• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: narendra modi cock and bull stories

కాకమ్మ కథలు ఆపి నరేంద్రమోడీ ఇప్పటికైనా అభివృద్ధి చర్యలు తీసుకుంటారా ?

26 Thursday Nov 2020

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

China BRI, China goods boycott, narendra modi cock and bull stories, RCEP INDIA


ఎం కోటేశ్వరరావు


ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సిఇపి) నుంచి భారత్‌ వైదొలగటం సముచితమా కాదా అన్న చర్చ ఇప్పుడు ఇంటా బయటా ప్రారంభమైంది. జపాన్‌ తదితర దేశాలు కోరుతున్నట్లు దానిలో చేరితే ఒక సమస్య లేకపోతే మరొకటి కనుక ఆ గుంజాటనతో ఎంతకాలం గడుపుతారు ? అంతా నెహ్రూయే చేశారు అన్న సుప్రభాతం మాని నరేంద్రమోడీ సర్కార్‌ తాను చెప్పిన ముఖ్యంగా మేకిన్‌ ఇండియా లేదా ఆత్మనిర్భరత కార్యక్రమాలతో దేశాన్ని ఆర్ధికంగా ఎలా ముందుకు తీసుకుపోనుంది అన్నది కీలకం. మరో దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకో కూడదనే వ్రతం చెడి తాను మద్దతు ప్రకటించిన డోనాల్డ్‌ ట్రంప్‌ పరాజయం పాలయ్యాడు. అధికారానికి వచ్చిన జో బైడెన్‌ను సంతృప్తి పరచేందుకు లేదా ఆర్‌సిఇపి చర్చ నుంచి జనం దృష్టిని మళ్లించేందుకు గానీ కేంద్ర ప్రభుత్వం మరోసారి చైనా ఆప్‌ల మీద డాడి చేసిందని భావించవచ్చు. రాబోయే రోజుల్లో మరికొన్నింటి మీద కూడా నిషేధం విధించవచ్చు. చైనా మీద వత్తిడి పెంచి బేరమాడే ఎత్తుగడ కానట్లయితే ఆప్‌లన్నింటినీ ఒకేసారి ఎందుకు నిషేధించటం లేదు అన్న ప్రశ్న తలెత్తుతోంది. వాటి వలన చైనాకు తగిలిన దెబ్బ-మనకు కలిగిన ప్రయోజనం ఏమిటన్నది వేరే అంశం. ఆర్దిక వ్యవస్ధ లావాదేవీలను ఆప్‌లు సులభతరం చేస్తాయి తప్ప సంపదలను సృష్టించవు. అందువలన నిషేధాలను పట్టించుకోకుండా కరోనా కారణంగా తగిలిన దెబ్బలను మాన్చుకొని చైనా ముందుకు పోతుంటే తగిలిన దెబ్బలు ఎంత లోతుగా ఉన్నాయో ఇంకా తేల్చుకోలేని స్ధితిలో మనం ఉన్నామంటే అతిశయోక్తి కాదు.


ఆర్‌సిఇపిలో చేరాలా వద్దా ?
ఆర్‌సిఇపి నుంచి వైదొలగటం సరైన నిర్ణయమని కొందరు చెబుతుంటే కాదని మరికొందరు తమ వాదనలను వినిపిస్తున్నారు. దీనిలో చేరితే భాగస్వామ్య దేశాల నుంచి పారిశ్రామిక, వ్యవసాయ, పాడి ఉత్పత్తులు వెల్లువెత్తి నష్టం కలిగిస్తాయని మన పారిశ్రామికవేత్తలు, రైతాంగం తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ రంగాలలో తలెత్తిన తీవ్ర సమస్యల నేపధ్యంలో 2019లో ఒప్పందం నుంచి వెనక్కు తగ్గుతున్నట్లు మన ప్రభుత్వం ప్రకటించింది. తిరిగి మనం ఏ క్షణంలో అయినా చేరేందుకు అవకాశం కల్పిస్తూ మిగిలిన దేశాలన్నీ 2020 నవంబరులో సంతకాలు చేశాయి. ఏ ఒప్పందం అయినా అందరికీ ఖేదం, మోదం కలిగించదు. ఇప్పుడు ఖేదం అనుకున్న లాబీ చేరకపోవటం సరైనదే అని చెబుతున్నది. మోదం పొందాలనుకున్న వారు వచ్చిన అవకాశం జారిపోయిందే అని ఎంత తప్పు చేశామో అని వాదిస్తున్నారు. నరేంద్రమోడీ సర్కార్‌ మీద ఎవరి వత్తిడి ఎక్కువగా ఉంటే రాబోయే రోజుల్లో అది అమలు జరుగుతుంది. అందువలన ఈ అంతర్గత పోరు ఎలా సాగుతుందో చూడాల్సి ఉంది.
ఒప్పందంలో చేరకపోవటం ద్వారా తక్షణ ప్రమాద నివారణ జరిగిందే తప్ప ముప్పు తొలగలేదని గ్రహించాలి. ఒక వైపు ప్రపంచీకరణ, మరింత సరళీకరణ, సంస్కరణలు అంటూ నరేంద్రమోడీ సర్కార్‌ కార్మికులు-కర్షకుల ప్రయోజనాలకు వ్యతిరేకమైన చర్యలను రుద్దుతున్నది. విదేశాల నుంచి వ్యవసాయ, పాడి ఉత్పత్తుల దిగుమతులను నివారించిందన్న సంతోషం రైతాంగంలో ఎక్కువ కాలం నిలిచేట్లు లేదు. సర్కార్‌ మరోవైపు అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగిన కనీస మద్దతుధరలు, సేకరణ బాధ్యతల నుంచి క్రమంగా తప్పుకొనేందుకు రైతాంగాన్ని స్వదేశీ-విదేశీ కార్పొరేట్ల దయాదాక్షిణ్యాలకు వదలివేసే చర్యలకు సంస్కరణల ముసుగువేసి పార్లమెంట్‌లో చట్టసవరణలు చేసింది.


కబుర్లు కాదు, నిర్దిష్ట చర్యలేమిటి ?
చైనాతో సహా 15దేశాలు ఆర్‌సిఇపి ద్వారా ముందుకు పోతున్నాయి. లడఖ్‌ సరిహద్దు వివాదం జరగక ముందే ఆర్‌సిఇపి చైనాకు అనుకూలంగా ఉంటుంది, దాని వస్తువులన్నీ మరింతగా మన దేశానికి దిగుమతి అవుతాయి అన్న కారణంతో మనం దానిలో చేరలేదని ప్రభుత్వం చెబుతున్నది. దానితో ఎవరికీ పేచీ లేదు. అయితే ఎప్పుడూ ఆ కబుర్లే చెప్పుకుంటూ కూర్చోలేముగా ! చైనాతో పోటీ పడి మన దేశం ముందుకు పోయేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ తీసుకుంటున్న చర్యలేమిటి అన్నది సమస్య. మనం తయారు చేసే వస్తువులను వినియోగించే శక్తిని మన జనానికి కలిగించే చర్యలేమిటి ? విదేశాలకు ఎగుమతి చేసేందుకు వ్యూహం ఏమిటి ?
చైనాకు సానుకూల హౌదా ఎందుకు రద్దు చేయటం లేదు ?

లడక్‌ ప్రాంతం గాల్వన్‌ లోయలో జరిగిన ఉదంతం తరువాత చైనాకు బుద్ధి చెప్పాలి, ఆర్ధికంగా దెబ్బతీయాలన్నట్లుగా ప్రభుత్వ చర్యలు, నేతల మాటలు ఉన్నాయి. పుల్వామా దాడి ఉదంతం తరువాత పాకిస్ధాన్‌కు అత్యంత సానుకూల హౌదా(ఎంఎఫ్‌ఎన్‌)ను మోడీ సర్కార్‌ రద్దు చేసింది. అంతకంటే ఎక్కువగా వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నా చైనాకు ఆ హౌదాను రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని మోడీ సర్కార్‌ చెప్పింది. దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. చైనాతో అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ల ప్రయోజనాలకు దెబ్బ తగల కూడదు, అదే సమయంలో చైనా వ్యతిరేకతను రెచ్చ గొట్టి జనంలో మంచి పేరు కొట్టేయాలన్న యావ తప్ప మరేమిటి ?
ప్రాంతీయ అభివృద్ధి అవకాశాలకు దూరంగా గిరిగీసుకున్న భారత్‌ అనే శీర్షికతో ఈ నెల 23వ తేదీన, అంతకు ముందు చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ రెండు విశ్లేషణలను ప్రచురించింది. వాటితో ఏకీభవించటమా లేదా అనే అంశాన్ని పక్కన పెట్టి వాటి సారాంశాన్ని చూద్దాం. ఈ ఏడాది ఏప్రిల్‌-సెప్టెంబరు మాసాల మధ్య భారత్‌ చేసుకున్న మొత్తం దిగుమతులలో చైనా ఉత్పత్తుల వాటా 18.3శాతం ఉందని, గతేడాది ఇదే కాలంలో 14.6శాతమే అని భారత వాణిజ్యశాఖ వివరాలు వెల్లడించాయి. ఆత్మనిర్బర పేరుతో చైనా నుంచి దిగుమతులను తగ్గించాలన్న ప్రభుత్వ నిర్ణయం, ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య నెలకొన్న వివాద నేపధ్యంలో ఇది జరిగింది.(చైనా వస్తుబహిష్కరణ వ్రతం ఏమైనట్లు ?) ఆర్‌సిఇపి నుంచి వైదొలిగిన భారత్‌ రక్షణాత్మక చర్యల నేపధ్యంలో అది సిపిటిపిపి లేదా అమెరికా, ఐరోపాలతో ఒప్పందాలు చేసుకోవటం ఇంకా కష్టతరం అవుతుంది. తనకు తాను గిరి గీసుకుంటున్న భారత్‌ భవిష్యత్‌లో అవకాశాలను జారవిడుచుకుంటుందని ఆ పత్రిక పేర్కొన్నది.


చైనా ఎఫ్‌డిఐ ఆంక్షల నుంచి మోడీ సర్కార్‌ వెనక్కు తగ్గుతోందా
ఇటీవల హౌం,వాణిజ్య, పరిశ్రమల శాఖల సంయుక్త బృందం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డిఐ) నిబంధనలను సడలించాలని ప్రధాని నరేంద్రమోడీకి ఒక ప్రతిపాదన చేసినట్లు వార్తలు వచ్చాయి. మన దేశంతో భూ సరిహద్దులున్న దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను కొన్ని రంగాలలో 26శాతం వరకు ప్రభుత్వ తనిఖీతో నిమిత్తం లేకుండా అనుమతించాలన్నదే దాని సారాంశం. అంతిమంగా ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఈ సడలింపు అమల్లోకి వస్తే చైనా నుంచి పెట్టుబడులను అడ్డుకొనేందుకు గతంలో కొండంత రాగం తీసి చేసిన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవటమే. ఈ ప్రతిపాదనను ఎందుకు చేసినట్లు ? ముందుచూపు లేదా పర్యవసానాల గురించి ఆలోచించకుండా జనాల్లో చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు పూనుకున్నవారికి ఇది ఎదురు దెబ్బ అవుతుంది. చైనాను వ్యతిరేకిస్తే అమెరికా, ఇతర దేశాల నుంచి పెద్దమొత్తంలో పెట్టుబడులు వస్తాయని కలలు కన్న, చైనా మీద వీరంగం వేసిన వారికి అవి కనుచూపు మేరలో కనిపించకపోవటమే అసలు కారణం. ఏటికి ఎదురీదాలని ఉత్సాహపడేే ఎవరైనా ముందు తమ సత్తా, పరిస్ధితులు ఏమిటో ఒకసారి పరిశీలించుకోవాల్సి ఉంటుంది.
నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత భారత-చైనా వాణిజ్యం బాగా పెరిగింది. చైనా నుంచి దిగుమతులతో పాటు పెట్టుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. ఆకస్మికంగా చైనా దిగుమతులను ఆపివేయలేని విధంగా మన పరిశ్రమలు చైనా మీద ఆధారపడ్డాయంటే అతిశయోక్తికాదు. రాజకీయ కారణాలతో ప్రత్యామ్నాయం చూసుకోవాలంటే అమెరికా, ఐరోపా ఇతర ఆసియా దేశాల నుంచి అధిక ధరలకు వస్తువులను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే మన వస్తువులు అంతర్జాతీయ మార్కెట్లో పోటీని తట్టుకోలేకపోతుండగా ఉత్పత్తి ఖర్చు మరింతగా పెరిగితే పరిస్ధితి ఇంకా దిగజారుతుంది. మన ఆర్ధిక పరిస్ధితి దిగజారుతున్న నేపధ్యంలో చైనాతో వివాదం ప్రారంభమైంది. దీన్ని మన వాణిజ్య, పారిశ్రామికవేత్తలు సహిస్తారా ?


ప్రపంచీకరణ జపం ఆచరణలో ఆంక్షలు !
చైనా మాదిరి మన దేశం ఎగుమతి కేంద్రంగా మారాలంటే రక్షణాత్మక చర్యలను విరమించి స్వేచ్చా వాణిజ్య పద్దతులను అనుసరించాలన్నది ఒక వాదన. దాని సారాంశం ఏమిటో చూద్దాం. గతంలో విఫలమైన విధానాలను తిరిగి అమలు జరిపితే లక్ష్యాలను చేరుకోలేము.2014 నుంచీ మోడీ సర్కార్‌ అనేక మార్లు దిగుమతి ఆంక్షలు, సుంకాలను, లైసన్సులు తీసుకోవాల్సిన చర్యలను పెంచింది. ఇది తిరిగి లైసన్సు రాజ్యం వైపు వెళ్లటమే. డిజిటల్‌ ఇండియా కార్యక్రమం గురించి ఒక వైపు చెబుతారు, మరోవైపు అది అమలుకు అడ్డుపడే చర్యలు తీసుకుంటారు. దీనికి అవసరమైన సెల్‌ఫోన్లు, కంప్యూటర్ల ధరలను పెంచారు.కొన్ని ఐఫోన్ల ధరలను చూస్తే విమానాల్లో దుబారు వంటి చోట్లకు వెళ్లి అక్కడ కొనుగోలు చేసి తెచ్చుకోవటం చౌక అని చెబుతున్నారు. అనేక వస్తువుల దిగుమతికి లైసన్సు తీసుకోవాలని నిర్ణయించారు. రక్షణాత్మక చర్యల వలన మన వస్తువుల నాణ్యత పెంచేందుకు, చౌకగా అందించేందుకు మన పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు చర్యలు తీసుకోరు. పాత పద్దతులనే కొనసాగించి లాభాలు పొందేందుకు ప్రయత్నిస్తారు. గతంలో ఇదే జరిగింది, ఇప్పుడూ అదే జరగబోతోంది. రూపాయి విలువను పడిపోయేట్లు చేయటం ద్వారా మన వినియోగదారులు దిగుమతి చేసుకొనే వస్తువుల ధరల పెరుగుదలకు, మన వస్తువులను విదేశీయులు చౌకగా పొందేందుకు వీలు కలిగిస్తున్నారు.
స్వయం సమృద్ధి లేదా మన కాళ్ల మీద మనం నిలిచే విధానాలకు ఎవరూ వ్యతిరేకం కాదు. అందుకు అనువైన విధానాలను అనుసరించే చిత్త శుద్ది లేదనేదే విమర్శ. ప్రపంచానికి తన తలుపులు తెరిచే ఉంటాయని చైనా చెబుతోంది, అయితే అది తాను చెప్పినట్లు జరగాలని అది కోరుకుంటోంది అని తాజాగా అమెరికా పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌లో వచ్చిన ఒక వ్యాసశీర్షిక సారం. తన కాళ్ల మీద తాను నిలిచి ఇతరులు తమ మీద ఆధారపడేట్లు చేసుకొనే వ్యూహాన్ని చైనా అధినేత గ్జీ జింపింగ్‌ అనుసరిస్తున్నారని దానిలో పేర్కొన్నారు. అదే విధంగా ఇతర ఆర్ధిక వ్యవస్ధలతో సంబంధాలను తెంచుకోవటం లేదని గ్జీ చెబుతున్నారు గానీ చైనా అడుగులు చూస్తే అదే మార్గంలో పడుతున్నాయి అంటూ వ్యాసకర్తలు భాష్యంచెప్పారు. మన నరేంద్రమోడీ కూడా ఆ విధానాన్నే ఎందుకు అనుసరించరు ?


ఒక దేశాన్ని ఎవరైనా శత్రువుగా మారిస్తే అది శత్రువే అవుతుంది !
ప్రతి దేశం ప్రపంచ రాజకీయాల్లో తన పాత్ర పోషిస్తోంది. అమెరికా, జపాన్‌, మన దేశంతో కలసి క్వాడ్‌ పేరుతో చైనాకు వ్యతిరేకంగా ఆస్ట్రేలియా కూటమి కడుతోంది. మరోవైపు అదే చైనాతో కలసి ఆర్‌సిఇపిలో భాగస్వామిగా చేతులు కలిపింది. చైనాతో వాణిజ్య మిగులులో ఉన్న ఆస్ట్రేలియన్లు మరోవైపు దక్షిణ చైనా సముద్రంలో దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపధ్యంలో చైనా తన ఆయుధాలను బయటకు తీస్తోంది. వరుసగా బొగ్గు, మద్యం,బార్లీ, పత్తి వంటి ఉత్పత్తుల దిగుమతులను ఆస్ట్రేలియా నుంచి క్రమంగా తగ్గిస్తోంది. ఇది వత్తిడి పెంచి అమెరికా నుంచి విడగొట్టే ఎత్తుగడలో భాగమే అన్నది స్పష్టం. దీనికి ప్రధాన కారణం దాని ఆర్ధికశక్తే. ఆస్ట్రేలియా ఎగుమతుల్లో 38శాతం చైనాకే జరుగుతున్నాయి, అమెరికా వాటా నాలుగుశాతమే. మన దేశం చైనా నుంచి ఒక శాతం వస్తువులను దిగుమతి చేసుకుంటుంటే మన ఎగుమతుల్లో మూడుశాతం చైనాకు ఉన్నాయి. అందువలన చైనాకు మన తలుపులు మూస్తే నష్టం ఎవరికో చెప్పనవసరం లేదు. ఒక దేశాన్ని ఎవరైనా శత్రువుగా మారిస్తే అది శత్రువే అవుతుంది.
రక్షణాత్మక చర్యల ద్వారా మన ప్రగతికి మనమే అడ్డుపడటమే గాక ప్రపంచ భాగస్వామ్యాలను కూడా దెబ్బతీసినట్లు అవుతోందన్నది కొందరి అభిప్రాయం. ఇది విదేశీ కంపెనీలకు అవకాశాలు కల్పించాలనే లాబీల నుంచి కూడా వచ్చే మాట అన్నది స్పష్టం. పన్నుల విధింపు, నిబంధనలు ఎక్కువగా ఉండటం వంటి చర్యల వలన ప్రపంచంలో భారత్‌ తన ఆర్ధిక వ్యవస్ధను తెరవటం లేదనే అభిప్రాయానికి తావిస్తుందన్నది సారాంశం. నిజానికి అమెరికా సంస్ధలైన అమెజాన్‌, వాల్‌మార్ట్‌ మన దేశంలోని ఆన్‌లైన్‌ షాపింగ్‌ మార్కెట్లో 70శాతం వాటాను చేజిక్కించుకున్నాయి.
ప్రతిష్ట, పలుకుబడి పెంచామన్నారు, ఫలితేమిటి ?
మేకిన్‌ ఇండియా పిలుపుతో ఆర్భాటం, ప్రపంచంలో దేశానికి ఎన్నడూ లేని ప్రతిష్టను, పలుకుబడిని పెంచానని చెప్పటం తప్ప వాటితో గత ఆరున్నర సంవత్సరాలలో మోడీ సర్కార్‌ సాధించిందేమిటో, చేసిందేమిటో తెలియదు.ఆచరణలో కనిపించకపోతే గప్పాలు కొట్టుకోవటం అంటారు. ఆర్‌సిఇపిలో చేరకూడదని ఏడాది క్రితమే నిర్ణయించిన కేంద్రం మన సరకులకు విదేశీ మార్కెట్ల కోసం చేసిందేమీ లేదు. మరోవైపున ఆ ఒప్పందంపై సంతకాలు చేసిన తరువాత 26దేశాలు, వాణిజ్య కూటములతో చైనా 19 స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకొని తన వాణిజ్య విలువను 27 నుంచి 35శాతానికి పెంచుకుంది. దీన్ని విస్తరణవాదంగా చిత్రించి పబ్బంగడుపుతున్నారు. ఇలాంటి ఒప్పందాలు లేకుండా మన దేశంలో తయారు చేస్తామని చెబుతున్న సరకులను ఎక్కడికి ఎగుమతి చేస్తారు ? ఆర్‌సిఇపి ఒప్పందంలోని మిగిలిన 14భాగస్వామ్య దేశాలతో చైనా విదేశీ వాణిజ్యంలో 2019లో మూడోవంతు ఉంది, చైనాకు వస్తున్న మొత్తం విదేశీ పెట్టుబడుల్లో ఆ దేశాల వాటా పదిశాతం ఉంది. ఈ దిశగా నరేంద్రమోడీ ఇంతవరకు చేసిందేమిటి ? మన ఇరుగుపొరుగు దేశాలతో కూడా వాణిజ్య సంబంధాలను మెరుగుపరచుకోలేదు, అవి చైనాతో సంబంధాలను పెంచుకున్నాయి.


మనం ప్రత్యామ్నాయ బిఆర్‌ఐని ఎందుకు రూపొందించలేదు ?
చైనా వాణిజ్య విస్తరణలో మరొక ప్రధాన అంశం బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌(బిఆర్‌ఐ). 2049లో (అప్పటికి చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చి వంద సంవత్సరాలు అవుతాయి) పూర్తయ్యే ఈ పధకం ద్వారా ఆసియా, ఆఫ్రికా, ఐరోపా దేశాలలో పెట్టుబడులు, వాణిజ్య విస్తరణకు చైనా పూనుకుంది. దీనిలో రోడ్డు, సముద్ర మార్గాలు ఉన్నాయి. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన సమయంలోనే ఇది రూపుదిద్దుకుంది. అదేమీ రహస్యం కాదు, అందరికీ తెలిసిందే, ముఖ్యమంత్రిగా ఎంతో అనుభవం ఉన్న మోడీ ఇలాంటి పధకాన్ని ఎందుకు రూపొందించలేకపోయారు ? చైనా గ్జీ జింపింగ్‌కు ఉన్న తెలివితేటలు మోడీకి లేవా ? నెహ్రూ అలా చేశారు, ఇలా చేశారు అని రోజూ అంతర్గతంగా ఆడిపోసుకోవటం, ఆర్‌సిఇపి, బిఆర్‌ఐ వంటి చర్యల ద్వారా చైనా విస్తరించటాన్ని అడ్డుకోవాలంటూ అమెరికా ఇతర దేశాలతో చేతులు కలిపేందుకు తాపత్రయం తప్ప మన దేశమే అలాంటి పధకాలను రూపొందించాలనే దూరదృష్టి ఎందుకు కొరవడింది?
చైనా లేదా మరొకటి మరొక దేశాన్ని ఆక్రమించుకుంటే దాన్ని వ్యతిరేకించాల్సిందే, అందరూ కలసి అడ్డుకోవాల్సిందే. గతంలో అలా ఆక్రమించుకున్న బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వంటి దేశాలన్నీ వెనక్కు తగ్గి స్వాతంత్య్రం ఇవ్వకతప్పలేదు. రెండవ ప్రపంచ యుద్దం తరువాత వలసలు, ఆక్రమణలు లేవు. ఏదో ఒక సాకుతో అమెరికా, దానికి మద్దతు ఇస్తున్నదేశాలే ఇటీవలి కాలంలో ఇరాక్‌, లిబియా, ఆఫ్ఘనిస్తాన్‌లను ఆక్రమించుకుని తమ తొత్తు ప్రభుత్వాలను ఏర్పాటు చేసి పరోక్షంగా పెత్తనం చేస్తున్నాయి తప్ప చైనా అలాంటి చర్యలకు ఎక్కడా పాల్పడలేదు. వాణిజ్యం, పెట్టుబడుల విషయానికి వస్తే ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) 1995లో ఉనికిలోకి రాక ముందు 1948 నుంచి పన్నులు, వాణిజ్యంపై సాధారణ ఒప్పందం(గాట్‌) అమల్లో ఉంది. అమెరికా, ఐరోపా ధనిక దేశాలు దానిలోకి చైనాను ప్రవేశించనివ్వలేదు. దీన్ని మరో విధంగా చెప్పాలంటే తమ ప్రాబల్యంలో ఉన్న ప్రపంచ మార్కెట్‌లోకి చైనా ప్రవేశించకుండా అడ్డుకున్నాయి.(1971వరకు అసలు చైనాకు ఐక్యరాజ్యసమితిలో గుర్తింపే ఇవ్వలేదు.చైనా తిరుగబాటు రాష్ట్రమైన తైవాన్‌లో ఉన్న తొత్తు ప్రభుత్వమే అసలైన చైనా ప్రతినిధి అని దానికే ప్రాతినిధ్యం కల్పించాయి) 2001లో సభ్యత్వమిచ్చాయి.
మనం గమనించాల్సిన అంశం ఏమంటే చైనా ప్రారంభించిన సంస్కరణల్లో భాగంగా అది తన అపార మార్కెట్‌ను తెరిచింది.దానిలో ప్రవేశించాలన్నా, లబ్ది పొందాలన్నా చైనాను డబ్ల్యుటిఓలో భాగస్వామిని చేయకుండా సాధ్యం కాదు. అందుకే గతంలో అడ్డుకున్న అమెరికా వంటి దేశాలే ఐరాసలో, డబ్ల్యుటిఓలో చేరనిచ్చాయి. ఆ అవకాశాన్ని వినియోగించుకొని చైనా నేడు ఒక అగ్రశక్తిగా ఎదిగి ధనిక దేశాలను సవాలు చేస్తోంది. తమకు పోటీగా తయారైన చైనాను సహించలేని అమెరికా, ఇతర ఐరోపా ధనిక దేశాలు మన దేశం పోటీలో ఉండే విధంగా ప్రోత్సహిస్తాయా ? సహిస్తాయా ? చైనాను వ్యతిరేకిస్తే పశ్చిమ దేశాలు మనకేదో తవ్వితలకెత్తుతాయనే భ్రమల్లో ఉన్న మోడీ సర్కార్‌ అయినా ఎండమావుల వెంట పరుగెత్తినట్లుగా వాటిని నమ్ముకొని ఉంది తప్ప తాను చేయాల్సింది చేయటం లేదు, ఒక దీర్ఘకాలిక ప్రణాళిక అసలే లేదు.2025 నాటికి ఐదులక్షల కోట్ల డాలర్ల జిడిపిని సాధించటం లక్ష్యంగా చెప్పింది తప్ప దానికి అనువైన పరిస్దితుల కల్పనకు పూనుకోలేదు. కరోనాతో నిమిత్తం లేకుండానే ఆర్ధిక వ్యవస్ధ దిగజారింది.

గుజరాత్‌ తరహా పారిశ్రామిక వృద్ధి జాడెక్కడ ?
ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ (ఐఎంఎఫ్‌) ప్రధాన ఆర్దికవేత్తగా ఉన్న గీతా గోపీనాధ్‌ మరో ఆర్ధికవేత్త ఇక్బాల్‌ దహలీవాల్‌తో కలసి 2014 మేనెలలో దేశ ఆర్ధిక వ్యవస్ధ గురించి ఒక విశ్లేషణ చేశారు. ప్రస్తుతం భారత్‌ యవ్వనదశలో ఎదుగుతున్న మార్కెట్‌గా ఉంది. దీని అర్ధం రానున్న ఐదు సంవత్సరాలలో ఎలాంటి నాటకీయ పరిణామాలు లేకుండానే అభివృద్ధి చెందుతుంది అని పేర్కొన్నారు. అదే జరిగింది, దానికి తోడు చమురు ధరలు పడిపోవటం ఎంతో ప్రయోజనం చేకూర్చింది. నరేంద్రమోడీ సర్కార్‌ ప్రత్యేకంగా తీసుకున్న చర్యలేమీ లేకుండానే అభివృద్ధి జరిగింది. తదుపరి చర్యలు లేకపోవటంతో ఐదేండ్ల తరువాత దిగజారింది. జిడిపిలో పరిశ్రమల విలువ వాటా 25శాతం దగ్గర అప్పటికే ఆగిపోయింది. తనకు అధికారమిస్తే గుజరాత్‌ తరహా పారిశ్రామిక వృద్ది దేశమంతటా అమలు చేస్తానని నరేంద్రమోడీ నమ్మబలికారు. ఐదు సంవత్సరాల తరువాత చూస్తే ప్రపంచబ్యాంకు సమాచారం ప్రకారం పరిశ్రమల వాటా 24.88శాతానికి పడిపోయింది. ఈ కాలంలో మెజారిటీ రాష్ట్రాలలో బిజెపిదే పాలన అన్న విషయం తెలిసిందే. ప్రయివేటు పెట్టుబడుల మీద ఆశలు పెట్టుకున్న సర్కార్‌కు కార్పొరేట్‌ కంపెనీలు ప్రభుత్వం ఇచ్చిన రాయితీలతో మూటలు కట్టుకోవటం తప్ప వాటిని పెట్టుబడులుగా పెట్టి పరిశ్రమలను స్ధాపించటం లేదు. విదేశీ మదుపుదార్లు మన కార్పొరేట్ల వాటాలను కొనుగోలు చేయటం తప్ప కొత్త పరిశ్రమలు పెట్టటం లేదు. అభివృద్ధి లేకపోవటానికి ఇదొక ప్రధాన కారణం.
చైనాలో ఉత్పాదక ఖర్చులు పెరుగుతున్నాయని, అంతర్జాతీయ సంస్ధలు ప్రత్యామ్నాయ ఉత్పాదక దేశాల కోసం చూస్తున్నాయని ఈ అవకాశాన్ని భారత్‌ వినియోగించుకుంటే పారిశ్రామిక వృద్ధి సాధించవచ్చని గీతా గోపినాధ్‌ చెప్పారు. చిత్రం ఏమిటంటే ఆరు సంవత్సరాల తరువాత కూడా నరేంద్రమోడీ అండ్‌కో అదే కబుర్లు చెబుతూ చైనా నుంచి ఉత్పాదక కంపెనీలు మన దేశానికి వస్తున్నాయని చెబుతున్నది, భ్రమలు కల్పిస్తున్నది. 2013లో సులభతర వాణిజ్య సూచికలో మన దేశం 134వ స్ధానంలో ఉండగా 2020లో 63కు ఎదిగినా చైనా నుంచి, మరొక దేశం నుంచి కంపెనీలు వస్తున్న సూచనలేమీ లేవు. ఇప్పటికైనా చైనా గాకపోతే మరొక దేశాన్ని చూసి అయినా అభివృద్ధికి బాట వేస్తారా ? కాకమ్మ కబుర్లు చెబుతూ కాలం గడుపుతారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

గో గూండాలకు గాంధీ సూక్తులు-నరేంద్రమోడీ పిట్ట, కట్టు కథలు !

01 Saturday Jul 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Acharya Vinoba Bhave, bjp cow politics, cow goondas, cow protectors, gandhi good words, Mahatma Gandhi, Narendra Modi, narendra modi cock and bull stories

నరేంద్రమోడీ చెప్పిన సరికొత్త ఆవు పశ్చాత్తాప కథ మా దొరగారి పొలంలో పండే మిరియాలు తాటి కాయలంతుంటాయి బాబయ్యా అని చెప్పినట్లుగా వుంది.

ఎం కోటేశ్వరరావు

భూమ్మీద మే నెలలో మాత్రమే పుష్పించే మొక్కలున్నాయి. అందుకే వాటిని వాడుక భాషలో మే పుష్పాలు అన్నారు. అది ప్రకృతి ధర్మం. మన ప్రధాని నరేంద్రమోడీ ఎప్పుడు నోరు విప్పుతారో తెలియదు.దీన్ని వికృతి ధర్మం అనవచ్చా. ఏ గొప్ప సందేశమిచ్చారన్నదానితో నిమిత్తం లేకుండా తాము నమ్మే మౌన బాబా నోరు విప్పటమే భక్తులకు పరమానందం. నరేంద్రమోడీ కూడా భక్తులకు అలాంటి అనూహ్య సందేశం వినిపించారు. తిరిగి ఎపుడు నోరు విప్పుతారో తెలియదు. ఆయన నోటి ముత్యాల కోసం దేశం యావత్తూ ఎదురు చూడాల్సిందే తప్పదు మరి !

గతేడాది అంటే 2016 ఆగస్టు 7న కేంద్ర ప్రభుత్వం లేదా ప్రధాని అమెరికా నేతలను అనుకరిస్తూ కొత్తగా ప్రారంభించిన ‘టౌన్‌ హాల్‌ ‘ కార్యక్రమంలో మాట్లాడుతూ (తరువాత అలాంటి కార్యక్రమాలు జరిగినట్లు, మాట్లాడినట్లు వార్తలేమీ లేవు) గో రక్షణ పేరుతో అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నవారిపై రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని కోరారు.( ఒక్క రాష్ట్రమైనా ప్రధాని వినతిని పట్టించుకొని తీసుకున్న చర్యల గురించి తెలిసిన వారు ఎవరైనా వివరాలు అంద చేయాలని మనవి) ‘ గో రక్షణ వ్యాపారానికి పూనుకున్న వారిని చూసి నాకు తీవ్ర కోపం వస్తోంది. గో భక్తి వేరు, గో రక్షణ వేరు. పగలు గో రక్షకుల ముసుగులు వేసుకొని రాత్రంతా నేరాలు చేస్తున్న కొంత మందిని నేను చూశాను. గో రక్షకుల అవతారమెత్తిన వారిలో 70-80శాతం మంది సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు, వారి తప్పులను కప్పి పుచ్చుకొనేందుకు గో రక్షకులుగా నటిస్తున్నారు. వారు నిజమైన రక్షకులైతే అత్యధిక ఆవులు ప్లాస్టిక్‌ కారణంగా మరణిస్తున్నాయి తప్ప వధించటం వలన కాదని తెలుసుకోవాలి. ఆవులు ప్లాస్టిక్‌ను తినకుండా వారు నిరోధించాలి.’ అని ఎంతో స్పష్టంగా చెప్పారు. తన స్వంత రాష్ట్రమైన గుజరాత్‌లో ఒక చచ్చిన ఆవుతోలు తీసినందుకు నలుగురు దళితులపై జరిపిన దాడిపై తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లడైన పూర్వరంగంలో వారిని బుజ్జగించే యత్నంలో భాగంగా ప్రధాని నోటి వెంట ఆ సుభాషితాలు వెలువడ్డాయి.

ఆ తరువాత మోడీ చెప్పినట్లు గో రక్షకుల ముసుగులో వున్న వారి ఆగడాలు ఆగలేదు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగి నిత్యకృత్యంగా మారాయి. ఎప్పుడు, ఎక్కడేం జరుగుతుందో తెలియదు. తరువాత జూన్‌ 29 గురువారం నాడు రెండు రోజుల గుజరాత్‌ పర్యటనలో మరోసారి నోరు విప్పి ‘ఆవు పేరుతో చేసే హత్యలను మహాత్మా గాంధీ అంగీకరించరు, అవి ఆయన సిద్దాంతాలకు వ్యతిరేకం ‘ అని సెలవిచ్చారు. రంజాన్‌ సందర్భంగా వస్తువులను కొనుగోలు చేసి దేశ రాజధాని ఢిల్లీ నుంచి రైలులో హర్యానాలోని స్వగ్రామానికి ప్రయాణిస్తున్న ముస్లిం కుటుంబంపై ముస్లిం వ్యతిరేక వున్మాదులు దాడి చేసి వారిని కొట్టి రైలులో నుంచి తోసివేసిన దుర్మార్గ వుదంతంలో పదిహేనేండ్ల ఒక యువకుడు మరణించిన విషయం తెలిసిందే. దానికి నిరసనగా దేశ వ్యాపితంగా అనేక నగరాలలో తీవ్ర నిరసన ప్రదర్శనలు వ్యక్తమైన ఒక రోజు తరువాత నరేంద్రమోడీ నోరు విప్పారు. అంటే తీవ్ర ఘటనలు, వాటిపై వ్యతిరేకత వ్యక్తమై అధికారపక్షం గబ్బు పట్టే పరిస్ధితులు తలెత్తినపుడే ప్రధాని నోరు విప్పుతారన్నది స్పష్టమైంది. అంతకు ముందే జరిపిన విదేశీ పర్యటన వార్తల కంటే ఎక్కువగా నిరసన ప్రదర్శనల గురించి అంతర్జాతీయ మీడియా స్పందించిన తీరు కూడా నరేంద్రమోడీని కలవరపరచి వుంటుంది.

‘ గోరక్షణ, గో ఆరాధన గురించి మహాత్మాగాంధీ, వినోభా భావే కొన్ని విషయాలు చెప్పారు. అవెలా చేయాలో వారు మనకు చూపారు.దేశానికి, ప్రగతికి అది మార్గం. గో భక్తి పేరుతో జనాన్ని చంపటం ఆమోదయోగ్యం కాదు, మనకు వినోభా భావే జీవితం అలాంటి సందేశం ఇవ్వదు. ఒకసారి వినోభానే కలిసే అదృష్టం నాకు కలిగింది. ఆయన నన్ను చూసి మరణించు, మరణించు అన్నారు. ఇదేమిటి ఇలా అంటారు అని దిగ్భ్రాంతి చెందాను. ఆవు కోసం మరణించు అని ఆ తరువాత ఆయనే చెప్పారు.మా గ్రామంలో నా చిన్నతనంలో ఒక ఆవు ప్రమాదవశాత్తూ ఐదు సంవత్సరాల బాలుడిని చంపింది. తరువాత అది మేతమేయటం మానుకొని ఆ బాలుడి తలిదండ్రుల ఇంటి ముందే పశ్చాత్తాపంతో మరణించింది. http://indianexpress.com/article/india/killing-in-name-of-cow-unacceptable-its-not-something-mahatma-gandhi-would-approve-pm-modi-4728580/ గాంధీ గురువుగా తెలిసిన జైన ఆధ్యాత్మికవేత్త శ్రీమద్‌ రాజచంద్ర 150వ జయంతి,ఆశ్రమ శతవార్షికోత్సవం జరుగుతున్నది, ఈ సందర్భంగా ఒకటి చెప్పదలచుకున్నాను, మనది అహింసాత్మక భూమి, మహాత్మాగాంధీ పుట్టిన నేల, ఏ సమస్యను కూడా ఎన్నడూ హింస పరిష్కరించజాలదు.నేను సబర్మతి ఆశ్రమంలో వున్నాను, ప్రస్తుతం దేశంలో వున్న పరిస్ధితి గురించి నా ఆగ్రహం, విచారం, బాధను వ్యక్తం చేయదలచుకున్నాను. చీమలకు కూడా తినబెట్టాలని నమ్మేదేశం మనది, వుదయమే చెరువుల దగ్గరకు వెళ్లి చేపలకు మేత వేసేటువంటి సంస్కృతి కలిగినట్టి ఒక దేశం, దానిలో మహాత్ముడు మనకు అహింస గురించి పాఠాలు చెప్పారు. అలాంటిది ఏమైంది మనకు ? విఫలమైన ఆపరేషన్‌ కారణంగా రోగి మరణిస్తే బంధువులు ఆసుపత్రులను తగులబెడుతున్నారు. ప్రమాదమంటే ప్రమాదమే. ప్రమాదాలలో ఎవరైనా మరణించినా లేక గాయపడినా జనం వచ్చి వాహనాలను తగులబెడుతున్నారు. మనమందరం కలసి కట్టుగా పని చేయాలి, గాంధీ కలలను నిజం చేయాలి. మన స్వాతంత్య్ర సమర యోధులు గర్వపడేట్లు చేయాలి.’ అని నరేంద్రమోడీ తన సందేశంలో చెప్పారు.

మోడీగారి ఈ మాటలు విన్న, చదివిన తరువాత చెవుల్లో పూలేమన్నా మొలిచాయా అని ఎవరైనా తడిమి చూసుకోవాల్సి వుంటుంది. ఆవు పేరుతో జరిగే హత్యలను మహాత్మాగాంధీ సహించరు అని నరేంద్రమోడీ ఎవరికి చెబుతున్నట్లు ? గాంధీ పేరు చెప్పుకొని ఎవరైనా అలాంటి దుర్మార్గానికి పాల్పడుతుంటే అలా చెబితే అర్ధం వుంటుంది. సాధు జంతువైన ఆవు రక్షణ పేరుతో చెలరేగుతున్న సాయుధ వున్మాదులకు ఆవు కోసం చంపు,చంపు అన్నవి తప్ప చావు, చావు అన్నవి రుచిస్తాయా ? అయినా విపరీతం గాకపోతే ఆవు కోసం మరణించటం ఏమిటి? సంఘపరివార్‌ లేదా అది ఏర్పాటు చేసిన ప్రత్యక్ష బిజెపి వంటి రాజకీయ పార్టీలు, సంస్ధలు లేదా పరోక్షంగా వేరే ముసుగులతో పని చేస్తున్న సంస్ధల వారు గానీ ఇంతవరకు గాంధీని జాతిపితగా గుర్తించలేదు. ప్రధాని నరేంద్రమోడీ- బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా ద్వయపు శరీరాలు వేరు తప్ప ఆత్మలు, ఆలోచనలు ఒక్కటే అని అందరికీ తెలుసు. అలాంటి ఒక ఆత్మ అయిన అమిత్‌ షా మహాత్ముడిని ఒక చతురుడైన కోమటిగా వర్ణించటాన్ని తన మౌనం ద్వారా మరో ఆత్మ అయిన నరేంద్రమోడీ సమర్ధించారు. అదే పెద్దమనిషి ఆవు పేరుతో జరిగే వాటిని మహాత్ముడు అంగీకరించడు అంటున్నారు. ఇలాంటివి ఆత్మను చంపుకొని లేదా వంచనలో భాగంగా మాట్లాడేవి తప్ప మరొకటి కాదు. హిందూ-ముస్లిం మతసామరస్యతను దెబ్బతీయటమే పరమ ధర్మంగా పెట్టుకున్న పరివార సంతతి సామరస్యత కోసం తన ప్రాణాలనే బలి ఇచ్చిన ఆయన కలలను నిజం చేయాలి అని చెబితే చెవుల్లో పూలు పెట్టుకున్నవారు తప్ప అన్యులెవరూ ఆవగింజంతైనా విలువ ఇవ్వరు. అమిత్‌ షా నాయకత్వంలోని బిజెపి అనుయాయులు, ఆర్‌ఎస్‌ఎస్‌లో కొంతకాలం పని చేసి ఆ మహాత్ముడిన చంపిన గాడ్సేకు గుడులు, గోపురాలు కట్టాలంటూ కీర్తిస్తున్న శక్తుల చెవులకు అవి ఇంపుగా వుంటాయా ? ఎందుకీ రెండు నాలుకల వైఖరీ, ఎందుకీ వంచన ? మనుషులను చంపితేనే వురి శిక్షలు వద్దని సభ్య సమాజం ఒకవైపు కోరుతుంటే ఆవును చంపిన వారిని వురితీసే విధంగా చట్టాలను సవరించాలని బిజెపి, దాని ప్రత్యక్ష, పరోక్ష అనుబంధ సంఘాల వారు చెలరేగుతున్న స్ధితి. అరవై ఆరు సంవత్సరాల నరేంద్రమోడీ, 87 సంవత్సరాల వయస్సులో 1982లో మరణించిన వినోభావేను ఎప్పుడు, ఎక్కడ కలిశారో, ఈయనను చూసి అవు కోసం చావు చావు అని తన మౌనవ్రతం వీడి ఆయనెందుకు చెప్పారో, దానిలో అంత సుగుణం ఏమి వుందని ఆవుకోసం హత్యలకు సైతం వెనకాడని వున్మాదం ప్రబలిన స్ధితిలో మోడీ ఎందుకు ప్రత్యేకించి చెప్పారో అని ఆలోచిస్తే అనేక కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మహాత్ము డు ఆవు గురించి ఏం చెప్పినా గొడ్డు మాంస నిషేధం గురించి చెప్పలేదు.https://thewire.in/12170/what-mahatma-gandhi-said-to-those-who-wanted-beef-banned-in-india/ పశు విక్రయాలపై కేంద్రం చేసిన నిర్ణయం పరోక్షంగా గొడ్డు మాంసాన్ని నిషేధించే దిశగా వుంది తప్ప వేరొకటి కాదు. ‘ఎవరికి వారికి బుద్ధి పుట్టకుండా ఆవును చంప వద్దని నేను బలవంతం ఎలా చేయగలను ? దేశంలో హిందువులు మాత్రమే లేరు. ముస్లింలు, పార్సీలు, క్రిస్టియన్లు, ఇతర మతాల వారు వున్నారు’ అని చెప్పారు. అయినప్పటికీ దేశంలో బిజెపి నేతలు గొడ్డు మాంసానికి వ్యతిరేకంగా మాట్లాడటం, రెచ్చగొట్టటాన్ని గాంధీ అంగీకరిస్తారా ? గాంధీని పొగుడుతూ అపహాస్యం చేయటమే ఇది. ఇక వినోభా భావే గో రక్షణ గురించి చెప్పారు తప్ప అందుకోసం చావు లేదా చంపు అన్న తీవ్రవాది మాదిరిగా మాట్లాడినట్లు, రాసినట్లు ఇంటర్నెట్‌లో నాకు దొరకలేదు. ఎవరైనా వాటి గురించి శోధించి చెప్పవచ్చు. తమ బుర్రల్లో వున్నవాటిని ఇతరుల పేర్లతో ప్రచారం చేస్తున్న వర్తమానంలో నరేంద్రమోడీ ఒక ప్రధానిగా వుంటూ తననెప్పుడో ఆవు కోసం ప్రాణాలిమ్మని కోరినట్లు చెప్పటం గో రక్షణ పేరుతో చెలరేగుతున్నవారికి రివర్సులో అర్ధమై ప్రాణాలు ఇవ్వటానికి బదులు ప్రాణాలు తీయమని మరింత ప్రోత్సాహమిస్తుంది తప్ప వారిని దాడుల నుంచి, హత్యలు చేయటం నుంచి వెనక్కు మరల్చదు.

నరేంద్రమోడీ చెప్పిన సరికొత్త ఆవు పశ్చాత్తాప కథ మా దొరగారి పొలంలో పండే మిరియాలు తాటి కాయలంతుంటాయి బాబయ్యా అని చెప్పినట్లుగా వుంది. ఆవులు, ఎద్దులు, దున్నలు, గేదెలు(బర్రెలు) కొన్ని సందర్భాలలో వాటి దగ్గరకు వెళ్లిన మనుషులను పొడుస్తాయి, తంతాయి. గాయాలు తీవ్రమైనవి లేదా ఆయువు పట్టులో తగిలితే ఎవరైనా మరణించ వచ్చు. ఆవుకు లేని లక్షణాలను ఆపాదించే వారి కోవలో భాగంగా మోడీ ఈ కథను వినిపించారన్నది స్పష్టం. బహుశా గుజరాత్‌ గోవులకు అంతటి మహత్తర గుణం వుందనుకుందాం. మోడీ చెప్పారు కనుక ‘పక్కా నిజం’ కూడా అయి వుంటుందనుకుందాం. గోధ్రా రైలు ఘటన అనంతరం జరిగిన ముస్లింల వూచకోతలో పాల్గొన్నవారు మోడీ గారి వూరి ఆవు మాదిరి ఆప్తులను కోల్పోయిన వారి ఇళ్ల ముందు తిండి మానుకొని మరణించకపోయినా కనీసం మోడీతో సహా ఒక్కరంటే ఒక్కరు కూడా పశ్చాత్తాపం తెలిపిన వుదంతం మనకు కనపడదు. మెదడు అంతగా ఎదగని, తింటున్నది ప్లాస్టిక్కో కాదో కూడా తెలియని ఆవు పశ్చాత్తాప గుణం మెదడు బాగా ఎదిగిన వారిలో మృగ్యమైంది. సిగ్గు పడాల్సిన విషయం కదా ! ప్రపంచంలో రెండో పెద్ద దేశానికి ప్రధానిగా వున్న ఒక వ్యక్తి ఇలాంటి కాకమ్మ కథలు వినిపిస్తున్నారంటే ప్రపంచంలో మన పరువేంగాను? ఇప్పటికే కొన్ని వేల సంవత్సరాల నాడే ఎలాంటి పెట్రోలు లేకుండా, పైకీ కిందికీ, వెనక్కు ముందుకు ఎటు కావాలంటే అటు, ఎంత మంది ఎక్కినా ఒకరికి ఖాళీ వుండే విమానాలను భారతీయులు తయారు చేశారని, టెస్ట్‌ ట్యూబ్‌ బేబీలను మహాభారత కాలంలోనే పుట్టించారని, మనిషికి ఎనుగు తలను అతికించి ఎప్పుడో ప్లాస్టిక్‌ సర్జరీ చేశారని, ఇవన్నీ సంస్కృత గ్రంధాలు,వేదాలలో వున్నాయని ఎలాంటి సంకోచం లేకుండా చెప్పుకుంటుంటే విదేశాల్లో భారతీయలు తలెత్తుకోలేకుండా వున్నారు. ఇప్పుడు మోడీ వాటికి మరో ఆవు కథను తోడు చేశారు.

ఒకవైపు నరేంద్రమోడీ ఆవు పశ్చాత్తాప కథలు, గోవు పేరుతో హత్యలను గాంధీ సహించరని చెబుతున్న సమయంలోనే బిజెపి పాలిత రాష్ట్రమైన ఝర్ఖండ్‌లో ఒక ముస్లిం ఒక వాహనంలో నిషేధిత గొడ్డు మాంసాన్ని తరలిస్తున్నాడంటూ ఒక గుంపు దాడి చేసి చచ్చేట్లు కొట్టటమే గాక ఆ వాహనాన్ని కూడా తగుల బెట్టారు. అంతకు ముందు ఒక ముస్లిం ఇంటి ముందు ఆవు తల కనిపించిందంటూ అతడిపై దాడి చేయటమే గాక ఆ ఇంటిని గో గూండాలు తగుల బెట్టారు. ఆవు పేరుతో ముస్లింలు, దళితులను ఏం చేసినా తమనేం చేసే వారుండరనే భరోసా పెరగటమే ఇలాంటి దుర్మార్గులు రెచ్చిపోవటానికి కారణం. గత మూడు సంవత్సరాలుగా ముఖ్యమంత్రులతో సహా బిజెపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, వారి అనుయాయుల చర్యలకు, నరేంద్రమోడీ సుభాషితాలకు ఎక్కడా పొంతన కుదరటం లేదు.https://thewire.in/152839/modi-cow-violence-gap-words-bjps-deeds/

గత ఏడు సంవత్సరాలలో (2010-17జూన్‌ 25వరకు) దేశంలో జరిగిన పశు సంబంధ హింసాకాండలో 51శాతం ముస్లింలే లక్ష్యంగా జరిగాయని ఇండియా స్పెండ్‌ విశ్లేషణ తెలిపింది. అరవై మూడు సంఘటనలలో28 మంది మరణించగా 124 మంది గాయపడ్డారు, మరణించిన వారిలో ముస్లింలు 86శాతం వున్నారు.ఈ మొత్తం వుదంతాలలో నరేంద్రమోడీ అధికారానికి వచ్చాక జరిగినవి 97శాతం వున్నాయి. ఎనిమిది సంవత్సరాలలో 63 జరగ్గా 2014-17లో 61 వున్నాయి, 2016లో 25 జరగ్గా, ఈ ఏడాది ఆరునెలల్లోనే 20 జరిగాయి. అరవై మూడు సంఘటనల్లో 32 బిజెపి పాలిత రాష్ట్రాలలో జరిగాయి. యాభై రెండు శాతం దాడులకు పుకార్లే ప్రాతిపదిక. 2016 మొత్తంలో నమోదైన ఘటనల సంఖ్యలో 2017 తొలి ఆరునెలల్లోనే 75శాతం జరిగాయని ఆ విశ్లేషణ తెలిపింది. ఇదంతా గతేడాది ఆగస్టులో నాకు కోపం వస్తోంది, చర్యలు తీసుకోండంటూ గో గూండాలపై మోడీ ఆగ్రహం వ్యక్తం చేసిన తరువాత నెలకొన్న పరిస్ధితి ఇది. గో గూండాయిజం ఘటనలు వుత్తర ప్రదేశ్‌లో 10, హర్యానా 9, గుజరాత్‌ 6, కర్ణాటక 6, మధ్య ప్రదేశ్‌, రాజస్ధాన్‌, ఢిల్లీలలో నాలుగేసి చొప్పున జరిగాయి. దక్షిణాది, బెంగాల్‌, ఒడిషాతో సహా ఈశాన్య రాష్ట్రాలలో 13 సంఘటనలు జరిగితే ఒక్క కర్ణాటకలోనే ఆరున్నాయి.63 వుదంతాలలో 32 బిజెపి పాలిత రాష్ట్రాలలో జరగ్గా కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో ఎనిమిది, మిగతావి ఇతర పార్టీల పాలిత రాష్ట్రాలలో జరిగాయి.

ఇండియా స్పెండ్‌ విశ్లేషణలోని మిగతా వివరాల ప్రకారం జరిగిన ఘటనలలో 50.8శాతం ముస్లింలు లక్ష్యంగా జరిగితే 7.9శాతం దళితులు, 4.8శాతం సిక్కులు లేదా హిందువులు, 1.6శాతం క్రైస్తవుల లక్ష్యంగా జరిగాయి. 20.6శాతం కేసులలో మతం ఏమిటో పేర్కొనలేదు. మన శిక్షా స్మృతిలో గుంపులు చేసే లించింగ్‌ అంటే చిత్రవధ చేయటం లేదా విచారణ లేకుండా చంపటం, చంపించటం అనే అంశాల ప్రస్తావన లేదు. ఐదుశాతం వుదంతాలలో దాడి చేసిన వారి అరెస్టుల వివరాలు లేవు, 21శాతం కేసులలో దాడులకు పాల్పడిన వారితో పాటు బాధితులపై కూడా కేసులు నమోదు చేశారు. 36శాతం కేసులలో గుంపులుగా పాల్గొన్న వారు భజరంగదళ్‌, విశ్వహిందూపరిషత్‌ లేదా స్ధానిక గోరక్షణ దళాల పేరుతో వున్నవారే వున్నారు.

హింసాకాండ తీరు తెన్నులు ఎలా వున్నాయంటే, 2012 జూన్‌ 10 పంజాబ్‌లోని జోగా పట్టణంలోని ఒక ఫ్యాక్టరీ సమీపంలో 25 ఆవు కళేబరాలు కనిపించాయి. విశ్వహిందూ పరిషత్‌, గోశాల సంఘాల నాయకత్వంలో ఒక గుంపు ఆ ఫ్యాక్టరీలో ప్రవేశించి దానిని ధ్వంసం చేశారు. ఆ ఫ్యాక్టరీని నడుపుతున్నవారిలో ఇద్దరి ఇండ్లను తగుల బెట్టారు, ఈ వుదంతంలో నలుగురు గాయపడ్డారు. గతేడాది ఆగస్టులో గొడ్డు మాంసం తింటున్నారనే పేరుతో హర్యానాలోని మేవాట్‌లో ఒక మహిళ, 14 ఏండ్ల మైనర్‌ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టటంతో పాటు ఇద్దరు బంధువులను హత్య చేశారు.

ఈ పూర్వరంగంలో నరేంద్రమోడీ చెప్పిన సుభాషితాలు, కట్టుకథలు, పిట్ట కథలు ఇంటా బయటా వెల్లువెత్తుతున్న విమర్శలను తప్పించుకోవటానికి తప్ప నిజంగా దోషులను అదుపు చేసేందుకు కాదన్నది స్పష్టం. ఢిల్లీ నుంచి హర్యానా వెళ్లే రైలులో ముస్లిం కుటుంబంపై దాడి చేసి వారిని రైలు నుంచి తోసివేసిన వున్మాద చర్యలో ఒక యువకుడు మరణించిన వుదంతంపై అనేక చోట్ల ‘నాట్‌ ఇన్‌ మై నేమ్‌ ‘పేరుతో జరిగిన నిరసన ప్రదర్శనలలో అనేక సంస్ధలు, పార్టీలకు చెందిన వారు పాల్గొన్నారు. నిజంగా ఆ వుదంతాన్ని బిజెపి ఖండిస్తున్నట్లయితే వారు కూడా వాటిలో పాల్గొని తమ వైఖరిని వెల్లడించి వుండాల్సింది. కానీ అందుకు భిన్నంగా రైలులో కూర్చునే దగ్గర తలెత్తిన గొడవలో ఆ యువకుడు మరణించాడని బిజెపి చెప్పింది, నిరసనలలో పాల్గొన్నవారంతా నరేంద్రమోడీ వ్యతిరేకులని ఆరోపించింది. రైళ్లలో సీట్ల దగ్గర గొడవలు జరగటం మన దేశంలో సర్వసామాన్యమే. అవి దాడులు, హత్యలు, రైళ్ల నుంచి తోసివేయటానికి దారితీస్తే ప్రతి రోజూ ప్రతి సాధారణ ప్రయాణీకుల రైళ్లలో అలాంటి వుదంతాలు అసంఖ్యాకంగా నమోదయ్యేవి. సమస్య తీవ్రతను, దేశంలో పెంచుతున్న ముస్లిం వ్యతిరేకత తీవ్రతను తగ్గించటానికి ‘సీటు దగ్గర గొడవని’ పోలీసులు, ఇతరులు సృష్టించిన కట్టుకధ తప్ప మరొకటి కాదు. ఢిల్లీ, హర్యానా, వుత్తర ప్రదేశ్‌ రాష్ట్రాలతో పాటు రైల్వే పోలీసులు కూడా బిజెపి పాలిత అధికార యంత్రాంగం కింద పని చేసే వారే. ఆ దాడికి పాల్పడ్డ నిందితులెవరో, వారిని అరెస్టు చేశారో లేదో ఇంతవరకు బయట పెట్టలేదు. ఇలాటి వుదంతాలను, గొడ్డు మాంసం, గోవుల పేరుతో చేస్తున్న వున్మాద చర్యలను అడ్డుకోకపోతే వారి దాడులు ఒక్క ముస్లింలు, దళితులకు మాత్రమే పరిమితం గావు. ఇస్లామిక్‌ దేశాలలో అమెరికా, ఇతర సామ్రాజ్యవాదులు సృష్టించి వదిలిన ఇస్లామిక్‌ తాలిబాన్లు అన్ని జీవన రంగాలలోకి, అందరి జీవితాలలో జోక్యం చేసుకొని నియంత్రించేందుకు పూనుకొని యావత్‌ సమాజానికే ముప్పుగా తయారు కావటాన్ని చూస్తున్నాము. మన దేశంలో హిందూత్వ శక్తులు తయారు చేస్తున్న కాషాయతాలిబాన్లు వారి కంటే తీసిపోరు. అందుకే హిట్లర్‌ పాలనా కాలంలో నాజీల చేతులలో జైలు పాలైన ఒక ప్రొటెస్టెంట్‌ మతాధికారి రాసిన కవితను పదే పదే గుర్తుకు తెచ్చుకోవటం అవసరం.

వారు తొలుత కమ్యూనిస్టుల కోసం వచ్చారు

నేను కమ్యూనిస్టును కాదు కనుక మౌనం దాల్చాను

తరువాత వారు కార్మికనేతల కోసం వచ్చారు

నేను కార్మికుడిని కాదు కనుక మిన్నకున్నాను

తరువాత వారు యూదుల కోసం వచ్చారు

నేను యూదును కాదు కనుక పట్టించుకోలేదు

చివరికి వారు నా కోసం వచ్చారు

పట్టించుకొనేందుకు నా వెనుక ఎవరూ మిగల్లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d