• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Science

ఏది ముందు పుట్టింది ? జ్ఞానమా , అజ్ఞానమా – మత శక్తులెందుకు జ్ఞానం మీద దాడి చేస్తాయి ?

07 Monday Jun 2021

Posted by raomk in AP NEWS, BJP, CHINA, Communalism, Current Affairs, Health, History, imperialism, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Science, USA

≈ Leave a comment

Tags

Anandaiah's K medicine, Ignorance, knowledge, pseudoscience, Science, science literacy, scientific temper


ఎం కోటేశ్వరరావు


జ్ఞానం ముందు పుట్టిందా ? అజ్ఞానం ముందు పుట్టిందా ! ఆధునిక విజ్ఞానం అందుబాటులోకి రాక ముందు జనానికి అస్సలు విజ్ఞానం లేదా ? లేదని చెబితే పురాతన మానవుల అనుభవాలను, తరతరాలుగా వాటిని పరిరక్షించటాన్ని కించపరచటమే. ఈజిప్టు పిరమిడ్లు నిర్మించిన వారు, వాటిలో మమ్మీలను భద్రపరచిన వారి పరిజ్ఞాన్ని విస్మరించగలమా ? చైనా గోడ నిర్మాతలకు తట్టిన ఆలోచన సామాన్యమైనదా ? క్రీస్తు పూర్వమే మన దేశంలో చెక్కిన ఎల్లోరా శిల్పాలు, అజంతా చిత్రాలకు ప్రాతిపదిక విజ్ఞానం కాదా ? రోమ్‌ నగరంలో వేల సంవత్సరాల నాడు నిర్మించిన ప్రఖ్యాత బహిరంగ స్డేడియం కూడా అలాంటిదే. అయితే ఇవన్నీ కూడా ప్రపంచమంతటా వాటి నిర్మాణ కాలంలో లేదా తరువాత గానీ మరోచోట పునరావృతం కాలేదు. ఎందుకు ? విదేశీ దండయాత్రల నుంచి రక్షణకోసమే చైనా గోడ నిర్మాణమైందనుకుందాం. విదేశీ దండయాత్రలు ఒక్క చైనా మీదే జరిగాయా ? మిగతా దేశాలకు అలాంటి ఆలోచన ఎందుకు తట్టలేదు, చూసి కూడా ఎందుకు నిర్మించలేదు ? అలాగే మిగతావీనూ. ఎవరైనా ఈ కోణం నుంచి పరిశోధించారో లేదో నాకైతే తెలియదు, అలాంటి విశ్లేషణలు ఉంటే అందరం చదువుకుందాం.

గత కొద్ది వారాలుగా ఆనందయ్య ఆకుల మిశ్రమం ( మందు లేదా ఔషధం కాదని ఆయుష్‌ చెప్పింది కనుక), ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని తూలనాడిన రామ్‌దేవ్‌ బాబా గురించి చర్చలో అనేక అంశాలు ముందుకు వచ్చాయి. వాటన్నింటినీ సమగ్రంగా చర్చించటం ఇక్కడ సాధ్యం కాదు, కొన్ని పరిశీలనలకే పరిమితం. దక్షిణాసియా, మరికొన్ని ప్రాంతాలలో ఆకు, వక్క, సున్నంతో కిళ్లీలు వేసుకోవటం ఎప్పటి నుంచో ఉంది.దానితో నోరు ఎర్రగా పండుతుందని తెలుసు కానీ ఎరుపుకు బదులు వేరే రంగులో ఎందుకు పండదో లేదా అసలు ఎందుకు పండుతుందో వేసుకొనే వారందరికీ తెలుసా ? తెలియనంత మాత్రాన వారిది అజ్ఞానం అనలేము ? ఆకు, వక్కలను పూజల్లో వినియోగిస్తాము. ఎందుకు ? ముఖ్యమైన దేవతలంతా తమలపాకులోని వివిధ భాగాలలో ఉంటారనే పుక్కిటి పురాణాలు వీటికి మూలం.

మహలక్ష్మి ఆకు కింది భాగంలో, సరస్వతి మధ్యలో, జేష్టలక్ష్మి తొడిమ-ఆకు కలిసే చోట, పార్వతి, మాంగల్యదేవి ఎడమవైపు, భూదేవి కుడి వైపు, శివుడు ఆకు బయట, శుక్రుడు పైన, సూర్యుడు ఆకులో మొత్తంగా ఇలా అనేక మంది దేవతలు, దేవుళ్లు, కాని ప్రముఖులకు కూడా తమలపాకులో స్ధానం కల్పిస్తూ కథలు రాశారు. శివుడు, పార్వతి ఆకు, వక్క మొక్కలను హిమాలయ ప్రాంతంలో నాటారు అని చెబుతారు. వాటినే ఇప్పటికీ విద్యావంతులు కూడా నమ్ముతూ ఉంటే దాన్ని అజ్ఞానం అంటారు, వారిని అజ్ఞానులు అనటంలో ఎలాంటి సందేహం లేదు. చదువులేని వారికి తెలియని తనం తప్ప అజ్ఞానం అనలేము. శివుడు, పార్వతి వాటిని ఎక్కడి నుంచి తెచ్చారు, హిమాలయాల్లోనే ఎందుకు నాటారు, మిగతా ప్రాంతాలను ఎందుకు విస్మరించారు. దేవతలకు పక్షపాతం ఉండకూడదు కదా ? అనే ప్రశ్నలకు సమాధానం ఉందా ? అదంతే అంటే దాన్నేమనాలి ? ఆయుర్వేదంలో తమలపాకులో ఉన్న ఔషధ లక్షణాల గురించి రాశారు. అది వేల సంవత్సరాల మానవుల అనుభవ సారం తప్ప ఎవరో ఒకరు పరీక్షించి కనుగొన్న పర్యవసానం కాదు. ఆకు, వక్కలతో వేసుకునే సున్నం మోతాదు మించితే నోరు బొక్కుతుంది. ఇది కూడా అనుభవంలోంచి వచ్చిందే కదా ? ఎందుకు అని ఎవరైనా ప్రశ్నిస్తే అదంతే అంటే వితండవాదం, నాకు కనిపించేదాన్ని మాత్రమే నమ్ముతా మిగతావి నమ్మను అంటే మూర్ఖత్వం అవుతుంది.


ఇప్పుడంటే యావత్‌ ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది. ఆ మూల నుంచి ఈ మూలకు కొన్ని గంటల్లోనే వెళ్లి రావచ్చు. ముందే చెప్పుకున్నట్లు ప్రతి దేశం లేదా ప్రాంతం వారు అనుభవంలో తమవైన వైద్య పద్దతులను ఉనికిలోకి తెచ్చారు. ఎవరికి వారు తమ పద్దతే గొప్ప అనుకోవటమే కాదు, మిగతావాటిని అంత తేలికగా స్వీకరించలేదు. ఐరోపాలో హౌమియోపతి వైద్యులు తొలి రోజుల్లో అల్లోపతిని అంగీకరించలేదు, అపహాస్యం చేశారు. నాగరిక సమాజాలతో సంబంధాలు లేకుండా ఆడవులు, కొండలకే పరిమితమైన గిరిజనులు ఇప్పటికీ తమవైన ఔషధాలను తయారు చేసుకొని వాడుతున్నారు. వారికి ఆయుర్వేదం అంటే తెలియదు, ఆయుర్వేదాన్ని గిరిజన ప్రాంతాలకు తీసుకుపోయిన చరిత్రా లేదు. ఉంటే ఇప్పటికీ వారు తమ నాటు మందులనే ఎందుకు నమ్ముతున్నారు. తమ సాంప్రదాయ గిరిజన వైద్య పద్దతులకే కట్టుబడి ప్రాణాలు పోగొట్టుకున్న ఉదంతాలు ఎన్నో. నల్లమలలోని చెంచు ఆదివాసులు కరోనా వాక్సిన్‌ తీసుకొనేందుకు నిరాకరిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఎక్కడికక్కడ స్ధానిక వైద్య పద్దతులు ఉనికిలోకి వచ్చాయి. వాటిని రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. కానీ ఆయుర్వేదానికి మన కాషాయ దళాలు పెట్టినట్లు హిందూ వైద్యం, ముస్లిం, క్రైస్తవం, ఇతర మతాల పేర్లు పెట్టలేదు. మన దేశంలో బౌద్దం, జైనం ఒకప్పుడు ప్రధాన మతాలుగా ఉన్నాయి, మరి వాటి పేరుతో వైద్యం ఎందుకు లేదు ! మన దేశంలో హిందూత్వ శక్తులకు ఒక అజెండా ఉంది, దానిలో ఉన్మాదాన్ని రెచ్చగొట్టటం ఒక ఎత్తుగడ గనుక ఇప్పుడు ప్రతిదానికి మతాన్ని తగిలిస్తున్నారు. సిక్కులు, పార్సీలు, క్రైస్తవులు, ముస్లింలు ఈ దేశంలో విడదీయలేని భాగం, ఆయుర్వేదానికి మత, కుల ముద్రలు వేయటం ద్వారా దానికి ఆదరణ పెంచాలనుకుంటున్నారా ? దెబ్బతీయాలని తలపెట్టారా ? ఆనందయ్య మిశ్రమానికి కొందరు అతివాదులుగా చెలామణి అవుతున్నవారు కులాన్ని కూడా జత చేశారు. అందుకే అతివాదం-మితవాదం నాణానికి బొమ్మా బొరుసూ వంటివి అంటారు.


ఒక నాడు అల్లోపతి అప్పటికి ఉన్న వైద్యపద్దతులకు ప్రత్యామ్నాయ వైద్య విధానంగా ముందుకు వచ్చింది అనే విషయాన్ని మరచిపోకూడదు. ఇప్పుడు అదే అసలైనదిగా మారి, స్ధానిక, దేశీయ వైద్య పద్దతులు జనం దృష్టిలో ప్రత్యామ్నాయమైనవిగా మారిపోయాయి. ఆయా దేశాలలో అభివృద్ది చెందిన స్ధానిక వైద్య పద్దతులను ఎప్పటికప్పుడు అభివృద్ది చేసుకుంటూ పోయి ఉంటే అల్లోపతి రంగంలోకే వచ్చేదే కాదు కదా ? వాటికి చాదస్తాలను తగిలించి అభివృద్ది కాకుండా చేసింది ఎవరు ? వర్తమాన ప్రభుత్వాల సంగతి పక్కన పెడదాం. అమెరికా, ఐరోపా దేశాలలో ఉన్న స్ధానిక వైద్య పద్దతులు ఉన్నప్పటికీ వాటి స్ధానంలో అల్లోపతి అభివృద్ది చెందింది. అదేమీ రహస్యంగా జరగలేదు. బలవంతమూ చేయలేదు. మన దేశంలో ఆయుర్వేద పండితులు వాటిని చూసి తమ వైద్య పద్దతిని, ఔషధాలను అభివృద్ది చేయటాన్ని ఎవరు అడ్డుకున్నారు. బ్రిటీష్‌ పాలకులేమీ ఆంక్షలు పెట్టలేదు, అప్పటికి అల్లోపతి కార్పొరేట్‌ ఆసుపత్రులు వాటితో కుమ్మక్కయ్యే ఔషధ మాఫియాలు కూడా రంగంలో లేవే !

హౌమియోపతి వైద్యపద్దతి రోగి లక్షణాల మీద ఆధారపడింది. దానికి ప్రత్యామ్నాయంగా అమెరికా, ఐరోపాలో కొందరు ముందుకు తెచ్చినదానిని హౌమియోపతి నిపుణుడు హానిమన్‌ తొలిసారిగా అల్లోపతి అని వర్ణించాడు. రోగ లక్షణంతో సంబంధం లేకుండా చికిత్సకు వేరే పద్దతుల్లో వైద్యం చేయటాన్ని ఎగతాళి చేస్తూ తొలిసారిగా 1810లో ఆ పదాన్ని ఉపయోగించాడు. జ్వరం వస్తే లక్షణాలను బట్టి హౌమియో పద్దతిలో కొన్ని మందులు ఇచ్చి దాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. ఆయుర్వేదంలో కాషాయం, లంఖణాలతో చిక్సిత చేస్తారు. అదే అల్లోపతిలో యాంటీబయోటెక్‌ ఇచ్చి జ్వరానికి కారణమైన బాక్టీరియా, వైరస్‌లను నాశనం చేయటం ద్వారా జ్వరాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. ఆయుర్వేదం, హౌమియోపతి వంటి వాటిలో శస్త్రచికిత్సలు లేవు. ఇక్కడ చెప్పవచ్చేదేమంటే రెండు పద్దతులను అసలు పోటీ దృష్టితో చూడాల్సిన అవసరం లేదు. ఆధునిక ఔషధాలతో జ్వరాన్ని రెండు మూడు రోజుల్లో తగ్గిస్తే లంఖణం పరమౌషధం పేరుతో వారాల తరబడి మంచాలకే పరిమితం చేస్తే ఉద్యోగాలేమి కావాలి, సెలవులు ఎక్కడి నుంచి వస్తాయి. శస్త్రచికిత్సలు అవసరమైన చోట దానికి బదులు మన మతం, మన కులం, మనదేశ పద్దతుల పేరుతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటామా ?

” యావత్‌ దేశాన్ని క్రైస్తవంలోకి మార్చే కుట్రలో భాగంగా ఆయుర్వేదంపై బురద జల్లేందుకు లక్ష్యంగా చేసుకున్నారు, గాఢనిద్రలో ఉన్న దేశప్రజలు మేలుకోనట్లయితే రాబోవు తరాలు మిమ్మల్ని క్షమించవు ” ఇలాంటి ట్వీట్ల ద్వారా పతంజలి కంపెనీ సిఇఓ ఆచార్య బాలకృష్ణ ప్రజలను కూడా అవమానిస్తూ రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. ఈ పెద్దమనిషికి నిజంగా ఆయుర్వేదం మీద, అన్నింటికీ మించి తాము తయారు చేస్తున్న ఔషధాల మీద, సకల రోగ నివారిణిగా చిత్రిస్తున్న యోగా మీద విశ్వాసం ఉందా ? నిజంగా ఉంటే ఉత్తరాఖండ్‌ రిషీకేష్‌లోని ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌( అల్లోపతి)లో చేరి ఎందుకు చికిత్స తీసుకున్నారు. 2019 ఆగస్టు 23న ఆసుపత్రిలో చేరినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి, బాలకృష్ణను పరామర్శిస్తూ రామ్‌దేవ్‌ బాబా నిలిచిన చిత్రాలూ దర్శనమిచ్చాయి. తాజాగా అలాంటి ఈ పెద్దమనుషులిద్దరూ అల్లోపతి వైద్యం మీద అనుచిత విమర్శలు చేయటంతో కొందరు పాతవీడియోలకు వ్యాఖ్యానాలు తోడు చేసి సామాజిక మాధ్యమంలో వైరల్‌ చేశారు. బాలకృష్ణకు గుండెపోటు వస్తే దివ్య అర్జున్‌ కషాయం ఇవ్వలేదు, అనులోమ విలోమ యోగా చేయించకుండా నేరుగా ఆసుపత్రిలో ఎందుకు చేర్చారు, ఇప్పుడు రామ్‌దేవ్‌ బాబా అల్లోపతిమీద విమర్శలు చేస్తున్నారు సిగ్గు చేటు అని పేర్కొన్నారు. అయితే బాలకృష్ణ ఆసుపత్రిలో చేరారా లేదా అని బూమ్‌ వెబ్‌సైట్‌ నిజానిజాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తే ఆసుపత్రిలో చేరిన మాట నిజమే అని తేలింది. ఇండియా టుడే గుండెనొప్పితో అని రాస్తే జీ న్యూస్‌ కలుషిత ఆహారం కారణంగా అని రాసింది. అయితే ఆ సమయంలో రామ్‌దేవ్‌ ప్రతినిధి కెకె తిజార్‌వాలా చేసిన ట్వీట్‌లో కలుషిత ఆహారం గురించి పేర్కొన్నారు. ఇక్కడ సమస్య చిన్నదైనా పెద్దదైనా , జబ్బు ఏదైనా అల్లోపతి సామర్ధ్యం గురించి విమర్శిస్తున్న వారు అదే ఆసుపత్రిలో చేరటం ఏమిటి ? ఒక చెట్టునో, ఆవు మూతినో వాటేసుకోకుండా సిలిండర్ల ఆక్సిజన్‌ తీసుకోవటం ఏమిటి ?

ఏడాది తరువాత కరోనాకు,రోగనిరోధక శక్తికి ఇదిగో మందు అంటూ ఆనందయ్య రంగంలోకి వచ్చారు లేదా కొందరు తెచ్చారు. దీని నేపధ్యం ఏమిటి ? కరోనా కొత్త వైరస్‌ గనుక దానికి చికిత్స ఏమిటో ఏ వైద్య పద్దతికీ తెలియదు. జ్వరం వస్తుంది కనుక పారాసిటమాల్‌ వేసుకుంటే తగ్గిపోతుంది అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు దాన్నే చెప్పారు. మలేరియాకు వాడే హైడ్రోక్సీక్లోరోక్విన్‌ ఇస్తే ఫలితం ఉంటుందన్నారు. వెంటనే మన దేశం వాటిని ఎగుమతి చేయటాన్ని నిషేధించింది. నిషేధం ఎత్తివేయకపోతే డొక్క చించుతా అని డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించాడు. తరువాత రెమిడెసివిర్‌ దివ్వ ఔషధం అన్నారు, ఎంతగా బ్లాక్‌ మార్కెట్‌ జరిగిందో చూశాము. చివరికి బిజెపి పెద్దలు కంపెనీ నుంచి తామే సేకరించి పెద్ద మేలు చేకూర్చేవారిగా ఫోజు పెట్టారు. తరువాత దాని వలన ఫలితం లేదని తేలిపోయింది. ఇదే సమయంలో ప్లాస్మా చికిత్స గురించి ప్రచారం. చివరికి అదీ ఫలితం లేదని తేలిపోయింది. రామ్‌దేవ్‌ బాబా కరోనిల్‌ పేరుతో కేంద్ర మంత్రుల సమక్షంలో ప్రారంభించి కరోనాకు దివ్వ ఔషధం అన్నారు. అది అసలు ఔషధమే కాదు తేలిపోయింది. ఒకవైపు కరోనా రెండవ తరంగం రెచ్చిపోతుంటే జనానికి దిక్కుతోచని స్ధితిలో ఆనందయ్యను రంగంలోకి తెచ్చారు. అతను గాకపోతే మరొకరు వచ్చి ఉండేవారు. గతంలో మెదడు వాపు వ్యాధి, స్వైన్‌ఫ్లూ వంటివి జనాన్ని భయపెట్టిన సమయంలో నిర్ధారణగాని హౌమియో, ఆయుర్వేదం మందులు ఇలాగే పెద్ద ఎత్తున పంచారు. నష్టం లేదు కదా అని జనం కూడా తీసుకున్నారు.


అల్లోపతిలో ప్రయత్నించిన ప్రతి ఔషధం ఉపశమనం కల్పించేది తప్ప నిరోధించేది కాదని తేలిన సమయంలో ఆనందయ్య మూలికల మిశ్రమం వచ్చింది. దాన్ని తినేందుకు మాత్రమే ఇస్తే ఇంత రగడ జరిగి ఉండేది కాదేమో ? కండ్లలో వేసే చుక్కలతో రోగనిరోధకశక్తి వస్తుందని చెప్పటమే తీవ్ర వివాదాన్ని రేపింది.నిర్ధారణ కాని వాటిని కరోనా రోగులు కంట్లో వేసుకున్నా, తిన్నా వారి కండ్లు,ప్రాణాలకు ముప్పు కనుక అనేక మంది అభ్యంతరాలు తెలిపారు. ఇది కూడా ఎందుకు జరిగింది. ఏడాదికి పైగా కరోనా జనాన్ని చంపేస్తుంటే ఆనందయ్య ఎక్కడున్నాడో తెలియదు. ఏడాది కాలంగా చేసిన పరిశోధన లేదా తెలుసుకున్న పరిజ్ఞానం ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. తెల్లవారేసరికి మందు కనుగొన్నా అంటే సరిపోతుందా ? ఇక్కడ ఆనందయ్య ఒక చిన్న వ్యక్తి. కరోనా వైరస్‌ గురించి నిర్ధారణ కాగానే అనేక దేశాల్లో ఉన్న స్ధానిక వైద్యపద్దతుల నిపుణులు ఔషధాన్ని ఎందుకు అభివృద్ది చేయలేకపోయారు ? అల్లోపతి శాస్త్రవేత్తలు, వైద్యుల ప్రయోగాలే ఫలించి వాక్సిన్‌ ఉనికిలోకి వచ్చింది. సహజంగానే దాన్ని సొమ్ము చేసుకొనేందుకు కార్పొరేట్‌ సంస్ధలు పూనుకున్నాయి. వాటిని చూపి నిర్ధారణ కాని నాటు మందులను ఒకసారి వాడి చూస్తే ఏమౌతుంది? నష్టమేమీ లేదు కదా అనే వాదనలు చేసే వారికి చెప్పేదేముంది. వాడి చూడండి, అనుభవించండి. ఆయిల్‌ పుల్లింగు చూశాము, నీటి వైద్యం వంటి వాటిని చూశాము. సాధారణ రోగాలకు అలాంటి వాటిని వెయ్యి వాడండి ఎవరి ఖర్మ వారిది. కానీ కరోనా ఒక మహమ్మారి, ఆదమరిస్తే, సకాలంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాలు పోయేదానితో కూడా ఇలాంటి ప్రయోగాలు ఎందుకు చేయకూడదని చెబుతుంటే వితండవాదం చేసే వారి మానసిక స్ధితిని అనుమానించాల్సి వస్తోంది. చుక్క వేయగానే పక్కాగా తయారయ్యానని చెప్పిన కోటయ్య మాస్టారు కొద్ది రోజుల్లోనే ఎందుకు మరణించారు,సమర్ధించిన వారే ఆయన ప్రాణాలకు మీదకు తెచ్చారనటం వాస్తవం కాదా ?


వైద్య రంగంలో అల్లోపతి ఆసుపత్రులు, ఔషధాల మాఫియా ఎలా అయితే ఉందో ఆయుర్వేద మాఫియా కూడా ముందుకు వచ్చింది. జనం బలహీనతను సొమ్ము చేసుకొనేందుకు వేగంగా పావులు కదుపుతోంది. తాము తయారు చేసిన కరోనిల్‌ ఔషధం కరోనాను అరికడుతుందని ప్రచారం చేసి సొమ్ము చేసుకొనేందుకు పెద్ద పధకం వేసిన రామ్‌దేవ్‌ బాబా ఆయుర్వేద మాఫియా తెగకు చెందిన వారు కాదా ? ఇలాంటి వారిని చూసి పక్కా ప్రణాళికతోనే ఆనందయ్యను కొందరు రంగంలోకి దించారని చెబుతున్నారు ? కాదని నిరూపించండి. నిజానికి ఏ పట్టా లేని ఆనందయ్యకు కొన్ని మూలికల మిశ్రమంతో కరోనా తగ్గుతుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిసినపుడు ఆమాత్రం కూడా ఆయుర్వేద నిపుణలకు ఎందుకు తట్టలేదు. జగదేక వీరుడి సినిమాలో మాదిరో లేక ఆఫ్రికా లేదా అమెజాన్‌ అడవుల నుంచి తెచ్చిన అపురూప మూలికలు కాదే. వేటితో తాను తయారు చేస్తున్నదీ ఆనందయ్యే చెప్పాడంటున్నారు కదా ? అప్పుడైనా ఆ మిశ్రమానికి ఆ లక్షణం ఉంటుందో లేదో నిపుణులు ఎందుకు చెప్పలేకపోయారు ? ఆయుష్‌ రంగంలోకి దిగి అలాంటి లక్షణాలేమీ లేవు వేసుకుంటే వేసుకోండి, చస్తే చావండి మీ ఇష్టం, ఇతర మందులను ఆపకుండా కావాలంటే దాన్ని కూడా తీసుకోండి తప్ప అల్లోపతి మందులను ఆపవద్దని చెప్పింది కదా ? దీనికి అనుగుణ్యంగానే దాన్ని పంపిణీ చేయవచ్చని రాష్ట్ర హైకోర్టు కూడా చెప్పింది. తిరుమల తిరుపతి దేవస్ధానం తామే దాన్ని తయారు చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు అది ఔషధం కాదంటున్నారు గనుక ఆపని మానుకున్నాం అంటోంది. చిత్రం ఏమిటంటే ఆ పార్టీ ఎంఎల్‌ఏలు మాత్రం మందు తయారు చేయించి పంపిణీ ప్రారంభించారు. ఇంత చర్చ జరిగాక కూడా ఎవరైనా దాని మీదే ఆధారపడితే ఎవరూ చేయగలిగింది లేదు. తమ పార్టీ వారే ఈ పని చేస్తున్నారు గనుక ఏదైనా అనుకోనిది జరిగితే వైఎస్‌ జగన్‌ మరోమారు ఓదార్పు యాత్రలు చేయాల్సి ఉంటుంది.

ఆనందయ్య మందును ప్రశ్నించటం ఒక కులాన్ని అణగదొక్కటంగా లేదా ఆయుర్వేదం హిందూ ఔషధం గనుక దాన్ని వ్యతిరేకించటం అంటే హిందూమతాన్ని వ్యతిరేకించటం , నాశనం చేసేందుకు పూనుకోవటమే అంటూ వాటిని అనుమతించాల్సిందే అని ప్రచారం చేయటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. శాస్త్రీయ అంశాలు బయటికి రావటం మతశక్తులకు ఇష్టం ఉండదన్నది చరిత్ర చెప్పిన సత్యం. బాగ్దాద్‌లో మహమ్మద్‌ బిన్‌ జకారియ లేదా రహేజాగా సుపరిచితుడైన వైద్యుడు 860-932 సంవత్సరాల మధ్య జీవించాడు. హేతువాద భావనలు, ఆ నాటికి ఉన్న పశ్చిమ దేశాల బోధనలను ముందుకు తెచ్చాడు. వైద్యం గురించి ఒక పుస్తకం రాశాడు. దాన్ని తట్టుకోలేని ముస్లిం మత పెద్ద ఆ పుస్తకంతోనే తల మీద మోదాలని ఆదేశాలు జారీ చేశాడు. దాంతో అతని కండ్లు పోయాయి. మైఖైల్‌ సెర్వెటస్‌ అనే స్పెయిన్‌ వైద్యుడు 1511-53 మధ్య జీవించాడు. ఊపిరితిత్తుల పనితీరు గురించి, క్రైస్తవాన్ని సంస్కరించటం గురించి తన అభిప్రాయాలతో ఒక పుస్తకం రాశాడు.అది మతవిరుద్దమని ప్రకటించటంతో కాథలిక్‌ మతగురువుల విచారణ, శిక్ష నుంచి తప్పించుకొనేందుకు స్విడ్జర్లాండ్‌ వెళ్లాడు. అక్కడ ప్రొటెస్టెంట్‌ మతగురువులకూ కంటగింపయ్యాడు. జెనీవా సరస్సు ఒడ్డున సజీవదహనం చేశారు. అందరికీ తెలిసిన గెలీలియో (1564-1642) గురించి చెప్పాల్సిన పని లేదు. అప్పటి వరకు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడని చెప్పటాన్ని సవాలు చేసి సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని చెప్పాడు. దాన్ని వ్యతిరేకించిన క్రైస్తవమత పెద్దలు జీవితాంతం గృహనిర్బంధంలో ఉంచాలని ఆదేశించటమే గాక ఆయన రచనలను నిషేధించారు.


మన దేశంలో హేతువాదం, భౌతికవాదానికి ఆదిపురుషులు చార్వాకులు అన్నది ఒక అభిప్రాయం. వారు బౌద్ద, హిందూ మతాలను రెండు చెప్పే ఆశాస్త్రీయ, పరస్పర విరుద్ద అంశాలను వ్యతిరేకించారు. స్వర్గ నరకాలు లేవన్నారు. అంతకు ముందు ఉనికిలో ఉన్న అనేక భావనలను వారు సవాలు చేశారు. అది తమ మతాల మనుగడకే ప్రమాదమని భావించిన నాటి మత పెద్దలు వారిని సర్వనాశనం చేశారు, వారి రచనలను దొరక్కుండా చేశారు. వారి మీద తప్పుడు ప్రచారం చేస్తూ వారి ప్రస్తావనలతో రాసిన వ్యతిరేక రచనల నుంచి వారి భావజాలం గురించి తెలిసింది, వారి అసలు రచనలు లేవు. మొత్తంగా చెప్పాలంటే ప్రశ్నించే తత్వాన్ని పూర్తిగా నాశనం చేశారు. పర్యవసానంగా ఒక నిర్వీర్యమైన జాతిగా మనది తయారు కావటానికి మతాలు తప్ప మరొకటి కాదన్నది కొందరి అభిప్రాయం. నాడు మతశక్తులు హేతువాదాన్ని అణగదొక్కితే నేటి మతశక్తులు మరోరూపంలో అశాస్త్రీయాన్ని ముందుకు తెచ్చి ఈసమాజాన్ని అజ్ఞానంలోకి నెట్టాలని చూస్తున్నాయి. దేశంలోని హిందూత్వ శక్తులు సమాజాన్ని వెనక్కు నడపాలని చూస్తున్నాయి గనుక మూఢనమ్మకాలకు, ఆశాస్త్రీయ అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సైన్సు సమావేశాలనే వేదికగా చేసుకొని అశాస్త్రీయ, ఆధారంలేని అంశాలను ప్రచారం చేశారు. ఆవు మూత్రంలో బంగారం ఉందా మరొకటి ఉందా తేల్చమని నిధులు కేటాయిస్తున్నారంటే ఏమనుకోవాలి. తిరోగామి జాతీయవాద అజెండాలో భాగంగా పురాతన సంస్కృతికి, మెజారిటీ హిందూమతానికి ముప్పు వచ్చిందనే పేరుతో జరుగుతున్న ప్రచారం తెలిసిందే. దానిలో భాగంగానే హేతువాదం ఘర్షణ పడే ప్రతిదానికి మతానికి సంబంధం కలిపితే జనాన్ని తమవెంట తీసుకుపోవటం సులభమని వారు భావిస్తున్నారు.

ఆల్లోపతి వైద్యం చేసే కార్పొరేట్‌ ఆసుపత్రులు, ఔషధాలు తయారు చేసే కంపెనీల లాభాపేక్ష, ఇతర లోపాలను చూపి ఆయుర్వేదానికి మతాన్ని తగిలించి సొమ్ము చేసుకోవాలని చూస్తున్న పతంజలి వంటి కంపెనీల యజమానులు అలాంటి ధోరణులను ప్రోత్సహిస్తున్నారు.వారికి కేంద్ర ప్రభుత్వ పెద్దల మద్దతు గురించి చెప్పనవసరం లేదు. విదేశీ కార్పొరేట్‌లు పెరిగితే తప్పు పట్టని వారు స్వదేశీ కార్పొరేట్ల ఎదుగుదలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అమెజాన్‌ మాదిరి మన అంబానీ కంపెనీ ఎందుకు పెరగకూడదు, ఒక ఫైజర్‌, ఒక జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ మాదిరి రామ్‌దేవ్‌ బాబా పతంజలి ఎందుకు విస్తరించకూడదు అనే వాదనలకు స్వదేశీ కార్పొరేట్‌ జాతీయవాదమే మూలం. అసలు మొత్తంగా దేశాన్ని కార్పొరేట్‌లకు అప్పగించటం హానికరం అని ఎక్కడా చెప్పరు. ఐరోపా సామ్రాజ్యవాదులు ఇలాంటి కార్పొరేట్‌ జాతీయవాదంతోనే తమ కంపెనీలకు మార్కెట్‌ను కల్పించేందుకు గతంలో దేశాలను వలసలుగా చేసుకున్నారు, ఎన్నో ప్రాంతీయ యుద్దాలు, రెండు ప్రపంచ యుద్దాలకు, నిత్యం ఏదో ఒక మూల ఉద్రిక్తతలకు కారకులు అవుతున్నారు. ఆనందయ్య వంటి వారిని కొందరు తమ స్ధాయిలో ఉపయోగించుకోవాలని చూస్తుంటే మతశక్తులతో చేతులు కలిపిన పతంజలి పెద్దలు పెద్ద స్ధాయిలో లబ్ది పొందాలనుకుంటున్నారు. ” యావత్‌ దేశాన్ని క్రైస్తవంలోకి మార్చే కుట్రలో భాగంగా ఆయుర్వేదంపై బురద జల్లేందుకు లక్ష్యంగా చేసుకున్నారు, గాఢనిద్రలో ఉన్న దేశప్రజలు మేలుకోనట్లయితే రాబోవు తరాలు మిమ్మల్ని క్షమించవు ” అంటూ చేస్తున్న ట్వీట్లు, హిందువులను మైనారిటీలుగా మార్చే కుట్ర జరుగుతోందంటూ సంఘపరివారం చేసే ప్రచారానికి పెద్ద తేడా ఏముంది ?


శాస్త్రం, కుహనా శాస్త్రం, జ్ఞానం, అజ్ఞానం వీటిలో ఏది ముందు ? బతుకు పోరాటంలోనే మానవుడు అనేక అంశాలను నేర్చుకున్నాడు. చెట్టుమీది కాయలు కింద పడటం మానవులకు తెలియని అంశం కాదు. దానిక్కారణం తెలియక ముందు అది దేవుడు, దేవత లేదా ఆదృశ్యశక్తి మహిమ అనుకున్నారు. అది కారణం తెలియని స్ధితి. దీనికి అజ్ఞానం ఒక పర్యాపదం. చెట్టుమీది యాపిల్‌ పండ్లు పైకి పోకుండా, పక్కకు పడకుండా నిటారుగా కిందనే ఎందుకు పడుతున్నాయన్న ఆలోచన న్యూటన్‌కు వచ్చింది కనుకనే భూమ్యాకార్షణ సిద్దాంతం వచ్చింది. అది విజ్ఞానం. అంతకు ముందు దేవుడే అలా రాసిపెట్టాడు అనుకోవటం తప్పుకాదు. తరువాత కూడా ఆ సిద్దాంతం గురించి తెలియని వారు అనుకుంటే దాన్ని కూడా అర్ధం చేసుకోవచ్చు. కానీ చదువుకొన్న వారు కూడా దేవుడి మహిమే అంటే అది అజ్ఞానం. పిల్లలు ఎలా పుడతారో తెలియక ముందు దేవుడి దయ, తెలిసిన తరువాత కూడా అలా అనుకుంటే అజ్ఞానం. అందువలన మౌలికంగా తెలియని స్ధితి లేదా అజ్ఞానం నుంచి జ్ఞానం పుట్టింది. సైన్సు, కుహనా సైన్సు కూడా అంతే. వివేకం లేని జ్ఞానం ఇసుకలో నీరు వంటిది అన్నది ఒక సామెత. వానరుడు నరుడిగా మారిన పరిణామ క్రమం గురించి మీరు విశ్వసిస్తారా అంటూ కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా సంస్ద జరిపిన సర్వే ప్రకారం జపాన్‌లో 78, ఐరోపాలో 70, చైనాలో 69, దక్షిణ కొరియాలో 64శాతం మంది అవునని అంగీకరిస్తే అమెరికాలో 45శాతం మందే ఉన్నారు. అజ్ఞానిగా ఉండటం పెద్దగా సిగ్గుపడాల్సిన అంశం కాదు, తెలుసు కొనేందుకు నిరాకరించటమే సిగ్గులేనితనం అని అమెరికా జాతిపితలలో ఒకడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉన్న బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌ చెప్పారు. వేదాల్లో అన్నీ ఉన్నాయి, ఆయుర్వేదంలో అన్నింటి గురించి రాశారని, మన సంస్కృత గ్రంధాల్లో ఉన్నవాటిని పాశ్చాత్యులు అపహరించి తామే కనుగొన్నట్లు ప్రచారం చేసే, చెబుతున్నవారు కొత్తగా తెలుసుకొనేందుకు ముందుకు వస్తారని ఆశించటం అత్యాశే. తెలుసుకొనేందుకు నిరాకరించే జాతి ఎక్కడైనా ముందుకు పోయిందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

టీకాల్లేక జనం చావులు – భారత్‌, చైనా తీరుతెన్నులు !

05 Saturday Jun 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Health, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RUSSIA, Science, USA

≈ Leave a comment

Tags

anti china, China's vaccine diplomacy, Global COVID vaccine diplomacy, India vaccine diplomacy, India Vaccine Matters, Vaccine Nationalism


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ సలహాదారులెవరో గానీ అచ్చతెలుగులో చెప్పాలంటే దిక్కుమాలిన సలహాలు ఇస్తున్నారు.అఫ్‌కోర్స్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి దగ్గర కూడా అలాంటి వాటిని ఇచ్చేవారు పుష్కలంగా ఉన్నారనుకోండి. లేకపోతే వధువు-వరుడు లేకుండా పెళ్లి చేసినట్లు టీకాలు లేకుండా నాలుగు రోజుల పాటు కరోనా టీకా ఉత్సవాలు జరపటం ఏమిటి ? అత్యున్నత న్యాయస్ధానం కరోనాటీకా విధానం గురించి తీవ్ర ఆక్షేపణ తెలియచేయటం వ్యక్తులు ఎవరని కాదు ఒక దేశ ప్రధానికి ఎంత నామర్ధా ! ఒక విధానం అంటూ లేదని వ్యాఖ్యానించటాన్ని చూసి అడ్డగోలు పాలన నడుస్తున్నట్లుగా ప్రపంచమంతా అనుకుంటుంటే ఎంత అవమానం!


మన జనానికి జ్ఞాపకశక్తి తక్కువ అన్నది మోడీ భక్తులకు పూర్తి విశ్వాసం. ఒక్క విషయాన్ని గుర్తు చేసి అసలు విషయానికి వద్దాం. పదమూడు కోట్ల వాక్సిన్లు వేసేందుకు నరేంద్రమోడీ నాయకత్వం కేవలం 95 రోజులే తీసుకుంటే అగ్రరాజ్యం అమెరికాకు 101, చైనాకు 109రోజులు పట్టిందని పెద్ద ఎత్తున కాషాయ దళాలు ప్రచారం చేశాయి. భారత్‌ ఎంత వేగంగా స్పందించిందో చూడండి అంటూ దాన్నొక పెద్ద విజయంగా విర్రవీగాయి. నరేంద్రమోడీ సర్కార్‌ కరోనా రెండవ తరంగం గురించి స్పందించకుండా నిర్లక్ష్యం చేశారన్న దుమారం నేపధ్యంలో ఈ విజయగాధను గానం చేశారు.


ఇప్పుడు పరిస్ధితి ఏమిటి ? ప్రపంచంలో మే నెలాఖరుకు 209 కోట్ల మందికి కనీసం ఒక డోసు వాక్సిన్లు వేశారు. ఒక్క చైనా లోనే 72 కోట్ల మందికి వేయగా మన దేశం 22 కోట్ల దగ్గర ఉంది. జూన్‌ నాలుగవ తేదీ నాటికి మన దేశంలో రెండు డోసుల వాక్సిన్‌ తీసుకున్నవారు 4.44 కోట్ల మంది, జనాభాలో కేవలం 3.3శాతమే. చైనా గురించిన సమాచారం లేనప్పటికీ అంతకంటే ఎక్కువే అన్నది స్పష్టం. వారిని పక్కన పెడదాం ఫైనాన్సియల్‌ టైమ్స్‌ జూన్‌ మూడవ తేదీ నాటి సమాచారం ప్రకారం బ్రిక్స్‌లోని బ్రెజిల్‌లో 10.6, రష్యాలో 8.9శాతం చొప్పున పూర్తిగా వేస్తే మనం ఎక్కడ ఉన్నాం అని ఆలోచించాలి. ఆలశ్యంగా ప్రారంభించినా ఈ ఏడాది చివరికి చైనాలో 80శాతం మందికి పూర్తిగా రెండు డోసులూ వేస్తారంటూ వార్తలు రాస్తున్నారు. మనం ఆస్ధాయిలో ఉన్నామా ? కొంత మంది మన దేశంలో వాక్సిన్లు వేయటం గురించి ఆలోచించకుండా చైనాలో ఎడతెగని వరుసల్లో జనం రోజుల తరబడి వేచి చూస్తున్నారంటూ ఈ మధ్య కొన్ని వీడియోలను సామాజిక మాధ్యమంలో తిప్పారు.ఇది కూడా నరేంద్రమోడీ వైఫల్యాన్ని సమర్ధించుకొనే యత్నంలో భాగమే. లేదూ సదరు వీడియోలు నిజమే అనుకుందాం. మోడీ తప్పేమీ లేదు, అంతా అలాగే ఉంది అని చెప్పేందుకు గాకపోతే దాని వలన మనకు కలిగే ప్రయోజనం ఏమిటి ? రోజుకు ఇప్పుడు కోటీ 90 లక్షల వాక్సిన్లు చైనాలో వేస్తున్నట్లు వార్తలు. ఎవరైనా అవన్నీ మేం నమ్మం అంటే అది వారిష్టం. చైనా గురించి కొన్ని నమ్ముతున్న వారు కొన్నింటిని ఎందుకు నమ్మటం లేదు ? లోకంలో నిత్యం ప్రతిదాన్నీ చివరికి తమను తామే నమ్మకుండా శంకించేవారు కొందరు ఉంటారు. మరికొందరు అతి తెలివి గలవారు అది కమ్యూనిస్టు నియంతృత్వం అండీ అవసరమైతే బలవంతంగా వాక్సిన్‌ వేస్తారు, మనది ప్రజాస్వామ్యం అని చెప్పే బాపతు కూడా తగలవచ్చు. దేశంలో ఇంతగా వ్యాధిని పుచ్చబెట్టమని, చంపమని ప్రజాస్వామ్యం చెప్పిందా ?

గేట్స్‌ ఫౌండేషన్‌ మాజీ డైరెక్టర్‌ రే ఇప్‌ చైనా గురించి వంకర బుద్దిని బయట పెట్టుకుంటూ అమానుష వ్యవస్ధలో భాగంగా ప్రతి గ్రామంలోనూ చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యులు ఉంటారు, అయితే వారు ఎంతో శక్తివంతంగా జనాన్ని సమీకరిస్తారు కూడా అని వాక్సినేషన్‌కు జనాన్ని సమీకరించటం గురించి చెప్పారు. చైనా కమ్యూనిస్టు పార్టీ కంటే తమ పార్టీలో ఎక్కువ మంది సభ్యులున్నారని బిజెపి చెప్పుకుంటుంది కదా ఇప్పుడు వారంతా ఏమయ్యారు? మైనారిటీ మతాల వారి మీద విద్వేషం రెచ్చగొట్టటం, మెజారిటీ మతోన్మాదాన్ని ఎక్కించటం తప్ప వారు చేస్తున్నది ఏమిటి ? నిజంగా కరోనాపై పోరులో రంగంలోకి దిగితే నరేంద్రమోడీ ఖ్యాతి ఇంకా పెరుగుతుంది కదా ? ఏప్రిల్‌ నెలలో అమెరికాలో గరిష్ట స్దాయిలో వాక్సినేషన్‌ జరిగింది. రోజుకు 34 లక్షల మందికి వేశారు, అదే చైనాలో ఏడు రోజుల సగటు కోటీ 90లక్షల మంది అని ఏపి వార్తా సంస్ధ తన కథనంలో పేర్కొన్నది. రాజధాని బీజింగ్‌లో 87శాతం మందికి ఒక డోసు వేశారు. సినోవాక్‌, సినోఫామ్‌ అనే రెండు రకాల వాక్సిన్ల తయారీకి అంతకు ముందున్న ఫ్యాక్టరీలేగాక కొత్తగా నిర్మించి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు, ఫ్లూ(జలుబు) మాదిరి కరోనా వైరస్‌ కూడా పదే పదే వచ్చే అవకాశం ఉన్నందున నివారణకు రానున్న రోజుల్లో కూడా వాక్సిన్‌ అవసరం అని కొంత మంది నిపుణులు భావించటం, అవసరమైతే మూడో డోసు కూడా వేయాల్సి రావచ్చన్న హెచ్చరికల నేపధ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. అవసరం లేకపోతే ఆ ఫ్యాక్టరీలను వేరే ఔషధాలు లేదా వాక్సిన్ల తయారీకి వినియోగిస్తారు. గతేడాది కరోనా కట్టడికి కొద్ది రోజుల్లోనే తాత్కాలిక ఆసుపత్రులను నిర్మించిన విషయం తెలిసిందే. సినోవాక్‌ ఏడాదికి రెండు వందల కోట్లు, సినోఫామ్‌ మూడు వందల కోట్ల డోసుల తయారీ సామర్ధ్యం కలిగి ఉన్నాయి. అనేక దేశాలలో మాదిరి వాక్సిన్ల తయారీకి చైనా ప్రభుత్వం కూడా మద్దతు ఇచ్చినప్పటికీ దాని తీరు వేరేగా ఉంది. మిగతాదేశాల మాదిరి వాక్సిన్ల తయారీకి అవసరమైన ముడి పదార్దాలకు అమెరికా నుంచి దిగుమతులపై ఆధారపడినందున మన దేశంలో సీరం సంస్ధ ఉత్పత్తికి ఆటంకం కలిగింది. చైనా కంపెనీలు దిగుమతుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు.
కొంత కాలం తరువాత వాక్సిన్‌ ప్రభావం తగ్గిపోతుంది కనుక రాబోయే రోజుల్లో తిరిగి తీసుకోవాల్సి రావచ్చని షాండోంగ్‌ రాష్ట్రంలోని క్వింగ్‌డావోలో ఉన్న బోయావో ఫోరమ్‌ ఫర్‌ ఆసియా సంస్ద ప్రతి ఝాంగ్‌ చెప్పారు. కొత్త రూపాన్ని సంతరించుకున్న వైరస్‌ల మీద వాక్సిన్ల ప్రభావం ఇంకా రుజువు కానందున మరింత సమాచారాన్ని పరిశీలించిన తరువాత గానీ మరోసారి వాక్సిన్లు తీసుకోవాలా లేదా అనేది చెప్పజాలమన్నారు. ఇన్‌ఫ్లూయంజా వైరస్‌ మాదిరి కరోనా కూడా మారవచ్చని కొందరు భావిస్తున్నారు. అమెరికా వంటి కొన్ని చోట్ల ఇప్పటికీ ఫ్లూ కారణంగా జనం మరణిస్తున్నప్పటికీ మనవంటి అనేక దేశాలలో జనంలో రోగనిరోధకశక్తి పెరిగి కొద్ది రోజులు ఇబ్బంది పెట్టి మాయం అవుతున్నది. గతంలో పది కోట్ల డోసుల లభ్యతకు 25 రోజులు పడితే తరువాత క్రమంగా 16,9, 7 రోజులకు తగ్గి ఇప్పుడు ఐదు రోజుల్లోనే అందుబాటులోకి వచ్చింది. ఇంజెక్షన్ల ద్వారా ఇచ్చే డోసు 0.5 మిల్లీ లీటర్లు ఉంటుంది. చైనాలో ఇలాంటి వాటితో పాటు ఒక కంపెనీ 0.1 మిల్లీలీటరును ముక్కుతో పీల్చుకొనే విధంగా ఒక వాక్సిన్‌ తయారు చేసి పరీక్షలు నిర్వహించింది. అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకుంది. దీనికి అనుమతి వస్తే వాక్సిన్‌ లభ్యత ఇబ్బడి ముబ్బడి అవుతుంది, రవాణా కూడా సులభంగా చేయవచ్చు.

కరోనా రెండవ దశ గురించి చేసిన హెచ్చరికలను కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పట్టిందనే విమర్శలు తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అలాంటిదేమీ లేదని చెబుతోంది, అంగీకరిద్దాం. కరోనా నిరోధానికి వాక్సిన్‌ అవసరాన్ని గుర్తించారు కదా ! తానే స్వయంగా ఉత్పత్తిని పర్యవేక్షిస్తున్నారని జనం అనుకొనే విధంగా ప్రధాని నరేంద్రమోడీ పూనా, హైదరాబాద్‌ పర్యటనలను జరిపారు కదా ! దాని మీద చూపిన శ్రద్ద ప్రణాళిక మీద ఎందుకు పెట్టలేదు, సుప్రీం కోర్టుకు సరైన సమాధానం ఎందుకు ఇవ్వలేకపోయింది ? నరేంద్రమోడీ సర్కార్‌ మనోవైకల్యం కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ విమర్శించారు. ప్రభుత్వంలో గందరగోళంలో పడిన కారణంగానే సత్తా అంతటినీ చూపలేకపోయిందన్నారు. ఆర్ధిక రంగంలో, సామాజిక సంబంధాల వైఫల్యం మహమ్మారి దాడిని ఎదుర్కోవటంలో వైఫల్యానికి ప్రాతిపదిక అన్నారు.


వాక్సిన్‌ తయారీ కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకు తప్ప మూడు ధరల విధానాన్ని కేంద్రం ముందుకు తీసుకురావటంలో మరొక పరమార్ధం లేదు.ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని విధానమిది. కేంద్రానికి 150 రూపాయలకు ఇచ్చిన కంపెనీలు రాష్ట్రాలు, ప్రయివేటు ఆసుపత్రులకు భారీ మొత్తాలను వసూలు చేయటంలో ఆంతర్యం ఏమిటి ? కేంద్రానికి ఇచ్చిన రాయితీలను కూడా ఈ రూపంలో పూడ్చుకోవాలన్న కంపెనీల ఎత్తుగడ, వాటితో కుమ్మక్కైన ప్రభుత్వ పెద్దల అతి తెలివి తప్ప మరొకటి కాదు. నరేంద్రమోడీ ప్రతిష్ట పెంచటంతో పాటు కంపెనీలకు లాభం చేకూర్చటమే దీని అంతరార్ధం. ముడిపదార్దాలు, అవసరమైన పరికరాల ఎగుమతులపై అమెరికా ఇంతవరకు ఆంక్షలు ఎత్తివేయలేదు. మరోవైపు రాష్ట్రాలు వాక్సిన్ల కోసం ప్రపంచ స్ధాయి టెండర్లను పిలిచినా కంపెనీల నుంచి స్పందన లేదు. అవి పెడుతున్న షరతుల మీద నిర్ణయం తీసుకోవాల్సిందీ, పరిష్కరించాల్సిందీ కేంద్ర తప్ప రాష్ట్రాలు చేయగలిగినది కాదు. ఇంత జరుగుతున్నా, వాక్సిన్‌ విధానం మీద కేంద్రం చురుకుగా కదులుతున్న దాఖలాలు లేవు.


కరోనా రెండవ తరంగాన్ని నిర్లక్ష్యం చేయటం ఒకటైతే దాని కొనసాగింపుగా వాక్సిన్‌ దౌత్యంతో దూరమైన ఇరుగు పొరుగు, ఇతర దేశాలకు దగ్గర కావాలని మోడీ సర్కార్‌ ఆలోచన చేసింది. ఇప్పుడు ఇటు దేశంలో తీవ్ర విమర్శలపాలు కావటమే గాక దౌత్య రంగంలో కూడా అనుకున్నది సాధించే స్ధితిలో లేవని పరిణామాలు వెల్లడిస్తున్నాయి. అనేక దేశాలు ఇప్పుడు చైనా వైపు చూస్తున్నాయి. ప్రతి దేశానికి దౌత్య సంబంధమైన, అంతర్జాతీయ సహకారానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు కొన్ని ఉంటాయి. వాటిలో ప్రపంచ ఆరోగ్య సంస్ధ పేద దేశాలకు కోవాక్స్‌ పేరుతో వాక్సిన్లు అందచేసేందుకు నిర్ణయించింది. వాక్సిన్‌ తయారీ దేశాలన్నీ తమ శక్తిమేరకు దానికి విరాళంగా వాక్సిన్లు అందచేస్తున్నాయి. మన దేశం కూడా అలాంటి బాధ్యత నిర్వహించాల్సిన అవసరం ఉంది. అంతవరకు ఓకే. కానీ జరిగిందేమిటి ? కేంద్ర ప్రభుత్వ సంస్ధ ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పిఐబి) మార్చినెల 23న ఒక ప్రకటన విడుదల చేసింది. దానిలో పేర్కొన్న సమాచారం ప్రకారం 74 దేశాలకు గ్రాంట్‌ (ఉచితం) వాణిజ్యం, కోవాక్స్‌ కార్యక్రమానికి గాను వాక్సిన్లు ఎన్ని డోసులు అందచేసిందీ వివరంగా ఉంది. మూడు తరగతులకు సంబంధించి మొత్తం 5.959 కోట్ల డోసులను ఎగుమతి చేసింది. వీటిలో గ్రాంట్లుగా 81.25లక్షలు, కోవాక్స్‌ కార్యక్రమానికి కోటీ 75లక్షల డోసులు ఇవ్వగా వాక్సిన్‌ ఎగుమతి చేసే కంపెనీలు వాణిజ్య పరంగా ఎగుమతి చేసినవి 3.396 కోట్ల డోసులు ఉన్నాయి. విశ్వగురువు నరేంద్రమోడీ పేరుతో ప్రచారం మాటున ఇదంతా జరిగింది. అంటే దానం, విరాళం అనే పేరుతో దౌత్యం దాని వెనుక పక్కా లాభసాటి వ్యాపారం. మరోవైపు నరేంద్రమోడీ కార్పొరేట్ల తాట తీస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో భక్తుల ప్రచారం. మార్చినెలలో మన రాయబారి ఐక్యరాజ్యసమితిలో మాట్లాడుతూ భారత్‌ దేశీయంగా ఉపయోగించే వాటి కంటే ఎగుమతులు చేసిందే ఎక్కువ అని గొప్పగా చెప్పుకున్నారు.


దేశంలో వాక్సిన్ల కొరత తలెత్తటంతో అబ్బే అంతా ఉత్తిదే అని జనాన్ని నమ్మించేందుకు కొత్త నాటకం. ప్రపంచం అంతా రాజకీయమయంగా ఉన్నపుడు ఎవరికి అవకాశం దొరికితే వారు ఉపయోగించుకుంటారన్నది జగమెరిగిన సత్యం. చైనా అదే చేస్తున్నది, ఎవరెంత గింజుకున్నా చేయగలిగిందేమీ లేదు. మనల్ని నమ్ముకొని వాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టిన వారు ఇప్పుడు మన మీద జాలి చూపుతూ చైనా వైపు చూస్తున్నారు. చిన్న దేశమైన భూటాన్‌ మన మీద ఆధారపడుతున్న దేశం, డోక్లాం వివాదంలో మన మిలిటరీ వెళ్లి చైనా వారిని అడ్డుకున్న విషయం తెలిసిందే. ఇండియా మాకు విశ్వసనీయమైన మిత్ర దేశమే, మేము అడిగితే రెండో డోసుకు వాక్సిన్లు ఇవ్వగలదు కానీ ఆ దేశంలోనే ప్రాణాలను నిలిపేందుకు ఎంతో అవసరం పడుతున్నపుడు మేము వత్తిడి చేయలేము అని ఆ దేశ ప్రధాని లోటే షెరింగ్‌ గత నెలలో ప్రకటించాడు.చైనా నుంచి దిగుమతి చేసుకొనేందుకు పూనుకున్నారు.నేపాల్‌దీ అదే పరిస్ధితి. మన వాక్సిన్ల కంటే చైనావి ధర ఎక్కువే అయినప్పటికీ, అమెరికా, ఐరోపా ధనిక దేశాలు ఎగుమతులు చేయనందున మిగతా ప్రపంచ దేశాలు చైనా వైపు చూడక తప్పని స్ధితి.

చైనాలో తయారు చేస్తున్న సినోఫామ్‌, సినోవాక్‌ వాక్సిన్‌న్లకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఆమోదం తెలపటంతో ఇప్పుడు అనేక దేశాలు అంతకు ముందు వచ్చిన వార్తలతో సందేహాలు వెలిబుచ్చినవి కూడా ఇప్పుడు వాటిని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. అమెరికా, ఐరోపాల వెలుపల తయారు చేసిన వాక్సిన్లలో ప్రపంచ ఆరోగ్య సంస్ద ఆమోదం పొందిన వాటిలో ఇంతవరకు చైనావి మాత్రమే ఉన్నాయి. మన దేశానికి చెందిన కోవాక్సిన్‌కు ఇంతవరకు ఆమోదం లేదు. ఒకసారి వాగ్దానం చేస్తే అది గ్రాంటు అయినా వాణిజ్య ప్రాతిపదిక అయినా కచ్చితంగా చైనా సరఫరా చేస్తుందనే నమ్మకం ప్రపంచ దేశాల్లో ఉంది. ఎనిమిది కోట్ల డోసులను అందచేస్తామని అమెరికా ప్రకటించటమే తప్ప వారాలు గడుస్తున్నా ఎటూ తేల్చటం లేదు. ఈ నెలాఖరుకు వస్తాయని చెబుతున్నారు. వాటిలో కొన్నింటిని మనకు అమెరికా ఉచితంగా ఇచ్చే అవకాశం ఉంది. గత కొన్ని నెలలుగా ఆవి అక్కడి గోడౌన్లలో పడి ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచ దేశాలకు 26.5కోట్ల డోసులు సరఫరా చేసిన చైనా మరో 50కోట్ల డోసుల సరఫరా చేయనుందని ఎయిర్‌ ఫినిటీ అనే సంస్ద నెల రోజుల క్రితం వెల్లడించింది. చైనా తరువాత ఐరోపా యూనియన్‌ వంద దేశాలకు 6.7 కోట్ల డోసులను ఎగుమతి చేసింది. మన దేశం నుంచి వాక్సిన్లు వస్తాయని ఆశించిన ఫిలిప్పైన్స్‌ అధికారి ఒకడు వాస్తవ పరిస్ధితిని అర్ధం చేసుకోకుండా దక్షిణ చైనా సముద్ర దీవుల వివాదంలో చైనాను విమర్శిస్తూ ట్వీట్లు చేశాడు. ప్రభుత్వం ఒకవైపు వాక్సిన్‌కోసం సంప్రదింపులు జరుపుతుంటే ఇలాంటి చర్యలేమిటని సదరు అధికారిని అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెరేట్‌ మందిలించాడు. చైనాతో వివాదం ఉన్నంత మాత్రాన దాని పట్ల దురుసుగా, అమర్యాదపూర్వకంగా వ్యవహరించాల్సిన అవసరం లేదన్నాడు. మన దేశం వాక్సిన్‌ ఎగుమతులపై నిషేధం విధించటంతో ఇండోనేషియా ప్రభుత్వం చైనా నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. చైనాతో వివాదం పేరుతో వాక్సిన్లు కొనుగోలు చేయకుండా జనం ప్రాణాలను ఫణంగా పెట్టటమా వివాదం ఉంటే తరువాత తేల్చుకుందాం ముందు ప్రాణాలు కాపాడటం ముఖ్యం అని వాక్సిన్లు కొనుగోలు చేసి సరఫరా చేస్తారా అన్నది మోడీ సర్కార్‌ తేల్చుకోవాల్సి ఉంది.


అవసరమైతే మనం కూడా చైనా నుంచి వాక్సిన్లు ఎందుకు దిగుమతి చేసుకోకూడదనే సూచనలు ఇప్పటికే వెలువడుతున్నాయి. మన మాదిరే చైనా కూడా గ్రాంటుగా ఇచ్చేది ఇస్తోంది, మరోవైపు వాక్సిన్లను ఆమ్ముతోంది. గత నెలాఖరులో మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ అమెరికా వెళ్లి వాక్సిస్లు ఆమ్ముతారా అంటూ వాకబు చేసి వచ్చారు. అమెరికన్లు ఏవీ ఉచితంగా ఇవ్వరు. ఒక వేళ ఒకదాన్ని ఇచ్చినా మరొకదానితో మొత్తం రాబడతారు. చైనా నుంచి ఆక్సిజన్‌ పరికరాలు, ఇతర సరఫరాలకు ఆటంకం లేకుండా సరకు రవాణా విమానాలు నడపాలని అదే జైశంకర్‌ చైనాను అడిగారు గానీ వాక్సిన్ల దగ్గర మొహమాట పడ్డారు. వాక్సిన్లు లేక జనం చస్తుంటే ఇదేమి వైఖరో, రాజకీయమో అర్ధం కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఐఎంఏ అధ్యక్షుడికి మత ముద్ర వేసిన కాషాయ దళం- రామ్‌దేవ్‌ బాబాకు జూన్‌ ఒకటిన వైద్యుల నిరసన !

29 Saturday May 2021

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Science, Uncategorized

≈ Leave a comment

Tags

Ayush systems, Baba Ramdev, Christianity, Dr Johnrose Austin Jayalal, Gaytri Mantra, Hindu Fundamentalism, IMA, RSS Propaganda, Yoga


ఎం కోటేశ్వరరావు


అల్లోపతి వైద్యాన్ని కించపరుస్తూ మాట్లాడిన రామ్‌దేవ్‌ బాబా బేషరతుగా క్షమాపణ చెప్పాలని, వాక్సినేషన్‌ కార్యక్రమాన్ని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడినందున ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జూన్‌ ఒకటవ తేదీన దేశవ్యాపితంగా నిరసన దినం పాటించాలని రెసిడెంట్‌ డాక్టర్ల ఫోరం పిలుపు నిచ్చింది. దీంతో ఇష్టవచ్చినట్లుగా బాబా మీద, మద్దతు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని కూడా ఎండగట్టే ఎండగట్టే అవకాశం ఉంది. రాతపూర్వకంగా క్షమాపణ చెప్పాలి లేదా వెయ్యి కోట్ల జరిమానా దావాను ఎదుర్కోవాలని అందుకు పదిహేను రోజుల గడువు ఇస్తున్నట్లు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఎ) ఇచ్చిన నోటీసులో పేర్కొన్నది. అందువలన ఆ గడువులోగా క్షమాపణ చెబుతారా, కేసును ఎదుర్కొంటారా అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శల తుపానుతో గుక్కతిప్పుకోలేని మోడీ సర్కార్‌కు అటు వైద్యులను సమర్ధించాలా లేకా విశ్వాసపాత్రుడైన రామ్‌దేవ్‌ను సమర్ధించాలా అన్న కొత్త తలనొప్పి మొదలయ్యే అవకాశం ఉంది. హర్యానాలో అధికారంలో ఉన్న బిజెపి సర్కార్‌ రామ్‌దేవ్‌ బాబా పతంజలి కరోనిల్‌ టూల్‌కిట్లను కొనుగోలు చేసి ఉచితంగా పంచాలని నిర్ణయించటాన్ని బట్టి బాబాకు మద్దతు ఇస్తున్నదెవరో స్పష్టమౌతోంది. మిగతా రాష్ట్రాలు కూడా ఏదో ఒకసాకుతో కొనుగోలు చేస్తాయా ?


వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అని కొందరు పండితులు చెప్పారు, ప్రచారం చేశారు తప్ప ప్రపంచంలో ఇంతవరకు ఏ వైద్య విధానమూ సర్వరోగ నివారిణులను కనుగొన్నాము అని ప్రకటించలేదు. అల్లోపతి కూడా చెప్పలేదు. కానీ కరోనా వైరస్‌ను సొమ్ము చేసుకోవాలని చూసిన రామ్‌దేవ్‌ బాబా వంటి వారు ఢిల్లీ పెద్దల అండచూసుకొని రెచ్చిపోతున్నారు. ప్రశ్నల పేరుతో అడ్డుసవాళ్లు విసురుతున్నారు. ఇప్పటికీ అనేక వ్యాధులకు సరైన ఔషధాలు, చికిత్స లేదు. అలాంటపుడు రామ్‌దేవ్‌ వంటి వారు ఒక్క అల్లోపతినే ఎందుకు ప్రశ్నించాలి, మిగతా విధానాలకు ఈ ప్రశ్నలను ఎందుకు వేయటం లేదు.


ఎందుకంటే ఆయుర్వేదం పేరుతో సొమ్ము చేసుకోవటం సులభం. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధానం ప్రకారం అల్లోపతి ఔషధాలకు మాత్రమే పరీక్షల నిర్దారణ నిబంధనలు ఉన్నాయి. సంప్రదాయ వైద్య పద్దతులను ప్రోత్సహించే పేరుతో ఆయుర్వేద, సిద్ద, యునానీ పేరుతో తయారు చేసే ఔషధాలకు వాటి నుంచి మినహాయింపులు ఇచ్చారు. ఆనందయ్య లాంటి వారు ఊరికొకరు మందుల పేరుతో పుట్టుకు వస్తున్నారు. ఈ లోపం కారణంగానే రామ్‌దేవ్‌ బాబా కంపెనీ పతంజలి తాము కరోనాను అరికట్టే కరోనిల్‌ అనే ఔషధాన్ని తయారు చేసినట్లు ప్రకటించుకుంది. దాన్ని విడుదల చేసిన సభలో స్వయంగా కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌ పాల్గొన్నారు. ఎలాంటి రుజువులు లేకుండా సొమ్ము చేసుకోవటం కంటే జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నందున ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ అలా చెప్పుకోవటాన్ని సవాలు చేసింది. కనుకనే బాబా గారికి అల్లోపతి వైద్యం, వైద్యుల మీద కోపం వచ్చింది. అందుకే నోటికి ఏది తోస్తే దాన్ని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. చివరికి అది వివాదానికి దారితీయటంతో కేంద్ర మంత్రి జోక్యం చేసుకొని అల్లోపతి వైద్యం మీద చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సలహా వంటి హెచ్చరిక చేయటంతో వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించిన బాబాగారికి ఉక్రోషం ఆగలేదు. ఐఎంఎగానీ దాని బాబు గాన్ని నన్ను అరెస్టు చేయించలేరు అని నోరుపారవేసుకున్నారు. దాని కొనసాగింపుగా వాక్సిన్‌ తీసుకున్నా పది వేల మంది వైద్యులు కరోనాతో మరణించారని అబద్దాలు ప్రచారం చేశారు. తన పాతిక ప్రశ్నలకు అల్లోపతి వైద్యవిధానాన్ని సమర్ధిస్తున్న వారు సమాధానం చెప్పాలంటూ సవాలు విసిరారు.


రామ్‌దేవ్‌ బాబా సవాలుకు తాము జవాబు చెబుతామని, తాము కూడా కొన్ని ప్రశ్నలు వేస్తామని ఆ చర్చను మీడియా సమక్షంలో నిర్వహించి ప్రత్యక్ష ప్రసారం చేయాలని, పతంజలి యోగ పీఠం నుంచి ముగ్గురు ఆయుర్వేదాచార్యులను నియమించాలని, కావాలంటే రామ్‌దేవ్‌ బాబా,ఆయన అనుచరుడు మరో భాగస్వామి బాలకృష్ణ కూడా చర్చలో ప్రేక్షకులుగా ఉండవచ్చునని ఐఎంఎ ప్రతిసవాలు విసిరింది. ఆయుర్వేదంలో వారిద్దరి అర్హతలేమిటో వెల్లడించాలని తాము గతంలోనే మూడు సార్లు కోరినప్పటికీ ఇంతవరకు జవాబు లేదని, అర్హత లేనివారితో చర్చించటం పద్దతి కాదు కనుక వారు తమ నిపుణులను నియమించాలని స్పష్టం చేసింది. అల్లోపతి వైద్య సామర్ద్యాన్ని ప్రశిస్తూ రామ్‌దేవ్‌ ప్రశ్నలు ఉన్నాయి.
ఈ వివాదంలో బిజెపి బీహార్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ సంజరు జైస్వాల్‌ అల్లోపతి వైద్యులకు మద్దతు ఇచ్చారు. తన ఫేస్‌బుక్‌ ఖాతాలో స్పందిస్తూ రామ్‌దేవ్‌ ఒక యోగా గురువు మాత్రమే, దానిలో ఆయన సమర్దతను ఎవరూ ప్రశ్నించరు. పానీయాలకు కోకా కోలా ఎంత ప్రాచుర్యం తెచ్చిందో యోగాకు ఆయన అలా చేశారు.భారతీయులు పురాతన కాలం నుంచీ షికంజీ, తండారు వంటి పానీయాలను తాగుతున్నారు. కోకా కోలా వచ్చిన తరువాత అదే జనాలు పెప్సీ, కోక్‌లను ఇండ్లలో నిలవచేసుకుంటున్నారు. రామ్‌దేవ్‌ యోగి కాదు, ఎందుకంటే యోగులు తమ మెదళ్లు, స్పృహలను అదుపులో ఉంచుకుంటారని అన్నారు. అల్లోపతి వైద్యులు పనికిమాలిన చర్చల్లో తమ సమయాన్ని, శక్తిని వృధా చేసుకోవద్దని పవిత్రమైన వృత్తి మీద కేంద్రీకరించాలని సలహా ఇచ్చారు. వ్యాధులను దూరంగా ఉంచినంత వరకు ముఖ్యమైనదే గాని యోగా వైద్యవిధానం కాదు, ప్రతి వైద్యవిధానానికి దేనికి ఉండే పరిమితులు దానికి ఉంటాయి, యోగా మనలను జాడ్యానికి దూరంగా ఉంచవచ్చు కానీ ఉన్న రోగాలకు చికిత్సగా చేస్తే కొత్త సమస్యలు తలెత్తుతాయి అన్నారు.


ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ) నూతన అధ్యక్షుడిగా ఎన్నికై పదవీ బాధ్యతలు స్వీకరించాల్సి డాక్టర్‌ సహజానంద కుమార్‌ సింగ్‌ ఒక ప్రకటన చేస్తూ రామ్‌దేవ్‌ తన యోగా, పతంజలి ఉత్పత్తులకు పరిమితం కావాలి, కరోనా సమయంలో అవసరమైన చికిత్స చేస్తున్న వైద్యులను నిరుత్సాహపరచ కూడదన్నారు. రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్నప్పటికీ పదివేల మంది వైద్యులు మరణించారంటూ పుకార్లు వ్యాపింప చేస్తున్నందుకు, కరోనా మీద ప్రభుత్వ చికిత్సా విధానాలను సవాలు చేయటం దేశద్రోహంగా పరిగణించి అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రధానికి రాసినట్లు తెలిపారు. అలాంటి చర్యలు జనాన్ని వాక్సిన్లు తీసుకోకుండా చేసేందుకు ప్రోత్సహిస్తాయని, ఇది జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకమని, ఇంతకంటే దేశద్రోహం ఏముంటుందని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్‌ ఐఎంఎ శాఖ వెయ్యి కోట్ల పరువు నష్టం దావా నోటీసు పంపిందన్నారు.


కరోనిల్‌ గురించి పతంజలి తప్పుడు ప్రచారం చేసి రోగులను తప్పుదారి పట్టించేందుకు పూనుకోవటంతో దాని సామర్ధ్యం గురించి ఐఎంఎ సవాలు చేసింది. అయితే తాము 46 మంది రోగుల మీద పరీక్షలు జరిపామని సమర్ధించుకొనేందుకు చూసినప్పటికీ కుదరకపోవటంతో అది చికిత్సకు సహాయకారి అని ప్రకటించాల్సి వచ్చింది. నిజానికి కేంద్ర ప్రభుత్వ సంస్ధ కూడా అలాంటిదిగానే పరిగణించి అనుమతి ఇచ్చినప్పటికీ ఏకంగా కరోనా నిరోధం అని ప్రచారం చేశారు. దీంతో ఐఎంఎ మీద అక్కసుతో అల్లోపతి వైద్యం బుద్ది తక్కువ శాస్త్రం అని రామ్‌దేవ్‌ అంటే పతంజలి సంస్ధ సారధుల్లో ఒకరైన ఆచార్య బాలకృష్ణ సమస్యకు మతం రంగు పులిమి కుట్ర కోణాన్ని ముందుకు తెచ్చి పక్కదారి పట్టించేందుకు పూనుకున్నారు. బిజెపి అనుకూల మీడియా కూడా దాన్ని భుజానవేసుకొని మతకోణాన్ని ముందుకు తీసుకు వచ్చిదాడి చేస్తోంది. సహజంగానే ఆ దాడికి గురైన నెటిజన్లు అదే పాటపాడుతున్నారు.


యావత్‌ దేశాన్ని క్రైస్తవంలోకి మార్చే కుట్రలో భాగంగా ఆయుర్వేదంపై బురద జల్లేందుకు లక్ష్యంగా చేసుకున్నారు, గాఢనిద్రలో ఉన్న దేశప్రజలు మేలుకోనట్లయితే రాబోవు తరాలు మిమ్మల్ని క్షమించవు అని బాలకృష్ణ ప్రజలను కూడా అవమానిస్తూ రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. దీని వెనుక అసలు కారణంగా కరోనిల్‌ మీద అదే విధంగా అల్లోపతిని అవమానిస్తూ వ్యాఖ్యానించిన రామ్‌దేవ్‌ మీద చర్యకు డిమాండ్‌ చేసిన ఐఎంఏకు ప్రస్తుతం అధ్యక్షుడిగా డాక్టర్‌ జాన్‌ రోజ్‌ జయలాల్‌ చురుకుగా వ్యవహరించటమే. తన పదవిని ఉపయోగించుకొని జాన్‌ రోజ్‌ జనాన్ని క్రైస్తవులుగా మార్చేందుకు పూనుకున్నారని గర్హనీయ, హాస్యాస్పదమైన ఆరోపణలకు దిగారు.


ప్రతిదానికీ ఆయుర్వేదంలో చికిత్స ఉంది, ఔషధాలున్నాయని చెప్పే వారు ప్రత్యామ్నాయ చికిత్సా విధానం కోసం ఎదురు చూస్తున్న జనం బలహీనతను సొమ్ము చేసుకొనేందుకు దేన్నీ వదలటం లేదు.మూడు సంవత్సరాల క్రితం కేరళలో వచ్చిన నీఫా వైరస్‌ వ్యాప్తి సమయంలో కూడా ఆయుర్వేదంలో కషాయ చికిత్స ఉందంటూ జనాన్ని తప్పుదారి పట్టించేందుకు పూనుకున్న సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేయాలి. అప్పుడు కూడా ఐఎంఎ రంగంలోకి దిగి జనాన్ని హెచ్చరిస్తూ అలాంటి ప్రచారాన్ని నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరించింది.నిజానికి నీఫా వైరస్‌ 1990 దశకంలోనూ, తరువాత కూడా మన దేశంలో వ్యాపించింది, దేశంలో కేరళ ఆయుర్వేద ప్రాచుర్యం గురించి తెలిసిందే, అయినప్పటికీ ఆ వైద్య విధానం లేదా ఆరంగంలో పని చేస్తున్న వారు గానీ ఔషధాన్ని తయారు చేయలేకపోయారు. ఇప్పుడు ఎలాంటి అర్హతలు, నైపుణ్యంలేని ఆనందయ్య కరోనాకు తాను మందు తయారు చేశానని చెబితే సమర్ధించే ఆయుర్వేద వైద్యులందరూ తమ పట్టాలను పక్కన పడేసి కల్వాలు-గూటాలు తీసుకొని ఆనందయ్య అనుచరులుగా మారిపోవటం మంచిది. ఆనందయ్యను సమర్ధించే పాలకులు ఆయుర్వేద కాలేజీలు, ఆసుపత్రులను అల్లోపతికి మార్చివేయాల్సి ఉంటుంది.


తన పదవిని ఉపయోగించుకొని జనాన్ని క్రైస్తవంలోకి మార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న తప్పుడు వార్తలను పట్టుకొని ఢిల్లీకి చెందిన ఒక లాయర్‌ ఐఎంఎ అధ్యక్షుడు జాన్‌ రోజ్‌ జయలాల్‌ మీద ఒక క్రిమినల్‌ కేసు దాఖలు చేశారు. రామ్‌దేవ్‌పై ఐఎంఎ ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ఇది దాఖలు కావటం గమనించాల్సిన అంశం. సామాజిక మాధ్యమంలో ప్రకటనలు చేయటం ద్వారా మత బృందాల మధ్య శతృత్వాన్ని ప్రోత్సహిస్తున్నారని లాయర్‌ ఆరోపించారు. తాను ఒక టీవీ చర్చను చూశానని, దానిలో బాబా రామ్‌దేవ్‌ను దూషిస్తూ, దుర్భాషలాడారని, బెదిరించారని, తాను యోగా గురువు భక్తుడిని కనుక మానసికంగా గాయపడ్డానని పేర్కొన్నారు. ఒక ఇంటర్వ్యూలో ” కుష్టు, కలరా, ఇతర మహమ్మారులు ప్రపంచంలో నష్టం కలిగించినపుడు వాటికి వ్యతిరేకంగా క్రైస్తవ వైద్యులు, చర్చ్‌లు పని చేశారని, క్రైస్తవ కరుణ చూపించారని ” చెప్పారని అది క్రైస్తవంలోకి మార్చే ప్రయత్నమని ఆరోపించారు.


ఒక కులం లేదా మతంలో పుట్టటం అనేది ఎంపిక ప్రకారం జరిగేది కాదు.అనేక మంది హిందూ, ముస్లిం, సిక్కు తదితర మతాల కుటుంబాలలో పుట్టినట్లుగానే డాక్టర్‌ జాన్‌ రోజ్‌ క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు. అతని మీద చేస్తున్న ఆరోపణల స్వభావం ఏమిటి ? అతను హగ్గారు ఇంటర్నేషనల్‌ అనే క్రైస్తవ సంస్ద సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రతి దేశాన్ని ఏసు క్రీస్తు సువార్తతో మార్చివేయాలన్న లక్ష్యం మాది అని సదరు సంస్ధ ప్రకటించుకుంది. ఐఎంఎ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఆ సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆధ్యాత్మిక జీవితంలో వైద్య వృత్తిలో సువార్త స్ఫూర్తిని నింపుకొని పని చేస్తానని, దేవుడికి సజీవ సాక్షిగా జీవించాలని గాఢంగా భావిస్తున్నాను. తమ వ్యక్తిగత రక్షకుడిగా ఏసును స్వీకరించాలని యువ వైద్య విద్యార్ధులు, వైద్యులను ప్రోత్సహిస్తాను, నేను పని చేస్తున్న ఒక లౌకిక సంస్ధలో దేవుడికోసం ఒక సాక్షిగా పని చేస్తాను అని చెప్పారు. సంఘపరివార్‌ శక్తులు ఈ మాటలను పట్టుకొని వాటికి చిలవలు పలవలు అల్లి తమ భాష్యాన్ని జోడించి నానా యాగీ చేశాయి. సదరు హగ్గీ సంస్ద ప్రకటించుకున్న లక్ష్యాలకు జాన్‌ రోజ్‌ ఎలా బాధ్యుడు అవుతారు?


లౌకిక రాజ్యాన్ని హిందూత్వ దేశంగా మార్చాలనే లక్ష్యాన్ని ప్రకటించిన ఆర్‌ఎస్‌ఎస్‌లోని వారే నేడు దేశాన్ని ఏలుతున్నారు. నిత్యం అందుకోసమే ఎన్ని ఎత్తులు, ఎన్ని జిత్తులు,ఎంతగా ప్రచారం చేస్తున్నారో తెలుసు. అలాంటివి ఇంకా అనేక సంస్ధలు ఉన్నాయి. వాటి సమావేశాల్లో పాల్గొన్నవారు అనేక మంది వివిధ అధికారిక సంస్దలు, పదవుల్లో ఉన్నారు. ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ అలాంటిది కాదు, వైద్య వృత్తిదారుల సంస్ధ. దాని నిబంధనావళికి లోబడి అర్హతలు ఉన్న ఎవరైనా చేరవచ్చు, పదవులకు ఎన్నిక కావచ్చు. వివిధ మతాలకు చెందిన వైద్యులు దాని సభ్యులుగా ఉండి తమ మత సంస్ధల సమావేశాలు, ప్రార్ధనా స్ధలాలకు వెళ్లటమా లేదా అనేది వారిష్టం. అదేమీ అనర్హత కాదు కనుకనే జాన్‌ రోజ్‌ జయలాల్‌ అత్యున్నత పదవికి ఎన్నికయ్యారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న అనేక మంది తమ మతవిశ్వాసాలకు అనుగుణ్యంగా గుళ్లు గోపురాలు తిరుగుతున్నారు. అంతమాత్రాన లౌకిక రాజ్యాంగం ప్రకారం పదవిని పొందిన వారిని వాటికి వెళ్లవద్దని ఎవరూ చెప్పటం లేదు. అది వారికి సంబంధించిన వ్యక్తిగత అంశం. విధి నిర్వహణలో తమ మతాన్ని, కులాన్ని తీసుకురావటం చట్టవిరుద్దం, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం. జాన్‌ రోజ్‌ ఎన్నికైన తరువాత ఏ వైద్య విద్యార్ధులు లేదా వైద్యులను ఐఎంఎ అధ్యక్షుడి హౌదాలో సమావేశ పరచి క్రైస్తవాన్ని పుచ్చుకోమని ఎక్కడా చెప్పలేదు. చంద్రబాబు సర్కార్‌ పుష్కర స్ధానాలు చేస్తే పుణ్యం వస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. బిజెపి ముఖ్యమంత్రులు, మంత్రులు కుంభమేళాలో పాల్గొని గంగలో మునగాలని ప్రోత్సహించారు, తమ అధికార పదవులను దుర్వినియోగం చేశారు.


ఇక జాన్‌ రోజ్‌ హిందూయిజాన్ని, పురాతన భారత సంస్కృతిని ద్వేషించారు అన్న ఆరోపణ. ఏ సందర్భంలో ద్వేషించారో లేదో కాషాయ దళాల రాతలను బట్టి నిర్ధారణలకు రాలేము. లేదూ ఒకవేళ ద్వేషించారే అనుకుందాం. అలాంటి అభిప్రాయాలు కలిగిన వారు అనేక మంది ఉన్నారు. లేదూ మతవిద్వేషాలు రెచ్చగొట్టిన నేపధ్యం ఏమైనా ఉందా ? ఒక అభిప్రాయం కలిగి ఉండటం దేశద్రోహమా, రాజ్యాంగ విరుద్దమా ? కులము-హిందూయిజం రెండింటికీ తేడాలేదని ద్వేషించిన తరువాతనే కదా అంబేద్కర్‌ రాజ్యాంగ రచనకు అధ్యక్షత వహించలేదా, కేంద్రమంత్రిగా పని చేయలేదా.
ఒక ఇంటర్వ్యూలో ” వారు దేశాన్ని ఒకటిగా, వైద్య పద్దతిని ఒకటే ఉండాలని కోరుకుంటున్నారు, రేపు ఒకే మతం ఉండాలని కోరుకుంటారు. ఇది కూడా సంస్కృత భాష ప్రాతిపదికన, అది ఎల్లవేళలా హిందూ సిద్దాంతాలతోనే ఉంటుంది.ఇది పరోక్ష పద్దతిలో సంస్కృతం పేరుతో జనం మెదళ్లలో హిందూత్వను నింపాలని చూస్తున్నారు ” అని కూడా జాన్‌ రోజ్‌ చెప్పారట. దానిలో అభ్యంతరం ఏముంది, గత ఏడు సంవత్సరాలుగా చేస్తున్నది అదే కదా ?


ప్రాణాయామం చేయటం ద్వారా, గాయత్రీ మంత్రాన్ని పఠించి కరోనాను పోగొట్టవచ్చా అని పరీక్షలు చేయాలని కేంద్ర శాస్త్ర సాంకేతికశాఖ నిర్ణయించటాన్ని, రెండు వారాల పాట్లు క్లినికల్‌ ప్రయోగాలు చేయాలని ఆదేశించటాన్ని ఏమనాలి, దాన్ని చదివి, విన్న వారికి కలిగే అభిప్రాయం ఏమిటి ? హిందూ మతంలో ఉన్న మూఢనమ్మకాలను ప్రోత్సహించటమా కాదా ? ముస్లిం, క్రైస్తవ ఇతర మతాల ప్రార్ధనలతో కూడా కరోనాను పోగొట్టవచ్చేమో పరీక్షించాలని గాయత్రీ మంత్రంతో పాటు ఎందుకు జత చేయలేదు. దీనితో పోల్చుకుంటే చర్చిల్లోంచి పరిశుద్ద జలం తెచ్చి వాటిని తాగితే లేదా చల్లుకుంటే కరోనా పోతుందని జాన్‌ రోజ్‌ చెప్పలేదు. తాను చెప్పిన వాటిని వక్రీకరించారని డాక్టర్‌ జయలాల్‌ చెప్పారు, ఆయన మీద జరుగుతున్న ప్రచారాన్ని ఐఎంఎం స్వయంగా ఖండించింది. తమ విధానాలు, వైఖరిని విమర్శించిన ప్రతివారి మీద మతం ముద్రవేయటం ద్వారా తమ దాడిని సమర్ధించుకొనే యత్నం తప్ప ఇది మరొకటి కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సరఫరాలు ఆపొద్దు, ధరలు పెంచొద్దని చైనాను కోరిన మోడీ సర్కార్‌ !

14 Friday May 2021

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Health, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RUSSIA, Science, UK, USA

≈ 1 Comment

Tags

Big Pharma Vaccine Profits, BJP Propaganda, China's vaccine diplomacy, Narendra Modi Failures, vaccination Policy, Vaccine Nationalism, WHO


ఎం కోటేశ్వరరావు


మన దేశంలో ఆక్సిజన్‌, ఇతర ఔషధాల ధరలు ముఖ్యంగా కరోనా చికిత్సలో వినియోగించే వాటి ధరలు ఎలా పెరుగుతున్నాయో, బ్లాక్‌ మార్కెట్‌ ఎలా ఉందో పదే పదే చెప్పనవసరం లేదు.బాధితులు, వారి బాధలు పంచుకున్నవారందరికీ అనుభవమే. దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్దితిని విధించి ముఖ్యమైన ఔషధాలు,వాక్సిన్లకు కంపల్సరీ లైసెన్సింగ్‌ విధానం కింద అనుమతులు ఇచ్చి అవసరాల మేరకు ఉత్పత్తిని పెంచేందుకు, ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమీ లేవు. ఇదేం పనయ్యా బాబూ అని ఎవరైనా ప్రశ్నిస్తే బిజెపి ప్రతినిధులు ఆరోగ్యం రాష్ట్రాలకు సంబంధించింది అని ఎదురుదాడులకు దిగుతున్నారు. మరోవైపున తొలి దశలో కరోనాను జయించింది తమ ప్రధాని మోడీ అని ఆయన లేకపోతే అదుపుఅయ్యేది కాదని, జనం ప్రాణాలు నిలిచేవి కాదంటూ పాడిన భజన గీతాల సంగతేమిటి, ఇప్పుడు ఇలా తాళం మార్చారేమిటి అని అడిగితే కష్ట కాలంలో సహకరించాల్సింది పోయి దెప్పి పొడుపులు, విమర్శలా అంటూ విరుచుకు పడుతున్నారు. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువారు అంటూ సుమతీ శతకకారుడు బహుశా ఇలాంటి వారి గురించే చెప్పి ఉంటాడు.

మన దేశంలో కరోనా వాక్సిన్‌ ధరల మీద కేంద్ర ప్రభుత్వం నియంత్రణ విధించలేదు. కేంద్రానికి ఇచ్చే వాక్సిన్లకు ఒక రేటు, రాష్ట్రాలకు ఇచ్చేదానికి ఒక రేటు, ప్రయివేటు ఆసుపత్రులకు అమ్మేది ఒక రేటు. ఒక వైపు సామాజిక మాధ్యమాలు, సాంప్రదాయ మాధ్యమాల్లో బిజెపి ప్రతినిధులు ఇప్పటికీ చైనా వైరస్‌ అంటూ దాడులు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ జనానికి తెలియాల్సిందేమంటే చైనా వస్తువులను బహిష్కరిస్తాం, చైనాకు బుద్ది చెబుతాం, కాళ్ల దగ్గరకు రప్పిస్తాం అని ఏడాది నుంచి ప్రగల్భాలు పలుకుతున్న వారు తేలు కుట్టిన దొంగల మాదిరి అదే చైనా నుంచి చేసుకుంటున్న దిగుమతుల గురించి మాత్రం మాట్లాడటం లేదు. గుండెలు తీసిన బంట్ల సంగతేమోగానీ అలాంటి వారిని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. కొద్ది రోజుల క్రితం రవాణా విమానాలు ఆపేసి మనలను దెబ్బతీసిందంటూ చైనాను నిందించారు. ఆ సమస్య పరిష్కారం అయిన విషయం మాత్రం జనానికి చెప్పకుండా ఇంకా అదే అభిప్రాయంతో ఉండాలని కోరుకొనే వారు మాత్రమే దాన్ని మూసిపెడతారు.


తాజా విషయానికి వస్తే భారత్‌ దిగుమతి చేసుకొనే వైద్యపరమైన వస్తువుల సరఫరా ఆగకుండా, ధరలు పెరగకుండా చూడండి సారో అని మన దేశం చైనా నాయకత్వాన్ని అభ్యర్ధిస్తున్నది. ఈ సమాచారం కొందరికి మింగుడు పడకపోవచ్చు. నరేంద్రమోడీ విఫల ప్రధాని అంటే మింగుడు పడుతోందా ! ఇదీ అంతే !! నిజం త్వరగా ఎక్కదు. చైనా ప్రత్యేక ప్రాంతంగా ఉన్న హాంకాంగ్‌లోని భారత కాన్సుల్‌ జనరల్‌ ప్రియాంక చౌహాన్‌ అక్కడి నుంచి వెలువడే సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు పత్రిక విలేకరితో మాట్లాడారు.” చైనా సరఫరా వ్యవస్ద తెరిచే ఉండాలని, ఉత్పత్తుల ధరలు స్ధిరంగా ఉండాలన్నది ఈ దశలో మా ఆకాంక్ష. సరఫరా గిరాకి వత్తిడి కొంత పెరిగినప్పటికీ ఉత్పత్తుల ధరలు స్ధిరంగా, అంచనాకు అందేట్లు ఉండాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రభుత్వ స్ధాయిలో కూడా మద్దతు, ప్రయత్నాలు అవసరం. అయితే ఈ విషయంలో చైనా ప్రభుత్వ పలుకుబడి ఎంత ఉంటుందో, ఏమి చేయగలదో నాకు సమాచారం లేదు, అయితే వారు చేయగలరు, అలా చేస్తే మేము స్వాగతిస్తాం ” అని ప్రియాంక చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొన్నది. సూటిగా మన రాజకీయ నాయకత్వం అడిగేందుకు ముఖం చెల్లక తడిక రాయబారం చేశారన్నది స్పష్టం.


మనకు అవసరమైన ముఖ తొడుగులు, పిపిఇ కిట్లు అన్నీ మనమే తయారు చేసుకోగలుగుతున్నట్లు కాషాయ దళాలు ప్రచారం చేస్తున్నాయి. మంచిదే, ఇంతకంటే కావాల్సింది ఏముంది ? మేకిన్‌ ఇండియా కింద గత ఏడు సంవత్సరాలుగా ఇబ్బడి ముబ్బడిగా ప్రపంచానికే వస్తువులను ఎగుమతి చేస్తున్నాము కదా అని పగటి కలలు కంటున్న వారున్నారు. మే 14వ తేదీ హిందూ పత్రిక వార్త వారి కళ్లు తెరిపిస్తుందా ? దాని ప్రకారం మన దేశం చైనా కంపెనీలకు ఏప్రిల్‌ నుంచి 40వేల ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్లకు ఆర్డరు పెడితే 21వేలు మనకు వచ్చాయి. వీటితో పాటు ఐదువేల వెంటిలేటర్లు, రెండు కోట్ల పది లక్షల ముఖతొడుగులు( మాస్కులు), 3,800 టన్నుల ఔషధాలు భారత్‌కు ఎగుమతి చేసినట్లు చైనా కస్టమ్స్‌శాఖలో నమోదైనట్లు దానిలో పేర్కొన్నారు. ఇవన్నీ తప్పుడు ప్రచారాలు అని కొట్టి పారవేస్తే చేసేదేమీ లేదు. ప్రచారానికి – వాస్తవానికి ఉన్న తేడాను జనానికి చెప్పేందుకే ఈ విషయాలు తప్ప నరేంద్రమోడీని దెప్పాలని కాదు. ఇప్పటి వరకు విదేశీ పత్రికలు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాయి. ప్రభుత్వమే కనపడటం లేదని మన దేశానికి చెందిన అవుట్‌లుక్‌ పత్రిక తాజా ముఖచిత్రంగా ప్రచురించినందున మోడీని వెతికి తెచ్చి ఎక్కడికి పోయారని ప్రశ్నించాలి తప్ప దెప్పి ప్రయోజనం ఏముంది ? ఒక వేళ ప్రశ్నించినా నోరు విప్పుతారా ?

కరోనా మహమ్మారి నుంచి రక్షణకు వినియోగించే వాక్సిన్లకు కొంత కాలం పాటు పేటెంట్‌ హక్కుల అమలు నిలిపివేయాలని ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటివో)లో దక్షిణాఫ్రికా, మన దేశం కూడా ప్రతిపాదించాయని, నరేంద్రమోడీ చొరవ ఎలాంటిదో చూడండి, చివరికి అగ్రరాజ్యం అమెరికా కూడా అంగీకరించింది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.(మనకు అవసరమైన వాక్సిన్‌ ముడిపదార్దాలనే ఇచ్చేందుకు అంగీకరించని వారు పేటెంట్ల రద్దుకు అంగీకరిస్తారా ? ) దీనితో పాటు కంపల్సరీ లైసెన్సు విధానం కింద గతంలో నాట్కో కంపెనీకి కాన్సర్‌ ఔషధ తయారికి అనుమతి ఇచ్చినట్లుగా వాక్సిన్లకు సైతం ఇవ్వాలన్న ప్రతిపాదనను ప్రజారోగ్య నిపుణులు, ఆ రంగంలో పని చేస్తున్నవారు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అందువలన మన ప్రభుత్వం ప్రపంచ సంస్ధలో అలాంటి ప్రతిపాదన చేయటం మంచిదే, ఎవరు చేసినా అభినందించాల్సిందే. ఇది నాణానికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు ఏం జరుగుతోంది. ఇదే నరేంద్రమోడీ సర్కార్‌ మే తొమ్మిదవ తేదీన సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో దానికి విరుద్దమైన వాదన చేసింది. సుప్రీం కోర్టు సూచించిన విధంగా కంపల్సరీ లైసెన్సు నిబంధనను ఈ దశలో ఉపయోగిస్తే, మేథోసంపత్తి హక్కుల ఒప్పందానికి విరుద్దంగా చర్యలు తీసుకుంటే ప్రతికూల ఫలితాలు వస్తాయని వాదించింది. ప్రచారం కోసం, జనాన్ని మభ్యపెట్టేందుకు ప్రపంచ వాణిజ్య సంస్దలో ఒక వైఖరి, తన అధికారాన్ని వినియోగించాల్సి వచ్చే సరికి కార్పొరేట్‌ కంపెనీల అనుకూల వాదనలు. ఎంత దగా ! పోనీ ఇప్పటి వరకు సానుకూలంగా వ్యవహరించి నరేంద్రమోడీ సర్కార్‌ సాధించింది ఏమిటి ? కోవిషీల్డ్‌ తయారీకి అవసరమైన ముడి పదార్ధాలు, పరికరాల ఎగుమతులపై అమెరికా ప్రభుత్వం నిషేధం విధించినపుడు దానికి రాని ప్రతికూల ఫలితాలు ప్రజల ప్రాణాలు కాపాడేందుకు పూనుకుంటే మనకు వస్తాయా ? ఒక వేళ వస్తే ఏమిటి ? మిన్ను విరిగి మీద పడుతుందా ? చైనాకు వ్యతిరేకంగా మనం చతుష్టయం పేరుతో అమెరికాతో జతకట్టి బస్తీమే సవాల్‌ అన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి వారు మనకు అవసరమైన వాటిని అందచేస్తున్నారా లేదా ? అమెరికా ఒక వైపు తమ జనం కోసం యుద్దసమయాల్లో వినియోగించే చట్టాలకు దుమ్ముదులిపి అమలు జరుపుతుంటే దాని భాగస్వామి అని చెప్పుకొనే మనం మన సార్వభౌమ అధికారాన్ని వినియోగించలేనంత దుర్బలంగా ఉన్నామా ? అసలు నరేంద్రమోడీ గారి సమస్య ఏమిటి ? ఇంత విపత్తు వస్తే కనీసం ప్రతిపక్షాలతో అఖిలపక్ష సమావేశం వేసి పరిస్ధితిని వివరించి సలహాలను కోరేందుకు తీరికలేనంతగా ఏం చేస్తున్నట్లు ? కేంద్రం చెబుతున్నట్లు ఆరోగ్య సమస్య రాష్ట్రాలదే అయినపుడు కేంద్రంలో ప్రధాని, ఇతర మంత్రులకు గోళ్లు గిల్లు కుంటూ కూర్చోవటం తప్ప ఇప్పుడు మరొక పనేముంటుంది. తీవ్రత తక్కువ మొదటి దశలో మోడీ చేయించిన పళ్లాలు, గ్లాసుల మోత, దీపాలు వెలిగించటం వంటి చర్యలన్నింటినీ జనం పాటించారుగా, ఇప్పుడు ఆ చొరవ ఏమైనట్లు ? పిచ్చిదో ఎచ్చిదో ఏదో ఒకటి ఎందుకు చేయించటం లేదు ? ఏమీ లేదు, ఎంత హడావుడి చేస్తే అంతగా జనం కేంద్రం వైపు చూస్తారు. ఉచిత వాక్సిన్‌ సరఫరాకే చేతులెత్తేసి అధిక భారాన్ని రాష్ట్రాల మీద నెట్టింది. గతేడాది మాదిరి 27లక్షల కోట్ల ఆత్మనిర్భర వంటి బూటకపు ప్రకటనలు చేస్తే నమ్మే జనం లేరు. అందుకే ప్రజాస్వామ్యబద్దంగా రాష్ట్రాల నిర్ణయానికే వదిలేస్తున్నానంటూ బాధ్యత నుంచి తప్పుకుంటున్నారు.

కోవిషీల్డు లేదా కోవాగ్జిన్‌కు గానీ ప్రయోగాలు పూర్తిగాక ముందే అత్యవసర వినియోగం పేరుతో ముందుగానే అనుమతి ఇచ్చారు. దాదాపు అన్ని దేశాలూ అదే చేశాయి. కోవిషీల్డు మన స్వంత తయారీ కాదు. దాని మాదిరే రష్యా స్పుత్నిక్‌ వాక్సిన్‌ ఉత్పత్తికి రెడ్డీలాబ్స్‌ ఒప్పందం చేసుకుంది. ఈ రెండింటితో పాటు దానికి, ఇతర వాక్సిన్లకు అనుమతి ఇచ్చి ఉంటే ఇప్పుడు తలెత్తిన వాక్సిన్‌ గిరాకీని సులభంగా అధిగమించి ఉండేవారం కదా ? రెండు కార్పొరేట్‌ కంపెనీల ప్రయోజనం కాపాడేందుకు చూపిన శ్రద్ద వేగంగా వాక్సిన్‌ తయారీ మీద ఎందుకు లేకపోయింది. మొదటి డోసు తీసుకున్న తరువాత నెల రోజుల్లోగా రెండవ డోసు తీసుకోవాలని చెప్పింది ప్రభుత్వమూ, నిపుణులే. ఇప్పుడున్న నెలన్నర – రెండు నెలల వ్యవధిని పొడిగించి మూడు నుంచి నాలుగు నెలల్లోపు కోవిషీల్డు తీసుకోవచ్చు అంటున్నారు. జనం దేన్ని నమ్మాలి ?
ప్రపంచంలో 184 వాక్సిన్లను జంతువుల మీద ప్రయోగించి పరిశీలిస్తున్నారు. ఆరోగ్యవంతులైన యువతీయువకుల మీద 32 వాక్సిన్లు మొదటి దశ ప్రయోగంలోనూ, 35 వాక్సిన్లు వివిధ తరగతుల మీద రెండవ దశ, 25వాక్సిన్ల ప్రభావం గురించి మూడవ దశ ప్రయోగాలు జరుగుతున్నాయి. పద్నాలుగు వాక్సిన్లను వినియోగిస్తున్నారు. అవన్నీ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్ధ అనుమతి పొందినవే. ఎవరు ముందుకు వస్తే వాటి తయారీకి మన దేశం ఆహ్వానించి ఉంటే వెంటనే అన్ని వయస్సుల వారికి వాక్సిన్‌ పూర్తయ్యేది, రోజుకు నాలుగువేల మరణాలు తప్పి ఉండేవి కదా ? ఎందుకు ఇవ్వలేదు ?
ఔషధాల తయారీలో మన దేశం పురోగమించిన మాట వాస్తవం. అది చైనా కంటే ఎక్కువ అని కొందరు అనుకుంటారు, అనుకోనివ్వండి మనకు ఇబ్బంది లేదు. మన ఔషధ పరిశ్రమలకు అవసరమైన ముడి సరకు పూర్తిగా లేదా పాక్షికంగా తయారైన వాటిని మన ఫార్మారంగం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్న పచ్చినిజం తెలిసిందే. ఇప్పుడు చైనా నుంచి మన దేశం అత్యవసర ఔషధాలను తెచ్చుకుంటున్నది దానికి లేని అభ్యంతరం తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్ద ఆమోదించిన చైనా వాక్సిన్‌ తెచ్చుకొనేందుకు, జనం ప్రాణాలను కాపాడేందుకు ఇబ్బంది ఏమిటి ? చైనా వాక్సిన్లు అంతగా పని చేయవని ఆ దేశ నిపుణులే చెప్పారని కట్టుకధలు ప్రచారం చేశారు. చైనాలో ఏటా ఐదు వందల కోట్ల డోసులను ఉత్పత్తి చేయగల సామర్ధ్యం ఉంది. మన దేశంలో ఐసిఎంఆర్‌తో కలసి భారత బయోటెక్‌ తయారు చేసిన కోవాగ్జిన్‌ పూర్తిగా వినియోగ అనుమతి మన దేశంలోనే ఉంది. మరో 14 దేశాల్లో అత్యవసర వినియోగానికి అనుమతించారు. ఇదే సమయంలో చైనాలో తయారైన నాలుగు వాక్సిన్లలో ఒకటైన సినో ఫార్మ నాలుగు దేశాల్లో పూర్తి వినియోగం 50 దేశాల్లో అత్యవసర అనుమతి పొందింది. మరొకటి కరోనా వాక్సిన్‌ పూర్తి వినియోగం చైనాలో, మరో 35దేశాల్లో అత్యవసర వినియోగానికి అనుమతి పొందింది. మరో రెండు పరిమితంగా అనుమతి పొందాయి. అందువలన మన దేశం వాక్సిన్ల రంగంలో ముందుంది అని చెప్పుకోవటం అతిశయోక్తి తప్ప మరొకటి కాదు.


నరేంద్రమోడీ ప్రపంచ ఫార్మా కంపెనీలను దెబ్బతీసినందున అవన్నీ కక్ష కట్టాయంటూ ఆయన భక్తులు మహిమలను అంటగట్టి ప్రచారం చేస్తున్నారు. మన దేశంలో తయారయ్యే వాక్సిన్లు మన అవసరాలకే సరిపోని స్ధితి కళ్ల ముందు కనిపిస్తుంటే ఇలాంటి అతిశయోక్తులను చూసి నవ్వాలో ఏడవాలో అర్ధం కాదు. ఆపని చేసింది చైనా అన్నది పచ్చి నిజం. వాక్సిన్‌ మానవ హక్కు. ఎవరు జాతీయ వాదంతో సంకుచితంగా వ్యవహరిస్తున్నారు, ఎవరు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారో ప్రపంచం చూస్తూనే ఉంది. ఏప్రిల్‌ 25 నాటికి చైనా 41.5 కోట్ల డోసులను ఉత్పత్తి చేసి 20 కోట్ల డోసులను ఎగుమతి చేసి మిగిలిన దాన్ని తన దగ్గర ఉంచుకుంది. అమెరికా 26.8 కోట్ల డోసులు ఉత్పత్తి చేసి మొత్తం అంతర్గత వినియోగానికి ఉంచుకుంది. బ్రిటన్‌ కూడా అదే మాదిరి 2.3 కోట్ల డోసులు ఉత్పత్తి చేసి మొత్తం ఉంచుకుంది. ఐరోపా యూనియన్‌ 22 కోట్ల డోసులు ఉత్పత్తి చేసి తొమ్మిది కోట్ల డోసులు ఎగుమతి చేసి మిగిలింది తన సభ్య దేశాలకు వినియోగించింది. మన దేశం 19.6 కోట్ల డోసులు ఉత్పత్తి చేసి పన్నెండున్నర కోట్ల డోసులు మన దేశంలో వినియోగించి మిగతాది ఎగుమతి చేసింది. ఇప్పటి వరకు ఎవరు ప్రపంచ ఫార్మాను దెబ్బతీసినట్లు ? ఎవరు ప్రపంచాన్ని ఆదుకొనేందుకు ముందుకు వచ్చినట్లు ? నేడు ఆంగ్లో-శాక్జన్‌ (అమెరికా-బ్రిటన్‌) దేశాలు వాక్సిన్ల తయారీకి అవసరమైన ముడిపదార్దాలను దాచివేస్తున్నాయని కడుపు మండిన ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ వ్యాఖ్యానించాడు. మన ప్రధాని నరేంద్రమోడికి నోరు పెగల్లేదు.


చైనా వాక్సిన్‌ సినోఫార్మకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ అనుమతి ఇవ్వటంతో ఇప్పుడు పెద్ద ఎత్తున వాక్సిన్‌ పేద దేశాలకు అందేందుకు వీలు కలిగింది. త్వరలో చైనా మరో వాక్సిన్‌ సిన్‌వాక్‌ కూడా అనుమతి రాబోతున్నదని వార్తలు. మన కోవాగ్జిన్‌కు ఇంకా రాలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్ధలోని సభ్య దేశాలలో 192 కోవాక్స్‌ పేరుతో వాక్సిన్‌ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు, ప్రాంతాలకు 2021 చివరి నాటికి 200 కోట్ల డోసుల వాక్సిన్‌ అందించాలన్నది లక్ష్యం. ఇప్పటి వరకు కోవాక్స్‌ పధకంలో భాగంగా 5.4 కోట్ల డోసులను 121 దేశాలకు అందించింది. ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో వాక్సిన్ల ద్వారా ఫైజర్‌ కంపెనీ 350 కోట్ల డాలర్లు సంపాదించింది. మోడెర్నా కంపెనీ ఏడాదిలో 1900 కోట్ల డాలర్లను సంపాదించనుందని అంచనా. కార్పొరేట్‌ కంపెనీల లాభాల కోసం మహమ్మారిని దీర్ఘకాలం పొడిగిస్తున్నారా ? అంటూ ప్రపంచబ్యాంకు మాజీ అధిపతి, ఆర్ధికవేత్త జోసెఫ్‌ స్టిగ్లిజ్‌ మరొకరితో కలసి రాసిన వ్యాసంలో ప్రశ్నించారు. ఫైజర్‌, మోడెర్నా కంపెనీలు ఎంఆర్‌ఎన్‌ఏ వాక్సిన్ల తయారీలో గుత్తాధిపత్యం వహిస్తున్నాయి. వాటి తయారీకి ఇతరులను అనుమతించటం లేదు. ఎంతకాలం వీలైతే అంతకాలం మహమ్మారిని పొడిగించి సొమ్ము చేసుకోవాలన్నది వాటి ఎత్తుగడ. వైరస్‌ కొత్త రూపం సంతరించుకుంటున్న కారణంగా వాటికి అవసరమైన వాక్సిన్ల కోసం తమ వనరులను పదిలపరచుకోవాలని పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయన్నది స్పష్టం. కోవాక్స్‌ పధకానికి కోటి డోసులు ఉచితంగా సమకూర్చుతామని చైనా ఇప్పటికే వాగ్దానం చేసింది. వాక్సిన్‌తో పని లేకుండానే వైరస్‌ను అదుపు చేసిన చైనా పెద్ద ఎత్తునవాక్సిన్‌ తయారు చేస్తూ అత్యవసరమైన ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నది. మరోవైపు తన జనానికి తాపీగా వాక్సిన్‌ వేస్తున్నది. మరోవైపు దాని ఉత్పత్తిలో సగం కంటే తక్కువ ఉన్న మనం దేశం చైనా కంటే వేగంగా వాక్సిన్‌ వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది.


మన దేశంలో ఆగస్టు -డిసెంబరు నాటికి మొత్తం 216 కోట్ల డోసుల వాక్సిన్‌ అందుబాటులోకి రానున్నదని నీతి ఆయోగ్‌ సభ్యుడు వికె పాల్‌ చెప్పారు. ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీలు కూడ అత్యవసర వినియోగం కింద తయారీకి దరఖాస్తు చేసుకోవాలని కోరినట్లు పాల్‌ తెలిపారు. ఆయన చెప్పినట్లు, అనుకున్నట్లు సవ్యంగా జరిగితే డిసెంబరు నాటికి గాని మన జనాభాకు వాక్సిన్‌ వేసే అవకాశం లేదు. కొందరు చెబుతున్నట్లు ప్రతివారికీ బూస్టర్‌ మూడో డోసు వేయాల్సి వస్తే , మూడో తరంగంలో వస్తుందని చెబుతున్న కొత్త వైరస్‌కు పాత వాక్సిన్లు పనికి రాకపోతే పరిస్ధితి ఏమిటి ? చైనా వాక్సిన్‌ సిన్‌ఫార్మకు అనుమతి ఇస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్ధ చేసిన ప్రకటనలో చైనా మరో 15వాక్సిన్ల తయారీ పురోగమనంలో ఉన్నట్లు తెలిపింది. వాక్సిన్ల తయారీలో చైనా – రష్యా సహకరించుకోనున్నాయి. మరి మనం ఎక్కడ ? అది ఉత్పత్తి కావచ్చు, వాక్సిన్‌ దౌత్యం కావచ్చు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కూలిన చైనా రాకెట్‌ – పతనమైన అమెరికా స్కైలాబ్‌ !

12 Wednesday May 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, Science, UK

≈ Leave a comment

Tags

Long March-5B Y2, NASA, skylab failure, US anti China Propaganda


ఎం కోటేశ్వరరావు


అదుపు తప్పిన చైనా రాకెట్‌ గురించి మీడియా వర్ణనలతో ఎవరికి వారు తమమీదే పడబోతోందని భయపడిపోయిన వారున్నారు. అలాంటిదేమీ లేకుండానే భూతలంలోకి రాగానే మండిపోగా మిగిలిన శకలాలు ఏమైనా ఉంటే మాల్దీవుల సమీపంలోని అరేబియా సముద్రంలో పడ్డాయి. జనం ఊపిరి పీల్చుకున్నారు. ప్రపంచంలో అనేక దేశాలు జరిపిన రాకెట్‌ ప్రయోగాలు విఫలమై కూలిపోయిన ఉదంతాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి చైనా రాకెట్‌. విఫలమైన రాకెట్‌ గమనాన్ని పర్యవేక్షిస్తున్న చైనా శాస్త్రవేత్తలు చెప్పక ముందే అమెరికా వారు దాన్ని రచ్చ చేశారు. కూలిపోక ముందే ఫలానా చోట పడింది, ఇవిగో ఫొటోలంటూ కుహనా వార్తలను ప్రచారంలో పెట్టారు. చైనా బాధ్యతా రహితంగా వ్యవహరించిందని, శకలాలు ఎక్కడ పడతాయో ఏ ముప్పు సంభవిస్తుందో అన్నట్లుగా నానా యాగీ చేశారు. అసలే కోతి, పైగా కల్లుతాగింది అన్నట్లుగా రాకెట్‌ చైనాది, చెప్పింది అమెరికా, రెచ్చిపోవటానికి మన మీడియాకు అంతకంటే కావాల్సిందేముంది. అంతరిక్ష ప్రయోగాల్లో ఆరుదశాబ్దాల అనుభవంలో రాకెట్లు కూలిన ఉదంతాలు అంత తీవ్రమైనవి కాదని తెలిసిన శాస్త్రవేత్తలు కూడా నోరు మూసుకొని తప్పుడు ప్రచారానికి ఊతమిచ్చారు.


తయాన్హీ అంతరిక్ష కేంద్ర నిర్మాణంలో భాగంగా అవసరమైన పరికరాలను మోసుకు పోయి క్షక్ష్యలో ప్రవేశపెట్టే లాంగ్‌ మార్చ్‌-5బి వై2 వాహక నౌక(రాకెట్‌)ను ఏప్రిల్‌ 29న చైనా ప్రయోగించింది. దానికి అమర్చిన వాటిని నిర్ణీత సమయంలో కక్ష్యలో ప్రవేశపెట్టటాన్ని బట్టి దాని విస్వసనీయత సరైనదే అని రుజువైంది. తిరిగి వచ్చే క్రమంలో చోదన ( ప్రొపల్షన్‌ ) వ్యవస్ధ విఫలమైంది, దాన్నే అదుపు తప్పటంగా పరిగణించారు. దాని గమనం, అదే విధంగా ఎక్కడ భూమిని చేరనుందనే అంశాలకు సంబంధించి చైనా చెప్పినట్లుగానే మే తొమ్మిదవ తేదీ అది గాలిలో మండగా, అవశేషాలు సముద్రంలో పడ్డాయి.
సాధారణమైన అంశాన్ని అమెరికా ఎందుకు ఇంత రచ్చ చేసింది ? ప్రస్తుతం రెండు దేశాల మధ్య సంబంధాలు సజావుగా లేవు. మరో పది సంవత్సరాలలో ఆర్ధికంగా అమెరికాను వెనక్కు నెట్టేసి చైనా ప్రధమ స్ధానంలో ఉండబోతున్నది. అన్నింటికీ మించి ఆధునిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవటంలో వేగంగా దూసుకుపోతోంది. ఇలా చైనా ప్రతి అడుగునూ ప్రపంచానికి ముప్పుగా చూపేందుకు, కుట్ర సిద్దాంతాలను జనం మెదళ్లలో చొప్పించేందుకు అడుగడుగునా అమెరికా ప్రయత్నిస్తోంది. తాజా ఉదంతం దానిలో భాగమే అని చెప్పవచ్చు. ఇది ఒక్క చైనాకే అనుకుంటే పొరబాటు మన దేశం ఆ స్ధితిలో ఉన్నా అదే చేస్తుంది. రాకెట్లు భూ తలంలోకి వచ్చేటపుడు జరిగేదేమిటో సామాన్యులకంటే శాస్త్రవేత్తలకే బాగా తెలుసు. అమెరికన్లు తప్ప మిగిలిన అంతరిక్ష అగ్రరాజ్యాలేవీ రచ్చ చేయలేదు. అంతరిక్ష ప్రయోగశాలను చైనా నిర్మించటం అంటే ఆ రంగంలో అమెరికా, రష్యా సరసన చేరినట్లే. అందుకే నిష్పాక్షికంగా పరిశీలించే వారు పశ్చిమ దేశాలు ఈ కార్యక్రమాన్ని దెబ్బతీసేందుకు చేస్తున్న ప్రయత్నాలను గమనిస్తున్నారు, ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తున్నట్లు విమర్శిస్తున్నారు. శకలాలతో జరిగే హాని పెద్దగా ఉండదని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ దాన్ని బూతద్దంలో చూపి ఒక దోషిగా చూపేందుకు ప్రయత్నించారు. దీనికి నాసాతో పాటు అమెరికా రక్షణశాఖ, మీడియా అన్నీ కలసి ప్రచారదాడి చేశాయి.చైనా రాకెట్‌ శకలాలు ఐవరీ కోస్ట్‌లోని రెండు గ్రామాల మీద పడ్డాయని కొన్ని పత్రికలు రాశాయి. వాటి మీద చైనా గుర్తులున్నాయని కూడా పేర్కొన్నాయి. ఇవిగో ఫొటోలంటూ ప్రచురించాయి. అవన్నీ తప్పుడు కధనాలని తేలిపోయింది.


అంతరిక్ష ప్రయోగాల శకలాల సమస్య చైనా ఒక్కదానితోనే తలెత్తింది కాదు, ఆ రంగంలో ప్రయోగాలు నిర్వహించే ప్రతిదేశమూ ఎదుర్కొంటున్నదే. సాంకేతిక పరమైనదానిని రాజకీయం చేయటం, జనాన్ని భయపెట్టేందుకు వినియోగించటమే గర్హనీయం. ప్రతి రాకెట్‌ ప్రయోగంలోనూ విజయవంతం చేయటంతో పాటు విఫలమైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలనూ శాస్త్రవేత్తలు పాటిస్తారు. పశ్చిమ దేశాలు ముఖ్యంగా అమెరికా సంస్ధ నాసా, మిలిటరీ చైనా రాకెట్‌ జాడను వెంబడించటం మిలిటరీ కోణాన్ని వెల్లడించింది. ఒక క్షిపణి వ్యతిరేక కార్యక్రమ శిక్షణగా అవి పరిగణించాయంటే అతిశయోక్తి కాదు. అయితే ఆ రంగంలో ప్రావీణ్యత ఉన్న ఏదేశమైనా అదే చేస్తుంది.
తియాన్‌హి అంతరిక్ష కేంద్ర కేంద్ర నిర్మాణంలో తొలి కీలక పరికరాలను లాంగ్‌ మార్చ్‌ మోసుకుపోయింది. గతంలో ప్రకటించిన దాని ప్రకారం రానున్న రెండు సంవత్సరాలలో మరో పది రాకెట్‌ ప్రయోగాల ద్వారా అవసరమైన అన్నింటినీ సమకూర్చిన తరువాత 2022 నాటికి అది పని చేయటం ప్రారంభిస్తుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం 2024లో పని చాలించనుంది. ఆ తరువాత విదేశీ భాగస్వాములకు అవకాశమిచ్చే అంతరిక్ష కేంద్రం తియాన్‌హి అని భావిస్తున్నారు. అమెరికా, ఐరోపా పశ్చిమ దేశాలకు ఈర్ష్య పుట్టిస్తున్న అంశమిదే. అంతరిక్ష రంగంలో చైనా అభివృద్ధిని అవి సహించలేకపోతున్నాయి.


ఇతర దేశాల రాకెట్లు కూలిపోలేదా ? చైనా రాకెట్‌ కూలిపోవటాన్ని ప్రమాదకరంగా వర్ణించిన వారు మార్చి నెల 26వ తేదీన కూలిపోయిన అమెరికా ఫాల్కన్‌ 9 రాకెట్‌ గురించి మాట్లాడలేదేం ? వాషింగ్టన్‌ రాష్ట్రంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో దాని శకలాలు పడ్డాయి. అది ఒక తోక చుక్క మాదిరి వెలుగులతో భూమిని తాకినట్లు ఎపి వార్తా సంస్ధ వర్ణించింది. కొందరికి అది ఎగిరే పళ్లాల మాదిరి అనిపించిందట. అదే జనావాసాల మీద పడి ఉంటే ఏమై ఉండేదన్న ఆందోళన, దానికి అనుగుణ్యమైన హెచ్చరికను కూడా అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించలేదు.

నాలుగు దశాబ్దాల క్రితం అమెరికా అంతరిక్ష కేంద్రం స్కైలాబ్‌ పతనమై కూలిపోయిన ఉదంతాన్ని ఇక్కడ ప్రస్తావించటం అవసరం. దాని గురించి నాటి పత్రికల్లో అల్లిన కథనాలు చదివి తెలుగు జనాలు ఎంత ఆందోళనకు గురయ్యారో నాటి తరాలకు తెలిసిందే. అది ఎంత ప్రాచుర్యం పొందిందంటే కొంత మంది తమ పిల్లలకు స్కైలాబ్‌ అని పేరు పెట్టుకున్నారు. సాధారణంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి దాని గడువు మీరిపోయిన తరువాత తిరిగి భూమికి తెచ్చే విధంగా రూపొందిస్తారు. దీర్ఘకాలం అంతరిక్షంలో బరువు కోల్పోయే మానవ శరీరాల మీద పడే ప్రభావం వంటి అనేక అంశాలను పరిశోధించేందుకు 77 టన్నుల బరువుగల స్కైలాబ్‌ను రూపొందించారు. తొమ్మిది సంవత్సరాల పాటు పని చేయించాలని నిర్ణయించి 1973లో ఏర్పాటు చేశారు. అయితే 1978 చివరిలో లోపాలు తలెత్తాయి. ఇలాంటి పరిస్ధితుల్లో దాన్ని సురక్షితంగా కిందికి దించటం ఎలా అనే అంశాన్ని నాసా శాస్త్రవేత్తలు రూపొందించిన సమయంలోనే పట్టించుకోని కారణంగా అది పతనం అవుతోందని గ్రహించారు. అయితే జనం ఆందోళన చెందటంతో దాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టి ఐదు సంవత్సరాల పాటు తిరిగేట్లు చేస్తామని, తరువాత అది అలా తిరుగుతూనే ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే అదేమీ జరగలేదు. 1979 జూలై 11న దాని బూస్టర్‌ రాకెట్లను పేల్చివేసి కూలిపోయేట్లు చేశారు. ఆస్ట్రేలియా, హిందూ మహా సముద్ర ప్రాంతంలో కూలిపోవచ్చని ఊహించారు. దాంతో మీడియాలో అనేక కధనాలు వచ్చాయి. చివరకు అనేక భాగాలు సముద్రంలో పడిపోగా కొన్ని పశ్చిమ ఆస్ట్రేలియాలోని జనావాసాల్లో పడ్డాయి ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు.
సరిగ్గా అదే సమయంలో అమెరికా ఆర్ధిక వ్యవస్ధ గిడసబారింది, చమురు సంక్షోభం తలెత్తింది. జనానికి ప్రభుత్వం, పార్లమెంట్‌ మీద విశ్వాసం సన్నగిల్లింది. స్కైలాబ్‌ కూలిపోనుందనే వార్తలు రావటంతో ప్రభుత్వాన్ని అపహాస్యం చేయటం ప్రారంభించారు. కొందరు దాన్ని కూడా సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నించారు. దేశమంతటా స్కైలాబ్‌ విందులు జరుపుకున్నారు. వాటిలో పాల్గొవారి మీద స్కైలాబ్‌ శకలాలు పడితే తలలు పగలకుండా గట్టి హెల్మెట్లు పెట్టుకురావాలని నిబంధనలు పెట్టారు. కొన్ని హౌటళ్లయితే ఇదిగో ఈ ప్రాంతంలోనే శకలాలు పడతాయంటూ ప్రత్యేకంగా గుర్తించి ఆ ప్రాంతం చుట్టూ విందులు ఏర్పాటు చేశాయి. టీషర్టులను అమ్మారు. కొన్ని పత్రికలయితే అపహాస్యం చేస్తూ స్కైలాబ్‌ బీమా గురించి ప్రకటించాయి. శకలాలు పడి ఎవరైనా గాయపడినా, మరణించినా 72 గంటల్లోగా చెబితే పదివేల డాలర్లు చెల్లిస్తామని ఒక పత్రిక ప్రకటించింది. శకలాలు ఎప్పుడు, ఎక్కడ పడతాయో నాసా చెప్పలేకపోయింది. ఆస్ట్రేలియా-హిందూ మహాసముద్రం మధ్య 7,400 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఎక్కడైనా పడవచ్చని పేర్కొన్నది. ఆ ప్రాంతం వెలుపల ఉన్న దేశాల వారు చివరికి ఐరోపా వారు కూడా ఎక్కడ తమ మీద పడతాయో అని అందోళన చెందారు. 1978లో సోవియట్‌ ఉపగ్రహం ఉత్తర కెనడా ప్రాంతంలో కూలిపోవటంతో స్కైలాబ్‌ కూడా ఇదే విధంగా కూలిపోనుందని జనం భయపడ్డారు.1979 జూలై పదకొండున స్కైలాబ్‌ కూలిపోనుందని ప్రకటించటంతో ఇంగ్లండ్‌లోని కొందరు డీవన్‌ ప్రాంతంలోని ఒక గుహలోకి వెళ్లి కూర్చున్నారు. బెల్జియంలో శకలాలు పడతాయనే భయంతో అక్కడి ప్రభుత్వం యుద్ద సమయంలో వైమానిక దాడుల గురించి హెచ్చరిస్తూ మోగించే 1250 సైరన్లను సిద్దం చేసుకుంది.

1995 జనవరి పదిహేనున రష్యా తయారు చేసిన ఒక ఉపగ్రహాన్ని జపాన్‌ రాకెట్‌తో అంతరిక్షంలో ప్రవేశపెట్టారు.దానికి జర్మనీ సాంకేతిక పరికరాలను అందించింది. తీరా అది ఏమైందో తెలియకుండా పోయింది. అందరూ కక్ష్యలోకి వెళ్లిందనుకున్నారు. అది నిర్ధారణగాకపోవటంతో భూమీ మీద పడిందని భావించారు గాని ఎక్కడ పడిందో తెలియలేదు.తరువాత కొంత కాలానికి ఆఫ్రికాలోని ఘనాలో ఉపగ్రహంలోని కాప్సూల్‌ దొరికింది. దానికి అమర్చిన పారాచూట్‌తో కింద పడింది. దాన్నుంచి సంకేతాలు పంపినా ఎవరూ గ్రహించలేకపోయారు. ఒక స్కూలు టీచరు దాన్ని గుర్తు పట్టి ఒక రూములో భద్రపరిచాడు. కొన్ని నెలల తరువాత అది లండన్‌ చేరింది. 2003 ఫిబ్రవరి ఒకటవ తేదీన అమెరికా కు చెందిన కొలంబియా స్పేస్‌ షటిల్‌ కూలిపోయి ఏడుగురు వ్యోమగాములు మరణించారు. 1967 జనవరిలో అమెరికా ఉపగ్రహం అపోలో 1 పేలిపోయి ముగ్గురు వ్యోమగాములు మరణించారు.అదే ఏడాది ఏప్రిల్‌లో సోవియట్‌ తొలి వ్యోమగామి కొమరోవ్‌ భూమికి తిరిగి వస్తూ పారాచూట్‌ విఫలం కావటంతో మరణించాడు.1971 జూలైలో 24 రోజుల పాటు అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో గడిపి తిరిగి వస్తూ ముగ్గురు సోవియట్‌ వ్యోమగాములు మరణించారు.1986 జనవరి 28న కేప్‌ కేనరవాల్‌ నుంచి ప్రయోగించిన 72 సెకండ్లలోనే ఛాలెంజర్‌ స్పేస్‌ షటిల్‌ పేలిపోయి ఒక స్కూలు టీచరుతో సహా ఏడుగురు వ్యోమగాములు మరణించారు.అదే ఏడాది ఏప్రిల్‌ 18న కాలిఫోర్నియా నుంచి ప్రయోగించిన ఒక మిలిటరీ ఉపగ్రహం పేలిపోయింది. మే మూడవ తేదీన కేప్‌ కేనరవాల్‌ నుంచి ప్రయోగించిన డెల్టా రాకెట్‌ పేలిపోయింది. 1990 ఫిబ్రవరి 22న పశ్చిమ ఐరోపాకు చెందిన ఏరియానె 36వ రాకెట్‌ ఫ్రెంచి గుయానాలో ప్రయోగించిన రెండు నిమిషాలకు పేలిపోయింది.ఇలా ఎన్నో ఉదంతాలను పేర్కొన వచ్చు.


ఈ సందర్భాలలో అవన్నీ ఆయా దేశాల బాధ్యతా రాహిత్యమూ, ప్రమాణాలను పాటించలేదు, ఎంత ప్రమాదమో చూడండంటూ చైనా రాకెట్‌ వైఫల్యం గురించి చిత్రించిన కధనాలు వెలువడలేదు, ఎందుకంటే అవన్నీ ప్రమాదాలు. ఫుకుషిమా అణు కేంద్రంలో జరిగిన ప్రమాదం కారణంగా కలుషితమైన జలాలను సముద్రంలోకి విడుదల చేయనున్నట్లు జపాన్‌ ప్రకటించగానే ప్రపంచం గగ్గోలు పెట్టింది. ఆ చర్యకు అమెరికా మద్దతు పలికిగింది. వివాదాస్పదమూ, ప్రమాదకరమైన ఆ చర్యను సమర్ధించటానికి కారణం జపాన్‌ మిత్రపక్షం. అలాంటి ప్రమాదాలేమీ లేని చైనా రాకెట్‌ పతనం గురించి పెడబొబ్బలు పెట్టటం చైనాతో ఉన్న శతృత్వం తప్ప మరొకటి కాదు. చైనాతో ఆరోగ్యకరమైన ఆర్ధిక విధానాలతో తలపడటానికి అమెరికాతో అన్ని దేశాలకు అవకాశాలు ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి అక్కసుతో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయటం ద్వారా ఎవరి నిజ స్వరూపం ఏమిటో, చిత్తశుద్ది ఏమిటో స్పష్టం అవుతోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ ఏలుబడి : కమ్యూనిస్టు చైనాను పక్కన పెట్టి అమెరికానైనా అనుసరిస్తారా !

09 Sunday May 2021

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Health, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, Science, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Anti China Media, Corona vaccine, Fuel Price in India, Joe Biden, Narendra Modi Failures, Saudi Arabia


ఎం కోటేశ్వరరావు


దేశంలో, మన చుట్టుపట్ల, ప్రపంచంలో ఏం జరుగుతోంది ? అన్నింటినీ ఒకేసారి చూడలేం. ఆలోచనలను రేకెత్తిస్తున్న కొన్ని అంశాలను చూద్దాం. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. స్వతంత్ర భారతచరిత్రలో తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్ధాన అభిశంసనకు గురైందంటే అతిశయోక్తి కాదు. పేరు పెట్టి మందలించకపోవచ్చు, కొన్ని హైకోర్టుల మాదిరి తీవ్ర వ్యాఖ్యలు చేయకపోవచ్చు గానీ తీసుకున్న చర్య చెంప పెట్టువంటిది. ఆక్సిజన్‌, కరోనా సంబంధిత సమస్యను గతనెలలో సుప్రీం కోర్టు తనంతట తానుగా విచారణకు చేపట్టినపుడే నరేంద్రమోడీ సర్కార్‌ మొద్దు నిద్రను వీడి తెలివిగా వ్యవహరించి ఉండాల్సింది. అదేమీ లేకపోగా తన చర్యలను సమర్ధించుకొనేందుకు పూనుకుంది. రాష్ట్రాలకు ఆక్సిజన్‌ కేటాయింపు విషయంలో ప్రభుత్వం సూచించిన విధానాన్ని తోసి పుచ్చి శాస్త్రీయ పద్దతిలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆక్సిజన్‌ కేటాయింపులకు ఒక కార్యాచరణ కమిటీని ఆరునెలల కాలానికి సుప్రీం కోర్టు నిర్ణయించటం నరేంద్రమోడీ సర్కార్‌ను అభిశంచించటం గాక మరేమనాలి ? వివిధ రాష్ట్రాల హైకోర్టులు చేస్తున్న వ్యాఖ్యల నేపధ్యంలో సుప్రీం కోర్టు తగినంత గడువు ఇచ్చినప్పటికీ సంతృప్తికరమైన విధానాన్ని కేంద్రం రూపొందించలేకపోయింది. దేశం సురక్షితమైన చేతుల్లో ఉంది అని చెప్పిన వారు ఇప్పుడు ఏమంటారో తెలియదు. చెడు వినను, చెడు కనను, చెడు చెప్పను అన్న మూడు కోతుల బొమ్మలను చాలా మంది చూసే ఉంటారు. చెప్పింది చేయను, జరుగుతున్నది చూడను, నోరు విప్పను అన్నట్లుగా కేంద్ర పాలకుల వ్యవహారం ఉంది.

సురక్షితమైన చేతుల్లో జనం అంటే ఇదేనా ?


ఇరవై ఏడు లక్షల కోట్ల రూపాయల ఆత్మనిర్భర పాకేజ్‌ ప్రకటించామని ఎంత ప్రచారం చేసుకున్నారో తెలిసిందే. వాక్సినేషన్లకు 35వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు ప్రకటించారు. ఆ సొమ్ముతో రెండువందల కోట్ల వాక్సిన్‌ డోసులు కొనుగోలు చేయవచ్చు. వంద కోట్ల మందికి వేయవచ్చు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోకుండా 45 ఏండ్లు దాటిన వారికి మాత్రమే తాము వేస్తామని, మిగతా వారికి రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ఎవరికి వారు స్వంత ఖర్చుతో వేయించుకోవాలని చెబుతోంది. చిన్న వయసు వారికి కూడా కరోనా సోకుతున్నందున అందరికీ వాక్సిన్‌ వేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఖర్చుకు వెనకాడాల్సిన సమయమా ఇది. అందులోనూ దేశ రక్షకులమని తమకు కితాబు ఇచ్చుకుంటున్న వారు. పోనీ వాక్సిన్లు అందుబాటులోకి తెచ్చే చర్యలేమైనా తీసుకుందా అంటే అదీ లేదు. కోవాగ్జిన్‌, కోవీషీల్డ్‌ రెండింటిని అత్యవసర వినియోగ ప్రాతిపదిక మీదనే అనుమతి ఇచ్చారు. రష్యా స్పుత్నిక్కుకు కూడా అదే పద్దతిలో అనుమతి ఇచ్చి ఉంటే ఈ పాటికి అది కూడా ఉత్పత్తిలోకి వచ్చి ఉండేది. రెండు కార్పొరేట్‌ సంస్ధలకు వచ్చే లాభాలు, వాటి నుంచి అందే నిధుల గురించే ఆలోచించారని జనం అభిప్రాయం పడితే తప్పు పట్టగలమా ? తాజాగా చైనా వాక్సిన్‌లను ప్రపంచ ఆరోగ్య సంస్ద అనుమతి ఇచ్చింది. దాన్నైనా అనుమతిస్తారా లేక పంతానికి పోయి జనం ప్రాణాలను ఫణంగా పెడతారా ? అనుమతిస్తే చైనా కంపెనీ అనుబంధ సంస్ధ హైదరాబాద్‌లోని గ్లాండ్‌ ఫార్మాలో వెంటనే తయారీ మొదలు పెట్టవచ్చు.

బాధ్యతల నుంచి వైదొలగిన మోడీ సర్కార్‌ !


గత ఏడాది రాష్ట్రాలతో సంప్రదించకుండా, జనం స్వస్ధలాలకు చేరే అవకాశం ఇవ్వకుండా, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఆకస్మికంగా ప్రకటించిన తీరును ప్రతిపక్షాలు తప్పుపట్టాయి తప్ప లాక్‌డౌన్ను వ్యతిరేకించలేదు.ఈ సారి లాక్‌డౌన్‌ విధించాలా లేదా అన్న నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదలివేస్తున్నట్లు ప్రకటించి ఎంతో ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరిస్తున్నట్లు ఫోజు పెట్టారు. అసలు విషయం ఏమంటే కేంద్రం బాధ్యతలను వదలించుకోవటమే. ఇప్పటికే నిధుల కొరతతో ఉన్న రాష్ట్రాలు వాక్సిన్‌ ఉచితంగా వేసేందుకు నిర్ణయించాయి. లాక్‌డౌన్‌ లేదా అలాంటి చర్యలు తీసుకుంటే ఉపాధి కోల్పోతున్న వారికి సాయం చేసే స్ధితిలో రాష్ట్రాల ఆర్ధిక స్ధితిలేదు. కేంద్రం నుంచి ఇంతవరకు ప్రత్యేకమైన చర్యలు ఏమీ లేవు. ఐదేసి కిలోల బియ్యం ఇస్తే సరిపోతాయా ? కేరళలో 17 రకాల నిత్యావసర వస్తువులతో కూడిన ఆహారకిట్లను ప్రభుత్వం ఉచితంగా అందిస్తే అదంతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే, ఎన్నికల కోసం అని కాంగ్రెస్‌, బిజెపి ప్రచారం చేశాయి. ఓటర్లు వాటికి చెప్పాల్సిన బుద్ది చెప్పారు. ప్రభుత్వం సాయం అందని వారు ఆరుశాతం మందే అని ఎన్నికల తరువాత జరిగిన ఒక సర్వేలో తేలింది. కేరళ ఇప్పుడు కూడా అదే కిట్‌ను అందిస్తున్నది, లాక్‌డౌన్‌ ప్రకటించినందున సామూహిక వంటశాలలను ప్రారంభించి అవసరమైన వారికి ఆహారం సరఫరా చేస్తున్నది. అలాంటి చర్యలను ఏ బిజెపి లేదా కాంగ్రెస్‌, ప్రాంతీయ పార్టీల పాలిత ప్రభుత్వాలలో అయినా అమలు జరుపుతున్నారా ?

రచ్చ చేసిన మీడియా ఎందుకు మౌనం దాల్చినట్లు ?


చైనా వస్తువుల కొనుగోలు గురించి గత ఏడాది కాషాయ దళాలు, వాటికి వంత పాడి రేటింగ్‌ పెంచుకున్న టీవీ ఛానళ్లు, పత్రికలు ఎంత రచ్చ చేశాయో చూశాము. ఇరుగు పొరుగుదేశాలతో సమస్యలు వస్తాయి, వాటిని పరిష్కరించుకొనేందుకు చూడాలి గానీ శాశ్వతవైరంతో వ్యహరిస్తే ఉభయులకూ నష్టమే. బలహీనులకు మరింత నష్టం.మన దేశంలో కరోనా పెరిగిన కారణంగా చివరికి తమ పౌరులు స్వదేశానికి వచ్చినా జైలు శిక్ష విధిస్తామని ఆస్ట్రేలియా ప్రకటించింది. ఎదుటి వారు మంచి పని చేసినప్పటికీ ఎవరికైనా ఇష్టం లేకపోతే మౌనంగా ఉండటం ఒక పద్దతి. కానీ ఇష్టంలేని వారు చేసే ప్రతిదానిని బూతద్దంలో చూపి దాడి చేసేందుకు పూనుకునే వారిని ఏమనాలి ? కరోనా కారణంగా చైనా ప్రభుత్వరంగ విమానయాన సంస్ద మన దేశానికి తాత్కాలికంగా వాణిజ్య విమానాల నిలిపివేత ప్రకటన చేయగానే ఇంకేముంది చైనా మనకు వెన్ను పోటు పొడిచింది అని టీవీ చానల్స్‌ నానా యాగీ చేశాయి. కానీ అదే చైనా గురించి ఇప్పుడు మన విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ఏమన్నారు.” మా దేశానికి చెందిన అనేక కంపెనీలు చైనా నుంచి వస్తువుల కొనుగోలుకు ఆర్డర్లు పెడుతున్నాయి. రవాణాలో మేము సమస్యలను ఎదుర్కొంటున్నాము. వాటిని పరిశీలించి తగుచర్యలు తీసుకొంటే మేము శ్లాఘిస్తాము ” అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ ఇతో మాట్లాడారు.” మా సంభాషణ తరువాత పని జరిగింది. మన విమాన సంస్దలు కొన్నింటికి వెంటనే అనుమతులు వచ్చాయి.రవాణా జరుగుతోంది, అదెంతో శ్లాఘనీయం ” అని చెప్పారు. ఇప్పుడు యాగీ చేసిన ఛానల్స్‌ ఏమంటాయి ? అసలేమీ జరగనట్లు మౌనంగా ఉన్నాయా లేదా ?

భారత ఆర్డర్లతో చైనా కంపెనీల లాభాలు – భావ స్వేచ్చ సమస్య !


చైనా వస్తువులు, వాటి నాణ్యత గురించి ఏదేదో మాట్లాడిన వారు ఇప్పుడు తేలు కుట్టిన దొంగల్లా ఉన్నారు. రికార్డు స్ధాయిలో మన దేశానికి చెందిన కంపెనీలు, ఏప్రిల్‌, మే మాసాల్లో చైనా వస్తువుల దిగుమతికి ఆర్డర్లు పెట్టాయి. ఏప్రిల్‌ ఆఖరు నాటికి 40వేల ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్లకు అర్డరు పెట్టారు, వాటిలో 21వేలు వచ్చాయి. ఐదువేల వెంటిలేటర్లు, 2.1కోటి ముఖ తొడుగులు(మాస్క్‌లు),3,800 టన్నుల ఔషధాలకు ఆర్డర్లు పెట్టినట్లు చైనా కస్టమ్స్‌ వివరాలు తెలుపుతున్నాయి( ది హిందూ మే 9, 2021) మన దేశ ఆర్డర్ల కారణంగా చైనా కంపెనీల అమ్మకాలు, లాభాలు విపరీతంగా పెరిగాయి.
చైనాలో భావ ప్రకటనా స్వేచ్చ లేదనే ప్రచారం గురించి తెలిసిందే. అది నాణానికి ఒక వైపు మాత్రమే. సోషలిజం, కమ్యూనిజాలకు, దానికొరకు పనిచేసే రాజ్యాంగానికి దాన్ని అమలు జరిపే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే ప్రచారానికి స్వేచ్చ లేదు. ఆ మాటకు వస్తే మన దేశంలో గానీ మరొక కమ్యూనిస్టేతర దేశంలో గానీ ఎవరైనా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రచారం చేసే స్వేచ్చ ఉందా ? అలాంటి వారిని శిక్షించకుండా వదులుతారా ? రాజ్యాంగపరిధిలో అనుమతించిన స్వేచ్చ మేరకు మాట్లాడితేనే దేశద్రోహులుగా మనదేశంలో చిత్రిస్తున్న విషయం దాస్తే దాగుతుందా ? ఇటీవల చైనా కమ్యూనిస్టు పార్టీ విభాగమైన చట్ట అమలు కమిటీ ట్విటర్‌ ఖాతా నుంచి ఒక ట్వీట్‌ వెలువడింది. దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు-ప్రశంసలు వెలువడ్డాయి. వివాదాస్పదమైన ఆ ట్వీట్‌ను వెంటనే తొలగించారు. దాని గురించి కూడా మన మీడియాలో వార్తలు వచ్చాయి.(అలాంటి అవాంఛనీయమైన ట్వీట్లను మన కాషాయ దళాలు ఎన్ని తొలగించాయో వారే చెప్పాలి ) ఇంతకీ ఆ ట్వీట్‌లో ఏముంది ? రెండు ఫొటోలు పెట్టారు. ఒకటి నింగిలోకి దూసుకుపోతున్న చైనా రాకెట్‌, మరొకటి మన దేశంలోని శ్మశానంలో చితిమంటల చిత్రం. వాటి కింద చైనా వెలిగిస్తున్న మంటలు-భారత్‌ వెలిగిస్తున్న మంటలు అని వ్యాఖ్యానించారు.ఒక దేశంలోని విపత్తును అలా పోల్చటం తగిన చర్య కాదు, తప్పు పట్టాల్సిందే. ఒక వ్యక్తి లేదా ఆ విభాగాన్ని చూస్తున్న కొందరు వ్యక్తులు అనాలోచితంగా పెట్టినప్పటికీ దాన్ని యావత్‌ కమ్యూనిస్టు పార్టీకి అంట గట్టారు. కానీ ఆ ట్వీట్‌ మీద చైనా సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున విమర్శలు-ప్రశంసలు వెలువడ్డాయి. అక్కడ స్వేచ్చ లేకపోతే ఆ చర్చ ఎలా జరిగినట్లు ? ఆ ట్వీట్‌ను గ్లోబల్‌టైమ్స్‌ పత్రిక సంపాదకుడు గ్జీ జిన్‌ విమర్శించినందుకు పెద్ద ఎత్తున నెటిజన్లు మండిపడ్డారు.ఆ ట్వీట్‌ను విమర్శించటంతో పాటు భారత్‌కు చైనా స్నేహ హస్తం అందిస్తున్నప్పటికీ భారత్‌ ద్వేషంతో, సంకుచితంగా వ్యవహరిస్తోంది, అయినప్పటికీ సాయం చేయాల్సిందే అని సంపాదకుడు పేర్కొన్నారు.గ్జీ విమర్శపై ధ్వజమెత్తిన షాంఘైలోని పుడాన్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ షెన్‌ ఇ తొలగించిన ట్వీట్‌ను సమర్దించాడు. భారత్‌కు సానుభూతి చూపినందువలన సానుకూల ఫలితం ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించాడు. నెటిజన్లు గ్జీ-షెన్‌ వర్గాలుగా చీలిపోయినట్లు కొందరు వ్యాఖ్యానించారు.దీని గురించి అమెరికా అగ్రశ్రేణి పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌ విశ్లేషణ రాసింది.

చమురు ధరలపై జనం ఊహించిందే జరిగింది !


ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తరువాత చమురు ధరలు పెరుగుతాయని జనం సరిగానే ఎంతగా అంటే పగలు తరువాత రాత్రి వస్తుందన్నంత కచ్చితంగా ఊహించారు. అదే జరుగుతోంది. చలికాలంలో గిరాకీ ఉంటుంది కనుక అది ముగిసిన తరువాత చమురు ధరలు తగ్గుతాయని చమురుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఫిబ్రవరి 26న చెప్పారు. ఆ మరుసటి రోజు నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కనుక ధరలు స్ధిరంగా ఉండి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత పెరుగుతున్నాయి. ఓట్ల కోసం అలాంటి పనులు బిజెపి చేయదు అని మరో వైపు ఆ పార్టీ నేతల డాంబికాలను జనం చూశారు. వేసవిలో జనాలు ఎక్కువగా తిరుగుతారు కనుక గిరాకీ పెరిగి వర్షాకాలం నాటికి ఎవరి పనుల్లో వారుంటారు గనుక ధరలు తగ్గుతాయని మంత్రిగారు చెబుతారేమో చూడాలి. పెట్రోలియం ప్లానింగ్‌ మరియు అనాలసిస్‌ విభాగం ప్రకటించిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి నెలలో మన దేశం దిగుమతి చేసుకొన్న ముడిచమురు పీపా సగటు ధర 61.22 డాలర్లు, మార్చినెలలో 64.73, ఏప్రిల్‌ నెలలో 63.40 డాలర్లు ఉంది. చైనా వస్తువుల కొనుగోలును ఆపివేస్తే వారు మన కాళ్ల దగ్గరకు వస్తారని చెప్పినట్లుగా మనం దిగుమతి చేసుకొనే దేశం కనుక దాన్ని ఆయుధంగా చేసుకొని ఒపెక్‌ దేశాలకు బదులు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తే అవి దిగివచ్చి ధరలు తగ్గిస్తాయని మంత్రిగారు సెలవిచ్చిన విషయం తెలిసిందే. ఆ మేరకు అమెరికా నుంచి కొనుగోళ్లు పెంచాం గాని ధరలు దిగిరాలేదు. ఏ దేశమూ మన కాళ్ల దగ్గరకు రాలేదు-వృతం చెడ్డా ఫలం దక్కలేదు.

అడుసు తొక్కనేల – కాలు కడగనేల !

ఇప్పుడు ఏమైంది ? మన బెదిరింపులు, చమురు కొనుగోలు తగ్గింపు వంటి చర్యలను మనసులో పెట్టుకోకుండా మనకు అవసరమైన ద్రవరూప ఆక్సిజన్ను ఆరునెలల పాటు సరఫరా చేసేందుకు సౌదీ, యుయేఇ, కతార్‌ దేశాల ప్రభుత్వాలు కంటెయినర్లలో సరఫరా చేసేందుకు ముందుకు వచ్చాయి.అమెరికా నుంచి అలాంటిది రాలేదు.ప్రభుత్వరంగ చమురు కంపెనీలు సౌదీ నుంచి కొనుగోళ్లు తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా పూర్వం మాదిరే కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చినట్లు వార్తలు వచ్చాయి. అమెరికా మబ్బులను చూసి గల్ఫ్‌ దేశాల చమురు ముంతలను వలకపోసుకుంటే ఏమౌంతుందో మోడీ సర్కార్‌కు తెలిసివచ్చింది. ఇంతేనా, కాదు గత ఏడాది కాలంలో జరిగిన పరిణమాలను చూస్తే మన విదేశాంగ విధానం ఎంత అధ్వాన్నంగా ఉందో తెలుస్తోంది. ఇప్పటికైనా ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలును కేంద్రం ప్రారంభిస్తుందా ?

మనం సౌదీని బెదిరించిన సమయంలోనే సౌదీ అరేబియా ప్రభుత్వ కంపెనీ అరామ్‌కో ఒకశాతం వాటాను చైనా పెట్టుబడి-చమురు కంపెనీలకు విక్రయించే చర్చలు మరింత పురోగమించాయని వార్తలు.సౌదీ-అమెరికా ప్రభుత్వం మధ్య సంబంధాల గురించి 1945లో ఒక ఒప్పందం కుదిరింది. దాని నిబంధనలు, స్ఫూర్తికి మరింత దూరం జరిగి సౌదీ అరేబియా వాటా అమ్మకం గురించి చర్చలు జరుపుతోందన్నదే కీలక అంశం.ఈ పరిణామం ఒక అడుగు అమెరికాకు దూరం చైనాకు దగ్గర కావటంగా చెబుతున్నారు. అమెరికాను వెనక్కు నెట్టేసి 2030 నాటికి అతి పెద్ద ఆర్ధిక వ్యవస్దగా చైనా అవతరించనుందనే అంచనాలు తెలిసిందే. అరామ్‌కో కంపెనీ వాటాలను చైనా కొనటం గురించి జరిగే చర్చలు కొత్తవేమీ కాదు. గత ఏడాది తప్ప అంతకు ముందు మూడు సంవత్సరాలలో దీని గురించి చర్చలు జరిగాయి. గత కొద్ది సంవత్సరాల పరిణామాలను చూస్తే సౌదీ – అమెరికా సంబంధాలలో ముద్దులాట-దెబ్బలాట తీరుతెన్నులు కనిపిస్తాయి. న్యూయార్క్‌లోని ప్రపంచ వాణిజ్య కేంద్రంపై 2011 సెప్టెంబరులో జరిగిన దాడికి సౌదీ మద్దతు ఉందన్న దగ్గర నుంచి అనేక పరిణామాల నేపధ్యంలో అమెరికాలో సౌదీ గురించి ప్రతికూల భావాలు పెరిగాయి.ఈ కారణంగానే అమెరికా,బ్రిటన్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌లలో అరామ్‌కో కంపెనీ వాటాల లావాదేవీలకు అనుమతి ఇవ్వలేదు. ఈ వైఖరి కూడా చైనాకు వాటాలను అమ్మేందుకు సౌదీని పురికొల్పిందని చెబుతున్నారు. ఈ ఒప్పంద వివరాలు అన్నీ రహస్యమే. అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా తన కరెన్సీ డాలరుతో ప్రపంచంపై పెత్తనం చేస్తోంది. గతేడాది పెద్ద మొత్తంలో సౌదీ నుంచి చైనా చమురు కొనుగోలు చేసింది. ఆ లావాదేవీలలో డాలర్లకు బదులు తమ కరెన్సీ రెన్‌మిన్‌బీ(యువాన్‌)ను స్వీకరించాలని చైనా చేసిన ప్రతిపాదనకు సౌదీ అంగీకరిందని చెబుతున్నారు. ఇది అమెరికాకు ఆగ్రహం తెప్పించే చర్య. దాని పర్యవసానాలను అంచనా వేస్తున్నందున ఇవేవీ ఇంకా ఖరారు కాలేదు. ఇదే జరిగితే అనేక దేశాలు డాలర్లను పక్కన పెట్టి యువాన్లవైపు మళ్లుతాయని, తమ పలుకుబడికి దెబ్బ అన్నది అమెరికా భయం. ఇప్పటికే ఎస్‌డిఆర్‌ ఆస్ధులలో చైనా కరెన్సీని 2016లో చేర్చారు. దాని కొనసాగింపుగా డాలరు బదులు మరొక కరెన్సీని రిజర్వుగా ఉంచాలన్నది ఆలోచన. ఆర్ధికంగా చైనా అగ్రరాజ్యంగా మారనున్నందున దాని కరెన్సీ అవుతుందని మిగతా దేశాల భయం. అమెరికా విధిస్తున్న ఆంక్షల నేపధ్యంలో తాము డాలర్లకు బదులు మరొక కరెన్సీని ఉపయోగంచక తప్పదని రష్యా హెచ్చరిస్తున్నది. ఇరాన్‌, వెనెజులా, రష్యా వంటి చమురు ఎగుమతి దేశాలపై అమెరికా ఆంక్షలను విధిస్తున్నది, అందువలన వాటికి డాలర్‌ బదులు మరొక ప్రత్యామ్నాయ కరెన్సీ అవసరం కనుక చైనా కరెన్సీ వైపు చూస్తున్నాయి.

సౌదీ అరేబియాను కూడా దూరం చేసుకుంటున్నామా ?


అరామ్‌కో కంపెనీలో ఒక శాతం వాటాను 19 బిలియన్‌ డాలర్లకు చైనా కొనుగోలు చేయనున్నదని వార్తలు వచ్చాయి. అంతే కాదు రెండు దేశాలు సంయుక్తంగా చెరిసగం వాటాలతో 20 బిలియన్ల డాలర్లతో పెట్టుబడి నిధిని ఏర్పాటు చేయాలని కూడా సూత్ర ప్రాయంగా నిర్ణయించాయి. గత నాలుగు సంవత్సరాలలో వివిధ రంగాలలో వాణిజ్య ఒప్పందాలు కూడా కుదిరాయి. అరామ్‌కోలో చైనా వాటా కొనుగోలు చేస్తే దాని ప్రభావం, పర్యవసానాలు మన దేశం మీద ఎలా ఉంటాయనే చర్చ కూడా జరుగుతోంది. గతంతో పోలిస్తే సౌదీ నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించినప్పటికీ గణనీయంగానే కొంటున్నాము. అయితే చైనాతో సౌదీ ఒప్పందాలు చేసుకొని సంబంధాలు పెంచుకుంటే మన దేశంతో జరిగే వాణిజ్యం మీద దాని ప్రభావం పడుతుంది. మన ఎగుమతులు తగ్గిపోయే అవకాశం లేకపోలేదు. అంతే కాదు రాజకీయంగా కీలకమైన ప్రాంతంలో చైనా మరొక మంచి మిత్రదేశాన్ని సంపాదించుకుంటుంది. సౌదీ మన దేశంతో కూడా పెట్టుబడుల గురించి సంప్రదింపులు జరిపింది. రిలయన్స్‌ ఇండిస్టీస్‌లో పెట్రోకెమికల్స్‌ వాణిజ్యంలో 20శాతం వాటా తీసుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్ధలతో కలసి చమురుశుద్ధి మరియు పెట్రోకెమికల్స్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు ప్రతిపాదించింది. తరువాత ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య సంబంధాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇటీవల చమురు ధరలను పెంచటంతో సౌదీపై చమురు దిగుమతి ఆయుధాన్ని వినియోగిస్తామని మన చమురుశాఖ మంత్రి చేసిన బెదిరింపు అందుకు నిదర్శనం. గతేడాది చౌకగా కొనుగోలు చేసి నిల్వచేసుకున్న చమురును వినియోగించుకోండని సౌదీ మంత్రి తిప్పికొట్టారు. చైనాలో పూర్తి స్ధాయిలో ఆర్ధిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. అమెరికా, ఐరోపా దేశాలలో నియంత్రణలు ఎత్తివేస్తున్న కారణంగా అక్కడ చమురు డిమాండ్‌ పెరుగుతున్నదని ఇప్పుడున్న 68 డాలర్ల రేటు 80వరకు పెరగవచ్చని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే మన పరిస్ధితి ఏమిటి ? మే నెలలో 0.40 డాలర్లు పెంచిన సౌదీ అరేబియా జూన్‌ మాసంలో సరఫరా చేసే చమురుకు గాను ఆసియా దేశాలకు పీపాకు 0.28 డాలర్లు తగ్గించనున్నట్లు ప్రకటించింది. దీని వలన వినియోగదారులకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. గతేడాది డిసెంబరులో కూడా ఇదే విధంగా తగ్గించింది. నరేంద్రమోడీ కోరిన కారణంగానే తగ్గించినట్లు కాషాయ దళాలు ప్రచారం చేశాయి.

చైనా సంగతి పక్కన పెట్టండి అమెరికా పద్దతయినా అనుసరిస్తారా !


కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్ధిక వ్యవస్ధను పునరుద్దరించేందుకు, దానిలో భాగంగా ఉపాధి కల్పించేందుకు రెండు లక్షల కోట్ల డాలర్లను ( మన రూపాయల్లో 146లక్షల కోట్లు ) ఖర్చు చేయాలని అమెరికాలో జోబైడెన్‌ సర్కార్‌ నిర్ణయించింది. ఈ పనుల్లో రోడ్లు, విద్యుత్‌ వాహన స్టేషన్ల మరమ్మతులు, ప్రభుత్వ ఆసుపత్రులు, స్కూలు భవనాల నిర్మాణం, మరమ్మతులు,అల్పాదాయ వర్గాల, వృద్దుల ఇండ్ల నిర్మాణం, ఇంటర్నెట్‌ వేగం పెంపుదల వ్యవస్ధలు, ఇలా శాశ్వత వనరులను సమకూర్చటంతో పాటు ఉపాధికల్పించే పనులు ఈ మొత్తంతో చేపట్టనున్నారు. దీన్నుంచి పరిశోధన-అభివృద్ధికి కూడా ఖర్చు చేస్తారు. దీనికి అవసరమైన నిధులను సమకూర్చేందుకు ప్రజల మీద పన్నులు విధింపునకు బదులు కార్పొరేట్‌ సంస్దల పన్ను పెంచాలని బైడెన్‌ నిర్ణయించారు. గతంలో డోనాల్డ్‌ ట్రంప్‌ కార్పొరేట్లకు పన్ను తగ్గించారు.కనీస కార్పొరేట్‌ పన్ను 21శాతానికి పెంచటంతో పాటు గరిష్టంగా 28శాతం విధించి నిధులు సమకూర్చి పైన పేర్కొన్న పనులను చేపడతారు. కార్పొరేట్‌ కంపెనీలు పన్నులు ఎగవేసేందుకు పెట్టుబడులు, లాభాలను పన్ను స్వర్గాలకు తరలించకుండా మేడ్‌ ఇన్‌ అమెరికా టాక్స్‌ పధకం పేరుతో స్వదేశంలో పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పించే సంస్ధలకు పన్ను రాయితీలను ప్రోత్సాహంగా ప్రకటించనున్నారు. విదేశాల్లో పెట్టుబడులు పెడితే తొలి పదిశాతం ఆదాయంపై పన్నులు చెల్లించనవసరం లేదన్న నిబంధనను ఎత్తివేయనున్నారు.


ఉపాధి పెంచే పేరుతో మన దేశంలో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు పెద్ద మొత్తంలో రాయితీలుఇచ్చింది. కరోనా కాలంలో సామాన్య జనం దివాలా తీస్తే కార్పొరేట్ల లాభాలు పెరిగాయి, బిలియనీర్లు కూడా పెరిగారు. వారు పెట్టుబడులు పెట్టకుండా తమ మూటలను అలాగే ఉంచారు. కనీసం కరోనా వాక్సిన్లు, వ్యాధి గ్రస్తుల వైద్య ఖర్చులకు అయినా కార్పొరేట్ల నుంచి తాత్కాలికంగా అయినా పన్ను రేటు పెంచి నిధులు సేకరించి దేశంలో ఖర్చు చేయవచ్చు. అలాంటి ప్రయత్నాలు గానీ ఆలోచనలు గానీ లేవు. అమెరికా మాదిరి అనేక ఐరోపా దేశాలలో ఇలాంటి ప్రయత్నాలే జరుగుతున్నాయి. పిల్లి నల్లదా తెల్లదా అని కాదు ఎలుకలను పడుతుందా లేదా అన్నది గీటు రాయి అన్న సామెత మాదిరి వ్యవస్ధ ఏదనికాదు. కమ్యూనిస్టు చైనా మాదిరి మన దేశాన్ని కూడా ప్రపంచ ఫ్యాక్టరీగా మారుస్తామంటూ ఆర్ధిక సర్వేల్లో పుంఖాను పుంఖాలుగా రాసుకున్నాం. కమ్యూనిస్టు చైనాను పక్కన పెట్టండి కాపిటలిస్టు అమెరికా, ఐరోపా దేశాల పద్దతి అయినా అనుసరిస్తారా ? అసలు జనం కోసం పని చేస్తారా ? వట్టిస్తరి మంచి నీళ్ల ఆత్మనిర్భరతోనే సరిపెడతారా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనా వాక్సిన్‌ రాజకీయాలు – కమ్యూనిస్టు క్యూబా ఆదర్శం !

16 Friday Apr 2021

Posted by raomk in CHINA, Current Affairs, Health, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, Science, USA

≈ Leave a comment

Tags

Big Pharma Vaccine Profits, Corona vaccine, Cuba Corona Vaccine, Vaccine Nationalism, world Vaccine politics


ఎం కోటేశ్వరరావు


అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అన్న సద్భావం గురించి తెలిసిందే. అదే విధంగా ప్రతి ఒక్కరూ కరోనా నుంచి సురక్షితంగా బయటపడేంత వరకు ఎవరికీ రక్షణ ఉండదు అని గ్రహించాలి. కొత్త రకం వైరస్‌లు తయారు కావటం, వాటి నిరోధానికి జరుగుతున్న పోరాటం ముఖ్యంగా కరోనా మానవాళికి చరిత్రలో ఎదురైన అతిపెద్ద సవాలు. ఇలాంటి విపత్తు సమయంలో కూడా మన దేశంలోనూ, ప్రపంచవ్యాపితంగా జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా కంటే ఇతర అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉద్రిక్తతలకు కారణం అవుతున్న అమెరికా సామ్రాజ్యవాదులు తీరుతెన్నులు అందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు కరోనా నుంచి కూడా లాభాలు పిండుకొనేందుకు ఔషధ కార్పొరేట్లు ప్రయత్నించటం దారుణం. వాక్సిన్‌ పంపిణీ, లభ్యత అసమానంగా ఉంటే ఏడాదికి ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు 1.2లక్షల కోట్ల డాలర్ల నష్టం అని రాండ్‌ కార్పొరేషన్‌ అంచనా వేసింది. వాక్సిన్లు సమ ప్రాతిపదికన పంపిణీ చేయనట్లయితే ప్రపంచానికి నైతికంగా, ఆర్ధికంగా వినాశకరమే అని ప్రపంచ ఆరోగ్య సంస్ద డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ చెప్పారు. ఇది రాసిన సమయానికి అమెరికా తరువాత స్ధానంలో ఉన్న బ్రెజిల్‌ను కిందికి నెట్టి మన దేశం మొత్తం కేసుల్లో రెండవ స్దానంలో ఉంది. ఏప్రిల్‌ 16న రెండు లక్షల పదహారువేలకు పైగా కేసులు రోజుకు నమోదయ్యాయి. మహారాష్ట్ర తరువాత ఉత్తర ప్రదేశ్‌ రెండవ స్ధానంలో ఉంది.
కొత్త కరోనా వైరస్‌లు పెరుగుతున్న నేపధ్యంలో పాత వైరస్‌కు తయారు చేసిన వాక్సిన్ల గురించి ఒక వైపు అనుమానాలు. మరోవైపు సాధ్యమైన త్వరగా దాన్నుంచి లబ్ది పొందాలని కార్పొరేట్లు ప్రయత్నిస్తున్నాయి. వాక్సిన్లు వస్తాయి, 2020 డిసెంబరు నాటికి కరోనాను అదుపులోకి తెస్తాము, త్వరలో సామూహిక రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పిన వారి అంచనాలు తప్పాయి. ఆశించిన వారికి కొత్త రకాల విజృంభణతో ఆశాభంగం కలిగేలా పరిణామాలు ఉన్నాయి. పరిమిత మరణాలతో వ్యాధి తీవ్రత తగ్గటానికి వాక్సిన్లు మినహా మరొక మార్గం కనిపించటం లేదు. అదే సమయంలో అవే కరోనాను కట్టడి చేస్తాయనే హామీ లేదు. కొత్త వైరస్‌ను కనుగొనే సామర్ధ్యమే అనేక దేశాలకు లేని స్ధితిలో వాటికి వాక్సిన్లు తయారు చేయటం ఎంత పెద్ద సవాలో అర్దం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం ఇదే. కనిపిస్తున్నదాని కంటే పరిస్ధితి తీవ్రంగా ఉంది.


గతేడాది మార్చినెల 14న దేశంలో ఇరవై కొత్త కేసులు నమోదైతే సెప్టెంబరు 16న గరిష్టంగా 97,894కు పెరిగి తరువాత క్రమంగా తగ్గాయి. ఈ ఏడాది మార్చి 14న 26,971నమోదు కాగా నెల రోజుల్లో ఏప్రిల్‌ 15న 2,17,353కి పెరిగాయి. ఇంత వేగంగా పెరుగుతున్నప్పటికీ లక్షల మంది గుమికూడే కుంభమేళాను ప్రభుత్వాలు అనుమతించాయి. దానికి సమర్ధన విచిత్రంగా ఉంది. రద్దు చేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. ఏప్రిల్‌ 30వరకు జరిగే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది. ఇప్పటికే హరిద్వార్‌లో రెండువేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అనేక మంది సాధువులకు కరోనా సోకిందని ఒక అఖారా ప్రకటించి కుంభమేళాలను ముగించాలని కోరింది. ఆ పిలుపును ఎవరూ లెక్క చేయటం లేదు. కుంభమేళా జరిగేది ఉత్తరా ఖండ్‌లో అయినప్పటికీ పాల్గొనేవారు దేశం మొత్తం నుంచి వచ్చేవారుంటారు. అందువలన వారికి అంటుకుంటే అది దేశం మొత్తానికి అంటిస్తారు. పుణ్యం పోయి పాపం చుట్టుకుంటుంది అన్న స్పృహకూడా లేకుండా పాల్గొనేవారు, వారిని ప్రోత్సహిస్తున్నవారూ ఉండటం విచారకరం, గర్హనీయం.


కొత్త కరోనా వైరస్‌ రకాల గురించి తక్షణమే కేంద్రీకరించాలని, ఉన్న వాక్సిన్ను అందరికీ సమాన ప్రాతిపదికన అందించాలని, గరిష్టంగా వైరస్‌ను అణచివేయాలని ప్రపంచంలోని ప్రముఖులు పిలుపు నిచ్చారు. ఒకసారి వైరస్‌ సోకి రోగనిరోధక శక్తి పెంపొందిన తరువాత తిరిగి వైరస్‌ సోకదని చెబుతారు. అయితే కొత్త రకాలు వస్తున్నందున వాటికి గతంలో వచ్చిన వారా లేదా అనే విచక్షణ ఉండదు, ఎవరికైనా మరోసారి సోకుతుంది గనుక గతంలో తీసుకున్న జాగ్రత్తలన్నీ ఇప్పుడు కూడా పాటించాలి. సామాజిక వ్యాప్తి నిరోధానికి అంతర్జాతీయంగా మరింత సమన్వయంతో చర్యలు తీసుకోవాల్సి ఉంది.


మార్చి నెలాఖరుకు ఉన్న సమాచారం ప్రకారం వాక్సిన్‌ తయారీలో చైనా అగ్రస్ధానంలో ఉండగా తరువాత అమెరికా, భారత్‌, ఐరోపాయూనియన్‌, బ్రిటన్‌ ఉన్నాయి. వీటిలో అమెరికా,బ్రిటన్‌ తమ దేశాల్లో తయారయ్యే వాక్సిన్‌ స్ధానిక వినియోగానికి మాత్రమే అని ప్రకటించాయి.ఐరోపా యూనియన్‌ తమ సభ్యదేశాల మధ్యనే వినియోగిస్తున్నది. చైనా, భారత్‌లు మాత్రమే ఇతర దేశాలకు ముఖ్యంగా పేద, అభివృద్ది చెందుతున్న దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. అయితే ప్రతి దేశం వాక్సిన్‌ దౌత్యానికి పాల్పడుతున్నదనే విమర్శలు కూడా ఉన్నాయి. వాస్తవం లేదని చెప్పలేము. కమ్యూనిస్టు వ్యతిరేకత, ఇతర రాజకీయ కారణాలతో చైనా వాక్సిన్ల సామర్ధ్యం మీద తప్పుడు ప్రచారం చేయటంతో పాటు వాటిని తిరస్కరించిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఈ కారణాలతో పాటు మన దేశంలో తయారీ ఖర్చు తక్కువగా ఉండటంతో అనేక బహుళజాతి కంపెనీలు తమ ఉత్పత్తులను మన దేశంలో తయారు చేయిస్తున్నాయి. ఈ కారణంగా రాబోయే రోజుల్లో చైనా కంటే మన దేశం ఉత్పత్తిలో ముందుండవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. అయితే చైనాలో ఉన్న సంస్ధలు మనకంటే ఎక్కువగా ఉత్పత్తి చేయగల స్థితిలో ఉన్నాయి.


అనేక అంశాలలో సోషలిస్టు దేశాలు-ఇతర దేశాల మధ్య స్పష్టమైన తేడాలను గతంలో ప్రపంచం చూసింది. ఇప్పుడు కరోనా విషయంలో కూడా అదే వెల్లడైంది. చైనా, వియత్నాం కరోనాను ఎలా కట్టడి చేశాయో, ఆర్ధిక దిగజారుడును ఎలా తప్పించాయో తెలిసిందే. అమెరికాలో తయారు చేసిన వాక్సిన్లకు పేటెంట్‌ హక్కు ఉన్న కారణంగా లాభాల కోసమే వాటిని తయారు చేస్తున్నారు. సామాన్యులకు వాటి ధర అందుబాటులో ఉండదు. కోవిషీల్డ్‌ను మన దేశంలో తయారు చేస్తున్న పూనాలోని సీరం సంస్ధ ప్రభుత్వానికి ఒక డోసును 150 రూపాయలకు ఇస్తున్నామని, బయటి మార్కెట్లో వెయ్యి రూపాయలకు అమ్ముకొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. ఎగుమతుల మీద నిషేధం విధించిన కారణంగా తమకు నష్టం వస్తున్నదని అందువలన కేవలం మన దేశానికి మాత్రమే తయారు చేయాలంటే ఉత్పాదకత సౌకర్యాలను పెంచేందుకు ప్రభుత్వం తమకు మూడువేల కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరింది. ఎగుమతులకు అనుమతి ఇవ్వాలని వత్తిడి చేస్తోంది. వివిధ రకాల వాక్సిన్లు అందుబాటులో లేని కారణంగా పేద, వర్దమాన దేశాల్లో ఏటా పదిహేను లక్షల మంది మరణిస్తున్నారు. అమెరికా, ఐరోపా దేశాలకు భిన్నంగా తాము తయారు చేసిన వాక్సిన్‌ ఎవరైనా తయారు చేసేందుకు దాని ఫార్ములాను అందచేస్తామని, పేటెంట్‌ హక్కును వదులు కుంటామని క్యూబా ప్రకటించింది.గతంలో పోలియో వాక్సిన్‌ కనుకొన్న అమెరికా శాస్త్రవేత్త జోనాస్‌ సాక్‌ దాని మీద పేటెంట్‌ హక్కును వదలుకొని ప్రపంచంలో ఎవరైనా తయారు చేసేందుకు అవకాశం ఇచ్చిన ఆదర్శానికి అనుగుణ్యంగా ఇది ఉంది.

మోడెర్నా, ఆస్ట్రాజెనెకా, ఫైజర్‌ వంటి ఇతర ఔషధ కంపెనీలు వాక్సిన్‌ పరిశోధనలకు ప్రభుత్వాల నుంచి పెద్ద మొత్తంలో నిధులు పొందినప్పటికీ, వాటి ఫార్ములాను ఇతరులకు అందించేందుకు నిరాకరిస్తున్నాయి. జనం ప్రాణాలు కోల్పోయినా సరే తమ లాభాల వేటలో ఉన్నాయి.ప్రపంచ ఆరోగ్య సంస్ధ కరోనా వాక్సిన్‌ తయారీ కార్యక్రమంలో 142 దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. నూటముప్పయి కోట్ల జనాభా ఉన్న ఆఫ్రికా ఖండానికి జూన్‌ నాటికి కేవలం కోటీ 40లక్షల డోసులు మాత్రమే అందుతాయని గార్డియన్‌ పత్రిక విశ్లేషించింది. ప్రపంచవ్యాపింగా 700 కోట్ల డోసులు కొనుగోలు చేస్తే వాటిలో 420 కోట్లు ప్రధాన పెట్టుబడిదారీ దేశాలకే పోతున్నదని కూడా తెలిపింది. నిజానికి ప్రపంచ జనాభా మొత్తానికి వాక్సిన్ల తయారీకి అవకాశాలున్నప్పటికీ లాభాల కోసం ఆ పని చేయటం లేదు. అంతిమంగా కొన్ని లక్షల కోట్ల డాలర్లను కార్పొరేట్లు లాభం పొందితే ఆ మేరకు సామాన్యజనం నష్టపోతారు.


లాటిన్‌ అమెరికాలో క్యూబాతో పోలిస్తే ధనిక దేశాలు అనేకం ఉన్నాయి. కానీ కరోనా వ్యాక్సిన్సు రూపొందించిన దేశం క్యూబా ఒక్కటే. ఐదు రకాల వాక్సిన్ల తయారీకి పూనుకొని రెండింటిని జనానికి అందుబాటులోకి తెచ్చింది. మే నెలాఖరుకు పెద్ద వారందరికీ వాక్సిన్లు వేయనున్నారు.ఆగస్టు నాటికి 70శాతం మందికి ఏడాది ఆఖరుకు మొత్తం జనాభాకు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఒక్క కరోనానే కాదు అన్ని వాక్సిన్లు అక్కడి జనానికి ఉచితంగానే వేస్తారు. కరోనా వాక్సిన్ను తమ పౌరులకే కాదు, తమ దేశ పర్యటనకు వచ్చిన వారందరికీ కావాలంటే వేస్తున్నారు. మా దగ్గర లేని దాన్ని మేం ఇవ్వలేము, ఉన్నదాన్ని అందరం పంచుకుంటాం అనే సూత్రాన్ని పాటిస్తున్నారు.

బ్రిటన్‌ ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్‌ ( మన దేశంలో కోవీషీల్డ్‌ పేరుతో సీరం సంస్ధ తయారు చేస్తున్నది) అభివృద్దిలో 97శాతం సొమ్ము ప్రజల నుంచి లేదా దాతల నుంచి వచ్చిందే అని తేలింది. అంతేకాదు రెండువేల సంవత్సరం నుంచి జరుపుతున్న వివిధ పరిశోధనల సారాన్ని విశ్వవిద్యాలయ పరిశోధకులు వినియోగించుకున్నారు. కరోనా వాక్సిన్‌ తయారీకి ధనాశ, పెట్టుబడిదారీ విధానమే కారణమని దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ చేసిన వ్యాఖ్యలోని డొల్లతనాన్ని గార్డియన్‌ పత్రిక బయటపెట్టింది. ప్రయివేటు పెట్టుబడిదారుల నుంచి కేవలం 2.8శాతం నిధులు మాత్రమే అందాయని, పారదర్శకత లేని కారణంగా వివరాలు జనానికి తెలియటం లేదని పేర్కొన్నది. ఎలాంటి ప్రతిఫలం కోరకుండానే వాక్సిన్‌ తయారు చేసే అర్హత ఉన్నవారందరికీ ఫార్ములా అందచేస్తామని తొలుత ఆక్స్‌ఫర్డ్‌ ప్రకటించింది. అయితే గతేడాది ఆగస్టులో బిల్‌గేట్స్‌ కోరిక మేరకు బ్రిటీష్‌-స్వీడిష్‌ ఔషధ తయారీ సంస్ధ ఆస్ట్రాజెనెకాతో ఒప్పందం చేసుకుంది. అది వివిధ దేశాలో సీరం వంటి సంస్దలతో ఒప్పందాలు చేసుకొని ఉత్పత్తి చేయిస్తున్నది. లాభాల కోసం తాము వాక్సిన్‌ విక్రయాలు జరపం అని, ఆ మేరకు ఉత్పత్తిదారులతో ఒప్పందం చేసుకుంటామని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. అయితే కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చిన తరువాత వాక్సిన్‌ ధరను నిర్ణయించే హక్కును అట్టిపెట్టుకున్నట్లు తెలిపింది. ఇక్కడే అసలు కీలకం ఉంది. వాక్సిన్లు పరిమితం కాలం మాత్రమే ప్రభావం చూపుతాయని అందువలన రాబోయే సంవత్సరాలలో అదనపు డోసులను ఇవ్వాల్సి వస్తే దాన్ని లాభాలకు ఉపయోగించుకోవాలన్న దూరాలోచన దాని వెనుక ఉంది. వాక్సిన్ల తయారీకి సంవత్సరాల సమయం పట్టటం, ప్రారంభ పెట్టుబడి ఎక్కువగా ఉండటం, దాని ఉపయోగం పరిమిత కాలమే అయితే నష్టం కనుక ఔషధ సంస్ధలు పరిశోధనలకు మొగ్గుచూపటం లేదు. అటువంటి స్ధితిలో కరోనా వాటికి ఒక వరం మాదిరి తయారైంది. లాభాలు పిండుకోవచ్చని అంచనా వేస్తున్నారు.


కరోనా వాక్సిన్‌ తయారీ సంస్ధలు ఉత్పత్తి రేటు కంటే ప్రభుత్వానికి తక్కువకు ఇస్తున్నామని చెబుతున్నాయి. పరిశోధన-అభివృద్ధి ఖర్చు, పంపిణీ, మార్కెటింగ్‌ ఖర్చు లేనందున అవి వాటికి కలసి వచ్చినట్లే. ఏ ప్రయివేటు సంస్ధా లాభం లేకుండా ఏ పనీ చేయదు. గరిష్ట స్ధాయిలో ఉత్పత్తి చేస్తున్నందున టర్నోవరు ఎక్కువగా ఉండి లాభాలు దండిగానే ఉంటాయి. ప్రభుత్వ కార్యక్రమం ముగిసిన తరువాత అవి ఎంత చెబితే అంతకు జనం కొనుగోలు చేయాల్సిందే. లాభాల గురించి అడిగితే ఇంతవరకు ఏ సంస్దా నోరు విప్పేందుకు సిద్దంగా లేదు. పూనాలోని సీరం సంస్ద ప్రధానంగా వాక్సిన్ల తయారీమీదే కేంద్రీకరించింది.


చైనా విషయానికి వస్తే కరోనా వాక్సిన్‌ ప్రజా వస్తువు అని ప్రకటించింది. అనేక దేశాలకు అందచేస్తామని ప్రకటించింది. అయితే అదేమీ వాణిజ్య ప్రాతిపదిక కాదు, అలాగని ఉచితమూ కాదు. మన దేశం విరాళంగా ఇస్తున్నట్లే అది కూడా ఇస్తోంది. ప్రతి వాక్సిన్‌ సామర్ధ్యం గురించి అనేక అనుమానాలు ఉన్నాయి, కొన్ని ఎక్కువ మరికొన్ని తక్కువ కావచ్చు. తమ ప్రత్యర్ధి సంస్ధ తయారు చేస్తున్నది ఒట్టి నీళ్లే అని మన దేశంలోని ఒక సంస్ధ కొట్టిపారేసిన విషయం తెలిసిందే. తరువాత ఆ రెండూ సర్దుబాటు చేసుకొని నోరుమూసుకున్నాయి. చైనాలో ప్రస్తుతం కేసులేవీ లేవు ఉన్నా వాటిని పెద్దగా లెక్కలోకి తీసుకోదగ్గవి కాదు కనుక అక్కడ వాక్సిన్‌ తయారీ విదేశాలకు అందచేయటానికి ఎక్కువ అవకాశాలున్నాయి. అలాగని దేశీయంగా వాక్సిన్లు వేయటం లేదని కాదు. వెయ్యి పడకల ఆసుపత్రిని వారం రోజుల్లో సిద్దం చేయగలిగిన వారికి అవసరమైతే వాక్సిన పెద్ద ఎత్తున తయారు చేయటం పెద్ద సమస్య కాదు.


కరోనా కాటుకు జనం బలవుతున్నా కొన్ని దేశాలు రాజకీయాలు మానుకోలేదు. తప్పుడు ప్రచారాన్ని వ్యాపింప చేస్తున్నాయి. ఆస్ట్రాజెనెకా వాక్సిన్‌ తీసుకున్నవారిలో రక్తం గడ్డకడుతున్నదనే సాకుతో అనేక దేశాలు దాన్ని నిషేధించాయి. దీనిలో శాస్త్రం కంటే ఇతర అంశాలే ప్రధానంగా ఉన్నాయని అనేక మంది నిపుణులు చెబుతున్నారు. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం తయారు చేసినదాని మీదే ఇంత రాజకీయం చేస్తుంటే చైనా తయారు చేసిందాని గురించి తప్పుడు ప్రచారంలో ఆశ్చర్యం ఏముంటుంది ?

హొ

Share this:

  • Tweet
  • More
Like Loading...

శాస్త్ర మిత్రోం వద్దు – మూఢ మూత్రోం ముద్దు !

06 Saturday Feb 2021

Posted by raomk in BJP, Current Affairs, Farmers, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Science

≈ Leave a comment

Tags

BJP pseudoscience, cow science exam, cow urine phenyl, love for pseudoscience, No to science, pseudoscience


ఎం కోటేశ్వరరావు


గ్రామం నుంచి సచివాలయం వరకు ప్రభుత్వ కార్యాలయాలను ఆవు మూత్రంతో తయారు చేసిన ఫినాయిల్‌తోనే శుద్ది చేయాలని మధ్య ప్రదేశ్‌ బిజెపి ప్రభుత్వం జనవరి నెల చివరిలో ఆదేశాలు జారీ చేసింది. ఆవు మూత్ర ఫినాయిల్‌ తయారీకి ముందే గిరాకీని సృష్టించామని అందువలన మూత్రం వృధా కాకుండా యజమానులు ఒట్టి పోయిన ఆవులను ఇండ్ల దగ్గరే ఉంచుతారని తద్వారా ఆవుల పరిస్ధితి మెరుగుపడుతుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి ప్రేమ్‌ సింగ్‌ పటేల్‌ ప్రకటించారు. తమ ప్రభుత్వ చర్యను చూసి ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే విధమైన చర్యలు తీసుకుంటారని బిజెపి ప్రతినిధి రాహుల్‌ కొఠారీ సమర్ధించారు.


ఇప్పటికే రామ్‌ దేవ్‌ బాబా పతంజలి కంపెనీ గోనైల్‌ పేరుతో ఆవు మూత్ర ఫినాయిల్‌ తయారు చేస్తున్నది. దానికి లబ్ది చేకూర్చేందుకే ఈ చర్య తీసుకున్నారన్న ఆరోపణ కూడా ఉంది. అయితే పెద్ద ఎత్తున గోమూత్ర సేకరణ చేయాల్సి ఉన్నందున ప్రభుత్వమే గ్రామాల్లో పాలకేంద్రాల మాదిరి ఆవు మూత్ర కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి సేకరించిన మూత్రంతో ఫినాయిల్‌ తయారీకి సహకరించే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న భారతీయులకు సరఫరా చేసేందుకు బహుశా మేకిన్‌ ఇండియా పధకం కింద ఎగుమతులు కూడా చేసే అవకాశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలించవచ్చు.
దేశంలో ఎక్కడా లేని విధంగా మధ్య ప్రదేశలో ప్రత్యేకంగా ” ఆవు మంత్రి వర్గం ” కూడా ఉంది. వాటి రక్షణ కోసం పశుసంవర్దక, అటవీ, పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి, హౌం మరియు రైతు సంక్షేమ శాఖల మంత్రులతో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ గతేడాది నవంబరు 18న ప్రకటించారు. రాజు తలచుకోవాలే గానీ డబ్బులకు – దెబ్బలకూ కొదవేముంటుంది ! బిజెపి తలచుకోవాలే గానీ ఆశ్రితులకు జనం సొమ్ము అప్పగించేందుకు కొత్త పుంతలు ఎన్నో. చివరకు ఆవు మూత్రాన్ని కూడా సొమ్ము చేసుకొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుంది. ఆవు మూత్రం తాగే జనం ఉన్న దేశం మనది.(ఎవరి మనోభావాన్ని కించపరచటం లేదు. ఎవరిష్టం వారిది) అలాంటిది అదీ దేశీయ ఆవు మూత్రంతో ఇండ్లు, ఆఫీసులను తుడిచే ఫినాయిల్‌ తయారు చేస్తామంటే ఎవరైనా అభ్యంతరపెడతారా ?


బిజెపి ప్రభుత్వ నిర్ణయం మీద సామాజిక మాధ్యమాల్లో జనాలు హాస్యాన్ని పండిస్తున్నారు.సంవాదాలు, రాజకీయ విసుర్లు, విమర్శించిన వారి మీద దాడి సరే సరి ! ప్రస్తుతం రసాయనాలతో ఫినాయిల్‌ తయారు చేస్తున్నారు. దానికి రకరకాల రంగులు, వాసనలు జోడిస్తున్నారు. ప్రపంచంలో ఊబకాయం పెద్ద సమస్యగా మారుతోంది. చిరుతిండ్లు దానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. అందువలన వాటి వాడకాన్ని నిరుత్సాహపరచేందుకు ” కొవ్వు ” లేదా ఉప్పు పన్ను వేస్తున్నారు. ఈనేపధ్యంలో కొన్ని వ్యాఖ్యానాలు ఎలా ఉన్నాయో చూద్దాం !

తదుపరి ఫాస్ట్‌ ఫుడ్స్‌, డ్రింకులకు కృత్రిమ వాసనల బదులు విధిగా గో మూత్ర వాసన జోడించాలని ఆదేశాలు జారీ చేసినా ఆశ్చర్యం లేదు. అలా చేస్తే పన్నుతో నిమిత్తం లేకుండానే జనాలు చిరుతిండ్లు మాని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు. డబ్బుకు డబ్బు ఆదా !
ముందు గవర్నర్‌, ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాలు, ఇళ్లతో ప్రారంభించాలి ! మూత్ర తంత్రం ఎంత గొప్పగా ఉందో కదా !
తరువాత మధ్య ప్రదేశ్‌ ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ఉదయాన్నే టీ బదులు గోమూత్రం తాగాలనే ఆదేశాలు జారీ అవుతాయి !
ఇళ్ల నుంచి పని చేసేందుకు ఉద్యోగులకు ఇది పెద్ద ప్రోత్సాహం అవుతుంది !
ఉత్తర ప్రదేశ్‌కు మధ్య ప్రదేశ్‌ గట్టి పోటీనిస్తోంది ! చూద్దాం 2024నాటికి ఎవరు ఎక్కువ గోమూత్రం తాగుతారో !
ఎంపీ, యూపీలలో ఉన్న వారి పట్ల విచారంగా ఉంది !
ఇది ఆవు ప్రభుత్వం, ఆవుల కోసం ఆవులు పని చేస్తున్నాయి ! మోడీ-అమిత్‌ షా బ్రాండ్‌ ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఎక్కడా లేదు !
ప్రపంచంలో మన దేశాన్ని అపహాస్యం పాలు చేయటానికి ఈ పాలకులు రోజుకు ఒక కొత్త మార్గాన్ని కనుగొంటున్నారు !
దానితో ఇబ్బంది ఏముంది ? రసాయన పరిశ్రమల కంటే కుటీర పరిశ్రమ వృద్ది చెందుతుంది !
మధ్య ప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఆవు మూత్రంతో పాటు మనుషుల మూత్రంతో కూడా ఫినాయిల్‌ తయారు చేయించవచ్చు, సులభంగా కూడా దొరుకుతుంది !
మిత్రోం వద్దు – మూత్రోం ముద్దు ! ప్రతిదీ ఆవు పేడ వాసన రావాల్సిందే !
బీఫ్‌ తినే వారు ఆవు మూత్రం గురించి అభ్యంతర పెట్టే నైతిక హక్కులేదు !
నేను బీఫ్‌ తింటా దానికి ఉచ్చతో చేసిన సాస్‌ బదులు మిరియాల సాస్‌ వాడతా, ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే ఉచ్చ సాస్‌ పంపుతా !
జనానికి అభ్యంతరం లేనంత వరకు మనకు సమస్య ఏముంది ?
” పప్పు ” పార్టీ కంటే గోమూత్ర పార్టీలో మెదళ్లు ఎక్కువగా ఉన్నాయని తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది.
పెట్రోలు ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయబ్బా ! ఆవు మూత్రంతో వాహనాలు నడపవచ్చేమో అన్న ఆలోచన వస్తోంది !
ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్‌ ఇది గోమూత్ర సర్కార్‌ అని వ్యాఖ్యానించారు.
వారేమీ దాచుకోవటం లేదని తెలుసుకోవటం సంతోషంగా ఉంది. మాకు అవకాశం వచ్చింది గనుక గోమూత్రాన్ని వాడుతున్నాం. మీకు అవకాశం వస్తే ఒంటె మూత్రాన్ని వాడండి, అది లౌకిక పద్దతి, మీరు కూడా తాగవచ్చు !


ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. హానికరమైన రేడియో ధార్మికశక్తిని ఆవు పేడ 60శాతం మేరకు నిరోధిస్తుందని తమ పరిశోధనల్లో తేలినట్లు గుజరాత్‌లోని సౌరాష్ట్ర విశ్వవిద్యాలయం జనవరి చివరిలో ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్ధ అయిన రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌ ఆధ్వర్యంలో ఈ ప్రయోగాలు జరిపినట్లు ప్రకటించారు. దీని గురించి గత అక్టోబరులోనే సంస్ధ అధ్యక్షుడు, క్యాన్సర్‌ చికిత్స నిపుణుడైన డాక్టర్‌ వల్లభారు కథిరియా ప్రకటించారు. దాన్ని అప్పుడే దేశంలోని ఆరువందల మంది శాస్త్రవేత్తలు సవాలు చేశారు. దాన్ని నిర్ధారిస్తూ ఇటీవల విశ్వవిద్యాలయంలోని భౌతికశాస్త్ర అధ్యాపకుల నుంచి ప్రకటన రావటం విచారం కలిగిస్తున్నదని కొందరు శాస్త్రవేత్తలు తాజాగా ఒక ప్రకటనలో విమర్శించారు. ఆవు పేడ ప్రతి ఒక్కరినీ రక్షిస్తుంది. దానికి రేడియో ధార్మికతను నిరోధించే గుణం ఉంది.అది ఇంట్లో ఉంటే రేడియేషన్‌ ఉండదు, ఇది సైన్సులో రుజువైందని వల్లభారు గతంలో చెప్పారు. విలేకర్ల సమావేశంలో ఒక పరికరాన్ని చూపుతూ సెల్‌ఫోన్ల నుంచి వెలువడే రేడియేషన్‌ను అది నిరోధిస్తుందన్నారు.

సౌరాష్ట్ర విశ్వవిద్యాలయ ప్రకటనను సవాలు చేసిన శాస్త్రవేత్తలు అసలా పరిశోధనా పద్దతిలోనే లోపం ఉందన్నారు. రేడియేషన్‌ కొలవటానికి వీలైనది, భిన్నమైన మందాలు గల ఆవు పేడ పిడకలతో ఎంత తేడాతో రేడియేషన్‌ ఉన్నదో కొలవ వచ్చు, కానీ ఆపని చేయకుండా ఒకసారి మాత్రమే కొలిస్తే అసలు పరిశోధన ఎలా అవుతుందన్నారు. ఆవు పేడ కాకుండా ఒంటె లేదా గాడిద పెంటతో ప్రయోగాలు చేసి ఉంటే ఏమి జరిగేదో చెప్పాలన్నారు. పరిశోధనలో లోపాల గురించి వారికి తెలిసి ఉండకపోవచ్చు లేదా ఎవరికోసమో తప్పుడు సమాచారాన్ని తయారు చేసి ఇచ్చి ఉండవచ్చన్నారు. బోధనా రంగంలో ఉన్న కొంత మంది కుహనా శాస్త్రాన్ని బలవంతంగా రుద్దటాన్ని తాము నిరసిస్తున్నామన్నారు. ఆవు పేడ రేడియేషన్‌ నిరోధకత కలిగి ఉందని శాస్త్రవేత్తల ముసుగు వేసుకున్న కుహనా బృందాల నుంచి నుంచి గాక ప్రభుత్వ సంస్ధ నుంచి వచ్చినందున దీన్ని తేలికగా తీసుకో కూడదని కొల్‌కతాలోని ఐఐఎస్‌ఇఆర్‌ సంస్ధ భౌతిక శాస్త్ర ప్రొఫెసర్‌ సౌమిత్ర బెనర్జీ అన్నారు. ఆవు పేడ మీద పరిశోధనలకు నిధులు పొందటం సులభమని కొంత మంది శాస్త్రవేత్తలు దృష్టి మళ్లిస్తారని అయితే ఇది శాస్త్ర ఆరోగ్యానికే హానికరమని అన్నారు.


ఆవు సైన్సును ప్రోత్సహించే పేరుతో ఫిబ్రవరి 25న దేశవ్యాపితంగా తొలిసారిగా ఆలిండియా ఆన్‌లైన్‌ కామధేను గో విజ్ఞాన ప్రచార-ప్రసార పరీక్ష పెడుతున్నారు. దీనిలో ఎవరైనా పాల్గొనవచ్చు, చదువు సంధ్యలతో, వయస్సుతో పనిలేదు. ఆవు గురించి తెలిస్తే చాలు. పరీక్ష రాసిన వారందరికీ అందరికీ ఆవు ” శాస్త్రవేత్తలు ” గా సర్టిఫికెట్లు ఇస్తారు, అధిక మార్కులు వచ్చిన వారికి అదనంగా బహుమతులు ఇస్తారు. పశుసంవర్ధన ఆధునిక, శాస్త్రీయ పద్దతుల్లో నిర్వహించేందుకు గాను రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఆచరణలో అది కుహనా శాస్త్ర ప్రచారాన్ని చేస్తున్నది. ఆ సంస్ధ అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్‌ వల్లభారు కథిరియా రాసిన ఒక బహిరంగలేఖలో ఒక వ్యాక్యం చదివితే అదేం చేస్తున్నదో అర్దం చేసుకోవచ్చు. ” ఈ రోజు మనం రామాయణం, మహాభారత్‌, కృష్ణ, చాణక్య, ఉపనిషత్‌ గంగ వంటి సీరియల్స్‌ను చూసినపుడు సామాజిక జీవనంలో మన ఊహకు సైతం అందని అసమాన సాంకేతిక ప్రక్రియలను ఉపయోగించినట్లు తెలుసుకోవచ్చు ” అని పేర్కొన్నారు. అంతేకాదు నేను క్యాన్సర్‌ ఆపరేషన్ల గురించి చెప్పగలను గానీ ఇతర విషయాలు నాకు తెలియవు, అలాగే ఆవు శాస్త్రం గురించి అందరికీ తెలియకపోవచ్చు అన్నారు.

ఒక వైపు ఆధునిక శాస్త్ర పరిశోధనలు అవసరమని లోకం కోడై కూస్తున్నది.మరోవైపు మన దేశంలో శాస్త్ర పరిశోధన మరియు అభివృద్ధికి నిధులు కోత పెడుతున్నారు.ప్రపంచబ్యాంకు సమాచారం ప్రకారం 1996లో మన జిడిపిలో 0.64 శాతం కేటాయించారు. అది 2008 నాటికి 0.86శాతానికి పెరిగింది. నరేంద్రమోడీ సర్కార్‌ హయాంలో 2018లో 0.65శాతానికి దిగజారింది. తాజాగా ఆర్ధిక సర్వేలో ఖర్చును 0.7 నుంచి రెండుశాతానికి పెంచాలని వ్యాఖ్యానించారు. తాజా బడ్జెట్‌లో అలాంటి సూచనలేమీ లేవు. ప్రపంచ నవకల్పన 2020 సూచీలో మనదేశం 131దేశాలలో 48వ స్ధానంలో ఉందని పేర్కొన్నది. కొందరైతే 2014లో 76వ స్దానంలో ఉన్నదానిని నరేంద్రమోడీ 28 స్ధానాలు పెంచి 48కి తెచ్చారని పొగడ్తలు కురిపించారు. మనతో సమానమైన వారితో పోటీ-పోలిక గౌరవంగా ఉంటుంది.మన దేశం 2014లో 33.7 పాయింట్లతో 76వ స్ధానంలో ఉంది. అది 2020కి 48లోకి వచ్చినా పాయింట్లు 35.6 మాత్రమే. ఇదే కాలంలో చైనా 46 నుంచి 29వ స్ధానానికి 17 స్ధానాలు మెరుగుపరచుకుంది, పాయింట్ల వారీ చూస్తే 46.6 నుంచి 53.3కు పెంచుకుంది. పైకి పోతున్న కొద్దీ పోటీ తీవ్రత పెరుగుతుందన్నది తెలిసిందే. సౌమిత్ర బెనర్జీ చెప్పినట్లు మన పరిశోధనలన్నీ ఆవు పేడ, మూత్రం చుట్టూ తిరుగుతున్నాయి. కేంద్రం, రాష్ట్రాలలో దాని పట్ల మక్కువ ఉన్న పాలకులు ఉన్న కారణంగా నిధుల కోసం అలాంటి పరిశోధనల చుట్టూ కొందరు శాస్త్రవేత్తలు ప్రదక్షణలు చేస్తున్నారు. గోమాతలను ప్రార్ధిస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీని మునగ చెట్టు ఎక్కిస్తున్న భక్తులు – వాస్తవాల వక్రీకరణ కుయుక్తులు !

18 Monday Jan 2021

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RELIGION, Religious Intolarence, Science

≈ Leave a comment

Tags

BJP pseudoscience, false scientific claims, Glorification of Narendra modi, Hindu Fundamentalism, pseudoscience, Vaccine Nationalism


ఎం కోటేశ్వరరావు


ఏ దేశమేగినా ఎందు కాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీజాతి నిండు గౌరవము
అని ప్రముఖ కవి రాయప్రోలు సుబ్బారావు రాసిన జన్మభూమి గీతాన్ని ఎవరు మరచి పోరు.మేరా భారత్‌ మహాన్‌, నిజమే ! నా దేశం గొప్పది. అందులో ఎలాంటి సందేహం లేదు. నా దేశమే గొప్పది, తరువాతే మిగతావి అంటేనేే తేడా వస్తుంది. వసుధైక కుటుంబం అన్న మహత్తర భావన మన దేశంలో తరతరాలుగా జనంలో నాటుకుపోయింది. అందరూ బాగుండాలి-అందులో నేనుండాలి అనుకొనే వారితో ఎలాంటి పేచీ లేదు. ఒకవైపు ఆ మాట చెబుతూనే మరోవైపు దానికి విరుద్దమైన ఆచరణతోనే అసలు సమస్య.


తాజాగా సామాజిక మాధ్యమంలో కొన్ని పోస్టులు తిరుగుతున్నాయి. ఒకదానిలో ప్రపంచ దేశాలన్నింటిలో భారతదేశంలోనే ముందుస్తుగా కోవాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం, నరేంద్రమోడీగారికే ఇది సాధ్యం అని పేర్కొన్నారు. నరేంద్రమోడీ నాయకత్వంలో సాధించిన విజయాలను ఎవరైనా పొగిడితే పోయేదేమీ లేదు. అబద్దాల ప్రచారాన్ని చూసి ప్రపంచమంతా నవ్వితే ఎవరికి నష్టం. అన్నీ ఉన్న ఆకు అణగిమణగి ఉంటుంది, ఏమీ లేనిది ఎగిరెగిరి పడుతుంది. కరోనా పోరులో ఉన్న మూడు కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఇతరులకు ఉచితంగా వేస్తామని, అందుకయ్యే ఖర్చును రాష్ట్రాలు భరించలేకపోతే కేంద్రమే భరిస్తుందని ప్రధాని మోడీ ముఖ్యమంత్రుల సమావేశంలో చెప్పారు. సాధారణ పౌరులకూ అలాగే వేస్తారా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. ప్రపంచంలో వెనకో ముందో అనేక దేశాల్లో కరోనా పోరులో 200 వరకు వాక్సిన్ల తయారీకి కసరత్తు జరుగుతోంది. వాటిలో మన దేశంలో హైదరాబాదు కేంద్రంగా భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్‌ పేరుతో ఒక దాన్ని తయారు చేస్తున్నది.


ఇక ఇతర దేశాల విషయానికి వస్తే ఉచిత వ్యాక్సిన్‌ వేయాలని జపాన్‌ పార్లమెంటులో చట్టపరమైన నిర్ణయం చేశారు.ఫ్రాన్స్‌, అమెరికా, బ్రిటన్‌ , నార్వే వంటి అనేక దేశాలూ ఈ జాబితాలో ఉన్నాయి. అన్నింటి కంటే చైనాలో ఉచితంగా, ప్రయోగాత్మకంగా వాక్సిన్‌ ఇవ్వటం గతేడాదే ప్రారంభించారు. ప్రచార కండూతి లేదని ఒక వైపు చెప్పుకుంటూనే బిజెపి తన ప్రచార సేన ద్వారా సామాజిక మాధ్యమంలో ఇలాంటి పోస్టులు పెట్టించుకోవటం ఎవరెరుగనిది. గుడ్డిగా నమ్మేందుకు జనం చెవుల్లో పూలు పెట్టుకు లేరు.

మరో పోస్టు కూడా తిరుగుతోంది. ప్రపంచానికి అమెరికా ఆయుధాలు ఇచ్చింది చంపుకోమని, పాకిస్తాన్‌ ఉగ్రవాదులను ఇచ్చింది చంపమని,చైనా కరోనాను ఇచ్చింది అందరూ చావాలని, నా భారత దేశం మాత్రమే మెడిసిన్‌ ఇస్తుంది అందరూ బతకాలని, అని దానిలో రాశారు. ఇది కాషాయ దళాల ఫ్యాక్టరీ ఉత్పత్తి అని వేరే చెప్పనవసరం లేదు. 2010-14 సంవత్సరాలతో పోల్చితే 2015-19 మధ్య (ట్రంప్‌ ఏలుబడి) అమెరికా అమ్మిన ఆయుధాలు 23శాతం పెరిగాయి. అనేక దేశాల మీద యుద్దాలు చేస్తూ, చేయిస్తూ ఆయుధ పరిశ్రమలకు లాభాల పంట పండిస్తున్న అమెరికా మనల్ని కూడా వదల్లేదు. చైనా మీదకు మనల్ని ఉసిగొల్పటం, చైనాను బూచిగా చూపి దాని ఆయుధాలను మనకూ అంటగడుతోంది. తన దగ్గర కాకుండా రష్యా దగ్గర కొనుగోలు చేస్తామంటే ఆంక్షలు విధిస్తామని బెదిరిస్తోంది.అలాంటి ట్రంప్‌కు మద్దతు ఇచ్చిన పెద్దమనిషి నరేంద్రమోడీ, అలాంటి అమెరికా మనకు భాగస్వామి అని, ఎలా కౌగిలింతలతో గడిపారో తెలిసిందే. మన అదృష్టం కొద్దీ ట్రంప్‌ ఓడిపోయాడు గానీ లేకుంటే పరిస్ధితి ఎలా ఉండేదో ఊహించుకోవాల్సిందే !


ప్రపంచానికి భారత్‌ మాత్రమే మెడిసిన్స్‌ ఇస్తుందా ? 2019లో బ్లూమ్‌బెర్గ్‌ అనే అమెరికా కార్పొరేట్‌ సంస్ధ ప్రపంచంలో ఆరోగ్యవంతమైన దేశాల సూచిక అంటూ 169 దేశాల జాబితా ఇచ్చింది. దానిలో మన స్ధానం 2017తో పోల్చితే 119 నుంచి 120కి పడిపోయింది. ఈసూచికకు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. మన దేశం ఎన్ని ఔషధాలు తయారు చేస్తున్నది అని కాదు, మోడీ పాలనలో జనాన్ని ఎంత ఆరోగ్యంగా ఉంచారో అని గర్వపడాలి. ఎందుకంటే కేంద్రంలోనూ, మెజారిటీ రాష్ట్రాలలో అధికారంలో ఉన్నది బిజెపినే కనుక ఆ ఖ్యాతి కూడా మోడీగారి ఖాతాకే జమకావాలి !


ఆరోగ్యవంతమైన దేశాల జాబితాలో చైనా మూడు స్ధానాలను పెంచుకొని 52వ స్ధానంలో ఉంది. మన పక్కనే ఉన్న శ్రీలంక 66, బంగ్లాదేశ్‌ 110 స్ధానాల్లో ఉండగా మన 120వ స్ధానానికి దగ్గరగా పాకిస్ధాన్‌ 124లో ఉంది. ఆరుదశాబ్దాలకు పైగా అష్టదిగ్బంధనలో ఉన్న క్యూబా 31 నుంచి 30వ స్ధానానికి ఎదగ్గా, దాన్ని నాశనం చేయాలని చూస్తున్న అమెరికా 34నుంచి 35కు పడిపోయింది. జనం ఆరోగ్యానికి తోడ్పడని ఔషధాలు ఎన్ని తయారు చేస్తే ప్రయోజనం ఏముంది ?అదేదో సినిమాలో అన్నట్లు దీనమ్మ జీవితం ఏది మాట్లాడినా నరేంద్రమోడీకే తగులుతోంది.


ఇక నరేంద్రమోడీ గారి ఖాతాలో జమ కావాల్సిన మరో ఘనత కూడా ఉంది. 1995 నుంచి నేటి వరకు గుజరాత్‌ బిజెపి ఏలుబడిలో ఉంది.దానిలో సగం కాలం నరేంద్రమోడీ గారు పన్నెండు సంవత్సరాల 227 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తరువాత ప్రధాని అయ్యారు. 1990-2016 సంవత్సరాల మధ్య వ్యాధుల భారం గురించి ఒక విశ్లేషణ జరిగింది.దాని ప్రకారం 1990లో గుజరాత్‌లో వ్యాధుల కారణంగా సంభవించిన మరణాలకు కారణాలలో ప్రధమ స్ధానంలో 36.1శాతం పోషకాహార లేమిగా తేలింది.2016 నాటికి 14.6శాశాతానికి తగ్గినా ప్రధమ స్ధానం దానిదే. ఇదే సమయంలో కేరళ వ్యాధుల భారం అతి తక్కువగా ఉన్న రాష్ట్రంగా ప్రధమ స్ధానంలో ఉంది. అక్కడ పైన పేర్కొన్న విశ్లేషణ కాలంలో మరణాల కారణాలలో ప్రధమ స్ధానంలో ఉన్న పోషకాహార లేమి 17.4 నుంచి 4.4శాతానికి, ప్రధమ స్దానం నుంచి తొమ్మిదికి తగ్గింది. మందులు ఎన్ని ఉత్పత్తి చేస్తున్నామన్నది కాదు, వాటి అవసరం లేకుండా ఏ చర్యలు తీసుకున్నారన్నది ముఖ్యం.


మన దేశం ఔషధాల ఉత్పత్తిలో ముఖ్యంగా వాక్సిన్లు, జనరిక్‌ ఔషధాల ఉత్పత్తిలో అగ్రస్ధానంలో ఉన్నమాట వాస్తవం. అదేదో ఆరున్నరేండ్ల నరేంద్రమోడీ పాలనలోనే సాధించినట్లు చిత్రిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే ఔషధాల ప్రయోగాలకు దొరికే వలంటీర్ల ఖర్చు మన దగ్గర చాలా తక్కువ, సకల రోగాలకు నిలయంగా ఉంది గనుక ప్రయోగాలూ ఇక్కడ ఎక్కువే. నిపుణులు ఉండటం, ఉత్పత్తి ఖర్చు తక్కువగా ఉండటం వంటి అంశాలు మన దేశంలో ఔషధ పరిశ్రమ అభివృద్దికి తోడ్పడ్డాయి.అయితే ప్రపంచంలో మన స్ధానం ఎక్కడ అని చూస్తే మొదటి 15దేశాలలో 2018 సమాచారం ప్రకారం 16.8శాతంతో జర్మనీ ప్రధమ స్ధానంలో ఉండగా 12.2, 7.5 శాతాలతో స్విడ్జర్లాండ్‌, బెల్జియం తరువాత ఉన్నాయి. మన దేశం 3.8శాతంతో 12పన్నెండవ స్ధానంలో ఉంది. మొదటి స్ధానంలో ఉన్న జర్మనీ ఎగుమతుల విలువ 62.3 బిలియన్‌ డాలర్లు కాగా మన విలువ 14.5బి.డాలర్లు. మన ఈ స్ధానానికి చైనా కూడా ఒక కారణం. మన ఔషధ ఉత్పత్తులకు అవసరమైన ముడి సరకుల్లో చైనా నుంచి 60నుంచి 70శాతం వరకు దిగుమతి చేసుకుంటున్నాము. మిగతా దేశాలతో పోలిస్తే అవి చౌక గనుకనే ఆ దిగుమతులు అన్నది గమనించాలి. అందువలన గొప్పలు చెప్పేవారు ఇంటా బయటా నిజంగా నరేంద్రమోడీ పరువు పెంచాలనుకుంటున్నారా తుంచాలనుకుంటున్నారో ఆలోచించుకుంటే మంచిది. ఈ వాస్తవాలను గమనంలో ఉంచుకుంటే నరేంద్రమోడీ గారికి గౌరవం, మర్యాద మిగులుతాయి.ప్రతిపక్షాలు అవకాశాల కోసం ఎదురు చూస్తుంటాయి. భక్తులే వాటిని సమర్పించుకుంటుంటే ?

మన గతం ఘనమైనదా కాదా ? దాన్ని అంగీకరిస్తారా లేదా ? గతం, వర్తమానం దేనిలో అయినా ఘనమైనవే కాదు, హీనమైనవి కూడా ఉంటాయి. కులాల కుంపట్లు, ప్రపంచంలో ఎక్కడా లేని అంటరాని తనం వంటివి ఎన్నో ! రెండోవాటిని ఎప్పటికప్పుడు వదిలించుకోకపోతే ఘనత పాతాళానికి పోతుంది.మత సామరస్యం, భిన్నత్వంలో ఏకత్వంలో ఏకత్వంలో భిన్న భావజాలాలను సహించటంలో మన గతం ఘనమైనదే అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఆ పరిస్ధితి ఉందా ? ప్రపంచంలో ఫాసిస్టు శక్తుల చరిత్రను చూసినపుడు ఊహాజనిత లేదా కల్పితమైన వాటిని రాబట్టేందుకు ప్రయత్నించటం, విభజన తీసుకురావటం, ఆధారాలు లేని వాటిని కీర్తించటం, లేనిగొప్పలు వర్తింప చేయటం, వైఫల్యాలకు కొందరిని బూచిగా చూపటం, వ్యక్తుల మీద కేంద్రీకరించటం ఒక లక్షణం.


కరోనా వాక్సిన్‌ మన దేశంలో తయారు చేసినా మరో దేశంలో రూపొందించినా అది శాస్త్రీయ ప్రాతిపదికన తయారు చేస్తున్నది తప్ప మాయలు మంత్రాలతో కాదు. వేదాల్లో అన్నీ ఉన్నాయష అని గతంలో చెబితే ఇప్పుడు ఆవు మూత్రం-పేడలో లేనిదేమీ లేదు అని చెప్పటాన్ని చూస్తున్నాము. మానవ జాతి చరిత్రలో కనీవినీ ఎరుగని కరోనా మహమ్మారి ముంచుకువచ్చినా దాన్నుంచి రక్షించేందుకు వాటినేవీ బయటకు తీయలేదంటే ఉన్నాయని చెబుతున్నవారినేమనాలి ? నిజంగా అవి ఉండీ ఉపయోగం ఏముందీ !


ఊహలను వాస్తవాలుగా సాక్షాత్తూ నరేంద్రమోడీయే చెప్పటాన్ని చూశాము.వినాయకుడికి ప్లాస్టిక్‌ సర్జరీ చేసి ఏనుగుతల అంటించటం,కృత్రిమ గర్భం ద్వారా కర్ణుడిని కనటం వేల సంవత్సరాల క్రితమే ఉందని నరేంద్రమోడీయే సెలవిచ్చారు. గురుత్వాకర్షణ, అణు సిద్దాంతం అన్నీ పాతవే, మనవే అని చెప్పిన తీరు చూశాము. ఇన్ని చెప్పిన వారు ఆవు మూత్రంలో ఏమున్నాయో తెలుసుకొనేందుకు పరిశోధనలు జరపమని పెద్ద మొత్తంలో నిధులు కేటాయించటాన్ని ఏమనాలి. వేదాల్లో, సంస్కృత గ్రంధాల్లో అన్నింటి గురించీ చెప్పారు గానీ ఆవు మూత్రంలో ఏమున్నాయో చెప్పలేదా ! పోనీ ఆవు మూత్రం నుంచి కరోనా వాక్సిన్నూ రూపొందించలేదూ ?

ప్రపంచమంతా కరోనా కల్లోలం గురించి ఆందోళన పడుతుంటే బిజెపి, ఇతర కాషాయ పెద్దలు చెప్పిందేమిటి ? గతంలో ఆవు మూత్రం తాగితే క్యాన్సరే మాయం అవుతుందన్నారు, తాజాగా దాన్ని కరోనా వైరస్‌కు ఆపాదించారు. దీపాలు వెలిగిస్తే వైరస్‌ భస్మం అవుతుందన్నారు. జనం అవన్నీ మరచిపోయారని కాబోలు ఇప్పుడు తమ నరేంద్రమోడీయే దగ్గరుండి వాక్సిన్‌ తయారు చేయిస్తే ఓర్చుకోలేకపోతున్నారని ఎదురుదాడికి దిగారు. ” ఆర్ధికంగా, వైద్యపరంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాస్కులు, శానిటైజర్లు వాడని హిందూ వ్యతిరేక మతాల మధ్య భారత్‌ కరోనా భరతం పట్టిందని, రెండు టీకాలు కనిపెట్టిందని ” తిప్పుతున్న పోస్టులో మతోన్మాదాన్ని ఎక్కించటం తప్ప మరొకటి కాదు. ఇప్పటి వరకు అనుమతించిన రెండింటిలో భారత్‌ బయోటెక్‌ వాక్సిన్‌ మాత్రమే మనది. మన దేశంలో సీరం సంస్ధ తయారు చేస్తున్న కోవిషీల్డ్‌ బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ-ఆస్ట్రజెనికా తయారు చేసిందనే కనీస పరిజ్ఞానం కూడా కొరవడిన పోస్టు అది.


ముస్లిం మత పెద్దలు కూడా తక్కువ తినలేదు. ఐదుసార్లు కడుక్కుంటే కరోనా అంటుకోదన్నారు. మసీదులను మూసివేస్తే దేవుడికి ఆగ్రహం వస్తుందన్నారు.మహిళల చెడునడత కారణంగా దేవుడికి కోపం వచ్చి కరోనా రూపంలో శిక్షిస్తున్నాడన్నారు. కమ్యూనిస్టు వ్యతిరేకులు చైనా వారే వైరస్‌ను ప్రపంచం మీదకు వదిలారని చెప్పారు.మనుషుల బుర్రలను నియంత్రించేందుకు యూదులు కరోనా వాక్సిన్‌ ఉన్న చిప్స్‌ ద్వారా ప్రయత్నిస్తున్నారన్నారని ముస్లిం మతోన్మాదులు చెబుతున్నారు.


ఇంటా బయటా మతశాస్త్రాల బోధన – విద్యాలయాల్లో విజ్ఞానశాస్త్ర బోధన జరుగుతున్నా మూఢత్వం వదలని కారణంగా మొదటిదాని మీద ఉన్న విశ్వాసం రెండవదాని మీద లేదు. ఒక వేళ ఉంటే మోడీ వంటి పెద్దలు ఆశాస్త్రీయ, ఊహాజనిత అంశాలను ప్రచారం చేయగలరా ? ఆవు చేలో ఉంటే దూడలు గట్టున ఉంటాయా ? బిజెపి ఎంపీ, మాలెగావ్‌ పేలుళ్ల కేసు ముద్దాయి ప్రజ్ఞాసింగ్‌ ఒక టీవీలో మాట్లాడుతూ ఆవు మూత్రం కలిపినదానిని తాగితే తన రొమ్ముక్యాన్సర్‌ నయమైనట్లు చెప్పారు. పాలకులకు తాన తందాన పలికే ఆంధ్రావిశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ జి నాగేశ్వరరావు కొన్నివేల సంవత్సరాల క్రితమే కణ పరిశోధనలు జరిపారని, వంద మంది కౌరవులు ఆ సాంకేతిక పరిజ్ఞానం ద్వారానే పుట్టారని సైన్స్‌ కాంగ్రెస్‌ సభలోనే సెలవిచ్చారు. అంతటితోనే ఆగలేదు నియంత్రిత క్షిపణులంటే వేరే ఏమీ కాదు విష్ణు చక్రం అన్నారు, రావణుడు24 రకాల విమానాలను వివిధ విమానాశ్రయాలకు నడిపినట్లు చెప్పారు. రాముడు-రావణుడు ఒకే కాలం నాటి వారు రావణుడికి విమానాలు ఉంటే రాముడికి లారీలు, జీపులు కూడా ఎందుకు లేవు ? రావణుడిని చంపే రహస్యాన్ని తెలుసుకున్న రాముడి పరివారం విమానాల టెక్నాలజీ గురించి తెలుసుకోలేకపోయిందా ? బ్రహ్మ డైనోసార్లను కనుగొన్నట్లు చెబుతారు. త్రిపుర బిజెపి ముఖ్యమంత్రి విప్లవదేవ్‌ అయితే మహాభారత కాలం నాడు ఇంటర్నెట్‌ ఉండబట్టే యుద్ధంలో ఏం జరిగిందో ఎప్పటి కప్పుడు సంజయుడి ద్వారా ధృతరాష్ట్రుడు తెలుసుకోగలిగినట్లు చెప్పారు.నెమళ్లు ఎన్నడూ జతకూడవని, మగనెమలి కన్నీటితో ఆడనెమలి పునరుత్పత్తిలో భాగంగా గుడ్లు పెడుతుందని ఒక న్యాయమూర్తి సెలవిచ్చిన విషయం తెలిసిందే. పురాతన భారత్‌ను పొగిడే పేరుతో మత రాజ్యాలవరకు జనాన్ని తీసుకుపోవటమే లక్ష్యం. కాలుష్య నివారణకు యజ్ఞాల గురించి చెప్పేవారిని, ఆవు మూత్రంలో బంగారం ఉందని, లక్ష సంవత్సరాల నాడే హిందూ రుషులు అణుపరీక్షలను జరిపారని చెప్పే శాస్త్రవేత్తలను, అప్పడాలు తింటే కరోనా పోతుందని చెప్పిన వారినీ చూశాము. కరోనా దెబ్బతో అలాంటి సొల్లు కబుర్లు చెప్పేవారి నోళ్లు కొంత మేరకు మూతపడ్డాయి. అలాంటి వారికి కరోనా సోకినపుడు ఆసుపత్రుల్లో చేరి ఉపశమనం పొందారు తప్ప ఆవు మూత్రం, అప్పడాల మీద ఆధారపడలేదు.


ప్రతిదానికి ప్రధాని నరేంద్రమోడీని ఎందుకు విమర్శిస్తున్నారు అనే ప్రశ్న ముందుకు వస్తున్నది. దీనిలో రెండు రకాలు అసలు మోడీ ఏం చేసినా విమర్శించకూడదు అనే ఒక ప్రమాదకరమైన ధోరణితో కావాలని అడిగేవారు ఒక తరగతి. ఏదో చేస్తున్నారు కదా కాస్త సమయం ఇవ్వాలి కదా అప్పుడే విమర్శలెందుకు అని అడిగేవారు మరికొందరు.రెండో తరగతి కల్మషం లేని వారు. విమర్శకు పెద్ద పీట వేసేది ప్రజాస్వామ్యం. నియంతృత్వ లక్షణాల్లో భజనకు అగ్రపీఠం ఉంటుంది. అన్నీ నెహ్రూ, కాంగ్రెసే చేసింది అని కాషాయ దళాలు ఎలా విమర్శిస్తున్నాయో, వారు చేసిన తప్పిదాలను సరిచేసే పేరుతో అధికారానికి వచ్చిన నరేంద్రమోడీ, బిజెపి అంతకంటే దారుణంగా వ్యవహరించింది అనే రోజులు రావని ఎవరు చెప్పగలరు? ఆ సూచనలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని విమర్శించటమే దేశద్రోహం అయితే మొదటి ద్రోహి బిజెపినే అని చెప్పాలి. ఎవరైనా అవ్వతో వసంతమాడతారా ? ప్రయోజనం ఏముంది, అందుకే అధికారంలో ఉన్న నరేంద్రమోడీ నాయకత్వాన్ని గాక ఇతరులను విమర్శిస్తే అర్ధం ఏముంది ? ఏమైనా సరే మా మోడీని విమర్శిస్తే సహించం అంటే కుదరదు. గతంలో ఇందిరే ఇండియా – ఇండియా ఇందిర అన్న కాంగ్రెస్‌ భజన బృందం కంటే ఇప్పుడు మోడీ దళం ఎక్కువ చేస్తోంది. అది మోడీకే నష్టం కాదంటారా ? కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చినన్ని దశాబ్దాలు బిజెపికి జనం ఇవ్వరు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనా వాక్సిన్‌ జాతీయవాదం- దేశ ద్రోహం – బిజెపి విపరీత పోకడ !

05 Tuesday Jan 2021

Posted by raomk in BJP, CHINA, Communalism, Current Affairs, Health, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, RELIGION, Science, USA

≈ Leave a comment

Tags

Bjp nationalism, COVAX, vaccine controversy, Vaccine Nationalism


ఎం కోటేశ్వరరావు
అన్నీ వివాదం అవుతున్నాయి, ఛీ ఛీ, చివరికి కరోనా వాక్సిన్‌ కూడా అనుకుంటున్నారా ! అవును, ఎవరి పాత్రను వారు పోషిస్తున్నారు. వాక్సిన్‌ తయారీ తన ఆత్మనిర్భర కలను నిజం చేయటంలో శాస్త్రవేత్తల ఆతురత కనిపించిందని అని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు.
కాదేదీ కవితకనర్హం అన్నాడు శ్రీశ్రీ. అలాగే ఎదుటి వారి మీద తప్పుడు ముద్రలు వేసేందుకు కూడా అతీతంగా ఏవీ కనిపించటం లేదు. ఒక కంపెనీ వాక్సిన్‌ నీటి మాదిరి సురక్షితమైనది అని ఒకరు ఎత్తిపొడిచింది. మరో కంపెనీ వాక్సిన్‌కు 60శాతం దుష్ప్రభావాలు ఉన్నా పారాసిటమాల్‌ వేసి కనపడకుండా చేసినట్లు మేం చేయం, కేవలం వంద మంది మీదనే పరీక్షించి మా ఉత్పత్తి సురక్షితం అంటే ఎలా అన్నారు మరొకరు. ఇద్దరూ కరోనా వాక్సిన్‌ తయారు చేసే బడా కంపెనీల అధిపతులే, రోడ్డెక్కి చెప్పిన మాటలే కనుక ఒకరు సీరం సిఎండి అదర్‌ పూనావాలా అయితే మరొకరు భారత్‌ బయోటెక్‌ అధినేత కృష్ణ ఎల్ల అని చెప్పుకోవటానికి మనం సిగ్గుపడనవసరం లేదు. ఏమిటీ లొల్లి, ఎవరి మాట నమ్మాలి, ఎవరిని అనుమానించాలి ? కేంద్ర ప్రభుత్వం రెండు వాక్సిన్లను అత్యవసర పరిస్ధితిలో వినియోగానికి అనుమతి ఇచ్చింది. వాటిలో ఒకదాని ప్రభావం, పరీక్షా ఫలితాల గురించి ప్రశ్నించిన వారి మీద దాడి చేస్తున్నారు.


ఔషధం, వాక్సిన్‌ ఏదైనా సరే జీవుల ప్రాణాలను కాపాడాలి తప్ప తీయకూడదు. రోగాలు, మహమ్మారుల నుంచి కూడా లాభాలు పిండుకోవటమే పరమార్ధంగా ఉండకూడదు. ఏ కంపెనీ అయినా పూర్తి వివరాలు ప్రకటించనపుడు అనేక మందికి అనుమానాలు కలగటం, వాటిని బహిరంగంగా వ్యక్తం చేయటం సహజం. అది కూడా తప్పేనా ? ఏమిటీ ఉన్మాదం ! భారత్‌ బయోటెక్‌ కంపెనీ ఉత్పత్తి వలన ప్రయోజనం-హానీ రెండు లేవని ప్రత్యర్ధి కంపెనీ సీరం సంస్ధ ప్రతినిధి చెప్పారు. అది ఆరోపణో, నిజమో జనానికి తెలియదు. దాని మీద స్పందించిన భారత్‌ బయోటెక్‌ అధిపతి కృష్ణ తన ప్రత్యర్ధి కంపెనీ ఉత్పత్తి 60శాతం దుష్ప్రభావాలు కలిగిస్తుందని చెబుతున్నారు. నిజానికి జనం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించే వారు ఇలాంటి సమాచారాన్ని ఇప్పటి వరకు ఎందుకు దాచినట్లు ? తన ఉత్పత్తి మీద విమర్శచేసిన తరువాతనే స్పందించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. రెండు వాక్సిన్ల గురించి కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. దొంగల మధ్య పంపిణీలో తేడాలు వచ్చినపుడు దొంగతనం విషయం బయటకు వచ్చినట్లుగా లేదీ వ్యవహారం !


గర్భవిచ్చిత్తి జరిగిన మానవ పిండాల నుంచి తీసిన కణాలతో తయారు చేసిన వాక్సిన్లను మన క్రైస్తవులు వేసుకోకూడదని కొందరు, పంది మాంసం నుంచి తీసి కణాలతో చేసిన వాక్సిన్లు ముస్లింలు వేసుకోకూడదని మరికొందరు టీకా తాత్పర్యాలు చెబుతున్నారు. వీరందరికంటే ముందే వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అని చెప్పిన వారు ఆవు మూత్రం తాగి, ఆవు పేడ పూసుకుంటే కరోనా ప్రభావం ఉండదని, దీపాలు వెలిగిస్తే వైరస్‌ నశిస్తుందని చెప్పిన విషయాలను గుర్తుకు తెచ్చుకోవాలి. గోమూత్ర సేవనం సర్వరోగ నివారిణి అని ఊరందరికీ చెప్పిన పెద్దలు తమవద్దకు వచ్చే సరికి ఆ పని చేయకుండా బతుకు జీవుడా అంటూ కరోనా సమయంలో ఆసుపత్రుల్లో చేరుతున్న విషయం తెలిసిందే. అదే మాదిరి క్రైస్తవ, ఇస్లామిక్‌ మత పెద్దలు కూడా కొన్ని ప్రత్యేక సందర్భాలలో వాక్సిన్లు తీసుకోవచ్చని ముక్తాయింపులు పలికారు. మతాలవారు చెప్పారని వాక్సిన్లు తీసుకోకుండా జనం ఆగుతారా ?


మన దేశంలో కరోనా వాక్సిన్‌ ఎందుకు రాజకీయ వివాదంగా మారింది ? ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం మరియు ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ను మన దేశంలోని సీరం ఇనిస్టిట్యూట్‌ తయారు చేసేందుకు అనుమతులు పొందింది. మరోవైపు దేశీయంగా హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న భారతబయోటెక్స్‌ కేంద్ర ప్రభుత్వ సంస్ధ ఐసిఎంఆర్‌ మరియు వైరాలజీ జాతీయ సంస్ధతో కలసి రూపొందించి కోవాగ్జిన్‌ పేరుతో వాక్సిన్‌ ప్రయోగాలు జరుపుతున్నది. కోవిషీల్డ్‌ మూడు దశల ప్రయోగాలు పూర్తి చేసుకుంది. కోవాగ్జిన్‌ మూడవ దశ ప్రయోగాలు పూర్తయినట్లు చెబుతున్నా ఇంకా ఫలితాలు ఇంకా వెలువడలేదు. అలాంటి వాక్సిన్‌ వినియోగానికి ముందుగానే అనుమతివ్వటం ఏమిటన్న ప్రశ్నను కొందరు లేవనెత్తారు. ఇది వివాదాస్పదమైంది. దీని మీద సమర్ధనలూ, విమర్శలూ వెలువడుతున్నాయి. జనంలో గందరగోళం, వాక్సిన్ల సామర్ధ్యం మీద అనుమానాలు తలెత్తాయి. కొందరు జాతీయవాదాన్ని ముందుకు తెచ్చేందుకు పూనుకున్నారు.ఇదొక అవాంఛనీయ పరిణామం. వాక్సిన్ల తయారీ కంపెనీల మధ్య వాణిజ్య పోరుగా రాబోయే రోజుల్లో బయటపడనుందా ?

కోవాగ్జిన్‌ వాక్సిన్‌ ప్రత్యామ్నాం అని పేర్కొనటం,వినియోగానికి సంబంధించి అనేక పరిమితులను పేర్కొని అనుమతులు ఇచ్చారు. ప్రత్యామ్నాయం అంటే ఏదీ దొరకనపుడు అనే అర్ధం కూడా ఉంది. అందువలన ఈ రెండు వాక్సిన్లలో దేనిని ఎవరు వేసుకోవాలి? నిర్ణయించేది ఎవరు ? మూడవ దశ ప్రయోగాల ఫలితాలు పూర్తిగాక ముందే కోవాగ్జిన్‌కు అనుమతులు ఎలా ఇచ్చారన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తొలుత మన సైనికుల పరాక్రమాన్ని ఇప్పుడు వాక్సిన్‌ తయారీని శంకిస్తున్నారంటూ కేంద్ర మంత్రి హర్దేవ్‌సింగ్‌ పూరీ, ఇతర బిజెపి నేతలు ప్రతిపక్షాలు, ఇతరుల మీద ఎదురుదాడికి దిగటం విస్మయం కలిగిస్తోంది. అసలు ఆ కంపెనీ తరఫున వీరు వకాల్తా పుచ్చుకోవటం ఏమిటి ? ప్రజల ప్రాణాలతో చెలగాటాలాడతారా ? కోవాగ్జిన్‌ సామర్ధ్యం గురించి ఎవరూ అనుమానాలు వ్యక్తం చేయలేదు, వివరాలు వెల్లడించకుండా నమ్మటం ఎలా అన్నదే అసలు సమస్య.


కోవాగ్జిన్‌ గతేడాది ఆగస్టు 15నాటికే అది సిద్దం అవుతుందని స్వయంగా ఐసిఎంఆర్‌ లేఖలు రాసింది. ప్రధాని నరేంద్రమోడీ స్వాతంత్య్రదినోత్సవం రోజున ప్రకటన చేసేందుకు సన్నాహాలు చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఆ గడువు పోయింది, రిపబ్లిక్‌ దినోత్సవం లోపు అయినా పరిశోధనా ఫలితాలు వస్తాయా అన్న అనుమానాలు ఉన్న సమయంలో రాకముందే ఏకంగా ముందస్తు అనుమతి ఇచ్చేశారు. కొంత మంది చెబుతున్నట్లు ఇప్పటికే దాదాపు 7 కోట్ల డోసులు తయారు చేసిన సీరం సంస్ధ నుంచి కొనుగోలు బేరసారాల వత్తిడిలో భాగంగా కోవాగ్జిన్‌ పరీక్షలు పూర్తి కాకుండానే అనుమతులు ఇచ్చారా అన్న కోణం కూడా ఉంది. ఒకవేళ అదే వాస్తవం అయితే అలాంటి విషయాలు దాగవు.


కోవాగ్జిన్‌పై అనుమానాలు వ్యక్తం చేయటమే దేశ ద్రోహం అన్నట్లుగా వ్యాఖ్యానించి బిజెపి వాక్సిన్‌ జాతీయవాదాన్ని ముందుకు తెచ్చింది. టీవీ ఛానల్స్‌ పెద్దలు కూడా ముందూ వెనుకా చూడకుండా నిర్దారణ చేసుకోకుండా తప్పుడు వార్తలను ఎలా ప్రచారం చేస్తున్నారో కూడా ఈ సందర్భంగా వెల్లడైంది. ఎవరో ఒక చిన్న విలేకరి పొరపాటు లేదా అత్యుత్సాహం ప్రదర్శించాడంటే అర్ధం చేసుకోవచ్చు. ఇండియా టీవీ అధిపతి, ప్రధాన సంపాదకుడు అయిన రజత్‌ శర్మ ఏకంగా కోవాగ్జిన్‌ టీకాను ముందుగానే 190 దేశాలు ఆర్డర్‌ ఇచ్చాయని సెలవిచ్చారు. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాలను జోడించి చెప్పే వారి మాదిరి ఈ పెద్ద మనిషి ఏం మాట్లాడారో చూడండి.” మన దేశంలో వృద్ది చేసిన ఈ వాక్సిన్‌ బాగా పని చేస్తుంది, ధర తక్కువ, నిల్వచేయటం సులభం. ఎందుకంటే నరేంద్రమోడీ విధానాలు మన శ్స్తావేత్తల నైపుణ్యం దీనికి కారణం. వాక్సిన్‌ గురించి అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారు ముందుగానే 190 దేశాలు దీని కొనుగోలుకు ఆర్డర్లు పెట్టాయని తెలుసుకోవాలి ” అని చెప్పారు. ఇదే విషయాన్ని ఆయన ట్వీట్‌ చేశారు. దాన్ని బిజెపి మరుగుజ్జులు పెద్ద ఎత్తున రీ ట్వీట్‌ చేశారు.


తమ ఉత్పత్తి కేంద్రాన్ని 70దేశాల ప్రతినిధులు సందర్శించారని చెప్పారు తప్ప ఆర్డర్లు బుక్‌ చేశారని భారత్‌ బయోటెక్‌ ఎండీ కృష్ణ ఎల్లా ఎక్కడా చెప్పలేదు. అలా సందర్శించిన వారు ఆర్డర్లు పెట్టినట్లు వార్తలు కూడా లేవు. మరి రజత్‌ శర్మగారికి 190 దేశాల సమాచారం ఎలా తెలిసింది? అనేక మంది సామాన్యులు భారత్‌ బయోటెక్‌ తయారీ కోవాగ్జిన్‌ వాక్సిన్‌, ప్రపంచ ఆరోగ్య సంస్ధ కార్యక్రమమైన కోవాక్స్‌తో గందరగోళపడుతున్నారు.ప్రపంచ దేశాలన్నింటికీ చౌకగా వాక్సిన్‌ అందించేందుకు ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. దానిలో 190 దేశాలు పాలుపంచుకుంటున్నాయని, భాగస్వామ్య దేశాలన్నింటికీ రెండువందల కోట్ల డోసుల వాక్సిన్‌ అందచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు డిసెంబరు 19న ప్రకటించారు. వీటిలో అనేక దేశాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్ధ నిర్దారించిన వాక్సిన్లన్నీ ఉన్నాయి. ఇరవై కోట్ల డోసులు అందించేందుకు వాక్సిన్‌ అలయన్స్‌ గవీ, ఇతర సంస్ధలు ఒప్పందం చేసుకున్నాయి. వివిధ దేశాలకు చెందిన పది వాక్సిన్‌లను ఉటంకిస్తూ అవి ఏ దశలో ఉన్నాయో కూడా ప్రకటనలో తెలిపారు. చిత్రం ఏమిటంటే వీటిలో భారత బయోటెక్స్‌ కోవాగ్జిన్‌ లేదు. త్వరలో పరీక్షలు పూర్తి చేసుకొని ప్రపంచ ఆరోగ్య సంస్ధ అనుమతి పొంది ఇది కూడా చేరుతుందా లేదా అన్నది వేరే విషయం. ఇప్పటికైతే ఎగుమతి వార్తలు లేవు.

కోవాక్స్‌ కార్యక్రమం ప్రకారం దానిలో భాగస్వామ్య దేశాలకు ఆ కార్యక్రమం కింద పంపిణీ చేసే వాక్సిన్‌లో ఆయా దేశాల జనాభాను బట్టి 20శాతం డోసులను వారికి అందచేస్తారు. వాటిని ఆయా దేశాలు ఎలా ఉపయోగించుకుంటాయి, ఎవరికైనా అందచేస్తాయా అన్నది వారిష్టం. ఉదాహరణకు చైనాలో కరోనా కేసులు లేని కారణంగా చైనా రూపొందించిన వాక్సిన్లను బ్రెజిల్‌లో ఉన్న రోగుల మీద ప్రయోగాలు చేశారు. కోవాక్స్‌ కార్యక్రమంలో చైనా భాగస్వామి కనుక దానికి వచ్చే వాటాను ఇతర దేశాలకు అందచేయవచ్చు. అమెరికా దానిలో భాగం కాదు కనుక దానికి వాక్సిన్ల కోటా ఉండదు. అదే విధంగా ఐక్యరాజ్యసమితి నిర్వచనం ప్రకారం పేద దేశాలకు సబ్సిడీ ధరలకు వాక్సిన్‌ అందచేస్తారు. బిల్‌గేట్స్‌ కూడా ఈ పధకంలో భాగస్వామి కనుక తనకు వచ్చే వాక్సిన్‌ తన సంస్ధ ద్వారా ఎవరికైనా అందచేయవచ్చు.


సమాజవాది పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌ తెలివి తక్కువ ప్రకటన చేసి శాస్త్రవేత్తలను అవమానించటం తన ఉద్దేశ్యం కాదంటూ తరువాత నష్ట నివారణ చర్యలకు పూనుకున్నారు. మన దేశంలో తయారయ్యే వాక్సిన్‌ బిజెపిదని దాన్ని తాను వేసుకోనని అఖిలేష్‌ వ్యాఖ్యానించారు. నిజానికి సర్వరోగనివాణి బిజెపి వాక్సిన్‌ లేదా ఔషధం ఆవు పేడ లేదా మూత్రం అన్నది అందరికీ తెలిసిందే . ఆవు మూత్ర సేవన కార్యక్రమాల సమయంలో ఆ ప్రకటన చేసి ఉంటే అర్ధం ఉండేది. ఆవు మూత్రం, పేడ కరోనాను నివారిస్తుందని చెప్పిన బిజెపి పెద్దలు అనేక చోట్ల వాటి సేవన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇలాంటి చర్యల ద్వారా మన వైద్యులు, శాస్త్రవేత్తలను అవమానించిందీ, ఇప్పటికీ అవమానిస్తున్నదీ కాషాయ దళాలే.
భారత బయోటెక్‌లో తయారు చేస్తున్నది ఆవు (మూత్రపు) శాస్త్రవేత్తలు కాదు. దాని మూడవ దశ ప్రయోగ ఫలితాలు ఇంకా రాలేదు కనుక వేసుకోను అన్నా అదొకరకం. ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి జిల్లాలోని ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గాల ఎంఎల్‌సి ఎన్నికల్లో బిజెపిని ఓడించి ఊపుమీద ఉండటం, వాక్సిన్‌ తయారీని తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు భ్రమ కల్పించేందుకు నరేంద్రమోడీ పూనా, హైదరాబాద్‌లోని ఆ సంస్దలను సందర్శించిన నేపధ్యంలో సమాజవాద పార్టీ నేత బిజెపి వ్యతిరేకతను వ్యక్తం చేసేందుకు ఆ వ్యాఖ్య పనికి వస్తుందని భావించి ఉండవచ్చేమోగాని, శాస్త్రవేత్తలను కించపరచాలనే ఉద్దేశ్యం ఉంటుందని చెప్పలేము. అఖిలేష్‌ యాదవ్‌ తెలివి తక్కువ ప్రకటన చేస్తే బిజెపి నేతలు తక్కువేమీ తినలేదు. వివరాలు లేని వాక్సిన్‌ సామర్ద్యాన్ని ప్రశ్నించటం దేశద్రోహం అనేంతవరకు వెళ్లారు.


వాక్సిన్లను స్వదేశీ-విదేశీ అని వర్ణించటం అర్ధంలేని విషయం. విదేశాల్లో రూపొందించిన వాక్సిన్లు, ఔషధాలను మన దేశంలోని సంస్ధలు తయారు చేయటమే కాదు, విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి.ఇదొక వ్యాపారం. భారత్‌ బయోటెక్‌ సంస్ధకు ప్రపంచంలో అతి పెద్ద వాక్సిన్‌ వ్యాపారి బిల్‌ గేట్స్‌కు, అంతర్జాతీయ ఫార్మా లాబీకి ఉన్న వ్యాపార లావాదేవీల వివరాలు జనానికి తెలియకపోవచ్చుగానీ వారి సంబంధాలు బహిర్గతమే. ఏదో ఒక రూపంలో ఆ సంస్ధ బిల్‌గేట్స్‌, ఇతర సంస్ధల నుంచి నిధులు పొందింది. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం భారత్‌ బయోటెక్‌ తయారు చేస్తున్న డయేరియాకు ఉపయోగించే రోటోవాక్‌ వాక్సిన్‌ సామర్ధ్యం 56శాతమే అని, దాని మూడవ దశ ప్రయోగ ఫలితాలు ఇప్పటికీ అందుబాటులో లేవనే విమర్శలు ఉన్నాయి. ఈ వాక్సిన్‌ కొనుగోలుకు ఆ సంస్దతో బిల్‌ గేట్స్‌ ఒప్పందం ఉంది. దాన్ని ప్రభుత్వాలకు అంటగట్టి ప్రజారోగ్య కార్యమ్రాలలో వినియోగిస్తున్నారనే విమర్శలున్నాయి. బిల్‌ గేట్స్‌ ఫౌండేషన్‌, అంతర్జాతీయ వాక్సిన్‌ లాబీ కంపెనీలు సరఫరా చేస్తున్న నాసిరకం లేదా ప్రభావం లేని వాక్సిన్ల కారణంగా ప్రపంచ వ్యాపితంగా 3.8కోట్ల మంది శిశువులు పుట్టక ముందే మరణించారనే విమర్శలు ఉన్నాయి.మన దేశంతో సహా అనేక దేశాలలో వాక్సిన్ల దుష్ప్రభావాలకు తయారీ కంపెనీల నుంచి పరిహారాన్ని కోరే చట్టాలు లేవు. ఈ నేపధ్యంలోనే కోట్లాది మందికి వేయదలచిన వాక్సిన్‌ గురించి భారత్‌ బయోటెక్‌ వివరాలు వెల్లడి చేయక ముందే అనుమతి ఏమిటన్న ప్రశ్నలు తలెత్తాయి.

వాక్సిన్‌పై తలెత్తిన వివాదం ”సమాచార మహమ్మారి ” ని మరింత ఎక్కువ చేయనుందనే అభిప్రాయాలు వెల్లడయ్యాయి. ఎన్ని మహమ్మారులను అయినా ఎదుర్కొనగలంగానీ అంతకంటే వేగంగా తప్పుడు, నకిలీ వార్తలను వ్యాపింప చేసే సమాచార మహమ్మారి వైరస్‌ ఎంతో ప్రమాదకరమని ఆ రంగంలోని పెద్దలు చెబుతున్నారు. దీని గురించి ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్ధ హెచ్చరించింది. ఇప్పుడు కరోనా-వాక్సిన్‌ కూడా వివాదం అయింది కనుక దేన్నీ గుడ్డిగా నమ్మవద్దని సవినయమనవి. చివరిగా ఒక విషయం మరచి పోకూడదు. కరోనా వైరస్‌ గురించి తెలిసిన వెంటనే ప్రపంచంలోని అనేక మంది దాని నివారణకు వాక్సిన్‌ తయారీకి పూనుకున్నారు. మన దేశంలో తొలి వైరస్‌ కేసు బయటపడి, లాక్‌డౌన్‌ విధించిన రెండు నెలల తరువాత కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర కార్యక్రమం ప్రకటించింది. అది ఆర్ధిక ఉద్దీపన కార్యక్రమం అని అందరికీ తెలుసు. ఇప్పుడు వాక్సిన్‌ తయారీ ఆ కార్యక్రమ కల అని దాన్ని శాస్త్రవేత్తలు నెరవేర్చారని ప్రధాని చెప్పటంలో నిజాయితీ ఎంతో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి.అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు మన వాక్సిన్‌ సామర్ధ్యాన్ని ప్రశ్నించటం దేశవ్యతిరేక వ్యాఖ్యలు తప్ప మరొకటి కాదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్దన్‌, మరొక మంత్రి హరదేవ్‌ సింగ్‌ పూరీ వ్యాఖ్యానించారు. కలికాలం, వైపరీత్యం గాకపోతే బిజెపికి నచ్చని వారందరికీ ఈ ముద్ర తగిలిస్తారా ! ఏమిటీ అనారోగ్యపు వ్యాఖ్యలు !!

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d