• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Elon Musk

చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !

17 Wednesday Dec 2025

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, UK, USA

≈ Leave a comment

Tags

Chip war 2.0, Chip war 2.0 against China, Elon Musk, Nvidia's H200, Pax Silica, US and China Chip War

ఎం కోటేశ్వరరావు

సాంకేతిక రంగంలో ముందుకు పోకుండా చైనాను అడ్డుకొనేందుకు ఇప్పటి వరకు ఒంటరిగా ప్రయత్నించిన అమెరికా తాజాగా తనకు తోడుగా మరికొన్ని దేశాలను కూడగట్టుకొని గోదాలోకి దిగింది. బహుశా అందుకే కృత్రిమ మేథ(ఏఐ) రంగంలో పూర్తిస్థాయి యుద్ధ ముప్పు ఉందని ప్రపంచ ధనికుడు ఎలన్‌ మస్క్‌ వ్యాఖ్యానించాడు. అమెరికా దిగ్గజ సంస్థ ఎన్‌విడియా తదుపరి తరం హార్డ్‌వేర్‌ బ్లాక్‌వెల్‌ చిప్‌తో అది ప్రారంభం అయినట్లే అన్నాడు. వచ్చే ఏడాది మార్కెట్‌లోకి అది రానుందనే వార్తల పూర్వరంగంలో జరుగుతున్న పరిణామాలపై తాజాగా మస్క్‌ స్పందించాడు. ఈ చర్యతో పోటీదారులు వేగం,ఖర్చు,విస్తృతి అంశాల్లో తమ సత్తా చూపేందుకు పూనుకుంటారన్నాడు. ద్రవ్యపెట్టుబడిదారు గవిన్‌ బేకర్‌ మాట్లాడిన అంశాల మీద మస్క్‌ స్పందించాడు. బ్లాక్‌వెల్‌ చిప్స్‌ తయారీలో అనేక సవాళ్లు ఉన్నట్లు బెకర్‌ చెప్పాడు. అందుకే అది ఆలస్యం అవుతున్నదని అన్నాడు.ఏది ఏమైనప్పటికీ ఈ రంగంలో ఉన్న గూగుల్‌, ఎలన్‌మస్క్‌ ఎక్స్‌ఏఐ, మేటా (ఫేస్‌బుక్‌ ) వంటి కంపెనీలన్నీ పోటీపడతాయని వేరే చెప్పనవసరం లేదు. మరోవైపు పశ్చిమ దేశాల సంస్థలకు చైనా పెద్ద సవాలు విసురుతున్నది. గత పదిహేను సంవత్సరాలుగా సాంకేతిక రంగంలో బీజింగ్‌ ఎదగకుండా చూసేందుకు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు చేయని యత్నం లేదు. వాణిజ్యపోరుతో పాటు చిప్స్‌ పోరును కూడా ప్రారంభించాయి. తాజా పరిణామాలను బట్టి ఈ యుద్ధంలో అమెరికాకు ఊహించని దెబ్బ తగిలిందని చెప్పవచ్చు.అందుకే అది కొత్త ఎతుత్తగడలతో పోరును కొనసాగించేందుకు పాక్స్‌ సిలికా పేరుతో కొత్త కూటమిని రంగంలోకి తెచ్చింది.

చిప్‌ యుద్ధంలో చైనా ఒక్కటే ఒకవైపు ,అనేక దేశాలు మరోవైపు ఉన్నాయి. జోబైడెన్‌ సర్కార్‌ 2022 అక్టోబరు నుంచి ా చైనాకు అధునాతన చిప్స్‌ ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఇటీవలనే ట్రంప్‌ ఏలుబడి ఎన్‌విడియా కంపెనీకి అనుమతి ఇచ్చింది. అయితే అధికారికంగా ఎలాంటి సమాచారం లేనప్పటికీ ఆ చిప్స్‌ తమకు అవసరం లేదన్నట్లుగా చైనా తీరు ఉందని, తిరస్కరించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ పూర్వరంగంలో చిప్‌ యుద్దంలో తన బలం ఒక్కటే చాలదని భావించిన అమెరికా డిసెంబరు 12న తొలిసారిగా పాక్స్‌ సిలికా పేరుతో ఒక కూటమికి శ్రీకారం చుట్టింది. పాక్స్‌ అంటే లాటిన్‌ భాషలో శాంతి, స్థిరత్వం, సిలికా అంటే ఇసుకతో సహా వివిధ రూపాల్లో ఉండే ఖనిజం. దాన్నుంచి కంప్యూటర్లకు అవసరమైన చిప్స్‌ తయారు చేస్తారు,అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఐటి, సాంకేతిక పరిజ్ఞానం కేంద్రాలు కేంద్రీకృతమైన ప్రాంతాన్ని సిలికాన్‌ వ్యాలీ అని పిలుస్తున్న సంగతి తెలిసిందే. పాక్స్‌ సిలికా లక్ష్యం ఏమిటంటే విలువైన ఖనిజాల సరఫరా, సాంకేతిక పరిజ్ఞాన సహకారంతో ఆ కూటమిలోని దేశాలు బలపడటం, చైనా ఆధిపత్యాన్ని ఉమ్మడిగా సవాలు చేయటం. అమెరికా వైపు నుంచి ఇలాంటి చొరవ చూపటం అంటే కమ్యూనిస్టు చైనా ముందు ఒక విధంగా తన ఓటమిని అంగీకరించటమే.చిత్రం ఏమిటంటే ఈ బృందం నుంచి భారత్‌ను మినహాయించారు.దీని అర్ధం మనలను చేర్చుకున్నందున తమకు ఉపయోగం లేదని భావించినట్లేనా ? లేక తమకు అనుకూలమైన షరతులతో వాణిజ్య ఒప్పందానికి ఒప్పించటానికి మరోవిధంగా వత్తిడి చేయటమా ?

ప్రస్తుతం ప్రపంచంలో విలువైన ఖనిజాలు, వాటి ఉత్పత్తుల విషయంలో 70శాతంతో చైనా అగ్రభాగాన ఉంది. వాటి ఎగుమతుల నిలిపివేతతో ఇటీవల ప్రపంచంలోని అనేక దేశాలు గిజగిజలాడిన సంగతి తెలిసిందే.ఈ ఖనిజాలతో పాటు కృత్రిమ మేథ(ఏఐ), చిప్స్‌ తయారీ వంటి కీలక రంగాలలో పరస్పరం సహకరించుకొనేందుకు అమెరికా,దక్షిణ కొరియా, సింగపూర్‌, జపాన్‌, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌, నెదర్లాండ్స్‌, బ్రిటన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ స్థాపక సభ్యులుగా పాక్స్‌ సిలికా ఏర్పడింది. ఆర్థిక కూటములు తప్ప సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి ఏర్పడటం ఇదే ప్రధమం.దీన్ని అమెరికా కృత్రిమ మేథ దౌత్యంగా వర్ణించారు. ఈ కూటమికి సహకరించేందుకు లేదా అతిధులుగా తైవాన్‌, ఐరోపా యూనియన్‌, కెనడా,ఓయిసిడి ఉంటాయి. ఈ సంస్థలకు చెందిన దేశాలు తమవంతు సహకారాన్ని అందిస్తాయి. అమెరికా ఆర్థిక వ్యవహారాల సహాయమంత్రి జాకబ్‌ హెల్‌బర్గ్‌ ఈ చొరవను ” నూతన స్వర్ణ యుగం ” అని వర్ణించాడు. దీని గురించి చైనా ఇంతవరకు అధికారికంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. ఇతరులపై ఆధారపడకుండా చైనా స్వయంశక్తితో ఎదిగేందుకు దీర్ఘకాలిక పథకాలను రూపొందించింది.దాన్లో భాగంగానే అక్కడి ప్రభుత్వం పెద్ద మొత్తాలలో పరిశోధన, అభివృద్ధికి ఖర్చు చేస్తున్నది.స్వయంగా ఉత్పత్తులను చేస్తున్నది. ఇప్పుడు పాక్స్‌ సిలికాను కూడా సవాలుగా తీసుకొని మరింతగా తన సంస్థలను ప్రోత్సహిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో అమెరికా, పశ్చిమ దేశాలు ఎంతగా ఒంటరిపాటు చేయాలని చూస్తే ఎలాంటి ఆర్భాటం లేకుండా అంతగా నూతన విజయాలతో ముందుకు వచ్చి సమాధానం చెప్పింది.

చైనా గురించి అనేక అబద్దాలను ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఎన్‌విడియా కంపెనీ తయారు చేసిన చిప్స్‌ను చైనాకు ఎగుమతి చేయరాదని అమెరికా ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే వాటిని అక్రమ పద్దతుల్లో సేకరించి డీప్‌సీక్‌లో వినియోగిస్తున్నట్లు వార్తలు రాశారు. అయితే అలాంటిదేమీ లేదని ఎన్‌విడియా ప్రకటించి వాటిగాలి తీసింది. సదరు ఆరోపణకు ఎలాంటి ఆధారాలు లేవని, తాము అమెరికా నిబంధనలకు అనుగుణంగానే పని చేస్తున్నట్లు పేర్కొన్నది. అత్యంత తక్కువ ఖర్చుతో స్వల్పకాలంలోనే ఏఐ డీప్‌సీక్‌ను తయారు చేసి 2025లో ప్రపంచాన్ని కుదిపివేసింది. చాట్‌ జిపిటి వంటి ఏఐ వ్యవస్థలను తయారు చేసేందుకు భారీ మొత్తాలలో ఖర్చు చేసిన సంస్థలు తలలు పట్టుకున్నాయి. కంపెనీల వాటాల ధరలు పతనమయ్యాయి. ఆధునికమైన చిప్స్‌తో పనిలేకుండానే తక్కువ ఖర్చుతో ఏఐ వ్యవస్థలను తయారు చేయవచ్చని ఇప్పుడు అనేక మంది భావిస్తున్నారు. సాంకేతిక రంగంలో కొన్నింటిలో ఇప్పటికీ ముందున్నప్పటికీ మొత్తంగా చూసినపుడు గతంలో మాదిరి అమెరికా ఒక నిర్ణయాత్మక శక్తిగా లేదు. ఎన్‌విడియా హెచ్‌200 రకం చిప్‌లను చైనాకు ఎగుమతి చేయవచ్చని ట్రంప్‌ అనుమతించాడు.చైనా మార్కెట్‌లో ప్రవేశించటం ఒకటైతే, వాటిని కొనుగోలు చేసిన చైనా తనపరిశోధనలను పక్కన పెట్టి వాటిపైనే ఆధారపడుతుందనే అంచనాతో ఈ చర్య తీసుకున్నాడు. అయితే అలా జరుగుతుందని చెప్పలేమని అధ్యక్ష భవనంలో ఏఐ జార్‌గా పరిగణించే డేవిడ్‌ శాక్స్‌ చెప్పాడు. ఎగుమతులపై నిషేధం పెట్టిన అమెరికా తానే ఏకపక్షంగా ఎత్తివేసింది. ఆట నిబంధనలను తానే రూపొందించి తానే మార్చినట్లయింది.

కొన్ని దశాబ్దాల పాటు తన నిబంధనలతో అమెరికా ప్రపంచాన్ని ఏలింది. ఇతర దేశాల తలరాతలను రాసేందుకు ప్రయత్నించింది. మనతో సహా అలీన దేశాలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తే అది సోవియట్‌, ఇతర సోషలిస్టు దేశాలకు, పెట్టుబడిదారీ దేశాల్లోనే తమ ప్రత్యర్ధులకు చేరుతుందనే భయంతో అనేక చర్యలు తీసుకుంది. పోటీదారులు తలెత్త కుండా చూసుకుంది, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా తన రాజకీయ అవసరాల కోసం ఒక ఆయుధంగా వాడుకుంది. మన దేశానికి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం అందకుండా అన్ని విధాలుగా అడ్డుకుంది. సోవియట్‌ యూనియన్‌, తరువాత రష్యా అండతో దాన్ని అధిగమించాం. అణుపరీక్షలు జరిపితే ఆంక్షలు విధించింది. ఆహార ధాన్యాలు కావాలంటే మాకేంటని బేరం పెట్టింది. ఇలా అనేక అంశాలను చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు కుదరదు, పరిస్థితులు మారాయి. అది చేసిన చారిత్రక తప్పిదం వలన ఇతర దేశాల మీద ఆధారపడక తప్పని స్థితి. వస్తు ఉత్పాదక పరిశ్రమలన్నింటినీ మూసివేసింది, లేదా ఇతర దేశాలకు తరలించింది. ఇప్పుడు టాయిలెట్లలో తుడుచుకొనేందుకు అవసరమైన కాగితాన్ని కూడా అది ఏదో ఒక దేశం నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. కోట్లకు వేసుకొనే టై దగ్గర నుంచి కాళ్లకు వేసుకొనే బూట్ల వరకు ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటే తప్ప గడవదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సంపాదించిన సొమ్ముతో వాటన్నింటినీ ఎక్కడో అక్కడ నుంచి తెచ్చుకుంది. ఇప్పుడు అలాంటి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఉదాహరణకు ఎన్‌విడియా చిప్స్‌ను చైనాకు ఎగుమతి చేసి రాబడిలో 25శాతం ఖజానాకు జమచేస్తానని ట్రంప్‌ చెప్పాడు. ఎలా అంటే 25శాతం ఎగుమతి పన్ను విధించి అన్నాడు. ఆ కంపెనీ ఏటా పది బిలియన్‌ డాలర్ల వరకు హెచ్‌ 200 రకం చిప్స్‌ను ఎగుమతి చేస్తే దాని మీద 25శాతం పన్నుతో రెండున్నర బిలియన్‌ డాలర్ల మేర రాబడి వస్తుందని ట్రంప్‌ లెక్కలు వేసుకున్నాడు. తీరా ఏమైంది. అమెరికా చిప్సా అసలు మనకు వాటి అవసరం ఉందో లేదో సమీక్షించాలని, ప్రభుత్వ రంగంలో వాటిని వాడవద్దని తన అధికారులు, సంస్థలను చైనా ప్రభుత్వం ఆదేశించినట్లు మీడియాలో వచ్చింది. మన చిప్స్‌ను చైనా తిరస్కరిస్తున్నది అని అధ్యక్ష భవన అధికారి డేవిడ్‌ శాక్స్‌ బ్లూమ్‌బెర్గ్‌ వార్తా సంస్థతో చెప్పాడు. అదే నిజమైతే ట్రంప్‌ వ్రతం చెడ్డా ఫలం దక్కలేదని చెప్పాల్సి ఉంటుంది. 2023 నుంచి నిషేధం అమలు చేసినందున మూడు సంవత్సరాల్లో ఎంతో నష్టపోయినట్లు ఎన్‌విడియా కంపెనీ వాపోయింది. అమెరికా భద్రత పేరుతో ఈ నిషేధం కారణంగా ఎవరిమీదో ఎందుకు ఆధారపడటం మీరే తయారు చేయండని స్థానిక కంపెనీలకు 70 బిలియన్‌ డాలర్ల ప్రోత్సాహక పాకేజ్‌ను చైనా ప్రకటించింది. అంతే శక్తివంతమైన ప్రత్నామ్నాయాలను రూపొందించింది కనుకనే అమెరికా చిప్స్‌తో పనిలేదన్నట్లుగా ఉంది. భద్రత సాకును వదలివేసి లాభాలే పరమావధిగా ఎగుమతులకు అమెరికా అనుమతి ఇచ్చింది.

ముందే చెప్పుకున్నట్లు చైనా పరిశోధనా రంగంలో చేస్తున్న ఖర్చుకు ఫలితాలు కనిపిస్తున్నాయి.2025 డిసెంబరు ఒకటవ తేదీన ఆస్ట్రేలియన్‌ స్ట్రాటజిక్‌ పాలసీ ఇనిస్టిట్యూట్‌ విడుదల చేసిన సమాచారం ప్రకారం అది విశ్లేషించిన 74 కీలక రంగాలకు గాను 66లో చైనా పరిశోధనలు ముందున్నాయి.అమెరికా కేవలం ఎనిమిదింటిలో మాత్రమే ఉంది. 2000 దశకంలో అమెరికా అగ్రస్థానంలో ఉంది, ఇప్పుడు తిరగబడింది. అయితే చైనా ఆ తరువాత అల్లా ఉద్దీన్‌ అద్బుతదీపాన్ని సంపాదించిందా ? లేదు, ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ప్రకారం ప్రాధాన్యత రంగాలను ఎంచుకొని సాగించిన కృషికి ఫలితమిది.అమెరికా ఎప్పుడైతే అడ్డుకోవాలని చూసిందో అప్పటి నుంచి మరింత పట్టుదల పెరిగింది.అనేక రంగాలలో విదేశాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఇప్పుడు లేదు. అలా అని తలుపులు మూసుకోలేదు, అవసరమైన వాటికోసం వెంపర్లాడటం లేదు. చిప్స్‌ కొనటం లేదని అమెరికా అధికారి వాపోవటానికి కారణం చైనా కాదు, అమెరికా అనుసరించిన ఎత్తుగడలే అన్నది స్పష్టం. అవసరం అయినపుడు అమ్మకుండా తీరిన తరువాత ఇస్తామంటే ఎవరైనా కొనుగోలు చేస్తారా ? చైనా కొన్ని అంశాలలో తన విధానాలను ఇతర దేశాలను చూసి నిర్ణయించుకోవాల్సిన స్థితిలో లేదు. చైనాతో సహా వర్ధమానదేశాలన్నింటినీ తమ గుప్పిటలోకి తెచ్చుకోవాలని అమెరికా శ్వేత సౌధంలో రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఎవరు ఉన్నా అనుసరించిన విధానం ఒక్కటే.అక్కడి అధికారం కోసం వారిలో వారు పోట్లాడుకుంటారు తప్ప ఇతర దేశాలను దోచుకోవటంలో, తంపులు పెట్టి ఆయుధాలు అమ్ముకోవటంలో ఎవరికెవరూ తీసిపోలేదు. ట్రంప్‌ రెండవసారి అధికారానికి వచ్చిన తరువాత చైనాపై చిప్‌ యుద్ధం 2.0 ప్రారంభించాడు, ఇది ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారితీస్తుందో చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎడారిలో ఇసుక అమ్మకం – ఎలన్‌ మస్క్‌ అమెరికా పార్టీ !

12 Saturday Jul 2025

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

America Party, BILLIONAIRE RAJ, Democratic party, Donald trump, Elon Musk, MAGA Republicans, Republican party

ఎం కోటేశ్వరరావు


ప్రపంచ ధనికుడు ఎలన్‌ మస్క్‌ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మీద ఆగ్రహంతో ‘‘ అమెరికా పార్టీ ’’ పేరుతో రాజకీయ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించేశాడు. దాని మీద రాజకీయ పండితులు చర్చలు చేస్తున్నారు. తమకు ప్రయోజనం కలిగించని లేదా వ్యతిరేకించిన పాలకుల మీద ఆగ్రహించిన వాణిజ్య, పారిశ్రామికవేత్తలు డబ్బుమదంతో తెల్లవారేసరికి పార్టీ పెట్టి తడాఖా చూపుతామంటూ హడావుడి చేయటం అన్ని దేశాలలో జరిగేదే. అమెరికాలో కూడా అదే జరిగింది. ఇప్పుడున్న స్థితిలో అతగాడి ప్రయత్నం ఎడారిలో ఇసుక అమ్మటమే అవుతుందన్నది ఒక వ్యాఖ్య. ట్రంప్‌తో ప్రేమాయణానికి కటీఫ్‌ చెప్పిన తరువాత తన ఫ్యాక్టరీలు, వ్యాపారాలను చూసుకుంటానని చెప్పిన పెద్దమనిషి బిగ్‌, బ్యూటీఫుల్‌( పెద్దది, అందమైన) బిల్లుగా వర్ణించినదానిని పార్లమెంటు గనుక ఆమోదిస్తే తాను రాజకీయ పార్టీని పెడతానని ప్రకటించాడు.ఆమోదం పొందటం, రాజకీయ పార్టీ ప్రకటన వెంటనే జరిగాయి.మఖలో పుట్టి పుబ్బలో అంతరించే పార్టీలు ప్రపంచమంతటా ఉన్నాయి. ఇది కూడా అలాంటిదే అవుతుందా, 24.7బిలియన్‌ డాలర్ల వ్యక్తిగత సంపదతో ప్రపంచ ధనికుడిగా ఉన్న మస్క్‌ డబ్బును వెదజల్లి అమెరికా రాజకీయాలను మలుపుతిప్పుతాడా, అక్కడ ఇప్పటికే తిష్టవేసిన రిపబ్లిన్‌, డెమోక్రటిక్‌ పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలుపుతాడా ? ఇలా పరిపరి విధాలుగా ప్రపంచ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. నిన్నటి వరకు ముద్దులాడుకున్న వారు నేడు దెబ్బలాడుకుంటున్నారు. రేపేం చేస్తారో తెలియదు, రాజకీయాలు, వ్యాపారాల్లో ఏదైనా జరగవచ్చు.


అసలు వారెందుకు విడిపోయారు ? తాను తయారు చేసే టెస్లా విద్యుత్‌ కార్లతో అమెరికాను ప్రపంచాన్ని నింపాలని ఎలన్‌ మస్క్‌ ఆశపడ్డాడు. అందుకు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ఉంటే తన ఆటలు సాగించుకోవచ్చనుకున్నాడు. ట్రంప్‌ పలుకుబడితోనే నరేంద్రమోడీపై వత్తిడి తెచ్చి మనదేశంలో స్టార్‌లింక్‌ను సాధించిన సంగతి తెలిసిందే, టెస్లా కార్లను కూడా మార్కెటింగ్‌ చేస్తానని ప్రకటించాడు.మస్క్‌ కంపెనీకి స్థానిక మార్కెట్‌ మొత్తాన్ని అప్పగిస్తే అమెరికాలో పెట్రోలు, డీజిలు, గ్యాస్‌ వ్యాపారం చేసేవారు, వాటితో నడిచే కార్లు తయారు చేసేవారు చేతులు ముడుకు కూర్చుంటారా ? రంగంలోకి దిగి ట్రంప్‌కు వార్నింగ్‌ ఇవ్వటంతో అతగాడు వెనక్కు తగ్గాడు.అక్కడే మొదలైంది రచ్చ. దాన్ని బయటకు చెప్పుకోలేడు గనుక ట్రంప్‌ యంత్రాంగం రూపొందించిన పొదుపు బిల్లు ఆమోదం పొందితే అమెరికా సర్వనాశనం అవుతుందంటూ ధ్వజమెత్తాడు. ట్రంప్‌ ఊరుకుంటాడా ఇలాగే వాగితే నీ కార్లకు ఇస్తున్న సబ్సిడీల మొత్తాన్ని ఎత్తివేస్తా ఆలోచించుకో అన్నాడు. కాస్త మెత్తబడినప్పటికీ ఆవిరైన ప్రేమ తిరిగి చిగురించలేదు, ఛీ పో అంటే ఛా పో అనుకున్నారు. ఇప్పుడేం జరుగుతుందన్నది ఆసక్తి కలిగించే అంశం.


అమెరికాను మరోసారి గొప్పదాన్ని చేయాలనే పిలుపును సమర్ధించిన వారందరికీ మస్క్‌ నిర్ణయం రుచించలేదు.ట్రంప్‌ ద్వారా గరిష్టంగా లబ్దిపొందాలని చూసిన బడాబాబులకు అమెరికా పార్టీ గురించి భయం లేదుగానీ మస్క్‌ తెస్తున్న వత్తిడి గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. పార్లమెంటు ఆమోదించి ట్రంప్‌ సంతకం అయిన పొదుపు చట్టం అమలు జరిగితే కార్మికవర్గ సంక్షేమ కార్యక్రమాల మీద తొలివేటు పడుతుందనే భయంతో ఇప్పటికే జనం భారీ ఎత్తున రెండుసార్లు నిరసన ప్రదర్శనలు చేశారు.ప్రాధమిక వార్తల ప్రకారం ఇది అమల్లోకి వస్తే కోటీ 30లక్షల మందికి ఆరోగ్యబీమా గల్లంతు లేదా ఉన్నప్పటికీ నిరుపయోగంగా మారుతుందనే విశ్లేషణలు వచ్చాయి.జనాల నుంచి ఎదురయ్యే నిరసనలను ఎలా అణచివేయాలా అని చూస్తుంటే మధ్యలో మస్క్‌ గొడవేంటని ఇతర కార్పొరేట్‌ శక్తులు చిరాకు పడుతున్నాయి. ట్రంప్‌ చట్టంతో ఇప్పటికే ఉన్న దేశ రుణానికి మరో నాలుగున్నరలక్షల కోట్ల డాలర్లు తోడవుతుందని మస్క్‌ ధ్వజమెత్తాడు. ఇప్పటికే జిడిపిలో 122శాతం 36.2లక్షల కోట్ల డాలర్ల అప్పు ఉంది. దాన్ని మరో నాలుగులక్షల కోట్ల డాలర్లు పెంచుకొనేందుకు మే నెలలో అనుమతి ఇచ్చారు, ఇప్పుడు మరో ఐదు లక్షల కోట్లడాలర్ల వరకు పెంచాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికాలో జన్మించి 2002లో అమెరికా పౌరసత్వం పొందిన మస్క్‌కు కెనడా పౌరసత్వం కూడా ఉంది. నిబంధనల ప్రకారం అమెరికా గడ్డమీద పుట్టిన వారు మాత్రమే అధ్యక్షపదవికి అర్హులు. ప్రస్తుతం రెండు పార్టీలు పోటాపోటీగా పార్లమెంటు ఉభయ సభల్లో సీట్లు తెచ్చుకుంటున్న పూర్వరంగంలో తనకున్న ధనబలంతో సెనెట్‌లో రెండు మూడు, ప్రజాప్రతినిధుల సభలో 8 నుంచి 10 తెచ్చుకుంటే చక్రం తిప్పవచ్చన్నది మస్క్‌ ఎత్తుగడ.తాజాగా మస్క్‌ వ్యతిరేకించిన ట్రంప్‌ ముందుకు తెచ్చిన బిగ్‌, బ్యూటీఫుల్‌ బిల్లు పార్లమెంటులో చావుతప్పి లొట్టపోయినట్లుగా నెగ్గింది. వంద మంది ఉన్న సెనెట్‌లో వ్యతిరేక, అనుకూల ఓట్లు 50 చొప్పున రాగా ఉపాధ్యక్షుడిగా ఉన్న జెడి వాన్స్‌ తన నిర్ణయాత్మక ఓటుతో బిల్లును గట్టెక్కించాడు. ప్రజాప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు 220 ఓట్లు ఉన్నప్పటికీ బిల్లుకు అనుకూలంగా 218 మాత్రమే రాగా 212 ఉన్న డెమోక్రాట్లతో మరో ఇద్దరు అధికారపక్ష సభ్యులు చేతులు కలపటంతో వ్యతిరేకంగా 214 వచ్చాయి. ఇలాంటి సమయాల్లో మూడో పక్షానికి ఎంపీలు ఉంటే కింగ్‌ మేకర్‌లుగా మారతారు. ఎలన్‌ మస్క్‌ ఆకాంక్ష, యత్నం అదే. రెండు పార్టీల విధానాలకు ప్రత్యామ్నాయం గురించి కాదు. గతంలో డెమోక్రటిక్‌ పార్టీకి, గత ఎన్నికల్లో రిపబ్లికన్‌ ట్రంప్‌కు మద్దతు ఇచ్చాడు. ఎవరికి బాసటగా ఉన్న తన లాభమే పరమావధి.

రెండు పార్టీలకు పరిష్కారం తన పక్షమే అని, అమెరికన్లు కోల్పోయిన స్వాతంత్య్రాన్ని తిరిగి ఇస్తానని మస్క్‌ చెప్పాడు. మూడిరట రెండు వంతుల మంది కొత్త పార్టీ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. ట్రంప్‌ ఏలుబడిలో ప్రభుత్వ సిబ్బంది సామర్ధ్యం పెంచే పేరుతో ఎలన్‌ మస్క్‌ చేపట్టిన డోజ్‌ ఉద్యోగులను తొలగించేందుకు పని చేసింది తప్ప మరొకటి కాదు. ట్రంప్‌ తెచ్చిన చట్టం కార్పొరేట్లకు పన్నుల తగ్గింపు, సామాన్యుల సంక్షేమం కుదింపుకు ఉద్దేశించింది. ప్రస్తుతం 7.1 కోట్ల మంది ఆరోగ్యబీమాపై ఆధారపడి ఉన్నారు. రానున్న పది సంవత్సరాల్లో కోటీ 70లక్షల మంది ఈ పథకానికి దూరం అవుతారు. మనదేశంలో ఆహార భద్రతా పథకం కింద 80 కోట్ల మందికి ఉచిత బియ్యం, గోధుమలు ఇస్తున్నట్లుగానే అమెరికాలో అదనపు పోషకాహారం పేరుతో 4 కోట్ల మంది ఆహార కూపన్లు ఇస్తున్నారు. వీరిలో 47 లక్షల మంది వాటిని కోల్పోతారు. కొత్త చట్టం అమలుచేస్తే సంక్షేమ పథకాలకు లక్ష కోట్లడాలర్లు కోతపడుతుందని అధ్యక్ష భవనం రూపొందించిన పత్రమే చెప్పింది. ఈ సొమ్మును దేనికి ఖర్చు చేస్తారో తెలుసా ! అక్రమంగా సరిహద్దు దాటకుండా ఉండేందుకు మెక్సికో సరిహద్దులో ఏర్పాటు చేసిన ఇనుప గోడకు 46బిలియన్‌ డాలర్లు, వలస వచ్చిన వారికి నిర్బంధ శిబిరాల్లో పడకలకు 45బి.డాలర్లు, వలస వచ్చిన వారిని గుర్తించి 2029 నాటికి దేశం నుంచి తరిమివేసేందుకు అవసరమైన మరో పదివేల మంది సిబ్బంది నియామకానికి ఇలా మొత్తం 350 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయనున్నారు. కొత్త లేదా పాత విద్యుత్‌ కార్లు కొనుగోలు చేసే వారికి ఇస్తున్న పన్ను రాయితీలు సెప్టెంబరు 30తో ముగుస్తాయి, వాటిని 2032వరకు పొడిగిస్తారు. పార్లమెంటు అనుమతి లేకుండా ప్రభుత్వం అప్పులు చేయటానికి లేదు, ఒక పరిమితి ఉంటుంది. అయితే 1960 నుంచి ఇప్పటికి 78 సార్లు నిబంధనలను సవరించారు. ట్రంప్‌ తొలిసారి పాలనా కాలంలో 8లక్షల కోట్ల మేర కొత్త అప్పు చేసేందుకు నిబంధనలు సడలించారు. ఇలాంటి సవరణలకు రెండు పార్టీలూ సై అంటాయి.


అమెరికా రాజకీయాల్లో బ్లాక్‌మెయిల్‌ చేయటం కూడా మామూలే, పెరోట్‌ కుమార్తె గురించి బుష్‌ తప్పుడు ప్రచారం చేయటం, అదివాస్తవం కాదని నిరూపించుకోలేని స్థితిలో 1992 ఎన్నికల్లో తొలుత పోటీ నుంచి వెనక్కు తగ్గాడు, తరువాత తిరిగి రంగంలోకి వచ్చాడు. బుష్‌ కుటుంబం మీద ఉన్న ఆగ్రహంతో రాస్‌ పెరోట్‌ అనే బిలియనీర్‌ 1992 అధ్యక్ష ఎన్నికలలో రిఫామ్‌ పార్టీ పేరుతో పోటీ చేశాడు. బిల్‌ క్లింటన్‌ డెమోక్రటిక్‌ పార్టీ (43) జార్జి బుష్‌ రిపబ్లికన్‌ పార్టీ 37.5 శాతం ఓట్లు తెచ్చుకోగా పెరోట్‌కు 18.9శాతం ఓట్లు వచ్చాయి. అయితే అధ్యక్ష ఎన్నికకు కావాల్సిన ఎలక్టరల్‌ కాలేజీలో ఒక్క ఓటూ రాలేదు. ఎలన్‌ మస్క్‌ కూడా బ్లాక్‌మెయిలింగ్‌లో తక్కువ తినలేదు. ఎప్‌్‌స్టెయిన్‌ అనేవాడు బడాబాబులకు పిల్లల్ని తార్చి డబ్బుగడిరచటంలో పేరు మోశాడు. అతగాడి జాబితాలో డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా ఉన్నట్లు విమర్శలు వచ్చాయి. అనుమానాస్పద స్థితిలో వాడు జైల్లో చచ్చాడు. దాంతో ఎప్‌స్టెయిన్స్‌ ఫైల్స్‌ గురించి దర్యాప్తును మూసివేసి పెద్దలను కాపాడారని గుప్పు మంది. అందే అంశాన్ని ట్రంప్‌తో చెడిన తరువాత మస్క్‌ ముందుకు తెచ్చాడు. ఆ విషయాలు అతగాడికి ఎప్పుడో తెలిసినప్పటికీ గత ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతుగా సర్వశక్తులూ వడ్డాడు, తన సామాజిక మాధ్యమం ఎక్స్‌ను ఉపయోగించాడు, పెద్ద మొత్తంలో స్వంతంగా సొమ్ము ఖర్చు చేశాడు. అందువలన పార్టీ పెట్టి తమను దెబ్బతీస్తాడనుకుంటున్నటున్న మస్క్‌ను వేరే రూపంలో దెబ్బతీసే అవకాశాలు లేకపోలేదు.

పార్టీలను ఏర్పాటు చేయటంలోనూ, రాజకీయాల్లో బిలియనీర్లు పాల్గొనటం ఎలన్‌ మస్క్‌తో ప్రారంభం కాలేదు. రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఒక అధ్యయనంలో ఫోర్బ్స్‌ రూపొందించిన జాబితా ప్రకారం ప్రపంచంలోని 2072 మంది బిలియనీర్లలో 11శాతం మంది రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అధికారాన్ని చేజిక్కించుకొనేందుకు, తమ ప్రభావాన్ని చూపేందుకు ధనికులు ముందుకు వస్తున్నారనటానికి ఇదొక సూచిక. వారు ఎలాంటి విధానాలకు మద్దతు ఇస్తారో కూడా వేరే చెప్పనవసరం లేదు. వారికి ప్రపంచంలో బలమైన సంబంధాలు ఉన్నప్పటికీ సైద్ధాంతికంగా పెద్దగా తెలియదని తేలింది. ప్రపంచ ధనికుల కేంద్రం అమెరికా అయినప్పటికీ ఇక్కడి బిలియనీర్లు ప్రపంచ సగటు కంటే తక్కువగా కేవలం 3.7శాతమే రాజకీయాల్లో ఉన్నారు. రెండు ప్రధాన పార్టీల్లో వీరు తమను అధ్యక్షపదవి అభ్యర్థులుగా ఎన్నుకోవాలని భారీ మొత్తాల్లో నిధులు ఖర్చు చేశారు.లాస్‌ ఏంజల్స్‌ నగర మేయర్‌ పదవి కోసమే రెండుసార్లు జెబి ప్రిట్జ్‌కర్‌ 35 కోట్ల డాలర్లు ఖర్చు చేశాడంటే అధ్యక్ష పదవికి స్వయంగా లేదా మద్దతు ఇచ్చేవారు ఎంత మొత్తాలు ఖర్చు చేస్తారో అర్ధం చేసుకోవచ్చు. 2022 మధ్యంతర పార్లమెంటు ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలకు బిలియనీర్లు ఇచ్చిన విరాళాల మొత్తం 88 కోట్ల డాలర్లు. అగ్రస్థానంలో ఉన్న ఇరవై మందిలో 14గురు రిపబ్లికన్‌ పార్టీకి ఇచ్చినట్లు తేలింది. వివిధ దేశాల ప్రభుత్వాలలో కొలువుదీరిన వారు 242 మంది కాగా సగటున 2.5 పదవులు చేపట్టారు. మనకు మిరేజ్‌, రాఫేల్‌ యుద్ద విమానాలు అమ్మిన కంపెనీ యజమాని సెర్గీ దసాల్ట్‌ ఫ్రాన్సులో ఏకంగా 16 పదవుల్లో పని చేశాడు. తన భార్య రాఫేల్‌ పేరునే విమానానికి పెట్టాడు. బిలియనీర్లు నిరంకుశ, నియంత పాలనలోనే ఎక్కువగా పదవుల్లో రాణించారట. అమెరికా బిలియనీర్లలో డెమోక్రాట్ల కంటే రిపబ్లికన్లను సమర్ధించిన వారు రెండున్నరరెట్లు ఎక్కువ, ఐరోపాలో అత్యధికులు మితవాద శక్తుల మద్దతుదార్లు. ఎలన్‌ మస్క్‌ కార్మికవర్గానికి వ్యతిరేకి. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో అతగాడి పార్టీ గెలుస్తుందో లేదో చెప్పలేము గానీ ఓట్లను చీల్చితే రిపబ్లికన్‌ పార్టీ బలం తగ్గి డెమోక్రాట్లు లాభపడితే ట్రంప్‌కు అడుగుడుగునా ప్రతిఘటన తప్పదు !
 

Share this:

  • Tweet
  • More
Like Loading...

సిగ్గూ ఎగ్గూలేని బతుకులు : ఔను వాళ్లిద్దరూ విడిపోయారు, తిరిగి దగ్గరవ్వాలని చూస్తున్నారు !

11 Wednesday Jun 2025

Posted by raomk in Current Affairs, INTERNATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Donald trump, Elon Musk, Narendra Modi, Tesla, Trump-Musk relationship


ఎం కోటేశ్వరరావు


కేవలం మూడు నిమిషాల్లోనే విడిపోయిన జంట ఉదంతం ప్రపంచంలో అత్యంత తక్కువ సమయం మనుగడ సాగించిన వివాహంగా చరిత్రలో నమోదైంది. కువాయిట్‌లో 2019లో ఇది జరిగింది, ప్రమాదవశాత్తూ తూలిపడిన వధువును బుద్ధిలేనిదానా అని తిట్టిన వరుడు తనకు అక్కర లేదనటంతో కోర్టుకు ఎక్కారు. అంతకు వందేళ్ల క్రితం ఒక హాలీవుడ్‌ జంట కేవలం 20నిమిషాల్లోనే విడిపోయింది. వివాహం మీద పునరాలోచనలో పడ్డ నటి భర్తను హానీమూన్‌ రూమ్‌లో పెట్టి బయట తాళం వేసి వెళ్లిపోయిందట. ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌, ప్రపంచ అగ్రరాజ్య అధిపతి డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రేమాయణం చెడిరది. ఇద్దరూ లాభాలు తప్ప మరొకటి పట్టని పక్కా వ్యాపారులే. ఛీ పో అంటే ఛా పో అనుకున్నారు, అంతలోనే మరోసారి దగ్గరయ్యేందుకు చూస్తున్నారు, సిగ్గూ ఎగ్గులేని బతుకులు. ప్రేమలో పడటానికి, విడిపోవటానికి, తిరిగి దగ్గర కావటానికి డాలర్లు తప్ప మరొక అంశాన్ని ఊహించటం కష్టం. జెఫ్రీ ఎప్‌స్టెయిన్‌ అనే అమెరికన్‌ పక్కా తిరుగుబోతు, తార్పుడుగాడు. పద్నాలుగు, పదిహేనేండ్ల ఆడపిల్లలను వలవేసి పట్టటం అనుభవించటం, బడాబాబులకు తార్చటం, తద్వారా లబ్దిపొందటం వాడి చరిత్ర.2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. వాడి గురించి దర్యాప్తు చేసిన పోలీసులు సేకరించిన సమాచారాన్ని జెఫ్రీ ఫైల్స్‌ అంటున్నారు. వాటిలో డోనాల్డ్‌ ట్రంప్‌ పేరు ఉందన్నది తాజాగా ఎలన్‌ మస్క్‌ పేల్చిన బాంబు. అందుకే వాడిని జైల్లో లేపేశారని బయటకు ఆత్మహత్య చేసుకున్నాడని కథలు అల్లారని చెబుతారు. వీడి ఖాతాదార్లలో ట్రంప్‌ ఉన్నట్లు ఎక్స్‌ చేసిన మస్క్‌ దాన్ని వెనక్కు తీసుకున్నాడు. డోనాల్డ్‌ ట్రంప్‌ పేరు ఎప్‌స్టెయిన్‌ ఫైల్స్‌లో ఉంది, అందుకే వాటిని బహిర్గత పరచలేదు అని మస్క్‌ పేర్కొన్నాడు. తరువాత దాన్ని తొలగించాడు. దీని మీద తన సామాజిక మాధ్యమం ట్రూత్‌లో నాకు వ్యతిరేకంగా ఎలన్‌ మస్క్‌ మారటాన్ని నేను పట్టించుకోను అన్నాడు, ఎయిర్‌ ఫోర్స్‌ ఒన్‌ విమానంలో ప్రయాణిస్తూ దాని గురించి నేనసలు ఆలోచించటం లేదన్నాడు.అయితే మస్క్‌ కంపెనీలతో ప్రభుత్వ కాంట్రాక్టుల గురించి ప్రతి అంశాన్ని పరిశీలిస్తామన్నాడు. డెమోక్రటిక్‌ పార్టీకి నిధులు ఇస్తే సంగతి చూస్తానని బెదిరించాడు.


ట్రంప్‌ను పదవి నుంచి అభిశంసన ద్వారా తొలగించాలని మస్క్‌ అన్నాడు. అదే నోటితో లాస్‌ ఏంజల్స్‌లో వలస కార్మికుల నిరసనలను అణచివేసేందుకు మిలిటరీని దింపిన ట్రంప్‌ను పొగుడుతున్నాడు. మస్క్‌తో మాట్లాడేదేలేదు అన్న ట్రంప్‌ మాట మార్చాడు. మస్క్‌ ఫోన్‌ చేస్తే మీరు మాట్లాడతారా అన్న విలేకర్ల ప్రశ్నకు దాని గురించి నిజంగా నేను ఆలోచించలేదు, నేను ఊహించగలను, దాని గురించి ఆలోచిస్తా అన్నాడు తప్ప అవునని కాదని చెప్పలేదు. దోచుకొనేదగ్గర, వాటాల పంపిణీలో దెబ్బలాట, జనాన్ని అణచటంలో ముద్దులాట. వర్గనైజం ఇది. ఎలన్‌మస్క్‌ పెద్ద వ్యాపారి, పారిశ్రామికవేత్త.తన టెస్లా కార్లను అమ్ముకోవాలన్నా, స్టార్‌లింక్‌ను పలుదేశాల్లో ఏర్పాటు చేయాలన్నా అమెరికా పాలకుల అండకావాలి. మన నరేంద్రమోడీ ఇటీవలనే అనుమతించటం దానికి పక్కా నిదర్శనం. డెమోక్రటిక్‌ పార్టీ మద్దతుదారుగా ఉన్న ఆ పెద్ద మనిషి అందుకోసమే డోనాల్డ్‌ ట్రంప్‌కు ఎన్నికల విరాళాల రూపంలో ఆర్థికంగా భారీ మొత్తంలో సమర్పించుకున్నాడు.అధికారానికి వచ్చిన మరుసటి రోజు నుంచే సతాయించటం మొదలు పెట్టాడు. రానున్న రోజుల్లో వినియోగదారులందరూ విద్యుత్‌ కార్లే కొనుగోలు చేయాలంటూ ఒక విధాన నిర్ణయం చేయాలని, వాటి మీద ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని పెంచాలని, వారికి అందుబాటులో మూలమూలనా చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశాడు. ట్రంప్‌ దానికి అంగీకరించలేదు . ఎందుకని ? అమెరికా కార్ల కంపెనీల యజమానుల చరిత్రను చూసినపుడు తమ కార్లను అమ్ముకొనేందుకు ప్రజారవాణా వ్యవస్థలైన బస్సులు, రైళ్లను, ట్రామ్‌లను పక్కన పెట్టేసే విధంగా ప్రభుత్వాలపై వత్తిడి తెచ్చి విజయవంతమయ్యారు. వారికి పెట్రోలు, డీజిలు అమ్ముకొనే కంపెనీలు వత్తాసు పలికాయి. ఎక్కడో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఎలన్‌ మస్క్‌ ప్రపంచ కుబేరుడు కావచ్చు కానీ ఇప్పటికే ఉన్న చమురు కార్ల పరిశ్రమ మొత్తాన్ని మూసివేయించేంత మొనగాడా అది జరిగితే నీ సంగతి తేలుస్తామని ఆ రంగంలోని కంపెనీలు ట్రంప్‌ను హెచ్చరించటంతో ఇరకాటంలో పడి వెనక్కు తగ్గాడు. వారి మధ్య వైరానికి అసలు కారణం ఇదే !


ఎలన్‌ మస్క్‌, డోనాల్డ్‌ ట్రంప్‌ల అక్రమ సంబంధాలు జగమెరిగిన సత్యం. ఇంతకు ముందు గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు సెర్జీ బెన్‌ భార్య నికోలే సహాన్‌తో మస్క్‌ పెట్టుకున్న అక్రమ సంబంధం కారణంగా వారిద్దరూ విడిపోయారు. తాజా ఉదంతానికి వస్తే అమెరికా అధ్యక్ష భవనంలో ఉన్నత అధికారిగా పనిచేస్తున్న స్టెఫాన్‌ మిల్లర్‌ భార్య కాటీ మిల్లర్‌తో సంబంధం పెట్టుకున్నట్లు గుప్పుమంది. ట్రంప్‌ మీద ఆగ్రహంతో మస్క్‌ డోజ్‌ పదవికి రాజీనామా చేసి బయటకు వెళ్లినపుడు అప్పటి వరకు అధ్యక్ష భవనంలో ఉద్యోగిగా ఉన్న కాటీ కూడా రాజీనామా చేసి ఎలన్‌ మస్క్‌ కంపెనీలో పని చేసేందుకు వెళ్లిపోయింది. వేరే సందర్భంలో స్టెఫాన్‌ మిల్లర్‌ ‘‘ అమెరికాను తిరిగి వెనక్కు తీసుకువచ్చాం’’ అని ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. దాని మీద మస్క్‌ స్పందిస్తూ ‘‘ నేను నీ భార్యను తీసుకుపోయినట్లేనా ’’ అని వ్యాఖ్యానించాడు. అయితే అదంతా నిజం కాదని తానలాంటి పోస్టు పెట్టలేదని మస్క్‌ చెప్పుకున్నప్పటికీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. తన స్వంత కృత్రిమ మేథ గ్రోక్‌ను సంప్రదిస్తే అది కూడా మస్క్‌ పెట్టిన పోస్టు స్క్రీన్‌ షాట్‌ నిజమే అని చెప్పిందట. అమెరికా స్టాక్‌ మార్కెట్‌ వీటిని పెద్దగా పట్టించుకోదు. ఇద్దరూ రాజీబాటలో ఉన్నారని సంతృప్తి వ్యక్తం చేయటంతో మస్క్‌ కంపెనీల వాటాల ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ పడిపోయన నాటి స్థాయికి చేరలేదు. వెంటనే వారిద్దరూ కలవక పోయినా కొన్ని నెలలకు పూర్తిగా సర్దుకుంటారని భావిస్తున్నారు.ఇద్దరి మధ్యా సంబంధాలు బాగున్నాయని అందరూ భావించినపుడు మార్చి నెలలో ట్రంప్‌ ఒక ఎర్ర టెస్లా కారు ముందు నిలిచి దానిని కొనుగోలు చేసినట్లు ఫొటోలకు ఫోజులిచ్చాడు. దాన్ని ఇప్పుడు వదిలించుకోవచ్చని అధ్యక్ష భవన సిబ్బంది చెబుతున్నారు.


మాజీ డెమోక్రాట్‌ అయిన మస్క్‌ 2016లో ట్రంప్‌ తొలిసారి అధికారానికి వచ్చినప్పటి నుంచి వాణిజ్య సలహ మండళ్లలో చోటు సంపాదించుకున్నాడు.రెండోసారి ఓడిపోయిన తరువాత ఇక చాల్లే మళ్లీ పోటీకి దిగవద్దన్నాడు. ఫ్లోరిడా గవర్నర్‌ డేశాంటిస్‌ పోటీ చేస్తే తాను మద్దతు ఇవ్వకపోయినా జో బైడెన్‌ మీద గెలుస్తాడని ఎక్స్‌ చేశాడు. కానీ 2024లో ట్రంప్‌కు అన్నీ తానే అన్నట్లు వ్యవహరించాడు. అతగాడి కోసమే తొలిసారిగా రిపబ్లికన్‌ పార్టీకి ఓటు వేశానన్నాడు. అమెరికా అధికారపీఠంపై అనుచరులతో ట్రంప్‌ దాడి చేయించినపుడు ఎక్స్‌ ఖాతాను రద్దు చేశారు. తరువాత మస్క్‌ కొనుగోలు చేసిన తరువాత 2022 చివరిలో పునరుద్దరించాడు.ట్రంప్‌ సొంతంగా ట్రూత్‌ అనే వేదికను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ట్రంప్‌ కేసుల్లో ఇరుక్కునపుడు ఐదు కోట్ల డాలర్లు మస్క్‌ ఇచ్చాడు. ట్రంప్‌ ఎన్నడూ తనను డబ్బు అడగలేదని తానే ఇచ్చినట్లు చెప్పుకున్నాడు.ఎన్నికల్లో 25 కోట్ల డాలర్లు ఖర్చు చేశాడు. అధికారానికి వచ్చిన తరువాత మస్క్‌ గొంతెమ్మ కోర్కెలు తీర్చే అవకాశం లేదని ట్రంప్‌ పక్కన పెట్టటం ప్రారంభించాడు, ఇచ్చిన పదవితో పండగ చేసుకో అన్నాడు. విద్యుత్‌ వాహనతయారీదారులు కష్టకాలంలో ఉన్నారు. వారు బిలియన్ల డాలర్లను సబ్సిడీగా ఇవ్వాలని కోరుకుంటున్నారు, అది సాధ్యం కాదనటంతో మస్క్‌ ఆశాభంగం చెందాడని ట్రంప్‌ చెప్పాడు. తన మద్దతులేకపోతే రిపబ్లికన్లు ఓడిపోయి ఉండేవారని, కృతజ్ఞత చూపలేదని మస్క్‌ అంటే అతగాడికి పిచ్చి ఎక్కిందని, తానింకే మాత్రం అతగాడి గురించి ఆలోచించనని ట్రంప్‌ బదులిచ్చాడు. నేను చైనా, రష్యాలతో, ఇంకా చాల సమస్యలతో తీరిక లేకుండా ఉన్నాను, ఎలన్‌ గురించి ఆలోచించటం లేదు, మీకు తెలుసు అతగాడు బాగుండాలని కోరుకుంటున్నా అన్నాడు.గుడిలో లింగాన్ని, గుడినీ మింగాలనుకున్న మస్క్‌ ఇచ్చిన పదవితో సంతృప్తి చెందలేదు. దాంతో ఇద్దరూ రోడ్డెక్కారు. మస్క్‌ త్వరలో బయటకు వెళ్లిపోతాడని ట్రంప్‌ తన కాబినెట్‌, ఇతర ముఖ్యులతో వ్యాఖ్యానించినట్లు ఏప్రిల్‌ రెండవ తేదీన పొలిటికో పత్రిక రాసింది. మే చివరి వారంలో పదవీ కాలం ఒక రోజు ఉండగానే రాజీనామా చేశాడు.


ఈ బాగోతం చూసిన తరువాత సామాజిక మాధ్యమం, రాజకీయ వర్గాల్లో జోకులే జోకులు. సముచితమైన ఫీజు కింద మాకు స్టార్‌లింక్‌ కంపెనీ వాటాలు ఇస్తే ఇద్దరి మధ్య రాజీకుదుర్చుతాం, దెబ్బలాడుకోవద్దు అంటూ రష్యన్‌ మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్‌ చమత్కరించాడు. కావాలంటే మస్క్‌కు రాజకీయ ఆశ్రయం కల్పిస్తామని రష్యా ఇతర నేతలు చెప్పారు. ఎలన్‌ ఆశాభంగం చెందవద్దు, అమెరికాలో అసాధ్యమైన సమస్యలను ఎదుర్కొంటే మా దగ్గరకు రండి మాలో ఒకరిగా మారండి, మీ సాంకేతిక నైపుణ్యానికి పూర్తి స్వేచ్చ ఉంటుంది ఇక్కడ నిజమైన స్నేహితులు ఉన్నారంటూ ఎక్స్‌లు చేశారు. ఎవరెన్ని మాట్లాడినా ఒక డాలరు విలువ చేయవు అన్నది ట్రంప్‌, మస్క్‌ తీరు. ఈ మొత్తం ఉదంతంలో అంతిమంగా ట్రంప్‌దే పైచేయి అన్నది స్పష్టం. ఎందుకంటే అపరిమితమైన అధికారం ఉన్నందున ఎలన్‌ మస్క్‌ ఆర్థిక సామ్రాజ్యాన్ని కుప్పకూల్చివేసే అవకాశం ఉంది. అందుకే మస్క్‌ దారికి వచ్చినట్లు కనిపిస్తోంది. కొస మెరుపు ఏమంటే మంగళవారం నాడు ఎలన్‌ మస్క్‌ డ్రైవర్‌తో పనిలేని తన తొలి కారును ప్రయోగించి చూపాడు. దాంతో రోబోటాక్సీ రంగంలో అతగాడి కంపెనీ ఉందన్న భరోసాతో స్టాక్‌మార్కెట్‌లో వాటాల ధరలు పెరిగాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పైసామే పరమాత్మ : ఎలన్‌ మస్క్‌తో చేతులు కలిపిన ‘‘ దేశభక్త ’’ జియో, ఎయిర్‌టెల్‌ ! దేశ రక్షణ సంగతేమిటి !!

14 Friday Mar 2025

Posted by raomk in BJP, CHINA, Congress, CPI(M), Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

Air Tel, BJP, CPI(M), Donald trump, Elon Musk, Jio, Mukesh Ambani, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ప్రపంచ నేతలను మన చుట్టూ తిప్పుకోగల విశ్వగురువుగా నరేంద్రమోడీని కొంత మంది గతంలో వర్ణించారు, అది ఒక కోణంలో నిజమే, బహుళజాతి గుత్త సంస్థలన్నీ మన మార్కెట్‌లో ప్రవేశించేందుకు మోడీ చుట్టూ తిరుగుతున్నారు. రెండోవైపు చూస్తే ప్రపంచ పెట్టుబడిదారుల నేతలను ప్రసన్నం కావించుకొనేందుకు సంతుష్టీకరించేందుకు మోడీ వారి చుట్టూ తిరుగుతున్నారు. తెరవెనుక జరిగే దీని గురించి కోటి మంది గొంతెత్తినా నమ్మని వారి కళ్లు తెరిపించేందుకు ఒక్క దృష్టాంతం చాలు. ఇప్పుడు అదే జరిగింది, అయినా మేం నమ్మం అనేవారిని ఎవరేం చేయలేరు.అంబానీ చెప్పినట్లు నరేంద్రమోడీ వినటం పదేండ్లుగా జరుగుతున్న సాధారణ విషయం. అదే మోడీ డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పినట్లు నడుచుకోవటమే అసలైన వార్త. అదేమిటంటారా ? ఎలన్‌మస్క్‌ స్పేస్‌ఎక్స్‌ కంపెనీ స్టార్‌లింక్‌ ఉపగ్రహ అంతర్జాల సేవలకు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కానీ ఆ కంపెనీ సేవలను తమ ఖాతాదార్లకు అందించటానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు జియో అధినేత ముకేష్‌ అంబానీ, ఎయిర్‌టెల్‌ అధినేత సునీల్‌ మిట్టల్‌ వెల్లడిరచారు. వారికలా ముందే తెలిసిపోతాయి మరి. దీన్ని బట్టి నేర్చుకోవాల్సిందేమిటంటే ఆలూలేదూ చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్న సామెతను తిరిగి రాసుకోవాలి. ఆలూచూలూ లేకుండానే కొడుకును కనొచ్చు, పేరుపెట్టవచ్చు. స్టార్‌లింక్‌ను మన దేశంలో ప్రవేశపెట్టేందుకు 2021 నుంచి ఎలన్‌మస్క్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికింకా అనుమతి ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే గిస్తే అనే పేరుతో ఒప్పందం చేసుకోవటం విశేషం. దీన్ని బట్టి కేంద్ర ప్రభుత్వ ఆమోద ముద్ర లాంఛనమే అన్నది తేలిపోయింది. మన దేశ దిగ్గజాలను ఒప్పించేందుకు మెప్పించేందుకు ఇంతకాలం స్టార్‌లింక్‌కు అనుమతి ఇవ్వలేదని, ఒక అవగాహనకు వచ్చిన తరువాత పచ్చజెండా ఊపేందుకు నిర్ణయించినట్లు స్పష్టమైంది.


కొంత మంది దృష్టిలో స్వదేశీ కార్పొరేట్‌ శక్తులు దేశభక్తులు, ఎప్పటి వరకు అంటే కారణాలు ఏమైనప్పటికీ వారు విదేశీ కార్పొరేట్లతో పోరాడినంతవరకు, తరువాత ? స్వాతంత్య్రానికి ముందు మహాత్మాగాంధీకి నాటి ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్యవేత్త బిర్లా కుటుంబం ఎంతో మద్దతు ఇచ్చింది. అంతకు ముందు దాదాభాయ్‌ నౌరోజీ బరోడా రాజు దగ్గర దివాన్‌(మంత్రి)గా పనిచేశారు, బ్రిటన్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు, మూడుసార్లు కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు, రెండవ సోషలిస్టు ఇంటర్నేషనల్లో సభ్యుడిగా కూడా స్వల్పకాలం పని చేశారు. మనదేశ సంపదను బ్రిటన్‌ ఎలా పీల్చివేస్తున్నదో తెలియచెప్పారు.వారే కాదు, అనేక మంది స్వదేశీ వాణిజ్య, పారిశ్రామికవేత్తలు స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో బ్రిటీష్‌ వారిని వ్యతిరేకించారు. ఎవడి గోలవాడిది, ఎవరి కారణం వారిది.చాలా మందికి భూ సంస్కరణలు అంటే భూమికోసం, భుక్తికోసం పోరాటాలు జరిపిన కమ్యూనిస్టుల కారణంగానే మనదేశంలో వాటిని ప్రవేశపెట్టారని అనుకుంటారు. అది వాస్తవం కాదు, అసలు కమ్యూనిస్టు పార్టీలు ఏర్పడక ముందే వాటికి నాంది పలికారు. నూతన వ్యవస్థ రూపుదిద్దుకుంటున్నపుడు దానికి పాతవ్యవస్థ ఆటంకంగా ఉంటే బద్దలు కొట్టి మరీ అవతరిస్తుంది. కోడి గుడ్డులో పిల్ల ఏర్పడగానే అది బయటకు వచ్చేందుకు అంతకు ముందు రక్షణగా ఉన్న పెంకెను బద్దలు కొట్టుకొని బయటకు వస్తుంది తప్ప అయ్యో ఒకనాడు నాకు రక్షణగా ఉందే అని జాలిపడదు. పెట్టుబడిదారీ వ్యవస్థ పురోగమనానికి ఆటంకంగా ఉన్న ఫ్యూడల్‌ వ్యవస్థను బద్దలు కొట్టటమే ఫ్రెంచి విప్లవ సారం. అది భూసంస్కరణలకు తెరలేపింది. మన దేశంలో స్వదేశీ పెట్టుబడిదారులు ఎదిగేందుకు వలస పాలన, విదేశీ కంపెనీలు ఆటంకంగా ఉన్నాయి. అందుకే బిర్లావంటి పారిశ్రామికవేత్తలు, దాదాభాయ్‌ నౌరోజీ వంటి వాణిజ్యవేత్తలు కూడా వలస పాలనను వ్యతిరేకించారు. ఇది దోపిడీ వర్గ మిత్రవైరుధ్యం, ప్రతి వలస దేశంలోనూ కనిపిస్తుంది. స్వాతంత్య్రం తరువాత బిర్లా వంటి వారు ఏం చేశారన్నది చూస్తే మరింతగా అర్ధం అవుతుంది.


బడా పరిశ్రమల ఏర్పాటుకు తమ వద్ద తగినంత పెట్టుబడిలేని కారణంగా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పేరుతో ప్రభుత్వరంగాన్ని ఆమోదించారు. తగిన బలం పుంజుకున్న తరువాత నూతన ఆర్ధిక విధానాల పేరుతో ఒక్క రక్షణ సంబంధిత రంగాలలో తప్ప మిగతా వాటిలో ప్రభుత్వ పెట్టుబడులు పెట్టకుండా చేయటంలో విజయం సాధించారు. విదేశీ కంపెనీలకు ద్వారాలు తెరవటంతో వాటితో పోటీ పడలేక చేతులు కలిపి సంయుక్త సంస్థల ఏర్పాటుతో లాభాలను పంచుకొనేందుకు చూశారు. ఇవి ముఖ్యంగా ఆటోమొబైల్‌, బీమా తదితర రంగాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. స్వరాజ్‌మజ్డా, మారుతీసుజుకీ, ఇండోసుజుకీ, హీరోహోండా, టాటాడైల్మర్‌,మహింద్రరేనాల్ట్‌, భారతీఆక్సా ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. సర్దుకుపోదారం రండి అనటానికి ఇవి ఉదాహరణలు. పోటీబడి దెబ్బలాడుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు రిలయన్స్‌అమెజాన్‌ ఉదంతం.దేశంలో రిటైల్‌ రంగంలో తమకు పోటీ లేకుండా చూసుకోవాలని చూసిన రిలయన్స్‌ను దెబ్బతీసేందుకు ఫ్యూచర్‌ గ్రూపు దుకాణాలను కొనుగోలు చేయాలని అమెజాన్‌ చూసింది. దాన్ని పడనీయకుండా రిలయన్స్‌ రంగంలోకి దిగింది. చివరికి ఫలితం ఏమంటే 2022 నుంచి ఫ్యూచర్‌ గ్రూపు మూతపడిరది. ముకేష్‌ అంబానీ నేడు ఎలన్‌ మస్క్‌తో రాజీకి వచ్చినట్లే అమెజాన్‌తో కూడా చేతులు కలిపి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. నాడు రిలయన్స్‌కు ప్రధాని మోడీ అండగా ఉన్నారు గనుకనే అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ మూడు రోజుల పాటు ఢల్లీిలో మకాం వేసినా మోడీ దర్శన భాగ్యం కలగక వెనక్కు తిరిగి వెళ్లిపోయినట్లు అప్పుడు వార్తలు వచ్చాయి. ఇప్పుడు రిలయన్స్‌, ఎయిర్‌టెల్‌ కంటే బలమైన స్టార్‌లింక్‌కు సాక్షాత్తూ డోనాల్డ్‌ట్రంపే మద్దతు ఇస్తున్నందున దాన్ని అడ్డుకోవటానికి మోడీకి 56 అంగుళాల ఛాతీ సరిపోయినట్లు కనిపించటం లేదు. సముద్రపు భారీ అలలకు వెన్ను వంచి తప్పించుకోవటం తప్ప ఎదురునిలిచినవారెవరూ బతికి బట్టకట్టలేరు, జియో, ఎయిర్‌టెల్‌ అదే చేశాయి. అడ్డుకొనేందుకు చూసి పోటీ పడలేక తెల్లజెండా ఎత్తి చేతులు కలిపాయి. ఫిబ్రవరి రెండవ వారంలో అమెరికా పర్యటనలో నరేంద్రమోడీతో ఎలన్‌మస్క్‌ భేటీలోనే ఆ కంపెనీలకు ఉప్పంది ఉంటుంది. ఈ మూడూ కలసి వినియోగదారులకు లబ్దిచేకూరుస్తాయా, ఒక్కటిగా చేరి పీక్కు తింటాయా చూడాల్సి ఉంది.


ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌ వ్యాపారాల్లో ఉపగ్రహ ఆధారిత స్టార్‌లింక్‌ అంతర్జాలం అది పెద్దది, 125దేశాల్లో సేవలను అందిస్తున్నది.అనేక సంస్థలను మింగేసింది. మనదేశంలో జియో, ఎయిర్‌టెల్‌ కూడా అలాంటివే. స్టార్‌లింక్‌ను మనదేశంలో ప్రవేశపెట్టాలని ఎలన్‌మస్క్‌ గత నాలుగు సంవత్సరాలుగా ఎంతగా ప్రయత్నిస్తున్నాడో ఈ రెండు కంపెనీల యజమానులు తమ పలుకుబడిని ఉపయోగించి అంతే గట్టిగా ఇప్పటివరకు అడ్డుకున్నాయి. చివరకు ట్రంప్‌ వత్తిడిని మోడీ అడ్డుకోలేరని గ్రహించి తామే లొంగి ఎంత దక్కితే అంతే ప్రాప్తం అన్నట్లుగా రాజీపడ్డాయి. మన దేశ కార్పొరేట్ల తీరుతెన్నులకు ఇది మరొక నిదర్శనం.2023 డిసెంబరులో చేసిన టెలికాం చట్ట ప్రకారం భూ సంబంధ స్పెక్ట్రమ్‌ వేలం ద్వారా, ఉపగ్రహ స్పెక్ట్రమ్‌ను అధికారయంత్రాంగం ద్వారా ఒక ఫీజు నిర్ణయించి కేటాయించేట్లు నిర్ణయించారు. ఎలన్‌ మస్క్‌ మన మార్కెట్‌ మీద ఎప్పటి నుంచో కన్నేసి ఉన్నకారణంగా అందుకు అనుగుణంగా మోడీ సర్కార్‌ పావులు కదిపిందని వేరే చెప్పనవసరం లేదు. మస్క్‌ కంపెనీ స్టార్‌లింక్‌ దరఖాస్తు కేంద్రం ముందు ఉంది. న్యాయమైన పోటీ విధానాన్ని ఎందుకు అనుసరించరని దిగ్గజ కంపెనీలైన అంబానీ రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌ కేంద్రాన్ని అడిగాయి. ప్రభుత్వ విధానం మార్కెట్‌లో అసమాన పోటీకి దారి తీస్తుందని స్పష్టం చేశాయి. రక్షణ, సముద్రయానం,ప్రకృతి విపత్తుల అవసరాల వంటి వ్యవస్థలకు ప్రభుత్వాలు కేటాయింపులు జరపవచ్చని, వాణిజ్య అవసరాలకు మాత్రమే వేలం వేయాల్సిందేనని అవి పేర్కొన్నాయి.చివరకు రాజీ పడ్డాయి.


స్టార్‌లింక్‌ వలన ఏమిటీ ఉపయోగం అంటే ఇంటర్నెట్‌ మరింత వేగం పెరుగుతుంది అని చెబుతున్నారు. అంటే స్టార్‌లింక్‌ కనెక్షన్‌ ఉన్నవారు ఇలా నొక్కగానే అలా సినిమాలు, ఇతర సమాచారం వారి ముందు వాలుతుంది. మారు మూల ప్రాంతాలకూ ఆ సౌకర్యం ఉంటుంది. వీడియో కాల్స్‌లో మన ముందుఉన్నట్లే బొమ్మలు కనిపిస్తాయి,వినిపిస్తాయి. సినిమాలో ఆకర్షణీయ దృశ్యాలను ముందుగా చూపి వీక్షకులను ఆకర్షించేందుకు చూసినట్లుగానే ఇవన్నీ చూపుతున్నారు, చెబుతున్నారు.ఈ సౌకర్యం లేదా సేవలు పొందేవారు ఎంత మూల్యం చెల్లించాలో ఇంకా తెలియదు.మనదేశంతో భూ సరిహద్దు ఉన్న దేశాల నుంచి పెట్టుబడులతో, అదే విధంగా చైనా యాప్‌లతో దేశరక్షణకు ముప్పు ఉంటుందని పెద్ద ఎత్తున హడావుడి చేసిన రోజులను గుర్తుకు తెచ్చుకోవాలి.పెట్టుబడుల మీద ఆంక్షలు, యాప్‌లను నిషేధించారు. ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్‌తో కూడా దేశరక్షణకు సంబంధించిన ఆందోళనను అనేక మంది వ్యక్తం చేస్తున్నారు. సిపిఐ(ఎం), కాంగ్రెస్‌ పార్టీ కూడా ఈ మేరకు ప్రకటనలు చేశాయి. స్టార్‌లింక్‌ కనెక్షన్లు తీసుకున్న సంస్థల ద్వారా దేశభద్రత, విలువైన కీలక సమాచారం సరిహద్దులు దాటిపోయేందుకు అవకాశాలున్నాయని చెబుతున్నారు.టిక్‌టాక్‌ను, ఇతర యాప్‌లను అదే కారణంతో కదా నిషేధించారు, మరి దీన్నుంచి అలాంటి ముప్పులేదా ? రెండిరజన్ల పాలన నడుస్తున్న మణిపూర్‌లో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేసిన సమయాల్లో ఉగ్రవాదులు, ఇతరులు స్టార్‌నెట్‌ సేవలను పొంది సమాచారాన్ని చేరవేసినట్లు డిసెంబరు, జనవరి నెలల్లో గార్డియన్‌ పత్రిక వెల్లడిరచిన సంగతి తెలిసిందే. భద్రతా దళాలు చేసిన సోదాలలో స్టార్‌లింక్‌ యాంటెన్నా, ఇతర పరికరాలను పట్టుకున్నారు. అయితే వినియోగించారని చెబితే పరువుపోతుంది గనుక అవి పని చేయటం లేదని లీకులు వదిలారు. ఏదో ఒకసాకుతో 2024లో ఇంటర్నెట్‌ సేవల నిలిపివేతలో ‘‘నిరంకుశ ’’ పాలన సాగుతున్న మయన్మార్‌లో 85 సార్లు జరిగితే ‘‘ ప్రజాస్వామిక ’’ భారత్‌లో 84 దఫాలు మూసివేసినట్లు సమాచారం. తరువాత 21సార్లతో బిజెపి నిత్యం భక్తి, అనురక్తితో తలుచుకుంటూ పారాయణం చేసే పాకిస్థాన్‌ ఉంది. ప్రజాస్వామిక దేశాలలో మనదే అగ్రస్థానం. ఇలాంటపుడు ఇంకా అధికారికంగా స్టార్‌లింక్‌ అనుమతులు లేనపుడే ఇలా ఉంటే ఇచ్చిన తరువాత దాని మీద నియంత్రణ, పర్యవేక్షణ ప్రశ్నార్ధకమే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పన్ను తగ్గింపు ఒప్పుకోలేము – చెప్పుకోలేము : ‘‘ అసలు సిసలు భారతీయుడు ’’ నరేంద్ర మోడీకి పక్కా అమెరికన్‌ డోనాల్డ్‌ ట్రంప్‌ అగ్నిపరీక్ష !

09 Sunday Mar 2025

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, USA

≈ Leave a comment

Tags

Amezon, BSNL, Donald trump, Elon Musk, India Protectionism, India Tariffs, Jio, Mukesh Ambani, Narendra Modi Failures, Starlink, Tariff King, Tariff War, TRADE WAR

ఎం కోటేశ్వరరావు

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ అని యావత్‌ ప్రపంచం అమెరికా అధినేత డోనాల్డ్‌ ట్రంప్‌ గురించి పాడుకుంటోందంటే అతిశయోక్తి కాదు. ఆ పెద్దమనిషి తీరు చూస్తుంటే అసలు సిసలు భారతీయులం అని చెప్పుకుంటున్న సంఘపరివార్‌కు, అది ముందుకు తెచ్చిన ప్రధాని నరేంద్రమోడీకి అగ్నిపరీక్ష పెట్టినట్లు కనిపిస్తోంది. పదే పదే ప్రతి సుంకాలు, ఆంక్షల గురించి మాట్లాడుతున్నాడు. అమెరికా వస్తువులపై దిగుమతి పన్నులు తగ్గించేందుకు భారత్‌ అంగీకరించిందని శుక్రవారం నాడు చెప్పాడు.వారు చేస్తున్నదానిని చివరకు ఎవరో ఒకరు బహిర్గత పరిచారు అని తన గురించి తానే చెప్పుకుంటూ మనదేశం గురించి మాట్లాడాడు. అయితే సుంకాల తగ్గింపు గురించి ఒప్పుకోలేరుచెప్పుకోలేరు అన్నట్లుగా మన పాలకుల స్థితి ఉంది. అంగీకరించినట్లు మన విదేశాంగశాఖ నిర్ధారించలేదు గానీ వాటి గురించి సంప్రదింపులు జరుగుతున్నట్లు చెప్పినట్లు వార్తా సంస్థ ఒకటి పేర్కొన్నది.ట్రంప్‌ చెప్పిన దాని గురించి నేను మాట్లాడను గానీ, ఇవన్నీ సంప్రదింపులలో ఉన్న అంశాలు గనుక వాటి గురించి చెప్పకూడదని విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ వ్యాఖ్యానించారు.ఇటీవల జరిగిన అనేక వాణిజ్య ఒప్పందాలలో సుంకాల సరళీకరణ మౌలిక అంశంగా ఉన్న సంగతి తెలిసిందే అని కూడా చెప్పారు. ట్రంప్‌కు లేని మర్యాద మనకు అవసరమా ? ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలన్నింటీని రద్దు చేసుకొని ఆదరాబాదరా మన వాణిజ్యశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ వాషింగ్టన్‌ వెళ్లారు. అక్కడ చర్చలు జరుపుతుండగానే ఏప్రిల్‌ రెండు నుంచి పన్నులు విధిస్తామని ట్రంప్‌ చెప్పాడు. మంత్రి ఇంకా అక్కడ ఉండగానే సుంకాలు తగ్గించేందుకు అంగీకరించినట్లు కూడా అదే నోటితో ప్రకటించటం గమనించాల్సిన అంశం. దీనిలో రెండు కోణాలు ఉన్నాయి. ఇలా ప్రకటించి మనదేశాన్ని ఇరికించేందుకు చూడటం ఒకటి. లేదా మనమంత్రి ఒక స్పష్టమైన హామీ ఇచ్చి ఉండాలి. మన నిర్వాకం గురించి ముందుగా ఇతరుల ద్వారానే మనం తెలుసుకోవాలి మరి. ఇది కూడా మోడీ విదేశాల్లో పెంచినట్లు చెప్పిన దేశ ప్రతిష్టలో భాగమేనా ! అసలు మనమంత్రి అలా వెళ్లాల్సిన అవసరం ఏమిటి ? ట్రంప్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడా ? మోడీ విధానాల గురించి రాహుల్‌ గాంధీ విదేశాల్లో విమర్శలు చేయటం ఏమిటని ప్రశ్నించేవారు, ట్రంప్‌ చేసిన ప్రకటన మీద నోటికి తాళం వేసుకోవటం ఏమిటి ?


అబద్దాలు చెప్పటం ట్రంప్‌కు, నిజాలు చెప్పకపోవటం మన కేంద్ర పాలకులకు వెన్నతో పెట్టిన విద్య. గాజాలోని పాలస్తీనియన్లకు శాశ్వత ఆశ్రయం కల్పించేందుకు జోర్డాన్‌ అంగీకరించిందని, ఆ దేశ రాజు అబ్దుల్లాతో కలసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో చెప్పాడు. అది వాస్తవం కాదని, తాము అంగీకరించేది లేదని తరువాత అదే అబ్దుల్లా ప్రకటించాడు. ఉక్రెయిన్‌ భద్రతకు ఎలాంటి హామీ ఇవ్వకుండా విలువైన ఖనిజాల ఒప్పందం మీద సంతకాలు చేయించి కొట్టేసేందుకు ట్రంప్‌ ఇదే ఎత్తుగడ అనుసరించాడు. అయితే జెలెనెస్కీ అడ్డం తిరగటంతో ఓవల్‌ ఆఫీసు పత్రికా గోష్టిలో పదినిమిషాల రచ్చ, జెలెనెస్కీ వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ట్రంప్‌ టీవీ ప్రసంగంలో చేసిన ప్రకటన గురించి ఆదివారం నాడు ఇది రాసిన సమయానికి మనదేశం నుంచి ఎలాంటి స్పందన, వివరణ వెలువడలేదు. ఎలన్‌ మస్క్‌ ఇండియాలో వ్యాపారం చేయాలని అనుకుంటున్నట్లు నేను భావిస్తున్నాను అని నరేంద్రమోడీతో భేటీ అయినపుడు ట్రంప్‌ నిర్మొహమాటంగా చెప్పినట్లు మీడియాలో వచ్చిన వార్తలు నిజమేనా ? యాభై ఆరు అంగుళాల ఛాతీ ఉన్నా భయమా ? తెరవెనుక ఏదో జరిగింది అనుకోవాలా ….? పార్లమెంటు సమావేశాల్లో ఉండగా అక్కడ చెప్పకుండా ఒక నిర్ణయం తీసుకొని నిజంగానే ట్రంప్‌కు చెబితే మనల్ని మనమే అవమానించుకున్నట్లు, ప్రజాస్వామ్యం, ప్రజాప్రతినిధులను కించపరిచినట్లు, రాజ్యాంగ వ్యవస్థలను దిగజార్జినట్లు కాదా ?

మన విశ్వగురువు నరేంద్రమోడీ తీరేవేరు, మరొకరు సాటి రారు. ట్రంప్‌ చేస్తున్న ప్రకటనల గురించి కెనడా,మెక్సికో,చైనా స్పందన, ప్రతిస్పందన చూశాము. మన మోడీ ఎందుకు మాట్లాడటం లేదని 140 కోట్ల మంది జనం మల్లగుల్లాలు పడుతున్నారు.అలాంటి చిన్న విషయాలు అసలు పట్టించుకోనవసరం లేదన్నట్లు కనిపిస్తోంది.వాటి బదులు దేశంలో 2050 నాటికి 44 కోట్ల మందికి ఊబకాయం వస్తుందని జాతిని హెచ్చరిస్తున్నారు. టెలికాం శాఖా మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రిపబ్లిక్‌ టీవీ సభలో మాట్లాడుతూ విదేశీ టెలికాం కంపెనీలకు ఎలాంటి ఆంక్షలను విధించేది లేదని తేల్చి చెప్పేశారు. దీంతో ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌ స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ ప్రసారాలకు తలుపులు బార్లా తెరిచినట్లు స్పష్టమైంది.మనదేశ టెలికాం రంగం ఎంతో నిబ్బరంతో ఉందని, ప్రపంచ సంస్థలను ఆహ్వానించేందుకు సిద్దంగా ఉందని , భారత్‌ ఎవరినీ చూసీ భయపడటం లేదని చెప్పారు.తనకు దేశ పౌరులు అత్యంత ముఖ్యమని, ప్రపంచంలో అందుబాటులో ఉన్నవాటిలో వారు దేన్ని కోరుకుంటే దాన్ని తెచ్చి ఇవ్వటం మంత్రిగా తన విధి, వసుధైక కుటుంబంలో తనకు విశ్వాసం ఉందన్నారు.


జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఎలన్‌ మస్క్‌ మనదేశ ఇంటర్నెట్‌, విద్యుత్‌ వాహనాల రంగంలోకి పెద్ద అడుగువేయనున్నట్లు కనిపిస్తోంది. యుపిఏ హయాంలో స్పెక్ట్రమ్‌ను అనుకూలురకు కేటాయించి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించిన నరేంద్రమోడీ తాను వేలం పద్దతిలో కేటాయించనున్నట్లు చెబితే, నిజంగానే అనేక మంది అభినందించారు. ఇప్పుడు ఎలన్‌ మస్క్‌ విషయానికి వస్తే ఉపగ్రహ స్పెక్ట్రమ్‌ వేలానికి బదులు అధికార కేటాయింపులకు ఎందుకు పాల్పడుతున్నట్లు ? ఇది మరో స్పెక్ట్రం కుంభకోణం కాదా ! అడిగితే దేశద్రోహులు అంటారేమో, అడిగితే ఏమిటి ముకేష్‌ అంబానీగారు ఇప్పటికే అడిగేశారు. అదేదో సినిమాలో వినపడలా అన్న చెవిటి పాత్ర డైలాగ్‌ను గుర్తుకు తెచ్చుకుందాం. నిజానికి వినపడకపోవటం కాదు, కావాలని చేసిందే. రెండు రకాల కేటాయింపు విధానాలెందుకు ? 2023 డిసెంబరులో చేసిన టెలికాం చట్ట ప్రకారం భూ సంబంధ స్పెక్ట్రమ్‌ వేలం ద్వారా, ఉపగ్రహ స్పెక్ట్రమ్‌ను అధికారయంత్రాంగం ద్వారా ఒక ఫీజు నిర్ణయించి కేటాయించేట్లు నిర్ణయించారు. ఎలన్‌ మస్క్‌ మన మార్కెట్‌ మీద ఎప్పటి నుంచో కన్నేసి ఉన్నకారణంగా అందుకు అనుగుణంగా మోడీ సర్కార్‌ పావులు కదిపిందని వేరే చెప్పనవసరం లేదు. మస్క్‌ కంపెనీ స్టార్‌లింక్‌ దరఖాస్తు కేంద్రం ముందు ఉంది. న్యాయమైన పోటీ విధానాన్ని ఎందుకు అనుసరించరని దిగ్గజ కంపెనీలైన అంబానీ రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌ కేంద్రాన్ని అడిగాయి. ప్రభుత్వ విధానం మార్కెట్‌లో అసమాన పోటీకి దారి తీస్తుందని స్పష్టం చేశాయి. రక్షణ, సముద్రయానం,ప్రకృతి విపత్తుల అవసరాల వంటి వ్యవస్థలకు ప్రభుత్వాలు కేటాయింపులు జరపవచ్చని, వాణిజ్య అవసరాలకు వేలం వేయాల్సిందేనని అవి పేర్కొన్నాయి. ఎలన్‌ మస్క్‌ దరఖాస్తు మీద ఇంకా అంతిమ నిర్ణయం తీసుకోలేదు. తీసుకుంటే మాత్రం నరేంద్రమోడీతో జియో,ఎయిర్‌టెల్‌,ఇతర కంపెనీలు లడాయికి దిగటం ఖాయం. భూ సంబంధ స్ప్రెక్ట్రమ్‌ను ఒకరికి కేటాయించినదానిని మరొకరు వినియోగించలేరని, కానీ ఉపగ్రహస్రెక్ట్రమ్‌ను ఎవరైనా పంచుకోవచ్చని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వాదించారు. మంత్రికి తెలిసిన మాత్రం జియో, ఎయిర్‌టెల్‌ యాజమాన్యాలకు తెలియకుండానే వేలం గురించి మాట్లాడాయనుకోవాలా ?

అమెరికాలో స్టార్‌లింక్‌ కనెక్షన్‌ తీసుకోవాలంటే 120 డాలర్లు చెల్లించాల్సి ఉండగా ఆఫ్రికాలో మార్కెట్‌ను స్వంతం చేసుకొనేందుకు కేవలం పదిడాలర్లకు అందచేస్తున్నది. మనదేశంలో కూడా అదే విధంగా పోటీ పడితే ప్రపంచ ధనికుడు ఎలన్‌మస్క్‌తో ఆసియా ధనికుడు ముకేష్‌ అంబానీ తట్టుకోగలరా ? ఇలా అంటున్నానంటే అంబానీ పట్ల సానుభూతి ఉండి కాదు, ఎందుకంటే మన బిఎస్‌ఎన్‌ఎల్‌ను దెబ్బతీసిన వారిలో ఆ పెద్దమనిషి కూడా ఉన్నందున అనుభవించాల్సిందే కదా ! ముకేష్‌ అంబానీ రిటైల్‌ స్టోర్ల నిర్వహణలో తనకు పోటీగా వచ్చిన అమెజాన్‌ కంపెనీని నరేంద్రమోడీ సహకారంతో తాత్కాలికంగా వెనక్కు నెట్టారు, కానీ మరోసారి పెద్ద ఎత్తున అమెజాన్‌ రంగంలో దిగేందుకు చూస్తున్నది. ట్రంప్‌ మద్దతు దానికి ఉంటుంది. రెండు కంపెనీలు పోటీ పడనున్నాయి. ఏఏ రంగాలలో తలపడేదీ ముందు ముందు తెలుస్తుంది.అమెజాన్‌ ఉపగ్రహ ఇంటర్నెట్‌ కుయిపర్‌ కూడా అనుమతి కోసం చూస్తున్నది.ముకేష్‌ అంబానీ జియో కంపెనీ స్టార్‌ ఇండియా, డిస్నీతో చేతులు కలిపేందుకు నిర్ణయించారు. రానున్న రోజుల్లో అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, సోనీలతో పోటీకి సిద్దపడుతున్నాయి.


ఇక ఎలన్‌ మస్క్‌, అతగాడిని భుజాల మీద మోస్తున్న డోనాల్డ్‌ ట్రంప్‌ మన దేశంలో టెస్లా విద్యుత్‌ కార్లను విక్రయించటానికి 110శాతం దిగుమతి పన్ను ఆటంకంగా ఉంది. స్టార్‌లింక్‌ మనదేశంలో కార్యకలాపాలు ప్రారంభిస్తే లైసన్సు ఫీజు నామమాత్రం గనుక తక్కువ ధరలకే కనెక్షన్లు ఇస్తుందని వేరే చెప్పనవసరం లేదు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లుగా ఇతర కంపెనీలను దెబ్బతీసేందుకు జియో చూసినట్లుగానే మస్క్‌ వస్తే దానితో పాటు, ఇతర కంపెనీల ఖాతాదారులందరూ మారిపోయే అవకాశం ఉంది.అలాగే కార్ల రంగంలో రారాజుగా ఉన్న టాటా, చిన్న కంపెనీలైన ఎంజి, కోటక్‌లకు ఎసరు వస్తుందని భావిస్తున్నారు. విదేశీ కార్ల మీద పన్ను తగ్గిస్తే సదరు అవకాశాన్ని ఒక్క టెస్లా మాత్రమే కాదు, చైనా, ఇతర దేశాల కంపెనీలు కూడా వినియోగించుకుంటాయి. వినియోగదారులు లబ్ది పొందుతారు. మన పరిశ్రమలు, ఉపాధి సంగతేమిటన్నదే ప్రశ్న. ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌ను దెబ్బతీస్తుంటే కొంత మేరకు అడ్డుకొనేందుకు పోరాడిన ఉద్యోగులు ఓడిపోయారు. కానీ తమను దెబ్బతీసే చర్యలకు అనుమతిస్తే మన బడాకార్పొరేట్లు చూస్తూ ఊరుకుంటాయా ? పదేండ్లుగా ఇస్తున్న మాదిరే బిజెపికి నిధులు ఇస్తాయా ? వాటి ఆధీనంలో ఉన్న మీడియా సంస్థలు సానుకూల భజన కొనసాగిస్తాయా ? తమకు అనుకూలమైన పార్టీ, శక్తులను రంగంలోకి తెచ్చేందుకు చూడకుండా ఉంటాయా ? ఇలా ఎన్నో ప్రశ్నలు.


కార్లు లేదా సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులుగానీ ఎక్కడెక్కడో తయారు చేసిన విడి భాగాలను తీసుకు వచ్చి వాటికి ఒక రూపు(అసెంబ్లింగ్‌) ఇచ్చి తమ బ్రాండ్లు వేసుకొని అమ్ముతున్నారు. అలాంటి కార్ల ఫ్యాక్టరీకి మూడు సంవత్సరాల్లో 50 కోట్ల డాలర్లు పెట్టుబడి పెడితే ఎనిమిదివేల వాహనాలను దిగుమతి చేసుకొనేందుకు అనుమతి, వాటికి కేవలం 15శాతమే పన్ను విధిస్తామని కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని ప్రకటించింది. అది ఒక్క టెస్లాకే కాదు, చైనాతో సహా ఎవరికైనా వర్తిస్తుంది.ఇలాగాక నేరుగా దిగుమతి చేసుకొంటే వాటి మీద 110శాతం పన్ను విధిస్తున్నారు. ఇప్పటికే చైనాలో ఫ్యాక్టరీ పెట్టిన టెస్లా అక్కడ తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. పోటీదార్లను దెబ్బతీసేందుకు ధరలను తగ్గించి మార్కెట్‌ను సొంతం చేసుకోవటం కంపెనీల ఎత్తుగడ. ఆ పోటీలో చైనా ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు స్థానిక ప్రైవేటు కంపెనీ అయిన బివైడి వంటి వాటికి కూడా పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇచ్చి నిలుపుతున్నది. అక్కడి సంస్థలు ఇంజన్లతో సహా కార్లకు అవసరమైన అన్ని భాగాలను తయారు చేస్తాయి, అటు వంటి పరిస్థితి టెస్లాకు గానీ మనదేశంలో ఉన్న సంస్థలకు గానీ లేవు. అందువలన చైనా కంపెనీలు కూడా మనదేశం వస్తే పరిస్థితి ఏమిటన్నది సమస్య.అయితే విద్యుత్‌ కార్ల ధరల విషయానికి వస్తే ప్రారంభ రకాల ధర టెస్లాతో పోల్చితే మన దేశంలో తయారవుతున్నవి తక్కువ వెలకే లభ్యమౌతున్నాయి. అందువలన అంతకంటే తక్కువ అయితేనే విదేశీ కంపెనీలు నిలదొక్కుకుంటాయి. 1990దశకం వరకు మన ప్రైవేటు రంగానికి ఎంతో రక్షణ ఉంది. తరువాత సరళీకరణలో భాగంగా విదేశీ కంపెనీలకు ద్వారాలు తెరవటంతో వాటితో చేతులు కలిపారు. ఇండోసుజుకీ, స్వరాజ్‌మజ్డా ఇంకా అలాంటివే ఎన్నో. తరువాత కూడా రక్షణలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు మరింతగా మార్కెట్‌ను తెరవటంతో తెగబలిసిన స్వదేశీ కార్పొరేట్లకు పెద్ద సవాలు ఎదురుకానుంది. వాటికి ప్రాతినిధ్యం వహించే బాంబే క్లబ్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఆర్థిక రంగంలో జరుగుతున్న పరిణామాలు రాజకీయ రంగంలో పర్యవసానాలకు దారి తీస్తాయన్నది ప్రపంచ అనుభవం. దానికి మనదేశం అతీతంగా ఉంటుందా ! నరేంద్రమోడీ పీఠం కదలకుండా ఉంటుందా !! కరవమంటే కప్పకు`విడవ మంటే పాముకు కోపం, ఏం జరుగుతుందో చూద్దాం !!!

Share this:

  • Tweet
  • More
Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌ తీరు తెన్నులు : నరనరాన భారత్‌పై విద్వేషం ! అయినా ఆలింగనాలకోసం నరేంద్రమోడీ తహతహ !!

12 Wednesday Feb 2025

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

BJP, Donald trump, Elon Musk, JD Vance, Narendra Modi Failures, normalising indian hate:, Racist, RSS

ఎం కోటేశ్వరరావు


మేకతోలు కప్పుకుంటే పులి చారలు కనిపించవు తప్ప దాని స్వభావం మారుతుందా ?నరేంద్రమోడీని డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఆలింగనాలతో ముంచి తేల్చవచ్చు తప్ప అతగాడి అంతరంగం బయటపడకుండా ఉంటుందా ! మన దేశమన్నా, మన పౌరులన్నా విద్వేషం వెళ్లగక్కేవారు అమెరికాలో ఎందరో ! వారిలో ఒకడైన మార్కో ఎలెజ్‌(25) అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు అమెరికా మీడియాను ఆకర్షించాడు. సామాజిక మాధ్యమంలో వాడు పెట్టిన పోస్టులలో ‘‘ భారతీయుల మీద విద్వేషాన్ని సాధారణీకరించండి ’’ అన్నది ఒకటి. శ్వేతజాతి దురహంకారులు ఇలాంటి పోస్టులు పెట్టటం సర్వసాధారణం, ప్రతిదాన్నీ పట్టించుకోనవసరం లేదు. మరి మార్కో ప్రత్యేకత ఏమిట ? అమెరికా అసలైన అధ్యక్షుడిగా అధికారం చెలాయిస్తున్న ఎలన్‌ మస్క్‌, ఆంధ్రా అల్లుడు అంటూ మన జనాలు పొంగిపోయిన ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌, చివరిగా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అందరూ వాడిని సమర్ధించారు, ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటికి పోతే పిలిచి తిరిగి ఇవ్వాలని చెప్పారు. కొద్ది రోజుల్లో భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వస్తున్నాడని వారికి తెలుసు, అయినా భారత్‌ మీద విద్వేషం వెళ్లగక్కిన వాడిని సమర్ధించటం ఏమిటి ? ఈ పరిణామం మీద ఆత్మగౌరవం గురించి కబుర్లు చెప్పే కాషాయ దళాలుగానీ, కేంద్ర ప్రభుత్వం గానీ నోరుమెదపలేదు. దీన్ని లొంగుబాటు అనాలా ? బానిస మనస్తత్వం అనాలా !


సామర్ద్యం లేని ప్రభుత్వ ఉద్యోగులందరనీ ఊరికే కూర్చో పెట్టి మేపుతున్నాం, వారందరినీ ఇంటికి పంపిస్తాం అని డోనాల్డ్‌ట్రంప్‌ చెప్పాడు. అందుకు గాను ప్రపంచ కుబేరుడు, మనందరీకీ తెలిసిన సామాజిక మాధ్యమవేదిక ఎక్స్‌ అధిపతి ఎలన్‌ మస్క్‌ను కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ సామర్ధ్య శాఖ మంత్రిగా నియమించాడు. అతగాడు ఇప్పుడు 23లక్షల ప్రభుత్వ సిబ్బందికి ఒక ఆదేశం జారీ చేసి స్వచ్చందంగా తప్పుకొనేవారికి ఒక అవకాశం ఇస్తున్నాం, మిగిలిన వారి సంగతి తరువాత చూస్తాం అని ప్రకటించాడు. అమెరికాలో వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ అనే దినపత్రిక అత్యధికంగా కాపీలు ముద్రించేదిగా ముందున్నది. అది డోనాల్డ్‌ ట్రంప్‌ చర్యల పట్ల విమర్శనాత్మక వైఖరిని ప్రదరిస్తుంది గనుక వ్యతిరేక పత్రికగా ముద్రవేశారు. ఆ పత్రిక ఎలన్‌ మస్క్‌ కంపెనీ స్పేస్‌ ఎక్స్‌లో పని చేసిన మార్కో ఎలెజ్‌కు ఎలన్‌ మస్క్‌ తన శాఖలో ఎందుకు ఉద్యోగం ఇచ్చాడనో ఇతర కారణాలతో గానీ సమాచారాన్ని సేకరించి మార్కో ఎలెజ్‌ ఒక జాత్యహంకారి అని అతడు గతంలో పెట్టిన పోస్టులను ఉటంకిస్తూ, ప్రస్తుతం వాటిని సామాజిక మాధ్యమం నుంచి తొలగించినట్లు ఆ పత్రిక ఒక వార్తను ప్రచురించింది. అలాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకూడదు. వార్త ప్రచురణ తరువాత తనను తొలగిస్తారనే అంచనాతో తానే రాజీనామా చేశాడు. అతగాడు గాజా, ఇజ్రాయెల్‌ అనే రెండిరటినీ భూమి మీద నుంచి లేపేసినా నేను పట్టించుకోను, స్వజాతి(మన దేశంలో కులం, గోత్రం, మతాలను పరిగణనలోకి తీసుకుంటారు) కాని వారిని వివాహం చేసుకున్నందుకు ప్రతిఫలం చెల్లించాల్సిన అవసరం లేదు వంటి పోస్టులు పెట్టాడు.


అలాంటి వాడిని వాడి మానాన వదిలేస్తే వేరు . అతన్ని తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటాం అని ఎలన్‌ మస్క్‌ ప్రకటించటమే కాదు, ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ సమర్దించటం అన్నింటికీ మించి డోనాల్డ్‌ ట్రంప్‌ మాట్లాడుతూ వాన్స్‌ చెప్పాడా అయితే నా అభిప్రాయమూ అదే అంటూ ఆమోద ముద్రవేశాడు. అలాంటి వ్యక్తితో మన ప్రధాని నరేంద్రమోడీ భేఠీ అయ్యేందుకు తాపత్రయపడుతున్నారు. ఏం మాట్లాడతారో, ఏం చేస్తారో చూసిన తరువాత దాని గురించి మాట్లాడుకుందాం. మానవులు తప్పులు చేస్తే దేవతలు క్షమిస్తారు అంటూ ఎలన్‌ మస్క్‌ వెనకేసుకు రాగా కుర్రవాడికి రెండో అవకాశం ఇవ్వాలి అంటూ జెడి వాన్స్‌ సమర్ధించాడు. బుద్దిహీన సామాజిక మాధ్యంలో కార్యకలాపాల కారణంగా ఒక పిల్లవాడి జీవితాన్ని నాశనం చేయకూడదు అన్నాడు. మార్కో రాజీనామా గురించి విలేకర్లు అడగ్గా దాని గురించి తనకు తెలియదని ట్రంప్‌ చెప్పాడు, అయితే మీ ఉపాధ్యక్షుడు తిరిగి తీసుకొనేందుకు అంగీకరించాడు కదా అని విలేకర్లు చెప్పగా అలానా అయితే ఒకే అన్నాడు. మార్కోను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలా వద్దా అన్న సర్వేలో పాల్గొన్న వేలాది మందిలో 78శాతం అనుకూలంగా ఓటు వేసినట్లు తేలిసింది. గత పదకొండు సంవత్సరాలుగా నరేంద్రమోడీ అమెరికా నేతలతో రాసుకుపూసుకు తిరిగి మనదేశ ప్రతిష్ట, పలుకుబడిని పెంచినట్లు ఊదరగొట్టిన తరువాత అమెరికాలో మనదేశం పట్ల వెల్లడైన విద్వేషతీరు ఇది.అయినా సరే దాన్ని పట్టుకువేలాడేందుకు పడుతున్న తాపత్రయాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో ఎవరికి వారే నిర్ణయించుకోవచ్చు.


మార్కో ఎలెజ్‌ ఉదంతాన్ని అమెరికాలోని భారతీయ సంతతి వారు జీర్ణించుకోలేకపోతున్నారు. పుండు మీద కారం చల్లినట్లుగా ఎలెజ్‌ను సమర్ధించటంతో మండిపడుతున్నారు. జెడి వాన్స్‌ సతీమణి భారతీయ సంతతికి చెందిన చిలుకూరి ఉష. అందుకే కొందరు జెడి వాన్స్‌ను ఆంధ్రా అల్లుడు అని కూడా వర్ణించారు.తనను భార్యను కూడా తూలనాడినప్పటికీ ఆ పెద్దమనిషి ఎలెజ్‌ను పల్లెత్తుమాట అనకపోగా విమర్శకులు తనను భావోద్వేగాలతో బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని ఎదురుదాడి చేశాడు.రిపబ్లికన్‌ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు రో ఖన్నా అమెరికన్‌ ఇండియన్‌.ఎలెజ్‌ను తిరిగి తీసుకొనే ముందు అతడి చేత క్షమాపణ చెప్పిస్తావా ? ఇది మన బిడ్డల కోసం అని వ్యాఖ్యానించాడు. వాన్స్‌ కబుర్లు చెప్పటం సరే, రోజంతా ఆయన బిడ్డలకు భద్రత ఉంటుంది. ఇంటర్నెట్‌లో వేధింపులకు గురయ్యే అవకాశం ఉన్న భారతీయుల పిల్లల సంగతేమిటి ? అంటూ అనేక మంది ప్రశ్నించారు. మార్కో ఎలెజ్‌ను పిలిచి మరీ ఉద్యోగమివ్వటం అంటే జాత్యంహంకార, భారత్‌ వ్యతిరేక శక్తులను బహిరంగంగా ప్రోత్సహించటం తప్ప మరొకటి కాదు. గాయపడిన భారతీయుల మనోభావాలను నరేంద్రమోడీ పరిగణనలోకి తీసుకుంటారా ? డోనాల్డ్‌ ట్రంప్‌తో ఆలింగనాల్లో అన్నీ మరచిపోతారా ?


అమెరికాలో ఇప్పుడు రెండు పరిణామాలు జరుగుతున్నాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సమర్ధవంతంగా పనిచేయటం లేదనే పేరుతో వారి సంఖ్యను తగ్గించటం, తద్వారా మిగిలే సొమ్మును కార్పొరేట్లకు,దుర్మార్గాలకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌ వంటి వాటికి మళ్లించేందుకు లేదా బడ్జెట్‌లోటును పూడ్చేందుకు చూస్తున్నారు.ట్రంప్‌ సర్కార్‌ బెదిరింపులు, విసిగిపోవటం తదితర కారణాలో గడువులోపల 65వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్చంద ఉద్యోగవిరమణకు అంగీకరించారు. అయితే దీని గురించి వాద ప్రతివాదనలు వినేందుకు ఒక కోర్టు ఇచ్చిన గడువు సోమవారంతో ముగిసింది. ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసుకు వచ్చేందుకు సిద్దంగా లేరు, వారిని వదలించుకొని ఉన్నత అర్హతలున్నవారిని నియమిస్తామని ట్రంప్‌ పత్రికా కార్యదర్శి కరోలిన్‌ లీవిట్‌ అన్నారు. స్వచ్చంద ఉద్యోగ విరమణకు అర్హత ఉన్న 23లక్షల మంది ఉద్యోగుల్లో 65వేలంటే చాలా తక్కువ అని చెప్పనవసరం లేదు. మిలిటరీ, పోలీసు వంటి కొన్ని తరగతులకు అనుమతి లేదు. మొత్తంగా పదిశాతం మంది ఉద్యోగుల తగ్గింపు విద్య, వైద్యం వంటి రంగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందనే హెచ్చరికలు కూడా వెలువడ్డాయి.తాను తీర్పు ఇచ్చే వరకు స్వచ్చంద ఉద్యోగ విరమణ అమలు నిలిపివేయాలని ఒక కోర్టు ఆదేశం ఇచ్చింది.


అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన వారిని వెతికి పట్టుకొని వారి దేశాలకు బలవంతంగా పంపటం ఇప్పటికే ప్రారంభమైంది. నిజానికి ఇది కొత్తేమీ కాదు, గతేడాది అక్రమంగా వలస వచ్చిన 90వేల మంది భారతీయులను అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి. 2022 నాటి సమాచారం ప్రకారం అక్కడ కోటీ పది లక్షల మంది అక్రమవలసదారులు ఉన్నారు. వారిలో 48లక్షల మంది పక్కనే ఉన్న మెక్సికోవారే. మూడిరట రెండువంతుల మంది మెక్సికో, లాటిన్‌ అమెరికా దేశాల వారే ఉన్నారు. ఎల్‌ సాల్వడార్‌ నుంచి 7.5లక్షలు, భారత్‌ 7.25, గౌతమాలా 6.75, హొండురాస్‌ 5.25 లక్షల వంతున ఉన్నారు. ఇలా వచ్చిన వారు వ్యవసాయం,హోటల్‌,ఇతర చిన్న చిన్న పనులు చేస్తున్నారు.వీరందరూ ఇప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్థితి. అయితే వీరితో పని చేయించుకొనే వారికి కూడా సమస్యే. ఒక్కసారిగా వీరంతా లేకపోతే ఏం చేయాలి ? ఇప్పటికే అనేక ప్రాంతాల పొలాల్లో నిలువు మీద ఉన్న పంటలు దెబ్బతినట్లు వార్తలు వచ్చాయి. వలసదారుల సమస్య ఫెడరల్‌ ప్రభుత్వానిది, అయితే తమ నేత ట్రంప్‌ మెప్పు పొందేందుకు రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ఫ్లోరిడా రాష్ట్ర గవర్నర్‌(మన ముఖ్యమంత్రి మాదిరి) రాన్‌ డెశాంటిస్‌ హడావుడి చేస్తున్నాడు. ఆ రాష్ట్ర శాసన సభ్యులు తనకు సహకరించాలని కోరుతున్నాడు. ట్రంప్‌ సర్కార్‌ అక్రమవలసదారులను బలవంతంగా తిప్పి పంపేందుకు తీసుకున్న కార్యక్రమానికి సహకరించని స్థానిక ఉద్యోగులను ఇంటికి పంపే అధికారం తనకు కావాలని కోరుతున్నాడు. ఫ్లోరిడాలో ఉంటూ విదేశాలకు డబ్బు పంపేవారు వాటి వివరాలను అందచేయాలని, తద్వారా వారి వలస స్థితిని గుర్తించవచ్చంటున్నాడు.


రాన్‌ డెశాంటిస్‌ తీరుతెన్నులను చూసి అనేక మంది అపహాస్యం చేస్తున్నారు. కొన్ని చట్టాలను చేసేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల ఏర్పాటుకు పరిశీలించాలంటూ ఒక జర్నలిస్టు వ్యంగ్యంగా రాసినప్పటికీ అక్రమవలసదారులను వెనక్కు పంపితే తలెత్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి. ఫ్లోరిడాలో నమోదైన పౌరులకు ‘‘ పొలాల్లో పనిచేసే స్వేచ్చా చట్టం 2025 ’’ చేయాలి.తద్వారా పొలాల్లో మిరియాలు, చెరకు, ఇతర పంటలు ఎండి, చెడిపోకుండా ఎలా తీసుకురావాలో పౌరులకు శిక్షణ ఇవ్వాలి. ‘‘ దేశభక్తులైన ఈ కార్మికులకు ’’ పొలాల్లోకి రాను పోను బస్‌లను ఏర్పాటు చేయాలి, అవసరం ఉన్నా లేకున్నా ప్రతి నాలుగు గంటలకు వారికి ఐదు నిమిషాల పాటు మంచినీరు తాగేందుకు విరామం ఇవ్వాలి. పని చేసే సమయాల్లో తగిలే దెబ్బలు లేదా వడదెబ్బ లేదా తలెత్తే మానసిక వత్తిడితో భూ యజమానులకు ఎలాంటి సంబంధం లేదని పనిచేసే వారు హామీ పత్రం మీద సంతకాలు చేయాలి. ఫ్లోరిడా చొరవలో సహాయకులు అనే పథకం కింద ఇండ్లలో పనిచేసే వారికి నైపుణ్యాల శిక్షణ ఇవ్వాలి.హోటళ్లు కార్మికుల కొరత ఎదుర్కొంటున్నపుడు అత్యవసర పని చేసేందుకు సిద్దంగా ఉండాలి.అతిధేయ రంగంలో వారికి వారం పాటు శిక్షణ ఇవ్వాలి.మరుగుదొడ్లు శుభ్రం చేయటం, పరుపుల మీద దుప్పట్లు వేయటం, కార్పెట్ల మీద ఎలాపడిరతో తెలియని మరకలను తుడిచివేయటం వాటిని వారు నేర్చుకోవాలి. ఈ దేశభక్తులైన ఫోరిడియన్లు వలసదారులను పంపివేసినపుడు తలెత్తే కొరత లేకుండా ఆతిధ్య రంగంలో పనిచేసేందుకు రాష్ట్ర గవర్నర్‌ క్లీన్‌ స్వీప్‌ రియాక్షన్‌ ఫోర్సుగా పని చేయాలి. శిక్షణ తరువాత వీరికి ప్రతిష్టాత్మ మాగా (మేక్‌ ఎగైన్‌ గ్రేట్‌ అమెరికా) మెయిడ్‌ అనే హోదాతో అవార్డు ఇవ్వాలి.


క్లీన్‌ ప్లేట్‌ ఫండ్‌(కంచాలను శుభ్రం చేసేందుకు నిధి) ఏర్పాటు చేయాలి. రెస్టారెంట్ల నుంచి తొలగించిన వలస కార్మికుల వలన ఏర్పడే కొరత నివారణకు నమోదైన ఫ్లోరిడియన్లకు అంట్లు తోమే సేవలను అప్పగించాలి.రెస్టారెంట్లలో భోంచేసిన వారు తాము తిన్న ప్లేట్లను తామే కడిగితే అలాంటి వారికి బిల్లులో 20శాతం రాయితీ ఇవ్వాలి.గమనిక కొత్తగా నియమితులైన కార్మికులు తొలగించిన వారి మాదిరి కష్టపడి పని చేస్తారని భావించకూడదు. తొలగించిన ఒక్కొక్క హైతియన్‌ లేదా గౌతమాల కార్మికుడి స్థానంలో ముగ్గురు అంట్లుతోమే అమెరికన్‌ పౌరులను నియమించటం మంచిది. మామ్మల బెడ్‌ పాన్‌ చొరవ పేరుతో సేవా పనికి సిద్దం కావాలి. అక్రమవలసదార్లను వెనక్కు పంపటాన్ని పండగ చేసుకుంటూ మంచాల మీద ఉన్న వృద్ధుల సేవకు సిద్దం కావాలి. వారి పక్క బట్టలు మార్చటంతో పాటు బెడ్‌పాన్‌లు మార్చాలి. వృద్ధులను మంచాల మీదే ఉంచి పక్కలు మార్చటం మీకు తెలుసా, దీని గురించి ఫ్లోరిడా రాష్ట్రం ఇచ్చే నూతన శిక్షణ కార్యక్రమం ఎంతో ఉద్వేగపరుస్తుంది. ఇంటి ఆవరణలో పెరిగే గడ్డి మొక్కలను సంరక్షించటం, ఎక్కువగా పెరిగిన వాటిని కత్తిరించటం, రాలిన ఆకులను తొలగించటం, ఇంట్లో వంటగది, బాత్‌రూమ్‌లో మార్పులు, మరమ్మత్తులు, కప్పుల నుంచి నీరు కారటాల వంటి వాటిని కూడా స్వయంగా చేసుకుంటూ ఎంతో ఆనందాన్ని పొందవచ్చని మీరెప్పుడైనా అసలు ఊహించారా, ఇప్పుడు అలాంటి సదవకాశం వచ్చింది.ఈ క్రమంలో నిబంధనలను అతిక్రమించినా ఎలాంటి తనిఖీలు, జరిమానాలు ఉండవు, ఇది ఒక గోడకూలిన శబ్దం కాదు, స్వేచ్చా ధ్వని సంకేతం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కమ్యూనిస్టుగా ఎలన్‌ మస్క్‌ కుమార్తె, కసితో భావజాలాన్ని అడ్డుకొనేందుకే ట్విటర్‌ కొనుగోలు !

09 Saturday Sep 2023

Posted by raomk in BJP, CHINA, Communalism, COUNTRIES, Current Affairs, Europe, Germany, imperialism, International, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ 2 Comments

Tags

Anti China Propaganda, Anti communist, BJP, China, communist, Elon Musk, Elon Musk daughter, Karl Marx, RSS


ఎం కోటేశ్వరరావు


కమ్యూనిజం భావజాల వ్యాప్తిని అరికట్టేందుకు తొలుత ఐరోపాను ఆవరించిన భూతంగా నిందించారు. కారల్‌ మార్క్స్‌ను జర్మనీ, బెల్జియంల నుంచి వెళ్లగొట్టారు. తొలి సోషలిస్టు రాజ్యం ఏర్పడిన తరువాత కమ్యూనిజం విస్తరణను అడ్డుకొనేందుకు అమెరికా ఇతర ధనిక దేశాలు ప్రచ్చన్న యుద్ద్ధం సాగించాయి. అనేక దేశాల్లో కుట్రలు చేశాయి. అలెండీ వంటి వారిని హత్య చేశాయి. మిలిటరీ నియంతలను గద్దెలపై కూర్చో పెట్టాయి. సైనిక కూటములను ఏర్పాటు చేశాయి. వియత్నాం, లావోస్‌, కంపూచియా, ఉత్తర కొరియాలపై భౌతిక దాడులకు పాల్పడి భంగపడ్డాయి. విధిలేని స్థితిలో వియత్నాం నుంచి అమెరికన్లు బతుకు జీవుడా అంటూ పారిపోయారు.కమ్యూనిజం అంతమే తమ పంతం అని ప్రకటించిన అమెరికా గడ్డమీదే ప్రపంచ ధనికుడైన ఎలన్‌ మస్క్‌ కుమార్తె కమ్యూనిస్టుగా మారింది. అక్కడే లక్షలాది మంది యువత నేడు అక్కడ అవును మేము సోషలిస్టులం, కమ్యూనిస్టులం అంటూ ముందుకు వస్తున్నారు.


తన కుమార్తె కమ్యూనిస్టుగా మారిందన్న ఉక్రోషం, కమ్యూనిస్టు భావజాల ప్రచారానికి ఒక వేదికగా ఉన్నందున నిరోధించేందుకు ఏకంగా సామాజిక మాధ్యమం ట్విటర్‌నే కొనుగోలు చేసినట్లు త్వరలో వెలువడనున్న ఎలన్‌ మస్క్‌ జీవిత చరిత్రలో వెల్లడించారు. ఎలన్‌ మస్క్‌ 2000 నుంచి 2016వరకు మూడు వివాహాలు చేసుకొని ముగ్గురికీ విడాకులు ఇచ్చాడు, తరువాత 2018 నుంచి 2021వరకు ఒకామెతో సహజీవనం చేశాడు. ఇప్పుడెలా ఊరేగుతున్నాడో తెలవదు. పది మంది పిల్లల్ని కన్నాడు. వారిలో ఒకడైన గ్జేవియర్‌ అలెగ్జాండర్క్‌ మస్క్‌ 2004లో పుట్టాడు. 2022 జూన్‌లో కాలిఫోర్నియా కోర్టుకు సమర్పించిన ఒక వినతిలో తన పేరును వివియన్‌ జెనా విల్సన్‌ అని మార్చుకొనేందుకు అంగీకరించాలని, తాను యువతిగా లింగమార్పిడి చేయించుకున్నట్లు పేర్కొన్నాడు. తన తండ్రి ఎలన్‌ మస్క్‌తో గానీ, అతని ఆస్తిపాస్తులతో గాని తనకు ఎలాంటి సంబంధం లేదని క్రటించాడు.2021లో లింగమార్పిడి జరిగింది.


తన కుమారుడు లింగ మార్పిడి చేయించున్నదాని కంటే స్కూల్లో వామపక్ష భావజాలానికి ప్రభావితుడు కావటం ఎలన్‌ మస్క్‌కు ఆగ్రహం తెప్పించింది. పచ్చి మితవాది అయిన మస్క్‌ తన కుమార్తెను కమ్యూనిస్టుగా వర్ణించాడు.కాలిఫోర్నియాలోని ఒక స్కూల్లో ఏడాదికి 50వేల డాలర్ల ఫీజు చెల్లించి చదివిస్తుండగా కమ్యూనిస్టు భావజాల వైరస్‌కు గురైందని, తన పట్ల కుమార్తె వైఖరి మారటానికి కొంత వరకు క్రాస్‌రోడ్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సు స్కూలు పురోగామి విధానాలు కూడా కారణమని ఆరోపించాడు. తన కుమార్తె సోషలిజాన్ని అధిగమించి ధనవంతులందరూ దుష్టులని భావించే పూర్తి స్థాయి కమ్యూనిస్టుగా మారిందని చెప్పాడు. తొలి రోజుల్లో ఉదారవాద భావాలతో కొడుకు లేదా కుమార్తె ఉన్నట్లు సరిపెట్టుకున్న తరువాత తెగతెంపులు చేసుకున్నాడు. అంతే కాదు, దీనంతటికీ కమ్యూనిస్టు భావజాల ప్రచారానికి వేదికగా ఉపయోగపడుతున్న ట్విటర్‌ కూడా తన బిడ్డ వంటి అనేక మందిని కమ్యూనిస్టులుగా మార్చుతున్నదని, ట్విటర్‌ వేదికగా ఆ భావజాలం రోజు రోజుకు పెరుగుతున్నదని భావించాడు.అది ప్రజాస్వామ్యం, స్వేచ్చా భావ ప్రకటనకు ముప్పుగా మారిందని, దాని విధానాలను మార్చేందుకు ఏకంగా 44 బిలియన్‌ డాలర్లతో ఆ సంస్థను కొనుగోలు చేశాడు. అంటే పురోగామి భావాలను అడ్డుకొని మితవాద ప్రచారానికి దాన్ని వేదికగా మార్చనున్నాడన్నది స్పష్టం. దానికి అనుగుణంగానే గత యాజమాన్యం రద్దు చేసిన డోనాల్డ్‌ ట్రంప్‌ వంటి పచ్చి మితవాదుల ఖాతాలన్నింటినీ పునరుద్దరించాడు. ట్విటర్‌ పేరు ఎక్స్‌గా మార్చాడు. వాల్టర్‌ ఇసాక్‌సన్‌ రాసిన ఎలన్‌ మస్క్‌ జీవిత చరిత్రను సెప్టెంబరు 12న మార్కెట్‌కు విడుదల చేయనున్నారు. దాని గురించి ఆసక్తి కలిగించేందుకు కొన్ని భాగాలను మీడియాకు విడుదల చేశారు.


ఎలన్‌ మస్క్‌ వంటి కమ్యూనిస్టు వ్యతిరేక మితవాద భావజాలం ఉన్న వారు అమెరికాలో తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. ఒక బంతిని ఎదురుగా ఉన్న గోడవైపు ఎంత గట్టిగా విసిరితే అంతే వేగంతో తిరిగి మనవైపు వస్తుంది. భావజాలం కూడా అంతే. దేన్నయినా అణచివేయాలని చూస్తే అంతేవేగంతో విస్తరిస్తుంది. కొత్త రాతియుగం నుంచి చైనా నేత షీ జింపింగ్‌ వరకు కమ్యూనిజం చరిత్ర పేరుతో జర్నలిస్టు పాల్‌ మాసన్‌ రాస్తున్న పుస్తకం 2026లో విడుదల కానుంది. ఒక భావం, ఒక ఉద్యమం, ఒక పాలన వరకు ఎలా పరిణమించిందీ దానిలో ఉంటుందని చెబుతున్నారు. పురాతన, మధ్యయుగాలలో సంభవించిన తిరుగుబాట్ల నుంచి కమ్యూనిస్టులు ఈ భావ చరిత్రను గుర్తించారు. పందొమ్మిదవ శతాబ్ది పెట్టుబడిదారీ వ్యతిరేక ఉద్యమాల పెరుగుదలతోనే ఈ కధ ముగియలేదు అన్నాడు పాల్‌ మాసన్‌. ” పశ్చిమ దేశాల ప్రజాస్వామ్యాలు గిడసబారాయి, తమ మీద తమకే విశ్వాసం లేకుండా ఉన్నాయి. వాతావరణం గురించి పెరుగుతున్న ఆందోళన విప్లవాత్మక ఆర్థిక సమాధానాలను డిమాండ్‌ చేస్తున్నది. ప్రపంచ పేద దేశాల్లోని కోట్లాది మంది జనం దృష్టిలో చైనా ముందుకు తెచ్చిన అధికారతత్వ(ఇది రచయిత పదజాలం కాదు), రాజ్య నేతృత్వంలోని అభివృద్ధి ప్రత్నామ్నాయ నమూనాగా చూస్తున్నారు. ఇరవై సంవత్సరాల క్రితం కమ్యూనిజం అంతాన్ని చూశామని అనుకున్నాం.. ఈ రోజు ప్రపంచంలో అతి పెద్ద రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీయే.ప్రపంచంలో అత్యంత విజయవంతమైన ఆర్థిక వ్యవస్థగా ఉంది. కావున ప్రచ్చన్న యుద్ధంలో భావజాల విజేతలు సెలవు తీసుకుంటూ రాసిన ఉద్గ్రంధాలన్నిటినీ భిన్నమైన చరిత్రగా చూడాల్సిన అవసరం ఉన్నదని భావిస్తున్నాను. ఇప్పటికీ అనేక మంది ఆర్థిక పురోగతి సాధనకు స్వేచ్చకోసం ఎందుకు సిద్దం అవుతున్నారో అర్ధం చేసుకోవటానికి తోడ్పడుతుంది.” అని పాల్‌ మాసన్‌ చెప్పాడు.


అమెరికా స్కూళ్లలో విద్యార్ధులు కమ్యూనిస్టులుగా మారుతున్నారని గుండెలు బాదుకుంటున్నది ఒక్క ఎలన్‌ మస్క్‌ మాత్రమే కాదు. అనేక మంది మితవాద రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు కూడా కమ్యూనిస్టు, చైనా వ్యతిరేకతతో ఊగిపోతున్నారు.అమెరికా స్కూళ్లు, విశ్వవిద్యాలయాలు చైనా సంస్థలతో పరిశోధనా ప్రాజక్టులలో భాగస్వాములు కావటాన్ని నిషేధించాలని సెనెటర్‌ జేమ్స్‌ లాంక్‌ఫోర్డ్‌ డిమాండ్‌ చేశాడు. అంతర్జాతీయంగానే కాదు, అమెరికా గడ్డ మీద కూడా దేశాన్ని చైనా సవాలు చేస్తున్నదని, విద్యా సంస్థలలో పాతుకుపోతున్నదని ఒక ప్రకటనలో తాజాగా ఆరోపించాడు. అమెరికా పరిశోధనలను తస్కరిస్తున్నదని, రాజకీయంగా విద్యార్థులు, బోధకులు, వారి కుటుంబాల మీద ప్రభావం చూపుతున్నదని చెప్పుకున్నాడు. అమెరికాలో తన ప్రతిష్టను పెంచేందుకు అనేక పధకాలను రూపొందించిందని, వాటి ద్వారా గూఢచర్యం జరుపుతున్నదని ఆరోపించాడు. ఆగస్టు 27న చైనాతో పరిశోధన ఒప్పందం ముగిసినప్పటికీ జో బైడెన్‌ సర్కార్‌ మరో ఆరునెలలు పొడిగించిందని వాపోయాడు.
కమ్యూనిస్టు వ్యతిరేక ఉన్మాదం అమెరికా పక్కనే ఉన్న మెక్సికోకు కూడా పాకింది. పాఠ్యపుస్తకాలకు కమ్యూనిస్టు వైరస్‌ సోకిందంటూ కొన్ని చోట్ల క్రైస్తవ మత బృందాలు తలిదండ్రుల పేరుతో కొందరిని సమీకరించి పుస్తకాలను తగులబెట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ పుస్తకాల్లో లైంగిక విజ్ఞానం, లింగసమానత్వం వంటి అంశాలు ఉన్నాయన్నది వారి ఆరోపణ. వాటి పంపిణీ నిలిపివేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఆ పుస్తకాల్లో మార్క్సిస్టు-కమ్యూనిస్టు సిద్దాంతాలను చేర్చారని ఆరోపించారు. ప్రభుత్వం ఈ ఆరోపణలను కొట్టిపారవేసింది. పాఠ్య అంశాలను టీచర్లు, నిపుణులు రూపొందించినట్లు పేర్కొన్నది.


అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర శాసనసభలో రిపబ్లికన్‌ పార్టీ ప్రతినిధి మరియ ఎలివిరా సాలాజార్‌ ఒక బిల్లును ప్రవేశపెట్టారు.దానిలో కమ్యూనిజం, నిరంకుశత్వాలను ఒకే గాటన కడుతూ వాటివలన సంభవించే నష్టాలను విద్యార్ధులకుచెప్పాలని పేర్కొన్నారు. అమెరికా యువత కమ్యూనిస్టుల పాలనలో జరిగిన నేరాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.కమ్యూనిజం బాధితుల ఫౌండేషన్‌కు పాఠాలను రూపొందించే బాధ్యత అప్పగించాలని ప్రతిపాదించారు. గతంలో కూడా సాలాజార్‌ ఇదే బిల్లును ప్రవేశపెట్టగా దాన్ని చర్చించక ముందే మురిగిపోయింది. ఈ బిల్లును ప్రతిపాదించినపుడు అధికారంలో డెమోక్రాట్లు ఉన్నారు. ఇప్పుడు రిపబ్లికన్లు ఉన్నందున తిరిగి ప్రవేశపెట్టారు.క్యూబా, కొరియా, వియత్నాం తదితర దేశాల నుంచి పారిపోయి వచ్చిన కమ్యూనిస్టువ్యతిరేకులు ఈ బిల్లుకు మద్దతు తెలిపారు.


కమ్యూనిస్టు వ్యతిరేక వైరస్‌ ఒక్క అమెరికా, ఐరోపాల్లోనే కాదు మనదేశంలో కూడా ఉంది. ఇటీవల మహారాష్ట్రలోని నాగపూర్‌ విశ్వవిద్యాలయం ఎంఎ చరిత్ర విద్యార్ధుల సిలబస్‌లో అధ్యయనం చేయాల్సిన అంశాల్లో బిజెపి, రామజన్మభూమిని చేర్చింది. కమ్యూనిస్టు ఉద్యమానికి సంబంధించిన పాఠ్యాంశాలను తొలగించింది. నూతన విద్యా విధానంలో భాగంగా సిలబస్‌లో మార్పులు చేర్పులు చేసినట్లు అధికారులు చెప్పారు. ఇదే విశ్వవిద్యాలయం గతంలో బిఏ విద్యార్ధులకు ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి పాఠాన్ని సిలబస్‌లో చేర్చింది. కమ్యూనిస్టు ఉద్యమం, పార్టీల గురించి నేర్చుకోవాలి, తెలుసుకోవాలనే ఆసక్తి కలగాలేగానీ పాఠ్యపుస్తకాలు, ట్విటర్‌, ఫేస్‌బుక్‌లతో పనేముంది. అవేవీ లేనపుడు ప్రపంచమంతా వ్యాప్తి చెందలేదా ? కమ్యూనిస్టు సిద్దాంతాలకు సంబంధించిన పుస్తకాలను బ్రిటీష్‌వారు, ఇతర సామ్రాజ్యవాదులు,అనేక దేశాల్లో ప్రభుత్వాలు నిషేధించినపుడు జనం వాటిని సంపాదించుకోలేదా అధ్యయనం చేయలేదా ? ఈ చరిత్ర తెలిసి కూడా ఇలాంటి పిచ్చిపనులు చేస్తున్నారు. చరిత్రలో యంత్ర విధ్వంసకుల గురించి చదివాము. ఐరోపాలో చేనేత రంగంలో మరమగ్గాలు వచ్చినపుడు తమ వృత్తిని అవి దెబ్బతీస్తున్నాయని ఆగ్రహించిన కార్మికులు వాటిని ధ్వంసం చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని భావించి కొన్ని చోట్ల ఆపని చేశారు. సమస్య యంత్రాలది కాదు, వాటిని ధ్వంసం చేస్తే యాంత్రీకరణ ఆగదు. అదే విధంగా భూస్వాములను అంతం చేస్తే భూస్వామిక వ్యవస్థ రద్దవుతుందని నమ్మి ఆ పని చేసిన వారి సంగతి తెలిసిందే. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరన్నది ఎంత వాస్తవమో నిషేధాలద్వారా ఒక భావజాల వ్యాప్తిని అడ్డుకోవటం కూడా సాధ్యం కాదన్నది కూడా అంతే నిజం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d