• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: farmers indebtedness

అన్నదాతల రుణ భారం కారణాలు – మూడవ భాగము

08 Sunday Nov 2015

Posted by raomk in Farmers

≈ Leave a comment

Tags

Agriculture, Farmers, farmers indebtedness

మద్దతు ధరలు రైతులకా వ్యాపారులకా ?
రైతు మిత్ర

అన్నపూర్ణ వంటి ఆంధ్రప్రదేశ్‌లో ధాన్య రైతుల పరిస్థితి గురించి చూద్దాం. కనీస మద్దతు ధరలు రైతాంగానికి వుపయోగపడుతున్నాయా లేక వ్యాపారులకు ప్రయోజనం కలిగిస్తున్నాయా అన్న అనుమానం వస్తోంది. వుదాహరణకు 2004-05 నుంచి 2014-15 వరకు పరిశీలిస్తే ప్రకటించిన మద్దతు ధర క్వింటాలకు సగటున రు.979.79లుగా వుంది. వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు అందచేసిన సమాచారం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అగ్‌మార్క్‌నెట్‌ పేర్కొన్న సంవత్సరాలలో డిసెంబరు, జనవరి మాసాలలో ఆంధ్రప్రదేశ్‌లోని మార్కెట్లలో ధాన్య రైతులు పొందిన సగటు ధరలు, దేశం మొత్తంగా రైతులు పొందిన ధరల వివరాలను దిగువ పట్టికలో చూడవచ్చు.స్ధలా భావం కారణంగా ప్రతి ఏడు డిసెంబరు, జనవరి మాసాల ధరలను మాత్రమే ఇక్కడ ఇవ్వటమైంది. దాని ప్ర కారం మన రాష్ట్రంలో ఈ కాలంలో ప్రతి ఏటా డిసెంబరులో రైతు పొందిన సగటు ధర రు.953.70, జనవరిలో 997.15 గా నమోదైంది. అదే దేశవ్యాపితంగా రు.1200.76, రు.1157.57 గా వున్నాయి. ఒక ఏడాది కనీస మద్దతు ధర కంటే ఎక్కువ వున్నా, మరొక ఏడాది తక్కువ వున్నా భరించాల్సింది రైతు మాత్రమే. 2005లో వున్న కనీస మద్దతు సగటు ధర 575తో 2015లో వున్న సగటు ధర 1430తో(సూపర్‌ ఫైన్‌, ఫైన్‌ రెండింటి సగటు) పోల్చితే మద్దతు ధర 147శాతం పెరిగింది. ఇదే సమయంలో 2005 జనవరిలో మార్కెట్‌లో రైతుకు లభించిన 634తో 2015లో వున్న 1363 రు.లను పోల్చితే పెరుగుదల 114శాతమే. ఆ విధంగా చూసినపుడు ఏం జరిగిందనేది వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. అధికారిక అంకెలే పరిస్ధితిని వివరిస్తున్నాయి.

1990 నుంచి మన దేశం నూతన ఆర్ధిక విధానాలను ప్రవేశపెట్టింది. ప్రభుత్వాలు శాంతి భద్రతలు, కరెన్సీ, సరిహద్దుల రక్షణ,సైన్యం వంటి వాటికి మాత్రమే పరిమితమై మిగతా రంగాల నుంచి తప్పుకొని మార్కెట్‌ శక్తులకు వాటిని వదలి వేయాలి. అప్పుడే జనానికి మెరుగైన సేవలు అందుతాయి.అని చెప్పారు. దానికి అనుగుణంగానే ఒక్కొక్క బాధ్యత నుంచి ప్రభుత్వాలు తప్పుకొంటున్నాయి. వాటి మంచి చెడ్డలు, విమర్శలు, ప్రశంసల గురించి ఇక్కడ చర్చించబోవటం లేదు. కనీస మద్దతు ధరలు ప్రకటించిన మాత్రాన్నే అవి రైతులకు గిట్టుబాటు కలిగిస్తాయా ? నిజానికి అవి వాస్తవ పెట్టుబడులను ప్రతిబింబిస్తున్నాయా ?

ధాన్యానికి ఆంధ్రప్రదేశ్‌లోని మార్కెట్లలో గత సంవత్సరాలలో లభించిన ధరల వివరాలు ఇలా వున్నాయి. మొదటి కాలంలో ఆ ఏడాది జనవరిలో లభించిన ధర అయితే రెండవ కాలంలో అంతకు ముందు ఏడాది డిసెంబరులో లభించిన ధర, మూడవ కాలంలో అంతకు ముందు సంవత్సరం జనవరి ధర పోలిస్తే మార్పు, నాలుగవ కాలంలో ఏడాదిలో వచ్చిన మార్పుగా గమనించాలి. వుదాహరణకు 2005 జనవరిలో వచ్చిన ధర పక్కనే 2004డిసెంబరులో వచ్చిన ధరగా తరువాత కాలంలో 2004 జనవరి ధర అని గమనించాలి.

జనవరి డిసెంబరు జనవరి నెలలో మార్పు ఏడాదిలో మార్పు

2005 ఆంధ్రప్రదేశ్‌ 634.24 624.79 581.8 1.51 9

దేశ సగటు 727.07 698.7 668.07

2006ఆంధ్రప్రదేశ్‌ 1033.38 473.52 634.24 118.23 62.93

దేశ సగటు 697.78 678.85 727.07

2007ఆంధ్రప్రదేశ్‌ 615.69 640.9 1033.38 -3.94 -40.42

దేశ సగటు 776.74 822.9 697.78

2008ఆంధ్రప్రదేశ్‌ 699.66 785.92 615.69 -10.98 13.64

దేశ సగటు 1015.81 1013.67 776.74

2009ఆంధ్రప్రదేశ్‌ 881.19 874.83 699.66 0.73 25.95

దేశ సగటు 1087.59 1155.48 1015.81

2010ఆంధ్రప్రదేశ్‌ 1036.35 1029.70 881.19 0.65 17.61

దేశ సగటు 1283.17 1303.54 1087.59

2011ఆంధ్రప్రదేశ్‌ 996.36 1004.60 1036.35 -0.82 -3.86

దేశ సగటు 1296.20 1239.66 1283.17

2012ఆంధ్రప్రదేశ్‌ 1080.31 1080.48 996.36 -0.02 8.43

దేశ సగటు 1228.22 1117.38 1296.2

2013ఆంధ్రప్రదేశ్‌ 1271.77 1273.14 1080.31 -0.11 17.72

దేశ సగటు 1704.53 1571.97 1228.22

2014ఆంధ్రప్రదేశ్‌ 1356.07 1338.66 1271.77 1.3 6.63

దేశ సగటు 2005.4 1970.67 1704.53

2015ఆంధ్రప్రదేశ్‌ 1363.64 1364.18 1356.07 -0.04 0.56

దేశ సగటు 1630.62 1635.44 2005.4

ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నెల సగటు ధర.997.15

దేశవ్యాపితంగా జనవరి నెల సగటు ధర రు. 1157.57

ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబరు సగటు ధర రు. 953.70

దేశవ్యాపితంగా డిసెంబరు నెల సగటు ధర రు. 1200.76

కనీస మద్దతు ధరల సగటు : రు.979.79

మన రాష్ట్రంలోని వాణిజ్య పంటలలో పత్తి ఒకటి. దీని పరిస్థితి ఎలా వుందో చూద్దాం. పత్తి విషయంలో కూడా బాగా మార్కెట్‌కు వచ్చే జనవరి నెల గణాంకాలనే తీసుకోవటం జరిగింది.

జనవరి డిసెంబరు జనవరి నెలలో ఏడాదిలో మద్దతు ధర
మార్పు మార్పు
2005 ఆంధ్రప్రదేశ్‌ 1815.87 1774.81 1960

దేశ సగటు 2096.04 2171.53 2726.41

2006ఆంధ్రప్రదేశ్‌ 1890.20 1961.44 1815.87 -3.63 4.09 1980

దేశ సగటు 2095.36 2147.27 2096.04

2007ఆంధ్రప్రదేశ్‌ 1994.58 1958.21 1890.20 1.86 5.52 1990

దేశ సగటు 2174.52 2249.97 2095.36

2008ఆంధ్రప్రదేశ్‌ 2718.18 1953.31 1994.58 39.16 36.28 2030

దేశ సగటు 2754.93 2733.65 2174.52

2009ఆంధ్రప్రదేశ్‌ 2561.32 2573.37 2718.18 -0.47 -5.77 3000

దేశ సగటు 2566.02 2700.45 2754.93

2010ఆంధ్రప్రదేశ్‌ 3092.58 3157.70 2561.32 -2.06 20.74 3000

దేశ సగటు 3447.75 3184.55 2566.02

2011ఆంధ్రప్రదేశ్‌ 4781.66 4079.47 3092.58 17.21 54.62 3000

దేశ సగటు 4543.68 4282.19 3447.75

2012ఆంధ్రప్రదేశ్‌ 3954.20 3830.46 4781.66 3.23 -17.3 3300

దేశ సగటు 4128.05 3946.85 4543.68

2013ఆంధ్రప్రదేశ్‌ 3893.25 3817.79 3954.20 1.98 -1.54 3900

దేశ సగటు 4073.02 4109.67 4128.05

2014ఆంధ్రప్రదేశ్‌ 4594.92 4137.30 3893.25 11.06 18.02 4000

దేశ సగటు 5128.21 4709.26 4073.02

2015ఆంధ్రప్రదేశ్‌ 3972.90 4011.39 4594.92 -0.96 -13.54 4050

దేశ సగటు 5479.75 4024.36 5128.21

పత్తి రైతులు గతంలో విచక్షణా రహితంగా సింథటిక్‌ పైరిత్రాయిడ్స్‌ వాడిన కారణంగా పర్యావరణ సమతూకం దెబ్బతిని తెల్లదోమ, పచ్చపురుగు ప్రబలి పంట దెబ్బతిని ప్రకాశం, గుంటూరు జిల్లాలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తరువాత రైతుల పాలిట కల్పతరువుగా బిటి పత్తి వచ్చిందన్నారు. అయినా దేశంలో అనేక చోట్ల పత్తి రైతులు ముఖ్యంగా మహారాష్ట్ర వంటి చోట్ల ఆత్మహత్యలు ఆగలేదు. ఆ బీటీ పత్తే కారణమని విశ్లేషకులు ఇప్పుడు చెబుతున్నారు. పైన పేర్కొన్న పట్టిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నెలలో పత్తి సగటు ధర రు.2,973.48, అదే దేశ సగటు రు3,498.84 వుంది. ఈ కాలంలో పత్తి సగటు కనీస మద్దతు ధర రు.3017.50 వుంది. పొడవు పింజ పత్తి మద్దతు ధర ఈ కాలంలో రు.1960 నుంచి రు.4050కి 106 శాతమే పెరిగింది.ఈ కాలంలో ప్రయివేటు మార్కెట్‌లో 2005జనవరి ధరతో 2015జనవరి ధరతో పోల్చితే పెరుగుదల 118శాతం వుంది. గమనించాల్సిందేమంటే అప్పుడూ ఇప్పుడూ పత్తి కనీస మద్దతు ధరల కంటే తక్కువే రు.1815-3972 మధ్యవుంది. మధ్యలో కొన్ని సంవత్సరాలు కనీస మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ పలికినప్పటికీ దాని వలన రైతులకు పెద్దగా ఒరిగింది లేదు.సగటున ఎంత దక్కిందన్నదే ముఖ్యం.

ముగిసినది

Share this:

  • Tweet
  • More
Like Loading...

అన్నదాతల రుణ భారం కారణాలు – రెండవ భాగము

07 Saturday Nov 2015

Posted by raomk in Farmers

≈ Leave a comment

Tags

Agriculture, Farmers, farmers indebtedness

రైతులపై ఎరువుల భారం-సబ్సిడీల అసలు కధ

రైతు మిత్ర

 

2010 ఏప్రిల్‌లో డిఎపి మార్కెట్‌ ధర టన్నుకు రు.20,736లు వుండగా నాటి విధానం ప్రకారం కేంద్ర ప్రభుత్వం రు.16,228 రూపాయలు సబ్సిడీగా ఇచ్చింది. అంటే రైతు రు.4,508లు చెల్లించాడు. అదే ఎరువు 2011 ఏప్రిల్‌లో రు.27,391లకు పెరిగింది. కేంద్రం సబ్సిడీని రు.19763 చెల్లించింది. రైతు రు.7,628 చెల్లించాడు. …….2015 ఏప్రిల్‌లో రు.29,117లకు ధర పెరగ్గా ప్రభుత్వం  12350 సబ్సిడీగా చెల్లించగా రైతు భారం రు. 16,767కు చేరింది.

రైతాంగానికి ఇచ్చే రాయితీలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి అవసరమైన ఎరువులకు సబ్సిడీని ఇస్తున్నది. ఇది రైతుల వుద్దరణకు అని చెబుతారు. ఎరువుల ధరల వుత్పాదక లేదా దిగుమతి ధరలకు రైతులు కొని సాగు చేయటం జరిగేది కాదు. ఒక వేళ మరొక పని లేని కారణంగా సాగు చేసినా పంటల ధరలు ఆకాశానికి లేస్తాయి. అంత ధరలతో వాటిని కొని తినే స్తోమత మన జనానికి లేదు. అందువలన జనానికి అందుబాటులో వుండాలంటే రైతాంగానికి సబ్సిడీ ఇవ్వాలి. అందుకే ఆ విధానాన్ని ప్రవేశ పెట్టారు. రైతుల కంటే దీన్ని ప్రయివేటు కంపెనీలు ఎక్కువగా వినియోగించుకున్నాయనే అభిప్రాయం బలంగా వుంది. అసలు ఖర్చులను ఎక్కువగా చూపి దొడ్డిదారిన సబ్సిడీ సొమ్మును పొందాయన్నది విమర్శ. ఈ సబ్సిడీల పరిస్ధితి ఎలా వుందంటే కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ రూపొందించిన నివేదికల సమాచారం ప్రకారం 2008-09 నుంచి 2012-13 సంవత్సరాల మధ్య ఎరువులపై ఇస్తున్న సబ్సిడీ మొత్తం 99,495 కోట్ల నుంచి 70,592 కోట్ల రూపాయలకు తగ్గి పోయింది.దీన్నే మరో విధంగా చెప్పుకుందాం. అదే మంత్రిత్వశాఖ సబ్సిడీ విధానాన్ని మార్చింది.మిశ్రమ ఎరువుల్లో ఏ పోషకము ఎంత( నూట్రియంట్‌ ) అన్న ప్రాతిపదికన ఇప్పుడు సబ్సిడీ ఇస్తున్నారు. సంస్కరణల పేరుతో 2010 ఏప్రిల్‌ నుంచి కేంద్ర ప్రభుత్వం యూరియా మినహా మిగిలిన ఎరువులపై ధరల అదుపును ఎత్తివేసింది. అంటే సబ్సిడీ విధానాన్ని మరోసారి మార్చింది. ఫలితంగా ఎరువుల ధరలు డిఎపి టన్నుకు రు.9350 నుంచి రు.2300కు ఎంఒపి(పొటాష్‌) రు.4,450 నుంచి 16,650కి పెరిగాయి. ధరలను నిర్ణయించుకొనే అధికారం ఎరువుల కంపెనీలకు వదలి పెట్టింది. రానున్న రోజుల్లో వాటిపై నిర్ణీత సబ్సిడీని ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టే విధంగా గత మూడు సంవత్సరాల తీరు తెన్నులు స్పష్టం చేశాయి. గత రెండు సంవత్సరాలలో ఇచ్చిన సబ్సిడీ మొత్తాలనే ఈ ఏడాది కూడా చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం మే నెలలో ఖరారు చేసింది. వుదాహరణకు డిఎపి టన్నుకు రు.12350, ఎంఓపి రు.9,300 గా పరిమితం చేసింది. మార్కెట్‌లో వ్యాపారులు డిమాండ్‌ను బట్టి ఎంత ధరకైనా అమ్ముకోవచ్చు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మారదు.ఎరువుల తయారీకి అవసరమైన వాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సివస్తున్నందున డాలరుతో మన రూపాయి మారకపు విలువ కూడా ధరలను ప్రభావితం చేస్తోంది. వుదాహరణకు 2010 ఏప్రిల్‌లో డిఎపి మార్కెట్‌ ధర టన్నుకు రు.20,736లు వుండగా నాటి విధానం ప్రకారం కేంద్ర ప్రభుత్వం రు.16,228 రూపాయలు సబ్సిడీగా ఇచ్చింది. అంటే రైతు రు.4,508లు చెల్లించాడు. అదే ఎరువు 2011 ఏప్రిల్‌లో రు.27,391లకు పెరిగింది. కేంద్రం సబ్సిడీని రు.19763 చెల్లించింది. రైతు రు.7,628 చెల్లించాడు. 2012 ఏప్రిల్‌లో ధర రు 26,840 వుంటే కేంద్రం రు 14350 చెల్లించగా రైతు రు.12,490 పెట్టి కొన్నాడు. 2013 ఏప్రిల్‌లో రు.27,636కు గాను కేంద్రం రు.12350 చెల్లించగా రైతు రు.15,286 తన జేబు నుంచి ఖర్చు చేశాడు. 2014 ఏప్రిల్‌లో రు.28,405 రులకు గాను కేంద్రం రు 12350 సబ్సిడీ ఇవ్వగా రైతు ఖర్చు రు.16055కు పెరిగింది, 2015 ఏప్రిల్‌లో రు.29,117లకు ధర పెరగ్గా ప్రభుత్వం అదే 12350 సబ్సిడీగా చెల్లించగా రైతు భారం రు. 16,767కు చేరింది.

2010-11 నుంచి 2014-15 మధ్య ప్రతి ఏటా ఒక రైతు వివిధ రకాల ఎరువులను 20 టన్నులచొప్పున కొన్నాడను కుందాం. అందుకుగాను 2010-11లో రు.3,08,694 రూపాయలు సబ్సిడీగా పొందితే క్రమంగా తగ్గి అది 2014-15 నాటికి రు.1,65,378లకు పడిపోయింది. అంటే క్రమంగా రైతుపై పెట్టుబడి భారం పెరుగుతున్నట్లా తరుగుతున్నట్లా ?

 

గత కొద్ది సంవత్సరాలుగా విధానాలలో చేసిన మార్పులు రైతులను ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూస్తే ఒక్క డిఎపి విషయంలోనే 2010-15 మధ్య రైతులపై అదనపు ఖర్చు రు.4,508 నుంచి రు.16,667కు పెరిగింది. అసలే మాత్రం ప్రభుత్వ అదుపు, సబ్సిడీ లేని పురుగులు, తెగుళ్ల నివారణ మందులపై ఏటా కనీసం పదిశాతం చొప్పున ధరలు పెరుగుతున్నాయి, పెట్రోలు, డీజిల్‌పై సబ్సిడీ ఎత్తివేసిన తరువాత ట్రాక్టర్లు, వరికోత,నూర్పిడి, ఇతర యంత్రాల ఖర్చు ఇవన్నీ రైతులపై భారాన్ని పెంచేవే తప్ప తగ్గించేవి కాదు. దీనికి తోడు రూపాయి విలువ పడిపోవటంతో దిగుమతి చేసుకొనే వాటిపై పడే అదనపు భారాన్ని కూడా రైతులే భరించాలి. వుదాహరణకు అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గిన కారణంగా తమ ఆదాయం పడిపోకుండా వుండేందుకు కేంద్రం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్‌పై పన్ను మొత్తాలను పెంచిన విషయం తెలిసిందే. అందువలన వీటి ఖర్చు పెరిగినంతగా కనీస మద్దతు ధరల పెంపుదల లేదా మార్కెట్‌లో లభిస్తున్న ధర వుందా అంటే లేదన్నది సుష్పష్టం. పరిస్ధితి ఇలా వుంటే రైతులు రుణ వూబిలో కూరుకు పోక ఏం చేస్తారు ? 2010-11 నుంచి 2014-15 మధ్య ప్రతి ఏటా ఒక రైతు వివిధ రకాల ఎరువులను 20 టన్నులచొప్పున కొన్నాడను కుందాం. అందుకుగాను 2010-11లో రు.3,08,694 రూపాయలు సబ్సిడీగా పొందితే క్రమంగా తగ్గి అది 2014-15 నాటికి రు.1,65,378లకు పడిపోయింది. అంటే క్రమంగా రైతుపై పెట్టుబడి భారం పెరుగుతున్నట్లా తరుగుతున్నట్లా ? కొన్ని ఎరువులకు ఇస్తున్న సబ్సిడీలను పూర్తిగా ఎత్తివేస్తే కొన్నింటికి పాక్షికంగా ఇచ్చారు. ఈ వివరాలను ఎరువుల మంత్రిత్వశాఖ పట్టికలో చూడవచ్చు.

2010-11 నుంచి ప్రభుత్వం మిశ్రమ ఎరువులపై పోషకాన్ని బట్టి ఒక్కొక్క టన్నుకు ఇస్తున్న సబ్సిడీ ఏ ఎరువుపై ఎంత ఇస్తున్నది, వాటిలో వచ్చిన మార్పులను గమనించవచ్చు.(టన్నుకు రూపాయలలో)

2010-11
1.4.2010 to 31.12.2010

1.1.2011 to 31.3.2011       2011-12      2012-13     2013-14  2014-15
1.DAP (18-46-0-0)  16268      15968            19763         14350        12350      12350
2.MAP (11-52-0-0)  16219      15897            19803         13978        12009      12009
3.TSP (0-46-0-0)    12087       11787           14875         10030          8592        8592
4.MOP (0-0-60-0)   14692       14392           16054         14400        11300        9300
5.SSP (0-16-0-11)   4400  4296+200             5359          3676          3173        3173
6.16-20-0-13          9203          9073           11030          8419          7294         7294
7.20-20-0-13        10133         10002          12116          9379          8129         8129
8.20-20-0-0            9901          9770           11898         9161           7911         7911
9.28-28-0-0          13861        11678           16657       12825          11075       11075
10.10-26-26-0       15521       15222           18080       14309           11841      10974
11.12-32-16-0       15114       14825           17887       13697           11496      10962
12.14-28-14-0       14037       13785           16602       12825           10789      10323
13.14-35-14-0       15877       15578           18866       14351           12097      11630
14.15-15-15-0       11099       10926           12937       10471             8758       8258
15.17-17-17-0       12578       12383           14662       11867             9926       9359
16.19-19-19-0       14058       13839           16387       13263           11094     10460
17.Ammonium
Sulphate
(20.6-0-0-23)         5195          5195           5979          5330            4686         4686
18.16-16-16-0
(w.e.f. 1.7.2010)   11838        11654         13800         11169           9342         8809
19.15-15-15-9
(w.e.f. 1.10.2010)  11259       11086         13088         10622           8909          8409
20.24-24-0-0 (from
1.10.10 to 29.5.12
and w.e.f. 22.6.2012) 11881    11724        14278         10993           9493          9493
21.DAP Lite(16-44-0-0)
(w.e.f. 1.2.11)           NA          14991       18573          13434         11559        11559
22.24-24-0-8
(wef 12.11.13 to 14.2.15)
without subsidy on S       NA       NA           NA                  NA           9493         9493
23.23-23-0-0
(upto22.6.2012)      11386      11236         13686         10535 NA NA
24.
DAP 4S (w.e.f. 25.2.13 to 7.11.13) without subsidy on S NA 14350    12350       NA
25.DAP Lite-II(14-46-0-0)
(w.e.f. 30.8.2011 to 29.8.2012) NA NA         18677        13390           NA          NA
26.MAP Lite (11-44-0-0)
(w.e.f. 30.8.2011 to 29.8.2012) NA NA          17276       12234           NA          NA
27.13-33-0-6
(w.e.f. 30.8.2011 to 29.8.2012) NA NA          14302       10416           NA         SNA

అంతర్జాతీయ మార్కెట్‌లో వచ్చిన మార్పుల కారణంగా డిఎపి ధరలలో వచ్చిన తీవ్ర ఎగుడు దిగుడుల కారణంగా కొన్ని సంవత్సరాలలో రైతులు డిఎపి ఎరువులకు దూరం కావాల్సి వచ్చింది. ఒక దశలో గరిష్టంగా టన్నుకు 50వేల రూపాయలు పలికిన సందర్భాలు కూడా వున్నాయి. దిగువ పట్టికలో వివరాలు చూడవచ్చు.

Month       Price       Change
Aug 2005 11,429.99 –
Sep 2005 11,598.35     1.47 %
Oct 2005 11,939.59      2.94 %
Nov 2005 12,128.85     1.59 %
Dec 2005 11,956.71    -1.42 %
Jan 2006 11,632.41     -2.71 %
Feb 2006 11,537.16    -0.82 %
Mar 2006 11,412.41    -1.08 %
Apr 2006 11,720.56      2.70 %
May 2006 12,294.51     4.90 %
Jun 2006 12,398.13      0.84 %
Jul 2006 12,136.68       -2.11 %
Aug 2006 12,142.05       0.04 %
Sep 2006 11,933.80      -1.72 %
Oct 2006 11,622.87       -2.61 %
Nov 2006 11,371.25      -2.16 %
Dec 2006 11,314.85      -0.50 %
Jan 2007 11,865.24        4.86 %
Feb 2007 15,252.57      28.55 %
Mar 2007 18,512.72      21.37 %
Apr 2007 18,225.06       -1.55 %
May 2007 17,392.69       -4.57 %
Jun 2007 17,711.09         1.83 %
Jul 2007 17,631.64         -0.45 %
Aug 2007 17,527.09       -0.59 %
Sep 2007 17,421.84        -0.60 %
Oct 2007 17,832.30          2.36 %
Nov 2007 20,548.24        15.23 %
Dec 2007 23,427.36         14.01 %
Jan 2008 27,864.08          18.94 %
Feb 2008 32,901.01          18.08 %
Mar 2008 42,162.63          28.15 %
Apr 2008 48,061.69           13.99 %
May 2008 50,514.79            5.10 %
Jun 2008 50,313.50            -0.40 %
Jul 2008 50,778.41            0.92 %
Aug 2008 50,533.77         -0.48 %
Sep 2008 50,063.45          -0.93 %
Oct 2008 47,182.96           -5.75 %
Nov 2008 30,014.54         -36.39 %
Dec 2008 19,821.58         -33.96 %
Jan 2009 17,142.84         -13.51 %
Feb 2009 18,107.63            5.63 %
Mar 2009 18,848.13            4.09 %
Apr 2009 16,793.87         -10.90 %
May 2009 14,438.87         -14.02 %
Jun 2009 13,269.13            -8.10 %
Jul 2009 14,227.32              7.22 %
Aug 2009 15,395.63            8.21 %
Sep 2009 15,344.38           -0.33 %
Oct 2009 14,021.51            -8.62 %
Nov 2009 13,516.65          -3.60 %
Dec 2009 16,805.45         24.33 %
Jan 2010 19,633.72        16.83 %
Feb 2010 22,722.80        15.73 %
Mar 2010 21,668.42        -4.64 %
Apr 2010 20,736.51         -4.30 %
May 2010 21,083.05         1.67 %
Jun 2010 20,860.92         -1.05 %
Jul 2010 21,619.76           3.64 %
Aug 2010 23,102.80         6.86 %
Sep 2010 24,169.34         4.62 %
Oct 2010 25,540.06         5.67 %
Nov 2010 26,387.71        3.32 %
Dec 2010 26,825.84        1.66 %
Jan 2011 27,037.64        0.79 %
Feb 2011 27,443.46       1.50 %
Mar 2011 27,241.17      -0.74 %
Apr 2011 27,391.54      0.55 %
May 2011 27,374.73     -0.06 %
Jun 2011 27,449.31       0.27 %
Jul 2011 28,897.69        5.28 %
Aug 2011 29,855.51      3.31 %
Sep 2011 30,665.17      2.71 %
Oct 2011 31,064.29      1.30 %
Nov 2011 30,987.14    -0.25 %
Dec 2011 30,268.30    -2.32 %
Jan 2012 27,150.51   -10.30 %
Feb 2012 25,432.37    -6.33 %
Mar 2012 25,287.31    -0.57 %
Apr 2012 26,840.60     6.14 %
May 2012 30,048.36   11.95 %
Jun 2012 31,621.93      5.24 %
Jul 2012 31,268.36     -1.12 %
Aug 2012 31,057.77   -0.67 %
Sep 2012 31,262.03    0.66 %
Oct 2012 30,345.16    -2.93 %
Nov 2012 28,717.01   -5.37 %
Dec 2012 27,253.52   -5.10 %
Jan 2013 26,341.90   -3.34 %
Feb 2013 25,917.75   -1.61 %
Mar 2013 27,601.83    6.50 %
Apr 2013 27,636.45    0.13 %
May 2013 26,696.68  -3.40 %
Jun 2013 27,895.64    4.49 %
Jul 2013 27,498.54    -1.42 %
Aug 2013 27,693.38    0.71 %
Sep 2013 25,356.25   -8.44 %
Oct 2013 23,253.44    -8.29 %
Nov 2013 22,026.39   -5.28 %
Dec 2013 22,913.03    4.03 %
Jan 2014 27,233.84   18.86 %
Feb 2014 30,558.29   12.21 %
Mar 2014 30,445.38   -0.37 %
Apr 2014 28,405.34   -6.70 %
May 2014 26,383.80  -7.12 %
Jun 2014 27,557.35    4.45 %
Jul 2014 29,995.84     8.85 %
Aug 2014 30,752.06   2.52 %
Sep 2014 29,323.04  -4.65 %
Oct 2014 28,618.85   -2.40 %
Nov 2014 27,924.39   -2.43 %
Dec 2014 28,823.51    3.22 %
Jan 2015 29,849.82     3.56 %
Feb 2015 30,099.05     0.83 %
Mar 2015 29,913.47    -0.62 %
Apr 2015  29,117.47    -2.66 %
May 2015 29,990.79    3.00 %
Jun 2015 30,206.13     0.72 %
Jul 2015  29,849.89    -1.18 %

Share this:

  • Tweet
  • More
Like Loading...

అన్నదాతల రుణ భారం కారణాలు – ఒకటవ భాగము

05 Thursday Nov 2015

Posted by raomk in Farmers

≈ Leave a comment

Tags

Agriculture, Farmers, farmers indebtedness

నిజానికి ఇది నేటిదా ! కానే కాదు, స్వాతంత్య్రానికి ముందు 1925లో పంజాబ్‌ రైతుల దుస్థితి గురించి విశ్లేషించిన మాల్కమ్‌ డార్లింగ్‌ భారత రైతు అప్పుల్లో పుట్టి, అప్పులో పెరిగి, అప్పులతో మరణిస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఆ నాటికే ధనికులుగా పరిగణించబడే పంజాబ్‌ రైతుల పరిస్ధితే అలా వుంటే నాటి నుంచి నేటి వరకు దేశంలో ఏ మూల చూసినా రైతాంగం రుణ వూబిలో దిగిపోవటం గురించే చర్చ జరుగుతోంది.

రైతు మిత్ర

వ్యవసాయం గిట్టుబాటు కావటం లేదు, రైతు కంటే కూలీ బతుకే నయం. కూరగాయలు పండించేవారి కంటే వాటిని అమ్మేవారే సుఖంగా వున్నారు. భూములమ్ముకొని పరిశ్రమలు, వ్యాపారాల్లో పెట్టిన వారి పరిస్ధితే బాగుంది. వ్యవసాయం గురించి ఎవరిని కదిలించినా వ్యక్తమయ్యే వ్యధ, బాధ ఇది.

నిజానికి ఇది నేటిదా ! కానే కాదు, స్వాతంత్య్రానికి ముందు 1925లో పంజాబ్‌ రైతుల దుస్థితి గురించి విశ్లేషించిన మాల్కమ్‌ డార్లింగ్‌ భారత రైతు అప్పుల్లో పుట్టి, అప్పులో పెరిగి, అప్పులతో మరణిస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఆ నాటికే ధనికులుగా పరిగణించబడే పంజాబ్‌ రైతుల పరిస్ధితే అలా వుంటే నాటి నుంచి నేటి వరకు దేశంలో ఏ మూల చూసినా రైతాంగం రుణ వూబిలో దిగిపోవటం గురించే చర్చ జరుగుతోంది. గతంలో రెండు సార్లు కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రుణ భారం నుంచి కొంత వుపశమనం కలిగించేందుకు కొన్ని రుణాలను రద్దు చేసింది. అయినా తరువాత కూడా అదే సమస్య ముందుకు వచ్చింది. ఆ కారణంగానే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఈ పూర్వరంగంలో రైతాంగ రుణాల రద్దు గురించి గత అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ వాగ్దానం చేసింది. దాన్ని అమలు జరిపేందుకు గత ఏడాది కాలంలో కొన్ని చర్యలు తీసుకుంది. రాబోయే సంవత్సరాలలో కూడా తీసుకుంటామని ప్రకటించింది. అసలు స్వాతంత్య్రం ముందు నాటి నుంచి వున్న ఈ సమస్య పదే పదే ఎందుకు పునరావృతం అవుతోంది. కొన్ని కారణాల గురించిన పరిశీలన ఇది.

ఆంగ్లేయులు వలస పాలకులు. తమ పరిశ్రమలకు అవసరమైన ముడి సరకులను సరఫరా చేసేందుకు, తమ పారిశ్రామిక వుత్పత్తులకు అవసరమైన మార్కెట్లుగా మార్చుకొనేందుకు వలస దేశాలను వుపయోగించుకున్నారన్నది నిర్వివివాదాంశం. అందుకే ఎందరో త్యాగధనులు తమ ప్రాణాలను సైతం అప్పగించి స్వాతంత్య్రం కోసం పోరాడారు. ఎన్నో త్యాగాలతో చివరికి సాధించుకున్నాం. తెల్లజాతీయులు పోయి అధికారానికి వచ్చిన మన వారు రైతే రాజు, దేశానికి వెన్నెముక, జై కిసాస్‌-జై జవాన్‌ ఇలా ఎన్నో నినాదాలు ఇచ్చారు. ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు ప్రకటించారు.

మన స్వాతంత్య్రానికి త్వరలో ఏడు పదులు నిండబోతున్నాయి.మొత్తం మీద రైతుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వేసిన మాదిరిగా వుంది. రుణ భారం ఒక తీవ్ర సమస్యగా మారి రైతాంగాన్ని ఆత్మహత్యలకు పురికొల్పేదిగా వుంది. రైతుల స్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా వుంది. అందుకే రైతులను ఎప్పుడు కదిలించినా నిర్వేదం ప్రకటిస్తుంటారు. అయితే వ్యవసాయం మీద బాగు పడిన వారు లేరా ? అనేక మంది మన కళ్ళ ముందు కనిపిస్తుంటే లేరని ఎలా అంటాం. బిడ్డ పుట్టిన తరువాత పెరగటం ఆగదు. అయితే అది ఆరోగ్యంగానా ముక్కుతూ, మూల్గుతూనా ఆంటే అది వేరే విషయం. రోగిష్టి బిడ్డ కూడా అప్పుడప్పుడూ నవ్వినట్లే బాగుపడిన రైతులు వున్నారు. ఇక్కడ చూడాల్సింది కొందరికే వ్యవసాయం ఎందుకు గిట్టుబాటు అవుతోంది? మొత్తం మీద ముల్లు ఎటు చూపుతోంది అన్నది ముఖ్యం.

అమెరికాలో కమతాలు వేల ఎకరాలుగా వుంటాయి. చిన్న రైతులన్నా వందలు,వేల ఎకరాల్లోనే పొలం వుంటుంది. అయినా అక్కడ కూడా ప్రభుత్వాలు రైతాంగానికి రాయితీలు, సబ్సిడీలు ఇస్తున్నాయి, చిన్న రైతాంగానికి వ్యవసాయం గిట్టుబాటు కావటం లేదన్న గొడవ వుండనే వుంది. ఫ్రాన్స్‌, బ్రిటన్‌ రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న వార్తలు చూస్తున్నాము.

 

అది పరతంత్రమైనా, స్వాతంత్య్రమైనా అనుసరించిన విధానాలే గీటు రాయి. దానితో వ్యవసాయం గిట్టుబాటు అవుతోందా కావటం లేదా అన్నది చూడాల్సి వుంది.కర్ణుడి చావుకు కారణాలు అనేక అన్నట్లు వ్యవసాయం గిట్టుబాటు కాకపోవటానికి కారణాలు కూడా అనేకం. పూసలు అనేక రంగులు, పరిమాణం, వివిధ రకాల ఆకృతుల్లో వున్నప్పటికీ వాటన్నింటిని ఒకటిగా కూర్చేందుకు వుపయోగించే దారం మాత్రం ఒకటిగానే వుంటుంది.అలాగే కారణాలు అనేక అయినప్పటికీ అవన్నీ విధాన పర్యవసానాలు అని గుర్తించటం అవసరం.

వ్యవసాయం మీద ఆధారపడే వారు మితిమీరి వుండటం, కమతాలు చిన్నవి కావటం, ఆధునిక వ్యవసాయ పద్దతులు,పరికరాలు అందుబాటులో లేకపోవటం వంటి కారణాల గురించి కొందరు బల్లగుద్ది చెబుతారు. వారి వాదనలోనూ నిజం లేకపోలేదు. అయితే ప్రతి దానికీ మినహాయింపులుంటాయి. వుదాహరణకు అమెరికాలో కమతాలు వేల ఎకరాలుగా వుంటాయి. చిన్న రైతులన్నా వందలు,వేల ఎకరాల్లోనే పొలం వుంటుంది. అయినా అక్కడ కూడా ప్రభుత్వాలు రైతాంగానికి రాయితీలు, సబ్సిడీలు ఇస్తున్నాయి, చిన్న రైతాంగానికి వ్యవసాయం గిట్టుబాటు కావటం లేదన్న గొడవ వుండనే వుంది. ఫ్రాన్స్‌, బ్రిటన్‌ రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న వార్తలు చూస్తున్నాము. ఏ సమస్యలు ఎన్ని వున్నా రైతుకు కావాల్సింది రక్షణ, గిట్టుబాటు. ఒక పారిశ్రామికవేత్త తన వుత్పత్తి, మార్కెటింగ్‌ వంటి ఖర్చులపై లాభం వేసుకొని తన వుత్పత్తులను విక్రయిస్తున్నాడు. అటువంటి అవకాశం రైతులకు వున్నదా ?

ఈ పూర్వరంగంలో కొన్ని అంశాల గురించి చెప్పుకుందాం. ప్రపంచ వాణిజ్య సంస్థ అవగాహన ప్రకారం కనీస మద్దతు ధరలు కూడా వుండకూడదు, ప్రభుత్వాలు సేకరణ బాధ్యతలు నిర్వహించకూడదు, మార్కెట్‌ శక్తులకే వదలి వేయాలి. ప్రభుత్వాలు రైతాంగానికి రాయితీలు ఇవ్వకూడదు. ఈ సమస్యపై వివాదం తెగని కారణంగానే దోహా చర్చలు 2001లో ప్రారంభమై ఇంకా కొనసాగుతూనే వున్నాయి. ధనిక దేశాలు తమలో తాము కొట్టుకుంటూనే ఏదో ఒక పేరు,సాకుతో వ్యవసాయ సబ్సిడీలు ఇస్తూ మన వంటి వర్ధమాన దేశాలలో వాటిని ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో, వడ్డించేవాడు మన వాడైతే కడబంతిలో వున్నా ఇబ్బంది లేదు అన్న లోకోక్తులను తరచూ వినే వుంటారు. అధికారంలో ఎవరు వున్నప్పటికీ పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలకు ఇస్తున్న ప్రాధాన్యత రైతాంగానికి లేదన్నది నిష్ఠుర సత్యం. వారికి ఇస్తున్న రాయితీలు, మినహాయింపులతో పోల్చితే రైతాంగానికి ఇస్తున్నది ఎంత అన్నది సమస్య. బడ్జెట్‌ అంటే ఆదాయ పంపిణీ కసరత్తు తప్ప మరొకటి కాదు. పరిశ్రమలు, వ్యాపారులకు ఇస్తున్న రాయితీల గురించి 2006-07 సంవత్సరం నుంచి ప్రతి ఏటా బడ్జెట్‌ పత్రాలలో ప్రభుత్వం కోల్పోయిన ఆదాయం ఆధ్యాయంలో వివరాలు ఇస్తున్నారు. ఇప్పటి వరకు(2014-15) ఆ మొత్తం దాదాపు 40 లక్షల కోట్ల రూపాయల వరకు వుందంటే అతిశయోక్తి కాదు. ఈ రాయితీలపై తీవ్ర విమర్శలు రావటంతో నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం ఆ అధ్యాయానికి పేరు మార్చింది. పన్నుల వ్యవస్థపై ఆదాయ ప్రభావం అని పెట్టింది. పేరులో నేమున్నది పెన్నిధి అన్నట్లుగా గతం నుంచి ఇస్తున్న రాయితీలను అదే మాదిరి కొనసాగించారు.

ఈ రాయితీలపై విమర్శలకు కొన్ని కారణాలు ఇలా వున్నాయి. విదేశాలకు ఎగుమతి చేసేందుకు మాత్రమే ఏర్పాటు చేసిన పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు మన వినియోగదారులకు లబ్ది చేకూర్చేవి కావు. విదేశీ కంపెనీలు, వ్యాపారులకు లబ్ది చేకూర్చేందుకు మనం పన్నులను మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం లేదు. స్వదేశీ కంపెనీలు పొందిన రాయితీల మేరకు స్ధానిక వినియోగదారులకు వాటిని బదిలీ చేయటం లేదు. వీటిని సమర్ధించేవారి వాదనలు ఇలా వున్నాయి. కార్పొరేట్‌ రంగమే ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నందున వారికి రాయితీలు ఇవ్వటం తప్పుకాదు. ఈ రాయితీల కారణంగా పరోక్షంగా వుపాధి కలుగుతోంది, వినియోగదారులకు కొంత మేరకు వుపశమనం కలుగుతోంది. అందువలన వీటిని రాయితీలుగా చూడరాదు, వీటికి విలువ కట్టరాదు. అయినా క్రమంగా ఈ రాయితీలు తగ్గిపోతున్నాయి. గతంలో జిడిపిలో 7.5శాతంగా వున్న రాయితీలు 2013-14 నాటికి ఐదుశాతానికి పడిపోయాయి. జిడిపి శాతం లెక్కల్లో చూస్తే తగ్గినప్పటికీ ఏడాది కేడాది మొత్తాలు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో వ్యవసాయ రంగానికి ఇస్తున్న రాయితీలకు ఎంతో ప్రాధాన్యత వున్నది. విలాస వస్తువులను అందరూ వుపయోగించకపోవచ్చు గానీ తిండి గింజలు వుపయోగించని వారెవరు?బంగారు కంచాల్లో తినే వారు కూడా బియ్యమో,గోధుమలో, కూరగాయలు తినాల్సిందే కదా ! అందువలన వ్యవసాయానికి ఇచ్చే రాయితీలు గాలి, నీరు, వెలుగు మాదిరి సర్వజనులకూ వుపయోగపడతాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d