• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: china communist party

హాంకాంగ్‌ ఆందోళన వెనుక అసలు కధ ఏమిటి ?

19 Wednesday Jun 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, UK, USA

≈ Leave a comment

Tags

Carrie Lam, china communist party, HONG KONG, Hong Kong Extradition Bill, Hong kong protests, Umbrella Movement

Image result for Hong kong protests

ఎం కోటేశ్వరరావు

హాంకాంగ్‌ ఈ మధ్య ప్రపంచ వార్తల్లోకి వచ్చిన ప్రాంతం. అక్కడ ప్రస్తుతం జరుగుతున్న ఆందోళన వార్తలను చదివేవారికి అదొక ప్రత్యేక దేశం అనే భ్రమ కలిగే అవకాశం వుంది. ఎందుకంటే అక్కడ నేరాలకు పాల్పడిన వారిని విచారించేందుకు చైనా ప్రధాన భూభాగానికి పంపేందుకు హాంకాంగ్‌ పాలనా వ్యవస్ధ ఒక బిల్లును ఆమోదించేందుకు గత కొన్ని నెలలుగా అవసరమైన చర్యలను చేపట్టింది. ఇంకేముంది మా స్వేచ్చకు ముప్పు వచ్చింది అని బిల్లును వ్యతిరేకించిన వారు ఆందోళనకు దిగారు.నిజమే అన్యాయం అంటూ అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు వారికి మద్దతు పలికాయి. జనంలో తలెత్తిన వుద్రేకాలను తగ్గించేందుకు బిల్లును తాత్కాలికంగా పక్కన పెట్టి చర్చలు జరుపుతామని ప్రత్యేక పాలనా అధికారి ప్రకటించిన తరువాత కూడా ఆందోళనలు ఆగలేదు, ప్రత్యేక స్వయం ప్రతిపత్తి, స్వాతంత్య్రం అంటూ డిమాండ్లను ముందుకు తెస్తున్నారు. పోలీసులను రెచ్చగొట్టి శాంతి భద్రతల సమస్యగా మార్చేందుకు కొట్లాటలకు దిగుతున్నారు. దీన్ని బట్టి నేరస్ధుల అప్పగింత కంటే మించిన అంశాలు ఈ ఆందోళన వెనుక వున్నాయన్నది స్పష్టం.గత మూడు దశాబ్దాలుగా హాంకాంగ్‌ను అడ్డం పెట్టుకొని విదేశాలు చైనా మీద వత్తిళ్లు తెస్తున్నాయంటే అతిశయోక్తికాదు. హాంకాంగ్‌ న్యాయవ్యవస్ధలో వున్న లోపాలను సరి చేసేందుకు, నేరాలకు సంబంధించి పరస్పరం సహకరించుకొనేందుకు గాను నేరస్ధుల అప్పగింతతో సహా మరికొన్ని అంశాలను దానిలో పొందుపరిచారు.నేరగాండ్లను ఒక్క చైనా ప్రధాన భూభాగానికే కాదు, తైవాన్‌కు సైతం అప్పగించేందుకు కూడా దానిలో నిబంధనలను పొందుపరిచారు. ఆందోళనల పూర్వరంగంలో బిల్లును వాయిదా వేయటం, చర్చలు జరుపుతామన్న ప్రకటనను చైనా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ‘స్వేచ్చ కోసం జరిగే ప్రపంచ యుద్ధంలో ముందు పీఠీన జరిగే పోరులో హాంకాంగ్‌ ‘అనే శీర్షికతో అమెరికాకు చెందిన టైమ్‌ పత్రిక ఒక ముఖచిత్ర కధనాన్ని ప్రచురించింది.

ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పోరుకు నాయకులెవరూ లేరని, దానంతట అదే తలెత్తిన విద్యార్ధులు, యువకుల వుద్యమం అని ప్రపంచ మీడియాలో కథనాలను వండి వారుస్తున్నారు. జూన్‌ పన్నెండవ తేదీ ప్రదర్శనల గురించి టైమ్‌ కధనం ఇలా ప్రారంభం అయింది. గుమికూడిన గుంపులు కేవలం ఒక గాలివానను తట్టుకొనేందుకు అవసరమైన ఏర్పాట్లతోనే రాలేదు, అలాంటిదొకటి వస్తుందని వారు లెక్కవేసుకుంటున్నారు. వర్షం ప్రారంభం కాగానే ‘గా యావ్‌ ‘ అంటూ గొడుగులు పట్టుకున్నవారందరూ ఒక్కసారిగా కేకలు వేశారు.( దాని అర్ధం అగ్నికి ఆజ్యం పోయండి అని) కొద్ది గంటల్లోనే వచ్చిన అనేక గుడారాలతో తాత్కాలిక రక్షణ శిబిరాలు తయారయ్యాయి. పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించినా, పెప్పర్‌ స్ప్రే చల్లినా తప్పించుకొనేందుకు ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. ఇలాంటి ఆందోళన అసంఘటితమైనదని, ఎవరూ వెనుక లేరని లోకాన్ని నమ్మింప చూస్తున్నారు. తొంభై తొమ్మిదిసంవత్సరాల పాటు బ్రిటీష్‌ వారి పాలనలో ఎలాంటి హక్కులూ లేనపుడు అక్కడి వారికి స్వేచ్చ, స్వాతంత్య్రాలు కావాలని అనిపించలేదు. ఎలాంటి ప్రజావుద్యమాలూ జరపలేదు. ఆకస్మికంగా చైనాలో విలీనమైన తరువాత వాటికోసం వారు ఆందోళన ప్రారంభించారని ప్రపంచానికి చెబుతున్నారు.

హాంకాంగ్‌ చైనాలో అంతర్భాగమే అయినప్పటికీ ఒక ప్రత్యేక పాలిత ప్రాంతం. తొంభై తొమ్మిది సంవత్సరాల బ్రిటీష్‌ వారి కౌలు గడువు ముగిసిన తరువాత 1997లో అది చైనాలో విలీనమైంది. అయితే అది ఒక అంతర్జాతీయ ఓడరేవుగా, పెద్ద వాణిజ్య కేంద్రంగా అప్పటికే అభివృద్ధి చెంది వున్న కారణంగా, దాని తరువాత పోర్చుగీసు నుంచి అదే మాదిరి కౌలు గడువు తీరిన తరువాత చైనాలో విలీనం అయ్యే మకావో దీవులు, అప్పటికే తిరుగుబాటు రాష్ట్రంగా వున్న తైవాన్‌ సమస్యలను దృష్టిలో వుంచుకున్న చైనా కమ్యూనిస్టు పార్టీ ఎన్నో తర్జన భర్జనల తరువాత ఒక వైఖరిని తీసుకుంది. ఒకే దేశం-రెండు వ్యవస్ధలు అని దాన్ని పిలిచారు. హాంకాంగ్‌ వాణిజ్య ప్రాంతంగా అభివృద్ధి చెందితే, మకావో పెద్ద జూదకేంద్రంగా వలసపాలనలో మారింది. అందువలన అక్కడ వున్న ప్రత్యేక పరిస్ధితులు, పెట్టుబడులు, ఇతర సామాజిక అంశాలను గమనంలో వుంచుకొని 2050 వరకు అక్కడ వున్న పెట్టుబడిదారీ వ్యవస్ధను కొనసాగనిస్తామని, ఇతర దేశాల సంస్ధలతో మాదిరి అక్కడి కార్పొరేట్లు ప్రధాన భూభాగంలో పెట్టుబడులు పెట్టవచ్చని, వాటికి హామీ ఇస్తామని పాలక కమ్యూనిస్టు పార్టీ ఒక ఒప్పందం ద్వారా భరోసా ఇచ్చింది. విలీనాన్ని చైనా ఆక్రమణగా వక్రీకరిస్తున్నారు. ఆ గడువు మరో 30దశాబ్దాలలో ముగిసి చైనా సమాజంలో పూర్తిగా అంతర్భాగం కావాల్సివుంది. గడువు దగ్గర పడుతున్నకొద్దీ సాఫీగా హాంకాంగ్‌ను ఆవైపు నడిపేందుకు చైనా ప్రయత్నిస్తుండగా వేర్పాటు ధోరణులను రెచ్చగొట్టేందుకు, పరిస్ధితులను సంక్లిష్టం గావించేందుకు విలీన వ్యతిరేకశక్తులు, వారికి మద్దతు ఇస్తున్న అమెరికా, తదితర పశ్చిమ దేశాలు కూడా ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపధ్యాన్ని అర్ధం చేసుకుంటేనే అక్కడి పరిణామాలు అర్ధం అవుతాయి.

బ్రిటీష్‌ పాలకులు హాంకాంగ్‌ను తమ వలసగా చేసుకున్న తరువాత ఏ రకమైన ప్రజాస్వామిక వ్యవస్ధనూ అమలు జరిపేందుకు వారెలాంటి ప్రయత్నమూ చేయలేదు. నామ మాత్ర పాలనా మండళ్లను ఏర్పాటు చేశారు, అదీ ధనికులకు మాత్రమే పరిమితంగా ఓటింగ్‌ హక్కు ఇచ్చారు, నామినేటెడ్‌ బోర్డులను ఏర్పాటు చేశారు. 1948లో చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు, చాంగ్‌ కైషేక్‌, అతని నాయకత్వంలోని మిలిటరీ, బ్రిటన్‌, ఇతర సామ్రాజ్యవాద దేశాల మద్దతుతో తైవాన్‌కు పారిపోయి దాన్ని స్ధావరంగా చేసుకొని చైనా పేరుతో అక్కడి నుంచి పాలన ప్రారంభించారు.ఐరాస కూడా 1970వరకు దానినే అసలైన చైనాగా గుర్తించింది. 1950 దశకంలో బ్రిటీష్‌ వారు హాంకాంగ్‌లో ప్రజాస్వామిక వ్యవస్ధను ఏర్పాటు చేస్తామంటూ ఒక ప్రతిపాదన చేశారు. ఆ ప్రాంతాన్ని మరొక తైవాన్‌ మాదిరి తిరుగుబాటు ప్రాంతంగా చేయాలనే ఎత్తుగడ దాని వెనుక వుంది. అందుకే చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించి గడువు మీరే వరకు ఒక వలస ప్రాంతంగానే వుంచాలి తప్ప మరొకవిధంగా చేయకూడదని స్పష్టం చేసింది. దాంతో వెనక్కు తగ్గిన బ్రిటీష్‌ వారు, 1997గడువు దగ్గరపడే కొద్ది స్వయంప్రతిపత్తి, ప్రజాస్వామిక వ్యవస్దల ఏర్పాటుకు తాము మద్దతు ఇస్తామని ప్రకటించి అసమ్మతికి బీజాలు నాటారు. చైనాలో విలీనమైన తరువాత కమ్యూనిస్టు ప్రభుత్వం ప్రత్యేక పాలనా మండలికి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరుపుతూ అందరికీ ఓటు హక్కు కలిగించింది. పైకి ఏమి చెప్పినప్పటికీ చైనాలో విలీనాన్ని వ్యతిరేకించే వారు, అనుకూలించేవారిగా చీలిపోయి పోటీ చేయటం ప్రారంభించారు. ప్రస్తుతం చైనాలో విలీనానికి మొగ్గుచూపే వారు పాలకమండలిలో మెజారిటీగా వున్నారు.

తాజా ఆందోళన వెనుక అమెరికా, మరికొన్ని దేశాలు వున్నాయన్నది చైనా అభిప్రాయం. బిల్లును సమర్ధించేవారు నడుపుతున్న వెబ్‌సైట్‌ మీద దాడి జరిపిన వారి మూలాలు అమెరికాలో కనిపించాయి.మార్చినెలలో ఈ బిల్లును హాంకాంగ్‌ పాలక మండలికి సమర్పించిన వెంటనే స్పందించిన తొలి విదేశం అమెరికాయే. ఒక వేళ బిల్లును ఆమోదించినట్లయితే హాంకాంగ్‌కు కల్పిస్తున్న ప్రత్యేక సదుపాయాల రద్దు గురించి ఆలోచించాల్సి వుంటుందని అమెరికా ప్రజాప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ బెదిరించారు. బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా కూడా అదేబాటలో నడిచాయి. జపాన్‌లో త్వరలో జరిగే జి20 సమావేశాల్లో తమ అధ్యక్షుడు ఈ అంశాన్ని లేవనెత్తుతారని అమెరికా విదేశాంగ మంత్రి మంత్రి మైక్‌ పాంపియో ప్రకటించారు. బిల్లును వక్రీకరిస్తూ హాంకాంగ్‌ అంతటా అనేక కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. విద్యార్ధులు, ఇతరులను రెచ్చగొట్టేవిధంగా వాటి రాతలున్నాయి. ఈ బిల్లును గనుక ఆమోదిస్తే నిరుద్యోగం పెరుగుతుందని, మతాన్ని అణచివేస్తారని, ఇతర దేశాలకు వీసాలతో నిమిత్తం లేకుండా వెళ్లే అవకాశాలు రద్దవుతాయంటూ వాటిలో పేర్కొన్నారు. నిజానికి అలాంటి అంశాలే బిల్లులో లేవు. ఆ బిల్లు చట్టంగా మారితే నేరస్ధులకే కాదు, సామాన్య పౌరులకూ తరువాత పొడిగిస్తారు, నగరంలో ప్రవేశించే వారందరూ అనుమతి పాస్‌లు తీసుకోవాల్సి వుంటుంది. అందువలన మరోసారి నేను ఇక్కడకు రావాలా లేదా అని ఆలోచించుకోవాల్సి వస్తుంది అని అమెరికా మాజీ దౌత్యవేత్త సీన్‌ కింగ్‌ వంటి వారు తప్పుడు ప్రచారాలు చేశారు. వుఘీర్స్‌లో కమ్యూనిస్టు పార్టీ ఆదేశాలను పాటించని వారిని పదిలక్షల మందిని నిర్బంధించారు, టిబెట్‌ బౌద్ధ వారసత్వాన్ని లేకుండా చేస్తున్నారంటూ జనాన్ని నమ్మించేందుకు ప్రయత్నించారు.

2016లో హాంకాంగ్‌ పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆరుగురు చైనా వ్యతిరేకులు, హాంకాంగ్‌ వేర్పాటు వాద సభ్యులు ఒక వేదికగా చేసుకున్నారు. హాంకాంగ్‌ చైనా కాదు అని ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. హాంకాంగ్‌ దేశానికే తాము విధేయులమై వుంటామని ప్రమాణస్వీకారాన్ని అపహాస్యం చేశారు. చైనాను అవమానపరిచారు. దాన్నొక వుపన్యాస వేదికగా మార్చివేశారు. వారి ప్రమాణ స్వీకారం చెల్లదని అధికారులు ప్రకటించారు. అయితే వారి ప్రవర్తన సరిదిద్దుకొనేందుకు అవకాశం ఇస్తూ మరోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం ఇచ్చారు. వారు దాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ తాము చేసింది తప్పుకాదంటూ సమర్ధించుకున్నారు. ఈ వివాదం కోర్టుకు వెళ్లింది. అక్కడి న్యాయమూర్తి వేర్పాటు వాదులకు వూతమిచ్చే విధంగా తీర్పు చెప్పారు. అంతకు ముందు హాంకాంగ్‌ కేంద్రంగా వున్న పుస్తక ప్రచురణకర్తల అరెస్టును వివాదం చేశారు. హాంకాంగ్‌ మరియు బ్రిటీష్‌ పౌరసత్వం వున్న ఇద్దరు చైనీయులు పుస్తక ప్రచురణ పేరుతో చైనా వ్యతిరేకతను, అశ్లీలంతో సహా అన్ని రకాల అరాజకత్వాన్ని రెచ్చగొట్టే విధంగా సాగిన రచనలను అక్రమంగా ముద్రించి పంపిణీ చేశారు. వారు సరైన పత్రాలు లేకుండా చైనాలో ప్రవేశించి అధికారులకు దొరికిపోయారు, అలాంటి వారే మరో ముగ్గురిని చైనా నిర్బంధించింది. ఈ విషయాలు వెలుగులోకి వచ్చిన తరువాత బ్రిటన్‌తో సహా ఇతర చైనా వ్యతిరేకులు మానవహక్కులు, స్వేచ్చ అంశాలను ముందుకు తెచ్చారు తప్ప వారి చైనా వ్యతిరేకచర్యలను మరుగుపరిచారు. వారిని చైనా అధికారులే అపహరించారని ఆరోపించారు. ఐదుగురిలో ఒకడు తమ పౌరుడేనని చైనా ప్రకటించింది. వారు హాంకాంగ్‌ తిరిగి వచ్చిన తరువాత అంతకు ముందు చేసిన ప్రకటనకు భిన్నంగా తమ చేత చైనాలో బలవంతంగా నేరాన్ని అంగీకరింప చేయించారంటూ మీడియా ముందు ప్రకటించి చైనా వ్యతిరేకతను వెల్లడించుకున్నాడు. ఈ పూర్వరంగంలోనే ఇలాంటి వారిని చైనాలో విచారించేందుకు వీలుగా అప్పగింత బిల్లు వచ్చిందని గమనించాలి. ఎక్కడ నేరం చేస్తే అక్కడే విచారించాలనే పేరుతో ఇలాంటి నేరస్ధులను రక్షించేందుకు చైనా వ్యతిరేకులు ప్రయత్నిస్తున్నారు. పుస్తక ప్రచురణ కర్తలు స్ధానిక అంశాల మీద పుస్తకాలు ప్రచురించి అక్రమాలకు పాల్పడితే అక్కడే విచారించాలని అంటే అర్ధం వుంది. సమంజసం కావచ్చు, చైనాలో హాంకాంగ్‌ అంతర్భాగం అయినపుడు సదరు చైనా సర్కార్‌ను కూల్చివేయాలని, కమ్యూనిస్టు పార్టీని అంతం చేయాలని అక్కడ మానవహక్కులు లేవని దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినపుడు, స్దానిక చట్టాలు పటిష్టంగా లేనపుడు ఏమి చెయ్యాలన్నది సమస్య.

రాజకీయ పరమైన ఈ సమస్యలు ఇలా వుండగా 2018 ఫిబ్రవరిలో జరిగిన ఒక నేరం బిల్లు రూపకల్పనలకు నాంది పలికిందని చెప్పవచ్చు. హాంకాంగ్‌కు చెందిన ఒక యువకుడు తన స్నేహితురాలితో కలసి తైవాన్‌ వెళ్లి అక్కడ ఆమెను హత్య చేసి హాంకాంగ్‌ తిరిగి వచ్చాడు. చిన్న చిన్న నేరాలకు జైలు పాలయ్యాడు. ప్రస్తుతం వున్న చట్టాల ప్రకారం హాంకాంగ్‌ వెలుపల జరిపిన నేరాలకు గాను నిందితులను హాంకాంగ్‌లో విచారణ జరపటానికి లేదు. అందువలన అతని మీద విచారణ జరపాలంటే తైవాన్‌కు పంపాలి. ఈ పూర్వరంగంలో ఈ బిల్లును రూపొందించారు.

Image result for Hong kong protests

ఈ బిల్లు మీద తలెత్తిన వ్యతిరేకతను, దాని వెనుక వున్న శక్తుల ఎత్తుగడలను గమనించిన చైనా, హాంకాంగ్‌ అధికారులు ఎంతో సంయమనంతో వ్యవహరించారు. ఎంతగా రెచ్చగొట్టి హింసాపూరితంగా మార్చాలని చూసినా దానికి వీలులేకుండా చూశారు. ఆందోళనలో పాల్గొన్నవారి సంఖ్య గురించి బయటి మీడియా చిలవలు పలవలుగా వర్ణించింది. అంత సీను లేకపోయినా గణనీయ సంఖ్యలో పాల్గొనటాన్ని గమనించిన చైనా నాయకత్వం తాత్కాలికంగా బిల్లును వాయిదా వేయాలని సలహా ఇచ్చింది. వాయిదా కాదు, పూర్తిగా రద్దు చేయాలనే ఆందోళన ఇప్పుడు సాగుతోంది. ప్రస్తుతం చైనాను లొంగదీసుకొనేందుకు అమెరికన్లు వాణిజ్య యుద్దాన్ని తీవ్రతరం చేయటంతో పాటు అనుకోకుండా వచ్చిన హాంకాంగ్‌ బిల్లును కూడా వుపయోగించుకొనేందుకు పూనుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆందోళనకు నాయకత్వం వహిస్తున్నవారు ఈ ఏడాది మార్చినెలలో అమెరికాను సందర్శించి మద్దతు కోరారు. దాని పర్యవసానమే అమెరికా జోక్యం, బెదిరింపులు అన్నది స్పష్టం. అమెరికా లేదా మరొక దేశం గానీ నేటి చైనా గురించి తక్కువ అంచనా వేస్తున్నారు. హాంకాంగ్‌ను బ్రిటీష్‌ వారికి కౌలుకు ఇచ్చిన నాటి స్ధితిలో చైనా వుందనుకుంటే పప్పులో కాలేసినట్లే అని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. సున్నితమైన ఈ సమస్యను చైనా నాయకత్వం ఎంతో జాగ్రత్తగా చూస్తోంది. ఒక్క ఈ విషయంలోనే కాదు, ఇతర అంశాలలో కూడా దీనిని గమనించవచ్చు.

మన దేశంలో పోలీసు చర్యతో సంస్ధానాలను విలీనం చేసినట్లుగా, రష్యా పాలకులు క్రిమియాను స్వాధీనం చేసుకున్నట్లుగా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ను మిలిటరీ చర్యద్వారా చైనాలో విలీనం చేయటం పెద్ద సమస్య కాదు. దాని వెనుక వున్న సామ్రాజ్యవాదుల హస్తం, ఇతర అంశాలను గమనంలో వుంచుకోవటంతో పాటు ఆయా ప్రాంతాలలోని జన అంగీకారం, మద్దతు ముఖ్యం. విశృంఖలమైన పెట్టుబడిదారీ వ్యవస్ధలో పెరిగిన వారు ఒక క్రమశిక్షణకు వెంటనే సిద్ధం కావటం చిన్న విషయం కాదు. అందువలన బలప్రయోగం మార్గం కాదనే చైైతన్యాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రదర్శిస్తోంది. తైవాన్‌, హాంకాంగ్‌, మకావోల్లో సామ్రాజ్యవాదుల కుట్రలను తిప్పికొట్టేందుకు వ్యవధి పట్టవచ్చుగాని, వాటి కుట్రలకు వమ్ము చేసి ఆ ప్రాంతాలను కాపాడుకోవటం అనివార్యం !

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాలుగు దశాబ్దాల చైనా సంస్కరణలు 3 : చైనా లక్షణాలతో సోషలిజం అంటే ఏమిటి !

24 Monday Dec 2018

Posted by raomk in CHINA, Current Affairs, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ 1 Comment

Tags

china communist party, china reforms, Forty years of China Reforms, Socialism with Chinese Character

Image result for forty years china reforms

ఎం కోటేశ్వరరావు

మన దేశంలో కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన కమ్యూనిస్టు వుద్యమ సైద్ధాంతిక చర్చలో రష్యా మార్గం, చైనా మార్గం అనే మాటలు వినిపించేవి. సారాన్ని సులభంగా అర్ధం చేసుకొనేందుకు ఆ పదజాలాన్ని వాడినప్పటికీ దేశంలో సోషలిజాన్ని ఎలా తీసుకురావాలి అనేదే ఆ చర్చ. కొందరు మాది చైనా మార్గం మావోయే మా చైర్మన్‌ అనేంత వరకు వెళ్లగా మరికొందరు తమది రష్యా మార్గమన్నారు. వామపక్ష వుద్యమంలో ప్రధాన భాగంగా వున్న సిపిఐ(ఎ) తమది చైనా కాదు రష్యా కాదు భారత మార్గం అని స్పష్టం చేసింది. అంటే ఏ దేశంలో వున్న పరిస్ధితులను బట్టి దానికి అనుగుణ్యంగా విప్లవశక్తుల కార్యాచరణ వుండాలి తప్ప ఏదో ఒక దేశాన్ని అనుసరించటం కాదని చెప్పటమే. అయితే ఆ మార్గం మంచి చెడ్డలు, అనుసరిస్తున్న ఎత్తుగడలు, విధానాల గురించి ఎవరైనా విమర్శించవచ్చు, విబేధించవచ్చు, చర్చించి పరిపుష్టం చేయవచ్చు అది వారికి వున్న స్వేచ్చ. చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం తరచూ చేసే వ్యాఖ్యానాలలో చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్ద నిర్మాణం, సమాజం వంటి అంశాలుంటాయి.

నిజానికి ఇది సైద్ధాంతిక అవగాహనకు సంబంధించినది. ఆచరణకు రానంత వరకు ఏ కొత్త భావజాలమైనా ఎంతగానో ఆకర్షిస్తుంది, ఆదర్శంగా వుంటుంది. దూరం నుంచి చూస్తే కొండలు ఎంతో మనోహరంగా కనిపిస్తాయి. వాటి దగ్గరకు వెళ్లి ఎక్కాల్సివచ్చినపుడు ఆచరణాత్మక సమస్యలు ఎదురవుతాయి. శక్తి రూపాలను మార్చుకున్నట్లుగానే దోపిడీ రూపాలు మారవచ్చు గానీ అనుమతించే వ్యవస్ధలున్న చోట దోపిడీ అంతం కాదు.మార్క్సిజం-లెనినిజం సిద్ధాంతం-ఆచరణకు సంబంధించి శాస్త్రీయమైనది. ఈ సిద్ధాంతాన్ని ఆయా దేశ, కాల పరిస్ధితులకు అన్వయించుకోవాల్సి వుంది. చైనా కమ్యూనిస్టు పార్టీ విప్లవం ద్వారా అధికారాన్ని పొంది నూతన వ్యవస్ధ నిర్మాణానికి పూనుకుంది. సుదీర్ఘంగా సాగిన విప్లవకాలంలోనూ తరువాత మూడు దశాబ్దాల వరకు మావోఆలోచనా విధానం పేరుతో చైనా పరిస్దితులకు అన్వయించిన అంశాలను అమలు జరిపారు. మావో బతికి వుండగానే వచ్చిన అనుభవాల ప్రాతిపదికగా మావో మరణం తరువాత అధికారానికి వచ్చిన డెంగ్‌సియావో పింగ్‌ హయాంలో సంస్కరణల విధానాన్ని అనుసరించారు. అప్పటి నుంచి చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం అంటున్నారు. నలభై సంవత్సరాల క్రితం ప్రారంభమైన చైనా సంస్కరణలు ఇప్పుడు 1980దశకం మాదిరే వుండవు. ఇప్పటి అవసరాలకు తగిన మార్పులు చేర్పులు వుండాలి. జనాభా అవసరాలకు అనుగుణంగా వుపాధి, కనీస అవసరాలు తీరాలంటే ఆర్ధిక వ్యవస్ధ వేగంగా అభివృద్ధి చెందాలి. కమ్యూనిస్టు పార్టీ రాజకీయ అధికారం కింద సోషలిజానికి కట్టుబడి వుంటూనే మార్కెట్‌ సంస్కరణలను అమలు జరిపేందుకు పూనుకున్నారు. ఈ క్రమంలో కొన్ని రాజీలు పడ్డారు.

Image result for forty years china reforms

గతంలో ఏ సోషలిస్టు దేశంలోనూ ఇలాంటి ప్రయోగం జరపలేదు. మార్కెట్‌ విధానాలు పూర్తిగా పెట్టుబడిదారీ వ్యవస్ధ పద్దతుల్లో లేవు, ప్రణాళికలు పూర్తిగా సోషలిస్టు పద్దతిలోనూ లేవు. చైనా సోషలిజం ప్రాధమిక దశలో వుంది, భౌతిక సంపద స్ధాయి తక్కువగా వుంది, సోషలిస్టు సమ సమాజం తరువాత కమ్యూనిస్టు సమాజానికి దారి తీయాలంటే ముందు ఆర్ధిక పురోగతి సాధించాలి, దానికి గాను మార్కెట్‌ ఆర్ధిక విధానాలు సాధనమని అధికారానికి వచ్చిన రెండున్నర దశాబ్దాల తరువాత చైనా కమ్యూనిస్టు పార్టీ అవగాహనకు వచ్చింది. నిజానికి చైనా సోషలిజం ప్రాధమిక దశలో వుందని 1950దశకం చివరిలోనే కమ్యూనిస్టుపార్టీ పేర్కొన్నది. పరివర్తన దశలో వుత్పాదక శక్తులు బలహీనంగా వున్నాయని ఆర్ధికవేత్తలు హెచ్చరించారు. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ వ్యవస్దలలోనే సోషలిస్టు విప్లవం జయప్రదం అవుతుందన్న మార్క్సిస్టు తత్వవేత్తల అంచనా తప్పింది.పురోగామి వుత్పాదక సంబంధాలు వుత్పత్తిని పెంచుతాయన్న మావో ఆలోచన ఆచరణ రూపం దాల్చలేదు. సోవియట్‌ తరహా ప్రణాళికాబద్ద విధానాలు కూడా జయప్రదం కాలేదు. పెట్టుబడిదారీ విధానంలో లాభాలు వచ్చే వాటికే ప్రాధాన్యత వుంటుంది. సోషలిస్టు వ్యవస్దలో ప్రజల అవసరాలకు వుపయోగపడే వస్తూత్పతికి ప్రాధాన్యత వుంటుంది. ఈ రెండింటినీ మేళవించి అమలు జరిపిన విధానం కారణంగా చైనా శరవేగంతో అభివృద్ది చెందుతోంది.

చైనా సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌ 1984చేసిన ఒక వుపన్యాసంలోచెప్పిన అంశాలను మననం చేసుకోవటం అవసరం. వాటి సారాంశం ఇలా వుంది. ప్రజా రిపబ్లిక్‌ ఏర్పాటు చేసే నాటికి పాత చైనాను నాశమైన ఆర్ధికవ్యవస్ధను వారసత్వంగా తెచ్చుకున్నాము. పరిశ్రమలు దాదాపు లేవు. సోషలిజాన్ని ఎందుకు ఎంచుకున్నారని కొందరు అడుగుతారు. పెట్టుబడిదారీ విధానం చైనాలోని గందరగోళాన్ని లేదా దారిద్య్రం వెనుకబాటు తనాన్ని తొలగించదు. అందుకే మార్క్సిజానికి, సోషలిస్టు బాటకు కట్టుబడి వున్నామని పదే పదే చెబుతున్నాము. అయితే మార్క్సిజం అంటే మన అర్ధం చైనా పరిస్ధితులకు దానిని అసుసంధానించటం, సోషలిజం అంటే చైనా పరిస్ధితులకు అనుగుణ్యంగా ప్రత్యేకించి చైనా లక్షణాలతో రూపొందించుకోవటం. సోషలిజం, మార్క్సిజం అంటే ఏమిటి ? గతంలో దీని గురించి అంత స్పష్టత లేదు. వుత్పాదకశక్తుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతతో మార్క్సిజం ముడిపడి వుంది. కమ్యూనిజానికి ప్రాధమిక దశ సోషలిజం అని చెప్పాము. ఆ వున్నత దశలో ప్రతి ఒక్కరూ శక్తి కొద్ది పని చేయటం, అవసరం కొద్దీ వినియోగం వుంటుంది. దీనికి వున్నతంగా అభివృద్ధి చెందిన వుత్పాదకశక్తులు,సరిపడా సరకుల తయారీ అవసరం వుంది. ప్రజా రిపబ్లిక్‌ ఏర్పాటు చేసిన తరువాత వుత్పాద శక్తుల అభివృద్ధికి తగిన శ్రద్ధ పెట్టకపోవటం ఒక లోపం. సోషలిజం అంటే దారిద్య్రాన్ని తొలగించటం, బికారితనం సోషలిజం కాదు. పశ్చిమ దేశాలలో పారిశ్రామిక విప్లవం సంభవించినపుడు చైనా తన తలుపులు మూసుకున్న విధానం అనుసరించింది. విప్లవం తరువాత ఇతర దేశాలు చైనాను దిగ్బంధనం కావించాయి. ఈ స్ధితి ఇబ్బందులను కలిగించింది. చైనా జనాభా 80శాతం గ్రామాలలోనే వుంది. వాటి నిలకడమీదనే చైనా స్ధిరత్వం ఆధారపడి వుంది. విదేశీ పెట్టుబడులు, ఆధునిక సాంకేతిక పద్దతులకు స్వాగతం పలికాము. అవి సోషలిజాన్ని పూర్వపక్షం చేస్తాయా, అవకాశం లేదు, ఎందుకంటే చైనా ఆర్ధిక వ్యవస్ధలో సోషలిస్టు ఆర్ధిక వ్యవస్ధ ప్రధాన భాగం.సహజంగానే విదేశీ పెట్టుబడులతో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. సానుకూల అంశాలతో పోలిస్తే ప్రతికూల ప్రభావాలు అంత ముఖ్యమైనవి కాదు. మరొక సందర్భంలో మాట్లాడుతూ సోషలిజం-పెట్టుబడిదారీ వ్యవస్ధల మధ్య ప్రణాళికా బద్ద మరియు మార్కెట్‌ శక్తులనేవి అనివార్యమైన విభేదం కాదని చెప్పారు. సోషలిజం అంటే ప్రణాళికా బద్ద ఆర్ధిక వ్యవస్ధ అనే నిర్వచనమేమీ లేదని పెట్టుబడిదారీ వ్యవస్ధలో మాదిరి ప్రణాళికాబద్ద మరియు మార్కెట్‌ శక్తుల ఆర్దిక వ్యవస్ధ సోషలిజంలో కూడా వుంటుందని రెండు శక్తులు ఆర్దిక వ్యవస్ధలను అదుపు చేస్తాయన్నారు.

ప్రపంచంలో సమసమాజం ఎలా స్ధాపించాలనే విషయంలో తలెత్తిన సైద్ధాంతిక సమస్యలు దోపిడీని ఎలా కొనసాగించాలనే అంశం మీద వ్యక్తం కాలేదు. ఈ కారణంగానే చైనాలో సాధించిన అభివృద్ధిని స్వాగతించేవారు కూడా ప్రస్తుతం అక్కడ పెరుగుతున్న ఆర్ధిక అసమానతలు, బిలియనీర్లు, ధనికుల సంఖ్యలను చూసి వారెక్కడ విప్లవాన్ని వమ్ము చేస్తారో అని భయపడుతున్నారు. మరోవైపు పెట్టుబడిదారుల్లో చైనా నాయకత్వం గురించి భయ సందేహాలు ఎలా పెరుగుతున్నాయో చూడటం అవసరం. 2018 అక్టోబరు మూడవ తేదీన అమెరికాకు చెందిన న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక ‘ఆధునిక చైనాను నిర్మించిన ప్రయివేటు వాణిజ్యాలు, ఇపుడు వెనక్కు నెడుతున్న ప్రభుత్వం ‘ అనే శీర్షికతో ఒక విశ్లేషణ ప్రచురించింది. ప్రయివేటు వాణిజ్యాలను అనుమతించే బీజింగ్‌ అనుజ్ఞార్ధకం గతకొద్ది సంవత్సరాలుగా అల్లుకుపోతూ ముందుకు సాగింది. నియంతృత్వం(పశ్చిమ దేశాల వ్యాఖ్యాతలు చైనా కమ్యూనిస్టు పాలనను అలాగే వర్ణిస్తారు) మరియు స్వేచ్చా మార్కెట్‌ మధ్య దీర్ఘకాలంగా వున్న వుద్రిక్తలు ఇప్పుడు సందిగ్దబిందువు వద్దకు చేరుకున్నాయని చైనాలో కొందరు చెప్పారని వక్కాణించారు. ఆ విశ్లేషణ ముఖ్యాంశాలు ఇలా వున్నాయి.

వ్యాఖ్యలు మెళకువతో కూడిన భాష వెనుక నక్కాయి, కానీ చైనా దిశ గురించిన హెచ్చరిక స్పష్టంగా వుంది. సంపదలతో పెరిగేందుకు తనలో భాగం మార్కెట్‌ శక్తులను ఆలింగనం చేసుకొన్నది. పొసగని గళాలతో ఇప్పుడు ప్రయివేటు సంస్ధలను ఖండిస్తున్నది. ఈ దృగ్విషయాన్ని గమనించాల్సివుంది అని మార్కెట్‌ అనుకూల ఆర్ధికవేత్త 88 ఏండ్ల వు జింగాలియన్‌ వ్యక్తం చేసిన అసాధారణ అధికారిక స్వరం చైనా వ్యాపార, ఆర్దికవేత్తలు, చివరికి కొంత మంది ప్రభుత్వ అధికారులలో కూడా పెరుగుతున్న ఆందోళనకు ప్రతిధ్వని. ప్రపంచంలో ఆర్ధికంగా రెండవ స్ధానంలోకి తీసుకుపోయిన స్వేచ్చా మార్కెట్‌, వాణిజ్య అనుకూల విధానాల నుంచి చైనా వెనక్కు తగ్గవచ్చు, గత నాలుగు దశాబ్దాలుగా నియంతృత్వ కమ్యూనిస్టు అదుపు మరియు స్వేచ్చగా తిరిగే పెట్టుబడిదారీ విధానం మధ్య చైనా వూగుతోంది. అక్కడ ఏమైనా జరగవచ్చు, లోలకం తిరిగి ప్రభుత్వంవైపే వూగవచ్చని కొందరికి కనిపిస్తోంది.

ఒకప్పుడు ప్రయివేటు వాణిజ్య సంస్దలు ముందుపీఠీన వున్న చోట పారిశ్రామిక వుత్పత్తి,మరియు లాభాలవృద్ధిలో రోజురోజుకూ ప్రభుత్వ అదుపులోని కంపెనీల వాటా పెరుగుతోంది. ఇంటర్నెట్‌ వ్యాపారం, రియలెస్టేట్‌, వీడియోగేమ్స్‌ను నియంత్రించేందుకు చైనా రంగంలోకి దిగింది. కంపెనీలు పన్నుల పెంపుదల, వుద్యోగులు పొందే లబ్ది ఖర్చును ఎక్కువగా భరించాల్సి రావచ్చు. కొందరు మేథావులు ప్రయివేటు సంస్ధలను పూర్తిగా రద్దు చేయాలని పిలుపులనిస్తున్నారు. అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ ప్రయివేటు సంస్ధలకు తమ ప్రభుత్వ మద్దతు వుంటుందని హామీ ఇస్తూ ప్రభుత్వరంగంలోని పెద్ద కంపెనీలకు పూర్తి స్ధాయి మద్దతు ప్రకటించటాన్ని ప్రయివేటు వాణిజ్యాలకు ఇంకచోటు లేదని చెప్పటమే అని అనేక మంది ఆర్ధికవేత్తలు నమ్ముతున్నారు. ప్రభుత్వ రంగ సంస్ధ చైనా నేషనల్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ కేంద్రం ఒకదాని సందర్శన సందర్భంగా గ్జీ మాట్లాడుతూ ‘ ప్రభుత్వ రంగ సంస్ధలు వుండకూడదు, మనకు చిన్న ప్రభుత్వ సంస్ధలే వుండాలి’ అనే ప్రకటనలు తప్పు, ఏకపక్షమైనవి అన్నారు. చైనా అధ్యక్షుడు మిలిటరీ, మీడియా, పౌర సమాజం మీద పూర్తిగా పార్టీ అదుపు వుండాలని కోరతారు. ఇప్పుడు వాణిజ్యం మీద దృష్టి సారిస్తున్నారు. పెద్ద ఇంటర్నెట్‌ కంపెనీలలో నేరుగా వాటాలు తీసుకోవటం గురించి పరిశీలిస్తోంది. విదేశీ కంపెనీలతో సహా అన్నింటిలో కమ్యూనిస్టు పార్టీ కమిటీలకు పెద్ద పాత్ర కల్పించేందుకు నియంత్రణ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

వామపక్ష పండితులు, బ్లాగర్స్‌(వివిధ అంశాల మీద విశ్లేషణలు, అభిప్రాయలు రాసేవారు) ప్రభుత్వ అధికారులు సిద్ధాంతపరమైన, ఆచరణాత్మకమైన మద్దతు తెలియచేస్తున్నారు. ప్రయివేటు యాజమాన్యాలను తొలగించాలని జనవరిలో(2018) బీజింగ్‌లోని రెనిమిన్‌ విశ్వవిద్యాలయ మార్క్సిజం ప్రొఫెసర్‌ జౌ గ్జిన్‌చెంగ్‌ కోరారు. అభివృద్ధి లక్ష్యాన్ని ప్రయివేటు రంగం పూర్తి చేసిందని ఇప్పుడు దానికి స్వస్తి పలకాలంటూ వు గ్జీయపింగ్‌ అనే అంతగా తెలియని బ్లాగర్‌ రాసిన అంశం ఇంటర్నెట్‌లో పెద్ద ఎత్తున ప్రచారం పొందింది. మానవ వనరులు, సాంఘిక భద్రత వుప మంత్రి క్వి గ్జియపింగ్‌ ప్రయివేటు సంస్ధలలో ప్రజాస్వామిక యాజమాన్య పద్దతులు వుండాలని, యజమానులు-కార్మికులు సంయుక్తంగా వాటిని నడపాలని కోరారు. ప్రభుత్వ చర్యల వలన రుణాలపై ఆధారపడి నడిచే ప్రయివేటు కంపెనీలకు డబ్బు దొరకటం కష్టంగా మారింది, ఇదే సమయంలో ప్రభుత్వ రంగ కంపెనీలకు కొత్త రుణాలు పొందటంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కోవటం లేదు. ఒకప్పుడు అసలు వూహల్లోకి కూడా రాని వాటిని ఇప్పుడు కొన్ని ప్రయివేటు సంస్దలు ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది ఇంతవరకు 46 ప్రయివేటు కంపెనీలు సగానికిపైగా వాటాలను ప్రభుత్వానికి విక్రయించినట్లు వార్తలు వచ్చాయి.చైనా ఆర్ధిక వ్యవస్ధతో పోల్చితే సంఖ్య చాలా చిన్నది అయినప్పటికీ ప్రయివేటు కంపెనీలకు వాటాలను విక్రయించే ప్రభుత్వ కంపెనీల రెండు దశాబ్దాల ధోరణికి ఇది వ్యతిరేకం.

Image result for forty years china reforms

కమ్యూనిస్టు పార్టీ ప్రచార విభాగానికి ప్రత్యక్ష పాత్ర కల్పించిన తరువాత కొత్త వీడియో గేమ్స్‌కు అనుమతులు స్ధంభించాయి. ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ కంపెనీ, వీడియో గేమ్‌ల్లో పేరు ప్రఖ్యాతులున్న టెన్‌సెంట్‌ కంపెనీమార్కెట్‌ విలువ దాదాపు మూడోవంతు పడిపోయింది. కొత్తగా తెచ్చిన చట్ట ప్రకారం ఆన్‌లైన్‌ వ్యాపారం చేసే కంపెనీలు ప్రభుత్వం దగ్గర నమోదు చేసుకోవాలి, పన్నులు చెల్లించాలి. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఇంటర్నెట్‌ కంపెనీలలో ఒకటైన అలీబాబా గ్రూప్‌ను దెబ్బతీస్తుంది. ఈ నేపధ్యంలో ప్రభుత్వ కంపెనీలకు ఇది మంచి సంవత్సరం. ప్రభుత్వ సమాచారం ప్రకారం ఏడాది తొలి ఏడునెలల్లో ప్రయివేటు కంపెనీలతో పోటీ పడి మూడురెట్లు లాభాలు సాధించాయి. అధిక సామర్ద్యం, కాలుష్యనివారణ చర్యలు ఎక్కువగా ప్రయివేటు కంపెనీల మీద మోపుతున్న ప్రభుత్వ ప్రయత్నాలు కూడా దీనికి కారణం.

చైనా మ్యూనిస్టు పార్టీ నిర్దేశించిన మార్గంలోనే సంస్కరణలు నడుస్తున్నాయా? లేదూ న్యూయార్క్‌ టైమ్స్‌ విశ్లేషకుడు చెబుతున్నట్లు ప్రభుత్వ రంగ అదుపులోకి తిరిగి చైనా అర్ధిక వ్యవస్ధ వెళ్ల నుందా? ఎంతకాలం పడుతుంది? వీటిన్నింటి గురించి చైనా వెలుపల కూడా చర్చించవచ్చు. అభిప్రాయాలను వెల్లడించవచ్చు. కోర్టు తీర్పులను విమర్శించవచ్చు గానీ న్యాయమూర్తులకు దురుద్ధేశ్యాలను ఆపాదించకూడదు అన్నట్లుగా చైనా కమ్యూనిస్టు నాయకత్వానికి దురుద్ధేశ్యాలను ఆపాదించకుండా వారి విధాన మంచి చెడ్డలను సమీక్షించవచ్చు. సోవియట్‌ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం మాదిరి చైనాలో కూడా తప్పిదాలకు పాల్పడితే అనే పెద్ద సందేహం ఎవరికైనా తలెత్తవచ్చు. ఇప్పటికైతే అది వూహాజనిత సమస్య. సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాల సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసినపుడు సోషలిజం అనే భావజాలానికి కాలం చెల్లిందని అమెరికా ప్రకటించింది. అదే చోట ఇప్పుడు పెట్టుబడిదారీ విధానం పనికిరాదు, అది కాలం చెల్లిన సిద్ధాంతం అని నమ్ముతున్నవారు, సోషలిజాన్ని అభిమానిస్తున్నవారు కూడా రోజు రోజుకూ పెరుగుతున్నారు. సమాజ మార్పుకోరే పురోగామి శక్తులకు తీవ్రమైన ఎదురుదెబ్బలు తగలవచ్చు గాని చరిత్ర ముందుకే పోతుంది, అంతిమ విజయం వారిదే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కమ్యూనిస్టు చైనా – కాథలిక్‌ మతం !

19 Monday Feb 2018

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

catholic religion, china communist party, pope, Pope Francis

Image result for china communist party-catholic religion

ఎం కోటేశ్వరరావు

మతం జనం పాలిట మత్తు వంటిదన్నది కమ్యూనిస్టుల అవగాహన. కమ్యూనిజం మతానికి వ్యతిరేకం అన్నది కాథలిక్‌ మతాధికారుల భాష్యం. అటువంటి రెండు పరస్పర విరుద్ధ శక్తులు కారణాలేమైతేనేం రాజీబాటలో వున్నాయంటే నమ్మబుద్ది కావటం లేదు కదూ ! ఈ పరిణామం గురించి వ్యాఖ్యానించటానికి ఎవరి స్వేచ్చ వారికి వుంది. అనుకూల, వ్యతిరేక తీర్పుల జోలికి పోకుండా అసలేం జరుగుతోందో ముందు చూద్దాం.గత కొద్ది వారాలుగా గతంలో ఎవరి మీదా లేని విధంగా క్రైస్తవులే పోప్‌ ఫ్రాన్సిస్‌పై పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోస్తున్నారు. మతాన్ని మంటగలుపుతున్నారని శాపనార్ధాలు పెడుతున్నారు. పోప్‌ కూడా చివరికి కమ్యూనిస్టు చైనాకు లో0గిపోతున్నారని, ఆ దేశం చెప్పినట్లు నడుచుకుంటున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. అదే జరిగితే గత వెయ్యి సంవత్సరాలుగా పోప్‌ల నియామకంపై పెత్తనం చలాయియిస్తున్న వాటికన్‌ ఓడిపోయినట్లే అని కొందరు రెచ్చగొడుతున్నారు. అది జరిగితే కొందరైతే గొర్రెపిల్లలను తోడేళ్లకు అప్పగిస్తున్న వ్యక్తిగా పోప్‌ను నిందిస్తున్నారు. ఎందుకిలా జరుగుతోంది?

ప్రతి సమాజంలో ఎవరు సుప్రీం, అంతిమ అధికారం ఎవరిది అన్న అంశంపై మతం, రాజ్యాధికారం మధ్య ఏదో ఒక రూపంలో పోరు సాగింది. దోపిడీవర్గ జోక్యంతో రాజీలు, సర్దుబాట్లు జరిగాయి. తమ దోపిడీ సజావుగా సాగటానికి అటు రాజ్యాన్ని, మతాన్ని దోపిడీవర్గం కుడిఎడమల డాల్‌, కత్తుల మాదిరి సహజీవనం చేయిస్తున్నది. గత మూడు సంవత్సరాలుగా చైనా-వాటికన్‌ మధ్య సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వెలువడుతున్నా నిర్ధిష్టంగా ఎలాంటి పురోగతి లేదు. చైనాలో 1948లో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో అధికారానికి వచ్చిన ప్రభుత్వాన్ని 1971 వరకు ఐక్యరాజ్యసమితి గుర్తించలేదు. అమెరికా నాయకత్వంలోని కూటమి చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌నే చైనాగా గుర్తిస్తూ వచ్చింది. బౌద్దమతాధిపతి దలైలామా అమెరికా అడుగుజాడల్లో నడుస్తూ చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని గుర్తించేందుకు నిరాకరించి టిబెట్‌ తన పాలనలోని రాజ్యమంటూ విఫల తిరుగుబాటు చేసి భారత్‌కు పారిపోయి వచ్చాడు. ఇక్కడ ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి టిబెట్‌లో నిత్యం ప్రభుత్వ వ్యతిరేకులతో సంబంధాలు కలిగి వున్నాడు. గతేడాది నవంబరు 23న ఒక ప్రకటన చేస్తూ జరిగిందేదో జరిగిపోయింది, చైనాతో టిబెట్‌ కలసి వుండాలనుకొంటోంది, చైనా అంగీకరిస్తే టిబెట్‌కు తిరిగి వస్తాను అని దలైలామా ప్రకటన చేశారు. కమ్యూనిస్టులు, సోషలిస్టు దేశాలకు వ్యతిరేకంగా రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా ప్రారంభించిన ప్రచ్చన్న యుద్ధంలో భాగంగా కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత చైనా నుంచి హాంకాంగ్‌ పారిపోయి తైవాన్‌, మకావుల్లో బిషప్పుగా పని చేసి రిటైరైన చైనాలోని కాధలిక్‌ మత కార్డినల్‌ జోసెఫ్‌ జెన్‌(86) మాత్రం ససేమిరా రాజీపడేది లేదు అంటున్నారు.

డిసెంబరులో వాటికన్‌ నుంచి చైనా వెళ్లిన ఒక ప్రతినిధి బృందం గ్వాంగ్‌డాంగ్‌ రాష్ట్రంలోని షాంటౌలో బిషప్పుగా పనిచేస్తున్న పీటర్‌ ఝువాంగ్‌ జియాన్‌ జియాన్‌(88)ను బీజింగ్‌లో కలసింది. బాధ్యతల నుంచి వైదొలగి చైనా ప్రభుత్వం నియమించిన పార్లమెంట్‌ సభ్యుడు, బిషప్పు హువాంగ్‌ బింగ్‌ఝాంగ్‌కు బాధ్యతలు అప్పగించేందుకు వీలు కల్పించాలని కోరింది. హువాంగ్‌ను 2011లో వాటికన్‌ అధికారులు మతం నుంచి బహిష్కరించారు. మరోబిషప్పు జోసెఫ్‌ గువో గ్జీజిన్‌ను కూడా తప్పుకోవాలని వాటికన్‌ బృందం కోరింది. 1999తో బ్రిటన్‌ కౌలు గడువు ముగిసిన హాంకాంగ్‌ చైనా ఆధీనంలోకి వచ్చినప్పటికీ విలీనం సందర్భంగా కుదురిన ఒప్పందం ప్రకారం 2050వరకు అక్కడ ప్రత్యేక పాలనా వ్యవస్ధ కొనసాగుతుంది. జోసెఫ్‌ జెన్‌ 2002లో అక్కడ బిషప్పు అయ్యాడు. తరువాత రిటైర్‌ అయిన ఈ మాజీ బిషప్పు చైనాలో హాంకాంగ్‌ విలీన వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతూ రాజకీయాలు చేస్తున్నాడు. దానిలో భాగంగానే సదరు జెన్‌ నాయకత్వంలోని ప్రతినిధి బృందం జనవరి పదిన వాటికన్‌ నగరానికి వెళ్లి అక్కడ పోప్‌ను కలిసింది. చైనా ప్రభుత్వానికి లంగిపోయి వాటికన్‌ గుర్తించిన ఇద్దరు బిషప్పుల స్ధానంలో కమ్యూనిస్టు పార్టీ ఆమోదం వున్న బిషప్పులను నియమించవద్దని వాదించింది. ఈ కలయిక, చర్చల గురించి పశ్చిమ దేశాలు, క్రైస్తవమత కేంద్రాలు, మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. వెయ్యి సంవత్సరాల తరువాత మరోసా రి మతం, రాజ్యం మధ్య ఆధిపత్యపోరు కొత్త రూపంలో ముందుకు వచ్చిందన్నది వాటిలో ఒకటి.

చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత వాటికన్‌ నగరానికి చైనాకు పరస్పర గుర్తింపు, దౌత్య సంబంధాలు లేవు. అయినా వాటికన్‌ అక్కడ ఇంతకాలంగా మత పెద్దలను నియమిస్తూనే వుంది. వారిని చైనా గుర్తించటం లేదు. చట్టవిరుద్ధంగా పని చేస్తున్నవారిగానే భావిస్తున్నది. 1957లో చైనా ప్రభుత్వం కాథలిక్‌ పేట్రియాటిక్‌ అసోసియేషన్‌ పేరుతో ఒక సంస్ధను ఏర్పాటు చేసి దాని ద్వారా బిషప్పు, ఇతర మతాధికారుల నియమాకాన్ని చేపట్టింది. దీన్ని తాము గుర్తించటం లేదని అలాంటి మతాధికారులను బహిష్కరిస్తున్నట్లు 1958లో పోప్‌ 14వ బెండిక్ట్‌ ప్రకటించారు. అప్పటి నుంచి వివాదం కొనసాగుతున్నది. అప్పటి నుంచి అధికార, అనధికార బిషప్పుల నియామకాలు జరుగుతూనే వున్నాయి. అనధికార ప్రార్ధనలపై చైనా సర్కార్‌ క్రమంగా ఆంక్షలను పెంచటం ప్రారంభించింది. వాటికన్‌ అధికారాన్ని గుర్తించేందుకు చైనా ససేమిరా అంటోంది. మొత్తంగా చూసినపుడు ప్రతి మతం ప్రజల పాలిట మత్తు మందే అన్నది స్పష్టం. అయినప్పటికీ కొందరు మతాన్ని సంపూర్ణంగా సంస్కరించలేకపోయినా సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలనే పురోగామివాదులు కొందరైతే మొరటుగా వెనక్కు నడిపించజూసే కొందరు అన్ని మతాల్లోనూ వుంటారు. తూర్పు ఐరోపా, సోవియట్‌ యూనియన్‌లలో సోషలిస్టు వ్యవస్ధల కూల్చివేతలో అమెరికా సామ్రాజ్యవాదులు, ఇతర ఐరోపా ధనిక దేశాలతో పాటు రెండవ పోప్‌ జాన్‌పాల్‌ కూడా పుణ్యం కట్టుకున్న రెండవ తెగకు చెందిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పోప్‌ ఫ్రాన్సిస్‌పై చేస్తున్న విమర్శలు, వస్తున్న వూహాగానాలను బట్టి ఆయన జాన్‌పాల్‌ వంటి వ్యక్తి మాత్రం కాదని చెప్పవచ్చు.

తిరుగుబాటు మాజీ బిషప్‌ జెన్‌ బృందం రోమ్‌లో పోప్‌ను కలిసి చైనా ప్రభుత్వ వత్తిడికి లంగవద్దని కోరింది. దాని మీద పోప్‌ స్పందిస్తూ గతంలో హంగరీలో మాదిరి తిరుగుబాటు చేసి జైలు పాలయ్యే పరిస్ధితి తెచ్చుకోవద్దని చైనాలో రహస్యంగా పని చేస్తున్న బిషప్పులనుద్ధేశించి సలహా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. జోసెఫ్‌ మైండ్‌జెంటీ అనే బిషప్పు కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని వ్యతిరేకించి జైలు పాలయ్యాడు.1956లో ప్రతీఘాతవిప్లవ సమయంలో తిరుగుబాటుదార్లు జైలుపై దాడి చేసి మైండ్‌ జెంటీని అమెరికా రాయబార కార్యాలయంలోకి పంపారు. హంగరీ ప్రభుత్వ వత్తిడి కారణంగా మైంట్‌జెంటీని దేశం వదలి వెళ్లాలని ఆదేశించిన వాటికన్‌ ఆయన స్ధానంలో ప్రభుత్వానికి ఆమోదయోగ్యుడైన మరొక బిషప్పును నియమించింది. అటువంటి స్ధితిని మరోమారు తెచ్చుకోవద్దని చైనా బిషప్పులకు పోప్‌ సలహాఇచ్చారన్నది వార్తల సారాంశం. ‘ చైనా కాథలిక్‌ చర్చిని వాటికన్‌ చర్చి(కమ్యూనిస్టులకు) ధారాదత్తం చేస్తున్నదని నేను ఎందుకు అనుకుంటున్నానంటే గత కొద్ది సంవత్సరాలుగా, నెలలుగా వారు నడిచినబాటనే కొనసాగిస్తే అదే జరుగుతుంది. వాటికన్‌-చైనా మధ్య ఒప్పందం కుదిరే క్రమంలో నేను ప్రధాన ఆటంకం వున్నానా? ఒక వేళ అది దుష్ట లావాదేవీ అనుకుంటే దానికి ఆటంకంగా వున్నందుకు నేను సంతోషపడతాను’ అని జెన్‌ తన బ్లాగ్‌లో పేర్కొట్లు వార్తలు వచ్చాయి. జెన్‌ వైఖరి చైనా సర్కార్‌తో ఘర్షణనే కోరుతున్నట్లు వెల్లడి కావటంతో ఒప్పందాన్ని ఖరారు చేసుకొనేందుకు వుభయపక్షాలు వేగంగా కదులుతాయని విశ్లేషకులు పేర్కొన్నారు. వాటికన్‌ విదేశాంగమంత్రి పిట్రో పారోలిన్‌ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెన్‌ పేరు ప్రస్తావించకుండా ‘ అవును, చైనా ప్రభుత్వ అధికారులతో ప్రస్తుత సంబంధాలను పోప్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయన వైఖరికి అనుగుణంగానే ప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. ఎవరూ అనధికార చొరవలు తీసుకోవటం లేదు. చేస్తున్న త్యాగం చైనా ప్రభుత్వం కోసం కాదు, క్రీస్తు చర్చికోసమే, అని చెప్పారు.

కమ్యూనిస్టు సిద్ధాంతం పుట్టి రెండు వందల సంవత్సరాలైతే క్రైస్తవం దాని కంటే రెండువేల సంవత్సరాల ముందు పుట్టింది. సోదరత్వాన్ని ప్రబోధించటమే తప్ప సోదరుల మధ్య అంతరాలు,దోపిడీ పెరగటాన్ని అది నిరోధించలేకపోయింది. దోపిడీకి వ్యతిరేకంగా నూతన సమాజాన్ని నిర్మించాలన్న కమ్యూనిజాన్ని దోపిడీదారులు, వారికి వత్తాసుగా వున్న మతపెద్దలు వ్యతిరేకించేందుకు నడుం కట్టారు. దోపిడీదార్లతో మత పెద్దలు చేతులు కలపాలంటే ఏదో ఒక సాకు కావాలి కనుక మతానికి కమ్యూనిజం వ్యతిరేకం అని అర్ధాలు తీశారు. దోపిడీ మతానికి వ్యతిరేకమని ఏనాడూ పెట్టుబడిదారీ వ్యవస్ధను, సిద్ధాంతాలను మతం చెప్పలేదు. సోవియట్‌, తూర్పు ఐరోపాదేశాలలో కమ్యూనిజాన్ని వ్యతిరేకించే సామ్రాజ్యవాదులతో పాటు వారితో చేతులు కలిపిన చర్చి అధికారుల పాత్రను చైనా కమ్యూనిస్టుపార్టీ గుర్తించి కనుకనే మతం ముసుగులో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్న మతాధికారులను కట్టడి చేసేందుకు చైనా ప్రభుత్వం పూనుకుంది. మత స్వేచ్చను అనుమతిస్తున్నది కనుకనే దాన్ని ఇంటికి పరిమితం చేసుకోవాలని, పారదర్శకంగా వ్యవహరించాలని కోరుతోంది. ఒకసారి జనంలో మతోన్మాదాన్ని నింపితే అది ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుందో తాలిబాన్లు, ఐఎస్‌ తీవ్రవాదులను చూస్తున్న ప్రపంచానికి వేరే చెప్పనవసరం లేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే అమెరికన్లు, వారితో చేతులు కలిపిన ఆ ప్రాంత కమ్యూనిస్టు వ్యతిరేకులు తాలిబాన్ల సృష్టికి తెరలేపారు. పశ్చిమాసియాలో రాజకీయంగా తమను వ్యతిరేకించే శక్తులకు వ్యతిరేకంగా తాలిబాన్లతో పాటు ఐఎస్‌ తీవ్రవాదులను కూడా పెంచి పోషించింది అమెరికా, దాని అనుయాయి దేశాలే అన్నది స్పష్టం. ఈ పరిణామాలను చూసిన తరువాత చైనా కమ్యూనిస్టుపార్టీ సోషలిస్టు వ్యవస్ధను కాపాడుకొనేందుకు తగిన చర్యలు తీసుకోకపోతే అది చారిత్రక తప్పిదం అవుతుంది. అందువలన చైనాలో అనధికార క్రైస్తవ, ఇస్లామిక్‌ మతకార్యకలాపాలను ఈ నేపధ్యం, దృష్టితోనే చూడాల్సి వుంది.

ఇక్కడ కమ్యూనిస్టులు, వామపక్ష అభిమానులకు ఒక సందేహం రావటం సహజం.మతం మత్తు మందు అని చెప్పే కమ్యూనిస్టులు మతాన్ని నిర్మూలించకుండా అధికారికంగా అనుమతించటం ఏమిటి అన్నదే అది. కమ్యూనిస్టు పార్టీ అంగీకారంతో నియమించే బిషప్పులు కూడా అదే క్రీస్తు, అదే బైబిల్‌నే ప్రచారం చేస్తారు కదా తేడా ఏముంది అని ప్రశ్నించ వచ్చు. మన సమాజంలో మతం అన్నది కొన్ని వేల సంవత్సరాల నుంచి వేళ్లూనుకుంది. చైనా కమ్యూనిస్టు పార్టీ లేదా మరో అధికార కమ్యూనిస్టు పార్టీ దాని ప్రభావాన్ని తగ్గించటానికి చర్యలు తీసుకుంటున్నదా, మతభావాలను పెంచేవిధంగా వ్యవహరిస్తున్నదా అన్నదే గీటురాయి. ఆ విధంగా చూసినపుడు చైనా ప్రభుత్వం మతంతో సహా అనేక అన్యవర్గధోరణులను అరికట్టేందుకు ఓపికతో పని చేయాలే తప్ప నిషేధాలతో కాదు. అక్కడ ఇంకా సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం ఇంకా ప్రాధమిక దశలోనే వుంది, ఎన్నో దశ లను అధిగమించాల్సి వుంది. అటువంటపుడు అన్యవర్గ ధోరణులు అంతమయ్యే అవకాశ ం లేదు. కనుక కొంత కాలం పాటు కుట్రలూ, కూహకాలకు అవకాశం లేని మత స్వేచ్చను అనుమతించటం తప్ప మరో మార్గం లేదు.జనం తమ అనుభవం ద్వారా మత ప్రభావం నుంచి బయటపడాల్సి వుంది.

విశ్లేషకులు చెబుతున్నదాని ప్రకారం చైనాలోని 140 కోట్ల జనాభాలో ఏడు కోట్ల మంది ప్రొటెస్టెంట్‌ క్రైస్తవులుంటే కోటి మంది కాథలిక్కులున్నారని అంచనా. చైనా కమ్యూనిస్టుపార్టీ చరిత్ర, ఏడు దశాబ్దాల ప్రభుత్వ తీరుతెన్నులను గమనిస్తే మతం రాజ్యానికి లోబడి వుండాలే తప్ప రాజ్యంపై మత పెత్తనాన్ని అంగీకరించేది లేదని రుజువైంది. కమ్యూనిస్టు పార్టీ అధికారానికి రాగానే బౌద్ద మతాధిపతి దలైలామా తాను సర్వస్వతంత్రుడనని, తన ఆధీనంలోని టిబెట్‌ తన రాజ్యమని ప్రకటించుకోవటమేగాక కమ్యూనిస్టు ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో తిరుగుబాటు విఫలమై మన దేశానికి పారిపోయి రావటం, మన ప్రభుత్వం ఆశ్రయం కల్పించటం, ప్రవాస ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన చరిత్ర తెలిసిందే. క్రైస్తవ మత చరిత్రలో బిషప్పులు, ఇతర మతాధికారులను నియమించే అధికారం రాజులదా, పోప్‌దా అనే ఆధిపత్యపోరు సాగింది.అది పదకొండవ శతాబ్దిలో తారాస్ధాయికి చేరింది. పోప్‌ ఏడవ గ్రెగరీ ఆధిపత్యాన్ని రోమన్‌ లేదా జర్మన్‌ చక్రవర్తి నాలుగవ హెన్రీ సవాలు చేయటంతో ముగ్గురు పోప్‌లు ఐదుసార్లు అతడిని మతం నుంచి బహిష్కరించారు. ఇటలీ, జర్మనీలలో అంతర్యుద్ధాలు సంభవించాయి. ఆ పోరులో బలహీనపడిన హెన్రీ 1076,77 సంవత్సరాలనాటికి చేతులెత్తేశాడు. ఈ పోరులోనే పోప్‌ ఏడవ గ్రెగరీని కిడ్నాప్‌ చేసి ఇటలీలోని కానోసా కోటలో బంధించారు. అయితే కొంత మంది ప్రభువుల అండతో తప్పించుకున్నాడు. కిడ్నాప్‌లో హెన్రీ హస్తం వుందని భావించారు. చివరకు హెన్రీ పోప్‌కు లంగిపోవాల్సి వచ్చింది. పోప్‌ నివాసానికి వెళ్లి మూడు రోజుల పాటు చెప్పుల్లేకుండా మంచులో బయట నిలబడి తన తప్పులను క్షమించాలని వేడుకున్నాడు. తరువాత పోప్‌ ఇతరులకు మద్దతు ఇచ్చి మరోసారి హెన్రీని మతం నుంచి బహిష్కరించాడు.

ఇది పదకొండవ శతాబ్దం కాదు, చైనా పాలకులకు నాలుగవ హెన్రీకి, ఏడవ పోప్‌ గ్రెగరీకి, ప్రస్తుత పోప్‌ ఫ్రాన్సిస్‌కు పోలికేలేదు. ఆయన స్ధానంలో మరొకరుండి పెత్తనం చెలాయించాలని చూసినా చైనాను కట్టడి చేసే శక్తివంతులెవరూ నేడు ప్రపంచంలో లేరు. పోప్‌దే సర్వాధికారం అని రుజువు చెయ్యటానికి పాలకులు యుద్ధాలు చేసే పరిస్ధితీ లేదు. వాటికన్‌ మొండిగా వ్యవహరించి చైనాలో రహస్యకార్యకలాపాలు నిర్వహిస్తున్న కాథలిక్కులను ప్రోత్సహించటమంటే ప్రభుత్వ వ్యతిరేకులుగా తయారు చేయటం, తద్వారా వారిని ఇబ్బందుల పాలు చేయటం తప్ప మరొకటి కాదు. గతంతో పోల్చితే ఒక్క క్రైస్తవమే కాదు అన్నిరకాల మతకార్యకలాపాలను అదుపు చేసేందుకు మరిన్ని చర్యలను తీసుకొనేందుకు చైనా నాయకత్వం నిర్ణయించింది. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి రహస్య ప్రార్ధనలను ఏమాత్రం సహించేది లేదని ప్రభుత్వం నిర్ణయించినట్లు చైనా తిరుగుబాటు బిషప్‌ జెన్‌ తన బ్లాగ్‌లో పేర్కొన్నాడు. ఆసియా న్యూస్‌ అనే పత్రిక 2015లో ప్రచురించిన ఒక వార్తను వుటంకిస్తూ దాని సంపాదకుడు వ్యాఖ్యానించారు. జైలు పాలైన మతాధికారుల గురించి చైనా ప్రభుత్వం అసలు చర్చలకే అంగీకరించలేదు, అప్పుడూ ఇప్పుడు తాము ప్రతిపాదించిన బిషప్పును గుర్తిస్తేనే వాటికన్‌ను గుర్తిస్తామని చైనా చెబుతోంది. ఆంక్షల పెంపుదలకు ఒకటే వుద్ధేశం. అదేమంటే కమ్యూనిస్టు పార్టీ అధికారాన్ని సుస్ధిరం చేసుకొనేందుకు, ఎవరైనా దాని వునికిని సవాలు చేస్తే అణచివేసేందుకు’ అన్నాడు. పదజాలం ఎలా వున్నప్పటికీ చైనా సోషలిస్టు వ్యవస్ధకు హాని తలపెట్టే ఏ పరిణామాన్ని కూడా అక్కడి నాయకత్వం తక్కువ చేసి చూడటం లేదని, దానిని రక్షించేందుకు అనేక చర్యలు తీసుకున్నట్లు ఇప్పటికే అనేక పరిణామాలు స్పష్టం చేశాయి. వాటికన్‌-చైనా సంబంధాల మెరుగుదలకు తీసుకుంటున్న చర్యలు ఏ రీత్యాచూసినా ఆహ్వానించదగినవే అని చెప్పవచ్చు. మతానికి కమ్యూనిజానికి మధ్య కట్టిన అడ్డుగోడల కూల్చివేతకు ఏ మాత్రం తోడ్పడినా మంచిదే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మాస్కోలో వైఫల్యం-బీజింగ్‌లో విజయం !

14 Tuesday Nov 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

100 years Bolshevik Revolution, Anti communist, Bolshevik Revolution, china communist party, communist, Donald trump, Socialism

వందేండ్ల మహత్తర అక్టోబరు విప్లవం-వర్తమానం-4

ఎం కోటేశ్వరరావు

నవంబరు ఏడవ తేదీ సందర్భంగా వంద సంవత్సరాల బోల్షివిక్‌ విప్లవం గురించి ముందుగానే మొదలైన చర్చ తరువాత కూడా ప్రపంచ మీడియాలో సాగుతోంది. నూరు పూవులు పూయనివ్వండి, వేయి ఆలోచనలను వికసించనివ్వండి అన్నట్లుగా బోల్షివిక్‌ విప్లవం గురించి వెలువడే వ్యతిరేక,సానుకూల అంశాలన్నింటిపై మధనం జరగవలసిందే. పాత, కొత్త తరాలు వాటి మంచి చెడ్డలను గ్రహించాలి. సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారీ విధానాలదే పైచేయిగా వున్నప్పటికీ ప్రస్తుతం వాటికి ప్రాతినిధ్యం వహించే దేశాలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. తమ సంక్షోభాన్ని ఎలా పరిష్కరించుకోవాలో వాటికి దిక్కు తోచటం లేదు. మొత్తంగా చూసినపుడు సోషలిస్టు దేశాలు-పెట్టుబడిదారీ దేశాల మధ్య వైరుధ్యమే ప్రధానంగా కనిపిస్తున్నది. అదే సమయంలో పెట్టుబడిదారీ దేశాలు తమ సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో వాటి మధ్య విబేధాలు కూడా కొనసాగుతూనే వున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) వునికిలోకి రాక ముందు 1949 నుంచి 1994 వరకు ఏడు వాణిజ్యం, పన్నులపై సాధారణ ఒప్పందాలు జరిగాయి. 2001లో ప్రారంభమైన దోహా దఫా చర్చలు 16సంవత్సరాలు గడిచినా కొనసాగుతూనే వున్నాయి. సాగదీతలో ఇప్పటికి ఇదే ఒక రికార్డు అయితే ఇంకెంతకాలానికి ఒప్పందం కుదురుతుందో తెలియదు. అమెరికా-ఐరోపాయూనియన్‌ల మధ్య తలెత్తిన విబేధాలే దీనికి కారణం. ఎవరిదారి వారు చూసుకొనే క్రమంలో ఆయా దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకొనేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపధ్యంలో సోషలిస్టు దేశాలను ఒకవైపు దెబ్బతీయాలని చూస్తూనే మరోవైపు వాటితో సఖ్యతగా వుండే ద్వంద్వ వైఖరిని ధనిక దేశాలు అనుసరిస్తున్నాయి. రెండో వెసులుబాటు గతంలో సోవియట్‌ యూనియన్‌, ఇతర తూర్పు ఐరోపా దేశాలకు వుండేది కాదు.

ఒక సైద్ధాంతిక ప్రత్యర్ధిగా భావించే చైనాను ఎదుర్కొనే క్రమంలో ప్రజాస్వామిక దేశాలు తమ వైఫల్యాలను గుర్తించాల్సి వుందని ఐరిష్‌ టైమ్స్‌ వాఖ్యాత మార్టిన్‌ వూల్ఫ్‌ పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యాన సారాంశం ఇలా వుంది. నాటి రష్యానేతల కంటే చైనా గ్జీ మరింత జాగ్రత్తగా వున్నారు, చైనా లక్షణాలతో కూడిన సోషలిజం నూతన యుగంలోకి ప్రవేశించిందని ఎంతో ధృడంగా చెప్పారు. తమ స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకుంటూనే అభివృద్ధిని వేగవంతం చేయాలని కోరుకొనే ఇతర దేశాలకు చైనా కొత్త అవకాశాలను కల్పిస్తోంది. లెనినిస్టు రాజకీయ వ్యవస్ధ చరిత్ర అవశేషాలనుంచి వుద్భవించింది కాదు, ఇంకా అదొక నమూనాగా వుంది. సోవియట్‌ పారిశ్రామికీకరణ నాజీ సైన్యాలను ఓడించటానికి తోడ్పడింది. సోవియట్‌ కమ్యూనిస్టుపార్టీ, ఆర్ధిక వ్యవస్ధ కుప్పకూలిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అదే పెద్ద అసాధారణ రాజకీయ పరిణామం. ఇదిలా వుండగా అత్యంత ముఖ్యమైన ఆర్ధిక పరిణామం దారిద్య్రం నుంచి మధ్యతరగతి ఆర్ధిక స్ధాయికి చైనా ఎదుగుదల. అందుకే గ్జీ చైనాను ఒక నమూనాగా చెప్పగలుగుతున్నారు. మాస్కోలో విఫలమైన వ్యవస్ధ బీజింగ్‌లో ఎలా విజయవంతం అయిందన్నది ఇంకా తెలియాల్సి వుంది. రెండింటికి మధ్య వున్న పెద్ద తేడా ఏమంటే మావో తరువాత లెనినిస్టు రాజకీయ వ్యవస్ధను అట్టేపెట్టిన డెంగ్‌ సియావో పింగ్‌ సూక్ష్మబుద్ధితో కూడిన నిర్ణయాలు. అన్నింటికీ మించి ఆర్ధిక వ్యవస్ధను బయటివారికి తెరుస్తూనేే పార్టీ ఆధిపత్యపాత్రను కొనసాగించటం. చైనీయులు వర్ణించే జూన్‌ నాలుగవ తేదీ సంఘటన,పశ్చిమ దేశాలు 1989 మారణకాండగా పిలిచిన వుదంతం సందర్భంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు పార్టీ అదుపు గురించి ఎంత పట్టుదలగా వున్నారో తెలియచేశాయి. ఆర్ధిక సంస్కరణల కొనసాగింపులో ఎన్నడూ తడబడలేదు. ఫలితాలు అద్భుతంగా వచ్చాయి.

Image result for 1991 soviet coup,lenin statue

సోవియట్‌ యూనియన్‌ కూడా అటువంటి బాటనే అనుసరించి వుండాల్సింది అనే చర్చ ప్రారంభమై వుండాల్సింది కానీ జరగలేదు. దీని ఫలితంగా శతాబ్దం క్రితం జరిగిన అక్టోబరు విప్లవాన్ని ఎలా గుర్తించాలి అనేది నేటి రష్యాకు తెలియకుండా పోయింది. లెనినిజం, మార్కెట్‌తో చైనా బంధపు పర్యవసానాలేమిటి? చైనా నిజంగానే పశ్చిమ దేశాల నుంచి ఆర్ధికశాస్త్రాన్ని నేర్చుకుంది.అయితే ఆధునిక పశ్చిమదేశాల రాజకీయాలను తిరస్కరించింది.చైనా అభివృద్ధి చెందే కొద్దీ లెనినిస్టు రాజకీయాలు, మార్కెట్‌ అర్ధికవిధానాల జమిలి వైఖరి పని చేస్తుందా? అంటే మనకు తెలియదనే సమాధానం చెప్పాలి. ఈ వ్యవస్ధ ఇప్పటి వరకు అద్భుతంగా పనిచేసింది. దీర్ఘకాలంలో పార్టీ మీద ఒక వ్యక్తి ఆధిపత్యం, చైనా మీద ఒక పార్టీ ఆధిపత్యం నిలబడదు. ఇదంతా దీర్ఘకాలంలో జరిగేది, తక్షణ స్ధితి సుస్పష్టం. ఏక వ్యక్తి నియంత్రించే లెనినిస్టు నిరంకుశపాలనలో చైనా ఒక ఆర్ధిక అగ్రరాజ్యంగా ఎదుగుతోంది. ఎదుగుతున్న ఈశక్తి మిగతా ప్రపంచమంతా శాంతియుతంగా సహకరించటం తప్ప మరొక అవకాశం లేదు. వుదారవాద ప్రజాస్వామ్యంలో విశ్వాసం వున్నవారందరూ ఆర్ధిక చైనాను మాత్రమే కాదు ప్రముఖ సైద్ధాంతిక ప్రత్యర్ధిగా కూడా గుర్తించాల్సిన అవసరం వుంది.ఒకటి, నిష్కారణంగా చైనాతో ప్రతికూల సంబంధాలను పెంచుకోకుండా పశ్చిమ దేశాలు తమ సాంకేతిక, అర్ధిక వున్నతిని కొనసాగించాలి. చైనా మన వ్యాపార భాగస్వామే తప్ప స్నేహితురాలు కాదు. రెండవది ఎంతో ముఖ్యమైనది, ఈరోజు మాదిరి దుర్బలంగా వున్న పశ్చిమ దేశాలు దశాబ్దాలుగా కాకపోయినప్పటికీ ఎన్నో సంవత్సరాలుగా తమ ఆర్ధిక యాజమాన్యం మరియు రాజకీయాలు సంతృప్తికరంగా లేవన్న వాస్తవాన్ని గుర్తించి, నేర్చుకోవాలి. పశ్చిమ దేశాలు తమ ద్రవ్యవ్యవస్ధను ఎటూ కదలని తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయే విధంగా వదలివేశాయి.తమ భవిష్యత్‌కు చేసే ఖర్చు విషయంలో గుచ్చి గుచ్చి వ్యవహరించాయి. ముఖ్యంగా ఆర్ధికవిజేతలు-పరాజితుల మధ్య ప్రమాదకరమైన అఘాతం పెరగటాన్ని అమెరికా అనుమతించింది. తన రాజకీయాలలో అబద్దాలు, విద్వేషానికి తావిచ్చింది.

ఇంకా మరికొన్ని విషయాలు తన విశ్లేషణలో పేర్కొన్న మార్టిన్‌ వూల్ప్‌ కమ్యూనిజం పట్ల సానుకూల వైఖరి కలిగినవాడేమీ కాదు. చైనా సోషలిజం కూలిపోతుందని జోస్యం చెప్పాడు. విధిలేని పరిస్ధితుల్లో అవకాశం వచ్చేంత వరకు చైనాతో మంచిగా వుండి సమయంరాగానే దెబ్బతీయాలని పరోక్షంగా సూచించాడు. చైనా వ్యాపార భాగస్వామి తప్ప స్నేహితురాలు కాదనటంలో అంతరంగమిదే. సంక్షోభాన్నుంచి బయటపడేందుకు,లాభాల కోసం పెట్టుబడిదారీ వర్గం సోషలిస్టు దేశాలతో సఖ్యంగా వుండటం అన్నది 1980 దశకం తరువాతి ముఖ్యపరిణామం. అమెరికా, జపాన్‌, ఐరోపా ధనిక దేశాలన్నీ గత కొద్ది దశాబ్దాలుగా అనుసరిస్తున్న విధానమిదే.

తాజా తొలి ఆసియా పర్యటనలో డోనాల్డ్‌ ట్రంప్‌ చైనా, వియత్నాంల అభివృద్ధి గురించి పొగిడారు.చైనాతో వాణిజ్యలోటుకు తమ గత అధ్యక్షులు అనుసరించిన విధానాలే కారణమని చెప్పారు.మార్టిన్‌ చెప్పినట్లు ఆర్ధిక అవసరాల కోసం అలా చెప్పాడు తప్ప సైద్ధాంతికంగా కమ్యూనిస్టు వ్యతిరేక చర్యతోనే ఆ దేశాల పర్యటనకు శ్రీకారం చుట్టటం ట్రంప్‌ వర్గనైజం. బోల్షివిక్‌ విప్లవానికి వందేండ్ల సందర్భంగా నవంబరు ఏడును ‘కమ్యూనిజం బాధితుల జాతీయ దినం ‘గా ప్రకటించి మరీ వచ్చాడు. వాస్తవానికి రోసెన్‌బర్గ్‌ దంపతులను వురితీయటంతో సహా అనేక మందిని వెంటాడి వేధించిన దుష్ట చరిత్ర వారిదే.కమ్యూనిజం గతించిందని, దానిని పాతిపెట్టామని, అంతిమ విజయం సాధించామని చెప్పుకున్న పాతికేండ్ల తరువాత కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు ఇంకా భయపడుతున్నాయి.పోరులో ఒక రంగంలో ఓడిపోవచ్చు, అంతమాత్రాన యుద్ధం ఓడిపోయినట్లు కాదు. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్‌ అనేక రంగాలలో విజేతగా వున్నాడు, సోవియట్‌ గడ్డపై జరిగిన నిర్ణయాత్మకపోరులో కమ్యూనిస్టుల చేతిలో ఓటమిపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. అదే విధంగా బోల్షివిక్‌ విప్లవాన్ని వమ్ముచేసినంత మాత్రాన దోపిడీ వర్గం అంతిమ విజయం సాధించినట్లు సంబరపడితే అది కార్మికవర్గాన్ని మరింతగా కర్తవ్యోన్ముఖులుగా మారుస్తుంది.

అక్టోబరు విప్లవం జయప్రదం అయిన తరువాత సోవియట్‌ను దెబ్బతీయటానికి పశ్చిమ దేశాలు చేయని యత్నం లేదు. అంతర్గతంగా సోషలిస్టు వ్యవస్ధను వ్యతిరేకించే శక్తుల విచ్చిన్న కార్యకలాపాలకు తోడు, బయట రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యేవరకు ఇరుగుపొరుగు దేశాలతో సోవియట్‌ సంబంధాలు సజావుగా లేవు. ఏడు సంవత్సరాల తరువాత 1924లో మాత్రమే బ్రిటన్‌ సోషలిస్టు రష్యాను గుర్తించింది. ప్రతి దేశంతో ఏదో ఒక సమస్య, సహాయ నిరాకరణ. వీటన్నింటినీ తట్టుకొని స్టాలిన్‌ నాయకత్వంలో సోవియట్‌ బలపడింది.

సోషలిస్టు చైనాకు సైతం పాతిక సంవత్సరాల పాటు ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయి. ఐక్యరాజ్యసమితిలో గుర్తించకుండా అడ్డుకున్నారు. ఇటువంటి స్ధితి చరిత్రలో మరేదేశానికీ వచ్చి వుండదు. మార్టిన్‌ పేర్కొన్నట్లు చైనాలో కమ్యూనిస్టు పార్టీ తన పట్టును పెంచుకున్న తరువాత డెంగ్‌ హయాంలో చేపట్టిన సంస్కరణలు, ఇతర రాజకీయ నిర్ణయాలు నేటి చైనా అవతరణకు దోహదం చేశాయి. చైనాలో సోషలిస్టు వ్యవస్ధను కూలదోసేందుకు జరిగిన ప్రయత్నాన్ని నిర్ణయాత్మకంగా ఎదుర్కొనటానికి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వ పాత్ర,దానికి జనామోదం లభించటానికి ఎంతో ముందు చూపుతో డెంగ్‌ నాయకత్వంలోని కమ్యూనిస్టుపార్టీ ప్రారంభించిన సంస్కరణలతో తమ జీవితాలు మెరుగుపడుతున్నాయని జనం గ్రహించటం కూడా ఒక ప్రధానకారణం.చైనా కమ్యూనిస్టుపార్టీ నాయకత్వంలోని ప్రజా మిలిటరీ తియన్మెన్‌ స్క్వేర్‌ కుట్రను మొగ్గలోనే తుంచి వేసింది. బహుశా దానిని గమనించే అమెరికా, ఇతరసామ్రాజ్యవాదులు సోవియట్‌, ఇతర తూర్పు ఐరోపా దేశాలలో కుట్రను ముందుకు, మరింత వేగంగా అమలు జరిపినట్లు కనిపిస్తోంది.తియన్మెన్‌ స్క్వేర్‌ ప్రదర్శనలుగా ప్రపంచానికి తెలిసిన ఘటనలు 1989 ఏప్రిల్‌ 15న ప్రారంభమై జూన్‌ నాలుగు వరకు జరిగాయి. తూర్పు ఐరోపాలో అదే ఏడాది నవంబరులో తూర్పు జర్మనీలో, తరువాత సోవియట్‌లో మొదలయ్యాయి. దానిని గుర్తించి అక్కడి కమ్యూనిస్టుపార్టీలు చైనా పార్టీ మాదిరి తమ పాత్రలను మలుచుకొని వుంటే చరిత్ర మరోవిధంగా వుండేది. !

Share this:

  • Tweet
  • More
Like Loading...

విస్మరించజాలని కమ్యూనిస్టు ప్రణాళిక, కమ్యూనిస్టు పార్టీల ప్రాధాన్యత

09 Thursday Mar 2017

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Political Parties, RUSSIA, USA

≈ 1 Comment

Tags

China, china communist party, communist manifesto, Engels, Marx, Marx and Engels, Narendra Modi, Xi Jinping

Image result for one cannot deny the importance of the communist manifesto

ఎం కోటేశ్వరరావు

ఏ తర్కానికైనా దానికి ఒక న్యాయబద్దమైన ముగింపు వుంటుంది. తర్కంలో పాల్గొనేవారు తమకు అనుకూలమైనంత వరకే స్వీకరించి ఎదుటి వారికి సరైన సమాధానం చెప్పకపోతే చివరకు ఆ తర్కం అసంబద్దంగా ముగుస్తుంది. వుదాహరణకు కమ్యూనిజానికి కాలం చెల్లింది, అది పనికిరాదు అంటారు. అదే నిజమైతే ప్రపంచవ్యాపితంగా కమ్యూనిజం గురించి అనుకూలంగానో వ్యతిరేకంగానో ఎందుకు చర్చ జరుగుతోంది?

కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ రచించిన కమ్యూనిస్టు ప్రణాళిక తొలి ముద్రణ జరిగి ఫిబ్రవరి 21 నాటికి 170 సంవత్సరాలు పూర్తి అయింది.అమెరికాలో ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత పుస్తక దుకాణాలలో ఆఫ్రో-అమెరికన్ల గురించి రాసిన న్యూ జిమ్‌ క్రో గ్రంధం తరువాత కమ్యూనిస్టు మానిఫెస్టో గురించి పాఠకులు అడుగుతున్నారని అమెరికాలోని సింపోజియం బుక్స్‌ యజమాని చెప్పారు. జనం కమ్యూనిస్టుమానిఫెస్టో గురించి ఎందుకు అడుగుతున్నట్లు ? అంటే కమ్యూనిస్టు సిద్దాంతం పనికిరాదని చెబుతున్నమాటలను జనం పూర్తిగా విశ్వసించటం లేదన్నమాట. 2008లో ధనిక దేశాలలో సంక్షోభం ప్రారంభమైన తరువాత అనేక మంది కమ్యూనిస్టు మానిఫెస్టో దుమ్ముదులుపుతున్నారు. ప్రఖ్యాత అమెరికన్‌ ఆర్ధికవేత్త రాబర్ట్‌ ఎల్‌ హెయిల్‌బ్రోనర్‌ ఒక సందర్భంలో ‘మనం మార్క్స్‌వైపు చూస్తున్నామంటే ఆయన సర్వజ్ఞుడని కాదు, ఎందుకంటే ఆయన్నుంచి మనం తప్పించుకోలేం’ అన్నారు. పాలకవర్గాలు తమ అస్ధిత్వానికి ముప్పు ఏర్పడినపుడు అంతకు ముందు ఏం చెప్పినప్పటికీ దాన్నుంచి తప్పించుకొనేందుకు ఒక మహా సంఘటనగా ఏర్పడతాయి. సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు రాజ్యాల కూల్చివేతకు ఐరోపా, అమెరికాలోని కమ్యూనిస్టు వ్యతిరేకశక్తులు, పోప్‌ ఒక కూటమిగా ఏర్పడటం ప్రపంచ చరిత్రలో ఒక ప్రధాన ఘటన కాదా? అంటే ఈ రెండు ఖండాలలోని అధికార శక్తులు కమ్యూనిజం తమను సవాలు చేసే ఒక శక్తి అని గుర్తించినట్లే కదా ? చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు జరిగిన కుట్రలో బౌద్ద దలైలామా ఒక పావుగా వుపయోగపడ్డారా లేదా ? అందుకే ఎవరెన్ని చెప్పినా కమ్యూనిస్టు మానిఫెస్టో, కాపిటల్‌ గ్రంధాలు ఇప్పటికీ కొత్త తరాలకు ఆసక్తి కలిగిస్తూనే వున్నాయి. ఇక్కడొక ప్రశ్న తలెత్త వచ్చు. తమకు ముప్పు తెచ్చే పుస్తకాలను అమెజాన్‌ వంటి బహుళజాతి కార్పొరేషన్లు ఎందుకు విక్రయిస్తున్నాయి, గూగుల్‌ వంటి కంపెనీలు ఆ సాహిత్యాన్ని ఆన్‌లైన్‌లో ఎందుకు అనుమతిస్తున్నాయని ఎవరైనా అడగవచ్చు. మార్క్సు రైనిష్‌ జీటుంగ్‌ పత్రికలో నాటి రష్యన్‌ జారు ఒకటవ నికోలస్‌ను విమర్శిస్తూ వ్యాసం రాయటంతో ఆ పత్రికపై నిషేధం విధించాలని ప్రష్యన్‌ ప్రభుత్వాన్ని కోరగా ఆ పని చేశారు. కమ్యూనిస్టు మానిఫెస్టో, కాపిటల్‌ తొలి ముద్రణలు పొందినపుడు వాటి వల్ల ముప్పు వస్తుందని నాటి పాలకవర్గాలు భావించలేదు కనుకనే ముద్రణ, విక్రయాలకు అనుమతిచ్చాయి, ఇప్పుడు ముప్పులేదని పైకి చెబుతున్న కారణంగా, దాని కంటే ఆ పుస్తకాలకు గిరాకీ వున్నందున వాటిపై కూడా లాభం సంపాదించేందుకు ఇప్పుడు అనుమతిస్తున్నారు. ఎంతకాలం అనుమతిస్తారో చూడాల్సిందే.

Image result for marx engels

చైనా కంటే భారత్‌ ఎందుకు వెనుకబడింది అంటే అది నిరంకుశ దేశం, మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం అని టక్కున సమాధానం చెబుతారు.అమెరికాతో పోలిస్తే 1917కు ముందు రష్యా కూడా నిరంకుశ జార్‌ పాలనలోనే మగ్గింది. మరి అదెందుకు వెనుకబడిపోయింది. ప్రపంచానికి ప్రజాస్వామ్యాన్ని నేర్పినట్లు చెప్పుకొనే రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని కలిగి వున్న బ్రిటన్‌ ఈ రోజు అమెరికా అనుచర దేశంగా ఎందుకు మారిపోయింది? నిరంకుశ దేశాలన్నీ చైనా మాదిరి అంతగాకపోయినా వాటి స్ధాయిలో అయినా ఎందుకు పురోగమించటం లేదు అంటే సరైన సమాధానం వుండదు. మన దేశం త్వరలో చైనాను అధిగమించనుంది అని చెబుతున్నారు. అంతకంటే కావాల్సిందేముంది? మన వారందరూ అమెరికా వెళ్లి ఆ దేశాన్ని ప్రధమ స్ధానంలో వుంచుతున్నారని మన చంద్రబాబు వంటి వారు చెబుతున్నారు. అందువలన అభివృద్దిలో చైనాతోయేం ఖర్మ అమెరికాతోనే పోటీ పడాలి. కానీ మనం ఎక్కడున్నాం, సర్దార్‌ పటేల్‌ విగ్రహాన్ని కూడా తయారు చేసుకోలేక చైనాకు ఆర్డర్‌ ఇచ్చాము. అదే నోటితో మేకిన్‌ ఇండియా అని పిలుపులు ఇస్తాము. మన ముందు ఏం మాట్లాడినా మన వెనుక ప్రపంచం నవ్వదా ?

Image result for xi jinping

చైనా విజయానికి కమ్యూనిస్టు పార్టీ ఎలా మార్గదర్శకత్వం వహించింది అనే పేరుతో అమెరికాకు చెందిన న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఒక వ్యాసాన్ని ప్రచురించింది. అదేమీ మ్యూనిస్టు అనుకూల పత్రిక కాదు. సెబాస్టియన్‌ హెయిల్‌మాన్‌(51) అనే ఒక జర్మన్‌ బెర్లిన్‌లోని మెర్కాటర్‌ ఇసిస్టిట్యూట్‌ ఆఫ్‌ చైనీస్‌ స్టడీస్‌ సంస్ధ స్ధాపక అధ్యక్షుడు. ట్రయర్‌ విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ ప్రొఫెసర్‌.ఆయనతో ఇంటర్వూ చేసి న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించింది. హెయిల్‌ మన్‌ రాసిన చైనా రాజకీయ వ్యవస్ధ అనే అంగ్ల అనువాదాన్ని ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి నవీకరిస్తున్నారు. ఎప్పటికప్పుడు చైనాలో జరుగుతున్న మార్పులను పాఠకులకు అందించేందుకు దానిని ఆన్‌లైన్‌లో పెట్టారు. చైనా పురోభివృద్ధిలో చైనా కమ్యూనిస్టు పార్టీ పాత్ర గురించి ఆయనెంతో లోతుగా పరిశోధించారు. ఇది కమ్యూనిజం విజయం కాదా? మనమెంతో తెలివిగలవారమని, చైనీయులు నల్లమందు భాయీలని ఎద్దేవా చేసిన రోజులను మనం మరిచిపోయామా ? అలాంటి వారిని ఎంతో తెలివిగలవారిగా మార్చిందెవరు ? కమ్యూనిస్టులు కాదా ? ప్రజాస్వామ్య వ్యవస్ధ మనలను అలా ఎందుకు మార్చలేకపోయింది ?

     మన దేశంలో అధికారంలో ఏ పార్టీ వున్నా తన కాడర్‌పై ఆధారపడటం అన్నది ఆత్మవంచన చేసుకొనేవారు తప్ప మిగిలిన వారందరూ అంగీకరిస్తున్న సత్యం. పార్టీ కార్యకర్తలకు నామినేటెడ్‌ పదవులను ఇచ్చి రాజకీయ నిరుద్యోగం పోగొట్టి వుపాధి కల్పించటం, ఆ పదవులను స్ధాయిని బట్టి పెద్ద ఎత్తున అక్రమంగా పోగేసుకోవటానికి వినియోగించటం తెలిసిందే. అది చైనాలో లేదా అంటే అక్కడా వుందని కమ్యూనిస్టుపార్టీయే స్వయంగా చెప్పి అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తున్నది. ఎన్నో వేల మందిపై వేటు వేశారు. మన దేశంలో ఏ పార్టీ అయినా అవినీతికి పాల్పడిన వారిని ఒక్కరినంటే ఒక్కరిని తొలగించి, శిక్షించిన వుదంతం వుందా ? ఎందుకు లేదు? ప్రజాస్వామ్యం నుకనా ?

     మన వంటి దేశాలలో విధాన నిర్ణయాలు, చట్టాలు చేసేది చట్టసభలు. వాటిని అమలు జరిపేది వుద్యోగ యంత్రాంగం. చైనాలో చట్టసభలు తమపని తాము చేస్తే వాటిని అమలు చేసే బాధ్యత పార్టీ కార్యకర్తలపై పెట్టటమే అక్కడి విజయ రహస్యం అన్నది హెయిల్‌మన్‌ అధ్యయన సారంశాలలో ఒకటి. వుదాహరణకు మన ప్రధాని నరేంద్రమోడీ సర్వరోగ నివారిణి జిందాతిలిస్మాత్‌ అన్నట్లుగా నల్లధనం నుంచి అవినీతి, వుగ్రవాదం, పన్నుల ఎగవేత, నగదు రహిత లావాదేవీల వంటి అనేక చర్యలకు గాను ఒకే మాత్ర అన్నట్లుగా పెద్ద నోట్ల రద్దును ప్రకటించి అమలు చేశారు. ఆ సందర్భంగా బిజెపి ప్రజాప్రతినిధులు, నాయకులందరూ తమ బ్యాంకు ఖాతాల లావాదేవీల వివరాలను పార్టీ నాయకత్వానికి అందచేయాలని ఆదేశించినట్లు మన ప్రజాస్వామిక మీడియాలో వార్తలు చదివాము. ఆ లెక్కల్లో ఎలాంటి అక్రమాలు లేవని అయినా ప్రకటించాలి కదా ? అసలు దాని గురించి ఎందుకు మాట్లాడరు ? అన్నింటికీ మించి రిజర్వుబ్యాంకు దగ్గరకు వచ్చిన రద్దయిన నోట్లెన్ని? ఎంత నల్లధనం బయటపడిందీ ఎందుకు ప్రకటించలేదు. ప్రజాస్వామిక వ్యవస్ధలలో ఇలాంటి వన్నీ రహస్యమా ?

చైనాలో కూడా బయటి నుంచి వచ్చిన పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అవినీతి కూడా దిగుమతి అయి కొందరు అవినీతిపరులుగా మారారు. వారిపై అక్కడి అధ్యక్షుడు గ్జీ జింగ్‌ పింగ్‌ కూడా చర్యలు తీసుకున్నారు. రోజూ ఏదో ఒక మూల నుంచి అవినీతి పరులపై చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు చదువుతూనే వున్నాము కదా? మన దేశంలో అలాంటి వార్తలు ఎందుకు రావటం లేదు. చెన్నయ్‌లో కోట్ల కొలది కొత్త నోట్లు పోగేసిన బడా కాంట్రాక్టర్‌ వుదంతంలో ఎందరు బ్యాంకు వున్నతాధికారులపై చర్యతీసుకున్నారో ఎవరైనా ప్రకటించారా ?

చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం ఎంతో పట్టువిడుపులతో చట్టాలు చేయబోయే ముందు అనేక అంశాలపై ప్రయోగాలు చేసిన తరువాతే చట్టాలు చేయటం కూడా విజయ రహస్యమని జర్మన్‌ ప్రొఫెసర్‌ అంటున్నారు. సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం అన్నది 1917కు ముందు తెలియదు. సోవియట్‌ ఒక ప్రయోగం. అక్కడ వచ్చిన ఫలితాలను అధ్యయనం చేసిన తరువాత చైనా తనదైన పంధాను ఎంచుకున్నది. భూ సంస్కరణల విషయంలో అది కనిపిస్తుంది. సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణానికి ఒక మూస అనేది వుండదని గ్రహించిన తరువాత చైనాలో సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌సియావో పింగ్‌, తరువాత నేతలుగా వున్న వారు అనేక ప్రయోగాలకు తెరతీశారు. మంచి గాలికోసం కిటికీలు తెరిస్తే దాంతో పాటు ఈగలు, దోమలు కూడా ప్రవేశించవచ్చు, అయితే వాటిని ఎలా అరికట్టాలో మాకు తెలుసు అని డెంగ్‌ అన్నారంటే ఒక ప్రయోగానికి శ్రీకారం చుట్టటమే. దానికి తోడు సత్వర ఫలితాలు రావాలంటే ప్రయోగాలను కూడా వికేంద్రీకరించాలని భావించారు, అది అవినీతికి తెరతీసిందని గ్రహించిన తరువాత ప్రస్తుత అధ్యక్షుడు గ్జీ జింగ్‌ పింగ్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కేంద్ర స్ధానం నుంచి పధకాలకు రూపకల్పన చేస్తున్నారు. దీని ఫలితాలను చూసిన తరువాత మార్పులు చేర్పులు చేయటం అనివార్యం. చైనా విజయ రహస్యం ఇదే. సోషలిజం, కమ్యూనిజం వాటిని అమలు చేసే వ్యవస్ధల నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఎదురుదెబ్బలు తిన్న పూర్వపు సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాల గురించిగానీ లేదా ప్రస్తుతం సోషలిస్టు వ్యవస్ధల నిర్మాణంలో నిమగ్నమైన చైనా, వియత్నాం, క్యూబా, లావోస్‌, కంపూచియా ప్రయోగాల గురించి తమ తమ దృక్కోణాల నుంచి అనేక మంది విశ్లేషణలు చేస్తున్నారు. వాటిని యథాతధంగా స్వీకరించటం లేదా తిరస్కరించటం గాకుండా అధ్యయనం చేయటం అవసరం. మావో మరణం తరువాత ఇంక చైనా పని అయిపోయినట్లే అని అనేక మంది వ్యాఖ్యానాలు చేశారు. తరువాత డెంగ్‌ను గురించి కూడా అదే విధంగా మాట్లాడారు. కానీ చైనా, వియత్నాం, క్యూబా వంటి దేశాలలో వున్న కమ్యూనిస్టు పార్టీలకు ఒక ప్రత్యేక చరిత్ర, అంకిత భావం గల కార్యకర్తల గురించి వారు విస్మరించారు. నాయకులు మరణించిన తరువాత కమ్యూనిజానికి భవిష్యత్‌ లేదని చెప్పటం వ్యతిరేకుల ప్రచారదాడిలో అస్త్రాలు తప్ప మరొకటి కాదని అనేక దేశాల అనుభవాలు నిరూపించాయి. రామాయణం గురించి చెప్పేవారు రాక్షసుడిగా చిత్రించినప్పటికీ రావణుడిని , మహాభారతంలో ధుర్యోధనుడిని, హిట్లర్‌ను పొగిడేవారు వాడి పీచమణిన స్టాలిన్‌ గురించి, గాడ్సేసు దేవుడిగా కొలిచే ‘జాతీయవాదులు’ మహాత్మాగాంధీని పక్కన పెట్టి ముందుకు పోలేరు. అలాగే ప్రఖ్యాత అమెరికన్‌ ఆర్ధికవేత్త రాబర్ట్‌ ఎల్‌ హెయిల్‌బ్రోనర్‌ ‘మార్క్స్‌ నుంచి మనం తప్పించుకోలేం’ అని చెప్పినట్లుగానే వర్తమానంలో అపూర్వ విజయాలు సాధించిన, సాధిస్తున్న చైనా గురించి అధ్యయనం చేయకుండా కమ్యూనిస్టు వ్యతిరేకులతో సహా ఎవరూ తప్పించుకోలేరు.

భూమి పొరలలో వుండి నిరంతరం తొలిచే లక్షణం గల చుంచెలుక మనం వూహించని చోట బయటకు వచ్చి కనిపిస్తుంది. అలాగే దోపిడీ శక్తులను వ్యతిరేకించే శక్తులు కూడా నిరంతరం పని చేస్తూనే వుంటాయి. అవి ఎక్కడ, ఎలా కనిపిస్తాయనేది ఎవరూ చెప్పజాలరు. రూపం మారవచ్చు తప్ప మౌలిక లక్షణం మారదు. కమ్యూనిస్టు మానిఫెస్టో కూడా అలాంటిదే. రెండు రెళ్లు నాలుగు అన్నది మారనట్లే దోపిడీ వున్నంత కాలం దానిని కొనసాగించేందుకు ఎవరెంతగా ప్రయత్నించినా, దానిని నాశనం చేసేందుకు పిలుపు ఇచ్చిన కమ్యూనిస్టు మానిఫెస్టో ఏదో రూపంలో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే వుంటుంది. ఇదే కమ్యూనిస్టుల తర్కానికి మూలం, ముగింపు కూడా.

Share this:

  • Tweet
  • More
Like Loading...
Newer posts →

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d