• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: INDIA

మోడీయే స్వయంగా అస్త్రాలు అందిస్తుంటే విభీషణులతో పనేమిటి ?

03 Sunday Feb 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

India budget, India Unemployment, Jobs in India, Narendra Modi sarkar

Image result for narendra modi sarkar itself giving astras to opposition cartoons

ఎం కోటేశ్వరరావు

కేంద్రంలోని నరేంద్రమోడీ నాయకత్వం రానున్న లోక్‌సభ ఎన్నికలలో లబ్ది పొందేందుకు సరిగ్గా నోటిఫికేషన్‌కు ముందు ప్రతిపక్షాల వూహకు అందని అస్త్రాలను బయటకు తీస్తోందని ఆ పార్టీతో పాటు దానికి కొమ్ముకాసే మీడియా ప్రచారం చేసింది. బడ్జెట్‌ తాయిలాలతో ఆ పర్వం ముగిసి అస్త్రాలు అయిపోయాయని అనుకోవాలి. ఇన్ని చేసినా తమకు అధికారం దక్కదేమో అనే అనుమానం తలెత్తితే ఇంకా వేటిని బయటకు తీస్తారో తెలియదు. తమది వ్యత్యాసంతో కూడిన పార్టీ అని బిజెపి స్వయం కితాబు ఇచ్చుకుంది. మన కష్టజీవులకు కానప్పటికీీ నరేంద్రమోడీకి అత్యంత మిత్రదేశమైన అమెరికా జాతీయ గూఢచార డైరెక్టర్‌ కార్యాలయం(ఓడిఎన్‌ఐ) తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. బిజెపి పాలిత ప్రాంతాలలో ఎన్నికలకు ముందు మతఘర్షణలు జరగవచ్చని దానిలో చెప్పినందున చివరకు ఆ మారణాస్త్త్రాలను ప్రయోగిస్తే చెప్పలేము. రామాయణంలో రావణుడిని ఎలా చంపాలో విభీషణుడు చెబితేనే రాముడికి సాధ్యమైంది. ఆ తరువాత రావణకాష్టం గురించి తెలిసిందే. ఇప్పటికే అనేక రామాయణాలు ప్రచారంలో వున్నాయి. బిజెపి రామాయణం కొత్తది. మోడీని దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలకు ఆ పార్టీలోని విభీషణుల అవసరం లేదు. మీడియా వర్ణించినట్లు మోడీ అస్త్రాలను బయటకు తీశారా లేక మోడీయే ప్రతిపక్షాలకు అస్త్రాలను అందించారా ?

కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ అన్న సామెత తెలిసిందే. అలాగే తాను భిన్నమైన పార్టీ అని బిజెపి స్వంతడబ్బా ఏమికొట్టుకున్నప్పటికీ కాంగ్రెస్‌కూ దానికీ పెద్ద తేడా లేదని,దేశంలోని వ్యవస్ధలను దెబ్బతీయటం, దుర్వినియోగం చేయటం, జనానికి విశ్వాసం లేకుండా చేయటంలో కాంగ్రెస్‌ కంటే రెండాకులు ఎక్కువే చదివిందని ఇటీవలి కాలంలో స్పష్టంగా నిరూపించుకుంది. కాంగ్రెస్‌ పాలనా కాలంలో జనం మీద మోపే భారాలను ముందుగానే ప్రకటించి బడ్జెట్లను భారాలు లేనివిగా ప్రకటించుకొని ఆ ప్రక్రియను ఒక ప్రహసనంగా మార్చారు. దాన్ని గతంలో బిజెపి కూడా కొనసాగించింది. తాజాగా జిఎస్‌టి విధానం అమలులోకి వచ్చిన తరువాత ఆ రేట్ల తగ్గింపు హెచ్చింపు అన్నది ఇష్టమొచ్చినపుడు చేసే అవకాశం వుండటంతో పధకాల ప్రకటన మినహా బడ్జెట్‌కు ప్రాధాన్యత లేకుండా పోయింది. వడ్డించేవారు మనవారైతే కడబంతిలో వున్నా మనకు అన్నీ అందుతాయన్న లోకోక్తి తెలిసిందే. బడ్జెట్‌ కూడా అంతే. తమకేమి ఒరగబెడతారా అని సామాన్యులు, మధ్యతరగతి ప్రదర్శించే ఆతృత ధనికులు, కార్పొరేట్లలో కనిపించదు. ఎందుకంటే ప్రభుత్వం తమది కనుక గుట్టుచప్పుడు కాకుండా తమ సింహభాగాన్ని తాము చక్కపెట్టుకొనేందుకు వారేమీ హడావుడి చెయ్యరు.

బడ్జెట్‌ సమర్పణ గురించి సంప్రదాయాలు, స్వయం నిబంధనలు తప్ప ఒక నమూనా లేదు. బ్రిటీష్‌ వారి పాలనలో మన దేశంలో ఆప్రక్రియ మొదలైంది గనుక వారి పద్దతిని, ప్రవేశ సమయాన్ని మనదేశంలో కూడా అమలు జరిపారు. సమగ్ర చర్చకు అవకాశం లేని పరిస్ధితుల్లో మూడునెలలకు సరిపడా అవసరాలకు ఖజానా నుంచి నిధులు తీసుకొనేందుకు అనుమతించే ప్రక్రియను ఓట్‌ఆన్‌ అకౌంట్‌ అంటారు. ఎన్నికలు జరగబోయే తరుణంలో అధికారంలోకి వచ్చే సర్కార్‌ ఎవరిదో, బడ్జెట్‌ ప్రాధాన్యతలు ఏమిటో తెలియవు గనుక ఈ పద్దతిని అనుసరించటం ఆనవాయితీగా వచ్చింది. తొలిసారిగా నరేంద్రమోడీ సర్కార్‌ దాన్ని తుంగలో తొక్కింది. మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. నిధుల విడుదలకు ఆమోదం తెలపటం తప్ప దీని మీద జరిగే చర్చ ఏమీ వుండదు. తమ ఐదేండ్ల పాలనతో ప్రజల విశ్వాసం పొంది తిరిగి అధికారంలోకి వస్తామనే నమ్మకం బిజెపిలో లేదని ఈ బడ్జెట్‌ స్పష్టం చేసింది. ఏదైన ఒక చట్టం లేదా చట్ట సవరణ అవసరాలను బట్టి వెనుకటి తేదీ నుంచి అమలులోకి తీసుకురావటం కొత్తేమీ కాదు. కానీ ఓట్ల కోసం రైతుల నిధి ఏర్పాటు, దాన్నుంచి చిన్న రైతులకు మూడు విడతలుగా రెండేసి వేల చొప్పున ఆరువేల రూపాయల అందచేత పధకాన్ని వచ్చే ఏడాది బడ్జెట్‌లో ప్రవేశపెట్టి దాన్ని గత ఏడాది నుంచి అమలయ్యే విధంగా చూశారంటే ఎన్నికల ఆపదమొక్కులు తప్ప మరొకటి ఎలా అవుతుంది.బడ్జెట్‌ ప్రహసనం ప్రతిపక్షాలకు మోడీ అందించిన అస్త్రం కాదా ?

తాము అధికారానికి వస్తే రామాలయ నిర్మాణం చేస్తామన్నది బిజెపి వాగ్దానం. అది సమర్ధనీయమా కాదా అన్నది ఒక అంశమైతే ఎందుకు అమలు జరపలేదో, ఎవరు అడ్డమొచ్చారో బిజెపి చెప్పాలా లేదా ? ఎప్పుడో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న అయోధ్య భూమిలో వివాదాస్పదం గాని స్ధలాన్ని యజమానులకు అప్పగించేందుకు అనుమతించాలని సుప్రీం కోర్టు అనుమతి కోరుతూ సరిగ్గా ఎన్నికలకు ముందుకు కేంద్రం పిటీషన్‌ దాఖలు చేయటం ఎన్నికల ఎత్తుగడ కాదా ? దీన్ని ప్రతిపక్షాలు ప్రశ్నించవా? దాని వెనుక వున్న వాస్తవాన్ని జనం ముందుంచవా ? బాబరీ మసీదు వున్న స్దలంపై హక్కు వివాదంలో దాఖలైన అన్ని పిటీషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు నిర్ణయం ఆకస్మికంగా జరగలేదు. దానిపై తీర్పు ఎన్నికలకు ముందే వస్తుందన్న నమ్మమూ లేదు. ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రయాగలో విశ్వహిందూపరిషత్‌ నిర్వహించిన ధర్మసంసద్‌లో ప్రసంగించిన ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌భగవత్‌ చెప్పిందేమిటి? ‘వారు(బిజెపి) రామాలయం గురించి మాట్లాడేది కేవలం ఓట్లు పొందేందుకే.అయితే విశ్వాసాన్ని దృష్టిలో వుంచుకొని ఆలయ నిర్మాణం జరుగుతుంది. మూడు నాలుగు నెలల్లో నిర్ణయం తీసుకుంటే మంచిదే, లేనట్లయితే నాలుగు నెలల తరువాత ఆలయ నిర్మాణం ప్రారంభం అవుతుంది.’ దీనికి రెండు రోజుల ముందు శంకరాచార్యల్లో ఒకరైన స్వరూపానాంద సరస్వతి అక్కడే మాట్లాడుతూ ఫిబ్రవరి 21న అయోధ్యయాత్ర చేసి అదే రోజు ఆలయ నిర్మాణానికి శంకుస్ధాపన చేస్తామని, ఇంకేమాత్రం ఆలస్యం కాకూడదని చెప్పారు. వివాదం లేని చోట రామాలయం కట్టేందుకు ఎవరూ అడ్డపడలేదే? లేదూ బాబరీ మసీదు స్ధలంలోనే కట్టాలనుకుంటే దాని యాజమాన్యంపై దాఖలైన పిటీషన్లపై కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగాలి, కోర్టు తీర్పునకు కట్టుబడి వుండాలి.ఓట్ల కోసం నాటకాలు గాకపోతే ఏమిటిది?

ప్రపంచంలో మన రిజర్వుబ్యాంకు, మన ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ వ్యవస్ధలకు ఒక ప్రత్యేకత వుంది. 2007లో ప్రపంచ ధనిక దేశాలలో బ్యాంకులు కుప్పకూలటంతో ప్రారంభమైన ఆర్దిక సంక్షోభానికి మన బ్యాంకులు, ఆర్ధిక వ్యవస్ధ అంతగా ప్రభావితం గాకపోవటానికి, నిలబడటానికి రిజర్వుబ్యాంకు విధానాలే కారణం. దాని అధిపతితో నిమిత్తం లేకుండా ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతీసుకున్నారు. దాని వలన జరిగిన నష్టం ఏమిటో తెలిసిందే. రద్దు నిర్ణయ సమయంలో మాట్లాడటం తప్ప ఇంతవరకు మోడీ నోరు విప్పలేదు. నల్లధనమేమీ బయటకు రాకపోగా దాన్ని కలిగిన వారంతా తెల్లధనంగా మార్చుకున్నారు.దేశ ఆర్ధిక వ్యవస్ధకు, ప్రత్యేకించి సామాన్యులకు పెద్ద మొత్తంలో నష్టం జరిగింది. ప్రభుత్వం దాని మీద చర్చ జరిపేందుకు భయపడింది, అసలేమీ జరిగిందో చెప్పేందుకు కూడా ముందుకు రాలేదు. రిజర్వుబ్యాంకు సైతం తేలుకుట్టిన దొంగలా ఏడాదిన్నర తరువాత వార్షిక నివేదికలో వివరాలు వెల్లడించటం తప్ప ఇతరంగా ప్రశ్నించటానికి అవకాశం ఇవ్వలేదు. పెద్ద నోట్ల రద్దుకు ముందు తమతో సంప్రదించగా ఆ చర్యను వ్యతిరేకించామని, తమతో సంబంధం లేకుండానే రద్దు నిర్ణయాన్ని ప్రకటించారని రాజీనామా చేసిన తరువాత రిజర్వుమాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ వెల్లడించారు. ఇతరుల మాదిరి రెండోసారి పదవీకాలాన్ని పొడిగించేందుకు మోడీ సర్కార్‌ తిరస్కరించింది. రాజన్‌ స్ధానంలో వచ్చిన గవర్నర్‌ వుర్జిత్‌ పటేల్‌ను అర్ధంతరంగా పదవి నుంచి తప్పుకొనేట్లు చేసింది మోడీ సర్కార్‌. తాము కోరిన విధంగా పెద్ద మొత్తంలో డివిడెండ్‌ రూపంలో ఆర్‌బిఐ నిల్వనిధులను ప్రభుత్వానికి బదిలీ చేయాలని వత్తిడి చేయగా తిరస్కరించిన పటేల్‌ రాజీనామా చేసి తప్పుకున్నారు. గత ఎన్నికలకు ముందు దేశ, విదేశాల్లో వున్న నల్లధనాన్ని వెలికి తీస్తే ప్రతి ఒక్కరికి 15లక్షల రూపాయల వంతున పంచవచ్చునంటూ కబుర్లు చెప్పిన పెద్దమనిషి గత ఐదేండ్లలో ఏ గుడ్డి గుర్రానికి పండ్లుతోమారో తెలియదు. తాజా మధ్యంతర బడ్జెట్లో తన ప్రభుత్వం నల్లధనం వెలికితీతకు కట్టుబడి వుందంటూ పెద్ద జోక్‌ పేల్చారు.

విదేశాలలో మన దేశ ప్రతిష్టను పెంచేందుకు, పెట్టుబడుల కోసమే తాను విదేశీ పర్యటనలు చేశానని, ఏటా రెండు కోట్ల వుద్యోగాలు, నైపుణ్యశిక్షణ కలిగించి మెరుగైన వుపాధి కల్పించామంటూ వూదరగొట్టిన అతి పెద్ద బెలూన్‌ గాలిని గత నాలుగున్నర దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా దేశంలో నిరుద్యోగం పెరిగిందన్న ప్రభుత్వ సంస్ధ ఎన్‌ఎస్‌ఎస్‌ఓ తాజా నివేదిక తుస్సుమనిపించింది. నాలుగేండ్లమోడీ పాలన తరువాత ఆరున్నర కోట్ల మంది యువతీయువకులు నిరుద్యోగులుగా వున్నారని వెల్లడించింది. అత్యవసర పరిస్ధితికి ఐదు సంవత్సరాల ముందు గరీబీ హఠావో నినాదంతో ఇందిరా గాంధీ అధికారానికి వచ్చిన తరువాత దేశంలో పరిస్ధితి మరింత దిగజారింది. దానికి తోడు రాజకీయంగా తగిలిన ఎదురు దెబ్బల నుంచి తప్పించుకొనేందుకు అత్యవసర పరిస్ధితిని ప్రకటించారు. దానికి రెండు మూడు సంవత్సరాల ముందున్న స్ధాయికి తిరిగి ఇప్పుడు నిరుద్యోగం పెరిగిందన్నది తాజా నివేదిక సారాంశం. 2017జులై నుంచి 2018జూన్‌ మధ్యకాలంలో సేకరించిన సమాచారం మేరకు 6.1శాతం నిరుద్యోగులున్నారు. వారం వారం సేకరించే సమాచార విశ్లేషణ ప్రకారం తాజా వారంలో నిరుద్యోగశాతం 8.9గా నమోదైందంటే ఎంత వేగంగా పరిస్ధితి దిగజారుతోందో అర్ధం చేసుకోవచ్చు.

మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు కిసుక్కున నవ్వినందుకు ఎక్కువ బాధ అన్నది కొత్త నుడికారం. తన ఏలుబడిలో వుపాధి అంత అధ్వాన్నంగా వుందన్న నివేదికాంశాల కంటే అది బయటకు వచ్చిన తీరు నరేంద్రమోడీని తగలరాని చోట దెబ్బతీసింది. నష్ట నివారణకు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కాదు. తిట్టబోతే అక్క కూతురు-కొట్టబోతే కడుపుతో వుంది అన్నట్లు పరిస్ధితి తయారైంది. వుపాధి గురించి నివేదిక రూపొందించింది ప్రభుత్వ సంస్ధ. అది బయటకు వస్తే ఎన్నికలలో ప్రభావం చూపుతుందని మోడీకి అర్ధమైంది.జాతీయ గణాంక కమిషన్‌ ఆ నివేదికను ఆమోదించింది. దాన్ని బహిర్గతం చేసేందుకు మోడీ కార్యాలయం అడ్డుపడటంతో నిరసన తెలుపుతూ ఇద్దరు కమిషన్‌ సభ్యులు ఈ మధ్యనే రాజీనామా చేశారు. సూదికోసం సోదికి పోతే పాత రంకులన్నీ బయటపడినట్లుగా దాచి పెట్టేందుకు ప్రయత్నించిన నివేదిక బయటకు వచ్చినదాని కంటే దానిలోని అంశాలను ఇంకా ప్రభుత్వం ఆమోదించలేదు, అది తాత్కాలికమైనది అని అటూఇటూ తిప్పి నష్టనివారణకు నీతి ఆయోగ్‌ వున్నతాధికారి చెప్పటం తగలరాని చోట మోడీ సర్కార్‌మీద దెబ్బ వేసినట్లయింది. నరేంద్రమోడీ సర్కార్‌ తీసుకున్న వుపాధి కల్పన పధకాలు గణనీయంగా వుద్యోగాలను కల్పిస్తాయంటూ ప్రధాన మంత్రి ఆర్ధిక సలహాదారుల మండలి సభ్యుడు వివేక్‌ దేవరాయ్‌ చెప్పిన వీడియోను రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ తన ఫేస్‌బుక్‌లో ఈ సందర్భంగా పోస్టు చేయటం గమనించాల్సిన అంశం. తన శాఖకు సంబంధం లేని అంశాన్ని ఆమె ఎందుకు పోస్టు చేశారో తెలియదు. బహుశా ప్రధాని ‘రక్షణ’ కోసం అనుకుందాం.

ఎన్నికల ముందు ఇలాంటి జిమ్మిక్కులు పనిచేస్తాయా అన్నది అపూర్వ చింతామణి ప్రశ్న. గత ఏడు దశాబ్దాలుగా అధికార పార్టీలు పట్టువదలని విక్రమార్కుడిలా జిమ్మిక్కులకు పాల్పడినా మొత్తం మీద పని చేయలేదు. మట్టి కరచిన వుదంతాలే ఎక్కువ.తాజాగా బిజెపి నాయకత్వ తీరు తెన్నులను, జరుగుతున్న పరిణామాలను చూస్తే కారల్‌ మార్క్స్‌ చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి. దోపిడీ స్వభావం కలిగిన పెట్టుబడిదారీ వ్యవస్ధ లాభాల కోసం వస్తువులతో పాటు తన గోరీ కట్టే కార్మికులను కూడా తయారు చేసుకుంటుందన్నారు. దాన్ని కొద్దిగా మార్పు చేస్తే మార్క్స్‌ చెప్పినట్లు నరేంద్రమోడీ తన పదవిని పదిల పరుచుకొనేందుకు కొన్ని అస్త్రాలను బయటకు తీయటంతో పాటు తన మీద సంధించే బలమైన అస్త్రాలను కూడా ప్రత్యర్ధులకు అందిస్తున్నారు అని చెప్పక తప్పదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాజీ గోబెల్స్‌ అడుగుల్లో కాషాయ పరివారం !

22 Tuesday Jan 2019

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, india's saffron brigade, Narendra Modi, narendra modi bhakts, Nazi Goebbels

Image result for modi's big lie cartoons

ఎం కోటేశ్వరరావు

ఘనుడై నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత 2014 జూన్‌ నుంచి 2018 సెప్టెంబరు వరకు మన దేశ స్వదేశీ, విదేశీ అప్పు మొత్తం 54,90,763 కోట్ల నుంచి 82,03,253 కోట్లకు పెరిగిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివరాల మేరకు మీడియాలో వార్తలు వచ్చాయి. వీటి మీద సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లోని ఒక గ్రూప్‌ చర్చలో పాల్గన్న మోడీ, బిజెపి అభిమానులు, కార్యకర్తల స్పందన గమనిస్తే దానిని ప్రత్యక్షంగా చూసేందుకు హిట్లర్‌ ప్రచార మంత్రి జోసెఫ్‌ గోబెల్స్‌ కుల సంఘాలు ఆమోదిస్తే హిందూత్వ తాలిబాన్‌ కుటుంబాలలో ఎక్కడో అక్కడ పుట్టేందుకు ప్రయత్నిస్తాడు. అయితే తెలిసీ అలాంటి వాడిని కనేందుకు ఏ తల్లీ అంగీకరించదు కనుక టెస్ట్‌ ట్యూబ్‌ జీవిగా పుట్టేందుకు ఒక మట్టి కుండను సరఫరా చేయమని ఆంధ్రవిశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ నాగేశ్వరరావుకు ఈ పాటికి గోబెల్స్‌ వర్తమానం పంపే వుంటాడు.

ప్రభుత్వ రుణ వార్తను ఇచ్చిన ఒక మీడియా సంస్ధను, వార్త కటింగ్‌ను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన వ్యక్తి ఒక అబ్బకు పుట్టిన వారు కాదని,అప్పులన్నీ హాజ్‌యాత్రకోసం చేసిన వని, కాంగ్రెస్‌ వారు 54లక్షల కోట్లు అప్పులు చేసి మోడీకి అప్పగిస్తే నాలుగున్నరేండ్లలో 32లక్షల కోట్ల వడ్డీ అయిందని, ఇండియా అప్పుకు, మోడీ చేసిన అప్పుకు తేడా తెలియదని, ఎల్లో మీడియా ఫేక్‌ న్యూస్‌ నమ్మవద్దని, అది అప్పుకాదు మోడీ మిగిల్చిన మొత్తం అంటూ విరుచుకుపడ్డారు.తెలివి తేటలు కలిగిన ఇంకొందరు గతంలో యుపిఏ హయాంలో చేసిన అప్పు కంటే మోడీ చేసిన అప్పు తక్కువ శాతం అంటూ సమర్ధనకు పూనుకున్నారు. బూతులు తిట్టేవారి కంటే వీరు కొంత నయం. వీటిని చూస్తుంటే జర్మనీలో నాజీలు, హిట్లర్‌ ప్రచారం అక్కడి సమాజం మీద ఎలాంటి ప్రభావం కలిగించిందో ప్రత్యక్షంగా అర్ధం అవుతోంది. 1897లో పుట్టిన గోబెల్స్‌ ‘ఆంగ్లేయుల నాయకత్వ రహస్యం ప్రత్యేకించిన కొన్ని తెలివితేటల మీద ఆధారపడలేదు. అది మూర్ఖ సూక్ష్మబుద్ధి మీద ఆధారపడిందంటే ఆశ్చర్యం కాదు. ఎవరైనా అబద్దం చెప్పదలచుకుంటే అది పెద్దదై వుండాలి, దానికే కట్టుబడి వుండాలి, దానిని కొనసాగించాలి.అది అపహాస్యంగా కనిపిస్తున్నా సరే దానికే కట్టుబడి వుండాలి.’ అని ఒక రచనలో పేర్కొంటాడు. దానిని మరింతగా అభివృద్ది చేసి ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే నిజం అవుతుంది, చివరకు తొలిసారి అబద్దం చెప్పిన వాడు కూడా ఒక దశలో నిజమే అని నమ్మే విధంగా తయారవుతాడు అని నిరూపించాడు.

Image result for modi's  big lie   cartoons

అప్పులు చేయటం సరైనదా కాదా అన్నది ఒక అంశం. అత్యంత ధనిక దేశం అమెరికా నుంచి దాన్ని తలదన్నేందుకు ప్రయత్నిస్తున్న చైనా వరకు అన్ని దేశాలు అప్పులు చేస్తున్నాయి. మన దేశం అందుకు మినహాయింపు కాదు. కేంద్రంగానీ, రాష్ట్రాలు గానీ, అది కాంగ్రెస్‌ లేదా బిజెపి అయినా ఎవరైనా చేస్తున్నది అదే. ప్రతి ఏటా బడ్జెట్‌లో గతంలో వున్న అప్పులు తీర్చేందుకు, వాటికి అసలు, వడ్డీ కోసం కేటాయింపులు చేస్తారు. లోటు బడ్జెట్‌ను పూడ్చుకొనేందుకు కొత్త అప్పులు చేస్తారు. మోడీ సర్కార్‌ సగటున ఏటా ఆరులక్షల కోట్ల మేరకు అప్పు చేస్తున్నది.ఈ ఏడాది అంటే 2019 మార్చి నెలాఖరులోపు కేంద్ర ప్రభుత్వ లోటు అంచనా 6.24లక్షల కోట్ల రూపాయలు. అయితే ఆర్ధిక సంవత్సరం తొలి ఎనిమిది నెలలకే 7.17 కోట్లకు చేరింది. అంటే ప్రపంచబ్యాంకు పరిభాషలో చెప్పాలంటే ఆర్ధిక కట్టుబాటును వుల్లంఘించటమే. ఈ లోటును పూడ్చుకొనేందుకు అప్పు చేయాలి లేదా నోట్ల ముద్రణకు పాల్పడాలి. ఇంతకు మించి మరొక ప్రత్యామ్నాయం లేదు ఈ వాస్తవం మోడీ భక్తులకు తెలియదా లేక తెలిసినా వాస్తవాన్ని అంగీకరించేందుకు నిరాకరిస్తూ ఎదురుదాడికి పాల్పడుతున్నారా ? వైఫల్యాలను కప్పి పుచ్చుకొనే క్రమంలో ఎదురుదాడి ఒక పద్దతి.

నరేంద్రమోడీకి లేనిదాన్ని ఆపాదించేందుకు ఆయన నియమించుకున్న యంత్రాంగం అనేక అవాస్తవాలను ప్రచారంలో పెట్టింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. పెట్టుబడులు తెచ్చేందుకే మోడీ విదేశీ ప్రయాణాలు చేశారు. నరేంద్రమోడీ సర్కార్‌ అసలు అప్పులు చేయలేదు, ప్రపంచ బ్యాంకు నుంచి ఎలాంటి అప్పులు తీసుకోలేదు. కాంగ్రెస్‌ పాలనా కాలంలో చేసిన అప్పులన్నీ తీర్చాడు. ఇంకా ఇలాంటి ఎన్నో అతిశయోక్తులను మోడీకి ఆపాదించారు. వీరాభి అభిమానులు వాటన్నింటినీ నమ్మారు కనుకనే సామాజిక మాధ్యమంలో స్పందన అలా అదుపు తప్పింది. మోడీ విశ్వసనీయత ఎలా తయారైందంటే ఆయనే స్వయంగా తన ప్రభుత్వం అప్పులు చేసిందని నిజం చెప్పినా అంగీకరించే స్ధితి లేదు. మూకోన్మాదం అంటే ఇదేనా ? గోబెల్స్‌ చెప్పినదానికి అనుగుణ్యంగానే బిజెపి నేతల తీరు తెన్నులున్నాయి. ఒక బిజెపిని ఓడించటానికి అన్ని పార్టీలు ఏకమౌతున్నాయి.నేను కాపలాదారుగా పహారా కాస్తుంటే దేశాన్ని లూటీ చేసిన వారంతా ఏకమౌతున్నారు. ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తున్నది సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీ, ఆయన భజన బృందం. తెలంగాణాలో అన్ని స్ధానాలకు పోటీ చేస్తున్న ఏకైక పార్టీ మాది, అధికారం మాదే. మీడియా, జనం పగలబడి నవ్వుతున్నా గల్లీ నుంచి ఢిల్లీ నేతల వరకు ఎన్నికల ప్రచారంలో చెప్పింది అదే. వారికా ధైర్యం, అంతటి తెలివి తేటలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే గోబెల్స్‌ చెప్పిన అంశమే.అతని వుపదేశాన్ని మరింత నవీకరిస్తూ పక్కాగా అమలు జరుపుతున్నది హిట్లర్‌, గోబెల్స్‌ భావజాలం, ప్రచార పద్దతులను అరువు తెచ్చుకున్న కాషాయ పరివారం, వారితో ఏదో ఒక దశలో స్నేహం చేసిన, చేస్తున్న వారు అంటే ఎవరికైనా కోపం వస్తే చేయగలిగిందేమీ లేదు.

Image result for modi's big lie cartoons

ఈ రోజు దేశంలో బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ కూటమిలో 40కి పైగా చిన్నా పెద్ద పార్టీలు వున్నాయి. బిజెపిని ఓడించటానికి అన్ని పార్టీలు ఏకమైతున్నాయని చెప్పటం గోబెల్స్‌ ప్రచారం కాదా ? ఎన్‌డిఏ పేరుతో వున్నది తమ పార్టీ ఒక్కటే అని చెప్పమనండి. కాపలాదారుగా నరేంద్రమోడీ సక్రమంగా విధి నిర్వహిస్తే విజయ మాల్య, నీరవ్‌ మోడీ వంటి వేల కోట్ల రూపాయలను ఎగవేసిన వారు దేశం వదలి ఎలా పోయారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగవేసిన వారు, నిధులను దారి మళ్లించిన వారు గత నాలుగు సంవత్సరాలలో ఇబ్బడి ముబ్బడిగా ఎలా పెరిగారు? కాంగ్రెస్‌ హయాంలో ఇచ్చిన అప్పులని చెబుతున్నవాటిలో కొన్ని లక్షల కోట్లను రాని బాకీల కింద రద్దు ఖాతాలో రాసిన వారెవరు? వసూలు చేయకుండా అడ్డుపడ్డదెవరు ? తీసుకున్న రుణాల వాయిదాల చెల్లింపులో విఫలమైన ప్రతి రుణఖాతా రుణ వ్యవధిని బట్టి నిరర్ధక ఆస్ధి అవుతుంది. అలాంటపుడు కాంగ్రెస్‌ హాయాంలో ఇచ్చిన అప్పులు తమ హాయాంలో ఇచ్చిన వాటిని వేరు చేసి తమ ఘనత, కాంగ్రెస్‌ కాలంలో ఇచ్చిన వాటి బండారాన్ని ఎందుకు బయటపెట్టరు.

అబద్దం ఆడదలచుకుంటే అది పెద్దదై వుండాలన్న బ్రిటీష్‌ కుటిల నీతిని ప్రదర్శించింది సాక్షాత్తూ నరేంద్రమోడీయే. పెద్ద నోట్ల రద్దు లక్ష్యాలు, నల్లధనం గురించి చెప్పింది పెద్ద అబద్దం కాదా ? జనం ఏమనుకున్నా అదే అబద్దానికి కట్టుబడి వుండాలి, నోరు విప్పకూడదు అన్నదానికి నరేంద్రమోడీ నోట్ల రద్దు గురించి ‘కట్టుబడి ‘ వున్నారా లేదా ? ఏండ్లు గడుస్తున్నా దాని మీద ఒక్క మాటైనా మాట్లాడారా ? ఎంత నిబద్ధత ! తాను నోరు విప్పక పోవటమే కాదు, రిజర్వు బ్యాంకు నోరు కూడా మూయించారా లేదా ? ఎన్నికలకు ముందు విదేశాల్లో నల్లధనం గురించి మాట్లాడిందేమిటి ? తరువాత అసలు నోరు విప్పారా ? గోబెల్స్‌ చెప్పిందానికి ట్టుబడి వున్నారా లేదా ? ఎవరేమనుకుంటే మాకేటి సిగ్గు అన్నట్లుగా వుండాలన్నాడు గోబెల్స్‌. కుహనా సైన్సు గురించి చెప్పిన మాటలను ప్రపంచం అపహస్యం చేస్తున్నా ఎవరైనా మానుకున్నారా ? వేదాల్లో అన్నీ వున్నాయష అని చెప్పేవారి సంఖ్య తగ్గలేదు, చెప్పేవారు మరింత పెరిగారు. తలకాయలూపే వారు ఇబ్బడి ముబ్బడి అయ్యారా లేదా ! పురాతన కాలంలో మనకు ప్లాస్టిక్‌ సర్జరీ నుంచి విమానాలు, టెస్ట్‌ ట్యూబ్‌ బేబీల నుంచి ఖండాంతర నియంత్రిత క్షిపణులు మన దగ్గర వున్నాయంటే నిజమే అని నమ్మేవారు తయారయ్యారా లేదా ? వినాయకుడికి ప్లాస్టిక్‌ సర్జరీ గురించి ప్రధాని మోడీ స్వయంగా చెప్పిన తరువాత ఆయన కటాక్ష వీక్షణాల కోసం పరితపించే వారు కొందరైతే, నిజంగా నమ్మే కొందరు అలాంటి ప్రచారాలు చేస్తున్నారు

Related image

వుపాధి గురించి తాము చేసిన వాగ్దానాలను అమలు జరిపానని మోడీ నమ్మబలుకుతున్నారు. ఇదొక పెద్ద అబద్దం. దాన్నుంచి బయట పడలేరు, వాస్తవాన్ని అంగీకరించలేరు. ఆవులను కాయటం కూడా వుద్యోగమే అని బిజెపి త్రిపుర ముఖ్యమంత్రి సెలవిచ్చాడు. పకోడీలు అమ్మేవారు రోజుకు రెండువందల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇది కూడా వుద్యోగ కల్పనే అని నరేంద్రమోడీ చెప్పిన తరువాత అనుచరులు మరింతగా రెచ్చిపోతారని వేరే చెప్పాలా? గతేడాది జూలై 21న ప్రధాని మోడీ లోక్‌సభలో వుపాధి గురించి చెప్పిన అంశాలేమిటో చూద్దాం. గతేడాది కాలంలో కోటికి పైగా వుద్యోగాలు(వుపాధి) కల్పించాం. 2017సెప్టెంబరు 2018 మే మాసాల మధ్య వుద్యోగుల భవిష్యనిధి సంస్ధ(ఇపిఎఫ్‌ఓ)లో 45లక్షల మంది నూతన చందాదారులుగా చేరారు. ఇదే కాలంలో నూతన పెన్షన్‌ స్కీములో 5.68లక్షల మంది నూతన ఖాతాదారులుగా చేరారు. కేవలం తొమ్మిదినెలలో ఈ రెండు పధకాల్లో చేరిన వారి సంఖ్య 50లక్షలు దాటుతుంది. పన్నెండు నెలల్లో 70లక్షలు దాటవచ్చు. ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్ల వంటి వారు మరో ఆరులక్షల మంది వృత్తిలో చేరి వుంటారు. గతేడాది దేశంలో7.6లక్షల వాణిజ్య వాహనాల విక్రయం జరిగింది. నాలుగోవంతు పనిలోంచి తొలగినా 5.7లక్షల వాహనాలు నిఖరంగా వుంటాయి. ఒక్కొక్కదాని మీద ఇద్దరు పని చేసినా 11.4లక్షల మందికి వుపాధి కల్పించినట్లు కాదా అంటూ ప్రతిపక్షాలను మోడీ తనవాదనా పటిమతో ప్రశ్నించారు. స్వరాజ్య అనే ఆర్‌ఎస్‌ఎస్‌వారు నడిపే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ప్రభుత్వం ఎన్నో వుద్యోగాలు కల్పించినా దాన్ని సాధికారికంగా చేప్పేందుకు అవసరమైన సమాచారం లేదని పేర్కొన్నారు.ఇదొక పెద్ద అబద్దం

Image result for modi's big lie cartoons

నీతి అయోగ్‌ వుపాధ్యక్షుడు అరవింద్‌ పనగారియా ఆధ్వర్యంలో వుపాధి కల్పన సమాచారం మీద ఒక నివేదిక తయారు చేశారు. వుద్యోగ కల్పన దృశ్యం కలతపరిచేదిగా కనిపించటంతో దాన్ని పక్కన పెట్టేశారు. అయినా ముఖ్యమంత్రిగా ఎంతో అనుభవం వుండి, నాలుగున్నర సంవత్సరాలు ప్రధాని పదవిలో వున్న పెద్దమనిషి వుద్యోగాల సమాచారం లేదని చెప్పటం సిగ్గుపడాల్సిందిగా వుంది కదా ! కార్మికశాఖ 2016-17 సంవత్సరానికి తయారు చేసిన నివేదికను కూడా ప్రభుత్వం తొక్కి పెట్టిందని చెబుతున్నారు. దొరికిందేదో చేయక కోరిన వుద్యోగం రాలేదని ఖాళీగా వున్న వారిని నిరుద్యోగులుగా లెక్కించకూడదని మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేవకర్‌ సెలవిచ్చారు. నిజమే రాజకీయ నిరుద్యోగులకు అది వర్తిస్తుంది, పదవులేమీ ఇవ్వకపోయినా అధికారపార్టీ తనలో చేరినవారందరికీ కండువాలు కప్పి మందలో కలిపేసుకుంటే అలాంటి వారు ఏమి చేస్తున్నారో ఎలా సంపాదించుకుంటున్నారో చూస్తున్నాము. కానీ వుపాధి విషయంలో అలా కుదరదే. కొత్తగా ఎవరైనా పకోడి బండి పెట్టుకుంటే వున్న తమకే బేరాల్లేకపోతే నువ్వొకడివా అంటూ గుర్రుగా చూసే పరిస్ధితి. జవదేవకర్‌ నిర్వచనం ప్రకారం ఆవుల పెంపకం, పకోడి బండి, టీ ఫ్లాస్కులు తీసుకొని రోడ్డెక్కటానికి అవకాశం లేని వారందరినీ నిరుద్యోగులుగా లెక్కించటానికి లేదు. దేశంలో నిరుద్యోగులు 2018 డిసెంబరులో 7.4శాతానికి పెరిగారు. జనవరి ఆరవ తేదీ నాటికి 30రోజు సగటు నిరుద్యోగుల సంఖ్య 7.8శాతానికి పెరిగింది. డిసెంబరులో మొత్తం వుపాధి పొందుతున్నవారి సంఖ్య 3.97కోట్లు, అదే 2017 డిసెంబరులో వున్నవారితో పోల్చితే 1.1 కోట్లు తక్కువ. తాను చెప్పిన దానిని ఎలాంటి జంక గొంకు లేకుండా పాటిస్తున్న వారిని చూసి గోబెల్స్‌ ముసిముసి నవ్వులు నవ్వుతూనే వుంటాడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పరిహాసం పాలైన జలంధర్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ !

11 Friday Jan 2019

Posted by raomk in Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Science

≈ Leave a comment

Tags

Indian Science Congress (ISC), pseudo-scientific beliefs, science congress 2019, scientific temper, unscientific statements

Image result for science congress 2019

ఎం కోటేశ్వరరావు

పరస్పర విరుద్దశక్తులు నిరంతరం పని చేస్తూనే వుంటాయి. ఒకటి వెనక్కు లాగుతుంటే మరొకటి ముందుకు తీసుకుపోయేందుకు ప్రయత్నిస్తుంది. ఈ పోరులో ఇప్పటి వరకు జరిగిన చరిత్ర అంతా మొత్తం మీద పురోగామి శక్తుల విజయమే. అయినా సరే ఎప్పటికప్పుడు తిరోగామి శక్తులు తమ పని తాము చేస్తూనే వుంటాయి. జనవరి మూడు నుంచి ఏడవ తేదీ వరకు పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగిన భారత సైన్స్‌ కాంగ్రెస్‌ 106వ సమావేశాలలో కూడా జరిగింది అదే. అక్కడ చేసిన కొన్ని వుపన్యాసాలు, సమర్పించిన పత్రాలు ప్రపంచంలో మనల్ని నగుబాట్లపాలు చేశాయి. ప్రపంచ మీడియా వీటి గురించి బహుళ ప్రచారమిచ్చింది.రెండు సంవత్సరాల క్రితం కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన బయాలజిస్ట్‌, నోబెల్‌ బహుమతి గ్రహీత అయిన వి రామకృష్ణన్‌ తాను హాజరైన సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశంలో సైన్సు గురించి చర్చించింది తక్కువని తానింకోసారి ఇలాంటి సమావేశాలకు హాజరు కానని చెప్పిన మాటలు ఇంకా మన చెవుల్లో గింగురు మంటున్నా ఒక్కరంటే ఒక్కరు కూడా సదరు వుపన్యాసాలను అడ్డుకొనేందుకు ప్రయత్నించలేదు. గత మూడు సమావేశాలలోనూ జరిగింది అదే. తాజా సమావేశాలు భవిష్యత్‌ భారత్‌ : శాస్త్రము, సాంకేతికము అనే ఇతివృత్తంగా జరిగాయి. ఆందోళనకరమైన అంశం ఏమంటే గత సమావేశాల అనుభవాలను చూసి అలాంటి శక్తులు ఆ వేదికను వుపయోగించుకోవటాన్ని అడ్డుకొనేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. అశాస్త్రీయ విషయాలను నిరూపిత అంశాలుగా చిత్రిస్తున్న వారిని ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ సమావేశాలలో నిలదీసి ప్రశ్నించకపోవటం మన శాస్త్రవేత్తల భావదారిద్య్రానికి నిదర్శనమా ! లేక తాము నమ్మిన, పరిశోధించిన అంశాలమీదే అపనమ్మకమా ? రెండూ ప్రమాదకరమే !

న్యూటన్‌ పుట్టక ముందే గురుత్వాకర్షణ శక్తి వుంది, డార్విన్‌ తాను చెప్పిన పరిణామ క్రమంలో భాగంగానే ఒక మానవుడిగా పుట్టాడు. వాటిని ఒక శాస్త్రీయ పద్దతిలో వివరించటమే వారు చేసింది. ఆ రంగాలలో నిష్ణాతులైన వారు వాటిని అంగీకరించారు. అవి ప్రపంచం ముందుకు వచ్చినపుడు ఏ వేద లేదా సంస్కృత పండితుడు అవన్నీ తమకు ఎప్పుడో తెలుసని సవాలు చేసిన వారుగానీ, వివరించిన వారు గానీ లేరు. రాబోయే రోజుల్లో ఎవరైనా ఆ సిద్ధాంతాలు తప్పని ఆధారాలతో నిరూపిస్తే ఆ నూతన సిద్ధాంతాలను సమాజం అంగీకరిస్తుంది, అనుకరిస్తుంది. అదేమీ లేకుండా ఫలానా సిద్దాంతాన్ని నేను తప్పు అంటున్నాను, లేకపోతే ఇవన్నీ వేదాల్లోనే వున్నాయనో పిచ్చివారెవరైనా చెబితే శాస్త్రవేత్తలు ప్రశ్నించలేకపోవటం నిజంగా మన దౌర్భాగ్యం కదూ ! ఇతర దేశాలతో పోటీపడి మన దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని అందరూ కోరుకుంటారు. ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సభలు జరుగుతున్నాయంటే ఆ రంగంలో మన పురోగతి, సాధించిన విజయాలను సమాజం ముందుంచి శాస్త్రవిషయాల పట్ల భావిభారత పౌరుల్లో ఆసక్తికలిగించాలని ఎవరైనా ఆశిస్తారు. కానీ గత నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్నదేమిటి? దానికంటే ఆశాస్త్రీయ విషయాలను ముందుకు తెచ్చి వేదాల్లో అన్నీ వున్నాయష అనే రోజుల్లోకి తీసుకుపోతున్నారు. నిజానికి ఇదొక మానసిక వ్యాధి లక్షణంలా వుంది. ప్రతి సమాజం ఘనమైన గతంతో పాటు సిగ్గుపడాల్సిన అంశాలను కూడా కలిగి వుంటుంది. గత సమాజాల్లో అంతా ఘనతే వుంటే జనం మార్పులను ఎందుకు కోరుకున్నట్లు ?

జలంధర్‌ సైన్స్‌ సభల్లో కొందరు చేసిన ప్రవచన అంశాలు దేశాన్ని వెనక్కు తీసుకుపోయేవిగా వున్నాయి. అవేమిటో సంక్షిప్తంగా చూద్ధాం. మహాభారత కాలం నాటికే మన దేశంలో బడ్డు తాడు కణాల పరిశోధన వుంది, వంద కుండల్లో వంద అండాలను పెట్టి కౌరవులను పుట్టించారు, ఇది టెస్ట్‌ ట్యూబ్‌ పిల్లల పరిజ్ఞానం కాదా అంటూ ఆంధ్రావిశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ జి నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఈ పేరుమోసిన విద్యావేత్త మేధస్సు అంతవరకే పరిమితం కాలేదు, రావణుడికి ఎందరు ఎక్కినా ఒకరికి ఖాళీ వుండే పుష్పక విమానం వుండటమే కాదు, లంకలో ఇరవైనాలుగు చిన్నా పెద్ద విమానాలు, ఎన్నో విమానాశ్రయాలు వుండేవని, సైనిక అవసరాలకువిమానాలను వాడారని కూడా రామాయణం చదివితే మనకు తెలుస్తుందని కూడా సెలవిచ్చారు. అంతేనా చార్లెస్‌ డార్విన్‌ పరిణామ సిద్ధాంతం కంటే ముందే దాని గురించి మనకు తెలుసని డార్విన్‌ చెప్పినదాని ప్రకారం తొలి జీవి నీటి నుంచి ప్రారంభమైందని దశావతారాల్లో మత్స్యావతారం మొదటిదని అంటే దశావతారాలు పరిణామ సిద్దాంతమని కూడా నాగేశ్వరరావు చెప్పారు. విష్ణువు దగ్గర లక్ష్యాన్ని చేధించి తిరిగి వచ్చే నియంత్రిత క్షిపణుల మాదిరి శంఖుచక్రం వుందని కూడా చెప్పారు.

రావణుడి గురించి చెప్పిన రావుగారు రాముడి విమానాల గురించి చెప్పలేదు. పురాణాల ప్రకారం సత్య, త్రేతా, ద్వాపర, కలియుగాల్లో రకరకాల విమానాలున్నాయి. వాటిలో ఎక్కువ భాగం మానసిక శక్తితోనే నడిచాయి. అలాంటపుడు రాముడికి విమానాలెందుకు లేవు, అడవులకు రధాల మీద, నదులు దాటేందుకు పడవలు ఎందుకు ఎక్కారు. విమానాల మీద పోవచ్చు కదా ! రావణుడు అడవిలోని సీతను అపహరించేందుకు రధంలో వచ్చాడు, సీతను రధంలో ఎక్కించుకొని పోయి సముద్రాన్ని ఎలా దాటాడు, రధాన్ని ఎక్కడ వుంచాడు, సముద్ర ప్రయాణానికి ఓడను వుపయోగించాడా ? విష్ణుమూర్తి అవతారంగా చెబుతున్న రాముడి దగ్గర నియంత్రిత క్షిపణి శంఖుచక్రం బదులు విల్లు, బాణాలు ఎందుకున్నాయి, విమానాలు ఎందుకు లేవు? లంకను చేరుకొనేందుకు రాముడి దగ్గర ఓడలు కూడా లేవా, వుంటే వానర సైన్య సాయంతో వారధిని ఎందుకు కట్టించినట్లు ? రావణుడిని సంహరించేందుకు క్షిపణి ప్రయోగం ఎందుకు చేయలేదు. హనుమంతుడు లంకా దహనం చేశాడని రాశారు తప్ప రావణుడి దగ్గర వున్న పుష్పక విమానాన్ని, ఇతర విమానాలను, లంకలోని విమానాశ్రయాలను దహనం చేయలేదా, వానర లేదా రాముడి సేనలపై రావణుడు వైమానిక దాడులు ఎందుకు చేయలేదు, రావణుడిని వధించిన తరువాత రాముడు ఆ విమానాలను స్వాధీనం చేసుకోలేదా ? ఆ తరువాత ఆ విమానాలు, క్షిపణులు ఏమయ్యాయి అనే ప్రశ్నలకు కూడా వైస్‌ ఛాన్సలర్‌గారు సమాధానాలు చెప్పాల్సి వుంది. మన వేదాలు లేదా సంస్కృత గ్రంధాలను పరదేశీయులు అపహరించారు, వాటి ఆధారంగా నూతన అవిష్కరణలు చేశారు అని చెబుతారు. ఇలాంటి కాకమ్మ కధలు వినటానికి వీనుల వింపుగా వుంటాయి. మనమెందుకు చేయలేదు ? ఇలాంటివి ఇంకా చాలా వున్నాయి.

Image result for science congress 2019,protests

సమస్య ఏమంటే మన శాస్త్రవేత్తలు ఇలాంటి ప్రచారాన్ని ఖండిస్తూ ఎందుకు ముందుకు రావటం లేదు. వేదికలపై ఎందుకు అనుమతిస్తున్నారు. దీనికి ప్రధానంగా ఒకటి కనిపిస్తోంది. ప్రభుత్వం సైన్స్‌ కాంగ్రెస్‌ వంటి వాటికి ధన, ఇతర రూపాలలో కొంత సాయం చేస్తున్నది. వాటిని ప్రారంభిస్తున్న ప్రధాని, కేంద్ర మంత్రులు స్వయంగా ఇలాంటి అశాస్త్రీయ విషయాలను తమ సందేశాలలోవెల్లడిస్తున్నారు. అందువలన వారికి లేదా వారి దివాలాకోరు భావజాలానికి వ్యతిరేకత వ్యక్తం చేస్తే సాయం ఆగిపోవచ్చు, నిర్వాహకుల వుద్యోగాలకు ముప్పు రావచ్చు, ప్రమోషన్లు ఆగిపోవచ్చు, అలాంటపుడు ఎవరేమి చెబితే మన కెందుకు అనే దిగజారుడుతనం తప్ప మరొకటి కనిపించటం లేదు. వినాయకుడికి ఏనుగు తల అతికించటాన్ని బట్టి మనకు గతంలోనే ప్లాస్టిక్‌ సర్జరీ తెలుసుని సాక్షాతూత ప్రధాని నరేంద్రమోడీయే చెప్పిన తరువాత గతంలో ఒక సైన్స్‌ కాంగ్రెస్‌లో కేంద్ర మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ ఆల్జీబ్రా, పైధాగరస్‌ సిద్ధాంతాలను ప్రపంచానికి భారత్‌ ఇచ్చిందని చెప్పటంలో ఆశ్చర్యం ఏముంది. ముంబై విశ్వవిద్యాలయ సంస్కృత విభాగ అధిపతి గౌరీ మహులీకర్‌ ఒక పత్రికలో రాసిన వ్యాసంలో జామెట్రిక్‌ ఫార్ములా గురించి క్రీస్తుకు పూర్వం 800 సంవత్సరాల క్రితమే సులభ సూత్ర అనే గ్రంధంలో బౌధాయన రాశాడని వాటినే పైథాగరస్‌ సిద్దాంతం అంటున్నామని ఆ పెద్దమనిషి పేర్కొన్నాడు. ఏడు వేల సంవత్సరాల క్రితమే భరద్వాజ మహర్షి విమానాల గురించి రాశాడని యుద్ధాలకు వుపయోగించే వాటిలో ఒక్కోదానికి 30 ఇంజన్లు వుండేవని, అవి ఎటు కావాలంటే అటు తిరిగి, ఎగిరేవని కెప్టెన్‌ ఆనంద్‌ జె బోడాస్‌ చెప్పాడు. కిరణ్‌ నాయక్‌ అనే మరో పెద్దమనిషి అయితే మహాభారత యుద్ధకాలంలో విమానాలతో యుద్ధం చేసిన వారు తలకు హెల్మెట్లు వాడారని నేను చెప్పేది నమ్మకపోయినా అలాంటి ఒక హెల్మెట్‌ను నాసా కనుగొన్నదని కావాలంటే గూగుల్‌లో తెలుసుకోవచ్చని పేర్కొన్నాడు. ఇలాంటి చెత్తను సమర్ధించుకోవటానికి నాసా పేరును వుపయోగించుకోవటం ఒక ఫ్యాషన్‌గా మారింది.తాజా సమావేశాలలో శాస్త్రవేత్తను అని చెప్పుకొన్న కెజె కృష్ణన్‌ అనే వ్యక్తి న్యూటన్‌, ఐనిస్టీన్‌లకు పెద్దగా భౌతిక శాస్త్రం గురించి తెలియదని, ప్రపంచాన్ని మోసం చేశారంటూ తాను చెప్పేదాన్ని అంగీకరిస్తే భవిష్యత్‌కు మరింత వుపయోగమన్నాడు. ఇప్పుడు ప్రపంచానికంతకూ తెలిసిన గురుత్వాకర్షణ తరంగాలకు నరేంద్రమోడీ తరంగాలని పేరు పెట్టాలని, గురుత్వాకర్షక కాంతికి హర్షవర్దన్‌(కేంద్రమంత్రి) పేరు పెట్టాలని ఒక శాస్త్రవేత్తకు వుండకూడని తన లక్షణాన్ని చక్కగా బయట పెట్టాడు. ఏ శాస్త్రవేత్తయినా కొత్త సిద్ధాంతం లేదా పద్దతిని కనిపెడితే అనేక సందర్భాలలో అతను లేదా ఆమె పేరు పెడతారు. ఈ పెద్దమనిషి ఎలాగూ తనను శాస్త్రలోకం ఆమోదించదు కనుక గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్లుగా మోడీ, హర్షవర్ధన్‌ పేర్లు పెట్టాలని కోరాడు. అబ్దుల్‌ కలాం కంటే భవిష్యత్‌లో కేంద్ర మంత్రి హర్షవర్దన్‌ పెద్ద శాస్త్రవేత్త అవుతారని కృష్ణన్‌ సెలవిచ్చాడు. కొంత మంది అతితెలివి గల వారు సంస్కృత అనువాదాలు కాదు అసలు రాతలను చదివితేనే వాటిలో చెప్పిన సిద్ధాంతాలను వెలికి తీయవచ్చునని వాదిస్తారు. ఎవరు వద్దన్నారు ? పాలకులకు ఇలాంటి విషయాలు ఇష్టంగా వున్నట్లు గమనించిన తరువాత ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి మెప్పించర సుమతీ అన్నట్లు చెప్పేవారు తయారైతే అదుపు చేయాల్సిన వారు కూడా మన కెందుకులే అని వూరుకుంటున్నారు.

సైన్స్‌ కాంగ్రెస్‌లో అశాస్త్రీయ ప్రకటనలు చేయటాన్ని సభకు హాజరైన వారు ఖండించకపోయినా బెంగళూరులో కొందరు శాస్త్రవేత్తలైనా నిరసించి పరువు కాపాడారు. ఇదేమాత్రం చాలదు. వివిధ సంస్ధలకు చెందిన వున్నతాధికారులేమి చేస్తున్నారు. సైన్స్‌ కాంగ్రెస్‌ అజెండా నిర్ణయంలో ప్రభుత్వానికేమీ పాత్ర వుండదని ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సలహాదారు కె విజయ రాఘవన్‌ చెప్పారు. అంధ్రవిశ్వవిద్యా లయ వైస్‌ ఛాన్సలర్‌ నాగే శ్వరరావు చెప్పిన అంశాలను విమర్శిస్తూ అతని మీద ఒక ఫిర్యాదును దాఖలు చేయాలన్నారు. ఒక ప్రముఖ విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌గా వున్న బయాలజిస్ట్‌ నాగేశ్వరరావు చెత్త మాట్లాడుతున్నపుడు శాస్త్రవేత్తల్లో వేడి పుట్టాలని అన్నారు. నాగేశ ్వరరావు, కృష్ణన్‌ మాట్లాడిన అంశాలు అపహాస్యం పాలుగావటంతో వాటితో తమకేమీ సంబంధం లేదని సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రేమేందు పి మాధుర్‌ ప్రకటించారు. తదుపరి తమ సమావేశాల్లో ప్రసంగించే వారికి సంబంధించి నిబంధనలు సవరించనున్నామని, వారేమి మాట్లాడేది తెలుసుకొని, ఇతర విషయాలు మాట్లాడబోమనే హామీలు తీసుకొని సరైన వారిని ఎంపిక చేస్తామని చెప్పారు. తానే గనుక ప్రసంగ సమయంలో అక్కడ వుండి వుంటే ఏం మాట్లాడుతున్నారని ప్రశ్నించేవాడినని, ఆధారం చూపమని కోరి వుండే వాడినని అన్నారు. సైన్స్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మనోజ్‌ చక్రవర్తి విలేకర్లతో మాట్లాడుతూ నాగేశ్వరరావు మాటలతో తాను దిగ్భ్రాంతి చెందానని, అతనికి ఈ విషయాలు ఎలా తెలుసు, ఏదైనా ఆధారం వున్నదా, శాస్త్ర సమాజం దిగ్భ్రాంతి చెందింది అని వ్యాఖ్యానించారు. తాము కొల్‌కతా వెళ్లిన తరువాత అతను చేసిన ప్రసంగాన్ని ఖండిస్తూ లాంఛనంగా ఒక ప్రకటన చేస్తామని వెల్లడించారు. ఈ ప్రకటనలతో వైస్‌ ఛాన్సలర్‌ నాగేశ్వరరావుకు ఏమైనా పరువు ప్రతిష్టలుంటే పదవి నుంచి తప్పుకొని వుండాల్సింది.

ఇలాంటి చెత్త మాట్లాడేవారి గురించి సైన్స్‌ కాంగ్రెస్‌ పెద్దలకు గతంలో ఫిర్యాదులు అందలేదా అంటే మూడు సంవత్సరాల క్రితమే ముంబై సమావేశం తరువాత తాము ఆందోళన చెందుతున్న అంశాల గురించి సైన్స్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశామని బెంగళూరుకు చెందిన బ్రేక్‌ త్రూ సైన్స్‌ సొసైటీ కార్యదర్శి కెఎస్‌ రజని చెప్పారు. తరువాత మైసూరు, తిరుపతి, ఇపుడు జలంధర్‌లో అదే పునశ్చరణ అయిందని, ఇలాంటి వాటిని ఎలా అనుమతిస్తున్నారని జనం నిర్వాహకులను నిలదీయాలని అన్నారు. ప్రముఖ రసాయన శాస్త్ర ప్రొఫెసర్‌ సిఎఆర్‌ రావు మాట్లాడుతూ సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలకు తాను రావటం లేదని, వస్తే ఇలాంటి ప్రకటనలను ఆమోదించినట్లు అవుతుందని అన్నారు.

గత పాతిక సంవత్సరాలుగా డైనోసార్లపై పరిశోధనలు జరుపుతున్నట్లు చెప్పుకుంటున్న పంజాబ్‌ విశ్వవిద్యాలయ జియాలజిస్టు అషు ఖోస్లా ఈ సమావేశాలకు సమర్పించిన ఒక పత్రంలో బ్రహ్మ ఒక పెద్ద శాస్త్రవేత్త అని, డైనోసార్ల గురించి వేదాల్లో ప్రస్తావన వుందని, అసలు వాటికా పేరు మన సంస్కృతం నుంచే వచ్చిందన్నారు. భారతీయ డైనోసార్‌ అస్దికలను తమ బృందం గుజరాత్‌లోని ఖేదా జిల్లాలో కనుగొన్నదని చెప్పారు. నిజంగానే కనుగొని వుండవచ్చు, కానీ బ్రహ్మ పెద్ద శాస్త్రవేత్త, ఈలోక సృష్టికర్త, ఆయనకు డైనోసార్ల గురించి తెలుసు అని చెప్పిన మాటలతో అతని పరిశోధనను అనుమానించాల్సి వస్తోంది.

https://vedikaa.com/wp-content/uploads/2019/01/ff809-1465846477930.png

ప్రపంచం మీద ప్రభావం చూపిన నాలుగువేల మంది శాస్త్రవేత్తలలో భారతీయులు కేవలం పది మందే అన్నది టెక్‌2 న్యూస్‌ విశ్లేషణ. ప్రతి ఏటా ప్రపంచవ్యాపితంగా ఎక్కువగా వుటంకించిన శాస్త్రవేత్తల జాబితాను క్లారివేట్‌ అనలిటిక్స్‌ అనే సంస్ధ గత ఐదు సంవత్సరాలుగా ప్రచురిస్తున్నది.2018 జాబితాలో పేర్కొన్న పది మందిలో సిఎన్‌ఆర్‌ రావు (ప్రముఖ రసాయన శాస్త్రవేత్త, బెంగళూరు),దినేష్‌ మోహన్‌ (ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌), రాజీవ్‌ వర్షనే (వ్యవసాయ శాస్త్రవేత్త, ఇక్రిశాట్‌), అశోక్‌ పాండే, టాక్సికాలజీ పరిశోధకులు, అవినిష్‌ అగర్వాల్‌, అలోక్‌ మిట్టల్‌, జ్యోతి మిట్టల్‌ (ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సు), రజనిష్‌ కుమార్‌(కెమికల్‌ ఇంజనీరింగ్‌), సంజీవ్‌ సాహు(నానో టెక్నాలజీ), శక్తివేల్‌ రత్నస్వామి(కంప్యుటేషనల్‌ మాథమాటిక్స్‌). నాలుగువేల మంది శాస్త్రవేత్తలు 60దేశాలకు చెందిన వారు. వీరిలో 80శాతం మంది కేవలం పదిదేశాలకు చెందిన వారైతే 70శాతం ఐదుదే శాల నుంచి వున్నారు. దేశాల రీత్యా అమెరికా 2,639,బ్రిటన్‌ 546, చైనా 482, భారత్‌ 10 మంది వున్నారు. సంస్ధల రీత్యా హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం 186మందితో అగ్రస్ధానంలో వుంది. ఒకే అంశం మీద పరిశోధన చేసే వారినే గతంలో జాబితాలో చేర్చగా ఈ ఏడాది వివిధ రంగాలలో పని చేస్తున్నవారికి చోటు కల్పించటంతో మన సంఖ్య పదికి చేరిందట. పదిహేను సంవత్సరాల క్రితం చైనా-భారత్‌ ఒకే స్దాయిలో వుండేవి, ఇప్పుడు ప్రపంచ శాస్త్ర పరిశోధన ఫలితాల్లో చైనా 15-16 శాతం సమకూర్చుతుండగా మన దేశ వాటా నాలుగు శాతమే అని సిఎన్‌ఆర్‌ రావు చెప్పారు. సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక అంశాలు దీనికి దోహదం చేసే అంశాలలో వున్నాయి. ఇవిగాక పారిశ్రామిక భాగస్వామ్యాలు, పెట్టుబడులు కూడా ప్రభావం చూపుతాయి.

పురాతన భారత దేశం వేదాలకే కాదు, వాటి ప్రామాణ్యతను ప్రశ్నించిన చార్వాకులకు కూడా నిలయమే. ప్రపంచంలో ప్రతి మతం తాను ప్రవచించిన దానిని వ్యతిరేకించిన లేదా ప్రశ్నించిన వారిని నాశనం చేసింది. దానికి మన దేశం మినహాయింపు కాదు.వేదాలను లేదా వాటిలో చెప్పిన అంశాల ప్రాతిపదికగా వున్న నాటి మతం, దాన్ని ఆశ్రయించిన నాటి పాలకులు చార్వాకులను భౌతికంగా అంతం చేయటమే కాదు, వారి రచనలను కూడా నాశనం చేశారు. విమర్శిస్తూ రాసిన వారి రచనల నుంచే చార్వాకులు ఏమి చెప్పారనేది మనకు తెలుస్తున్నది. ప్రత్యక్ష ప్రమాణం ప్రాతిపాదికగా వారు వ్యవహరించారన్నది స్పష్టం. చార్వాకులు లేదా లోకాయతుల అణచివేత తరువాత కాలంలో ఆ దృష్టి మన సమాజంలో కొరవడింది. చివరకు అది బ్రాహ్మలు మాత్రమే వేదాలు చదవాలి. క్షత్రియుడు మాత్రమే కత్తి పట్టాలి. శూద్రులు వ్యవసాయమే చేయాలి. పంచములు వూరికి దూరంగా వుండాలి. స్త్రీలు ఏ సామాజిక తరగతిలో వున్నా వారికి స్వాతంత్య్రం లేదు. చదువు అవసరం లేదు. సముద్ర ప్రయాణాలు చేసిన వారికి ప్రోత్సాహం సంగతటుంటి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనేదాకా పోయింది. ఇలా సమాజంలో అనేక బంధనాలు, ఆటంకాలను సృష్టించిన సమాజం కొన్ని వందల, వేల సంవత్సరాలు కొనసాగిన కారణంగా మన జనంలో శాస్త్ర స్పృహ అడుగంటింది. కుల వృత్తికి సాటిరాదు గువ్వల చెన్నా అన్నట్లుగా ఎదుగూబదుగూ లేకుండా సాగింది.

ప్రతి సమాజం అనేక వూహలకు నిలయమైంది. వాస్తవంతో పని లేకుండా వూహలతో నిండిన సాహిత్యాన్ని సృష్టించారు. అందుకు మన దేశం మినహాయింపు కాదు. వాటినే ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ నుంచి వైస్‌ ఛాన్సలర్‌ నాగేశ్వరరావు వంటి వారి వరకు అనేక మంది పురాతన శాస్త్రంగా చెప్పటమే కాదు, ఆధునిక ఆవిష్కరణలకు జోడించి చెబుతున్నారు. ఆ కాలంలో అయినా ఈ కాలంలో అయినా మానవుడికి ఏనుగుకు పరిమాణంలో ఎంతో తేడా వుంటుంది. వినాయకుడికి అంత పెద్ద ఎనుగు తలను అతికిస్తే ఆ భారాన్ని ఎలా భరించేవాడు, దాన్ని వేసుకొని అతి చిన్న ఎలుకవాహనం మీద ఎలా ఎక్కేవాడు, అన్నింటికీ మించి ప్లాస్టిక్‌ సర్జరీ నిపుణులు వుంటే తెగిన వినాయకుడి తలనే ఎందుకు అతికించ కుండా, ఏనుగు తలను ఎందుకు తెచ్చారు, అంతకంటే చిన్న జంతువులు దొరకలేదా అనే సందేహాలు రానవసరం లేదా ?

ఆశాస్త్రీయ భావజాలాన్ని ప్రచారం చేస్తున్న పాలకులు, వారికి వంత పలికే కుహనా లేదా ఆత్మను చంపుకొని తాము చదివిన దానికి భిన్నంగా కుహనా శాస్త్ర అంశాలను చెప్పేవారిని ఎదిరించేందుకు ధైర్యం చేయని అశక్తులు అసలు సైన్సు సమావేశాలు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. కేవలం ఇటు వంటి సమావేశాలే సమాజంలో సైన్సు పట్ల ఆసక్తి కలిగిస్తాయని చెప్పలేము గానీ ఇవొక అవకాశం. పరిశోధన, ప్రచారానికి తగిన నిధులు కేటాయించేందుకు రానురాను పాలకులు విముఖత చూపుతున్నారు. సమాజాన్ని తిరోగమనంలో నడపాలని చూసే వారికి శాస్త్రీయ, ప్రత్యామ్నాయ విధానాల అవగాహన పెరగటం ఏమాత్రం ఇష్టం వుండదు. పరిశోధన, అభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించని దేశమూ, సమాజమూ ముందుకు పోయిన దాఖలా మనకు కనపడదు. యధారాజా తధా ప్రజ అన్నట్లు ఆ పని చేయని పాలకులు వున్నపుడు వారికి వంతపాడే మేథావులు కూడా ఇష్టగానాలు, నృత్యాలే చేస్తారు. జలంధర్‌ సైన్స్‌ కాంగ్రెస్‌లో జరిగింది అదే. ఇలాంటి ధోరణులను ప్రతిఘటించకపోతే రాబోయే సమావేశాల్లోనూ అదే పునరావృతం అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

దేశభక్తిని ఓట్ల వ్యాపార సరకుగా మార్చుతున్న బిజెపి !

07 Monday Jan 2019

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP pseudo patriotism, Gujarat studens roll call, patriotism, pseudo patriotism, Real patriotism

Image result for bjp patriotism

ఎం కోటేశ్వరరావు

‘ఒక దుర్మార్గుడి అంతిమ ఆశ్రయం (దిక్కు) దేశభక్తి ‘ అని 18వ శతాబ్దపు బ్రిటన్‌ రచయిత శామ్యూల్‌ జాన్సన్‌ చేసిన వ్యాఖ్య కొందరి విషయంలో నిజమే అనిపిస్తోంది కదూ! మన దేశాన్ని ఆక్రమించి మనలను పాలించిన మొఘలాయీ, బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన వారిని దేశభక్తులు, జాతీయ వాదులు అని పిలిచారు, జనం గౌరవించారు. స్వాతంత్య్రం వచ్చి మనలను మనమే పాలించుకుంటున్నాం. బ్రిటీష్‌ వారి కాలంలో వారితో చేతులు కలిపిన వారి వ ారసులు ఇన్ని దశాబ్దాల తరువాత మేమే అసలు సిసలు జాతీయవాదులం, దేశభక్తిలో మాకు సాటి లేదు, దానిలో 24గంటలూ మునిగి తేలుతున్నాం, మాతో మునగని వారందరూ దేశద్రోహులే అంటున్నవారిని ఏమని పిలవాలి ?

అవును నిజం ! ఇప్పటి వరకు ఎస్‌ సర్‌ లేదా ఎస్‌ మిస్‌, ప్రజెంట్‌ సర్‌ లేదా మిస్‌ లేదా మేడం అన్న అందరినీ వారికి తెలియకుండానే దేశద్రోహుల ఖాతాలో జమ చేసేందుకు పూనుకున్నారు. దానిలో భాగంగానే హాజరు వేసే సమయంలో జై హింద్‌ లేదా జై భారత్‌ అని చెప్పాలట. ఎస్‌ సర్‌ అన్న వారి కంటే జైహింద్‌ అన్న వారికే గుజరాత్‌ టీచర్లు రాబోయే రోజుల్లో సర్టిఫికెట్లు ఇవ్వాల్సి వుంటుంది. జై హింద్‌ అనని వారు దేశభక్తులు, భావి భారత పౌరులు కాదు, దేశవ్యతిరేకులు. పిచ్చి ముదురుతోంది. కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ అన్నట్లు దేశభక్తి లేదా బ్రిటీష్‌ వ్యతిరేక జాతీయవాదంతో ఏమాత్రం సంబంధం లేని వారి వారసులు ఇప్పుడు కొత్త దేశభక్తుల అవతారం ఎత్తారు. తాజాగా గుజరాత్‌ బిజెపి సర్కార్‌ జైహింద్‌, జై భారత్‌ ఆదేశాలు జారీ చేసింది. చిన్న వయస్సు నుంచి పిల్లలకు జాతీయ వాదంలో తర్ఫీదునిచ్చేందుకు తామీ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నది.

జై హింద్‌, భారత్‌ అంటే తప్పేమిటి అన్నది వెంటనే వచ్చే ప్రశ్న. తప్పేమీ లేదు. అనేక యుద్ధాల్లో ప్రాణాలర్పించిన మన సైనికులు బడుల్లో హాజరు కోసం జై హిందు అనలే, అయినా సైన్యంలో చేరారా లేదా, వారికి దేశభక్తి లేకుండానే అలా నడుచుకుంటూ వెళ్లారా? సింధు నాగరికత వర్ధిల్లిన ప్రాంతాన్ని పరదేశీయుల పలుకు నుంచి వచ్చిన హిందు పదంతో ఎవరికీ అభ్యంతరం లేదు. హిందూ మతానికి దేశానికి పెడుతున్న లంకెతోనే వస్తున్న ఇబ్బంది. జర్మన్‌ హిట్లర్‌ కూడా తనది జాతీయ సోషలిస్టు కార్మిక పార్టీ అని చెప్పుకొని ఆ పేరుతో చరిత్రలో కనీవిని ఎరుగని మారణకాండకు పాల్పడ్డాడు. నాజీల మేడిపండు జాతీయ సోషలిజం అవగాహనను ప్రతి విద్యార్ధి ఆమోదించాలని వత్తిడి చేశారు. వ్యతిరేకించిన పిల్లలను విడిగా వుంచి భయపెట్టారు. అతగాడి భావజాలాన్ని అరువు తెచ్చుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌, దాని సృష్టి బిజెపి, ఇతర సంస్దలన్నీ తాము జాతీయవాదులని తామే అసలు సిసలు జాతీయ వాదులమని, తమది హిందూత్వ జాతీయవాదమని, ఒక జీవన విధానమని ఒళ్లంతా రాసుకొని వూరేగుతున్నారు. దాన్ని వ్యతిరేకించే వారే కాదు, అంగీకరించని వారిని కూడా దేశద్రోహులని ముద్రవేస్తున్నారు కనుకనే అభ్యంతరం తెలియచేయాల్సి వస్తున్నది. 1947కు ముందు బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా మనమంతా జాతీయవాదులం, ఇప్పుడు మనం భారతీయులమని గర్వంగా చెప్పుకోవచ్చు తప్ప భారత జాతీయవాదులం అంటే మిగతా దేశాలు ఒప్పుకోవు. ఈ తరహా జాతీయవాదంతోనే గతంలో జర్మనీ,ఇటలీ,జపాన్‌ వంటి దేశాలలో హిట్లరు, ముస్సోలినీ, టోజో వంటి నియంతలు తయారై ప్రపంచాన్ని నాశనం చేశారు. వారిని ఆదర్శంగా తీసుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పే అఖండ భారత్‌ అంటే ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి పాకిస్ధాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, మయన్మార్‌ వరకు అన్నీ భారత్‌లో భాగమే.

మమ్మల్ని రాజకీయంగా వ్యతిరేకిస్తే అభ్యంతరం లేదుగానీ ప్రతి నిత్యం, ప్రతి సందర్భంలోనూ మీరు మాత్రం మేము చెబుతున్న తరహా దేశభక్తిని నిరూపించుకోవాలనే ఒక అప్రజాస్వామిక అభిప్రాయాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి శక్తులు వ్యాపింప చేస్తున్నాయి. పరిణితి చెందిన ఏ దేశంలోనూ ప్రతిక్షణం ప్రతి ఒక్కరూ దేశభక్తిని బహిరంగంగా ప్రదర్శించాలనే ధోరణి లేదు. అమెరికా విద్యా సంస్ధలలో హియర్‌( వున్నాను) అంటారు తప్ప జై యుఎస్‌ఏ లేదా లాంగ్‌ లివ్‌ అమెరికా అనరు. వారికి దేశభక్తి లేనట్లా, లేక నేర్పనట్లా ? జర్మనీలో నియంత హిట్లర్‌ను పొగిడే విధంగా టీచర్లను మలచారు, హై హై నాయకా అన్నట్లు టీచరు వచ్చీ రావటంతోనే హిట్లర్‌ నామ జపం చేయగానే పిల్లలందరూ పొలో మంటూ ప్రతిజ్ఞ చేసినట్లుగా పొగిడే వారు. ఏదైనా అతి చేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువ. గోవులనే తీసుకోండి. గోమాత రక్షణ పేరుతో గోగూండాలను ప్రోత్సహించిన వారిలో వుత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ ఒకరు. ఆ పెద్దమనిషి చర్యలతో పాలివ్వని పశువులకు గడ్డిపెట్టలేని రైతులు వాటిని రోడ్ల మీదకు వదలి వేశారు. ఇప్పుడవి మేతకోసం పంటపొలాల మీద పడుతున్నాయి. గగ్గోలు పెట్టిన రైతులు కొన్ని చోట్ల వాటిని తోలుకుపోయి ప్రభుత్వ పాఠశాలల్లో వుంచి తాళాలు వేశారని వార్తలు. అనేక చోట్ల అవి పంటలను నాశనం చేయకుండా రైతులు పొలాల చుట్టూ కంచెలు వేసుకోవటం, కాపాలా కాయటం చేయాల్సి వస్తోంది. సమాజాన్ని వెనక్కునడపాలని చూసే వారికి ఇలాంటి అంశాలు ఎదురైనా వాటి నుంచి పాఠాలు తీసుకోకుండా మరింతగా వెనక్కు నడిపేందుకు చూస్తారు.

సినిమా హాళ్లలో దేశభక్తి నింపేందుకు ఎలాంటి ప్రహసనం నడిచిందో చూశాము. ఎందుకు నిలబడాలని ప్రశ్నించిన వారిని దేశద్రోహులుగా చూసిన అనుభాలను ఇంకా మరచి పోలేదు. తొలుత ప్రభుత్వ నిర్ణయంగా సినిమా హాళ్ల దేశభక్తిని సమర్ధించిన సుప్రీం కోర్టు తరువాత ఆ నిర్ణయం మీద దాఖలైన అప్పీళ్ల సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరమైనవి. కాళ్లూ, చేతుల మీద తమ దేశభక్తి ప్రదర్శన చేయాలని జనాన్ని బలవంతం చేయలేము, జాతీయ గీతం పాడుతున్నపుడు ఒక వ్యక్తి లేచినిలబడనప్పుడు అతనిలో దేశభక్తి తక్కువని అనుకోకూడదు అని పేర్కొన్నది. అంతే కాదు ప్రభుత్వం సినిమాలకు వచ్చేవారు టీ షర్టులు, పొట్టి నిక్కర్లు వేసుకోకూడదు, అలాంటి దుస్తులతో జాతీయ గీతాలాపన సమయంలో లేచి నిలవటం అవమానించటమే అని నిర్ణయిస్తే పరిస్ధితి ఏమిటి అని కూడా సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఇపుడు గుజరాత్‌ లేదా ఒకవేళ ఇదేదో ఓట్లు కురిపించేట్లుందే అని రేపటి నుంచి దాన్ని అనుసరించే ఇతర బిజెపి రాష్ట్రాలలో కూడా అమలు చేస్తే ఇదే పరిస్ధితి ఎదురవుతుంది.గతంలో కేరళ కేసులో జాతీయ గీతాలాపన సందర్భంగా నిబంధనల ప్రకారం లేచి నిలబడాలి తప్ప గీతాన్ని ఆలపించాలన్న నిబంధన ఎక్కడా లేదని, ఆలపించని కారణంగా ఎవరిమీదైనా చర్యలు తీసుకోవటం చెల్లదని సుప్రీం కోర్టు చెప్పింది. గుజరాత్‌ సర్కార్‌ లాజిక్కు ప్రకారం చూస్తే దేశంలో ఫోన్లు, ప్రతి కార్యాలయం, ఫ్యాక్టరీ, బజారుల్లో కూడా దేశభక్తిని నేర్పేందుకు జై హింద్‌, జై భారత్‌ అని పలకరించుకోవాల్సి వుంటుంది. ఏది తినాలో ఏది తినకూడదో, ఏది ధరించాలో ఏదికూడదో, ఎవరిని వివాహం చేసుకోవాలో ఎవరిని కూడదో చెబుతున్న కాషాయ దళాలు ఇప్పటికే దేశంలో ఎక్కడబడితే అక్కడ తామరతంపరగా పుట్టుకు వస్తున్నాయి. గుజరాత్‌ చర్యలు ఈశక్తులను మరింతగా రెచ్చిపోయేట్లు చేసేవి తప్ప వేరు గాదు. పిచ్చి మరింత ముదిరి పిల్లలందరూ జాతీయ జండా రంగులతో లేదా కాషాయ యూనిఫారాలు వేసుకోవాలని నిర్ణయించినా ఆశ్చర్యం ఏముంటుంది. దేశభక్తి, దేశ ద్రోహాన్ని కూడా ఓట్లవేటలో వ్యాపారంగా మార్చివేస్తున్నారని గ్రహించటం అవసరం. అందుకే ఒక దుర్మార్గుడి అంతిమ ఆశ్రయం (దిక్కు) దేశభక్తి అన్న శామ్యూల్‌ జాన్సన్‌ను గుర్తు చేయాల్సి వచ్చింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రధాని మోడీ కావాలని దాచినవి, తెలిసి కూడా ఎఎన్‌ఐ అడగనివి !

02 Wednesday Jan 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

ANI, Narendra Modi, Narendra Modi interview, Narendra Modi interview with ANI

Image result for What Narendra Modi hide, What ANI did not asked

ఎం కోటేశ్వరరావు

మిన్నువిరిగి మీద పడితే తప్ప ప్రధాని నరేంద్రమోడీ మీడియా గోష్టిలో ముఖాముఖీ మాట్లాడని భారత తొలి ప్రధానిగా సరికొత్త రికార్డు సృష్టించటం ఖాయమని తేలిపోయింది. బహుశా ప్రపంచంలోనే తొలి ప్రజాప్రతినిధి కూడా అయి వుండవచ్చు. పది సంవత్సరాల కాలంలో మూడంటే మూడు సార్లు మాత్రమే మీడియాతో మాట్లాడిన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను మౌనముని అని ఎద్దేవా చేసిన వారిలో బిజెపి కూడా వుంది. సోనియగాంధీ అనుమతి ఇవ్వని కారణంగా మన్మోహన్‌ అలా చేసి వుండవచ్చు. నాకు 56 అంగుళాల ఛాతీ వుంది, రిమోట్‌ కంట్రోలు లేదు అని చెప్పుకొనే నరేంద్రమోడీ ఒక్కసారి కూడా మాట్లాడకపోవటానికి కారణాలేమిటో ? అయితే ఏ ప్రధానీ ఇవ్వనన్ని ఫోజులు మీడియా కెమెరాలకు ఇచ్చారు కదా అని ఆయన భక్తకోటి దెబ్బలాటకు దిగవచ్చు. అలాంటి పెద్ద మనిషి నరేంద్రమోడీ జనవరి ఒకటవ తేదీన, హిందూత్వశక్తులు, అసలు సిసలు భారతీయతకు ప్రతీకలం అని చెప్పుకొనే వారు మొహాలు ఎక్కడో పెట్టుకొని సిగ్గుపడే విధంగా ఎఎన్‌ఐ అనే వార్తా సంస్ధకు ఆంగ్ల సంవత్సరాది రోజు 95నిమిషాల ఇంటర్వ్యూ ఇచ్చారు. అది యాదృచ్చికం తప్ప ఆంగ్ల సంవత్సరాదికి మోడీ ఇంటర్వ్యూకు సంబంధం లేదని వితండవాదం లేదా భాష్యం చెప్పే బాపతు కూడా మనకు తగలవచ్చు.

బ్రిటన్‌లో చాలా కాలం కిందట రాజు గారి తరువాత రాణీగారి ప్రతిపక్షంగా వ్యవహరించే పార్టీలు వుండేవి. అంటే రాజు, రాణీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అణగిమణగి ప్రశ్నించే పక్షాలవి. అలాగే నరేంద్రమోడీ మన దేశంలో అలాంటి మీడియాను రంగంలోకి తెచ్చిన ఆద్యుడిగా చెప్పుకోవాలి. ఒక యాంకర్‌గా చర్చలో పాల్గనేవారి మీదకు ఎక్కే ఆర్నాబ్‌ గోస్వామి నక్క వినయాలతో నరేంద్రమోడీని ఇంటర్య్వూ చేసిన విషయం తెలిసిందే. అంటే ముందుగానే ఏ ప్రశ్నలు అడగాలో ఏమి జవాబులు చెబుతారో, వాటి మీద వుప ప్రశ్నలు వేయకుండా ఎలా నోరు మూసుకోవాలో అన్నీ ముందే నిర్ణయం అవుతాయి. ఒక వేళ నోరు జారితే ఆ భాగాన్ని తొలగిస్తారనుకోండి అది వేరే విషయం. జనవరి ఒకటిన ఎఎన్‌ఐ ఇంటర్వ్యూ కూడా అలాంటి ముందస్తు ఏర్పాటుతో జరిగిందే అని వేరే చెప్పనవసరం లేదు. ఆ షరతుకు ఒప్పుకుంటేనే తన గదిలో మోడీ నోరు విప్పుతారు.

కొంత మంది ఓటమి లేదా తప్పిదాలను ఒక పట్టాన ఒప్పుకోరు, అందునా అవకాశవాద రాజకీయ నాయకులు కిందపడ్డా మాదే విజయం అంటారు. రెండు సంవత్సరాల క్రితం నరేంద్రమోడీ చేసిన పెద్ద నోట్లను రద్దు గురించి తాజా ఇంటర్వ్యూలో చెప్పిందేమిటి? ఇదేమీ ఝట్కా (ఆకస్మిక నిర్ణయం) కాదు, ఏడాది క్రితమే మీ దగ్గర నల్లధనం ఏదైనా వుంటే డిపాజిట్‌ చేయండి, అపరాధరుసుం చెల్లించండి, మీకు సాయం దొరుకుతుంది అని హెచ్చరించా. అయినప్పటికీ ఇతరుల మాదిరే మోడీ కూడా వ్యవహరిస్తారులెమ్మని కొంతమందే స్వచ్చందంగా ముందుకు వచ్చారు. నోట్ల రద్దుకు ముందు సమాంతర ఆర్ధిక వ్యవస్ధ వుంది, అది అంతర్గతంగా ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీసింది. సంచుల్లో దాచిన కరెన్సీ బ్యాంకింగ్‌ వ్యవస్ధలోకి తిరిగి వచ్చింది.’ అన్నారు మోడీ.

మోడీ మహాశయుడు నోట్ల రద్దు గురించి చెప్పిందాంట్లో కొత్తదేమీ లేదు. సాధించింది ఏమిటో చెప్పాలి కదా ! ఎంత నల్లధనం బయపడింది, దానిని ఎలా వుపయోగించారు, దాని వలన ఆర్ధిక వ్యవస్ధకు జరిగిన మేలేమిటి? బ్యాంకింగ్‌ వ్యవస్ధకు పెద్ద మొత్తంలో కరెన్సీ వస్తే ఇప్పుడు బ్యాంకులకు ప్రభుత్వం మూలధనం సమకూర్చేందుకు రిజర్వుబ్యాంకుల వద్ద వున్న మిగులును ఇమ్మని ఎందుకు అడుగుతున్నట్లు ? వీటి గురించి ఎంత తరచినా కేంద్ర ప్రభుత్వం లేదా రిజర్వుబ్యాంకు అధికారికంగా ఒక్క ప్రకటనా చేయలేదు. ఒక సాధారణ అంశం మాదిరి, 2018 ఆగస్టులో తన వార్షిక నివేదికలో తప్పదు కాబట్టి వివరాలను పొందుపరచింది. దాని ప్రకారం రద్దయిన నోట్లలో 99.3శాతం తిరిగి బ్యాంకులకు వచ్చాయి. ఆ మిగిలిన 0.7శాతం కూడా చిరిగిపోయి, ధ్వంసమై చెలామణిలో లేని లేదా ఆమాయకంగా మార్చుకోకుండా తమవద్దే వుంచుకున్న అమాయక సామాన్యుల వద్ద వుండిపోయింది తప్ప అది నల్లధనం కాదు. రద్దు వలన వచ్చిన లాభం కంటే జరిగిన నష్టమే ఎక్కువని అందరికీ తెలిసిన అంగీకరించటానికి 56 అంగుళాల ఛాతీకి ధైర్యం చాల్లేదు.

రిజర్వుబ్యాంకు గవర్నర్‌ వుర్జిత్‌ పటేల్‌ రాజీనామా గురించి నరేంద్రమోడీ పెద్ద జోక్‌ పేల్చారు. మొదటిసారిగా బయట పెడుతున్నానంటూ రాజీనామాకు ఆరేడు నెలల ముందే తాను తప్పుకుంటానని చెప్పారని, వ్యక్తిగతంగా తనకు రాతపూర్వకంగా తెలియచేశారని నరేంద్రమోడీ చెప్పారు. రాజీనామా సమయంలోనే ఈ విషయం ఎందుకు చెప్పలేదు, అదేమైనా రహస్యమా, దేశ భద్రతకు సంబంధించిన అంశమా ? రిజర్వుబ్యాంకు వద్ద వున్న నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదలాయించమని పటేల్‌ను వత్తిడి చేసిన అంశం బహిరంగ రహస్యం. మిగులు నిధులు, ఇతర కొన్ని అంశాలలో తాము చెప్పినట్లు చేయకపోతే కుదరదని తెగేసి చెప్పటమే గాక దేశ చరిత్రలో తొలిసారిగా రిజర్యుబ్యాంకు చట్టంలోని సెక్షన్‌ ఏడును ప్రయోగించింది. దాని ప్రకారం ప్రభుత్వం చెప్పినట్లు రిజర్వుబ్యాంకు వ్యవహరించాల్సి వుంటుంది. ఒక స్వతంత్ర ప్రతిపత్తిగలిగిన సంస్ధకు అధిపతిగా వున్న వ్యక్తిలో ఏ కాస్త ఆత్మగౌరవం వున్నా దానికి నిరసనగా రాజీనామా చేయటం తప్ప మరొక మార్గం లేదు. వుర్జిత్‌ పటేల్‌ ఆ పని చేయకుండా తన వ్యక్తిగత కారణాలు చూపి తప్పుకున్నాడు. అయినా నరేంద్రమోడీ ఈ విషయం గురించి పిట్టకథలు చెబుతున్నారు. రాజీనామాకు అనుమతించాలంటూ ఆరేడు నెలల క్రితం పటేల్‌ రాసిన లేఖను మోడీ బయట పెట్టి వుంటే ఆయన చెబుతున్న మాటలకు విశ్వసనీయత వుండేది.

రాజకీయాల గురించి ఎంత జాణతనంతో మాట్లాడినా చెల్లుతుంది. రైతాంగరుణ భారం వంటి తీవ్ర సమస్యల గురించి ప్రధాని మోడీ చాలా చులకనగా మాట్లాడారు. రుణాల రద్దు లాలీపాప్‌ వంటివన్నారు. అదే నిజమైతే ఆయన పార్టీ మంత్రులు ఎందుకు రుణాల రద్దు గురించి మాట్లాడుతున్నట్లు ? మోడీ మాట్లాడటానికి ఒక రోజు ముందే తమకు ఒడిషాలో అధికారమిస్తే రైతుల రుణాలను రద్దు చేస్తామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రకటించారు. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్లుగా మోడీ తీరు వుంది. రుణాల రద్దు కొద్ది మందికే వుపయోగపడుతున్నాయని, బ్యాంకుల నుంచి తీసుకొనే వారు తక్కువ, వడ్డీ వ్యాపారుల వద్ద తీసుకొనే వారే ఎక్కుని కూడా మోడీ సెలవిచ్చారు.ఆయనకు వాస్తవాలు తెలియవా, నివేదికలు చదవరా ? చదివించుకోరా ? అర్ధంగాకపోతే వివరించమని అధికారులను అడగరా ? బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొనే రైతులు చాలా తక్కువని ప్రధానే చెప్పారంటే అర్ధం ఏమిటి? బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వటం లేదనే కదా ? అదే నిజమైతే కేంద్రం గత ఐదేండ్లుగా ఏమి చేస్తున్నట్లు, ప్రాధాన్యతా రంగంగా ప్రకటించిన వ్యవసాయానికి రుణాలు తగినన్ని ఇవ్వలేదని బ్యాంకులను ఎందుకు నిలదీయలేదు. అసలు వాస్తవం ఏమంటే 2018ఆగస్టులో నాబార్డు వెల్లడించిన అధ్యయనం ప్రకారం 52.5శాతం రైతు కుటుంబాలు రుణభారంలో కూరుకుపోయాయి. వీరిలో కేవలం 11.5శాతమే వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకున్నారు. మోడీ చెప్పిందేమిటి ?

సర్జికల్‌ దాడులు తీవ్రముప్పుతో కూడుకున్నవి గనుక ఎక్కువ సేపు సాగించకుండా తెల్లవారక ముందే పూర్తి చేసి రమ్మని తాను స్పష్టమైన మార్గదర్శక సూత్రాలను జారీచేసినట్లు ప్రధాని చెప్పుకున్నారు. వినేవారుంటే చెప్పేవారు ఎన్నయినా పిట్టకథలు చెబుతారు. ఇలాంటి దాడుల గురించి గతంలో వాటిని నిర్వహించిన వారు చెప్పాలి. లేని గొప్పలు చెప్పుకోవటం తప్ప ఏ అనుభవంతో మోడీ మార్గదర్శక సూత్రాలు జారీ చేసినట్లు? గతంలోనూ అనేక దాడులు జరిపారు అయినా ఏ ప్రధానీ వాటిని ఇంతగా గొప్పలు చెప్పుకోలేదు. గోవధల పేరుతో మూకదాడులు చేసిన వారి గురించి మోడీ ఖండించారు. మరోవైపు ఆయన మంత్రులు చేసిందేమిటి? దాడులకు పాల్పడి శిక్షలు పడిన ఎనిమిది మంది నేరగాండ్లు బెయిలు మీద బయటకు వచ్చినపుడు హజారీబాగ్‌లో పూలదండలు వేసి మరీ కేంద్ర మంత్రి జయంత సిన్హా స్వాగతం పలికారు. ఇదేమి పనయ్యా అని అడిగితే అది భావ ప్రకటనా స్వేచ్చ అంటూ మరో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ గడుసుతనంతో తప్పించుకున్నారు. దాద్రి హత్య కేసులో నిందితుడు చస్తే శవం మీద జాతీయజండాను కప్పి ఒక నేరగాడికి గౌరవం ఇచ్చిన మరో మంత్రి మహేశ్‌శర్మలు మోడీగారి ఈ సమయంలో గుర్తు లేదా లేక మంత్రులను ఖండించినట్లా ? ఎందుకీ వంచన? వుత్తర ప్రదేశ్‌లో గోరక్షకులుగా చెప్పుకొనే ఒక పోలీసు అధికారినే హత్య చేసిన విషయం తెలిసిందే.

Image result for Narendra Modi hypocrisy

రాఫెల్‌ విమాన ఒప్పందం గురించి మోడీ అతి తెలివి తర్కానికి పాల్పడ్డారు. అదానీ, అంబానీలకు లబ్ది చేకూర్చారు కదా అన్న ప్రశ్నకు వ్యక్తిగతంగా నా పేరు చెప్పలేదు కదా ప్రభుత్వాన్ని అన్నారు, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి, ఎంత ఇచ్చారో చెప్పమనండి అని అడ్డుసవాలు విసిరారు. ఈ విషయంలో సుప్రీం కోర్టు తమ ప్రభుత్వానికి క్లీన్‌ చిట్‌ ఇచ్చిందని అన్నారు. అయితే మోడీగారు చెప్పనిది, ఇంటర్వ్యూ చేసిన వారు అడగనిది ఏమిటి ? 126 విమానాల కోసం గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసి అధిక ధరలకు 36విమానాలు ఎందుకు కొన్నారు ? ఎంతో అనుభవం వున్న హాల్‌ను విస్మరించి ఎలాంటి అనుభవం లేని అనిల్‌ అంబానికి కాంట్రాక్టు ఎందుకిచ్చారు? అంబానీ కంపెనీ దివాలా తీసిందా లేదా ? విమానాల ధరల వివరాలను పబ్లిక్‌ ఎకౌంట్స్‌ కమిటీకి కాగ్‌ ఇచ్చినట్లు సుప్రీం కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. అలాంటిదేమీ లేదని కమిటీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధికారయుతంగా చెప్పారు. 2జి స్పెక్ట్రమ్‌ మాదిరి సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణ ఎందుకు జరపరు? భారత ప్రభుత్వమే అంబానీ కంపెనీ పేరు సిఫార్సు చేసిందని ఫ్రెంచి మాజీ అధ్యక్షుడు హోలాండే ప్రకటించినదాని సంగతేమిటి ?

ముమ్మారు తలాక్‌ అంశం లింగవివక్షకు సంబంధించింది, శబరిమల అంశం సాంప్రదాయం అని మోడీ మహిళల పట్ల వివక్షను సమర్ధిస్తూ సుప్రీం కోర్టు మెజారిటీ న్యాయమూర్తుల తీర్పును విస్మరించి వివక్షను సమర్ధించిన మహిళా న్యాయమూర్తి ఇందు మల్హోత్రా చెప్పిన అంశాలను ప్రధాని వివరించారంటే దేశానికి ఏ సందేశం పంపినట్లు ? అన్ని కేసులలోనూ మైనారిటీ న్యాయమూర్తుల వ్యతిరేక తీర్పులనే సమర్ధిస్తారా ? అదే ప్రాతిపదిక అయితే ఆధార్‌ కేసులో ఆ పధకాన్ని పూర్తిగా రద్దు చేయాలంటూ మైనారిటీ తీర్పు చెప్పిన చంద్రచూడ్‌ వైఖరిని అనుసరించి ఆధార్‌ను రద్దు చేస్తారా ? శబరిమలలో మహిళల పట్ల వివక్షను ప్రధాని సమర్ధిస్తున్న సమయంలోనే కేరళ మహిళా మానవహారంలో పాల్గన్నట్లు చెబుతున్న 30 నుంచి 50లక్షల మంది వరకు మహిళలు ప్రధాని వైఖరిని ఖండించినట్లే. ఇలా అనేక అంశాలను మోడీ కావాలనే విస్మరించారు, ఇంటర్వ్యూ చేసిన వారికి అవన్నీ తెలిసి కూడా అడగకుండా దాటవేశారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాలుగు దశాబ్దాల చైనా సంస్కరణలు 2 : అమెరికాకు 69 ఏండ్లు , చైనాలో 18కే సాధ్యమైంది !

23 Sunday Dec 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, USA

≈ 1 Comment

Tags

China, Forty years of China Reforms, Xi Jinping

Related image

ఎం కోటేశ్వరరావు

1929 మాంద్యం ప్రారంభంలో అమెరికా వాస్తవ జిడిపి 1.109 లక్షల కోట్ల డాలర్లు కాగా అది పన్నెండు లక్షల కోట్ల డాలర్లకు చేరేందుకు 69 ఏండ్లు తీసుకుంది. 2017లో 18లక్షల కోట్ల డాలర్లకు చేరటానికి చేరటానికి 88 సంవత్సరాలు పట్టింది. చైనా జిడిపి 1999లో 1.09లక్షల కోట్ల డాలర్లుగా వున్నది 2017లో 12లక్షల కోట్ల డాలర్లకు చేరటానికి కేవలం 18 సంవత్సరాలే పట్టింది. అమెరికా ఆర్ధిక చరిత్రలో కనిపించే అనేక ఎగుడుదిగుడులు అది ఎదుర్కొన్న సమస్యలకు నిదర్శనం, అటువంటి పరిస్ధితి చైనా విషయంలో కనపడదు.1952-2017 మధ్య అమెరికాలో తొమ్మిది సంవత్సరాలు అంతకు ముందున్న జిడిపి కంటే తగ్గగా చైనాలో అటువంటి పరిస్ధితి ఐదు సంవత్సరాలలోనే కనిపించింది. 1978 సంస్కరణల ప్రారంభం తరువాత తిరుగులేకుండా సాగింది. అదే అమెరికాలో 1978 తరువాత ఐదు సంవత్సరాలు తరుగుదల వుంది. వీటిని మొత్తంగా చూసినపుడు అభివృద్ధిరేటులో కొద్ది హెచ్చు తగ్గులు వుండవచ్చుగానీ సంస్కరణల తరువాత చైనా ఎలాంటి పెట్టుబడిదారీ సంక్షోభాలను ఎదుర్కోలేదు.

ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ వునికిలోకి వచ్చి కొందరి అవగాహన ప్రకారం ఐదు వందల సంవత్సరాలు దాటింది. అమెరికాలో 1817లో న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ ప్రారంభాన్ని అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్ధ ప్రారంభంగా తీసుకుంటే దానికి రెండువందల సంవత్సరాలు నిండినట్లు. అంత అనుభవం వున్న అమెరికాను, సంస్కరణలు ప్రారంభించిన 50సంవత్సరాల నాటికి జిడిపిలో చైనా అధిగమించగలదని అంచనా వేస్తున్నారు. అయితే జనాభా రీత్యా తలసరి ఆదాయంలో మరికొన్ని దశాబ్దాల పాటు అమెరికాయే అగ్రస్ధానంలో కొనసాగుతుంది. రెండు వందల సంవత్సరాల సుదీర్ఘపెట్టుబడిదారీ విధాన అనుభం తరువాత కూడా ఇంకా అమెరికాలో స్వంత ఇల్లులేని వారు, అద్దె భరించలేక కారుల్లో కాపురాలు చేసే వారున్నారంటే, 140 కోట్ల జనాభా వున్న చైనాలో జనానికి కనీస ప్రాధమిక వసతులు కల్పించటానికి ఎంత వ్యవధి కావాలో చెప్పనవసరం లేదు. కొందరు చెబుతున్నట్లు చైనాలో నిజంగా పెట్టుబడిదారీ విధానమే అమలు జరిపితే ఆ వ్యవస్ధకు సహజంగా వుండే జబ్బులన్నీ రావాలి, రావటం లేదు. సంక్షోభాలు లేకుండా శరవేగంగా అభివృద్ధి చెందటం పెట్టుబడిదారీ వ్యవస్ధ లక్షణం కాదు. అయితే చైనాలో పెట్టుబడిదారీ విధాన లక్షణాలు లేవా అంటే వున్నాయి.స్టాక్‌ ఎక్సేంజ్‌, ప్రయివేటు పెట్టుబడులు, లాభాలు తీసుకోవటం, ప్రయివేటు కంపెనీలను విస్తరించుకోవటం, బిలియనీర్ల పెరుగుదల వంటివి దాని లక్షణాలే. బలమైన పెట్టుబడిదారులు పెరిగిన తరువాత వారు సోషలిస్టు వ్యవస్దను అనుమతిస్తారా అని కొంత మంది వ్యక్తం చేస్తున్న సందేహాలను తీర్చటం అంతసులభమూ కాదు. తమ జనాభా అవసరాలు తీరాలంటే కొంతకాలం ఆ విధమైన విధానాలు తప్పవని చైనా కమ్యూనిస్టు పార్టీ చెబుతోంది. అధికారికంగానే అది ఒకే దేశం-రెండు వ్యవస్ధల విధానాన్ని 2050వరకు అనుమతిస్తామని ఎన్నడో చెప్పింది. సోషలిజం అంటే దారిద్య్రాన్ని పంచుకోవటం కాదు. పెట్టుబడిదారులను ఆహ్వానించటం, అనుమతించే వైఖరి మీద సందేహాలు కొత్తగా తలెత్తినవి కాదు. నాలుగు దశాబ్దాల నాడే వాటి గురించి చైనా నాయకత్వం చెప్పింది. గాలి కోసం కిటికీలు తెరిచినపుడు చెడుగాలితో పాటు, క్రిమి కీటకాలూ ప్రవేశిస్తాయని తెలుసు, వాటిని ఎలా అదుపు చేయాలో కూడా తమ గమనంలో వున్నదని చెప్పారు. ఈ నేపధ్యంలో అక్కడ అనుసరించిన విధానాలు ఎలా అద్భుతాలను సృష్టించాయో చూద్దాం.

Related image

1980లో చైనా జిడిపి 305బిలియన్‌ డాలర్లు కాగా 2017నాటికి 12.7ట్రిలియన్‌లకు పెరిగింది.(ఒక ట్రిలియన్‌ లక్ష కోట్లు) నాడు కేవలం 21 బిలియన్‌ డాలర్ల విలువగల వుత్పత్తులను ఎగుమతి చేసిన చైనా 2017నాటికి 2.49లక్షల కోట్ల డాలర్లతో ప్రపంచంలోనే అతి పెద్ద ఎగుమతిదారుగా తయారైంది.1980-2016 మధ్య సగటు అభివృద్ధి రేటు 10.2శాతం.1980లో చైనాకు వచ్చిన విదేశీ పెట్టుబడులు దాదాపు లేవు, 2017లో 168 బిలియన్‌ డాలర్లు వచ్చాయి, 2016నాటికి ప్రపంచంలోని వివిధ దేశాలలో చైనా పెట్టుబడులు 216 బిలియన్‌ డాలర్లున్నాయి. ఈ కాలంలో చైనీయుల సగటు జీవిత కాలం 66 నుంచి 76 సంవత్సరాలకు పెరిగింది.22శాతంగా వున్న నిరక్షరాస్యులు 3.2శాతానికి తగ్గారు. చైనా కుటుంబాల వినియోగం 49 బిలియన్‌ డాలర్ల నుంచి 90రెట్లు పెరిగి 2016నాటికి 4.4లక్షల కోట్లకు చేరింది.

సిఐఏ వెల్లడించిన వివరాల ప్రకారం 2017లో చైనా 2.16లక్షల కోట్ల డాలర్ల విలువగల వస్తువులను ఎగుమతి చేస్తే మనం 299.3బిలియన్‌ డాలర్ల దగ్గర వున్నాం.2016లో మనం 1.15లక్షల కోట్ల యూనిట్ల విద్యుత్‌ వుత్పత్తి చేస్తే చైనాలో అది 6.14లక్షల కోట్ల యూనిట్లు. అంతర్జాతీయ ఆటోమొబైల్‌ సంస్ధ తెలిపిన వివరాల ప్రకారం 2016లో చైనా 244లక్షల కార్లు, 36లక్షల వాణిజ్య వాహనాలను తయారు చేస్తే మనం 36లక్షల కార్లు, 8.1లక్షల వాణిజ్య వాహనాలను వుత్పత్తి చేశాము. బ్రిక్స్‌ దేశాలలోని వంద అగ్రశ్రేణి కంపెనీలలో చైనాకు చెందినవి 87శాతం ఆదాయం, 85శాతం లాభాలను కలిగి వుండగా మనవి 4,3శాతాలుగా వున్నాయి. రైలు మార్గాల విషయంలో మనకూ చైనాకూ పెద్ద తేడా లేదు. అయితే అక్కడ 22వేల కిలోమీటర్ల హైస్పీడ్‌ రైలు మార్గం వుండగా మన దగ్గర అలాంటిది లేదు. పరిశోధన, అభివృద్దికి జిడిపిలో చైనా 2.1శాతం ఖర్చు చేస్తుండగా మన దగ్గర ఒకశాతానికిలోపుగానే వుంది.2016లో చైనాలో పదిలక్షల 34వేల పేటెంట్లకు దరఖాస్తు చేశారు. ప్రపంచం మొత్తం మీద ఇవి 42శాతం. మన దేశంలో దాఖలైనవి 45,057 మాత్రమే. మన దేశంలో రోజుకు 24కిలోమీటర్ల గ్రామీణ రహదారులను నిర్మిస్తుండగా చైనాలో 1994-2000 మధ్య రోజుకు 1,200 కిలోమీటర్లునిర్మించారు.

ఇవన్నీ సానుకూల అంశాలైతే సమాజంలో ఆర్ధిక అసమానతలు పెరగటం ప్రతికూల అంశం.సంస్కరణల ప్రారంభంలో జాతీయ సంపదలో జనాభాలో ఒకశాతంగా వున్న ధనికుల చేతిలో 6.4శాతంగా వున్న దేశ సంపద 2015లో 13.9శాతానికి పెరిగింది. ఏ దేశంలోనూ లేని విధంగా 620 మంది బిలియనీర్లు వున్నారు. పేదలలోని 50శాతం మంది చేతిలో వున్న 26.7శాతం సంపద 14.8శాతానికి తగ్గిపోయింది. దేశంలో కొన్ని ప్రాంతాలు బాగా అభివృద్ది చెందగా మరికొన్ని దూరంగా వున్నాయి. పట్టణ, గ్రామీణుల మధ్య వ్యత్యాసాలు కూడా వున్నాయి. నలభై సంవత్సరాలలో చైనా జనాభా 96 నుంచి 139 కోట్లకు పెరిగింది. అభివృద్ది క్రమంలో చైనా ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలలో పట్టణీకరణ ఒకటి. పట్టణ ప్రాంతాలలో ఆదాయం, సౌకర్యాలు మెరుగ్గా వుండటంతో సహజంగానే యువతీ యువకులు పట్టణ ప్రాంతాలవైపు మొగ్గుచూపుతారు.

Image result for Forty years China Reforms

గత నాలుగు దశాబ్దాలలో 17.9శాతంగా వున్న చైనా పట్టణ జనాభా 58.5శాతానికి పెరిగింది. సంఖ్య రీత్యా 17 కోట్ల నుంచి 81 కోట్లకు పెరిగింది. అక్కడ జరుగుతున్న అభివృద్దికి అనుగుణ్యంగా 1980లో 54.5లక్షల మంది పట్టణాలకు వలస వెళ్లగా 1990నాటికి 65.5లక్షలకు, 1995 నుంచి ఏటా రెండు కోట్ల మందికి చేరింది. ఇటువంటి మార్పు ప్రపంచంలో మరే దేశంలోనూ జరగలేదు. గ్రామాల నుంచి రోజూ పట్టణాలకు వచ్చిపోయే వారి సంఖ్య కూడా ఎక్కువే.2025 నాటికి పట్టణ జనాభా వంద కోట్లకు చేరుతుందని అంచనా. అందువలన చైనా ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ ఇంకా సాధించాల్సింది ఎంతో వుంది. ఈ కారణంగానే తమది ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే చైనా నాయకత్వం చెబుతోంది. సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణంతో పాటు అధిగమించాల్సిన సమస్యలు కూడా చైనా తరహాలోనే వున్నాయని వేరే చెప్పనవసరం లేవు. వెనుకబడిన ఆఫ్రికా ఖండంలోనూ, అభివృద్ధి చెందిన అమెరికా ఖండంలోనూ కార్మికవర్గం వున్నప్పటికీ సమస్యల తీరుతెన్నులు ఒకే విధంగా వుండవు. ఒకే విధమైన సోషలిస్టు నిర్మాణం కుదరదు. ప్రతి దేశానికి విప్లవం దాని తరహాలోనే వస్తుందన్నది శాస్త్రీయ మార్క్సిస్టు సూత్రం. అందువలన సోషలిస్టు సమాజ నిర్మాణ లక్షణాలు కూడా ప్రత్యేకంగానే వుంటాయి. అమెరికా 69 ఏండ్లలో సాధించినదానిని చైనా 18 సంవత్సరాల్లోనే అధిగమించింది.రెండు చోట్లా వున్నది పెట్టుబడిదారీ విధానమే అయితే అంత తేడా ఎందుకున్నట్లు ? భారత్‌ ఎందుకు విఫలమైనట్లు ? అధ్యయనం చేయాల్సిన అవసరం లేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాలుగు దశాబ్దాల చైనా సంస్కరణలు 1 : దారిద్య్ర నిర్మూలనలో అసాధారణ ప్రగతి !

22 Saturday Dec 2018

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

china reforms, four decades of china reforms, poverty reduction

Image result for four decades of china reforms

ఎం కోటేశ్వరరావు

ఏమి చెయ్యాలో చెయ్య కూడదో చైనాను నిర్దేశించే స్ధితిలో ఎవరూ లేరు, మా బాటలో మేము ప్రయాణిస్తాం ! ఇదీ తమ సంస్కరణల నలభయ్యవ వార్షికోత్సవాన్ని ప్రారంభించిన చైనా అధ్యక్షుడు గ్జీ గింగ్‌పింగ్‌ డిసెంబరు 18న ప్రపంచానికి స్పష్టం చేసిన అంశం. చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు పధానికి మరియు సోషలిజానికి, దాని అభివృద్ధికి కట్టుబడి వుంటూ ముందుకు పోతామని ప్రపంచానికి తెలిపారు. సంస్కరణల పట్ల ప్రజల విశ్వాసాన్ని, సంస్కరణలను పెంచుతామని కూడా చెప్పారు. చైనీయులు మాట్లాడేది తక్కువ ఆచరించేది ఎక్కువ అని ఇప్పటికే నిరూపించుకున్నారు. సంస్కరణల విషయాన్ని గతంలో కూడా పదే పదే స్పష్టం చేశారు గనుక పునశ్చరణ అవసరం లేదు. మావో మరణానంతరం బాధ్యతలు స్వీకరించిన డెంగ్‌ సియావో పింగ్‌ నాయకత్వంలోని పార్టీ ఎన్నో తర్జన భర్జనలు పడిన తరువాత ఎంతో ముందు చూపుతో, ఆత్మ విశ్వాసంతో ప్రారంభించిన సంస్కరణలు చైనాలో అద్భుతాలను ఆవిష్కరించాయంటే అతిశయోక్తి కాదు.

సోషలిస్టు వ్యవస్ధలను ఫలానా విధంగా నిర్మించాలనే ఒక నమూనా లేదు. అన్ని దేశాలలో ఒకే విధంగా నిర్మించటమూ సాధ్యం కాదన్నది స్పష్టం. తమ దేశ లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం చేస్తున్నామని చైనా కమ్యూనిస్టుపార్టీ ప్రకటించింది.చైనాలో నిర్మాణం చేస్తున్నది సోషలిస్టు వ్యవస్ధ కాదని, ప్రభుత్వ రంగంలోని పెట్టుబడిదారీ వ్యవస్ధ్ద అని మరొకటని కొందరు వర్ణించవచ్చు.వారికా స్వేచ్చ వుంది. చిత్రం ఏమిటంటే ఒకవైపు కమ్యూనిస్టులుగా చెప్పుకొనే వారు అక్కడ వున్నది సోషలిస్టు వ్యవస్ధ కాదని తిరస్కరిస్తుంటే, మరోవైపు అసలు సిసలు పెట్టుబడిదారీ విధానం కాదంటూ పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద దేశాలు చైనాను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. చైనా తరహా సోషలిస్టు విధానంలో కనిపించిన తప్పులు ఒప్పులతో చర్చించటం, మెరుగుపడేందుకు తోడ్పడటం ఒక ఎత్తు. అలాగాక ఏ పేరుతో వ్యతిరేకించినా అది సామ్రాజ్యవాదులు, సోషలిస్టు వ్యతిరేకులకే ప్రయోజనం. ఈ పూర్వరంగంలో గత నాలుగు దశాబ్దాలలో చైనా సాధించిన అభివృద్ధిని, అది ఎలా సాధ్యమైందో ఒకసారి సింహావలోకనం చేసుకోవటం అవసరం.

చైనా సమాజ మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా దేశ ఆర్ధిక వ్యవస్ధను మరింతగా విదేశాలకు తెరవాలని అమెరికా నాయకత్వంలోని ధనిక దేశాలు ఒకవైపుకు లాగుతున్నాయి. దేశ ఆర్ధిక వ్యవస్ధ, సమాజంలోని అన్ని అంశాల మీద మ్యూనిస్టు పార్టీ అదుపులో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం చేయాలని గ్జీ జింగ్‌పింగ్‌ నాయకత్వంలోని కమ్యూనిస్టు పార్టీ మరోవైపు ప్రయత్నిస్తున్నది. ఈ పరిస్ధితిలో చైనా ఎటు ప్రయాణిస్తుంది అన్నది సహజంగానే కమ్యూనిస్టుల్లో, వ్యతిరేకుల్లో కూడా ఆసక్తి కలిగించే అంశమే. డెంగ్‌సియావో పింగ్‌ చెప్పినట్లుగా పిల్లి నల్లదా తెల్లదా అని కాదు, ఎలుకలను పట్టగలిగినంత వరకు అది ఏ రంగుదైనా ఫర్లేదు. చైనాతో పాటు భారత్‌తో సహా అనేక దేశాలు సంస్కరణల పేరుతో తమ మార్కెట్లను విదేశీకార్పొరేట్లకు తెరిచాయి. వాటిలో ప్రజాస్వామ్యం, నియంతల పాలనలో వున్నవీ వున్నాయి కానీ సోషలిస్టు చైనా మాదిరి అభివృద్ధి చెందలేదు. పెత్తందారీ అమెరికా, ఇతర సామ్రాజ్యవాద దేశాలను సవాలు చేసే స్ధితిలో లేవు. ప్రపంచంలో అత్యధిక జనాభాతో, అత్యంత వెనుకబడిన దేశంగా వున్న చైనాలో ప్రస్తుతం వున్నది సోషలిజమా-పెట్టుబడిదారీ విధానమా అనే మీమాంసలో కూరుకుపోతే ప్రధాన అంశాన్ని మరచిపోయినట్లే. అసలు సమస్య చైనా జనానికి తిండిపెట్టటం, దానికి ఏది పని చేస్తుంది అన్నది ముఖ్యం. ఈ పూర్వరంగంలో చైనాలో వున్న ప్రత్యేక పరిస్ధితులను గమనంలో వుంచుకొని అక్కడి పార్టీ నాయకత్వం తనదైన మార్గాన్ని ఎంచుకుంది. ఇంకా సమస్యలున్నప్పటికీ ఆకలి దారిద్య్రాల నుంచి జనాన్ని బయటపడవేసింది. తానేమిటో ప్రపంచానికి చాటింది. చైనా వ్యవస్ధ కూలిపోతుందని అనేక మంది పశ్చిమ దేశాల పండితులు ఇప్పటికి ఎన్నో జోశ్యాలు చెప్పారు. తమ వ్యవస్ధలు ఎదుర్కొన్న సంక్షోభాలను వారు పసిగట్ట లేకపోయారు, లేదా తెలిసినా మూసిపెట్టారు. సంక్షోభాలను నివారించలేకపోయారు. ప్రపంచీకరణలో భాగంగా లాటిన్‌ అమెరికాలోని అనేక దేశాలు ఎగుమతి ఆధారిత ఆర్ధిక వ్యవస్దలుగా మారిపోయి అప్పులపాలై దివాలా తీసి, తీవ్ర సామాజిక, ఆర్ధిక సమస్యలను ఎదుర్కొనటం మన కళ్ల ముందే చూశాము. ఇతర దేశాల మీద ఆధారపడిన ఎగుమతి ఆర్ధిక విధానాన్ని చైనా ప్రధానంగా అనుసరించినప్పటికీ గత నలభై సంవత్సరాలలో లాటిన్‌ అమెరికా లేదా ఇతర పెట్టుబడిదారీ దేశాల మాదిరి సమస్యలను ఎదుర్కోలేదు. అనేక ముందు జాగ్రత్తలను తీసుకొని వ్యవహరించిన కారణంగా కొన్ని సంవత్సరాలలో అభివృద్ధి రేటు తగ్గినా మొత్తం మీద రెండంకెల ప్రగతిని సాధించింది. మరే దేశంలోనూ ఈ తీరు కనిపించదు. చైనా అనుసరిస్తున్నది ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం అని వర్ణించే వారు సైతం ప్రభుత్వేతర పెట్టుబడిదారీ విధానం కంటే ఇదే మెరుగైనదని, మిగతా విధానాలు వైఫల్యం చెందాయని అంగీకరించకతప్పదు. ఒక దేశం అనుసరిస్తున్నది పెట్టుబడిదారీ విధానమా దానికి భిన్నమైనదా అనేందుకు కొలబద్ద పౌరుల జీవన పరిస్ధితుల మెరుగుదల మాత్రమే.

Image result for four decades of china reforms

చైనా అధ్యక్షుడు గ్జీ గింగ్‌పింగ్‌

దారిద్య్రనిర్మూలన పెట్టుబడిదారీ విధానానికి ఒక నినాదం మాత్రమే. దానికి భిన్నమైన విధానాలకు ఒక బృహత్తర కార్యక్రమం, సవాలు. దానికి చక్కటి వుదాహరణలు భారత్‌, చైనాలే. 1971లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇందిరా గాంధీ గరీబీ హఠావో పేరుతో పేదరిక నిర్మూలన నినాదమిచ్చి ఘనవిజయం సాధించారు. చైనా విషయానికి వస్తే అలాంటి నినాదాలేమీ ప్రత్యేకంగా ఇవ్వలేదు గానీ 1978లో విదేశీ కార్పొరేట్లకు తన మార్కెట్‌ను తెరుస్తూ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. వాటిలో దారిద్య్ర నిర్మూలన లక్ష్యం కూడా ఒకటి. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ వంటి సంస్ధలన్నీ చెప్పినదాని ప్రకారం గత నాలుగు దశాబ్దాలలో 70 నుంచి 80 కోట్ల మందికి( జనాభాలో 90శాతం నుంచి రెండుశాతానికి) దారిద్య్రం నుంచి విముక్తి కలిగించింది. 2030నాటికి ప్రపంచ వ్యాపితంగా దారిద్య్రనిర్మూలన సాధించాలన్న ఐక్యరాజ్యసమితి సహస్రాబ్ది లక్ష్యాలకు అనుగుణ్యంగా పని చేయటాన్ని చూస్తే పది సంవత్సరాల ముందే నూటికి నూరుశాతం మందిని దారిద్య్రరేఖకు ఎగువకు చేర్చాలని ప్రయత్నిస్తున్నది. చైనా జాతీయ గణాంక సంస్ధ తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం 1978-2017 మధ్య 74కోట్ల మందిని దారిద్య్రం నుంచి బయటకు తెచ్చింది. సరాసరి ఏటా కోటీ 90లక్షల మందికి విముక్తి కలిగించింది.తాజాగా విడుదల చేసిన మార్గదర్శక సూత్రాల ప్రకారం ఆహారం, దుస్తులు, విధిగా పిల్లలకు తొమ్మిది సంవత్సరాల విద్య, మౌలిక వైద్య, గృహవసతి కల్పించాల్సి వుంది. దీనికి అనుగుణంగా 2020 నాటికి మిగిలిన వారికి ఆ వసతులు కల్పించేందుకు వచ్చే ఏడాది 13బిలియన్‌ డాలర్ల మేర ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఒక వ్యక్తికి వార్షికాదాయం 2,300 యువాన్లు లేదా 337 డాలర్ల కంటే తక్కువ లభిస్తే దారిద్య్రంలో వున్నట్లు లెక్క. ప్రపంచబ్యాంకు తాజాగా ప్రకటించినదాని ప్రకారం రోజుకు 1.9డాలర్ల కంటే తక్కువ వచ్చే వారు దారిద్య్రంలో వున్నట్లు లెక్క. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమ(యుఎన్‌డిపి) సంస్ధ బహుఅంశాల దారిద్య్ర సూచిక (ఎంపిఐ-మల్టీ డైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌) 2018 ప్రకారం 2015-16 సర్వే ప్రకారం భారత్‌ సూచిక 0.121, జనాభాలో 27.51శాతం మంది దారిద్య్రంలో వున్నారు. అదే చైనాలో 2014 సర్వే ప్రకారం సూచిక 0.017గానూ, 4.11శాతం మంది దారిద్య్రంలో వున్నారు. ఈ లెక్కన త్వరలో నూటికి నూరుశాతం మంది చైనాలో దారిద్య్రం నుంచి బయటపడనుండగా మన దేశం 2030లక్ష్యాన్ని చేరుకోగలదా అన్నది సమస్య. అందువలన ఏ విధంగా చూసినా చైనా మనకంటే ఎంతో ముందుంది. చైనా సమాజంలో ఆర్ధిక అసమానతలు వున్నాయని ప్రభుత్వమే స్వయంగా చెబుతోంది. మొత్తంగా అసమానతలతో పాటు గ్రామీణ- పట్టణ అసమానలు ఒక సమస్య. పట్టణ పేదరిక సమస్య దాదాపు పూర్తిగా నిర్మూలన అయింది. గ్రామాలు, బాగా వెనుకబడిన ప్రాంతాలలో మిగిలి వున్న ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కేంద్రీకరణ చేపట్టింది.

Image result for four decades of china reforms

డెంగ్‌సియావో పింగ్‌

అభివృద్ధిలో పోటీపడి ఏ దేశమైనా తన పౌరుల జీవన పరిస్ధితులను మెరుగుపరిస్తే అంతకంటే కావాల్సింది ఏముంది. గత కొద్ది సంవత్సరాలుగా త్వరలో చైనాను అధిగమించి భారత్‌ పురోగమించనుందని అనేక మంది చెబుతున్నారు. రెండు దేశాలను పోల్చి కొన్ని అంకెలను కూడా చెబుతున్నారు. విమర్శనాత్మకంగా పరిశీలించి భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసిన వారిని జాతివ్యతిరేకులుగా వర్ణించే ప్రమాదకర పోకడలు పెరుగుతున్నాయి. 2018 మార్చినాటికి భారత జిడిపి 2.6లక్షల కోట్లుగానూ, 2023 మార్చినాటికి నాలుగు లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతుందని నీతిఅయోగ్‌ తాజా అంచనాలో తెలిపింది. అభివృద్ధి రేటు ఎనిమిది నుంచి పదిశాతం మధ్య వుంటుందనే అంచనాతో ఈ జోస్యం చెప్పారు. ప్రస్తుతం 14లక్షల కోట్ల డాలర్లుగా వున్న చైనా జిడిపి 2023నాటికి 21.5లక్షల కోట్లకు పెరుగుతుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. ఒక వేళ చైనా అభివృద్ది పూర్తిగా ఆగిపోతుందని అనుకుంటే ఇప్పుడున్న చైనా స్ధాయికి చేరాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో. 2.6లక్షల కోట్ల నుంచి నాలుగు లక్షలకోట్లకు ఐదు సంవత్సరాలు పడితే ఊఏటా పదిశాతం అభివృద్ది రేటు వుంటే గింటే 2034 నాటికి గాని మనం చైనా స్ధాయికి చేరుకోలేమన్నది అంచనా. అందువలన ప్రస్తుత విధానాలతో త్వరలోనే మనం చైనాను అధిగమించుతామని చెప్పటం అంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదటమే. మన ఆర్ధికవేత్తలు, ఇతరులు చెబుతున్నట్లు మన దేశం ఏటా 7.5శాతం అభివృద్ధి సాధిస్తే మన ఆర్ధిక వ్యవస్ధ 0.195లక్షల డాలర్ల మేర పెరుగుతుంది. అదే చైనా 6.9శాతం వున్నా 0.86లక్షల కోట్లు పెరుగుతుంది. 2018 ప్రపంచ ఆర్ధిక వేదిక సంఘటిత అభివృద్ధి సూచిక ప్రకారం మన దేశంలో ప్రతి పదిమందిలో ఆరుగురు రోజుకు 3.20 డాలర్ల కంటే తక్కువ ఆదాయంతో వున్నారు. చైనాలో అది ప్రతి పది మందికి 1.2 మంది మాత్రమే అలా వున్నారు. సంఘటిత అభివృద్ధి పధంలో వున్నాయని ఆ సంస్ధ ఎంపిక చేసిన 74 దేశాలలో చైనా 26వదిగా వుండగా మన దేశం 62వ స్ధానంలో వుంది. చైనా సాధించిన విజయాల గురించి కమ్యూనిస్టు, చైనా వ్యతిరేకులు పెదవి విరుస్తుంటారు. చెబుతున్న అభివృద్ధికి రుజువుల్లేవంటారు, మేం నమ్మం అంటారు. ఎయిడ్స్‌ వైరస్‌కు చికిత్సలేదు. మాకు నమ్మకం లేదు అనేది కూడా అలాంటి చికిత్సలేని వ్యాధే. అలాంటి వారిని ఒప్పిందచేందుకు పూనుకోవటం వృధా ప్రయాసే. ఎయిడ్స్‌ రోగుల మాదిరి సానుభూతి చూపాల్సిందే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాపై అమెరికా టెక్‌ వార్‌లో భారత్‌ ఎటువైపు !

19 Wednesday Dec 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

5G, Huawei, us china tech war, US-CHINA TRADE WAR

Image result for  us china tech war

ఎం కోటేశ్వరరావు

మూడు నెలలపాటు వాణిజ్య యుద్ధ దాడులకు విరామం ఇద్దామని అమెరికా-చైనా నిర్ణయించాయి. ఇంతలోనే అమెరికా మరో యుద్దానికి తెరలేపింది. అదే టెక్నాలజీ యుద్ధం. చైనాలోని ప్రముఖ హైటెక్‌ సెల్‌ఫోన్ల తయారీ కంపెనీ హువెయి యజమాని కుమార్తె, కంపెనీ సిఎఫ్‌ఓ మెంగ్‌ వాన్‌జౌ అరెస్టు దానికి నాంది అని కొందరంటుంటే పర్యవసానాలపై గత ఇరవై రోజులుగా అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. ఎలాంటి కారణాలు చూపకుండా అమెరికా వినతి మేరకు కెనడాలో అరెస్టు చేసిన మెంగ్‌ను కోర్టుకు హాజరుపరిచారు. తమను రెచ్చగొట్టే ట్రంప్‌ సర్కార్‌ చర్యమీద చైనా ఇప్పటి వరకు ఎంతో సంయమనంతో వ్యవహరించింది. మెంగ్‌ అరెస్టు అయిన నాటి నుంచి తన కనుసన్నలలో వ్యవహరించే దేశాల మీద అమెరికా వత్తిడి తెస్తోంది. హువెయి కంపెనీ పరికరాలు, ఫోన్లు కొనవద్దని కోరుతోంది. దానిలో భారత్‌ కూడా ఒకటి. ఈ వ్యవహారం నరేంద్రమోడీ సర్కార్‌కు కత్తిమీద సాములా మారింది. ఇప్పటికే చైనాతో వాణిజ్యలోటు కొండలా పెరిగిపోతోంది.మన వస్తువులను మరింతగా కొనుగోలు చేయాలంటూ చైనాతో సర్కారు సంప్రదింపులు జరుపుతోంది. ఆవు పేడను తయారు చేయటం తప్ప మోడీ మేకిన్‌ ఇండియా పధకం ముందుకు సాగటం లేదు. అమెరికా ఆదేశాల మేరకు హువెయి కంపెనీ వుత్పత్తుల కొనుగోలు నిలివి పేస్తే మరొక అగ్రదేశం తయారు చేసే ఐదవ తరం పరికరాల కోసం ఎదురు చూడటం తప్ప మనకు మరొక మార్గం లేదు. అదే చేస్తే చైనాకు ఇప్పుడు మనం చేస్తున్న ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

ఈ చర్య కారణంగా మరింతగా స్వదేశీయ పరిజ్ఞానం మీద ఆధారపడాలనే కసితో చైనా వ్యవహరించకూడదు అని హాంకాంగ్‌ నుంచి వెలువడే కమ్యూనిస్టు వ్యతిరేక పత్రిక సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు తాజాగా ఒక కథనాన్ని ప్రచురించింది. చైనాకు ఎదురైన చేదు అనుభవాలంటూ కొన్ని అంశాలను పేర్కొని టెక్నో జాతీయవాదం తెలివితక్కువ తనమని, వాణిజ్యదారులను మూసివేస్తుందని, భద్రతను బలహీనపరుస్తుందని వ్యాఖ్యానించింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మెంగ్‌ అరెస్టుపై నోరు మూసుకొని గత నాలుగు దశాబ్దాలుగా మార్కెట్‌ను తెరిచినట్లుగానే రాబోయే రోజుల్లో కూడా వ్యవహరించకపోతే ఇప్పటి వరకు సాధించిన ప్రగతి దెబ్బతింటుందని పరోక్షంగా బెదిరించిందని చెప్పవచ్చు. ప్రపంచ కార్పొరేట్ల ప్రతినిధి అయిన మీడియా సంస్ధ నుంచి ఇలాంటివి వెలువడటంలో ఆశ్చర్యం లేదు.

డిసెంబరు ఒకటవ తేదీన కెనడాలోని వాంకోవర్‌లో మెంగ్‌ ఒక విమానం నుంచి మరో విమానంలోకి మారుతున్న సమయంలో కెనడా పోలీసులు ఎలాంటి కారణాలు చూపకుండా అమెరికా వినతి మేరకు అరెస్టు చేస్తున్నట్లు చెప్పారు. ఈ చర్య ఆమె మానవ హక్కులను హరించటమే అని చైనా పేర్కొనగా, ఆ చర్య కిడ్నాపింగ్‌ తప్ప మరొకటి కాదని చైనా మీడియా వర్ణించింది. అరెస్టులో తమ సర్కార్‌ ప్రమేయం లేదని కొద్ది రోజుల ముందే నోటీసు ఇచ్చామని కెనడా ప్రధాని ట్రడేవ్‌ ఆరు రోజుల తరువాత ప్రకటించారు. కొద్ది నెలల ముందే అరెస్టు వారంటు జారీ చేసినట్లు అమెరికా చెప్పింది. అమెరికా ఆంక్షలను వుల్లంఘిస్తూ ఇరాన్‌తో వ్యాపారం చేసేందుకు హువెయి కంపెనీ స్కైకామ్‌ అనే హాంకాంగ్‌ సంస్ధను అనధికార అనుబంధ సంస్ధగా వుపయోగించుకొని ద్య్రవ్య సంస్ధలను మోసం చేసేందుకు కుట్రపన్నిందని, తమ దేశ భద్రతకు ముప్పు కలిగించేవిగా దాని చర్యలున్నాయని బెయిలు విచారణ సమయంలో అమెరికా చేసిన ఆరోపణలను కెనడా సర్కార్‌ వల్లించింది.అరెస్టయిన పదకొండవ రోజున వాంకోవర్‌లోని ఆమె ఇంటి నుంచి బయటకు పోకుండా షరతులతో కూడిన బెయిలు మంజూరు చేశారు. ఇదే సమయంలో ఇద్దరు కెనడియన్లను భద్రతా కారణాలతో అరెస్టుచేసినట్లు చైనా అధికారులు ప్రకటించారు. అరెస్టు చేసిన మెంగ్‌ను తమకు అప్పగించాలని అమెరికా కోరింది. ఈ కేసులో 30సంవత్సరాల శిక్షపడే అవకాశం వుంది. అదే జరిగితే అమెరికా-చైనా సంబంధాలు ఏ మలుపులు తిరుగుతాయో చెప్పలేము.

ఇటీవలి కాలంలో హైటెక్‌ వుత్పత్తులలో ఇతర దేశాలకు చైనా కంపెనీలు పోటీ ఇస్తున్నాయి. మనందరికీ తెలిసిన శాంసంగ్‌ కంపెనీ సెల్‌ఫోన్లు, టెలికమ్యూనికేషన్ల పరికరాల తయారీలో మొదటి స్ధానంలో వుండగా చైనా హువెయి కంపెనీ రెండవ స్ధానానికి ఎదిగింది. ఇప్పుడు అది 5జి సాంకేతిక రంగంలో ముందున్నదని, ఒకటవ స్ధానానికి ఎదగ నుందని వార్తలు వచ్చాయి. వ్యాపారంలో తలెత్తిన పోటీయే కంపెనీ సిఎఫ్‌ఓ అరెస్టుకు అసలు కారణమని చెబుతున్నారు. చైనాపై వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించిన ట్రంప్‌ చైనా కంపెనీల పరికరాలు తమ దేశ భద్రతకు ముప్పుగా పరిణమించాయని ఆరోపించిన విషయం తెలిసిందే. దానిలో భాగంగానే అమెరికా పౌరులు హువెయి కంపెనీ సెల్‌ఫోన్లు, సంస్ధలు పరికరాలను వాడవద్దనే నిషేధాలను విధించారు. అమెరికా కనుసన్నలలో కెనడా, బ్రిటన్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా కూడా నిషేధం విధించాయి.ఈ ఐదు దేశాలకు చెందిన గూఢచార సంస్ధలు ‘ఫైవ్‌ ఐస్‌’ (ఐదు నేత్రాలు) పేరుతో చైనా కంపెనీ పరికరాలలో రహస్య పరికరాలు వున్నట్లు నివేదికలను రూపొందించాయి. జూలై 17న ఐదుగురు గూఢచార అధిపతులతో కెనడా ప్రధాని కెనడాలోని అట్టావాలో ఒక రహస్య సమావేశం నిర్వహించారు. దీనిలో సిఐఏ డైరెక్టర్‌ గినా హాస్పెల్‌, బ్రిటన్‌ ఎం16 అధిపతి మైఖేల్‌ యంగర్‌ పాల్గన్నారు. ఈ సమావేశం గురించి ఆస్ట్రేలియా పత్రిక సిడ్నీ మోర్నింగ్‌ హెరాల్డ్‌ దీన్నొక సాదాసీదా సమావేశంగా వార్తను ప్రచురించింది. ఆ తరువాతే చైనా, రష్యాల మీద పెద్ద ఎత్తున ప్రచార దాడిని ప్రారంభించారు. హువెయి కంపెనీ పరికరాలను కొన వద్దనే ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. కంపెనీ అధికారిణి అరెస్టు దానికొనసాగింపు.జపాన్‌ ప్రభుత్వం, మూడు టెలికాం కంపెనీలు కూడా హువెయి పరికరాల కొనుగోలు నిలిపివేసినట్లు ప్రకటించాయి.

Image result for us china tech war cartoons

ప్రపంచంలో అన్ని దేశాలలో గూఢచర్యం జరిపే అమెరికాకు ఇప్పుడు తన నీడను చూస్తే తానే భయపడుతున్నట్లుగా వుంది. తమ అధ్యక్ష ఎన్నికలలో రష్యా జోక్యం చేసుకున్నదన్న ఆరోపణలు దానిలో భాగమే. గొర్రెల గోత్రాలు కాపరులకే ఎరుక అన్నట్లుగా ఆధునిక పరికరాలతో గూఢచర్యం ఎలా జరపవచ్చో అమెరికాకు వేరొకరు చెప్పనవసరం లేదు. అవే అస్త్రాలతను తమ మీద కూడా ప్రయోగిస్తున్నారని అది కంగారు పడుతోంది. ఈ రోజు ప్రతి దేశం తన అవసరాల కోసం, ఇతరుల కుట్రల గురించి జాగ్రత్తలు తీసుకొనేందుకు గూఢచర్యం జరపటం సాధారణ విషయం. దానిలో చైనా, మరొక దేశానికి ఎలాంటి మినహాయింపులు వుండవు. ఇప్పుడు అమెరికాలోని టెలికాం కంపెనీలు ఇబ్బందుల్లో వున్నాయి. స్మార్ట్‌ ఫోన్లను అక్కడ తయారు చేయటం లేదు. చైనా ఫోన్లమీదే అమెరికన్లు ఆధారపడుతున్నారు. ఈ ఏడాది ఆగస్టులో డెలాయిట్‌ కన్సల్టింగ్‌ విడుదల చేసిన ఒక నివేదికలో ఐదవ తరం(5జి) నెట్‌వర్క్‌ ఏర్పాటు పరుగులో అమెరికా మీద చైనా విజయం సాధించనున్నది.అమెరికా వెంటనే రంగంలోకి దిగకపోతే భవిష్యత్‌లో నూతన కంపెనీల ఏర్పాటులో తీవ్ర ప్రతిబంధకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని హెచ్చరించింది. ఈ రంగంలో ముందున్న వారికి వెనుకబడినవారితో పోల్చితే ఎంతో ఆర్ధిక ప్రయోజనం వుంటుందని కూడా వ్యాఖ్యానించింది. ఇంకా అనేక కంపెనీలు ఇలాంటి హెచ్చరికలనే చేశాయి.

రెండుసార్లు సిఐఏ తాత్కాలిక డైరెక్టర్‌గా పని చేసిన మైఖేల్‌ మోరెల్‌ వాషింగ్టన్‌ పోస్టుకు రాసిన వ్యాఖ్యానంలో ఇది వాణిజ్య యుద్దం కాదు, సాంకేతిక యుద్ధం, ఐదవతరం పోటీలో మైలు దూరంలో అమెరికా వెనుకంజలో ఓడిపోతోందని మరింత స్పష్టంగా పేర్కొన్నాడు. అమెరికా అధ్యక్షుడు తరచుగా వాణిజ్య యుద్ధం గురించి చెబుతాడు, నిజానికి అమెరికా సాంకేతికపరమైన ప్రచ్చన్న యుద్దం చేస్తోంది. ఐదవతరం నెట్‌వర్క్‌లతో గతంలో ఎన్నటి కంటే వేగంగా ఎక్కువ సమాచారాన్ని సేకరించవచ్చు, ఈ నెట్‌వర్క్‌ల ద్వారా గూఢచర్యమే కాదు, విద్రోహానికి కూడా పాల్పడవచ్చు, ఈ రంగంలో పై చేయి సాధించిన వారు ఆర్ధికంగా ముందుంటారు, తమ రహస్యాలను పదిలపరుచుకోవటంతో పాటు ఇతరుల వాటిని తెలుసుకోవటంలో ముందుంటారు. వీటన్నింటినీ గమనంలోకి తీసుకున్నపుడు అమెరికా ఆందోళనపడక తప్పదని హెచ్చరించాడు.

ఐదవతరం ఇంటర్నెట్‌ సాంకేతిక పరిజ్ఞానం పరిశోధన, అభివృద్దిలో హువెయి కంపెనీ ఏటా 14బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తూ అమెరికా కంటే ముందున్నది. చైనా మార్కెట్‌ను ఇతర దేశాలకు తెరిచిన సమయంలో అమెరికాకు చెందిన మైక్రోసాప్ట్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌, ఐఫోన్‌ వంటి సంస్దలు తమ పరికరాల ద్వారా పెద్ద ఎత్తున చైనా గూఢచర్యానికి పాల్పడ్డాయి. నిజానికి అమెరికన్లు అన్ని దేశాలలో అలాంటి చర్యలకు పాల్పడ్డారు. జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ఫోన్‌ వర్తమానాలను దొంగిలించారు. చైనా అధ్యక్షుడు ప్రయాణించే బోయింగ్‌ 737 విమానంలో అమర్చిన రహస్య పరికరాన్ని చైనీయులు తొలగించారు. అమెరికా పరికరాలనే వుపయోగించి ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ అమెరికా రహస్య సమాచారాన్నే పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. చైనా తమ పరిజ్ఞానాన్ని తస్కరిస్తున్నదంటూ పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అదే నిజమైతే ఐదవ తరం పరిజ్ఞానంలో అమెరికా ఎందుకు వెనుకబడిపోయినట్లు? చైనాలో పరిశోధనలు చేయకుండా అది ముందుకు ఎలా పోయినట్లు ? నిజానికిది ప్రచార దాడి తప్ప ఒకసారి తస్కరించినట్లు తేలితే ఏ దేశమైనా జాగ్రత్తలు తీసుకోకుండా వుంటుందా ?

Image result for  us china tech war

గతేడాది అక్టోబరులో చైనా కమ్యూనిస్టు పార్టీ 19వ మహాసభ జరిగింది. మేడిన్‌ చైనా 2025 పేరుతో అది కొన్ని లక్ష్యాలను దేశం ముందుంచింది. దాని కొనసాగింపుగానే అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ అనేక చర్యలను చేపట్టారు. అన్ని రంగాలలో సాంకేతిక పరంగా పై చేయి సాధించాలన్నదే ఆ లక్ష్యాల, చర్యల సారాంశం. అది యుద్ధ ప్రాతిపదిక మీద అమలు జరుగుతోందా సాదాసీదాగా జరుగుతోందా అంటే గత నాలుగు దశాబ్దాల చైనా అభివృద్ధిని చూసినపుడు వారు ఏ లక్ష్యాన్ని సాదాసీదాగా అమలు జరపలేదు. నిర్ణీత వ్యవధిలో లక్ష్యాన్ని చేరేందుకు ప్రతి అంశంలోనూ యుద్ధం మాదిరి పని చేశారు. గతంలో సూపర్‌ కంప్యూటర్లంటే అమెరికా తప్ప మరొకపేరు వినపడేది కాదు. గత రెండు దశాబ్దాల్లో పరిస్ధితి మారిపోయింది. టాప్‌ 500 పేరుతో ఒక సంస్ధ రూపొందించిన సమాచారం ప్రకారం ప్రపంచంలోని 500 వేగవంతమైన కంప్యూటర్లలో 206 చైనా వద్ద, 124 అమెరికా వద్ద వున్నాయి. నాలుగు అగ్రశ్రేణి కంప్యూటర్లలో రెండు చైనా వద్ద వున్నాయి, ఇటీవలనే అమెరికా మూడవదానిని రూపొందించి మొదటి స్దానం తిరిగి పొందింది. పోటీలో నువ్వానేనా అన్నట్లుగా అమెరికా-చైనా వున్నాయి. మైక్రోచిప్స్‌ విషయంలో చైనా ఎంతో వెనుకబడి వుంది. అమెరికా పది తయారు చేస్తే చైనాలో ఒకటి మాత్రమే వుత్పత్తి అవుతోంది. 2025నాటికి అమెరికాతో ఢీకొనేందుకు చైనా 30బిలియన్‌ డాలర్లు కేటాయించింది.ప్రపంచమంతా ఇపుడు కృత్రిమ మేధస్సు గురించి మాట్లాడుతోంది. 2030నాటికి ప్రపంచంలో అగ్రస్ధానంలో వుండేందుకు చైనా 150బిలియన్‌ డాలర్లను కేటాయించి పరిశోధనలను ప్రోత్సహిస్తోంది. ఈ పరిజ్ఞానం రెండంచుల పదును కలది అటు మానవ కల్యాణానికి, వినాశకరమైన మిలిటరీ అవసరాలకు రెండింటికీ వినియోగపడుతుంది. ఐదవ తరం టెలికమ్యూనికేషన్స్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటులో అమెరికా ఇంకా ఆలోచనలోనే వుండగా చైనా దూసుకుపోయి కీలకమైన సాంకేతిక ప్రమాణాలను ప్రపంచం ముందుంచింది. మిగతా ప్రపంచం చైనాను అసుసరించటం తప్ప మేం కూడా వచ్చేంతవరకు మీరు ముందుకు పోవటానికి వీల్లేదంటే కుదరదు. క్వాంటమ్‌ కంప్యూటర్‌ తయారీకి ఇప్పుడు అగ్రరాజ్యాలు పోటీపడుతున్నాయి. దానిలో కూడా చైనా వెనుకబడి లేదు. ఇప్పటికే పది బిలియన్‌ డాలర్లతో పని ప్రారంభించింది. అదే అమెరికా రానున్న ఐదు సంవత్సరాలలో 1.25 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఖర్చు చేయనున్నది. ఈ పూర్వరంగంలో అమెరికా దుష్ట స్వభావం గురించి కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్ధికవేత్త జెఫ్రీ శాచస్‌ సిబిసి టీవీతో చెప్పిన మాటలతో ఈ విశ్లేషణను ముగిద్దాం.

‘ మెంగ్‌ అరెస్టు మరో ప్రచ్చన్న యుద్దానికి నాంది అవుతుంది, అందుకు అమెరికాను కెనడా ప్రేరేపించింది. ఎట్టి పరిస్ధితుల్లో అయినా చైనా ఎదుగుదలను అడ్డుకోవాలని అమెరికా ప్రయత్నిస్తున్నది.ప్రత్యర్ధి ఆర్ధిక ఎదుగుదలను దెబ్బతీసేందుకు తన అధికారాన్ని వుపయోగించే అమెరికా వైఖరి బాగా తెలిసిందే, ఇది చాలా చెడ్డది, ప్రమాదకరమైంది, వాస్తవానికి ప్రపంచానికి మరొక కొత్త ప్రచ్చన్న యుద్ధాన్ని తెచ్చేది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తప్పుడు లెక్కలతో పత్తి, చెరకు రైతులకు హాని తలపెట్టిన అమెరికా, ఆస్ట్రేలియా !

06 Thursday Dec 2018

Posted by raomk in Current Affairs, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, USA

≈ Leave a comment

Tags

cotton farmers, cotton subsidies, sugarcane, WTO

Image result for usa, australia stand against india farmers at wto

ఎం కోటేశ్వరరావు

అమెరికా, ఆస్ట్రేలియా వంటి ధనిక దేశాలు దౌత్యపరంగా మనకు మిత్ర దేశాలే. మన యువతీ యువకులు తెల్లారి లేస్తే ఏదో ఒక చోటికి వెళ్లాలని తహతహలాడుతుంటారు. మన పాలకులు అక్కడికి వెళ్లినపుడు, వారు ఇక్కడికి వచ్చినపుడు భారత దేశమా చుట్టుపక్కల 66 దేశాలకు పోతుగడ్డ అన్నట్లుగా మాట్లాడతారు. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు చూస్తే ఎక్కడన్నా బావే కానీ వంగతోట దగ్గర కాదన్నట్లు, మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌, మా ఇంటికొస్తూ మాకేం తెస్తావ్‌ అన్నట్లుగా తమ దేశాల కార్పొరేట్ల ప్రయోజనాల విషయంలో మనకు ముఖ్యంగా రైతాంగానికి అవి శత్రుదేశాలే. ప్రపంచీకరణ పేరుతో మన పెట్టుబడిదారులు ఇతర దేశాలకు విస్తరించేందుకు, ఇప్పటికే విస్తరించిన బహుళజాతి కంపెనీలతో జత కట్టేందుకు మన పాలకవర్గం ప్రపంచీకరణ పేరుతో వాటికి ప్రాతినిధ్యం వహించే సంస్ధల సలహాలు, ఆదేశాలతో నడుస్తున్నాయి. దానిలో భాగంగానే ఇప్పటికే మన పాలకులు ఒక్కొక్క వలువ తీసివేసి చివరకు గోచి మీద నిలబెట్టినట్లు నామ మాత్ర రాయితీలు మిగిల్చాయి. ఇప్పుడు రైతాంగానికి మిగిలిన ఆ గోచిని కూడా తీసేయాల్సిందేనని ధనిక దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయంటే నమ్ముతారా? ఇప్పుడు ఆ పంచాయతీ ప్రపంచ వాణిజ్య సంస్ధలో నడుస్తోంది.

అమెరికాాచైనా మధ్య జూలైలో ప్రారంభమైన వాణిజ్య యుద్ధం గురించి మాత్రమే మనకు తెలుసు. ఆ యుద్దంలో దెబ్బతినే తన రైతాంగానికి ఇప్పటికే ఇస్తున్న సబ్సిడీలకు తోడు అదనంగా పత్తి, సోయా వంటి అనేక ఎగుమతి పంటలకు 12బిలియన్‌ డాలర్లు ఇవ్వాలని నిర్ణయించింది అమెరికా. అలాంటి దేశం గతంలో వరి, గోధుమలపై ఇప్పుడు మన మీద పత్తి రాయితీలు పరిమితికి మించి ఇస్తున్నారంటూ కనీస మద్దతు ధరకు ఎసరు పెట్టింది. తప్పుడు లెక్కలతో ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటివో)కు ఫిర్యాదు చేసింది. చెరకు రైతులకు, పంచదార ఎగుమతులకు ఇస్తున్న సబ్సిడీలు తమ రైతాంగాన్ని, మొత్తంగా ప్రపంచ పంచదార మార్కెట్‌ను దెబ్బతీశాయంటూ ఆస్ట్రేలియా కూడా అదే పని చేసింది. ఆ వాదన లేదా మనపై దాడికి ప్రాతిపదిక ఏమిటి? మన దేశంలో వున్న విభిన్న వాతావరణ పరిస్ధితుల కారణంగా అటు వుష్ణ మండల పంటలతో పాటు ఇటు శీతల మండల, సమశీతల మండల ప్రాంతాలలో సాగు చేసే పంటలలో కొన్ని మినహాదాదాపు అన్నింటినీ పండించే అవకాశం వుంది. అందుకే మన దేశాన్ని తన పరిశ్రమలకు ముడిసరకు సరఫరా చేసే ప్రాంతంగా పారిశ్రామిక విప్లవం తరువాత ఐరోపా ధనిక దేశాలు గుర్తించాయి. అందుకే ఆక్రమణ పోటీలో బ్రిటన్‌ది పైచేయి అయింది.మారిన పరిస్ధితుల్లో తమ అన్ని రకాల వ్యాపారాలు, వస్తుమార్కెట్లకు మన దేశం అనువుగా వుంది కనుక, భౌతికంగా ఆక్రమించుకొనే అవకాశం లేదు గనుక మన మార్కెట్‌ను ఆక్రమించుకొనేందుకు, తమకు అనుకూలంగా మన విధానాలను రూపుదిద్దేందుకు పూనుకున్నాయి. అందుకోసం ప్రపంచీకరణ, సరళీకరణ, సంస్కరణలు అంటూ ముద్దుపేర్లను ముందుకు తెచ్చాయి. ప్రస్తుతాంశం వ్యవసాయ సబ్సిడీలు కనుక వాటి గురించి చూద్దాం.

గత రెండు దశాబ్దాలలో మన వ్యవసాయ పెట్టుబడులు కనీసంగా నాలుగింతలు పెరిగాయి. ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) వునికిలో వచ్చి జనవరి ఒకటిన 24వ సంవత్సరంలో అడుగిడబోతోంది. ముఫ్పై సంవత్సరాల నాటి లెక్కల ఆధారంగా వర్ధమాన దేశాలకు నిర్ణయించిన పదిశాతం సబ్సిడీ పరిమితిని, వ్యవసాయ వుత్పత్తుల ధరలను పరిగణనలోకి తీసుకొని ఇప్పుడు భారత్‌లో సబ్సిడీలు పరిమితికి మించి ఇస్తున్నారని అమెరికా, ఆస్ట్రేలియాలు ఫిర్యాదు చేశాయి. కనీస మద్దతు ధర ఆ నిబంధనను వుల్లంఘించేదిగా వుందని, తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. సరే అసలు ఎత్తివేయాలని కూడా మరోవైపు వత్తిడి తెస్తున్నాయనుకోండి. దీన్ని సులభంగా అర్ధం చేసుకోవాలంటే మన దేశంలో వుత్పత్తి అయ్యే మొత్తం పత్తి విలువ వెయ్యికోట్ల రూపాయలు అనుకుందాం. ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలు, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఐరోపాయూనియన్‌ వంటి ధనిక దేశాల వాదన ప్రకారం పత్తి మీద సబ్సిడీ మొత్తం విలువలో పదిశాతం అంటే వంద కోట్ల రూపాయలకు మించి ఇవ్వకూడదు. దీన్నే మరొక విధంగా చెప్పాలంటే కనీస మద్దతు ధరల పెంపుదల వందకోట్ల రూపాయలకు మించకూడదు.(ప్రత్యక్షంగా ఇచ్చే సబ్సిడీ మొత్తాలకు, కనీస మద్దతు ధరల సబ్సిడీ అవగాహనకు వున్న తేడా తెలిసిందే) మిగతా పంటలకూ ఇదే సూత్రం. ప్రపంచ వాణిజ్య సంస్ధ వునికిలోకి రాక ముందు దాని విధి విధానాలను రూపొందించే కసరత్తులో భాగంగా 1986-88 సంవత్సరాలలో ప్రపంచ మార్కెట్లో వున్న సగటు ధరలను ప్రాతిపదికగా తీసుకొని ధనిక దేశాలు ఐదుశాతం, అభివృద్ధి చెందుతున్న దేశాలు పదిశాతానికి మించి సబ్సిడీలు ఇవ్వకూడదని నిర్ణయించారు.

అంకెలతో ఎన్నో గారడీలు చేయవచ్చు. స్వామినాధన్‌ కమిటి సిఫార్సుల ప్రకారం వుత్పాదక ఖర్చుకు అదనంగా సగం కలిపి అంటే 150 గా కనీస మద్దతు ధరలను నిర్ణయిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వుత్పాదక ఖర్చులో కొన్నింటిని కలపలేదని మనం విమర్శిస్తున్నాం. అంతకంటే ముందే మన మద్దతు ధరలను వ్యతిరేకిస్తున్న అమెరికా ఏమి చెబుతోందో చూద్దాం. మన గోధుమలు, వరికి ప్రకటిస్తున్న మద్దతు ధర పదిశాతం పరిమితికి మించి 60,70 శాతం వుందని అమెరికా వాణిజ్య ప్రతినిధి ప్రపంచ వాణిజ్య సంస్ధకు ఫిర్యాదు చేశాడు. గాజు కొంపలో కూర్చొని ఎదుటివారి మీద రాళ్లు వేస్తున్నది అమెరికా. మన దేశం వరికి 60శాతం అదనంగా ఇస్తున్నట్లు యాగీ చేస్తున్న ఆ దేశం తన రైతాంగానికి 82శాతం, ఐరోపా యూనియన్‌ 66శాతం ఇస్తున్నది. ప్రపంచ వాణిజ్య సంస్ధ సూత్రాల ప్రకారం మొత్తం వ్యవసాయ పంటల విలువలో ధనిక దేశాలు ఐదుశాతం, అభివృద్ధి చెందుతున్న దేశాలు పదిశాతం పరిమితికి సబ్సిడీలు మించకూడదు. అయితే దీన్ని వక్రీకరించి కొన్ని పంటలకు కొన్ని సంవత్సరాలలో విపరీతమైన సబ్సిడీలను ఇచ్చి మొత్తం పంటల విలువకు దాన్ని వర్తింప చేసి ధనిక దేశాలు తప్పించుకుంటున్నాయి. అందుబాటులో వున్న సమాచారం మేరకు కొన్ని సంవత్సరాలలో అమెరికాకు అర్హత వున్న సబ్సిడీ మొత్తం వంద రూపాయలు అనుకుంటే 90రూపాయలను పాలు, పంచదార రైతులకే ఇచ్చింది, అలాగే ఐరోపా యూనియన్‌ 64రూపాయలను గోధుమ, వెన్నకే ఇచ్చింది.

గత ఇరవై ఏండ్లలో ఏడు సంవత్సరాల సమాచారాన్ని చూసినపుడు అమెరికాలో కొన్ని వుత్పత్తులకు వూలు 215, మేక బచ్చుతో చేసే శాలువలకు 141, వరి 82, పత్తి 74, పంచదార 66, కనోలా 61, ఎండు బఠాణీలకు 57శాతం, ఐరోపా యూనియన్‌లో పట్టుపురుగులకు 167, పొగాకు 155, పంచదార 120, కీరా 86, పియర్స్‌ పండ్లకు 82, ఆలివ్‌ ఆయిల్‌ 76, వెన్న 71,ఆపిల్స్‌ 68,పాలపొడి 67,టమాటా 61శాతాల చొప్పున ఇచ్చారు. ఇలా ప్రత్యేకించి ఒక వుత్పత్తికి ఇచ్చిన రాయితీలు సబ్సిడీల పరిధిలో చూపటం లేదు.

మన దేశం 53ా81శాతం మధ్య పత్తికి సబ్సిడీ ఇస్తున్నట్లు అమెరికా ఆరోపించింది. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా చేసిన కొనుగోళ్లను మాత్రమే సబ్సిడీలుగా భారత్‌ చూపుతున్నది.2015ా16లో 120 కోట్ల రూపాయలు చెల్లించినట్లు ప్రపంచ వాణిజ్య సంస్ధకు భారత్‌ తెలిపిందని అయితే 50,400 కోట్ల రూపాయలు చెల్లించినట్లు అమెరికా ఆరోపించింది. అంటే మొత్తం పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేసినట్లు రైతులకు సబ్సిడీ ఇచ్చినట్లు చిత్రించింది. పంచదారను ప్రభుత్వం సేకరించే విధానం లేనప్పటికీ మద్దతు ధర నిర్ణయించటమే సబ్సిడీ చెల్లించటంగా ఆస్ట్రేలియా ఆరోపించింది. తాము నిర్ణయిస్తున్న మద్దతు ధరలను డబ్ల్యుటిఓ ఏర్పాటుకు ముందు 1986ా88 నాటి ధరలతో పోల్చి ఎక్కువగా వుంటున్నట్లు అమెరికా తప్పుడు లెక్కలు వేస్తోందని మన దేశం గతంలోనే సమాధానమిచ్చినా ఖాతరు చేయకుండా ఫిర్యాదు చేశారు. భారత్‌ డాలర్లలో లెక్కలు వేస్తుంటే అమెరికన్లు భారతీయ కరెన్సీలో గుణిస్తున్నారని అందువలన ఇరు దేశాలు చెప్పేదానికి పొంతన వుండదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 1990లో ఒక డాలరుకు 18 రూపాయలుండగా ఇప్పుడు 72 తాకింది. అందువలన రూపాయల్లో లెక్కవేసినపుడు నాలుగు రెట్లు ఎక్కువగా కనిపించటం సహజం. భారత, చైనా వంటి దేశాల వ్యవసాయ సబ్సిడీల గురించి అభ్యంతర పెడుతున్న ధనిక దేశాలు తాము ఇస్తున్నవాటి గురించి దాస్తున్నాయి. పలు ఖాతాల ద్వారా అందచేస్తూ వాటిని సబ్సిడీలుగా పరిగణించకుండా జాగ్రత్త పడుతున్నాయి.

అంతర్జాతీయ పత్తి సలహా సంస్ధ 2018 నవంబరులో విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొన్న అంశాలను గమనించటం అవసరం. కనీస మద్దతు ధరలు, ప్రత్యక్ష వుత్పాదక సబ్సిడీ, బీమా, తదితర రాయితీలన్నింటినీ కలిపి మొత్తంగా పత్తి సబ్సిడీలని పిలుస్తున్నారు.ప్రపంచ వ్యాపితంగా ఇవి 2016-17లో 4.4బిలియన్‌ డాలర్లుండగా 2017-18నాటికి 5.9బిలియన్లకు( ఒక బిలియన్‌ వంద కోట్ల డాలర్లు) 33శాతం పెరిగాయి. ఒక పౌను(453) దూదికి ఇచ్చిన సబ్సిడీ 17 నుంచి 18 సెంట్లకు(నవంబరు 27 విలువ ప్రకారం రు.12.03 నుంచి రు.12.74కు పెరిగాయి) 1997-98 నుంచి ఇప్పటి వరకు వున్న ధోరణుల ప్రకారం పత్తి ధరలు ఎక్కువగా వున్నపుడు సబ్సిడీలు తగ్గటం, తగ్గినపుడు పెరుగుదల వుంది.

పత్తి ధరల విషయానికి వస్తే 2013-14లో సగటున పౌనుకు 91సెంట్లు లభిస్తే 2014-16లో 70కి తగ్గి 2016-17లో 83కు, 2017-18లో 88 సెంట్లకు పెరిగింది.బ్రెజిల్‌,భారత్‌,పాకిస్ధాన్‌ వంటి అనేక దేశాలలో 2017-18లో కనీస మద్దతు ధరల కంటే మార్కెట్లో ఎక్కువ ధరలు వున్నాయి. అయినప్పటికీ కొన్ని దేశాలు ఎరువులు, రవాణా, గ్రేడింగ్‌, నిల్వ, ఇతర మార్కెటింగ్‌ ఖర్చులను సబ్సిడీగా ఇచ్చాయి.కొన్ని చోట్ల పంటల బీమా సబ్సిడీ పెరిగింది.1998-2008 మధ్య ప్రత్యక్ష, ఇతర సబ్సిడీల మొత్తం సగటున 55శాతం పెరిగింది, మరుసటి ఏడాది 83శాతానికి చేరింది, 2010-14 మధ్య 48శాతానికి తగ్గింది, తదుపరి రెండు సంవత్సరాలలో సగటున 75శాతానికి పెరిగి తదుపరి రెండు సంవత్సరాలలో 47శాతానికి తగ్గాయి. ఈ పూర్వరంగంలో చూసినపుడు మన దేశం గురించి అమెరికా చేసిన ఫిర్యాదు దురుద్దేశపూరితం, కనీస మద్దతు ధర వంటి కనీస రక్షణ కూడా ఎత్తివేయాలని వత్తిడి చేయటం తప్ప మరొకటి కాదు. చైనా, అమెరికాలలో మాదిరి వివిధ పధకాల కింద ఇస్తున్న రాయితీలు మన పత్తి రైతాంగానికి లేవు. ఎరువులు, పురుగు మందుల ధరల మీద నియంత్రణ ఎత్తివేయటం, పెరిగిన ధరలకు అనుగుణంగా సబ్సిడీ మొత్తాన్ని పెంచకపోవటం వంటి చర్యల కారణంగా పత్తి రైతాంగానికి ఏటే వుత్పాదక ఖర్చు పెరిగిపోతోంది. కనీస మద్దతు ధరకంటే పడిపోయినపుడు రంగంలోకి వస్తున్న సిసిఐ పరిమితంగానే కొనుగోళ్లు చేస్తూ ప్రయివేటు వ్యాపారులకు ఎక్కువగా తోడ్పడుతోంది. అనేక సందర్భాలలో రైతుల పేరుతో వ్యాపారుల నుంచే కొనుగోలు చేసిన కుంభకోణాల గురించి పత్తి రైతాంగానికి తెలిసిందే.

అమెరికా అభ్యంతర పెడుతున్న కనీస మద్దతు ధరల ప్రహసనం ఏమిటో మనకు తెలియంది కాదు. అంతర్జాతీయ పత్తి సలహా సంస్ధ నివేదిక రహస్యమేమీ కాదు. దానిలో మన దేశం గురించి పేర్కొన్న అంశాలు ఇలా వున్నాయి.’ భారత్‌లో కనీస మద్దతు ధర పద్దతి వుంది. 2014-15 మరియు 2015-16 సంవత్సరాలలో కనీస మద్దతు ధరల కంటే మార్కెట్‌ ధరలు తక్కువగా వున్నందున కొద్ది కాలమైనా ప్రభుత్వం నేరుగా పత్తి కొనుగోలు చేసింది.2016-17,2017-18లో మార్కెట్‌ ధరలు ఎక్కువగా వున్నందున మద్దతు ధరల వ్యవస్ధ కొనుగోలు అవసరం లేకపోయింది. మధ్యరకం పింజ రకమైన జె34 రకానికి 2017-18లో మద్దతు ధరగా క్వింటాలుకు రు.4,020 నిర్ణయించారు. అది పౌను దూది ధర 83సెంట్లకు సమానం. భారత్‌లో పత్తి రైతులు ప్రభుత్వ రుణ మాఫీ మరియు ఎరువుల సబ్సిడీ వలన లబ్ది పొందారు. పంటల బీమా ద్వారా కూడా కొంత మేర మద్దతు ఇచ్చారు. అయితే దీని విలువ ఎంతో తెలియదు. ఇది కాకుండా నాణ్యమైన విత్తనాల వుత్పత్తికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించటం వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. టెక్నాలజీ మిషన్‌ ద్వారా జిన్నింగ్‌, ప్రెస్సింగ్‌ యూనిట్ల నవీకరణకు, పత్తి మార్కెటింగ్‌కు ఇటీవల తోడ్పడింది. వీటి గురించి బహిరంగంగా తెలిపే సమాచారం లేదు. ఇవి గాకుండా జౌళి రంగానికి ప్రత్యక్ష మద్దతు, చౌక రుణాల ద్వారా కూడా ప్రభుత్వం మద్దతు ఇస్తోంది.’ రుణాల రద్దును, నూలు, వస్త్ర మిల్లులకు ఇస్తున్న రాయితీలను కూడ పత్తి రైతులకు ఇస్తున్న రాయితీగా చిత్రించారు.

చైనా పత్తి రైతులకు ఇస్తున్న రాయితీల గురించి చూద్దాం. 2017-18లో అంతకు ముందు ఏడాది ఇచ్చిన 3.3బిలియన్‌ డాలర్ల సబ్సిడీని 4.3బిలియన్‌ డాలర్లకు పెంచారు(పౌనుకు 30సెంట్లు). ప్రపంచ వాణిజ్య ఒప్పందం ప్రకారం దిగుమతి చేసుకోవాల్సిన నిర్దేశిత వంతుకు మించి అదనంగా దిగుమతి చేసుకొనే పత్తి మీద 40శాతం పన్నుతో సహా రైతాంగానికి పలు రక్షణలు కల్పిస్తున్న కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌ ధరకంటే రైతాంగానికి ఎక్కువ గిట్టుబాటు అవుతున్నది. దిగుమతి చేసుకున్న పత్తి ధర, చైనా మిల్లులకు చేరిన ధరకు మధ్య వున్న వ్యత్యాసం రైతులకు నష్టదాయకంగా వుండకుండా చూసేందుకు చెల్లించిన లబ్ది మొత్తం 201-17లో ఒక బిలియన్‌ డాలర్లు వుండగా మరుసటి ఏడాది అది 1.5బిలియన్లకు పెరిగింది. ఇంతేగాకుండా మన దగ్గర కనీస మద్దతు ధర మాదిరిగా ప్రతి ఏటా రైతాంగానికి ఒక లక్షిత ధరను ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఆ ఏడాది మార్కెట్‌లో వచ్చిన సగటు ధరతో దానిని పోల్చి తక్కువ వస్తే ఆ మేరకు రైతులకు ప్రభుత్వం నేరుగా చెల్లిస్తుంది. ఆ మేరకు 2015,16,17 సంవత్సరాలలో చెల్లింపులు చేసింది. 2018 సంవత్సరానికి ఒక టన్నుకు 18,600 యువాన్లుగా నిర్ణయించింది. ఇది పౌనుకు 130 సెంట్లకు సమానం. దాని ప్రకారం అంతకు ముందు సంవత్సరం చెల్లించిన 1.6బిలియన్ల నుంచి 2.1బిలియన్లకు మొత్తాన్ని పెంచింది. అంతే కాదు ప్రతి ఏటా 15క్లో డాలర్ల మేర నాణ్యమైన విత్తన సబ్సిడీ, మరో 15కోట్ల డాలర్లను దూర ప్రాంత రవాణా ఖర్చుల కింద రైతాంగానికి చెల్లించింది. ప్రపంచ వాణిజ్య సంస్ధలో సభ్యత్వం కోసం చైనా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఒక ఏడాదికి 8,94,000 టన్నుల పత్తి దిగుమతి చేసుకుంటే దాని మీద పన్ను ఒక శాతమే విధించాలి. అంతకు మించి దిగుమతులు వుంటే పరిమాణాన్ని బట్టి ఒక శాతం నుంచి 40శాతం వరకు పన్ను విధించవచ్చు. గత మూడు సంవత్సరాలుగా నిర్దేశిత మొత్తం మేరకే దిగుమతులు చేసుకుంటున్నది.

Image result for cotton picking in india

కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సిసిఐ) వార్షిక నివేదికలను ఆ సంస్ధ వెబ్‌ సైట్‌లో ఎవరైనా చూడవచ్చు. వాటిలో పేర్కొన్నదాని ప్రకారం 2014-15 సంవత్సరానికి పత్తి కనీస మద్దతు ధర అంతకు ముందు సంవత్సరం కంటే పెంచింది రు.50, ఇది ఒక శాతానికి దగ్గరగా వుంది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ పడిపోయిన కారణంగా ఆ ఏడాది దేశీయ మార్కెట్లో ముడిపత్తి ధరలు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 19 నుంచి 30శాతం వరకు, అదే విధంగా దూది ధర 25 నుంచి 30శాతం వరకు పతనమైందని సిసిఐ నివేదిక తెలిపింది. ఇలాంటి సందర్భాలలో చైనా, అమెరికాలలో రైతాంగానికి ఆయా ప్రభుత్వాలు సబ్సిడీల రూపంలో నష్టం రాకుండా చూశాయి. మన దేశంలో అలాంటి విధానం లేదు. కనీస మద్దతు ధరకంటే మార్కెట్లో తక్కువ వున్నపుడు ఇష్టం లేని పెండ్లికి తలంబ్రాలు పోసినట్లుగా సిసిఐ కొనుగోళ్లు వుంటున్నాయి. అవి కూడా మద్దతు ధరకు మించటం లేదు. పైన చెప్పుకున్నట్లు ఒక ఏడాది ధరలు భారీగా పడిపోయినా రైతాంగం అప్పులపాలు కావాల్సిందే. ఈ ఏడాది ప్రస్తుతం మార్కెట్లో కనీస మద్దతు ధరల కంటే తక్కువ ధరలకే అధిక మొత్తాలను కొనుగోలు చేస్తున్నట్లు వివిధ మార్కెట్ల సమాచారం వెల్లడిస్తున్నది.

1966 నాటి చెరకు నియంత్రణ విధానం ప్రకారం మన ప్రభుత్వాలు చెరకు ధరను సూచిస్తున్నాయి. ఈ విధానం, పంచదార ఎగుమతులకు ఇస్తున్న రాయితీల కారణంగా ధరలు తగ్గి తమతో పాటు ప్రపంచ రైతాంగానికి, వ్యాపారులకు నష్టం జరుగుతోందంటూ ఆస్ట్రేలియా ప్రపంచ వాణిజ్య సంస్ధకు మన దేశం మీద చేసిన పరోక్ష ఫిర్యాదును ఇప్పుడు విచారిస్తున్నారు.’ చెరకు వుత్పాదనా సామర్ధ్యాన్ని పెంచేందుకు భారతీయ రైతులకు అధిక మూల్యం చెల్లిస్తున్నారు.దీంతో పంచదార మిల్లులకు ప్రభుత్వం అదనంగా చెల్లించేందుకు వీలు కలుగుతోంది. ప్రపంచ వాణిజ్య ఒప్పందం ప్రకారం భారత్‌ సబ్సిడీలను తగ్గించే జాబితాలో చెరకు లేదు ‘ అని ఆస్ట్రేలియా ఫిర్యాదు చేసింది. చెరకు సబ్సిడీలను తగ్గిస్తామని అంగీకరించిన దేశాలలో మన దేశం లేదు. ధనిక దేశాలు కోరుతున్న పద్దతిలో వ్యవసాయ సబ్సిడీలను తగ్గించాలనటాన్ని మనదేశం, చైనా వుమ్మడిగా ప్రపంచ వాణిజ్య సంస్ధలో వ్యతిరేకించాయి, ఈ అంశం మీద చర్చలు జరపాలని డిమాండ్‌ చేశాయి. అయితే అమెరికా, ఐరోపాయూనియన్‌, జపాన్‌, నార్వే, స్విడ్జర్లాండ్‌ తదితర దేశాలు చర్చను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 2011-17 మధ్య అంగీకరించిన సబ్సిడీ మొత్తాలకు మించి చెరకు సబ్సిడీలను భారత్‌లో ఇచ్చారని ఆస్ట్రేలియా వాదించింది. భారత చెరకు, పంచదార గురించి అమెరికా తయారు చేసిన తప్పుడు లెక్కలను వుదహరించి ఆస్ట్రేలియా కేసు దాఖలు చేసింది. ఒక్క చెరకు పంట మీదే కాదు, పప్పుధాన్యాలకు కూడా భారత్‌ ఇస్తున్న సబ్సిడీ వలన కూడా ప్రపంచ వాణిజ్యం ప్రభావితం అవుతోందని ఆరోపిస్తోంది.ఈ వైఖరి ఒక విధంగా మన దేశ సార్వభౌమత్వాన్నే సవాలు చేయటంగా కూడా చెప్పవచ్చు.

ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీల కారణంగా ఈ ఏడాది భారత్‌లో పంచదార వుత్పత్తి ఏకంగా 20 నుంచి 35 మిలియన్‌ టన్నులకు పెరిగిందని ఆస్ట్రేలియా ఆరోపించింది. భారత్‌ 85కోట్ల డాలర్ల మేర సబ్సిడీ ఇచ్చి ఐదులక్షల టన్నుల పంచదారను ప్రపంచ మార్కెట్లో కుమ్మరిస్తున్నదని, తమ దేశంలో టన్ను పంచదార వుత్పత్తికి 440-450 డాలర్ల వరకు ఖర్చవుతుండగా మార్కెట్లో 500డాలర్లుగా వున్న ధర పడిపోయి 400కు మించి రావటం లేదని ఆస్ట్రేలియా ఆరోపిస్తోంది. మరోవైపు మన దేశంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్న ధరలు రైతాంగానికి గిట్టుబాటు కావటం లేదని పెంచాలని కోరుతున్నారు. దీన్నే సబ్సిడీ చెల్లించటంగా చిత్రిస్తున్నారు.నిజానికి రాష్ట్రం లేదా కేంద్రంగానీ రైతులకు ఇస్తున్న ప్రోత్సాహక ధరలు లేదా రాయితీలు చెరకు-దాని వుత్పత్తుల మీద వచ్చే ఆదాయం, పన్నులతో పోల్చుకుంటే తక్కువే. ఈ మాత్రపు రక్షణ కూడా లేకుండా మార్కెట్‌ శక్తులకు వదలి వేయాలని అంతర్జాతీయ బడా పంచదార వ్యాపారులు వత్తిడి తెస్తున్నారు.

గత పదహారు సంవత్సరాలలో తొలిసారిగా భారత్‌ పంచదార వుత్పత్తిలో బ్రెజిల్‌ను అధిగమించి 35.9 మిలియన్‌ టన్నులతో ప్రధమ స్ధానంలోకి వచ్చింది. అయితే ఇది తాత్కాలికమే అని చెప్పవచ్చు. బ్రెజిల్‌లో ప్రతికూల వాతావరణం నెలకొనటం ఒక కారణమైతే, చమురు ధరలు 85డాలర్లకు పెరిగినందున పంచదార బదులు ఎథనాల్‌ తయారు చేయటం లాభసాటిగా వున్నందున పంచదార వుత్పత్తిని కావాలనే తగ్గించారు. చమురు ధరలు 60డాలర్లకు పడిపోయినందున ఎథనాల్‌ బదులు పంచదారకు మరలితే మన పరిస్థితి ఇబ్బందుల్లో పడుతుంది. ప్రపంచ వ్యాపితంగా 188.3మిలియన్‌ టన్నుల పంచదార వుత్పత్తి అవుతుందని అంచనా.

మన మార్కెట్‌ను బహుళజాతి గుత్త సంస్ధలకు తెరిచిన కారణంగా ఇప్పటికే పత్తి, ఇతర విత్తన రంగం,పురుగు మందుల రంగం విదేశీ, స్వదేశీ గుత్త సంస్ధల ఆధిపత్యంలోకి పోయింది.వారు నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేయాల్సిందే. కార్గిల్‌ వంటి బహుళజాతి గుత్త సంస్ధలు కనీస మద్దతు ధరలను దెబ్బతీసే విధంగా పరోక్షంగా కొనుగోళ్లు జరుపుతూ మార్కెట్లను నిర్దేశిస్తున్నాయని 2017 జనవరిలో వార్తలు వచ్చాయి. లోపాలతో కూడినదే అయినప్పటికీ ఆ విధానం కూడా వుండకూడదని, అప్పుడే తాము ప్రత్యక్షంగా రంగంలోకి దిగవచ్చని అవి భావిస్తున్నాయి. దానిలో భాగంనే పారిశ్రామిక రంగానికి ఇచ్చే రాయితీలను కూడా రైతుల ఖాతాలో వేసి అమెరికా వంటి దేశాలు కనీస మద్దతు ధరల విధానం మీద దాడి చేస్తున్నాయన్నది స్పష్టం. దీని వెనుక అంతర్జాతీయ వ్యవసాయ కార్పొరేట్ల ప్రయోజనాలు తప్ప మరొకటి లేదు. ధనిక దేశాల లాబీ, వత్తిడికి లంగి వాటికి అనుకూలమైన విధానాలు అమలు జరుపుతున్న పాలకవర్గాల మీద, అదే విధంగా కార్పొరేట్‌ శక్తుల కుట్రల మీద రైతాంగం చైతన్యవంతులై ఆ విధానాలను తిప్పికొట్టకపోతే వున్న రాయితీలు కూడా వూడ్చిపెట్టుకుపోయే ప్రమాదం వుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వక్రీకరణలను తిప్పికొట్టండి-సోషలిజం గొప్పతనాన్ని చెప్పండి !

29 Thursday Nov 2018

Posted by raomk in CPI(M), Current Affairs, Greek, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

100 years of the KKE, 20 IMCWP, 20th International Meeting of Communist and Workers’ Parties, Communist Party of Greece

Image result for 20th IMCWP

ఎం కోటేశ్వరరావు

కమ్యూనిస్టు , కార్మికోద్యమాలను బలపరిచే, సంరక్షించుకొనే కృషిలో భాగంగా 2019లో వచ్చే ముఖ్యమైన స్మారకోత్సవాల సందర్భంగా బహుముఖ కార్యక్రమాలను నిర్వహించాలని, వక్రీకరణలను తిప్పి కొట్టి సోషలిజం గొప్పతనాన్ని జనానికి చెప్పాలని గ్రీసు రాజధాని ఏథెన్స్‌లో జరిగిన 20వ అంతర్జాతీయ కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీల సమావేశం పిలుపు నిచ్చింది. గ్రీసు కమ్యూనిస్టు పార్టీ తన వందవ వార్షికోత్సవం సందర్భంగా నవంబరు 23-25 తేదీలలో ఆతిధ్యమిచ్చిన ఈ సమావేశానికి 73 దేశాల నుంచి 90 పార్టీల ప్రతినిధులు హాజరై తమ అనుభవాలను కలబోసుకున్నారు. ‘ వర్తమాన కార్మికవర్గం మరియు దాని మైత్రి(సమాశ్రయం). దోపిడీ మరియు సామ్రాజ్యవాదుల యుద్ధాల వ్యతిరేక పోరాటం, శాంతి, సోషలిజం కోసం, కార్మికులు మరియు పౌరుల హక్కుల పరిరక్షణ వుద్యమాల్లో ముందుండే కమ్యూనిస్టు మరియు కార్మిక పార్టీల రాజకీయ లక్ష్యాలు.’ అనే ఇతి వృత్తంతో జరిగిన ఈ సమావేశంలో పాల్గన్న ప్రతి పార్టీ అంతర్జాతీయ, ప్రాంతీయ, దేశీయ పరిస్ధితులపై తన అనుభవాలు, పాఠాలను సోదర పార్టీలతో పంచుకుంది. మన దేశం నుంచి సిపిఐ(ఎం), సిపిఐ పార్టీల ప్రతినిధి వర్గాలు పాల్గన్నాయి.

పెట్టుబడిదారీ విధాన అభివృద్ధి లేదా సంక్షోభంలో బహుముఖాలుగా పెట్టుబడిదారీ దేశాలు వాటి కూటముల మధ్య పోటీ మరియు వైరుధ్యాలు తీవ్రమౌతున్నాయని, ఆ క్రమంలో బలాబలాల పునరేకీకరణ అంతర్జాతీయంగా ముందుకు వస్తున్నదని సమావేశం గుర్తించింది. సామ్రాజ్యవాదుల జోక్యం, దిగ్బంధాలు మరియు మధ్యవర్తిత్వాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ సిరియా, ఎమెన్‌, లిబియా అదే విధంగా అజర్‌బైజాన్‌లో యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రజావ్యతిరేక కీవ్‌ పాలకుల కారణంగా వుక్రెయిన్‌లో భాతృహత్యా సంబంధమైన యుద్ధం జరుగుతోంది. మిలిటరీ ఆయుధీకరణ మరియు యుద్ధ సన్నాహాలు పెరుగుతున్నాయి. అమెరికా, నాటో, ఐరోపా యూనియన్‌ మరియు వాటి మిత్ర సామ్రాజ్యవాదుల పధకాలు మరియు రాజకీయ వైఖరులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల నుంచి అనేక అనుభవాలు లభించాయి.

వైరుధ్యాలు తీవ్రతరం కావటంతో సంపదను వుత్పత్తి చేసే వనరులపై అదుపు, మార్కెట్లు, చమురుపైప్‌లైన్లపై ఆధిపత్యం కోసం సామ్రాజ్యవాదుల నూతన యుద్ధాల ముప్పు ఇమిడి వుంది. శాంతి, నిరాయుధీకరణ కోసం ఇది విశాలమైన సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాన్ని పటిష్టపరిచేందుకు వుపేక్షించరాని లక్ష్యాలను కమ్యూనిస్టులు మరియు శ్రామికోద్యమాల ముందుంచింది. బడా పెట్టుబడిదారుల లాభదాయకత కోసం పని చేసే బూర్జువా ప్రభుత్వాల వైఖరి మరియు సామాజ్రవాదుల దురాక్రమణ,యుద్ధాలకు వ్యతిరేకంగా పోరాటాలను వుధృతం చేయాల్సి వుంది.

అక్టోబరు విప్లవ వందసంవత్సరాల వార్షికోత్సవం, కారల్‌మార్క్స్‌ 200వ జన్మదినోత్సవాల సందర్భంగా 2017,18 సంవత్సరాలలో తీసుకున్న చొరవను సమావేశం సానుకూలంగా విశ్లేషించింది. సిరియా, పాలస్తీనా, సైప్రస్‌, లెబనాన్‌, సూడాన్‌, క్యూబా, వెనెజులా, బ్రెజిల్‌, ఇరాన్‌ ఎదుర్కొంటున్న సామ్రాజ్యవాదుల దాడులు, బెదిరింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్నవారికి అంతర్జాతీయ సౌహార్ద్రతను పునురుద్ఘాటించింది. పోలాండ్‌, వుక్రెయిన్‌, సూడాన్‌, కజకస్తాన్‌, పాకిస్ధాన్లలో కమ్యూనిస్టు వ్యతిరేక మరియు ప్రజాస్వామిక హక్కులపై జరుగుతున్న దాడులను, రష్యా తదితర చోట్ల కమ్యూనిస్టులు ఎదుర్కొంటున్న చట్టపరమైన, రాజకీయ ఆటంకాలను సమావేశం ఖండించింది.

Image result for 20th IMCWP

2019లో కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ స్ధాపనవందేండ్ల వుత్సవం, చైనా విప్లవ 70, క్యూబా విప్లవ 60వ వార్షికోత్సవాల వంటి ముఖ్యమైన స్మారకోత్సవాలు వున్నాయి. ప్రజా విజయాలకు కమ్యూనిస్టు వుద్యమం ఇచ్చిన తోడ్పాటు, అంతర్జాతీయ కార్మికోద్యమాన్ని పటిష్టపరచాల్సిన అవసరం, చారిత్రక వాస్తవాలను వక్రీకరించి ఫాసిస్టుల అత్యాచారాలతో సమంగా కమ్యూనిజాన్ని చూపే యత్నాలు, తప్పుడు ప్రచారాలను ఎండగట్టటం, కార్మికుల, ఇతర తరగతుల సామాజిక విజయం కోసం జరిపే పోరాటాల పురోగతికి ఈ అవకాశాలను వినియోగించుకోవాలని సమావేశం పిలుపునిచ్చింది.

నాటో 70వ వార్షికోత్సవం సందర్భంగా దానికి వ్యతిరేకంగా అనేక రూపాలలో మరింత మిలిటరీ కేంద్రీకరణ జరుపుతున్న ఐరోపాయూనియన్‌ చర్యలకు వ్యతిరేకంగా 2019 ఏప్రిల్‌ నాలుగవ తేదీన, అణ్వాయుధాలు, విదేశీ సైనిక స్ధావరాలకు, హిరోషిమా-నాగసాకీ అణుమారణకాండకు వ్యతిరేకంగా ఆగస్టు ఆరు మరియు తొమ్మిదిన, రెండవ ప్రపంచ యుద్దం ప్రారంభమై 80సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా సెప్టెంబరు ఒకటిన కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశం కోరింది. కమ్యూనిస్టు వుద్యమ చరిత్రను, అంతర్జాతీయ కార్మిక సౌహార్ద్రత విలువలను పరిరక్షిస్తూ, కమ్యూనిస్టు వ్యతిరేకత, కమ్యూనిస్టు, కార్మికోద్యమాల అణచివేతకు వ్యతిరేకంగా మార్చినెల రెండవ తేదీన వందేండ్ల కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ వుత్సవం సందర్భంగా, అక్టోబరు విప్లవ 102వ వార్షికోత్సవం సందర్భంగా సోషలిజం సాధించిన విజయాల గురించి ప్రచారం, పెట్టుబడిదారీ విధానం, దోపిడీ, అణచివేత వంటి అమానుష ధోరణులకు వ్యతిరేకంగా లోతైన సైద్ధాంతిక చర్చ, ఆచరణాత్మక కార్యక్రమాల గురించి బహుముఖ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది.

సోషలిస్టు క్యూబాకు వ్యతిరేకంగా అమెరికా అమలు జరుపుతున్న దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని, వెనెజులా బలివేరియన్‌ విప్లవాన్ని వమ్ము చేసేందుకు చేస్తున్న బెదిరింపులు, జోక్యాలకు వ్యతిరేకంగా పాలస్తీనా పౌరుల పోరాటం, కొరియాల ఐక్యతకు మద్దతుగా కార్యక్రమాలు నిర్వహించాలని కోరింది. మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సం, మే డే, ఫాసిజం, నాజీజాల మీద ప్రజా విజయం రోజున తిరిగి తలెత్తుతున్న ఆ శక్తులకు వ్యతిరేకంగా, పర్యావరణ పరిరక్షణకు పలు కార్యక్రమాలు చేపట్టాలని ఏథెన్స్‌ సమావేశం పిలుపునిచ్చింది.

Related image

వంద సంవత్సరాల గ్రీసు కమ్యూనిస్టు పార్టీ 1918 నవంబరు 17న గ్రీసు సోషలిస్టు లేబర్‌ పార్టీగా ఏర్పడింది.పైరాస్‌ పట్టణంలో తొలి మహాసభ జరిగింది. 1924లో గ్రీసు కమ్యూనిస్టు పార్టీగా మారింది. నాజీల దురాక్రమణకు ప్రతిఘటన వుద్యమంలో గణనీయమైన పాత్ర పోషించింది.1967 ఏప్రిల్‌ 21న గ్రీసుకు కమ్యూనిస్టు ముప్పు తలెత్తిందనే పేరుతో మిలిటరీ తిరుగుబాటు చేసి అన్ని రాజకీయ పార్టీలను నిషేధించింది. మరుసటి ఏడాది గ్రీసు కమ్యూనిస్టు పార్టీలో చీలిక వచ్చి ఒక వర్గం యూరోకమ్యూనిజం పేరుతో మితవాదబాట పట్టింది. మరొక వర్గం మిలిటరీ పాలకులపై సాయుధపోరుకు దిగింది.1974లో మిలిటరీ పాలన అంతమైన తరువాత తిరిగి కమ్యూనిస్టు పార్టీ బహిరంగ కార్యకార్యకలాపాల్లోకి వచ్చింది. వందవ వార్షికోత్సవ సభ మొదటి మహాసభ జరిగిన పైరాస్‌ పట్టణంలోనే శాంతి, స్నేహ స్టేడియంలో పెద్ద ఎత్తున రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలతో జరిగింది.తొంభై కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధుల సమక్షంలో వేలాది మంది గ్రీసు పార్టీకార్యకర్తలు, పౌరులు పాల్గన్నారు. గతంలో మిలిటరీ పాలనకు వ్యతిరేకంగా ఆయుధాలు పట్టిన యోధులు, ఎర్రజెండాను సమున్నతంగా నిలబెడుతున్న యువ కమ్యూనిస్టులు వేలాది మందిని ఈ సందర్భంగా గ్రీసు పార్టీ ప్రధాన కార్యదర్శి దిమిత్రిస్‌ కౌటుసోంబస్‌ సన్మానించారు.

Image result for KKE, Dimitris Koutsoumbas

ఈ సందర్భంగా దిమిత్రిస్‌ మాట్లాడుతూ ‘మేం ఏటికి ఎదురీదాం, బిగ్గరగా చేసిన విమర్శలను తట్టుకోలేక చెవులు మూసుకున్నాం, మృదువుగా మృదువుగా వుందాం అని చెప్పిన కొందరు స్నేహితులు, కామ్రేడ్లను మేము కలవర పెట్టాము. వారు మమ్మల్ని రాజీపడమని కోరారు. మేమా పని చేయకపోవటమే సరైందని రుజువైంది. అలా చేసి వుంటే చివరకు రాజీ మాత్రమే మిగిలి వుండేది. మేమా పని చేయలేదు. ఎందుకంటే వంద సంవత్సరాల పార్టీ అనుభవం మమ్మల్ని తప్పులు చేయనివ్వలేదు. ఏటికి ఎదురీదిన కారణంగానే మేము ముందుకు పోవటానికి, ప్రతిదాడి చేసేందుకు, నూతన మిలిటెంట్ల సచేతనత్వం పొందటానికి తోడ్పడింది. యజమాని లేకుండా నడపవచ్చుగానీ కార్యకర్తలనే గొలుసు లేకుండా బండిని నడపలేము.’ అంటూ కార్యకర్తలను వుత్సాహపరిచారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d