• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Narendra Modi

ప్రధాని మోడీ కావాలని దాచినవి, తెలిసి కూడా ఎఎన్‌ఐ అడగనివి !

02 Wednesday Jan 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

ANI, Narendra Modi, Narendra Modi interview, Narendra Modi interview with ANI

Image result for What Narendra Modi hide, What ANI did not asked

ఎం కోటేశ్వరరావు

మిన్నువిరిగి మీద పడితే తప్ప ప్రధాని నరేంద్రమోడీ మీడియా గోష్టిలో ముఖాముఖీ మాట్లాడని భారత తొలి ప్రధానిగా సరికొత్త రికార్డు సృష్టించటం ఖాయమని తేలిపోయింది. బహుశా ప్రపంచంలోనే తొలి ప్రజాప్రతినిధి కూడా అయి వుండవచ్చు. పది సంవత్సరాల కాలంలో మూడంటే మూడు సార్లు మాత్రమే మీడియాతో మాట్లాడిన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను మౌనముని అని ఎద్దేవా చేసిన వారిలో బిజెపి కూడా వుంది. సోనియగాంధీ అనుమతి ఇవ్వని కారణంగా మన్మోహన్‌ అలా చేసి వుండవచ్చు. నాకు 56 అంగుళాల ఛాతీ వుంది, రిమోట్‌ కంట్రోలు లేదు అని చెప్పుకొనే నరేంద్రమోడీ ఒక్కసారి కూడా మాట్లాడకపోవటానికి కారణాలేమిటో ? అయితే ఏ ప్రధానీ ఇవ్వనన్ని ఫోజులు మీడియా కెమెరాలకు ఇచ్చారు కదా అని ఆయన భక్తకోటి దెబ్బలాటకు దిగవచ్చు. అలాంటి పెద్ద మనిషి నరేంద్రమోడీ జనవరి ఒకటవ తేదీన, హిందూత్వశక్తులు, అసలు సిసలు భారతీయతకు ప్రతీకలం అని చెప్పుకొనే వారు మొహాలు ఎక్కడో పెట్టుకొని సిగ్గుపడే విధంగా ఎఎన్‌ఐ అనే వార్తా సంస్ధకు ఆంగ్ల సంవత్సరాది రోజు 95నిమిషాల ఇంటర్వ్యూ ఇచ్చారు. అది యాదృచ్చికం తప్ప ఆంగ్ల సంవత్సరాదికి మోడీ ఇంటర్వ్యూకు సంబంధం లేదని వితండవాదం లేదా భాష్యం చెప్పే బాపతు కూడా మనకు తగలవచ్చు.

బ్రిటన్‌లో చాలా కాలం కిందట రాజు గారి తరువాత రాణీగారి ప్రతిపక్షంగా వ్యవహరించే పార్టీలు వుండేవి. అంటే రాజు, రాణీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అణగిమణగి ప్రశ్నించే పక్షాలవి. అలాగే నరేంద్రమోడీ మన దేశంలో అలాంటి మీడియాను రంగంలోకి తెచ్చిన ఆద్యుడిగా చెప్పుకోవాలి. ఒక యాంకర్‌గా చర్చలో పాల్గనేవారి మీదకు ఎక్కే ఆర్నాబ్‌ గోస్వామి నక్క వినయాలతో నరేంద్రమోడీని ఇంటర్య్వూ చేసిన విషయం తెలిసిందే. అంటే ముందుగానే ఏ ప్రశ్నలు అడగాలో ఏమి జవాబులు చెబుతారో, వాటి మీద వుప ప్రశ్నలు వేయకుండా ఎలా నోరు మూసుకోవాలో అన్నీ ముందే నిర్ణయం అవుతాయి. ఒక వేళ నోరు జారితే ఆ భాగాన్ని తొలగిస్తారనుకోండి అది వేరే విషయం. జనవరి ఒకటిన ఎఎన్‌ఐ ఇంటర్వ్యూ కూడా అలాంటి ముందస్తు ఏర్పాటుతో జరిగిందే అని వేరే చెప్పనవసరం లేదు. ఆ షరతుకు ఒప్పుకుంటేనే తన గదిలో మోడీ నోరు విప్పుతారు.

కొంత మంది ఓటమి లేదా తప్పిదాలను ఒక పట్టాన ఒప్పుకోరు, అందునా అవకాశవాద రాజకీయ నాయకులు కిందపడ్డా మాదే విజయం అంటారు. రెండు సంవత్సరాల క్రితం నరేంద్రమోడీ చేసిన పెద్ద నోట్లను రద్దు గురించి తాజా ఇంటర్వ్యూలో చెప్పిందేమిటి? ఇదేమీ ఝట్కా (ఆకస్మిక నిర్ణయం) కాదు, ఏడాది క్రితమే మీ దగ్గర నల్లధనం ఏదైనా వుంటే డిపాజిట్‌ చేయండి, అపరాధరుసుం చెల్లించండి, మీకు సాయం దొరుకుతుంది అని హెచ్చరించా. అయినప్పటికీ ఇతరుల మాదిరే మోడీ కూడా వ్యవహరిస్తారులెమ్మని కొంతమందే స్వచ్చందంగా ముందుకు వచ్చారు. నోట్ల రద్దుకు ముందు సమాంతర ఆర్ధిక వ్యవస్ధ వుంది, అది అంతర్గతంగా ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీసింది. సంచుల్లో దాచిన కరెన్సీ బ్యాంకింగ్‌ వ్యవస్ధలోకి తిరిగి వచ్చింది.’ అన్నారు మోడీ.

మోడీ మహాశయుడు నోట్ల రద్దు గురించి చెప్పిందాంట్లో కొత్తదేమీ లేదు. సాధించింది ఏమిటో చెప్పాలి కదా ! ఎంత నల్లధనం బయపడింది, దానిని ఎలా వుపయోగించారు, దాని వలన ఆర్ధిక వ్యవస్ధకు జరిగిన మేలేమిటి? బ్యాంకింగ్‌ వ్యవస్ధకు పెద్ద మొత్తంలో కరెన్సీ వస్తే ఇప్పుడు బ్యాంకులకు ప్రభుత్వం మూలధనం సమకూర్చేందుకు రిజర్వుబ్యాంకుల వద్ద వున్న మిగులును ఇమ్మని ఎందుకు అడుగుతున్నట్లు ? వీటి గురించి ఎంత తరచినా కేంద్ర ప్రభుత్వం లేదా రిజర్వుబ్యాంకు అధికారికంగా ఒక్క ప్రకటనా చేయలేదు. ఒక సాధారణ అంశం మాదిరి, 2018 ఆగస్టులో తన వార్షిక నివేదికలో తప్పదు కాబట్టి వివరాలను పొందుపరచింది. దాని ప్రకారం రద్దయిన నోట్లలో 99.3శాతం తిరిగి బ్యాంకులకు వచ్చాయి. ఆ మిగిలిన 0.7శాతం కూడా చిరిగిపోయి, ధ్వంసమై చెలామణిలో లేని లేదా ఆమాయకంగా మార్చుకోకుండా తమవద్దే వుంచుకున్న అమాయక సామాన్యుల వద్ద వుండిపోయింది తప్ప అది నల్లధనం కాదు. రద్దు వలన వచ్చిన లాభం కంటే జరిగిన నష్టమే ఎక్కువని అందరికీ తెలిసిన అంగీకరించటానికి 56 అంగుళాల ఛాతీకి ధైర్యం చాల్లేదు.

రిజర్వుబ్యాంకు గవర్నర్‌ వుర్జిత్‌ పటేల్‌ రాజీనామా గురించి నరేంద్రమోడీ పెద్ద జోక్‌ పేల్చారు. మొదటిసారిగా బయట పెడుతున్నానంటూ రాజీనామాకు ఆరేడు నెలల ముందే తాను తప్పుకుంటానని చెప్పారని, వ్యక్తిగతంగా తనకు రాతపూర్వకంగా తెలియచేశారని నరేంద్రమోడీ చెప్పారు. రాజీనామా సమయంలోనే ఈ విషయం ఎందుకు చెప్పలేదు, అదేమైనా రహస్యమా, దేశ భద్రతకు సంబంధించిన అంశమా ? రిజర్వుబ్యాంకు వద్ద వున్న నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదలాయించమని పటేల్‌ను వత్తిడి చేసిన అంశం బహిరంగ రహస్యం. మిగులు నిధులు, ఇతర కొన్ని అంశాలలో తాము చెప్పినట్లు చేయకపోతే కుదరదని తెగేసి చెప్పటమే గాక దేశ చరిత్రలో తొలిసారిగా రిజర్యుబ్యాంకు చట్టంలోని సెక్షన్‌ ఏడును ప్రయోగించింది. దాని ప్రకారం ప్రభుత్వం చెప్పినట్లు రిజర్వుబ్యాంకు వ్యవహరించాల్సి వుంటుంది. ఒక స్వతంత్ర ప్రతిపత్తిగలిగిన సంస్ధకు అధిపతిగా వున్న వ్యక్తిలో ఏ కాస్త ఆత్మగౌరవం వున్నా దానికి నిరసనగా రాజీనామా చేయటం తప్ప మరొక మార్గం లేదు. వుర్జిత్‌ పటేల్‌ ఆ పని చేయకుండా తన వ్యక్తిగత కారణాలు చూపి తప్పుకున్నాడు. అయినా నరేంద్రమోడీ ఈ విషయం గురించి పిట్టకథలు చెబుతున్నారు. రాజీనామాకు అనుమతించాలంటూ ఆరేడు నెలల క్రితం పటేల్‌ రాసిన లేఖను మోడీ బయట పెట్టి వుంటే ఆయన చెబుతున్న మాటలకు విశ్వసనీయత వుండేది.

రాజకీయాల గురించి ఎంత జాణతనంతో మాట్లాడినా చెల్లుతుంది. రైతాంగరుణ భారం వంటి తీవ్ర సమస్యల గురించి ప్రధాని మోడీ చాలా చులకనగా మాట్లాడారు. రుణాల రద్దు లాలీపాప్‌ వంటివన్నారు. అదే నిజమైతే ఆయన పార్టీ మంత్రులు ఎందుకు రుణాల రద్దు గురించి మాట్లాడుతున్నట్లు ? మోడీ మాట్లాడటానికి ఒక రోజు ముందే తమకు ఒడిషాలో అధికారమిస్తే రైతుల రుణాలను రద్దు చేస్తామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రకటించారు. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్లుగా మోడీ తీరు వుంది. రుణాల రద్దు కొద్ది మందికే వుపయోగపడుతున్నాయని, బ్యాంకుల నుంచి తీసుకొనే వారు తక్కువ, వడ్డీ వ్యాపారుల వద్ద తీసుకొనే వారే ఎక్కుని కూడా మోడీ సెలవిచ్చారు.ఆయనకు వాస్తవాలు తెలియవా, నివేదికలు చదవరా ? చదివించుకోరా ? అర్ధంగాకపోతే వివరించమని అధికారులను అడగరా ? బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొనే రైతులు చాలా తక్కువని ప్రధానే చెప్పారంటే అర్ధం ఏమిటి? బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వటం లేదనే కదా ? అదే నిజమైతే కేంద్రం గత ఐదేండ్లుగా ఏమి చేస్తున్నట్లు, ప్రాధాన్యతా రంగంగా ప్రకటించిన వ్యవసాయానికి రుణాలు తగినన్ని ఇవ్వలేదని బ్యాంకులను ఎందుకు నిలదీయలేదు. అసలు వాస్తవం ఏమంటే 2018ఆగస్టులో నాబార్డు వెల్లడించిన అధ్యయనం ప్రకారం 52.5శాతం రైతు కుటుంబాలు రుణభారంలో కూరుకుపోయాయి. వీరిలో కేవలం 11.5శాతమే వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకున్నారు. మోడీ చెప్పిందేమిటి ?

సర్జికల్‌ దాడులు తీవ్రముప్పుతో కూడుకున్నవి గనుక ఎక్కువ సేపు సాగించకుండా తెల్లవారక ముందే పూర్తి చేసి రమ్మని తాను స్పష్టమైన మార్గదర్శక సూత్రాలను జారీచేసినట్లు ప్రధాని చెప్పుకున్నారు. వినేవారుంటే చెప్పేవారు ఎన్నయినా పిట్టకథలు చెబుతారు. ఇలాంటి దాడుల గురించి గతంలో వాటిని నిర్వహించిన వారు చెప్పాలి. లేని గొప్పలు చెప్పుకోవటం తప్ప ఏ అనుభవంతో మోడీ మార్గదర్శక సూత్రాలు జారీ చేసినట్లు? గతంలోనూ అనేక దాడులు జరిపారు అయినా ఏ ప్రధానీ వాటిని ఇంతగా గొప్పలు చెప్పుకోలేదు. గోవధల పేరుతో మూకదాడులు చేసిన వారి గురించి మోడీ ఖండించారు. మరోవైపు ఆయన మంత్రులు చేసిందేమిటి? దాడులకు పాల్పడి శిక్షలు పడిన ఎనిమిది మంది నేరగాండ్లు బెయిలు మీద బయటకు వచ్చినపుడు హజారీబాగ్‌లో పూలదండలు వేసి మరీ కేంద్ర మంత్రి జయంత సిన్హా స్వాగతం పలికారు. ఇదేమి పనయ్యా అని అడిగితే అది భావ ప్రకటనా స్వేచ్చ అంటూ మరో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ గడుసుతనంతో తప్పించుకున్నారు. దాద్రి హత్య కేసులో నిందితుడు చస్తే శవం మీద జాతీయజండాను కప్పి ఒక నేరగాడికి గౌరవం ఇచ్చిన మరో మంత్రి మహేశ్‌శర్మలు మోడీగారి ఈ సమయంలో గుర్తు లేదా లేక మంత్రులను ఖండించినట్లా ? ఎందుకీ వంచన? వుత్తర ప్రదేశ్‌లో గోరక్షకులుగా చెప్పుకొనే ఒక పోలీసు అధికారినే హత్య చేసిన విషయం తెలిసిందే.

Image result for Narendra Modi hypocrisy

రాఫెల్‌ విమాన ఒప్పందం గురించి మోడీ అతి తెలివి తర్కానికి పాల్పడ్డారు. అదానీ, అంబానీలకు లబ్ది చేకూర్చారు కదా అన్న ప్రశ్నకు వ్యక్తిగతంగా నా పేరు చెప్పలేదు కదా ప్రభుత్వాన్ని అన్నారు, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి, ఎంత ఇచ్చారో చెప్పమనండి అని అడ్డుసవాలు విసిరారు. ఈ విషయంలో సుప్రీం కోర్టు తమ ప్రభుత్వానికి క్లీన్‌ చిట్‌ ఇచ్చిందని అన్నారు. అయితే మోడీగారు చెప్పనిది, ఇంటర్వ్యూ చేసిన వారు అడగనిది ఏమిటి ? 126 విమానాల కోసం గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసి అధిక ధరలకు 36విమానాలు ఎందుకు కొన్నారు ? ఎంతో అనుభవం వున్న హాల్‌ను విస్మరించి ఎలాంటి అనుభవం లేని అనిల్‌ అంబానికి కాంట్రాక్టు ఎందుకిచ్చారు? అంబానీ కంపెనీ దివాలా తీసిందా లేదా ? విమానాల ధరల వివరాలను పబ్లిక్‌ ఎకౌంట్స్‌ కమిటీకి కాగ్‌ ఇచ్చినట్లు సుప్రీం కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. అలాంటిదేమీ లేదని కమిటీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధికారయుతంగా చెప్పారు. 2జి స్పెక్ట్రమ్‌ మాదిరి సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణ ఎందుకు జరపరు? భారత ప్రభుత్వమే అంబానీ కంపెనీ పేరు సిఫార్సు చేసిందని ఫ్రెంచి మాజీ అధ్యక్షుడు హోలాండే ప్రకటించినదాని సంగతేమిటి ?

ముమ్మారు తలాక్‌ అంశం లింగవివక్షకు సంబంధించింది, శబరిమల అంశం సాంప్రదాయం అని మోడీ మహిళల పట్ల వివక్షను సమర్ధిస్తూ సుప్రీం కోర్టు మెజారిటీ న్యాయమూర్తుల తీర్పును విస్మరించి వివక్షను సమర్ధించిన మహిళా న్యాయమూర్తి ఇందు మల్హోత్రా చెప్పిన అంశాలను ప్రధాని వివరించారంటే దేశానికి ఏ సందేశం పంపినట్లు ? అన్ని కేసులలోనూ మైనారిటీ న్యాయమూర్తుల వ్యతిరేక తీర్పులనే సమర్ధిస్తారా ? అదే ప్రాతిపదిక అయితే ఆధార్‌ కేసులో ఆ పధకాన్ని పూర్తిగా రద్దు చేయాలంటూ మైనారిటీ తీర్పు చెప్పిన చంద్రచూడ్‌ వైఖరిని అనుసరించి ఆధార్‌ను రద్దు చేస్తారా ? శబరిమలలో మహిళల పట్ల వివక్షను ప్రధాని సమర్ధిస్తున్న సమయంలోనే కేరళ మహిళా మానవహారంలో పాల్గన్నట్లు చెబుతున్న 30 నుంచి 50లక్షల మంది వరకు మహిళలు ప్రధాని వైఖరిని ఖండించినట్లే. ఇలా అనేక అంశాలను మోడీ కావాలనే విస్మరించారు, ఇంటర్వ్యూ చేసిన వారికి అవన్నీ తెలిసి కూడా అడగకుండా దాటవేశారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఒక్క పటేల్‌ విగ్రహమేమిటి, నరేంద్రమోడీ ఘనతలు ఇంకా ఎన్నో !

05 Monday Nov 2018

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP Vote Politics, flying Modi, Narendra Modi, Patel Statue, Sardar patel on Kahmir issue, world tallest statue

Image result for tallest   patel statue,  narendra modi cartoons

ఎం కోటేశ్వరరావు

అనుకోకుండా ఒక ప్రయాణంలో తోటి వారితో జరిగిన మాటా మంతీలో చిన్ననాటి విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. అదే రోజు పత్రికలో ప్రపంచంలో ఎత్తయిన విగ్రహం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వార్త చదవటంతో ప్రపంచంలో పెద్ద నది ఏది, ఏ కట్టడాన్ని ఎవరు కట్టించారు వంటి అంశాలలో క్విజ్‌లో ముందున్న రోజులు గుర్తుకు వచ్చాయి. ఇప్పుడు ప్రపంచంలో ఎత్తయిన విగ్రహం ఏది, దానిని ఎవరు పెట్టించారు అంటే పటేల్‌, నరేంద్రమోడీ అని టక్కున చెప్పే పిల్లలు గుర్తుకు వచ్చారు. బాల్యం కాదు గనుక తాజ్‌మహల్‌ను కట్టించిన వారు కాదు, దానికి రాళ్లెత్తిన కూలీలెవరన్న మహాకవి శ్రీశ్రీ ప్రశ్న నేపధ్యంలో మూడువేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి పేరు కొట్టేసిన నరేంద్రమోడీ నిర్వాకం మదిలోకి రాక మానదు కదా !

చరిత్రలో అనేక మంది పెద్ద విగ్రహాలు పెట్టించి, కట్టడాలు కట్టించినవారున్నారు. ఆ సరసన నరేంద్రమోడీ చేరారు, రేపు చెప్పుకొనేందుకు ఫలానా అని లేని మరొకరు అంతకంటే పెద్ద విగ్రహం పెట్టించవచ్చు. చిత్రం ఏమిటంటే దేశం, మన సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యల నేపధ్యంలో ఇలాంటి రికార్డులు, ర్యాంకుల గురించి జనం ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవటం లేదు. ఒక ప్రధానిగా ఏడాదికి సగటున ఎక్కువ దేశాలు తిరిగిన, విదేశాల్లోనే ఎక్కువ కాలం గడిపిన ప్రధాని ఎవరు , ఒక ప్రధానిగా ఐదేండ్ల కాలంలో మీడియాతో మాట్లాడని ప్రధాని ఎవరు ఇలాంటి అనేక ప్రశ్నలకు నరేంద్రమోడీ అనే అసాధారణ రికార్డులను మోడీ ఇప్పటికే సాధించారు. సమీప భవిష్యత్‌లో మరొకరు ఆ రికార్డులను బద్దలు కొట్టే అవకాశాలు కనిపించటం లేదు. క్వారా డాట్‌కామ్‌ ప్రశ్నకు వచ్చిన వివరాల ప్రకారం ఇందిరా గాంధీ మొత్తం మీద ఎక్కువగా 113, తరువాత 93తో మన్మోహన్‌ సింగ్‌, మోడీ 79, జవహర్‌లాల్‌ నెహ్రూ 70 విదేశీ పర్యటనలు చేశారు. వీరిలో మోడీ తప్ప మిగిలిన వారంతా ఎక్కువ కాలం పదవిలో వున్నారు. అందువలన సగటున ఏడాదికెన్ని అంటే నరేంద్రమోడీ 19.5, మన్మోహన్‌ సింగ్‌ 9.3, ఇందిరా గాంధీ 8, నెహ్రూ 4.1 పర్యటనలు చేశారు. చిత్రం ఏమిటంటే ఈ అంకెలతో నరేంద్రమోడీ భక్తులెవరూ విబేధించలేదు. సమాచార హక్కు చట్టం కింద నాలుగు సంవత్సరాలలో మోడీ గారు ఎన్ని దేశాలు తిరిగారు అంటే 52 అని కేంద్ర ప్రభుత్వమే సమాధానం ఇచ్చింది. దీని ప్రకారం కూడా ఏడాదికి 13దేశాలతో మోడీయే ముందున్నారు.

ఎందుకు ఇలా ఎడా పెడా తిరిగారయ్యా అని ఎవరైనా అడిగితే విదేశీ పెట్టుబడుల కోసం అని తడుముకోకుండా తొలి సంవత్సరాలలో బిజెపి నేతలు చెప్పే వారు. ఇప్పుడు నోరెత్తటం లేదు, నో కామెంట్‌ అంటూ తప్పుకుంటున్నారు. ఎందుకని నాలుగేండ్లలో ఏమి జరిగింది? మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం మన కంపెనీలలో విదేశీయులు పెట్టిన పెట్టుబడులు, మన రుణపత్రాలు కొనుగోలు, తదితర రూపాలలో పెట్టే పెట్టుబడులను ఎఫ్‌పిఐ అంటారు. అవి 2014 నుంచి 2017వరకు వరుసగా 2,18,511-82,793-43,428-1,83,334 కోట్ల వంతున వచ్చాయి.2018లో ఇప్పటి వరకు పదినెలల్లో లక్ష కోట్ల రూపాయలు వెనక్కు పోయాయి. ఈ వార్తలను చదువుతున్న సమయంలోనే సులభతర వాణిజ్య ర్యాంకులో మన దేశం 2014లో 142వ స్ధానంలో వున్నది కాస్తా 2018లో 77కు చేరుకుంది. అంటే విదేశీయులు, స్వదేశీయులు వాణిజ్యాన్ని అంత సులభంగా చేసుకోవచ్చు అని ప్రపంచబ్యాంకు చెప్పింది. అలాంటపుడు ఈ ఏడాది లక్ష కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వెనక్కు ఎందుకు పోయినట్లు ? మంచి రాంకుకు పెట్టుబడులకు సంబంధం లేదా ? లేక ఇక్కడ వ్యాపారం లాభసాటిగా లేదని విదేశీయులు గ్రహించారా ? ర్యాంకుల సర్వే జరిగిన సమయంలో పరిస్ధితికి ఇప్పటికి తేడా వచ్చిందా ? వస్తే ఎందుకు ? ఏతా వాతా చివరకు తేలిందేమంటే రాంకు వచ్చినా సంతోషించే స్ధితిలో నరేంద్రమోడీ లేరు. ఇదే ర్యాంకు గతంలో వచ్చి వుంటే మీడియా ఎంత హడావుడి చేసి వుండేదో కదా !

అతి పెద్ద పటేల్‌ విగ్రహాన్ని ఐక్యతా ప్రతీకగా మోడీ సర్కార్‌ చిత్రించింది. కాలం కలసి రాకపోతే తాడే పామైకరుస్తుందంటారు. విగ్రహం గురించి చర్చ కంటే సిబిఐలో చెలరేగిన కుమ్ములాటల్లో నరేంద్రమోడీ పాత్ర, రిజర్వుబ్యాంకు స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు, వివాదాస్పద బాబరీ మసీదు స్ధల యాజమాన్య కేసు విచారణ జనవరికి వాయిదా వేసిన సుప్రీం కోర్టు, దాన్ని జీర్ణించుకోలేని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆగ్రహం, రామాయణంలో పిడకల వేటలో పటేల్‌తో పోలిస్తే మరుగుజ్జు వంటి విగ్రహాన్ని రాముడికి పెడతామని వచ్చిన వార్తల్లో పటేల్‌ విగ్రహ వార్తను జనం మరచి పోయారు. భక్తి శివుడి మీద చిత్తం చెప్పుల గురించి అన్నట్లుగా బిజెపి నిత్యం చెప్పేది ఐక్యత, చేసేది విచ్చిన్నం, అదే బిజెపి అసలు రూపం !

సంస్ధానాల విలీనం అనేది స్వాతంత్య్రం వచ్చిన వెంటనే ఎవరు అధికారంలో వున్నా చేసే పనే. లేకపోతే దేశ భద్రతకే ముప్పు. దానికి నాయకత్వం వహించాల్సింది హోంశాఖ, దానికి మంత్రిగా ఎల్లయ్య వున్నా పుల్లయ్య వున్నా యంత్రాంగం చేస్తుంది తప్ప రాజకీయ నాయకత్వం కాదు. ఆ సమయంలో వల్లభాయ్‌ పటేల్‌ వున్నారు. అంతే. నాటి మంత్రివర్గ నిర్ణయాన్ని అమలు జరిపారు. ఆయన వల్లనే విలీనం జరిగిందని అంటేనే అభ్యంతరం, వాస్తవ విరుద్ధం. పటేల్‌ లేనట్లయితే ఈ రోజు కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు రైళ్లు వుండేవి కావని నరేంద్రమోడీ సెలవిచ్చారు. ఇది కాశ్మీరు విషయంలో పటేల్‌ పాత్రకు పూర్తి విరుద్దం.

చరిత్ర తెలియకపోవటం తప్పు కాదు, తెలుసుకోకుండా వ్యాఖ్యానించటం తొందరపాటు అవుతుంది. అన్నింటికీ మించి చరిత్ర గురించి సంఘపరివార్‌ చరిత్రకారులు చెప్పే అంశాలను గుడ్డిగా నమ్మి వ్యాఖ్యలు చేస్తే వూబిలో పడతారు. కాశ్మీరు సంస్ధానంలో మెజారిటీ జనాభా ముస్లింలు, పాలకుడు హిందూరాజు. మేము పాకిస్ధాన్‌లో లేదా భారత్‌లోగానీ కలిసేది లేదు, యథాతధ స్ధితిలో వుంటాము అని పాక్‌తో కాశ్మీర్‌రాజు హరి సింగ్‌ ఒప్పందం చేసుకున్నాడు. భారత్‌తో కూడా అలాంటి ఒప్పందం చేసుకొనేందుకు సిద్దపడ్డాడు. నాటి నేషనల్‌ కాన్ఫరెన్సు పార్టీ నేత షేక్‌ అబ్దుల్లా తాము భారత్‌తోనే వుంటామని ప్రకటించాడు. ఎవరు దేశభక్తులు, ఎవరు దేశద్రోహులు ? అయితే 1947 సెప్టెంబరు నాటికే పాకిస్ధాన్‌ పాలకులు కాశ్మీర్‌ ఆక్రమణకు పాల్పడ్డారు. అక్టోబరులో విధిలేక హరిసింగ్‌ విలీనానికి అంగీకరించటంతో కేంద్ర ప్రభుత్వం మిలిటరీని పంపింది, అప్పటికే ఈ రోజు మనం ఆక్రమిత కాశ్మీర్‌గా పిలుస్తున్న ప్రాంతాన్ని పాక్‌సేనలు ఆక్రమించాయి. అయితే పాక్‌ ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని తాము విలీనం చేసుకోలేదని అంతకు ముందు రాజు ప్రకటించినట్లుగా స్వతంత్య్ర రాజ్య ఏర్పాటులో భాగంగా విముక్తి చేశామని ఆ ప్రాంతాన్ని ఆజాద్‌ కాశ్మీర్‌ అని ప్రకటించారు. దానికి ఒక స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ పూర్వరంగంలో నాటి కేంద్ర ప్రభుత్వం తాము కూడా కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించి భారత్‌లో అంతర్భాంగా చేస్తామని ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది. జునాఘడ్‌, హైదరాబాదు సంస్ధానాలను భారత్‌లో విలీనం చేస్తే కాశ్మీర్‌ దేశంలో విలీనంగాకపోయినా మేము దానిని శత్రువుగా చూడబోమని వల్లభాయ్‌ పటేల్‌ తనకు స్పష్టంగా హామీ ఇచ్చినట్లు నాటి బ్రిటీష్‌ పాలకుడు మౌంట్‌బాటన్‌ పేర్కొన్నాడు. అయితే కాశ్మీర్‌లోని వాస్తవ పరిస్ధితి, మిగతా నాయకుల వ్యతిరేకత కారణంగా వెంటనే పటేల్‌ కూడా తన వైఖరిని మార్చుకున్నట్లు చెబుతారు. కాశ్మీరులో మెజారిటీ ముస్లింలు వున్నందున ఆ తలనొప్పి భారత్‌కు ఎందుకు అని పటేల్‌ భావించినట్లు చెబుతారు.

ఇప్పుడు పటేల్‌ భారత రాజకీయాలలో చూపే ప్రభావమేమీ లేదు. అందువలన పటేల్‌ గురించి అతిశయోక్తులు చెప్పకుండా వుంటేనే ఆయన గౌరవం నిలుస్తుంది. 1947 అక్టోబరులోనే కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్‌కు సైన్యాన్ని పంపి నేటి ప్రాంతాన్ని కాపాడింది. కాశ్మీర్‌కు ప్రత్యేక పత్తి ఇవ్వటాన్ని తప్పుపడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ను రద్దు చేస్తానని బిజెపి చెప్పటం అంటే మన దేశం నుంచి కాశ్మీర్‌ వేరుపడి పోవాలని కోరుకొనే దేశద్రోహులకు అక్కడి జనాన్ని రెచ్చగొట్టేందుకు అవకాశం ఇవ్వటమే.

ఇక నిజాం రాజు ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసిన సమయంలో నిజాం భారత్‌లో విలీనం కాలేదు. 1948 ఆగస్టు 21న నిజాం రాజు ఐరాసకు ఫిర్యాదు చేశాడు. పరిస్ధితి చేయిదాటి పోతోందని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరు 13న పోలీసు చర్యకు పూనుకుంది. మొత్తం అన్ని సంస్ధానాలను విలీనం చేసింది. దానిలో పటేల్‌ ప్రత్యేకత ఏమీ లేదు. నిజానికి ఆయన రాజకీయ చరిత్రలో సంస్ధానాలకు వ్యతిరేకంగా లేదా సంస్ధానాల ప్రజల సమస్యల మీద పోరాడిన చరిత్ర కూడా లేదు.

Image result for tallest   patel statue,  narendra modi cartoons

ప్రపంచంలో అతి పెద్ద విగ్రంగా పటేల్‌ది పెట్టినంత మాత్రాన ఆయనకు కొత్తగా వచ్చే ఖ్యాతి ఏమీలేదు. దేశ ఐక్యతకు చిహ్నంగా పటేల్‌ను కొత్తగా వర్ణిస్తున్న బిజెపి నాయకత్వం కాశ్మీర్‌ విషయంలో దేశద్రోహకరమైన వైఖరిని తీసుకుంటూ మరోవైపు దేశంలో సామాజిక అనైక్యతకు, నిర్మించిన వ్యవస్ధలను ఒకదాని తరువాత ఒకదానిని నాశనం చేస్తూ మరోవైపు పటేల్‌ విగ్రహం పెట్టి ఐక్యత గురించి కబుర్లు చెప్పటమే బిజెపి చేస్తున్న మోసం. ఇలాంటి వారిని గుండెలు తీసిన బంట్లు అంటారు.

మోడీ పాలనలో దేశ ఆర్ధికాభివృద్ధి చైనా కంటే ఎక్కువగా వుందని, త్వరలో దాన్ని అధిగమించబోతున్నామని చెబుతున్నారు. 2018 ప్రపంచ ఆకలి సూచిక తయారీకి తీసుకున్న 120 దేశాలలో చైనా 25వ స్ధానంలో వుంటే మనది 103, మన కంటే పేద దేశాలైన నేపాల్‌, బంగ్లాదేశ్‌ 72,86 స్ధానాల్లో వున్నాయి. మనం 106దిగా వున్న పాకిస్ధాన్‌తో పోటీ పడుతున్నాం. ప్రపంచంలో రక్తహీనత జనాభాలో మనమే మొదటి స్ధానంలో వున్నాం. కుష్టు, క్షయ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలలో గత నాలుగు సంవత్సరాలలలో మనమే ముందున్నాం. దేశాన్ని డిజిటల్‌ యుగంలోకి తీసుకుపోతామని చెబుతున్నవారి పాలనలో పరిష్కారం సంగతి దేవుడెరుగు , కనీసం ఏ ఒక్కదానిలో అయినా పురోగతి వుందా ? రోగాలు, రొష్టులతో మనం ఎంత నష్టపోతున్నామో తెలుసా? రైతులు వ్యవసాయం చేసి అప్పులపాలవుతుంటే సాధారణ జనం రోగాలతో అప్పులపాలవుతున్నారని అనేక నివేదికలు చెబుతున్నాయి. వీటన్నింటి గురించి ప్రధాని మన్‌కీ బాత్‌లో ఎప్పుడైనా ప్రస్తావించారా? వాటిని పట్టించుకోవటం మాని మూడువేల కోట్ల రూపాయలు పెట్టి ఒక విగ్రహాన్ని నెలకొల్పటం అవసరమా? అంత మొత్తం ఖర్చును భరించే స్ధాయి మన జనానికి వుందా ? ఆర్ధికంగా నాలుగు సంవత్సరాలలో చెప్పుకొనేందుకు సాధించిందేమీ లేదు, వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకొని దర్జాగా దేశం దాటి పోతున్న నేరంగాండ్లను ఒక్కడంటే ఒక్కడిని పట్టుకోకుండా వదలి వేయటం, ఓట్లను దండుకొనేందుకు ఎక్కడ వివాదాస్పద అంశం దొరుకుతుందా అని చూసే దేశవ్యాపిత మత రాజకీయాలు, విగ్రహాల రాజకీయాలు, వేల కోట్ల అవినీతికి తెరలేపిన రాఫెల్‌ విమాన కొనుగోలు అవినీతి అక్రమాలు, వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు, నెపాన్ని ఇతరుల మీద నెట్టేందుకు సిబిఐ, ఆర్‌బిఐ వంటి అనేక వ్యవస్ధలను నాశనం చేసే ప్రమాదకర పోకడలు. అందువలన ప్రపంచంలో ఎత్తయిన విగ్రహాన్ని నెలకొల్పటమే కాదు, పైన చెప్పుకున్న వాటన్నింటి ఘనత కూడా కచ్చితంగా నరేంద్రమోడీకే దక్కాలి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

రూపాయి విలువ- మోడీ భక్తుల గారడీ-1

03 Monday Sep 2018

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

fall in the value of the rupee, Indian currency, Narendra Modi, Rupee, Rupee Fall

Image result for Rupee value : narendra modi  cartoons

ఎం కోటేశ్వరరావు

ఈ మధ్య కిరాయి ప్రచార యంత్రాంగం పడిపోతున్న రూపాయిని కూడా ప్రధాని నరేంద్ర మోడీకి అనుకూలంగా మార్చేందుకు పూనుకుంది. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి మోడీని ధన్యుడిని చేయాలన్న తాపత్రయంలో వారున్నారు. మన కంటే కొన్ని కరెన్సీల విలువలు ఎక్కువగా పడిపోతున్నాయి. మన కరెన్సీ విలువ కూడా పెరిగింది అయితే కొన్ని కరెన్సీల విలువలు ఇంకా పెరిగాయి అంటూ కొన్ని అంకెలను ప్రచారంలో పెట్టారు. తెనాలి రామకృష్ణుడు నియోగులను ఎలాగైనా వినియోగించుకోవచ్చు అన్నట్లుగా అంకెలు కూడా అలాంటివే.

మన్మోహన్‌ సింగ్‌ హయాంలో గరిష్టంగా పతనమైన రూపాయి విలువను తాజాగా పడిపోయిన విలువను పోల్చి పెద్దగా పడిందేమీ లేదని జనానికి చెప్పదలచుకున్నారు.2013 ఆగస్టు 31న 65.70రులకు పడిపోయింది. 2018ఆగస్టు 30న విలువ 70.74ను చూపి తేడా ఐదు రూపాయలే కదా అన్నట్లుగా చిత్రిస్తున్నారు. 2009 మార్చి ఆరున రు.51.69 కనిష్టంగా వున్నది తరువాత క్రమంగా పడిపోతూ 2011 ఆగస్టు ఒకటిన 44.05 గరిష్ట స్ధాయికి చేరింది, అప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ పైన చెప్పుకున్న 65.70కి పతనమైంది. ఆ తరువాత మోడీ ఏలుబడికి వచ్చే నాటికి 2014 మే 25న 58.52కు పెరిగింది. అప్పటి నుంచి గత నాలుగు సంవత్సరాలలో ఇంతవరకు కనీసం ఆస్ధాయిని ఒక్క రోజు కూడా చేరుకోలేదు, క్రమంగా పెరుగుతూ సోమవారం నాడు (సెప్టెంబరు 3న) 71.21గా ముగిసి మరో రికార్డు సృష్టించింది. ఈ వివరాలను ఎవరైనా కాదనగలరా చెప్పండి. కావాలంటే క్రింది లింక్‌లో గ్రాఫ్‌ను చూడండి. మోడీ భక్తుల బండారం బయట పడుతుంది.https://www.poundsterlinglive.com/bank-of-england-spot/historical-spot-exchange-rates/usd/USD-to-INR

Image result for Rupee value cartoons

మన కరెన్సీ విలువ కూడా పెరిగింది, మన కంటే డాలరు విలువ ఇంకా పెరిగింది. ఇది అతితెలివితో కూడిన వాదన.మన కరెన్సీ విలువ మరొక కరెన్సీతో పోల్చితే పెరిగింది లేదా తగ్గింది అంటే అర్ధం ఏమిటి? వుభయులము పరస్పరం కరెన్సీలను కొనుగోలు చేసి ఆ మేరకు చెల్లించే వప్పందం వున్నపుడు పాకిస్ధాన్‌-మనమ ధ్య లావాదేవీలు జరిగితే ఏం జరుగుతుంది. మన దేశం నుంచి వంద రూపాయల విలువ గల వస్తువును పాకిస్ధాన్‌ కొంటే గతేడాది సెప్టెంబరు 28న పాక్‌ కొనుగోలు దారులు మనకు వారి కరెన్సీ 162 రూపాయలు చెల్లించాలి.అదే ఈ ఏడాది జూలై 28న 188 అయింది, ఈ నెల రెండున 173 అయింది. అంటే జూలై 28తో పోల్చితే సెప్టెంబరు రెండుకు పాక్‌ కరెన్సీ విలువ(మనతో పోల్చుకుంటే) పెరిగినట్లు. మనం పాకిస్ధాన్‌ నుంచి వంద రూపాయల వస్తువు కొంటే జూలై 26న 53 రూపాయలు ఇస్తే సరిపోయింది, అదే వస్తువుకు మనం సెప్టెంబరు 2న 58 చెల్లించాల్సి వచ్చింది. అంటే పాక్‌ కరెన్సీతో మన రూపాయి విలువ పడిపోయింది. అదే మన మధ్య డాలర్ల మార్పిడి జరిగిందను కోండి. మన దగ్గర వుంటే వాటిని లేదా మార్కెట్లో కొని చెల్లించాలి. ఆగస్టు ఆరున మనం పాక్‌ నుంచి ఒక డాలరుకు ఒక పెన్ను దిగుమతి చేసుకుంటే మనం ఆరోజున్న మార్కెట్‌ రేటు ప్రకారం రు.68.46 పెట్టి ఒక డాలరు కొని పాక్‌ వ్యాపారికి ఇచ్చాము. అదే పెన్నును సెప్టెంబరు మూడున కొంటే సెప్టెంబరు రెండున డాలరుకు రు.71.21చెల్లించాల్సి వచ్చింది. డాలర్లలో ఏ దేశానికైనా అదే రీతిలో చెల్లించాలి. అమెరికా మన నుంచి ఒక చాక్లెట్‌ దిగుమతి చేసుకుంటే ఆగస్టు 3న 0.015 డాలర్లు చెల్లించాలి. ఒక నెల తరువాత సెప్టెంబరు మూడున ఆ మొత్తం 0.014కు పడిపోయింది. అంటే మన కరెన్సీ విలువ తగ్గింది, అమెరికా విలువ పెరిగింది.

త్వరలో మనల్ని చైనాను అధిగమించేట్లు నడిపిస్తామని మోడీ బృందం నమ్మిస్తున్నది. మంచిదే, అంతకంటే కావాల్సింది ఏముంది. మనం చైనాతో సహా అన్ని దేశాలకు మేకిన్‌ ఇండియా పేరుతో వస్తువులను ఎగుమతి చేయాలని అనుకుంటున్నాం. దానిలో భాగంగా మనం అదానీ లేదా అంబానీ దుకాణం నుంచి ఒక కిలో కందిపప్పు ఒక రూపాయికి ఎగుమతి చేశామనుకోండి( మోడీ ప్రత్యేక ఎగుమతి సబ్సిడీ అందచేస్తున్నారు అనుకోవాలి మరి) మనకు చైనా తన కరెన్సీలో ఆగస్టు 3న 0.1యువాన్లు చెల్లించింది. అదే సెప్టెంబరు రెండున 0.096 యువాన్లకు తగ్గిపోయింది. దీనర్ధం మన కరెన్సీ విలువ తగ్గిపోయింది, అమెరికా, ఇతరులతో మన సంఘపరివార్‌ తదితరులు దెబ్బతీయాలని చూస్తున్న చైనా కరెన్సీ విలువ పెరిగింది.

Image result for Rupee value cartoons

మన కంటే అధ్వాన్నం అయిన పాకిస్ధాన్‌తోనే మన కరెన్సీ దిగజారింది, మోడీ భక్తులు చెబుతున్న మన కరెన్సీ పెరుగుదల అంటే దాని కంటే అధ్వాన్న దేశంతో అనుకోవాలి. ఆశలు చైనాను దెబ్బతీయటం, ఆచరణ వూరూ పేరులేని దేశాలతో పోల్చుకొని సంబర పడటం ! ఏమి సామర్ధ్యం, ఏమి దేశభక్తి బాబూ ఇది !! ‘ అధికార కేంద్రాన్ని కాపాడు కోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్ధేశం లేదు,రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు ‘ ఈ మాటలు అన్నదెవరో తెలుసా మిన్నువిరిగి మీద పడ్డా మీడియాతో మాట్లాడేందుకు నిరాకరిస్తున్న నరేంద్రమోడీ ! మరి ఈ మాటలు ఎలా చెప్పారు అని వెంటనే అడిగేందుకు ఆయన భక్తులు కాచుకొని వుంటారు. కాస్త నిదానించి పై వ్యాఖ్య ఎప్పుడు చేశారో ఇప్పుడేం చేస్తున్నారో చూడండి.http://www.business-standard.com/article/politics/modi-blames-upa-govt-s-inaction-for-falling-rupee-113082000623_1.html

Share this:

  • Tweet
  • More
Like Loading...

రూపాయితో కనిపించని దెబ్బలు కొడుతున్న నరేంద్ర మోడీ

31 Friday Aug 2018

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Uncategorized

≈ Leave a comment

Tags

Demonetisation, Narendra Modi, RBI Report on Demonitisation, Rupee Fall

Image result for narendra modi hitting  below the belt with currency cartoons

ఎం కోటేశ్వరరావు

కత్తులతో పని లేకుండా కంటి చూపుతో ఖతం చేస్తా అన్న హీరోలను సినిమాల్లో చూశాము. రూపాయితో 135కోట్ల జనాన్ని చావు దెబ్బలు కొడుతున్న హీరో ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇక్కడో పెద్ద విజయగాధను చెప్పుకోకతప్పదు. నరేంద్రమోడీ పాలనలో హిందూ మహిళలు పెద్ద సంఖ్యలో పిల్లల్ని కనాలని సంసారాలతో పని లేని యోగులు, యోగినులు చేసిన ప్రచారం వల్లకానీయండి, మరో విధంగా గానీ నరేంద్రమోడీ తన ఖాతాలో మరొక విజయాన్ని నమోదు చేసుకున్నారు. 2015 నుంచి ఈ విశ్లేషణ రాసే సమయానికి ప్రపంచంలో మన జనాభా శాతం 17.73 నుంచి 17.74శాతానికి పెరిగింది. ఇదే సమయంలో చైనా వాటా 18.92 నుంచి 18.54కు పడిపోయింది. యోగులు, యోగినులు కూడా సన్యాసాన్ని త్యజించి, భార్యలను వదిలేసిన భర్తలు కూడా ఒకింటి వారై సంతానోత్పత్తిలో పాల్గని వుంటే మన జనాభా ఇంకా పెరిగి వుండేది, చౌకగా శ్రమను ధారపోసి మేకిన్‌ ఇండియా పిలుపును జయప్రదం చేసి వుండేవారు.

మన సమాజం ఎంతటి నేరాన్ని అయినా సహించింది, క్షమించింది. నాడు నేడు రేపు నమ్మక ద్రోహాన్ని మాత్రం సహించదు. 2016 నవంబరు 14న గోవాలోని మోపా విమానాశ్రయ శంఖుస్థాపన సందర్భంగా గౌరవనీయ ప్రధాని నరేంద్రమోడీ దేశానికి ఒక విన్నపం చేశారు. ‘నేను కేవలం 50రోజులు మాత్రమే అడుగుతున్నాను. డిసెంబరు 30వరకు గడువు ఇవ్వండి. ఆ తరువాత నా వుద్ధేశ్యాలు లేదా చర్యలలో ఏదైనా లోపం కనపడితే దేశం ఏ శిక్ష విధించినా భరించటానికి నేను సిద్దంగా వున్నాను, వురికైనా సిద్దమే, సజీవ దహనం చేయండి’ అన్నట్లు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. డెబ్బయ్యేండ్ల నుంచి కుంభకోణాలకు పాల్పడిన వారు నన్ను బతకనివ్వరు, వారంతా ఇప్పుడు తమ దగ్గర వున్న నల్లధనాన్ని మార్చుకొనేందుకు బ్యాంకుల ముందు బారులు తీరారని కూడా సెలవిచ్చారు. ఆ గడువు తీరిపోయి త్వరలో పెద్ద నోట్ల రద్దు రెండవ వార్షికోత్సవాలకు సిద్ధం అవుతున్నారు. ప్రతి నెలా మన్‌కీ బాత్‌ పేరుతో మాట్లాడుతూనే వున్నారు. ఒక్కసారంటే ఒక్కసారి కూడా తన పెద్ద నోట్ల రద్దు వుద్ధేశ్యం ఏమేరకు నెరవేరిందో చెప్పలేదు. హైదరాబాదు వంటి మహానగరంలో ఇది రాస్తున్న సమయానికి కూడా కొన్ని ఎటిఎంలలో గరిష్టంగా ఒకసారికి ఐదువేలకు మించి డబ్బుతీసుకొనే పరిస్ధితి లేదు. ఎక్కువసార్లు తీసుకుంటే బ్యాంకుల బాదుడు మీకు తెలిసిందే.

పోనీ రిజర్వుబ్యాంకు అయినా నిజం చెప్పిందా ! బ్యాంకింగ్‌ లావాదేవీల్లో ఏ రోజుకు ఆరోజు ఖరారు అవుతాయి. పెద్ద నోట్ల రద్దు సమయంలో ఇచ్చిన గడువు ప్రకారం ఏ రోజు ఎన్ని రద్దయిన నోట్లు వచ్చాయో తెలుసుకోవటం కష్టం కాదు. గడువు ముగిసి నెలలు, సంవత్సరం గడిచినా ఎన్ని నోట్లు తిరిగి వచ్చాయో చెప్పలేదు. కొద్ది రోజులు నోట్ల లెక్కింపుపూర్తి కాలేదని చెప్పారు. ఈలోగా జనం మరచి పోయారు. ఎంతకాలం దాచినా ఏదో ఒక నివేదికలో వాస్తవాలను ప్రచురించకతప్పదు కనుక తాజాగా రిజర్వుబ్యాంకు నివేదికలో వెల్లడించకతప్ప లేదు. దాని ప్రకారం 99.3శాతం రద్దయిన నోట్లు వెనక్కు తిరిగి వచ్చాయి.రాని వాటి విలువ కేవలం గాకపోయినా మరుసటి రోజుకు ఆన్‌లైన్‌లో లెక్కలు సరి చూసి 10,720 కోట్లు మాత్రమే వెనక్కు రాలేదని, మొత్తం నోట్లలో 0.0005శాతం అంటే 5,22,783 మాత్రమే నకిలీ నోట్లను కనుగొన్నట్లు రిజర్వుబ్యాంకు వెల్లడించింది.

Image result for demonetisation, rbi report cartoons

కనీసం మూడు లక్షల కోట్ల రూపాయల విలువగల నోట్లు వెనక్కు రావని, ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి అనూహ్య ఆదాయం వస్తుందని మోడీ సర్కార్‌ లెక్కలు వేసుకుంది. నోట్ల రద్దు వలన ఎలాంటి ఫలితం వుండదని అనేక మంది నిపుణులు ముందే చెప్పారు. వారందరూ నల్లధనాన్ని కలిగి వున్నవారి మద్దతుదార్లుగా చిత్రించారు. రద్దయిన నోట్లను మార్చుకొనేందుకు, కొత్త నోట్లు తీసుకొనేందుకు బ్యాంకుల ముందు గంటల తరబడి వరుసలలో నిలబడటం దేశభక్తికి చిహ్నంగా అనేక మంది నిజంగానే భావించారు, భ్రమించారు. ఎవరైనా నోట్లరద్దును విమర్శిస్తూమాట్లాడితే దేశద్రోహి అన్నట్లు అసహ్యించుకొని చూసినవారు, కొట్టేందుకు వచ్చిన వారు కూడా లేకపోలేదు. నోట్ల రద్దు చర్య తీసుకున్నవారు గానీ దానిని సమర్ధించిన వారుగానీ తేలు కుట్టిన దొంగల మాదిరి ఎవరూ ఇప్పుడు మాట్లాడటం లేదు. నోట్ల రద్దు ఎవరికీ తెలియదు నరేంద్రమోడీ తీసుకున్న అత్యంత గుప్త నిర్ణయం అని అప్పుడు అందరూ మోడీకీర్తిని పెంచేందుకు ప్రచారం చేశారు. అది వికటించిన తరువాత ఇతరుల మీద నెపం మోపేందుకు అవకాశం లేకపోవటంతో ఎన్ని విమర్శలు వచ్చినా దాని గురించిన వివరాలు బయటపెట్టకుండా అడ్డుకున్నారు.

Image result for demonetisation, rbi report cartoons

ఇంతకాలం తరువాత అయినా నోట్ల రద్దు తప్పిదమనే నిజాయితీ ఎక్కడా ప్రదర్శితం కావటం లేదు. దాని వలన వచ్చిన లాభం ఏమిటో నష్టాలు ఏమిటో అధికారికంగా చెప్పే ధైర్యం కేంద్ర ప్రభుత్వానికి లేదా రిజర్వుబ్యాంకుకు లేదు. అనేక సర్వేలు చేస్తున్న బ్యాంకు నష్టాల గురించి ఇంతవరకు ఎలాంటి అధ్యయనం చేయలేదు, లేదా రహస్యంగా చేసి వుంటే బయటకు చెప్పటం లేదు. దేశం, జనాభాపట్ల జవాబుదారీతనం అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.నష్టాల గురించి ఎవరైనా మాట్లాడిదే దానిని రాజకీయంగా మార్చి పక్కదారి పట్టిస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకర ధోరణి. నోట్ల రద్దు ఫలితంగా ఒక శాతం జిడిపి నష్టం జరిగిందని 2017 జనవరి-ఏప్రిల్‌ మాసాల మధ్య పదిహేను లక్షల వుద్యోగాలు హరీ మన్నాయన్నది(సిఎంఐయి) అంచనా. ఈ నష్టం సంగతి ఏమిటి? కొత్త నోట్ల మార్పిడి లేదా ఎటిఎంలు, బ్యాంకుల ముందు తమ డబ్బు తాము తీసుకోవటానికి వెచ్చించిన పని గంటలు, పెట్టిన సెలవులు దీనికి అదనం. మాజీ అర్ధిక మంత్రి పి చిదంబరం చెప్పిన లెక్కల ప్రకారం ఏడాది కాలంలో జిడిపి 1.5శాతం నష్టం విలువ 2.25లక్షల కోట్లు, అనేక వారాల పాటు 15కోట్ల మంది రోజువారీ కూలీలు పని కోల్పోయారు, నోట్ల కోసం వరుసల్లో నిలబడి వంద మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వేలాది చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి, ఫలితంగా లక్షల మంది కార్మికులకు పని పోయింది. ఆ నష్టం ఎంతో ఎవరూ లెక్క గట్టలేదు. ఐదు వందలకు బదులు వెయ్యి, రెండు వందలు, యాభై కొత్త నోట్లను ఎటిఎం యంత్రాలలో అమర్చేందుకు వాటిని మూసివేసినపుడు జనం అనుభవించిన యాతనలు చెప్పనవసరం లేదు. యంత్రాలలో మార్పులు చేర్పులకు ఆయా బ్యాంకుల మీద పడిన భారం గురించి కూడా ఎవరూ నోరు విప్పటం లేదు. ఎవరైనా చెబితే అది నేరుగా నరేంద్రమోడీకే తగులుతుంది, సదరు అధికారి బలి ఖాయం. ఇలా బయటకు చెప్పుకోలేని,లోపల తట్టుకోలేని ఇబ్బందులెన్నో. రిజర్వుబ్యాంకు అధికారికంగా చెప్పినదాని ప్రకారమే వెనక్కు రాని నోట్ల కంటే కొత్త నోట్లు అచ్చేసి, పంపిణీ చేసేందుకు అయిన ఖర్చు ఎక్కువ. పదమూడు వేల కోట్ల రూపాయలని చెప్పింది. నోట్లు రద్దు చేయటానికి ముందు అంటే 2015-16 ఆర్ధిక సంవత్సరంలో ఆర్‌బిఐ కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్‌గా 65,876 కోట్లు ఇచ్చింది, నోట్ల రద్దు తరువాత 2016-17లో ఆ మొత్తం 30,659 కోట్ల రూపాయలకు తగ్గిపోయింది. తదుపరి ఏడాది చెల్లించిన మొత్తం కూడా 50వేల కోట్లకు మించలేదు. అంటే కేవలం రెండు సంవత్సరాలలోనే 55వేల కోట్ల మేరకు కేంద్రానికి ఆదాయ నష్టం జరిగింది. ఇతర వాణిజ్యబ్యాంకులకు నిరర్ధక ఆస్ధులు పెరిగిపోవటంతో నష్టాలు వచ్చాయి, మరి రిజర్వుబ్యాంకు లాభాలు ఎందుకు పడిపోయినట్లో ఎవరైనా చెబుతారా ? దేవగిరి-ఢిల్లీ మధ్య రాజధానులను మార్చిన మహమ్మద్‌బిన్‌ తుగ్లక్‌ చర్యకు సైన్యం, పరివారమే ఇబ్బంది పడింది. నరేంద్రమోడీ చర్యకు యావత్‌ దేశం ఇబ్బంది పడింది. ఇద్దరిలో ఎవరు మెరుగు ?

నోట్ల రద్దుకు ముందు అంటే 2016నవంబరు నాలుగున మన వుపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తాజాగా కూడా చెప్పినట్లు కొంత మంది బాత్‌ రూముల్లో దాచుకున్నదానితో సహా దేశంలో 17.97లక్షల కోట్ల రూపాయల నగదు చెలామణిలో వుంది. ఈ ఏడాది మార్చి నాటికి చెలామణిలో వున్న నగదు 18.03లక్షల కోట్లు, అయినా సరే బ్యాంకుల్లో వున్న తమ డబ్బును తీసుకోవాలంటే అడిగినంత మొత్తం ఇవ్వలేమని బ్యాంకులు ఎందుకు చెప్పినట్లు? అంటే తిరిగి బాత్‌రూముల్లోకి పోయిందా? పోకుండా మోడీ సర్కార్‌ ఏం చేస్తున్నట్లు ? స్వయం సేవకులతో సహా చెప్పేవారెవరూ లేరు…… పోతే పోనీ గానీ గుండు మాత్రం పొన్నకాయలా బలే వుందే అన్న ముతక సామెత మాదిరి నోట్ల రద్దు వలన జరిగిన నష్టం కంటే వచ్చిన ఫలితాలు బాగున్నాయని ఇప్పటికీ అధికారపక్ష పెద్దలూ, వారికి అనుగుణంగా, కొందరు మేథావులూ, అధికారులూ అతిశయోక్తులు చెప్పటం విశేషం. నోట్ల రద్దు వలన పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణమే ఎక్కువగా ప్రభావితమైందని ఒక అధ్యయనంలో ప్రపంచబ్యాంకు పేర్కొన్నది. గురుచరణ దాస్‌ అనే ఆర్ధికవేత్త మాట్లాడుతూ ఇండ్లలో దాచుకున్న సొమ్ము బ్యాంకుల్లోకి వచ్చింది, బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన వారందరూ భవిష్యత్‌లో పన్ను చెల్లింపుదారులుగా మారతారు, డిజిటల్‌ ఆర్ధిక వ్యవస్ధ వేగంగా పెరిగింది అన్నారు. అయితే సానుకూల ఫలితాలు రావటానికి ఇది(పెద్ద నోట్ల రద్దు) మార్గం కాదు. జనాలు చెల్లించిన మూల్యం చాలా ఎక్కువగా వుంది. నా అంచనా ప్రకారం ఒక ఏడాది ఆర్ధిక అభివృద్ధిని మనం నష్టపోయాము. దేశంలో వుపాధి సమస్యను పరిష్కరించాలంటే మనం ఏటా ఎనిమిదిశాతం చొప్పున 20సంవత్సరాల పాటు పెరగాలి అని కూడా దాస్‌ చెప్పారు.

Image result for demonetisation, rbi report cartoons

రాజుగారు నందంటే నంది, పందంటే పంది గురించి చెప్పగలిగిన సమర్ధులు మన వున్నతాధికారులు.కేంద్ర ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్క్‌ నోట నోట్ల రద్దు విజయగానంలో చోటు చేసుకున్న అంశాలు ఇలా ఆవు వ్యాసంలో విషయాల మాదిరి వున్నాయి. గతంమాదిరే కరెన్సీ వ్యవస్ధ కొనసాగి వుంటే మూడు నాలుగు లక్షల కోట్ల రూపాయల మేరకు నోట్ల చలామణి తక్కువ వుండేది. మూడు లక్షల కోట్ల రూపాయల నల్లధనం బ్యాంకింగ్‌ వ్యవస్ధకు దూరంగా వుండేది, నోట్ల రద్దు తరువాత రెండులక్షల కోట్ల మేరకు బ్యాంకులకు చేరింది. ఆదాయపన్ను శాఖ 1.75లక్షల కోట్ల రూపాయల మొత్తంతో ప్రమేయమున్న అనుమానిత ఖాతాల గురించి పరిశీలన చేస్తున్నది. పద్దెనిమిది లక్షల మందికి ఆదాయానికి మించి ఆదాయం వున్నట్లు గుర్తించారు. వారిమీద చర్యల ద్వారా నల్లధనం మీద దాడి లక్ష్యం నెరవేరుతుంది. గతంలో నకిలీనోట్లు పెద్ద ఎత్తున చలామణిలో వుండేవి. నోట్ల రద్దు తరువాత అవి పెద్దలెక్కలోకి వచ్చేవిగా లేవు. ఇప్పుడు ఎవరైనా ఆ నోట్లను గుర్తించగలరు, ఎవరినీ మోసం చేయలేరు. నగదు రహిత(డిజిటల్‌ ) లావాదేవీలు పెరిగి ఒక నెలలో 25కోట్లకు చేరుకున్నాయి. ఫిబ్రవరి, మార్చినెలల్లో నగదుకు కొరత వుండేది ఇప్పుడు ఆ సమస్య లేదు. ఇలా బూతద్దంలో చూపేందుకు గార్గ్‌ ప్రయత్నించారు.

పెద్ద మొత్తంలో కరెన్సీ చలామణిలోకి వచ్చిందని ఏలుబడిలో వున్నవారు చెబుతుంటే కొన్ని కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చలామణిలో వున్న కరెన్సీ విలువ 19.38లక్షల కోట్ల రూపాయలని, పొదుపు 2.8శాతానికి పెరిగిందని అంగీకరిద్దాం. ఇదే సమయంలో పొదుపు సొమ్ము బ్యాంకులు లేదా కార్పొరేట్‌ డిపాజిట్లలో ఐదు దశాబ్దాల కనిష్టం 2.9శాతానికి ఎందుకు పడిపోయిందన్నది విశ్లేషకుల ప్రశ్న. డిపాజిట్ల రూపంలో బ్యాంకులకు చేరిన మొత్తంలో కొంత నోట్ల రద్దు తరువాత బ్యాంకింగ్‌ వ్యవస్ధ నుంచి వెళ్లిపోయింది. వడ్డీ రేటు తగ్గటంతో వ్యక్తిగతంగా బ్యాంకుల్లో డిపాజిట్లు చేయటం తగ్గింది. అంతకు ముందు సంవత్సరంలో 6.3శాతం వున్న డిపాజిట్లు వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో 2.9శాతానికి పడిపోయాయి.

నోట్ల రద్దుతో జనం మీద దాడి చేసిన మోడీ ఇప్పుడు కరెన్సీ విలువతో దాడికి దిగినట్లు కనిపిస్తోంది. మోడీకి దీనికి సంబంధం ఏమిటని కొందరు అడ్డు తగల వచ్చు. మోడీ సర్వాంతర్యామి, ఇందుగలదందు లేడను సందేహము వలదు లేదా అన్నీ నేనే అని గీతాకారుడు చెప్పినమన భూమిలో కరెన్సీలో ఆయన లేకుండా ఎలా వుంటాడు. నోట్ల రద్దు తన స్వంత నిర్ణయం చెప్పిన పెద్ద మనిషి పడిపోతున్న రూపాయి విలువకు కారణాలేమిటో, తన ప్రమేయం లేకపోతే జనాన్ని ఎలా ఆదుకుంటారో రాజధర్మంగా అయినా చెప్పాలి కదా ? శుక్రవారం నాడు మార్కెట్‌ వేళలు ముగిసే సమయానికి డాలరుతో మారకానికి రు.70.94గా పతనం చెంది సరికొత్త రికార్డు నమోదు అయింది. ప్రభుత్వ ఆసుపత్రుల కెళితే ఏ జబ్బుకైనా ఒకే రంగు గోళీలు, నీళ్ళ మందుపోస్తారని ప్రతీతి. రూపాయి విలువ పతనాన్ని అడ్డుకొనేందుకు గత కొద్ది రోజులుగా మన రిజర్వుబ్యాంకు అటువంటి పనే చేసింది. జబ్బు ఒకటైతే నీళ్ల మందు చికిత్సలకు తగ్గుతుందా? ఐఎఫ్‌ఏ గ్లోబల్‌ కరెన్సీ నివేదిక ప్రకారం చమురు ధరలు ఎక్కువగా వున్నంత వరకు మన వంటి దేశాల కరెన్సీ విలువ పతనం కొనసాగుతూనే వుంటుంది. రూపాయి విలువ 70.45-70.90 లేదా అంతకు దిగువకు పడిపోవచ్చు. ఆ జోశ్యాన్ని కూడా మన రూపాయి వమ్ము చేసి ఆగస్టు 31న 70.96 నమోదు చేసింది. దిగుమతిదారులకు 70.20, ఎగుమతిదారులకు 69.75 స్ధాయిల్లో వుంటుందనే అంచనాతో లావాదేవీలను సాగించుకోవచ్చని ఐఎఫ్‌ఏ సలహా ఇచ్చింది. దిగుమతిదారుల నుంచి డిమాండ్‌ పెరగటం, మరింత పతనం అవుతుందేమో దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకుందామనే ముందుచూపుతో విదేశీ మదుపుదారులు తమ సొమ్మును వెనక్కు తీసుకోవటం ఎక్కువగా చేస్తుండటంతో రూపాయి పతనం కొనసాగుతోంది. అది త్వరలో 71లేదా 72కు చేరనుందని అనేక మంది చెబుతున్నారు.ఇప్పటికే ఈ ఏడాది పదిశాతం పతనమై ఆసియాలో అత్యంత అధ్వాన్నంగా మారిన కరెన్సీగా రూపాయి పేరు తెచ్చుకుంది.

దేశంలోపలివా, వెలుపలివా కారణాలు ఏవైనప్పటికీ డాలర్లకు డిమాండ్‌ పెరగటం మన రూపాయి విలువ పతన కారణాల్లో ఒకటి. పెట్రోలు, డీజిలు లేకపోతే గడవదు కనుక ఎన్ని డాలర్లయినా ఇచ్చి తెచ్చుకోవాలనుకుందాం.విదేశీ లిప్‌స్టిక్‌లు,లో దుస్తులు, పై దుస్తులు, నగలు, వాచీలు, బంగారం చివరికి అమెరికా నుంచి బాదం పప్పు, దోసకాయల వంటి నిత్యావసర వస్తువులు లేకపోతే తమకు గడవదు అనుకొనే వారికి కూడా మన జనం మొత్తం తరఫున అధిక ధరలకు డాలర్లను కొని ఇస్తున్నాం. ఇరాన్‌ మీద అమెరికా వాడికి కోపం వస్తే పెరిగే చమురు ధరలకు మన ఇతర దేశాల నుంచి కొనాలి తప్ప చౌకగా ఇచ్చే ఇరాన్‌ నుంచి కొనుగోలు చేయం. ఎందుకంటే ట్రంప్‌కు మన మీద కోపం వస్తుంది. ఇలాంటి వాటి కారణంగా మన కరెంట్‌ ఖాతాలోటు పెరుగుతోంది. మనం చేసుకొనే దిగుమతులకు చెల్లించే మొత్తం, మన ఎగుమతుల ద్వారా సంపాదించే ఆదాయ మొత్తానికి మధ్య వుండే తేడానే కరెంట్‌ ఖాతా లోటు లేదా మిగులు అంటాం.మరో విధంగా చెప్పాలంటే పెట్టుబడులు సంపాదించటానికి, పలుకుబడి పెంచే పేరుతో విదేశాలకు విమానాల్లో తిరగటానికి, రోజుకో కొత్త కోటు వేసుకోవటానికి మన మోడీకి అయ్యే ఖర్చు ఆయన సంపాదించిన దాని కంటే ఎక్కువ వుంది అనుకోండి.

2018 ఆర్ధిక సంవత్సరంలో మన కరెంట్‌ ఖాతా లోటు జిడిపిలో 1.9శాతం వుంటే అది 2019కి 2.8కి పెరుగుతుందని అంచనా. ప్రత్యక్ష పెట్టుబడుల మొత్తం తగ్గుతోంది. మన దేశ స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు, ప్రభుత్వాలకు అప్పులు ఇచ్చేవారు ఇంతకు ముందు గణనీయంగా పెరిగారు. ఇప్పుడు ఎందుకైనా మంచిదని వెనక్కు వెళ్లిపోతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 50వేల కోట్ల రూపాయల మేర వెనక్కు తీసుకున్నారు. మనకు అప్పులు ఇచ్చేవారు డాలర్లలో ఇస్తారు, డాలర్లలోనే తీసుకుంటారు. మనరూపాయలను అంగీకరించరు. మన్మోహన్‌ సింగ్‌ పది సంవత్సరాల కాలంలో కిందికీ మీదికీ పడుతూ లేస్తూ రు.45.32 నుంచి గరిష్టంగా 68.85 వరకు పతనమై నరేంద్రమోడీ అధికారానికి వచ్చే సమయానికి రు.58.43కు పెరిగింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు మోడీ హయాంలో తొలిసారిగా మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడి నాటి గరిష్ట పతనాన్ని తాకి 2017 జనవరి ఆరున రు.67.96 గా ముగిసింది. ఇప్పుడు ముందే చెప్పుకున్నట్లు 71రూపాయలను ఏక్షణంలో అయినా దాటేట్లు వుంది. పది సంవత్సరాల మన్మోహన్‌ సింగ్‌ కాలంలో నిఖర పతనం పదమూడు రూపాయలకు అటూ ఇటూగా అయితే నరేంద్రమోడీ పాలనలో కూడా అదే స్ధాయిలో జరిగింది, త్వరలో నూతన రికార్డులను కూడా నమోదు చేయవచ్చు. మోడీ అధికారానికి వచ్చినపుడు మనం ఒక వంద డాలర్లు అప్పు తీసుకున్నామనుకుంటే అసలు రు.5843. దానికి మార్కెట్లో వున్న రేటున బట్టి వడ్డీ చెల్లించాలి.( అలాగాక చంద్రబాబు నాయుడు అమరావతి నగర నిర్మా ణానికి అప్పుకు అధికవడ్డీ రేటు ఇచ్చినట్లుగా ఇస్తే అది వేరే.) చైనాతో పేచీ వచ్చింది, మాక్కూడా డాలర్ల అవసరం పెరిగింది మా సొమ్ము మాకివ్వండని అమెరికా వాడు అడిగాడనుకోండి. గత నాలుగేండ్లుగా చెల్లించాల్సిన బారు లేదా చక్ర వడ్డీగాక, అసలే 7096కు పెరిగిపోయింది. మన రూపాయి విలువ పతన పర్యవసానమిది.

దీన్నే మరో విధంగా చెప్పుకోవటం అవసరం. 2008లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభాన్ని అధిగమించేందుకు అక్కడి వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు అమెరికా, ఇతర ధనిక దేశాలలో వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించారు. వుదాహరణకు ట్రేడింగ్‌ ఎకనమిక్స్‌ అనే వెబ్‌సైట్‌ విశ్లేషణ ప్రకారం అమెరికాలో సంక్షోభ సమయంలో వడ్డీ రేటు 3.6శాతం వుండగా ఒక ఏడాదిలో అది 0.25శాతానికి పడిపోయింది.2016 వరకు అదే కొనసాగి, అప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం రెండుశాతానికి పెరిగింది. అంతకంటే ఎక్కువగా మన దేశంలో వడ్డీ రేట్లు వున్నాయి కనుక. డాలరు బాబులు మనకు వుదారంగా అప్పులిచ్చారు. ఇప్పుడు తమ దగ్గరే వడ్డీ రేట్లు పెరిగాయి, ఇంకా పెంచుతామని అమెరికా ఫెడరల్‌ రిజర్వు( రిజర్వుబ్యాంకు వంటిది) ప్రకటించింది. గనుక మనకు అప్పు లేదా పెట్టుబడులు పెట్టటం కంటే తమ దేశమే నయమని ఎవరికి వారు వెనక్కి తీసుకుంటున్నారు. ఇది కూడా మన రూపాయి పతనానికి దారి తీస్తోంది.

మన వాణిజ్యమంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం 2018 ఏప్రిల్‌ా జూలై నెలల్లో మన చమురు దిగుమతుల విలువ 46.98 బిలియన్‌ డాలర్లు. అదే నెలల్లో ఒక ఏడాది క్రితం ఆ మొత్తం 31.02 బిలియన్లు మాత్రమే. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు పెరగటమే దీనికి కారణం. ఇది ప్రామాణిక బ్రెంట్‌ ముడిచమురు ప్రస్తుతం పీపా ధర 78 డాలర్లు వుంది. ఈ ఏడాది అది 80 దాట వచ్చని అంచనా. చమురు ధరలు అంతకు మించి 90 డాలర్లకు పెరిగితే మన కరెంటు ఖాతా లోటు 3.6శాతానికి చేరుతుందని అంచనా. ఇదే జరిగితే జనంలో గగ్గోలు చెలరేగకుండా వుండాలంటే చమురు మీద పెంచిన పన్నులను అయినా తగ్గించాలి. లేదా పెరిగిన భారాన్ని జనం మీద మోపాలి. తగ్గిస్తే ప్రభుత్వం అదనంగో నోట్లను ముద్రించాలి, అదే జరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది, అంటే ధరలు పెరుగుతాయి. భారం తగ్గించకపోయినా ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. కరంట్‌ ఖాతా లోటు పెరిగితే అప్పులు తెచ్చి లేదా జనం మీద భారాలు మోపీ చెల్లింపులు చేయాల్సి వుంటుంది. ఏది జరిగినా భరించాల్సింది జనమే.

గతంలో చూసిన అనుభవాల కారణంగా విదేశీమారక ద్రవ్యనిల్వలకు ఆర్‌బిఐ కొన్ని చర్యలు తీసుకుంది. వాటి నుంచి ఈ ఏడాది ఇప్పటి వరకు ఏప్రిల్‌-జూన్‌ మాసాల మధ్య 14.5బిలియన్‌ డాలర్లను విక్రయించి డాలర్లకు డిమాండ్‌ను తగ్గించేందుకు తద్వారా రూపాయి విలువ మరింత పతనం కాకుండా చూసేందుకు ప్రయత్నించింది. రూపాయి బాండ్లను ప్రవేశపెట్టటం, ఎలక్ట్రానిక్‌ వస్తువులపై దిగుమతి సుంకాన్ని గణనీయంగా పెంచటం ద్వారా డాలర్ల డిమాండ్‌ను తగ్గించటం వంటి చర్యలు తీసుకుంది. రూపాయి విలువ పతనాన్ని సొమ్ము చేసుకొనేందుకు ప్రవాస భారతీయులు ఇటీవలి కాలంలో పెద్ద మొత్తంలో డాలర్లు, ఇతర విదేశీ కరెన్సీని మన దేశానికి పంపుతున్నారు. మన కరెన్సీ ఎంత పతనమైతే వారికి అంతగా కష్టపడకుండానే ఎక్కువ రూపాయలు వస్తాయి మరి. చైనాలో కరెన్సీ విలువ మన మాదిరి పతనం కాలేదు, డాలరుతో పోటీ పడుతోంది కనుక ప్రవాస చైనీయులు మనవారి కంటే ఐదు బిలియన్‌ డాలర్లు తక్కువ పంపారట. చమురు ధరలు తక్కువగా వున్నాయి గనుక సొమ్ము చేసుకుందామని పెద్ద ఎత్తున రంగంలోకి దిగిన విమాన కంపెనీలు ఇప్పుడు దివాలా బాటలో వుండటానికి చమురు ధరలు పెరగటమే కారణం.రాబోయే రోజుల్లో దిగుమతి చేసుకొనే ఆధునిక పరికరాలు ధరలు పెరిగి టెలికాం కంపెనీలపై భారం పెరగనున్నదని అప్పుడే వార్తలు వస్తున్నాయి. మన్మోహన్‌ సింగ్‌ చివరి రోజుల్లో అంటే 2013లో ఆరునెలల దిగుమతి అవసరాలకు సరిపడా విదేశీమారక ద్రవ్య నిల్వలుంటే ఇప్పుడు మోడీ చివరి రోజుల్లో పది నెలలకు సరిపడా వున్నాయి. అనూహ్యపరిస్ధితులు తలెత్తితే పరిస్ధితి ఇంకా దిగజారి మరోసారి అప్పుల చిప్ప పట్టుకోవాల్సి వచ్చినా ఆశ్చర్య ం లేదు. ఇటువంటి విధానాలతో లబ్ది పొందేవారి కంటే నష్టపోయేవారే ఎక్కువ.1991 తరువాత అధికారంలో వున్నవారు వరుసగా రెండవ సారి ఎన్నిక అవటం 2009 ఒక్క మన్మోహన్‌ సింగ్‌ హయాంలోనే జరిగింది. మరే పార్టీ వరుసగా అధికారంలోకి రాలేదు. అందుకే పరిస్ధితులు మరింతగా దిగజారకముందే ఓటర్ల ముందుకు వెళితే ఫలితం వుంటుందేమో అన్నఆశతో నరేంద్రమోడీ ముందస్తు ఎన్నికల గురించి దూరాలోచన చేస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పతనంలో పోటీ పడుతున్న నరేంద్రమోడీ, రూపాయి విలువ !

01 Sunday Jul 2018

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

Narendra Modi, narendra modi bhakts, Rupee, rupee falls, rupee value

ఎం కోటేశ్వరరావు

‘ 48 సంవత్సరాలలో కాంగ్రెస్‌ చేయలేని దానిని నరేంద్రమోడీ 48నెలల్లో చేసి చూపించారు అన్నది తాజాగా ఆయన వీర భక్తులు చేస్తున్న భజనలలో ఒకటి. త్వరలో కొద్ది వారాల్లోనే లోక్‌సభ మధ్యంతర ఎన్నికల ప్రకటన రాబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మోడీ భక్తుల భజన రాతావళిలో రూపాయి విలువ గురించి కూడా చేర్చారు. పురుషలందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లు జర్నలిస్టులలో నిజమైన జర్నలిస్టులు వేరయా అనుకుంటే సిగ్గుమాలిన జర్నలిస్టుల ప్రతినిధిగా చెప్పాలంటే చాలా మంది వున్నారు. వారెవరో అందరికీ బాగా తెలుసు. మోడీ బృందంలో ఆర్నాబ్‌ గోస్వామి అనే ఒక పేరు మోసిన జర్నలిస్టు వున్నాడు. వెధవాయను నేను అంటే నీ కంటే పెద్ద వెధవాయను నేను అంటూ ఒక పాత సినిమాలో పాట వుంది. ఆర్నాబ్‌ గోస్వామి మోడీ భజన చేస్తుంటే ‘మా హీరో ఆర్నాబ్‌ గోస్వామి, మేము ఎల్లవేళలా అతనికి మద్దతు ఇస్తాము అంటూ ఫేస్‌బుక్‌లో ఒక పేజీని సృష్టించారు. వారు తాజాగా రూపాయి విలువ గురించి స్క్వింట్‌ నియాన్‌ అనే పేరుతో ఒక ట్వీట్‌ సమాచారాన్ని ప్రచారంలో పెట్టారు. దాని సారాంశం ఇది.’హార్వర్డ్‌ బంగారు పతక గ్రహీత ఆర్ధికవేత్త (మన్మోహన్‌ సింగ్‌) హయాంలో 2008లో ఒక డాలరుకు రూపాయి విలువ 39 కాగా 2014లో 68, ఒక చాయ్‌ వాలా(నరేంద్రమోడీ) హయాంలో 2014లో 68 వుండగా 2018లో 69. ఎదుటి వారు అవివేకులని భావించి ఎక్కటం తప్ప ఏమిటిది? ‘. అని ప్రశ్నించారు, అంటే మన్మోహన్‌ సింగ్‌ హయాంలో 39 నుంచి 68కి పడిపోతే దాన్ని వదలి పెట్టి 68 నుంచి 69కి మాత్రమే పడిపోయిన మోడీ గురించి రచ్చ చేస్తున్నారేమిటి అంటూ ఎదురు దాడికి దిగటం. ఈ స్క్వింట్‌ రియాన్‌ ఫ్రొఫైల్లో ఫెమినిస్ట్‌ అని వుంది కనుక మహిళ అనుకోవచ్చు. ఆడో మగో, అసలు నకిలీ ఖాతానో వదలివేద్దాం. పేరును బట్టి విదేశీయులు కూడా ప్రధాని మోడీ పాలనా తీరు గురించి ఎలా ప్రశంసిస్తున్నారో చూడండి అని చెప్పుకోవటమే దీని ప్రధాన లక్ష్య ం. దానిలో అంశమే చర్చనీయాంశం.

‘అధికార కేంద్రాన్ని కాపాడు కోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్ధేశం లేదు,రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు ‘ ‘ యుపిఏ ప్రభుత్వాన్ని, రూపాయిని చూస్తుంటే ఎవరెంత ఎక్కువగా పతనం చెందుతారో పోటీ పడుతున్నట్లుగా వుంది’ ‘ రూపాయి తన విలువను కోల్పోయింది, ప్రధాని తన సొగసును కోల్పోయారు’ ఇద్దరు ప్రముఖు చేసిన వ్యాఖ్యలివి. మొదటి రెండు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ చేస్తే, మూడవది బిజెపి లోక్‌సభా పక్షనేతగా వున్నపుడు సుష్మా స్వరాజ్‌ చేసిన ట్వీట్‌ . ఇప్పుడు జూన్‌ 28న రు.69.09లకు పతనం చెందిన రూపాయితో నరేంద్రమోడీ తన రికార్డును తానే బద్దలు కొట్టుకొని కొత్తది సృష్టించారు. తేలు కుట్టిన దొంగల మాదిరి ఏ ఒక్క ప్రభుత్వ నేతా దీని మీద నోరు విప్పటం లేదు. మరుగుజ్జులతో ప్రచార దాడి చేయిస్తున్నారు. నిజానికి ఎదుటి వారు అమాయకులని భావించటమే కాదు, ఒక అవాస్తవాన్ని వందసార్లు చెబితే నిజమై కూర్చుంటుందన్న గోబెల్స్‌ సూత్రాన్ని తు.చ తప్పకుండా పాటిస్తున్న వారు చేస్తున్న ప్రచారదాడి ఇది.

మన్మోహన్‌ సింగ్‌ అదికారంలో వుండగా 2013 ఆగస్టు 28న రూపాయి విలువ డాలరుకు రు.68.85కు పడిపోయి ఒక రికార్డు నమోదు చేసింది. నరేంద్రమోడీ సర్కార్‌ 2016 నవంబరు 24న దాన్ని రు.68.86కు దిగజార్చి పాత రికార్డును బద్దలు చేసింది. అదే సర్కార్‌ 2018 జూన్‌ 28న రు.69.09లకు పతనం చెందిన రూపాయితో మరో ‘విజయం’ సాధించింది. ప్రతి నెలాఖరులో మోడీ చెప్పే తన మనసులోని మాటలో దీని గురించి ఇంతవరకు ఎలాంటి ప్రస్తావన చేయలేదు. ప్రస్తుతం మోడీ మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా వుండి, గతంలో ప్రతిపక్ష నేతగా వున్న రవిశంకర ప్రసాద్‌ నాడు ‘పూర్తిగా ఆర్ధిక వ్యవస్ధ దుర్నిర్వహణ’ కారణంగా రూపాయి పతనం అవుతున్నదన్నారు. ‘ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) మరియు విదేశీ సంస్ధాగత పెట్టుబడుల (ఎఫ్‌ఐఐ)తో ఆర్ధిక వ్యవస్ధను నిర్వహించే యుపిఏ విధాన కారణంగానే ఇలా జరుగుతున్నదని చెప్పారు. మన దేశం నుంచి డబ్బు తరలి పోయినందున రూపాయి విలువ పడిపోయిందని లాయర్‌గారు వాదించారు. ‘యుపిఏ ఏర్పడినపుడు డాలరకు రూపాయి విలువ రాహుల్‌ గాంధీ వయస్సుతో సమంగా వుంది. ఈ రోజు సోనియా గాంధీ వయస్సుకు దగ్గర అవుతున్నది.అది మన్మోహన్‌ సింగ్‌ వయస్సుకు దగ్గర అవుతుందేమోనని భయంగా వుంది ‘ అని చమత్కరించారు.

ఇప్పుడు రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది, యుపిఏ పాలనా విధానాలను మార్చి రూపాయి విలువను పెంచకుండా లేదా కనీసం పతనం చేయకుండా నిలువరించటంలో ఎవరు మోకాలడ్డారు ? ఎవరైనా సూటిగా సమాధానం చెప్పేవారున్నారా ?http://inr.fx-exchange.com/usd/2014_05_26-exchange-rates-history.html నరేంద్రమోడీ అధికారం స్వీకరించిన 2014 మే 26వ తేదీన డాలరుకు రూపాయి విలువ రు.58.73 వున్నట్లు పై ఆధారం తెలియ చేస్తున్నది. వచ్చే సెప్టెంబరు 17 నాటికి నరేంద్రమోడీ వయస్సు 68లో ప్రవేశించనుంది. రూపాయి విలువ ఇది రాస్తున్న సమయానికి రు.68.46(2018 జూన్‌ 29) వుంది. ఆయన వయస్సును దాటి పోయింది. మరి దీనికి ఏ స్టెరాయిడ్స్‌ ఇచ్చారో తెలియదు? త్వరలో 70 దాటనున్నదని విశ్లేషకులు జోశ్యం చెబుతున్నారు. పతనంలో రూపాయి, నరేంద్రమోడీ ఎవరు విజేత అవుతారో?

2014 సాధారణ ఎన్నికలలో నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి విజయం సాధించనున్నదనే అంచనాలు వెలువడిన సమయంలో అమెరికా సంస్థ బ్లూమ్‌బెర్గ్‌ ప్రతినిధులు అమిత్‌ ప్రకాష్‌, క్రిస్టిన్‌ ఆక్వినో రూపాయి విలువ పెరగటం నరేంద్రమోడీ నిర్ణయాత్మక విజయానికి సూచిక అని వ్యాఖ్యానించారు. దీర్ఘకాలంలో రూపాయి విలువ ఒక అమెరికన్‌ డాలరుకు 2014 మార్చి నెలలో వున్న రు.61.19 నుంచి 45-40కి పెరిగే క్రమంలో ఎన్నికల ఫలితం ఒక వుత్ప్రేరకంగా పని చేయగలదని, ఒక వేళ బలహీన సంకీర్ణం ఏర్పడితే 2013 అగస్టు 28 నాటి రికార్డు పతనం 68.85ను అధిగమించ వచ్చని సిటీ గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ కార్పొరేషన్‌ ఆసియా-పసిఫిక్‌ అధిపతి ఆడమ్‌ గిల్‌మౌర్‌ చెప్పిన మాటలను వారు వుటంకించారు. అంతే కాదు, మోడీ విజయం సాధిస్తే అది ఆట తీరునే మార్చివేస్తుందన్నది మార్కెట్‌ అభిప్రాయమని కూడా ఆడమ్‌ వ్యాఖ్యానించాడు. ఆసియాలోని మూడవ పెద్ద ఆర్ధిక వ్యవస్థ అయిన భారత్‌ 2008లో ప్రారంభమైన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం తరువాత ఇప్పుడే పట్టాలపైకి వస్తున్నదని మోడీ స్టీరింగ్‌ పట్టుకుంటే మరింత వేగం అందుకుంటుందని బ్లూమ్‌బెర్గ్‌ వ్యాఖ్యాతలు చెప్పారు.

రూపాయి విలువ పెరుగుతున్నదని, అది డాలరుకు 40కి పెరిగితే 2008 ఏప్రిల్‌ నాటి బలమైన స్ధాయికి చేరినట్లు అవుతుందని ఈ తరుణంలో డాలర్లను అమ్ముకోవటం మంచిదని ఎన్నికల వరకు ఆగితే ఆది ఆలస్యం కూడా కావచ్చని గిల్‌మౌర్‌ జోస్యంతో కూడిన సలహా ఇచ్చారు. అయితే అది ఎంత కాలంలో జరుగుతుందన్నది ఆయన చెప్పలేదని, బ్లూమ్‌బెర్గ్‌ జరిపిన సర్వే ప్రకారం 2014 డిసెంబరు నాటికి రు.61.21 అవుతుందని 2016 చివరికి 58.50లకు పెరుగుతుందని ఆ సంస్థ వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. దీనికి విరుద్ధంగా 2018లో 69.09గా నమోదైంది. దీనికి కారణాలేమిటి ?

నిత్యం బలమైన కరెన్సీ గురించి బోధనలు చేయటం తప్ప మోడీ-జైట్లీ ద్వయం బ్రిటీష్‌ వలసవాద ఆర్ధిక విధానాలకు మద్దతు ఇస్తున్నారని, ఇంకా బలహీనమైన రూపాయి కొనసాగటం జాతి సిగ్గుపడాల్సిన అంశమని అంశుమన్‌ తివారీ అనే ఆర్ధిక వ్యవహారాల వ్యాఖ్యాత పేర్కొన్నారు.http://www.dailyo.in/business/rupee-narendra-modi-arun-jaitley-rbi-manmohan-singh-pv-narasimha-rao-dollar/story/1/6138.html  ఒక దేశ కరెన్సీ జాతి గర్వించదగిన లేదా దగని అంశంగా వుండకూడదు, చేయకూడదని తెలిసినప్పటికీ బిజెపి 2013లో రూపాయి విలువ ఎదుర్కొన్న సంక్షోభాన్ని జాతి సిగ్గుపడే అంశంగా ప్రదర్శించిందని తివారీ పేర్కొన్నారు.

‘మారకపు విలువ కేవలం ఒక ధర మాత్రమే. నీవు అమ్మకపు వ్యాపారంలో వుండాలంటే నీ ధర పోటీలో నిలబడేట్లుగా వుండాలి’ అని 1991లో రూపాయి విలువను భారీగా తగ్గించిన సమయంలో ఆర్ధిక మంత్రిగా వున్న మన్మోహన్‌ సింగ్‌ చెప్పిన తర్కాన్ని అంగీకరించాలంటారు తివారి. బూర్జువా మేథావుల ప్రతినిధి తివారీ. మేకిన్‌ ఇండియా పిలుపు ఇచ్చిన నరేంద్రమోడీ మన దేశంలో సరకులను తయారు చేసి చౌకగా విదేశాలకు ఎగుమతి చేసేందుకు రూపాయి విలువను కావాలనే పతనం గావిస్తున్నారా ? అవుననో కాదనో, అసలు కథేమిటో మోడీ నోరు విప్పితే కదా తెలిసేది.

1990 దశకంలో మన దేశం చెల్లింపుల సంక్షోభం ఎదుర్కొన్న కారణంగా మన ఎగుమతులను పెంచాలనే ఒక దివాళాకోరు ఆలోచనతో నాటి సర్కార్‌ ప్రపంచ బ్యాంకులో పని చేస్తున్న మన్మోహన్‌ సింగ్‌ను ఆర్ధిక మంత్రిగా తీసుకొన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచబ్యాంకు ఆదేశాలతో ఈ పెద్ద మనిషి ఒక్కసారిగా నాలుగు రోజుల్లో రూపాయి విలువను తొమ్మిదిశాతం వరకు తగ్గించారు. అంతకు ముందు దేశ చరిత్రలో అలాంటి వుదంతం జరగలేదు. ఆ సమయంలో ప్రభుత్వ ఆర్ధిక సలహాదారుగా జైరాం రమేష్‌, రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా రంగరాజన్‌ వున్నారు.

గతంతో అంటే 2013 రికార్డు పతనంతో పోల్చితే నాటికీ నేటికీ ఎంతో బేధం వుంది. అప్పుడు రూపాయి విలువ పతనం దేశ బలహీనతగా బిజెపి ప్రచారం ప్రారంభించింది. అ సమయంలో మన విదేశీ మారక ద్రవ్య నిల్వలపై తీవ్ర ప్రభావం చూపే చమురు పీపా ధర 100 డాలర్లకు పైగా వుంది. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 40-50 డాలర్ల మధ్య వుండి ఇటీవలి కాలంలో 75 డాలర్ల వరకు పెరిగింది. ఇక మోడీ భక్తులు తాజాగా ప్రారంభించిన రూపాయి విలువ ప్రచారం బండారం గురించి చూద్దాం.

ఒనడా డాట్‌ కామ్‌ డాటా ప్రకారం 2004ా05 నుంచి 2018 జూన్‌ వరకు వున్న ఏడాది సగటు రూపాయి విలువ ఇలా వుంది. ప్రతి రోజు పెరగటం, తగ్గుదల వుంటుంది కనుక సౌలభ్యం కోసం ఏడాది సగటు తీసుకుందాం.(డాలరుకు రూపాయి మారకం విలువ) 2018-19లో ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు)

ఏడాది రూపాయి విలువ

2004ా05 44.94

2005ా06 44.28

2006ా07 45.25

2007ా08 40.28

2008ా09 46.46

2009ా10 47.74

2010ా11 45.90

2011ా12 48.53

2012ా13 54.44

2013ా14 60.42

2014ా15 61.17

2015ా16 65.49

2016ా17 67.15

2017ా18 64.54

2018ా19 67.02

ఈ అంకెల ప్రకారం పదేండ్ల మన్మోహన్‌ సింగ్‌ పాలనలో 2005ా06 నుంచి 2013ా14 మధ్య కాలంలో రూపాయి పతనం 44.28 నుంచి 60.42కు జరిగితే నాలుగేండ్ల మోడీ కాలంలో అది 60.42 నుంచి 67.02కు దిగజారింది. సగటు దిగజారుడు చూస్తే దాదాపు ఒకటే వుంది. అంటే మన్మోహన్‌ సింగ్‌ పాలన చివరి రోజుల్లో పడిన ఇబ్బందుల కంటే మోడీ కాలంలో ఎక్కువగా వున్నట్లు స్పష్టం అవుతోంది. పదేండ్ల కాంగ్రెస్‌ పాలన చివరి ఏడాదిని మినహాయించి తొలి తొమ్మిది సంవత్సరాల తీరు తెన్నులను గమనిస్తే రూపాయి విలువ 44.28 నుంచి 54.44 మధ్యనే కదలాడింది. అదే మోడీ పాలనలో 60.42 నుంచి 67.02 మద్య వుంది. దీని అర్ధం కాంగ్రెస్‌ విధానాలను సమరించటం లేదా మంచివని చెప్పటం కాదు. రెండు పార్టీల విధానాలలో ఎలాంటి మౌలిక తేడాలు లేవు.

మన దేశాన్ని కేవలం ముడి సరకులు ఎగుమతి దేశంగా వుంచాలని, మన పారిశ్రామిక వస్తువుల ధరలు ప్రపంచ మార్కెట్లో ఎక్కువగా వుంచేందుకు నాటి బ్రిటీష్‌ పాలకులు రూపాయి విలువను లేని దాని కంటే ఎక్కువగా వుంచారన్న అభిప్రాయం వుంది. యుపిఏ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు బిజెపి రూపాయి విలువ పతనాన్ని దేశానికి అవమానంగా చిత్రించింది. తాను అధికారంలోకి వచ్చిన తరువాత అదే పార్టీ ఇప్పుడు రూపాయి పతనమౌతోంటే గుడ్లప్పగించి చూస్తోంది. నోట మాట రావటం లేదు.

నాడు మన్మోహన్‌ సింగ్‌ కరెన్సీ విలువ తగ్గింపును సమర్ధించుకుంటూ ‘మారకపు విలువ కేవలం ఒక ధర మాత్రమే. నీవు అమ్మకపు వ్యాపారంలో వుండాలంటే నీ ధర పోటీలో నిలబడేట్లుగా వుండాలి’ అన్నారంటే దాని అర్ధం తక్కువగా వుంచాలనే కదా. అప్పటి నుంచి చూస్తే 1970 నుంచి 1989 వరకు వాణిజ్య లోటుతో వున్న చైనా ఆ తరువాత నుంచి నేటి వరకు తన మిగులును పెంచుకుంటూ పోతూనే వుంది.1990 నుంచి 8.74 బిలియన్‌ డాలర్ల మిగులుతో ప్రారంభమై 2017లో 422 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నది. మరి మనం ఎక్కడ వున్నాం ? 2017లో చైనా ఎగుమతులు, దిగుమతుల లావాదేవీల మొత్తం 4.1లక్షల కోట్లు కాగా మనది 800 బిలియన్‌ డాలర్లకు అటూ ఇటూగా 157 బిలియన్‌ డాలర్ల లోటుతో వున్నాం. మన వాణిజ్యలోటు పెరగటం తప్ప ఏ ఒక్క సంవత్సరంలోనూ మిగులు లేదు. మన రూపాయి విలువను తగ్గించుకున్నా మన వస్తువులను ఎగుమతి చేయలేని స్ధితి. అయినప్పటికీ నిరుద్యోగ యువతను తప్పుదారి పట్టించేందుకు మేకిన్‌ ఇండియా నినాదంతో ప్రధాని నరేంద్రమోడీ కాలం గడుపుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ మన దేశం వచ్చి ఇక్కడ మన కార్మికుల చేత వస్తువులను తయారు చేయించుకొని ఎగుమతి చేసుకోవాలన్నది ఈ నినాదం వెనుక వున్న లక్ష్యం. ఇన్నేళ్లుగా మనం ఎందుకు విఫలమయ్యాము. అందునా ప్రపంచ ధనిక దేశాలన్నీ ఆర్ధిక మాంద్యంలో వుండగా ఇప్పుడున్న పరిశ్రమల వుత్పత్తులకే దిక్కు లేకపోతే కొత్తగా ఎవరు ప్రారంభిస్తారు అన్నది ప్రశ్న. అందువలన మన ఆర్ధిక విధానాన్ని మన అవసరాలకు తగినట్లు సమూలంగా మార్చుకొని అంతర్గతంగా వస్తువినియోగానికి డిమాండ్‌ పెంచుకుంటేనే ఏ రంగమైనా అభివృద్ది చెందుతుంది. మన యువతకు వుపాధి దొరుకుతుంది.

విదేశాలకు తక్కువ ధరలకు ఎగుమతులు చేయటానికి మన వనరులన్నీంటినీ వుపయోగిస్తే మన వస్తువులు కొన్న వాడికి తప్ప మనకు లాభం ఏమిటి? ఏ కారణం చేత అయినా కొనే వారు ఎత్తుబడితే మన వస్తువులను ఎవరికి అమ్ముకోవాలి? ఇప్పుడు అమెరికా, ఐరోపా ధనిక దేశాలలో వస్తువులు కొనే వారు లేకనే మన వస్తువులు ఎగుమతి కావటం లేదని అందరూ చెబుతున్నదే. అలాంటపుడు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టి మన నరేంద్రమోడీ గారికి మేకిన్‌ ఇండియా పేరు తెచ్చేందుకు ఎవరు ముందుకు వస్తారు అన్నదే సమస్య? మన కంటే తక్కువ ధరలకు ఎగుమతులు చేయాలంటే చైనా దగ్గర డాలర్ల నిల్వలు గుట్టలు పడి వున్నాయి. రెండవది, ఎగుమతులు దెబ్బతింటే అంతర్గతంగా వినియోగాన్ని పెంచే విధంగా చైనా తన పౌరుల ఆదాయాలను పెంచుతున్నది. మన పరిస్దితి అందుకు విరుద్దంగా వుంది.

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లుగా నరేంద్రమోడీ గారి మేకినిండియా పిలుపును జయప్రదం చేయటం కోసం రూపాయి విలువను మరింత పతనం గావిస్తే మనం దిగుమతి చేసుకొనే ఎరువులు, పురుగు మందులు, పెట్రోలియం వుత్పత్తుల వంటి వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి. వుదాహరణకు మనకు స్వాతంత్య్రం వచ్చిన రోజు నాడున్న విలువ ప్రకారం ఒక రూపాయకు కొన్న ఒక వస్తువు ధర నరేంద్రమోడీ పదవిలోకి వచ్చే నాటికి రు.58.58కి పెరిగింది. నాలుగు సంవత్సరాల తరువాత జూన 28న రు.69.09కి చేరింది, ఇంకా పెరగవచ్చని కొందరి అంచనా. మోడీ ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసిన మంచి రోజులంటే ఇవా ?

2014 మే 25న నరేంద్రమోడీ పదవీ బాధ్యతలను స్వీకరించిన సమయానికి 58.58 గా వుంది. ఇది తమ మోడీ ఘనతే అని అభిమానులు చెప్పారు. రూపాయి విలువ పతనం, పెరుగుదల చరిత్రను చూస్తేhttps://knoema.com/infographics/rygejhb/rupee-devaluation-against-dollar-1947-till-date ప్రధానిగా జవహర్‌ లాల్‌ నెహ్రూ వున్న సమయంలో 1947 నుంచి 1950 మధ్య ఒక రూపాయి నుంచి రు.4.76కు పడిపోయింది. ఆ ఏడాది నుంచి నెహ్రూ మరణించిన తరువాత లాల్‌ బహదూర్‌ శాస్త్రి పాలనలో 1965 వరకు స్ధిరంగా ఒక డాలరుకు రు.4.76 పైసలు వుంది. శాస్త్రి మరణించిన 1966లో రు.6.36కు పడిపోయింది. తరువాత ఇందిరా గాంధీ హయాంలో రు.6.36 నుంచి 1976లో రు.8.96కు పడిపోయి, ఆమె దిగిపోయే నాటికి రు.8.75కు పెరిగింది. జనతా పార్టీ నేత మొరార్జీ దేశాయ్‌ పాలనలో పెరుగుదల తప్ప పతనం లేదు, రు.8.75 నుంచి రు.8.14కు పెరిగి పెరిగింది.

రెండవ సారి ఇందిరా గాంధీ అధికారానికి వచ్చిన సమయంలో రు.7.86గా వున్నది కాస్తా ఆమె మరణించే నాటికి రు.11.36కు పతనమైంది. తరువాత రాజీవ్‌ గాంధీ ఏలుబడిలో రు.16.23కు దిగజారింది.1989లో అధికారానికి వచ్చిన విపి సింగ్‌ హయాంలో రు.17.50కి, నూతన ఆర్ధిక సంస్కరణలకు ఆద్యుడిగా పేరు గాంచిన పివి నరసింహారావు పాలనలో రు.22.74 నుంచి 35.43కు తగ్గింది. హెచ్‌డి దేవగౌడ, ఐకె గుజ్రాల్‌ పాలనా కాలంలో రు.41.26కు చేరింది. తరువాత బిజెపి నేత ఎబి వాజ్‌పేయి పాలనలో రు.48.61కి పతనమై చివరికి రు.45.32కు పెరిగింది. మన్మోహన్‌ సింగ్‌ పది సంవత్సరాల కాలంలో కిందికీ మీదికీ పడుతూ లేస్తూ రు.45.32 నుంచి గరిష్టంగా 68.85 వరకు పతనమై నరేంద్రమోడీ అధికారానికి వచ్చే సమయానికి రు.58.43కు పెరిగింది. మోడీ హయాంలో తాజాగా 69.10కి దిగజారింది. ఏడాది సగటు ఎలా వుందో పైన చూశాము. మోడీపాలనా కాలం ముగిసే నాటికి ఇంకా పతనం అవుతుందనే వారే తప్ప పెరుగుతుందని చెప్పేవారు ఒక్కరూ లేరు. మోడీని అభిమానించే వారు దీనిని విజయం అంటారా పతనంగాక మరేదైనా పేరు పెడతారా ?

రూపాయి విలువ పతనమైతే సామాన్య జనానికి జరిగే నష్టం ఏమిటి? మోడీకి, మన్మోహన్‌ సింగ్‌కో మరొకరికో వ్యక్తిగత నష్టం గురించిన సమస్య కాదిది. మనిషికి బిపి పెరిగినా, తగ్గినా శరీరంలో ఎటువంటి ప్రమాదకర మార్పులు సంభవిస్తాయో ఏ దేశ ఆర్ధిక వ్యవస్ధలో అయినా కరెన్సీ విలువ వుద్ధాన, పతనాలు అలాంటి పర్యవసానాలకే దారితీస్తాయి. అంటే మొత్తం జనాన్ని ముఖ్యంగా సామాన్య జనాన్ని తీవ్ర ప్రభావితం చేస్తాయి. ఎలాగో చూద్దాం.

మనకు చమురు నిక్షేపాలు తగినన్ని లేని కారణంగా అత్యధికంగా దిగుమతులపై ఆధారపడుతున్నాం. అందువలన ఆ రంగంలో పర్యవసానాలు మన నిత్యజీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నరేంద్రమోడీ అధికారాన్ని స్వీకరించిన తరువాత 2014 మే 29 జూన్‌ 11వ తేదీతో ముగిసిన పక్షంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు పీపా(బారెల్‌) ధర 106.72 డాలర్లు వుంది. ఆ రోజుల్లో డాలరు సగటు రూపాయి విలువ రు. 59.17 ఆ లెక్కన మనం రు 6314 లకు ఒక పీపాను కొనుగోలు చేశాము. ఇప్పుడు అంటే 2018 జూన్‌ 30 నాటికి ఒక పీపాధర 75 డాలర్లకు తగ్గినా రూపాయల్లో డాలరుకు రు.68-69 మధ్య విలువ పతనం కారణంగా పీపాను ఆరువేల రూపాయలకు అటూ ఇటూగా కొనుగోలు చేస్తున్నాము. నరేంద్రమోడీ సర్కార్‌ రూపాయి విలువ పతనాన్ని అరికట్టి స్ధిరంగా వుంచి వుంటే, ప్రపంచ ఆర్ధికవేత్తలు వూహించినట్లు 45-40 రూపాయలకు పెరిగి వుంటే చమురు ధరలు గణనీయంగా తగ్గి వుండేవి. అన్నీ తానే అయి చూసుకుంటున్న నరేంద్రమోడీ రూపాయి పతనాన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నారు.అది చేయలేకపోగా తన హయాంలో డీజిలు, పెట్రోలుపై పన్ను పెంచి అదనపు భారం ఎందుకు మోపి నట్లు ?

రూపాయి విలువ పతనమైతే ఎక్కువ మందికి నష్టం జరిగితే, లాభపడే వారు కూడా వుంటారు. విదేశాలలో వుద్యోగాలు చేస్తూ మన దేశానికి డాలర్లు పంపే వారికి ఇక్కడ రూపాయలు అదనంగా వస్తాయి. మన వస్తువులను దిగుమతులు చేసుకొనే వారు తక్కువ డాలర్లు చెల్లించి లబ్దిపొందుతారు. మన దేశం దిగుమతి చేసుకొనే ముడి చమురు, ఎరువులు, ఔషధాలు, పురుగుమందులు, పప్పుధాన్యాలు, పామాయిల్‌ వంటి ఖాద్య తైలాలకు ఎక్కువ డాలర్లు చెల్లించాలి, పర్యవసానంగా ధరలు పెరుగుతాయి. అవి ఇతర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తాయి. విదేశాలలో విద్యనభ్యసించేవారిపై భారం పెరుగుతుంది. విదేశాల నుంచి డాలర్ల రూపంలో తీసుకొనే రుణాలకు చెల్లించాల్సిన మొత్తాలు పెరుగుతాయి.

అంతర్జాతీయ మార్కెట్‌ ముఖ్యంగా డాలరుతో మన బంధం ముడివేసుకున్న కారణంగా, మన పాలకులు గత 70సంవత్సరాలుగా అనుసరిస్తున్న దివాలాకోరు ఆర్ధిక విధానాల పర్యవసానంగా కరవ మంటే కప్పకు కోపం విడవ మంటే పాముకు ఆగ్రహం అన్నట్లుగా మన రూపాయి విలువ పరిస్ధితి తయారైంది. విలువ తగ్గినా, పెరిగినా కార్పొరేట్లకు పోయిందేమీ లేదు. ఆ కారణాలతో దివాలా తీసి బలవన్మరణాలకు పాల్పడిన పెద్దలు ఒక్కరంటే ఒక్కరు కూడా వున్నట్లు మనకు వార్తలు లేవు. వారు బ్యాంకుల దగ్గర తీసుకున్న అప్పులను ఎగవేయటం, మన్మోహన్‌, మోడీ వంటి పాలకులు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు రుణాలు ఇవ్వటం, బ్యాంకులకు ఎగవేసిన కార్పొరేట్ల అప్పులను ఏటా లక్షల కోట్ల వంతున రద్దు చేయటం తప్ప మరొకటి చేయటం లేదు. ఎటు తిరిగి సామాన్య వ్యాపారులు, జనమే గగ్గోలు పెట్టి ఆత్మహత్యలకు పూనుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది. రూపాయి బలపడితే ఎగుమతి వ్యాపారులు లబోదిబో మంటే దిగుమతి వ్యాపారులు సంతోషించారు, ఇప్పుడు దిగుమతి వ్యాపారులతో పాటు జనమంతా గగ్గోలు పెట్టే దిశంగా ఈ పతనం కొనసాగుతుందా అనిపిస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ – యూ టూ బ్రూటస్‌ !

12 Tuesday Jun 2018

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Politics

≈ Leave a comment

Tags

maoists, maoists letter, Narendra Modi, Naxals, Nitin Gadkari, plotting the murder of PM Narendra Modi, RSS, Shehla Rashid, you too brutus

ఎంకెఆర్‌

జిగినీ దోస్త్‌, ప్రాణ స్నేహితుడు అనుకున్న బ్రూటస్‌ చేసిన ద్రోహానికి నివ్వెరపోయిన జూలియస్‌ సీజర్‌ యూ టూ బ్రూటస్‌ ( బ్రూటస్‌ నువ్వుకూడా ఇంత ద్రోహానికి పాల్పడతావా) అన్న విషయం తెలిసిందే. అధికారంతో కూడిన రాజకీయాల్లో ఎవరెప్పుడు, ఎందుకు వెన్ను పోటు పొడుస్తారో తెలియదు.

ప్రధాని నరేంద్రమోడీని రాజీవ్‌ గాంధీ తరహాలో హతమార్చేందుకు మావోయిస్టుల పేరుతో వున్న తీవ్రవాదులు కుట్రపన్నారనేది మహారాష్ట్ర పోలీసుల అభియోగం. ఒక వేళ నిజంగా అది నిజమే అయితే గర్హనీయమే. పోలీసులు గతంలో నక్సల్స్‌ మీద అనేక కుట్ర కేసులు బనాయించారు. దాదాపు ఏ ఒక్కటీ రుజువు కాలేదు. ఇది కూడా అలాంటిదే అయితే పోలీసుల తీరును ఖండించాల్సిందే. మన పోలీసు, దర్యాప్తు సంస్ధలను దుర్వినియోగం చేయటంతో వాటి మీద విశ్వాసం అడుగంటిన సమయమిది.

Image result for plotting the murder of PM Narendra Modi

జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్ధిని షీలా రషీద్‌ ఈ మధ్య ఒక ట్వీట్‌ చేశారు. నరేంద్రమోడీ హత్యకు కుట్రపన్నారనే పోలీసుల కధనం గురించినదే అది. ‘ దీన్ని చూస్తుంటే ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా నితిన్‌ గడ్కరీ మోడీని హతమార్చేందుకు, ఆ నెపాన్ని ముస్లింలు లేదా కమ్యూనిస్టుల మీద మోపి తరువాత ముస్లింలను వధించేందుకు పధకం వేస్తున్నట్లుగా కనిపిస్తోంది ‘ అన్నది దాని సారాంశం.

దీన్ని చూసి గుండెలు బాదుకోవాల్సిన అగత్యమేమీ కనిపించటం లేదు. ఆమె ట్వీట్‌ సంగతి పక్కన పెడితే అలాంటి ట్వీట్‌ చేసినందుకు పోలీసులు ఆమె మీద కేసునమోదు చేసినట్లు ఒక తప్పుడు ప్రచారాన్ని చేసిన వారు ఆమె ట్వీట్‌కు మరింత ప్రాచుర్యం కల్పించారు. పోలీసులు తమకు ఒక ఫిర్యాదు వచ్చిందని దాని మీద విచారణ చేస్తున్నాం తప్ప ఇంతవరకు కేసు నమోదు చేయలేదని చెప్పారు. ఏదో ఒక సాకుతో ఆమె మీద కేసును కూడా నమోదు చేసినా ఆశ్చర్యం లేదు.

కొంత మంది ఆర్‌ఎస్‌ఎస్‌ నిజస్వరూపాన్ని చూసి బయటకు వచ్చిన వారు ఆ సంస్ధ చేసే కుట్రల గురించి బహిరంగంగానే చెప్పారు. వాటి గురించి తెలిసిన వారికి షీలాకు వచ్చిన అనుమానం ఎంతో మందికి వచ్చింది. ఎల్‌కె అద్వానీ ప్రధాని కాకుండా ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి నేతలు కొందరు తెరవెనుక మంత్రాంగం నడిపారన్నది బహిరంగ రహస్యం. దానికి ముసుగుగా వయస్సును, మరొకదాన్ని ముందుకు తేవటం వేరే విషయం. ఎన్‌టి రామారావుకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు అండ్‌ కో చేసిన మంత్రాంగం, యంత్రాంగం కూడా తెలిసినదే. దానికే మరోపేరు కుట్ర. మతపరమైన వుగ్రవాద లేదా సాంస్కృతిక సంస్ధల ముసుగులో వున్న హిందూత్వ సంస్ధలు, ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా తాలిబాన్‌, ఐఎస్‌ వంటివిగానీ రాజకీయంగా కమ్యూనిస్టుల పేరుతో వుగ్రవాద చర్యలకు పాల్పడే వివిధ సంస్ధలు గానీ తమ పధకాల అమలుకు కుట్రలు చేయటం సాధారణమే. మూసిపెట్టి వుండే ప్రతి సంస్ధ నిత్యం ఏదో ఒక కుట్ర చేస్తూనే వుంటుంది.

2008లో మావోయిస్టులు లాల్‌ఘర్‌ ప్రాంతంలో నాటి ముఖ్యమంత్రి బుద్దదేవ్‌ భట్టాచార్యను హతమార్చేందుకు మందుపాతరలు పేల్చిన విషయం తెలిసిందే. ఎక్కడో ఒక దగ్గర కుట్ర జరగకుండా అలాంటివి జరగవు. అయితే సిపిఎం ఎన్నడూ ఆ వుదంతాన్ని చూపి సానుభూతి పొందేందుకు ప్రయత్నించలేదు. అదే మావోయిస్టులు సిపిఎంకు వ్యతిరేకంగా మమతా బెనర్జీతో చేతులు కలపటం, చివరకు ఆమె చేతిలో వారెలాంటి చావు దెబ్బలు తిన్నది చరిత్రలో నమోదైంది. వారిని రాజకీయంగా ఎదుర్కొంటూనే, అధికారంలో వున్న కారణంగా శాంతిభద్రతల సమస్య వరకు యంత్రాంగాన్ని వుపయోగించి సిపిఎం పని చేసింది. ఇప్పుడు మావోయిస్టులు నరేంద్రమోడీని హతమార్చేందుకు రాజీవ్‌ గాంధీ తరహాను అమలు చేసేందుకు నిజంగా ఆలోచిస్తున్నారా లేక నరేంద్రమోడీ ప్రచార ఆయుధంగా తప్పుడు లేఖలు సృష్టించారా అన్నది తరువాత బయటపడక మానదు. అలాంటి ప్రయత్నాలు నిజంగా చేస్తే ఎవరు చేసినా అది గర్హనీయమే. ఒక దుష్ట భూస్వామిని అంతం చేసినంత మాత్రాన ఆ వ్యవస్ధ అంతరించలేదు. అంతకంటే పేరు మోసిన వారు కొన్ని డజన్ల మంది వచ్చారు, వస్తారు. ఇది ఎవరికైనా వర్తిస్తుంది.

చరిత్రలో జరిగిన అనేక వుదంతాలను చూసినపుడు ఏమి జరిగినా ఆశ్చర్యం లేదు. అమెరికా మాజీ అధ్యక్షుడు కెన్నడీ హత్య జరిగి ఐదు దశాబ్దాలు కావస్తున్నది. అనేక రహస్యాలను ఛేదించిన ఎఫ్‌బిఐ, సిఐఏ ఈ విషయంలో హత్యవెనుకు ఎవరున్నారు, దేనికి చేశారు అన్నది ఇంతవరకు కనిపెట్టలేకపోయాయి. హత్య చేసేందుకు ఏదో ఒక సమయంలో ప్రయత్నించిన బృందాలు 42 వున్నాయని, 82 మంది హంతకులు, 214 మంది ఇతరులు వున్నారని చెప్పటం తప్ప జరిగిందేమిటో తెలియదు. ఇందిరా గాంధీ హత్య వెనుక వున్న కుట్ర, ఇతర విషయాల గురించి బయటకు చెప్పరాదని ఏకంగా ఒక నిర్ణయమే చేశారు. ఇలా చరిత్రలో ఎన్నో వున్నాయి. తాము పెంచి పోషించిన వుగ్రవాదం లేదా మతోన్మాదం చేతిలో తామే బలైపోయిన వుదంతాలు ఎన్నో వున్నాయి.

ఇండోనేషియాలో కమ్యూనిస్టులను అణచివేసేందుకు నాటి మిలిటరీ అధిపతి సుహార్తో తన సహచరులను కొందరిని చంపించి ఆ నెపాన్ని కమ్యూనిస్టులపై మోపి లక్షల మందిని వూచకోత కోయించాడు. పంజాబ్‌లో రాజకీయ ప్రత్యర్ధి అకాలీదళ్‌ను ఎదుర్కొనేందుకు ఇందిరా గాంధీ వుగ్రవాది భింద్రన్‌వాలేను పెంచి పోషించిన చరిత్ర, చివరకు వాడిని హతమార్చినందుకు ప్రతీకారంగా భద్రతా సిబ్బంది రూపంలో వున్న మరొక వుగ్రవాది చేతిలో హతమైన విషయం తెలిసిందే. రాజకీయ ప్రయోజనాల కోసం శ్రీలంక తమిళతీవ్రవాదులకు మద్దతు, శిక్షణ కూడా ఇచ్చేందుకు మన దేశం ఏర్పాట్లు చేసిన విషయం బహిరంగ రహస్యం. చివరకు అలాంటి వారిని అదుపు చేసేందుకు మన దేశమే శాంతి నెలకొల్పే పేర సైన్యాన్ని పంపి తీవ్రవాదులను అణచేందుకు ప్రయత్నించింది. దాని పర్యవసానమే రాజీవ్‌ గాంధీ చివరికి అదే తీవ్రవాదుల చేతుల్లో హతమైన విషయం తెలిసిందే.

వుగ్రవాదం అనేక రూపాలలో వుంటుంది. ఎప్పుడూ ఒకే విధంగా వుండదు. కొత్తది పుట్టుకు వస్తుంది. తాలిబాన్లే ఒక కొత్త పరిణామం అయితే,ఐఎస్‌ గురించి ఎవరైనా వూహించారా? దేశంలో గత కొన్ని దశాబ్దాలుగా రెచ్చగొట్టిన పర్యవసానాలను తక్కువ అంచనా వేయకూడదు.

వాగ్దానం చేసినట్లుగా అయోధ్యలో రామాలయం కట్టనందుకు హిందూత్వశక్తులు వుగ్రవాదులుగా మారవచ్చు. విశ్వహిందూపరిషత్‌ నుంచి బయటకు వెళ్లగొట్టిన ప్రవీణ్‌ తొగాడియా స్వంత దుకాణం తెరవబోతున్నాడు. తనను హతమార్చటానికి కుట్ర జరిగిందని ఆయనే స్వయంగా చెప్పారు. ఆ కుట్ర ముస్లింలు చేశారని ఆయన చెప్పలేదు, అంటే ఆయన పనిచేసిన సంస్ధలు, పార్టీలకు చెందిన వారే అందుకు ప్రయత్నించారని అనుకోవాలి. అనేక సంస్ధలు రామాలయం మీద బిజెపి మాట తప్పిందనే విమర్శలు ప్రారంభించాయి.

వున్మాదాన్ని పెంచి పోషించిన తరువాత దానికి తన మన అనే విచక్షణ వుండదు. అందువలన అలాంటి ధోరణులను ప్రోత్సహించిన వారు, పరమత ద్వేషాలను రెచ్చగొడుతున్నవారికి ఎప్పుడు ఏ వైపు నుంచి ముప్పు వుంటుందో చెప్పలేము. వుగ్రవాదులు అన్న తరువాత అది మత పరమైనదైనా మరొకటైనా నిత్యం చేసేది అదే.

నరేంద్రమోడీ పట్ల విమర్శనాత్మకంగా వున్నవారిని, మతోన్మాదాన్ని వ్యతిరేకించే జర్నలిస్టులు, రచయితలు, మేథావులను అనేక మందిని హతమార్చిన వారు, ఇప్పటికీ బెదిరింపులకు పాల్పడుతున్నది హిందూత్వ శక్తులు అన్నది అందరికీ తెలిసిన రహస్యం. షీలా రషీద్‌ ట్వీట్‌ గురించి గుండెలు బాదుకుంటున్నవారు, గౌరీ లంకేష్‌కు సక్సల్స్‌తో సంబంధాలున్నాయని వారే ఆమెను హత్య చేశారని ప్రచారం చేసిన విషయాన్ని జనం ఇంకా మరచి పోలేదు. కొంత మంది నక్సల్స్‌ను ప్రభుత్వానికి లొంగిపోయేట్లు గౌరీ చేశారని, అది గిట్టని నక్సల్స్‌ ఆమెను హత్య చేశారని ప్రచారం జరిగిందా లేదా? చివరికి దొరికిన నిందితుడు హిందూత్వ సంస్ధల ప్రమేయం వుందని పోలీసుల ముందు అంగీకరించినట్లు తాజా వార్తలు. అందువలన రాజకీయ ప్రయోజనం కోసం ఎవరు, ఎంతటి దారుణాలకు పాల్పడతారో తెలియదు. లేదూ హిందూత్వశక్తులు ప్రచారం చేసినట్లుగా నక్సల్సే గౌరీ లంకేష్‌ను హతమార్చారు అనుకుంటే అదే పని మోడీనో మరొకరినో హతమార్చటానికి ఆయన పార్టీలోనే కొందరు కుట్ర చేయవచ్చని ఎవరికైనా అనిపిస్తే ఆశ్చర్యం ఏముంది? గుజరాత్‌ బిజెపి నేత, మాజీ హోంమంత్రి అయిన హరేన్‌ పాండ్య హత్య వెనుక వున్న కుట్ర ఏమిటో ఇప్పటికీ బయటకు రాలేదు, స్వంత పార్టీ నేతలవైపే అనేక కళ్లు చూసిన మాట నిజం కాదా?

రాజకీయ ప్రత్యర్ధుల గురించి, ఇబ్బందులు వచ్చినపుడల్లా గతంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విదేశీ హస్తం గురించి ఎక్కువగా చెబుతుండేవారు, చివరికి ధరల పెరుగుదల వెనుక కూడా విదేశీ హస్తం వుందనేంత వరకు పోయారని ఎన్నో జోకులు పేలాయి అప్పుడు. ఇప్పుడు స్వయంగా నరేంద్రమోడీ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం తన హత్యకు కుట్ర గురించి చెప్పారు, ఇప్పుడు మరోసారి అదే ప్రచారాన్ని మొదలెట్టారని జనం అనుకుంటున్నారు. అందుకు ఆస్కారం ఇచ్చింది ఎవరు?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఫిట్‌నెస్‌ కాదు మోడీజీ, మౌనముద్ర సవాల్‌ స్వీకరించండి !

26 Saturday May 2018

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Anushka sarma, fitness challenge, Kohil's challenge, Narendra Modi, narendra modi fitness challenge, petrol price, Rahul gandhi

Image result for narendra modi fitness challenge

ఎం కోటేశ్వరరావు

అమెరికాలో ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి రేటు, వడ్డీ రేటు పెంచితే మన రూపాయి విలువ మరింత దిగజారుతుందా ? అవును, ఇదేమి లంకె అనుకుంటున్నారా ? చమురు ధరలు పెరిగితే దానిని వుత్పత్తి దేశాలకు ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం, ఆనందం. మనకు విషాదం, తారాజువ్వల్లా ధరల పెరుగుదల ! ఎంకిపెళ్లి సుబ్బి చావుకు రావటం అంటే ఇదేనా ! ప్రపంచ మార్కెట్లో చమురు ధరల పెరుగుదల మన రూపాయి విలువ పతన కారణాలలో ఒకటని అనేక మంది చెబుతుంటే మన చమురు, సహజవాయు శాఖ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ గారు మాత్రం దానికి రూపాయి విలువ పతనం అని మరొకదాన్ని జోడించి మన దేశంలో పెట్రోలియం, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయని సెలవిచ్చారు. చమురు ధరలు మన చేతుల్లో లేవు సరే మన రూపాయి విలువ కూడా మన అదుపులో లేదా ? పాపాయి వంటి రూపాయికి రక్షణ లేకుండా పోతోందని ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ గుండెలు బాదుకున్న విషయం మరచిపోయారా ?

పెట్రోలు ధరల గురించి ఈ రోజు రాసింది రేపటికి చద్దివార్త అవుతోంది. ధరలు మారిపోతున్నాయి. అందువలన ఈ రోజు ఎంత అన్నది వదిలేద్దాం. కొద్ది నెలల క్రితం గోల్డ్‌మన్‌ సాచస్‌ అనే సంస్ధ విడుదల చేసిన విశ్లేషణ ప్రకారం అమెరికాలో ఆర్ధిక వ్యవస్ధ మెరుగుపడుతున్న కారణంగా(ఎలాంటిది, ఎంతనేది వేరే విషయం) నిరుద్యోగరేటు తగ్గుతోంది, పర్యవసానంగా 2018లో అక్కడ వడ్డీ రేట్లు నాలుగు సార్లు పెరిగే అవకాశం వుందన్నది ఒక అంశం. ఇదే జరిగితే బలహీనమైన ఆర్ధిక వ్యవస్ధలతో అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడి(డాలర్ల రూపంలో) అమెరికన్‌ మార్కెట్లకు తరలిపోతుంది. అటువంటి పరిస్ధితులలో మనది బలహీన ఆర్ధిక వ్యవస్ధ కానప్పటికీ దేశంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఎఫ్‌పిఐలు షేర్‌ మార్కెట్లో, అప్పు మార్కెట్లో పెట్టుబడులు పెడతారు. ఎక్కడ మోసం చేయటానికి జనం దొరుకుతారో అక్కడికి నవారు ఆట మోసగాండ్లు ఎప్పటికప్పుడు మకాంలు ఎలా మారుస్తారో అలాగే విదేశీ మదుపుదార్లు మన దేశంలో కంటే వాటిమీద ఎక్కడ ఎక్కువ రాబడి వస్తే అక్కడకు ఇక్కడ అమ్మేసి తరలిస్తారు. వారికేమీ దేశభక్తి, మన దేశం ఏమి అవుతుంది అనేదేమీ వుండదు. అలా పెట్టుబడులు తరలిపోయినపుడు వాటి మీద ఆధారపడి ప్రారంభించిన కొత్త ప్రాజెక్టులు, విస్తరణ ఆగిపోతుంది. నిరుద్యోగం పెరుగుతుంది. అమెరికాలో పరిస్ధితులు మెరుగుపడితే మన రూపాయి విలువ పతనం అవుతుంది, దిగజారితే డాలరు విలువ తగ్గి మన రూపాయి విలువ పెరుగుతుంది. అప్పుడు మనం కొనే చమురుకు చెల్లించాల్సిన డాలర్ల మొత్తం తగ్గుతుంది. అసలు చమురు రేట్లే పెరిగితే ఆ భారం ఇంకా పెరుగుతుందని చెప్పనవసరం లేదు.

అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే అక్కడ వున్న ప్రవాస భారతీయులు అక్కడే పెట్టుబడులు పెడతారు తప్ప మన దేశానికి డాలర్లను తరలించరు. మన వారికే దేశభక్తి లేనపుడు మిగతావారి గురించి చెప్పేదేముంది. అమెరికా ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుంది. అక్కడ వాటి వడ్డీ రేట్లు పెరిగితే మన దేశం కంటే అక్కడ ఎక్కువ వచ్చేట్లయితే ఇక్కడి అప్పును అయినకాడికి అమ్మేసి డాలర్లను తీసుకుపోతారు. దీని ప్రభావం మన స్టాక్‌ మార్కెట్‌ మీద కూడా పడుతుంది. మన దేశంలో పెట్టుబడులు కావాల్సిన వారు విదేశాల నుంచి తీసుకోవాలంటే ఎక్కువ రేటు చెల్లించాలి. గతంలో మన రూపాయి విలువ ఎక్కువగా వుండి డాలరు విలువ తక్కువగా వున్నపుడు అందిన కాడికి మన కంపెనీలు అప్పులు తీసుకువచ్చాయి. తరువాత డాలరు రేటు పెరగటం, మన రూపాయి పతనంతో ఆ కంపెనీలు తలకు మించిన రుణభారంతో దెబ్బతిన్నాయి.

తిరుగుతున్న చక్రం మీద కూర్చున్న ఈగ చక్రాన్ని తానే తిప్పుతున్నట్లు భావిస్తుందట. నరేంద్రమోడీ సర్కార్‌ గత నాలుగు సంవత్సరాలలో మూడు సంవత్సరాలు విజయగీతాలాపన చేశారు. నాలుగోఏడాది పూర్తయ్యే సరికి గొంతు బొంగురు పోతోంది.యుపిఏ హయాంలో 2012-13 సంవత్సరాలలో చమురు పీపాధర 150 డాలర్ల వరకు పోయింది. సరే అప్పుడు పెట్రోలు లీటరు రు.70కి అటూ ఇటూగా వున్నపుడు ఇంత ఘోరమా అంటూ బిజెపి పెద్దలందరూ వీధులలో నిరసనలతో హోరెత్తించారు. అలాంటి ధరలు కాస్తా నరేంద్రమోడీ అధికారానికి వచ్చాక ఒక దశలో కనిష్టంగా 33 డాలర్లకు పడిపోయాయి. అయినా పెట్రోలు రు.60కి మించి తగ్గలేదు. చమురు ఆదాయం మీద ఆధారపడిన అనేక దేశాలు అల్లాడుతుంటే మన దేశం ఎంతో లబ్ది పొందింది. అది సామాన్య జనానికి కాకుండా కార్పొరేట్లకు అన్నది తిరుగులేని నిజం. తగ్గిన చమురు భారాన్ని జనానికి బదలాయించకుండా వచ్చిన లాభాన్ని ద్రవ్యలోటు పూడ్చేందుకు వినియోగించి లోటును తగ్గించిన ఘనత మాదే అని గొప్పలు చెప్పుకున్నారు. ఇదే సమయంలో కార్పొరేట్లకు పెరిగాయి తప్ప రాయితీలు ఏమాత్రం తగ్గలేదు. కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం మరియు సహజవాయు శాఖ వార్షిక నివేదికల ప్రకారం ముడి చమురు దిగుమతులు, పీపా సగటు ధరలు ఇలా వున్నాయి.

సంవత్సరం    మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు    ధర డాలర్లలో        దిగుమతి ఖర్చు రు.కోట్లు

2011-12         171.729               111.89                ======

2012-13         184.795              107.97           7,84,562

2013-14         189.238            105.52            8,64,875

2014-15         189.43                84.16            6,87,416

2015-16         202.85                46.17             4,16,579

2016-17        213.93                47.56              4,70,159

2017-18        217.08                53.59             3,42,673

2017-18 సంవత్సరంలో 217 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు దిగుమతి అంచనా కాగా మూడు లక్షల 42వేల 673 కోట్లు ఏప్రిల్‌-నవంబరు మాసాలలో దిగుమతి చేసుకున్న మొత్తానికి చెల్లించిన సొమ్ము. ఈ అంకెలు నరేంద్రమోడీ సర్కార్‌పై చమురు దిగుమతుల బిల్లు భారాన్ని ఎంతగా తగ్గించాయో చెబుతున్నాయి. ఇంత భారం తగ్గినప్పటికీ దాన్ని వినియోగదారులకు బదలాయించకపోగా మోడీ ప్రభుత్వం వినియోగదారులపై అదనంగా ఎంత భారం మోపిందో చూద్దాం.

2013-14లో(నరేంద్రమోడీ 2014 మే 26న పదవిలోకి వచ్చారు) యుపిఏ సర్కార్‌ పెట్రోలు, డీజిల్‌, ఇతర పెట్రోలియం వుత్పత్తుల మీద విధించిన పన్నుల ద్వారా కేంద్రానికి వచ్చిన ఆదాయం 88,600 కోట్ల రూపాయలు. ఈ మొత్తం మోడీ హయాంలో వరుసగా నాలుగు సంవత్సరాలలో 1,05,653, 1,85,598, 2,53,254, 2,01,592, 2,57,850లకు పెరిగింది. ఈ అంకెలలో 2017-18 సంవత్సరానికి చూపిన 2,01,592 కోట్ల రూపాయలు ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు మాత్రమే. అంటే మిగిలిన మూడు నెలలకు సగటున మరో 67వేల కోట్ల రూపాయలను వేసుకుంటే 2,68,790 కోట్లుగా వుంటుంది.ఈ లెక్కన నాలుగేండ్లలో ఎన్ని లక్షల కోట్ల రూపాయల సబ్సిడీని వుపసంహరించిందో, ఎన్నిలక్షల కోట్ల భారం మోపిందో అర్ధం చేసుకోవటం కష్టం కాదు.

పిఎంఓ రిపోర్డు కార్డు పేరుతో అచ్చు కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ అనే భ్రమ కలిగించే ఒక బిజెపి ప్రచార వెబ్‌సైట్‌ వుంది. దాని మీద ప్రధాని బొమ్మ, మూడు సింహాలు, జాతీయ జెండా కూడా వుంటాయి. దాని మీద సామాన్యులకు అర్ధం కాకుండా అనధికారికం అనే ఒక పదం వుంటుంది. అయితే దాని ఫేస్‌బుక్‌ పేజీ చూస్తే కాని అది అనధికారికం, వలంటీర్లు నిర్వహిస్తున్నది అని తెలుస్తుంది. వలంటీర్లంటే కిరాయి బాపతు అని వేరే చెప్పనవసరం లేదు. మోడీ సర్కార్‌కు పెట్రోలు మంటల సెగ తగులుతుండటంతో ఆ గ్యాంగు ఒక పట్టికను తయారు చేసి జనం మీదకు వదిలింది.

2009-13 సంవత్సరాల మధ్య, తరువాత 2018వరకు ముంబైలో పెట్రోలు ధరలంటూ ఒక పట్టిక ఇచ్చింది. వాటిని ఎలా నిర్ధారించారో తెలియదు, వదలివేద్దాం. యుపిఏ ఐదేండ్ల కాలంలో పెట్రోలియం వుత్పత్తుల మీద ఇచ్చిన సబ్సిడీ దాని పట్టిక ప్రకారం 5,67,449 కోట్లు, తరువాత మోడీ నాలుగు సంవత్సరాల కాలంలో ఇచ్చిన మొత్తం 1,33,663 కోట్లుగా తెలిపింది. యుపిఏ హయాంలో ఇచ్చిన సబ్సిడీ నుంచి మోడీ ఏలుబడి సబ్సిడీ మొత్తాన్ని తీసి వేసి యుపిఏ కాంగ్రెస్‌ లూటీ చేసిన 4,43,308 కోట్ల రూపాయల మొత్తం ఏమైందో ఆశ్చర్యంగా వుందంటూ ఒక వ్యాఖ్యను జోడించారు. లూటీ మొత్తమంటూ పేర్కొన్నది కూడికలు తీసివేతలు కూడా సరిగా రాని వారు వేసిన అంకె. ఆ మొత్తం వినియోగదారులకు దక్కింది అని వేరే చెప్పనవసరం లేదు. ఇక్కడ మోడీగారిని అడగాల్సింది, జనానికి తెలియాల్సిందేమంటే ఆ పట్టిక ప్రకారం సబ్సిడీలో విధించిన కోత 4,33,786 కోట్లు, పెంచిన పన్నులతో వసూలు చేసిన మొత్తం 8లక్షల 20వేల కోట్లకు అటూగా వుంది. అంతకు ముందు మాదిరి పన్ను రేటు అలాగే వుందనుకుంటే అది ఏడాదికి ఒక లక్ష కోట్ల రూపాయలనుకుంటే మోడీ సర్కార్‌ జనం మీద మరో నాలుగు లక్షల కోట్ల భారం మోపినట్లే ? దీనికి కోతపెట్టిన సబ్సిడీని కూడా కలుపుకుంటే ఏడాదికి రెండులక్షల కోట్ల మేరకు జనం మీద భారం మోపినట్లే . జనం ఆశ్చర్యపోవాల్సిందీ, నిలదీయాల్సిందీ ఇంత భారం మోపి సాధించిన ప్రగతి ఏమిటీ అని?

నాలుగు సంవత్సరాల క్రితం అమెరికాలో ఒక వ్యాధి మీద పరిశోధనకు అవసరమైన నిధుల సేకరణకు కొంత మంది ఒక బకెట్‌లో నీళ్లు, మంచు ముక్కలు కలుపుకొని తల మీద పోసుకొని ఇతరులు కూడా అలాగే చేయాలని సవాలు విసిరారు. జనం వేలం వెర్రిగా ఆపని చేశారు. సరే తరువాత అది ఎంత అపహాస్యమైందో ఎన్ని జోకులు పేలాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు నరేంద్రమోడీ గారిని జనం చమురు గురించి, ఇతర వాగ్దానాల గురించి నిలదీస్తుంటే వాటికి ఎక్కడా సమాధానాలు చెప్పటం లేదు. ఇప్పుడు మరోవేలం వెర్రిగా మారుతున్న ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ను పట్టుకొని జనాలు తామేం చేస్తున్నదీ ఫొటోలు పెడుతున్నారు.దాన్లో భాగంగా క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ తన భార్య అనుష్కశర్మతో పాటు ప్రధాని నరేంద్రమోడీకి కూడా ఫిట్‌నెస్‌ సవాలు విసిరాడు. వయసులో వున్న కోహ్లీ నాలుగు కాలాలపాటు క్రికెట్‌ ఆడి, నాలుగు వాణిజ్య ప్రకటనలు చేసి నాలుగు డబ్బులు వెనకేసుకోవాలంటే ఫిట్‌నెస్‌ అవసరం. ఆయన భార్య అనుష్కశర్మ సినిమా హీరోయిన్‌, ఆమెదీ అదే పరిస్ధితి, అందులోనూ వారిద్దరికీ ఈ మధ్యే వివాహం కూడా అయింది.ఫిట్‌నెస్‌ గురించి వారిద్దరూ ఒకరికొకరు సవాలు విసురుకున్నారంటే అందం, అర్ధం వుంది. మరి ఈ వయస్సులో నరేంద్రమోడీకి ఎందుకు ! ఒకవైపు దేశంలో మీరు ప్రధాని పదవికి అన్‌ఫిట్‌ (తగరు) అనే అభిప్రాయం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇటువంటి స్ధితిలో ప్రతిపక్షాలు విసురుతున్న అనేక సవాళ్ల గురించి పట్టించుకోకుండా దేశం తగులబడుతుంటే ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్న నీరో చక్రవర్తి మాదిరి నేను కూడా శారీరక ఫిట్‌నెస్‌ సవాలును స్వీకరిస్తా అంటూ క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో సై అనటం నరేంద్రమోడీకి తగని పని. నీరోకూ ఆయనకు పెద్ద తేడా కనపడటం లేదు. దేశమంతటా చమురు ధరల గురించి చర్చ చేస్తుంటే చమురు సవాలును స్వీకరించాలని రాహుల్‌ గాంధీ విసిరిన సవాలు గురించి మౌన ముద్రదాల్చారు. సామాజిక మీడియాలో దాని మీద పేలుతున్న జోకులెన్నో సరేసరి. నిజానికి ఇప్పుడు నరేంద్రమోడీ ముందున్నది మరోసారి ప్రధాని పదవికి అర్హత వుందా అన్నది పెద్ద సవాల్‌. ఏ ప్రధాన సమస్య గురించి నోరు విప్పని మోడీ వాటి గురించి మాట్లాడాలి.

మన దేశంలో కేంద్రంలో ఎవరు అధికారానికి వచ్చినా ఒకే చెప్పుల్లో కాళ్లు దూర్చుతున్నారు, ఒకే బాటలో నడుస్తున్నారు. అది పదేండ్ల మన్మోహన్‌ సింగ్‌ పాలన కావచ్చు, నాలుగేండ్ల నరేంద్రమోడీ ఏలుబడి కావచ్చు. ప్రపంచీకరణ యుగంలో మనం ఒంటరిగా వుండలేమన్నది నిజం. కిటికీ మూసుకుంటే గాలి ఆడక వుక్కిరి అవుతాం. తెరిస్తే ఈగలు, దోమలతో పాటు ఇప్పుడు కొత్తగా గబ్బిలాల వైరస్‌ కూడా ప్రవేశించే ప్రమాదం వుంది. ఇప్పటికే దేశంలో అంతకు మించి ముప్పు తెచ్చే మతోన్మాద వైరస్‌ ప్రమాదకరంగా విస్తరిస్తోంది. దీనికి దివాళాకోరు ఆర్ధిక విధానాల కారణంగా ఆర్ధిక దిగజారుడు తోడైంది. వీటిని జంటగా ఎదుర్కోవటం పెద్ద సవాల్‌. దేశం ఈ ఛాలెంజ్‌ను స్వీకరిస్తుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నోటి తుత్తర నేతలు -బిజెపి ద్వంద్వ ప్రమాణాలు !

25 Wednesday Apr 2018

Posted by raomk in BJP, Communalism, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

BJP double standards, BJP motor mouths, motormouths, Narendra Modi

ఎం కోటేశ్వరరావు

నోటి తుత్తరతో సమస్యలు తీసుకురావద్దని ప్రధాని నరేంద్రమోడీ తన పార్టీ అనుచరగణానికి చెప్పాల్సి రావటం ఆ పార్టీ ఎలాంటి సంకట స్ధితిని ఎదుర్కొంటోందో తెలియచేస్తోంది. జర్నలిస్టుల ప్రత్యక్షంగా మాట్లాడకుండా మౌన దీక్షపూని ఒక ప్రపంచ రికార్డు ఇప్పటికే సృష్టించిన మోడీ త్వరలో ఐదో సంవత్సరంలో ప్రవేశించబోయే వుత్సవంతో కలిపి దాన్ని కూడా ఒక విజయంగా జరుపుకుంటారు. ఒకవైపు నేత నిక్కచ్చిగా వుంటే మరోవైపు అందుకు విరుద్ధంగా పండ్లుతోముకోవటమైనా మానతారేమోగాని బిజెపి నాయకులు మీడియా ముందు మాట్లాడకుండా ఒక్కరోజు కూడా గడపలేని స్ధితికి వచ్చారు. అయితే మోడీ ఇప్పుడెందుకు హెచ్చరించారనేదే అందరినీ ఆలోచింపచేస్తున్న అంశం. ఊరందరిదీ ఒక దారయితే వులిపికట్టెది మరొక దారి అన్నట్లుగా కథువా(అసిఫా) అత్యాచార వుదంతంపై దేశ మంతటా ఆగ్రహం, విచారంతో నిరసన వ్యక్తం చేస్తుంటే, పన్నెండేళ్లలోపు బాలికలపై అత్యాచారాలు జరిగినపుడు నిందితులకు వురి శిక్ష విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ చారిత్రాత్మకమైనది కనుక పండుగ చేసుకోవాలని బిజెపి నేతలు పిలుపునిచ్చారు.

వైపరీత్యం ఏమంటే ఎనిమిదేండ్ల అసిఫాపై అత్యాచారం జరిపి హత్య చేశారని కొందరిపై అభియోగం మోపారు. నిందితులు నిర్దోషులని, హిందువులను గబ్బు పట్టించటానికి ఇదంతా చేస్తున్నారంటూ వీధులకు ఎక్కి ప్రదర్శనలు చేసిందీ, కేసు నమోదుచేయకుండా పోలీసులను అడ్డుకున్న బిజెపి అనుకూల లాయర్ల, నేతలు,కార్యకర్తల తీరు తెన్నులు చూసి దేశం ఇంకా దిగ్బ్రాంతి నుంచి ఇంకా కోలుకోలేదు.Û గతంలో గోరక్షకుల మంటూ ఆవులను రక్షించటానికి ముందుకు వచ్చిన వారే ముక్కుపచ్చలారని పసి పిల్లపై అత్యాచారం చేసిన నిందితులకు మద్దతుగా రేపిస్టు రక్షకులుగా ముందుకు వస్తారని ఎవరూ వూహించి వుండరు. దాన్నుంచి దృష్టిమళ్లించటానికి తెచ్చిన ఆర్డినెన్స్‌పై పండుగ చేసుకోవాలని పిలుపివ్వటం గుండెలు తీసిన బంట్లకు తప్ప అన్యులకు అసాధ్యం. బిజెపి అభిమానులు దీన్ని ఎలా జీర్ణించుకుంటున్నారో అనూహ్యం. తమదాకా వచ్చినపుడు గాని వారికి తెలియదని సరి పెట్టుకోవటం తప్ప ఇంకేం చేయగలం. అనేక ప్రజావ్యతిరేక నిర్ణయాలపై వేగంగా నిర్ణయం తీసుకున్న మోడీ సర్కార్‌ దీనిపై ఎందుకు తాత్సారం చేసిందని, అదీ ఆర్డినెన్స్‌ జారీ చేయాల్సినంత అగత్యం ఏమిటని అడగటం పాచిపోయిన పాత పాట ‘దేశద్రోహం’ అవుతుందేమో !

పన్నెండు సంవత్సరాల లోపు బాలికలపై అత్యాచారం జరిగితే మరణశిక్ష, 12ా16 సంవత్సరాల మధ్యవారిపై జరిగినపుడు పది నుంచి ఇరవై సంవత్సరాలకు పెంచాలని మోడీ సర్కార్‌ తెచ్చిన ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. బిజెపి అధికార ప్రతినిధి మీనాక్షీ లేఖీ మాట్లాడుతూ దీర్ఘకాలంగా చేస్తున్న డిమాండ్‌ను నేటికి నెరవేర్చారని, ఈ రోజు చారిత్రాత్మకం అన్నారు. మహిళాసాధికారత పెంపుదలకు, గొడ్డుచాకిరీని తగ్గించేందుకు మోడీ సర్కార్‌ తీసుకున్న సానుకూల చర్యల గురించి చర్చించాల్సిన దినమిదన్నారు. అంతటితో వూరుకుంటే కిక్కేముంది. సమాజంలో వున్న కొంతమంది వున్మాదుల పట్ల కఠినంగా వ్యవహరించేందుకు తీసుకున్న చర్యలతో ఇది పండుగ చేసుకోవాల్సిన సందర్భమని అన్నారు.అసిఫా వుదంతంపై దేశమంతటా, విచార,మౌన, నిందుతులను వెనుకేసుకు వచ్చిన బిజెపి నేతలపై ఆగ్రహ ప్రదర్శనలు చేస్తుంటే ఈమె గారికి పండుగ చేసుకోవాల్సిన అవసరం కనిపించింది.

గత చరిత్రను చూసినపుడు బిజెపిలో నోటి దురుసుతనం లేదా తుత్తర ఎంత ఎక్కువగా వుంటే అంత త్వరగా వారు అధికార ప్రతినిధులుగా, పదవులు పొందుతారని వెల్లడైంది. దానికి కారణం మత, సామాజికరీత్యా విద్వేషభావాలను, ప్రచారాలను రెచ్చగొట్టటం, వదరుబోతుతనం తమకు ప్రయోజనకరమని ఆ పార్టీ వ్యూహకర్తలు భావించటమే. అదుపు తప్పిన నోళ్లు ఎప్పుడు ఏంమాట్లాడతాయో తెలియదు. అది రాజకీయంగా నష్టం కలిగించటం, తమ తెలివితక్కువ తనంతో ఓహో ఈ పార్టీ ఇలాంటివారితోనే నిండి వుందనే సందేశం ఇటీవలి కాలంలో అనేక మందికి అవగతం అవుతుండటంతో నోళ్లను అదుపులో పెట్టుకోవాలని మోడీ చెప్పాల్సి వచ్చింది.

‘ఇంత పెద్ద దేశంలో ఒకటి రెండు అత్యాచారాలు జరిగితే ఏమైంది, దానికే అన్ని వైపుల నుంచి నానా యాగీ చేయటం న్యాయం కాదు’ అంటూ కేంద్ర కార్మిక, వుపాధిశాఖల మంత్రి సంతోష్‌ గాంగ్వార్‌ స్వయంగా వ్యాఖ్యానించాడు. ఇలాంటి వ్యాఖ్యలు బిజెపి కార్యకర్తలకు మంచి వుత్సాహాన్నిచ్చి సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేకంగా స్పందించిన వారి మీద విరుచుకుపడేట్లు చేస్తాయి. అసలు విషయాన్ని జయప్రదంగా పక్కదారి పట్టిస్తాయి.’ ప్రతి సమస్య మీద విశ్లేషణ చేసే ఒక సామాజిక శాస్త్రవేత్తగానో లేక పండితులుగానో భావించుకొని టీవీ కనపడిన ప్రతిసారీ ఒక ప్రకటన చేసేందుకు తొందరపడవద్దు ‘ అని నమో ఆప్‌ ద్వారా నరేంద్రమోడీ తన సహచరులను మందలించారు. గత నాలుగు సంవత్సరాలలో అనేక మంది బిజెపి నేతలు మసాలా వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల ఒక బిజెపి నేత ఏర్పాటు చేసిన నైట్‌క్లబ్‌ను ప్రారంభించి మీడియాలో గబ్బుపట్టగానే నాకు అది క్లబ్బు అని చెప్పకుండా మోసం చేశారంటూ చేతులు దులుపుకున్న సాధువైన పార్టీ ఎంపీ గిరిరాజ్‌ సింగ్‌ ‘ ఒక వేళ రాజీవ్‌ గాంధీ ఒక నైజీరియన్‌ మహిళను పెళ్లి చేసుకొని వుంటే, ఆమెకు తెల్లతోలు లేకపోయి వుంటే కాంగ్రెస్‌ ఆమె నాయకత్వాన్ని ఆమోదించి వుండేదా ?’ అని వ్యాఖ్యానించారు. తరుణ్‌ విజయ్‌ అనే మరో ఎంపీ ‘ మేము జాత్యహంకారులమే అయితే మొత్తం దక్షిణ భారత్‌లో మేము ఎందుకు వుండేవాళ్లం. తమిళనాడు మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్‌ మరియు కేరళ మీకు తెలుసు, వారితో మేము జీవిస్తున్నాం, మా చుట్టూరా నల్ల వారున్నారు’ అని సెలవిచ్చిన విషయం తెలిసిందే. ‘డార్విన్‌ సిద్ధాంతం తప్పు ఎందుకంటే కోతులు మనుషులుగా మారటాన్ని ఎవరూ చూడలేదు’ అన్న సత్యపాల్‌ సింగ్‌, ‘మహాభారతంలో అంధుడైన ధృతరాష్ట్రుడికి సంజయుడు యుద్ధరంగంలో ఏం జరుగుతున్నదీ చెప్పగలిగాడంటే ఆ రోజు ఇంటర్నెట్‌ మరియు సాంకేతిక పరిజ్ఞానం వుండబట్టే ‘ అన్న త్రిపుర బిజెపి ముఖ్యమంత్రి విప్లవకుమార్‌ చెప్పిన మాటలతో బిజెపి నవ్వులపాలైంది. అయితే కొద్ధి సంవత్సరాల క్రితం ఇలాంటి మాటలను స్వయంగా నరేంద్రమోడీయే చెప్పినపుడు మీడియా వాటికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది. వాటిని సమర్ధించేందుకు అనేక మంది సమర్ధకులు బయటకు వచ్చారు. ఇప్పుడా సీన్‌ లేదు. అధికారానికి వచ్చిన ఆరునెలలకు 2014 అక్టోబరులో వైద్యులు,శాస్త్రవేత్తలు పాల్గన్న ఒక సమావేశంలో నరేంద్రమోడీ మాట్లాడుతూ మహాభారత సమయంలోనే జెనెటిక్స్‌ శాస్త్రంలో భారత్‌ ప్రావీణ్యం సంపాదించిందని, వినాయకుడికి ఏనుగుతలను అంటించటం ఆ సమయంలో మనకు ప్లాస్టిక్‌ సర్జన్స్‌ వున్నారనేందుకు ప్రత్యక్ష రుజువు అని సెలవిచ్చారు. అంతటి పెద్దమనిషే అలా అన్నతరువాత అనేక మంది తరువాత ఎన్నో అశాస్త్రీయ, కేవలం నవ్వులాటకు పనికి వచ్చే, మన దేశ పరువు తీసే అంశాలను ముందుకు తెచ్చి ప్రచారం చేసిన విషయం తెలిసిందే. వీటిని ప్రవచించిన పెద్దలందరూ నిజంగా వాటిని గట్టిగా విశ్వసించబట్టే చెప్పారు. ఎందుకంటే ఈ దేశంలోని తిరోగమన వాదులు బిజెపి పుట్టకముందే వేదాల్లోనే అన్నీ వున్నాయష అంటూ చేసిన ప్రచారాన్ని చిన్న తనం నుంచి తలకెక్కించుకున్నవారెందరో వున్నారు. వారిలో కాషాయ కుటుంబానికి చెందిన వారు అగ్రస్ధానంలో వుంటారు.

విద్వేష పూరిత ప్రసంగాలు చేసే నోళ్లు కూడా చిన్నవేమీ కాదు, తక్కువేమీ లేవు. వారు ఒక హిందువును చంపితే మేము వంద మంది ముస్లింలను చంపుతామన్న యోగి ఆదిత్యనాధ్‌, ఇంట్లో ఆవు మాంసం వుందంటూ దాద్రిలో దాడి చేసి ఇంటి యజమాని మహమ్మద్‌ అఖ్లాక్‌ను హత్యచేసిన తరువాత నిందితులను బదులు మాంసం కలిగి వున్నందుకు ఆ కుటుంబాన్ని అరెస్టు చేయాలన్న ఎంఎంల్‌ఏ సంగీత్‌ సోమ్‌, మన దేశాన్ని హిందుస్తాన్‌ అని పిలుస్తారు, అంటేదాని అర్ధం ఇది హిందువులది, గతంలో ఒక పద్దతి వుండేది ఎంత పెద్ద గడ్డం వుంటే అంత ఎక్కువ లబ్ది కలిగించేవారు అన్న ఎంఎల్‌ఏ విక్రమ్‌ సైనీ వ్యాఖ్యలు మచ్చుకు కొన్ని మాత్రమే. ఈ విషయంలో నరేంద్రమోడీ ఏమీ తక్కువ తినలేదు. ముఖ్యమంత్రిగా వున్నపుడే ముస్లిం కాందిశీక శిబిరాలన్నీ పిల్లలను పుట్టించే ఫాక్టరీలని, వుత్తర ప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో ఖబరస్తాన్‌(ముస్లింల శ్మశానవాటిక) ఏర్పాటు చేసినపుడల్లా ఒక శ్మశానాన్ని కూడా ఏర్పాటు చేయాల్సిందే అని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. బిజెపి మిత్ర పక్షం శివసేన నాయకులూ ఈ విషయంలో బిజెపితో పోటీపడతారు. అలాంటి పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయం బిజెపి ప్రజాప్రతినిధుల బాధ్యతారహితమైన వ్యాఖ్యలకు బాధ్యత ప్రధానిదే అని దాడి చేసింది. ఈ బిజెపి రాజ్యంలో ప్రధాని మోడీని చూసి వుత్తేజం పొందే పార్టీ మంత్రుల నోటికి అదుపుండదు అని పేర్కొన్నది.

పోనీ ఇలా నోరు అదుపులేని నేతల పట్ల బిజెపి గతంలో ఎలా వ్యవహరించింది? 2008లో ముంబై వుగ్ర దాడుల సందర్భంగా నాటి హోం మంత్రి ఆర్‌ఆర్‌ పాటిల్‌ నోరు జారారు. పెద్ద పట్టణాలలో ఇలాంటి చిన్నచిన్న అంశాలు జరుగుతుంటాయి అన్నందుకు గాను నానా యాగీ చేసిన బిజెపి ఆయన రాజీనామా చేసే వరకు వూరుకోలేదు. మరి ఇప్పుడు దేశమంతటినీ కుదిపివేసి వున్నావ్‌ అత్యాచార వుదంతంపై ఇంత పెద్ద దేశంలో ఒకటి రెండు అత్యాచారాలు జరిగితే ఏమైంది, దానికే అన్ని వైపుల నుంచి నానా యాగీ చేయటం న్యాయం కాదు అన్న కేంద్ర మంత్రి సంతోష్‌ గాంగ్వార్‌ను కనీసం అదే బిజెపి మందలించను కూడా లేదు, ద్వంద్వ ప్రమాణాలు అంటే ఇవే.

ఒక అత్యాచారం జరగ్గానే చేసిన వాడిని వురి తీయాలి, వాడి అంగాన్ని నరికివేయాలంటూ ఆగ్రహం తీవ్ర స్ధాయిలో వ్యక్తం చేయటం సహజం. హత్య నేరమే కొన్ని కేసులలో యావజ్జీవ శిక్ష పడుతుంది, కొన్నింటిలో వురి శిక్ష కూడా వేశారు. ఎందుకీ తేడా ? ఏదైనా హత్య హత్యేకదా ? వుద్రేకంలోనో, అసంకల్పిత ప్రతీకార చర్యలోనో మరొక కారణంతో జరిగితే అది సాధారణ హత్య. అలాగాక కుట్ర చేసి లేదా హత్యలు చేయటమే పనిగా పెట్టుకొని లేదా, వున్మాదంతో చేసేవి దారుణ హత్యలు. అందుకే శిక్షల్లో తేడా. వురి శిక్ష వేస్తే సమస్య పరిష్కారం అవుతుందా అంటే అనేక దేశాలు, మన దేశ అనుభవం చూసినా అలాంటి వాటి వలన ఫలితమేమీ కనపడటం లేదు. అందువలన సిపిఎం వంటి పార్టీలు, కొన్ని సంస్ధలు వురి శిక్షలు వద్దు ఇతర శిక్షలు వద్దని చెబుతున్నాయి. వద్దన్నవారిని దుండగులను ప్రోత్సహించేవారుగానూ, కావాలన్నవారిని నిరుత్సాహపరిచేవారుగానూ అనేక మందికి కనిపిస్తారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధులలోనూ, ఇతరత్రా చూసినపుడు అవాంఛనీయ శక్తులు ఇతర పార్టీలలనే ఎక్కువగా వున్నట్లు ఎవరికైనా ఇట్టే అర్ధం అవుతుంది.

సరే బిజెపి వారు అనేక చారిత్రకాంశాలకు ఆద్యులమని చెప్పుకుంటున్నారు గనుక వారు చెప్పుకున్నట్లు పన్నెండు సంవత్సరాల లోపు వయస్సు వున్న బాలికలపై అత్యాచారం చేసిన వారికి వురి శిక్ష విధిస్తూ , అంతకంటే కాస్త పెద్దవారిపై అత్యాచారం జరిగితే శిక్షను పది నుంచి 20కి పెంచుతూ శిక్షాస్మృతిని సవరిస్తూ తొలిసారిగా ఆర్డినెన్స్‌ తెచ్చిన ఆ ఖ్యాతిని కూడా వారి ఖాతాలోకే వేద్దాం. దాంతో పాటే మరొకదానిని కూడా వేయాలి. ఒక పన్నెండేళ్లలోపు బాలికపై అత్యాచార కేసులో నిందితులు నిర్దోషులంటూ హిందూ ఏకతా మంచ్‌ పేరుతో జరిపిన ప్రదర్శనలో బిజెపి మంత్రులు పాల్గనటం కూడా ఇదే ప్రధమం కనుక దీన్ని కూడా ఆ ఖాతాకే జమచేయటం న్యాయం.ఇక బేటీ బచావో నినాదం ఇచ్చిన ఖ్యాతి కూడా నరేంద్రమోడీ ఖాతాలోనే వేయాలి. దేశంలో అత్యాచారాలు ఈనాటివి కాదు. కొత్తగా బిజెపిలో ప్రారంభంగాని మాట నిజం.2016 లెక్కల ప్రకారం మొత్తం రేప్‌ కేసులు 39068,రోజుకు 107, గంటకు 4.46, ప్రతి 14ని నిమిషాలకు ఒక అత్యాచారం జరిగింది.

ఇక వివరాల్లోకి వస్తే ఆరేండ్ల లోపు అభాగినులు 520,6ా12 ఏండ్ల మధ్య వారు 1596,12ా18 ఏండ్ల మధ్య వయస్కులు 8656, మిగిలిన 22205 మందిలో 57 మంది అరవై సంవత్సరాల పైబడిన వారు కూడా వున్నారు. పన్నెండు సంవత్సరాల లోపు వారు 1114 మంది వున్నారు.2016లెక్కల ప్రకారం నాలుగో వంతు మైనర్‌ బాలికలపై జరుగుతున్నాయి. రెండు సంవత్సరాల నాడు ఇంత మందిపై జరిగాయి, తరువాత సంవత్సరం కూడా ఎంతమంది బలయ్యారో లెక్కలు వారికి అందుబాటులో వుంటాయి కనుక కేంద్రంలోని పెద్దలకు తెలియకపోదు. అలాంటపుడు ఆర్డినెన్స్‌లోని శిక్ష మంచిదో చెడ్డతో అన్న మీమాంసను పక్కన పెడితే ఇన్ని సంవత్సరాలు ఎందుకు తేలేదు, ఇన్నాళ్ల తరువాత తెచ్చిందానిని చారిత్రకం అని ఎందుకు డబ్బా కొట్టుకుంటున్నారు. దీన్ని కూడా ఓట్లకోసం వాడుకుంటారా? 2013 ఆగస్టు ఒకటిన ఆశారామ్‌ బాపు అనే ఒక బాబా దయ్యం వదలగొట్టే నెపంతో తనపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు బాబా నిర్దోషి అంటూ సమర్ధించిన వారిలో బిజెపి నేతలున్నారు. ఇప్పుడు ఆ కేసులో తీర్పు వెలువడనుండగా శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చుననే భయంతో పోలీసులను మోహరించాల్సిస దుస్ధితి వచ్చిందంటే బాబా భక్తులకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చినట్లు ? ఆ కేసులో బాబాపై పోస్కో చట్టంతో పాటు షెడ్యూలు కులాలు, తెగలపై అత్యాచార నిరోధ చట్టం కింద కూడా అభియోగాలను మోపారు.కోర్టు బాబాను దోషిగా తేల్చి యావజ్జీవ శిక్షవిధించింది. అదే కేసులో మరో నలుగురికి జోధ్‌పూర్‌ కోర్టు శిక్షలు వేసింది. ఈ సందర్భంగా ఐదు సంవత్సరాల క్రితం ముంబయ్‌లో శక్తి మిల్స్‌లో సామూహిక అత్యాచారానికి గురైన ఫొటో జర్నలిస్టు కేసును పరిశీలించటం సముచితం. ఇది శ క్తి మిల్స్‌ కేసుగా కూడా పిలుస్తారు. ఫొటో జర్నలిస్టుపై అత్యాచారం కేసులో 2014 మార్చి 20న ఇచ్చిన తీర్పులో ఐదుగురు నేరగాండ్లలో ముగ్గురికి మరణశిక్ష, ఒకడికి జీవిత ఖైదు విధించింది. అప్రూవర్‌గా మారినవాడిని వదిలేసింది. అదే మిల్స్‌ ఆవరణలో జరిగిన మరొక అత్యాచార వుదంతంలో ఒక మైనర్‌ బాలుడు నిందితుడు. వాడికి మూడు సంవత్సరాల శిక్ష విధించారు. చట్ట ప్రకారం అంతకంటే ఎక్కువ లేదు.

వదిలేద్దాం, ఓట్ల కోసం దేన్నయినా వాడుకోగల దిట్టగా బిజెపి ఆరితేరిందని దాని ఘనతను కీర్తిద్దాం. ఇప్పటికే వున్న చట్టాల ప్రకారం దారుణమైన నేరాలకు వురి శిక్ష విధించటానికి అవకాశం వుంది. ఈ నాలుగు సంవత్సరాలలో ఒక్క బాలిక వుదంతంలో కూడా కోర్టులు ఎందుకు వురి శిక్ష విధంచలేదు. న్యాయమూర్తులలో స్పందన లోపించిందా? అసాధారణ రేప్‌ కేసులలో వురి శిక్ష విధించాలని, అయితే తమ పార్టీ సూత్రప్రాయంగా వురిశిక్షకు వ్యతిరేకమని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ అభిప్రాయం చెప్పారు. అది నచ్చని వారు తప్పు పట్టవచ్చు, కానీ కొందరు రేపిస్టులను సిపిఎం సమర్ధిస్తోందంటూ దాడులకు దిగారు. అసలు కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్సు ఇప్పుడు రావటానికి కారణం ఏమిటి? కాశ్మీర్‌లోని కథువా ఎనిమిదేండ్ల బాలిక అసిఫా వుదంతంలో నిందులపై కేసు పెట్టకుండా అడ్డుకోచూసింది బిజెపి మద్దతుదారులైన లాయర్లు, నిందితులకు మద్దతుగా హిందూ ఏకతా మంచ్‌పేరుతో మతోన్మాదులు జరిపిన ర్యాలీలో పాల్గన్నది బిజెపి మంత్రులు, దీనిపై తీవ్ర విమర్శలు రావటంతో వారిని వుద్యోగాల నుంచి వూడగొట్టింది బిజెపి. గోరక్షక్‌ నుంచి రేపి స్ట్‌ రక్షక్‌ మారిందనే పేరు వచ్చింది. ఇంత పరువు పోయాక ఆ నష్ట నివారణ చర్యలో భాగం తప్ప ఆర్డినెన్స్‌లో నిజాయితీ ఎక్కడుంది? ఆర్డినెన్స్‌ తెచ్చినందుకు అభినందించుకోండి, వూరూరా తిప్పి సన్మానాలు చేయించి నీరాజనాలు పట్టండి, సమర్ధించని వారిని విమర్శించాల్సినంత సీన్‌ బిజెపి వారికి లేదు. చిత్రం ఏమిటంటే అసిఫా అత్యాచారాన్ని ఇంతవరకు ఖండించేందుకు నోరు రాని బిజెపి వారందరూ ఒక్కసారిగా ఇప్పుడు ఆర్డినెన్స్‌పై ఎక్కడలేని వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో దారుణ అత్యాచారానికి గురైన నిర్భయ పేరుతో ఒక చట్టాన్ని చేశారు. ఇప్పుడు పేరు ఎలాగూ బయటకు వచ్చింది కనుక తెచ్చిన ఆర్డినెన్స్‌ను చట్టంగా మార్చేటపుడు బిజెపి వారికి ఏమాత్రం నిజాయితీ వున్నా ఆసిఫా చట్టం అని పేరుపెడతారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

సూక్ష్మంలో నరేంద్రమోడీ మోక్షం: పకోడీలతో స్వయం వుపాధి !

09 Friday Feb 2018

Posted by raomk in BJP, Current Affairs, Economics, employees, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

India budget, Narendra Modi, pakoda, pakoda budget, pakoda self employment, self employment

ఎం కోటేశ్వరరావు

ఎట్టకేలకు నరేంద్రమోడీ నాలుగేండ్ల తరువాత తాము వుపాధి కల్పించలేకపోతున్నట్లు పరోక్షంగా అయినా అంగీకరించినందుకు అభినందించకుండా ఎలా వుంటాం ! పెట్టలేని వారు పెట్టే దారన్నా చూపాలి అన్నట్లు పకోడీలు అమ్మి స్వయం వుపాధి కల్పించుకోవాలని మంచి సలహా కూడా ఇచ్చినందుకు ఆయన మేథోశక్తికి నీరాజనాలు పలకాల్సిందే. బాబొస్తే జాబొచ్చినట్లే అన్న తెలుగుదేశం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌ బాబు చేయలేని ధైర్యం, తెగువను నరేంద్రమోడీ చూపారు. పకోడీ వ్యాఖ్యానం తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో యావత్‌ దేశాన్నీ ఆకర్షించేందుకు మోడీ మరో విన్యాసం చేశారు. వుద్యోగులకు ఏడాదికి మెడికల్‌ రీయంబర్స్‌మెంట్‌ పదిహేనువేలు, నెలకు 16వందల ప్రయాణ అలవెన్సు వెరసి ఏడాదికి 34,200కు ఇప్పుడు పన్ను మినహాయింపు వుంది. ఈ రెండింటి బదులు గుండుగుత్తగా 40వేల రూపాయలకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ఆర్ధిక మంత్రి అరుణ్‌జెట్లీ ప్రకటించారు. దీని వలన వుద్యోగులకు ఎనిమిదివేల కోట్ల రూపాయలు మిగిలితే, ఖజానాకు అంతే మొత్తం నష్టం అని చెప్పారు. ఈ వుదారత్వానికి వుద్యోగులు ఎలా పండుగ చేసుకుంటారన్నది వారికే వదలివేద్దాం.

‘కోటీ 89లక్షల మంది వేతన జీవులు ఒక్కొక్కరు 2016ా17లో చెల్లించిన సగటు పన్ను రు.76,306 కాగా వ్యక్తిగతంగా వ్యాపారులు, వైద్యులు, లాయర్ల వంటి వృత్తిదారులు 1.88 కోట్ల మంది సగటున చెల్లించింది రు.25,753 మాత్రమే. ఇవి కేంద్ర ఆర్ధిక కార్యదర్శి హష్‌ముఖ్‌ అధియా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం వెల్లడించిన వివరాలు. నిజాయితీగా పన్ను చెల్లించే తమకు భారం తగ్గించి అక్రమ మార్గాలను వెతక్కుండా సరైనదారిలో పెట్టాల్సిన ప్రభుత్వం ఆ పని చేయటం లేదు. మరోవైపు తమ కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న ఇతరుల పన్ను ఎగవేత నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. ఇదీ స్థూలంగా బడ్జెట్‌ సందర్భంగా వేతన జీవులలో వెల్లడవుతున్న అసంతృప్తి. దిగువనున్న ఇతరులతో పోల్చుకుంటే వుద్యోగుల పరిస్ధితి మెరుగే అయినప్పటికీ పెరుగుతున్న ధరలు, అవసరాలు, గౌరవ ప్రదమైన జీవనం గడపాలంటే ప్రస్తుత వేతనాలను ఇంకా పెంచాల్సిన అవసరం వుంది. ప్రతి బడ్జెట్‌లో భారాలు మోపటం సర్వసాధారణ రివాజుగా మారింది కనుక సామాన్యులకు పెద్దగా ఆసక్తి వుండదు. ఎన్ని రాయితీలు ఇచ్చినా మంగళగిరి పానకాల రాయుడి మాదిరి ఇంకా కావాలనే వాణిజ్య, పారిశ్రామికవేత్తలు, న్యాయమైన రాయితీల కోసం ఎదురు చూసే వేతన జీవులలోనే బడ్జెట్‌ పట్ల ఆసక్తి వుంటుంది. వ్యాపారులు, వృత్తిదారులు పన్నుల విధింపు సమాచారం గురించి కుతూహలం చూపుతారు. ఏ భారం మోపినా చివరకు దాన్ని ఏదో ఒక రూపంలో తిరిగి వినియోగదారులు, సేవలు పొందే జనం మీదనే మోపుతారు కనుక బడ్జెట్‌లో ఏం చేసినా వారికేమీ చింత వుండదు.

ఎక్కువ మంది వుద్యోగులు బడ్జెట్‌లో తమకేమి రాయితీలు ప్రకటించారు అనే విషయం మీదనే ప్రధానంగా కేంద్రీకరించటం సహజం. నిజానికి పౌరులుగా, చదువుకున్న వారికి అంతకంటే ఎక్కువ ఆసక్తి, విమర్శనాత్మక వైఖరితో ఈ ప్రక్రియను చూడటం అవసరం. అందుకే అసలు బడ్జెట్‌ అంటే ఏమిటి ? ప్రజారంజక, ప్రజా సంక్షేమ బడ్జెట్‌నే ప్రవేశపెట్టామని చెప్పని పార్టీ ఏముంది? అదే నిజమైతే 2017లో దేశంలో వృద్ధి అయిన సంపదల మొత్తంలో ఒక శాతంగా వున్న ధనికులు 73శాతం దక్కించుకున్నారని ఆక్స్‌పామ్‌ అనే స్వచ్చంద సంస్ధ ఎందుకు చెప్పింది. వివిధ సంస్ధల, లెక్క విధానాలు, అంచనాలలో హెచ్చు తగ్గులుండవచ్చుగానీ సంపద కొద్ది మంది దగ్గర పోగుపడుతున్నదనేది వాస్తవమే కదా ?

ఆదాయాన్ని ఖర్చుల నిమిత్తం చేసే పంపిణీ ప్రక్రియే బడ్జెట్‌. దీనిలో సామాన్యులుగా వున్న 99శాతానికి, ఒకశాతం ధనికులకు దామాషా ప్రకారం పంపిణీ చేస్తే సమస్య లేదు. లేకపోతేనే తేడాలు వస్తాయి. కాంగ్రెస్‌, బిజెపి వంటి పార్టీలు ప్రతిపక్షంలో వుండగా ప్రజల కోసం కడవల కొద్దీ కన్నీరు కార్చి అధికారం రాగానే కార్పొరేట్లకు కామధేనువులుగా మారుతున్నాయి. నాలుగు సంవత్సరాల క్రితం అధికారానికి వచ్చిన నరేంద్రమోడీ సామాన్యులకు మంచిరోజులు( అచ్చేదిన్‌) వచ్చాయని ప్రకటించారు. ఆక్స్‌ఫామ్‌ సంస్ధ వెల్లడించిన విశ్లేషణ ప్రకారం 2017లో దేశంలోని బిలియనీర్ల ్లబ్బులో కొత్తగా పదిహేడు మంది చేరారు. మోడీ నిజంగా రాబిన్‌హుడ్‌ అవతారం అయితే బిలియనీర్ల సంపద తగ్గాలి కదా ! గత నాలుగు సంవత్సరాలుగా తాను ఎన్నో విజయాలు సాధించానని ప్రతి నెలా మన్‌కీబాత్‌ పేరుతో (మనసులోని మాట) ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ జన్‌కీ బాత్‌(జనం మాట) వేరేగా వుంది. మొత్తంగా చూసుకున్నపుడు వుత్పత్తి, ఎగుమతులు పడిపోయాయి. అనేక చోట్ల గిట్టుబాటు ధరలు రాక రైతాంగం ఆందోళనలకు దిగింది, ఆత్మహత్యలు ఆగలేదు. అయినా మరోవైపు కార్పొరేట్ల లాభాలు తగ్గలేదు, స్టాక్‌మార్కెట్‌ సూచీలు రికార్డులను తిరగరాశాయి. పర్యవసానంగా శతకోటీశ్వరుల సంఖ్య పెరిగింది, అప్పటికే ఆ జాబితాలో వున్నవారి ఆస్ధులు ఇంకా పెరిగాయని వేరే చెప్పనవసరం లేదు. అంటే మోడీ గారు చెప్పిన మంచి రోజులు ఎవరికి వచ్చినట్లు ? ఒక చాయ్‌ వాలా పాలనలో ఎంత మంది ఫ్లాస్కుల నుంచి టీ స్టాల్స్‌, హోటల్స్‌ పెట్టే స్ధాయికి ఎదిగారు ? తాజాగా మోడీతో పాటు, అమిత్‌షా గారు కూడా చెప్పినట్లు పకోడీలు అమ్మేవారు ఎంత మంది లక్షాధికార్లు అయ్యారు అని ప్రశ్నించుకోవాలి.

ఐదేండ్ల కాలానికి ఎన్నుకున్న మోడీ సర్కార్‌కు ఇది చివరి, ఎన్నికల బడ్జెట్‌ కనుక సహజంగానే జనంలో ఆసక్తి కలిగించింది. ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశపెట్టిన 2018-19 బడ్జెట్‌ ప్రకారం మొత్తం ఆదాయం 24లక్షల కోట్ల 42 వేల 213 కోట్లు. దీనిలో పన్నుల ద్వారా వచ్చే మొత్తం రు.17,25,738 కోట్లు. అప్పుల ద్వారా సమకూర్చుకొనేది 6,24,276 కోట్లు మిగతాది ఇతర వనరుల ద్వారా వస్తుంది. దీనిలో వడ్డీ చెల్లింపులకు కేటాయింపు 5,75,795 కోట్లు. నరేంద్రమోడీ పాలనలో మన రూపాయి రాకపోకల తీరు తెన్నులు ఎలా మారాయో చూద్దాం. 2015-16 బడ్జెట్‌లో 21పైసలు అప్పుల ద్వారా సమకూర్చుకుంటే 2018-19కి అది 19కి తగ్గిపోయింది. కార్పొరేట్‌ పన్ను 20 నుంచి 19కి తగ్గింది, ఆదాయపన్ను 14 నుంచి 16కు పెరిగింది. తాజా బడ్జెట్‌ రూపాయి రాకలో నూరు పైసలకు గాను జిఎస్‌టి నుంచి 23, కార్పొరేట్‌ పన్ను నుంచి 19,అప్పుల ద్వారా 19, ఆదాయ పన్ను నుంచి 16, ఎక్సయిజ్‌, కస్టమ్స్‌ నుంచి 12, ఇతరంగా 11పైసల వంతున వస్తోంది. ఇక పోక విషయానికి వస్తే పన్నులు, డ్యూటీలలో రాష్ట్రాల వాటా 24, వడ్డీ చెల్లింపులు 18, రక్షణ, కేంద్ర పధకాలు, సబ్సిడీలకు 9చొప్పున, ఫైనాన్స్‌ కమిషన్‌ బదిలీలకు 8, ఇతర ఖర్చులకు 13పైసలు పోతోంది.

గతేడాది నోట్ల రద్దు వలన సాధారణ పెరుగుదల కంటే అదనంగా 18లక్షల మంది కొత్తగా పన్నులు చెల్లించేవారు పెరిగారని ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. మంచిదే, రెండు కోట్ల ఎనభైలక్షల మంది పన్ను చెల్లింపుదార్లుండగా మరో 18లక్షల మంది కోసం పెద్ద నోట్లు రద్దు చేయాలా? ఇంట్లో ఎలుకలున్నాయని ఇంటికే నిప్పు పెట్టిన ప్రబుద్ధులను ఈ చర్య గుర్తుకు తేవటం లేదూ? ఈ పద్దెనిమిది లక్షల మంది అదనంగా చెల్లించే పన్నెంతో, నోట్ల రద్దు వలన జరిగిన నష్టం, జనం పడిన ఇబ్బందుల గురించి అధికారంలో వున్న వారు నోరు విప్పారా ? పోనీ ఆ కారణంగా ఆదాయపన్ను రాబడి రూపాయి రాకలో రెండుశాతం పెరిగిందని అనుకుందాం. కార్పొరేట్‌ పన్ను ఆదాయం పెరగకపోగా తగ్గటానికి కారణం ఏమిటి? లోపాలను సరిచేస్తే వసూలు పెరగాలి కదా ! చెప్పే మాటలకు, చేతలకు పొత్తు కుదరటం లేదు. ఇంతకు ముందు 50 కోట్ల లావాదేవీలు వున్న కంపెనీలకు 25శాతం కార్పొరేట్‌ పన్ను వుంటే ఇప్పుడు దానిని ఏకంగా ఐదు రెట్లు అంటే 250 కోట్లకు పెంచటం వంటి వెసులుబాటు కాదా? పోనీ ఇలాంటి మినహాయింపులతో కంపెనీలు పొందిన లబ్దిని తిరిగి పెట్టుబడులుగా పెట్టిన దాఖలాలేమీ లేవు. అందుకే ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షా మహాశయులు వుద్యోగాలు లేకపోతే పకోడీలు అమ్మాలని సెలవిచ్చారు. 2015-16 వుపాధి, నిరుద్యోగ సర్వే ప్రకారం దేశంలో పని చేస్తున్న వారిలో 46.6శాతం మంది స్వయం వుపాధి అంటే మోడీ గారి భాషలో పకోడీ వుద్యోగాలు చేస్తున్నవారే. వారి వార్షిక ఆదాయం అరవైవేల రూపాయలు. వారందరూ మంచి రోజుల కోసం ఎదురు చూస్తుంటే కొత్తగా వుద్యోగాల కోసం చూస్తున్నవారికి నాలుగేండ్ల తరువాత మోడీ ఈ సలహా ఇచ్చారు.

యుపిఏ , ఎన్‌డిఏ రెండూ సంస్కరణలు అమలు జరిపాయి. అవి ఎవరికి లబ్ది చేకూర్చాయి? గత పది సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వానికి పన్ను రాబడిలో ఏ రంగం నుంచి ఎంత వచ్చిందో బడ్జెట్‌ పత్రాలలో వివరించారు. దాని ప్రకారం 2009-10లో మొత్తం పన్ను రాబడి 6,24,528 కోట్లకు గాను కార్పొరేట్‌, ఆదాయ పన్ను వాటాలు 39,19.6 శాతం చొప్పున వున్నాయి. అదే 2018-19 బడ్జెట్‌లో 27.3,23.2 శాతాలుగా వున్నాయి. అంటే పదేండ్లలో కార్పొరేట్లకు పన్నెండుశాతం వరకు లబ్ది చేకూరితే వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపుదార్లపై 3.6శాతం భారం పెరిగింది. ఆదాయ అసమానతలు పెరగటానికి శతకోటీశ్వరులు వృద్ధి చెందటానికి ఇది కారణం కాదా ? వుద్యోగులకు మొత్తం ఆదాయం మీద పన్ను విధిస్తుండగా కార్పొరేట్‌లు, వ్యాపారులు, ఇతర వృత్తిదారులకు ఖర్చులు పోను నిఖర ఆదాయం మీదనే పన్ను వేస్తున్నారు. ఇదొక అన్యాయం. వుద్యోగులకు కుటుంబ ఖర్చులను లెక్కవేసే వేతనాలు నిర్ణయిస్తున్నారు తప్ప ప్రతి ఏటా వారికి ఇంత మిగులు వుండాలనే ప్రాతిపదికేమీ వుండదు. హష్‌ముఖ్‌ చెప్పినదాని ప్రకారం ఏడు లక్షల నమోదైన కంపెనీలలో సగం సమర్పించిన ఆదాయ వివరాల ప్రకారం సున్నా మిగులు లేదా నష్టాలను చూపారు. వుద్యోగులకు ఇటువంటి అవకాశం లేదు. నిజానికి వారు వినియోగదారులుగా ఇతర పన్నులతో పాటు అదనంగా ఆదాయపన్ను చెల్లిస్తున్నారు. ‘బ్రిటీరాజ్యం నుంచి బిలియనీర్‌ రాజ్యం వరకు ‘ అనే శీర్షికతో ప్రముఖ ఆర్ధికవేత్తలు ల్యూకాస్‌ ఛాన్సెల్‌, థామస్‌ పికెట్టి ఆదాయ పన్ను చట్టం చేసిన 1922 నుంచి 2014 వరకు మన దేశ ఆర్ధిక వ్యవస్ధలో అసమానతల గురించి ఒక అధ్యయన పత్రాన్ని తయారు చేశారు. దాని ప్రకారం 2014లో పదిశాతం ధనికులు వార్షికాదాయంలో 56శాతాన్ని పోగేసుకున్నారు.1930 దశకంలో ఒకశాతం ధనికులు మొత్తం ఆదాయంలో 21శాతం లోపు కలిగి వుండగా అది 1980దశకం ప్రారంభానికి ఆరుశాతానికి పడిపోయి 2014నాటికి 22శాతానికి పెరిగింది. గతేడాది ఆక్స్‌ఫామ్‌ సర్వే ప్రకారం ప్రపంచ ధనికులలో ఒక శాతం మంది 50శాతం సంపదను కలిగి వుండగా మన దేశంలో అది 58శాతంగా వుంది. 2017 వివరాల ప్రకారం ఒకశాతం ధనికుల సంపద 20.9లక్షల కోట్లకు అంటే కేంద్ర బడ్జెట్‌కు సమంగా చేరుకుంది. మన దేశంలోని ఒక ప్రముఖ వస్త్రకంపెనీ సిఇఓ ఒక ఏడాది ఆదాయాన్ని పొందాలంటే గ్రామీణ ప్రాంతంలో కనీస వేతనం పొందుతున్న కార్మికుడు 941 సంవత్సరాలు పనిచేయాల్సి వుంటుంది. మరో విధంగా లెక్క వేస్తే గ్రామీణ కార్మికుడు జీవితాంతం(50 సంవత్సరాలు) పని చేస్తే సంపాదించే మొత్తాన్ని అదే సిఇఓ కేవలం 17.5 రోజుల్లో సంపాదిస్తాడట. అదే అమెరికాలో ఒక కార్మికుడు ఏడాది మొత్తంలో పొందిన వేతనాన్ని ఒక కంపెనీ సిఇవో ఒక రోజులో పొందుతాడని ఆక్స్‌ఫామ్‌ పేర్కొన్నది.

కారిపోతున్న ‘సంపద బక్కెట్‌ ‘ కన్నాలు పూడ్చాలని కార్పొరేట్లకు పన్ను రాయితీలు రద్దు చేయాలని, పన్ను నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆక్స్‌ఫామ్‌ కోరింది. గతేడాదినాటికి మన దేశంలోని బిలియనీర్ల సంపద 20.7లక్షల కోట్లకు పెరిగితే దానిలో గతేడాదే 4.89లక్షల కోట్లు చేరింది. ఈ మొత్తంతో దేశంలోని అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించవచ్చు, ప్రతి రాష్ట్రంలో జాతీయ ప్రాజక్టులకు ధారాళంగా నిధులు కేటాయించవచ్చు. బాహుబలి సినిమా వసూలు చేసిన మొత్తమంత కూడా తమకు కేటాయించలేదని రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సిన అవసరం వుండదు.

ఆర్ధిక సర్వే, బడ్జెట్‌లోని మరికొన్ని విషయాలను చూద్దాం. ఆర్ధిక సర్వే, ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు అంకెలన్నీ ఒకచోటనే తయారు చేసి స్వల్ప మార్పులతో ఎవరికి వారు ప్రకటించుకున్నట్లుగా వుంది. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో జిడిపి పెరుగుదల రేటు 6.75శాతం వుంటుందని అంచనా వేస్తే కేంద్ర గణాంకశాఖ 6.5శాతంగానూ, ఐఎంఎఫ్‌ 6.7గా చెప్పింది, వచ్చేఏడాది పెరుగుదల రేట్లను 7.5,7.4శాతాలుగా పేర్కొన్నాయి. పెరుగుదల రేట్లు అచ్చేదిన్‌ అంచనాలు అని చెప్పవచ్చు. ఎందుకంటే మన చేతుల్లో లేని ప్రపంచ చమురు మార్కెట్‌ రేట్ల మీద ఇవి ఆధారపడి వుంటాయి. స్టాక్‌ మార్కెట్‌ ఇప్పుడు మంచి కాక మీద వుంది కనుక లాభాలు దండిగా సంపాదించుకొనేందుకు విదేశీ కంపెనీలు డాలర్లను కుమ్మరించి వాటాలను కొనుగోలు చేస్తున్నాయి. ఆ మొత్తాలను మన విదేశీ మారక నిల్వలుగా చూపుతున్నాం, వాటితో చమురు కొనుగోలు చేస్తున్నాం. స్టాక్‌ మార్కెట్‌ పతనమైనా, చమురు ధరలు పూర్వపు స్ధాయికి పెరిగినా మన పరిస్ధితి ఢమాల్‌. ఒకవేళ స్టాక్‌ మార్కెట్‌ బుడగ మరికొంత కాలం కొనసాగిందనుకుందాం. అది వుండగానే మన పారిశ్రామిక వుత్పత్తి పడిపోయింది, ఎగుమతులు తగ్గిపోయాయి. అందువలన ఈ పరిస్ధితి కొనసాగదన్న గ్యారంటీ ఏముంది? ముదిమది తప్పిన మాదిరి డోనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌పై కాలుదువ్వుతున్న పూర్వరంగంలో ఇప్పటికే పీపా చమురు 70 డాలర్లకు చేరింది. తగ్గే పరిస్ధితి కనిపించటం లేదు. అందుకే మనకు రోజూ పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు అమెరికా సర్కార్‌ మన ఐటి ఎగుమతులను దెబ్బతీసే విధంగా, మన ఇంజనీర్లకు వీసాలు నిరాకరించే ధోరణిలో వ్యవహరిస్తోంది. అది కూడా మనకు నష్టం చేకూర్చే పరిస్థితే. ప్రపంచ ధనిక దేశాలలో పరిస్ధితులు చక్కబడితే తప్ప మన ఎగుమతులు పెరగవు అని తేలిపోయింది. వాటి పరిస్ధితి కూడా అంత ఆశావహంగా కనిపించటం లేదు. అనేక దేశాలు రక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. వాటి ప్రభావం మన మీద పడింది కనుకనే మన ప్రధాని దవోస్‌ సమావేశ వేదికపై వుగ్రవాదం ఎంత చెడ్డదో రక్షణ చర్యలు కూడా అంతే అని చెప్పాల్సి వచ్చింది.

ఈ సమస్యల నుంచి బయట పడాలంటే అంతర్గత మార్కెట్‌ను పెంచుకోవటం తప్ప మరొక మార్గం లేదు. అది జరగాలంటే జనంలో కొనుగోలు శక్తి పెరగాలి. ఇప్పుడు ఎగుమతుల కోసం లేదా కార్పొరేట్‌ సంస్ధలకు ఇస్తున్న ఇతర రాయితీల మొత్తాన్ని వేతన పెరుగుదల లేదా జనం కొనుగోలు శక్తి పెంపుదలకు మళ్లిస్తే పారిశ్రామిక వుత్పత్తి పెరగటంతో పాటు వుపాధి అవకాశాలు పెరుగుతాయి. బడ్జెట్‌ విషయానికి వస్తే 2022 నాటికి వ్యవసాయ ఆదాయం రెట్టింపు చేస్తామన్నది ఒక పెద్ద వాగ్దానం. అయితే దానికి తోడ్పడే చర్యలేమీ లేవు. రానున్న ఎన్నికలకు రైతులకు విసిరిన ఎర. ప్రత్యక్ష పన్నుల వాటా 51.6 నుంచి 50.6శాతానికి తగ్గనున్నట్లు చెప్పటమంటే కార్పొరేట్లకు రాయితీ ఇవ్వటమే. ఏడాదికి ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల వరకు చెల్లించేందుకు వీలుగా పది కోట్ల కుటుంబాలకు ఆరోగ్యబీమా. పాత పధకాలన్నీ కలిపి కొత్తగా చెప్పిన అంకె. జన ఆరోగ్యం కంటే పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్న బీమా కంపెనీలకు పెద్ద ఎత్తున సొమ్ము ముట్టచెప్పే ఎత్తుగడ దీని వెనుక వుందని అనుమానిస్తున్నారు. ఇప్పటికే ప్రయివేటు రంగం పెట్టుబడులు పెద్దగా రావటం లేదు. వచ్చినవి కూడా వుపాధి రహిత వృద్ధికే దోహదం చేస్తున్నాయి. ప్రభుత్వ పెట్టుబడులు నానాటికీ తగ్గుతున్నాయి. అనేక పధకాలకు కేటాయింపులు తగ్గించారు. డబ్బు మొత్తాలు స్వల్పంగా పెరగవచ్చుగానీ జిడిపితో పోల్చితే శాతాలన్నీ తగ్గిపోయాయి. పోనీ పేర్కొన్నవాటిని కూడా పూర్తిగా ఖర్చు చేస్తున్నారా అంటే అదీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నిరుద్యోగ యువతను పకోడీలమ్మించే దిశగా బడ్జెట్‌కు రూపకల్పన చేశారని చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జీ హుజూర్‌ జర్నలిస్టులు, భజనలో టీవీ ఛానళ్లు !

22 Monday Jan 2018

Posted by raomk in BJP, Current Affairs, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

his master's voice tv channels and journalists, journalism, Narendra Modi

ఎం కోటేశ్వరరావు

బహుశా ప్రపంచంలో ఏ ప్రధాని లేదా అధ్యక్షుడి ఖాతాలోను గతంలో లేని వర్తమాన, భవిష్యత్‌లో కూడా లేని అరుదైన రికార్డును ఇప్పటికే నరేంద్రమోడీ స్వంతం చేసుకున్నారు. ఇక మిగిలిన పదవీ కాలంలో కూడా ఇదే వూపును కొనసాగిస్తే పదవీ కాలంలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా జర్నలిస్టులతో ముఖాముఖీ సమావేశం నిర్వహించని తొలి దేశాధినేతగా చరిత్రకెక్కనున్నారు. ఆ రహస్యం ఏమిటో, మోడీ ఎందుకంత పంతం పట్టారో ఇంతవరకు ఏ పరిశోధనాత్మక జర్నలిస్టూ కనిపెట్టలేకపోయారు. ఈ మధ్య జీ న్యూస్‌ మరియు టైమ్స్‌ నౌ టీవీ ఛానల్స్‌ వారు ప్రధాని నరేంద్రమోడీని ఇంటర్వ్యూ చేశారు. ఇప్పటి వరకు ఒక జర్నలిస్టుగా ఇంటర్వ్యూలు ఎలా చేయాలో ప్రతి ఒక్కరి నుంచి ఇంకా నేర్చుకుంటూనే వున్నాను. తొలిసారిగా ఎలా చేయకూడదో గతంలో ఆర్నాబ్‌ గోస్వామి, ఇప్పుడు ఈ రెండు ఛానల్స్‌ ప్రతినిధుల నుంచి నేర్చుకోవటం ప్రారంభించాను. రాబోయే రోజుల్లో ఇంకా ఎందరు నూతన మార్గదర్శకులౌతారో చూడాలి.

తానొవ్వక ఇతరుల నొప్పింపక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతీ అన్నట్లుగా సదరు ఛానళ్ల సీనియర్‌ జర్నలిస్టులు ప్రధాని నరేంద్రమోడీని ప్రశ్నలు అడిగిన తీరు చూసియావత్‌ జర్నలిస్టు లోకం నివ్వెరపోతోంది. ఒక పార్టీనేతకు మరొక పార్టీనేత సంధించే ప్రశ్నలు దెబ్బలాడినట్లే వుంటాయి. కానీ ఒక జర్నలిస్టు అవే అంశాలపై సమాధానాలు రాబట్టేందుకు తమ వృత్తి నైపుణ్యాన్ని వినియోగించి అడగటం వేరు. రెండు ప్రముఖ చానల్స్‌ సీనియర్‌ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలు లాలూచీ వ్యవహారంగా ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. ఈ ఇంటర్వ్యూల ప్రత్యేకత ఏమంటే వారు కొత్త విషయాలనేమీ రాబట్టలేదు. మోడీ చెప్పినవాటిలో కొత్త విషయాలేమీ లేవు. మరి దీని గురించి చెప్పుకోవాల్సినంత ప్రత్యేకత ఏమిటి ?

ఎవరైనా అధికారంలోనో లేక యజమానులుగానో వున్న పెద్దలు ఒక పెద్ద పర్యటన జరిపినపుడో, ఒక సభలో పాల్గొని వచ్చిన తరువాత ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించే భక్తజనులు, భజనపరులు ఇతరులతో పోల్చి మీకు వారికి అసలు పోలికే వుండదు, మీరెక్కడ వారెక్కడ మీరు గనుక ఈ పర్యటన చేయగలిగారు అంటూ మునగ చెట్టు ఎక్కిస్తారు. ఈ రెండు ఛానళ్ల విలేకర్లు అలాంటి దృశ్యాలను గుర్తుకు తెచ్చారంటే అతిశయోక్తి కాదు. అధికారంలో వున్నవారితో పాకేజ్‌లు కుదిరితే, లేదా యాజమాన్యాలు ఇతర కారణాలతో పాలకులతో సత్సంబంధాలు కొనసాగించదలచుకుంటే ఎలాంటి ప్రశ్నలు వెలువడుతాయో అవి ఒక్కోసారి ఎంత హాస్యభరితంగా వుంటాయో, జనం ఎదుర్కొంటున్న, ఆవేదన పడుతున్న, అందరికీ తెలిసిన పాలకులకు ఇబ్బంది కలిగించే అంశాలను కార్పొరేట్‌ మీడియా ఎలా విస్మరిస్తుందో తెలుసుకొనేందుకు ఆ ప్రశ్నలు ఎలా వున్నాయో చూడండి. నెతన్యాహు పర్యటన గురించి ప్రస్తావించారు గానీ దేశాన్ని కుదిపివేసిన సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయమూర్తుల విమర్శల గురించి ఏ ఛానల్‌ వారికీ అడగాలని తోచకపోవటం విచిత్రం. ఇలాంటి వారు కూడా విలేకర్లుగా వుంటారా అని బయటి వారి ఆలోచనకు తావిచ్చారు. జీ న్యూస్‌ సుధీర్‌ చౌదరి ప్రశ్నలు ఇలా వున్నాయి.
.https://www.youtube.com/watch?v=2sqUgua0npA

1. మీరు ప్రధాని అయిన 2014 ఇప్పుడు 2018 మధ్య మీరు అంతర్జాతీయ సమ్మేళనాలకు వెళ్లినపుడు భారత స్థితి గురించి తేడా ఏమైనా గమనించారా ?

2.దవోస్‌ లేదా సార్క్‌, లేదా జి20 వంటి సమావేశాలను మేము ఇంతకు ముందు చూశాము.అదంతా దౌత్యపరమైన కసరత్తులా వుండేది. మన నేతలు వెళతారు, దౌత్యపరమైన కసరత్తు, ఒక ఫొటో తీయించుకుంటారు. మిమ్మల్ని తీసుకుంటే దాన్ని మీ విమర్శకులు ఇష్టపడరనుకోండి. అది స్నేహబంధంలాగా వుంటుంది. వారిని మీరు హత్తుకుంటారు, వారి భుజాలపై మీరు చేతులు వేసి మాట్లాడతారు, తరువాత ఫొటోలు వుంటాయి. వాటిని ఆధారంగా చేసుకొని జనాలు మీపై దాడికూడా చేస్తారనుకోండి. కాని అది మీ తరహా దౌత్యశైలి, దాంతో మీరు వెంటనే స్నేహితుల్ని చేసుకుంటారు. వుదాహరణకు నెతన్యాహునే చూడండి. మీ ఇద్దరి మధ్య స్నేహాన్ని చూస్తే మేం ఇద్దరు జిగిని దోస్తులం కలసి సినిమా చూసినట్లుగా వుంది. కాబట్టి మీది అనితరసాధ్యమైన దౌత్యశౌలి, ఈ దేశానికి చెందిన వ్యక్తి కాదు, మీ భాష మాట్లాడరు, బహుశా మీరు ఎంతో కాలం నుంచి తెలిసిన వారు కూడా కాదు, అబ్బబ్బ అలాంటి వ్యక్తితో మీరు అంత త్వరగా ఎలా కలసి పోగలిగారు?

3.మీరు అధికారానికి వచ్చిన తరువాత జిడిపి అభివృద్ధి రేటు విషయంలో ఒక నూతన సాంప్రదాయం ప్రారంభించారు. అదెలా ముందుకు పోతోంది. నాకిప్పుడు గుర్తుకు వస్తోంది,అసలు దీనికి ముందు మూడు నాలుగు సంవత్సరాలక్రితం జనానికి జిడిపి అభివృద్ధి రేటు అంటే ఏమిటో కూడా తెలియదు. ఇప్పుడు జనాలు సెన్సెక్స్‌(స్టాక్‌మార్కెట్‌ సూచీ)ను అనుసరిస్తున్న మాదిరి ప్రతి మూడు నెలలకు అది పైకి కిందికీ ఎలా కదులుతోంది అని చూస్తున్నారు. దాని ఆధారంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మీరు వాగ్దానం చేసిన మాదిరి అది లేనట్లయితే వెంటనే దాడులు ప్రారంభం అవుతాయి, ఇదొక నూతన సాంప్రదాయం కాదా ?

4. ఈ ఇంటర్వ్యూకు సిద్ధమయ్యేందుకు నేను ఎంతో పరిశోధన చేస్తున్నపుడు ఈ నూతన ప్రపంచ వ్యవస్ధ గురించి ఆలోచిస్తున్నాను. అసలేమిటీ నూతన ప్రపంచ వ్యవస్ధ? దాంతో నేనొక కొత్త విషయాన్ని కనుగొన్నాను. అదేమంటే దాన్ని పిటిఎం-పుతిన్‌ ట్రంప్‌ మోడీ అని పిలవొచ్చు, అదే నూతన ప్రపంచ వ్యవస్ధ.

5.కొన్ని సందర్భాలలో జనాలు పని చేస్తున్నపుడు వారి వుత్సాహాన్ని కోల్పోతారు. మీరు 2014లో ప్రదర్శించినట్లే ఎంతో వుత్సాహం నేడు కూడా వుందా ? ఇది 2018,

6. మీరు సరైన దారిలోనే వున్నారని అనుకుంటున్నారా ?

7.మీరు ఒక పకీరులా (సర్వసంగ పరిత్యాగి) జీవిస్తున్నారు, మిమల్ని మీరు ఒక పకీరుగా పిలుచుకోండి మీ కుటుంబం కూడా ఎంతో పెద్దది, 125కోట్ల జనం. మీరింత వరకు సెలవు తీసుకోలేదు.విదేశాలకు వెళ్లినపుడు మీరు రాత్రిపూటే ప్రయాణం చేస్తారు, కాబట్టి మీరు మధ్యలో ఆగరు, మీరు విమానంలోనే నిద్రపోతారని విన్నాను. మీకీ వయస్సులో అంతశక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే ఇతరులెవరైనా ఈ వయస్సులో దీన్ని కనీసం వూహించలేరు కూడా. ఒక భారత యువకుడు సిగ్గుపడే విధంగా ఈ రోజు మీశక్తి కనిపిస్తోంది.

టైమ్స్‌ నౌ జర్నలిస్టులు రాహులు శివశంకర్‌, నవికా కుమార్‌ ప్రశ్నలు ఇలా వున్నాయి.

http://www.timesnownews.com/india/video/narendra-modi-full-interview-full-transcript-watch-times-now-prime-minister-modi-interview-bharatiya-janata-party-congress-mukt-india-corruption-free/1910491.

1.ప్రధాన మంత్రిగారూ అధికారంలో మూడున్నర సంవత్సరాల తరువాత మీ గతాన్ని ఎలా చూసుకుంటారు. ఎంతో జరిగింది, మీరు మొత్తంగా సాధించినవి ఏమిటి ? మిగిలిపోయినవి ఏమిటి ?

2.గత రెండు దశాబ్దాలలో దవోస్‌ వెళుతున్న ఈ దేశ తొలి ప్రధాని మీరు, మరియు ప్లీనరీలో మీరు మాట్లాడబోతున్నారు. ఏ ప్రధానీ ఇంతకు ముందు ఇలా చేయలేదు, ఎవరూ ప్లీనరీలో మాట్లాడలేదు. గతేడాది ప్లీనరిలో చైనా మాట్లాడింది, ఈ ఏడాది మీరు మాట్లాడబోతున్నారు, మీ ప్రయాణం రెండు రోజుల్లో ప్రారంభం కాబోతున్నది, భారత అభివృద్ధి గాధలో ఏ భాగాన్ని మీరు దవోస్‌ సభ ముందుంచబోతున్నారు.

3.1991నుంచి ఇంతవరకు మన దేశ ఏ ప్రధాన మంత్రీ వేదికమీద ఆశీనులయ్యే అవకాశాన్ని పొందలేదు, ఎందుకిలా జరిగింది?

4. ప్రధాన మంత్రిగారూ మీరు సంపూర్ణ ప్రధాని. ప్రధాన మంత్రిగారూ నేను మీకు ఒక విషయాన్ని జ్ఞప్తికి తేదలచాను, అది 2017 అక్టోబరు, ఐఎంఎఫ్‌ అధిపతి క్రిస్టీన్‌ లాగార్డే ఇలా చెప్పారు.’మేము స్వల్పంగా భారత స్ధాయిని తగ్గించాము, అయితే గతకొద్ది సంవత్సరాలుగా అమలు జరిపిన వ్యవస్ధీకృత సర్దుబాట్ల(సంస్కరణల) కారణంగా భారత్‌ మధ్య, దీర్ఘ కాలిక అభివృద్ధి బాటలో వున్నదని మేము నమ్ముతున్నాము’ ప్రపంచ ఆర్ధిక సంస్ధలైన ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంకు వంటివి పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి వంటి వాటి విషయంలో సంతృప్తి చెందితే ఎందుకని మన దేశంలోని వారు నోట్ల రద్దు, జిఎస్‌టితో సంతృప్తి చెందటం లేదు.

5. ప్రధాన మంత్రిగారూ విదేశాల్లో భారత ప్రతిష్టను మెరుగుపరచేందుకు ప్ర యత్నిస్తున్నారు, కానీ కొంత మంది మన నాయకులు విదేశాలకు వెళ్లినపుడు భారతీయ సంతతివారితో మాట్లాడుతూ ఆ చెప్పే విషయాలన్నీ దేశంలో పని చేయటం లేదు అని చెబుతున్నారు, ప్రతిదీ దిగజారుతున్నందున విదేశాల్లో వున్న భారతీయులు స్వదేశానికి రావాలని చెబుతున్నారు. అలాంటి వారికి మీరేం చెబుతారు.

6.మోడీ గారూ , ఒక మోడీ సిద్ధాంతం వునికిలోకి వచ్చింది, ఎవరైతే ఇటీవల న్యూఢిల్లీని సందర్శించారో మీ మంచి స్నేహితుడు బెంజమిన్‌ నెతన్యాహు మోడీ సిద్ధాంతాన్ని బలపరిచారు. వుగ్రవాదం పట్ల మీ వైఖరికి ఆయన మద్దతిచ్చారు.టైమ్స్‌ నౌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వుగ్రవాదం పట్ల మీ తీరు ఒక గట్టిశక్తి అయిన దేశవైఖరి మాదిరిగా వుందని చెప్పారు. ఆయన మోడీ సిద్దాంతాన్ని, ధృడమైన అధికారాన్ని బలపరిచారు. సుతారమైన అధికారంతో వుగ్రవాద సమస్యను ఎదుర్కోలేమని ఆయన చెప్పారు. మీరు ఆ ధృఢవైఖరినే కొనసాగిస్తారా ?

ఇంతకంటే ప్రహసనాలు ఏముంటాయి ? ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే జర్నలిస్టులను చూసిన వారికి ఈ ఇంటర్వ్యూ చేసిన వారు కనిపిస్తే హయిగా నవ్వుకొనేందుకు వీలు కలుగుతుంది. హాస్య, వ్యంగ్యోక్తులకు మంచి ముడిసరకును అందించినందుకు ఆ జర్నలిస్టులకు యావత్‌ జర్నలిస్టు, రచయితలు, కళాలోకం ఎంతైనా రుణపడి వుంటుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d