• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: manuvadis

రాజకీయాలను ప్రభావితం చేస్తున్న దేవుళ్లు – కులవివక్షను ప్రశ్నిస్తున్న బహుజనులు, ఇరకాటంలో ఆర్‌ఎస్‌ఎస్‌ !

19 Sunday Feb 2023

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, Literature., NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Bhakti, BJP, cast politics, caste discrimination, caste system, Manusmriti, manuvadis, Mohan Bhagwat, Narendra Modi, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


మహాశివరాత్రి సందర్భంగా దేశమంతటా భక్తులు జాగారం, పూజలు చేయటం సాధారణమే. రాజకీయపార్టీల నేతల భక్తి ప్రదర్శనలు చర్చనీయం అవుతున్నాయి. శనివారం నాడు శివరాత్రి సందర్భంగా వివిధ పత్రికలు, టీవీలు వివిధ అంశాలను జనం ముందుకు తెచ్చాయి. వాటిలో ఒక టీవీ సమీక్ష శీర్షిక ” భక్తి పోటీలో రాహుల్‌ గాంధీ, నరేంద్రమోడీ , సిఎం యోగి పూజా విధి: రాజకీయాలను ప్రభువు శివుడు ఎలా ప్రభావితం చేస్తున్నాడు ” అని ఉంది.


అయోధ్యలో రామాలయ నిర్మాణం మీద చూపుతున్న శ్రద్ద, వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల ముందు జనం దృష్టికి తెచ్చేందుకు ప్రధాని నరేంద్రమోడీ, ఇతర బిజెపి నేతలు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు అన్నది తెలిసిందే. నరేంద్రమోడీ 2022 అక్టోబరులో ఉత్తరాఖండ్‌లోని కేదారనాథ్‌ను సందర్శించారు. ప్రధాని పదవి చేపట్టిన తరువాత ఇది ఆరవసారి. ఆ సందర్భంగా ” ఆయన (శివుడు) మహాపర్వతాల మీద గడిపినందుకు స్వయంగా ఎంతో సంతోషించారు. నిరంతరం ఆయనను గొప్ప మునులు పూజించారు. నేను ప్రభువు శివుడిని మాత్రమే ఆరాధిస్తాను. కేదార ప్రభువు చుట్టూ ఎందరో దేవతలు,రాక్షసులు, యక్షులు, మహాసర్పాలు, ఇతరులు ఉన్నారు.” అని మోడీ చెప్పారు. కొండల్లో నివసించే జనాల సాంప్రదాయ ధవళ దుస్తులపై స్వస్తిక్‌ గుర్తును ఎంబ్రాయిడరీ చేసిన దానిని ధరించి కేదారనాధ్‌ గుడిలో పూజలు చేశారు.నవంబరు నెలలో కాశీ తమిళ సంగం సమావేశాలను ప్రారంభించిన ప్రధాని మాట్లాడుతూ ” కాశీలో బాబా విశ్వనాధ్‌ ఉంటే తమిళనాడులో రామేశ్వరంలో ప్రభు దీవెనలు ఉన్నాయి. కాశీ, తమిళనాడు రెండూ శివమయం, శక్తిమయం ” అన్నారు. (న్యూస్‌ 18, ఫిబ్రవరి 18, 2022)


ప్రభుత్వాలు హాజ్‌ యాత్రకు సహకరించటాన్ని, సబ్సిడీలు ఇవ్వటం గురించి గతంలో బిజెపి పెద్ద వివాదాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. అసోంలోని బిజెపి ప్రభుత్వం శివరాత్రి సందర్భంగా జారీ చేసిన ఒక ప్రకటనలో భక్తులు,యాత్రీకులు కామరూప్‌ జిల్లాలోని డాకిని కొండ మీద ఉన్న భీమేశ్వర దేవాలయాన్ని సందర్శించాలని కోరింది. ప్రభుత్వం ప్రతి మతానికి చెందిన పండుగల సందర్భంగా ఇలాంటి ప్రకటనలు ఇస్తుంటే అదొకదారి, కానీ హిందూ పండగలకే ఇవ్వటం వివాదాస్పదమైంది.దీనిలో మరొక మలుపు ఏమంటే భీమేశ్వర దేవాలయం పూనా జిల్లాలో ఉంది. దాన్ని పన్నెండింటిలో ఆరవ జ్యోతిర్లింగంగా పరిగణిస్తారు. కానీ ఈ దేవాలయం అసోంలో ఉన్నట్లు అక్కడి టూరిజం శాఖ పేర్కొన్నది. బిజెపి నేతలు దేన్నీ మహారాష్ట్రలో ఉంచకూడదని నిర్ణయించారా అని ఎన్‌సిపి నాయకురాలు సుప్రియ సూలే ప్రశ్నించారు. పరిశ్రమలు, ఉపాధిలో మహారాష్ట్ర వాటాను అపహరించారు, ఇప్పుడు సాంస్కృతిక,భక్తిపరమైన వారసత్వాన్ని కూడా హరిస్తారా అని ఆమె ప్రశ్నించారు.


పగటి వేషగాళ్లు లేదా తుపాకీ రాముళ్లు ఏ ఊరు వెళితే ఆ ఊరి గొప్పతనం గురించి పొగడి లబ్ది పొందేందుకు చూస్తారు. అది పొట్టకూటి కోసం, మరి అదే పని రాజకీయ నేతలు చేస్తే….ఓట్ల కోసమని వేరేచెప్పాలా ? శనివారం నాడు సిఎం యోగి ఆదిత్యనాధ్‌ గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాధ్‌ ఆలయంలో శివరాత్రి పూజలు చేశారు. తమిళ కాశీ సంగం సమావేశాల్లో గతేడాది నవంబరులో మాట్లాడుతూ తమిళ భాష ఎంతో పురాతనమైనది, ఘనమైన సాహిత్యాన్ని కలిగి ఉంది అంటూనే రెండు భాషలూ శివుడి నోటి నుంచి వచ్చినవే అని చెప్పారు. దాన్ని అంగీకరించటానికి ఇబ్బంది లేదు. కానీ మన దేశంలో ఎక్కువ మంది మాట్లాడే హిందీ, తెలుగు, బెంగాలీ ఇతర భాషలెందుకు శివుడి నుంచి రాలేదన్నదే ప్రశ్న. శివుడికి ఎన్ని భాషలు వచ్చు అని గూగుల్‌ను అడిగితే ఏవేవో చెబుతోంది తప్ప సూటిగా ఇన్ని వచ్చు అని చెప్పటం లేదు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ గుళ్లు గోపురాలు, సాధు సంతుల చుట్టూ తిరిగిన సంగతి తెలిసిందే. తమ నేత ఒక శివభక్తుడని రాజస్తాన్‌ సిఎం అశోక్‌ గెహ్లాట్‌ గతంలో చెప్పారు.రాజసమంద్‌ జిల్లాలోని నాధ్‌ద్వారా పట్టణంలో గతేడాది ప్రపంచంలోనే ఎత్తైన 369 అడుగుల శివుడి విగ్రహాన్ని విశ్వస్వరూపం పేరుతో ఆవిష్కరించిన సందర్భంగా చెప్పారు.ఈ ఏడాది శివరాత్రి సందర్భంగా రాహుల్‌ గాంధీ ఏ క్షేత్రాన్ని సందర్శించారో తెలీదు గాని శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రకటన చేశారు.


చిత్రం ఏమిటంటే శివ శబ్దం చెవుల్లో పడటాన్నే సహించని త్రిదండి చిన జియ్యర్‌ స్వామి శివాలయాలను సందర్శించరని తెలిసిందే. ముచ్చింతల్‌ ఆశ్రమంలో 2022లో ఏర్పాటు చేసిన సమతామూర్తి రామానుజాచార్య విగ్రహాన్ని శివుడిని మాత్రమే ఆరాధిస్తానని చెప్పిన నరేంద్రమోడీ చేత ఆవిష్కరింప చేయించారు. రామానుజాచార్యుల అంతటి సుగుణవంతుడని మోడీని పొగిడినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఒక శివభక్తుడితో ఆవిష్కరింప చేయించినందుకు తరువాత శుద్ది చేయించారేమో తెలీదు. అపవిత్రం అనుకున్నపుడు అలాంటివి బహిరంగంగానే చేస్తున్నారు. మోడీ, అందునా ప్రధాని గనుక చీకటి మాటున జరిపి ఉండవచ్చన్నది అనుమానం. ఇలాంటి స్వామీజీలు-నరేంద్రమోడీ ఒక దగ్గరకు ఎందుకు వస్తున్నారంటే ఎన్నికల ప్రయోజనం. అంతకు ముందు తెలంగాణా సిఎం కెసిఆర్‌కు చిన జియ్యర్‌ స్వామి ఎంతో దగ్గరగా ఉండేవారు. తరువాత ఆ బంధం తెగింది అనేకంటే బిజెపి తెంచింది అన్నది పరిశీలకుల భావన.మన దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు మతాన్ని, దేవుళ్లను వీధుల్లోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ఎందుకు అన్నది కొంత మందికి ఒక చిక్కు ప్రశ్న. పూ విశ్లేషణ వివరాలు కొంత మేరకు సమాధానమిస్తాయి.


2021లో అమెరికా చెందిన ” పూ ” విశ్లేషణా సంస్థ మన దేశంలో ఒక సర్వే నిర్వహించింది. దానిలో వెల్లడైన కొన్ని అంశాలను చూస్తే ఎందుకు దేవుళ్ల కోసం రాజకీయ పార్టీలు వెంపర్లాడుతున్నదీ అర్ధం అవుతుంది. 2019 నవంబరు 17 నుంచి 2020 మార్చి 23వ తేదీ వరకు మన దేశంలో 29,999 మందిని సర్వే చేసింది. వారిలో 22,975 హిందువులు, 3,330 ముస్లింలు,1,782 సిక్కులు,1,011 క్రైస్తవులు, 719 బౌద్దులు, 109 జైనులు,67 మంది ఏమతం లేని వారు ఉన్నారు. 2019 ఎన్నికలు జరిగిన తరువాత, జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రం, ఆర్టికల్‌ 370 రద్దు తరువాత జరిపిన సర్వే ఇది. విశ్లేషణలో కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. వీటిని పరమ ప్రమాణంగా తీసుకోవాలని చెప్పటం లేదు గానీ దేశంలో నెలకొన్న ధోరణులకు ఒక సూచికగా తీసుకోవచ్చు. 2019 ఎన్నికల్లో పార్టీల వారీగా హిందువులు బిజెపికి 49శాతం, కాంగ్రెస్‌కు 13శాతం వేశారు. ముస్లింలలో కాంగ్రెస్‌కు 30, బిజెపికి 19శాతం, క్రైస్తవుల్లో కాంగ్రెస్‌కు 30, బిజెపికి పదిశాతం, సిక్కుల్లో కాంగ్రెస్‌కు 33, బిజెపికి 19, బౌద్దుల్లో బిజెపికి 29, కాంగ్రెస్‌కు 24శాతం మంది వేశారు. ఈ ధోరణి 2014 నుంచి ఉన్నదని చెప్పవచ్చు. అందువల్లనే ఎవరి ఓటు బాంకును వారు కాపాడుకొనేందుకు చూడటంతో పాటు హిందువుల ఓట్లకోసం కాంగ్రెస్‌ నేతలు, మైనారిటీల ఓట్లకోసం బిజెపి నేతలు వెంపర్లాడటం లేదా సంతుష్టీకరణకు పూనుకున్నారని చెప్పవచ్చు.


దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల విశ్వాసం తగ్గుతున్నదని ఈ సర్వే అంకెలు చెబుతున్నాయి. మొత్తంగా ప్రజాస్వామ్య నాయకత్వం కావాలని 46శాతం మంది చెప్పగా దానికి విరుద్దమైన బలమైన నేత కావాలని చెప్పిన వారు 48శాతం మంది ఉన్నారు. హిందువుల్లో మొదటిదానికి 45 శాతం మద్దతు పలకగా రెండవ దానికి 50శాతం మంది ఉన్నారు.మిగతా మతాల వారిలో ప్రజాస్వామిక వ్యవస్థ కావాలని కోరిన వారి శాతం 49 నుంచి 57శాతం వరకు ఉండగా బలమైన నేత కావాలని చెప్పిన వారు 37 నుంచి 47శాతం వరకు ఉన్నారు.బలమైన నేత కావాలని స్త్రీలు 48, పురుషులు 49శాతం మంది కోరుకోగా ప్రజాస్వామ్యం కావాలని చెప్పిన వారు 44, 47శాతాల చొప్పున ఉన్నారు. ఈ కారణంగానే గట్టి నిర్ణయాలు తీసుకోవటం నరేంద్రమోడీ వల్లనే జరుగుతుందని బిజెపి వ్యూహకర్తలు అలాంటి ప్రచారాన్ని ముందుకు తెచ్చినట్లు స్పష్టం అవుతోంది. సంస్కరణలను వేగంగా అమలు జరపటం గురించి తగ్గేదే లేదని, అదానీ కంపెనీల గురించి విచారణకు అంగీకరించేది లేదన్న వైఖరి, రాష్ట్రాలకు చెందిన సాగు రంగంపై వాటితో సంప్రదించకుండా మూడు చట్టాలను రుద్దేందుకు పూనుకోవటం. ఆర్టికల్‌ 370ని కాశ్మీర్‌ అసెంబ్లీతో చర్చించకుండా రద్దు వంటి వాటిని ” గట్టి నాయకుడి ”లో చూడవచ్చు. చరిత్రలో జర్మన్లు హిట్లర్‌లో గట్టి నేతను చూశారు.


తెలంగాణాలో బిజెపి నేతలు హైదరాబాద్‌లోని వివాదాస్పద భాగ్యలక్ష్మి ఆలయం(చార్మినార్‌ వద్ద ఒక మినార్‌ పక్కనే తెచ్చిపెట్టిన విగ్రహం) నుంచే దాదాపు ప్రతి కార్యకమాన్ని ప్రారంభిస్తారు, కర్ణాటకలో ముస్లిం విద్వేషాన్ని రెచ్చగొట్టటం తెలిసిందే. కేరళలో ముస్లిం, క్రైస్తవ విద్వేషం ఇలా దక్షిణాది రాష్ట్రాలలో మత ప్రాతిపదికన ఓటు బాంకు ఏర్పాటు చేసుకొనేందుకు బిజెపి ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నది. దేశంలోని ఇతర ప్రాంతాలలో ఇప్పటికే రెచ్చగొట్టిన దానిని కొనసాగించేందుకు నిరంతరం కొత్త అంశాలను ముందుకు తెస్తున్నది. ఎందుకు అన్నది పూ సర్వే వివరాలను చూస్తే తెలుస్తుంది.ముందే చెప్పుకున్నట్లుగా 2019లో మొత్తంగా హిందువులలో బిజెపికి ఓటు వేసింది 49శాతమే. వాటిని దేశ జనాభాలో 80శాతం వరకు ఉన్నారు గనుక ఆ మేరకు ఓటు బాంకు ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నది. ప్రాంతాల వారీ చూస్తే ఉత్తరాదిన 68శాతం, మధ్యభారత్‌లో 65, పశ్చిమాన 56, తూర్పున 46, దక్షిణాదిన 19శాతం మాత్రమే. ఈ కారణంగానే దక్షిణాది మీద బిజెపి ఎంతగానో కేంద్రీకరిస్తున్నది. నిజమైన భారతీయుడు అంటే హిందూ అన్నట్లుగా హిందూ అంటే హిందీ, హిందీ మాట్లాడేవారంటే హిందువులే అన్న భావనను రేకెత్తించేందుకు కూడా చూస్తున్నారు.దానిలో భాగంగానే దేశం మొత్తం మీద హిందీని బలవంతంగా రుద్దాలన్న యత్నం. పూ సర్వే ప్రకారం నిజమైన భారతీయుడు హిందువుగా ఉండాలని భావిస్తున్నవారు 55శాతం, హిందీ మాట్లాడాలని చెప్పిన వారు 59, హిందూగా ఉండటం హిందీ మాట్లాడటం అనేవారు 60శాతం ఉన్నారు.


ఏడు దశాబ్దాల స్వాతంత్య్రం తరువాత జనం మత వ్యవహారాల్లో రాజకీయపార్టీల, నేతల జోక్యాన్ని సమర్ధించేవారు అన్ని మతాల్లో మూడింట రెండువంతుల మంది ఉండటం ఆందోళన కలిగించే అంశం.దీన్ని అవకాశంగా తీసుకొని కొన్ని శక్తులు నిస్సిగ్గుగా మతాన్ని-రాజకీయాన్ని మిళితం చేస్తున్నాయి. మత పెద్దలమని చెప్పుకొనే వారు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. పూ సర్వే ప్రకారం మొత్తంగా చూసినపుడు 62శాతం మంది మత వ్యవహారాల్లో రాజకీయపార్టీల ప్రమేయాన్ని సమర్ధించారు.హిందూమతంలో సమర్ధించిన వారు 64శాతం కాగా వద్దన్న వారు 29శాతం ఉన్నారు. సమర్ధించిన వారు ఇతర మతాల్లో 59 నుంచి 42శాతం వరకు ఉన్నారు. రాజకీయపార్టీల ప్రమేయం ఉండకూడదని చెప్పిన వారు ఇతర మతాల్లో 35 నుంచి 52శాతం వరకు ఉన్నారు. ఈ కారణంగానే హిందూత్వశక్తులు తమ అజెండాను అమలు చేస్తున్నాయి. ముస్లింలలో రాజకీయపార్టీల ప్రమేయం ఉండాలన్న వారు 59శాతం వద్దన్నవారు 35శాతం. అంటే మెజారిటీ మైనారిటీ మతాల్లో మతాన్ని ఎంతగా ఎక్కించిందీ అర్ధం చేసుకోవచ్చు.మెజారిటీ మతతత్వం ఎంత ప్రమాదకరమో మైనారిటీ మతతత్వం కూడా అంతే ప్రమాదకరం. నిరుద్యోగం ప్రధాన సమస్య అని భావిస్తున్నవారు అందరిలో 84శాతం మంది ఉండగా అవినీతి అని 76, మహిళలమీద నేరాలని 75, మతహింస అని 65శాతం మంది భావించారు.హిందూ-ముస్లిం మతాలకు చెందిన వారు ఈ అంశాల గురించి దాదాపు ఒకే విధంగా స్పందించటం విశేషం.


ఇక ఏ దేవుడు, దేవత పలుకుబడి లేదా ప్రభావం ఎక్కువగా ఉందో కూడా పూ విశ్లేషణలో ఆసక్తికర అంశాలున్నాయి.శివుడు 44శాతంతో ఆలిండియా దేవుడిగా అగ్రస్థానంలో ఉండగా హనుమాన్‌ 35, గణేష్‌ 32,లక్ష్మి 28, కృష్ణ 21, కాళి 20, రాముడు 17,విష్ణు 10, సరస్వతి 8, ఇతరులు 22శాతంతో ఉన్నారు. చిత్రం ఏమిటంటే శ్రీరాముడి గురించి సంఘపరివార్‌ పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ మిగతా దేవుళ్లతో పోలిస్తే ఎక్కడా పెద్దగా ప్రభావం చూపటం లేదని పూ చెబుతోంది. మధ్య భారత్‌లో మాత్రమే పైన పేర్కొన్న తొమ్మిది మంది జాబితాలో రాముడు గరిష్టంగా 27శాతంతో ఐదవ స్థానంలో ఉన్నాడు. ఉత్తరాదిన 20,తూర్పున 15, దక్షిణాదిన 13,పశ్చిమాన 12, ఈశాన్యంలో ఐదుశాతం మంది అనుచరులతో ఉన్నాడు. ఉత్తరాదిన 43శాతంతో హనుమాన్‌ తరువాత 41శాతంతో శివుడు, గణేష్‌ ఉన్నారు.ఈశాన్యంలో కృష్ణుడు 46శాతం, తూర్పున 34శాతంతో కాళి, 32శాతంతో లక్ష్మి,పశ్చిమాన 46శాతంతో గణేష్‌ అగ్రస్థానంలో ఉన్నారు.దేశంలోని మిగతా ప్రాంతాల వారితో పోలిస్తే దక్షిణాదిన ప్రాంతీయ దేవతలు గణనీయంగా ప్రభావం కలిగి ఉన్నారు. మురుగన్‌ 14, అయ్యప్ప 13, మీనాక్షి ఏడు శాతం మందిని కలిగి ఉన్నారు.శివుడు 39శాతంతో అగ్రస్థానంలో ఉన్నాడు.


ఆర్‌ఎస్‌ఎస్‌ అనుకున్నట్లుగా లోకం నడవదు. రామచరిత మానస్‌లో వెనుకబడిన తరగతుల వారిని కించపరిచినట్లు వచ్చిన వివాదం తరువాత ఆ సామాజిక తరగతులను సంతుష్టీకరించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత మోహన్‌ భగవత్‌ రంగంలోకి దిగారన్నది ఒక అభిప్రాయం. హిందూత్వ శక్తులు, వారిని అనుసరించేవారిలో ఒక వైరుధ్యం ఉంది. తాము చెప్పే హిందూత్వ సనాతనమైనదని దానిలో కులాలు లేవని జనాన్ని నమ్మించేందుకు బిజెపి చూస్తున్నది. గతేడాది అక్టోబరు ఎనిమిదవ తేదీన నాగపూర్‌లో ఒక పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ వర్ణ, కుల వ్యవస్థలను హిందూయిజం నుంచి తొలగించాలని, అది పాపమని కూడా మోహన్‌ భగవత్‌చెప్పారు. ఆ సభ గురించి లోక్‌సత్తా పత్రిక రాసిన వార్తలో ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి బ్రాహ్మల గురించి ప్రస్తావించినట్లు రాశారని ఆ పత్రిక సంపాదకుడు, నాగపూర్‌ విలేకరి మీద సంఘపరివార్‌కు చెందిన వారు కేసులు దాఖలు చేశారు. ఒక కులం గురించి భగవత్‌ ప్రస్తావించని మాట నిజమే అయినా కులవ్యవస్థను సృష్టించింది ఎవరు ? లేక దానికి అదే పుట్టిందా అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.వర్ణ వ్యవస్థ సృష్టి బ్రాహ్మణవాదులపనే అనే అభిప్రాయం బలంగా ఉండటంతో సదరు విలేకరి బ్రాహ్మణుల పేరు ప్రస్తావించి ఉండవచ్చు.


చిత్రం ఏమిటంటే అదే మోహన్‌ భగవత్‌ ఈ ఏడాది ఒక దగ్గర మాట్లాడుతూ కులాలను సృష్టించింది పండితులే అని సెలవిచ్చారు. వెనుకబడిన తరగతులు, దళితులు, మహిళలను కించపరుస్తూ తులసీదాస్‌ రామచరిత మానస్‌లో రాశారన్న విమర్శలను సమాజవాదీ, ఆర్‌జెడి నేతలు ముందుకు తెచ్చిన పూర్వరంగంలో భగవత్‌ ఈ మాటలు చెప్పారని అనుకోవచ్చు. ఈ దేశంలో పండితులు అంటే బ్రాహ్మలే కదా ! దాని మీద ఆర్‌ఎస్‌ఎస్‌లోని బ్రాహ్మలు, వెలుపల ఉన్న వారిలో కూడా గగ్గోలు తలెత్తటంతో నష్టనివారణగా ఒక వివరణ ఇచ్చారు. అదే మంటే పండిట్‌ అంటే ఆంగ్లంలో బ్రాహ్మలు కాదు, ఆంగ్లం, మరాఠీలో మేథావులు అని అర్ధం ఉంది కనుక ఆ భావంతో అన్నారు అని పేర్కొన్నారు. ఇక్కడ సమస్య మేథావులు అంటే ఎవరు. బ్రాహ్మలు కాని మేథావులను పండిట్‌ అని ఎందుకు పిలవటం లేదు ? కాశ్మీరీ బ్రాహ్మలకు ఉన్న మరోనామ వాచకమే కాశ్మీరీ పండిట్‌లు కదా ! కులవ్యవస్థ ఉనికిలోకి వచ్చిన నాటి నుంచి బ్రాహ్మణులు తప్ప వేదాలు చదివిన వారు ఇతర కులాల్లో ఎవరూ లేరు. వేదాల్లో ఉన్నదే చెబుతున్నారా అసలు వాటిలో ఉన్నదేమిటి అని తెలుసుకొనే ఆసక్తి కలిగిన వేళ్ల మీద లెక్కించగలిగిన వారు తప్ప వేదాలను చదివే ఇతర కులస్థులు ఎంతు మంది ఉన్నారు ? ఇటీవలి వరకు అసలు ఇతరులను చదవనివ్వలేదు. నిన్న మొన్నటి వరకు శూద్రులు, అంటరాని వారిగా ముద్రవేసిన వారికి కనీస చదువు సంధ్యలు కూడా లేవు కదా. అలాంటపుడు ఇతర కులాల్లోని ఏ పండితులు తమను తాము కించపరుచుకొనే విధంగా నిచ్చెన మెట్ల అంతరాలతో కులాలను సృష్టించినట్లు? చదువుకున్నది బ్రాహ్మల తరువాత క్షత్రియులు, వైశ్యులు మాత్రమే. అంటే ఈ కులాలకు చెందిన మేథావులు అనుకుంటే అందులో బ్రాహ్మల వాటా ఎంత ? ఇతరుల వాటా ఎంతో ఆర్‌ఎస్‌ఎస్‌ నిపుణులు వేదగణితంతో గుణించి చెప్పాలి.


కుల వ్యవస్థ పోవాలని ఇప్పటికైనా ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పటం, మారుమనస్సు పుచ్చుకోవటం మంచిదే. అందుకోసం వారు చేసిందేమిటి ?మాటలకే పరిమితం, చిత్తశుద్ది ఎక్కడా కనిపించదు. గమనించాల్సిందేమంటే కులాల సృష్టి పండితులదే అని చెప్పటంతో హిందూ, బ్రాహ్మణ వ్యతిరేకం అంటూ హిందూత్వ అనుకూలురు మోహన్‌ భగవత్‌ మీద మండిపడుతున్నారు. పండితుల గురించి ఇచ్చిన వివరణను ఏ పండితులూ జీర్ణించుకోవటం లేదు. మరోవైపు పండితులుగా ముద్రవేసుకున్న వారు, ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతుదారులు కులవ్యవస్థను సమర్ధించే మనుస్మృతి పుస్తకాలను అచ్చువేయించి ప్రచారం చేస్తున్నారు. పూరీ శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి భగవత్‌ మాటలపై స్పందిస్తూ కులవ్యవస్థను సమర్ధిస్తూ మాట్లాడారు.” తొలి బ్రాహ్మడి పేరు బ్రహ్మ. మీరు వేదాలను చదవాలి.ప్రపంచంలోని సైన్సు, ఆర్ట్స్‌ను బ్రహ్మ ఒక్కడే వివరించాడు. మనం సనాతన వ్యవస్థను ఆమోదించకపోతే దాని స్థానంలో ఏ వ్యవస్థ ఉండాలి ” అని ప్రశ్నించారు. శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద మాట్లాడుతూ ” కుల వ్యవస్థను దేవుడు సృష్టించలేదని, వాటిని పండితులు సృష్టించి ఉండవచ్చని భగవత్‌ చెబుతున్నారు. తరువాత పండితులంటే మేథావులు తప్ప బ్రాహ్మలు కాదని వివరించారు.మేథావులు కొన్ని విషయాలను చెబితే మీ రెందుకు తిరస్కరిస్తున్నారు ” అని ప్రశ్నించారు. భగవత్‌ జాతి వ్యతిరేకి, హిందూ వ్యతిరేకి అని ఇటీవల ప్రముఖంగా వార్తలకు ఎక్కిన నరసింగానంద ధ్వజమెత్తారు.


దక్షిణాదిలో మనువాదం, దానికి ప్రతినిధులుగా ఉన్న బ్రాహ్మణుల మీద ధ్వజమెత్తుతూ పెద్ద ఉద్యమం మాదిరి నడిచింది. బ్రాహ్మణులకు ప్రత్యామ్నాయంగా కొన్ని చోట్ల కమ్మ బ్రాహ్మణులు వివాహతంతు వాటిని నిర్వహించిన రోజులు ఉన్నాయి. ఇటీవలి కాలంలో బ్రాహ్మణులు కాకున్నప్పటికీ బ్రాహ్మణవాదాన్ని తలకు ఎక్కించుకున్న అనేక మంది వర్ణ వ్యవస్థకు, హిందూత్వకు ముప్పు వచ్చిందంటూ వీధుల్లోకి వస్తున్నారు. ఇప్పటికీ తంతుల పేరుతో బ్రాహ్మణులు జనాన్ని దోచుకుతింటున్నారని, పరాన్న భుక్కులుగా ఉన్నారంటూ వ్యతిరేకతను వెల్లడించటాన్ని చూడవచ్చు. ఉత్తరాదిలో బిజెపి మద్దతుదార్లుగా ఉన్న అనేక మంది దళితులు,వెనుకబడిన తరగతుల వారు తమ పట్ల వివక్షను ప్రదర్శించే మనుస్మృతి, పురాణాల గురించి ప్రశ్నిస్తున్నారు. ఒక వరలో రెండు కత్తులు ఇమడవు అన్నది తెలిసిందే. అందుకే ఓటు బాంకుగా ఉన్న బలహీనవర్గాలు లేవనెత్తే సామాజిక వివక్ష, కించపరచటాన్ని ప్రశ్నిస్తున్న కారణంగా అసలైన హిందూత్వ అంటే కులాలు లేనిది అనే పల్లవిని ఆర్‌ఎస్‌ఎస్‌ అందుకుంది. ఇప్పటి వరకు ప్రధాన మద్దతుదార్లుగా ఉన్న బ్రాహ్మలు, బ్రాహ్మణవాదులు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఒక విమర్శ చేసి దళిత, బహుజనులను , అబ్బే నా అర్ధం అది కాదు అంటూ బ్రాహ్మలను ఇతర అగ్రకులాలు అనుకొనే వారిని సంతుష్టీకరించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి సాము గరిడీ చేస్తున్నారు.ఉత్తరాదిన బహుజనుల్లో ప్రారంభమైన ఈ ప్రశ్నించే, వివక్షను ఖండించేతత్వం మరింత పెరగటం అనివార్యం. అది హిందూత్వ అజెండాను, మనుకాలం నాటికి దేశాన్ని తీసుకుపోవాలనటాన్ని కూడా అంతిమంగా ప్రశ్నించకమానదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అంబేద్కర్‌, బుద్ద సబ్బులతో మానసిక బానిసత్వ శుద్ధి !

30 Tuesday May 2017

Posted by raomk in Communalism, Current Affairs, History, INDIA, Literature., Opinion, RELIGION, Social Inclusion

≈ Leave a comment

Tags

Ambedkar, Buddha, Dalit, manuvadis, mental slavery, soaps, Yogi Adityanath

అంబేద్కర్‌, బుద్ద సబ్బులతో మానసిక బానిసత్వ శుద్ధి !

అసంగ్‌ వాంఖడే

ఇదిగో నా నైవేద్యం

మనువు నన్ను మలినం గావించాడు

మీ అసహ్యబుద్ది

మాకు దుర్గంధం వంటి కులనామాన్నిచ్చి వెలివేసింది

గాయాల వాసనతోనే నేను ప్రకాశించాను

నాపై వున్నది అణచివేత జాడలు తప్ప మీ దుర్గంధం కాదు

మీ దేవుడి ప్రసన్నం కొరకు

ఈ రోజు నాకు షాంపూ, సబ్బులు ఇచ్చారు

మైనారిటీల హింస, మానభంగాలను వల్లించే

మీ కంపునోళ్లను కడిగేందుకు వాటినెప్పుడైనా వాడారా

మనువాదం, వర్ణాశ్రమ ధర్మం అని ప్రవచించే

బుద్ధి శుద్ధికి పుపయోగించారా

మీ కానుకలతో

మీరు నా మాన మర్యాదలను మంటగలిపారు

నా నైవేద్యంతో

మీ అహంభావ, గర్వాలను అసహ్యించుకుంటున్నా

మా బాబా సాహెబ్‌ చర్యలు

నా క్షణభంగురమైన వాసనలను శుద్ధి చేస్తాయి

నా కుల అణచివేత, వెలి గాయాలను సబ్బులు మరింత మండిస్తాయి

నాకు మీ సానుభూతి అవసరం లేదు

నాకు మీపై ద్వేషం కావాలి

నిరసన కేకల మధ్య

నా ఆత్మప్రతిష్ట గానం వినిపిస్తాను

అదే నాకు ఆత్మగౌరం, స్వాతంత్య్రాలను,

రణానికి స్వేచ్చ నిస్తుంది.

రెండు సార్ల తిండి కోసం

నేను నీ మలమూత్రాలను మోస్తాను

లేదంటే ఈ సర్వసత్తాక రాజ్యంలో

నేను ఆకలితో నిద్రపోవాలి

సబ్బులు, షాంపులు మీ అజా&క్షన ఆకలిని తప్ప

మా కడుపులను నింపవు

దేశ వెలుగుల ప్రసరణ కోసమే మీ ప్రభువు ఇక్కడున్నాడు

ఆయన ఆహ్లాదం కోసం మమ్మల్ని శుద్ధి చేశారు

భజనపరుల మాదిరి చిరునవ్వులు చిందించమన్నారు

మా అంతరంగం తన మౌనాన్ని వీడితే ఎలాంటి కంపనలు వస్తాయో తెలుసా ?

ఓ దేవుడా మా ఇంటిని చూసేందుకు దయచేయి

అది మీ కాషాయ అంగవస్త్రం కంటే శుభ్రంగా వుంటుంది

అయితే నీ అంతరంగం పరిశుద్ధంగా వున్నపుడు మాత్రమే మాట్లాడు

మనువును తగులబెట్టిపుడు మాత్రమే నవ్వు

నీ హృదయంలో నృత్యం చెయ్యి

నా నిశ్శబ్దం బద్దలు కాబోతున్నది

ఇప్పటికే వుషోదయమైంది

మీరు వెనుదిరిగి వెళ్లే ముందు ఇదే నా నైవేద్యం

నేను అంబేద్కర్‌, బుద్దుడు అనే సబ్బులను అర్పిస్తున్నాను

వెళ్లి మీ మానసిక బానిసత్వాన్ని శుద్ధి చేసుకోండి

మీ తాత్వికతలో మనువు చొప్పించిన కులాన్ని అంతం చేయండి

మీ కాషాయ అంగవస్త్రాన్ని తెల్లగా చేయండి

మా వైపు ఇద్దరు సూర్యులు వుండ కూడదు

మిమ్మల్ని భస్మం చేసేందుకు మా స్వంత సూర్యుడున్నాడు

కొద్ది రోజుల క్రితం వుత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధుడు ఒక గ్రామానికి వెళ్లారు. ఆ సందర్భంగా దళితులకు సబ్బులు, షాంపూలు ఇచ్చి యోగి దర్శనానికి శుభ్రంగా స్నానం చేసి రమ్మని ఆదేశించారు. దానిపై న్యాయవాది, కవి అయిన అసంగ్‌ వాంఖడే స్పందనే ఈ కవిత. అనువాదం ఎం కోటేశ్వరరావు. నేను స్వతహాగా కవిని కాదు కనుక అనువాదంలో ఆ ఆవేశం వుండదు కనుక విమర్శకులు మన్నించాలి. అందువలన ఆంగ్ల మూలాన్ని కూడా ఇక్కడ ఇస్తున్నాను.

Here is my offer
Manu made me unclean.
Your prejudiced mind makes me
reek of caste names and exclusion
I glow with the fragrance of sores,
I stink of oppression and not your shit.

To please your lord, you offered me
soap and shampoo today.
Have you ever used them to clean
those foul smelling tongues,
which talk of raping minorities and violence?
Or used them to clean those brains,
that preach Manuvād and varnashramadharma?

With your offer,
you have abused my dignity.
With my offer,
I am abusing your conceit.

Appropriators of my Babasaheb
act as my ephemeral cleansers.
Soap exacerbates my wounds
of caste oppression and exclusion,
I don’t want your sympathy,
I want your detestation.
I play the song of assertion
in the cries of protests;
It gives me dignity and freedom,
a freedom to fight for.

For two meals
I carry your faeces!
If I don’t, I will sleep
hungry in this Republic.
Soap and shampoo only feed your ignorance,
not my stomach.

Your lord is here to capture the nation’s spotlight
We are bleached, to look presentable;
We are told to cheer like minions,
What will tremble when my insides break their silence?

Oh Lord, come see my home!
It is cleaner than your bhagwa drape.
But talk only when your consciousness is clean;
Smile only when you burn the Manu
dancing in your heart.
For my silence is about to break,
It is dawn already.

Before you turn your back
here is my offer.
I offer you my soaps, Ambedkar and Buddha.
Go clean your mental slavery,
Go annihilate caste and the Manu infused in your reason,
bleach your bhagwa to white.
There cannot be two Suns on this side, and
We have our own, to incinerate yours.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీత్వ-మనువాదుల మనోగతం ఏమిటి ?

22 Friday Apr 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION

≈ Leave a comment

Tags

BJP, Hinduthwa, manuvadam, manuvadis, Modi Critics, moditva manuvadi's, Narendra Modi Failures, narendra modi's ruling, RSS, RSS game

ఎం కోటేశ్వరరావు

    రెండు సంవత్సరాల నరేంద్రమోడీ పాలన వుత్సవాలు త్వరలో జరగబోతున్నాయి. తొలి ఏడాది మాదిరి ఈ సారి హడావుడి వుంటుందా ? లేక వైఫల్యాల మనోవైకల్యంతో సాదాసీదాగా వుంటుందా? మోడీని దేవదూతగా వర్ణించిన వెంకయ్య నాయుడి వంటి వారు సాదాసీదాగా జరగనిస్తారా ? వదిలేయండి ఎలా అయితేనేం, దేశానికి జరిగిందేమిటి? సామాన్యులకు ఒరిగిందేమిటన్నదే ముఖ్యం ! గత ఎన్నికలలో గుజరాత్‌ మోడల్‌ పాలన అనే ఎండమావులను చూసి భ్రమలు పెంచుకున్నవారు కొందరైతే, అంతకు ముందు గుజరాత్‌ మారణకాండతో వుత్సాహం పొంది హిందూత్వకు పెద్ద పీట వేస్తారని చూస్తున్న మనువాదులు ఎలాగూ వున్నారు. రెండు సంవత్సరాల సంబరాల సందర్భంగా వారేమనుకుంటున్నారు ?

   ‘ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం త్వరలో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది. రాజకీయాలలో ఒక వారమే దీర్ఘకాలం అనుకుంటే ప్రభుత్వం ఎటు వైపు పయనిస్తోందో చెప్పటానికి రెండు సంవత్సరాలు చాలు. గాలిలో గడ్డి పరకలు దిశను తెలియచేసినట్లే తన విధానాలు, కార్యక్రమాల గురించి సమర్ధనీయం కాని ఆశాభావం, అదృష్టాన్ని నమ్ముకొనే విపరీత వ్యామోహంతో వున్నట్లు కనిపిస్తోంది.’ ఈ మాటలు స్వరాజ్య అనే మితవాదుల పత్రికలో మురళీ ధరన్‌ అనే కాలమిస్టు రాసినవి.ఆ పత్రిక నరేంద్రమోడీ, హిందూత్వవాదుల అనధికార వాణిగా వుంది. అలాంటి దీనిలో ఇలాంటి వ్యాసం ప్రచురించటం ఏమిటి అని ఆశ్చర్య పోయిన వారు కూడా వున్నారు. నిజానికి ఇది మోడీకి వ్యతిరేకంగా రాసినది కాదు, ఆయనను హెచ్చరిస్తూ ఇష్టం లేకున్నా వెళ్ల బోసుకున్న ఆవేదన. బిజెపి, నరేంద్రమోడీని రాజకీయంగా, విధాన పరంగా వ్యతిరేకించే వారే కాదు, సమర్ధించేవారిలో కూడా ‘అసంతృప్తి’ ఎలా పెరుగుతోందో ఈ వ్యాసంపై వెలువడిన అభిప్రాయాలు మోడీ-మనువాదుల మనోగతాన్ని వెల్లడిస్తున్నాయి. వాటిలో కొన్నింటి సారాంశాన్ని చూద్దాం.

    అమెరికన్లు అంతరిక్షంలో చంద్రుడి వద్దకు వెళ్లాలని అనుకున్నపుడు వారిదగ్గర సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఏమీ లేదు, కాని వారు ఆ మేరకు కలకన్నారు,జనాన్ని ఆ వైపుగా నడిపించి సాధించారు.మన చేతుల్లో చేయాల్సిన పని చాలా వుంది.ఇప్పటికీ రోడ్ల మీద చెత్తవేయటాన్ని చూస్తున్నాం, దీని గురించి మోడీ పెద్దగా చేయగలిగిందేమీ లేదు. దిశను నిర్ధేశించటమే ఆయన బాధ్యత.మోడీ దగ్గర పెద్ద సైన్యం వుంది వారు ఎంతగానో కష్టపడాల్సి వుంది. సమస్య ఏమంటే వారంతా ఆయన చుట్టూ కుర్చుంటున్నారు తప్ప చేస్తున్నది తక్కువ. నాకు తెలిసినంత వరకు నరేంద్రమోడీ మంత్రివర్గంలో పని చేస్తున్న అధికారులందరూ పధకాలను విజయవంతం చేసేందుకు పూర్తి స్థాయిలో పని చేస్తున్నారు.నరేంద్రమోడీ నిర్దిష్ట కాలంలో ఫలితాలు రావాలని కోరుకొనే నేత, ఆయన మంత్రులందరూ కష్టపడి పని చేస్తున్నారు. 2017 నుంచి నిర్మలా సీతారామన్‌, ప్రకాష్‌ జవదేకర్‌, పియూష్‌ గోయల్‌, రవిశంకర్‌ ప్రసాద్‌, మీనాక్షి లేఖి, స్మృతి ఇరానీ లను టీవీ చర్చలకు పంపటం నరేంద్రమోడీకి మంచి వ్యూహంగా వుంటుంది.తద్వారా సాధించిన మంచి గురించి చైతన్యాన్ని కలిగించవచ్చు.

    నిజంగా మంచిని సాధిస్తే జనానికి తెలుస్తుంది, జరిగినట్లు భావిస్తారు, సాధించిన వాటి గురించి చెప్పటానికి డజను మందిని పంపనవసరం లేదు. ఫలితాలే స్వయంగా వెల్లడిస్తాయి.

    మీడియా, ప్రతిపక్షాలు దెబ్బతీసే పనిలో వున్నపుడు మనం అలాంటి పనులు చేయాల్సి వుంటుంది.

  యుపిఏ పాలనా కాలంలో ప్రతివారం లూటీ జరిగినా ఎన్నికల ఫలితాలలో మోడీ వచ్చేంతవరకు అది కాంగ్రెస్‌ను ప్రభావితం చేయలేదు. మీడియా మద్దతు లేకుండా తాము చేసిన దానిని ప్రజలకు చెప్పుకోగలమని బిజెపి నాయకులు అనుకుంటే భ్రమలో వున్నట్లే. కనీసం వామపక్షాలకు మద్దతు ఇచ్చే నెట్‌వర్క్‌ను అయినా ధ్వంసం చేయాలి. వారు వాటితో బతగ్గలగటమే కాదు వృద్ధి చెందుతున్నారు.

    కేవలం విద్యుత్‌, మౌలిక సదుపాయాలు, రైల్వేలు, అవినీతి రహిత పాలన కారణంగానే ప్రధాని మోడీ వచ్చే ఎన్నికలలో గెలుస్తారు.

   మోడీ పాలనాయంత్రాంగం అత్యంత ముఖ్యమైన సమస్యలను కూడా పట్టించుకోవటం లేదు.భారత్‌లో హిందువుల పట్ల వివక్ష చూపుతున్నారు. మైనారిటీలతో సమంగా హిందువుల దేవాలయాలను స్వాధీనం చేసుకోవటం గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు.ఆయన ఓటర్లందరూ హిందువులే, వారిని విస్మరిస్తున్నారు.

   మోడీ హిందూ హృదయ సామ్రాట్‌గా వుండాలని అంగీకరిస్తా. మన హిందువులందరికీ సమాన అవకాశాలు కల్పిస్తారని నేను ఇంకా వేచి చూస్తున్నా.

   హిందువులను విస్మరించటం లేదు. కానీ దేవాలయ ట్రస్టులు డబ్బును వెనక్కి తీసుకోవటం అంత సులభం కాదు, అది 1949లోనో ఎప్పుడో జరిగింది. అందరూ ఇంతకాలం ఎందుకు నోర్మూసుకున్నారు.

   సమస్య రాష్ట్ర ప్రభుత్వాలతో వుంది. ప్రధాన రాజకీయాలు, పధకాల అమలు రాష్ట్ర స్థాయిలోనే జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు చౌకబారు స్థానిక రాజకీయాల మీద తప్ప పధకాల అమలు మీద ఎప్పుడో తప్ప శ్రద్ధ పెట్టటం లేదు. మోడీ లేదా బిజెపి తన సమయం, డబ్బును పశ్చిమబెంగాల్‌, కేరళ వంటి ప్రయోజనం లేని రాష్ట్రాల మీద వెచ్చించే కంటే తమ పాలనలో వున్న వాటిమీద పెట్టటం మంచిది. మోడీ గుజరాత్‌లో చేసిన మాదిరి ఆ రాష్ట్రాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి 2019 ఎన్నికలలో ఆ విజయాలను ముందుకు తేవటం మంచిది.

    వారి స్వంత రాష్ట్రాలపైనే పూర్తిగా కేంద్రీకరించటం మంచిది. చివరికి చత్తీస్‌ఘర్‌ కూడా మారిపోతే ఇతర రాష్ట్రాలలోని జనం వాటిని చూసి ఈర్ష్య పడతారు, ఇతర పార్టీలను అపహాస్యం చేస్తారు.

    ఒంటి చేత్తో దేశాన్ని ముందుకు తీసుకుపోయేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారు. సమయాన్ని వృధా చేస్తూ ముందుగా వ్యవస్ధలను నిర్మించి తరువాత పధకాలను ప్రారంభించాలని అనుకుంటే ఫలితాలు సంపూర్తిగా వుండకపోవచ్చు. మార్కెట్లోను, జనంలోనూ ఆశాభావాన్ని కలిగించటానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. స్వంత ప్రభుత్వంలో ప్రతిభలేమిని ఆయన ఎదుర్కొంటున్నారు, కానీ ఆయన ప్రతి పధకానికి వున్న ఆటంకాలను తొలగించగలరు.ఆయన పద్దతి కొద్దిగా తేడాగా వుండవచ్చు కానీ కాంగ్రెస్‌కు ఇచ్చిన మాదిరి ఆయనకు మరింత సమయాన్ని ఇవ్వాలి. భారత ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తున్నది. అంతర్గతంగా తన ప్రభుత్వంలో జోక్యం చేసుకోవటంపై మోడీ జయప్రదంగా పోరాడారు. ఇది పశ్చిమ దేశాలకు కోపకారణమైంది. వారి, మన మీడియా కూడా ఆయనకు వ్యతిరేకంగా కత్తులు దూస్తున్నది.ఆయనను వూపిరి సలుపుకోనివ్వండి.

   ప్రకటించటంతో పాటు పధకాల అమలుపై కూడా శ్రద్ధ పెడితే అవి పని చేస్తాయి. దిగువ స్ధాయిలో అటువంటి ప్రయత్నాలకు కొన్ని సమస్యలు ఎదురౌతాయి, ముందుకు పోతే వాటిని సరిచేసుకోవచ్చు.వాటిని అమలు జరిపితేనే పురోగతి వుంటుంది, చరిత్రను చూస్తే సన్నాహాలు లేకుండా ప్రారంభిస్తే పనిచేయవని చాలా మంది చెప్పటం జరుగుతూనే వుంటుంది.మోడీ అందుకు మార్గం చూపారు.మోడీ ప్రచారం కారణంగా విజయం సాధిస్తారు. విజయం దానంత అదే రాదు.

    బిజెపి వారు (ఆర్‌ఎస్‌ఎస్‌, విహెచ్‌పి తదితరులతో సహా) నిజానికి భిన్నమైన వారేమీ కాదు. వాగాడంబర నినాదాలు తదుపరి చర్యలు, ఫలితాలు వుండటం లేదు.టీవీలలో జనాన్ని మెప్పించే ఒప్పించే మేథావంతులు కొద్ది మందే వున్నారు. ప్రచారాన్ని ప్రారంభించటం వాటిని చివరిదాకా పూర్తి చేయకుండా వదలి వేయటం లేదా ప్రతి వుదంతంలోనూ వెనక్కి తగ్గటం గురించి అనేక వుదాహరణలు చెప్పుకోవచ్చు.

1. ఘర్‌ వాపసీ: దానిని ప్రారంభించారు తరువాత వదలివేశారు. గత రెండు సంవత్సరాలుగా తిరిగి అది వినపడటం లేదు.

2.జెఎన్‌యు వుదంతం: కన్నయ్య ఇతరుల గురించి ఎంతో మాట్లాడారు, వారేమో చేయదలచుకున్నది చేస్తూనే వున్నారు.

3. భారత మాతాకీ జై : పసలేని నినాదం, నిట్‌లో భారత అనుకూల విద్యార్ధులను రక్షించటానికి కూడా బిజెపి ముందుకు రాలేకపోయింది. ఒక నినాదంపై పిల్లచేష్టమాదిరి చర్చలు తెలివి తక్కువ వారిగా చేస్తున్నాయి తప్ప దేశభక్తులుగా కాదు.

4. గొడ్డు మాంస నిషేధం: గేదెలు, ఆవులు మేకలు,ఎద్దులు, కోళ్లు, పందులను వధించవచ్చు గానీ ఆవులను మాత్రం కాదు, ఏమిటీ తర్కం. గోవాలో బిజెపి ప్రభుత్వం గొడ్డు మాంసాన్ని అనుమతించవచ్చా, ఏమిటీ అసంబద్ధ ద్వంద్వ ప్రమాణాలు.

5.అనుపమ ఖేర్‌ : అతనికి ఏమైంది. కేంద్రం, రాష్ట్రంలోనూ రెండు చోట్లా బిజెపి అధికారంలో వున్న తన స్వంత దేశంలో శ్రీనగర్‌లో కనీసం ప్రవేశించనివ్వకుడా వెనక్కి తిప్పి పంపారు.

6.వెర్రి వారిగా పిలువబడే బిజెపి వారు:అసహ్యంగా మాట్లాడేవారి గురించి ఏం చేశారు ?

7. వుమ్మడి పౌర స్మృతి: ముస్లిం మహిళలకు బిజెపి ప్రభుత్వ మద్దతు ఎక్కడ ?

8. పాకిస్ధాన్‌పై విధానం: పాకిస్థాన్‌ ఏ టు ఇ ని నాకటం తప్ప బిజెపి చేసిందేముంది. ప్రతిఘటన ఎక్కడ ? పఠాన్‌ కోట్‌ వైమానికి స్ధావరంపై వారు చేసిన దాడి గురించి దర్యాప్తు చేయటానికి ఐఎస్‌ఐని ఆహ్వానించటం కంటే దారుణం ఇంకేముంటుంది? ముందే చెప్పినట్లు ఇలా చెప్పుకుంటూ పోతే జాబితాకు అంతు లేదు. బిజెపి,మోడీలపై జనం పెట్టుకున్న ఆశలు వేగంగా అంతరిస్తున్నాయి. ఈ బుద్దిలేని గుంపుతో పోలిస్తే 2019 రాహుల్‌ గాంధీ ఒక గొప్ప రాజకీయవేత్తగా కనిపిస్తారేమో ఎవరికి తెలుసు !!

(ఈ వ్యాఖ్యల గురించి ఎవరికైనా అనుమానం వుంటే మురళీధరన్‌ వ్యాసం పూర్తిగా చదువుకొనేందుకు, దానిపై వెలువడిన అభిప్రాయాలను తెలుసుకొనేందుకు ఈ లింక్‌ను చూడవచ్చు)

http://swarajyamag.com/politics/to-retain-power-in-2019-the-bjp-must-eschew-its-fascination-for-micawberism

Share this:

  • Tweet
  • More
Like Loading...

బద్దలవుతున్న ఆంక్షలు, పలు చోట్ల మహిళల ఆలయ ప్రవేశం

12 Tuesday Apr 2016

Posted by raomk in Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Bhumata Brigade, HAJ Restrictions, manuvadis, Shani Shingnapur, temples, Trupti Desai, Women decisive victory, women power

సత్య

     శని శింగనాపూర్‌ శని ఆలయ ప్రవేశంపై మహిళల విజయంతో మహారాష్ట్రలోని పలు ఆలయాలలో మహిళల ప్రవేశంపై వున్న ఆంక్షలను స్వయంగా పాలక మండళ్లే స్వయంగా తొలగిస్తున్నాయి. శని శింగనాపూర్‌ ఆలయంపై బొంబే హైకోర్టు తీర్పుతో భీష్మించుకు కూర్చున్న ఛాందసవాదులు దిగిరాక తప్పటం లేదు. ఈ పరిణామాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. ఇదే సమయంలో నిషేధం కొనసాగించాల్సిందేనంటూ హిందూ జన జాగృతి వంటి కొన్ని మితవాద సంస్ధలు ముంబైలో సోమవారం నాడు ఆందోళన ప్రారంభించాయి. కొల్లాపూర్‌లోని మరో పురాతన మహలక్ష్మి దేవాలయంలోకి సోమవారం నాడు ఎనిమిది మంది మహిళలు ప్రవేశించారు. పోలీసులు, ఆలయ యాజమాన్యం మధ్య జరిగిన చర్చల తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. అంతకు వారం రోజుల ముందు ఈ దేవాలయంలో ప్రవేశించేందుకు ‘అవని’ అనే సంస్ధ నాయకత్వాన మహిళలు ఆలయ ప్రవేశం చేయబోగా దేవాలయ యాజమాన్యం కొందరు మహిళలను సమీకరించి వారిచేత అడ్డగింప చేసింది. హైకోర్టు తీర్పు వచ్చినప్పటికీ సాంప్రదాయాన్ని వుల్లంఘించటానికి వీలులేదని వారు వాదించారు. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. వున్నతాధికారుల నుంచి వుత్తరువులు లేవని చెప్పారు. తరువాత కొద్ది సేపటికి శాంతి భద్రతలను కాపాడే పేరుతో ఆలయ ప్రవేశానికి వచ్చిన మహిళలను అక్కడి నుంచి పంపివేశారు.ఆ తరువాత జరిగిన పరిణామాలలో కోర్టు తీర్పును వుల్లంఘిస్తే ముఖ్యమంత్రిపైనో కోర్టు ధిక్కరణ ఫిర్యాదు చేస్తామని భూమాత బ్రిగేడ్‌ నేత తృప్తి దేశాయ్‌ హెచ్చరించటం, శుక్రవారం నాడు శని శింగనాపూర్‌ ఆలయంలోకి అనుమతించిన అంశం తెలిసిందే. ఈ సందర్భంగానే ఈనెల 13న కొల్లాపూర్‌ మహలక్ష్మి ఆలయప్రవేశం చేస్తామని కూడా తృప్తి దేశాయ్‌ ప్రకటించారు. అయితే రెండు రోజులు ముందుగానే మహిళలు ప్రవేశించి పూజలు జరిపారు.

    పూనాలోని పార్వతి హిల్‌పై వున్న కార్తికేయ దేవాలయం పాలకమండలి మహిళలు ఇష్టమైతే ప్రవేశించవచ్చు లేకుంటే వారిష్టమని పేర్కొన్నది. మహిళలకు ప్రవేశం లేదు అనే బోర్డును కూడా తొలగించారు. పురందర్‌లోని వీర్‌ గ్రామంలో వున్న మహాస్‌కోబా ఆలయ ప్రవేశంపై గ్రామసభ నిర్ణయం తీసుకుంది.తాము మహిళల ప్రవేశంపై నిషేధం విధించలేదని, అయితే కొన్ని సందర్భాలలో మాత్రమే ప్రవేశం కల్పించామని ఇపుడు ఎలాంటి ఆంక్షలు లేకుండా వారు కోరుకున్న విధంగా ప్రవేశం కల్పిస్తామని దేవాలయ ట్రస్టు అధ్యక్షుడు బాలాసాహెబ్‌ ధుమాల్‌ ప్రకటించారు. సతారా జిల్లాలోని సోలాషి శనీశ్వర దేవాలయ నిర్వాహకులు కూడా ఇదే దారి పట్టారు.ఈ మేరకు ఏకంగా ఒక పత్రికా ప్రకటనే జారీ చేశారు. గతేడాది డిసెంబరులో 12 మంది ఈ ఆలయంలో ప్రవేశించటంతో అపవిత్రమైందంటూ వెంటనే పురోహితులు గోమూత్రంతో శుద్ధి చేశారు. నాటి ప్రవేశానికి నాయకత్వం వహించిన అడ్వొకేట్‌ వర్షా దేశపాండే తాజా నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ ఇది సానుకూల ప్రారంభమని వ్యాఖ్యానించారు. దేశం మొత్తంలో ట్రస్టులు ఇదే పని చేయాలని కోరారు. అఖిలభారతీయ జనవాది మహిళా సంఘటన నాయకురాలు కిరణ్‌ మోఘే మాట్లాడుతూ ఇది రాజ్యాంగ విజయమని, రాజ్యాంగం మహిళలకు హక్కులు ఇచ్చిందన్నారు.

    మతోన్మాదుల చేతిలో హత్యకు గురైన హేతువాది నరేంద్ర దబోల్కర్‌ కుమార్తె ముక్తా మాట్లాడుతూ తన తండ్రి 1998 ప్రారంభించిన పోరాటం విజయం సాధించిందని, సమయం తీసుకున్నప్పటికీ సంస్కరణలను జనం ఆమోదిస్తారని అన్నారు. మార్పు కోసం ఎవరో ఒకరు ముందడుగు వేయాలని శని శింగనాపూర్‌ పరిణామాలు స్పష్టం చేశాయని, తొలుత ప్రతిఘటన వున్నప్పటికీ పోరాటాన్ని కొనసాగించాలని, చివరకు విజయం సాధిస్తామని ‘ ముక్త పేర్కొన్నారు.

హాజ్‌ కమిటీ ఆంక్షలపై ఆగ్రహం

    గర్భవతులుగా వున్న మహిళలు హాజ్‌ యాత్ర చేయకూడదంటూ ఆంక్షలు ప్రకటించటంపై వ్యతిరేకత వ్యక్తమైంది. ముస్లిం చట్ట ప్రకారం గర్భవతులపై ఆంక్షలు లేవని మౌలానా ఖలీద్‌ రషీద్‌ ఫిరంగి మహల్‌ ప్రకటించారు. కమిటీ వున్నది యాత్రకు వెళ్లేవారికి సాయపడేందుకు తప్ప కూర్చుని ఆంక్షలు విధించటానికి కాదన్నారు. గర్భవతులకు అవసరమైన వైద్య సలహాలు ఇవ్వాలి తప్ప ఆంక్షలు జారీ చేయటం ఏకపక్షమని పేర్కొన్నారు. అనేక మహిళా బృందాలు కూడా ఈ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేశాయి. హాజ్‌ కమిటి చివరకు వైద్య విషయాలను కూడా చర్చిస్తుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాంటి ఆంక్షలకు ఏ విధమైన విలువ లేదని భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్‌ సంస్ధ ప్రతినిధి జకియా సోమన్‌ పేర్కొన్నారు. దరఖాస్తు సమయంలో గర్భవతులుగా వున్నవారు సెప్టెంబరులో వెళ్లు సమయానికి నాలుగు నెలలు నిండితే వారిని అనుమతించరని హాజ్‌ కమిటీ పేర్కొన్నది.

   ముంబైలోని హాజ్‌ అలీ దర్గాలోకి మహిళలను అనుమతించే విధంగా ఆదేశాలివ్వాలని కోరుతూ భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్‌ బొంబే హైకోర్టులో ఒక పిటీషన్‌ దాఖలు చేసింది. పదిహేనవ శతాబ్దికి చెందిన సూఫీ ఫకీరు హాజీ అలీ సమాధి దగ్గరకు మహిళలను అనుమతించరు. పురుష ఫకీరు సమాధి వద్దకు మహిళలను అనుమతించటం ఇస్లాం ప్రకారం పెద్ద పాపమని దర్గా ట్రస్టు వాదిస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 26 ప్రకారం ఒక ట్రస్టు తన కార్యకలాపాలను నిర్వహించుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నదని, మూడవ పక్షం దానిలో జోక్యం చేసుకోరాదని పేర్కొన్నది. అయితే దర్గాలో గతంలో అందరికీ ప్రవేశం వుందని 2012 నుంచి సమాధి వద్దకు వెళ్లటంపై ఆంక్షలు విధించారని ఫిర్యాదీలు పేర్కొన్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ దర్గాలో సమాధి వున్న ప్రాంత తలుపు వద్దకు తప్ప లోపలికి అనుమతించటం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

శని సింగనాపూర్‌లో మనువాదంపై మహిళల తిరుగులేని విజయం

09 Saturday Apr 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Women

≈ Leave a comment

Tags

Bhumata Brigade, manuvadis, Shani Shingnapur, Trupti Desai, Women decisive victory, women power

సత్య

13న కొల్లాపూర్‌ మహలక్ష్మి దేవాలయ ప్రవేశం

    తృప్తి దేశాయ్‌ ! భూమాత రాన్‌ రాగిణి బ్రిగేడ్‌ !! శని శింగనాపూర్‌ !!!

       దేశంలో అనేక మంది నోళ్లలో నానుతున్న పేర్లివి. నాలుగు వందలఏళ్ళ  నాటి శని దేవాలయంలో మహిళలకు ప్రవేశ నిషేధ శని శుక్రవారం సాయంత్రంతో వదలి పోయింది.ఈనెల ఒకటవ తేదీన బొంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుతో శని దేవాలయ పాలకవర్గం మహిళలపై వున్న నిషేధాన్ని ఎత్తివేయాలని నిర్ణయించింది. ఇది నిజంగా మహిళలు సాధించిన పెద్ద విజయాలలో ఒకటి. దీనితో వుత్తేజితులైన మహారాష్ట్ర మహిళలు ఇప్పుడు తమ దృష్టి ఇతర దేవాలయాలపై సారించారు. తదుపరి ఈనెల 13న తాము కొల్లాపూర్‌లోని మహలక్ష్మి దేవాలయ ప్రవేశం చేస్తామని, తరువాత నాసిక్‌లోని త్రయంబకేశ్వర ఆలయ ప్రవేశం చేస్తామని ఈ వుద్యమానికి నాయకత్వం వహిస్తున్న తృప్తి దేశాయ్‌ శనివారం నాడు ప్రకటించారు. ఒక చిన్న పల్లెటూరు శని శింగనాపూర్‌లో ప్రారంభమైన ఈ వుద్యమం దేశంలోని ఇతర పాంతాలకు విస్తరిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. స్వాతంత్య్ర వుద్యమ కాలంలో దళితులకు దేవాలయ ప్రవేశాలపై వున్న ఆంక్షలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేవాలయ ప్రవేశ వుద్యమాలు సాగిన విషయం తెలిసిందే. ఇపుడు మహిళా ప్రవేశ వుద్యమానికి నాంది పలికారు.దీంతో మనువాదులు మింగా కక్కలేకుండా వున్నారు. రాజ్యాంగం చట్టాలు వుండబట్టిగాని లేకపోతే ఇలాంటి తీర్పులు ఇస్తున్న న్యాయమూర్తుల అంతం చూసి వుండేవాళ్లం ప్రకటించే సర్వసంగ పరిత్యాగులమని ఫోజు పెట్టే సాధ్వులు, బాబాలు, యోగులు,యోగినులు మనకు దర్శనమిచ్చినా ఆశ్చర్యం లేదు.

     చాలా మందికి సుపరిచితమైన షిరిడీకి దగ్గరలో అహమ్మద్‌ నగర్‌ జిల్లాలో ఈ శనిదేవాలయం వుంది. తమకు పట్టిన శని వదలాలని లేదా పట్టకుండా వుండాలని ముందస్తుగా కోరుకుంటూ వేలాది మంది నిత్యం ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. మహిళలు సాగిస్తున్న ఈ వుద్యమం ఆస్తికులకే గాక నాస్తికులకు కూడా అభ్యంతరకరంగా వున్నట్లు అక్కడక్కడా వినిపిస్తోంది. ఇక్కడ సమస్య మహిళలలో మూఢనమ్మకాలను ప్రోత్సహించటం కాదు. దళితుల దేవాలయ ప్రవేశ వుద్యమానికి కమ్యూనిస్టు అగ్రనాయకులు అనేక మంది నాయకత్వం వహించారంటే అర్ధం దళితులను తీసుకువెళ్లి మనువాదానికి అప్పగించాలని కాదు. పుట్టుక కారణంగా వివక్ష ప్రదర్శించటాన్ని, తోటి మనిషిని మనిషిగా చూడాలనే ప్రజాతంత్ర డిమాండ్‌, హక్కును నిర్ధారించుకొనేందుకే ఆ వుద్యమాలు జరిగాయి.ఇప్పుడు మహిళల పట్ల వివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న వుద్యమం, న్యాయపోరాటాలను కూడా అలాగే చూడాలి. ఒక వ్యక్తి దేవుడిని, మతాన్ని నమ్మటమా నమ్మకపోవటమా అన్నది వారి వ్యక్తిగతం.

    ఈ వుద్యమానికి నాంది పలికిన 31 సంవత్సరాల యువతి ఆస్ధికురాలు. మహారాష్ట్రలో అధికారంలో వున్న బిజెపి-శివసేన సంకీర్ణ కూటమి ప్రభుత్వం శని ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకొనేందుకు చేయని ప్రయత్నం లేదు. మహిళలను అడ్డుకొనేందుకు తొలిసారిగా ఆ దేవాలయానికి మహాళా ధర్మకర్తలను నియమించి వారి ద్వారా అడ్డుకోవాలని చౌకబారు ఎత్తుగడ వేసింది. మహిళలను సమీకరించేందుకు కూడా చేయూత నిచ్చింది.అయితే బోంబే హైకోర్టులో ప్రభుత్వం వివక్షకు వ్యతిరేకమని అఫిడవిట్‌ ఇవ్వాల్సి వచ్చింది. అయినా తీర్పును అమలు జరిపేందుకు సిద్ధం కాకపోవటంతో ముఖ్య మంత్రిపై కోర్టు ధిక్కరణ నేరం కింద కోర్టుకు లాగుతామని తృప్తి దేశాయ్‌ ప్రకటించిన తరువాతే శని ఆలయ కమిటీ దిగివచ్చింది. ఇంత జరిగాక దేవాలయ ప్రవేశం కోసం మహిళలు ఆందోళన చేయాల్సి రావటం సిగ్గుచేటని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ వ్యాఖ్యానించటం విశేషం. వివక్షను పాటిస్తున్న ఇతర దేవాలయాల ప్రవేశం సందర్భంగా ఎలాంటి వైఖరి తీసుకుంటారో చూడాల్సి వుంది.

   కాలం చెల్లిన మనువాదులను వుక్కిరి బిక్కిరి చేస్తున్న తృప్తి దేశాయ్‌ ఒక సాధారణ కుటుంబానికి చెందిన గృహిణి. కర్ణాటక సరిహద్దులోని నిపానీ తాలుకాలో జన్మించిన తృప్తి కుటుంబం తరువాత పూనాలో స్ధిరపడింది. ముంబైలో హోం సైన్సు కోర్సులో చేరిన ఆమె కుటుంబ పరిస్ధితుల కారణంగా ఒక ఏడాది తరువాత విద్యను మానుకోవాల్సి వచ్చింది.తరువాత తాను నివసించే పరిసరాలలో క్రాంతి వీర్‌ అనే ఒక సంస్ధలో చేరి దానికి అధ్యక్షురాలైంది. పేదలకు రేషన్‌ కార్డులు ఇప్పించేందుకు, చట్టపరమైన సమస్యల పరిష్కారానికి, వుపాధికి తోడ్పటం వంటి కార్యకలాపాలను ఆ సంస్ధ నిర్వహించేది.ఈ క్రమంలోనే 2007లో ఆమె ఎన్‌సిపి అగ్రనేత అజిత్‌ పవార్‌ కుటుంబ ఆధ్వర్యంలో నడిచే అజిత్‌ సహకార బ్యాంకులో జరిగిన 50 కోట్ల అవినీతికి వ్యతిరేకంగా తృప్తి దేశాయ్‌ గళం విప్పింది.బ్యాంకు డిపాజిట్‌దార్లతో పోరాట సమితిని ఏర్పాటు చేసి నాలుగు సంవత్సరాల తరువాత 29వేల మందికి తమ డిపాజిట్లు వచ్చేట్లు చేయటంతో ఆమె వెలుగులోకి వచ్చారు. దాంతో కొంత మంది ఆమెకు ఏదైనా సామాజిక సంస్ధను ఏర్పాటు చేయమని సలహా ఇచ్చారు.

     అలా ఏర్పడిందే భూమాత బ్రిగేడ్‌.నలభై మందితో 2010 సెప్టెంబరు 27న ప్రారంభమైన ఈ సంస్ధలో ఇపుడు ఐదువేల మందికి పైగా స్త్రీ, పురుష సభ్యులున్నారు. అనేక అంశాలపై ఈ సంస్ధ పని చేస్తుంది.అన్నా హజారే జనలోక్‌పాల్‌ ఆందోళనలోనూ వారు పాల్గొన్నారు. శని దేవాలయ ప్రవేశం కోసం భూమాత బ్రిగేడ్‌ ఒక వుప విభాగాన్ని ఏర్పాటు చేసి దానికి భూమాత రాన్‌రాగిణి బ్రిగేడ్‌ అని పేరు పెట్టారు. నవంబరు 29న ప్రారంభమైన ఈ వుద్యమం ఏప్రిల్‌ ఎనిమిదిన దేవాలయ ప్రవేశంతో విజయం సాధించింది. తృప్తి దేశాయ్‌ 2006లో వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇప్పుడు ఆరు సంవత్సరాల కుమారుడు. భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఆమెకు పూర్తి మద్దతు ఇస్తున్నారు. తన భార్య కార్యకలాపాలను చూసి తాము గర్వ పడుతున్నట్లు ఆమె భర్త ప్రశాంత్‌ దేశాయ్‌ చెప్పాడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d