• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: chinese communist party

చైనా కమ్యూనిస్టులు బైబిల్‌ను తిరగరాస్తున్నారా ? నిజానిజాలేమిటి ?

29 Saturday Jul 2023

Posted by raomk in CHINA, Communalism, Current Affairs, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RELIGION, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Anti communist, chinese communist party, Gospel of John, Jesus, Pope Francis, Rewriting the Bible, RSS, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


మతాన్ని చైనీకరణ కావించేందుకు గాను అక్కడి కమ్యూనిస్టు పార్టీ (సిసిపి) బైబిల్‌ను తిరగరాస్తున్నదని ప్రచారం చేస్తున్నవారిని అమెరికా ప్రోత్సహిస్తున్నది. దానికి పార్లమెంటరీ కమిటీని వేదికగా చేసుకుంది. అమెరికా పార్లమెంట్‌లో చైనా కమ్యూనిస్టు పార్టీ తీరుతెన్నులపై ఏర్పాటు చేసిన సెలెక్ట్‌ కమిటీ సమావేశంలో రిపబ్లికన్‌ పార్టీ ఎంపీ మైక్‌ గాలఘెర్‌ చైనా మీద ఆరోపించాడు. జనాలు దేవుడి కంటే పార్టీకి విశ్వాస పాత్రులుగా ఉండేట్లుగా మార్చాలని, దానికి గాను అన్ని మతాలను చైనీకరణ గావించాలని, మతం, సోషలిజం ఒకదానికి ఒకటి తోడుగా ఉనికిలో ఉండేట్లు చూడాలని చైనా కమ్యూనిస్టు పార్టీ 19వ మహాసభ జరిగినపుడు 2017లో అధినేత షీ జింపింగ్‌ కోరినట్లు ,దానిలో భాగంగానే బైబిల్‌ను తిరగరాస్తున్నారని కూడా మైక్‌ ఆరోపించాడు. ఈ ప్రచారాన్ని గత కొన్ని సంవత్సరాలుగా ఒక పథకం ప్రకారం సాగిస్తున్నారు. పది సంవత్సరాల్లో బైబిల్‌ను తిరగరాసే పని పెట్టుకున్నారన్నది వాటిలో ఒకటి. దీన్ని ఒక్క క్రైస్తవ మతానికే పరిమితం చేయలేదని బౌద్దం, ఇస్లాంకు కూడా వర్తింప చేస్తున్నారని మైక్‌ ఆరోపించాడు.మతం మీద పూర్తి అధికారాన్ని సాధించేందుకు సిసిపి చూస్తున్నదనే ప్రచారాన్ని అనేక క్రైస్తవ మత సంస్థలు, మీడియాలో కూడా గత ఆరు సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు. మతం, సోషలిజం సహజీవనం అన్నది వక్రీకరణ తప్ప వాస్తవం కాదు. మత స్వేచ్చను అనుమతించటం అంటే ప్రోత్సహించటం, ఉనికిని కాపాడటం కాదు. తరతరాలుగా వేళ్లూనుకున్న భావనలను క్రమంగా పోగొట్టాలి తప్ప ప్రార్ధనా మందిరాలను కూల్చివేసినా, నిషేధాలతో అణచివేస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయి.


చిత్రం ఏమిటంటే మతాన్ని అణచివేస్తున్నట్లు ఒక వైపు ఆరోపణలు చేస్తున్న తరుణంలోనే 2018లో చైనా ప్రభుత్వంతో పోప్‌ ఒక ఒప్పందం చేసుకున్నారు. దాని ప్రకారం ప్రభుత్వం ఎంపిక చేసిన వారిని చైనాలో కాథలిక్‌ మత అధిపతులుగా పోప్‌ ఆమోదించాల్సి ఉంటుంది. ఇదంతా టిబెట్‌లో తదుపరి దలైలామాను కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేసేందుకు గాను ముందుగా పోప్‌తో ఒప్పందం చేసుకున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇక బైబిల్‌ను తిరగరాస్తున్నారని చెప్పేందుకు మైక్‌ గాలఘెర్‌ రెండు ఆరోపణలు చేశాడు. న్యూటెస్ట్‌మెంట్‌ బైబిల్‌లో జాన్‌ సువార్త ప్రకారం వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ఒక మహిళను రాళ్లతో కొట్టటాన్ని చూసిన ఏసు క్రీస్తు వారి వద్దకు వెళ్లి మీలో పాపం చేయనివారెవరైనా ఉంటే ముందుగా వారు వచ్చి కొట్టమని చెప్పారన్న కథ అందరికీ తెలిసిందే.దాన్ని చైనా వారు మార్చి ఏసు క్రీస్తే స్వయంగా రాళ్లు వేసినట్లు రాశారని మైక్‌ ఆరోపించాడు. ఇది తప్పుడు ప్రచారం తప్ప మరొకటి కాదు. మరికొన్ని దీన్నే మరోవిధంగా ప్రచారం చేస్తున్నారు. ఏసుక్రీస్తు జోక్యం చేసుకున్న తరువాత రాళ్లు వేసిన వారు వెళ్లిపోయారని, వారు నిన్ను చంపారా అని సదరు మహిళను అడిగితే లేదని ఆమె చెప్పిన తరువాత వారు గాక పోతే నేనే చంపేస్తా, ఇలాంటి పాపం మరొకసారి చేేయ వద్దు, వెళ్లిపో అన్నట్లుగా బైబిల్‌ను తిరగరాసినట్లు ప్రచారం చేస్తున్నారు.


మరొక కథనం ప్రకారం ఫార్సీ(నాటి చట్టాల గురించి తెలిసినవారు) యూదులు ఒక మహిళను తీసుకు వచ్చి ఏసుక్రీస్తు ముందు నిలిపారు. బోధకుడా ఈ మహిళ వ్యభిచారం చేస్తూ పట్టుబడినది. చట్టం , మోజెస్‌ మాకు చెప్పినదాని ప్రకారం అలాంటి మహిళను రాళ్లతో కొట్టాలి. ఇప్పుడు మీరేమి చెబుతారు అని ప్రశ్నించారట. ఇదంతా ఏసుక్రీస్తును ఉచ్చులో ఇరికించేందుకు యూదునేతలు చేశారట. అప్పుడు ఏసు క్రీస్తు నేల మీద వేలితో ఏదో రాస్తూ (అదేమిటో ఇప్పటికీ తెలియదట) మీలో పాపం చేయని వారెవరైనా ఉంటే ముందుగా వారు రాళ్లతో కొట్టండి అన్నారట. దాంతో వణికిపోయి వారు అక్కడి నుంచి వెళ్లిపోయారట. అప్పుడు ఏసు మహిళా వారెక్కడ, ఎవరూ నీ మీద దాడి చేయలేదు కదా అంటే అవునయ్యా అందట. నేను కూడా నిన్ను కొట్టను వెళ్లిపో నీ జీవితంలో ఇంక పాపం చేయవద్దు అన్నాడట. అలా అందరూ వెళ్లిన తరువాత ఏసు ఆమెను స్వయంగా రాయితో కొట్టి నేను కూడా పాపినే అని చెప్పినట్లు చైనా కమ్యూనిస్టులు తిరగరాస్తున్న బైబిల్‌లో ఉందని, దాన్ని తరగతి పుస్తకాల్లో పెట్టారని కొన్ని క్రైస్తవ సంస్థలు ప్రచారం చేస్తున్నాయి.ఇది ఏసు దైవత్వాన్ని కించపరచటమే అని ఆరోపిస్తున్నారు.


ప్రస్తుతం చైనా, మన దేశం,ఇంకా అనేక దేశాల్లో ఉన్న చట్టం ప్రకారం అక్రమ సంబంధం నేరం కాదు. అందువలన దానికి పాల్పడిన వారిని రాళ్లతో కొట్టాలని, ఏసుక్రీస్తే ఆపని చేశారు గనుక మీరూ చేయవచ్చని చైనాలో ఉన్న క్రైస్తవులకు గానీ మరొకరికి గానీ చెప్పాల్సిన అవసరం కమ్యూనిస్టులకు లేదు, అందుకుగాను బైబిల్‌ను తిరగరాయాల్సిన అగత్యమూ లేదు. దానికీ సోషలిస్టు సమాజ నిర్మాణానికి సంబంధం లేదు. అలాగని అక్రమ సంబంధాలను ప్రోత్సహిస్తున్నదీ లేదు. ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ కారణంతో విడాకులు తీసుకోవచ్చని చైనా చట్టాలలో ఉంది. వివాహం చేసుకున్నప్పటికీ స్త్రీ సదరు పురుషుడి ఆస్తికాదు. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 497 ప్రకారం భర్త అనుమతి లేకుండా భార్య పరపురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుంటే సదరు పరపురుషుడు అవివాహితుడైనప్పటికీ అభియోగం రుజువైతే ఐదు సంవత్సరాల వరకు శిక్ష విధించవచ్చు. వివాహిత మహిళకు ఎలాంటి శిక్ష ఉండదు. ఈ సెక్షన్‌ రాజ్యాంగ విరుద్దమని 2018 సెప్టెంబరు 27న సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. మరొకరి భాగస్వామి అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే నగదు జరిమానా విధించవచ్చని సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ చెప్పింది.


చైనాలోని హేనాన్‌ రాష్ట్రంలోని ప్రొటెస్టెంట్‌ చర్చిలలో టెన్‌కమాండ్‌మెంట్స్‌ బదులు చైనా అధినేత షీ జింపింగ్‌ చెప్పిన మాటలను బోధించాలని కమ్యూనిస్టు పార్టీ నేతలు బలవంతం చేస్తున్నారని, ఈ మేరకు మొదటి కమాండ్‌మెంట్‌ను మార్చి రాశారని కూడా అమెరికన్‌ ఎంపీ ఆరోపించాడు. పశ్చిమ దేశాల భావజాలాన్ని చొరనివ్వకుండా ఇలా చేస్తున్నారని, తిరస్కరించిన ఇద్దరు పాస్టర్లను శిక్షించినట్లు, ఇతరులను అడ్డుకుంటున్నట్లు ఇంటర్నేషనల్‌ క్రిస్టియన్‌ కన్సరన్‌(ఐసిసి) నివేదించినట్లు పార్లమెంటు కమిటీ ముందు చెప్పాడు. బైబిల్‌ రెండు రకాలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఓల్డ్‌ టెస్టిమెంట్‌, న్యూ టెస్టిమెంట్‌ అన్న గ్రంధాలు మనం ఎక్కడైనా చూడవచ్చు. వాటిని తిరగ రాసింది క్రైస్తవులు తప్ప కమ్యూనిస్టులు కాదు.వివిధ మత గ్రంధాల మీద అనేక మంది భిన్నమైన భాష్యాలు రాశారు. కైస్తవం కమ్యూనిజానికి అనుకూలమని, వ్యతిరేకమని బైబిల్‌లో ఉన్న అంశాలకు వ్యాఖ్యానం చెప్పిన వారు లేకపోలేదు. అసలు ఏసుక్రీస్తు ఎప్పుడు జన్మించాడు, బైబిల్‌ అంశాలను ఎవరు ఎప్పుడు ప్రబోధించారు లేదా ఎప్పుడు రాశారు ? అప్పటికీ అసలు కమ్యూనిజం, సోషలిజం అన్న ప్రాధమిక భావనలు కూడా లేవు. అలాంటపుడు ప్రబోధకులు లేదా రాసిన వారు వాటికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఎలా వాదనలు చేయగలరు. బైబిల్‌ను తిరగరాసి దానిలో ఇలా ఉంది అని చెప్పి జనాన్ని కమ్యూనిజానికి అనుకూలంగా మార్చేంత భావ దారిద్య్రంలో ప్రపంచంలో ఏ కమ్యూనిస్టులూ లేరు. దోపిడీకి వ్యతిరేకంగా జరిపే పోరాటాలను పక్కదారి పట్టించేందుకు, దోపిడీదార్లకు కొమ్ముకాసేందుకు ప్రతి మతం యత్నించటాన్ని రోజూ మనం చూస్తున్నదే.

మనదేశంలో మనుధర్మం పేరుతో అమలు జరిపిన వివక్ష, దుర్మార్గాలు చేస్తున్నపుడే సర్వేజనా సుఖినోభవంతు అని కూడా చెప్పారు. అందువలన అలా చెప్పిన వారిని మన దేశంలో తొలి సోషలిస్టులు, కమ్యూనిస్టులు అంటారా ? ప్రతి సమాజంలో దుర్మార్గాలను చూడలేని అనేక మంది తమ వాంఛలను వెల్లడించారు. వాటిని వాస్తవ రూపంలోకి తీసుకువచ్చే శాస్త్రీయ సిద్దాంతం, ఆచరణలను కమ్యూనిస్టులు చెప్పారు. వ్యక్తులకు, వారి ఇండ్లకు, ప్రార్ధనా స్థలాలకు పరిమితం కావాల్సిన మతాన్ని వీధులు, రాజకీయాలు, దోపిడీదార్లకు కొమ్ముకాసేందుకు తీసుకురావటాన్ని కమ్యూనిస్టులే కాదు, హేతువాదులు, పురోగామివాదులెవరూ అంగీకరించరు. రాజ్యం, పౌరుల మీద మత పెత్తనాన్ని చివరికి పెట్టుబడిదారులు కూడా అంగీకరించరు.ఐరోపాలో ఒక దశలో భూమిలో అత్యధిక భాగం మత సంస్థల చేతుల్లోనే ఉండేది. దాన్ని బద్దలు కొట్టటం ఫ్రెంచి విప్లవంలో ఒక భాగం, ఫ్యూడల్‌ బంధాలను,మత పట్టును అది బద్దలు చేసింది.పేదలు,అణగారిన వర్గాలను రక్షించేందుకే క్రైస్తవం తొలి రోజుల్లో ముందుకు వచ్చింది గనుకనే జనం ఖండాలు, రంగు, భాషా బేధాలతో నిమిత్తం లేకుండా ఆదరించారు. కానీ అదే మతం కష్టజీవుల మూలుగులను పీల్చే పెట్టుబడిదారులు,యుద్ధాలతో రక్తపుటేరులు పారించిన నియంతల పట్ల దాని వైఖరి ఏమంటే సానుకూలమే. మత యుద్ధాలకు పాల్పడిన చరిత్ర కూడా తెలిసిందే. దోపిడీని అంతం చేయాలన్న సోషలిస్టు, కమ్యూనిజం మతానికి వ్యతిరేకం అని ఆ మత పెద్దలే రోజూ తప్పుడు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.


దేశాల మీద మతపెత్తనం కుదరదు, మత రాజ్యాలు అంతరించాయి. మతం పేరుతో విద్రోహానికి పూనుకుంటే సహించాల్సిన అవసరం ఉందా? తూర్పు ఐరోపా సోషలిస్టు దేశాలు, సోవియట్‌ కూల్చివేతలో క్రైస్తవమత పెద్దలు కూడా అమెరికా, ఇతర సామ్రాజ్యవాదులతో చేతులు కలిపిన చరిత్ర మన కళ్ల ముందు ఉంది. అటువంటి కుట్రలను చైనా సాగనివ్వటం లేదు గనుక దాని మీద తప్పుడు ప్రచారాలు అన్నది స్పష్టం. చైనాలో బైబిల్‌, ఖురాన్‌ ఏ పవిత్ర గ్రంధాన్ని కూడ సహించరని ప్రచారం చేస్తున్న క్రైస్తవ సంస్థలు నేడు ఐరోపాలో పెరుగుతున్న ముస్లిం వ్యతిరేకత, ఖురాన్‌ గ్రంధాలను తగులపెడుతున్న ఉదంతాల గురించి ఎక్కడా మాట్లాడవు.స్టాక్‌హౌమ్‌లోని టర్కీ ఎంబసీ ముందు ఖురాన్‌ ప్రతిని తగుల బెట్టేందుకు స్వీడన్‌ ప్రభుత్వం ఏకంగా అధికారిక అనుమతి మంజూరు చేసింది. ఇంకా అనేక దేశాల్లో పచ్చి ముస్లిం వ్యతిరేకులు ఇలానే రెచ్చిపోతున్నారు. వాటి గురించి అమెరికా ఎంపీలెవరూ మాట్లాడరు. చైనా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 36 ప్రకారం మత స్వేచ్చ ఉంది. ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థలు లేదా వ్యక్తులు ఫలానా మతాన్ని నమ్మాలని లేదా వద్దని గానీ వత్తిడి తేకూడదు.వివక్ష చూపకూడదు.ప్రజా జీవనాన్ని విచ్చిన్నం చేసేందుకు లేదా పౌరుల ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు చూడకూడదు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో జోక్యం చేసుకోకూడదు. ఏ మత సంస్థకూడా విదేశీ పెత్తనాన్ని అంగీకరించకూడదు. ఇదే విధంగా మత సంస్థలు విద్యాసంస్థలను ఏర్పాటు చేయవచ్చు తప్ప వాటిలో మత బోధన చేయకూడదు. ఇలా మతాన్ని పరిమితం చేసే నిబంధనలు ఉన్నాయి. అంతే తప్ప మా మతం ఇలా చెప్పింది లేదా మత కేంద్రం ఫలానా చోట ఉంది, వారు చెప్పినట్లు నడచుకుంటాం, దేశంలోని చట్టాలు మాకు వర్తించవు అంటే కుదరదు. మేం చెప్పినట్లే నడవాలి అంటే అసలు కుదరదు. ఇది అన్ని మతాలకూ వర్తిస్తుంది. బౌద్దం పేరుతో జనాన్ని రెచ్చగొట్టి తిరుగుబాటు చేసిన టిబెట్‌ దలైలామా పారిపోయి మన దేశంలో ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు.


అమర జీవుల గళం(విఓఎం) పేరుతో పని చేస్తున్న ఒక సంస్థ ప్రతినిధి టోడ్‌ నెటెల్టన్‌ ఒక పత్రికతో మాట్లాడుతూ పది సంవత్సరాల్లో బైబిల్‌ను తిరగ రాయాలని చైనా కమ్యూనిస్టు పార్టీ 2019లో నిర్ణయించిందని. దానిలో కన్ఫూసియస్‌, బౌద్ద సూత్రాలను కూడా చొప్పించి పార్టీకి మద్దతు ఇచ్చేవిధంగా రాస్తారని ఆరోపించాడు. ఇక్కడ గమనించాల్సిందేమంటే 140 కోట్ల చైనా జనాభాలో ఇండెక్స్‌ ముండీ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం క్రైస్తవులు కేవలం 5.2, ముస్లింలు రెండు శాతమే.ఏ మతానికీ చెందని వారు 51.8, స్థానిక తెగల మతాల వారు 21.9, బౌద్దులు 18.3 శాతాల చొప్పున ఉన్నారు. మనదేశంలో మాదిరి 80శాతం మంది ఉన్న హిందూమతానికి ముస్లిం, క్రైస్తవుల నుంచి ముప్పు వచ్చిందని చెప్పేవారెవరూ అక్కడ లేరు. ప్రపంచంలో ఎక్కడా వర్తమాన కాలంలో ఏ దేశంలోనూ ఒక మతస్తులు తమ జనాభాను విపరీతంగా పెంచి మరొక మతానికి ముప్పు తెచ్చిన ఉదంతమేదీ జరగలేదు. చైనాలో నిజంగా బైబిల్‌ను తిరగరాస్తూ దానిలో కొన్ని భాగాలను ఇప్పటికే పాఠ్యపుస్తకాల్లో పెట్టి ఉంటే రోమ్‌లో ఉన్న క్రైస్తవమత కేంద్రానికి, పోప్‌కు తెలియకుండా ఉంటుందా ? తెలిస్తే అధికారికంగానే దాని మీద స్పందించిన దాఖలా ఇంతవరకు లేదు.


క్రైస్తవుల కోసం పని చేస్తున్నామంటూ ప్రచారం చేసుకొనే వారూ, పత్రికల్లో రాతలు రాసేవారూ చివరికి పోప్‌ ఫ్రాన్సిస్‌ను కూడా వదలటం లేదు. చైనా అక్రమంగా నియమించిన షాంఘై బిషప్‌ను అంగీకరించినట్లు ధ్వజమెత్తారు.2018లో చైనాతో పోప్‌ కుదుర్చుకున్న ఒప్పందం ఇప్పటికీ రహస్యమేనని, దాన్ని ఇప్పటికి రెండు సార్లు సమీక్షించినట్లు జూలై 27న ఒక విశ్లేషకుడు పేర్కొన్నాడు. ఒప్పందం ప్రకారం బిషప్పులను ఎంపిక చేసేది చైనా అయినా అధికారికంగా ప్రకటించాల్సింది పోప్‌ అని దానికి విరుద్దంగా షాంఘై బిషప్‌ వ్యవహారం ఉందని, వాటికన్‌కు ఆ సంగతి పత్రికా వార్తల ద్వారా తెలిసిందని కూడా ఆరోపించాడు. ఏప్రిల్‌ నాలుగున నియామకం జరిగితే జూలై 15న పోప్‌ అధికారికంగా ప్రకటించారని వాపోయాడు. గొడవలెందుకని ఊరుకొని ఆమోదించాంగానీ చైనా ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు వాటికన్‌ విదేశాంగ మంత్రి కార్డినల్‌ పెట్రో పరోలిన్‌ చెప్పినట్లు కూడా రాశాడు. 2018 ఒప్పందం ప్రకారం అనుమతి లేకుండా చర్చి సమావేశాలు నిర్వహించటాన్ని ఎవరూ ప్రోత్సహించకూడదు. అలాంటి వారంతా చైనా ప్రభుత్వం గుర్తించిన దేశభక్త కాథలిక్‌ చర్చిలో విలీనం కావాలి.కానీ ఇప్పటికీ రహస్య చర్చ్‌లు కొనసాగుతున్నట్లు వాటికన్‌ మంత్రి అంగీకరించాడు. అలా చేరని వారి మనోభావాలను గౌరవించాలని కూడా ఇప్పుడు మంత్రి చెప్పటాన్ని బట్టి దాని అర్ధం వారికి వెలుపలి నుంచి మద్దతు లభిస్తున్నది. వారికి రక్షణ కల్పించాలని అనేక మంది పత్రికల్లో డిమాండ్‌ చేస్తున్నారంటే పోప్‌ కుదుర్చుకున్న ఒప్పందానికి తూట్లు పొడవటం, ధిక్కరణ తప్ప మరొకకాదు. బైబిల్‌ను తిరగరాయాలంటే ఎక్కడైనా పది సంవత్సరాలు అవసరం లేదు. తెల్లవారేసరికి పోటీ గ్రంధాలను రాసేవారున్నారు. కమ్యూనిస్టులు అలాంటి పనికిమాలిన పని పెట్టుకోరు. గతంలో మతాన్ని అనుమతించరని, ప్రార్ధనా మందిరాలను కూల్చివేశారని చేసిన ప్రచారం అబద్దమని తేలింది. అందువలన ఎత్తుగడలను మార్చి మతాన్ని తమకు అనుకూలంగా మారుస్తున్నారని, మత గ్రంధాలను తిరగరాస్తున్నారనే తప్పుడు ప్రచారానికి పూనుకున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాలో “సోషలిస్టు మార్కెట్‌ ఎకానమీ” మావో ఆలోచనావిధానంలో భాగమే

12 Wednesday Oct 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion

≈ Leave a comment

Tags

China socialist market economy, chinese communist party, Mao Zedong, Mao Zedong thought, People's Republic of China

ఆదిత్య కృష్ణ  

చైనాకీ,  చైనాపరిశీలకులకీ చాలాముఖ్యమైనది ఈ అక్టోబరు16 న మొదలౌతున్న చెనా కమ్యూనిస్టు పార్టీ 20వ మహాసభ. నేడు చైనాలో సోషలిజం ప్రాథమిక స్థాయిలోనూ, చైనా ప్రత్యేక లక్షణాలతోనూ కూడి వున్నది అని అక్కడి నాయకత్వం చెప్తున్నది. 2050 నాటికి ప్రపంచంలోని మధ్యస్థాయి (యూరపు) దేశాల అభివృద్ధి స్థాయిని అందుకొంటుందనీ వారు చెప్తున్నారు. దాన్ని కొట్టిపారేస్తూ – చైనా పాలకులు సోషలిజం ముసుగులో పెట్టుబడిదారీ పాలనను సాగిస్తున్నారని మీడియాలో నిత్యం ప్రచారం సాగుతున్నది. సోషలిజం సార్వజనీనమైనది, మళ్లీ ‘చైనా మాదిరి’ ఏమిటి అని కొందరు ప్రశ్నిస్తున్నారు. నిజానికి సోషలిజానికి ఒకే రకమైన రెడీమేడ్‌ మోడల్‌ ఏమీ లేదు.

అక్కడితో ఆగక, చైనాది సామ్రాజ్యవాదం, లేదా సోషల్‌ సామ్రాజ్యవాదం అని మరి కొందరు – మావో వాదులమని  చెప్పుకొనేవారు ‘సిద్ధాంతాల’ పేరిట – విమర్శిస్తున్నారు. సామ్రాజ్యవాదం అంటేనే గుత్తపెట్టుబడిదారీ వ్యవస్థ; గుత్తపెట్టుబడిదారీ విధాన అత్యున్నత రూపం సామ్రాజ్యవాదం అవుతుంది – అని లెనినిజం చెప్తుంది. చైనాలో గుత్త పెట్టుబడిదారీ విధానం అనే పునాదే లేదు; అనేక (పబ్లిక్, సమిష్టి, ప్రైవేటు, వ్యక్తిగత) సెక్టార్లున్న చైనాలో – దానికి ప్రాతిపదిక లేదు. అలాంటిచోట (సోషల్‌) సామ్రాజ్యవాదం ఎలా ఏర్పడుతుంది?

సామ్రాజ్యవాదాన్ని, అమెరికా అగ్రరాజ్యాన్ని ఎదుర్కొంటున్న ప్రధాన ప్రపంచ శక్తిగా ఉన్న  చైనాపై అలాంటి ఆరోపణలు అర్థరహితం. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మూడవ ప్రపంచదేశాల్లో  చైనాకి  ఉన్న ఆదరణను దెబ్బతీయటానికి ప్రయత్నిస్తున్న సామ్రాజ్యవాద అనుకూల పాలకవర్గాలకు ఈ ప్రచారాలు ఆచరణలో తోడ్పడుతున్నాయి. సిద్ధాంతరీత్యా చూసినా, ఆచరణలో చూసినా చెల్లని ఆరోపణలివి. స్వతంత్ర పరిశీలనకన్నా పాశ్చాత్య మీడియా, పాశ్చాత్య మేధావులూ వండి వార్చినదే  వారి విమర్శలకి మూలాధారం. చైనా పార్టీతో, వారి డాక్యుమెంట్ల పరిశీలనతో వారికి పనిలేదు. 

భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం , అనేక తప్పులు చేసి, ఎదురుదెబ్బలు తిని,విప్లవ గమనంలో కుంటుపడి చిక్కుల్లో ఉన్నది. మనదేశంలో మార్కిజం-లెనినిజం-మావో ఆలోచనావిధానం పేరిట బలమైన పిడివాదం వుంది. తప్పుడు విమర్శలకు ఒక పునాది అదే. మనదేశంలో చాలా మంది కమ్యూనిస్టులకూ, అభ్యుదయవాదులకూ అల నాటి రష్యాపట్ల అపార అభిమానం. వారికి ఎంగెల్స్‌ నొక్కి చెప్పిన “శాస్త్రీయ సోషలిజం” కన్నా ఆదర్శవాద, ఊహాజనిత సోషలిజమే ఒంట బట్టింది. అందుకే అశాస్త్రీయమైన అవగాహనతో విమర్శలు చేస్తుంటారు. ఈ విషయంపై సమగ్ర అధ్యయనం అవసరం. దానికిది క్లుప్త పరిచయం.

అంతర్జాతీయ, చైనా వ్యవహారాల నిపుణులైన జె.యన్‌.యు. ప్రొఫెసర్‌ అల్కా ఆచార్య క్జి జిన్‌పింగ్‌ ఎన్నికపై లోగడ ఒక సమీక్షావ్యాసం రాశారు (EPW 5-5-2018). బీజింగ్‌లో ఒక యువపరిశోధకుడు 2017లో అన్న మాటతో ఆమె తనవ్యాసం ముగించారు: “మావో మమ్మల్ని విముక్తి చేశారు. డెంగ్‌   మ మ్మల్ని సంపన్నులుగా మార్చారు. ఇప్పుడు జిన్‌పింగ్‌ మా పార్టీని, చైనాను శక్తివంతంగా  రూపొందిస్తారు.”  విప్లవ విజయం (1949) తర్వాత  చైనా – సోషలిస్టు నిర్మాణంలో అంచెలంచెలుగా ముందుకుసాగుతున్నది. పై వాక్యాలు అక్కడి పరిణామాల క్రమాన్ని అర్థం చేసుకోడానికి ఉపయోగపడుతాయి. 

వాస్తవాలకు విరుద్దమైన విమర్శలు : చైనాలో వ్యవసాయ భూమినేటికీ  ప్రభుత్వ ఆస్తిగానే వుంది   

మావోకాలంలో అంతా సవ్యంగా వుందని, మావో తర్వాత డెంగ్‌ అంతా తిరగ దోడారనీ విమర్శలు చేస్తుంటారు. చెనాలో మావో పద్ధతులని పక్కనపెట్టి, “స్వేచ్చామార్కెటు” (డెంగ్‌) విధానాలను అనుసరిస్తున్నారని అంటూ చైనాలో పెట్టుబడిదారీ పునరుద్దరణ జరిగిందన్న సిద్దాంతాన్ని – లోతుపాతులు తెలుసుకోకుండా-కమ్యునిస్టు వ్యతిరేకులు కూడా- ప్రచారం చేస్తున్నారు. నిజానికి అచ్చంగా “స్వేచ్భామార్కెట్‌” విధా నాలు ఈ నాడు ఏ సామ్రాజ్యవాదదేశంలో సైతం అమల్లో లేవు. సామ్రాజ్యవాదం అంటేనే గుత్తపెట్టుబడిదారీ వ్యవస్థ . స్వేచ్చా మార్కెటు‌కీ, గుత్త వెట్టుబడికీ పొత్తు కుదరదు. ఇటీవలి కాలంలో అనేక దేశాల్లో అక్కడితో ఆగలేదు. ప్రొటెక్షనిజం, ఆశ్రిత (క్రోనీ) పెట్టుబడిదారీ పద్దతులు గుత్తపెట్టుబడికి తోడైనాయి. చైనా పాలకులు సోషలిజం ముసుగువేసుకొన్నారు;  ఆచరణలో సొంత ఆస్థిని పునరుద్ధరించారు; కమ్యూన్‌లను రద్దు చేసారు అని కొందరు చెప్తున్నారు. చైనాలో కమ్యూన్‌లను రద్దు చేసి “వ్యక్తిగత బాధ్యతావిధానం”  (Individual Responsibility system) అనే వ్యవసాయరంగ సంస్క రణను చేసా రన్నది నిజమే. కానీ సొంత ఆస్తిని పునరుద్ధరించారన్నది వాస్తవం కాదు. చైనాలో వ్యవసాయ భూమి ఈనాడు కూడా ప్రభుత్వ ఆస్తిగానే వుంది. రైతులకు అనుభవించే హక్కు, ఆ హక్కుని తర్వాతి తరం పొందే హక్కు కూడా వుంది. ఆస్తి వ్యవస్థ  వేరు, నిర్వహణా పద్ధతి వేరు. సంస్కరించింది రెండో అంశం మాత్రమే. ఈ కీలకమైన వాస్తవాన్ని విస్మరించి, వ్యాఖ్యానించటం తప్పు. ఇది అవాస్తవం, అశాస్త్రీయం, హేతువిరుద్ధం కూడా.

సోషలిస్ట్ మార్కెట్‌ ఎకానమీ అంటే.. చైనాలో అనుసరిస్తున్నది “స్వేచ్చా మార్కెట్‌ పద్ధతి” కాదు. దాన్ని “సోషలిస్టు మార్కెట్‌ ఎకానమీ” అంటారు. దానికే “సోషలిస్ట్ ప్లాన్డ్‌ కమోడిటీ ఎకానమీ” అనే పేరు కూడా ఉంది. “పబ్లిక్‌ ఓనర్‌షిప్‌” పైచేయిగా వుండే వ్యవస్థ అది. రాజ్యం మార్కెటుని రెగ్యు లేటు చే స్తుంది; మార్కెట్‌ ఎంటర్ ప్రైజెస్ ని గైడ్ చేస్తుంది” అన్నది దాని ప్రాతిపదిక. ఆ విధంగా ప్లానింగు, మార్కెటు మేళవించబడుతాయి. ఈ అవగాహ నను చైనాపార్టీడాక్యుమెంట్లలో చూడవచ్చును. కొన్ని మౌలిక ఆర్థిక సూత్రాలను  తెలుసుకోకుండా, లేదా విస్మరించి, తప్పు అవగాహనలు చలామణీలో వున్నాయి. పెట్టుబడిదారీ విధానం=మార్కెటు; సోషలిజం=ప్లానింగు; ఇవి విడదీయరాని జంటలని ఒక అవగాహన విస్తృతంగా వుంటూ వచ్చింది. ఇది తప్పు అని చైనా పార్టీ, డెంగ్‌ వివరించారు. ఫ్యూడల్‌ యుగంలోనూ మార్కెటు- వాణిజ్యం, ఎగుమతులూ – ఉన్నాయి;  బడా పెట్టుబడిదారీ సంస్థలు ప్లానింగ్ చే సుకొన్నాకే  రంగంలోకి దిగుతాయని గుర్తుచేసారు. దాని అధ్యయనం అవసరం, ఉపయోగకరం. 

‘ఆర్థిక రంగంలో సాగించే యుద్ధం‘: లెనిన్‌

లెనిన్‌ కాలంలో రష్యా విప్ణవం (1917) విజయవంత మైంది. ఆ వెంటనే సామ్రాజ్యవాదుల జోక్యం, అంతర్యుద్ధం రష్యాని అతలాకుతలం చేశాయి. 1922 దాకా అలాంటి సంక్షోభం కొనసాగింది. సోషలిస్ట్ నిర్మాణం- అభివృద్ధి తొలిదశలోనే 1924 జనవరిలో లెనిన్‌ మరణించారు. ఆ దశలో లెనిన్‌ నూత న ఆర్థిక విధానం ( NEP) పేరిట దేశ, విదేశ పెట్టుబడిదారులనూ, వారి పద్ధతులనూ రష్యా లో  అనుమతించారు. 

ఈ విధానం ప్రమాదకరం కాదా? అంటే అది పెట్టుబడిదారీ అభివృద్ధే అవుతుంది, నిజమే. కానీ ప్రమాదకరం కాదు; ఎందుకంటే అధికారం కార్మికుల, రైతులచేతిలోనే ఉంటుంది. కంట్రాక్టు షరతుల్ని అమలు చేస్తాం; దాని వల్ల కార్మికుల పరిస్థితులు బాగుపడుతాయి… ఇది సరైందే కూడా; ఎందుకంటే ఇతరదేశాల్లో విప్లవం ఆలస్యమైపోయింది; ఈ లోగా మన పారిశ్రామిక తదితర ఉత్పత్తులు పెరుగుతాయి; మన కార్మికుల, రైతుల, ప్రజల పరిస్థితి బాగుపడుతుంది, అది అవసరం.ఈ అవకాశాన్నివదులుకొనే హక్కు మనకిలేదు“…ఈ క్రమంలో (విదేశీ) పెట్టుబడిదారులు కొంత లాభపడుతారు; మనం కొంత వదులుకోవాల్సివస్తుంది నిజమే,  ఈ త్యాగం మృత్యుసమానం కాదు, ప్రమాదకరం కాదు”, అని లెనిన్‌  వివరించారు ( 1921 ఏప్రెల్‌ 25; CW volume 32). ఈ ఏర్పాట్లు ఒక రకం యుద్ధమే;  ఆయుధాలతోకాక, ఆర్థిక రంగంలో సాగించే యుద్ధం; ఈ యుద్ధంలో మన ఉత్పత్తిశక్తుల్ని ధ్వంసం చేసుకోము; పెంపొందించుకొంటాం. పెట్టుబడిదారులు మనని మోసం చేయ జూస్తారు, నిజమే; వారిని మన రాజ్యం, చట్టాలద్వారా, ఇతరత్రా ఎదుర్కొంటాం; గెల్చి తీరుతాం. మనం వారిని కేవలం ఆయుధాల ద్వారానే ఓడించగల్గుతామని భావించటంలేదు…’ప్రపంచ విప్లవ చెయిన్‌ లో మనమొక లింకుమాత్రమే; మనమొక్కరమే ప్రపంచ విప్లవాన్ని సాధించలేము, ఆ లక్ష్యాన్ని  మనం పెట్టుకోలేదు కూడా.. అని ఆ రోజుల్లోనే ( Lenin On Concessions, 1920 నవంబరు 26; మాస్కో పార్టీ సమావేశంలో ఉపన్యాసం) వివరించారు. సామ్రాజ్యవాదం మరణశయ్యపై ఉన్నదని లెనిన్ సూత్రీకరించి శతాబ్దం దాటిపోయినా, నేటికీ అది ఎంతబలంగా ఉన్నదో చూస్తూనే ఉన్నాం. 

లెనిన్‌ తర్వాత ఆ బాధ్యతల్నిస్టాలిన్‌ చేపట్టి 1953 లో తన మరణందాకా కొనసాగించారు. రష్యాలో ‘సోషలిజం చాలా పరిణతి చెంది, వర్గరహిత కమ్యూనిజంవలె’ రూపొందుతున్నదన్న అతివాద అంచనావేసి, పొరపాటుచేసినట్టు స్టాలిన్ కాలం చివరిలో గుర్తించబడింది. ఆ పొరపాటుని మావో కాలంలోనే చైనా పార్టీ గుర్తించింది. నేడు చైనాలో సోషలిజం ప్రాథమిక స్థాయిలో వున్నది; అక్కడ సోషలిస్ట్ మార్కెటు వ్యవస్థకి  కీలక పాత్ర వున్నది – అని డెంగ్‌ నాయకత్వంలో చైనా పార్టీ సూత్రీకరించింది.

‘సోషలిజంలో కూడా  మార్కెట్‌ పాత్ర వుంటుంది’ : మావో  

సోషలిస్ట్  నిర్మాణానికి సంబంధించి కొన్ని ఆర్థికనియమాలు (EconomicLaws)వున్నాయి, వుంటాయి. వాటిపట్ల శాస్త్రీయ అవగాహన వుండాలని, అవి మన ఇష్టాయిష్టాల ప్రకారం వుండవని లెనిన్‌, స్టాలిన్‌, మావో, డెంగ్  నొక్కి చెప్పారు. వాటి అవగాహన, అన్వయాలలో అనేక ప్రయోగాలు, అనుభవాలు, సాఫల్యవైఫల్యాలు, అంగీకారాలు – అనంగీకారాలు కూడా వున్నాయి, సహజమే. ఆ నియమాలు ఇలా వున్నాయి:

“ఎకనామిక్‌ ప్రాబ్లమ్స్‌ ఆఫ్‌ సోషలిజం ఇన్‌ యు.యస్.‌యస్.‌ఆర్‌” పేరుతో స్టాలిన్‌(1951 లో) రచించిన గ్రంధం ఒకటుంది. మానవాళి చరిత్రలో మొదటిసారిగా శాస్త్రీయ సోషలిజం అమలు జరిగింది రష్యాలోనే.  కార్మికవర్గం అధికారం చేజిక్కించుకోవటం సోషలిస్ట్ విప్లవానికి నాంది. అది బతికి బట్టకట్టాలంటే     ‘సోషలిస్టు నిర్మాణం-అభివృద్ధి’  కీలకం; ఆ రెంటిలోనూ   రష్యాది కొత్త అనుభవం, కొత్త ప్రయోగం. ఆ అనుభవాలనే స్టాలిన్‌ పై పుస్త కంలో చర్చిం చారు; సోషలిజంలో కూడా సరుకుల (కమోడిటీ) ఉత్పత్తి వ్యవస్థ, మార్కెట్‌ పాత్ర వుంటాయని, అవి పెట్టుబడిదారీ సమాజంతోనే ముగియవని స్టాలిన్‌ (1951) నిర్ధారించారు. ఈ పుస్తకంపై మావో ఒక విమర్శతో కూడిన సమీక్షను (క్రిటిక్‌)1958లో రచించారు.  చైనా భవిష్యత్తుకి ఉపయోగ పరచుకునే లక్ష్యంతో రష్యా అనుభవాలను మావో పరిశీలించారు. పారిశ్రామిక రష్యా స్థితి అది;  చైనాలోని వాస్తవ పరిస్థితులతో కలిపి చూడాలని,  వెనుకబడిన వ్యవసాయ దేశమైన చైనాలో మార్కెట్ మరింత అవసరం అని మావో ఆ రచన ప్రారంభంలోనే నొక్కిచెప్పారు. ఆ ‘సమీక్ష’లోని అంశాలు గమనించదగినవి. “సరకుల ఉత్పత్తి వ్యవస్థ అనగానే మనలో కొందరికి చిర్రెత్తుతుంది; అది పెట్టుబడిదారీ విధానమే అని భావిస్తాం. కానీ కోట్లాది రైతుల సంఘీభావాన్ని సమీకరించుకోగలగాలంటే, సరకుల ఉత్పత్తిని, మనీ సప్లయిని పెద్ద  యెత్తున పెంపొందించాల్సి వస్తుందని కన్పడుతుంది- అని వెనుకబడిన, రైతాంగదేశాల ప్రత్యేకతల దృష్ట్యా మావో చెబుతారు.  ప్రయోగాల అవసరం మావో గుర్తిస్తారు. 

“కమ్యూనిస్టు స్వర్గంలోకి ఒక్క అంగలో వెళ్ళలేము, క్రమ క్రమంగానే వెళ్ళగలం. సరకుల వ్యవన్థను, విలువ సూత్రాన్ని, అవి బూర్జువా స్వభావం కలవే అయినా, వాటిని మన ఇష్టానుసారం రద్దు చేయలేము..” పీపుల్స్‌కమ్యూన్లున్నా,  అక్కడ సరుకుల వినిమయాన్ని, విలువ సూత్రాన్ని వినియోగించాల్సి వస్తుంది; సోషలిస్టు పరిణామక్రమానికి అవి తోడ్పడుతాయి అంటారు మావో. వ్యవసాయ ప్రధానదేశంగా, గ్రామీణ జనాభా 80 శాతందాకా వున్న దేశంగా చైనా పరిస్థితులు వేరు (రష్యాలో కన్నా వెనుకబడి వుంటాయి) అని కూడా ఎత్తిచూపారు. అక్కడ మార్కెటు పాత్రని నొక్కి చెప్పారు. ‘పెట్టుబడిదారీ కాలంలో అయినా, సోషలిస్టు కాలంలో అయినా ఆర్థికాభివృద్దికి, రాజకీయార్థిక శాస్త్రానికి చెందిన కొన్ని నియమాలు వర్తిస్తాయని చెప్పాల్సివుంటుంది. ప్రకృతి విజ్ఞాన శాస్త్రంలో వలెనే, ఆర్థికాభివృద్ది నియమాలు కూడా వస్తుగతమైనవి (ఆబ్జెక్టివ్)‌, అవి మానవుని ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా వుంటాయ’ని మావో రాశారు.  ‘సోషలిస్ట్ ఆర్థికానికి సంబంధించిన “రెడీమేడ్‌” అంశాలేవీ లేనందున,  ‘కొత్తవైన సోష లిస్ట్ ఆర్థిక రూ పాలను సృష్టించాల్సి వుంటుంద’నీ, ఈ క్రమాన్నీ అ-ఆ ల నుంచి మొదలు పెట్టాల్సివస్తుందనీ… నిస్సందేహంగా ఇది “జటిలమైన, సంక్లిష్ట మైన, ఇంతకుముందెన్నడూ లేని కర్తవ్యంగా” వుంటుందనీ మావో చెప్పారు.’సోవియట్‌ యూనియన్‌ నుంచి నేర్చుకుని మనం మెరుగుపరుచుకోవాలని, ఆర్థిక నియమాలను రష్యా రద్దు చేయగలుగుతుందని, కొత్త వాటిని సృష్టించుకోగలుగుతుందని భావిస్తే- అది పూర్తిగా అసత్యం’-అని చెప్పారు మావో. 

‘మన ప్రణాళికా సంస్థలు సామాజిక ఉత్పత్తిని సరిగ్గా (కరెక్ట్‌ గా) ప్లాన్ చేయడం సాధ్యమే…ఐతే దాన్నీ వాస్తవంలో సాధించటాన్నీకలగా పులగం చేయకూడదు. అవి రెండూ వేర్వేరు విషయాలు.’సాధ్యత’ను వాస్తవంగా మార్చగలగాలంటే, ఆర్థికాన్ని అధ్యయనం చేయటం, దానిపై పట్టు సాధించటం, పూర్తి అవగాహనతో దాన్ని అన్వయించగలగటం అవసరం. “ఆయా నియమాలను పూర్తిగా ప్రతిబింబించగల్గినటువంటి ప్రణాళికలను రూపొందించుకోవాలి’- అంటారు మావో. అలాంటి నియమాల్లో భాగమే సరకుల వ్యవస్థ, మార్కెటూ. ‘గతంలో మనం అలాటి కొన్ని ప్రణాళికలు రూపొందించాం; కానీ తరచుగా అవి తుఫానులని సృష్టించాయి. ఐతే అతి, కాకపోతే మరీ తక్కువ..అయింది. అనేక వైఫల్యాల తరువాత,“40 అంశాల వ్యవసాయ కార్యక్రమం” రూపొందించుకున్నాం. ఇప్పటికీ-వాస్తవిక ఆచరణలో దీన్ని ఇంకా నిరూపించాల్సే వున్నది-అని ప్రయోగాల అవనరాన్ని మావో నొక్కిచెప్పారు. “మన ప్రణాళికలు వాస్తవిక సూత్రాలను పూర్తిగా ప్రతిబింబించలేదు…అంతిమ పరిశీలనలో సరకుల ఉత్పత్తి ఉత్పాదక శక్తులతోకూడా ముడిపడి వుంటుంది. అందువల్ల – పూర్తిగా సోషలైజు చేయబడిన పబ్లిక్‌ ఓనర్‌ షిప్‌ క్రింద కూడా- సరకుల  వినిమయం అమలులో వుండడం-కొన్ని రంగాల్లో నైనా- తప్పనిసరవుతుంది’ అని మావో అంటారు. “పట్టణాలకు-గ్రామాలకు, పరిశ్రమలకు వ్యవసాయానికి మధ్య ఆర్థిక సంబంధాన్ని గట్టిపరచాలంటే, సర కుల ఉత్పత్తి వ్యవస్థని కొంతకాలం వుంచాల్సిందేనని బోధపడుతుంది. పట్టణాలతో అలాంటి బంధం మాత్రమే రైతాంగానికి ఆమోదయోగ్యంగా వుం  టుంది” -అంటారు మావో. ఇక్కడ కార్మిక రైతాంగ ఐక్యసంఘటన కూడా ఇమిడిఉంది.  ఇంకా ఇలా అంటారు: అభివృద్ది చెందిన పెట్టు బడిదారీ దేశాలకీ, వెనుకబడిన పారిశ్రామిక వ్యవస్థలకూ, వ్యవసాయ ప్రధాన దేశాలకూ తేడా వుంటుంది. ఒకే దేశంలో పరిశ్రమలకూ-వ్యవసాయానికీ, పట్టణ వర్గాలకూ రైతాంగానికీ కూడా తేడాలుంటాయి..కొన్ని వాస్తవిక ఆర్థిక సూత్రాలకు, నియమాలకు లోబడి వుంటాయి; మానవుడి ఇష్టాయిష్టాల ప్రకారం వుండవు. వాటిని అవగాహన చేసుకుని, అన్వయించుకోవలసివుంటుంది.  ‘సరకుల ఉత్పత్తి వ్యవస్థ వద్దే వద్దు’ -అని కొందరనుకుంటారు. కానీ అది తప్పు. ఆ వ్యవనను గురించి లెనిన్‌ నుంచి స్టాలిన్ నేర్చుకున్నారు. స్టాలిన్ నుంచి మనం నేర్చుకోవాలి” అంటారు మావో.”సరకుల ఉత్పత్తి వ్యవస్థ కేవలం పెట్టుబడిదారీ వ్యవస్థకు సంబంధించినదే కాదు..సరకుల ఉత్పత్తి విడిగా ఒంటరిగా వుండదు. సందర్భాన్నిబట్టి- పెట్టుబడి దారీ విధానంలోనా, సోషలిజంలోనా అని దాన్ని చూడాలి. పెట్టుబడిదారీ సందర్భంలో అది పెట్టుబడిదారీ సరుకుల ఉత్పత్తి వ్యవస్థ గాను, సోషలిస్ట్ సందర్భంలో అది సోషలిస్ట్ ఉత్పత్తి వ్యవస్థగాను వుంటుంది. నిజానికి సరుకుల ఉత్పత్తి ప్రాచీనకాలం నుంచీ వుంటూ వచ్చింది”-అని మావో అంటారు. సరకుల ఉత్పత్తి వ్యవస్థ అంటే అది పెట్టుబడిదారీ వ్యవస్థేనని నిర్దారించటానికి వీల్లేదని, దాని చారిత్రిక పూర్వ రంగాన్ని గుర్తు చేస్తారు మావో.

రష్యాలో సోషలిజం నిర్మాణ అనుభవాలతో “రాజకీయ ఆర్థిక శాస్త్రం  పాఠ్యపుస్తకం” ఒకటి రష్యాలో ప్రచురించబడింది. స్టాలిన్ నేతృత్వంలో సోవియట్‌ ఆర్థిక వేత్తల బృందం దాన్ని రూపొందించింది. దాన్ని సమీక్షిస్తూ మావో ఒక “రీడింగ్‌ నోట్స్‌”ని రచించారు. 1961-62లో రచించిన, 1969లో వెలుగుచూ సిన ఈ సమీక్షలో కూడా పైన పేర్కొన్న అవగాహనే వుంది. రష్యాతో విభేదిస్తూనే, కొన్ని ఆర్థిక నియమాలను గుర్తిస్తూ మావో రచించారు. ఇవన్నీ మావో ఆలోచనావిధానంలో భాగంగా, మార్క్సిజం-లెనినిజం కొనసాగింపుగా అధ్యయనం చేయాల్సినవే. మావో తనజీవితకాలమంతటా నమ్మి, వివ రించిన పై సిధ్ధాంతాల్ని ‘సాంస్కృతికవిప్లవ’ (1966 తర్వాత)  కాలంలో పక్కనపెట్టి, అతివాదమార్గం పట్టారు. డెంగ్ ని పెట్టు బడిదారీ మార్గీ యుడని నిందించి, తొలగించారు. రష్యాలో స్టాలిన్ తర్వాత జరిగిన తప్పుల్ని నివారించాలనే ఆదుర్దాతో అలా చేసారు. 

 ధైర్యంగా అనేక ప్రయోగాలు చేసి, ‘సోషలిస్టు నిర్మాణ‘ సిధ్ధాంతాల్ని అభివృధ్ధి చేసిన డెంగ్ 

కానీ అనతికాలంలో తన అతివాద తప్పుని గ్రహించి,1973లోనే  డెంగ్ ని మళ్లీ పిలిచి, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పూర్తి బాధ్యతల్ని పునరుధ్ధరించారు. ఈ వాస్తవాల్ని చూడానిరాకరించే పిడివాదులు కొందరు మావోపేరిట డెంగ్ ని తిట్టిపోస్తుంటారు. వారికి ఒక దశలోని మావోయే వేదం, డెంగ్ విషం!   

‌ పై ప్రాతిపదికనే డెంగ్ వివరించి, విస్తరించి,’సోషలిస్టు మార్కెటు ఆర్థికవ్యవస్థను ప్రతిపాదించి, అమలు చేసి, ధైర్యంగా అనేక ప్రయోగాలు చేసి, చైనాని అనూహ్యంగా ముందుకు తీసుకెళ్లారు. అదే సమయంలో బూర్జువా లిబరలైజేషన్ ని వ్యతిరేకించే  ఉద్యమాన్ని నడిపించారు; అలాంటి ధోరణులపట్ల మెతకగా ఉన్న ఇద్దరు (హు యావో బాంగ్‌, ఝావో జియాంగ్‌) నాయకులు ప్రధాన కార్యదర్శి పదవినుంచే – డెంగ్‌ మార్గదర్శకత్వంలోనే – తొలగించబడ్డారు. దేశం మొత్తం విధిగా పాటించాల్సిన సూత్రాలను డెంగ్‌ నొక్కిచెప్పి, తమ పార్టీ మౌలిక సిద్ధాంతంలో భాగం చేసారు: సోషలిస్టు మార్గం, జనతాప్రజాతంత్ర నియంతృత్వం, పార్టీ, మాలెమా సిద్ధాంతం – వీటి నాయకత్వ పాత్ర -ఈ ‘నాల్గు మౌలిక సూత్రాల’కి (Four Cardinal Principles)  లోబడిమాత్రమే ఏ సంస్కరణలైనా సాగాల్సి ఉంటుంద’ని నిర్ణయించారు. రష్యాలో గోర్బచేవ్‌ నేతృత్వంలోని సంస్కరణలు పట్టాలు తప్పి, సోవియట్‌ పతనానికి దారితీసాయి; కాగా చైనా గ్లోబలైజేషన్‌ తుఫాన్లనీ,2008 ఆర్థిక సంక్షోభాన్నీ, కోవిడ్ మహమ్మారి పర్యవసానాల్నీ తట్టుకొని ముందుకు సాగుతున్నది.”సోషలిస్ట్ యుగంలో మనం సరకుల వ్యవస్థని సంపూర్ణ వికనన దశవరకూ అభివృద్ధి చేయాలి..యుద్దాన్ని దశాబ్దాల పాటు సాగించాం…తైవాన్‌ విముక్తి కోసం ఇప్పటికీ ఓపిగ్గా ఎదురు చూస్తున్నాం…అలాగే సోషలిజం పరిణతి కోసమూ ఎదురు చూడాల్సి వస్తుంది. మరీ త్వరగా విజయాలు వచ్చేస్తాయని ఆశించవద్దు”  అంటారు మావో. చైనాలో సోషలిజం అంతిమవిజయానికి ‘వెయ్యేళ్లయినా పట్ట వచ్చు, ఇది సుదీర్ఘ ప్రయాణం’ అన్నా రు (1950లలొ) ఒక సందర్భంలో. చైనాలో సోషలిజం ప్రాథమిక దశలోనే వుంది అని డెంగ్‌ సూత్రీకరించింది ఈ అవగాహనతోనే. 

తొమ్మిది కోట్లమంది కమ్యూనిస్టు సభ్యులూ, మూడుతరాల శ్రేణులూ నాయకుల అవిఛ్చిన్న, పటిష్ట నేతృత్వంలో చైనా తనదైన స్వతంత్ర, సోషలిస్టు అభివృద్ధిపధంలో ముందుకు సాగుతున్నది.  ఎవరో కొద్దిమంది  తూలనాడితే, చైనాకి పోయేదేమీ లేదు; ఆ పిడివాదం మనకే నష్టదాయకం. మనదేశంలో ఏం చేయాలి, ఎలా ఉద్యమాల్ని ముందుకు తీసుకువెళ్లాలి అన్నది మనకి ముఖ్యం. చైనాపార్టీ 20వ మహాసభను కీలకమైనదిగా భావించి, ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తున్నది. ఆ సందర్భంగా పై అవగాహన అవసరం. 

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా కమ్యూనిస్టు పార్టీపై నోటి తుత్తర -తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టిన జెపి మోర్గాన్‌ సిఇఓ !

01 Wednesday Dec 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

chinese communist party, Jamie Dimon joke, JP Morgan CEO's China apology, JPMorgan, JPMorgan Chase Jamie Dimon


ఎం కోటేశ్వరరావు


అది అమెరికాలో అతి పెద్ద బ్యాంకు, స్టాక్‌ మార్కెట్లో వాటాల విలువ ప్రకారం ప్రపంచంలో అతి పెద్దది. బ్యాంకులకున్న ఆస్తులను పరిగణనలోకి తీసుకుంటే ప్రపంచంలో ఐదవది.(మొదటి నాలుగు చైనావి) అమెరికా వాల్‌స్ట్రీట్‌లో రారాజుగా పేరు గాంచిన జెపి మోర్గాన్‌ సంస్ధ సిఇఓ జామీ డైమన్‌ చైనా కమ్యూనిస్టు పార్టీకి ఒకే రోజు కొద్ది గంటల వ్యవధిలో రెండు సార్లు క్షమాపణలు చెప్పి చెంపలు వేసుకున్నాడు. వినోద ఉత్పత్తులు అందించే అమెరికాలోని బడా కంపెనీలలో డిస్నీ ఒకటి. అది 2005లో ఒక టీవీ సీరియల్‌ నిర్మాణం చేసింది. దానిలో ఒక పాపను దత్తత తీసుకొనేందుకు ఒక కుటుంబం వివిధ ప్రాంతాలను సందర్శిస్తుంది. ఆ క్రమంలో చైనాలోని తియన్మెన్‌ స్క్వేర్‌ ప్రాంతాన్ని కూడా సందర్శిస్తుంది. దానిలో ” తియన్‌ ఎన్‌ మెన్‌ స్క్వేర్‌ : ఈ ప్రాంతంలో 1989లో ఏమీ జరగలేదు ” అనే బోర్డు అక్కడ ఉన్నట్లు ఆ సీరియల్‌లో చూపారు. అది చైనాను కించపరిచే లేదా పరిహసించేది తప్ప మరొకటి కాదు. హాంకాంగ్‌ ప్రాంతంలో ఆ సీరియల్‌ను ప్రసారం చేయాలంటే అలాంటి దృశ్యాలను చైనా సెన్సార్‌ నిబంధనలు అంగీకరించవు. దాంతో డిస్నీ కంపెనీ వాటిని తొలగించినట్లు వార్తలు వచ్చాయి. లాభాల కోసం మార్కెట్‌ కావాలని వెంపర్లాడుతూనే చైనాను కించపరుస్తూ వ్యవహరించే వారికి ఈ రెండు ఉదంతాలు కనువిప్పు కలిగిస్తాయా ?


అమెరికాలోని బోస్టన్‌ కాలేజీలో కంపెనీల సిఇఓలతో నిర్వహించే ఒక కార్యక్రమంలో జామీ డైమన్‌ మాట్లాడుతూ ” నేను ఇటీవల హాంకాంగ్‌లో ఒక జోక్‌ వేశాను. జెపి మోర్గాన్‌ మాదిరే చైనా కమ్యూనిస్టు పార్టీ వందవ వార్షికోత్సవం జరుపుకుంటోంది, అయితే దాని కంటే మా బ్యాంకు ఎక్కువ కాలం మనగలుగుతుందని పందెం అన్నాను ” అని చెప్పాడు. అంతే కాదు, ఈ మాటలను నేను చైనాలో చెప్పలేను, వారు ఏదో విధంగా వింటూ ఉండవచ్చు అని కూడా అన్నాడు. చైనా కమ్యూనిస్టు పార్టీకి రోజులు దగ్గర పడ్డాయనే భావంతో చేసిన ఈ వ్యాఖ్యలతో అమెరికన్‌ మీడియా పండగ చేసుకుంది. పెద్ద ఎత్తున ప్రచారమిచ్చింది. బ్లూమ్‌బెర్గ్‌ మరీ రెచ్చిపోయింది. తమ బ్యాంకు, దేశానికి హాని చేస్తున్నామనే అంశం ఆ క్షణంలో తట్టలేదు గానీ కొద్ది గంటల్లోనే తెలిసి వచ్చింది. ” నేను అలాంటి మాటలు మాట్లాడి ఉండాల్సింది కాదు. మా కంపెనీ దీర్ఘకాలంగా ఉండటాన్ని, అదెంత బలమైనదో వక్కాణించటానికి అలా చెప్పాల్సి వచ్చింది అని జామీ డైమన్‌ ఒక ప్రకటనలో తెలిపాడు. తరువాత మరి కొద్ది గంటల్లోనే మరొక ప్రకటన చేశాడు. చైనాలో తొలిసారిగా పూర్తిగా ఒక విదేశీ బ్యాంకు స్వంతంగా స్టాక్‌మార్కెట్‌లో బ్రోకర్‌గా పని చేసేందుకు ఆగస్టు నెలలో జెపి మోర్గాన్‌ అనుమతి పొందింది. తద్వారా తన లావాదేవీలను పెద్ద ఎత్తున విస్తరించాలని పధకాలు రూపొందించుకుంటోంది. ఈ దశలో అధికార కమ్యూనిస్టు పార్టీని కించపరుస్తూ డైమన్‌ నోరుపారవేసుకున్నాడు.” ఎవరి మీదా అది ఒక దేశం, దాని నాయకత్వం, లేదా సమాజంలోని ఒక భాగాన్ని, సంస్కృతి మీద జోకులు వేసేందుకు, కించపరిచేందుకు హక్కులేదు. ఆ విధంగా మాట్లాడటం ఎప్పటి కంటే మరింత అవసరమైన సమాజంలో నిర్మాణాత్మక, ఆలోచనా పూర్వకమైన సంప్రదింపులను హరించటమే అవుతుంది.” అని డైమన్‌ రెండవ ప్రకటనలో పేర్కొన్నాడు.


చైనాకు విదేశీ బాంకుల అవసరం ఉన్నప్పటికీ అక్కడ లావాదేవీలు నిర్వహించే పశ్చిమ దేశాల కంపెనీలు జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుందని జామీ డైమన్‌ ఉదంతంపై పరిశీలకులు హెచ్చరించారు. 2019లో స్విస్‌ బాంకు యుబిఎస్‌ గ్లోబల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సంస్ధకు చెందిన పాల్‌ డోనోవాన్‌ చైనా గురించి నోరు పారవేసుకున్నాడు. చైనాలో స్వైన్‌ ప్లూ కారణంగా తలెత్తిన ద్రవ్యోల్బణ ప్రభావాల గురించి రాసిన నివేదికలో మీరు ఒక చైనా పంది లేదా చైనాలో పంది మాంసం తినాలనుకుంటేనే మీకు సమస్యలు అవగతం అవుతాయని పేర్కొన్నాడు.దీనిపై తీవ్ర ఆగ్రహం తలెత్తటంతో ఆ కంపెనీతో చైనా సంస్ధలు లావాదేవీలు నిలిపివేశాయి. నష్టనివారణ చర్యగా సదరు కంపెనీ అతగాడిని సస్పెండు చేసింది. హాంకాంగ్‌లోని బ్రిటన్‌కు చెందిన విమాన సంస్ధ కాథే పసిఫిక్‌ సిఇఓ 2019లో హాంకాంగ్‌ వేర్పాటువాద నిరసనలను సమర్ధించాడు.చైనా అభ్యంతరం తెలపటంతో పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో స్వీడిష్‌ ఫాషన్‌ సంస్ధ హెచ్‌ అండ్‌ ఎం, అమెరికాకు చెందిన నైక్‌ కంపెనీ చైనాలోని గ్జిన్‌జియాంగ్‌ రాష్ట్రంలో బలవంతంగా ముస్లింలతో పని చేయించి పత్తి సాగు చేస్తూ మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారంటూ వ్యాఖ్యానించి చైనా మీడియా, వాణిజ్య సంస్ధల విమర్శలకు గురయ్యాయి.


తమ ప్రభుత్వాన్ని నేరుగా లేదా పరోక్షంగా సవాలు చేసినప్పటికీ అవసరమైతే విదేశీ కంపెనీల వాణిజ్య లావాదేవీలను పరిమితం చేసేందుకు లేదా మూసివేసేందుకైనా సిద్దమే అని చైనా స్పష్టంగా వెల్లడించిందని కార్నెల్‌ కంపెనీ ప్రతినిధి ప్రసాద్‌.ఏ చెప్పారు. డైమన్‌ విషయానికి వస్తే హాంకాంగ్‌ ప్రభుత్వం కరోనా నిబంధనలను సడలించి పర్యటనకు అనుమతించింది. అక్కడి నిబంధనల ప్రకారం విదేశాల నుంచి వచ్చే వారు తమ స్వంత ఖర్చుతో రెండు నుంచి మూడు వారాల పాటు హౌటల్‌ క్వారంటైన్‌లో గడపాల్సి ఉంటుంది. అలాంటిది 32 గంటల డైమన్‌ రాకకు మినహాయింపు ఇచ్చారు.” తన మనసులో ఉన్నదాన్ని మాట్లాడటమే జామీ డైమన్‌లో ఉన్న ఉత్తమ-చెత్త విశిష్టలక్షణం.అదొక ఆనవాలుగా అతనికి బాగా పని చేస్తుంది. మదుపుదార్లు అభినందిస్తారు, సాధికారికమైనది భావిస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇబ్బందుల్లోకి నెడుతుంది. ” అని వెల్స్‌ ఫార్గో విశ్లేషకుడు మేయో అన్నాడు.


ఈ అంశాన్ని మరింతగా పెద్దది చేయటాన్ని మీడియా ఆపితే మంచిది అని చైనా ప్రతినిధి అన్నాడు. డైమన్‌ వ్యాఖ్యలు కంపెనీ అవకాశాలను సంకటంలో పడవేశాయని ఐతే వెంటనే క్షమాపణ చెప్పినందున పెద్దగా నష్టం జరగకపోవచ్చని కొందరు చెప్పారు.గతంలో జరిగిన వాటిని చూసి డైమన్‌ భయపడ్డారని చైనా నిపుణుడు రాబర్ట్‌ లారెన్స్‌ సిఎన్‌ఎన్‌ టీవీతో చెప్పారు.చైనా జనాలు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని ఇష్టపడరన్న ఒక సాధారణ అభిప్రాయం వాస్తవం కాదు పెద్ద మెజారిటీ మద్దతు ఇస్తారు, సమస్యలు ఉండటాన్ని గుర్తించారు. కానీ తలసరి జిడిపి 50 రెట్లు పెరగటాన్ని వారు చూశారు.ఎనభై కోట్లకుపైగా జనాన్ని దారిద్య్రం నుంచి బయటపడవేశారు. ప్రపంచమంతటా కలిపి చూసినా వాటి కంటే ఎక్కువగా ఉన్న వేగవంతమైన రైళ్లను చూశారు. కాబట్టే కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వారు ప్రభుత్వం పట్ల చాలా సంతృప్తితో ఉన్నారని లారెన్స్‌ చెప్పాడు.


జామీ డైమన్‌ ఇలా నోరుపారవేసుకోవటం, అహంకార ప్రదర్శన వెనుక ఏముంది అనే చర్చ కూడా జరిగింది.గత పదహారు సంవత్సరాలుగా జెపి మోర్గాన్‌ సిఇఓగా కొనసాగుతున్నాడు.2008లో తలెత్తిన ద్రవ్యసంక్షోభం నుంచి సంస్ధను కాపాడాడు, మంచి సమర్ధకుడిగా వాల్‌స్ట్రీట్లో పేరు తెచ్చుకున్నాడు, ప్రస్తుతం 65 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పటికీ మరో ఐదు సంవత్సరాలు సారధిగా ఉండే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇతగాడి నిర్వాకాలు వాటి మీద పడిన మచ్చలేమీ చిన్నవి కాదు. 2012లో లండన్‌ బ్రాంచి ద్వారా నిర్వహించిన లావాదేవీల్లో అక్రమాలకు గాను ఆరుబిలియన్‌ డాలర్ల నష్టం వచ్చింది. ఒక బి.డాలర్ల మేర జరిమానాలు చెల్లించాల్సి వచ్చింది. దాంతో ఏడాదికి అతడి 23మిలియన్‌ డాలర్లవేతనాన్ని సగానికి కోత పెట్టారు.తరువాత తన పదవిని కాపాడుకొని అర్ధికంగా ఎంతో లబ్ది పొందాడు. నోరు ఒక్క చైనా మీదనే కాదు, డోనాల్డ్‌ ట్రంప్‌ను కూడా వదల్లేదు.2018లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ గురించి మాట్లాడుతూ తాను ట్రంప్‌ కంటే తెలివిగలవాడినని, వారసత్వంగా పొందినది గాక తెలివితేటలతో ఆస్తి సంపాదించుకున్నానని అన్నాడు. వెంటనే ఒక ప్రకటన చేస్తూ తానలా మాట్లాడి ఉండాల్సింది కాదని, తాను మంచి రాజకీయవేత్తను కాదని తన మాటలు రుజువు చేశాయన్నాడు.


జామీ డైమన్‌ ఉదంతం దక్షిణ కొరియాలో చర్చను రేపింది. చైనాతో వాణిజ్యమిగులు ఉన్న దేశాలలో అది ఒకటి. ఇటీవల అక్కడి షిన్‌సెగే గ్రూపు ఉపాధ్యక్షుడు చంగు యాంగ్‌ జిన్‌ చేసిన కమ్యూనిస్టు వ్యతిరేక వ్యాఖ్యను వెనక్కు తీసుకొనేందుకు నిరాకరించటం రానున్న దినాల్లో సమస్యలు తేవచ్చని భావిస్తున్నారు. నవంబరు 15న ఒక పీజా దుకాణం వద్ద ఇద్దరు సిబ్బందితో కలసి ఒక ఫొటో తీసుకున్నాడు, దాని మీద తనపైత్యాన్ని జోడించి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశాడు. పీజా బాక్సుమీదు ఎరుపు రంగులో ముద్రించిన లోగో ఉంది. సిబ్బంది కూడా ఎరుపు దుస్తులు ధరించి ఉన్నారు.” కొన్ని కారణాలతో ఫొటోను చూస్తుంటే అది కమ్యూనిస్టు పార్టీ సంబంధితంగా ఉంది. అపార్ధం చేసుకోవద్దు. నేను కమ్యూనిజాన్ని ద్వేషిస్తాను ” అని వ్యాఖ్యానించాడు. ఉత్తర కొరియాను కించపరచటం, అపహాస్యం చేస్తూ చిత్రించిన స్వికిడ్‌ గేమ్‌ అనే సీరియల్‌ను ఒక స్మగ్లర్‌ ఉత్తర కొరియాలోని వారికి అందించాడని, అందుకుగాను అతడిని ఉరితీసినట్లు వచ్చిన వార్తల మీద నవంబరు 24న స్పందిస్తూ కమ్యూనిజాన్ని ద్వేషిస్తానని పేర్కొన్నాడు. యాభై మూడు సంవత్సరాల చుంగ్‌ తన చిన్నతనంలో ప్రచ్చన్న యుద్దవాతావరణంలో కమ్యూనిస్టు వ్యతిరేకిగా పెరిగానని తన చర్యలను సమర్ధించుకున్నాడు. ప్రతివారికీ భావ ప్రకటనా స్వేచ్చ ఉందని అయితే చుంగ్‌ ఒక కంపెనీ బాధ్యతలో ఉన్నందున అపార్ధం చేసుకొనే లేదా తప్పుడు భాష్యం చెప్పటానికి వీలున్న వ్యాఖ్యలను చేసేటపుడు జాగ్రత్తగా ఉండాలని జుంగ్‌ యోన్‌ సంగ్‌ అనే ప్రొఫెసర్‌ చెప్పాడు.


చైనాలో లావాదేవీలు నిర్వహించాలనుకొనే వారికి కమ్యూనిస్టు పార్టీ, దేశం గురించి కొన్ని పాఠాలు నేర్చుకొని రావాలని చైనా అధ్యయన సంస్ధ డైరెక్టర్‌ ఝాంగ్‌ టెంగ్‌జున్‌ అన్నాడు. అమెరికా కంపెనీల విజయం వెనుక చైనా మార్కెట్‌ ఉందని, చైనా విజయం వెనుక కమ్యూనిస్టు పార్టీ వెన్నుదన్నుగా ఉందని, రెండింటికి మధ్య ఉన్న సంబంధాన్ని వారు చూడరా అని ప్రశ్నించాడు. నిజం ఏమిటంటే వారు ఇప్పటికీ చైనాను అర్ధం చేసుకోవటం లేదు. వారు చైనా నుంచి లాభాలను మాత్రమే చూస్తున్నారని అన్నాడు. ఇంటి వారు మాంసంతో పెట్టిన భోజనం చేసిన వాడు తరువాత వారినే దూషించినట్లు అనే ఒక సామెత చైనాలో ఉంది.(తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు, పెట్టిన చేతినే కొట్టాడు లేదా తిట్టాడు అన్న మన సామెతలు కూడా అలాంటివేే) సిఇఓ, బిలియనీర్లైన వాణిజ్యవేత్తలు అర్ధం చేసుకోవాలని, బహుశా జామీ డైమన్‌ దాన్ని మరచి ఉంటాడు, తరువాత వెంటనే గుర్తుకు తెచ్చుకొని ఉంటాడని చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది. ఆగస్టులో చైనా ప్రభుత్వం ఇచ్చిన అనుమతితో జెపి మోర్గాన్‌ బాంకు చైనాలో 20బి.డాలర్ల మేరకు లావాదేవీలు జరిపే వీలుందని, ఇంకా పెరగవచ్చని అంచనా.ఇంతటి మేలు చేకూర్చిన చైనా పాలకపార్టీ మీద ఇంత త్వరలోనే నోరు పారవేసుకున్న నేపధ్యంలో చైనా సామెతను గుర్తు చేసింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాలో ఏం జరుగుతోంది, ఎందుకలా ?

31 Wednesday Jan 2018

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, UK, USA

≈ Leave a comment

Tags

chinese communist party, Communist Party Groups, foreign companies in China, Xi Jinping

Image result for communist party vangaurd in china companeis

ఎం కోటేశ్వరరావు

చైనాలో ఏం జరిగినా అది కమ్యూనిస్టులకు, పెట్టుబడిదారులకూ ఆసక్తికరంగానే వుంటుంది. ఒకే దేశమైనా అక్కడ రెండు వ్యవస్ధలను అనుమతించే విధంగా కమ్యూనిస్టుపార్టీ నిర్ణయం తీసుకుంది. తమకు అవసరమైన పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం కోసం విదేశీ సంస్ధలు, పెట్టుబడులకు అనుమతివ్వాలని 1970దశకం చివరిలోనే చైనా కమ్యూనిస్టుపార్టీ నిర్ణయించింది. అందువలన ఆ తరువాత రెండు దశాబ్దాలకు బ్రిటీష్‌, పోర్చుగీసువారి కౌలు గడువు ముగిసిన తరువాత చైనాలో విలీనం కావాల్సిన హాంకాంగ్‌, మకావో ప్రాంతాలలోని పెట్టుబడిదారీ వ్యవస్ధను 2050 వరకు కొనసాగనిస్తామని హామీ ఇచ్చింది. హాంకాంగ్‌ అత్యంత అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ వ్యవస్ద వున్న ప్రాంతాలలో ఒకటి. ఎక్కడి నుంచో పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నపుడు తనలో విలీనం అయ్యే ప్రాంతాలలో వారిని తిరస్కరించటంలో అర్ధం వుండదు. తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ గురించి తెలిసిందే. కమ్యూనిస్టుపార్టీ ఇచ్చిన వెసులుబాటును అవకాశంగా తీసుకొని ప్రపంచ పెట్టుబడిదారులు విలీన ప్రాంతాలలో శాశ్వతంగా పెట్టుబడిదారీ వ్యవస్ధను కొనసాగించేందుకు లేదా చైనా నుంచి విడగొట్టేందుకు చేయని ప్రయత్నం లేదు. వాటిని ఎదుర్కొంటూనే మరోవైపు చైనా తన దైన పద్దతులలో ప్రధాన భూభాగంలో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం చేస్తున్నట్లు కమ్యూనిస్టుపార్టీ గతంలోనే ప్రకటించింది.

స్విడ్జర్లాండ్‌లోని దవోస్‌లో ఇటీవలనే పెట్టుబడిదారీ జలగల వార్షిక జాతర జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి మాదిరిగా బయటిలోకానికి పరిచయం అవుతున్న కెటిఆర్‌ ఆ జాతరకు వెళ్లి వచ్చారు. దేశంలో, తమ రాష్ట్రాలలో లాభాలను పీల్చుకొనేందుకు వున్న అవకాశాల గురించి వివరించి మరీ వచ్చారు. అక్కడికి వచ్చిన వారిలో మారియట్‌ ఇంటర్నేషనల్‌ సిఇఓ ఆర్నె సోరెన్సన్‌ ఒకరు. అంతర్జాతీయ ప్రయాణాలు తగ్గాయని దానిలో భాగంగానే ఈరోజు అమెరికాను ఆహ్వానించేవారు తగ్గిపోయారని దానికి కారణం డోనాల్డ్‌ ట్రంప్‌ అని చెప్పాడు. చైనాలో పూర్తిగా కమ్యూనిస్టు నిరంకుశత్వం వుందని కూడా ఆరోపించాడు. ప్రత్యక్షంగా ఘర్షణ పడటానికి సిద్దంగా లేనప్పటికీ చైనాను దెబ్బతీసేందుకు సామ్రాజ్యవాదులు చేయన్ని యత్నం లేదు. చైనాలో 300 హోటల్స్‌ నిర్వహిస్తున్న మారియట్‌ కొద్ది వారాల క్రితం ఒక ఇమెయిల్‌ సర్వే జరిపింది. దానిలో టిబెట్‌, హాంకాంగ్‌, మకావో, తైవాన్‌ ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా పేర్కొన్నది. ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే చైనా ప్రభుత్వం మారియట్‌ మొబైల్‌ ఆప్‌ను, తరువాత దాని వెబ్‌సైట్‌ను పనిచేయకుండా చేసింది. వెంటనే ఇందుకు పాల్పడిన తమ సిబ్బందిపై చర్యతీసుకుంటామని, మరోమారు అలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని మారియట్‌ క్షమాపణలు చెప్పింది. సదరు ప్రాంతాలు చైనా నుంచి విడిపోవాలని కోరే శక్తులు, లేదా వ్యక్తులకు తమ మద్దతు వుండదని, సమస్య తీవ్రతను గుర్తించామని పేర్కొన్నది.

చైనాలో వ్యాపారం చేస్తూ ఆ దేశ సమగ్రతను దెబ్బతీసే కుట్రలో విదేశీ కంపెనీలు ఎలాంటి పాత్ర నిర్వహిస్తాయో ఈ వుదంతం చెప్పకనే చెప్పింది. కిటికీ తెరిచినపుడు మంచిగాలితో పాటు ఈగలు, దోమలు కూడా వస్తాయని, వాటిని ఎలా అదుపు చేయాలో తమకు తెలుసని సంస్కరణలకు ఆద్యుడిగా భావిస్తున్న డెంగ్‌సియావో పింగ్‌ ప్రారంభంలోనే చెప్పిన విషయం తెలిసిందే. చైనాలో విదేశీ కంపెనీలను ఎలా అదుపు చేస్తున్నారనేది సహజంగానే ఆసక్తి కలిగించే అంశం. దీనికి సంబంధించి బహిరంగంగా చైనా చేసిన ప్రకటనలు లేదా విధానాల వివరాలు మనకు అందుబాటులో లేవు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై విదేశీ సంస్ధలు, వ్యక్తులు వెలిబుచ్చుతున్న అభిప్రాయాలు కొన్ని సందర్భాలలో రామునితోక పివరుండు అన్నట్లుగా వుంటాయి కనుక యధాతధంగా తీసుకోనవసరం లేదు. అయితే ఆ సమాచారం కొన్ని విషయాలను వెల్లడిస్తున్నది. వాటి మంచి చెడ్డలు, పర్యవసానాలను పక్కన పెట్టి వాటిని చూద్దాం.

చైనా జనజీవితంలో కమ్యూనిస్టు పార్టీ పాత్రను పెంచటానికి, అగ్రగామిగా వుంచటానికి అక్కడి నాయకత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. విదేశీ సంస్ధలకు ద్వారాలు తెరిచిన తరువాత అన్యవర్గ ధోరణులైన అవినీతి, ఆశ్రిత పక్షపాతం, పార్టీ , సోషలిస్టు వ్యతిరేక ధోరణులు చైనా సమాజంపై పడకుండా చూసేందుకు అవి అన్నది స్పష్టం. వాషింగ్టన్‌ పోస్టు అనే అమెరికా పత్రిక కొద్ది రోజుల క్రితం విదేశీ కంపెనీలలోకి ప్రవేశించేందుకు, అదుపు చేసేందుకు కమ్యూనిస్టు పార్టీ ప్రయత్నిస్తున్నది అనే పేరుతో అది ఒక విశ్లేషణ రాసింది. దాని భాష్యాన్ని మనం యధాతధంగా తీసుకోనవసరం లేదు. చైనా సర్కారుతో కలసి సంయుక్త భాగస్వామ్య సంస్ధలను నెలకొల్పిన అమెరికా మరియు ఐరోపా కంపెనీలు వాటిలోని నిర్ణయాత్మక కమిటీలు, ఎగ్జిక్యూటివ్‌లు, వాణిజ్య బృందాలలో కమ్యూనిస్టుపార్టీ సభ్యులకు భాగస్వామ్యం కల్పించాలని ఇటీవల చైనా కోరిందన్నది వార్త సారం. చైనాలోని అమెరికా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మాజీ అధ్యక్షుడు జేమ్స్‌ జిమర్‌మన్‌ ‘ కమ్యూనిస్టు పార్టీ యంత్రాంగం ఇంతవరకు విదేశీ పెట్టుబడులున్న సంస్ధలలోకి పెద్ద ఎత్తున పాకి చొరబడినట్లు కనిపించటం లేదు గాని జరుగుతున్న విషయాలను చూస్తే అదే మార్గంలో పయనిస్తున్నాయి’ అన్నారు. విదేశీ కంపెనీల యాజమాన్య నిర్ణయాలలో పాత్రను కమ్యూనిస్టుపార్టీ కోరటం ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయని, ఇదే సమయలో ఇంటర్నెట్‌పై సెన్సార్‌షిప్‌ విదేశీ కంపెనీలపై ప్రభావితం చేయటానికి నాంది అని, తాను ఆర్ధికంగా బలంగా వున్నందున పశ్చిమ దేశాల వాణిజ్యాన్ని తగ్గించేయవచ్చని చైనా భావిస్తున్నట్లు ఆ పత్రిక వ్యాఖ్యాత పేర్కొన్నారు. కంపెనీల నిర్వహణలో మరొక దొంతరను ప్రవేశపెట్టటం సంయుక్త భాగస్వామ్య కంపెనీల స్వతంత్ర నిర్ణయాలు చేసే సామర్ద్యాన్ని దెబ్బతీస్తాయని, పెట్టుబడులకు ఆటంకం అవుతుందని చైనాలోని యూరోపియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ పేర్కొన్నది. విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలంటే అనేక ఆర్ధిక రంగాలలో సంయుక్త భాగస్వామ్యం వున్న కంపెనీలలో చేరాలని చైనా చట్టాలు నిర్ధేశిస్తున్నాయి.

ఇంటర్నెట్‌ను విదేశీ కంపెనీలు వినియోగించుకోవాలంటే ‘ చైనా కమ్యూనిస్టు పార్టీ నిర్దేశించిన ఏడు నిబంధనలకు కట్టుబడి వుంటామని, సోషలిస్టు వ్యవస్ధ, ప్రజాభద్రత, సామాజిక నైతికతను దెబ్బతీయబోమని, దేశ ప్రయోజనాలను వుల్లంఘించబోమని ఒక హమీ పత్రాన్ని ఇవ్వాల్సి వుంటుంది. గతేడాది జూన్‌ నుంచి చైనాలో అమలులోకి వచ్చిన ఇంటర్నెట్‌ భద్రతా చర్యల్లో భాగంగా ఈ జాగ్రత్తలను తీసుకుంటున్నారు. అయితే తమ వ్యాపార రహస్యాలు, మేథాసంపత్తి బహిర్గతం అవుతాయనే పేరుతో ప్రభుత్వ నియంత్రణను విదేశీ కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. చైనాలో వున్న అన్ని విదేశీ కంపెనీలలో శాఖలను ఏర్పాటు చేసేవిధంగా కమ్యూనిస్టుపార్టీ విస్తరణకు ప్రయత్నిస్తున్నదని ఆక్స్‌ఫర్డ్‌ అనలిటికా అనే బ్రిటీష్‌ కంపెనీ తాజాగా ఒక నివేదికను తన కెనడా ఖాతాదారులకు పంపింది.దానిలోని అంశాలపై కెనడా మీడియా వ్యాఖ్యానాలు చేస్తున్నది. ఆ మేరకు ఆ నివేదికలోని అంశాల సారాంశం ఇలా వుంది.

వ్యాపార, వాణిజ్యాలు స్వతంత్రరంగానికి చెందినవి కాదు. ఇప్పటి వరకు ప్రయివేటు వాణిజ్యాన్ని రాజ్యమే క్రమబద్దీకరించింది తప్ప పార్టీ కాదు, కానీ ఇప్పుడు గ్జీ జింపింగ్‌ వాణిజ్యాన్ని పార్టీ అదుపు చేయాలని కోరుతున్నారు.ముఖ్యంగా టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్ల కంపెనీలపై పార్టీ ప్రభావం, అదుపు వుండాలి. విదేశీ కంపెనీలలో పార్టీ శాఖలను ఏర్పాటు చేయటం ద్వారా వాణిజ్య నిర్ణయాలపై పార్టీ ప్రభావం ఏమిటో తెలుసుకోవటానికి వీలుకలుగుతుంది. మారియట్‌ హోటల్స్‌ నిర్వహించిన ఆన్‌లైన్‌ సర్వేలో టిబెట్‌, తైవాన్‌, హాంకాంగ్‌, మకావోలను వేరే దేశాలుగా పేర్కొనటాన్ని పార్టీ శాఖలే కనుగొన్నాయి. ప్రతి రంగంలోనూ పార్టీ ప్రమేయం వుండాలని గతేడాది జరిగిన పార్టీ మహాసభ చేసిన నిర్ణయానికి అనుగుణంగా వందలాది ప్రభుత్వ రంగ కంపెనీలు ప్రధాన నిర్ణయాలపై పార్టీ కమిటీలను సంప్రదించే విధంగా మార్గదర్శకాలను సవరించాయి.

ఏ సంస్ధలో అయినా ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది పార్టీ సభ్యులుంటే అక్కడ పార్టీ విధానం, సూత్రాలు అమలు జరుగుతున్నదీ లేనిదీ వారు చూడాలని పార్టీ నిబంధనావళి పేర్కొంటున్నది. అయితే 1980వ దశకంలో సంస్కరణల కారణంగా దీని అమలును సడలించారు. తరువాత రెండు దశాబ్దాల కాలంలో వ్యూహాత్మకం కాని ప్రభుత్వ రంగ సంస్ధలపై ప్రత్యక్ష నియంత్రణలను సడలించారు. ప్రభుత్వ, పార్టీ అదుపును సవాలు చేసే స్ధితిలో లేని చిన్న ప్రయివేటు, మరియు ప్రభుత్వ రంగ సంస్దలపై కమ్యూనిస్టు పార్టీ పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే 2001లో ప్ర పంచవాణిజ్య సంస్ధలో చేరేందుకు గాను వ్యాపార, వాణిజ్య రంగాలలో వున్నవారిని కూడా పార్టీలో చేరేందుకు అనుమతించారు. ఈ చర్యతో అనేక కొత్త కంపెనీలను ఆశ్రిత పక్షపాతంతో పార్టీలో వున్నవారి బంధువులు, ఆశ్రితులతో ఏర్పాటు చేయించారు. ఆ సమయంలో కేవలం మూడుశాతం ప్రయివేటు కంపెనీలలో మాత్రమే పార్టీ శాఖలున్నాయి.తరువాత కాలంలో చైనా ఆర్ధిక వ్యవస్ధలో ప్రయివేటు కంపెనీలు, వాటిలో కమ్యూనిస్టుపార్టీ శాఖల సంఖ్య కూడా పెరిగింది. 2015 నుంచి ఏర్పాటయిన 36లక్షల ప్రయివేటు సంస్దలలో మెజారిటీ సంస్ధలలో పార్టీ శాఖలున్నాయి. సభ్యులు అనేక కంపెనీలలో అత్యంత ముఖ్యమైన బాధ్యతలలో కమ్యూనిస్టు పార్టీ సభ్యులు వుండటం పెరిగింది. టెన్సెంట్‌ అనే ఇంటర్నెట్‌ కంపెనీ సిబ్బందిలో కమ్యూనిస్టుపార్టీ సభ్యులు 23శాతం అయినప్పటికీ 60శాతం కీలక బాధ్యతలలో వారున్నారు. 2002లో చైనాలోని 17శాతం విదేశీ కంపెనీలలో మాత్రమే పార్టీ శాఖలుంటే అక్కడున్న ఏడున్నర లక్షల విదేశీ కంపెనీలలో 70శాతంలో పార్టీ శాఖలను ఏర్పాటు చేశారు.

చైనా మాదిరే మన దేశం కూడా సంస్కరణలకు తెరతీస్తే ఇక్కడి కమ్యూనిస్టులు అక్కడ బలపరుస్తూ ఇక్కడ వ్యతిరేకిస్తున్నారని ఆరోపించటం తెలిసిందే. చైనాలో ప్రయివేటు కంపెనీలను విచ్చలవిడిగా అనుమతించిన తరువాత అది సోషలిజం ఎలా అవుతుందని కమ్యూనిస్టు అభిమానుల్లో సందేహాలు వున్నాయి. అందువలన అక్కడ జరుగుతున్న తీరుతెన్నులను రేఖా మాత్రంగా తెలిపే ఈ సమాచారం సోషలిస్టు వ్యవస్ధను బలపరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలుగా చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మెరుగైన అవకాశాలు-తీవ్ర సవాళ్ల మధ్య చైనా: గీ జింపింగ్‌

18 Wednesday Oct 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

China, chinese communist party, chinese communist party congress 2017, Xi Jinping

బుధవారం నాడు మహాసభను ప్రారంభిస్తున్న గీ జింపింగ్‌

చైనా కమ్యూనిస్టుపార్టీ 19వ మహాసభ ప్రారంభం

ఎం కోటేశ్వరరావు

ప్రియమైన పాఠకులు ఈ వ్యాసం చదవటం ప్రారంభించే సమయానికి ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరొక చారిత్రక అధ్యాయానికి చైనాలో తెరలేచింది. వారం రోజుల పాటు జరిగే చైనా కమ్యూనిస్టుపార్టీ 19వ మహాసభ బుధవారం నాడు ప్రారంభమైంది. బీజింగ్‌లోని తియన్మెస్‌ స్క్వేర్‌లోని గ్రేట్‌ హాల్‌లో మహాసభ ప్రారంభం వుపన్యాసంలో రానున్న ఐదు సంవత్సరాల కార్యాచరణకు సంబంధించిన అంశాలను పార్టీ ప్రధాన కార్యదర్శి గీ జింపింగ్‌ ఆవిష్కరించారు.’ ప్రస్తుతం చైనా, ప్రపంచం కూడా తీవ్ర మరియు సంక్లిష మార్పుల మధ్య వుంది. వ్యూహాత్మక అభివృద్ధి అవకాశాల విషయంలో చైనా ఇప్పటికీ ఒక ముఖ్యమైన యుగంలోనే వుంది. అవకాశాలు మెరుగ్గా వున్నాయి, అదే సమయంలో తీవ్రమైన సవాళ్లు కూడా వున్నాయి.’ అని జింపింగ్‌ చెప్పారు.

ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహసభల గురించి అటు శత్రువులు, ఇటు స్నేహితులలోనూ సహజంగానే ఎంతో ఆసక్తి తలెత్తుతుంది. గతంలో జరిగిన మహాసభలకు ముందు ప్రపంచ మీడియాలో ఎన్నో కట్టుకథలు, పిట్టకథలు రాసేవారు. ఈ సారి కమ్యూనిస్టు వ్యతిరేక మీడియా తన పాఠకులు, వీక్షకులకు అటువంటి వినోదాన్ని చాలా పరిమితం చేసి ఎందరినో నిరాశపరిచింది.

పురాతన చరిత్రలో ఎన్నో వైవిధ్యాలను నమోదు చేసిన చైనా వర్తమానంలో కూడా అదే బాటలో నడుస్తోంది. పెట్టుబడిదారీ దేశాలు, వ్యవస్ధలతో ఆర్ధిక సంబంధాలు కలిగి వున్న కారణంగా కొన్ని ఆటుపోట్లు ఎదురవుతున్నప్పటికీ ఏడాదికేడాది ఎన్నో విజయాలు సాధిస్తూ చైనా సోషలిస్టు వ్యవస్థ ముందుకు పోతున్నది. పెట్టుబడిదారీ వ్యవస్ధకు పట్టిన జబ్బులు ఎప్పుడు వదులుతాయో, పక్షవాతం ఎన్నటికి నయమౌతుందో తెలియని స్ధితిలో చైనా గురించి అవాస్తవాలు రాసే మీడియా విశ్వసనీయత నానాటికీ పడిపోవటం వంటి కారణాలతో ఈ సభల సందర్భంగా వాటి జోలికి పోలేదా ? పది సంవత్సరాల క్రితం ప్రపంచ పెట్టుబడిదారీ కేంద్రం అమెరికాలో ప్రారంభమైన సంక్షోభానికి త్వరలో పదేండ్లు నిండబోతున్నాయి. తమతో పాటే చైనా కూడా మునిగిపోతుందని పిచ్చి కలలు కన్న వారిని చైనా కమ్యూనిస్టులు కొరడాతో కొట్టి లేపి మా విజయాలు చూడండి అని చూపుతున్న కారణంగానే 19వ మహాసభ సందర్భంగా వారు ఒళ్లు దగ్గర పెట్టుకున్నారా ?

కమ్యూనిస్టు పార్టీల మహాసభలు రెండు విధాలుగా జరుగుతాయి. అధికారంలో వున్న కమ్యూనిస్టు పార్టీలు సైద్దాంతిక సమస్యలతో పాటు తమ దేశ ఆర్ధిక వ్యవస్ధ, జనజీవన పరిస్ధితులను ఎలా మెరుగుపరచాలో సభలలో చర్చించి లక్ష్యాలను నిర్ణయించుకుంటాయి. ప్రస్తుతానికి చైనా కమ్యూనిస్టు పార్టీ ముందు పెద్ద సైద్ధాంతిక సవాళ్లు లేవనే చెప్పాలి. అమెరికా నాయకత్వంలో సామ్రాజ్యవాదుల కుట్రలను వమ్ము చేసి, ప్రపంచ దేశాలతో సఖ్యత పెంచుకొని తన జనాభా జీవన ప్రమాణాలను మెరుగుపరచి వర్తమానం నుంచి మరో సోషలిస్టు దశకు ఎలా చేరటమా అన్నదే వారి ముందున్న పెద్ద సవాలు . అధికారంలో లేని కమ్యూనిస్టు పార్టీలు జరిపే సభలలో సైద్ధాంతిక, రాజకీయ ఎత్తుగడల పంధా, జనజీవన పరిస్థితుల మెరుగుదలకు చేపట్టాల్సిన పోరాటాల వంటి సమస్యలు ప్రధాన అజెండాగా వుంటాయి.

2012లో జరిగిన 18వ మహాసభ తరువాత చైనా సాధించిన అభివృద్ధి గురించి జాతీయ గణాంకాల సంస్థ వివరాలను గత వారంలో విడుదల చేసింది. 2013ా16 సంవత్సరాల మధ్య ప్రపంచ సగటు వృద్ధి రేటు 2.6, అభివృద్ధి చెందుతున్న దేశాలలో 4 వుంటే చైనాలో 7.2శాతం వుంది.ఈ ఏడాది తొలి త్రైమాసిక వృద్ధి రేటు 6.9శాతం. గతేడాది ప్రపంచ జిడిపి విలువలో చైనా వాటా 14.8శాతం(11.2లక్షల కోట్ల డాలర్లు).గత నాలుగు సంవత్సరాలలో 3.4శాతం పెరిగింది. ఇదే కాలంలో ప్రపంచ పురోభివృద్ధికి చైనా 30శాతం వాటా అందించింది.ఇది అమెరికా, జపాన్‌, యూరోజోన్‌ దేశాల మొత్తం కంటే ఎక్కువ. జిడిపిలో సేవారంగం వాటా 45.3 నుంచి 51.6కు పెరిగింది. పట్టణాలలో పని చేసే గ్రామీణుల వార్షిక పెరుగుదల రేటు 1.8శాతం. పట్టణాలలో శాశ్వతనివాసితుల శాతం 52.57 నుంచి 57.35కు పెరిగింది. ఏటా కోటీ 30లక్షల కొత్త వుద్యోగాలు కల్పిస్తున్నప్పటికీ 31 పెద్ద నగరాలలో నిరుద్యోగులు ఐదుశాతం వున్నారు.పరిశోధన మరియు అభివృద్ధికి చేస్తున్న ఖర్చు 1.91నుంచి 2.11శాతానికి పెరిగింది. పేటెంట్‌ దరఖాస్తుల స్వీకరణ 69శాతం, మంజూరు 39.7శాతం పెరిగింది.కొత్త కంపెనీల నమోదు పెరుగుదల 30శాతం. జనం ఖర్చు చేయగలిగిన తలసరి ఆదాయం 7,311యువాన్ల నుంచి 23,821కి పెరిగింది.వార్షిక పెరుగుదల రేటు 7.4శాతం. అది గ్రామీణుల విషయంలో 10.7శాతం వుంది.

1921లో షాంఘై నగరంలో చైనా కమ్యూనిస్టు పార్టీ తొలి మహాసభ జరిగింది.మావో సేటుంగ్‌తో సహా కేవలం 13 మంది మాత్రమే ప్రతినిధులు ఆ సభకు హాజరయ్యారు. దేశంలోని ఇతర ప్రాంతాలలో కొన్ని డజన్ల మంది కార్యకర్తలు, నాయకులు మాత్రమే అసమయానికి వున్నారు.వారి నాయకత్వంలో కమ్యూనిస్టుపార్టీ 28 సంవత్సరాల తరువాత అనూహ్యరీతిలో చైనాలో అధికారాన్ని స్వీకరిస్తుందని వారు ఆ సమయంలో వూహించి వుండరు. ప్రపంచ కమ్యూనిస్టు వుద్యమ చరిత్రలో చైనాకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. అక్కడి భౌతిక పరిస్ధితులకు అనుగుణ్యంగానే ‘చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్ధ’ నిర్మాణం చేపట్టాలని 1982లో పన్నెండవ మహాసభ నిర్ణయించింది. బీజింగ్‌లో జరుగుతున్న 19వ సభకు 8.9కోట్ల మంది సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తూ దేశమంతటి నుంచీ ఎన్నికైన 2,287 మంది ప్రతినిధులు హాజరుకావాల్సివుంది. ఈ సభలో ఇరవై అయిదు మందితో పొలిట్‌బ్యూరో, ఏడుగురితో పొలిట్‌బ్యూరో స్టాండింగ్‌ కమిటీ, 205 మందిని కేంద్రకమిటీ సభ్యులుగా మరి కొందరిని ప్రత్యామ్నాయ కమిటీ సభ్యులుగా ఎన్నుకుంటారు. కేంద్రకమిటీ పార్టీ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటుంది.

గతమహాసభలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన గ్జీ జింపింగ్‌(64) తిరిగి ఆ బాధ్యతకు ఎన్నికయ్యే అవకాశాలున్నాయని, పార్టీలో అంతర్గతంగా ఎలాంటి నాయకత్వ సమస్యలేదని, స్టాండింగ్‌ కమిటీలోని ఏడుగురిలో ఐదుగురు బాధ్యతల నుంచి తప్పుకొంటారని కొందరు వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీ మహాసభలలో చర్చించబోయే అంశాలను ముందుగానే గత మహాసభలో ఎన్నికైన కేంద్రకమిటీ ఖరారు చేస్తుంది.రాబోయే మహాసభ వరకు ఏమి చెయ్యాలో ముసాయిదా నివేదికలను రూపొందిస్తుంది. ఒక వేళ కేంద్రకమిటీలో తీవ్రమైన భిన్నాభిప్రాయాలుంటే పార్టీ అత్యున్నత విధాయక పార్టీ మహాసభకు నివేదిస్తుంది. అంగీకారమైతే వాటిని నివేదికలు లేదా తీర్మానాలలో చేర్చుతారు, లేదా సవరణ ప్రతిపాదనలను ఓటింగ్‌కు పెట్టి అంతిమ నిర్ణయం చేస్తారు.

ఈ మహాసభ సమయంలో పిట్టకథలేమీ లేవంటే అసలేమీ లేవని కాదు. అవి లేకపోతే మీడియాకు కిక్కు వుండదు కదా. బహిరంగంగా మాట్లాడే అసమ్మతి వాదులను మహాసభ సమయంలో బీజింగ్‌ వదలి వెళ్లమన్నారని, విదేశీ జర్నలిస్టులతో మాట్లాడవద్దన్నారని రాశారు. అధికారిక వార్తా సంస్ధ నుంచి వచ్చే కథనాలను తప్ప వేరే పుకార్లను వ్యాపింపచేయవద్దని, చోటివ్వవద్దని మీడియా సంస్ధలకు జారీ చేసిన రహస్య సెన్సార్‌ నిబంధనలలో పేర్కొన్నారని ఒక పత్రిక రాసింది. ఇవెంత హాస్యాస్పదమో వేరే చెప్పనవసరం లేదు. ఇవే నోళ్లు గతంలో అసమ్మతి వాదులను జైలు పాలు చేశాయని చెప్పి ఇప్పుడు నగరం విడిచి వెళ్లమని చెప్పాయని చెబుతున్నాయి. అధికార మీడియా సంస్దలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా రహస్య సెన్సార్‌ నిబంధనలు అని చెప్పటం కట్టుకధగాక మరేమిటి? గత నాలుగు దశాబ్దాలుగా చెబుతున్న ఒక పిట్టకధ చైనీయులు చెప్పే అంకెలను నమ్మకూడదు. ఎవరు నమ్మమన్నారు? వివిధ దేశాలతో వాణిజ్య మిగులు కారణంగా ఏ దేశం వద్ద లేనన్ని డాలర్లు పోగుపడ్డాయా లేదా? చివరకు అమెరికాయే వారి నుంచి అప్పుతీసుకొంటోందా లేదా? అన్ని దేశాల నుంచి పెట్టుబడిదారులు అక్కడికి వెళ్లి పరిశ్రమలు, వ్యాపారాలలో పెట్టుబడులు పెడుతున్నారా లేదా ?

ప్రపంచ ధనిక దేశాలలో కొనసాగుతున్న సంక్షోభాన్ని ఇతర దేశాలపై నెట్టేందుకు, ఇతర దేశాల మార్కెట్లను ఆక్రమించుకొని ఇబ్బందుల నుంచి తాము బయట పడాలని పెట్టుబడిదారీ వర్గం చేయని ప్రయత్నం లేదు. వారికి కంటగింపుగా వున్న తమను వేయి కళ్లతో చూస్తున్నాయని చైనా నాయకత్వానికి తెలియంది కాదు. గత మూడు దశాబ్దాలుగా విపరీత వేగంతో జరిగిన అభివృద్ది వారికి కొత్త సమస్యలను తెచ్చింది. ఆర్ధికరీత్యా తమతో సంబంధాలు కలిగి వున్నప్పటికీ సోషలిస్టు వ్యవస్థను కూల్చేందుకు, మిలిటరీ రీత్యా దెబ్బతీసేందుకు పశ్చిమ దేశాలు నిత్యం ప్రయత్నిస్తున్నాయన్నది బహిరంగ రహస్యం. వీటిని ఎదుర్కొంటూనే, అంతర్గతంగా సామాజికంగా తలెత్తుతున్న సమస్యల నుంచి తమ వ్యవస్ధను మెరుగుపరుచుకోవటం అనే ద్వంద్వ సవాళ్లను ప్రస్తుతం చైనా నాయకత్వం ఎదుర్కొంటున్నది. అదే సమయంలో పెట్టుబడిదారీ ప్రపంచంలో వున్న వైరుధ్యాలను ప్రస్తుతానికి అది వుపయోగించుకోగలుగుతోంది. ఈ రోజు చైనా సాధిస్తున్న పురోగతి, దాని నుంచి ఇతర పెట్టుబడిదారీ దేశాల మాదిరి లబ్ది పొందకుండా మనకు మనమే గిరిగీసుకోవద్దని ఆస్ట్రేలియా-చైనా వాణిజ్య మండలి మాజీ సిఇవో లారీ పెర్సీ ‘ఆస్ట్రేలియన్‌’ పత్రికలో చైనా కమ్యూనిస్టుపార్టీ మహాసభ సందర్భంగా రాసిన వ్యాసంలో సలహా ఇచ్చారు. నలభై అయిదు సంవత్సరాల క్రితం 1971లో ఆస్ట్రేలియా ప్రతిపక్ష లేబర్‌ పార్టీ నాయకుడు విట్‌లామన్‌ చైనా సందర్శించారు. అది జరిగిన మూడు రోజుల తరువాత అమెరికా విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్‌ రహస్యంగా చైనా వెళ్లి నిక్సన్‌ పర్యటనకు ఏర్పాట్లు చేసి వచ్చాడు. ఆ పర్యటనను నాడు అధికారంలో వున్న ఆస్ట్రేలియా సంకీర్ణ కూటమి దాన్ని బుద్దిలేని వ్యవహారంగా చూసిందని ఆ వుదంతాన్ని పేర్కొంటూ అమెరికాయే చైనాతో సంబంధాలు పెట్టుకొని లబ్ది పొందుతున్నపుడు మనం కూడా చైనా నుంచి ఎందుకు లబ్ది పొందకూడదని ఆయన ప్రశ్నించారు. నిజానికి ఇది ఒక్క ఆస్ట్రేలియా కార్పొరేట్ల వైఖరే కాదు. గత పది సంవత్సరాలుగా ఆర్ధిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న మన దేశంతో సహా అన్ని పెట్టుబడిదారీ దేశాల కార్పొరేట్ల ఆలోచనకు అది ప్రతిబింబం. అందువలనే బయట వున్న ఆర్‌ఎస్‌ఎస్‌ గాంగ్‌ చైనా వ్యతిరేక ప్రచారం చేసి ఇంతకాలం తాము తయారు చేసిన కమ్యూనిస్టు వ్యతిరేకులను సంతృప్తి పరుస్తుంటే అధికారంలో వున్న ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు చైనాతో వాణిజ్యం, పెట్టుబడులతో కార్పొరేట్ల సేవలో తరిస్తున్నారు. ఇది వారి ద్వంద్వ స్వభావం అనేకంటే మోసకారి తనం అనాలి.

చైనా కమ్యూనిస్టు పార్టీ విజయాల వెనుక ఎంతో పకడ్పందీగా పధకం రూపొందించటం, ఆచరణ గురించి కమ్యూనిస్టు వ్యతిరేకులు కూడా అంగీకరిస్తారు. బ్రిటీష్‌ వారి కౌలుకింద వున్న హాంకాంగ్‌ ప్రపంచంలో అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ కేంద్రాలలో ఒకటిగా మారింది. తిరుగుబాటు రాష్ట్రంగా వున్న తైవాన్‌ కూడా అదేమాదిరి అభివృద్ధి చెందింది. వాటితో పోల్చుకుంటే ప్రధాన భూభాగం ఎంతో వెనుక బడి వుంది. కౌలు గడువు తీరి హాంకాంగ్‌ చైనాలో విలీనమైంది. అక్కడ వున్న పెట్టుబడుల అవసరం చైనాకు వుంది. అందువలననే సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణానికి భంగం కలగకుండానే ఒకే దేశం-రెండు వ్యవస్ధల విధానం కింద 2050వరకు హాంకాంగ్‌ ఆర్ధిక వ్యవస్ధలో ఎలాంటి జోక్యం చేసుకోబోమని ఒక ఒప్పందం చేసుకొని అక్కడి పెట్టుబడిదారులకు స్పష్టమైన హామీనిచ్చింది.

చైనాలో సంస్కరణలు మొత్తం మీద ఎంతో అభివృద్దికి దోహదం చేసినప్పటికీ ఆదాయ, ప్రాంతాల మధ్య అసమాన అభివృద్ధి అసమానతలు, అవినీతి పెరుగుదల వంటి సమస్యలతో పాటు, సామాజికంగా మత ప్రభావం పెరుగుదల వంటి కొత్త సమస్యలను చైనా ఎదుర్కొంటోంది. వాటిని తక్కువగా చూడనవసరం లేదు. వాటిని పరిష్కరించటంలో చైనా నూతన నాయకత్వం ఎలాంటి చర్యలను చేపడుతుందన్నదే ఆసక్తికరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d