• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Prices

రూపాయి పాపాయి విల విల – డాలరు నిల్వలు వెల వెల ! నరేంద్రమోడీ కీర్తి కిరీటంలో మరో కలికి తురాయి!!

25 Sunday Sep 2022

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, India's Forex Reserves, Narendra Modi Failures, Rupee Fall, rupee value

ఎం కోటేశ్వరరావు


చైనాను వెనక్కు నెట్టి అమెరికాతో పోటీ పడే విధంగా దేశాన్ని ముందుకు తీసుకుపోగల సమర్ధుడు ప్రధాని నరేంద్రమోడీ అని ఇప్పటికీ అనేక మంది భావిస్తున్నారు. దాని వలన దేశానికి ఎలాంటి ఉపయోగం లేకున్నా వారి మనోభావాలను గౌరవిద్దాం, అదే సమయంలో ప్రపంచం, దేశంలో జరుగుతున్నదాన్ని గురించి కూడా చెప్పుకుందాం. వారు వింటారా లేదా అన్నది వారికే వదలివేద్దాం. శుక్రవారం నాడు (2022 సెప్టెంబరు 23) ప్రధాని నరేంద్రమోడీ కీర్తి కిరీటంలో మరో కలికి తురాయి చేరింది. లండన్‌లోని ఎక్సేంజ్‌ రేట్స్‌ . ఓఆర్‌జి.యుకె సమాచారం ప్రకారం శుక్రవారం నాడు మన దేశంలో రాత్రి ఎనిమిది గంటలు, లండన్‌లో మధ్యాహ్నం మూడున్నర గంటలపుడు డాలరుకు రూపాయి విలువ రు.81.4101గా ఉంది.( అంతర్జాతీయ మార్కెట్లో ప్రతి క్షణం రేట్లు మారుతూ ఉంటాయి .) సహజంగా ఏ దేశంలో స్టాక్‌మార్కెట్‌ ప్రారంభం-ముగింపు సమయాల్లో ఎంత ఉంటుందో ఆ రోజుకు ముగింపు విలువను పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు మన దేశంలో శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు రు.81.11 ఉంది. అంతకు ముందు 81.23కు పతనమైంది. శనివారం నాడు లండన్‌లో తెల్లవారు ఝామున 3.20కి (మన దగ్గర 7.50) రు.81.2485 దగ్గర ఉంది. రానున్న మూడు నాలుగు నెలల్లో అది రు.82- 83 మధ్య ఉంటుందని, తరువాత 85-86కు దిగజారవచ్చని కొందరి అంచనా.

తరలిపోతున్న ఎఫ్‌పిఐ పెట్టుబడులు నిలిచినా, తిరిగి వచ్చినా రు.81-82 దగ్గర స్థిరపడవచ్చని, వర్తమాన ఆర్ధిక సంవత్సరం మిగిలిన రోజుల్లో 79-83 మధ్య ఉండవచ్చని, పరిపరి విధాల ఎవరి జోశ్యం వారిది. ఎవరు చెప్పినా 2014 ఎన్నికలకు ముందు బిజెపి నేతలు చెప్పిన రు.38-48కి పెరగటం గురించి ఎవరూ ప్రస్తావించటం లేదు. ఆర్‌బిఐ ఇప్పటికే రూపాయి పతనాన్ని అరికట్టేందుకు ఇప్పటికే ఆర్‌బిఐ 80బి.డాలర్లను విక్రయి ంచిందని, రూపాయి పతనమైతే దాన్ని వదలివేయటం తప్ప ఆర్‌బిఐకి మరొక మార్గం లేదని కొందరు చెబుతున్నారు. గత ఏడు నెలల కాలంలో గురువారం నాడు ఒక్కరోజే 83పైసలు పతనమైంది. ఎవరేం చెప్పినప్పటికీ ప్రపంచీకరణతో బంధం వేసుకున్నందున మన చేతుల్లో అనేక అంశాలు ఉండవు. ఏం జరుగుతుందనేది ఎవరు చెప్పినా అయితే లేదా కాకుంటే అన్న జాగ్రత్తలతో చెప్పేవే తప్ప మరొకటి కాదు. కొద్ది వారాలుగా చమురు ధరలు తగ్గుముఖం పట్టినందున కొంత మేర ఒకవైపు ఊరట కలుగుతున్నది.మరోవైపు కరెన్సీ విలువ పతనంతో హరించుకుపోతున్నది.


ఆర్‌బిఐ శుక్రవారం నాడు విడుదల చేసిన సమాచారం ప్రకారం గత ఏడు వారాలుగా వరుసగా మన విదేశీమారక ద్రవ్య నిల్వలు పడిపోతూ సెప్టెంబరు 16 నాటికి 545.652 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.2020 అక్టోబరు రెండవ తేదీ తరువాత ఇంత తక్కువగా ఎన్నడూ లేవు. తగ్గటానికి కరెన్సీ మారకపు విలువలో మార్పులు కొంత మేరకు కారణం కాగా రూపాయి విలువ పతనాన్ని అరికట్టేందుకు ఆర్‌బిఐ తీసుకుంటున్న చర్యలే ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లు కొందరి అభిప్రాయం. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూలై నెలలో రూపాయి పతనాన్ని అడ్డుకొనేందుకు ఆర్‌బిఐ 35 బి.డాలర్లను, ఈ మొత్తంలో జూలై నెలలో 19బి.డాలర్లను విక్రయించింది. సెప్టెంబరు ఇరవై మూడవ తేదీన ఒక్క రోజే రెండు బిలియన్‌ డాలర్లను విక్రయించినట్లు వార్తలు. 2021 సెప్టెంబరు మూడవ తేదీన 642.45బి.డాలర్లు మన దగ్గర ఉన్నాయి. విదేశీ పెట్టుబడులు వెనక్కు వెళ్లటం, మన ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా పెరగటంతో పాటు మన కరెన్సీ విలువ తగ్గినందువలన కూడా డాలరు నిల్వ కరిగిపోతున్నది.


ప్రపంచ ధోరణులకు అనుగుణంగా రూపాయికి ఏం జరిగితే అది జరుగుతుందని(పాత సినిమాల్లో డాక్టర్లు ఇక ఆ దేవుడిదే భారం అన్నట్లు) వదలి పెట్టటం తప్ప అక్టోబరు-మార్చి నెలల్లో ఆర్‌బిఐ అరకొర తప్ప తీసుకొనే పెద్ద రక్షణ చర్య లేవీ ఉండకపోవచ్చని చెబుతున్నారు. ఇప్పటి వరకు చేసుకున్న జోక్యం ఫలితాలనివ్వలేదని పతన తీరు సూచిస్తున్నది. విదేశీ మారక ద్రవ్యంగా చెబుతున్న మొత్తంలో అన్నీ డాలర్లే ఉండవు. ఆర్‌బిఐ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం మన దగ్గర ఉన్న 545.652 బిలియన్‌ డాలర్లలో నగదు 484.901 బి.డాలర్లు కాగా బంగారం రూపంలో 38.186, ఎస్‌డిఆర్లు 17.686, ఐఎంఎఫ్‌ వద్ద 4.880బి.డాలర్లు ఉన్నాయి . ప్రస్తుతం దిగుమతులు-ఎగుమతుల అంతరం పెరిగి జిడిపిలో 4శాతానికి కరెంటు ఖాతాలోటు పెరిగినా మొత్తం నిల్వలు 510 బి.డాలర్లకు తగ్గవచ్చని, 2013 మే నెలలో ఉన్న 300 బి.డాలర్లతో పోలిస్తే పరిస్థితి మెరుగేనని కొందరి అభిప్రాయం. పది సంవత్సరాల క్రిందట ఆ నిల్వలు 4.1నెలల దిగుమతులకు సరిపోగా ఇప్పుడున్న నిల్వలు 8.9 నెలలకు వస్తాయని అంచనా. రూపాయి విలువ పతనమైతే మన దేశం నుంచి డాలర్లు వెలుపలికి పోతే విదేశాల్లో ఉన్న మన జాతీయులు డాలర్లను మన దేశానికి పంపుతారు. వాటికి గతం కంటే ఇక్కడ ఎక్కువ రూపాయలు వస్తాయి.


వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో మన జిడిపి వృద్ధి గురించి గతంలో వేసిన అంచనాలను క్రమంగా తగ్గించటమే తప్ప స్థిరంగా ఉంటుందని ఏ సంస్థా చెప్పటం లేదు. ప్రస్తుతం ఏడు శాతంగా చెబుతున్నారు, వచ్చే ఏడాది 6.4శాతానికి తగ్గుతుందని అంచనా. ఆర్‌బిఐ వడ్డీ రేట్లను ఇంకా పెంచనుందనే వార్తల పూర్వరంగంలో వృద్ధి రేటు ఇంకా తగ్గేందుకే అవకాశం ఉంది. డాలరు రేటు పెరిగింది తప్ప మన కరెన్సీ విలువ తగ్గలేదని కొందరు వాదిస్తున్నారు. ఉక్రెయిన్‌ మీద సైనిక చర్య జరుపుతున్న రష్యా మీద అమెరికా కూటమి దేశాలు అనేక ఆంక్షలు విధించినా దాని కరెన్సీ రూబుల్‌ విలువ పెరిగింది. మన జిడిపి ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉంటే దాని జిడిపి పదకొండవదిగా ఉంది. అలాంటపుడు మన కరెన్సీ విలువ ఎందుకు పెరగలేదు ? జపాన్‌ ఎన్‌ విలువ పెరిగింది, దక్షిణ కొరియా కరెన్సీ వన్‌ పెరిగింది. అందువలన పతనమైన వాటితో చూపి మనదీ అలాగే ఉందని చెబుతామా, మెరుగ్గా ఉన్నవాటితో పోల్చుకుంటామా ? మనకు పతనం కావటమా, పెరగటమా ఏది లాభం. దిగుమతులు ఎక్కువగా ఉన్నందున ఎక్కువ మందికి పెరగటం లాభం. ఎగుమతులు తక్కువగా ఉన్నందున కొందరికి తగ్గటం లాభం.


మన కరెన్సీతో దిగుమతులు చేసుకొనేందుకు కొన్ని దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నారు.దీంతో డాలర్లకు గిరాకీ తగ్గి కొంత వెసులుబాటు కలుగుతుంది తప్ప మనకు కలిగే లబ్ది ఏముంటుంది. ఏ దేశమైనా డాలరుతో పోల్చి దాని బదులు దాని విలువకు సమానమైన రూపాయలు అడుగుతుంది తప్ప రోజు రోజుకు దిగజారుతున్న మన కరెన్సీని స్థిర విలువకు ఎవరూ అంగీకరించరు. మనం ఇతర దేశాల కరెన్సీ తీసుకున్నప్పటికీ ప్రాతిపదిక అదే ఉంటుంది. అమెరికాలో వడ్డీ రేట్లు పెంచుతున్నారు గనుక అక్కడ పెట్టుబడులు పెట్టినా లేదా ప్రభుత్వ బాండ్లు కొనుగోలు చేసినా మదుపుదార్లకు లాభం కనుక ఇతర దేశాల నుంచి డాలర్లు అమెరికా చేరుతున్నాయి. వడ్డీ రేటు తగ్గితే అంతకంటే ఎక్కువ వడ్డీ వచ్చే దేశాలకు తిరిగి దారిపడతాయి . మన ఆర్‌బిఐ వడ్డీ రేటు పెంచటం వెనుక మతలబు ఇదే. అయి తే అది మన పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు, రుణాలు తీసుకొని ఇండ్లు, వాహనాలు కొనుగోలు చేసిన వారి మీద అదనపు భారం మోపుతుంది. డాలర్లు కొని విదేశాల్లో చదువుకొనే వారికి, టూర్లకు వెళ్లే వారికి భారం పెరుగుతుంది. మంచి పనితీరును కనపరచిన ఎనిమిది కరెన్సీలలో మనది ఒకటని విశ్లేషణలు వెల్లడించాయి.దాన్ని పట్టుకొని మన సామర్ధ్యానికి భంగం కలగలేదని బిజెపి నేతలు చెబుతున్నారు. నిజం కావచ్చు, దాని వలన మనకు ఒరిగేదేమిటి ? కేసుపోతేనేం గానీ మన ప్లీడరు భలేవాదించాడు అన్నట్లుగా ఉంది.


ప్రపంచంలో తమ వద్ద డిపాజిట్‌ చేసిన మదుపుదార్లకు బాంకులు వడ్డీ చెల్లించటం తెలిసిందే. కానీ ఐదు దేశాల్లోని బాంకులు తమ వద్ద డబ్బుదాచుకున్న వారి నుంచి ఎదురు వడ్డీ వసూలు చేస్తున్నాయి, వినటానికి చిత్రంగా ఉన్న అది నిజం. పెట్టుబడిదారులు ఏది చేసినా తమ లాభాలకే అన్నది గ్రహిస్తే ఇది కూడా దానిలో భాగమే అన్నది స్పష్టం. బహిరంగ మార్కెట్లో ఉన్న వడ్డీ రేట్ల కంటే మన దేశంలో బాంకుల వడ్డీ రేటు తక్కువ. పెట్టుబడిదార్లకు చవకగా రుణాలు కావాలంటే బాంకులు కావాలి. వాటి దగ్గర డిపాజిట్లు ఉండాలి కనుక మన బాంకులు డిమాండ్‌ను బట్టి వడ్డీ రేట్లను ఖరారు చేస్తాయి. అమెరికా, ఐరోపా దేశాల్లో అతి తక్కువ వడ్డీ రేట్లు అక్కడి వారికి లబ్ది చేకూర్చేందుకే. వడ్డీ తక్కువ ఉంటే వారి వస్తువుల తయారీ ఖర్చు తక్కువగా ఉండి ప్రపంచ మార్కెట్లో పోటీ పడవచ్చు.ఐదు దేశాల బాంకుల్లో డిపాజిట్‌ చేసిన వారే అవి నిర్ణయించిన మేరకు ఎదురు వడ్డీ చెల్లించాలి. డబ్బు వచ్చేకొద్దీ అవి కూడా రేట్లు మారుస్తూ ఉంటాయి. ఎదురు వడ్డీ స్విడ్జర్లాండ్‌లో 0.75, డెన్మార్క్‌ 0.60, జపాన్‌ 0.1, స్వీడన్‌ 0.25, స్పెయిన్‌0.0 శాతం ఉంది. అనేక ఐరోపా ధనిక దేశాల్లో వడ్డీ రేట్లు నామమాత్రంగా ఉంటాయి. ఇలా ఎందుకు అంటే పొదుపు వద్దు- ఖర్చే ముద్దు అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఖర్చు చేస్తేనే కదా కార్పొరేట్ల వస్తువులు, సేవలకు గిరాకీ ఉండేది, లాభాలు వచ్చేది. జపాన్‌లో ఎలాంటి వడ్డీ లేకుండా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం, బాంకులు రుణాలు ఇస్తాయి. డాలరు దెబ్బకు జపాన్‌ ఎన్‌ కూడా ప్రభావితమైంది. దాంతో 1998 తరువాత తొలిసారిగా గతవారంలో జపాన్‌ రిజర్వుబాంక్‌ రంగంలోకి దిగి తమ కరెన్సీ విలువ పడిపోకుండా, పెరిగేందుకు జోక్యం చేసుకుంది.2011లో ఎన్‌ విలువ పెరగటంతో తగ్గేందుకు లేదా స్థిరంగా ఉండేందుకు చూసింది. ఎగుడు దిగుడులు సహజం, ఇబ్బందులు, పతనాలు తాత్కాలికం అంటూ కొందరి నోట ఉపశమనాలు వినిపిస్తున్నాయి , మంచిదే అంతకంటే కావాల్సింది ఏముంది ? అందుకోసం సమర్ధుడైన నరేంద్రమోడీ చేస్తున్నదేమిటి అన్నదే ప్రశ్న.

.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రెండేండ్ల వరకు ధరల పెరుగుదల తగ్గదన్న ఆర్‌బిఐ గవర్నర్‌ !

25 Thursday Aug 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Causes of Inflation, Consumer Price Index, India inflation, India Price Rise, Narendra Modi, Narendra Modi Failures, RBI, RBI governor


ఎం కోటేశ్వరరావు

నాలుగు శాతానికి ద్రవ్యోల్బణం రేటు తగ్గేందుకు రెండు సంవత్సరాలు పడుతుందని రిజర్వుబాంక్‌ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ 2022 ఆగస్టు 23న చెప్పారు. వృద్ధి రేటును పెద్దగా కోల్పోకుండానే ఈ లక్ష్యాన్ని సాధిస్తామని అన్నారు. అంటే ఇప్పుడు పెరిగిన ధరల రేటు తగ్గేందుకు మరో రెండు సంవత్సరాలు పడుతుందని చెప్పటమే. నిజానికిది జనాలతో ధరల చేదు మాత్రను మింగించేందుకు, ఆందోళన చెందుతున్న నరేంద్రమోడీ సర్కార్‌కు ఊరట కలిగించేందుకు వెలిబుచ్చిన ఆశాభావం తప్ప పరిస్థితులు ఇప్పటి కంటే దిగజారితే ఏమిటన్నది ప్రశ్న. గవర్నరే చెప్పినట్లు ఇటీవలి గరిష్టం 7.8శాతానికి చేరుతుందని కూడా ఎంతో ముందుగానే ఆర్‌బిఐ చెప్పి ఉంటే విశ్వసనీయత ఉండేది. మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడిలో ఇంతకంటే తీవ్ర స్థాయికి చేరినపుడు కూడా అప్పటి గవర్నర్లు ఇలాంటి మాటలే చెప్పారు. ఇప్పుడు నరేంద్రమోడీ సర్కార్‌ ఎందుకు ఆందోళన చెందుతున్నది ? ఎనిమిది సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు, అందుకు ముందు గుజరాత్‌ సిఎంగా నరేంద్రమోడీ మహిమల మంత్రదండం గురించి మీడియా చెప్పిన కథలు, అన్నింటికి మించి మన్మోహన్‌ సింగ్‌ పాలన చివరి రోజుల్లో దిగజారిన పరిస్థితులు, అవినీతి అక్రమాల కారణంగా మోడీ అధికారానికి వస్తే తెల్లవారేసరికి అద్బుతాలు చేస్తారని నమ్మినవారికి ఎనిమిదేండ్లు గడిచినా రెచ్చిపోతున్న హిందూత్వ నూపుర్‌ శర్మలు, రాజాసింగ్‌లు తప్ప ఆర్ధికంగా జనానికి ఉపశమనం గురించి చెప్పాల్సిన వారు ఎక్కడా కనిపించటం లేదు. గత పదహారు నెలలుగా రెండంకెలకు పైగా నమోదవుతున్న టోకు ధరల ద్రవ్యోల్బణం ఐదు నెలల తరువాత జూలై నెలలో 13.93కనిష్ట స్థాయికి తగ్గింది. గత సంవత్సరం 11.57శాతం ఉంది. ఇంథనం, విద్యుత్‌ ద్రవ్యోల్బణం 43.75 స్థాయికి పెరిగింది.


– ద్రవ్యోల్బణం ఎందుకు సంభవిస్తుంది అన్నదాని మీద ఎవరి భాష్యం, కారణాలు వారివే. ప్రతికూల ప్రభావాలను జనం అనుభవిస్తున్నారు గనుక ఎవరు చెప్పేది వాస్తవానికి దగ్గరగా ఉందో ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే. ఆర్ధిక రంగంలో నగదు చెలామణి పెంపుదల కూడా దవ్యోల్బణానికి దారితీస్తుంది.1951 నుంచి 2022 వరకు దేశంలో నగదు సరఫరా నెలవారీ సగటున రు. 26,168.65 బిలియన్లు.1952అక్టోబరులో కనిష్ట రికార్డు రు.20.57 బిలియన్లు కాగా 2022 జూలై గరిష్ట రికార్డు 2,09,109.47 బి. రూపాయలు. సరఫరా పెరిగితే దవ్యోల్బణం పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. ఆర్ధిక రంగంలో ద్రవ్య సరఫరాకు అనుగుణంగా ఉత్పత్తి, సేవలు, వస్తు సరఫరా లేకపోతే ద్రవ్యోల్బణం పెరుగుతుంది అన్నది ఒక సూత్రీకరణ. ట్రేడింగ్‌ ఎకనమిక్స్‌ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం 2000 సంవత్సరంలో పదివేల బిలియన్లు కాగా 2010నాటికి 50వేలకు, 2015కు లక్ష, 2020కి 160వేలకు, 2022 జూలైలో 2,09,109.47 బి. రూపాయలకు చేరింది.


ఉద్యోగుల వేతనాలు పెరిగితే ధరలు పెరుగుతాయని చాలా మంది అనుకుంటారు. అసలు వేతన పెరుగుదల లేకున్నా ధరలు పెరుగుతాయని కొన్ని బుర్రలకు ఎక్కదు.2020-21 మూడవ త్రైమాసిక ఆదాయంలో గృహ పొదుపు అమెరికా, బ్రిటన్‌, కెనడా, జపాన్‌,ఆస్ట్రేలియా, ఐరోపా దేశాల్లో పది నుంచి ఇరవై శాతం ఉంది. అదే మన దేశంలో 2.8శాతం, ఇండోనేషియాలో రెండు శాతం తిరోగమనంలో ఉంది.అలాంటపుడు రెండు చోట్లా ఒకే కారణంతో ద్రవ్యోల్బణం పెరగకూడదు. మన దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదలకు వేతనాలు ఎంతవరకు కారణం ? దేశంలో 2014 నుంచి ద్రవ్యోల్బణ వార్షిక పెరుగుదల ఇలా ఉంది.
ఏడాది×× ద్రవ్యోల్బణ శాతం
2014 ×× 6.6
2015 ×× 4.9
2016 ×× 4.9
2017 ×× 3.3
2018 ×× 3.9
2019 ×× 3.7
2020 ×× 6.6
2021 ×× 5.1
2022 ×× 6.8(ఏడునెలల సగటు)
ఈ ఎనిమిది సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ ఏడవ వేతన కమిషన్‌ సిఫార్సులు 2017లో అమల్లోకి వచ్చాయి.కరోనా కాలంలో కొన్ని నెలలు అసలు ప్రైవేటు రంగంలో ఉపాధి, వేతనాల్లేవు, అనేక చోట్ల వేతన కోతలు ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం పెరిగింది. దేశంలో 70శాతం కార్మికశక్తి గ్రామాల్లోనే ఉంది.2020లో గ్రామీణ ప్రాంతాల్లో వేతనాలు 3.5శాతం తగ్గాయి, మరుసటి ఏడాది అరశాతం పెరగ్గా, 2021-22 తొలి తొమ్మిది నెలల్లో వ్యవసాయ పెరుగుదల 1.6శాతం, గ్రామీణ ఇతర కార్మికుల వేతనాలు 1.2శాతం తగ్గాయి.ఈ కాలంలో అసంఘటిత రంగ కార్మికులకు కనీసవేతనాలేమీ పెరగలేదు.కొన్ని రంగాల్లో కాస్త పెరిగినప్పటికీ మొత్తం మీద చూసినపుడు దేశంలో వేతనాలు పెద్దగా పెరగకున్నా ద్రవ్యోల్బణం పెరిగిందంటే దానికి వేరే కారణాలు దోహదం చేస్తున్నట్లే. పశ్చిమ దేశాల్లో ద్రవ్యోల్బణం పెరుగుదలకు గృహస్తుల కోసం కరోనా సందర్భంగా పెద్ద ఎత్తున చేపట్టిన ద్రవ్య ఉద్దీపన పధకాలు కారణంగా చెబుతున్నారు.మన దేశంలో పేదలకు నెలకు ఐదు కిలోల బియ్యం, కిలోపప్పులు, జనధన్‌ ఖాతాలున్న వారికి మూడు నెలలు ఐదేసి వందల నగదు, కొన్ని గాస్‌ బండలు తప్ప ఇచ్చిందేమీ లేదు. కరోనాతో నిమిత్తం లేని కిసాన్‌ నిధులు కూడా కలుపు కొని మొత్తం పాకేజి విలువ రు.1.76వేల కోట్లు మాత్రమే. మన దేశంలో కరోనా గృహస్తుల పొదుపు మొత్తాలను హరించటమే కాదు అప్పులపాలు చేసింది.
కొన్ని దేశాల్లో లాక్‌డౌన్ల వల్ల ఖర్చు చేసేందుకు వీలులేక బలవంతపు పొదుపు పెరిగిందని చెబుతున్నారు. పరిస్థితి చక్కబడిన తరువాత కొనుగోళ్లకు పూనుకోవటంతో అలాంటి చోట్ల అధిక ద్రవ్యోల్బణం తలెత్తిందని ఐఎంఎఫ్‌ చెప్పింది. ధనికులుగా ఉన్నవారి కొనుగోళ్లు పెరిగినప్పటికీ మొత్తం మీద ఇది మన దేశానికి వర్తించదు.

మాక్రోట్రెండ్స్‌ సంస్థ సమాచారం ప్రకారం కరోనాకు ముందు మన వినియోగదారుల 2018,19 రెండు సంవత్సరాల వార్షిక సగటు ఖర్చు 1,664.28 బిలియన్‌ డాలర్లు కాగా 2020,21 వార్షిక సగటు 1,751.73 బి.డాలర్లు అంటే 5.25 శాతం మాత్రమే పెరిగింది. ఇది ద్రవ్యోల్బణ పెరుగుదల రేటు 5.85 శాతం కంటే తక్కువ, అంటే వాస్తవ ఖర్చు తగ్గింది. ఇదే అమెరికాను చూస్తే 2021 మే నుంచి 2022 మార్చినెల మధ్య ద్రవ్యోల్బణం 8.5 శాతం ఉండగా 2022 మార్చినెలలో అక్కడి వినియోగదారుల ఖర్చు 18శాతం పెరిగింది. అంతకు రెండు సంవత్సరాల ముందు పన్నెండు శాతమే ఉండేది.2019తో పోలిస్తే అమెరికన్ల వద్ద ఉన్న పొదుపు మొత్తం 2.8లక్షల కోట్ల డాలర్లు ఎక్కువ. వారంతా ఆ మూటలను విప్పి కొనుగోళ్లకు పూనుకోవటంతో వస్తువులకు డిమాండ్‌ పెరిగి ద్రవ్యోల్బణం పెరిగింది. మన దేశంలో ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో పట్టణాల్లో 16శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 16.6శాతం అమ్మకాలు పడిపోయాయినా ద్రవ్యోల్బణం ఎందుకు తగ్గటం లేదు ? కరోనా కారణంగా తలెత్తిన పరిస్థితి నుంచి ఆర్ధిక రంగాలను కాపాడుకొనేందుకు అనేక ధనిక దేశాలు పెద్ద ఎత్తున కరెన్సీ నోట్లను ముద్రించి జనానికి నగదు అందచేశాయి. అక్కడ ద్రవ్యోల్బణం పెరుగుదలకు అదొక కారణమైతే, జనాలు ఆ సొమ్ముతో కొనుగోళ్లకు పూనుకోవటంతో సరకుల కొరత ఏర్పడటం, దిగుమతుల ధరలు పెరగటం వంటి కారణాలు దానికి ఆజ్యం పోశాయి.


ద్రవ్యోల్బణాన్ని లెక్కించేందుకు అన్ని దేశాలూ ఒకే ప్రాతిపదికను అనుసరించటం లేదు. పరిగణనలోకి తీసుకొనే అంశాల ప్రాముఖ్యత దేశదేశానికీ మారుతుంది. ఉదాహరణకు అమెరికాలో ఆహార వస్తువులకు 7.8శాతం ఇస్తే చైనాలో అది 18.4శాతం, మన దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు మొత్తానికి 22.62శాతం కాగా వాటిలో ఆహార వస్తువులకు 15.26, పారిశ్రామిక ఉత్పత్తులకు ఇస్తున్న 64.23 శాతంలో ఆహార ఉత్పత్తులకు 19.12 శాతం ఉంది. అమెరికాలో రవాణా రంగానికి 15.1శాతం కాగా చైనాలో 10.1 మన దేశంలో 5.2 శాతం ఉంది. చైనాలో దుస్తులకు 6.2 శాతం, అమెరికాలో 2.8, మన దేశంలో 7.3 శాతం ఉంది. చైనా వస్తువులను ఎగుమతి చేస్తుండగా అమెరికా దిగుమతి చేసుకొనే దేశంగా ఉంది. కనుక వాటి ప్రాధాన్యతలు ఒకే విధంగా ఉండవు.


మన దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం-ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేయకపోతే ఇబ్బందని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలప్పటికే అర్ధమైంది. వాటిలో లబ్ది పొందటంతో పాటు ధరల అదుపునకు ఇంథన ధరలను స్థంభింప చేశారు. ఎన్నికల తరువాత కూడా 2022 ఏప్రిల్‌ ఆరవ తేదీ నుంచి అదే స్థంభన కొనసాగుతోంది. అదొక్కటే చాలదు కనుక కేంద్రం పెద్ద మొత్తంలో విధించిన సెస్‌ను కొంత తగ్గించారు. దాన్ని రాజకీయ అస్త్రంగా మార్చి ఇతర పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వాట్‌ను ఎందుకు తగ్గించవంటూ దాడి చేశారు. పెట్రోలు మీద లీటరుకు రు.8, డీజిలు మీద రు.6 తగ్గించి దీని వలన కేంద్ర ప్రభుత్వం ఏడాదికి లక్ష కోట్ల మేరకు ఆదాయాన్ని ” త్యాగం ” చేస్తున్నట్లు చెప్పారు. దాన్ని పెంచినపుడేమో మిలిటరీకోసమని జనానికి దేశభక్తి కబుర్లు చెప్పారు, తగ్గించినపుడు కేంద్ర ప్రభుత్వానికి దేశభక్తి తగ్గిందని అనుకోవాలా ? ఈ తగ్గింపు ప్రక్రియను మరో విధంగా చెప్పాలంటే చమురుపై భారీగా పన్నుల పెంపుదల ద్రవ్యోల్బణానికి దారితీస్తున్నదని అంగీకరించటమే. సత్యహరిశ్చంద్రుడివారసులమని, ఒకటే మాట ఒకటే బాణం అన్న రాముడి భక్తులమని చెప్పుకొనే వారికి నిజాన్ని అంగీకరించే ధైర్యం ఎందుకు లేదు ? 2021 ఏప్రిల్‌-మే మాసాల్లో ద్రవ్యోల్బణం రేటు 2.5శాతం కాగా అదే 2022లో మార్చి నెలలో ఆరుశాతానికి చేరింది.


2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌ సంక్షోభం తలెత్తక ముందే పెరుగుదల బాటలో ఉన్న ద్రవ్యోల్బణం తరువాత ఈ కారణంగా మరికొంత పెరిగింది. డాలరు నిల్వలను పెంచుకొనేందుకు ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులతో పాటు మన స్టాక్‌ మార్కెట్లో వాటాల కొనుగోలుకు విదేశీ సంస్థలను ప్రభుత్వం అనుమతించింది.ఇదే విధంగా విదేశాల నుంచి తక్కువ వడ్డీలకు దొరుకుతున్న డాలరు రుణాలను కూడా ప్రోత్సహించింది. రూపాయి విలువ పతనాన్ని అడ్డుకోవటంలో ఘోరవైఫల్యం, అమెరికాలో వడ్డీ రేటు పెరుగుదల కారణంగా మన స్టాక్‌ మార్కెట్‌ నుంచి డాలరు పెట్టుబడులు వెనక్కు మరలాయి. ఇది కూడా ద్రవోల్బణం పెరుగుదలకు దారి తీశాయి.చమురు, ఇతర దిగుమతి వస్తువుల ధరల పెరుగుదలకు రూపాయి పతనం కూడా తోడైంది. దేశంలో ద్రవ్యోల్బణ పెరుగుదలకు విదేశీ ధోరణులే కారణమని తప్పించుకొనేందుకు కొందరు ప్రభుత్వానికి వంతపాడుతున్నారు. మన దేశాన్ని నయా ఉదారవాద చట్రంలో బిగించినందున ఆ విధానాలను అనుసరిస్తున్న దేశాల జబ్బులన్నీ మనకూ కొంతమేర అంటుకుంటాయి. జనాలకు చమురు, గాస్‌, ఇతర సబ్సిడీలను ఎత్తివేసి, పరిమితం చేసి, కోతలు పెట్టటం, కార్పొరేట్లకు పన్నురాయితీలు ఇవ్వటం, జనాల మీద పన్ను బాదుడు దానిలో భాగమే.పన్నుల పెంపుదల గురించి చట్ట సభల్లో చర్చకు తావులేకుండా జిఎస్‌టి మండలి, విద్యుత్‌ క్రమబద్దీకరణ మండళ్ల ఏర్పాటు, ప్రభుత్వ అదుపులేని ప్రైవేటు రంగానికి అన్నింటినీ అప్పగించటమూ అదే. జిఎస్‌టి విధానం రాక ముందు ధనికులు వాడే విలాస వస్తువులపై 30 నుంచి 45శాతం వరకు పన్నులు ఉండేవి. జిఎస్‌టి దాన్ని 28శాతానికి తగ్గించింది. ఆ మేరకు తాజాగా పెంచిన పన్నులు, విస్తరించిన వస్తువుల జాబితాను చూస్తే సామాన్యుల నడ్డి విరవటమే కాదు ద్రవ్యోల్బణ పెరుగుదలకూ దోహదం చేస్తున్నది. వస్తూత్పత్తిదారులు తమ మీద పడిన భారాన్ని జనం మీదకే నెడతారన్నది తెలిసిందే.


2020-21లో మన దేశం దిగుమతి చేసుకున్న ముడి చమురు పీపా సగటు ధర 44.82 డాలర్లు కాగా అది 2021-22కు 79.18కి పెరిగింది. 2022-23లో రష్యా తక్కువ ధరలకు చమురు ఇచ్చినప్పటికీ ఆగస్టు 23వ తేదీ వరకు ఏప్రిల్‌ నుంచి ఐదు నెలల సగటు 106.13 డాలర్లకు చేరింది. దీన్ని బట్టి మన దిగుమతుల బిల్లు పెరుగుతుంది, దానికి రూపాయి విలువ పతనంతో మరింత భారం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో పాటు విదేశాల నుంచి వస్తువులనే కాదు ద్రవ్యోల్బణాన్ని కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాము. దేశంలో బొగ్గు నిల్వలున్నా వాటిని తవ్వకుండా ఖరీదైన బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని కేంద్రం విద్యుత్‌ సంస్థల మీద రుద్దటం ద్రవ్యోల్బణ దిగుమతిలో భాగం కాదా ? ఇలాంటి వాటి కారణంగానే వెంటనే ద్రవ్యోల్బణాన్ని తగ్గించే మంత్రదండం లేదని ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ చెప్పారనుకోవాలి. –

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ తాత నుంచి సమాధానం వచ్చిందా కీర్తీ దూబే తల్లీ ?

22 Monday Aug 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, India Price Rise, Inflation in India, kriti dubey letter, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


అదుపుగాని ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం గురించి ప్రధాని నరేంద్రమోడీ ఆందోళన చెందుతున్నారా ? జనానికి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నా ఇంతవరకు వాటి గురించి ఎందుకు నోరు విప్పటం లేదు ? జూలై నెలలో చిల్లర ద్రవ్యోల్బణం గత ఐదు నెలల కనిష్ట స్థాయి 6.71శాతానికి తగ్గిందన్నది ప్రభుత్వ ప్రకటన. అనేక మంది హమ్మయ్య అని కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకు అంటే ఆహారం, మరికొన్ని వస్తువుల ధరలు కాస్త తగ్గటమే కారణం. ద్రవ్యోల్బణాన్నే ధరల పెరుగుదల సూచికగా కూడా తీసుకోవచ్చు. సూచిక తగ్గుదల-పెరుగుదలను ఎలా చూడాలి. జూన్‌ నెలలో ఇది 7.1శాతంగా ఉన్నది జూలైలో 6.71కు తగ్గింది. ద్రవ్యోల్బణం లెక్కింపుకు వంద వస్తువుల ధరలను ప్రమాణంగా తీసుకుంటే వాటి ధర రు 100 అనుకుంటే జూన్‌ నెలలో పెరుగుదల ప్రకారం రు.107.10కి పెరిగితే జూలైలో రు.106.70 ఉంటుంది. అంటే నలభై పైసలు తగ్గింది.వంద వస్తువుల్లో కొన్నింటి ధర సగటు కంటే తగ్గవచ్చు,కొన్ని పెరగవచ్చు. ఇలా పన్నెండు నెలల వివరాలను సగటుగా తీసుకొని వార్షిక ద్రవ్యోల్బణాన్ని ఖరారు చేస్తారు. ఈ మేరకు 2014 నుంచి 2021వరకు ఎనిమిదేండ్ల సగటు 4.87శాతంగా ఉంది. ప్రభుత్వం నిర్దేశించుకున్న నాలుగుశాతం లోపు మూడు సంవత్సరాల్లో మాత్రమే ఉంది. తగ్గుదలకు కారణం తమ ప్రతిభే అనుకుంటే పెరుగుదల కీర్తి కూడా వారిదే మరి !


ద్రవ్యోల్బణం నాలుగు శాతంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆర్‌బిఐని ఆదేశించింది. షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా దానికి రెండు శాతం అటూ ఇటైనా ఫరవాలేదని చెప్పింది. అంటే ఏటా నాలుగు నుంచి ఆరుశాతం మేరకు ధరలను పెరగనివ్వవచ్చు అన్నది ప్రభుత్వ విధానం. అది నరేంద్రమోడీ లేదా మరొకరు ఎవరున్నా సేమ్‌ టు సేమ్‌ అన్నట్లుగా అలాంటి లక్ష్యాలనే నిర్దేశిస్తారు. ఇప్పుడు మినహాయింపును కూడా దాటి జనాలకు దడపుట్టిస్తున్నది. జనం తమకు తామే లేదా ఏ పార్టీ, ప్రజాసంఘం కానీ పెద్దగా ఆందోళనలు చేయకుండానే నరేంద్రమోడీ సర్కార్‌ రెండుసార్లుగా పెట్రోలు, డీజిలు ధరల మీద పన్నులను తగ్గించింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నటిగా కాకుండా నిజజీవితంలో గాస్‌ బండలు పట్టుకొని ధరల పెరుగుదల మీద గత పాలకుల మీద తెగ ఆందోళన చేశారు. ఇప్పుడు అధికారంలో తమ పార్టీ ఉంది గనుక ఆమె అంతర్గతంగా పోరాటం జరిపి ఉండవచ్చు. లేదా ఆ పన్నులు ధరల పెరుగుదలకు దారి తీసి శ్రీలంక మాదిరి జనం ఆందోళనకు దిగుతారనే భయమే కావచ్చు. లేకపోతే అంతకు ముందు పన్నులు తగ్గించేది లేదని భీష్మించుకున్న వారు, రకరకాల వాదనలు, అవాస్తవాలు చెప్పిన వారు ఆకస్మికంగా ఎందుకు మారుమనసు పుచ్చుకున్నట్లు ?


ఇప్పుడు పెరిగిన ద్రవ్యోల్బణం ప్రపంచమంతటా ఉన్నదే తప్ప మా లోపం ఏమీ లేదు అని సరికొత్తగా సమర్ధించుకుంటున్నారు. ఎనిమిదేండ్ల క్రితం ఏం చెప్పారో వారు వెనక్కి తిరిగి చూసుకోవాలి. మన కాషాయ దళాలు, వాటికి వంతలుగా ఉన్న మీడియా ప్రపంచమంతటా ద్రవ్యోల్బణం పెరుగుతోందని చెబుతాయి. ఇది జనాన్ని పూర్తిగా తప్పుదారి పట్టించటం తప్ప తర్కానికి నిలిచేది కాదు. దీనికి కారణాలేమిటి ? ఒక్కొక్క దేశంలో ఒక్కోకారణం తప్ప అన్ని దేశాలకూ ఒకే కారణం ఉండదు. బిజెపి వారు చెబుతున్నట్లు అంతటా ఒకటే అంటే శ్రీలంకలో మాదిరి మన దగ్గర కూడా పెరగాలి కదా ! గతేడాది జూలైతో పోలిస్తే లంకలో 2022 జూలై ద్రవ్యోల్బణం రేటు 60.8శాతం ఉంది.వెనెజులాలో కొన్ని సంవత్సరాలుగా తలెత్తిన ద్రవ్యోల్బణం కొన్ని వేలశాతం పెరిగి జూలై నెలలో 7.5శాతానికి తగ్గినట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ తెలిపింది. కనుక అన్ని చోట్లా ఉంది కనుక మనదగ్గరా ఉంది అన్నది తప్పుడు వాదన. చైనా గురించి ఎందుకు మౌనంగా ఉంటున్నట్లు ? లాక్‌డౌన్ల వలన దాని ఆర్ధిక రంగం దెబ్బతిన్నదని, పురోగతిలో మన దేశం కంటే వెనుకబడినట్లు, అక్కడి పరిశ్రమలు వెలుపలికి తరలిపోతున్నట్లు ఇంకా ఇలాంటి కబుర్లు చైనా గురించి చాలా చెబుతున్నారుగాని అక్కడి ధరల పెరుగుదల అంశాన్ని మాత్రం చెప్పరు. తప్పనిసరైతే అక్కడ నిరంకుశంగా ధరలను అణిచివేస్తారు, ధరలను జైలుపాలు చేస్తారు,ధరల హక్కులను హరిస్తారు అని చెబుతారేమో !


ఈ ఏడాది తొలి ఆరుమాసాల్లో చైనాలో సగటున నెలవారీ ధరల పెరుగుదల 1.7శాతం, ఏడాదిలో మూడుశాతానికి పెరగవచ్చని అంచనా. ఒక్క ఈ సంవత్సరమే కాదు, గత పది సంవత్సరాల్లో ఒక్క ఏడాది తప్ప రెండు శాతానికి మించి ధరల పెరుగుదల లేదు. విత్త సంబంధమైన ఉద్దీపన పధకాలను పెద్ద ఎత్తున అమలు జరపకపోవటమే ద్రవ్యోల్బణం అదుపులో ఉండటానికి కారణం. ఆహార స్వయం సమృద్ధి, వస్తువుల దిగుమతులు లేకపోవటం మరో కారణం. అయినప్పటికీ చైనాలో పరిమితంగా ద్రవ్యోల్బణం ఉండటానికి లేదా పెరగటానికి అది దిగుమతి చేసుకొనే చమురు, కొన్ని పరికరాలు, ఇతర ముడివస్తువుల ధరలు ప్రపంచ మార్కెట్లో పెరగటమే కారణం. మన దేశ స్థితి గురించి ఎవరి అంచనాలు వారు చెబుతున్నప్పటికీ అందరూ చెబుతున్నది ఒకటే అదేమిటంటే ప్రభుత్వం నిర్దేశించిన నాలుగు శాతానికి తగ్గే పరిస్థితి లేదు.


దీని గురించి ప్రధానిగా నరేంద్రమోడీ ఎందుకు మాట్లాడటం లేదు అన్నది ప్రశ్న. 2004 నుంచి 2013 వరకు పదేండ్లలో సగటు వార్షిక ద్రవ్యోల్బణం 8.06 శాతం కాగా 2014నుంచి 2021వరకు మోడీ ఏలుబడిలో 4.87శాతం ఉంది. గత రెండు సంవత్సరాలుగా పెరుగుతోంది, ఈ ఏడాది ఇప్పటివరకు ఎక్కువగా పెరిగింది. ఇక్కడ 2014 ఎన్నికలకు ముందు నరేంద్రమోడీ గుజరాత్‌ సిఎం లేదా బిజెపి నేతగా ఏం చెప్పారో గుర్తుకు తెచ్చుకోవాలి.నరేంద్రమోడీ డాట్‌ ఇన్‌ వెబ్‌సైట్‌లో ఎవరైనా చూడవచ్చు. ” ఇది ద్రవ్యోల్బణాన్ని ఓడించే తరుణం, ఇది కాంగ్రెస్‌ను ఓడించే సమయం ” అనే శీర్షిక కింద నరేంద్రమోడీ చెప్పిన మాటలు, సమాచారాన్ని ఉంచారు. ” వంద రోజుల్లో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తానని కాంగ్రెస్‌ చెప్పింది. వారి వాగ్దానాన్ని నిలుపుకోలేదు. ప్రజావిశ్వాసాన్ని వమ్ము చేసిన వారిని నమ్మవద్దు. ప్రధాని వాజ్‌పేయి, మొరార్జీ దేశాయి ప్రభుత్వాలు ధరలను అదుపు చేసినపుడు మనమెందుకు చేయలేము ? 2014లో అధికారానికి వచ్చే బిజెపి ప్రభుత్వం ఆ పని చేస్తుందని నేను మీకు హామీ ఇస్తున్నాను. లోపభూయిష్టమైన విధానాలు, సరైన ప్రణాళిక లేకపోవటమే దీనికి కారణం ” అని నరేంద్రమోడీ చెప్పారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఆ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం 1998లో అంటే వాజ్‌పేయి అధికారానికి వచ్చిన ఏడాది 13.1 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణాన్ని ఓడిన 2004 నాటికి 3.76 శాతానికి తగ్గించగా తరువాత వచ్చిన మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ 10.92 శాతానికి పెంచినట్లు పేర్కొన్నారు. 2004 ఎన్నికలకు ముందు కనిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం చేరినందున వందరోజుల్లో దాన్ని ఇంకా తగ్గిస్థానని కాంగ్రెస్‌ చెప్పిందనటం ఒక పెద్ద అవాస్తవం. దేశం వెలిగిపోతోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన బిజెపి 2004 ఎన్నికల్లో దెబ్బతిన్నది.


ఇప్పుడు పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణాన్ని ఓడించాల్సిన అవసరం లేదని నరేంద్రమోడీ భావిస్తున్నారా ? ధరల పెరుగుదల నివారణకు 2011లో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ వినియోగదారుల వ్యవహారాల మీద ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. దానికి గుజరాత్‌ సింఎగా నరేంద్రమోడీ అధ్యక్షుడు. ఇతర సభ్యులుగా ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు ముఖ్యమంత్రులున్నారు.ఆ బృందం ఆచరణాత్మక చర్యలంటూ 64 అంశాలు, ఇరవై సిఫార్సులను చేసింది. ఇప్పుడు అలాంటి కమిటీ లేదు, పదేండ్ల నాటి సిఫార్సుల కట్టమీద దుమ్ము దులిపి ఒక్కసారి చదువుకున్నట్లు కూడా లేదు. కావాలనే వాటిని కూడా విస్మరించారా ? లేక ఆ ఫైలు కనిపించలేదా ? పోనీ ఒకటవ తరగతి చదువున్న ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఆరేండ్ల పసిపిల్ల కీర్తి దూబే తన పెన్సిల్‌, ఎరైజర్‌ వాటిని పారవేసుకుంటే తన తల్లి కోప్పడటం, మాగీ ధరల పెరుగుదల గురించి రాసిన లేఖ గురించి తెలిసిందే. దాని మీద ప్రధాని ఇంతవరకు స్పందించిన దాఖలా నాకు గూగుల్‌ వెతుకులాటలో కనిపించ లేదు. ఎవరికైనా కనిపిస్తే సరి చేసుకుంటాను. ధరల గురించి ప్రధాని స్పందించలేదంటే రెండు కారణాలుండవచ్చు. ఒకటి చమురు ధరలు ఎంత పెరిగినా, పన్నులు ఎంత పెంచినా భరించిన జనం ఇతర వస్తువుల ధరలకు కూడా మెల్లగా అలవాటు పడతారు లెమ్మని కావచ్చు. తానే నోరు విప్పితే ధరల పెరుగుదలను అంగీకరించినట్లు అవుతుంది, ఒకసారి అంగీకరించిన తరువాత తగ్గించేందుకు తీసుకున్న చర్య లేమిటనే చర్చ జనంలో ప్రారంభం అవుతుంది. ప్రజల ఆందోళనల కన్నా వారిలో ఇలాంటి ఆలోచనలు ప్రమాదకరమని భావించి మౌనంగా ఉంటున్నారని అనుకోవాలి. వరల్డ్‌ డాటా డాట్‌ ఇన్‌ఫో సమాచారం ప్రకారం 1960 నుంచి 2021 వరకు ద్రవ్యోల్బణ సగటు 7.5శాతం కాగా కనిష్టం మైనస్‌ 7.6, గరిష్టం 28.6శాతంగా నమోదైంది. 1960లో వంద రూపాయలకు వచ్చే సరకుల కొనుగోలుకు 2021చివరిలో రు.7,804.85 చెల్లించాల్సి వచ్చింది.కనుక నరేంద్రమోడీ గారి అచ్చేదిన్‌ ఏలుబడిలో 2014లో రు.100 విలువ గల వస్తువులు ఇప్పుడు రు.146.66కు గానీ రావటం లేదు. ద్రవ్యోల్బణం అంటే జనాల జేబులకు చిల్లు లేదా జేబులు కొట్టేసినట్లే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

2024 ఎన్నికలు : పనామాలో కూడా ఎర్రజెండా ఎగురుతుందా ?

30 Saturday Jul 2022

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Political Parties, Prices, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Latin America’s Right, Latin American left, panama, panama canal, protests in Panama


ఎం కోటేశ్వరరావు


లాటిన్‌ అమెరికాలో పెరుగుతున్న వామపక్ష అలలను కట్టడి చేసేందుకు అమెరికా ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందంటూ తాజాగా ఒక ప్రొఫెసర్‌ హెచ్చరించాడు. రెండు వందల సంవత్సరాల్లో తొలిసారిగా అమెరికాకు సన్నిహితమైన కొలంబియాలో వామపక్ష నేత గుస్తావ్‌ పెట్రోను ఎన్నుకోవటంతో ప్రతిదీ మారుతోందంటూ గుండెలు బాదుకున్నాడు.2010దశకం నుంచి పెరుగుతున్న ఎర్ర మంటను ఆర్పలేకపోయినట్లు వాపోయాడు. రష్యా, చైనాలను అడ్డుకోవటం ఎలా అన్నదానిమీదే అమెరికా కేంద్రీకరిస్తోంది తప్ప లాటిన్‌ అమెరికాలో వాటి ప్రభావాన్ని అడ్డుకొనేందుకు చూడటం లేదన్నాడు. వెనెజులాను దెబ్బతీయటంలో కొలంబియా ప్రధాన పాత్రధారిగా ఉంది. ఇప్పుడు గుస్తావ్‌ పెట్రో వెనెజులాతో సంబంధాలను పునరుద్దరించుకుంటానని చెప్పటం అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బ. ఇటీవల జరిగిన అమెరికా దేశాల శిఖరాగ్ర సమావేశానికి వెనెజులా, క్యూబా, నికరాగువాలను ఆహ్వానించనందుకు నిరసనగా తాను ఆ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు మెక్సికో అధ్యక్షుడు లోపెజ్‌ ప్రకటించటం అమెరికాకు చెంపదెబ్బ వంటిది.


జో బైడెన్‌ శ్రద్దలేమి వలన దూరంగా ఉన్న చైనా, ఉత్తర కొరియా, ఇరాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, భారత్‌, తూర్పు ఐరోపాలనే కాదు, మూర్ఖత్వం, అచేతనం, పట్టించుకోని కారణంగా పెరటి తోటగా ఉన్న లాటిన్‌ అమెరికాను కూడా కోల్పోతున్నామంటూ మరో విశ్లేషకుడు వాపోయాడు.రెండు సంవత్సరాలు కూడా గడవక ముందే అమెరికా అనుకూల పెరూ, కొలంబియాలను బైడెన్‌ ఏలుబడిలో కోల్పోయాము. బ్రెజిల్‌ నుంచి పనామా, గౌతమాల నుంచి మెక్సికో వరకు ఎక్కడ చూసినా వామపక్ష శక్తులు ముందుకు పోతున్నాయి. జనాలను చైతన్యవంతులను గావించేందుకు గత రెండు దశాబ్దాల్లో మనం ఖర్చు చేసిన బిలియన్ల డాలర్లు దేనికీ పనికి రాలేదు. మన పెరటితోటలోనే పలుకుబడి కోల్పోవటాన్ని ప్రపంచంలోని మన స్నేహితులు చూస్తున్నారు. ఈ పరిణామాన్ని చూస్తున్న చైనా చిరునవ్వులు చిందిస్తోంది, మన స్థానాన్ని ఆక్రమించేందుకు చూస్తోంది. గత పాతిక సంవత్సరాల్లో మన అధ్యక్షులతో భేఠీ వేసిన వారందరూ ఒక్కొరొక్కరుగా జారిపోతుంటే గుండెలు బద్దలువుతున్నాయి. దీర్ఘకాలం మన అనుంగు దేశంగా ఉన్న కొలంబియా వామపక్ష శక్తుల వశమైందని కూడా బైడెన్‌ గ్రహించినట్లు లేదు. చైనా తమ ప్రాంతంలోనే కాదు చివరికి మన దగ్గర కూడా కమ్యూనిజాన్ని ముందుకు నెడుతోందని సదరు విశ్లేషకుడు గుండెలు బాదుకున్నాడు.


లాటిన్‌ అమెరికాలో జరుగుతున్న పరిణామాల గురించి కొందరు అమెరికా భక్తుల కడుపు మంట ఇది. వెనెజులాలో ఆగస్టు నెలలో జరిగే మిలిటరీ క్రీడలనే కాదు, పనామాలో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను కూడా పట్టించుకోకపోతే అది కూడా వామపక్షాల వశం కానుందని ఒక విశ్లేకురాలు రాసినదానికి వాల్‌స్ట్రీట్‌ జనరల్‌తో సహా అనేక పత్రికలు ప్రాధాన్యత ఇచ్చాయి. పశ్చిమార్ధగోళంలో తొలిసారిగా రష్యా నిర్వహించే క్రీడలివి.లాటిన్‌ అమెరికాలో రష్యా,ఇరాన్‌, చైనా నిరంతరం కనిపిస్తూనే ఉంటాయని చెప్పటమే మిలిటరీ క్రీడల లక్ష్యమని మరింతగా చెప్పాలంటే ఈ ప్రాంతం వెలుపల అమెరికాను వ్యతిరేకించే మిలిటరీలను ఇక్కడి దేశాలు ఆహ్వానించే, సమ్మతికి బాటవేయటమేనని కూడా ఆమె పేర్కొన్నారు.


అసలు పనామాలో ఏం జరుగుతోంది ? పనామా అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది పనామా కాలువ. అట్లాంటిక్‌-పసిఫిక్‌ సముద్రాలను కలిపే 81కిలోమీటర్ల పొడవైన కాలువ. పనామా జనాభా నలభై లక్షలు కాగా, సగం మంది రాజధాని పనామా సిటీలోనే ఉంటారు. ఉత్తర- దక్షిణ అమెరికాలను అనుసంధానించే దేశం పనామా. జూలై ఆరవ తేదీన శాంటియాగో డి వెరాగువాస్‌ అనే చిన్న పట్ణణంలో ( ఇది పనామా కాలువ నుంచి ఇతర లాటిన్‌ అమెరికా దేశాలకు వస్తువులను రవాణా చేసే కీలక రహదారి ప్రాంతంలో ఉంది. దాన్ని మూసివేస్తే రవాణా మొత్తం ఆగిపోతుంది) ప్రభుత్వ విధానాలు,జనం మీద మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా సమ్మె రూపంలో టీచర్ల సంఘం తొలుత నిరసన తెలిపింది. బిల్లు- బెల్లు తప్ప మిగతావాటితో మనకేం పని అని వారు అనుకోలేదు. తరువాత దేశంలోని అన్ని ప్రాంతాలకు నిరసన పాకింది.బలమైన నిర్మాణ సంఘ కార్మికులు కలిశారు. తరువాత రైతులు, విద్యార్ధులు, మూలవాసులు అందరూ గళం విప్పారు. కార్మికుల సమ్మెతో విమానాలు ఎక్కాల్సిన వారు నడిచి పోవాల్సివచ్చింది. శ్రీలంక పరిణామాలు గుర్తుకు వచ్చి లేదా తోటి దేశాల్లో పరిణామాలను చూసి కావచ్చు, పదిహేడవ తేదీన గాలన్‌(3.78లీటర్లు) పెట్రోలు ధరను ఆరు నుంచి 3.25 డాలర్లకు తగ్గించారు. మన ప్రధాని నరేంద్రమోడీ కొంత మేర సెస్‌లను తగ్గించారు.ఏప్రిల్‌ ఆరు నుంచి ధరలను స్థంభింప చేశారు. పనామా టీచర్లు సమ్మె విరమించలేదు. ఇరవయ్యవ తేదీన పనామా కాథలిక్‌ బిషప్పును రంగంలోకి తెచ్చారు. ప్రభుత్వం-నిరసన తెలుపుతున్న సంఘాల ప్రతినిధులతో కూర్చోపెట్టారు.ఆహార, ఔషధాల ధరల అదుపు, విద్యపై ఖర్చు పెంపు, విద్యుత్‌ సబ్సిడీల వంటి ఎనిమిది అంశాలపై ప్రజాసంఘాలు ఆమోదం తెలిపినట్లు బిషప్‌ ప్రకటించారు తప్ప ఆందోళనలు ఆగలేదు.అస్తవ్యస్తంగా పరిస్థితి మారింది. ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడేందుకు ఎవరూ సిద్దం కాలేదు. ధరల పెరుగుదలే కాదు, రాజకీయ అవినీతిపై చర్యలు, రాజకీయ సంస్కరణలు చేపట్టాలనే డిమాండ్లు కూడా ముందుకు వచ్చాయి. ప్రస్తుతం కాస్త సద్దుమణిగినా తదుపరి ఏం జరగనుందో చెప్పలేము.


రోమ్‌ నగరం తగులబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తూ దర్శనమిచ్చినట్లుగా జనం తీవ్ర ఇక్కట్లపాలైన స్థితిలో పనామా పాలక పార్టీ ఎంపీలు ఖరీదైన విస్కీ తాగుతూ మజా చేస్తున్న వీడియోలు జనానికి ఆగ్రహం తెప్పించాయి.ఆశ్రితులను అందలాలెక్కించటం, సంస్కరణల పేరుతో కార్మికుల హక్కులను హరించటం, ఖరీదైన విదేశీ ఔషధాల దిగుమతులకు అనుమతుల వంటి వాటికి ఇచ్చిన ప్రాధాన్యత జన ఇబ్బందులకు ఇవ్వలేదు. ఔషధాల లేమి, వేతనాల కోత, చివరికి డాక్టర్లకు సైతం వేతనాల నిలిపివేత, చేసేందుకు పని లేకపోవటం వంటి పరిణామాలు సంభవించాయి. ఆపరేషన్‌ చేయాల్సిన చోట బాండ్‌ ఎయిడ్‌ వేసినట్లుగా అరకొర చర్యలు జనాన్ని సంతృప్తి పరచలేదు. ప్రభుత్వం విశ్వసనీయత పోగొట్టుకుంది. జనవరి తరువాత చమురు ధరలు 50శాతం పెరిగాయి, నిరుద్యోగం పదిశాతానికి చేరింది.ద్రవ్యోల్బణం పెరుగుతోంది. మిగతా దేశాల పాలకులు చెప్పినట్లే ధరల పెరుగుదలకు కరోనా, ఉక్రెయిన్‌ సంక్షోభం కారణమని అధ్యక్షుడు కార్టిజో తప్పించుకో చూశాడు. దేశం ఆరున్నరశాతం రేటుతో అభివృద్ది చెందుతున్నట్లు చెబుతున్న ప్రభుత్వం ఔషధాలను ఎందుకు సరఫరా చేయలేకపోతోందన్న ప్రశ్నకు జవాబు లేదు.


లాటిన్‌ అమెరికాలో ఆర్ధిక అసమానతలు ఎక్కువగా ఉన్న దేశాల్లో పనామా ఒకటి. అది అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలతో అసమానత మరింత పెరిగింది. కరోనాతో జన జీవితాలు మరింతగా దిగజారాయి. అంతకు ముందు 2018లోనే ఇరవై శాతం జనం దారిద్య్రరేఖకు దిగువన ఉండగా పదిశాతం మంది దుర్భర దారిద్య్రంలో ఉన్నారు. కరోనాకు ముందు ప్రయివేటు రంగంలో 8,73,750 మంది వేతన జీవులుండగా కరోనాలో 37శాతం మందిని తొలగించారు, 30శాతం మందినే కొనసాగించారు, 33శాతం మంది కాంట్రాక్టు ఒప్పందాలను సస్పెండ్‌ చేశారు, అంటే వారికి కూడా ఉపాధి లేదు.2021లో వారిని తిరిగి తీసుకున్నారు. ప్రభుత్వం పొదుపు పేరుతో పదిశాతం ఖర్చు కోతపెట్టి 27వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇక ఆర్ధిక అవినీతి సంగతి చూస్తే 2009 నుంచి 2019వరకు 46బిలియన్‌ డాలర్ల మేరకు పన్నులు ఎగవేసిన వారి మీద ఎలాంటి చర్యలూ లేవు. ఒక్క 2019లోనే ఆరు బిలియన్‌ డాలర్ల మేరకు ఎగవేశారంటే ఇప్పుడు ఇంకా పెరిగిందన్నది స్పష్టం. ఇదంతా అనేక పన్ను రాయితీలు ఇచ్చిన తరువాత జరిగిన అవినీతి.


ఒకవైపు జనజీవితాలు దిగజారుతుంటే ఎంపీల వేతనాలు పెద్ద మొత్తంలో పెంచటమే కాదు, అనేక మందికి లాభాలు పొందే కాంట్రాక్టులను అప్పగించారు. గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్న జీవన వ్యయానికి ఇటీవలి వెలపలి కారణంగా తోడై కార్మికుల్లో అసంతృప్తిని మరింత పెంచినట్లు వామపక్ష నేత, గత ఎన్నికల్లో అధ్యక్షపదవికి పోటీ చేసిన సాల్‌ మెండెజ్‌ చెప్పాడు. పాలకులు అవినీతిని సంస్థాగతం గావించారని ప్రముఖ గాయకుడు, రచయిత రేబెన్‌ బేడ్స్‌ విమర్శించారు, ప్రజాధనాన్ని లూటీ చేశారన్నాడు. అవినీతిని అరికట్టాలన్న జనం డిమాండ్‌ను పట్టించుకోకుండా ఎంపీలకు కాంట్రాక్టులు అప్పగించినట్లు పౌరశక్తి సంస్థ నేత చెప్పాడు. సంస్కరణలకు ఒక ప్రణాళికను ప్రకటించాలని ఐదు కార్మిక సంఘాలు డిమాండ్‌ చేశాయి. గత మూడు సంవత్సరాలలో సంక్షేమ చర్యలకు చేసిన ఖర్చుతో 16.5బి. డాలర్లు అప్పు పెరిగినట్లు ప్రభుత్వం చెబుతోంది.


పనామాలో తలెత్తిన ఆందోళనకు మూలం నూతన ఉదారవాద విధానాల పేరుతో ధనికులకు దోచి పెట్టే విధానపరమైనది తప్ప మరొకటి కాదు. రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ జనవరిలో చెప్పినదాని ప్రకారం కేంద్ర ప్రభుత్వ రుణ భారం జిడిపిలో 68.5 నుంచి 2021లో 64.2శాతానికి తగ్గింది. సామాజిక భద్రతా పధకాల రుణాలను పక్కన పెడితే అది 57.7శాతానికి తగ్గుతుంది.2020లో 17.9 ప్రతికూల వృద్ది రేటు నుంచి కోలుకొని 2021లో అంచనా వేసిన 12ను అధిగమించి 15శాతం వృద్ది నమోదైంది.2022, 2023లో వరుసగా 7,5శాతాల చొప్పును పెరుగుతుంది. దీర్ఘకాల మందగమనం నుంచి బయటపడుతుంది. పనామా కాలువ టోల్‌ ద్వారా, రాగి ఎగుమతులు ఆర్ధిక వృద్దికి చోదకాలుగా ఉన్నాయి.2021 నవంబరు వరకు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 0.9 బి.డాలర్లుగా ఉన్న రాగి ఎగుమతులు 2.5బి డాలర్లకు పెరిగాయి. రానున్న రెండు సంవత్సరాల్లో ఇంకా పెరుగుతుంది. ఏటా 13-14వేల ఓడలు ప్రయాణించే పనామా కాలువ ద్వారా కూడా గణనీయంగా రాబడి వస్తున్నది.


లాటిన్‌ అమెరికాలో తనకు తైనాతీలుగా ఉన్న వారిని అధికారంలో కూర్చోపెట్టిన గతం, వర్తమానం అమెరికాకు ఉంది. పనామా కూడా అలాంటిదే. పనామా కాలువను తన ఆధీనంలో ఉంచుకున్న అమెరికా అన్ని విధాలుగా లబ్దిపొందింది. కాలువ ప్రాంతంలో తన సైనిక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. స్పెయిన్‌ నుంచి స్వాతంత్య్రం పొందిన కొలంబియాలో నేటి పనామా ఒక ప్రాంతం. స్వచ్చందంగానే కొలంబియాలో చేరినప్పటికీ అక్కడ వేర్పాటు భావనలు తలెత్తాయి.పనామా కాలువ ప్రాజెక్టును చేజిక్కించుకోవాలని అమెరికా తలపెట్టిన తరువాత ఆ ప్రాంతాన్ని విడగొట్టి స్వతంత్ర దేశంగా మార్చేందుకు చేయాల్సిందంతా చేసింది. వేర్పాటువాదులను పాలకులుగా గుర్తించి 1903లో వారితో ఒప్పందం చేసుకుంది.2000 నాటికి కాలువను పనామా ప్రభుత్వానికి అప్పగించేందుకు 1979లో అమెరికా ఒప్పందం చేసుకుంది. తరువాత 1984 కుట్రచేసి మిలిటరీ జనరల్‌ నోరిగానూ గద్దెపై కూర్చోపెట్టింది. అదే నోరిగా అటు అమెరికా సిఐఏ నుంచి ఇటు మాదకద్రవ్యాల మాఫియా నుంచి నిధులు పొందుతూ ఏకు మేకై అమెరికా పెత్తనాన్ని సవాలు చేశాడు. దాంతో 1989లో అమెరికా మిలిటరీ దాడి చేసి నోరిగాను గద్దె దించి తనకు అనుకూలమైన శక్తులకు మద్దతు ఇచ్చింది.
పనామా చరిత్రను చూసినపుడు మితవాద, అమెరికా అనుకూల శక్తులదే అక్కడ పెత్తనం.2013లో బ్రాడ్‌ఫ్రంట్‌ పేరుతో నిర్మాణరంగ కార్మికనేత సాల్‌మెండెజ్‌ వామపక్ష పార్టీని ఏర్పాటు చేశాడు.2019 ఎన్నికల్లో అతనికి కేవలం 0.69శాతం, పార్లమెంటు ఎన్నికల్లో ఫ్రంట్‌కు 1.26శాతం ఓట్లు వచ్చాయి. తదుపరి ఎన్నికలు 2024లో జరగాల్సి ఉంది. వామపక్ష శక్తుల బలం పరిమితంగా ఉన్న పనామాలో 1930దశకంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. బలం పెద్దగా లేకున్నా పనామా కాలువను జాతీయం చేయాలన్న ఆందోళనలో చురుకుగా ఉండటమే గాక తరువాత అధికారానికి వచ్చిన ఉదారవాదులకు మద్దతు ఇచ్చింది. వారు ప్రజానుకూల విధానాలకు తిలోదకాలివ్వటంతో 1984లో వెలుపలికి వచ్చింది, 1991లో పార్టీ గుర్తింపును రద్దు చేశారు.


వామపక్షాలు చాలా బలహీనంగా ఉన్నప్పటికీ జూలై నెలలో జరిగిన ప్రజా ఉద్యమాలు ఆశక్తులు బలపడేందుకు దోహదం చేస్తాయనే భయాన్ని మితవాద శక్తులు ముందుగానే వెల్లడిస్తున్నాయి. లాటిన్‌ అమెరికాలో అనేక దేశాల్లో ప్రజా ఉద్యమాలు వామపక్ష శక్తులను ముందుకు తీసుకురావటం, జనం ఆదరించటమే దీనికి కారణం. పాలకుల ప్రజావ్యతిరేక విధానాలు ఇప్పటి మాదిరే కొనసాగితే 2024 పనామా ఎన్నికల్లో వామపక్షాలు ఒక ప్రధాన శక్తిగా ముందుకు వచ్చినా ఆశ్చర్యం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వెనెజులాతో అమెరికా కాళ్ల బేరానికి వచ్చిందా – మితవాదుల ఆగ్రహం !

25 Monday Jul 2022

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, International, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Politics, Prices, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Joe Biden, Latin American left, Lifting some Sanctions On Venezuela, Nicolás Maduro, US imperialism


ఎం కోటేశ్వరరావు


అందితే జుట్టు లేకపోతే కాళ్లు అన్న సామెత తెలిసిందే. లాటిన్‌ అమెరికాలోని వెనెజులా గత ఏడు సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. అక్కడ వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉంది గనుక తలెత్తిన స్థితిని ఆసరా చేసుకొని ఎన్ని కట్టుకథలు, ఎన్ని దెప్పి పొడుపులో ! ఇప్పుడు ఆ దేశంలో పరిస్థితి ఏమిటి ?


2022 జూలై పన్నెండవ తేదీన బిబిసి ముండో( స్పానిష్‌ భాష) అమెరికా విదేశాంగశాఖ మంత్రిత్వ మాజీ ముఖ్యకార్యదర్శి కారీ ఫిలిపెట్టీతో ఒక ఇంటర్వ్యూను ప్రచురించింది. డోనాల్డ్‌ ట్రంప్‌ ఏలుబడిలో విదేశాంగశాఖలో వెనెజులా, క్యూబా వ్యవహారాలను ఆమె చూశారు.అమెరికా అధికారులు ప్రస్తుతం వెనెజులా అధ్యక్షుడు నికొలస్‌ మదురోతో సంప్రదిస్తున్నారని ప్రతిపక్షంతో ఎలాంటి సంబంధాలు లేవని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన మదురో బదులు తాము మద్దతు ఇచ్చిన ప్రతిపక్ష నేత జువాన్‌ గుయిడోనే విజేతగా గుర్తిస్తున్నట్లు ప్రకటించిన డోనాల్డ్‌ ట్రంప్‌, తరువాత ఇటీవలి వరకు జో బైడెన్‌ సర్కార్‌ ఆ వైఖరినే కొనసాగించింది. మదురోను పదవి నుంచి తొలగించాలని అక్కడి మితవాద శక్తులకు అమెరికా చెప్పింది. అన్ని రకాలుగా తోడ్పడుతున్నది. ప్రస్తుతం ప్రపంచంలో తలెత్తిన ఇంథన సంక్షోభం ప్రారంభం వరకు అమెరికా చదరంగంలో గుయిడోనే పావుగా ఉన్నాడు. ఒక ఎత్తుగడగా లేదా అవసరం కొద్దీ గుర్తించను గుర్తించను అన్న అమెరికా ఇప్పుడు తన మాటలను తానే దిగమింగి అధికారికంగా మదురో సర్కార్‌తో చర్చలు జరుపుతోంది.


వెనెజులా పౌరులు గత కొన్ని సంవత్సరాలుగా అనుభవించిన, ఇప్పటికీ పడుతున్న కష్టాలు, ఇబ్బందులకు అమెరికా కారణం అన్న మౌలిక అంశాన్ని మీడియా కావాలనే విస్మరించి, కట్టుకథలు, పిట్టకతలు చెప్పింది, వాటిని గుడ్డిగా నమ్మి అనేక మంది రకరకాలుగా చెప్పారు. ఎవరెన్ని చెప్పినా అక్కడి జనాలకు వాస్తవాలు తెలుసుగనుక ఎన్ని ఇబ్బందులున్నా వామపక్ష మదురోవైపే మొగ్గుచూపుతున్నారు. మానవహక్కులు, ప్రజాస్వామ్యం, చట్టబద్దపాలన పరిరక్షణ పేరుతో అనేక దేశాలపై అమెరికా విధించిన ఏకపక్ష ఆంక్షల ప్రతికూల పర్యవసానాలను నివేదించేందుకు ఐరాస ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దాని నివేదన అధికారిణి ప్రొఫెసర్‌ అలేనా దౌహాన్‌ ఇటీవల చెప్పిన ప్రకారం అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు 98శాతం అవి చెప్పిన సుభాషితాలు, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే అని పేర్కొన్నారు. జింబాబ్వే సందర్శనలో ఆమెతో కొందరు విద్యార్ధులు మాట్లాడుతూ తమ దేశంపై ఆంక్షల కారణంగా టూరిస్టులుగా కొన్ని చోట్లకు వెళ్లి చదువుకోవాల్సి వచ్చిందని, పరీక్షలకు వెళ్లి రోడ్ల మీద నిద్రించాల్సి వచ్చిందని చెప్పారు. వెనెజులాపై ఆంక్షల కారణంగా 2017 నుంచి 2018వరకు అక్కడ శిశుమరణాల రేటు 31శాతం పెరిగిందని,ఆరోగ్య హక్కుకు భంగం కలిగిందని అలేనా చెప్పారు. వాక్సిన్ల కొనుగోలును అడ్డగించిన కారణంగా 26లక్షల మంది వెనెజులా పిల్లలకు మెనెంజటిస్‌, రోటావైరస్‌, మలేరియా, ఇన్‌ఫ్లూయెంజా, మీజిల్స్‌, ఎల్లో ఫీవర్‌ ముప్పు తలెత్తిందన్నారు.


ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా వెనెజులా కరోనా మహమ్మారిని కట్టడి చేసి చావులను గణనీయంగా అరికట్టింది.ప్రతి లక్ష మందికి 20.1శాతం మంది మరణిస్తే అదే అమెరికాలో 304.18శాతం చావులు నమోదయ్యాయి. వెనెజులా మీద 2017 నుంచి 600 రకాల ఆర్ధిక ఆంక్షలను అమెరికా అమలు జరిపింది. ఒక దశలో వీటి కారణంగా 99శాతం రాబడిని కోల్పోయింది. మరోవైపు మితవాద శక్తులను రాజకీయంగా ఉసిగొల్పింది. వీటన్నింటినీ మదురో సర్కార్‌, అధికార సోషలిస్టు పార్టీ ఎదుర్కొన్నది. 2021 డిసెంబరులో జరిగిన ప్రాంతీయ, మున్సిపల్‌ ఎన్నికల్లో 23 గవర్నర్‌ పదవులకు గాను 21, 213 మేయర్‌ పదవుల్లో 120 గెలుచుకుంది.
అమెరికా, ఇతర దాని మిత్ర దేశాల ఆంక్షల, ఇతర కొన్ని అంశాల కారణంగా గత పది సంవత్సరాల్లో వెనెజులా ఆర్ధికంగా 70శాతం దిగజారింది. అనేక తీవ్ర ఇబ్బందులున్నప్పటికీ ఈ ఏడాది ప్రధమార్ధం నుంచి జిడిపి కోలుకోవటం ప్రారంభమైంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభం అవుతున్నాయని, జనం కొనుగోలు ఖర్చు పెరిగిందని తాజా వార్తలు. వెనెజులియన్‌ ఫైనాన్స్‌ అబ్సర్వరేటరీ సంస్థ చెప్పినదాని ప్రకారం ఈ ఏడాది తొలి ఆరునెలల్లో ద్రవ్యోల్బణం 53.8శాతం, ఇది గతేడాదితో పోలిస్తే ఆరోవంతు. కరెన్సీ బొలివర్‌ విలువ డాలర్‌తో గతేడాది 50శాతం పతనమైతే ఈ ఏడాది 17శాతం. అనేక నియంత్రణ చర్యలు, ఇతర అంశాలు దీనికి దోహదం చేశాయి.ఈ ఏడాది ఆఖరుకు రోజుకు 20లక్షల పీపాల చమురు ఉత్పత్తి లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతుండగా ప్రస్తుతం 7.75లక్షల పీపాలు జరుగుతున్నది. కోటి మంది కార్మికులు, ఇతరులకు లబ్ది కలిగించే వేతనాలు, కనీసవేతనాలను ప్రభుత్వం ఇటీవల పెంచింది. లాటిన్‌ అమెరికా-కరీబియన్‌ ఎకనమిక్‌ కమిషన్‌ అంచనా ప్రకారం 2014 తరువాత ఈ ఏడాది వృద్ధి రేటు ఐదుశాతం ఉంటుందని, అది అన్ని లాటిన్‌ అమెరికా దేశాల కంటే ఎక్కువ అని పేర్కొన్నది. 2022 జనవరి నుంచి మార్చి నెలవరకు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే చమురు ఉత్పత్తి రోజుకు 5,33,000 పీపాల నుంచి 7,56,000 పీపాలకు పెరిగింది. ఏడాది పొడవునా ఆరులక్షల పీపాలు ఉంటే జిడిపి వృద్ది రేటు 8శాతం ఉంటుందని మరొక అంచనా. ఐదు సంవత్సరాలుగా అమలు జరుపుతున్న ఆంక్షలను అమెరికా కొద్దిగా మే 17 నుంచి సడలించింది. వెనెజులా ప్రభుత్వ రంగ చమురు కంపెనీతో లావాదేవీలు జరపవచ్చని అమెరికా, ఐరోపా చమురు కంపెనీలకు సూచించింది.


అమెరికా ఆంక్షలకు గురైన దేశాలలో ఇరాన్‌ కూడా ఒకటి. వెనెజులాాఇరాన్‌ మధ్య వివిధ రంగాలలో 20 సంవత్సరాల వ్యూహాత్మక సహకార ఒప్పందంపై ఇరుదేశాల నేతలు జూన్‌ 11న సంతకాలు చేశారు. చమురు రంగంలో ఇరాన్‌, ఆహార, ఉత్పత్తి ఎగుమతిలో వెనెజులా సహకరించుకుంటాయి. ఎనిమిది లక్షల పీపాల చమురును రవానా చేసే ఓడలను ఇరాన్‌ అందిస్తుంది. రెండు దేశాలూ అమెరికా సామ్రాజ్యవాద బాధితులే, వ్యతిరేకులే. ఉక్రెయిన్‌ – రష్యా వివాదంతో తలెత్తిన పరిస్థితి పర్యవసానాలను అంచనా గట్టటంలో ఒక విధంగా అమెరికా విఫలమైందనే చెప్పాలి. అమెరికాలో అసాధారణ రీతిలో చమురు ధరల పెరుగుదల వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్‌ పార్టీని దెబ్బతీయవచ్చనే అంచనాలున్నాయి. అసాధారణ రీతిలో పెరిగిన ద్రవ్యోల్బణ దేశ జిడిపి వృద్ది రేటును కూడా దెబ్బతీస్తుంది. వచ్చే ఏడాది మాంద్యంలోకి జారవచ్చన్న హెచ్చరికలూ ఉన్నాయి. చమురు ధరలు తగ్గాలంటే సరఫరాను పెంచాలన్న వినతులను సౌదీ ఇతర దేశాలు అంగీకరించలేదు. రష్యా చమురు ఎంత ఎక్కువగా మార్కెట్‌కు వస్తే అంత అధికంగా దానికి రాబడి వస్తుందని తేలింది. అందువలన వెనెజులాపై గతంలో విధించిన ఆంక్షలను చూసీచూడనట్లు నటిస్తూ అక్కడ చమురు ఉత్పత్తి పెంపుదలకు అమెరికా చొరవ చూపింది.తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గితే అమెరికాకూ మేలే గనుక ఇది దాని అవసరం కోసం తప్ప వెనెజులా మీద మనసు మారి కాదు. తిరిగి ఎప్పుడైనా పంజా విసరవచ్చు. దొరికిన ఈ వెసులుబాటును వెనెజులా తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. గతంలో చమురు ధరల పతనం కూడా దాని ఆర్ధిక ఇబ్బందులకు ఒక కారణం ఇప్పుడు వందడాలర్లకు పైగా ఉన్నందున రష్యా మాదిరి కొన్ని దేశాలకు రాయితీ ఇచ్చినా దానికి రాబడి పెరుగుతుంది. ఇదే తరుణంలో అమెరికాను పక్కాగా ప్రతిఘటించే ఇరాన్‌తో ఒప్పందం కూడా సానుకూల అంశమే. ప్రతిపక్ష నేత గుయిడోను వెనెజులా తాత్కాలిక అధ్యక్షుడిగా గుర్తించిన అమెరికా, దాని బాటలో నడిచిన ఇతర పశ్చిమ దేశాలు ఇప్పుడు అదే అమెరికా మదురో యంత్రాంగంతో చర్చలకు రావటం అమెరికాకు ప్రపంచంలో పరువు తక్కువ వ్యవహారమే దాన్ని నమ్ముకొని దానికి తాన తందాన అన్న దేశాలకూ పరాభవమే. ఇది మదురోకు పెద్ద నైతిక విజయం.చమురు ఎగుమతుల మీదనే ఆధారపడితే అమెరికా సామ్రాజ్యవాదం నుంచి ఎప్పుడైనా ముప్పురావచ్చు.అందుకే సమతుల విస్తరణ, దిగుమతులపై ఆధారపడకుండా చూసుకోవటం వంటి విధానాలవైపు వెనెజులా మళ్లుతున్నది.


ప్రతిపక్ష నేతను దేశాధ్యక్షుడిగా గుర్తించిన అమెరికా 2019లో వెనెజులాలోని తన రాయబార కార్యాలయాన్ని పక్కనే ఉన్న కొలంబియాకు తరలించింది. అక్కడ ఎన్నికల్లో తొలిసారిగా వామపక్షం అధికారంలోకి రానున్నదని గతేడాదే వివిధ సర్వేలు వెల్లడించాయి, అదే జరిగింది. ఇప్పుడు రెండు దేశాల మధ్య తిరిగి సంబంధాలు ఏర్పడనున్నాయి.ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య తధ్యమని ముందుగానే అమెరికాకు తెలుసు గనుకనే అంటరాని వాడిగా పరిగణించిన మదురోతో చర్చలకుగాను మార్చి నెలలోనే బైడెన్‌ సర్కార్‌ వెనెజులాకు ఒక అధికారిక బృందాన్ని పంపింది. అక్కడ బందీలుగా ఉన్న తమ పౌరుల విడుదల సంప్రదింపులకు తప్ప మరొకటి కాదని బుకాయించింది. తరువాత ఆంక్షలను సడలిస్తామని ప్రకటించింది.చమురు ఉత్పత్తి, ఎగుమతులకు సంబంధించి ఒప్పందాలు చేసుకోవచ్చని తమ కార్పొరేట్‌ సంస్థ చెవరాన్‌కు అనుమతి ఇచ్చింది. ఇలా చేసి ఉండాల్సింది కాదని, దీనివలన అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ తట్టుకొని నిలవగలమనే ధైర్యం బాధిత దేశాలకు వస్తుందని మితవాద, వామపక్ష వ్యతిరేకశక్తులు గగ్గోలు పెడుతున్నాయి. అమెరికాను వ్యతిరేకించే చైనా, రష్యా ప్రభావం పశ్చిమార్ధగోళంలో పెరుగుతుందని వాపోతున్నాయి.


ఆగస్టు 13 నుంచి 27వ తేదీ వరకు వెనెజులా రాజధాని కారకాస్‌లో ఇంటర్నేషనల్‌ ఆర్మీ గేమ్స్‌ జరుగుతున్నాయి.రష్యా ప్రారంభించిన ఈ క్రీడలను తొలిసారిగా పశ్చిమార్ధగోళంలోని వెనెజులా నిర్వహిస్తున్నది. ఇప్పటి వరకు 37 దేశాల నుంచి 275 టీములు, 36 విభాగాల్లో పోటీ పడేందుకు వస్తున్నట్లు సమాచారం. జరుగుతున్నది క్రీడలే కావచ్చుగానీ వీటికి ఎంతో ప్రాధాన్యత ఉంది. లాటిన్‌ అమెరికాలో ఇప్పటికే తొమ్మిది దేశాల్లో అమెరికా వ్యతిరేక, వామపక్ష పార్టీల ప్రభుత్వాలు ఉన్నాయి. త్వరలో పనామా కూడా వీటి సరసన చేరవచ్చని వార్తలు వస్తున్నాయి. మొత్తంగా చూసినపుడు అమెరికా బయట-తన పెరటి తోట అనుకుంటున్న లాటిన్‌ అమెరికాలోనూ ఒంటరి అవుతున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వంటగాస్‌ ధరల పెంపు, గాలి వాటు పన్ను – సామాన్యులకు సబ్సిడీల కోత, ధరల మోత !

08 Friday Jul 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, LPG Price in India, Narendra Modi Failures, windfall tax


ఎం కోటేశ్వరరావు


ధరలు ఎంత పెంచినా జనం ఆమోదిస్తున్నారు, ఎక్కడా నిరసన తెలపటం లేదు. విశ్లేషకులు, జర్నలిస్టులకు ఎందుకు ? ఇదీ ఇటీవల బిజెపి నేతలు వేస్తున్న ప్రశ్నలు, చేస్తున్న ఎదురుదాడి. శ్రీలంక పరిణామాలు ఇక్కడా పునరావృతం అయ్యేంతవరకు అలానే మాట్లాడతారు అది వేరే అనుకోండి. 2022 జూలై మొదటి వారంలో సాధారణ వంటగాస్‌ ధరను మరో రు.50 పెంచారు. దీంతో హైదరాబాదులో రు.1,105కు చేరింది. అంతకు ముందు ఎంత పెంచినా జనాలు కిక్కురు మన లేదు, ఇప్పుడూ అంతే. పార్టీల పిలుపుల్లో కారకర్తలు తప్ప ఇతర జనాలు కనిపించరు. మంచం ఉన్నంత వరకే కాళ్లు ముడుచుకొని నిద్రించటం అలవాటైన వారం కదా ! సర్దుకు పోవటంలో మన తరువాతే ఎవరైనా ! కందకు లేని దురద కత్తిపీటకెందుకు అన్నట్లుగా జనానికి లేనిది ఎవరికైనా ఎందుకు మరి ! అయినా సరే కొన్ని అంశాలను చెప్పక తప్పదు. ఆసక్తి ఉన్న వారు చదవండి మరి !


జూలైలోనే ప్రభుత్వం విండ్‌ ఫాల్‌ టాక్సు పేరుతో చమురు సంస్థల మీద పన్ను విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇది మామూలుగా విధించే పన్నుకు అదనం, తాత్కాలికం. దాని వలన కేంద్ర ప్రభుత్వానికి లక్ష నుంచి లక్షా 30వేల కోట్ల వరకు వస్తుందని కొందరు చెబుతుండగా ఇంకా ఎక్కువ ఉండవచ్చని కొన్ని అంచనాలు. సరే ఎంతైనా అది సెస్‌ గనుక వాటిలో రాష్ట్రాలకు వచ్చేదేమీ ఉండదు. అమ్మకపు పన్ను, జిఎస్‌టి, మరొక పన్ను గురించో విన్నాం గానీ విండ్‌ఫాల్‌ టాక్సు గురించి పెద్దగా తెలియదు. దీనికి తెలుగులో సరైన పదాన్ని నిఘంటువులేవీ చూపటం లేదు. గాలి వాటు (ఆదాయంపై ) పన్ను అందాం. ఒక కంపెనీకి దాని ప్రమేయం లేకుండా ఆర్ధికంగా పెద్ద మొత్తంలో లాభాలు, లబ్ది పొందటాన్ని విండ్‌ ఫాల్‌ అంటున్నారు. నదులకు భారీగా వరదలు వచ్చినపుడు లంకల్లో ఉన్న పొలాలకు సారవంతమైన ఒండ్రు మట్టి చేరి పంటలు బాగా పండుతాయి. కొత్తగా కొన్ని లంకలు ఏర్పడి భూమిగా అందుబాటులోకి కూడా రావచ్చు. దీనికి రైతుల ప్రమేయం లేదా ప్రయత్నాలుగానీ ఉండవు. అలాగే పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకు అలాంటి లాభాలు వస్తాయి.ఉక్రెయిన్‌ వివాద ఫలితంగా మన దేశంలోని చమురు కంపెనీలకు అలాంటి అపరిమిత లాభాలు వస్తున్నందున వాటి మీద కేంద్ర ప్రభుత్వం పన్ను విధించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మేరకు గాలివాటు పన్ను ఇలా ఉంది. మన దేశం నుంచి ఎగుమతి చేసే పెట్రోలుకు రు.6, డీజిలు మీద రు.13, విమాన ఇంథనానికి లీటరుకు ఒక రూపాయి, దేశీయంగా ఉత్పత్తి చేసిన ముడి చమురు మీద టన్నుకు రు.23,250 చెల్లించాల్సి ఉంటుంది.


కొన్ని దేశాల్లో గాలివాటు లాభాలపై పన్ను విధిస్తుంటే జర్మనీలో ఇంథన సంస్థలను ఆదుకొనేందుకు వినియోగదారుల మీద భారాలు మోపేందుకు అక్కడి సర్కారు ఆలోచిస్తున్నది. పెరుగుతున్న ఇంథన ధరల మేరకు అదనంగా వసూలు చేసేందుకు చట్టసవరణకు పూనుకుంది. రష్యా ప్రభుత్వం కూడా ఇంథన రంగ సంస్థ గాజ్‌ప్రోమ్‌ గాలి వాటు లాభాలపై 20బిలియన్‌ డాలర్ల మేరకు పన్ను విధించింది. సెప్టెంబరు నుంచి మూడు నెలల పాటు నెలకు 6.5బి.డాలర్ల చొప్పున పన్ను వసూలు చేస్తారు. ఈ సొమ్ము ప్రభుత్వ ఖజనాకు చేరుతుంది. ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమైన తరువాత ఐరోపాకు, చమురు, గాస్‌ సరఫరాను తగ్గించినప్పటికీ ఈ సంస్థ రోజుకు పది కోట్ల డాలర్లకు పైగా సంపాదిస్తున్నది. సరఫరాలు తగ్గినా గత ఏడాది వచ్చిన దానికి సమంగా సంపాదిస్తున్నది. ఇటలీలో ఇంథన ధరలు పెరిగిన కారణంగా ప్రభావితులైన వినియోగదారులు, వాణిజ్య సంస్థలను ఆదుకొనేందుకు అక్కడి చమురు సంస్థల లాభాలపై 25శాతం పన్ను విధించినట్లు ప్రకటించారు.బ్రిటన్‌లో 2022 మే26 వతేదీ తరువాత వచ్చిన లాభాలపై పన్నును 40 నుంచి 60శాతానికి పెంచారు. దీనికి ఇంథన ధరల లెవీ అని పేరు పెట్టారు.2025 తరువాత దాన్ని తొలగిస్తారు. మనం ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాం. మన దేశంలో ఈ పన్ను ఎందుకు విధించారు. ఆ వచ్చిన రాబడితో వంటగాస్‌, పెట్రోలు, డీజిలు ధరలను తగ్గించాల్సి ఉండగా గాస్‌ ధరను రు.50 ఎందుకు పెంచినట్లు ? ఎవరి కోసం ఈ పన్ను ఆదాయాన్ని ఖర్చు చేస్తారు ? ప్రశ్నించకుండా నోరు మూసుకున్నవారు దేశభక్తులు, అడిగినవారు దేశద్రోహులు !


దేశంలో కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో వంటగాస్‌ను ప్రోత్సహించారు.ప్రజల కొనుగోలు శక్తి తక్కువగా ఉన్నందున దానికి గాను సబ్సిడీలు కూడా ఇచ్చారు. దీంతో వినియోగదారులు గణనీయంగా పెరిగారు. కరోనా లాక్‌డౌన్‌ విధించిన 2020లో పెట్రోలు కంటే దేశంలో తొలిసారిగా గాస్‌ను ఎక్కువగా కొనుగోలు చేశారు. తరువాత తిరిగి పెట్రోలు పెరిగిందనుకోండి. సబ్సిడీలను ఎత్తివేసేందుకు గాను వేసిన ఎత్తుగడ ఏమంటే సబ్సిడీ మొత్తాన్ని నేరుగా వినియోగదారుల ఖాతాలో వేస్తామంటూ గాస్‌ ధర మొత్తాన్ని ముందుగా చెల్లించే అలవాటు చేశారు. తరువాత స్వచ్చందంగా సబ్సిడీ వదులు కోవాలన్న తతంగం నడిపారు. బిజెపి దేశభక్తులు కూడా వదులుకోకపోవటంతో క్రమంగా సబ్సిడీ ఎత్తివేశారు. ఐదుశాతం మంది స్వచ్చందంగా వదులు కున్నట్లు చెప్పగా కాగ్‌ సదరు అంకెలతో అంగీకరించలేదు. 2014లో గాస్‌ ధర రు.414 కాగా తాజా పెంపుదలతో అది రు.1,105(హైదరాబాదు)కు పెరిగింది. 2014 తరువాత నిజానికి అంతర్జాతీయ మార్కెట్లో గాస్‌ ధర ముడిచమురుతో పాటు గణనీయంగా తగ్గింది.


అబ్జర్వర్‌ రిసర్చ్‌ ఫౌండేషన్‌ (ఒఆర్‌ఎఫ్‌) 2021 డిసెంబరు నాలుగవ తేదీన ప్రచురించిన ఒక విశ్లేషణలో పేర్కొన్న అంశాల సారాంశం ఇలా ఉంది.2013-14 నుంచి 2019-20 కాలంలో అంతర్జాతీయ ఎల్‌పిజి(వంటగాస్‌) ధర 48శాతం తగ్గింది. అదే 2020-21తో పోల్చితే తగ్గుదల 31శాతం ఉంది.2014 ఏప్రిల్‌ నుంచి 2021 అక్టోబరు వరకు మన దేశంలో ధరను 110శాతం పెంచారు. కరోనా లాక్‌డౌన్ల ఎత్తివేత తరువాత మాత్రమే అంతర్జాతీయ ధర పెరిగింది.అంతకు ముందు ఆరు సంవత్సరాలు తగ్గింది. ఈ కారణంగానే ప్రభుత్వం మీద సబ్సిడీ భారం తగ్గింది.2013-14 నుంచి 2015 – 16 మధ్య ప్రభుత్వం భరించిన సబ్సిడీ భారం 64శాతం తగ్గింది. అంకెల్లో 746.1 నుంచి 263 బిలియన్ల రూపాయలకు( మన కోట్లలో చెప్పుకుంటే 74,610 నుంచి 26,300 కోట్లకు) తగ్గింది. ఇదే కాలంలో చమురు కంపెనీలు భరించిన సబ్సిడీ మొత్తం 98శాతం అంటే రు.69,128 నుంచి రు.1,268 కోట్లకు తగ్గింది.వినియోగదారులకు నేరుగా చెల్లించిన సబ్సిడీ మొత్తం 2015-16 నుంచి 2020-21 కాలంలో రు.27,570 కోట్ల నుంచి రు.3,658 కోట్లకు తగ్గింది.

ధనికులకు సబ్సిడీని తగ్గించి పేదలకు పెంచామంటూ ప్రచార ఆర్భాటం చేసి ప్రధాన మంత్రి ఉజ్వల యోజన(పిఎంయువై) పధకం పేరుతో మంజూరు చేసిన గాస్‌ కనెక్షన్ల ప్రచారాన్ని అనేక మంది ప్రశ్నించారు. సబ్సిడీల గురించి అనుసరించిన లెక్కల పద్దతిని కాగ్‌ ప్రశ్నించింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో ఓటర్ల కోసం ఈ పధకాన్ని ప్రారంభించారు.2015-16లో ఈ పధకం కింద ఇచ్చినట్లు చెప్పిన సబ్సిడీ రు.2,990 కోట్లు కాగా 2019-20కి అది రు.1,293 కోట్లకు తగ్గింది. ఈ పధకం కింద గాస్‌ కనెక్షన్లు పొందిన వారి ఆదాయం పెరగని కారణంగా, సబ్సిడీ కోత వలన సిలిండరును తీసుకోలేకపోయారు.


పిఎంయువై పధకం కింద గాస్‌ కనెక్షను ఉన్నవారికి సిలిండర్‌కు రు.200 సబ్సిడీ ఇస్తున్నట్లు ఇటీవల కేంద్రం ప్రకటించింది.2022 మే 12వ తేదీన హిందూ పత్రిక వార్తలో వెల్లడించిన సమాచారం ప్రకారం గత ఆర్ధిక సంవత్సరంలో 90 లక్షల మంది ఉజ్వల లబ్దిదార్లు గాస్‌ను తీసుకోలేదు. కోటి మంది ఒక సిలిండరు మాత్రమే తీసుకున్నారు. 2016 మే ఒకటవ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో ప్రధాని నరేంద్రమోడీ ఈ పధకాన్ని ప్రారంభించారు.2020 మార్చి నాటికి ఎనిమిది కోట్ల కనెక్షన్లు ఇవ్వాలని చెప్పారు, తరువాత మరొక కోటి పెంచారు. సమాచార హక్కు కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా గత ఆర్ధిక సంవత్సరంలో (2021 మార్చి నాటికి) ఇచ్చిన కనెక్షన్లలో ఐఓసిలో ఒకసారి మాత్రమే సిలిండర్లు తీసుకున్నవారు 65, హెచ్‌పిసిలో 9.1, బిపిసిలో 15.96లక్షల మంది ఉన్నారు. 2019 సెప్టెంబరు వరకు తాము ఇచ్చిన కనెక్షన్ల గురించి బిపిసి ప్రత్యేకంగా పేర్కొన్నది. ఐఓసిలో ఒకసారి మాత్రమే తీసుకున్నవారు 52,హెచ్‌పిసిలో 27.58, బిపిసిలో 28.56లక్షల మంది ఉన్నారు.ఈ ఏడాది మార్చి నెలలో లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో ఏటా ఈ పధకం కింద కనెక్షన్‌ పొందిన వారు సగటున ఒక్కొక్కరు 3.6 సిలిండర్లు మాత్రమే తీసుకున్నారు. 2020 ఏప్రిల్‌ ఒకటి నుంచి డిసెంబరు వరకు కేంద్ర ప్రభుత్వం మూడు ఉచిత సిలిండర్లు ఇస్తున్నట్లు ప్రకటించగా ఈ పధకం తీసుకున్న సిలిండర్ల సంఖ 14.17కోట్లని మరొక ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం తెలిపిందని హిందూ పత్రిక పేర్కొన్నది. తొమ్మిది కోట్ల మంది మూడు చొప్పున తీసుకుంటే 27 కోట్లు కావాలి, అంటే కరోనాలో కూడా ఉచితంగా ఇచ్చినా తీసుకొనే స్థితి లేదన్నది స్పష్టం. అలాంటపుడు కేవలం రెండువందల సబ్సిడీ ఇచ్చి తాజాగా పెంచిన రేటు ప్రకారం రు.900 పెట్టి కొనుగోలు చేసేందుకు ఎందరు ముందుకు వస్తారన్నది ప్రశ్న.వంటగాస్‌ ధరలకు సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సగటున ఒక లీటరు ధర జూలై నాలుగవ తేదీ నాటికి 80 సెంట్లు ఉంది. మన కరెన్సీలో రు.63.39 కాగా మన దేశంలో 87 సెంట్లు, రు.68.94 ఉంది. మన కంటే ఆస్ట్రేలియాతో సహా 28 దేశాలలో ధర తక్కువగా 22 చోట్ల ఎక్కువగా ఉంది. విశ్వగురువుగా అభిమానుల నుంచి అభినందనలు అందుకుంటున్న ప్రధాని నరేంద్రమోడీ ఏ దేశాలను ఆదర్శంగా తీసుకుంటారు ?


గాలి వాటు లాభాలు ఎలా ఉన్నాయంటే ప్రభుత్వ రంగ ఓఎన్‌జిసి 2020-21లో సంపాదించిన మొత్తం రు.1,10,345 కోట్లకు గాను దానికి వచ్చిన లాభం రు.40,306 కోట్లు. మన దేశంలో ఓఎన్‌జిసితో పాటు చమురును వెలికి తీసే వేదాంత ప్రైవేటు కంపెనీకి సైతం పెద్ద మొత్తంలో లబ్ది కలిగింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విధించిన గాలివాటు పన్నుతో ఈ రెండు కంపెనీల నుంచే కేంద్రానికి 69వేల కోట్ల మేరకు రాబడి ఉంటుందని పిటిఐ వార్తా సంస్థ పేర్కొన్నది. రిలయన్స్‌ కంపెనీ జామ్‌నగర్‌లోని చమురుశుద్ధి కర్మాగారం నుంచి ఎగుమతి చేస్తున్న చమురు ఉత్పత్తులపై ఆ కంపెనీ అపరిమిత లాభాలు ఆర్జిస్తున్నది. గాలివాటు పన్ను విధించిన తరువాత కూడా దానికి గణనీయ లాభాలు ఉంటాయని చెబుతున్నారు. జూన్‌ చివరి వారంలో కంపెనీ జిఆర్‌ఎం ఒక పీపాకు 24 నుంచి 26 డాలర్లవరకు ఉందని మోర్గన్‌ స్టాన్లీ అంచనా వేసింది. ఈ కంపెనీ శుద్ధి చేసిన ఉత్పత్తుల్లో 58శాతం ఎగుమతి చేస్తున్నట్లు జఫరీస్‌ సంస్థ తెలిపింది. గాలి వాటు పన్ను వలన జిఆర్‌మ్‌ ఒక పీపాకు 7 నుంచి 12 డాలర్లు తగ్గుతుందని అంచనా.2021లో పీపాకు 5.9, 2022లో 9.7 డాలర్లు రాగా రష్యా చమురు కారణంగా 2023లో 16.5 డాలర్లు ఉండవచ్చని నొమురా పేర్కొన్నది. గతంలో కేవలం ఐదు శాతం దిగుమతి చేసుకోగా ఇప్పుడు రష్యా చమురు 25శాతానికి పెరిగింది. గతంలో కేంద్ర ప్రభుత్వం చమురు ధరలు తగ్గినపుడు ఆ మేరకు జనాలకు తగ్గించకుండా సెస్‌లను విపరీతంగా పెంచి లక్షల కోట్లు తన ఖజనాకు మళ్లించింది. చమురు ధరలను తగ్గించలేదు. ఇప్పుడు చమురు కంపెనీలకు వస్తున్న అపరిమిత లాభాల నుంచి కొంత వసూలు చేయటం సమర్ధనీయమే. కార్పొరేట్లకు పన్ను తగ్గించిన కేంద్రం ఆత్మనిర్భర్‌ పేరుతో వాటికే మరికొంత లబ్ది చేకూర్చింది.గాలి వాటు పన్ను ద్వారా వచ్చే అదనపు రాబడిని ఎవరికోసం ఖర్చు చేస్తారు.కార్పొరేట్లగా సామాన్య జనాలకా ? గాస్‌, చమురు ధరల పెంపుదల ఇతర వస్తువుల ధరల పెరుగుదలకు దారి తీస్తున్నది. పరిశ్రమల వృద్ధి, పెట్టుబడులకు ప్రోత్సాహం పేరుతో కంపెనీలకు ఇస్తున్న పలు రాయితీలు కొనసాగుతూనే ఉన్నాయి, మరి సామాన్యులకు సబ్సిడీల కోత – ధరల మోత ఎందుకు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

రూపాయి పతనం : వంచనకూ ఒక హద్దుంటుంది :నరేంద్రమోడి , ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులా మిత్రోం !

04 Monday Jul 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

BJP, Joe Biden, Narendra Modi Failures, Rupee depreciation, Rupee Fall


ఎం కోటేశ్వరరావు


” గతంలో భారత ప్రధానులు అమెరికా అధ్యక్షులను కలుసుకొనేందుకు వారి దగ్గరకు వెళ్లేవారు. ఇప్పుడు వారే మన ప్రధాని దగ్గరకు వస్తున్నారు. అదే నరేంద్రమోడీ గొప్పతనం ” ఇది ఇటీవలి జి7 దేశాల సమావేశం తరువాత సామాజిక మాధ్యమంలో తిరుగుతున్న ఒక పోస్టులోని అంశం. నిజమే ఆ దృశ్యాన్ని చూసి యావత్‌ నరేంద్రమోడీ భక్త జనులు ఆనందపారవశ్యంతో ఆ బొమ్మ ముందు పొర్లు దండాలు కూడా పెట్టి ఉండవచ్చు. ఎవరిష్టం వారిది. ప్రపంచ నేతలతో అందునా అమెరికా నేతలతో కౌగలించుకొనే చనువు మన ప్రధానికి ఉంది గనుక మరొకటి కూడా జరిగి ఉండవచ్చు. ” ఏమిటి మోడీ గారు మా డోనాల్డ్‌ ట్రంప్‌నైతే కౌగలించుకొని చెట్టపట్టాలు వేసుకొని మరీ మధుర భాషణలు జరిపారు. నన్ను చూసి కూడా చూడనట్లు అటు తిరిగి మాట్లాడుతున్నారేం ” అంటూ వెనుక నుంచి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నరేంద్రమోడీ భుజం తట్టి మరీ పలకరించి ఉండవచ్చుగా ! వసుదేవుడు అంతటి వాడు తన పని జరిపించుకొనేందుకు గాడిద కాళ్లు పట్టుకున్నాడన్న పురాణ కధ చదివాము. వర్తమాన ప్రపంచ రాజకీయాల్లో తన అవసరం కోసం గత ఐదునెలల్లో బెదిరింపులు-బుజ్జగింపులతో మన దేశాన్ని తనవైపు తిప్పుకొనేందుకు అమెరికా చూస్తున్నదనేది కూడా జగమెరిగినదే. దానిలో భాగంగా కూడా జో బైడెన్‌ వెనుక నుంచి తట్టి మరీ నరేంద్రమోడీని పలుకరించి ఉండవచ్చు మీ వైఖరిని మార్చుకున్నారా అని అడిగి ఉండవచ్చు. అవసరం వారిది కదా ! ఏదైనా దాన్ని వదలివేద్దాం, దీనితో దేశానికి ఒరిగిందేమిటి, జనాలకు దక్కిందేమిటి ?


నరేంద్రమోడీని విశ్వగురువుగా మన జనాలకు చూపేందుకు ప్రశాంత కిషోర్‌ వంటి వారి సలహాలతో మద్దతుదారులు ఇలాంటివి ప్రచారంలో పెట్టినా ఆశ్చర్యం లేదు. గతంలో చాయవాలా బ్రాండ్‌,ఎన్నికల సభల్లో టీ అమ్మేవారికి ప్రత్యేక స్థలాన్ని కేటాయించి కూర్చోబెట్టటం, బిజెపి నేతలు టీ అమ్మటం వంటి జిమ్మిక్కులన్నీ దానిలో భాగమే కదా ! చాయవాలా తరువాత చౌకీదారు బ్రాండ్‌తో ముందుకు వచ్చారని తెలిసిందే ! ఇవన్నీ నాణానికి ఒక వైపు మాత్రమే. ప్రపంచానికి పాఠాలు చెబుతున్న విశ్వగురువు తన కార్యస్థానంలో చెప్పిందేమిటి చేస్తున్నదేమిటి ? అన్నింటినీ ఒకేసారి చెప్పుకోలేం గనుక రూపాయి గురించి మోడీ, బిజెపి నేతలు చెప్పిందేమిటో చూద్దాం ? ఇప్పుడు జరుగుతున్నదేమిటో చూద్దాం. దాని గురించి వారు మరిచినట్లు నటిస్తున్నా జనానికి మతిమరుపు వచ్చినా అవసరం గనుక చెప్పుకోక తప్పదు. భజన తప్ప మరొకటి మాకు పట్టదని భక్తులు అంటారా ? వారిని వదలివేద్దాం ! తమ అవసరాల కోసం నరేంద్రమోడీని విదేశాలు – కార్పొరేట్‌లు మునగచెట్టు ఎక్కించవచ్చు, మీడియాలో గొప్పతనాన్ని గుప్పించవచ్చు. దానికి అనుగుణంగానే ఎక్కడ వేదిక దొరికితే అక్కడ మోడీ గారు సుభాషితాలను వల్లిస్తున్నారు. ఒకటి మాత్రం అందరూ అంగీకరించాల్సిందే. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి జనాన్ని ఆకట్టుకోవటంలో నరేంద్రమోడీకి ప్రస్తుతం దేశంలో మరొకరు సాటిరారు. అందునా వేషం-భాషల్లో ప్రత్యేక శిక్షణ కూడా పొందారు.


” యుపిఏ నిర్వాకం రూపాయి పతనానికి దారి తీసింది : బిజెపి ” 2013 నవంబరు 21న పిటిఐ వార్తకు శీర్షిక. ” ఎఫ్‌డిఐల ద్వారా ఎఫ్‌ఎఫ్‌ఐల పెట్టుబడులతో నడపాలన్న యుపిఏ విధానం వలన ఈ దుస్థితి ఏర్పడింది. రూపాయి రికార్డు పతనం చెందింది.( ఆరోజు ఒక డాలరుకు 60.15 రూపాయలు)” ఆ రోజు విలేకర్లతో మాట్లాడింది నాడు రాజ్యసభలో బిజెపి ఉపనేతగా ఉన్న రవిశంకర ప్రసాద్‌. ప్రభుత్వం మీద జోకులు పేలుస్తూ ” యుపిఏ ప్రభుత్వం ఏర్పడినపుడు డాలరు-రూపాయి దామాషా రాహుల్‌ గాంధీ వయసుతో సమానం ఉంది. ఇప్పుడు సోనియా గాంధీ వయసుకు దగ్గరగా ఉంది. అది మన్మోహన్‌ సింగ్‌ వయసును తాకుతుందేమోనని నిజంగానే భయపడుతున్నాం ” అన్నారు.


రవిశంకర ప్రసాద్‌ కంటే ముందు, 2013 ఆగస్టు 20న గాంధీనగర్‌ నుంచి పిటిఐ వార్తా సంస్థ సిఎంగా ఉన్న నరేంద్రమోడీ వ్యాఖ్యల గురించి ఒక వార్తను ఇచ్చింది. ఆరోజు రూపాయి విలువ 64.11కు దిగజారింది.” ఈ రోజు దేశం ఆశాభంగం చెందింది, ఎందుకంటే ఆర్ధిక రంగం గురించి గానీ రూపాయి పతనం గురించి గానీ ప్రభుత్వానికి పట్టలేదు. దాని ఏకైక చింతల్లా కుర్చీని ఎలా కాపాడుకోవాలా అన్నదే. గత మూడు నెలలుగా రూపాయి పతనం చెందుతూనే ఉంది. కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.రూపాయి ఇలా పతనం అవుతుంటే ఇతర దేశాలు దీన్ని అవకాశంగా తీసుకుంటాయి. ఇలాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుందని దేశం ఎన్నడూ ఊహించి ఉండకపోవచ్చు. కానీ ఇలాంటి సంక్షోభంలో నాయకత్వానికి ఎటు పోవాలో తెలియకపోతే తరువాత నిరాశ పెరుగుతుంది. ప్రజల్లో విశ్వాసాన్ని నింపేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు. గత ఐదు సంవత్సరాలుగా ప్రతి మూడునెలలకు ఒకసారి ధరలు, ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెస్తామని కేంద్రం చెప్పటాన్ని వింటున్నాం, కానీ జరిగిందేమీ లేదు. ” అని బిజెపి ప్రచార కమిటీ నేతగా కూడా ఉన్న మోడీ చెప్పారు.


2018 సెప్టెంబరు మూడున ద క్వింట్‌ పత్రిక జర్నలిస్టు మేఖలా శరణ్‌ రాసిన విశ్లేషణ ” రూపాయి ఆసుపత్రిలో ఉంది, మృత్యువు ా ప్రాణాలతో పోరాడు తోంది ” అని 2013లో నరేంద్రమోడీ చెప్పారు. ఐదు సంవత్సరాల తరువాత ప్రధాన మంత్రి, సెప్టెంబరు మూడున తొలిసారిగా రు. 71.11గా ఉంది అంటూ ప్రారంభమైంది. దానిలో కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. 2012లో నరేంద్రమోడీ గట్టిగా ఇలా చెప్పారు.” నేను పరిపాలనలో కూడా ఉన్నాను. నాకు రూపాయి విలువ గురించి తెలుసు అది ఇంతవేగంగా పతనం కాకూడదు.ఈ విధంగా పతనం కావటానికి గల కారణాలేమిటి ? ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. ఈ దేశం జవాబును డిమాండ్‌ చేస్తోంది” అన్నారు. మరుసటి ఏడాది బిజెపి నేత సుష్మా స్వరాజ్‌ ఇలా చెప్పారు. ” ఈ విధంగా రూపాయి విలువ పడిపోవటాన్ని గత రాత్రి చూస్తూ భయపడి టీవీ కట్టేశాను.” బిజెపి నేతల ఈ ప్రకటనలను ఉటంకించిన ఆజ్‌తక్‌ టీవీ యాంకర్‌ ” ఇప్పుడు రోజులు మారాయి. నరేంద్రమోడీ ప్రధాన మంత్రి అయ్యారు. ఇప్పుడు డాలరుతో రూపాయి విలువ పతనమైంది. ఆయన దేన్నిగురించీ చెప్పటం లేదు.” అని ముక్తాయింపు ఇచ్చారు. ఎన్‌డిటీవి యాంకర్‌ రవీష్‌ కుమార్‌ ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ ఏం మాట్లాడిందీ చూపారు. ” ఈ పతనం(2018) గురించి మీరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇతర కరెన్సీలు కూడా పతనమౌతున్నంత కాలం రూపాయి 80 రూపాయలకు పతనమైనా కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు.” గార్గ్‌ మాటల తరువాత ” వంచనకూ ఒక హద్దు ఉంటుంది ” అన్న నరేంద్రమోడీ చెప్పిన ఒక మాటను చూపి రవీష్‌ కుమార్‌ ముగించారు. నరేంద్రమోడీ ఈ మాటలు ఏ సందర్భంలో చెప్పినా నిత్య సత్యం. కచ్చితంగా కాంగ్రెస్‌ నేతల గురించే చెప్పి ఉంటారు. తరువాత కాలంలో అది తనకూ వర్తిస్తుందని ఊహించి ఉండరేమో !


. 2012 మార్చి 29 నుంచి ఏప్రిల్‌ పదకొండువరకు ముడి చమురు సగటు ధర 121.28 డాలర్లు. కేంద్ర ప్రభుత్వ సంస్థ పిపిఏసి వెల్లడించిన సమాచారం ప్రకారం 2022 జూన్‌ పదవ తేదీన మనం కొనుగోలు చేసిన చమురు ధర 121.28 డాలర్లు. అదే ధరకు 2012లో చెల్లించిన మొత్తం మన కరెన్సీలో రు.6,201.05 కాగా ఎనిమిదేండ్ల పాలనలో నరేంద్రమోడీ అదే డాలర్లకు చెల్లించిన మొత్తం రు.9,434.29. చమురు మీద పెంచిన పన్నులను పక్కన పెడితే రూపాయి విలువ పతనాన్ని అరికట్టలేని అసమర్ధత కారణంగా ఈ రోజు మనం ప్రతి పీపాకు పదేండ్ల నాటి కంటే అదనంగా రు.3,233.24 చెల్లిస్తున్నాము. పదేండ్ల క్రితం రూపాయి విలువ డాలరుకు 51.13 ఉండగా మోడీ ఏలుబడిలో 2022 జూన్‌ పదిన అది 77.79కి దిగజారింది, ఇప్పుడు 79 దాటింది. పదేండ్ల క్రితం, ఇప్పుడు ముడి చమురు ధర ఒకే విధంగా ఉన్నప్పటికీ మనం చెల్లించే మొత్తం భారీగా పెరిగింది. దీని గురించి సుభాష్‌ చంద్ర గార్గ్‌ ఏం చెబుతారు ? రూపాయి విలువను కాపాడలేదంటూ నరేంద్రమోడీతో సహా బిజెపి నేతలందరూ మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ను దులిపివేశారు. మోడీ సర్కార్‌ నిర్వాకానికి ఇప్పుడు దేశ ప్రజలందరూ మూల్యం చెల్లించాల్సి వస్తోందా లేదా ?


2022 జూలై ఒకటవ తేదీన 79.20తో రూపాయి పతనం కొత్త రికార్డు నెలకొల్పింది. నరేంద్రమోడీ వయస్సును దాటి బిజెపి మార్గదర్శక మండలిలో ఉన్న అద్వానీ, మురళీమనోహర్‌ జోషి వంటి వారి వయస్సులను అధిగమించేందుకు పోటీ పడుతోంది. త్వరలో 80 దాట నుందని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఐదు నెలల్లో ఐదు రూపాయలు పతనమైంది. అమెరికాలో వడ్డీ రేట్లను పెంచితే మరింతగా కూడా పతనం కావచ్చు. గత ప్రభుత్వం ఎఫ్‌డిఐ, ఎఫ్‌ఎఫ్‌ఐల మీద ఆధారపడిన కారణంగానే పతనం అన్న నరేంద్రమోడీ ఇప్పుడు అదే కారణాలతో అంతకంటే ఎక్కువగా పతనం చెందుతున్నా మాట్లాడటం లేదు. పతనాన్ని అరికట్టేందుకు ఆర్‌బిఐ తన దగ్గర ఉన్న డాలర్లను మార్కెట్లో అమ్ముతున్నది. డిసెంబరులో 31నాటికి 633.6 బి.డాలర్లుండగా జూన్‌ 24న 593.3 బి.డాలర్లకు విదేశీ మారక ద్రవ్యం తగ్గింది. ఈ ఏడాది రెండవ అర్ధభాగంలో 77-81 మధ్య రూపాయి విలువ కదలాడవచ్చని కొందరి అంచనా. అది ఇప్పుడున్న ముడిచమురు ధరలు అలా ఉంటే అన్న ప్రాతిపదికన అన్నది గమనించాలి.2022లో 95.6 బి.డాలర్ల మేర చమురు దిగుమతులు చేసుకోగా, ఈ ఏడాది ఆ మొత్తం 145-150 బి.డాలర్ల వరకు పెరగవచ్చని అంచనా. షేర్‌ మార్కెట్‌ నుంచి విదేశీ పెట్టుబడులను వెనక్కు తీసుకోవటమే ప్రస్తుత భారీ పతనానికి కారణం. మన దేశం చేస్తున్న ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉన్నందున పతనం కారణంగా ఎక్కువ మొత్తాలను చెల్లించాల్సి ఉంటుంది. దాంతో దిగుమతి చేసుకున్న వస్తువుల ధరలు పెరుగుతాయి. పతనమౌతున్న రూపాయి గురించి ఎవరూ మాట్లాడరేం. మరక మంచిదే అన్నట్లు పతనం మంచి రోజుల్లో భాగమే అని బిజెపినేతలైనా చెప్పాలి కదా మిత్రోం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎపిఎస్‌ఆర్‌టిసి ప్రయాణీకులపై మోడీ – జగన్‌ బాదుడే బాదుడు !

02 Saturday Jul 2022

Posted by raomk in AP NEWS, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

APSRTC, Narendra Modi, YS jagan


ఎం కోటేశ్వరరావు


ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ(ఎపిఎస్‌ఆర్‌టి) డీజిల్‌ సెస్‌ పేరుతో ప్రయాణీకుల మీద భారం మోపింది. 2022 జూలై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.ఈ సందర్భంగా సంస్థ చేసిన ప్రకటనలో ” పొరుగు రాష్ట్రంలో అన్ని బస్సుల టిక్కెట్లు మరియు పాస్‌ల ధరలు 9.6.2022 నుంచి పెంచటం జరిగినది ” అని సమర్ధించుకుంది.ఎదుటి వారు తొడ కోసుకుంటే మనం మెడ కోసుకుంటామా అన్న లోకోక్తి తెలిసిందే. భారం మోపేందుకు ఇది ఒక సాకు తప్ప హేతుబద్దత లేదు. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వాటన్నింటినీ ఆంధ్రప్రదేశ్‌ అమలు జరుపుతున్నదా, ఎపిలో ఉన్న వాటిని ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయా ! ఒకరు పెంచితే మిగతావారు పెంచాలని, తగ్గిస్తే తగ్గించాలనే ఒప్పందం గానీ విధిగానీ లేదు. జూలై రెండవ తేదీన ఇరుగు పొరుగు రాష్ట్రాలలో ఒక లీటరు పెట్రోలు, డీజిలు ధరలు దిగువ విధంగా ఉన్నాయి.
పట్టణం ×××× పెట్రోలు××× డీజిలు
విజయవాడ×× 111.66 ××× 99.43
హైదరాబాదు × 109.66 ××× 97.82
బెంగలూరు ×× 101.94 ××× 87.89
చెన్నై ×××××× 102.63 ××× 94.24
భువనేశ్వర్‌ ××× 103.19 ××× 95.28
ఆర్‌టిసీ ఛార్జీల పెంపుదల కోసం పొరుగు రాష్ట్రంతో పోలిక తెచ్చిన జగన్‌మోహనరెడ్డి సర్కార్‌ మరి ఈ రేట్లను గమనించి తక్కువ ఎక్కడుందో దాన్ని ఎందుకు అనుసరించటం లేదు ? దున్నబోతే దూడల్లో తినబోతే ఎద్దుల్లో అంటే ఇదే కదా ! అడ్డగోలు సమర్ధనకు ఒక తర్కం-పద్దతీ పాడూ ఉండదు. ఆర్‌టిసి ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కూడా సర్వీసులను నిర్వహిస్తున్నది. ఇప్పుడు రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నవారు పొరుగునే తక్కువగా ఉన్న ధరలకు డీజిలు, పెట్రోలు కొనుగోలు చేస్తున్నారు.అలాగే ఎపిఎస్‌ఆర్‌టిసి ఛార్జీలు తక్కువగా ఉంటే పొరుగు రాష్ట్రాల జనాలు మన బస్సులు ఎక్కుతారు, రాబడి కూడా పెరుగుతుంది కదా ! సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి చుట్టూ తిష్టవేసిన సలహాదారులకు, అధికారులకు గానీ ఈ చిన్న అంశం తట్టలేదా ! గతంలో కూడా డీజిలు ధరలు పెరిగాయి. ఎన్నడూ ఆర్‌టిసి చరిత్రలో దొడ్డిదారిన డీజిల్‌ సెస్‌ పేరుతో భారం మోపలేదు.


నవరత్నాలలో భాగంగా గత మూడు సంవత్సరాలలో లక్షా 50వేల కోట్ల వరకు జనానికి లబ్ది చేకూర్చినట్లు వైసిపి ప్రభుత్వ విజయాలలో చెప్పుకుంటున్నారు. ఆర్‌టిసి అధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం గత మూడు సంవత్సరాలలో వరుసగా వచ్చినట్లు చెప్పిన నష్టం 2019-20లో రు.1,222.96 కోట్లు, 2020-21లో రు.2,982.32 కోట్లు, 2021-22లో రు.2,698.86 కోట్లు. ఆర్‌టిసిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.ఇది మిగిలిన ప్రభుత్వశాఖల వంటిది కాగా నష్టాల గురించి ఎందుకు చెబుతున్నారన్నది ప్రశ్న. వైద్య ఆరోగ్యశాఖలో కూడా అందించేది సేవ మాత్రమే. ఆర్‌టిసిలో సిబ్బంది వేతనాలు, బస్సుల కొనుగోలు, నిర్వహణ ఉన్నట్లే అక్కడా సిబ్బంది వేతనాలు, ఆసుపత్రులు, వాటికి అవసరమైన వైద్య పరికరాలు, ఔషధాల కొనుగోలు వంటివి ఉంటాయి. దానిలో లేని లాభనష్టాల లెక్కలు ఆర్టీసికి ఎందుకు చెబుతున్నట్లు ? ఆసుపత్రుల్లో వాణిజ్య దుకాణాలు ఉండవు,అదే బస్టాండ్లలో ఎంతో కొంత దుకాణాల ద్వారా రాబడి వస్తుంది. ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణించేది పేద, మధ్య తరగతి వారు మాత్రమే. వారి కోసం రవాణా సబ్సిడీని కూడా నవరత్నాల్లో భాగంగా పరిగణించి ఏడాదికి మూడువేల కోట్ల రూపాయల భారాన్ని భరించే శక్తిలేనిదిగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదా ? నిజానికి నష్టం అని చెబుతున్నదంతా నష్టం కాదు. వృద్దులు, స్కూలు విద్యార్దులు, బస్‌పాస్‌లు, ఆర్‌టిసి మాజీ సిబ్బంది, జర్నలిస్టులు, ఇతరులకు ఇస్తున్న రాయితీలు కూడా దీనిలో ఉన్నందున ఆ మేరకు ప్రభుత్వం సంస్థకు చెల్లిస్తే నష్టాల మొత్తం తగ్గుతుంది. గత మూడు సంవత్సరాల్లో డీజిలు ధర లీటరుకు రు.40 పెరిగిందని ఆర్‌టిసి తన ప్రకటనలో చెప్పింది. డీజిలు మీద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 22.25శాతం పన్ను విధిస్తున్నది అంటే, అంత మేర రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయం వస్తున్నదనేది పచ్చినిజం. ఆ మేరకు ఆర్‌టిసి కొనుగోలు చేసే డీజిలు మీద పన్ను తగ్గించినా భారం తగ్గుతుంది కదా !


పెద్ద మొత్తంలో డీజిలు కొనుగోలు చేసేవారికి లీటరుకు రు.30 అదనంగా కేంద్ర ప్రభుత్వం అమ్ముతున్నది. ఇది జనం మీద విధిస్తున్న మోడీ టాక్సు అని చెప్పవచ్చు. తెలంగాణా వంటి చోట్ల ఆర్‌టిసి ఏకమొత్త కొనుగోలు నిలిపివేసి ఆ భారాన్ని తగ్గించుకొనేందుకు విడిగా కొనుగోలు చేస్తున్నారు. ఎపిఎస్‌ఆర్‌టిసి కూడా అదే పద్దతిని అనుసరించవచ్చు.ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇప్పుడు కొనుగోలు నిలిపివేశారని చెబుతున్నారు. అలాంటపుడు ఆ పేరుతో జనాల మీద భారం మోపారంటే దీన్ని మోడీ-జగన్‌ టాక్సు అని పిలవాల్సి ఉంటుంది. ఆర్‌టిసి బస్సుల్లో ఇప్పటికే టోలు, పాసింజరు, సేఫ్టీ పేరుతో అదనపు మొత్తాలను ప్రయాణీకుల నుంచే వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఇది అదనపు భారం.


ఆర్‌టిసిలో వివిధ సర్వీసుల మీద పెంచిన డీజిల్‌ భారం వెనుక పాలకపార్టీ పెద్దలు-ప్రయివేటు బస్‌ యజమానుల కుమ్మక్కును కొట్టి పారవేయలేము. వారు విడిగా తక్కువ ధరలకు బంకుల్లో డీజిలు కొనుగోలు చేస్తారు కనుక ఆర్‌టిసి పెంచిన మొత్తం ఎంతైతే అంత వారికి వచ్చే అదనపు లాభమే. డిమాండ్‌ ఉన్నపుడు తప్ప మిగిలిన రోజుల్లో ఇప్పటికే ఆర్టీసి కంటే తక్కువ చార్జీలకే తిప్పుతున్నారు. అందువలన ఇప్పుడు ఆర్‌టిసిలో పెంపుదల వారికి మరింత లాభం ఉంటుంది. దానిలో కొంత తగ్గించుకొని ఆర్టీసి కంటే తక్కువ ఛార్జీలకు ప్రయాణీకులను ఆకర్షించేందుకు అవకాశం పెరుగుతుంది. ఇప్పటికే ఆర్‌టిసిలో ఎక్కేవారు తగ్గుతున్నారు. లాభం వుండే దూరపు సర్వీసుల్లో మరింతగా తగ్గితే నష్టాలు మరింతగా పెరుగుతాయి. అందువలన ఏ విధంగా చూసినా సంస్థను మరింత దెబ్బతీసేపనే తప్ప మరొకటి కాదు

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !

25 Saturday Jun 2022

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Adani Coal, Ambani and Adani, Ambani’s Reliance, BJP, Narendra Modi


ఎం కోటేశ్వరరావు


ఎవ్విరిబడీ లవ్స్‌ ఏ గుడ్‌ డ్రాట్‌ ( మంచి కరువును ప్రతివారూ ప్రేమిస్తారు) అనే పేరుతో ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి శాయినాధ్‌ పాతికేండ్ల క్రితం రాసిన పరిశోధనాత్మక కధనాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. అవి నిత్య సత్యాలు. వర్తమానంలో కొనసాగుతున్న ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని చూసిన తరువాత ” మంచి యుద్ధాన్ని ప్రేమిస్తారు ” అనే పేరుతో విశ్లేషణలు రాయవచ్చు. ఉక్రెయిను మీద సైనిక చర్య జరుపుతున్న రష్యా మీద తాము విధించిన ఆంక్షలను భారత్‌ ఖాతరు చేయటం లేదని అమెరికా, ఐరోపా ధనిక దేశాలు గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. వలలో పడుతుందనుకున్న పిట్ట జారిపోయిందని ఆశాభంగం చెందినట్లుగా మింగలేక కక్కలేక ఎప్పటికైనా తిరిగి పడకపోతుందా అన్నట్లుగా వలలు పన్ని ఎదురు చూస్తున్నాయి.


ప్రతిదేశ రాజకీయ వైఖరుల వెనుక ఆ దేశ పాలకవర్గాల ఆర్ధిక ప్రయోజనాలుంటాయన్నది జగమెరిగిన పచ్చినిజం.అమెరికాను శాసించే సంస్థల్లో ఒకటైన అమెజాన్‌ కంపెనీ సిఇవో బెజోస్‌ భారత్‌ వచ్చినపుడు నరేంద్రమోడీ కలుసుకొనేందుకు ఇష్టపడలేదు. విదేశాలకు వెళ్లి మరీ పెద్ద పీటవేసి పెట్టుబడులను ఆహ్వానించినట్లు చెప్పుకున్న మోడీ ఏకంగా మన దేశానికి వచ్చిన అమెజాన్‌ అధిపతి పట్ల అలా ఎందుకు వ్యవహరించినట్లు ? అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం ఏమంటే అమెజాన్‌ కంపెనీ తన జియోకు ఎక్కడ పోటీ వస్తుందో, ఎలా మింగివేస్తుందో అని ముకేష్‌ అంబానీ భావించటమే. తరువాత జరిగిన అనేక పరిణామాలు దీన్నే నిర్ధారించాయి. తమకు అనుకూలంగా మోడీ సర్కార్‌ ఉంది కనుక అంబానీ మీడియా నరేంద్రమోడీకి భజన చేస్తుంటే అమెజాన్‌ కంపెనీకి అవకాశం ఇవ్వటం లేదు గనుక అదే కంపెనీకి చెందిన వాషింగ్టన్‌ పోస్టు పత్రిక విమర్శనాత్మకంగా ఉంది, మోడీ సర్కార్‌ను విమర్శిస్తూ రాస్తున్నది. ఉక్రెయిన్‌ వివాదంలో కూడా అమెరికా మీడియా మొత్తంగా అదే చేస్తున్నది. ఇక ఉక్రెయిన్‌ సంక్షోభం ముకేష్‌ అంబానీకి ” మంచి యుద్ధం ” గా మారి లాభాలు కురిపిస్తున్నదంటే చాలా మంది నమ్మకపోవచ్చు గానీ ఇది పచ్చినిజం.


అమెరికా ఆంక్షలను ధిక్కరించి రష్యా నుంచి చౌకధరలకు మన దేశం కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్న ముడి చమురు వివరాలను చూస్తే అసలు కధ ఏమిటో అర్ధం అవుతుంది. మన దేశం రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న చమురు ఏప్రిల్‌ నుంచి 50 రెట్లు పెరిగింది. ఈ చమురులో 69శాతం రిలయన్స్‌, నయారా వంటి సంస్థలే దిగుమతి చేసుకుంటున్నట్లు వార్తలు.ప్రభుత్వ లేదా ప్రయివేటు సంస్థలు ఏవి దిగుమతి చేసుకున్నా దిగుమతి ఖర్చు తగ్గినపుడు జనాలకు ఆమేరకు తగ్గాలి. అలా తగ్గటం లేదు ఎందుకని ? రిలయన్స్‌, నయారా తదితర ప్రైవేటు బంకుల్లో చమురు విక్రయాలు దాదాపు లేవు, ఎక్కడైనా తెరిచి ఉంచినా కొనుగోలు చేసే వారు కూడా ఉండరు. మరి దిగుమతి చేసుకున్న చమురును శుద్దిచేసి ఏమి చేస్తున్నట్లు ? విదేశాలకు, అమెరికా, ఆఫ్రికా, ఐరోపాకు ఎగుమతి చేసి లాభాలు పోగేసుకుంటున్నాయి.


రాయిటర్స్‌ వార్తా సంస్థ జూన్‌ ఒకటవ తేదీ కధనం ప్రకారం 2021 తొలి ఐదు నెలల్లో మన దేశం ఎగుమతి చేసిన చమురు ఉత్పత్తుల కంటే ఈ ఏడాది అదే కాలంలో 15 శాతం పెరిగినట్లు కెప్లర్‌ సంస్థ సమాచారం వెల్లడించింది. ఒక లీటరు డీజిలు మీద రు.20, పెట్రోలు మీద రు.17 నష్టం వస్తున్నందున ప్రయివేటు చమురు శుద్ధి సంస్థలు మార్కెటింగ్‌ను గణనీయంగా తగ్గించాయి. శ్రీలంక పరిణామాలను చూసిన తరువాత ధరల పెరుగుదలతో ప్రభుత్వం మీద జనంలో అసంతృప్తి తలెత్తుతుందనే భయంతో కేంద్ర ప్రభుత్వం కొంత మేరకు పన్ను తగ్గించటంతో పాటు ఏప్రిల్‌ ఆరు నుంచి ధరల సవరణను స్థంభింపచేసింది. రిలయన్స్‌ కంపెనీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న శుద్ధి కర్మాగారాన్ని వార్షిక నిర్వహణలో భాగంగా కొంతకాలం మూసి పనులు చేపట్టాలని భావించింది.అలాంటిది ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా అందుబాటులోకి వచ్చిన చౌక ధర రష్యా చమురు కారణంగా నిర్వహణ పనులను వాయిదా వేసి శుద్ది కొనసాగిస్తూ ఎగుమతులతో లాభాలను పొందుతున్నది. ఆ సంక్షోభం ఎంతకాలం కొనసాగితే అంతకాలం లాభాలే లాభాలు. మన దేశం కొనుగోలు చేసే ధరల కంటే పీపాకు 30 డాలర్ల వరకు రష్యా రాయితీ ఇస్తున్నది. మరో ఆరునెలల పాటు ఒక నిర్ణీత ధరకు సరఫరా చేస్తారా అంటూ ఈ కంపెనీలు రష్యాతో ఇప్పుడు బేరమాడుతున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ తెలిపింది. అందుకే అంబానీకి ఇది మంచి యుద్ధంగా, జనానికి చెడుగా మారింది. ప్రధానంగా లబ్ది పొందుతున్నది రిలయన్స్‌, వచ్చే ఎన్నికల్లో ఆదుకొనే వాటిలో ఆ కంపెనీ ఒకటి గనుక అమెరికా బెదిరింపులను నరేంద్రమోడీ ఖాతరు చేయటం లేదని వేరే చెప్పనవసరం లేదు.

ఇటీవల మన దేశానికి చమురును సరఫరా దేశాల్లో రెండవ స్థానంలో ఉన్న సౌదీని వెనక్కు నెట్టేసి రష్యా రెండవ స్థానానికి చేరుకుంది. జర్మనీని రెండవ స్థానానికి నెట్టి చైనాకైతే మొదటిదిగా మారింది. అమెరికా, ఐరోపా దేశాలు విధించిన ఆంక్షల పర్యవసానాలు దీర్ఘకాలంలో ఎలా ఉంటాయో చెప్పలేము గానీ, ముడి చమురు ధరలు పెరిగిన కారణంగా రాయితీ ఇచ్చినప్పటికీ రష్యాకు లాభంగానే ఉంది. గత ఏడాది కంటే సగటున 60శాతం ధర పెరిగింది. ఈ స్థితిని అంచనా గట్టటంలో అమెరికా, పశ్చిమదేశాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఐరోపాకు 75శాతం ఇంధన ఎగుమతి తగ్గినప్పటికీ ధరల పెరుగుదల వలన రోజుకు పది కోట్ల డాలర్లు వస్తున్నట్లు, గతేడాదితో సమంగా ఉన్నట్లు అంచనా.ఉక్రెయిన్‌ సంక్షోభం తొలి వంద రోజుల్లో ( ఫిబ్రవరి 24 నుంచి జూన్‌ 3 వరకు) ఇంథన ఎగుమతుల ద్వారా రష్యా 98బి.యురోలను పొందింది. వాటిలో 61శాతం ఐరోపా దేశాల నుంచే ఉంది. దేశాల వారీ చూస్తే చైనా 12.6, జర్మనీ 12.1, ఇటలీ 7.8, నెదర్లాండ్స్‌ 7.8, టర్కీ 6.7, పోలాండ్‌ 4.4, ఫ్రాన్స్‌ 4.3, భారత్‌ 3.4, బెల్జియం బి.యురోల మేరకు దిగుమతి చేసుకున్నాయి. మన అవసరాల్లో రష్యా నుంచి దిగుమతులు ఫిబ్రవరి 24కు ముందు ఒకశాతం ఉంటే మే నెలలో 18శాతానికి పెరిగాయి. మన దేశం దిగుమతి చేసుకున్న ముడి చమురు నుంచి తయారు చేసిన ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.


అమెరికా వడ్డీరేట్లు పెంచటం, అక్కడ, ఇతర ధనిక దేశాల్లో మాంద్యం తలెత్తవచ్చనే అంచనాల వెల్లడితో ఇటీవల 124 డాలర్లకు చేరిన ప్రామాణిక బ్రెంట్‌ రకం ముడిచమురు ధర గత వారంలో 103 డాలర్లవరకు పడిపోయింది.జూన్‌ 24వ తేదీన 113 డాలర్లుంది. అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు వడ్డీ రేట్ల పెంపు వలన ప్రయోజనం ఉండదని, ఏడాది-ఏడాదిన్నరలో అక్కడ మాంద్యం తలెత్తవచ్చని అనేక మంది ఆర్ధికవేత్తలు హెచ్చరిస్తున్నారు. నవంబరులో జరిగే పార్లమెంటు ఎన్నికలలో ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు జో బైడెన్‌ కూడా చమురు పన్ను తగ్గించే ప్రతిపాదనలో ఉన్నట్లు వార్తలు. డాలరు విలువ పెరుగుతున్నందున చమురు దిగుమతి చేసుకొనే దేశాల మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపవచ్చని చెబుతున్నారు. దానికి నిదర్శనంగా మన రూపాయి విలువ పతనంలో ఇటీవల కొత్త రికార్డులను నెలకొల్పుతున్నది.


ఇక అదానీ కంపెనీల విషయానికి వస్తే నరేంద్రమోడీ సర్కార్‌ ఆస్ట్రేలియాలోని అదానీ బొగ్గు గనుల నుంచి దిగుమతులు చేసుకొనేందుకు అనువైన పరిస్థితిని కల్పించింది. అదానీకి మంచి రోజుల కోసమే ఇదంతా అన్నది స్పష్టం. మన దేశంలో 1,07,727 మిలియన్‌ టన్నుల మేరకు బొగ్గు నిల్వలున్నట్లు నిర్ధారణైంది. ప్రపంచంలో ఐదవ దేశంగా 9శాతం కలిగి ఉంది. వర్తమాన వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ నిల్వలు 111.5రెట్లు ఎక్కువ. ఇంత మొత్తం ఉన్నప్పటికీ బొగ్గు తవ్వకంలో నరేంద్రమోడీ సర్కార్‌ వైఫల్యం కారణంగా విదేశాల నుంచి దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌టిపిసి ఆస్ట్రేలియాలోని అదానీ కంపెనీ నుంచి పదిలక్షల టన్నుల బొగ్గు దిగుమతి ఒప్పందం చేసుకుంది. మరో సంస్థ డివిసి మరో పదిలక్షల టన్నుల దిగుమతికి సంప్రదింపులు జరిపింది. దిగుమతి చేసుకున్న బొగ్గుధర ఎక్కువగా ఉంది. అదానీ వంటి కంపెనీలకు లబ్ది కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకున్న బొగ్గును విధిగా దేశీయ బొగ్గుతో మిశ్రమం చేసిి వినియోగించాలని ఆదేశించింది. ఇది విద్యుత్‌ చార్జీల పెంపుదలకు దారి తీస్తున్నది. నరేంద్రమోడీ పాలనలో దేశీయ చమురు ఉత్పత్తి కూడా పడిపోయిన సంగతి తెలిసిందే.


కేంద్ర విద్యుత్‌ శాఖా మంత్రి ఆర్‌కె సింగ్‌ మే నెలలో అన్ని రాష్ట్రాలకు రాసిన లేఖలో విదేశీ బొగ్గు దిగుమతుల గురించి ఆదేశించారు.2022 అక్టోబరు వరకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు గాను రాష్ట్రాల విద్యుత్‌ ఉత్పత్తి కంపెనీలు, ప్రయివేటు సంస్థలకు షరతులు విధించారు. మే నెలాఖరులోగా వాటి అవసరాల్లో పదిశాతం దిగుమతులు చేసుకోని పక్షంలో జరిమానాగా తరువాత 15శాతానికి పెంచుతారు. జూన్‌ 15లోగా విదేశీ-స్వదేశీ బొగ్గును మిశ్రితం ప్రారంభించని పక్షంలో జరిమానాగా స్వదేశీ బొగ్గు కేటాయింపులో ఐదుశాతం కోత విధిస్తారు. దేశంలోని 173 విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలలో సగటున ఏడు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలులేని స్థితిలో ఈ ఆదేశాలను జారీ చేశారు.97 కేంద్రాలలో ఏడు రోజుల కంటే తక్కువ, 50 కేంద్రాలలో నాలుగు రోజుల కంటే తక్కువ, కొన్నింటిలో ఒక రోజుకు సరిపడా నిల్వలున్నట్లు పేర్కొన్నారు. మొత్తం విద్యుత్‌ కేంద్రాలలో కేవలం 18 మాత్రమే బొగ్గుగనుల సమీపంలో(ఉదా: కొత్తగూడెం) ఉండగా 155 కేంద్రాలు 500 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రూపాయి పతనంలో మరో రికార్డు – నరేంద్రమోడీ ” ఘనత ”కు చెల్లిస్తున్న మూల్యం ఎంతో తెలుసా !

13 Monday Jun 2022

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RUSSIA, WAR

≈ Leave a comment

Tags

BJP, Fuel Price in India, Narendra Modi Failures, Rupee Fall


ఎం కోటేశ్వరరావు


ఎనిమిది సంవత్సరాల పాలనలో నరేంద్రమోడీ సాధించిన ఘనతలు లేదా విజయాలు అంటూ వాట్సాప్‌ పండితులు జనాలకు వండి వడ్డిస్తున్నారు. యజమానులు చెప్పినట్లుగా వారి పని వారు చేస్తున్నారు. వంటలు ఎంత కష్టపడి చేశారని కాదు, అవి తినేందుకు పనికి వస్తాయా లేదా అన్నది గీటురాయి. ఎనిమిదేండ్లుగా తిన్నవారికి అవెలాంటివో తెలియటం ఇప్పుడే ప్రారంభమైంది. ఎప్పటికీ రుచి పచీ తెలియని జనాలు కొందరుంటారు. వారికి సానుభూతి తెలుపుదాం. బిజెపి నుంచి తాత్కాలికంగా పక్కన పెట్టిన అధికార ప్రతినిధి నూపూర్‌ శర్మ చిల్లర మాటల వివాదం తరువాత వాట్సాప్‌ పండితులు నరేంద్రమోడీ గారి ” ఘనతల” గురించి ప్రచారం మొదలు పెట్టారు. వాటిలో చమురు గురించి కూడా ఉంది. వాటితో పాటు దాని కంటే ముందే చమురు రంగంలో” ఘనత ” గురించి గురించి చూద్దాం.


మన దేశం కొనుగోలు చేస్తున్న ముడి చమురు ధర పదేండ్ల నాటి స్థాయికి పెరిగిందన్న వార్తలను కొద్ది మందైనా చదివే ఉంటారు.2011-12లో మన దేశం కొనుగోలు చేసిన ముడి చమురు సగటు ధర 111.89 డాలర్లు. ఆ ఏడాది అంటే 2012 మార్చి నెలలో ఉన్న సగటు ధర 123.66 డాలర్లుంది.2012 మార్చి 29 నుంచి ఏప్రిల్‌ పదకొండువరకు సగటు ధర 121.28 డాలర్లు. కేంద్ర ప్రభుత్వ సంస్థ పిపిఏసి వెల్లడించిన సమాచారం ప్రకారం 2022 జూన్‌ పదవ తేదీన మనం కొనుగోలు చేసిన చమురు ధర 121.28 డాలర్లు. ఇక్కడే మనం నరేంద్రమోడీ ఘనత గురించి చెప్పుకోవాలి. అదే ధరకు 2012లో మన చెల్లించిన మొత్తం మన కరెన్సీలో రు.6,201.05 కాగా ఎనిమిదేండ్ల పాలనలో నరేంద్రమోడీ అదే డాలర్లకు చెల్లించిన మొత్తం రు.9,434.29.అంటే మంచి రోజుల పేరుతో అధికారాన్ని పొంది బాదుడేబాదుడు అన్నట్లుగా చమురు మీద పెంచిన పన్నులను పక్కన పెడితే రూపాయి విలువ పతనాన్ని అరికట్టలేని అసమర్ధత కారణంగా ఈ రోజు మనం ప్రతి పీపాకు పదేండ్ల నాటి కంటే అదనంగా రు.3,233.24 చెల్లిస్తున్నాము. పదేండ్ల క్రితం రూపాయి విలువ డాలరుకు 51.13 ఉండగా మోడీ ఏలుబడిలో 2022 జూన్‌ పదిన అది 77.79కి దిగజారింది, పదమూడవ తేదీన 78.29కి పతనమై మరో కొత్త రికార్డు నమోదు చేసింది. అందువలన పదేండ్ల క్రితం, ఇప్పుడు ముడి చమురు ధర ఒకే విధంగా ఉన్నప్పటికీ మనం చెల్లించే మొత్తం భారీగా పెరిగింది. రూపాయి విలువను కాపాడలేదంటూ నరేంద్రమోడీతో సహా బిజెపి నేతలందరూ మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ను దులిపివేశారు. మోడీ సర్కార్‌ నిర్వాకానికి ఇప్పుడు దేశ ప్రజలందరూ మూల్యం చెల్లించాల్సి వస్తోంది.


గతేడాది నవంబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకు 137 రోజుల పాటు చమురు ధరలను స్థంభింప చేశారు. తరువాత పదిహేను రోజుల్లో 13సార్లు పెంచారు. తిరిగి ఏప్రిల్‌ ఆరు నుంచి ధరల స్థంభన కొనసాగుతోంది. ఏప్రిల్‌ నెలలో మన దేశం కొనుగోలు చేసిన ముడిచమురు సగటు ధర 102.97, మే నెలలో 109.51, జూన్‌ నెలలో పదవ తేదీ వరకు 118.34 డాలర్లుగా ఉంది. జూన్‌ 12న 122 డాలర్లుంది. అందువలన ఏ క్షణంలోనైనా తిరిగి ధరలు పెరగవచ్చు. గతంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం ధరలను స్థంభింప చేస్తే శ్రీలంక పరిణామాలను చూసిన తరువాత ఇప్పుడు ధరల పెరుగుదలను అరికట్టేందుకుగాను కొంత మేర పన్ను తగ్గింపు, ధరల స్థంభన కానసాగిస్తున్నారు. ఇది మంచిదే కదా అని ఎవరైనా అనవచ్చు. ఎప్పుడు మంచిది అవుతుంది అంటే ఏప్రిల్‌ ఆరునుంచి పెరిగిన ధరల భారాన్ని ప్రభుత్వం భరిస్తే, అలాగాక తిరిగి ఆ మొత్తాన్ని జనం మోపితే పరిస్థితి ఏమిటి ? ఇప్పటికే ఎనిమిది సంవత్సరాల ద్రవ్యోల్బణ రికార్డును మోడీ సర్కార్‌ అధిగమించిన ఘనత సాధించింది.


2022-23 బడ్జెట్‌ను ముడిచమురు ధర 75 డాలర్లు ఉంటుందనే అంచనాతో రూపొందించారు. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో సగటున ఎంత ఉందో పైన చూశాము. ఆర్‌బిఐ, ఇతర సంస్థలు మన జిడిపి వృద్ధి గురించి వేసిన అంచనాలన్నిటినీ కుదింపులతో సవరిస్తున్నాయి. పెట్రోలు, డీజిలుకు కూరగాయల సాగుకు నేరుగా సంబంధం లేకున్నా రవాణా,సాగు, ఇతర ఖర్చు పెరిగి వాటి ధరలు కూడా పెరుగుతాయి. మే నెల మూడవ వారం ప్రారంభంలో ఉన్న ముడిచమురు ధరలను బట్టి డీజిలు ధర లీటరుకు రు. 3-4, పెట్రోలు ధర 2-3 వరకు పెంచవచ్చని ప్రభుత్వం లీకులు వదిలింది. మరోవైపు డీజిలు మీద 25-30, పెట్రోలు మీద పది వరకు నష్టాలు వస్తున్నట్లు కొందరు గుసగుసలాడుతున్నారు. చమురు దిగుమతి బిల్లు 2020-21లో ఏడాదికి 62.2బిలియన్‌ డాలర్లుంటే 2021-22కు అది 119.2 బి.డాలర్లకు పెరిగింది. ఈ ఏడాది ఎంత అవుతుందో చెప్పలేము.


చమురు రంగానికి సంబంధించి నరేంద్రమోడీ ఘనత గురించి చెప్పుకోవాలంటే ఇంకా ఉన్నాయి.2014తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో మన దేశంలో ఉత్పత్తి చేసిన ముడిచమురు 35.9మిలియన్‌ టన్నులు. అది 2020-21కి 29.1కి, 2021-22లో ఖరారు కాని లెక్కల ప్రకారం 28.4మి.టన్నులని పిపిఏసి సమాచారం వెల్లడించింది. పరిస్థితి ఇది కాగా వాట్సాప్‌ పండితులు లేదా పండిత పుత్రులు తిప్పుతున్న ఒక పోస్టులో అంశాల గురించి చూద్దాం.


” భాగస్వామ్య పద్దతిలో రష్యాతో కలిసి కొత్త ఆయిల్‌ బావుల అన్వేషణ కోసం ఒప్పందం చేసుకోవాల్సిందిగా ఓఎన్‌జిసితో పాటు ప్రభుత్వరంగ ఆయిల్‌ సంస్థలను కోరారు మోడీజీ.కొత్త్త ఆయిల్‌ బావుల అన్వేషణ భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం అవడంతో ప్రస్తుతం ఆ ఖర్చును రష్యా భరించే స్థితిలో లేకపోవటంతో కొత్త ఆయిల్‌ బావుల అన్వేషణ కోసం భారత్‌ను కోరింది రష్యా.” వెనుకటికి ఎవడో సన్యాసి నాకు పదివేల రూకలిస్తే మీకు బంగారం తయారు చేసే ఉపాయం చెబుతా అన్నాడట. వాడే బంగారాన్ని తయారు చేసుకొని కోట్లు సంపాదించవచ్చు కదా ! చమురు దిగుమతులను తగ్గించి విదేశీమారకద్రవ్యాన్ని ఆదా చేస్తానని చెప్పిన నరేంద్రమోడీ గత ఎనిమిదేండ్లలో ఉన్న ఉత్పత్తిని కూడా కొనసాగించలేని స్థితిలోకి చమురు సంస్థలను నెట్టారు. ఐదులక్షల కోట్ల డాలర్లు కాకున్నా ఇప్పుడు జిడిపిలో రష్యా కంటే మెరుగైన స్థితిలో ఉన్న మన దేశం మన కొత్త బావుల సంగతి చూడకుండా రష్యా వెళ్లమని మోడీ కోరారట, వినేవారుంటే కథలు భలేచెప్తారు కదా ! ఈ రోజు రష్యా సమస్య – కొత్తవాటిని తవ్వటం గురించి కాదు, ఉన్న వాటి నుంచి తీసిన చమురును అమ్ముకోవటం ఎలా అన్నదే. మనతో నిమిత్తం లేకుండానే అది గతంలో బావులను తవ్వుకుంది. మనతో సమంగా దాని దగ్గర కూడా విదేశీమారకద్రవ్య నిల్వలు ఉన్నాయి. చమురు కొనుగోలు చేసి మనమే ప్రతినెలా దానికి సమర్పించుకుంటున్నాము. నరేంద్రమోడీ గారికి గొప్పతనాన్ని ఆపాదించేందుకు ఇలాంటి కట్టుకథలను ప్రచారం చేస్తారు.


”మోడీజీ ఓఐసి(ఇస్లామిక్‌ ఆర్గనైజేషన్‌ దేశాలు) దేశాల నుంచి దిగుమతి చేసుకొనే క్రూడ్‌ ఆయిల్‌లో కోత విధించి దానిని రష్యా నుంచి దిగుమతి చేసుకోవాలని ఆయిల్‌ కంపెనీలను కోరారు”. ఇది ఒక పచ్చి అబద్దం. నూపూర్‌ శర్మ చిల్లర మాటల వివాదానికి ముందు నుంచే తక్కువ ధరకు వస్తున్నందున రష్యా నుంచి దిగుమతిని భారీగా పెంచారు.
”ఇప్పటి వరకు అమెరికా రష్యానుంచి ముడిచమురు బారెల్‌కు 30డాలర్లు పెట్టి దిగుమతి చేసుకొని దానిని శుద్ది చేసి తిరిగి ఐరోపా దేశాలకు అమ్ముతున్నది.ఇప్పుడు భారత్‌ కూడా తక్కువ రేటుకి రష్యా నుంచి కొని దాన్ని శుద్ది చేసి ఐరోపా దేశాలకు అమ్ముతున్నది. ఇది పరోక్షంగా గల్ఫ్‌ దేశాల ఆయిల్‌ వ్యాపారానికి చెంపదెబ్బ ” ఈ పోస్టును రచించిన వారికి ముందేమి రాస్తున్నామో వెనకేమి రాశామో అన్న ఆలోచన ఉన్నట్లు లేదు.పైన పేర్కొన్న రాతకు ఎగువన ఏం రాశారో తెలుసా ! ” మన దేశంలో ఉన్నట్లు ఇయు దేశాలలో భారీ రిఫైనరీలు లేవు. నేరుగా రష్యా నుంచి పెట్రోలును పైప్‌ లైన్‌ నుంచి దిగుమతి చేసుకుంటూ వచ్చాయి.” ఉక్రెయిను సంక్షోభానికి ముందు వరకు రష్యా నుంచి పెట్రోలు, డీజిలు, పెట్రోలియం ఉత్పత్తులను అమెరికా దిగుమతి చేసుకునేది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటుంది. కరోనా సంక్షోభంలో కార్పొరేట్‌ శక్తులను నరేంద్రమోడీ సర్కార్‌ ఎలా ఆదుకున్నదో, జనం అప్పులపాలై దివాలా తీస్తే ధనికుల దగ్గర సంపద ఎలా పోగుపడిందో చూశాము. ఇప్పుడు ఉక్రెయిను సంక్షోభం కారణంగా మన దేశంలో జనం ధరల పెరుగుదలతో అల్లాడిపోతుంటే రష్యా నుంచి చౌకగా దిగుమతి చేసుకున్న ముడిచమురును శుద్ది చేసి ఐరోపా దేశాల కోసం ఎగుమతి చేస్తున్నారంటే దీని వలన లబ్ది పొందేది ఎవరు? మన జనమైతే కాదు, పోనీ ఐరోపా దేశాల నుంచి వాటికి ప్రతిగా నరేంద్రమోడీ పలుకుబడితో తక్కువ ధరలకు సరకులను దిగుమతి చేసుకుంటున్నామా అంటే అదీ లేదు. రష్యా నుంచి దిగుమతుల వలన మన జనానికి కలిగిన-కలుగుతున్న మేలు ఇదీ అని ఎవరినైనా చెప్పమనండి !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d