• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Modi

దేశం ఎటు పోతోంది ! ఏం జరుగుతోంది !!

17 Thursday Mar 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Agriculture, BJP, Bjp nationalism, black money, cbi, INDIA, indirect subsidies, JNU, JNU ROW, lalit modi, Modi, Narendra Modi, subsidies, vijay mallya

 సమాజంలో అత్యంత నిరుపేదలు కొనుగోలు చేసే లేదా ఎగుమతి చేసే వజ్రాలు, బంగారు ఆభరణాలపై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ఎంతో తెలుసా ?చాయ్‌ వాలా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాది(2014-15)లో రు. 44,962 కోట్ల రూపాయలు, మరి రెండో సంవత్సరం రు.61,126 కోట్లు. సర్‌ గోచిపాత రాయుళ్లు ఎక్కే విమానాలను దిగుమతి చేసుకున్న విమానాలపై ఇచ్చిన సబ్సిడీ రు.2,945 కోట్ల నుంచి రు.3,516 కోట్లకు పెరిగింది. ఇక వాటికి పోసే పెట్రోలుకు ఇస్తున్న సబ్సిడీ 762 కోట్లు .ఇవి గాక బీదా, బిక్కీ ఎక్కే విలాసవంతమైన కార్లపై ఇచ్చిన రాయితీ రు 20,141-18,260 కోట్ల మధ్య వుంది

ఎం కోటేశ్వరరావు

     కేంద్రంలో బిజెపి రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత రెండు పూర్తి బడ్జెట్లు ప్రవేశ పెట్టింది. వాటి ద్వారా తాము చేసిన వాగ్దానాలపై ఫలానా నిర్ధిష్ట చర్య తీసుకున్నట్లు జనానికి నమ్మకం కలిగించలేకపోయింది. తన ఎన్నికల ప్రణాళికలో ఇతర పార్టీల మాదిరిగానే అనేక మంచి అంశాలు చెప్పింది. గత ప్రభుత్వంతో పోల్చుకొని జనం గణనీయంగా దానికి ఓట్లు వేశారు. మన ఎన్నికల విధానంలో వున్న ఒక తీవ్రలోపం, ప్రతిపక్ష ఓట్లు చీలటం,వివిధ కారణాలతో దానికి వచ్చిన ఓట్ల కంటే సీట్లు ఎక్కువగా వచ్చాయి. దాంతో ఎలాంటి భయం లేకుండా చేసిన వాగ్దానాలను అమలు జరుపుతుందని జనం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ చిత్రం ఏమంటే ఎన్నికల ప్రణాళికలోలేని అనేక అంశాలను అది అమలు జరుపుతోంది. ఏ కాంగ్రెస్‌ విధానాలనైతే తెగనాడిందో అవే విధానాలను మరింత ఎక్కువగా అమలు జరుపుతోంది. గత రెండు బడ్జెట్లలో వుద్యోగులు తీవ్ర ఆశాభంగానికి గురైనట్లుగానే సమాజంలోని అన్ని తరగతుల వారిలో రోజు రోజుకూ తీవ్ర అసంతృప్తి పెరిగిపోతోంది. ఇతర పార్టీల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడే అవకాశం లేకుండా స్వంతంగా మెజారిటీ సీట్లు వున్నప్పటికీ ఒక్క కీలకాంశంపైనా అది ఇంతవరకు నిర్ణయం తీసుకోలేకపోయిందంటే అతిశయోక్తి కాదు.

    నల్లధనాన్ని వెనక్కు తీసుకురావటంలో కాంగ్రెస్‌ ఎందుకు విముఖత చూపుతోంది? ఎందుకంటే అది ఎవరిదో వారికి తెలుసు కనుక, విదేశాల్లో దాచుకున్న ప్రతి పైసాను ఎన్‌డిఏ వెనక్కు తీసుకు వస్తుంది. దాన్ని పంచితే ఒక్కొక్కరికి 15-20లక్షల రూపాయలు వస్తాయి అని ఎన్నికలకు ముందు నరేంద్రమోడీ ట్వీట్లు చేసి జనానికి స్వీట్ల ఆశచూపారు. పార్టీ అధ్యక్షుడిగా వున్న రాజనాధ్‌ సింగ్‌ అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లో నల్లధనాన్ని తీసుకువచ్చి దాన్ని సంక్షేమ కార్యక్రమాలకు అమలు జరుపుతామని చెప్పారు.తీరా అధికారానికి వచ్చిన తరువాత బిజెపి అధ్యక్షుడు ఎన్నికల సమయంలో అనేకం చెబుతుంటాం అవి అమలు జరుగుతాయా మీ పిచ్చిగానీ అన్నట్లు మాట్లాడారు.

    నల్లధనాన్ని తీసుకు వస్తామన్న పెద్దమనిషి గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో తన పాలనలో ఇప్పుడెవరూ నల్లధనాన్ని బయటకు తీసుకు వెళ్లటానికి సాహసించటం లేదు అని చెప్పారు. ఇంతకంటే హాస్యాస్పదం ఏముంది ? గతేడాది సెప్టెంబరు వరకు తమ ప్రభుత్వం విధించిన గడువులోగా నల్లధనాన్ని తెల్లదిగా మార్చుకొనే పధకంలో 6,500 కోట్లు వస్తాయని ప్రధాని చెప్పారు. చివరికి అంది పంచపాండవులంటే మంచం కోళ్ల మాదిరిగా తయారైంది. తమ ప్రభుత్వ పధకం ప్రకారం 638 మంది రు 4,147 కోట్లను వెల్లడించారని రెవెన్యూ కార్యదర్శి చెప్పారు.మరి 6500 కోట్ల సంగతేమిటని అడిగితే అబ్బే అబ్బే ఇది మా పధకం ద్వారా కాదు హెచ్‌ఎస్‌బి దర్యాప్తు ద్వారా స్వాధీనం చేసుకున్న మొత్తం అని ఆర్ధిక మంత్రి అరుణ్‌జెట్లీ చెప్పారు.తీరా ప్రభుత్వ పధకం ద్వారా వెల్లడైంది కేవలం 2,488 కోట్లు మాత్రమే అన్నారు. తరువాత ఇది కూడా జనాన్ని తప్పుదారి పట్టించే సమాచారమే అని తేలింది.

     స్విడ్జర్లాండ్‌ బ్యాంకులలో దాచుకున్న డబ్బు గురించి 2011లోనే 1,195 మంది పేర్లతో 25,420 కోట్ల రూపాయలు వున్నట్లు బయటకు వచ్చింది. అయితే మోడీ సర్కార్‌ ఇంకా 628 పేర్లనే పట్టుకు వేలాడుతోంది.హెచ్‌ఎస్‌బిసి బ్యాంకులో దాచుకున్న సొమ్ము గురించి కూడా తెలిసింది చాలా పరిమితమే.ఆ బ్యాంకులో అక్రమంగా సొమ్ముదాచుకున్నవారి వివరాలు బయటపడటంతో ఫ్రాన్స్‌ 110 కోట్ల డాలర్లు, అమెరికా 190 కోట్లు, స్విడ్జర్లాండ్‌ 4.3 కోట్ల డాలర్లు చెల్లించాలని ఆ బ్యాంకుకు జరిమానా వేశాయి. మరి మన దేశం ఎంత జరిమానా వేసింది ? అయినా మన జెట్లీ గారు తాజా బడ్జెట్‌ ప్రసంగంలో పెద్ద రంకెలే వేశారు తప్ప ఆచరణ లేదు.

    క్రికెట్‌ అసోసియేషన్‌లో వందల కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం అభియోగాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణ చేపట్టగానే లలిత్‌ మోడీ బిజెపి ముఖ్యమంత్రిగా వున్న వసుంధరరాజె, సుష్మస్వరాజ్‌ తదితరుల సహకారంతో దేశం వదలి పారిపోయాడు. అతగాడితో కుమ్మక్కు కానట్లయితే భారత్‌కు రప్పించేందుకు మోడీ సర్కార్‌ చేసిన ప్రయత్నాలేమిటి. ఇది ఇలా వుండగా కింగ్‌ పిషర్‌ విజయ మాల్య తొమ్మిదివేల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగవేసి, తన వ్యాపారాలను ఇతర కంపెనీలకు అమ్మివేసి లండన్‌కు పారిపోయి ఇప్పుడప్పుడే తాను భారత్‌కు రానని చెప్పేశాడు. చిన్న చేప లలిత్‌మోడీనే పట్టుకోలేనివారు పెద్ద చేప మాల్యను పట్టుకుంటారా అని జనం అడుగుతున్నారు. మధ్య ప్రదేశ్‌లో వ్యాపం పేరుతో ప్రవేశ పరీక్షలలో జరిగిన కుంభకోణం నిజాలను నిగ్గుతేల్చేందుకు విచారణ చేపట్టిన సిబిఐ ఇంతవరకు చేసిందేమీ లేదు. అలాంటిది దేశం వదలి పారిపోతుంటే గుడ్లప్పగించి చూస్తూ కూర్చున్న ఆ సంస్ధపై జనానికి విశ్వాసం ఎలా వుంటుంది. తొలుత విదేశాలకు వెళుతుంటే నిర్బంధించమని లుక్‌అవుట్‌ నోటీసు జారీ చేసిన సిబిఐ తరువాత ఒక నెలలోపే దానిని సవరించి వెళుతున్నట్లు తెలియ చేస్తే చాలని ఎందుకు మార్చినట్లు ? ప్రధాని పర్యవేక్షణలోని ఈ సంస్ధ నిర్వాకం గురించి ఇంతవరకు ఎవరూ నోరు విప్పరేం?

     వ్యవసాయం రంగం తీవ్ర సంక్షోభంలో వుంది. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కొనసాగుతున్న ఆత్మహత్యలే అందుకు తిరుగులేని నిదర్శనం. వుత్పత్తి ఖర్చులపై కనీసం 50శాతం లాభం వచ్చేట్లు చూస్తామని బిజెపి ఎన్నికల ప్రణాళిక చెప్పింది. ఇప్పటికే పరిమితంగా వున్న ఎరువుల సబ్సిడీని కూడా దుర్వినియోగం అవుతోందనే పేరుతో ఇంకా కోత పెట్టేందుకు పూనుకుంది. యాభై శాతం కాదు కదా అందులో సగమైనా దక్కేందుకు ఇంత వరకు నిర్ధిష్ట పధకం ఏమి లేకపోగా స్వాతంత్య్ర దేశ చరిత్రలో తమ ప్రభుత్వం చేసినంతగా రైతులకు ఎవరూ సాయపడలేదని ఇటీవల బిజెపి రైతు సభలలో ప్రధాని చెప్పుకున్నారు.

   ధరల పెరుగుదలను అరికట్టటంలో వైఫల్యం గురించి తమకు పెరుగుతున్న కరువు భత్యమే పెద్ద సాక్ష్యమని వేరే చెప్పనవసరం లేదు. రెండు నెలలపాటు వుల్లిపాయలను బ్లాక్‌ మార్కెట్‌ చేసి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలను జనం నుంచి గుంజిన వ్యాపారులపై తీసుకున్న చర్యలేమిటి ? అదే విధంగా కంది పప్పు. దాని కంటే చేపలు, కోడి మాంసం చౌక అయిందా లేదా ? ఇక ధరల తగ్గింపు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప్రయివేటు వర్తకులు అడ్డగోలు పద్దతుల్లో ధరలు పెంచారంటే అదొక దారి. వాగ్దానాలు చేయని వాటిని అమలు జరుపుతున్నదని ముందే చెప్పుకున్నాం. నరేంద్రమోడీ అధికారానికి రాక ముందు లీటరు పెట్రోలుపై రు.9.48 పైసలు ఎక్సైజ్‌ డ్యూటీ వుండేది. దానిని ప్రస్తుతం రు.21.48 పైసలకు పెంచారు. రూపాయి విలువను డాలరుకు రు.62.12 నుంచి ( ఫిబ్రవరి ఒకటిన సగటు రేటు) రు.67.68కి పతనం గావించారు. దీంతో చమురు వినియోగదారులకు అటు గోడ దెబ్బ చెంప దెబ్బ అన్నట్లుగా ప్రపంచ మార్కెట్లో ధరలు పతనమైనా మన దేశంలో వాటి ప్రభావం పెద్దగా లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వంతో పోల్చితే నా రూటే సపరేటు అని బిజెపి చెప్పుకుంది. నిజమే అనుకున్నారు జనం. అన్నం వుడికిందా లేదా అని చూడటానికి ఒక్క మెతుకు పట్టుకున్నా చాలని ప్రతి ఒక్కరికీ తెలుసు. అలాగే కాంగ్రెస్‌ విధానాలను అంతకంటే ఎక్కువగా అమలు జరుపుతున్నదనటానికి దిగువ వివరాలు చూడండి.

   సమాజంలో అత్యంత నిరుపేదలు కొనుగోలు చేసే లేదా ఎగుమతి చేసే వజ్రాలు, బంగారు ఆభరణాలపై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ఎంతో తెలుసా ?చాయ్‌ వాలా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాది(2014-15)లో రు. 44,962 కోట్ల రూపాయలు, మరి రెండో సంవత్సరం రు.61,126 కోట్లు. సర్‌ గోచిపాత రాయుళ్లు ఎక్కే విమానాలను దిగుమతి చేసుకున్న విమానాలపై ఇచ్చిన సబ్సిడీ రు.2,945 కోట్ల నుంచి రు.3,516 కోట్లకు పెరిగింది. ఇక వాటికి పోసే పెట్రోలుకు ఇస్తున్న సబ్సిడీ 762 కోట్లు .ఇవి గాక బీదా, బిక్కీ ఎక్కే విలాసవంతమైన కార్లపై ఇచ్చిన రాయితీ రు 20,141-18,260 కోట్ల మధ్య వుంది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఈ వివరాలన్నీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ పత్రాలలో అధికారికంగా రాసినవే. ఇన్ని రాయితీలు ఇచ్చిన కేంద్రం వుద్యోగులకు పన్ను మినహాయింపు విషయానికి వచ్చేసరికి మొండి చేయి చూపుతోంది. పన్ను రాయితీలు అక్కరలేదు, ధరల పెరుగుదలను కూడా స్ధంభింప చేయండి చాలు అని అనేక మంది అంటుంటారు, పోనీ అదైనా చేస్తోందా లేదే. జనం దగ్గర గోళ్లూడగొట్టి పన్నులు వసూలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఏటా వివిధ ప్రోత్సాహక పధకాల పేరుతో ఇస్తున్న పరోక్ష రాయితీల మొత్తం పెరుగుతున్నది. అయినా సరే కార్పొరేట్‌, ఇతర బడా కం పెనీలు, పెద్దలు తీసుకున్న రుణాల ఎగవేత కూడా ఏటేటా పెరుగుతున్నది. మరోవైపు మరి ఈ రాయితీల సొమ్మంతా ఎటు పోతున్నట్లు ? గత కొద్ది సంవత్సరాలుగా క్రమంగా పెరుగుతూ వస్తున్న రాయితీల మొత్తం ఇలా వుంది. (కోట్ల రూపాయలలో)

2012-13 5,66,234.7

2013-14 5,72,923.3

2014-15 5,54,349.04

2015-16 6,11,128.31

    కేవలం నాలుగు సంవత్సరాలలోనే 22 లక్షల కోట్ల రూపాయలు వివిధ రాయితీల కింద ఇచ్చారు. నిజంగా కాంగ్రెస్‌ విధానాల నుంచి వైదొలిగితే చాయ్‌ వాలా హయాంలో ఈ సబ్సిడీలు తగ్గాలి కదా, చాయ్‌ రేటు కూడా పెరిగిపోయిందా లేదా ? అవే దివాళా కోరు ఆర్ధిక విధానాలు, అంతకంటే ఎక్కువగా అమలు. అందుకే రెండేళ్లలోనే వైఫల్యాల బాట.

    దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదన్న సామెత తెలిసిందే. అలాగే తమ విధానాలు వైఫల్యం చెందుతాయని నరేంద్రమోడీకి, ఆయనకు మార్గదర్శకంగా వున్న సంఘవపరివార్‌కు తెలియని విషయమేమీ కాదు. అందుకే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నరేంద్రమోడీ మౌన వ్రతం పూనారు. ఏ ఒక్క కీలక సమస్యపైనా మాట్లాడరు. మరోవైపు వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు అనేక అంశాలను ముందుకు తెస్తున్నారు.

   వాటిలో స్వచ్చభారత్‌ ఒకటి. నిజమే దీనితో విబేధించాల్సిన అవసరం లేదు. దీని గురించి కొండంత రాగం తీశారు.ఎక్కడ చూసినా అశుభ్రం తప్ప మరొకటి కనపడటం లేదు. చరిత్రలో ఔరంగ జేబు అనేక పన్నులు చివరికి తల పన్ను కూడా విధించాడని చదువుకున్నాం. ఈ ఆధునిక ఔరంగజేబు మురికి పన్ను విధించేందుకే ఇంత ప్రచారం చేశారనేది ఇప్పుడు రుజువైంది. రెండవది అనధికారిక ఎజండాగా గో సంరక్షణ అంశాన్ని ముందుకు తెచ్చారు. దీని గురించి ఎవరి నమ్మకాలు వారికి వున్నాయి. రోజూ గోమూత్రం తాగే వారు కూడా వున్నారు. తాగనివ్వండి, అనారోగ్యం పాలు కానివ్వండి, కార్పొరేట్‌ అసుపత్రులకు లక్షల రూపాయలు సమర్పయామి చేసుకోమనండి. అది వేరే విషయం.

   మన దేశంలో ఆస్తికులతో పాటు నాస్తికులు కూడా సహజీవనం చేశారన్నది పదే పదే చెప్పుకోనవసంర లేదు. ఆరేడు వందల సంవత్సరాల నాడే యోగి వేమన గొప్ప హేతువాది, నాస్తికుడు. అంతకు ముందు చార్వాకులు,లోకాయతులు వున్నారు. అలా భిన్నఅభిప్రాయం వుండటమే, సహన భావమే మన భారతీయ సంస్కృతి. లేకుంటే భిన్న ఆచారాలు, ఆలోచనలు,తత్వ శాస్త్రాలు మనుగడలో వుండేవే కావు. ఆ పరంపరలోనే కర్ణాటకలో కలుబుర్గి అనే రచయిత అనేక రచనలు చేశాడు. వాటికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి కూడా ఇచ్చింది. ఆయన రచనలు హిందుత్వకు వ్యతిరేకం అంటూ హిందూ తాలిబాన్లుగా పరిగణిస్తున్నవారు ఒక రోజు కాల్చి చంపారు. తన అవార్డు పొందిన ఒక రచయిత దారుణ హత్యకు గురైతే కనీసం ఖండించటం కనీస సంస్కారం. కేంద్ర సాహిత్య అకాడమీ ఆ పని చేయకపోగా తిరస్కరించింది. అనేక మంది అవార్డు గ్రహీతలు తమ అవార్డులను తిరిగి ఇచ్చి నిరసన తెలిపిన తరవాత గానీ మొక్కుబడిగా ఖండించలేదు. దీని గురించి కూడా కేంద్రం స్పందించలేదు. దీన్ని అవకాశంగా తీసుకొని హిందూతాలిబాన్లు రెచ్చిపోతున్న స్థితి దేశంలో తలెత్తింది. దీనికి కారణం ఏమిటి కేంద్రంలో తమకు అనుకూలమైన సర్కార్‌ వుందనే ధీమా తప్ప మరొకటి కాదు. ఢిల్లీలో యుమునా నది ఇప్పటికే కాలుష్యమైంది. అలాంటి దానిని మరింత కాలుష్యం చేసే విధంగా ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గురువు శ్రీ శ్రీ రవిశంకర్‌ 35లక్షల మందిని సమీకరించే ఒక కార్యక్రమాన్ని తలపెట్టారు. అందువలన పర్యావరణానికి మరింత హాని జరుగుతుందని అనేక మంది పర్యావరణ సంరక్షణ కోరుకొనే వారు ఆందోళన వ్యక్తం చేశారు. వారి వాదన సబబే అని కోర్టు కూడా ఐదు కోట్ల రూపాయలు పరిహారంగా చెల్లించాలని తీర్పు చెప్పింది. అలాంటి సభలకు పశ్చిమ దేశాలలో అనుమతి ఇవ్వరని వేరే చెప్పనవసరం లేదు. కానీ దానికి అభ్యంతర పెట్టటమే తప్పు దేశద్రోహం అన్నట్లుగా విమలేందు ఝా అనే కార్యకర్తపై ఓంజీ అనే ఒక స్వామి రెచ్చిపోతూ హేతువాది నరేంద్ర దబోల్కర్‌, గోవింద పన్సారే, కలబర్గిల మాదిరే నిన్ను హత్య చేస్తాం, నువ్వొక సిఐఏ ఏజంట్‌,ద్రోహివి, జాతి వ్యతిరేకివి అంటూ కెమెరాల ముందే బెదిరింపులకు దిగాడు. వీరు స్వాములా ? గూండాలా ? ఏ దమ్ము చూసుకొని ఇలా ప్రవర్తిస్తున్నారు?

   ఒక ముస్లిం కుటుంబం పండుగ సందర్భంగా గొడ్డు మాంసం తెచ్చుకొని వండుకోవటమేమిటి? అది గో మాంసం అని కొందరు దేవాలయ మైకులో ప్రకటించటం, వందలాది మంది ఆ ఇంటిపై దాడి చేసి కుటుంబ యజమానిని హత్య చేయటం మధ్య యుగాలలోనో అంతకు ముందు ఆటవిక యుగంలో చేసే పని తప్ప మరొకటి కాదు. తీరా అది గోమాంసం కాదని తేలింది. దేశమంతటా దాని గురించి ఆవేశకావేషాలను రెచ్చగొట్టింది ఎవరు ? ఆ సామూహిక హత్యకు పాల్పడిన నేరగాళ్లను అరెస్టు చేస్తే దానికి వ్యతిరేకంగా బిజెపి వారు రంగంలోకి రావటాన్ని బట్టి దీని వెనుక వారి పధకమే వుందని జనం అనుకున్నారు.దేశమంతటా చర్చనీయాంశం అయింది, దాని గురించి మాట్లాడవయ్యా అంటే మోడీ నోరు విప్పరు.

   అప్జల్‌ గురు అనే వుగ్రవాది నాయకత్వంలో పార్లమెంట్‌పై దాడి జరిగిందని కోర్టు తీర్పు చెప్పి వురి శిక్ష విధించింది. అసలు వురిశిక్షలనే వ్యతిరేకిస్తున్నవారు మన దేశంలో వున్నారు. వురి శిక్ష పడిన ఎవరైనా క్షమా భిక్ష కోసం దరఖాస్తు చేసుకోవటానికి చట్టం అవకాశం ఇచ్చింది. వారు వుగ్రవాదులా మరొక దారుణం చేసిన వారా అనేది ఎక్కడా లేదు. ఆ విధంగా చూసినపుడు అప్జల్‌ గురుకు తగిన అవకాశం ఇవ్వకుండా తొందరపాటుతో వురి తీశారని కొందరు అభిప్రాయ పడుతున్నారు. అదే అభిప్రాయంతో హైదరాబాదు సెంట్రల్‌ యూనివర్సిటీలో కొందరు విద్యార్ధులు సభ పెట్టారు. ఆ వురిని ఖండించారు.అలాంటి సభలు కాశ్మీర్‌లో, దేశంలోని అనేక ప్రాంతాలలో అనేక జరిగాయి. ఇష్టం వున్న వారు పాల్గొన్నారు. లేనివారు లేదు. కానీ అలాంటి సభ జరపజరపటం దేశ ద్రోహం, విశ్వవిద్యాలయ దేశ ద్రోహ కార్యకలాపాలకు నిలయంగా మారింది చర్యలు తీసుకోండంటూ ఇద్దరు కేంద్రమంత్రులు లేఖలు రాయటం వారిని మెప్పించేందుకు ఐదుగురు దళిత విద్యార్ధులపై చర్యలు తీసుకోవటం, వారిలో ఒకరైన వేముల రోహిత్‌ ఆత్మహత్య చేసుకోవటం తెలిసిందే. తీరా అది కేంద్ర ప్రభుత్వం, బిజెపి మెడకు చుట్టుకోవటంతో ఆ సమస్యను పక్కదారి పట్టించేందుకు అసలు రోహిత్‌ దళితుడు కాదు బిసి అని బిజెపి అనుబంధ ఎబివిపి వారు ఒక తప్పుడు ప్రచారం ప్రారంభించారు.

    అప్జల్‌గురు వురితీయటం సరైంది కాదు అన్న అభిప్రాయం వ్యక్తం చేయటమే దేశద్రోహమైతే అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయటమే కాదు, గురు అస్తికలను కాశ్మీర్‌కు అందచేయాలని కోరిన కాశ్మీర్‌లోని పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ(పిడిపి)తో కలసి బిజెపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేసింది? అది దేశ ద్రోహం కాదా ? కాశ్మీర్‌లో వేర్పాటు వాదానికి గురైన ప్రతి ఒక్కరూ అప్జల్‌ గురు వురిని వ్యతిరేకిస్తారు.అందరినీ దేశద్రోహులు కింద జమకట్టి చర్యలు తీసుకుంటారా ?

   ఈ వుదంతం సద్దుమణగ ముందే ఢిల్లీలోని జెఎన్‌యులో మరో చిచ్చు రేపారు. అక్కడ కూడా అప్జల్‌ గురు వురి మీదే కొంత మంది సాంస్కృతిక కార్యక్రమం పేరుతో ఒక సభను ఏర్పాటు చేశారు. దానికి విశ్వవిద్యాలయ అధికారులు అనుమతించారు. చివరి నిమిషంలో ఏబివిపి జోక్యం చేసుకొని అ సభ జరగటానికి వీల్లేదు అంటూ అభ్యంతర పెట్టింది. దాని వత్తిడికి లొంగి పోయిన అధికారులు అనుమతిని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. దాంతో సభ నిర్వాహకులు విశ్వవిద్యాలయంలోని ఇతర విద్యార్ధి సంఘాలు, విద్యార్ధి యూనియన్‌ నాయకులను కలసి సభ జరుపుకొనేందుకు తమకు సహకరించాలని సాయం కోరారు. ఈ రోజు ఏబివిపి వత్తిడితో ఈ సభ అనుమతిని రద్దు చేసిన వారు రేపు తమ సభలనైనా అడ్డుకుంటారనే భయంతో అన్ని సంఘాలు ఏకమైన ముందు ఇచ్చిన అనుమతి ప్రకారం సభ జరుపుకొనేందుకు అనుమతి ఇవ్వాలని వత్తిడి తెచ్చాయి. దాంతో లౌడ్‌ స్పీకర్లు లేకుండా సభ జరుపుకోవచ్చని అధికారులు

  షరతులతో అనుమతి ఇచ్చారు. అయితే ఆ సభను అడ్డుకోవాలని ఎబివిపి నిర్ణయించి తమ మద్దతుదార్లను సమీకరించటంతో సభ ప్రాంగణంలో మిగతా విద్యార్ధి సంఘాల కార్యకర్తలు కూడా అక్కడే వున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. జెఎన్‌యు వివిధ భావజాలలను స్వేచ్చగా చర్చించుకొనేందుకు అనువైన వాతావరణం ఒక నిజమైన ప్రజాస్వామిక కేంద్రం. ఇక్కడ వామపక్ష వాదులు, నక్సలైట్లు, వేర్పాటు వాదులు, అరాజకవాదులు, ఇతర అన్ని రకాల భావజాలంతో వుండే విద్యార్ధులు వున్నారు. అలాంటి వారిలో కాశ్మీర్‌ వేర్పాటు వాదాన్ని సమర్దించే నక్సలైట్లు, ఇతరులు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన సభను ఏర్పాటు చేశారు. ఆ విషయం విశ్వవిద్యాలయ అధికారులకూ తెలియందేమీ కాదు. వారి భావజాలాన్ని, కాశ్మీర్‌ వేర్పాటు వాదాన్ని వ్యతిరేకించే ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, విద్యార్ధి యూనియన్‌ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ ఆ సభకు ఎందుకు వెళ్లారని అనేక మంది అడగవచ్చు.వివాదాస్పద అంశాలపై సభలు జరగటం అక్కడ కొత్త కాదు. అసలు అధికారులు లేదా శాంతి భద్రతల సమస్య తలెత్త వచ్చని నిఘావర్గాలు హెచ్చరించినపుడు తొలుత అనుమతి నిరాకరించి వుంటే వుంటే అది నిర్వాహకులు- అధికారుల మధ్య సమస్యగా వుండేది. ఏబివిపి రంగ ప్రవేశంతోనే అసలు సమస్య వచ్చింది. షరతులతో కూడిన సభ జరిగింది. దానిలో చేసిన వుపన్యాసాలు, వాటిలోని అంశాలతో మిగతా విద్యా ర్ధి సంఘాలకు ఎలాంటి ప్రమేయం ఏకీభావం లేదు. దానిని ఎబివిపి అడ్డుకోవటంతో అక్కడ గొడవ జరిగింది. కొంత మంది బయటి నుంచి వచ్చిన వారు దేశ వ్యతిరేక నినాదాలు చేశారు. ఇదీ జరిగింది. కానీ చివరికి అది ఎలా మారిపోయింది?

     విద్యార్ధి యూనియన్‌ అధ్యక్షుడు కన్నయ్య, ఇతర విద్యార్ధి సంఘాల నాయకులు అక్కడ చేరి దేశ వ్యతిరేక నినాదాలు చేశారని, అందువల వారిపై దేశద్రోహం నేరం కింద పోలీసులు కేసు బనాయించారు. అనేక మంది విద్యా ర్ధులకు నోటీసులు ఇచ్చారు. వారిలో కొందరు సభా నిర్వాహకులు కూడా వున్నారు.ఇక్కడ చిత్రమేమంటే నిజంగా నినాదాలు ఇచ్చిన వారిలో ఇంతవరకు ఒక్కరంటే ఒక్కరిని కూడా పోలీసులు పట్టుకోలేదు.వీడియోను మార్ఫింగ్‌ చేసి నినాదాలు చేయని వారు చేసినట్లు తయారు చేసిన నకిలీ వీడియోల ఆధారంగా కేసులు బనాయించి కన్నయ్యను అరెస్టు చేశారు. తీరా అవి నకిలీవి, అతను ఆ నినాదాలు చేయలేదని తేలటంతో ఆరునెలల బెయిలు ఇచ్చారు. కన్నయ్యను కోర్టులో హాజరు పరిచినపుడు బిజెపి ఎంఎల్‌ఏ, లాయర్ల ముసుగులో వున్న కొందరు కన్నయ్య మీద, వార్తలను కవర్‌ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టుల మీద దాడులకు దిగారు. కన్నయ్య అరెస్టును ఖండించిన వారందరినీ దేశద్రోహులుగా చిత్రిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు. దాడులను రెచ్చగొట్టారు. మహిళా జర్నలిస్టులను మానభంగం చేస్తామని బెదిరించారు. అన్నింటికంటే దారుణం జెఎన్‌యులో రోజుకు మూడు వేల కండోమ్‌లను వినియోగిస్తారని, మందుతాగుతారని స్వయంగా బిజెపి ఎంఎల్‌ఏ తప్పుడు ప్రచారానికి దిగాడు. అక్కడ చదివే వారిలో ఎబిపివి చెప్పే భారత మాత పుత్రికలు, పుత్రులు కూడా వున్నారని అది వారికి కూడా వర్తిస్తుందనే జ్ఞానం సదరు నేతకు లేకపోయింది. వీటిపై కూడా నరేంద్రమోడీ ఇంతవరకు నోరు విప్పలేదు.అందుకే దేశంలో ఏం జరుగుతోంది, ఎటు పోతోంది అని ప్రతివారూ ఆలోచించాల్సిన తరుణం ఇది. బిజెపి పూర్వీకులు స్వాతంత్య్ర వుద్య మ సమయంలో బ్రిటీష్‌ వారికి సలాంగొట్టి లొంగిపోయి లేఖలు రాసిన చరిత్ర కలిగిన వారు. అందుకే భగత్‌ సింగ్‌, రాజగురు,సుఖదేవ్‌లను వురితీసినపుడు వారెక్కడ వున్నారన్న ప్రశ్నకు సమాధానం లేదు. అలాంటి వారు దేశభక్తి గురించి పాఠాలు చెబుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందువలన ఏది దేశభక్తి, ఏది దేశ ద్రోహం అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. చర్చించాలి. విదేశీ కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలు పన్ను రాయితీలు ఇవ్వటం, మన సొమ్మును విదేశాలకు తరలించుకుపోనివ్వటం ప్రభుత్వ విధానంగా వుంది.ఇది దేశద్రోహమా దేశ భక్తా ?ఈ విధానాన్ని ఎవరైనా విమర్శిస్తే ఇప్పుడున్న బ్రిటీష్‌ కాలం నాటి చట్ట ప్రకారం దేశద్రోహ నేరం కింద జైల్లో పెట్ట వచ్చు.జర్మనీలో హిట్లర్‌ కూడా దేశ భక్తి, జాతీయ వాదంతోనే రెెచ్చగొట్టి తనను వ్యతిరేకించిన వారిని మారణకాండకు బలిచేశాడు. ఇప్పుడు మనదేశంలో కూడా నేను చెప్పిందే దేశభక్తి కాదని కాదన్న వారిని ఖతం చేస్తా అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఇప్పుడు మనకేమీ ముప్పులేదులే అని ఎవరైనా అనుకుంటే మనదాకా వచ్చినపుడు అయ్యో పాపం అనేవారుండరు .

Share this:

  • Tweet
  • More
Like Loading...

పటేల్‌కు పెద్ద పీట, అంబేద్కర్‌కు నిరాదరణ, నెహ్రూకు అవమానం

04 Thursday Feb 2016

Posted by raomk in BJP, Communalism, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Ambedkar, Jawaharlal Nehru, Modi, Modi Sarkar, Sardar patel

సత్య

ఆధునిక భారత నిర్మాతలలో పెద్దలు ఎవరంటే బహుశా వేదాల్లోంచి తీసిన బిజెపి వేద గణిత స్కేలు ప్రకారం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఎత్తుగా కనిపించి వుంటారు. అందుకే ఆయనకు పెద్ద పీట వేసిందేమో ! గతేడాది అంబేద్కర్‌ 125వ జయంతి, జవహర్‌లాల్‌ నెహ్రూ 125వ జయంతి, వల్లభాయ్‌ పటేల్‌ 75వ వర్ధంతి లేదా 140వ జయంతి గతేడాది వచ్చింది. సహజంగానే అంబేద్కర్‌ 125 జయంతి ని ఒక ప్రత్యేకత సంతరించే విధంగా జరుపుతారని భావిస్తారు. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశం జరిపి ఆ తంగాన్ని ముగించారు. కానీ గతేడాది అక్టోబరు-డిసెంబరు మాసాలలో నరేంద్రమోడీ ప్రభుత్వ తీరు తెన్నులపై సమాచార హక్కు కార్యకర్త శాయి వినోద్‌కు ఎక్కడో తేడా కనిపించింది. రంగంలోకి దిగి సమాచారాన్ని సంపాదించారు.

సర్దార్‌ పటేల్‌ 140 జయంతి(అక్టోబరు 31) సందర్బంగా కేంద్ర ప్రభుత్వ డిఎవిపి సర్దార్‌ పటేల్‌పై ఎనిమిది కోట్ల రూపాయల విలువగల ప్రకటనలు 1,525 విడుదల చేయగా అంబేద్కర్‌పై కోటీ 59లక్షలతో 156, నెహ్రూపై 5.33లక్షలతో నాలుగు ప్రకటనలు విడుదల చేసినట్లు తేలింది. నవంబరు 14ను బాలల దినోత్సవంగా కూడా ఎప్పటి నుంచో జరుపుతున్నారు. గతేడాది విచిత్రమేమంటే ఆ సందర్బంగా నెహ్రూ చిత్రం లేకుండా రాష్ట్రపతి, ప్రధాని బొమ్మలతో కూడిన ప్రకటనను కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ అవార్డుల బహుకరణ పేరుతో విడుదల చేసింది.

వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లుగా బిజెపి పరిస్ధితి తయారైంది. వాస్తవానికి వల్లభాయ్‌ పటేల్‌ను దేశం ఎప్పుడో మర్చిపోయింది. కానీ ఆయనను తిరిగి జనజీవన స్రవంతిలోకి తేవటానికి బిజెపి చేయనియత్నం లేదు.కారణం ఆయన కాంగ్రెస్‌లో మిత, మతవాదులకు దగ్గరగా వుండటమే. అయితే గదేడాది కేంద్ర ప్రభుత్వ ప్రకటనలతో పాటు అనేక కార్యక్రమాలతో పటేల్‌ను ప్రముఖంగా ప్రచారంలోకి తెచ్చింది బిజెపి, ఇంత జరిగాక గతేడాది డిసెంబరులో జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలలో పట్టణ ప్రాంతాలలో ఏదో గెలిచినా గ్రామీణ ప్రాంతాలలో బిజెపి బొక్కబోర్లా పడింది. పటేల్‌ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు బిజెపి జిమ్మిక్కులకు మోసపోకపోగా దిమ్మదిరిగే దెబ్బ కొట్టారు. మొత్తం 31 జిల్లా పరిషత్‌లకు గాను 23 చోట్ల కాంగ్రెస్‌ గెలిచింది. ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్‌, ఇతర ప్రముఖ రాష్ట్రమంత్రులు ప్రాతినిధ్యం వహించే గ్రామీణ ప్రాంతాలన్నింటా కాంగ్రెస్‌ జెండా ఎగురవేసింది. ఓటమి తప్పదని ముందే మీడియా పేర్కొన్నప్పటికీ నరేంద్రమోడీ-అమిత్‌ షా మంత్రదండాలు అక్కడేమీ పారలేదు. గుజరాత్‌ అధికారాన్ని సోపానంగా చేసుకొని ఢిల్లీ పీఠమెక్కిన నరేంద్రమోడీ దేశంలోని అన్ని రాష్ట్రాలను ఆగబగా కబళించాలని చూస్తున్నారు. అయితే గుజరాతే 2017లో బిజెపి చేజారనుందనే వార్తలు ఆ పార్టీ నేతలకు నిదురపట్టనివ్వటం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏదో జరుగుతోందని అందరికీ తెలుసు ? ఏమిటది ?

29 Friday Jan 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, CHANDRABABU, Modi

మన్మోహన్‌ సింగ్‌ శంకుస్ధాపన – నరేంద్రమోడీ ప్రారంభోత్సవం

ఎంకెఆర్‌

అటు కాకలు తీరిన పాలకపార్టీ పెద్దలు నిండు పేరోలగంలో ప్రతిపాదిస్తే ఇటు తలలు పండిన ఎందరో ప్రతిపక్ష యోధులు ఆమోదించారు. (సిపిఎం మినహా) వారూ వీరూ , వారితో చేరినవారూ చేతులు కలిపి లేదా కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్‌కు పార్లమెంట్‌లో ప్రకటించిన ప్రత్యేక హోదా, లోటు భర్తీకి నిధులు, కొత్త రాజధాని అమరావతి నిర్మాణాలకు ప్రారంభోత్సవంగా భావించి క్యా సీన్‌ హై అనుకోకండి. వట్టిస్తరి మంచినీళ్లు మాత్రమే. శంకస్ధాపన మాదిరి కొన్ని వందల కోట్లు ప్రజాధనం ఖర్చు చేసి అమరావతి తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి నిర్ణయం జరిగినపుడే అంతసీన్‌ లేదని తేలిపోయింది.

ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఆఫ్ఘనిస్తాన్‌ పార్లమెంట్‌ భవనం గురించి. వేసిన అంచనాల కంటే ఎక్కువ కావటం, పనులు ఇంకా పూర్తి గాక పోవటంతో సవరించిన అంచనా ఖర్చు రు.960 కోట్లకు చేరుకోవటంతో బుధవారం నాడు జరిగిన మన కేంద్ర కాబినెట్‌ సమావేశం ఆమోదం తెలిపింది. ఇంకా అయితే తరువాత ఎలాగూ చెల్లిస్తారు లెండి. ఇదేమిటి ఎక్కడి ఆఫ్ఘనిస్తాన్‌ ! ఎక్కడి మోడీ సర్కార్‌ !! వారి పార్లమెంట్‌ భవనం మనం కట్టటం ఏమిటి !!!

ఆఫ్ఘనిస్తాన్‌ సర్వనాశనం కావటానికి కారకులు నూటికి రెండువందల శాతం అమెరికా, దాని చుట్టూ తోకాడించుకుంటూ తిరిగే ఐరోపా ధనిక, సౌదీ అరేబియావంటి అమెరికా తొత్తు దేశాలు. దాన్ని పునరుద్ధరించేందుకు మాత్రం ప్రపంచ దేశాలన్నీ తలాకాస్త సాయం చేయాలంటూ అమెరికా ఆదేశించింది. అదే లెండి దొరగారు తలా కాస్త చేయండి అంటే చేయకపోతే అయ్యగారితో ఎప్పుడు ఏతంటా వస్తుందో, ఎప్పడు ఏ అవసరం వస్తుందో పోయిందేముంది లే అనుకొని మన వాటాగా పార్లమెంట్‌ భవనం నిర్మాణం, మరికొన్ని చేస్తామని మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా వున్నపుడు వాగ్దానం చేసి వచ్చారు. అది సకాలంలో పూర్తిగాక చివరికి డిసెంబరులో పూర్తి కావటంతో 25వ తేదీన ఆఫ్ఘన్‌ అధ్యక్షుడితో కలసి నరేంద్రమోడీ ప్రారంభోత్సవం చేసి వచ్చారు. మిగిలిన ఎలక్ట్రానిక్‌ పరికరాల బిగింపు వంటి ఫినిషింగ్‌ పనులు పూర్తి చేసి ఈ ఏడాది మార్చి 31 నాటికి భవనాన్ని అఫ్ఘన్‌ అధికారులకు అందచేయాల్సి వుంది. అందుకుగాను పెరిగిన ఖర్చుకు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. అంతర్జాతీయ సంబంధాలు సజావుగా కొనసాగటానికి ఎవరి హయాంలో ఏ నిర్ణయం జరిగినా దానిని కొనసాగించటం తరువాత అధికారంలో వున్న వారి బాధ్యత అనుకుందాం. మరి ఆంధ్రప్రదేశ్‌కు పార్లమెంట్‌లో చేసిన వాగ్దానాల మాటేమిటి ? ఆంధ్రులు అంత నోరు లేనివారా ?

కన్నమ్మకు కూడు పెట్టని కొడుకు పిన్నమ్ముకు ఒంటి నిండా బంగారు ఆభరణాలు తొడిగిస్తా అని చెప్పినట్లుగా చ ంద్రబాబు నాయుడు, బిజెపి నాయకులు హైదరాబాదు కార్పొరేషన్‌ ఎన్నికలలో కురిపించని వాగ్దానాలు లేవు. హైదరాబాదు నుంచి ఏటా 45వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోందంటే ఆ శ్రమ తనదే అని చంద్రబాబు నాయుడు చెప్పారు, నైజాం నవాబులు హైదరాబాదును 400 సంవత్సరాలలో, బ్రిటీష్‌ వారు సికిందరాబాదును 200 సంవత్సరాలలో తీర్చిదిద్దితే ఈ రెండింటికీ ప్రపంచ పటంపై కేవలం తొమ్మిది సంవత్సరాలలోనే ఎనలేని కీర్తి తెచ్చి పెట్టానని, హైటెక్‌ సిటీని కేవలం 15నెలల్లోనే నిర్మింపచేయించిన ఘనత తనదేనని, తాను ఆనాడు అభివృద్ధి చేయకపోయి వుంటే ఈ రోజున తెలంగాణా ప్రభుత్వానికి సంక్షేమ పధకాలు అమలు జరపటం సాధ్యమయ్యేది కాదని చంద్రబాబు హైదరాబాదు వీధుల్లో చెప్పారు. అంతేనా ! కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పధకాల్లో తెలంగాణాకు అన్యాయం జరగకుండా చూస్తానని, అవసరమైతే ప్రధాని మోడీని ఒప్పించి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని మరీ చెప్పారు. పిట్టల దొర గుర్తుకు రావటం లేదూ ?

ఈ వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వారికి కూడా తెలిసి వుంటే బాబ్బాబు….. ఐదు సంవత్సరాలలో ఇప్పటికే మూడోవంతు అయిపోయింది. లేస్తే మనిషిని కాను అని దారిన పొయ్యేవారిని బెదిరించి దండుకున్న కుంటి మల్లయ్య కధ మాదిరిగాక ముందే కొత్తవి రాకపోతే పోయే చేసిన వాగ్దానాల అమలుకు కేంద్రాన్ని ఒప్పిద్దురూ మీకు పుణ్యముంటుంది అని ఆంధ్రప్రదేశ్‌ జనాలు పోకిరి సినిమాలో మాదిరి విజయవాడ రాగానే చంద్రబాబు వెంట బడటం ఖాయం.

రాజధాని అమరావతి శంకుస్ధాపన కార్యక్రమానికి వచ్చినపుడు తాను కూడా దాని నిర్మాణానికి కొంత విరాళం ప్రకటిద్దామని అనుకున్నానని, అయితే ప్రధాని మోడీ అంతటి వ్యక్తే పిడికెడు మట్టి, కుండెడు నీళ్లు ఇచ్చినపుడు తాను విరాళం ప్రకటిస్తే తెలంగాణాపై మోడీ ఎక్కడ మరింత కక్ష పెంచుకుంటాడోనని తాను ప్రకటించలేదని, అయినా అమరావతికే దిక్కులేదు, హైదరాబాదుకేం వరాలిస్తారని అటు బిజెపిని ఇటు తెలుగుదేశం పార్టీని తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గాలితీశారు. వెంకయ్య(నాయుడు) ప్రాసకోసం ఎన్నయినా మాట్లాడతాడు, అలా మాట్లాడటం నాకూ వస్తుంది, ఆయనకంటే తెలుగు సాహిత్యం నాకే బాగా వచ్చు అని కూడా చెప్పారు.

ఏ దేశం వెళితే అక్కడి తెలుగు వారిని, భారతీయులను పొగడటం, మీరే ఆ దేశాలను పెంచి పోషిస్తున్నారన్నట్లుగా చెప్పటం చంద్రబాబు బ్యాండు బృందానికి బాగా వచ్చు. కానీ ఆయన మాత్రం సావిత్రీ నీ పతి ప్రాణంబు దక్క మరొక్క వరం కోరుకో అని యమధర్మరాజు చెప్పినట్లుగా తెలుగువారి రాజధాని నిర్మాణ రూపకల్పన బాధ్యత మాత్రం తెలుగు వారికీ ఇవ్వలేదు, భారతీయులకు ఇవ్వలేదు. ఎంత రాష్ట్ర భక్తి, ఎంత దేశ భక్తి ? పోనీ మనవారేమైనా తక్కువ వారా ?

మయసభకు ప్రతిరూపాన్ని నిర్మించారే, ప్రపంచ స్దాయి కట్టడాలకు ఏ విషయంలో తక్కువ తిన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో భారతీయులు నిర్మించిన నూతన పార్లమెంట్‌ భవనం ప్రపంచంలో అత్యుత్తమ పార్లమెంట్‌ భవనాలలో ఒకటిగా భావిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో వున్న అరాచక పరిస్దితులు, భద్రతా సమస్యల కారణంగా 2009లో ప్రారంభమై 2012లో పూర్తి కావాల్సింది 2015 వరకు సాగింది.దీనిలో ప్రధాన ఆకర్షణ ఏమంటే 17.15 మీటర్ల ఎత్తుండే కంచు గుమ్మటం ఆసియాలోనే పెద్దదట. ఇక భవనం లోపలా బయటా ఆకర్షణలు చూడాల్సిందే తప్ప వర్ణించనలవి కాదట. ఇంత మంచి కన్సల్టెంట్స్‌, నిర్మాణ కంపెనీలు, నిపుణులైన పనివారు మన దగ్గర వుండగా అందునా మేకిండియా పిలుపు ఇచ్చిన ప్రధాని కేంద్రంలో వుండగా రాజధాని అమరావతిని సింగపూర్‌ వారికి ఎందుకు కట్టబెట్టినట్లు ? నీకిది నాకది అని పక్కా అవగాహనలతో పంచుకొనే రోజుల్లో ఏది ఎందుకు జరుగుతుందో ? గొర్రెల గోత్రాలు కాపరులకే ఎరుక అన్నట్లు అలాంటి విషయాల్లో పండిపోయిన వారే చెప్పాలి. కాకపోతే అలాంటి వారికి విస్వసనీయత వుండదు, అందరికీ తెలుసు ఏదో జరుగుతోందని. అదేమిటి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

What the Muslims Who Are Not On His Mind Tell Us About Modi

05 Saturday Dec 2015

Posted by raomk in BJP, Communalism, Current Affairs, NATIONAL NEWS

≈ 1 Comment

Tags

Modi, Muslims

BY JYOTI PUNWANI

Believe it or not, Imran Khan, Noor Jahan and Javed Ahmed are not the only individuals mentioned by Prime Minister Narendra Modi in his speeches and ‘Mann ki Baat’ broadcasts. Sunil Jaglan, Haryana ex-sarpanch, was mentioned once in his radio show and then again at Wembley stadium, London. And in the same November 29 broadcast where Noor Jahan and Javed Ahmed were mentioned, Jamuna Mani Singh found an honourable mention too.

Jamuna who? Why is it that only the first three names have stayed in mind? Not just because of their achievements. Few would remember what Alwar’s Imran Khan did to earn praise from Modi. By next month, Noor Jahan and Javed Ahmed’s achievements would be forgotten too. But their names will not, or at least, their Muslim identity will not.

This was the man who was chief minister when those who shared his ideology massacred Muslims across his state. Now, as prime minister, he chooses to praise Muslims. If that’s not news, what is? No wonder that the media has gone after these unknown Muslims much more enthusiastically than it has pursued the others mentioned by him.

Sunil Jaglan was already famous for his “selfie with daughter’’ campaign before Modi praised him. But few people outside Haryana may remember that he has been mentioned by Modi not once, but twice.

As for Jamuna Mani Singh, only two mainstream English newspapers – one from Kolkata, and one from the south – bothered to trace out this ASHA worker in Odisha’s Balasore district. The rest who chased her belonged to the Odia media.

It’s not as if Jaglan and Jamuna Mani Singh’s achievements are insignificant compared to those of Khan, Noor Jahan and Ahmed. Both had the guts to go against the norm in their villages. Jaglan fought Haryana’s male-dominated, misogynist society, known to regard women as the dirt beneath their feet, and he did so in his village. Jamuna had to persuade tribals in her village to give up age-old beliefs in animal sacrifice as a way of fighting illness, and turn instead, to modern medicine to fight malaria, an illness that’s routinely fatal for tribals. Any medical worker who’s worked among tribals knows how tough that is. Jamuna succeeded; there have been no malaria deaths in her village for the last two years.

Yet, it’s the Muslims who stay in mind.

It’s unfortunate for Khan, Noor Jahan and Ahmed to be remembered not for what they’ve achieved, but for the accident of their birth. For their feats are indeed noteworthy. Imran Khan, who teaches mathematics in a Sanskrit school in BJP-ruled Rajasthan, developed 52 learning Apps – learning how to do so on his own – for his deprived rural students. Noor Jahan, even at 70, rents out solar lamps for a mere Rs 3 a day to her electricity-starved villagers near Kanpur. Javed Ahmed, rendered paralysed waist downwards by a militant’s bullet in Kashmir when he was just 21, turned his life around by teaching poor children and then started a school for disabled children.

For these three, who’ve worked quietly without craving attention, praise by the PM represents the acme of achievement. As it does for their families and indeed, their entire village. The same applies for Jaglan and Jamuna Mani Singh.

Yet, there’s a difference. The immediate reaction that takes place after their names and work are lauded by the PM has been different for the former. Local BJP leaders promptly land up at their door, and are photographed congratulating them. Widowed 20 years back, Noor Jahan told reporters she could do with more solar lamps to meet the village’s growing demand – she has just 50 now. What she did get instead was a clock with Modi’s face, a shawl and a garland, from BJP Kanpur chief Surendra Maithani, and a vague promise of “financial help from the Centre.’’ Imran Khan was offered a job by the government and felicitated by the state education minister. Jamuna, on the other hand, wasn’t deemed worthy of an immediate visit by the Odisha unit of the BJP. Surely as an opposition party, the BJP would have benefitted more by a photo-op with Jamuna.

A lot of research must go into finding individuals deemed worthy of being mentioned by the PM in his speeches. There are thousands of such unsung heroes in our villages. So who Modi talk’s about reflects a deliberate choice. At any rate, this PM is not known for spontaneous gestures (the one that has stood out is his almost reflex rejection of a Muslim topi offered by a maulana in Gujarat.)

So what’s the message Modi is trying to send out when he mentions Muslims in his Mann ki Baat broadcasts, which are touted as his way of communicating directly to the people? That all that talk of him being anti-minority is just ‘sickular’ propaganda? That he is indeed appreciative of the community?

But then, why the silence when a Muslim is killed by a mob driven mad by their belief in Hindutva and their hatred for Muslims – be it Mohsin Shaikh in Pune, or Mohammed Akhlaq in Dadri? Why his silence when cabinet colleagues and other important party members abuse Muslims? Why did he refer to them as the “other community’’ in his Bihar campaign? Why did his prime ministerial campaign have graphic references to the way animals are killed and their pink flesh exported, or to those illegal immigrants out to grab :your’’ jobs (in Assam), or the regret that “your’’ women are not safe (in UP where “protection of our bahu-beti’’ was the driving force behind Jat violence against Muslims in Muzaffarnagar)?

The late Shiv Sena chief Bal Thackeray had the habit of listing Muslims whom he approved of as patriotic, while the rest were deemed not up to the mark. Everyone knows what his “boys’’ did to the rest in Mumbai, in 1984, and then in 1992-93. Modi seems to be following in his footsteps. “My India lives in Imran Khan,’’ Modi declared in Wembley to an adoring crowd. “And it dies with Mohammed Akhlaq,” if only he could have added.

Above article appeared in WIRE.com

Share this:

  • Tweet
  • More
Like Loading...

Modi’s gold deposit scheme attracts only 400 grams so far

19 Thursday Nov 2015

Posted by raomk in NATIONAL NEWS

≈ Leave a comment

Tags

gold deposit scheme, Modi

NEW DELHI | BY MANOJ KUMAR

A gold deposit scheme launched amid fanfare by Indian Prime Minister Narendra Modi two weeks ago has so far attracted only 400 grams, an industry official said on Thursday, out of a national hoard estimated at 20,000 tonnes.

Modi has urged Indians to put gold stashed in homes and temples in the bank, offering modest rates of interest that earlier schemes have lacked. His government has also launched ‘paper’ gold in the form of gold-backed bonds.

A shortage of centres to assay the gold being put on deposit is a problem that the government has agreed to address, said Anil Sankhwal, the northern regional chairman of India’s Gem and Jewellery Export Promotion Council.

“Only 400 grammes have been deposited so far,” Sankhwal told reporters after meeting financial ministry officials. “The government has agreed to review the scheme and open more centres for gold testing and depositing in banks.”

Indians have a deep attachment to gold, which they value not just as a wedding gift but also as a way to keep wealth away from the prying eyes of tax collectors.

That, say experts, will make it a challenge to wean them off the yellow metal and put the vast store of wealth to work in India’s undersized financial system, funding investments that Modi hopes would promote economic growth and create jobs.

A finance ministry official said the government had agreed to increase the number of testing centres and refineries involved in the scheme. There are 29 testing centres and four refineries currently accredited to it.

The number of testing centres would increase to 55, and refineries to 20, by the end of the year.

Another scheme, to mint India’s own series of gold coins, is going a bit better than the deposit scheme.

Buyers have acquired 6,200 of the Ashoka Chakra coins – which carry the symbol of a 24-spoke circle that also graces the Indian national flag and has its origins in Buddhism.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బుర్రకు పని పెట్టకుండా చెవులప్పగిస్తే …………

19 Thursday Nov 2015

Posted by raomk in Current Affairs, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Bihar results, Modi, Nithish, prashant kishor

సత్య

         చెప్పేవాడికి వినేవాడు లోకువ. బీహార్‌ ఎన్నికల తరువాత మీడియా, రాజకీయ వర్గాలను ఒక వ్యక్తి ఆకర్షించారు. అతనే ప్రశాంత కిషోర్‌. ప్రజారోగ్య నిపుణుడిగా గుజరాత్‌లో అడుగుపెట్టి ముఖ్యమంత్రి నరేంద్రమోడీ దృష్టిని ఆకర్షించి గతేడాది లోక్‌సభ ఎన్నికలలో మోడీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టిన మేధావి అన్నారు. ఆలాంటి వ్యక్తి ఏమైందో ఏమిటో ఏడాదిలోనే మోడీ ఇంటి నుంచి బయటకు వచ్చి బీహార్‌ నితీష్‌ కుమార్‌ ఇంట్లో చేరారు. కిషోర్‌కు ఎవరిదగ్గరైనా పని చేస్తే ఆయన వారిండ్లలోనే వుంటారట. అంతటి మోడీని బీహార్‌ ఎన్నికలలో మట్టి కరిపించిన అపర చాణక్యుడిగా మీడియాలో నీరాజనాలందుకున్నాడు. విజయం సాధించిన తరువాత నితీష్‌ కుమార్‌ బహింరంగా మీడియా ముందు సంతోషం పట్టలేక ఆలింగనం చేసుకున్న తరువాత అదింకా పెరిగి పోయింది. మా ఇంటికి రమ్మంటే మాయింటికి రమ్మని అనేక కాంగ్రెస్‌తో సహా అనేక రాజకీయ పార్టీలు, పదవుల కోసం అర్రులు చాస్తున్న నాయకులు ఆహ్వానాలు పంపుతున్నారట. ఎంత కావాలంటే అంత డబ్బు తీసుకోమని సందేశాలిస్తున్నారు.

      నరేంద్రమోడీని అందలమెక్కించిన వ్యక్తి అదే మోడీకి బీహార్‌లో పరాభవంపొందే వ్యూహం రచించాడంటే తమ కంటే ఎంతో తెలివిగల వాడు కాకపోతే ఎలా సాధ్యం అని మీడియా పండితులు తలలు పట్టుకొని వుండవచ్చు. ఎందుకంటే ప్రజల నాడి తమకు తప్ప ఇతరులకు తెలియదన్నట్లు ఫోజు పెడుతూ బీహార్‌లో ఎన్‌డిఏకు అధికారం వచ్చేసినట్లే ఎక్జిట్‌ పోల్స్‌ ప్రకటించటమే కాదు, ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తరువాత కూడా మొదటి గంటలో బల్లగుద్ది బిజెపి నేతలతో సీట్లు పంపిణీ చేయించి కొన్ని చోట్ల పటాసులు కూడా కాల్పించిన ఘనులు కదా ! అలాంటి వారు ఇప్పుడు ప్రశాత కిషోర్‌ ఎవరికి ప్రశాంతత లేకుండా చేస్తాడా అని ఊహాగానాలు చేస్తున్నారు.

అందమైన వారికి బుర్ర వుండదంటారు.మనకు రంగుల లోకం చూపించే మీడియా కూడా అందమైనదే కదా, అందుకే జనం దాసోహం అవుతున్నారు. దానికి బుర్రేకాదు, జ్ఞాపకశక్తి కూడా తక్కువే వున్నట్లుగా మనకు అది అందించే సమాచార తీరుతెన్నులు వెల్లడిస్తాయి.లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మనకు చెప్పిందేమిటి? మోడీలోని సగభాగం వంటి అమిత్‌ షా అనే ఒక గుజరాత్‌ స్ధానిక నాయకుడు పెద్ద జాతీయ వ్యూహం పన్నాడని, రాజకీయాలతో సంబంధం లేదని, తమది కేవలం సాంస్కృతిక సంస్ధ మాత్రమే అని చెప్పుకొనే ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యూహకర్తలు మోడీని ప్రధాని గద్దెపై కూర్చుండపెట్టేందుకు తమ సేవకులందరినీ ఎన్నడూ లేని విధంగా ఇంటింటికీ తిప్పారని, ఓట్లు పోగేసి మోడీకి తిరుగులేని మెజారిటీ చేకూర్చి పెట్టారని అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్లు చెబితే ఎంతశాతం అనేది పక్కన పెడితే నోట్లో వేలేసుకొని మనం విన్నామా లేదా ?

      ఇప్పుడు అదే మీడియాలో వస్తున్నదేమిటి ? బుర్ర, కష్టం తనది అయితే పేరు మాత్రం అమిత్‌షాకు దక్కిందని ప్రశాంత కిషోర్‌ ప్రశాంతత కోల్పోయాడట. ఇప్పటికే ఇది ఎక్కువ నీ స్ధానంలో నవ్వుండు, అంతకు మించి ఎక్కువ ఆశించవద్దు అన్నట్లుగా నరేంద్రమోడీ తన సగభాగం షాతో సమంగా చూసేందుకు తిరస్కరించారని వినికిడి. దాంతో నంద సామ్రాజ్యాన్ని నాశనం చేయకపోతే నా జడను ముడవను అన్న చాణక్యుడి మాదిరి శపధం పట్టి నితీష్‌ కుమార్‌ ఇంట్లో చేరాడని, సోషల్‌ మీడియా అంటే సదభిప్రాయం లేని నితీష్‌ కుమార్‌ను ఒప్పించాడని చివరకు తన అపరచాణక్యంతో మోడీని దెబ్బతీశారని, దీంతో రానున్న రోజుల్లో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల నేతలందరూ ప్రశాంత కిషోర్‌ చాణక్య వ్యూహాల కోసం క్యూలు కడుతున్నారని మీడియా చెబుతోంది.

      ఇక్కడ ప్రశాంత కిషోర్‌ గురించి మరికొన్ని విషయాలు చెప్పకుండా కధ సంపూర్ణం కాదు. ముందే చెప్పుకున్నట్లు ప్రజారోగ్యరంగంలో ప్రవేశం వున్న కిషోర్‌ జన్మస్ధలం బీహార్‌. తొలుత స్వంత రాష్ట్రం తరువాత తెలంగాణాలో పని చేస్తుండగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ దృష్టిని ఆకర్షించాడు. యూనిసెఫ్‌లో పనిచేయమని అది కోరింది. ఆ మేరకు ఆఫ్రికాలో పని చేశారు. ఆ సమయంలో మన దేశంలో ఆరోగ్య పరిస్ధితి గురించి మన ప్రణాళికా సంఘ నివేదికలు చదివి నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ఒక లేఖ రాశారు. దానిలో గుజరాత్‌ పారిశ్రామికంగా ముందున్నప్పటికీ ఆరోగ్య విషయంలో వెనుక బడి వుందని వ్యాఖ్యానించారు. ఆ లేఖను ప్రధాని కార్యాలయం గుజరాత్‌ ముఖ్యమంత్రికి పంపింది. అప్పుడు మోడీ నివేదికను తెప్పించుకొని వివరాలు తెలుసుకొని కిషోర్‌ ఎక్కడ వున్నారో తెలుసుకోవలసిందిగా తన యంత్రాంగాన్ని ఆ దేశించి తన వద్దకు రప్పించుకొని ప్రజారోగ్యాన్ని మెరుగు పరచేందుకు తోడ్పడాలని కోరారు. ఆ విధంగా 2011లో గుజరాత్‌ వెళ్లిన కిషోర్‌ క్రమంగా మోడీ దృష్టిని ఆకర్షించారు. ఆ మోడీ ఆశ్రయం పొంది చివరికి ఎన్ని కల వ్యూహకర్తగా మారారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ మేధావి సలహాలను అమలు జరిపిన గుజరాత్‌ అరోగ్య రంగంలో దేశంలోని 29 రాష్ట్రాలకు గాను 21 స్దానంలో వుంది. తమిళనాడు,కర్ణాటక,కేరళ మొదటి మూడు స్ధానాలలో వున్నట్లు యూనిసెఫ్‌ సర్వే వెల్లడించింది.పిల్లలకు టీకాలు వేయించటంలో దేశ సగటు 65.2శాతం వుంటే గుజరాత్‌ 56.2శాతం మాత్రమేనని డిఎన్‌ఏ పత్రిక ఈ ఏడాది జూలై ఎనిమిదిన ప్రచురించింది. అంటే మన మేధావి ఈ విషయంలో ఫెయిలయ్యాడని అనుకోవాలా ?

     లోక్‌సభలో నరేంద్రమోడీ నాయకత్వంలో ఎన్‌డిఏ విజయం సాధించటానికి ప్రశాంత కిషోర్‌ ఇచ్చిన సలహాలే కారణమని చెబుతున్నారు. ఈ ఎన్నికలలో బిజెపికి వచ్చిన ఓట్లెన్ని ? కొన్ని చోట్ల మాత్రమే సీట్లు రావటానికి కారణం ఏమిటి ? మిగతా చోట్ల ఆ సలహాలు, వ్యూహం ఎందుకు పని చేయలేదు? దేశంలోని మొత్తం ఓటర్లు 83,41,01,479 ఓట్లకు గాను బిజెపికి వచ్చింది 17,16,57,549 ఓట్లు మాత్రమే అంటే కేవలం 20శాతం. అదే పోలైన ఓట్లలో చూసుకున్నా వచ్చింది 31శాతమే. కానీ సీట్ల పరంగా చూస్తే 52శాతం తెచ్చుకుంది. భారతీయ జనతా పార్టీ ఓట్ల శాతాన్ని చూస్తే వరుసగా పన్నెండవ లోక్‌సభ నుంచి తాజా 16వ లోక్‌సభ వరకు 25.59,23.75,22.16,18.80,31శాతాలుగా వున్నాయి. అంటే గతంలో ప్రశాంత కిషోర్‌ వంటి వారు లేకుండానే బిజెపి గరిష్టంగా 25.59శాతం ఓట్లను తెచ్చుకుంది. ఇప్పుడు అదనంగా మరో ఐదున్నర శాతం పెంచుకుంది. ఈ పెరుగుదలకు కాంగ్రెస్‌ అవినీతి అక్రమాలు, దాని వైఫల్యం కారణాలకు తోడు గుజరాత్‌లో నరేంద్రమోడీ అద్బుతాలు చేశాడనే మీడియా ప్రచారం తోడైంది. అదనంగా బెంగాల్లో ఆరు నుంచి 17శాతానికి కేరళలో ఆరు నుంచి పదిశాతానికి అసోంలో 17 నుంచి 36.5శాతానికి కాశ్మీర్‌లో 18.6 నుంచి 32.4శాతానికి ఓట్లు పెరగటం కూడా తోడ్పడింది.

      నిత్యం స్వదేశీ గురించి జపం చేసే బిజెపి ఎన్నికలలో ప్రచార వ్యూహ నిపుణులను పెట్టుకోవటం విదేశాల నుంచి అరువు ఆయిడియా. గతంలో అలాంటి ఐడియాలో భాగంగానే తమ పాలనలో భారత్‌ వెలిగిపోతోందంటూ బిజెపి, తేళ్లు,జర్రుల వంటి బొమ్మలతో కాంగ్రెస్‌ ప్రచారాలు చేసి బొక్కబోర్లా పడ్డాయి. ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత కుక్కిన పేనులయ్యాయి. నినాదాలు, ఆకర్షణీయమైన కబుర్లు, వుపన్యాసాలను చూసి గతంలో కడుపు నిండిన పశ్చిమదేశాల ఓటర్లు ప్రభావితులైన వుదంతాలు వుండి వుండవచ్చు. ఇటీవలి సంవత్సరాలలో కూడా పాలకవర్గ పార్టీలు అలాంటి నిపుణులు ఇచ్చిన సలహాలు , వ్యూహాల మేరకు అలాగే చేస్తున్నారు, ఓటర్ల ముందు అభాసు పాలౌతున్నారు. వారు అమలు జరిపిన విధానాలు, వాటి పర్యవసానాలు ఏమిటి అని ముఖ్యంగా 2008లో ప్రారంభమైన ధనిక దే శాల ఆర్ధిక సంక్షోభం ప్రారంభం తరువాత జనం చూస్తున్నారు. ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా అధికారంలో వున్న పార్టీలన్నీ దెబ్బతింటున్నాయి. నిపుణుల వ్యూహాలు ఎదురుతన్నుతున్నాయి.

      ఈ పూర్వరంగంలో చూస్తే బీహార్‌లో నిపుణుల వ్యూహాలు ఏమిటన్నది ప్రశ్న. గత లోక్‌సభ ఎన్నికలలో బీహార్‌లో ఎన్‌డిఏ పక్షాలకు వచ్చిన ఓట్ల మొత్తం 39.5 శాతం. జెడియు, ఆర్‌జెడి, కాంగ్రెస్‌కు 39.1శాతం వచ్చాయి. తాజా అసెంబ్లీ ఎన్నికలలో 34.1 బిజెపి కూటమికి , మహాసంఘటనకు 44.1శాతం ఓట్లు వచ్చాయి. పార్లమెంట్‌ ఎన్నికలలో మహాసంఘటన పక్షాలు విడిగా పోటీ చేసి ఓట్లు చీలటంతో బిజెపికి గణనీయంగా సీట్లు వచ్చాయి. పార్లమెంట్‌ ఎన్నికలలో పరాభవం తరువాత కలసి వుంటే కలదు సుఖం అని నితీష్‌ కుమార్‌, లాలూ ప్రసాద్‌, కాంగ్రెస్‌లకు తెలియంది కాదు, ఆ మేరకు గతాన్ని మరిచి పోయి అసెంబ్లీలో కలసి పోటీ చే శాయి. ఈ పార్టీల ఓట్లు గుండుగుత్తగా కూటమి అభ్యర్ధులకు పడతాయని తాము అంచనా వేయలేకపోయామని ఫలితాలు వచ్చిన తరువాత బిజెపి నాయకులు వాపోయిన విషయం తెలిసిందే. ఇరవై స్ధానాలలో ఇతర చిన్న పార్టీలు చీల్చిన ఓట్లతోనే బిజెపి గెలిచింది. అది కూడా లేనట్లయితే బిజెపికి ఇంకా సీట్లు తగ్గేవి. పార్లమెంట్‌ ఎన్నికలలో కాంగ్రెస్‌పై అసంతృప్తితో ఓటు వేసినట్లే ఈ సారి నరేంద్రమోడీ ఏడాదిన్నర కాలంలో వట్టిస్తరి మంచినీళ్లు తప్ప సాధించిందేమీ లేకపోవటాన్ని జనం గమనించారు. రెండవది దాద్రి సంఘటన,కులుబుర్గి హత్యతో అసహన ధోరణులకు వ్యతిరేకంగా రచయితలు తమ అవార్డులను వెనక్కి ఇచ్చి నిరసన తెలపటం, ఇతర మేధావులు కూడా వారికి తోడు కావటం వంటి పరిణామాలన్నీ ఎన్నికల సమయంలోనే జరిగాయి. వీటిపై మోడీ, సంఘపరివార్‌ నేతల రిజర్వేషన్ల వ్యతిరేక వ్యాఖ్యలు తోడ్పడ్డాయి. అందువలన వీటన్నింటినీ విస్మరించి ప్ర శాంత కిషోర్‌ చాణక్యం అని చెప్పటమంటే జనం వివేచన జ్ఞానాన్ని తక్కువ చేసి చూడటమే. అలాంటి నిపుణుల నినాదాలు, ఎత్తుగడల కోసం అర్రులు చాచటమంటే పార్టీలు జనాన్ని మోసం చేసేందుకు మరింతగా ప్రయత్నిస్తున్నాయని అర్ధం చేసుకోవాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

CPI(M) opposes further opening up of FDI in India

13 Friday Nov 2015

Posted by raomk in CPI(M), Current Affairs, Economics, Left politics

≈ Leave a comment

Tags

CPI(M), FDI, Modi

The Polit Bureau of the CPI(M) strongly condemns the announcement by the Prime Minister easing the regulations for Foreign Direct Investments in our country.  15 areas, including single brand retail, banking, construction, media, airlines, defence, banking, plantations etc., are to be opened up for approval under the automatic route.  32 new investment points will now allow FDI automatically.  The cap for approval of foreign investments has been raised to Rs. 5,000 crore from the existing Rs. 3,000 crores. The increase in the FDI to 49 per cent for news channels and radio is particularly harmful as it will facilitate near complete control of the news media by foreign media monopolies.

All these decisions have been taken on the eve of the winter session of the Parliament.  Worse they have been taken even without the Cabinet approval.  This is a complete travesty of our system of parliamentary democracy.  The Polit Bureau of the CPI(M) condemns such unilateral decisions by the PM.

Clearly, these announcements have come on the eve of Prime Minister Modi’s yet another programme of foreign tours to London, G-20, Malaysia and Singapore.  PM Modi made these announcements with an aim to appease foreign capital.  Thus both India’s markets and resources are being opened up further for the maximization of profits for foreign capital.

This license to loot comes at a time when the majority of the Indian people continue to groan under newer economic burdens. Price rise of essential commodities continues unabated. The agrarian distress is deepening.  The increases in the minimum support prices are so meagre that they do not even cover the production costs.  This is accelerating the distress suicides of our farmers.

The Polit Bureau of the CPI(M) calls upon PM Modi and his government to focus attention on providing relief to the vast majority of our Indian people as promised during the 2014 election campaign.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బీహార్‌ బిజెపి ఓటమి పర్యవసానాలు-పునరాలోచనలో దాని మిత్రపక్షాలు

09 Monday Nov 2015

Posted by raomk in BJP, Current Affairs

≈ Leave a comment

Tags

Bihar debacle, Modi

మోడీపై కార్పొరేట్ల ‘సంస్కరణల’ వత్తిడి

బీహార్‌ ఎన్నికలలో ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షాలకు చెప్పుకోలేని చోట దెబ్బ తగిలింది. ఏడాదిన్నర మోడీ పాలనలో ఇదో పెద్ద మలుపు. ఇప్పటికే తాము కోరుతున్న సంస్కరణలను వేగంగా అమలు జరపటం లేదనే అసంతృప్తితో వున్న జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్లు మరింత వత్తిడి పెంచాయి. భారతీయ జనతా పార్టీతో తమ సంబంధాలను ఎన్‌డిఏలోని మిగతా భాగస్వామ్య పక్షాలు సమీక్షించుకోవటానికి ఈ ఎన్నికలు నాంది పలికాయి. దేశంలో పెద్ద ప్రాంతీయ పార్టీగా మారిన కాంగ్రెస్‌కు రానున్న రాష్ట్రాల ఎన్నికలలో మరో పరీక్ష ఎదురుకానుంది. ఈ ఎన్నికలలో మోడీ-షాలతో పాటు వారికి వంత పాడిన కార్పొరేట్‌ మీడియా, ఎన్నికల పండితులు, సర్వే కంపెనీలకు శృంగభంగమైంది.

బీహార్‌ ఎన్నికలలో మోడీ పరాజయం తొలి పర్యవసానం సోమవారం నాడు స్టాక్‌ మార్కెట్‌ సూచీలు, రూపాయి పతనానికి దారి తీసింది. ఇప్పటికే అసంతృప్తితో వున్న కార్పొరేట్‌ శక్తులు రానున్న రోజుల్లో మరింత వత్తిడి పెంచే అవకాశం వుంది. అయితే రాజ్యసభలో మెజారిటీ లేకపోవటంతో మోడీ సర్కార్‌ కార్పొరేట్ల గొంతెమ్మ కోర్కెలను తీర్చలేకపోతోంది. ప్రతిపక్షంగా వున్న కాంగ్రెస్‌ ఈ సంస్కరణలకు అనుకూలమే అయినప్పటికీ ఇప్పుడున్న స్ధితిలో మోడీ సర్కార్‌ సంస్కరణలను బలపర్చటమంటే రాజకీయంగా తన మరణశాసనాన్ని తానే రాసుకొన్నట్లు అవుతుంది. పోయిన ప్రతిష్టను తిరిగి తెచ్చుకోవాలంటే అనివార్యంగా పార్లమెంటులో మోడీ చర్యలను వ్యతిరేకించక తప్పదు. అధికారంలో వున్నపుడు కార్పొరేట్ల సేవలో తరించటం, లేనపుడు శ్రమజీవుల పట్ల కడవల కొద్దీ కన్నీరు కార్చటం బూర్జువా పార్టీల లక్షణం. ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనుల ఓట్లు కొల్లగొట్టేందుకు బాక్సైట్‌ తవ్వకాలను ప్రతిపక్షంలో వున్నపుడు వ్యతిరేకించిన తెలుగుదేశం అధికారానికి వచ్చిన తరువాత ప్లేటు ఫిరాయించటం చూస్తున్నదే. అయితే దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలన్నీ ఇలాంటివే. అందుకే కాంగ్రెస్‌, బిజెపి బలహీనంగా వున్న చోట్ల కార్పొరేట్లు ప్రాంతీయ పార్టీలకు మద్దతు ఇస్తూ అవసరమైనపుడు వుపయోగించుకుంటున్నాయి.

ఎన్‌డిఏలో బిజెపి తరువాత పెద్ద పార్టీ మహారాష్ట్రలో శివసేన. అనివార్యమైన స్ధితిలో బిజెపితో చేతులు కలిపినా నరేంద్రమోడీ బలహీనతలను సొమ్ము చేసుకొనేందుకు అప్పుడప్పుడు తోక జాడిస్తోంది. బీహార్‌ ఎన్నికల సమయంలోనే ముంబై శివార్లలోని ఒక కార్పొరేషన్‌ ఎన్నికలలో బిజెపిని పక్కకు నెట్టి విజయం సాధించింది. బీహార్‌ ఫలితాలు వెలువడగానే నితీష్‌ కుమార్‌ను సూపర్‌ హీరో అని శివసేన నాయకుడు సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించాడు.ఇప్పటిప్పుడు మహారాష్ట్రలో ఎన్నికలు జరిగితే బిజెపి ఓడిపోవటం ఖాయం, మోడీ పలుకుబడి తగ్గిపోయిందని ఆయన నాయకత్వంలో జరిగిన బీహార్‌ ఎన్నికలు స్పష్టం చేశాయని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు.

పంజాబ్‌లోని అకాలీదళ్‌-బిజెపి కూటమిపై కూడా ప్రభావం అనివార్యం. రెండు పార్టీలూ తమ మత అజెండా ప్రకారం పనిచేయటం వాటి మధ్య సయోధ్యకు ఒక కారణం. అయితే వ్యవసాయ రాష్ట్రమైన పంజాబ్‌లో ఇటీవల జరిగిన రైతుల ఆందోళనలు రెండు పార్టీలకు ఒక హెచ్చరిక. మోడీ సర్కార్‌ కార్పొరేట్‌ అనుకూల, రైతు వ్యతిరేకమైనదనే ముద్ర ఇప్పటికే తెచ్చుకుంది. బీహార్‌లో ఒకవేళ గెలిస్తే ఏదో ఒక పేరుతో అకాలీదళ్‌ను వదిలించుకోవాలని బిజెపి చూసిందన్నది బహిరంగ రహస్యం. ఇప్పుడు అకాలీదళ్‌ ఈ అవకాశాన్ని వుపయోగించుకొని బిజెపిని కట్టడి చేయవచ్చన్నది విశ్లేషణ.

మరో ముఖ్యమిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు తన వ్యూహం మార్చుకోవటానికి ఇది నాంది. తన అవసరాలకు తగినట్లు వ్యూహం మార్చటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. గతంలో ఎన్‌డిఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటానికి అతల్‌ బీహారీ వాజ్‌పేయిని చూసి ఇస్తున్నాము తప్ప బిజెపిని చూసి కాదని చెప్పారు. గత ఎన్నికలలో అలాంటి సాకుతో పని లేకుండానే మోడీ పలుకుబడిని వుపయోగించుకోవటానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు అదే మోడీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా గురించి ఏాదిన్నర గడిచినా నోరు మెదపటం లేదు. హోదా లేదనే సంకేతాలు ఇప్పటికే పంపారు. దేశంలో అసహనాన్ని రెచ్చగొట్టటానికి కాషాయ పరివారం చేస్తున్న యత్నాలు, అది వికటించకతప్పదని బీహార్‌ ఫలితాలు నిరూపించాయి. బీహార్‌కు పెద్ద ప్యాకేజిని ప్రకటించిన నరేంద్రమోడీని జనం నమ్మలేదని ఎన్నికల ఫలితాలు నిర్ధారించాయి. పార్లమెంట్‌ సాక్షిగా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాకు బదులు దయాదాక్షిణ్యాలతో కూడిన మెరుగైన ప్యాకేజి ఇస్తామని చెబుతున్న కబుర్లను రాష్ట్ర ప్రజలు ఇంకేమాత్రం విశ్వసించరు. దాంతో చట్టబద్దమైన హోదాకు ప్రజలు పట్టుబట్టే అవకాశం వుంది.ఈ పూర్వరంగంలో రాజధాని అమరావతి, అంతర్జాతీయ స్దాయి పట్టణ రంగుల కల కబుర్లను ఇంక ఎంతో కాలం చెప్పలేరు. బీహార్‌లో మోడీ ఓడిపోవటానికి దారి తీసిన ఇతర కారణాలతో పాటు ఏడాదిన్నర కాలంలో సాధించిన నిర్ధిష్ట విజయాలు లేకపోవటం, వందరోజుల్లో నల్లధనాన్ని వెలికితీస్తామని, ఒక్కొక్కరికి 15-20లక్షల రూపాయలు వస్తాయని చేసిన వాగ్దానం వంటివాటిని విస్మరించారు. బాబొస్తే జాబొస్తుందన్న తెలుగుదేశం నినాదం కూడా అలాంటిదే. వున్న జాబులు పోవటం తప్ప ఇంతవరకు కొత్త జాబులేమీ వచ్చే సూచనలు కనిపించటం లేదు.పైకి బింకంగా వున్నప్పటికీ ప్రస్తుత పరిస్ధితులలో కేంద్రం నుంచి సాధించేదేమీ లేదని చంద్రబాబు అంతర్గతంగా గుబులుతో వున్నారు. తమనేతపై వున్న కేసుల కారణంగా ప్రతిపక్షంగా వున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అంతర్గతంగా నరేంద్రమోడీతో సంబంధాలు కొనసాగిస్తోందన్నది తెలుగుదేశం శ్రేణులు చేసే ఒక ప్రచారం లేదా ఆరోపణ కావచ్చు. ఒక రాజకీయ పార్టీగా వున్నది కనుక ఒకవేళ అలాంటి సంబంధాలు వుంటే ముందు ముందు వారు కూడా జాగ్రత్త పడవచ్చు.

దేశంలో విధానాల ప్రాతిపదికన రాజకీయ సమీకరణలు జరగనంత కాలం బూర్జువా జాతీయ, ప్రాంతీయ పక్షాలు కార్పొరేట్ల సేవలో తరిస్తూనే వుంటాయి. అవకాశ వాద రాజకీయాలు నడుపుతూనే వుంటాయి. వామపక్షాలు బలపడినపుడే వాటి అసలు రంగు బహిర్గతం అవుతుంది. బీహార్‌ ఎన్నికలలో వామపక్షాలు తాము విజయం సాధించలేమని తెలిసినప్పటికీ విధానాల ప్రాతిపదికన సమీకరణకు విడిగా పోటీ చేశాయి. వాటిలో సిపిఎం(ఎల్‌) పార్టీకి మాత్రమే మూడు సీట్లు వచ్చాయి. బూర్జువాశక్తులతో విడగొట్టుకొని తమ బలాన్ని పెంచుకోవటం అన్నది ప్రస్తుతం వామపక్షాల ముందున్న పెద్ద సవాలు. కేరళలో గతవారంలో జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలలో సిపిఎం నాయకత్వంలోని వామపక్ష, ప్రజాతంత్ర సంఘటన (ఎల్‌డిఎఫ్‌)ఘనవిజయాలు సాధించింది. ఐదు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో దానిని కొనసాగించనున్నదని అనేక మంది వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. ఎల్‌డిఎఫ్‌ నుంచి ఆర్‌ఎస్‌పి బయటకు పోయి కాంగ్రెస్‌ గూటిలో చేరింది. కేరళలో వున్న పరిస్దితులో కొన్ని వేల ఓట్లు కూడా ఫలితాలను అటూ ఇటూ చేస్తాయన్న విషయం తెలిసిందే. అక్కడ మత,కుల సంస్ధలు కొన్ని కాంగ్రెస్‌ మరికొన్ని బిజెపి వెనుక చేరి సిపిఎంను దెబ్బతీసేందుకు ప్రయత్నించి బొక్కబోర్లా పడినప్పటికీ పరిమిత ప్రాంతాల్లో అయినా బిజెపి గణనీయమైన ఓట్లు సంపాదించింది.

పశ్చిమ బెంగాల్లో కూడా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి వుంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ పైకి ఏమి చెబుతున్నప్పటికీ బిజెపితో దాని సంబంధాలపై అనుమానాలు వుండనే వున్నాయి. బీహార్‌లో జెడియు,లాలూ, కాంగ్రెస్‌ కూటమికి మమతా బెనర్జీ మద్దతు ప్రకటించింది. దానికి ప్రతిగా తాము బెంగాల్లో ఆమెకు మద్దతు ఇస్తామని జెడియు చెబుతున్నది. ఇక్కడ తమ మిత్రపక్షమైన కాంగ్రెస్‌ను ఏమి చేస్తారన్నది ప్రశ్న. మన దేశంలో కూడా రెండు పార్టీల వ్యవస్ధను వునికిలోకి తెచ్చి తమ పబ్బం గడుపుకోవాలని కార్పొరేట్లు చేస్తున్న యత్నం ఇంతవరకు సఫలం కాలేదు. ఇప్పుడున్న స్ధితిలో అది సాధ్యమయ్యేట్లు కనిపించటం లేదు. కాంగ్రెస్‌ తిరిగి పుంజుకొనే అవకాశాలు నానాటికీ సన్నగిల్లుతున్నాయి. అంతర్జాతీయ మీడియా ఈ ఫలితాలకు బీహార్‌ ఎంతో ప్రాధాన్యతనిచ్చింది. బీహార్‌ విజయం గురించి దేశంలో కాషాయ సేనలు ఎంత ధీమాగా వున్నాయంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బిజెపి నేతలు ఫలితాల ముందురోజే మీడియా సంస్ధలకు తమ విజయోత్సవాలకు హాజరు కావాలని ఆహ్వానం పంపారు. టీవీలలో తొలి గంటలో వెలువడిన ఫలితాలు బిజెపికి అనుకూలంగా కనిపించటంతో కొన్ని చోట్ల బాణా సంచాలు, కొన్ని చోట్ల స్వీట్లు పంచారని వార్తలు వచ్చాయి. తొలి ఫలితాలను చూసి కొన్ని ఛానల్స్‌ బిజెపి అనుకూల వ్యాఖ్యానాలు కూడా ప్రారంభించాయి. వాటిని చూసి బిజెపి అభిమానులు విజయం తమదేనని నిర్ధారించుకున్నారు. అయితే తొలి రెండు గంటలలోనే అంకెలు తిరగబడటం ప్రారంభించాయి.ఆ సమయంలో టీవీలలో మాట్లాడిన కమలనాధులు అప్పుడే ఏమైంది చూద్దాం అన్నట్లుగా మాట్లాడారంటే మోడీ-షా చాణక్యం మీద వారెంత గుడ్డి భ్రమలతో వున్నారో వెల్లడైంది. ఎన్నికల పండితులు, సర్వేలు, పోలింగ్‌ అనంతర సర్వేలు మొత్తంగా బొక్కబోర్లా పడ్డాయి.

చివరిదశ ఎన్నికల వరకూ మొత్తంగా వార్తల తీరుతెన్నులను చూస్తే బిజెపికి భారీ మెజారిటీ లేదా పూర్తి ఆధిక్యత గురించి రాసినవే ఎక్కువ. నితీష్‌ కుమార్‌, లాలూ, కాంగ్రెస్‌ కూటమి విజయం సాధిస్తుందని రాసినవారు లేరంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు వారంతా తలలు ఎక్కడ పెట్టుకుంటారో తెలియదు.మనవంటి వెనుకబడిన సమాజాలలో ఎవరు గెలుస్తారంటే వారివైపే మొగ్గే వారు కొంతశాతం మంది ఓటర్లు వుంటారు. మీడియా ప్రచారం వారిని ప్రభావితం చేస్తుంది. ఆ లెక్కన బీహారు ఫలితాలను చూస్తే అలాంటి ఓటర్లు కొంతమందైనా మొగ్గి వుంటారు కనుక బిజెపికి ఆ మాత్రమైనా సీట్లు వచ్చాయి, లేకుంటే ఇంకా తగ్గి వుండేవి.

బీహార్‌లో బిజెపి ఓడిపోతే పాకిస్ధాన్‌లో టపాకాయలు కాలుస్తారని బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా వ్యాఖ్యానించారు. పాక్‌పేరుతో ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టి హిందువుల ఓట్లను కొల్లగొట్టేందుకు వేసిన చౌకబారు ఎత్తుగడ అన్నది వేరే చెప్పనవసరం లేదు. గల్లీలో వుండాల్సివారు ఢిల్లీ వెళితే ఇలాగే వుంటాయి. పాకిస్తాన్‌ సంగతేమోగానీ బిజెపిలోని మోడీ బాధితులతో సహా దేశమంతటా దీపావళి సంబరాలు చేసుకుంటున్నారన్నది వాస్తవం.

Share this:

  • Tweet
  • More
Like Loading...
Newer posts →

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d