• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Novel Coronavirus

చైనాపై తప్పుడు ప్రచారాలు, సమాధానం లేని ప్రశ్నలు !

29 Sunday Mar 2020

Posted by raomk in CHINA, Current Affairs, Health, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Amarican Virus, Donald Trump Virus, falsities, Falsities against China, Novel Coronavirus

Information warfare: Western media spreads false info on virus ...

ఎం కోటేశ్వరరావు
వైరస్‌లు ఒకే విధంగా ఉండవు, ఎప్పటికప్పుడు స్వభావాన్ని, స్వరూపాన్ని కూడా మార్చుకుంటూ ఉంటాయి. అందుకే వాటికి వాక్సిన్లు లేవు. నిజానికి తయారు చేయటం కష్టమేమీ కాదు. వాక్సిన్‌ తయారీ, పరీక్షలు జరిపి నిర్ధారించుకొనే లోగా సదరు వైరస్‌ కనుమరుగు కావటం లేదా కొత్త లక్షణాన్ని సంతరించుకుంటే అది వృధా. తయారు చేసిన వారికి సమయం, పెట్టుబడి దండగ. కొంత మంది చెబుతున్నట్లు కరోనా ఇప్పుడు అమెరికన్‌ వైరస్‌గా మారింది. ఇది నిన్నటి మాట, అమెరికన్లకు అవమానకరం. అది పక్కాగా డోనాల్డ్‌ ట్రంప్‌ వైరస్‌గా రూపాంతరం చెందినట్లు అది అక్కడ వ్యాప్తి చెందుతున్న తీరుతెన్నులు స్పష్టం చేస్తున్నాయి. అయితే దాని లక్షణాలు మాత్రం కరోనావే, ఎలాంటి మార్పులు లేవు.
హాలీవుడ్‌ సినిమాల్లో గొరిల్లాల మాదిరి కరోనా తమ ముంగిటికి వచ్చినప్పటికీ గుర్తించలేని మతి తప్పిన స్ధితిలో కొందరు ఉన్నారు.వారిలో ట్రంప్‌ ఒకడు. మన దేశంలో కొందరు మడి కట్టుకున్న మాదిరే ప్రపంచంలో తమను ఏ వైరస్‌లు అంటుకోవు అనే దురహంకారులు ప్రపంచమంతటా ఉన్నారు. చైనాలో దాన్ని అరికట్టినా అక్కడ వెలువడుతున్న కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన వారిలో తప్ప స్ధానికుల్లో కొత్త కేసులు లేవు. అనేక మంది ఈ వార్తలను నమ్మటం లేదు. నిజానికి వారికి కొత్త మానసిక వ్యాధి పట్టుకుంది. కరోనా సోకిన వారికి తగిన సమయంలో చికిత్స అందిస్తే కోలుకుంటారు. కానీ ఈ మానసిక వ్యాధికి ఒకసారి గురైతే జీవితాంతం వారిని అది వెంటాడుతూనే ఉంటుంది. స్వయం కృతం అని, తన గోతిలో తానే పడిందని, తయారు చేసి ప్రపంచం మీదకు వదలిందని ఇలా చైనా గురించి తప్పుడు ప్రచారాలన్నీ చేసిన వారు, బుర్రకు పని పెట్టకుండా వాటిని గుడ్డిగా నమ్మినవారు చైనాలో వైరస్‌ను అరికట్టటాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇది కరోనా కంటే ప్రమాదకరమైన జబ్బు. దానికన్నా వాక్సిన్‌ కనుగొనగలరేమో గానీ, దీనికి అసాధ్యం.

Arab Media: COVID-19 Is A US Plot To Ruin China's Economy | MEMRI
కరోనా పీడితుల్లో ఇప్పుడు అమెరికా అగ్రస్ధానానికి చేరింది.పెరుగుదల రేటు వారంలో రెట్టింపైంది. దీనికి ట్రంప్‌ నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం, దురహంకారం తప్ప మరొకటి కారణం కాదు. గూఢచార సంస్ధలు, అధికారులు నెత్తీనోరూ బాదుకొని చెప్పినా వినిపించుకోలేదు. చైనా వైరస్‌ను తయారు చేసి వదిలిందని, దాని గురించి ప్రపంచానికి వెల్లడించకుండా దాచి పెట్టి తన గోతిలో తానే పడిందని అనేక మంది నోరు పారవేసుకున్నారు. ఒక పిచ్చి రోగిని పిచ్చి ఉందంటే మరింతగా రెచ్చి పోయేలక్షణం ఉంటుంది కనుక. చైనా పిచ్చి పట్టిన వారు చెప్పేదాన్ని కాసేపు అంగీకరిద్దాం. తామొక రాక్షసితో పోరాడుతున్నామని చైనా అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ జనవరిలోనే ప్రకటించారు. వెంటనే వ్యాధి ఉన్న ప్రాంతంలో జనబందీ(లాక్‌డౌన్‌) పాటించిందని తెలుసు కదా ?చైనాలో ఎప్పుడేమి జరుగుతోందా తమకు పక్కాగా తెలుసునని విర్రవీగే పశ్చిమ దేశాల గూఢచారులు ఏ గుడ్డిగుర్రాలకు పళ్లు తోముతున్నట్లు ? తమ దేశాలను తగుజాగ్రత్తలు తీసుకోవాని ఎందుకు హెచ్చరించలేదు ? వీటికి సమాధానాలు మనకు ఎక్కడా కనపడవు.
తీరా ఇప్పుడు కేసుల్లో చైనాను మించిపోయిన అమెరికాలో దేశమంతటా జనబందీని ఎందుకు అమలు జరపటం లేదు. కొంత మంది చెప్పినట్లు చైనా తన జనాన్ని గోతి నుంచి సురక్షితంగా బయటకు తెచ్చింది. మిగతా దేశాల పాలకులందరూ ఇప్పుడు తమ జనం మొత్తాన్ని గోతుల్లో పడవేశారు. ప్రాణాలు తీస్తున్నారు. అంత్యక్రియలు కూడా సకాలంలో చేసే వారు లేక శవాలు గుట్టలుగా పడుతున్న దుస్ధితిని చూస్తున్నాము. ఈ దుర్మార్గానికి ఎందుకు పాల్పడ్డారని వారిని అడగాల్సిందిపోయి ఇంకా కొందరు చైనా మీద ప్రశ్నలను సంధిస్తున్నారు. వారిలో రెండు రకాలు, ఒకటి కావాలని చేయటం, రెండవది అమాయకంగా వారి ప్రచారాన్ని గుడ్డిగా నమ్మి వాట్సప్‌లో అందరికీ పంచేవారు. బుర్ర పక్కన పెట్టి చెవులప్పగించి వినేవారుంటే చెప్పేవారు ఏదైనా మనకు ఎక్కిస్తారు.కొన్ని ప్రశ్నలకు సమాధానాలు,ఆలోచనకోసం మరికొన్ని ప్రశ్నలను ఇక్కడ చూద్దాం
అమెరికన్ల దగ్గర అంతులేని సంఖ్యలో అణు, ఇతర ఆయుధాలున్నాయి. యుద్ద విమానాలకు, ఓడలకు కొదవలేదు. అలాంటి దేశంలో…..తుడుచుకొనే కాగితపు ఉండలకు కొరత ఎందుకు ఏర్పడింది? శత్రుదేశాల మీద క్షణాల్లో బాంబులు వేసి విధ్వంసం సృష్టించే ఎఫ్‌35 బాంబర్లను క్షణాల్లో తయారు ప్రపంచంలో ఏమూలకైనా సరఫరా చేయగల అమెరికా తన పౌరుల ప్రాణాలను రక్షించే వెంటిలేటర్లను వెంటనే ఎందుకు తయారు చేసుకోలేకపోతోంది? వైద్య సిబ్బందికి అవసరమైన కనీస మాస్కులు, గ్లౌజులు, గౌన్లు ఎందుకు సరఫరా చేయలేకపోతోంది? రోగులను పరీక్షించే కిట్లకు ఎందుకు కటకటలాడుతోంది ? ఇతర దేశాలను అమెరికా ఎందుకు ఆదుకోలేకపోతోంది ?

ఊహాన్‌ నగరం నుంచి జర్మనీలోని డూయిస్‌బర్గ్‌కు వైద్య సరఫరాలతో కూడిన రైలు ఈనెల 28న బయలుదేరింది. జనబందీ ఎత్తివేసిన తరువాత ప్రారంభమైన తొలి సరఫరా ఇది. చైనా నుంచి మరికొన్ని ఆసియా దేశాలకు ఇప్పటికే విమానాల్లో సరఫరా చేశారు ? అమెరికా, ఇతర ఐరోపా ధనిక దేశాలు ఏమి చేస్తున్నట్లు ? ఇవా ఇప్పుడు అడగాల్సిన ప్రశ్నలు ? లేక చైనా గురించా ? ఇప్పటికీ చైనా గురించి అడుగుతున్నారంటే వారి కడుపులో దుష్ట బుద్ధి ఇంకా ఉన్నట్లే !
ఊహాన్‌, పరిసరాల్లో తప్ప చైనాలోని మిగతా ప్రాంతాల్లో ఎందుకు వ్యాప్తి చెందలేదు అని చైనాను ప్రశ్నిస్తున్నవారు దానికి సమాధానం తెలుసుకోవటంతో పాటు అమెరికా, ఐరోపా, మన దేశంతో సహా అనేక చోట్ల తొలి కేసులు బయట పడగానే వ్యాపించకుండా ఎందుకు కట్టడి చేయలేదు అని అడగాలా లేదా ? ఇక కరోనా గురించి చైనా చెప్పేదానిని నమ్మరు, అలాంటి వారు మిగతా ప్రాంతాలకు విస్తరించకుండా కట్టడి చేశారంటే నమ్ముతారనే హామీ ఏముంది? సంతృప్తి చెందుతారా ? వారు నమ్మాలంటే ఏ అమెరికా వాడో మరొకరో చెప్పాలి. చైనా చెప్పిందాన్ని నమ్మకుండా తమ జనం ప్రాణాల మీదకు తెచ్చిన వారు చైనా గురించి ఏమి చెబుతారు ? వారేమి చెప్పినా చెప్పకపోయినా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా కొన్ని విషయాలు చెప్పుకోవాలి. 2002-03లో కరోనా జాతికి చెందిన సారస్‌ బాధిత దేశం చైనా. ఆ అనుభవం ఉంది కనుకకే ఊహాన్‌లో బయటపడిన వెంటనే అక్కడి నుంచి మిగిలిన ప్రాంతాలకు రాకపోకలను బంద్‌చేసింది, తదుపరి చర్యగా హుబెయి, పరిసర రాష్ట్రాలలో దాదాపు పది కోట్ల మంది జనాన్ని జనవరి 23 నుంచి దాదాపు రెండు నెలలపాటు ఇండ్లకే పరిమితం చేసింది(లాక్‌డౌన్‌). చైనా ఇతర ప్రాంతాలలో కూడా కేసులు ఉన్నాయి తప్ప చెదురుమదురు, వాటిని కూడా సకాలంలో ఎదుర్కొన్నారు.

First train with medical supplies for Europe leaves Wuhan as China eases Covid-19 lockdown

చైనా వారు ప్రపంచానికి అంటించారన్నది ఒక తప్పుడు ప్రచారం. ఊహాన్‌ నుంచి షాంఘై 839కిలోమీటర్లు, ఊహాన్‌ నుంచి బీజింగ్‌ 1152 కిలోమీటర్లే ఉన్నా వాటికి సోకని కరోనా పదిహేను వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికాకు ఎలా పాకిందని తెలివితేటలు ఎక్కువగా ఉన్న కొందరు ప్రశ్నిస్తున్నారు. అమెరికాలో ఇది రాస్తున్న సమయానికి ఉన్న 1,23,750 కేసులలో ఒక్క న్యూయార్క్‌ రాష్ట్రంలో 53,455 ఉన్నాయి, దాని పక్కనే పెద్ద సరిహద్దు ఉన్న పెన్సిల్వేనియాలో 2,751 మాత్రమే ఉండగా పక్కనే మరో చిన్న సరిహద్దు ఉన్న న్యూజెర్సీలో 11,124 కేసులు ఎందుకు నమోదయ్యాయో చైనా గురించి అడిగేవారు చెప్పగలరా ?
చైనాలో తొలిసారి వైరస్‌ గురించి చెప్పిన ఒక వైద్యుడు, దాన్ని బయట పెట్టిన ఒక జర్నలిస్టు నోరును అక్కడి ప్రభుత్వం మూయించిందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అది నిజం కావచ్చు కాకపోవచ్చు. ఒక కొత్త జబ్బు నిర్ధారణ కాకుండా ఒక వైద్యుడు లేదా జర్నలిస్టు ఇలాంటి విషయాలను బహిర్గతం చేయటాన్ని ఏ ప్రభుత్వమైనా అంగీకరిస్తుందా ? నిర్ధారణ అయిన తరువాత చైనా తగుజాగ్రత్తలు తీసుకుంది. వైరస్‌ తీవ్రత గురించి అమెరికా అధినేత ట్రంప్‌కు వివరించి హెచ్చరించామని, అయినా పట్టించుకోలేదని గూఢచారి వర్గాలు చెప్పిన అంశాన్ని పత్రికలు బయటపెట్టాయి. మరి దీనికి జవాబు ఏమిటి ? ఇక సమాచారాన్ని ఇతర దేశాలతో పంచుకోలేదని, ప్రపంచ ఆరోగ్య సంస్ధ అధికారిని లోబరుచుకున్నారని, ప్రపంచ ఆరోగ్య సంస్ధ అబద్దాలాడిందని ఆధారాలు లేని ప్రశ్నలకు సమాధానాలు చెప్పమంటున్నారు. అన్నీ అధికారికంగా ఆయా వెబ్‌సైట్లలో ఉన్నాయి. నమ్మకం లేని వారు తీరికగా మంచి కళ్లద్దాలు పెట్టుకొని చూడవచ్చు.
వైరస్‌ సోకిన సమయంలోనే చైనా నూతన సంవత్సరాది ఉత్సవాలు వచ్చాయి. ఆ సమయంలో ప్రతి ఏడాది కోట్ల మంది చైనీయులు సెలవుల మీద స్వదేశంలో వివిధ ప్రాంతాలకు, విదేశాలకు ప్రయాణిస్తారు. ఈ ఏడాది ప్రభుత్వం ఆ ఉత్సవాలను రద్దు చేసింది, ఊహాన్‌ నుంచి స్వదేశీ, విదేశీ విమానాలను రద్దు చేయటం బహిరంగ రహస్యం. ఊహాన్‌ నుంచి 50లక్షల మందిని ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు ఎందుకు పంపారన్నది మరొక ప్రశ్న. ఊహాన్‌ జనాభా కోటిచిల్లర. అందులో సగం మందిని ఆకస్మికంగా విదేశాలకు పంపుతూ ఉంటే ఆ దేశాలు ఎందుకు వీసాలు ఇచ్చినట్లు ? వైరస్‌ సోకిన తరువాత ఊహాన్‌ నుంచి ఏదేశం ఎంత మందికి వీసాలు ఇచ్చిందో, ఎన్ని విమానాల్లో వారు ప్రయాణించారో ఈ ప్రశ్న వేసిన వారే వివరాలు చెప్పాలి. ఇక సంక్షోభ సమయంలో భారత్‌ ప్రపంచ నేతగా ముందుకు వచ్చింది అని ఒక ముక్తాయింపు. ఇది కాషాయ దళాల ప్రచారం తప్ప వాస్తవం కాదు. వైరస్‌ నుంచి తాను తేరుకొని ఇతర దేశాలకు అవసరమైన సాయం చేస్తున్నది చైనా తప్ప మరొక దేశం కాదు.తమ జబ్బలను తామే చరుచుకొనే వారిని కానివ్వండి అనటం తప్ప ఆగమని చెప్పలేం కదా !
చైనా తన శత్రు దేశాలకు మాత్రమే వైరస్‌ను ఎగుమతి చేసింది, మిత్ర దేశాలను మినహాయించింది అన్నది మరొక ప్రచారం. జపాన్‌ అమెరికా మిత్రదేశం, చైనాకు శత్రుదేశం, దాన్ని ఆక్రమించుకొని నానా బాధలు పెట్టటమే కాదు, రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు చైనా నగరాలపై ప్లేగు బాంబులను ప్రయోగించి లక్షల మంది జనాన్ని బలిగొన్న చరిత్ర జపాన్‌ది. ఊహాన్‌ జపాన్‌ మధ్య దూరం కేవలం 2,300కిలోమీటర్లే, మరి జపాన్‌లో వైరస్‌ను ఎందుకు వ్యాప్తి చేయలేదో ఎవరైనా చెబుతారా ? చైనా మిత్ర దేశం ఇరాన్‌, రెండుదేశాల మధ్య దూరం 5,600 కిలోమీటర్లు. ఇరాన్‌ ఇప్పుడు కరోనా బాధిత దేశాల్లో ఒకటి, మరి మిత్ర దేశం అయినపుడు ఇరాన్‌కు ఎందుకు పంపినట్లు ?
తప్పుడు సమాచారాన్ని అమ్ముకొని డబ్బు సంపాదించే అమెరికన్‌ అలెక్స్‌ జోన్స్‌ తయారు చేయించిన ”ఇన్ఫోవార్స్‌” అనే ఒక యాప్‌ను తాజాగా గూగుల్‌ నిషేధించింది. ఇంతకాలం దాని సమాచారాన్ని తలకెక్కించుకొని ఇతరుల మెదళ్లు తిన్నవారి గురించి జాలిపటం తప్ప మరేమీ చేయలేము. గూగుల్‌ కూడా తప్పుడు సమాచారాన్ని సొమ్ముచేసుకోవటంలో ఏమాత్రం తీసిపోలేదు. 2018లోనే యాపిల్‌ కంపెనీ శాశ్వతంగా నిషేధించినప్పటికీ ఇంతవరకు గూగుల్‌ కొనసాగించిందంటే డబ్బు తప్ప దానికి మరొక కారణం లేదు.

How the coronavirus is testing social media's efforts to stem the ...

అలెక్స్‌జోన్స్‌ ప్రతిదానిని కుట్రకోణంలో వండివారుస్తాడు కనుక కుట్ర సిద్ధాంతవేత్త అని పేరు వచ్చింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు సామాజిక దూరం పాటించాలని, ఒక దగ్గర ఉండిపోవాలని, స్వీయదిగ్బంధనం పాటించాలనటం వెనుక కుట్ర ఉందని అతగాడు తన యాప్‌ ద్వారా ప్రచారంలో పెట్టాడు. బహుశా ట్రంప్‌ వంటి వారందరూ నిర్లక్ష్యం చేయటానికి ఇలాంటి వాటిని ప్రమాణంగా తీసుకోవటం కావచ్చు. కరోనా మీద తప్పుడు వార్తల ప్రచారాన్ని అడ్డుకోవాలన్న గూగుల్‌ నిర్ణయానికి ఈ యాప్‌ను కొనసాగించటం పొసగదు కనుక ఆ పని చేసింది. ఈ యాప్‌ద్వారా వైరస్‌ నివారణ ఔషధాలంటూ ఆ ప్రబుద్ధుడు ప్రచారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. అలాంటి ఉత్పత్తుల అమ్మకాన్ని నిలిపివేయాలని గతవారంలో న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ లెటియా జేమ్స్‌ ఉత్తరువు జారీ చేశారు. అవి ప్రజారోగ్యానికి భంగకరమని పేర్కొన్నారు. కనుక ఇలాంటి ప్రబుద్దుడి నోరు ఒకదాన్ని మూయించినా లక్షల కొలదీ వాగుతూనే ఉన్నాయి. అందుకే వినేవాడుంటే చెప్పేవాడు చెత్తంతా నింపుతాడు ! కాస్త వివేచనతో ఆలోచించినపుడు వాస్తవాలేమిటో తెలుస్తాయి !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనా వైరస్‌ : కాసుల లాభనష్టాల బేరీజులో కార్పొరేట్‌ లోకం !

09 Sunday Feb 2020

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Health, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Coronavirus, Coronavirus and pharmaceutical companies, Coronavirus outbreak, Novel Coronavirus, Wuhan

Image result for coronavirus corporates making profit and loss impact assessment

ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ విసిరిన సవాలును ఎదుర్కొనేందుకు చైనా తన సర్వశక్తులను వడ్డుతోంది.కరోనా లేదా మరొక వైరస్‌ దేనికీ జాతి, మతం, రంగు, ప్రాంతం, ఖండం అనే విచక్షణ ఉండదు, సరిహద్దులను అసలే ఖాతరు చేయదని గతంలో వ్యాప్తి చెందిన అనేక వైరస్‌లు నిరూపించాయి. అందువలన అలాంటి వాటిని నిరోధించేందుకు యావత్‌ దేశాలు కృషి చేయాల్సి వుంది. కానీ అమెరికా వంటి కొన్ని రాజ్యాలు సహకరించకపోగా తప్పుడు ప్రచారాన్ని వ్యాపింప చేస్తున్నాయి. మరోవైపు వైరస్‌ వ్యాప్తివలన చైనా, ప్రపంచానికి కలిగే ఆర్ధిక నష్టం గురించి లెక్కలు వేసుకుంటున్నాయి. వాటి గురించి కూడా అతిశయోక్తులు, అర్ధ సత్యాలను వ్యాప్తి చేస్తున్నారు. మరికొందరు ప్రబుద్దులు చైనా కమ్యూనిస్టు పార్టీ, అక్కడి సోషలిస్టు వ్యవస్ధ మీద ఉన్న కసిని కరోనా పేరుతో తీర్చుకొని మానసిక సంతృప్తిని పొందుతున్నారు. ఒకవైపు వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుంటే మరోవైపు దాన్నుంచి లాభాలను ఎలా పిండుకోవాలా అని ఔషధ దిగ్గజ సంస్ధలు చూస్తున్నాయి.
ఆర్ధిక నష్టం గురించి ఎవరూ ఇదమిద్దంగా అంచనా వేయలేదు. వైరస్‌ ప్రభావం ఎంతకాలం ఉంటుంది, దాని తీవ్రత ఎప్పుడు తగ్గుతుంది అనేది కూడా ఇప్పటికిప్పుడే చెప్పలేరు. కరోనాతో నిమిత్తం లేకుండానే సోవియట్‌ యూనియన్‌ మాదిరి చైనా సోషలిస్టు వ్యవస్ధ కూడా కుప్పకూలిపోతుందని అనేక మంది కలలు కన్నారు, ఆకాంక్షించారు. ముహార్తాలు కూడా పెట్టారు. అవి నిజం గాకపోవటంతో నీరసపడిపోయారు. ఇప్పుడు కరోనా కూడా అలాంటి వారిని నీరసపరచటం ఖాయం.
ప్రపంచ కార్పొరేట్ల పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో ‘ ఆసియా నిజమైన వ్యాధిగ్రస్ధ చైనా ‘ శీర్షికతో వాల్టర్‌ రసెల్‌ మీడ్‌ అనే ఒక కాలేజీ ప్రొఫెసర్‌ తనలో ఉన్న విద్వేషాన్ని వెళ్లగక్కాడు. చైనీయులు మురికి, రోగిష్టి మనుషులనే గత కాలపు పశ్చిమ దేశాల దురహంకారం ఇంకా కొనసాగుతోందనేందుకు ఇది ఒక సూచిక. దీని మీద తీవ్రమైన ఆగ్రహం వెల్లడైంది, చైనా అధికారికంగా నిరసన కూడా తెలిపింది. వాటి మీద వ్యాఖ్యానించేందుకు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ నిరాకరించింది. శ్వేతజాతీయులకు వచ్చే రోగాల కంటే చైనీయులు, ఇతర ఆసియావాసులకు వచ్చే జబ్బులు ప్రమాదకరమైన వంటూ పందొమ్మిదవ శతాబ్దంలోనే పశ్చిమ దేశాల వారు జాత్యంహకారం వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కరోనాను కూడా చైనా జాతికి అంటకట్టే ప్రయత్నం జరుగుతోంది.
చైనా నిపుణుల అంచనా ప్రకారం ఫిబ్రవరి 15వరకు వైరస్‌ వ్యాప్తి చెందవచ్చు, తరువాత తగ్గుముఖం పడుతుంది. మేనెల మధ్యనాటికి పూర్తిగా అదుపులోకి వస్తుంది.ఈ లోగా చైనా ఆర్ధిక వ్యవస్ధకు జరిగే పరిమిత హాని తరువాత కాలంలో పూడ్చుకోవచ్చు. ఎంత ప్రభావం పడినా చైనా జిడిపి 5.6-5.8శాతం మధ్య వుండవచ్చని అంచనా వేస్తున్నారు.

Image result for coronavirus, corporates cartoons
కరోనా వైరస్‌ ప్రస్తుతం సోకిన ప్రాంత విస్తీర్ణం ఎంత? ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 70శాతం ఉహాన్‌ నగరం ఉన్న హుబెరు రాష్ట్రంలోనే ఉన్నాయి. మరణించిన వారిలో 97శాతం మంది ఈ రాష్ట్రానికి చెందిన వారే. తరువాత తూర్పు రాష్ట్రమైన ఝియాంగ్‌లో వెయ్యిలోపు కేసులు నమోదయ్యాయి. వలస వచ్చిన వారు పెద్ద సంఖ్యలో ఉండే బీజింగ్‌, షాంఘై నగరాలలో ఒక్కొక్కరు మాత్రమే మరణించారు. చైనా జిడిపి తొలి మూడు నెలల్లో 5.2శాతం ఉంటుందని, తరువాత ఏడాది మొత్తం 5.8శాతం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కనిష్టంగా తొలి త్రైమాసికంలో 4.8శాతం, మొత్తం ఏడాదిలో 5.5శాతం ఉంటుందని మరొక అంచనా.చైనాలో అందరూ చెబుతున్నంత అభివృద్ధి లేదని, అంకెల గారడీ చేస్తారని చెప్పే నోళ్లు దీని గురించి ఏమంటాయో తెలియదు.
ఉహాన్‌ పరిసర ప్రాంతాలలో ఆటో, టెలికమ్యూనికేషన్స్‌,ఎలక్ట్రానిక్స్‌, బయోమెడిసిన్‌ సంబంధమైనవి పెద్ద పరిశ్రమలు.హుబెరు రాష్ట్రం, ఉహాన్‌ నగర ప్రాధాన్యత ఏమంటే దేశం మధ్యలో ఉండటంతో రవాణా, వాణిజ్యం, పెట్టుబడులు, టూరిజం వంటి సేవారంగం కీలకమైన అంశాలు. ఒకసారి వ్యాధి వ్యాప్తి అదుపులోకి వచ్చిన తరువాత అవన్నీ సాధారణ స్ధితికి చేరుకుంటాయి.
2003లో సారస్‌ వ్యాప్తి సమయంలో ప్రపంచ వాణిజ్యంలో చైనా వాటా కేవలం ఐదుశాతమే, ఇప్పుడు 16శాతానికి పెరిగినందున ప్రభావం ఎక్కువగా ఉంటుందని కొందరు చెబుతున్నారు. ఇటీవలి సంవత్సరాలలో చైనాలో వచ్చిన ప్రధాన మార్పుల్లో స్ధానిక వినియోగం పెరగటం ఒకటి. అందువలన మార్కెట్‌ చోదిత పెట్టుబడులు వెనక్కు పోవటం సాధ్యం కాదన్నది ఒక అభిప్రాయం. చైనాలో కార్మికుల వేతనాలు పెరగటం తదితర ఉత్పాదక ఖర్చుల పెరుగుదల కారణంగా లాభాలు తగ్గి ప్రస్తుతం విదేశీ పెట్టుబడులలో 70శాతం ఉత్పాదక రంగం నుంచి సేవారంగానికి మరలాయి. వ్యాధి తగ్గుముఖం పట్టిన తరువాత సేవారంగం తిరిగి పుంజుకుంటుంది. అందువలన తాము ఎలాంటి ఆందోళనకు గురికావటం లేదని చైనీయులు చెబుతున్నారు. ఇప్పటికే గట్టిగా తట్టుకొని నిలిచిన తమ సమాజాన్ని వ్యాధి గ్రస్త దేశమని నోరు పారవేసుకుంటున్నవారు త్వరలో వైరస్‌ను ఎలా ఓడిస్తామో కూడా చూస్తారనే విశ్వాసాన్ని వెల్లడిస్తున్నారు.
చైనా వ్యాధి నిరోధకానికి ప్రాధాన్యత ఇస్తున్నది. గతంలో స్పానిష్‌ ఫ్లూ వంటి ప్రమాదకర వైరస్‌ వ్యాప్తి సమయంలో అమెరికాతో సహా ఏ దేశంలోనూ ఇలాంటి చర్యలు తీసుకోలేదు. హుబెరు రాష్ట్రం, పరిసర ప్రాంతాలలో దాదాపు పది కోట్ల మంది జనాన్ని ఇండ్లకే పరిమితం చేసి వ్యాధి వ్యాపించకుండా చూస్తున్నది. వారికి అవసరమైన ఇతర సాయం చేస్తున్నది. ఇంత పెద్ద సంఖ్యలో జనం ఇండ్లకే పరిమితం అయితే అది ఆర్దిక వ్యవస్ధ మీద, ప్రభుత్వ ఖజానా మీద ప్రభావం చూపకుండా ఎలా ఉంటుంది. చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా, విడివస్తువులను అందచేసే గొలుసులో ఒక ప్రధాన లంకెగా ఉన్నందున ఆ గొలుసులో ఉన్న ఇతర దేశాలు కూడా ప్రతికూలంగా ప్రభావితం కాకుండా ఎలా ఉంటాయి. కనుకనే కార్ల నుంచి వీడియో గేమ్‌ల వరకు ప్రపంచ సరఫరా గొలుసుకు అంతరాయం కలిగితే తీవ్ర నష్టం జరగనుందని అనేక దేశాలు భయపడుతున్నాయి. అయితే జరిగే నష్టం, పడే ప్రభావం ఎంత ఉంటుందో ఎవరూ ఇదమిద్దంగా చెప్పలేకపోతున్నారు. లండన్‌ కేంద్రంగా పని చేసే కాపిటల్‌ ఎకనమిక్స్‌ అనే సంస్ధ ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో కరోనా వైరస్‌ ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు 280బిలియన్‌ డాలర్ల మేర నష్టం కలిగించవచ్చని అంచనా వేసింది.
షాంఘై, హాంకాంగ్‌లోని వినోద కేంద్రాలను గత వారం రోజులుగా మూసివేసిన కారణంగా రెండవ త్రైమాసికంలో తమ ఆదాయం 17.5కోట్ల డాలర్లు తగ్గిపోవచ్చని డిస్నీ ఆర్ధిక అధికారి చెప్పారు.చైనా నూతన సంవత్సరాది సందర్భంగా విడుదల చేయదలచిన ఐదు చిత్రాలను నిలిపివేసినట్లు కెనడా కంపెనీ ఐమాక్స్‌ పేర్కొన్నది. చైనాలోని మకావో దీవిలో 41కాసినోలను మూసివేశారు. వీటిలో ఎక్కువ భాగం అమెరికా జూదశాలలే. ప్రతి రోజూ తమకు 24 నుంచి 26 మిలియన్‌ డాలర్ల మేరకు నష్టమని వయన్‌ రిసార్ట్స్‌ తెలిపింది.
ఆపిల్‌,క్వాల్‌కామ్‌ కంపెనీలు తమ నష్టాలను అంచనా వేస్తున్నాయి. హుండరు వంటి కార్ల కంపెనీలు చైనా నుంచి విడిభాగాలు ఆలస్యమయ్యే కారణంగా దక్షిణ కొరియాలో ఉత్పత్తి కేంద్రాలను తాత్కాలిక మూసివేస్తున్నట్లు తెలపింది. చైనాలో పరిస్ధితులు మెరుగుపడుతున్నట్లు చైనా ప్రభుత్వం చెప్పగానే వారం రోజులు తిరిగి ఉత్పత్తిని ప్రారంభిస్తామని డైల్మర్‌, ఓక్స్‌వాగన్‌ ప్రకటించాయి. విడిభాగాల సరఫరా అంతరాయం కారణంగా ఐరోపాలోని తమ ఉత్పత్తి కేంద్రాలకు అంతరాయం ఉంటుందని ఫియట్‌ ఛిస్లర్‌ పేర్కొన్నది.
గత కొద్ది వారాలుగా అనేక విమాన సంస్ధలు చైనా సర్వీసులను రద్దు చేశాయి, వాటి నష్టాలను అంచనా వేస్తున్నారు. ఎయిర్‌ చైనా ఎక్కువగా ఆదాయాన్ని కోల్పోనుంది.స్టార్‌బక్స్‌ మెక్‌డోనాల్డ్‌ వంటి సంస్ధలు అనేక దుకాణాలను తాత్కాలికంగా మూసివేశాయి, మొత్తంగా చూస్తే తమ లాభాల మీద ప్రభావం పెద్దగా పడదని అంటున్నాయి.
వైరస్‌ ప్రభావం లేని ప్రాంతాలలో కార్మికుల కొరత కారణంగా వేతనాలు పెద్ద ఎత్తున పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. నూతన సంవత్సరాది సెలవులు, ఇదే సమయంలో వ్యాధి నిరోధక చర్యల్లో భాగంగా ఇండ్లకు పరిమితమై విధుల్లోకి రాని కార్మికులకు పొడిగించిన సెలవు రోజులకు సైతం వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చైనా నుంచి పర్యాటకులను అనుమతించరాదని థారులాండ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన విహారయాత్రల రంగానికి 10కోట్ల డాలర్ల మేర నష్టమని అంచనా వేశారు.
వైరస్‌ వార్తలు వెలువడిన తరువాత న్యూయార్క్‌, లండన్‌లోని చమురు మార్కెట్‌లో ధరలు 15శాతం పడిపోయాయి. చమురు ఆధారిత ఆర్ధిక వ్యవస్ధలున్న రష్యా, మధ్యప్రాచ్యం, పశ్చిమాసియా, గల్ఫ్‌ , ఇతర దేశాలకు, చివరికి అమెరికాలోని షేల్‌ చమురు కంపెనీలకు కూడా ఆ మేరకు నష్టం ఉండవచ్చు. ఇదే సమయంలో దిగుమతులపై ఆధారపడిన చైనాకు దిగుమతి బిల్లుతో పాటు అంతర్గతంగా చమురు డిమాండ్‌ తగ్గిపోయి అక్కడి ఆర్ధిక వ్యవస్ధకు ఆమేరకు లబ్ది కూడా చేకూరనుంది.
అమెరికా-చైనా మధ్య కుదిరిన సర్దుబాటు అవగాహన మేరకు అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌ పెరిగే అవకాశాలకు ఇప్పుడు పరిమితంగా అయినా గండి పడింది. వైరస్‌ కారణంగా చైనాలో పరిశ్రమలు మూతపడితే ఆ మేరకు తమకు ఉపాధి, ఇతరత్రా మేలు జరుగుతుందని అమెరికా వాణిజ్యశాఖ మంత్రి విల్బర్‌ రోస్‌ సంతోషం వ్యక్తం చేశారు, అయితే మొత్తంగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధకూ ప్రతికూలమే అని ఆర్ధికవేత్తలు చెబుతున్నారు. చైనా యువాన్‌ విలువ పడిపోతే అది అమెరికాకు దెబ్బ.

Image result for coronavirus political cartoons
చైనాతో పెద్దవ్యాపార భాగస్వామిగా ఉన్న మనదేశం మీద పడే ప్రభావం గురించి కూడా కార్పొరేట్‌ సంస్ధలు మదింపు వేస్తున్నాయి. మన దేశం గతేడాది మొత్తం దిగుమతుల్లో 14శాతం చైనా నుంచి తీసుకోగా ఎగుమతుల్లో మన వస్తువులు ఐదుశాతం చైనా వెళ్లాయి. ఆకస్మిక పరిణామంగా వైరస్‌ వ్యాప్తి వలన వెంటనే దిగుమతుల ప్రత్నామ్నాయం చూసుకోవటం అంత తేలిక కాదు, అదే సమయంలో పరిమితమే అయినా అసలే ఇబ్బందుల్లో ఉన్న మన ఆర్ధిక పరిస్దితి మీద ఎగుమతులు తగ్గితే ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా. ఎగుమతుల్లో ఎలక్ట్రానిక్స్‌మీద ప్రభావం ఎక్కువ. చైనా నుంచి పర్యాటకులు ఇటీవలి కాలంలో బాగా పెరిగినందున ఆ రంగం మీద ప్రభావం తీవ్రంగా పడవచ్చు, విమానరంగం కూడా ప్రభావం కానుంది. చైనాలో వ్యాధి వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా పెద్ద సంఖ్యలో సినిమా ధియేటర్లను మూసివేసినందున బాలీవుడ్‌ కూడా ఏంతో కొంత నష్టపోనుంది. అసలే కార్లు, ఇతర మోటారు వాహనాల అమ్మకాలు తగ్గాయి, ఇప్పుడు చైనా నుంచి విడిభాగాలు నిలిచిపోతే నష్టం ఇంకా పెరుగుతుందనే అందోళన ఉంది.
కరోనా వైరస్‌ గురించి ఒకవైపు అతిశయోక్తులు, చైనా వ్యతిరేకతను ప్రచారం చేస్తున్న పశ్చిమ దేశాలు మరోవైపు దాన్నుంచి లాభాలు పిండుకొనేందుకు పూనుకున్నాయి. వ్యాధుల నివారణ, చికిత్సకు వాక్సిన్‌లు, ఔషధాల తయారీ అవసరమే అయితే అయితే చరిత్రను చూసినపుడు జన కల్యాణం కోసం గాక కాసుల కోసమే కార్పొరేట్‌ కంపెనీలు ప్రయత్నించాయి. కరోనా వైరస్‌ వాక్సిన్‌ తయారీకి కొన్ని సంవత్సరాలు పడుతుందని, అందుకోసం వంద కోట్ల డాలర్లు ఖర్చవుతుందని పోలాండ్‌ నిపుణుడు ఒకరు చెప్పగా మరొక అంచనా 150 కోట్ల డాలర్ల వరకు ఉంది. అది ఎంతో ఖరీదైనదిగా ఉన్నప్పటికీ, తక్షణమే అది ఉపయోగంలోకి రాకపోయినా భవిష్యత్‌లో నష్టాల నివారణకు తోడ్పడుతుంది. అయితే ఇలాంటి వైరస్‌ల నిరోధానికి వాక్సిన్‌ల తయారీ యత్నాలు గతంలో పెద్దగా ముందుకు సాగలేదు. 2003లో వచ్చిన సారస్‌, 2012లో తలెత్తిన మెర్స్‌కే ఇంతవరకు తయారు కాలేదు. ఎబోలా వాక్సిన్‌ పరిస్దితీ అంతే. గతేడాది ఆమోదం పొందిన వాక్సిన్‌ మీద ప్రయోగాలు చేసేందుకు కొన్ని సంవత్సరాలు పడుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనా వైరస్‌ కట్టడిలో చైనా-కట్ట్టు కథల వ్యాప్తిలో మీడియా !

05 Wednesday Feb 2020

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, Science, USA

≈ Leave a comment

Tags

Coronavirus outbreak, Novel Coronavirus, Wuhan, wuhan hospital construction

Image result for while china trying to control the coronavirus,media spreading misinformation"

ఎం కోటేశ్వరరావు
తప్పుడు సమాచారం రెండో అంటు వ్యాధి అనే శీర్షికతో అమెరికా పత్రిక లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌ తాజాగా ఒక వ్యాఖ్యానాన్ని ప్రచురించింది. ఇది చైనా నుంచి అనేక దేశాలకు వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ గురించి అని వేరే చెప్పనవసరం లేదు. భయంకరమైన అంటు వ్యాధులు వ్యాపించటం పెద్ద సంఖ్యలో జనం, ఇతర జీవజాలం మరణించటం మనకు చరిత్ర తెలియనప్పటి నుంచీ వుంది. గతంలో వ్యాధుల గురించి తెలియనపుడు, నివారణ చర్యలను వెంటనే ఒకరికి ఒకరు తెలియచేసుకొనే సాధనాలు లేనపుడు అనేక వైరస్‌లు, బాక్టీరియాలు పెద్ద సంఖ్యలో నష్టం కలిగించాయి. క్షణాల్లో సమాచారం ప్రపంచానికంతటికీ తెలుస్తున్న ఈ రోజుల్లో జనానికి అవసరమైన దాని బదులు భయాన్ని పెంచేది, తప్పుడు సమాచారం ముందుగా జనానికి చేరుతోంది. దాన్ని అంటు వ్యాధితో పోల్చటాన్ని బట్టి ఎంత ప్రమాదకారిగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సామాజిక మాధ్యమం ఈ విషయంలో అగ్రస్ధానంలో ఉంటే ఎక్కడ వెనుకబడిపోతామో అన్నట్లు సాంప్రదాయక మాధ్యమం కూడా పోటీపడుతోంది. ఈ అంటు వ్యాధికి చికిత్స లేదు. వ్యాధి ఇతరులకు వ్యాపించకుండా తీసుకున్న చర్యల్లో భాగంగా ఊహాన్‌, ఇతర ప్రాంతాల పౌరులను ఇండ్ల నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం కోరింది. చివరికి దీన్ని తప్పు పడుతూ, వక్రీకరిస్తూ పశ్చిమదేశాల మీడియా కథనాలు రాస్తోంది. తాజా సమాచారం ప్రకారం వ్యాధి సోకిన దగ్గర నుంచి అంటే గత పదిహేను రోజుల్లో మరణించిన వారి సంఖ్య 490కి చేరింది. వారిని దహనం చేయటంతో కోటి మందికి పైగా జనాభా ఉన్న నగరమంతటా దట్టంగా పొగలు వ్యాపించాయని అతిశయోక్తులు రాశారు.
ఒక వైపు వ్యాధి లక్షణాలు నిర్దారణ కాగానే నివారణకు చైనా, ఇతర దేశాలు తీసుకున్న చర్యలను పొగడకపోయినా జనానికి తెలియ చెప్పటం కనీస ధర్మం. దానికి బదులు వ్యాధి గురించి తప్పుడు ప్రచారం చేసే వారు పొందే లబ్ది ఏమిటో తెలియదు. చైనాలో కోట్లాది మందికి వ్యాధి సోకిందని వీధుల్లో వేలాది మంది కుప్పకూలిపోతున్నారని, ఆరున్నర కోట్ల మంది వరకు మరణించే అవకాశం ఉందని బిల్‌ గేట్స్‌ ఫౌండేషన్‌ అంచనా వేస్తోందని, మీ చేతిలో కనుక ఒరెగానో ఆయిల్‌ గనుక ఉంటే వారిలో మీరు ఒకరు కాకుండా ఉంటారని సామాజిక మాధ్యమంలో ప్రచారం జరుగుతున్నట్లు లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌ పేర్కొన్నది. మన దేశంలో కూడా అదే స్ధాయిలో ప్రచారం ఉంది, భయాన్ని సొమ్ము చేసుకొనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. గతంలో స్వైన్‌ ఫ్లూ వచ్చినపుడు ఐదు రూపాయల విలువ చేసే మాస్క్‌లను ఎంతకు అమ్మారో,మనం కొన్నామో గుర్తుకు తెచ్చుకోవటం అవసరం. చైనాలో కరోనా వైరస్‌ను ఎక్కువ భాగం అదుపు చేశారని, అయినా వ్యాపిస్తున్నదని, చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్ధ నిపుణులుతీసుకున్న చర్యల కారణంగా వ్యాప్తి వేగం తగ్గిందని లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌ పేర్కొన్నది.

Image result for wuhan hospital construction"
ఒక తీవ్రమైన అంటు వ్యాధి వ్యాప్తిని అరికట్టటానికి చైనాలో మాదిరి రోజూ ఇరవైనాలుగు గంటల పాటు ఎనిమిది రోజుల్లో వెయ్యికిపైగా పడకలున్న ఆసుపత్రి నిర్మాణం ఏ దేశంలో అయినా జరిగిందా ? జన చైనా ప్రజాసైన్య నిర్వహణలో సోమవారం నుంచి అక్కడ రోగులను చేర్చుకొని చికిత్స చేస్తున్నారు. 33,900 చదరపు మీటర్ల ప్రాంతంలో ఏడువందల మంది ఇంజనీర్ల స్దాయి నిపుణులు, నాలుగువేల మంది కార్మికులు ఈ మహత్తర నిర్మాణంలో పాలు పంచుకున్నారు.ఆసుపత్రి ప్లాన్‌ జనవరి 24కు సిద్ధం అయింది, అదే రోజు వందకు పైగా నేలను తవ్వే, చదును చేసే యంత్రాలను దించారు. 25వ తేదీన నిర్మాణాన్ని ప్రారంభించారు. ముందుగానే సిద్దం చేసిన పెట్టెల వంటి మూడు వందల గదులను 29న ఏర్పాటు చేశారు. శనివారం నాటికి వైద్య పరికరాలను అమర్చారు. ఆదివారం నాటికి ఆసుపత్రి పూర్తి కావటాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయగా ఎనిమిది కోట్ల మంది ఇంటర్నెట్‌లో వీక్షించారు. టీవీల్లో సరేసరి. గతంలో సారస్‌ వైరస్‌ వ్యాప్తి సమయంలో బీజింగ్‌ శివార్లలో ఏడు రోజుల్లోనే ఆసుపత్రి నిర్మాణం చేశారు. ఆ అనుభవాన్ని ఇప్పుడు మరింతగా మెరుగుపరిచి ఉపయోగించారు. కరోనా వ్యాపించిన ఉహాన్‌, ఇతర నగరాల్లో కూడా ఇలాంటి త్వరితగతి ఆసుపత్రులను ఇంకా నిర్మిస్తున్నారు.
గతంలో చైనా, ఇరుగు పొరుగుదేశాలలో సారస్‌ వ్యాప్తి చెందినపుడు వ్యాధి సోకిన వారిలో పదిశాతం మంది మరణించగా ప్రస్తుతం కరోనా విషయంలో అది 2.09 మాత్రమేనని అందువలన అంతగా భయపడాల్సిన అవసరం లేదని అనేక మంది చెబుతున్నారు. మరణించిన వారిలో ఎక్కువ మంది వృద్దులు, ఇతర వ్యాధులు ఉన్నవారేనని, అంత మాత్రాన వైరస్‌ తీవ్రతను తగ్గించినట్లుగా భావించరాదని హెచ్చరిస్తున్నారు.
కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్ధ(డబ్ల్యుహెచ్‌ఓ) ప్రపంచ అత్యవసర పరిస్ధితిని ప్రకటించిందంటే దాని అర్ధం చైనా మీద విశ్వాసం లేదని కాదు. ఆరోగ్య వ్యవస్ధలు బలహీనంగా ఉన్న దేశాలలో వ్యాప్తి చెందకుండా చూడాలన్నదే ఉద్దేశ్యం. వైరస్‌ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ఉహాన్‌ పట్టణం, పరిసరాల్లో దాదాపు ఐదు కోట్ల మంది జనాన్ని అటూ ఇటూ ప్రయాణించకుండా ఇండ్లకే పరిమితం చేస్తూ కట్టడి చేశారు, వారికి కావలసినవన్నీ అందిస్తున్నారు. దక్షిణ కొరియా లేదా ఒక ఆస్ట్రేలియా జనాభా కంటే ఎక్కువ మందికి ఏర్పాట్లు చేయటం ఇంతవరకు మరొక దేశంలో ఎక్కడా జరగలేదు. వైరస్‌ గుర్తింపు తదితర చర్యలు తరువాత, ముందు వ్యాప్తిని అరికట్టటం ముఖ్యమనే వైఖరితో ఈ చర్యలు తీసుకున్నారు. చైనా జనాభా మొత్తానికి ముఖాలకు అవసరమైన వ్యాధి నిరోధక మాస్కుల తయారీని చేపట్టారు. వైరస్‌ను గుర్తించిన పది రోజుల్లోనే దాని డిఎన్‌ఏను గుర్తించిన చైనా శాస్త్రవేత్తలు ఆ వివరాలను ప్రపంచానికంతటికీ అందించారు. వైరస్‌ ప్రబలుతున్న సమయంలోనే ఇంత తక్కువ సమయంలో సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచటం గతంలో ఎన్నడూ జరగలేదు, దాన్ని ఎవరైనా అధ్యయనం చేయవచ్చు, టీకాల వంటి వాటిని తయారు చేయవచ్చు.
ఇలాంటి విపత్తులు వచ్చినపుడు నలుగురూ నాలుగు చేతులు వేసి పరస్పరం సాయం చేయాల్సి వుండగా రాజకీయాలు చేయటం నీచాతి నీచం. ఇలాంటివి జరిగినపుడు బలహీనులను బలిపశువులుగా చేసిన దురహం కారం, దుర్మార్గాన్ని చరిత్ర నమోదు చేసింది. చైనా జాతీయుల కారణంగానే కరోనా వ్యాపిస్తోందని ఆరోపిస్తూ వారిని దేశంలో ప్రవేశించకుండా నిషేధించాలని దక్షిణ కొరియా సియోల్‌ నగరంలో కొందరు ప్రదర్శన చేశారు. కొన్ని చోట్ల అసలు ఆసియా వాసులెవరినీ రానివ్వ వద్దనే వరకు పరిస్ధితి పోయింది. ఎంతగా విద్వేషాన్ని,భయాన్ని రెచ్చగొట్టారో తెలుసుకొనేందుకు ఒక ఉదాహరణ. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో చైనా టౌన్‌ రెస్టారెంట్‌ వెలుపల 60 ఏండ్ల ఒక చైనా జాతీయుడు గుండెపోటుతో పడిపోయాడు. అలాంటి వారి గురించి తెలియగానే కృత్రిమ శ్వాస అందించేందుకు ఏర్పాట్లు చేస్తారు. అయితే అతను కరోనా వైరస్‌ కారణంగానే పడిపోయాడని అలాంటి చికిత్సను అందించేందుకు తిరస్కరించారు.( కరోనా వైరస్‌ వార్త పేరుతో చైనాలోని ఒక రోడ్డుపై ఆకస్మికంగా పడిపోయిన వ్యక్తి దృశ్యాన్ని మన దేశంలో కూడా మీడియా చూపింది. నిజంగా అతనెందుకు అలా పడిపోయాడో తెలియదు. కరోనా వైరస్‌ వ్యాధి లక్షణాలలో అదొకటని ఎవరూ చెప్పలేదు)
ఇప్పుడు చైనాలో జనాన్ని ఒక చోటి నుంచి మరొక చోటికి కట్టడి చేసిన మాదిరి గతంలో కలరా సోకినపుడు చేయలేదు. వారిని నౌకల్లో అనుమతించిన కారణంగా అది ప్రపంచ వ్యాప్తమైంది.1832లో వలస వచ్చిన ఐరిష్‌ జాతీయులు కలరాను వ్యాప్తి చేస్తున్నారని అనుమానించి వారిని విడిగా ఉంచారు, తరువాత రహస్యంగా చంపిన దుర్మార్గం తరువాత బయటపడింది. తొలి రోజుల్లో ఎయిడ్స్‌ కారకులు హైతీయన్లు అంటూ వారి మీద దాడులు చేసి వేధించారు. 2003 చైనాలో సారస్‌ ప్రబలినపుడు కెనడాలోని చైనా జాతీయుల మీద దాడులు చేసి వారి ఇండ్లు, దుకాణాల నుంచి తరిమివేసిన దారుణాలు జరిగాయి. మధ్య అమెరికా దేశాల నుంచి వచ్చే జనం కుష్టువ్యాధి, మసూచిని తీసుకు వచ్చి అమెరికాను కలుషితం చేస్తున్నారంటూ 2018లో అమెరికాలోని ఫాక్స్‌ న్యూస్‌ వ్యాఖ్యాత నోరు పారవేసుకున్నాడు. నిజానికి మసూచిని 1980లోనే ప్రపంచం నుంచి తరిమివేశారు.
కరోనా వైరస్‌తో చైనీయులు జీవ ఆయుధాలు తయారు చేస్తుండగా తప్పించుకొని బయటకు వచ్చిందని, ఆ వైరస్‌ను వారు కెనడా ప్రయోగశాల నుంచి అపహరించారనే కట్టుకధలు అనేకం ప్రచారంలోకి వచ్చాయి. వెనక్కు వెళితే అనేక అంటు వ్యాధులు జనాన్ని సామూహికంగా హతమార్చాయి. వాటికి కారకులు ఎవరు ? 1918 జనవరి నుంచి 1920 డిసెంబరు వరకు ప్రపంచ వ్యాపితంగా 50 కోట్ల మందికి స్పానిష్‌ ఫ్లూ సోకింది, ఆర్కిటిక్‌ నుంచి పసిఫిక్‌ సముద్రదీవుల వరకు ఏ ప్రాంతాన్నీ వదల్లేదు. ఆరోజు నేటి మాదిరి విమానాలు లేవు, ప్రయాణాలు లేవు. కనీసం ఐదు నుంచి పది కోట్ల మంది వరకు మరణించినట్లు అంచనా. (అంటే నాటి ప్రపంచ జనాభాలో ప్రతి వందమందిలో ముగ్గురి నుంచి ఐదు మంది వరకు) ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభంలో అనేక అంటు వ్యాధులు ఎంతగా ప్రబలాయంటే అమెరికాలో సగటు జీవిత కాలం పన్నెండు సంవత్సరాలు తగ్గిపోయింది. ఫ్లూ పిల్లలను, ముసలి వారినీ ఎక్కువగా కబళిస్తుంది, కానీ అమెరికాలో యువత ఎక్కువ మంది మరణించారు. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా అనేక దేశాలు వాస్తవాలను బయట పెట్టకుండా తొక్కిపెట్టాయి. అలాంటి పశ్చిమ దేశాలు ఇప్పుడు కరోనా వైరస్‌ గురించి చైనా మీద అలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. ఫ్లూ కారణంగా స్పెయిన్‌లో రాజు పదమూడవ ఆల్ఫోన్సోతో సహా అనేక మంది సామాన్యులు కూడా పెద్ద సంఖ్యలో మరణించారు. దాంతో అక్కడి నుంచే అది ప్రబలిందని అందువలన దానికి స్పెయిన్‌ ఫ్లూ అని పేరు పెట్టారు.

Image result for wuhan hospital construction"
గత మూడువందల సంవత్సరాలలో తొమ్మిది సార్లు ప్రమాదకరంగా ఫ్లూ వ్యాపించినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. ప్రతి దేశంలోనూ సగటున మూడు సార్లు ఫ్లూ వచ్చినట్లు తేలింది. అలాంటి భయంకరమైన వాటిలో 2009లో వచ్చిన ఫ్లూ ఒకటి.దీన్నే స్వైన్‌ ఫ్లూ అని పిలిచారు. మన దేశాన్ని కూడా ఎలా వణికించిందో తెలిసిందే. ఇది తొలుత అమెరికా పక్కనే ఉన్న మెక్సికోలో బయట పడింది. ప్రపంచమంతటా పాకి జనాభాలో పదకొండు నుంచి 21శాతం మందికి సోకినట్లు, 1,51,700 నుంచి 5,75,400 మంది వరకు మరణించినట్లు తేలింది. ఎంతో అభివృద్ది చెందింది, వైద్య పరంగా ముందున్నదని చెప్పుకొనే అమెరికాలో స్వైన్‌ ఫ్లూ 2009-10లో నాలుగు కోట్ల 30లక్షల మంది నుంచి 8.9 కోట్ల మందికి సోకిందని అంచనా. వారిలో లక్షా 95వేల నుంచి నాలుగు లక్షల మూడువేల మంది వరకు ఆసుపత్రి పాలయ్యారని, 8,870 నుంచి 18,300 మంది వరకు మరణించారని అంచనా. మరొక సమాచారం ప్రకారం ప్రతి ఏటా అమెరికాలో సగటున ఫ్లూ కారణంగా కొన్ని సంవత్సరాల సగటు 25వేలు ఉండగా మరికొన్ని సంవత్సరాలలో 36వేల మంది మరణించారని తేలింది. ఒక ఏడాది తక్కువ, మరొక ఏడాది ఎక్కువ ఉండవచ్చు ఇది సగటు అని అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ పత్రిక వెల్లడించింది. కరోనాకు చైనా కారణం అని చెప్పేవారు అమెరికాలో జరిగే వాటికి కారకులు ఎవరని చెబుతారు ?
కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి అమెరికా ఎలాంటి సాయం చేయకపోగా అతిగా స్పందిస్తున్నదని దానిలో భాగంగానే ఏ దేశమూ చేయని విధంగా ఉహాన్‌లోని తన రాయబార కార్యాలయ సిబ్బందిని వెనక్కు తీసుకొన్నదని చైనా విమర్శించింది. ఇది అనైతికం అయినా అమెరికా, దాన్ని సమర్ధించే మీడియా చర్యలు ఆశ్చర్యం కలిగించటం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాడు సారస్‌, నేడు చైనాను వణికిస్తున్న ఉహాన్‌ న్యుమోనియా

22 Wednesday Jan 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS

≈ Leave a comment

Tags

China, Novel Coronavirus, SARS


ఎం కోటేశ్వరరావు
ప్రస్తుతం ఊహాన్‌ న్యూమోనియాగా పిలుస్తున్న వ్యాధికి కారణమైన వైరస్‌ను అదుపు చేసేందుకు చైనా ప్రయత్నిస్తుండగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ నిపుణులు బుధవారం నాడు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాల గురించి చర్చించనున్నారు. చైనాతో పాటు మరో మూడు దేశాల్లో ఈ వైరస్‌ సోకినట్లు గుర్తించారు. గతంలో 2003లో వ్యాపించిన సారస్‌ మాదిరి వైరస్‌ మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తున్నదని చైనా ప్రకటించింది. దీని గురించి ఆందోళన చెందాల్సిన పని లేదని చెబుతున్నప్పటికీ అటు చైనాలోనూ, ఇటు ప్రపంచ వ్యాపితంగా ఆందోళన వ్యక్తం అవుతోంది.
మీడియాలో నోవెల్‌ కొరోనా వైరస్‌(2019-ఎన్‌సిఓవి), ఉహాన్‌ సీఫుడ్‌ మార్కెట్‌ న్యుమోనియా వైరస్‌, ఉహాన్‌ న్యుమోనియా, ఉహాన్‌ కొరోనావైరస్‌ అని ఏ పేరుతో పిలిచినా అవన్నీ ఒకటే. దీనికి గుడ్లగూబల నుంచి వ్యాప్తి చెందే ఒక వైరస్‌ లక్షణాలున్నట్లు ప్రాధమికంగా తేలింది. గతనెలలో గుర్తు తెలియని ఈ వైరస్‌తో బాధపడుతున్న వారిని గుర్తించారు. ఇప్పటి వరకు 9 మంది మరణించారని వార్తలు వచ్చాయి. బుధవారం ఉదయం ఏడు గంటల సమయానికి పద్నాలుగు రాష్ట్రాలలో 324 మందికి వైరస్‌ సోకినట్లు చైనా ప్రకటించింది. అంతకు రెండు రోజుల ముందు లండన్‌లోని ఇంపీరియల్‌ మెడికల్‌ కాలేజీ నిపుణులు కనీసం 1700కి సోకి వుండవచ్చునని పేర్కొన్నారు. చైనా వెలుపల దక్షిణ కొరియాలో ఒకరికి సోకినట్లు సోమవారం నాడు, చైనా నుంచి అమెరికా వెళ్లిన ఒక యువకుడికి వైరస్‌ సోకినట్లు మంగళవారం నాడు అమెరికా వెల్లడించింది. హాంకాంగ్‌లో 117 మందికి సోకినట్లు అనుమానం తప్ప నిర్దారణ కాలేదు.
మధ్యచైనా రాష్ట్రంగా పిలిచే హుబెరు రాష్ట్ర రాజధాని ఉహాన్‌ పట్టణం. చైనా నూతన సంవత్సర సందర్భంగా కోట్లాది మంది చైనీయులు బంధు, మిత్రులను స్వయంగా కలిసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ వేడుకలు జరుపుకుంటారు. పెద్ద ఎత్తున స్వదేశంలోనూ, విదేశాలకు విహార యాత్రలకు వెళతారు. ఈ సమయంలో చైనాలో 20 కోట్ల మంది ప్రయాణాలు చేస్తారని అంచనా కాగా ఒక్క ఉహాన్‌ నగరం నుంచి కోటిన్నర మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతున్నట్లు అధికారికంగా ప్రకటించిన నేపధ్యంలో ఇప్పటికే అనేక మంది తమ ప్రయాణాలను పరిమితం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. జనవరి 25 నుంచి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయి. ఇరవై అయిదు నుంచి 30వ తేదీ వరకు అధికారిక సెలవుదినాలుగా ప్రకటించారు. జనవరి పది నుంచి ఫిబ్రవరి 18వరకు వసంత రుతు ఉత్సవాలు జరుగుతాయి. ఈ కాలంలో కనీసం 20 కోట్ల మంది ప్రయాణాలు చేస్తారని అంచనా. ఉహాన్‌ నగర జనాభా కోటీ పదిలక్షలు, పెద్ద రవాణా కేంద్రం. జనవరి 20-27 తేదీల మధ్య దేశంలోని వివిధ ప్రాంతాలకు 2,105, విదేశాలకు 231 విమానాలను నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఉహాన్‌ న్యూమోనియా వైరస్‌ లక్షణాలు కనిపించిన వెంటనే చైనా సర్కార్‌ దేశవ్యాపితంగా శ్వాస సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్నవారిని గుర్తించి పరీక్షించిన కారణంగా నూతన కేసులు బయట పడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్ధ పేర్కొన్నది. ఉహాన్‌ నుంచే గాక హుబెరు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి మీద కూడ వ్యాధిలక్షణాల గురించి నిఘావేశామని, హాంకాంగ్‌లో వంద మందిని పర్యవేక్షిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. అనేక దేశాల విమానాశ్రయాలలో చైనా నుంచి వచ్చేవారిని పరీక్షించే ఏర్పాట్లు చేశారు.
తాజా వైరస్‌ వార్తలతో యావత్‌ చైనా సమాజంలో ఒక విధమైన ఆందోళన, అప్రమత్తత కూడా వెల్లడి అయినట్లు వార్తలు వచ్చాయి. దీని గురించి దాయాల్సిన అవసరం లేదని, అదే సమయంలో గతంలో సారస్‌ మాదిరి పరిస్దితి లేదని చైనా మీడియా పేర్కొన్నది. 2004 తరువాత ఇంతవరకు చైనాలో సారస్‌ లక్షణాలు వెల్లడి కాలేదు. ఇదే సమయంలో సారస్‌ వైరస్‌ను నిరోధించే టీకాలను కూడా ఇంతవరకు రూపొందించలేకపోయారు. ఆ లక్షణాలున్న వారి నుంచి ఇతరులకు వ్యాపించకుండా నిరోధ చర్యలు మాత్రమే తీసుకుంటున్నారు, ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఇంటర్నెట్‌ అందరికీ అందుబాటులో ఉన్నందున ప్రభుత్వం సమాచారాన్ని దాచినా దాగదని, అంతర్జాతీయ మీడియా కూడా మిన్నకుండజాలదని చైనా అధికారులు చెబుతున్నారు. సంక్లిష్ట పరిస్ధితులు తలెత్తినపుడు వాస్తవాలను వెల్లడించటం ద్వారానే జనానికి భరోసా కల్పించవచ్చని అన్నారు. సారస్‌ వ్యాప్తి నుంచి చైనా వైద్యనిపుణులు ఎన్నో అనుభవాలను పొందారని, ఇలాంటి పరిస్ధితులను ఎలా ఎదుర్కోవాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని అంటున్నారు. ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు యావత్‌ చైనా సమాజాన్ని కదిలించాల్సిన అవసరం ప్రస్తుతానికైతే లేదని చెబుతున్నారు.
గతంలో సారస్‌ వైరస్‌ దక్షిణ చైనాలోని గ్వాంగ్‌ డాంగ్‌ రాష్ట్రం షండే ప్రాంతం నుంచి ప్రారంభమై 2002 నవంబరు నుంచి 2003 జూలై మధ్యకాలంలో పద్నాలుగు దేశాల ( పదిహేడు ప్రాంతాలు)లో వ్యాపించింది. మొత్తం 8,273మందికి సోకగా 775 మంది ఐదు దేశాల(ఏడు ప్రాంతాలు)లో మరణించారు, వీరిలో సారస్‌ సోకినప్పటికీ ఇతర కారణాలతో మరణించిన వారు 60 మంది ఉన్నారు. సగటున 9.6శాతం మంది మృతి చెందారు. దేశాల వారీ చైనా ప్రధాన భూభాగంలో 5,328 మందికి సోకగా 349 మంది మరణించారు, చైనాలో భాగమైన హాంకాంగ్‌లో 1,755 మందికి గాను 299 మంది చనిపోయారు. కెనడాలో 251 మందికి 44, సింగపూర్‌లో 238 మందికి 33, చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌లో 346 మందికి 37, వియత్నాంలో 63కు ఐదు, ఫిలిప్పైన్స్‌లో 14కు రెండు మరణాలు సంభవించాయి. చైనా గ్వాంగ్‌ డాంగ్‌లో వైరస్‌ ప్రారంభమైన బీజింగ్‌ నగరంలో పెద్ద ఎత్తున వ్యాపించింది. ఆ సమయంలో అక్కడి ప్రాధమిక, మాధ్యమిక పాఠశాలలను మూసివేశారు. చైనాలో ప్రతి ఏటా వసంత రుతు సమయంలో జలుబు సాధారణంగా వస్తుంది. అయితే జలుబు చేసిన వారి శరీర ఉష్ణోగ్రత 37.3 సెంటీగ్రేడ్‌ డిగ్రీలు దాటితే వారికి ఉహాన్‌ న్యుమోనియా అనుమానంతో చికిత్స చేస్తున్నారు. ఇటీవలి కాలంలో మీరు ఎక్కడెక్కడికి ప్రయాణాలు చేశారని వైద్య సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. ఉహాన్‌ వెళ్లి వచ్చిన తరువాత జ్వరంలో కూడిన జలుబు చేస్తే పనులకు పోవద్దని, రక్షణ ముసుగులు ధరించాలని సలహా ఇస్తున్నారు. దేశంలో కొన్ని చోట్ల ఉహాన్‌ న్యుమోనియా లక్షణాలు,తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పెద్ద ఎత్తున బ్యానర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు.
ప్రస్తుతం చైనాలో ప్రపంచంలోనే అతి పెద్దదైన వ్యాధికారక వైరస్‌, బాక్టీరియాలను పరిశీలించే ప్రయోగశాలల వ్యవస్ధ ఉంది. దేశంలో పన్నెండు ప్రధాన ప్రయోగశాలలు, 91 ప్రాంతీయ, 800 ఆసుపత్రుల ప్రయోగశాలలు ఉన్నాయి. ఇప్పటికి తెలిసిన 300 వ్యాధికారక వైరస్‌లను అక్కడ వెంటనే గుర్తించే ఏర్పాట్లు ఉన్నాయి. 2003 సారస్‌ విస్తరణ తరువాత వీటిని మరింత పటిష్ట పరిచారు. గుర్తు తెలియని వైరస్‌లను గుర్తించే నిరంతర పరిశోధనల గురించి చెప్పనవసరం లేదు. సారస్‌ తరువాత పెద్ద ఎత్తున వ్యాప్తి చెందే వ్యాధులను గుర్తించేందుకు 17ప్రత్యేక బృందాలకు శిక్షణ ఇచ్చారు. సాధారణ న్యూమోనియా వైరస్‌ పది రోజుల కంటే ప్రభావం చూపలేదు, అయితే సారస్‌ మూడు నెలలకు మించి ఉన్నట్లు విదేశీ నిపుణులు గుర్తించారు.
ప్రస్తుతం వ్యాపించిన ఉహాన్‌ న్యూమోనియా కోరోనా వైరస్‌ కేంద్రం నగరంలోని సముద్ర ఉత్పత్తుల మార్కెట్‌గా గుర్తించారు. ఇతర ప్రాంతాల్లోని చేపలు, కోళ్ల మార్కెట్లలో అలాంటి లక్షణాలు కనిపించనందున వైరస్‌ సాధారణ లక్షణాలను నిర్ధారించటం ఆలస్యం అవుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది ఉహాన్‌లో వైరస్‌ వ్యాప్తికి తోడ్పడే వాతావరణం ఉండటంతో వైరస్‌ల గుర్తింపు, నివారణ సవాలుగా మారింది. ఈ నగరంలో 198 మందిలో వైరస్‌ను గుర్తించారు, 25 మందికి చికిత్స చేసి ఆసుపత్రి నుంచి పంపారు, తొమ్మిది మంది పరిస్ధితి విషమంగా ఉంది. చికిత్స చేస్తున్న సిబ్బందిలో 15 మందికి సోకినట్లు గుర్తించగా వారిలో ఒకరి పరిస్ధితి తీవ్రంగా ఉంది. అవసరమైతే తప్ప జనాలు బయటకు రావద్దని నగరపాలక సంస్ధ సలహా ఇచ్చింది.
చైనాలో కలరా, ప్లేగ్‌ వంటి వాటికి కారణమయ్యే వైరస్‌ను మొదటి తరగతిగా వర్గీకరించి అధిక ప్రాధాన్యత ఇస్తారు, సారస్‌, ఎయిడ్స్‌ వంటి వైరస్‌ల వంటి బి తరగతిలో ఉహాన్‌ వైరస్‌ను చేర్చారు. అంటే వీటిని ఎదుర్కొనేందుకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు. జపాన్‌, థారులాండ్‌, దక్షిణ కొరియాల్లో కూడా ఈ వైరస్‌ను గుర్తించిన కారణంగా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని దేశాధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ అధికారులను కోరారు.
ఈ వైరస్‌ గురించి దీని గురించి చైనా వాస్తవాలను బయటకు వెల్లడించటం లేదని పశ్చిమ దేశాల మీడియాలో కథనాలు రాస్తున్నారు. నిజానికి చైనా దాచిందీ లేదు, పశ్చిమ దేశాలు శోధించి కనుగొన్నదీ లేదు. డిసెంబరు 31న ఉహాన్‌లో అంతుబట్టని న్యుమోనియాను గుర్తించినట్లు చైనా ప్రపంచ ఆరోగ్య సంస్దకు తెలియ చేసింది. వ్యాధి వ్యాపించటానికి కారణమైన వైరస్‌ కేంద్రంగా అనుమానించిన సముద్ర ఉత్పత్తుల మార్కెట్‌ను జనవరి ఒకటిన మూసివేశారు. ఈ వ్యాధి గురించి తమకు తెలిసిందని జనవరి రెండున సింగపూర్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. జనవరి ఒకటిన ఈ వైరస్‌ కారణంగా తమ దేశంలో తొలి మరణం సంభవించినట్లు చైనా తెలిపింది. ఉహాన్‌ నుంచి వచ్చిన ఒక మహిళకు వ్యాధి సోకినట్లు థారులాండ్‌లో జనవరి 13న గుర్తించారు, పదహారవ తేదీన జపాన్‌లో ఒక కేసు బయట పడింది.పదిహేడవ తేదీన రెండవ,20న మూడవ,21న నాల్గవ వ్యక్తి మరణించారు. ఉహాన్‌ నుంచి దక్షిణ కొరియాకు వచ్చిన ఒక వ్యక్తికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు. చైనా నుంచి వచ్చే కొన్ని విమానాల ప్రయాణీకులకు పరీక్షలు జరుపుతామని ఆస్ట్రేలియా ప్రకటించింది.
ఇలాంటి అంతుతెలియని ప్రమాదకర వైరస్‌లు వ్యాప్తి చెందినపుడు వాటిని యావత్‌ అంతర్జాతీయ సమాజం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ప్రతి వారు తమ అనుభవం, పరిశోధనల సమాచారాన్ని ఏ దేశంలో అయితే వైరస్‌ ప్రారంభమైందో దానికి అందచేస్తే మానవాళికి మేలు కలుగుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d