• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Anti communist

తప్పుడు సెక్షన్లతో అణచివేతలో నరేంద్రమోడీ – డోనాల్డ్‌ ట్రంప్‌ ఇద్దరూ ఇద్దరే : ఇక్కడ ఎస్‌ఎఫ్‌ఐ శివానందన్‌ – అక్కడ మహమ్మద్‌ ఖలీల్‌ !

19 Wednesday Mar 2025

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

anti BJP, Anti communist, ANTI NATIONAL, Anti War, BJP, Donald trump, JD Vance, Mahmoud Khalil, Narendra Modi Failures, Ramadas Prini Sivanandan, sfi, US Green Card


ఎం కోటేశ్వరరావు


ఇప్పటివరకైతే భారత్‌, అమెరికా రెండూ పెద్ద ప్రజాస్వామిక దేశాలే ఎవరూ కాదనటం లేదు. కానీ ఆచరణ చూస్తే నిరంకుశత్వానికి దారితీస్తున్నట్లుగా వ్యవహరించటం ఆందోళన కలిగిస్తోంది.వ్యవస్థలను దిగజారుస్తున్నారు, కొత్త అర్ధాలు చెబుతున్నారు, పాలకులను విమర్శించటాన్ని దేశద్రోహంగా చిత్రిస్తూ బ్రిటీష్‌ వలస పాలకులను గుర్తుకు తెస్తున్నారు. మన గతం గురించి మరచిపోయిన వారికి దాన్ని గుర్తు చేయటం కూడా ఒకందుకు మంచిదేనేమో ? ఏదీ ఊరికే రాదు అన్నట్లుగా మన స్వేచ్చ, స్వాతంత్య్రాలు ఊరికే రాలేదు అని కొందరైనా తెలుసుకుంటారు.రెండు చోట్లా చట్టాలు, నిబంధనలకు వక్రభాష్యాలు చెప్పి భావ ప్రకటన, నిరసన తెలిపే హక్కును హరించే ఉదంతాల గురించి చెప్పుకోవటం దేశ వ్యతిరేకతగా పరిగణించినా ఆశ్చర్యం లేదు, రోజులిలా ఉన్నాయి, ఏం జరిగినా ఎదుర్కోక తప్పదు మరి. గత ఏడాది ఏప్రిల్‌ నెలలో ముంబైలోని టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(టిస్‌) అభివృద్ధి అధ్యయనాల విభాగంలో పిహెచ్‌డి చేస్తున్న రామదాస్‌ ప్రిని శివానందన్‌ అనే పరిశోధకుడిని సంస్థ సస్పెండ్‌ చేసింది. ఎందుకటా ! న్యూఢల్లీిలో విద్యార్ధులు భారత్‌ను రక్షించండి`బిజెపిని తిరస్కరించండి అనే నినాదంతో పార్లమెంట్‌వద్దకు ప్రదర్శన నిర్వహించారని, దానిలో భాగస్వామి కావటం జాతి వ్యతిరేకతకిందకు వస్తుందని కారణం చెప్పింది.కేరళలో దళిత సామాజిక తరగతికి చెందిన ఈ యువకుడు ముంబైలో చదువుతూ మహారాష్ట్ర ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త కార్యదర్శిగా పని చేశాడు.


టిస్‌ చెప్పిన సాకులు లేదా కారణాలను చూస్తే ఎవరూ కూడా ప్రభుత్వాల విధానాల మీద నిరసనలు, అసమ్మతి తెలపటానికి వీల్లేదు. ఎందుకంటే ఏదో ఒక ప్రభుత్వ పథకం కింద ఆర్థికంగానో, సేవాపరంగానో ప్రతివారూ లబ్దిదారులే, అలాంటపుడు ఎవరూ ఏ ప్రభుత్వాన్నీ విమర్శించకూడదు, భజన మాత్రమే చేయాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానాన్ని ఢల్లీిలో జరిగిన ప్రదర్శనలో విమర్శించారు, దాన్లో పాల్గొన్నందున శివానందన్‌ జాతి వ్యతిరేకి అనటమే కాదు అతని మీద చర్యలు తీసుకొనేందుకు దర్యాప్తు సంస్థలు ముందుకు రావాలని కూడా టిస్‌ కోరింది. న్యాయవ్యవస్థ ఇంకా ఉనికిలో ఉంది గనుక తన సస్పెన్షన్‌ చెల్లదని ప్రకటించాలని కోరుతూ అతను బోంబే హైకోర్టుకు వెళ్లాడు. ఎంఎం సత్తాయి, ఎఎస్‌ చందూర్కర్‌ డివిజన్‌ బెంచ్‌ అతని పిటీషన్ను కొట్టివేస్తూ టిస్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఈ తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేయనున్నట్లు శివానందన్‌ చెప్పాడు. ఇది వ్యక్తిగత సమస్య కాదని మొత్తం విద్యార్ధి సమాజం మీద ప్రభావితం చూపనున్నందని అన్నాడు.కేంద్ర ప్రభుత్వం నుంచి ఫెలోషిప్‌ పొందుతున్న కారణంగా రాజకీయ పరమైన కార్యకలాపాల్లో పాల్గ్గొంటే చర్యలు తప్పవని, సంస్థలో ఉన్నపుడు రాజకీయ అభిప్రాయాలకు దూరంగా ఉండాలని కోర్టు పేర్కొన్నది. ఒక టెలికాం ఉద్యోగి యువకుడిగా ఉన్నపుడు ఒక యువజన సంఘ సమావేశంలో పాల్గొన్నందున ఉద్యోగం నుంచి తొలగించితే ఆ కేసు సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. అతను పాల్గొన్నది నిషేధిత సంస్థ కాదు, యువకులు యువజన సంఘాల సమావేశాల్లో గాక మరిదేనిలో పాలుపంచుకోవాలని ప్రశ్నిస్తూ ఉద్యోగం నుంచి తొలగించటాన్ని తప్పు పడుతూ జస్టిస్‌ ఓ చిన్నపరెడ్డి చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. తరువాత ఉద్యోగిగా ఆ యువకుడు ఉద్యోగ విరమణ చేసేవరకు టెలికాం ఉద్యోగుల యూనియన్లో కూడా చురుకుగా పని చేశారు.


కోర్టు పేర్కొన్న అంశాలు సరైనవి కాదని, ఒక విద్యార్ధి అర్హత పరీక్షలో పాసైనపుడు ఫెలోషిప్‌ ఒక హక్కు తప్ప దయాధర్మం కాదని, పరిశోధక విద్యార్థికి ఫెలోషిప్‌ ఇవ్వటం తనంతటతాను బతకటానికి అవసరమైన ఉద్యోగ సంపాదన కోసం కాదని, జాతి నిర్మాణ క్రమంలో తోడ్పడేందుకు ఇచ్చే మొత్తమని శివానందన్‌ చెప్పాడు. ఏ విద్యా సంస్థ అయినా జారీచేసే సర్క్యులర్‌ కంటే రాజ్యాంగం ఎంతో ముఖ్యమైనదని తాను భావిస్తున్నానని, రాజ్యాంగ హక్కును వినియోగించుకున్నందుకు తనను శిక్షించారని అన్నాడు. టిస్‌ లేదా ఏ విశ్వవిద్యాలయం జారీచేసే నిబంధనలు, సర్క్యులర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించకూడదని, విద్యా సంస్థలు నిష్పాక్షికంగా ఉండాలని, ఒక తరహా రాజకీయాలకు ఒక విశ్వవిద్యాలయం తనను తాను ఎలా అనుంబంధించుకుంటుదని ప్రశ్నించాడు.


పార్లమెంట్‌కు ప్రదర్శన బానర్‌ కింద భారత్‌ను రక్షించండి, బిజెపిని తిరస్కరించండి అనే నినాదంతో తాను ప్రదర్శనలో పాల్గొంటే తాను పట్టుకున్న ప్లకార్డు మీద టిస్‌ పేరు ఉన్నట్లు అధికారులు ఆరోపించారచెప్పాడు. ప్రోగ్రెసివ్‌ స్టూడెంట్స్‌ ఫోరమ్‌(పిఎస్‌ఎఫ్‌) ప్రధాన కార్యదర్శిగా ప్రదర్శనలో పాల్గొన్నాను తప్ప టిస్‌ ప్రతినిధిగా కాదని అన్నాడు. తనను సస్పెండ్‌ చేసిన టిస్‌ కమిటీ, హైకోర్టు ముందు కూడా తాను ఇదే చెప్పానన్నాడు. శివానందన్‌ 2015లో టిస్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌గా చేరి తరువాత అక్కడే ఎంఫిల్‌ పూర్తి చేసి పరిశోధక విద్యార్థిగా నమోదయ్యాడు. టిస్‌ గతంలో ఒక ప్రజాస్వామిక సంస్థగా కనీసం నటించేదని ఇటీవలి సంవత్సరాలలో విద్యార్ధులు చేపట్టే ఎలాంటి కార్యక్రమాలకు అనుమతించటం లేదని చెప్పాడు. అయోధ్యలో రామాలయ ప్రారంభాన్ని ఒక జాతీయ కార్యక్రమంగా చేపట్టినపుడు జాతీయ అవార్డు పొందిన ఆనంద పట్వర్ధన్‌ డాక్యుమెంటరీ ‘‘ రామ్‌ కె నామ్‌ (రాముడి పేరుతో ) ’’ ను అనేక విశ్వవిద్యాలయాల్లో ప్రదర్శించారని తాను ఆ సమయంలో ప్రమాదంలో గాయపడి ప్రదర్శనకు రాలేకపోయానని, అయితే బాబరీ మసీదు విధ్వంసం సందర్భంగా జరిగిన దుర్మార్గమైన వాస్తవాలను తెలుసుకొనేందుకు అందరూ చూడాలని కోరుతూ తన అభిప్రాయాలను సామాజిక మాధ్యమంలో వెల్లడిరచగా దాన్ని కూడా దేశ వ్యతిరేక చర్యగా టిస్‌ తన మీదకు మళ్లించిందని పేర్కొన్నాడు. కేంద్రం నుంచి 50శాతం పైగా నిధులు పొందుతున్న సంస్థలన్నింటిని కేంద్రం తన ఆధీనంలోకి తెచ్చుకున్న తరువాత టిస్‌లో అనేక పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఎక్కడ పది మంది విద్యార్దులు కూర్చుంటే, చివరకు తమ గ్రూపు ప్రాజెక్టుల గురించి చర్చించేందుకు ఒక చోట చేరినా సంస్థను అస్థిరపరిచేందుకు చూస్తున్నారంటూ చెదరగొట్టటం జరుగుతోందన్నాడు.శివానందాన్ని హెచ్చరిస్తూ అనేక సార్లు తప్పుడు నోటీసులు జారీ చేసింది. భగత్‌ సింగ్‌ స్మారక ఉపన్యాసం చేసేందుకు పిలిచిన అతిధులను వివాదాస్పద ప్రసంగీకులు అనే సాకుతో వారి పేర్లు లేకుండా ఇచ్చిన నోటీసు అలాంటి వాటిలో ఒకటి. సదరు వివాదాస్పద అతిధులు ఎవరంటే మెగసెసే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్‌, ప్రముఖ జర్నలిస్టు పి శాయినాధ్‌, జెఎన్‌యు మాజీ ప్రొఫెసర్‌, ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ మాజీ సంపాదకుడు గోపాల్‌ గురు. గతేడాది టిస్‌ విద్యార్ధి సంఘ ఎన్నికలను రద్దు చేసింది, ప్రోగ్రెసివ్‌ స్టూడెంట్స్‌ ఫోరమ్‌ను నిషేధించింది. విద్యార్థులు ఆందోళన చేయటంతో వెనక్కు తీసుకుంది. ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే టిస్‌కు ఎలాంటి అభ్యంతరం ఉండదు, కేంద్ర ప్రభుత్వ ఫెలోషిప్‌ తీసుకొనే వారు బిజెపి రాజకీయాలను విమర్శించకూడదంటే నేను అంగీకరించను, దేశంలో ఉండాలంటే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బిజెపి సభ్యత్వం తీసుకోవటానికి లేదా సానుభూతిపరునిగా ఉండటానికి నన్ను బలవంతం చేయలేరని శివానందన్‌ చెప్పాడు.

అమెరికాలో ఏం జరుగుతోంది !
మహమ్మద్‌ ఖలీల్‌ అమెరికా పౌరసత్వం కలిగిన సిరియా దేశస్థుడు. అతని మీద చట్ట ఉల్లంఘనకు పాల్పడిన కేసులేవీ లేవు. అతన్ని బలవంతంగా సిరియా పంపేందుకు ట్రంప్‌ యంత్రాంగం చూస్తోంది. ఖలీల్‌ చేసిన నేరం ఏమిటో తెలుసా ? గాజాలో పాలస్తీనియన్లపై మారణకాండకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌ దుశ్చర్యలను ఖండిస్తూ కొలంబియా విశ్వవిద్యాలయంలో జరిగిన విద్యార్ధుల నిరసనకు నాయకత్వం వహించటమే. వాక్‌, సభా స్వాతంత్య్రాలు విలసిల్లుతుంటాయని భావించే దేశంలో ఇది జరిగింది. అతని భార్య ఎనిమిది నెలల గర్భవతి, అరెస్టు చేసిన ఖలీల్‌ గ్రీన్‌కార్డును రద్దు చేసినట్లు ప్రకటించిన ప్రభుత్వం అతనుండే న్యూయార్క్‌ రాష్ట్రం నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లూసియానాలోని ఒక నిర్బంధ శిబిరానికి తరలించి తన మానవత్వ ముఖాన్ని ప్రదర్శించుకుంది. ఈ ఉదంతం తరువాత గ్రీన్‌ కార్డు ఉన్నంత మాత్రాన ఎవరూ అమెరికాలో శాశ్వతంగా ఉండే హక్కు ఉన్నట్లు కాదని ఉపాధ్యక్షుడు జెడివాన్స్‌ ప్రకటించాడు. అంటే ప్రభుత్వం తలచుకుంటే ఎప్పుడైనా రద్దు చేయవచ్చనే బెదిరింపు దీని వెనుక ఉంది. పాలస్తీనియన్లకు మద్దతుగా విద్యార్ధులు ఆందోళనకు దిగినపుడు స్థానికులా, వలస వచ్చినవారా అనే తేడా లేకుండా అందరూ నిరసనల్లో పాల్గొన్నారు. దీన్ని నాటి బైడెన్‌ సర్కార్‌ నేటి ట్రంప్‌ జమానా కూడా సహించటం లేదు. గాజాలో మారణకాండకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌కు అమెరికాలో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ నిస్సిగ్గుగా మద్దతు ఇస్తూ మానవహక్కుల పరిరక్షణ గురించి ప్రపంచానికి సూక్తులు వల్లిస్తారు.


పాలస్తీనియన్లకు మద్దతు పలికిన మహమ్మద్‌ ఖలీల్‌ మీద 1952 నాటి కమ్యూనిస్టు వ్యతిరేక చట్టంలోని సెక్షన్లను మోపటాన్ని బట్టి ట్రంప్‌ అసలు రూపం వెల్లడైంది. వలస వచ్చే వారు కమ్యూనిస్టు పార్టీ సభ్యుడైనా లేదా అనుంబంధం ఉన్నప్పటికీ వీసాలను తిరస్కరించటానికి లేదా అనర్హులుగా ప్రకటింటానికి ఆ చట్టం వీలు కల్పిస్తుంది. ఒకవేళ అమెరికా వచ్చినప్పటికీ తిరిగి పంపే అధికారం ప్రభుత్వానికి ఉంది. కమ్యూనిజానికి సంబంధించిన సాహిత్యాన్ని రాసినా, ముద్రించినా, తెలిసి కూడా పంపిణీ చేసినప్పటికీ తిప్పి పంపే అధికారం ఉంది. ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశంలోనైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఉన్నప్పటికీ అలాంటి చర్యలు తీసుకోవచ్చు. ఉదారవాదులనే పేరున్న ప్రతిపక్ష డెమోక్రాట్లలో కొందరు ఖలీల్‌ అరెస్టు, గ్రీన్‌కార్డు రద్దును మాట మాత్రంగా ఖండిరచినప్పటికీ తమ పాలిత న్యూయార్క్‌ రాష్ట్రవాసి అరెస్టు గురించి నిరసన వ్యక్తం చేయలేదు. అమెరికాలో గాడిద పార్టీ, ఏనుగు పార్టీ ఏదైనా ఒక్కటే అనేందుకు ఇలాంటి ఉదాహరణలు ఎన్నో చెప్పుకోవచ్చు.కమ్యూనిస్టు వ్యతిరేకత, అమెరికా విదేశాంగ విధానాలపై విమర్శను రెండు పార్టీలూ సహించవు.


2023లో డోనాల్డ్‌ ట్రంప్‌ ఒక ప్రతిజ్ఞ చేశాడు. అదేమంటే అమెరికా విధానాలను విమర్శించే విదేశీయులు, క్రైస్తవులను ద్వేషించే కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు, సోషలిస్టులు ఎవరినీ అమెరికాలోకి అడుగుపెట్టనివ్వం దీనికి గాను 1952 నాటి చట్టాన్ని వినియోగిస్తాం,దేశీయంగా పెరిగన కమ్యూనిస్టులు, మార్క్సిస్టులను అదుపు చేసేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావాలని చెప్పాడు. ట్రంప్‌ తొలిసారి అధికారానికి వచ్చినపుడు అమెరికాను సోషలిస్టు దేశంగా మారనిచ్చే సమస్యేలేదని ప్రకటించటాన్ని అత్యధిక డెమోక్రాట్లు హర్షించారు. అయితే చరిత్రను చూస్తే కమ్యూనిస్టుల రాకను నిషేధించే చట్టం ఉన్నప్పటికీ పూర్తిగా నిరోధించటం గానీ, అమెరికాలో సోషలిస్టు, కమ్యూనిస్టు భావజాల వ్యాప్తిని అడ్డుకోవటం గానీ చేయలేకపోయారన్నది వాస్తవం. మన దేశానికి చెందిన కష్మా సావంత్‌ వంటి వారు అనేక మంది అమెరికా వెళ్లి వామపక్ష వాదులుగా మారిన సంగతి తెలిసిందే. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అపేందుకు చూసిన ప్రబుద్దుల సంగతి తెలిసిందే, భావజాలమూ అంతే, ఎవరూ ఆపలేరు, ఎంతగా అడ్డుకుంటే అంతే వేగంతో విస్తరిస్తుందన్నది చరిత్ర చెప్పిన సత్యం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎరుపంటే ఎందుకంత భయం : అమెరికాలో కమ్యూనిస్టు వ్యతిరేక విద్య బిల్లు !

13 Friday Dec 2024

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, Politics, Uncategorized, USA

≈ Leave a comment

Tags

anti china, Anti communist, Anti-Communism Education Bill, communism, Failure of Capitalism, Socialism

ఎం కోటేశ్వరరావు


ఒక భూతం ఐరోపాను వెంటాడుతున్నది. అదే కమ్యూనిస్టు భూతం అంటూ ప్రపంచ సామాజిక గతినే మార్చివేసిన కమ్యూనిస్టు ప్రణాళిక ప్రారంభం అవుతుంది.బ్రిటన్‌లో కారల్‌ మార్క్స్‌ఫెడరిక్‌ ఎంగెల్స్‌ 1848 ఫిబ్రవరి 21న ఆ గ్రంధాన్ని వెలువరించారు.నాటి నుంచి నేటి వరకు 176 సంవత్సరాల తరువాత కూడా ప్రపంచంలోని దోపిడీ వర్గాలు, వాటిని కాపాడేవారిని అది భయపెడుతూనే ఉంది. సోషలిజం, కమ్యూనిజాలను ఏడు నిలువుల లోతున పాతిపెట్టాం, విజయం మాదే అని ప్రకటించుకున్న అమెరికా గడ్డ మీదే పాలకవర్గం ఇప్పుడు ఎందుకు వణికి పోతున్నది. 2024 డిసెంబరు మొదటి వారంలో అమెరికా ప్రజాప్రతినిధుల సభ (కాంగ్రెస్‌)లో కమ్యూనిస్టు వ్యతిరేక బిల్లును 32762 ఓట్ల మెజారిటీతో ఆమోదించింది. సోషలిజం, కమ్యూనిస్టు ఉద్యమాలు ప్రపంచంలో ఉధృతంగా ఉన్న రోజుల్లో అలాంటి బిల్లు పెట్టారంటే అదొక దారి, ఆ ఉద్యమాలు అంత ఆకర్షణీయంగా లేని వర్తమానంలో ఎందుకు ఇలాంటి చట్టాలు తీసుకువస్తున్నట్లు ? అధికార రిపబ్లికన్‌ పార్టీ, ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీలోని కమ్యూనిస్టు వ్యతిరేకులు కూడా చేతులు కలపటంతో ఇంత మెజారిటీ వచ్చింది. ఈ బిల్లుకు పెట్టిన పేరు ఎడ్యుకేటింగ్‌ ఫర్‌ డెమోక్రసీ యాక్ట్‌( ప్రజాస్వామ్యం కోసం చైతన్య చట్టం). ప్రజాస్వామ్య పరిరక్షణకు అవసరమైన అడుగు అని కొందరు వర్ణిస్తే సైద్దాంతిక పరమైన విభజన జరుగుతుందని మరికొందరు పేర్కొన్నారు. ఒక భావజాలాన్ని అణగదొక్కటం చరిత్రలో ఇంతవరకు ఎవరి వల్లా కాలేదు. ఎవరైనా ఫలానా సిద్దాంతాన్ని రూపుమాపాం అని చెబితే ఎలా అనే ఉత్సుకత ఏ ఒక్కరిలో చిగురించినా అది మొక్కై మానుగా మారుతుంది. ఇప్పుడు అమెరికాలో ఇతర పెట్టుబడిదారీ దేశాలలో జరుగుతున్నది అదే. ఓడిరచామన్న సోషలిజం, కమ్యూనిజాల గురించి యువతరంలో ఆసక్తి, అనురక్తి పెరుగుతున్నదనే సర్వేల సమాచారం అక్కడి దోపిడీ శక్తులకు కునుకు పట్టకుండా చేస్తున్నది.


1997-2012 మధ్య జన్మించిన వారిని జెడ్‌ తరం అని పిలుస్తున్నారు. వారిలో గణనీయంగా కమ్యూనిజం పట్ల సానుకూలంగా ఉన్నారు. అంతకు ముందు 1946-64 మధ్యకాలంలో జన్మించిన వారిలో కేవలం మూడు నుంచి ఆరుశాతం మంది మాత్రమే సుముఖంగా ఉన్నారు. అమెరికాలో పెట్టుబడిదారీ విధానం కంటే కమ్యూనిజం మెరుగని 28శాతం మంది జడ్‌ తరం భావిస్తున్నది. ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలే పురాతన కాలం నుంచి నేటి ఆధునిక సమాజానికి బాటలు వేశాయి. ఇంతకాలం సోషలిజం విఫలమైందని ప్రచారం చేసిన వారి ఏలుబడిలో సోషలిస్టు చైనా నుంచి దిగుమతులు లేకపోతే రోజు గడవటం లేదు. ఈ పరిస్థితి ఎందుకు అనే ఆలోచన అమెరికా యువతలో ఉదయించదా ? ‘‘ పెట్టుబడిదారీ విధాన ఒక వైఫల్యం ’’ అనే పేరుతో అమెరికా న్యాయమూర్తిగా పనిచేసిన రిచర్డ్‌ ఫోసనర్‌ 2009లో ఒక గ్రంధం రాశాడు. ఈ పెద్దమనిషి కమ్యూనిస్టు కాదు. అప్పటి నుంచి సోషలిజం వైఫల్యం కంటే పెట్టుబడిదారీ వైఫల్యం గురించి చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఈ కాలంలోనే అమెరికా, ఇతర పెట్టుబడిదారీ దేశాలలో సోషలిజం, కమ్యూనిజం పట్ల సానుకూల వైఖరి పెరుగుతోంది.ఈ ధోరణి అమెరికా పాలకవర్గం, అక్కడి కమ్యూనిస్టు వ్యతిరేకులకు ఆందోళన కలిగిస్తోంది. దిక్కుతోచని స్థితిలో అమెరికా పాలకవర్గం ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం ఎంత ఎక్కువ చేస్తే అంతగా యువతలో ఆసక్తి పెరటం అనివార్యం. ఉన్మాదంలో ఉంచటం ద్వారా యువతను సైద్దాంతిక మధనానికి దూరం చేయాలని విఫలయత్నం చేస్తోంది.


సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాలు, చైనా తదితర సోషలిస్టు దేశాలు, వాటికి నాయకులుగా ఉన్నవారి గురించి ఇప్పటికే పేలిన అవాకులు చవాకులను అమెరికా పిల్లలకు పాఠాలుగా బోధించేందుకు తాజా బిల్లును తెచ్చారు. కమ్యూనిజం లోపాల గురించి చెబితే విద్యార్థులు స్వేచ్చ, ప్రజాస్వామ్య విలువ గురించి తెలుసుకుంటారని రిపబ్లికన్‌ పార్టీ ఎంపీ మైక్‌ జాన్సన్‌ చెప్పాడు. ఈ చట్టం ప్రకారం బోధించాల్సిన పాఠ్యాంశాలను ‘‘ కమ్యూనిజం బాధితుల స్మారక ఫౌండేషన్‌(విఓసిఎంఎఫ్‌) రూపొందిస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో కోట్లాది మంది మరణాలకు కారకులైన నాజీలు ఎర్ర సైన్యం చేతిలో చచ్చారు. వారిని కూడా కమ్యూనిజం బాధితులుగానే ఈ సంస్థ చిత్రిస్తున్నది.చైనాలోని యుఘిర్స్‌ పట్ల, హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య అనుకూల ప్రదర్శనల పట్ల చైనా అనుసరించిన వైఖరిని కూడా కమ్యూనిస్టు వ్యతిరేక అంశాలతో పాటు బోధించాలని ఈ చట్టం నిర్దేశించింది. ఒక భావజాలాన్ని వక్రీకరించి చూపుతున్నారని, రాజకీయ భావజాలం కోసం తరగతి గదులు యుద్ధ క్షేత్రాలుగా మారతాయని కొందరు హెచ్చరించారు. ప్రపంచ చరిత్రను సమగ్రదృష్టితో చూడకుండా నిస్సిగ్గుగా పాక్షిక వైఖరితో ఈ బిల్లు చూసిందని వ్యతిరేకించిన డెమోక్రాట్లు పేర్కొన్నారు.‘‘ చరిత్రను బోధించటం అంటే ఒక దానికి వ్యతిరేకంగా మరొక భావజాలాన్ని ప్రోత్సహించటం కాదు. మన రాజకీయం కోసం అవసరమైన దాన్ని మాత్రమే కాదు మొత్తం కథను చెప్పాలి ’’ అని డెమోక్రటిక్‌ సోషలిస్టు 35 ఏండ్ల అలెగ్జాండ్రియా ఒకాసియో కార్టెజ్‌ చెప్పారు. ఈమె డెమోక్రటిక్‌ పార్టీ తరఫున 2019 నుంచి న్యూయార్క్‌ నుంచి ప్రజాప్రతినిధుల సభకు ఎన్నికై పని చేస్తున్నారు. ఇప్పటికే రాజకీయ ప్రేరేపితమైన సిలబస్‌తో వత్తిడికి గురవుతున్న టీచర్లు కమ్యూనిజం ముప్పు అంటే స్పష్టత లేని ఈ బిల్లు వలన మరింతగా ఇబ్బంది పడతారని నిపుణులు చెప్పారు. కమ్యూనిజం గురించి చెప్పాలంటున్నారు సరే అడ్డూ అదుపులేని పెట్టుబడిదారీ విధానం సంగతేమిటి ? కథను సంపూర్ణంగా చెప్పరా లేక కేవలం స్వంత సిద్దాంతాలను చెప్పుకోవటమేనా అన్న విమర్శలు కూడా సామాజిక మాధ్యమంలో వెలువడ్డాయి.


ఇటీవలి కాలంలో నిర్వహిస్తున్న అనేక సర్వేల ప్రకారం గత తరాలతో పోల్చితే సోషలిజం, కమ్యూనిజాల గురించి యువ అమెరికన్లు సానుకూల వైఖరితో చూడటం పెరిగిపోతోందని, ప్రజాస్వామ్య సూత్రాల గురించి అవగాహన తగ్గుతున్నదని రిపబ్లికన్‌ సెనెటర్లు వాపోయారు. బిల్లును రూపొందించిన వారిలో ఒకరైన మరియా సాలాజార్‌ మాట్లాడుతూ పాఠశాలల్లో అమెరికా విలువల బోధన అన్నది ఒక విప్లవాత్మక ఆలోచనేమీ కాదు. యువతరంలో మూడోవంతు మంది కమ్యూనిజానికి అనుకూలంగా ఉన్న సమయం, అయితే ఆ సిద్దాంత ప్రమాదం, దాని చరిత్రను యువతకు చెప్పటంలో విఫలం అవుతున్నామన్నది స్పష్టం, అందుకే ఈ బిల్లు అవసరమైంది అన్నారు. పెట్టుబడిదారీ విధానాన్ని రక్షించుకొనేందుకు ఇది అవసరమని మరికొందరు సమర్దించారు. స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌ బిల్లును ఆమోదించినందుకు అభినందించాడు. విద్యావ్యవస్థలో కమ్యూనిజం వాస్తవాలను గమనించకపోవటం లేదా తక్కువ చేసి చూస్తున్నారని ఆరోపించాడు. చైనా వంటి శత్రుదేశాలు అమెరికా వ్యవస్థలో తమ అజెండాను చొప్పిస్తున్నాయన్నాడు. అమెరికా చట్టాలు అనుమతించిన మేరకు కన్ఫ్యూసియస్‌ తరగతి గదుల పేరుతో చైనా ఐదువందల చోట్ల ఏర్పాటు చేసింది.అవి అమెరికా మిలిటరీ కేంద్రాలకు దగ్గరగా ఉన్నాయని, వాటిలో కమ్యూనిస్టు సిద్దాంతాలను బోధిస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది.
పురోగామి భావాలను వెల్లడిరచే ప్రతి ఒక్కరిని కమ్యూనిస్టుగా భావిస్తూ అమెరికన్లలో అనేక మంది మానసికవ్యాధితో బాధపడుతున్నారు. కొందరు కావాలని అలాంటి తప్పుడు ప్రచారం చేస్తూ సామాన్యజనాల బుర్రలను చెడగొడుతున్నారు. అలాంటి వాటిలో హెరిటేజ్‌ ఫౌండేషన్‌ ఒకటి. దాని ట్రస్టీ కెవిన్‌ రాబర్డ్‌తో జెసీ కెలీ అనే రేడియో వ్యాఖ్యాత గతేడాది ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేశాడు.‘‘ 1991లో సోవియట్‌ యూనియన్‌ పతనమైంది. దాంతో పాటే ప్రపంచ కమ్యూనిజపు నీడ జాడలేకుండా పోయింది. కమ్యూనిజం అంతరించిందని అమెరికన్లందరూ ఊపిరి పీల్చుకున్నారు, కానీ మనింట్లో కొత్త కుట్ర ప్రారంభమైంది.పురోగామివాద ముసుగులో నేడు కమ్యూనిస్టులు అనేక సంస్థలలో చొరబడ్డారు. అమెరికన్ల రోజువారీ కార్యకలాపాలను వారి నూతన శక్తితో అదుపు చేస్తున్నారు ’’ అని వ్యాఖ్యాత చెప్పాడు. అతగాడు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రణాళిక పేరుతో ఒక పుస్తకాన్ని కూడా రాశాడు. దాన్లో కమ్యూనిస్టుల పని తీరు పేరుతో అనేక వక్రీకరణలకు పాల్పడ్డాడు.


మితవాదుల నాయకత్వంలో నడిచే ఫ్రాసర్‌ ఇనిస్టిట్యూట్‌ అనే మేథోమధన సంస్థ జరిపిన సర్వేలో 1834 ఏండ్ల మధ్య ఉన్న కెనడా యువతలో 54శాతం మంది సోషలిజం దేశ ఆర్థిక వ్యవస్థ, పౌరుల మంచి చెడ్డలను ప మెరుగుపరుస్తుందని భావిస్తున్నట్లు తేలింది. అంతవరకే కాదు, ఆ సర్వే ప్రకారం పదిలక్షల మంది యువత సోషలిజం కంటే కమ్యూనిజం మంచి ఆర్థికవ్యవస్థను కలిగి ఉంటుందని చెప్పటంతో సర్వే నిర్వాహకులు నిర్ఘాంతపోయారట. అంతేనా ఇప్పుడున్న పెట్టుబడిదారీ వ్యవస్థ పనిచేయటం లేదని యువత భావించటం వారికి ఆందోళన కలిగించింది. ఆ సర్వేను మరింత లోతుగా చూసినపుడు 1834 ఏండ్ల వారిలో సోషలిజం అనువైనదని చెప్పినవారు 46శాతమైతే, 1824 ఏండ్ల వయస్సు వారిలో 50శాతానికి పెరిగారు. పెట్టుబడిదారీ విధానం మంచిదని చెప్పిన వారు 1834లో 39శాతమే ఉండగా కాదన్నవారు 41శాతం. సోషలిజానికి మారాలని చెప్పిన వారు 1834లో 54శాతం ఉండగా 1824లో 58శాతం ఉన్నారు, కాదని చెప్పిన వారు 17శాతం మాత్రమే. ఎందుకు యువత ఇలా భావిస్తున్నదంటే 2008లో ధనిక దేశాల్లో వచ్చిన సంక్షోభం అనుభవించారు గనుక, అది ఇంకా ఏదో రూపంలో కొనసాగుతూనే ఉంది. దానికంటే మరింత పెద్ద సంక్షోభం రానున్నదని పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలే హెచ్చరిస్తున్నందున ఎక్కడైనా యువత ప్రత్యామ్నాయం గురించి ఆలోచించకుండా ఉంటుందా ? వారికి సోషలిజం, కమ్యూనిజం తప్ప మరొకటి కనిపించటం లేదు. పెట్టుబడిదారులకు ప్రాతినిధ్యం వహించే వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక సరైన సమాధానం చెప్పలేక ధరలు పెరిగి ఆహారవస్తువులను కొనుగోలు చేయలేకపోతే ఉదయపు అల్పాహారాన్ని మానుకోండని ఉచిత సలహా చెప్పింది. పరిస్థితి ఇంకా దిగజారితే రోజుకు ఒక పూటే తినండని కూడా చెప్పగలదు.యువత కమ్యూనిజం పట్ల ఇంత ఆసక్తిని ఎందుకు పెంచుకుంటున్నదన్న ప్రశ్నకు ఫ్రాసర్‌ సంస్థ ఉపాధ్యక్షుడు జేసన్‌ క్లెమెన్స్‌ సమాధానమిస్తూ ఇంతటి దురవస్థను వారి మీద ఎన్నడూ రుద్దలేదు అన్నాడు. భూతల స్వర్గం అనుకుంటున్నవారికి లాభాలు పిండుకొనే కార్పొరేట్‌ భూతాలు కళ్ల ముందు కనిపిస్తుంటే చూస్తూ ఊరుకోవటం మానవనైజం కాదు. తగ్గేదే లేదు, దాని అంతమే తమ పంతం అంటారు, కాదంటారా ! దానికి సోషలిజం తప్ప మరొక మార్గం కనుచూపు మేరలో కనిపించటం లేదు, అందుకే మూలనపెట్టిన సిద్దాంత పుస్తకాలు దుమ్ముదులుపుతున్నారు.నడిచే సమయం రాగానే, తపన కలగ్గానే ఏం చేయాలో పసివాళ్లకు ఎవరూ చెప్పనవసరం లేదు. వారంతటవారే లేచి అడుగులు వేసినట్లుగా మార్గం వెతుక్కుంటారు. సమాజమార్పూ అంతే !


కమ్యూనిస్టు మానిఫెస్టో రాసిన నాటికీ నేటికీ ప్రపంచంలో అనేక మార్పులు జరిగిన మాట నిజం. అది ఆ నాటికి సరిపోయిందిగానీ నేటికి పనికి రాదు అని కొందరు వ్యతిరేకులు దాడి చేస్తున్నారు.దాన్లో చెప్పింది ఒక శాస్త్రీయ సిద్దాంతం. కూడినా హెచ్చవేసినా రెండురెళ్లు నాలుగే. అది మారదు. అలాగే శ్రమదోపిడీ ఉన్నంత కాలం దాన్నుంచి జనావళిని విముక్తం చేసేందుకు పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి దేశంలో విప్లవం ఒకే విధంగా జరగదని పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంకా వెనుకబడిన, పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్యవాదం ప్రభావితం చేస్తున్న దేశాలలో విప్లవాన్ని ఎలా తీసుకురావాలనేది అక్కడి కార్మికవర్గం నిర్ణయించుకోవాల్సిందే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా పెట్టుబడులకు గేట్లు తెరిచిన మోడీ సర్కార్‌ : సంఘపరివార్‌కు ఎదురు దెబ్బ ! కార్పొరేట్‌ సత్తానా మజాకా !!

26 Saturday Oct 2024

Posted by raomk in BJP, CHINA, Congress, CPI(M), Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

Anti China Propaganda, Anti communist, BJP, BRICS, Indo - China trade, Indo-China standoff, Narendra Modi, RSS, Xi Jinping


ఎం కోటేశ్వరరావు.


నాలుగు సంవత్సరాల క్రితం మనదేశంలో చైనా వ్యతిరేక ఉన్మాదం తారాస్థాయిలో ఉంది.చైనా వస్తువులను బహిష్కరించి దాన్ని మనకాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని అనేక మంది వీరంగం వేశారు. ఇప్పుడు అలాంటి దృశ్యాలు, రాతలు ఎక్కడా కనిపించవు. అక్టోబరు చివరి వారంలో కొన్ని పత్రికలు, వెబ్‌సైట్లలో వచ్చిన వార్తల శీర్షికలు కొంతమందికి ఆనందం, ఆసక్తి కలిగిస్తే మరి కొందరికి ఆందోళన కలిగించవచ్చు. 2020 సంవత్సరంలో జరిగిన సరిహద్దు ఉదంతాల అనంతర అనుమానాల నుంచి బయటపడి లడక్‌ సరిహద్దు ప్రాంతంలో సాధారణ పరిస్థితులను పునరుద్దరించేందుకు భారతచైనా ప్రభుత్వాలు నిర్ణయించాయి, ఆ మేరకు చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్‌ సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీచైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌ ఈమేరకు కరచాలనం చేసి ఆమోద ముద్రవేశారు. ఇది రెండు దేశాలకూ శుభసూచికం. వేల కోట్ల రూపాయలను సరిహద్దుల్లో వృధా చేయనవసరం లేదు. ‘‘ భారతచైనాల సామరస్యత కొరకు భారత సిఇఓలు ఎందుకు వత్తిడి చేశారు ’’ ( 2024 అక్టోబరు 24 ) బిజినెస్‌ చెఫ్‌ డాట్‌కాం విశ్లేషణ శీర్షిక. పదాల తేడాతో అంతర్జాతీయ వార్తా సంస్థ బ్లూమ్‌బెర్గ్‌ ఇచ్చిన ఇదే వార్తకు మరికొంత విశ్లేషణను జోడిరచి జాతీయ పత్రికలు, టీవీ ఛానల్స్‌ కొన్నింటిలో దర్శనమిచ్చింది. ఇదే సమయంలో ‘‘ పావురాల మధ్య గండుపిల్లి ’’ అంటూ చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు మరోశీర్షికతో వచ్చిన వార్తా విశ్లేషణలో చైనా పెట్టుబడుల గురించి భారత మాజీ రాయబారి హెచ్చరిక గురించి రాశారు. ఈ అంశంలో ఏం జరుగుతోంది ? ఎవరు దిగి వచ్చారు, ఎవరు వెనక్కు తగ్గారన్నది పాఠకులకే వదలి వేద్దాం.

గాల్వన్‌లోయలో పెద్ద ఉదంతం జరిగిన తరువాత మన దేశం చైనా పెట్టుబడులపై ఆంక్షలు విధించి రాకుండా అడ్డుకుంది. ఇప్పుడు మన కార్పొరేట్‌ శక్తులు ఎందుకు చైనాతో సంబంధాల పునరుద్దరణకు నరేంద్రమోడీ మీద వత్తిడి తెస్తున్నారు ? చైనా సోషలిస్టు వ్యవస్థ అంటే అభిమానమా, కమ్యూనిజం అంటే ప్రేమా ?కానే కాదు, పక్కా వాణిజ్య ప్రయోజనాలే ! పెట్టుబడుల మీద ఆంక్షల సడలింపు గురించి కొద్ది నెలల క్రితమే మన అధికారం యంత్రాంగం లీకులు వదిలింది. దాని మీద ప్రతికూల ప్రచారం, వ్యతిరేకత తలెత్తకుండా రాజకీయ నాయకత్వం తగిన జాగ్రత్తలు తీసుకున్నది. చైనా పెట్టుబడులను అనుమతించేందుకు కేంద్రం నిర్ణయించినట్లు ఈ ఏడాది వెల్లడిరచిన ఆర్థిక సర్వేలో పేర్కొన్న అంశాలే సూచన ప్రాయంగా వెల్లడిరచాయి. అయితే సరిహద్దు వివాదం చర్చలు కొనసాగుతున్న తరుణంలో తలుపులు బార్లా తెరిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయన్న భయంతో చైనా వ్యతిరేకులను చల్లబరిచేందుకు, పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కలిగించేందుకు చూస్తున్నారు. సరిహద్దులో పూర్వపు స్థితిని పునరుద్దరించేందుకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. వచ్చిన వార్తల ప్రకారం ఇరుదేశాల పరువుకు భంగం కలగకుండా గతంలో ఎవరు ఎక్కడ ఉంటే అక్కడకు వెనక్కు తగ్గాలన్న ఒప్పందం కుదిరింది. ఆ మేరకు తట్టాబుట్టా సర్దుకోవటం ప్రారంభమైంది. చైనాతో సాధారణ స్థితికి మన సంబంధాలు రాకూడదని కోరుకుంటున్న అమెరికాకు ఇది మింగుడుపడటం లేదు.దానికి తక్షణ స్పందన అన్నట్లుగా ఖలిస్తానీ ఉగ్రవాది హత్యలో మన ప్రమేయం ఉందని ఆరోపిస్తున్న కెనడాకు మద్దతు పలుకుతున్న వైనాన్ని చెప్పవచ్చు.అంతర్జాతీయ రాజకీయాల్లో ఏదీ సూటిగా ఉండదు.

ఇటీవలి ఆర్థిక సర్వేలో చైనా పెట్టుబడులకు పచ్చజెండా ఊపారు. దీని మీద కేంద్ర ప్రభుత్వంలో ఉన్న చీలికలను ఉపయోగించుకొనేందుకు వెంటనే మనదేశంలో చైనా రాయబారి పావులు కదిపారని చైనాలో భారత మాజీ రాయబారి గౌతమ్‌ బంబావాలే వ్యాఖ్యానించారు. చైనా ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తూ భారత ప్రధాన ఆర్థిక సలహాదారు చేసిన వ్యాఖ్యలతో పావురాల మధ్య గండుపిల్లిని వదలినట్లయింది. ఈ విషయంలో సమన్వయం లేదని, అలాంటి ప్రకటన చేసే ముందుకు జాతీయ భద్రతా సలహాదారులను కూడా పరిగణనలోకి తీసుకొని ఉండాల్సిందని, ఎకనమిక్‌ సర్వే సమయంలో వ్యాఖ్యలు చేయటం ఆందోళనకరంగా ఉందని గౌతమ్‌ వ్యాఖ్యానించారు. టెలికమ్యూనికేషన్స్‌ ఇతర రంగాలలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని గౌతమ్‌ సలహాఇచ్చారు. చైనా పెట్టుబడులపై పునరాలోచనలేదని వాణిజ్య శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ గతంలోనే చెప్పినా పరిణామాలు దానికి భిన్నంగా ఉన్నాయి. చైనాతో సఖ్యతకు కేంద్రం సుముఖంగా లేకపోతే సరిహద్దు సమస్యపై అంగీకారం కుదిరివుండేదే కాదు.రానున్న రోజుల్లో వేగం పుంజుకొనే అవకాశం ఉంది. చైనా పెట్టుబడులపై ప్రభుత్వ వైఖరిలో వచ్చిన మార్పును అర్ధం చేసుకోవాలంటే ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్వహించే స్వదేశీ జాగరణ్‌ మంచ్‌(ఎస్‌జెఎం) గతంలో ఏం చెప్పిందో 2020జూలై ఒకటవ తేదీ ఎఎన్‌ఐ వార్త సారాంశాన్ని చూద్దాం.ఆ సంస్థ జాతీయ సహ కన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ చెప్పినదాని ప్రకారం ఇలా ఉంది.‘‘పేటిఎం వంటి భారతీయ స్టార్టప్‌ కంపెనీల నుంచి చైనా పెట్టుబడులకు ఉద్వాసన పలకాలి. మన విదేశీమారకద్రవ్య నిల్వలు ఐదువందల బిలియన్‌ డాలర్లతో పోలిస్తే ఆరు బిలియన్‌ డాలర్ల చైనా పెట్టుబడులు లెక్కలోనివి కాదు. మన సంస్థలు పైచేయి సాధించటానికి ఇదొక సువర్ణ అవకాశం.చైనా పెట్టుబడులను కాంగ్రెస్‌ ఎందుకు వ్యతిరేకించటం లేదని నేను ప్రశ్నిస్తున్నాను. చైనా ఒక సూపర్‌పవర్‌ అనే వాతావరణాన్ని సృష్టిస్తున్నపుడు దాన్ని మనం దెబ్బతీయాల్సిన అవసరం లేదా ? ముందుగా మన పరిశ్రమలను రక్షించుకోవాలి.’’ సరిగ్గా ఈ మాటలు చెప్పిన నాలుగు సంవత్సరాల తరువాత అదే చైనా నుంచి పెట్టుబడులు తెచ్చుకోవాలని మన ఎకనమిక్‌ సర్వేలో రాసుకున్నాం, తగిన జాగ్రత్తలు తీసుకొని పెట్టుబడులను తీసుకోవచ్చని అదే పాలకపార్టీ పెద్దలు సెలవిస్తున్నారు.మేము వాణిజ్యం కావాలనుకుంటున్నాం, పెట్టుబడులను కోరుకుంటున్నాం, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు తీసుకుంటాం అని తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు.అమెరికన్లను ఉద్దేశించిన ఒక సమావేశంలో ఈ మాటలు చెప్పారు. జాగ్రత్తలు తీసుకోవద్దని ఎవరన్నారు? ఇది కమ్యూనిస్టు, చైనా వ్యతిరేకతలను నిరంతరం రెచ్చగొట్టే సంఘపరివార్‌, దాని భావజాలానికి లోనైన వారికి చెప్పుకోరానిచోట తగిలినదెబ్బ.

2020 సరిహద్దు ఉదంతం తరువాత చైనా పెట్టుబడులపై ఆంక్షలు ఎదురుతన్నుతున్నాయని మన కార్పొరేట్‌ పెద్దలు చెప్పినట్లు, వాణిజ్య ఆంక్షలను సడలించేందుకు ప్రభుత్వం చూస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొన్నది. నిజానికి చైనా నుంచి దిగుమతులపై ఎలాంటి ఆంక్షలు లేవు, ఈ విషయంలో మోడీ తన రికార్డులను తానే బద్దలు కొట్టారు. నిబంధనలు సడలించటం అంటే పెట్టుబడుల స్వీకరణకు ద్వారాలు తెరవటమే. గడచిన ఆర్థిక సంవత్సరంలో చైనాతో లావాదేవీలు 118.4బిలియన్‌ డాలర్లు కాగా అక్కడి నుంచి చేసుకున్న దిగుమతుల మొత్తం 101.7బిలియన్‌ డాలర్లు ఉంది. చైనా పెట్టుబడులపై ఆంక్షల కారణంగా చిప్‌ తయారీ వంటి ఉన్నత సాంకేతిక రంగాలతో పాటు విద్యుత్‌ వాహనాలు, బ్యాటరీల తయారీలో కూడా వెనుకబడుతున్నట్లు భావిస్తున్న కార్పొరేట్స్‌ చైనా పెట్టుబడులకు అనుమతులు ఇవ్వాలని మోడీ సర్కార్‌ మీద తీవ్ర వత్తిడి తెస్తున్నాయి. భారతీయులు యజమానులుగా ఉన్న కంపెనీలలో తొలిదశలో పదిశాతం మేరకు చైనా పెట్టుబడులను అనుమతించాలని యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. గత పదిహేను సంవత్సరాలలో మనదేశ దిగుమతులలో చైనావాటా 21 నుంచి 30శాతానికి పెరిగింది.ప్రస్తుతం మొత్తం దుస్తులు, వస్త్రాల దిగుమతుల్లో చైనా నుంచి 41.5, ఎలక్ట్రానిక్‌, టెలికాం ఉత్పత్తులు 38.7,యంత్రాలు 38.5 శాతం చొప్పున ఉన్నాయి.రసాయనాలు 28.7,ప్లాస్టిక్స్‌ 25, ఆటోమొబైల్‌ 23, ఐరన్‌,స్టీలు, బేస్‌ మెటల్‌ 16.6శాతం చొప్పున దిగుమతి చేసుకుంటున్నాము.నరేంద్రమోడీ రెండవసారి అధికారానికి వచ్చిన తరువాత 201920లో చైనా నుంచి దిగుమతుల విలువ 8,187 కోట్ల డాలర్లుండగా 202324నాటికి 11,839 కోట్ల డాలర్లకు పెంచారు.(2015లో 7,166కోట్ల డాలర్లు మాత్రమే ఉండేది.) ఇదే సమయంలో మన ఎగుమతులు చైనాకు 1,661 కోట్ల నుంచి 1,665 కోట్ల డాలర్లకు మాత్రమే పెరిగాయి. మన మేకిన్‌ ఇండియా ఎలా విఫలమైందో దీన్నొక ఉదాహరణగా చెప్పవచ్చు.

కొన్ని ప్రత్యేక పరిశ్రమలకు సంబంధించి 2023 చివరిలో చైనా నిపుణులకు వీసా నిబంధనలు సడలించటమే మోడీ సర్కార్‌లో వచ్చిన మార్పుకు నిదర్శనమని 2024 జూలై 18 ఎకానమిస్టు పత్రికలో వచ్చిన వార్తను నిదర్శనంగా చూపుతున్నారు.కొన్ని కంపెనీలలో యంత్రాల అమరిక వంటి పనులకు అవసరమైన చైనా ఇంజనీర్లను గతనాలుగు సంవత్సరాలుగా మనదేశం అనుమతించని కారణంగా మన పరిశ్రమలకే నష్టం వాటిల్లింది. తాజాగా ప్రభుత్వం పదిహేను రోజుల్లో ఇ వీసాలు ఇచ్చేందుకు నిర్ణయించటంతో పరిశ్రమలకు ఎంతో ఊరట కలిగింది. ఇటీవలి కాలంలో చైనా వ్యతిరేక ధోరణి తగ్గి, సరిహద్దుల్లో శాంతి మంత్రం జపించటం పెరిగింది. సరిహద్దు చర్చలు ‘‘పురోగతి’’లో ఉన్నాయని ఏప్రిల్‌ నెలలో రక్షణ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ చెప్పారు. ఆ మరుసటి నెలలోనే 18నెలల తరువాత ఢల్లీిలో చైనా నూతన రాయబారి నియామకం జరిగింది.మరో వైపు మన దేశంలో దలైలామాను అమెరికా అధికారులు కలిసినా పెద్ద సమస్యగా మార్చకుండా చైనా సంయమనం పాటించింది. దాన్ని అమెరికాతో సమస్యగా పరిగణించింది. సరిహద్దులో బఫర్‌ జోన్లను ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో ఇరు దేశాలు సేనలను వెనక్కు రప్పించి, కాపలా నిబంధనలను సడలించటం కూడా ముఖ్యపరిణామమే.చైనా ఇతర దేశాలతో కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నదని, భారత్‌తో సఖ్యతగా మెలిగితే దానికి లాభం తప్ప నష్టం ఉండదనే ముందుచూపుతో సరిహద్దుల్లో సఖ్యతకు అంగీకరించిందని కొందరు చెబుతున్నారు. ఇప్పటికే మన దేశానికి చెందిన కొన్ని కార్పారేట్‌ సంస్థలు చైనా కంపెనీలతో సంయుక్త భాగస్వామ్య కంపెనీల ఏర్పాటుకు పావులు కదుపుతున్నాయి. చైనా ప్రభుత్వ ంగ సంస్థ ఎస్‌ఏఐసి మోటార్స్‌తో కలసి మన దేశానికి చెందిన జెఎస్‌డబ్ల్యు గ్రూపు 2030నాటికి దేశ మార్కెట్లో గణనీయ వాటాను దక్కించుకొనేందుకు విద్యుత్‌ వాహనాల ఉత్పత్తికి భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. డిక్సన్‌ టెక్నాలజీస్‌ సంస్థ లాంగ్‌ ఛీర్‌ మరియు హెచ్‌కెసి అసెంబ్లింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు, మైక్రోమాక్స్‌ కంపెనీ స్మార్ట్‌ ఫోన్ల నమూనాలు, ఐటి హార్డ్‌వేర్‌, టెలికాం పరికరాల రూపకల్పనలకు ఓడిఎం హాక్విన్‌ కంపెనీతో ఒప్పందాలు చేసుకున్నాయి. చైనాలో యాపిల్‌ ఐ ఫోన్లను తయారు చేసే అమెరికా కంపెనీ మనదేశంలో కూడా ఉత్పత్తి చేస్తున్నది. దానికి విడిభాగాలను అందిస్తున్న చైనా కంపెనీలను మనదేశంలో ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకరించినట్లు చెబుతున్నారు. ఇలాంటి వాటివలన చైనాకు వచ్చే నష్టం ఉండదు.

సరిహద్దు సమస్యపై ఒప్పందాలు, పెట్టుబడుల స్వీకరణకు చైనాతో సఖ్యత కుదుర్చుకుంటున్న మన దేశం పాకిస్తాన్‌తో అదే మాదిరి ఎందుకు ముందుకు పోవటం లేదని కూడా మన మీడియాలో కొందరు విశ్లేషిస్తున్నారు. అదేమీ అర్ధం కానంత బ్రహ్మపదార్ధమేమీ కాదు. ప్రపంచ సరఫరా గొలుసులో మనం కూడా కలవాలంటే చైనా నుంచి ఎఫ్‌డిఐ అవసరమని తాజా ఆర్థిక సర్వేలో స్పష్టంగా పేర్కొన్నారు. మనవాణిజ్యంలో ప్రధమ స్థానంలో ఉన్న అమెరికాను వెనక్కు నెట్టి మరోసారి చైనా ముందు వచ్చింది.అమెరికాకు ఎగుమతులు చేయాలన్నా చైనా పెట్టుబడుల అవసరం ఉంది. చైనా కంపెనీలు మనదేశంలో పెట్టుబడులు పెడితే మనం ఎగుమతులు చేయవచ్చు. ఇలా ఆర్థికంగా చైనాతో ఉన్న లాభాలు పాకిస్థాన్‌తో లేవు. పాక్‌ ప్రేరేపిత లేదా అక్కడి నుంచి వచ్చిన తీవ్రవాదులు మనదేశంలో అనేక దాడులు చేసి ఎంతో నష్టం కలిగించారు.సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ పాక్‌ నుంచి మనదేశానికి ఉగ్రవాదంతీవ్రవాదులను ఎగుమతి చేస్తున్నట్లుగా చైనా నుంచి లేదన్నది తెలిసిందే.చైనాను వ్యతిరేకించేవారు, అనుమానంతో చూసే వారు కూడా ఉగ్రవాదం విషయంలో వేలెత్తి చూపే అవకాశం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కేరళ సిఎంతో కయ్యానికి కాలుదువ్వుతున్న గవర్నర్‌ : లేని అధికారం చెలాయించబోయి అభాసుపాలైన ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ !

10 Thursday Oct 2024

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Anti communist, Arif Mohammed Khan, BJP, LDF, Pinarai Vijayan, RSS, UDF Kerala


ఎం కోటేశ్వరరావు


తనకు లేని అధికారాన్ని చెలాయించబోయి కేరళ గవర్నర్‌ అభాసుపాలయ్యారు.ఉక్రోషం పట్టలేక కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. మలప్పురం జిల్లాలో గత మూడు సంవత్సరాలుగా బంగారం స్మగ్లింగ్‌,దానితో సంబంధాలున్న దేశ వ్యతిరేక కార్యకలాపాలపై, సిఎం పినరయి విజయన్‌ చెప్పినట్లు హిందూ పత్రికలో ఆపాదించిన అవాస్తవ అంశాలను అధారం చేసుకొని గవర్నర్‌ సిఎం మీద దాడికి దిగారు. సదరు పత్రికలో వచ్చిన అంశాలపౖౖె నేరుగా 2024 అక్టోబరు ఎనిమిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు తనకు నివేదించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శారదా మురళీధరన్‌, డిజిపి షేక్‌ దర్వేష్‌ సాహిబ్‌లను గవర్నర్‌ ఆదేశించారు. అయితే అలాంటిదేమీ జరగలేదు.అంతకు ముందు ఇదే అంశం గురించి వివరించాలని, తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని సిఎంకు గవర్నర్‌ లేఖ రాశారు. అయితే ఆ పత్రిక విజయన్‌కు ఆపాదించిన మాటలను ఆయన చెప్పలేదని సవరించుకున్న తరువాత కూడా దాన్నే పట్టుకొని కక్ష సాధించాలని గవర్నర్‌ ప్రయత్నించటం గమనించాల్సిన అంశం. మలప్పురం గురించి సిఎం చెప్పని అంశాలు తమ వార్తలో చోటు చేసుకున్నాయని, ఒక పబ్లిక్‌ రిలేషన్స్‌ ఏజన్సీకి చెందిన వ్యక్తి సిఎంపేరుతో వాటిని కలిపి రాయమని కోరినట్లు ఆ పత్రిక రాసింది. అయితే సిఎం తన ప్రచారం కోసం ఒక ఏజన్సీని నియమించారంటూ ప్రతిపక్షం దాని మీద రాద్దాంతం చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయం ఎలాంటి ఏజన్సీని నియమించలేదని ముఖ్యమంత్రి విజయన్‌ స్పష్టం చేశారు. సిఎంకు రాసిన లేఖకు ఎలాంటి స్పందన లేకపోవటంతో అధికారులు వచ్చి వివరణ ఇవ్వాలని గవర్నర్‌ ఆదేశించారు.‘‘ దొంగబంగారంతో వచ్చిన సొమ్మును దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారంటూ సిఎం చెప్పారని, అలాంటి పనికి పాల్పడుతున్నవారెవరు, వారిపై తీసుకున్న చర్య ఏమిటి ?వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని సిఎంను కోరాను.‘‘ కొద్ది రోజులు వేచి చూశాను. రాష్ట్రంలో చాలా తీవ్రమైన పరిస్థితి ఉన్నట్లు నాకు కనిపిస్తోంది, సిఎం తన బాధ్యతను విస్మరించారు. నాకు తెలియకుండా ఎందుకు దాచాలని చూస్తున్నారో తెలియటం లేదని విలేకర్లతో గవర్నర్‌ ఆరోపించారు. అధికారులకు గవర్నర్‌ ఆదేశించటంపౖౖె రాజభవన్‌కు సిఎం ఒక లేఖ రాస్తూ అలా నేరుగా పిలిచే అధికారం గవర్నర్‌కు లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ అంగీకారంతోనే సీనియర్‌ అధికారులను పిలవాలని పేర్కొన్నారు. సాంకేతిక కారణాలను చూపి తనకు సమాచారం ఇవ్వకుండా ఉండజాలరని, రాష్ట్రపతికి నివేదించాల్సి ఉన్నందున వివరణ ఇవ్వాల్సిందేనని సిఎంకు మరొక లేఖ రాశారు. కోరిన సమాచారం ఇవ్వకపోతే నిబంధనలు, రాజ్యాంగబద్దమైన విధి నిర్వహణను ఉల్లంఘించినట్లు అవుతుందని గవర్నర్‌ బెదిరించారు.


తనకు చెప్పకుండా కొన్ని విషయాలను దాస్తున్నారన్న గవర్నర్‌ ఆరోపణలపై సిఎం పినరయి విజయన్‌ తీవ్ర అభ్యంతరం తెలుపుతూ లేఖ రాశారు. తనను పక్కన పెట్టి తన ప్రభుత్వంలో పనిచేసే అధికారులను పిలవటం ఏమిటని ప్రశ్నించారు. సత్యదూరమైన, ఆధారంలేని అంశాలతో గవర్నర్‌ చేసిన ఆరోపణల కారణంగా గౌరవ ప్రదమైన రీతిలో నిరసనతెలపాల్సి వచ్చిందని పేర్కొన్నారు. దేశ, రాష్ట్ర వ్యతిరేక కార్యకలాపాల గురించి తానెలాంటి బహిరంగ ప్రకటన చేయలేదని, గవర్నర్‌ వక్రీకరించిన కథనంపై ఆధారపడ్డారని స్పష్టం చేశారు. కేరళ వెలుపల దొంగబంగారాన్ని పట్టుకున్న వివరాలను కొన్నింటిని తాను సేకరించానని దొంగరవాణా దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని, గణనీయ మొత్తంలో పన్నుల ఎగవేత జరుగుతుందని అలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాను కూడా హెచ్చరించానని పేర్కొన్నారు. విమానాశ్రయాల ద్వారా జరుగుతున్న దొంగబంగార రవాణాను అరికట్టాల్సిన ప్రాధమిక బాధ్యత కేంద్ర ప్రభుత్వ కస్టమ్స్‌శాఖదని రాష్ట్ర ప్రభుత్వ అధికారులను దాని గురించి అడగకూడదని, అయినా ముఖ్యమంత్రితో నిమిత్తం లేకుండా రాష్ట్ర అధికారులను పిలవటం ఏమిటని ప్రశ్నించారు.


అక్టోబరు ఏడవ తేదీ సోమవారం నాడు కేరళ అసెంబ్లీలో జరిగిన అనూహ్య పరిణామంతో కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌ తమ ఎత్తుగడ వికటించటంతో అల్లరికి దిగింది. దాంతో స్పీకర్‌ సమావేశాన్ని మరుసటి రోజుకు వాయిదా వేశారు.తాము సంధించిన 49 ప్రశ్నలను నక్షత్ర గుర్తు కలవిగా పరిగణించి సభలో ప్రత్యక్షంగా సమాధానాలు ఇవ్వాల్సి ఉండగా స్పీకర్‌ కార్యాలయం వాటిలో ఎక్కువ భాగం రాతపూర్వక సమాధానాలు ఇచ్చే ప్రశ్నలుగా మార్చివేసిందంటూ ప్రశ్నోత్తరాల సమయంలో యుడిఎఫ్‌ సభ్యులు గొడవకు దిగారు. ఆ సందర్భంగా స్పీకర్‌కు దురుద్ధేశ్యాలను ఆపాదించటంతో పాటు పోడియం ముందుకు వెళ్లి అల్లరి చేశారు. స్పీకర్‌ ఆదేశాల మేరకు ప్రతిపక్ష నేత సతీశన్‌ తన స్థానంలోకి వెళ్లారు. అయితే కొందరు కాంగ్రెస్‌ సభ్యులు అల్లరి కొనసాగిస్తుండగా అసలు ప్రతిపక్ష నేత ఎవరూ, మీరందరూ నేతలేనా అని ప్రశ్నించటాన్ని సతీశన్‌ తప్పుపడుతూ తమను అవమానించారని, స్పీకర్‌ ఎఎం శంషీర్‌ పరిణితిలేకుండా మాట్లాడారని, ఆ పదవికే అవమానమని తీవ్రంగా ఆరోపించారు. అంతకు ముందు ముఖ్యమంత్రి అవినీతి పరుడని ఆరోపించారు. తమ ప్రశ్నల స్వభావాన్ని మార్చినందుకు నిరసనగా ప్రశ్నోత్తరాల సమయాన్ని బహిష్కరించినట్లు ప్రకటించి వెళ్లిపోయారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేత, యుడిఎఫ్‌ సభ్యుల తీరును ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విమర్శించారు. ప్రతిపక్ష నేత దిగజారిన వ్యక్తని పదే పదే ప్రదర్శించుకుంటున్నారని ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ప్రతిపక్షనేతను చూడలేదని దుయ్యబట్టారు. స్పీకర్‌ మీద చేసిన విమర్శలను ఖండిరచాలన్నారు. తనను అవినీతి పరుడని ప్రతిపక్ష నేత అంటే కుదరదని సమాజం అంగీకరించదని అన్నారు.


ప్రశ్నోత్తరాల బహిష్కరణ తరువాత జీరో అవర్‌లో సభలో ప్రవేశించిన యుడిఎఫ్‌ సభ్యులు మరోసారి అల్లరికి దిగారు. ప్రతిపక్ష నేత సతీశన్‌ మాట్లాడుతూ తనపై సిఎం చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని, సిఎం మాదిరి అవినీతి పరుడు కాకుండా చూడమంటూ తాను ప్రతిరోజూ భగవంతుడిని ప్రార్ధిస్తానని చెప్పుకున్నారు. దాంతో ప్రతిపక్ష సభ్యులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయటంతో పాటు తమ వెంట తీసుకువచ్చిన బానర్‌ను ప్రదర్శించారు. ప్రతిపక్ష సభ్యులను అడ్డుకొనేందుకు కొందరు అధికారపక్ష సభ్యులు కూడా ముందుకు రావటంతో స్పీకర్‌ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. హిందూ పత్రిక ప్రతినిధితో సిఎం ముఖాముఖి మాట్లాడినదానిని వక్రీకరించి వార్త రాశారు. సిఎం చెప్పని అంశాలను ఒక ప్రజాసంబంధాల సంస్థ ప్రతినిధి జోడిరచమని కోరగా రాసినట్లు సదరు పత్రిక తరువాత తప్పును సవరించుకుంటూ పెద్ద వార్తను ఇచ్చింది. అసలు తామే సంస్థను నియమించలేదని, అవసరం కూడా లేదని విజయన్‌ స్పష్టం చేసినప్పటికీ దాని గురించి సభలో అల్లరి చేసేందుకు కాంగ్రెస్‌ ఎత్తువేసింది. దానిలో భాగంగా ఆ అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చింది. అక్కడే కాంగ్రెస్‌ పప్పులో కాలేసింది. ఇతర అంశాల మీద ప్రతి పక్షాలు ఇచ్చిన వాటిని చర్చకు అంగీకరించారు తప్ప నేరుగా ముఖ్యమంత్రి మీద ఆరోపణలతో కూడిన వాయిదా తీర్మానాలను ఏ రాష్ట్ర అసెంబ్లీ లేదా పార్లమెంటులో ఆమోదించిన దాఖలాలు ఇంతవరకు లేవు. బహుశా చరిత్రలో మొదటి సారిగా కేరళలో జరిగింది. తీర్మానాన్ని స్పీకర్‌ తిరస్కరిస్తారని, కనీసం సభలో ఉంచరని, దాన్ని అవకాశంగా తీసుకొని అల్లరి చేయాలనే ఎత్తుగడతో వచ్చిన కాంగ్రెస్‌ను ఊహించని విధంగా సిఎం దెబ్బతీశారు. ప్రతిపక్షం ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు తాము సిద్దంగా ఉన్నామని, మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడుగంటల పాటు ఇతర కార్యక్రమాలను వాయిదా వేసి చర్చించటానికి అంగీకరిస్తూ విజయన్‌ ప్రకటించారు. ఆ తరువాత జీరో అవర్‌లో సభలోకి వచ్చిన కాంగ్రెస్‌ సభ్యులు తాము అనుకున్నదొకటి అయింది ఒకటని గ్రహించి ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై నిరసనపేరుతో సభలో గందరగోళం సృష్టించి సభను వాయిదాపడేట్లు చేశారు. ఇలాంటి తీర్మానాలపై చర్చ తరువాత చివరగా ముఖ్యమంత్రి సమాధానం ఇస్తారు, అంతటితో చర్చ ముగుస్తుంది. ప్రతిపక్ష ఆరోపణలను తిప్పికొట్టేందుకు అధికారపక్షం పూర్తిగా సమాయత్తమైందని గ్రహించి తమ ఆరోపణల బండారం బయటపడుతుందని భావించిన కాంగ్రెస్‌ అల్లరికి దిగిందన్నది స్పష్టం.


వామపక్ష, ప్రజాతంత్ర సంఘటన మద్దతుతో మలప్పురం జిల్లా నుంచి రెండుసార్లు గెలిచిన స్వతంత్ర సభ్యుడు పివి అన్వర్‌ గత కొద్ది నెలలుగా సంఘటన నుంచి వెళ్లిపోయేందుకుగాను సిపిఎం, సిఎం, ఇతరుల మీద ఆరోపణలు గుప్పిస్తున్నారు. అతగాడిని చేర్చుకొనేందుకు కాంగ్రెస్‌ కూడా సిద్దంగా లేదు. దాంతో డిఎంకెలో చేరి కేరళలో ఆ పార్టీ ఏర్పాటు, లేదా తమిళనాడు ముస్లింలీగుతోనైనా చేతులు కలపాలని పావులు కదిపారు. అయితే తమిళనాడు రాజకీయాల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో సత్సంబంధాలు కలిగిన డిఎంకె నేత స్టాలిన్‌ అందుకు అంగీకరించలేదు, కనీసం అన్వర్‌ కలుసుకొనేందుకు సమయం కూడా ఇవ్వలేదు. అక్కడి ముస్లిం లీగ్‌ కూడా ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నందున అది కూడా విముఖత చూపింది. దాంతో డిఎంకె అనే పేరు వచ్చేట్లుగా డెమోక్రటిక్‌ మువ్‌మెంట్‌ ఆఫ్‌ కేరళ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని రాజకీయాలు నడపాలని అన్వర్‌ నిర్ణయించుకున్నారు.డిఎంకె నేతలు ధరించే రంగు కండువాలను కప్పుకొని అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు.


మలప్పురం జిల్లాలో బంగారం స్మగ్లింగ్‌ జరుగుతోందని, వచ్చిన సొమ్మును దేశవ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారంటూ ముఖ్యమంత్రి మాట్లాడి జిల్లాను అవమానించారని అసెంబ్లీలో కాంగ్రెస్‌ సభ్యులు తప్పుడు ఆరోపణలు చేశారు. సిఎం అలాంటి ఆరోపణలు చేయలేదని, అసలు ఆ జిల్లాను ఏర్పాటు చేసిందే కమ్యూనిస్టులని, నాటి కాంగ్రెస్‌ నేతలు జనసంఘంతో కలసి జిల్లా ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారని, అలాంటి పార్టీతో ముస్లింలీగ్‌ స్నేహం నెరుపుతున్నదని సిపిఎం తిప్పికొట్టింది. ఆ జిల్లా గురించి మాట్లాడేందుకు ఎవరికీ యాజమాన్య హక్కులు లేవని పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్‌ విలేకర్ల సమావేశంలో చెప్పారు. తాము మెజారిటీ, మైనారిటీ మతోన్మాదాలు రెండిరటినీ వ్యతిరేకిస్తామని అన్నారు. రెండవ సారి విజయన్‌ అధికారానికి వచ్చిన తరువాత ప్రతిపక్ష యుడిఎఫ్‌, ఇతర శక్తులు ఒక అవకాశవాద కూటమిగా చేతులు కలిపి మీడియాలో కొన్ని సంస్థల మద్దతుతో 1957నాటి తొలి కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విముక్తి ఆందోళన మాదిరి రెచ్చగొట్టేందుకు పూనుకున్నట్లు సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశం ఆమోదించిన తీర్మానంలో పేర్కొన్నది. వెనుకబాటు తనంతో ఉన్న కారణంగా ముఖ్యమంత్రిగా నంబూద్రిపాద్‌ ప్రత్యేక జిల్లాగా మలప్పురాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. ఒక చిన్న పాకిస్తాన్ను ఏర్పాటు చేస్తున్నారంటూ నాడు జనసంఫ్‌ు పార్టీ ఆరోపించిందని, దానితో చేతులు కలిపింది కాంగ్రెస్‌ అని చెప్పారు. ఒకప్పుడు ముస్లింలు, కమ్యూనిస్టులను పోలీసులుగా తీసుకొనేవారు కాదని నంబూద్రిపాద్‌ అధికారానికి వచ్చిన తరువాత పరిస్థితి మారిందన్నారు. సిపిఎంలో దేవుడిని నమ్మేవారు, నమ్మని వారు కూడా పని చేయవచ్చని, తమ మద్దతుతో రెండు సార్లు గెలిచిన స్వతంత్ర సభ్యుడు అన్వర్‌ ఇప్పుడు జమాతే ఇస్లామీ, ఎస్‌డిపిఐ, యుడిఎఫ్‌ మద్దతుతో అసత్యాలను ప్రచారం చేస్తున్నట్లు గోవిందన్‌ చెప్పారు. ముస్లింలీగ్‌, జమాతే ఇస్లామీ రెండూ కూడా ఎన్‌డిపిఐ భావజాలంతో ముస్లింలను సమీకరిస్తున్నాయని విమర్శించారు. అలప్పూజ, పాలక్కాడ్‌ జిల్లాల్లో పోలీసులు గట్టిగా జోక్యం చేసుకున్న తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌`ఎస్‌డిపిఐ మతహింస అదుపులో ఉందని, అవి రెండూ సిపిఎం మీద రాజకీయదాడి చేస్తున్నాయంటే మతశక్తులకు వ్యతిరేకంగా తాము పనిచేస్తున్నదానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్‌ ఓట్లు బిజెపికి పడిన కారణంగానే త్రిసూర్‌లో ఆ పార్టీ గెలిచిందని చెప్పారు.

కేరళలో మీడియా వివాదాల తయారీ కేంద్రంగా మారిందని సిఎం పినరయి విజయన్‌ విమర్శించారు. వయనాడ్‌లో జరిగిన ప్రకృతి విలయానికి సంబంధించి తప్పుడు వార్తలను ఇచ్చారని ఆ కారణంగా రాష్ట్రానికి నష్టం జరిగిందని అన్నారు. తప్పుడు వార్తల కారణంగా రాష్ట్రం అనర్హమైన సాయం పొందేందుకు చూస్తోందనే తప్పుడు అభిప్రాయం కలుగుతోందని అన్నారు. వీటి ఉద్దేశ్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయటమేనని, వాటిని ఆధారం చేసుకొని ప్రతిపక్షం విమర్శలకు దిగుతున్నదని అన్నారు. కేంద్రానికి సమర్పించిన మెమోరాండాన్ని నిపుణులు రూపొందించారు తప్ప మంత్రులు కాదని, దానిలోని అంకెలనే తీసుకొని మీడియా తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నదని అన్నారు. విధ్వంసం నుంచి కోలుకొనేందుకు రాష్ట్రం చూస్తుంటే టీవీ ఛానల్స్‌ రేటింగ్స్‌ పెంచుకొనేందుకు ఛానల్స్‌ చూస్తున్నాయన్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా ఎన్నికల్లో కమ్యూనిజం చర్చ- ట్రంప్‌పై రెండో హత్యాయత్నం ?

17 Tuesday Sep 2024

Posted by raomk in Current Affairs, Economics, INTERNATIONAL NEWS, Opinion, Politics, USA, Women

≈ Leave a comment

Tags

#US Elections 2024, another assassination attempt on trump, Anti communist, Donald trump, Joe Biden, Kamala Harris, red-baiting

ఎం కోటేశ్వరరావు

నవంబరు ఐదవ తేదీన అమెరికాలో ఎన్నికలు సజావుగా జరుగుతాయా ? తనకు ప్రతికూలంగా ఫలితం వస్తే డోనాల్డ్‌ ట్రంప్‌ అంగీకరిస్తాడా ? గెలుపుకోసం ఎంతకైనా తెగిస్తాడా ? ఇలా ఎన్నో ప్రశ్నలు, సందేహాల నడుమ ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో మరోసారి ట్రంప్‌ మీద హత్యాయత్నం జరిగిందని, దుండగుడిని పట్టుకున్నట్లు భద్రతా సిబ్బంది ప్రకటించారు. ఫ్లోరిడాలోని వెస్ట్‌ పామ్‌ బీచ్‌లో తన స్వంత మైదానంలో గోల్ఫ్‌ ఆడుతుండగా భద్రతా సిబ్బంది సమీపంలో ఉన్న పొదల్లో సాయుధ దుండగుడిని గమనించి కాల్పులు జరిపారు. దాంతో దుండగుడు రయన్‌ రౌత్‌ తన వద్ద ఉన్న ఎకె47 మాదిరి తుపాకి, మరికొన్ని వస్తువులను వదలి తన కారులో పారిపోగా 65 కిలోమీటర్ల తరువాత పట్టుకున్నట్లు చెబుతున్నారు. రౌత్‌ కాల్పులు జరిపాడా లేక పొదల్లో శబ్దాలకారణంగా అతని ఉనికిని గుర్తించి భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారా అన్నది వెంటనే స్పష్టం కాలేదు. అతని సామాజిక మాధ్యమ ఖాతాలను పరిశీలించగా డెమోక్రటిక్‌ పార్టీ అభిమాని అని తేలినట్లు చెప్పారు. అయితే అది వాస్తవం కాదని గత ఎన్నికల్లో ట్రంప్‌కు ఓటువేశాడని, తాజా ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడిన భారతీయ మూలాలున్న వివేక్‌ రామస్వామి చివరి వరకు పార్టీ అభ్యర్థిగా డోనాల్డ్‌ ట్రంప్‌ మీద పోటీలో ఉండాలని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినట్లు మరొక ప్రచారం. జూలై 13వ తేదీన జరిపిన కాల్పుల్లో ట్రంప్‌ కుడి చెవి తమ్మెకు గాయమైంది. భద్రతా సిబ్బంది వెంటనే దుండగుడిని పట్టుకొని కాల్చి చంపారు. భద్రతా వైఫల్యానికి బాధ్యత వహిస్తూ రహస్య భద్రతా సిబ్బంది డైరెక్టర్‌ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ట్రంప్‌ మద్దతుదారైన ప్రపంచ ధనికుడు ఎలాన్‌ మస్క్‌ తాజా ఉదంతం మీద స్పందించిన తీరుకు నెటిజన్లు మండిపడుతున్నారు. హత్యాయత్నాలు అధ్యక్షుడు జోబైడెన్‌, పోటీలో ఉన్న కమలాహారిస్‌ మీద ఎందుకు జరగటం లేదు, ట్రంప్‌ మీదనే ఎందుకు అంటూ ఎక్స్‌ ద్వారా మస్క్‌ స్పందించాడు. ఇది అత్యంత బాధ్యతారహితం అని అనేక మంది గర్హించారు. ట్రంప్‌కు ఏమీ కానందుకు జో బైడెన్‌, కమలా హారిస్‌ ఊపిరి పీల్చుకున్నారు. సాధారణంగా అధ్యక్షులు గనుక గోల్ఫ్‌ ఆడితే ఆ మైదానం చుట్టూ భద్రతా సిబ్బంది వలయంగా ఏర్పడతారు. ట్రంప్‌ మాజీ గనుక అలాంటి రక్షణ కల్పించలేదని అధికారులు వివరణ ఇచ్చారు. అమెరికాలో హింసాకాండకు తావులేదని ఎక్స్‌లో కమల స్పందించారు. అమెతో జరిగిన సంవాదంలో ట్రంప్‌ వెనుకబడినట్లు సర్వేలు తేల్చిన తరువాతే ఈ ఉదంతం జరగటం అనేక అనుమానాలకు తావిస్తోంది. జో బైడెన్‌, కమల తన మీద ధ్వజమెత్తుతున్న కారణంగానే హత్యాయత్నాలు జరుగుతున్నాయని ట్రంప్‌ ఆరోపించాడు.


ఒకవేళ ఓడితే ఫలితాన్ని డోనాల్డ్‌ ట్రంప్‌ అంగీకరిస్తాడా, గతంలో మాదిరే అనుచరులను రెచ్చగొట్టి దాడులకో మరొకదానికో పాల్పడతాడా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఎన్నికలు జరిగే నవంబరు ఐదవ తేదీ దగ్గర పడేకొద్దీ అనూహ్యపరిణామాలు సంభవిస్తాయోమోనని భావిస్తున్నారు.జో బైడెన్‌ అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న సమయంలో ట్రంప్‌ ముందంజలో ఉన్నాడు. తొలిసారి హత్యాయత్నం తరువాత ఆధిక్యత మరింత పెరిగి విజయం ఖాయం అనే వాతావరణం ఏర్పడిరది. కమలా హారిస్‌ రంగ ప్రవేశంతో అదంతా తారుమారైంది. తీవ్రమైన పోటీ స్వల్ప ఆధిక్యంలో కమల ఉన్నట్లు సర్వేలు వెల్లడిరచాయి. సెప్టెంబరు పదవ తేదీన వారిద్దరి మధ్య జరిగిన సంవాదంలో ట్రంప్‌ తేలిపోయాడు. కొన్ని సర్వేలు కమల 23పాయింట్ల ఆధిక్యతతో ఉన్నట్లు పేర్కొన్నాయి. తరువాత జరిగిన మరికొన్ని సర్వేలలో కూడా ఆమెదే పైచేయిగా ఉంది.దాంతో తాను మరోసారి ఆమెతో బహిరంగ చర్చలో పాల్గొనాల్సిన అవసరం లేదని ట్రంప్‌ సంచలన ప్రకటన చేశాడు. దీంతో పోలింగ్‌కు ముందే ఓటమిని అంగీకరించినట్లు కావటంతో మాటమార్చాడు. పిచ్చోడు ఎప్పుడేం మాట్లాడతాడో ఏం చేస్తాడో తెలియదు, ట్రంపు కూడా అంతే. అక్టోబరులో జరిగే మరో రెండు చర్చల్లో పాల్గొనేదీ లేనిదీ చెప్పలేము. ఒక వేళ సిద్దపడకపోతే పారిపోతున్నట్లుగానే ఓటర్లు భావిస్తారు.కమలతో సంవాదాన్ని నిర్వహించిన ఏబిసి సంస్థ వీక్షకుల అభిప్రాయాన్ని తారుమారు చేసిందని తానే ముందున్నట్లు ట్రంప్‌ ప్రకటించుకున్నాడు.గొప్ప చర్చ చేసినందుకుగాను ఓటర్లు తనకు మద్దతు ఇవ్వటం ప్రారంభించారని, సర్వేల్లో అదే వెల్లడైనా కుహనా మీడియా వాటిని వెల్లడిరచటం లేదు రిగ్గింగు చేసినట్లు స్వంత సామాజిక మాధ్యమం ట్రూత్‌ సోషల్‌ వేదికలో రాసుకున్నాడు.


అమెరికా ఎన్నికల్లో మైలురాళ్లుగా చెప్పుకోవాల్సి వస్తే జూలై 15న రిపబ్లికన్‌ పార్టీ జాతీయ సమావేశం ట్రంప్‌ను, ఆగస్టు 19న కమలాహారిస్‌ను డెమోక్రటిక్‌ పార్టీ జాతీయ సమావేశం అభ్యర్థులుగా ఖరారు చేశాయి.సెప్టెంబరు పదిన ట్రంప్‌కమల తొలి సంవాదం జరిగింది.నవంబరు ఐదున ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. జనవరి ఆరున ఫలితాలను నిర్ధారిస్తారు.జనవరి 20న నూతన అధ్యక్ష పాలన ప్రారంభం అవుతుంది. ప్రముఖులుగా ఉన్నవారు, ఓటర్లను ప్రభావితం చేసే వారు కొందరు ఎన్నికల్లో ఏదో ఒక పక్షాన్ని లేదా అభ్యర్థిని బలపరుస్తారు ఎక్స్‌ అధిపతి, ప్రపంచంలోనే పెద్ద కుబేరుడు ఎలన్‌ మస్క్‌ ట్రంప్‌ను సమర్ధిస్తున్నాడు. అదే విధంగా ప్రముఖ గాయని, నటి, రచయిత్రి టేలర్‌ స్విఫ్ట్‌ కమలా హారిస్‌ను బలపరుస్తున్నట్లు ప్రకటించింది. ఎలన్‌ మస్క్‌ సామాజిక మాధ్యమాల్లో ఉన్న అసహ్యకరమైన మనిషి అంటూ మస్క్‌ కుమార్తె వివియన్‌ జెనా విల్సన్‌ విరుచుకుపడిరది.టేలర్‌ స్విఫ్ట్‌ను ఉద్దేశించి ఒక ఎక్స్‌ చేస్తూ ‘‘ బాగుంది టేలర్‌..నేను నీకు ఒక బిడ్డను ఇస్తా, నా జీవితాతం నీ కుక్కలకు కాపలా కాస్తా ’’ అని మస్క్‌ పేర్కొన్నాడు. అమెరికా ఎన్నికల ప్రచారం ఎంతలా దిగజారి ఉంటుందో దీన్ని బట్టి అర్దం చేసుకోవచ్చు. టేలర్‌ వ్యతిరేకతను తట్టుకోలేని ట్రంప్‌ అందుకు తగిన మూల్యం చెల్లిస్తావంటూ బెదిరింపులకు పూనుకున్నాడు.

ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి పోటీలో లేకపోయినా కమ్యూనిజం, సోషలిజాల గురించి పెద్ద చర్చే నడుస్తున్నది. గతకొద్ది దశాబ్దాలుగా కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టిన కారణంగా అనేక మంది బుర్రల్లో అది రాయిలా గడ్డకట్టింది. తాను గెలవాలంటే పాతబడిన కమ్యూనిస్టు వ్యతిరేకతను ఒక అస్త్రంగా చేసుకోవాలని ట్రంప్‌ ఎంచుకున్నాడు.దానిలో భాగంగా కామ్రేడ్‌ కమల మన దేశానికి భయంకరమైన వ్యక్తి. అమె ఒక మార్క్సిస్టు లేదా కమ్యూనిస్టు, ఎప్పుడూ కమ్యూనిస్టుగానే ఉన్నారు, భవిష్యత్‌లో కూడా అలాగే ఉంటారు, ఎన్నుకుంటే అమెరికా చరిత్ర ముగిసినట్లే అని న్యూయార్క్‌ ఎకనమిక్‌ క్లబ్‌ ప్రసంగంలో అన్నాడు. అమెరికా చరిత్రలో తొలిసారిగా ఒక ప్రధాన పార్టీ అభ్యర్ధి, స్వేచ్చను తిరస్కరిస్తూ మార్క్సిజం, కమ్యూనిజం, ఫాసిజాలను అనుసరిస్తున్నారన్నాడు. ఆమె రూపంలో స్టాలిన్‌ జన్మించాడని చెప్పాడు. మౌలికంగా కృత్రిమ మేథ(ఏఐ) ద్వారా ఆమె కమ్యూనిస్టు టోపీ, ఎర్ర కోటు ధరించినట్లు ఒకటి, ఇంకా కమ్యూనిస్టు అని చెప్పే రకరకాల చిత్రాలను సృష్టించి వైరల్‌ చేయించాడు. కమల అభ్యర్థిగా నిర్ణయంగాక ముందే డెమోక్రటిక్‌ పార్టీని దేవుడు లేడని చెప్పే కమ్యూనిస్టు అని వర్ణించాడు. మన ప్రత్యర్థిని ఒక కమ్యూనిస్టు,సోషలిస్టు లేదా అమెరికాను నాశనం చేసే మరోవ్యక్తిగా చిత్రించి ప్రచారం చేయాలని తన మద్దతుదార్లను బహిరంగంగానే కోరాడు.ఎలన్‌ మస్క్‌ తన సామాజిక మాధ్యమం ఎక్స్‌ ద్వారా కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొడుతున్నాడు. సోవియట్‌ నాయకుల మాదిరి కమల బొమ్మలను సృష్టించాడు.కమల తొలి రోజు నుంచే ఒక కమ్యూనిస్టు నియంతగా మారనున్నారు. అమెరికన్ల ఆర్థిక స్వేచ్చను హరించేందుకు సిద్దంగా ఉన్న ఒక సోషలిస్టు అంటూ వ్యాఖ్యలను జోడిరచి ప్రచారంలో పెట్టాడు.

కమలా హారిస్‌ కమ్యూనిస్టు కాదు, డెమోక్రటిక్‌ పార్టీలో ఉన్న ఉదారవాదుల్లో ఒకరు మాత్రమే. డెమోక్రటిక్‌ సోషలిస్టు నేత బెర్నీ శాండర్స్‌ కొన్ని అంశాలలో ఆమె వైఖరిని బట్టి పురోగామివాదిగా పరిగణిస్తున్నట్లు చెప్పాడు. అమెరికాలో గాడిద(డెమోక్రటిక్‌ పార్టీ)ఏనుగు (రిపబ్లికన్‌ పార్టీ) గుర్తుల మీద ఎవరు పోటీ చేసినా రెండిరటినీ బలపరిచే కార్పొరేట్లకు ఆమోదమైతేనే రంగంలో ఉంటారు.కమల కూడా అంతే. కమ్యూనిస్టు వ్యతిరేకులు ఏమి చెప్పినప్పటికీ కార్పొరేట్లకు ప్రాతినిధ్యం వహించే గోల్డ్‌మన్‌ శాచస్‌ సంస్థ ట్రంప్‌ కంటే కమల మెరుగని పేర్కొన్నది. ఆమె గెలిస్తే అమెరికా ఆర్ధిక వ్యవస్థకు శక్తి వస్తుందని, ట్రంప్‌ వస్తే దెబ్బతింటుందని చెప్పింది. కమ్యూనిస్టు నియంత మెరుగని ప్రపంచంలోని అతి పెద్ద పెట్టుబడిదారులు ఎలా చెబుతున్నారంటూ కొందరు గగ్గోలు పెడుతున్నారు. పెట్టుబడిదారుల చక్రవర్తి ట్రంప్‌ ఆర్థిక ప్రణాళిక ప్రకారం కమ్యూనిస్టు కామ్రేడ్‌ కమల చెబుతున్నదాని కంటే లోటు ఐదు రెట్లు పెరుగుతుందని తటస్థంగా ఉంటే పెన్‌ వార్టన్‌ బడ్జెట్‌ నమూనా నివేదిక చెప్పిందని ఒకరు పేర్కొన్నారు. ఇంతకీ కమల లేదా డెమోక్రటిక్‌ పార్టీ చెబుతున్నదేమిటి ? యాభైవేల డాలర్లతో ప్రారంభించే చిన్న అంకుర సంస్థలకు పన్ను రాయితీలను వర్తింపచేయటం, బడా సంస్థలకు పన్నులు పెంచటం, దీన్నే కమ్యూనిజం అంటున్నారు. స్కూలు పిల్లలకు ఉచితంగా మధ్యాహ్నభోజనం పెట్టటాన్ని కూడా సోషలిజం అని వర్ణించేబాపతు ఇలా చెప్పటంలో ఆశ్చర్యం ఏముంది? వాషింగ్టన్‌ ఎగ్జామినర్‌ అనే మీడియాతో కమలాహారిస్‌ మాట్లాడిన అంశాలను రిపబ్లికన్లు కమ్యూనిజంగా వర్ణించటాన్ని పురోగామి మార్పు ప్రచార కమిటీ స్థాపకుల్లో ఒకరైన ఆడమ్‌ గ్రీన్‌ ఎద్దేవా చేశాడు. రానున్న వారాల్లో గుడ్ల ధర ఏడు నుంచి తొమ్మిది దాలర్లకు పెరగటాన్ని అడ్డుకుంటామని కమలా హారిస్‌ చెబుతున్నారు, మితవాదులు దాన్నే గనుక కమ్యూనిజం అంటే అత్యధిక అమెరికన్లు దాన్నే కోరుకుంటారు, మీరేం మాట్లాడుతున్నారో అర్ధమౌతోందా అని గ్రీన్స్‌ ప్రశ్నించాడు.ధరలను అదుపు చేయటాన్ని కూడా ట్రంప్‌ కమ్యూనిజంగా వర్ణించాడు. కరోనా కాలం నాటితో పోల్చితే ప్రస్తుతం అమెరికాలో ధరలు 20శాతం పెరిగాయి.నిజవేతనాలు గణనీయంగా పడిపోతున్నాయి. అందుకే బతుకుదుర్భరమౌతున్న కారణంగా అనేక మంది యువతకు సోషలిజం, కమ్యూనిజాల గురించి తెలియకపోయినా అదే కావాలని కోరుకుంటున్నారు. ట్రంప్‌ వంటి వారు చేసే విపరీత ప్రచారం వాటి గురించి ఆసక్తి పెంచేందుకు దోహదం చేస్తున్నదంటే అతిశయోక్తి కాదు. అందుకే పెట్టుబడిదారీ దేశాల్లో చేస్తున్న సర్వేల్లో యువతలో సోషలిజం పట్ల సానుకూలత వెల్లడి అవుతున్నది. అమెరికాలో డెమోక్రాట్లను కమ్యూనిస్టులని ప్రచారం చేయటం ఇదే మొదటి సారి కాదు. ఈ ఎన్నికల్లో అది మరింతగా పెరిగింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చివరికి గొడుగులు కూడా చైనా నుంచి దిగుమతా ! హతవిధీ పదేండ్లలో నరేంద్ర మోడీ ప్రగతి ఇదా !!

02 Monday Sep 2024

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

Anti China Media, Anti communist, BJP, China imports to India, Indian manufacturers, Narendra Modi Failures, RSS, Tata EV, Ten years Narendra Modi rule


ఎం కోటేశ్వరరావు


మన దేశంలో అగ్రశ్రేణి ఆటోమొబైల్‌ కంపెనీ టాటా మోటార్స్‌ తన విద్యుత్‌ కార్లకు చైనా బ్యాటరీలను కొనాలని నిర్ణయించింది. మేకిన్‌ ఇండియా పథకం కింద విద్యుత్‌ బాటరీలను తయారు చేస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇదే సమయంలో గతంలో విధించిన నిషేధాలను తొలగించి ఇబ్బందిలేని ఎలక్ట్రానిక్స్‌ వంటి రంగాలలో చైనా పెట్టుబడులను అనుమతించాలని కూడా నిర్ణయించారు. 2030నాటికి దేశంలో 30శాతం వాహనాలు విద్యుత్‌ బాటరీలో నడిచే అవకాశం ఉన్నందున వాటి ఉత్పత్తిని ఇబ్బడి ముబ్బడిగా పెంచాల్సి ఉంది. ఈ క్రమంలో చైనా పెట్టుబడుల అవసరం మనదేశానికి ఉందా లేదా అని మోడీ గారి బిజెపిలో ‘‘ అంతర్గత పోరు ’’ ఉన్నట్లు 2024 ఆగస్టు ఒకటవ తేదీన అమెరికాభారత సంయుక్త యాజమాన్యంతో నడుపుతున్న సిఎన్‌బిసి టీవీ ఛానల్‌ ఒక వార్తను ప్రసారం చేసింది. ఇటీవల కొద్ది నెలలుగా జరుగుతున్న పరిణామాలను చూసినపుడు చైనా లేదా అమెరికా,రష్యా దేశం ఏదైతేనేం వాటి నుంచి వచ్చే పెట్టుబడులు లేదా సంబంధాలను నిర్ణయించేది, నడిపేది మన పాలకులా కార్పొరేట్లా అన్న సందేహం కలుగుతున్నది. గతంలో సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ చైనాతో సంబంధాలు సజావుగా ఉన్నాయి. గాల్వన్‌ ఉదంతాల సందర్భంగా చైనా మన భూభాగాన్ని ఆక్రమించలేదని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన సంగతి తెలిసిందే. సంఘపరివార్‌ చైనా, కమ్యూనిస్టు వ్యతిరేకత గురించి తెలిసినప్పటికీ గత పదేండ్లలో వాణిజ్య,పారిశ్రామికవేత్తలు ఇబ్బడి ముబ్బడిగా చైనా నుంచి దిగుమతులు చేసుకుంటుండగా లేనిది దాని పెట్టుబడుల అంశంలో ఎందుకు మడిగట్టుకోవాలనే ధోరణి ఇటీవలి కాలంలో పెరిగింది.

గాల్వన్‌ లోయలో జరిగిన ఉదంతాల తరువాత దేశంలో పెద్ద ఎత్తున చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టారు. ఆ దేశ యాప్‌లను నిషేధించారు.పెట్టుబడులు రాకుండా ఆంక్షలు పెట్టారు.కాషాయ దళాలు, మీడియాలో కొంత భాగం చైనా వస్తు దిగుమతులను నిలిపివేస్తే అది మన కాళ్ల దగ్గరకు వస్తుందనే ప్రచారం చేశారు.తీరా చూస్తే మన ఉక్కు మంత్రిత్వశాఖ తాజా నివేదిక ప్రకారం మన దేశం దిగుమతి చేసుకుంటున్న ప్రతి నాలుగు ఉక్కు వస్తువులలో మూడు చైనా నుంచే ఉన్నట్లు ఆగస్టు 29వ తేదీ హిందూ బిజినెస్‌లైన్‌ పత్రిక వార్త పేర్కొన్నది.గతేడాది ఏప్రిల్‌జూలై నెలలతో పోల్చితే మన దిగుతులు అక్కడి నుంచి 30శాతం పెరిగాయి.ఏడాది క్రితం మన ఎగుమతులు ఎక్కువగా ఉండేవి కాస్తా ఇపుడు పరిస్థితి తారుమారైంది.ఇతర దేశాలకూ మన ఎగుమతులు పడిపోయాయి.విచారకరమైన అంశం ఏమంటే చివరికి గొడుగులు, బొమ్మలను కూడా చైనా నుంచి దిగుమతి పెరగటం వలన మన ఎంఎస్‌ఎంఇ సంస్థలు దెబ్బతింటున్నాయని గ్లోబల్‌ ట్రేడ్‌ రిసర్చ్‌ ఇనీషియేటివ్‌(జిటిఆర్‌ఐ) స్థాపకుడు అజయ్‌ శ్రీవాత్సవ చెప్పారు(2024సెప్టెంబరు ఒకటవ తేదీ పిటిఐ వార్త).ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు మనం చైనాకు 850కోట్ల డాలర్ల విలువగల వస్తువులను ఎగుమతి చేయగా అక్కడి నుంచి 5,040 కోట్ల డాలర్ల మేర దిగుమతి చేసుకున్నామని జిటిఆర్‌ఐ నివేదిక వెల్లడిరచింది.చైనాతో పోటీ పడి గొడుగులను కూడా ఉత్పత్తి చేయలేని దుస్థితికి గత పదేండ్లలో మన దేశాన్ని నరేంద్రమోడీ నెట్టారా ? చిన్నప్పటి పాఠాల్లో భార్య ఎండకు తాళలేక ఆపసోపాలు పడుతుంటే ఒక రుషి ఆగ్రహ శాపానికి భయపడి సూర్యుడు దిగివచ్చి చెప్పులు, గొడుగు ఇచ్చినట్లు చదువుకున్నాం. ఇప్పుడు చైనా వారు ఇస్తున్నారు. ఆ రుషులేమయ్యారు, ఆ సూర్యుడు ఎందుకు కరుణించటం లేదు ! చైనాతో పోటీ పడి నాణ్యంగా, చౌకగా గొడుగులు తయారు చేసేందుకు మన వేదాల్లో నిగూఢమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వెలికితీసే నిపుణులు, దేశం కోసంధర్మం కోసం పని చేసే వారే లేరా ?

ఇటీవలన మన దేశ వార్షిక ఆర్థిక సర్వే విడుదల చేశారు. దాని వివరాల ప్రకారం చైనా నుంచి ఎఫ్‌డిఐని ఆహ్వానించాలని ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌ చెప్పారు.రెండు దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలను పెంచుకోవటం కంటే చైనా నుంచి పెట్టుబడులను ఆహ్వానించటం మెరుగని ఆర్థిక మంత్రికి నివేదించారు. గాల్వన్‌ ఉదంతాల తరువాత వైఖరిలో వచ్చిన మార్పుకు సూచిక ఇది.అమెరికా, ఐరోపాలు చైనా నుంచి సేకరణకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నందున మనం చైనా నుంచి దిగుమతులు చేసుకోవటం, వాటికి కొంత విలువను జోడిరచి తిరిగి ఎగుమతి చేయటం కంటే చైనా కంపెనీల పెట్టుబడులతో మనదేశంలో వస్తువులను ఉత్పత్తి చేసి విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయటం మరింత ప్రభావం చూపుతుందని ఆ నివేదికలో పేర్కొన్నారు. దీనికి నిర్మలా సీతారామన్‌ కూడా విలేకర్ల సమావేశంలో మద్దతు తెలిపారు. అయితే ప్రస్తుతానికి అలాంటి పునరాలోచన లేదని వాణిజ్య మంత్రి పియూష్‌ గోయల్‌ చెప్పినట్లు రాయిటర్స్‌ పేర్కొన్నది.‘‘ బిజెపి ప్రతిష్టను దెబ్బతీసే పర్యవసానాలకు దారితీసే దీన్ని ఎవరూ కోరుకోవటం లేదు. ఈ విధానాన్ని భారతీయులు మెచ్చరు, కానీ అది అవసరమని మోడీ ఆయన ఆర్థిక మంత్రిత్వశాఖ గుర్తించింది ’’ అని నాటిక్సిస్‌లోని ఆసియా పసిఫిక్‌ ఎకానమిస్ట్‌ అల్సియా గార్సియా హెరారో చెప్పినట్లు సిఎన్‌బిసి వార్త పేర్కొన్నది. రానున్న ఐదు సంవత్సరాల్లో ఏటా వంద బిలియన్‌ డాలర్ల మేర ఎఫ్‌డిఐలను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.గత ఆర్థిక సంవత్సరంలో 71బిలియన్‌ డాలర్లు వచ్చాయి. సోలార్‌ పలకలు,విద్యుత్‌ బాటరీల తయారీ రంగాలలో చైనా పెట్టుబడులను అనుమతించేందుకు నిబంధనలను సులభతరం చేయనున్నారు.‘‘ భారత ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా,ఐరోపా వారు విముఖంగా ఉన్నారు. అత్యధిక విదేశీ పెట్టుబడులు ఐసిటి(ఇన్ఫర్మేషన్‌, కమ్యూనికేషన్‌ టెక్నాలజీస్‌) డిజిటల్‌ సర్వీసెస్‌ వంటి రంగంలోకి వెళ్లాయి’’ అని హెరారో చెప్పాడు. ఆసియా ఉత్పత్తి కేంద్రంగా మారాలని భారత్‌ కోరుకుంటే చైనా సరఫరా గొలుసులతో సంబంధాలు పెట్టుకోవాలని ఢల్లీి కేంద్రంగా పని చేస్తున్న అబ్జర్వర్‌ రిసర్చ్‌ ఫౌండేషన్‌లోని విదేశీ విధాన అధ్యయన విభాగ ఉపాధ్యక్షుడు హర్ష వి పంత్‌ చెప్పారు.

ముందే చెప్పుకున్నట్లుగా చైనా వ్యతిరేకతను పెద్ద ఎత్తున రెచ్చగొట్టిన కారణంగా వ్యతిరేకులను సంతుష్టీకరించేందుకు , రాజకీయంగా పరువు నిలుపుకొనేందుకు గత కొద్ది నెలలుగా చైనా పెట్టుబడులను అందరితో అంగీకరింపచేయించేందుకు ఢల్లీి పెద్దలు కసరత్తుచేస్తున్నారు.‘‘ ఆర్థిక కోణంలో చూస్తే కొన్ని రంగాలలో చైనా పెట్టుబడులు మనకు అవసరమే అని చక్కటి తర్కంతో చెప్పవచ్చు. కానీ ఆక్రమంలో దేశ భద్రత,అంతర్జాతీయ రాజకీయ కోణాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది, ప్రస్తుతం చైనాతో సంబంధాలు అంత మంచిగా,సాధారణంగా లేవు ’’ అని విదేశాంగ మంత్రి జై శంకర్‌ ఇటీవల చెప్పారు. 2070నాటికి పూర్తి కాలుష్య రహిత లక్ష్యాన్ని చేరుకోవాలని మనదేశం లక్ష్యంగా పెట్టుకుంది.దానిలో భాగంగా 2030 నాటికి 50శాతం విద్యుత్‌ను పునరుత్పత్తి ఇంథన వనరుల నుంచి తయారు చేయాల్సి ఉంది.చైనా ఆ రంగంలో ఎంతో ముందుంది,తక్కువ ఖర్చుతో, సమర్ధవంతంగా ఉత్పత్తి చేస్తున్నది. ప్రస్తుతం అది 584 టెరావాట్‌ అవర్స్‌ సామర్ధ్యం కలిగి ఉండగా మనది కేవలం 113టెరావాట్‌ అవర్స్‌ మాత్రమే.చైనా కమ్యూనిస్టుదేశం, మనది ప్రజాస్వామ్యం అక్కడి నుంచి పెట్టుబడులు ఎలా తీసుకుంటాం అని మడిగట్టుకు కూర్చొనేందుకు మనదేశంలోని కార్పొరేట్‌ కంపెనీలు సిద్దంగా లేవు.అక్కడి నుంచి దిగుమతులు చేసుకొనే బదులు పెట్టుబడులు తీసుకొని మనదేశంలోనే సంస్థలను ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉపాధిని కూడా కల్పించవచ్చు. ప్రస్తుతం మన దేశం తప్ప ప్రపంచంలో మరేదేశమూ చైనా పెట్టుబడులపై పూర్తి నిషేధం విధించలేదు.దాన్నుంచి పూర్తిగా విడగొట్టుకునేందుకు ఏ దేశమూ సిద్దంగా లేదు.తోటి సోషలిస్టు దేశమైనా చైనావియత్నాం మధ్య కొన్ని సరిహద్దు విబేధాలున్నాయి, అయినా చైనా నుంచి పెట్టుబడులను తీసుకుంటున్నది.


టాటా కంపెనీ అనేక దేశాల అనుభవాలను చూసిన తరువాతనే చైనా నుంచి బ్యాటరీలను కొనాలని నిర్ణయించింది.సరఫరా, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిగణనలోకి తీసుకుంది.మన దేశ విద్యుత్‌ వాహన మార్కెట్‌లో దాని వాటా 60శాతం. ఇంతకు ముందుదాని ఉత్తత్తుల్లో బాటరీల నుంచి ఎదురైన సమస్యలతో పాటు మార్కెట్లో పోటీని కూడా అది గమనంలోకి తీసుకుంది.చైనాతో ఉన్న సరిహద్దు, రాజకీయ విధానాలను అది పక్కన పెట్టింది. ఇప్పటికే చైనా బివైడి కంపెనీ మన దేశంలోని సంస్థలతో భాగస్వామిగా లేదా విడి భాగాలను ఎగుమతి చేసేదిగా ఉంది. విద్యుత్‌ వాహనాలలో బ్యాటరీ ధర, సామర్ధ్యమే కీలకం.చైనాతో అమెరికా ప్రభుత్వానికి ఉన్న రాజకీయ విబేధాల కారణంగా అమెరికా దిగ్జజ కంపెనీ ఫోర్డ్‌ చైనా కంపెనీతో కలసి అమెరికాలో ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకొని కూడా అనేక ఆటంకాలను ఎదుర్కొని విరమించుకుంది. అది చేసిన తప్పిదాన్ని టాటా చేయదలచలేదని పరిశీలకులు పేర్కొన్నారు.తొలుత కొన్ని రంగాలలో ఆటంకాలను తొలగిస్తే క్రమంగా ఇతర రంగాలకు విస్తరిస్తారు. మన దేశంలో ఇప్పటి వరకు కేంద్రంలో ఎవరు అధికారంలో ఏ పార్టీ లేదా కూటమిఉన్నప్పటికీ కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలనే అనుసరించింది. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది.వాటి అడుగులకు మడుగులొత్తితేనే ఎవరైనా అధికారంలో ఉంటారు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాతో గిల్లి కజ్జా : అమెరికా రాజకీయ క్రీడలో పావుగా దలైలామా !

26 Wednesday Jun 2024

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RELIGION, USA

≈ 1 Comment

Tags

#Anti China, 14th Dalai Lama, Anti communist, China, cia, Nancy Pelosi, Tibet


ఎం కోటేశ్వరరావు


ధర్మశాలలో ప్రవాస జీవితం గడుపుతున్న 88 ఏండ్ల దలైలామా మోకాలి చికిత్సకోసం అమెరికా వెళ్లారు. ఆ సందర్భంగా అక్కడ రాజకీయ నేతలతో చర్చలు జరుపుతారా లేదా అన్నది ఇంకా స్ఫష్టం కాలేదు. గతవారంలో అమెరికా పార్లమెంటు ప్రజాప్రతినిధుల సభ మాజీ స్పీకర్‌ నాన్సీ పెలోసి హిమచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో దలైలామాను కలిశారు.ఈ సందర్భంగానే ప్రధాని నరేంద్రమోడీ, విదేశాంగ మంత్రి జై శంకర్‌ను కూడా ఆమె నాయకత్వంలో వచ్చిన ఏడుగురు ఎంపీల బృందం భేటీ జరిపింది. ఇతర పని మీద భారత్‌ పర్యటనలో భాగంగా ఏదో ఇంతదూరం వచ్చాం కదా మర్యాద పూర్వకంగా అనుకుంటే దలైలామాను కలవటం పెద్ద వార్తే కాదు.రావటమే కాదు,నేను చైనాను విమర్శిస్తే అది దలైమాకు అంగీకారం కాదని తెలిసినా అంటూ అక్కడే చైనా అధినేత షీ జింపింగ్‌ మీద ధ్వజమెత్తింది. అందుకే ఇది పక్కా రాజకీయ, చైనా వ్యతిరేక పర్యటనే అనటంలో ఎలాంటి సందేహం లేదు.దలైలామా వారసత్వం ఎప్పటికీ ఉండిపోతుంది, కానీ చైనా అధ్యక్షపదవిలో ఉన్న మీరు శాశ్వతంగా ఉండరు,ఎవరూ, దేనికీ మిమ్మల్ని గుర్తుంచుకోరు అంటూ నాన్సీ పెలోసి నోరుపారవేసుకుంది. దలైలామాతో చైనా ప్రభుత్వం సంప్రదింపులు జరపాలని కూడా చెప్పింది.
ఈ పరిణామం మీద మన విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ మాట్లాడుతూ భారత వైఖరిలో ఎలాంటి మార్పులేదు, స్థిరంగా ఉందని చెప్పారు.మనదేశంలో మతపరమైన,ఆధ్యాత్మిక కార్యకలాపాలు నిర్వహించేందుకు మాత్రమే దలైలామాకు ఆశ్రయం కల్పించినట్లు చెప్పారు. నాన్సీ పెలోసీ చేసిన రాజకీయ వ్యాఖ్యలకు-మన ప్రభుత్వానికి సంబంధం లేదని, వాటి గురించి మీరు అమెరికానే ప్రశ్నించాలని విలేకర్లతో చెప్పారు. ధర్మశాలలో ఉందని చెబుతున్న టిబెట్‌ ప్రవాస ప్రభుత్వం ఒక వేర్పాటు వాద రాజకీయ సంస్థ, చైనా రాజ్యాంగం, చట్టాల ప్రకారం అది చట్టవిరుద్దం, ఆ సంస్థకు ప్రపంచంలో ఎలాంటి గుర్తింపు లేదు, ఇక దలైలామాతో సంప్రదింపులు, మాటల విషయానికి వస్తే అది చైనా ప్రభుత్వం-పద్నాలుగవ దలైలామాకు సంబంధించిన వ్యవహారం అన్నది ఎప్పుటి నుంచో మేము చెబుతున్నాం అని చైనా స్పందించింది. ఈ సందర్భంగా కొన్ని అభిప్రాయాలు, వక్రీకరణలు, భాష్యాలు వెలువడ్డాయి.టిబెటన్ల హక్కుల పేరుతో గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా ఆడుతున్న నాటకం తెలిసిందే. అమెరికా, దానికి తాన తందాన పలికే దేశాలు చెబుతున్నదాని ప్రకారం టిబెట్‌ ఒక స్వతంత్ర దేశం, కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చాక దాన్ని చైనా ఆక్రమించింది. కనుక టిబెటన్ల హక్కును పరిరక్షించాలి అంటూ వేర్పాటు వాదాన్ని సమర్ధిస్తున్నది.మనదేశంలో బ్రిటీష్‌ ప్రభుత్వానికి లోబడిన సామంత రాజరిక సంస్థానాల మాదిరే చైనాలో రాజరిక కాలంలో టిబెట్‌ కూడా అలాంటిదే.చైనాకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత చైనా ప్రభుత్వానికి లోబడిన ఒక స్వయం పాలిత ప్రాంతంగా ఉంది, దాని అధిపతిగా దలైలామా కొనసాగాడు.


చైనా కమ్యూనిస్టు పార్టీ లాంగ్‌ మార్చ్‌ లేదా విప్లవపోరాట కాలంలో అధికారంలో ఉన్న చాంగ్‌కై షేక్‌ ప్రభుత్వం కూలిపోవటం తధ్యమని గ్రహించిన అమెరికా, బ్రిటన్‌ సామ్రాజ్యవాదులు ఒక వ్యూహం ప్రకారం నాడు ఫార్మోజా దీవిగా నేడు తైవాన్‌గా పిలుస్తున్న ప్రాంతానికి మిలిటరీ, ఆయుధాలను తరలించి అక్కడే తిష్టవేయించింది. చైనా రాజులు ఆ దీవిని 1895లో జపాన్‌కు ధారాదత్తం చేశారు. రెండవ ప్రపంచ యుద్దంలో ఓడిపోయిన తరువాత 1945లో దాన్ని తిరిగి చైనా ప్రభుత్వానికి అప్పగించారు. మిగతా ప్రధాన ప్రాంతంలో కమ్యూనిస్టులు కేంద్రీకరించి తరువాత తైవాన్‌ సంగతి చూద్దాం లెమ్మని భావించారు.తరువాత అనేక కారణాలతో స్వాధీనం చేసుకోలేదు. ఈ లోగా అమెరికా, ఇతర దేశాలు తైవాన్‌ పాలకులకు భారీ ఎత్తున ఆయుధాలు ఇచ్చి ఒక దేశం మాదిరి తయారు చేశారు. దాన్నే అసలైనా చైనాగా భద్రతా మండలిలో గుర్తించారు. 1970దశకంలో అనివార్య స్థితిలో ఐక్యరాజ్యసమితి ఆమోదించిన తీర్మానం ప్రకారం చైనా అంటే తైవాన్‌తో కూడిన ప్రాంతం తప్ప రెండు చైనాలు లేవు. దీనికి అమెరికా కూడా అంగీకరించింది. అయితే శాంతియుతంగా విలీనం జరగాలంటూ కొత్త నాటకం ప్రారంభించింది. బలవంతంగా ఆక్రమించేందుకు చైనా పూనుకుంటే తాము సహించేది లేదని అమెరికా అంటున్నది. తైవాన్‌ వ్యవహారాలను చూసేందుకు ఏ ఒక్కదేశానికీ భద్రతా మండలి అనుమతి ఇవ్వలేదు. తనకు తానే రక్షకురాలిగా అమెరికా ప్రకటించుకుంది. ఆధునిక ఆయుధాలన్నీ ఇచ్చి ఎదురుదాడులకు కూడా అనుగుణంగా తయారు చేస్తున్నది.


ఇక టిబెట్‌ విషయానికి వస్తే కమ్యూనిస్టు పార్టీ, ప్రభుత్వం కూడా ముందుజాగ్రత్తతో వ్యవహించి సామ్రాజ్యవాదుల కుట్రలను వమ్ముచేసింది. మతం, దలైలామా పేరుతో జరిపిన తిరుగుబాటును అణచివేసింది.టిబెట్‌లో తిరుగుబాటు చేసేందుకు పూనుకున్న వేర్పాటు వాదులకు సిఐఏ అనేక చోట్ల రహస్యంగా సాయుధ శిక్షణ, పెద్ద మొత్తంలో నిధులు అందచేసింది. చైనా కమ్యూనిస్టు పార్టీ 1949లో అధికారానికి వచ్చిన తరువాత ” ఇంకే ముంది మనం చైనాను నష్టపోయాం, మన అదుపు నుంచి పోయింది, మనకు కొత్త విరోధి ఉనికిలోకి వచ్చింది ” అన్నట్లుగా అమెరికా పాలకవర్గం భావించింది. విప్లవ కాలంలోనే చైనాలో కమ్యూనిస్టు పార్టీని అడ్డుకోవటంలో విఫలం కావటం గురించి అది బెంగపెట్టుకుంది. ఇరాన్‌లో అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు1953లో మహమ్మద్‌ మొసాద్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు చేసిన ఖర్చుతో పోలిస్తే సిఐఏ 1949-51కాలంలో ఇరవై రెట్లు మొత్తాన్ని చైనా కోసం వెచ్చించింది.రహస్య కార్యకలాపాలకు పది రెట్లు సిబ్బందిని పెట్టింది.కార్యస్థానంగా టిబెట్‌ను ఎంచుకుంది.చరిత్రను చూస్తే టిబెట్‌ ప్రాంతంలో చైనా రాజులకు సామంత రాజ్యంగా ఉంది తప్ప స్వతంత్రదేశం కాదు.1912లో క్వింగ్‌ రాజరిక వ్యవస్థకూలిపోయిన మరుసటి ఏడాది పదమూడవ దలైలామా తమకు స్వాతంత్య్రం కావాలని ప్రకటించాడు.చైనా ఆశీస్సులతో నిమిత్తం లేకుండా ఆధ్యాత్మిక, రాజకీయ అధికారాన్ని చెలాయిస్తానని చెప్పుకున్నాడు.దాన్ని చైనా ప్రభుత్వం ఆమోదించలేదు. రెండవ ప్రపంచ యుద్దం ముగిసిన తరువాత టిబెట్‌ను పూర్తిగా చైనాలో విలీనం చేసేందుకు చూస్తున్నట్లు 1941డిసెంబరు 20వ తేదీ డైరీలో నాటి ప్రధానిగా ఉన్న చాంగ్‌కై షేక్‌ రాశాడు.


కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత ముందే చెప్పుకున్నట్లు సిఐఏ రంగంలోకి దిగింది. దీన్ని పసిగట్టిన మావో జెడాంగ్‌ ముందు జాగ్రత్త చర్యగా 1950లో అక్కడికి 40వేల మంది మిలిటరీని పంపాడు.దీంతో పాటు చైనాతో అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకున్నాడు. అదే ఏడాది అక్టోబరు 6-24వ తేదీల మధ్య తూర్పు టిబెట్‌లో తిరుగుబాటుకు తెరతీసిన వేర్పాటు వాదులను చామడో పోరులో మిలిటరీ అణచివేసింది, మూడు వేల మందిని బందీలుగా పట్టుకుంది. టిబెట్‌ పౌరుల మీద ఎలాంటి దాడులు జరపలేదు. ప్రస్తుతం మనదేశంలో ఉన్న 14వ దలైలామా టెంజిన్‌ జియాస్టో ఆ పరిణామం తరువాత తాను క్రమశిక్షణతో మెలుగుతానని ప్రకటించాడు. కాశ్మీరు, హైదరాబాదు సంస్థానాలను మనదేశంలో విలీనం చేసినట్లుగానే టిబెట్‌ సంస్థానాన్ని చైనా 1951 మే నెలలో విలీనం చేసింది. టిబెట్‌ రాజకీయం చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి రావటానికంటే ముందే మొదలైంది.మన దేశం తొలిసారిగా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం టిబెట్‌తోనే మొదలైంది.చైనా మిలిటరీ చర్య గర్హనీయమని, అది చైనా ప్రయోజనాలకు, శాంతికి కూడా దోహదం చేయదని నాటి నెహ్రూ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి వెంటనే అమెరికా, బ్రిటన్‌ తదితర ఆ గుంపు దేశాలు కూడా మద్దతు ఇచ్చాయి.


దలైలామాకు 1940దశకంలోనే సిఐఏతో సంబంధాలు, నిధుల అందచేత ఉన్నట్లు తరువాత వెల్లడైంది. అమెరికాలోని కొలరాడోలో టిబెట్‌ తిరుగుబాటుదార్లకు శిక్షణ ఇచ్చింది. వారిని అక్కడికి విమానాల్లో తరలించి తరువాత తిరిగి టిబెట్‌కు చేర్చింది. ఆయుధాలను ఇచ్చింది. అలాంటి వారి నాయకత్వంలో 1956లో తూర్పు టిబెట్‌లో రెండు చోట్ల తిరుగుబాటును ప్రకటించారు. దలైలామా అన్న గయాలో తోండప్‌ 1951లో అమెరికా వెళ్లాడు.అక్కడే ఉండి ఎప్పటికప్పుడు చైనా, టిబెట్‌లో పరిస్థితుల గురించి అక్కడ ఎందరు సైనికులు ఉన్నదీ మొదలైన సమాచారాన్ని అందచేసేవాడు. దానికి ప్రతిగా చైనాకు వ్యతిరేకంగా తమకు సాయం చేయాలని కోరాడు. అందుకోసం భారత్‌, నేపాల్లో అమెరికా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసింది. జపాన్‌లోని ఒకినావా, మైక్రోనేసియా ప్రాంతంలోని ఫసిపిక్‌ దీవుల్లో అమెరికా ఆధీనంలో ఉన్న గువామ్‌లో టిబెటన్లకు శిక్షణ ఇచ్చారు. ఢిల్లీలో సిఐఏ-మనదేశ సంస్థ కలసి ఒక కేంద్రాన్ని కూడా నడిపినట్లు తరువాత వెల్లడైంది. ఆపరేషన్‌ ఎస్‌టి సర్కస్‌ పేరుతో ఒక పధకాన్ని రూపొందించి 1959లో దలైలామా సోదరుడి నాయకత్వంలో గెరిల్లా తిరుగుబాటు ప్రారంభించారు. అయితే దాన్ని చైనా మిలిటరీ రెండు వారాల్లోనే అణచివేసింది. లాసా నుంచి పారిపోయిన దలైలామా నాటి భారత ప్రభుత్వ సహకారంతో నేటి అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ ప్రాంతం ద్వారా మనదేశానికి 1959 మార్చి 31న వచ్చాడు. ధర్మశాలలో కేంద్ర ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలతో కాందిశీకుల పేరుతో ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. తరువాత తాను వైదొలిగి ఇతరులకు అప్పగించాడు. ఈ ప్రభుత్వాన్ని మనదేశం గుర్తించనప్పటికీ నాటి నుంచి నేటి వరకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నది. అమెరికా విదేశాంగశాఖ 1998లో వెల్లడించిన పత్రాలలో ఉన్న సమాచారం మేరకు దలైలామా 1970దశకం మధ్య వరకు ఏటా లక్షా 80వేల డాలర్లను అమెరికా సిఐఏ నుంచి పొందినట్లు ఉంది. ఇప్పటికీ అమెరికా మద్దతు కొనసాగుతోంది. నాన్సీ పెలోసీ గుంపు పర్యటన అదే.


దలైలామాతో చర్చలు జరపాలని చైనాను డిమాండ్‌ చేసే హక్కు అమెరికాకు లేదు. తాను చేసిన చట్టాలు, లేదా అవగాహన ప్రకారం బిన్‌లాడెన్‌ లాంటి కొంత మందిని ఉగ్రవాదులుగా ప్రకటించింది. అలాంటి వారితో ఎవరైనా చర్చలు జరపాలని కోరితే అంగీకరిస్తుందా. చైనా దృష్టిలో తిరుగుబాటు చేసిన దలైలామా వేర్పాటువాది. అలాంటి వారితో చర్చలు జరిపేది లేదని గతంలోనే ప్రకటించింది.దలైలామా ఒక్క మతనాయకుడే కాదు, ప్రవాసంలో ఉన్న రాజకీయవాది కూడా అని తాజాగా స్పష్టం చేసింది. అతగాడి వైఖరిలో మార్పు లేదు. ఇప్పుడు దలైలామాకు వృద్దాప్యం వచ్చింది. తదుపరి వారసుడు ఎవరన్నది తేలాల్సి ఉంది. తన వారసుడు భారత్‌లో ఉన్నట్లు దలైలామా చెబుతున్నారు. కొత్త దలైలామాను తాము ఆమోదించాల్సిందేనని చైనా అంటున్నది.జూన్‌ పన్నెండున అమెరికా పార్లమెంటు టిబెట్‌-చైనా వివాద బిల్లును ఆమోదించింది.అధ్యక్షుడు ఆమోదిస్తే చట్టం అవుతుంది. అది ఉభయ దేశాల సంబంధాల మీద ప్రభావం చూపుతుంది గనుక అలాంటి పనికి పూనుకోవద్దని చైనా హితవు పలికింది. పురాతన కాలం నుంచి చైనాలో టిబెట్‌ భాగం కాదని దానిలో పేర్కొన్నారు. అసలు అలాంటి చట్టం చేసే అధికారం అమెరికా పార్లమెంటుకు ఎవరిచ్చారు. దలైలామా గురించి ప్రపంచంలో ఆసక్తి తగ్గిపోతున్న తరుణంలో అమెరికా ఈ పని చేసింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏమి రాజకీయాల్రా బాబూ : చైనాపై అమెరికా పెద్దన్న ధ్వజం – విశ్వగురువు నరేంద్రమోడీ లొంగుబాటు !!

16 Thursday May 2024

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, USA, WAR

≈ Leave a comment

Tags

Anti China Propaganda, Anti communist, BJP, China, CHINA TRADE, Donald trump, Import duty on EVs, Joe Biden, Narendra Modi Failures, RSS, TRADE WAR, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


ఒకవైపు బెదిరించి లొంగదీసుకోవాలన్న ఎత్తుగడ. మరోవైపు జనం ముందు శత్రువు అంటూనే చైనా సంతుష్టీకరణ.ఎందుకిలా జరుగుతోంది ? ” ఉక్రెయిన్‌ యుద్ధాన్ని నరేంద్రమోడీ ఆపివేయగలిగారు. అమెరికా, రష్యా అధినేతలను సైతం శాసించగలిగిన పలుకుబడి కలిగిన విశ్వగురువుగా ఎదిగారు, ప్రపంచ నేతల్లో పలుకుబడి ఎక్కువ కలిగిన నేతగా ఉన్నారు.” మోడీ గురించి ఇలాంటి ఎన్నో అంశాలను ప్రచారం చేస్తున్నారు. జనం కూడా నిజమే కదా అని వింటున్నారు, మేము సైతం తక్కువ తిన్నామా అన్నట్లుగా వాటిని ఇతరులకు ఉచితంగా పంచుతున్నారు. వాట్సాప్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎలాంటి కష్టం లేకుండానే పట్టాలు పొందుతున్నారు.ఇక తాజా విషయానికి వస్తే చైనా నుంచి దిగుమతి అవుతున్న విద్యుత్‌ వాహనాలు,కంప్యూటర్‌ చిప్స్‌, వైద్య ఉత్పత్తులపై అమెరికా సర్కార్‌ వందశాతం వరకు దిగుమతి సుంకాన్ని విధించి వాణిజ్య యుద్దాన్ని కొనసాగిస్తున్నాం కాసుకోండి అంటూ ఒక సవాల్‌ విసిరింది. మరి అదే అమెరికా మెడలు వంచారని, దారిలోకి తెచ్చుకున్నారని చెబుతున్న నరేంద్రమోడీ ఏం చేశారు ? ఇప్పటి వరకు మనదేశం విదేశీ విద్యుత్‌ వాహనాలపై రకాన్ని బట్టి 70 నుంచి 100శాతం వరకు విధిస్తున్న దిగుమతి సుంకాన్ని పదిహేను శాతానికి తగ్గించారు. అయితే చైనా కంపెనీలతో సహా ఎవరైనా 50 కోట్ల డాలర్ల మేరకు ఆ వాహనరంగంలో మనదేశంలో పెట్టుబడులు పెట్టాలి, ఉత్పత్తి ప్రారంభించేంత వరకు ఐదు సంవత్సరాల పాటు ఏటా ఎనిమిది నుంచి 40వేల వరకు వాహనాలను ప్రతి కంపెనీ నేరుగా దిగుమతులు చేసుకోవచ్చు. వాహనాల తయారీలో దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న విడిభాగాల వినియోగం ప్రస్తుతం 30 నుంచి 40శాతం వరకు ఉందని, నూతన విధానం వలన మరింత పెరుగుతుందని ప్రభుత్వం చెబుతుండగా రానున్న రోజుల్లో చైనా వాహనాలతో భారత మార్కెట్‌ నిండిపోతుందని ఆ రంగ నిపుణులు హెచ్చరిక, ఆందోళన వెల్లడించారు. అమెరికా మెడలే వంచగలిగిన నరేంద్రమోడీ చైనా విషయంలో ఇప్పుడున్న పన్నును కొనసాగించకుండా ఇలా ఎందుకు లొంగిపోయినట్లు ? అమెరికా పెద్దన్న బెదిరించి లొంగదీసుకోవాలని చూస్తుంటే, విశ్వగురువు తనకు నచ్చని మాట సంతుష్టీకరణకు ఎందుకు పూనుకున్నట్లు ?


నవంబరు నెలలో జరగనున్న ఎన్నికల్లో జో బైడెన్‌కు ప్రత్యర్ధి డోనాల్డ్‌ ట్రంప్‌ చుక్కలు చూపిస్తున్నాడు.చైనా నుంచి దిగుమతులు అంటే అమెరికన్లకు ఉపాధి తగ్గటమే. అందుకే ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు బైడెన్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే అమెరికాలో విద్యుత్‌ వాహనాలను తయారు చేసే కంపెనీలు ఉన్నాయి గనుక అక్కడి వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనదేశంలో పదేండ్లలో మోడీ అలాంటి కార్ల తయారీని ప్రోత్సహించటం, పరిశోధనా, అభివృద్ధి రంగాలను పట్టించుకోలేదు. ఈ కారణంగా మనదేశంలోని కార్పొరేట్‌ సంస్థలు చైనా కంపెనీలతో సంయుక్త భాగస్వామ్యం, దిగుమతులకు మోడీ సర్కార్‌ మీద వత్తిడి తెచ్చాయి. ఎన్నికలలో వాటి నుంచి నిధులు కావాలి గనుక ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడక ముందే వాటిని సంతుష్టీకరించేందుకు విద్యుత్‌ వాహనాల దిగుమతి, తయారీ విధానంలో వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. కొన్ని కంపెనీలు ఎన్నికల బాండ్ల రూపంలో అంతకు ముందే బిజెపికి గణనీయమొత్తాలను సమర్పించుకున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు తరువాత బహుశా టెంపోలలో నోట్లను రవాణా చేసి ఉంటాయి. దిగుమతుల కారణంగా ఉపాధి తగ్గినా లేక నిరుద్యోగం ప్రాప్తించినా అమెరికా సమాజం సహించదు. మనదేశంలో అలాంటి పరిస్థితి లేదు, మతం, కులం, ప్రాంతం, విద్వేషం, తప్పుడు సమాచారం తదితర అనేక మత్తుమందులను ప్రయోగిస్తూ అసలు సమస్యల నుంచి జనాన్ని తప్పుదారి పట్టించటంలో ఎవరు అధికారంలో ఉన్నా సర్వసాధారణమైంది. జనం కూడా అలవాటు పడ్డారు.గుళ్లు, మసీదు, చర్చీలు ఇతర ప్రార్ధనామందిరాలకు వెళ్లి రోజంతా వేడుకోవటానికి కానుకల సమర్పణ, కొబ్బరి కాయలు కొట్టేందుకు సిద్దపడుతున్నారు గానీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించటానికి ఆసక్తి చూపటం లేదు.


అమెరికా పెంచిన పన్నులను రద్దు చేయాలని లేదా తాము కూడా ప్రతిచర్య తీసుకుంటామని చైనా స్పందించింది.చైనా నుంచి దిగుమతి చేసుకొనే విద్యుత్‌ వాహనాలు,అల్యూమినియం, సెమీకండక్టర్లు,బ్యాటరీలు, కొన్ని రకాల ఖనిజాలు, సోలార్‌ సెల్స్‌,క్రేన్ల వంటి వాటి మీద దిగుమతి పన్ను పెంపు కారణంగా కనీసం 1,800కోట్ల డాలర్ల మేర అమెరికా వినియోగదారుల మీద భారం పెరుగుతుంది. ఆ కారణంగా దిగుమతులు నిలిపివేస్తే ప్రత్యామ్నాయం చూపే పరిస్థితిలో అమెరికా లేదు. వాటినే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సివస్తే భారం ఇంకా పెరుగుతుంది. గత ఏడాది చైనా నుంచి 427 బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువులను దిగుమతి చేసుకున్న అమెరికా 148బి.డాలర్ల విలువగల వస్తువులను ఎగుమతి చేసింది.గతంలో చైనా కూడా ప్రతిచర్యల్లో భాగంగా పన్నులు పెంచింది. చైనా వస్తువుల మీద ఆధారపడకుండా స్వంతంగా తయారు చేసుకోవాలని, తద్వారా చైనాను ఆర్థికంగా దెబ్బతీయాలని, తమ కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలనే సంకల్పం చెప్పుకున్న అమెరికా, ఐరోపా దేశాల సరసన మనదేశం కూడా ఉంది.
అనేక దేశాలతో మనదేశం స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు(ఎఫ్‌టిఏ) చేసుకుంది. ప్రపంచ వాణిజ్య సంస్థ ఉన్నప్పటికీ దాన్ని పక్కన పెట్టి పరస్పరం లబ్ది పొందేందుకు వీటిని చేసుకుంటున్నారు. విదేశాలు తిరిగి మనవస్తువులకు మార్కెట్‌ అవకాశాలను పెంచానని, దానితో పాటు పలుకుబడి కూడా పెరిగిందని నరేంద్రమోడీ పదే పదే చెబుతారు. కానీ గత ఐదు సంవత్సరాల వివరాలను చూసినపుడు ఎగుమతుల అంశంలో మన పలుకుబడి పప్పులు ఉడకలేదు. 2019-2024 ఆర్థిక సంవత్సరాలలో ఎఫ్‌టిఏలు ఉన్న దేశాలకు మనం ఎగుమతి చేసిన వస్తువుల విలువ 107.2 నుంచి 122.72 బిలియన్‌ డాలర్లకు(14.48శాతం) పెరిగితే, దిగుమతులు 136.2 నుంచి 187.92 బిలియన్‌ డాలర్లకు ( 37.97శాతం) పెరిగినట్లు జిటిఆర్‌ఐ నివేదిక వెల్లడించింది. ఎగుమతులపై మోడీ ప్రచార బండారాన్ని బయట పెట్టింది. మొత్తంగా చూసుకున్నపుడు ప్రపంచ వాణిజ్య ఎగుమతుల్లో 1.8శాతంతో మనదేశం 17వదిగా ఉండగా దిగుమతుల్లో 2.8శాతం వాటాతో ఎనిమిదవ స్థానంలో ఉంది. అంతా బాగుంది అని చెప్పిన 2023-24లో మన వస్తు ఎగుమతులు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 3.11శాతం తగ్గి 437.1బిలియన్‌ డాలర్ల వద్ద ఉన్నాయి. దిగుమతి చేసుకున్న వస్తువులను కొనుగోలు చేయటం తగ్గటంతో గతేడాది 5.4శాతం తగ్గి 677.2బి.డాలర్లుగా ఉన్నాయి.


ట్రంప్‌ మాదిరి చైనా పట్ల కఠినంగా ఉండాలని జో బైడెన్‌ కూడా జనానికి కనిపించేందుకు తాజా చర్యకు పూనుకున్నాడు. గతనెలలో రాయిటర్స్‌ జరిపిన ఒక సర్వేలో ట్రంప్‌ కంటే బైడెన్‌ ఏడుపాయింట్లు వెనుకబడి ఉన్నాడు. అయితే 2020లో చైనాతో ట్రంప్‌ కుదుర్చుకున్న ఒప్పందంతో ఎలాంటి ఫలితమూ రాలేదు. పరస్పరం సహకారం పెంచుకోవాలని చెబుతూనే దిగుమతి పన్నుల పెంపుదలకు సాకుగా తాము అవసరాలకు మించి హరిత ఉత్పత్తులు చేస్తున్నామని లేనిపోని మాటలు చెబుతున్నదని చైనా విమర్శించింది. ఇది రక్షణాత్మక చర్యలకు పూనుకొనేందుకు చేస్తున్న ప్రచారమని, తనను తాను దెబ్బతీసుకోవటమేనని, గతంలో వచ్చిన అవగాహనకు భిన్నమని, రెండు దేశాల మార్గంలో గుంతలు తవ్వవద్దని హితవు చెప్పింది. బైడెన్‌ ఎన్నికల కోసం రాజకీయంగా తీసుకున్న చర్య తప్ప తమ మీద పెద్దగా ప్రభావం పడదని కూడా వ్యాఖ్యానించింది.2023 నుంచి ఈ ఏడాది మార్చినెల వరకు అమెరికా సమాచారాన్ని చూస్తే జర్మనీ నుంచి 689 కోట్ల డాలర్లు, దక్షిణ కొరియా నుంచి 622 కోట్ల డాలర్ల విలువగల విద్యుత్‌ బాటరీల వాహనాలను కొనుగోలు చేసిన అమెరికా చైనా నుంచి దిగుమతి చేసుకున్నది కేవలం 38 కోట్ల డాలర్ల విలువగలవే అని ఒక పత్రిక పేర్కొన్నది. బైడెన్‌ నిర్ణయం ప్రకారం విద్యుత్‌ వాహనాలపై పన్ను 25 నుంచి 102.5శాతానికి పెరిగింది. బాటరీలు, వాటి విడి భాగాలపై 7.5శాతం నుంచి 50శాతం వరకు పెంచారు.నౌకల నుంచి సరకులను తీరానికి చేర్చే క్రేన్లపై ఇప్పటి వరకు పన్నులేదు, వాటి మీద 25శాతం, సిరంజ్‌లు, సూదులపై 50శాతం, రక్షణకు ఉపయోగించే వైద్య కిట్లపై 25శాతం విధించారు. రానున్న సంవత్సరాల్లో ఈ పన్నులు ఇంకా పెరుగుతాయి.ఈ పెరుగుదల అంతా అమెరికా వినియోగదారుల మీదనే భారం మోపుతుంది.చైనా అనుచిత వ్యాపారాన్ని అడ్డుకొనేందుకే ఈ చర్యలని అమెరికా సమర్ధించుకుంటున్నది. ద్రవ్యోల్బణాన్ని అరికట్టే సాకుతో దేశీయంగా తయారైన వాహనాల కొనుగోలుదార్లకు అమెరికా ప్రభుత్వం ఏడున్నరవేల డాలర్లు రాయితీ ఇస్తుంది. అయితే ఇటీవల అలాంటి వాహనాల్లో చైనా విడిభాగాలు ఏవైనా ఉంటే ఆ రాయితీ వర్తించదని ప్రకటించారు.


మధ్యలో ఒకటి రెండు సంవత్సరాలు మనదేశంతో వాణిజ్య లావాదేవీల్లో అమెరికా మొదటి స్థానంలోకి వచ్చింది. దాంతో మీడియాలో కొందరు ఇంకేముంది చైనాతో మనకు పనేముంది, సరఫరా గొలుసు నుంచి బయటపడ్డాం అన్నట్లుగా సంబరాన్ని ప్రకటించారు. కానీ తిరిగి చైనా మొదటి స్థానానికి వచ్చినట్లు తాజా సమాచారం వెల్లడించింది. ఇదంతా సరిహద్దు వివాదంలో చైనా సంగతి తేలుస్తాం, బుద్దిచెబుతాం అనే పటాటోపం మధ్యనే జరిగింది.2023-24 సంవత్సరంలో రెండు దేశాల వాణిజ్యం 11,840 కోట్లు కాగా అమెరికాతో 11,380 కోట్ల డాలర్లు ఉంది.కౌంటర్‌పాయింట్‌ అధ్యయనం ప్రకారం ఉత్పాదకతతో ముడిపెట్టిన ప్రోత్సాహకం(పిఎల్‌ఐ) పధకం ఉన్నప్పటికీ మనదేశంలో చైనా బ్రాండు ఫోన్లు గణనీయమార్కెట్‌ వాటాను కలిగి ఉన్నాయి.ఈ పధకం వలన ఆపిల్‌, శాంసంగ్‌ వంటి కంపెనీలు లబ్దిపొందినప్పటికీ మార్కెట్లో వాటి వాటా దానికి తగినట్లుగా పెరగలేదని హిందూ బిజినెస్‌లైన్‌ పత్రిక రాసింది. ఇతర బ్రాండ్లతో ఉత్పత్తి కాంట్రాక్టులు కుదుర్చుకోవటం, ఎగుమతులు తప్ప భారతీయ బ్రాండ్లకు రూపకల్పన, అభివృద్ధి జరగలేదు.ఫార్మారంగంలో కొన్నింటిని పిఎల్‌ఐ కారణంగా మనదేశంలోనే తయారు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ మన పరిశ్రమలు చైనా మీదనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. దిగుమతుల నిరోధానికి ఈ పధక చికిత్స పనిచేయలేదు. గతేడాది మనదేశం చేసుకున్న ఎలక్ట్రానిక్స్‌ దిగుమతుల్లో చైనా నుంచి 43.9శాతం ఉన్నాయి. కుండలో కూడు అలాగే ఉండాలి పిల్లాడు దుడ్డులా ఎదగాలి అంటే కుదరదన్న సామెత తెలిసిందే. గడచిన పది సంవత్సరాల్లో అన్నీ వేదాల్లోనే ఉన్నాయష బాపతు పెరిగింది తప్ప ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కోసం ప్రభుత్వం ఖర్చు చేయాలన్న జ్ఞానం పాలకులకు రాలేదు.గతమెంతో ఘనం అనే పిచ్చిలోనే కొట్టుకుంటున్నారు. జనాన్ని ముంచుతున్నారు. జిడిపిలో మనకంటే చైనా ఐదు రెట్లు పెద్దది. మనం 0.75శాతం పరిశోధనలకు ఖర్చు చేస్తుంటే అక్కడ 3.5శాతం ఉంది. దీని అర్ధం మనకంటే చైనాలో 25రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నారని ప్రొఫెసర్‌ అరుణకుమార్‌ వ్యాఖ్యానించారు.మన విశ్వవిద్యాలయాల్లో రాజకీయ, అధికార జోక్యం ఎక్కువగా ఉంది తప్ప పరిశోధన వాతావరణాన్ని సృష్టించలేదన్నారు. ఏవైనా నిధులు ఉంటే గోమూత్రం, పేడలో బంగారం, ఇతరంగా ఏమున్నాయో పరిశోధనలు చేయిస్తున్నారు.చైనా ఉత్పత్తులపై అమెరికా దిగుమతి సుంకం పెంపు పర్యవసానాలు మనదేశం మీద ఎలా ఉంటాయన్న చర్చ మొదలైంది. చైనా ఉత్పత్తులు కుప్పలు తెప్పలుగా మనదగ్గరకు వచ్చిపడతాయని, మన ఎగుమతి అవకాశాలు పెరగవన్నది ఒక అభిప్రాయం. అమెరికా, ఐరోపా యూనియన్‌ దిగుమతి పన్నులు పెంచటం, దిగుమతులను తగ్గిస్తున్న కారణంగా చైనా తన వాహనాలకు భారత్‌ ఇతర దేశాల మీద ఆధారపడుతుందని కొందరి అంచనా. ఈ అంశాలను ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నప్పటికీ నరేంద్రమోడీ చైనా నుంచి పెట్టుబడులు, దిగుమతులను పెంచేందుకు వీలుగా దిగుమతి పన్ను ఎందుకు తగ్గించారన్నది వారి ప్రశ్న. కార్పొరేట్ల లాభాల కోసం సంతుష్టీకరణ తప్ప మరొకటి కనిపించటం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చిలీలో మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం !

13 Wednesday Mar 2024

Posted by raomk in Current Affairs, History, imperialism, International

≈ Leave a comment

Tags

#latin american left, Anti communist, Chile communists, Gabriel Boric


ఎం కోటేశ్వరరావు


ప్రజాస్వామ్యాన్ని, ప్రజాభిప్రాయాన్ని ఏడు నిలువుల లోతున పాతిపెట్టిన చిలీ నియంత పినోచెట్‌ చచ్చి పద్దెనిమిదేండ్లు అవుతున్నా, వాడి వారసులు వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల పూర్వరంగంలో మరోసారి కమ్యూనిస్టుల మీద విరుచుకుపడుతున్నారు. చిలీలో ఆశ్రయం పొందిన వెనెజులా సోషలిస్టు వ్యతిరేక మిలిటరీ అధికారి ఒకడు ఇటీవల హతుడయ్యాడు. కమ్యూనిస్టులే చంపారంటూ చిలీ మీడియా,పినోచెట్‌ వారసులైన ప్రతిపక్ష పార్టీ కూటమి తప్పుడు ప్రచారం ప్రారంభించింది. కమ్యూనిస్టుల విశ్వసనీయత ప్రశ్నించరానిదని చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్‌ బోరిక్‌ బహిరంగంగా సమర్ధించాడు. వామపక్ష సంఘటన ప్రభుత్వంలో కమ్యూనిస్టు పార్టీ ఒక ప్రధాన భాగస్వామిగా ఉంది. పార్లమెంటులోని 155 స్థానాలకు గాను అధికార కూటమికి 37,దానికి మద్దతు ఇస్తున్న కూటమికి మరో 37 ఉన్నాయి.వాటిలో సోషలిస్టులకు 13, కమ్యూనిస్టు పార్టీ 12సీట్లతో ప్రధమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నాయి. లాటిన్‌ అమెరికాలో ఉన్న సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో మితవాద శక్తుల ప్రధాన ఆయుధం కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టటం ఒకటన్నది తెలిసిందే. అనేక దేశాల్లో నిరంకుశ, మితవాద శక్తులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సోషలిస్టులు, కమ్యూనిస్టులు అధికారానికి వస్తే క్రైస్తవమతానికి, ధనికుల ఉనికి ప్రశ్నార్ధకం అవుతుందనే ప్రచారం ఎప్పటి నుంచో చేస్తున్నారు. నాజీ గోబెల్స్‌ను మించి అవాస్తవాలను ప్రచారంలో పెడుతున్నారు.


2017లో వెనెజులా నుంచి పారిపోయి వచ్చి చిలీలో ఆశ్రయం పొందిన మిలిటరీ మాజీ అధికారి రోలాండ్‌ జెడాను కొద్ది రోజుల క్రితం కొందరు అపహరించి హత్యచేశారు. దీని వెనుక కమ్యూనిస్టులు ఉన్నారని, దేశంలో హింసాకాండ సృష్టికి కుట్రలు పన్నుతున్నారంటూ అనేక పత్రికలు, ప్రతిపక్ష మితవాద పక్షాలు ఎలాంటి ఆధారం లేకుండా ధ్వజమెత్తుతున్నాయి. జనంలో అనుమానాలు కలిగించేరీతిలో కథనాలు అల్లుతున్నాయి. ఈ శక్తులన్నీ నియంత పినోచెట్‌ హయాంలో కమ్యూనిస్టులు, సోషలిస్టులు, ఇతర ప్రజాస్వామిక వాదుల అణచివేత, అపహరణలను సమర్ధించినవే. మార్క్సిస్టు కాన్సర్‌ను అంతమొందించాలనే పేరుతో పినోచెట్‌ మిలిటరీ పాలకులు వేలాది మంది కమ్యూనిస్టులు, అభ్యుదయవాదులను హతమార్చారు, అనేక మంది జాడలేకుండా చేశారు. చిత్రహింసలు, జైళ్లపాలు సరేసరి. 1983లో కేవలం రెండు నెలల వ్యవధిలోనే 20 మంది కమ్యూనిస్టు నేతలను హత్యచేశారు. తరువాత ముగ్గురు నేతల నాలుకలను చీల్చి చిత్రహింసలకు గురిచేశారు. పినోచెట్‌ పాలనలో నాలుగువేల మంది అపహరణలకు గురయ్యారు. కనీసం ఇరవై వేల మంది పిల్లలను అపహరించి విదేశాల్లో చట్టవిరుద్ద దత్తతకు సహకరించారనే విమర్శలున్నాయి. వాటి గురించి దర్యాప్తు జరపాలని, నిజాల నిగ్గుతేల్చాలని కమ్యూనిస్టులు కోరుతున్నారు.


చిలీలో నియంతృత్వం ఉన్నకాలంలో కమ్యూనిస్టు పార్టీ అజ్ఞాతవాసంలోకి వెళ్లింది.ప్రజల తరఫున పోరాడేందుకు సాయుధ దళాలను ఏర్పాటు చేసింది. నియంతల పాలన అంతరించిన తరువాత కమ్యూనిస్టులు తిరిగి బహిరంగంగా పనిచేయటం ప్రారంభించారు.ప్రస్తుతం 46,023 మంది సభ్యులతో దేశంలో అతి పెద్ద పార్టీగా ఉంది. గత ఎన్నికల్లో కమ్యూనిస్టు అభ్యర్ధి బరిలో ఉంటారని అందరూ భావించారు. అయితే వామపక్ష కూటమిలోని పార్టీల అభిప్రాయం మేరకు గాబ్రియెల్‌ బోరిక్‌ పోటీ చేసి 2021ఎన్నికల్లో గెలిచారు. హతుడైన వెనెజులా మాజీ మిలిటరీ అధికారికి వెనెజులాలో అనేక మందిని హతమార్చిన చరిత్ర ఉంది. హత్యవెనుక వెనెజులా హస్తం ఉందని, దేశ అధ్యక్షుడు నికోలస్‌ మదురోను ఖండించటంలో గొంతుకలపాలని చిలీ మితవాద పార్టీలు చేసిన డిమాండ్‌ను కమ్యూనిస్టు పార్టీ తిరస్కరించింది. కమ్యూనిస్టుల మీద విషం చిమ్మటానికి ఇదొక కారణమని చిలీ మంత్రి, కమ్యూనిస్టు నేత గామిలా వలేజో చెప్పారు. పార్లమెంటులో ఉన్న బలంతో గాబ్రియెల్‌ బోరిక్‌ ప్రభుత్వానికి అనేక ఆటంకాలు కలిగిస్తున్న ప్రతిపక్షాలు కమ్యూనిస్టు పార్టీ మీద విషం చిమ్మటంలో ఆశ్చర్యం ఏముందని కమ్యూనిస్టు పార్టీ ఎంపీ, విద్యార్ధి సంఘమాజీ నాయకురాలు కరోల్‌ కారియోలా చెప్పారు.భాగస్వామ్య పక్షాల అవగాహన మేరకు పార్లమెంటు సభాధ్యక్ష స్థానాన్ని కమ్యూనిస్టులు చేపట్టనున్న పూర్వరంగంలో పార్టీ మీద దాడికి దిగినట్లు చెప్పారు.


అంతరంగంలో గూడు కట్టుకున్న కమ్యూనిస్టు వ్యతిరేకతను ప్రతిపక్షాలు వెల్లడిస్తున్నాయి.ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా వ్యక్తులు, సంస్థలు ఎవరిమీదనైనా భయంకరమైన ఆరోపణలు చేయగల సమర్ధత కలిగినవి.వాటి పర్యవసానాలు వాటికి పట్టదు.ఊహాజనితమైన ఆరోపణలు చేస్తున్నాయి. చరిత్రలో చిలీ కమ్యూనిస్టు పార్టీ ప్రజాస్వామిక నిబద్దతను ఎవరూ సందేహించాల్సిన అవసరం లేదు. అది ప్రారంభమైనప్పటి నుంచి అందరికీ తెలుసు. ప్రజాస్వామిక పోరాటాల్లో తమదైన ముద్రను వారు ఎప్పుడూ ప్రదర్శిస్తూనే ఉన్నారు.ప్రజాస్వామ్య పరిరక్షణను వారెన్నడూ వీడలేదు. ఆ క్రమంలో నిరంతరం భాగస్వాములుగానే ఉన్నారు. వ్యవస్థాపరమైన చట్రానికి అనుగుణంగా వారు సర్దుబాటు చేసుకొని నడుచుకుంటున్నారు.అందువల్లనే కమ్యూనిస్టుల మీద జరుపుతున్నదాడిని కాకమ్మ కథలుగా చూస్తున్నాను అని చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్‌ బోరిక్‌ చెప్పాడు. కమ్యూనిస్టులు న్యాయం, సమానత్వం, హక్కులకు అంకితమయ్యారు. కార్మికుల హక్కులను కాపాడేందుకు, ఆదర్శసమాజాన్ని ఏర్పాటు చేసేందుకు దేశంలో ఒక ప్రజాస్వామిక వ్యవస్థ ఉండాలని కోరుకుంటున్నారు. అన్ని రకాల వివక్ష, అణచివేతను నిర్మూలించాలన్నదే తమ లక్ష్యమని కూడా చెప్పారు.జనం, సమాజ కేంద్రంగా ఉండాలని, జీవితాలు మెరుగుపడాలని మేం కోరుతుండగా నయా ఉదారవాదం ప్రజలు, వారి హక్కుల కంటే పెట్టుబడికి పెద్ద పీటవేస్తున్నదని బోరిక్‌ చెప్పాడు. ప్రభుత్వ ఏర్పాటు ఒప్పందంలో భాగంగా ప్రజాప్రతినిధుల సభ అధ్యక్ష పదవిని కమ్యూనిస్టులకు అప్పగించాల్సి ఉంది. దానికి అనుగుణంగా నిర్ణయించామని, గౌరవిస్తామని అన్నాడు. ఆ పదవిలో ఎవరు అన్నది సమస్యే కాదు, పార్లమెంటులోని సహచరులందరూ సమర్ధులే, వ్యక్తులు దొరుకుతారా లేదా అన్నది కాదు, సమిష్టి నిర్ణయాలు ఉంటాయి గనుక ఎవరున్నా ఇబ్బంది ఉండదన్నాడు.


ప్రభుత్వం తలపెట్టిన సంస్కరణలకు సామాజిక ఉద్యమాల ద్వారా మద్దతు కూడగట్టాలని కమ్యూనిస్టు పార్టీ పిలుపు ఇవ్వటం పార్లమెంటులోని మితవాద శక్తులకు కంటగింపుగా మారింది.చిలీ పార్లమెంటులో ఇప్పుడున్న బలాబలాల ప్రకారం అధికారంలో ఉన్న కూటమి ప్రతిపాదించే విధానాలు ఓటింగ్‌లో వీగిపోయే అవకాశం ఉంది. చట్టాలు, విధానాలను రూపొందించాల్సిన బాధ్యత చట్టసభలది తప్ప సామాజిక మద్దతు పేరుతో వత్తిడి తేవటం ఏమిటని మితవాదశక్తులు, వాటికి మద్దతుగా ఉన్న మీడియా,వాదిస్తున్నాయి. అందులో తప్పేం ఉందని అధ్యక్షుడు బోరిక్‌ ప్రశ్నించాడు. ఆ ఉద్యమాలు ప్రజా ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించినట్లయితే ఆహ్వానించాల్సిందే అన్నాడు. అబార్షన్‌ మీద చేసిన చట్టం వెనుక మహిళా ఉద్యమాల సమీకరణ లేదా అని ప్రశ్నించాడు. విద్యార్ధి ఉద్యమం ఉచిత విద్య కోసం పోరాడిందని, నూతన రాజ్యాంగం సామాజిక ఉద్యమాలను ప్రోత్సహిస్తున్నదని, ప్రజాస్వామిక పద్దతుల్లో సామాజిక చర్చ జరగాలన్నాడు.వామపక్ష శక్తులు అధికారానికి వచ్చిన తరువాత ప్రతిపాదించిన ప్రజానుకూల సంస్కరణలను ముందుకు తీసుకు వెళ్లలేని వాస్తవ పరిస్థితి పార్లమెంటులో ఉంది. దానిలో భాగంగానే ధనికుల నుంచి పన్నువసూళ్లను పెంచే ప్రతిపాదన పార్లమెంటుముందుంచగా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి.కార్పొరేట్‌, ధనికులకు మద్దతుగా నిలిచాయి. పెన్షన్ల పెంపు, పెన్షన్‌ హామీ, సంరక్షణ వంటి పధకాలకు అవసరమైన నిధులను సేకరించేందుకు కలిగిన వారి మీద పన్ను పెంచాలని వామపక్ష ప్రభుత్వం ప్రతిపాదించింది.దాన్ని అడ్డుకోవటం అంటే పౌరుల సామాజిక హక్కుల మీద దాడి చేయటమే. అందుకే అలాంటి పార్టీల మీద వత్తిడి తేవాలంటే పార్లమెంటుతో పాటు వెలుపల ప్రజా ఉద్యమాలను నడపాలని కమ్యూనిస్టు పార్టీ కోరింది. దీని మీద ఆగ్రహిస్తున్న మీడియా వెనెజులా మిలిటరీ మాజీ అధికారి హత్యను సాకుగా తీసుకొని కమ్యూనిస్టుల మీద తప్పుడు ఆరోపణలతో దాడికి దిగింది.


గతంలో ఎన్నడూ లేనంత భయం, విపరీత కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచార నేపధ్యంలో 2021 డిసెంబరు 19న జరిగిన చిలీ మలి విడత అధ్యక్ష ఎన్నికలలో వామపక్ష కూటమి అభ్యర్ధి గాబ్రియెల్‌ బోరిక్‌ ఘనవిజయం సాధించాడు.నవంబరు 21న జరిగిన ఎన్నికలలో క్రిస్టియన్‌ సోషల్‌ ఫ్రంట్‌ అభ్యర్ధి జోస్‌ ఆంటోనియో కాస్ట్‌ 27.92 శాతం ఓట్లతో ప్రధమ స్దానంలో ఉండగా బోరిక్‌ 25.82శాతం ఓట్లు తెచ్చుకున్నాడు. డిసెంబరు 19న తుది పోటీ జరిగింది. బోరిక్‌ 55.87శాతం, కాస్ట్‌ 44.13శాతం ఓట్లు తెచ్చుకున్నాడు. నయా ఉదారవాద తొలి ప్రయోగశాల లాటిన్‌ అమెరికా కాగా, దానిలో చిలీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందుకే అక్కడి యువత నయా ఉదారవాదం పుట్టింది ఇక్కడే దానికి గోరీ కట్టేది ఇక్కడే అనే నినాదంతో ఉద్యమించింది, దానికి బోరిక్‌ రూపంలో విజయం లభించింది. పదేండ్ల క్రితం విద్యార్ధి ఉద్యమం ముందుకు తెచ్చిన నేతలలో బోరిక్‌ ఒకడు, 2014 నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు.
1973లో సోషలిస్టు పార్టీ నేత (మార్క్సిజం-లెనినిజానికి కట్టుబడిన) సాల్వెడార్‌ అలెండీ ప్రభుత్వంపై జరిగిన కుట్రలో భాగంగా మిలిటరీ, పోలీసు తిరుగుబాటు చేసింది. దాన్ని ప్రతిఘటించేందుకు ఆయుధం పట్టిన అలెండీని కుట్రదారులు కాల్చి చంపారు. అయితే ప్రాణాలతో మిలిటరీకి పట్టుబడటం ఇష్టం లేక ఆత్మహత్యచేసుకున్నట్లు 2011లో కోర్టు ప్రకటించింది. ఈ కథను ఎవరూ నమ్మకపోయినా తాము విశ్వసిస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పటంతో ఆ కేసు విచారణ ముగించారు. అలెండీ మీద తిరుగుబాటు చేసిన జనరల్‌ పినోచెట్‌ తరువాత పగ్గాలు చేపట్టి నయాఉదారవాద విధానాలను జనం మీద రుద్దాడు.1973 నుంచి 1990వరకు నియంతగా పాలించాడు. తరువాత పౌరపాలన పునరుద్దరణ జరిగింది.

మధ్యలో రెండు సార్లు గతంలో అలెండీ నాయకత్వం వహించిన సోషలిస్టు పార్టీకి చెందిన మిచెల్లీ బాచలెట్‌ అధికారానికి వచ్చినప్పటికి మిగతావారి మాదిరే మొత్తం మీద నయా ఉదారవాద విధానాలనే కొనసాగించారు. సాధారణంగా తొలిదఫా ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ రాకున్నప్పటికీ ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న పార్టీ అంతిమ పోటీలో గెలుస్తుంది. చిలీలో దానికి భిన్నంగా రెండవ స్ధానంలో వచ్చిన బోరిక్‌ ఘనవిజయం సాధించాడు. మితవాద శక్తులన్నీ ఒకవైపు, వారిని ప్రతిఘటించే పురోగామి, ఉదారవాదులందరూ మరోవైపు సమీకరణయ్యారు.ఈ క్రమంలో బోరిక్‌ను ఎన్నుకుంటే కమ్యూనిస్టు ప్రమాదం వస్తుందని, దేశం మరొక వెనెజులాగా మారిపోతుందనే ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. సామాజిక, మతపరమైన అంశాలను కూడా ముందుకు తెచ్చారు. భయం మీద ఆశ విజయం సాధించిందని, ఒక పద్దతి ప్రకారం కమ్యూనిస్టునిస్టు వ్యతిరేక విష ప్రయోగాన్ని కూడా జనం అధిగమించారని బోరిక్‌ తన విజయ సందేశంలో చెప్పాడు. పార్లమెంటు దిగువ సభ డిప్యూటీల ఛాంబర్‌లో దామాషా ప్రాతిపదికన 155 స్ధానాలకు గాను వామపక్ష కూటమి పార్టీలకు వచ్చింది 37 మాత్రమే. ఎగువ సభలోని 50 స్దానాలకు గాను వామపక్షాలకు ఐదు, స్వతంత్రులు ఇద్దరు, మిగిలిన 43మితవాద పార్టీలకే వచ్చాయి. వామపక్షాలలో ప్రధాన పార్టీగా ఉన్న కమ్యూనిస్టులు గతంలో ఉన్నఎనిమిదింటిని 12కు పెంచుకున్నారు, ఎగువ సభలో కొత్తగా రెండు స్దానాలను గెలుచుకున్నారు. నూతన రాజ్యాంగ ప్రతిపాదనపై 2022లో జరిగిన ఓటింగ్‌ తిరస్కరణకు గురైంది. దాన్ని వామపక్ష వాదులు ప్రతిపాదించినట్లు ప్రచారం చేశారు. తరువాత 2023డిసెంబరులో రెండవ రాజ్యాంగం గురించి జరిగిన ఓటింగ్‌లో మరోసారి తిరస్కరణకు గురైంది. దానిలో మితవాద ముద్ర ఉండటంతో వామపక్ష శక్తులు వ్యతిరేకించాయి. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలు, నూతన రాజ్యాంగం వంటి అంశాలలో మితవాద శక్తులు ఇప్పటి నుంచే వామపక్షాలను దెబ్బతీసేందుకు పూనుకున్నాయి. దానిలో భాగంగానే పెద్ద పార్టీగా ఉన్న కమ్యూనిస్టులపై తప్పుడు ప్రచారం ప్రారంభించినట్లు కనిపిస్తోంది. వాటిని వామపక్షాలు ఎలా ఎదుర్కొంటాయన్నది ఆసక్తిగా మారింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అర్జెంటీనా అధ్యక్షుడిగా పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకి !

22 Wednesday Nov 2023

Posted by raomk in COUNTRIES, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Latin America, Opinion

≈ Leave a comment

Tags

#latin american left, Anti communist, Argentina presidential election 2023, Donald trump, Javier Milei, Joe Biden


ఎం కోటేశ్వరరావు


ఆదివారం నాడు జరిగిన అర్జెంటీనా అధ్యక్ష తుది ఎన్నికల్లో పచ్చి మితవాది జేవియర్‌ మిలై విజయం సాధించాడు. వామపక్షాల మద్దతు ఉన్న అధికార పెరోనిస్టు పార్టీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి, కూటమి అభ్యర్థి సెర్గియో మాసాకు 44శాతం ఓట్లు రాగా మిలై 56శాతం తెచ్చుకున్నాడు.డిసెంబరు పదవ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నాడు. మార్కెట్‌ అనుకూల మిలై వాగాడంబరానికి మితవాద శక్తులు, అసంతృప్తి చెందిన యువతరం అధికార కూటమికి వ్యతిరేకంగా ఓటు చేసినట్లు కనిపిస్తోంది. ఒక అరాచక కాపిటలిస్టునని తన గురించి మిలై స్వయంగా చెప్పుకున్నాడు. ఎన్నికల ఫలితాలు వెలుబడగానే పెట్టుబడిదారులు సంబరాలు జరుపుకున్నారు. బాండ్ల రేట్లు పెరిగాయి.నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే అధ్యక్ష ఎన్నికలలో అంతకు ముందు అధికారంలో ఉన్న మితవాద శక్తులను ఓడించి 2019లో పెరోనిస్టు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.2015 నుంచి 2019వరకు మితవాద శక్తులు అధికారంలో ఉన్నాయి. వాటి వైఫల్యంతో అంతకు ముందు అధికారంలో ఉన్న పెరోనిస్టు కూటమికి జనం తిరిగి పట్టం కట్టారు. కరోనా సమయంలో విధించిన లాక్‌డౌన్‌, మరింత దిగజారిన ఆర్ధిక వ్యవస్థ కారణంగా జనంలో ప్రభుత్వం మీద అసంతృప్తి తలెత్తింది.జనాభాలో45శాతం మంది దారిద్య్రరేఖకు దిగువ ఉన్నట్లు అంచనా. వందశాతం దాటిన ద్రవ్యోల్బణం అదుపులేదు. కరెన్సీ పెసో విలువ దిగజారింది.గడచిన పదకొండు సంవత్సరాలలో ఏడు సార్లు వృద్ది రేటు తిరోగమనంలో నమోదైంది. ఈ ఏడాది మాంద్యంలోకి జారవచ్చని ఐఎంఎఫ్‌ జోశ్యం చెప్పింది. ఈ పూర్వరంగంలో పెరోనిస్టు కూటమి ఓడింది.


కరోనా, ఇతర వైఫల్యాల కారణంగా తలెత్తిన పరిస్థితిని ఉపయోగించుకొని జేవియర్‌ మిలై 2021 పార్లమెంటు ఎన్నికల్లో కొత్త పార్టీతో రంగంలోకి దిగాడు. వాస్తవ ప్రతిపాదనలతో ముందుకు వచ్చిన అభ్యర్ధిని తాను మాత్రమేనని మిలై చెప్పాడు. అతగాడికి కుక్కలంటే పిచ్చి. వాటి భాషలో మాట్లాడతాడు. ఎన్నికలకు ముందు ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రికతో మాట్లాడుతూ ద్రవ్యోల్బణాన్ని తగ్గించటం గురించి ఆలోచిస్తున్నానని, అందుకుగాను తన దగ్గర ఐదు కుక్కలున్నాయని, అవి పది లేదా ఇరవై కూడా కావచ్చు అని చెప్పాడు. వాటిని వదిలితే తగ్గుతుందన్నాడు. మిలై దృష్టిలో కుక్కలంటే రాజ్యాన్ని పక్కన పెట్టి మొత్తం వ్యవస్థను పెట్టుబడిదారులకు అప్పగించాలని ప్రబోధించే ప్రముఖులు. ఆర్థిక సమస్యలను పరిష్కరించటానికి రాజ్యం ఒక పరిష్కారం కాదు, అదే అసలు సమస్య అని కూడా చెప్పాడు. ఐరోపా సంతతితో ఏర్పడిన అర్జెంటీనా గత శతాబ్ది తొలి రోజుల్లో సంపద్వంతంగా ఉండేదని, ప్రస్తుత దురవస్థకు ప్రభుత్వాల వైఫల్యమే కారణమనేందుకు ఉదాహరణగా ఉందన్నాడు. దేశంలోని మొత్తం రాజకీయ తరగతి అంతా దొంగలని, పన్నులు విధించాలని కోరటం హింసాత్మక చర్య అన్నాడు. ఇతగాడి నోటి దురుసుతనంతో అసంతృప్తితో ఉన్న జనం మద్దతుదారులుగా మారవచ్చు, ఓట్లు వేయవచ్చు, నిజంగా అధికారం వస్తే ఎలా పాలిస్తాడో ఏ తిప్పలు తెచ్చిపెడతాడో అన్న భయాన్ని వెల్లడించిన వారు కూడా ఉన్నారు.చివరకు అదే నిజమైంది. అర్జెంటీనాలో నాలుగు సంవత్సరాలకు ఒకసారి అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. పార్లమెంటు ఉభయ సభలకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి దిగువ సభలో సగం సీట్లకు, ఎగువ సభలో మూడోవంతు సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. పార్లమెంటు రద్దు కాదు. ఒకసారి ఎన్నికైన వారు ఎగువ సభలో ఆరు సంవత్సరాలు, దిగువ సభలో నాలుగేండ్లు ఉంటారు.ప్రజాప్రతినిధుల దిగువ సభలో రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన సీట్లు ఖరారు చేస్తారు. అధ్యక్ష ఎన్నికలు రెండు లేదా మూడుదశల్లో జరుగుతాయి.


ప్రాధమిక ఎన్నికల్లోనే అర్జెంటీనాకు పచ్చి మితవాద శక్తుల ముప్పు ముంచుకువస్తున్నట్లు వెల్లడైంది. ఫలితాలు అనేక మందిని దిగ్భ్రాంతికి గురి చేశాయి. కొత్త రాజకీయ చర్చకు తెరతీశాయి. ఆ ఎన్నికల్లో స్వేచ్చతో ముందుకు (లిబర్టీ అడ్వాన్సెస్‌) పార్టీ నేతగా జేవియర్‌ మిలై అగ్రస్థానంలో నిలిచాడు. దేశంలోని 24 ప్రావిన్సులలో పదహారు చోట్ల ఆధిక్యత కనపరిచాడు.మిలైకు 30.04శాతం, మరో మితవాద పార్టీకి 28.28శాతం, ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రజాతంత్ర, వామపక్ష కూటమికి 27.27శాతం ఓట్లు వచ్చాయి.తొలి దఫా ఓటింగ్‌ 45శాతంపైగా తెచ్చుకున్నవారు ఒకరే ఉంటే సదరు అభ్యర్ధితో పాటు ఉపాధ్యక్షపదవికి పోటీ చేసిన అభ్యర్ధి కూడా నెగ్గినట్లు ప్రకటిస్తారు. అలాగాక 40శాతం తెచ్చుకున్నప్పటికీ విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే రెండవ స్థానంలో ఉన్న అభ్యర్ధికి మొదటి స్థానంలో ఉన్నవారికి తేడా పదిశాతం కంటే ఎక్కువ ఉండాలి. ఒక వేళ ఇద్దరికి 45శాతానికి మించి ఓట్లు వచ్చినా లేక 40శాతం నిబంధన ప్రకారం ఎవరూ నెగ్గకున్నా, ఎక్కువ ఓట్లు వచ్చిన తొలి ఇద్దరి మధ్య రెండవ దఫా ఎన్నిక జరిపి విజేతను ప్రకటిస్తారు. పదహారు సంవత్సరాలకే ఓటింగ్‌ హక్కు ఇచ్చినప్పటికీ 18-70 సంవత్సరాల వయస్సులో ఉన్న వారు విధిగా ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రాధమిక ఎన్నికలలో విధిగా ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. అక్టోబరు 22న జరిగిన తొలి దఫా ఎన్నికల్లో ఐదుగురు పోటీ చేశారు. వారిలో పెరోనిస్టు మెసాకు 36.78శాతం, మిలైకి 29.99శాతం, మూడో అభ్యర్ధికి 23.81 శాతం రాగా మిగిలిన ఇద్దరికీ కలిపి 9.43శాతం వచ్చాయి. దీంతో నవంబరు19న తుది దఫా మెసా-మిలై మధ్య పోటీ జరిగింది.


ప్రాధమిక ఎన్నికల్లో మొదటి స్థానంలో ఉన్నట్లు ఫలితాలు వెల్లడి కావటంతో మిలై తన మద్దతుదారులతో మాట్లాడుతూ సంబరాలు చేసుకున్నాడు.రాజకీయ నేతలు మారకపోతే వారిని వదిలించుకోవాలని పిలుపునిచ్చాడు. ప్రస్తుత అధ్యక్షుడు ఆల్బర్టో ఫెర్నాండెజ్‌ చైనాను అనుమతించి కొన్ని కీలకరంగాలను అప్పగించాడని ఆరోపించాడు. తాను చైనాతో సంబంధాలను తెంచివేస్తానని, కమ్యూనిస్టులతో వ్యాపారం చేయనని అన్నాడు. కమ్యూనిజం ఒక హంతక వ్యవస్థ, సోషలిజం ఆత్మకు పట్టిన జబ్బు అన్నాడు. తాను అధికారానికి వచ్చిన తరువాత దేశ రిజర్వుబాంకును రద్దు చేస్తానని, ప్రభుత్వ ఖర్చు కోత పెడతానని, పతనమౌతున్న దేశ కరెన్సీ పెసోను రద్దు చేసి కొన్ని దేశాల మాదిరి అమెరికా డాలరును చట్టబద్దమైన కరెన్సీగా ప్రకటిస్తానని చెప్పాడు. విధిగా పాఠశాలల్లో లైంగిక విద్య బోధన జరపాలన్న గత ప్రభుత్వ చట్టాన్ని రద్దు చేస్తానని అన్నాడు.అర్జెంటీనా ఎన్నికలు ఒక్క లాటిన్‌ అమెరికాకే కాదు, మొత్తం ప్రపంచానికే ఆసక్తికరంగా మారాయని చెప్పవచ్చు.


లాటిన్‌ అమెరికాను అమెరికా సామ్రాజ్యవాదం తన పెరటి తోటగా పరిగణించింది. తనకు లోబడిన వారిని గద్దె నెక్కించటం వీలుగాకపోతే మిలిటరీ నియంతలను రంగంలో తెచ్చింది. ఇదే సమయంలో ప్రపంచబాంకు, ఐఎంఎఫ్‌ విధానాలను ఆ దేశాల మీద రుద్దారు. అవి వికటించటం, అనేక దేశాల్లో నియంతలు, మితవాద పాలకులకు వ్యతిరేకంగా వామపక్ష శక్తులు పార్లమెంటరీ పోరాటంతో పాటు ఆయుధాలు కూడా పట్టి జనాన్ని సమీకరించారు. దివాలా కోరు ఆర్థిక విధానాలతో పాలకులు ప్రజల నుంచి దూరం కావటం, ప్రతిఘటన తీవ్రమైన తరుణంలో విధిలేక ఎన్నికలు జరపటం వాటిలో నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన అనేక మంది ఒక్కటిగా నిలవటంతో వామపక్ష శక్తులు అధికారానికి వచ్చాయి. వాటికి మద్దతు ఇచ్చిన వారందరూ సోషలిజం, కమ్యూనిజాలకు మద్దతుదార్లు కాదు. నిరంకుశ వ్యతిరేక పోరాటంలో విశాల వేదికల్లో కలసి వచ్చినవారు ఎందరో ఉన్నారు. ప్రజలకు మేలు చేయాలనే వైఖరిని బలపరిచారు.దోపిడీ వ్యవస్థ పునాదులను కూలిస్తే తప్ప జనజీవితాల్లో మౌలిక మార్పులు రావనే అంశాన్ని గుర్తించటంలో, అమలు జరపటంలో ఏకాభిప్రాయం లేదు. అందువల్లనే అధికారానికి వచ్చినచోట వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు గత పునాదులను అలాగే ఉంచి వాటి మీదనే సామాన్య జనానికి ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవటంతో వరుసగా రెండు, మూడు సార్లు గెలుస్తూ వచ్చారు. అయితే వాటికి ఉన్న పరిమితులు వెల్లడి కావటంతో జనంలో తలెత్తిన అసంతృప్తి కారణంగా తిరిగి మితవాద శక్తులు తలెత్తుతున్నాయి.బ్రెజిల్లో, మరికొన్ని చోట్ల అదే జరిగింది. కొన్ని చోట్ల వామపక్షం పేరుతో గెలిచిన వారు మితవాద శక్తులతో చేతులు కలిపారు.


గతంలో మాదిరి నియంతలను రుద్దితే లాభం లేదని గుర్తించిన అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను దెబ్బతీసేందుకు మితవాద శక్తులకు మద్దతు ఇస్తున్నాయి.ఎన్నికల్లో గెలిచినప్పటికీ పెట్టుబడిదారీ, కార్పొరేట్‌ అనుకూల విధానాల కారణంగా అసంతృప్తి తలెత్తి తిరిగి జనం వామపక్షాలకు పట్టంగడుతున్నారు. బ్రెజిల్లో లూలా అదే విధంగా మరోసారి గెలిచాడు. అర్జెంటీనాలోగత ఎన్నికల్లో జరిగింది అదే.ప్రజాతంత్ర, వామపక్ష శక్తులు మౌలిక విధానాల మార్పుల జోలికి పోని కారణంగా జన జీవితాల్లో పెద్ద మార్పులు రాలేదు. అర్జెంటీనాలో ప్రస్తుతం 45శాతం జనం దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. వార్షిక ద్రవ్యోల్బణం 143 శాతానికి చేరింది. ప్రభుత్వం వద్ద నగదు నిల్వలు లేవు. దశాబ్దికాలంగా జిడిపి ఎదుగూ బొదుగూ లేకుండా ఉంది.కరెన్సీ విలువ పతనమైంది. అప్పుల మీదనే దేశం నడుస్తోంది. ఈ కారణంగానే మితవాద ఆర్థికవేత్త కూడా అయిన మిలై చేసిన సైద్దాంతికపరమైన దాడికి నూతన తరం ఆకర్షితమైనట్లు కనిపిస్తోంది. ఇప్పుడున్న వాటన్నింటినీ రద్దు చేసి మొత్తం బాధ్యత అంతటినీ మార్కెట్‌ శక్తులకు వదలి వేస్తే అవే సమస్యలను పరిష్కరిస్తాయంటూ అరచేతిలో స్వర్గం చూపుతున్నాడు. డోనాల్డ్‌ ట్రంప్‌, బ్రెజిల్‌ మితవాది బోల్సనారో బాటలో తాను దేశాన్ని నడిపి ఫలితాలను చూపుతానని నమ్మబలికాడు. ఏ ప్రభుత్వమైతే పెద్ద ఎత్తున సబ్సిడీలు, నగదు బదిలీ చేసిందో ఆ లబ్ది పొందిన పేదలు కూడా దానికి వ్యతిరేకంగా మితవాద మిలైకి ఓటువేసినట్లు స్పష్టమైంది. మితవాద మిలై విప్లవాత్మక మార్పులను నిజంగా తెస్తాడని, మరొక మార్గం లేదని జనం భ్రమలకు గురైనట్లు పరిశీలకులు భావిస్తున్నారు. నయా ఉదారవాద విధానాలకు శస్త్ర చికిత్స తప్ప పై పూతలతో దాన్ని సంస్కరించి ప్రజానుకూలంగా మార్చలేరన్నది గ్రహించాల్సి ఉంది. జనంలో ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకొని గద్దె నెక్కినప్పటికీ జేవియర్‌ మిలై తాను ప్రకటించిన అరాచక పెట్టుబడిదారీ విధానాలను అమలు జరపటం అంత తేలిక కాదు. 2021లో జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాల తరువాత 257 స్థానాలకు గాను పెరోనిస్టు కూటమికి 118,వర్కర్స్‌ లెఫ్ట్‌ ఫ్రంట్‌కు నాలుగు మినహా మిగిలిన సీట్లన్నింటిలో మితవాద పార్టీల కూటమికి 116, ఇతర మితవాద పార్టీలు, స్వతంత్రులు కలిపితే మెజారిటీ ఉన్నారు. అనేక దేశాల్లో అధికారానికి వచ్చిన మితవాదులు తొలుత తమ దాడిని కార్మికుల మీదనే ప్రారంభించిన నేపధ్యంలో మిలై ఆచరణ కూడా దానికి భిన్నంగా ఉంటుందని భావించలేము. అదే జరిగితే వెంటనే ప్రజా ప్రతిఘటన కూడా ప్రారంభం అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d