• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Narendra Modi

మహిళా రిజర్వేషన్లపై నరేంద్రమోడీ టక్కు టమారాలు : పదేండ్లు పట్టించుకోలేదు, 2034 తరువాతే అమలు !

25 Monday Sep 2023

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Women

≈ Leave a comment

Tags

BJP, Delimitation Commission of India, Narendra Modi, Narendra Modi Failures, women reservation bill 2023


ఎం కోటేశ్వరరావు


నాటకీయ పరిణామాల మధ్య నరేంద్రమోడీ సర్కార్‌ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చట్ట సభల్లో 33శాతం మహిళా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందింది.అది చట్టం కావటం లాంఛనమే. సగం రాష్ట్రాలు ఆమోదిస్తే దాని అమలుకు బాటపడుతుంది. ఏ అసెంబ్లీ, లోక్‌సభ సెగ్మెంట్లలోని ఓటర్లలో పురుషులు ఎందరు, మహిళలు ఎందరు అనే వివరాలు ఇప్పటికే ఉన్నాయి గనుక కొందరు ఆ స్థానాలను ఉటంకిస్తూ అవన్నీ మహిళలకు రిజర్వు చేయబోతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. అసలు ఈ రిజర్వేషన్లు ఎప్పుడు అమల్లోకి వస్తాయంటే 2029 నాటికి అని మరికొందరు 2034 లేదా ఆ తరువాతే అని భాష్యం చెబుతున్నారు. ఇదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజనలో ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరిగేదీ, ఎక్కడ ఎన్ని సీట్లు తగ్గేది కూడా కొన్ని అంకెలను కూడా ఉటంకిస్తున్నారు. తాజాగా ఆమోదం పొందిన బిల్లు ప్రకారం రిజర్వేషన్లు పదిహేను సంవత్సరాల పాటు అమల్లో ఉంటాయి. షెడ్యూలు కులాలు, తరగతులకు నిర్ధేశించిన సీట్లలో కూడా మూడోవంతు సీట్లను మహిళలకు కేటాయిస్తారు. వెనుబడిన తరగతుల మహిళకు రిజర్వేషన్లు ఉండాలన్న డిమాండ్‌ను బిజెపి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక ఆమోదించిన బిల్లు చట్టమై ఎప్పటికి అమల్లోకి వస్తుంది, అసలు ఏం జరగబోతోంది ?


రాజ్యసభలో 2010లోనే ఆమోదం పొందిన రిజర్వేషన్‌ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందితే సరిపోతుంది. యుపిఏ ఏలుబడిలో ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కొన్ని పార్టీల వ్యతిరేకత లేదా అభ్యంతరాల కారణంగా అది లోక్‌సభలోకి రాలేదు. తమకు పూర్తి మెజారిటీ వస్తే దాన్ని తక్షణమే ఆమోదిస్తామని బిజెపి వాగ్దానం చేసింది. 2014లో, 2019లో అవసరమైన మెజారిటీ, సగానికంటే ఎక్కువ రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వాలే ఉన్నందున ఆ బిల్లు ఆమోదానికి ఆటంకం లేదు, అయినప్పటికీ తొమ్మిదేండ్లుగా దాని ప్రస్తావన, అసలు చొరవే చూపలేదు. నిజానికి అధికారానికి వచ్చిన వెంటనే ఆమోదం పొంది తక్షణమే అమల్లోకి వచ్చే విధంగా 2011 జనాభా ప్రాతిపదికన ఉన్న సీట్లలోనే మహిళల కోటా అమలు జరిపేందుకు పునర్విభజనతో నిమిత్తం లేకుండా అవసరమైన రాజ్యాంగ సవరణ చేసి ఉంటే అమల్లోకి వచ్చి ఉండేది. చిత్తశుద్ది ముఖ్యం, అది లేదు కనుకనే విమర్శలు. కారణాలు, ఉద్దేశ్యాలు ఏమైనప్పటికీ ముందు రోజు కాబినెట్‌లో ఆమోదించి మరుసటి రోజు లోక్‌సభలో, తరువాత రాజ్యసభలో ఆమోదానికి పెట్టారు.లోక్‌సభలో ఇద్దరున్న మజ్లిస్‌ మినహా మిగిలిన పార్టీలేవీ వ్యతిరేకంగా ఓటు వేయలేదు, రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, తరువాత లోక్‌సభ, ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి ఈ పరిణామాన్ని ఎలా ఉపయోగించుకుంటుందో, జనానికి ఏం చెబుతుందో, ఓటర్లు ఎలా స్వీకరిస్తారో చూద్దాం.


ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది ? పదేండ్లకు ఒకసారి జరిగే జన గణన తరువాత లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగాలన్నది స్వాతంత్య్రం వచ్చిన తరువాత జరిగిన నిర్ణయం. దీన్ని అమలు చేసేందుకు ఏర్పాటు చేసే కమిషన్‌కు ఒక విశ్రాంత సుప్రీం కోర్టు న్యాయమూర్తి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి, రాష్ట్రాల ఎన్నికల అధికారులు ఉంటారు. దాని నిర్ణయాన్ని ఆమోదించటం తప్ప ఏ కోర్టులోనూ సవాలు చేసే అవకాశం లేదు. ఆ మేరకు 1952, 1963, 1973లో జరిగాయి.1973 తరువాత పాతికేండ్ల పాటు ఆ ప్రక్రియను స్థంభింప చేస్తూ పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేశారు. ఆ మేరకు 2002లో మరో పునర్విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. తరువాత మరో పాతికేండ్లపాటు 2026వరకు అదే సంఖ్యను కొనసాగించాలని కూడా నిర్ణయించారు. తొలి లోక్‌సభలో 494 నియోజకవర్గాలుండగా, తరువాత పది సంవత్సరాలకు 522కు పెంచారు. మరో పది సంవత్సరాల తరువాత 542కు పెంచారు. ఆప్రక్రియ తరువాత సిక్కిం మనదేశంలో విలీనం కావటంతో మరొక స్థానాన్ని దానికి కేటాయించటంతో 543 అయ్యాయి. వీటిలో పదమూడు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఉన్నాయి. అప్పటి నుంచి 2026వరకు ఆ సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండదు. మధ్యలో అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలలో కొన్ని ప్రాంతాలూ, అసెంబ్లీ సెగ్మెంట్లు అటూ ఇటూ అయ్యాయి. కొన్ని నియోజవర్గాలు రద్దు, కొన్ని కొత్తవి వచ్చాయి. తెలంగాణాలో జనాభా పెరగటంతో ఆంధ్రప్రాంతంలో సీట్లు తగ్గాయి. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించిన తరువాత ఎక్కడ ఉన్న సీట్లు అక్కడే ఉన్నాయి.రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాణా సీట్లను 119 నుంచి 153కు, ఆంధ్ర ప్రదేశ్‌లో 175ను 225కు పెంచుతామని వాగ్దానం చేసినందున 2026 తరువాత జరిగే పునర్విభజన ప్రక్రియలో భాగంగా అవి అమల్లోకి వస్తాయి.


2021లో జరగాల్సిన జనగణన వాయిదా పడింది. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. గడువు ప్రకారం వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి వుంది. అందువలన జనగణన జరుగుతుందా, మరుసటి ఏడాదికి వాయిదా పడుతుందా అన్నది ప్రస్తుతానికి ఊహాగానమే. 2026లోపు జనగణన జరుగుతుందనే భావనతో తరువాత జరిగే పునర్విభజన ప్రకారం 2029లోక్‌ సభ ఎన్నికలు, గడువు ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33శాతం కేటాయించాల్సి ఉంటుందని అందువలన 2029లో అమలు జరుగుతాయని కొందరు భాష్యం చెబుతున్నారు. ఇక పార్లమెంటు ఆమోదించిన 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026 తరువాత జరిగే పునర్విభజన ప్రక్రియకు ఆ తరువాత జరిగే అంటే 2031లో జరిగే జనగణన ప్రాతిపదికన జరగాల్సి ఉంటుంది. 2021లో జరగాల్సిన జనగణన 2024 లేదా 2025లో జరిగితే పదేండ్లు గడవకుండానే మరోగణన 2031లో జరుపుతారా లేక పదేండ్లు అంటే 2034 లేదా 2035లో జరుపుతారా అన్నది తెలియదు. ఒక వేళ అదే జరిగితే ఆ తరువాతే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. అందుకే కపిల్‌ సిబల్‌ వంటి న్యాయకోవిదులు 2034కు ముందు అమల్లోకి వచ్చే అవకాశం లేదని చెప్పారు. రెండవది పునర్విభజన ప్రక్రియకు నిర్ణీత కాలవ్యవధి లేదు.


అనేక రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ విధానాలను సక్రమంగా అమలు జరపకపోవటం, జనాభా ప్రాతిపదికన లోక్‌సభ సీట్లను కేటాయిస్తున్నందున ఎక్కువ సీట్లు పొందేందుకు జనాభా అదుపును పట్టించుకోవటం లేదనే అభిప్రాయం ఉంది. ఆ విషయాన్ని సూటిగా చెప్పకుండా 1976లో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా 2000 సంవత్సరం వరకు నియోజకవర్గాలలో ఎలాంటి మార్పులు చేయకూడని నిబంధనను సవరించారు. తరువాత జనాభా స్థిరీకరణ అవుతుందనే అంచనాతో మరోసారి 84వ రాజ్యాంగసవరణ ద్వారా 2026వరకు సీట్ల సంఖ్యలో మార్పులేకుండా నిర్ణయించారు. 2002లో ఏర్పాటు చేసిన కమిషన్‌ 1991 జనాభా ప్రాతిపదికన పునర్వ్యవస్ధీకరణ చేపట్టాలని నిర్ణయించారు.కమిషన్‌ పని చేపట్టిన తరువాత 2003లో 87వ రాజ్యాంగసవరణ ద్వారా 2001జనాభా ప్రాతిపదికను నిర్ణయించటంతో తిరిగి నూతన ప్రక్రియను చేపట్టాల్సి వచ్చింది, 2008వరకు పూర్తి కాలేదు. జమ్మూ-కాశ్మీర్‌లో జనగణన జరగలేదు గనుక దీన్నుంచి మినహాయించారు, అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌ జనాభా లెక్కల్లో తేడాలు ఉన్నందున కోర్టు వివాదాల కారణంగా అక్కడ జరగలేదు. 2009 సాధారణ ఎన్నికల నాటికి 543కు గాను 499చోట్ల పునర్వ్యస్థీకరణ జరిగింది. పన్ను ఆదాయ పంపిణీకి పదిహేనవ ఆర్థిక సంఘం ఎంచుకున్న జనాభా ప్రాతిపదికతో ఎక్కువ మొత్తాలను జమ చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలు తక్కువ మొత్తాలను పొందుతూ వివక్షకు గురవుతున్నాయి.అంతకు ముందు 1971 జనాభా ప్రాతికగా ఉన్న కేటాయింపులను 2011కు మార్చటంతో పెద్ద తేడా వచ్చింది. దేశ జనాభాలో 18శాతం ఉన్న రాష్ట్రాలు జిడిపిలో 35శాతం సమకూర్చుతున్నాయి. రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే వారు రాష్ట్రాలకు ప్రతినిధులుగా ఉండాలన్నది రాజ్యాంగ స్ఫూర్తి. కానీ 2003లో చేసిన సవరణతో ఎవరు ఎక్కడి నుంచైనా ప్రాతినిధ్యం వహించవచ్చు. అలాంటి వారు ఆ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తారా ? అక్కడి సమస్యలను పట్టించుకుంటారా ? వచ్చే పునర్విభజనలో పాత జనాభా పద్దతినే ఆమోదిస్తే దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గటం ఖాయం.

పాత విధానాన్ని అనుసరిస్తే పునర్యవస్థీకరణ తరువాత ఇప్పుడున్న 543 సీట్లు( ఇద్దరు ఆంగ్లోఇండియన్‌ల నామినేషన్‌ రద్దు చేశారు గనుక 541 ఉంటాయి) 848కి పెరుగుతాయని కొందరి జోశ్యం. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సూచించినట్లుగా గతంలో నిర్ణయించిన దాని కంటే జనాభా రెట్టింపైనందున సీట్ల పెరుగుదల వెయ్యి ఉండవచ్చనేది ఒక వాదన.మరో అంచనా ప్రకారం 753 ఉంటాయి. తదుపరి పునర్యవస్థీకరణ సంవత్సరాన్ని ముందే ఖరారు చేసినందున ఏ ప్రాతిపదికన జరిగేదీ కమిషన్‌ నియామక సమయంలోనే తెలుస్తుంది. దాన్ని బట్టే ఎన్ని సీట్లు అన్నది ఖరారు అవుతుంది. అప్పటి వరకు వెలువడే సంఖ్యలన్నీ ఊహాగానాలే. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 81 ప్రకారం జనాభా ప్రాతిపదికన ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు అన్నది ఖరారు కావాలి. కానీ కొన్ని రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల, కొన్ని చోట్ల తగ్గుదల కారణంగా ఆ సూత్రాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుంది. రాజ్యాంగం ప్రారంభంలో లోక్‌సభ సీట్లు 500గా ఖరారు చేసింది. తరువాత రాష్ట్రాల పునర్విభజన, ప్రతి రాష్ట్రానికి ప్రాతినిధ్యం కల్పించాలనే ప్రాతిపదికన సీట్లను పెంచారు.1971 జనాభా ప్రాతిపదికనే ఇప్పటికీ సీట్ల సంఖ్య కొనసాగటం సహేతుకం కాదని పెరిగిన జనాభాకు అనుగుణంగా రాష్ట్రాలకు సీట్లు కేటాయించాలన్నది ఒక అభిప్రాయం.ఉదాహరణకు దాని ప్రకారం 2001 జనాభా ప్రాతిపదికన ఉత్తర ప్రదేశ్‌కు ఏడు సీట్లు పెంచాలి, తమిళనాడుకు ఏడు తగ్గించాలి, అదే 2011లెక్కల ప్రకారం ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లకు 22 అదనంగా కేటాయించాలి, అదే ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణా, కేరళ, తమిళనాడుకు 17 సీట్లు తగ్గించాలి.2021(ఎప్పుడు జరిగితే అప్పుడు) జనాభా లెక్కల ప్రకారం దక్షిణాది రాష్ట్రాల సీట్లు ఇంకా తగ్గవచ్చు.2019లో జచేసిన ఒక విశ్లేషణ ప్రకారం ఉత్తర భారత్‌కు 32 సీట్లు పెరుగుతాయి, దక్షిణ భారత్‌కు 24 తగ్గుతాయి. కుటుంబ నియంత్రణ పద్దతులను జయప్రదంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం అన్నది వినిపిస్తున్నమాట.కార్నెగీ సంస్థ విశ్లేషణ మేరకు 2031 జనాభా ప్రకారమైతే ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌ రెండు రాష్ట్రాలకే 21 సీట్లు అదనంగా పెరిగితే, తమిళనాడు, కేరళకు కలిపి 16 తగ్గుతాయి. మొత్తం సీట్లు 848కి పెరిగితే ఒక్క ఉత్తర ప్రదేశ్‌కే 143, కేరళకు 20 ఉంటాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జి 20 ఢిల్లీ శిఖరాగ్ర సభ : రష్యాను ఖండించకుండా పశ్చిమ దేశాలు ఎందుకు దిగి వచ్చాయి !

13 Wednesday Sep 2023

Posted by raomk in Africa, BJP, CHINA, COUNTRIES, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, China, G 20, G20 Delhi summit, Joe Biden, Narendra Modi, Ukraine crisis, Vladimir Putin, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు న్యూఢిల్లీలో జి 20 దేశాల 2023 శిఖరాగ్ర సమావేశం జయప్రదంగా జరిగింది. ప్రతి సంవత్సరం ఒక సభ్య దేశ ఆతిధ్యంలో సమావేశాలు జరుగుతాయి. గత ఏడాది ఇండోనేషియాలో జరగ్గా వచ్చే ఏడాది బ్రెజిల్‌ వేదిక కానుంది. మరుసటి ఏడాది దక్షిణాఫ్రికాలో జరుగుతుంది, కాగా 2026లో జరగాల్సిన సభకు అమెరికా వేదిక కావటాన్ని చైనా ప్రశ్నించినప్పటికీ చివరికి అంగీకరించింది. ప్రతి సమావేశం తరువాత విడుదల చేసే సంయుక్త ప్రకటన విడుదల అవుతుందా లేదా అన్న అనుమానాలు తలెత్తినప్పటికీ చివరికి విడుదల చేశారు. ఈ కూటమిలోని కొన్ని దేశాల మధ్య కొనసాగుతున్న తీవ్ర విబేధాలు, పరస్పర అనుమానాలు తదితర కారణాల వలన చైనా అధినేత షీ జింపింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ హాజరు కాలేదు. దీని గురించి ఎవరికి తోచిన ఊహాగానాలను వారుచేశారు తప్ప అధికారికంగా సదరు దేశాల నుంచి ఎలాంటి ప్రకటనలూ విడుదల కాలేదు. చైనా తరఫున ప్రధాని లీ చియాంగ్‌, రష్యా నుంచి విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావరోవ్‌ ప్రతినిధి వర్గాలకు నాయకత్వం వహించారు. ఈ కూటమిలో ఆఫ్రికా యూనియన్‌కు పూర్తి సభ్యత్వం ఇవ్వటంతో ఇప్పటి నుంచి అది జి21గా మారింది. దీనిలో 19 దేశాలు ఉన్నాయి. వాటిలో భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా,ఇండోనేషియా, రష్యా, చైనా, అర్జెంటీనా, జపాన్‌, దక్షిణ కొరియా, బ్రెజిల్‌, మెక్సికో, కెనడా, బ్రిటన్‌, జర్మనీ,ఫ్రాన్స్‌, టర్కీ, ఇటలీ, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా ఉన్నాయి. ఆఫ్రికా యూనియన్‌, ఐరోపా యూనియన్‌ పూర్తి సభ్యత్వం గల సంస్థలు, ఐరాసతో సహా కొన్ని శాశ్వత ఆహ్వానితుల జాబితా ఉన్నాయి. పశ్చిమ దేశాల్లో ఆర్థిక సమస్యలు తలెత్తినపుడు ఒక పరిష్కార మార్గంగా ఈ కూటమి ఏర్పాటుకు 1999లో జి7 దేశాల కూటమి ఆలోచన చేసింది. 2008లో ధనిక దేశాల్లో తీవ్ర సంక్షోభం తలెత్తినపుడు ప్రతి ఏటా శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.


ఈ కూటమిలో ఇప్పటి వరకు ఆహ్వానితురాలిగా ఉన్న ఆఫ్రికా యూనియన్‌కు పూర్తి సభ్యత్వ హౌదా కల్పిస్తూ ఢిల్లీ సభ ఆమోదం తెలిపింది. దీనికి కారకులం తామంటే తామని మన దేశంతో పాటు రష్యా, చైనాలు కూడా ప్రకటించుకున్నాయి.ఈ చర్య ద్వారా పేద దేశాల గొంతుక వినిపించేందుకు అవకాశం వచ్చిందన్నది స్పష్టం. సభ్యత్వం ఇచ్చిన ఖ్యాతిని ఎవరి ఖాతాలో వేసుకోవటం అన్నది ముఖ్యం కాదు. వాటికి తోడ్పడుతున్నది ఎవరు అన్నదే గీటురాయి. దాన్ని పరిశీలించినపుడు ఇటీవలి కాలంలో ఆఫ్రికా ఖండంలో రష్యా, చైనా సాయంతో పాటు వాటి పలుకుబడి కూడా పెరుగుతోందన్నది అందరికీ తెలిసిందే. న్యూఢిల్లీ సభ జరిగిన తీరుతెన్నులు, పర్యవసానాలు, ఫలితాల గురించి సమీక్షలు వెలువడుతున్నాయి. తీసుకున్న నిర్ణయాలపై నవంబరు నెలలో వీడియో కాన్ఫరెన్సుద్వారా సమీక్ష జరుపుతారు. ఆమోదించాల్సిన తీర్మానాలు, నిర్ణయాల మీద ఏకాభిప్రాయం సాధించే బాధ్యత ఆతిధ్య దేశం కలిగి ఉంటుంది. అందుకు అనుగుణ్యంగానే దాన్ని మన దేశం కూడా నిర్వహించింది.ఐరాస తీర్మానాలు, పారిస్‌ ఒప్పందాల వంటి వాటినే అంగీకరించకుండా, అమలు జరపకుండా ఠలాయిస్తున్న దేశాలు ఈ కూటమిలో ఉన్నాయి.నిర్ణయాలను స్వచ్చందంగా అమలు జరపటం తప్ప విధి కాదు. కొన్ని స్పందనలు, కొన్ని అభిప్రాయాలకు భిన్నంగా దేశాలు వ్యవహరిస్తున్న తీరు తెన్నుల గురించి స్థూలంగా చూద్దాం. ఈ సమావేశాలను తన రాజకీయ ప్రయోజనాలకు నరేంద్రమోడీ ఉపయోగించుకుంటున్నారనే అభిప్రాయం మనదేశంలో ఇప్పటికే ఉంది. సభ జరిగిన తీరు మీద బిజెపి, నరేంద్రమోడీ మద్దతుదారుల స్పందన కూడా దానికి అనుగుణంగానే ఉంది.


పశ్చిమాసియాలో ప్రముఖ మీడియా సంస్థ ” అల్‌ జజీరా ” లో రాసిన ఒక విశ్లేషణ ఇలా ప్రారంభమైంది.” నరేంద్రమోడీ మోము, భారత దౌత్య మహత్తు(లేదా వివేకము) ప్రదర్శితమైంది.కానీ భారత భిన్నత్వ ప్రదర్శనకు అవకాశాన్ని నిరాకరించారు.భారత్‌ 140 కోట్ల జనాభా ఉన్న దేశం. కానీ సమావేశ రోజుల్లో రాజధాని నగరంలో ఎక్కడ చూసినా కేవలం ఒక ముఖమే కనిపించింది. జి 20 కూటమి నేతలకు ఆతిధ్యం ఇస్తున్న ప్రధాని నరేంద్రమోడీదే అది. కేవలం విమానాశ్రయం వద్దనే కాదు, సభకోసం ఇటీవల జరిపిన నిర్మాణం వరకు చూస్తే ప్రతి రోడ్డు, కొన్ని చోట్ల ప్రతి కొన్ని అడుగులకు, ఎక్కువ చోట్ల రెండుకార్ల పొడవునా ఒక వ్యక్తి ప్రదర్శన మాత్రమే కనిపించింది. దౌత్య ఆడంబర ప్రదర్శనలో మోడీ హీరో కాగా మధ్య ఢిల్లీలో సభ నిర్వహణ ప్రాంతానికి సమీపంలోని విదేశీరాయబార కార్యాలయాలు, హౌటళ్ల వద్ద సంచరించే కోతులను భయపెట్టేందుకు వాటి బొమ్మలతో కూడిన భారీ కటౌట్లను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. సభ జరిగిన చోట వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పోటీ చేసే భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతీకగా ఉన్న మోడీ బొమ్మలు ఎక్కువగా కనిపించాయి. ప్రగతి మైదాన్‌గా పిలుస్తున్న ప్రాంతంలో కొత్త సభా భవనాన్ని నిర్మించి దానికి భారత మండపం అని పేరు పెట్టారు. దీంతో లౌకిక ముద్ర నుంచి దూరంగా జరిగినట్లయింది. హిందూ దేవాలయాల్లో ముందు వసారాలను మండపం అని పిలుస్తారు. ” ఈ విశ్లేషణలో వీటితో పాటు మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు.


శిఖరాగ్ర సభ ఒక రోజు ముందే సంయుక్త ప్రకటనను ఆమోదించింది. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్‌ అని దానిలో పిలుపునిచ్చారు. ఈ సుభాషితంతో ఎవరికీ ఇబ్బంది లేదు, అభినందనీయమే. దానికి కట్టుబడి ఉన్నది ఎవరన్నదే ప్రశ్న. ఇది యుద్ధాలకు తగిన యుగం కాదు అన్నది ప్రకటనలోని ఒక అంశం. ఈ కూటమి ఉనికిలోకి వచ్చిన తరువాతనే ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్ల మీద ఈ కూటమిలోని దేశాలు దురాక్రమణలకు పాల్పడిన చరిత్ర, అనేక దేశాల మీద దాడులకు ఉగ్రవాదులను,కిరాయి మూకలను ఉసిగొల్పుతున్న తీరు తెలిసిందే. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని ఎగదోసిందీ, రష్యా ప్రాదేశిక భద్రత మీద ఎలాంటి హామీ ఇవ్వకుండా ఆయుధాలను సరిహద్దుల్లోకి చేర్చటం ప్రారంభించిన తరువాతే పుతిన్‌ సైనిక చర్యకు పాల్పడినదాన్ని ప్రపంచం చూసింది. దాన్ని పరిష్కరించాల్సిన పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు తమ ఆయుధ సంపత్తిని అందిస్తూ ప్రోత్సహిస్తూ మరోవైపు సుద్దులు చెప్పటం హాస్యాస్పదం. తైవాన్‌ ప్రాంతం చైనా అంతర్భాగమని ఐరాస గుర్తించింది. దాన్ని విలీనం చేసుకొనే హక్కు చైనాకు ఉంది. దానికి తగిన సమయం రాలేదంటూ తైవాన్‌కు ఆయుధాలు ఇస్తూ చైనా మీద దాడికి ఉసిగొల్పుతున్న దేశాల నిజాయితీ ఏమిటన్నది ప్రశ్న. దక్షిణ చైనా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో చైనా ఇంతవరకు ఏ దేశ నౌకనూ అడ్డుకున్న దాఖలా లేదు.


న్యూఢిల్లీ ప్రకటనలో పేర్కొన్న లక్ష్యానికి భిన్నంగా ప్రపంచంలో పరిణామాలు జరుగుతున్నాయి. అణ్వాయుధాల వినియోగం గురించి ప్రకటన హెచ్చరించింది. కానీ తానుగా వాటిని వినియోగించబోనని ప్రకటించేందుకు ఇంతవరకు అమెరికా అంగీకరించ లేదు. అణ్వాయుధాలను మోసుకుపోయే ఆధునిక క్షిపణులు, విమానాలను రోజు రోజుకూ మెరుగుపరుస్తోంది. ఐరాస నిబంధనావళి ప్రకారం ఏ దేశమూ బలప్రయోగం చేయకూడదని పేర్కొన్నది. దీని మీద కూటమి దేశాలు రాజీపడినట్లు ఉక్రెయిన్‌ మండిపడింది. ఉక్రెయిన్‌ ప్రాదేశిక సమగ్రతకు కట్టుబడతామని రష్యా కూడా అంగీకరించిందని అందుకే దిగి వచ్చి సంతకం చేసిందని కొందరు పశ్చిమ దేశాల వారు వక్రీకరించారు. వాస్తవానికి పశ్చిమ దేశాల వలలో చిక్కుకొని నాటోలో చేరి తమ ప్రాదేశిక భద్రతకు ముప్పు తలపెట్టినందున ఉక్రెయిన్ను దారికి తెచ్చేందుకు సైనిక చర్య జరుపుతున్నాం తప్ప దాన్ని ఆక్రమించుకొనే లక్ష్యం లేదని రష్యా ప్రారంభం నుంచీ చెబుతున్నది. రష్యా,ఉక్రెయిన్ల నుంచి ఆహారం, ధాన్యాలు, ఎరువుల సరఫరాను పునరుద్దరించాలని, ఎగుమతి దిగుమతులను అడ్డుకోరాదని, అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని కూడా జి21 కూటమి కోరింది. టర్కీ మధ్యవర్తిత్వంలో కుదిరిన ఒప్పందాన్ని పశ్చిమ దేశాలు ఉల్లంఘించి తమను దెబ్బతీస్తున్న కారణంగానే ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు రష్యా ప్రకటించింది. ఈ కారణంగా అనేక పేద దేశాలు అధిక ధరలకు ఇతర దేశాల నుంచి ఆహారాన్ని దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితికి పశ్చిమ దేశాలే కారణం. రైతులు విదేశాలకు సైతం ఎగుమతులు చేసుకొని లబ్దిపొందవచ్చంటూ మూడు సాగు చట్టాలను రైతుల మీద రుద్దినపుడు కబుర్లు చెప్పిన నరేంద్రమోడీ జి20 అధ్యక్ష స్థానంలో ఉన్నపుడే గోధుమలు, బియ్యం, పంచదార, ఉల్లి ఎగుమతులను కూడా నిషేధించిన సంగతి తెలిసిందే.


ఢిల్లీ సమావేశానికి షీ జింపింగ్‌ హాజరు కాకపోవటం గురించి మీడియాలో అనేక కథనాలు వచ్చాయి.గతంలో జరిగిన ఇలాంటి శిఖరాగ్ర సమావేశాలకు కొన్ని దేశాల నేతలు రాకపోవటం తెలిసిందే. కానీ జింపింగ్‌ రాలేదంటే దాని వెనుక బలమైన కారణాలేమీ లేవంటే ఎవరూ నమ్మరు, తప్పుకుండా ఉండి ఉంటాయి. చతుష్టయ కూటమి(క్వాడ్‌) అమెరికా, భారత్‌,జపాన్‌, ఆస్ట్రేలియా కూటమి తనకు వ్యతిరేకమే అని చైనా భావిస్తున్నది. ఈ కూటమి నేతలను వచ్చే రిపబ్లిక్‌ దినోత్సవ అతిధులుగా పిలవాలని మన ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఢిల్లీలో ఒక గదిలో చైనా ప్రధాని ఉండగా మరొక పక్క గదిలో జో బైడెన్‌-నరేంద్రమోడీ సమావేశమై క్వాడ్‌ పటిష్టత గురించి, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్చా నౌకారవాణా గురించి చర్చలు జరిపారు. ఇవి చైనాను రెచ్చగొట్టేవే అన్నది స్పష్టం. వీటికంటే ముందే చైనా రూపొందించిన ప్రపంచ పటంలో మన భూభాగాలను కొన్నింటిని మినహాయించటం, దాని మీద వివాదం చెలరేగిన సంగతీ తెలిసిందే. గతేడాది ఇండోనేషియా నగరమైన బాలిలో జరిగిన సమావేశ ప్రకటనలో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ఖండిస్తూ చేర్చిన పేరా వివాదాస్పదమైంది. రాజీమార్గంగా చివరకు ఎక్కువ మంది సభ్యులు ఖండించారని, పరిస్థితి మీద ఇతరులు భిన్నమైన వైఖరులను వెల్లడించారని పేర్కొన్నారు. మొత్తం మీద ఖండన దానిలో కనిపించింది. ఆ సమావేశంలో వీడియో కాన్ఫరెన్సుద్వారా మాట్లాడిన ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ కూటమిని జి20 బదులు జి19 అని సంబోధించటం(రష్యాను గుర్తించకుండా) కూడా రచ్చకు దారి తీసింది. సమావేశం జరుగుతుండగా పోలాండ్‌లో క్షిపణి పేలుడు జరిగింది. వాస్తవాలు నిర్ధారించుకోకుండానే దానికి రష్యా కారణమని ఆరోపించటం, సభలో ఉన్న జి7, నాటో కూటమి దేశాల నేతలు అక్కడే విడిగా సమావేశం కావటం, వాటన్నింటికంటే ముందే రష్యా ప్రతినిధి వర్గ నేత లావరోవ్‌తో ఫొటో దిగేందుకు అనేక మంది నేతలు తిరస్కరించటంతో అసలు బాలిలో పాల్గన్నవారి కుటుంబ చిత్రమే లేకుండా పోయింది. తరువాత జరిగిన అనేక పరిణామాలు చైనా, రష్యాలతో అమెరికా, ఐరోపా పశ్చిమ దేశాల సంబంధాలు మరింతగా దిగజారాయే తప్ప మెరుగుపడలేదు. బాలిలో షీ జింపింగ్‌-జో బైడెన్‌ భేటీ జరిగింది, సంబంధాలను, మాటా మంతిని పునరుద్దరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటన వెలువడింది. కానీ ఆ వెంటనే అమెరికా పార్లమెంటు స్పీకర్‌ నానీ పెలోసీ చైనా అభ్యంతరాలను ఖాతరు చేయకుండా పంతంతో తైవాన్‌ వెళ్లటం తెలిసిందే. తరువాత అమెరికా సర్కార్‌ మరింతగా మిలిటరీ సాయాన్ని ప్రకటించింది. ఈ పూర్వరంగంలో వెళ్లకపోవటమే మంచిదని షీ జింపింగ్‌, పుతిన్‌ భావించి ఉండాలి.సంయుక్త ప్రకటనలో ఉక్రెయిన్‌ సంక్షోభానికి సంబంధించి బాలి ప్రకటనలో ఉన్న పదజాలానికి భిన్నంగా రష్యా పేరు లేకుండా యుద్ధం కారణంగా జనం పడుతున్న ఇబ్బందుల గురించి మాత్రమే పేర్కొన్నారు. ఇది పశ్చిమ దేశాలకు ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. బాలిలో మాదిరి ఖండిస్తే చైనా, రష్యా అంగీకరించకపోతే అసలు ప్రకటనే వెలువడి ఉండేది కాదు. అది జరిగితే తాము బలపరస్తున్న నరేంద్రమోడీ ప్రతిష్టకు భంగం అని భావించి పశ్చిమ దేశాలు అయిష్టంగానే రష్యా మిలిటరీ చర్య ప్రస్తావన లేకుండా అంగీకరించినట్లు కనిపిస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సనాతన ధర్మంపై పోరుకు అంబేద్కర్‌ మారుపేరు : వ్యాఖ్యల నుంచి తగ్గేది లేదన్న ఉదయనిధి స్టాలిన్‌ !

05 Tuesday Sep 2023

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence, Social Inclusion

≈ Leave a comment

Tags

# Anti Sanatan Dhrma, #Hindutva, #Udhayanidhi Stalin, Anti Hindu, BJP, DMK, Dravida, Eradicate Sanatan Dharma, INDIA, Narendra Modi, RSS


ఎం కోటేశ్వరరావు


” మన సమాజానికి సనాతన ధర్మం ఒక మలేరియా, డెంగీ వంటిది, దాన్ని వ్యతిరేకించటం కాదు, రూపుమాపాలి ” అని శనివారం నాడు తమిళనాడు పురోగామి రచయితలు మరియు కళాకారుల అసోసియేషన్‌ సభలో తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ వెల్లడించిన అభిప్రాయం దేశంలో దుమారం రేపింది.ఇది హిందూ వ్యతిరేక వైఖరి, సనాతన ధర్మాన్ని పాటించే వారిని ఊచకోత కోయాలని పిలుపు ఇచ్చారంటూ బిజెపి చిత్రించింది. మాట్లాడే స్వేచ్చ పార్టీల కుందని కాంగ్రెస్‌ చెప్పగా, తృణమూల్‌ కాంగ్రెస్‌ తప్పుపట్టింది. చెన్నయి సభ సందర్భంగా నిర్వాహకులు ” సమతా ధర్మ నిర్మూలన ” అనే అంశంపై చర్చను పెట్టారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించటం గాక నిర్మూలించాలని నిర్వాహకులు పేరు పెట్టినందున వారిని అభినందిస్తున్నానని ఉదయనిధి స్టాలిన్‌ అన్నారు.” కొన్ని అంశాలను మనం నిర్మూలించాలే తప్ప దోమలు, డెంగీ, కరోనా, మలేరియా వంటి వాటిని కేవలం వ్యతిరేకించలేం, నిర్మూలించాలి. సనాతన ధర్మం కూడా ఇలాంటిదే.వ్యతిరేకించటంగాక నిర్మూలించటం అన్నది మన తొలి లక్ష్యంగా ఉండాలి అన్నారు. సనాతనం జనాన్ని కులపరంగా చీల్చిందని చెప్పారు. అది సమానత్వానికి, సామాజిక న్యాయానికి వ్యతిరేకం తప్ప మరింకేమీ కాదన్నారు. తమిళనాడులో 39 లోక్‌సభ స్థానాలు, పుదుచ్చేరిలో ఒకదానిలో అన్నింటా మనం గెలవాలి. సనాతనం ఓడాలి, ద్రావిడం గెలవాలి అన్నారు. ప్రతిదాన్నీ ప్రశ్నించేందుకే కమ్యూనిస్టు, ద్రవిడ ఉద్యమం పుట్టిందని అన్నారు.


సనాతన ధర్మాన్ని రూపుమాపాలి అని చెప్పిన తన మాటలను బిజెపి వక్రీకరించిందని రద్దు లేదా రూపు మాపాలి అంటే అర్ధం సనాతన ధర్మాన్ని పాటించేవారిని అంతం చేయాలని కాదని ఉదయనిధి స్పష్టం చేశారు. తన వైఖరిని పదే పదే వెల్లడిస్తానని, సనాతన ధర్మాన్ని మాత్రమే విమర్శించానని, దాని మీద ఎన్నికేసులు దాఖలైనా ఎదుర్కొంటానని ఆది, సోమవారాలలో పునరుద్ఘాటించారు. కొంత మంది తీరు పిల్లచేష్టల మాదిరి ఉందంటూ ద్రావిడవాదాన్ని రద్దుచేయాలి అని చెప్పినవారి మాటలకు అర్ధం డ్రావిడులను అంతం చేయాలనా, కాంగ్రెస్‌ ముక్త భారత్‌ అని ప్రధాని నరేంద్రమోడీ చెబుతున్నారు అంటే కాంగ్రెస్‌ వారిని చంపాలనా అని ప్రశ్నించారు. సనాతన అంటే దేన్నీ మార్చకూడదు, దానిలో చెప్పినవన్నీ శాశ్వతంగా ఉంటాయని అర్ధం అని ఉదయనిధి చెప్పారు. అదిఆద్యంత రహితమైనది, దాన్ని మార్చలేము, ఎవరూ దాన్ని ప్రశ్నించకూడదన్నదే దాని అర్ధం,కుల ప్రాతిపదికన సనాతనం జనాన్ని చీల్చింది అన్నారు.


సనాతన ధర్మ పునరుద్దరణ కోసమే పుట్టామని చెబుతున్న హిందూత్వశక్తులు రెచ్చిపోతున్న తరుణమిది. ఆ ధర్మం పేరుతో కోట్లాది మందిని అంటరానివారిగా, విద్య, వ్యక్తిత్వాలకూ దూరం చేసిన భావజాలం మీద అంబేద్కర్‌ , వామపక్ష, పురోగామి, హేతువాదులు నిరంతరం పోరాడారు. దాన్ని కొనసాగించటం కోసం నేడు కోట్లాది మంది అంబేద్కర్‌లు తయారు కావాల్సిన అవసరం వచ్చింది.ఇది భావజాల పోరు. దానిలో భాగంగానే ఉదయనిధి స్టాలిన్‌ వదిలిన ఒక వాగ్బాణం దెబ్బకు విలవిల్లాడుతున్న వారు దాన్ని చిలవలు పలవలుగా మార్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారు.ఉదయనిధి స్టాలిన్‌ తల నరికిన వారికి పది కోట్ల రూపాయల బహుమతి ఇస్తానని అయోధ్య తపస్వి ఛావనికి చెందిన మహంత పరమహంస దాస్‌ పిలుపు నిచ్చారు. గత రెండు వేల సంవత్సరాలలో అనేక మతాలు వచ్చి అంతరించాయని సనాతన ధర్మం మాత్రమే మిగిలి ఉందని అన్నారు. దాన్ని ఎవరైనా నాశనం చేయాలని చూస్తే అంతు చూస్తామని అన్నారు. ఉదయనిధిని చంపివేస్తే తాను కోటి రూపాయలు ఇస్తానని బిజెపి నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గ నేత దిలీపాచారి ప్రకటించారు. ఇలాంటి ప్రకటనలు మత ఉగ్రవాదం తప్ప మరొకటి కాదు. హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ కొన్ని చోట్ల కొందరు కేసులు దాఖలు చేశారు.


” భగవద్గీతలో ప్రవచించిన హిందూ సామాజిక తత్వాన్ని నేను తిరస్కరిస్తాను.అది సాంఖ్య తత్వశాస్త్రంలోని త్రిగుణాల ప్రాతిపదికన ఉంది. నా అభిప్రాయం ప్రకారం ఇది కపిలుడి తత్వశాస్త్రానికి క్రూరమైన వక్రీకరణ రూపం, అది హిందూ సామాజిక జీవన న్యాయంలో అంతరాలతో కూడిన అసమాన కుల వ్యవస్థను తయారు చేసింది. సహపంక్తి భోజనాలు లేదా అక్కడక్కడా జరిగే కులాంతర వివాహాల వలన కులం అంతరించదు. కులం ఒక మానసిక స్థితి, అది బుర్రకు పట్టిన వ్యాధి. ఈ వ్యాధికి హిందూ మతబోధనలే మూలకారణం. మనం కులతత్వాన్ని , అస్పృశ్యతను పాటిస్తున్నాం.హిందూమతం ద్వారా వాటిని చేసేందుకు ఆజ్ఞాపితులమయ్యాము.పచ్చి చేదును తీపిగా మార్చలేము. దేని రుచినైనా మార్చగలము.కానీ విషాన్ని అమృతంగా మార్చలేము.మానవులు శాశ్వతం కాదు. భావజాలం కూడా అంతే.మొక్కలకు నిరంతరం నీటిని అందించటం ఎంత అవసరమో ఒక భావజాలానికి ప్రచారం కూడా అంతే అవసరం, లేకుంటే రెండూ చచ్చిపోతాయి.నేను చివరిగా చెప్పేదేమంటే జనాలను మీరు చైతన్యపరచండి, పోరు సాగించండి, సంఘటితపరచండి, మీరు ఆత్మవిశ్వాసంతో ఉండండి.మన పోరు సంపద కోసమో లేదా అధికారం కోసమో కాదు. స్వేచ్చకోసం, ఇది మానవ వ్యక్తిత్వ పునరుద్దరణ పోరు. ” ఇవి వివిధ సందర్భాలలో మహనీయుడు బిఆర్‌ అంబేద్కర్‌ చెప్పిన మాటలు, చేసిన దిశానిర్దేశం.


ఉదయనిధి స్టాలిన్‌ చేసి వ్యాఖ్యల మీద సహజంగానే బిజెపి, దాన్ని అనుసరించేవారు మీడియాలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ విరుచుకుపడుతున్నారు. వర్తమాన పరిస్థితుల్లో అదేమీ అనూహ్యమైంది కాదు. శాంతి, సహనాల గురించి రోజూ సుభాషితాలు చెప్పే వారు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సనాతన ధర్మ ప్రబోధకులు, దాన్ని అమలు చేయాలని చూసే వారిని గట్టిగా విమర్శిస్తే వారు మరింత రెచ్చిపోతారు, జనం అర్ధం చేసుకోకపోతే మనకే నష్టం అని చెప్పేవారు మంచి ఉద్దేశంతోనే చెబుతున్నారు. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవటం తప్ప భావజాల పోరును పక్కన పెడితే మరింతగా రెచ్చిపోతారు. దేశంలో చివరికి ఏ గల్లీ సిల్లీ స్వామీజీని కదలించినా చెప్పేవి ధర్మం కోసం దేశం, సనాతనం, హిందూత్వ పరిరక్షణ, ముస్లింలుక, కైస్తవులు దేశానికి ముప్పుగా మారారు అనే కబుర్లే కదా ! ఉదయనిధి స్టాలిన్‌ వంటి వారు మాట్లాడినందునే వారంతా రెచ్చిపోతున్నారా ? లేదు, ఒక అజెండా ప్రకారమే వారు మాట్లాడుతున్నారు, వామపక్ష, పురోగామి వాదులతో పాటు ఉదయనిధి మాదిరి మాట్లాడేవారు ఇతర పార్టీలలో ఇప్పుడు ఎందరున్నారు అన్నది ప్రశ్న. సనాతవాదుల మారణకాండకు పిలుపునిచ్చినట్లు అతని మాటలను వక్రీకరించిన బిజెపి తీరు దేశం చూస్తున్నది. ఒక భావజాలాన్ని మరొక భావజాలం కలిగిన వారు విమర్శించటం ప్రజాస్వామిక లక్షణం. అనేక అంశాల మీద తర్కం జరిగినట్లు మన ప్రాచీన భారత చరిత్ర కూడా చెబుతున్నది. హిందూత్వ, సనాతనం మీద విమర్శలు చేస్తే అవి ఆ శక్తులకే ఉపయోగపడతాయని, జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడాలని కొందరు సనాతన ధర్మ వ్యతిరేకులు కూడా మాట్లాడుతున్నారు.

అసలు కమ్యూనిస్టులు, ఇతర పురోగామి వాదులు గతంలో గట్టిగా పోరాడని కారణంగానే మతశక్తులు పేట్రేగిపోయారని చెప్పేవారు కూడ మనకు తగులుతారు.కానీ అసలు కారణం అది కాదు, స్వాంత్య్ర ఉద్యమానికి దూరంగా ఉండటమేగాక ద్రోహం చేసిన శక్తులు మహాత్ముడిని హతమార్చిన తరువాత వాటిమీద తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా మేం మారాం అని ఇచ్చిన లేఖను తీసుకొని కొనసాగనిచ్చిన వారు అసలు దోషులు అని చెప్పేవారు కూడా ఉన్నారు. కానీ ప్రపంచవ్యాపితంగా మితవాద పిచ్చిమొక్కలు పెరగటానికి అనువైన వాతావరణం ఏర్పడిందని గ్రహిస్తే వాటిని పీకివేసేందుకు చేయాల్సిన కార్యాచరణకు ముందుకు వస్తారు. పర్యవసానాల గురించి తెలియకుండానే దేశంలో అనేక మంది మితవాదుల పట్ల ఒక సానుకూల వైఖరితో ఉన్నారు, మేథావులుగా ఉన్నవారు కొందరు మతశక్తుల చంకనెక్కుతున్నారు.చాలా మంది మౌనంగా ఉంటున్నారు. అంబేద్కర్‌ చెప్పినట్లు ఉదాసీనత లేదా తటస్థవాదం అత్యంత ప్రతికూల చెడు వ్యాధిగా జనాన్ని ప్రభావితం చేస్తుంది.” చెడ్డవారి అణచివేత, దుర్మార్గం కంటే మంచి వారి మౌనం చివరికి విషాదంగా మారుతుంది. మౌనం ఒకనాటికి నమ్మక ద్రోహంగా పరిణమిస్తుంది ” అని మార్టిన్‌ లూధర్‌ కింగ్‌ జూనియర్‌ చెప్పిన అంశాన్ని అందరూ గుర్తించాల్సిన తరుణం వచ్చింది.


ఒక మతభావజాలం సమాజ పురోగమనానికి ఆటంకం కలిగినపుడు మరో తత్వశాస్త్రం ముందుకు వచ్చి కొత్త మతాల ఆవిర్భావానికి కారణం అన్నది ప్రతి మత చరిత్ర చెబుతున్నది. మన దేశంలో వేదమతం లేదా సనాతన ధర్మం 50 బ్రహ్మ సంవత్సరాల పాటు కొనసాగిందని చెప్పేవారు ఉన్నారు. ఒక్కో బ్రహ్మ సంవత్సరానికి 3.1104 లక్షల కోట్ల మానవ సంవత్సరాలు అంటే సనాతన ధర్మం 155.52లక్షల కోట్ల సంవత్సరాలు సాగిందని నమ్మింప చూస్తారు. దీనికి ఎలాంటి ఆధారం లేదు.వేద మతం మీద తిరుగుబాటుగా లేదా కొత్త ఆలోచనల నుంచి వచ్చినవే బుద్ద, జైన, అనేక సారూప్యతలు కలిగిన వివిధ హిందూ మతాలు. ఈ కాలంలోనే చార్వాకులు లేదా లోకాయతులుగా పిలిచిన భారత తొలి భౌతికవాదులు తమ తత్వశాస్త్రాన్ని ముందుకు తెచ్చినట్లు వారికి వ్యతిరేకంగా వెలువడిన రచనలను బట్టి తెలుస్తున్నది. పరలోకం లేదా మరణానంతర లోకం లేదన్న వాదనలను ముందుకు తెచ్చిన చార్వాకులను అవి ఉన్నాయని చెప్పే మతశక్తులు భౌతికంగా అంతమొందించటంతో పాటు వారి రచనలను కూడా ధ్వంసం చేసినట్లు చెబుతారు. చివరకు తమతో విబేధించిన బౌద్ద, జౌన మతాలను కూడా మన దేశంలో అణచివేసిన చరిత్ర మనకు తెలిసిందే. గతంలో శైవు- వైష్ణవ మతాలను అనుసరించిన వారు మతోన్మాదంతో కొట్టుకుచచ్చినా తరువాత కాలంలో రాజీపడ్డారు. ఇప్పుడు కూడా నిఖార్సయిన శైవులుగా చెప్పుకొనేవారు వైష్ణవాలయాలను, వైష్ణవమత పరిరక్షకులమని అంటున్నవారు శివాలయాలను సందర్శించరు. ఇలాంటి వారంతా ఇప్పుడు హిందూత్వశక్తులుగా, హిందూమత పరిరక్షకులుగా ఫోజు పెడుతున్నారు. ఈ రోజు హిందూమతం అంటే సనాతనకు ప్రతిరూపంగా ముందుకు తెస్తున్నందున ఉదయనిధి స్టాలిన్‌ వంటి వారు విమర్శలు చేస్తున్నారు. సనాతన, హిందూత్వ లేదా హిందూ అనేది ఒక జీవన విధంగా చెబుతూ సామాన్యుల చేత తమ చేదు మాత్ర మింగించేందుకు మతశక్తులు చూస్తున్నాయి. అలాంటి జీవన విధానానికి తిరిగి వెళ్లాలని ప్రబోధిస్తున్నవారు సమాజాన్ని వెనక్కు నడపాలని చూసే వారు తప్ప మరొకరు కాదు. ఎందుకంటే భారత్‌లో ఏనాడూ జనమందరి జీవన విధానం ఒక్కటిగా లేదు. అన్ని కులాలది ఒకటే జీవన విధానం కాదు. సామాజిక న్యాయం లేదు. జీవన విధానమే అసలైన అంశం అయితే హిందూ మతానికి ముప్పు వచ్చిందని ఎందుకు ప్రచారం చేస్తున్నట్లు ? తమ మతం, జీవన విధానాలను ఎంచుకొనే స్వేచ్చ జనానికి సంబంధించిన అంశం.


ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మ విధానం మీద విమర్శ చేయగానే బిజెపి నేతలు ధ్వజమెత్తారు. సనాతను వ్యతిరేకించటం కాదు నిర్మూలించాలని పిలుపునిచ్చారంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే సనాతన ధర్మాన్ని పాటిస్తున్న దేశంలోని 80శాతం మందిని ఊచకోత కోయాలని పిలుపు నివ్వటమే అని బిజెపి ఐటి విభాగ నేత అమిత్‌ మాలవీయ ఆరోపించారు. దీనికి ముంబైలో సమావేశమైన ఇండియా కూటమి నేతలు అంగీకరించినట్లేనా అని బిజెపి ప్రశ్నించింది. ఇదంతా మెజారిటీగా ఉన్న హిందువులతో ఓటు బ్యాంకు రాజకీయం తప్ప మరొకటి కాదు. తమిళనాడు బిజెపి నేత నారాయణ తిరుపతి ధ్వజమెత్తారు. డిఎంకె ఒక కాన్సర్‌ వంటిది దానికి సనాతన ధర్మ సూత్రాలతో చికిత్స చేయాలన్నారు. డిఎంకెకు ఇలాంటివి కాత్త కాదు. వారికి చెడు అంశాలు మంచివిగా మంచివి చెడుగా కనిపిస్తాయి. సనాతనం ఆద్యంతరహితమైనది, డిఎంకె ఒక మత పార్టీ, అది ముస్లింలు, క్రైస్తవుల ఓట్ల మీద బతుకుతున్నది అన్నారు.(తమిళనాడులో హిందువుల జనాభా 88శాతం వరకు ఉన్నదని లెక్కలు చెబుతున్నాయి) క్రైస్తవ మిషినరీల నుంచి అరువుతెచ్చుకున్న భావజాలంతో ఉదయనిధి స్టాలిన్‌ చిలుకపలుకులు వల్లించినట్లు బిజెపి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై వర్ణించారు. రాష్ట్ర జిఎస్‌డిపి కంటే ఎక్కువగా గోపాలపురం కుటుంబం(స్టాలిన్‌ కుటుంబం నివాసం ఉండే ప్రాంతం పేరు) సంపదలను పోగేసుకుందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని బిజెపి ఎంపీ సుధాంశు త్రివేది అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ భిన్న స్వరాలను వినిపించింది. తమిళనాడుకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరం ఉదయనిధి వ్యాఖ్యలను సమర్ధించగా, జాతీయ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ మాట్లాడుతూ ప్రతి పార్టీకి అభిప్రాయాలు వెల్లడించే హక్కు ఉందని అన్నారు. తమ పార్టీ అన్ని మతాల మనోభావాలను గౌరవిస్తుందని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌ టిఎంసి ప్రతినిధి విమర్శించారు. ఇండియా కూటమిలోని ఒక భాగస్వామి పార్టీ నుంచి వెలువడిన వ్యాఖ్యలపై కూటమి అభిప్రాయం ఏమిటని బిజెపి ప్రశ్నించింది. మౌనంగా ఉండటం ద్వారా సనాతనవాదుల ఊచకోత పిలుపును కాంగ్రెస్‌ సమర్ధించినట్లయిందని బిజెపి నేత అమిత్‌ మాలవీయ ఆరోపించారు. కాంగ్రెస్‌, డిఎంకె ఓట్ల కోసం సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నదని కేంద్ర మంత్రి అమిత్‌ షా ఆరోపించారు. రాజస్థాన్‌ ఎన్నికల సభలో మాట్లాడుతూ మోడీ గెలిస్తే సనాతన గెలిచినట్లు కాంగ్రెస్‌ చెబుతోంది, లష్కరే తోయబా కంటే హిందూ సంస్థలు ప్రమాదకరమైనవని రాహుల్‌ గాంధీ చెప్పారని షా ఆరోపించారు. ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలతో దేశంలో తిరోగామి సనాతన ధర్మం గురించి చర్చ జరుగుతున్నది. ఇది కొందరి కళ్లు తెరిపించినా మంచిదే. సనాతన ధర్మం కొనసాగాలని చెప్పేవారి వాదనలేమిటో, వ్యతిరేకించేవారి కారణాలేమిటో జనం తెలుసుకొనేందుకు ఒక అవకాశం వచ్చింది.నూరుపూవులు పూయనివ్వండి వేయి ఆలోచనలను వికసించనివ్వండి అన్నట్లుగా భావజాల పోరు సాగాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికల చర్చ : మాజీ రాష్ట్రపతి రామనాధ్‌ కోవింద్‌ కమిటీ ఏర్పాటు !

01 Friday Sep 2023

Posted by raomk in Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

'Ram Nath Kovind committee, BJP, Narendra Modi, Narendra Modi Failures, one nation one election


ఎం కోటేశ్వరరావు


సెప్టెంబరు 18 నుంచి 22వ తేదీ వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకో పార్టీలకూ, జనానికి తెలవదు. ఆ ప్రకటనతో పాటు ఒకేసారి పార్లమెంట్‌-అసెంబ్లీల ఎన్నికలు జరిపే అంశం గురించి నివేదిక ఇవ్వాలని మాజీ రాష్ట్రపతి రామనాధ్‌ కోవింద్‌ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. దీంతో జమిలి ఎన్నికల కోసం అవసరమైన బిల్లు, రాజ్యాంగ సవరణల కోసమే ఐదు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలన్న చర్చ దేశంలో ప్రారంభమైంది. ఊరకరారు మహాత్ములు అన్నట్లు నరేంద్రమోడీ నాయకత్వం ఏది చేసినా బిజెపికి, తాను, తన ఆశ్రితుల లబ్ది చూస్తారు అన్నది తెలిసిందే. గత శతాబ్దిలోనే ముందుకు వచ్చింది ఒకేసారి ఎన్నికల అంశం. ఇది సమాఖ్య వ్యవస్ధ, రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యతిరేకమని అనేక పార్టీలు, నిపుణులు తిరస్కరించినప్పటికీ 2014 నుంచీ ఒకే దేశం-ఒకే ఎన్నికలంటూ వదలకుండా చెబుతున్నారు.విడివిడిగా ఎన్నికలు జరగటం వలన అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం గనుక ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి చర్చించాలని వాదనలు చేస్తారు.


స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1967వరకు లోక్‌సభ,అసెంబ్లీ ఎన్నికలన్నీ ఒకేసారి జరిగాయి. కానీ ఆకాలంలో జరిగిందేమిటి ? దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతినటం, అది రాజకీయ సంక్షోభాలకు కారణం కావటం తెలిసిందే. దాని ఫలితమే 1969లో కొన్ని అసెంబ్లీల రద్దు, తరువాత ముందుగానే 1970లోపార్లమెంట్‌ రద్దు, 1971 ప్రారంభంలో ఎన్నికలు అన్న విషయం తెలిసిందే. ఒక దేశవృద్ది రేటు ఒకేసారి ఎన్నికలు జరపటం, ఎన్నికల ఖర్చు తగ్గింపు మీద, ఆ సమయంలో ప్రవర్తనా నియమావళి మీద ఆధారపడదు. చివరకు దేశం కోసం ధర్మం కోసం అనే పేరుతో ఈ వాదన అసలు ఎన్నికలే వద్దు అనేదాకా పోతుంది. ఆయా దేశాల జిడిపిలు, ఆదాయాలతో పోల్చితే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వాల ఖర్చు నామమాత్రమే. పార్టీలు పెట్టే ఖర్చే దానికి ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటోంది. దాని నివారణకు ఒకేసారి ఎన్నికలు పరిష్కారం కాదు.2019లోక్‌సభ ఎన్నికల్లో పార్టీలు ఖర్చుచేసిన మొత్తాలతో సహా అరవైవేల కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా వేశారు. ఇది పోటీచేసిన అభ్యర్ధులు ఇచ్చిన సమాచారం మేరకు అంచనా తప్ప, వాస్తవ ఖర్చు దాని కంటే కొన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది. చీటికి మాటికి ఎన్నికలు జరిగితే అభివృద్ధి పధకాల అమలు నిలిచిపోతుందన్నది ఒక పెద్ద తప్పుడు ప్రచారం. ప్రవర్తనా నియమావళి అంటే ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టే కొత్త కార్యక్రమాల ప్రకటనలను నివారించటం తప్ప వాటితో నిమిత్తం లేకుండా ముందే ప్రారంభమై సాగే పధకాల అమలు నిలిపివేత ఉండదు. రైలు మార్గాల నిర్మాణం, విద్యుదీకరణ, ప్రభుత్వ గృహాలు, రోడ్ల నిర్మాణం, పెన్షన్ల చెల్లింపు, చౌకదుకాణాల్లో వస్తువుల సరఫరా వంటివి ఏవీ ఆగటం లేదే.గతంలో గుజరాత్‌, హిమచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నప్పటికీ గ్రామీణ ఉపాధి పధకం పనులకు విడుదల చేయాల్సిన నిధులకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇచ్చింది. అయితే ఆ విషయాన్ని మీడియాలో ఎక్కడా వెల్లడించకూడదని షరతు పెట్టింది.


కొన్నిదేశాల్లో ఒకేసారి జాతీయ, ప్రాంతీయ, స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ విధంగా చేసి ఖర్చును ఆదాచేయటం వల్ల అవి అభివృద్ధి సాధించినట్లు ఎక్కడా రుజువు లేదు. ఉదాహరణకు అమెరికాలో 1962-2019 మధ్య 57 ఏండ్లలో 26 సంవత్సరాలు తిరోగమన, 16 సంవత్సరాలు ఒక శాతంలోపు, ఐదు సంవత్సరాలు ఒకటి-రెండు శాతం మధ్య వృద్ది నమోదైంది.అమెరికాలో ఎన్నికల ప్రకటన నుంచి పోలింగ్‌ రోజువరకు మన దేశంలో మాదిరి ప్రవర్తనా నియమావళితో నిమిత్తం లేకుండా అనేక చర్యలు తీసుకోవటాన్ని చూశాము. అక్కడ రాష్ట్రానికి ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉంది. ఎన్నికల కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు ఆగవు, ప్రవర్తనా నియమావళి లేదు. అయినా అక్కడ వృద్ధి రేటు ఎక్కువ సంవత్సరాలు దిగజారింది. కొన్ని లాటిన్‌ అమెరికా, ఐరోపా దేశాలలో నిర్ణీత కాలం వరకు చట్ట సభలు రద్దు కావు, ప్రభుత్వాలు మారుతుంటాయి. అలాంటి దేశాలూ అభివృద్ది సమస్యలను, సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. మన దేశంలో కూడా ఇలా ఐదేండ్ల పాటు పార్లమెంటు, అసెంబ్లీలు రద్దు కాకుండా రాజ్యాంగ సవరణ చేస్తే ఇప్పుడున్న లోపభూయిష్టమైన పార్టీల ఫిరాయింపు చట్టం అవసరం కూడా ఉండదు. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటే అది కూలిపోయి కొత్త ప్రభుత్వం వస్తుంది. సభ్యత్వాలు రద్దు కావు, అంటే ప్రజాప్రతినిధులను ఎవరు ఎక్కువ మందిని సమీకరిస్తే అది డబ్బుద్వారా లేదా కండబలం ద్వారా కావచ్చు అధికారం వారికే ఉంటుంది. కొన్ని దేశాల్లో జరుగుతోంది అదే. ధనస్వామ్యం తప్ప ప్రజాస్వామ్య జాడ ఉండదు.


నిజానికి ఇప్పుడు కావాల్సింది ఒకే సారి ఎన్నికలు కాదు. ప్రజాస్వామ్యం మరింతగా వర్దిల్లేవిధంగా, ధన ప్రలోభాలను గణనీయంగా తగ్గించి, ప్రజాభిప్రాయానికి చట్టసభల్లో తగు ప్రాతినిధ్యం లభించేందుకు ఉన్నంతలో మెరుగైన దామాషా పద్దతి ఎన్నికల సంస్కరణలు కావాలి. ప్రజాస్వామ్య కబుర్లు చెప్పే అమెరికాలో దేశాధ్యక్ష ఎన్నికల్లో 50రాష్ట్రాల్లో రెండు చోట్ల తప్ప మిగిలిన చోట్ల మెజారిటీ ఓట్లు తెచ్చుకున్న పార్టీకి అధ్యక్షుడిని ఎన్నుకొనే ఎలక్టరల్‌ కాలేజీ ప్రతినిధులను మొత్తంగా కేటాయిస్తారు. అందువలన దేశం మొత్తంలో ఓట్లు తక్కువ తెచ్చుకున్నా కొన్ని రాష్ట్రాలలో వచ్చిన మెజారిటీ ఆధారంగా ఎలక్టరల్‌ కాలేజీలో పైచేయి సాధించి 2016లో అధ్యక్ష పదవిని డోనాల్డ్‌ ట్రంప్‌ గెలిచారు. దామాషా ప్రాతినిధ్య విధానంలో మైనారిటీ ఓట్లకూ ప్రాతినిధ్యం ఉంటుంది. డబ్బుతో ఓట్లు కొన్నప్పటికీ గెలుస్తారో లేదో తెలియదు కనుక ఎవరూ డబ్బు పెట్టరు, నిజమైన ప్రజాభిప్రాయం వెల్లడి కావటానికి అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు అధికారమే పరమావధిగా ఉన్న పార్టీలు, వ్యక్తులు డబ్బున్నవారికే పెద్దపీట వేస్తూ అధికారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. అందుకే దామాషా ప్రాతినిధ్య విధానం గురించి వామపక్షాలు తప్ప మిగిలిన పార్టీలేవీ మాట్లాడవు.


తరచూ ఎన్నికల వలన ప్రభుత్వాలు దీర్ఘకాలిక విధానాలను రూపొందించే అవకాశాలకు ఆటంకం కలుగుతుందని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతారు. పాలకులు మారినా లక్ష్యాల నిర్దేశం, పధకాలు కొనసాగేందుకు ఏర్పాటు చేసిన ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి అయోగ్‌ పేరుతో అజాగళ స్థనం వంటి అధికారాలు లేని సంస్థను ఏర్పాటు చేసిన పెద్దలు గద్దె మీద ఉండగా దీర్ఘకాలిక విధానాల గురించి మాట్లాడటం హాస్యాస్పదం, జనాన్ని తప్పుదారి పట్టించే వ్యవహారమే.ఒకేసారి అన్నింటికీ ఎన్నికలు అనేది ప్రజాస్వామిక సూత్రాలకే విఘాతం. ఫెడరల్‌ సూత్రాలకు, రాజ్యాంగ మౌలిక స్వభావానికే విరుద్దం. ఏక వ్యక్తి ఆధిపత్యానికి దారి తీస్తుంది. ఫెడరల్‌ వ్యవస్థను కూలదోసి యూనిటరీకి మళ్లేందుకే బిజెపి ఈ ప్రతిపాదనను పదే పదే ముందుకు తెస్తున్నదనిపిస్తున్నది.1983లో తొలిసారి ఎన్నికల కమిషన్‌ ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పక్కన పెట్టింది. వాజ్‌పేయి హయాంలో 1999లో లా కమిషన్‌ ద్వారా ఈ ప్రతిపాదనన తెచ్చారు. తరువాత యుపిఏ పాలనలో దాని ప్రస్తావన లేదు. నరేంద్రమోడీ తొలిసారి అధికారానికి వచ్చి,బిజెపికి మెజారిటీ రాష్ట్రాల్లో అధికారం వచ్చినపుడు 2016లో నీతి ఆయోగ్‌ ద్వారా ముందుకు తెచ్చారు.2018లో లా కమిషన్‌ ఐదు రాజ్యాంగ సవరణలు అవసరమని చెప్పింది. నరేంద్రమోడీ రెండవ సారి అధికారానికి వచ్చిన వెంటనే మరోసారి చర్చకు తెచ్చారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో కూడా చర్చ సాగించారు. నిర్మాణాత్మక అవిశ్వాసం పేరుతో మరొక ప్రతిపాదనను లా కమిషన్‌ ద్వారా ముందుకు తెచ్చారు. ఒక ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టటానికి ముందు ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని సభ విశ్వాసం పొందాలని చెప్పారు.2022లో నాటి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌ చంద్ర ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు తాము సిద్దంగా ఉన్నామని, అందుకు గాను రాజ్యాంగ సవరణ జరపాలని చెప్పారు. అదే ఏడాది డిసెంబరులో లా కమిషన్‌ అన్ని రాజకీయ పార్టీలు, మేథావులు, అధికారులు తమ సూచనలు పంపాలని కోరింది. ఇపుడు రామనాధ్‌ కోవింద్‌ నాయకత్వంలో ఒక కమిటీని వేసి మరోసారి మోడీ సర్కార్‌ ముందుకు తెచ్చింది.వివరాలు తెలియదు.


ఐడిఎఫ్‌సి అనే ఒక సంస్ధ 1999 నుంచి 2014వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పాటు జరిగిన కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమాచారాన్ని విశ్లేషించింది. ఒకేసారి జరిగితే కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ఓటర్లు ఒకే పార్టీని ఎంచుకొనేందుకు 77శాతం అవకాశాలుంటాయని పేర్కొన్నది. ఐఐఎం అహమ్మదాబాద్‌ డైరెక్టర్‌గా ఉన్న జగదీప్‌ ఛోకర్‌ జరిపిన విశ్లేషణ కూడా దీన్నే చెప్పింది. 1989 నుంచి ఒకేసారి జరిగిన లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 24 ఉదంతాలలో ప్రధాన రాజకీయ పార్టీలు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో దాదాపు ఒకే విధమైన శాతాలలో ఓట్లు పొందాయి. కేవలం ఏడు సందర్భాలలో మాత్రమే ఫలితాలు భిన్నంగా వచ్చాయి. ఈ కారణంగానే గతంలో కాంగ్రెస్‌ మాదిరి ప్రస్తుతం దేశవ్యాపితంగా ఉన్న బిజెపి ఒకేసారి ఎన్నికలు జరిగితే తనకు ఉపయోగమని, ఉన్న అధికారాన్ని మరింతగా సుస్ధిరపరచుకోవచ్చని, ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడే అవకాశాలను తగ్గిస్తాయని భావిస్తున్నది. ఒకేసారి ఎన్నికలు జరపాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సింది ఉంది. అదే జరిగితే రాష్ట్రాలలో, కేంద్రంలో ఏ కారణాలతో అయినా ప్రభుత్వాలు కూలిపోతే నిర్ణీత వ్యవధి వరకు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్రపతి పాలన విధించాల్సి ఉంది. దాని అర్ధం కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే దాని అధికారమే పరోక్షంగా ఉంటుంది. లేదా ముందే చెప్పుకున్నట్లు అవకాశవాదంతో ఏర్పడే కూటములకు అధికారాన్ని అప్పగించాల్సి వస్తుంది.


కరోనా ప్రభావం గురించి దేశమంతా ఆందోళన చెందుతోంటే దాన్ని పక్కన పెట్టి ప్రధాని కార్యాలయం స్దానిక సంస్ధలతో సహా అన్ని ఎన్నికలకు ఒకే ఓటర్ల జాబితా తయారీ సాధ్యా సాధ్యాల గురించి చర్చించేందుకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అలా చేయాలంటే ముందుగా ఆర్టికల్‌ 243కె, 243జడ్‌, ఏ లకు సవరణలు చేయాల్సి ఉంటుందని చర్చ జరిగింది.ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గినప్పటికీ అంతకు ముందున్న స్థితికి అభివృద్ది రేటు పెరగటం గురించి ఎవరికీ విశ్వాసం లేదు. దిగజారిన వృద్ది పునాది మీద పెరుగుదలను చూపి జనాన్ని తప్పుదారి పట్టించేందుకు చూస్తున్నారు. దేశ అభివృద్ది, ప్రయోజనాల గురించి తమకు తప్ప మరొకరికి పట్టవని, దేశభక్తి ఇతరులకు లేనట్లుగా, దేశద్రోహులకు మద్దతు ఇస్తున్నట్లు గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఒక పధకం ప్రకారం ప్రచారం చేస్తున్నారు. ఒక అవాస్తవాన్ని వందసార్లు చెబితే 101వసారి నిజంగా మారుతుందని సూత్రీకరణ చేసిన జర్మన్‌ నాజీ మంత్రి గోబెల్స్‌ తరహా ప్రచారం ఇది. పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఉన్న మెజారిటీ, దేన్నయినా బలపరిచే ఇతర పార్టీలు కూడా ఉన్నందున ఒక్క రోజులోనే కాశ్మీర్‌ రాష్ట్రాన్నే రద్దుచేసినట్లు ఒకేసారి ఎన్నికల కోసం జనాభిప్రాయాన్ని తోసిపుచ్చి రాజ్యాంగ సవరణలు చేయటం నరేంద్రమోడీకి ఒక పెద్ద సమస్య కాదు. అలాంటి పరిణామం జరిగినా ఆశ్చర్యం లేదు.రాజ్యాంగాన్ని మార్చకుండానే తూట్లు పొడిచేందుకు వీలైన అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. ఫెడరల్‌ అంటూనే అధ్యక్ష తరహా పాలనకు వీలు కల్పించేదే ఒకే సారి ఎన్నికలు అనే భావన.అలాంటి అధికార కేంద్రీకరణ ఉంటేనే సంస్కరణల వేగం పేరుతో దేశ సంపదలను ఆశ్రితులకు అప్పగించేందుకు, కార్మికుల, రైతాంగ హక్కులను హరించి వేసేందుకు అవకాశం ఉంటుంది. స్వేచ్చను హరించుతున్న పాత చట్టాలను రద్దు చేయాలన్నది ఒక ప్రజాస్వామిక డిమాండ్‌. దాన్ని అమలు చేసే పేరుతో మరింత కఠినమైన చట్టాలను రూపొందించేందుకు పూనుకున్నారు. కార్మిక చట్టాలను క్రోడీకరించే పేరుతో కార్మికుల హక్కులకు ఎసరు పెట్టారు. రైతాంగాన్ని కార్పొరేట్లకు అప్పగించే యత్నాన్ని రైతాంగం విజయవంతంగా తిప్పికొట్టినప్పటికీ ఆ కత్తి మెడమీద వేలాడుతూనే ఉంది. ఇండియా కూటమి రూపంలో ముందుకు వచ్చిన పార్టీలు బిజెపి ముక్త భారత్‌కు పిలుపునిచ్చి ముందుకు పోతుండటంతో నరేంద్రమోడీ నాయకత్వానికి భయం పట్టుకుంది.అందుకే జనం దృష్టిని మళ్లించేందుకు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటారని అనేక మంది భావిస్తున్నారు. వాటిలో భాగంగానే పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశ పరుస్తున్నారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

బ్రిక్స్‌ సదస్సులో ధనికదేశాలకు షీ జింపింగ్‌ హెచ్చరిక : రంకెలేసి, బలప్రదర్శన చేస్తే కుదరదు !

29 Tuesday Aug 2023

Posted by raomk in Africa, CHINA, COUNTRIES, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

BRICS 2023 Summit, BRICS expansion, BRICS nations, China, Narendra Modi, Vladimir Putin, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


ఆగస్టు 22 నుంచి 24వ తేదీ వరకు దక్షిణాఫ్రికా నగరమైన జోహన్నెస్‌బర్గ్‌లో ” బ్రిక్స్‌ (బిఆర్‌ఐసిఎస్‌)” కూటమి(బ్రెజిల్‌,రష్యా,ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) పదిహేనవ శిఖరాగ్ర సమావేశం జయప్రదంగా ముగిసింది.అర్జెంటీనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్‌, సౌదీ అరేబియా,యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ను ఈ కూటమిలో చేరాల్సిందిగా ఆహ్వానం పలికారు, వాటికి అంగీకారమైతే 2024 జనవరి ఒకటవ తేదీ నుంచి పూర్తి స్థాయి సభ్యులుగా పరిగణిస్తారు. న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో 2006లో జరిగిన ఒక సమావేశంలో బ్రెజిల్‌, రష్యా,ఇండియా,చైనాలతో ఏర్పడిన ఆర్థిక కూటమిని బ్రిక్‌ అని పిలిచారు. తరువాత 2010లో దక్షిణాఫ్రికా చేరటంతో అది బ్రిక్స్‌ గా మారింది. ఇప్పుడు విస్తరణ బాటలో ఉన్నందున బ్రిక్స్‌ ప్లస్‌ అంటారా లేక మరేదైనా పేరు పెడతారా అన్నది చూడాల్సి ఉంది. బ్రిక్‌ లేదా బ్రిక్స్‌ కూటమి అని పేరు పెట్టటానికి గోల్డ్‌మన్‌ శాచస్‌ కంపెనీ ఆర్థికవేత్త జిమ్‌ ఓ నెయిల్‌ చేసిన వర్ణన ప్రేరణ అని చెబుతారు. ఇలాంటి కూటమి ఏర్పడితే అది 2050 నాటికి ప్రపంచ ఆర్థిక రంగంలో మిగతావాటిని వెనక్కు నెడుతుందని 2001లో జోశ్యం చెప్పాడు. బ్రిక్స్‌ విస్తరణ, దాని తీరు తెన్నులను చూస్తే అంతకంటే ముందే దాని ప్రభావం వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిదానమే ప్రదానం అన్నట్లుగా ముందుకు పోతున్న ఈ కూటమి నేడు పశ్చిమ దేశాల పెత్తనం,తంటాల మారి తనాన్ని ఎదుర్కొనే దిశగా ఉంది. నూతన ప్రపంచ ఆర్థిక, రాజకీయ వ్యవస్థకోసం చూస్తున్న ఈ కూటమి నడక నల్లేరు మీద బండిలా ఎలాంటి కుదుపులు లేకుండా సాగుతుందని చెప్పలేము. ఈ సమావేశాల్లో లూలా డిసిల్వా(బ్రెజిల్‌),సెర్గీలావరోవ్‌(రష్యా విదేశాంగ మంత్రి),నరేంద్రమోడీ(ఇండియా), షీ జింపింగ్‌ (చైనా), సిరిల్‌ రామఫోసా(దక్షిణాఫ్రికా) పాల్గొన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ మీద అంతర్జాతీయ కోర్టు వారంటు జారీ చేసింది. ఆ కోర్టును రష్యా అంగీకరించలేదు.

బ్రిక్స్‌కు ఆతిధ్యం ఇస్తున్న దక్షిణాఫ్రికా కోర్టు ఒప్పందంలో సభ్యురాలిగా ఉన్నందున తలెత్తే పరిస్థితి కారణంగా పుతిన్‌ హాజరు కాలేదు.
పారిశ్రామిక, సరఫరా గొలుసు నుంచి విడగొట్టుకోవాలి,విచ్చిన్నం, ఆర్థిక బలవంతం చేయాలని చూస్తున్న శక్తుల చర్యలను అడ్డుకోవాలని, చైనా అధినేత షీ జింపింగ్‌ తాజా సమావేశంలో పిలుపునిచ్చారు. ఇదే తరుణంలో డిజిటల్‌ ఎకానమీ, హరిత వృద్ధి,సరఫరా వ్యవస్థల వంటి రంగాలలో ఆచరణాత్మక సహకారం అందించుకోవాలని కోరారు. అంతర్జాతీయ రంగంలో పెద్ద గొంతులేసుకొని, కండల ప్రదర్శనలతో తమ స్వంత నిబంధనలను రుద్దాలని చూస్తున్నవారి తీరు ఆమోదం కాదని, ఐరాస నిబంధనలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.ఒక దేశం- ఒక కూటమి పెత్తనం లేకుండా ముందుకు వస్తున్న బహుముఖ ప్రపంచం, సాంప్రదాయక విలువలు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు నూతన ఉదారవాద విధానాలు ముప్పు తెస్తున్నట్లు వీడియో ద్వారా పుతిన్‌ చేసిన ప్రసంగంలో పేర్కొన్నాడు. అమెరికా పేరు పెట్టకుండా దాని గురించే మాట్లాడినట్లు విశ్లేషకులు టీకా తాత్పర్యం చెప్పారు.పశ్చిమ దేశాలు బ్రిక్స్‌ కూటమి తమకు ముప్పుగానూ, జి-7కు పోటీగా దాన్ని మార్చేందుకు చైనా చూస్తున్నదనే అనుమానాలు పశ్చిమ దేశాల్లో రోజు రోజుకూ పెరుగుతున్నాయి. విస్తరణలో భాగంగా చేరుతున్న దేశాలు కూడా పశ్చిమ దేశాల బాధితులే కావటం గమనించాల్సిన అంశం. ప్రపంచంలో ఏ దేశమూ గతంలో మాదిరి ప్రచ్చన్న యుద్ధ వాతావరణలో నడవాలని కోరుకోవటం లేదు.


బ్రిక్స్‌ దేశాల్లోని జనాభా 2022 లెక్కల ప్రకారం 324 కోట్ల మంది, అంటే ప్రపంచంలో నలభై శాతం మంది.భారత్‌, చైనాల్లోనే 382 కోట్ల మంది ఉండగా మిగిలిన మూడింటిలో 42 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచ సాధారణ జిడిపిలో ఈ కూటమి వాటా 2000లో 11.74శాతం కాగా పదేండ్లలో 17.95, 2022 నాటికి 26శాతానికి పెరిగింది. అదే పిపిపి పద్దతిలో చూస్తే 31.5శాతానికి పెరిగి జి7 దేశాల 30శాతాన్ని దాటింది.2028 నాటికే బ్రిక్స్‌ వాటా 50శాతం దాట నుందని అంచనా. ఐఎంఎఫ్‌ సమాచారం ప్రకారం 2000 సంవత్సరం నుంచి 2022కు చూస్తే జనాభా వాటా 43.92 నుంచి 41.42శాతానికి తగ్గింది. ప్రపంచ ఎగుమతుల్లో వాటా 8.2 నుంచి 18, ప్రపంచ వాణిజ్యంలో 7.51 నుంచి 18 శాతానికి, విదేశీ మారకద్రవ్య నిల్వ 281.2 నుంచి 4,581 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఆంక్టాడ్‌ 2023 గణాంకాల ప్రకారం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) 2001-2021 కాలంలో 84 నుంచి 355 బి.డాలర్లకు పెరిగాయి.ఈ మొత్తంలో చైనా వాటా సగానికి పైగా ఉంది. ఒక్క జనాభాలో భారత్‌ ప్రధమ స్థానంలో ఉండటం తప్ప మిగిలిన అన్ని అంశాలలో చైనా ఎంతో ఎత్తున ఉంది.


జోహన్నెస్‌బర్గ్‌ శిఖరాగ్ర సభలో మొత్తంగా భిన్న నేపధ్యాల పూర్వరంగంలో దేశాల మధ్య వ్యూహాత్మక, ఆర్థిక,ప్రపంచ సమస్యలపై ఏకీభావం సాధించేందుకు సంప్రదింపులకు ప్రాధాన్యత ఇవ్వాలన్న సంకల్పం వెల్లడైంది. సమీకృత అభివృద్ధి,ప్రపంచ సవాళ్లు,దేశాల మధ్య సంబంధాలను పటిష్టపరుచుకోవాలన్న వాంఛను నేతలు వెలిబుచ్చారు. సభ జరిగింది ఆఫ్రికా ఖండంలో గనుక సహజంగానే దాని ఇతివృత్తానికి కేంద్ర స్థానం లభించింది.ప్రపంచ పేద దేశాలు ప్రత్యేకించి ఆఫ్రికా దేశాలతో సంబంధాలు, సహకారం గురించి నేతలందరూ మాట్లాడారు. ఈ సభకు పుతిన్‌ రాకపోవటం గురించి పశ్చిమ దేశాల్లో ఇంకేముంది బ్రిక్స్‌లో విబేధాలు, రష్యా పలుకుబడికి గండిపడింది అన్నట్లుగా విశ్లేషణలను వండివార్చారు. ముందే చెప్పుకున్నట్లు ఆతిధ్య దేశాన్ని ఇరకాటంలో పెట్టకూడదన్న పరిణితి పుతిన్‌, ఇతర దేశాధినేతల్లో వెల్లడైంది.స్వయంగా హాజరు బదులు వీడియో కాన్ఫరెన్సుద్వారా పాల్గొని నిర్ణయాల్లో భాగస్వామి అయ్యారు. బ్రిక్స్‌ను విస్తరించాలన్న ఆలోచన కొత్తగా వచ్చింది కాదు.2013లో దక్షిణాఫ్రికా అధ్యక్ష స్థానంలో ఉన్నపుడు ఆఫ్రికా యూనియన్‌కు స్థానం కల్పించాలని కోరింది. తరువాత 2017లో బ్రిక్స్‌ ప్లస్‌(బ్రిక్స్‌తో పాటు ఇతర దేశాలు) అన్న భావనను చైనా ముందుకు తెచ్చింది. తమకు సభ్యత్వం ఇవ్వాలని ఇరాన్‌, అర్జెంటీనా దరఖాస్తు చేసుకోవటంతో 2022లో బ్రిక్స్‌ సూత్ర ప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో మొత్తం నలభై దేశాలు ఆసక్తి వెల్లడించటంతో పాటు 23 లాంఛనంగా దరఖాస్తు చేశాయి. వాటిని పరిశీలించి పైన పేర్కొన్న ఆరు దేశాలకు వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి పూర్తి స్థాయి సభ్యత్వం ఇచ్చేందుకు నిర్ణయించారు.


ప్రపంచ జనాభాలో ఈ కూటమి దేశాల్లో 46.5శాతానికి, జిడిపి 30శాతానికి పెరగనుంది. దేశాల వారీగా జిడిపి బిలియన్‌ డాలర్లలో, బ్రాకెట్లలో ప్రపంచంలో దేశ వాటా శాతాలు దిగువ విధంగా ఉన్నాయి. చైనా 19,374(18.4), భారత్‌ 3,737(3.6), బ్రెజిల్‌ 2,081(2), రష్యా 2,063(2), సౌదీ అరేబియా 1,062(1), అర్జెంటీనా 641(0.6), యుఏఇ 491(0.5) దక్షిణాఫ్రికా 399(0.4), ఈజిప్టు 387(0.4), ఇరాన్‌ 368(0.4), ఇథియోపియా 156(0.1)బి.డాలర్లు. విస్తరణతో ఈ కూటమి దేశాల చమురు వాటా ప్రపంచంలో 20.4 నుంచి 43.1శాతానికి పెరగనుంది.ప్రపంచంలో దేశాల వాటాల శాతాలు ఇలా ఉన్నాయి. సౌదీ అరేబియా 12.9, రష్యా 11.9,చైనా 4.4, యుఏఇ 4.3, ఇరాన్‌ 4.1, బ్రెజిల్‌ 3.3శాతం కాగా అర్జెంటీనా, భారత్‌ 0.8శాతం చొప్పున, ఈజిప్టు 0.7శాతం కలిగి ఉండగా దక్షిణాఫ్రికా, ఇథియోపియాల్లో అసలేమీ లేదు. ప్రపంచ సహజవాయువులో 30శాతం కలిగి ఉన్నాయి, ప్రపంచ చమురు ఎగుమతుల్లో వాటా 18 నుంచి 25.1శాతానికి పెరగనుంది. ప్రపంచ ఆర్థికరంగం మీద పెత్తనం చేస్తున్న డాలరును వెనక్కు నెట్టి బ్రిక్స్‌ కరెన్సీని ప్రవేశపెట్టాలన్న ఆలోచన మీద కూడా జోహన్నెస్‌బర్గ్‌ సమావేశాల్లో చర్చ జరిగింది. కొన్ని దేశాల సందేహాల కారణంగా ముందుకు పోలేదు.ఉమ్మడి కరెన్సీని పంచుకోవటం గురించి బ్రెజిల్‌ ప్రతిపాదన ముందుకు తేడా మనదేశం భిన్న వైఖరిని వెల్లడించింది. ఈ అంశం ప్రస్తుత సమావేశ అజెండాల్లో లేదని దక్షిణాఫ్రికా పేర్కొన్నది. డాలర్లకు బదులు ఆయా దేశాల కరెన్సీలతో లావాదేవీలు జరపాలని చైనా, రష్యా పేర్కొన్నాయి. అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్న ఈ దేశాలు సహజంగా డాలరును వ్యతిరేకిస్తున్నాయి.డాలర్లలో లావాదేవీల వాటా 2015లో వాటి వాటా 90శాతం ఉండగా 2020 నాటికి 46శాతానికి, తరువాత ఇంకా తగ్గింది. మన దేశం మాత్రం ఎగుమతులు-దిగుమతులకు 80శాతం డాలర్లనే వాడుతున్నది.


ప్రస్తుత విస్తరణ, రానున్న రోజుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్న దేశాల పెరుగుదలను చూసినపుడు ప్రపంచ బలాబాల్లో ఈ కూటమి కీలకంగా మారనున్నదనేది స్పష్టం.మనదేశం, చైనాతో సహా మిగిలిన దేశాలన్నీ బహుముఖ ప్రపంచ వ్యవస్థ ఉండాలని కోరుతున్నాయి. ఈ కూటమిలో ఉన్న దేశాల ఆర్థిక రంగాలను చూసినపుడు తేడా చాలా ఎక్కువగా ఉంది. అందువలన వాటి ప్రయోజనాలు, ప్రాధాన్యతలు కూడా వేరుగా ఉంటాయి. ఉదాహరణకు మన దేశం చైనాను అధిగమించాలని చూస్తున్నట్లు బహిరంగంగానే వాంఛ వెల్లడిస్తున్నది.వివాదాస్పద అంశాలపై కూడా ఈ కూటమిలో పూర్తి ఏకీభావం లేనందున అంగీకృత అంశాల మీదనే కేంద్రీకరణ జరుగుతున్నది. ఇండో-పసిఫిక్‌ పేరుతో చైనా వ్యతిరేక కూటమి నిర్మాణానికి పూనుకున్న అమెరికాకు దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్చగా నౌకలు తిరిగేందుకు అవకాశం ఉండాలంటూ మన దేశం మద్దతు ఇస్తున్నది. ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలను సమర్ధించనప్పటికీ అమెరికాకు ఆగ్రహం కలగకుండా ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు నిలిపివేసిన సంగతి తెలిసిందే.ఒక విధంగా చెప్పాలంటే ఎవరికీ నొప్పి తగలకూడదనే వైఖరితో మన దేశం గడసాము గరిడీలు చేస్తున్నది.


లండన్‌లోని సోయాజ్‌ చైనా సంస్థ డైరెక్టర్‌ స్టీవ్‌ సాంగ్‌ మాట్లాడుతూ బ్రిక్స్‌ సభ్యదేశాలు ఉపరితలంతో ఒకేవిధంగా లేవని, అయినప్పటికీ ఎవరూ పశ్చిమ దేశాల ఆధిపత్య ప్రపంచంలో జీవించకూడదని అందరూ అనుకుంటున్నట్లుగా చూపేందుకు షీ జింపింగ్‌ చూశారని, చైనా వారు చూపుతున్న ప్రత్యామ్నాయంలో నిరంకుశులు తమ స్వంత దేశాల్లో సురక్షితంగా ఉండవచ్చని, ప్రజాస్వామిక అమెరికా, ఐరోపా దేశాలు రుద్దిన షరతులను అంగీకరించకుండా ప్రత్యామ్నాయ అభివృద్ధి పధాన్ని కనుగొనవచ్చనే భావన ఉన్నదని అన్నాడు. తమకు గానీ మరొక దేశానికి గానీ ప్రత్యర్ధిగా రాజకీయ ప్రత్యర్ధి తయారవుతున్నట్లుగా తాము భావించటం లేదని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సులవాన్‌ సమావేశ ప్రాధాన్యతను తక్కువ చేసి చూపేందుకు, వక్రీకరించేందుకు చూశారు.కొత్తగా బ్రిక్స్‌లో చేరిన ఆరు దేశాల్లో ఏ ఒక్కటీ అమెరికా వ్యతిరేకమైనది లేదని వాషింగ్టన్‌లోని క్విన్సీ సంస్థ డైరెక్టర్‌ సరంగ్‌ షిడోర్‌ అన్నాడు.ఈ సమావేశాల తరువాత పశ్చిమ దేశాలకు చెందిన విశ్లేషకులు, మీడియా వార్తల తీరు వక్రీకరణ, కూటమిలో అనుమానాలను రేకెత్తించేదిగా తంపులు పెట్టేదిగా ఉందని చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జాతీయ పతాకానికి అవమానం, హిందూ దేశంగా జాబిల్లి, రాజధానిగా శివశక్తి కేంద్రం, ఒక స్వామి డిమాండ్‌ !

29 Tuesday Aug 2023

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Science, Uncategorized, USA, Women

≈ Leave a comment

Tags

#Hindutva, BJP, Chandrayaan-3, Defame to national flag tiranga, ISRO scientists, Jawahar Point, Naming Controversy, Narendra Modi, RSS, Shiv Shakti Point, Tiranga Point’, Vikram Lander


ఎం కోటేశ్వరరావు


చందమామ రావే జాబిల్లి రావే అంటూ పాడుకున్నమనం దాని రాకకోసం ఆగకుండా మనమే వెళ్లాం. ఆగస్టు 23న భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలోనే కాదు, ప్రపంచంలోనే ఒక వినూత్న అధ్యాయానికి నాంది పలికింది. చంద్రుడి దక్షిణ ధృవం మీద అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్‌ నిలిచిందంటే దాని వెనుక ఉన్న యావత్‌ ఇస్రో సిబ్బంది దీక్ష, పట్టుదలే కారణం. అందుకు వారిని యావత్‌ జాతి శ్లాఘిస్తోంది.భుజం తట్టి మరిన్ని విజయాలతో ముందుకు పోవాలని మనసారా కోరుకుంటోంది. ఇంతటి మహత్తర విజయం తరువాత ఏమిటి అనే ప్రశ్న, ఉత్కంఠను రేకెత్తించింది. చంద్రయాన్‌-లో భాగంగా విక్రమ్‌ లాండర్‌ దిగిన ప్రాంతానికి ” శివశక్తి ” అని 2019లో చంద్రయాన్‌ -2లో దిగటంలో విఫలమైన ప్రాంతానికి ” తిరంగ ” అని ప్రధాని నరేంద్రమోడీ పేరు పెట్టారు. అనేక పరిశోధనలు, ఫలితాలు, నవీకరణలకు సంబంధిత రంగాల్లో విశేష కృషి చేసిన వారి పేర్లు పెట్టటం ప్రపంచమంతటా ఉన్నదే. దానిలో భాగంగానే లాండర్‌కు విక్రమ్‌ అన్న నామకరణం భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్‌ సారాభారు పేరును చిరస్థాయిగా చేసేందుకే అన్నది తెలిసిందే. పెట్టిన పేరు వివాదాలకు తావు ఇవ్వకుండా ఉత్తేజాన్ని లేదా సందేశాన్ని ఇచ్చేదిగా ఉండాలి. ఆ విధంగా చూసినపుడు రెండు పేర్లూ అభ్యంతరకరమైనవే. చంద్రయాన్‌-2లో విఫలమైన ప్రాంతానికి పనిగట్టుకొని నాలుగేండ్ల తరువాత పెట్టటం ఏమిటి ? ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున ఉంటుందా ? నరేంద్రమోడీ స్పూర్తితో చంద్రుడిని హిందూ దేశంగా, దాని రాజధానిగా విక్రమ్‌ లాండర్‌ దిగిన ప్రాంతాన్ని పార్లమెంటు ప్రకటించాలని సంత్‌ మహాసభ జాతీయ అధ్యక్షుడిగా చెప్పుకుంటున్న చక్రపాణి మహరాజ్‌ అనే హిందూ స్వామి ఒకరు ఆదివారం నాడు డిమాండ్‌ చేశారు. భిన్న భావజాలం కలవారు అక్కడకు చేరి గజ్వా ఏ హింద్‌ (ముస్లింలు జయించిన రాజ్యం) అని ప్రకటించుకోక ముందే ఈ పని చేయాలని అన్నారు. ఇదే ప్రాతిపదిక అయితే చంద్రుడి మీద తొలుత కాలుమోపిన వారు మతరీత్యా క్రైస్తవులు. వారు క్రీస్తు రాజ్యం అని పేరు పెట్టాలన్న ఆలోచన చేయలేదే !


తిరంగ అన్నది మన జాతీయ పతాకను జనం పిలిచే పేరు. ఒక విఫల ప్రయోగానికి దాని పేరు పెట్టటం మొత్తం జాతిని, జాతీయోద్యమాన్ని అవమానించటం తప్ప మరొకటి కాదు. అది బ్రిటీష్‌ వలస పాలకులపై సాగించిన సమర విజయానికి ప్రతీకగా 1947 ఆగస్టు 15న ఎగిరిన పతాకమది.స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వాములు కాకపోవటమే కాదు, బ్రిటీష్‌ వారికి సేవ చేసుకుంటామన్న వారిని ఆకాశానికి ఎత్తుతున్న పాలకులు చంద్రుడిపై లాండర్‌ దిగటంలో విఫలమైన ప్రాంతానికి ఆ పేరు పెట్టటాన్ని ఏమనాలి? అమృతకాలమని, ఆజాదీకా అమృతమహౌత్సవాలు జరిపిన వారు దీనికి పాల్పడటం నిస్సందేహంగా అభ్యంతరకరం. ప్రధాని నరేంద్రమోడీ, మన దేశంలోని ఇతర మూడు రాజ్యాంగ బద్దమైన ఉన్నత పదవుల్లో (రాష్ట్రపతి, ఉపాధ్యక్షుడు, లోక్‌సభ స్పీకర్‌) ఉన్నవారందరూ ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలానికి చెందిన వారే. తిరంగాను జాతీయ పతాకగా ఆర్‌ఎస్‌ఎస్‌ అంగీకరించలేదు, ఆ కారణంగానే స్వాతంత్య్రం వచ్చిన 52 సంవత్సరాల పాటు తమ కార్యాలయాల దగ్గర గానీ, ఇతర చోట్ల ఆ సంస్థ నేతలెవరూ ఎగురవేయలేదు. అజాదీకా అమృతమహొత్సవాల సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో తిరంగాను తమ ప్రొఫైల్‌ పిక్చర్‌గా పెట్టుకోవాలని ప్రధాని మోడీ సలహా ఇచ్చారు. అనేక మంది ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు దాన్ని అనుసరించలేదని వార్తలు వచ్చాయి. హర్‌ ఘర్‌ తిరంగా ప్రచారానికి పిలుపునిచ్చిన వారు ఒక జాతివ్యతిరేక సంస్థకు చెందిన వారని 52 సంవత్సరాల పాటు వారు జాతీయపతాకను ఎగురవేయలేదని, వారు ప్రధాని మాట వింటారా అని గతేడాది రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని రాజకీయం చేయవద్దని, తమ అణువణువు దేశభక్తితో ఉంటుందని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పుకున్నాయి.


మూడు రంగుల్లో మూడు అనే పదమే అశుభమని, మూడు రంగులు దేశం మీద మానసిక చెడు ప్రభావాన్ని కలిగిస్తాయని, దేశానికి హానికరమని జాతీయ జెండాపై చర్చ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పింది. ఆ సంస్థ పత్రిక ఆర్గనైజర్‌లో రాసిన ఒక విశ్లేషణలో దాని వైఖరిని వెల్లడించారు. దాన్ని మార్చుకున్నట్లు ఇంతవరకు ఎక్కడా అది చేసిన ప్రకటన లేదు. నాగపూర్‌లోని తమ సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద రాష్ట్ర ప్రేమీ యువదళ్‌ అనే సంస్థకు చెందిన ముగ్గురు బలవంతంగా జాతీయ జెండాను ఎగురవేశారని 2001 జనవరి 26న ఆర్‌ఎస్‌ఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. సదరు ప్రాంగణ పర్యవేక్షకుడు తొలుత వారిని అడ్డుకున్నట్లు చెప్పారు. పది సంవత్సరాలకు పైగా నడిచిన తరువాత తగిన ఆధారాలు చూపలేదని కేసును కొట్టి వేశారు. తిరంగా బదులు జాతీయ పతాకంగా భగవధ్వజం ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధులు చెప్పారు. ఈ మేరకు ఆర్గనైజర్‌ పత్రికలో భగవధ్వజం వెనుక ఉన్న రహస్యం పేరుతో రాసిన ఒక విశ్లేషణలో పేర్కొన్నారు. విధి కారణంగా అధికారానికి వచ్చిన వారు మన చేతుల్లో త్రివర్ణ పతాకాన్ని పెట్టవచ్చు. దాన్ని ఎవరూ గౌరవించరు, హిందువులెవరూ స్వంతం చేసుకోరు ” అని రాశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ మన్మోహన్‌ వైద్య 2018లో చెన్నయిలో లౌకికవాదం మీద జరిగిన ఒక సెమినార్‌లో మాట్లాడుతూ జాతీయ పతాకంలో కాషాయ రంగు ఒకటి మాత్రమే ఉండాలి, ఇతర రంగులు మతోన్మాదానికి ప్రాతినిధ్యం వహిస్తాయి అని సెలవిచ్చారని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక వార్త పేర్కొన్నది. ఆర్‌ఎస్‌ఎస్‌ నేత కల్లాడక ప్రభాకర్‌ భట్‌ 2022 మార్చినెలలో ఒక దగ్గర మాట్లాడుతూ చాలా త్వరలోనే జాతీయ జెండాగా త్రివర్ణ పతాకం స్థానంలో కాషాయ జెండా రానుందని చెప్పారు.


శివసేన(ఉద్దావ్‌)నేత సంజయ రౌత్‌ మాట్లాడుతూ లాండర్‌ దిగిన చోటుకు విక్రమ్‌ సారాభారు లేదా నెహ్రూ పేరు పెట్టి ఉండాల్సిందని అన్నారు. వారు చేసిన కృషి కారణంగానే ఇదంతా జరిగింది అన్నారు. శాస్త్రవేత్తలను మరిచిపోతున్నారు, ప్రతి చోట హిందూత్వను తీసుకువస్తున్నారు. మేము కూడా హిందూత్వ పట్ల విశ్వాసం ఉన్నవారిమే, కానీ కొన్ని అంశాలు శాస్త్రానికి సంబంధించినవి, అక్కడికి హిందూత్వను తీసుకురాకూడదని వీర సావర్కర్‌ చెప్పారని శివసేన నేత అన్నారు. దేశాన్ని హిందూ మత రాజ్యంగా మార్చాలనే అజెండాలో భాగంగా ఇలాంటి వన్నీ చోటు చేసుకుంటున్నాయి. మెజారిటీ హిందువులు చెప్పినట్లు జరగాలి తప్ప ఇతరంగా పరిణామాలు ఉండకూడదనే దురహంకార ధోరణిని ఈ పేరు ప్రతిబింబిస్తున్నది. రెండవది స్వాతంత్య్రం విఫలమైందని జనాలకు చెప్పటం కూడా తిరంగ పేరు పెట్టటం వెనుక దాగుంది.


చంద్రుడిపై లాండర్‌ దిగిన కేంద్రానికి శివశక్తి అని ప్రధాని మోడీ పేరు పెట్టటం సరైనదే అని దానికి ఆయనకు అర్హత ఉందని ఇస్రో చైర్మన్‌గా ఉన్న ఎస్‌ సోమనాధ్‌ ఆదివారం నాడు సమర్ధించారు. శివశక్తి, తిరంగ అనే పేర్లు భారతీయతను ధ్వనిస్తున్నాయని అన్నారు.శివ అనే మాటలో శుభం ఉందని శక్తి అనే పదంలో నారీశక్తి దాగుందని ప్రధాని మోడీ చెప్పారు. శనివారం నాడు స్వంత రాష్ట్రమైన కేరళలోని తిరువనంతపురంలోని భద్రకాళీ, ఇతర ఆలయాలను సోమనాధ్‌ సందర్శించి పూజలు చేశారు. తాను శాస్త్రాన్ని,పరలోకాన్ని నమ్ముతానని అందుకే దేవాలయాల సందర్శన, పురాణాలను చదువుతానని అన్నారు. తాను అన్వేషినని చంద్రుడిని, అంత:కరణాన్ని కూడా అన్వేషిస్తానని చెప్పారు. అది తన జీవితంలో భాగమని, సంస్కృతి అన్నారు. మన ఉనికి, అంతరిక్షంలోకి మన ప్రయాణ అర్ధాలు తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. శాస్త్ర, సాంకేతిక సంస్థలలో పని చేస్తున్న ఇలాంటి అనేక మందిలో సోమనాధ్‌ ఒకరు. గతంలో ఇస్త్రో నేతలుగా ఉన్నవారి హయాంలో కూడా రాకెట్ల నమూనాలను సుళ్లూరు పేట చెంగాలమ్మ గుడిలో, తిరుపతి వెంకటేశ్వరుడి గుడిలో పూజలు చేయించిన తరువాత ప్రయోగించిన సంగతి తెలిసిందే. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని చెప్పే క్రమంలో మన పరిశోధనలు విఫలమైనా సఫలమైనా అంతా దేవుడి లీల అని చెబుతున్న సంగతి తెలిసిందే. అంతే కాదు, అన్నీ వేదాల్లో ఉన్నాయష, సంస్కృతంలో రాసిన శాస్త్ర విజ్ఞానాన్ని పశ్చిమ దేశాలు తస్కరించి వాటిని తామే కనుగొన్నట్లు చెబుతారని వాదించేవారు ఇటీవల బాగా పెరిగారు. అలాంటి కోవకు చెందిన శాస్త్రవేత్తే సోమనాధ్‌ కూడా. ఈ ఏడాది మే నెలలో మధ్యప్రదేశ్‌లోని మహరిషి పాణిని సంస్కృత, వేద విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ ఆల్జీబ్రా, స్క్కేర్‌ రూట్స్‌, కాలం, ఆర్కిటెక్చర్‌, మెటలర్జీ, వైమానిక పరిజ్ఞానం కూడా తొలుత వేదాల్లోనే కనుగొన్నారని చెప్పారు. ఈ అంశాలన్నీ అరబ్‌ దేశాల ద్వారా ఐరోపాకు చేరినట్లు, తరువాత వాటిని పశ్చిమ దేశాల శాస్త్రవేత్తలు కనుగొన్నట్లు ప్రకటించారని అన్నారు. సంస్కృతంలో రాసిన వాటిని పూర్తిగా పరిశోధించి ఉపయోగించుకోలేదని సోమనాధ్‌ చెప్పారు. ఇలాంటి కబుర్లు చెప్పేవారు ఇస్రో కేంద్రాలతో సహా, ఇతర శాస్త్రపరిశోధనా సంస్థలలో శాస్త్రవేత్తల బదులు సంస్కృత పండితులను నియమించి పరిశోధనలు జరిపితే ఎంతో ఖర్చు కలసి వచ్చేది. ఈ కబుర్ల మీద వారికి నిజంగా నమ్మకం ఉంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు, వెంటనే ఆపని చేయవచ్చు.విజ్ఞానమంతా వేదాల్లో , సంస్కత గ్రంధాల్లో వుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. వాటిని వెలికి తీసి దేశానికి మేలు చేసి పక్కా దేశభక్తులని నిరూపించుకోండని చేసిన సూచనలను ఏ ఘనాపాఠీ, సంస్కత పండితులు పట్టించుకోలేదు. ఎందుకంటే దేవుడు నైవేద్యం తినడనే నిజం పూజారికి తెలిసినట్లుగా మరొకరికి తెలియనట్లే వాటిలో కావలసినంత అజ్ఞానం తప్ప విజ్ఞానం లేదని పండితులకు బాగా తెలుసు. ఇస్రో లేదా మరొక శాస్త్ర పరిశోధనల్లో పని చేస్తున్న శాస్త్రవేత్తలు అలా కాదు, వారిలో నిజాయితీ వుంది, తాము నమ్మిన దాన్ని ఆచరణలో పెట్టేందుకు చేయాల్సిందంతా చేస్తున్నారు. వారిని మరింతగా ప్రోత్సహించాలంటే వాటిని నిరుత్సాహపరిచే అశాస్త్రీయ భావాల ప్రచారాన్ని కట్టిపెట్టాలి.


దేశంలో ఇలాంటి తాతగారి నాన్నగారి భావాలను పెంచి పోషిస్తున్న కారణంగానే అనేక మంది రెచ్చిపోతున్నారు. బిజెపి ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన కంగన రనౌత్‌ చంద్రయాన్‌ గురించి స్పందించారు. ఇస్రో మహిళా శాస్త్రవేత్తలు ఉన్న ఒక ఫోటోను తన ఇనస్టాగ్రామ్‌లో పోస్టు చేసి వారంతా బిందీ, సింధూరాలు, తాళిబట్లు ధరించి ఉన్నారని, ఉన్నత ఆలోచనలు, సాధారణ జీవితాలల భారతీయతకు ప్రతీకలని పేర్కొన్నారు. ఇలా చెప్పటం ద్వారా ఆమె జనాలకు ఏ సందేశం ఇవ్వదలచుకున్నారు ? చంద్రయాన్‌-1 చంద్రుడి ఉపరితలం మీద ఉన్న ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు ఉద్దేశించారు. రెండు సంవత్సరాల పాటు పరిశోధనకు పంపిన ఉపగ్రహం 2008 నవంబరు 14న అక్కడకు వేరుకుంది. ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్‌ కలాం అజాడ్‌ సూచన మేరకు అది దిగిన చోటును ప్రధమ ప్రధాని జవహర్‌లాల్‌ నెగ్రూ కేంద్రం అని పేరు పెట్టారు.అయితే అది 312 రోజులు మాత్రమే పని చేసింది.2009 ఇస్రో కేంద్రం నుంచి సంబంధాలు తెగిన తరువాత ఆచూకీ తెలియలేదు. తరువాత అమెరికా నాసా కేంద్రం కనుగొన్న సమాచారం ప్రకారం 2016వకు క్షక్ష్యలో తిరుగుతూనే ఉంది. అది పంపిన సమాచారంలో చంద్రుడి మీద నీరు ఉన్నట్లు తేలింది. అది దిగిన కేంద్రానికి నెహ్రూ పేరు పెట్టటం మీద ఎలాంటి వివాదం తలెత్తలేదు. కానీ చంద్రయాన్‌ -3 లాండర్‌ దిగిన చోటుకు నరేంద్రమోడీ శిశశక్తి అని పెట్టటం వివాదాస్పదమైంది. ఒక మతానికి ప్రతీక అయిన పేరు పెట్టటం ఏమిటన్నది ప్రశ్న. ఇప్పటికే భారత్‌లో మతశక్తులు రెచ్చిపోతున్నారని భావిస్తున్న విదేశాల్లో మన దేశ ప్రతిష్ట మరింత దిగజారుతుంది తప్ప మరొకటి కాదు.ది. భారత్‌ వారసత్వంలో అనేక మతాలు ఉన్నాయి, వాటన్నింటినీ తోసి పుచ్చి హిందూ ఒక్కటే వారసురాలని చరిత్రను వక్రీకరిస్తున్నారు. ఒకనాడు పెద్ద ఎత్తున విలసిల్లిన బౌద్ద, జైన మతాలు మన దేశంలో పుట్టినవి తప్ప విదేశాల నుంచి వచ్చినవి కాదు. అసలు అన్నింటికంటే కుల, మతాలకు అతీతంగా ఉన్న మనశాస్త్రవేత్తల సమిష్టి కృషికి వైజ్ఞానిక గుర్తింపు ఇవ్వాల్సి ఉండగా మతం రంగు పులమటం దుష్టఆలోచనకు ప్రతిరూపం తప్ప మరొకటి కాదు. జవహర్‌ పేరు లౌకిక వాదానికి శివశక్తి మతవాదానికి ప్రతీకలు. ఇది మత ప్రాతిపదికన సమాజం మరింతగా చీలిపోవటానికి దోహదం చేస్తుంది.మతం పేరుతో జరిపే వాటికి రానున్న రోజుల్లో ఇతర దేశాలు ఏమేరకు సహకరిస్తాయన్నది ప్రశ్న.


చంద్రయాన్‌ -2 ప్రయోగం విజయవంతంగా కావాలని మఠాధిపతులు, గుడి పూజారులు, చిన్న దేవుళ్లు, దేవతలు, పెద్ద వెంకటేశ్వరస్వామి ఆశీర్వచనాలు, వాట్సాప్‌ భక్తులు చేసిన పూజలు ఫలించలేదు. అందుకుగాను వారెవరూ ఏడ్చినట్లు చూడలేదు గానీ ఇస్రో అధిపతి శివన్‌ ఏడ్చేశారు.ౖ ఒక ప్రయోగం విఫలమైనపుడు, మరొకటి సఫలమైనపుడు శాస్త్రవేత్తలు, సమాజం భావోద్వేగాలకు గురి కావటం సహజం. మన చంద్రయాన్‌ మాదిరే ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు మన ఖర్చులో సగంతో ఒక ప్రయోగం జరిపారు. అది 2019 ఏప్రిల్‌ 19వ తేదీన చివరిక్షణాల్లో సమాచార వ్యవస్ధతో సంబంధాలు తెగిపోయి, మన ప్రయోగం మాదిరే జయప్రదం కాలేదు. మన దేశంలో మాదిరి దశ్యాలు,ఓదార్పులు అక్కడ లేవు. చంద్రయాన్‌-2 ప్రయోగానికి ముందు సామాజిక మాధ్యమంలో ఒక అంశం చక్కర్లు కొట్టింది. ” చంద్రయాన్‌-2 ప్రయోగానికి అంతా రెడీ, కానీ ఎక్కడో ఏదో చిక్కుముడి తెమలడం లేదు, తేలడం లేదు లెక్క తెగడమే లేదు.900 కోట్ల ప్రాజెక్టు. కోట్ల మంది భారతీయుల ఆశలు. ప్రపంచ కన్ను . ఇస్రో ఛైర్మన్‌కు ఓ సీనియర్‌ సైంటిస్టు ఓ సలహా ఇచ్చాడు. ఇస్రో శివన్‌ కూడా ప్రతిదీ వినే తరహా, దేన్నీ తేలికగా తీసేసే రకం కాదు. ఆ సలహా ఏమిటంటే..? ‘పూరి శంకరాచార్యను కలుద్దాం సార్‌, ఆయన ఏమైనా పరిష్కారం చెప్పవచ్చు, తను ఓ క్షణం విస్తుపోయాడు, ఆధునిక గణితవేత్తలు, అంతరిక్ష శాస్త్రవేత్తలు, భౌతికశాస్త్ర పరిశోధకులకే చేతకానిది ఓ కాషాయగుడ్డల సన్యాసికి ఏం తెలుసు అని బయటికి వెల్లడించలేదు తన మనసులో భావాన్ని..! కానీ వాళ్లు వెళ్లలేదు స్వామివారినే శ్రీహరికోటకు రమ్మని ఆహ్వానించారు ఆయన వచ్చాడు,చూశాడు. ఆ లెక్కను చిటికెలో సాల్వ్‌ చేసేశాడు శంకరాచార్య అలియాస్‌ నిశ్చలానంద సరస్వతి. ఆయన ఎదుట అక్షరాలా భక్తిభావంతో సాగిలపడ్డాడు ఇస్రో చీఫ్‌. ” ఇలా సాగింది. ఇది కచ్చితంగా ఫేక్‌ ప్రచారమే. ఇస్రో అంటే ఏదో గణిత శాస్త్ర సంస్ధ అన్నట్లు, లెక్కల చిక్కు ముడి పడినట్లు చిత్రించారు. ఇలా చెప్పటం నిజంగా మన శాస్త్రవేత్తలను అవమానించటం, స్వామీజీలు, బాబాలకు లేని ప్రతిభను ఆపాదించటం తప్ప మరొకటి కాదు. ప్రతి అంతరిక్ష ప్రయోగానికి ముందు వాటి ప్రతిమలతో తిరుపతి వెంకన్న , సుళ్లూరు పేట చెంగాలమ్మ దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు. చంద్రయాన్‌-2కు నాటి ఇస్రో అధిపతి కె శివన్‌ వుడిపి శ్రీకష్ణ మఠాధిపతి ఆశీస్సులు కూడా అందుకున్నారు. ఇక వాట్సాప్‌ భక్తులు, ఇతరులు చేసిన వినతులకు కొదవ లేదు. మరి శంకరాచార్య లెక్కలేమయ్యాయి. దేవుళ్ల కరుణాకటాక్షం, మఠాధిపతుల, తిరుపతి వేద పండితుల ఆశీర్వాచనాల మహత్తు, శక్తి ఏమైపోయినట్లు ? మూఢనమ్మకాలను పెంచే, శాస్త్రవిజ్ఞానం మీద పూర్తి నమ్మకంలేని తరాలను మనం తయారు చేస్తున్నాము. దీనికి తాజాగా ప్రస్తుత ఇస్రో అధిపతి సోమనాధ్‌ కూడా జతకలిశారు. అన్నీ వేదాల్లోనే ఉన్నాయష బాపతు పక్కన చేరారు.


చంద్రయాన్‌ 2 విఫలం కాదు, ప్రయోగాలలో అది ఒక భాగమే. ఆర్యభట్ట నుంచి సాగుతున్న విజయాల పరంపరలో ఇదొక ప్రయోగం. వైఫల్యాలతో గతంలో ఏ శాస్త్రవేత్త కుంగిపోలేదు. నిరాశపడలేదు. అది అసలు వారి లక్షణం కాదు. వారి ప్రయోగాలు విజయవంతం కావాలని, అది దేశానికి వుపయోగపడాలని అందరూ కోరుకుంటున్నారు. చంద్రయాన్‌ 1లో 2008లోనే దాదాపు 10 నెలలపాటు మన పరిశోధనలు చంద్రునిపై సాగాయి, కొన్ని లోపాలు ఉన్నా అది విజయమే, ప్రపంచంలో స్థానం ఆనాడే సాధించాము. చంద్రయాన్‌ 2 లో ఆర్బిటర్‌ లక్షణంగా పని చేసింది. లాండర్‌ మాత్రమే విఫలమైంది. ఇప్పుడు చంద్రయాన్‌-3లో ఆ లోపాన్ని కూడా అధిగమించాము. ఇందుకు గాను మన శాస్త్రవేత్తలను యావత్‌ లోకం వేనోళ్ల కొనియాడుతున్నది.


నరేంద్రమోడీ సర్కార్‌ వుగ్రవాదులు, నల్లధనం వున్న వారి మీద కంటే మేధావులు, శాస్త్ర పరిశోధనల మీద సమర్దవంతంగా మెరుపు దాడులు చేసిందని (సర్జికల్‌ స్ట్రెక్స్‌ ) ప్రముఖ చరిత్ర కారుడు రామచంద్ర గుహ వ్యాఖ్యానించారు. 2014లో అధికారానికి వచ్చినప్పటి నుంచి మేథావుల మీద నిరంతరం యుద్ధం సాగిస్తున్నదని, ఒక విశ్వవిద్యాలయం తరువాత మరొక విశ్వవిద్యాలయాన్ని, పరిశోధనా సంస్ధలను లక్ష్యంగా చేసుకొని వాటి విశ్వసనీయతను దెబ్బతీస్తున్నదని పేర్కొన్నారు. మన పూర్వీకులు ప్లాస్టిక్‌ సర్జరీ చేశారని, కత్రిమ గర్భధారణ పద్దతులను అభివద్ధి చేశారని స్వయంగా నరేంద్రమోడీయే చెప్పారు. ఇలాంటి ఆధారం లేని ఆశాస్త్రీయ ప్రచారాలను చేయటంలో మోడీని ఆయన మంత్రులు పెద్ద ఎత్తున అనుకరిస్తున్నారు.ఇలాంటి విషయాలను (చెప్పింది వినటం తప్ప ప్రశ్నించటానికి సాహసం చేయని) ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖల్లో లేదా ప్రయివేటు సంభాషణల్లో కాదు, ఏకంగా సైన్స్‌ కాంగ్రెస్‌లోనే చెప్పారని రామచంద్ర గుహ వ్యాఖ్యానించారు. నరేంద్రమోడీ నాలుగు సంవత్సరాల తరువాత చంద్రయాన్‌-2లో లాండర్‌ విఫలమైన చోటుకు తిరంగా అని పెట్టటం జాతీయ పతాకను అవమానించటం, తాజాగా జయప్రదంగా దిగిన చోటుకు శివశక్తి అని పేరు పెట్టటం మత అజెండాను ముందుకు తీసుకుపోవటంలో భాగంగా భావించటం తప్పువుతుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇష్టం లేని పెళ్లిలో తలంబ్రాలు పోసినట్లు : పులిహోర – పప్పుచారు మీద ఉన్న యావ మణిపూర్‌ మీద లేకపాయే ! నరేంద్రమోడీ 133 నిమిషాల ప్రసంగంలో కేవలం మూడు నిమిషాలే !

11 Friday Aug 2023

Posted by raomk in BJP, Communalism, Congress, History, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence, Social Inclusion, Women, Women

≈ Leave a comment

Tags

BJP, Manipur crisis, Manipur unrest, Narendra Modi, Narendra Modi Failures, No confidence motion 2023, RSS

  ఎం కోటేశ్వరరావు

పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లుగానే దేశనేతలందు మన ప్రధాని నరేంద్రమోడీ వేరయా అని చెప్పక తప్పదు. సుదీర్ఘ ప్రసంగంతో తన రికార్డును బద్దలు చేశారు. గురువారం నాడు(ఆగస్టు పదవ తేదీ) తన ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మీద ప్రశ్నలను సంధిస్తూ ప్రధాని మాట్లాడిన తీరు కూడా దాన్ని నిర్ధారించింది. మణిపూర్‌ మీద నోరు విప్పించేందుకే అవిశ్వాసం అన్నది తెలిసిందే. దానికి సమాధానం అంటూ 133 నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో కేవలం మూడంటే మూడు నిమిషాలే (డక్కన్‌ హెరాల్డ్‌ పత్రిక) మణిపూర్‌ గురించి మాట్లాడారంటే మొక్కుబడి,ఎంత నిర్లక్ష్య వైఖరితో ఉన్నారో లోకానికి వెల్లడైంది. ప్రశ్నలను అడిగే చతురత ఏ ఒక్కరి సొత్తూ కాదు. మీడియాతో మాట్లాడని దేశాధినేతలెవరు లేదా ఎందరు ? ప్రజాస్వామ్యానికి మన దేశం పుట్టినిల్లు , పార్లమెంటును దేవాలయం అని వర్ణించి దానికి దూరంగా ఉండటం, మాట్లాడేందుకు ?ఇచ్చగించని ప్రధాని ఎవరు ? పార్లమెంటుకు వస్తూ సభలో చేయాల్సిన ప్రకటనను ప్రాంగణంలోని మెట్లు, గోడలను ఉద్దేశించి మొక్కుబడిగా మాట్లాడిన ప్రధాని ఎవరు అన్న ప్రశ్నలకు సమాధానం అంత కష్టమేమీ కాదు. యావత్‌ దేశాన్నే గాక ఐరోపా పార్లమెంటులో కూడా చర్చనీయాంశమైన మణిపూర్‌ దారుణాల గురించి స్పందనకు కూడా తీరికలేకుండా ప్రధాని ఉన్నారు.పార్లమెంటులో ఈ అంశం గురించి ప్రధాని నోరు విప్పాలన్న ప్రతిపక్షాల, యావత్‌ సమాజ వేడుకోళ్లు, విన్నపాలు, డిమాండ్లను పట్టించుకోకపోవటంతో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టి మాట్లాడించే మార్గాన్ని అనుసరించాల్సిన పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా తలెత్తి ఉండదు. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందని ఎవరూ కలలో కూడా అనుకోలేదు. మణిపూర్‌ మీద ఏం చెబుతారో దేశానికి వెల్లడించాలన్న ఏకైక లక్ష్యంతోనే ప్రవేశపెట్టారన్నది తెలిసిందే.

మానవతుల మర్యాద మంట గలిపిన దుర్మార్గం గురించి మాట్లాడవయ్యా మహానుభావా అంటే మణిపూర్‌ ప్రభుత్వ ఆఫీసుల్లో మహాత్మాగాంధీ చిత్రాలను అనుమతించనపుడు అక్కడున్న ప్రభుత్వం ఎవరిది, జాతీయగీతం అలపించటాన్ని అనుమతించనపుడు ఎవరు అధికారంలో ఉన్నారు, తిరుగుబాటుదార్లు చెప్పిందే జరిగినపుడు ఏలుబడి ఎవరిది అంటూ జికె ప్రశ్నలను సంధించారు. మిజోరామ్‌ అమాయక పౌరుల మీద 1956 మార్చి ఐదున వైమానిక దళంతో కాంగ్రెస్‌ దాడులు చేయించింది అంటూ ప్రధాని మోడీ మాట్లాడిన తీరును చూసి ఏమనుకోవాలి ! జనాలకు బుర్ర తిరిగింది. అప్పుడు మిజోరంలో కాంగ్రెస్‌ దాడి చేయిస్తే నేడు మణిపూర్‌లో ఉన్న రెండింజన్ల పాలన సాగిస్తున్న బిజెపి మేమేన్నా తక్కువ తిన్నామా అంటూ మహిళలను నగంగా తిప్పి మానభంగం చేయించినట్లుగా ప్రధాని తర్కం ఉంది. మణిపూర్‌ వెళ్లి బాధితులను ఎందుకు పరామర్శించలేదు, రెండు సామాజిక తరగతుల మధ్య తలెత్తిన అనుమానాలను ఎందుకు తీర్చలేదు, ప్రధాని కనిపించటం లేదు అని పోస్లర్లు వేసి మరీ అక్కడ జనం అడుగుతున్నారు అని ప్రతిపక్షాలు అడిగాయి. వాటికి సమాధానం చెప్పకుండా కాంగ్రెస్‌ ఎన్నడూ ఆ ప్రాంత ప్రజల మనోభావాలను అర్ధం చేసుకొనేందుకు చూడలేదు, నేను 50సార్లు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లాను అన్నారు ప్రధాని. ఓట్ల కోసం వందసార్లు వెళ్లవచ్చు, ఒక రాష్ట్రం మొత్తాన్ని మిలిటరీకి అప్పగించి జనం బిక్కుబిక్కు మంటూ దిక్కులేకుండా ఉన్నపుడు మణిపూర్‌ వెళ్లారా, పరామర్శించారా ,గాయపడిన మణిపూర్‌ పౌరుల మనోభావాలను పట్టించుకున్నారా లేదా అన్నది గీటురాయి తప్ప ఆ ప్రాంతానికి ఎన్నిసార్లు వెళ్లారు అని ఏ ప్రతిపక్ష పార్టీ అయినా అడిగిందా ? మణిపూర్‌లో నిందితులను కఠినంగా శిక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.సమీప భవిష్యత్‌లో మణిపూర్‌లో శాంతి నెలకొంటుందని దేశ ప్రజలకు హామీ ?ఇస్తున్నాను, దేశం మొత్తం మీతో ఉందని మణిపూర్‌ మహిళలు, బిడ్డలతో సహా పౌరులందరికీ నేను చెబుతున్నాను అని ప్రధాని చెప్పారు. ఈ ముక్కేదో మణిపూర్‌లో హింసాకాండ చెలరేగిన తొలి రోజుల్లోనే చెప్పి ఉంటే ? పార్లమెంటు ప్రారంభం కాగానే స్వయంగా ప్రకటన చేసి ఉంటే ఇంత రచ్చ జరిగేదా ?

  తనకు లేని అధికారాన్ని పుచ్చుకొని మెయితీలను గిరిజనులుగా పరిగణిస్తూ రిజర్వేషన్లు వర్తింప చేయాలన్న మణిపూర్‌ హైకోర్టు ఆదేశమే కదా అక్కడ జరిగిన పరిణామాలకు కారణం.దాని మీద కేంద్ర ప్రభుత్వం ఒక వైఖరి ప్రకటించనంతవరకు గిరిజనుల్లో ఉన్న అనుమానాలు తొలగవు. ఇతర ప్రాంతాల్లోని గిరిజనులలో కూడా అదే పరిస్థితి తలెత్తవచ్చు. కానీ ప్రధాని ప్రసంగంలో దాని ప్రస్తావన లేదు. అంటే ఆ వివాదాన్ని కొనసాగించాలని చూస్తున్నారన్నది స్పష్టం. మణిపూర్‌ దారుణాలు జరిగినపుడు కర్ణాటకలో ఓట్ల వేటలో ఉన్నందున మోడీ గారికి వెళ్లే తీరికలేదు అనుకుందాం. ఒక ట్వీట్‌ ద్వారానైనా తన స్పందన ఎందుకు వెల్లడించలేదు. ట్వీట్‌ అంటే గుర్తుకు వచ్చింది. మణిపూర్‌లో హింసాత్మక ఉదంతాలు ఆగలేదు, ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. పక్కనే ఉన్న హర్యానాలో బుల్డోజర్లను నడిపిస్తున్న ఆటవిక పాలన సాగుతున్నది. సరిగ్గా అప్పుడు అంటే ఆగస్టు రెండున ఒక ఉదంతం జరిగింది. దాన్ని నరేంద్రమోడీ గారి ట్వీట్‌లోనే చూద్దాం. ” గత సాయంత్రం నేను భారత దక్షిణ రాష్ట్రాల ఎన్‌డిఏ ఎంపీలతో ఒక అద్భుతమైన సమావేశాన్ని జరిపాను. తరువాత గొప్ప విందు జరిగింది. దానిలో పానియారమ్‌, అప్పమ్‌, కూరగాయల కుర్మా, పులిహోర,పప్పుచారు,అడాయి. అవియాల్‌ ?ఇంకా కొన్ని వడ్డించారు ” అని ప్రధాని నరేంద్రమోడీ ఆగస్టు మూడవ తేదీ సాయంత్రం 4.1?కు ఒక ట్వీట్‌ చేశారు, దానికి విందు ఫొటోను కూడా జత చేశారు.

  రోమ్‌ తగులబడుతుంటే ఫిడేలు వాయిస్తూ కూర్చున్న నీరో చక్రవర్తి నిర్వాకం గురించి తెలిసిందే. పులిహౌర-పప్పుచారు రుచుల మీద ఉన్న యావ మణిపూర్‌ మీద ప్రధానికి ఎందుకు లేకపోయింది అన్నది ప్రశ్న. అవిశ్వాస తీర్మానం మీద సమాధానంగా ప్రధాని చేసిన మిగతా ప్రసంగమంతా కాంగ్రెస్‌, ప్రతిపక్ష పార్టీల మీద గతంలో చేసిన దాడిని పునరుచ్చరించటం తప్ప మరేమీ లేదు.ఈశాన్య రాష్ట్రాలకు ఎన్నిసార్లు వెళ్లిందీ ప్రధాని చెప్పారు. దేవాలయం అని వర్ణించిన పార్లమెంటుకు ప్రధాని ఎన్నిసార్లు వచ్చారు, ఎంతసేపు గడిపారు, ఏం మాట్లాడారు అన్నది ప్రశ్న.పార్లమెంటు నిబంధనల ప్రకారం ప్రధానితో సహా కేంద్ర మంత్రులు పార్లమెంటుకు వచ్చినా రిజిస్టర్‌లో సంతకాలు చేయాల్సిన అవసరం లేదు గనుక వారెన్ని సార్లు వచ్చిందీ మనకు తెలియదు. మన ప్రజాస్వామ్య గొప్పతనమిది అనుకొని మన భుజాలను మనమే చరుచుకోవాలి. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను 2014 ఎన్నికలపుడు నరేంద్రమోడీ విమర్శించిన తీరును చూశాము. బలహీన, నోరులేని, మౌన మోహన సింగ్‌ అని వర్ణించారు. గడచిన తొమ్మిది సంవత్సరాలలో అదే పెద్దముషి తాజాగా చేసిన ప్రసంగంతో కలుపుకొని పార్లమెంటులో మాట్లాడింది కేవలం 31 సార్లు మాత్రమే అని తేలింది. ఇంత కంటే ఎక్కువ సార్లు మాట్లాడినట్లు ఎవరైనా చెబితే ఆ మేరకు అంకెను సవరిద్దాం. అదే మౌన మోహన సింగ్‌ గారు పదేండ్ల పాలనా కాలంలో 70సార్లు మాట్లాడారు. అనేక కీలక అంశాల మీద నరేంద్రమోడీ మౌనం జగమెరిగిన సత్యం.ప్రతి ఏడాదీ రాష్ట్రపతి ప్రసంగం మీద ధన్యవాదాలు తెలపటం, స్పీకర్‌ ఎన్నిక సందర్భంగా అభినందనలు, తన మంత్రుల పరిచయం, రామ మందిర నిర్మాణం గురించి ప్రకటనల వంటివి మోడీ ప్రసంగాల జాబితాలో ఉన్నట్లు ఇండియా టుడే ఒక విశ్లేషణలో పేర్కొన్నది.

  2014లో మంత్రిగా ఉన్న సాధ్వి నిరంజన ప్రతిపక్షాల మీద చేసిన సంస్కారం లేని అనుచిత వ్యాఖ్యల మీద దుమారం లేవటంతో తప్పనిసరై మోడీ జోక్యం చేసుకొని పార్లమెంటులో మాట్లాడటం, తరువాత ఆమె మంత్రి పదవి పోవటం, ముంబై పేలుళ్లలో పాక్‌ జాతీయుడికి బెయిలిచ్చిన ఉదంతం మీద, ఒకసారి కాశ్మీరు మీద, మరోసారి వ్యవసాయ సంక్షోభం, పదహారవ లోక్‌సభలో ముగింపు మాటలు తప్ప మరొకటి లేదు.రాఫెల్‌ గురించి, అదానీ కంపెనీల మీద హిండెన్‌బర్గ్‌ నివేదిక వంటి అంశాల మీద నోరు విప్పలేదు. వర్తమాన లోక్‌సభలో నెలల తరబడి సాగు చట్టాల మీద పార్లమెంటు అనేక సార్లు స్థంభించినా, మిత్రపక్షం అకాలీదళ్‌ వెళ్లిపోయినా నోరు విప్పలేదు. బిజెపి ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ తమ మర్యాదకు భంగం కలిగించినట్లు మహిళా రెజ్లర్లు కేసులు పెట్టి ఆందోళన చేసినా నోరు మెదపలేదు. అందువలన మణిపూర్‌లో తమ పార్టీ నిర్వాకం వలన తలెత్తిన పరిస్థితి గురించి ప్రధాని మౌనంగా ఉండటంలో ఆశ్చర్యం లేదు. విధిలేక సాగు చట్టాలను రద్దు చేస్తూ జాతికి క్షమాపణలు చెబుతూ బయట మాట్లాడారు తప్ప పార్లమెంటులో కాదు. అంతకు ముందు గోరక్షకుల పేరుతో జరిపిన దురాగతాల గురించి చేసిన ప్రకటన, సిఏఏ ఆందోళన గురించి మాట్లాడింది కూడా పార్లమెంటులో కాదు. చివరికి గాల్వన్‌ ఉదంతాల మీద కూడా ప్రతిపక్షాలతో జరిపిన అఖిల పక్ష సమావేశంలో, టీవీలో మాత్రమే మన భూభాగంలోకి ఎవరూ రాలేదు, ఏ పోస్టునూ కదిలించలేదు అని మాట్లాడారు. ప్రతిపక్షం అవిశ్వాసం తీర్మానం పెట్టటమే తప్పు అధికారం కోసం ఆకలితో ఉన్నట్లు ప్రధాని ఆరోపించారు. చరిత్రను ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే తమ గతం గుర్తుకు వచ్చి ఉండేది. కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద గతంలో ప్రవేశపెట్టిన అన్ని అవిశ్వాస తీర్మానాలకు బిజెపి లేదా దానికి ముందు రూపమైన జనసంఘం మద్దతివ్వటమే కాదు, తానే స్వయంగా ప్రవేశపెట్టిన ఉదంతాలు కూడా ఉన్నాయి.ప్రతిపక్షాలకు అవిశ్వాస తీర్మానం ఒక ఆయుధం.దేశ చరిత్రలో 28సార్లు ప్రవేశపెట్టారు. పదహారు సంవత్సరాల పాలనలో ఇందిరా గాంధీ పదిహేను తీర్మానాలను ఎదుర్కొన్నారు. ఏ ఒక్కటీ నెగ్గలేదు.

  ఇక ప్రధాని నరేంద్రమోడీ పులిహోర- ప్చుచారు ట్వీట్‌ మీదా నెటిజన్లు తీవ్రంగానే స్పందించారు. కొన్ని స్పందనలను చూద్దాం.” ఉప్మా ఎక్కడ మోడీ గారూ, పెరుగన్నం గురించి చెప్పలేదేం సార్‌, పప్పు అంటే ఏమిటి ? ” ఒక మొద్దుబారిన స్పందన ఇది, హర్యానా, మణిపూర్‌ తగులబడుతున్నది, ఎక్కడ చూసినా హింసాకాండ, రక్తపాతం, విద్వేష ప్రసంగాలు, ప్రతి చోటా జనం చచ్చిపోతుండగా ఈ మనిషి తాను తిన్నదాని గురించి ట్వీట్‌ చేశారు.అతనికేమీ సహానుభూతి లేదు, అతనేమీ పట్టించుకోరు.” ” జరుగుతున్న పార్లమెంటు సమావేశాలకు ఎందుకు వెళ్లరు,మణిపూర్‌ను ఎందుకు సందర్శించరు ?” ” ఈ మనిషి నిజంగా ఆశ్చర్యకరంగా ఉన్నారు, దేశం తగులబడుతుంటే తాను తిన్న పదార్ధాల గురించి చెబుతున్నారు ” ” మీ డిన్నర్‌లో దాక్షిణాది వంటకాలతో మజా చేసుకోండి ” ” చాలా గొప్పగా ఉందండి హర్యానా లేదా మణిపూర్‌లో గుజరాత్‌ నమూనా విద్వేష విస్తరణ పండగ పార్టీలా ఉంది. మీరు పార్లమెంటు లేదా మణిపూర్‌ ఎప్పుడు వెళతారు ” ” ఎంతటి గొప్ప మనిషిని మనం ప్రధానిగా కలిగి ఉన్నాం. మణిపూర్‌ సమస్య మీద వివరణ కోసం మీరు పార్లమెంటుకు రావాలని యావత్‌ ప్రతిపక్షం కోరుతుండగా మీరు మాత్రం తాపీగా ఉన్నారు. దక్షిణాది వంటకాల రుచులను అనుభవిస్తున్నారు. మోడీ గారూ పౌరుల గురించి మీకు ఎంత విశాల హృదయ స్పందన ఉందో కదా ! ” ” మీరు మంచి సమావేశాన్ని జరిపారు కానీ మీకు దేశంలో జరుగుతున్న దానిమీద చర్చించేందుకు తగిన సమయం లేదాు. మీరు ఆ గద్దెమీద ఎందుకు ఉన్నారు. మీ వంటి నేతను కలిగి ఉన్నాం కాబట్టి వందల సంవత్సరాల తరువాత కూడా మీ కారణంగా మనం అభివృద్ది చెందిన దేశం మాదిరి గాక అభివృద్ది చెందుతున్న దేశంలోనే ఉంటాం.” ” అద్భుతం మీరూ హాపీ మేమూ హాపీ . రకరకాల దుస్తులు, ఎన్నో రకాల వంటలు అనుభవించండి, భిన్న రుచులను అనుభవించటమే కదా జీవితం ” ” సార్‌ అప్పుడప్పుడూ డిన్నర్‌లో ఒక రొట్టె ముక్కను కూడా తినేందుకు ప్రయత్నించాలి మీరు. ఎందుకంటే మణిపూర్‌ సహాయ శిబిరాల్లో ఉంటున్నవారు తింటున్నది అదే ” ” ఎనభై కోట్ల మంది జనం ఐదు కిలోల ఉచిత రేషన్‌తో బతుకుతుండగా మీరు అనేక వంటకాలను భుజిస్తున్నారు ” ” అనేక శాంతి భద్రలతల సమస్యల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం, లక్షలాది మంది పేదా మధ్యా తరగతి జనాల ఆదాయం మీద ప్రతికూల ప్రభావం చూపుతున్నది. మన దేశ ప్రధానికి తమ పార్టీ ఎంపీలతో కలసి ఆరగించిన ఆహార పదార్దాల గురించి ట్వీట్‌ చేసేందుకు వ్యవధి ఉంటుంది గానీ పరిస్థితిని అదుపు చేసేందుకు ఎలాంటి ప్రయత్నం కనిపించటం లేదు.” వీటి గురించి వేరే వ్యాఖ్యలు అవసరమా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రధాని నరేంద్రమోడీకి ఒక బహిరంగ లేఖ : ఆవు పేడ కాదు, కావాల్సింది సెమీ కండక్టర్ల పరిశోధన !

31 Monday Jul 2023

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Europe, Germany, History, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Science, UK, USA

≈ Leave a comment

Tags

America's tech war with China, India’s R&D, Narendra Modi, Narendra Modi Failures, R&D investment, Research on cow dung, Semicon India 2023, Semiconductor


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ గారికి,
అయ్యా ప్రతి నెలా మీ మన్‌కీ బాత్‌ అంశాలను చదివేవారిలో నేను ఒకరిని.ఒక జర్నలిస్టుగా జన్‌కీ బాత్‌లో ఉన్న కొన్ని ంటిని ఈ బహిరంగ లేఖ ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్నాను. జూలై 28-30 తేదీలలో గుజరాత్‌ రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో తమరు సెమికాన్‌ ఇండియా 2023 రెండవ వార్షిక సమావేశాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా దేశమంతటా పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలు కూడా జారీ చేశారు. దేశాన్ని సెమీకండక్టర్ల కేంద్రంగా మార్చుతామని, మూడు వందల కాలేజీల్లో సెమికండక్టర్‌ కోర్సులను ప్రవేశపెడతామని తమరు ప్రకటించటం సంతోషం. గతంలో దేశంలో జరిగిన అనర్ధాలకు, వెనుకబడి ఉండటానికి,మనకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం రాకపోవటానికి నెహ్రూనే కారణం అని బిజెపి, దాని మాతృసంస్థ సంఘపరివారం ఠకీమని సమాధానం చెబుతుంది. సెమికండక్టర్ల రంగంలో వెనుకబడటానికి కూడా నెహ్రూనే నిందిస్తారా ?


అన్నీ మీరే చేశారు అని మా తెలుగు సినిమాలో ఒక పాత్ర తండ్రిని తప్పుపడుతుంది. అలాగే అన్నీ ఆ నెహ్రూ చేశారనే కాసేపు అనుకుందాం.ఆయన అనుసరించిన విధానాల నుంచి కాంగ్రెస్‌ 1990దశకంలోనే నూతన ఆర్ధిక విధానాల పేరుతో వైదొలిగిందని మీకు తెలియంది కాదు. వాటినే మీరు అమలు జరుపుతున్నారు తప్ప కొత్త విధానాలు కాదు, ఎందుకంటే వాటిని మన మీద ప్రపంచ బాంకు, ఐఎంఎఫ్‌ రుద్దింది. గత పది సంవత్సరాలలో మీకు పూర్తి అధికారం ఉన్నప్పటికీ మీరు అంగీకరించినా లేకున్నా అనేక రంగాలలో వైఫల్యబాటలోనే దేశం ఉండటానికి కారణం ఆ విఫల విధానాలనే మరింత వేగంగా అమలు జరపటమే. అరిగిపోయిన రికార్డు అంటే ఇప్పటివారికి తెలియదు కనుక అన్నీ నెహ్రూనే చేశారు అనే పాచిపాట ఇంకా ఎంతకాలం పాడాలి అని మీ భక్తులు, జనం నుంచి ప్రశ్న ఇప్పుడు ఎదురవుతోంది. మీరు చెప్పిన మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, దేశమంతటా గుజరాత్‌ నమూనా అభివృద్ధి వంటి విఫల నినాదాలను చూసిన తరువాత ఎన్నికల కోసం ఆడుతున్న ఆటలో భాగం ఇదని అనేక మంది భావిస్తున్నారు. ఎందుకంటే ఒకసారి ఇచ్చిన నినాదం, చెప్పిన మాట మరోసారి మీ నోటి వెంట రాదన్నది స్పష్టమే. మీ శైలి అనితరసాధ్యం. గతంలో అమెరికా, పూర్వపు సోవియట్‌ మధ్య ప్రచ్చన్న పోరులో అణ్వాయుధాలు కేంద్ర స్థానంలో ఉంటే ఇప్పుడు అమెరికా, చైనా మధó్య తలెత్తిన పోరులో సెమీకండక్టర్‌లు ఉన్నాయి.ఆయుధాలలో కూడా ఇవి కీలకంగా మారనున్నాయని విశ్వగురువుగా ప్రపంచాన్ని ఔపోసన పట్టిన మీకు నేను చెప్పాల్సినపని లేదు.


ఎయిర్‌బస్‌లో అనేక దేశాలను అలా వెళ్లి ఇలా చుట్టివచ్చిన మీరు సెమీకండక్టర్‌ బస్‌ను ఎలా మిస్‌ అయ్యారన్నది చాలా మందికి అర్ధం కావటం లేదు. తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తరువాత వచ్చిన ప్రధానులెవరికీ(వారిలో అతల్‌ బిహారీ వాజ్‌పాయి ఉన్నదీ లేనిదీ తెలియదు) దూర దృష్టి లేదని విమర్శించే మీ అనుయాయులు (సుబ్రమణ్య స్వామిని పక్కన పెడదాం) మీ గురించి ఏం చెబుతారో తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్‌ యాభై సంవత్సరాలలో చేసిన దాన్ని మీరు తొలి ఐదు సంవత్సరాల్లోనే చేసి చూపించారని గత ఎన్నికలపుడు ప్రచారం చేశారు. చేసిందేమిటో సాధికారిక సమాచారాన్ని జనానికి అందిస్తే వాస్తవం తెలుస్తుంది. మన దేశంలో మీ కంటే ముందు నుంచి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్‌) పేరుతో వివరాలను సేకరిస్తున్నారు. దానిలో మీ పాలనలో అనేక సూచికలు దిగజారినట్లు కనిపించింది. మీ ఏలుబడిలో నిరుద్యోగం పెరిగిందన్న సమాచారాన్ని గత లోక్‌సభ ఎన్నికల ముందు తొక్కిపెట్టిన సంగతి మీకు చెప్పనవసరం లేదు. వచ్చే సర్వేలో ఎలాంటి ఫలితాలు వస్తాయో అని సమాచారాన్ని సేకరించే పద్దతిని రూపొందించే సంస్థ అధిపతినే తప్పించారు అని జనం అనుకుంటున్నారు.


నరేంద్రమోడీ పెద్ద విజనరీ అంటే భూత, వర్తమాన, భవిష్యత్‌ను చూడగలిగిన దృష్టి కలవారని అని ప్రచారం చేశారు. నిజమే కావచ్చు, సర్వేల్లో వచ్చే సమాచారం ఎలాంటిదో మీకు ముందే తెలిసి ఉంటుంది గనుక దాని రూపకర్తనే తొలగించారు. అన్నట్లు మరిచాను. ఈ ఏడాది మీ మీద ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాయని మీరు ముందే గ్రహించి ఆ విషయాన్ని ఎన్నో సంవత్సరాల ముందే మీరు చెప్పినట్లు కొందరు సామాజిక మాధ్యమంలో మీ గొప్ప గురించి ప్రచారం చేస్తున్న పోస్టు ఉంది. దాని నిజా నిజాలు మీకే ఎరుక. నిజంగా మీకు తెలిసి ఉంటే మణిపూర్‌ దురంతాన్ని ఎందుకు నివారించలేకపోయారు అన్న ప్రశ్న వస్తోంది. దాన్ని వదలివేద్దాం. నాలుగవ తరం పారిశ్రామిక విప్లవం గురించి కూడా మీరు చెప్పారు. పిండి లేకుండా రొట్టెలు రావు కదా ? దానికి అవసరమైన పరిశోధన, అభివృద్ధి రంగాల ప్రాధాన్యత, దానిలో సెమికండక్టర్ల గురించి ప్రధాని కాగానే లేదా అంతకు ముందు గుజరాత్‌ సిఎంగా ఎందుకు పసిగట్టలేకపోయినట్లు ? ఈ రంగానికి నిధుల కేటాయింపు కేంద్ర ప్రభుత్వం లేదా ప్రైవేటు సంస్థలు చేయాల్సి ఉంది. రెండూ జరగటం లేదు. ముంబై కేంద్రంగా పని చేస్తున్న గేట్‌వే హౌస్‌ అనే ఒక మేథో సంస్థ 2015 జనవరి పదహారున టెక్నాలజీ పరుగులో చైనా ముందు భారత్‌ ఓడిపోనుందా అనే శీర్షికతో ఒక విశ్లేషణను ప్రచురించింది. మీ సలహాదారులకు దీని గురించి తెలియదని అనుకోలేము.లేదా ఇలాంటి వాటిని పట్టించుకోకపోతే మన దేశ ఖర్మ అనుకోవటం తప్ప చేసేదేమీ లేదు. దానిలో పరిశోధన, అభివృద్ది ఖర్చు గురించి చర్చించారు. 1991 నుంచి చైనా పరిశోధన ఖర్చును ఏటా 19శాతం పెంచుతూ 2012నాటికి జిడిపిలో 1.97శాతానికి చేరినట్లు పేర్కొన్నారు.అప్పటికి మనదేశ ఖర్చు 0.9శాతం మాత్రమే ఉంది.ఫస్ట్‌ పోస్ట్‌ అనే పత్రికలో 2023 ఫిబ్రవరి ఒకటిన ప్రచురితమైన ఒక విశ్లేషణలో జిడిపిలో మనదేశ తాజా ఖర్చు 0.7శాతమే అని చైనా 2.1శాతంగా పేర్కొన్నారు. జిడిపిలో రెండు శాతం ఖర్చు చేయాలని గతంలో వాజ్‌పాయి సర్కార్‌ కూడా చెప్పింది. దూరదృష్టి గల మీ పాలనలో గతం కంటే తగ్గిందేమిటి ? మన దేశంలో నిపుణులకు, పరిశోధకులకు కొరత ఉన్నదా ?


కుహనా అంశాలమీద పరిశోధనకు మీరు చూపుతున్న శ్రద్ధ సెమికండక్టర్స్‌ వంటి ప్రాధాన్యరంగాల మీద లేదు, ఆవు పేడ, మూత్రం, పాలలో బంగారం ఉందా, ఇంకా ఏమైనా ఉన్నాయా అంటూ పరిశోధనలకు ప్రజాధనాన్ని ప్రభుత్వం వృధా చేస్తున్నదని 2020 సంవత్సరంలో వందలాది మంది శాస్త్రవేత్తలు ప్రభుత్వతీరుతెన్నులను తప్పు పడుతూ ఆ పరిశోధనలను ఆపివేయాలని కోరినా మీరు పట్టించుకోలేదు. అంతకు ముందు 2017లో పంచగవ్య గురించి ఆయుర్వేద పుస్తకాల్లో రాసిన వాటిని రుజువు చేసేందుకు పరిశోధనలు చేసేందుకు ప్రభుత్వం పూనుకుంది. మొత్తంగా పరిశోధనలకు తగినన్ని నిధులు కేటాయించకుండా ముందుకు పోవటానికి మీ దగ్గర మంత్రదండమేదైనా ఉంటే హాం ఫట్‌ అంటూ తిప్పండి.ప్రతి లక్ష మంది జనాభాకు ఇజ్రాయెల్‌లో 834, దక్షిణ కొరియా 749,అమెరికాలో 441, చైనాలో 130 మంది పరిశోధకులు ఉండగా మనదేశంలో కేవలం 25 మంది మాత్రమే ఉన్నారని చెప్పటం మీకు ఇష్టముండదని తెలిసినా తప్పటం లేదు.


తినేందుకు బంగాళాదుంప, అరటి చిప్స్‌ లేకున్నా రోజు గడుస్తుందిగానీ ఎలక్ట్రానిక్స్‌ చిప్స్‌ లేకుండా మనకు క్షణం గడవదంటే అతిశయోక్తి కాదు.ప్రపంచంలో నిపుణులైన సెమికండక్టర్‌ రూపకల్పన ఇంజనీర్లు ప్రపంచం మొత్తంలో ఉన్నవారిలో 20శాతం మంది మనదేశంలో ఉన్నారని అంచనా. వారందరినీ విదేశీ కంపెనీలకు చౌక శ్రామికులుగా సమర్పించటం తప్ప ఇప్పుడు జరుగుతున్నదేమైనా ఉందా ? వారు సాధించే పేటెంట్స్‌ మన దేశానికి దక్కవు. మన ఇంజనీర్లు ఐటి రంగంలో ముందున్నారు. దీనికి మీ సర్కార్‌ ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. హార్డ్‌వేర్‌ రంగంలో ఆ స్థితి లేదు. ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువ భాగం మనం దిగుమతి చేసుకుంటున్నార. అదే విధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలతో విదేశీ కంపెనీలు రూపకల్పనలో లబ్ది పొందటం తప్ప చిప్స్‌ తయారీ మన దేశంలో ఎంతమేరకు జరుగుతుందన్నది ప్రశ్నార్ధకమే. ప్రస్తుతం అమెరికా మైక్రాన్‌ కంపెనీ ఎక్కడో ఉత్పత్తి చేసిన వాటిని మనదేశంలో పరీక్షించి పాకింగ్‌ చేయిస్తున్నది. దానితోనే పండగ చేసుకుందామా ?


చైనా మీద అమెరికా ప్రారంభించిన టెక్నాలజీ పోరులో ఎవరికి నష్టం ఎవరికి లాభం అన్న చర్చ జరుగుతోంది.తమ దేశంలోనే సెమీ కండక్టర్లను ఉత్పత్తి చేయాలని, అక్కడి నుంచి ఎగుమతులు జరపాలని అమెరికా సర్కార్‌ పట్టుబడుతోంది. తైవాన్‌లోని టిఎస్‌ఎంసి కంపెనీ ఉత్పత్తి మీద అదుపు కలిగి ఉంది.1990లో ప్రపంచ సెమీకండక్టర్ల ఉత్పతిలో అమెరికా వాటా 37శాతం ఉంటే 2020లో 12శాతానికి తగ్గింది. తిరిగి పూర్వపు స్థితికి చేరాలంటూ కొత్త పరిశ్రమలకు ఇచ్చేందుకు 280 బిలియన్‌ డాలర్లను అమెరికా కేటాయించింది.ఈ మొత్తానికి స్థానిక ప్రభుత్వాలు ఇచ్చేది అదనం. ఇప్పటి వరకు అమెరికా, ఐరోపా సమాఖ్య, జపాన్‌ సెమీకండక్టర్ల తయారీ కంపెనీలను ఆకర్షించేందుకు సబ్సిడీల నిమిత్తం పదివేల కోట్ల డాలర్లు పక్కన పెడుతున్నట్లు ప్రకటించాయి. ఇంటెల్‌ కంపెనీ జర్మనీలో 30బిలియన్‌ యూరోల ప్లాంట్‌ పెట్టాలంటే మూడో వంతు తమకు సబ్సిడీ ఇవ్వాలని బేరమాడింది.పోలాండ్‌, జర్మనీ, ఇజ్రాయెల్లో కొత్త ప్లాంటులు పెట్టేందుకు 50బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఇంటెల్‌ పేర్కొన్నది. మొత్తం మీద చూస్తే ఈ రంగంలో ముందున్న కంపెనీలు పెద్ద ఎత్తున లబ్దిపొందనున్నాయి. ఈ పోరులో మనదేశం ఎక్కడ అన్నది ప్రశ్నార్ధకమే.


గత పది సంవత్సరాలుగా ఈ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశారు. దీనికి కూడా నెహ్రూ, కాంగ్రెసే కారణం అని మీ మద్దతుదార్లు చెప్పినా ఆశ్చర్యంలేదు. అమెరికా వాణిజ్య మంత్రి గినా రైమండోతో మన మంత్రి పియూష్‌ గోయల్‌ 2023 మార్చి పదవ తేదీన సెమీకండక్టర్ల సరఫరా, నూతన ఆవిష్కరణల భాగస్వామ్యం గురించి ఒక ఒప్పందం చేసుకున్నారు. అంతకు ముందు జనవరిలో సంక్లిష్టమైన, వర్ధమాన సాంకేతికతల (ఐసిఇటి) సహకారం గురించి ఒప్పందం జరిగింది. చిత్రం ఏమంటే అధ్యక్ష కార్యాలయం వెల్లడించిన వాస్తవాల పత్రంలో మిగతా అంశాల గురించి ఉంది తప్ప సెమీకండక్టర్ల మీద నిర్దిష్టంగా ఏమీ లేదు అని కార్నెగీ ఇండియా వెబ్‌సైట్‌లో 2023 మే నెల 23వ తేదీన కోణార్క భండారీ రాశారు. మన దగ్గర దానికి భిన్నమైన సమాచారం ఉంటే ఆ పత్రాన్ని విడుదల చేస్తే వాస్తవం తెలుస్తుంది. మనదేశంలో ఉత్పత్తి చేసి ఎగుమతి చేసే వాటిని ప్రోత్సహించేందుకు ఉత్పాదకతతో ముడివడిన ప్రోత్సాహక(పిఎల్‌ఐ) పధకాన్ని 2021 నుంచి ఐదేండ్లలో రు.1.97లక్షల కోట్లు ఇచ్చే ప్రవేశపెట్టారు. కానీ దాన్ని ఆచరణలో ఉత్పత్తి బదులు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలను ఒక దగ్గర చేర్చే సెల్‌ఫోన్లకు, చిప్స్‌ పరీక్షలకు ఇస్తున్నారు. అందుకే భలే మంచి పధకం, వదలితే దొరకదని పొలోమంటూ ఆపిల్‌, మైక్రాన్‌ వంటి కంపెనీలు మన దేశానికి వస్తున్నాయి.


రెండు దిగ్గజదేశాలైన అమెరికా, చైనా సెమీకండక్టర్ల రంగంలో పైచేయి సాధించేందుకు భారీ సబ్సిడీలతో పోటీ పడుతున్నాయి. అదే సమయంలో చైనా తన స్వంత రూపకల్పన, ఉత్పత్తికి గాను భారీ మొత్తంలో పరిశోధనకు నిధులు వెచ్చిస్తున్నది. మనదేశంలో ఒక సమగ్ర విధానాన్ని కూడా ఇప్పటికీ రూపొందించుకోలేకపోయాము.అలూ లేదూ చూలూ లేదు అన్నట్లుగా ఉంటే మన దేశాన్ని సెమీకండక్టర్‌ హబ్‌గా మారుస్తానని మీరు చెబుతున్నారు. వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ తాజా(2023) సమాచారం ప్రకారం సెమీకండక్టర్ల ఉత్పత్తిలో తైవాన్‌, దక్షిణ కొరియా, జపాన్‌, చైనా, అమెరికా తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఫాబ్రికేషన్‌లో 2022 డిసెంబరు నాటికి జపాన్‌లో 102, తైవాన్‌ 77, అమెరికా 76, చైనా 70, జర్మనీ 20, బ్రిటన్‌ 12, మలేషియా 7 ప్లాంట్లను కలిగి ఉన్నాయి. తరువాత స్థానాల్లో ఇజ్రాయెల్‌, నెదర్లాండ్స్‌ ఉన్నాయి. గుజరాత్‌లో 70శాతం సబ్సిడీ ఇచ్చి అమెరికా మైక్రాన్‌ కంపెనీతో ఒక పాకింగ్‌ కేంద్రాన్ని పెట్టించి దీంతో ప్రపంచ హబ్‌గా మారుస్తానని మీరు జనాలకు చెబుతున్నారు. ఇది ఎంతకాలం నడుస్తుంది ? అమెరికా మనలను తన సహజ భాగస్వామిగా పరిగణిస్తున్నదని, పిలిచి పెద్ద పీటవేస్తున్నదని చెబుతున్నారు. గతేడాది (2022) మార్చి నెలలో తొలిసారిగా అమెరికా చొరవతో చిప్స్‌ 4 లేదా ఫాబ్‌ 4 కూటమి ఏర్పడింది. దానిలో తైవాన్‌(చైనా తిరుగుబాటు రాష్ట్రం), జపాన్‌, దక్షిణ కొరియా ఇతర భాగస్వాములు తప్ప మనకు చోటు లేదు. ప్రపంచ సెమీకండక్టర్ల పరిశ్రమలో 70శాతం వాటా ఈ నాలుగు దేశాలదే. విధాన రూపకల్పన, ఉత్పత్తిలో పరస్పరం సహకరించుకొనేందుకు, విస్తరణకు దీన్ని ఏర్పాటు చేశారు.


గత తొమ్మిది సంవత్సరాల్లో దేశ అప్పును విపరీతంగా పెంచివేశారు. 2023 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు మొత్తం రు.152,61,122 కోట్ల 12లక్షలకు చేరుతుందని, అది 2024 మార్చి 31కి రు.169,46,666 కోట్ల 85లక్షల కోట్లకు చేరుతుందని నిర్మలమ్మగారి బడ్జెట్‌ పత్రాల్లో ఉంది.కాగ్‌ ఖరారు చేసిన గణాంకాల ప్రకారం 2014 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు రు.50,68,235 కోట్లు కాగా 2015 మార్చి నాటికి అంటే తొలి ఏడాది దాన్ని రు.56,07,315 కోట్లకు తరువాత మీరు దాన్ని ఎడాపెడా పెంచారు.కేవలం మీరు చేసిన అప్పు 2024 మార్చి నాటికి 118,78,431కోట్లకు పెంచుతామని ప్రతిపాదించారు.మీరు అధికారానికి వచ్చినపుడు కేంద్ర ప్రభుత్వ రుణం జిడిపిలో 67.1 శాతం కాగా 2021లో 88.5 శాతానికి పెరిగింది, 2023 నాటికి అది 83.1శాతంగా ఉంది. ఇంత చేసిన వారు పరిశోధనకు పెంచకపోగా ఎందుకు తగ్గించిందీ ఏదైనా ఒక మన్‌కీ బాత్‌లో చెబితే సంతోషం. ఆవు పేడ పరిశోధన నిధులు సెమీ కండక్టర్లకు మళ్లించండి, సబ్సిడీలతో పాటు పరిశోధనలకూ నిధులు ఇవ్వండి. ఇప్పటికి ఇంతటితో ముగిస్తున్నా.
తోటి భారతీయుడు
ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More
Like Loading...

మేడిపండు చూడ మేలిమై ఉండు…. మోడీ ఏలుబడిలో దేశ ప్రతిష్ట పెరిగిందా ? తరిగిందా ?

24 Saturday Jun 2023

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, USA

≈ Leave a comment

Tags

BJP, India press freedom, India’s prestige, Joe Biden, Narendra Modi, Narendra Modi Failures, Narendra Modi marketing


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజు అమెరికా పర్యటన తరువాత ఈజిప్టు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత ఏమి సాధించారో మోడీ మాటల్లో విన్న తరువాత వాటి మంచి చెడ్డల గురించి చూద్దాం. ఏదేశమేగినా ఎందుకాలిడినా మోడీ వెంట మన బడా కొర్పొరేట్‌ పెద్దలు పొలోమంటూ వెళతారు. వెళ్లిన చోట అక్కడి బడా సంస్థల వారితో కొలువు తీరతారు, ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వాటితో మన 140 కోట్ల జనానికి కలిగే లబ్ది ఎంత ? వేళ్ల మీద లెక్కించగలిగిన బడా పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు కలిగే లాభం ఏమిటి అన్నదాన్ని బట్టే టూరు ఎందుకో అవగతం అవుతుంది. గత తొమ్మిది సంవత్సరాలుగా జరిపిన అన్ని విదేశీ టూర్లను ఈ ప్రాతిపదికగానే చూడాల్సి ఉంది. గతంలో పదేండ్లు ప్రధానిగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌, ఇతర ప్రధానులు కూడా విదేశాలకు వెళ్లారు. మోడీ మాదిరి పొగడ్తలు, బిరుదులు, ఆహా ఓహౌలను వెంట తీసుకురాలేదన్నది నిజం. ఎవరినైనా కౌగలించుకొనే చొరవ అందరికీ ఉంటుందా ? ప్రపంచంలో నాడున్న పరిస్థితి, అంతర్జాతీయ రాజకీయాలు, వాటిలో భారత నేతలను మునగచెట్టు ఎక్కిస్తే తమకెంత లాభం అన్నదాన్ని బట్టి పొగడ్తలు ఉంటాయి. ఇక్కడ ఒక అంశం చెప్పుకోవాలి. గత ప్రధానులను విదేశాల్లో పొగడనంత మాత్రాన మన జనానికి కలిగిన నష్టం లేదు-మోడీని పొగిడినదానికి వచ్చిన లాభమూ లేదు. విదేశాల్లో మోడీ పొందిన బహుమతులను వేలం వేస్తే ఖజనాకు నాలుగు డబ్బులు వస్తాయి. పొగడ్తలను కొనుగోలు చేసే వారెవరూ ఉండరు. వాటిని చూపి ప్రపంచంలో మోడీ హయాంలో దేశ ప్రతిష్ట విపరీతంగా పెరిగిందని బిజెపి నేతలు, మోడీ సర్కార్‌తో అవసరం ఉన్నవారందరూ ఆకాశానికి ఎత్తుతున్నారు. అమెరికా, ఈజిప్టు టూర్‌లో ఇంకెన్ని తీసుకువస్తారో చూడాల్సి ఉంది. రాహుల్‌ గాంధీ బ్రిటన్‌, అమెరికా వెళ్లి మన ప్రభుత్వ విధానాలను విమర్శించి దేశ ప్రతిష్టకు మచ్చ తెచ్చారని బిజెపి నానా రచ్చ చేసింది. మోడీ వెళ్లిన చోట కూడా మన అంతర్గత విధానాలు, వైఖరి గురించి రచ్చ జరుగుతూనే ఉంది. అమెరికాలో కూడా జరిగింది. దాన్ని దేశానికి గౌరవాన్ని తెచ్చినట్లు ఎవరైనా వర్ణిస్తారా ?


గత తొమ్మిది సంవత్సరాలలో మోడీ విదేశాల్లో మన ప్రతిష్టను పెంచారా తగ్గించారా అన్నది ఒక చర్చ. అమెరికాలోని ప్రముఖ పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌ తాజాగా అమెరికా వెళ్లిన మన ప్రధాని గురించి మన టీవీల తీరు తెన్నుల మీద రాసిన కొన్ని అంశాలను చూద్దాం. ” అమెరికాలో అడుగుపెట్టిన బాస్‌, దౌత్య రారాజు, చరిత్ర సృష్టిస్తున్నారు చూడండి, దౌత్యంలో మోడీ వినూత్న పరిణామం ” ఇలా టీవీల శీర్షికలున్నాయి. జో బైడెన్‌, నరేంద్రమోడీ కరచాలనం చేస్తున్న దృశ్యంలో వారి హావ భావాలను చూస్తే ఒకరికొకరు లేకపోతే అసంపూర్ణం అన్నట్లుగా ఉందని ఒక యాంకర్‌ వర్ణించారట.( గతంలో మోడీ-డోనాల్డ్‌ ట్రంప్‌ కౌగిలింతలు, చెట్టపట్టాలు వేసుకు తిరిగినపుడు కూడా చాలా మందికి వారు అలానే కనిపించారు. మోడీ, బైడెన్‌, ట్రంప్‌ మహానటులు అనటంలో సందేహం లేదు) ఎంతో యుక్తితో జాగ్రత్తగా సంప్రదాయ వార్తా సంస్థలతో సంబంధాలను మోడీ ఏర్పాటు చేసుకున్నారు. ప్రోత్సాహకాలు, వత్తిడి ఎత్తుగడల సమ్మిళితంతో ఎక్కువ సంస్థలను తనవైపు ఉండేట్లు చేసుకున్నారు.ఇబ్బందికరమైన సమస్యలు తలెత్తినపుడు అంటే ఒక రాష్ట్రంలో ఎన్నికల్లో ఓటమి, ఈశాన్య రాష్ట్రంలో తెగల మధ్య తలెత్తిన పోరులో రక్తపాతం, అశాంతి, ప్రాణాంతకమైన మూడు రైళ్ల ఢ వంటి వాటితో మోడీకేమీ సంబంధం లేదని తప్పుదారి పట్టించటంలో అవి వేగంగా ఉంటాయి. మోడీ అమెరికా టూరు గురించి వార్తలు ఇచ్చిన తీరు ఒక వరం. వచ్చే ఏడాది జరగాల్సిన పార్లమెంటు ఎన్నికల్లో తన ప్రచారాన్ని ప్రారంభించేందుకు అవసరమైన అజెండాను రూపొందించేందుకు తోడ్పడుతుంది అని కూడా ఆ పత్రిక రాసింది. దీన్ని బట్టి జరుగుతున్నదేమిటో చెప్పేందుకు అరటి పండు ఒలిచి చేతుల్లో పెట్టాల్సిన పనిలేదు. కొస మెరుపు ఏమిటంటే బైడెన్‌తో కలసి మోడీ పాల్గొన్న పత్రికా గోష్టిలో భారత్‌లో మానవహక్కుల ఉల్లంఘనల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని దాటవేశారు. దాన్నే ఎంతో ధైర్యంగా ఆప్రశ్నను మోడీ ఎదుర్కొన్నట్లు ఒక హిందీ ఛానల్‌ యాంకరమ్మ వర్ణించినట్లు కూడా అమెరికా పత్రిక పేర్కొన్నది. రాజులు, రంగప్పల ఆస్థానాల్లో ఉన్న భట్రాజులు(కుల ప్రస్తావన, కించపరచటంగా భావించవద్దని మనవి) స్వర్గం నుంచి చూస్తూ తమ స్థానాన్ని ప్రజాస్వామ్యంలో కొందరు టీవీ యాంకర్లు, విశ్లేషకులు భర్తీ చేశారని భావిస్తూ తమ పొగడ్తలతో పోల్చుకొని ఉండాలి.


గతంలో వారం రోజుల పాటు జరిపిన అమెరికా టూర్‌ నుంచి తిరిగి వచ్చిన తరువాత ప్రధాని నరేంద్రమోడీ తన పాలనలో విదేశాల్లో దేశ ప్రతిష్ట పెద్ద ఎత్తున పెరిగిందని స్వయంగా చెప్పుకున్నారు. అప్పుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలో ఉన్నాడు, ఇప్పుడు జో బైడెన్‌ ఉన్నాడు. తాజా పర్యటన గురించి ఇంకెన్ని కబుర్లు చెబుతారో చూద్దాం. అమెరికా పార్లమెంటులో మోడీ ప్రసంగంలో 79సార్లు హర్వధ్వానాలు చేశారని, 15సార్లు లేచి నిలిచి చప్పట్లు కొట్టారని, ప్రసంగం ముగిసిన వెంటనే ఎంపీలు మోడీతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడినట్లు వార్తలు, దృశ్యాలను చూపారు. భారత సంతతివారు పోటెత్తినట్లు పేర్కొన్నారు.


లండన్‌ కేంద్రంగా ఉన్న హెన్లే పాస్‌ పోర్ట్‌ విశ్లేషణ ప్రకారం 2013లో మన సూచిక 199 దేశాలలో 74లో ఉండగా (52 దేశాలకు ముందుగా వీసాలతో పని లేకుండా వెళ్లి రావచ్చు) అది 2021లో 90కి దిగజారింది. ఆ మధ్యలో ఎగుడు దిగుడులు ఉన్నాయి. ఒక దేశ పాస్‌ పోర్టుతో వీసాలతో నిమిత్తం లేకుండా ఎన్ని దేశాలకు స్వేచ్చగా వెళ్లి రావచ్చు అనేదాన్ని బట్టి ఆ దేశ ప్రతిష్టకు కొలబద్దగా ఈ సూచికను పరిగణిస్తున్నారు. కరోనా కారణంగా అనేక దేశాలు రాకపోకల మీద ఆంక్షలు విధించినందున 2020,21 సంవత్సరాలను ప్రామాణికంగా తీసుకోనవసరం లేదు. 2023లో మన దేశం ఈ సూచికలో 82వ స్థానంలో ఉంది, 59 దేశాలకు స్వేచ్చగా వెళ్లి రావచ్చు. పెరుగుదల ఏడు దేశాలు మాత్రమే. ఇదే పెద్ద గొప్ప అంటారా? ప్రపంచంలో మన దేశ ప్రతిష్ట పెరిగితే నరేంద్రమోడీ అధికారానికి వచ్చినపుడు ఉన్న స్థానం కంటే ఇప్పుడు ఎందుకు దిగజారినట్లో మోడీ భక్తులు చెప్పాలి. ఈ కాలంలోనే ప్రపంచంలో ఒంటరిదౌతున్నదని చెబుతున్న చైనా రాంకు 82 నుంచి 62కు పెరిగింది. దేశాల సంఖ్య 81గా ఉంది. ఎవరి పలుకుబడి పెరిగినట్లు ? మొదటి మూడు స్థానాల్లో సింగపూర్‌ 194, జపాన్‌ 192,జర్మనీ, దక్షిణ కొరియా,స్పెయిన్‌,ఇటలీ 191 దేశాలతో మూడవ స్థానంలో ఉన్నాయి. మనకు ఎగువన 140కిపైగా దేశాలు మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. ఇతర అంతర్జాతీయ సూచికల్లో మన స్థానం గురించి వార్తలు వచ్చినపుడు వాటిని మేము గుర్తించం అని బిజెపి సర్కార్‌ చెబుతున్నది. మరి మోడీ దేశ ప్రతిష్టను పెంచినట్లు బిజెపి నేతలు చెప్పేదానికి ప్రాతిపదిక ఏమిటి ? కరోనా నిరోధంలో మోడీ సర్కార్‌ ప్రపంచంలోనే గొప్పగా ప్రశంసలు పొందిందని చెప్పారు, అలాంటపుడు దాని తరువాత వీసా ఆంక్షలను ఇతర దేశాలు మన వారికి ఎందుకు సడలించలేదు ? ఏ దేశమూ వేయనన్ని వాక్సిన్లు వేసినట్లు చెప్పుకుంటారు. ఇంత మంది జనాభా మరో దేశంలో లేదు. మన దేశంలో ఈ ఏడాది జనవరి నాటికి 220 కోట్ల టీకాలు వేస్తే చైనాలో మార్చి 23వ తేదీ నాటికి 351 కోట్లు వేశారు.


ఎన్నికల ప్రజాస్వామ్య సూచికలో మన దేశం అంతకు ముందు ఏడాది వందవ స్థానంలో ఉన్నది కాస్తా 2023లో 108వ స్థానానికి దిగజారినట్లు వి డెమ్‌ (ప్రజాస్వామ్య రకాలు) సంస్థ పేర్కొన్నది.మన కాషాయ దళాలు నిరంతరం పారాయణం చేస్తూ గుర్తు చేసే పాకిస్తాన్‌ మనకు దగ్గరగా 110వదిగా ఉంది. ఎగువన లేకపోవటం మోడీ భక్తులకు కాస్త ఊరట కలిగించే అంశం. నిరంకుశత్వం వైపు వెళుతున్న దేశాల గురించి కూడా ఆ సంస్థ సూచికలను ఇచ్చింది. ప్రపంచ ప్రజాస్వామ్య స్థితి నివేదికల్లో వెల్లడించిన సమాచారం ప్రకారం 1975 నుంచి 1995వరకు మన మార్కులు 59 నుంచి 69కి పెరగ్గా, 2015లో 72, తరువాత 2020లో 61కు తగ్గాయి. ఇలా ఏ సూచికను చూసినా తగ్గుదల తప్ప పెరిగింది లేదు. అలాంటపుడు ప్రపంచ దేశాల్లో మన ప్రతిష్ట పెరుగుతుందని ఎలా నమ్మబలుకుతున్నారో అర్ధం కాదు. సరిహద్దులు లేని విలేకర్ల పేరుతో ఉన్న సంస్థ విడుదల చేసిన సూచిక ప్రకారం పత్రికా స్వేచ్చలో మన స్థానం 2023లో అంతకు ముందున్న స్థితి నుంచి పదకొండు స్థానాలు దిగజారి 180 దేశాలలో 161 దగ్గర ఉన్నాం. మన దేశం ప్రజాస్వామ్య పుట్టిల్లు అని చెప్పిన తరువాత ఉన్న స్థితి ఇది. 2002లో 139 దేశాల్లో 80 మెట్టు దగ్గర ఉంటే 2023నాటికి 81 మెట్లు దిగజారి 180 దేశాల్లో 161 దగ్గర ఉన్నాం. ప్రధాని నరేంద్రమోడీ గద్దె నెక్కినపుడు 140లో ఉన్నాం. తొమ్మిదేండ్లలో మన ప్రతిష్టను మోడీ పెంచారా తగ్గించారా ?


నరేంద్రమోడీ పలుకుబడి అంతగా పెరిగితే పదే పదే ఐరాస సంస్కరణల గురించి చెబుతుంటే విడదీయరాని బంధంలో ఉన్నట్లు చెబుతున్న అమెరికా, ఇతర శాశ్వత దేశాలు భారత్‌కు శాశ్వత ప్రాతినిధ్యం గురించి ఇంతవరకు ఒక నిర్దిష్ట ప్రతిపాదనను ఎందుకు చేయలేదో ఎవరైనా చెబుతారా ? చైనా వీటో చేస్తుందేమో అని కొందరు గొణగవచ్చు, ముందు ప్రతిపాదించాలి గదా ! చైనా మీద ప్రేమతో జవహర్‌లాల్‌ నెహ్రూ మనకు అవకాశం వచ్చినపుడు వదులుకున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.స్వాతంత్య్రం రాకముందే ఐరాస ఏర్పడిందని, ప్రారంభంలోనే చైనా శాశ్వత దేశమని చరిత్ర తెలియని వారికి ఎన్నిసార్లు చెప్పినా అర్ధం కాదు. ఒక దేశాన్ని తొలగించి తాను ఎవరికి కావాలంటే వారికి ఇవ్వటానికి ఐరాస ఏమైనా అమెరికా జేబు సంస్థా ? దానికి నిర్ణయాత్మక సత్తా, అధికారం ఉంటే ఇప్పుడు ఇమ్మనండి ఎవరు వద్దన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే వారి మీద ఆంక్షలు విధిస్తామని అమెరికా బెదరించింది. మోడీ పలుకుబడి కారణంగా వెనక్కు తగ్గిందని చెబుతున్నారు, మరి అదే పలుబడి, చాణక్యం భద్రతా మండలి అంశంలో ఏమైంది ? పుతిన్‌ దగ్గర నుంచి చమురు కొని దాన్ని డీజిల్‌, పెట్రోలు, ఇతర ఉత్పత్తులుగా మార్చి అదే అమెరికా, ఐరోపా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు గనుక అమెరికా చూసీ చూడనట్లు ఉంటోంది తప్ప మోడీ ఘనత ఏముంది ?


అట్లాంటిక్‌ కౌన్సిల్‌ అనే సంస్థ జరిపిన ఒక సర్వేలో 2033 వరకు అసలు భద్రతా మండలి విస్తరణే ఉండదని 64శాతం మంది చెప్పారు. శాశ్వత సభ్యత్వం భారత్‌కు ఇవ్వాలని 26, జపాన్‌కు 11,బ్రెజిల్‌కు 9, జర్మనీకి 7,నైజీరియాకు 4, దక్షిణాఫ్రికాకు రెండు శాతం మంది మద్దతు తెలిపారు. విస్తరణ అంశం నరేంద్రమోడీతో ప్రారంభం కాలేదు, స్వస్తి పలికే అవకాశమూ లేదు.1990 దశకం నుంచే విస్తరణను అడ్డుకోవాలని కొన్ని దేశాలూ కంకణం కట్టుకున్నాయి. దీన్ని కాఫీ క్లబ్‌ అని నిక్‌నేమ్‌ పెట్టారు. దీన్లో ఇటలీ, ఈజిప్టు, పాకిస్తాన్‌, మెక్సికో, కెనడా, టర్కీ, స్పెయిన్‌, అర్జెంటీనా తదితర దేశాలు ఉన్నాయి. ఏకాభిప్రాయ సాధనతో ఏదైనా జరగాలని ఇవి మోకాలడ్డుతున్నాయి. ఈ పూర్వరంగంలో బ్రెజిల్‌, జర్మనీ, భారత్‌, జపాన్‌ 2005లో జి 4 కూటమిగా ఏర్పడి ఉమ్మడిగా మద్దతు సాధించాలని నిర్ణయించుకున్నాయి. ఈ బృందంలో భారత్‌కు మద్దతు ఇస్తాం గానీ జపాన్ను అంగీకరించేది లేదని గతంలోనే చైనా స్పష్టం చేసింది. ఇప్పుడు సంబంధాలు దెబ్బతిన్న పూర్వరంగంలో పూర్వ వైఖరికి కట్టుబడి ఉంటుందని చెప్పలేము. మొత్తంగా చెప్పాలంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నట్లుగా నరేంద్రమోడీ రంగంలోకి వచ్చిన తరువాత ఒక్క అంగుళం కూడా ముందుకు పోలేదు. విశ్వగురువు పలుకుబడి పని చేయటం లేదన్నది స్పష్టం.


మోడీ ఏలుబడిలో ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ విమానవాహక యుద్ధ నౌకను ప్రారంభించారని గొప్పగా చెబుతారు. దాని చరిత్రను చూసిన వారెవరూ ఆ ఖ్యాతిని మోడీ ఖాతాలో వేయరు. నౌక రూపకల్పన 1999లో ప్రారంభమై 2022 నాటికి సర్వీసులోకి వచ్చింది. అగ్ని 5 క్షిపణి, ఇస్రో కూడా అలాంటిదే.ఎప్పటి నుంచో ఉన్న కార్యక్రమం అది. వీటి వలన ప్రపంచంలో మన దేశం కూడా అగ్రదేశాల సరసన చేరిందనే పేరు తెచ్చుకుంది. గత ప్రభుత్వాల కొనసాగింపుగా మోడీ సర్కార్‌ కూడా ఈ పధకాలను కొనసాగిస్తున్నది తప్ప మోడీతోనే ప్రారంభమైనట్లు చెప్పుకుంటే ఎలా ? ఇలాంటి వాటిని ఏ దేశమూ స్వల్పకాలంలో సాధించలేదు. కానీ పత్రికా స్వేచ్చ, ప్రజాస్వామ్యం,ఆకలి వంటి అంశాలను మెరుగుపరచేందుకు దశాబ్దాల కాలం అవసరం లేదు. మరి వాటిలో పురోగతి లేకపోగా దేశద్రోహం వంటి చట్టాలు కొనసాగాలని చెబుతుంటే, పరిస్థితులు ఇంకా దిగుజారుతుంటే విదేశాల్లో మన ప్రతిష్ట పెరుగుతుందా ? విదేశాల వారు మరీ అంత అమాయకులా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

తమిళ తంబిల ఓట్ల కోసం రాజదండం సరే, కిరీటం, పట్టపు రాణి, రాజ గురువు, రాజ నర్తకి… సంప్రదాయాల సంగతేమిటి !

31 Wednesday May 2023

Posted by raomk in BJP, Communalism, Congress, COUNTRIES, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

Amith shah, BJP, Dharma Danda, Jawaharlal Nehru, Narendra Modi, Narendra Modi Failures, Raja Danda, RSS, Sengol, vd savarkar


ఎం కోటేశ్వరరావు


వివాదాస్పద అంశాలను ముందుకు తేవటం ప్రతిపక్షాలను, జనాన్ని వాటి చుట్టూ తిప్పటంలో కొంత మంది సిద్దహస్తులు. వారిలో నరేంద్రమోడీకి సాటి రాగల వారెవరూ కనిపించటం లేదు. గతాన్ని కాసేపు పక్కన పెడితే నూతన పార్లమెంటు భవన ప్రారంభాన్ని ప్రధమ పౌరురాలు, రాజ్యాంగ అధిపతిగా ఉన్న రాష్ట్రపతి పదవిని అగౌరవపరచి, ఆ పదివిలో ఉన్న ద్రౌపది ముర్మును విస్మరించి తానే ప్రారంభించి చర్చకు తెరలేపారు. అదే విధంగా రాజ్యాంగం. అధికారంతో సంబంధంలేని ఒక రాజ దండాన్ని ముందుకు తెచ్చి మరో పనిలేని చర్చను ముందుకు తెచ్చారు. పురాతన సంప్రదాయాలకు ప్రాణ ప్రతిష్ట చేయాలనే నాన్నగారి తాతగారి భావాలకు దాసులైన వారికి వెనుక చూపు తప్ప వర్తమానం, ముందు చూపు ఉండదు. అలాంటి వారు కుహనా గతాన్ని అమలు జరపాలని చూస్తారు. లేని చరిత్రను, ఉదంతాలను సృష్టించటంలో, చిన్న వాటిని బూతద్దంలో చూపటంలోనూ పేరు మోసిన మన వాట్సాప్‌ విశ్వవిద్యాలయం స్వర్గంలో ఉన్న గోబెల్స్‌కు సదరు అంశాలపై తమకు మార్గదర్శకుడిగా ఉన్నందుకు గౌరవడాక్టరేట్‌ ప్రదానం చేసిందట.


ఫలానా చోట ఫలానా ఉదంతం జరిగింది. మీడియాలో మొత్తం హిందూ వ్యతిరేకులే ఉన్నందున ఏ టీవీ, పత్రికలోనూ రాలేదు, రాదు. కనుక మీరు దీనిని అందరికీ పంపించండి అన్న తప్పుడు వర్తమానం ఒక్కటైనా వాట్సాప్‌ను వాడే ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు అందే ఉంటుంది. పెద్దలు చెప్పిన ఒక హితవును కాషాయ దళాలు పక్కాగా పాటిస్తున్నాయి . అదేమంటే ఒక అబద్దం చెబితే గోడ కట్టినట్లు ఉండాలి తప్ప తడికలా ఉండకూడదు. ప్రాణ, విత్త, మాన భంగములందు అబద్దం చెప్పవచ్చనే మినహాయింపు ఇచ్చారు మన పెద్దలు. దీనీలో ఎన్నికలను కూడా చేర్చి పచ్చి అబద్దాలు చెబుతున్నారు. వీటిని చూసి, విని గోబెల్స్‌ కూడా సిగ్గుపడుతున్నట్లు సమాచారం. తాజాగా దేశమంతటా పెద్ద చర్చ జరిగిన, పార్లమెంటులో ప్రతిష్టించిన రాజదండం గురించి కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా తడిక కథ చెప్పారు. దేవుడు ప్రసాదం తినడని పూజారికి మాత్రమే తెలుసు. అదే మాదిరి నరేంద్రమోడీకి రాజకీయ ఇబ్బందులు వస్తున్నట్లు అమిత్‌షాకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. ఆడిన మాట తప్పని తెగకు చెందినవారం అని చెప్పుకుంటారు గనుక చెప్పింది వాస్తవం కాదు అని తేలిన తరువాత కూడా తన ప్రకటనను వెనక్కు తీసుకోలేదు, సవరించుకోలేదు. చరిత్రలో అత్యంత దుర్మార్గమైన రెండవ ప్రపంచ యుద్ధం తప్పుడు ప్రచారంతోనే నాజీలు ప్రారంభించారు. అదేమిటంటే జర్మనీ రేడియో ట్రాన్స్‌మిటర్‌ మీద పోలాండ్‌ చేసిన దాడికి ప్రతీకారం పేరుతో హిట్లర్‌ మూకలు పోలాండ్‌ మీద టాంకులతో దాడికి దిగాయి. ఒక ట్రాన్స్‌మిటర్‌ను ధ్వంసం చేస్తేనే మరొక దేశం మీద దాడికి దిగాలా ? ఏదో ఒక సాకు కావాలి. తరువాత నిజానిజాలు వెల్లడైనా అప్పటికే జరగాల్సిన మారణ హౌమం జరిగింది. మహా జర్మనీ నుంచి నినాదం నుంచి కాపీ కొట్టిందే అఖండభారత్‌,అలాంటి అనేక పోలికలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. గతమెంతో ఘనం అన్న జాతీయవాదం రోజు రోజుకూ ఊపందుకుంటోంది. ఏ దేశ చరిత్రలోనైనా ఘనమూ, హీనమూ రెండూ ఉంటాయి. ఘనాన్ని దాచుకొని రెండవ దాన్ని చరిత్ర చెత్తబుట్టలోకి నెడుతుంది. దాన్నుంచి కూడా లబ్ది పొందాలని చూసే వారు చరిత్రలో కోకొల్లలుగా కనిపిస్తారు.


నూతన పార్లమెంటు భవనంలో గత ఘనం, సంస్కృతి పరిరక్షణలో భాగంగా రాజ దండానికి ప్రాణ ప్రతిష్ట చేస్తున్నామంటూ మన ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం నాడు ప్రతిష్టించారు. అంతకు ముందు హౌమంత్రి అమిత్‌ షా విలేకర్లతో మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినపుడు బ్రిటీష్‌ చివరి వైస్రాయి మౌంట్‌ బాటన్‌ అధికార మార్పిడి చిహ్నంగా రాజదండాన్ని నెహ్రూకు అందచేస్తే దాన్ని పక్కన పెట్టేసి మన సంస్కృతిని అవమానపరిచారు, ఆ చారిత్రాత్మకమైన రాజదండాన్ని ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంటు భవనంలో ప్రతిష్టించి గౌరవాన్ని నిలబెడతారు అని సెలవిచ్చారు. దేశ ప్రజలందరూ దీన్ని చూసి ఈ చారిత్రాత్మక ఉదంతం గురించి తెలుసుకోవాలని, అందరికి గర్వకారణము అని కూడా చెప్పారు. ఆ రాజదండం మన దేశంలోని అనేక రాజవంశాలలో ఏదో ఒకరు వాడినది అనుకుందామా అంటే అదేమీ కాదు. అది శైవ మతాన్ని అవలంభించిన వారు రూపొందించిన దండం, వైష్టవులు, బౌద్ద, జైనాలను ఆదరించిన రాజులు వాడిన దండాలు వేరుగా ఉంటాయి. వర్తమాన ప్రభుత్వం అంగీకరించాలంటే ఏ రాజదండాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి ? అసలు అది రాజదండం కాదు, చరిత్రలో వర్ణించిన చోళ రాజరిక దండ నమూనా మాత్రమే. స్వాతంత్య్ర తరుణంలో అధికార మార్పిడి గురుతుగా ఏదైనా క్రతువు నిర్వహించుతారా అని మౌంట్‌ బాటన్‌ నాడు నెహ్రూను అడిగారట. దాని గురించి రాజాజీగా సుపరిచితులైన సి రాజగోపాలచారిని నెహ్రూ సంప్రదించగా చోళ రాజుల పద్దతిని పాటిద్దామని చెప్పారట. ఈ పూర్వరంగంలో తమిళనాడులోని తిరువదుత్తురై అనే ఒక మఠానికి చెందిన వారు 1947 ఆగస్టు 14 రాత్రి నెహ్రూకు నమూనా రాజదండాన్ని పూజా పునస్కార తంతుతో బహుకరించారు తప్ప దానికి మౌంట్‌బాటన్‌కు ఎలాంటి సంబంధమూ లేదు. నమూనా రాజదండాన్ని ఉమ్మిడి బంగారు చెట్టి రూపొందించగా ఉమ్మిడి ఎతిరాజులు(96),ఉమ్మిడి సుధాకర్‌(88) తయారు చేశారు. వారు చెన్నైలో నివసిస్తున్నారు. క్రీస్తు పూర్వం 300సంవత్సరం నుంచి క్రీస్తు శకం 1279 వరకు చోళ రాజుల పాలన సాగింది. అంటే తరువాత వారి రాజదండాన్ని ఎవరికిచ్చినట్లు ? తరువాత వచ్చిన రాజులు దాన్ని పక్కన పెట్టి కొత్త రాజదండాలను వాడారా అసలు సిసలు దండం ఎక్కడ ఉన్నట్లు అన్న ప్రశ్నకు సమాధానం లేదు.


అసలు పురావస్తుశాలలోని రాజదండం ఎలా వెలుగులోకి వచ్చిందన్నది ఆసక్తికరం. దీనికోసం చెప్పిన ” కత ” విన్న తరువాత సందేహాలు తలెత్తటం సహజం. దీన్ని చారిత్రాత్మక రాజదండం అని వర్ణించటంతోనే పురాతన వస్తువు పేరుతో నకిలీలను అంటగట్టే మోసగాళ్లను గుర్తుకు తెచ్చారు. చోళుల నాటి ఈ రాజదండాన్ని బ్రిటీష్‌ వారికి అందచేయగా వారి చివరి ప్రతినిధి మౌంట్‌బాటన్‌ అధికార మార్పిడి సూచికగా దాన్ని దాని నెహ్రూకు అందచేశారన్నది కూడా మోసగాళ్ల కథలో భాగమే. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌గా మారిన పూర్వపు అలహాబాద్‌ నగరంలో నెహ్రూ నివాసం ఆనంద భవన్‌ను ఒక పురావస్తుశాలగా మార్చారు. దానిలో తనకు బహుమతిగా ఇచ్చిన నమూనా రాజదండాన్ని కూడా ఉంచారు. దాన్ని బంగారు చేతి కర్రగా నమోదు చేశారు. ఇది చోళ రాజవంశం నాటిదని చివరికి అమిత్‌ షా కూడా నమ్మారు.లేదా నమ్మినట్లు నటించి చెప్పారు. పత్రికల్లో వచ్చిన కథనం ప్రకారం దాన్ని తయారు చేసిన ఉమ్మిడి బంగారు చెట్టి కుటుంబీకులు కూడా దాని గురించి మరచిపోయారు.నిజానికి దానికి అంతటి ప్రాధాన్య ఉంటే దాన్ని తయారు చేసిన ఆ కుటుంబీకులు ఇప్పటికీ సజీవులుగా ఉన్నప్పటికీ గడచిన 75 సంవత్సరాలుగా తమ వారికి చెప్పలేదంటే తాము తయారు చేసిన అనేక వస్తువుల్లో ఒకటిగా చూశారు తప్ప మరొకటి కాదన్నది స్పష్టం. ఆ కుటుంబానికి చెందిన ఉమ్మిడి అమరేంద్రన్‌ చెప్పినదాని ప్రకారం 2018లో ఒక పత్రికలో దాని గురించి చదివారట. మరుసటి ఏడాది పురావస్తు శాలలో చూశారట. దాని గురించి ఒక పత్రికా గోష్టి పెడదామనుకుంటే కరోనా (2020లో కరోనా బయటపడింది) కారణంగా కుదరలేదట. దాంతో ఒక నిమిషము నిడివి గల వీడియో తీస్తే అది నరేంద్రమోడీ కంటబడటంతో వెలుగులోకి వచ్చిందట. దాన్ని ఎప్పుడు తీశారు, నరేంద్రమోడీ ఎప్పుడు చూశారు, ప్రధానికి వీడియోలు చూసే తీరిక ఉందా అని సందేహం కలగవచ్చు.

ఉమ్మిడి కుటుంబం దాన్ని వంద సావరిన్‌(సవర్లు)ల బంగారంతో తయారు చేసి ప్రభుత్వం నుంచి రు.15వేలు తీసుకున్నదట. దీని గురించి ప్రధాని మోడీ కార్యాలయం పంపిన బృందంలోని జర్నలిస్టు ఎస్‌ గురుమూర్తి ఉమ్మిడి కుటుంబాన్ని సంప్రదించారు. వారి కోరిక మేరకు దాని ప్రతిరూపాన్ని రూపొందించారు. వెండితో చేసిన దానికి బంగారు పూత పూశారు. అసలైన బంగారు వస్తువును శాశ్వతంగా పార్లమెంటు భవనంలో, దాని ప్రతి రూపాన్ని జనం కోసం ప్రదర్శిస్తారని చెప్పారు. గవర్నర్‌ జనరల్‌గా ఉన్న రాజగోపాల చారి అనేక పుస్తకాలను చదివి చివరికి చోళుల రాజదండం గురించి తెలుసుకొని కొత్త రాజులకు అధికారిక మార్పిడి సూచికగా రాజదండాలను అందచేసే వారని తెలుసుకొన్నారు. తరువాత తికెవదుత్తురై మఠానికి చెందిన స్వాములను సంప్రదించి బంగారు రాజదండాన్ని తయారు చేయించి వారి ద్వారానే నెహ్రూకు అంద చేయించారు. దీనికి నెహ్రూ అంగీకరించారని చెబుతున్నారు. అదే గనుక వాస్తవమైతే అదే నెహ్రూ దాన్ని ఎందుకు పక్కన పడవేసినట్లు ? తన తరువాత అధికారానికి వచ్చేవారికి దాన్ని అందచేసేందుకు ఎందుకు ఏర్పాట్లు చేయలేదు ? ఈ విషయాలన్నీ తరువాత అధికారానికి వచ్చిన లాల్‌బహదూర్‌ శాస్త్రికి ఎవరూ ఎందుకు చెప్పలేదు ? నెహ్రూకు అందచేసిన మఠాధిపతులైనా తరువాత ప్రధానులుగా చేసిన వారికి కూడా ఎందుకు ఈ ఘనమైన సంప్రదాయం, సంస్కృతి గురించి ఎందుకు గుర్తు చేయ లేదు ? ఇలా ఆలోచించటం కూడా జాతి వ్యతిరేకం అంటారేమో ? రాజదండ ప్రహసనం వచ్చే ఎన్నికల్లో తమిళుల ఎన్నికల కోసమే అన్న విమర్శ ఉంది.


ద్రావిడ నాడు అనే పత్రికలో 1947 ఆగస్టు 24వ తేదీ సంచికలో తరువాత డిఎంకె స్థాపకుడిగా, సిఎంగా పని చేసిన సిఎన్‌ అన్నాదురై రాజదండం బహుకరించిన వారి ఉద్దేశం ఏమిటో గ్రహించాలని నెహ్రూను హెచ్చరిస్తూ రాశారు. దానిలో ఎక్కడా అది చోళుల నాటి రాజదండం అని గానీ పరంపరగా అధికార బదిలీ గురించిగానీ లేదు. అన్ని రకాలుగాను జనాన్ని దోచుకుంటున్న మఠాలు, స్వాములు కేంద్ర ప్రభుత్వాన్ని మంచి చేసుకొనేందుకు, తమ ఆస్తుల జోలికి రాకుండా, ఎదురులేకుండా చేసుకొనేందుకు గాను దాన్ని బహుకరించినట్లు పేర్కొన్నారు.దాని గురించి తమిళనాడు ప్రభుత్వ పత్రాల్లో ప్రస్తావించారు.అధికారానికి చిహ్నంగా రాజముద్రికలు ఉండేవి.రాజ ఫర్మానాల మీద ఆ ముద్రిక ఉంటేనే దాన్ని రాజాధికారిక పత్రంగా పరిగణించారని తెలుసు. రాజులుగా అధికారం స్వీకరించినపుడు కిరీటం ధరించటం అధికారిక చిహ్నంగా ఉండేది. రాజదండం అనేది ఒక అలంకార ప్రాయం తప్ప అధికారిక గుర్తు కాదు. అధికార మార్పిడి అంటే ఒక పత్రం మీద సంతకం చేసి కరచాలనం చేసుకోవటమే కాదు, స్థాుక సంప్రదాయాలకు అనుగుణంగా ఉండాలని అమిత్‌ షా గారు చెప్పారు. మన దేశంలో అనేక రాజవంశాలు, సంప్రదాయాలు ఉండేవి. దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి? సంప్రదాయాల ప్రకారం అధికారానికి చిహ్నంగా పరిగణించారని చెబుతున్న రాజదండం, రాజముద్రికలు, కిరీటం రాజుగారి కనుసన్నలలోనే ఉంటాయి.


అలాంటి దాన్ని లోక్‌సభ స్పీకర్‌ స్థానం పక్కనే ప్రతిష్టించారు. ఆడా మగా కాని ఈ కొత్త పరంపర ఏమిటి ? స్పీకర్‌ దేశ సర్వాధికారి అని అర్ధమా? ఉప రాష్ట్రపతి ఉండే రాజ్యసభ సంగతేమిటి ? స్థానిక సంప్రదాయాల గురించి వాటికి అసలు సిసలు వారసులుగా చెప్పుకొనే వారి పరంపరకు చెందిన వాజ్‌పాయి, నరేంద్రమోడీ పదవీ స్వీకారం చేసినపుడు వారికి, లేదా ఆర్‌ఎస్‌ఎస్‌ హిందూత్వ, బిజెపినేతలకు వాటి గురించి గుర్తులేదా ? ఆధునిక రాజ్యాంగం ప్రకారం అధికారాన్ని అనుభవిస్తూ మనుధర్మశాస్త్ర కాలానికి జనాన్ని తీసుకుపోవాలని చూస్తున్న వారికి సంప్రదాయాలను, ఆధునికతను మేళవించాలనే అందమైన మాటలను చెప్పటం కష్టం కాదు. పోనీ అలా చేస్తే నష్టం ఏమిటి , గతాన్ని ఎందుకు వదులు కోవాలి అని గొర్రెదాటు కబుర్ల చెప్పేవారు మపకు ఎక్కడబడితే అక్కడ దొరుకుతారు, వాటిని సమర్ధించటమూ తెలిసిందే. కనిపించిన ప్రతి రాయికి రప్పకూ మొక్కి ఒక నమస్కారమే కదా పోయేదేముంది అనే వారికి కొదవ లేదు. ఆ తర్కం ప్రకారమే సమర్ధన. రాజదండంతో పాటు కిరీటం, పట్టపురాణి, రాజ గురువు, రాజనర్తకి తదితర సాంప్రదాయాల సంగతేమిటి ? ఇపుడు అధికారిక పురోహితులు, స్వాములు లేరు. ఏ ప్రాతిపదికన రాజరిక చిహ్నమైన రాజదండాన్ని పట్టుకొని నరేంద్రమోడీ ఒక మతానికి చెందిన 20 మఠాల వారిని పార్లమెంటులో నడిపించినట్లు ?

ఇదంతా నూతన పార్లమెంటు భవనం బదులు ఒక రాజు కొత్త కోటను ప్రారంభించినట్లుగా ఉంది. అందుకే కొల్‌కతా నుంచి వెలువడే టెలిగ్రాఫ్‌ దినపత్రిక పతాక శీర్షికలో క్రీస్తు పూర్వం 2023 అని ప్రముఖంగా ప్రచురించింది. రాజరికాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ రాజదండం అన్నది 1300 సంవత్సరాల నుంచి మాత్రమే ఉనికిలోకి వచ్చిందని, దాని అసలు పేరు నంది ధ్వజము అని ఆరియాలజిస్టులు సిహెచ్‌ బాబ్జీరావు, ఇ శివనాగిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వాములుగా చెలామణిలో ఉన్న కొందరు రాజ దండాన్ని ధర్మ దండం అని పిలిచేవారని చెబుతున్నారు. ప్రధాని మోడీ, అమిత్‌ షాకు మద్దతుగా సాంప్రదాయాల గురించి స్వామీజీలు, మరి కొందరు రంగంలోకి దిగారు. రాజు కోరుకుంటే ఇలాంటి వారికి కొదవా ? వారి వాదనలసారం ఇలా ఉంది.
పట్టాభిషేకం జరిగినపుడు మంత్రాల ద్వారా ” నా రాజదండంతో పరిపాలన చేసేందుకు పూనుకున్నాను. నా అధికారంతో నేను పాలన-దండన చేస్తాను ” అని ప్రమాణం చేసిన తరువాత రాజ గురువు రాజును రాజదండంతో తాటించి ధర్మ దండంతో పాలించాలని అందచేస్తాడట.( వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అని చెప్పే వేదకాలం నాటి వారు ప్రతి తరంలోనూ ఉంటారు.) రాజదండం అంటే ధర్మ ప్రతీక అని, దానికి వృషభం ప్రతినిధి అని, దానికి ఉండే నాలుగు కాళ్లను సత్య, సౌచ(శుచి), బహుతాద్య,(భూత దయ), నిష్మామకర్మలుగా చెప్పారు. పూర్వీకులు చెప్పిన ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుందంటే అర్ధమిదేనట.

నంది ఒక పాదాన్ని ఎందుకు ముడవకుండా కూర్చుంటుందటా !. ఎందుకంటే సత్యం కోసం ఎప్పుడు అవసరమైతే అప్పుడు లేచి వెళ్లటానికట. ధర్మాన్ని కాపాడే శివుడి ముందే కూర్చుంటుంది గనుక అది లేవాల్సిన అవసరం ఉండదట. అలాగే నరేంద్రమోడీ ధర్మ పరీక్షకు కూడా పరిగెత్తనవసరం లేదట. అంటే మోడీ శివుడితో సమానం అని చెప్పటం. సంస్కృత పదాలకు అర్ధాలకోసం కూడా వెతుక్కోవాల్సిన పని లేదట. భారత అంటే సత్యం, సెక్యులర్‌ ఇండియా అంటే మాయ, విశ్వగురువు అంటే దక్షిణామూర్తి (నరేంద్రమోడీ అవతారానికి అర్ధం అదే అని చెప్పలేదుగానీ భావం అదే ). వసుధైక కుటుంబం అంటే స్వచ్చ భారత్‌, స్మార్ట్‌ సిటీస్‌,జాతీయ రహదారులు, కొత్తగా నిర్మించిన రైల్వే స్టేషన్లు, వందే భారత్‌ తదితరాలు శుచిలో భాగమట. భూత దయ అంటే నమామి గంగ, పునరుత్పాదక శక్తి, ఎల్‌ఇడి లైట్లు, ఉజ్వల పధకం, ఆయుష్మాన్‌ భారత్‌, నేరుగా నగదు బదిలీ, గోవధ నిషేధం, ఆవు పేడతో సేంద్రీయ సాగు, నిష్కామకర్మ అంటే అగ్నివీర్‌, అవినీతి రహిత పాలన, అధికారయంత్రాంగ ప్రక్షాళన, కిసాన్‌ సమ్మాన్‌ యోజన, ముద్ర యోజన తదితరాలట. అమృత కాలం నూతన పార్లమెంటు భవనంతో ప్రారంభమౌతుందట. (అంటే ఇప్పటి వరకు చెప్పిన అచ్చేదిన్‌, ఇతర వాగ్దానాలన్నీ వచ్చే రోజుల్లో అమలు చేస్తారని, గతం గురించి ప్రశ్నించకుండా నోర్మూసుకోవాలని చెబుతున్నారు ధర్మ మూర్తులు) ధర్మ విజయాన్ని పున:ప్రతిష్టించే అవకాశం నరేంద్రమోడీకి వచ్చింది. ధర్మాన్ని కాపాడే ధర్మ దండాన్ని నరేంద్రమోడీ ప్రతిష్ఠిస్తున్నారు గనుక కాంగ్రెస్‌ వణికి పోతోందని కూడా చెప్పారు.

వీటిని చూస్తే మేం కూడా ఇంతగా పొగడలేదని పూర్వపు భట్రాజులు కూడా సిగ్గుపడిపోతారు( ఒక కులాన్ని కించపరచటంగా భావించవద్దని మనవి) రాజు దైవాంశ సంభూతుడని చిత్రించిన వారు, నిరంకుశ రాజరికాలను ప్రోత్సహించిన వారు రాజదండాన్ని ఆ దేవుడే పంపాడు, దేవు ప్రతినిధులం తాము గనుక రాజులకు అందించే తంతు తమదని పూజారులు చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ భావనలను, హిందూత్వను ముందుకు తెచ్చిన విడి సావర్కర్‌ కూడా నమ్మారు, అతగాడిని ఆరాధించే శక్తులు గనుకనే సావర్కర్‌ జన్మదినం రోజునే పార్లమెంటులో రాజదండం ప్రతిష్టాపన, భవన ప్రారంభోత్సం జరిపారు. అదేమీ కాదు, ఏదో ఒక తేదీని ఎంచుకోవాలి కదా అలా చేస్తే ఏదో అలా కలసి వచ్చిందని చెబితే ఎవరూ నమ్మరు. రాజరికాలను తిరిగి ప్రతిష్టించాలనే కోరిక, తిరిగి సమాజాన్ని వెనక్కు నడపాలనే , ప్రజస్వామ్యాన్ని పాతిపెట్టి హిందూత్వ పాలన రుద్దాలన్న ప్రగాఢవాంఛ నరనరాన ఉన్నవారే దీనికి పాల్పడతారని వేరే చెప్పనవసరం లేదు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆలోచనలు అనే గ్రంధంలో బిఆర్‌ అంబేద్కర్‌ రాసిన ఒక పేరాలో ఏముందో చూద్దాం.” ఒక బ్రాహ్మణుడు స్వతంత్ర దేశ తొలి ప్రధాని ఐన సందర్భంగా పండుగ చేసుకొనేందుకు బనారస్‌ బ్రాహ్మలు చేసిన యజ్ఞంలో ప్రధాని నెహ్రూ పాల్గొనలేదు. ఆ బ్రాహ్మలు అందించిన రాజదండాన్ని ధరించలేదు, గంగ నుంచి తెచ్చిన జలాన్ని తాగలేదు ” అని రాశారు. అధికార మార్పిడి జరిగిన మరుసటి రోజు యజ్ఞం జరిగింది. అధికార మార్పిడి చిహ్నంగా రాజదండం, దాన్ని మౌంట్‌బాటన్‌ అందచేశాడనటాుకి ఎలాంటి రుజువులు, ఆధారాలు లేవు.

గోద్రా ఉదంతం తరువాత గుజరాత్‌లో జరిగిన మారణకాండ సందర్భంగా రాజధర్మం పాటించాలని ప్రధానిగా ఉన్న వాజ్‌పాయి నరేంద్రమోడీకి హితవు చెప్పిన సంగతి తెలిసిందే. దాన్ని పాటించిన దాఖలాల్లేవు. రాజులు దండాన్ని దుష్టుల మీద ప్రయోగించాలని చెప్పారు. ్ల ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ తమ మీద లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మహిళా రెజ్లర్లు చేసిన ఫిర్యాదుమేరకు విధిలేక కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. పోక్సో కేసు పెట్టిన వారిని అరెస్టు చేస్తారన్న సంగతి తెలిసిందే. కానీ తన పార్టీకి చెందిన సదరు ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌కి మద్దతుగా కొందరు ప్రదర్శనలకు దిగుతున్నారు. గుజరాత్‌లో అత్యాచారాలకు పాల్పడి రుజువైన కేసులో శిక్షలను పూర్తిగా అమలు జరపకుండా నేరగాండ్లను విడుదల చేసి వారికి గౌరవ మర్యాదలు చేసిన బిజెపి ఘనులను నరేంద్రమోడీ పల్లెత్తు మాట అనలేదు. బ్రిజ్‌ భూషణ్ను కాపాడుతూ అరెస్టు డిమాండ్‌ చేస్తున్న రెజ్లర్ల మీద దండాన్ని ఝళిపించి అధికారాన్ని దేనికి, ఎలా ఉపయోగించేదీ బేటీ పడావో బేటీ బచావో అని చెప్పిన నరేంద్రమోడీ లోకానికి వెల్లడించారు. ఇది మన గతం, సంప్రదాయం అని మనం నమ్మాలి, ఏమి చేసినా కిమ్మన కూడదు ? రాజదండ సందేశమిదే !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d