• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: imperialism

స్లేట్‌ ద స్కూల్‌ అధిపతి వాసిరెడ్డి అమరనాధ్‌ ఫేస్బుక్‌ పోస్టు – ఒక పరిశీలన ! మేథావులు ఆత్మావలోకనం చేసుకోవాలి !!

26 Monday Apr 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ 1 Comment

Tags

conspiracy theories, Intellectuals, Propaganda War, Propaganda war victims, Slate the School

ఎం కోటేశ్వరరావు

ఆంగ్లంలో ఇంటలెక్చ్యువల్‌ – తెలుగులో బుద్ధి జీవి. బుద్ది జీవులు ఎవరు, వారి లక్షణాలు ఏమిటి అన్నది సామాన్యులకూ – బుద్ది జీవుల్లోను ఎడతెగని సమస్య. వాళ్లు అలా అనుకుంటున్నారు- వీళ్లు ఇలా అనుకుంటున్నారు అని చెప్పటమే మేథావి లక్షణం అయితే అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడివి అక్కడికి చేరవేసే వారందరూ, అలా అట ఇలా అట అంటూ చెవులు కొరికే వారూ మేధావులే. ప్రశ్నలను మాత్రమే రేకెత్తించి జవాబులు చెప్పని వారు మేథావులని ఒక అనుభవశాలి చెప్పాడు. జార్జి ఆర్వెల్‌ అనే కలం పేరుతో సుప్రసిద్దుడైన ఆంగ్ల రచయిత ఎరిక్‌ ఆర్ధర్‌ బ్లెయిర్‌ ” కొన్ని ఆలోచనలు ఎంత బుద్ది తక్కువగా ఉంటాయంటే బుద్ది జీవులు మాత్రమే వాటిని నమ్ముతారు ” అని చెప్పారు. జార్జి ఆర్వెల్‌ ప్రస్తుతం బీహార్‌లోని మోతీహరిలో జన్మించి స్వాతంత్య్రం తరువాత ఇంగ్లండ్‌ వెళ్లిపోయి 47 సంవత్సరాల వయస్సులోనే 1950లో మరణించాడు. ఇంటర్నెట్‌, వాట్సప్‌ రాక ముందే తనువు చాలించాడు గానీ లేకుంటేనా వాట్సప్‌ విశ్వవిద్యాలయ బుద్ది మంతుల గురించి ఎంత చెప్పి ఉండేవాడో కదా !

హైదరాబాదు, విజయవాడ, తిరుపతి నగరాల్లో స్లేట్‌ ద స్కూలు పేరుతో విద్యా సంస్ధలు నడుపుతూ వైద్యంతో సహా (ఫేస్బుక్‌ పోస్టులను బట్టి ) బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరున్న వాసిరెడ్డి అమరనాధ్‌ ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు పెట్టారు. పేరు వినటమే తప్ప నాకు పరిచయం లేదు, పంచాయతీల్లేవు. అమరనాధ్‌ పోస్టు వాట్సప్‌ విశ్వవిద్యాలయంలో చూసిన తరువాత ఒక జర్నలిస్టుగా బుద్ది జీవుల గురించి రాయాలనిపించింది. ఆ పోస్టు అంశాలు ప్రస్తుతం సమాజంలో ఎందరో మేథావులు, విద్యావంతుల గందరగోళం- ఆలోచనకు ప్రతిబింబంగా ఉంది కనుక స్పందించాల్సి వస్తోంది. కనుక వ్యక్తిగతంగా తీసుకోనవసరం లేదు. పోస్టులోని అంశాన్ని విమర్శించాలని లేదా సంవాదం ప్రారంభించాలని కాదు. నా అభిప్రాయాలతో ఏకీభవించటమా, వ్యతిరేకించటమా అన్నది ఎవరికి వారే నిర్ణయించుకోవచ్చు. రాగ ద్వేషాలకు అతీతంగా పరిశీలించి బుద్దికి పదును పెట్టమని కోరుతున్నాను. అమరనాధ్‌గారి పోస్టులోని అంశాలపై నా స్పందన ఇక్కడ ప్రస్తావిస్తాను.

” చైనాలో పుట్టిన ఆ వైరస్‌ ప్రపంచం నలుచెరుగులా ఉన్న 180 కి పైగా దేశాలకు వ్యాపించింది . కానీ చైనా లో మాత్రం ఒక్క నగరానికే పరిమితం . ప్రపంచమంతా ఒకటి.. రెండు .. మూడు అంటూ వేవ్‌ లు . అక్కడ మాత్రం మొదటి మూడు నాలుగు నెలలు .. ఒక నగరం .. 90 వేల కేసులు మాత్రమే . . దీని వెనుక ఉన్న ఇంద్ర జాల మహేంద్ర జాలం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు . పోనీ చైనా న్యూజిలాండ్‌ లాగా ఎక్కడో దూరంగా ఉన్న దేశమా అంటే .. కాదు . ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా ! జన సాంద్రత ! ఆ వైరస్‌ ను ఏ అల్లాఉద్దీన్‌ అదుÄ్బత ద్వీపం సాయం తో కట్టడి చేసారో ఇప్పటి దాక ఒక్క శాస్త్రవేత్త కూడా వివరించ లేదు. ”

దీనిలో శాస్త్రవేత్తలు వివరించాల్సిందీ, వివరించనిదీ, తెలియనిదీ ఏమీ లేదు. వైరస్‌ చైనాలో పుట్టిందా మరోచోటనా అన్నది ఇంకా తెలియదు. చరిత్రలో స్పానిష్‌ ఫ్లూగా పరిచితమైనది తొలుత బయటపడింది అమెరికాలో, నింద మాత్రం స్పెయిన్‌కు వచ్చింది. మొదటి ప్రపంచ యుద్దం ముగిసిన సమయంలో దేశాలన్నింటా మీడియా మీద సెన్సార్‌ ఆంక్షలున్నాయి. స్పెయిన్‌ ఆ యుద్దంలో తటస్దంగా ఉంది. రాజు పదమూడవ ఆల్పోన్సోకు తీవ్ర సుస్తీ చేయటంతో అక్కడి మీడియాలో దాని గురించి రాశారు. అందరూ స్పానిష్‌ ఫ్లూ అన్నారు.
1977లో ఫ్లూ రష్యా, ఇతర దేశాలను వణికించింది. తొలుత ఇది ఉత్తర చైనాలో కనిపించింది. వ్యాప్తి ఎక్కువగా నాటి సోవియట్‌యూనియన్‌లో జరిగింది కనుక మీడియాలో దాన్ని రష్యా ప్లూ అన్నారు. తరువాత అమెరికా, ఇతర దేశాల్లో కూడా వ్యాపించింది. అప్పుడు చైనా-సోవియట్‌ సంబంధాలు సరిగా లేవు గనుక చైనా వారు లాబ్‌లో తయారు చేసి వదిలారని తప్పుడు ప్రచారం చేశారు.
2009లో ప్రపంచాన్ని వణికించిన హెచ్‌1ఎన్‌1 ప్లూ తొలుత మెక్సికోలో కనిపించినా దాన్ని మెక్సికో ఫ్లూ అని పిలువ లేదు. పందుల నుంచి వ్యాప్తి చెందినట్లు బయటపడినందున స్వైన్‌ ఫ్లూ అన్నారు. అయితే పంది మాంసం తినే దేశాలు ఈ పేరును అభ్యంతర పెట్టాయి. తరువాత ఇలాంటి వైరస్‌లకు ఒక దేశం, ప్రాంతం, భాష, జీవి పేరు పెట్టకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్ధ నిర్ణయించింది. ఆ మేరకు కోవిడ్‌-19 అని పేరు పెట్టారు. దాన్ని ఉల్లంఘిస్తూ చైనా వైరస్‌ అని ప్రచారం చేసి చైనా మీద ఉన్న కసిని అలా తీర్చుకున్నారు.

కరోనా వైరస్‌ తొలుత కనిపించిన ఊహాన్‌ నగరంలోని కోటి మంది జనాభా, పరిసరాలలో లాక్‌డౌన్‌ అమలు జరిపారు. అపార్ట్‌మెంట్లు, జనావాసాలను ఎక్కడిక్కడ కట్టడి చేశారు. రోగలక్షణాలతో నిమిత్తం లేకుండా దాదాపు ప్రతి ఇంటివారిని పరీక్షించి వైరస్‌ లక్షణాలున్న వారిని వేరు చేసి చికిత్స చేశారు. దేశంలోని ప్రజారోగ్య సిబ్బందినీ, వేలాది మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను వలంటీర్లుగా సమీకరించి ప్రతి నివాసం వద్ద ఉంచారు. ప్రతి ఇంటిలో ఎవరికేమి జరుగుతోందో పర్యవేక్షించారు. కావాల్సిన వాటిని అందచేశారు, జవాబుదారీతనంతో వ్యవహరించారు. అమరనాధ్‌ గారు స్లేట్‌ అనే ఒక కార్పొరేట్‌ స్కూలు అధిపతి గనుక స్కూలు పిల్లల గురించి చైనా తీసుకున్న జాగ్రత్తలను తెలుసుకోవాల్సింది. స్కూలు బస్సులకు ప్రత్యేక రోడ్ల కేటాయింపు, ఎక్కేటపుడు దిగేటపుడు జ్వరం ఉందా లేదా అని పరీక్షించటం వంటి చర్యలన్నీ తీసుకున్నారు.
ఇక్కడ కావాల్సింది చైనా మీద, అక్కడి వ్యవస్ధ మీద విశ్వాసం. అది లేని వారు అక్కడ ఏమి జరిగినా నమ్మరు. అందుకు ఒక్క ఉదాహరణ. చైనాలో జరిగిన ఆర్దిక అభివృద్ది గురించి చెప్పిందంతా అంకెల గారడీ అని ప్రచారం చేశారు. అవే నోళ్లు ఇప్పుడు తన ఆర్దికశక్తితో ప్రపంచాన్ని అదుపులోకి తెచ్చుకొనేందుకు చైనా పూనుకుంది అని కొత్తబాణీ అందుకున్నాయి. చైనా, వైరస్‌ గురించి కుట్ర సిద్దాంతాలను ప్రచారం చేసేందుకు చూపిన శ్రద్ద వైరస్‌ నివారణకు మన దేశంతో సహా మిగతా దేశాలు చూపి ఉంటే ఇలాంటి తీవ్ర పరిస్ధితి ఉండేది కాదు. రెండవ తరంగం కరోనా వ్యాప్తి తీవ్రం అవటం ప్రారంభించిన తరువాతనే కదా లక్షలాది మంది రాసుకుంటూ పూసుకుంటూ తిరిగే కుంభమేళాకు అనుమతించింది. ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి మూర్ఖ, మూఢత్వాన్ని ప్రభుత్వాలే ప్రోత్సహించాయా ? దీనిలో తెలియంది ఏముంది ? అమరనాధ్‌ లాంటి వారికి ఇంటర్నెట్‌ అందుబాటులో ఉంది, నిజంగా శ్రద్ద ఉండి తెలుసుకుంటే తెలియనిదేమీ లేదు. తెలుసుకోకుండా ఉంటారనీ అనుకోలేము.నిర్మొహమాటంగా చెప్పాలంటే చైనా సమాచారాన్ని విశ్వసించలేకపోవటమే అసలు సమస్య. దానికి సామాన్యుడైనా మేథావి అయినా ఒకటే.

” చైనా అమెరికా దేశంలోని అనేక యూనివర్సిటీ లకు సీక్రెట్‌ గా ఫండ్స్‌ ఇచ్చిందట . ఇదేదో అభియోగం కాదు. ట్రంప్‌ అధికారం లో వున్నప్పుడు దీని పై విచారణ జరిపి ఆయా యూనివర్సిటీ ల పై చర్య ల కు కూడా ఆదేశించాడు . యూనివర్సిటీ ల కు ఫండ్స్‌ ఇస్తే మంచే పనే కదా . దాన్ని గొప్పగా చెప్పుకోవాలి కదా ? . కానీ సీక్రెట్‌ గా దొంగ లాగా ఇవ్వడం ఏంటి ? అమెరికా మేధావులను తన అదుపులో పెట్టుకోవడం .. అమెరికన్‌ ల బ్రెయిన్‌ వాష్‌ .. మరో మాటలో చెప్పంటే మేధో దాడి అని కొంత మంది అంటారు . ”

చీమ చిటుక్కుమంటే కనిపెట్టగలిగిన అమెరికా గూఢచారి వ్యవస్ద గురించి తెలిసిన అమరనాధ్‌ గారు మీడియా ప్రచారదాడికి గురైయ్యారని పోస్టు పెట్టిన తీరు చెబుతోంది. ఇక్కడ కూడా అమెరికన్లు చెబుతున్న కుట్ర సిద్దాంతాన్ని నమ్మటమే. ముందే చెప్పినట్లు అక్కడ అలా అట ఇక్కడ ఇలా అట అని చెప్పటానికి అమరనాధ్‌ గారు అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. మన దేశంలోని విశ్వవిద్యాలయాలలో అధ్యయన సంస్దల ఏర్పాటు వాటికి స్వదేశీ, విదేశీ సంస్ధలు నిధులు ఇవ్వటం రహస్యమేమీ కాదు. అలాగే అమెరికాలోని విశ్వవిద్యాలయాలలో కన్పూషియస్‌ సిద్దాంతాల అధ్యయనం పేరుతో మరో పేరుతో చైనా అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటికి చైనా సంస్దల నుంచి, అమెరికా సంస్దల నుంచి కూడా నిధులు ఇచ్చారు. గత నాలుగు దశాబ్దాలుగా అమెరికా-చైనాల మధ్య సంబంధాలు, వాణిజ్యం పెద్ద ఎత్తున జరుగుతున్నపుడు లేని సమాచారం ట్రంప్‌ హయాంలోనే బయటకు వచ్చిందా ? అంతకు ముందున్న పాలకులకు తెలియదా ? సిఐఏ, ఎఫ్‌బిఐ, జాతీయ దర్యాప్తు సంస్దలు వాటికి ఉన్న లక్షలాది మంది గూఢచారులు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లుతోముతున్నారు ? నిజానికి అమెరికా ప్రభుత్వానికి తెలియకుండా జరిగిందేమీ లేదు.

చైనాతో వివాదం పెట్టుకోవాలి, దాన్ని అదిరించి బెదిరించి తన వాణిజ్యలోటును తగ్గించుకోవాలి. అందుకోసం ఏదో ఒక సాకులు చెప్పి జనాన్ని నమ్మించాలి. ఆ ఎత్తుగడలో భాగమే విశ్వవిద్యాలయాలకు నిధులు, అమెరికన్ల బుద్ది శుద్ది ప్రచారం. మన దేశంలోని విద్యా సంస్ధలలో గత ఐదు దశాబ్దాలుగా వామపక్ష ఉగ్రవాద సానుభూతి పరులు ఉద్యోగాలు చేయటం, నక్సల్‌ పార్టీల అనుబంధ సంఘాలతో సంబంధాలు కలిగి ఉండటం తెలిసిందే. ఇదే సమయంలో తిరోగమన ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం ఉన్నవారి సంఖ్యతో పోలిస్తే వీరు తక్కువే. అయినా అర్బన్‌ నక్సల్‌ అనే పదాన్ని ఇటీవలి కాలంలో ప్రత్యేకంగా ఎందుకు ప్రచారంలోకి తెచ్చారు? నిజానికి విశ్వవిద్యాలయాల్లో అలాంటి వారి సంఖ్య గతంతో పోల్చితే చాలా తగ్గింది. అధికార పార్టీలకు భజన చేసే బ్యాచి ఎక్కువైంది. అర్బన్‌ నక్సల్స్‌ పదం ప్రచారం ఎత్తుగడలో భాగం.

అమెరికాలో బుద్ది శుద్ది ఎవరు చేస్తున్నారు? చైనా కమ్యూనిస్టులు వచ్చి అక్కడేమీ రాజకీయ పాఠశాలలు పెట్టి కమ్యూనిస్టు పాఠాలు చెప్పటం లేదే ? గత మూడు దశాబ్దాల్లో అమెరికా విద్యావంతుల్లో వచ్చిన మార్పు ఏమిటి ? అంతకు ముందు కమ్యూనిజాన్ని బూచిగా చూపారు. సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాలను కూల్చివేసిన తరువాత కమ్యూనిజంపై విజయం సాధించామని ప్రకటించింది ఎవరు ? అమెరికన్లే కదా ! అక్కడే అమెరికా మేథావులు, యువతలో కొత్త ఆలోచనకు నాంది పడింది. దేశంలో దిగజారుతున్న పరిస్ధితి, దుకాణాలన్నీ చైనా వస్తువులతో నిత్యం దర్శనమివ్వటం, వాణిజ్య లోటు తగ్గించాలని అమెరికా నేతలు నిత్యం చైనీయులను కోరటం, అదే సమయంలో చైనా కమ్యూనిస్టు వ్యవస్ధలో మానవ హక్కులు లేవనే బ్లాక్‌మెయిల్‌ ప్రచారం వాస్తవమా, కాదా ? వీటికి తోడు పదేండ్లకొకసారి వస్తున్న ఆర్ధిక సంక్షోభాలు అమెరికా వంటి ధనిక దేశాలకు తప్ప చైనా దరిచేరకపోవటం అమెరికా మేథావులకు తెలియదా ? ఆందుకే మన దేశపు పెట్టుబడిదారీ వ్యవస్ధ ఎందుకు విఫలమైంది, అంతకు ముందు విఫలమైంది అని చెప్పిన సోషలిస్టు వ్యవస్ధ చైనాలో ఎందుకు ముందుకు పోతోంది అనే ఆలోచన వారిని కాపిటల్‌ గ్రంధం దుమ్ముదులిపేందుకు ముందుకు నెట్టింది. ఇప్పుడు అమెరికా విద్యావంతుల్లో చర్చ పెట్టుబడిదారీ వ్యవస్ద వైఫల్యం గురించే నడుస్తున్నది. సోషలిస్టు అంటే ఎయిడ్స్‌ వచ్చిన వాడిని చూసినట్లు చూసే జనం ఒకప్పుడు ఉన్న అమెరికాలో ఇప్పుడు ఏం జరుగుతోంది. అవును నేను సోషలిస్టును బస్తీమే సవాల్‌ అంటూ బహిరంగంగా ప్రకటించుకున్న బెర్నీ శాండర్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిత్వం కొరకు పోటీపడే స్ధితి ఏర్పడింది. ఆ పార్టీలోని అనేక మంది మీద కమ్యూనిస్టు ముద్ర ఉన్నా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. మిలియన్ల మంది యువత మేమూ సోషలిస్టులమే అని ప్రకటించుకుంటున్నారు. ఇవేవీ అమరనాధ్‌ వంటి వారికి తెలియవా, తెలుసుకుంటే దొరకని వస్తువా ? మార్గం చూపాల్సిన మేథావులు అపని చేయకుండా, తాము ఏమనుకుంటున్నారో చెప్పకుండా అమెరికన్ల బ్రెయిన్‌ వాష్‌.. మరో మాటలో చెప్పాలంటే మేథోదాడి అని కొంత మంది అంటారు అని ఇతరుల మీద నెట్టటం ఏమిటి ?

” తొలిసారి ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయినప్పుడు ఒక ప్రచారం జరిగింది . రష్యా వివిధ పద్ధతుల్లో ట్రంప్‌ గెలవడానికి సాయ పడింది . ఆ విధంగా అమెరికా పై పట్టు సాధించడానికి ప్రయత్నిస్తోంది అని . చైనా ప్రపంచం పై పట్టు సాధించడానికి చేయని ప్రయత్నం లేదనేది మేధావుల మాట . మొన్నటి అమెరికా ఎన్నికలు ముందు అమెరికా లో కేసులు విపరీతంగా పెరగడం తెలిసిందే . అప్పటికే దిగజారుతున్న ట్రంప్‌ పరపతి దీనితో ఇంకా పోయింది . ట్రంప్‌ , కరోనా విషయం లో సరిగా వ్యవహరించక పోవడం వల్లే ఇంత నష్టం జరిగింది అని చాలా మంది అమెరికన్‌ లు అనుకొన్నారు . ఫలితం .. ట్రంప్‌ ఓటమి . అమెరికన్‌ లు మాస్క్‌ పెట్టుకోకపోవడం వల్లే కేసులు పెరిగాయని ట్రంప్‌ మాస్క్‌ ల విషయం లో తప్పుదారి పట్టించేలా వ్యవహరించాడని చాలా మంది భావించారు . లేదు .. తన పై దాదాపుగా యుద్ధం ప్రకటించిన ట్రంప్‌ ను ఓడించాలని చైనా పంతం పట్టింది .. అమెరికా లో మేధావులు , మీడియా ఇప్పుడు చైనా గుప్పిట్లో వున్నారు . చైనా కావాలంటే కేసులు పెంచడం పెద్ద కష్టమా ? ఇందులో ఏదో కుట్ర వుంది అని భావించే వారున్నారు . ఇలా చెప్పడానికి ఎలాంటి రుజువులు లేవనేది సత్యం . ఇలాంటి కుట్ర సిద్ధాంతాలు కేవలం కాలక్షేపానికి పనికి వస్తాయి అని చాలా మంది భావిస్తారు. ” అని అమరనాధ్‌గారు చెప్పారు.

వాట్సప్‌ యూనివర్సిటీ చేస్తోంది ఇదే. రుజువులు లేని సొల్లుకబుర్ల తయారీ కూడా ప్రచార దాడిలో భాగమే. జనాన్ని తప్పుదారి పట్టించేందుకు అవి బాగా ఉపయోగపడతాయి, రంజుగా ఉంటాయి. ఎలాంటి విమర్శనాత్మక దృష్టి లేకుండా మేథావులు వాటిని జనం ముందు ఉంచటమే విషాదం, విచారకరం, ఆక్షేపణీయం. ఆ పని చేయటంలో పోస్టుమాన్‌ పని తప్ప వారి బుద్ది కుశలత ఏముంది ? వాటి మీద బుద్ది జీవుల వైఖరి ఏమిటి ? ఒక టీవీ యాంకర్‌ అయితే దీని మీద వారలా అంటున్నారు, మీరేమంటున్నారు, దాని మీద వారలా అన్నా మీరేమంటారు అని అడగవచ్చు. అది మేథోలక్షణం కాదు. కొందరు యాంకర్లు తమకు నచ్చేవాటిని చెప్పేందుకు ఎక్కువ అవకాశమిస్తారు, భిన్నంగా మాట్లాడితే ఏదో ఒక పేరుతో వేరే అంశానికి మరలుతారు. మేథావులు అలా చేస్తే సహజంగానే అనుమానాలు వస్తాయి.

ప్రతి దేశం మరోదేశపు అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నది అన్నది అందరికీ తెలిసిన పచ్చినిజం. మన ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా అమెరికా వెళ్లి అబ్‌కి బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అని బహిరంగంగా ప్రచారం చేసి వచ్చిన విషయం తెలియదా ? అంటే బైడెన్‌ను ఓడించాలనే కదా ! ఎవరైనా ఒకటే కదా మరి, మోడీ ఎందుకు ఆ పిలుపు ఇచ్చినట్లు ? పాకేజ్‌ ఏమైనా కుదుర్చుకున్నారా ? తన పెరటితోట అనుకుంటున్న లాటిన్‌ అమెరికాలో, ఇంకా అనేక దేశాల్లో అమెరికా జోక్యం చేసుకుంటూ ఎవరు గద్దెమీద ఉండాలో కూడదో నిర్దేశిస్తున్నది. ఎన్నుకున్న ప్రభుత్వాలను గుర్తించేందుకు నిరాకరిస్తున్నది. మేథావులకు ఇవేవీ పట్టవా ? కుట్ర సిద్దాంతాలను ఒక లక్ష్యం కోసం తప్ప కాలక్షేపం కోసం సృష్టించటం లేదు. అదేమీ చిన్న విషయం కాదు. సూటిగా చెప్పకుండా అనుమానాలు రేకెత్తించి జుట్టుపీక్కొనేట్లు చేసే నైపుణ్యం ఉంటేనే అలాంటి వాటి సృష్టి కర్తలకు నాలుగు డబ్బులు వస్తాయి. దేశంలో హిందువులను మైనారిటీలుగా మార్చేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఇస్లాం, క్రైస్తవ మతాల వారి మీద నిరంతరం ప్రచారం చేస్తున్నారు. దీన్ని కాలక్షేపానికి చేస్తున్నారని అనుకోవాలా ? కేంద్ర ప్రభుత్వ చర్యలను లేదా రాష్ట్రాలలో ఆయా ప్రభుత్వాల చర్యలను విమర్శించిన మీడియా మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయో చూస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం ఏకంగా దేశద్రోహంగా చిత్రిస్తున్నది. అదే విధంగా అమెరికా మీడియాలో ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే దానికి చైనా మద్దతు, నిధులు అంటున్నారు. అమెరికా మీడియాలో ప్రధాన స్రవంతి సంస్ధలన్నీ కార్పొరేట్లవే. వాటి ప్రయోజనాలే మీడియాకు ముఖ్యం తప్ప చైనా కోసం పని చేస్తాయని చెప్పటం ప్రచారదాడిలో భాగమే.

” కొన్ని నెలల క్రితం ఒక యూట్యూబ్‌ లో ఒక సీనియర్‌ జర్నలిస్ట్‌ వీడియో చూసాను . ఆయన తెలుగు వాడే . పేరు గుర్తు రావడం లేదు . ఢిల్లీ స్థాయిలో మీడియా ను చైనా దేశం తరపున కొంత మంది బ్రోకర్‌ లు ఎలా మానిప్యులేట్‌ చేస్తున్నారో .. మీడియా లో చైనా వ్యతిరేక వార్తలు రాసిన జర్నల్లిస్ట్‌ ల ఉద్యోగాలు ఎలా ఊడి పోయాయో అయన ఆ వీడియో లో పేర్ల తో సహా వివరించాడు . అవునా ? మన దేశం లో కూడా చైనా కు నిజంగా అంత పట్టుందా అని నేను ఆశ్చర్య పోయాను. ”

ఇది ఆధారం, అర్దం లేని అంశం. సదరు సీనియర్‌ జర్నలిస్టు తెలుగువాడైనా మరొకరైనా చైనా వ్యతిరేక వార్తలు రాసి ఉద్యోగాలు పోగొట్టుకున్నారని చెప్పటం అతిశయోక్తి తప్ప మరొకటి కాదు. పత్రికలు, టీవీ ఛానళ్లు తమ రేటింగ్‌ను పెంచుకొనేందుకు చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు చేస్తున్న ప్రచారం అమరనాధ్‌ గారి దృష్టికి వచ్చి ఉంటే ఈ అతిశయోక్తి వార్తను నమ్మి పోస్టులో పెట్టి ఉండరు. చైనాతో మన సంబంధాల గురించి విమర్శనాత్మకంగా రాసిన వారెవరైనా ఉద్యోగాలు పోగొట్టుకొని ఉంటారు తప్ప మరొకటి కాదు. చైనీయులు అమెరికాను, మన దేశ మేథావులను కూడా అదుపులోకి తీసుకున్నారని అమరనాధ్‌ వంటి వారు నిజంగా నమ్ముతున్నారా ? మొత్తంగా ఎక్కడైనా అమ్ముడు పోతారా ? ఒక వైపు మీడియాను పూర్తిగా తనకు అనుకూలంగా వినియోగించుకుంటూ ఒకటీ అరావిమర్శనాత్మకంగా ఉంటే మీడియా మొత్తం కమ్యూనిస్టులు, దేశద్రోహులతో నిండిపోయిందని కాషాయ దళాలు నిరంతరం ప్రచారం చేస్తుంటాయి. భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే వారు, భజన చేయని వారందరూ వారి దృష్టిలో కమ్యూనిస్టులే.

” ఫిబ్రవరి మూడవ వారం నుంచి కేసులు మన దేశం లో భారీగా పెరిగాయి . ఇలా పెరుగుతాయని ఎవరూ ఊహించలేదు అనేది సత్యం . ఇప్పుడు అనేక వాట్సాప్‌ గ్రూప్‌లలో ఫేస్బుక్‌ పైన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకత పెరగడం చూసాను . అమెరికా లో సఫలం అయిన ప్రయోగాన్ని ఇక్కడ కూడా చేయాలని చైనా చూస్తోందా ? అసలు అమెరికా లో చైనా ఆలా చేసింది అని చెప్పడానికే ఆధారాలు లేవు . ఇంకా ఇక్కడ దాన్ని ప్రయోగిస్తోంది అని అనుకోవడమేంటి ? పిచ్చి ఊహ కాదా ? అయిన చైనా ఆలా చెయ్యాలని ప్రయత్నిస్తే మన దేశం లో గూఢచారి సంస్థలు పసిగట్ట లేవా ? ఏమో .. అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ కన్నా మన సంస్థ లు గొప్పవా ? ఆబ్బె .. ఇది అతి గా ఆలోచించడం .. ”

ఇది వాట్సప్‌, బుర్ర ఉపయోగించకుండా దానిలో వచ్చిన వాటన్నింటినీ గుడ్డిగా నమ్మి ప్రచారం చేసిన దాని ప్రభావం అమరనాధ్‌ గారి మీద కూడా పడినట్లుంది. ఆయనే చెప్పినట్లు పిచ్చి ఊహల గురించి చెప్పుకోవటం పనిపాటా లేని వ్యవహారం. లేదా వాటిని చెప్పాల్సి వస్తే అలాంటి పనిపాటా లేని సరకు గురించి జనాన్ని హెచ్చరించాలి. అతిగా ఆలోచించటం అన్నారు తప్ప అమరనాధ్‌ పోస్టులో అలాంటి సూచనలేవీ లేవు. కరోనా కేసులు పెరుగుతాయని సామాన్యులు ఊహించలేకపోవచ్చు. కానీ ఎంతో అనుభవం, నిత్యం ప్రపంచ పరిణామాలను చూస్తున్న అధికార యంత్రాంగం, దాన్ని నడిపే రాజకీయనాయకత్వానికి ముందు చూపు లేకపోతే దేశం అధోగతి పాలవుతుంది. ఇరుగు పొరుగు దేశాలతో వస్తుందో రాదో తెలియని యుద్దం గురించి అంచనా వేసుకొని లక్షల కోట్ల రూపాయల ఆయుధాలు కొనుగోలు చేస్తున్నాము. ఆ సమాచారం ఉంది ఈ సమాచారం ఉందని కథలు రాయిస్తుంటారు. కొన్న ఆయుధాలు పాతపడి పోగానే పక్కన పడేసి కొత్తవి కొంటున్నాము.

కరోనా మీద యుద్దం ముగిసిందని ఎవరు చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్ధ అలాంటి సూచనలేమీ ఇవ్వలేదు. అనేక దేశాలలో తిరగబెట్టింది. కేంద్ర పాలకులు ఆ అనుభవాన్ని ఏమైనా పరిగణనలోకి తీసుకున్నారా ? పోనీ కేసులు అనూహ్యంగా పెరుగుతున్న తరువాత కూడా కుంభమేళాకు ఎందుకు అనుమతిచ్చారు? అనేక మంది నిపుణులు చేసిన హెచ్చరికలను ఎందుకు పెడచెవిన పెట్టారు ? ఆక్సిజన్‌ అవసరం గురించి గతేడాదే అర్దం అయింది. దానికోసం 150 ప్లాంట్లను ఏర్పాటు చేయాలని గతేడాదే నిర్ణయించారు. ఏడు నెలల పాటు టెండర్లు ఖరారు చేయలేదు, దీన్ని ఏమనాలి బాధ్యతా రాహిత్యమా , నేరపూరిత నిర్లక్ష్యమా ? ఫేస్బుక్‌లో జన స్పందన చూసేంతవరకు మీకు కేంద్ర వైఖరిలో ఎలాంటి తప్పు ఒప్పులు కనిపించలేదా ? సామాన్యులకు మీకు ఇంక తేడా ఏముంది. పరిజ్ఞానం కంటే ఊహ ముఖ్యమని ఐనిస్టీన్‌ చెప్పాడు. మెదడుతో చూడగలిగిన వాడే బుద్ది జీవి అని మరో పెద్దమనిషి సెలవిచ్చారు. అలాంటి వారు కొందరు హెచ్చరిస్తున్నా కేంద్రంలో, పలు రాష్ట్రాల్లో యంత్రాంగం పట్టించుకోకపోవటమే ఇంతవరకు తెచ్చింది. మేథావులూ పట్టించుకోవటం లేదు.

” చైనా లో ఆ ఒక్క నగరం తప్పించి మిగతా చోట్లకు ఆ రోగం ఎందుకు విస్తరించలేదు ? ఆ నగరం పేరు పోస్ట్‌ చేసినా సోషల్‌ మీడియా ఎందుకు ఆ పోస్ట్‌ ను బ్లాక్‌ చేస్తోంది ? చైనా మిత్రం దేశం .. మన పొరుగున వున్న పాకిస్థాన్‌ . మన దేశం లో మాత్రం అటు ఉత్తరాంచల్‌ మొదలు ఇటు తమిళనాడు దాకా కేసులు పెరుగుతున్నాయి . సరే ఇక్కడ మాస్క్‌ లు పెట్టుకోలేదు .. జనాలు గుంపులు గుంపులుగా తిరిగారు అని చెప్పేవారు . మరి మన పొరుగునే వున్న పాకిస్థాన్‌ ? అక్కడ కొద్దీ పాటి కేసులు పెరిగినా ఇక్కడి లాగా ఇన్ని కేసులు రావడం లేదు . అక్కడ మాస్క్‌ లు భౌతిక దూరం సిద్ధాంతం పని చెయ్యదా ?
పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నాను కదా . అందుకే చెప్పా .. నా దగ్గర రుజువులు లేవండి . చదివే వారికి ఏదో సోది లాగా ఉంటుంది .. లేదా నేనేదో సంచలనం కోసం .. పబ్లిసిటీ పిచ్చితో ప్రవర్తిస్తున్నాను అనిపిస్తుంది .. కాబట్టి నేను చెప్పను .. అవి నా మనసులో అనుమానాలే .. అది నాతోనే ఉండి పోనీ అని .. నిన్నటి నుంచి సర్‌ చెప్పండి చెప్పని అని మెసెంజర్‌ లో మెసేజ్‌ ల వెల్లువ . సరే పోస్ట్‌ చేశా . జస్ట్‌ చదివి మరచి పోండి. అయిదు నిముషాలు కాలక్షేపం అనుకోండి. ”

ఊహాన్‌ నగరం పేరు ఉన్న పోస్టును సోషల్‌ మీడియా బ్లాక్‌ చేస్తోందన్నారు. చాలా చిత్రంగా ఉంది. కాషాయ తాలిబాన్లు ఇలాంటి చిత్రాల గురించి పోస్టులు పెట్టటం నేను ఫేస్బుక్‌లో చూశాను. మన దేశంలో ఇంటర్నెట్‌ను నియంత్రించేది చైనా అనుకుంటున్నారా ? పక్కా నరేంద్రమోడీ సర్కార్‌. రైతు ఉద్యమం సందర్భంగా మీడియా కిట్ల గురించి ఎంత రచ్చ చేసిందో మీకు తెలియకుండా ఉంటుందా ? పబ్లిసిటీ పిచ్చికోసం ప్రవర్తిస్తున్నాను అనిపిస్తుంది అన్నారు. మీకేమనిపించిందో స్కానింగ్‌చేసినా దొరకదు, కానీ మెసేజ్‌ల వెల్లువ కారణంగా పోస్టు చేయాల్సి వచ్చిందన్నారు. పర్యవసానం మీకు ఎంతో పబ్లిసిటీ వచ్చింది. మీకు కాలక్షేపం అనిపించవచ్చు గానీ, ఒక మేధావిగా ఇలాంటి పోస్టులు పెట్టటం తగదేమో ఆలోచించండి. దీని వలన ఏమి సాధించిందీ అవలోకించుకోండి. ఎవరిలో అయినా ఉన్న గందరగోళాన్ని తొలగించారా, ఇంకా గట్టిపరిచారా ? చైనా-అమెరికా-నరేంద్రమోడీ ఇంకా ఎవరైనా సరే వారి గురించి అమరనాధ్‌ గారయినా మరొక మేధావి అయినా ఒక స్పష్టమైన అభిప్రాయం కలిగి ఉండాలని మనవి. అవి వెల్లడించే ధైర్యం లేనపుడు మౌనంగా ఉండటం మేలు. అటూ ఇటూగాకుండా చెబితే ప్రయోజనం ఏముంది ? ఒక బుద్ది జీవిగా ఆలోచించండి. మేథావుల మౌనం దేశాలకు మంచిది కాదని ప్రపంచ చరిత్ర చెప్పింది.ప్రపంచంలో తటస్ధం అంటూ ఏదీ లేదు. నాకు రాజకీయాలు పట్టవు, నేను ఎవరికీ అనుకూలం కాదు వ్యతిరేకం కాదు అని ఎవరైనా అంటే అధికారంలో ఉన్నవారిని కొనసాగించాలని కోరే పక్షానికే అది అనుకూలిస్తుంది. తెలియకుండానే అలాంటి వారు ఒక వైపు మద్దతు ఇచ్చినట్లే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

రూపాయి పాపాయి మీద అనుమానం, అమెరికా నిఘా : మోడీకి అడుగడుగునా అవమానాలు, భంగపాటు !

24 Saturday Apr 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, Uncategorized, USA

≈ Leave a comment

Tags

currency manipulators, Currency watch list of US, India’s Rupee, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ఎదుటి వారిలో ఏమీ లేకుండా మనం ఎగిరెగిరి కౌగలించుకున్నంత మాత్రాన ఒరిగిందేమీ లేకపోగా అడుగడుగునా అవమానాలు. విదేశీనేతలను ముఖ్యంగా డోనాల్డ్‌ ట్రంప్‌ను మన నరేంద్రమోడీ కౌగిలించుకున్న తీరు తెన్నులు చూసి ఎబ్బెట్టుగా అనిపించి ఇదేమిటని విమర్శించిన వారు కొందరు ఉండవచ్చు. కానీ మోడీ ఏం చేసినా దేశం కోసమే అని నమ్మి సమర్ధించిన వారెందరో. ఒక్కొక్క నేతది ఒక్కో శైలి. అధికారంలో ట్రంపు ఉన్నా బైడెన్‌ వచ్చినా అమెరికా నుంచి అడుగడుగునా ఆటంకాలు, అవమానాలే. అన్నింటికీ మించి మనకు ఒరిగిందేమీ లేకపోగా నష్టాలే. వాటిని పదే పదే చెప్పుకున్నా అల్లు అర్జున్‌ ఒక సినిమాలో చెప్పినట్లు చాల బాగోదు.


తాజా విషయానికి వస్తే అమెరికా మనల్ని మోసకారుల జాబితాలో చేర్చింది. కరెన్సీతో మోసాలకు పాల్పడుతూ అమెరికా ప్రయోజనాలను దెబ్బతీస్తున్నదంటూ కన్నేసి ఉంచాల్సిన దేశాల జాబితాలో మన పేరు చేర్చింది. తొలిసారి 2018లో చేర్చి మరుసటి ఏడాది తొలగించింది, మరోసారి గత డిసెంబరులో చేర్చింది. దాన్ని మరోసారి తాజా పరిచినట్లు గతవారంలో వార్తలు వచ్చాయి. అమెరికా ఆర్ధికశాఖ రూపొందించిన జాబితాలో చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, జర్మనీ, ఐర్లాండ్‌, ఇటలీ, ఇండియా, మలేషియా, సింగపూర్‌,థాయిలాండ్‌, మెక్సికో ఉంది. అమెరికాకు తన ప్రయోజనాలు తప్ప మిత్ర-శత్రుదేశాలనేవి లేవని ఈ జాబితా స్పష్టం చేస్తున్నది. డిసెంబరు జాబితాలో మెక్సికో, ఐర్లండ్‌లు లేవు. ఈ జాబితా లేదా ఈ దేశాల మీద ఇలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేసింది ఏ ప్రపంచ వాణిజ్య సంస్దో లేక ఐక్యరాజ్యసమితో అయితే అదోదారి. ఏదో ఒక అంతర్జాతీయ చట్టం కింద అనుకోవచ్చు. అదేమీ లేదు, 2015నాటి అమెరికా వాణిజ్య చట్టం ప్రకారం ఈ పని చేశారు. వారు దాడి చేయాలనుకున్నవారిని జాబితాలో పెడతారు, ఎత్తుగడగా వద్దనుకున్న వారిని మినహయిస్తారు. దానిలో భాగంగానే వియత్నాం, చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌, స్విడ్జర్లాండ్‌లను ఆరునెలల క్రితం ఈ జాబితాలో చేర్చారు. అయినప్పటికీ రాజకీయ కారణాలతో జాబితా నుంచి తొలగించి మిగతావాటితో పాటు ఓ కన్నేసి ఉంచాలని మాత్రమే నిర్ణయించారు.


ఒక దేశం కరెన్సీతో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించేందుకు అమెరికాకు ప్రాతిపదిక ఏమిటి? అమెరికాతో వాణిజ్యం చేసే దేశపు మిగులు ఏడాదిలో 20 బిలియన్‌ డాలర్లు ఉండటం, ఆయా దేశాల జిడిపిలో కరెంటు ఖాతా మిగులు మూడుశాతం వరకు ఉన్నపుడు, ఒక దేశం ఏడాది కాలంలో కొనుగోలు చేసిన విదేశీ కరెన్సీ దాని జిడిపిలో రెండుశాతం దాటితే అమెరికాను మోసం చేస్తున్నట్లు పరిగణిస్తారు. 2020 జనవరి నుంచి డిసెంబరు మధ్యకాలంలో వియత్నాం, స్విడ్జర్లాండ్‌, తైవాన్‌, భారత్‌, సింగపూర్‌ లావాదేవీల గురించి అమెరికాకు అనుమానం వచ్చినట్లు ఏప్రిల్‌ 16వ తేదీన విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. పైన పేర్కొన్న మూడు ప్రాతిపదికలలో మన దేశం రెండింటిలో గీత దాటినట్లు పేర్కొన్నది. 2020లో పన్నెండు నెలలకు గాను పదకొండు నెలల్లో భారత్‌ నిఖరంగా 131 బిలియన్‌ డాలర్లను కొనుగోలు చేసింది, ఇది జిడిపిలో ఐదుశాతానికి సమానం. 2001,02,03 తరువాత 2020లో భారత కరెంటు ఖాతా మిగులు 1.3శాతం ఉంది. అదే ఏడాది అమెరికాతో భారత వాణిజ్య మిగులు 24 బిలియన్‌ డాలర్లు ఉంది, సేవల వాణిజ్యంలో కూడా ఎనిమిది బిలియన్‌ డాలర్ల మిగులు ఉంది. 2019తో పోల్చితే కరోనాతో ఆర్ధిక వ్యవస్ధ కుదేలయినా మన దేశ స్టాక్‌ మార్కెట్లోకి విదేశీ మదుపరులు పెద్ద మొత్తంలో ప్రవేశించారు. మన డాలర్ల నిల్వ పెరగటానికి అది కూడా ఒక కారణం. ఒక దేశ ఆర్ధిక మౌలిక అంశాలను ప్రతిబింబించే విధంగా కరెన్సీ మారకపు విలువ ఉండాలి. విదేశీ కరెన్సీ జోక్యం పరిమితంగా ఉండాలి, ఎక్కువగా నిలువ చేసుకోకూడదని అమెరికా ఆర్ధికశాఖ నివేదిక పేర్కొన్నది.


వారి జాబితా నుంచి తొలగించిన వాటిలో స్విడ్జర్లండ్‌ ఐరోపాలోని తటస్ధదేశం, అయినా గతంలో మోసకారుల జాబితాలో చేర్చి తాజాగా తొలగించింది. వియత్నాం సోషలిస్టు దేశం. దక్షిణ చైనా సముద్రంలో కొన్ని దీవుల విషయంలో చైనాతో విబేధిస్తున్నది కనుక దాన్ని తనవైపు తిప్పుకోవాలంటే ఇలాంటి తాయిలం పెట్టాలన్నది ఒక ఎత్తుగడ. ఇక తైవాన్‌ విషయానికి వస్తే చైనాలోని తిరుగుబాటు రాష్ట్రం, స్వంతంగా మిలిటరీని కలిగి ఉంది. అమెరికా నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తున్నది. దాన్ని కూడా అనుమానితుల జాబితాలో చేర్చితే అక్కడి జనంలో అమెరికా వ్యతిరేకత పెరుగుతుంది, దీనికి తోడు చైనాను రెచ్చగొట్టేందుకు తైవాన్‌ ఒక శిఖండిలా ఉపయోగపడుతోంది కనుక దానికీ అమెరికన్లు మినహాయింపు ఇచ్చారు. మనల్ని మిత్రదేశం అంటూనే మరింతగా లొంగదీసుకొనేందుకు మోసకారి ముద్రవేశారు.


అమెరికా ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నది. స్వార్ధం, బెదిరింపు,లొంగదీసుకొనే ప్రక్రియలో భాగం తప్ప మరొకటి కాదు. దీనిలో కీలక అంశం కరెన్సీ విలువ. ప్రస్తుతం ప్రపంచంలో వివిధ దేశాల మధ్య టవమారకానికి డాలర్లను వినియోగిస్తున్నారు. కరెన్సీ విలువలను మోసపూరిత పద్దతుల్లో కృత్రిమంగా తగ్గించి లేదా పెంచి తమ కార్మికులను దెబ్బతీస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది. పారిశ్రామిక, వాణిజ్యవేత్తలని చెబితే బాగోదు కనుక కార్మికుల పేరుతో రాజకీయం చేస్తోంది. ఆయా దేశాలు తమ కరెన్సీ విలువలను కావాలని తగ్గిస్తున్నాయన్నది దాని ప్రధాన ఆరోపణ. చిత్రం ఏమంటే ట్రంప్‌ యంత్రాంగం చైనాను మోసకారి అని ప్రకటించగా, బైడెన్‌ యంత్రాంగం నిఘావేసి ఉంచాల్సిన మోసకారుల జాబితాలో మన దేశంతో పాటు చైనాను కూడా చేర్చింది, అంటే చైనా మీద దాడి తీవ్రతను తగ్గించింది. ఈ జాబితా రూపకల్పనలో ఎలాంటి ఆర్ధిక పరమైన తర్కం తనకు అర్ధం కావటం లేదని మన వాణిజ్యశాఖ కార్యదర్శి అనుప్‌ వాధ్వాన్‌ వ్యాఖ్యానించారు. పోనీ మోసకారులంటే ఏ ఒక్కరి మీద అమెరికా ఆంక్షలు ఎందుకు లేవు అన్నారు. మార్కెట్‌ శక్తుల ప్రాతిపదికగానే రిజర్వుబ్యాంకు వ్యవహరిస్తోందన్నారు.


ఇక అమెరికా ఆగ్రహం విషయానికి వస్తే మన రూపాయి పాపాయి బలపడుతోంది- చిక్కిపోతోంది. తాజాగా ఆసియాలో అత్యంత దారుణమైన పని తీరు కనపరుస్తున్న కరెన్సీగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. డాలర్ల కొనుగోలు రూపాయి పెరుగుదలను నిరుత్సాహపరచేందుకు తీసుకున్న చర్యగా కొందరు చెబుతున్నారు. రూపాయి చిక్కితే ఎగుమతిదార్లకు లాభం- దిగుమతిదార్లకు నష్టం, బలపడితే ఎగుమతిదార్లకు నష్టం-దిగుమతిదార్లకు లాభం. మార్కెట్లోని ఈ రెండు శక్తులు తమకు అనువైన వాదనలను ముందుకు తెస్తూ వత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటాయి.మనతో వాణిజ్యం జరిపే దేశాల ప్రమేయం కూడా దీనిలో ఉంటుంది. తమ డాలరు విలువ తగ్గకుండానే తమ సరకులను అమ్ముకోవాలన్నది అమెరికా లక్ష్యం. కరెన్సీ విలువ ఎక్కువ-తక్కువలు ఒకే దేశంలో ఎగుమతి-దిగుమతిదార్లు ఇద్దరి మీద ప్రభావం చూపుతాయి. ఇలా ఇంటా బయటి వత్తిళ్లతో రూపాయి పరిస్ధితి అగమ్యగోచరంగా ఉంటుంది. గత ఏడు సంవత్సరాల కాలంలో చూసినపుడు రూపాయి 58 నుంచి 75కు దిగజారింది కనుక దీనిలో రెండు అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యుపిఏ కంటే తన పాలనలో ఎగుమతులను పెంచి దేశాన్ని ముందుకు తీసుకుపోయానని చెప్పుకొనేందుకు మోడీ సర్కార్‌ రూపాయి విలువను దిగజార్చిందని చెప్పవచ్చు. అంతకు ముందు రూపాయి విలువ పడిపోతే ముఖ్యమంత్రిగా మోడీ, బిజెపి నేతలు ఎంత యాగీ చేశారో, ఎన్ని మాటలన్నారో తెలిసిందే. తమ దాకా వచ్చే సరికి ప్లేటు ఫిరాయించారు.నోరు మూసుకున్నారు. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు.


2010 నుంచి 2019వరకు ఉన్న వివరాలను చూసినట్లయితే మన ఎగుమతులు జిడిపిలో 2010లో 22.4శాతం ఉండగా 2013 నాటికి 25.43శాతానికి పెరిగాయి. అప్పటి నుంచి పడిపోతూ 2019నాటికి 18.41శాతానికి తగ్గాయి. ఇదే సమయంలో దిగుమతులు కూడా తగ్గినప్పటికీ ఎగుమతుల కంటే ఎక్కుగానే ఉన్నాయి. 2010 -21 మధ్య డాలరుతో రూపాయి మారకపు విలువ 45 నుంచి 75కు పడిపోయింది (ఏప్రిల్‌ 24న 75.22). మే నెలలో 76.50వరకు పతనం కావచ్చని అంచనా. ఇదే కాలంలో ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నపుడు రూపాయి విలువ అంతర్గతంగా 100 నుంచి 202.96(ఏప్రిల్‌ 24వ తేదీ)కు పడిపోయింది. అంటే ఒక వస్తువు ధర పదేండ్లలో ఆ స్ధాయిలో పెరిగింది అని చెప్పవచ్చు. ఒక దేశ కరెన్సీ విలువ డాలరుతో మారకపు ధర ఎంత తక్కువ ఉంటే అంతగా ఎగుమతి అవకాశాలు ఉంటాయన్నది సాధారణ సిద్దాంతం. దానికి మినహాయింపుగా మన దేశ పరిస్ధితి ఉన్నట్లు పై వివరాలు వెల్లడిస్తున్నాయి. నరేంద్రమోడీ సర్కార్‌ ఏడు సంవత్సరాలుగా ఎగుమతుల గురించి కబుర్లు చెప్పటం తప్ప పెరగలేదంటే ఇతర దేశాల సామర్ధ్యం లేదా మన అసమర్ధత అయినా కావచ్చు. ఎగుమతుల మీద ఆధారపడిన ఆర్ధిక వ్యవస్దలను నిర్మించిన దేశాలన్నీ చైనా మాదిరి విజయవంతం కాలేదు.మనం అసలు పోటీలోకే ప్రవేశించ కుండా లేస్తే మనిషిని కాదు అన్న మల్లయ్య కథమాదిరి మాట్లాడుతున్నాము.


ప్రస్తుతం అమెరికాతో మన వాణిజ్యం మిగులులో ఉంది. ఇలాంటి పరిస్ధితి ఏ దేశంతో ఉన్నా అమెరికన్లకు నిదురపట్టదు.చైనాతో లోటు మరింత ఎక్కువగా ఉంది కనుక దానితో వాణిజ్య యుద్దానికి దిగింది.మనది పెద్ద మార్కెట్‌గా ఉన్నందున ఖరీదైన తన వస్తువులను మన మీద రుద్దాలని చూస్తున్నది. వాటికి మార్కెట్‌ ఉండదు కనుక దానికి మన దిగుమతిదారులు కూడా అంగీకరించరు. ఎక్కడ వస్తువుల ధరలు తక్కువగా ఉంటే అక్కడికే దారితీస్తారు. అందుకే కమ్యూనిజానికి నరేంద్రమోడీ బద్ద వ్యతిరేకి అయినప్పటికీ వాణిజ్యవేత్తల వత్తిడికి తలొగ్గి భారీ ఎత్తున దిగుమతులకు అనుమతించక తప్పలేదు. మరోవైపు అమెరికాను సంతృప్తి పరచేందుకు పెద్ద మొత్తంలో ఆయుధాలు, చమురు కొనుగోలు చేస్తున్నారు, మరో దేశం నుంచి దొరకని వైద్యపరికరాల వంటివాటిని కూడా దిగుమతి చేసుకుంటున్నాము. అయినా అమెరికన్లకు తృప్తి లేదు.


మన దేశ కరెంటు ఖాతా ఎప్పుడూ లోటులోనే ఉంటున్నది. గతేడాది కరోనా వలన కొనుగోలు చేసేవారు లేక దిగుమతులు పెద్ద ఎత్తున పడిపోయినందున మన వాణిజ్యం మిగుల్లో ఉంది తప్ప నిజానికి మన ఎగుమతులు పెరిగి కాదు. నికర వాణిజ్యలోటు నిరంతరం ఉండే మన వంటి దేశాలకు తగినన్ని డాలర్ల నిల్వలు లేనట్లయితే అసాధారణ రీతిలో చమురు ధరలు పెరిగితే చెల్లింపుల సమస్య తలెత్తుతుంది. అయితే నరేంద్రమోడీ అధికారానికి వచ్చినప్పటికీ ఆరు సంవత్సరాల కాలంలో చమురు ధరలు కనిష్టస్ధాయికి పడిపోయి విదేశీమారక ద్రవ్య నిల్వలు బాగా పెరిగాయి.కరోనా కారణంగా స్టాక్‌మార్కెట్‌ పడిపోయింది, దాంతో విదేశీమదుపుదార్లు వాటాలను అమ్ముకొని పెట్టుబడులు తరలించుకుపోయినపుడు రిజర్వుబ్యాంకు డాలర్లను కొనుగోలు చేసింది. అయితే మన ప్రభుత్వం కార్పొరేట్‌శక్తులకు పెద్దమొత్తంలో రాయితీలు ఇవ్వటంతో స్టాక్‌మార్కెట్‌లో వాటాలు ధరలు పెరిగినందున తిరిగి విదేశీ పెట్టుబడుల ప్రవాహం వచ్చింది. గతేడాది ఏప్రిల్‌ 24న రూపాయి విలువ 76.22కు పడిపోయింది. తరువాత పెరిగి, స్వల్పంగా తగ్గినా 2021మార్చి 21న 72.32కు పెరిగింది. తిరిగి గత నెల రోజుల్లో ఏప్రిల్‌ 21న 75.22కు పతనమైంది. తరువాత అదే స్ధాయిలో కొనసాగుతోంది. ఇప్పుడు ముడిచమురు ధర 65 డాలర్లకు అటూ ఇటూగా ఉన్నపుడు ఇలా ఉంటే విశ్లేషకులు చెబుతున్నట్లు 75డాలర్లకు పెరిగితే పతనం మరింత ఎక్కువగా ఉండవచ్చు. ఉన్న డాలర్లు కూడా హరించుకుపోతాయి గనుక డాలర్లను కొనుగోలు చేయకతప్పదు.


2020-21 ఆర్ధిక సంవత్సరంలో తొలి ఆరునెలల్లో మన వాణిజ్య మిగులు 15.1 బిలియన్‌ డాలర్లు ఉండగా, సెప్టెంబరు-డిసెంబరు కాలంలో 1.3 బిలియన్‌ డాలర్లలోటు నమోదైంది. తరువాత మూడు నెలల్లో అది 5-7 బిలియన్‌ డాలర్ల వరకు పెరగవచ్చని అంచనా. అనూహ్యమైన పరిణామాలు జరిగితే తప్ప ఇప్పటి వరకు ఉన్న పరిస్ధితిని బట్టి రూపాయి విలువ 74.50 నుంచి 76 మధ్య కదలాడవచ్చని కొన్ని అంచనాలు చెబుతున్నాయి. ఇంతకు మించి పతనం కాకుండా ఆర్‌బిఐ చర్యలు తీసుకోవచ్చని చెబుతున్నారు. అంతకు మించితే మన దిగుమతుల బిల్లు పెరిగి, పర్యవసానంగా జనం మీద మరింత భారం పడుతుంది.


వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పన్నెండు లక్షల కోట్ల రూపాయల మేరకు అప్పులు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటికి మార్కెట్లో వడ్డీ రేట్లు తక్కువగా ఉండేట్లు చూసే లక్ష్యంతో ఏప్రిల్‌-జూన్‌ మాసాల మధ్య రిజర్వుబ్యాంకు లక్ష కోట్ల రూపాయల బాండ్లను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా రూపాయి పతనాన్ని అరికట్టవచ్చని కూడా చెబుతున్నారు. ఇదే సమయంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణ ప్రభావం వీటి మీద ఎలా ఉంటుందో ఊహించలేని స్ధితి. ఇక్కడ సమస్య మనకు అవసరమైన డాలర్లు కొనుగోలు చేస్తే అమెరికాకు అభ్యంతరం ఎందుకు ఉండాలి ? తర్కబద్దంగా చెప్పాలంటే డాలరు విలువను నిర్ణయించేది మార్కెట్‌శక్తులైనపుడు మన రూపాయిని కూడా అవే శక్తులు నిర్ణయిస్తాయని ఎందుకు అనుకోకూడదు. అయితే అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం ఏమంటే ప్రతి దేశమూ తన అవసరాలకు అనుగుణ్యంగా కరెన్సీ విలువలను నియంత్రిస్తోంది. ఈ క్రీడలో అమెరికా లబ్ది పొందలేదా ? కరెన్సీని అదుపు చేస్తున్నదని చైనా మీద ఆరోపణలు చేసే అమెరికన్లు అదే చైనా కరెన్సీ రేటు తక్కువగా ఉన్నందునే అక్కడినుంచి పెద్ద ఎత్తున సరకులను దిగుమతి చేసుకున్నది వాస్తవం కాదా ? అంతేకాదు, ఉత్పత్తి ఖర్చు కూడా తక్కువగా ఉన్న కారణంగా తమ గడ్డమీద పరిశ్రమలను మూసి చైనాకు తరలించలేదా ? కొత్తగా చైనాలో పెట్టలేదా ?


గతంలో అమెరికా-సోవియట్‌ యూనియన్‌ మధ్య ప్రచ్చన్న యుద్దం సాగిన సమయంలో ఆ రెండు దేశాల మధ్య ఆర్ధిక సంబంధాలు లేవు. అందుకు విరుద్దంగా అమెరికా-చైనా సంబంధాలు ఉన్నాయి. చైనా తన మార్కెట్‌ను తెరిచిన తరువాతనే ప్రపంచ వాణిజ్య సంస్దలో చేరేందుకు అమెరికా అనుమతించింది. సోవియట్‌యూనియన్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు రాజ్యాలను పతనం గావించి ప్రచ్చన్న యుద్దంలో తామే విజయం సాధించామని 1990 దశకంలో అమెరికా ప్రకటించుకుంది. అంతకు ముందు సోవియట్‌ – చైనా మధ్య ఉన్న విబేధాలను ఉపయోగించుకొనేందుకు, చైనా మార్కెట్‌లో ప్రవేశించేందుకు అమెరికన్లు చైనాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు.వారు అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. సోవియట్‌ కూలిపోయిన తరువాత ప్రచ్చన్న యుద్దరంగాన్ని చైనాకు మార్చారు. గత మూడు దశాబ్దాలలో వాటి మధ్య వాణిజ్యంతో పాటు వైరమూ పెరిగింది. ఇలాంటి స్ధితి సోవియట్‌తో లేదు.


అలాంటి చైనాతో అమెరికన్లకు ఇప్పుడు వాణిజ్యలోటు చాలా ఎక్కువగా ఉంది. ట్రంపు నాలుగు సంవత్సరాల పాటు పరోక్షంగా, ప్రత్యక్షంగా చైనాతో వాణిజ్య యుద్దం చేశాడు.2019తో పోలిస్తే 2020లో తొమ్మిది శాతం తగ్గినా అమెరికాలోటు 310.8 బిలియన్‌ డాలర్లు ఉంది. అమెరికన్లు 124 బిలియన్‌ డాలర్ల సరకు, వస్తువులను ఎగుమతి చేయగా చైనా నుంచి 435.5 బిలియన్‌ డాలర్ల మేరకు దిగుమతి చేసుకున్నారు. అలాటి చైనా మీద తుపాకి పేల్చేందుకు మన భుజాన్ని వాడుకుంటున్నారు, చివరికి మనలను కూడా మోసకారుల జాబితాలో చేర్చారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వాక్సిన్‌ దౌత్యం : డోనాల్డ్‌ ట్రంప్‌ ధైర్యం నరేంద్రమోడీకి ఎందుకు లేకపోయింది ?

21 Wednesday Apr 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Health, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

Corona vaccine, US Vaccine Diplomacy, vaccine controversy, Vaccine Nationalism


ఎం కోటేశ్వరరావు


నిజమే, అవసరం మనదైనపుడు తగ్గి ఉండాలని పెద్దలు చెప్పిన బుద్దులు- సుద్దులను పరిగణనలోకి తీసుకోవాల్సిందే-కానీ ఆత్మగౌరవాన్ని చంపుకొని లొంగి పోవాలని పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు ఏవీ చెప్పలేదే ? మన గత చరిత్ర కూడా అది కాదు కదా ! కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా వ్యవహరించకపోతే ఎవరికైనా ఏం గౌరవం ఉంటుంది. అయితే అందుకు తగిన దమ్మూ-ధైర్యం ఉండాలి. మనమూ అమెరికా విడదీయలేనంతటి సహ భాగస్వాములమని చెప్పారు. నిజమే కామోసు, మన నరేంద్రమోడీ గారిని చూసి భయపడకపోయినా అమెరికా మారు మనసు పుచ్చుకుందేమో అనుకున్నారు ఎందరో ! కానీ జరుగుతోందేమిటి ? కరోనాతో ప్రాణాలు పోతున్నా వాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడి పదార్ధాలను మనకు అందచేసేందుకు – సొమ్ము తీసుకొనే సుమా – మన సహ భాగస్వామి అంగీకరించటం లేదు. గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా అబ్బే మేము నిషేధం పెట్టలేదు ట్రంప్‌ హయాంలో దుమ్ముదులిపిన మా చట్టాన్నే అమలు జరుపుతున్నాం, దాని ప్రకారం ఎగుమతి చేసేందుకు అవకాశం లేకపోతే మేమేం చేయగలం, ఎగుమతుల మీద పని గట్టుకొని నిషేధం అయితే లేదబ్బా …. ఏవమ్మా కమలా హారిస్‌ మీ పూర్వీకుల దేశం వారు ఏదేదో అంటున్నారు నువ్వయినా చెప్పమ్మా అన్నట్లుగా జో బైడెన్‌ మాట్లాడుతున్నారు. మీ అవసరాలను గుర్తించాంగానీ ఇప్పటికైతే మా చేయి ఖాళీ లేదు, ఏమీ చేయలేం అంటున్నారు అధికారులు. ఏం చేయాలో పాలుపోక మన నరేంద్రమోడీ గారి నోట మాట రావటం లేదు.(మామూలుగానే మాట్లాడే అలవాటు లేదు, కరోనా కదా నోరు విప్పుతారేమో అనుకున్నవారికి ఆశాభంగం).

సరిగ్గా ఏడాది క్రితం మన ప్రధాని నరేంద్రమోడీ జిగినీ దోస్తు డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికాలో కరోనా వ్యాప్తిని అలక్ష్యం చేసి ఎందరి ప్రాణాలను ఎలా తీశాడో చూశాము. ఆ సమయంలో మలేరియాకు వాడే హైడ్రోక్సీక్లోరోక్విన్‌ కరోనాకు కూడా దివ్వ ఔషధంగా పని చేస్తుందని ఎవరో చెప్పగానే మన దేశం దాని ఎగుమతుల మీద నిషేధం విధించింది. అది నిజమా కాదా అని నిర్దారించుకోకుండా తక్షణమే మాకు సరఫరా చేయండి లేకపోతే మన పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మాదిరి మీ తాట వలుస్తా అని డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించిన విషయమూ-యాభై ఆరు అంగుళాల ఛాతీ గల మనదేశం వెంటనే ఎందుకంత కోపం కావాలంటే పంపకుండా ఉంటామా అంటూ ఆఘమేఘాల మీద అందచేయటం తెలిసిందే. శ్రీశ్రీ అన్నట్లుగా తారీఖులు, దస్తావేజులను పక్కన పెడితే శనివారం నాడు మనం నిషేధం విధించాం, ఆదివారం నాడు మోడీతో ట్రంప్‌ ఫోన్లో మాట్లాడాడు. సోమవారం నాడు విలేకర్లతో మాట్లాడుతూ ఔషధాన్ని పంపకపోతే ప్రతీకార చర్యలు తీసుకుంటామని బహిరంగంగా బెదిరించాడు. మంగళవారం నాడు ఆంక్షలను సడలించి అమెరికాకు ఎగుమతి చేశాము. ఇదీ ఏడాది క్రితం జరిగిన ఉదంతం.


ఇంతేనా జర్మనీకి రవాణా అవుతున్న లక్షలాది మాస్కులు, తొడుగులను మధ్యలోనే అడ్డుకొని తమ దేశానికి మళ్లించుకున్న డోనాల్డ్‌ ట్రంప్‌ అదరగొండితనం కూడా అదే సమయంలో జరిగిన సంగతి తెలిసిందే. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో తాము దేశీయంగా చేసుకున్న రక్షణ ఉత్పత్తి చట్టానికి పదును పెట్టామని, దాని ప్రకారం అవి ఎగుమతి నిషేధ జాబితాలో ఉన్నాయని, తమ కంపెనీలు తయారు చేసినందున వాటిని తాము స్వాధీనం చేసుకున్నామని అమెరికా సమర్ధించుకుంది. ఇప్పుడు కరోనా వాక్సిన్‌ కోవీషీల్డ్‌ తయారీకి అవసరమైన ముడి పదార్దాలు, ఇతర వస్తువుల సరఫరా మీద కూడా అదే చట్టాన్ని ప్రయోగించి ఎగుమతుల మీద జోబైడెన్‌ సర్కార్‌ నిషేధం విధించింది. ట్రంప్‌ అయినా బైడెన్‌ అయినా తమ అవసరాలకు ఇస్తున్న ప్రాధాన్యత తమ సహజ భాగస్వాములుగా వర్ణించి, ఉబ్బేసిన మన విషయంలో ఇవ్వటం లేదని తేలిపోయింది. ఎక్కడైనా బావే గానీ వంగతోట దగ్గర కాదు అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ముద్దులాట వ్యవహారం దగ్గర మొహమాటానికి సిద్దమే గాని వ్యాపారం దగ్గర కాదు అంటే ఇదే. మనం నొప్పిని తట్టుకోలేని-బయటకు చెప్పుకోలేని స్దితిలో పడిపోయామా ?

అమెరికా విధించిన ఆంక్షల కారణంగా ముడి సరుకులు నిండుకొని వాక్సిన్‌ ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందని పూనాలోని సీరం సంస్ధ మార్చి తొమ్మిదవ తేదీన ప్రపంచ బ్యాంకు ఏర్పాటు చేసిన వాక్సిన్‌ తయారీదారుల సమవేశంలో ఆందోళన వ్యక్తం చేసింది. ఆరువారాలు గడచిపోయాయి. తమ నేత ప్రపంచాన్ని శాసించగలుగుతున్నారని చెబుతున్న మోడీ భక్తులు గానీ, బహుశా గడ్డాన్ని చూసి విశ్వగురువు అని వర్ణిస్తున్నవారు గానీ, చివరికి నరేంద్రమోడీ గానీ ఈ విషయంలో ఇంతవరకు చేసిందేమీ లేదు. భారత వినతిని పరిశీలిస్తున్నామని, సాధ్యమైనంత త్వరలో నిర్ణయం తీసుకుంటామని జో బైడెన్‌ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఎప్పుడు ? తాత చచ్చి అవ్వ వితంతువు అయిన తరువాతనా అని తెలుగులో ఒక సామెత ఉంది. కరోనా కాటుకు మన జనం బలైన తరువాతనా లేక అమెరికా సంస్దలు తయారు చేస్తున్న వాక్సిన్ను మనం అధిక ధరలకు కొనుగోలు ఒప్పందం కుదిరిన తరువాత అనా ?


గతేడాది పిపిఇ కిట్ల తయారీ నిర్ణయాన్ని తీసుకోవటంలో జరిగిన జాప్యం గురించి వచ్చిన విమర్శలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అనేక దేశాల్లో రెండవ, మూడవ కరోనా తరంగం వచ్చిన విషయమూ తెలిసినా ఒకవేళ మన దగ్గర వస్తే ఏం చెయ్యాలన్న ముందు జాగ్రత్తలు తీసుకోలేదు. మరోసారి లాక్‌డౌన్‌ విధించే పరిస్ధితులను తెచ్చుకోవద్దని ఘనమైన ప్రధాని నరేంద్రమోడీ గారు నెపాన్ని జనం మీద నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.కరోనా మీద విజయం సాధించామన్న స్వంతడబ్బా ప్రకటనలు తప్ప మరోసారి వస్తే అన్న ముందుచూపు లేకపోయింది. గతేడాది అనేక చోట్ల ఆక్సిజన్‌ కొరత ఏర్పడి రోగులు ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. ఇరవైఆరులక్షల కోట్ల ఆత్మనిర్బర పాకేజీ గురించి గొప్పలు చెప్పుకోవటం తప్ప అది అవసరమై ఆక్సిజన్‌ అందించి ప్రాణాలను నిలిపేందుకు ఉపయోగపడలేదు. గతేడాది అనుభవాన్ని చూసి ఇప్పటికే ఆక్సిజన్‌ సరఫరాకు కొత్త ప్లాంట్లకు అనుమతి ఇచ్చి సిద్దం చేసి ఉంటే అనేక రాష్ట్రాల్లో కొందరు రోగులు దిక్కులేని చావు చచ్చేవారా ? ఒక్క సిలిండరు ఉత్పత్తికి కూడా పనికి రాని లక్షల కోట్ల పాకేజ్‌లు ఎందుకు ? ఇల్లుకాలుతుండగా నీటికోసం బావులు తవ్వినట్లుగా ఇప్పుడు వంద ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ఆదేశాలిచ్చినట్లు తమ ఘనతగా చెప్పుకుంటున్నారు. కేవలం రెండు వందల కోట్ల రూపాయలతో 150 ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచేందుకు ఎనిమిది నెలలు పట్టిందంటే మన కేంద్ర ప్రభుత్వ నిర్వాకం ఎలా ఉందో ఇంతకంటే చెప్పాలా ? ఇలాంటి స్దితికి విచారించాలా, బాధ్యతా రాహిత్యాన్ని గర్హించాలా ? యుద్దం వస్తుందో రాదో తెలియకపోయినా లక్షల కోట్ల రూపాయల ఆయుధాలను కొని పెట్టుకుంటున్నాం. అవి కొంత కాలానికి పనికి రావని తెలిసినా కొనుగోలు చేస్తున్నాం. అలాంటిది కొన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఆక్సిజన్‌ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలా లేదా ? డబ్బుల్లేక అడుక్కుంటే ఇచ్చే దాతలు ఎందరు సిద్దంగా లేరు ?

మార్చినెల 26వ తేదీ నుంచి దేశంలో కరోనా అనూహ్యంగా వ్యాపిస్తోన్న విషయం తెలిసినా, అంతకంటే ముందే తయారీదార్లు హెచ్చరించినా వాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడి సరకులు మీద నిషేధం ఎత్తివేయించేందుకు అమెరికా మీద ఎలాంటి వత్తిడీ ఎందుకు తేలేదు. గత వారం వరకు మన కేంద్ర మంత్రులు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ? అన్నీ తానై చూసుకుంటున్న ప్రధాని ఏమి చేస్తున్నట్లు ? ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి ఇచ్చిన ప్రాధాన్యతలో వందో వంతైనా ఇచ్చి ఉంటే అమెరికా నుంచి వస్తాయో రావో ఎప్పుడో తేలిపోయి ఉండేది. ప్రపంచం గొడ్డుపోలేదుగా ! మరో దేశం నుంచి తెచ్చుకొనేందుకు ప్రయత్నం చేసినట్లు కూడా ఎవరూ చెప్పటం లేదు. అమెరికా కోడి కూయకపోతే ప్రపంచానికి తెల్లవారదా ? వాక్సిన్‌ తయారు చేస్తున్న దేశాల్లో చైనా ఒకటి. కావాలంటే ముడిసరకులు సరఫరా చేస్తామంటూ వారు ముందుకు వచ్చారు. అక్కడి నుంచి తెచ్చుకొనేందుకు ఇబ్బంది ఏమిటి ? గాల్వన్‌ ఉదంతానికి, సరిహద్దు ఉద్రిక్తతలు, సమస్యలకు ఇతర అంశాలను ముడి పెట్టవద్దని వారు చెబుతున్నారు. అలాంటపుడు అక్కడి నుంచి తెచ్చుకుంటే తప్పేముంది?


చైనా నుంచి తెచ్చుకోవచ్చుగానీ వారి సరకుల నాణ్యత గురించి సందేహాలున్నాయి అని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. గతకొన్ని సంవత్సరాలుగా మన ఔషధ పరిశ్రమలకు అవసరమైన ముడి సరకులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాము, వాటి మీదే ఆధారపడి ఉన్నాము. వాటికి లేని నాణ్యత సమస్య వాక్సిన్‌ ముడి పదార్దాలు, వస్తువులకు మాత్రమే వచ్చిందా ? ఎందుకీ సాకులు, ప్రాణాలు పోతున్నా రాజకీయమేనా ? చైనాలో తయారైన వాక్సిన్ను ఇతర దేశాలు వినియోగించటం లేదా ? కమ్యూనిస్టు, చైనా వ్యతిరేకత ఎక్కిన వ్యవహారం తప్పితే మరొకటి ఏదైనా ఉందా ? నువ్వు మిత్రుడు అనుకుంటున్న అమెరికా వాడు ఇవ్వడు-శత్రువు అంటున్న చైనా వారు ఇస్తానంటే జనం ప్రాణాలను పోగొట్టటానికైనా సిద్దం అవుతున్నాము తప్ప తెచ్చుకోవటానికి ముందుకు కదలటం లేదు. ఇదేమి జవాబుదారీతనం ! ఇదేమి రాజధర్మం !! ప్రపంచంలో ఏదేశమూ ఎదుర్కోని విధంగా మన దేశంలో కరోనా విజృంభిస్తోందన్న కఠోర సత్యాన్ని కేంద్ర పాలకులు గుర్తిస్తున్నట్లు లేదు. బతికుంటే కావాలంటే తరువాత చైనాతో సమస్యలను తేల్చుకోవచ్చు. 1962లో యుద్దం జరిగిన తరువాత వివాదం ఉండగానే సాధారణ సంబంధాలు నెలకొల్పుకోలేదా, వాణిజ్యం చేయలేదా ? గాల్వన్‌లో మరో వివాదం వచ్చింది, ఆ పేరుతో ప్రాణావసరాలను కూడా తెచ్చుకోకుండా మడికట్టుకు కూర్చుందామా ? ఉత్తరాఖండ్‌ కుంభమేళాకు అనుమతి ఇస్తే కరోనా పుచ్చిపోతుందని అనేక మంది హెచ్చరించారు. అయినా బిజెపి పెద్దలు ఖాతరు చేయలేదు.మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. ఏమైంది, కరోనాతో అనేక మంది మరణించిన తరువాత మధ్యలోనే విరమించాలని ప్రధాని చెప్పాల్సి వచ్చిందా లేదా ? వాయిదా కూడదు కూడదు అని చెప్పిన అఖాడాలు బతుకు జీవుడా అంటూ మూటా ముల్లె సర్దుకొని గుడారాలు ఎత్తివేశాయా లేదా ?

ముప్పు పేరుతో అమెరికా ఆయుధవ్యాపారులు చెప్పిన ఆయుధాలన్నీ కొంటున్నాము. సమాచారం ఇస్తామంటే దానికీ ఒప్పందాలు చేసుకున్నాము. ఇటు నుంచి అటుపోవటం తప్ప అటు నుంచి ఇటు వచ్చిందేమీ లేదు. చైనా మీద, అదే విధంగా పెరుగుతున్న చమురు ధరల మీద మన ఆయుధాలను ప్రయోగిస్తామని చెప్పారు.చైనా యాప్‌లను నిషేధించారు, కొన్ని పెట్టుబడులను అడ్డుకొని, ఆయుధాలు కొనుగోలు చేసి అమెరికాను సంతోష పెట్టారు తప్ప మనం సాధించింది ఏమిటి? అమెరికా నుంచి వాక్సిన్‌ ముడిసరకులను అప్పనంగా అడిగామా ? ఆపదలో ఆదుకోని మిత్రుడి గురించి వెంపర్లాడటం ఎందుకు ? చైనా వస్తువుల కొనుగోలు మానుకుంటే వారు మన కాళ్ల దగ్గరకు వస్తారని, మనం చెప్పినట్లు వింటారని ప్రచారం చేశారు. అలాంటి సూచనలేమీ లేవు, తొలి మూడు మాసాల్లో 18శాతం అభివృద్ది రేటు సాధించినట్లు వార్తలు వచ్చాయి. కీలకమైన లడఖ్‌ సరిహద్దు ప్రాంతాల నుంచి ఇరుదేశాల సైన్యాలు పూర్వపు స్ధానాలకు తగ్గాలంటే మనం పెడుతున్న ప్రతిపాదనలను అంగీకరించటం లేదు. అంటే మన వత్తిడిలో పసలేదని తేలిపోయింది. అమెరికా అండ చూసుకొని ఆయాసపడటం అవసరమా ? పోనీ చమురు ఎగుమతి దేశాల మీద కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పినట్లు దిగుమతి ఆయుధ ప్రయోగంచేసి వత్తిడి తెచ్చి చమురు ధరలు తగ్గించామా అంటే అదీ లేదు. చివరకు చమురును కూడా అమెరికానుంచే కొనుగోలు చేస్తున్నాము. గల్ఫ్‌, పశ్చిమాసియా దేశాలను శత్రువులుగా చేసుకుంటున్నాము. చతుష్టయ కూటమి నుంచి తప్పుకుంటాము, ఆయుధాలు, చమురు కొనుగోలు నిలిపివేస్తాము అంటే అమెరికా దిగిరాదా ? జనం చస్తున్నా ఎందుకీ లొంగుబాటు ?ముడి పదార్దాల సరఫరా గురించి మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ అమెరికా మంత్రితో మాట్లాడామని చెప్పారు తప్ప ఫలితం ఏమిటో వెల్లడించలేదు. వాక్సిన్లకోసం ముడి సరకులు సజావుగా అందేందుకు అందుబాటులో ఉంచాలని పెద్ద దేశాలను కోరినట్లు జై శంకర్‌ చెప్పారు. అలాంటపుడు సూటిగానే చైనా నుంచి ముడిసరకులను ఎందుకు తీసుకోకూడదు ?

వాక్సిన్‌ రాజకీయాల్లో భాగంగా చతుష్టయ దేశాలైన అమెరికా, జపాన్‌, భారత్‌,ఆస్ట్రేలియా కూటమి వాక్సిన్‌ తయారీకి చర్యలు తీసుకొని చైనా పలుకుబడిని తగ్గించాలని నిర్ణయించాయి. దానిలో భాగంగా మన దేశానికి వాక్సిన్‌ ముడి పదార్దాలతో పాటు అమెరికా, జపాన్‌ నుంచి పెట్టుబడులూ వస్తాయని చెప్పారు. బ్రిటన్‌ ఆస్ట్రాజెనెకాతో పాటు సీరం సంస్ద అమెరికాకు చెందిన నోవాక్స్‌ వాక్సిన్‌ కూడా తయారీకి ఒప్పందం చేసుకుంది. పోనీలే రాజకీయం చేస్తే చేశారు, ఏదో ఒక పేరుతో వాక్సిన్‌ అందించేందుకు పూనుకున్నాయి అని సంతోషించిన వారికి ముడిసరకులను బ్లాక్‌చేసిన అమెరికా తానే మోకాలడ్డింది. దీంతో కోవిషీల్డ్‌ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది, నోవాక్స్‌ ప్రారంభానికి నోచుకోలేదు.


తూర్పు చైనాలోని జియాంగ్‌సు రాష్ట్రంలో ఔషధాలు తయారు చేస్తున్న కంపెనీ ప్రతినిధి చైనా పత్రిక గ్లోబల్‌టైమ్స్‌తో మాట్లాడుతూ ఇప్పటికే తాము భారత్‌కు సరఫరా చేస్తున్న సోడియం క్లోరైడ్‌ను వైద్య అవసరాలకు వినియోగిస్తున్నారని, దానిలో కొంత వాక్సిన్లకూ ఉపయోగించవచ్చని చెప్పారు. ప్రస్తుతం తాము దేశీయ అవసరాలకోసమే ఉత్పత్తి చేస్తున్నప్పటికీ ఇతర దేశాలు కోరితే వాటికీ అందచేసే సామర్ధ్యం తమకు ఉందని చెప్పారు. షాంగ్‌డోంగ్‌ రాష్ట్రానికి చెందిన మరో సంస్ధ ప్రతినిధి మాట్లాడుతూ ఔషధాలకు అవసరమైన సీసాల తయారికి వినియోగించే సిలికాన్‌ గ్లాస్‌ను తయారు చేస్తున్నామని, ఏటా ఐదు కోట్ల సీసాలు తయారు చేయగలమని అవసరమైతే విదేశాలకూ అందచేయగలమని చెప్పారు. క్యూబాలో వాక్సిన్‌ తయారు చేసినా దానిని సరఫరా చేసేందుకు అవసరమైన సీసాల తయారీ సమస్యగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి, అదే పరిస్ధితి మన దేశంతో పాటు మరికొన్ని చోట్ల కూడా ఉంది.


మనకు అవసరమైన వాక్సిన్ల తయారీకి విదేశాల్లో కూడా ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది. మంచిదే ! మన పాలకులు చేయాల్సిందేమిటి ? ప్రయివేటు కంపెనీలను నమ్ముకొని మన ఐడిపిఎల్‌ను మూతపెట్టాము, వాక్సిన్‌ తయారీ కేంద్రాలలో చెట్లు మొలిపిస్తున్నాము.లాభాలే ధ్యేయంగా పని చేసే సీరం సంస్దలో ఉత్పత్తిని పెంచటానికి 1500 కోట్ల రూపాయల రుణాన్ని ఎలాంటి హామీలు లేకుండా ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తప్పులేదు, తమిళనాడులో ఆరువందల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సమగ్ర వాక్సిన్‌ కేంద్రాన్ని ఎందుకు ఖాళీగా ఉంచుతున్నారు ? ఇలాంటివే ఇంకా కొన్ని సంస్ధలు ఉన్నాయి. యుద్ద ప్రాతిపదికన వాటిని కరోనా వాక్సిన్ల తయారీకి ఎందుకు ఉపయోగించటం లేదు ? ఎవరి ప్రయోజనాలకోసమీ నిర్లక్ష్యం ? ఇంత పెద్ద దేశంలో ఎప్పుడే అవసరం ముంచుకు వస్తుందో తెలియదు. అవసరం తీరిన తరువాత ఇతర వాక్సిన్లను తయారు చేయవచ్చు, ఇతర దేశాలకు ఎగుమతికి ఉపయోగించవచ్చు. ప్రభుత్వ రంగంలో ఔషధతయారీని మూతపెట్టిన కారణంగా ఈ రోజు అవసరమైన డెమిసెవిర్‌ వంటి ఔషధాలు బ్లాక్‌ మార్కెట్‌కు తరలుతున్నా గుడ్లప్పగించి చూస్తున్నారు. మహారాష్ట్రలో అలా దొరికిపోయిన దొంగలకు మద్దతుగా ఆ రాష్ట్ర బిజెపి నేత, మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ ధర్నాకు దిగారంటే ఏమనుకోవాలి. తీరా అసలు విషయం బయటపడిన తరువాత మహారాష్ట్ర కోసమే డామన్‌ కంపెనీ నుంచి తెప్పిస్తున్నట్లు మాట మార్చారు. అంటే అక్కడి శివసేన-ఎన్‌సిపి-కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వం చేతగానిదైంది, మా పలుకు బడి ఉపయోగించి తెచ్చామనే చౌకబారు చావు రాజకీయం తప్ప దీనిలో ఏమైనా ఉందా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా కమ్యూనిస్టులు జాక్‌ మాకు ఎందుకు చెక్‌ పెట్టారు ?

19 Monday Apr 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Alibaba, china communist party, Jack Ma, U.S. Cold War on China, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


జాక్‌ మా, అలీ బాబా పేరు ఏదైనేం, వ్యక్తి-సంస్ద పేరు విడదీయలేనంతగా మారిపోయాయి. కొద్ది నెలల క్రితం జాక్‌ అదృశ్యమైనట్లు వార్తలు వచ్చాయి. జనవరిలో దర్శనమిచ్చిన తరువాత కట్టుకథలు-పిట్టకథలకు తెరపడింది. తాజాగా చైనా ప్రభుత్వం జాక్‌ మా కంపెనీల పెట్టుబడులపై తీవ్ర ఆంక్షలు విధించిందన్న సమాచారంతో మరోసారి వార్తలకు ఎక్కాడు. ఆలీబాబా, ఆంట్‌ తదితర గ్రూపు కంపెనీల నుంచి అతగాడు బయటికి పోవటం, కొన్ని వాటాల విక్రయం, మరికొన్నింటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం వంటి అంశాల గురించి వార్తలు వస్తున్నాయి. తన వాటాలను కొన్నింటిని ప్రభుత్వానికి స్వాధీనం చేస్తానని నవంబరు నెలలోనే జాక్‌ మా ప్రతిపాదించినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ గతంలో రాసింది. జనవరి నుంచి పీపుల్స్‌ బాంక్‌ ఆఫ్‌ చైనా( మన రిజర్వుబ్యాంకు వంటిది), బ్యాంకింగ్‌, బీమా నియంత్రణ కమిషన్‌ వివిధ అంశాలకు సంబంధించి చర్చలు జరుపుతున్నాయి. ఇంత వరకు ఏ విషయమూ ఇదమిద్దంగా తెలియదు.


ఒకటి మాత్రం స్పష్టం, చైనా ప్రభుత్వం జాక్‌ మాను అదుపులోకి తెచ్చింది. దేశంలోని ఇతర ప్రయివేటు సంస్ధలను నిరుత్సాహపరచకుండా ఒక వైపు అడుగులు వేస్తూ మరో వైపు సోషలిస్టు వ్యవస్ధకే ఎసరు తెచ్చే విధంగా బడా సంస్ధలను అనుమతించబోమనే సందేశాన్ని జాక్‌ మా ద్వారా చైనా కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక్కడ అనేక మందిలో తలెత్తే సందేహం ఏమంటే అసలు అలాంటి బడా సంస్ధలను మొగ్గలోనే తుంచి వేయకుండా ఎందుకు ఎదగనిచ్చింది ? ప్రపంచ కార్పొరేట్‌ శక్తుల ప్రతినిధులు చెబుతున్నట్లుగా ఈ చర్యలతో చైనా నవకల్పనలు కుంటుపడతాయా ? అభివృద్ధికి ఆటంకం కలుగుతుందా ? కొంత మంది చైనాలో జాక్‌ మా యుగం ప్రారంభమైందని ప్రచారం చేశారు.అది నిజమే అని అతగాడు భ్రమించి చైనా వ్యవస్ధనే సవాలు చేశాడా ? వాస్తవానికి చైనా యుగంలో జాక్‌ మా వంటి వారు కొందరు తప్ప వ్యక్తుల యుగాలు ఉండవు.


దీన్ని వివరిస్తే కొంత మందికి జీర్ణం గాకపోవచ్చు, అయినా తప్పదు . అందువలన క్లుప్తంగా చెప్పుకుంటే పెట్టుబడిదారీ విధానం అంటే శ్రమను అమ్ముకొనే ఒప్పందం మేరకు పని, ఆ మేరకు వేతనం. మిగతా వాటితో సంబంధం ఉండదు. సోషలిజం అంటే శక్తికొద్దీ పని, శ్రమకొద్దీ ప్రతిఫలం. మొదటిదానిలో లాభం లేదా మిగులు పెట్టుబడిదారుల స్వంతం అవుతుంది. రెండవ దానిలో శ్రామికులకు గౌరవప్రదమైన వేతనాలతో పాటు మిగులు సామాజిక పరం అవుతుంది. దాన్ని వివిధ రూపాలలో అందరికీ వినియోగిస్తారు. సోషలిజం అంటే దరిద్రాన్ని పారదోలటం తప్ప దాన్ని అలాగే ఉంచి అందరికీ పంచటం కాదు. సోషలిజం దాని తరువాత కమ్యూనిజం అంటే శక్తికొద్దీ పని, అవసరం కొద్దీ వినియోగం. ఇప్పటికైతే కమ్యూనిజం ఒక ఉత్తమ భావన. మరి దీనికి ప్రాతిపదిక లేదా అంటే, ఉంది. ఆదిమ కమ్యూనిజం అనే దశలో నాటి మానవులు సామూహిక శ్రమ ద్వారా సాధించిన వాటిని అవసరం కొద్దీ పంచుకొనే వారు గనుక ఆ స్ధాయిలో ఉత్పత్తి సాధిస్తే ఆధునిక కమ్యూనిజం సాధ్యమే అన్నది మార్క్స్‌-ఎంగెల్స్‌ భావన. దాన్ని సాధించాలంటే జనం అందరి అవసరాలు తీరేంతగా ఉత్పత్తిని, ఉత్పాదక శక్తులను పెంచటం ఎంతకాలంలో సాధ్యం అవుతుంది అంటే ఎవరమూ చెప్పలేము. వ్యక్తిగత ఆసక్తి కొద్దీ ఒకరు కత్తి పట్టుకొని వైద్య పరమైన శస్త్ర చికిత్సలు చేయవచ్చు, మరొకరు అదే కత్తితో అందమైన క్రాఫులూ చేయవచ్చు. ఏది చేసినా సమాజం తగిన గుర్తింపు, గౌరవంతో పాటు వారి పూర్తి అవసరాలు తీరుస్తుంది. దోపిడీ, పీడన, యుద్దాలు ఉండవు, మారణహౌమాలు జరగవు. అదే కమ్యూనిజం భావన.

ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఆధునిక పెట్టుబడిదారీ విధానం అమల్లో ఉన్న ప్రాంతాలతో పాటు కొండకోనలకే పరిమితమై దుస్తులు కూడా వేసుకోని ఆదిమానవుల లక్షణాలను ఇంకా కలిగి ఉన్న వారి వరకు వివిధ దశల్లో ఉన్న జనం ఉన్నారన్నది వాస్తవం. పెట్టుబడిదారీ వ్యవస్ధ సంక్షోభంలో ఉన్నపుడు దాని బలహీనపు లింకును తెగగొట్టి సోషలిస్టు వ్యవస్ధను ఏర్పాటు చేయవచ్చు అన్నది రష్యాలో కమ్యూనిస్టులు నిరూపించారు. అయితే దాన్ని విఫలం చేశారు అని కొందరి అభిప్రాయం, కాదు అంతర్గత లోపాల కారణంగా అది విఫలమైంది అని కొందరు చెబుతారు. నెలలు నిండకుండానే పుట్టిన బిడ్డ అని కొందరు భావిస్తే అలాంటి బిడ్డను బతికించుకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలను తీసుకోని కారణంగా అంతరించిందని కొందరు చెప్పవచ్చు. దేన్నీ పూర్వపక్షం చేయకుండా అనుభవాలు తీసుకోవటం ఇక్కడ ముఖ్యం. చైనాలో సోషలిస్టు వ్యవస్ధను ఏర్పాటు చేసిన వారు ఈ అనుభవాన్ని తీసుకొని తమదైన శైలిలో ఆ వ్యవస్ధను ముందుకు తీసుకుపోతున్నామని చెబుతున్నారు.


దానిలో భాగమే జాక్‌ మా వంటి వారు, ఆంట్‌ వంటి సంస్ధలూ వాటి మీద చర్యలూ అని చెప్పవచ్చు. రష్యాలో విప్లవం వచ్చిన నాటికి ఆ ప్రాంతం అభివృద్ది చెందిన పెట్టుబడిదారీ వ్యవస్ధలలో ఒకటి. అదే చైనా విప్లవ సమయంలో ఫ్యూడల్‌ సంబంధాలతో ఉన్న వ్యవస్ధ, పారిశ్రామికంగా మనకంటే వెనుకబడిన దేశం. పెట్టుబడిదారీ విధానం ఉన్నత స్ధాయిలోకి రావటం అంటే ఉత్పాదకశక్తులు గణనీయంగా అభివృద్ది చెంది ఉత్పత్తి ఇబ్బడి ముబ్బడి కావటం. దానితో పాటు దోపిడీ విపరీతంగా పెరిగి దాన్ని కూలదోసే సైన్యాన్ని కూడా అది పెంచుతుందన్నది కమ్యూనిస్టులు చెప్పే సిద్దాంతం. ఈ నేపధ్యంలో చూసినపుడు చైనాలో సోషలిస్టు వ్యవస్ధ లక్ష్యంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ అధికారానికి వచ్చిన తరువాత ఉత్పాదకశక్తుల పెరుగుదల ఆశించిన మేరకు పెరగలేదు. కనుకనే డెంగ్‌సియావో పింగ్‌ సంస్కరణలలో భాగంగా విదేశీ పెట్టుబడులు, పెట్టుబడిదారులను చైనాకు ఆహ్వానించారు. దేశీయంగా కూడా పరిమితుల మేరకు అనుమతించారు. దీనికి తోడు జాక్‌ మా వంటి వారు ఐటి, దాని అనుబంధ రంగాలలో ప్రవేశించి అనూహ్య స్దాయిలో సంపదలను సృష్టించారు, బిలియనీర్లుగా పెరిగిపోయారు. అయితే వారు సోషలిస్టు వ్యవస్ధకే ఎసరు తెచ్చే సూచనలు వెల్లడిస్తే కమ్యూనిస్టు పార్టీ అనుమతిస్తుందా ?


జాక్‌ మా వంటి వారి పెరుగుదలను చూసి ఇతర దేశాల్లో ఉన్న కమ్యూనిస్టుల్లో కొంత మంది ఇంకేముంది అక్కడ పెట్టుబడిదారీ విధానం అమల్లోకి వచ్చింది అని సూత్రీకరించారు, విచారపడ్డారు. ఇదేమిటని పెదవి విరిచారు. అదే జాక్‌ మా మీద ఆంక్షల విషయం వెల్లడికాగానే ప్రపంచంలోని కమ్యూనిస్టు వ్యతిరేకులు, పెట్టుబడిదారులందరూ గుండెలు బాదుకున్నారు. మేము ఇలా అనుకోలేదు అంటూ మొసలి కన్నీరు కార్చారు. ఇంకేముంది చైనా తిరోగమనం ప్రారంభం అయిందని చంకలు కొట్టుకున్నారు. ఒకటి స్పష్టం, గ్లాస్‌నోస్త్‌ పేరుతో నాటి సోవియట్‌ యూనియన్‌లో అమలు చేసిన అనుభవాలు చూసిన తరువాత తియన్మెన్‌ స్కేర్‌లో విద్యార్ధుల పేరుతో జరిపిన ప్రతీఘాత ప్రయత్నాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ మొగ్గలోనే తుంచి వేసింది. తాను పెరిగి, ఇతర సంస్దలను మింగివేసేందుకు పూనుకున్నట్లు జాక్‌మా గురించి వచ్చిన వార్తలు, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినట్లు వెల్లడైన సమాచారం మేరకు తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. అలీబాబా, ఆంట్‌ ఇతర కంపెనీల్లోని జాక్‌ మా వాటాలను చిన్న మదుపర్లకు విక్రయిస్తారని, ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని పరిపరి విధాలుగా వార్తలు వస్తున్నాయి. ఏమి జరిగినప్పటికీ ప్రభుత్వ అనుమతుల మేరకు ఉంటాయి.

గుత్త సంస్ధలు పెరగకుండా నిరోధించే చట్టాలు అన్ని దేశాలలో మాదిరి చైనాలో కూడా ఉన్నాయి. వాటిని లోపభూయిష్టంగా తయారు చేయటం, సరిగా అమలు జరపని కారణంగా అనేక దేశాలలో సంస్ధలు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగి ప్రభుత్వాలనే శాసిస్తున్నాయి. చైనాలో వాటి అమలుకు నిదర్శనమే తాజా పరిణామాలు అని చెప్పవచ్చు.ఆంట్‌ కంపెనీ 37 బిలియన్‌ డాలర్ల వాటాల విక్రయానికి పూనుకోగా గతేడాది డిసెంబరులో చైనా ప్రభుత్వం అడ్డుకున్నది. ఈ చర్యలను చైనా అధినేత గ్జీ జింపింగ్‌ తన వ్యతిరేకులను అణచివేసే వాటిలో భాగంగా తీసుకుంటున్నట్లు చిత్రిస్తున్నారు. మన దేశంలో కాంగ్రెస్‌ లేదా బిజెపి ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లో తమ ప్రత్యర్ధులుగా ఉంటూ వాణిజ్య, పారిశ్రామికవేత్తలుగా ఉన్న వారి మీదనే దాడులు జరుగుతాయి. ఆ రీత్యా చూసినపుడు చైనాలో అలాంటి వాటికి అవకాశం లేదు. మూడు సంవత్సరాల క్రితం జాక్‌ మా కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అక్రమాలకు పాల్పడిన అనేకమంది కమ్యూనిస్టులు, ఇతరుల మీద చర్యలు తీసుకున్నారు. రియలెస్టేట్‌ కంపెనీ వాండా యజమాని వాంగ్‌ జియాన్‌లిన్‌, ఇన్సూరెన్సు కంపెనీ అనబాంగ్‌ అధిపతి ఉ గ్జియావోహురు మీద చర్యలు తీసుకోవటమే గాక వారి వ్యాపారాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.(మన దేశంలో మాదిరి మేం వ్యాపారం చేయటం లేదు అని ఉన్న ప్రభుత్వ రంగ సంస్ధలకు ఎసరు తెస్తున్నదానికి విరుద్దం).


1999లో కేవలం 20 మంది స్నేహితులు, సిబ్బందితో తన స్వంత ఫ్లాట్‌లో ఐటి కార్యకలాపాలను ప్రారంభించిన జాక్‌ మా కేవలం రెండు దశాబ్దాల కాలంలోనే 2020 నాటికి ఏడాదికి 72 బిలియన్‌ డాలర్ల ఆదాయం తెచ్చే కంపెనీలకు అధిపతి అయ్యాడు.కెఎఫ్‌సి కంపెనీ తమ దుకాణంలో ఉద్యోగానికి పనికి రాడని జాక్‌ను తిరస్కరించింది. తాను జన్మించిన పట్టణానికి వచ్చే విదేశీయుల పరిచయాలతో ఆంగ్లం నేర్చుకున్న జాక్‌ తరువాత ఆంగ్లబోధకుడయ్యాడు. అదే సమయంలో ఇంటర్నెట్‌ చైనాలో ఊపందుకుంటున్నది. తన ఆంగ్ల పరిజ్ఞానంతో వాణిజ్య సంస్దలకు వెబ్‌ పేజీలను తయారు చేయటంతో తన కార్యకలాపాలను ప్రారంభించి ఆ రంగంలో ఉన్నత స్ధానాలకు ఎదిగాడు. ఇలాంటి వారెందరో తమ ప్రతిభతో బిలియనీర్లుగా మారారు.చైనాలో బిలియనీర్లుగా ఉన్న వారిలో ఇలాంటి వారే అత్యధికులు. స్వాతంత్య్రం వచ్చినపుడు మన దేశంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాని ప్రయివేటు సంస్ధలు ఇప్పుడు ప్రభుత్వ అండతో బడా సంస్ధలుగా ఎదిగి ప్రభుత్వ రంగాన్నే కొనుగోలు చేసే స్ధాయికి ఎదిగినట్లుగా, తమకు అనుకూలమైన విధానాలను అనుసరించాలని శాసిస్తున్నారు. జాక్‌ మా వంటి వారు చైనా ప్రభుత్వ విధానాలనే ప్రశ్నించే స్దాయికి ఎదిగారు. దానికి పరాకాష్టగా గతేడాది అక్టోబరులో చేసిన ఒక ప్రసంగంలో తన అంతరంగాన్ని బయటపెట్టారు. దేశ ఆర్ధిక, నియంత్రణ, రాజకీయ వ్యవస్ధలను సంస్కరించాలని, వస్తు తనఖా లేదా ఆస్తి హామీ లేకుండా రుణాలు ఇవ్వని వడ్డీ వ్యాపార దుకాణ ఆలోచనల నుంచి బ్యాంకులు బయటపడాలని చెప్పారు. ఇవి చైనా వ్యతిరేక శక్తులు చేస్తున్న ప్రచారానికి ప్రతిబింబం తప్ప మరొకటి కాదన్నది స్పష్టం. 2008లో ఇతర ధనిక దేశాల్లో వచ్చిన బ్యాంకింగ్‌ సంక్షోభం చైనాను తాకలేదు, దీనికి కారణం అక్కడి వ్యవస్ధపై ప్రభుత్వ అదుపు, ఆంక్షలు ఉండటమే. అలీబాబా ప్రభావం ఎంతగా పెరిగిపోయిందంటే దాన్ని అదుపులోకి తేవాల్సినంతగా అని సాంగ్‌ క్వింగ్‌హురు అనే ఆర్ధికవేత్త వ్యాఖ్యానించాడు.

చైనా మీద తరువాత కాలంలో వాణిజ్య యుద్దం ప్రకటించిన డోనాల్డ్‌ ట్రంప్‌ తాను అధికారం స్వీకరించిన తరువాత భేటీ అయిన తొలి చైనీయుడు జాక్‌ మా అన్నది చాలా మందికి గుర్తు ఉండకపోవచ్చు. తొలి పది రోజుల్లోనే న్యూయార్క్‌లో వారి భేటీ జరిగింది. అమెరికా వస్తువులను తన వేదికల ద్వారా చైనాలో మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించి పది లక్షల మంది అమెరికన్లకు ఉపాధి కల్పిస్తామని జాక్‌ మా ఆ సందర్భంగా ట్రంప్‌కు వాగ్దానం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఒక పారిశ్రామికవేత్తగా అలా చెప్పటాన్ని తప్పు పట్టనవసరం లేదు. తమ దేశ అవసరాలు, వ్యూహంలో భాగంగా చైనా ప్రభుత్వమే జాక్‌ మా వంటి వాణిజ్యవేత్తలను ప్రోత్సహించింది. ఐక్యరాజ్యసమితి వేదికల మీద రాజులు, రాణులు, దేశాల అధ్యక్షులు, ప్రధానుల సరసన కూర్చో పెట్టింది. దాన్ని చూసి అది తన పలుకుబడే, గొప్పతనమే అనుకుంటే అది పతనానికి నాంది. ఎంత పెద్ద వారైనా తిరుగుతున్న చట్రం మీద కూర్చున్న జీవులు తప్ప చట్రాన్ని తిప్పే వారు కాదు. ఈ నేపధ్యంలో చైనాలో జరుగుతున్న పరిణామాలను చూడాల్సి ఉంది. వ్యవస్ధకు కంపెనీలు, వ్యక్తులు అనువుగా ఉండాలి తప్ప వ్యక్తులు,సంస్ధల కోసం వ్యవస్ధలు కాదని చైనా నాయకత్వం స్పష్టం చేయదలచుకుంది.


ఇదే సమయంలో ఒక దేశం – రెండు వ్యవస్ధలు అనే అవగాహనకు చైనా కమ్యూనిస్టు నాయకత్వం దూరంగా పోతున్నదనే వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. బ్రిటన్‌ కౌలు గడువు తీరిన తరువాత 1997లో హాంకాంగ్‌ ప్రాంతం, అదే విధంగా పోర్చుగీసు నుంచి మకావో ప్రాంతాలు చైనాలో విలీనం అయిన సమయంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం, ప్రభుత్వం ఇచ్చిన హామీ, ఒప్పందం అది. ఆ మేరకు 2047 నాటికి ఈ రెండు ప్రాంతాలూ పూర్తిగా చైనా ప్రధాన వ్యవస్ధలో అంతర్భాగంగా మారాల్సి ఉంది. అప్పటి వరకు హాంకాంగ్‌లో ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్ధ, మకావూలో ఉన్న జూద కేంద్రాల కొనసాగింపు, పెట్టుబడులకు స్వేచ్చ ఉంటుంది. ఆ తరువాత అక్కడ కూడా ప్రధాన ప్రాంతంలోని చట్టాలు, వ్యవస్ధలోకి మారాల్సి ఉంటుంది. దీనికి అక్కడి పౌరులు సిద్దం కావాల్సి ఉంటుంది. అయితే అమెరికా, బ్రిటన్‌, ఇతర దేశాలు జోక్యం చేసుకొని హాంకాంగ్‌కు స్వాతంత్య్రం కావాలనే డిమాండ్‌ చేస్తూ ఆందోళనలకు పూనుకొనే విధంగా అక్కడి జనాలను రెచ్చగొడుతున్నారు. దాన్ని ఎదుర్కొంటూ విలీనానికి అవసరమైన చర్యలను ఒక్కొక్కటిగా చైనా తీసుకొంటోంది. అది పూర్తిగా చైనా అంతర్గత వ్యహారం, అయినా ఏదో ఒక పేరుతో మన దేశంతో సహా అనేక దేశాలు జోక్యం చేసుకుంటున్నాయి.

తైవాన్‌ మీదకు చైనా యుద్ద విమానాలు వెళ్లాయంటూ ఇటీవల కొన్ని సంచలనాత్మకంగా వార్తలను మీడియా ముందుకు తెచ్చింది. అది నిరంతర ప్రక్రియ. చైనా ప్రధాన భూ భాగానికి దూరంగా ఉన్న ఒక దీవి రాష్ట్రం తైవాన్‌.అది తిరుగుబాటు రాష్ట్రంగా విడిగా ఉంటోంది. తైవాన్‌ ప్రత్యేక దేశం కాదని, చైనాలో అంతర్భాగమే అని ఐక్యరాజ్యసమితి ఎప్పుడో గుర్తించింది. బలవంతంగా విలీనం చేసుకోవాలంటే చైనాకు పెద్ద సమస్య కాదు, సామరస్యపూర్వకంగా విలీనం జరగాలని కోరుకుంటోంది. అమెరికా, ఇతర దేశాలు తైవాన్‌లో జోక్యం చేసుకొని దానికి ఆయుధాలు అందిస్తున్నాయి, దాని తీరాలకు యుద్ద నావలను పంపి విన్యాసాల పేరుతో చైనాను రెచ్చగొడుతున్నాయి. ఇలా చేసినపుడల్లా విదేశీ జోక్యం దారులకు హెచ్చరికా చైనా నౌకలు విన్యాసాలు చేస్తుంటాయి, విమానాలు ఎగిరి వెనక్కు వస్తుంటాయి తప్ప ఎన్నడూ దాడులు చేయలేదు.తైవాన్‌లో, హాంకాంగ్‌లో జోక్యం ద్వారా చైనాను రెచ్చగొట్టి యుద్దానికి దింపాలన్నది సామ్రాజ్యవాదుల ఎత్తుగడ. వాటి వలలో పడకుండా చైనా తనదైన శైలిలో వ్యవహరిస్తోంది. తన జన జీవితాలను మెరుగుపరచటమే చైనాకు ప్రధమ ప్రాధాన్యత తప్ప యుద్దం కాదు.అదే సమయంలో అనివార్యం అయితే అందుకు అనుగుణ్యంగా తన ఆయుధాలకూ పదును పెడుతోంది. దాని బలం అమెరికా, ఇతర దేశాలనూ దుందుడుకు చర్యలకు పాల్పడకుండా నిలువరిస్తోంది.

అమెరికా, ఇతర పెట్టుబడిదారీ ధనిక దేశాలు చైనా మీద సాగిస్తున్న ప్రచ్చన్న యుద్దంలో చైనాలోని గ్జిన్‌ జియాంగ్‌ రాష్ట్రం కేంద్ర స్ధానంగా మారింది. అక్కడ ఉన్న ముస్లిం మైనారిటీలను సర్కార్‌ అణచివేస్తున్నదని, నిర్బంధంగా చాకిరీ చేయిస్తూ మానవ హక్కులకు భంగం కలిగిస్తున్నదని కొంత కాలం ప్రచారం చేశారు. ఇప్పుడు దాని కొనసాగింపుగా మానవహక్కులకు భంగం కలిగించే ప్రాంతం నుంచి ఉత్పత్తి అయ్యే చైనా వస్తువులను బహిష్కరించాలని అనేక దేశాలు పిలుపునిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా ఆంక్షలు ప్రకటించింది, మరికొన్ని దేశాలు అప్రకటితంగా అమలు చేస్తున్నాయి. ఆ రాష్ట్రం చుట్టూ రష్యా, మంగోలియా, కిర్ఖిజిస్తాన్‌, తజికిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్దాన్‌, మన దేశ సరిహద్దులు ఉన్నాయి. కోటీ 30లక్షల మంది ముస్లిం మైనారిటీలు ఉన్నారు. పొరుగుదేశాల నుంచి జోక్యం చేసుకుంటున్న శక్తులు అక్కడ వేర్పాటు వాదులను, ఉగ్రవాదులకు ప్రోత్సహిస్తున్నాయి. అనేక దేశాల మాదిరే చైనా కూడా తన జాగ్రత్తలు తాను తీసుకుంటున్నది. వాటిని మానవహక్కుల హననంగా చిత్రించి ప్రచారం చేస్తున్నారు. ఇస్లామిక్‌ దేశాలను రెచ్చగొడుతున్నారు. ప్రపంచ మార్కెట్లో మూడో వంతు దుస్తులు, వస్త్రాలు చైనా నుంచి వస్తున్నాయి. ఏటా చైనా చేస్తున్న 300 బిలియన్‌ డాలర్ల వస్తు ఎగుమతుల్లో 120బిలియన్‌ డాలర్లు వీటి నుంచే వున్నాయి. చైనాలో ఉత్పత్తి అయ్యే పత్తిలో 87శాతం గ్జిన్‌ జియాంగ్‌ రాష్ట్రం నుంచే ఉంది.ఆ రాష్ట్రం కొత్తగా చైనాలో చేరింది కాదు, జౌళి ఉత్పత్తులు కొత్తగా జరుగుతున్నవీ కాదు. వాటిని దిగుమతి చేసుకొని లబ్ది పొందని పశ్చిమ దేశమూ లేదు. అందువలన అక్కడ మానవ హక్కులకు భంగం కలుగుతోందనే పేరుతో చైనా జౌళి ఎగుమతులను దెబ్బతీయాలన్నది అమెరికా అండ్‌కో ఎత్తు గడ. అందుకోసం ప్రచార, దౌత్య, ఆర్ధిక యుద్ద రంగాలను తెరిచి చైనాను ఉక్కిరి బిక్కిరి చేయటం అసలు లక్ష్యం.అదే జరుగుతోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా అదరగొండితనం-తేలుకుట్టిన నరేంద్రమోడీ !

14 Wednesday Apr 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

#USS John Paul Jones, 7th Fleet, Freedom of Navigation Programme, India’s EEZ, Narendra Modi


ఎం కోటేశ్వరరావు


అరేబియా సముద్రంలో కేరళకు దగ్గరగా ఉన్న లక్ష దీవుల చుట్టూ ఉన్న మన ప్రత్యేక ఆర్ధిక మండలి(ఇఇజెడ్‌) ప్రాంతంలోకి ప్రభుత్వ అనుమతి లేకుండా అమెరికా యుద్ద నావ ఏప్రిల్‌ ఏడున ప్రవేశించింది. ఆ విషయాన్ని అదే రోజు అమెరికా ప్రకటించిన తరువాత రెండు రోజులకు మన ప్రభుత్వం దౌత్య పద్దతిలో నిరసన తెలిపింది. కేరళలోని కొచ్చి నుంచి 400 కిలోమీటర్ల దూరంలో లక్ష దీవులు ఉన్నాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం(వాటిని పాటిస్తే ) ప్రతి దేశానికి తన తీరం నుంచి సముద్రంలో 200 నాటికల్‌ మైళ్లు లేదా 370 కిలోమీటర్ల మేరకు హక్కు ఉంటుంది. ఆ మేరకు అక్కడ ఉండే గ్యాస్‌, చమురు, ఖనిజాలు, చేపల వంటి సంపదలపై ఆ దేశాలకు హక్కు ఉంటుంది. ఆ పరిధిలోకి ఎవరైనా ప్రవేశించాలంటే అనుమతి తీసుకోవాల్సి ఉంది. దీన్ని అమెరికా అంగీకరించటం లేదు, అందువల్లనే తాము అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని నౌకాయానం చేసే హక్కు, స్వేచ్చ తమకు ఉన్నదని అమెరికా సప్తమనౌకాదళంలోని డిస్ట్రాయర్‌ నౌక యుఎస్‌ఎస్‌ జాన్‌ పాల్‌ జోన్స్‌ అధికారులు ఏప్రిల్‌ ఏడవ తేదీన ప్రకటించారు. ఇది అనుచితం అంటూ మన దేశం నిరసన తెలిపింది. ఐక్యరాజ్యసమితి నిబంధనల ప్రకారం అనుమతి లేకుండా విదేశీ నౌకలు ప్రవేశించరాదని పేర్కొన్నది. ఆయా దేశాల ప్రత్యేక జోన్ల తీరాలకు రావటం, ఆయుధాలు, పేలుడు పదార్ధాలతో మిలిటరీ విన్యాసాలు- చర్యలు అనుమతి లేకుండా జరపరాదని ఐరాస తీర్మానాలున్నాయని పేర్కొన్నది. పర్షియన్‌ గల్ఫ్‌ నుంచి మలక్కా జలసంధి వరకు పహారాలో భాగంగా ప్రయాణిస్తూ అనుమతి లేకుండా మన జలాల్లో లక్ష ద్వీపాలకు పశ్చిమంగా 130 నాటికల్‌ మైల్‌ వరకు అమెరికా నౌక వచ్చింది.


చిత్రం ఏమిటంటే గతంలో కూడా అనేక సార్లు ఇలా అక్రమంగా ప్రవేశించినా ఆ విషయాన్ని అమెరికా ఎన్నడూ బహిరంగంగా ప్రకటించలేదు, మన దేశం ఎందుకు నిరసన తెలపలేదు. ఇప్పుడెందుకు అలా జరిగాయి అన్న ప్రశ్న తలెత్తింది. అనుమతి లేకుండా అమెరికా యుద్ద నౌక చివరిసారిగా 2018 అక్టోబరు ఒకటి నుంచి 2019 సెప్టెంబరు 30వరకు తిరిగింది. హిందూ మహా సుముద్రం ప్రాంతలో గగన తల, నౌకాయాన కార్యకలాపాలు నిర్వహించేందుకు తమకు హక్కుందని, వాటిని కాపాడుకొనేందుకు పర్యటించినట్లు అమెరికా రక్షణ శాఖ నివేదికలో పేర్కొన్నారు. అంతకు ముందు 2015,16,17 సంవత్సరాలలో కూడా ఇలాగే అనుమతి లేకుండా పర్యటించినా ఎన్నడూ బహిరంగ ప్రకటన చేయని అమెరికా ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు ప్రకటించింది. 1991 నుంచి ఇప్పటి వరకు మూడు దశాబ్దాల్లో 20సార్లు మన అనుమతి లేకుండా అమెరికా నావలు మన జలాల్లో తిరిగాయి.


ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా తమ మిలిటరీ తిరుగుతుంటుందని, అంతర్జాతీయ చట్టాల మేరకు తమకు హక్కు ఉందని తెలియచెప్పేందుకే ఈ పని చేస్తామని కూడా అమెరికా తెలిపింది. ఇదేదో ఒక దేశానికి వ్యతిరేకంగా చేస్తున్నది లేదా రాజకీయ ప్రకటనలు చేసేందుకు కాదని, గతంలోనూ చేశామూ, భవిష్యత్‌లో కూడా కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఆయా దేశాలు తమకు లేని హక్కులను ప్రకటించుకుంటున్నాయని, అలాంటి వాటిని గుర్తించి ప్రతి చోటా దాన్ని సవాలు చేస్తూ తాము తిరుగుతుంటామని తెలిపింది.బంగాళాఖాతం, అరేబియా, హిందూ మహాసముద్రాలకు అమెరికాకు సంబంధం లేదు. ఈ ప్రాంతంలో పహారా కాయమని వారిని ఎవరు అడిగారు, ఎవరి కోసం ఆ పని చేస్తున్నారు. ప్రపంచ పోలీసుగా తనకు తానే ప్రకటించుకొని ఈ పని చేస్తున్న అదరగొండితనం తప్ప మరొకటి కాదు.
2019లో అండమాన్‌-నికోబార్‌ దీవుల జలాల్లోకి చైనా నౌక ప్రవేశించినపుడు వెనక్కు పంపించారు. మరి అమెరికా నావలు 20సార్లు ప్రవేశిస్తుంటే మన మిలిటరీ, ప్రభుత్వం ఏమి చేస్తున్నది? అమెరికా తాజాగా చేసిన ప్రకటన గురించి అనేక వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. ఇది చైనాను ఉద్దేశించి చేసినట్లు బలంగా వినిపిస్తున్న అంశం. ఇదే సమయంలో మన దేశానికి కూడా హెచ్చరిక అన్నది మరొకటి. ఒక వేళ చైనాకు హెచ్చరిక అయితే మన ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నట్లు ? అనేక దేశాల విషయంలో అమెరికా అతిక్రమణలకు పాల్పడినపుడు ఎందుకు చేయలేదు ?

దక్షిణ చైనా సముద్రంలోని దీవులపై తమకు హక్కు ఉన్నదని చైనా చేస్తున్న వాదనను అమెరికా, మరికొన్ని దేశాలు అంగీకరించటం లేదు. నిజానికి వాటి మీద చైనా పొరుగుదేశాలు తమ హక్కుల గురించి వివాదాన్ని లేవనెత్తితే అర్ధం చేసుకోవచ్చు. కానీ ఎలాంటి సంబంధమూ లేని అమెరికా ముందుకు వస్తోంది. అంతేకాదు, గతంలో తాము చైనాను ఆక్రమించిన సమయంలో కొన్ని దీవులు తమ ఆధీనంలోకి వచ్చాయని, వాటిమీద హక్కు తమదే అని జపాన్‌ వాదిస్తోంది. ఈ వివాదంలో మన దేశానికి ఎలాంటి సంబంధం లేకపోయినా అంతర్జాతీయ జలాల్లో స్వేచ్చగా విహరించే హక్కు ఉన్నదని స్పష్టీకరించేందుకు అంటూ మన దేశం కూడా అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాతో చతుష్టయం పేరుతో చేతులు కలిపింది. అమెరికా తెలివిగా మన దేశాన్ని చైనాతో సరికొత్త వివాదంలోకి దించింది. అనేక మిలిటరీ సంబంధ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇప్పుడు మనం వెనక్కు రాలేని పరిస్ధితి ఏర్పడిందని గ్రహించిన తరువాత అమెరికా తన అసలు రూపాన్ని బయటపెట్టి చివరికి మన హక్కులను కూడా సవాలు చేస్తోంది. తేలుకుట్టిన దొంగ మాదిరి మన పరిస్దితి తయారైందని చెప్పవచ్చు.


తీరదేశాల హక్కులకు సంబంధించి ఐక్యరాజ్యసమితి ఒప్పందం 1994లో అమల్లోకి వచ్చింది. దాన్ని 168 దేశాలు నిర్ధారించగా అమెరికా ఇంతవరకు ఆమోదించలేదు. మన దేశం మరుసటి ఏడాదే ఆమోదించింది. దానిలో ఉన్న రెండు వందల నాటికల్‌ మైళ్ల పరిధిని 350 మైళ్లకు పెంచాలని 2010లో మన దేశం ఐరాసకు దరఖాస్తు చేసింది.దీని మీద ఎలాంటి నిర్ణయం జరగలేదు.అంగీకరిస్తే ఆ పరిధిలోపల ఉన్న సహజ సంపదలపై మనకు హక్కు వస్తుంది.దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్చగా నౌకల ప్రయాణం తమ జాతీయ భద్రతకు అవసరమని మోకాలికి -బోడి తలకు ముడి వేసినట్లుగా అమెరికా వాదిస్తున్నది. ఆ ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలకు తమకు హక్కున్నదని వాదిస్తోంది. పసిఫిక్‌ సముద్రం-మలక్కా జలసంధి మధ్య దక్షిణ చైనా సముద్రం వాటిజ్య నౌకా ప్రయాణానికి కీలకం. ఏటా నాలుగున్నరలక్షల కోట్ల డాలర్ల విలువగల వాణిజ్యం ఈ మార్గం గుండా జరుగుతున్నట్లు అంచనా.


సముద్ర చట్టాల్లో ఉన్న లోపాలు లేదా ఏకాభిప్రాయం లేకపోవటం లేదా చట్టాలకు చెబుతున్న భాష్యాల కారణంగా అనేక దేశాల మధ్య వివాదాలు ఉన్నాయి. ఉదాహరణకు దక్షిణ చైనా సముద్రంలో ఉన్న హైనాన్‌ దీవి చైనాలో ఒక రాష్ట్రం. అదే విధంగా ఆ సముద్రంలోని ఇతర చైనా దీవులు కూడా ఇలాగే సుదూరంగా ఉన్నాయి. అందువలన వాటి చుట్టుపక్కల 370 కిలోమీటర్ల వరకు చైనాదే అధికారం. కొన్ని దీవులు తమవని తైవాన్‌ అంటోంది. తైవాన్‌ ప్రస్తుతం విడిగా ఉన్నప్పటికీ అది చైనాలో అంతర్భాగమే కనుక ఎప్పుడైనా విలీనం కావాల్సిందే, అప్పుడు ఆ దీవులు కూడా చైనాకే చెందుతాయి. దీన్ని అమెరికా అంగీకరించటం లేదు. అదే విధంగా ఆ ప్రాంతంలోని వియత్నాం, ఫిలిప్పైన్స్‌, దక్షిణకొరియా, ఇతర దేశాలైన జపాన్‌, రష్యా, శ్రీలంక, మాల్దీవులు, భారత్‌ తీరాల్లోని అధికారాన్ని కూడా అమెరికా సవాలు చేస్తోంది. దానికి తన పెత్తనం, ప్రయోజనాలు తప్ప మిత్ర-శత్రు దేశాలనే తేడా లేదు. ఉంటే మన దేశం గురించి ఇలాంటి ప్రకటన చేసి ఉండేది కాదు. లక్షద్వీపాల ప్రత్యేక ఆర్ధిక ప్రాంతం గురించి అమెరికా చేసిన ప్రకటన పదజాలం గతంలో శత్రుదేశంగా పరిగణించే చైనాతో మాత్రమే చేసింది. ఇంతవరకు జపాన్‌, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాల విషయంలో ఉపయోగించలేదు. దీంతో మన నేతల ముఖాలు కందగడ్డల్లా రంగుమారాయని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. గిల్లి జోలపాడటం అమెరికా ఎత్తుగడల్లో ఒకటి. ఇప్పుడు నరేంద్రమోడీ సర్కార్‌ ఇరకాటంలో పడటంతో అమెరికా తన ప్రకటనను సమర్ధించుకుంటూనే నష్టనివారణ చర్యలకు పూనుకుంది. భారత్‌తో భాగస్వామ్యానికి మేము ఎంతో విలువ ఇస్తాము. ఇది మీ గురించి కాదు, అంతర్జాతీయంగా మేము ఎప్పుడూ చేస్తున్నదానిలో భాగంగానే ఇక్కడా చేశాము తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. నరేంద్రమోడీ లేదా విదేశాంగ, రక్షణ మంత్రుల నోట మాటరాలేదు. వివాదాన్ని మూసిపెట్టే ప్రయత్నం జరుగుతోంది.


ఆయా దేశాలు తమవి అని చెబుతున్న సముద్ర ప్రాంతాల్లోకి ప్రవేశించి మీవి అంటే కుదరదు అంటూ అమెరికా గత ఏడాది నవంబరు నుంచి ప్రవేశించిన ప్రాంతాల వివరాలు ఇలా ఉన్నాయి. నవంబరు 24న జపాన్‌ సముద్రంలో తన ప్రాంతం అని రష్యా చెబుతున్న చోటికి యుఎస్‌ఎస్‌ జాన్‌ మెకెయిన్‌, డిసెంబరు 15న జపాన్‌ జలసంధిలోకి యుఎస్‌ఎన్‌ఎస్‌ అలాన్‌ షెపర్డ్‌, డిసెంబరు 22న దక్షిణ చైనా సముద్రంలోని చైనాకు చెందిన స్పార్టలే దీవుల సమీపానికి జాన్‌ మెకెయిన్‌ ప్రవేశించింది. ఈ ప్రాంతానికి రావటానికి ఇవి తమవి అని చెబుతున్న చైనా, వియత్నాం దేశాల అనుమతి తీసుకోనవసరం లేదని మన లక్షదీవుల పర్యటన మాదిరే అమెరికా ప్రకటించింది. డిసెంబరు 24న జాన్‌మెకెయిన్‌ దక్షిణ చైనా సముద్రంలోని కాన్‌ డావో దీవుల సమీపానికి, ఫిబ్రవరి 5న అదే సముద్రంలోని పార్సెల్‌ దీవులు, ఫిబ్రవరి 17న రస్సెల్‌ ఓడ స్పార్టలే దీవుల ప్రాంతానికి, మార్చి 31న దక్షిణ కొరియా కుక్‌ టో దీవుల సమీపానికి చార్లెస్‌ డ్రా, ఏప్రిల్‌ 3న జాన్‌ పాల్‌ శ్రీలంక ప్రాంతానికి, ఏప్రిల్‌ ఏడున భారత్‌ మరియు మాల్దీవుల ప్రాంతాల్లోకి అక్రమంగా ప్రవేశించింది.ప్రకటనలో శ్రీలంక, మాల్దీవులను వదలి మన దేశాన్ని మాత్రమే పేర్కొన్నది.

ప్రపంచాన్ని ఆక్రమించుకొనేందుకు అమెరికా అన్ని ఖండాలలో పన్నెండు నౌకా దళాలను ఏర్పాటు చేసింది. వాటిలో లక్ష్యం పూర్తి అయిన తరువాత ఐదు పని చేయటం లేదు లేదా ఇతర వాటితో విలీనం చేశారు. ప్రస్తుతం రెండు, మూడు, నాలుగు,ఐదు, ఆరు, ఏడు, పది మాత్రమే పని చేస్తున్నాయి. వీటిలో పదవది మిగిలిన ఆరు నౌకాదళాల సమాచార వ్యవస్ధలను సమన్వయ పరిచే విధులు నిర్వహిస్తుంది. ఆరింటిలో సప్తమ నౌకాదళమే పెద్దది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఆసియాలో అమెరికా జరిపిన కొరియా, వియత్నాం, గల్ఫ్‌ దాడులన్నింటిలో ఇది పాత్రధారిగా ఉంది. మూడు వందల యుద్ద విమానాలు, 60 నుంచి 70 వివిధ రకాల యుద్ద నౌకలు, 40వేల మంది సైనికులు ఉన్నారు. దీని ప్రధాన కేంద్రం జపాన్‌లోని యొకోసుకాలో ఉంది. బంగ్లాదేశ్‌ విముక్తి సమయంలో మన దేశాన్ని బెదిరించేందుకు అమెరికా ఈ దళాన్ని బంగాళా ఖాతంలోకి నడిపింది. ఆ సమయంలో మన దేశం నాటి సోవియట్‌ యూనియన్‌తో రక్షణ ఒప్పందం చేసుకొన్నది. బంగ్లా విముక్తి కోసం తాను సత్యాగ్రహం చేశానని మన ప్రధాని నరేంద్రమోడీ చెప్పుకున్నదానికి ఆధారాలు లేవు. నేటి బిజెపికి పూర్వ రూపమైన నాటి జససంఘం సత్యాగ్రహం జరిపింది నిజానికి బంగ్లా విముక్తి కోసం కాదు, ఆ ముసుగులో సోవియట్‌తో రక్షణ ఒప్పందానికి వ్యతిరేకంగా అన్నది గమనించాలి. ఆ ఒప్పందం చేసుకున్న తరువాతనే మన దేశం బంగ్లాదేశ్‌లోకి సైన్యాన్ని పంపి పాక్‌ సైన్యాన్ని అణచివేసి విముక్తి కలిగించింది.


ఇప్పటికే హిందూ మహాసముద్రంలో డిగాగార్షియా దీవుల్లో సైనిక స్దావరం ఉన్న అమెరికా అక్కడి నుంచి వైదొలిగేందుకు నిరాకరిస్తోంది. మారిషస్‌కు చెందిన ఈ దీవులను బ్రిటన్‌ తన వలస కాలంలో అమెరికాకు కౌలుకు ఇచ్చింది. వాటిని మారిషస్‌కు అప్పగించాలని అంతర్జాతీయ న్యాయస్దానం 2019లోనే తీర్పు చెప్పింది. అయినా ఖాళీ చేయలేదు. ఇక్కడి అమెరికా నౌకా స్దావరం ఆసియా-ఆఫ్రికా దేశాలపై దాడులకు అనువుగా ఉంటుంది కనుకనే ఏదో ఒక సాకుతో కొనసాగించేందుకు పూనుకుంది. ఈ నేపధ్యంలోనే తన రక్షణ ఎత్తుగడల్లో భాగంగా బంగాళాఖాతం, హిందూ మహాసముద్ర ప్రాంతంపై చైనా కేంద్రీకరిస్తున్నది. దీనికి ప్రతిగా అమెరికాతో కలసి పైసా ఖర్చు లేకుండా దక్షిణ చైనా సముద్రంలో చైనా కార్యకలాపాలతో వత్తిడి పెంచాలని మన దేశం పూనుకుంది. ఒకవైపు ఆ ప్రాంత వివాదాన్ని సామరస్యంతో పరిష్కరించుకోవాలని చెబుతూనే మరోవైపు చైనాను రెచ్చగొట్టే చర్య ఇది. ఇప్పుడు దక్షిణ చైనా సముద్రమే కాదు అరేబియా సముద్రంలో కూడా తాము కాలుపెడతామంటూ మొదటికే మోసం తెస్తూ మన దేశానికే అమెరికా బహిరంగంగా చెప్పేసింది. రేపు బంగాళాఖాతంలో అండమాన్‌ దీవుల గురించి కూడా ఇదే ప్రకటన చేసినా ఆశ్చర్యం లేదు. లడఖ్‌ సరిహద్దులో చైనా సైనిక కదలికల పేరుతో తప్పుడు సమాచారం అందించి మన మిలిటరీని కొండలెక్కించిన అమెరికా ఎత్తుగడ తెలిసిందే. అంతే కాదు, చైనాతో తమ వాణిజ్య యుద్దం కారణంగా అమెరికా, ఇతర దేశాల కంపెనీలన్నీ చైనాలో దుకాణాలు కట్టేసి భారత్‌కు వస్తున్నాయని ఆశచూపిందీ అమెరికా యంత్రాంగమే.


గత కొద్ది రోజులుగా దక్షిణ చైనా సముద్రంలోనూ, తైవాన్‌-చైనా మధ్య సముద్రంలోనూ రెచ్చగొట్టే కార్యకలాపాలకు పూనుకున్న అమెరికా ఇదే సమయంలో అరేబియా సముద్రంలోనూ కెలుకుతోంది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో తన అనుయాయిగా ఉన్న ఫిలిప్పీన్స్‌ ప్రాదేశిక జలాల పేరుతో రాజకీయం నడిపేందుకు అమెరికా నిర్ణయించుకుంది. ఎవరైనా దాని మీద దాడి చేసినా; హక్కులకు భంగం కలిగించినా పరస్పరరక్షణ ఒప్పందంలో భాగంగా తాము జోక్యం చేసుకుంటామని అమెరికా విదేశాంగ ప్రతినిధి ప్రకటన చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి చైనా తీర రక్షణ చట్టం అమల్లోకి వచ్చింది. దాని ప్రకారం తమ జాతీయ సార్వభౌమత్వం, హక్కులు, పరిధికి భంగం కలిగించే విదేశీ సంస్దలు, వ్యక్తుల మీద ఆయుధ ప్రయోగంతో సహా అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామన్నది దాని సారం. ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం తైవాన్‌ కూడా చైనాలో అంతర్భాగమే. అందువలన ఆ ప్రాంతంలో ఎవరు జోక్యం చేసుకున్నా చర్య తీసుకొనేందుకు చైనా సిద్దం అవుతోంది. కొద్ది రోజులుగా అమెరికా యుద్ద నౌకలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న కారణంగా సోమవారం నాడు చైనా తన యుద్ద నౌక లియావోనింగ్‌ నుంచి విమానాలను తైవాన్‌ రెండు వైపులకు పంపి అమెరికాను హెచ్చరించింది. తైవాన్‌ జలసంధిలో అమెరికా యుద్ద నౌక జాన్‌ మెకెయిన్‌ ప్రయాణించిన తరువాతే చైనా ఈ చర్యకు పాల్పడింది.

దక్షిణ చైనా సముద్ర ప్రాంత దేశాల మధ్య వివాదంలో ఉన్న దీవుల గురించి హేగ్‌లోని అంతర్జాతీయ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పును తాము గుర్తించటం లేదని నాలుగు సంవత్సరాల క్రితమే చైనా ప్రకటించింది. చారిత్రకంగా చూసినపుడు ఆ సముద్రంలో చైనాతో పాటు ఇతర దేశాలకు చెందిన మత్స్యకారులు దీవులను వినియోగించుకున్నట్లు ఉంది తప్ప చైనాకు మాత్రమే ప్రత్యేక హక్కులు లేవని ట్రిబ్యునల్‌ పేర్కొన్నది.1947లో జపాన్‌ లొంగిపోయిన సమయంలో గుర్తించిన తొమ్మిది చుక్కల గీతల ప్రకారమే ఆ ప్రాంత దీవులపై హక్కు ఉన్నదని తాము చెబుతున్నామని, ఆ ప్రాంత దేశాలతో సమస్యలను పరిష్కరించుకొనేందుకు సిద్దం అని చైనా చెబుతున్నది.1947లో చైనాలో అధికారంలో ఉన్నది కమ్యూనిస్టులు కాదు, చాంగ్‌కై షేక్‌ ప్రభుత్వమన్న విషయం తెలిసిందే.


లక్షదీవుల ఉదంతం తరువాత చతుష్టయం పేరుతో అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాలతో కలసి చైనాకు వ్యతిరేకంగా కూటమి కడుతున్న మన దేశం స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించటం అవసరం. విభజించి పాలించే దాని ఎత్తుగడలలో చిక్కుకోకుండా ఉండాలంటే చతుష్టయ కూటమి నుంచి బయటకు రావటం, మన సార్వభౌమత్వ విషయంలో ఎలాంటి రాజీలేదని అమెరికాకు స్పష్టం చేయాల్సి ఉంది. అంత సాహసం కాషాయ దేశభక్తుడు నరేంద్రమోడీకి ఉందా ? నిజమైన దేశ భక్తులు ఆలోచించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

హతవిధీ ! విమర్శించిన నెహ్రూ బాటలోనే నరేంద్రమోడీ !!

11 Sunday Apr 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Anti Dumping Duties, India Protectionism, Jawaharlal Nehru, Narendra Modi, Trade Protectionism, WTO


ఎం కోటేశ్వరరావు


జవహర్‌లాల్‌ నెహ్రూ, నరేంద్రమోడీ ఇద్దరూ పాలకవర్గాల సేవకులే అనటంలో మరో మాట లేదు. ఒకరు పదిహేడు సంవత్సరాలు ప్రధానిగా అధికారంలో ఉంటే మరొకరు ఇప్పటి వరకు ఏడు, మరో మూడు సంవత్సరాలు ఉండబోతున్నారు. దేశం కోసం అనే పేరుతో ఇంకేదైనా చేస్తే ఏం జరుగుతుందో చెప్పలేం. మనం అనేక రంగాలలో వెనుకబడి ఉండటానికి నెహ్రూ, తరువాత కాంగ్రెస్‌ అనుసరించిన విధానాలే కారణం అని సంఘపరివార్‌ అంశ నుంచి వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ సందుదొరికినపుడల్లా దుమ్మెత్తి పోయటం తెలిసిందే. కాంగ్రెస్‌ యాభై సంవత్సరాలలో సాధించలేని దానిని తాము ఐదేండ్లలో అమలు చేశామని చెప్పుకొనే వారు ఆ పాచిపాట ఇంకేమాత్రం పాడలేరు. దేశ అభివృద్దికి సంబంధించి నిరంతరం చర్చ జరగాల్సిందే. అధికారంలో ఉన్న ఎవరి విధానాలనైనా విమర్శనాత్మకంగా చూడాల్సిందే. చిత్రం ఏమిటంటే నెహ్రూ విధానాలను విమర్శించటం దేశభక్తి, నరేంద్రమోడీ ఏలుబడిని తప్పుపట్టటం దేశద్రోహంగా పరిగణిస్తున్నారు. ప్రపంచంలో ఏం జరుగుతోంది ? తిరుగుతున్న చట్రంలో ఏ దేశం ఎక్కడ ఉంది ? వాటిలో మార్పుల కోసం జరుగుతున్న ప్రయత్నాలు, వాటి పర్యవసానాలేమిటి ? వీటి అంతరార్దం ఏమిటి ? కార్పొరేట్ల లాభాలుా, అందుకోసం రక్షణాత్మక చర్యలు. ధనిక దేశాలు, వాటిని అనుసరించాలని చూస్తున్న దేశాల విధానాల సారమిదే !

వాణిజ్య సమస్యలను పరిష్కరించేందుకు ప్రపంచ వాణిజ్య సంస్ద(డబ్ల్యుటివో)ను ఏర్పాటు చేశారు. వివాదాలు తలెత్తితే విచారించి తీర్పు చెప్పేందుకు ఒక న్యాయస్ధానం ఉంటుంది. దానికి న్యాయమూర్తులను నియమించేందుకు అమెరికాలో అధికారంలో ఉన్న ట్రంప్‌ నిరాకరించాడు, ఇప్పుడు జో బైడెన్‌ అదే బాటలో నడుస్తున్నాడు. కనుక ఎవరైనా దానికి ఫిర్యాదు చేస్తే వెంటనే తేలదు. మనం అమెరికా, ఇతర విదేశీ కంపెనీలపై డిజిటల్‌ సర్వీసు టాక్సు(డిఎస్‌టి) వేశాము. దాని మీద డబ్ల్యుటిఓకు వెళితే వెంటనే తేలదు. అది తెలుసు గనుక దానితో నిమిత్తం లేకుండా మన దేశం నుంచి దిగుమతి చేసుకొనే వస్తువుల మీద అమెరికా 25శాతం సుంకం విధించనున్నట్లు ప్రకటించింది.ఈ వివాదం ఎక్కడ తేలాలి ? తెలియదు !
చైనా నుంచి దిగుమతి చేసుకొనే సౌర విద్యుత్‌ పలకలు, సంబంధిత పరికరాలపై మన ప్రభుత్వం రక్షణ పేరుతో 2018లో విధించిన పన్ను గడువు ఈ ఏడాది జూలైలో తీరి పోనుంది. అందువలన సోలార్‌ ఫొటోఓల్టాయిక్‌ మోడ్యూల్స్‌(పివి) మీద 40శాతం, సోలార్‌ ఫొటోవోల్టాయిక్‌ సెల్స్‌ మీద 25శాతం చొప్పున దిగుమతి పన్నును 2022 ఏప్రిల్‌ నుంచి విధించాలని మన ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని డబ్ల్యుటివోలో సవాలు చేసినా వెంటనే తేలదు కనుక చైనా కూడా పోటీగా ప్రతీకార చర్య తీసుకుంటుంది. దానికీ అదే గతి, కనుక ఏం చేయాలి ? తెలియదు ! అలాంటపుడు జరిగేదేమిటి ? ఆయా దేశాల సామర్ధ్యం ముందుకు వస్తుంది. అది లేని దేశాలు మిగతావాటికి లొంగిపోతాయి. లేదూ తమకూ కొన్ని ప్రత్యేకతలు ఉంటే వాటిని తురుపుముక్కగా ఉపయోగించి రాజీకి వస్తాయి. మన దేశంలో సౌర విద్యుత్‌ తయారీకి అవసరమైన పరికరాకావచ్చు, మరొకటి కావచ్చు స్వంతంగా తయారు చేసుకుంటే ఎవరికీ లొంగాల్సిన, రాజీ పడాల్సిన పని లేదు.

ఇప్పుడున్న పరిస్దితి ఏమిటి ? ఈ ఏడాది మార్చి 24న అమెరికన్‌ ప్రాస్పెక్ట్‌ అనే పత్రిక ప్రచురించిన సమాచారం ప్రకారం సౌర విద్యుత్‌కు అవసరమైన నాలుగు పరికరాల విషయంలో ప్రపంచ సామర్ధ్యం ఇన్‌గాట్స్‌లో 95, వేఫర్స్‌లో 99,పివి సెల్స్‌ 80,పివి మోడ్యూల్స్‌లో 75శాతం చైనా వాటాగా ఉంది. ఈ రంగంలో చైనా తన సాంకేతికతను మరింతగా మెరుగుపరచుకొంటోంది. దీనికి సాంకేతికపరిజ్ఞానంతో పాటు పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరం. ఇలాంటి పరిస్దితిలో అమెరికాను మెప్పించేందుకో మరొకందుకో చైనా దిగుమతుల మీద పన్నులు పెంచితే మనం దేశీయంగా ఉత్పత్తిని పెంచుకోవటం అనుమానాస్పదమే అనే వారిని దేశద్రోహులుగానో, స్వదేశీ పరిశ్రమ మీద ప్రేమ లేని వారుగానో ముద్రవేస్తారు. సంప్రదాయ విద్యుత్‌ బదులు ప్రత్యామ్నాయ సౌర విద్యుత్‌ మీద కేంద్రీకరించే దేశాలకు చైనా తన వస్తువులను ఎగుమతి చేస్తుంది. దానికి పోయేదేమీ లేదు. మేకిన్‌ ఇండియాను ప్రోత్సహించుదాం !


మన దేశంలో సోలార్‌ పానల్స్‌ తయారీలో బోరోసిల్‌ అనే కంపెనీ ఉంది. అది తయారు చేసేవి మన అవసరాలకు చాలవు.దీనికి తోడు సౌర విద్యుత్‌ ఉత్పత్తి చేసే వారు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య మన దేశంలో తయారయ్యే పివి సెల్స్‌ తయారీదారులు చెప్పుకున్నమాదిరి సామర్ద్యం కలిగినవి కాదన్నది విమర్శ. నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించే ప్రభుత్వ సంస్దలు లేని కారణంగా ఎవరిష్టం వచ్చినట్లు వారు తమ ఉత్పత్తుల గురించి చెప్పుకుంటున్నారు. అది ఆయా సంస్దల గిట్టుబాటును కూడా ప్రశ్నార్ధకంగా మారుస్తోంది. ప్రస్తుతం మన దేశంలో సౌర విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యం 32గిగావాట్లు కాగా మన సోలార్‌ సెల్స్‌ ఉత్పత్తి మూడు, మాడ్యుల్స్‌ ఉత్పత్తి ఐదు గిగావాట్లకే సరిపోతుంది. మిగిలినదంతా చైనా నుంచి దిగుమతుల మీదే ఆధారపడి ఉంది. ఏడు సంవత్సరాల క్రితం మన దేశం ప్రపంచ సారధిగా మారాలని చాలా మంది ఆశించగా వాస్తవ పరిస్ధితి ఇలా ఉంది. దేశభక్తి ప్రదర్శన కాదు, ఆచరణలో చూపాలి మరి. మన దేశంలో సోలార్‌ పానల్స్‌ తయారు చేస్తున్న కంపెనీకి దన్నుగా కేంద్రం దిగుమతి సుంకాలు విధించి రక్షిస్తోంది.

మన దేశ పరిశ్రమలను రక్షించుకోవాలనటంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభుత్వానికి వ్యాపారంతో పని లేదు అని చెబుతున్న పాలకులు నిత్యం వ్యాపారుల సేవలోనే మునిగితేలుతున్నారు.విశాఖ ఉక్కు వంటి వాటిని రక్షించుకొనేందుకు అవసరమైన చర్యలను నిరాకరిస్తున్న పాలకులు విదేశీ కంపెనీలకు కారుచౌకగా కట్టబెట్టేందుకు పూనుకోవటం ఏమిటి ? ఇక్కడా చేస్తున్నది దేశానికి దివాలాకోరు-విదేశాలకు లాభాల వ్యాపారమే. ఒకవైపు స్వేచ్చా వాణిజ్యం అని చెబుతారు, సులభతర వాణిజ్యంలో మన స్దానం ఎంతో మెరుగుపడింది చూడమంటారు. కానీ ఆచరణలో ఎలా ఉన్నారు.మనం చైనా ఉత్పత్తుల మీద సుంకాలు విధిస్తున్నాం. చైనా మనకు ఎంత దూరమో మనమూ చైనాకు అంతే దూరంలో ఉంటాం. ఒకరు రాళ్లు వేస్తుంటే మరొకరు పూలు వేస్తారా ? మన భాగస్వామ్య దేశం అని చెప్పుకుంటున్న అమెరికా ఏం చేస్తోందో చూశాము. శత్రుదేశం అంటూ నిత్యం కత్తులు దూస్తున్న చైనా ప్రతికార చర్యలకు పూనుకోకుండా ఎలా ఉంటుంది?


మన దేశం నుంచి దిగుమతి చేసుకొనే దున్న-బర్రె మాసం, రొయ్యలు, ఇతర సముద్ర ఉత్పత్తుల మీదచైనా ఆంక్షలు విధించింది. దాన్ని సవాలు చేస్తూ తాజాగా మన దేశం ప్రపంచ వాణిజ్య సంస్దకు ఫిర్యాదు చేసింది. గాళ్లు లేదా గాలి కుంటు వ్యాధి ముప్పు కారణంగా దున్న-బర్రె మాంసాన్ని నిషేధిస్తున్నామని, అదే విధంగా రొయ్యల గురించి తగినంత సమాచారం లేనందున వాటినీ నిషేధిస్తున్నట్లు చైనా చెబుతోంది. రొయ్యల్లో ఉండే వైరస్‌ మానవులకు హాని కలిగించేది కాదనే నిర్ధారణ పత్రాలు కావాలని చైనా చెబుతోంది. అయితే కొత్త నిబంధనలను ముందుకు తెస్తూ అడ్డుకుంటున్నదని, ఆ మేరకు నిర్దారణ పత్రాలను మనం ఇవ్వలేమని మన దేశం వాదిస్తోంది. నిజం చెప్పుకోవాలంటే చైనాతో మన సర్కారు వివాదం, పెట్టుబడులపై ఆంక్షలు, దిగుమతులపై సుంకాల విధింపు అసలు కారణం అని వేరే చెప్పనవసరం లేదు. 2019-20 సంవత్సరంలో మన దేశం 680కోట్ల డాలర్ల మేర సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేయగా వాటిలో ఐదోవంతు చైనా 130 కోట్ల డాలర్ల సరకు దిగుమతి చేసుకుంది.2020-21లో దిగుమతులు గణనీయంగా పడిపోయాయి. దున్న-బర్రె మాంసం పరిస్ధితి కూడా ఇంతే.

మనం నిత్యం వినియోగిస్తున్న ప్లాస్టిక్‌ సీసాలు, గ్లాసులను పోలిథిలిన్‌ టెరెఫాథలేట్‌(పెట్‌ రెసిన్‌) అనే పదార్ధంతో తయారు చేస్తారు.దీన్ని మన దేశంలో రిలయన్స్‌, ఇండో రమా కంపెనీలు ప్రధానంగా తయారు చేస్తాయి. వీటి వాటా 91శాతం ఉంది.అత్యధిక భాగం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. ఈ రెండు కంపెనీలు తమకు రక్షణ కల్పించాలని కోరిన మేరకు ఏడాది తరువాత నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం గతేడాది డిసెంబరు నుంచి అమల్లోకి వచ్చే విధంగా రానున్న ఐదు సంవత్సరాల పాటు చైనా దిగుమతుల మీద నాణ్యతను బట్టి టన్నుకు 16.92 నుంచి 200.66 డాలర్ల మేరకు దిగుమతి పన్ను విధించాలని నిర్ణయించింది. పెట్‌తో శీతల పానీయాల, మంచినీటి సీసాలు, జాడీల వంటివి తయారు చేస్తారు. 2018లో చైనా నుంచి 88,247 టన్నులు దిగుమతి చేసుకోగా 2019లో అది 147,601 టన్నులకు పెరిగింది. దీంతో చైనా దిగుమతులపై పన్ను విధించాలని రిలయన్స్‌, ఇండోరమా కంపెనీలు డిమాండ్‌ చేశాయి. లడఖ్‌ వివాదానికి ముందే ఈ కంపెనీలు కేంద్రం ముందు వత్తిడి తెచ్చాయి. ఆ సాకుతో దానికి మోడీ సర్కార్‌ తలొగ్గింది. దీనికి ఆత్మనిర్భర ముసుగు తొడిగింది. రక్షణ చర్యల పేరుతో ప్రతి దేశం తమ కార్పొరేట్ల ప్రయోజనాలకు పూనుకుంటే స్వేచ్చా వాణిజ్యం, పోటీ తత్వం గురించి చెప్పే కబుర్లకు విలువ ఉండదు. చైనా వస్తువులపై 200 బిలియన్‌ డాలర్ల మేరకు దిగుమతి సుంకాలు విధించిన అమెరికా చర్యను ప్రపంచ వాణిజ్య సంస్ధ విమర్శించింది.


నిజానికి రక్షణ చర్యలు మన దేశానికి కొత్తేమీ కాదు. జవహర్‌లాల్‌ నెహ్రూ పాలన ప్రారంభమైన తరువాత అంతకు ముందు మాదిరి తమ వస్తువులకు మార్కెట్‌గా భారత్‌ను మార్చుకోవాలని అమెరికా, ఇతర ఐరోపా ధనిక దేశాలు భావించాయి. మన దేశంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందచేసేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకు రాలేదు. అప్పటికి మన పారిశ్రామికవేత్తలకు భారీ పెట్టుబడులు పెట్టగలిగిన సత్తా లేదు. అంతకు మించి పెట్టి లాభాలు సంపాదించగలమనే ధైర్యమూ లేదు. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు, వాణిజ్యానికి నాటి ప్రభుత్వం పునాదులు వేసింది. వాటిని ఆధారం చేసుకొని అనేక మంది పెట్టుబడిదారులు లబ్ది పొందారు, తమ పరిశ్రమలకు వాటిని ఆలంబనగా చేసుకున్నారు. హైదరాబాదులోని ఐడిపిఎల్‌లో పని చేసిన అనుభవాన్ని ఔషధ రంగంలో పరిశ్రమల స్ధాపనకు వినియోగించుకొని నేడు ఆ రంగాన్ని శాసిస్తున్న రెడ్డీలాబ్స్‌ వంటి కంపెనీల యజమానుల గురించి చెప్పనవసరం లేదు. ప్రయివేటు రంగం ముందుకు వచ్చిన తరువాత ఐడిపిఎల్‌ను మూసివేయించారు. అన్ని రంగాల్లోనూ అదే జరుగుతోంది. నాడు ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహించేందుకు, దానికి ఆలంబనగా చేసేందుకు నెహ్రూ ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహించారు. నేడు వాటి అవసరం తీరిపోయింది గనుక ఆ ప్రభుత్వ రంగ సంస్దలను ప్రయివేటు వారికి తెగనమ్మి లేదా మూసివేసి లబ్ది చేకూర్చేందుకు నరేంద్రమోడీ అదేపని చేస్తున్నారు.ఐడిపిఎల్‌ను మరింతగా విస్తరించి జనానికి చౌకగా ఔషధాలు అందించవచ్చు, కానీ ప్రభుత్వం వ్యాపారం చేయదనే పేరుతో వదిలించుకుంటున్నారు.
1991 నుంచి నూతన ఆర్ధిక విధానాల పేరుతో మన దేశం విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచింది. విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరవాలన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ద (ఐఎంఎఫ్‌), ప్రపంచబ్యాంకు ఆదేశాల మేరకు ఈ పని చేశారు. అప్పటి నుంచి మూడు దశాబ్దాల కాలంలో పదమూడు సంవత్సరాలు అతల్‌ బిహారీ వాజ్‌పాయి, నరేంద్రమోడీ ఏలుబడే ఉన్నది. సాధించింది ఏమిటి ? 2014లో అధికారానికి వచ్చిన మోడీ దగ్గర మంత్రదండం ఉందని, అద్భుతాలు చేస్తారని దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్‌ రంగం, దానికి వెన్నుదన్నుగా ఉండే మీడియా ఊదరగొట్టింది.అలాంటిదేమీ లేకపోగా తిరోగమనంలో నడుస్తోందన్న విమర్శలు ప్రారంభమయ్యాయి. పెద్ద దేశాలతో పోలిస్తే భారత్‌లోనే రక్షణ లేదా దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉన్నాయని రెండవ సారి మోడీ అధికారానికి వచ్చిన సమయంలో తీవ్ర విమర్శలు వెలువడ్డాయి. సంస్కరణలను మరింత వేగవంతం చేస్తానని మోడీ కూడా చెప్పారు.


కాంగ్రెస్‌ హయాంలో అయినా, మోడీ ఏలుబడిలో అయినా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) ఆశించిన మేరకు రాలేదు. వాటికి బదులు మన దేశంలో ఉన్న పరిశ్రమలు, వాణిజ్యాల షేర్‌మార్కెట్లో వాటాల కొనుగోలుకు పెట్టుబడులు పెట్టి లాభాలను తరలించుకుపోయే (ఎఫ్‌పిఐ) పెట్టుబడులు, వడ్డీ వసూలు చేసుకొనే అప్పుల రూపంలో మాత్రమే ఎక్కువగా వచ్చాయి. మన దేశానికి రావటం గొప్ప అన్నట్లుగా పాలకులు, వారికి వంతపాడే అధికార యంత్రాంగం చెబుతోంది.మన పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు, వాటిద్వారా వచ్చే లాభాల కోసం తప్ప మనకు మేలు చేసేందుకు కాదు అన్నది గమనించాలి.

నెహ్రూ హయాంలో అనుసరించిన విధానం అభివృద్ధికి దోహదం చేయలేదని కొంత మంది విమర్శిస్తారు. దాన్ని తప్పుపట్టనవసరం లేదు. వారు ప్రత్యామ్నాయంగా సూచించిన విధానాల పర్యవసానం ఏమిటి? 1990దశకానికి ముందు మన పారిశ్రామిక వస్తువులకు రక్షణగా దిగుమతుల మీద గరిష్టంగా విధించిన పన్ను మొత్తం 355శాతం ఉంటే సగటు 126శాతం. తరువాత 2010-11 నాటికి అవి 10-9.5శాతాలకు తగ్గాయి.2020-21లో 10-11.1శాతాలుగా ఉన్నాయి. నరేంద్రమోడీ హయాంలో తిరిగి రక్షణాత్మక చర్యలు ప్రారంభమయ్యాయి.2020జూన్‌ నాటికి వివిధ దేశాల్లో అమల్లో ఉన్న దిగుమతి వ్యతిరేక చర్యల వివరాలు ఇలా ఉన్నాయి.(ది.ని- దిగుమతి నిరోధ చర్యలు),ప్ర.వా.వా-ప్రపంచ వాణిజ్యంలో వాటాశాతం )
దేశం××× ది.ని ××× సుంకం×××× ప్ర.వా.వా
అమెరికా× 398 ××× 71 ×××× 13.3
భారత్‌ × 243 ××× 98 ×××× 2.5
చైనా × 156 ××× 4 ×××× 10.8
బ్రెజిల్‌ × 111 ××× 4 ×××× 1
ఆస్ట్రేలియా× 71 × 15 ×××× 1.2
గతంలో నెహ్రూ లేదా కాంగ్రెస్‌ హయాంలో రక్షణాత్మక చర్యలు ఎక్కువగా తీసుకున్నారు, వాణిజ్యానికి ఆటంకాలు ఎన్నో కలిగించారు. మేము వాటికి భిన్నంగా వ్యవహరిస్తున్నామని చెబుతున్న బిజెపి పెద్దలు ఏ దేశంతో పోల్చుకొని చెబుతున్నట్లు ? ప్రపంచ వాణిజ్యంలో మనవాటా శాతంతో పోల్చితే అవి ఎక్కువగా తక్కువా అన్నది చెప్పాలి. 1990దశకానికి ముందు, తరువాత గణాంకాలను చూసినపుడు ఎగుమతులు-దిగుమతుల ధోరణి ఒకే విధంగా ఎందుకు ఉన్నట్లు ? గతంలో స్వావలంబన అని చెప్పినా, ఇప్పుడు మేకిన్‌ ఇండియా, స్ధానిక వస్తువులనే కొనండి, ఆత్మనిర్బర్‌ అని ఏ పేరు చెప్పినా దిగుమతులదే పై చేయి ఎగుమతులు ఎందుకు పెరగటం లేదు ? యుపిఏ కాలంలో పెరిగిన ఎగుమతి-దిగుమతులు నరేంద్రమోడీ హయాంలో రెండూ ఎందుకు పడిపోయినట్లు ? ఉపాధి ఎందుకు పెరగటం లేదు, ఎందుకు తగ్గుతోంది ?
పెద్ద పరిశ్రమలను ప్రోత్సహించిన నెహ్రూ విధానంలో దుస్తులు, పాదరక్షలు,ఫర్నీచర్‌ వంటి వాటిని చిన్న లేదా కుటీర పరిశ్రమలుగా వర్గీకరించి వాటికి రక్షణ కల్పించారని, ఫలితంగా అవి గిడసబారి పోయినట్లు విమర్శ చేసే వారున్నారు. ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలు బడా రంగం అది కూడా రక్షణ లేకపోతే విదేశీ దిగుమతుల దెబ్బకు విలవిల్లాడుతున్నాది. చిన్న పరిశ్రమల సంగతి సరేసరి మూతపడుతున్నవాటి సంఖ్యే అందుకు నిదర్శనం.చిన్న సన్నకారు పరిశ్రమల నుంచి ప్రభుత్వ రంగ సంస్ధలు కొనుగోలు చేయాలన్న రక్షణ విధానాలకు గతంలో అనుసరించిన వాటికి తేడా ఏమిటి ? కరోనా సమయంలో వాటికి ఇవ్వాల్సిన బకాయిలను కూడా మోడీ సర్కార్‌ చెల్లించలేకపోవటం వివాదంగా మారిన విషయం తెలిసినదే.

మన దేశాన్ని ఉత్పత్తి కేంద్రంగా మార్చి ఎగుమతులు చేయాలని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు ఘోరంగా విఫలమైంది. దిగుమతుల నిరోధానికి విధించే పన్ను శాతాలు పెరుగుతున్నాయి. మనం ఆ పని చేస్తే మన వస్తువులను దిగుమతి చేసుకొనే దేశాలూ అదే చేస్తాయా లేదా ? మన ఎగుమతులు ఎందుకు పెరగటం లేదో మోడీ అండ్‌కో చెబుతారా ? ప్రభుత్వం వాణిజ్యం చేయకూడదంటూ విశాఖ ఉక్కు వంటి సంస్ధలను తెగనమ్మేందుకు పూనుకున్నారు. ప్రభుత్వం అమలు జరిపే ఉత్పత్తితో ముడిపెట్టిన ప్రోత్సాహకాల పధకం వంటి వాటి సంగతేమిటి ? విశాఖ ఉక్కు వంటి వాటికి ఈ పధకాన్ని ఎందుకు అమలు జరపరు ? ప్రయివేటు రంగం ముద్దు-ప్రభుత్వరంగం వద్దా ! భారీ పెట్టుబడులు-కార్మికులు తక్కువగా ఉండే ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలకు ఐదేండ్ల పాటు నాలుగు నుంచి ఆరుశాతం రాయితీలు ఇస్తామని ప్రకటించారు. పారిశ్రామిక, వాణిజ్య సంస్ధలు తమ సంగతి తాము చూసుకుంటాయి కదా వాటికి జనం సొమ్ముతో రాయితీలు ఇవ్వటం ఏమిటి ? ఇది రక్షణాత్మక చర్య కాదా ? భారీ పెట్టుబడులు, ఆటోమేషన్‌తో పనిచేసే సంస్ధలే ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి. వాటిలో ఉపాధి తక్కువ. అదే తక్కువ పెట్టుబడి, ఎక్కువ మంది కార్మికులు పని చేసే పరిశ్రమలు వాటితో పోటీ పడలేవు. అంటే బడా కంపెనీలకే ప్రోత్సాహకాలు ఇస్తే ఈ సంస్ధలేమి కావాలి ? విదేశాలు కూడా అదే పని చేస్తే మన ఉత్పత్తులు పోటీ పడతాయా ? నెహ్రూ విధానాలను విమర్శించేవారు తాము చేస్తున్నదేమిటి ?


నినాదాలు జనాన్ని ఆకర్షిస్తాయి తప్ప అమలు సందేహమే.అయితే చైనా అందుకు మినహాయింపుగా ఉంది. ఏ నినాదం వెనుక ఏ ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేనంత కాలం జనం మోసపోతూనే ఉంటారన్న లెనిన్‌ మాటలు తెలిసిందే. మన దేశంలో గరీబీ హటావో నినాదం అలాంటిదే.ఇప్పుడు ఆత్మనిర్భరత కూడా అలాంటిదే అని అనేక మంది అభిప్రాయం. మన మార్కెట్‌ను విదేశాలకు తెరిచిన తరువాత వస్తున్న పోటీని స్ధానిక పరిశ్రమలు, వాణిజ్యం తట్టుకోలేకపోతోంది. తమకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తోంది. నరేంద్రమోడీ సర్కార్‌ ఇప్పుడు చేస్తున్నది అదే. ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య(ఆర్‌సిఇపి) ఒప్పందంలో చేరకపోవటం కూడా రక్షణాత్మక చర్యల్లో భాగమే. దానిలో చేరితే మిగతాదేశాల సరకుల మీద దిగుమతి పన్నులు తగ్గించటంతో పాటు వాటిని అనుమతించాల్సి ఉంటుంది. మనకు ఎగుమతి చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆ సామర్ధ్యం లేని కారణంగా బలమైన వారే ఉట్టి కొడతారు. మన ఎగుమతి అవకాశాలు ఇంకా తగ్గిపోతాయి. గత ఐదు సంవత్సరాలలో టారిఫ్‌ కోడ్‌లో ఉన్న 5,500కు గాను 3,600 వస్తువుల విషయంలో దిగుమతి సుంకాలు పెరిగాయి. గత ఏడాది కాలంలోనే ఆరువందల వస్తువుల మీద పన్నులు పెరిగాయి. నెహ్రూను విమర్శించేవారు తాము కక్కిన దానిని తామే తినటం అంటే ఇదే. ఇప్పటికే ప్రయివేటు రంగం పరిశోధన-అభివృద్దికి చేస్తున్నదేమీ లేదు, ఇక వాటికి రక్షణ కల్పిస్తే రాయితీలు మింగి మరింతగా పెరుగుతాయి తప్ప వినియోగదారులకు ప్రయోజనం ఏముంటుంది ?

అద్భుతాలు సృష్టించిన దేశాలుగా పేరు పడిన వాటిలో దక్షిణ కొరియా ఒకటి. ఇప్పుడు ఆ దేశ పరిస్ధితి ఏమిటి ? ప్రభుత్వం ఇచ్చిన మద్దతుకారణంగా ఎలక్ట్రానిక్స్‌ రంగంలో అది పురోగతి సాధించిన మాట వాస్తవం. అమెరికా రక్షణలో ఉన్న కారణంగా మిలిటరీ వ్యయం తక్కువగా ఉండటంతో అక్కడి ప్రభుత్వం ప్రయివేటు రంగానికి పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చింది. ఇప్పుడు దానికి చైనా రూపంలో పోటీ ఎదురైంది. అక్కడి సంస్ధలు కార్యకలాపాలను పరిమితం చేయటం, ఉత్పత్తులను నిలిపివేయటం వంటి చర్యలకు పూనుకున్నాయి.1998 తరువాత తొలిసారిగా 2019లో దాని జిడిపి ఒకశాతం తిరోగమనంలో ఉంది. కరోనా కారణంగా ఇంటి నుంచి పని చేసేందుకు ప్రపంచ వ్యాపితంగా పెద్ద ఎత్తున కంప్యూటర్లు అవసరమై అక్కడి సంస్ధలు ఎగుమతులతో 2020లో నిలదొక్కుకున్నాయి గానీ లేకుంటే పరిస్ధితి ఏమిటి ? అక్కడి పారిశ్రామికవేత్తల నుంచి వసూలు చేస్తున్న వడ్డీ రేటు కేవలం 0.5(అర)శాతమే. అటువంటి రాయితీ ఇచ్చే స్ధితిలో మన దేశం లేదు. అలాంటపుడు బస్తీమే సవాల్‌ అన్నట్లుగా అమెరికా అండచూసుకొని మనకంటే బలవంతుల మీద మీసాలు మెలివేయటం తగనిపని. వాణిజ్య యుద్దంలో అమెరికా వారే కిందామీద పడుతుంటే మనం నిలవగలమా ? చైనా మాదిరి వస్తువులను ఎగుమతి చేయాలని, దాన్ని అనుకరించాలని నాలుగు దశాబ్దాల తరువాత చెబుతున్నారు. మరోవైపు అక్కడి నుంచి వస్తువుల దిగుమతులను నిలిపివేసి ఆర్ధికంగా దెబ్బతీస్తామని అసాధ్యమైన అంశాన్ని టాంటాం వేస్తున్నారు.


అమెరికా, ఐరోపా ధనిక దేశాల మాదిరి చౌకగా వచ్చే చైనా వస్తువులను దిగుమతి చేసుకొని లబ్దిపొందినట్లుగానే గత కొద్ది సంవత్సరాలుగా మన దేశంలోని పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు కూడా అదే పని చేస్తున్నారు.కొత్త ఆవిష్కరణలు చేసి తక్కువ ఖర్చుతో ఉత్పత్తిచేసేందుకు ముందుకు రావటం లేదు. గతంలో కాంగ్రెస్‌ ఏలుబడిలో లైసన్సు విధానం ద్వారా కొన్ని పరిశ్రమలకు రక్షణ కల్పించారు. దాన్ని విమర్శిస్తున్న సంఘపరివార్‌ పెద్దలు ఇప్పుడు చేస్తున్నదేమిటి. అదే రక్షణ విధానంలో భాగంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే అనుమతి తీసుకోవాలని, విధించిన పన్నులను చెల్లించాలంటున్నారు. సబ్సిడీలు ఇస్తున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగవేస్తే ఒన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ పేరుతో తగ్గిస్తున్నారు. అసలు పూర్తిగా ఎగవేస్తే రద్దుచేస్తున్నారు. అలాంటపుడు పోటీ ఎలా ఉంటుంది ? చరిత్ర పునరావృతం అవుతుందంటారు. దాని అర్ధం గతం మాదిరే అని కాదు. విదేశీ పోటీ నుంచి రక్షణ కల్పిస్తున్నారు, గతంలో తెరిచిన ద్వారాలను మెల్లగా మూస్తున్నారు. స్వాతంత్య్రానంతరం విదేశీ మార్కెట్‌కు ద్వారాలు మూసినందుకు అమెరికా, ఐరోపా దేశాలు మనలను దెబ్బతీసేందుకు ప్రయత్నించాయి. అవి వేర్పాటు, ఉగ్రవాదం రూపంలో ఎలా మనలను దెబ్బతీశాయో చూశాము. ఇప్పుడు ఒక వైపు ధనిక దేశాలతో రాజకీయంగా చేతులు కలుపుతూ మరోవైపు ఆర్ధిక విధానాల్లో దేశీయ కార్పొరేట్లకు రక్షణ కల్పిస్తున్నారు.

అమెరికా బడా దిగ్గజం అమెజాన్‌కు పోటీగా మన దేశ కంపెనీ రిలయన్స్‌ ముందుకు వచ్చింది. రిలయన్స్‌కు దన్నుగా కేంద్ర ప్రభుత్వం ఉంది. అడుగడుగునా అమెజాన్ను అడ్డుకొనేందుకు ప్రభుత్వం పూనుకుంది. అదే విధంగా మెట్రో వంటి సంస్ధలను రిటెయిల్‌ రంగంలోకి రాకుండా ఆటంకం కలిగిస్తూ దేశీయ కార్పొరేట్లకు రక్షణ కల్పిస్తోంది మోడీ సర్కార్‌. అందువలన విదేశాలు ముఖ్యంగా ధనికదేశాలు మనలను చూస్తూ అలాగే వదలి వేస్తాయనుకుంటే పొరపాటు. ముందే చెప్పినట్లు నెహ్రూ-మోడీ ఇద్దరూ కార్పొరేట్ల ప్రతినిధులే. ఒకరు ప్రయివేటురంగం నిలబడేందుకు ప్రభుత్వ రంగాన్ని అభివృద్ధి చేస్తే, ప్రయివేటు రంగం బలపడింది కనుక మరొకరు దాన్ని కారుచౌకగా ప్రయివేటు, విదేశీ కంపెనీలకు అప్పగిస్తున్నారు. ప్రయివేటు రంగానికి రక్షణ, రాయితీలు కల్పించటంలో సేమ్‌ టు సేమ్‌ ! ప్రత్యామ్నాయ విధానాలను అనుసరిస్తే తప్ప చైనా మాదిరి అభివృద్ది చెందే అవకాశం ఉండదు. కానీ ఆర్ధిక విధానాల విషయంలో కాంగ్రెస్‌-బిజెపి రెండూ ఒకదాన్నే అనుసరిస్తున్నాయి. అంతర్గత వైరుధ్యాలు అప్పుడూ-ఇప్పుడూ ఉన్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా ఎడమ చంకలో ఇమ్రాన్‌ – కుడి వైపున నరేంద్రమోడీ ! వావ్‌ !!

10 Saturday Apr 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

China, F-16 jets, imperialism, imran khan, Narendramodi, US, yankees


ఎం కోటేశ్వరరావు


మరో ఆరు రాఫేల్‌ యుద్ద విమానాలు ఏప్రిల్‌ 28న మన దేశానికి రానున్నాయన్నది ఒక వార్త . తన వ్యూహాత్మక భాగస్వామి పాకిస్ధాన్‌కు ఎనిమిది ఎఫ్‌-16 జెట్‌ యుద్దవిమానాలను విక్రయించాలని నిర్ణయించిన అమెరికా ఆమేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా ఇచ్చింది. డోక్లాంతో సహా చైనా-భూటాన్‌ మధ్య ఉన్న సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవాలని రెండు దేశాలూ మంగళవారం నుంచి శుక్రవారం వరకు జరిగిన సంప్రదింపులలో రెండు దేశాలూ నిర్ణయించాయి.


విమానాల కొనుగోలు లావాదేవీల్లో మధ్యవర్తిగా ఉన్న భారత ” దేశభక్తుడు ” సుషేన్‌ గుప్తా దొంగతనంగా మన సైన్యం వద్ద పత్రాలను దొంగిలించి అందచేసినందుకు బహుమతి పేరుతో గుప్తా, మరికొందరు మధ్యవర్తులకు రాఫేల్‌ కొన్ని మిలియన్ల యూరోలు సమర్పించుకుంది. మన పాలక దేశభక్తులు ఏం చేస్తారో తెలియదు. పాకిస్ధాన్‌కు ఎఫ్‌-16 యుద్ద విమానాలు అందచేయటం ‘ఉగ్రవాదం’ మీద జరిపే పోరుకు ఇబ్బంది అని నరేంద్రమోడీ ఎంత మొత్తుకున్నా -నిజంగా అలా చేశారో లేదో తెలియదు- అమెరికా ఖాతరు చేయలేదు. గెజిట్‌లో కూడా ప్రకటించాం తన్నుకు చావండి అన్నట్లుగా ఉంది.
డోక్లాంలో చైనా సైన్యాన్ని అడ్డుకొనేందుకు మన మిలిటరీ భూటాన్‌ ఆహ్వానం మీద వెళ్లిందా లేదా చిన్న దేశం కనుక పక్కకు నెట్టి వ్యవహరించిందా అన్నది ఇప్పటికీ తేలని విషయమే. తాజాగా చైనా-భూటాన్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం స్వతంత్రంగానే భూటాన్‌ వ్యవహరించనున్నదని వార్తలు వచ్చాయి. అంటే మీకు చైనా ముప్పు ఉందంటూ మనం జోక్యం చేసుకొనేందుకు దారి మూసినట్లేనా ? అంతిమ ఒప్పందం కుదిరే వరకు రెండు దేశాల మధ్య శాంతి, సుస్ధిరతలను కాపాడాలని నిర్ణయించాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు సరిగా లేకపోయినా ఈ ఒప్పందం కుదరటం విశేషం. భారత్‌ను దూరంగా ఉంచేందుకు చైనా వైపు నుంచి భూటాన్‌కు గణనీయంగా రాయితీలు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. డోక్లాంకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో చైనీయులు భూటాన్‌ భూ భాగంలో ఒక గ్రామాన్ని నిర్మించారని మన పత్రికలు కట్టుకధలు రాసిన విషయం తెలిసిందే. అరుణాచల్‌లో కూడా అదే విధంగా గ్రామాలను నిర్మించినట్లు రాసిన విషయం తెలిసిందే.


నరేంద్రమోడీ సర్కార్‌ అమెరికా, దాని మిత్రపక్షాలతో జతకట్టదలచుకుంటే సూటిగానే చెప్పవచ్చు. దాని మంచి చెడ్డలను సమయం వచ్చినపుడు జనం తేలుస్తారు. మేము ఏదైనా బస్తీమే సవాల్‌ అన్నట్లుగా చెప్పి చేస్తాము అని చెప్పుకుంటున్న మోడీ నాయకత్వం ఆచరణలో అలా ఉందా ? ప్రతిదేశం ప్రతి సమస్య, పరిణామం నుంచి తామెలా లబ్ది పొందాలన్న తాపత్రయంలోనే ఉంది.అందుకే ఎన్నో ఎత్తులు, జిత్తులూ దీనికి ఏ దేశమూ మినహాయింపు కాదు. వాటి వలన జనానికి లబ్ది చేకూరుతుందా, వారి ప్రయోజనాలను ఫణంగా పెట్టి కార్పొరేట్లకు లాభాలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారా అన్నదే గీటురాయి.ప్రపంచం వైరుధ్యాల మయం. అవి నిరంతరం ఉంటూనే ఉంటాయి. అయితే అన్నీ ఒకేసారి ముందుకు రావు. ఏదైనా ప్రధాన వైరుధ్యంగా ముందుకు వచ్చినపుడు వాటి పట్ల తీసుకొనే వైఖరి తరువాత వచ్చే వైరుధ్యాన్ని బట్టి మారిపోతూ ఉండవచ్చు. ప్రపంచం మొత్తాన్ని మింగివేయాలన్నది అమెరికా దురాశ. అది సాధ్యం కాదని ఐరోపాలోని ధనిక దేశాలకు ఇంతకు ముందే తెలుసు కనుక వైరుధ్యాలను ఉపయోగించుకోవాలని అవి నిత్యం చూస్తుంటాయి.అమెరికా, ఐరోపా ధనిక దేశాలు తమ పధకంలో ఏ దేశాన్ని ఎక్కడ నిలిపి ఎలా లబ్ది పొందాలా అని నిరంతరాన్వేషణ సాగిస్తున్నాయి.
ఇప్పుడు ప్రపంచంలో ఇండోాపసిఫిక్‌ ప్రాంతం మీద కేంద్రీకరణ పెరిగింది. భూమి తన చుట్టుతాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇది ప్రకృతి. అమెరికా అన్ని దేశాలనూ తన చుట్టూతిప్పుకోవాలనుకుంటుంది, అది వికృతి. తాటిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడుంటాడని చైనా నిరూపించింది. అతి పెద్ద దేశంలో ప్రవేశించి అక్కడి మార్కెట్‌ను కొల్లగొట్టాలన్నది అమెరికా, ఐరోపా ధనిక దేశాల ఆకాంక్ష. తమ దగ్గర లేని సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులను బయటి నుంచి తెచ్చుకొని తాము అభివృద్ధి చెందాలన్నది చైనా కమ్యూనిస్టుల లక్ష్యం. నాలుగుదశాబ్దాల ఈ పయనంలో చైనా కమ్యూనిస్టులే పైచేయి సాధించారు. ఎంతగా అంటే ఆర్ధికంగా అమెరికాను అధిగమించి పోయేంతగా అని వేరే చెప్పనవసరం లేదు. అందుకే దాన్ని అడ్డుకొనేందుకు ఎన్నో పధకాలు.


తన ఆర్ధిక, మిలిటరీ శక్తిని ఉపయోగించి మన దేశంతో సహా అనేక దేశాలను చైనాకు వ్యతిరేకంగా నిలబెట్టాలన్నది దాని పధకం. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడచిన తరువాత అమెరికా కొంత మేరకు సఫలీకృతమైంది.దానిలో భాగమే గతేడాది జరిగిన లడఖ్‌, అంతకు ముందు సంభవించిన డోక్లాం పరిణామాలు. భూటాన్‌-చైనా మధ్య వివాదంగా ఉన్న ప్రాంతంలో చైనా రోడ్డు వేయకూడదని మన దేశం వెళ్లి అడ్డుకుంది. మన ప్రాంతాలను చైనా ఆక్రమించలేదని స్వయంగా ప్రధాని మోడీ చెప్పినప్పటికీ లడఖ్‌ ప్రాంతంలో రెండు దేశాల మధ్య సాయుధ ఘర్షణలు జరిగాయి.చైనాకు వ్యతిరేకంగా చతుష్టయం పేరుతో అమెరికా-జపాన్‌-ఆస్ట్రేలియాలతో మన దేశం జట్టుకట్టి బస్తీమే సవాల్‌ అంటున్నాయి.ఈ గుంపులోకి ఐరోపా ధనిక దేశాలను కూడా లాగాలని చూస్తున్నాయి. పశ్చిమ దేశాలు అనుకున్న, వేసిన పధకం సఫలం కావాలంటే కాగితాల మీద గీతలు గీసినంత సులువు కాదు. ముందుగా చైనా వస్తువుల మీద ధనిక దేశాలు ఆధారపడటం మానుకోవాలి. అంటే వాటికి చౌకగా వస్తువులను తయారు చేసి సరఫరా చేసే ప్రత్యామ్నాయ దేశాలు కావాలి. మన దేశంలో చౌకగా దొరికే మానవశక్తి ఉంది, పశ్చిమ దేశాల వస్తువులకు అవసరమైన మార్కెట్టూ ఉంది. అందుకే మన దేశాన్ని, ఎవరు గద్దెమీద ఉంటే వారిని ఇంద్రుడూ చంద్రుడూ అంటూ పొగుడుతున్నాయి. సమీప భవిష్యత్‌లో మనం ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని ఎవరూ అనుకోవటం లేదు.


వివిధ పరిణామాలను ఒక దగ్గరకు చేర్చి చూస్తే దారులన్నీ రోమ్‌కే అన్నట్లుగా ప్రస్తుతానికి ప్రయత్నాలన్నీ చైనాకు వ్యతిరేకంగానే ఉంటున్నాయి. గతంలో బ్రిటన్‌-జపాన్‌-ఫ్రాన్స్‌ -స్పెయిన్‌- ఇటలీ-జర్మనీ చరిత్రను చూసినపుడు ప్రపంచాన్ని పంచుకొనేందుకు వాటి మధ్య వచ్చిన పంచాయతీలే అనేక ప్రాంతీయ, రెండు ప్రపంచ యుద్దాలకు దారి తీశాయి. ఇప్పుడు వీటన్నింటినీ పక్కకు నెట్టి అమెరికా ముందుకు వచ్చి అదే చేస్తోంది.చైనా మార్కెట్లో వాటికి ప్రవేశం కల్పిస్తే, చైనా తమకు పోటీ ఇవ్వకుండా ఉంటే అసలు పేచీయే లేదు. అది జరగటం లేదు గనుకనే ఏదో ఒక గిల్లికజ్జా పెట్టుకుంటున్నాయి. చైనాకు పోటీగా మన దేశాన్ని వినియోగించుకోవాలని చూసిన పశ్చిమ దేశాలు తీవ్ర ఆశాభంగం చెందాయి. దాని దరిదాపుల్లో కూడా మనం లేకపోవటంతో చైనాతో విధిలేక ముద్దులాట-దెబ్బలాట అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. మన ప్రధాన బలహీనత జిడిపిలో 14శాతం వాటా ఉన్న వ్యవసాయ రంగంలో 50శాతం మంది ఉపాధిపొందుతున్నారు.అరవైశాతంగా ఉన్న సేవారంగం 28శాతం మందికే ఉపాధి చూపగలుగుతోంది.

లాహిరి లాహిరిలో అన్నట్లుగా చైనా అధినేత గ్జీ జింపింగ్‌ ా మన నరేంద్రమోడీ వ్యవహరించిన తీరును మనం చూశాము. అలాంటిది ఆకస్మికంగా గాల్వన్‌లోయ ఉదంతాలకు ఎందుకు దారి తీసింది ? చైనా మన ప్రాంతాలను ఆక్రమించుకోలేదని ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్ష సమావేశంలో చెప్పిన తరువాత సరిహద్దుల్లో జరిగిన ఉదంతాల గురించి పరిపరి విధాల ఆలోచనలు ముందుకు వచ్చాయి. చైనాతో వచ్చిన లేదా తెచ్చుకున్న సరిహద్దు వివాద అసలు లక్ష్యం ఏమిటి ?తెరవెనుక పాత్రధారులు, వారేం చేస్తున్నదీ మనకు కనిపించదు,వినిపించదు. తెర ముందు జరిగే వాటిని బట్టి నిర్దారణకు వస్తే తప్పులో కాలేస్తాము. చైనాతో సరిహద్దు వివాదం రాజకీయంగా నరేంద్రమోడీ పుట్టక ముందునుంచీ ఉంది.1962 తరువాత కొత్తగా మన భూభాగం చైనా ఆధీనంలోకి వెళ్లలేదని మోడీ సర్కారే పార్లమెంటులో కూడా చెప్పింది. మన పాలకులు చెబుతున్నట్లుగా సరిహద్దుల్లో చైనా కవ్వించిందనే అనుకుందాం. చర్చల ద్వారా అనేక అంశాలను పరిష్కరించుకుంటున్న మనం ఆ మార్గాన్ని ఎందుకు ఎందుకు ఎంచుకోలేదు ? కాసేపు పక్కన పెడదాం.

ఇరాన్‌తో మనకు గోడ-నీడ పంచాయతీల్లేవే. (ఇష్టం లేకపోతే నీ స్ధలమే గావచ్చు గోడ ఎత్తుగా కట్టావు, దాని నీడ మా ఇంటి మీద పడుతోందని గిల్లికజ్జా) ఇప్పుడు ఇరాన్‌-చైనా మధ్య ఏర్పడిన బంధం మన దేశానికి తలనొప్పిగా మారిందని, కొత్త సవాళ్లను ముందుకు తెచ్చిందని సంఘపరివార్‌ పత్రిక ఆర్గనైజర్‌ మాజీ సంపాదకుడు శేషాద్రి చారి పేర్కొన్నారు. తలనొప్పి స్వయంగా నరేంద్రమోడీ తెచ్చింది తప్ప మరొకటి కాదు. శేషాద్రి ముందుకు తెచ్చిన అంశాల సారాంశాన్ని చూద్దాం. ఇరాన్‌ మీద విధించిన ఆంక్షలను తొలగించే చిన్నపాటి సూచనలు కూడా అమెరికా నుంచి వెలువడని సమయంలో పాతికేండ్ల పాటు అమల్లో ఉండే 400 బిలియన్‌ డాలర్ల ఒప్పందాన్ని ఇరాన్‌తో చైనా కుదుర్చుకుంది.హార్ముజ్‌ జలసంధిలో కీలక స్ధానంలో ఉన్న బందర్‌ అబ్బాస్‌ రేవు ద్వారానే మన దేశానికి గరిష్టంగా సరకు రవాణా జరుగుతోంది.అమెరికా ఆంక్షల కారణంగా మన దేశానికి దాన్ని మూసివేసినందున మన రవాణా ఖర్చులు అనేక రెట్లు పెరుగుతున్నాయి.చమురు సరఫరాలు నిలిచిపోయిన కారణంగా ధరలు పెరిగిపోయి వాణిజ్యలోటులో సమస్యలు వస్తున్నాయి. అరవై రోజుల వరకు అరువు సౌకర్యం, ఆకర్షణీయమైన రాయితీలు, రూపాయి చెల్లింపులను అంగీకరించటం వంటివి ఇరాన్‌తో మనకున్న సానుకూల అంశాలలో కొన్ని మాత్రమే. ఇవన్నీ పోవటం మన వ్యూహాత్మక, రక్షణ ప్రయోజనాలకు వ్యతిరేకం. మధ్య ఆసియా దేశాలతో మన వాణిజ్యానికి ఇరాన్‌ ముఖద్వారం. పాకిస్ధాన్‌తో నిమిత్తం లేకుండా చబ్బార్‌ రేవు ద్వారా ఆఫ్ఘనిస్తాన్లో ప్రవేశించేందుకు ఉపయోగపడుతుంది. తుర్కుమెనిస్దాన్‌-ఆఫ్ఘనిస్దాన్‌-పాకిస్దాన్‌-భారత్‌ చమురు పైప్‌లైన్‌ మన ఇంధన భద్రతకు అవసరం. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే ఇరాన్‌ సహకారం లేకుండా సాధ్యం కాదు, అందువలన ఇరాన్‌పై ఆంక్షల ఎత్తివేతకు మన దేశం అమెరికాను ఒప్పించాల్సి ఉందని శేషాద్రి చారి చెప్పారు. ఆ పెద్దమనిషి చైనా వ్యతిరేకి అని వేరే చెప్పనవసరం లేదు. అయినా నరేంద్రమోడీ సర్కార్‌ వైఖరిని ఎందుకు తప్పు పడుతున్నట్లు ? ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.అమెరికాను నమ్ముకొని మోడీ ఇరుగు పొరుగు దేశాలను చైనా వైపు వెళ్లేట్లు నెడుతున్నారన్నది అసలు దుగ్ద. చైనాతో సరిహద్దు వివాదం ఉంది గనుక మన లడఖ్‌లో ప్రతాపం చూపాము అనుకుంటే అర్ధం ఉంది. మరి ఇరాన్‌ను ఎందుకు దూరం చేసుకుంటున్నాము ? అమెరికా కౌగిలింతలతో మునిగి తేలుతూ ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులు నిలిపివేశాము.


ఇరాన్‌తో చైనా ఒప్పందం కేవలం దానికి అవసరమైన చమురు కోసమే అనుకుంటే పొరపాటు. అమెరికా ఆంక్షలతో ఇబ్బంది పడుతున్న ఇరాన్‌ ఆర్దిక వ్యవస్ధను ఆదుకోవటం కూడా దానిలో కీలక అంశం. ప్రపంచాన్ని ఆక్రమించాలని చూస్తున్న అమెరికాను కట్టడి చేసే మధ్య ప్రాచర్య వ్యూహంలో భాగం అది. ఇండో-పసిఫిక్‌ వ్యూహం పేరుతో చైనాను దెబ్బతీసేందుకు భారత్‌-జపాన్‌-ఆస్ట్రేలియాలను ఇప్పటికే అమెరికా ఒక దగ్గరకు చేర్చింది. దానికి ప్రతిగా చైనా తన ఎత్తుగడలను రూపొందించుకొంటోంది. రానున్న రోజుల్లో మధ్య ప్రాచ్యం అగ్రదేశాల అధికార పోరుకు వేదిక కానుందన్నది చైనా అంచనా.అందుకే ఆప్రాంతంతో పాటు ఆఫ్రికాలో కూడా చైనా వ్యూహాన్ని అమలు చేస్తూ అనేక దేశాలతో ఒప్పందాలతో ముందుకు పోతున్నది. పశ్చిమాసియాలో షియా-సున్నీ విభేదాలను ఉపయోగించుకొని అమెరికా రాజకీయం చేస్తుంటే చైనా దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నది.సున్నీలు మెజారిటీగా ఉన్న సౌదీ అరేబియా-షియాలు మెజారిటీగాఉన్న ఇరాన్‌తోనూ సత్సంబంధాలను కలిగి ఉంది. రెండు దేశాల నుంచీ పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేస్తున్నది. అమెరికాను ఎదుర్కొనే ఎత్తుగడలో భాగంగా రష్యా కూడా తన పావులు కదుపుతున్నది. 2019లో చైనా-రష్యా-ఇరాన్‌ మిలిటరీ సంయుక్త విన్యాసాలు అమెరికాకు ఒక హెచ్చరిక తప్ప మరొకటి కాదు.


వర్దమాన దేశాలు తమలో తాము సహకరించుకోవటం ద్వారా అభివృద్ధి పొందాలి తప్ప సామ్రాజ్యవాదులతో చేతులు కలిపి బాగుపడదామనుకుంటే జరిగేది కాదన్నది ఇప్పటి వరకు ప్రపంచ అనుభవం. మన సంబంధాలు అమెరికా, జపాన్‌ వంటి దేశాలతో ఈ గీటురాయితోనే సరి చూసుకోవాలి. ఒకవైపు బ్రెజిల్‌, రష్యా,ఇండియా,చైనా, దక్షిణాఫ్రికా(బ్రిక్స్‌) ఒక కూటమిగా సహకరించుకోవాలని సంకల్పం చెప్పుకున్నాయి. మరోవైపు మన దేశం చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో జతకడుతుంది. అలాంటపుడు ఈ కూటమి దేశాల మధ్య విశ్వాసం ఎలా ఉంటుంది, సహకారానికి ఎలా దారి చూపుతుంది ? అందుకే ముందుకు పోవటం లేదు. చతుష్టయంలో చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో చేతులు కలిపిన ఆస్ట్రేలియా, జపాన్‌ మరోవైపు అమెరికా వ్యతిరేకించే ఆర్‌సిఇపి కూటమిలో చైనాతో చేతులు కలుపుతాయి.అమెరికా బెదిరింపులను కూడా ఖాతరు చేయకుండా చైనాతో ఒప్పందాలు చేసుకున్న ఐరోపాధనిక దేశాలు మరోవైపున ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో జట్టుకట్టేందుకు ఆసక్తి చూపుతాయి. అమెరికా రెచ్చగొట్టగానే చైనాతో తాడోపేడో తేల్చుకుంటామన్న మన నరేంద్రమోడీ సర్కార్‌ మరోవైపు దానితో చర్చల ప్రక్రియ సాగిస్తోంది.బాలాకోట్‌ దాడులతో పాక్‌ను దెబ్బతీశామని ప్రకటించిన మన దేశం తెరవెనుక వారితో 2018 నుంచే సంప్రదింపులు జరుపుతున్నట్లు బయటపడింది. రెండు దేశాలూ సఖ్యంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఇటీవలనే నాటకీయంగా ప్రకటన చేశాయి. ఆట మనకై మనమే ఆడుతున్నామా లేక ఎవరైనా ఆడించినట్లు ఆడుతున్నామా ?

ప్రపంచీకరణను ముందుకు తెచ్చింది అమెరికా, ఐరోపా అగ్రరాజ్యాలు. మనవంటి వర్ధమాన, పేద దేశాలను దానిలోకి లాగిందీ అవే. దశాబ్దాల పాటు చైనాను ప్రపంచీకరణలో భాగస్వామిని చేసేందుకు నిరాకరించాయి. తీరా ఇప్పుడు ప్రపంచీకరణకు భిన్నమైన చర్యలు తీసుకుంటున్నదీ దాన్ని ప్రారంభించిన దేశాలే. నిజమైన ప్రపంచీకరణ స్ఫూర్తిని పాటించాలని చైనా డిమాండ్‌ చేస్తున్నది. ప్రపంచ పరిణామాల్లో ఎంత మార్పు ? ఐక్యరాజ్యసమితి, ప్రపంచ వాణిజ్య సంస్ధ వంటి వాటన్నింటినీ పక్కన పెట్టి అమెరికా తన సంగతి తాను చూసుకుంటోంది. మనవంటి దేశాలను తన అజెండాకు అనుగుణ్యంగా నడవమంటోంది, బెదిరిస్తోంది.(ఇరాన్‌ చమురు కొనవద్దని ఆదేశించటం పక్కా నిదర్శనం). రెండవ ప్రపంచ యుద్దం తరువాత ప్రపంచీకరణ ద్వారా తన మార్కెట్‌ను పెంచుకోవాలన్నది ధనిక దేశాల ఎత్తుగడ. అవి అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి.


మనలను ప్రధాన భాగస్వామి అని చెబుతున్న అమెరికన్లు పాకిస్ధాన్‌కూ అదే చెబుతున్నారు. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు గానీ అమెరికా చెరొక చంకలో ఇమ్రాన్‌ ఖాన్ను, నరేంద్రమోడీని ఎక్కించుకుంటున్నట్లు పరిణామాలు వెల్లడిస్తున్నాయి. అమెరికాను నమ్ముకొని చైనాతో శతృత్వం పెంచుకుంటే నష్టం మనకే. పశ్చిమాసియా, మధ్య ఆసియాలో అమెరికా ప్రయోజనాల రక్షణకు, ఇరాన్‌కు వ్యతిరేకంగా పాకిస్ధాన్‌ అవసరం. అందుకే మనలను మాయపుచ్చటానికి ఎన్ని కబుర్లు చెప్పినా చేయాల్సింది చేస్తోంది. పాక్‌తో సయోధ్యకు మన మెడలు వంచుతోంది. మనం లొంగిపోయామనే అంచనాకు వచ్చిన కారణంగానే వాణిజ్యం, దిగుమతుల విషయంలో సానుకూల ప్రకటన చేసిన పాకిస్ధాన్‌ మరుసటి రోజే అబ్బెబ్బె అదేం లేదంటూ మాట మార్చింది. ఎఫ్‌ -16 విమానాలను తెచ్చుకున్నాం గనుక తాడో పేడో తేల్చుకుందాం అన్నా ఆశ్చర్యం లేదు.


ఒక స్వతంత్ర విదేశాంగ విధానం లేనట్లయితే మనం ఎటువైపు ఉండాలో తేల్చుకోలేము.గతంలో నెహ్రూ, కాంగ్రెస్‌ హయాంలో సోవియట్‌కు అనుకూలంగా ఉండి భారీ పరిశ్రమలు, ఇప్పుడు అనేక విజయాలు సాధిస్తున్న అంతరిక్ష రంగానికి అవసరమైన వాటిని సాధించుకున్నాము. ఇప్పుడు అమెరికాకు అనుకూలంగా మారి చెప్పుకొనేందుకు సాధించింది ఏమైనా ఉందా ? లేకపోగా చుట్టుపక్కల వారినందరినీ దూరం చేసుకున్నాము. పాకిస్ధాన్‌, చైనాతో శతృత్వం పెంచుకుంటున్నాము. దాని ద్వారా ఆయుధాలు అమ్ముకుంటున్న అమెరికా తప్ప మనకు కలిగిన లబ్ది ఏమిటో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. కరుడు గట్టిన నేరగాండ్లు, మాఫియా ముఠాలు కొత్త వారికి ఎరలు వేసి ఆకర్షిస్తారు. మెల్లగా వారికి తెలియకుండానే చిన్నపాటి నేరాలు చేయించి తమ బందీలుగా చేసుకుంటారు. తరువాత వారు చెప్పినట్లు చేయక తప్పని స్ధితిని కల్పిస్తారు. అమెరికా, ఇతర అగ్రదేశాలు కూడా అంతే ! ఈ అంశాన్ని మన పాలకులు గుర్తిస్తారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ (కౌగిలింతల ) వ్రతం చెడ్డా ఫలం దక్కలే ! అమెరికాతో వాణిజ్య యుద్దానికి సిద్దమా !!

05 Monday Apr 2021

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Digital Service Tax, DST, Katherine Tai, Narendra Modi, Retaliatory tariffs on Indian goods, Trade Protectionism, USTR


ఎం కోటేశ్వరరావు


తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు లేకపోయినా, మీడియా పెద్దగా పట్టించుకోని కారణంగా అనేక విషయాలు మరుగున పడిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం మన ప్రభుత్వం సౌదీ అరేబియా మీద చమురు ఆయుధాన్ని ప్రయోగించాలంటూ వార్తలు వెలువడ్డాయి. చమురు ధరలు పెరిగితే కొనుక్కోలేము, తగ్గితే కొని నిలవ చేసుకొనేందుకు సౌకర్యాలు, స్వంత ఉత్పత్తిని పెంచుకోలేని మనం చమురు ఎగుమతి దేశాల మీద దాడి చేయటం ఏమిటి ? సౌదీ అరేబియా నుంచి కొనుగోళ్లను నిలిపివేసి లేదా బాగా తగ్గించి ఇతర మార్కెట్లలో ఏ రోజు ధర ఎంత ఉంటే అంతకు కొనుగోలు చేసి మన సత్తా ఏమిటో చూపాలన్నట్లుగా వార్తలు వచ్చాయి. మనది సర్వసత్తాక స్వతంత్ర భారత్‌ – స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం, వారసత్వం లేని కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలకు ఆ విషయం తెలుసో లేదో తెలియదు ( అయినా అమెరికా ఆదేశించింది గనుక మనమే ” స్వంత ” నిర్ణయం తీసుకొని ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు నిలిపివేశాము. ఇరాక్‌ నుంచి గణనీయంగా తగ్గించాము.) ఇప్పుడు సౌదీ అరేబియా ( కొద్ది రోజుల క్రితం సామాజిక మాధ్యమంలో బిజెపి మరుగుజ్జులు నరేంద్రమోడీ మీద గౌరవంతో సౌదీ అరేబియా మనకు రాయితీధరలకు చమురు విక్రయించేందుకు అంగీకరించిందని ప్రచారం చేశారు ) మీద కారాలు మిరియాలు నూరుతున్నాము. వారు నందంటే నంది పందంటే పంది అని జనం కూడా మాట్లాడాలి మరి, లేకుంటే దేశభక్తి లేదని ముద్రవేస్తారు మరి !


అసలు విషయం ఏమిటి ? గత కొద్ది సంవత్సరాలుగా చమురు దిగుమతి చేసుకొనే దేశంగా ఉన్న అమెరికా ఇటీవలి కాలంలో షేల్‌ ఆయిల్‌ ఉత్పత్తి కారణంగా చమురు ఎగుమతి దేశంగా మారిపోయింది. అమెరికాతో మన వాణిజ్యం కొద్దిగా మిగులులో ఉంది.కనుక తమ కంపెనీల నుంచి పారిశ్రామిక ఉత్పత్తులు, ఆయుధాలతో పాటు చమురు కూడా కొంటారా లేదా అని వత్తిడి చేస్తోంది. పశ్చిమాసియా, గల్ఫ్‌దేశాలు మనకు ఎప్పుడూ మిత్రులుగానే ఉన్నాయి తప్ప శత్రువులు కాదు. గల్ఫ్‌ దేశాల నుంచి కొనుగోళ్లు తగ్గించి ఆమేరకు అమెరికా చమురు కొనాలంటే ఏదో ఒకసాకు కావాలి. సౌదీ అరేబియా ఇటీవల చమురు ఉత్పత్తిని తగ్గించిన కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగాయి. తగ్గినపుడు ఆ మేరకు మన జనానికి తగ్గించకుండా పన్నులు వేసి ఆ మొత్తాలను అదానీ, అంబానీల వంటి కార్పొరేట్లకు పన్నుల రాయితీల రూపంలో మూటగట్టి మరీ ఇచ్చారు, ఇస్తున్నారు. ఇప్పుడు చమురు ధరలు పెరిగితే ప్రస్తుతం నరేంద్రమోడీ మత్తులో ఉన్న జనానికి అది వదిలిన తరువాత ఏం జరుగుతుందో అందరికంటే నరేంద్రమోడీకే బాగా తెలుసు గనుక చమురు ఎగుమతి దేశాల మీద రుసరుసలాడుతున్నారు. గతంలో మా దగ్గర కారుచౌకగా కొన్న చమురు ఉంది కదా ఆమేరకు మీ వినియోగదారులకు భారం తగ్గించండి అని సౌదీ అరేబియా సలహాయిచ్చింది.దాన్ని సాకుగా తీసుకొని వేరే మార్కెట్లలో కొనుగోలు చేయాలని మన చమురు కంపెనీలను కోరారు.


పోనీ ఆ వేరే మార్కెట్లలో మన లావు – పాత పోలిక వద్దు లెండి ఇప్పుడు గడ్డం పొడవు చూసి అనాలేమో ! తక్కువ ధరలకు ఏమైనా ఇస్తాయా ? ఒక్క సెంటు(మన ఏడు పైసలకు సమానం) కూడా తగ్గించవు. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ధరల ప్రకారమే, డాలర్లు మరీ చెల్లించి మనం కొనుక్కోవాలి, మన పొరుగునే ఉన్న గల్ఫ్‌ నుంచి రవాణా ఖర్చులు తక్కువ, అదే అమెరికా నుంచి కొనుగోలు చేస్తే తడచిమోపెడంత అవుతాయి……తనది కాదు గనుక తాటిపట్టవేసి గోక్కోమన్నాడట వెనుకటికెవడో ! అలాగే కేంద్ర పెద్దలదేముంది, భరించేది మనమే కదా ఎంతైనా, ఎక్కడి నుంచైనా తెస్తారు ? చమురు కార్పొరేట్లతో వారి సంబంధాలు ముఖ్యం కదా ! మన ప్రధాని నరేంద్రమోడీ అమెరికా స్నేహం పట్టినప్పటి నుంచీ కొంత చమురును మన రూపాయల్లో కొనే వెసులుబాటు కల్పించిన ఇరాన్‌ను వదలి పెట్టి అమెరికన్లను మెప్పించేందుకు చమురు కొనుగోళ్లను ఎలా పెంచారో తెలుసా ?


2017-18లో రోజుకు 38వేల పీపాల చమురు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నాము.2021 ఫిబ్రవరిలో ఆ మొత్తం 5,45,300 పీపాలకు పెరిగింది.ప్రస్తుతం 8,67,500 పీపాలతో మొదటి స్ధానంలో ఉన్న ఇరాక్‌ నుంచి దిగుమతులను గణనీయంగా తగ్గించి అమెరికా మీద అధికంగా ఆధారపడే విధంగా మోడీ వేగంగా ప్రయాణిస్తున్నారు. మన పశ్చిమాసియా మిత్ర దేశాలతో చమురు వైరుధ్యం తెచ్చుకొని ఆ దారులన్నీ మూసుకున్న తరువాత అమెరికా ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి, ఎక్కడ, ఎలా నిలబడమంటే అలా నిలబడాల్సిన రోజు వచ్చినా ఆశ్చర్యం లేదు. మన చమురు ఆయుధాన్ని మనమీదే ప్రయోగిస్తే చేయగలిగిందేమీ లేదు.మనం ట్రంప్‌ హయాంలో కౌగిలింతల కోసం ఎంతగా లొంగిపోయామో అందరికీ తెలిసిందే. ఇప్పుడు జో బైడెన్ను మరింతగా ఆకర్షించేందుకు నానా పాట్లు పడుతున్నాము. అయినా వారు చేస్తున్నదేమిటి ?
డోనాల్డ్‌ ట్రంప్‌, జో బైడెన్‌ ఎవడైతేనేం అమెరికన్‌ కార్పొరేట్ల చౌకీదార్లు. వారికోసం ఏ గడ్డికరవమన్నా కరుస్తారు. వాటంగా ఉంటే కౌగలించుకొని మత్తులో ముంచుతారు లేకపోతే కాటువేసి దెబ్బతీస్తారు. ఈ మధ్య కాలంలో నరేంద్రమోడీ డిజిటలైజేషన్‌ గురించి ఎన్నో కబుర్లు చెబుతున్నారు. ఆయన ప్రత్యేకత ఏమంటే అసలు మన దేశంలో ఇంటర్నెట్‌, డిజిటల్‌ కెమెరా రాకముందే వాటిని ఉపయోగించి అద్వానీగారినే ఆశ్చర్యపరిచిన ఘనత ఆయన సొంతం. స్వయంగా ఆయనే చెప్పుకున్న విషయం, దాని మంచిచెడ్డలు వదలివేద్దాం. విదేశాలకు చెందిన సంస్ధలు మన దేశంలో డిజిటల్‌ సేవలను అందించి వ్యాపారం చేస్తున్నపుడు దానికిగాను డిజిటల్‌ సర్వీసు టాక్సు(డిఎస్‌టి) చెల్లించాలని మన దేశం 2016లోనే అనేక దేశాలతో పాటు ఆదాయం మీద ఆరుశాతం పన్ను విధించాలని నిర్ణయించింది. అయితే అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్ధల వత్తిడి మేరకు మోడీ సర్కార్‌ దాన్ని ఆన్‌లైన్‌ ప్రకటనల సేవలకు మాత్రమే పరిమితం చేసింది. తరువాత అన్ని రకాల డిజిటల్‌ సేవలకు గాను రెండు శాతం చెల్లించాలని గత ఏడాది మార్చినెలలో 2020 ఫైనాన్స్‌ చట్టం ద్వారా నిర్ణయించింది. అలాంటి సేవలందించే సంస్ధలలో అత్యధికభాగం అమెరికాకు చెందినవే. మన దేశం విధించిన పన్ను పరిధిలోకి వివిధ దేశాలకు చెందిన 119 సంస్ధలు వస్తాయి, వీటిలో కేవలం అమెరికా నుంచే 86 ఉన్నాయి. ఈ పన్ను అంతర్జాతీయ చట్టాలకు విరుద్దం, అమెరికా వాణిజ్య సంస్ధల పట్ల వివక్ష చూపటమే అని అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాపితంగా డిజిటల్‌ ఆర్ధిక వ్యవస్ధ శరవేగంగా అభివృద్ది చెందుతున్న దశలో ఏ దేశమూ దాని ద్వారా రావాల్సిన ఆదాయాన్ని వదులుకోజాలదు. మన దేశ వినియోగదారులతో విదేశీయులు జరిపే ప్రతిలావాదేవీకి ఈ పన్ను వర్తిస్తుంది.


అమెరికా వారు ఎంత అదరగొండి బాపతు అంటే వారికి అంతర్జాతీయ చట్టాలు పట్టవు. 1974వారు చేసిన అమెరికా వాణిజ్య చట్టంలోని 301 సెక్షన్‌ ప్రకారం ఏ దేశమైనా అమెరికా వాణిజ్యానికి వ్యతిరేకమైన చర్యలు తీసుకున్నదని భావిస్తే తమ స్వంత చట్టం ద్వారా విచారణ జరుపుతారట. ఆ మేరకు చర్యలు కూడా తీసుకుంటారు. మన దేశం విధించిన డిఎస్‌టి అమెరికా, తదితర విదేశీ డిజిటల్‌ సంస్ధలకు మాత్రమే వర్తింప చేస్తూ భారతీయ సంస్దలకు మినహాయింపు ఇవ్వటం వివక్ష కిందకు వస్తుందన్నది ఒక అభ్యంతరం.ఉదాహరణకు అమెజాన్‌,గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి వాటితో పాటు అంబానీ-అదానీ కంపెనీలు డిజిటల్‌ సేవలు అందించినా ఈ చట్టం ప్రకారం అదానీ-అంబానీలు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రెండవది కొన్ని నాన్‌ డిజిటల్‌ సేవా సంస్దలు డిజిటల్‌ సేవల మాదిరి వాటిని అందచేసినా వాటికి మినహాయింపు ఇవ్వటం వివక్షా పూరితం అన్నది అమెరికా అభ్యంతరం. దీన్ని మన దేశం అంగీకరించలేదు. ఏ కంపెనీ అయినా మన దేశంలో శాశ్వత కార్యాలయం ఏర్పాటు చేసుకుంటే దానికి మన దేశంలోని పన్ను చట్టాలు వర్తిస్తాయి గనుక వాటి మీద మరొక పన్ను విధించాల్సిన అవసరం లేదన్నది మన వాదన. అమెరికా సంస్ధలు ఏవైనా మన దేశంలో శాశ్వత కార్యాలయం ఏర్పాటు చేసుకుంటే అదే సూత్రం వర్తిస్తుంది. మనకు ఎలాంటి పన్నులు చెల్లించకుండా మన సేవల ద్వారా లాభాలు పొంది వాటిని తమ దేశాలకు తరలించుకుపోవాలన్నది విదేశీ కార్పొరేట్‌ శక్తుల ఎత్తుగడ. చైనా, భారత్‌ వంటి దేశాలలో పెద్ద ఎత్తున డిజిటల్‌ సేవలను విస్తరిస్తున్నందున వాటి నుంచి పన్ను ఆదాయం రాబట్టకుండా ఆర్ధిక వ్యవస్ధలు నడవవు.
అనేక దేశాలు వివిధ రూపాలలో వస్తు, సేవల మీద పన్నులు వసూలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు చైనాలో డిఎస్‌టి లేదు. చైనాకు చెందిన అలీబాబా వంటి సంస్దలు డిజిటల్‌ సేవలు అందిస్తున్నాయి.చైనాలో ప్రస్తుతం 18 రకాల పన్నులు ఉన్నాయి. డిజిటల్‌ సేవల మీద కూడా పన్ను విధించాలనే ఆలోచన చేస్తున్నారు. అక్కడ కూడా అమలు చేస్తే ప్రస్తుతం సాగుతున్న వస్తు,సేవల వాణిజ్య యుద్దం డిజిటల్‌ సేవల వాణిజ్యానికి కూడా విస్తరించవచ్చు. మన దేశం విధించిన రెండుశాతం డిఎస్‌టికి ప్రతిగా కొన్ని భారతీయ వస్తువులపై 25శాతం దిగుమతి పన్ను విధించి బదులు తీర్చుకుంటామని మార్చినెల చివరి వారంలో అమెరికా నూతన వాణిజ్యప్రతినిధి కాథరీన్‌ తాయి బెదిరించారు.ఆస్ట్రియా, బ్రిటన్‌, ఇటలీ, టర్కీ, స్పెయిన్‌, ఇతర దేశాల మీద కూడా బస్తీమే సవాల్‌ అన్నారు. టర్కీ 7.5, ఆస్ట్రియా 5, ఇటలీ, స్పెయిన్‌, ఫ్రాన్సు మూడు శాతం చొప్పున, బ్రిటన్‌ రెండుశాతం డిఎస్‌టి విధిస్తామని ప్రకటించాయి, బ్రెజిల్‌ కూడా పన్ను విధింపు ఆలోచన చేస్తున్నది. ఒకవైపు డిజిటల్‌ సేవల పన్ను మీద ప్రపంచ ఒప్పందం చేసుకొనే అంశం గురించి చర్చించుదామని జో బైడెన్‌ మాట మాత్రంగా అంటున్నా, అది కుదిరే వరకు గతంలో ట్రంప్‌ ప్రతిపాదించిన ప్రతికూల చర్యలను ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించుకున్నట్లుగా తారు ప్రకటన నిర్దారించింది.ఆమె ప్రకటనను అమెరికా ఇంటర్నెట్‌ అసోసియేషన్‌ అభినందించింది.

మన దేశం విధించిన డిఎస్‌టి ద్వారా ఏటా 5.5 కోట్ల డాలర్ల మేరకు పన్ను ఆదాయం వస్తుందని అంచనా. అంత మొత్తానికి సమంగా మన దేశం నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై అమెరికా పన్ను విధించే ఆలోచన చేస్తున్నది. అదే గనుక జరిగితే మన రొయ్యలు, బాసుమతి బియ్యం, రంగురాళ్లు, వెదురు ఉత్పత్తులు, ఫర్నీచర్‌, బంగారు ఆభరణాలు మొదలైన వాటి మీద 25శాతం వరకు పన్నులు విధిస్తామని ప్రకటించింది. ఇంతకు ముందే మన ఎగుమతులకు ఇచ్చే రాయితీలను కొన్నింటిని ట్రంప్‌ రద్దు చేసిన విషయం తెలిసిందే. అప్పుడు ఉన్నవి పోయాయి, ఇప్పుడు కొత్తవి తగులుకుంటాయి. అయితే అమెరికా చర్యలకు ప్రతీకారంగా అమెరికాను ప్రపంచ వాణిజ్య సంస్ద కోర్టులోకి లాగవచ్చు. అమెరికా నుంచి వస్తున్న ఆడియో-వీడియో ప్రసారాల మీద పన్ను వేయవచ్చు, అమెరికా క్రెడిట్‌ కార్డు కంపెనీలు, మెసేజింగ్‌ సేవలను నిలిపివేయవచ్చు. ఆ చర్యలు తీసుకొనే దమ్మూ ధైర్యం మన 56 అంగుళాల ప్రధానికి ఉందా ? బహుశా మరొక పద్దతిలో బైడెన్‌న్ను ప్రసన్నం చేసుకొనేందుకు సౌదీ బదులు మరింతగా అమెరికా నుంచి చమురు కొంటామనే సంకేతం పంపారా ? అమెరికా వాణిజ్య ప్రతినిధి కాథరీన్‌ తాయి బెదిరింపు-ఈ సంకేతం ఒకే సమయంలో వెలువడటాన్ని ఎలా అర్దం చేసుకోవాలి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మిలిటరీ కుట్రలు – ఐరోపా,అమెరికన్ల ద్వంద్వ ప్రమాణాలు !

31 Wednesday Mar 2021

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

2021 Myanmar coup d'état, Aung San Suu Kyi, Myanmar’s Military Coup, US double standards on coups


ఎం కోటేశ్వరరావు


మార్చి 27న మన పొరుగు దేశమైన మయన్మార్‌లో దేశ వ్యాపితంగా మిలిటరీ జరిపిన కాల్పుల్లో పెద్ద సంఖ్యలో పౌరులు మరణించారు. ఆ దుశ్చర్యను యావత్‌ సమాజం ఖండిస్తోంది, నిరసిస్తోంది. గత ఏడాది నవంబరు పార్లమెంటరీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఫిబ్రవరి ఒకటవ తేదీ ఏడాది పాటు అత్యవసర పరిస్ధితిని ప్రకటించి మయన్మార్‌ మిలిటరీ అధికారాన్ని స్వాధీనం చేసుకుంది. రెండవ ప్రపంచ యుద్దంలో 76 సంవత్సరాల క్రితం జపాన్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా మార్చి 27న మయన్మార్‌ సాయుధ దళాల ప్రతిఘటన ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఆ రోజున సాయుధ దళాల దినోత్సవం జరుపుతున్నారు. అదే రోజున నిరసనకారుల మీద జరిపిన కాల్పుల్లో 90 మంది మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ సంఖ్య 114 అని, ఇంకా ఎక్కువ ఉండవచ్చని కూడా చెబుతున్నారు. ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి మొత్తం మరణించిన వారు 510 మంది అని కొందరి లెక్క. మిలిటరీ చర్యల మీద యావత్‌ ప్రపంచంలో నిరసన వ్యక్తమైంది. ఇంకా ఎంత మంది ప్రాణాలు తీస్తారు అన్న ప్రశ్న సహజంగానే తలెత్తింది. ప్రపంచంలో మిలిటరీ అధికారానికి వచ్చిన చోటల్లా మానవహక్కుల ఉల్లంఘన, ప్రాణనష్టం పెద్ద జరుగుతున్నది. అమెరికా దాని మిత్రపక్షాలుగా ఉన్న ఐరోపా, మరికొన్ని దేశాలు మయన్మార్‌పై ఆంక్షలను ప్రకటించాయి.


ఒక దేశ అంతర్గత వ్యవహారాలు, పరిణామాలపై ఎంత వరకు స్పందించాలి, ఎంత మేరకు జోక్యం చేసుకోవాలి అన్నది ఒక ఎడతెగని, ఏకీభావం కుదరని సమస్య. ఇలాంటి సమస్యలు తలెత్తిన దేశాలన్నింటి పట్ల అన్ని దేశాలూ ఒకే వైఖరి తీసుకుంటే అసలు ఇలాంటి పరిణామాలు తలెత్తవు, ఒకవేళ జరిగినా మారణకాండకు అవకాశాలు పరిమితం.ఐక్య రాజ్యసమితి వంటి సంస్ధలు ఉన్నప్పటికీ ఇలాంటి దారుణాలను నివారించలేకపోతున్నాయి. ఫిబ్రవరిలో జరిగిన పరిణామాల సమయంలోనే ఆంక్షలు విధిస్తామని అమెరికా ప్రకటించింది. గతవారాంతంలో జరిగిన పరిణామాల తరువాత దౌత్య, సంబంధాలన్నింటినీ పక్కన పెట్టింది.హింసా కాండ భయానకంగా ఉందని అధ్యక్షుడు జో బైడెన్‌ వర్ణించారు. మిలిటరీ తిరుగుబాటు అయినా, దానికి ప్రజాప్రతిఘటన అయినా అది అంతర్గత సమస్యగానే పరిగణించాల్సి ఉంది. మరో దేశం జోక్యం చేసుకొనే పరిస్ధితి తలెత్తినపుడు ఒకవేళ జోక్యం చేసుకుంటే అది సమర్దనీయమా కాదా అన్న చర్చ జరుగుతుంది. మార్చినెల 26వ తేదీన బంగ్లాదేశ్‌ విముక్తి 50సంవత్సరాల కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన మన ప్రధాని నరేంద్రమోడీ తాను రాజకీయ జీవితం ప్రారంభించినపుడు బంగ్లా విముక్తికోసం జరిగిన సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లినట్లు ప్రకటించారు.దానిలో నిజమెంత అనేది ఒక అంశమైతే పాకిస్ధాన్‌లో ఒక భాగమైన నేటి బంగ్లాదేశ్‌లో నాటి పాక్‌ నియంతల మారణకాండకు స్వస్తి పలికేందుకు మన దేశం సైనిక జోక్యం చేసుకున్నది.దాన్ని ఎందరో హర్షించినా, పాక్‌ వ్యవహారాల్లో జోక్యం చేసుకొనేందుకు పూనుకుంది అనే పేరుతో మనలను బెదిరించేందుకు ముందుగానే అమెరికన్లు తమ సప్తమ నౌకా దళాన్ని బంగాళాఖాతానికి దింపారు. అమెరికా చర్యను మాత్రం నాటి జనసంఘం, ఆర్‌ఎస్‌ఎస్‌ ఖండించలేదు. అమెరికా దాడి చేస్తే రక్షణ కోసం ఆ రోజు మన దేశం నాటి సోవియట్‌ యూనియన్‌తో రక్షణ ఒప్పందం చేసుకుంది. జనసంఘం బంగ్లాదేశ్‌కు మద్దతు పేరుతో ఆ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ సత్యాగ్రహం చేసింది తప్ప నిజానికి బంగ్లా మీద ప్రేమతో కాదు. ఏది ఏమైనా నాటి జోక్యం సరైనదే, అందువలన ప్రతి జోక్యాన్ని తప్పు పట్టలేము, అలాగని ప్రతి ప్రత్యక్ష, పరోక్ష జోక్యాన్ని సమర్ధించకూడదు. దేనికి దాన్నే విడిగా విచక్షణగా చూడాలి.


తాజా విషయాలకు వస్తే మయన్మార్‌ పరిణామాలపై అన్ని దేశాలూ ఒకే విధంగా స్పందించటం లేదు. మార్చి 27న మయన్మార్‌ మిలిటరీ దినోత్సవంలో పాల్గొని మన దేశంతో సహా ఎనిమిది దేశాల ప్రతినిధులు హాజరై సామాన్యుల రక్తంతో తడిచిన మిలిటరీ అధికారుల చేతులతో కరచాలనం చేశారు. పాకిస్ధాన్‌, రష్యా, చైనా, బంగ్లాదేశ్‌, వియత్నాం, లావోస్‌, థారులాండ్‌ ప్రతినిధులు కూడా వారిలో ఉన్నారు. మన సంఘపరివార్‌ సంస్దలు చెబుతున్నదాని ప్రకారం ఈ దేశాల్లో ప్రజాస్వామ్యం లేదు కనుక వెళ్లారని కాసేపు అనుకుందాం, మరి మన ప్రధాని మన ప్రతినిధిని ఎందుకు పంపినట్లు ? ముందే చెప్పుకున్నట్లు తాను పాక్‌ మిలిటరీ నియంత్రత్వానికి వ్యతిరేకంగా జరిగిన బంగ్లా విముక్తి ఉద్యమంలో భాగంగా సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్లాను అని చెప్పిన నరేంద్రమోడీ ప్రకటనకూ దీనికీ పొంతన కుదరటం లేదు. ఒక చోట మానవహక్కులను హరించటాన్ని ఖండిస్తారు-మరోచోట హరిస్తున్నవారితో కరచాలనం చేస్తారా ? ఏమిటీ ద్వంద్వ ప్రమాణాలు ? మయన్మార్‌ విషయంలో సత్యాగ్రహం చేయకపోయినా ఖండన ప్రకటన ఎందుకు చేయలేదంటే ఏమి చెబుతారు ? ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకొనే భారత్‌ మా రక్తంతో తడిచిన మిలిటరీతో కరచాలనం చేసేందుకు తన ప్రతినిధిని ఎందుకు పంపింది అని మయన్మార్‌ ప్రజాస్వామిక వాదులు సామాజిక మాధ్యమంలో ప్రశ్నించారు. చైనాను కూడా వారే అదే ప్రశ్న వేయవచ్చు. ఆంగ్‌సాన్‌ సూకీ నాయకత్వంలోని ఎన్‌ఎల్‌డి ఎంపీల కమిటీ కూడా భారత చర్యను ప్రశ్నించింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో మన దేశం కూడా సభ్యురాలే అయినప్పటికీ ఇంతవరకు హింసాకాండను ఖండించలేదు.ప్రస్తుతం మన దేశం భద్రతా మండలి సభ్యురాలిగా ఉండి,పొరుగుదేశం గురించి ఏమి చేసింది అన్న ప్రశ్నకు ప్రభుత్వం సమాధానమివ్వాలా లేదా ?


దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యానికి అడ్డుకట్టవేస్తామంటూ బయలు దేరిన చతుష్టయ దేశాలలో అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాలతో కలసి సాధారణ పరిస్ధితుల పునరుద్దరణ జరగాలని మన దేశం కోరింది. మరి మిగిలిన మూడూ మయన్మార్‌ మీద ఆంక్షలను విధించాలని అంటుంటే మన దేశం మౌనంగా ఉంది, అంగీకరించటం లేదు. మయన్మార్‌లో పరిణామాలు అంతర్గత విషయాలని చైనా, రష్యా బహిరంగంగానే ప్రకటించాయి. మయన్మార్‌లో మిలిటరీ చర్యలకు నిరసనగా ఆంక్షలను కఠినంగా అమలు జరుపుతామని ప్రకటించింది అమెరికా, దాని నాయకత్వంలో ఐరోపా పశ్చిమ దేశాలు అన్నది తెలిసిందే. ఆంక్షల వలన ఫలితం లేదని మన దేశం ఇప్పటికే ఈ దేశాలన్నింటికీ మన దూతల ద్వారా తెలిపింది.


మయన్మార్‌ ఎన్నికల్లో అక్రమాలు జరిగితే అక్కడి జనం వాటి సంగతి చూసుకుంటారు. మిలిటరీ జోక్యం చేసుకోవటాన్ని ఎవరూ హర్షించరు, ఖండించాల్సిందే. కానీ ఆంక్షలు విధించటానికి అమెరికా, పశ్చిమ దేశాలకు ఉన్న హక్కేమిటి ? ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసిన ప్రతి ఉదంతంలోనూ అదే విధంగా ప్రవర్తిస్తే పోనీ అదొక తీరు. అనేక దేశాల్లో వారే స్వయంగా మిలిటరీ నియంతలను ప్రోత్సహించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయించటమే కాదు, పెద్ద సంఖ్యలో పౌరుల పాణాలను బలిగొన్న రక్త చరిత్ర మన కళ్ల ముందు ఉంది. తమ ప్రయోజనాలను ప్రపంచ ప్రయోజనాలుగా చిత్రించటంలో పశ్చిమ దేశాలు, వాటికి మద్దతు ఇచ్చే మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోశాడనే పేరుతో అమెరికా తదితర దేశాలు జోక్యం చేసుకొని సద్దాంతో సహా లక్షలాది మంది సామాన్య పౌరులను హత్య చేశారు. తరువాత అబ్బే ఎలాంటి మారణాయుధాల ఆనవాళ్లు లేవని అదే అమెరికా ప్రకటించింది. యెమెన్‌లో ప్రభుత్వం-దాన్ని వ్యతిరేకించే శక్తుల మధ్య అంతర్యుద్దం జరుగుతోంది. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు అక్కడి ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నాయి. సౌదీ అరేబియాను తమ ప్రతినిధిగా నియమించి దాడులు చేయిస్తున్నాయి. వేలాది మందిని హతమార్చాయి. సిరియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉగ్రవాద మూకలను రెచ్చగొట్టి ఆయుధాలు అందించి అక్కడ అంతర్యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఈజిప్టులో 2013లో జనరల్‌ శిసి తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చివేశాడు.దానికి నిరసనగా పదవీచ్యుతుడైన అధ్యక్షుడు మహమ్మద్‌ మోర్సీ మద్దతుదారులు రాజధాని కైరోలో నిరసన తెలుపుతున్న సమయంలో మిలిటరీ విరుచుకుపడి మారణకాండ సాగించింది.ఆధునిక చరిత్రలో అత్యంత దారుణమైన వాటిలో ఒకటిగా పరిగణించబడుతున్న రబ్బా చౌక్‌ మారణకాండ గురించి తెలిసిందే. 2013 ఆగస్టు 14న రబ్బాతో పాటు మరొక ప్రాంతంలో జరిపిన కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య వెయ్యి నుంచి రెండువేల ఆరువందల వరకు ఉంది.గాయపడిన వారు కొన్నివేల మంది ఉన్నారు. నాటి నుంచి నేటి వరకు వేలాది మందిని హత్య చేశారు, తప్పుడు కేసులు పెట్టి ఉరితీశారు. డెబ్బయి వేల మంది రాజకీయ ఖైదీల కోసం 23 జైళ్లను ప్రత్యేకంగా నిర్మించిన అపర ప్రజాస్వామిక మిలిటరీ నియంతను బలపరించిది అమెరికా. అలాంటి నిరంకుశ పాలకుల చేతిలో జనం ఎంతో సుఖవంతంగా ఉన్నారంటూ టైమ్‌ వంటి పత్రికలు రాతలు రాశాయి. ఇప్పటికీ జనరల్‌ శశి నిరంకుశపాలన కింద ఈజిప్టు మగ్గిపోతూనే ఉంది. తమ తొత్తుగా ఉన్న కారణంగానే అమెరికా అన్ని రకాల మద్దతు ఇస్తోందన్నది స్పష్టం. ఎలాంటి ఆంక్షలు లేవు, ఎందుకని ? ఇది ద్వంద్వప్రమాణం కాదా ? తమకు అనుకూలంగా ఉండే మిలిటరీ పట్ల ఒక వైఖరి, లేని వారి పట్ల భిన్న వైఖరి.


అమెరికన్లు తమకు నచ్చని లేదా లొంగని పాలకులను తొలగించేందుకు చేసిన కుట్రలకు అంతే లేదు. ప్రతి ఖండంలో అలాంటి ఉదంతాలు మనకు కనిపిస్తాయి. 1946 నుంచి 2000 సంవత్సరం వరకు కనీసం 81దేశాలలో పాలకులను మార్పు చేసేందుకు అమెరికా జోక్యం చేసుకుంది. మిలిటరీ నియంతలను సమర్ధించింది, నియంతలుగా మారిన వారిని ప్రోత్సహించింది. బొలీవియాలో జరిగిన ఎన్నికల్లో ఇవో మోరెల్స్‌ విజయం సాధిస్తే అక్రమాలతో గెలిచారంటూ అక్కడి పోలీసు, మిలిటరీ తిరుగుబాటు చేసి మోరెల్స్‌, ఇతర నేతలను దేశం నుంచి బయటకు పంపారు. ఆ దుర్మార్గాన్ని అమెరికా నిస్సిగ్గుగా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు సమర్దించాయి. ఎలాంటి ఆంక్షలు విధించకపోగా అన్ని రకాలుగా సాయం చేశాయి. వెనెజులాలో ఎన్నికైన ప్రభుత్వాన్ని గుర్తించేందుకు నిరాకరించి తమ తొత్తును పాలకుడిగా గుర్తించాయి. అందువలన మయన్మార్‌లో ఆంక్షలు విధించటానికి వారికి ఉన్న అర్హత, హక్కేమిటి ? అమెరికా చర్యలను గనుక సమర్ధిస్తే లాటిన్‌ అమెరికాలో తమను వ్యతిరేకించే శక్తులు అధికారానికి వచ్చిన ప్రతి చోట ఆదే సాకుతో ప్రభుత్వాలను కూలదోస్తారు.
ప్రపంచ రాజకీయాల్లో ప్రజాస్వామ్యంతో పాటు అనేక ఇతర అంశాలూ ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. మయన్మార్‌ విషయానికి వస్తే అక్కడి నియంతల తీరుతెన్నులు ఒక పట్టాన అంతుబట్టవు. ప్రపంచ వ్యాపితంగా ప్రతి మిలిటరీ నియంత అమెరికా మద్దతు పొందిన వాడే. ఇక్కడ నియంతలను మాత్రం అమెరికా వ్యతిరేకిస్తోంది.మిలిటరీ నియమించిన మంత్రుల్లో కొంత మంది గతంలో చైనా సంస్దలలో పని చేసిన వారున్నారు కనుక చైనాకు మిలిటరీ అనుకూలం అనే విధంగా కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. మిలిటరీ పాలనకు మద్దతుగా చైనా ఇంతవరకు ఒక్క మాట మాట్లాడలేదు. 2015 ఎన్నికల్లోనే అంగ్‌సాన్‌ సూకీ నాయకత్వంలోని ఎన్‌ఎల్‌డి పార్టీ పూర్తి మెజారిటీతో అధికారానికి వచ్చింది. గడచిన ఐదు సంవత్సరాలలో ఆ ప్రభుత్వం చైనాతో సన్నిహితంగానే మెలిగింది తప్ప మరొక విధంగా వ్యవహరించలేదు. గతేడాది ఎన్నికల్లో అదే పార్టీ తిరిగి విజయం సాధించింది. మిలిటరీ తిరుగుబాటుకు కొద్ది రోజుల ముందు ఈ ఏడాది జనవరిలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ ఇ ఉన్నత స్దాయి ప్రతినిధి వర్గంతో మయన్మార్‌ పర్యటనకు వచ్చి సూకీతో భేటీ కావటం, ప్రభుత్వంతో ఆర్దిక ఒప్పందాలు చేసుకున్నారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో చైనా పెట్టుబడులు అక్కడ ఉన్నందున శాంతియుత వాతావరణం ఉండాలనే కోరుకుంటుంది తప్ప మరొకటి కాదు.


చైనా ప్రారంభించిన బిఆర్‌ఐ కార్యక్రమంలో మయన్మార్‌ కూడా ఉంది. అక్కడ మిలిటరీ అధికారాన్ని చేపట్టిన నేపధ్యంలో పశ్చిమ దేశాలు ఆంక్షలు ప్రకటించాయి. అందువలన అక్కడి నుంచి పెట్టుబడులు వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే చైనా ఒప్పందాలు ఉన్నాయి గనుక మిలిటరీ పాలకులు అయినా మరొకరైనా ఉనికికోసం పెట్టుబడుల గురించి చైనా మీద ఆధారపడక తప్పదు. ఆ కారణంగానే గతంలో చైనా సంస్దలలో పని చేసిన వారిని మంత్రులుగా నియమించి ఉండవచ్చు.చైనా కూడా మిలిటరీ చర్యలు అంతర్గత వ్యవహారమని భావిస్తున్నందున మన వైఖరిని ప్రశ్నిస్తున్నట్లుగానే బర్మీయులు చైనా వైఖరిని కూడా ప్రశ్నించవచ్చు. మయన్మార్‌ మిలిటరీ ఎప్పుడు ఎలా వ్యవహరిస్తుందో ఒక పట్టాన అంతుపట్టదు. అంగ్‌సాన్‌ సూకీ తండ్రి అంగ్‌సాన్‌ బర్మా స్వాతంత్య్రసమర యోధుడు, సోషలిస్టు, కమ్యూనిస్టు.జపాన్‌ దురాక్రమణ నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు సాయుధ దళాలను ఏర్పాటు చేసిన చరిత్ర ఉంది. అప్పటికే పక్కనే ఉన్న చైనాలో కమ్యూనిస్టులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపధ్యంలో అంగ్‌సాన్‌ నాయకత్వంలో బర్మా కూడా కమ్యూనిస్టు దేశంగా మారుతుందనే భయంతో బ్రిటీష్‌ వారు చేసిన కుట్రలో భాగంగా అంగ్‌సాన్‌ నాయకత్వంలోని మంత్రివర్గం మొత్తాన్ని హత్య చేశారు. మిలిటరీలోని కొందరు దీని వెనుక ఉన్నారు. తరువాత అధికారంలోకి వచ్చిన వారు అమెరికా, బ్రిటన్‌ ప్రోద్బలంతో చైనా చాంగ్‌కై షేక్‌ మిలిటరీకి బర్మాలో ఆశ్రయం కల్పించి చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని అస్దిరపరచేందుకు దాడులు చేయించిన చరిత్ర ఉంది. గత ఏడు దశాబ్దాలలో మయన్మార్‌లో మిలిటరీ ఆధిపత్యమే కొనసాగుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రాజ్యాంగం ప్రకారం నాలుగో వంతు మంది ఎంపీలు మిలిటరీ నియమించిన వారే, కీలకమైన శాఖల మంత్రులుగా కూడా వారే ఉంటారు. అదేమీ ప్రజాస్వామ్యయుత రాజ్యాంగం కాదు. అంగ్‌సాన్‌ సూకీకి శాంతి నోబెల్‌ బహుమతి ఇచ్చారు. ఆమె పాలనలోనే రోహింగ్యా మైనారిటీలపై దాడులు, దేశం నుంచి తరిమివేయాటాలు జరిగాయి. ఇప్పుడు ఆమే బందీ అయ్యారు. అందువలన నిరంకుశ, అప్రజాస్వామిక చర్యలకు ఎవరు పాల్పడినా ఖండించాల్సిందే. తమ విముక్తి కోసం తోడ్పడిన దేశ ప్రతినిధిగా మన ప్రధానిని బంగ్లాదేశ్‌ ఆహ్వానించింది. కానీ అదే బంగ్లాదేశ్‌ నుంచి శరణార్దులుగా, దేశ విభజన సమయంలో వచ్చిన వారి పట్ల బిజెపి అనుసరించిన వైఖరికి నిరసనగా నరేంద్రమోడీ రాకను నిరసిస్తూ బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున నిరసిస్తూ ప్రదర్శనలు, జనం మీద కాల్పులు, అనేక మంది ప్రాణాలు కోల్పోవటం తెలిసిందే. అంతిమ నిర్ణేతలు ప్రజలే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బంగ్లా విముక్తి ఉద్యమం : నగుబాట్ల పాలైన నరేంద్రమోడీ సత్యాగ్రహం !

28 Sunday Mar 2021

Posted by raomk in Communalism, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Bangladesh liberation struggle, Jan Sangh, Narendra Modi Satayagrah claim


ఎం కోటేశ్వరరావు


బంగ్లాదేశ్‌ విముక్తి జరిగి యాభై సంవత్సరాలు గడచిన సందర్భంగా అతిధిగా ఢాకా వెళ్లిన మన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తాను బంగ్లాదేశ్‌ విముక్తి కోసం 1971లో సత్యాగ్రహం చేసి జైలుకు సైతం వెళ్లానని చెప్పారు. తనతో పాటు తన మిత్రులు కూడా ఉన్నారన్నారు. ఈ ప్రకటన తీవ్ర విమర్శలకు దారి తీసింది. ప్రధాని అబద్దాలు చెబుతున్నారని కాంగ్రెస్‌ మండిపడింది. యాభై సంవత్సరాల నాడు జరిగిన విషయం- అది నిజమో కాదో తెలుసుకొనేందుకు ఇప్పుడున్నన్ని ఆధారాలు అప్పుడు లేవు. ప్రధాని అంతటి పెద్దాయన చెప్పారు గనుక అది పచ్చి అబద్దమని ఎవరైనా అంటే దాన్ని తేలికగా తీసిపారవేయలేము- అలాగని వాస్తవం అని కూడా చెప్పలేము. అప్పుడేం చేయాలి ? ఉన్న ఆధారాలను బట్టి ఏది నిజం ఏది అబద్దం అనే అంశాలను పాఠకుల ముందు ఉంచితే వారే ఒక నిర్ణయానికి రావచ్చు. ఈ ప్రయత్నం అదే ! నరేంద్రమోడీ స్వయంగా నోరువిప్పితే తప్ప అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకవు.


ప్రధాని ఏమి చెప్పారు ? ” అప్పుడు నాకు 20-22 సంవత్సరాలుంటాయి. బంగ్లాదేశ్‌ స్వాతంత్య్రం కోసం నేను, నా మిత్రులు సత్యాగ్రహం చేశాము, జైలుకు కూడా వెళ్లాము ” అని చెప్పారు. ఎన్నికల కమిషన్‌కు స్వయంగా ఇచ్చిన వివరాల ప్రకారం నరేంద్రమోడీ 1950 సెప్టెంబరు 17న జన్మించారు. బంగ్లా విముక్తి ఉద్యమ సమయంలో జనసంఘం 1971 అగస్టు నెలలో సత్యాగ్రహం నిర్వహించింది. అంటే అప్పటికి మోడీ వయస్సు 21 సంవత్సరాలు. ఇక్కడ తలెత్తే ప్రశ్న ఏమిటంటే నరేంద్రమోడీ ఆ సమయంలో ఏమి చేస్తున్నారు ? తాను ఫలానా కాలేజీలో ఫలానా సంవత్సరంలో చదివాను అని నరేంద్రమోడీ ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. బిజెపి అనుకూల పత్రిక జాగరణ జోష్‌లో 2020 సెప్టెంబరు 17న షిఖా గోయెల్‌ రాసిన వ్యాసం ప్రకారం 1967లో గుజరాత్‌ ఎస్‌ఎస్‌సి బోర్డు నుంచి పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. పదిహేడవ ఏట తనకు వివాహం వద్దంటూ ఇల్లు వదలి రెండు సంవత్సరాలు దేశంలో వివిధ ఆశ్రమాలను సందర్శించారు. తరువాత వచ్చి అహమ్మదాబాద్‌లోని బస్టాండులో ఒక టీ దుకాణంలో పని చేశారు. 1970 ప్రారంభంలో ఏబివిపి శాఖను ఏర్పాటు చేశారు.1971లో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా చేరారు. తరువాత ఢిల్లీ విశ్వవిద్యాలయం దూరవిద్య కోర్సు ద్వారా రాజకీయ శాస్త్రంలో బిఏ డిగ్రీ పొందారు.1983లో గుజరాత్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎంఎ పట్టా తీసుకున్నారు. స్కూలు విద్య తరువాత రెండేండ్లు అక్కడా ఇక్కడా తిరిగిన వ్యక్తి ఏ కాలేజీలో చేరకుండా ఏబివిపి విద్యార్ధి సంఘాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ? వివాహం వద్దంటూ ఇల్లు వదలిన మోడీ భార్య అని స్వయంగా పేర్కొన్న యశోదాబెన్‌తో వివాహం ఎప్పుడు జరిగింది ?


అసలు మోడీ గారి డిగ్రీ పట్టా గురించి పెద్ద వివాదమే నడిచింది. ఆ వివరాల వెల్లడి దేశ భద్రతకు ముప్పు అన్నట్లుగా సమాచారహక్కు కింద అడిగిన వారికి వివరాలు ఇవ్వలేదు. వివాదం ముదరటంతో ఢిల్లీ విశ్వవిద్యాలయం ఇచ్చిన డిగ్రీ పట్టా అంటూ ఒకదానిని చూపారు. పూర్తి వివరాలను వెల్లడించేందుకు ఢిల్లీ విశ్వవిద్యాలయం కూడా తిరస్కరించింది. ఎట్టకేలకు 1978లో నరేంద్రమోడీ పరీక్షలను పూర్తి చేశారని, 1979లో డిగ్రీ పొందారంటూ వెల్లడించింది. అదే సమయంలో డిగ్రీపరీక్ష రాసేందుకు నమోదు చేసుకున్న సంఖ్య ” సిసి 594-74 అని పరీక్ష హాల్‌ టికెట్‌ నంబరు 16594 ” అని వెల్లడించింది. అంటే 1974లో దూరవిద్య ద్వారా డిగ్రీకోసం నమోదు చేసుకొని మూడు సంవత్సరాల పరీక్షలను ఒకేసారి రాసి పాసయ్యారని అని అనుకోవాలి. మిత్రులతో కలసి బంగ్లాదేశ్‌ కోసం సత్యాగ్రహం చేశాను, జైలుకు వెళ్లాను అని చెప్పారు. వివరాలు నమోదు చేయకుండా పోలీసు లాకప్‌లో ఉన్నానంటే నమ్మవచ్చు, కానీ జైలులో ఒక రోజు కూడా ఉంచరు. ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు, ఏ జైల్లో ఉన్నారో వివరాలు వెల్లడి అయ్యేంత వరకు దాని గురించి చెప్పే మాటలను నమ్మటం ఎలా ?


పశ్చిమ దేశాల్లో ప్రధానులు, దేశాధ్యక్షుల మీద బూతులు ప్రయోగించినా అక్కడ పెద్దగా పట్టించుకోరు. మన దేశంలో అలాంటి ప్రయోగం మీద తమకు మాత్రమే హక్కు ఉందనే శీలవంతులు ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ప్రభుత్వ విధానాలను విమర్శించటమే దేశద్రోహం అంటున్న ఈ రోజుల్లో దేశ ప్రధాని నరేంద్రమోడీ మీద జోకులు పేలిస్తే ఏమౌతుందో నెటిజన్లు ఒక్కసారి ఆలోచించుకోవాలేమో. బంగ్లా విముక్తి ఉద్యమానికి మద్దతుగా సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్లాను అని చెప్పిన మోడీగారి మీద సామాజిక మాధ్యమంలో పేలిన జోకులు ఎలా ఉన్నాయో చూడండి.
” 1969లో చంద్రుడిపై కాలుమోపిన నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ బృందంలో రహస్యంగా దూరి మోడీ గారు కూడా చంద్రుడి మీద కాలుమోపారు. బంగ్లాదేశ్‌ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని అరెస్టు కావటానికి ముందే పందొమ్మిదేండ్ల వయస్సులోనే మోడీ ఈ నాసా కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలికట్‌ స్మార్ట్‌ సిటీలో కాలుపెట్టిన వాస్కోడాగామాను స్వాగతించింది నరేంద్రమోడీ గారే. దేశ తొలి సాధారణ ఎన్నికలు 1951లోనే నరేంద్రమోడీ గారు ఓటు వేశారు. ఏడాది వయస్సులో ఆయన వేసిన ఓటు ప్రధానిగా జవహర్‌లాల్‌ ఎన్నికలో కీలకపాత్ర పోషించింది. 1942లో తన ఆరాధ్య వ్యక్తితో కాన్‌సెంట్రేషన్‌ కాంపుల గురించి చర్చిస్తున్నప్పటి చిత్రం. మోడీ తన ఎంఏ చివరి పరీక్షా పత్రాన్ని రాస్తున్న దృశ్యం ” ఇలా ఉన్నాయి. వీటన్నింటి సారం ఒక్కటే నరేంద్రమోడీ సత్యాగ్రహం గురించి అతిశయోక్తులు చెప్పారని ఎద్దేవా చేయటమే !


అశోకా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌, చరిత్రకారుడు అయిన శ్రీనాధ్‌ రాఘవన్‌ మాట్లాడుతూ మన దేశంలో ఎవరైనా బంగ్లాదేశ్‌ స్వాతంత్య్రం కోసం సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్లాననటం హాస్యాస్పదం అన్నారు. అయితే నరేంద్రమోడీ జైలుకు వెళ్లానని చెప్పింది వాస్తవమేనంటూ సంఘపరివార్‌కు చెందిన వారు సమర్ధిస్తున్నారు.ఒక దేశంలోని మరో దేశంలో జరిగే ఉద్యమాలకు మద్దతు ప్రకటించటం సహజం. కానీ సత్యాగ్రహం చేసి అరెస్టయ్యామని చెప్పటమే అతిశయోక్తి. 1971లో బంగ్లాదేశ్‌లో విముక్తి ఉద్యమం ప్రారంభమైన సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌, దాని రాజకీయ విభాగమైన జనసంఘం మద్దతు ఇచ్చాయి. ఒక దేశంలో జరుగుతున్న పరిణామాల మీద వెంటనే స్పందిస్తే లేదా ప్రభుత్వ వ్యతిరేక శక్తులకు మద్దతు ఇస్తే రాబోయే పర్యవసానాల గురించి ప్రభుత్వం తటపటాయించింది, అది సహజం. అదే ప్రభుత్వం అనువైన సమయం రాగానే మిలిటరీ జోక్యం చేసుకున్నది. అమెరికా బెదిరింపులను కూడా లెక్క చేయలేదు. పక్కనే ఉన్న మయన్మార్‌లో మిలిటరీ అణచివేతలకు పాల్పడం ప్రారంభమై నెలలు గడుస్తున్నా మోడీ సర్కార్‌ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయకపోవటానికి కారణం ఏమిటి ? పర్యవసానాల గురించి తటపటాయింపే.


పక్కనే ఉన్న మయన్మార్‌లో మిలిటరీ పాలకులు దశాబ్దాలుగా అక్కడ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినా అణచివేతకు పాల్పడినా, తాజాగా పార్లమెంట్‌, ప్రభుత్వాన్ని రద్దు చేసి జనాన్ని అణచివేస్తున్నా కనీసం జనానికి సానుభూతి మిలిటరీ చర్యలను తప్పు పట్ట లేదు బిజెపి. మరోవైపు ఉన్న శ్రీలంకలో ప్రత్యేక రాజ్యం కోసం ఆయుధాలు పట్టిన తమిళులకు మద్దతుగా బిజెపి ఎన్నడైనా సత్యాగ్రహం చేసిందా ? నేపాల్లో రాజరికానికి వ్యతిరేకంగా జనం ఉద్యమించినపుడు బిజెపి వైఖరి ఏమిటి ? అనేక దేశాల్లో జనసంఘ హయాంలో, బిజెపి హయాంలో విముక్తి పోరాటాలు జరిగాయి. వాటిలో ఏ ఒక్కదానికైనా మద్దతు ప్రకటించిన దాఖలాలు ఉన్నాయా ? అంతెందుకు ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం పాలస్తీనా నుంచి కొన్ని ప్రాంతాలను విడదీసి ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేశారు. అది వెంటనే అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల మద్దతుతో పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించుకొని ఇప్పటికీ ఖాళీ చేసేందుకు మొరాయిస్తోంది. పాలస్తీనా అరబ్బులకు అసలు మాత్రదేశాన్నే లేకుండా చేశారు. వారు నివశించే ప్రాంతాలను సైనికశిబిరాలుగా మార్చి వేసిన దుర్మార్గాన్ని చూస్తున్నాము. అలాంటి ఇజ్రాయెల్‌తో ఏ దేశమూ సంబంధాలు పెట్టుకోకుండా నిరసన తెలుపుతుంటే మన బిజెపి సర్కార్‌ మిత్ర దేశంగా పరిగణిస్తున్నది. ఇదేమి ద్వంద్వ వైఖరి ? అలాంటి పార్టీ బంగ్లాదేశ్‌ విముక్తి కోసం ఉద్యమించి జైలుకు కూడా వెళ్లామని చెప్పుకుంటున్నదంటే దాని అసలు లక్ష్యం ఏమిటి ? నిజం ఏమిటి ?

బంగ్లాదేశ్‌ విముక్తి విషయంలో జనసంఫ్‌ు మద్దతులో చిత్తశుద్ది లేదు. బంగ్లా విముక్తి కంటే పాకిస్దాన్‌ రెండు ముక్కలు అవుతున్నదనే అంశానికే అది ప్రాధాన్యత ఇచ్చి అమెరికాను సంతృప్తి పరచేందుకు, నాటి సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా సత్యాగ్రహం వంటి హడావుడి చేసింది అన్నది స్పష్టం. నాడు బంగ్లాదేశీయులను ఊచకోత కోసిన పాక్‌ మిలిటరీకి మద్దతుగా అమెరికా తన సప్తమ నౌకాదళాన్ని బంగాళా ఖాతానికి తరలించిన అమెరికా దుర్మార్గాన్ని ఖండించిన పాపాన పోలేదు. ఒక స్వతంత్ర దేశ వ్యవహారాల్లో మరొక దేశం జోక్యం చేసుకోవాలంటే దానికి ఎంతో కసరత్తు అవసరం. అక్కడ అంతర్యుద్దం జరుగుతున్న సమయంలో ఏక్షణంలో అయినా జోక్యం చేసుకోవాల్సిన పరిస్ధితి తలెత్తవచ్చని, అందువలన దాని గురించి బహిరంగంగా చర్చించవద్దని,దాని వలన జరిగే లాభం కంటే హానే ఎక్కువ అని నాటి ప్రధాని ఇందిరాగాంధీ జనసంఘంతో సహా ప్రతిపక్ష పార్టీల నేతల సమావేశంలో చెప్పారు. అమెరికా సప్తమ నౌకాదళాన్ని దించిన నేపధ్యంలో సోవియట్‌ యూనియన్‌తో రక్షణ ఒప్పందాన్ని చేసుకున్నారు. బంగ్లావిముక్తి ఉద్యమానికి బహిరంగ మద్దతు ప్రకటనలు చేయవద్దన్న సూచనను రాజకీయ ప్రయోజనం కోసం జనసంఘం ఉల్లంఘించింది. అది చేసిన సత్యాగ్రం బంగ్లాకు విముక్తి కంటే సోవియట్‌తో చేసుకున్న ఒప్పందాన్ని ఉద్దేశించింది అన్నది అసలు విషయం. బంగ్లాదేశ్‌ విముక్తిని గుర్తించకుండా ఉండేందుకే కుట్రతో మన ప్రభుత్వం సోవియట్‌తో రక్షణ ఒప్పందం చేసుకుందని ఢిల్లీలో జరిగిన సత్యాగ్రహ సభలో అతల్‌బిహారీ వాజ్‌పాయి ఉపన్యాసం చేశారని 1971 ఆగస్టు 12న టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక వార్తలో రాసింది. అందువలన బంగ్లాదేశ్‌కు మద్దతు పేరుతో సత్యాగ్రహం అని చెప్పినా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగింది కనుక కొంత మందిని అరెస్టు చేసి ఉండవచ్చు తప్ప బంగ్లాకు మద్దతు కారణం అయితే కాదు. దానిలో నరేంద్రమోడీ పాల్గొన్నట్లు, అరెస్టయి జైలుకు పోయినట్లు ఆధారాలు అయితే లేవు.


దేశ విభజన సమయంలోనూ, బంగ్లా విముక్తి పోరాటం సమయంలో అనేక మంది అక్కడి నుంచి కాందిశీకులుగా ప్రాణాలు అరచేత పట్టుకు వచ్చిన వారిని అక్రమ చొరబాటుదారులంటూ తరువాత కాలంలో అసోం, బెంగాల్‌, ఈశాన్య రాష్ట్రాలలో పెద్ద రచ్చ చేసి మత ప్రాతిపదికన విద్వేషాలు రెచ్చగొట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు నడిపింది సంఘపరివార్‌ శక్తులు, వాటి రాజకీయ రూపం బిజెపి అన్నది బహిరంగ రహస్యం. ఇప్పటికీ దాన్ని ఎన్నికల అస్త్రంగా వినియోగిస్తున్నారు. అందుకే మోడీ పర్యటనకు నిరసనగా అక్కడి మతశక్తులతో పాటు పురోగామి వాదులు కూడా నిరసన వ్యక్తం చేశారు. మోడీ రాకను హర్షించిన వారెవరూ లేరు.


పెద్దల మాటను గౌరవించాలి. నిజమే, ఒక నాటికలో (బహుశా ‘ పంజా ‘ అనుకుంటున్నా) ఒక పాత్రధారి నేనూ స్వాతంత్య్ర సమర యోధుడనే అని చెప్పుకుంటాడు. అదెలా అంటే కొండా వెంకటప్పయ్య జెండా ఎగురవేస్తుంటే చూశా అంటాడు. అలాంటి పెద్దలను కాదు. పెద్దలనే వారు గౌరవ ప్రదంగా వ్యవహరించినపుడే మన్నించాలి. పెద్దలం కదా అని ఏది బడితే అది చెబితే నమ్మే రోజులు కావివి. కనుక పెద్దలూ మా రోజుల్లో లేదా ఆరోజుల్లో అని చెప్పేటపుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ నేపధ్యంలోనే తన ప్రకటన మీద తలెత్తిన వివాదానికి ముగింపు పలకాల్సింది కూడా నరేంద్రమోడీయే. అది వ్యక్తిగతంగా ఆయనకే గౌరవం. తాను, తనతో పాటు ఉన్న మిత్రులు ఏ తేదీల్లో ఏ జైల్లో ఉన్నారో ఆధారాలు వెల్లడించటం కష్టమేమీ కాదు. దేశభద్రతకు వచ్చే ముప్పు అసలే ఉండదు. లేనట్లయితే ఆయన డిగ్రీ వివాదం మాదిరి దేశవ్యాపితంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా మచ్చగా మిగిలిపోతుంది. మీడియాలో దీని గురించి జరిగే చర్చ, సమాచారం సరిహద్దులు దాటకుండా ఉంటుందా ? ట్విటరైట్లను, ఫేస్‌బుకర్లను ఆపగలమా ? ఎవరి గడ్డిని వారికే తినిపిస్తారు !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d