• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: INDIA

చైనాపై పోప్‌, ఇస్లామిక్‌ దేశాల మౌనం ఎందుకు ?

02 Thursday Jan 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

China, Islam, Islam in China, Islamic Countries, Pope Francis, Religion in China

Image result for pope  china
ఎం కోటేశ్వరరావు
ఇటీవల చైనా గురించి మీడియాలో వస్తున్న అనేక అంశాలు చదువరులు, వీక్షకులను గందరగోళపరుస్తున్నాయి. వక్రీకరణలు, అవాస్తవాలను విశ్లేషణలు, వార్తల పేరుతో కుమ్మరిస్తున్నారు. వాటిలో కొన్నింటి మంచి చెడ్డల గురించి చూద్దాం. క్రైస్తవులను, ముస్లింలను అణిచి వేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై పోప్‌, ఇస్లామిక్‌ దేశాలు ఎందుకు మౌనం పాటిస్తున్నాయి అనే ప్రశ ్నలు అనేక మందిలో తలెత్తుతున్నాయి. జర్మనీలో యూదులను లక్ష్యంగా చేసుకున్న హిట్లర్‌ మాదిరి మన దేశంలో ముస్లింలు, క్రైస్తవ మైనారిటీలపై ప్రచార, భౌతిక దాడులకు పాల్పడుతున్న ఫాసిస్టు తరహా పరివార్‌ పట్ల మన దేశంలోని మీడియా మౌనం వహించటం లేదా సమర్దించటాన్ని చూస్తున్నాము.
‘ బైబిల్‌ మరియు ఖురాన్‌లను తిరగరాసేందుకు చైనా పూనుకుంది ‘ ఇది ఇటీవలి ముఖ్యమైన వార్త !
అంతేనా 2018లో చైనాలో బైబిల్‌ అమ్మకాలను నిషేధిస్తున్నారు అని ప్రచారం జరిగింది.చట్టబద్దమైన మార్గాల ద్వారా బైబిల్‌ లేదా ఖురాన్‌ లేదా ఏ మత గ్రంధాన్ని అయినా చైనీయులు తెప్పించుకోవచ్చు. అందుకు ప్రభుత్వ అనుమతులు తీసుకోవాల్సి ఉంది, అది అన్ని దేశాలకు వర్తించే నిబంధనే. చైనా సర్కార్‌ దగ్గర నమోదు గానీ లేదా అనుమతి లేని పుస్తకాలు, పత్రికల మీద అక్కడి ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. దాన్ని మతాల మీద దాడిగా చిత్రించారు. చైనాలో ఉన్న నిబంధనల ప్రకార బైబిళ్లను చర్చ్‌ల ద్వారానే తెప్పించుకోవాలి లేదా కొనుగోలు చేయాలి, పుస్తకాల దుకాణాల్లో అనుమతించరు. అక్కడి సామాజిక యాజమాన్య వ్యవస్ద ప్రకారం ఒక పుస్తకంగా ఒక్క బైబికే కాదు ఏ మత గ్రంధానికి పవిత్రతను ఆపాదించకూడదు. పశ్చిమ దేశాలను చైనా అనుకరించకపోతే దాన్ని మత వ్యతిరేకం, అణచివేతగా చిత్రిస్తున్నారు.

చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చి ఏడుపదులు దాటింది. మావో సేటుంగ్‌ నాయకత్వంలో కమ్యూనిస్టులు అధికారంలోకి రాగానే క్రైస్తవ మత చర్చీలు, ఇస్లామిక్‌ మసీదులను కూల్చివేశారు, మతాలను నాశనం చేశారని ప్రచారం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ఏదో ఒక ప్రచారం జరుగుతూనే ఉంది. అదే నిజమైతే ఒక్కరూ ఇప్పటికి మిగిలి ఉండేవారు కాదు. 1953లో హాన్స్‌ జాతీయులు 93.94శాతంగా మిగిలిన 6.06శాతం బౌద్ద, క్రైస్తవ, ముస్లిం తదితర మైనారిటీలు ఉన్నారు. అదే 2010 లెక్కల ప్రకారం 91.40, 8.60శాతాలుగా ఉన్నారు. అంటే మైనారిటీలు పెరిగారు. వీరిలో ముస్లిం యుఘీర్‌లు 0.62 నుంచి 0.76శాతానికి పెరిగారు. దీనికి కారణం మైనారిటీలకు జనాభా నియంత్రణ నిబంధనను వర్తింప చేయలేదు. మన దేశంలో బాబరీ మసీదును కూల్చివేసిన మతోన్మాదుల చర్యను ప్రపంచమంతా చూసింది గానీ, చైనా, రష్యా(కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నపుడు) ఇతర దేశాల్లో కమ్యూనిస్టులు ప్రార్ధనా స్ధలాలను కూల్చివేసిన దాఖలాలు లేవు. అన్నీ సురక్షితంగానే ఉన్నాయి. రష్యాలో కమ్యూనిస్టుల అధికారం ముగిసిన తరువాత అనేక మంది అక్కడి చర్చ్‌లను చూసి ప్రభువా కమ్యూనిస్టులు చర్చ్‌లను కూల్చివేశారని చేసిన తప్పుడు ప్రచారాన్ని నమ్మి వ్యతిరేకించినందుకు మన్నించు అని ప్రార్ధించారంటే అతిశయోక్తి కాదు. కమ్యూనిస్టులు మత రాజకీయాలు చేయరు, మతాన్ని రాజకీయాల్లో అనుమతించరు.

Image result for famous churches in china
బైబిల్‌ విషయానికి వస్తే పాత నిబంధన, కొత్త నిబంధన అని ఆ మతాలకు చెందిన వారే రాసుకున్నారు. వాటిలో అనేక అంశాలను చొప్పించారని అనేక మంది విమర్శిస్తారు. వాటిని పక్కన పెడదాం. బైబిల్‌ రాసిన లేదా దేవుడు లేదా దేవుని కుమారుడు, దేవదూతలు ప్రవచించిన సమయానికి ప్రపంచంలో ఎక్కడా కమ్యూనిజం, దాని సిద్దాంతాల జాడలేదు. సోషలిజం, కమ్యూనిజాలకు క్రైస్తవం వ్యతిరేకం అని బైబిల్‌ లేదా ఖురాన్‌ లేదా మరొక మత గ్రంధంలో ఉన్న ఉన్న అంశాల మీద రాస్తున్న లేదా చేస్తున్న తప్పుడు భాష్యాలు పుంఖాను పుంఖాలుగా ఉన్నాయి. అలాంటి తప్పుడు వ్యాఖ్యానాలతో సోషలిజానికి వ్యతిరేకంగా జనాలను రెచ్చగొడుతూ ఉంటే అది తమ రాజ్యాంగానికి వ్యతిరేకం కనుక వాటి వ్యాప్తిని అరికట్టేందుకు చైనా చర్యలు తీసుకోవచ్చు. లేదా మత గ్రంధాల్లో ఉన్న అంశాలు కొన్ని సోషలిజం, కమ్యూనిజాలకు ఎలా వ్యతిరేకం కావో, సానుకూలమో వివరించి జనాల్లో ఉన్న పొరపాటు అవగాహనలను తొలగించేందుకు తమ రాజ్యాంగ లక్ష్యాలకు అనుకూలమైన భాష్యంతో పుస్తకాలను రాయాలని, చైనా లక్షణాలతో కూడిన మత వ్యవస్ధను నిర్మించాలని అక్కడి ప్రభుత్వం చెప్పిందే తప్ప, వాటిని తిరిగి రాయటం అంటూ ఎక్కడా ఉండదు.
మారుతున్న కాలానికి అనుగుణంగా లేని మత పరమైన గ్రంధాలకు సమగ్ర భాష్యాలు రాయాలని, కమ్యూనిస్టు పార్టీ సిద్దాంతాలకు వ్యతిరేకంగా ఉన్న వాటిని నిరోధించాలని గతేడాది నవంబరులో జరిగిన చైనా మత వ్యవహారాల కమిటీ సమావేశంలో చెప్పారు తప్ప బైబిల్‌, ఖురాన్‌ అని ఎక్కడా చెప్పలేదు. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాన్ని జోడించి చెప్పినట్లుగా పశ్చిమ దేశాల మీడియా దానికి మత గ్రంధాల పేర్లను జోడించి కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి ఉపయోగించుకుంది. ఈ సమావేశంలో వివిధ మతాలకు చెందిన వారు, నిపుణులు, ప్రజాప్రతినిధులు 16 మంది పాల్గొన్నారు. మతాలను, వ్యక్తిగత మత విశ్వాసాలను చైనా కమ్యూనిస్టు పార్టీ అనుమతిస్తుంది తప్ప మతం, విశ్వాసాల ముసుగులో రాజ్యాంగ పరమైన సోషలిజం, కమ్యూనిస్టు, మత రహిత లక్ష్యాలను వ్యతిరేకించే శక్తులను చైనాలో అనుమతించరన్నది స్పష్టం. మన దేశంలో మత వి శ్వాసాలు కలిగి ఉన్నప్పటికీ కమ్యూనిస్టు పార్టీలలో సభ్యులుగా చేరవచ్చు. అలాంటి వారు అనర్హులు అనే నిబంధనలు లేవు.

Image result for why pope and islamic countries silence on china
” కైస్తవులను చైనా అణచివేస్తోంది, చర్చీలను కూల్చివేస్తోంది”
అంతే కాదు వాటికన్‌ను గుర్తించటం లేదు, వాటికన్‌ నియమించిన వారిని అరెస్టు చేస్తోంది, బిషప్పులను స్వంతంగా నియమించుకుంటోంది.ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారంలో ఇదొకటి. ముందుగా తెలుసుకోవాల్సిన అంశం. వాటికన్‌ ఇంతవరకు కమ్యూనిస్టు చైనాను ఒక దేశంగానే గుర్తించలేదు. ఇప్పటికీ దాని దృష్టిలో చైనా అంటే తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ మాత్రమే. కమ్యూనిస్టు పాలన ఏర్పడిన తరువాత ఒక్క పోప్‌ కూడా చైనా సందర్శనకు రాలేదు. అందువలన వాటికన్‌ అధికారాన్ని చైనా గుర్తించే ప్రశ్నే ఉదయించదు. రెండవది, చైనాలో ఉన్న క్రైస్తవులు తమ బిషప్పులను తామే నియమించుకుంటున్నారు అంటే అక్కడ క్రైస్తవులను అణచివేస్తే బిషప్పులు దేనికి ? అంటే అణచివేత కూడా వాస్తవం కాదు. మరి ఎవరిని అరెస్టు చేస్తున్నారు? చైనా సర్కార్‌ అనుమతి లేదా గుర్తింపు లేకుండా రహస్యంగా చర్చ్‌లను ఏర్పాటు చేస్తూ, రహస్య, చైనా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నవారిని అరెస్టు చేస్తున్నారు. దేశవ్యతిరేక శక్తులను ఏ దేశంలో అయినా అదే చేస్తారు కదా ! సామాన్యులకు ఏసుక్రీస్తును ఆరాధించటానికి స్వేచ్చ ముఖ్యమా లేక వాటికన్‌ పెద్దలు చెప్పినట్లుగా చేయటం ముఖ్యమా ? ప్రపంచంలో అనేక దేశాలలో సాగుతున్న దోపీడీని, నియంతలను వాటికన్‌ లేదా క్రైస్తవం వ్యతిరేకించటం లేదు, సమసమాజం కోరుతున్న కమ్యూనిస్టులను ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. చైనాతో సంబంధాలు పెట్టుకోవాలని వాటికన్‌ పెద్దలు కొందరికి ఉన్నా, అమెరికా కనుసన్నలలో పని చేసే కమ్యూనిస్టు వ్యతిరేక చైనా జాతీయుడైన జోసెఫ్‌ జెన్‌ వంటి వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చివరికి వాటికన్‌ పెద్దలు కూడా రాజీపడి లొంగిపోతున్నారని, చైనాను సంతృప్తిపరచేందుకే ఎల్ల వేళలా పని చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశాడు. ఇంతకాలం చైనాలో క్రైస్తవులను అణచివేస్తున్నారని చేసిన ప్రచారం వాటికన్‌కు తెలియంది కాదు. వాటి వెనుక ఉన్న నిజానిజాలు కూడా తెలుసు. అందువల్లనే ఎన్ని విమర్శలు వచ్చినా, ఎందరు వ్యతిరేకించినప్పటికీ 2018లో పోప్‌ ఫ్రాన్సిస్‌ చైనాతో ఒప్పందం చేసుకున్నారు. చైనా నియమించిన బిషప్పులను కూడా గుర్తించారు. ఒప్పందం చేసుకుంటే ఇంతకాలం చైనా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ రహస్యంగా చర్చ్‌లను నిర్వహించిన నిజమైన విశ్వాసులను మోసం చేసినట్లే అని జోసెఫ్‌ జెన్‌ అన్నాడు. ఒప్పందం ప్రకారం రహస్యంగా ఉన్న చర్చ్‌లను వాటికన్‌ ప్రోత్సహించకూడదు.

Image result for why pope and islamic countries silence on china
” ముస్లింలను అణచివేస్తున్నారు, నిర్బంధ శిబిరాల్లో పెడుతున్నారు ”
చైనాలోని గ్జిన్‌జియాంగ్‌ రాష్ట్ర జనాభా రెండు కోట్లు. అది చైనా వాయువ్య సరిహద్దులో ఉంది. ఒక స్వయం పాలిత ప్రాంత హౌదా కలిగి ఉంది. ఒక వైపు మంగోలియా, కిర్కిజిస్తాన్‌, కజకస్తాన్‌, తజికిస్తాన్‌, రష్యా, ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్ధాన్‌,భారత్‌ సరిహద్దులుగా ఉంది. అయితే ఆక్సారు చిన్‌గా పిలుస్తూ మనది అని చెప్పుకుంటున్న ప్రాంతం గ్జిన్‌జియాంగ్‌లో భాగమైన తమది అని చైనా చెబుతోంది, అది ప్రస్తుతం చైనా అధీనంలో ఉన్న భారత-చైనా వివాదాస్పద ప్రాంతాలలో ఒకటి. ముస్లింలలో ఒక పెద్ద తెగ యుఘిర్‌కు చెందిన జనాభా దాదాపు 46శాతం ఉండటంతో దానిని యుఘిర్‌ రాష్ట్రం అని కూడా పిలుస్తారు.నలభైశాతం మంది హాన్‌ చైనా జాతీయులు, మిగిలిన వారు ఇతర ముస్లిం తెగలకు చెందిన వారున్నారు. కమ్యూనిస్టులు అధికారానికి రాక ముందు ఆ ప్రాంతంలోని యుద్ద ప్రభువులు నాటి కొమింటాంగ్‌ చైనా పాలకులకు వ్యతిరేకంగా సోవియట్‌ మద్దతుతో స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారని చెబుతారు గానీ స్వతంత్ర దేశంగా వ్యవహరించిన దాఖలాలు లేవు. కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత చైనాలో అంతర్భాగంగానే ఉంది. సోవియట్‌ కూలిపోయిన తరువాత ఇరుగు పొరుగు రాజ్యాలు, ఇతర విదేశీ జోక్యంతో కొంత మంది తప్పుదారి పట్టిన యుఘిర్‌లు కమ్యూనిస్టులు అధికారానికి రాకముందు కొంత కాలం తాము స్వతంత్ర దేశంగా ఉన్నామని, హాన్‌ జాతీయులు తమ మీద పెత్తనం చేస్తున్నారని, తమకు స్వాతంత్య్రం ఇవ్వాలంటూ వేర్పాటు వాదాన్ని ముందుకు తెచ్చారు. కొన్ని ఉగ్రవాద చర్యలకు సైతం పాల్పడ్డారు. మనకు కాశ్మీర్‌ ఎలాంటి కీలక ప్రాంతమో చైనాకు అది అంత ముఖ్యమైనది. ఈ నేపధ్యంలో చైనా ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యల గురించి చిలవలు పలవలుగా చిత్రిస్తున్నారు. ముస్లింలను అణచివేసేందుకు తీసుకున్న నిర్ణయాల పత్రాలు బయట పడ్డాయని కొన్ని పత్రికలు కథలు రాశాయి.
చైనా లక్షణాలతో సోషలిజాన్ని నిర్మిస్తామని చైనా కమ్యూనిస్టు పార్టీ చెబుతున్నది. దీనిని కొంత మంది కమ్యూనిస్టులే అంగీకరించటం లేదు. ఆ పేరుతో అక్కడ పెట్టుబడిదారీ వ్యవస్దను నిర్మిస్తున్నారనే ప్రచారం చేస్తున్నారు కూడా. నూరు పూవులు పూయనివ్వండి, వేయి ఆలోచనలను వికసించనివ్వండి అన్నట్లుగా ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలను వారిని వ్యక్తం చేసుకోనివ్వటం తప్ప మరొక మార్గం లేదు. పెట్టుబడిదారీ విధానం అన్ని దేశాల్లో ఒకే మూసగా అభివృద్ది చెందలేదు. అలాగే సోషలిజాన్ని కూడా అభివృద్ధి చేయలేమని, ఏ దేశానికి ఆదేశ ప్రత్యేక పరిస్ధితులను గమనంలో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇంతవరకు సోషలిజాన్ని నిర్మించే క్రమంలో దశల గురించి తెలియదు, చైనీయుల అవగాహన ప్రకారం అనేక ద శల్లో తమది ఒకటి అంటున్నారు. మొత్తంగా చూసినపుడు వారి దారి ఎటు అన్నదే ముఖ్యం.

Image result for china islamic
సోషలిజం గురించే ఇలా ఉన్నపుడు ఇక మతాల గురించి చెప్పాల్సిందేముంది. ఎంతో సున్నితమైన అంశం, శత్రువులు కాచుకొని ఉంటారు. ఒక లౌకిక వ్యవస్దలో మతం పట్ల ఎలా వ్యవహరించాలి అన్నది ఒక ముఖ్యాంశం, అది కూడా కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న చోట(మన దేశంలో మాదిరి ఒకటో అరో రాష్ట్రంలో అధికారం పొందటం కాదు) మరింత సంక్లిష్టం. సోషలిస్టు సమాజ లక్ష్యం కలిగిన ఏ వ్యవస్దలో అయినా మతం దాని నిర్మాణానికి దోహదం చేసేదిగా ఉండాలి తప్ప వ్యతిరేకించేదిగా ఉండకూడదు. మత విశ్వాసాలు వ్యక్తి, కుటుంబానికి పరిమితం కావాలి తప్ప నా మతం చెప్పినట్లుగా పాలన నడవాలంటే కుదరదు. మతాలే దానికి అనుగుణ్యంగా మారాల్సి ఉంటుంది.అనేక దేశాల్లో అలా మారినపుడు సోషలిస్టు దేశాల్లో కుదరదంటే ఎలా ?
చైనాలోని ఎనిమిది ముస్లిం తెగల పెద్దలతో ప్రభుత్వం సమావేశం జరిపి సోషలిజానికి తగిన విధంగా ఇస్లాం మారాల్సిన అవసరం గురించి వివరించింది, అందుకు గాను ఐదు సంవత్సరాలలో శీఘ్రగతిన తెలియచెప్పేందుకు తీసుకోవాల్సిన చర్యలను వారి ముందుంచింది. పశ్చిమ దేశాల మీడియా దీన్ని దొరకబుచ్చుకొని యుఘిర్‌లో ఉగ్రవాద నిర్మూలన చర్యలుగా కొందరు చిత్రీకరిస్తే మరి కొందరు ఆ పేరుతో మతాన్ని అణచివేసేందుకు పూనుకున్నట్లు రాశారు. అనేక దేశాల్లో మితవాద శక్తులు మత పెత్తనాన్ని తిరిగి పునరుద్దరించేందుకు, పాలకుల మీద వత్తిడి తెచ్చేందుకు ఇటీవలి కాలంలో తీవ్రంగా ప్రయత్నిస్తున్న అంశాన్ని మరచిపోకూడదు. మతపరమైన దేశాల్లో పరిస్ధితులు ఎంత దారుణంగా ఉన్నాయో చూసిన తరువాత ప్రతి లౌకిక దేశం తన జాగ్రత్తలు తాను తీసుకోనట్లయితే అనేక కొత్త సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంటర్నెట్‌ ఎంత వేగంగా చొచ్చుకుపోతోందో దాన్ని వినియోగించుకొని మత శక్తులు అంతగా రెచ్చిపోవటాన్ని మనం చూస్తున్నాం. ఇదే పరిస్ధితి ప్రపంచమంతటా ఉంది. పోప్‌ జాన్‌ పాల్‌ 2 పోలెండ్‌లో సోషలిస్టు వ్యవస్ధ కూల్చివేతకు ఎలా చేతులు కలిపిందీ మనం చూశాము. వాటికన్‌ కేంద్రం ఉన్న ఇటలీ ఉప ప్రధాని మాటియో సల్వవినీ 2018 ప్రారంభంలో ఒక ప్రకటన చేశాడు.’ మన మీద దాడి జరుగుతోంది, మన సంస్కృతి, సమాజం, సంప్రదాయాలు, జీవన విధానానికి ముప్పు ఏర్పడింది.’ అని మాట్లాడితే ఒక మీడియా 2019లో మత యుద్ధాలు తిరిగి రానున్నాయని రాసింది. ఛాందసవాదం వెర్రి తలలు వేస్తోంది, అది మితవాద జాతీయ వాద భావనలను ముందుకు తెస్తోంది, హింసాకాండకు, సామాజిక అస్ధిరతకు కారణం అవుతోంది. ఈ అనుభవాలను ప్రతి దేశం తీసుకోవాలి, అవసరమైన చర్యలు తీసుకోవాలి. చైనా దీనికి మినహాయింపుగా ఉండజాలదు.
సోషలిజానికి అనుగుణ్యంగా ఒక్క ఇస్లామే కాదు, చైనాలోని అన్ని మతాలూ మారాలని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. అందుకు అనుగుణ్యమైన చర్యలు తీసుకొంటోంది. ఏ మతానికి మినహాయింపు లేదు. మన దేశంలో కేంద్రంలో, అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న సంఘపరివార్‌ నేతల మాదిరి హిందూ మతానికి ఇతర మతాల నుంచి, లౌకిక వాదుల నుంచి ముప్పు వస్తోందని చెబుతన్నట్లుగా చైనాలో మెజారిటీ మతానికి ముప్పు వస్తోందని చెప్పటం లేదు. ఒక మైనారిటీ మతాన్నుంచి వస్తోందనే ముప్పును మరొక మెజారిటీ మతోన్మాదం అరికట్టలేదు, అది తన ఉన్మాదాన్ని జనం మీద రుద్దుతుంది. జనాన్ని అణచివేస్తుంది. 2018లో చైనా విడుదల చేసిన ఒక శ్వేత పత్ర సమాచారం ప్రకారం 20 కోట్ల మంది మతాన్ని నమ్మేవారున్నారు. ప్రభుత్వం వద్ద నమోదైన ప్రార్దనా స్ధలాలు 1,44,000 ఉన్నాయి. వాటిలో 3,80,000 మంది మత పరమైన క్రతువులు నిర్వహించే వారున్నారు. ఉగ్రవాద నిరోధ చర్యలు, మత పరమైన స్వేచ్చ పూర్తిగా భిన్నమైన అంశాలు. ఉగ్రవాదుల మీద చర్యలు తీసుకోవటం, దాన్ని నివారించటం మత స్వేచ్చను అడ్డుకోవటం కాదు. మన దేశంలో సంఘపరివార్‌ చేస్తున్న ప్రచారం మాదిరి ముస్లింలు మొత్తం ఉగ్రవాదులే అని లేదా అందరూ ఉగ్రవాదులు కాదు గానీ ఉగ్రవాదులుగా ఉన్నవారందరూ ముస్లింలే అనే తప్పుడు ప్రచారాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ చేయటం లేదు.
ముస్లిం దేశాలు చైనా చర్యను ఎందుకు ఖండించటం లేదు ?
చైనాలో ఒక రాష్ట్రంలోని ముస్లింలను ఇంతగా హింస పెడుతుంటే ఒక్క ముస్లిం దేశమూ ఖండిచదు ఎందుకు అని కొందరు సామజిక మాధ్యమం, మీడియాలో అమాయకంగా అడుగుతున్నట్లు కనిపిస్తారు. వారే వాటికి సమాధానం కూడా చెబుతారు.చైనాతో ఉన్న ఆర్దిక సంబంధాలే కారణం అన్నది అది. మరి అమెరికా ఎందుకు అంతగా గొంతు చించుకుంటున్నది, చైనాతో అందరి కంటే ఎక్కువ వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్నది, చైనా దగ్గర పెద్ద మొత్తంలో డాలర్లు అప్పుగా తెచ్చుకున్నదీ అమెరికాయే కదా ? చైనా రాజకీయంగా, ఆర్ధికంగా తనకు నచ్చినట్లు లంగలేదు కనుక బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నది అనుకోవాలా ?
చైనా పదిలక్షల మంది యుఘిర్‌ ముస్లింలను నిర్బంధ శిబిరాల్లో పెట్టింది. దీనికి పశ్చిమ దే శాలూ, వాటి మీడియా చూపే ఆధారాలు లేవు, దగ్గరుండి సరిగ్గా లెక్క పెట్టినట్లు రాస్తున్నారు. కోటి మంది ముస్లింలు ఉన్న ప్రాంతంలో పది లక్షల మందిని నిర్భందిస్తే మిగిలిన వారంతా ఈ పాటికి పొరుగు దేశాలకు శరణార్దులుగా వెళ్లి ఉండాల్సింది. కానీ సరిహద్దుల్లో ఉన్న ఏ ఒక్క ముస్లిం దేశం, మరొక దేశం గానీ తమ దేశానికి అలాంటి సమస్య ఉన్నట్లు ఇంతవరకు ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేయలేదు. దాదాపు పదకొండువేల కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దు కలిగిన ప్రాంతమది, తప్పించుకోకుండా కట్టడి చేయటం ఏ దేశానికైనా సాధ్యమేనా ? ఉపగ్రహ చిత్రాలంటూ పత్రికల్లో టీవీల్లో కొన్ని భవనాలను చూపుతారు, అవి ఏ భవనాలైనా కావచ్చు. చైనాలో జరుగుతున్నట్లు చెబుతున్న మానవ హక్కుల ఉల్లంఘన గురించి అమెరికా తప్ప మరొక దేశం ఏదీ చొరవ తీసుకొని ఫిర్యాదు చేసేందుకు ఇంతవరకు ముందుకు రాలేదు.

Image result for pope  china
తామే తుమ్మి తామే తధాస్తు అనుకున్నట్లుగా తాము పెద్ద ఎత్తున ప్రచారం చేసిన కారణంగా నిర్బంధ శిబిరాలను పెద్ద సంఖ్యలో మూసివేసిందని కూడా పశ్చిమ దేశాల వారు ప్రచారం చేస్తున్నారు. ముందే చెప్పుకున్నట్లుగా దేశ వ్యవస్ధకు అనుగుణ్యంగా వ్యవహరించాల్సిన తీరుతెన్నులను వివరించేందుకు పిల్లలు, యువతకు ప్రభుత్వం కొన్ని పాఠశాలలను ఏర్పాటు చేసింది. వాటిలో ఉగ్రవాదం, దానికి దూరంగా ఉండాల్సిన అవసరం, బతికేందుకు అవసరమైన నైపుణ్యాలలో శిక్షణ వంటివి అన్నీ అక్కడ వున్నాయని చైనా అధికారులే చెబుతున్నారు. వాటిని శత్రువులు నిర్భంద శిబిరాలంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో నక్సల్స్‌గా మారి నేరాలు చేసిన వారిని పట్టిస్తే బహుమతులు ప్రకటించటం లేదా వారే లొంగిపోతే ప్రభుత్వాలు ఆర్దిక సాయం చేసి జనజీవన స్రవంతిలోకి తెచ్చే పధకాలను అమలు జరపటం తెలిసిందే. చైనా నిర్వహిస్తున్న అలాంటి పాఠశాలలను సందర్శించాలని అనేక దేశాల, దౌత్యవేత్తలు, జర్నలిస్టులను ఆహ్వానించింది. వారందరూ చైనా అనుకూలురు అని ఒక నింద. వాటిలో ఖురాన్‌ చదవ నివ్వటం లేదని, పంది మాంసం బలవంతంగా తినిపిస్తున్నారంటూ రంజుగా కథలు చెబుతున్నారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని సామాజిక, మానవతా పూర్వక, సాంస్కృతిక వ్యవహారాల కమిటీ ముందు గతేడాది అక్టోబరు 23 యుఘీర్స్‌పై జరుగుతున్నదాడులంటూ అమెరికా,బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వంటి 23దేశాలు ఫిర్యాదు చేశాయి,54దేశాలు చైనా తీసుకున్న చర్యలను సమర్ధించాయి. ఇస్లామిక్‌ దేశాలు పాలస్తీనియన్లు, మయన్మార్‌లో రోహింగ్యాల మీద జరుగుతున్న దాడులను ఖండించాయి గానీ, యుఘీర్స్‌ పట్ల కేవలం ఆందోళన మాత్రమే వ్యక్తం చేశాయని అమెరికన్లు కస్సుబుస్సుమంటున్నారు. పాలస్తీనియన్ల మీద జరుగుతున్నదాడులను అమెరికా ఎప్పుడైనా ఖండించిందా, ఖండించకపోగా ఐరాసలో ఇజ్రాయెల్‌ను సమర్దిస్తున్నది. సిరియాపై దాడికి అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు పంపిన ఆల్‌ఖైదా ఉగ్రవాద ముఠాలలో యుఘీర్‌లు దొరికిపోయారు. వారిని అక్కడకు పంపిందెవరు చైనా వారా అమెరికన్లా ? ఆప్ఘన్‌ తాలిబాన్ల ముఠాలలో అనేక మంది యుఘీర్లు పట్టుబడ్డారు, వారిని తాలిబాన్లలోకి పంపిందెవరు ? ఈ విషయాలు ముస్లిం దేశాలకు తెలియవా ?చైనాను ఏమని విమర్శిస్తాయి?

Share this:

  • Tweet
  • More
Like Loading...

సిఎఎ వివాదం : హద్దులు దాటిన కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌

29 Sunday Dec 2019

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

CAA, governor arif mohammad khan, Historian Irfan Habib, Indian constitution, Indian History Congress, Nathuram Godse

Image result for as a governor arif mohammad khan crossed his limits
ఎం కోటేశ్వరరావు
దేశంలో ఎవరు ‘అసహనంతో ప్రజాస్వామ్యవిరుద్దంగా ‘ ప్రవర్తిస్తున్నారో చూశారా అంటూ పొద్దున్నే ఒక పలకరింపు. కేరళలోని కన్నూరు విశ్వవిద్యాలయంలో శనివారం నాడు (ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌) భారత చరిత్ర కారుల 80వ మహాసభను ప్రారంభిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ చేసిన ప్రసంగం, దాని మీద వ్యక్తమైన నిరసన గురించి ఆ పరామర్శ. తర్కబద్దంగా సమాధానం చెబితే వినే ‘సహనం’ కనిపించకపోవటంతో మహాశయా మీరు చిన్నతనంలో చదువుకున్న కుక్క పని గాడిద చేస్తే….. కథను ఒక్కసారి చదువుకుంటే చాలు అని చెప్పి ముగించాల్సి వచ్చింది.
దేెశంలో గవర్నర్ల పాత్ర అంటే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేది, రాష్ట్రాలలో రాజకీయ సంక్షోభాలు వచ్చినపుడు తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలే గుర్తుకు వస్తాయి. ఆ విషయంలో కాంగ్రెస్‌ ముందుంటే, దాన్ని అధిగమించేందుకు, కొత్త పుంతలు తొక్కేందుకు బిజెపి తహతహలాడుతోంది. మన రాజ్యాంగంలో గవర్నర్ల పాత్ర పరిమితం, వారు రాజకీయాలు చేయకూడదు, చేస్తున్నారు గనుక ఎవరైనా విమర్శిస్తే భరించాల్సిందే, గవర్నర్లంటే గౌరవం లేదా అంటే కుదరదు. ఇటీవలి కాలంలో మహారాష్ట్ర గవర్నర్‌ ప్రవర్తించిన తీరు తెన్నులను మరచి పోకముందే కేరళ గవర్నర్‌ తానూ తక్కువ తినలేదని, పదవి ఇచ్చిన వారి ఉప్పుతిన్నందున వారికి విధేయుడనై ఉన్నానని ప్రదర్శించుకొనేందుకు తాపత్రయ పడ్డారు అని చెప్పక తప్పదు.
గవర్నరు పదవిలో ఉన్న వారికి అధికారికంగా చట్ట సభల్లో ప్రభుత్వ అభిప్రాయాలు తప్ప వ్యక్తి గత అభిప్రాయాలు వ్యక్తం చేసే నిబంధనలు లేవు. బయట గవర్నర్లు గౌరవ అధ్యక్షులో మరొకటో అయిన సంస్దలు లేదా పర్యటనల్లో పరిమితమైన అంశాల మీద సందేశాలు, ప్రకటనలు చేయవచ్చు తప్ప. రాజకీయాల జోలికి పోకూడదు. అయితే చరిత్రకారుల మహాసభ లేదా మరొక సభ దేనినైనా ప్రారంభించాలని ఆహ్వానించినపుడు రావాలా లేదా అనేది గవర్నర్ల విచక్షణకు సంబంధించిన అంశం. అలా వచ్చినపుడు సాధారణంగా ముందుగా తయారు చేసుకున్న సంబంధిత అంశం మీదనే ప్రసంగిస్తారు. దానితో అందరూ ఏకీభవించాలని లేదు. కన్నూరులో జరిగింది అది కాదు. గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ తాను తయారు చేసుకు వచ్చిన ప్రసంగాన్ని పక్కన పెట్టి అంతకు ముందు వక్తలు సిఎఎ, కాశ్మీర్‌ పరిణామాలపై చేసిన ప్రస్తావనలు లేదా విమర్శలకు రాజకీయ సమాధానాలు చెప్పటం ప్రారంభించటంతో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఒక పార్టీ నాయకత్వంలో నడిచే ప్రభుత్వం చేసిన నిర్ణయాలు, చట్టాలను విమర్శించే హక్కు ఎవరికైనా ఉంది. వాటికి రాజకీయ పరమైన సమాధానం చెప్పాల్సింది మంత్రులు, పార్టీ నేతలు మాత్రమే. ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్న అధికారులు చట్టంలోని అంశాల మీద వివరణ ఇస్తారు తప్ప రాజకీయ పరమైన విమర్శలకు సమాధానం చెప్పే అవకాశం లేదు. గవర్నర్లకూ లేదు.
తనను ప్రసంగించకుండా చరిత్రకారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌, శ్రోతల నుంచీ కొందరు అడ్డుకున్నారని, గేలిచేశారని గవర్నర్‌ ఆరోపించారు. ఒక భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తంచేయటాన్ని సహించలేకపోవటం అప్రజాస్వామికం అని కూడా వ్యాఖ్యానించారు. భౌతికంగా తనను నిరోధించేందుకు ఇర్ఫాన్‌ హబీబ్‌ ప్రయత్నించారని కూడా ట్వీట్ల ద్వారా తీవ్ర ఆరోపణ చేశారు. అయితే ఆ ట్వీట్లలోనే గవర్నరే జరిగిందేమిటో వివరించాల్సి వచ్చింది.” భారత చరిత్రకారుల మహాసభ ప్రారంభం ఎలాంటి వివాదాలను రేకెత్తించలేదు.అయితే కన్నూరు విశ్వవిద్యాలయంలో జరిగిన 80వ చరిత్రకారుల మహాసభలో సిఎఎ మీద ఇర్ఫాన్‌ హబీబ్‌ కొన్ని అంశాలను లేవనెత్తారు. వీటి గురించి గవర్నర్‌ జవాబు చెబుతున్న సమయంలో గవర్నర్‌ను భౌతికంగా నిరోధించేందుకు ఇర్ఫాన్‌ హబీబ్‌ తన స్ధానం నుంచి లేచారు. మౌలానా అబ్దుల్‌ కలామ్‌ పేరు ఉటంకించటానికి గవర్నర్‌కు ఉన్న హక్కును ఆయన ప్రశ్నించారు, చప్పట్లు కొడుతూ ఆయన గాడ్సే పేరును ప్రస్తావించాలని అన్నారు. అవాంఛనీయ ప్రవర్తనను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన గవర్నర్‌ ఎడిసి మరియు రక్షణ అధికారిని తోసివేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్న ఒక వ్యక్తిగా తాను తనకంటే ముందు మాట్లాడిన వక్తలు పేర్కొన్న కొన్ని అంశాలపై మాత్రమే తాను స్పందించానని ” గవర్నర్‌ ట్వీట్లలో పేర్కొన్నారు.
కన్నూరు సభలో గవర్నర్‌ కంటే ముందు మాట్లాడిన వక్తలు పౌరసత్వ సవరణ చట్టం, ఇతర అంశాలపై విమర్శలు చేశారు. రాజ్యాంగంలోనే కొన్ని అంశాలపై లోపాలు ఉన్నాయనే అభిప్రాయం వెలిబుచ్చటం తప్పు కాదు, రాజ్యాంగ ఉల్లంఘన అంతకంటే కాదు, దానికి ముప్పు తలపెట్టినట్లు కాదు. ఇప్పటికి 104 రాజ్యాంగ సవరణలు చేశారు, రాబోయే రోజుల్లో ఇంకా చేయవచ్చు. చట్ట సభల్లో దళితులు, గిరిజనుల రిజర్వేషన్లను మరొక పది సంవత్సరాల పాటు పొడిగిస్తూ, ఆంగ్లో ఇండియన్‌ల నామినేటెట్‌ సీట్లను రద్దు చేస్తూ 104 సవరణలో తీర్మానించారు. ఎవరైనా వీటిని కూడా విమర్శించవచ్చు.అలాంటపుడు పౌరసత్వ సవరణ చట్టాన్ని సవరించటాన్ని విమర్శించటం, రాజ్యాంగానికి వచ్చిన ముప్పుగా పరిగణించటం, దాన్ని కాపాడే బాధ్యతలో భాగంగా విమర్శలకు సమాధానం చెప్పబూనుకోవటమే అసలైన రాజ్యాంగ నిబంధనలకు విరుద్దం.
అదే వేదికపై ఉన్న సిపిఐ(ఎం) రాజ్యసభ సభ్యుడు కెకె రాగేష్‌ గవర్నర్‌ కంటే ముందు మాట్లాడారు.” చరిత్రకారుల సభలో గవర్నర్‌ పూర్తిగా రాజకీయ ప్రసంగం చేశారు. ఆయన ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ వాదిలా మాట్లాడారు. ఎంపీ గారూ ఇది మీ కోసమే అంటూ నన్ను ఉద్దేశించి ప్రసంగాన్ని ప్రారంభించారు. నేనుకూడా ఇతర పెద్దలతో పాటే వేదిక మీద ఉన్నాను. ఇర్ఫాన్‌ హబీబ్‌ గవర్నర్‌ను తోసివేయలేదు, కనీసం తాకను కూడా తాకలేదు. మౌలానా అబ్దుల్‌ కలామ్‌ అజాద్‌ మాటలను వక్రీకరించటానికి బదులు గాడ్సే చెప్పిందాన్ని ఉటంకించమని మాత్రమే కోరారు.” అని రాగేష్‌ చెప్పినట్లు మీడియా పేర్కొన్నది. అంతే కాదు సభలో ఉన్న ఒక ప్రతినిధి జరిగిన సంఘటన గురించి ” గవర్నర్‌ మౌలానా అజాద్‌, గాంధీ ఇతరుల పేర్లను పూర్తి అసందర్భంగా ప్రస్తావించారు, అదే సమయంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని కూడా పొగడటం ప్రారంభించారు. ఎవరైనా ఆయనకు ఏమి చెబుతారు, వారిని వక్రీకరిస్తూ మాట్లాడినపుడు తరువాత గాడ్సేను కూడా ప్రస్తావించాలని చెప్పారు. ఇది చరిత్రకారుల మహాసభ, పౌరసత్వ సవరణ చట్టం మీద సెమినార్‌ కాదు.” అని పేర్కొన్నట్లు ఇండియా టుడే వెల్లడించింది. ఖాన్‌ చెత్త మాట్లాడుతున్న సమయంలో మీరెందుకు అజాద్‌, గాంధీలను ఉదహరిస్తున్నారు గాడ్సే గురించి చెప్పండి అంటూ హబీబ్‌ అడ్డుకున్నారు అని అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ షిరీన్‌ మూస్వీ చెప్పారు.
గవర్నర్‌ ప్రసంగంశాలపై అనేక మంది ప్రతినిధులు, విద్యార్ధులు కూడా నిరసన తెలిపారు. వారిని ఉద్దేశించి ” మీకు నిరసన తెలిపే హక్కుంది, కానీ నన్ను నోరు మూయించలేరు. మీరు చర్చల ద్వారాన్ని మూయటం అంటే మీరు హింసా సంస్కృతిని ప్రోత్సహించటమే అని” వారితో గొంతు కలిపారు. నిరసనల మధ్య తన ప్రసంగాన్ని ముగించిన అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ తాను ముందే సిద్ధం చేసుకున్న ప్రసంగంతోనే వచ్చానని, అయితే తనకంటే ముందు మాట్లాడిన వక్తలు ఈ అంశాన్ని(సిఎఎ) ప్రస్తావించకుండా ఉంటే నేను మాట్లాడేవాడినే కాదు, మీరు ప్రస్తావించి రాజకీయ ప్రకటనలు చేశారు.రాజ్యాంగాన్ని సమర్ధించుతానని, రక్షించాలని నేను ప్రమాణం చేశాను. దానిలో భాగంగా నేను హబీబ్‌ లేవనెత్తిన అంశాలపై ప్రతిస్పందించాను. అయితే ఆయన నా ప్రసంగాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు” అని గవర్నర్‌ ఆరోపించారు.
ఈ ఉదంతంపై ఇద్దరు జర్నలిస్టులు చేసిన ట్వీట్లను గమనించాల్సిన అవసరం ఉంది. బిజెపి ఎంపీ యజమానిగా ఉన్న రిపబ్లిక్‌ టీవీతో సహా అనేక సంస్ధలలో పని చేసిన జర్నలిస్టు ఆదిత్య రాజ్‌ కౌల్‌ చేసిన ట్వీట్‌లో ఇలా పేర్కొన్నారు.’ దిగ్భ్రాంతి కలిగిస్తోంది. కొంత మంది కుహనా ఉదారవాదులనబడే వారు ఇప్పుడు మాట్లాడే, భావప్రకటనా స్వేచ్చ హక్కులేదని అంటున్నారు. మౌలానా అబ్దుల్‌ కలామ్‌ అజాద్‌ను ప్రస్తావిస్తూ సుప్రసిద్ద పండితుడైన కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ మాట్లాడుతున్న సమయంలో ఆయన్ను గేలిచేశారు” అని విమర్శించారు. దీనికి స్పందనగా ఎన్‌డిటీవీ జర్నలిస్టు గార్గి రావత్‌ ఒక ట్వీట్‌ చేస్తూ ” ఆశ్చర్యంగా ఉంది. గేలి చేయటాన్ని సమర్ధించటం లేదు. కానీ, అవకాశవాద మాజీ రాజకీయవేత్త అయిన గవర్నర్‌ అరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ను మీరు ఒక పండితుడు అంటున్నారు, సుప్రసిద్ధ చరిత్రకారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌ను కుహనా ఉదారవాదిగా పిలుస్తున్నారు” అని చురక అంటించారు.


ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ను అవకాశవాది అనటం సరికాదని, నిజంగా అవకాశవాది అయితే షా బానో కేసులో సుప్రీం కోర్టు తీర్పును తిరస్కరించే నిర్ణయం తీసుకున్న రాజీవ్‌ గాంధీని ఎందుకు వ్యతిరేకిస్తారు, మంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేస్తారని కొందరు మీడియా విశ్లేషకులు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఇర్ఫాన్‌ హబీబ్‌ అబద్దాలు చెబుతున్నట్లు ఆరోపణలు చేశారు. ఆయోధ్యలో ముస్లింలు రాజీపడేందుకు సిద్దపడినపుడు హబీబ్‌ ఇతరులు పడనీయలేదని ఆరోపించారు. అంతవరకు పరిమితం కాలేదు గార్గి కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు ముక్తార్‌ అబ్బాస్‌ అహమ్మద్‌ అన్సారీ మనవడిని వివాహం చేసుకుందని, ఆమె భర్త యూసుఫ్‌ అహమ్మద్‌ అన్సారీ కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేశారని, ఆమె కాంగ్రెస్‌ అనుకూల జర్నలిస్టు అని అసందర్భ వ్యాఖ్యలు చేయటాన్ని బట్టి వారు కాషాయ దళసైనికులన్నది స్పష్టం.
ఇక ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ విషయానికి వస్తే షాబానో కేసు తీర్పును వమ్ము చేసేందుకు నిర్ణయించిన రాజీవ్‌ గాంధీ చర్యను వ్యతిరేకించిన మాట వాస్తవం.ఆచర్యను అనేక మంది పురోగామి వాదులు ప్రశంసించారు. అలీఘర్‌ ముస్లిం విద్యార్ధి సంఘనాయకుడిగా పని చేశారు. తొలుత బికెడి తరఫున పోటీ చేసి ఓడిపోయారు, తరువాత 26 ఏండ్ల వయస్సులోనే ఎంఎల్‌సి అయ్యారు. తరువాత కాంగ్రెస్‌లో చేరి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. మంత్రిగా పని చేస్తూ రాజీనామా చేశారు. తరువాత జనతాదళ్‌ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. మరోసారి మంత్రిగా పని చేశారు. తరువాత ఆ పార్టీ నుంచి బిఎస్‌పిలో చేరి మరోసారి ఎంపీ అయ్యారు. తరువాత 2004లో బిజెపిలో చేరి ఎన్నికలలో ఓడిపోయారు. మూడు సంవత్సరాల తరువాత బిజెపికి రాజీనామా చేసినట్లు ప్రకటించినా ఆ పార్టీతో సంబంధాలను వదులు కోని కారణంగానే నరేంద్రమోడీ సర్కార్‌ కేరళ గవర్నర్‌గా నియమించింది. ఇన్ని పార్టీలు మారిన వ్యక్తిని అవకాశవాది అనాలో మరొక విధంగా పిలవాలో ఎవరికి వారే నిర్ణయించుకోవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

దిగుబడుల పెరుగుదలకు దున్నకం తగ్గించాలా !

26 Thursday Dec 2019

Posted by raomk in Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Science, USA

≈ Leave a comment

Tags

Agricultural, Reduced soil tilling, Smart Agriculture, soils, yields

Image result for could Reduced soil tilling helps both soils and yields

 

 

 

 

 

 

 

 

ఎం కోటేశ్వరరావు
భూమిని ఇష్టం వచ్చినట్లుగా ప్రతిదానికీ దున్నకూడదు, ఎంత తక్కువ దున్నితే అంతగా భూమి ఆరోగ్యం బాగుపడుతుంది, దిగుబడులు కూడా పెరుగుతాయని తమ అధ్యయనంలో తేలిందని తాజాగా కొందరు పరిశోధకులు చెప్పారు. రైతాంగం ముఖ్యంగా మన వంటి వర్ధమాన దేశాల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నో. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవటం ఒక అంశమైతే, పంట మార్కెటింగ్‌ మరొక అంశం. ప్రపంచ వాణిజ్య సంస్ద ఉనికిలోకి రాక ముందే ప్రపంచీకరణ, దానిలో భాగంగా నయా ఉదారవాద విధానాలు వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. మన దేశంలో ఆ విధానాలు అమలులోకి వచ్చిన 1991 తరువాత అంతకు ముందు తలెత్తినదాని కంటే వ్యవసాయ రంగంలో తీవ్ర సంక్షోభం దానికి సూచికగానే ఆత్మహత్యలన్న విషయం తెలిసిందే. వ్యవసాయం గిట్టుబాటు కానందున అనేక మంది వ్యవసాయ మానివేస్తే, అంతకంటే ఎక్కువగా మరోపని లేక కౌలు రైతులు ఉనికిలోకి వచ్చారు. పశ్చిమ దేశాలతో పోల్చితే మన దేశంలో వ్యవసాయ కమతాల సంఖ్య, వాటి మీద పని చేసే వారి సంఖ్యా ఎక్కువే.
తాజా సమాచారం ప్రకారం మన దేశంలో వ్యవసాయం మీద ఆధారపడుతున్నవారు 58శాతం ఉన్నారు.మన కంటే వెనుకబడిన, దారిద్య్రంతో మగ్గుతున్న దే శాలలో తప్ప మరే ఇతర వర్ధమాన దేశంలో ఇంత సంఖ్యలో లేరు. గడచిన ఆర్దిక సంవత్సరంలో 28.5 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేశాము. 2015-16లో ఒక రైతు కుటుంబ సగటు ఆదాయం రూ.96,703ను 2022-23 నాటికి రూ.2,19,724 చేస్తామని నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్‌డిఏ సర్కార్‌ వాగ్దానం చేసింది. ఇది ఎలా జరుగుతుందో ఇప్పటి వరకైతే అంతుబట్టలేదు, నరేంద్రమోడీ ఇటీవలి కాలంలో దాని గురించి మాట్లాడటం లేదు. దీని గురించి మరో సందర్భంలో చూద్దాం. మన దేశ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలకు, వందల, వేల ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఐరోపా, అమెరికాల్లో ఉండే రైతుల సమస్యలు వేరుగా ఉంటాయి. అయితే దేశం ఏదైనా భూమి ఎదుర్కొంటున్న సమస్యలు ఎక్కడైనా ఒకటే. తగ్గుతున్న భూసారం, దెబ్బతింటున్న భూమి ఆరోగ్యం.ఈ సెగ మనకు తగిలిన కారణంగానే ఇప్పటికే మన రైతాంగానికి పది కోట్ల మేరకు భూ ఆరోగ్య కార్డులు పంపిణీ చేశారు. ఒక మొబైల్‌ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు.
ఈ తరం సూపర్‌ తిండి తింటున్నది కనుకనే మా తరం మాదిరి గట్టిగా ఉండటం లేదని వృద్ధులు అనటం వింటాం. దానిలో పాక్షిక సత్యం లేకపోలేదు. ఈ అంశాలన్నీ ఒక ఎత్తయితే ఇటీవలి కాలంలో భూమి ఆరోగ్యం దిగజారుతోందన్న అంశాలు రైతాంగాన్ని మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. భూ ఆరోగ్య బాగుకు అయ్యే ఖర్చుకూడా రైతుమీదే పడుతుందని వేరే చెప్పనవసరం లేదు. ఇది మునిగే పడవకు గడ్డిపోచకూడా భారం మాదిరే అన్న విషయం తెలిసిందే. ప్రతి ఏటా 2.4 కోట్ల ఎకరాల భూమి సారం లేనిదిగా తయారు అవుతున్నదన్నది ఒక అంచనా. ఇది ప్రపంచ ఆహార భద్రతను ప్ర శ్నార్దకం చేయటంతో పాటు భూమి మీద వత్తిడిని పెంచటంతో పాటు మన వంటి దేశాలలో రైతు మీద భారాన్ని కూడా మోపనుంది.
దీనికి రైతులు వ్యక్తిగతంగా చేయగలిగింది పరిమితం, ప్రభుత్వాలు మాత్రమే పరిష్కరించగలిగిన అంశం. వ్యవసాయ అభివృద్ధి, విస్తరణ, పరిశోధన బాధ్యతల నుంచి వైదొలిగే విధానాలు అనుసరిస్తున్న పాలకుల నుంచి ఏమి ఆశించగలమన్నది ఒక ప్రశ్న. ఈ నేపధ్యంలో ప్రపంచంలో ఏమి జరుగుతోంది, శాస్త్రవేత్తలు ఏమి చెబుతున్నారో చూద్దాం. ఒక దేశంలో జరిగిన అధ్యయనాలు మరొక దేశానికి లేదా ప్రాంతానికి మక్కీకి మక్కీ వర్తించకపోవచ్చుగానీ, ఆయాదేశాల, ప్రాంతాలకు సంబంధించి ఏమి చేయాలన్నదానికి దారి చూపుతాయి.

Image result for could Reduced soil tilling helps both soils and yields
కొన్ని అంశాలు విపరీతంగా కూడా అనిపించవచ్చు, వాటి మంచి చెడ్డలను శాస్త్రవేత్తలు మాత్రమే వివరించగలరు. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం తాజాగా విడుదల చేసిన పరిశోధన అంశాల సారం ఏమంటే భూమిని ఇష్టం వచ్చినట్లుగా ప్రతిదానికీ దున్నకూడదు, ఎంత తక్కువ దున్నితే అంతగా భూమి ఆరోగ్యం బాగుపడుతుంది, దిగుబడులు కూడా పెరుగుతాయని చెబుతున్నారు.1930దశకంలో అమెరికా, కెనడాలలో తీవ్రమైన దుమ్ము తుపాన్లు,వర్షాభావ పరిస్ధితులు ఏర్పడి, కొన్ని చోట్ల సాగు నిలిపివేయాల్సి వచ్చింది.కొంత కాలం దున్నకం నిలిపివేసిన తరువాత పంటల దిగుబడి అక్కడ పెరిగిందని, భూ ఆరోగ్య మెరుగుదల, దిగుబడుల పెరుగుదలకు దాన్నుంచి పాఠాలు నేర్చుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు.
రైతులు సాధారణంగా సాగుకు ముందు పాటు కలుపు మొక్కల తొలగింపుకు, ఎరువులు వేసే సమయంలోనూ దున్నటం, విత్తే సమయంలో దున్నటం తెలిసిందే. ఇలా ఎక్కువ సార్లు దున్ని భూమిలో కలుపు మొక్కలు లేకుండా చేయటం వలన స్వల్పకాలంలో దిగుబడులు పెరగవచ్చుగానీ దీర్ఘకాలంలో భూమి సారం తగ్గుతుందట.భూమికి మేలు చేసే బాక్టీరియా, ఇతర క్రిమి కీటకాలు అంతరిస్తున్నాయి. ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్ధ(ఎఫ్‌ఏఓ) 2015నివేదిక ప్రకారం గత నాలుగు దశాబ్దాల కాలంలో మూడో వంతు సాగు భూమిలో సారం తగ్గిందట. పదే పదే భూమి దున్నకం, దాని పర్యవసానాల గురించి అమెరికాలోని సోయా, మొక్కజొన్న సాగు చేసే భూముల మీద చేసిన అధ్యయనం మేరకు ఎంత తక్కువగా దున్నితే అంత మంచిదనే అభిప్రాయానికి వచ్చారు.తక్కువ సార్లు దున్నితే ఆరోగ్యకరమైన భూ యాజమాన్య పద్దతులను ప్రోత్సహించటంతో పాటు, కోతనిరోధం, నీటిని నిలుపుకోవటం మెరుగుపడుతుంది.యంత్రాలను వినియోగించకపోవటం లేదా పరిమితంగా దున్నటం ద్వారా గత సంవత్సరపు పంట కోసిన తరువాత మిగిలే సోయా, మొక్కజన్న దుబ్బులు కూడా భూమికి మేలు చేస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పరిమిత దున్నకపు పద్దతులను ప్రస్తుతం అమెరికా ఖండ దేశాలు, ఓషియానా ప్రాంతంలో 37 కోట్ల ఎకరాల్లో వినియోగిస్తున్నారు.పరిమిత దున్నక సాగు అమెరికా మొక్కజొన్న పొలాల్లో 2012-17 మధ్య పదిహేడు శాతం పెరిగింది. అయితే మొత్తం సాగులో ఇది 3.4శాతమే. అయితే దిగబడులు, లాభాలు తగ్గుతున్నాయని రైతాంగం ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. గతంలో ఈ పద్దతులను కొన్ని పరిశోధనా కేంద్రాల్లోనే అమలు జరిపారు, అక్కడ కూడా ఉత్పాకత మీద పడే ప్రభావం గాక భూసార మెరుగుదల గురించే కేంద్రీకరించారు.
స్టాన్‌ఫోర్డ్‌ బృందం ఎక్కువ సార్లు దున్నే ప్రాంతాలు, పరిమిత దున్నకపు ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసం గురించి అధ్యయనానికి 2005 నుంచి 2016వరకు కంప్యూటర్లలో సేకరించిన సమాచారంతో పాటు ఉపగ్రహ చిత్రాలద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించారు. దీనిలో పంటల దిగుబడులపై వాతావరణ మార్పులు, పంటల తీరు తెన్నులు, భూమి స్వభావం వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నారు. అమెరికాలోని తొమ్మిది రాష్ట్రాలలో అధ్యయనానికి ఎంచుకున్న కేంద్రాల సమాచారాన్ని విశ్లేషించారు. దీర్ఘకాలం పాటు పరిమితంగా దున్నిన పొలాల్లో సగటున మొక్కజొన్న దిగుబడి 3.3, సోయా 0.74 శాతం చొప్పున ఎక్కువ సార్లు దున్నిన పొలాలతో పోల్చితే పెరిగినట్లు వెల్లడైంది. కొన్ని కేంద్రాల్లో ఈ దిగుబడులు గరిష్టంగా 8.1,5.8 శాతాల చొప్పున ఉన్నాయి. కొన్ని చోట్ల 1.3, 4.7 శాతాల చొప్పున మొక్కజన్న, సోయా దిగుబడులు తగ్గినట్లు కూడా గమనించారు. ఇంతటి తేడాలు రావటానికి భూమిలో నీరు, ఉష్ణోగ్రతల్లో వచ్చిన మార్పులు ప్రధానంగా పని చేసినట్లు వెల్లడైంది. ఎక్కువ సార్లు దున్నే ప్రాంతాలలో నేలలు పొడిబారటం, నీటిని నిలువ చేసే సామర్ధ్యం తగ్గగా తక్కువ సార్లు దున్నిన ప్రాంతాలలో నేలలో తేమ దిగుబడులు పెరిగేందుకు ఉపయోగపడింది.
అధ్యయనం వెల్లడైన ధోరణులను వెల్లడించింది తప్ప ఇంకా నిర్దిష్ట నిర్ధారణలకు రాలేదు. మరింత విస్తృత అధ్యయనాలు జరపాల్సి ఉంది.1980దశకం నుంచి ఈ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు.తక్కువ సార్లు దున్నిన చోట రైతులు పూర్తి స్ధాయిలో లబ్ది పొందేందుకు మొక్కజొన్న విషయంలో పదకొండు సంవత్సరాలు పడితే సోయా విషయంలో రెట్టింపు వ్యవధి తీసుకుంది. తక్కువసార్లు దున్నకం వలన భూమి సారం అభివృద్ధి చెందటం ఒకటైతే యంత్రాల వాడకం, వాటికి అవసరమయ్యే ఇంధనం, కార్మికుల ఖర్చు తగ్గింది. భూసారం పెరిగే కొలదీ దిగుబడులు పెరగటాన్ని గమనించారు.2017 అమెరికా వ్యవసాయ గణాంకాల ప్రకారం దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు మొగ్గుచూపుతున్నట్లు, అమెరికాలోని పంటలు పండే భూమిలో 35శాతం వరకు తక్కువ సార్లు దున్నే పద్దతులను అనుసరిస్తున్నట్లు వెల్లడైంది. పరిశోధనా కేంద్రాల నుంచి వెల్లడైన సమాచారానికి, సాగు చేస్తున్న రైతాంగ అనుభవానికి అనేక మార్లు పొంతన కుదరకపోవటంతో రైతుల్లో పూర్తి విశ్వాసం ఇంకా ఏర్పడ లేదు. ఫలితంగా కొందరు రైతులు ఈ పద్దతికి మళ్లేందుకు ముందుకు రాని పరిస్ధితి కూడా ఉంది. తక్కువ ఉత్పాదకత ఉండే భూములను సారవంతవమైనవిగా మార్చవచ్చని క్వీన్‌లాండ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. స్ధానిక, గిరిజన తెగల సహకారంతో నిస్సారమైన భూములను చాలా చౌకగా, తక్కువ వ్యవధిలోనే పదిల పరచవచ్చంటున్నారు.
ప్రపంచ వ్యవసాయ రంగంలో తీవ్రమైన పోటీ, ఇటీవలి కాలంలో ఉత్పత్తుల ధరలపతనం వంటి అనేక అంశాలు కొత్త పరిశోధనలకు తెరలేపుతున్నాయి. అయితే ఇవి చిన్న, సన్నకారు రైతులు ఎక్కువగా ఉండే మన వంటి వ్యవసాయ పరిస్దితులున్న చోట పరిశోధనల ఫలితాలను ఎలా వుపయోగించుకోవాలి, ఎలా వర్తింప చేసుకోవాలి అన్నది ఒక పెద్ద సవాలే. అయినా ఎంత మేరకు వీలైతే అంతమేరకు వినియోగించుకోవటం తప్ప మరొక మార్గం కనిపించటం లేదు.సూక్ష్మ వ్యవసాయం, మార్కెట్‌ పద్దతుల గురించి ప్రస్తుతం అనేక చోట్ల కేంద్రీకరిస్తున్నారు. గ్లోబల్‌ మార్కెట్‌ ఇన్‌సైట్‌ ఇంటర్నేషనల్‌ కార్పొరేషన్‌ అనే సంస్ధ తాజాగా విడుదల చేసిన అధ్యయనం ప్రకారం 2025 నాటికి ప్రస్తుతం ఉన్న నాలుగు బిలియన్‌ డాలర్లుగా ఉన్న సూక్ష్మ వ్యయవసాయ మార్కెట్‌ పన్నెండు బిలియన్‌ డాలర్లవరకు పెరగవచ్చని అంచనా వేసింది.

Image result for could Reduced soil tilling helps both soils and yields
స్మార్ట్‌ ఫోన్ల మాదిరి స్మార్ట్‌ వ్యవసాయ పద్దతులకు గాను సమాచారాన్ని, సమాచార వ్యవస్ధలను వినియోగించుకొని రైతాంగానికి తోడ్పడేందుకు ప్రయత్నిస్తున్నారు. పంటల స్ధితిగతులను తెలుసుకొనేందుకు, కంప్యూటర్‌ వ్యవస్ధలతో పాటు డ్రోన్ల వినియోగం కూడా రోజు రోజుకూ పెరుగుతోంది. సూక్ష్మ వ్యవసాయ పద్దతులంటే పరిమిత ప్రాంతాలలో సైతం ఎలాంటి పంటలను సాగు చేయాలి, ఎంత నీరు, ఎరువుల వినియోగం వంటి నిర్ధిష్ట సూచనలు చేసే వ్యవస్ద ఏర్పాటు. ఇందుకోసం 2017లో డచ్‌ ప్రభుత్వం పంటల సమాచార సేకరణకు ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు అవసరమైన నిధులను విడుదల చేసింది. గగనతలం నుంచి సమాచారాన్ని సేకరించేందుకు ద్రోన్స్‌, సెన్సర్లు, జిపిఎస్‌ వ్యవస్ధలు, స్మార్ట్‌ ఫోన్ల వినియోగం 2025నాటికి 70శాతం వరకు ఉండవచ్చని అంచనా. మెరుగైన, పొదుపు పద్దతుల్లో నేల, నీటి వినియోగానికి ఇలాంటివన్నీ ఉపయోగపడతాయి. రానున్న ఆరు సంవత్సరాలలో పరికరాలను గరిష్టంగా, జాగ్రత్తగా వినియోగించటం దగ్గర నుంచి సూక్ష్మ వ్యవసాయ సేవల వరకు మార్కెట్‌ పెరుగుదల రేటు 27శాతం ఉంటుందని అంచనా. పొలాల్లో ఎక్కడ ఏ లోపం ఉందో తెలుసుకొనేందుకు, వాటి నివారణకు తగు చర్యలను తీసుకొనేందుకు 3డి మాపింగ్‌తో సహా అనేక పద్దతులు అందుబాటులోకి వచ్చాయి.
అమెరికా, ఐరోపా వంటి దేశాల్లో జరుపుతున్న పరిశోధనలన్నీ కార్పొరేట్‌ వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చే లక్ష్యంతో చేస్తున్నవే, వాటిని వినియోగించుకోగలిగింది కార్పొరేట్‌ సంస్ధలే అన్నది వేరే చెప్పనవసరం లేదు. ఆ ఫలితాలను మన వ్యవసాయ రంగానికి ఎలా వర్తింప చేయాలి, వినియోగించుకోవాలి అన్నది మన ప్రభుత్వాలు చేయాల్సిన పని. వ్యవసాయ విస్తరణ, అభివృద్ధి వ్యవస్ధ, సిబ్బంది నియామకం పట్ల పూర్తి నిర్లక్ష్యం వహించిన ఫలితాల పర్యవసానాలను చూస్తున్నాము. యూరియా, క్రిమి, కీటక నాశనులను అవసరానికి మించి వాడుతున్నందున జరుగుతున్న నష్టాల గురించి చెబితే చాలదు, ఇతర ఎరువుల ధరలు ఆకా శాన్ని అంటిన కారణంగా సబ్సిడీ వున్నందున రైతాంగం యూరియాను ఎక్కువగా వాడుతున్నారన్నది తెలిసిందే. అందువలన రైతాంగాన్ని చైతన్యపరచటంతో పాటు, భూ సారం, ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవటం, అందుకు అవసరమైన సబ్సిడీలు, బడ్జెట్‌ కేటాయింపులు చేయటం అవసరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ-షా ద్వయ అవాస్తవాలు: ‘వివక్ష’ లేని సమాచారం ఇస్తున్న గూగులమ్మ !

25 Wednesday Dec 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Narendra modi on NRC, Narendra modi u turn on NRC, NRC controversy, NRIC

Image result for modi - shah duo sad
ఎం కోటేశ్వరరావు
నరేంద్రమోడీ ఈ దేశానికి దేవుడు ఇచ్చిన వరం అని మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఒక సందర్భంలో చెప్పారు. ఆ వరపుత్రుడు ప్రధాని నరేంద్రమోడీ, ఆయన ఆత్మవంటి అమిత్‌ షా ద్వయం అబద్దాలు లేదా అవాస్తవాలు చెబుతున్నదా ? జాతీయ పౌర నమోదు(ఎన్‌ఆర్‌సి) గురించి ఇంతవరకు అసలు ఎలాంటి చర్చ జరపలేదని మోడీ మహాశయుడు రామ్‌లీలా(ఒకే మాట మీద నిలిచినట్లు చెప్పే రాముడి పేరుతో ఉంది) మైదానంలో ఒట్టేసి మరీ చెప్పారు. ముందుగా ఆశ్చర్యపోయింది, అవాక్కయింది బిజెపి నేతలు, అభిమానులు అంటే అతిశయోక్తి కాదు. ఏది నిజం, ఏది అవాస్తవం మోడీ మహాశయా అని బయటికి కాకున్నా లోలోపల జుట్టుపీక్కుంటున్నారు. రెండు రోజుల తరువాత నరేంద్రమోడీ ఏది చెబితే అదే కరెక్టు అసలు ఎన్‌ఆర్‌సిగురించి మేము చర్చించని మాట నిజమే అని మోడీగారి ఆత్మగా పరిగణించుతున్న కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా గారు ఒక వార్తా సంస్ధతో చెప్పారు. జాతీయ జన జాబితా, జాతీయ పౌరజాబితా తయారీకి సంబంధం లేదని కూడా అన్నారు.
ఏదో ఒకసారి చెబితే ఎవరికైనా ఇలాంటి సందేహం రావటంలో అర్ధం ఉంది గానీ మోడీ అవాస్తవాల గురించి చర్చ చేయటం ఒక సినిమాలో హీరో మాదిరి ‘చాల బాగోదు’. దేశ రాజకీయాల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్న వారిలో నేర చరితలు లేని, కోటీశ్వరులు, వ్యాపార, పారిశ్రామికవేత్తలు గాని వారెందరు అని బూతద్దం పెట్టి వెతకాల్సిన రోజులివి. అలాగే మోడీ లేదా బిజెపి నేతలు ఎన్ని నిజాలు చెప్పారనేందుకు అంజనం వేసి చూడాలి. లేదా ధర్మపీఠాలను ఎక్కించి నిజాలు పలికించాలి అంటే అన్ని దొరుకుతాయా, మేకిన్‌ ఇండియాలో కూడా తయారు చేయగలమా అన్నది సందేహమే. మోడీ ప్రకటన తరువాత ఎన్ని అబద్దాలు, ఎప్పుడు చెప్పారన్న వివరాలు తెలిపే పనిలో ఊపిరి సలపకుండా గూగులమ్మ తల్లి నిండా మునిగి ఉంది. ఊరట ఏమంటే ఆ మాత తనను కోరిన సమాచారం అందించేందుకు ” ఎంపిక చేసిన దేశాలకు మాత్రమే” ”మతపరమైన మినహాయింపు” వంటి నిబంధనలు పెట్టలేదు.
మీకు తెలుసా, నాకైతే ఇప్పటి వరకు తెలియదు. మోడీ, షా ద్వయం అవాస్తవాల గురించి చెప్పవే తల్లీ అని అడిగితే ‘మోడీ లైస్‌.ఇన్‌’ పేరుతో ప్రత్యేకంగా వాటికే పరిమితమైన ప్రత్యేక వెబ్‌ సైట్‌ కూడా ఉంది నాయనా అని గూగులమ్మ ఒక దారి చూపింది. ప్రపంచంలో ఇతర నేతల మీద ఎక్కడైనా వెబ్‌ సైట్‌లు ఉన్నాయోమో నాకు తెలియదు, సమాచారం అందించిన వారికి కృతజ్ఞతలు చెబుతాను. యాభై అంగుళాల ఛాతీతో ధైర్యం ఉన్న మోడీ అభిమానులు కూడా దాన్ని చూసి వివరాలు తెలుసుకోవచ్చు. నిజాలు తెలుసుకొనేందుకు భయపడాల్సిన పనిలేదు !
అన్నం ఉడికిందో లేదో తెలుసుకొనేందుకు కుండలో ఉన్నమొత్తాన్ని చూడనవసరం లేదు ఒక మెతుకును పట్టుకుంటే చాలు. ప్రెషర్‌ కుకర్‌లలో వండే వారికి అలాంటి అవకాశం లేదు. తోటకూర నాడే అడ్డుకోవాల్సింది అన్నట్లుగా కాషాయ దళాలు చెప్పే అవాస్తవాలను ప్రారంభంలోనే నిలదీసి ఉంటే పరిస్ధితి వేరుగా ఉండేది. అయితే కాంగ్రెస్‌ నిర్వాకాల కారణంగా విసిగిపోయి బిజెపి ఏమి చెప్పినా సరైనదే అనే ఒక అభిప్రాయానికి చాలా మంది వచ్చారు. వెనుకబడిన సమాజం కనుక ఒకసారి ఒకరిని నమ్మిన తరువాత వారు తప్పులు చేసినా వెంటనే నిలదీయలేని బలహీనత మనలో ఉంది. దేవుడు నైవేద్యం తినడన్నది ఎంత వాస్తవమో, ఆ దేవుడి పేరుతో రాజకీయాలు చేసే కాషాయ పరివారం ఎన్నడూ నిజాలు చెప్పదన్నది పచ్చి నిజం. ఎన్‌ఆర్‌సి గురించి అసలు చర్చించనేలేదని నరేంద్రమోడీ, అమిత్‌ షా స్వయంగా చెప్పినప్పటికీ పూజారుల వంటి ఆనుచరులు ఎలాగూ నమ్మరు. కానీ అనేక మంది కళ్లుతెరిపించారు. స్ధలాభావం రీత్యా పరిమితంగా మోడీ గారి తాజా సుభాషితాల గురించి మాత్రమే చూద్దాం !
నిర్బంధ శిబిరాల గురించి అర్బన్స్‌ నక్సల్స్‌ మరియు కాంగ్రెస్‌ పుకార్లను వ్యాపింప చేస్తోందని ప్రధాని చెప్పారు.
అసలు నిర్భంధ శిబిరాల గురించి ప్రధాని ఎందుకు దాస్తున్నట్లు ? అవి అసోంలో కాంగ్రెస్‌ హయాంలోనే ప్రారంభమయ్యాయి. వాటిలో ప్రవేశానికి ముస్లింలు, ఇతర మతాల వారు అనే నిబంధనలు లేవు. అక్రమంగా వచ్చి అడ్డంగా దొరికి పోయిన వారందరినీ ముందు అక్కడ వేయాలన్నది వాటి లక్ష్యం. తన మంత్రులు పార్లమెంటులో ఏ సమాధానం, సమాచారం ఇస్తున్నారో తెలియని స్ధితిలో నరేంద్రమోడీ ఉన్నారా ? 2019 నవంబరు 22 నాటికి తమ రాష్ట్రంలోని ఆరు నిర్బంధ కేంద్రాలలో 988 మంది విదేశీయులున్నారని అసోం లోని బిజెపి రాష్ట్ర ప్రభుత్వం పంపిన సమాచారాన్ని కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రారు రాజ్యసభకు రాతపూర్వక సమాధానంలో చెప్పారు. 2016 నుంచి 2019అక్టోబరు 13వరకు నిర్బంధితుల్లో 28 మంది శిబిరాల్లో లేదా ఆసుపత్రుల్లో మరణించారని కూడా వెల్లడించారు. అసోంలోని ఆరింటిలో ఒక శిబిరం ఏడు ఫుట్‌బాల్‌(కాలి బంతి) మైదానాలంత విస్తీర్ణంలో ఉందని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొన్నది. అంతేనా అక్రమంగా వలస వచ్చేందుకు వీలున్న అన్ని జిల్లాలు, పట్టణ కేంద్రాలలో దేశమంతటా నిర్బంధశిబిరాలను ఎలా ఏర్పాటు చేయాలో సూచిస్తూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఒక నమూనాను కూడా పంపింది. కర్ణాటక, మహారాష్ట్రల్లో రెండింటి నిర్మాణాలు పూర్తయ్యాయని, అసోంలో మరో పదింటిని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అక్రమంగా వచ్చిన వారెవరినైనా నిర్బంధించాల్సిందే, అయితే శరణార్దులతో పాటు, అక్రమంగా వలస వచ్చిన వారిలో ముస్లిమేతర మతాలవారికి పౌరసత్వం ఇవ్వాలంటూ పౌరసత్వ సవరణ చట్టాన్ని సవరించటంతో ముస్లింలలో భయ సందేహాలు తలెత్తాయి. నిర్బంధ శిబిరాల్లో ముస్లింలను మాత్రమే పెడతారనేది ఒకటైతే, ఎన్‌ఆర్‌సిలో అక్రమంగా వచ్చారంటూ ముస్లింలను పెద్ద సంఖ్యలో విదేశీయులుగా తేల్చి నిర్బంధిస్తారనే అనుమానాలు తలెత్తాయి. బతుకుతెరువు కోసం స్వస్ధాలలను వదలి కొత్త ప్రాంతాలకు వెళ్లిన వారిని స్ధానికులని ఎవరు నిర్ధారిస్తారు, వారి దగ్గర ఆధారాలేముంటాయి అన్నది అసలు సమస్య. ఈ నేపధ్యంలో అసలు నిర్బంధ శిబిరాలే లేవంటూ మోడీ ప్రకటించటం మరిన్ని అనుమానాలకు తెరలేపింది.

Image result for modi - shah duo u turn on nrc
ఎన్‌ఆర్‌సి గురించి అనేక అవాస్తవాలను వ్యాపింప చేస్తున్నారు. మేము దాన్ని రూపొందించలేదు, పార్లమెంటు ముందుకు తేలేదు, అసలు ప్రకటించలేదు, ఎన్‌ఆర్‌సి పదం గురించి కూడా చర్చించలేదు అని నరేంద్రమోడీ అన్నారు.
2019 జూన్‌ 20న పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామనాధ్‌ కోవింద్‌ చేసిన ప్రసంగంలో చొరబాటు సమస్యలు తలెత్తిన ప్రాంతాలలో ప్రాధాన్యతా క్రమంలో ఎన్‌ఆర్‌సిని అమలు చేయటం తన ప్రభుత్వ ప్రాధాన్యత అని చెప్పారు. రాష్రపతి ప్రసంగం అంటే ఏదో దారినపోయే దానయ్య మాట్లాడేది కాదు. తమ విధానాలు, ప్రాధాన్యతల గురించి ప్రభుత్వాలు తయారు ఇచ్చే అంశాలతోనే కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రాల్లో గవర్నర్లు తన ప్రభుత్వం అంటూ ప్రసంగిస్తారు, అదీ రాతపూర్వకంగా ఉన్నదాన్ని చదువుతారు. ఒక్క మాట కూడా స్వంతంగా మాట్లాడేందుకు వీల్లేదు. మంత్రివర్గంతో లేదా ప్రధాని కార్యాలయ ప్రమేయలేకుండానే రాష్ట్రపతి ప్రసంగం చేశారా ? ఆయన కూడా అర్బన్‌ నక్సల్‌ జాబితాలోకే వస్తారా ? రాష్ట్రపతి ప్రసంగం నాటికే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అసోంలో ఎన్‌ఆర్‌సి జాబితాను రూపొందించే ప్రక్రియ జరుగుతోంది.
ఎన్నికలకు ముందు ఏప్రిల్‌ నెలలో మాట్లాడుతూ ముందు పౌరసత్వ సవరణ బిల్లు తరువాత ఎన్‌ఆర్‌సి అని చెప్పిన అంశాలన్నీ మీడియాలో వచ్చాయి. ఏప్రిల్‌ 11న పశ్చిమబెంగాల్‌లోని రారుగంజ్‌లో మాట్లాడుతూ దేశమంతటా ఎన్‌ఆర్‌సిని అమలు జరుపుతామన్నారు. ఏప్రిల్‌ 23న బిజెపి యూట్యూబ్‌ ఛానల్‌లో పెట్టిన ఒక వీడియోలో తొలుత శరణార్దులకు పౌరసత్వం, తరువాత దేశవ్యాపితంగా ఎన్‌ఆర్‌సిని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మే ఒకటవ తేదీన పశ్చిమ బెంగాల్లోని బంగావ్‌లో మాట్లాడుతూ ఎన్‌ఆర్‌సి తయారు చేసి చొరబాటుదార్లను దేశం నుంచి బయటకు పంపివేస్తామని చెప్పారు. నవంబరు 20వ తేదీన రాజ్యసభలో మాట్లాడుతూ దేశ వ్యాపితంగా ఎన్‌ఆర్‌సిని నిర్వహిస్తామని చెప్పారు. భాషా పరమైన సర్వే నిర్వహణకు రూపొందించిన వెబ్‌సైట్‌లో సైతం ఎన్‌ఆర్‌సికి ఏర్పాటు చేశారు. డిసెంబరు రెండున ఝార్ఖండ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా చక్రధర్‌ పూర్‌లో మాట్లాడుతూ ఎన్‌ఆర్‌సి అమలుకు 2024 చివరి గడువు అని చెప్పారు. పౌరసత్వ సవరణ చట్ట బిల్లుపై చర్చ సందర్భంగా ఈ బిల్లుకు ఎన్‌ఆర్‌సికి సంబంధం లేదంటూ త్వరలో ఎన్‌ఆర్‌సిని కూడా తీసుకువస్తామని కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా పార్లమెంటులోనే ప్రకటించారు. డిసెంబరు 17న ఇటి నౌ ఛానల్‌లో మాట్లాడుతూ సిఏఏ-ఎన్‌ఆర్‌సికి ఉన్న సంబంధం గురించి చెప్పారు. ఎన్‌ఆర్‌సి గురించి భయపడాల్సిన అవసరం ఏముందని ఎదురు ప్రశ్నించారు. ఇన్ని చెప్పిన వారు, వాటి మీద మీడియాలో వచ్చిన వార్తలను ఒక్కదానిని కూడా ఖండించలేదు, ఇప్పుడు అబ్బే, అంతా ఉట్టిదే అని చెబుతుంటే నమ్మేదెలా !

Image result for modi - shah duo sad
అవాస్తవాలు ఒక అంశానికే పరిమితమా ? కానే కాదు. ఉగ్రవాదాన్ని నిర్మూలించాం అన్నారు. నల్లధనాన్ని వెలికి తీస్తామన్నారు, అచ్చేదిన్‌ అన్నారు, గుజరాత్‌ తరహా అభివృద్ధి చేస్తాం చూడండన్నారు. పెద్ద నోట్ల రద్దు ఫలితాలు వెంటనే రావు, కొంత కాలం ఆగాలి అన్నారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. జనం నిజమే అనుకున్నారు. సంవత్సరాలు గడిచాయి. దేశ అర్ధిక పరిస్ధితి గురించి ఐఎంఎఫ్‌ చెప్పిన అంచనాలను ఉటంకిస్తూ చూడండి మా పనితనాన్ని అంతర్జాతీయ సంస్ధ కూడా నిర్దారించింది అని చెప్పి ఊదరగొట్టారు. అదే సంస్ధ తాజాగా దేశ పరిస్ధితి మరింతగా దిగజారనుందని చెప్పింది. ఇప్పుడు దాని ప్రస్తావనే తీసుకురారు. మన సమాజం నోట్లో వేలు వేసుకొని గుడ్లప్పగించి చూస్తూ ఉంటే ఐఎంఎఫ్‌ వెనుక కూడా ప్రతిపక్షాల హస్తం ఉంది, అలా చెప్పిస్తున్నాయని, దాని అంకెలు కూడా తప్పులు తడకలని ఎదురుదాడి చేయగల ఘనులు. లంచం తీసుకోవటమే కాదు ఇవ్వటం కూడా నేరమే కదా, అలాగే అబద్దాలు చెప్పటం ఎంత మోసమో, నిజాలు చెప్పకపోవటం అంతకంటే పెద్ద మోసం కదూ ! నల్లధనాన్ని వెలికి తీసి ప్రతివారి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తామని చెప్పిన అంశం గురించి ఒకసారి అడిగితే షా గారు తన గడ్డాన్ని సవరించుకొని ఒక నవ్వు నవ్వుతూ జుమ్లా (ఏదో చెబుతుంటాం) అని సమాధానం చెప్పారు. కొద్ది రోజుల తరువాత ఎన్‌ఆర్‌సి గురించి ఆలోచించనే లేదని చెప్పింది కూడా జుమ్లా అంటే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అక్రమాల ట్రంప్‌కు అభిశంసన-మోడీ అభినందన !

25 Wednesday Dec 2019

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Donald trump impeachment, Impeachment, Narendra Modi, US President impeachment

Image result for donald trump impeachment
ఎం కోటేశ్వరరావు
అమెరికాకు 1776లో స్వాతంత్య్రం వస్తే రాజ్యాంగం 1789 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నలుగురు అధ్యక్షులను అభిశంసన ద్వారా గద్దె దించే ప్రయత్నాలు జరిగాయి. రెండు ప్రయత్నాలు విఫలం కాగా, ఒక అధ్యక్షుడు అభిశంసన ప్రక్రియ ప్రారంభానికి ముందే రాజీనామా చేశాడు. నాలుగవ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌. అతగాడి మీద వచ్చిన అభియోగాలపై విచారణ జరిపి ఈ నెల 19న పార్లమెంట్‌ దిగువ సభ అమెరికన్‌ కాంగ్రెస్‌(ప్రజాప్రతినిధుల సభ) విచారణ జరిపి ట్రంప్‌ నేరం చేశాడంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అభిశంసన ప్రక్రియ ప్రకారం ఎగువ సభ సెనెట్‌ కూడా అభియోగాలపై విచారణ జరిపి నిజమే అని నిర్ధారిస్తే ట్రంప్‌ ఇంటికి పోవాల్సి ఉంటుంది.
ప్రజాప్రతినిదుల సభలోని 441 స్ధానాలకు గాను 435 మందికి ఓటింగ్‌ హక్కు ఉంటుంది. ప్రస్తుత ట్రంప్‌ నాయకత్వంలోని రిపబ్లికన్‌ పార్టీ 198 స్దానాలు, ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీకి 232, ఇతరులు ఒకరుండగా, నాలుగు స్దానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ కారణంగా ప్రతిపక్షానికి చెందిన నాన్సీపెలోసీ స్పీకర్‌గా ట్రంప్‌ మీద అభిశంసన ప్రక్రియను ప్రారంభించటం, మెజారిటీ ఉంది కనుక ఆమోదం జరిగిపోయాయి.అయితే రిపబ్లికన్‌ పార్టీకి వంద స్ధానాలున్న సెనెట్‌లో 53 మంది సభ్యులుండగా ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీకి 45, స్వతంత్రులు ఇద్దరు ఉన్నారు. సెనెట్‌ నిబంధనల ప్రకారం మూడింట రెండువంతుల మెజారిటీ కావాల్సి ఉన్నందున అసాధారణ పరిస్ధితి ఏర్పడి రిపబ్లికన్‌ పార్టీలో తిరుగుబాటు వంటివి జరిగితే తప్ప అభిశంసన వీగిపోవటం ఖాయం. ఎందుకంటే అలాంటి తీవ్ర పరిస్దితి, పరిణామాలేమీ ఇంతవరకు లేవు, సూచనలు కూడా కనిపించటం లేదు. ఈ కారణంగానే ఆ పనేదో త్వరగా కానివ్వండి అని ట్రంప్‌ సవాళ్లు విసురుతున్నాడు.
ట్రంప్‌ను అభిశంసించటానికి కారణాలు రెండు. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికలలో తనకు ప్రత్యర్ధి అవుతాడు అనుకున్న డెమోక్రటిక్‌ పార్టీ నేత జోబిడెన్‌, అతని కుమారుడి అవినీతి అక్రమాలకు సంబంధించి విచారణ జరిపి వారిని కేసులలో ఇరికించాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడి మీద వత్తిడి తేవటం, ఆ క్రమంలో ఆ దేశానికి వాగ్దానం చేసిన మిలిటరీ సాయాన్ని తొక్కిపెట్టారన్నది ఒకటి. దీని మీద అభిశంసన ప్రక్రియను అడ్డుకొనేందుకు ప్రయత్నించటాన్ని మరొక అభియోగంగా విచారణ జరిపి నిర్ధారించారు. ఈ రెండూ అధికార దుర్వినియోగాలుగా పరిగణించారు. జనవరి ఏడవ తేదీన సెనెట్‌ విచారణ ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. విచారణ ఎలా జరగాలన్న అంశంపై రెండు పార్టీల మధ్య ప్రస్తుతం జరుగుతున్న వాదోపవాదాల నేపధ్యంలో ఆ రోజున ప్రారంభం కావచ్చు లేదా తరువాత అవుతుంది.
ఇంతవరకు ప్రజాప్రతినిదుల సభ స్పీకర్‌ తమకు అభియోగ అంశాల గురించి అధికారికంగా ఎలాంటి వర్తమానం పంపలేదని అందువలన తాము సెలవులను ఆనందంగా గడపటం తప్ప తాము చేసేదేమీ లేదని, విచారణ ఏ రోజున ప్రారంభమయ్యేది చెప్పలేనని సెనెట్‌ సభానాయకుడు మిచ్‌ మెకొనెల్‌ వ్యాఖ్యానించాడు. అయితే సెనేట్‌ వైపు నుంచి ఏం జరుగుతుందో తెలియకుండా తాము తమ ప్రతినిధుల నియామకం చేయలేమని ప్రజాప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ పేర్కొన్నారు. ఇంతవరకు న్యాయసమ్మతంగా ఏమి జరుగుతుందో తమకు కనిపించటం లేదన్నారు. ప్రజాప్రతినిధుల సభలో సాక్ష్యం చెప్పటానికి నిరాకరించిన ట్రంప్‌ యంత్రాంగ అధికారులు నలుగురు సెనెట్‌ విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఈ ప్రతిష్ఠంభనకు కారణంగా చెబుతున్నారు. వారిని రప్పించాలని, ట్రంప్‌ కార్యాలయం తొక్కిపెట్టిన కొన్ని పత్రాలను కూడా సమర్పించాలని కోరుతూ సెనెట్‌లో డెమోక్రటిక్‌ పార్టీ నేత చుక్‌ ష్కమర్‌ గతవారంలో మెకొనెల్‌కు లేఖ రాశారు. ముఖ్యాంశాలను ట్రంప్‌ దాచనట్లయితే ఎందుకు నిరాకరిస్తున్నారని విలేకర్లతో ప్రశ్నించారు. దీనిపై మెకొనెల్‌ ప్రతిస్పందిస్తూ విచారణపై తమకు అభ్యంతరం లేదని, గతంలో రెండు దశాబ్దాల క్రితం బిల్‌ క్లింటన్‌ మీద జరిగినట్లుగానే ఇప్పుడు కూడా జరుపుతామని, న్యాయం అందరికీ ఒకటే కదా అన్నారు.
ఇక్కడే తిరకాసు ఉంది. క్లింటన్‌ విచారణ సమయంలో డెమోక్రాట్‌ సెనెటర్‌ చుక్‌ ష్కమర్‌ అప్పుడే సభలో కొత్తగా అడుగు పెట్టారు. ఆ సమయంలో మెకొనెల్‌ కూడా సభ్యుడే. ఆ సమయంలో విచారణ తీరుతెన్నులపై అప్పుడు తీసుకున్న వైఖరికి విరుద్దంగా రెండు పార్టీల వారూ ఇప్పుడు మాట్లాడుతున్నారు. అభియోగాల గురించి సెనెట్‌లో వాదోపవాదాలు ప్రారంభించటం, రాతపూర్వకంగా ప్రశ్నలను అనుమతించటానికి తగిన వ్యవధి ఇచ్చి వాటి ప్రాతిపదికగా సాక్షులను పిలవాలా లేదా అన్నది నిర్ణయిస్తారు. బిల్‌ క్లింటన్‌ విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు కూడా తాము అదే పద్దతి పాటిస్తామని రిపబ్లికన్లు చెబుతున్నారు. అయితే ముందుగానే ఫలానా వారిని సాక్షులుగా పిలవాలని డెమోక్రాట్లు ఇప్పుడు కోరుతున్నారు. క్లింటన్‌ విచారణ సమయంలో ప్రజాప్రతినిదుల సభలో అన్ని విషయాలు చర్చించినందున సెనెట్‌లో కొత్తగా సాక్షులను విచారించాల్సిందేమీ లేదని అప్పుడు డెమోక్రాట్లు వాదించగా రిపబ్లికన్లు వ్యతిరేకించారు. కనీసం ముగ్గురు కొత్త సాక్షులను విచారించాల్సిందే అన్నారు. ఇప్పుడు విచారణలో కొత్తగా సాక్షులను పిలవాలని డెమోక్రాట్లు కోరుతుండగా అవసరం లేదని రిపబ్లికన్లు అంటున్నారు, దాన్ని నిర్ణయించటానికి సెనెట్‌లో అవసరమైన బలం రిపబ్లికన్లకు ఉంది కనుక ప్రారంభంలోనే అడ్డుకోవాలన్నది వారి ఎత్తుగడ. తన వివాహేతర సంబంధాల గురించి బిల్‌ క్లింటన్‌ అసత్యాలు చెప్పారన్న ఆరోపణపై ఆయనను అభిశంసించారు,1999 ఫిబ్రవరి పన్నెండున క్లింటన్‌ నిర్దోషిగా సెనెట్‌ తీర్మానించింది.
అనేక దేశాలలో ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటం సర్వసాధారణంగా జరుగుతోంది. అమెరికా అందుకు మినహాయింపు కాదు. తమ బలాన్ని, చేసిన దాన్ని చెప్పుకోవటం కంటే ప్రత్యర్దుల బలహీనతలను ముందుకు తెచ్చి ఎదురుదాడి చేయటం ఇటీవలి కాలంలో పెరిగింది. డెమోక్రాటిక్‌ పార్టీనేత జోబిడెన్‌ కుమారుడు ఉక్రెయిన్‌కు చెందిన ఒక గ్యాస్‌ కంపెనీలో పని చేశాడు. ఆసమయంలో పాల్పడిన అక్రమాల వివరాలను తెప్పించుకొని ప్రత్యర్ధిని దెబ్బతీయాలన్నది ట్రంప్‌ ఎత్తుగడ. పార్లమెంట్‌ ఆమోదించిన మేరకు ఉక్రెయిన్‌కు మిలిటరీ సాయం అందించాలంటే తనకు ఆ సమాచారాన్ని ఇవ్వాలని ట్రంప్‌ షరతు పెట్టాడు, ఒత్తిడి తెచ్చేందుకు గాను సాయం అందించకుండా తొక్కి పెట్టాడు. ఈ వ్యవహారం బయటకు వచ్చిన తీరు చూస్తే అంతర్జాతీయ స్ధాయిలో అగ్రనేతలు ఎలా ప్రవర్తిస్తారో అర్ధం అవుతుంది.
జోబిడెన్‌, అతని కుమారుడి అక్రమాల గురించి సమాచారం సేకరించాలని ట్రంప్‌ ఎంతో ముందుగానే పధకం వేశాడన్నది స్పష్టం. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో జరిగిన ఎన్నికలలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడిగా వ్లదిమిర్‌ జెలెనెస్కీ ఎన్నికయ్యాడు. అతడి ప్రమాణ స్వీకారానికి హాజరైన ఐరోపా యూనియన్‌ రాయబారి, ఇంధన శాఖ మంత్రి, ఉక్రెయిన్‌ ప్రత్యేక దౌత్యవేత్తలు ముగ్గురూ తిరిగి వచ్చిన వెంటనే ఉక్రెయిన్‌ అధ్యక్షుడితో కథ నడిపించవచ్చని ట్రంప్‌కు చెప్పారు. అక్కడి నుంచి అసలు కథ ప్రారంభమై అనేక మలుపులు తిరిగింది.ఒక అవగాహన కుదిరిన తరువాత ట్రంప్‌-జెలెనిస్కీ ఫోన్‌ సంభాషణ జరిపారు. ఈ వివరాలను తెలుసుకున్న ఒక ఆకాశరామన్న ఫిర్యాదు చేశాడు. అది తెలిసిన సిఐఏ అధికారి ఒకరు తన ఉన్నతాధికారికి నివేదించాడు. చివరకు ఈ వార్త మీడియాలో వచ్చింది. వెంటనే తొక్కి పెట్టిన మిలటరీ సాయాన్ని విడుదల చేశారు. అధ్యక్షుడి అధికార దుర్వినియోగంపై అభిశంసన జరపాలని డెమోక్రాట్లు డిమాండ్‌ చేశారు. ఆ మేరకు సెప్టెంబరు 24న విచారణకు శ్రీకారం చుట్టారు, డిసెంబరు 19న ప్రజాప్రతినిధుల సభలో అభి శంసన తీర్మానాన్ని ఆమోదించారు. విచారణకు హాజరైన సాక్షులు తమను ట్రంప్‌ ఎలా బెదిరించిందీ వివరించారు, విచారణను అడ్డుకునేందుకు ప్రయత్నించటాన్ని వెల్లడించారు. నాకిది నీకది అనే పద్దతుల్లో ట్రంప్‌-ఉక్రెయిన్‌ అధ్యక్షుడి మధ్య సంభాషణలు నడిచాయని తేలింది.

Image result for donald trump impeachment- narendra modi commendation
ప్రజాప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ఆమోదం పొందింది.సెనెట్‌ ముందుకు రావటం, అది అక్కడ వీగిపోవటం లాంఛనమే. అందువలన ఒక వేళ ఆమోదం పొందితే, రాజ్యాంగంలో పేర్కొన్న వరుస ప్రకారం ఉపాధ్యక్షుడు అధ్యక్షుడు అవుతారు. ఒక వేళ ఉపాధ్యక్షుడు లేకపోతే ఎవరు కావాలో ఒక జాబితా ఉంది, సెనెట్‌లో తీర్మానం ఆమోదం పొందే అవకాశం లేదు గనుక ఆ వివరాలు అవసరం లేదు. సాంకేతికంగా ట్రంప్‌కు ఎలాంటి ఢోకాలేనప్పటికీ నైతికంగా ఇది పెద్ద ఎదురు దెబ్బ. అనేక సర్వేలలో ట్రంప్‌ పరిస్ధితి బాగోలేదని తేలినప్పటికీ పుంజుకుంటున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమౌతున్నాయి. తాజాగా సిఎన్‌ఎన్‌ జరిపిన సర్వేలో ప్రతిపక్ష డెమోక్రాట్‌ జోబిడెన్‌కు 49శాతం మంది, ట్రంప్‌కు 44శాతం మద్దతు ఇస్తున్నారని వెల్లడైంది. అక్టోబరు కంటే ఐదు పాయింట్లు డెమోక్రాట్లకు తగ్గినట్లు పేర్కొన్నది. ప్రజాప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ఆమోదం పొందిన కొద్ది గంటల్లో జరిపిన ఒక ఫోన్‌ సర్వేలో 53శాతం మంది ట్రంప్‌ అదికార దుర్వినియోగానికి పాల్పడినట్లు, విచారణను అడ్డుకునేందుకు ప్రయత్నించినట్లు 51శాతం మంది అభిప్రాయ పడ్డారు.
ఈ అక్రమం వెలుగులోకి వచ్చిన తరువాత అమెరికా సమాజంలోని పలు తరగతుల నుంచి తీవ్రమైన వత్తిడి, నిరసన వ్యక్తమైన కారణంగానే ప్రజాప్రతినిధుల సభ విచారణకు స్వీకరించాల్సి వచ్చిందనే అంశాన్ని మరచిపోరాదు. ప్రతిపక్షమే తేల్చుకుంటుందిలే అని ఉపేక్షించలేదు. ఇటీవలి కాలంలో అసంతృప్తికి గురవుతున్న యువత, వివిధ తరగతుల ప్రజానీకం వీధుల్లోకి వస్తున్నది.ట్రంప్‌ అక్రమాల గురించి మీడియాలో వెల్లడై అమెరికన్‌ సమాజంలో తీవ్ర నిరసన వ్యక్తమౌతున్న తరుణంలో మన ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్లి హౌడీ మోడీ కార్యక్రమం పేరుతో ట్రంప్‌కు మద్దతు పలికి, తిరిగి అధికారానికి రావాలని కోరి వచ్చారు. అక్కడి భారతీయులందరూ ట్రంప్‌కు మద్దతు ఇవ్వాలని చెప్పారు. ఒక అధ్యక్షుడిగా మీకు డోనాల్ట్‌ ట్రంప్‌ వంటి మిత్రుడు మరొకరు లేరు అని చెప్పగలను అని నరేంద్రమోడీ చెప్పారు. దానికి ప్రతిగా నరేంద్రమోడీ భారత దేశ పిత అని ట్రంప్‌ కితాబు ఇచ్చిన విషయం తెలిసిందే. నీవెలాంటి వాడివో తెలుసుకోవాలంటే నీ స్నేహితులను చూస్తే చాలు అన్న లోకోక్తి తెలిసిందే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ నియంత – ది న్యూయార్క్‌ర్‌ !

23 Monday Dec 2019

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

CAA, India citizenship amendment act 2019, Narendra Modi an authoritarian, NRC

Image result for Narendra Modi authoritarian, protest keralaఎం కోటేశ్వరరావు
”భారత ఆర్ధిక సంస్కరణకు మంచి భవిష్యత్‌ నరేంద్రమోడీ అని నేను వాదించాను. ఇప్పుడు సంగతులు మారిపోయాయి.” అని చెప్పాడు ది టైమ్‌ జర్నలిస్టు ఇయాన్‌ బ్రెమర్‌. నరేంద్రమోడీ నియంతగా మారారు అని ది న్యూయార్క్‌ర్‌ అనే పత్రిక జర్నలిస్టు డెక్సటర్‌ ఫిల్‌కిన్స్‌ వ్యాఖ్యానించారు.
”వివాదాస్పద పౌర సత్వ బిల్లును ఆమోదించటంతో భారత్‌ అంతటా నిరసనలు చెలరేగాయి. దేశ లౌకిక రాజ్యాంగానికి పెద్ద ఒక పెద్ద సవాలుగా భారత్‌ తన 20కోట్ల ముస్లిం మైనారిటీలలో కొందరిని సులభంగా జైల్లో పెట్టటానికి, బయటకు పంపివేయటానికి సులభతరం గావించేందుకు పూనుకుంది.” అని ఈనెల 20న అమెరికాలోని ప్రముఖ పత్రిక టైమ్‌ విదేశీ వ్యవహారాల సంపాదకుడైన ఇయాన్‌ బ్రెమర్‌ రాసిన విశ్లేషణ, దాని సారాంశంగా రాసిన వాక్యాలను పైన చూశాము. వెంటనే మన దేశంలోని కాషాయతాలిబాన్లు దీని వెనుక పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వామపక్షాలు, కాంగ్రెస్‌ అని వెంటనే వాట్సాప్‌ యూనివర్సిటీ, అసహ్యంగా కనిపించే ఫేస్‌బుక్‌ వంటి వాటిలో దాడులు మొదలు పెడతారని వేరే చెప్పనవసరం లేదు. వాటిని గుడ్డిగా నమ్మే జనానికి మనం చెప్పాల్సిందేమంటే మగాను భావులారా అరచేతిని చూసుకొనేందుకు అద్దం అవసరం లేదు.
”తన ప్రజాస్వామ్యానికి ఉన్న పరిమితులను పరీక్షించుకొనేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నండగా తన పరిమితులు ఏమిటో ప్రపంచానికి చూపేందుకు భారత్‌ తీరిక లేకుండా ఉంది. పొరపాటు చేయవద్దు. మానవతా పూర్వక దృక్కోణంలో చూస్తే ప్రత్యేకించి దేశంలో దాదాపుగా ఉన్న 20కోట్ల మంది ముస్లింలకు భారత్‌లో ఇప్పుడు జరుగుతున్నది విషాదం. అయితే ఇది పనిచేస్తున్న, సంఘటితమైన ప్రజాస్వామ్యానికి, తన 140 కోట్ల మంది పౌరులకు అవసరమైన సేవలు, అవకాశాలను కల్పించగల ఆధునిక మరియు సంక్లిష్ట ఆర్ధిక వ్యవస్ధ ఉన్న భారత భవిష్యత్‌కు సైతం విషాదమే.”
పైన పేర్కొన్న విధంగా తన విశ్లేషణను ప్రారంభించిన బ్రెమర్‌ గతలోక్‌ సభ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు మే ఒకటవ తేదీ టైమ్‌ సంచికలో తాను నరేంద్రమోడీ గురించి ప్రశంసా పూర్వకంగా రాసిన అంశాలను ఉటంకించారు. గత కొద్ది నెలలుగా(అంటే రెండవ సారి మోడీ అధికారానికి వచ్చిన తరువాత) మరమ్మతులు చేయటానికి వీలులేని విధంగా ఆ ప్రతిమ దెబ్బతిన్నది అని వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల కారణంగా తమ పౌరులు భారత ప్రయాణాల గురించి జాగ్రత్తలు తీసుకోవాలని అమెరికాతో సహా అనేక పశ్చిమ దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి. టైమ్‌ వంటి కార్పొరేట్‌ పత్రికలు ఇలా రాసిన తరువాత మన దేశంలో పెట్టుబడులు పెట్టేవారు వాటిని పట్టించుకోకుండా ఉంటారా, హెచ్చరికలుగా తీసుకోరా ? ప్రశాంతంగా ఉన్న ప్రాంతాలకే పెట్టుబడిదారులు బారులు తీరతారు. బిజెపి మరియు నరేంద్రమోడీ మన దేశాన్ని ప్రశాంతంగా ఉంచేందుకు, తాము చెప్పిన మంచి రోజులను తెచ్చేందుకు లేదా ఇంకా దిగజార్చేందుకు చూస్తున్నారో ఎవరికి వారు విశ్లేషించుకోవాలి.

Image result for Narendra Modi authoritarian
ఇయాన్‌ బ్రెయిన్‌ తన విశ్లేషణ ముగింపులో పేర్కొన్న అంశాలు ఇప్పటి వరకు బుర్రలకు పని పెట్టని వారికి ఎంతో ఉపయోగపడతాయి. వాటి సారాన్ని ఇలా చెప్పుకోవచ్చు.(అనుమానాలు ఉన్నవారు, ఆసక్తి కలిగిన వారికి వీలుగా లింక్‌ కూడా ఇస్తున్నాను)https://time.com/5753624/india-narendra-modi-nationalism/ ” భారత్‌ రాజకీయాల్లో స్ధిరపడిపోయిన వ్యక్తులతో విసిగిపోయిన కారణంగా అద్బుతమైన ప్రచారంతో 2014లో బిజెపి, నరేంద్రమోడీ అధికారానికి వచ్చారు. అధికారానికి వచ్చారు గనుక తన పెరుగుదలకు తోడ్పడిన హిందూ జాతీయ వాదం నుంచి పక్కకు తప్పుకొని పాలనా బాధ్యతలను స్వీకరిస్తారని కొంత మంది ఆశించారు. అయితే భారత ఆర్ధిక వ్యవస్ధ మందగించటం ప్రారంభమైన తరువాత 2019లో తన విజయం కోసం హిందూ జాతీయవాదం వైపు తిరిగారు. ఆర్ధిక అంశాలను నిర్లక్ష్యం చేశారు. ప్రభుత్వ విధానంలో జాతీయవాదం ప్రముఖపాత్రను తీసుకుంది. రాజ్యాంగబద్దంగా ఆదేశించిన లౌకిక ప్రజాస్వామ్యాన్ని ప్రత్యక్షంగా సవాలు చేయటం ప్రారంభించింది. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హౌదాను రద్దు చేసింది. ఒక ప్రజాస్వామిక వ్యవస్ధలో ఇంటర్నెట్‌ను సుదీర్ఘకాలం మూసివేసిన ప్రభుత్వంగా అంతర్జాతీయంగా పతాక శీర్షికలకు ఎక్కింది. జాతీయ పౌరుల నమోదు(ఎన్‌ఆర్‌సి) అమలును ముందుకు తెచ్చింది. ఈ కారణంగా అసోంలో దాదాపు 20లక్షల మంది తమ పౌరసత్వాన్ని కోల్పోయారు. తాజా నమోదులో పౌరసత్వం కోల్పోయిన వారిలో పన్నెండు లక్షల మంది హిందువులే ఉన్నట్లు తేలింది. ఇది ముస్లింలు కాని ఇరుగుపొరుగు దేశాల నుంచి వలస వచ్చిన వారికి పౌరసత్వం కల్పించాలనే చట్టాన్ని చేసేందుకు పురికొల్పింది. అక్రమంగా వలస వచ్చిన ముస్లింలను వెనక్కు పంపాలని బిజెపి డిమాండ్‌ చేసింది, బంగ్లాదేశ్‌ వారిని వెనక్కు తీసుకొనేందుకు అంగీకరించే అవకాశం లేదు.” అని బ్రెమర్‌ పేర్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికల సమయంలో బిజెపి ముందుకు తెచ్చిన అంశాల గురించి వామపక్షాలు ఎన్నో హెచ్చరికలు చేశాయి. ప్రస్తుతం బిజెపి పోకడలకు వ్యతిరేకంగా ఆందోళనలకు ముందుకు వచ్చిన వారితో సహా ఎక్కువ మంది వాటిని ఖాతరు చేయలేదు. ఎన్నికల ఫలితాలు రాకముందే అమెరికా టెలివిజన్‌ సిఎన్‌ఎన్‌ ప్రతినిధి గతంలో ఎన్నడూ లేని దానికంటే దేశాన్ని ఎన్నికలు మరింతగా విడదీశాయంటూ ఒక విశ్లేషణ రాశారు. బిజెపి, నరేంద్రమోడీ తీరుతెన్నులు, ప్రచార సరళిలో వచ్చిన మార్పును వర్ణిస్తూ 2014లో కొద్ది మందిని మాత్రమే లక్ష్యంగా చేసుకున్న పరిమిత హిందూ జాతీయవాద శబ్దాలను ఇప్పుడు దేశమంతా వినిపించే లౌడ్‌ స్పీకర్లు అక్రమించాయని పేర్కొన్నారు( ఆంగ్లంలో- డాగ్‌ విజిల్‌ వస్‌ రిప్లేస్‌డ్‌ బై ఏ బుల్‌హారన్‌). ఎన్నికల ఫలితాల తరువాత నరేంద్రమోడీ విజయం భారతీయ ఆత్మకు చెడు అని లండన్‌ నుంచి వెలువడే గార్డియన్‌ పత్రిక వ్యాఖ్యానించింది. ఎవరి మీద అయినా మరులు గొన్నపుడు మనం మంచి చెడ్డలు, ఎలాంటి వారమో కూడా పట్టించుకోము. ఎవరి హెచ్చరికలను పట్టించుకోము.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను అంతర్జాతీయ మీడియా ప్రముఖంగానే వార్తలుగా ఇస్తోంది. అవి పెడుతున్న శీర్షికలు వాటి అవగాహన, అభిప్రాయాలను ప్రతిబింబిస్తున్నాయి. ” పెల్లుబుకుతున్న ఆగ్రహం, హిందూ రాజ్యంగా మారేందుకు భారత్‌ దగ్గర అవుతోందా ?” అని అమెరికా నుంచి వెలువడే న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొన్నది. ముస్లింలను మినహాయించటం ద్వారా మౌలికంగా వివక్షా పూరితమైనదని, దాన్ని సమీక్షించాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్‌ చేసిన వ్యాఖ్యను ఉటంకించింది. దేని మీదా ఏకీభావానికి రాని ప్రతిపక్షాలు ఒక్కటయ్యాయని వ్యాఖ్యానించింది.
బ్రిటన్‌ నుంచి వెలువడే గార్డియన్‌ పత్రిక మూడు వార్తలను ప్రచురించింది. వాటిలో ఒక దాని శీర్షిక ఇలా ఉంది.” భారత పౌరసత్వ చట్టం: తీవ్ర అణచివేత మోడీ వ్యతిరేకులను ఐక్యపరచవచ్చు” నిరసనల తీవ్రత గురించి వ్యాఖ్యానిస్తూ నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన ఆరు సంవత్సరాల తరువాత వెల్లడైన ముఖ్యమైన నిరసన అని పేర్కొన్నది.
నరేంద్రమోడీ చివరకు చాలా దూరం పోయారా అని న్యూయార్కర్‌ అనే పత్రిక విశ్లేషించింది.” ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న ప్రదర్శనలు రాజకీయాల్లో ఇప్పుడో తరువాతో నియంతలు చాలా దూరం ప్రయాణిస్తారు అని ఎంతగానో నమ్మిన పురాతన సిద్దాంతాన్ని క్రమబద్దీకరించాయి. ఈ ఉదంతంలో నియంత నరేంద్రమోడీ, భారత ప్రధాని ” అని పేర్కొన్నది.డెక్సటర్‌ ఫిల్‌కిన్స్‌ రాసిన విశ్లేషణలో ప్రధాని నాయకత్వం వహిస్తున్న హిందూ జాతీయవాద ప్రభుత్వం ఇరవై కోట్ల ముస్లింలను అంతర్గత శత్రువులుగా మలచింది అని వ్యాఖ్యానించారు.

Image result for Narendra Modi authoritarian
అంతర్జాతీయ మీడియాలో వెల్లడైన అభిప్రాయాలలో ఇవి కొన్ని మాత్రమే. భారత రాజకీయాలు ఏవైపు పయనిస్తున్నాయనే చర్చ మరోసారి ప్రపంచంలో ప్రారంభమైంది. మన దేశంలో సరేసరి. నరేంద్రమోడీ నియంతా, ఫాసిస్టా, మరొక ప్రమాదకారా ఏ తరగతికి చెందుతారు అన్న అంశంపై అనేక మందిలో ఏకీభావం ఉండకపోవచ్చు. మన విభేదాలను తరువాత చూద్దాం, ఈ అన్ని లక్షణాలు కలిగిన శక్తిని ముందు వ్యతిరేకిద్దాం అనే ఏకాభిప్రాయ క్రమం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఓట్ల రాజకీయంలో బిజెపి పోటీ పడి అది ముందుకు తెస్తున్న మతోన్మాదంతో రాజీపడుతున్న రాజకీయ పార్టీల పట్ల కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో హిందూ జాతీయవాదాన్ని ప్రత్యక్షంగా కాకపోయినా దానికి ప్రాతినిధ్యం వహించే నరేంద్రమోడీ సర్కార్‌ను బలపరిచేందుకు పోటీ పడుతున్న తెలుగుదేశం, వైసిపి వంటి పార్టీలు తమ వైఖరిని పునరాలోచించుకుంటాయా లేదా అన్నది ఇప్పుడు ఒక ప్రశ్న. వాటి వెనుక ఉన్న మైనారిటీ తరగతుల వారు ఆలోచనలో పడుతున్నారు. ఒక మెజారిటీ మతోన్మాద శక్తిని ఎదుర్కొనేందుకు మరొక మైనారిటీ మతోన్మాదశక్తి వెనుక సమీకరణ కావటం, బలపరచటం కూడా ప్రమాదకరమే. అలాంటి మొగ్గునే మెజారిటీ మతశక్తులు కోరుకుంటున్నాయి. ఆ ఊబిలో ఎప్పుడు దిగుతారా అని చూస్తున్నాయి. ఎందుకంటే దాన్ని చూపి మెజారిటీ మద్దతును కూడగట్టుకోవటం సులభం కనుక ప్రస్తుతం తీవ్ర ఆందోళనలో ఉన్న మైనారిటీలు జాగ్రత్తగా ఉండటం కూడా అవసరమే. లౌకిక, వామపక్ష భావాలవైపు సమీకృతమై ఉమ్మడిగా లౌకిక రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకొనేందుకు పూనుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మూడు రాజధానులతో అభివృద్ది-మూడు ఎండమావులు !

19 Thursday Dec 2019

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

Aandhra Pradesh three Capitals, Amaravathi capital, ANDHRA PRADESH Capital Politics, Andhrapradesh new Capitol

Image result for three capitals

ఎం కోటేశ్వరరావు
ఆంధ్రప్రదేశ్‌లో ఐదేండ్ల క్రితం ప్రారంభమైన రాజధాని రాజకీయం కొత్త పుంతలు తొక్కింది. అది కూడా రాజధానికి-అభివృద్ధికి ముడి పెట్టటం, ఇది ప్రపంచంలో ఎనిమిదో వింత అని చెప్పక తప్పదు. తెలుగుదేశం గత ఐదేండ్ల పాలనలో భ్రమరావతిగా ఒక్క అమరావతినే చూపారు. ఇప్పుడు అభివృద్ది వికేంద్రీకరణ, అభివృద్ది పేరుతో మరో రెండు భ్రమరావతులను ప్రదర్శించేందుకు వైసిపి ఆరునెలల పాలన నాంది పలికిందా అన్న అనుమానాలు తలెత్తాయి. దీనిపై అధికారిక నిర్ణయం ఇంకా వెలువడలేదు గనుక దీని మంచి చెడ్డల పరిశీలన కూడా ఆ పరిమితుల్లోనే ఉంటుంది.
కన్యాశుల్కంలో తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అని అగ్నిహౌత్రావధానులు ఆంటాడు. డిసెంబరు17న అసెంబ్లీలో మాట్లాడుతూ మూడు రాజధానులు రావచ్చునేమో అన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ప్రకటన ద్వారా తాంబూలాలతో నిమిత్తం లేకుండానే తన్నుకు చచ్చేందుకు తెరతీశారు. అప్పుడే నిర్ణయం జరిగిపోయినట్లుగా విశాఖ, కర్నూల్లో హార్షాతిరేకాలు వ్యక్తం చేస్తుండగా తమను మోసం చేశారంటూ అమరావతిలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బంద్‌ చేశారు. అమరావతిలో అసెంబ్లీ, కర్నూలులో హైకోర్టు, విశాఖలో సచివాలయం అని వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చెప్పేశారు.

Image result for three capitals
ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతో మరొకరో , మీడియా ఊహాగానాల్లోనో ఉన్నరాజధానిపోవచ్చు, కొత్త రాజధానులు రావచ్చేమో అంటే అదొక తీరు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే అసెంబ్లీలో వచ్చు భాష మాట్లాడితే దాన్ని రాజకీయం తప్ప అని మరొకటి అనలేరు. రాజధాని అమరావతితో సహా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సూచనలు చేసేందుకు ఐదుగురు పట్టణ ప్రణాళికల నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. పట్టణాల నిపుణులు రాష్ట్ర అభివృద్ధి, అమరావతి గురించి ఏమి చెబుతారో తెలియదు. వివిధ తరగతుల నుంచి అభిప్రాయలు సేకరించారు గనుక ఏదో ఒకటి చెబుతారనుకుందాం. కొద్ది రోజుల్లో అలాంటి నివేదిక ఇవ్వబోతున్నారని వార్తలు వచ్చాయి. రాకముందే రాజధానులు మూడు వుండవచ్చు అని సిఎం చెప్పేశారంటే నివేదికలో అలాగే ఇమ్మని ముందుగానే ఉప్పందించారనే అనుకోవాలి. ఒక వేళ దానికి భిన్నంగా ఇస్తే ఏమిటి అన్నది ప్రశ్న !
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు పాలకులు తలచుకొంటే ఏదీ అసాధ్యం కాదు. కమిటీల నివేదికల సిఫార్సులకు, పాలకుల నిర్ణయాలకు సంబంధం లేదు. రాజధాని గురించి గతంలో శివరామకృష్ణ కమిటీ చేసిన సిఫార్సులను పక్కన పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం తన స్వంత నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు రోగి కోరుకున్నదే వైద్యుడు రాసి ఇచ్చినట్లుగా వైసిపి ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్సు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. భిన్నంగా ఇస్తే చంద్రబాబు చెప్పుల్లో కాళ్లు పెట్టి వైఎస్‌ జగన్‌ స్వంత నిర్ణయాలు తీసుకోవచ్చు.
ఎన్నో తర్జన భర్జనలు, తెరవెనుక మంత్రాంగాలు, లావాదేవీలు పూర్తయ్యాక అక్కడా, ఇక్కడా అని చెప్పిన పుకార్ల వ్యాప్తి, శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సుల తరువాత వాటికి భిన్నంగా రాజధాని నిర్మాణానికి చివరకు అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేశారు. దానికి ప్రతిపక్షంగా ఉన్న వైసిపి, దానికి నేతగా ఉన్న జగన్మోహన్‌ రెడ్డి కూడా అంగీకరించారు. అప్పుడు జగన్‌ ఆయన పరివారానికి ‘ ఇంగ్లీషు, తెలుగు ‘ భాష వచ్చు అయినా ఆ సమయంలో అధికార వికేంద్రీకరణ, భిన్న రాజధానుల గురించి మాట్లాడలేదు. ఎన్నికల ప్రణాళికలో అలాంటి ఊసు లేదు. అసెంబ్లీలో అంగీకరించినా జగన్‌ అధికారానికి వస్తే రాజధానిని మార్చివేస్తారని తెలుగుదేశం ప్రచారదాడి చేసింది. చంద్రబాబు రాజధానిలో స్దిరనివాసం ఏర్పరచుకోలేదు, మానేత తాడేపల్లిలో ఏకంగా ఇల్లుకట్టుకున్నారు, అలాంటి వ్యక్తి అమరావతి నుంచి రాజధానిని ఎలా మారుస్తారని వైసిపి నేతలు ఎదురుదాడి చేశారు. ఆయనే ఇప్పుడు అధికారపీఠమెక్కారు. చంద్రబాబు అధికారానికి వచ్చిన ఆరునెలల తరువాత రాజధాని మీద నిర్ణయం తీసుకుంటే, వైఎస్‌ జగన్‌ కూడా సరిగ్గా ఆరునెలల తరువాతే రాజధాని గురించి తన మన్‌కీ బాత్‌ వెల్లడించారు. అదియును సూనృతమే ఇదియును సూనృతమే అన్నట్లుగా బిజెపి నేతల మాటలు ఉన్నాయి.

Image result for three capitals
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. మరో నాలుగున్నర సంవత్సరాల తరువాత మరో పార్టీ, ముఖ్య మంత్రి అధికారానికి వస్తే మూడింటితో అభివృద్ధి ముడిపడలేదు, మూడును పదమూడు చేస్తా అంటే ? వంతుల వారీగా ప్రతి జిల్లాలోనూ రాజధానులను ఏర్పాటు చేయవచ్చు. వారికి పోయేదేముంది. వారు లేదా వారి అనుయాయులుగా ఉన్న వారి రియలెస్టేట్‌ ప్రయోజనాలు కదా ముఖ్యం. గుడ్డిగా సమర్ధించే మద్దతుదారులు ఎలాగూ ఉంటారు. గతంలో చంద్రబాబు వాషింగ్టన్‌, కౌలాలంపూర్‌, సింగపూర్‌ ఇలా ఏ నగరం పేరు చెప్పి అలాంటి నగరాల మాదిరి ప్రపంచ స్ధాయి రాజధానిని నిర్మిస్తామంటే తెలుగుదేశం మద్దతుదారులు, అభిమానులు బుర్రలను తీసి పక్కన పెట్టి తలలు ఊపారు. మూడు ప్రాంతాలలో రాజధానులు ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని జగన్మోహన్‌ రెడ్డి చెబుతుంటే ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. తేడా రంగులు, అభిమానులు మారారంతే !
రాజధాని రాజకీయంలో చంద్రబాబు కొన్ని నగరాల పేర్లను ముందుకు తెస్తే జగన్మోహన్‌రెడ్డి రాజధాని రాజకీయానికి దక్షిణాఫ్రికా దేశాన్ని తెరమీదకు తెచ్చారు. సినిమా ఇంటర్వెల్‌ వరకే చెప్పి ముగింపు చెప్పకపోతే ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రికి దక్షిణాఫ్రికా కధను చెప్పిన వారు అదే పని చేశారు. జాత్యంహార వ్యవస్ధ చిహ్నాలుగా ఉన్న మూడు రాజధానులకు బదులు సరికొత్త రాజధాని నిర్మాణం జరపాలనే ప్రతిపాదన ముందుకు వచ్చినట్లు చెప్పలేదు. వందిమాగధులు రాజుగారికి ఇష్టమైన అంశాలనే చెప్పేవారు. ఇప్పుడు వారి స్ధానాన్ని ప్రభుత్వ సలహాదారులు అక్రమించారు కనుక సగమే చెప్పి ఉండాలి.
దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులుంటే రెండు రాజధానులున్న దేశాల మరో డజను వరకు ఉన్నాయి. అసలు రాజధానికి ప్రత్యేకంగా ఒక నగరమంటూ లేకుండానే ఒక మున్సిపల్‌ జిల్లాలోని ఒక పట్టణంలో రాజధాని కలిగి ఉన్న హొండూరాస్‌ గురించి సలహాదారులకు తెలిసినా చెప్పి ఉండరు. రాజధాని-అభివృద్ధి గురించి చర్చించబోయే ముందు సిఎం ప్రకటనతో దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఎందుకున్నాయని అనేక మందిలో ఉత్సుకత తలెత్తింది. కేప్‌టౌన్‌లో పార్లమెంట్‌, ప్రిటోరియాలో పాలనా యంత్రాంగం, న్యాయవ్యవస్ధ కేంద్రంగా బ్లోయెమ్‌ ఫోంటెన్‌ ఉంది.
నేడు దక్షిణాఫ్రికాగా పిలుస్తున్న ప్రాంతాన్ని 1657లో డచ్‌ ఈస్టిండియా కంపెనీ ఆక్రమించింది. తరువాత డచ్‌వారు ఆ ప్రాంతాన్ని 1806లో బ్రిటీష్‌ వారికి ధారాదత్తం చేశారు. డచ్‌ పాలనా కాలంలో డచ్‌ జాతీయుల ఆధిపత్యంలోని ఆరు ప్రాంతాలకు స్వయంప్రతిపత్తి ఇచ్చారు. వాటిని బోయర్‌ రిపబ్లిక్‌లని పిలిచారు. వాటిలో దక్షిణాఫ్రికా, ఆరెంజ్‌ ఫ్రీ స్టేట్‌ అనే రిపబ్లిక్‌లు పెద్దవి. బ్రిటీష్‌ వారు పెత్తనానికి వచ్చిన సమయంలో ఇచ్చిన హామీలు లేదా యథాతధ స్ధితిని కొనసాగించటానికి భిన్నంగా బోయర్‌ రిపబ్లిక్‌ల మీద తమ ఆధిపత్యాన్ని నెలకొల్పే ప్రయత్నంలో బోయర్‌ రిపబ్లిక్‌లు ప్రతిఘటించాయి. వాటినే ఆంగ్లో-బోయర్‌ యుద్ధాలు అని పిలిచారు. చివరికి 1910లో బ్రిటీష్‌ వారు పాక్షిక స్వాతంత్య్రం, బ్రిటీష్‌ ప్రాంతాలు-బోయర్‌ రిపబ్లిక్‌లతో కూడిన ఒక యూనియన్‌ ఏర్పాటు చేశారు. అప్పుడు కుదిరిన ఒప్పందం ప్రకారం వారికి చెందిన రెండు పెద్ద పాలిత ప్రాంతాల రాజధానులలో ,బ్రిటీష్‌ వారి రాజధానిలో ఒక్కొక్క చోట ఒక్కో విభాగాన్ని ఏర్పాటు చేయాలనే నిబంధన అమల్లో భాగంగా పైన చెప్పుకున్న మూడు రాజధానులు ఉనికిలోకి వచ్చాయి.
1934లో పూర్తి స్వాతంత్య్రం వచ్చింది. డచ్‌, బ్రిటీష్‌ వారు ఎవరు అధికారంలో ఉన్నా వారు స్ధానిక ఆఫ్రికన్ల పట్ల జాత్యహంకారంతో వ్యవహరించారు. ఆ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరుతో చివరకు జైలు నుంచి నెల్సన్‌ మండేలా విడుదల, 1994 ఎన్నికల్లో ఎఎన్‌సి విజయంతో జాత్యహంకార పాలన ముగిసింది. ఆ వ్యవస్ధ చిహ్నాలుగా ఉన్న రాజధానుల స్ధానంలో ఒక చోట కొత్త రాజధాని నిర్మాణం జరపాలని అనేక మంది కోరారు. అయితే దాని కంటే ఇతర ప్రాధాన్యతలకు నిధులు అవసరమైనందున ఆప్రతిపాదనను పక్కన పెట్టి ఉన్న వ్యవస్ధలనే కొనసాగిస్తున్నారు.
ఈ నేపధ్యంలో దక్షిణాఫ్రికా అనుభవం నుంచి ఏమి నేర్చుకోవాలి? మూడు చోట్ల ఉన్నవాటిని ఒక చోటకు చేర్చాలంటే వారికి నిధుల సమస్య ఎదురైంది. తాత్కాలికంగా అయినా వాయిదా వేసుకున్నారు. అప్పులు, ఆర్ధిక ఇబ్బందుల గురించి చెబుతున్న జగన్మోహన్‌ రెడ్డి ఉన్న ఒక రాజధానిని మూడుకు పెంచవచ్చని చెప్పటం గమనించాల్సిన అంశం. ప్రస్తుతం ఉన్న రాజధానిలో పాలన సాగించటానికి ఎలాంటి ఇబ్బంది లేదు. తాత్కాలిక కట్టడాలుగా ఉన్నవాటినే ఉపయోగపడినంత కాలం శాశ్వతంగా మార్చినా పోయేదేమీ లేదు. ఇప్పటి వరకు సామాన్య జనానికి లేని ఇబ్బంది కొత్తగా వచ్చేదేమీ ఉండదు.
ఎన్ని రాజధానులు ఉండాలి అనేది దేశాలన్నింటా ఒకే విధంగా లేదు. నెదర్లాండ్స్‌ రాజధాని ఆమస్టర్‌ డామ్‌. మరో పట్టణం హేగ్‌ వందల సంవత్సరాలుగా రాజధానిగా ఉంది. బొలీవియాలో లాపాజ్‌ మరియు సకురే పట్టణాలను రాజధానులుగా పరిగణించి అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని శాఖలను పని చేయిస్తున్నారు. 19వ శతాబ్దంలో తలెత్తిన విబేధాల కారణాంగా ఇలా చేశారు.కోట్‌ డిలోవరీ అనే ఆఫ్రికన్‌ దేశం అధికారిక రాజధాని యెమౌసుకోరో, అయితే ప్రభుత్వం మాత్రం అబిడ్‌జాన్‌లో ఉంటుంది. అధికారికంగా రాజధాని కాదు. బెనిన్‌ అనే దేశ రాజధాని పోర్టో నోవా, కానీ పాలన మాత్రమ కోటోనౌ పట్టణం నుంచి జరుగుతుంది. చిలీ రాజధాని శాంటియాగో, కానీ 1990లో పార్లమెంట్‌ను వలపారిసోకు తరలించారు. పూర్వపు సోవియట్‌ రిప్లబిక్‌గా ఉండి ఇప్పుడు స్వతంత్ర దేశమైన జార్జియా రాజధాని తిబిలిసి, పార్లమెంట్‌ మాత్రం కుటారుసిలో ఉంది. హొండురాస్‌ అనే దేశానికి అసలు దేశ రాజధాని పట్టణం లేదు. సెంట్రల్‌ డిస్ట్రిక్ట్‌ మున్సిపాలిటీ అనే పాలనా ప్రాంతంలో తెగుసియోగాల్పా అనే పట్టణం నుంచి పాలన సాగుతుంది. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌, అయితే 1999లో పుత్ర జయ అనే పట్టణానికి తరలించారు. మాంటెనీగ్రో అనే దేశ రాజధాని పోడ్‌గార్సియా. అయితే మాజీ రాజధాని అయిన సెటినిజేను గౌరవ రాజధానిగా పరిగణిస్తున్నారు. దక్షిణ కొరియాకు రెండు రాజధానులున్నాయి. సియోల్‌ పట్టణం రద్దీగా మారినందున 2012 నుంచి సిజోంగ్‌ పట్టణాన్ని పాలనా రాజధానిగా చేశారు. శ్రీలంక రాజధాని కొలంబో అయితే శివార్లలో జయవర్ధనే పుర కొటే అనే చోట రాజధాని నిర్మాణం చేశారు. స్వాజీలాండ్‌ అనే దేశంలో కార్యాలయాలు మబాబ్‌నేలో ఉంటే లొబాంబాలో పార్లమెంట్‌ ఉంది. టాంజానియా రాజధాని దారెస్‌ సలామ్‌, అయితే దేశంలో మధ్యలో ఉండే డోడోమాకు 1973లో రాజధానిని మార్చారు. పశ్చిమ సహారాలో అంతర్యుద్ధం జరుగుతున్నది. రెండు ప్రధాన పక్షాలు రెండు ప్రాంతాలను తమ రాజధానులుగా ప్రకటించకున్నాయి. మొరాకో తన రాజధాని లాయునే అంటే సహరావీ అరబ్‌ రిపబ్లిక్‌ టిఫారిటీని రాజధానిగా పరిగణిస్తుంది.
మన దేశంలో రద్దయిన కాశ్మీర్‌కు,మహారాష్ట్రకు రెండు రాజధానులు ఉన్నాయి. చలికాలంలో శ్రీనగర్‌లో మంచు కారణంగా జమ్మూలో రాజధాని పని చేస్తుంది. స్వాతంత్య్రానికి ముందు తరువాత సెంట్రల్‌ ప్రావిన్సుగా ఉన్న ప్రాంతానికి రాజధాని నాగపూర్‌. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఏర్పడిన మహారాష్ట్రలో నాగపూర్‌ ఉన్న విదర్భ ప్రాంతాన్ని విలీనం చేశారు. రాజధాని ముంబైలో ఉంటే తమ ప్రాంత అభివృద్ధి కుంటుపడుతుందేమో అన్న భయం ఆప్రాంత జనంలో ఏర్పడటంతో నాగపూర్‌ను అనుబంధ రాజధానిగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక అసెంబ్లీ సమావేశాన్ని అక్కడ జరుపుతారు.
మద్రాస్‌ ప్రావిన్సు నుంచి తెలుగు ప్రాంతాలను విడదీసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నపుడు రాయలసీమనేతలు లేవనెత్తిన సందేహాలను తీర్చేందుకు శ్రీబాగ్‌ ఒప్పందంలో భాగంగా కర్నూలులో రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేశారు. అందరికీ అందుబాటులో విజయవాడలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కూడా ఉంది. అయితే విజయవాడ ప్రాంతంలో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్నందున అక్కడ రాజధాని ఏర్పాటుకు కాంగ్రెస్‌ నేతలు వ్యతిరేకించారు. అయితే ఆ ప్రాంతాన్ని సంతృప్తి పరచేందుకు గుంటూరులో హైకోర్టును ఏర్పాటు చేశారు. తరువాత ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు సమయంలో గుంటూరులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని కోరటం తప్ప ఎలాంటి హామీలను కోరలేదు. ఆంధ్రప్రదేశ్‌ను విడదీసినపుడు, రాజధాని ఏర్పాటు సమయంలోనూ ఎలాంటి ప్రత్యేక డిమాండ్లు ముందుకు రాలేదు. అమరావతి నిర్ణయం సాఫీగానే జరిగింది.

Image result for three capitals
ప్రపంచంలో ప్రతి దేశానికి, మన దేశంలో ప్రతి రాష్ట్రానికి రాజధానులు ఉన్నాయి. అవేమీ జనాన్ని దారిద్య్రం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, వెనుకబాటు తనం, నిరక్షరాస్యత, వ్యవసాయ సంక్షోభం, సంపదల కేంద్రీకరణ, ప్రాంతీయ అసమానతల వంటి వాటి నుంచి జనాన్ని బయటపడలేక పోయాయి. అయినా రాజధానితో అభివృద్ధి సాధిస్తామని చెబుతుంటే ఎంత మంది నమ్ముతున్నారో తెలియదు గానీ నమ్మే వారంతా గుడ్డిగా ఉన్నారని చెప్పకతప్పదు.పైన పేర్కొన్నట్లుగా దేశాల రాజధానుల, మన దేశంలో రెండు రాష్ట్రాల రా నిర్ణయంలో అనేక అంశాలు పని చేశాయి. అసలే ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రంలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు మూడు మూడూ చోట్ల ఉంటే అది ఆర్ధికంగా భారాన్ని మోపేదే అనటంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా సచివాలయం, అసెంబ్లీ వేరు వేరు నగరాల్లో ఉంటే అధికారులు, సిబ్బంది పనికి అంతరాయంతో పాటు ఆర్ధికంగా అదనపు భారాన్ని మోపుతుంది. అనేక రాష్ట్రాల్లో హైకోర్టులు రాజధానికి దూరంగా ఉన్నాయి. కొన్ని చోట్ల హైకోర్టు బెంచ్‌లు ఉన్నాయి. అలాగే కొన్ని శాఖలకు ప్రాంతీయ డైరెక్టరేట్‌ కార్యాలయాలు కూడా ఉన్నాయి. అందువలన అలాంటి వాటి గురించి ఆలోచించవచ్చు తప్ప మూడు వ్యవస్దల ప్రధాన కేంద్రాలను వేర్వేరు చోట్ల నుంచి పని చేయించటం సరైంది కాదు.
అనేక మంది అధికార వికేంద్రీకరణ అంటే పలు చోట్ల ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయటం అనే అర్ధంలో మాట్లాడుతున్నారు. రాష్ట్ర కేంద్రంగా ఉన్న అధికారాలను వాటిని స్ధానిక సంస్ధలకు బదలాయించటం అనే విషయాన్ని మరచిపోతున్నారు. రెండవది ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనేది మరొక భ్రమ. గతంలో రాజధాని ప్రాంతాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టి పరిశ్రమలను స్ధాపించాయి. ఇప్పుడు వాటిని తెగనమ్మే కార్యక్రమాన్ని అమలు జరుపుతున్నాయి. అందువలన ప్రభుత్వాల పెట్టుబడులు రావు. ప్రయివేటు పెట్టుబడులు రాజధానిగా ఉన్న నగర ప్రాతిపదికన రావు. వాటికి ఎక్కడ లాభసాటి అయితే అక్కడకు పోతాయి తప్ప మరొకటి కాదు. విశాఖలో సచివాలయాన్ని ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్రవెనుకబాటు తనమూ, కర్నూల్లో హైకోర్టు ఏర్పడితే రాయలసీమ వెనుకబాటు తనమూ, అమరావతిలో అసెంబ్లీ ఉంటే కోస్తా జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అని ఎవరైనా వాదిస్తే వారికి వంద నమస్కారాలు పెట్టటంతప్ప తర్కంతో చర్చ జరిపితే వినే స్ధితిలో ఉండరు.
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే అభివృద్ది జరుగుతుందని చెబుతున్న లేదా నిజంగా నమ్ముతుంటే బిజెపి నేతలు, ఇతరులు ఢిల్లీలో ఉన్న కేంద్ర రాజధానిని విభజించి ప్రతి రాష్ట్రంలోనూ అత్యంత వెనుకబడిన ప్రాంతంలో కేంద్ర రాజధానుల శాఖలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేయాలి. అప్పుడు దేశమంతా అభివృద్ధి చెందుతుంది.అంతకంటే కావాల్సింది ఏముంది. ప్రత్యేక హౌదా కావాలన్న డిమాండ్లు రావు, ఆ వాగ్దానంపై మడమ తిప్పను అని చెప్పుకొనే వారికి ఇబ్బంది ఉండదు ! సర్వేజనా సుఖినో భవంతు !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

పౌరసత్వ సవరణ చట్టం-వాదనలు, వాస్తవాలు !

16 Monday Dec 2019

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION

≈ 1 Comment

Tags

CAA, CAB, citizenship amendment act 2019 : some arguments and facts, India citizenship amendment act 2019

Image result for citizenship amendment act 2019పౌరసత్వ సవరణ చట్టం-వాదనలు, వాస్తవాలు !
ఎం కోటేశ్వరరావు
పార్లమెంట్‌ ఆమోదించిన పౌరసత్వ సవరణ బిల్లు రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారింది.దీని చట్టబద్దతను సవాలు చేస్తూ అనేక మంది సుప్రీం కోర్టు తలుపు తట్టనున్నారు. ఈ చట్టం గురించి అనేక మందిలో తలెత్తిన అనుమానాలు, కొన్ని వాదనలు, వాస్తవాలను చూద్దాం.
ఈ చట్టం ద్వారా ప్రస్తుతం దేశంలో ఉన్న ముస్లింలకు పోయేదేమీ లేదు, అయినా ఎందుకు ఆందోళనలు చేస్తున్నారు, వారిని ఎవరో రెచ్చగొడుతున్నారు, విదేశీ ముస్లింలను ఆహ్వానించి పౌరసత్వం ఇవ్వాలని వారు కోరుతున్నారా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మాటలు మాట్లాడే వారు ఈశాన్య రాష్ట్రాలలో నిరసనలు తెలుపుతున్నది ప్రధానంగా హిందువులే అన్న అంశాన్ని కావాలనే విస్మరిస్తున్నారు. అసోంలో ఇప్పటికే కొందరు బిజెపి నేతలు పదవులకు రాజీనామాలు చేశారు, బిజెపి మద్దతుదారైన ఏజిపి పునరాలోచనలో పడింది. మరి వీరిని ఎవరు ప్రేరేపిస్తున్నట్లు ?
1985లో కుదిరిన అస్సాం ఒప్పందం ప్రకారం 1971 మార్చి 24 తరువాత దేశంలో అక్రమంగా ప్రవేశించిన వారందరినీ మతంతో నిమిత్తం లేకుండా వెనక్కు పంపాల్సి ఉండగా విదేశీయులకు స్వాగతం పలికేందుకు ఎవరూ సిద్ధం కాదు, అలాంటి అవసరమూ లేదు. దేశంలోని ఏ ముస్లిమూ అలాంటి డిమాండ్‌ను ఎన్నడూ ముందుకు తేలేదు. గతంలో లేని మాదిరి శరణార్దులుగా వచ్చిన వారికి మత ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయించిన వారు, రేపు అదే ప్రాతిపదికన ఇచ్చిన పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు కూడా వెనుకాడరన్నదే ఇప్పుడు తలెత్తిన భయం. రాజ్యాంగాన్ని దెబ్బతీసే అనేక చర్యలను వేగంగా తీసుకుంటున్న పూర్వరంగంలో ఇతర మత రాజ్యాలలో మాదిరి తమ హక్కులను హరిస్తారా, రెండవ తరగతి పౌరులుగా మారుస్తారా అన్న ఆందోళనే మైనారిటీలను ఆందోళనకు గురి చేస్తోంది.
సవరించిన చట్టం ప్రకారం పాకిస్ధాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘ్‌నిస్తాన్‌లో ఉన్న హిందువులు ఎవరైనా మన దేశంలోని బంధువులు, కుటుంబాలతో కలసిపోయేందుకు అక్కడి నుంచి వలస వస్తే వారికి పౌరసత్వం ఇచ్చే వీలు కల్పిస్తుంది. ఇదే సూత్రం ముస్లింలకు వర్తించదు. హిందువుల మాదిరే ఈ దేశాల్లో ఉన్న ముస్లింలకు కూడా మన దేశంలో బంధుత్వాలు, కుటుంబాలు ఉన్నాయి. ఒక మతం వారికి ఒక సూత్రం, మరొక మతం వారికి మరొక సూత్రం మన రాజ్యాంగంలో లేదే !
ఈ మూడు దేశాల్లో ఉన్నది ఇస్లామిక్‌ ప్రభుత్వాలు. పాక్‌, ఆప్ఘనిస్తాన్‌ మాత్రమే ఇస్లామిక్‌ అని ప్రకటించుకున్నాయి.1972లో బంగ్లాదేశ్‌ లౌకిక రాజ్యంగా ఏర్పడింది. తరువాత దానిని 1980లో ఇస్లామిక్‌ రాజ్యంగా మార్చారు.1972లో ఆమోదించిన లౌకిక సూత్రాలే చెల్లుబాటు అవుతాయని 2010లో అక్కడి సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అయినప్పటికీ ఆచరణలో మత రాజ్యంగా ఉందనే కొందరు చెబుతారు.
ఈ మూడు దేశాల్లో అత్యధికులు ముస్లింలు, మిగిలిన వారందరూ మైనారిటీలు, వారి మీద దాడులు జరుగుతున్నాయి కనుక వారు మాత్రమే భారత్‌లో పౌరసత్వం పొందేందుకు అర్హులు అన్నది ఒక వాదన. ప్రపంచంలో మైనారిటీలు అన్నిదేశాలలో ఉన్నారు. పాకిస్ధాన్‌లో కంటే ఇండోనేషియాలో హిందువుల సంఖ్య. మన దేశంలో మైనారిటీల మీద దాడులు జరుగుతున్నట్లుగానే ప్రపంచంలో అనేక దేశాల్లో దాడులు జరుగుతున్నాయి. అలాంటి వారు మరొక దేశంలో ఆశ్రయం కోరితే వారికి మత ప్రాతిపదికన పౌరసత్వం మంజూరు చేసే పద్దతి ఏ దేశంలోనూ లేదు.
పాకిస్ధాన్‌లో మైనారిటీలు అంటే ఒక్క హిందువులే కాదు. హిందువులలో వివిధ తరగతులు ఉన్నట్లే ముస్లింలలో కూడా మెజారిటీ, మైనారిటీలు ఉన్నారు. అక్కడి షియాలు, అహమ్మదీయాలు, సూఫీలు మైనారిటీలే. హిందువులు ఇతర మైనారిటీల మీద దాడులు జరిగినట్లే వీరి మీద కూడా నిత్యం దాడులు జరుగుతున్నాయి.హిందువులకు ఉన్నట్లే వీరి పూర్వీకులు కూడా మన దేశంలో ఉన్నారు. అయినప్పటికీ ఈ మైనారిటీలు ఆశ్రయం కోరితే తాజాగా చేసిన సవరణ చట్టంలో అంగీకరించే అవకాశం లేదు. పాకిస్ధాన్‌లో లష్కరే జాంగ్వీ పేరుతో ఒక ఉగ్రవాద సంస్ధ ఉంది. దీని పని షియాల మీద దాడులు, వారిని చంపటమే. వారిని ముస్లిమేతరులుగా ప్రకటించాలని అది డిమాండ్‌ చేస్తోంది. 2003-16 మధ్య 2,558 మందిని హత్య చేయగా 4,518 మందిని గాయపరిచారు. జనాభాలో షియాలు 15నుంచి 20శాతం వరకు ఉన్నారు.
1974లో పాకిస్ధాన్‌ ఒక రాజ్యాంగ సవరణ చేసి అహమ్మదీలను ముస్లిమేతరులుగా ప్రకటించింది. తరువాత నియంత జియావుల్‌ హక్‌ అహమ్మదీయాలు తమను ముస్లింలుగా పిలుచుకోవటాన్ని నిషేధించాడు. తెహరిక్‌ ఇ తాలిబాన్‌ పాకిస్ధాన్‌ అనే సంస్ధ లాహౌర్‌ తదితర చోట్ల అహమ్మదీలు, వారి మసీదులపై దాడులు చేస్తున్నది. పోలీసులు కూడా అదే దుండగాలకు పాల్పడుతున్నారు. మన దేశంలో ముస్లింలు, క్రైస్తవుల మీద విద్వేష ప్రచారం చేస్తున్నట్లుగానే అహమ్మదీల మీద పత్రికల్లోనే అలాంటి ప్రచారానికి సంబంధించి 3,963 వార్తలు, 532 వ్యాసాలను ఉటంకిస్తూ బాధితులు ఒక నివేదికను విడుదల చేశారు. బంగ్లాదేశ్‌లో దేవుడు, దేవదూతలు, ప్రవక్తల పట్ల విశ్వాసం లేని వారు గణనీయ సంఖ్యలో ఉన్నారు. వారందరూ ఆచరణలో ముస్లిం మైనారిటీలే, వారు గాక బీహారీ ముస్లింలు, అస్సామీ ముస్లింల పట్ల బంగ్లాదేశ్‌లో వివక్ష కొనసాగుతోంది, వారు దాడులకు గురవుతున్నారు, వారు శరణు కోరితే వైఖరి ఏమిటి ?

Image result for citizenship amendment act 2019
బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలోని సంస్క త విద్యా ధర్మ విజ్ఞాన కేంద్రంలో సంస్క తంలో ఉన్న హిందూ పురాణాలను జంధ్యం లేని, ఫిరోజ్‌ ఖాన్‌ అనే ఒక ముస్లిం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ బోధించటాన్ని అంగీకరించేది లేదంటూ అక్కడి విద్యార్ధులు, కొందరు టీచర్లు కూడా ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దాంతో ఫిరోజ్‌ఖాన్‌ రాజీనామా చేశారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పోయిన తన పరువును కాపాడుకొనేందుకు రాజీమార్గంగా ఫిరోజ్‌ఖాన్‌ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకొని ఆర్ట్స్‌ విభాగంలో సంస్క త సాహిత్యం, భాషా విభాగంలో నియమించింది.
పాకిస్ధాన్‌లో కూడా మతఛాందస శక్తులు అతిఫ్‌ మియాన్‌ అనే అహమ్మదీ సామాజిక తరగతికి చెందిన ఆర్ధికవేత్తను ఆర్ధిక సలహా మండలిలో పని చేయటానికి అంగీకరించబోమని వత్తిడి చేయటంతో వారంలోపే నియామకాన్ని రద్దు చేశారు. మత అసహనం, వివక్షకు ఇది పక్కా నిదర్శనం. సూఫీ ముస్లింల మీద కూడా అక్కడ ఇలాంటి దాడులే జరుగుతున్నాయి. వారు కూడా పాక్‌లో హిందువుల మాదిరే మన పూర్వీకులే కదా ! శరణార్ధులంటే ఎవరైనా శరణార్ధులే, వారిని అనుమతించటమా లేదా అనే ఒక విధానం తీసుకోవటంలో తప్పు లేదు కానీ వారి పట్ల మత విబేధాన్ని పాటించటం అంటే ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటమే. ఇది మన భారతీయ సంప్రదాయం కానే కాదు. అఖండ్‌ భారత్‌ను పునరుద్దరించాలని చెప్పే వారు, ఈ సంకుచిత వైఖరిని అనుసరించటంలో హిందూ ఓటు బ్యాంకు రాజకీయం తప్ప, విశాల భావనకు చోటెక్కడ ? పౌరసత్వ చట్ట సవరణ ద్వారా అఖండ భారత్‌లో విభజనకు పూర్వం ఉన్న ముస్లింలకు చోటు లేదని తేల్చి చెప్పారు.
రాజ్యాంగ విరుద్దం అని ఎందుకు అంటున్నారు ?
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించే వారు ముస్లిం అనుకూలురు, ఇతర దేశాల నుంచి ముస్లింలు వలస రావాలని కోరుతున్నారనే తప్పుడు ప్రచారం జరుగుతోంది. రాజ్యాంగ విరుద్దమైన చర్యను వ్యతిరేకించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ముస్లింలే వ్యతిరేకిస్తున్నారు అనేది తప్పుడు ప్రచారం, వక్రీకరణ. దేశ విభజన నేపధ్యంలో తలెత్తే పౌరసత్వ సమస్యలను పరిష్కరించేందుకు హింద్షూముస్లిం అనే వివక్ష లేకుండా రాజ్యాంగంలోని ఐదు నుంచి పదకొండు వరకు ఉన్న ఆర్టికల్స్‌ నిబంధనలు, విధి విధానాలను స్పష్టంగా పేర్కొన్నాయి. ఆర్టికల్‌ పదకొండు ప్రకారం పౌరసత్వాన్ని ఇచ్చేందుకు, తిరస్కరించేందుకు పార్లమెంట్‌కు అధికారం ఇచ్చింది. ఇప్పుడు దాన్ని వినియోగించుకొని ఆ ఆర్టికల్‌ను సవరిస్తూ మత ప్రాతిపదికన ముస్లిం మినహా పైన పేర్కొన్న మూడు దేశాల నుంచి వచ్చిన హిందూ, బౌద్ద, జైన, సిక్కు, పార్సీ, క్రైస్తవులకు పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఎన్‌డిఏ సర్కార్‌ చట్టసవరణ చేసింది. గతంలో లేని మత వివక్షను చొప్పించింది, ఇది లౌకిక స్వభావం నుంచి మత రాజ్యంవైపు వేసే అడుగులో భాగం తప్ప మరొకటి కాదు. ఆర్టికల్‌ 14కు విరుద్ధం.
1955 చట్టం ప్రకారం అక్రమంగా దేశంలో ప్రవేశించిన వారికి పౌరసత్వాన్ని ఇచ్చే అవకాశం లేదు. సవరించిన చట్టంలో దీనికి మినహాయింపులు ఇచ్చారు. 2015లో పాస్‌పోర్టు, విదేశీయుల చట్టానికి సంబంధించి చేసిన సవరణల ప్రకారం ముస్లిమేతరులు తగిన పత్రాలు లేకుండా దేశంలో ప్రవేశించినప్పటికీ పౌరసత్వాన్ని పొందేందుకు అవసరమైన ఎత్తుగడ దీనిలో స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాది చట్టసవరణకు ప్రవేశపెట్టిన బిల్లుకు ఈశాన్య రాష్ట్రాలలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. దాంతో రాజ్యాంగ ఆరవ షెడ్యూలులో చేర్చిన గిరిజన ప్రాంతాలకు ఇప్పుడు ఈ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే ఒకసారి పౌరసత్వం ఇచ్చిన తరువాత ఈ ప్రాంతాలకు వలసలను ఎలా నిరోధిస్తారన్నది ఒక ప్రశ్న. తెలుగు రాష్ట్రాలలో ఒన్‌ ఆఫ్‌ 70 చట్టం ఉన్నప్పటికీ గిరిజనేతరులు గిరిజన ప్రాంతాలకు ఎలా చేరుతున్నదీ చూస్తున్నాము.ఈశాన్యరాష్ట్రాలలోని గిరిజనేతర ప్రాంతాలను ఇప్పటి వరకు శరణార్ధులుగా ఉన్న వారికి పౌరసత్వం ఇచ్చి నింపితే స్ధానికులు తాము మైనారిటీలుగా మారతామని, తమ భాష, భూమి, సంస్క తులకు ముప్పు వస్తుందనే భయంతో ఆ ప్రాంతాలన్నీ ఒక్కసారిగా భగ్గుమన్నాయి.

Image result for citizenship amendment act 2019
శరణార్ధుల విషయంలో మత ప్రాతిపదికను ప్రవేశపెట్టిన కేంద్రం ఇంతటితో ఆగుతుందనే హామీ లేని కారణంగా మైనారిటీల్లో భయం ఏర్పడింది. ఈశాన్య ప్రాంతాలలో తమ అస్ధిత్వం, అవకాశాల గురించి హిందువులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా వీధుల్లోకి వచ్చింది వారే. ఇదే సమయంలో దేశ వ్యాపితంగా ఎన్‌ఆర్‌సిని అమలు జరుపుతామని కేంద్రం ప్రకటించింది. అసోం ఎన్‌ఆర్‌సి జాబితాలో అవకతవకలు, పేర్లను తొలగించే అధికారం అధికారులకు కట్టబెట్టం మైనారిటీల్లో ఇప్పటికే అనేక అనుమానాలు, ఆందోళనలను రేకెత్తించింది. శరణార్ధుల విషయంలో మతవివక్షను ప్రవేశపెట్టిన కేంద్రం ఎన్‌ఆర్‌సి పేరుతో దేశంలో ఉన్న లక్షల మంది ముస్లింల పౌరసత్వాలను రద్దు చేస్తారనే భయం అనేక చోట్ల వారిని ఆందోళనకు పురికొల్పింది.
ఆఫ్ఘనిస్తాన్‌కు మన దేశానికి ఇప్పుడు ఆచరణలో సరిహద్దులేదు. అయినప్పటికీ ఆ దేశాన్ని ఎందుకు చేర్చారో తెలియదు. మన పొరుగునే ఉన్న మయన్మార్‌లో మైనారిటీలుగా ఉన్న రోహింగ్యాలు, శ్రీలంకలో మైనారిటీలుగా హిందువులు, ముస్లింలు ఉన్నారు. నేపాల్‌, భూటాన్‌ ప్రాంతాల్లో మైనారిటీలు ఉన్నారు. వారందరినీ మినహాయించటానికి తగిన కారణాలను చెప్పలేదు. 1985లో కుదిరిన అస్సాం ఒప్పందం ప్రకారం 1971 మార్చి 24 తరువాత అక్రమంగా దేశంలో ప్రవేశించిన వారందరినీ మతంతో నిమిత్తం లేకుండా వెనక్కు పంపాల్సి ఉంది.
ఇతర దేశాల్లో ఉన్న హిందువులు, సిక్కులు అక్కడ పౌరులు కానట్లయితే, మన దేశం పౌరసత్వం కావాలనుకుంటే మంజూరు చేయాలన్న మత ప్రాతిపదిక ప్రతిపాదనను రాజ్యాంగ రచన సమయంలోనే కొందరు ముందుకు తెచ్చారు.1949 ఆగస్టు పన్నెండున ఆ ప్రతిపాదనపై రాజ్యాంగ పరిషత్‌లో ఓటింగ్‌ జరపగా తిరస్కరించారు. ఇప్పుడు హిందూత్వశక్తులు, వారిని సమర్ధించే వారు గతంలో తిరస్కరించిన ప్రాతిపదికనే ఇప్పుడు ముందుకు తెచ్చారు. పార్లమెంట్‌లో మెజారిటీ ఉన్నందున 70సంవత్సరాల తరువాత మత ప్రాతిపదికను అమల్లోకి తెస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగుతుందనే హామీ లేదు. ఆర్టికల్‌ పదకొండు ప్రకారం పౌరసత్వాన్ని మంజూరు చేసే రద్దు చేసే హక్కు పార్లమెంట్‌కు ఉంది. ఇప్పుడు మతాల ఆధారంగా మంజూరుకు చట్టాన్ని సవరించిన వారు, రేపు అదే ప్రాతికన మైనారిటీల పౌరసత్వాన్ని రద్దు చేస్తే, ఆంక్షలు విధిస్తే పరిస్ధితి ఏమిటి ? ఇప్పటికి లేదు కదా రాబోయే రోజుల్లో ఏదో చేస్తారని ఎందుకు అనుమానించాలి అని కొందరు అతితెలివిగా ప్రశ్నిస్తున్నారు. ఈ దే శాన్ని హిందూ రాజ్యంగా మార్చాలని నిరంతరం ప్రచారం చేస్తున్నవారిని సమర్ధిస్దున్న వారే కేంద్రంలో పాలకులుగా ఉండగా వారికి మద్దతు ఇచ్చేందుకు తెలుగుదే శం, వైసిపి వంటి పార్టీలు పోటీపడుతున్నాయి. ఎవరైనా జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రద్దు చేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తారని, మొత్తం రాష్ట్రాన్ని అప్రకటిత కర్ఫ్యూ ప్రాంతంగా మార్చివేస్తారని, అభ్యంతర తెలిపిన పార్టీల నేతలను జైలు పాలు చేస్తారని ఊహించారా ? బాబరీ మసీదును కూల్చివేస్తామని సంఘపరివార్‌ ఎన్నడూ చెప్పలేదు, అయినా ఉత్తర ప్రదే శ్‌లో అధికారాన్ని అడ్డుపెట్టుకొని దాన్ని కూల్చివేస్తుంటే ఎవరేమి చేయగలిగారు? ఒకసారి మతరాజ్యంగా మారిన తరువాత హిందూ మతానికి ప్రాతిపదిక మనుధర్మం కనుక ఇస్లామిక్‌ దేశాల్లో షరియత్‌ను అమలు చేసినట్లుగా మనుధర్మాన్ని జనం మీద రుద్దరనే హామీ ఉందా ? సామాజిక వివక్ష నివారణలో భాగంగా ఏర్పాటు చేసిన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా లేదా చర్చ జరగాలనే పేరుతో వాటి రద్దు డిమాండ్‌ను ముందుకు తెస్తున్నది సంఘపరివార్‌, అందువలన ఒక విషయంలో ఒక సామాజిక తరగతి మౌనం వహిస్తే మరొక విషయంలో వారికే ముప్పు తెస్తే దిక్కేమిటి ? ఈ సందర్భంగా హిట్లర్‌ దాష్టీకానికి గురైన జర్మన్‌ మతాధికారి మార్టిన్‌ నైమిలర్‌ జైలులో పశ్చాత్తాపం లేదా కుట్రను గ్రహించి నాజీల తీరుతెన్నుల గురించి రాసిన కవితను ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవటం అవసరం.

తొలుత వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు !
నేను కమ్యూనిస్టును కాదు కనుక మాట్లాడలేదు.
తరువాత వారు సోషలిస్టుల కోసం వచ్చారు !
నేను సోషలిస్టును కాదు గనుక నోరు విప్పలేదు.
తరువాత వారు కార్మికనేతల కోసం వచ్చారు !
నేను కార్మికుడిని కాదు కనుక పెదవి విప్పలేదు.
తరువాత వారు యూదుల కోసం వచ్చారు !
నేను యూదును కాదు గనుక మౌనంగా ఉన్నాను.
తరువాత వారు నాకోసం వచ్చారు !
మాట్లాడేందుకు అక్కడ ఎవరూ మిగల్లేదు .

సవరణ చట్టం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందంటూ అనేక మంది సుప్రీం కోర్టులో సవాలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే రాజ్యాంగ మౌలిక స్వభావానికి విరుద్దంగా ఉన్న ఆర్టికల్‌ 370 రద్దు అంశం ఉన్నత న్యాయ స్ధానం ముందు ఉంది. ఇటీవలి కొన్ని తీర్పుల తీరు తెన్నులు చూసిన తరువాత అనేక మందిలో తలెత్తిన సందేహాలు, అనుమానాలకు సుప్రీం కోర్టు తెరదించుతుందా ? మన రాజ్యాంగం మనుగడలో ఉంటుందా ? మత రాజ్యాంగంగా మారనుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

సావర్కర్‌పై రాహుల్‌ వ్యాఖ్యతో బిజెపి రుసరుస !

15 Sunday Dec 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Not Rahul Savarkar, Rahul Jinnah, vd savarkar

Image result for rahul gandhi ramlila maidan

ఎం కోటేశ్వరరావు
మరోసారి కాషాయ పరివారం హిందుత్వ ప్రతీక విడి సావర్కర్‌ను దేశ భక్తుడిగా దేశం ముందుకు తెచ్చింది. నరేంద్రమోడీ పాలన దేశాన్ని మేకిన్‌ ఇండియాగా మార్చటానికి బదులు రేప్‌ ఇన్‌ ఇండియా(అత్యాచారాల భారత్‌)గా మార్చిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కొద్ది రోజుల క్రితం ఒక ఎన్నికల సభలో చేసిన వ్యాఖ్య దీనికి మూలం. రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ బిజెపి పార్లమెంట్‌లోపలా బయటా డిమాండ్‌ చేసింది. ఈ అంశంపై వివాదం చెలరేగటంతో పార్లమెంట్‌ పలుసార్లు వాయిదా పడింది. రాహుల్‌ వ్యాఖ్య దేశాన్ని, మహిళలను అవమానించటమే అని, అత్యాచారాలు చేయాల్సిందిగా ఆహ్వానం పలకటం వంటిదే అని బిజెపి ఎంపీలు ఆరోపించారు. సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలో దేశద్రోహంతో సమానమని అందుకు రాహుల్‌ను జైల్లో పెట్టాలని సంఘపరివార్‌కు చెందిన వారు డిమాండ్‌ చేశారు. రాహుల్‌ ఇటలీకి పోవాలన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దావ్‌ ధాకరే బహిరంగంగా రాహుల్‌ గాంధీని కొట్టాలని సావర్కర్‌ మనవడు కోరారు.
‘నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా గురించి మాట్లాడతారు, అయితే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అది అత్యాచారాల భారత్‌గా కనిపిస్తోంది’ అన్నది రాహుల్‌ గాంధీ వ్యాఖ్య. క్షమాపణ చెప్పాలని బిజెపి చేసిన డిమాండును న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారత్‌ను రక్షించండి అనే నినాదంతో కాంగ్రెస్‌ నిర్వహించిన సభలో రాహుల్‌ గాంధీ తిప్పి కొట్టారు. పదే పదే క్షమాపణలు చెప్పటానికి నేనేమీ రాహుల్‌ సావర్కర్‌ను కాదు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తనకు క్షమాభిక్ష పెడితే బ్రిటీష్‌ వారికి సేవచేసుకుంటానని అండమాన్‌ జైలు నుంచి విడి సావర్కర్‌ పదే పదే లేఖలు రాసి వేడుకున్న అంశాన్ని రాహుల్‌ గాంధీ తన వ్యాఖ్యద్వారా ప్రస్తావించారు. దీనిపై చెలరేగిన వివాదం కారణంగా సావర్కర్‌ దే శభక్తుడని నమ్ముతున్నవారికి సావర్కర్‌ అసలు రూపం ఏమిటో చూసేందుకు ఆసక్తి రేకెత్తించినందుకు బిజెపికి ‘అభినందనలు’ చెప్పాల్సిందే.
తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పేది లేదంటూ రాహుల్‌ గాంధీ విమర్శలను తిప్పికొట్టారు. ఢిల్లీని అత్యాచారాల రాజధాని అని ప్రతిపక్షంలో ఉన్నపుడు అనేక సార్లు బిజెపి పేర్కొన్నదని, సాక్షాత్తూ నరేంద్రమోడీ 2014 ఎన్నికల సందర్భంగా చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్‌ను విడుదల చేశారు. గుక్కతిప్పుకోలేని బిజెపి నేతలు రాహుల్‌ గాంధీకి తగిన పేరు రాహుల్‌ జిన్నా అని వ్యాఖ్యానించారు. సిపాయి తిరుగుబాటుగా బ్రిటీష్‌ చరిత్రకారులు వర్ణించిన 1857 పరిణామాలను ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామం అని ముందుగా వర్ణించిన సావర్కర్‌ గొప్ప దేశభక్తుడని కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా గతంలో చేసిన వ్యాఖ్యను ఈ సందర్భంగా మరోసారి పునరుద్ఘాటించారు.
1857 మే పదవ తేదీన బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా మీరట్‌లో ప్రారంభమైన మిలిటరీ తీరుగుబాటు తరువాత దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించింది.1858 జూన్‌ 20న గ్వాలియర్‌లో తిరుగుబాటుదార్లను అణచివేయటంతో వెనుకపట్టు పట్టింది. అయితే సిపాయిలపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటే తమ పాలన అంతానికి నాంది అవుతుందని భయపడిన బ్రిటీష్‌ పాలకులు హత్యకేసులతో సంబంధం ఉన్నవారికి మినహా మిగిలిన తిరుగుబాటుదారులందరికీ క్షమాభిక్ష పెడుతున్నట్లు ప్రకటించారు.1859 జూలై ఎనిమిది తిరుగుబాటు లాంఛనంగా ముగిసింది.
ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామం గురించి నాటి పాలకుల కనుసన్నలలో నడిచే బ్రిటన్‌ పత్రికలు, అధికారిక ప్రకటనలు తప్ప ప్రపంచానికి ప్రత్యామ్నాయ వాస్తవ సమాచారం అందుబాటులో లేదు. అయినప్పటికీ తిరుగుబాటు ప్రారంభమైన 50 రోజుల్లోనే కారల్‌ మార్క్స్‌- ఫెడరిక్‌ ఎంగెల్స్‌ దాని స్వభావాన్ని పసిగట్టారు. తరువాత మరొక నెల రోజులకే భారత్‌లో జరిగిన అలజడి ఒక సిపాయి తిరుగుబాటు కాదు, ఒక జాతీయ తిరుగుబాటు, జాన్‌ బుల్‌ దానిని మిలిటరీ తిరుగుబాటుగా పరిగణించవచ్చుగానీ వాస్తవం ఏమంటే అది జాతీయ తిరుగుబాటు అని 1857 జూలై 28, 31 తేదీలలోనే కారల్‌ మార్క్సు వ్యాఖ్యానించారు. 1857 జూన్‌ 30న భారత్‌లోని పరిణామాలను మార్క్స్‌ ఇలా వర్ణించారు. ‘ ముస్లింలు, హిందువుల తమ ఉమ్మడి యజమానులకు వ్యతిరేకంగా ఐక్యమయ్యారు. తిరుగుబాటు కొన్ని ప్రాంతాలకే పరిమితం కాలేదు. ఆసియా దేశాలలో తలెత్తిన సాధారణ అసంతృప్తి కాలంలోనే ఇది జరిగింది.’ అని రాశారు.ఆ తిరుగుబాటును అణచివేయటంలో నాటి సంస్ధానాధీశులలో ఒకరైన సింధియా, ఇతర ప్యూడల్‌ శక్తుల పాత్ర గురించి కూడా మార్క్స్‌-ఎంగెల్స్‌ అనుమానించారు.
సిపాయిల తిరుగుబాటులో ప్రధమ భారత స్వాతంత్య్రం సంగ్రామ లక్షణాల గురించి మార్క్స్‌-ఎంగెల్స్‌ వ్యాఖ్యానించే నాటికి అసలు వి డి సావర్కర్‌ పుట్టనే లేదు. ఐదు ద శాబ్దాల తరువాత లండన్‌లో బారిష్టర్‌ చదవటానికి వెళ్లిన సమయంలో వారి రచనలు చదివి సావర్కర్‌ ఆ అభిప్రాయానికి వచ్చి వుండవచ్చు, వారి అవగాహన, అభిప్రాయాన్ని అంగీకరించారంటే అర్ధం చేసుకోవచ్చు గానీ అసలు ముందుగా వ్యాఖ్యా నించింది సావర్కరే అంటే చరిత్రను వక్రీకరించటమే. సావర్కర్‌ లండన్‌లో ఉన్న సమయంలో 1909లో మరాఠీలో సిపాయి తిరుగుబాటును ప్రధమ భారత స్వాతంత్య్రం సంగ్రామంగా వర్ణిస్తూ పుస్తకాన్ని రాశారు. దానికి మూలం లండన్‌లో విద్యార్ధి విప్లవకారులకు కేంద్రంగా ఉన్న ఇండియా హౌస్‌లో ఏర్పడిన పరిచయాలు, అధ్యయనమే అన్నది వేరే చెప్పనవసరం లేదు.
అభినవ్‌ భారత్‌ లేదా ఇండియా హౌస్‌లో సావర్కర్‌ పని చేసిన కాలంలో ఆయన పాత్ర గురించి ఎవరికీ పేచీ లేదు. బ్రిటీష్‌ వారి అరెస్టు నుంచి తప్పించుకొని ఫ్రెంచి వారికి చిక్కారు. వారు సావర్కర్‌ను బ్రిటీష్‌ వారికి అప్పగించారు.1910లో అరెస్టయిన కేసులో మరుసటి ఏడాది అండమాన్‌ జైలుకు తరలించిన తరువాత సావర్కర్‌ లొంగుబాటు అధ్యాయం ప్రారంభమైంది. 1911,13,17,20 సంవత్సరాలలో లేఖల మీద లేఖలు రాసి క్షమాభిక్ష కోసం ప్రాకులాడిన విషయం దాస్తే దాగదు. ఎలా కావాలంటే అలా బ్రిటీష్‌ వారికి అనుకూలంగా పని చేస్తానని రాశారు. 1923లో జైలు నుంచి విడుదల అయిన తరువాత ఇచ్చిన మాట తప్పకుండా మడమ తిప్పకుండా స్వాతంత్య్ర పోరాటానికి దూరమయ్యారు. అంతవరకైతే అదొక దారి క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించి బ్రిటీష్‌ వారికి తన విధేయతను చాటుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయులు మిలిటరీలో చేరి బ్రిటీష్‌ వారికి తోడ్పడాలని ప్రచారం చేశారు. అదే ఏడాది హిందూ మహాసభ నాయకత్వాన్ని స్వీకరించి తొలిసారిగా హిందుత్వను ప్రతిపాదించి ద్విజాతి సిద్దాంతాన్ని ముందుకు తెచ్చారు. ముస్లిం ద్వేషిగా మారి చివరకు మహాత్మా గాంధీ హత్య కుట్రకేసులో ముద్దాయిగా మారిన విషయం తెలిసిందే. సాక్ష్యాలను సరిగా ప్రవేశ పెట్టని కారణంగా ఆ కేసునుంచి బయటపడ్డారు.
సావర్కర్‌తో పాటు అనేక మంది దే శభక్తులు అండమాన్‌ జైలు పాలయ్యారు. వారెవరూ బ్రిటీష్‌ వారి దయాదాక్షిణ్యాల కోసం పాకులాడలేదు. అనేక మంది తరువాత కమ్యూనిస్టులుగా మారారు. అయితే సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి లేఖలు రాసిన విషయం చాలా కాలం వరకు బయటకు రాలేదు. ఆయన 1966లో మరణించారు. 1975లో నాటి కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ స్వాతంత్య్ర పోరాటంలో అండమాన్‌ జైలుకు వెళ్లినవారి గురించి ఒక పుస్తకం ప్రచురించాలని నిర్ణయించింది. దాన్ని ఆర్‌సి మజుందార్‌ అనే చరిత్రకారుడు రాశారు. ఆయన 1857 తిరుగుబాటును ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామంగా గుర్తించేందుకు నిరాకరించిన వ్యక్తి. సావర్కర్‌ అభిమానిగా ఆయన గొప్పతనాన్ని చిత్రించేందుకు ఎంతగా ప్రయత్నించినా బ్రిటీష్‌ వారికి రాసిన లొంగుబాటు లేఖలను దాచిపెట్టలేకపోయారు. అలాంటి సావర్కర్‌కు భారత రత్న బిరుదు ఇవ్వాలని కాషాయ దళాలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి. మోడీ సర్కార్‌ అందుకు ఇప్పటి వరకు ‘ఆ సాహసానికి ‘పూనుకొనేందుకు జంకింది. అక్టోబరు నెలలో మహారాష్ట్ర ఎన్నికల సమయంలో తాము అధికారానికి వస్తే సావర్కర్‌కు భారత రత్న కోసం కృషి చేస్తామని బిజెపి-శివసేన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నాయి.

Image result for rahul gandhi ramlila maidan
రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలతో తలెత్తిన వివాదంలో శివసేన నేతలు సావర్కర్‌ దే శభక్తుడనే తమ పాత వైఖరిని పునరుద్ఘాటించారు. నాటకీయ పరిణామాల మధ్య శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్‌ మహారాష్ట్రలో సంకీర్ణ సర్కార్‌ భాగస్వాములుగా ఉన్నాయి. తాము గాంధీ, నెహ్రూలను గౌరవిస్తామని అలాగే కాంగ్రెస్‌ కూడా సావర్కర్‌ను గౌరవించాలని శివసేన నేత సంజయరౌత్‌ వ్యాఖ్యానించారు. ప్రతిఒక్కరూ ప్రతిదానినీ అంగీకరించలేరని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలను కూడా అలాగే చూడాలంటూ ఎన్‌సిపి నేత ఛాగన్‌ భుజబల్‌ రాహుల్‌కు మద్దతు ప్రకటించారు. ఆవు మన మాతృమూర్తి కాదని సావర్కర్‌ అన్నారు, బిజెపి దానితో విబేధిస్తోంది, అదే మాదిరి పెద్ద వారి గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని చెప్పారు. దేశంలో ఈ వ్యాఖ్యల ప్రభావం ఎలా ఉన్నప్పటికీ ఈ కారణంగా మహారాష్ట్ర సంకీర్ణ కూటమికి వచ్చే ముప్పు ఉండదని చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

దిశ, ఇతరులపై అత్యాచారాలు: సభ్య సమాజం ముందున్న ప్రశ్నలు, సవాళ్లు !

08 Sunday Dec 2019

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Telangana, Women

≈ Leave a comment

Tags

#Hyderabad vet rape, Disha, Disha and others Rape and murder cases, Disha Rape and murder case, Hyderabad Encounter, Hyderabad rape case encounter, Hyderabad vet rape and murder, murder

Image result for Disha and others Rape and murder cases:challenges and questions for civic societyఎం కోటేశ్వరరావు
నవంబరు 27న హైదరాబాద్‌ పశువైద్యురాలు దిశపై సామూహిక అత్యాచారం, హత్య ఉదంతంలో అరెస్టు చేసిన నలుగురు నిందితులను డిసెంబరు ఆరు శుక్రవారం తెల్లవారు ఝామున షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌ పల్లి వద్ద పోలీసులు కాల్చి చంపారు. దిశను ఎక్కడైతే సజీవదహనం చేశారో అక్కడే, ఏ సమయంలో ఆ దుండగానికి పాల్పడ్డారో అదే సమయానికి వారిని హతమార్చినట్లు చెబుతున్నారు. దిశ దారుణోదంతంపై వెల్లడైన తీవ్ర నిరసన, పోలీసులు, ప్రభుత్వ పెద్దలపై వచ్చిన వత్తిడి పూర్వరంగంలో ఇలాంటిదేదో జరుగుతుందని, తమ బాధ్యతను దులిపివేసుకొంటారని బయటకు చెప్పకపోయినా అనేక మంది ముందే ఊహించారు. దుండగులపై తక్షణమే చర్య అంటే కాల్చివేయాలని పెద్ద ఎత్తున వివిధ తరగతులకు చెందిన వారు బహిరంగంగానే డిమాండ్‌ చేశారు. వారు కోరుకున్నట్లుగానే జరగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున యువత, మహిళలు పండుగ చేసుకుంటూ వివిధ రూపాల్లో దాన్ని ప్రదర్శించారు. పోలీసుల మీద పూలవర్షం కురిపించారు, జయజయ ధ్వానాలు పలికారు. పాలకులను కూడా అదే విధంగా పొగడ్తలతో ముంచెత్తారు. ఇది చైతన్యమా ? దానికి విరుద్దమా ?

Image result for Disha and others Rape and murder cases:challenges and questions for civic society
పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఎన్‌కౌంటర్‌పేరుతో నిందితులను హతమార్చారు, ఇది చట్ట ఉల్లంఘన అని అభిప్రాయపడిన వారిని అనేక మంది నిందితులకు మద్దతుదారులు,అత్యాచారాలను సమర్ధించేవారు అన్నట్లు శాపనార్ధాలు పెట్టారు. ఒకవైపు చట్టాలకు అందరూ, అన్ని సమయాలలో లోబడే ఉండాలని చెబుతూనే, కొందరి పట్ల కొన్ని సమయాల్లో చట్టాల ప్రకారం పోతే కుదరదు సత్వర న్యాయం జరగాలంటూ చట్ట వ్యతిరేక చర్యలకు బహిరంగంగా మద్దతు పలుకుతూ ద్వంద్వ స్వభావాన్ని బయట పెట్టుకున్నారు.ఒక అనాగరిక చర్యకు ప్రతిక్రియ పేరుతో మరొక అనాగరిక ప్రతిచర్యను సమర్దించారు. ఈ పరిణామాన్ని అర్ధం చేసుకోవాల్సిందే తప్ప అంగీకరించాల్సిన ధోరణి కాదని చెప్పకతప్పదు. ఉద్రేకాల నుంచి తగ్గి ఆలోచించాల్సిన సమయమిది.
దిశ ఉదంతం అత్యంత కిరాతకమైనదనటంలో ఎలాంటి సందేహం లేదు. నిందితులను ఏ ఒక్కరూ, ఏ ఒక్క పార్టీయే కాదు, చివరకు వారి కుటుంబ సభ్యులు కూడా సమర్ధించలేదు. దురంతానికి వ్యతిరేకంగా వీధుల్లోకి రావటానికి ఎవరూ వెనుకాడలేదు. వారు చేసిన నేరానికి మరణశిక్ష పడేందుకు కూడా అవకాశం ఉందని నిర్భయ కేసు ఇప్పటికే స్పష్టం చేసింది. గతంలో తోబుట్టువులైన గీతా-సంజరు కిడ్నాప్‌, హత్య కేసులో నేరగాండ్లు రంగా, బిల్లాలకు ఉరిశిక్షను అమలు చేసిన ఉదంతం తెలిసిందే. అయినా పోలీసులు, కోర్టుల మీద విశ్వాసం సన్నగిల్లటం, కాలహరణ నేపధ్యంలో వెంటనే నిందితులను కాల్చిచంపాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది.
సమాజంలో సర్వకాల సర్వావస్దలలో మనోభావాలు ఉంటాయి. ఆయా ఉదంతాలు, సందర్భాలను బట్టి అవి వెల్లడయ్యే రూపాలు ఉంటాయి. గత కొంత కాలంగా మన దేశంలో మనోభావాలు వెల్లడవుతున్న తీరు, కొన్ని అంశాలలో రెచ్చగొడుతున్న(నిర్భయ, దిశ వంటి దారుణాతి దారుణ ఉదంతాల విషయంలో కాదని మనవి) తీరు వివాదాస్పదం అవుతోంది. ఆవు, ఆలయాల పేరుతో జరుగుతున్నవి అందుకు తిరుగులేని ఉదాహరణలు. మనోభావాలు, ఆవేశ, కావేషాలు గతం కంటే పెరుగుతున్నాయి, అదే సమయంలో ప్రతి దారుణం, అన్యాయం పట్ల ఒకే విధంగా స్పందన ఎందుకు ఉండటం లేదు అన్న ప్రశ్నలు కూడా రోజు రోజుకూ పెరుగుతున్నాయి. దిశ దారుణం, అనంతరం దానికి పాల్పడి అరెస్టయిన నిందితుల కాల్చివేత జరిగిపోయాయి. ఉద్రేకాలు చల్లారాయి గనుక వీటి పర్యవసానాలు, మరో దిశ ఉదంతం జరగకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోచించాలి.
ఎన్‌కౌంటర్‌ పేరుతో దిశ కేసులో నిందితుల కాల్చివేత చట్టవిరుద్దం అనటమే పెద్ద నేరం అన్నట్లుగా అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. వారిలో ఉన్నత విద్యావంతులు కూడా ఉండటం ఆందోళనకరం. ఎవరికైనా దేన్నయినా ప్రశ్నించే హక్కు ఉంది, వాటిని కోరుకొనే వారికి బాధ్యతలు కూడా ఉంటాయని గుర్తు చేయాల్సి వస్తోంది. ఏకపక్షం అంటే కుదురుతుందా ? షాద్‌నగర్‌ పోలీసు చర్యను సమర్ధించేవారు కూడా కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది. దిశ తలితండ్రులు తమ కుమార్తె అదృశ్యం గురించి ఫిర్యాదు చేసేందుకు వెళ్లినపుడు మా స్టేషన్‌ పరిధి కాదంటూ పోలీసులు తిరస్కరించారు. అంతటితో ఊరుకోలేదు, మీ అమ్మాయికి ఎవరితో అయినా ప్రేమ వ్యవహారం ఉందా, ఎవరితో అయినా లేచిపోయిందనే అనుమానాలున్నాయా అని ప్రశ్నించినట్లు వార్తలు వచ్చాయి. ఇది అత్యాచారం కంటే మరింత బాధాకరమైన, బాధ్యతా రహితమైన చర్య. బిడ్డ సంగతి దేవుడెరుగు, అనాగరికంగా ప్రవర్తించేే పోలీస్‌ స్టేషన్‌కు ఎందుకు వచ్చామురా బాబూ అని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారు అనుకోవాల్సిన పరిస్దితులు పోలీసు వ్యవస్ధలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అలాంటి పోలీసులపై చర్యకు సభ్య సమాజం ఎందుకు డిమాండ్‌ చేయలేదు. నిందితులను కాల్చిచంపగానే పోలీసుల మీద పూలు చల్లటాన్ని ఏమనాలి, మనమేం చేస్తున్నామో అనే చైతన్యంలో ఉండే ఆ పని చేశారా ?
పోలీసులకు ఫిర్యాదు చేయకపోవటం, సహాయ పోలీసు ఫోన్‌కు సమాచారం అందించకు పోవటం దిశదే తప్పు అన్నట్లుగా మాట్లాడిన మంత్రులు, అధికారయంత్రాంగంపై తీసుకున్న చర్యలేమిటి ? దిశపై అత్యాచారానికి ముందు ఆదిలాబాద్‌ ప్రాంతంలో టేకు లక్ష్మి, అదే సమయంలో వరంగల్‌ మానసలపై అత్యాచారాలు, హత్యలు జరిగాయి. ఈ దురంతాలను మీడియా ఎందుకు విస్మరించింది ? బలహీనవర్గాలుగా ఉన్నవారి మీద ఇలాంటివి సర్వ సాధారణమే, వాటిని సంచలనాత్మకంగా అందిస్తే రేటింగు, సర్క్యులేషన్‌ల పెరుగుదల ఉండదని లెక్కలు వేసుకుంటున్నదా ? మీడియాకు ఏది లాభసాటి అయితే దాని మీదే కేంద్రీకరిస్తుందని సరిపెట్టుకుందాం, సభ్య సమాజం సంగతి ఏమిటి ? దానికేమైంది ? దిశ ఉదంతంపై మాదిరి ఎందుకు స్పందించలేదో ఎవరైనా చెప్పగలరా ? అత్యాచారం అన్న తరువాత ఎవరి మీద జరిగినా అది దారుణమే, కొందరి మీద దారుణాతి దారుణంగా మరికొందరి మీద సుఖవంతంగా జరుగుతుందా? తీవ్రంగా ఖండించాల్సిన ఉదంతమే, అన్నింటి పట్ల ఎందుకు ఒకే మాదిరి స్పందించటం లేదు? దిశ విద్యావంతురాలిగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ విధి నిర్వహణలో భాగంగానే బయటకు వెళ్లింది. టేకు లక్ష్మి విద్యావంతురాలు కాదు గనుక గ్రామాల్లో తిరుగుతూ బూరలు, పూసల వంటి వాటిని అమ్ముకుంటూ కుటుంబ పోషణకు తన వంతు చేస్తున్నది. ఆ క్రమంలోనే ఆమె దుండగులకు బలైంది.
లక్ష్మి, మానస కుటుంబ సభ్యులు, పరిమితంగానే అయినా వారికి మద్దతుగా నిలిచిన వారు నిందితులపై కఠిన చర్య తీసుకోవాలని మాత్రమే కోరారు. దిశ కేసు నిందితులను కాల్చివేసిన తరువాత తమ వారి కేసుల్లో కూడా నిందితులను కాల్చివేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌ తరువాత హైదరాబాదు, తెలంగాణా లేదా ఏ రాష్ట్రంలో అయినా ఆడపిల్లలు నిర్భయంగా స్వేచ్చగా తిరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారా ? తలి దండ్రులు లేదా సంరక్షకులు భయపడకుండా తమ పిల్లలను బయటకు పంపగలరా ? నేరాలు చేయాలనుకునే వారంతా భయంతో ఉన్నారని పోలీసు అధికారి సజ్జనార్‌ చెప్పగలరా ? లేకపోతే ఎందుకు అని సంజాయిషీ, సమాధానం చెప్పకపోయినా ఎవరికి వారు ఆలోచించుకోవాల్సి ఉంది.
ఎన్‌కౌంటర్లతో దుష్ట లేదా నేర స్వభావం ఉన్నవారిని భయపెట్టి అదుపు చేయగలరా ? పోలీసులకు అనుమతి ఉన్న తుపాకులు ఉన్నాయి కనుక దిశ కేసులో నిందితులను కాల్చిచంపి ఇతరులను భయపెట్టాలని చూశారని చెబుతున్నారు. సరే అనుకుందాం. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు దిశ తలిదండ్రులు, గతంలో అనేక మంది పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులు మరొక అభాగిని తల్లిదండ్రుల పట్ల ఆ విధంగా ప్రవర్తించకుండా వారిలో భయాన్ని పుట్టించాల్సిన అవసరం లేదా ? వారినలాగే వదిలేస్తారా ? దానికి పోలీసు ఉన్నతాధికారులు లేదా ప్రభుత్వం చేసింది ఏమిటి ?
అమెరికాలో ఏ చిన్న నేరానికి పాల్పడినా వెంటనే విచారణ, శిక్షలు వేస్తారు. ఎక్కడా లేని విధంగా జనాలతో జైళ్లను నింపివేస్తున్నారు. అయినా నేరాలు చేసేవారెవరూ భయపడటం లేదు. ఏ తెల్లపోలీసు ఏ నల్లవాడిని ఎప్పుడు, ఎందుకు కాల్చిచంపుతాడో తెలియదు. పౌరుల విషయానికి వస్తే ఎవడు ఎప్పుడు తుపాకి తీసుకొని ఉట్టిపుణ్యానికి తోటి వారిని ఎందుకు చంపుతాడో తెలియదు. నల్లవారిని చంపిన తెల్ల పోలీసుల మీద అత్యధిక సందర్భాలలో చర్యలుండవు, ఆత్మరక్షణ, అనుమానంతో కాల్చిచంపామని ఎలాంటి ‘భయం’ లేకుండా దర్జాగా తిరుగుతుంటారు. ఇక తుపాకులతో సామూహిక హత్యాకాండలకు పాల్పడిన ఉదంతాలలో పోలీసులు అత్యధిక సందర్భాలలో నిందితులను అక్కడికక్కడే కాల్చిచంపుతున్నట్లు వచ్చే వార్తలు తెలిసిందే. అది భయం కలిగించేదే అయినా అలాంటి ఘటనలు రోజూ ఎక్కడో అక్కడ అమెరికాలో ఎందుకు పునరావృతం అవుతున్నాయి.

Image result for Disha and others Rape and murder cases:challenges and questions for civic society
మన దేశంలో నమోదైన నేరాలలో కేవలం 46.48శాతం(2016) మందికి మాత్రమే శిక్షలు పడుతున్నాయి. రాష్ట్రాల వారీ చూస్తే కేరళలో 84శాతం ఉంటే బీహార్‌లో పదిశాతం మాత్రమే. అదే అమెరికాలో 93, జపాన్‌, కెనడాలలో 99శాతం వరకు ఉంటున్నాయి.మన కంటే వేగంగా కేసుల దర్యాప్తు, కోర్టు విచారణ జరుగుతోంది అయినా ఒకసారి కేసుపెడితే శిక్ష తప్పుదు అనే భయం ఆయా సమాజాలలో కలగటం లేదు. నేరాలు పునరావృతం అవుతున్నాయి. మన దేశంలో ప్రతి లక్షమంది జనాభాకు జైళ్లలో ఉన్నవారు కేవలం 30 మంది మాత్రమే. అదే అమెరికాలో 737 మంది, రష్యాలో 615 మంది ఉన్నారు. అంతమంది జైలు పాలవుతున్నా అక్కడ భయం ఎందుకు ఉండటం లేదు ?
అందువలన ఎన్‌కౌంటర్ల ద్వారా, సత్వర శిక్షల ద్వారా కూడా భయం కలుగుతుందని చెప్పలేము. ముందుస్ధు ఆలోచనలు లేదా పధకాలతో నేరాలకు పాల్పడేవారు తాము చట్టం, సమాజం నుంచి తప్పించుకోగలమనే ధీమాతోనే పాల్పడతారు. దిశ ఉదంతంపై నిరసన తెలిపి రాత్రయ్యే సరికి తప్పతాగి గంతులు వేసేందుకు హైదరాబాద్‌లో పబ్‌కు వెళ్లిన ఒక మాజీ ప్రజాప్రతినిధి కుమారుడు ఒక యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు అందిన విషయ తెలిసిందే. అలాంటి వారిని జైళ్లపాలు చేసి సమాజానికి దూరంగా ఉంచటం తప్ప సత్వరన్యాయం పేరుతో అంతం చేయటానికి నాగరిక సమాజం అంగీకరించటం లేదు. ఎన్నో అనుభవాల తరువాతనే ప్రస్తుతం ఉన్న చట్టాలను రూపొందించామని అందరూ గుర్తించటం అవసరం. అసలు నేరాలుండని సమాజం కోసం కృషి చేయటం తప్ప మరొక దగ్గర మార్గం ఏముంది. అయితే అందుకు ఎంతకాలం ఎదురు చూడాలి అన్నది తక్షణమే వెలువడే ప్రశ్న. నిర్భయ, దిశలకు ముందు అనేక మంది అభాగినులు అత్యాచారాలకు గురయ్యారు. అయినా స్పందించటానికి సమాజం ఇంతకాలం ఎందుకు వ్యవధి తీసుకుంది, ఎందుకు ముందుకు రాలేదు అని ప్రశ్నించుకుంటే సమాధానం దొరక్కపోదు. మన సమాజం ఈ స్ధితికి రావటానికి లక్షల సంవత్సరాలు పట్టింది. అయినప్పటికీ ఒక ఇంట్లోనే అందరి ఆలోచనలూ, చైతన్య స్ధాయి ఒకే విధంగా ఉండటం లేదని, అలాంటపుడు చైతన్యాన్ని వేగిరంగా కలిగించేందుకు కృషి చేయటం తప్ప మరొక దగ్గరదారి లేదన్నది అవగతం అవుతుంది.
ప్రతీకారం తీర్చుకోవటమే అయితే న్యాయం తన లక్షణాన్ని కోల్పోతుందని మన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ కథనాలపై స్పందించారు. న్యాయం అన్నది ఎన్నడూ తక్షణం లభించేది కాదు, అది ప్రతీకారంగా మారితే దాని స్వభావాన్నే కోల్పోతుంది, నేర వ్యవహారాల కేసుల పట్ల అలసత్వం, వ్యవధి తీసుకోవటం గురించి వైఖరిని పునరాలోచించుకోవాలన్నారు.
కోర్టులలో విచారణ ఆలస్యం కావటం మీద పౌరులలో అసంతృప్తి పెరుగుతోంది. నిర్భయ ఉదంతం తరువాత వెల్లడైన నిరసనల పూర్వరంగంలో న్యాయం వేగంగా జరిగేందుకు సూచనలు చేయాల్సిందిగా సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జెఎస్‌ వర్మ ఆధ్వర్యంలో మరో ఇద్దరు న్యాయమూర్తులు లీలా సేథ్‌, గోపాల్‌ సుబ్రమణియమ్‌లతో కూడిన కమిటీని 2012లో ఏర్పాటు చేశారు. ఉరిశిక్ష ద్వారా అత్యాచారాల నిరోధించటం లేదా పరిష్కారం కాదని స్పష్టం చేస్తూ అలాంటి నేరాలు నిరోధించేందుకు తీసుకోవాల్సిన సామాజిక మరియు భౌతిక అంశాలకు సంబంధించి అది కొన్ని సూచనలు చేసింది. ఆరు సంవత్సరాలు గడిచినా వాటిని అమలు జరపటంలో ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం వహించాయి.
ఈ నివేదికను సమర్పించిన తరువాత మహిళలను కించపరిచే అనేక మంది గత ఆరు సంవత్సరాలలో మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆయ్యారు.ఉత్తర ప్రదేశ్‌లో అధికార పార్టీ ఎంఎల్‌ఏ ఒక అత్యాచార కేసులో నిందితుడు.కాశ్మీర్‌లో అసిఫా మీద అత్యాచారం చేసిన నిందితులకు మద్దతుగా బిజెపి మంత్రులు, న్యాయవాదులు ఏకంగా ప్రదర్శనలే చేశారు. వర్మకమిటీ చేసిన సిఫార్సులలో మరణశిక్ష లేదు. అత్యాచార నేరంగాండ్లకు జీవితకాల శిక్ష విధించాలని పేర్కొన్నది. కేసులను నమోదు చేసేందుకు తిరస్కరించిన లేదా దర్యాప్తును నీరుగార్చేందుకు ప్రయత్నించిన అధికారులు నేరం చేసినట్లుగా భావించి శిక్షార్హులను చేయాలన్నది. ఎంత మందిని ఆ విధంగా శిక్షించారు? విచారణ అధికారులందరూ చిత్త శుద్దితోనే పని చే శారని చెప్పగలరా ? దిశ ఉదంతం మా పరిధి కేసు కాదని తిరస్కరించిన వారిపై చర్యలేమిటి అన్నది ప్రశ్న. అదేవిధంగా అత్యాచారానికి గురైన వారికి జరిపే వైద్య పరీక్షలను శాస్త్రీయ పద్దతిలో నిర్వహించాలని పేర్కొన్నది. రాష్ట్రాలలో భద్రత కమిషన్లను ఏర్పాటు అన్నది ఒక సూచన. ఇంతవరకు ఎన్ని రాష్ట్రాలు అలాంటి కమిషన్లను ఏర్పాటు చేశాయి ? వచ్చిన వార్తలు, నేరుగా అందిన ఫిర్యాదులను స్వీకరించి కోర్టులు విచారణకు తీసుకోవచ్చని కమిటీ పేర్కొన్నది. రాజకీయ సంస్కరణల్లో భాగంగా నేరచరిత్ర ఉన్నవారిని ప్రజాప్రతినిధులుగా తీసుకోవద్దని, రాజకీయాలను నేరపూరితంగా మార్చవద్దని కూడా వర్మకమిటీ కోరింది.ఎన్ని పార్టీలు అమలు జరుపుతున్నాయి?

Image result for Disha and others Rape and murder cases:challenges and questions for civic society
వర్మకమిటీ సిఫార్సులు వచ్చిన తరువాత రాజకీయ వ్య వస్ధ పరిస్ధితి ఏమిటో చూద్దాం.2014లో ఎన్నికైన పార్లమెంట్‌ సభ్యులలో నేర చరిత్రకలవారు 26శాతం మంది ఉంటే, 2019లో 43శాతానికి పెరిగారు. ఎడిఆర్‌ సంస్ధ వెల్లడించిన వివరాల ప్రకారం 539 మంది లోక్‌ సభ సభ్యులలో 233 మంది నేర చరిత కలిగిన వారున్నారు. వీరిలో బిజెపికి చెందిన వారు 116, తరువాత కాంగ్రెస్‌ 29,జెడియు 13, డిఎంకె 10,టిఎంసి నుంచి తొమ్మిది మంది ఉన్నారు. ఇక పార్టీల తరఫున పోటీ చేసిన అభ్యర్ధులపై ఉన్న కేసులలో మహిళల మీద అత్యాచారాలు, హత్యలు,యత్నాలు, కిడ్నాప్‌ల వంటివి 29శాతం ఉన్నాయి. మహిళలపై నేరాలకు సంబంధించి ఎంపీ, ఎంఎల్‌ఏ అభ్యర్ధులలో నేర చరిత కలిగిన వారు బిజెపిలో ఎక్కువ మంది ఉండగా రెండవ స్ధానంలో బిఎస్‌పి ఉందని ఏడిఆర్‌ మరొక అధ్యయనంలో పేర్కొన్నది. ఇలాంటి వారి చేతిలో పాలన పెడితే జరిగేదేమిటో సభ్యసమాజం ఆలోచిస్తున్నదా ? అభ్యర్ధుల నేర చరిత్ర గురించి అఫిడవిట్లలో వారే స్వయంగా ఇస్తున్నారు. వాటిని విశ్లేషించి ఎడిఆర్‌ సంస్ధ నిర్వాహకులు పోలింగ్‌కు ముందే ప్రకటిస్తున్నారు. అయినా సభ్యసమాజం అలాంటి వారిని ఎందుకు ఎన్నుకుంటున్నట్లు ? సభ్య సమాజానికి బాధ్యత లేదా ?
దిశ నిందితుల కాల్చివేత జరిగి కొన్ని గంటలు కూడా జరగక ముందే హైదరాబాద్‌ శివార్లలోని హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ప్రగతి నగర్‌లో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఒక మహిళ చేసిన ఫిర్యాదుతో ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వార్త, భయం ఏమైనట్లు ? సభ్య సమాజం ఆలోచించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d