• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: January 2016

‘Modi fails to live up to high hopes’

11 Monday Jan 2016

Posted by raomk in BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

BJP, Narendra Modi, Narendra Modi Failures

Author: Arun Swamy, University of Guam

In his first calendar year as Prime Minister of India, Narendra Modi focused on economics. Through high profile trips abroad and ambitious proposals at home Modi maintained an air of energy and initiative, but the results were modest. Meantime, domestic politics became more polarised, contributing to two high profile election defeats for the Bharatiya Janata Party (BJP) in state elections.

Indian Prime Minister Narendra Modi walks past a Russian honour guard on an official visit to President Vladimir Putin on 24 December 2015. (Photo: AAP)

Modi’s brand of personal diplomacy was one of the year’s staples. In January, Barack Obama became the first US president to visit India twice while in office. The two countries announced agreements on implementing the 2008 India–US nuclear deal and carbon emissions. Over the year Modi took 16 foreign trips, soliciting investment and technical cooperation from Japan to Silicon Valley, wooing the Indian diaspora and finalising defence purchases with traditional suppliers France and Russia. Continuing efforts to promote the BRICS countries (Brazil, Russia, India, China and South Africa) saw the founding of a new development bank with funding of US$50 billion provided equally by all five members.

But India’s relations with its neighbours remained strained. Although a boundary dispute with Bangladesh was resolved and those with China were put on the back burner, ties with Nepal deteriorated dramatically. And ties with Pakistan continued to be turbulent. Talks were scheduled and cancelled, low level hostilities intensified, reduced then spiked again. Contact resumed at the Paris climate talks and Modi’s surprise Christmas Day visit to Pakistan earned gushing headlines. But, as some pointed out, this was preceded by a trip to Afghanistan, where Modi personally delivered Indian-made weapons systems, raising hackles in the Pakistani defence establishment.

Domestically the priority was on economic policy. Modi promised a pro-business agenda and sought to deliver on deregulation, facilitating investment and reducing spending. The budget was praised by business as taking modest steps in this direction.

Yet more ambitious proposals requiring statutory or constitutional changes failed to pass the upper house. These included a bill making it easier for companies to declare bankruptcy, another to ease land acquisition for public projects, and the introduction of a national General Sales Tax. In the end, the actions of the much-respected head of the central bank received more favourable attention than those of the prime minister.

One controversial area in the government’s economic policy has been social welfare spending. The government initially proposed to cut the preceding government’s signature employment guarantee program by limiting its application to poor districts, but shelved this in the face of opposition. Yet outlays for the program have been whittled down and reports of beneficiaries not receiving payments have become common. This is indicative of the government’s approach to social welfare generally.

The government’s challenges in parliament stem from the fact that the upper house is elected by state legislatures, a majority of which are controlled by opposition parties. The BJP’s losses in two crucial states, Delhi and Bihar, that it had won in the national election, bode poorly for its ability to pass legislation in the future. In Delhi the BJP lost to a new ‘good government’ party, while in Bihar it was defeated by a coalition led by a former regional ally. The elections indicated the potential for an alternative to the BJP that is not led by the once-dominant Indian National Congress.

The Congress itself remains in a permanent state of crisis. The party is still led by the Nehru-Gandhi family, contributing to organisational paralysis. Party elections are never held and new leaders rise only with the favour of the Gandhis, while their critics leave the party.

Adding to its woes, the Modi government was accused of intimidating its opponents, in both parliament and civil society. Former Congress prime minister Manmohan Singh as well as Sonia and Rahul Gandhi were prosecuted for corruption. And, citing security concerns, the government implemented new restrictions on non-governmental organisations receiving funds from foreign sources.

Conflict occurred over many issues. Conflict over caste quotas, eating beef — which many Hindus oppose for religious reasons — and religious conversion were especially challenging as in many cases the tensions stemmed from demands by BJP supporters. Modi was slow to comment in most instances, but there has been robust resistance from opposition parties, civil society, courts and even officials. Leading writersreturned honours bestowed on them to protest the government’s tolerance of sectarianism. The courts stepped in on more than one occasion to uphold civil liberties. And the Bihar election, fought partly over religious conflict, showed the potential for an explicitly anti-sectarian political program to win.

At the same time there has been a marked decline in popular belief in democracy in India, even compared to other countries. As revealed by the World Values Survey, India has seen a 30 per cent increase over the last two decades in those who do not express faith in democratic methods. The great peril is that the impatience to ‘get things done’ will lead to more support for the kind of authoritarian impulses that seem to be on the rise elsewhere in the world.

Arun R. Swamy is Associate Professor of Political Science at the University of Guam.

This article appeared in East Asia Forum

Share this:

  • Tweet
  • More
Like Loading...

అవగాహన ఒప్పందాలలో మోడీని అధిగమించేందుకు చంద్రబాబు యత్నం !!

11 Monday Jan 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, Others

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, CHANDRABABU, Mou's

ఇలాంటి మాజిక్‌లను మోడీ గతంలోనే చేశారు కేవలం 24 గంటల్లో 2.1లక్షల కోట్ల పెట్టుబడులుండే 21వేల అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రకటించారు.అంటే ప్రతి నాలుగు సెకండ్లకు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే పిటి వుష, వుసేన్‌ బోల్ట్‌ రికార్డులను తిరగరాశారు.

సత్య

విశాఖ పట్టణంలో మూడు రోజుల పెట్టుబడుల ఆకర్షక సదస్సులో మొదటి రోజే రెండు లక్షల కోట్ల రూపాయల విలువగల అవగాహనా ఒప్పందాలపై సంతకాలు జరిగాయన్నది వార్త. అతిధి సత్కార్యాలకు పెట్టింది పేరు ఆంధ్రావని. అరిసెలు, వెన్న వుండలు, పూతరేకులు, గారెలు, నాటు కోడి కూర, గుంటూరు గోంగూర, జగ్గయ్య పేట దోసకాయ పచ్చడి, భీమవరం టైగర్‌ రొయ్యలు, నెల్లూరు చేపల పులుసు, బొంగులో చికెన్‌ వంటి వంటకాలను భారీగా వడ్డిస్తామని ముందే ప్రభుత్వం చెప్పింది కనుక మొదటి రోజు అవి తిన్న వారు ఆ మత్తులో గమ్మత్తులో మరికొన్ని కొత్త ఒప్పందాలపై సంతకాలు పెడతారన్నా అతిశయోక్తి కాదు. మొత్తం ఏడు లక్షల కోట్ల మేరకు ఒప్పందాల జరగవచ్చని ముందే అంచనా వేశారు కనుక తొలి రోజు వూపును బట్టి మలి, మూడవ రోజు ఇంకా జోరుగా ఎడా పెడా ఒప్పందాలు జరుగుతాయన్నది స్పష్టం. ఇలాంటి మాజిక్‌ చేయాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు, చంద్రబాబు చేయగలరని నమ్ముతున్నారు గనుక అది వమ్ము కాకూడదని రాష్ట్ర భక్తులైన వారు కోరుకుంటారు. 1947 ఆగస్టు 16 నుంచి దేశభక్తి క్రమంగా తగ్గుతూ ఢిల్లీ నుంచి గల్లీ చివరికి ఇంటికి, అక్కడ కూడా నేను, నా కుటుంబ స్ధాయికి దిగజారిన పరిస్ధితుల్లో రాష్ట్ర భక్తి అనటం కొందరికి అతిశయోక్తిగా తోచవచ్చు, క్షంతవ్యుడను.

ఇటీవలి కాలంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టటాన్ని నిలిపివేసిన 1991 నూతన ఆర్ధిక సంస్కరణల అమలు నుంచి రాష్ట్రాలు పెట్టుబడుల కోసం తరచూ పెద్ద మేళాలను నిర్వహిస్తున్నాయి. వివాహాలకు సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి విందులు ఆరగించి చందన తాంబూలాలు స్వీకరించి పోయినట్లుగా కొన్ని వేల మంది, లక్షల మంది విదేశీ కంపెనీల ప్రతినిధులు, వారి వంది మాగధులు మన రాష్ట్రాలను సందర్శించి వేలాది అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేసి వెళ్లి వుంటారు. అవన్నీ వాస్తవ రూపం దాల్చి వున్నట్లయితే తెలుగు రాష్ట్రాలు రెండు ఏర్పడి వుండేవి కాదు, మన దేశం మొత్తంగా ఎప్పుడో అమెరికా అంత గాకపోయినా కనీసం చైనాను వెనక్కు నెట్టి వుండివుండేది.

ఆంధ్రప్రదేశ్‌కు మూడు వైపుల తమిళనాడు(చెన్నయ్‌) కర్ణాటక(బెంగలూరు) తెలంగాణా(హైదరాబాదు) అనే మూడు మహానగరాలు వున్నాయి. నాలుగో వైపున వున్నది బంగాళాఖాతం కనుక పెట్టుబడుల ఆకర్షణ పోటీలో అది వుండదు, అయినా మూడు మహానగరాలను తట్టుకొని ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు పెట్టేందుకు దేశం నలు మూలల నుంచి 1100 మంది 41 దేశాల నుంచి 315 మంది తొలిరోజు హాజరు కావటం చంద్రబాబు నాయుడి యాజమాన్య నిర్వహణకు నిదర్శనం. వివిధ కారణాలతో తొలి రోజు రాలేకపోయిన వారు చివరి రెండు రోజులలో రావచ్చు, వాటికీ రాలేని వారు తరువాత వచ్చి విజయవాడలో సంతకాలు చేసి వెళతారు. అన్నయ్యా ఎంత మంది వచ్చారు, ఏం తిన్నారు, ఎన్ని సంతకాలు చేశారని కాదు, ఎన్ని వాస్తవ రూపం దాల్చాయన్నది ముఖ్యం అన్నట్లుగా గతంలో జరిగిన ఆకర్షక సమావేశాల ఫలితాలేమిటో మచ్చుకు కొన్ని చూద్దాం.

ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే అందుకు అనువైన వాతావరణం అంటే దండిగా లాభాలు వచ్చే పరిస్ధితులు వున్నాయా లేవా అని చూస్తారు. లేకుంటే ప్రపంచం నలుమూలలు, పొరుగు రాష్ట్రాల నుంచి ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంటుంది ? ఏ దేశంలో అయినా ఆర్ధిక వుత్పత్తి వనరులలో ఎంతశాతాన్ని వినియోగించుకుంటున్నారు? కొత్త పరిశ్రమలు పెడితే వాటి భవిష్యత్‌ ఎలా వుంటుంది అని ఎవరైనా వెనుకా ముందు ఆలోచిస్తారు. గత ఆగస్టు ఎనిమిదవ తేదీన ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక ప్రచురించిన క్రిసిల్‌ రేటింగ్‌ నివేదిక ఆధారంగా ఇచ్చిన ఒక వార్త ప్రకారం మన దేశంలో పెట్టుబడులు తగ్గుతున్నాయి, సామర్ధ్యవినియోగం ఐదేళ్ల కనిష్టానికి పడిపోయిందన్నది దాని సారం. వర్తమాన ఆర్ధిక సంవత్సరం(2015-16)లో రెండుశాతం పెట్టుబడులు తగ్గుతాయని, ప్రయివేటు రంగ పెట్టుబడులు గత కొద్ది సంవత్సరాలుగా తగ్గటం ఆందోళన కలిగిస్తోందనిఈ ఏడాది మరో ఎనిమిదిశాతం తగ్గవచ్చని నివేదిక పేర్కొన్నది. పన్నెండు భారీ పరిశ్రమల రంగాలకు గాను పదింటిలో సామర్ధ్య వినియోగం ఐదేళ్ల కనిష్టానికి పడిపోయినందున కొత్త ప్రాజెక్టుల ఆశలు ఆవిరి అవుతున్నాయని, పర్యవసానంగా గతేడాది కాలంలో ప్రకటించిన లేదా అనుమతించిన పరిశ్రమలలో కేవలం 20శాతం మాత్రమే అమలులోకి రావచ్చని, మూల ధన పెట్టుబడులు 2017లోనే అర్ధవంతమైన విధంగా పెరగవచ్చని క్రిసిల్‌ వెల్లడించింది.

అల్యూమినియం, వుక్కు రంగాల సామర్ధ్యం పెంచిన కారణంగా వాటిని దిగుమతి చేసుకొనే భారత్‌ ఎగుమతి చేసే దేశంగా మారింది,ప్రపంచ మార్కెట్‌లో వస్తువుల ధరలు తగ్గిన కారణంగా చమురు శుద్ధి, మార్కెటింగ్‌, పెట్రోకెమికల్‌ రంగాలపై ప్రభావం పడింది.కాగితంతో సహా కొన్ని రంగాలలో సామర్ధ్య వినియోగం ఐదు సంవత్సరాల కనిష్టానికి తగ్గింది. కొద్ది కాలం తరువాత గాని తిరిగి పూర్వస్ధితికి చేరుకోలేవు. ఈ రంగాలలో కొత్త ప్రాజెక్టులకు అవకాశాలు పూర్తిగామృగ్యమయ్యాయి. ఆటోమొబైల్‌, ఎరువుల రంగంలోనే పెట్టుబడులు పెరిగే అవకాశాలు వున్నాయి. ఎరువుల రంగంలో కల్పించే రాయితీలు, చమురు ధరలు, వడ్డీలు తగ్గిన కారణంగా ఆటోమొబైల్‌ రంగంలో ముఖ్యంగా కార్ల రంగంలో అవకాశాలు వున్నాయి.

మౌలిక సదుపాయాల విషయానికి వస్తే పరిస్ధితి పూర్తి తిరోగమనంలో వుంది. విద్యుత్‌ రంగంలో పెట్టుబడులు తగ్గుతాయి.ధర్మల్‌ విద్యుత్‌ విభాగంలో జతచేయదలచిన సామర్ధ్యం గత రెండు సంవత్సరాలలో40వేల మెగావాట్లకు తగ్గగా మరో రెండు సంత్సరాలలో36వేలకు తగ్గిపోనుంది. ప్రయివేటు రంగంలో పెట్టుబడులు లేకపోవటం, పంపిణీ సంస్ధల ఆర్ధిక స్ధితి బలహీనంగా వున్న కారణంగా కొత్త కొనుగోలు ఒప్పందాలు లేని కారణంగా కొత్త ప్రాజక్టుల ప్రకటనలు రావటం లేదు అని క్రిసిల్‌ పేర్కొన్నది. ఇలాంటి నివేదికలను గమనంలోకి తీసుకొనే ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు తప్ప మరొక ప్రాతిపదిక వుండదు. ఈ పూర్వరంగంలో కొన్ని రాష్ట్రాలు కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు చిత్తుకాగితాలుగా మారాయి. పంజాబ్‌లో 2011-12 నుంచి ఖన్నా-మండి గోవింద ఘర్‌ పారిశ్రామిక ప్రాంతంలో 688 పరిశ్రమలు మూతపడ్డాయి. పంజాబ్‌లో భూముల ధరలు ఎక్కువగా వున్న కారణంగా పారిశ్రామిక సంస్ధలు విస్తరణకు మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, చత్తీస్‌ఘర్‌లను ఎంచుకుంటున్నాయి. అసోచెమ్‌ తన అధ్యయనంలో ఇలా పేర్కొన్నది. పంజాబ్‌లో 2015 మార్చి వరకు ఆకర్షించిన పెట్టుబడులు రెండులక్షల కోట్ల రూపాయలు. వాటిలో 1.6లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్లో ఎలాంటి పురోగతి లేదు. మిగిలినవి ఖర్చు పెరిగిందని, సమయం పడుతుందని పేర్కొన్నాయి. పరిశ్రమల రంగ అభివృద్ధి 2006-07లో 20శాతం వుండగా 2014-15లో రెండుశాతానికి పడిపోయింది. పురోగమన పంజాబ్‌ మదుపుదార్ల సదస్సు 2013 డిసెంబరులో జరిగింది. ఆ సదస్సును ఘన విజయంగా అకాలీదళ్‌, బిజెపి వర్ణించాయి. దానిలో 65వేల కోట్ల రూపాయల అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఇప్పటికీ అవి అలాగే వున్నాయి. కొన్ని కంపెనీలు కనీసం తమ ప్రతిపాదనలేమిటో కూడా సమర్పించలేదు. కొత్తవి రాకపోగా 2013-14లో వచ్చిన 7,200 కోట్లకు గాను మరుసటి సంవత్సరంలో రు.2,600 కోట్లకు పడిపోయాయి.

కర్ణాటకలో మూడు సంవత్సరాల తరువాత గతేడాది పెట్టుబడిదారుల సదస్సు జరిగింది.దానికంటే కొద్ది వారాల ముందే గతేడాదే తమిళనాడులో కూడా జరిగింది. ఇప్పుడు విశాఖలో ఆంధ్రప్రదేశ్‌ సదస్సు జరుగుతున్నది ఈ మూడు కూడా కేవలం నాలుగు నెలల వ్యవధిలో జరిగాయి. దేశ, విదేశాల ప్రతినిధులు ఈ సదస్సులన్నింటికీ హాజరయ్యారు. ఒప్పందాలపై సంతకాలు చేశారు, వాగ్దానాలు చేశారు. ఏ రాష్ట్రానికి ఆరాష్ట్రం తాము ఇచ్చే రాయితీలను పెట్టుబడిదారుల ముందు ఏకరువు పెడుతున్నాయి,తమ ప్రత్యేకతలు ఏమిటో వివరిస్తున్నాయి. జోస్యం చెప్పే కోయరాజులు తాము ఎంత పెద్దవారికి జోస్యం చెప్పామో తెలిపేందుకు వారితో దిగిన ఫొటోలను ముందుగా తమవద్దకు వచ్చేవారికి చూపినట్లు ఏ ఏ కంపెనీలు ఇప్పటికే తమ రాష్ట్రాలలో వున్నాయో, ఎవరు ఆసక్తి చూపుతున్నారో చూడండంటూ హడావుడి చేస్తున్నాయి. పెట్టుబడుల సదస్సుల గురించి జనంలో ముఖ్యంగా నిరుద్యోగ యువకుల్లో ఎన్నో ఆశలు రేపుతున్నారు. గోరంతను కొండంతలు చేసి చూపుతున్నారు. దీనిలో ఏ ఒక్కరూ తక్కువ తినలేదు.

వుదాహరణకు కర్ణాటకలో 2012లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు జరిగింది. సదానందగౌడ రాష్ట్రముఖ్య మంత్రి. ప్రభుత్వం శాసనసభకు సమర్పించిన సమాచారంలో ఇలా వుంది. ‘2010లో ఎడ్డియూరప్ప ముఖ్యమంత్రిగా వున్న సమయంలో 2010లో జరిగిన సదస్సులో 3.92లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, 7.27లక్షల వుద్యోగాలు కల్పించబడతాయని ప్రభుత్వం ఆరోజు చెప్పింది, వాస్తవానికి వచ్చింది 32,957 కోట్లు, 93,102 వుద్యోగాలు మాత్రమే. సదానందగౌడ 2012లో 2.81లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నానని, 13.99లక్షల వుద్యోగాలు వస్తాయని చెప్పారు. దానికి గాను వచ్చింది 12,468 కోట్లు వుద్యోగాలు 21,794 మాత్రమే. ఈ రెండింటినీ కలుపుకుంటే పెట్టుబడుల వాగ్దానం 6.37లక్షల కోట్లు , వస్తాయన్న వుద్యోగాలు 21.26లక్షలు కాగా వచ్చిన పెట్టుబడి 45,425 కోట్లు ఇచ్చిన వుద్యోగాలు 1.14లక్షలు మాత్రమే.

రాజకీయ నాయకుల వాగ్దానాలు ఎలా వుంటాయంటే లోక్‌సభ ఎన్నికల సమయంలో బిజెపి నేత నరేంద్రమోడీ విదేశాల్లో వున్న నల్లధనాన్ని వెలికితీస్తానని దానిని ఒక్క్కొరికి పంచితే 15లక్షలు వస్తుందని చెప్పారు. బహుశా దాన్ని తీసుకు వచ్చే క్రమంలోనే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ రాష్ట్రానికి లక్షా నలభైవేల కోట్ల రూపాయల ప్రత్యేక పాకేజి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు పార్లమెంట్‌ నిండు సభలో ప్రకటించిన ప్రత్యేక హోదా గురించి ఇంతవరకు కంటి చూపు తప్ప నోటమాటలేదు.

విశాఖ సభకు వచ్చిన ప్రతి ఒక్కరితో ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకొనే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ఆయన సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్‌ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.ఇలాంటి మాజిక్‌లను మోడీ గతంలోనే చేశారు కేవలం 24 గంటల్లో 2.1లక్షల కోట్ల పెట్టుబడులుండే 21వేల అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రకటించారు.అంటే ప్రతి నాలుగు సెకండ్లకు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే పిటి వుష, వుసేన్‌ బోల్ట్‌ రికార్డులను తిరగరాశారు. అలాగే నరేంద్రమోడీ గతేడాది ఎర్రకోట ప్రసంగంలో 17కోట్ల బ్యాంకు ఖాతాలను తెరుస్తామని ప్రకటించారు అంటే సెకనుకు ఆరు అన్నమాట. ఎప్పుడూ విదేశాల్లోనే తిరుగుతుంటారు మీకు భారత్‌లో చేసే పనేమీ లేదా అంటే దేశానికి కనీసం లక్ష కోట్ల డాలర్లు అంటే 66లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావటం తన లక్ష్యమని చెప్పుకున్నారు. అందువలన అలాంటి నరేంద్రమోడీని స్ఫూర్తిగా తీసుకున్న చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క ప్రతినిధితో ఒక్కొక్క ఒప్పందం కుదుర్చుకోవటంలో అతిశయోక్తి ఏముంటుంది, గొప్ప ఏముంది?

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాలో భారత్‌ కంటే ధాన్యానికి మద్దతు ధర రెట్టింపు

10 Sunday Jan 2016

Posted by raomk in Farmers, INDIA, NATIONAL NEWS, Uncategorized

≈ Leave a comment

Tags

FAO, MSP, Rice price

ఎంకెఆర్‌

చైనాలో ధాన్య మద్దతు ధర క్వింటాలుకు వారి కరెన్సీలో 270 యువాన్లు, ఆ మొత్తాన్ని మన రూపాయల్లోకి మార్చుకుంటే 2,740. రైతే రాజు రైతు లేనిదే బతుకు లేదు అని నిత్యం కబుర్లు చెప్పే మన దేశంలో 2015-16 సంవత్సరానికి ధాన్య మద్దతు ధర రు.1410, 1460. భారత ఆహార సంస్ధ కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన వున్నత స్ధాయి కమిటీ నివేదిక(పేజీ 61) ప్రకారం 2014లో చైనాలో బియ్యం మద్దతు ధర టన్నుకు 505 డాలర్లు కాగా భారత్‌లో 330.2 డాలర్లు. ఫిలిప్పైన్స్‌లో అత్యధికంగా 580.5, ఇండోనేషియాలో 408.3, బంగ్లాదేశ్‌లో 388.1 డాలర్లు. ప్రపంచంలో ధాన్యం ఎక్కువగా పండే దేశం చైనా, మనది రెండో స్ధానం. ఇదే సమయంలో అత్యధికంగా ఎగుమతి చేసే దేశాలలో మనం ప్రధమ స్ధానంలో వుంటే దిగుమతి చేసుకొనే దేశాలలో చైనా మొదటి స్ధానంలో వుంది. దీన్ని బట్టి ఏం అర్ధం చేసుకోవాలి.

మనం పది కోట్ల టన్నుల బియ్యం పండిస్తుంటే చైనా 14 కోట్ల టన్నులు .మనకంటే పది కోట్ల మంది ఎక్కువ వున్న చైనా తన జనాభాకు కడుపు నిండా తిండి పెట్టాలంటే పండించే రైతులకు ఎక్కువగా గిట్టుబాటు ధర చెల్లిస్తోంది. పండిన పంటకు తోడు విదేశాల నుంచి దిగుమతి చేసుకొంటోంది. చైనా కమ్యూనిస్టు దేశం గనుక అక్కడ రైతులకు ఎక్కువ చెల్లిస్తారు, అలాగే జనానికి బలవంతంగా తిండి పెడతారు, మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం కనుక మన రైతులకు తక్కువ ధరలు ఇచ్చి విదేశాలకు చౌకగా బియ్యం ఎగుమతి చేస్తారు, మన జనాన్ని తిండికి మాడుస్తారు అనే సమాధానం చెప్పుకోవాలి.

రెండు తెలుగు రాష్ట్రాలలో పండిన ధాన్యం త్వరలో మార్కెట్‌కు రాబోతున్నది. నాగార్జునసాగర్‌ ప్రాంతంలో నీరు లేక పంట లేదు. పండిన చోట రైతులకు ఎలాంటి ధర వస్తుందో తెలియదు. గతేడాది చేదు అనుభవాలే పునరావృతం అవుతాయా, పరిస్ధితి మెరుగుపడుతుందా అన్నది చూడాల్సి వుంది. డిసెంబరు మాసంతో 2015 ధాన్య సీజన్‌ ముగిసింది. పండిన పంట, మిగిలిన నిల్వలకు సంబంధించి తుది అంచనాలు వెలువడటానికి కొంత సమయం పడుతుంది. ప్రపంచంలో అనేక దేశాలలో ఎల్‌నినో ప్రభావం ధాన్య వుత్పత్తిపై పడింది.రెండవ పంట దిగుబడులు ఎలా వుంటాయో ఇంకా పూర్తిగా స్పష్టం కాలేదు. ఇప్పటికే 2015 గురించి తొలుత వేసిన అంచనా కంటే అక్టోబరు తరువాత రెండు మిలియన్‌ టన్నులు తగ్గింది. ప్రపంచ ఆహార సంస్ధ తాజా అంచనా పకారం 740 మిలియన్‌ టన్నుల ధాన్యం ప్రపంచంలో పండింది. గతేడాది కంటే 4మిలియన్‌ టన్నులు తక్కువ. ప్రతికూల వాతావరణ పరిస్ధితులు, ధరలు తగ్గటం వంటి పలు కారణాలు వున్నాయి. హెక్టారుకు 4.6టన్నులు సగటు దిగుబడి. ప్రతికూల పరిస్ధితులు ఆసియాలో ఎక్కువగా వున్నందున (మొత్తం వుత్పత్తి 670 మిలియన్‌ టన్నులు) 3.1మిలియన్‌ టన్నులు ఇక్కడే తగ్గింది. భారత్‌, మయన్మార్‌,నేపాల్‌,పాకిస్తాన్‌,ఫిలిఫ్పీన్స్‌లో తగ్గితే చైనా, బంగ్లాదేశ్‌, శ్రీలంక, ఇండోనేసియాలో పెరిగింది. ఎక్కువగా దిగుమతి చేసుకొనే దేశాలలో పంట బాగా పండటం, కొన్ని ఆఫ్రికన్‌ దేశాలు ఆర్ధిక ఇబ్బందుల కారణంగా దిగుమతులను తగ్గించిన కారణంగా మొత్తం మీద దిగుమతులు కూడా తగ్గాయి.భారత్‌ విషయానికి వస్తే రికార్డు స్ధాయిలో 11.7 మిలియన్‌ టన్నులు ఎగుమతి చేసింది.

ఇక 2016 విషయానికి వస్తే గతేడాది కంటే అంతర్జాతీయ ఎగుమతులు స్వల్పంగా పెరిగి 45. మిలియన్‌ టన్నులకు చేరవచ్చని అంచనా వేశారు. అనేక అనిశ్చితలను ఊహిస్తున్నారు. భారత్‌లో సరఫరా కష్టంగా వుండటం, ధర పోటీకి అనుగుణంగా లేకపోవటం వలన ఎగుమతులు తగ్గవచ్చు. ప్రపంచ వినియోగం తగ్గుతుందని అంచనా.జపాన్‌, థాయ్‌లాండ్‌ వంటి చోట్ల బియ్యాన్ని పశువుల దాణాగా వినియోగించటం పెరిగే అవకాశం వుంది. ఈ ఏడాది తలసరి బియ్యం వినియోగం 54.6 కిలోలకు పెరుగుతుంది. తాజా అంచనాలను బట్టి ప్రపంచ బియ్యపు నిల్వలు 5.7 మిలియన్‌ టన్నులు తగ్గి 2016లో 166.4 మిలియన్‌ టన్నులకు పడిపోతాయి.

గతేడాది చివరి మూడు నెలల్లో ప్రపంచ బియ్యం ధరలు స్థబ్దుగా వున్నాయి. పెద్దమొత్తంలో మార్కెట్‌కు పంట రావటమే కారణం. ఈ కారణంగా అక్టోబరు, నవంబరు నెలల్లో బియ్యం ధరలు పడిపోయాయి. ఎఫ్‌ఏవో బియ్యం ధర సూచిక 199,196 పాయింట్ల సగటు వుంది. కొన్ని దేశాలలో సేకరణ పెరగటం, ప్రధాన కొనుగోలు దారులు ఆసక్తి చూపటం వంటి కారణాలతో డిసెంబరులో 197 పాయింట్లకు పెరిగింది.ఎఫ్‌ఏఓ అన్ని రకాల బియ్యపు సూచిక 2015లో 2007 తరువాత అత్యంత కనిష్ట స్ధాయి 211 పాయింట్లకు పడిపోయింది.అంతకు ముందు ఏడాదితో పోల్చితే ఇది 10.5శాతం తక్కువ. బాస్మతి వంటి రకాల ధరలు 31శాతం పడిపోయాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సాంప్రదాయం, మనోభావాల పేరుతో సతి, దేవదాసీలనూ పునరుద్ధరిస్తారా ?

10 Sunday Jan 2016

Posted by raomk in BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

jallikattu, Modi Sarkar, Tamilnadu

మైనారిటీల ఓట్ల కోసం వారిని సంతృప్తి పరచే చర్యలు తీసుకుంటున్నారంటూ ఇతర పార్టీలపై నిత్యం ఆరోపణల పారాయణం చేస్తున్న వారు జల్లి కట్టు, ఎద్దులను హింసపెట్టే బండ్ల పోటీలకు అనుమతించటం ఎవరిని సంతృప్తిపరచేందుకు, ఎవరి ఓట్లను కొల్లగొట్టేందుకు ?

జల్లికట్టుకు అనుమతితో ప్రమాదకర పోకడకు నరేంద్రమోడీ సర్కార్‌ నాంది

సత్య

తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో నిర్వహించే జల్లికట్టు అనే ఒక మొరటు గ్రామీణ క్రీడను 2014లో సుప్రీం కోర్టు నిషేధించింది. సంప్రదాయాలు, సంస్కృతి పునరుద్దరణ పేరుతో కేంద్రంలోని బిజెపి సర్కార్‌ ఒక వుత్తరువు ద్వారా నిషేధాన్ని ఎత్తివేసి న్యాయ చరిత్రలో సర్వోన్నత న్యాయ స్ధానం తీర్పులను అపహాస్యం చేసే, వ్యవస్ధలను నాశనం చేసే ఒక అవాంఛనీయ పోకడకు తెరతీసింది. తమిళనాడులో కాలు మోపేందుకు అవసరమైన ఓట్ల కోసం పడిన కక్కుర్తి తప్ప ఇది మరొకటి కాదు. దీనిని అనుమతిస్తే రానున్న రోజులలో భారతీయత, సంప్రదాయం, ఆచారాలు, సంస్కృతి, మనోభావాల మరొక పేరుతో ఎంతకైనా తెగించేందుకు అవకాశం వుంది. మోడీ సర్కార్‌ నిర్ణయంపై అనేక వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండగా తమిళనాడులోని అధికార అన్నాడిఎంకె, ప్రధాన ప్రతిపక్షం డిఎంకె స్వాగతించాయి. కేంద్ర ప్రభుత్వ చర్యను కోర్టులో అడ్డుకుంటే స్టే రాకుండా చూసేందుకు జయలలిత సర్కార్‌ కేవియట్‌ పిటీషన్‌ కూడా వేసింది. సంక్రాంతి సందర్భంగా జల్లికట్టును యధావిధిగా అనుమతించేందుకే ఇది అని వేరే చెప్పనవసరం లేదు.

క్షత్రియత లేదా పౌరుషానికి(పురుషత్వం) జల్లికట్టు చిహ్నమని దానిని అనుమతించటాన్ని సమర్ధిస్తూ తమిళనాడు బిజెపి నేత ఎల్‌ గణేశన్‌ వ్యాఖ్యానించారు. ఇక బిజెపి మేథావులైతే కేంద్ర చర్యను విమర్శించిన వారిని సంస్కృతి తెలియని నిరక్షరాస్యులని విరుచుకుపడుతున్నారు. జల్లికట్టు లేకుండా పొంగల్‌ పండుగ సంపూర్ణం కాదని, ఎద్దులను హింస పెట్టటం జరగదని, వాటితో పోరాడి లొంగదీసుకొనే వారికే ఎక్కువ ప్రమాదమని, అహింస పేరుతో మనం పిరికివారిగా మారకూడదని గణేశన్‌ సెలవిచ్చారు. అంతే కాదు స్వామి వివేకానంద, సుబ్రమణ్య భారతి, ముత్తురామలింగ దేవర్‌ ఎప్పుడూ పురుషత్వం గురించి చెప్పారని, జల్లి కట్టుకు దానిని పెంపొందించే గుణం వుందంటూ వారిని కూడా ఇందులోకి లాగారు.

తమిళనాడు జల్లికట్టు, మహారాష్ట్రలోని ఎడ్ల బండి పందాలలో వుపయోగించే పశువులు హింసకు గురువుతున్నందున వాటిని నిషేధించాలని రెండు రాష్ట్రాలలో దాఖలైన పిటీషన్లు, స్దానిక కోర్టులు ఇచ్చిన తీర్పులు వాటిపై అప్ఫీళ్లను అన్నింటినీ కలిపి సుప్రీం కోర్టు విచారించింది. ఏడు సంవత్సరాల పాటు సాగిన ఈ న్యాయ ప్రక్రియ తరువాత 2014 మే నెలలో సుప్రీం కోర్టు జల్లికట్టును నిషేధిస్తూ అంతిమ తీర్పు నిచ్చింది. దీనిని పూర్వపక్షం చేస్తూ ఈనెల ఏడున కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ

ఒక నోటిఫికేషన్‌ జారీ చేసి సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణంగా తమిళనాడులో జల్లికట్టు , మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్‌, హర్యానా, కేరళ, గుజరాత్‌ వంటి చోట్ల జరిగే పందాలను అనుమతిస్తున్నట్లు పేర్కొన్నది. ఎవరైనా దీనిపై కేసులు దాఖలు చేస్తే తమవాదన వినకుండా ముందుకు పోరాదని తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఒక పిటీషన్‌ దాఖలు చేసింది.

కేంద్ర ప్రభుత్వ చర్య ఏదో తమిళనాడులో జల్లికట్టును అనుమతించటంగానే గాక అంతకంటే పెద్ద సమస్యగా చూడాలని మాజీ సొలిసిటర్‌ జనరల్‌ ఎం పరాశరన్‌తో సహా అనేక మంది న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. మన దేశ చట్టాల ప్రకారం ప్రజాప్రతినిధులతో కూడిన పార్లమెంట్‌,అసెంబ్లీలు చట్టాలను చేస్తాయి, వాటిని ప్రభుత్వాలు అమలు జరుపుతాయి, అవి రాజ్యాంగబద్దంగా వున్నాయా లేవా అన్న టీకా తాత్పర్యాలను న్యాయస్ధానాలు విచారించి తీర్పులు చెబుతాయి. వాటిపై ప్రభుత్వంతో సహా ఎవరికైనా అభ్యంతరాలో మరొకటో వుంటే పునర్విచారణ కోరవచ్చు. లేదా ప్రభుత్వాలు చట్ట సభలలో అవసరమైన చట్ట సవరణలు చేసి కోర్టు తీర్పుల పర్యవసానాలను సరిచేయవచ్చు. ఇక్కడ కేంద్ర సర్కార్‌ దీనిని పట్టించుకోకుండా , కోర్టులో వున్న రివ్యూ పిటీషన్‌ విషయం ఏమీ తేలకుండానే ఏకంగా కార్యనిర్వహణ అధికారాన్ని వుపయోగించి సంస్కృతి, సంప్రదాయాల ముసుగులో సర్వోన్నత న్యాయస్థాన తీర్పును వమ్ము చేసింది. విచారణ సందర్బంగా వాటన్నింటినీ కూలంకషంగా విన్నతరువాతనే సర్వోన్నత న్యాయ స్ధానం తీర్పు నిచ్చింది అన్న విషయాన్ని మరిచి పోరాదు.

మన దేశంలో సంస్కృతులు, సాంప్రదాయాలు, ఆచారాలు, విశ్వాసాల పేరుతో గతంలో అనేక అనర్ధాలు జరిగాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. కొన్ని చట్ట వ్యతిరేకంగా మరికొన్నింటిని పైన చెప్పిన కారణాలను సాకుగా చూపుతూ చట్టవ్యతిరేక చర్యలను చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అలాంటి వాటిన్నింటిపై గతంలో ఇచ్చిన తీర్పులను ప్రభుత్వాలు జల్లికట్టు మార్గంలో తిరగదోడే అవకాశం వుంది. ప్రజల మనోభావాల పేరుతో ప్రభుత్వం ఏమైనా చేయవచ్చని పరాశరన్‌ హెచ్చరించారు. ప్రతి వ్యవస్ధా పవిత్రతను కోల్పోతున్నది, తగు పద్దతులలో ఎందుకు చేయకూడదు ? ప్రభుత్వం ముందు మూడు అవకాశాలు వున్నాయి. ఒకటి రివ్యూ(సమీక్ష) పిటిషన్‌ దాఖలు చేయటం, రెండవది తాత్కాలిక పిటీషన్‌, మూడవది పార్లమెంట్‌లో చట్టసవరణ ద్వారా చేయవచ్చు అని పరాశరన్‌ అన్నారు.

మన సాంప్రదాయం కాదనే పేరుతో దేశంలోని వివిధ ప్రాంతలలో అటు మెజారిటీ ఇటు మైనారిటీ మతోన్మాద శక్తులు పౌరులపై ముఖ్యంగా మహిళలపై అనేక ఆంక్షలను విధించటమే కాదు, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నాయి. సాంప్రదాయాల పేరుతో అనేక అనర్ధాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందాలు కూడా జల్లికట్టువంటివే. సాంప్రదాయం, పల్నాటి పౌరుషం పేరుతోనో మరొక పేరుతోనో వాటిని నిషేధించిన హైకోర్టు నిర్ణయాన్ని ప్రభుత్వం తిరగదోడదన్న గ్యారంటీ ఏముంది? ఒక యుగంలో ఏకపత్నీవ్రతం ఆదర్శ మైతే మరొక యుగంలో బహుభార్యాత్వం, వేలాది మందితో సరససల్లాపాలు ఆమోదమైంది. అనేక ప్రాంతాలలో ఎంత మంది వుంపుడుగత్తెలను కలిగివుంటే అంతటి పురుషత్వంగా కీర్తించబడిన రోజులు వున్నాయి. పురుషత్వం, పౌరుషం వంటివి తిరోగమన, ఫ్యూడల్‌ భావజాలానికి ప్రతీకలు. మహిళ లకు పౌరుషం అక్కర లేదా ?

మన దేశంలో బాల్యవివాహాలు, సతీసహగమనం, కన్యాశుల్కం, దేవదాసీ, బసివిని,జోగినీ వంటి దురాచారాలకు, దళితులపై అత్యాచారాలకు అనేక మత విశ్వాసాలు, గత సాంప్రదాయాలు, ఆచారాలను అతికించే మేథావులు ఎక్కడచూసినా మనకు కనిపిస్తారు. అఖండ భారత్‌, హిందూ సమాజ పునరుద్దరణ తమ లక్ష్యంగా, చట్టాలకంటే తమ విశ్వాశాలే ప్రధానమని ప్రకటించుకున్న శక్తులకు ప్రాతినిధ్యం వహించేవారు కేంద్రంలో, పలు రాష్ట్రాలలో అధికారంలో వున్నారు.పైన పేర్కొన్నవాటిని పునరుద్ధరించరన్న గ్యారంటీ ఏముంది. మైనారిటీల ఓట్ల కోసం వారిని సంతృప్తి పరచే చర్యలు తీసుకుంటున్నారంటూ ఇతర పార్టీలపై నిత్యం ఆరోపణల పారాయణం చేస్తున్న వారు జల్లి కట్టు, ఎద్దులను హింసపెట్టే బండ్ల పోటీలకు అనుమతించటం ఎవరిని సంతృప్తిపరచేందుకు, ఎవరి ఓట్లను కొల్లగొట్టేందుకు ? కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రేపు మరొక అంశంలో, మరొక రాష్ట్రంలో ఇలాంటి అవాంఛనీయ చర్యలకు దారితీయదన్న గ్యారంటీ ఏముంది? బాబరీ మసీదు ప్రాంతం రాముడి జన్మ స్ధలం అన్నది తమ విశ్వాసమని అక్కడే గుడి కట్టాలని చెబుతున్నవారు రేపు కోర్టులో అందుకు వ్యతిరేకంగా తీర్పు వస్తే దాన్ని గౌరవిస్తారా ? ప్రజల, మతవిశ్వాసాలు, మనోభావాలను గౌరవించే పేరుతో ఆ వివాదాస్పద స్ధలంలో శాశ్వత చిచ్చు పెట్టరన్న గ్యారంటీ ఏముంది ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

బలహీనపడుతున్న నరేంద్రమోడీ – బలపడుతున్న విమర్శకులు

09 Saturday Jan 2016

Posted by raomk in BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

BJP, Modi Critics, Narendra Modi

ఎంకెఆర్‌

నరేంద్రమోడీ 2014 ఎన్నికలకు ముందు బిజెపిలో తిరుగులేని నేత ! వుక్కు మనిషిగా అభిమానులు కీర్తించిన ఎల్‌కె అద్వానీని సైతం తుక్కు కింద జమకట్టి మూలన పడేసిన అపర చాణక్యుడు !! మరి నేడు ? ఏం పీకుతారో పీక్కోండి అంటూ మోడీ-అమిత్‌షాల నాయకత్వాన్ని సవాలు చేస్తున్న నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎంత తేడా !!! ఎందుకీ పరిస్ధితి? ఏం జరుగుతోంది?

భారతీయ జనతా పార్టీ దాని పూర్వరూపాలైన జనసంఘం,జనతా పార్టీ న్యూఢిల్లీలో సాంప్రదాయంగా బలంగా వుండేవి. అలాంటిది కేంద్రంలో స్వంతంగా తొలిసారి బిజెపి అధికారానికి వచ్చిన తరువాత అక్కడ బిజెపి ఆమ్‌ ఆద్మీ చేతిలో చావు దెబ్బ తిన్నది. సృష్టి, స్ధితి, లయ కారకుడిగా నరేంద్రమోడీని వర్ణించినందున అక్కడ తగిలిన చావు దెబ్బకూ ఆయనే మూలం. తరువాత బీహార్‌లో పద్దతి మార్చారా అంటే అదీ లేదు, అక్కడా బిజెపి విష్ణుమూర్తి బోర్లా పడ్డాడు. తాను పాలించిన గుజరాత్‌ అభివృద్దికి నమూనా అని దాన్ని దేశం మొత్తానికి విస్తరింప చేస్తానని నమ్మబలికిన పెద్ద మనిషి ఇరవై నెలలు గడిచినా దాని జాడే లేదు, అంతకు ముందు కంటే వుత్పత్తి రంగంలో అధోగతిలోకి దేశం దిగజారింది. ఏ రంగంలో చూసినా పరిస్ధితి దిగజారటమే తప్ప సమీప భవిష్యత్‌లో మెరుగు పడే సూచనలు కనిపించటం లేదు. ఇంటా బయటా మరిన్ని సంస్కరణలు అమలు జరపాలన్న వత్తిడి పెరుగుతోంది. జిఎస్‌టి వంటి బిల్లులు ఆమోదం పొందే పరిస్ధితి కనిపించటం లేదు. నోరు తెరిస్తే జర్నలిస్టులు ఏం అడుగుతారో, ఏం చెప్పాల్సి వస్తుందో తెలియని స్ధితిలో నరేంద్రమోడీ మన్మోహన్‌ సింగ్‌ బాటలోనే మౌన ముని అవతారమెత్తారంటే అతిశయోక్తి కాదు.

ఇన్ని వైఫల్యాల తరువాత నరేంద్రమోడీకి, ఆయన అంతర్భాగం లేదా అంతరంగమైన అమిత్‌షాకు పార్టీపైన పట్టేముంటుంది. పూర్వాశ్రమంలో సినిమాల్లో విలన్‌ పాత్రలు పోషించి తనకంటూ ఒక ఇమేజ్‌ సృష్టించుకున్న షాట్‌ గన్‌ శతృఘ్న సిన్హా ఇప్పుడు బిజెపి మందలో ఒకడు. అద్వానీ సమక్షంలో షాపై జోకులు పేల్చుతున్నాడు. బీహార్‌ పీఠాన్ని ఆశించి భంగ పడ్డవారి జాబితాలో వున్నాడు. తన జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ సందర్భంగా పాత గాయాన్ని మరోసారి కెలికినట్లు బీహార్‌ ఘోరపరాజయాన్ని జనం ముందుకు తెచ్చారు.ఆ సభలో బిజెపిలో మూలన పడేసిన అద్వానీ, యశ్వంత సిన్హా, ఇద్దరు కేంద్ర మంత్రులు హర్షవర్ధన్‌, వికె సింగ్‌,ఎస్‌పి నేత అమరసింగ్‌,కాంగ్రెస్‌ నేత రణదీప్‌ సూర్జేవాలా కూడా హాజరై సభను రక్తి కట్టించారు.’ మా నాయకుడు అమిత్‌ షా బీహార్‌లో మూడింట రెండువంతుల మెజారిటీతో గెలుస్తామని జోస్యం చెప్పారు.బహుశా అలా చెప్పటం ఆయనకు అలవాటు అనుకుంటా ఎందుకంటే ఢిల్లీలో కూడా అదే చెప్పారు అక్కడ మూడింట రెండువంతులకు బదులు రెండుమూడు సీట్లు వచ్చాయి’ అని శతృఘ్న సిన్హా జోక్‌ చేశారు. బీహార్‌కు చెందిన ఇతర మా నాయకులు ప్రతివారూ వాటిని చిలుక పలుకుల్లా వల్లించారు. వుల్లితో కన్నీరు తెప్పించి గతంలో ఓడిపోయి మనం కన్నీరు కార్చాము ఈ సారి దానిని పునరావృతం కాకుండా ధరలు తగ్గించమని తాను చెప్పానని, తన మాట ఎవరూ వినలేదని సిన్హా ఆత్మకధలో రాసుకున్నారు. తనకు నాయకత్వం అప్పగించని కారణంగా పార్టీ ఓడిపోతుందని కొందరు తనతో చెప్పారని చివరికి అదే జరిగిందని కూడా పేర్కొన్నారు.సిన్హా ఈ విధంగా మాట్లాడటానికి తొలి ఏడాది కాలంలోనే నరేంద్రమోడీ పసేమిటో తేలిపోవటం మినహా మరొకటి కాదని వేరే చెప్పాలా ?

ప్రధాని సన్నిహితులలో ఒకరైన అరుణ్‌జైట్లీ అవినీతి గురించి ధ్వజమెత్తిన బిజెపి ఎంపీ కీర్తీ అజాద్‌పై ఏ క్షణంలో అయినా పార్టీ క్రమశిక్షణా చర్య తీసుకొనే అవకాశం వుంది. అజాద్‌ క్రమశిక్షణను వుల్లంఘించినట్లు క్రమశిక్షణా కమిటీ ఇప్పటికే ప్రకటించింది. ఆయన ప్రవర్తన పార్టీ ప్రతిష్టను దిగజార్చేదిగా వుందని కమిటీ అధ్యక్షుడు గణేషీ లాల్‌ వ్యాఖ్యానించాడు. ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌లో జరిగిన నిధుల అవినీతి గురించి అజాద్‌ ఎవరి పేరునూ ప్రస్తావించకుండానే విలేకర్ల సమావేశంలో పరోక్షంగా జెట్లీ గురించి చెప్పారు. విలేకర్లతో మాట్లాడవద్దని పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా ఆదేశించినా ఖాతరు చేయలేదు. పార్టీ ఇచ్చిన సంజాయిషీ లేఖను కూడా పట్టించుకోకుండా తానెలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకూ పాల్పడలేదని పేర్కొన్నారు.

గతంలో తాను అధ్యక్షుడిగా వున్న క్రికెట్‌ అసోసియేషన్‌ వ్యవహారాలపై ఆరోపణలు చేసినందుకు అరుణ్‌ జైట్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, ఇతర ఆప్‌ నేతలపై పరువు నష్టం దావా దాఖలు చేశారు. కేజ్రీవాల్‌ ప్రభుత్వం పేద అయినందున తాను కేవలం ఒక రూపాయి ఫీజు తీసుకొని జైట్లీకి వ్యతిరేకంగా వాదిస్తున్నట్లు బిజెపి మాజీ నాయకుడు రాజ్యసభ సభ్యుడు రామ్‌ జెత్మాలనీ చెప్పారు. దేశంలో ఎక్కువ ఫీజు తీసుకొనే న్యాయవాదిని తాను అన్న మాట వాస్తవమేనని అయితే తాను వాదించే కేసులలో కేవలం పదిశాతం మంది నుంచే డబ్బు తీసుకుంటానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వాజ్‌పేయి సర్కారులో న్యాయశాఖ మంత్రిగా వున్న తనను తొలగించటంలో అరుణ్‌జెట్లీ పాత్ర వుందని అన్నారు. తనకు జైట్లీ మీద బలమైన అభిప్రాయాలు వున్నాయని అయితే అవి మంచివి కాదని చెప్పారు. తన గురించి నాకు ఎన్నో విషయాలు తెలుసని జైట్లీకి తెలుసని కూడా అన్నారు.ఎన్నికల ప్రచారంలో చెప్పిన నల్ల ధనం గురించి మోడీ-అమిత్‌ షా- జెట్లీ ఎన్నో చెప్పినపుడు తాను వారి అభిమానినయ్యానని, వాటి గురించి ఇప్పుడేమీ చేయని కారణంగా తాను వారి విమర్శకుడిగా మారినట్లు జెత్మలానీ చెప్పారు.

నరేంద్రమోడీ ఎన్నికల వాగ్దానాలను విస్మరించారని విమర్శిస్తూ సామాజిక వుద్యమ కార్యకర్త అన్నా హజారే ఒక లేఖ రాశారు. అంతకు ముందున్న కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ పాలనకూ మోడీ ఏలుబడికి పెద్ద తేడా కనపడటం లేదని పేర్కొన్నారు. నల్లధనాన్ని వెనక్కు తీసుకువస్తానని, లోక్‌పాల్‌, లోకాయక్తలను సక్రమంగా అమలు చేస్తానని చెప్పిన మోడీ వాటిని విస్మరించారని పేర్కొన్నారు.ఈ విషయమై తాను ఎన్నిసార్లు లేఖలు రాసినా వాటిని చెత్తబుట్టలో వేశారని ఇది కూడా అలాంటిదే అని వ్యాఖ్యానించారు.గతంలో లంచం ఇవ్వకుండా ఆఫీసుల్లో పని జరగదని మీరు చెప్పిన మాటలను జనం నమ్మారు, ఇప్పుడు కూడా పరిస్ధితి అలాగే వుంది, ద్రవ్యోల్బణం కూడా తగ్గలేదని హజారే విమర్శించారు. చేసిన వాగ్దానాలను మరిచి పోయారని పేర్కొన్నారు. ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో తాను దీక్ష చేపట్టిన సమయంలో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వమే కాదు బిజెపి నేతలు సుష్మా స్వరాజ్‌,అరుణ్‌ జైట్లీ కూడా అవినీతి వ్యతిరేక బిల్లును అమోదిస్తామని తనకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరి లేఖకు ప్రధాని స్పందించటం సాధ్యం కాదని తనకు తెలుసునని తన వంటివ వారికి సమాధానం రాయాల్సి వుందన్నారు.పివి నరసింహారావు ప్రధానిగా వున్నపుడు కొన్ని సార్లు ఫోన్లో మాట్లాడారని, వాజ్‌పేయి పూనేకు వచ్చినపుడు తన గురించి తెలుసుకున్నారని, మన్మోహన్‌ సింగ్‌ తన లేఖలకు సమాధానాలు రాసేవారని, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు శేషాద్రి తన వూరు పహెల్‌ గామ్‌ సిద్దికీ సందర్శించి తనను గ్రామ కర్మయోగిగా ఒక పుస్తకంలో రాశారని అలాంటి తనను మోడీ విస్మరించారిని హజారే వాపోయారు.

ఇదిలా వుండగా ఇది జరిగిన కొద్ది రోజులకే మహారాష్ట్రలోని బిజెపి సర్కార్‌ హజారే తదితరులు ట్రస్టు సభ్యులుగా వున్న ఒక ప్రభుత్వేతర సంస్ధ పేరులోని అవినీతి వ్యతిరేక అనే పదాన్ని తొలగించనందుకు గాను వారిని ట్రస్టీలుగా తొలగిస్తూ ప్రభుత్వం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. గతేడాది జూన్‌లో ఈ మేరకు అధికారులు జారీ చేసిన నోటీసులో అవినీతి వ్యతిరేక అనే పదాన్ని తొలగించకపోతే చర్య తీసుకుంటామని హెచ్చరించారు. సామాజిక సేవ తప్ప అవినీతి వ్యతిరేక చర్యలు తీసుకొనే బాధ్యత ధర్మాదాయ సంస్ధల చట్టం కింద నమోదైన సంస్ధల పని కాదని పేర్కొన్నారు. ప్రభుత్వ నోటీసు అందుకున్న హజారే అందుకు తిరస్కరించారు.ప్రభుత్వం ఎన్‌జీవోలను వేధించటం మానుకొని అవినీతి నిరోధక చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం మొత్తం ఇరవై సంస్ధలకు ఇలాంటి నోటీసులే ఇచ్చింది. అవినీతి నిరోధక చర్యల పేరుతో అధికారంలోకి వచ్చిన బిజెపి సర్కార్‌ ఇలాంటి చర్యలకు పూనుకోవటం నిజంగా ఆశ్చర్యం గొలుపుతోంది కదూ !

Share this:

  • Tweet
  • More
Like Loading...

బలమైన సిపిఐ(ఎం)ను నిర్మిద్దాం

09 Saturday Jan 2016

Posted by raomk in CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

CPI(M), CPI(M) Plenum, indian communist, INDIAN LEFT, SITARAM YECHURY

– సీతారాం ఏచూరి

                      ఇరవైఒకటవ పార్టీ మహాసభ ఆదేశాల మేరకు సిపిఐ(ఎం) ప్లీనం సమావేశమయింది. తన పనిని ‘2015 చివరికల్లా’ పూర్తిచేసింది. కేవలం ఎనిమిది నెలల కాలంలో పార్టీ మహాసభ ఆదేశాలను సిపిఐ(ఎం) నెరవేర్చ గలగటం గౌరవప్రదమైన విజయం. ప్లీనం నిర్వహించటానికి ఒక సమగ్రమైన, సవివర మైన విధానాన్ని, టైంటేబుల్‌ను పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించింది. ప్రస్తుత పార్టీ నిర్మాణం, పనితీరులను గురించి రాష్ట్ర కమిటీల నుంచి విస్తృత సమాచారాన్ని సేకరించటం కోసం ఒక వివరణాత్మక మైన ప్రశ్నావళిని పార్టీ కేంద్రం రూపొందించింది. రాష్ట్ర కమిటీ లు పంపిన సమాధానాలను పరిశీలించిన మీదట వాటి ఆధారంగా నిర్మాణంపై ‘ముసాయిదా నివేదిక’, ‘ముసాయిదా తీర్మానం’లను తయారు చేసింది. పార్టీ మహాసభకు, ప్లీనం జరగటానికి మధ్యకాలంలో పొలిట్‌బ్యూరో ప్రత్యేకంగా నాలుగు సార్లు, కేంద్ర కమిటీ మూడు సార్లు సమావేశమయ్యా యంటే దీనిలో ఎంత తీవ్ర స్థాయిలో సన్నాహక శ్రమ ఉందో అర్థం చేసుకోగలం. కొల్‌కతా బ్రిగేడ్‌ పేరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన మహా ప్రదర్శన అనంతరం 2015 డిసెంబర్‌ 27 మధ్యాహ్నం తరువాత ప్లీనంలో చర్చలు మొదలయ్యాయి. ఇటీవలి కాలంలో బ్రిగేడ్‌ మైదానంలో ఇంత పెద్ద ప్రదర్శన జరగలేదని బూర్జువా మీడియా కూడా అంగీకరించవలసి వచ్చింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ దాడులను, అడ్డంకులను అధిగమించి ప్రదర్శనలో పాల్గొన్నవారిని చూస్తే సిపిఐ(ఎం) యువకులను ఆకర్షించలేకపోతున్నదని మన వర్గశత్రువులు, బూర్జువా మీడియా చేస్తున్న ప్రచారం ఎంత అసత్యమనే విషయం తెలుస్తున్నది. ఈ ప్రదర్శనలో పశ్చిమబెంగాల్‌లోని అన్ని ప్రాంతాల నుంచి యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
పార్టీ నిర్మాణం ప్రాధాన్యతను ఒక కమ్యూనిస్టు పార్టీ ఎన్నడూ తక్కువగా చూడటం జరగదు. అశేష భారత ప్రజానీకానికి పార్టీ అవగాహనను, రాజకీయ పంథాను చేరవేయటంలో అది పార్టీకి ప్రధాన ఆయుధంగా ఉంటుంది. సజీవమైన, సమర్థవంతమైన పార్టీ నిర్మాణం లేనిదే భారత ప్రజలతో బలమైన అనుబంధాన్ని పెంపొందించుకుని, వారి ప్రయోజనాలను కాపాడేందుకు పోరాడజాలదు.
ప్రజాపంథాతో విప్లవపార్టీ
మన లక్ష్యాలను వేగవంతంగా సాధించేందుకు పార్టీ శ్రేణులను పునరుత్తేజపరిచే, పార్టీ నిర్మాణాన్ని పునఃపటిష్టం చేసే ప్రక్రియ ప్లీనం విజయవంతంగా ముగియటంతో ప్రారంభమయింది. పార్టీ రాజకీయ-ఎత్తుగడల పంథాను సమీక్షించి వామపక్ష ప్రజాతంత్ర సంఘటనను నిర్మించవల సిన ఆవశ్యకతను ప్రాథమ్య లక్ష్యంగా పునరుద్దరిస్తూ రాబో యే మూడు సంవత్సరాలకు రాజకీయ-ఎత్తుగడల పంథాను 21వ పార్టీ మహాసభ ఆమోదించింది. కాబట్టి ఈ లక్ష్యాలను సాధించేందుకు పార్టీ నిర్మాణ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు, క్రమబద్ధీకరించేందుకు నిర్మాణంపై జరిగిన ఈ ప్లీనం తన దృష్టిని సారించింది. బలమైన ప్రజాపోరాటాలను నిర్వహించటం ద్వారా ప్రస్తుత సవాళ్ళను ఎదుక్కోవాలని సిపిఐ(ఎం) కృతనిశ్చయంతో ఉంది. అంటే మనం మన పార్టీ స్వంత బలాన్ని పెద్ద ఎత్తున పెంచుకోవలసి ఉంటుంది. భారత ప్రజలలోని వర్గ శక్తుల పొందిక వామపక్ష, ప్రజాతంద్ర సంఘటన(ఎల్‌డిఎఫ్‌)కు అనుకూలంగా మార్చవలసిన అవసరాన్ని పునరుద్ఘాటించిన రాజకీయ-ఎత్తుగడల పంథాను అనుసరించి ఇది జరగాలి. ఏదో ఒక బూర్జువా కూటమిని ఎంచుకునే దయనీయ స్థితి నుంచి బయటపడేసి, ఒక ప్రత్యామ్నాయ విధాన ప్రాతిపదికన ఏర్పడే వర్గ ప్రత్యామ్నాయాన్ని భారత ప్రజల ముందుంచగలిగేంత బలంగా ఎల్‌డిఎఫ్‌ ఉండాలి. భారత ప్రజలలోని వర్గ శక్తుల పొందికను మార్చటం ద్వారా ఎల్‌డిఎఫ్‌ దేశంలో జనతా ప్రజాతంత్ర విప్లవం నుంచి సోషలిజానికి పరివర్తన చెందేం దుకు నాయకత్వం వహించే జనతా ప్రజాతంత్ర సంఘటనకు అగ్రగామిగా ఉంటుంది. అందువల్ల ప్రస్తుత దశలో దాని పంథా భారత ప్రజలతో సంబంధాలను బలోపేతం చేయడం అంటే ప్రజా మార్గంతో ఉన్న విప్లవ పార్టీ గనక మార్క్సిజం- లెనినిజం సైద్ధాంతాలపై ఆధారపడిన ఒక విప్లవ పార్టీగా సిపిఐ(ఎం) స్వభావాన్ని ప్లీనం పునరుద్ఘాటించింది.
నిర్మాణ సామర్థ్యాలను బలోపేతం చేయటం
పార్టీ నిర్మాణ సామర్థ్యాలను విస్తారంగా అభివృద్ధి చేస్తే తప్ప ఈ విప్లవ లక్ష్యాలను సాధించజాలం. అందువల్ల చాలా కఠినమైన సవాళ్ళు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగానూ, దేశం లోనూ, సమాజంలోనూ నెలకొన్న సంక్షోభం శీఘ్రంగా తీవ్రతరమౌతోంది. ‘ప్రతి సంక్షోభ సమయంలోనూ ఏదో ఒక అవకాశం అందుబాటులో ఉంటుంది’ అనే పాత నానుడి ఉంది. పురోగమించేందుకు అలాంటి అవకాశాలను అంది పుచ్చుకోవాలని ప్లీనంలో సిపిఐ(ఎం) నిర్ణయించింది.ప్రపంచ పెట్టుబడిదారీ సంక్షోభం నెలకొన్న స్థితిలో ఆ వ్యవస్థలో ప్రవేశపెట్టిన సంస్కరణలు ప్రజలను తీవ్రమైన దోపిడీ నుంచి విముక్తి చేయలేవు. అలాంటి పరిస్థితిలో దోపిడీకి గురవు తున్న వర్గాల మద్దతును కూడగట్టే కార్మికవర్గ పార్టీగా సిపిఐ (ఎం) ముందుండాలి. సోషలిజం అనే రాజకీయ ప్రత్యామ్నా యంతోనే ఇది చేయటం సాధ్యపడుతుంది. అంతేకాక భారతదేశానికి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ విధాన ప్రణాళిక సిపిఐ(ఎం)కు ఉన్నది. దాని ఆధారంగా మెరుగైన భారత దేశాన్ని సృష్టించటం సాధ్యమేనని ప్రజలు గుర్తించేందుకు వీలుకలుగుతుంది. ఆర్థిక అసమానతలను విపరీతంగా పెంచే ప్రస్తుత విధానాలకు బదులుగా దేశ వనరులను ఉపయోగించి నాణ్యమైన విద్యను, మంచి ఆరోగ్యాన్ని, సుస్థిర ఉపాధిని కల్పించి భారతీయ యువతకు మంచి భవితను ఈ ప్రత్యామ్నాయం అందిస్తుంది. మన బహుళ మత, భాష, సంస్కృతి, జాతుల ప్రజల మధ్య ఐక్యతను విచ్ఛిన్నంచేసి మతపరమైన కేంద్రీకరణను రెచ్చగొట్టి, అసహన ఫాసిస్టు హిందూ రాజ్యాన్ని మనదేశంపై రుద్దేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌- బిజెపిలు చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడే రాజకీయ శక్తిగా సిపిఐ(ఎం) ఉంటుంది. ఉగ్రవాదానికి, అన్ని రకాల మతమౌఢ్యాలకు వ్యతిరేకంగా సిపిఐ(ఎం) ఏకకాలంలో నికరంగా పోరాడుతుంది. మెజారిటీ మతతత్వం, మైనారిటీ మత మౌఢ్యం ఒక దానిని మరొకటి బతికించుకుంటూ బలోపేతం చేసుకుంటాయి. అన్ని రకాల వివక్ష, సామాజిక అసమానతలతోపాటు కుల ఆధారిత అంటరానితనాన్ని రూపుమాపేందుకు సిపిఐ(ఎం) ఉద్యమాలను తీవ్రతరం చేస్తుంది. వేగంగా దిగజారుతున్న రాజకీయ నైతికత బురదలో అవినీతి, ప్రజా జీవితంలో నైతిక దిగజారుడుకు వ్యతిరేకంగా పోరాడే ఉదాహరణగా సిపిఐ(ఎం) ఉంటుంది. సిపిఐ(ఎం)కు ఉన్న ఈ రికార్డు పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసే లక్ష్యాన్ని సాధించేందుకు అవకాశం కల్పిస్తుంది.
నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్ట విశ్లేషణ
‘నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్ట విశ్లేషణే గతితార్కిక నియమాల జీవసారం’ అనే లెనిన్‌ సూత్రీకరణను సిపిఐ(ఎం) ఎల్లవేళలా సమర్థిస్తుంది. ఈ సూత్రీకరణను అనుసరించి గత రెండు దశాబ్దాలుగా నయా ఉదారవాద విధానాల ప్రభావం వల్ల ఎలాంటి నిర్దిష్ట మార్పులు జరిగాయి అనే విషయాన్ని అధ్యయనం చేసేందుకు సిపిఐ(ఎం) మూడు స్టడీ గ్రూపులను నియమించింది. ఈ స్టడీ గ్రూపుల నిర్దారణల ఆధారంగా భూస్వాములు, గ్రామీణ ధనికుల కూటమికి వ్యతిరేకంగా వ్యవసాయ కార్మికుల, పేదల, మధ్యతరగతి రైతుల, వ్యవసా యేతర రంగాలలో పనిచేసే గ్రామీణ కార్మికుల, ఇతర గ్రామీణ పేదల విశాల ఐక్య సంఘటనను నిర్మించి వర్గ, ప్రజా ఉద్యమాలను బలోపేతం చెయ్యాలని ప్లీనం నిర్ణయించింది. ప్రధానమైన వ్యూహాత్మక పరిశ్రమలలో కార్మికులను సమీకరిం చటం, సంఘటిత, అసంఘటిత రంగాలలోని ఒప్పంద కార్మికులను సమీకరించటం, ట్రేడ్‌ యూనియన్ల, యువత, మహిళల సహకారంతో ప్రాదేశిక ఆధారిత నిర్మాణాలను స్థాపించటం, పట్టణాలలోని బస్తీలలో పట్టణ పేదలను సమీకరించటం, వృత్తి ఆధారిత బస్తీ కమిటీలను స్థాపించ టం, పౌర వేదికల వంటి వాటిని, సాంస్కృతిక కార్యకలాపా లను ప్రోత్సహించే వేదికలను, వారి జీవితాలలో, పనిలో శాస్త్రీయ దృక్పథం అలవర్చే కార్యకలాపాలను, రెసిడెన్షియల్‌ అసోసియేషన్లు, పింఛనర్ల అసోసియేషన్లు, వృత్తి సంఘాల ను స్థాపించి మధ్యతరగతి వర్గాలలో పనిని ప్రధానంగా భావ జాల సంబంధిత కార్యకలాపాలను బలోపేతం చెయ్యాలి.
సరైన క్యాడర్‌ విధానాన్ని అమలు చెయ్యాలి
ఒక కమ్యూనిస్టు పార్టీ ఎల్లవేళలా పైనుంచే నిర్మించ బడుతుంది. కాబట్టి మన నిర్మాణాన్ని బలోపేతం చెయ్యా లంటే పార్టీ కేంద్రాన్ని బలోపేతం చెయ్యటంతో ఈ ప్రయ త్నాలు మొదలవ్వాలని, ఆ తరువాత పార్టీలోని అన్ని స్థాయిల్లో నాణ్యతను మెరుగుపర్చాలని ప్లీనం స్పష్టంగా పేర్కొన్నది. దీనిని సాధించటానికి తీసుకోవలసిన అనేక చర్యలలో యువ కామ్రేడ్స్‌ను గుర్తించి, ప్రోత్సహించి, సంబంధిత కమిటీల సమిష్టి నిర్ధారణ ఆధారంగా బాధ్యతలను అప్పజెప్పటం, వారిని విప్లవ పరివర్తన కోసం జరిగే పోరాటాలలో భావజాల నిబద్ధతకు, త్యాగానికి ప్రతీకలైన పూర్తి కాలం కార్యకర్తలుగా తీర్చిదిద్దటం, పూర్తి కాలం కార్యకర్తలకు తగిన వేతన నిర్మాణం ఉండేలా చూసి, వారికి సకాలంలో వేతనాలు అందేలా చూడ టం వంటి సరియైన క్యాడర్‌ విధానాన్ని అమలు చేయవలసిన అవసరాన్ని ప్లీనం ప్రముఖంగా పేర్కొన్నది. పటిష్టమైన శ్రేణులను నిర్మించటంలో భాగంగా క్రమం తప్పకుండా పార్టీ పాఠశాలలను నడపవలసిన అవసర ముందని, స్వీయ అధ్య యనం కోసం చదువవలసిన అవశ్యక గ్రంథాల పట్టికతో పాటు కేంద్ర స్థాయిలో సిలబస్‌ను తయారు చెయ్యాలని, పార్టీ పత్రికల, ప్రచురణల నాణ్యతను గణనీయంగా మెరుగుపర్చి, వాటి రూపం, సారాల స్థాయిని పెంచి అశేష ప్రజానీకానికి చేరేలా చర్యలు తీసుకోవాలని ప్లీనం భావించింది.
సామాజిక అణచివేతపై  పోరాటాలను తీవ్రతరం చెయ్యడం
ఆర్థిక దోపిడీ, సామాజిక అణచివేత అనే ‘రెండు కాళ్ళ’ మీద భారతదేశంలోని వర్గ పోరాటాలు ముందుకు సాగాలనే సిపిఐ(ఎం)అవగాహనను అనుసరించి జండర్‌ అణచివేత, దళిత, ఆదివాసీ, వికలాంగుల, మతసంబంధిత అల్పసంఖ్యా కుల పట్ల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటాలను తీవ్రతరం చేయటానికి పార్టీ నిర్మాణ సామర్థ్యాన్ని బలోపేతం చెయ్యాల ని ప్లీనం ప్రముఖంగా పిలుపునిచ్చింది. సిపిఐ(ఎం) ఈ రెండు కాళ్ళ మీద ముందుగా నడవాలి. ఆ తరువాత పరుగెత్తాలి.
మతతత్వంపై పోరాటం
మతతత్వ శక్తుల ప్రస్తుత భావజాల దాడిని తిప్పికొట్టేం దుకు పార్టీ నిర్మాణ సామర్థ్యాన్ని బలోపేతం చేయవలసిన అవసరం ఉందని ప్లీనం పేర్కొన్నది. ఇందుకోసం సాహిత్య వేత్తలను, శాస్త్రవేత్తలను, చరిత్రకారులను, సాంస్కృతిక రంగంలో పనిచేస్తున్న మేధావులను, ఇతర రంగాలకు చెందిన మేధావులను సమీకరించాలి. పాఠశాల పూర్వ, పాఠశాల స్థాయిలో శాస్త్రీయ దృక్పథాన్ని, లౌకిక విలువలను వ్యాప్తిచేసేందుకు సామాజిక, సాంస్కృతిక కార్యకలాపాలను నిర్వహించేందుకు అధ్యాపకులను, సామాజిక సంస్థలను భాగస్వాములను చెయ్యాలి. దళిత, ఆదివాసీల వంటి దోపిడీకి గురవుతున్న వర్గాలలోకి మతతత్వ ధోరణులు చొచ్చుకురాకుండా అడ్డుకునేందుకు ప్రత్యేక కార్యకలాపాలను రూపొందించాలి. ప్రగతిశీల, లౌకిక విలువలను, సాంస్కృతిక రూపాలను విస్తృతపరచటానికి విశాల సాంస్కృతిక వేదిక లను ఏర్పాటు చెయ్యాలి. ట్రేడ్‌ యూనియన్లు, ఇతర ప్రజా సంఘాలు తమతమ ప్రాంతాలలో సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలి. ఆరోగ్య కేంద్రాలు, విద్యా శిక్షణ సెంటర్లు, రీడింగ్‌ రూమ్స్‌, సహాయ కార్యక్రమాల వంటి సామాజిక సేవా కార్యకలాపాలను నిర్వహించాలి. వీటితో పాటు జనరంజకమైన సైన్స్‌, సాంస్కృతిక ఉద్యమాలను బలోపేతం చేయవలసిన అవసరం చాలా ఉన్నది.
తక్షణ అత్యవసర పనులు
గొప్ప ప్రజా ఉద్యమాలను నడిపేందుకు సిపిఐ(ఎం) దేశ ప్రజలతో సంబంధాలను బలోపేతం చేసేందుకు అవసర మైన చర్యలు తీసుకోవాలి. పార్టీ నిర్మాణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవటానికి ఇది అవసరం. ప్రజలతో సజీవ సంబంధాలను బలోపేతం చేయటానికి ముందుగా పార్టీ ప్రజా పంథాను అమలుచేయాలి. అంటే అనేక రకాల స్థానిక పోరాటాలను నిర్వహించటానికి స్థానిక పార్టీ శాఖలను బలోపేతం చేయటంతోపాటు ప్రజాతంత్ర విప్లవానికి ఇరుసుగా ఉన్న వ్యవసాయిక విప్లవాన్ని ముందుకు తీసుకు పోయే విషయంపై మనం దృష్టి సారించాలి. ఇందుకోసం దోపిడీకి గురవుతున్న గ్రామీణ ప్రజలు చేసే పోరాటాలలో మమేకమవడం ద్వారా కార్మిక-కర్షక మైత్రిని బలోపేతం చేయాలి. పార్టీ పలుకుబడి పెరగటానికి, వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను కూడదీయటానికి ఆర్థిక, సామాజిక సమస్యలపై వర్గ, ప్రజా పోరాటాలను నిర్వహించటంపై తక్షణమే దృష్టిని సారించాలి. ప్రజాపంథాను అవలంబించి ప్రజలతో సజీవ సంబంధాలను ఏర్పరచుకోవాలి. మంచి నాణ్యతగల సభ్యత్వాన్ని కలిగిన విప్లవ పార్టీని నిర్మించటానికి పార్టీ నిర్మాణాన్ని క్రమబద్ధం చేయాలి. యువతను పార్టీలోకి ఆకర్షించటానికి, మతతత్వానికి, నయా ఉదారవాదానికి, ప్రతీఘాత భావజాలాలకు వ్యతిరేకంగా భావజాల పోరాటం చేయటానికి ప్రత్యేక కృషి జరగాలి.
ఆమోదింపబడిన డాక్యుమెంట్లలోని నిర్ణయాలు- తీర్మానం, నివేదికలను తప్పనిసరిగా ఒక కాలపరిమితిలో అమలుచేయాలని ప్లీనం నిర్ణయించింది. ఇది పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీలతో మొదలవుతుంది. కొన్ని రాష్ట్రాలలో అసెం బ్లీ ఎన్నికలు జరగనున్నందున అన్ని రాష్ట్ర కమిటీలూ తమ తమ నిర్దిష్ట పరిస్థితులను అనుసరించి తమ ప్రణాళికలను ఒక కాలపరిమితిలో అమలుచేయాలి. వాటిని ఒక సంవత్సర కాలంలో సమీక్షించాలి. అత్యావశ్యక సంకల్పంతో ఈ నిర్ణయా లను అమలు చేసేందుకు మొత్తం పార్టీని, కార్యకర్తలను, సానుభూతిపరులను, పార్టీ క్షేమాన్ని కాంక్షించేవారందరినీ సమీకరించాలని విజ్ఞప్తి చేస్తూ ప్లీనం ముగిసింది. మన దేశం లో విప్లవాత్మక సామాజిక పరివర్తనను ముందుకు తీసుకెళ్ళే బాధ్యతను సిపిఐ(ఎం) నిర్వర్తించేందుకు ఇదొక్కటే మార్గం.
(అనువాదం : నెల్లూరు నరసింహారావు)

Share this:

  • Tweet
  • More
Like Loading...

పోతులూరి వీరబ్రహ్మం కాలజ్ఞానంపై పరిశోధనలు

08 Friday Jan 2016

Posted by raomk in Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Science

≈ Leave a comment

Tags

indian science congress 2016, pseudo-scientific claims

సైన్స్‌ సమావేశాలా మూఢనమ్మకాల మేళాలా ?

ఎంకెఆర్

ఈ లెక్కన పోతులూరి వీరబ్రహ్మం కాలజ్ఞానం పేరుతో ప్రచారంలో వున్న వాటన్నింటి మీద ఒక్కొక్క పత్రాన్ని సమర్పించవచ్చు.రుజువు అయ్యేంత వరకు వాటిని కాదనటానికి లేదు, ఏమి తర్కమిది, దేశాన్ని ఎటు తీసుకుపోవాలనుకుంటున్నారు వీరు? ప్రజాస్వామ్య దేశం, భావప్రకటనా స్వేచ్ఛ వుంది కనుక అలాంటి వాటికి కావాలంటే పిచ్చి కాంగ్రెస్‌లు ఎన్నయినా పెట్టుకోవచ్చు, పత్రాలు సమర్పించుకోవచ్చు సైన్స్‌ కాంగ్రెస్‌లలో వాటిని జొప్పించటమే మన దౌర్బాగ్యం.

ఏడు కొండల వాడా పాహిమాం రాకెట్‌ సముద్రంలో కూలిపోకుండా చూడు అని ఇస్త్రో శాస్త్రవేత్తలు మొక్కుతారు ! దేవుడా మేం కట్టే వంతెన కూలిపోకుండా చూడు అని కాంట్రాక్టరుతో కలిసి ఇంజనీర్లు కొబ్బరి కాయలు కొడతారు ! ఆపరేషన్‌ జయప్రదం చేసి నా ప్రాక్టీస్‌ను పెంచు అని వైద్యులు కత్తులు కటార్లను దేవుడి ముందుంచుతారు !!!

లోకంలో ఇన్ని జరుగుతున్నపుడు గతేడాది ముంబైలో జరిగిన సభలో సంస్కృతంలో పురాత భారత సైన్సు అంశాలు నిక్షిప్తమై వున్నాయని చెప్పి సభను ఒక ప్రహసంగా మార్చారు. ఇప్పుడు దాని కొనసాగింపుగా మైసూరులో జరిగిన సైన్స్‌ కాంగ్రెస్‌లో మరికొన్ని అశాస్త్రీయ అంశాలను అనుమతించటం, ప్రవేశపెట్టటంలో ఆశ్చర్యం ఏముంది? వేదాలను నమ్మటం నమ్మకపోవటం అన్నది వ్యక్తిగతం. కానీ వేదాల్లో అన్నీ వున్నాయష మనమేమీ చేయనవసరం లేదన్నది సహించరాని విషయం. ఇలాంటి తిరోగమన అంశాలకు ప్రస్తుతం కేంద్రంలో వున్న ప్రభుత్వమే పెద్ద పీట వేస్తున్నది. అలాంటి వాటిని ప్రచారం చేయటం జాతి ద్రోహమని తెలిసిన వారు కూడా మౌనంగా వుండటానికి పేరేమి పెట్టాలో భాషా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలి లేదా వేదాల్లో ఏముందో సంస్కృత పండితులు చెప్పాలి.

శాస్త్ర సభలు సమాజంలో ముఖ్యంగా విద్యార్ధులు,యువతలో కొత్త విషయాలపై ఆసక్తిని రేకెత్తించి నూతన ఆవిష్కరణలకు దోహదం చేయాలి. మధ్య ప్రదేశ్‌కు చెందిన ప్రయివేటు విశ్వవిద్యాలయాల నియంత్రణ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ అఖిలేష్‌ పాండే శివుడు గొప్ప పర్యావరణవేత్త అనే ఇతి వృత్తంతో మైసూరు సైన్స్‌ కాంగ్రెస్‌కు పత్రం సమర్పించటం ఏమిటి ? దాన్ని నిర్వాహకులు అంగీకరించటం ఏమిటి? భారతీయులు ఎప్పుడో విమానాలను కనిపెట్టారు, క్లోనింగ్‌ ప్రక్రియ కొట్టిన పిండి, మనిషి-జంతు శరీర భాగాలను కూడా అతికించగలిన వైద్యులు మనకుండబట్టే గణపతి తయారయ్యాడు వంటి విషయాలను ఇటీవలి కాలంలో ప్రచారం చేస్తున్నారు. వాటిని మొగ్గలోనే నిలువరించకపోవటంతో కొనసాగింపు జరుగుతోంది. రానున్న రోజుల్లో ఇంకా ఇలాంటి విచిత్రాలను ఎన్నింటిని వినాల్సి, చూడాల్సి వస్తుందో !

చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్న లోకరీతి తెలిసిందే.కొందరు శాస్త్రజ్ఞులకు తెలివి కంటే అతి తెలివి ఎక్కువ అని సైన్స్‌ కాంగ్రెస్‌ చర్చ అంశాల ఎంపిక సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గంగాధర మిశ్రా నిరూపించారు. ఊహాజనితాలపై ప్రయోగాలు చేస్తూ వున్నపుడు అవి విజయవంతమైతే విజ్ఞానశాస్త్రమౌతుంది అని గొప్ప స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. శివుడు పర్యావరణ శాస్త్రవేత్త అన్న పత్రాన్ని సమర్పించేందుకు ఇచ్చిన అనుమతిని సమర్ధించుకుంటూ చెప్పిన మాటలివి. ఇలాంటివారిని చూసి దేనితో నవ్వాలో తెలియటం లేదు.ఈ లెక్కన పోతులూరి వీరబ్రహ్మం కాలజ్ఞానం పేరుతో ప్రచారంలో వున్న వాటన్నింటి మీద ఒక్కొక్క పత్రాన్ని సమర్పించవచ్చు.రుజువు అయ్యేంత వరకు వాటిని కాదనటానికి లేదు, ఏమి తర్కమిది, దేశాన్ని ఎటు తీసుకుపోవాలనుకుంటున్నారు వీరు? ప్రజాస్వామ్య దేశం, భావప్రకటనా స్వేచ్ఛ వుంది కనుక అలాంటి వాటికి కావాలంటే పిచ్చి కాంగ్రెస్‌లు ఎన్నయినా పెట్టుకోవచ్చు, పత్రాలు సమర్పించుకోవచ్చు సైన్స్‌ కాంగ్రెస్‌లలో వాటిని జొప్పించటమే మన దౌర్బాగ్యం.

బోడిగుండుకు మోకాలికి ముడి పెట్టినట్లుగా ఇళ్ల ముందు చల్లే పేడ కళ్లాపి నుంచి ప్రతి మూఢనమ్మకానికీ శాస్త్రీయ కారణాలున్నాయంటూ చెప్పేవారు, వాటిని ప్రచురించి వ్యాపింపచేసే పుస్తక ప్రచురణలు, మీడియా సంస్ధలూ వున్నాయి. ఏమో ఏ పుట్టలో ఏ పాముందో మనకు తెలియదేమో, తెలియని వాటిని ఎందుకు కాదనాలంటూ నమ్మటమే కాదు, ప్రచారం చేసే జనాలూ వున్నారు. ఇప్పుడు సమాజంలో ఫాస్ట్‌ ఫుడ్‌లు, అవి పెంచే వూబకాయాలతో ఫిట్‌నెస్‌ సమస్య ముందుకు వచ్చింది. ఏది చెప్పినా దానికి దేశీయత అని బ్రాండ్‌ వేయటం దేశభక్తిగా మారింది. దానిలో భాగంగానే శంఖాన్ని రోజూ కాసేపు వూదితే మెదడు చురుకుగా పనిచేస్తుందని, ముఖం కళకళలాడుతుందని, శ్వాసకోశాలు చక్కపడతాయని, పురీష నాళ కండరాలకు మర్ధన చేసినట్లు అవుతుందని కాన్పూర్‌కు చెందిన ఐఎఎస్‌ అధికారి రాజీవ్‌శర్మ ఒక పత్రం సమర్పించారు. అదే నిజమైతే దాన్ని ఒక మతానికి చిహ్నంగా వున్న శంఖానికే ఎందుకు పరిమితం చేయాలి ? బూరకు గాలి వూదినా, సన్నాయి, తబలా, హార్మోనియం వాయించినా, రబ్బరు బంతిని నలిపినా ఇలా ప్రతి పరికరానికి శరీర భాగంలో ఏదో ఒకటి కదలటం మెదడు పనిచేయటం, ముఖాలు వెలిగిపోవటం ఎందుకు జరగదు ? కొన్ని ఆపరేషన్లు చేసినపుడు, పక్షవాతానికి గురైనపుడు,ఇతర కీళ్ల సంబంధ వ్యాధులకు వైద్యులు బంతి వున్న పరికరంలోకి గాలి వూదించటం, రబ్బరు బంతులను చేతులతో నలిపించే ప్రక్రియలు కొన్ని చేయించటం మనకు తెలిసిందే. వాటికి శాస్త్రీయ కారణాలు చెప్పటానికి బదులు మహత్తులను ఆపాదించటమే అభ్యంతరకరం.రోజూ శంఖువు వూదితే కలిగే ప్రయోజనాలను ప్రతిపాదించే ముందు ఎంత మందిపై పరిశోధనలు చేశారో, ఎలా చేశారో, కందగడ్డలుగా వున్న ముఖాలు ఎన్ని ఎంతలా విప్పారాయో, మంద బుద్దులు ఎంత మంది చురుకుగా మారారో నిరూపించే అంశాలను చూపినపుడే దానికి ప్రామాణికత వుంటుంది.అవేమీ లేకుండా ఏది బడితే దాన్ని అనుమతించటం మన సైన్సు సమావేశాలను మనమే అపహాస్యం చేసుకోవటం తప్ప మరేముంది? వైద్య రంగంలో ప్రత్యామ్నాయ వైద్యం పేరుతో ఇప్పటికే అనేక ఆశ్రాస్తీయ అంశాలను శాస్త్రంగా చిత్రించి జనాన్ని తప్పుదారి పట్టిస్తున్న తరుణంలో ఇలాంటి వాటికి తావివ్వకూడదు.గతంలో ఆయిల్‌ పుల్లింగ్‌ పేరుతో పుంఖాను పుంఖాలుగా రాశారు, కొందరు చేశారు. దాని వెనుకా శాస్త్రీయ కారణాలున్నట్లు అప్పుడు ప్రచారం చేశారు. ఇపుడు ఎందుకు అలాంటి వారు కనిపించటం లేదు.

పురాణాలు, ఇతిహాసాలలో పేర్కొన్న విమానాలలో మన వారు ఎక్కడకు ప్రయాణించారో మనం నిరూపించలేము గానీ వాటిని పశ్చిమ దేశాల వారు నిరూపించినందున మన వారు చెప్పింది కరెక్టే కదా అనే వాదనలను ముందుకు తెస్తున్నారు. అపని మనం ఎందుకు చేయలేకపోయాము, మనల్ని ఆపిందేమిటి , మన మెదళ్లు అంతగా ఎందుకు మొద్దుబారి పోయాయి అన్నదే సమస్య. అన్ని దేశాలు, మతాలలో ఇలాంటి వూహలు, కల్పనలూ వున్నాయి. వాటిని నమ్మినట్లుగానే మన దేశంలో పేర్కొన్నవాటిని కూడా కొందరు పాశ్చాత్యులు నమ్మి వాటినే తిరిగి మనకు మనకు తెలియని మన శాస్త్రాంశాలుగా పుస్తకాలు రాస్తే మనం మన పాత సైన్సు ఎంత గొప్పదో అని జబ్బలు చరుచుకుంటున్నాం . వాటిని నిరూపించేంత వరకు కల్పనలుగానే తీసుకోవాలి తప్ప నిరూపించనంత మాత్రాన నిజం కాకుండా పోతాయా , అసలేమీ తెలియకుండానే చెప్పారా లేదా రాశారా అనే వితండ వాదనలు చేస్తే అర్ధం లేదు. దేనికైనా శాస్త్రీయతే ప్రమాణం.

మైసూరు సైన్స్‌ కాంగ్రెస్‌కు సమర్పించిన శంఖం, శివుడు పర్యావరణ వేత్త అనే పత్రాలు కాంగ్రెస్‌ అధికారంలో వుండి వుంటే వివాదాస్పదం అయ్యేవి కావని, బిజెపి కేంద్రంలో వుంది కనుక రాజకీయం చేస్తూ మీడియాలో రాస్తున్నారని కొందరు అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు.బిజెపి తిరోగమన పునాదులపై ఏర్పడిన పార్టీ, అందుకని అది వాటికి ఆలంబనగా వున్న హిందూయిజాన్ని ప్రచారం చేసేందుకు అన్ని వేదికలనూ వుపయోగించుకుంటుంది. పురాణ పాత్రలకు ప్రామాణిక ముసుగు వేసే యత్నమే శివుడి గురించి పత్రం.గోవును వధించిన వారిని చంపాలని వేదాలు చెప్పాయని చెప్పిన వారు వేదాల పేరుతో ఏం చేసేందుకైనా సిద్ద పడతారు.

మన సైన్స్‌ కాంగ్రెస్‌ల గురించి నోబెల్‌ బహుమతి గ్రహీత అయిన వెంకటరామన్‌ రామకృష్ణన్‌ చేసిన వ్యాఖ్యలు కనువిప్పు కావాలి. ఆయనేమీ మోడీ లేదా సంఘపరివార్‌ వ్యతిరేక రాజకీయ నాయకుడు కాదు. మైసూరు జరిగే సైన్స్‌ సమావేశాలు ఒక సర్కస్‌ తప్ప మరొకటి కాదని, వాటికి తాను హాజరు కావటం లేదని వ్యాఖ్యానించారు. రాజకీయాలు, మత భావాలను సైన్సుతో మిళితం చేయరాదన్నారు. గతంలో జరిగిన ఒక సభకు తాను వచ్చానని అక్కడ సైన్సు గురించి చాలా తక్కువ చర్చించారని నా జీవితంలో మరోసారి అలాంటి సభలకు రానని విలేకర్లతో చెప్పారు. చండీఘర్‌లోని పంజాబ్‌ విశ్వవిద్యాలయంలో మాట్లాడుతూ ఎన్నో శాస్త్రీయ విజయాలను సాధించినప్పటికీ పెద్ద సంఖ్యలో భారతీయులు ఇంకా మూఢనమ్మకాలతో వున్నారని అందువలన నిర్ణయాలు తీసుకోవటంలో ఆలస్యం జరుగుతోందన్నారు.మంగళయాన్‌ కార్యక్రమాన్ని ప్రస్తావించి దాని ప్రయోగానికి శుభప్రదమైన రోజంఊ మంగళవారాన్ని ఎంచుకోవటం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. రెండువేల సంవత్సరాల క్రితమే ఒక యోగి విమానాన్ని కనిపెట్టారని చెప్పటాన్ని తాను నమ్మనని అన్నారు. ఆధునిక శాస్త్రం తెల్లవారే సరికి వూడిపడలేదని, ఒక పద్దతి ప్రకారం తయారైన పరిజ్ఞానాన్ని ఎవరైనా తిరిగి ప్రతిబింబించినపుడే అది శాస్త్రం అవుతుందన్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Robot: 10 Facts

08 Friday Jan 2016

Posted by raomk in Economics, employees, INTERNATIONAL NEWS, Readers News Service

≈ Leave a comment

Tags

Robot, robotics

The automotive industry dominates the ever growing field of robotics.

Takeaways

  • The automotive industry is the largest user of industrial robots worldwide.
  • China — the world’s largest producer of cars — currently has 281 robots per 10,000 automotive industry workers.
  • The US employed 152 robots in all industries per 10,000 workers in 2013, tripling the global average.

1.South Korea employed 437 robots per 10,000 manufacturing workers as of 2013 — the highest robot density in the world.

2.South Korea has held the top spot since 2011, when it overtook Japan.

3.Japan’s industrial robot density in 2013 was 323 per 10,000 workers.

4.Third-ranked Germany had 282 robots in use per 10,000 workers — the highest rate in Europe.

5.One of the things South Korea, Japan and Germany all have in common is a huge automotive industry.

6.The automotive industry is the largest user of industrial robots. Other robot-intensive industries include electronics, metals, plastics and food.

7.China — the world’s largest producer of cars — currently has 281 robots per 10,000 automotive industry workers.

8.In all other industries, China’s robot industry rate was only about 14 per 10,000 workers.

9.The United States employed 152 robots in all industries per 10,000 workers in 2013.

10.While the U.S.’s robot density is just about a third of South Korea’s, it is almost three times the global rate of 62 robots per 10,000 manufacturing workers.

Source: World Robots 2014, International Federation of Robotics, with analysis by The Globalist Research Center

Share this:

  • Tweet
  • More
Like Loading...

Why Good U.S. Jobs Are Too Few and Wages So Poor

08 Friday Jan 2016

Posted by raomk in Current Affairs, INTERNATIONAL NEWS, Readers News Service, USA

≈ Leave a comment

Tags

globalization of technology, TECHNICAL SKILLS, U.S. GDP, U.S. Jobs, white-collar work

The lack of workers trained for a more technologically demanding workplace is slowing growth.

By Peter Morici, January 8, 2016   theglobalist.com

Credit: VLADGRINShutterstock.com

Takeaways

  • The future lies not in being angry about false injustice, rather in building and teaching machines.
  • Lack of workers trained for a more technologically demanding workplace is slowing growth.
  • By 2030, it will become technologically possible to replace 90% of the jobs with smart machines.
  • The globalization of technology will relegate us to low paying work better left to androids.
  • Four in ten graduates lack the complex reasoning skills needed for white-collar work.

Americans are justified to be angry about the economic recovery. This is a bipartisan challenge.

Since Ronald Reagan ran the country, the availability of attractive employment has been trending down and slowing economic growth is often blamed.

During Obama’s recovery, U.S. GDP has advanced at a 2.2% annual pace, whereas the comparable figures for the Reagan and Clinton presidencies were 4.6% and 3.7%.

But that puts the story backwards — the lack of workers adequately trained for a more technologically demanding workplace is slowing growth, not the other way around.

Switch to automation

Automation has been an enduring theme throughout American history. First, reapers and tractors consolidated farms and sent workers to factories.

Then machines replaced workers in manufacturing, pushing them into more highly paid professions in medicine, education and technology (but also less well paid occupations in restaurants, retailing and other services).

Until recently, computer-programmed machines could be taught strenuous and repetitive tasks like attaching a heavy, rigid fender onto an automobile.

Going forward, robots will increasingly replace people in activities requiring more-subtle manual dexterity—like making shirts and harvesting fruit—and those requiring more complex cognitive processes like masonry construction, driving limousines and building newrobots that adapt to changing environmental conditions.

The drug store I visit in Washington no longer has cashiers—just a group of checkout machines and one clerk to assist technologically flummoxed patrons.

Over the next two decades, robots will be capable of unloading pallets, stocking shelves, filling prescriptions, and generally running the store with minimal human intervention.

Flawed education system?

By 2030, it will become technologically possible to replace 90% of the jobs as we know them with smart machines.

The real challenge, however, will be training most Americans to engage in intellectually demanding and creative work.

Otherwise, the globalization of technology and competition will relegate most of us to very low paying work better left to androids.

In 2016, Americans should be skeptical, not merely of false promises to restore prosperity made by Bernie Sanders and Donald Trump, but also outraged by the handiwork of mainstream politicians.

The latters’ efforts to make a U.S. high school diploma universal have made it a nearly worthless credential.

Less than 40% of 12th graders are ready to read or learn math at the college level, and many fewer have skills to enter technically demanding positions without post-secondary training.

A college diploma is not much better. After millions of unqualified students have been pushed into universities, four in ten graduates lack the complex reasoning skills needed for white-collar work — as it exists today.

Machines equipped with high-level artificial intelligence could replace armies of stockbrokers, insurance adjusters and restaurant managers over the next several decades.

Need for more technical skills

Meanwhile the president and his presumptive heir, Hillary Clinton, remain wedded to pushing more people into college (and too often into debt) without regard for whether this investment could possibly pay off.

And conservatives—including the likes of Ted Cruz and Marco Rubio — oppose universal standards for more academic rigor like the Common Core.

The future lies in educating Americans, not to be angry about false injustice or an omnipresent state, but rather to build and teach the machines that will do the work that has burdened humanity since the first branch was shaped into a hunting implement.

Without young people trained and encouraged to do that sophisticated work, the locus of prosperity will permanently shift from America to Asia.

There, pragmatic leaders urge children to study engineering, not the personal and institutional hobbyhorses peddled by pious academics and deceitful politicians.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Number of Americans Who Identify as Bisexual on the Rise

08 Friday Jan 2016

Posted by raomk in International, INTERNATIONAL NEWS, Readers News Service, USA, Women

≈ Leave a comment

Tags

Americans, Bisexual, same-sex, sexual fluidit

By Kali Holloway / AlterNet

Razvan Raz / Shutterstock

It seems fitting that as we close out a year in which sexual fluidity was one of the most discussed topics, a new study finds that the number of adult Americans who identify as bisexual is on the rise.

That’s according to the Centers for Disease Control, which assessed sexual attitudes of more than 9,000 U.S. residents aged 18-44. The survey found that between 2011 and 2013, an increasing number of respondents reported same-sex sexual contact and bisexual self-identification.

As in other recent surveys, the CDC report found U.S. women outpaced men in reporting bisexuality. Two percent of men polled labeled themselves bisexual, up from 1.2 percent in the 2006-2010 survey. Women, at 5.5 percent, up from 3.9 percent in the previous poll, were nearly three times as likely to identify as bisexual than men.

Fittingly, the report notes an increase in the number of American women who report same-sex sexual contact. This was true of 14.2 percent of women polled in 2006-2010—a figure that rose to 17.4 in the most recent survey. Just 6.2 percent of men say they’ve had sexual contact with other men.

CNN notes that researchers identified some race-linked disparities among survey respondents. Hispanic and Latina women, at 11.2 percent, were least likely to have had sexual contact with other women. Conversely, 19.6 percent of white women and 19.4 percent of black women reported having had same-sex sexual contact.

In late 2015, a study at the University of Essex became somewhat controversial due to researchers’ determination that “100 percent heterosexual” women simply don’t exist. The study assessed women’s involuntary physical responses, such as pupil dilation, when shown sexually suggestive videos of both men and women. Overwhelmingly, women who identified as lesbian showed signs of arousal almost solely with images of women. But heterosexual women involved in the study responded to both.

“Even though the majority of women identify as straight, our research clearly demonstrates that when it comes to what turns them on, they are either bisexual or gay, but never straight,” said the study’s lead author Gerulf Rieger, in a statement that garnered a few interesting responses.

The 2014-2015 edition of the CDC study is slated for release this fall.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d