Tags
‘Lord Vishnu’ Remarks., BJP, BR Ambedkar, BR Gavai, CJI BR Gavai, Kamaltai Gavai, Narendra Modi Failures, RSS, Sanatan Dharma, Shoe Thrown at Chief Justice Gavai, Supreme Court
ఎం కోటేశ్వరరావు
మనోభావాల మాటున ఎంతకైనా తెగించే శక్తులు రెచ్చిపోతున్న రోజులివి. అక్టోబరు ఆరవ తేదీన సుప్రీం కోర్టు పధ్రాన న్యాయమూర్తి భూషన్ రామకృష్ట (బిఆర్ ) గవాయిపై రాకేష్ కిషోర్ అనే 71 ఏండ్ల న్యాయవాది కోర్టు హాలులో బూటువిసిరి దాడి చేసేందుకు ప్రయత్నించాడు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సనాతన ధర్మాన్ని అవమానిస్తే హిందూస్తాన్లో సహించేది లేదంటూ నినాదాలు చేశాడు. అయితే తొణకని బెణకని ప్రధాని న్యాయమూర్తి ఇలాంటి చర్యలు తననేమీ చేయవని, వాదనలు కొనసాగించాలని న్యాయవాదులను కోరారు. రాకేష్ కిషోర్‌ను కొద్ది సేపు నిర్బంధంలోకి తీసుకున్న సిబ్బంది తరువాత వదలి పెట్టారు. ఎలాంటి కేసు దాఖలు చేయలేదు. ఈ ఉదంతాన్ని అనేక మంది తీవ్రంగా ఖండించారు. సిపిఐ(ఎం) వంటి క్నొు పార్టీలు, సంస్థలు అనేక చోట్ల నిరసన ప్రదర్శనలు చేశాయి. మా వరకు ఇది మరచిపోయిన ఉదంతం అని తరువాత బిఆర్ గవాయి వ్యాఖ్యానించారు. మా సోదర న్యాయమూర్తి, నేను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురైనప్పటికీ మా వరకు ఇది ముగిసిపోయిన అంశము అన్నారు. సదరు లాయరు సభ్యత్వాన్ని సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ , భారత బార్ కౌన్సిల్ వెంటనే రద్దు చేశాయి. గవారు తల్లి కమలాతారు, సోదరి కీర్తి అర్జున్ కూడా ఖండించారు.సమస్యలు ఏవైనా ఉంటే రాజ్యాంగబద్దంగా పరిష్కరించుకోవాలి తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకొనేందుకు ఎవరికీ హక్కులేదని కమలాతారు పేర్కొన్నారు. ఈ దాడి కేవలం వ్యక్తిగతమైనది కాదు, దేశానికే అవమానకరమైనది, ఒక విషపూరిత భావజాలంలో భాగము, దాన్ని నిరోధించాలని కీర్తి పేర్కొన్నారు.
తనది సాధారణ జన్మ కాదు అన్న ప్రధాని నరేంద్రమోడీని ఆదర్శంగా తీసుకున్నట్లుగా ఈ దాడి తాను చేసింది కాదు,తనకసలు అలాంటి ఉద్దేశమే లేదు, దేవుడే చేయించాడని రాకేష్ కిషోర్ తరువాత చెప్పాడు. ఎఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ సెప్టెంబరు 16వ తేదీన ప్రధాన న్యాయమూర్తి ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విన్నారు, దాన్ని దాఖలు చేసిన న్యాయవాది ఎవరో కూడా తెలియదు అప్పటి నుంచి తన చర్యలతో ఒక సందేశాన్ని ఇాచ్చేందుకు ప్రయత్నించినట్లు, విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సనాతన ధర్మాన్ని అవమానించారని రాకేష్ ఆరోపించారు. ఖజురహౌలో ఏడు అడుగుల విష్ణుమూర్తి విగ్రహం తలనరికి వేశారు, విదేశీయులు మన దేశం మీద దండయాత్రలు చేసినపుడు అనేక దేవాలయాల మీద దాడులు చేశారు, వాటిలో ాదొకటు, తాను వ్యక్తిగతంగా ఆ విగ్రహ్నాు సందర్శించినపుడు ఏడ్చాను, అలాంటి అందమైన విగ్రహానికి తలలేకపోవటంతో ఎంతో విచారించాను, అది అందరికీ విచారం కలిగించేదే అని రాకేష్ కిషోర్ చెప్పారు. ఆ విగ్రహానికి మరమ్మతులు చేయాలన్న పిటీషనర్ వినతి మీద ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్య తనకు విచారం కలిగించింది, మీరు దేవుడికి అంత గొప్ప భక్తులైతే ఏదో ఒకటి చేయాలని ఆ విగ్రహానికే మీరు చెప్పండి అన్నారు, దాని కంటే ఆ పిటీషన్‌ను కొట్టివేయటం తనకు మరింత విచారం కలిగించిందని చెప్పారు.
న్యాయమూర్తి ఏ పూర్వరంగంలో ఆ వ్యాఖ్య చేశారో గమనించటం అవసరం. ఖజురహౌ ప్రాంతం వారసత్వ సంపదగా ప్రకటించిన జాబితాలో ఉంది, దాని మీద నిర్ణయం తీసుకొనే అవకాశం కోర్టుకు లేదంటూ పిటీషన్ కొట్టివేసినట్లు ప్రకటించిన సందర్భంలో పిటీషనర్ పదే పదే తాను విష్ణుమూర్తి భక్తుడనని ప్రస్తావించటంతో అయితే ఆ విష్ణుమూర్తికే విన్నవించుకోండి, మీతీరు చూస్తే ప్రజాప్రయోజన వాజ్యంగాక ప్రచార ప్రయోజనం కోసం వేసినట్లుగా ఉందని కూడా గవాయి వ్యాఖ్యానించారు. దాడి యత్నానికి తానేమీ చింతించటం లేదని రాకేష్ కుమార్ చెప్పారు. సనాతన ధర్మాన్ని ప్రధాన న్యాయమూర్తి అపహాస్యం చేసిన క్రియకు తాను చేసింది కేవలం ప్రతిక్రియ మాత్రమే అన్నారు. తానెలాంటి మైకంలో లేనని, భయపడేవాడిని కూడా కాదన్నారు. ఇతర సామాజిక తరగతుల విషయంలో న్యాయస్థానం పెద్ద చర్యలు తీసుకున్నదంటూ హల్దవానీ రైల్వే భూమిని ఆక్రమించిన ఒక సామాజిక తరగతి నుంచి దాన్ని తొలగించాలనే కేసు సుప్రీం కోర్టు ముందుకు వచ్చినపుడు మూడు సంవత్సరాల క్రితం స్టే విధించారు, అది ఇప్పటికీ కొనసాగుతున్నది, నూపూర్ శర్మ కేసు వచ్చినపుడు మీరు వాతావరణ్నాు చెడగొట్టినట్లు కోర్టు వ్యాఖ్యాుంచింది, ఇలా అన్నీ వారే చేస్తారు, అదంతా సక్రమంగా ఉందనుకోవాలి అంటూ ఎద్దేవా చేశారు. రోజూ సామాజక మాధ్యమం, ఇతర మాధ్యమాల్లో కాషాయ దళాలు చేస్తున్న వాదనలన్నింటినీ ఈ సందర్భంగా వల్లించారు. తాను ఒక సాధారణ వ్యక్తిని కాదని ఎంఎస్సి, పిడి. గోల్డ్‌మెడలిస్ట్ మరియు ఎల్ఎల్బి చదివినట్లు, తనకే పార్టీ, సంస్థ మద్దతు లేదని చెప్పుకున్నారు. తన సామాజిక తరగతి గురించి అతనేమీ చెప్పలేదు గానీ దళితుడని సామాజిక మాధ్యమాల్లో వచ్చింది. సనాతన ధర్మం, మను ధర్మం పేరుతో వేల సంవత్సరాలుగా అంటరాని వారంటూ దళితులను తీవ్ర వివక్ష, అవమానాలకు గురిచేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ సామాజిక తరగతికి చెందిన వ్యక్తై ఉండి ఆ సనాతన ధర్మం కోసం ఈ పని చేశానని చెప్పటం, సామాజిక స్పృహను కోల్పోయిన ఉన్మాద స్థితిలోకి వెళ్లిన అతన్ని చూసి నిజంగా జాలిపడాలి. ఆ విష్ణువునే ప్రార్ధించండి అని అనటం సనాతన ధర్మాన్ని అవమానించటమా ? అదే గనుక అయితే నైజాం నవాబు జైల్లో పెట్టినపుడు ఎవడబ్బ సొమ్మని కులికావు రామచంద్రా అని భక్తరామదాసు నిరసనగా కీర్తన పాడినట్లు ప్రచారంలో ఉన్నదే దానికి మనోభావాలు దెబ్బతిని ఎవరిని చెప్పుదెబ్బలు కొడతారు. వేదవిద్యలెల్ల వేశ్యల వంటివి, భ్రమలు పెట్టి తేటపడగనీవు,అన్న వేమన, కనక మృగము భువినికద్దు లేదనక యే, తరుణి విడిచిపోయె దాశరధియు, తెలివిలేనివాడు దేవుడెట్లాయరా అన్న సంగతి తెలిసిందే. అందువలన మనోభావాలు దెబ్బతిన్నాయనే పేరుతో వేమన మీద దాడులు చేస్తారా ?
మీడియాతో మాట్లాడినదాన్ని బట్టి రాకేష్ కుమార్ ఒక పథకం ప్రకారమే దాడికి యత్నించినట్లు చెప్పవచ్చు. ఎందుకంటే నిజంగా మనోభావాలు గాయపడిన వారి లక్షణం వెంటనే స్పందించటం, గవారు వ్యాఖ్య చేసిన రోజు లేదా మరుసటి రోజే ఆపని చేసి ఉంటే 71ఏండ్ల వయస్సు వచ్చినా ఉద్రేకం తగ్గలేదు భావించేందుకు ఆస్కారం ఉండేది. కానీ ఇరవై రోజుల తరువాత బూటు విసిరేందుకు పూనుకోవటం అప్పటికప్పుడు కలిగిన స్పందన అంటారా ? ఒక పథకం ప్రకారం చేసింది తప్ప మరొకటి కాదు. నూపూర్ శర్మ గురించి న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించారు. మరి ఆ రోజు ఈ పెద్దముషి అలాంటి ప్రతిక్రియకు పాల్పడాలని అనిపించలేదా ? కోర్టు అన్నదాన్ని తప్పు పట్టారు, ఒకే. ఆమె నోటితుత్తరతో విదేశాల్లో కూడా తలెత్తిన నిరసన కారణంగా వారిని సంతుష్టీకరించేందుకు చర్య తీసుకొని బిజెపి అసలు ప్రజాజీవనంలో తిరిగి కనిపించకుండా చేసింది కదా ? ఆలాంటి పార్టీ నేతల మీద బూటు విసిరి ప్రతీకారం తీర్చుకోవాలని ఎందుకు అనిపించలేదు ? చట్టం ముందు అందరూ సమానులే, గవారు వ్యాఖ్య తప్పు లేదా నేరం అనుకుంటే తానే కేసు ఎందుకు దాఖలు చేయలేదు. ఖజురహౌ విగ్రహం గురించి తాను కేంద్ర ప్రభుత్వాుకి అనేక లేఖలు రాసినా స్పందన లేదని కూడా దరఖాస్తుదారు కోర్టులో చెప్పారు. హిందువుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోని ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వ పెద్దలు, పురావస్తుశాఖ మంత్రి మీద ప్రతిచర్య తీసుకోవాలని రాకేష్ కుమార్‌ను దేవుడు ఆదేశించలేదా ? ఎవరి మీద బూటు విసరాలో లేదో దేవుడు వడపోతద్వారా ఎంచుకొని ఆదేశిస్తాడా ? తన వ్యాఖ్యల మీద సామాజిక మాధ్యమంలో భిన్నంగా చిత్రిస్తూ ప్రచారం చేస్తున్నారని కొందరు తన దృష్టికి తెచ్చారని, తనకు అన్ని మతాల మీద గౌరవం ఉందు గవారు స్పష్టం చేశారు.రాకేష్ కుమార్ చర్యను హిందూత్వశక్తులు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద తొలిసారిగా బూటువిసిరినట్లు ఒక సంస్థ వ్యాఖ్యానించింది. రాకేష్‌కు ఉన్న సంబంధాల గురించి చర్చ అవసరం లేదు. దేశంలో విచ్చలవిడిగా వ్యాపిస్తున్న విద్వేష కాషాయ వైరస్ సోకిన వ్యక్తి అన్నది స్పష్టం. దానికి నివారణ తప్ప ఎయిడ్స్ మాదిరి చికిత్సలేదు. అతగాడి బుర్ర ఎంతగా చెడింది అంటే ” జరిగిందేదో జరిగింది, వడపోత న్యాయం, దుర్మార్గమైన(బ్లడీ) ఈ లౌకికవాదం ప్రమాదకరంగా హిందువుల అనేక ప్రాధమిక హక్కులను తిరస్కరిస్తున్నది.” అనే వ్యాఖ్యలు అతగాడి నోటి వెంట వచ్చాయంటే రాజ్యాంగమౌలిక లక్షణాలకు వ్యతిరేకి అని వేరే చెప్పనవసరం లేదు. రాజ్యాంగంలో ఉన్న లౌకికవాదం, సామ్యవాదం పదాలను తొలగించాలని అర్ఎస్ఎస్ చెప్పిన సంగతి తెలిసిందే. అలాంటి భావజాలం కలిగిన వ్యక్తి ఇరవై రోజుల తరువాత బూటు విసిరాడంటే కుట్రలో భాగంగానే జరిపిందన్నది స్పష్టం.
ఇలా చెప్పటాుకి హేతువు ఏమిటి ? సెప్టెంబరు 16న గవారు వ్యాఖ్యల మీద సామాజిక మాధ్యమంలో కాషాయదళాలు విరుచుకుపడ్డాయి తప్ప పక్కా హిందూత్వ సంస్థలుగా చెప్పుకొనేవేవీ కూడా మనోభావాల పేరుతో విమర్శలకు, దాడులకు దిగలేదు. అక్టోబరు ఐదవ తేదీన అమరావతి పట్టణం(మహారాష్ట్ర)లో జరిగే విజయదశమి కార్యక్రమాలకు అతిధిగా రావాల్సిందిగా గవాయి తల్లి కమలాతారును ఆర్ఎస్ఎస్ ఆహ్వానించింది. ప్రముఖులు లేదా వారి సంబంధీకులను బుట్టలో వేసుకొనే ప్రక్రియ, వారికి కాషాయ రంగు పులమటంలో సంఘమేథావులకు మరొకరు సాటి రారు. దాన్లో కూడా పెద్ద రాజకీయమే నడిచింది. గట్టి అంబేద్కరిస్టు కుటుంబం, అందునా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మాతృమూర్తి తమ సభకు వచ్చారంటే తమ భావజాల్నాు ఆమోదించినట్లే అని ప్రచారం చేసుకొనే చౌకబారు ఎత్తుగడ దానిలో ఉంది.తమ ఆహ్వానాన్ని మన్నించి ఆమె హాజరుకానున్నట్లు మీడియాలో ప్రచారం చేయించారు. అయితే ఆర్ఎస్ఎస్ ఆహ్వానాన్ని కమలాతారు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. దాదాసాహెబ్ గవాయి ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలిగా ఉన్న తాను అంబేద్కర్ భావజాలం, రాజ్యాంగానికి కట్టుబడి ఉన్న వ్యక్తినని, అలాంటి కార్యక్రమాుకి హాజరు కావటం అంటే సామాజిక చైతన్యానికి హాని జరిగినట్లే అంటూ ఆమె ఒక లేఖను కూడా విడుదల చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కార్యక్రమానికి హాజరుకావటం లేదు, సమర్ధించటం లేదు, రాజ్యాంగ విలువలకు తమ కుటుంబం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. బౌద్దులు విజయదశమి రోజును అశోక్ విజయదశమి లేదా ధర్మచక్ర పరివర్తన దినంగాగా పాటిస్తారు, ఆ రోజునే చక్రవర్తి అశోకుడు బౌద్దాన్ని స్వీకరించాడు, అంబేద్కరిస్టులకు ఆ విధంగా ఆ రోజు ఎంతో ముఖ్యమైనదని కూడా స్పష్టం చేశారు. తన అంగీకారం, అనుమతి తీసుకోకుండానే రాక గురించి ఆర్ఎస్ఎస్ తప్పుడు ప్రచారం చేసింది, అలాంటి ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దు, ఆహ్వానాన్ని అంగీకరించే ప్రశ్నే లేదని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖ విడుదల తరువాత రిపబ్లికన్ పార్టీ నాయకుడైన ఆమె రెండో కుమారుడు డాక్టర్ రాజేంద్ర ఆ కార్యక్రమాుకి తన తల్లితో పాటు తాను కూడా హాజరవుతున్నట్లు గట్టిగా చెప్పారు. ఆర్ఎస్ఎస్ ఆహ్వానాన్ని తాను అంగీకరించినట్లు చెప్పారు. గవారు తల్లి లేఖ కాషాయదళాలకు చెప్పుకోరాని చోట తగిలిన దెబ్బ. ఆ కార్యక్రమ మరుసటి రోజే గవారు మీద బూటుదాడి యత్నం జరిగింది.దానికీ దీనికి ఎలాంటి సంబంధం లేదంటారా ?
ఈ సందర్భంగా గవాయి కుటుంబ నేపధ్యం గురించి చెప్పుకోవటం కూడా అవసరం.గవాయిసోదరుల తండ్రి ఆర్ఎస్ గవారు రిపబ్లికన్ పార్టీ సీనియర్ నేత, యువకుడిగా అంబేద్కర్‌తో కలసి పని చేశారు. నాగపూర్ దీక్షభూమి సంపర్క సమితి అధ్యక్షుడిగా ఉన్నారు, 1998లో అమరావతి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎు్నకయ్యారు. కాంగ్రెస్ పాలనా కాలంలో 2006 నుంచి 11వరకు బీహార్, సిక్కిం, కేరళ గవర్నర్‌గా పుచేశారు. కాంగ్రెస్ మద్దతుదారుగా ఆ పదవుల్లో ఉన్నపుడు కేరళలో నేటి ముఖ్యమంత్రి పినరరు విజయన్‌పై నాటి మంత్రివర్గ సిఫారసును తోసిపుచ్చి ఎస్ఎన్సి-లావ్లియన్ కేసులో సిబిఐ దర్యాప్తు జరపాల్సిందిగా ఆదేశించారు. కాంగ్రెస్ మద్దతుతో తన తండ్రి నాలుగుదశాబ్దాల పాటు ఎంఎల్ఏ, ఎంపీగా పు చేశారు, తన సోదరుడు ఆర్పిఐ నేతగా కాంగ్రెస్‌కు దగ్గరగా ఉంటారు ఒక సందర్భంగా బిఆర్ గవారు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. చిత్రం ఏమిటంటే హిందువుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రబోధించే ఆర్ఎస్ఎస్ పెద్దలు మహారాష్ట్రలో హిందూత్వ సంస్థలు, వ్యక్తుల మనోభావాలను తుంగలో తొక్కారు. గవారు కుటుంబం పక్కా ఆంబేద్కరిస్టు , అనేక సందర్భాలలో హిందుత్వ వ్యతిరేక మనోభావాలతో విభజించేందుకు చూసిందంటూ అలాంటి కుటుంబానికి చెందిన మహిళను విజయదశమి కార్యక్రమానికి పిలవటం ఏమిటంటూ వారు అమరావతి కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నేతల మీద ధ్వజమెత్తారని వార్త. జనాల్లో ఒక పునాదిని ఏర్పాటు చేసుకొనేందుకు దశాబ్దాల తరబడి హిందూత్వశక్తులు విద్వేషాన్ని రెచ్చగొట్టాయి.వచ్చిన అధికారాన్ని నిలుపుకోవాలంటే మద్దతుదార్లను మరింతగా పెంచుకోవాలి, విద్వేష ప్రచారం దానికి అడ్డుపడుతున్నది. అందుకే గోముఖవ్యాఘ్రం మాదిరి చెబుతున్న సుభాషితాలు పూర్తిగా విద్వేషం తలకెక్కిన వారికి మింగుడుపడటం లేదు. దేశంలో ఉన్న హిందువులు, ముస్లింలు, క్రైస్తవులదందరిదీ ఒకే డిఎన్ఏ, సామాజిక సామరస్యత కోసం గొడ్డు మాంసం తినటం, ముస్లింలు లేకుండా హిందూరాష్ట్రం ఉండదు, వంటి మాటలను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే అలాంటి వారు తమ మనోభావాలను అణచివేసుకుంటున్నారు తప్ప ఆ కబుర్లు చెప్పిన వారి మీద బూట్లు విసరటం, దాడుల వంటి వాటికి పాల్పడటం లేదు. అలాంటివి చేస్తే ఆర్ఎస్ఎస్ లాఠీలు వారి వీపులు పగలగొడతాయి మరి.
ఆర్ఎస్ఎస్, బిజెపి శక్తులు బూటు ఉదంతాన్ని తప్పు పడుతూనే అతి తెలివితేటల వాదనలను ముందుకు తెస్తున్నాయి. రాకేష్ కుమార్ మీద కేసు పెట్టి విచారణ జరపాలంటున్నాయి. అలా ఎందుకు చేశారో న్యాయస్థానాల విచారణల్లో నమోదు కావాలి. ఇది ప్రజాస్వామ్యం కనుక ఒక టెర్రరిస్టుకు సైతం తన వాదనలు చెప్పుకొనేందుకు అవకాశం ఇస్తున్నపుడు రాకేష్ కుమార్‌కు కోర్టులో చెప్పుకొనే అవకాశం ఇవ్వాలి అంటూ సామాజిక మాధ్యమంలో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అంటే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని బోనెక్కించాలని చెప్పటం తప్ప మరొకటి కాదు. జాతిపిత మహాత్మాగాంధీని తానెందుకు చంపిందీ వివరిస్తూ కోర్టులో గాడ్సే చేసిన వాదనలను పుస్తకాలుగా ముద్రించి ప్రచారం చేస్తున్న కాషాయ దళం బూటు ఉదంతాన్ని కూడా అలాంటి హిందూత్వ ప్రచారానికి వినియోగించుకోవాలన్న అతితెలివి తప్ప మరొకటి కాదు. అందుకే ఆ దాడి వెనుక పెద్ద కుట్రదాగి ఉందు చెప్పాల్సి వస్తోంది. ఒక దళితుడైన ప్రముఖుడి మీద మరో దళితుడితో దాడి చేయించటం కుట్రగాక మరేమిటి ? దేశంలో వివిధ మఠాలు, స్వాములు మౌనంగా ఉండి రాకేష్ కుమార్‌ను ఉసికొల్పటాన్ని అర్దం చేసుకోలేనంత అమాయకంగా నేడు దళిత సామాజిక తరగతి ఉందా ? సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి ఎంతో సముచితంగా, హుందాగా వ్యవహరించారని వేరే చెప్పనవసరం లేదు, బూటువెనుక ఉన్న కుట్రను వెంటనే గ్రహించారేమో !

when a FIL is subjected the CJI should talk within the practical legality, if there is a way to talk to Lord Viishnu why anyone will approach a court?
more over the CJI has no right to mock someone asking for justice. What the petitioner has responded is justicefie and even Gavai himself might have realized it.
LikeLike