• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Israel genocide

గాజా నరమేథం ఆగింది, ప్రజాశత్రువుకు శాంతి బహుమతి ! ఐఎంఎఫ్‌ విధానాలకు లాటిన్‌ అమెరికాలో ప్రతిఘటన !!

15 Wednesday Oct 2025

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Gaza ceasefire deal, Israel genocide, Latin america left, Netanyahu, Nobel peace prize, Peru Protests, Venezuela

ఎం కోటేశ్వరరావు

అమెరికా ముందుకు తెచ్చిన 20 అంశాల శాంతి ప్రతిపాదన ఒప్పందంపై సోమవారం నాడు కైరో(ఈజిప్టు)లో అనేక మంది దేశాధినేతల సమక్షంలో సంతకాలు జరిగాయి. హమస్‌ వద్ద బందీలుగా ఉన్న 20మంది, ఇజ్రాయెల్‌ జైళ్లలో నిర్బంధంలో ఉన్న రెండువేల మంది పాలస్తీనియన్ల విడుదల జరిగింది. బందీలుగా ఉండి మరణించిన 28 మంది మంది భౌతిక కాయాలను కూడా అప్పగించేందుకు హమస్‌ అంగీకారం తెలిపింది. గాజాలో సాగిస్తున్న మారణకాండకు ప్రస్తుతానికి తెరపడింది.ఇలా ఎందుకు అనాల్సి వచ్చిందంటే మరోసారి ఇజ్రాయెల్‌ అలాంటి దుర్మార్గానికి పాల్పడనే హామీ ఏమీ లేదు. పాలస్తీనియన్లు ఊపిరి పీల్చుకొనేందుకు అవకాశం ఇచ్చే ఏ చర్యనైనా ఆహ్వానించాల్సిందే. అసలైన సమస్య పాలస్తీనా గుర్తింపు, ఐరాస తీర్మానం ప్రకారం దానికి కేటాయించిన ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్‌ వైదొలగటం మీద ఆధారపడి ఉంది. గతంలో కుదిరిన ఒప్పందాలేవీ కూడా ఈ అంశంపై ఎలాంటి పరిష్కారాన్ని చూపలేదు. ఏడాదికేడాది ఇజ్రాయెల్‌ ఆక్రమణలు, నివాసాల నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. జనాభా స్వభావాన్ని మార్చేందుకు యూదులందరినీ తీసుకువచ్చి ఆ ప్రాంతాల్లో ఉంచుతున్నారు. ఒప్పందం మొదటి దశగా పేర్కొన్నదాని ప్రకారం బందీలు-ఖైదీల మార్పిడికి మాత్రమే పరిమితం.

సోమవారం నాడు డోనాల్డ్‌ ట్రంప్‌ కైరో వెళ్లే ముందు జెరూసలెంలో ఉన్న ఇజ్రాయెల్‌ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించాడు.నూతన మధ్య ప్రాచ్యానికి చారిత్రాత్మక ఉషోదయం అని ఒప్పందాన్ని వర్ణించాడు. ఆ సందర్భంగా ఇద్దరు వామపక్ష వాదులైన ఎంపీలు పాలస్తీనా పట్ల అమెరికా వైఖరికి నిరసన తెలిపారు.అమెన్‌ ఒడే, ఓఫర్‌ కాసిఫ్‌ అనే ఎంపీలను భద్రతా సిబ్బంది బయటకు తీసుకువెళ్లారు. యూదు దురహంకారం, అరబ్బులను రెండోతరగతి పౌరులుగా చూసే వివక్ష వాస్తవం. అయితే మొత్తం యూదు సామాజికతరగతికి దీన్ని ఆపాదించాల్సిన అవసరం లేదు.వారిలో కూడా పురోగామి,ప్రజాతంత్ర వాదులు ఉన్నారు గనుకనే అనేక మంది గాజాలో జరుపుతున్న మారణకాండను వ్యతిరేకించారు.దానికి సారధ్యం వహించిన నెతన్యాహు చర్యలకు నిరసన తెలిపారు.అయితే వాటికి ఉన్న పరిమితులు, మీడియా పూర్తిగా అలాంటి వార్తలను పక్కన పెట్టిన కారణంగా బయటి ప్రపంచానికి వివరాలు పూర్తిగా తెలియవు. ట్రంప్‌కు నిరసన తెలిపిన ఇద్దరు ఎంపీలలో ఒకరైన ఒడే సామాజిక మాధ్యమంలో తరువాత పెట్టిన పోస్టులో తామెందుకు ఆ చర్యకు పాల్పడిందీ తెలిపాడు. పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించాలని యావత్‌ ప్రపంచ సమాజం అంగీకరించినందున ఆ పని ఎందుకు చేయరన్నదే తమ ప్రశ్న అని ఆ మాత్రానికే తమను పార్లమెంటునుంచి బయటకు గెంటారని పేర్కొన్నాడు.మరో ఎంపీ కాసిఫ్‌ ఒక ప్రకటన చేస్తూ ట్రంప్‌ చర్యలను విమర్శించాడు, పాలస్తీనా, ఇజ్రాయెల్‌ గుర్తింపు పరిష్కారాన్ని అమలు జరపాలని డిమాండ్‌ చేశాడు. అమెరికా మిత్రదేశాలుగా ఉన్న కెనడా, కొన్ని ఐరోపా దేశాలు ఇప్పటికే పాలస్తీనాను అధికారికంగా గుర్తించినప్పటికీ అమెరికా ముందుకు రావటం లేదు. ఇజ్రాయెల్‌ అసలు ఉనికినే ప్రశ్నిస్తున్నది. ఐరాస అచేతనంగా ఉండిపోయింది. భద్రతామండలిలో ఎవరైనా కార్యాచరణకు తీర్మానం పెడితే వీటో హక్కుతో అమెరికా సైంధవుడిలా అడ్డుపడుతున్నది.మారణకాండనే ఆపేందుకు ముందుకు రాని వాషింగ్టన్‌ తన రాజకీయ, మిలిటరీ, ఆర్థిక అజెండాను పక్కకు పెట్టి పాలస్తీనాను గుర్తిస్తుందా ?

వివిధ రంగాలలో ప్రజ్ఞ కనపరచిన వారికి ఇచ్చే నోబెల్‌ బహుమతుల గురించి ఇంతవరకు ఎలాంటి వివాదమూ లేదుగానీ శాంతి బహుమతికి ఎంపికలు కొన్ని అపహాస్యానికి గురౌతున్నాయి. తాజాగా వెనెజులా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే మరియా కోరినా మచోడోకు శాంతి బహుమతి అలాంటిదే. అక్కడి వామపక్ష నికోలస్‌ మదురో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు చివరికి అమెరికా మిలిటరీ కూడా జోక్యం చేసుకోవాలని, బాంబులు వేయాలని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహును కోరిన ఆమెను శాంతిదూతగా పరిగణించటం, తనకు వచ్చిన బహుమతిని తనకు నిర్ణయాత్మక మద్దతు ఇచ్చిన డోనాల్డ్‌ ట్రంప్‌కు అంకితం చేస్తున్నట్లు ఆమె ప్రకటించటాన్ని చూస్తే నోబెల్‌ కమిటీ ఎవరి కనుసన్నలలో పని చేస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు. గత రెండున్నర దశాబ్దాలుగా ఆమె తీరుతెన్నులన్నీ వెనెజులాలో అశాంతిని రెచ్చగొట్టేందుకు అమెరికాతో చేతులు కలిపి చేసిన నిర్వాకాలు తప్ప శాంతి చిహ్నాలే లేవు. అసలా బహుమతి తనకే ఇవ్వాలని డోనాల్డ్‌ ట్రంప్‌ డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. మదురోను అరెస్టు చేసేందుకు అవసరమైన సమాచారమిచ్చిన వారికి ఐదు కోట్ల డాలర్ల బహుమతి ఇస్తామని ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. వెనెజులాను మాదక ద్రవ్యాల సరఫరా కేంద్రంగా మార్చారంటూ వెనెజులా నుంచి వచ్చిన రెండు బోట్లమీద కాల్పులు జరిపి వాటిలో ఉన్నవారిని హత్య చేసి మాదకద్రవ్య సరఫరాదారులుగా ప్రచారం చేయటమే కాదు, అవసరమైతే సైనిక చర్యకు దిగేందుకు మిలిటరీని మోహరించిన సంగతి తెలిసిందే. మరియా కోరినా నిర్వాకాలను చూస్తే 2002లో హ్యూగో ఛావెజ్‌కు వ్యతిరేకంగా జరిగిన విఫల కుట్రలో ఆమె పాత్రధారి.కేవలం 47 గంటలు మాత్రమే అధికారంలో ఉన్న తిరుగుబాటుదార్లు రాజ్యాంగాన్ని , పతి ప్రజా సంస్థను రద్దు చేశారు. వెనెజులాను విముక్తి చేసేందుకు మిలిటరీ జోక్యం చేసుకోవాలని అమెరికాను కోరింది. కరీబియన్‌ సముద్ర ప్రాంతంలో మాదక ద్రవ్యాల నిరోధం పేరుతో దిగిన అమెరికా నౌకాదళానికి ఆమె జేజేలు పలికింది. వెనెజులా ఎన్నికల ఫలితాన్ని గుర్తించేందుకు నిరాకరించిన వ్యక్తితో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించిన ఘనురాలామె. జెరూసలెంలో మూసివేసిన వెనెజులా రాయబార కార్యాలయాన్ని తెరవాలని కోరింది. వెనెజులా చమురు, నీరు, మౌలిక సదుపాయాలవంటి అన్నింటినీ ప్రవేటింకరించాలని కోరుతున్న శక్తుల ప్రతినిధిగా పని చేస్తున్నది.ఆమె శాంతి లేదా పురోగతికి ప్రతీక కాదని, ఫాసిజం, యూదు దురహంకారం మరియు నయాఉదారవాదాల ప్రపంచ కూటమిలో భాగం,ప్రజాస్వామ్య ముసుగులో శాంతిని విచ్చిన్నం చేసే శక్తి అని కొందరు విమర్శించారు. నోబెల్‌ శాంతి బహుమతి ఆశయం, లక్ష్యాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నవారికి దాన్ని ప్రదానం చేయటం పక్కా రాజకీయం. వియత్నాంలో దురాక్రమణకు పాల్పడి లక్షలాది మంది ప్రాణాలు తీసింది అమెరికా. దానికి నాయకత్వం వహించినవారిలో ఒకడు హెన్రీ కిసింజర్‌. అక్కడ కాల్పుల విరమణకు కృషి చేశాడనే పేరుతో 1973లో శాంతి బహుమతి ఇచ్చారు. అదే పెద్దమనిషి ఇజ్రాయెల్‌ దుర్మార్గాలకు మద్దతు ఇచ్చాడు.ఈజిప్టును లొంగదీసుకొని ఇజ్రాయెల్‌తో కాంప్‌డేవిడ్‌ ఒప్పందానికి తెరతీసిన జిమ్మీ కార్టర్‌కు 1978లో అదే బహుమతి ఇచ్చారు. ఆ ఒప్పందంలో పాలస్తీనా గుర్తింపును విస్మరించారు. పాలస్తీనా ప్రాంతంలో దురాక్రమణలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌పై ఆంక్షల కోసం పెట్టిన తీర్మానాన్ని వీటో చేసిన పెద్దమనిషి బరాక్‌ ఒబామా,మిలిటరీ సాయాన్ని మరింతగా పెంచినందుకా అన్నట్లు 2009లో శాంతి బహుమతి పొందాడు. ఇలాంటి విషయాల్లో నేను మాత్రం తక్కువ తిన్నానా నాకెందుకు ఇవ్వరని ట్రంప్‌ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

బ్రెట్టన్‌ ఉడ్‌ కవలలుగా పేరుమోసిన ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ ప్రయోగశాల లాటిన్‌ అమెరికా. వాటి ప్రజావ్యతిరేక, ప్రపంచ పెట్టుబడి అనుకూల విధానాల కారణంగా జన జీవితాలు అతలాకుతలం అయ్యాయి. వాటిని బలవంతంగా అమలు జరిపేందుకు మిలిటరీ పాలకులు, నియంతలను రంగంలోకి తెచ్చారు. వారికి వ్యతిరేకంగా అనేక రూపాల్లో జరిగిన పోరాటాలతో వామపక్ష శక్తులు ముందుకు వచ్చాయి, అనేక చోట్ల అధికారాన్ని పొందాయి. అయితే నయావలసవాద పునాదులను పూర్తిగా నాశనం చేయకుండా జనాలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు జరిపి కొంత ఉపశమనం కలిగించినప్పటికీ అసలు సమస్యలకు పరిష్కారం దొరకలేదు. అందుకే ఎన్నికలలో వామపక్షాలకూ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇదే సమయంలో బ్రెట్టన్‌ ఉడ్‌ కవలలు మరింతగా సంస్కరణల పేరుతో తమ విధానాలను రుద్దుతుఉన్న కారణంగా కార్మికవర్గం, ఇతర తరగతులు వీధులలోకి రావటం అనివార్యంగా కనిపిస్తున్నది.

ఈ పూర్వరంగంలో పెరూలో వామపక్ష అభ్యర్ధిగా ముందుకు వచ్చి విజయం సాధించిన ఒక సామాన్య స్కూలు టీచర్‌ పెడ్రో కాస్టిలో 2021లో అధికారానికి వచ్చిన ఏడాదిలోనే పదవి కోల్పోయాడు. తన మూలాలను మరచి మితవాద,మతవాద శక్తులతో చేతులు కలిపి కార్మికవర్గాన్ని విస్మరించాడు.పార్లమెంటు ఉద్వాసనతో పదవి నుంచి తప్పుకున్నాడు. అప్పుడు ఉపాధ్యక్షరాలిగా ఉన్న దినా బోలార్టే 2022లో గద్దెనెక్కింది. అన్ని విధాలుగా పాలనలో విఫలం కావటంతో పార్లమెంటు గత శుక్రవారం నాడు పదవి నుంచి తొలగించింది.ఆమెకు వ్యతిరేకంగా దేశవ్యాపితంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. గురువారం రాత్రి చర్యకు ఉపక్రమించిన పార్లమెంటు మెరుపువేగంతో వ్యవహరించి తెల్లవారేసరికి ఉద్వాసన పలికింది. రాత్రి 11.30కు పార్లమెంటు రావాలని ఇచ్చిన ఆదేశాన్ని ఆమె ఉల్లంఘించింది. ఒకనాడు మద్దతు ఇచ్చిన పార్టీలు కూడా వ్యతిరేకంగా ఓటువేశాయి. విచ్చలవిడి అవినీతి, రెచ్చిపోయిన నేరస్థ ముఠాలను అదుపుచేయటంలో వైఫల్యంతో దినా పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగేవరకు పార్లమెంటు స్పీకరు జోస్‌ జెరీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టాడు. గత తొమ్మిది సంవత్సరాలలో ఏడుగురు అధ్యక్షులు మారారు. వారిలో ముగ్గురిని పార్లమెంటు తొలగించింది. అధ్యక్షులుగా ఎన్నికైన పార్టీ పార్లమెంటులో మెజారిటీ సాధించలేకపోవటం అనేక లాటిన్‌ అమెరికా దేశాల్లో జరుగుతున్నది.దామాషా ప్రాతినిధ్యంతో అనేక పార్టీలు పార్లమెంటులో అడుగుపెడుతున్నాయి. పౌరుల ఆగ్రహం తలెత్తినపుడు అధ్యక్షులను పార్లమెంట్లు తొలగిస్తున్నాయి. ప్రైవేట్‌ పెన్షన్‌ నిధులకు కార్మికులు చెల్లించాలనే బిల్లుకు వ్యతిరేకంగా యువతరం నిరసనలకు దిగింది.దీనికి తోడు ఉద్యోగ భద్రత లేదు, యువతలో నిరుద్యోగం విపరీతంగా ప్రబలింది.

మరో లాటిన్‌ అమెరికా దేశం ఈక్వెడార్‌. మితవాది, వాణిజ్యవేత్తలకు అనుకూలమైన అధ్యక్షుడు డేనియల్‌ నోబావోకు వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నది. చమురు మీద ఇస్తున్న సబ్సిడీలను ఎత్తివేయటంతో ఆగ్రహం భగ్గుమన్నది. ఒక గాలన్‌(3.79 లీటర్లు) డీజిలు ధర 1.8 డాలర్ల నుంచి 2.8డాలర్లకు పెరిగింది. అంతర్జాతీయ ధరలను బట్టి ఎప్పటికప్పుడు ధరలను సవరిస్తామని ప్రకటించారు. స్థానిక తెగలకు ప్రాతినిధ్యం వహించే సంస్థ అనేక రూపాల్లో ఆందోళనకు పిలుపు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఖాతరు చేయలేదు. ఆదివారం నాడు కొలంబస్‌ దినం రోజున(1492లో కొలంబస్‌ లాటిన్‌ అమెరికా గడ్డపై అడుగు పెట్టాడు) తాజా ప్రదర్శనలపై దేశవ్యాపితంగా పోలీసులు విరుచుకుపడ్డారు. దాంతో నిరసనలు హింసాత్మకంగా మారాయి. పది జిల్లాల్లో అధ్యక్షుడు అత్యవసర పరిస్థితిని ప్రకటించేంతగా ఉద్రిక్తత పెరిగింది.గతవారంలో రోడ్డు మీద అధ్యక్షుడి కారునే అడ్డుకున్నారు. స్థానిక తెగలు ఎక్కువగా పని చేస్తున్న వ్యవసాయం, చేపలు పట్టటం, రవాణా రంగాలపై చమురు సబ్సిడీ ఎత్తివేత ప్రభావం ఎక్కువగా ఉంది. ఏటా ప్రభుత్వం 110 కోట్ల డాలర్ల సబ్సిడీ ఇస్తున్నదని, ఈ కారణంగా ఇరుగుపొరుగున ఉన్న కొలంబియా, పెరూ దేశాలకు పెద్ద ఎత్తున అక్రమరవాణా జరుగుతున్నదని అధ్యక్షుడు వాదిస్తున్నాడు. డేనియల్‌ నోబావో నియంతమాదిరి వ్యవహరిస్తున్నాడని,చమురు సబ్సిడీ ఎత్తివేతకు ముందు ఇతర రాయితీలను కూడా తొలగించారని, చమురు అక్రమరవాణా అన్నది ఒక సాకుమాత్రమే నంటూ ఐదువేల మంది ప్రభుత్వ ఉద్యోగులను కూడా తొలగించారని కార్మిక నేతలు ప్రకటించారు. సమ్మెకు పిలుపు ఇచ్చిన సంస్థతో చర్చలకు ససేమిరా అనటంతో పరిస్థితి మరింతగా దిగజారింది. కొత్తగా రుణం ఇచ్చేందుకు రుద్దిన ఐఎంఎఫ్‌ ఆదేశాల మేరకు పొదుపు పేరుతో నయా ఉదారవాద విధానాలను అమలు చేస్తున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఔషధాలు కూడా సరిగా ఉండటం లేదు. విదేశీ మిలిటరీ స్థావరాల ఏర్పాటును అనుమతించేందుకు జూన్‌లో పార్లమెంటు తీర్మానించింది. ఇది అమెరికా కోసమే అన్నది తరువాత వెల్లడైంది. ప్రజా వ్యతిరేక విధానాలకు, అమెరికాకు లొంగిపోవటాన్ని లాటిన్‌ అమెరికా కార్మికవర్గం వ్యతిరేకిస్తున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కళ్లుండీ చూడలేని కబోదులా, రక్త పిపాసులా – గాజాపై అమెరికా ఆరవసారి వీటో !

20 Saturday Sep 2025

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Gaza Deaths, Global Sumud Flotilla, Israel genocide, UNSC Failures, US’s sixth veto

ఎం కోటేశ్వరరావు

2023 అక్టోబరు 7వ తేదీ నుంచి పాలస్తీనా ప్రాంతమైన గాజాలో ఇజ్రాయెల్‌ ఊచకోతలో మరణించిన వారి సంఖ్య 65వేలు దాటింది. వీరిలో 70శాతం మంది అన్నెంపున్నెం ఎరగని పిల్లలు, వారి సంరక్షణ చూస్తున్న తల్లులే ఉన్నారు. లక్షలాది మంది గాయపడ్డారు, వేలాది మంది జాడ తెలియటం లేదు. నివాస ప్రాంతాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, నిర్వాసితుల గుడారాలు, మానవతా పూర్వక సాయం చేస్తున్న కేంద్రాలు ఒకటేమిటి, ఏదో ఒక సాకుతో నిత్యం ఇజ్రాయెల్‌ మిలిటరీ దాడులకు గురవుతున్నాయి. యాసిలెడ్‌ అనే ఒక సంస్థ తాజాగా విడుదల చేసిన సమాచారం ప్రకారం గాజాలో ఇజ్రాయెల్‌ చేసిన ప్రతి పదహారు హత్యలలో బలైంది 15 మంది సామాన్య పౌరులే అని తేలింది.ఈ ఏడాది మార్చినెల 18 తరువాత తాము 2,100 మంది సాయుధులను మట్టుబెట్టామని ఇజ్రాయెల్‌ చెప్పింది. తమ సమాచారం ప్రకారం 1,100 మందికి మించి లేరని సర్వే చేసిన సంస్థ పేర్కొన్నది. ఇదే కాలంలో 16వేల మంది పౌరులను చంపారు. ఇటీవలి కాలంలో నివాస ప్రాంతాల విధ్వంసం కూడా విపరీతంగా పెరిగింది. మార్చి నెలకు ముందు 15 నెలల కాలంలో భవనాల కూల్చివేతలు, దాడులు 698 జరిగితే, గడచిన ఆరునెలల్లోనే 500 ఉదంతాలు ఉన్నాయి. హమస్‌ను అదుపు చేయలేకపోయామనే ఉక్రోషంతో ఇజ్రాయెల్‌ ఎంతకు తెగిస్తున్నదో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.

తాజాగా త్రివిధ దళాలు ప్రారంభించిన భీకరదాడులతో లక్షలాది మందిని తరిమివేస్తున్నారు. దిక్కుతోచని జనం తమ ప్రాంతాల నుంచి కకావికలౌతున్నారు.పదాతి దళాలు, వారికి మద్దతుగా యుద్ధ టాంకులు, వీటితో పాటు యుద్ద విమానాలు, హెలికాప్టర్లను రంగంలోకి దించి గాజాలో ఉన్న నివాస ప్రాంతాలపై పెద్ద ఎత్తున ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతున్నది. దీంతో కాలినడకన, బండ్లు, దొరికిన వాహనాలతో లక్షలాది మంది గాజా దక్షిణం, ఇతర చోట్లకు వెళుతున్నారు, ఎక్కడ సురక్షిత ప్రాంతం దొరుకుతుందా అని చూస్తున్నారు. ఎక్కడ ఆగితే అక్కడ విమానాలతో దాడులు జరుగుతున్నాయి. పాలస్తీనా మరో ప్రాంతమైన పశ్చిమగట్టులో గ్రామాలు, పౌరుల మీద కూడా ఇజ్రాయెల్‌ మిలిటరీ దాడులు జరుపుతున్నది. ఈ దారుణాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ భద్రతా మండలిలో గురువారం నాడు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని 15కు గాను 14 సభ్యదేశాలు బలపరచగా అమెరికా వీటో చేసి అడ్డుకుంది. గాజా మారణకాండపై ప్రవేశపెట్టిన తీర్మానాలను అమెరికా వీటో హక్కుతో అడ్డుకోవటం ఇది ఆరవసారి.

గాజాలో ఇజ్రాయెల్‌ మారణకాండకు పాల్పడుతున్నట్లు తొలిసారి ఐరాస ప్రకటించింది. అయితే ఆ బృందం వాస్తవాలను పట్టించుకోలేదని, హమస్‌కు మద్దతుగా వ్యవహరించిందంటూ భద్రతా మండలిలో అమెరికా ధ్వజమెత్తింది. అంతర్జాతీయ మానవహక్కుల కమిషన్‌ ఇలాంటి తప్పుడు నివేదికలు ఇస్తున్న కారణంగానే తాము ఆ సంస్థ నుంచి తప్పుకున్నట్లు సమర్ధించుకుంది.ఐరాస మానవహక్కుల కమిషన్‌ గాజాలో మారణకాండ జరుగుతున్నదని చెప్పటం తప్పుడు ప్రచారమని అమెరికా మధ్య ప్రాచ్య ఉపరాయబారి మోర్గాన్‌ ఆర్టగస్‌ ఆరోపించింది.మానవహక్కుల కమిషన్‌ నివేదిక అంతా అవాస్తవాలతో నిండి ఉందని, హమస్‌కు లబ్ది చేకూర్చేదిగా ఉందని ఆమె ఆరోపించింది. ఎలాంటి ఆధారాలను చూపకుండా ఇలాంటి నివేదికలను రూపొందించటమంటే తన నిబంధనలను తానే ఉల్లంఘించినట్లు ఐరాసపై ఆమె ఆరోపించింది. యూదు వ్యతిరేక వేధింపులుగా వర్ణించింది.ఇజ్రాయెల్‌ ఆత్మరక్షణ హక్కును తీర్మానం గుర్తించలేదని, హమస్‌ చర్యలను ఖండించలేదని ఆరోపించింది.

సాధారణంగా భద్రతామండలి సమావేశాల్లో ఆయాదేశాల ప్రతినిధులు మాట్లాడిన తరువాత సమావేశాలు ముగుస్తాయి. కానీ గురువారం నాడు ఒకసారి మాట్లాడిన తరువాత సభ్యులు ఆగ్రహంతో రెండోసారి ప్రసంగించటం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్‌ దుర్మార్గంపై వెల్లడైన ఆగ్రహం, రెండు శిబిరాలుగా దేశాలు చీలిపోవటాన్ని ఇది సూచించింది.గాజాలో మారణకాండను నిలిపివేయాలని కోరుతూ తీర్మానాన్ని ప్రతిపాదించిన పది దేశాల్లో అల్జీరియా ఒక్కటే అరబ్బు దేశం. గాజాలో జరుపుతున్న దుర్మార్గాలను ఖండించటంతో పాటు, దాడులను ఆపాలని, అక్కడ కరువు విలయతాండవం చేస్తున్నదని, దాడులను మరింతగా విస్తరించేందుకు ఇజ్రాయెల్‌ పూనుకున్నదని తీర్మానంలో పేర్కొన్నారు.ఇజ్రాయెల్‌ ప్రతినిధి మాట్లాడిన తరువాత తిరిగి తనకు అవకాశం ఇవ్వాలని ఆ దేశప్రతినిధితో పాటు డెన్మార్క్‌ ప్రతినిధి కూడా కోరగా ఇజ్రాయెల్‌ వక్త కూడా అదే చేశారు. అల్జీరియాకు అంత ఆగ్రహం ఎందుకని ఎదురుదాడికి దిగాడు. ఇజ్రాయెల్‌ జైళ్లలో నిర్బంధించిన పదివేల మంది పాలస్తీనియన్లను చిత్రహింసలు పెడుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి.ఏ అంతర్జాతీయ సంస్థనూ పరిశీలించేందుకు అనుమతించటం లేదు. వారిని ఏ ఆరోపణలతో నిర్బంధించిందీ కూడా చెప్పటం లేదు.భద్రతా మండలిలో అమెరికా తమకు నైతికంగా మద్దతు ఇచ్చినందుకు ఇజ్రాయెల్‌ కృతజ్ఞతలు తెలిపింది. భద్రతా మండలి సభ్యులు అల్జీరియా, హమస్‌ ప్రభావానికి లోనైనట్లు రాయబారి డానన్‌ ఆరోపించాడు. గాజాలో ఉన్న తమ బందీలను విడిపించుకొనేందుకు, హమస్‌ను దెబ్బతీసేందుకే దాడులు చేస్తున్నామని చెప్పుకున్నాడు.. అమెరికా చర్యతో పాలస్తీనియన్లు తీవ్ర ఆశాభంగం చెందారని ఐరాస రాయబారి రియాద్‌ మన్సూర్‌ పేర్కొన్నాడు. గాజా నుంచి వెలువడుతున్న దృశ్యాలను చూస్తుంటే కడుపు తరుక్కు పోతున్నదని ప్రతివారినీ కదిలిస్తున్నాయని చెప్పాడు. పసిపిల్లలు ఆకలితో మరణిస్తున్నారు, ఇజ్రాయెల్‌ మిలిటరీ భవనాల మీద నుంచి పౌరుల తలల మీద కాల్పులు జరుపుతున్నది. సామూహికంగా హత్యలు చేస్తున్నారని చెప్పాడు.

భద్రతా మండలి తీర్మానంపై ఓటింగ్‌ జరుగుతున్న సమయంలోనే గతంలో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించి లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు చేసింది.సాయుధ సంస్థ హిజబుల్లానేతలు, మిలిటియాను మట్టుపెట్టేందుకే ఈ దుర్మార్గం అన్నది తెలిసిందే. గతేడాది నవంబరు నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ మిలిటరీ 4,500 సార్లు ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు లెబనాన్‌ మిలిటరీ ప్రకటించింది. గతేడాది నవంబరులో కుదిరిన ఒప్పందం ప్రకారం హిజబుల్లా సాయుధుల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని, అక్కడ పాతిన మందుపాతరలను తొలగించేందుకు కంపూచియా, చైనా నిపుణులను అనుమతించాల్సి ఉంది. అయితే ఇజ్రాయెల్‌ పదే పదే ఆ ఒప్పందాన్ని ఉల్లంఘస్తున్నది. అందువలన ఆ రెండు చర్యలూ అమలు జరగటం లేదు. ఒప్పందంలో మధ్యవర్తులుగా ఉన్న అమెరికా, ఫ్రెంచి నేతలు తమ మిత్రదేశాన్ని అంకెకు తెచ్చి ఒప్పందం అమలుకు పూనుకోవాలని లెబనాన్‌ ప్రధాని నవాఫ్‌ సలామ్‌ డిమాండ్‌ చేశాడు.ఒక్క దక్షిణ లెబనాన్‌ మీదనేగాక యావత్‌ దేశం మీద దాడులు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చిన అమెరికా ఎక్కడా కనిపించటం లేదు. అసలు లెబనాన్‌లో ప్రభుత్వమే లేదని అందువలన ఆ పేరుతో తాము ఆయుధాలను విసర్జించేది లేదని హిజబుల్లా చెబుతున్నది, ఇజ్రాయెల్‌ జరుపుతున్నదాడులు తమ వైఖరి సరైనదే అని నిర్ధారిస్తున్నట్లు కూడా అది పేర్కొన్నది. దోహా మీద ఇజ్రాయెల్‌ దాడులు జరిపిన తరువాత తన అనుయాయి అయిన కతార్‌ మీద దాడులను అమెరికా నివారించలేకపోయిందని అలాంటిది లెబనాన్ను ఎలా రక్షిస్తుందని హిజబులా ప్రశ్నించింది. భద్రతా మండలిలో అమెరికా వీటో చేయటాన్ని హమస్‌ తీవ్రంగా ఖండించింది.మారణకాండపట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు పేర్కొన్నది. తీర్మానం ప్రవేశపెట్టిన పదిదేశాలను ప్రశంసించింది.

భావ ప్రకటనా స్వేచ్చ గురించి గొప్పలు చెప్పే బ్రిటన్‌ పాలకులు గాజాలో జరుగుతున్న మారణకాండ గురించి అక్కడి పౌరులు, పాలస్తీనా మద్దతుదారులు వాట్సాప్‌లో సమాచారం, సందేశాలు పంపిన వారి మీద కూడా ప్రభుత్వం దాడులు చేస్తున్నదని విమర్శలు వచ్చాయి. గాజాలో జరుపుతున్న దుర్మార్గాలకు నిరసనగా ఇజ్రాయెల్‌ జాతీయ ఫుట్‌బాల్‌ జట్టు, ఇజ్రాయెలీ క్లబ్‌ సభ్యులు పాల్గొనే క్రీడలను బహిష్కరించాలని ఐరోపా వ్యాపితంగా ఉన్న ఫుట్‌బాల్‌ ఫెడరేషన్లు, మాజీ ఆటగాండ్లు, ఇతరులు కూడా పెద్ద ఎత్తున ప్రచారాన్ని ప్రారంభించారు.ఇజ్రాయెల్‌కు ఆయుధాలు సరఫరా చేయటాన్ని ఇటలీ రేవు కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. ఈక్రమంలో రావెన్న రేవుకు వచ్చిన రెండు ట్రక్కులను కార్మికులతో పాటు ఇతరులు అడ్డుకున్నారు. తన వినతి మేరకు ఆయుధాలతో ఉన్న లారీలను అంగీకరించేందుకు రేవు అధికారులు తిరస్కరించినట్లు నగర మేయర్‌ ప్రకటించాడు. ఇలాంటి ప్రతిఘటనే ఫ్రాన్సు, స్వీడన్‌, గ్రీస్‌ కార్మికులు కూడా చేపట్టారు. అయితే ఇటలీ రేవుకు వచ్చిన ఆయుధాలు ఎక్కడి నుంచి తరలించిందీ తెలియలేదు. ఇజ్రాయెల్‌తో అన్ని రకాల వాణిజ్య, ఇతర సంబంధాలను నిలిపివేయాలని కోరుతూ ప్రధాని జార్జియా మెలోనీపై వత్తిడి తెచ్చేందుకు ఇటలీలో అతి పెద్ద కార్మిక సంఘమైన సిజిఐఎల్‌ సెప్టెంబరు 22న సగం రోజు సమ్మె చేసేందుకు పిలుపునిచ్చింది. ఇతర కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. పాలస్తీనియన్లపై సాగిస్తున్న మారణకాండకు నిరసనగా ఎమెన్‌లోని హౌతీ సాయుధులు ఇజ్రాయెల్‌పై బలమైన క్షిపణిదాడి చేసి రాజధాని టెలిఅవీవ్‌లోని మిలిటరీ లక్ష్యాలను దెబ్బతీసినట్లు ప్రకటించారు. అయితే డ్రోన్లను తాము అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్‌ చెప్పుకుంది.ఇజ్రాయెల్‌ మీద ఆంక్షల విధింపు అంశాన్ని పరిశీలిస్తున్నామని అయితే గాజాలో జరుగుతున్నదానిని మారణకాండగా తాము పిలిచేది లేదని జర్మనీ ప్రకటించింది. అక్టోబరులో జరిగే ఐరోపా సమాఖ్యలో ఆంక్షల విషయాన్ని పరిశీలిస్తామని ఛాన్సలర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్‌ చెప్పాడు. అయితే తాను సాధించుకున్న లక్ష్యాల దామాషాలో దాని చర్యలు ఎక్కువగా ఉన్నట్లు చెప్పాడు. వాటిని మారణకాండగా వర్ణించలేమన్నాడు. అక్కడ జరుగుతున్నది మారణకాండ అని ఐరాస కమిషన్‌ వ్యాఖ్యానించిన తరువాత జర్మనీ స్పందన ఇది.పాలస్తీనాకు రాజ్యహౌదా అన్నది ఇప్పుడు చర్చ కాదన్నాడు.

ఇజ్రాయెల్‌ దాడులు పెరగటంతో నగర జీవ నాడులు కుప్పకూలుతున్నాయని ఐరాస మావతాపూర్వక సహాయ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.గడచిన ఐదు రోజుల్లో పదకొండువేల మంది తలదాచుకుంటున్న గృహాలను కూల్చివేశారని, ఇప్పటి వరకు మొత్తం పదిలక్షల మంది నెలవులు తప్పినట్లు ఆదివారం నాటి నుంచే 56వేల మంది నిరాశ్రయులైనట్లు తెలిపింది.ప్రతి రోజూ సహాయ సంస్థలు 5.6లక్షల ఆహార పొట్లాలను అందిస్తున్నాయని, ఇజ్రాయెల్‌ ఒక పథకం ప్రకారం ఈ ఏర్పాట్లను దెబ్బతీస్తున్నదని కొన్ని ఆహార పదార్దాలతో పాటు కొన్ని ప్రాంతాలకు సరఫరాను అడ్డుకుంటున్నదని పేర్కొన్నది. గాజా దిగ్బంధనాన్ని నిరసిస్తూ అక్కడ చిక్కుకు పోయిన పౌరులకు సాయం అందించేందుకు 44 దేశాలకు చెందిన యాభైకి పైగా చిన్న చిన్న పడవలతో గ్లోబల్‌ సముద్‌ ఫ్లోటిలా పేరుతో ఒక సమూహం గాజావైపు ప్రయాణిస్తున్నది. దానిలో వైద్యులు, సాంకేతిక నిపుణులు, సంఘసేవకులు ఉన్నారు. దాన్ని అడ్డుకొనేందుకు ఇజ్రాయెల్‌ పూనుకుంది. ఉగ్రవాదులకు సాయపడేందుకు అనేక మంది ఆ పడవల్లో వస్తున్నట్లు ఆరోపించింది, ఆ ముసుగులో గతంలో మాదిరి దాడి చేసి నిర్భందించేందుకు పూనుకుంది.ఇలాంటి పడవల్లో వెళ్లి సాయం అందించటం పెద్ద విషయం గాకపోయినా ఇజ్రాయెల్‌ దుర్మార్గాన్ని లోకానికి వెల్లడించేందుకు, వత్తిడి తెచ్చేందుకు 2010 నుంచి సాగుతున్నది. గతంలో హండాలా, మాడలీన్‌ నౌకలతో వెళ్లినపుడు ఇజ్రాయెల్‌ డ్రోన్లతో దాడి చేసింది.నౌకలలో ఉన్నవారిని నిర్బంధించింది.వారిపై దాడి చేయటంతో పాటు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నది, వేరే ప్రాంతాలకు బలవంతంగా తరలించింది.ఈ సారి ఎలాంటి దుర్మార్గాలకు పాల్పడనుందో తెలియదు, యావత్‌ సభ్య సమాజం ఇజ్రాయెల్‌, దానికి నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్న అమెరికా దుర్మార్గాన్ని ఖండించాల్సి, ఎదిరించాల్సిన అవసరం ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రపంచమా గాజాను మరచిపోవద్దు : ఇజ్రాయెల్‌ దాడిలో ప్రాణాలు వదలిన ఓ జర్నలిస్టు ఆఖరి కోరిక !!

13 Wednesday Aug 2025

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Don’t forget Gaza, Gaza Deaths, Israel genocide, Netanyahu, Palestine Journalist Anas al-Sharif, Palestinian People


ఎం కోటేశ్వరరావు


2023 అక్టోబరు ఏడున గాజాలో ఇజ్రాయెల్‌ ప్రారంభించిన మారణకాండ మరోదశలో ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. హమస్‌ను అంతమొందించేందుకు గాజా స్వాధీనం తప్పదని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ప్రకటించాడు. ఇప్పటి వరకు 75వేల మంది వరకు నిరాయుధులైన పాలస్తీనియన్లను ఇజ్రాయెల్‌ మిలిటరీ చంపివేసింది. వీరిలో సగానికి పైగా పిల్లలు, మహిళలు ఉన్నారు. దాదాపు రెండు లక్షల మందిని గాయపరిచారు, లక్షలాది ఇండ్లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలను నేలమట్టం గావించారు. అయినప్పటికీ హమస్‌, ఇతర సాయుధ బృందాలను పట్టుకోవటంలో విఫలమైంది. వారిని పట్టుకోవాలంటే గాజాను పూర్తిగా తన స్వాధీనంలో తెచ్చుకోవాలని ఇజ్రాయెల్‌ చెబుతోంది. నిజానికి ఒక విధంగా గాజా ప్రస్తుతం ఇజ్రాయెల్‌ ఆక్రమణలోనే ఉంది. ఆకలితో మాడుతున్న పసిపిల్లలకు అవసరమైన ఆహారసాయాన్ని కూడా రాకుండా మిలిటరీ అడ్డుకుంటున్నది, సహాయ శిబిరాల వద్దకు వచ్చిన వారిని కూడా చంపివేస్తున్నది. ప్రపంచంలో అనేక యుద్ధాలు, ఉద్రిక్తతల సమయంలో వార్తలను సేకరించే జర్నలిస్టులకు రక్షణ ఉంటుంది, ప్రమాదవశాత్తూ గాయపడటం, మరణించటం వేరు. కానీ గాజాలో ఇప్పటి వరకు 242 మంది జర్నలిస్టులను ఇజ్రాయెల్‌ బలగాలు చంపివేశాయి. తాజాగా అల్‌ జజీరా టీవీ, పత్రికలకు వార్తలు సేకరిస్తున్న జర్నలిస్టులను హతమార్చారు, ఏమిటంటే వారంతా హమస్‌ సాయుధులతో కలసి ఉన్నారంటూ పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తున్నారు. అనాస్‌ అల్‌ షరీఫ్‌ అనే ఆల్‌ జజీరా విలేకరి తన కుటుంబం, ప్రపంచానికి ఎక్స్‌ ద్వారా ఒక చివరి సందేశం పంపాడు.‘‘ ఇది చివరి వర్తమానం, మీకు అందే సమయానికి ఇజ్రాయెల్‌ నన్ను చంపివేస్తుంది, నా గళాన్ని అణచివేస్తుంది, ప్రపంచం గాజాను మరచిపోవద్దు ’’ అని దానిలో ఉంది. ఆదివారం రాత్రి అది నిజమైంది. గాజాలోని ఆల్‌ షిఫా ఆసుపత్రి సమీపంలో జర్నలిస్టులు ఉన్నారనే చిహ్నాలు ఉన్న గుడారాన్ని లక్ష్యంగా చేసుకొని జరిపిన వైమానిక దాడిలో అల్‌ షరీఫ్‌తో పాటు తమ జర్నలిస్టులు మరో నలుగురితో సహా ఏడుగురిని చంపినట్లు అల్‌ జజీరా తెలిపింది.


ఓ జర్నలిస్టు చివరి సందేశం
అనాస్‌ అల్‌ షరీఫ్‌ చివరి సారిగా ఎక్స్‌లో పంపిన వర్తమానం ఇలా ఉంది.‘‘ ఇది నా వాంఛ మరియు చివరి వర్తమానం. ఇది మీకు చేరేలోపు ఇజ్రాయెల్‌ నన్ను చంపటంలో జయప్రదం అవుతుంది, నా గళం మూగపోయేట్లు చేస్తుంది. మొదటిది మీకు శాంతి చేకూరాలి, అల్లా దయ మరియు దీవెనలు మీకు కలగాలి. జబాలియా శరణార్ధి శిబిరంలో నేను జన్మించి కళ్లు తెరిచినప్పటి నుంచి అక్కడి వీధులు, సందుల్లో తిరుగాడుతూ నా జనం కోసం గళం విప్పి మద్దతు ఇచ్చిన ప్రతి అంశం గురించి అల్లాకు తెలుసు. మా స్వంత పట్టణమైన ఆక్రమిత అస్కలాన్‌( అల్‌ మజదాల్‌)కు తిరిగి వచ్చేందుకు అల్లా నా జీవితాన్ని పొడిగిస్తాడని ఆశిస్తున్నాను, అందువలన నేను నాకుటుంబం, ప్రేమించేవారిని కలుసుకొనేందుకు తిరిగివస్తాను. అయితే అల్లా వాంఛ ముందు మరియు ఆయన ఆదేశమే అంతిమం.
నేను బాధల మధ్యనే జీవించాను, అనేక నష్టాలు, ఇబ్బందులను చవిచూశాను. అయినప్పటికీ ఎలాంటి వక్రీకరణలు, తప్పుడు సమాచారం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా నిజాన్ని చేరవేసేందుకు ఒక్కసారి కూడా నేను వెనుకాడలేదు.ఏడాదిన్నరకు పైగా మన జనాలు ఎదుర్కొంటున్న ఊచకోతను ఆపేందుకు ఏమీ చేయని వారిని, మన పిల్లలు, మహిళల శరీరాలు ఛిద్రమైనా చలించని హృదయాలు కలవారిని, మౌనంగా దూరంగా ఉన్నవారిని, మన హత్యలను ఆమోదించిన వారిని, మన శ్వాసను ఆడనివ్వని వారిని అందరినీ అల్లా చూస్తున్నాడు.
ముస్లిం సమాజ కిరీటంలో మణి, ఈ ప్రపంచంలోని ప్రతి స్వేచ్చా జీవి గుండె చప్పుడు వంటి పాలస్తీనాను మీకు అప్పగిస్తున్నాను. దాని జనాన్ని, తప్పు చేసిన వారినీ, రక్షణ, శాంతిలేకుండా జీవించేందుకు లేదా కలలు కనేందుకు కూడా ఎన్నడూ సమయంలేని అమాయకులైన పిల్లలతో పాటు మీకు అప్పగిస్తున్నాను. వేలాది టన్నుల ఇజ్రాయెలీ బాంబులు, క్షిపణులతో నిర్మలమైన వారి శరీరాలు నలిగిపోయాయి, ఛిద్రమైన వారి భాగాలు అంతటా పడ్డాయి. బంధనాలు మిమ్మల్ని మౌనంగా ఉంచలేవు, సరిహద్దులు ఏమీ చేయలేవు. అపహరించిన మన మాతృభూమిలో స్వేచ్చ, హుందాతనపు సూర్యుడు ఉదయించే వరకు మన భూమి, పౌరుల విముక్తి కోసం మీరు వారధులుగా మారండి.
నా కుటుంబ మంచిచెడ్డలను మీకు అప్పగిస్తున్నాను. నేను కలలు కన్నవిధంగా నా కుమార్తె షామ్‌ ఎదగటాన్ని చూసే అవకాశం నాకు రాలేదు. నాకళ్ల వెలుగైన ఆమెను మీకు అప్పగిస్తున్నాను. నా భారం మోసేంతవరకు మరియు నా లక్ష్యాన్ని సాధించేవరకు అతని పెరుగుదలకు నా ప్రియమైన కుమారుడు సాలాప్‌ాను కూడా మీకు అప్పగిస్తున్నాను. నేను ప్రేమించే నా మాతృామూర్తిని కూడా మీకు అప్పగిస్తున్నాను.నేను ఇలా ఉండటానికి ఆమె చేసిన ప్రార్ధనలే కారణం. అవేనాకు పెట్టని కోట, ఆమె ఇచ్చిన వెలుగు బాట నాది. ఆమెకు శక్తిని ప్రసాదించాలని, శుభం కలగాలని నా తరఫున అల్లాను ప్రార్ధిస్తున్నాను.
నా జీవితకాల సహచరి, భార్య ఉమ్‌ సాలాప్‌ా(బయాన్‌) బాధ్యతను కూడా మీకు అప్పగిస్తున్నాను. యుద్ధం మమ్మల్ని రోజులు, నెలల తరబడి విడదీసింది. వంగని ఆలివ్‌ చెట్టు కొమ్మలా ధీటుగా ఆమె నిలిచింది, బంధానికి కట్టుబడి ఉంది, సహనంతో ఆల్లా మీద విశ్వాసంతో ఉంది. నా పరోక్షంలో ఆమె బాధ్యతలను నిర్వహించేందుకు ఆమె తన యావత్‌ శక్తి, విశ్వాసాన్ని వినియోగిస్తున్నది. వారందరికీ మీరు అండగా నిలవాలని కోరుతున్నాను, అల్లా తరువాత మీరే వారికి మద్దతు ఇవ్వాలి.
నేను గనుక మరణిస్తే, నా సిద్దాంతాలకు గట్టిగా నిలిచి నేను మరణించేందుకు సిద్దం. నేను అల్లా ఆదేశాలకు అనుగుణంగా నడుస్తానని ప్రమాణం చేశాను, నేను ఆయన్ను తప్పకుండా కలుసుకుంటాను. ఆయనతో ఎప్పటికీ నిలిచి ఉంటానని హామీ ఇస్తున్నాను. ఓ అల్లా అమరజీవుల్లో నన్ను ఒకరిగా స్వీకరించు, నా గత, భవిష్యత్‌ పాపాలను క్షమించు. నాజనం, నా కుటుంబం స్వేచ్చా బాటలో నడిచేందుకు అవసరమైన వెలుగునిచ్చేందుకు నా రక్తం తోడ్పడేట్లు చేయి. ఆకాంక్షలకు అనుగుణంగా నేను లేనట్లయితే నన్ను క్షమించు.
నా వాగ్దానాన్ని నిలుపుకొనేందుకు దాన్ని ఎన్నడూ మార్చుకోకుండా, ద్రోహం చేయకుండా ఉండేందుకు దయతో నాకోసం ప్రార్ధించండి. గాజాను మరచిపోవద్దు. క్షమ మరియు మీలో ఒకడిగా అంగీకరించేందుకు మీరు చిత్తశుద్దితో చేసే ప్రార్ధనల్లో నన్ను మరవకండి.’’


హృదయాలను కదలించే చివరి సందేశం పంపిన అనాస్‌ అల్‌ షరీఫ్‌ 28 సంవత్సరాల యువకుడు, జర్నలిస్టు, వీడియో గ్రాఫర్‌. అతని స్వస్థలం ప్రస్తుతం ఇజ్రాయెల్‌ ఆక్రమణలో ఉంది.పాలస్తీనా విముక్తి పోరులో ప్రాణాలకు తెగించి వార్తలను అందిస్తున్నవారిలో ఒకడు. అతనికి హమస్‌ తీవ్రవాది ముద్రవేసిన ఇజ్రాయెల్‌ మిలిటరీ గత రెండు సంవత్సరాలుగా చంపివేస్తామని అనేక సార్లు బెదిరించింది. అది చంపదలుకున్నవారందరికీ ఏదో ఒక ముద్రవేస్తున్నది. ఇజ్రాయెల్‌ ఆరోపణను ఐరాస తిరస్కరించింది. గాజా మారణకాండకు సంబంధించి అతను తీసిన ఫొటోకు 2024లో పులిట్జర్‌ బహుమతి ఇచ్చారు. రెండు సంవత్సరాలుగా అల్‌ జజీరాలో పనిచేస్తున్నాడు. గత నెలలో ఆకలితో చంపుతున్న ఇజ్రాయెల్‌ దుశ్చర్యను వెలుగులోకి తెచ్చాడు. అప్పటి నుంచి అతని కోసం ఇజ్రాయెల్‌ మిలిటరీ వేట ప్రారంభించి చివరకు ఆగస్టు పది రాత్రి విమానాలతో దాడి చేసి హతమార్చింది.


అల్‌ షరీఫ్‌ వంటి ఎందరో పాలస్తీనియన్లు శరణార్ధి శిబిరాల్లోనే పుట్టి అక్కడే పెరిగి చివరికి అదే ఇజ్రాయెల్‌ దుర్మార్గాలకు అక్కడే మరణిస్తున్నారు. గత ఎనిమిది దశాబ్దాలుగా సాగుతున్న మారణకాండ, పోరు అలాంటి ఎందరినో మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్దం చేస్తున్నది తప్ప పిరికిబారేట్లు చేయటం లేదు. 2023 అక్టోబరు ఏడు నుంచి ఇప్పటి వరకు 242 మంది జర్నలిస్టులను చంపినట్లు ఐరాస పేర్కొన్నది. రెండు ప్రపంచ యుద్దాలు, వియత్నాం, ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌ దురాక్రమణ వంటి అనేక యుద్ధాలన్నింటిలో కూడా ఇంత మంది ప్రాణాలు కోల్పోలేదని విశ్లేషకులు పేర్కొన్నారు.ఇటీవలి సంవత్సరాలలో జర్నలిస్టులకు ప్రాణాంతక, అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఉదంతం ఈ మారణకాండ. తనకు అనుకూలంగా వార్తలు ఇచ్చే వారిని తప్ప అంతర్జాతీయ జర్నలిస్టులను గాజాలో ప్రవేశించకుండా ఇజ్రాయెల్‌ అడ్డుకుంటున్నది. ఈ నేపధ్యంలో స్థానిక పాలస్తీనియన్లే విలేకర్లుగా మారి ఆల్‌ జజీరా వంటి మీడియా సంస్థలకు వార్తలను అందిస్తున్నారు. అది కూడా లేనట్లయితే అసలు గాజాలో ఏం జరుగుతున్నదో బయటి ప్రపంచానికి తెలిసే అవకాశమే ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు.


గాజాలో తాజా పరిణామాల విషయానికి వస్తే హమస్‌ ఆయుధాలు విసర్జింతవరకు దాడులు చేయటం తప్ప మరొకమార్గం లేదని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ప్రకటించాడు. ప్రస్తుతం 70నుంచి75శాతం వరకు తమ ఆధీనంలో ఉందని చెప్పాడు.హమస్‌కు రెండు గట్టి స్థావరాలు ఉన్నాయని పూర్తిగా తుదముట్టించాలంటే గాజా స్వాధీనం చేసుకోవాల్సిందే అన్నాడు. ఈ వైఖరిని అనివార్యమై కొన్ని పశ్చిమదేశాలు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ అమెరికా అండతో ఈ దుర్మార్గానికి పూనుకున్నాడు. గాజాలో దాడులకు ఉపయోగించే ఆయుధాలను ఇజ్రాయెల్‌కు నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు జర్మనీ ప్రకటించింది. అయితే నిజంగా అమలు చేస్తుందా లేక వేరే మార్గాల ద్వారా సరఫరా చేస్తుందా అన్నది చెప్పలేము.హమస్‌కు వ్యతిరేకంగా ఆత్మరక్షణ చేసుకొనే హక్కు ఇజ్రాయెల్‌కు ఉన్నదని జర్మనీ ఇదే సందర్భంగా పేర్కొన్నది. పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించిన ఇజ్రాయెల్‌ గత ఏడు దశాబ్దాల నుంచి చెబుతున్న ఆత్మరక్షణ కతలను పశ్చిమదేశాలు సమర్ధిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పేరుతో పాలస్తీనాను అడ్డుకోవటం అడ్డగోలు వ్యవహారం తప్ప మరొకటి కాదు.జర్మనీ గతంలో సరఫరా చేసిన ఫ్రైగేట్స్‌తోనే గాజాపై ఇజ్రాయెల్‌ నౌకాదళం తొలి దాడులు జరిపింది.


గాజా ఆక్రమణను అడ్డుకొనేందుకు ముస్లిం దేశాలన్నీ ఐక్యం కావాలని టర్కీ, ఈజిప్టు పిలుపునిచ్చాయి. ఈజిప్టుతో చర్చలు జరిపిన తరువాత విదేశాంగశాఖ మంత్రి బదర్‌ అబ్దెలెటీతో కలసి టర్కీ విదేశాంగ మంత్రి హకన్‌ ఫిదాన్‌ శనివారం నాడు విలేకర్ల సమావేశంలో ఈ పిలుపునిచ్చారు. రెండు దేశాలూ ఇజ్రాయెల్‌ చర్యను ఖండిరచాయి.తక్షణమే ఇస్లామిక్‌ దేశాల సంస్ధ సమావేశం జరపాలని కోరారు. ఇజ్రాయెల్‌ చర్య ఒక్క పాలస్తీనాకే గాక ఇరుగుపొరుగు దేశాలన్నింటికీ ప్రమాదమే అని పేర్కొన్నారు. ఇస్లామిక్‌ దేశాల సంస్థ విదేశాంగ మంత్రుల కమిటీ కూడా ఖండిరచింది. భద్రతా మండలి, ప్రపంచ అగ్రరాజ్యాలు జోక్యం చేసుకోవాలని కోరింది. లక్షలాది మంది ఇజ్రాయెల్‌ పౌరులు రాజధాని టెల్‌ అవీవ్‌, ఇతర నగరాల్లో గాజా దురాక్రమణ ప్రతిపాదనను ఖండిస్తూ పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేశారు. ప్రభుత్వ చర్యకు సైనికులు మద్దతు ఇవ్వరాదని నినదించారు. హమస్‌ వద్ద బందీలుగా ఉన్నవారిని విడిపించేందుకు అవసరమైతే నెతన్యాహు ప్రభుత్వ వైఖరిని నిరసనగా సాధారణ సమ్మె జరపాలని బందీల కుటుంబ సభ్యులు పిలుపునిచ్చారు. స్వజనంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇజ్రాయెల్‌ చర్యలకు నానాటికీ వ్యతిరేకత వెల్లడవుతున్నప్పటికీ డోనాల్డ్‌ ట్రంప్‌ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు, నిస్సిగ్గుగా మద్దతు ప్రకటిస్తున్నాడు. మరింత పెద్ద ఎత్తున నిరసనోద్యమం జరిగితే తప్ప ఇజ్రాయెల్‌ వెనుకడుగువేసే అవకాశం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బాంబే హైకోర్టు సుభాషితాల ప్రకారం ‘‘దుమ్ము రేపుతున్న’’ నరేంద్రమోడీ దేశభక్తుడా, కాదా !

10 Sunday Aug 2025

Posted by raomk in CPI(M), Current Affairs, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Bombay high court cpi(M) case, Gaza Deaths, Israel genocide, Narendra Modi, RSS

ఎం కోటేశ్వరరావు


‘‘ దేశభక్తులుగా ఉండండి, దేశంలో ఉన్న సమస్యలను చేపట్టండి :బాంబే హైకోర్టు ’’ మీడియా వార్తల్లో వచ్చిన ఒక శీర్షిక ఇది. గాజాలో ఇజ్రాయెల్‌ మారణకాండకు నిరసనగా అజాద్‌ మైదానంలో తలపెట్టిన ప్రదర్శనకు ముంబై పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆ చర్యకు వ్యతిరేకంగా సిపిఐ(ఎం) దాఖలు చేసిన పిటీషన్ను కొట్టివేస్తూ బాంబే హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చింది.సిపిఎం తరఫున మానవ, పౌరహక్కుల సీనియర్‌ న్యాయవాది మిహిర్‌ దేశాయ్‌ వాదించారు. కోర్టు నిర్ణయం సరైనదా కాదా అన్నది ఒక అంశమైతే ఈ సందర్భంగా డివిజన్‌ బెంచ్‌లోని న్యాయమూర్తులు రవీంద్ర ఘాగే, గౌతమ్‌ అఖద్‌ చేసిన వ్యాఖ్యలు ఆలోచింపచేసేవిగా, ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. అవి రాజ్యాంగ వ్యతిరేకమైనవని సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనలో విమర్శించింది. ఎస్‌ఎం గోరవాద్‌కర్‌ అనే సీనియర్‌ న్యాయవాది సిపిఎం ప్రకటన నేరపూరితంగా ఉందని, న్యాయమూర్తులకు దురుద్దేశ్యాలను ఆపాదించేదిగా ఉన్నందున కోర్టే స్వయంగా చర్య తీసుకోవాలని ఆగస్టు నాలుగవ తేదీన ఒక పిటీషన్‌ దాఖలు చేశారు. ఎలాంటి చర్యలు అవసరం లేదంటూ కోర్టు దాన్ని కొట్టివేసింది.


ఇటీవలి కాలంలో కోర్టులు ఇస్తున్న తీర్పులు, ఆదేశాలు అనేకం వివాదాస్పదం అవుతున్నాయి. విచారణల సందర్భంగా న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలు కూడా విమర్శలకు దారితీస్తున్నాయి. తాజా ఉదంతానికి వస్తే అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి ప్రశాంతకుమార్‌ క్రిమినల్‌ కేసులను విచారించకూడదంటూ సుప్రీం కోర్టు డివిజన్‌ బెంచి ఇచ్చిన ఆదేశం వివాదాస్పదమైంది. ఈ ఆదేశాన్ని అమలు జరపకుండా చూసేందుకు కోర్టు మొత్తాన్ని సమావేశపరచాలని పదమూడు మంది అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తులు హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అరుణ్‌ భన్సాలీకి లేఖ రాశారు. దీంతో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి ఆర్‌ గవాయ్‌ జోక్యం చేసుకోవటంతో గతంలో ఇచ్చిన ఉత్తరువును కోర్టు వెనక్కు తీసుకుంది. అసలు అలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తిందన్నది కీలకమైన అంశం.మణిపూర్‌ హైకోర్టు తన పరిధిలో లేని గిరిజనేతరులను గిరిజనులుగా మార్చే రిజర్వేషన్ల అంశంపై జారీ చేసిన ఆదేశాలతో ఆ రాష్ట్రంలో వ్యతిరేకులు, అనుకూల సామాజిక తరగతుల మధ్య తలెత్తిన ఘర్షణలు, దాడులతో 2023 మే మూడవ తేదీ నుంచి రాష్ట్రంలో అల్లకల్లోలం తలెత్తింది, ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉంది, ఎప్పుడు సాధారణ పరిస్థితి నెలకొంటుందో తెలియని స్థితి. దీనికి మూలం కోర్టు ఆదేశాలే. న్యాయమూర్తులందరూ పత్తిత్తులు కాదని గతంలో కొందరు, తాజాగా హైకోర్టు జస్టిస్‌ యశ్వంతవర్మ ఉదంతం వెల్లడిరచింది. జ్యుడిషియల్‌ యాక్టివిజమ్‌(న్యాయమూర్తుల ఆచరణతత్వం) రెండంచుల పదనుగల కత్తి వంటిది. చట్టంలో దీనికి అవకాశం ఉందా లేదా పరిధి ఏమిటి అన్నది ఒక చర్చ. ఈ యాక్టివిజమ్‌లో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు కొన్ని విమర్శలకు, మరికొన్ని ప్రశంసలకు అర్హమైనవి. బాంబే హైకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యలు మొదటి కోవకు చెందినవని చెప్పవచ్చు. తీర్పులను విమర్శించే స్వేచ్చ మనకు రాజ్యాంగం కల్పిస్తున్నది గానీ న్యాయమూర్తులకు దురుద్దేశ్యాలను ఆపాదించకూడదు. ఇంతకూ సిపిఎం తన ప్రకటనలో చేసిన వ్యాఖ్యలేమిటి ? దాని పూర్తి పాఠం దిగువ విధంగా ఉంది.


‘‘ రాజ్యాంగ వ్యతిరేకమైన బాంబే హైకోర్టు వ్యాఖ్యలకు ఖండన
గాజాలో కొనసాగుతున్న ఇజ్రాయెల్‌ మారణకాండకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ు అనుమతించని ముంబై పోలీసు చర్యను సవాలు చేస్తూ పార్టీ దాఖలు చేసిన దరఖాస్తును తిరస్కరించిన సందర్భంగా బాంబే హైకోర్టు చేసిన వ్యాఖ్యలను సిపిఐ(ఎం) పొలిట్‌ బ్యూరో తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ సందర్భంగా పార్టీ దేశభక్తిని ప్రశ్నించేవరకూ కోర్టు వెళ్లింది. ఒక రాజకీయ పార్టీకి రాజ్యాంగం ప్రసాదించిన అంశాల గురించి లేదా పాలస్తీనియన్లు మరియు వారి న్యాయబద్దమైన మాతృభూమి హక్కుకు మన దేశం మరియు మన పౌరులు ప్రదర్శించిన సంఫీుభావ చరిత్ర గురించి గానీ హైకోర్టుకు తెలియనట్లుగా కనిపించటం హాస్యాస్పదంగా ఉంది. కోర్టు వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వ వైఖరికి అనుగుణంగా స్పష్టమైన రాజకీయ వివక్షతో కూడినవిగా ఉన్నాయి. కోర్టు బెంచ్‌ వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి, ‘‘ పాలస్తీనా లేదా ఇజ్రాయెల్‌ పక్షానికి అనుకూలంగా గానీ ఇచ్చే మద్దతు రేపే దుమ్ము(వివాదం) గురించి మీకు తెలియదు. మీరెందుకు ఇలా చేయాలని కోరుకుంటున్నారు. మీరు ప్రాతినిధ్యం వహించే పార్టీ చర్య దేశ విదేశీ వ్యవహారాలకు చేసేదేమిటో మీకు అర్ధం కావటం లేదని స్పష్టంగా కనిపిస్తున్నది. మీ సంస్థ భారత్‌లో నమోదైన వాటిలో ఒకటి. చెత్త కుమ్మరింపు, కాలుష్యం, మురుగు, వరదల వంటి అంశాలను మీరు తీసుకోవచ్చు. మేం కొన్ని ఉదాహరణలు మాత్రమే చెబుతున్నాం. మీరు వాటి మీద నిరసనలు తెలపటం లేదు కానీ దేశానికి కొన్నివేల మైళ్ల దూరంలో జరుగుతున్నదాని మీద చేస్తున్నారు.’’
గత శతాబ్ది 40వ దశకంలో మహాత్మాగాంధీ, జాతీయోద్యమం, తరువాత స్వతంత్ర భారత్‌ విదేశాంగ విధానం గానీ పాలస్తీనియన్ల స్వేచ్చాహక్కు మరియు మాతృభూమికి మద్దతు ఇవ్వటానికి సంకోచించలేదు. ఐరాస సంస్థలు మరియు అంతర్జాతీయ న్యాయస్థానం వెల్లడిరచిన వైఖరులు మరియు ఇజ్రాయెల్‌ చర్యలకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాపితంగా అసందిగ్దంగా తెలుపుతున్న మద్దతు వాస్తవాన్ని గానీ కోర్టు గుర్తించినట్లు లేదు. స్వేచ్చ, ప్రజాస్వామ్యాలను ప్రేమించే దేశ పౌరులు ఇలాంటి గర్హÛనీయమైన వైఖరిని ఎలాంటి శషభిషలు లేకుండా తిరస్కరించేందుకు మాతో కలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ’’ అని పేర్కొన్నది.


బాంబే హైకోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను పూర్తిగా సిపిఐ(ఎం) తన ప్రకటనలో ప్రస్తావించలేదు. మీడియాలో వచ్చిన వార్తల్లోని అంశాలు కొన్ని దిగువ విధంగా ఉన్నాయి. ‘‘ మన దేశానికి చాలా సమస్యలున్నాయి. ఇలాంటి వాటిని మేము కోరుకోవటం లేదు. మీరు సంకుచిత దృష్టితో ఉన్నారని చెప్పాల్సి వచ్చి నందుకు నేను విచారిస్తున్నాను. మీరు గాజా మరియు పాలస్తీనా సమస్యలను చూస్తున్నారు మీ స్వంత దేశం గురించి చూడండి.దేశ భక్తులుగా ఉండండి, ఇది దేశభక్తి కాదు.(డెక్కన్‌ హెరాల్డ్‌)’’ సిపిఐ(ఎం) చేసిన ప్రకటన కోర్టులను ధిక్కరించేదిగా, న్యాయవ్యవస్థ మీద విశ్వాసాన్ని పోగొట్టేదిగా ఉన్నందున స్వయంగా హైకోర్టు చర్య తీసుకోవాలని కోరుతూ సీనియర్‌ న్యాయవాది ఎస్‌ఎం గోరవాద్‌కర్‌ దాఖలు చేసిన దరఖాస్తును హైకోర్టు కొట్టి వేసింది. ఎలాంటి చర్యలూ అవసరం లేదని పేర్కొన్నది, తమ వ్యాఖ్యల మీద ఆ పార్టీ తన అభిప్రాయాన్ని వెల్లడిరచిందని మాత్రమే చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తులు వెల్లడిరచిన అభిప్రాయాలను ఆసరా చేసుకొని ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ కమ్యూనిస్టుల మీద మరోసారి విషం కక్కింది.ఆధారం లేని ఆరోపణలు చేసింది. వారెప్పుడూ రష్యా, చైనాలకు విధేయులుగా ఉంటారని వ్యాసకర్త సెలవిచ్చారు. దశాబ్దాల నాటి మైండ్‌ సెట్‌ నుంచి ఇంకా బయటపడినట్లు లేదు, రష్యాను కూడా కమ్యూనిస్టు దేశంగా ఇప్పుడు కూడా పేర్కొన్నారు. పాడిరదే పాడరా అన్నట్లుగా అరిగిపోయిన రికార్డును మళ్లీ వినిపించారు.


‘‘ పాలస్తీనా పక్షం లేదా ఇజ్రాయెల్‌ పక్షానికి అనుకూలంగా గానీ ఇచ్చే మద్దతు రేపే దుమ్ము(వివాదం) గురించి మీకు తెలియదు ’’ అంటూ సిపిఎంకు చెప్పిన సుభాషితం ప్రధాని నరేంద్రమోడీకి వర్తిస్తుందా ? ఆయన దేశభక్తుడా కాదా ? హమస్‌ సాయుధులు 2023 అక్టోబరు ఏడవ తేదీన గాజా నుంచి ఇజ్రాయెల్‌లో ప్రవేశించి 1,195 మందిని చంపి 251 మందిని బందీలుగా పట్టుకున్నారు. ఆ మరుసటి రోజు నుంచి హమస్‌ సాయుధులను పట్టుకొనే పేరుతో ఇజ్రాయెల్‌ మిలిటరీ జరుపుతున్నదాడుల్లో ఇప్పటి వరకు 61వేల మందిని చంపారు, వారిలో సగానికి పైగా పిల్లలు, మహిళలు. మరో లక్షా 52వేల మందిని గాయపరిచారు. లక్షలాది ఇండ్లు, ఆసుపత్రులు, విద్యా సంస్థలను నేలమట్టం గావించారు. గాజా ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించేందుకు పూనుకున్నారు. హమస్‌ చర్యను మనదేశంలో ఏ ఒక్క పార్టీ కూడా సమర్ధించలేదు. పాలస్తీనియన్ల మీద, వారికి ప్రాతినిధ్యం వహించే సాయుధ సంస్థలతో ఇజ్రాయెల్‌ మిలిటరీ, దాని మద్దతు ఉన్న సాయుధ బృందాల మధ్య దాడులు, ప్రతిదాడులు ఈ నాటివి కాదు. వాటి కొనసాగింపుగా హమస్‌ దాడులు చేసింది, నిరాయుధులుగా ఉన్న పాలస్తీనా పౌరులు లేదా ఇజ్రాయెల్‌ పౌరులను చంపటం ఎవరు చేసినా తప్పే. హమస్‌ దాడుల గురించి గుండెలు బాదుకుంటున్నవారు, గడచిన ఎనిమిది దశాబ్దాలుగా పాలస్తీనా ఆక్రమణకు పూనుకోవటం, ఇజ్రాయెల్‌ చేస్తున్న మారణకాండ గురించి పల్లెత్తు మాట్లాడటం లేదు.హమస్‌ దాడి తరువాత మన ప్రధాని నరేంద్రమోడీ ఇజ్రాయెల్‌కు మద్దతుగా మాట్లాడారు, దానికి మద్దతుగా ఉంటామని చెప్పారు. పాలస్తీనియన్లను హత్య కావించటం తప్పు అంటారే తప్ప దానికి బాధ్యురాలైన ఇజ్రాయెల్‌ను ఇంతవరకు ఖండిరచలేదు. మనదేశంలో ఎన్నో సమస్యలుండగా ఎక్కడో జరిగిన వాటి మీద నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని దేశంలో ప్రతిపక్షాలన్నీ తప్పు పట్టాయి. హైకోర్టు న్యాయమూర్తుల సుభాషితాల ప్రకారం మోడీ నోరు మూసుకొని ఉండాలి కదా, ఎందుకు ఇజ్రాయెల్‌కు మద్దతుగా మాట్లాడినట్లు ? రాజ్యాంగం ప్రకారం ప్రధాని ఒక రాజకీయ పార్టీ నాయకుడు, ఇజ్రాయెల్‌ పట్ల గత ప్రభుత్వాలు తీసుకున్న వైఖరికి భిన్నంగా వ్యవహరించి ‘‘ దుమ్ము(వివాదం)’’ రేపారు. తమ మీద తిరుగుబాటు చేసి భారత్‌లో ప్రవాస ప్రభుత్వం ఏర్పాటు చేసిన దలైలామా 90వ జన్మదినోత్సం, అంతకు ముందు అరుణాచల్‌ ప్రదేశ్‌ సందర్శన సందర్భంగా చైనా అభ్యంతరాలు తెలిపినా మన ప్రభుత్వం, ప్రధాని కూడా ఖాతరు చేయలేదు, అది రెండు దేశాల మధ్య ‘‘దుమ్ము ’’ రేపింది. చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌లో అధికారానికి వచ్చిన చైనా వ్యతిరేక ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి తన ప్రతినిధిని పంపి బిజెపి ‘‘ దుమ్ము ’’ రేపింది. ప్రధానిగా ఉంటూ అమెరికా పర్యటనకు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో సత్కారాలు పొంది తిరిగి రావాల్సిన నరేంద్రమోడీ అబ్‌కీబార్‌ ట్రంప్‌ సర్కార్‌ అని పిలుపిచ్చి ‘‘ దుమ్ము ’’ రేపారు. ఈ చర్య అమెరికా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం, మన విదేశాంగ విధానానికి వ్యతిరేకం.


ఒక పార్టీ నేతగా ప్రధాని మోడీకి ఇజ్రాయెల్‌ను సమర్ధించే హక్కు ఉన్నపుడు మరో పార్టీకి విమర్శించే, నిరసించే హక్కు ఉంటుందని న్యాయమూర్తులకు తెలియదా ? అధికారంలో ఉన్న పార్టీ అడుగుజాడల్లోనే నడవాలా ? అమెరికా మొదలు ఆస్ట్రేలియా, ఐరోపా నుంచి ఆఫ్రికా వరకు అన్ని ఖండాలు, దేశాలలో లక్షలాది మంది పాలస్తీనియన్ల మీద సాగిస్తున్న మారణకాండకు పలు రూపాల్లో నిరసన తెలుపుతున్న అంశాన్ని న్యాయమూర్తులు పరిగణనలోకి తీసుకోరా ? ఆ దేశాల్లో వారికి స్థానిక సమస్యలు లేక లేదా పనిపాటలు లేక అంతర్జాతీయ అంశం మీద స్పందిస్తున్నారా ? వియత్నాం మీద యుద్ధానికి వ్యతిరేకంగా స్వంత ప్రభుత్వ తీరునే తప్పు పడుతూ అమెరికాలో పెద్ద ఉద్యమమే నడిచిన చరిత్రను మరువగలమా ? మానవత్వం, మానవహక్కులను పరిరక్షించాలన్న వాంఛ ఈ నిరసనల్లో ఉందని న్యాయమూర్తులు గ్రహించలేని స్థితిలో ఉన్నట్లు కనిపిస్తున్నది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత పుట్టిన తరాలలో గత చరిత్ర, ప్రజా ఉద్యమాలకు అంతర్జాతీయ సంఫీుభావం వంటి అంశాల పట్ల ఆసక్తి లేదు. నయా ఉదారవాద విధానాలు అమల్లోకి వచ్చిన తరువాత సంకుచిత ధోరణలు మరింతగా పెరుగుతున్నాయి. దీనికి సమాజంలో ఎవరూ మినహాయింపుగా కనపడటం లేదు. మణిపూర్‌లో 2023 మే 3వ తేదీ నుంచి ప్రారంభమైన హింసాకాండలో ఒక మహిళను వివస్త్రను గావించి ఊరేగించిన దుర్మార్గం జరిగినప్పటికీ తెలిసి కూడా ప్రధాని నరేంద్రమోడీ పట్టించుకోలేదు. ఆ ఉదంతం సామాజిక మాధ్యమంలో వైరల్‌ అయిన తరువాత జూలై మూడున మరోమార్గం లేక నోరు విప్పాల్సి వచ్చింది. రెండు సంవత్సరాలు దాటిన తరువాత కూడా ఆ రాష్ట్రాన్ని సందర్శించేందుకు తీరికలేని ప్రధాని ఈ కాలంలో అనేక దేశాలను సందర్శించి ప్రసంగాలు చేసి వచ్చారు. ఈ తీరు న్యాయమూర్తులకు పట్టదా ? స్వదేశీ సమస్యలను పట్టించుకోండి, దేశభక్తుడిగా ఉండండి అని మోడీకి సలహా ఇవ్వగలరా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

గాజాలో మారణకాండకు ఏడాది : ఆయుధాలతో ఇజ్రాయెల్‌,తప్పుడు వార్తలతో మీడియా దాడి !

09 Wednesday Oct 2024

Posted by raomk in Asia, COUNTRIES, Current Affairs, Europe, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, UK, USA, WAR

≈ Leave a comment

Tags

fake news, Hamas Israel, Israel genocide, Joe Biden, media bias, media credibility, Netanyahu, Palestinians, Propaganda War, Western media propaganda


ఎం కోటేశ్వరరావు


తమ్ముడు తనవాడైనా ధర్మాన్ని ధర్మంగా చెప్పాలన్న లోకోక్తి తెలిసిందే. వర్తమాన ప్రపంచంలో అలా జరుగుతోందా ? నూటికి నూరుశాతం లేదు. పక్షపాత తీర్పులు, వైఖరులే వెల్లడౌతున్నాయి. గాజాపై ఇజ్రాయెల్‌ మారణకాండ ప్రారంభమై అక్టోబరు ఏడవ తేదీతో ఏడాది గడిచింది. ప్రపంచ ప్రధాన స్రవంతి మీడియా ఇజ్రాయెల్‌ మీద హమస్‌ ఉగ్రవాదులు జరిపిన దాడికి సంవత్సరం నిండిరది అంటోంది. హమస్‌దాడిని ఎవరూ సమర్ధించటం లేదు. ఐక్యరాజ్య సమితి 1948లో ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేసిన తరువాత అప్పటి వరకు ఉన్న పాలస్తీనా ఉనికిలో లేకుండా పోయింది. ఏదో ఒకసాకుతో దానికి కేటాయించిన ప్రాంతాలన్నింటినీ ఆక్రమించుకోవటంతో పాటు వేలాది మందిని చంపి, లక్షల మందికి నిలువనీడ లేకుండా చేస్తూ పాలస్తీనా దేశం ఏర్పడకుండా ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికాతో సహా పశ్చిమదేశాలన్నీ మద్దతు ఇస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేస్తున్న బృందాలలో హమస్‌ ఒకటి. దాని దాడులు గత ఏడాదే ప్రారంభం కాలేదు. కానీ అది చేసిన దాడి సాకుతో గాజాలో ఏడాది కాలంగా మారణకాండ సాగిస్తున్నారు. ఇప్పటి వరకు 42వేల మందిని చంపారు.పదివేల మంది జాడ తెలియటం లేదు, లక్ష మంది వరకు గాయపడ్డారు.లక్షలాది ఇండ్లను నేలమట్టం గావించారు. గాజాలోని 23లక్షల మందిని ఇండ్ల నుంచి వీధుల్లోకి నెట్టారు. మారణకాండ ఇంకా కొనసాగుతోంది. వెస్ట్‌బాంక్‌ ప్రాంతానికి విస్తరించారు. ఇదంతా ఎందుకు అంటే హమస్‌ జరిపిన దాడిలో 815 మంది సాధారణ పౌరులతో సహా 1,195 మంది ఇజ్రాయెలీలు మరణించారు, ఆ సందర్భంగా కొందరు విదేశీయులతో సహా 251 మందిని బందీలుగా పట్టుకున్నారు, వారిలో కొందరిని విడుదల చేశారు, మరికొందరు మరణించగా మరో 95 మంది హమస్‌ వద్ద బందీలుగా ఉన్నారు. దీనికి ప్రతీకారం అని చెబుతున్నారు. ఏ రీత్యా చూసినా ఇజ్రాయెల్‌ చర్య గర్హనీయం, అంతర్జాతీయ న్యాయస్థానంలో యుద్ధ నేరాల కింద దీనికి బాధ్యులైన వారిని శిక్షించాలి.


ఈ దారుణకాండ గురించి ప్రపంచ మీడియా వార్తలు ఇస్తున్న తీరు కూడా సభ్యసమాజం ఆమోదించేదిగా లేదు. అంతర్జాతీయ వార్తా సంస్థలన్నీ పశ్చిమ దేశాలకే చెందినవి కావటంతో అవి అందచేసిన తప్పుడు సమాచారాన్నే వాస్తవాలుగా చెబుతున్నారు. అయితే తప్పుడు, వక్రీకరణ, కుహనా వార్తలను ఇవ్వటం కొత్తగా జరుగుతున్నది కాదు. ప్రపంచం మీద ప్రచారదాడి జరుగుతున్నది. గాజాలో తలెత్తిన మానవ సంక్షోభ తీవ్రత అక్కడి నుంచి వార్తలు పంపుతున్న పశ్చిమదేశాల విలేకర్లలో ఎక్కడా కానరాదు. ప్రపంచానికి వారు అందచేస్తున్నవి తప్ప ప్రత్యామ్నాయ సంస్థలు లేవు. గాజాలో మరణించిన, గాయపడిన వారిలో నూటికి 80శాతం మంది నిరాయధులైన మహిళలు, పిల్లలే ఎందుకు ఉన్నారో ఏ మీడియా అయినా చెబుతోందా? హమస్‌ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందో చూడండి అంటూ అందచేస్తున్న వీడియోలలో ఒక శాతమైనా ఇజ్రాయెల్‌ దుర్మార్గాలకు సంబంధించి లేవంటే అతిశయోక్తి కాదు. వైమానికదాడులు, టాంకుల ఫిరంగి గుళ్లకు 128 మంది జర్నలిస్టులు మరణించగా వారిలో 123 మంది పాలస్తీనియన్లు, ఇద్దరు ఇజ్రాయెలీలు, ముగ్గురు లెబనీస్‌ ఉన్నారు. మరో 35 మంది గాయపడ్డారు. ఏకపక్షంగా జరుగుతున్న మారణకాండకు ఇది ఒక నిదర్శనం.ఎక్కడో ఏసి గదుల్లో కూర్చొని కంప్యూటర్‌ గ్రాఫిక్‌లు సృష్టిస్తున్నదెవరో, యుద్ధరంగంలో ప్రాణాలకు తెగించి వాస్తవాలను నివేదించేందుకు పని చేస్తున్నదెవరో అర్ధం అవుతోంది. మేము సైతం అన్నట్లుగా సాధారణ పౌరులతో పాటు పాలస్తీనా జర్నలిస్టులు పని చేస్తున్నారు, ప్రాణాలర్పిస్తున్నారు.


ఇజ్రాయెల్‌ మిలిటరీ, ప్రభుత్వ పెద్దలు అందిస్తున్న సమాచారాన్ని స్వయంగా చూసినట్లు పశ్చిమదేశాల విలేకర్లు, సంస్థలు చిత్రిస్తున్నాయి. ఐరోపాలో అతి పెద్ద మీడియా సంస్థ జర్మన్‌ యాక్సెల్‌ స్ప్రింగర్‌ అప్‌డే అనే ఒక యాప్‌ను రూపొందించింది. ఇజ్రాయెల్‌ ప్రతినిధులు చెప్పే కథనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పాలస్తీనీయుల మరణాలను తగ్గించి చూపాలని తన సిబ్బందికి ఆదేశాలిచ్చినట్లు దాని అంతర్గత పత్రాల ద్వారా వెల్లడైందని ఇంటర్‌సెప్ట్‌ అనే పత్రిక పేర్కొన్నది. అంతేకాదు మరీ తప్పనిసరైతే తప్ప పాలస్తీనియన్ల గురించి ప్రస్తావించవద్దని అమెరికా న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక కూడా తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. యజమానులే అలాంటి వైఖరి తీసుకున్నతరువాత నిజం రాసినా, చూపినా అవి పాఠకులు, వీక్షకుల వద్దకు చేరుకోవు అన్నది మీడియాలో పని చేసేవారందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అందుకే హమస్‌ను ఒక రాక్షసిగా, దాన్ని మట్టుపెట్టేందుకు పూనుకున్న అపరశక్తిగా, బాధిత దేశంగా ఇజ్రాయెల్‌ను చిత్రించారు. సెంటర్‌ ఫర్‌ మీడియా మోనిటరింగ్‌ ( మీడియా పరిశీలక కేంద్రం) అనే సంస్థ అంతర్జాతీయ మీడియా ఛానల్స్‌ ప్రసారం చేసిన లక్షా 80వేల వీడియోలు,బ్రిటీష్‌ మీడియా సంస్థలు రాసిన 26వేల వ్యాసాలను వడగట్టి తేల్చింది కూడా ఇదే. అక్టోబరు ఏడు నుంచి జరుగుతున్నదాడులకు ముందు కూడా మీడియా తీరు ఇలాగే ఉంది, పాలస్తీనా కోసం పోరాడుతున్నవారిని ఉగ్రవాదులుగా చిత్రించించటం తెలిసిందే. ఇటలీ మీడియా 2019`21 సంవత్సరాల తీరుతెన్నులను ఐరోపా సమాఖ్య నిధులతో ఒక పరిశోధన చేశారు. మూడు పత్రికలను పరిశీలించగా అంతర్జాతీయ వార్తలలో 32శాతం ఇజ్రాయెల్‌ ప్రధాని, నరహంతకుడు నెతన్యాహు చుట్టూ తిరిగాయని తేలింది. గతేడాది కాలంగా సాగిస్తున్న మారణకాండ ఇటాలియన్‌ మీడియాకు పట్టలేదు. ‘‘ గాజా నుంచి రాకెట్ల ప్రయోగం, గాజా నుంచి 430 రాకెట్లతో దాడి, ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ హక్కు ఉంది ’’ ఇలాంటి శీర్షికలతో జనాన్ని తప్పుదారి పట్టించారు. దాని దుర్మార్గాలను సమర్ధించారు.


హమస్‌ దాడిచేసి 40 మంది పసిపిల్లల గొంతు కోసిందంటూ ఇజ్రాయెల్‌ అల్లిన అవాస్తవ కథనాన్ని యావత్‌ ప్రపంచ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. చివరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా ఖండిస్తూ మాట్లాడాడు. ఇలాంటి ప్రకటనలు చేసే ముందు నిర్ధారణ చేసుకుంటే మంచిది లేకుంటే పరువు పోతుంది ముసలోడా అంటూ అతగాడి సిబ్బంది తరువాత జాగ్రత్త చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికీ ఈ కట్టుకథ సామాజిక మాధ్యమాల్లో తిరుగుతూనే ఉంది, ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు దాన్ని ఉదహరిస్తూనే ఉన్నారు. ముస్లింలు జీహాద్‌ ప్రకటించారు, ప్రపంచ మొత్తాన్ని కబళించేందుకు పూనుకున్నారు, తమ జనాభా సంఖ్యను పెంచుతున్నారు అంటూ సాగిస్తున్న అనేక కుట్ర కథనాలతో దశాబ్దాల తరబడి జరుపుతున్న గోబెల్స్‌ ప్రచారాన్ని బుర్రలకు ఎక్కించుకున్నవారిని ఇలాంటివి వెంటనే ఆకర్షిస్తాయి. అదేగనుక వాస్తవమైతే ఇజ్రాయెల్‌ చుట్టూ ఉన్నది ముస్లిం దేశాలే, అవన్నీ ఒక్కసారిగా దండెత్తి ఉంటే ఈ పాటికి అది అదృశ్యమై ఉండేది, పాలస్తీనియన్లు ఏడున్నర దశాబ్దాలుగా అష్టకష్టాలు పడి ఉండేవారు కాదు. కానీ అలా జరగలేదే ! అలాంటిది ముస్లింలు ప్రపంచం మొత్తాన్ని ఆక్రమిస్తారంటే నమ్మేవారికి బుర్రల్లో పదార్ధం లేదన్నది స్పష్టం.ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోసి ప్రపంచానికి ప్రమాదం తెచ్చిపెట్టాడన్న నాటి జార్జి డబ్లు బుష్‌, మీడియా ప్రచారాన్ని అమెరికాతో పాటు అనేక దేశాల్లో జనం నమ్మారు. తరువాత అది వాస్తవం కాదని అదే అమెరికా అంగీకరించాల్సి వచ్చింది. పాలకులతో పాటు మీడియా కూడా విశ్వసనీయతను కోల్పోయింది.


అన్నెం పున్నెం ఎరుగని పసిపిల్లలను నిజంగా ఒక్కరిని చంపినా ఖండిరచాల్సిందే. ఆగస్టు 15నాటికి గాజాలో 42వేల మందిని ఇజ్రాయెల్‌ చంపితే వారిలో 17వేల మందికి పైగా పిల్లలు, పదకొండువేల మంది మహిళలు ఉన్నారు. ఏ పశ్చిమదేశాల మీడియా సంస్థలైనా దీన్ని గురించి ఎన్ని వార్తలను ఇచ్చాయి. ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన తరువాత కూడా ఇంకా హమస్‌ గురించే అవి చెబుతున్నాయి.నలభై రెండువేల మందిని చంపి దాదాపు ఒక లక్ష మందిని గాయపరచి, పదివేల మందిని అదృశ్యం కావించిన యూదు దురహంకారులు పాలస్తీనియన్లను తిప్పికొట్టేందుకు చేసిన పనిగా అందమైన మాటలతో పచ్చి దుర్మార్గాన్ని పశ్చిమదేశాలు వర్ణిస్తున్నాయి. బిబిసి తీరును పరిశీలిస్తే గతేడాది అక్టోబరు 10 నుంచి డిసెంబరు రెండవ తేదీ వరకు 23సార్లు హమస్‌ సాయుధులు ఇజ్రాయెలీలపై మారణకాండ జరిపారని వర్ణిస్తే ఒక్కసారే పాలస్తీనియన్ల మీద మారణకాండ పద ప్రయోగం జరిగిందని తేలింది. అంటే దొంగే దొంగని అరచినట్లుగా బిబిసి తీరు ఉంది. ఈ తీరుకు నిరసనగా 2023 అక్టోబరులోనే ఇద్దరు ఆ సంస్థ జర్నలిస్టులు రాజీనామా చేశారు. గాజాపై దాడిని ఖండిస్తూ వెయ్యి మంది అమెరికా జర్నలిస్టులతో పాటు సంతకం చేసిన న్యూయార్క్‌ టైమ్స్‌ మాగజైన్‌ ఎడిటర్‌ జాజ్‌ హగ్స్‌ మీద యాజమాన్యం వత్తిడి తేవటంతో రాజీనామా చేసి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ జాబితానుంచి పేరు తొలగించాలని అసోసియేటెడ్‌ ప్రెస్‌ విలేకరిని యాజమాన్యం ఆదేశించింది. ఇలా లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌ వంటి అనేక పత్రికలు, మాగజైన్లు కూడా ఇజ్రాయెల్‌కు అనుకూలంగా వత్తిడి చేసి అనేక మంది జర్నలిస్టులను తొలగించటం, నోరు మూయించటం వంటి దుర్మార్గాలకు పాల్పడ్డాయి. పాలస్తీనియన్ల మీద తప్పుడు వార్తలు ఒక ఎత్తయితే వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ అనే ప్రముఖ అమెరికా పత్రిక రాసిన ఒక ఆధారం లేని వార్త కారణంగా గాజాలో నిరాశ్రయులకు అందాల్సిన 45 కోట్ల డాలర్ల సాయం నిలిచిపోయింది. గాజాలో ఐరాస నిర్వహిస్తున్న శిబిరంలో పనిచేస్తున్న పన్నెండు మంది సిబ్బందికి హమస్‌తో సంబంధాలు ఉన్నాయని, వారంతా దాడుల్లో పాల్గ్గొన్నారని ఆ పత్రిక కేవలం ఇజ్రాయెల్‌ కట్టుకథనే తనదిగా రాసింది.నిజానికి దానికి ఎలాంటి ఆధారాలు లేవు.అమెరికా సిఎన్‌ఎన్‌, బ్రిటన్‌ బిబిసిలో పని చేస్తూ గాజా పరిణామాలపై వార్తలు ఇచ్చిన పది మంది విలేకర్లు ఇజ్రాయెల్‌ అనుకూల వైఖరితో పనిచేసినట్లు వెల్లడిరచారు.న్యూస్‌ రూముల్లో ఉన్న సీనియర్లు జోక్యం చేసుకొని ఇజ్రాయెల్‌ చేసిన దుర్మార్గాలను తక్కువ చేసి చూపాలని వత్తిడి చేసినట్లు వెల్లడిరచారు.ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన చిత్రం ద్వారా బిబిసి భాషలో పాలస్తీనీయన్ల మీద వ్యతిరేకతను ఎలా రెచ్చగొట్టారో జరిపిన ఒక పరిశీలన వచ్చింది. అదే మంటే మారణకాండకు గురైనట్లు 23సార్లు ఇజ్రాయెల్‌ గురించి చెప్పగా ఒక్కసారి మాత్రమే పాలస్తీనా పేరును ప్రస్తావించారు. ఊచకోతకు గురైనట్లు ఇరవైసార్లు ఇజ్రాయెల్‌ గురించి చెప్పగా ఒక్కసారి కూడా పాలస్తీనా పేరు రాలేదు.


తమ పత్రికలు ఎన్ని తప్పుడు కథనాలు, అవాస్తవాలు రాసినా అమెరికా యువత ముఖ్యంగా విద్యార్థులు పాలస్తీనా అనుకూల వైఖరి తీసుకోవటం గమనించాల్సిన అంశం. వారు మీడియా కతలను నమ్మటం లేదన్నది వాస్తవం. ఇజ్రాయెల్‌ మారణకాండకు పాల్పడుతున్నదని నమ్మిన కారణంగానే ఈ పరిణామం. ఇది అక్కడి పాలకవర్గాలకు ఆందోళన కలిగించే అంశం. ప్రచారదాడి ఎదురు తిరిగితే వారి పునాదులను కదలించే కదన శక్తిగా యువత మారుతుంది.ప్రపంచ ప్రఖ్యాతిగాంచి పర్యావరణ ఉద్యమ కార్యకర్త 21 సంవత్సరాల స్వీడిష్‌ యువతి గ్రేటా థన్‌బెర్గ్‌ పాలస్తీనా అనుకూల ప్రదర్శనలో పాల్గొన్నందుకు కోపెన్‌హాగన్‌ నగరంలో అరెస్టు చేశారు. మీడియా కూడా ఆమె మీద పెద్ద ఎత్తున విమర్శలకు దిగింది.యువతలో వచ్చిన ఈ మార్పును కూడా మూసిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఒకసారి నీవు బాధితుడవైనందుకు గాను ఇతరుల మీద నిరంతరం దాడి కొనసాగిస్తానంటే కుదరదు, దేనికైనా ఒక హద్దు ఉంటుంది. దాన్ని మీరి గాజాలో పాలస్తీనియన్ల మీద ఇజ్రాయెల్‌ దుర్మార్గాలకు పాల్పడుతున్నది. పశ్చిమ దేశాల మీడియా దానికి మద్దతు ఇస్తున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

లెబనాన్‌ ఆక్రమణ బాటలో ఇజ్రాయెల్‌ – ప్రతిగా ఇరాన్‌ క్షిపణి దాడి !

02 Wednesday Oct 2024

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

Gaza Deaths, Hamas, Hezbollah, Iran-Israel Tensions, israel attack lebanon, Israel genocide, Joe Biden, MIDDLE EAST

ఎం కోటేశ్వరరావు

లెబనాన్‌, గాజాలపై ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడులకు ప్రతిస్పందనగా మంగళవారం నాడు క్షిపణులతో జరిపిన తమ దాడి ముగిసిందని ఇరాన్‌ ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్‌ వైపు నుంచి దాడులు కొనసాగితే తాము మరింత గట్టిగా స్పందిస్తామని పేర్కొన్నది. తమ శత్రువు మిలిటరీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్‌ సేనలు లెబనాన్‌లో ప్రవేశించి దాడులను కొనసాగిస్తున్నాయి. వేలాది మంది నివాసాలు వదలి వెళ్లాలని ప్రకటించాయి.దాడులను తిప్పికొడుతున్న హిజబుల్లా ప్రకటించింది. బుధవారం నాడు కూడా దాడులు కొనసాగాయి. అటు ఇజ్రాయెల్‌, ఇటు లెబనాన్‌లో జరిగిన నష్టాల వివరాలు వెల్లడికాలేదు. ఇజ్రాయెల్‌పై జరుగుతున్న క్షిపణి దాడులను అడ్డుకోవాలని అమెరికా మధ్యప్రాచ్యంలో తిష్టవేసిన తన సేనలను అమెరికా ఆదేశించింది. ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. తాజా పరిణామాలతో ప్రామాణిక బ్రెంట్‌ రకం ముడి చమురు అక్టోబరు ఒకటిన 70.4 డాలర్లుగా ఉన్నది రెండవ తేదీన 74.78డాలర్లకు పెరిగింది. పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది.

గత శనివారం నాడు లెబనాన్‌లోని హిజబుల్లా పార్టీ నేత హసన్‌ నస్రల్లాతో పాటు మరికొందరిని ఇజ్రాయెల్‌ హత్య చేసింది. ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడుల్లో 1,873 మంది మరణించారని, 9,134మంది గాయపడినట్లు ప్రకటించారు. 1960లో జన్మించిన నస్రల్లా 1992లో హిజ్‌బుల్లా బాధ్యతలను స్వీకరించి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అందుకు ముందు నేతగా ఉన్న అబ్బాస్‌ ముసావీని కూడా ఇజ్రాయెల్‌ ఇదే విధంగా హత్య చేసింది.1997లో జరిగిన ఘర్షణల్లో ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో నస్రల్లా పెద్ద కుమారుడు హడీ మరణించాడు. 2006లో ఇజ్రాయెల్‌తో జరిపిన 33 రోజుల పోరులో నస్రల్లా నాయకత్వంలో సాధించిన విజయంతో పలుకుబడి పెరిగింది. తాజా హత్యలను నిస్సిగ్గుగా సమర్ధించిన అమెరికా సామ్రాజ్యవాద దుష్టత్వాన్ని మరోమారు ప్రపంచానికి వెల్లడిరచింది. అది అందచేసిన సమాచారం, విద్రోహుల కారణంగానే ఇరాన్‌, ఇరాక్‌, లెబనాన్‌లలో తమ వ్యతిరేకులను ఇజ్రాయెల్‌ హతమార్చుతోంది.అమెరికా అండ చూసుకొని గాజాలో జరుపుతున్న మారణకాండను వ్యతిరేకిస్తున్న ఇరుగుపొరుగుదేశాలన్నింటి మీదా తెగబడుతోంది. ఈ పూర్వరంగంలో మధ్య ప్రాచ్యంలో పరిణామాలు యుద్ధానికి దారితీస్తాయా అన్న ఆందోళన కలిగిస్తున్నాయి. లెబనాన్‌పై ప్రత్యక్ష దాడి వెనుక కారణాలేమిటన్నది ఆసక్తి కలిగించే అంశం. యుద్ధం చెలరేగుతుందా లేదా అన్నది పక్కన పెడితే మధ్యప్రాచ్యంలో పరిస్థితి మరింత దిగజారటం ఖాయంగా కనిపిస్తోంది.లెబనాన్‌ తరువాత ఎమెన్‌ మీద దాడులకు దిగవచ్చని చెబుతున్నారు. ఈ నెల ఏడవ తేదీ నాటికి గాజాలో మారణకాండకు ఏడాది నిండ నుంది, ఆ తరువాత పరిణామాలు ఏ మలుపు తిరిగేదీ చెప్పలేము. గడచిన రెండు నెలల కాలంలో ఇజ్రాయెల్‌ చేసిన హత్యలు, దాడుల గురించి ఇరాన్‌, సిరియా, హమస్‌, హిజబుల్లా తక్కువ లేదా తప్పుడు అంచనాతో ఉన్నట్లు కనిపిస్తోందన్న కొందరి విశ్లేషణలను కొట్టిపారవేయలేము. అందుకే వ్యూహాలను తిరిగి రచించుకొనేందుకు కొంత వ్యవధి పట్టవచ్చు.

మధ్యప్రాచ్య పరిణామాలు భారత్‌తో సహా అనేక దేశాల మీద ఆర్థిక ప్రభావాలు చూపుతాయి.ముడి చమురు ధరలు పెరుగుతాయన్నది వాటిలో ఒకటి.1973లో ఇజ్రాయెల్‌ దాడులకు వ్యతిరేకంగా చమురు ఉత్పత్తి దేశాలు చమురును ఒక అస్త్రంగా ఉపయోగించాయి. దానికి అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్న అమెరికా, జపాన్‌, కెనడా, బ్రిటన్‌, నెదర్లాండ్స్‌ వంటి దేశాలకు చమురు ఎగుమతులను నిలిపి వేశాయి. దాంతో పీపా ధర మూడు నుంచి 11 డాలర్లకు పెరిగింది. ఇప్పుడు కూడా అలాంటి పెరుగుదల, దానితో పాటు ఆర్థిక వ్యవస్థల కుదేలు జరగవచ్చని అంటున్నారు. ఇప్పటికే ఎమెన్‌లోని హౌతీలు జరుపుతున్నదాడులతో ఎర్ర సముద్ర ప్రాంతంలో నౌకల రవాణాకు ఆటంకం కలుగుతూ ఆఫ్రికా గుడ్‌హోప్‌ ఆగ్రం చుట్టూ తిరిగి రావటంతో ఖర్చులు పెరుగుతున్నాయి. గతేడాది అగస్టు పదకొండవ తేదీతో ముగిసిన వారంలో 70 ఓడలు ఎర్ర సముద్రం బాబ్‌ అల్‌ మండాబ్‌ జల సంధి గుండా ప్రయాణించగా ఈ ఏడాది అదే వారంలో కేవలం 23 మాత్రమే వచ్చినట్లు ఐఎంఎఫ్‌ రేవుల విభాగం గుర్తించింది. పరిసర దేశాల్లోని చమురు క్షేత్రాలు, శుద్ధి కేంద్రాల మీద దాడులు జరిగితే సంక్షోభం తలెత్తవచ్చు. చరిత్ర పునరావృతం కావచ్చు గానీ ఒకే విధంగా జరుగుతుందని చెప్పలేము.ఈ కారణంగానే భిన్న దృశ్యాలతో రాగల పరిణామాలను అంచనా వేస్తున్నారు. గతేడాది అక్టోబరు ఏడవ తేదీన హమస్‌దాడులు, ఆ పేరుతో ఇజ్రాయెల్‌ ప్రారంభించిన మారణకాండ పర్యవసానాల గురించి ప్రపంచబ్యాంకు మూడు అంచనాలు చెప్పింది, వాటినే ఇప్పుడు విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. స్వల్ప ఆటంకం ( లిబియాలో అంతర్యుద్ధం జరిగిన 2011 ఏడాది మాదిరి) ప్రపంచ చమురు సరఫరాలోలో ఐదు లక్షల నుంచి ఇరవైలక్షల పీపాల వరకు రోజుకు తగ్గవచ్చు, చమురు ధరలు మూడు నుంచి 13శాతం పెరగవచ్చు. రెండవది (2003లో ఇరాక్‌ సమయంలో మాదిరి) సరఫరా 30 నుంచి 50లక్షల పీపాల వరకు తగ్గవచ్చు, ధరలు 21 నుంచి 35శాతం పెరుగుదల, మూడవది 1973 చమురు సంక్షోభం మాదిరి ఎనభైలక్షల పీపాల మేరకు సరఫరా తగ్గుదల, 56 నుంచి 75శాతం మేరకు ధరలు పెరగవచ్చు.

ఈ నెల ఏడవ తేదీ నాటికి గాజాలో ప్రారంభమైన ఇజ్రాయెల్‌ మారణకాండకు ఏడాది నిండుతుంది.ఇప్పటి వరకు 41,586 మంది మరణించగా 96,210 మంది గాయపడ్డారు, పది వేల మంది జాడ కనిపించటం లేదు.లక్షలాది నివాసాలు నేలమట్టమయ్యాయి. పాఠశాలలు, ఆసుపత్రులు, ఐరాస నిర్వహించే సహాయశిబిరాలు దేన్నీ దాడులలో వదలటం లేదు. అయినప్పటికీ హమస్‌ సాయుధులను అంతం చేస్తామన్న ఇజ్రాయెల్‌ పంతం నెరవేరే సూచనలు కనిపించటం లేదు. ఇదే సమయంలో పాలస్తీనా దురాక్రమణ, గాజా మారణకాండను వ్యతిరేకిస్తున్న హిజబుల్లాను అణచేపేరుతో లెబనాన్‌ మీద వైమానికదాడులకు దిగింది.దాని అధిపతి, ఇతర ముఖ్యనేతలను హతమార్చవచ్చు తప్ప పూర్తిగా అణచివేయటం ఇజ్రాయెల్‌ తరం కాదని అందరూ చెబుతున్నారు. ఎందుకు అంటే హమస్‌తో పోల్చితే దాని పోరాట యోధులు, ఆయుధ సంపత్తి కూడా ఎక్కువే. ఇజ్రయెల్‌ మిలిటరీతో పోల్చితే దాని ఆయుధాలు, సాయుధుల సంఖ్య చాలా తక్కువ అని కూడా గమనించాలి.హిజబుల్లా దగ్గర 30 నుంచి 50వేల మంది వరకు ఉన్నారని అంచనా. అయితే తమ యోధుల సంఖ్య లక్షకు పైబడే అని ఇటీవల హత్యకు గురైన నస్రల్లా గతంలో ప్రకటించాడు. ఐదు నుంచి 500 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లే క్షిపణులు లక్షా ఇరవైవేల నుంచి రెండు లక్షల వరకు ఉన్నట్లు అంచనా, ఇవి గాక ఇరాన్‌ సరఫరా చేసిన మానవరహిత విమానాలు కొన్ని, ఉపరితలం నుంచి ఉపరితలం మీదకు క్షిపణులను ప్రయోగించే సంచార వాహన వ్యవస్థలు కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్‌లోని ఏ ప్రాంతం మీదనైనా దాడికి ఇవి ఉపయోగపడతాయి. అయితే ఇజ్రాయెల్‌ వద్ద త్రివిధ దళాల రెగ్యులర్‌ మిలిటరీ, రిజర్వు దళాల మొత్తం 1,69,500 నుంచి 6,34,500 మంది ఉన్నారు. తమ మీదకు వదిలే క్షిపణులను ముందుగా లేదా మధ్యలో గుర్తించి కూల్చివేసే ఆధునిక రక్షణ వ్యవస్థలు, భారీ క్షిపణులు, వందలాది విమానాలు, నౌకలు ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ ఎటువైపు నుంచి ఏ దాడి జరగనుందో అనే భయంతో వణికిపోయే జనం, వారి రక్షణకు ప్రతి నగరంలో భూగర్భ గృహాలు కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్‌కు ఇంత బలం ఉన్నప్పటికీ తన రక్షణ కోసం అవసరం అంటూ గతంలో దక్షిణ లెబనాన్‌ ప్రాంతాన్ని ఆక్రమించింది. ఇరాన్‌లో అయాతుల్లా ఖొమైనీ అధికారానికి వచ్చిన తరువాత 1979లో షియా ముస్లిం తెగకు చెందిన కొద్ది మందితో హిజబుల్లా (దేవుడి పార్టీ)ను ఏర్పాటు చేశారు. అయితే 1982లో ఇజ్రాయెల్‌ దురాక్రమణకు పాల్పడిన తరువాతే అది ప్రాచర్యంలోకి వచ్చింది. 1985లో లెబనాన్‌ అంతర్యుద్ధం సందర్భంగా అక్కడి వివిధ షియా సంస్థలన్నీ హిజబుల్లా నాయకత్వంలో ఐక్యమయ్యాయి. తరువాత ఇజ్రాయెల్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా సాయుధ పోరును ప్రారంభించింది.2006లో ఇజ్రాయెల్‌ వైదొలగే వరకు అది పోరుబాటలో ఉంది. ఈ క్రమంలోనే అది రాజకీయ సంస్థగా కూడా రూపుదిద్దుకుంది. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే తన సాయుధ విభాగాన్ని కొనసాగిస్తున్నది. దీనికి లెబనాన్‌ ప్రభుత్వ గుర్తింపు కూడా ఉంది.ప్రస్తుతం సంకీర్ణ మంత్రివర్గంలో ఇద్దరు సభ్యులు, 128 మందితో ఉన్న పార్లమెంటులో 15 స్థానాలతో హిజబుల్లా పెద్ద పక్షంగా ఉంది.

పలు చోట్ల తనను వ్యతిరేకించే సంస్థల నేతలను దొంగదెబ్బలతో హత్య కావించటం, పేజర్లు, వాకీటాకీలను పేల్చి లెబనాన్‌లో హిజబుల్లాపై దాడుల ద్వారా తనకు ఎదురులేదని ఆప్రాంతంలోని వ్యతిరేకులను బెదిరించటమే ఇజ్రాయెల్‌ దానికి మద్దతు ఇస్తున్న సామ్రాజ్యవాద శక్తుల లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే తాడిని తన్నే వాడుంటే వాడి తలదన్నేవాడొస్తాడన్నట్లు చరిత్ర రుజువు చేసింది.నస్రల్లా ఉన్న బంకర్‌ను బద్దలు చేసేందుకు అమెరికా సరఫరా చేసిన ఎఫ్‌15 విమానాలతో వెయ్యి కిలోల బరువుండే 85బాంబులను ప్రయోగించి హత్యచేశారు. నాలుగు పెద్ద భవనాలు నేలమట్టమయ్యాయి. నస్రల్లా హత్యతో అనేక మంది బాధిత కుటుంబాలకు న్యాయం జరిగిందని జో బైడెన్‌ అన్నాడు. ఈ చర్యలన్నీ ఇరాన్ను రెచ్చగొట్టి యుద్ధంలోకి దించే అమెరికా కుట్రలో భాగం తప్ప మరొకటి కాదన్నది పదే పదే చెప్పనవసరం లేదు. ఐరాస సాధారణ అసెంబ్లీ సమావేశంలో నెతన్యాహు మాట్లాడుతూ ఒక మాప్‌ను చూపుతూ దానిలో ఉన్న లెబనాన్‌, ఇరాన్‌, సిరియా, ఇరాక్‌ ఒక చీడ అంటూ దాన్ని దాన్ని తొలగించేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పాడు.అమెరికా మద్దతుతో అనేక మంది అనుకుంటున్నదాని కంటే ముందే ఈ కలను సాకారం చేస్తామని కూడా చెప్పాడు. పాలస్తీనా ఉనికే లేని నూతన మధ్య ప్రాచ్యాన్ని ఏర్పాటు చేస్తామన్నాడు. నస్రల్లాను చంపిన బాంబుదాడి జరిపిన విమానపైలట్‌ మాట్లాడుతూ తాము ప్రతివారినీ, ప్రతి చోటా దెబ్బతీస్తామన్నాడు. ఎలాగైనా సరే ప్రపంచాన్ని గెలుచుకుంటామంటూ అమెరికా చెబుతున్నది కూడా అదే.


తాజా దాడుల విషయానికి వస్తే హిజబుల్లాను లక్ష్యంగా చేసుకొని చేస్తున్నట్లు ఇజ్రాయెల్‌, పశ్చిమదేశాల మీడియా చిత్రిస్తున్నప్పటికీ వాటి తీరుతెన్నులను చూస్తే సామాన్య జనం మీదనే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. మరణించిన వారిలో అత్యధికులు మహిళలు, పిల్లలే ఉన్నారు. వేలాది గృహాలను నేలమట్టం చేశారు. గాజా, బీరూట్‌, లెబనాన్‌ కేంద్రాలుగా పనిచేస్తున్న సాయుధ సంస్థలు తమ ఆయుధాలను సొరంగాల్లో దాస్తున్నాయి తప్ప పశ్చిమ దేశాల మీడియా చెబుతున్నట్లు సాధారణ పౌరుల ఇండ్లలో కాదు. అయితే ప్రతిఘటన పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న కారణంగా పరిస్థితి అడవుల్లో మాదిరి ఉండదని వేరే చెప్పనవసరం లేదు. అందుకే ఇజ్రాయెల్‌ దాడులు చేసినపుడు పౌరులు ఇండ్లను ఖాళీచేయాలని పదే పదే చెబుతోంది. గాజాలో మాదిరే బీరూట్‌, పరిసరాల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. పాలస్తీనా విమోచన సంస్థ(పిఎల్‌ఓ) లెబనాన్‌ నుంచి తమ మీద దాడులు జరుపుతోందని, అందువలన రక్షణగా కొన్ని ప్రాంతాలు తమకు అవసరమంటూ 1982 ఇజ్రాయెల్‌ ఆక్రమణలకు పూనుకుంది. నిజానికి సిరియా`లెబనాన్‌ మధ్య వివాదం ఉన్న గోలన్‌ గుట్టలను 1967 తరువాత 1973, 1981లో కూడా కొత్త ప్రాంతాలను ఇజ్రాయెల్‌ ఆక్రమించింది. ఇప్పటికీ ఆ ప్రాంతం దాని ఆక్రమణలోనే ఉంది. జెనీవా ఒప్పందాల ప్రకారం ఆక్రమిత ప్రాంతాల పౌరులకు ప్రతిఘటించే హక్కును గుర్తించారు. ఆ విధంగా ఇజ్రాయెల్‌ ఆక్రమణలోని లెబనాన్‌ ప్రాంతాల విముక్తికి తాము పోరాడుతున్నట్లు హిజబుల్లా చెబుతోంది. నస్రల్లా మరణం తరువాత ఉపనేత నయిమ్‌ ఖాసిం దేశ పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ నస్రల్లా మరణ సమయంలో 20 మంది నేతలతో సమావేశం జరుగుతున్నదని వారంతా మరణించారని ఇజ్రాయెల్‌ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పార్టీ మిలిటరీ కమాండర్‌, ఇరాన్‌ రివల్యూషనరీ గార్డుల డిప్యూటీ కమాండర్‌, భద్రతా సిబ్బంది అక్కడ ఉన్నారని చెప్పాడు. 2006లో మాదిరే ఇజ్రాయెల్‌ను వెనక్కు కొడతామని విజయం మనదే అని ప్రకటించారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన చైనా : పధ్నాలుగు పాలస్తీనా విముక్తి సంస్థల ఒప్పందం !

01 Thursday Aug 2024

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

Fatah, Hamas and Fatah agreement, Hamas Israel, Israel genocide, Palestine Solidarity Day, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


మధ్యప్రాచ్య చరిత్రలో మరో చారిత్మాత్మక ఘట్టానికి తెరలేచింది.పాలస్తీనా విముక్తికోసం పోరాడుతున్న పధ్నాలుగు ప్రజా సంస్థలు, పార్టీలు తమ విబేధాలకు స్వస్తిపలుకుతూ ఐక్యతను పటిష్ట పరిచేందుకు 2024జూలై చివరి వారంలో చైనా మధ్యవర్తిత్వంలో ఒక ఒప్పందానికి వచ్చాయి. వీటిలో ఉప్పు-నిప్పుగా ఉన్న ఫతా – హమస్‌ కూడా ఉండటం విశేషం.ఈ ఒప్పందం పధ్నాలుగు సంస్థల ఐక్యత, అవి సమాధానపరుచుకోవటానికి అంకితమని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి ప్రకటించాడు. గతేడాది అక్టోబరు ఏడు నుంచి ఇజ్రాయెల్‌ మిలిటరీ పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో సాగిస్తున్న మారణకాండ, పశ్చిమగట్టు ప్రాంతంలో సాగిస్తున్నదాడులు, అరబ్బు ప్రాంతాల ఆక్రమణలు కొనసాగిస్తున్న పూర్వరంగంలో ఈ ఒప్పందం కుదిరింది. పాలస్తీనా పౌరులందరికీ ఏకైక అధీకృత ప్రతినిధిగా పాలస్తీనా విముక్తి సంస్థ(పిఎల్‌ఓ)ను గుర్తించటం దీనిలో కీలకమైన అంశం.ప్రస్తుతం కొనసాగుతున్న గాజా మారణకాండ అనంతర పాలనతో పాటు తాత్కాలిక జాతీయ ప్రభుత్వ ఏర్పాటుకు కూడా అంగీకారం కుదిరింది.పశ్చిమాసియాలో చిచ్చుపెట్టి తన ఆధిపత్యాన్ని నెలకొల్పుకొనేందుకు అమెరికా కుట్రలు పన్నుతుండగా వాటిని వమ్ముచేసే క్రమంలో ఐక్యతను సాధించేందుకు చైనా తన పలుకుబడి, అనుభవాన్ని వినియోగిస్తున్నది. ఈ క్రమంలో ఇది రెండవ ఉదంతం. ఇరాన్‌-సౌదీ అరేబియా మధ్య సయోధ్యను కుదిర్చిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంలో నాలుగు ప్రధాన అంశాలున్నాయి. తాత్కాలిక జాతీయ ఐక్యతా ప్రభుత్వం ఏర్పాటు,భవిష్యత్‌ ఎన్నికలకు ముందు ఐక్య నాయకత్వ పొందిక, నూతన పాలస్తీనా జాతీయ మండలికి స్వేచ్చగా ఎన్నికలు, ఇజ్రాయెల్‌ దాడుల పూర్వరంగంలో ఐక్యతా ప్రకటన. తాము చారిత్రాత్మక కూడలిలో ఉన్నామని, తమ పోరాటాలకు జనం స్పందిస్తున్నందున ఇంతకు మించి మరొక మార్గం లేదని చర్చలలో పాల్గన్న సంస్థల ప్రతినిధులు చెప్పారు.గాజాలో జరుగుతున్న మారణకాండే ఈ ఐక్యత వెనుక ప్రధాన కారణం అని వేరే చెప్పనవసరం లేదు. ఐక్యతా ఒప్పందం పాలస్తీనా పార్టీల అంతర్గత వ్యవహారం, అయితే అంతర్జాతీయ సమాజ మద్దతు లేకుండా సాధించలేరని చైనా ప్రతినిధి లిన్‌ జియాన్‌ చెప్పాడు. ఈ ఒప్పందాన్ని వమ్ము చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్‌ సకల యత్నాలూ చేస్తాయి.ముఖ్యంగా ఫతా సంస్థను రెచ్చగొట్టేందుకు, వత్తిడి పెంచేందుకు ఇప్పటికే రంగంలోకి దిగాయి.


పాలస్తీనా విముక్తి సంస్థ అనేక పార్టీలు, సంస్థలతో కూడిన ఒక ఉమ్మడి వేదిక. యాసర్‌ అరాఫత్‌ దీని నేతగా ఉన్న సంగతి తెలిసిందే.1993లో ఇజ్రాయెల్‌తో ఓస్లో ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం ఇజ్రాయెల్‌ ఆక్రమిత గాజా-పశ్చిమ గట్టు ప్రాంతంలో పాలస్తీనా సాధికార సంస్థ(పిఏ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో, అదే విధంగా పిఎల్‌ఓలో కూడా ఫతా అనే పార్టీ ప్రధాన పాత్రధారిగా ఉంది.ఈజిప్టు కేంద్రంగా పని చేస్తున్న ముస్లిం సోదరత్వం అనే సంస్థ ప్రభావం పక్కనే ఉన్న గాజా ప్రాంతంపై ఉంది. దానితో సంబంధం ఉన్న శక్తులు 1987లో హమస్‌గా ఉనికిలోకి వచ్చాయి. పిఎల్‌ఓ, దానిలో ఉన్న భాగస్వామ్య పక్షాలతో దానికి ఏకీభావం లేదు. ఓస్లో ఒప్పందాలలో భాగస్వామి కాదు. ఇజ్రాయెల్‌ ఉనికిని అది గుర్తించలేదు. పాలస్తీనా సాధనకు సాయుధ పోరాటాన్ని మార్గంగా ఎంచుకుంది. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో గాజాలో తిరుగులేని రాజకీయ,మత,సాయుధ శక్తిగా ఎదగటమే కాదు, ఎన్నికల్లో తన సత్తాను చూపి అధికారానికి కూడా వచ్చింది.పశ్చిమగట్టు ప్రాంతంలో ఫతా పార్టీ అధికారంలో ఉంది.పాలస్తీనా విముక్తి కోసం అనేక సంస్థలు తమవైన పద్దతుల్లో పోరాడుతున్నాయి.కొన్ని అంశాలు, పద్దతులపై వాటి మధ్య ఏకీభావం లేని మాటవాస్తవం. దీన్ని అవకాశంగా తీసుకొని సామ్రాజ్యవాదుల మద్దతుతో ఇజ్రాయెల్‌ అణచివేతకు, తాజాగా గాజాలో మారణకాండకు పూనుకుంది.ఇజ్రాయెల్‌ను అధికారికంగా హమస్‌ గుర్తించకపోయినా 1967నాటి సరిహద్దుల ప్రాతిపదికన పాలస్తీనా ఏర్పాటు జరగాలని 2017లో అది చేసిన ప్రతిపాదనకు అర్ధం పరోక్షంగా అంగీకరించినట్లే.


పాలస్తీనా నేషనల్‌ ఇనీషియేటివ్‌ సంస్థ అధ్యక్షుడు ముస్తఫా బర్గౌటీ తాజా ఒప్పందం గురించి మాట్లాడుతూ అన్ని పక్షాలూ పిఎల్‌ఓలో చేరేందుకు అంగీకరించాయని అదొక్కటే పాలస్తీనియన్ల నిజమైన ప్రతినిధి అన్నాడు. రెండు భిన్న పార్టీల పాలనలో ఉన్న పాలస్తీనాలోని గాజా-పశ్చిమ గట్టు ప్రాంతాలను ఒకే పాలనా వ్యవస్థ కిందకు తెచ్చేందుకు 2017లో హమస్‌-ఫతా మధ్య కుదిరిన ఒప్పందం అమలు కాలేదు.2007వరకు గాజా కూడా ఫతా నాయకత్వంలోని ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. అదే ఏడాది అధికారానికి వచ్చిన హమస్‌ యంత్రాంగం ఫతాను అక్కడి నుంచి బహిష్కరించింది. కొన్ని అరబ్‌ దేశాలూ, ఈజిప్టు తెచ్చిన ఒత్తిడి మేరకు పదేండ్ల వైరాన్ని విరమించుకొనేందుకు చేసుకున్న ఒప్పందం విఫలమైంది. పాలస్తీనా అధారిటీ ప్రధాన మంత్రి రామీ హమదల్లా 2018లో గాజా సందర్శనకు వచ్చినపుడు హత్యాయత్నం జరిగింది. దానికి హమసే కారణమని ఫతా ఆరోపించింది. గతం కంటే నిర్దిష్టంగా కొన్ని చర్యలు తీసుకొనేందుకు తాజా ఒప్పందంలో అంగీకరించినట్లు ముస్తఫా చెప్పారు. మొత్తంగా పాలస్తీనాను అంతం చేసేందుకు ఇజ్రాయెల్‌ పూనుకున్నందున దానికి వ్యతిరేకంగా ఐక్యమౌతున్నట్లు చెప్పారు. ఏకాభిప్రాయ సాధనతో ఉమ్మడి ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుందనే అంశంపై కూడా ఒప్పంద పక్షాల్లో స్పష్టత ఉన్నట్లు కనిపిస్తోంది. ఒక వైపు అమెరికా ఇతర దేశాల అండచూసుకొని ఇజ్రాయెల్‌ మారణకాండను కొనసాగిస్తూనే ఉంది. అది ముగిసిన తరువాత ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందా ? బీజింగ్‌ ఐక్యతా చర్చల్లో పాల్గొన్న హమస్‌ ప్రతినిధి హసమ్‌ బద్రన్‌ మాట్లాడుతూ ధ్వంసమైన ప్రాంతాల పునర్‌నిర్మాణం, తగిన సమయంలో ఎన్నికలు జరపాలన్న నిర్ణయం జరిగిందని, అయితే దాడులు కొనసాగుతున్నప్పటికీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడవచ్చని, అది కాల్పుల విరమణకు దోహదం చేయవచ్చన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బీజింగ్‌లో హమస్‌-ఫతా ప్రతినిధుల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి.తరువాత చైనా నేత షీ జింపింగ్‌ మధ్య ప్రాచ్య దేశాలకు ప్రత్యేక రాయబారిని పంపి అంతర్జాతీయ శాంతి సభ జరపటానికి గల అవకాశాలను పరిశీలించారు. ఈప్రక్రియకు ముందు ఇరాన్‌-సౌదీ అరేబియా మధ్య చెలిమి అసాధ్యం అనుకున్న దాన్ని చైనా సుసాధ్యం గావించింది.మధ్య ప్రాచ్యం, పశ్చిమాసియాలో అమెరికాతో పోలిస్తే చైనా పాత్ర పరిమితమే. అయినప్పటికీ తంపులు పెట్టే అమెరికాతో పోలిస్తే దానికి భిన్నమైన వైఖరితో ఉన్నందున బీజింగ్‌ పట్ల విశ్వసనీయత పెరుగుతోంది.


గాజాలో మారణకాండ పూర్వరంగంలో అంతర్జాతీయ సమాజ అభిప్రాయం ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా మారుతున్నది. గత 57 సంవత్సరాలుగా తూర్పు జెరూసలెం, గాజా, పశ్చిమ గట్టు ప్రాంతాలను ఆక్రమించటం చట్టవిరుద్దమని అంతర్జాతీయ న్యాయ స్థానం(ఐసిజె) వ్యాఖ్యానించింది. ఓస్లో ఒప్పందం ప్రకారం పశ్చిమ గట్టు ప్రాంతంలలో పాలస్తీనా అధారిటీ పాలన కొనసాగుతున్నప్పటికీ యూదుల నివాసాల ముసుగులో ఇజ్రాయెల్‌ దురాక్రమణలు కొనసాగుతూనే ఉన్నందున ఫతా సంస్థ వైఖరిలో మార్పురాక తప్పలేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు 23.7చదరపు కిలోమీటర్ల మేర ఇజ్రాయెల్‌ ఆక్రమించిందని పీస్‌ నౌ అనే స్వచ్చంద సంస్థ పేర్కొన్నది.గత రెండు దశాబ్దాల్లో ఆక్రమించినదానికంటే ఇది ఎక్కువ. అమెరికా మధ్యవర్తిత్వలో 1993లో కుదిరిన ఓస్లో ఒప్పందం ప్రకారం పశ్చిమ గట్టును ఏబిసి ప్రాంతాలుగా విభజించారు. ఏ తరగతి పాలస్తీనా అధారిటీ ఏలుబడిలో, బి ప్రాంతాలు ఇజ్రాయెల్‌-పాలస్తీనా ఉమ్మడి పాలన, సి ప్రాంతాలు ఇజ్రాయెల్‌ ఆధీనంలో ఉంటాయి. మూడవ ప్రాంతంలో యూదుల నివాసాల ఏర్పాటుతో పాటు అరబ్బు రైతాంగాన్ని ఇజ్రాయెల్‌ క్రమంగా తొలగిస్తున్నది.పాలస్తీనా పశ్చిమ గట్టు ప్రాంతంలో 1990దశకంలో ఇజ్రాయెల్‌ తీసుకువచ్చిన యూదుల సంఖ్య రెండున్నర లక్షలు కాగా ప్రస్తుతం ఏడు లక్షలకు పెరిగారు. పాలస్తీనా రాజధానిగా ఉండే తూర్పు జెరూసలెంలో అలాంటి వారిని 800 నుంచి మూడు వేలకు పెంచారు. గాజాలో మారణకాండ ప్రారంభించిన ఇజ్రాయెల్‌ పశ్చిమ గట్టు ప్రాంతంలో కూడా దాడులకు పూనుకుంది. ఇప్పటి వరకు 513 మంది పాలస్తీనియన్లను మిలిటరీ చంపివేసింది.వందలాది మందిని గాయపరచింది.ప్రతి ఏటా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉంది.


ఒప్పందాన్ని తామింకా సమీక్షించలేదంటూ గాజాలో హమస్‌ పాత్రను తాము సమర్ధించే ప్రసక్తే లేదని అమెరికా ప్రకటించింది. ఒక ఉగ్రవాద సంస్థకు ప్రభుత్వంలో పాత్ర ఉండకూడదని ప్రతినిధి మిల్లర్‌ చెప్పాడు.ప్రస్తుత యుద్ధం ముగిసిన తరువాత రెండు ప్రాంతాల్లో ఒకే ప్రభుత్వం ఉండాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పాడు. పాలస్తీనా ఐక్యతా ఒప్పందం అమలు జరుగుతుందా ? భాగస్వామ్య పక్షాలు కట్టుబడి ఉంటాయా, భవిష్యత్‌లో హమస్‌ పాత్ర ఏమిటి అంటూ మీడియా, ప్రభుత్వాలలో చర్చలు జరుగుతున్నాయి. ఐక్యతను దెబ్బతీసేందుకు చాణక్య నీతిని ప్రయోగించేందుకు అమెరికా, ఇతర పశ్చిమదేశాలు చూస్తున్నాయి. సందేహాలు లేవనెత్తుతున్నవారందరినీ ఒకేగాటన కట్టలేము గానీ కొన్ని ఆచరణాత్మక సమస్యలు ముందుకు వచ్చినప్పటికీ మొత్తానికే ఎసరు పెడుతున్న సామ్రాజ్యవాదుల కుట్ర, చర్యల కారణంగా వాటిని పరిష్కరించుకొనే పరిణితిని పాలస్తీనా సంస్థలు ప్రదర్శిస్తాయి.దానిలో పెద్ద ముందడుగే తాజా ఒప్పందం.ఒప్పందమైతే జరిగింది గానీ దాని అమలు గురించి అనేక మందికి సందేహాలున్నా అవసరాలు వివిధ పక్షాల వైఖరుల్లో మార్పులకు దోహదం చేస్తున్నాయి.అనేక పరిణామాలను చూసినపుడు ప్రతి పాలస్తీనా సంస్థ అనేక గుణపాఠాలు నేర్చుకుంది. ఐక్యత కోసం రాజీలకు, సర్దుబాట్లకు సిద్దంగాక తప్పని స్థితిలో పడ్డాయి. మొదటికే మోసం తెస్తున్న ఇజ్రాయెల్‌ను నిలువరించటం ప్రధమ కర్తవ్యంగా భావించాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా విద్యార్థి ఉద్యమం : నాటి వియత్నాం, నేటి పాలస్తీనాకు తేడా ఏమిటి !!

15 Wednesday May 2024

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Left politics, Opinion, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Andi War protests, Donald trump, Israel genocide, Joe Biden, Pro-Palestinian protests, US Student Protests


ఎం కోటేశ్వరరావు


పాలస్తీనా ప్రాంతమైన గాజాలో ఇజ్రాయెల్‌ మిలిటరీ రాఫా, తదితర ప్రాంతాల్లో మారణకాండను తీవ్రం చేస్తోంది. చివరకు ఐరాస తరఫున పనిచేస్తున్న సహాయసిబ్బందిని కూడా వదలటం లేదు.సోమవారం జరిపిన దాడుల్లో ఐరాస తరఫున పనిచేస్తున్న వారిలో మనదేశానికి చెందిన వ్యక్తి మరణించాడు. రాఫాలోని ఐరోపా ఆసుపత్రికి ఒక వాహనంలో ఇతరులతో కలసి వెళుతుండగా ఇజ్రాయెల్‌ మిలిటరీ జరిపిన దాడిలో అతడు మరణించగా మిగిలిన వారికి గాయాలయ్యాయి.గతేడాది అక్టోబరు ఏడు నుంచి ఇప్పటి వరకు 35వేల మందికి పైగా మరణించారు. వారిలో 70శాతంపైగా పిల్లలు, మహిళలు ఉన్నారు.పాలస్తీనియన్ల ఊచకోత గురించి అణుమాత్రమైనా పట్టని అమెరికా, ఇతర పశ్చిమదేశాలు యూదు వ్యతిరేకత పెరుగుతోందని మాత్రం గుండెలు బాదుకుంటున్నాయి. ఆ సాకుతో ఇజ్రాయెల్‌ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతున్న విద్యార్థులపై తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నాయి. కొద్ది వారాల క్రితం అమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాలోనే ప్రారంభమైన ఉద్యమం ఇప్పుడు కెనడా, ఐరోపా ముఖ్యంగా బ్రిటన్‌కు విస్తరించింది.అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు ఈ ఆందోళనకు దూరంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. ప్రభుత్వం తమను గుర్తించి వీసాలను రద్దు చేసినా, అమెరికా నుంచి వెనక్కు తిప్పిపంపినా నష్టపోతామనే భయమే దీనికి కారణంగా ఉన్నట్లు కొందరు చెప్పారు.రఫా మీద దాడులను అంగీకరించేది లేదన్నది అమెరికా ఉత్తుత్తి బెదిరింపు మాత్రమే అని తేలిపోయింది. మంగళవారం నాటికి అందిన సమాచారం మేరకు ఆ నగరం పరిసరాలలో ఉన్న 14 లక్షల మంది జనాభాలో సగం మంది దాడులను తప్పించుకొనేందుకు ఇతర ప్రాంతాలకు పారిపోయారు.


ప్రతి మతంలోనూ దురహంకారులు ఉంటారు. దానికి యూదు అతీతం కాదు.ఐరోపాలో ముందుకు తెచ్చిన యూదు వ్యతిరేకత వారిని అష్టకష్టాలపాలు చేసింది. లక్షలాది మంది ప్రాణాలు తీసింది. ఆ దుర్మార్గాన్ని యావత్‌ ప్రపంచం ఖండించింది. కానీ ఇప్పుడు అదే మత ప్రాతిపదికన ఏర్పడిన ఇజ్రాయెల్‌ పాలకుల అరబ్‌ లేదా ముస్లిం వ్యతిరేకతను అనేక పశ్చిమదేశాలు నిస్సిగ్గుగా సమర్ధిస్తున్నాయి.పాలస్తీనా సాగిస్తున్న మారణకాండకు మద్దతు ఇస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించి మానవహక్కులను కాపాడాలని కోరుతున్నారే తప్ప యూదు వ్యతిరేకతను ముందుకు తీసుకురాలేదు. ఇజ్రాయెల్‌ పాలకులు యూదు దురహంకారులు తప్ప అక్కడ ఉన్న సామాన్య పౌరులందరూ అలాంటి వారే అనటం లేదు. ఐరాస తీర్మానం ప్రకారం పాలస్తీనా ఏర్పడకుండా అడ్డుకుంటున్నది అక్కడి పాలకులు, యూదు ఉన్మాదం తలకెక్కించిన మిలిటరీ, వారిని తమ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్న పశ్చిమదేశాలు తప్ప పౌరులు కాదు. పాలస్తీనాలోని గాజా, పశ్చిమగట్టు, తూర్పుజెరూసలెం ప్రాంతాలలోని పౌరులపై దశాబ్దాల తరబడి సాగిస్తున్న దమనకాండ గురించి తన పౌరులకు బోధ చేసేందుకు ఎన్నడూ ఒక చట్టం చేయని అమెరికా పార్లమెంటు దిగువసభ ఇటీవల ” యూదు వ్యతిరేక జాగృతి బిల్లు ” తెచ్చింది. దానికి 91 మంది వ్యతిరేకంగా ఓటు వేయగా 320 మంది మద్దతు తెలిపారు.యూదు వ్యతిరేకత అమెరికాలో ఉన్న యూదు విద్యార్థుల మీద ప్రభావం చూపుతుందని చట్టం ప్రకటించింది. దాన్ని సెనెట్‌ కూడా ఆమోదిస్తే అధ్యక్షుడి ఆమోదంతో చట్టంగా మారుతుంది. ఒకసారి అది ఉనికిలోకి వస్తే వివాదాస్పద యూదు వ్యతిరేక నిర్వచనాలతో విద్యార్థులు, ఇజ్రాయెల్‌ దమనకాండపై గళమెత్తే ఇతరులను అణచివేసే అవకాశం ఉంది. ఈ బిల్లును సెనెట్‌ ఆమోదించకూడదని అనేక మంది కోరుతున్నారు. విద్యార్థులు చేస్తున్నది మరొక యుద్ధ వ్యతిరేక ఉద్యమం కాగా దాన్ని యూదు వ్యతిరేకమైనదిగా పశ్చిమదేశాల మీడియా చిత్రించటం పాలకవర్గాల కనుసన్నలలో నడవటం తప్ప మరొకటి కాదు.


గతంలో వియత్నాంపై జరిపిన దురాక్రమణ, హత్యాకాండ, అత్యాచారాలకు నిరసనగా 1968లో అమెరికా యువత పెద్ద ఎత్తున నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. చివరకు బతుకుజీవుడా అంటూ అమెరికన్లు అక్కడి నుంచి పారిపోయి వచ్చారు. అక్కడ కనీసం 30లక్షల మంది అమాయక పౌరులను అమెరికన్లు హతమార్చారు. గతంలో వియత్నాంలో మాదిరి ఇప్పుడు 2024లో గాజాలో జరుగుతున్న మారణకాండలో అమెరికా ప్రత్యక్ష భాగస్వామి కాదు. ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వటాన్ని వ్యతిరేకించటం అమెరికా యువతలో పెరిగిన చైతన్యానికి ఒక నిదర్శనం. గతంలో మాదిరి జరుగుతున్నవాటిని మూసి పెట్టటం ఇప్పుడు సాధ్యం కాదు. అమెరికాలో జరుగుతున్నదాని గురించి ఒక విశ్లేషకుడు ఒక సినిమా కథతో పోల్చాడు. మోర్ఫస్‌ అనే చిత్రంలో ఒక వ్యక్తి తన వద్దకు వచ్చిన ఆశ్రితుడికి ఎరుపు, నీల వర్ణపు రంగుల మాత్రలు ఇచ్చి ఏదో ఒకటి తీసుకోమంటాడు.ఎరుపు రంగుదాన్ని సేవించిన వారికి తమ చుట్టూ జరుగుతున్న భయంకర అంశాలన్నీ కనిపిస్తాయి. అదే నీలి రంగు మాత్ర వేసుకుంటే నిజంగా జరుగుతున్నదాన్ని మరిపింపచేస్తుంది. ఆ సినిమాలో ఆశ్రితుడు ఎర్ర రంగు మాత్ర తీసుకున్నట్లుగా ఇప్పుడు అమెరికా సమాజంలోని నవతరం కూడా అదే మాదిరి పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్‌ జరుపుతున్న అకృత్యాలను చూస్తున్నారని, వ్యతిరేకంగా స్పందిస్తున్నారని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా జరుగుతున్న చర్చలో ఒక్క ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వటమే కాదు తమ ప్రభుత్వం అనేక చోట్ల ఉగ్రవాద వ్యతిరేక చర్యల పేరుతో జరుపుతున్న దారుణాలను కూడా ఇప్పుడు విద్యార్థులు స్పష్టంగా చూస్తున్నారు.


అమెరికా జరుపుతున్న దారుణాలను ప్రపంచం చూస్తున్నప్పటికీ ఇటీవలి కాలంలో అమెరికన్లు వాటిని ఏ మేరకు గమనించారన్న చర్చ ఒకటి ఉంది. ఏదైనా శృతిమించితే వారు కూడా స్పందిస్తారని తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. పాలస్తీనా విముక్తి కోసం పోరాడుతున్నవారిని ఉగ్రవాదులని అమెరికా ఎప్పటి నుంచో చిత్రిస్తున్నది.ప్రతి దేశంలో సామ్రాజ్యవాదం, నిరంకుశపాలకులు చేసింది అదే. ఉగ్రవాదంపై పోరు పేరుతో అమెరికా సాగిస్తున్న చర్యలతో నిజానికి ఉగ్రవాదం పెరిగింది తప్ప తగ్గలేదు. అనేక మందిని ఉగ్రవాదులుగా మార్చిందంటే అతిశయోక్తి కాదు. బ్రౌన్‌ విశ్వవిద్యాలయం జరిపిన ఒక విశ్లేషణ ప్రకారం వివిధ దేశాలలో అమెరికా కారణంగా 45లక్షల మంది మరణించారు.వారిలో అమెరికా మిలిటరీ ప్రత్యక్షంగా తొమ్మిది లక్షల మందిని చంపివేసింది.కనీసం 3.8కోట్ల మంది తమ నెలవులు తప్పారు. ఎమెన్‌ అంతర్యుద్ధంలో అమెరికా మద్దతు, పధకం ప్రకారం జోక్యం చేసుకున్న సౌదీ అరేబియా కారణంగా దశాబ్ది కాలంలో 2.33లక్షల మంది మరణించారు.ఐరాస కార్యాలయం 2020లో చెప్పినదాని ప్రకారం వారిలో ఆహారం, ఆరోగ్యసేవలు, మౌలిక సదుపాయాల లేమి వంటి పరోక్ష కారణాలతో మరణించిన వారు 1.31లక్షల మంది ఉన్నారు. ఇటీవలి ప్రపంచ పరిణామాల్లో సౌదీ అరేబియా-ఇరాన్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఎమెన్‌లో జోక్యానికి స్వస్తిపలికింది. సద్దాం హుస్సేన్ను తమ పలుకుబడికిందకు తెచ్చుకొనేందుకు ఇరాక్‌పై అమెరికా అమలు జరిపిన ఆంక్షల కారణంగా ఐదు లక్షల మంది పిల్లలు మరణించారని అంచనా. ఇంకా ఇలాంటి అనేక దారుణాల్లో తమ నేతల, దేశ పాత్ర గురించి విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో గుడారాల్లో తిష్టవేసి నిరసన తెలుపుతున్న విద్యార్థులు అరచేతిలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని అధ్యయనం చేస్తున్నారు.


అమెరికా ప్రత్యక్షంగా పాల్గొనటమే కాదు, అనేక దేశాల పాలకులను ప్రోత్సహించి లక్షలాది మంది మరణాలకు బాధ్యురాలైంది.ప్రస్తుత బంగ్లాదేశ్‌ 1971కి ముందు పాకిస్తాన్‌లో భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ తలెత్తిన ప్రభుత్వ వ్యతిరేకతను అణచివేసేందుకు పాక్‌ మిలిటరీ ఆపరేషన్‌ సెర్చ్‌లైట్‌ పేరుతో జరిపిన మారణకాండలో మూడు లక్షల మంది మరణించగా కోటి మంది తమ ప్రాంతాల నుంచి పారిపోవాల్సివచ్చింది.దానికి అమెరికా పూర్తి మద్దతు ఇచ్చింది.మనదేశం జోక్యం చేసుకొని పాక్‌ మిలిటరీని ఓడించి బంగ్లాదేశ్‌ విముక్తికి తోడ్పడింది. అంతకు కొద్ది సంవత్సరాల ముందు ఇండోనేషియాలో కమ్యూనిస్టులను అణచివేసేందుకు మిలిటరీ నియంత సుహార్తోను గద్దెమీద కూర్చోబెట్టి కనీసం పదిలక్షల మందిని ఊచకోత కోయించటంలో సిఐఏ ప్రధాన పాత్ర పోషించింది. రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా మిత్రపక్ష దేశాల మీద యుద్దం ప్రకటించిన హిట్లర్‌ వంటి వారిని తప్ప ప్రపంచంలో నియంతగా పేరు మోసిన ప్రతివాడినీ అమెరికా బలపరిచింది.హిట్లర్‌కు సైతం ఆయుధాలు అమ్మి తొలి రోజుల్లో మద్దతు ఇచ్చింది. రెండవ ప్రపంచ యుద్దంతో బ్రిటన్‌ ప్రపంచాధిపత్యం అంతరించి అమెరికా రంగంలోకి వచ్చింది.అప్పటి నుంచి సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు దేశాలతో సాగించిన ప్రచ్చన్న యుద్ధంలో తాము విజేతలం అని ప్రకటించుకొనే వరకు అంటే 1949 నుంచి 1989వరకు వివిధ దేశాలలో పాలకులను మార్చేందుకు అమెరికా 72 ప్రయత్నాలు చేయగా 29 సందర్భాలలో అమెరికా కుట్రలో భాగస్వాములైన వారు జయప్రదమయ్యారు. కూల్చిన వాటిలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఆరు ఉన్నాయని బోస్టన్‌ కాలేజీ రాజకీయ శాస్త్ర అధ్యాపకురాలు లిండ్సే ఓ రూర్‌కే పేర్కొన్నారు. ఒక వలసవాదిగా అమెరికా దుర్మార్గం చిన్నదేమీ కాదు. ఆసియాలోని ఫిలిప్పైన్స్‌ను ఆక్రమించకొని అక్కడ మొదటి ప్రపంచ యుద్ధానికి ముందే రెండు నుంచి ఆరులక్షల మందిని జాత్యహంకారం, ఇతర కారణాలతో అమెరికన్‌ పాలకులు హత్య చేశారని అంచనా.


1968లో వియత్నాంలో దురాక్రమణ, మారణకాండలకు వ్యతిరేకంగా విద్యార్థులు జరిపిన ఆందోళనకు, ఇప్పుడు గాజాలో జరుపుతున్న ఇజ్రాయెల్‌ మారణకాండకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి విద్యార్థిలోకం గళమెత్తటానికి గల పోలికలు చర్చలోకి వచ్చాయి. అప్పుడూ ఇప్పుడూ ఆందోళన కాలేజీ ప్రాంగణాల్లోనే ప్రారంభమైంది.నాడూ నేడు పోలీసులను పిలిపించి అణచివేతకు పాల్పడ్డారు.నవతరం-పాతవారి మధ్య కొన్ని సైద్దాంతిక విబేధాలు గతంలోనూ వర్తమానంలోనూ ఉన్నాయి. నిజానికి ఇవి పెద్ద అంశాలు కావు. ఫ్రెంచి వలస ప్రాంతంగా ఉన్న ఇండోచైనాను రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ ఆక్రమించింది. అది ఓడిన తరువాత తిరిగి ఫ్రాన్సు ఆక్రమించిన వియత్నాంలో విముక్తి పోరాటం కారణంగా 1954లో స్వాతంత్య్రం వచ్చింది. ఉత్తర, దక్షిణ వియత్నాంలుగా దాన్ని విభజించారు. ఫ్రెంచి పాలకులు తప్పుకున్న తరువాత దక్షిణ వియత్నాం కేంద్రంగా అమెరికా రంగంలోకి వచ్చి ఉత్తర వియత్నాంను ఆక్రమించేందుకు, దక్షిణ వియత్నాంలో విముక్తి పోరాటాన్ని అణచేందుకు చూసింది. స్వతంత్ర పాలస్తీనాను రెండవ ప్రపంచ యుద్దం తరువాత రెండుగా చీల్చి ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేశారు. ఆ వెంటనే పాలస్తీనా ప్రాంతాలను పశ్చిమదేశాల మద్దతుతో అది అక్రమించి ఇప్పటి వరకు పాలస్తీనా స్వతంత్రదేశం ఏర్పడకుండా అడ్డుకుంటున్నది. నాడు వియత్నాంలో 5.36లక్షల మంది అమెరికన్‌ సైనికులు ఉన్నారు.నేడు ఇజ్రాయెల్‌లో కొద్ది మంది ఉన్నప్పటికీ వారు దాడులలో భాగస్వాములు కావటం లేదు. వియత్నాంలో దాదాపు అరవై వేల మంది అమెరికా సైనికులు మరణించారు, మూడు లక్షలకు పైగా గాయపడ్డారు. తమ సైనికుల ప్రాణనష్టం సాధారణ అమెరికన్లను కలచివేసింది. పాలస్తీనాలో ఒక్క అమెరికనూ చావలేదు, గాయపడలేదు. అయినప్పటికీ మానవత్వానికి ముప్పు తెచ్చిన కారణంగా విద్యార్థులు వీధుల్లోకి రావటం చైతన్యానికి నిదర్శనం.రాఫాలో దాడులను అడ్డుకోవటంలో విఫలమైన తమ ప్రభుత్వం మీద విద్యార్థులు మరింతగా వీధుల్లోకి వస్తారా , ఏం జరగనుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇజ్రాయెల్‌పై దక్షిణాఫ్రికా కేసు, బీరూట్‌లో హమస్‌ నేత హత్య, ఎర్ర సముద్రంలోకి ఇరాన్‌ యుద్ధనౌక !

03 Wednesday Jan 2024

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

Hamas, Iran War Ship Alborz, Israel genocide, Israel-Hamas war, Joe Biden, Red Sea


ఎం కోటేశ్వరరావు


ఒకవైపు గాజా నుంచి సైన్య ఉపసంహరణ వార్తలు, మరోవైపు ఆలోగా మిగిలి ఉన్న నివాసాలను పూర్తిగా నాశనం చేయటం, సాధ్యమైనంత మంది పాలస్తీనియన్ల ప్రాణాలను హరించేందుకు వైమానిక, టాంకులతో ఇజ్రాయెల్‌ మిలిటరీ విరుచుకుపడుతున్నట్లు సమాచారం. నిబంధనలను తోసిరాజని అమెరికా భారీ ఎత్తున మిలిటరీ సాయం. పాలస్తీనా జాతిని తుడిచిపెట్టేందుకు పూనుకున్న ఇజ్రాయెల్‌ మీద విచారించాలంటూ అంతర్జాతీయ కోర్టు (ఐసిజె)లో దక్షిణాఫ్రికా కేసు దాఖలు. ఎమెన్‌ కేంద్రంగా ఉన్న హౌతీ సాయుధులు ఎర్రసముద్రంలో నౌకలపై దాడులు, వారి మీద అమెరికా యుద్ధనౌకల నుంచి ప్రతిదాడులు. పది మంది హౌతీల మరణం,ఈ పూర్వరంగంలో మంగళవారం నాడు ఎర్ర సముద్రంలోకి ఇరాన్‌ తన యుద్ధ నౌక అల్‌బోర్జ్‌ను నడిపింది. ఈ పరిణామంతో అంతర్జాతీయ మార్కెట్లో స్వల్పంగా ముడి చమురు ధరలు పెరిగాయి. హిందూమహా సముద్రంతో ఎర్రసముద్రాన్ని కలిపే ఏడెన్‌ జలసంధి నుంచి ఎర్ర సముద్రం దక్షిణ ప్రాంతంలోకి ఇరాన్‌ నౌక ప్రవేశించింది. తాము కూడా ఆ ప్రాంతంలో ప్రయాణించే నౌకలకు రక్షణ కల్పించేందుకే అని ఇరాన్‌ ప్రకటించింది. అదే పేరుతో అమెరికా, బ్రిటన్‌ ఇతర దేశాల నౌకలు ఉన్నాయి.2009 నుంచి నియమిత కాలాల్లో తమ నౌక ఆ ప్రాంతంలో గస్తీకి రావటం మామూలేనని, ఎవరికీ చెందని జలాల్లోకి ఇతర దేశాల యుద్ధ నావలు ఎలా వస్తున్నాయో తమది కూడా అంతేనని ఇరాన్‌ చెప్పింది.2021లో ఏడెన్‌ జలసంధిలో రెండు చమురు టాంకర్లపై సముద్ర దొంగల దాడిని తమ అల్‌బోర్జ్‌ తిప్పిన కొట్టిన అంశాన్ని గుర్తు చేసింది. ఎర్ర సముద్రంలో నౌకల స్వేచ్చా విహారానికి విఘాతం కలిగిస్తున్న హౌతీల మీద ప్రత్యక్ష చర్యకు దిగుతామని బ్రిటన్‌ బెదిరించింది. మంగళవారం నాడు లెబనాన్‌ రాజధాని బీరూట్‌ శివార్లలో హమస్‌ అగ్రనేతలలో ఒకడైెన సాలే అల్‌ అరౌరీని హత్య చేశారు. ఇజ్రాయెల్‌ వైపు నుంచి వచ్చిన డ్రోన్‌ దాడిలో మరణించినట్లు హమస్‌ ప్రకటించింది, అయితే ఏ సంస్థ కూడా తామే హతమార్చినట్లు చెప్పుకోలేదు. దీని గురించి మాట్లాడవద్దని ఇజ్రాయెల్‌ తమ నేతలకు సలహా ఇచ్చింది. ఇవీ మధ్యప్రాచ్యంలో వర్తమాన పరిణామాలు.


పాలస్తీనా జాతిని తుడిచిపెట్టి, గాజా ప్రాంతాన్ని నామరూపాల్లేకుండా చేసేందుకు పూనుకున్న ఇజ్రాయెల్‌ మీద విచారణ జరపాలని దక్షిణాఫ్రికా ఐసిజెలో కేసు దాఖలు చేసింది. పాలస్తీనియన్లు యూదుదురహంకారుల అణచివేతకు గురవుతున్నట్లే శతాబ్దాల తరబడి శ్వేత జాతి దురహంకారుల వివక్ష, అణచివేతకు దక్షిణాఫ్రికాలో ఆఫ్రికన్లు బలైన సంగతి తెలిసిందే. ఆ బాధ ఏమిటో వారికి తెలిసినంతగా మరొకరికి అవగతం కాదు, ఈ కారణంగానే పాలస్తీనియన్లకు మద్దతుగా కేసుదాఖలు చేసినట్లు భావిస్తున్నారు. అది ఏమౌతుందో చెప్పలేము గానీ ఇజ్రాయెల్‌ మీద వత్తిడి పెంచుతుంది, బహుశా దాని ప్రభావం వల్లనే పెద్ద సంఖ్యలో సేనలను గాజా నుంచి వెనక్కి రప్పిస్తున్నట్లు ప్రకటించిందా ? అబ్బే అదేమీ లేదు, పోరులో ఉన్నవారికి విశ్రాంతినిచ్చేందుకు, వారి స్థానంలో కొత్తవారిని దించుతామని ఇజ్రాయెల్‌ అధికారులు ప్రకటించింది వాస్తవమా ? చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు గాజాలో ఇరవై రెండువేల మందికి పైగా పౌరులను చంపారు. ఎనిమిది వేల మంది హమస్‌ తీవ్రవాదులను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ చెప్పుకోవటం తప్ప దానికి తగిన ఆధారాలను చూపలేదు, ఎవరూ నమ్మటం లేదు. ఈ ఏడాది అంతటా తమ దాడులు కొనసాగుతాయని ప్రకటించారు. అంతర్జాతీయ వ్యవస్థలో ఐసిజె సివిల్‌ కోర్టు, ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టు(ఐసిసి) నేరాలను విచారిస్తుంది. ఐరాసలో రెండు దేశాలూ సభ్యులే కనుక కోర్టు నిర్ణయాలకు బద్దులు కావాల్సి ఉంది.తమ దేశంలో 1994లో అంతమైన జాత్యంహకార పాలనలో శ్వేతజాతి మైనారిటీలు జనాన్ని బలవంతంగా వేర్వేరుగా ఉంచారని, ఇప్పుడు ఇజ్రాయెల్‌ విధానాలు కూడా అలాగే ఉన్నట్లు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా చెప్పాడు. అక్టోబరు ఏడు నుంచి గాజాలో ఇజ్రాయెల్‌ చర్యలు జాతుల అంతంపై ఐరాస తీర్మానాలకు విరుద్దంగా ఉన్నాయని అందువలన తక్షణమే విచారణ జరపాలని కోర్టును దక్షిణాఫ్రికా అభ్యర్ధించింది. గాజాలో కాల్పుల విరమణ జరిపేవరకు ప్రిటోరియాలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని ఆదేశించటమే గాక అన్ని రకాల దౌత్య సంబంధాలను పక్కన పెడుతున్నట్లు దక్షిణాఫ్రికా చాలా రోజుల క్రితమే ప్రకటించింది. తమ మీద చేసిన అభియోగాలకు ఆధారం లేదని, రక్తపు మరకలను తమకు అంటిస్తున్నారని ఇజ్రాయెల్‌ ఆరోపించింది. గాజాలోని పౌరులు తమకు శత్రువులు కాదని చెప్పుకుంది.మరోవైపు గాజాలో అమాయకులెవరూ లేరని ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు హర్‌జోగ్‌ ప్రకటించాడు. అక్కడి జనం మానవ మృగాలు గనుక వారికి సామూహిక శిక్ష విధిస్తామని రక్షణ మంత్రి చెప్పాడు. ప్రధాని నెతన్యాహు బైబిల్‌లోని అంశాలను ఉల్లేఖించటం జాతి నిర్మూలనకు పిలుపు నివ్వటం తప్ప మరొకటి కాదని అనేక మంది చెప్పారు. దక్షిణాఫ్రికా చర్యను పాలస్తీనా విదేశాంగ మంత్రిత్వశాఖ స్వాగతించింది.వెంటనే కోర్టు స్పందించాలని, పౌరులకు మరింత హాని జరగకుండా చూడాలని కోరింది.


గాజాలో ఇజ్రాయెల్‌ దాడులకు నిరసనగా ఎర్ర సముద్రంలోని బాబ్‌ ఎల్‌ మాండెబ్‌ జలసంధి ద్వారా రాకపోకలు సాగిస్తున్న నౌకలపై తాము దాడులు చేస్తామని ఎమెన్‌ కేంద్రంగా ఉన్న హౌతీ సాయుధ దళాలు ప్రకటించాయి. తమ సేనలు మూడు హౌతీ పడవలను ముంచివేసి పదిమందిని హతమార్చినట్లు అమెరికా వెల్లడించింది. తొలిసారిగా ప్రత్యక్ష దాడులకు దిగటం ఇదే ప్రధమం. ఎమెన్‌ కాలమానం ప్రకారం ఆదివారం నాడు ఉదయం ఆరున్నర గంటలకు హంగఝౌ అనే కంటెయినర్‌ నౌక మీద చిన్న పడవల నుంచి దాడులు జరగటంతో తమను రక్షించాలని నౌకలో ఉన్నవారు కోరిన వెంటనే యుద్ధ నౌకలు, కొన్ని హెలికాప్టర్లను పంపి హౌతీలపై అమెరికన్లు దాడులు జరిపారు. బహుళజాతి సముద్రయాన రక్షణ దళాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డిసెంబరు 19న అమెరికా ప్రకటించగా సుముఖత చూపిన పందొమ్మిది దేశాలు సంతకాలు చేసినప్పటికీ కేవలం తొమ్మిది మాత్రమే ఈ ప్రయత్నంలో ఉన్నట్లు తమ పేర్లు పేర్కొనాలని చెప్పాయి.ఒక్క బ్రిటన్‌ మాత్రమే తమ యుద్ధ నౌకలను పంపింది. అనేక అరబ్బు దేశాలు పరిణామాలు, పర్యవసానాల గురించి ఆందోళన చెందుతున్నాయి. ఇజ్రాయెల్‌కు సంబంధం ఉన్న నౌకల రక్షణకు తామెందుకు మద్దతు ఇవ్వాలని అవి ఆలోచిస్తున్నాయి. హౌతీల దాడుల గురించి అమెరికా రక్షణశాఖ ఆందోళన చెందుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. హౌతీలు కేవలం రెండువేల డాలర్ల విలువగల డ్రోన్లతో దాడులు చేస్తుంటే తాము 21 లక్షల డాలర్ల విలువగల క్షిపణులను వాటిని కూల్చేందుకు వినియోగించాల్సి రావటం భారంగా భావిస్తున్నట్లు చెబుతున్నారు. గడచిన రెండు నెలల కాలంలో ఎర్రసముద్రంలో 38 డ్రోన్లను కూల్చివేసినట్లు అమెరికా చెప్పుకుంది. ఇరాన్‌ తయారు చేస్తున్న డ్రోన్ల కనిష్ట ధర రెండు వేల డాలర్లు కాగా గరిష్టంగా ఇరవైవేల డాలర్లు ఉంది. ప్రస్తుతం అమెరికా మధ్యధరాసముద్రం, ఏడెన్‌ గల్ఫ్‌కు రెండు విమానవాహక యుద్ద నౌకలు, నాలుగు డెస్ట్రాయర్లు, ఒక క్రూయిజర్‌ను పంపింది.సూయజ్‌ కాలువ ద్వారా హిందూ మహాసముద్రంలో ప్రవేశించే మార్గం ద్వారా ప్రపంచ వాణిజ్యంలో పన్నెండు శాతం రవాణా జరుగుతుంది. ఎర్ర సముద్రంలో తలెత్తిన పరిస్థితి కారణంగా నౌకలు గుడ్‌హౌప్‌ ఆగ్రం వరకు వెళ్లి ఆఫ్రికా ఖండాన్ని చుట్టి వచ్చే పాత మార్గానికి మళ్లుతున్నాయి. ఇది ఖర్చుతో పాటు ప్రయాణ సమయాన్ని కూడా పెంచుతుంది. ఇజ్రాయెల్‌ చెబుతున్నట్లు ఈ ఏడాది అంతా గాజామీద దాడులు జరిపితే ఎర్రసముద్రంలో దాడులు కూడా కొనసాగుతాయి. ఎవరి ఎత్తుగడలు వారికి ఉంటాయి. అమెరికా నేరుగా రంగంలోకి దిగటంతో తమ దాడులను కూడా తీవ్రం చేస్తామని హౌతీలు ప్రకటించారు.


పశ్చిమాసియా, ఉక్రెయిన్‌ సంక్షోభాలలో డ్రోన్ల వినియోగం యుద్ధ తీరుతెన్నులనే మార్చివేసిందంటే అతిశయోక్తి కాదు.భారీ ఖర్చుతో కూడిన అమెరికా, ఇతర నాటో దేశాల ఆధునిక ఆయుధాలు స్వల్ప ఖర్చుతో రూపొందించే నాటు రకం డ్రోన్లను కూల్చేందుకు ఉపయోగించాల్సి రావటం ఎంతో వ్యయంతో కూడుకున్నది. అందువలన ఇప్పుడు డ్రోన్లను కూల్చేందుకు శక్తివంతమైన లేజర్‌ కిరణాలను పంపే విధంగా కొత్త వ్యవస్థలను రూపొందించాల్సిన అగత్యం అమెరికాకు ఏర్పడింది. రష్యా ఇప్పటికే తన డ్రోన్లు పనిచేయకుండా స్థంభింపచేసే ఎలక్ట్రానిక్‌ యుద్ధ వ్యవస్థలను వమ్ము చేసేందుకు మాజిక్‌ రేడియో పేరుతో రక్షణ కల్పిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.దీన్ని బట్టి రానున్న రోజుల్లో సినిమాల్లో మాదిరి కిరణాల యుద్ధాలు జరగనున్నాయని చెప్పవచ్చు.శక్తివంతమైన లేజర్‌ కిరణాలను పంపి డ్రోన్లు, క్షిపణుల మీద దాడి చేసినపుడు వాటినుంచి వెలువడే ఉష్ణం వాటిని మండించి పనికి రాకుండా చేస్తుంది. హమస్‌, హౌతీ సాయుధులు ఉపయోగిస్తున్న మానవ రహిత ఆత్మాహుతి డ్రోన్లతో అమెరికా రక్షణశాఖను ఆతురతలోకి నెట్టారు. ఈ డ్రోన్లన ఇరాన్‌ వీరితో పాటు రష్యాకూ సరఫరా చేస్తున్నది. వాటితో ఉక్రెయిన్‌ మౌలిససదుపాయాల వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న సంగతి తెలిసిందే.కేవలం యాభైవేల డాలర్ల విలువ గల రష్యా డ్రోన్లను కూల్చేందుకు అమెరికా అందచేసిన 30లక్షల డాలర్ల ఖరీదు చేసే పేట్రియాట్‌ క్షిపణులను జెలెనెస్కీ సేనలు ప్రయోగిస్తున్నాయి. వీటిని ప్రయోగించే మొత్తం వ్యవస్థకయ్యే ఖర్చు 110 కోట్ల డాలర్లు. ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు ఉక్రెయిన్‌ వద్ద నిండుకున్నట్లు, అందుకే పరిమితంగా వాటిని వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు. డ్రోన్ల గుంపు అంటే ఎన్ని అన్నది కూడా అర్ధంకాని స్థితి ఉంది.కొన్ని డజన్లు అంతకంటే ఎక్కువ దూసుకువచ్చినపుడు శక్తివంతమైన లేజర్‌ కిరణాలు వాటన్నింటినీ కూల్చివేసే అవకాశం లేదని చెబుతున్నారు. వీటిని ప్రయోగించాలంటే వాటిని ఉంచిన కేంద్రాలలో నిరంతరం విద్యుత్‌ సరఫరా కూడా ఉండాలి.


తాము నిర్మించినవే గనుక ఉక్రెయిన్‌లో విద్యుత్‌ సరఫరా వ్యవస్థలన్నీ రష్యన్లకు కొట్టినపిండి. ఇరాన్‌ సరఫరా చేసిన దీర్ఘశ్రేణి డ్రోన్లలో ముందుగానే లక్ష్యాలను నిక్షిప్తం చేసి వదులుతున్నందున అక్కడి వ్యవస్థలను ధ్వంసం చేయగలుగుతున్నాయి.గాజాపై దాడులను విరమించకపోతే తాము ఇజ్రాయెల్లో మంటలు రేపుతామని హమస్‌ తీవ్రవాదులు హెచ్చరిస్తున్నారంటే వారి దగ్గర ఇలాంటి డ్రోన్లు ఇప్పటికే చేరి ఉండాలి. ఉక్రెయిన్‌ వద్ద రాడార్లను, లేజర్‌ కిరణాలను తప్పించుకుంటూ సముద్రాల మీద తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లు ఉన్న కారణంగానే అజోవ్‌ సముద్రంలోని వంతెన పేల్చివేత, సెవాస్తపూల్‌లోని రష్యా నౌకలపై దాడులు సాధ్యమైందని చెబుతున్నారు. పశ్చిమాసియా, ఉక్రెయిన్‌ యుద్దాలలో వీటిని చూసిన తరువాత ప్రపంచ దేశాలలో ఆందోళన తలెత్తుతున్నది, భారీ ఆయుధాలు, జెట్‌ విమానాలను కూల్చటమెట్లా అని ఇప్పటి వరకు ఆలోచిస్తున్న దేశాలు ఇప్పుడు ఇలాంటి చిన్న వాటిని పసిగట్టేవాటిని తయారు చేయటం మీద కేంద్రీకరించాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పాలస్తీనా ప్రజలు చరిత్ర నిర్మిస్తున్నారు

02 Tuesday Jan 2024

Posted by raomk in Current Affairs, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

2023 Israel–Hamas war, Gaza Deaths, Israel genocide, Netanyahu, Recep Tayyip Erdoğan


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌


2023 అక్టోబరు 7న హమాస్‌ ఇజ్రాయెల్‌పై దాడి తరువాత పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులతో మారణకాండకు పూనుకుంది. ఆసుపత్రులు, పాఠశాలలు, శరణార్ధుల కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని కార్పెట్‌ బాంబుదాడులను సాగిస్తోంది. కొరియా, వియత్నాంలపై దురాక్రమణ యుద్ధాలలో ఒక్క అంగుళంకూడా వదలకుండా ఇలాగే అమెరికా మారణహౌమాన్ని సష్టించింది. అదే చరిత్రను పునరావతం చేస్తూ, ఇజ్రాయెల్‌ సైన్యం గాజాలో ఇళ్ళను భూమట్టంచేస్తూ తన పై దాడి చేసిన హమాస్‌ వారిని పట్టుకోలేక, 22 వేలమందికి పైగా సామాన్య అమాయక ప్రజలను హతమార్చింది. ఇందులో 70 శాతం మంది చిన్న పిల్లలు, మహిళల తోపాటుగా జర్నలిస్టులు , డాక్టర్లు కూడా వున్నారు. తీవ్ర అననుకూల పరిస్ధితులలోవార్తలను సేకరిస్తూ, సంఘర్షణలను, బాంబుదాడులను చిత్రీకరిస్తూ 90 మంది జర్నలిస్టులు తమ ప్రాణాలనర్పించారు. హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ గత వారం ఇజ్రాయెల్‌ ప్రభుత్వం యుద్ధ నేరానికి పాల్పడిందని ప్రకటించింది. ప్రజలకు ఆహారం, నీరు అందకుండా కత్రిమ కరువు ను సష్టించి ప్రజల ప్రాణాలను తీస్తున్నఇజ్రాయల్‌ ప్రధాని నెతన్యాహూని ఈ నాటి హిట్లర్‌ అని టర్కీఅధ్యక్షుడు ఎర్డోగాన్‌ అన్నాడు. అంతేకాకుండా గాజాపై ఈ ఉన్మాద దాడులను ఆపేయాలి అన్నాడు. పాలస్తీనా ప్రజలకు అండగా మేమున్నామంటూ, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజా ప్రదర్శను ఇస్తాంబుల్‌ పట్టణంలో నిర్వహించారు. మలేసియా ప్రధాని అన్వర్‌ఇబ్రహీమ్‌ తమది ఒక స్వతంత్ర సార్వభౌమ దేశమని, అమెరికా వత్తుడులకు లోంగమన్నారు. తమహక్కులకోసం, స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న పాలస్తీనియన్లకు పూర్తి సహకారం అందిస్తామని పెద్ద ప్రజా ప్రదర్శనను నిర్వహించారు. కొలంబియా అధ్యక్షుడు పెట్రో. దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు రామపోసా , అమెరికా, జర్మనీ, బ్రిటన్‌, తదితర దేశాల్లో ప్రజలు గాజా ప్రజలకుఅండగా వుంటామన్నారు.

మానవ కల్పిత కరువు

గాజాలోని పాలస్తీనియన్లకు అవసరమయిన ఆహారంలో కేవలం 10 శాతం మాత్రమే అందుతున్నదని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఐరాస ఏజెన్సీలు మరియు స్వచ్చంద సహాయ సంస్థల భాగస్వామ్యం అయిన ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌ సెక్యూరిటీ ఫేజ్‌ క్లాసిఫికేషన్‌ ప్రచురించిన ఒక నివేదికలో, గాజాలో ఉన్న కుటుంబాలు సంక్షోభంలో తీవ్రమైన ఆహార అభద్రతతో బాధపడుతున్నట్లు పేర్కొంది. గాజాలోని మొత్తం 23 లక్షల జనాభా అతిపెద్ద మానవ కల్పిత కరువు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నదని హెచ్చరించింది.తక్షణ కాల్పుల విరమణ కోసం ఐ రా స పిలుపునిచ్చేందుకు వీల్లేదని అమెరికా వీటోని ప్రయోగించి తన సామ్రాజ్యవాద స్వభావాన్ని మరోసారి నిరూపించుకున్నది. గాజాలో మానవతావాద పరిస్థితి మరింత భయంకరంగా మారడంతో ఇజ్రాయెల్‌ సైనిక చర్య సమర్థించలేనిదిగా మారడంతో, బలమైన మద్దతుదారు అమెరికా, జర్మనీ, బ్రిటన్‌ లలోకూడా ప్రజలు తీవ్ర నిరసనతెలపుతున్నారు. ప్రభుత్వాలు ఇరుకున పడుతున్నాయి.ఎర్ర సముద్రంలోని ”ఇజ్రాయెల్‌- సంబంధిత” నౌకలపై యెమెన్‌ హౌతీ మిలీషియా దాడులను తీవ్రతరం చేయడంతో వివాదం మధ్యప్రాచ్యంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తోంది. ఇజ్రాయల్‌-పాలస్తీనాకు పరిమితమయిన యుద్ధం సముద్రానికి మారింది.

పాలస్తీనాకు మద్దతిస్తున్న హౌతీ రెబెల్స్‌ ఎర్రసముద్రంలో ఇజ్రాయల్‌తో సంబంధమున్న దేశాల నౌకలపై డ్రోన్లు, క్షిపణు లతో దాడులను చేస్తున్నారు. ప్రపంచ వాణిజ్య రంగంలో ముఖ్యమైన నౌకా రవాణా రంగంలో అత్యంత కీలకమైన మార్గమిది. అమెరికా, ఐరోపా దేశాలు ఆసియా, ఆఫ్రికా దేశాలతో వ్యాపారం చేసి లాభాలను ఆర్జిస్తూన్నాయి. ఆఫ్రికా చుట్టూ తిరిగిరాకుండా ఈజిప్ట్‌లోని సూయజ్‌ కాలువ-ఎర్రసముద్రం మీదుగా ఆంతర్జాతీయ వాణిజ్యంసాగుతోంది. బాబ్‌ ఎల్‌ మండెప్‌ జలసంధి వద్ద మార్గం చాలా సన్నంగా 29 కి.మీ. మాత్రమే వుండటం వలన నౌకలపై దాడులకు అనువుగా వుంది. పక్కనే ఉన్న ఎమెన్‌ స్ధావరంగా చేసుకుని హౌతీ రెబెల్స్‌ వాణిజ్య నౌకలపై దాడుల ద్వారా గాజాలో మారణహౌమాన్ని ఆపాలని వత్తిడి తెస్తున్నారు. ఇజ్రాయల్‌, అమెరికా, యూరప్‌లను హడలెత్తిస్తున్నారు. మొత్తం ఆంతర్జాతీయ సమాజానికి అల్టిమేటం ఇస్తున్నారు. పది దేశాల మిలిటరీ బలగాలను ఎర్రసముద్రం లోకి దించి హౌతీలను ఎదుర్కోవాలని అమెరికా”ఆపరేషన్‌ ప్రాస్పరిటీ గార్డియన్‌” వ్యూహాలను రచిస్తున్నది. యుద్ధ నౌకల పహారాతో నౌకలను దాడులనుండి రక్షించటానికి ఎర్రసముద్ర సంకీర్ణ రక్షణ కూటమిని ఏర్పాటు చేసింది. ఈ కూటమిలో అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, బహరైన్‌, షెషల్స్‌, స్పెయిన్‌, నార్వే, నెదర్లాండ్‌, కెనడా, ఇటలీతో 10 దేశాలున్నాయి. ప్రాంతీయ దేశాలలో బలమైన సౌదీ అరేబియా, ఈజిప్టు చేరలేదు. ఒక్క బహ్రైన్‌ చేరింది. కూటమిలో చేరటానికి అన్ని నాటో దేశాలు ఉత్సాహం చూపటంలేదు.

గాజాపై దాడులు ఆపకపోతే ప్రపంచ ఇంటర్నెట్‌పై కూడా దాడి చేస్తామని హౌతీలు హెచ్చరించారు. బాబ్‌ ఎల్‌ మండెప్‌ జలసంధికి దగ్గర సముద్ర కేబుల్‌ నెట్‌ వర్క్‌ వైర్‌లను కత్తిరించేస్తామన్నారు. హౌతీలు వాణిజ్య నౌకల పైననే కాకుండా , అమెరికా యుద్ధనౌకలపైనా, ఇజ్రాయల్‌ రేవులపౖౖె కూడా దాడులను మొదలెట్టారు. వందలకొలదీ నౌకలు సముద్రంలో లంగరు వేసి ఆగిపోయాయి. అతి పెద్ద, యం.స్‌.సీ యునైటెడ్‌ వాణిజ్య నౌక పై డిసెంబర్‌ 26న హౌతీ మిలిటరీ మిస్సైల్‌ తో దాడి చేసినట్లుగా వెల్లడించింది. గెలక్సీ లీడర్‌ అనే ఇజ్రాయల్‌ వ్యాపారి నౌకను హైజాక్‌ చేసి 25 మంది సిబ్బందిని ఎమెన్‌ లో నిర్బంధించారు. ఇజ్రాయల్‌ తో అంటకాగుతున్న ఇండియా నౌకలను కూడా వదలలేదు. ఇండియా వస్తున్నఎం.వి.కెమ్‌.ఫ్లూటో నౌక పైనా, సౌదీనుండి వస్తున్న ఎం.వి.సాయిబాబా నౌకల పైన కూడా డ్రోన్‌ దాడులు జరిగాయి. భారతదేశం 3 యుద్ధ నౌకలను కాపలాగా పంపించింది. అందులో”ఐ యన్‌ యస్‌ మారముగో”గైడెడ్‌ మిస్సైల్‌ విధ్వంసక నౌక కూడా వుంది.

ప్రపంచ ప్రజలు ఉద్యమించాలి

నౌకలు రెడ్‌ సీ ద్వారా రోజుకి 16 నాటికల్‌ మైళ్ళ వేగంతో ప్రయాణించి 25 రోజులలో యూరప్‌ ని చేరగల్గుతున్నాయి. ఎర్రసముద్రాన్ని తప్పించి ఆఫ్రికా చుట్టూ తిరిగి గుడ్‌ హౌప్‌ మార్గం ద్వారా ప్రయాణించటానికి 43 రోజులు పడ్తుంది. వ్యయ ప్రయాసలకోర్చిరూట్‌ మార్చే ప్రయాణానికి 9 రోజులనుండి 30 రోజులు ఆలస్యమవుతుంది. 15 రోజులు ప్రయాణ కాలం పెరిగితే నౌకకు ఇంధనం ఖర్చు అదనంగా 10లక్షల డాలర్ల వుతాయి. వందకు పైగా వాణిజ్య నౌకలు రూటు మార్చుకున్నాయి. ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్తున్నాయి. భీమా కంపెనీలు ప్రతి కంటైనర్‌ మీద 700 డాలర్ల సర్‌ ఛార్జి విధిస్తున్నాయి. నిత్యవసరవస్తువులన్నిటికీ ఆసియా, ఆఫ్రికా దేశాలపై ఆధారపడిన అమెరికా యూరప్‌ దేశాలు సరుకుల రవాణా ఆలస్యాన్ని భరించలేవు. ఖర్చు పెరుగుతుంది. ఆసియా ధేశాలకు చమురు సహజ వాయువు దిగుమతులు కష్టవుతాయి. ప్రపంచవ్యాపితంగా ధరలు పెరిగి ద్రవ్యోల్బణం సంభవించి ఆర్ధిక సంక్షోభానికి దారి తీస్తుంది. అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రమాదంగా పరిణమించిన సమస్యను పరిష్కరించాలంటే గాజా పై ఇజ్రాయల్‌ మానవ హననాన్ని ఆపేటట్లుగా ప్రపంచ ప్రజలు ఉద్యమించాలి.

టెక్నాలజీ, ఆయుధాలు సమస్యలన్నిటినీ పరిష్కరిస్తాయనే విశ్వాసం అన్నిసార్లూ వాస్తవం కాదని పాలస్తీనీయులు, హౌతీలు నిరూపించారు. ప్రపంచంలో అత్యంత ఆధునిక టెక్నాలజీ సహాయంతో ఏదైనా ముందే కనుక్కోగలమనే ఇంటలిజెన్స్‌ నెట్‌ వర్క్‌ వున్నదనుకుని విర్రవీగే ఇజ్రాయల్‌ ప్రభుత్వం, హమాస్‌ దాడిని ముందే పసిగట్టలేకపోయింది. హఠాత్తుగా జరిగిన అక్టోబర్‌ 7 దాడిని జీర్ణించుకోలేక సాగిస్తున్నవిశంఖలదాడులు హమాస్‌ ని పట్టుకోవటం లో విఫలం చెంది విచక్షణారహితంగా సామాన్యప్రజలను హతమారుస్తున్నారు. 200 డాలర్లతో తయరయ్యే డ్రోన్‌ ల తో , లక్షలకోట్ల డాలర్ల విలువ చేసే నౌకలను హౌతీలు హడలెత్తిస్తున్నారు. అంతర్జాతీయ వాణిజ్యం సంక్షోభం లోకి జారేటట్లున్నది. వరస ఎదురుదెబ్బలు తింటూ, డాలర్‌ పతనం ప్రారంభమయి, ఉక్రెయిన్‌ లోకూడా భంగపడబోతున్న అమెరికాకు ఇజ్రాయల్‌ దుశ్చర్యలను చివరకంటా బలపరచటం సాధ్యంకాదు. ప్రజలే చరిత్రను నిర్మిస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d