రైతులపై ఎరువుల భారం-సబ్సిడీల అసలు కధ
రైతు మిత్ర
2010 ఏప్రిల్‌లో డిఎపి మార్కెట్ ధర టన్నుకు రు.20,736లు వుండగా నాటి విధానం ప్రకారం కేంద్ర ప్రభుత్వం రు.16,228 రూపాయలు సబ్సిడీగా ఇచ్చింది. అంటే రైతు రు.4,508లు చెల్లించాడు. అదే ఎరువు 2011 ఏప్రిల్‌లో రు.27,391లకు పెరిగింది. కేంద్రం సబ్సిడీని రు.19763 చెల్లించింది. రైతు రు.7,628 చెల్లించాడు. …….2015 ఏప్రిల్‌లో రు.29,117లకు ధర పెరగ్గా ప్రభుత్వం 12350 సబ్సిడీగా చెల్లించగా రైతు భారం రు. 16,767కు చేరింది.
రైతాంగానికి ఇచ్చే రాయితీలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి అవసరమైన ఎరువులకు సబ్సిడీని ఇస్తున్నది. ఇది రైతుల వుద్దరణకు అని చెబుతారు. ఎరువుల ధరల వుత్పాదక లేదా దిగుమతి ధరలకు రైతులు కొని సాగు చేయటం జరిగేది కాదు. ఒక వేళ మరొక పని లేని కారణంగా సాగు చేసినా పంటల ధరలు ఆకాశానికి లేస్తాయి. అంత ధరలతో వాటిని కొని తినే స్తోమత మన జనానికి లేదు. అందువలన జనానికి అందుబాటులో వుండాలంటే రైతాంగానికి సబ్సిడీ ఇవ్వాలి. అందుకే ఆ విధానాన్ని ప్రవేశ పెట్టారు. రైతుల కంటే దీన్ని ప్రయివేటు కంపెనీలు ఎక్కువగా వినియోగించుకున్నాయనే అభిప్రాయం బలంగా వుంది. అసలు ఖర్చులను ఎక్కువగా చూపి దొడ్డిదారిన సబ్సిడీ సొమ్మును పొందాయన్నది విమర్శ. ఈ సబ్సిడీల పరిస్ధితి ఎలా వుందంటే కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ రూపొందించిన నివేదికల సమాచారం ప్రకారం 2008-09 నుంచి 2012-13 సంవత్సరాల మధ్య ఎరువులపై ఇస్తున్న సబ్సిడీ మొత్తం 99,495 కోట్ల నుంచి 70,592 కోట్ల రూపాయలకు తగ్గి పోయింది.దీన్నే మరో విధంగా చెప్పుకుందాం. అదే మంత్రిత్వశాఖ సబ్సిడీ విధానాన్ని మార్చింది.మిశ్రమ ఎరువుల్లో ఏ పోషకము ఎంత( నూట్రియంట్ ) అన్న ప్రాతిపదికన ఇప్పుడు సబ్సిడీ ఇస్తున్నారు. సంస్కరణల పేరుతో 2010 ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వం యూరియా మినహా మిగిలిన ఎరువులపై ధరల అదుపును ఎత్తివేసింది. అంటే సబ్సిడీ విధానాన్ని మరోసారి మార్చింది. ఫలితంగా ఎరువుల ధరలు డిఎపి టన్నుకు రు.9350 నుంచి రు.2300కు ఎంఒపి(పొటాష్) రు.4,450 నుంచి 16,650కి పెరిగాయి. ధరలను నిర్ణయించుకొనే అధికారం ఎరువుల కంపెనీలకు వదలి పెట్టింది. రానున్న రోజుల్లో వాటిపై నిర్ణీత సబ్సిడీని ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టే విధంగా గత మూడు సంవత్సరాల తీరు తెన్నులు స్పష్టం చేశాయి. గత రెండు సంవత్సరాలలో ఇచ్చిన సబ్సిడీ మొత్తాలనే ఈ ఏడాది కూడా చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం మే నెలలో ఖరారు చేసింది. వుదాహరణకు డిఎపి టన్నుకు రు.12350, ఎంఓపి రు.9,300 గా పరిమితం చేసింది. మార్కెట్‌లో వ్యాపారులు డిమాండ్‌ను బట్టి ఎంత ధరకైనా అమ్ముకోవచ్చు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మారదు.ఎరువుల తయారీకి అవసరమైన వాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సివస్తున్నందున డాలరుతో మన రూపాయి మారకపు విలువ కూడా ధరలను ప్రభావితం చేస్తోంది. వుదాహరణకు 2010 ఏప్రిల్‌లో డిఎపి మార్కెట్ ధర టన్నుకు రు.20,736లు వుండగా నాటి విధానం ప్రకారం కేంద్ర ప్రభుత్వం రు.16,228 రూపాయలు సబ్సిడీగా ఇచ్చింది. అంటే రైతు రు.4,508లు చెల్లించాడు. అదే ఎరువు 2011 ఏప్రిల్‌లో రు.27,391లకు పెరిగింది. కేంద్రం సబ్సిడీని రు.19763 చెల్లించింది. రైతు రు.7,628 చెల్లించాడు. 2012 ఏప్రిల్‌లో ధర రు 26,840 వుంటే కేంద్రం రు 14350 చెల్లించగా రైతు రు.12,490 పెట్టి కొన్నాడు. 2013 ఏప్రిల్‌లో రు.27,636కు గాను కేంద్రం రు.12350 చెల్లించగా రైతు రు.15,286 తన జేబు నుంచి ఖర్చు చేశాడు. 2014 ఏప్రిల్‌లో రు.28,405 రులకు గాను కేంద్రం రు 12350 సబ్సిడీ ఇవ్వగా రైతు ఖర్చు రు.16055కు పెరిగింది, 2015 ఏప్రిల్‌లో రు.29,117లకు ధర పెరగ్గా ప్రభుత్వం అదే 12350 సబ్సిడీగా చెల్లించగా రైతు భారం రు. 16,767కు చేరింది.
2010-11 నుంచి 2014-15 మధ్య ప్రతి ఏటా ఒక రైతు వివిధ రకాల ఎరువులను 20 టన్నులచొప్పున కొన్నాడను కుందాం. అందుకుగాను 2010-11లో రు.3,08,694 రూపాయలు సబ్సిడీగా పొందితే క్రమంగా తగ్గి అది 2014-15 నాటికి రు.1,65,378లకు పడిపోయింది. అంటే క్రమంగా రైతుపై పెట్టుబడి భారం పెరుగుతున్నట్లా తరుగుతున్నట్లా ?
గత కొద్ది సంవత్సరాలుగా విధానాలలో చేసిన మార్పులు రైతులను ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూస్తే ఒక్క డిఎపి విషయంలోనే 2010-15 మధ్య రైతులపై అదనపు ఖర్చు రు.4,508 నుంచి రు.16,667కు పెరిగింది. అసలే మాత్రం ప్రభుత్వ అదుపు, సబ్సిడీ లేని పురుగులు, తెగుళ్ల నివారణ మందులపై ఏటా కనీసం పదిశాతం చొప్పున ధరలు పెరుగుతున్నాయి, పెట్రోలు, డీజిల్‌పై సబ్సిడీ ఎత్తివేసిన తరువాత ట్రాక్టర్లు, వరికోత,నూర్పిడి, ఇతర యంత్రాల ఖర్చు ఇవన్నీ రైతులపై భారాన్ని పెంచేవే తప్ప తగ్గించేవి కాదు. దీనికి తోడు రూపాయి విలువ పడిపోవటంతో దిగుమతి చేసుకొనే వాటిపై పడే అదనపు భారాన్ని కూడా రైతులే భరించాలి. వుదాహరణకు అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గిన కారణంగా తమ ఆదాయం పడిపోకుండా వుండేందుకు కేంద్రం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్‌పై పన్ను మొత్తాలను పెంచిన విషయం తెలిసిందే. అందువలన వీటి ఖర్చు పెరిగినంతగా కనీస మద్దతు ధరల పెంపుదల లేదా మార్కెట్‌లో లభిస్తున్న ధర వుందా అంటే లేదన్నది సుష్పష్టం. పరిస్ధితి ఇలా వుంటే రైతులు రుణ వూబిలో కూరుకు పోక ఏం చేస్తారు ? 2010-11 నుంచి 2014-15 మధ్య ప్రతి ఏటా ఒక రైతు వివిధ రకాల ఎరువులను 20 టన్నులచొప్పున కొన్నాడను కుందాం. అందుకుగాను 2010-11లో రు.3,08,694 రూపాయలు సబ్సిడీగా పొందితే క్రమంగా తగ్గి అది 2014-15 నాటికి రు.1,65,378లకు పడిపోయింది. అంటే క్రమంగా రైతుపై పెట్టుబడి భారం పెరుగుతున్నట్లా తరుగుతున్నట్లా ? కొన్ని ఎరువులకు ఇస్తున్న సబ్సిడీలను పూర్తిగా ఎత్తివేస్తే కొన్నింటికి పాక్షికంగా ఇచ్చారు. ఈ వివరాలను ఎరువుల మంత్రిత్వశాఖ పట్టికలో చూడవచ్చు.
2010-11 నుంచి ప్రభుత్వం మిశ్రమ ఎరువులపై పోషకాన్ని బట్టి ఒక్కొక్క టన్నుకు ఇస్తున్న సబ్సిడీ ఏ ఎరువుపై ఎంత ఇస్తున్నది, వాటిలో వచ్చిన మార్పులను గమనించవచ్చు.(టన్నుకు రూపాయలలో)
2010-11
1.4.2010 to 31.12.2010
1.1.2011 to 31.3.2011 2011-12 2012-13 2013-14 2014-15
1.DAP (18-46-0-0) 16268 15968 19763 14350 12350 12350
2.MAP (11-52-0-0) 16219 15897 19803 13978 12009 12009
3.TSP (0-46-0-0) 12087 11787 14875 10030 8592 8592
4.MOP (0-0-60-0) 14692 14392 16054 14400 11300 9300
5.SSP (0-16-0-11) 4400 4296+200 5359 3676 3173 3173
6.16-20-0-13 9203 9073 11030 8419 7294 7294
7.20-20-0-13 10133 10002 12116 9379 8129 8129
8.20-20-0-0 9901 9770 11898 9161 7911 7911
9.28-28-0-0 13861 11678 16657 12825 11075 11075
10.10-26-26-0 15521 15222 18080 14309 11841 10974
11.12-32-16-0 15114 14825 17887 13697 11496 10962
12.14-28-14-0 14037 13785 16602 12825 10789 10323
13.14-35-14-0 15877 15578 18866 14351 12097 11630
14.15-15-15-0 11099 10926 12937 10471 8758 8258
15.17-17-17-0 12578 12383 14662 11867 9926 9359
16.19-19-19-0 14058 13839 16387 13263 11094 10460
17.Ammonium
Sulphate
(20.6-0-0-23) 5195 5195 5979 5330 4686 4686
18.16-16-16-0
(w.e.f. 1.7.2010) 11838 11654 13800 11169 9342 8809
19.15-15-15-9
(w.e.f. 1.10.2010) 11259 11086 13088 10622 8909 8409
20.24-24-0-0 (from
1.10.10 to 29.5.12
and w.e.f. 22.6.2012) 11881 11724 14278 10993 9493 9493
21.DAP Lite(16-44-0-0)
(w.e.f. 1.2.11) NA 14991 18573 13434 11559 11559
22.24-24-0-8
(wef 12.11.13 to 14.2.15)
without subsidy on S NA NA NA NA 9493 9493
23.23-23-0-0
(upto22.6.2012) 11386 11236 13686 10535 NA NA
24.
DAP 4S (w.e.f. 25.2.13 to 7.11.13) without subsidy on S NA 14350 12350 NA
25.DAP Lite-II(14-46-0-0)
(w.e.f. 30.8.2011 to 29.8.2012) NA NA 18677 13390 NA NA
26.MAP Lite (11-44-0-0)
(w.e.f. 30.8.2011 to 29.8.2012) NA NA 17276 12234 NA NA
27.13-33-0-6
(w.e.f. 30.8.2011 to 29.8.2012) NA NA 14302 10416 NA SNA
అంతర్జాతీయ మార్కెట్‌లో వచ్చిన మార్పుల కారణంగా డిఎపి ధరలలో వచ్చిన తీవ్ర ఎగుడు దిగుడుల కారణంగా కొన్ని సంవత్సరాలలో రైతులు డిఎపి ఎరువులకు దూరం కావాల్సి వచ్చింది. ఒక దశలో గరిష్టంగా టన్నుకు 50వేల రూపాయలు పలికిన సందర్భాలు కూడా వున్నాయి. దిగువ పట్టికలో వివరాలు చూడవచ్చు.
Month Price Change
Aug 2005 11,429.99 –
Sep 2005 11,598.35 1.47 %
Oct 2005 11,939.59 2.94 %
Nov 2005 12,128.85 1.59 %
Dec 2005 11,956.71 -1.42 %
Jan 2006 11,632.41 -2.71 %
Feb 2006 11,537.16 -0.82 %
Mar 2006 11,412.41 -1.08 %
Apr 2006 11,720.56 2.70 %
May 2006 12,294.51 4.90 %
Jun 2006 12,398.13 0.84 %
Jul 2006 12,136.68 -2.11 %
Aug 2006 12,142.05 0.04 %
Sep 2006 11,933.80 -1.72 %
Oct 2006 11,622.87 -2.61 %
Nov 2006 11,371.25 -2.16 %
Dec 2006 11,314.85 -0.50 %
Jan 2007 11,865.24 4.86 %
Feb 2007 15,252.57 28.55 %
Mar 2007 18,512.72 21.37 %
Apr 2007 18,225.06 -1.55 %
May 2007 17,392.69 -4.57 %
Jun 2007 17,711.09 1.83 %
Jul 2007 17,631.64 -0.45 %
Aug 2007 17,527.09 -0.59 %
Sep 2007 17,421.84 -0.60 %
Oct 2007 17,832.30 2.36 %
Nov 2007 20,548.24 15.23 %
Dec 2007 23,427.36 14.01 %
Jan 2008 27,864.08 18.94 %
Feb 2008 32,901.01 18.08 %
Mar 2008 42,162.63 28.15 %
Apr 2008 48,061.69 13.99 %
May 2008 50,514.79 5.10 %
Jun 2008 50,313.50 -0.40 %
Jul 2008 50,778.41 0.92 %
Aug 2008 50,533.77 -0.48 %
Sep 2008 50,063.45 -0.93 %
Oct 2008 47,182.96 -5.75 %
Nov 2008 30,014.54 -36.39 %
Dec 2008 19,821.58 -33.96 %
Jan 2009 17,142.84 -13.51 %
Feb 2009 18,107.63 5.63 %
Mar 2009 18,848.13 4.09 %
Apr 2009 16,793.87 -10.90 %
May 2009 14,438.87 -14.02 %
Jun 2009 13,269.13 -8.10 %
Jul 2009 14,227.32 7.22 %
Aug 2009 15,395.63 8.21 %
Sep 2009 15,344.38 -0.33 %
Oct 2009 14,021.51 -8.62 %
Nov 2009 13,516.65 -3.60 %
Dec 2009 16,805.45 24.33 %
Jan 2010 19,633.72 16.83 %
Feb 2010 22,722.80 15.73 %
Mar 2010 21,668.42 -4.64 %
Apr 2010 20,736.51 -4.30 %
May 2010 21,083.05 1.67 %
Jun 2010 20,860.92 -1.05 %
Jul 2010 21,619.76 3.64 %
Aug 2010 23,102.80 6.86 %
Sep 2010 24,169.34 4.62 %
Oct 2010 25,540.06 5.67 %
Nov 2010 26,387.71 3.32 %
Dec 2010 26,825.84 1.66 %
Jan 2011 27,037.64 0.79 %
Feb 2011 27,443.46 1.50 %
Mar 2011 27,241.17 -0.74 %
Apr 2011 27,391.54 0.55 %
May 2011 27,374.73 -0.06 %
Jun 2011 27,449.31 0.27 %
Jul 2011 28,897.69 5.28 %
Aug 2011 29,855.51 3.31 %
Sep 2011 30,665.17 2.71 %
Oct 2011 31,064.29 1.30 %
Nov 2011 30,987.14 -0.25 %
Dec 2011 30,268.30 -2.32 %
Jan 2012 27,150.51 -10.30 %
Feb 2012 25,432.37 -6.33 %
Mar 2012 25,287.31 -0.57 %
Apr 2012 26,840.60 6.14 %
May 2012 30,048.36 11.95 %
Jun 2012 31,621.93 5.24 %
Jul 2012 31,268.36 -1.12 %
Aug 2012 31,057.77 -0.67 %
Sep 2012 31,262.03 0.66 %
Oct 2012 30,345.16 -2.93 %
Nov 2012 28,717.01 -5.37 %
Dec 2012 27,253.52 -5.10 %
Jan 2013 26,341.90 -3.34 %
Feb 2013 25,917.75 -1.61 %
Mar 2013 27,601.83 6.50 %
Apr 2013 27,636.45 0.13 %
May 2013 26,696.68 -3.40 %
Jun 2013 27,895.64 4.49 %
Jul 2013 27,498.54 -1.42 %
Aug 2013 27,693.38 0.71 %
Sep 2013 25,356.25 -8.44 %
Oct 2013 23,253.44 -8.29 %
Nov 2013 22,026.39 -5.28 %
Dec 2013 22,913.03 4.03 %
Jan 2014 27,233.84 18.86 %
Feb 2014 30,558.29 12.21 %
Mar 2014 30,445.38 -0.37 %
Apr 2014 28,405.34 -6.70 %
May 2014 26,383.80 -7.12 %
Jun 2014 27,557.35 4.45 %
Jul 2014 29,995.84 8.85 %
Aug 2014 30,752.06 2.52 %
Sep 2014 29,323.04 -4.65 %
Oct 2014 28,618.85 -2.40 %
Nov 2014 27,924.39 -2.43 %
Dec 2014 28,823.51 3.22 %
Jan 2015 29,849.82 3.56 %
Feb 2015 30,099.05 0.83 %
Mar 2015 29,913.47 -0.62 %
Apr 2015 29,117.47 -2.66 %
May 2015 29,990.79 3.00 %
Jun 2015 30,206.13 0.72 %
Jul 2015 29,849.89 -1.18 %
