• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: philanthropy-facts

ధర్మం కంటే కాలుష్య అధర్మం నుంచి గేట్స్‌కు లాభాలు ఎక్కువ

07 Monday Dec 2015

Posted by raomk in Current Affairs, Economics, Environment, INTERNATIONAL NEWS

≈ Leave a comment

Tags

BILL GATES, billionaires, philanthropy-facts

ధర్మకర్తృత్వం-దాతల బండారం-5

ఎం కోటేశ్వరరావు

బలి ఇస్తే లంకెబిందెలు దొరుకుతాయని మోసగాళ్లు చెప్పిన మాట విని జంతువులనే కాదు ఏకంగా పిల్లలనే బలి ఇచ్చేవారిని చూస్తున్నాము. దాన ధర్మాలు చేస్తే పుణ్యం వస్తుందని నమ్మేవారు ఆ మార్గంలో పుణ్యం పొందాలంటే ఏం చేయాలి పర్మనెంటుగా తమ ముందు చేయిచాచే వారిని తయారు చేసుకుంటూ వుండాలి. మెక్సికోకు చెందిన కార్లోస్‌ సిమ్‌ ఇప్పుడు ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ధనవంతుడు. అమెరికన్‌ బిల్‌గేట్స్‌ను మించిపోయాడు. అతగాడు దాతృత్వాన్ని ఒక పండ్ల చెట్లతో పోల్చాడు. మీరు పండ్ల చెట్లను దగ్గర వుంచుకొని పండ్లు మాత్రమే దానం చేయాలి తప్ప చెట్లను కాదు అన్నాడు. ఇతనితో సహా ధనవంతులు మరింత ధనవంతులు కావటాన్ని పేదలు మరింత పేదలుగా సంపదల పంపిణీలో అసమానతలను చూపే ప్రస్తుత వ్యవస్ధ తప్ప మరొకటి కాదు. అందుకే థామస్‌ పికెట్టి అనే ఫ్రెంచి ఆర్ధిక వేత్త ప్రపంచ ధనికులను హెచ్చరించాడు. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా ఆర్ధిక అసమానతలు పెరిగాయి, ఇది సామాజిక అశాంతికి దారితీస్తుందని ముందస్తు హెచ్చరిక చేశాడు. అసమానతలు పెరిగాయని అంగీకరిస్తే దానికి కారణాలేమిటో చెప్పమని జనం నిలదీస్తారు. అప్పుడు విధానాల గురించి, పెట్టుబడిదారీ విధానమా, కమ్యూనిజమా ఏది కారణం అన్న చర్చ వస్తుంది. నూటికి 99 వేళ్లు పెట్టుబడిదారీ విధానంవైపే చూపుతాయి. అందువలన అనేక మంది పెట్టుబడిదారులు పికెట్టి మరీ ఎక్కువ చెప్పాడని తప్పించుకుంటున్నారు తప్ప చర్చలోకి దిగటం లేదు. లేదు అంటే వర్తమాన ఆర్ధిక సంక్షోభాలు ఏమిటి? దానికి కారణాలు ఏమిటని నిలదీస్తారు.అప్పుడూ అదే చర్చ జరపాలి. అందువలన ఈ త్రైమాసికం చూడూ ఈ త్రైమాసికం చూడు నీకు అభివృద్ది కనిపిస్తుంది అని గత ఏడు సంవత్సరాలుగా చెబుతూనే వున్నారు. బ్రిటీష్‌ విక్టోరియా రాణి కాలం 1837-1901 మధ్య కాలానికి నేటికి ఆదాయ అసమానతలు ఎలా వున్నాయో కొందరు చెబుతున్నారు. ఆ కాలంలో కేవలం 46 సంవత్సరాలు మాత్రమే బతికి ప్రఖ్యాత రచయిత ఆస్కార్‌ వైల్డ్‌ తన కాలంలోని దాతృత్వ తీరుతెన్నులను వర్ణించాడు.నాటి ధనవంతులు కూడా సమాజంలో ఇంత దారిద్య్రం వుందా, పేదలకు ఇన్ని కష్టాలు వున్నాయా అని మన బిల్‌గేట్స్‌, వారెన్‌బఫెట్‌, మార్క్‌ జుకెర్‌ బర్గ్‌ మాదిరిగానే పీపాల కొద్దీ కన్నీళ్లు కార్చారు. వైల్డ్‌ ఏమన్నారంటే నాటి ధనవంతులు సూచించిన పరిష్కార మార్గాలు సమాజంలోని జబ్బును నయం చేయలేదు, మరికొంత కాలం పొడిగించాయి. తగిన లక్ష్యం లేకపోతే దారిద్య్రాన్ని నిర్మూలించటం అసాధ్యం అన్నాడు.

సైన్స్‌ ఇన్‌ సొసైటీ సంస్ధ డైరెక్టర్‌ , జెనిటిస్ట్‌, బయోఫిజిస్ట్‌ అయిన డాక్టర్‌ మాయే వాన్‌ హో ఏ చెప్పారంటే ఏ సమస్యలనైతే తాను పరిష్కరిస్తానని బయలు దేరిందో ఆ పెద్ద ధార్మిక సంస్ధ వాటికి కారణమైన కంపెనీలలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి లాభాలు సంపాదిస్తోందని అన్నారు. ఆ సంస్ధ మంజూరు చేసే గ్రాంట్ల వలన ప్రపంచ ఆరోగ్యం, వ్యవసాయ వ్యవస్ధకు హానితప్ప మేలు జరగటం లేదు, జాతీయ, ప్రపంచ ప్రాధాన్యతలను వక్రీకరిస్తున్నది. గేట్స్‌ ఫౌండేషన్‌ 2000 సంవత్సరంలో 2006లో రెట్టింపైంది. వారెన్‌బఫెట్‌ చేరిక దీనికి కారణం. మంచి పనులకు వీరు భారీ మొత్తంలో నిధులు ఇవ్వటంలో పేరు పొందారు. అయితే అదే సందర్భంలో మంచి పనుల కంటే దాని పెట్టుబడులపై భారీ మొత్తాలలో లాభాలు సంపాదిస్తున్నదని 2007 అమెరికాకు చెందిన లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌ వెల్లడించింది. ఇచ్చిన గ్రాంట్లకంటే చమురు కంపెనీలలో దాని పెట్టుబడులు ఎక్కువ. నైజీరియాలోని పిల్లలు టీకాలతో లబ్దపొందినప్పటికీ గేట్స్‌ ఫౌండేషన్‌, ఇతర ధార్మిక సంస్ధలు పెట్టుబడులు పెట్టిన చమురు బావుల నుంచి వెలువడే వాయువుల కారణంగా తీవ్రమైన శ్వాసకోశ సంబంధ వ్యాధుల బారిన పడ్డారు. నైగర్‌ డెల్టాలో చమురు బావుల నుంచి వెలువడిన మంటల కారణంగా పెద్ద వారిలో బ్రాంకోటైస్‌ పిల్లలలో ఆస్త్మా, కంటి చూపు సరిగా కనిపించకపోవటం వంటి సమస్యలు తలెత్తాయని ఎనోచా ప్రాంతంలోని ఒక వైద్యుడు చెప్పారు. అంతేకాదు ఈ ప్రాంతంలోని గ్యాస్‌ బావుల నుంచి రోజూ దాదాపు వంద కోట్ల ఘనపుటడుగుల గ్యాస్‌ను మండిస్తారు. దాని అమ్మకంద్వారా కలిగే ప్రయోజనం ఎంతో తెలియదు గానీ ప్రపంచ వాతావరణం వేడెక్కటానికి ఇవి దోహదం చేస్తున్నాయి. గేట్స్‌ ఫౌండేషన్‌ పోలియో, ఇతర టీకాలకు, పరిశోధనలకు ప్రపంచవ్యాపితంగా 218 మిలియన్‌ డాలర్లు దానం చేస్తే నైజీరియాలోని ఎని, రాయల్‌ డచ్‌, షెల్‌, ఎక్సాస్‌ మోబిల్‌ కార్పొరేషన్‌ , చెవరాన్‌, టోటల్‌ వంటివాటిలో 423 మిలియన్‌ డాలర్లు పెట్టుబడులుగా పెట్టిందని లాస్‌ఏంజల్స్‌ టైమ్స్‌ తెలిపింది. అమెరికా, ఐరోపాలలో అనుమతించిన దానికంటే ఎక్కువగా కాలుష్యం వెదజల్లేందుకు ఈ కంపెనీలకు అక్కడ అనుమతి ఇచ్చారు.

గేట్స్‌ ఫౌండేషన్‌ తాను ఎయిడ్స్‌ సమస్యపై పోరాడుతున్నానని చెప్పుకుంటోందో అది పెట్టుబడి పెట్టిన నైజీరియాలోని ఆయిల్‌ కంపెనీల కార్యకలాపాల కారణంగా తమ ప్రాంతంలో వ్యభిచారం తీవ్రంగా పెరిగిందని, దాని కారణంగా ఎయిడ్స్‌, తరుణవయస్సు యువతులు గర్భందాల్చటం వంటి సమస్యలు పెరిగాయని స్ధానికులు పేర్కొన్నారు. దారిద్య్రం, వ్యాధుల నిర్మూలన గురించి గేట్స్‌ ఫౌండేషన్‌ చెబుతుంటుంది. అది పెట్టుబడులు పెట్టిన చమురు కంపెనీలు తవ్విన చమురు బోర్ల గుంతలలో నిల్వవుండే నీరు నింపుతారు. దాంతో దోమలు తామరతంపరగా వృద్ధి చెంది మలేరియా పెరిగిపోతోంది. రివర్స్‌ స్టేట్‌లోని ఆరోగ్య కమిషనర్‌ దర్యాప్తు చేయించగా నదులలో చమురు తెట్టుల కారణంగా కలరా వస్తున్నట్లు తేలింది. విషపదార్ధాల నుంచి వెలువడే బెంజైన్‌, మెర్క్యురీ, క్రోమియం వంటివి పిల్లలలో వ్యాధినిరోధక శక్తిని తగ్గించి మరింతగా పోలియో, మీజిల్స్‌ వంటివి సోకటానికి దోహదం చేస్తున్నాయి.

గేట్స్‌ ఫౌండేషన్‌ పెట్టుబడులు పెట్టిన బిపి షేర్లు 83, రాయల్‌డచ్‌ 77, ఆంగ్లో-అమెరికన్‌ కంపెనీల వాటాల ధరలు 255 శాతం పెరిగాయి.మసాచుచెట్స్‌ విశ్వవిద్యాలయం రూపొందించిన జాబితా ప్రకారం అమెరికాలోని అత్యంత కాలుష్యకారక పరిశ్రమలు వంద, కెనడాలోని 50లో 330 కోట్ల డాలర్ల మేరకు గేట్స్‌ పెట్టుబడులు వున్నాయి. అంటే కాలుష్యం నుంచి కూడా ధర్మాత్ముడు గేట్స్‌ లాభాలు పిండుకుంటున్నాడన్నమాట.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అసలు బిలియనీర్లను పెంచటమెందుకు ? వారిని విరాళాల కోసం అడుక్కోవటం ఎందుకు ?

06 Sunday Dec 2015

Posted by raomk in Current Affairs, INTERNATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

billionaires, Face book, philanthropy-facts

ధర్మకర్తృత్వం-దాతల బండారం-4

ఎం కోటేశ్వరరావు

వ్యాపారులు ఎక్కువగా దాన ధర్మాలు చేయాలా ? దాన ధర్మాల పేరుతో ఎక్కువ వ్యాపారం చేయాలా అన్న ప్రశ్న ఎదురైనపుడు గతంలో ఏం జరిగిందో చూస్తే ఫేస్‌బుక్‌ సిఇఓ మార్క్‌ జుకెర్‌బర్గ్‌ ధర్మ వ్యాపారం ఎలా చేయబోతున్నాడో ముందు ముందుగానీ తెలియదు. లాన్‌సెట్‌ అనే వైద్య పత్రిక 2009లో జరిపిన అధ్యయనంలో గేట్స్‌ ఫౌండేషన్‌ 1998-2007 మధ్య ఇచ్చిన గ్రాంట్లలో కేవలం 1.4శాతమే ప్రభుత్వ రంగ సంస్ధలలకు వెళ్లగా మిగతా మొత్తం 659 ప్రభుత్వేతర సంస్ధలు పొందాయి, వాటిలో 37శాతమే మధ్య లేదా అల్పాదాయ దేశాలలో ప్రధాన కార్యాలయాలను కలిగి వున్నాయి. బడా కార్పొరేట్లు ధర్మ ఫౌండేషన్లను ఏర్పాటు చేసిన కాలాన్ని కూడా మనం గమనంలోకి తీసుకోవాలి. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్దలు వ్యవస్తాగత సర్దుబాట్ల పేరుతో మెజారిటీ ప్రపంచ దేశాలకు ప్రయివేటీకరణ, విద్య, వైద్యం వంటి సేవారంగాల బాధ్యతల నుంచి ప్రభుత్వాలు తప్పుకోవాలని షరతులు విధించి అమలు జరిపిస్తున్న కాలంలో ధనికుల ఫౌండేషన్లు వునికిలోకి వచ్చాయి. ప్రజలు, ప్రభుత్వాల మధ్య ఏర్పడిన ఖాళీలో ప్రభుత్వ ఏతర(ఎన్‌జివో)లను ప్రవేశపెట్టారు. అంతే కాదు ప్రభుత్వాలు తమ జాతీయ ప్రాధాన్యతలను నిర్ణయించుకోవటంలోనూ, ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు ఎన్‌జిఓలతో సమన్వయ పరుచుకోవటంలోనూ పొంతన కుదరక ఎద్దు-దున్న దున్నకం మాదిరి తయారైంది. ఎండ పెరిగే కొద్ది ఎద్దు నీడలోకి లాగ నీడ తగ్గేకొద్దీ దున్న ఎండలోకి లాగ అన్నట్లుగా తయారై వ్యవసాయం మూలనబడినట్లుగా అంతిమంగా జనం నష్టపోయారు. జాతీయ ప్రాధాన్యతలు వెనుక్కుపోయాయి. ఎయిడ్స్‌ హెచ్‌ఐవి సమాచారం మరియు నివారణ సంస్ధ ఐ బేస్‌ ప్రతినిధి పోలీ క్లేడన్‌ దీన్ని గురించి మాట్లాడుతూ మీకు హెచ్‌ఐవి వుండి వేరే వారు ప్రయోగదశలోవున్న ఔషధాలకు నిధులు చెల్లిస్తుంటే మీ సంరక్షణ సరిగా జరగకపోవచ్చు, వారికి ఈ ఏడాది ఈ ఆలోచన వచ్చి వచ్చే ఏడాది మరొకదానిమీదకు మళ్లితే మీ సంగతేమిటి అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు అలా చీటికి మాటికి ఏడాదికొక ప్రాధాన్యతలను మార్చుకోవు. దాతృత్వ సంస్ధల జోక్యం వలన ప్రజారోగ్య కార్యక్రమాలు అడ్డదిడ్డంగా తయారవుతాయి. కొన్ని సందర్భాలలో ఆయాదేశాల పౌరులకు అంతగా ప్రాధాన్యం కాని వాటికి ధనికులు నిధులు అందచేస్తారని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకురాలు దేవీ శ్రీధర్‌ హెచ్చరించారు.

ప్రయివేటు ఫౌండేషన్లు, ఎన్‌జీవోల భాగస్వామ్యం పెరగటంతో మరోవైపున ఐక్యరాజ్యసమితి ద్వారా ప్రపంచ ఆరోగ్యానికి అందచేసే నిధులు 1990-2008 మధ్య 32 నుంచి 14శాతానికి తగ్గాయి. దీనివలన జరిగేదేమిటి? మూడు లోంచి ఒకటి తీసి వేసి మిగిలిన దానికి ఒకటి కలిపితే ఏమౌతుందో ప్రపంచ ఆరోగ్యానికి అదే జరిగింది. అవి కూడా పైన చెప్పుకున్నట్లు ఒక పద్దతి ప్రకారం కాకుండా అస్తవ్యస్తం అయ్యాయి. గేట్స్‌ఫౌండేషన్‌ ప్రపంచ ఆరోగ్య సభ సిఫార్సు చేసిన వాటికి గాక ముందుగా తాను అనుకున్న పధకాలకే ప్రపంచ ఆరోగ్య సంస్ధకు నిధులు అందచేస్తున్నది. ప్రపంచ బ్యాంకు సంస్కరణలలో భాగంగా ప్రభుత్వాలు వైద్య సేవరంగం నుంచి వైదొలగాలన్నది ఒక షరతు. దానిని అమలు జరపటానికి తెల్లవారే సరికి ఆసుపత్రులను మూసివేస్తే రాజకీయంగా అధికారంలో వున్న పార్టీలు, ప్రభుత్వాలకు ఇబ్బందులు వస్తాయి. అందువలన పొమ్మనకుండా పొగ పెట్టినట్లు మొదటి దశలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు తగిన వైద్యులు, సిబ్బంది, పరికరాలు లేకుండా వాటిని పడకేయించారు. మిగిలిన ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లటం కంటే నేరుగా నరకానికి పోవటం మంచిది అనుకొనే విధంగా ఆసుపత్రులను తయారు చేశారా లేదా ? పర్యవసానం ఏమైంది? కార్పొరేట్‌ ఆసుపత్రులు మహానగరాల నుంచి మామూలు పట్టణాలకు చేరాయి. రైతులు, వ్యవసాయ కార్మికులు రుణగ్రస్తులెందుకు అవుతున్నారంటే ఆసుపత్రులకు వెళ్లేందుకు చేస్తున్న అప్పులు కూడా తోడు అవుతున్నాయన్నది అనేక పరిశోధనల్లో తేలింది. కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేరి బీమా లేకుండా అప్పులు పాలు కాకుండా బయటకు వచ్చిన సామాన్యులెవరైనా వుంటే గుండెమీద చేయి వేసుకొని చెప్పమనండి. ఇప్పుడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలతో మొదలు పెట్టి క్రమంగా ఆసుపత్రులను ప్రయివేటు వైద్యులకు , ఎన్‌జిఓలకు అప్పగించేందుకు ముందుకు పోతున్నారు.

ఒక ధనవంతుడికి జనమంతా తన మాదిరి చేపలు తింటే మంచిది కదా అన్న ఆలోచన వచ్చిందట. రాగానే ఒక లారీలో చేపలు తీసుకు వెళ్లి దగ్గరుండి మరీ పంపిణీ చేయించాడట. అందరూ ఎగబడి తీసుకుంటుంటే అక్కడున్న జనంలోని ఒక యువకుడు అలాగే నిలబడి పోవటం ఆ ధనికుడికి ఆశ్చర్యం కలిగించింది. ఏం నీకు చేపలు అవసరం లేదా తీసుకోవటం లేదు. అనగానే నీవంటి దాతలు నాకు దయా ధర్మంగా ఇచ్చే చేపలను తినటానికి నాకు సిగ్గుగా వుంది. నాకు జాలితో మీరిచ్చే చేపలు కాదు ప్రభుత్వం ఇచ్చే వల కావాలి అన్నాడట. పిచ్చివాడా వెంటనే తినేందుకు అవసరమైన చేపలు ఇస్తుంటే వల అడుగుతావేమిటి అని ధనవంతుడు అడిగాడు. మీకు ఈ రోజు బుద్ది పుట్టింది గనుక చేపలు ఇచ్చారు. రేపు మనస్సు మారినా మీ దగ్గర లేకపోయినా మా పరిస్ధితి ఏమిటి అని ప్రశ్నించిన యువకుడు తానే సమాధానం చెబుతూ మీరు వుండొచ్చు లేకపోవచ్చు, శాశ్వతంగా వుండే ప్రభుత్వం వలలను సమకూర్చితే జీవితాంతం మేము చేపలు పట్టుకొని నాలుగు డబ్బులు సంపాదించుకుంటాము, మేము తింటాము అందుకే వల అడిగాను అన్నాడట.

అంతిమంగా ఆరోగ్య సమస్యలను జవాబుదారీగలిగిన ప్రభుత్వాలే పరిష్కరించాలి తప్ప స్వచ్చంద సంస్ధలు పరిష్కరించలేవు. ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వీర్యం చేసిన ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని గాలికి వదలి వేసి కార్పొరేట్‌ ఆసుపత్రులకు ఏటా వందల కోట్ల రూపాయలను ఎలా కట్టబెడుతున్నాయో చూస్తున్నాము. ఆరోగ్యశ్రీ వలన పేదలకు వుపయోగం జరుగుతోందా లేదా అంటే జరుగుతోంది. అందుకయ్యే ఖర్చులో సగం సొమ్ముతో ప్రభుత్వ ఆసుపత్రులలో అదే రకం వైద్యం చేయవచ్చు. మిగిలిన మొత్తాన్ని మరొక ప్రజా సంక్షేమానికి ఖర్చు చేయాలి తప్ప కార్పొరేట్ల పరంచేయటం ఏమిటి. ఈ కార్పొరేట్‌ ఆసుపత్రులన్నింటా అంతర్జాతీయ జలగల పెట్టుబడులు ప్రవహిస్తున్నాయి. ధనికులు మరింతగా ముందుకు వచ్చి దానధర్మాలు చేయాలని, వారికి అలాంటి మంచి మనస్సు కలిగేలా చూడాలని కొందరు ప్రార్ధనలు జరుపుతున్నారు. దీని అర్ధం ఏమిటి? కార్పొరేట్లు మరింతగా పెరగాలని, వారు చేసే ధర్మాలు కూడా పెరగాలనే కదా? దీన్నే మరోవిధంగా చెప్పాలంటే ఇప్పుడున్న దోపిడీ ఇలాగే కొనసాగాలి, కావాలంటే పేదలకు ఎంతో కొంత సొమ్ముదానంగా ఇస్తాం అని చెప్పటమే. ప్రపంచ ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఇది అసలు పరిష్కారమే కాదు అంటున్నారు ఎందరో. అన్నింటికీ మించి అటువంటి బిలియనీర్లను పెంచే వ్యవస్ధను కొనసాగనివ్వటం ఎందుకు ? విరాళాలు ఇమ్మని అడగటం ఎందుకు ? ఇది సమస్యను పక్కదారి పట్టించటమే కదా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

వ్యాపారులు ఎక్కువగా దాన ధర్మాలు చేయాలా ? దాన ధర్మాల పేరుతో ఎక్కువ వ్యాపారం చేయాలా ?

05 Saturday Dec 2015

Posted by raomk in Current Affairs, Economics, INTERNATIONAL NEWS

≈ Leave a comment

Tags

billionaires, education, Face book, philanthropy-facts

ధర్మకర్తృత్వం-దాతల బండారం-3

ఎం కోటేశ్వరరావు

లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు అన్న సామెత తెలిసిందే. ఇప్పటి వరకు ప్రపంచ మంతా బిల్‌గేట్స్‌, వారెన్‌ బఫెట్‌ ధర్మాల గురించి పాత రోజుల్లో పల్లె టూళ్లలో గుంపులుగా కూడి సినిమా కధలు చెప్పుకున్నట్లుగా చెప్పుకున్నారు. చంద్రబాబు నాయుడి వంటి వారి గురించి ఇక చెప్పనవసరం లేదనుకోండి. ఫేస్‌బుక్‌ సిఇఓ మార్క్‌ జుకెర్‌బర్గ్‌ దాతృత్వం గురించి గొప్పగా పొగిడారు( మరి ఆయనకు తాతగా ప్రమోషన్‌ వచ్చిన సందర్బంగా హెరిటేజ్‌ ఇతర కంపెనీల్లో వున్న వాటాలను కూడా అలాగే ధర్మం చేయవచ్చు కదా అని ఎవరూ అడగకండి). మనకున్న జబ్బు అని అనకూడదు గానీ ఏ అంశమైనా కొనసాగింపు,పర్యవసానాలు ఏమిటి అని చూడటం తక్కువగా వుంది.మూసి పెట్టటం తప్ప మీడియా దాని గురించి అసలు పట్టించుకోదు.ఒక అవినీతి గురించి సంచలన వార్త ప్రసారం లేదా ప్రచారం, ప్రచురణ తరువాత చివరకు ఏమైంది? కాకపోతే ఎందుకు కాలేదు అన్న సమాచారం వుండదు. కలికాలం కాకపోతే ధనవంతులకు ఆకస్మికంగా ధర్మాలు చెయ్యాలన్న బుద్ది పుట్టటమేమిటి? ఈ విషయం బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారో లేదో నేను వినలేదు) నిజంగా వారు తమ సంపదలను ఇచ్చారా? ఇస్తే ఏం జరిగింది అన్నది తెలుసుకోకపోవాలన్న ఆసక్తి జనానికి వుండకూడదనే ధనికులు కోరుకుంటారు.ఒక్క ఇచ్చినపుడు ప్రచారం తప్ప.

బిల్‌గేట్స్‌ తన సంపదలను దానం చేశాడు, ఓకే, దాని వలన లాభపడింది ఎందరు? అసలు సమాజంలో ఒకరు ఇచ్చేవారు, ఒకరు పుచ్చుకొనే నిస్సహాయత ఎందుకు వుండాలి. పుచ్చుకొనేవారి కష్టానికి తగిన ప్రతిఫలం లేదా గౌరవ ప్రదమైన శ్రమకు తగ్గ విలువను చెల్లిస్తే వేరొకరి ముందు చేయి చాచాల్సిన అగత్యం ఎందుకు అని ఆలోచించనవసరం లేదా ? అంటే పెట్టుబడిదారులు తమది ఎల్లపడు పైచేయిగా వుండే పరిస్ధితులు శాశ్వతం కావాలని కోరుకుంటున్నారా ?

బిల్‌ గేట్స్‌ దాన ధర్మాల గురించి ఆండ్రూ బౌమన్‌ అనే పరిశోధకుడు కొన్ని మింగలేని విషయాలను వెల్లడించారు. హఫింగ్టన్‌ పోస్ట్‌ అనే పత్రికకు కొద్ది సంవత్సరాల క్రితం అసలు తానెందుకు సంపదను దానం చేయాలనుకున్నదీ గేట్స్‌ వివరించాడు. 1993లో గేట్స్‌ ఆఫ్రికా వెళ్లినపుడు అక్కడి పరిస్ధితులను చూసి చలించిపోయాడన్నది సారాంశం. అమెరికాలో ఎవరైనా తమ సంపదలో ఏడాదికి ఐదు శాతం దాన ధర్మాలకు అందచేస్తే వారికి పన్ను రాయితీలు దక్కుతాయి. గేట్స్‌ ఆఫ్రికాను చూసి చలించి పోయిన తరువాత ఆయన మిత్రుడు వారెన్‌ బఫెట్‌లో కూడా చలనం వచ్చింది. గేట్స్‌తో కలసి తన కుటుంబం 30 బిలియన్‌ డాలర్లను దాన ధర్మాలకు ఇస్తామని ప్రకటించారు. 2010నాటికి వారు 26 బిలియన్‌ డాలర్లు ఎక్కువగా ప్రపంచ ఆరోగ్య అవసరాలకు ఇచ్చారు. అమెరికాలో అంతకు ముందు ధనికుడిగా వున్న రాకఫెల్లర్‌ కుటుంబం 1914నుంచి ఇచ్చిన మొత్తం 14 బిలియన్‌ డాలర్లు మాత్రమే. గేట్స్‌ ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌ టీకాల ద్వారా అరవైలక్షల మంది పిల్లలను బతికించినట్లు చెప్పుకున్నారు. ఎయిడ్స్‌, టీబీల నుంచి ఏడాదికి లక్షమందిని రక్షించటం లక్ష్యంగా గేట్స్‌ ప్రకటించారు. గేట్స్‌ చొరవ అనేక మంది ధనికులను ప్రపంచ ఆరోగ్యంవైపు దృష్టి సారింప చేయించిందని అనేక మంది పొగిడారు.

అయితే ఈ ఫౌండేషన్‌ పెట్టే ఖర్చు, దానిప్రభావం ఎంత , అసలది ఎవరికి జవాబుదారీ అన్న సమస్యలు ముందుకు వచ్చాయి. దాన ధర్మాలకు ఇచ్చిన సొమ్ములో ఏటా ఐదు శాతం మొత్తం తమ వైపు తిప్పుకొనేందుకు యత్నించే(లాబీయింగ్‌) వ్యవహారాలకు, సలహాలకు ఖర్చు చేస్తామని ఫౌండేషన్‌ చెప్పుకుంటుంది. వాటిలో అమెరికా విశ్వవిద్యాలయాల మొదలు ఎన్‌జీవోల వరకు అనేక సంస్ధలున్నాయి. ముందే చెప్పుకున్నట్లు ఫౌండేషన్‌ చేసే ఖర్చులో సింహభాగం ప్రపంచ ఆరోగ్య భాగస్వామ్యం కోసమే కేటాయించారు.అంటే ఆరోగ్య విధానాల రూపకల్పనలో తమ ముద్ర , ప్రాధాన్యతలు వుండే విధంగా లాబీయింగ్‌ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్ధ, ఇతర ఏజన్సీలు వున్నప్పటికీ గేట్స్‌ ఫౌండేషన్‌ ఆరోగ్య సంరక్షణ వ్యూహాలపై సమీక్షా సమయాలలో గేట్స్‌ కంపెనీ సిఇఓ కుర్చీవేసుకు కూర్చుంటాడు. వూరికే కూర్చోవటానికి వారేమన్నా పనిలేని వారా ? దానాలలో కూడా లాభాలు ఎలా పిండుకోవచ్చో కనిపెట్టిన వారు వూరికే వుండరు కదా ! విధానాలపై ప్రభావం చూపేందుకు జోక్యం చేసుకుంటారు. మందులు మా బావమరిది షాపులోనే కొనాలనే షరతులు విధించకుండానే కొనిపించే డాక్టర్ల మాదిరి చేయాల్సింది చేసుకుంటారు.డాక్టర్‌ డేవిడ్‌ మెకాయ్‌ అనే ప్రజారోగ్య వైద్యుడు లండన్‌ విశ్వవిద్యాలయ కళాశాలలో పరిశోధకుడు, ్క ప్రజారోగ్య వుద్యమానికి ఒక సలహాదారు. ఆయనేమన్నారంటే ‘ఫౌండేషన్‌ అంటే నిధుల వసూలు , పధకాల అమలుకు మించి దాని లక్ష్యాలు వుంటాయి అన్నారు. అకడమీషియన్లుగా వుండే వ్యక్తులు, ప్రభుత్వేతర సంస్ధలు, వాణిజ్య రంగాలతో అంతర్గత సంబంధాలు కలిగి వుంటాయి. అంతర్జాతీయ ఆరోగ్య సమస్యపై ఒక బృంద ఆలోచనగా ప్రభావం చూపుతాయి.శాస్త్రీయ అభిప్రాయాలలోని భిన్నత్వాన్ని గేట్స్‌ ఫౌండేషన్‌ అణచివేస్తున్నదని, అది తనకు తాను తప్ప ఇతరులెవరికీ జవాబుదారీ కాదని ప్రపంచ ఆరోగ్య సంస్ధలోని మలేరియా విభాగ పరిశోధన అధిపతి ఆరాటా కోచి 2008లో విమర్శించారు.

గేట్స్‌ వంటి ఫౌండేషన్లు ప్రపంచ ఆరోగ్య విధానాన్ని ఏవైపుకు నెడుతున్నాయి ?

తాను పెట్టుబడులు పెట్టటానికి ఒకేసారి ఏడడుగులు ఎగిరేందుకు ప్రయత్నించటం గాక ఒక అడుగుతో దాటిపోయేయి ఏవి వుంటాయా అని పరికించిచూస్తాను అని వారెన్‌బఫెట్‌ అన్నాడు.అయితే బిల్‌గేట్స్‌ దీనికి విరుద్ధంగా కుండలో కూడు కుండలోనే వుండాలి పిల్లాడు మాత్రం తెల్లవారేసరికి దుడ్డులా తయారు కావాలి అన్నట్లు తాను ఇచ్చే దాన సొమ్ముతో ఒకేసారి ఏడడుగులు గెంతాలి అన్నాడు. పసితనంలో రెండుమూడు డోసులు వేసే టీకాలతో జీవితకాలంపాటు రాని వ్యాధుల మాదిరి ఎయిడ్స్‌, టీబీ వంటి వ్యాధులను ఒక్క మాత్ర లేదా టీకాతో నయం చేసే అద్భుతాలు జరగకపోతే ఆధునిక పరిజ్ఞానం ఎందుకన్నట్లు మాట్లాడటమే కాదు తన దానపు సొమ్ములో1998-2007 మధ్య 36.5శాతం ప్రభుత్వ-ప్రయివేటురంగ భాగస్వామ్యంతో నడిచే ‘గావి అలయన్స్‌’ పరిశోధనలకే కేటాయించాడు. అది హెపటైటిస్‌ బి, హెచ్‌ఐబి బాక్టీరియా నిర్మూలనకు వాక్సిన్‌ల తయారీకీ పనిచేసింది. ప్రస్తుతం న్యూమోనియో, డయేరియా వంటి వ్యాధుల కారక బాక్టీరియాను నిర్మూలించే వ్యాక్సిన్ల పరిశోధనలో నిమగ్నమై వుంది. మరి ఈ వాక్సిన్లు మానవాళికి వుపయోగమా కాదా అంటే వుపయోగమే.

సమస్య ఎక్కడ వుందంటే ఇప్పటి వరకు సాగించిన శాస్త్ర పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు అన్నీ సమాజానికి చెందినవే తప్ప వ్యక్తులకు చెందినవి కాదు. ఒక శాస్త్రవేత్త ఒక ఔషధాన్ని కనిపెట్టాడు, లేదా ఒక ప్రమాదకర బాక్టీరియాను జాడ పట్టాడు అంటే దాని వెనుక అతని ప్రతిభ లేదని కాదు. పరిశోధన రిలే పరుగు పందెం వంటిది అనుకుంటే విజయసూచికగా రిబ్బన్ను తాకేది చివరి రన్నర్‌ కావచ్చుగాని అంతకు ముందు వారు లేకుండా, వారు సరిగా పరుగుతీయకుండా చివరి వ్యక్తికి విజయం సాధ్యం కాదు. అలాగే తన ముందు తరాల వారు వాటిపై సాగించిన అధ్యయనాల కొనసాగింపుగా ఎవరైనా నూతన అంశాన్ని కనుగొన్నారు, వున్నవాటిని మెరుగుపరిచారు తప్ప స్వంతంగా తామే కనుగొనలేదు.ఎవరైనా అలా చెప్పుకుంటే అది వారి సంస్కారానికి సంబంధించిన అంశం. రైట్‌ బ్రదర్స్‌కు ముందు విమానాలపై జరిగిన పరిశోధనలు, వైఫల్యాల నుంచి వారు తీసుకున్న గుణపాఠంతో విమానం ఎగరటంపై పైలట్స్‌కు ఎలా అదుపు వుండాలో కనుగొన్నారు. అది ఒక విప్లవాన్ని తెచ్చింది.వారి పరిశోధన బృందంలో సైకిల్‌ షాపు మెకానిక్‌ చార్లీ టేలర్‌ కూడా ఒక ముఖ్యుడన్న విషయం మనలో చాలా మందికి తెలియదు. ప్రింటింగ్‌ ప్రెస్‌లు,మోటార్లు, సైకిల్‌షాపులు అన్నింటిని ఆ బృందం పరిశీలించి, వాటిలో పనిచేసి విమానం ఎగిరే యంత్రాన్ని కనిపెట్టారు. కానీ పేటెంట్‌ మాత్రం రైట్‌ బ్రదర్స్‌ పొందారు.నిజానికి ఆది సమష్టి కృషి.దానిని సమాజానికి వుపయోగించినపుడు ఫలాలు అందరూ అనుభవిస్తారు, వ్యక్తులు లేదా కొన్ని కంపెనీలకు పరిమితం చేసినపుడు వారు మాత్రమే లబ్దిపొందుతారు. ఈ దిశగా ఆధునిక పెట్టుబడిదారులు తమ లాభాలను కాపాడుకొనేందుకు, పెంచుకొనేందుకు నూతన పద్దతులను, ఆర్ధిక వుత్పత్తులను కనిపెడుతున్నారు.

వుదాహరణకు కామెర్ల రోగానికి మందులను ఇంతకు ముందే కనిపెట్టకపోలేదు. అయితే వాటికి నిర్ణయించిన ధరలలో వుపయోగించాలంటే సామాన్యుల వల్లకాదు. పెద్ద మొత్తంలో తయారు చేస్తే ఖర్చులు తగ్గుతాయి. అందుకు పద్దతులు కనుగొనాలి, దాన్ని మార్కెటింగ్‌ చేయాలి. అప్పుడే అందరికీ అందుబాటులోకి వస్తుంది. ‘గావీ’ సంస్ధద్వారా బిల్‌గేట్స్‌ ఫౌండేషన్‌ ఆపని చేసింది. హెపటైటిస్‌ బి వ్యాక్సిన్‌ ధరను 68శాతం మేరకు తాము తగ్గించగలిగామని గావి చెప్పింది. దీని తరువాత న్యూమోనియా టీకాల పరిశోధనకు 150 కోట్ల డాలర్ల ధర్మ నిధిని కేటాయించారు. కామెర్ల వ్యాధి అందరికీ వస్తుందా, దాని నివారణకు వ్యాక్సిన్‌ ముందే తీసుకోవటం అవసరమా? కంపెనీలు తయారు చేశాయి,అవి అమ్ముడు పోవాలి, లేదా యంత్రాలు ఖాళీగా వుండకుండా ఏదో ఒకటి తయారు చేయాలి, నుక వాటికోసం టీకాలు తీసుకోవాలా అన్నది మరొక చర్చ. ముందస్తు నివారణ కోసం అవసరం వున్నా లేకపోయినా మందుల కంపెనీలు తమ వుత్పత్తులను అంటగడుతున్నాయన్న చర్చ జరుగుతోందా లేదా ? వ్యాక్సిన్లపై అమెరికాలో పెద్ద ఎత్తున వ్యతిరేకం వ్యక్తం అవుతోందా లేదా ?చౌకగా వ్యాక్సిన్లు అందుబాటులోకి తేవటం మంచిదే కదా, దాని వలన ఏదైనా ఒక కంపెనీ లాభం పొందితే ఏమిటట, ఏడుపు తప్ప అనేవారు లేకపోలేదు.

పెట్టుబడిదారుల పత్రిక ఫైనాన్సియల్‌ టైమ్స్‌ దీని గురించి రాస్తూ చౌక ధరలతో, వేగంగా అటు పేదలకు ఔషధాలు దొరకటం, ఇటు వుత్పత్తుల మార్కెటింగ్‌ జరిగి కంపెనీలకు సమాన ప్రయోజనం కలిగిందని పేర్కొన్నది. సరిహద్దులకు అతీతంగా ఔషధాలు దొరకాలనే ప్రచారం చేస్తున్న సంస్ధ డైరెక్టర్‌ టిడోవాన్‌ సచోయన్‌ అంగ్‌రెర్‌ ఏమంటారంటే ప్రపంచ ఆరోగ్యరంగంలో ప్రయివేటు రంగ పాత్ర ఎక్కువగా వుండాలని గేట్స్‌ ఫౌండేషన్‌ కోరుతున్నది, ప్రభుత్వంతో ప్రయివేటు రంగ భాగస్వామ్యం కోరుతున్నది, దాన్నొక విధానంగా రూపాందింపచేసేందుకు ఈ సంస్ధలు ప్రయత్నిస్తున్నాయి.దీని వెనుక వాటికి భారీ ప్రయోజనాలు దాగున్నాయి. ఒక ఆట నిబంధనలను రూపొందించే పాత్రలో కంపెనీలు వుండకూడదు. ప్రపంచ ఆరోగ్య సంస్ధకు భారీ మొత్తంలో నిధులు ఇస్తున్న గేట్స్‌ ఫౌండేషన్‌ ఆ సంస్ధ విధాన నిర్ణయాల రూపకల్పనలో ప్రాధాన్యతలను నిర్ణయిస్తున్నది.అది బడా ఫార్మా కంపెనీల మాజీ వుద్యోగులను పెద్ద ఎత్తున తన సిబ్బందిగా తీసుకోవటంతో కంపెనీలకు అనుగుణ్యంగా నిర్ణయాలు జరుగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి.

మన కేంద్ర ప్రభుత్వం ప్రజారోగ్యవుద్యమ కార్యకర్తల వత్తిడికి తలొగ్గి లేదా మన ఫార్మా పరిశ్రమ అభివృద్దికి లేదా తన బడ్జెట్‌ ఖర్చు తగ్గించుకొనేందుకు గానీ జీవనధార (జనరిక్‌)ఔషధాలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. పేటెంట్‌ హక్కులున్న ఔషధాలు ఎంతో ఖరీదైనవి. వాటికి అడ్డదారులు కనుగొనటంలో మనదేశం, చైనా ఫార్మాకంపెనీలు ఆరితేరాయి. జీవన ధార ఔషధాల తయారీ వలన వాటిని రూపొందించిన కంపెనీలకు ఎలాంటి ఆర్ధిక ప్రయోజనం కలగదు. అందువలన అవి పేటెంట్‌ హక్కులను మరింత కఠినతరం చేసేందుకు పెద్ద ఎత్తున లాబీయింగ్‌ చేస్తున్నాయి.ఈ మందులను తయారు చేసే కంపెనీలకు ఏదో ఒక సాకుతో ఆటంకాలు కలిగిస్తున్నాయి. మన దే శంలోని అనేక జనరిక్‌ మందుల తయారీ కంపెనీలకు ఏ రోజున, ఎటువైపు సుంచి ఏం ముప్పు ముంచుకువస్తుందో తెలియదు.ఈ మందుల తయారీ పోటీ లేనట్లయితే ఎందరో రోగులు మందులు కొనుగోలు చేయలేక మరణించి వుండేవారు. పేదలకు వుపయోగపడని ఆధునిక పరిజ్ఞానం ఒక పరిజ్ఞానమా అని కబుర్లు చెప్పే బిల్‌గేట్స్‌ మరోవైపున కష్టపడి పేటెంట్‌ పొందిన కంపెనీల మేధోపరమైన హక్కులకు గట్టి రక్షణ లేకపోతే ఎలా అని ‘ట్రిప్స్‌’ ఒప్పంద చర్చ సందర్భంగా ప్రపంచ వాణిజ్య సంస్ధలో, జి 8 దేశాల బృందంలో మైక్రోసాప్ట్‌ కంపెనీ ద్వారా వత్తిడి చేయించాడు.ఈ వైఖరి అభివృద్ధి చెందుతున్నదేశాలలో ఆరోగ్య సంక్షోభాన్ని మరింత పెంచుతుందని ఆక్స్‌పామ్‌ సంస్ధ పేర్కొన్నది. వాణిజ్య, పారిశ్రామికవేత్తలు మరిన్ని దాన ధర్మాలు చేయాలా ? లేక దాన ధర్మాల పేరుతో మరింత వ్యాపారం చేయాలా అన్నది ఇక్కడ సమస్య?

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d