• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: European Union

చైనా మీద కోపం, కట్టడి పేరుతో మనం చేతులు కాల్చుకోవాలా ?

22 Friday Jul 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, China’s dominance, European Union, FTA, India-EU ties, Narendra Modi Failures, RSS, Trade talks


ఎం కోటేశ్వరరావు


” నవంబరులో షీ జింపింగ్‌తో భేటీకి ఐరోపా నేతలింకా తేల్చుకోలేదు – భారత్‌కు అవకాశాన్ని అందిపుచ్చుకొనే తరుణమిది ” తాజాగా ఒక విశ్లేషణకు పెట్టిన శీర్షిక ఇది. ” తొమ్మిది సంవత్సరాల తరువాత భారత్‌ – ఐరోపా సమాఖ్య వాణిజ్య చర్చల పునరుద్దరణ వెనుక ” అసాధారణ అత్యవసరం ” ముందుకు నెట్టి ఉండవచ్చు ” అన్నది మరొక విశ్లేషణ శీర్షిక. ఏం జరుగుతోంది ? ఒక వైపు ప్రపంచ వాణిజ్య సంస్థలో అన్ని దేశాలకూ సభ్యత్వం ఉంది. దాన్ని పక్కన పెట్టి స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది ? గతంలో మన దేశం కుదుర్చుకున్న ఒప్పందాల సారాంశాన్ని చెప్పాల్సి వస్తే సాఫ్టా( దక్షిణాసియా దేశాల స్వేచ్చా వాణిజ్య ఒప్పందం)తో మాత్రమే మన దేశం లబ్దిపొందింది. మిగతావాటితో మన ఎగుమతులు పెరిగిందేమీ లేకపోగా దిగుమతులు ఎక్కువగా జరిగాయి. అందువలన మరోసారి ఒప్పందాలతో చేతులు కాల్చుకొనేందుకు సిద్దపడుతున్నామా ? గతం కంటే నరేంద్రమోడీ హయాంలో దేశ పరిస్థితి మెరుగుపడిందంటూ మనకు అనుకూలంగా ఉందని చెబుతారా ? అదే నిజం అనుకుంటే మన దిగుమతులు ఎందుకు తగ్గలేదు, ఎగుమతులు ఎందుకు పెరగలేదు ? ఉనికిలో ఉన్న ఒప్పందాలనే ఉపయోగించుకోవచ్చు కదా !


కరోనా కారణంగా కొన్ని కుదుపులు, వృద్ధి రేటు తగ్గినప్పటికీ చైనా కడుపు నిండిన స్థితిలో ఉంది. కనుక మనల్ని లేదా మరొక దేశాన్ని చూసి పశ్చిమ దేశాలు చైనాను వదలి మనవెంటపడతాయని భ్రమించకూడదు. కఠినమైన కరోనా లాక్‌డౌన్‌ కారణంగా తొలి అంచనా 5.5శాతాన్ని అందుకోకపోవచ్చుగానీ జిడిపి పురోగమనం మూడు- నాలుగుశాతం మధ్య ఉంటుందని వార్తలు. అమెరికాతో సహా అనేక దేశాలు ఇప్పటికీ చైనా సరఫరాల మీద ఆధారపడుతున్నాయి. చైనాకు జలుబు చేస్తే మిగతా దేశాలు చీదాల్సిన పరిస్థితి ఏర్పడింది. హాంకాంగ్‌ ఎక్సేంజస్‌, క్లియరింగ్‌(హెచ్‌కెఇఎక్స్‌) సిఇఓ నికోలస్‌ అగుజిన్‌ ఇటీవల లోహాల గురించి జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ 45 -57శాతం ప్రపంచ లోహ వినియోగం చైనాలో జరుగుతోందని,2021 ప్రపంచ ఉత్పత్తిలో 35 నుంచి 55శాతం వరకు లోహాలను చైనాలో శుద్ది చేస్తున్నట్లు చెప్పారు. అందువల్లనే చైనాలో మందగిస్తే అది ప్రపంచానికి మాంద్యం, ద్రవ్యోల్బణానికి కారణం అవుతుందని అన్నారు.


పశ్చిమ దేశాలు మానవహక్కుల గురించి శుద్దులు చెబుతూ తమ దగ్గరకు వచ్చే సరికి వాటిని హరించే దేశాలు, వాటి నేతలతో చెట్టపట్టాలు వేసుకొనే మోసకారితనాన్ని చూస్తున్నాం. మన దేశంలోని కొన్ని శక్తులు వాటి బాటనే నడుస్తున్నాయి. సరిహద్దు వివాదాన్ని చూపి ఇప్పటికీ ఒక వైపు చైనా వ్యతిరేకతను రెచ్చగొడుతూనే ఉన్నారు. మరో వైపు అక్కడి నుంచి దిగుమతుల్లో నరేంద్రమోడీ సర్కార్‌ రికార్డులను సృష్టిస్తున్నది. ఇది జనాన్ని మోసం చేయటం కాదా ? వరుసగా రెండవ సంవత్సరం కూడా వంద బిలియన్‌ డాలర్లకు పైగా లావాదేవీలు నమోదు కానున్నాయి. జనవరి నుంచి జూన్‌ ఆరు నెలల కాలంలో 67.08 బి.డాలర్లు జరిగింది. దీనిలో మన దిగుమతులు గతేడాది కంటే 34.5శాతం పెరిగి 57.51 బి.డాలర్లకు చేరాయి. మన ఎగుమతులు 35.3శాతం తగ్గినట్లు చైనా కస్టమ్స్‌ శాఖ ప్రకటించింది. మన వాణిజ్యలోటు 47.94 బి.డాలర్లు. గతేడాది 125బి.డాలర్ల లావాదేవీలు జరగ్గా తొలి ఆరునెలల తీరుతెన్నులను బట్టి చూస్తే అంతకంటే పెరగటం తప్ప తగ్గే పరిస్థితి కనిపించటం లేదు. గతేడాది మన ఎగుమతులు 28.14 బి.డాలర్లు కాగా చైనా నుంచి దిగుమతులు 97.52 బి.డాలర్లు. రెండు దేశాలూ లెక్కించే పద్దతిలో తేడాలు ఉన్నందున మన దేశం ప్రకటించే అంకెలు భిన్నంగా ఉండవచ్చు గానీ ధోరణి తెలుస్తున్నది. చైనా మొత్తం విదేశీ వస్తు వాణిజ్య ఆరునెలల్లో 2.94 లక్షల కోట్ల డాలర్లు.


” ప్రభుత్వం స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేయదు ” అనే శీర్షికతో 2020 నవంబరు 17న ఒక వార్తను టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రచురించింది. గతంలో చేసుకున్న ఒప్పందాలతో సబ్సిడీలతో కూడిన వస్తువులను మన దేశంలోకి అనుమతించారని, నష్టం జరిగిందని విదేశాంగ మంత్రి జై శంకర్‌ విమర్శించినట్లు, ఒప్పందాలను కుదుర్చుకోబోమని కూడా చెప్పినట్లు ఆ వార్తలో పేర్కొన్నారు. అదే ప్రభుత్వం ఇప్పుడు అలాంటి ఒప్పందాలకు ఉత్సాహపడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతలోనే మార్పుకు కారణం ఏమిటి ? చైనాను ఒక బూచిగా చూపే దేశాలతో ఇటీవలి కాలంలో మన దేశ సంబంధాలు పెరిగిన కారణంగానే చైనాను అడ్డుకొనేందుకు ఒక మార్గంగా వాణిజ్య ఒప్పందాల కోసం తొందర పడుతున్నట్లు కొందరు చెబుతున్నదాన్ని తోసిపుచ్చగలమా ? 2014-15లో మన వాణిజ్యలోటు 118.37 బిలియన్‌ డాలర్లు ఉండగా 2021-22కి అది 192 బి.డాలర్లకు పెరిగింది. వర్తమాన సంవత్సర తీరు తెన్నులను చూస్తే 250కి పెరగవచ్చు. మన దేశం కుదుర్చుకున్న ఒప్పందాలు మనకు లబ్దిచేకూర్చలేదనేందుకు ఇది ఒక సూచిక.కర్ర ఉన్నవాడిదే గొర్రె అన్నట్లుగా బలమైన దేశాలే లబ్ది పొందుతాయి. సాప్టా ఒప్పందంతో మనకు లబ్ది, వాణిజ్య మిగులు కలిగిందంటే దానిలో ఉన్న దేశాల్లో మనది బలమైనది కావటమే. ఆసియన్‌ దేశాలతో ఉన్న ఒప్పందాల కారణంగా 2009-10లో మన వాణిజ్యలోటు ఎనిమిది బిలియన్‌ డాలర్లుండగా 2018-19నాటికి అది 22 బి.డాలర్లకు పెరిగింది.


స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలతో మన జిడిపి ఐదు లక్షల కోట్ల డాలర్లకు సులభంగా చేరుతుందని కొందరు నరేంద్రమోడీ సర్కార్‌కు బిస్కెట్లు వేస్తున్నారు. వాటి వలన విదేశాల నుంచి సరకులను మన మార్కెట్లో గుమ్మరిస్తే ఇక్కడి పరిశ్రమలు, వ్యవసాయ రంగం దెబ్బతింటుంది. తనను మింగేస్తుందనే భయంతోనే అమెజాన్‌ కంపెనీ విస్తరణను అంబానీ అడ్డుకోవటాన్ని చూస్తున్నాము. జర్మనీ కంపెనీ మెట్రో కూడా తన బిజినెస్‌ను ఎవరికో ఒకరికి అమ్మేసి తనదారి తాను చూసుకోవాలని చూస్తోంది. అందువలన చైనా మీద కోపంతో ఇతర ధనికదేశాలతో ఒప్పందాలు చేసుకుంటే మన చేతులు మరింతగా కాలుతాయి. అందుకే ఆర్‌సిఇపిలో చేరేందుకు మనం వెనుకడుగువేశాము. మన దేశంలో చౌకగా శ్రమశక్తి లభిస్తుందని తెలిసినా, నిపుణులైన పనివారున్నారని ఎరిగినా ఐరోపా, అమెరికా నుంచి ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు రాలేదు, చైనా మాదిరి ఎగుమతి వస్తూత్పత్తి జరగటం లేదు.


ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య కారణంగా చైనాతో ఐరోపా సమాఖ్య(ఇయు) సంబంధాలు సజావుగా లేవు గనుక ఇప్పుడు మనం చైనా స్థానాన్ని ఆక్రమించేందుకు అవకాశం వచ్చిందని చెబుతున్నారు. అమెరికా, ఐరోపాలకు కావాల్సింది చౌకగా వస్తువులను అందించటం, వారి ఉత్పత్తులకు మార్కెట్లను తెరవటం. ఆ పని ఎవరు చేస్తే వారికి అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. ఇప్పటి వరకు అది మనవల్ల కాలేదు. ఐరోపా నేతలను నవంబరులో రావాలని ఆహ్వానించినట్లు వచ్చిన వార్తలు వాస్తవం కాదని చైనా విదేశాంగశాఖ పేర్కొన్నది.కరోనా కారణంగా గత మూడు సంవత్సరాలుగా రాకపోకలు లేవు. ఒకవైపు ఉక్రెయిన్‌ సంక్షోభం దీర్ఘకాలం కొనసాగవచ్చని చెబుతుండగా దాని ప్రతికూల పర్యవసానాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. ఈ పూర్వరంగంలో అమెరికా కోసం ఆసియాలో చైనాతో కూడా లడాయి పెట్టుకొనేందుకు ఐరోపా సిద్దంగా లేదనే వార్తలు మరోవైపున వెలువడుతున్నాయి. చైనా నుంచి విదేశీ కంపెనీలన్నీ చైనా నుంచి వెలుపలికి పోతున్నట్లుగా జరిగిన ప్రచారం తెలిసిందే.ఇప్పుడు చైనాను బెదిరించేందుకు, రాయితీలు పొందేందుకు పూనుకోవచ్చు తప్ప విస్మరించే అవకాశం లేదు. గాల్వన్‌ ఉదంతం తరువాత మన దేశంలోని కొన్ని శక్తులు చేసిన హడావుడి తరువాత చైనా నుంచి రికార్డు స్థాయిలో మన దిగుమతుల గురించి తెలిసిందే. మరి ఐరోపా, అమెరికా చైనాను ఎలా వదులుకుంటాయి. ఇప్పటికీ వాటి పెట్టుబడులు చైనాలో పెద్ద మొత్తంలో ఉన్నాయి. చైనాకు వ్యతిరేకంగా మన దేశాన్ని నిలిపేందుకు అవి మరింతగా వివాదాన్ని ఎగదోయవచ్చు, వాణిజ్య ఆశలు చూపవచ్చు. ఎక్కడన్నా బావేగాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా అవి తమలాభాల దగ్గర రాజీపడవు. ఇటీవలి కాలంలో ఐరోపా దేశాలు చైనా మీద దూకుడును తగ్గించాయి.


చైనా నుంచి ఆహ్వానాలు అందిందీ లేనిదీ ఇంతవరకు ఐరోపా దేశాలేవీ తిరస్కరించలేదు, నిర్ధారించలేదు. ఒకవేళ ఆహ్వానం వస్తే ఏమి చేయాలా అని పారిస్‌లో తర్జనభర్జనలు జరుగుతున్నట్లు వార్తలు. అక్టోబరులో చైనా కమ్యూనిస్టు పార్టీ సభల తరువాతనే భేటీ జరగవచ్చు.ఆహ్వానమే గనుక వస్తే తిరస్కరించటం కష్టమని ఐరోపా అధికారులు అంటున్నారు.ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో చైనా-ఇయు వాణిజ్య లావాదేవీల విలువ గతేడాది కంటే పదిశాతం పెరిగి 205బి.డాలర్లకు చేరాయి. 2018లో చైనా మీద అమెరికా వాణిజ్య యుద్దం ప్రారంభించినప్పటికీ, చైనా నుంచి దిగుమతులను నిలిపివేయలేదు. చైనా వస్తువులపై విధించిన దిగుమతి పన్నుల భారం అమెరికన్‌ వినియోగదారుల మీదనే పడుతోంది. చైనా దారికి వచ్చే వైఖరిలో లేదు, కొనసాగిస్తే జనం మీద భారం, తొలగిస్తే ప్రపంచ దృష్టిలో పలుచన అవుతామనే సందేహం అమెరికా నేతల్లో ఉంది.


వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో మన వాణిజ్యలోటు 250 బిలియన్‌ డాలర్లకు లేదా జిడిపిలో 7.3శాతానికి చేరనున్నట్లు అంచనా. జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో గతేడాది లోటు 31.4బి.డాలర్లు కాగా ఈ ఏడాది 70.8కి పెరిగింది.మన దేశం ఆర్ధికంగా పెరిగితే చైనాను అరికట్టవచ్చని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఎవరు వద్దన్నారు, ఎవరు అడ్డుకున్నారు, ఎవరు ఇక్కడ కావాల్సింది మనం పెరగటమా చైనాను అరికట్టటమా ? మన ఎగుమతులకు చైనా ఏ విధంగానూ పోటీ కాదు. ఎనిమిదేండ్ల నుంచి నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా అన్నా ఆ బ్రాండ్‌ పేరును పక్కన పెట్టి తాజాగా ఆత్మనిర్భర్‌ అని మార్చినా మన ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా పెరుగుతున్నాయి. అమెరికా వాడి మాటలను నమ్మి చైనా ఆక్రమణకు వస్తోందనే అంచనాతో లడఖ్‌ ప్రాంతంలో కొండలను ఎక్కించిన మన మిలిటరీని ఇప్పుడు దించలేము, కొనసాగించలేని స్థితి. మన ప్రాంతాలను చైనా ఆక్రమించలేదని గాల్వన్‌ ఉదంతం తరువాత స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.గాల్వన్‌ తరువాత ఇప్పటి వరకు 278 చైనా యాప్‌లను మన దేశం నిషేధించింది. దాని వలన కొంత మన దేశంలో కొంత మందికి మానసిక తృప్తి తప్ప చైనాకు కలిగిన ఆర్ధిక నష్టం ఏమిటో ఎవరూ చెప్పరు. వాటిని నిషేధించినా మన దేశంలోని అనేక సంస్థలలో చైనా పెట్టుబడులు పెద్ద మొత్తంలో ఉన్న వాస్తవాన్ని మూసిపెడితే దాగదు. చైనా జిడిపిలో దాని విదేశీ వాణిజ్య వాటా 35శాతం ఉంది. అమెరికానే అది అన్ని రంగాలలో ముప్పు తిప్పులు పెడుతున్నది.

చైనాఅమెరికా ఇప్పటికీ అగ్రరాజ్యమే, కానీ దానికి ఉండే బలహీనతలు దానికి ఉన్నాయి. అమెరికన్లను నమ్మి దిగితే కుక్కతోక పట్టుకొని గోదావరిని ఈదినట్లే. మమ్మల్ని వెళ్లనివ్వండిరా బాబూ మీకు పుణ్యం ఉంటుంది అని తాలిబాన్ల కాళ్లు పట్టుకొని అమెరికా మిలిటరీ ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి పారిపోయిన తీరును కళ్లారా చూశాము. తరువాత ఉక్రెయిన్ను రెచ్చగొట్టి గోదాలోకి దించారు. కావాలంటే ఎన్ని ఆయుధాలనైనా అమ్ముతాం తప్ప మా సైనికులెవరూ యుద్దానికి రారు అంటూ అమెరికా, నాటో దేశాలు చేతులెత్తేసిన తీరునూ చూశాము. ఉక్రెయిన్‌ కాదు గానీ తైవాన్ను గనుక చైనా ఆక్రమిస్తే సైన్యాన్ని పంపుతామంటూ జో బైడెన్‌ ప్రగల్భాలు పలికాడు. వాటినెవరూ నమ్మటం లేదు. చైనా అంతర్భాగమే తైవాన్‌ అని అమెరికా అంగీకరించింది, దాన్ని ఎప్పుడు విలీనం చేసుకోవటం అన్నది చైనా అంతర్గత అంశం. విలీనం చేసుకుంటే అడ్డుకొనేశక్తి ఏ దేశానికీ లేదన్నది వాస్తవం., పాకిస్తాన్‌ మరొక దేశం ఏదైనా మన రక్షణ జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిందే.వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. మూడూ అణుశక్తి దేశాలే గనుక ఎవరిని ఎవరూ లొంగదీసుకోలేరు, ఎవరి మీద ఎవరూ విజయం సాధించలేరు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్రెయిన్‌ సంక్షోభంపై అమెరికా కూటమి మల్లగుల్లాలు : అనుకున్నదొకటి అవుతున్నది మరొకటి !

06 Wednesday Jul 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

European Union, G7 summit 2022, NATO, Ukraine war, Ukraine-Russia crisis


ఎం కోటేశ్వరరావు


అమెరికా ఆధిపత్యంలోని నాటో కూటమి సృష్టించిన వివాదంలో ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన ప్రత్యేక సైనిక చర్య బుధవారం నాడు 133వ రోజులో ప్రవేశించించింది. డాన్‌బాస్‌లో కొంత మినహా మిగిలిన ప్రాంతం నుంచి ఉక్రెయిన్‌ మిలిటరీ, దానికి అనుబంధంగా ఉన్న కిరాయి నాజీ మూకలను రష్యా మిలిటరీ తరిమివేసింది. లుహానస్క్‌ ప్రాంతాన్ని విముక్తి చేసినందుకు అధ్యక్షుడు పుతిన్‌ అభినందనలు తెలిపారు. లుహానస్క్‌ వేగంగా పతనం కావటాన్ని చూస్తే రష్యా సేనల మధ్య మెరుగైన సమన్వయం ఉన్నట్లు కనిపిస్తోందని బ్రిటన్‌ రక్షణశాఖ పేర్కొన్నది. మరోవైపు తమ సేనలు వెనక్కు తగ్గటం, రష్యా దళాలను అడ్డుకోవటం తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జలెనెస్కీ చెప్పాడు. డాన్‌టెస్క్‌ ప్రాంతం కూడా త్వరలో పతనం కానున్నట్లు వార్తలు. మూలనున్న ముసలమ్మలు, ఉయ్యాళ్లలో ఉన్న పసి పిల్లలు కూడా తుపాకులు పట్టి పుతిన్‌ సేనలను తరిమికొడుతున్నారన్న కథలు ఇప్పుడు ఎక్కడా వినిపించటం లేదు. ఒక వేళ చెప్పినా నాటో కూటమి దేశాల్లో జనం క్రమంగా చెవుల్లో పూలు తొలగించుకుంటున్నారు గనుక నమ్మని పరిస్థితి. కనుక ఆయాసపడినా ఫలితం ఉండదని గ్రహించి వాటిని తగ్గించారు.


గత నెలలో జర్మనీలో జి7, మాడ్రిడ్‌లో నాటో కూటమి సమావేశాలు జరిగాయి. రెండుచోట్లా రష్యాను ఎలా దెబ్బతీయాలి, కొత్త చోట్ల ఎలా చిచ్చు పెట్టాలన్న ఆలోచనల చుట్టూ చర్చలు, నిర్ణయాలు చోటు చేసుకున్నాయి. అంతర్గతంగా జరుగుతున్న మల్లగుల్లాల్లో మాత్రం ఉక్రెయిన్‌ సంక్షోభం నుంచి బయటపడేదెలా ? అనుకున్నదాని కంటే రష్యా మెరుగ్గా ఎలా ఉంది, నెలల తరబడి చేసిన కసరత్తు వృధాగా మారిందా? అన్న అంశాలున్నాయని వార్తలు. ఐరోపా సమాఖ్య(ఇయు) ఆర్ధిక పురోగతికి, దేశాల మధó్య ఆటంకాలను తొలగించుకొనేందుకు ఏర్పడింది.అలాంటి వేదికపై ఇప్పుడు మిలిటరీ అంశాల గురించి చర్చలు చోటు చేసుకుంటున్నాయి. నిరంతరం ప్రపంచంలో సామ్రాజ్యవాదులు రెండు రంగాల్లో యుద్ధాలు చేస్తున్నారు. ఒకటి ఆర్ధిక, రెండవది మిలిటరీ. రష్యా మీద ఆంక్షల రూపంలో అమెరికా, ఐరోపా సమాఖ్య తన నిర్ణయాలను ప్రపంచం మీద రుద్దాలని చూస్తున్నది. వందల కోట్ల డాలర్ల మేరకు ఆయుధాలను అందిస్తూ నాటో కూటమి ఉక్రెయినుకు వెన్నుదన్నుగా ఉంది.


వ్లదిమిర్‌ పుతిన్‌కు దగ్గరగా ఉన్నట్లు భావించిన వారిలో 1,100 మంది ఆస్తులను పశ్చిమ దేశాలు ఆర్థిక ఆంక్షల్లో భాగంగా స్థంభింప చేశాయి. ఐరోపా ద్రవ్యమార్కెట్లకు రష్యన్‌ బాంకులను దూరం చేశారు. రష్యా ఎగుమతులతో పాటు అది ఐరోపా నుంచి చేసుకొనే దిగుమతులపై ఆంక్షలు పెట్టారు.దాదాపు వంద బిలియన్‌ యురోల విలువగల వస్తువులను అడ్డుకున్నారు. దీన్ని ” ఎగుమతి నియంత్రణలను మిలిటరీకరించటం ”గా పిలుస్తున్నారు. ఆర్ధిక కూటమి నుంచి భద్రతా కూటమిగా స్వయంగా మార్పు చెందటంగా చెబుతూ ఇటీవలి కాలంలో ఆ దిశగా ఇయు చేసిన చట్టాలను ఉటంకిస్తున్నారు. అమెరికా ఆదేశాలను ఇయు సభ్య దేశాలపై రుద్దుతున్నది. పరిస్థితిని ఆసరా చేసుకొని అనేక అధికారాలను స్వంతం చేసుకుంది. అమెరికా తాను తీసుకున్న నిర్ణయాలను ముందుగా ఇయుకు చెప్పి తరువాత ఇతర దేశాలతో సంప్రదింపుల తతంగం జరుపుతున్నది. రష్యా మీద అమలు జరిపిన ఈ ఎత్తుగడను చైనాకు విస్తరించేందుకు పూనుకున్నారు.


గతేడాది నవంబరులో అమెరికా సిఐఏ డైరెక్టర్‌ బిల్‌ బర్న్‌ ఐరోపా సమాఖ్య ప్రధాన కార్యాలయం ఉన్న బ్రసెల్స్‌ వచ్చి రహస్య సమావేశాలు జరిపి ఉక్రెయిన్‌ మీద పెద్ద ఎత్తున దాడి చేసేందుకు పుతిన్‌ సిద్దం అవుతున్నాడు, ఏం చేద్దామని అడిగాడు. గత కొద్ది నెలలుగా పుతిన్‌ సన్నద్దం అవుతున్నాడు. మీరు కూడా భాగస్వాములవుతారు గనుక చలికాలంలో గాస్‌ అవసరం మీకుంటుంది. మిమ్మల్ని ఇరుకున పెట్టేందుకుగాను మీరు నిల్వ చేసుకొనేందుకు వీల్లేకుండా గాస్‌ సరఫరాలను తగ్గించాడని కూడా చెప్పాడు. మిలిటరీగా నాటో జోక్యం కుదిరేది కాదు గానీ, కావాలంటే 2014 క్రిమియా విలీనం తరువాత మీరు చేస్తున్న ఆర్ధిక దాడుల్లో మేము కూడా భాగస్వాములం అవుతామని ఇయు నేతలు అంగీకరించారు. ఐదు రకాలుగా ఆంక్షలు అమలు జరపాలని ముందే పధకం వేశారు. తరువాత కసరత్తు చేసి ఎలా అమలు జరుపుతున్నదీ తెలిసిందే. రష్యా సైనిక చర్య డాన్‌బాస్‌ ప్రాంతానికే పరిమితం అవుతుందని, మనకు పెద్దగా పని ఉండదని అనేక మంది భావించారు. ఏకంగా రాజధాని కీవ్‌ మీదనే దాడులు జరపటంతో అంతకు ముందే అనుకున్న దశలవారీ ఆంక్షలను వేగంగా వెంటనే ప్రకటించారు. అది కొన్ని దేశాలకు ఇబ్బందికరంగా మారింది. ఎయిర్‌ బస్‌ కంపెనీకి అవసరమైన టిటానియంను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటారు. దాంతో నాలక్కరుచుకొని అబ్బే వాటికి వర్తించవని సడలించారు. అలాగే కొన్ని దేశాలకు ఇంథన సరఫరాలకు మినహాయింపునిచ్చారు.


ఆంక్షల్లో ఉన్న లోపాలను ఆధారం చేసుకొని మూడవ పక్ష దేశాల నుంచి రష్యన్లు కంప్యూటర్లు, కార్ల విడిభాగాల వంటి వాటిని దిగుమతి చేసుకున్నారు. తమ నుంచి దిగుమతి చేసుకొనే వారు రూబుళ్లలోనే చెల్లించాలన్న ఎత్తుగడ కూడా కొంత మేరకు ఫలించింది.అన్నింటికీ మించి పశ్చిమ దేశాలు ఊహించని విధంగా లబ్ది పొందింది. ఇంథన ఉత్పత్తిని తగ్గించినప్పటికీ ఇప్పటి వరకు గతం కంటే ఎక్కువ ఆదాయం వస్తోంది. తమ ఆంక్షల ఫలితంగా రష్యాలో పదిశాతం ఉత్పత్తి తగ్గుతుందని, ఇరవై శాతం పెట్టుబడులు ఆగుతాయని, అవసరమైన విడి భాగాలకు కొరత ఏర్పడి ఆయుధ పరిశ్రమల మూత, చివరికి ట్రాక్టర్లకు సైతం కొరత, వీటన్నింటి ఫలితంగా ఆర్ధిక సంక్షోభం, రాజకీయంగా పుతిన్‌కు ఎసరు వస్తుందని రాసుకున్న నివేదికలన్నింటినీ పశ్చిమ దేశాలు ముందు వేసుకొని నాలుగు నెలలు గడిచినా అలా ఎందుకు జరగటం లేదని పదే పదే చదువు కుంటున్నాయి. మరోవైపున అమెరికాతో సహా పశ్చిమ దేశాల్లో ద్రవ్యోల్బణం, ఆర్ధిక దిగజారుడు మాంద్యానికి గురికానున్నట్లు వార్తలు. పెరుగుతున్న ఇంథన ధరలు ఐరోపాలోని అనేక దేశాల్లో దారిద్య్రం పెరగనుందని రష్యన్‌ మీడియా చెబుతోంది.


పశ్చిమ దేశాలు ఊహించని మరొక అంశం. రష్యా సరిహద్దులకు వెలుపల మాస్కో నుంచి 1,257 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న రిపబ్లిక్‌ కలినిన్‌గ్రాడ్‌. దీని జనాభా ఐదు లక్షలు. రష్యా నుంచి రోడ్డు మార్గంలో రావాలంటే ఒక వైపున లాత్వియా, లిథువేనియా మీదుగా, మరోవైపు నుంచైతే బెలారస్‌,లిథువేనియా మీదుగా రావాల్సి ఉంటుంది. నౌకా మార్గంలోనైతే బాల్టిక్‌ సముద్రం నుంచి చేరుకోవచ్చు.రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత జర్మనీ-సోవియట్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం జర్మనీ కలినిన్‌గ్రాడ్‌ ప్రాంతాన్ని సోవియట్‌కు అప్పగించింది. 1990దశకంలో సోవియట్‌ విడివడిన తరువాత అది రష్యా ఆధీనంలోకి వచ్చింది. ఉక్రెయిన్‌ వివాదం తలెత్తిన తరువాత ఈ ప్రాంతానికి రష్యా నుంచి సరఫరాలను అనుమతించాలా లేదా అన్నది సమస్యగా మారింది. ఉక్కు, అల్యూమినియం వంటివి ఆంక్షల జాబితాలో ఉన్నప్పటికీ వాటి రవాణాను పునరుద్దరించాలని ఐరోపా సమాఖ్య తాజాగా నిర్ణయించింది. జూన్‌ పదిహేడవ తేదీ నుంచి రైళ్ల ద్వారా నిర్మాణ సామాగ్రి, బొగ్గు,ఖనిజ రవాణాను లిథువేనియా నిలిపివేసింది. ఉక్రెయిన్‌ వివాదానికి ముందు ఎంత పరిమాణంలో సరఫరా ఉంటే అంతే అనుమతిస్తామని ఐరోపా సమాఖ్య చెబుతోంది. కలినిన్‌ గ్రాడ్‌ నుంచి ఇతర దేశాలకు సరఫరా కాకుండా అడ్డుకొనేందుకు ఈ షరతు విధిస్తున్నారు.లిథువేనియా వైఖరితో విబేధించిన జర్మనీ ఐరోపా సమాఖ్య ద్వారా తన నిర్ణయాన్ని అమలు చేయిస్తున్నదని వార్తలు వెలువడ్డాయి. రష్యా-ఉక్రెయిన్‌ వివాదంలో ఆంక్షలను జర్మనీ సమర్ధిస్తున్నప్పటికీ యుద్ధంలో నాటో భాగస్వామి కాకూడదని కోరుకుంటోంది. అనవసర వివాదాలతో రష్యాను మరింతగా రెచ్చగొట్టవద్దని కూడా చెబుతోంది. అయితే లిథువేనియా దీని గురించి రుసరుసలాడుతోంది. ఐరోపా కమిషన్‌లో రష్యా భయాన్ని నింపిందని, ఇది కొన్ని రైల్వే వాగన్ల అంశం కాదని, రష్యా బెదిరింపులకు లొంగినట్లు కనిపిస్తోందని, ఇది ఇంతటితో ఆగదని, ఐరోపాలో చీలికలు తెచ్చేందుకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుందని, తమ పరువు తీశారని, ఇప్పుడు నాటోలో భాగంగా లిథువేనియాలో ఉన్న జర్మన్‌ దళాలను ఉంచుతారా వెనక్కు తీసుకుంటారా అన్నది చూడాల్సి ఉందని అక్కడి విశ్లేషకులు చిత్రిస్తున్నారు. చివరికి ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాల్సి ఉంది.


జి7, నాటో సమావేశాల్లో ఆంక్షలను మరింతగా పెంచాలని సంకల్పం చెప్పుకున్నారు, ఉక్రెయినుకు ఆయుధ సరఫరాను పెంచాలని నిర్ణయించారు. ఇదే సమయంలో తమ పరువు కాపాడుకుంటూ వివాదాన్ని ఎలా ముగించాలా అనే ఆలోచన కూడా చేస్తున్నారు. తొలి రోజుల్లో ఉక్రెయిను గట్టిగా నిచినట్లు కనిపించినా దాని అడుగుజారుతున్నట్లు అంతర్గతంగా పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. మిలిటరీ, ఆర్ధిక లక్ష్యాలను దెబ్బతీస్తూ రష్యా అడుగులు వేస్తున్నది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను చూస్తే పశ్చిమ దేశాలు ఇచ్చిన అస్త్రాలతో ఉక్రెయిన్‌ ఆత్మరక్షణకు పాల్పడుతున్నది తప్ప రష్యా చేతికి చిక్కిన ప్రాంతాలను తిరిగి పొందే అవకాశం కనిపించటం లేదు. ఉక్రెయిన్‌తో పోలిస్తే ఆర్ధికంగా, ఆయుధపరంగా రష్యా పైచేయితో ఉంది. దాడులు మరికొంత కాలం ఇదే తీరుతో కొనసాగితే అంతర్గతంగా ఉక్రెయిన్‌ జనం స్పందన ప్రతికూలంగా మారవచ్చు.ఇరుగు పొరుగు దేశాలకు శరణార్ధులకు ఆశ్రయం కల్పించటం,ఆర్ధిక సాయం భారంగా మారవచ్చు.


సైనిక చర్య ఎప్పుడు ముగుస్తుందో తెలియదు, ఇంకా ఎంత మేరకు ఉక్రెయిన్‌ ధ్వంసమౌతుందో అంచనా లేదు. ఇప్పటి వరకు జరిగినదాన్నుంచి పునర్‌నిర్మాణం జరగాలంటే 750బిలియన్‌ డాలర్లు అవసరమని, ఈ బాధ్యతను ప్రజాస్వామిక ప్రపంచమే చేపట్టాలని జెలెనెస్కీ డిమాండ్‌ చేస్తున్నాడు. ఉక్రెనియన్లలో అసంతృప్తి తలెత్తకుండా చూసేందుకు పునర్‌నిర్మాణ పనులను ప్రారంభిస్తున్నట్లు హడావుడి చేస్తున్నారు. ఇప్పటి వరకు 6.84 బిలియన్‌ డాలర్ల ప్రతిపాదనలు వచ్చినట్లు ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్స్‌ ప్రకటించారు, ఎక్కడ 750 ఎక్కడ 6.84 బి.డాలర్లు ? స్విడ్జర్లాండ్‌లో జరిగిన రెండు రోజుల సమావేశంలో 40 దేశాలు, సంస్థలకు చెందిన వారు తాము భాగస్వాములం అవుతామని సంతకాలు చేశారు. ఈ సంక్షోభం పరోక్షంగా ప్రపంచమంతటినీ ప్రభావితం చేస్తోంది. పరిస్థితి ఇంకా దిగజారితే దాన్ని ఎగదోస్తున్న పశ్చిమదేశాల వైపు చూపే వేళ్ల సంఖ్య పెరుగుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఐరోపా యూనియన్‌ భవిష్యత్‌ మరింత సంక్లిష్టం !

29 Wednesday May 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, UK

≈ Leave a comment

Tags

Brexit Party, Europe Far-Right, european parliamentary elections 2019, european parliamentary elections 2019 verdict, European Union, Far-right populists, Le Pen’s National Rally, Salvini’s Lega party, The Greens

Image result for european parliamentary elections 2019 verdict complicated it's future

ఎం కోటేశ్వరరావు

ఆదివారం నాటితో ముగిసిన మూడు రోజుల ఐరోపా యూనియన్‌ తొమ్మిదవ పార్లమెంట్‌ ఎన్నికలు సంస్ధ భవిష్యత్‌ను సంక్లిష్టగావించాయి. ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నది స్పష్టమైంది. పర్యావరణ పరిరక్షణ కోరే గ్రీన్స్‌ పార్టీలు, తీవ్ర మితవాద పార్టీలు గతం కంటే బలం పుంజుకున్నాయి, నాలుగు దశాబ్దాల తరువాత సాంప్రదాయ మధ్యేవాద, వామపక్ష పార్టీలు మెజారిటీని కోల్పోయాయి. ఫలితాలు ఐరోపా సమాజంలో జరుగుతున్న మధనానికి అద్దం పట్టాయి. ఇటీవలి సంవత్సరాల పర్యవసానాల పలితాలు ఇవి. గత రెండు దశాబ్దాలలో జరిగిన ఎన్నికలతో పోల్చితే ఈ సారి 50శాతం పైగా ఓట్లు పోలు కావటం ఒక విశేషం అయితే కొన్ని చోట్ల పోలింగ్‌ తగ్గటం జనంలో వున్న నిర్లిప్తతను, కొన్ని చోట్ల పెరగటం గ్రీన్స్‌, పచ్చి మితవాదులకు మద్దతుగా ఓటర్లు ముందుకు వచ్చినట్లు కూడా వెల్లడించింది. మితవాద శక్తులు మొత్తం మీద బలం పెంచుకున్నప్పటికీ వూహించినంతగా విజయం సాధించకపోవటమే ఒక వూరటగా కొందరి విశ్లేషణ వుంది. గత ఎన్నికల్లో పార్లమెంట్‌లో 20శాతంగా వున్న బలాన్ని ఇప్పుడు 25శాతానికి పెంచుకున్నారు. అదే విధంగా గ్రీన్స్‌ విజయాన్ని కూడా వూహించలేదు. అన్ని దేశాల్లో ఒకే విధంగా లేనప్పటికీ మొత్తం మీద ఐరోపా రాజకీయ రంగంలో వారొక శక్తిగా ఎదుగుతున్నట్లు కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోవాలని కోరుకొనే వారి సంఖ్య మరింత పెరిగే ధోరణులు వ్యక్తమయ్యాయి. గ్రీన్స్‌తో పాటు ఇటీవలి కాలంలో స్ధిరోష్ణ పేటిక(ఇంకుబేటర్‌)లో వున్న జాతీయవాద పార్టీలు ఇప్పుడు యుద్ధ భూమిలో చురుకుగా వున్నట్లుగా ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి. వీటన్నింటికీ మితవాదం, జాతీయ వాద లక్షణాలలో సారూప్యత వున్నప్పటికీ విడివిడిగా చూస్తే వాటి మధ్య వైరుధ్యం వుంటుంది. ఎవరికి వారు తమ దేశప్రయోజనాలే ముఖ్యం అనుకున్నపుడు వైరుధ్యాలు తలెత్తటం అనివార్యం. ప్రస్తుతం వున్న వాటిని కూల్చివేయాలనటంలో వున్న ఏకీభావం వాటి స్ధానంలో వేటిని నిర్మించాలనటంలో వుండదు.

1979లో ఐరోపా యూనియన్‌ పార్లమెంట్‌ వునికిలోకి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం 28దేశాలకు చెందిన 51.2 కోట్ల మంది పౌరులకు ప్రాతినిధ్యం వహించే 751 మంది ఎంపీలను ఎన్నుకొనే ప్రక్రియ మే 23 నుంచి 26వరకు జరిగింది. యూనియన్‌ నుంచి వైదొలగాలని బ్రిటన్‌ నిర్ణయించటంతో స్ధానాల సంఖ్యను 751 నుంచి 705కు తగ్గించారు. అయితే ఈ ఏడాది అక్టోబరు వరకు బ్రిటన్‌ సభ్యత్వాన్ని పొడిగించిన కారణంగా అక్కడ కూడా ఎన్నికలు జరిగాయి.( అధికారిక ఎన్నికల ఫలితాల వివరాలు ఇంకా పూర్తిగా అందుబాటులోకి రానందున ఈ సమీక్ష కొన్ని పరిమితులకు లోబడి వుంటుందని పాఠకులు గమనించమనవి.) ఇటలీ, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లలో మితవాద శక్తులు అతి పెద్ద పార్టీలుగా ముందుకు రాగా మరికొన్ని చోట్ల కూడా గణనీయమైన విజయాలు సాధించాయి.

గ్రీన్స్‌ విషయానికి వస్తే గత ఎన్నికల్లో 51 సీట్లు తెచ్చుకోవగా ఇప్పుడు 70కి పెరిగాయి. జర్మనీలో మధ్యేవాద వామపక్షంగా వర్ణితమయ్యే సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీని వెనక్కు కొట్టి రెండవ పెద్ద పార్టీగా గ్రీన్స్‌ అవతరించారు. ఫిన్లాండ్‌లో 16శాతం, ఫ్రాన్స్‌లో 13, బ్రిటన్‌లో 12శాతం చొప్పున తెచ్చుకున్నారు. వీరు వలసలకు, ఐరోపా యూనియన్‌ ఐక్యతకు అనుకూలురు. అయితే పర్యావరణం పేరుతో వీరు తీసుకొనే కొన్ని వైఖరులతో అటు మితవాదులకు, ఇటు వుదారవాదులకు కూడా కొన్ని విబేధాలు వున్నాయి.

Image result for european parliamentary elections 2019 verdict complicated it's future

ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడిపోతుందా లేదా, అదే జరిగితే ఎలా అనే విషయాలను పక్కన పెడదాం. అక్టోబరు వరకు సాంకేతికంగా అది యూనియన్‌ సభ్యురాలిగా వుంటుంది. తరువాత విడిపోతే ఈ ఎన్నికలు వృధా ప్రయాస. అయితే ఎంకిపెళ్లి సుబ్బిచావుకు వచ్చినట్లు ఈ ఎన్నికలు బ్రిటన్‌ రాజకీయ రూపు రేఖలను మార్చివేసేవిధంగా సాంప్రదాయ కన్సర్వేటివ్‌, లేబర్‌ పార్టీలకు పోటీగా మరొక పార్టీ ముందుకు వచ్చింది. మూడు నెలల క్రితం పెట్టిన బ్రెక్సిట్‌(ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోవాలని కోరుకొనే ) పార్టీ 32శాతం ఓట్లతో బ్రిటన్‌లోని 73 సీట్లకు గాను 29 పొందింది. ఒక్క లండన్‌లో తప్ప మిగతా అన్ని ప్రాంతాలలో ఈ పార్టీ ప్రాతినిధ్యం సంపాదించింది.1834తరువాత కన్సర్వేటివ్‌ పార్టీ అత్యంత దయనీయ స్ధితిలో తొమ్మిదిశాతం ఓట్లతో ఐదవ స్ధానంలో మూడు సీట్లతో సరిపెట్టుకుంది. ఐదు సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికలలో దీనికి 24శాతం వచ్చాయి. ఈ పార్టీ మద్దతుదారులు అత్యధికులు బ్రెక్సిట్‌ పార్టీకి ఓటు చేశారు. ఐరోపా యూనియన్‌ అనుకూల లిబరల్‌ డెమోక్రాట్లు గతం కంటే బలం పుంజుకొని 20శాతం ఓట్లతో రెండవ స్ధానంలో, ప్రతిపక్ష లేబర్‌ పార్టీ 14శాతం, గ్రీన్స్‌ పార్టీ 11, యుకెఐపి నాలుగుశాతంలోపు ఓట్లతో చివరి స్ధానంలో వుంది.గత యూరో పార్లమెంట్‌ ఎన్నికలలో 24సీట్లు తెచ్చుకున్న యుకెఐపి పార్టీ ఇప్పుడు ఒక స్ధానానికి పరిమితం అయింది. ఈ పార్టీ నేత నైగెల్‌ ఫారజే దాన్నుంచి విడిపోయి బ్రెక్సిట్‌ పార్టీని ఏర్పాటు చేశాడు. ఈ పూర్వరంగంలో జూన్‌ ఏడున కన్సర్వేటివ్‌ పార్టీ ప్రధాని థెరెసా మే ఫలితాలు రాక ముందే రాజీనామాకు నిర్ణయించుకున్నారు. ఈ ఓటింగ్‌ తీరుతెన్నులు చూసిన తరువాత ఆమె స్ధానంలో వచ్చేవారు ఎవరు? అసలేమీ జరగనుంది అనేది చూడాల్సి వుంది.

ఫ్రాన్స్‌లో పచ్చి మితవాది మారినే లీపెన్‌ నాయకత్వంలోని నేషనల్‌ ర్యాలీ పార్టీ (ఆర్‌ఎన్‌) 23.3శాతం ఓట్లతో ప్రధమ స్దానంలో నిలిచింది. అయితే గత ఎన్నికలలో ఈ పార్టీకి 24.9శాతం వచ్చాయి. అధ్యక్షుడు మక్రాన్‌ పార్టీకి తాజా ఎన్నికలలో 22.4శాతం వచ్చాయి. గ్రీన్‌ పార్టీకి 13.4శాతం వచ్చాయి. మాజీ అధ్యక్షుడు నికోలస్‌ సర్కోజీ నాయకత్వంలోని రిపబ్లికన్స్‌ పార్టీకి 8.4, సోషలిస్టు పార్టీకి 6.3శాతం ఓట్లు వచ్చాయి. గత కొద్ది నెలలుగా ప్రతివారాంతంలో ఆందోళనలు చేస్తూ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన పసుపు చొక్కాల పార్టీకి కేవలం 0.54శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. వారి కంటే ఎక్కువగా జంతు ప్రేమికుల పార్టీకి 2.17శాతం వచ్చాయి. ఫ్రాన్స్‌లో మొత్తం 34 పార్టీలు పోటీ చేశాయి.

ఇటలీలోని అధికార మితవాద లీగ్‌ పార్టీ 34.3శాతం ఓట్లతో 28సీట్లతో ప్రధమ స్ధానంలో వుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ 27-31శాతం మధ్య వస్తాయని పేర్కొన్నవాటి కంటే ఎక్కువ శాతం ఓట్లు తెచ్చుకున్నారు. ప్రతిపక్ష లెఫ్ట్‌ డెమోక్రాట్స్‌ 22.7శాతం, సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా వున్న ఫైవ్‌ స్టార్‌ పార్టీ(ఎం5ఎస్‌) 17.1శాతం ఓట్లు తెచ్చుకుంది.మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోని ఫోర్జా ఇటాలియాకు 8.8శాతం, ఇటలీ బ్రదర్స్‌ పార్టీకి 6.5శాతం వచ్చాయి. కనీసం నాలుగుశాతం ఓట్లు తెచ్చుకున్న పార్టీలకే ప్రాతినిధ్యం దక్కుతుంది. ఇక్కడ మరో పార్టీ ఆమేరకు ఓట్లు సంపాదించలేదు. ఇటలీ పార్లమెంట్‌ ఎన్నికలలో ఏడాది క్రితం 32శాతం ఓట్లు తెచ్చుకున్న ఫైవ్‌ స్టార్‌ పార్టీ ఓట్లు ఈ ఎన్నికలలో 17శాతానికి పడిపోయాయి. మరోవైపు సాల్వినీ నాయకత్వంలోని లీగ్‌ పార్టీ బలం 17 నుంచి 34శాతానికి పెంచుకుంది. దీంతో సాల్వినీ ప్రధాన పదవిని డిమాండ్‌ చేసే అవకాశం వుందని వార్తలు వచ్చాయి.

ఇటీవలి కాలంలో జర్మనీ ప్రత్యామ్నాయ పార్టీ(ఎఎఫ్‌డి) పేరుతో ముందుకు వచ్చిన పచ్చి మితవాద శక్తులు తాజా ఎన్నికల్లో కాస్త తగ్గినప్పటికీ మొత్తం మీద బలాన్ని నిలుపుకున్నాయి. పూర్వపు తూర్పు జర్మనీలో ఇది బలమైన పార్టీగా ముందుకు వచ్చింది. రెండు సంవత్సరాల క్రితం జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలలో 13శాతం తెచ్చుకున్న ఈ పార్టీ ఇప్పుడు 11శాతానికి పరిమితమైంది. ఐరోపా మితవాత శక్తుల్లో బలాన్ని కోల్పోయిన పార్టీ ఇదొక్కటే కనిపిస్తోంది. తూర్పు జర్మనీలోని రెండు రాష్ట్రాలలో రెండు పార్టీల మధ్య తేడా రెండుశాతమే అయినప్పటికీ అధికార ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ నాయకత్వంలోని క్రిస్టియన్‌ డెమోక్రాట్స్‌(సిడియు)ను రెండవ స్ధానంలోకి నెట్టి ఎఎఫ్‌డి ప్రధమ స్దానంలో వచ్చింది. త్వరలో ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. దేశం మొత్తం మీద సిడియు 29శాతంతో ముందుండగా తరువాత గ్రీన్స్‌ పార్టీ 20.5శాతం ఓట్లతో, సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ(ఎస్‌పిడి) 16శాతం ఓట్లతో మూడవ స్ధానంలో వుంది. పట్టణాలలోని యువత గ్రీన్స్‌ పార్టీ వైపు మొగ్గినట్లు కనిపించింది.

ఎన్నికలు ఐరోపా పార్లమెంట్‌కు అయినప్పటికీ సభ్య దేశాలలో పోటీలు మాత్రం స్ధానిక ప్రాతిపదికగానే జరిగాయి. ఎలాంటి వుమ్మడి ఎన్నికల ప్రణాళికలు, వాగ్దానాలు లేవు. బ్రిటన్‌లో బ్రెక్సిట్‌( ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోవాలా లేదా ) అనే ప్రాతిపదిక మీద జరిగాయి. ఫ్రాన్స్‌లో గత అధ్యక్ష ఎన్నికలలో పోటీ పడిన ప్రత్యర్ధి పార్టీలు మరోసారి తమ బలనిరూపణ ప్రాతిపదికనే తలపడ్డాయి. స్పెయిన్‌లో కొద్ది వారాల ముందు జరిగిన పార్లమెంటరీ ఎన్నికలలో గణనీయ విజయాలు సాధించిన సోషలిస్టు వర్కర్స్‌ పార్టీ తన బలాన్ని పటిష్ట పరచుకొనేందుకే ప్రయత్నించింది. ఇటలీలో మితవాద లీగ్‌ పార్టీ ఏడాది క్రితం సాధించిన ఓట్లను మెరుగుపరచుకొవటం మీదే కేంద్రీకరించింది.

ఐరోపా యూనియన్లోని నాలుగు ప్రధాన దేశాల వివరాలను చూసిన తరువాత . మొత్తం మీద ఐరోపా అనుకూల, వ్యతిరేక శిబిరాలుగా మరింత స్పష్టంగా వేరుబడటం కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ధోరణులు మరింతగా తీవ్రం కానున్నాయని చెప్పవచ్చు. కార్మికవర్గంలో అసంతృప్తికి అన్ని దేశాలలో ఒకే కారణం కానప్పటికీ మొత్తం మీద పెరుగుతోంది. ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఎప్పుడు ఏది జనాకర్షక నినాదంతో ముందుకు వస్తే దాని వెనుక సమీకృతం అవుతున్నారన్నది ఇటలీ ఓటింగ్‌ తీరుతెన్నులు స్పష్టం చేస్తున్నాయి. పచ్చిమితవాదులు బలంపుంజుకోకపోయినా సాంప్రదాయ పార్టీలు బలహీనం కావటం ఫ్రెంచి పరిణామం సూచించింది.జాతీయ వాదులకు బుద్ధి లేదు, వారి దేశాలను ప్రేమిస్తారు, విదేశీయులను ద్వేషిస్తారు అని ఐరోపా కమిషన్‌ అధ్యక్షుడు జీన్‌ క్లాడ్‌ జుంకర్‌ ఐరోపా పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌కు ముందు ఘాటుగా వ్యాఖ్యానించారు. అంటే వలస కార్మికుల సమస్య ఐరోపాను ఎక్కువగా ప్రభావితం చేస్తోందన్నది స్పష్టం.

Related image

ప్రపంచ వ్యాపితంగా ముఖ్యంగా ఐరోపాలో ప్రజాకర్షక, జాతీయవాదులు, వీరందరినీ మితవాదులు అనవచ్చు. వీరి వైఖరి ఆయాదేశాల పరిస్ధితులను బట్టి మారుతూ వుంటుంది గాని మౌలిక లక్షణం మితవాదం, అది ముదిరితే పచ్చి మితవాదం, మతవాదం, ఇంకా నయా ఫాసిజం, నాజీజం. ఎందుకీ పరిస్ధితి తలెత్తింది అన్నది అభ్యుదయవాదులు, అధికారం కోసమే పని చేసినా మౌలికంగా పెట్టుబడిదారీ వ్యవస్ధను సమర్ధించే సాధారణ లౌకికవాదుల ముందున్న ప్రశ్న. వలస కార్మికుల సమస్యపై జాతీయ వాద రాజకీయవేత్తల వైఖరి ఐరోపా ఐక్యతకే స్పష్టమైన ముప్పును ముందుకు తెచ్చింది అని జుంకర్‌ చెప్పారు. ‘ ఈ ప్రజాకర్షకులు, జాతీయ వాదులు, బుద్దిలేని జాతీయవాదులు తమ దేశాలను ప్రేమిస్తారు, సుదూరాల నుంచి వచ్చే వారిని వారు ఇష్టపడరు, మన కంటే దుర్భర పరిస్ధితుల్లో వున్న వారికి మనం మద్దతుగా వ్యవహరించాలి’ అని జుంకర్‌ చెప్పారు. ఐరోపా దేశాలలో కూడా జాత్యహంకారులు, శ్వేతజాతి వాదులు మైనారిటీలను, విదేశాల నుంచి వలస వచ్చిన వారికి దేశం పట్ల విధేయత వుండదని అవమానిస్తారు.

ఐరోపా అంతటా ఇటీవలి కాలంలో మితవాదం పెరుగుతోంది, ఇదే సమయంలో సోషల్‌ డెమోక్రసీ తరుగుతోంది. నాజీ హిట్లర్‌ తరువాత జర్మనీలో ఏడు దశాబ్దాల పాటు ఐరోపా తరహా ప్రజాస్వామ్యమే వుంది తప్ప మితవాద శక్తులు తలెత్తలేదు. అలాంటి చోట ఎఎఫ్‌డి( జర్మనీ ప్రత్యామ్నాయ పార్టీ) అనే పచ్చి మితవాద పార్టీ మూడవ శక్తిగా వునికిలోకి వచ్చింది. రెండవ ప్రపంచ యుద్దంలో దెబ్బతిన్న ఐరోపా తిరిగి తమకు పోటీగా బలపడకూడదని అమెరికా భావించింది. ఒంటరిగా వుంటే ఏనుగు వంటి అమెరికాను ఎదిరించి ప్రపంచ మార్కెట్లో తమ వాటాను తాము కాపాడుకోలేమని గ్రహించిన యూరోపియన్‌ కార్పొరేట్‌ శక్తుల ఆలోచన ప్రకారమే ఐరోపా యూనియన్‌ వునికిలోకి వచ్చింది. ఐరోపా బొగ్గు, వుక్కు కమ్యూనిటీతో 1951లో ప్రారంభమై ఏడుదశాబ్దాలుగా సరిహద్దుల చెరిపివేత వరకు వచ్చిన ఐరోపా యూనియన్‌ మీద ఇప్పుడు అనేక దేశాలలో వ్యతిరేకత పెరుగుతోంది. ఎవరి కాపురం వారు పెట్టుకుందాం, ఎవరి గొడవ వారు చూసుకుందామనే ధోరణులు పెరిగాయి. దాని పర్యవసానమే ఐరోపా యూనియన్‌ నుంచి బయటకు రావాలన్న బ్రిటన్‌ నిర్ణయం.

Image result for european parliamentary elections 2019 verdict complicated it's future

ఓటింగ్‌ తీరుతెన్నులను చూసినపుడు మొత్తం మీద మెజారిటీ జనం ఐరోపా యూనియన్‌ ఐక్యతకే మొగ్గుచూపుతున్నట్లు చెప్పవచ్చు. అనేక దేశాలలో విడిపోవాలనే వారు క్రమంగా పెరుగుతుండటం కనిపిస్తోంది. ప్రపంచీకరణ వల్లనే ఇదంతా జరుగుతోంది అనే శక్తులు దాన్ని వ్యతిరేకించటం ఒకటైతే అంతకంటే ప్రమాదకరమైన వైఖరి జాతీయ వాదంవైపు మొగ్గటం. జనంలో మార్పు కావాలనే వాంఛ కనిపిస్తున్నది, అయితే అది ఎటుంవంటిది అన్న విషయంలో స్పష్టత లేదు. ఏ నేత లేదా పార్టీ నినాదం ఆకర్షణీయంగా వుంటే దాని వెంట సమీకృతం అవుతున్నారు. ఈ క్రమంలో సాంప్రదాయ బూర్జువాపార్టీలు, వామపక్ష శక్తులను జనం పక్కన పెడుతున్నారు. జనాకర్షక, జాతీయవాదం వైపు మొగ్గు చూపుతున్నారు. 2008లో ఆర్ధిక మాంద్యం తలెత్తిన నాటి నుంచి ఐరోపాలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి గెలవటం లేదు. కొత్త పార్టీలు పుట్టుకువస్తున్నాయి, పాత పార్టీలను వెనక్కు నెడుతున్నాయి. తాజాగా ఎన్నికలకు ముందు మద్యేవాద మితవాద, పురోగామి సోషలిస్టులు, డెమోక్రాట్లు పార్లమెంట్‌లో 54శాతం మంది వుంటే ఇప్పుడు వారి సంఖ్య 43శాతానికి పడిపోయిందని కొన్ని విశ్లేషణలు వెల్లడించాయి. ఈ మేరకు పచ్చి మితవాదులు, గ్రీన్స్‌ పెరిగారు. ధనిక దేశాల ఆర్ధిక సమస్యలు, మాంద్యానికి కనుచూపు మేరలో పరిష్కారం కనిపించకపోగా మరో తీవ్ర మాంద్యం పొంచి వుందనే హెచ్చరికల నడుమ వున్నాం. అందువలన ఐరోపాలో లేదా మరొక చోట భవిష్యత్‌లో ఎలాంటి రాజకీయ, నాటకీయ పరిణామాలు జరుగుతాయో జోశ్యం చెప్పలేము.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఒప్పందం లేకుండానే బ్రిటన్‌ విడిపోతుందా !

21 Wednesday Nov 2018

Posted by raomk in Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Opinion, UK

≈ Leave a comment

Tags

brexit, brexit deal or no deal, European Union, Theresa May

Image result for brexit deal or no deal

ఎం కోటేశ్వరరావు

తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అన్న లుబ్దావన్ల ప్రకటనతో కన్యాశుల్కం నాటకం ఏ మలుపులు తిరిగిందీ మనకు తెలిసిందే. ఇప్పుడు ఐరోపా యూనియన్‌(ఇయు)నుంచి విడిపోయిన(బ్రెక్సిట్‌) అనంతర సంబంధాల గురించి తాను కుదుర్చుకున్న ముసాయిదా ఒప్పందానికి పార్లమెంటు ఆమోదం పొందాలని బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఆమె ప్రత్యర్దులు ఒప్పందాన్ని తిరస్కరించటం ద్వారా ఎలాంటి ఒప్పందం లేకుండానే ఇయుతో తెగతెంపులు చేసుకోవాలనే కొత్త వాదనను తాజాగా ముందుకు తెస్తున్నారు. దాంతో ఒప్పందం వుంటే ఏమిటి లేకుంటే ఏమి జరుగుతుంది అన్న చర్చ ఇప్పుడు బ్రిటన్‌లో జరుగుతోంది. మరోవైపు బడాకార్పొరేట్‌ లాబీ ఇయు నుంచి బయటకు పోయినా తమ లాభాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకొనే విధంగా ప్రయత్నిస్తున్నది. బ్రిటన్‌లోని వివిధ కమ్యూనిస్టు పార్టీలు బ్రెక్సిట్‌కు అనుకూలంగా రెండు సంవత్సరాల క్రితం ఓటు వేశాయి. ప్రధాన టోరీ, లేబర్‌ పార్టీలలో పునరాలోచన తలెత్తినప్పటికీ విడిపోయే విషయంలో కమ్యూనిస్టుపార్టీలు ఎలాంటి పునరాలోచన చేయటం లేదు. అయితే అక్కడి రాజకీయాలలో వీటి పాత్ర పరిమితం అన్న విషయం తెలిసిందే. పార్టీలోని పచ్చి మితవాదులు ప్రధాని థెరెసా మే మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని చూస్తుండగా మరికొందరు అంతవరకు రాకుండా పార్టీలోనే సభా నాయకురాలిగా విశ్వాసతీర్మానం ఎదుర్కోవాలనే ప్రయత్నాల్లో వున్నారు. మరోవైపు ఒక వేళ ఎలాంటి ఒప్పందం లేకుండా ఇయు నుంచి విడిపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సాంకేతికపరమైన నోటీసుల పేరుతో ప్రభుత్వం అన్ని తరగతులకు సమాచారాన్ని తెలియ చేస్తున్నది. దీంతో ఒప్పందం లేకుండానే బ్రిటన్‌ వేరు పడుతుందా అన్న వూహాగానాలకు తెరలేచింది. ఈ సమస్య చివరకు థెరెసా మే వుద్యోగం వూడగొతుందా? ఆమె ప్రత్యర్ధులు చిత్తవుతారా అనేది వెండితెరపై చూడాల్సిందే. అసలు సమస్య ఏమిటి?

రెండు సంవత్సరాల క్రితం ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోవాలా లేదా అనే అంశంపై ప్రజాభిప్రాయసేకరణ జరిగింది. దాన్నే క్లుప్తంగా బ్రెక్సిట్‌ అని పిలుస్తున్నారు. వెళ్లిపోవాలనే అభిప్రాయానికి మెజారిటీ ప్రజలు అంగీకరించారు. ఇప్పుడు ఎలా వుపసంహరించుకోవాలనే అంశం మీద కూడా మరో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలన్న ప్రతిపాదనలు కూడా వున్నాయి.ఐరోపా యూనియన్‌లో బ్రిటన్‌ చేరటం నుంచి విడిపోవటం, అంతిమంగా ఎలా విడిపోవాలన్నది కూడా వివాదాస్పదం కావటం అంటే ప్రపంచ పెట్టుబడిదారీ వర్గం ఎదుర్కొంటున్న సంక్షోభ తీవ్రతను వెల్లడించటమే. ఎలా విడిపోవాలి అనే అంశంపై కుదుర్చుకున్న ఒప్పందానికి పార్లమెంట్‌లో మెజారిటీ వుందా లేదా అన్నది కూడా సందేహంగా మారింది.మెరుగైన తన ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ప్రధాని ప్రకటించిన 24 గంటలు కూడా గడవ ముందే బ్రెక్సిట్‌ మంత్రి, మరొకరు రాజీనామా ప్రకటించి వత్తిడి పెంచారు. స్వపక్షంతో పాటు ప్రతిపక్ష లేబర్‌ పార్టీ కూడా ఒప్పందాన్ని వ్యతిరేకిస్తోంది.

2016 జూన్‌లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో 52శాతం మంది ఇయు నుంచి బ్రిటన్‌ బయటకు రావాలని ఓటు వేయగా 48శాతం వుండాలని ఓటు వేశారు. బయటకు వస్తేనే సార్వభౌమత్వాన్ని తిరిగి పొందటం, వలసల విషయంలో భూభాగంపై మరింత అదుపు సాధ్యమని బ్రెక్సిట్‌ మద్దతుదార్లు పేర్కొన్నారు. బయటకు వస్తే ఆరోగ్య పరిరక్షణకు పెద్ద మొత్తంలో ఖర్చు చేసేందుకు అవకాశం వుంటుందని ఓటర్లను తప్పుదారి పట్టించారు. దశాబ్దాల పాటు యూనియన్‌లో కొనసాగి ఇప్పుడు వుపసంహరించుకుంటే అనూహ్య సమస్యలు తలెత్తుతాయని సమర్ధకులు పేర్కొన్నారు.నిజానికి ఐరోపా యూనియన్‌లో వున్నప్పటికీ బ్రిటన్‌ కోల్పోయిందేమీ లేదు. మిగతా దేశాలన్నీ తమ కరెన్సీలను రద్దు చేసుకొని యూరోకు మారితే బ్రిటన్‌ తన పౌండ్‌ను అలాగే కొనసాగిస్తోంది. తన స్వంత వడ్డీ రేట్లు,ద్రవ్య విధానాలు, సరిహద్దులలో సందర్శకుల తనిఖీ స్వంత నిబంధనలు అమలు జరుపుతోంది. ప్రజాభిప్రాయ సేకరణ చట్టబద్దమైనది కాదు. పార్లమెంట్‌ అనుమతి లేనిదే వుపసంహరణ ప్రక్రియ ప్రారంభం కారాదని బ్రిటన్‌ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దాంతో పార్లమెంట్‌ ఒక చట్టం చేయాల్సి వచ్చింది. ఐరోపా యూనియన్‌ నిబంధన ప్రకారం ఏ సభ్యదేశమైనా బయటకు వెళ్ల దలచుకుంటే ఆర్టికల్‌ 50 అమలు జరపాలని కోరాల్సి వుంది. ఆ మేరకు పరివర్తనా కాల వ్యవధి ముగిసే 2019, మే 29నాటికి ఒప్పందం కుదుర్చుకోవాల్సి వుంది. ఈలోగా గతంలో కుదిరిన ఒప్పందాలు,భవిష్యత్‌ సంబంధాలపై బ్రిటన్‌ -ఇయు మధ్య ఒక ఒప్పందం జరగాల్సి వుంది. ఇప్పుడు ప్రధాని థెరేసా మే దాన్నే ప్రతిపాదించారు.

Image result for brexit deal or no deal cartoons

ఒప్పందానికి కట్టుబడతారో లేదో తేల్చుకోవాల్సింది బ్రిటన్‌ తప్ప బ్రెక్సిట్‌ విషయంలో ఎలాంటి పున:సంప్రదింపులు లేవని ఐరోపాయూనియన్‌ కరాఖండిగా చెప్పింది. పరివర్తన కాల వ్యవధి పొడిగింపు, అస్పష్టంగా వున్న కొన్ని అంశాల గురించి సంప్రదింపులు తప్ప ప్రధాన మార్పులకు అవకాశం లేదని ఐరోపా యూనియన్‌ స్పష్టం చేసింది.యూనియన్‌ చర్చల ప్రధాన ప్రతినిధి మైఖేల్‌ బార్నియర్‌ విలేకర్లతో మాట్లాడుతూ బ్రిటన్‌లో రాజకీయ పరిస్ధితి ఎలా వున్నప్పటికీ ఇయు రాయబారులెవరూ వారితో విడిగా మాట్లాడవద్దని కోరారు. అనేక మంది ఐరోపా నేతలు బ్రిటన్‌ ప్రధాని వైఖరికి మద్దతుగా మాట్లాడటం విశేషం. వారిలో ఆస్ట్రియన్‌ ఛాన్సలర్‌ సెబాస్టియన్‌ కర్జ్‌ ఒకరు. ఒప్పందంలో ఎలాంటి మార్పులు చేయవద్దని డచ్‌ ప్రధాని మార్క్‌ రూటే వ్యాఖ్యానించారు. యూనియన్‌ నుంచి బయటకు వస్తే బ్రిటీష్‌ పౌరులకు బంగారు భవిష్యత్‌ వుంటుందని అక్కడి బాధ్యతారహితమైన అనేక మంది రాజకీయ నాయకులు జనానికి చెప్పారు, నిజం ఏమిటంటే ఆ నిర్ణయం వారికి కాళరాత్రి అవుతుంది అని ఫ్రెంచి మంత్రి వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది మార్చి 29లోగా ఒప్పందం కుదరకపోతే వెంటనే సంబంధాలు రద్దవుతాయి. ఎలాంటి పరివర్తన వ్యవధి వుండదు.

బ్రిటన్‌లో టోరీ లేదా లేబర్‌ పార్టీగానీ రెండూ మౌలికంగా పెట్టుబడిదారీ వర్గప్రతినిధులే.అయినా వాటి మధ్య అధికారం విషయంలో తగాదాలున్నాయి.వివరాలు వెల్లడైన మేరకు ఒక అభిప్రాయం ప్రకారం ఆ ఒప్పంద సారాంశాన్ని చెప్పాలంటే కార్పొరేట్‌, ఇతర ధనికుల ప్రయోజనాలను రక్షించేదిగా, వలస వచ్చే వారి మీద దాడి చేసేదిగా వుంది. గతంలో బ్రిటన్‌ తీసుకున్న నిర్ణయం ప్రకారం వచ్చే ఏడాది మార్చినెలాఖరుకు ఐరోపా యూనియన్‌(ఇయు) నుంచి బయటకు వస్తుంది. ఆ తరువాత 21నెలల పాటు పరివర్తన కాలం వుంటుంది. ఆ సమయంలో అనేక ఐరోపా స్వేచ్చా మార్కెట్‌ నిబంధనలు వర్తించే కస్టమ్స్‌ పన్నుల పరిధిలో బ్రిటన్‌ వుంటుంది. తరువాత ఏమిటన్నది సమస్య. తరువాత కూడా కార్పొరేట్‌, ధనికులకు వుపయోగపడే విధంగా బ్రెక్సిట్‌ ఒప్పంద అంశాలను రూపొందించాలన్న వత్తిడి మేరకు బ్రెక్సిట్‌ ఒప్పంద అంశాలను పొందుపరిచారన్నది ఒక అభిప్రాయం.పరివర్తన వ్యవధిలో బ్రెక్సిట్‌ అనంతర సంబంధాలపై బ్రిటన్‌-ఇయు మధ్య ఒప్పందం కుదరకపోతే పరివర్తన కాలం పొడిగింపు వుంటుంది. అంటే యూనియన్‌ నుంచి బయటకు వెళ్లిన తరువాత కూడా బ్యాంకింగ్‌, రవాణా, పౌరసేవల వంటి అంశాలలో బ్రిటన్‌కు కూడా ఇయు సభ్యదేశాలతో సమాన అవకాశాలు కల్పించాలన్నది బ్రిటన్‌ కార్పొరేట్ల డిమాండ్‌. పరివర్తన కాలం ముగిసిన తరువాత బ్రిటన్‌లో వున్న దాదాపు 30లక్షల మంది ఇయు వలస పౌరులు అక్కడే వుండేందుకు తమకు అవకాశం ఇవ్వాలని బ్రిటన్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఐదేండ్లనుంచి వుంటున్నట్లు రుజువు చేసుకున్నవారు అక్కడే స్ధిరపడిన స్ధితిలో కొనసాగవచ్చు. ఇదే నిబంధన ఇయు దేశాలలో వున్న బ్రిటన్‌ వలస పౌరులకు కూడా వర్తిస్తుంది.ఐరోపా యూనియన్‌ విధానాలను బట్టి ఇతర దేశాల వాసులు స్ధిరపడిన స్ధితిని బ్రిటన్‌ సర్కార్‌ రద్దు కూడా చేయవచ్చు. ఆర్ధికంగా సంపాదన లేని వారు తమ కుటుంబసభ్యులకు భారంగా లేమని తమకు తగినన్ని ఆర్ధిక వనరులు, సమగ్ర ఆరోగ్యబీమా వుందని రుజువు చేసుకోవాల్సి వుంది. వలస వచ్చిన వారికి బీమా సౌకర్యాన్ని వర్తింప చేయకూడదనే వత్తిళ్లు ఇప్పటికే వున్నాయి.వివాహ బంధంలో విడిపోయినపుడు భరణం చెల్లించటం గురించి తెలిసిందే.అలాగే విడిపోవాలని బ్రిటనే కోరుకుంది గనుక పరిహారంగా ఇయుకు 50బిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి వుంటుంది.

పాలక టోరీ పార్టీలో బ్రెక్సిట్‌ ఒప్పందం మీద భిన్నాభిప్రాయాలున్నాయి. అది చివరకు ఇద్దరు మంత్రుల రాజీనామా, ప్రధానిపై అవిశ్వాసతీర్మానం పెట్టాలనేంతవరకు దారితీశాయి. ఇయు నుంచి వెళ్లిపోవాలని గట్టిగా పట్టుబడుతున్నవారు పూర్తిగా తెగతెంపులు చేసుకోవాలని, వాణిజ్యం నుంచి వలసలు, వుత్పత్తుల క్రమబద్దీకరణ వరకు అన్నింటికీ బ్రిటీష్‌ చట్టాలు తప్ప ఇయు చట్టాలతో సంబంధం వుండకూడదని చెబుతున్నారు. దీన్ని వ్యతిరేకిస్తున్నవారు బ్రిటన్‌-ఇయు మధ్య కొన్ని సంబంధాలను కానసాగించాలని, పూర్తిగా తెగతెంపులు చేసుకుంటే దేశ ఆర్ధిక వ్యవస్ధకు, రాజకీయ స్ధిరత్వానికి విపత్కరమని వాదిస్తున్నారు. ఇలాంటి అభిప్రాయాలే ప్రతిపక్ష లేబర్‌ పార్టీలోనూ వున్నాయి.బ్రెక్సిట్‌ తరువాత కూడా ఇయు కస్టమ్స్‌ యూనియన్‌లో బ్రిటన్‌ కొనసాగేందుకు వీలైన అంశం థెరేసా మే ఒప్పందంలో వుంది. ఐర్లండ్‌ అంతర్యుద్ధంలో వుత్తర ఐర్లండ్‌ ప్రాంతంలో మెజారిటీగా వున్న ప్రొటెస్టెంట్‌లు తాను బ్రిటన్‌లో భాగంగా వుండాలని కోరుకున్నారు. కాథలిక్కులు మెజారిటీ ఐర్లండ్‌లో వుండిపోయారు. రెండు ప్రాంతాల మధ్య సయోధ్యలో భాగంగా 1999లో కుదిరిన గుడ్‌ ఫ్రైడే ఒప్పందం మేరకు ఐర్లండ్‌ – వుత్తర ఐర్లండ్‌ మధ్య సరిహద్దు నిబంధనలు సులభతరంగా వున్నాయి. ఇప్పుడు బ్రిటన్‌ బయటకు పోయిన తరువాత ఐర్లండ్‌ గనుక ఇయు కఠిన నిబంధనలు అమలు జరిపితే అది 1999 ఒప్పందానికి విరుద్ధం అవుతుంది. అందువలన సరిహద్దు నిబంధనలు సులభతరంగా వుండాలని బ్రిటన్‌ కోరుతోంది. ఆ అవకాశాన్ని వినియోగించుకొని బ్రిటన్‌ తన వుత్పత్తులను ఐర్లండ్‌లోకి పంపితే ఎలా అన్నది ఇయు సమస్య.

Image result for brexit deal or no deal

ఐరోపా యూనియన్‌తో కుదుర్చుకోదలచిన ముసాయిదా పత్రంలోని అంశాలను వ్యతిరేకిస్తూ ఇద్దరు మంత్రులు రాజీనామా చేయగా, వారి బదులు మరొక ఇద్దరిని వెంటనే నియమించారు. ఒప్పందం తనకోసం కాదని జాతీయ ప్రయోజనాలకోసమే అని ప్రధాని చెబుతున్నారు. తన ప్రతిపాదనలకు మద్దతు ఇవ్వాలని ప్రధాని థెరెసా మే సోమవారం నాడు కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ బ్రిటీష్‌ ఇండస్ట్రీ(సిబిఐ)కివిజ్ఞప్తి చేశారు. ఈ ఒప్పందం వలన తమకు చౌకగా దొరికే కార్మికుల కొరత ఏర్పడుతుందని, తద్వారా తాము నష్టపోతామని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడినట్లు వార్తలు వచ్చాయి.ఒప్పందం కుదురుతుందన్న వార్తలు వెలువడగానే బ్రిటన్‌ కంపెనీలు దేశంలో పెట్టుబడులు పెట్టాలన్న నిర్ణయం నుంచి వెనక్కు తగ్గుతున్నాయని ఒక కంపెనీ తూర్పు ఐరోపాకు తరలాలని నిర్ణయించినట్లు సిబిఐ ప్రతినిధులు పేర్కొన్నారు. ఒప్పందం లేకుండా బ్రిటన్‌ విడిపోతే 50 బిలియన్‌ డాలర్ల పరిహారం చెల్లించాల్సిన అవసరం వుండదని కొందరు భాష్యం చెబుతుండగా ఒప్పందం వున్నా లేకపోయినా పరిహారం చెల్లించాలని మరికొందరు చెబుతున్నారు.ఈనెల 25న బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో ఐరోపా యూనియన్‌ నేతలతో ఆమె సమావేశం తరువాత బ్రిటన్‌లో ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సమయంలో నాయకత్వ మార్పు సమస్యను ముందుకు తెచ్చినంత మాత్రాన జరిగేదేమీ వుండదని, సంప్రదింపులు ఆలస్యమయ్యే కొద్దీ ముప్పు మరింత పెరుగుతుందని ఆమె హెచ్చరించారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జర్మనీలో అనిశ్చితిపై ఐరోపాలో ఆందోళన !

30 Thursday Nov 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, UK, USA

≈ Leave a comment

Tags

Angela Merkel, European Union, German elections, Germany

Image result for germany political uncertainty

ఎం కోటేశ్వరరావు

జర్మనీ, ఐరోపాయూనియన్‌ అనే ఒక రైలు బండికి ఇంజను వంటిది. గత రెండు నెలలుగా అది ఆగిపోయి ముందుకు కదలటం లేదు. దాన్ని తిరిగి ఎలా నడుపుతారో ప్రస్తుతానికైతే తోచటం లేదు. బండి ప్రయాణించకపోతే జర్మన్లకే కాదు, మొత్తం ఐరోపా ప్రయాణీకులందరికీ ఇబ్బందులు వస్తాయని ఆందోళన చెందుతున్నారు. కొందరు విశ్లేషకులు పేర్కొన్నట్లు జర్మనీ రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఎరుగనంత రాజకీయ అనిశ్చితి, సంక్షోభాన్ని ఇప్పుడు ఎదుర్కొంటున్నది. సెప్టెంబరు 24న ఎన్నికలు జరిగాయి. ఇంతవరకు కొత్త ప్రభుత్వం ఏర్పడలేదు. ఎప్పుడు ఏర్పడుతుందో తెలియదు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తొలిసారిగా పచ్చిమితవాదులు పన్నెండుశాతంపైగా ఓట్లతో మూడవ పెద్ద పార్టీగా పార్లమెంటులో ప్రవేశించారు. క్రిస్మస్‌ నాటికి ఒక కొలిక్కి రానట్లయితే మహాసంఘటన చర్చలు విఫలమైనట్లుగా భావించాలని ప్రకటనలు వెలువడుతున్నాయి. ఆ తరువాతే మైనారిటీ ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమౌతుంది. రాజకీయాలలో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కనుక తన రాజకీయ సంక్షోభాన్ని జర్మనీ ఎలా పరిష్కరించుకుంటుందనేదే ఆసక్తికరం. మొత్తం ఐరోపా పధకాలే గందరగోళంలో పడతాయని బ్రస్సెల్స్‌(ఐరోపా యూనియను ప్రధాన కేంద్రం) భయంకరమైన ఆందోళన వ్యక్తం అవుతోంది.ఐరోపా యూనియను సముద్రంలో వుంది, దాన్ని ఆదుకొనే పెద్ద స్నేహితుడు మధ్య ఐరోపాలో మనకు లేడు అంటూ ఐరోపా ప్రపంచం అనే పత్రిక ప్రచురణకర్త చేసిన వ్యాఖ్య వాస్తవానికి దగ్గరగా వుంది. అమెరికా ట్రంప్‌ తప్పుడు అంతర్జాతీయ విధానాల ఫలితంగా భద్రత మరియు విదేశీ వ్యవహారాలలో ఐరోపా యూనియను కలసికట్టుగా వ్యవహరించాల్సిన అవసరం వుంది, అందుకు గాను ఇంజను వంటి బలమైన జర్మనీ అవసరం అని భావిస్తున్నారు. అలాంటి జర్మనీలో ప్రభుత్వం ఏర్పడుతుందో లేదో తిరిగి ఎన్నికలు జరుగుతాయో లేదో తెలియని స్ధితి ఏర్పడింది. మరోవైపు యూనియన్‌ నుంచి విడిపోయేందుకు 50బిలియన్‌ పౌండ్లు చెల్లించేందుకు సిద్ధపడి బ్రిటన్‌ తనదారి తాను చూసుకుంటున్నది.ఐరోపా అంతటా పచ్చి మితవాద, నయా ఫాసిస్టు, నాజీ శక్తులు తలెత్తటం ఐరోపా యూనియన్‌ నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నది. సహజంగానే ఈ పరిస్ధితి అమెరికన్లకు సంతోషం కలిగిస్తుంది.

తమ విధానాలకు ప్రత్యామ్నాయం లేదని విర్రవీగిన పెట్టుబడిదారీ కావలి బంట్లలో ఏంజెలా మెర్కెల్‌ ఒకరు. వరుసగా మూడు సార్లు ఛాన్సలర్‌గా ప్రభుత్వాలను నడిపిన ఆమెకు ఇది పెద్ద ఎదురుదెబ్బ. ఆమె ప్రభుత్వంలో పన్నెండు సంవత్సరాలలో ఎనిమిది సంవత్సరాలు భాగస్వామిగా చేరిన సోషలిస్టులం అనిచెప్పుకొనే సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీకి వెన్నుదన్నుగా వుండే కార్మికులు ఈ ఎన్నికలలో దూరం, కావటం రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అతి తక్కువ ఓట్లు తెచ్చుకోవటం శరాఘాతం వంటిది. మెర్కెల్‌తో జతకడితే రానున్న రోజుల్లో వున్న ఓట్లుకూడా పోతాయోమోననే భయం ఆ పార్టీని వెన్నాడుతున్నది. అయితే తాజా వార్తలను బట్టి వారు సంకీర్ణ సంప్రదింపులకు తలుపులను పూర్తిగా మూసివేయలేదు. అదే సమయంలో 20శాతం బలంతో వందశాతం డిమాండ్లు పెడితే అంగీకరించేది లేని మెర్కెల్‌ శిబిరం హెచ్చరికలు జారీ చేసింది. ఈ పూర్వరంగంలో ఎవరు ఎంత మేరకు రాజీపడినప్పటికీ కార్మికవర్గానికి జరిగే మేలు ఏమిటన్నది అసలు సమస్య.

ఆల్‌ ఈజ్‌ వెల్‌(అంతా మంచిగా వుంది) అనుకుంటున్న జర్మనీలో ఎన్నికలు అధికార కూటమిని అనూహ్యకుదుపునకు గురిచేశాయి.నిజానికి జర్మనీలో ఒక విధంగా చెప్పాలంటే ఒక్క వామపక్షపార్టీ తప్ప మిగిలినవన్నీ అవి తెచ్చుకొనే సీట్లను బట్టి, అక్కడి పాలకవర్గ వాంఛలను బట్టి అధికార-ప్రతిపక్ష పాత్రలను పోషిస్తున్నాయి. నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే పార్లమెంట్‌ ఎన్నికలలో 2013లో రెండు పెద్ద పార్టీలైన క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ యూనియన్‌(సిడియు), దానితో కలసి వుండే క్రిస్టియన్‌ సోషలిస్టు యూనియన్‌ అనే ఒక ప్రాంతీయ పార్టీ, సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ(ఎస్‌డిపి) సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. తాజా ఎన్నికలలో రెండు పార్టీలకు దిమ్మదిరిగే విధంగా గతంలో ఎన్నడూరానన్ని తక్కువ ఓట్లు, సీట్లు వచ్చాయి. పార్లమెంట్‌లోని 709 స్థానాలకు గాను మెజారిటీ 355కాగా ఈ మూడు పార్టీలకు 399 వచ్చినప్పటికీ తాము ప్రతిపక్షంలో వుంటామని 143 సీట్లు తెచ్చుకున్న ఎస్‌డిపి ప్రకటించటం జర్మనీలో రాజకీయ అనిశ్చితికి దారితీసింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత పార్లమెంట్‌కు 18సార్లు ఎన్నికలు జరిగాయి.ఇరవై అయిదు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. వీటిలో అత్యధికం సిడియు, దాని మిత్రపక్ష ప్రభుత్వాలు. ఎస్‌పిడి దాని మిత్రపక్షాలతో కలసి అధికారానికి వచ్చింది. ఈ రెండు పార్టీలు కలసి ఐదుసార్లు సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన చరిత్ర వుంది.

ఏంజెలా మెర్కెల్‌ నాయకత్వంలోని సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీతో కలసి మరోసారి అధికారాన్ని పంచుకొనేందుకు తొలి స్పందనగా ససేమిరా అని పేర్కొన్నది. ధనిక దేశాలలో 2008లో ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభం పదవ సంవత్సరంలోకి ప్రవేశించనుంది. దాని దెబ్బకు ఐరోపాలోని మితవాద పార్టీలతో పాటు సోషలిస్టులుగా వున్నవారు కూడా ఎన్నికలలో చావు దెబ్బలు తింటున్నారు. ఒకసారి అధికారానికి వచ్చిన వారు మరోసారి మట్టికరుస్తున్నారు.జర్మనీలో మితవాద సిడియు, వామపక్షంగా చెప్పుకొనే ఎస్‌డియు రెండూ గత నాలుగు సంవత్సరాలుగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న కారణంగా రెండుపార్టీల ఓట్లు, సీట్లు పడిపోయాయి.1998లో గరిష్టంగా 40.9శాతం ఓట్లు తెచ్చుకున్న ఎస్‌పిడి తరువాత అధికారానికి వచ్చి ఇప్పుడు 20.5శాతానికి పడిపోయింది. అందువలన మరోసారి సిడియుతో జతకట్టవద్దని ఆ పార్టీలో పైనుంచి కింది వరకు వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఐరోపాలోని మిగతా ధనిక దేశాలతో పోల్చితే జర్మనీ ఆర్ధిక పరిస్ధితి కాస్త మెరుగ్గా వున్నప్పటికీ సాంఘిక సంక్షేమ పధకాలకు కోతపెట్టటంలో రెండుపార్టీలు ఏకాభిప్రాయంతో వ్యవహరించాయి. ఈ అసంతృప్తి కార్మికవర్గంలో వుంది. అందుకే వెంటనే తాము ప్రతిపక్షంలో వుంటామని చెప్పింది. అయితే అది కూడా ఒక బూర్జువాపార్టీయే గనుక కార్పొరేట్‌ శక్తుల వత్తిళ్లకు లంగి సంకీర్ణం గురించి చర్చించేందుకు సిద్ధం అంటున్నది.తొలిసారిగా ముస్లిం, వలసకార్మికుల వ్యతిరేక నినాదాలతో ఎన్నికలలో పోటీచేసి మూడవ పెద్ద పార్టీగా ఆవిర్భవించిన జర్మనీ ప్రత్యామ్నాయ పార్టీని బూచిగా చూపి మరోసారి మెర్కెల్‌తో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లేకపోలేదు.

పార్లమెంట్‌లోని 709 స్ధానాలకు గాను 299 సీట్లకు ప్రత్యక్ష పద్దతిలో 410 సీట్లకు దామాషా ప్రాతిపదికన ఎన్నికలు జరిగాయి. వివిధ పార్టీలు దిగువ విధంగా సీట్లు సంపాదించాయి.(బ్రాకెట్లలోని అంకెలు గత ఎన్నికలలో సాధించిన సీట్లు) క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ(సిడియు),క్రిస్టియన్‌ సోషల్‌ యూనియన్‌(సిఎస్‌యు) 246(311), సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ(ఎస్‌డిపి) 153(193), జర్మనీ ప్రత్యామ్నాయ పార్టీ(ఎడి) 94(కొత్త పార్టీ), ఫ్రీ డెమోక్రటిక్‌ పార్టీ 80(0), వామపక్ష పార్టీ 69(64), గ్రీన్‌ పార్టీ 67(63). మిగతా ఐరోపా దేశాలలో మాదిరే జర్మనీలో కూడా ఈ ఎన్నికలలో తొలిసారిగా పచ్చిమితవాద జర్మనీ ప్రత్యామ్నా పార్టీ మూడవ పెద్ద పార్టీగా అవతరించింది. వామపక్ష,గ్రీన్‌ పార్టీలు గతం కంటే కొద్దిగా సీట్లు పెంచుకున్నా ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మలచుకోవటంలో విఫలమయ్యాయి.

మెర్కెల్‌ నాయకత్వంలోని సిడియుతో జతకట్టేందుకు ఎస్‌డిపి తిరస్కరించటంతో ఒక సంక్లిష్ట పరిస్ధితి ఏర్పడింది. ఎస్‌పిడి,వామపక్ష,గ్రీన్‌ పార్టీలతో కూటమి ఏర్పడినా మెజారిటీ సాధించే అవకాశం లేదు. సిడియు పరిస్ధితి కూడా అంతే పచ్చిమితవాద జర్మనీ ప్రత్యామ్నాయ పార్టీని, ఫ్రీడెమోక్రటిక్‌ పార్టీని కలుపుకుంటే తప్ప మెజారిటీ సాధించే పరిస్ధితి లేదు.ఆ మూడు కలిసే అవకాశం లేదు. అయితే జర్మనీ పాలకవర్గం సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని పార్టీల మీద వత్తిడి చేస్తోంది. మరోసారి ఎన్నికలు జరిపినా పరిస్ధితిలో పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేకపోగా సిడియు పరిస్ధితి మరింత దిగజారినా ఆశ్చర్యం లేదు. ఈ పరిస్ధితుల్లో ఏకైక పెద్ద పార్టీగా సిడియు మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం మినహా మరొక మార్గం లేదు. అందుకు సిద్దపడటం కంటే తిరిగి ప్రజాతీర్పు కోరటం మేలనే వైఖరితో మెర్కెల్‌ వున్నారు. అయితే అందుకు ఆ పార్టీనాయకత్వం అంగీకరిస్తుందా, లేక ఆమెను పక్కకు నెట్టి కొత్తనేతతో సంకీర్ణ లేదా మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అన్నది వచ్చే ఏడాది జనవరిలో గానీ స్పష్టం అయ్యే అవకాశం లేదు.ఎస్‌డిపితో కలసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సుమఖత తెలియచేస్తూ సిడియు తీర్మానించింది. మరోవైపు ఎస్‌డిపి యువజన విభాగం కూడా ఒక తీర్మానం చేసి మహా సంఘటన ఏర్పాటుకు ప్రయత్నించటం కంటే ప్రతిపక్షంలోని పార్టీలతో సంకీర్ణానికి ప్రయత్నించాలని తీర్మానించి పార్టీ నాయకత్వంపై వత్తిడి తెచ్చింది.

దేశ జనాభాలో గణనీయ భాగం 2000 సంవత్సరంలో సంపాదించిన ఆదాయ మొత్తంలో సగం కూడా ఇప్పుడు పొందటం లేదని విశ్లేషణలు తెలుపుతున్నాయి. ఇటువంటి స్ధితిలో వామపక్షాలు ప్రత్యామ్నాయంగా లేకపోతే జనం పచ్చిమితవాద, నయా ఫాసిస్టు శక్తులవైపు మొగ్గుతారని జర్మనీతో సహా అన్ని ఐరోపా దేశాల అనుభవాలు తెలుపుతున్నాయి. ఇవి వామపక్ష, కమ్యూనిస్టు పార్టీలకు కూడా మేలుకొలుపు వంటివే. పెట్టుబడిదారీ వ్యవస్ధ జరుపుతున్నదాడులు, నయావుదారవాద విధానాలను నిఖరంగ ఎదిరించే మొనగాళ్లుగా వామపక్షాలు జనానికి కనిపించకపోతే మితవాదులే మెరుగని జనం భావిస్తారు. తాజా ఎన్నికలలో పూర్వపు పశ్చిమ జర్మనీ ప్రాంతంలో వామపక్ష పార్టీ కొంత మేరకు ఓట్లు పెంచుకుందిగానీ, తూర్పు జర్మనీలో ఆరుశాతం కోల్పోయింది, ఆ ఓట్లు ఎడి పార్టీకి పడ్డాయి. స్వల్పంగా ఓట్లు, సీట్లు పెంచుకున్నప్పటికీ మిగతాపార్టీలకంటే తాము భిన్నం అనే గుర్తింపును జనంలో తెచ్చుకోలేకపోయింది. కొన్ని రాష్ట్రాలలో సమతూక బడ్జెట్‌ పేరుతో కోతలకు, రోడ్ల ప్రయివేటీకరణకు అంగీకరించటం వంటి చర్యలు అందుకు నిదర్శనం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బ్రిటన్‌పై ఐరోపా ధనిక దేశాల ఆగ్రహం

26 Sunday Jun 2016

Posted by raomk in Current Affairs, Economics, INDIA, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

brexit, EU, European Union, Europeans angry

ఎం కోటేశ్వరరావు

    కొన్ని గంటల్లోనే ఎంత తేడా !’విడాకులివ్వాలని నిర్ణయించుకున్న తరువాత రోషం, పౌరుషం వున్నవాళ్లెవరైనా వెంటనే ఇల్లు వదలి వెళ్లి పోవాలి.ఇక్కడే వుండి మరో నాలుగు నెలల తరువాత నోటీసు పంపుతాను అనటం ఏమిటి? మనం ఏమైనా పరస్పర ఆమోదంతో విడాకులు తీసుకుంటున్నామా లేక మన మధ్య సన్నిహితమైన ప్రేమ ఏడిచింది గనుకనా ? వెంటనే పరిష్కారం చేసుకోవాలి. ‘ ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోవాలని బ్రిటన్‌ నిర్ణయించుకున్నట్లు ఓటింగ్‌ వివరాలు ప్రకటించి 24 గంటలు కూడా గడవక ముందే యూనియన్‌ కమిషన్‌ అధ్యక్షుడు పెరీ మాస్కోవిసీ అన్న మాటల సారాంశమిది. విడిపోవాలనుకున్న తరువాత కొత్త పితలాటకాలు పెట్టకుండా సాధ్యమైనంత త్వరగా వెళ్లి పోతే మంచిది అని ఫ్రెంచ్‌ విదేశాంగ మంత్రి జీన్‌ మార్క్‌ రాల్ట్‌ తో సహా అనేక మంది ఐరోపాయూనియన్‌ విదేశాంగ మంత్రులు బ్రిటన్‌కు సూచించారు. రాజీనామా ప్రకటించిన ప్రధాని కామెరాన్‌ వెంటనే వైదొలిగితే మంచిది, వైదొలగే ప్రక్రియను సాగదీయ కుండా నిబంధనావళిలోని ఆర్టికల్‌ 50 అమలును వెంటనే కోరాలని, మిగిలిన వారు పీఠముడి పడిన పరిస్థితిలో వుండకూడదని జర్మనీ విదేశాంగ మంత్రి బ్రిటన్‌కు సలహా ఇచ్చారు. వెళ్లిపోతామని ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత ఎక్కువ కాలం కొనసాగటం బ్రిటన్‌కు మర్యాద కాదు అని కూడా ఫ్రెంచి మంత్రి వ్యాఖ్యానించాడు. అక్టోబరులో తన వారసుడు వచ్చే వరకు వెళ్లి పోయే చర్చలను ప్రారంభించే అవకాశం లేదని కామెరాన్‌ ప్రకటించిన నేపధ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. నాలుగు నెలల పాటు ఎలుకా-పిల్లి మాదిరి వ్యవహరించటం మంచిది కాదని లక్సెంబర్గ్‌ మంత్రి, మేం తరువాత పేజీ తిప్పి ముందుకు పోవాలని నెదర్లాండ్స్‌ మంత్రి వ్యాఖ్యానించారు. ప్రారంభం నుంచి ఐరోపా యూనియన్‌లో బ్రిటన్‌ ధోరణి వేరుగానే వుంది. పీడా విరగడైంది, ఒక తలనొప్పి పోయిందనే భావం మంత్రుల వ్యాఖ్యలలో వెల్లడైంది.

    అయితే తిరిగి ఓటింగ్‌ జరిపి మరోసారి అభిప్రాయం తీసుకోవాలంటూ బ్రిటన్‌లో లక్షల మంది పార్లమెంట్‌కు వినతి పత్రంపై సంతకాలు చేశారు. ఐరోపా యూనియన్‌ విదేశాంగ మంత్రులు కుర్రకారు మాదిరి బ్రిటన్‌లేని ఐరోపా యూనియన్‌ గురించి చర్చించాలంటూ విరుచుకుపడితే పెద్దమనిషి మాదిరి జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ కుర్రాళ్లూ తొందర పాటు వద్దంటూ బ్రిటన్‌తో సంబంధాలు తెగకుండా దౌత్యానికి తెరతీశారు. విడిపోయిన తరువాత కూడా బ్రిటన్‌ను సహ సభ్యురాలిగా పరిగణించాలనే ప్రతిపాదన జర్మనీ నుంచి వచ్చిందంటూ వార్తలు వచ్చాయి. ఫ్రెంచి నేతలు బ్రిటన్‌పై కాలుదువ్వుతున్న నేపధ్యంలో తాము బ్రిటన్‌కు వ్యతిరేకం కాదన్న సందేశం ఈ రూపంలో జర్మనీ పంపిందా అంటే కాదని చెప్పలేము. మొత్తానికి ఐరోపా యూనియన్‌లోని సభ్య దేశాల మధ్య విబేధాల వెల్లడికి, బ్రిటన్‌లోని కొన్ని ప్రాంతాల జనం అసంతృప్తికి ఈ పరిణామాలు అద్దం పట్టాయి. బ్రిటన్‌లో అధికార, ప్రతిపక్షాలు రెండింటిలో ఈ పరిణామం ప్రకంపనలు సృష్టిస్తే ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ ఒక్కసారిగా వులిక్కిపడింది. మరో తీవ్ర సంక్షోభానికి ఈ పరిణామం నాంది పలికిందా అని భయపడుతున్నది. ఓటింగ్‌ ఫలితాలు వెల్లడి అయిన తరువాత బ్రిటన్‌ సాధారణ ప్రజానీకానికి అంతకు ముందు మాదిరే మరో రోజు గడిచిందన్న వార్తలు వచ్చాయి.

   రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ అధికార వ్యవస్థలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటి వరకు అగ్రదేశంగా వున్న బ్రిటన్‌ తన వలసలను, మార్కెట్లను, పూర్వ ప్రాభవాన్ని కోల్పోయింది.మాజీ రాజు,జమిందారుల మాదిరి పూర్వీకులు సమకూర్చిన అడ్డగోలు సంపాదన మిగిలింది కనుక బెట్టు చేసే మాదిరి దాని పరిస్థితి. రెండు ప్రపంచ యుద్ధాలలో ఏ మాత్రం దెబ్బతినపోగా అటూ ఇటూ ఆయుధాలు అమ్మి సొమ్ము చేసుకున్న అమెరికా పెట్టుబడిదారీ దేశాలలో అగ్రగామిగా ముందుకు వచ్చి ద్విముఖ వ్యూహం అనుసరించింది. సోవియట్‌ నాయకత్వంలో ముందుకు వచ్చిన సోషలిస్టు కూటమి దేశాలను దెబ్బకొట్టటం, పెట్టుబడిదారీ కూటమిలోని ఐరోపాలోని సామ్రాజ్యవాద దేశాలు తిరిగి తనకు పోటీగా తయారు కాకుండా చూసుకొనేందుకు నాటో సైనిక కూటమిని రుద్ది వాటి జుట్టుపట్టుకు కూర్చోవటం. ఐరోపా పునరుద్దరణ పేరుతో మార్కెట్లను తనఅదుపులోకి తెచ్చుకోవటం, ఆసియాలో మరో సామ్రాజ్యవాద దేశమైన జపాన్‌ను తన రక్షణ ఒప్పందంతో కట్టిపడవేయటం వంటి ఎత్తుగడలకు తెరతీసింది. గొర్రెల గోత్రాలు కాపరులకే తెలుసు అన్నట్లుగా అమెరికా దురాలోచన పసిగట్టిన ఐరోపా దేశాలు యుద్ధం ముగిసిన వెంటనే తమలో తాము సహకరించుకొనేందుకు గల అవకాశాలను వెతకటం ప్రారంభించాయి. యుద్ధంలో ఓడిపోయిన కారణంగా మిలిటరీలు రద్దయిన జర్మనీ, జపాన్‌ మిలిటరీకి ఖర్చు లేదు కనుక ఆ సొమ్మును పరిశోధన, అభివృద్ధికి కేటాయించి అచిర కాలంలోనే తిరిగి పట్టాలెక్కాయి. మార్కెట్లు, వలసలను కోల్పోయిన ఐరోపా దేశాలు దెబ్బలు తగిలిన వారందరూ ఒక చోట చేరి ఒకరి గాయానికి మరొకరు మందు రాసినట్లుగా తమలో తాము సహకరించుకొనే ప్రక్రియ 1948లోనే ప్రారంభమైంది. ఆక్రమంలో అంటీ ముట్టనట్లుగా వుండి పాతిక సంవత్సరాల తరువాత 1973లో బ్రిటన్‌ ఐరోపా ఆర్ధిక యూనియన్‌లో చేరింది.

    1948లో హేగ్‌లో జరిగిన ఐరోపా సదస్సుకు ఆ ఖండం నుంచి ప్రతినిధులతో పాటు అమెరికా, కెనడాల నుంచి పరిశీలకులు హాజరయ్యారు. ఐరోపాలో రాజకీయ, ఆర్ధిక సహకారానికి ల అవకాశాలను పరిశీలించేందుకు ఆ సదస్సు తీర్మానించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిన, గెలిచిన దేశాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్న పూర్వరంగంలో ఈ ఆలోచన వచ్చింది. 1952లో ఐరోపా బొగ్గు, వుక్కు సమాజం ఏర్పాటుతో ప్రారంభమై నేటి ఐరోపా ఆర్ధిక యూనియన్‌గా పెరిగి పెద్దదై 1992లో మాస్ట్రిచ్‌ ఒప్పందంతో నేటి ఐరోపా యూనియన్‌ ప్రారంభమైంది.అది ఏర్పడిన మరో పాతిక సంవత్సరాలకు బ్రిటన్‌ దాని నుంచి వైదొలగాలని నిర్ణయించింది. ప్రస్తుత యూనియన్‌కు జర్మనీ ఇంజను వంటిదైతే మిగతా సభ్యదేశాలు మోటారు వాహనంలోని ఇతర భాగాల వంటివి.తన పెత్తనం లేని యూనియన్‌లో బ్రిటన్‌ ప్రారంభం నుంచి ఇష్టం లేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్లుగానే వ్యవహరించింది. బహుశా ఈ కారణంగానే ఫ్రెంచి మంత్రి అలాంటి వ్యాఖ్య చేసి వుండవచ్చు. జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్‌, ఇటలీ, లక్బెంబర్గ్‌ దేశాల మంత్రులతో సమావేశమైన తరువాత ద్రవ్య, రాజకీయ పరమైన పర్యవసానాలు సంభవించే అవకాశం వున్నందున సాధ్యమైనంత త్వరగా వెళ్లిపోయే ప్రక్రియను ప్రారంభించాల్సి వుందన్నారు.

     వివాహం అంటే అనుకున్నతరువాత ఆగలేని వారు చివరికి ఆంజనేయ స్వామి గుడిలో అయినా 24 గంటల లోపే చేసుకోవచ్చు. కానీ విడాకులు అలా కాదు. చట్ట ప్రకారమే కనీస వ్యవధి, పెద్ద తతంగం వుంటుంది. అలాగే ఐరోపా యూనియన్‌ నుంచి ఏ సభ్య దేశమైనా విడిపోవాలన్నా అన్నీ సక్రమంగా జరిగితే అనే షరతుకు లోబడి లావాదేవీల పరిష్కారానికి కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది. అవసరమనుకుంటే ఆ వ్యవధిని ఇంకా పొడిగించుకోవచ్చు. లేదూ ఏదో తొందర పడి విడిపోవాలనుకున్నాం, ఇంకా నోటీసు ఇవ్వలేదు కనుక కొనసాగే అవకాశం ఇవ్వాలని అని బ్రిటన్‌ కోరుతుందా ? ఇంతవరకు ఏ దేశమూ అలా అడిగిన దాఖలా లేదు కనుక అటువంటి పరిస్థితే వస్తే ఏం చేస్తారో చూడాల్సి వుంది. విడిపోవాలి, కలసి వుండాలి అని ఓటు చేసిన వారి మధ్య తేడా కొన్ని లక్షలు మాత్రమే.ఫలితాలు వెల్లడైన తరువాత అనేక మంది తాము ఆలోచించకుండానే ఓట్లు వేశామని గగ్గోలు పెడుతున్నారు. ఐదు ప్రాంతాలలో ఇంగ్లండ్‌, వేల్స్‌లో మెజారిటీ విడిపోవటానికి ఓటు వేయగా లండన్‌, స్కాట్లండ్‌, వుత్తర ఐర్లండ్‌ ప్రాంతాల వారు అత్యధికులు కలసి వుండటానికి మొగ్గు చూపారు.అయితే మొత్తం జనాభాలో ఇంగ్లండ్‌లోనే 53శాతం వున్నందున అక్కడి వారు స్వల్ప మెజారిటీతో విడిపోవటానికి మొగ్గు చూపినా మొత్తం ఫలితాన్ని వారే నిర్ణయించారు. విడిపోవాలనే నిర్ణయ పర్యవసానాల గురించి గగ్గోలు పెడుతున్న జనం తిరిగి ఓటింగ్‌ జరపాలని ప్రభుత్వానికి విన్న వించుకున్నారు. రాజ్యాంగం ప్రకారం లక్ష మంది ఏదైన ఒక పిటీషన్‌పై సంతకం చేస్తే దానిపై పార్లమెంట్‌లో చర్చ జరగాలి. అలాంటిది పిటీషన్‌పై సంతకాలు ప్రారంభమైన కొన్ని గంటలలోనే పన్నెండు లక్షల మంది సంతకాలు చేయటానికి ఒకేసారి పూనుకోవటంతో అధికారిక వెబ్‌సైట్‌ కుప్పకూలింది.

   బ్రిటన్‌ సామాన్య జనం ఎటువైపు మొగ్గారు ?ప్రాధమిక విశ్లేషణలను బట్టి అక్కడి వెనుక బడిన ప్రాంతాల జనం ఎక్కువ మంది విడిపోవటానికి ఓటు వేశారు. పరిశ్రమలు మూతపడటం తప్ప తెరవని, కొత్త పెట్టుబడులను నోచుకోని ప్రాంతాలు, ఐరోపా యూనియన్‌ నిబంధనల పేరుతో అమలు జరుపుతున్న పొదుపు చర్యలకు ఎక్కువగా ప్రభావితులైన వారు, ఇక్కడ వున్నవారే దారిద్రరేఖకు దిగువకు దిగిపోతుంటే ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చేవారిని అనుమతిస్తారా అంటూ అసంతృప్తికి గురైన వారు ఇలా ఏదో ఒక కారణంతో ప్రతికూల పర్యవసానాలకు ప్రభావితులైన వారందరూ విడిపోవటానికే మొగ్గు చూపారు. దీని పర్యవసానాల గురించి అనేక వ్యాఖ్యానాలు పరస్పర విరుద్దంగా వెలువడుతున్నాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానం మాదిరి అనిపించినప్పటికీ సంక్షిప్తంగా ఎలా వున్నాయో చూద్దాం.

   విడిపోయేందుకు మొగ్గు చూపారనగానే ప్రపంచ వ్యాపితంగా స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి. తరువాత స్వల్పంగా కోలుకున్నప్పటికీ వెంటనే అనిశ్చితి తొలగలేదు. తక్షణమే అతిగా స్పందించినట్లు కొందరు భావించారు. ఐరోపా చీకట్లోకి పోనుంది, ఐరోపా నాయకులు అసలు సమస్యలపై దృష్టి సారించకపోతే 1933 నాటి ఆర్ధిక సంక్షోభానికి దారి తీయవచ్చు. ఐరోపా తిరిగి అభివృద్ధి బాట పడుతుంది. ఐదు సంవత్సరాలలో బ్రిటన్‌ సమాఖ్యగా వుండజాలదు. స్కాట్లండ్‌ స్వతంత్ర దేశంగా మారి ఐరోపా యూనియన్‌లో చేరుతుంది. ఐర్లండ్‌లో వుత్తర ఐర్లండ్‌ విలీనం అవుతుంది. బ్రిటన్‌ తిరిగి పూర్వ వైభవం పొందుతుంది. అనేక దేశాలు ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోతాయి. అమెరికా-బ్రిటన్‌ మధ్య ప్రత్యేక అనుబంధం మరింత గట్టి పడవచ్చు, అమెరికా సాయంతో తన పలుకుబడి పెంచుకొనేందుకు బ్రిటన్‌ ప్రయత్నిస్తుంది. నాటోను సాధనంగా చేసుకుంటుంది. అమెరికా ఇతర దేశాలతో సంబంధాలు పెట్టుకుంటుంది. బ్రిటన్‌ రానున్న ఐదు నెలల కాలంలో మాంద్యంలోకి జారిపోతుంది. అనేక దేశాలను అది ప్రభావితం చేస్తుంది. ఐరోపా అంతటా ప్రజాకర్షక నినాదాల పార్టీలకు ఆదరణ పెరుగుతుంది. జర్మనీ మరింత పలుకుబడి కలిగిన దేశంగా మారుతుంది. మిగతా దేశాలు కూడా పలుకుబడి పెంచుకొనేందుకు ప్రయత్నిస్తాయి.ఐరోపా యూనియన్‌ పెత్తనాన్ని తగ్గించేందుకు పూనుకుంటాయి. ఐదు సంవత్సరాలలో ఐరోపా ప్రపంచ శక్తి స్ధానాన్ని కోల్పోతుంది. ఐరోపా ఐక్యత దెబ్బతిని రష్యా పలుకుబడి పెరగవచ్చు. పుతిన్‌ మరింత బలపడతారు .ఈ పరిణామం అమెరికా నాయకత్వంలోని నాటోను మరింత పటిష్ట పరచవచ్చు. ఐరోపా యూనియన్‌ మరిన్ని రక్షణ చర్యలను తీసుకోవచ్చు. జనం పొదుపు చర్యలను తగ్గించమని డిమాండ్‌ చేస్తారు. స్పెయిన్‌, పోర్చుగల్‌, ఇటలీ వామపక్షం వైపు వెళ్ల వచ్చు. డాలరు బలపడి, వాణిజ్యలోటు, జాతీయ వాదాలు పెరగవచ్చు.

    బ్రిటన్‌ నిర్ణయ ప్రభావం భారత్‌పై ఎలా పడుతుందనేది కూడా మిశ్రమ స్పందనగా వుంది. దీని గురించి రానున్న రోజుల్లో మరింత స్పష్టత రావచ్చు. సోమవారం నాడు జరిగే ఐరోపా యూనియన్‌ సమావేశం తరువాత అనేక అంశాలపై మరింత వివరణ, విశ్లేషణలు వెలువడతాయి. ఇప్పుడు చేసే వన్నీ కూడా అయితే గియితే అన్న అంచనాలపైనే వుంటాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d