• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: RELIGION

కమ్యూనిస్టు చైనా-కాథలిక్‌ మతం మధ్య చారిత్రాత్మక ఒప్పందం !

27 Thursday Sep 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

agreement between china and vatican, china and vatican, Chinese Catholics, historic agreement between china and vatican, Pope Francis

Image result for historic agreement between china and vatican

ఎం కోటేశ్వరరావు

ఒకవైపు వాటికన్‌తో చర్చలు మరోవైపు బుల్‌డోజర్లతో చైనా క్రైస్తవాన్ని అదుపు చేయాలని చూస్తున్నదనే శీర్షికతో న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక రెచ్చగొట్టే ఒక విశ్లేషణ ప్రచురించింది. చైనాలో బిషప్పుల నియామకం గురించి అక్కడి ప్రభుత్వం-వాటికన్‌ చర్చి మధ్య సెప్టెంబరు 22న కుదిరిన తాత్కాలిక ఒప్పందం గురించి ప్రపంచ మీడియాలో, క్రైస్తవ మతంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దానిలో భాగమే ఇది. దేవుడు లేడని నమ్మే కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వంతో వున్నట్లు విశ్వసించే వాటికన్‌ ఒప్పందం చేసుకోవటం ఏమిటని అటు కమ్యూనిస్టులుగా వున్నవారు, ఇటు మతాన్ని పాటించే వారు దిగమింగలేకుండా వున్నారు. ఇదే సమయంలో ఆమోదించిన వారే ఎక్కువ అనేందుకు అసలు ఆ ఒప్పందం కుదరటమే నిదర్శనం. దాని ప్రకారం చైనాలో వాటికన్‌తో నిమిత్తం లేకుండా పని చేస్తున్న బిషప్పులను పోప్‌ ఆమోదిస్తారు. చైనా ప్రభుత్వ ఆమోదం లేని అనధికార బిషప్పులు కొందరు రాజీనామా చేస్తారు. ఇరు పక్షాలు కలసి రాబోయే రోజుల్లో కొత్త బిషప్పులను నియమిస్తాయి.

కొన్ని చోట్ల క్రైస్తవం కావచ్చు, మరికొన్ని చోట్ల ఇస్లాం, ఇతర మతాలు కావచ్చు. కాలక్రమంలో అంతరించాల్సిన మతాన్ని నిషేధాలు, అణచివేతల ద్వారా తెల్లవారే సరికి పరిష్కరించటం జరిగేది కాదు. సోషలిస్టు, కమ్యూనిస్టు వున్నత మానవాళి అవతరించినపుడే అది సాధ్యం. ఈ నేపధ్యంలో మతంతో సంబంధాలు అనేవి ప్రపంచ సోషలిస్టు, కమ్యూనిస్టు వుద్యమానికి ఎదురైన ఒక వాస్తవిక, పరిష్కారం కావాల్సిన సవాలు. దీనిని కమ్యూనిస్టు వుద్యమం విస్మరించజాలదు. సర్వేజనా సుఖినో భవంతు అన్న ఆశయాన్ని కమ్యూనిజం పుట్టక ముందే ప్రకటించారు. అది అమలు జరగలేదు గనుక ప్రకటించిన వారిని తప్పు పడతామా? సోషలిస్టు భావన కూడా అదే అయినప్పటికీ, అమలుకు ఒక కార్యాచరణను ప్రకటించటమే దాని ప్రత్యేకత. అందువలన దాని అమలులో తలెత్తే సమస్యలను పరిష్కరించటం వాస్తవికత.

ప్రపంచంలో అనేక చోట్ల మతాన్ని ఒక ఆయుధంగా చేసుకొని తమ ప్రయోజనాలను నెరవేర్చుకొనేందుకు దోపిడీ శక్తులు తీవ్రంగా ప్రయత్నించటాన్ని మనం చూస్తున్నాం. దానిలో భాగమే మతవిద్వేషాలను రెచ్చగొట్టటం. చైనా-వాటికన్‌ మధ్య ఒక ఒప్పందం కుదిరింది అంటే అర్ధం అక్కడ మత సమస్య పరిష్కారమైందని కాదు. సోషలిస్టు వ్యవస్ద నిర్మాణబాటలో ఎదురయ్యే అనేక ఆటంకాలను తొలగించుకుంటూ పోవటం తప్ప దగ్గరదారి లేదు.దానిలో భాగమే ఇది అని చెప్పవచ్చు. ఇది సరైనదా కాదా అన్న విషయం మీద ఇప్పటికిప్పుడు తీర్పు చెప్పటం సాధ్యం కాదు. సోషలిస్టు వ్యవస్ధను వ్యతిరేకించేందుకు, దెబ్బతీసేందుకు ఎవరు ప్రయత్నించినా కమ్యూనిస్టులు అలాంటి శక్తులను సహించరు. చైనా కమ్యూనిస్టు పార్టీ అందుకు మినహాయింపు అనుకోజాలం.

చైనాలో క్రైస్తవం మైనారిటీ మతం. ఎంత మంది దాన్ని అవలంభిస్తున్నారన్నది స్పష్టంగా తెలియదు. మీడియాలో వచ్చే అంకెలు పొంతన లేకుండా వున్నాయి. ఒప్పందం గురించి సహజంగానే ఎవరికి వారు ఏమి చెప్పుకున్నప్పటికీ చైనాలోని చర్చ్‌లపై వాటికన్‌ పోప్‌ అధికారాన్ని పరిమితంగానే అయినా కమ్యూనిస్టు ప్రభుత్వం గుర్తించటం, మత వ్యవహారాలలో ప్రభుత్వాల పాత్రను అంగీకరించం అనే వాటికన్‌ తన వైఖరిని సడలించుకోవటం ఒక చారిత్రక ముందడుగు. క్రైస్తవంతో సహా ఏమతమైనా సామాన్యుల బాధలు, గాధల పట్ల కడవల కొద్దీ కన్నీరు కార్చింది తప్ప వాటిని తొలగించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోరాడేవారిని నిర్వీర్యం చేసేందుకు మతాన్ని ఒక మత్తు మందుగా పాలకవర్గాలు ప్రయోగించాయి. ప్రధమ శ్రామికవర్గ రాజ్యం సోవియట్‌లో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణాన్ని, ప్రపంచం మొత్తంగా కమ్యూనిస్టు భావజాలాన్ని క్రైస్తవం వ్యతిరేకించింది. సామ్రాజ్యవాదంతో చేతులు కలిపింది. అందువల్లనే సోవియట్‌ యూనియన్‌ వునికిలో వున్నంత కాలం వాటికన్‌తో అధికారిక సంబంధాలు లేవు. అదొక అపరిష్కృత సమస్యగానే వుండిపోయింది.

క్రైస్తవంలో తలెత్తిన సంస్కరణ, ఇతర వుద్యమాల కారణంగా అనేక మొత్తం మీద ఏసును ప్రభువుగా గుర్తిస్తూనే మత కర్మకాండల విషయంలో భిన్న ధోరణులు, పలు చర్చి సమూహాలు వునికిలోకి వచ్చాయి. వాటికి పాలకవర్గాల మద్దతు లభించింది తప్ప ఎక్కడా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. ఎవరికి ఇష్టమైన చర్చిని వారు అనుసరించారు. దేవుడి వునికిని అంగీకరించని, రాజ్యానికి మతానికి సంబంధం వుండకూడదని కోరుకొనే కమ్యూనిస్టులు పాలకులుగా వచ్చిన తరువాత సరికొత్త సమస్య తలెత్తింది. అప్పటి వరకు తమలో తాము ఎంతగా కుమ్ములాడుకున్నప్పటికీ కమ్యూనిజం తమ వునికినే వ్యతిరేకిస్తున్న కారణంగా ముందుగా దాన్ని వ్యతిరేకించాలంటూ అన్ని రకాల చర్చ్‌లు ఏకమయ్యాయి. వాటి కుట్రలను ఎదుర్కొంటూనే సోషలిస్టు దేశాలన్నీ తమ పౌరులకు మత స్వేచ్చను ఇచ్చాయి. సోషలిస్టు వ్యవస్ధను కూల్చేందుకు ప్రయత్నించే ఇతర శక్తులతో సమంగా మతశక్తులనూ చూశాయి, చూస్తున్నాయి. కమ్యూనిస్టులు బిషప్పుల నియామకంలో వాటికన్‌ ఏకపక్ష పెత్తనం చైనా గడ్డమీద చెల్లదని ప్రభుత్వం రుజువు చేసిందని, రహస్య కార్యకలాపాలను నిర్వహించే అనధికార చర్చ్‌లను మూసివేయటానికి తోడ్పడుతుందని మరోవాదన.ప్రభుత్వాన్ని వ్యతిరేకించే కొందరు బిషప్పులను బాధ్యతల నుంచి తొలగించేందుకు వీలు కలుగుతుందని చెబుతున్నారు. ఈ ఒప్పందం చేసుకున్నప్పటికీ దానికి చైనా నాయకత్వం పెద్ద ప్రచారం కల్పించదలచలేదు, ఒక సాదాసీదా వ్యవహారంగానే చూడాలని నిర్ణయించినట్లు అధికార మీడియాలో క్లుప్తంగా వార్తలు ఇచ్చిన తీరే నిదర్శనం.

కొన్ని నెలల క్రితం చైనా లక్షణాలతో కూడిన మత కార్యకలాపాలు వుండాలనే ప్రచారానికి చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ శ్రీకారం చుట్టారు. చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్దను నిర్మించాలనే లక్ష్యం కలిగిన చైనా రాజ్యాంగానికి కట్టుబడే అన్ని మతకార్యకలాపాలుండాలని నిబంధనలు చెబుతున్నాయి.దానికి భిన్న మైన వైఖరి వ్యక్తమైన చోట్ల సరి చేసేందుకు, చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు వెనుకాడటం లేదు. దీన్ని వ్యతిరేకించే శక్తులు వాటిని చిలవలు పలవలుగా పెంచి ప్రచారం చేస్తున్నాయి. ప్రత్యేకించి ఇలాంటి ఒప్పందం కుదుర్చుకొనేందుకు సముఖత వ్యక్తమైనప్పటి నుంచీ గత మూడు సంవత్సరాలుగా పని గట్టుకొని ఈ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ముస్లింలను లక్షలాది మందిని శిబిరాలలోకి చేర్చి బలవంతంగా పందిమాంసం తినిపిస్తున్నారని, సాంప్రదాయ దుస్తులు వేసుకోరాదని, బురఖాలు, గడ్డాలను తీసివేయాలని వత్తిడి చేస్తున్నారని, క్రైస్తవ చర్చ్‌లను కూల్చివేస్తున్నారని, శిలువల ప్రదర్శనలను అనుమతించటం లేదని, మత కేంద్రాలలో పార్టీ పెత్తనాన్ని ఆమోదించాలని, కమ్యూనిస్టు నాయకుల ఫొటోలు పెట్టాలని వత్తిడిచేస్తున్నారంటూ రకరకాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆయా దేశాల వారు చైనాను ప్రశ్నించరేమని రెచ్చగొడుతున్నారు. మన దేశంలో నిత్యం ఇస్లాం, క్రైస్తవ మతాల మీద విద్వేషం రెచ్చగొట్టి, దాడులకు పాల్పడే శక్తులు కూడా మొసలి కన్నీరు కారుస్తూ తమ చైనా వ్యతిరేక ప్రచారానికి దీన్ని వాడుకుంటున్నాయి. టిబెట్‌ బౌద్ధ మతాధికారి దలైలామా ప్రభుత్వంపై విఫల తిరుగుబాటు చేసి పారిపోయి మన దేశంలో ఆశ్రయం పొందిన విషయం తెలిసిందే. టిబెట్‌ను చైనాలో అంతర్భాగంగా గుర్తించేందుకు నిరాకరిస్తున్న దలైలామా సామ్రాజ్యవాదుల చేతిలో పావుగా మారి చైనా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. మన ప్రభుత్వం టిబెట్‌ను చైనా అంతర్బాగÛంగా గుర్తిస్తున్నప్పటికీ దలైలామాకు ఆశ్రయం ఇవ్వటం గమనించాల్సిన అంశం. దలైలామా నియమించే మతాధికారులకు చైనాలో గుర్తింపు లేదు. దలైలామా కూడా చైనా రాజ్యాంగాన్ని ఆమోదించి, టిబెట్‌ను అంతర్భాంగా అంగీకరిస్తే తిరిగి చైనాలో ప్రవేశించేందుకు అభ్యంతరం వుండకపోవచ్చు.నేరాలేమైనా వుంటే రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకోవచ్చు.

Image result for historic agreement between china and vatican

‘ నేడు పోప్‌ ప్రతినిధి సింహద్వారం నుంచే బీజింగ్‌ వెళ్ల వచ్చు. రహస్య సంప్రదింపులు ఇంకేమాత్రం అవసరం లేదు. అయితే అధికారిక ఒప్పందం పోప్‌ను, చైనా కాథలిజం గౌరవాన్ని గుర్తించిందని’ వాటికన్‌తో దగ్గరి సంబంధాలున్న ఇటలీ మాజీ మంత్రి ఆండ్రియా రికార్డీ ఒప్పందం గురించి వ్యాఖ్యానించాడు. దీంతో చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌కు ఇంతకాలం ఒక దేశంగా వాటికన్‌ ఇచ్చిన గుర్తింపు రద్దయినట్లే. ఈ ఒప్పందం గురించి పశ్చిమ దేశాలలో చైనా వ్యతిరేక మీడియా ప్రముఖంగా వార్తలు ఇచ్చింది. అరెస్టులు, నిర్బంధాలకు గురై రహస్యంగా మతకార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిని ఫణంగా పెట్టి ఈ ఒప్పందం ద్వారా చైనా ప్రభుత్వానికి వాటికన్‌ అమ్ముడు పోయిందని, తోడేళ్లకు మేకలను బలిపెట్టినట్లయిందని హాంకాంగ్‌ మాజీ కార్డినల్‌ జోసెఫ్‌ జెన్‌ విషంగక్కాడు. చైనాలో ఎంత మంది బిషప్పులున్నారన్నది ఒక సమస్య. వాటికన్‌ లెక్క ప్రకారం 145 మంది వుండగా, చైనా లెక్కలో 96 వున్నట్లు హాంకాంగ్‌లోని ఒక సంస్ధ పేర్కొన్నది.

చైనా ప్రభుత్వ గుర్తింపుతో పని చేస్తున్న కాథలిక్‌ సంస్ధలు ఒప్పందాన్ని స్వాగతించాయి. దేశాన్ని, మతాన్ని ప్రేమించే సాంప్రదాయానికి తాము కట్టుబడి వున్నామని దానికి సోషలిస్టు సమాజమే మార్గమని, స్వతంత్రంగా పని చేయాలనే సూత్రాన్ని పాటిస్తామని చైనీస్‌ పేట్రియాటిక్‌ కాథలిక్‌ అసోసియేషన్‌(సిపిసిఏ), బిషప్స్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ కాథలిక్‌ చర్చ్‌ ఇన్‌ చైనా( బిసిసిసిసి) తమ ప్రకటనల్లో పేర్కొన్నాయి. మొదటి సంస్ధ 1957లో ఏర్పడగా, రెండవ సంస్ధ సాంస్కృతిక విప్లవం తరువాత 1980లో ఏర్పడింది. ఆ కాలంలో అన్ని మతాలను రద్దు చేయాలనే విపరీత ధోరణి కొందరు నేతల్లో వ్యక్తమైన విషయం తెలిసినదే. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శక సూత్రాల ప్రకారం బహిరంగంగా మతకార్యకలాపాలు నిర్వహించటం, కట్టడాలు నిర్మించటం, సాహిత్యం అమ్మటం తదితర అంశాలపై కొన్ని ఆంక్షలున్నాయి. వాటి మేరకు అనుమతి లేని చర్చ్‌లను కూల్చివేయటాన్ని మొత్తం చర్చ్‌లు కూల్చివేయటంగా పశ్చిమ దేశాల మీడియా వక్రీకరించింది.

ఈ ఒప్పందం గురించి కాథలిక్‌ న్యూస్‌ సర్వీస్‌ ప్రకటించిన విశ్లేషణలోని అంశాలు ఇలా వున్నాయి. ఇప్పుడు కావలసింది ఐక్యత, విశ్వాసం, ఒక నూతన ప్రేరణ. గతంలో వున్న అపోహలు, ఇటీవలి వుద్రిక్తతలతో సహా గతంలో తలెత్తిన వాటిని అధిగమించాలని వాటికన్‌ విదేశాంగ మంత్రి కార్డినల్‌ పెట్రో పారోలిన్‌ తన సందేశంలో పేర్కొన్నారు. బిషప్పుల నియామకం, పని వాటికన్‌-చైనా సంబంధాలలో ఒక ముఖ్యమైన ఆటంకం. బిషప్పులను పోప్‌ నియమించాలని వాటికన్‌ పట్టుబడుతుండగా, అలా చేయటం తమ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటమే అని చైనా భావించింది. ప్రభుత్వం ఆమోదించిన మత సంస్ధలు నియమించిన బిషప్పులను అనుసరించటానికి కొందరు కాథలిక్కులు తిరస్కరించారు. అనేక మందిని స్ధానికంగానే ఎన్నుకున్నారు,అయినప్పటికీ వారు పోప్‌కు విధేయత ప్ర కటించారు. చైనాలో బిషప్పుల నియామకం పూర్తిగా తమ అదుపులోనే వుండాలని తాము ఆశించటం లేదని, ముందు అక్కడి వారికి స్వేచ్చ, భద్రత కోరుకుంటున్నామని వాటికన్‌ అధికారులు ఎల్లపుడూ చెబుతూనే వున్నారు.

తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం బిషప్పుల నియామక ప్రక్రియను ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. ఒప్పంద ప్రతిని వాటికన్‌ విడుదల చేయలేదు. ఒప్పందానికి ముందు వచ్చిన వార్తల ప్రకారం బిషప్పుల నియామకానికి ఒక ప్రక్రియను రూపొందిస్తారు. భవిష్యత్‌లో జరిగే నియామకాలకు సబంధించి డయోసిస్‌ పరిధిలోని వారితో ప్రజాస్వామిక ఎన్నికల పద్దతి ద్వారా బిషప్పులను ఎన్నుకుంటారు. ఫలితాలను పరిశీలనకు ప్రభుత్వానికి అంద చేస్తారు, వాటి నుంచి జాబితాను అధికారికంగా పోప్‌కు పంపుతారు. ప్రభుత్వం, పోప్‌ కూడా జాబితాలోని వారిని వీటో చేయవచ్చు. ఎన్నిక సక్రమంగా జరిగిందా లేదా అన్నది పోప్‌ దర్యాప్తు చేయవచ్చునని జెసూట్‌లు నడిపే అమెరికన్‌ మాగజైన్‌ తెలిపింది. వీటో జరిగినపుడు చైనా-వాటికన్‌ ప్రతినిధులు సంప్రదింపుల ద్వారా పరిష్కారానికి ప్రయత్నిస్తారు, సాధ్యం కానపుడు చైనా మరోపేరును ప్రతిపాదిస్తుంది. అంతిమ నిర్ణయం పోప్‌దిగానే వుంటుంది. ఈనెల 20వ తేదీన ఒప్పందంపై సంతకాలకు ముందు కార్డినల్‌ పారోలిన్‌ విలేకర్లతో మాట్లాడుతూ ఇది ఒక ముందుడుగు అని భావిస్తున్నాం ఇక నుంచి అంతా సులభంగా జరిగిపోతుందని అనుకోవటం లేదు, అయితే ఇది మాకు సరైనదారి అనిపించింది అన్నారు. ఇది మతపరమైనది తప్ప రాజకీయమైంది కాదని ఒప్పందం గురించి వాటికన్‌ మీడియా డైరెక్టర్‌ గ్రెగ్‌ బుర్కే వ్యాఖ్యానించారు.

ఏ దేశంలో ఏ మత చరిత్ర చూసినా అది పాలకవర్గాల ఆయుధంగా వుంది. చైనాలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన విప్లవోద్యమం కొనసాగిన కాలంలో మెజారిటీ చర్చి అధికారులు దానికి వ్యతిరేకంగా వున్నారు, వ్యతిరేకులతో చేతులు కలిపారు, విదేశాలకు వెళ్లిపోయారు తప్ప సామాన్య జన పక్షాన లేరు, దోపిడీ నుంచి వారు విముక్తికావాలని కోరుకోలేదు. అందువలన సహజంగానే కమ్యూనిస్టు పార్టీ కూడా దానికి అనుగుణ్యంగానే వ్యవహరించింది. కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మిగతా సామ్రాజ్యవాదుల మాదిరే వాటికన్‌ కూడా ఆ ప్రభుత్వంతో దౌత్య సంబంధాలను రద్దు చేసుకుంది. శత్రువులతో చేతులు కలిపిన అనేక మంది విదేశీ చర్చి ప్రతినిధులను చైనా దేశం నుంచి పంపివేసింది. స్ధానికంగా వున్న వారిని కొంత మంది మీద విచారణ జరిపి దోషులుగా చేరిన వారి మీద చర్య తీసుకుంది. తరువాత అక్కడి మతాభిమానులు చైనా దేశభక్త కాధలిక్‌ అసోసియేషన్‌ పేరుతో బిషప్పులతో సహా పూజారులను నియమించుకొని కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. మతంపై కమ్యూనిస్టు ప్రభుత్వం ఎలాంటి నిషేధం విధించలేదు, కొందరు ప్రచారం చేసినట్లు ఒక్క చర్చిని కూడా కూల్చలేదు. ఈ పూర్వరంగంలో ఏడు దశాబ్దాల తరువాత చైనా-వాటికన్‌ మధ్య ఒప్పందం కుదరటం చారిత్రాత్మకమే.

ఈ ఒప్పందం గురించి కరడుగట్టిన మతవాదులు, అలాగే కొందరు విపరీత అభ్యుదయ వాదులు కూడా వ్యతిరేకతను వ్యక్తం చేయటం సహజమే. వందలు, వేల సంవత్సరాలుగా వేళ్లూనుకున్న మత భావనలను తెల్లవారే సరికి పోగొట్టగలమని ఎవరైనా అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి వుండదు. మతం మత్తు మందు అని నమ్మేకమ్యూనిస్టులు ఒక మతంతో రాజీ పడటం ఏమిటి అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. కమ్యూనిస్టులు చైతన్యంతో ఒక అడుగు ముందుండాలే తప్ప జనాన్ని వదలి దూరంగా వుంటే లాభం లేదు. మతం మత్తు మందు అని తాము నమ్మితే చాలదు, ఇంకా దాని మత్తులో వున్న విస్తార జనంలో దాన్ని వదిలించాలి. అంతిమ లక్ష్యమైన సోషలిస్టు సమాజ నిర్మాణానికి వర్గశత్రువుతో ఎలాగూ పోరాటం చేయక తప్పదు. మతాన్ని నమ్మిన సామాన్యులందరూ సోషలిజానికి శత్రువులు కాదు. ప్రతి దేశంలో ఏదో ఒక మతాన్ని అనుసరించే శ్రమజీవులే కదా కమ్యూనిస్టుల నాయకత్వాన విప్లవాలను జయప్రదం చేసింది. సామాన్యులందరూ మతోన్మాదులే అయితే ఇది సాధ్యమయ్యేదా? ఆ లక్ష్యాన్ని దెబ్బతీయటానికి మతాన్ని ఆయుధంగా చేసుకొనేశక్తులను అనుమతించకుండా, సామాన్యులను శత్రువులుగా చేసుకోకుండా ఎత్తుగడగా అయినా కొంత కాలం మతంతో రాజీపడటం వాస్తవానికి దగ్గరగా వుంటుంది. రాజీ వేరు లంగిపోవటం వేరు. హేతు, భౌతిక వాదాన్ని ఫణంగా పెట్టి మతాన్ని సంతృప్తి పరచటం వేరు. చైనా సర్కార్‌ చర్యలో అలాంటిదేమీ కనిపించటం లేదు. మతానికి సంబంధించి తన విధానాన్ని నవీకరించుకున్న తరువాతే ఈ పరిణామం జరిగింది.

రాజీ, సర్దుబాటు అన్నది అటు కమ్యూనిస్టు చైనాకు, ఇటు క్రైస్తవ వాటికన్‌కు రెండింటికీ అవసరం అయ్యాయనవచ్చు. సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారీ వర్గంతో కలసి క్రైస్తవులను సోషలిజం, కమ్యూనిస్టు వ్యవస్దలకు వ్యతిరేకంగా నిలబెట్టేందుకు చర్చి నిరంతరం ప్రయత్నిస్తున్నది. తూర్పు ఐరోపా, సోవియట్‌ వ్యవస్ధల కూల్చివేతలకు పోప్‌ రెండవ జాన్‌ పాల్‌ సామ్రాజ్యవాదులతో చేతులు కలిపారన్నది బహిరంగ రహస్యం. తూర్పు ఐరోపా, సోవియట్‌ యూనియన్‌ సోషలిస్టు వ్యవస్ధల కూల్చివేతలో ఇతర అనేక అంశాలతో పాటు కాథలిక్‌ చర్చి జోక్యం ముఖ్యంగా పోప్‌ రెండవ జాన్‌పాల్‌ పాత్ర గురించి బయటకు తెలిసినదాని కంటే చైనా కమ్యూనిస్టుపార్టీకి ఇంకా వివరంగా తెలుసన్నది వేరే చెప్పనవసరం లేదు.

తదనంతరం కాలంలో పశ్చిమ దేశాల మీడియా చైనాలో క్రైస్తవులను అణచివేస్తున్నారని, దాంతో రహస్యంగా ప్రార్ధనలు చేసే వారు పెరుగుతున్నారని పశ్చిమ దేశాల మీడియాలో ఒక పధకం ప్ర కారం ప్రచారం ఎక్కువైంది.కమ్యూనిస్టులు మతాన్ని నిషేధించరు, అణచివేయరు, స్వేచ్చను ఆటంక పరచరు అని లోకానికి తెలియటం అవసరం. తైవాన్‌ను ఒంటరి చేయాలంటే వాటికన్‌తో దౌత్య సంబంధాలను పునరుద్దరించుకోవటం ఒక మార్గం. ఈ పూర్వరంగంలో తెలివైన వారెవరైనా ప్రధాన అంశాల మీద కేంద్రీకరించి, మిగతావాటి మీద సర్దుబాటుకు ప్రయత్నిస్తారు. చైనా నాయకత్వం కూడా అదే చేసినట్లు కనిపిస్తోంది. తాను ఒక మెట్టుదిగి చైనా సర్కార్‌ ఆధిపత్యాన్ని అంగీకరించకపోతే లాభం లేదని వాటికన్‌ కూడా అనుభవంలో తెలుసుకుంది. ఏదో ఒక పరిష్కారం కుదుర్చుకొనేందుకు చొరవ చూపాలనే వత్తిడి కూడా క్రమంగా పెరిగింది. ఇదీ నేపధ్యం. ఈ ఒప్పందం కుదరటానికి పశ్చిమ దేశాల మీడియా లేదా మరికొందరు వర్ణిస్తున్నట్లు కమ్యూనిస్టు పోప్‌ ఫ్రాన్సిస్‌ కారణం అనుకుంటే పొరపాటు. ఆయన హయాంలో ప్రయత్నాలు వేగవంతం అయితే అయి వుండవచ్చుగానీ సర్దుబాటు లేదా రాజీకి పునాది పోప్‌ బెనెడిక్ట్‌-16 హయాంలోనే ప్రారంభమయ్యాయి. ఒక అంగీకారానికి రావటం ఇరు పక్షాలకూ కత్తిమీద సాము వంటిదే. పోప్‌ 16వ బెనెడిక్ట్‌ హయాంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. వాటికన్‌ విదేశాంగశాఖ మంత్రిగా వున్న ఆర్చిబిషప్‌ పిట్రో పారోలిన్‌ 2009లోనే తన ప్రయత్నాలను ప్రారంభించారని, చైనాతో ఒక అవగాహనకు వచ్చారని మిలన్‌ కాథలిక్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ అగొస్టినో జివాంగ్నోలీ చెప్పారు. ఆ ఏడాదే పారోలిన్‌ వెనెజులాకు వాటికన్‌ ప్రతినిధిగా వెళ్లారు.అయితే తరువాత ఎలాంటి పురోగతి లేదు. 2013లో పోప్‌ ప్రాన్సిస్‌ బాధ్యతలు చేపట్టిన వెంటనే అధ్యక్షుడిగా ఎన్నికైన జింపింగ్‌కు అభినందనలు పంపారు. తరువాత ఒక పోప్‌ ప్రయాణించే విమానాన్ని తొలిసారిగా తన భూభాగం మీదుగా అనుమతించి పోప్‌ ఫ్రాన్సిస్‌ దక్షిణ కొరియా పర్యటనకు చైనా అవకాశమిచ్చింది. ఆ వెంటనే అర్జెంటీనా రాజకీయవేత్త రికార్డో రోమనో ద్వారా ఒక లేఖ పంపిన పోప్‌ తాను చైనా నాయకుడితో చర్చలకు ఆహ్వానం పంపారు. ఆ తరువాత చైనా నూతన సంవత్సరం సందర్భంగా జీకి శుభాకాంక్షలు పంపారు. మెక్సికో నుంచి రోమ్‌ వెళుతూ విమానంలో విలేకర్లతో మాట్లాడిన పోప్‌ తాను చైనా సందర్శనను నిజంగా ప్రేమిస్తానని బహిరంగంగా చెప్పారు.2014లో రోమ్‌లో వుభయ ప్రతినిధులు సమావేశమయ్యారు. చైనాతో చర్చలు కొనసాగించి ఒక పరిష్కారాన్ని కనుగొనాలని పోప్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు ఒక అధికారి రెండు సంవత్సరాల క్రితమే రాయిటర్స్‌ వార్తా సంస్ధకు చెప్పారు. ఆ తరువాత ప్రతినిధి వర్గాల సమావేశాలు, తాజా ఒప్పందానికి దారి తీశాయి.

చైనా కమ్యూనిస్టు పార్టీ హేతువాద, భౌతికవాద దృక్పధం కలిగింది. అయినప్పటికీ అక్కడి ప్రభుత్వం అధికారయుతంగానే బౌద్ధం,తావో, ఇస్లాం, క్రైస్తవంలో ప్రొటెస్టెంట్‌, కాథలిక్‌ మతాలను గుర్తించి రాజ్యాంగ పరిధిలో మతారాధన, అవలంబన స్వేచ్చ హక్కులను ఇచ్చింది. మతం పేరుతో తమ దేశంలోని వారిని విదేశాలలో వున్న వారు అదుపు చేసే లేదా మార్గదర్శనం చేయటాన్ని అంగీకరించటం అంటే అదొక ముప్పుగా భావించింది. అందుకే కొన్ని పరిమితులు, పరిధిని ఏర్పాటు చేసింది. ప్రపంచంలో వున్న మతాలలో ఒక్క కాథలిక్‌ మతానికే ప్రపంచ కేంద్రం వుంది. అందువలన దాన్ని అవలంభించేవారు దాని ఆదేశాలు, మార్గదర్శనం కోసం ఎదురు చూస్తారు. మతపరంగా దానికే విధేయులై వుంటారు. చైనా విప్లవ కాలం, కమ్యూనిస్టు పార్టీ అధికారానికి వచ్చిన తరువాత వాటికన్‌ నియమించిన మతాధికారులు మొత్తం మీద కమ్యూనిస్టుల వునికి, విప్లవం, ప్రభుత్వాన్ని గుర్తించేందుకు నిరాకరించారు. సోవియట్‌ యూనియన్‌లోని కొన్ని రిపబ్లిక్‌లలోని అతి పెద్దదైన రష్యా, ఇతర చోట్ల కాథలిక్‌ చర్చి ఆధిపత్యాన్ని అంగీకరించని ఆర్ధొడాక్‌ చర్చ్‌ ప్రభావం ఎక్కువ. అది కూడా సోషలిజాన్ని వ్యతిరేకించింది, తరువాత రాజీపడి కొనసాగింది. 1989లో సోవియట్‌ చివరి రోజులలో గోర్బచెవ్‌ నాటి పోప్‌ను తొలిసారిగా సోవియట్‌ నేత హోదాలో కలిశారు. తరువాత రెండు సంవత్సరాలకే దాన్ని కూల్చివేశారు.

వాటికన్‌తో ఒప్పందం విషయంలో చైనా నాయకత్వంలో కూడా సందేహాలు వ్యక్తమయ్యాయి. పద్దెనిమిది సంవత్సరాల క్రితం హాంకాంగ్‌, మకావో దీవులు చైనాలో విలీనమయ్యాయి. ప్రజాస్వామ్యం పేరుతో హాంగాంగ్‌లో నిర్వహిస్తున్న చైనా వ్యతిరేక ఆందోళనలో స్దానిక కాథలిక్‌ అధికారులు, ఇతర విదేశీ మిషనరీల పాత్ర సుపరిచతం. చర్చలు ప్రారంభమైన తరువాత కూడా హాంకాంగ్‌ మాజీ బిషప్‌ జోసెఫ్‌ జెన్‌ వంటి వారు తమ చైనా వ్యతిరేకతను దాచుకోలేదు. అందువలన పోప్‌ను నమ్మవచ్చా, ఒప్పందం కుదిరిన తరువాత చైనా అంతర్గత వ్యవహారాలలో వాటికన్‌ జోక్యం చేసుకోకుండా వుంటుందా? మతభావనలు మరింతగా పెరిగే అవకాశాలేమైనా వుంటాయా; అప్పుడేమి చెయ్యాలి? అనే తర్జన భర్జనలు జరగకపోలేదు. వాటన్నింటి తరువాతే ఒప్పందం కుదిరింది. విదేశీ పెట్టుబడులకు,సంస్థలకు ద్వారాలు తెరిచినపుడు సంస్కరణలకు ఆద్యుడు డెంగ్‌సియావో పింగ్‌ ఒక మాట చెప్పారు. గాలి కోసం కిటికీ తెరిచినపుడు దానితో పాటు హాని కలిగించే క్రిమి కీటకాలు కూడా ప్రవేశిస్తాయి, వాటిని ఎలా అరికట్టాలో తెలుసు అన్నారు. ఇప్పుడు వాటికన్‌తో ఒప్పందం విషయంలో కూడా అదే జాగ్రత్తలతో చైనా నాయకత్వం వుంటుందని ఎందుకు అనుకోకూడదు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మాజీ ప్రధాని వాజ్‌పేయిపై మీడియాలో అతిశయోక్తులు !

20 Monday Aug 2018

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

AB Vajpayee, BJP, RSS

Image result for ab vajpayee, govindacharya

ఎం కోటేశ్వరరావు

మాజీ ప్రధాని ఏబి వాజ్‌పేయి దేశ రాజకీయ చరిత్రలో ఏ రకంగా చూసినప్పటికీ ఒక ప్రముఖుడనటం నిర్వివివాదాంశం. స్ధానిక, జాతీయ మీడియా సహజంగానే, అందునా కేంద్రంలో, రాష్ట్రాలలో వున్న ప్రభుత్వాలకు భయపడి లేదా భక్తితో గానీ భారీగానే ఆయన మరణవార్తలకు చోటు కల్పించింది. కేంద్ర సర్కార్‌ తీసుకున్న చర్యల వలన తన ఆదాయం రెట్టింపు అయిందని చత్తీస్‌ ఘర్‌ రాష్ట్ర రైతు మహిళ ఒకరు చెప్పిన అంశాన్ని నరేంద్రమోడీ పెద్ద ఎత్తున తన ప్రచారానికి వినియోగించుకున్నారు. అదెంత బూటకమో బయట పెట్టిన ఎబిపి న్యూస్‌ ఛానల్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌, మరొక జర్నలిస్టులను రాజీనామా చేసి బయటకు పోయే విధంగా యాజమాన్యం వత్తిడి తెచ్చింది. దీని వెనుక కేంద్ర అధికార పార్టీ పెద్దల బెదిరింపులున్నాయన్నది బహిరంగ రహస్యం. తమ నేత వాజ్‌పేయి మృతికి తగినంత చోటు కల్పించలేదని ఆ పెద్దలు కినుక వహిస్తే… ఎందుకులే తంటా అని గావచ్చు లేదా వాజ్‌పేయి అంటే మీడియా యాజమాన్యాలకు వున్న భక్తి కావచ్చు.

వాజ్‌పేయి ఒక మాజీ ప్రధాని, అటువంటి వ్యక్తి మరణించినపుడు రాజకీయాలతో నిమిత్తం లేకుండా విచారం వెలిబుచ్చటం, నివాళి అర్పించటం ఒక సంస్కారం. అలా చేయటమంటే ఆయన రాజకీయాలను, ఇతర అంశాలన్నింటితో ఏకీభవించటం అని కానే కాదు. కమ్యూనిస్టు పార్టీలు సంతాప ప్రకటనలు చేయటాన్ని సామాజిక మాధ్యమంలో తప్పుపడుతూ, వ్యంగోక్తులు విసురుతూ కొందరు వ్యాఖ్యానాలు చేశారు. వాజ్‌పేయి రాజకీయ జీవితంలో వున్న ప్రతికూలతల కారణంగా ఆయన మరణానికి విచారం ప్రకటించకపోవటం ఒక విప్లవ చర్య అనే అర్ధం వచ్చేట్లుగా కొందరి తీరు వుంది. అలా అయితే హిట్లర్‌ మరణానికి కూడా సంతాపం ప్రకటించాలి కదా అనే తీరులో స్పందించారు కొందరు. దాని గురించి వదిలేద్దాం. వాజ్‌పేయికి సంతాపం ప్రకటించిన సిపిఐ(ఎం) ప్రకటన పూర్తి పాఠం ఇలా వుంది.(The Polit Bureau of the Communist Party of India (Marxist) expresses its grief at the death of former Prime Minister Shri Atal Behari Vajpayee.Shri Vajpayee had a distinguished political career in parliament, in government and as Prime Minister of India.As a political leader he commanded respect of all sections.) ‘మాజీ ప్రధాని శ్రీ అతల్‌ బిహారీ వాజ్‌పేయి మరణం పట్ల భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తన విచారాన్ని వ్యక్తం చేస్తున్నది. ప్రధానిగా ప్రభుత్వంలోనూ, పార్లమెంటులోనూ వాజ్‌పేయి విలక్షణ రాజకీయ వురవడి కలిగినవారు. ఒక రాజకీయవేత్తగా అన్ని తరగతుల మెప్పు పొందారు.’ ఈ మాత్రపు ప్రకటన కూడా చేయకూడదని ఎవరైనా అనుకుంటే వారి అది వారికున్న స్వేచ్చ.

దేశ రాజకీయాలలో వాజ్‌పేయి పాత్ర గురించి మరణించిన సమయంలో వ్యతిరేక వ్యాఖ్యలు చేయటం గురించి సామాజిక మాధ్యమంలో కొంతమంది పరివార్‌ అభిమానులు, కానివారు కూడా అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బతికి వున్నపుడు, చురుకుగా రాజకీయాల్లో వున్నపుడు కూడా ఆయన గురించి తీవ్ర విమర్శలు చేసినపుడు కూడా ‘అభిమానులు’ పై మాదిరే వ్యవహరించారు.బిజెపికి వాజ్‌పేయి ఒక ముసుగు అని వర్ణించిన ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంత వేత్త కెఎన్‌ గోవిందాచార్య గురించి తెలిసిందే. వాజ్‌పేయి మరణం సందర్భంగా దాని గురించి మాట్లాడుతూ తాను చెప్పిన మాటను ఒక తరగతి మీడియా వక్రీకరించిందని ఆరోపించారు. బిజెపిలో వాజ్‌పేయి బహుళ ఆదరణ కలిగిన వారు, అత్యధికులు ఆమోదించే ముఖ రూపసి అని చెప్పానని అయితే ముఖ రూపసి బదులు ముసుగుగా మార్చారని గోవిందాచార్య అన్నారు. ఆ వుదంతంతో గోవిందాచార్య బిజెపి, రాజకీయాలలో కూడా చోటును కోల్పోయారు.
చరిత్రలో హిట్లర్‌ను కూడా నిస్సిగ్గుగా సమర్ధించేవారున్నారు. చరిత్రలో బతికి వున్నపుడు, మరణించిన తరువాత తీవ్ర ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొనని రాజకీయనేతలు బహు కొద్ది మంది. అలాంటి వారిలో వాజ్‌పేయి లేరు. కొంత మంది తమ అభిమాన రాజకీయ నేతల విషయంలో అతిశయోక్తులను ముందుకు తెస్తారు. పని గట్టుకొని ప్రచారం చేస్తారు. వాజ్‌పేయి విషయంలోనూ అదే జరుగుతోందా ?

ఆగస్టు 17వ తేదీన ఆంధ్రజ్యోతి పత్రికలో 1942.. ఏ లవ్‌ స్టోరీ పేరుతో ఒక వార్త వచ్చింది. దాని సారాంశం ఇలా వుంది. 1942లో గ్వాలియర్‌ విక్టోరియా కాలేజీలో వాజ్‌పేయి తన సహాధ్యాయిని ప్రేమించి దాన్ని బహిరంగంగా చెప్పలేక ప్రేమలేఖ రాసి పుస్తకంలో పెట్టి ఆమెకు ఇచ్చారు. రెండు మూడు రోజులు గడిచినా ఏ స్పందనా లేకపోవటంతో తన లేఖను ఆమె చూడలేదని అనుకున్నారు. అయితే ఆమె కూడా అంగీకరిస్తూ రాసిన లేఖను అదే పుస్తకంలో పెట్టి వాజ్‌పేయికి ఇద్దామనుకున్నారు. ఆ సమయంలో వ్యక్తిగత కారణాలతో వాజ్‌పేయి ఢిల్లీ వెళ్లినందున ఆ లేఖ ఆయనకు చేరలేదు. తమ ప్రేమ గురించి రాజకుమారి తలిదండ్రులకు చెప్పినా శాఖాబేధం కారణంగా వారు అంగీకరించలేదు. ఆమెకు 1947లో ఢిల్లీలో హడావుడిగా నిశ్చితార్ధం చేయించి ఆ తరువాత గ్వాలియర్‌ తీసుకువచ్చి పెళ్లి చేశారు. ప్రేమ విఫలం కావటంతో వాజ్‌పేయి పెళ్లి చేసుకోకుండా రాజకీయాలకు అంకితమై పోయారు. కొన్నాళ్ల తరువాత ఢిల్లీలో వాజ్‌పేయి అమెని కలిశారు. తరువాత వారింటికి తరచూ వెళ్లే వారు. భర్త చనిపోయిన తరువాత రాజకుమారి ఆయన అధికార నివాసానికి మకాం మార్చారు. వాజ్‌పేయితోనే వుండిపోయారు.’

అనేక మంది రాజకీయ నేతల మాదిరే వారి సంబంధం గురించి అనేక కధనాలు గతంలోనే వెలువడ్డాయి. వాటి మీద వాజ్‌పేయి స్పందించిందీ లేనిదీ తెలియదు. నాకు ఎక్కడా దొరకలేదు. ఆగస్టు 19నాటి ఈనాడు పత్రికలో వాజ్‌పేయీ స్వీయ నిర్బంధం ! అనే శీర్షికతో ఒక వార్తను బాక్సు కట్టీ మరీ ప్రచురించారు. దాని సారాంశం ఇలా వుంది. పెళ్లి అనే రెండు అక్షరాలకూ వాజ్‌పేయి బహుదూరం. వివాహానికి దూరంగా వుండిపోతే జీవితాన్ని జాతికి అంకితం చేసే వీలుంటుందన్నదే వాజ్‌పేయి అభిమతం అని ఆయన సన్నిహిత మిత్రుడు దివంగత గోరేలాల్‌ త్రిపాఠీ తనయుడైన విజయ ప్రకాష్‌ చెప్పారు. తొలి నుంచీ బ్రహ్మచర్య జీవితాన్నే ఇష్టపడేవారు. ఆయన పీజీ చేసే రోజులలో తలిదండ్రులు ఆయన వివాహం గురించి అనుకోవటం ఆయన చెవిన పడింది. కల్యాణమంటే విరక్తి పెంచుకున్న వాజ్‌పేయి కాన్పూర్‌లోని మిత్రుడి ఇంటిలో ఒక గదిలోకి వెళ్లి మూడు రోజులు తనను తాను బంధించుకున్నంత పని చేశారు.’

ఆంధ్రజ్యోతి వార్త ప్రకారం వాజ్‌పేయి ఒక భగ్న ప్రేమికుడు. ప్రేమికురాలు రాజకుమారి భర్త చనిపోయిన తరువాత ఆమె తన నివాసాన్ని వాజ్‌పేయి ఇంటికి మార్చి నాలుగు సంవత్సరాల క్రితం మరణించే వరకు అక్కడే వున్నారు. అందువలన పై రెండు వార్తలనూ పక్కపక్కనే పెట్టుకొని చదివితే పాఠకుడు గందరగోళంలో పడిపోతాడు. వాజ్‌పేయి గురించి ఈనాడు అతిశయోక్తులు రాసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక వాజ్‌పేయి గురించి గతంలో పత్రికల్లో, మరణించిన తరువాత సామాజిక మాధ్యమంలో జరిగిన చర్చలో 1942లో క్విట్‌ ఇండియా వుద్యమంలో అరెస్టయి అప్రూవర్‌గా మారి చెప్పిన సాక్ష్యంతో కొంత మందికి శిక్షలు పడ్డాయనే అంశం. ఆయన మరణించిన సందర్భంలో ఈ విషయాన్ని ప్రస్తావించటం ఏమిటి? ఆయన బతికి వుండగా విమర్శిస్తే సమాధానం చెప్పటమో, సరిదిద్దుకోవటమో చేసే వారు కదా అని కొంత మంది సామాజిక మాధ్యమ చర్చల్లో అభిప్రాయపడ్డారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ స్వాతంత్య్ర వుద్యమానికి దూరం. అలాంటి సంస్ధలో 1939లోనే చేరిన వాజ్‌పేయి 1942లో క్విట్‌ ఇండియా వుద్యమంలో ఎలా పాల్గొన్నారు. ద్రోహం చేసినట్లు, కోర్టులో అంగీకరించిన ప్రకటన వలన ఆయన బయటపడినా కొందరికి శిక్షలు పడటం గురించి నిజా నిజాలేమిటి? దీనికి సంబంధించి ఫ్రంట్‌లైన్‌ పక్షపత్రిక 1998 ఫిబ్రవరి 7-20వ తేదీ సంచికలో ఒక పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. వాజ్‌పేయిని ప్రధాని అభ్యర్ధిగా ముందుకు తెచ్చే క్రమంలో ఆయనకు స్వాతంత్య్రవుద్యమంలో పాల్గన్న నేపధ్యం వుంది అని చెప్పేందుకు గాను సంఘపరివార్‌, బిజెపి తాపత్రయ పడింది, వాజ్‌పేయి క్విట్‌ ఇండియా వుద్యమంలో పాల్గొని జైలు పాలయ్యారని ప్రచారం చేశారు. చివరికి వాజ్‌పేయి కూడా స్వయంగా తాను క్విట్‌ ఇండియా వుద్యమంలో పాల్గొన్నట్లు చెప్పుకున్నారు. ఇక్కడే చిక్కువచ్చింది. ఇరవై ఒక్క రోజులు జైలులో వున్న తరువాత ఒక పత్రం రాసి ఇచ్చి బయటపడ్డారు. అయితే తాను ఎలాంటి పత్రం రాయలేదని, బ్రిటీష్‌ వారికి లొంగిపోలేదని వాదించారు. చివరకు మీడియా పరిశోధనలో వెల్లడైన అంశాల కారణంగా తాను పత్రంపై సంతకం చేసిన మాట నిజమే అని ఫ్రంట్‌లైన్‌ ప్రతినిధులతో అంగీకరించారు. 1942 సెప్టెంబరు ఒకటవ తేదీన ఆగ్రా జిల్లా సెకెండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ముందు వుర్దూలో రాసిన పత్రంపై వాజ్‌పేయి ఆంగ్లంలో సంతకం చేశారు. దాదాపు అలాంటిదానినే ఆయన సోదరుడు ప్రేమ్‌ బిహారీ వాజ్‌పేయి కూడా మెజిస్ట్రేట్‌కు అంద చేశారు. ఇంతకీ ఎబి వాజ్‌పేయి రాసిచ్చిన పత్రంలో ఏముంది?

నా పేరు : అతల్‌ బిహారీ , తండ్రిపేరు : గౌరీ శంకర్‌, నా కులం: బ్రాహ్మణ, వయస్సు : 20, వృత్తి : విద్యార్ధి గ్వాలియర్‌ కాలేజి, చిరునామా : బాతేష్వర్‌, పిఎస్‌ బా, జిల్లా ఆగ్రా

మీరు దహనకాండకు పాల్పడ్డారని, నష్టపరిచారని చెబుతున్నారు, దీనికి సంబంధించి మీరేమి చెబుతారు. అన్న న్యాయూర్తి ప్రశ్నకు ‘ 1942 ఆగస్టు 27న బాతేష్వర్‌ బజార్‌లో ఆలా గానం నిర్వహిస్తున్నారు. సాయంత్రం రెండు గంటల సమయంలో కకువా అనే లీలాధర్‌ మరియు మహువా ఆలా దగ్గరకు వచ్చి ఒక వుపన్యాసం ఇచ్చి అటవీ చట్టాలను వుల్లంఘించాలని కోరారు. రెండువందల మంది జనం ఫారెస్ట్‌ ఆఫీసుకు వెళ్లారు, నేను నా సోదరుడు జనాన్ని అనుసరించాము బటేష్వర్‌ అటవీ కార్యాలయానికి చేరుకున్నాము. నా సోదరుడు, నేను కిందనే వున్నాము, జనం పైకి వెళ్లారు. నాకు కకువా మరియు మహువా తప్ప అక్కడున్నవారిలో మరే ఇతర వ్యక్తి పేరూ తెలియదు. ఇటుకలు కిందికి పడుతున్నట్లు నాకు కనిపించింది. గోడను ఎవరు పడగొడుతున్నారో తెలియదు కానీ గోడ ఇటుకలు మాత్రం పడుతున్నాయి. నేను నా సోదరుడితో కలసి మెయిపురా వెళ్లేందుకు బయలుదేరాము, జనం మా వెనుక వస్తున్నారు.పైన పేర్కొన్న వ్యక్తులు పశువుల శాల నుంచి మేకలను బలవంతంగా బిచికోలీ వైపు మళ్లించారు. అటవీ కార్యాలయంలో పది పన్నెండు మంది వున్నారు. నేను వంద అడుగుల దూరంలో వున్నాను. ప్రభుత్వ భవనాన్ని పడగొట్టటానికి నేను ఎలాంటి సాయం చేయలేదు. ఆ తరువాత మేము ఇండ్లకు వెళ్లాము.’

ఈ పత్రంపై అతల్‌ బిహారీ వాజ్‌పేయితో పాటు మెజిస్ట్రేట్‌ ఎస్‌ హసన్‌ కూడా సంతకాలు చేశారు. శిక్షా స్మృతి సెక్షన్‌ 164కింద ఈ ప్రకటనను నమోదు చేశారు. ఆ పత్రం మీద మెజిస్ట్రేట్‌ చేత్తో కింది విధంగా రాసి సంతకం చేశారు.

అతనెలాంటి తప్పు చేయలేదని గౌరీశంకర్‌ కుమారుడైన అతల్‌ బిహారీకి నేను వివరించాను, ఒకవేళ చేసి వుంటే ఏ తప్పయినా చేస్తే దానిని అతనికి వ్యతిరేకంగా సాక్ష్యంగా పరిగణిస్తామని చెప్పాను. ఈ విషయాలు అతను స్వచ్చందంగా వెల్లడించినట్లు నేను నమ్ముతున్నాను.ఇది నా సమక్షములో తీసుకున్నది, అతల్‌ బిహారికి చదివి వినిపించబడినది, దానిలో తాను చెప్పిన అంశాలే పూర్తిగా వున్నాయని, సరైనవే అని అతను అంగీకరించాడు.

కోర్టులో చేసిన ఈ ప్రకటనను బట్టి వాజ్‌పేయి క్విట్‌ ఇండియా వుద్యమంలో పాల్గొనలేదు. ఆందోళనకారుల వెనుక వున్నందున ఆయనను కూడా అరెస్టు చేశారు. ఆ రోజు జరిగినదానితో తనకేమీ సంబంధం లేదని స్పష్టంగా చెప్పినందున తరువాత కేసు నుంచి ఆయన బయట పడ్డారు. నిజమైన స్వాతంత్య్ర సమర యోధులందరూ పోలీసులు, కోర్టుల ముందు తాము బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పాల్గొన్నట్లు వీరోచితంగా ప్రకటనలు చేసి చెరసాలలు, వురికొయ్యలకు తమ జీవితాలను అంకితం చేశారు. జైలు జీవితాలు, చిత్రహింసలను భరించలేని సావర్కర్‌ వంటి వారు లొంగిపోయి బ్రిటీష్‌ వారికి సేవ చేసుకుంటామని, విధేయతతో వుంటామని లేఖలు రాసి బయట పడ్డారు. ఇక వాజ్‌పేయి కోర్టులో చేసిన ప్రకటనలో తన పేరు ప్రస్తావించినందున సాక్ష్యంగా చెప్పకపోయినా తన శిక్షకు కారణం అది కూడా ఒకటని కకువా అనే లీలాధర్‌ అభిప్రాయపడ్డారు. దాన్నే కాంగ్రెస్‌ నాయకులు ప్రచారంలో పెట్టి వాజ్‌పేయి లొంగుబాటు కారణంగా స్వాతంత్య్ర సమర యోధులకు శిక్షలు పడ్డాయని ప్రకటనలు చేశారు. చాలా కాలం పాటు వాజ్‌పేయి క్విట్‌ ఇండియా వుద్యమంలో పాల్గొన్న సమర యోధుడని చేసిన ప్రచారం అవాస్తవమని తేలింది. తాను పాల్గొనలేదని, జరిగినదానితో జరిగినదానికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్వయంగా కోర్టులో ప్రకటన చేశారు. వాజ్‌పేయి గానీ మరొక నేత గానీ ఎవరి గురించి అయినా అతిశయోక్తులు ప్రచారం చేసుకోవటానికి కొందిరికి ఎలా స్వేచ్చ వుంటుందో విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించటానికి కూడా ఎవరికైనా అలాంటి స్వేచ్చే వుంటుంది. ఎవరూ చరిత్ర విశ్లేషణలు, విమర్శలకు అతీతులు కాదు. అది సభ్య సమాజం ఆమోదించిన పరిమితులకు లోబడి వుండాలి. సానుకూలంగా లేదా ప్రతికూలంగా చేసే విమర్శలు లేదా ఆరోపణలకు ఆధారాలు చూపగలిగి వుండాలి. మేం చెప్పింది మా నమ్మకం, విశ్వాసం, ఇతరులు మా మనోభావాలను దెబ్బతీస్తున్నారంటే కుదరదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రేమతో ఆవుల బహుమతి: నరేంద్రమోడీ ర్వాండా గో మాంస ప్రియుల సంతుష్టీకరణ దౌత్యం !

26 Thursday Jul 2018

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, RELIGION

≈ Leave a comment

Tags

cows, Girinka, Girinka Programme, Modi, Modi gifts 200 cows, Rwanda

ఎం కోటేశ్వరరావు

విదేశీ పర్యటనల సమయంలో లేదా విదేశీ అతిధులు మన దేశాన్ని సందర్శించినపుడు మన ప్రధాని నరేంద్రమోడీ అందచేసే బహుమతుల గురించి ఒక పెద్ద పరిశోధనే చేయవచ్చునంటే అతిశయోక్తి కాదు. ఆయన రూటే వేరు. కాదేదీ కవిత కనర్హం అన్నట్లుగా ఆవులతో కూడా దౌత్యనీతిని ప్రదర్శించవచ్చని తొలిసారిగా ప్రపంచానికి చాటి చెప్పిన రాజనీతిజ్ఞుడిగా కూడా చరిత్రకెక్కారు. దేశంలో మోడీ మాతృసంస్ధ సంఘపరివార్‌, దాని అనుబంధ రాజకీయ, ఇతర సంస్ధల కార్యకర్తలందరూ ‘గోరక్షణ కర్తవ్యం పేరుతో’ ముస్లింలపై మూకదాడులు, హత్యలకు పాల్పడుతున్నారు. గోరక్షణకు కంకణం కట్టుకున్నానని నమ్మబలుకుతున్న నరేంద్రమోడీ దేశ ప్రజల అదృష్టం లేదా ఖర్మకొద్దీ ప్రధానిగా వున్నందున ప్రస్తుతానికి గోరక్షణ కార్యక్రమాలలో పాల్గనే అవకాశాలు లేవు. విదేశీ అతిధులు మన దేశానికి వచ్చినా, నరేంద్రమోడీ విదేశీ పర్యటనలు జరిపినా పురుష నేతల భుజాలపై చేతులు వేయటం లేదా కౌగలించుకొని ఎంతో ఆత్మీయతను ప్రదర్శించటం తెలిసిందే. బ్రిక్స్‌ సమావేశంలో పాల్గనేందుకు దక్షిణాఫ్రికా వెళుతూ దానితో పాటు కోటీ 20లక్షల జనాభా వున్న ర్వాండా అనే దేశాన్ని సందర్శించిన మోడీ అక్కడి వారికి 200 ఆవులను బహుమతిగా ఇచ్చి ఇటు జాతీయంగా ప్రతిపక్షాల వారిని అటు అంతర్జాతీయంగా తామే తిరుగులేని తలపండిన పెద్ద దౌత్యవేత్తలమని విర్రవీగుతున్న వారిని కూడా ఆశ్చర్యపరుస్తూ కొత్త వరవడికి శ్రీకారం చుట్టారని చెప్పకతప్పదు. ర్వాండా అధ్యక్షుడికి గోవుల పంపిణీ ఇష్టమని మనసెరిగి గోపాలుడి అవతారమెత్తిన నరేంద్రమోడీ ఒక గ్రామానికి ప్రత్యేకంగా వెళ్లి కార్యక్రమంలో పాల్గని ఆ దేశాధ్యక్షుడిని పడేశారు.

మోడీ ప్రయాణించే విమానంలో మన దేశం నుంచి గోవులను రవాణా చేయటం కుదరదు, ఇక్కడి హిందూ గోమాతలు ఆఫ్రికా వాతావరణానికి సరిపడతాయో లేదో తెలియదు, అన్నింటికీ మించి అక్కడి క్రైస్తవ, ముస్లిం ఆచార వ్యవహారాలతో సరిపడక వాటి మనోభావాలు దెబ్బతినవచ్చు. సంకరంతో వ్రతం చెడవచ్చు. అందువలన ఎవరి మనోభావాలకు దెబ్బతగుల కుండా స్ధానికంగా దొరికే మెజారిటీ క్రైస్తవ గోమాతలనే కొనుగోలు చేయించి వాటిని అక్కడి వారికి బహుమతిగా ఇచ్చి ర్వాండాతో సంబంధాలను మెరుగుపరచుకొనేందుకు ప్రయత్నించారు. ఆ దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధానిగా చరిత్రకెక్కారు.

ర్వాండా పేదల సంక్షేమ పధకాలలో భాగంగా గిరింకా పేరుతో అధ్యక్షుడు పాల్‌ కగామే ఆవుల పంపిణీ పధకం చేపట్టినట్లు మోడీ సర్కార్‌ తెలుసుకుంది. అందువలన దానికి సంబంధించిన బహుమతి ఇచ్చి అక్కడి ప్రభుత్వాన్ని ఆకట్టుకోవచ్చని మోడీ సలహాదారులు భావించి వుండాలి.ఆవుల పంపిణీ కార్యక్రమంపై ర్వాండా అధ్యక్షుకి స్వయంగా ఆసక్తి వున్నందున దానిలో మన దేశం కూడా భాగస్వామి కావటం ప్రాముఖ్యత సంతరించుకుందని విదేశీ వ్యవహారాల ఆర్ధిక సంబంధాల కార్యదర్శి టిఎస్‌ తిరుమూర్తి విలేకర్లతో స్వయంగా చెప్పారు. దాని ఫలితమే ఆవుల బహుమతి. ర్వాండాతో సోదర, సౌహార్ధ్ర సంబంధాల మెరుగుదలకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

గిరింకా పధకం ప్రకారం ప్రభుత్వం పేదలకు ఆవులను బహుమతిగా ఇస్తుంది. వాటిని పొందిన వారు సదరు ఆవులకు పెయ్య దూడలు పుడితే వాటిని పొరుగు పేదలకు బహుమతిగా ఇవ్వాలి. ఇలా మూడున్నరలక్షల ఆవులను పంపిణీ చేయాలని అధ్యక్షుడు నిర్ణయించాడు. ఆవుల పధకంతో కుటుంబాలకు అవసరమైన పాలతో పాటు వ్యవసాయానికి కావాల్సిన ఎరువు సమకూరుతుంది, వట్టిపోయిన తరువాత ఆవులను, కోడెదూడలను మాంసానికి వినియోగిస్తారు కావున పోషకాహారలేమితో బాధపడుతున్న దేశంలోని పిల్లలకు దానిని సరఫరా చేయాలన్నది ఆ పధక లక్ష్యం. ర్వాండా జనాభాలో అత్యధికులు క్రైస్తవులు. వారి ఆహారంలో గొడ్డు మాంసం ముఖ్యమైనది. మనకు ప్రతి వూరిలో హోటల్‌లో ఇడ్లీ, దోసె దొరికినట్లుగా అక్కడ అది దొరుకుతుంది.

గో గూండాలు మరోమారు విజృంభించి మరొకరి ప్రాణం తీసిన వుదంతం మీడియాలో ప్రముఖంగా వచ్చిన తరుణంలోనే మోడీ గో దౌత్యం గురించి కూడా ఆ వార్తలతో పాటు దీన్ని చదువుకున్నాం గోవధను ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో నిషేధించారు, దేశమంతటా అమలు చేయాలని హిందూత్వ శక్తులు పట్టుబడుతున్న తరుణంలో దానికి అనుగుణంగానే గో గూండాలు చెలరేగుతున్నారు. మూక హత్యలు పెరిగిపోతున్నాయి. అలాంటి దేశానికి అసలు సిసలైన ప్రతినిధిని అని చెప్పుకుంటున్న మోడీ గొడ్డు మాంసం లేనిదే ముద్ద దిగని దేశంలో ఆవులను బహుమతిగా ఇవ్వటంపై గో అభిమానులే పరిహాసాలాడుతున్నారు.కోరిన చెయ్యే కొట్టు, కొట్టిన చెయ్యే కోరు అన్నట్లు పేటెంట్‌ కలిగి వుండకపోయినా గోవుల స్వంతదారుల మాదిరి ప్రవర్తిస్తున్నవారు ఏం చేసినా తప్పులేదని ఎవరైనా వాదించినా ఆశ్చర్యం లేదు.

‘ బుగెసెరాలో ఏర్పాటవుతున్న అతి పెద్ద గోమాంస(పరిశ్రమ) కబేళాకు ప్రేమతో 200 గోవులను బహుమతిగా ఇచ్చిన నరేంద్రమోడీ ‘ అన్నది వాటిలో ఒకటి. పన్నెండు వేల ఎకరాల విస్తీర్ణంలో గోవులు, ఇతర పశుసంపదను పెంచి, వాటి నుంచి మాంసం వుత్పత్తి చేసేందుకు ఒక పెద్ద పరిశ్రమ బుగెసెరా అనే చోట దశలవారీ ఏర్పాటు అవుతున్నది. దానికి దేశాధ్యక్షుడు పాల్‌ కగామే అనుమతి ఇచ్చారు. ఏటా 1200 గోవులతో ప్రారంభమై 2018నాటికి మూడువేల స్ధాయికి పెంచనున్నట్లు ప్రభుత్వమే ప్రకటించింది. ఒక్కో ఆవు నుంచి 160కిలోల మాంసం తయారవుతుంది. దేశం మొత్తంలో 2015లో 86వేల టన్నులుగా వున్న వుత్పత్తిని 2018 నాటికి 2,30,000 టన్నులకు పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ప్రతి పశువును 120 రోజులు బాగా మేపి తరువాత కబేళాకు తరలిస్తారు. గో మాంస ఎగుమతులకు బుగెసెరాలో ఏర్పాటు కానున్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా వినియోగించుకుంటారు. గోవులను పెంచేందుకు, కబేళాల ఏర్పాటుకు ప్రభుత్వమే భూములను కౌలుకు ఇస్తుంది.

‘ మోడీ ర్వాండాకు 200 గోవులను బహుమతిగా ఇవ్వటం కొంత గందరగోళం కలిగిస్తోంది. ఆ దేశంలో ప్రతి చోటా ఆవులు వుండాలని ఆరు కోరుకుంటారు, ప్రత్యేకించి భోజన బల్లల మీద, త్వరిత గతిన దూకే గోరక్షక దళాన్ని ఏర్పాటు చేయాల్సి రావచ్చు, వారిని తెల్లవారే సరికి పారా చూట్ల ద్వారా దించటాన్ని నేను చూడగలను’

‘ గోరక్షకులందరికీ సామూహిక అప్రమత్త సందేశం, ర్వాండాలో ఈ ఆవులను రక్షించేందుకు దయచేసి వెళ్లండి, వెళ్లండి, ఇప్పుడే వెళ్లండి’ ‘ ర్వాండాకు రెండువందల ఆవులను తరలిస్తున్న స్మగ్లర్‌ కనిపించాడు.’ ‘ ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి రెండు ఆవులను తరలిస్తున్న ఒక వ్యక్తిని వధించారు, మరొక వ్యక్తి 200 ఆవులను భారత్‌ నుంచి ర్వాండాకు తరలిస్తున్నట్లు నేను ఇప్పుడే విన్నాను. అయితే అతనికేమీ కాకూడదని ఆశిస్తున్నాను, అతని కోసం నేను ప్రార్ధిస్తాను.’ ‘200 ఆవులను ర్వాండాకు స్మగ్లింగ్‌ చేస్తున్నందుకు యునెస్కో మోడీకి అతి పెద్ద ఆవుల స్మగ్లర్‌ అనే అవార్డు ఇచ్చింది. వావ్‌ మోడీ వావ్‌, ప్రియమైన భక్తులారా మన ప్రధానిని వధించవద్దు, ఎందుకంటే ఆయన భాగీదారు తప్ప చౌకీదారు కాదు ‘

మాంసం కోసం లేత ఆవులు, కోడె దూడలను వధించటం, అతిధులకు దానిని వడ్డించటం ఒక మర్యాదగా మన దేశంలో ఒకప్పుడు విలసిల్లింది. మా మనోభావాలను గాయపరిచారనే పేరుతో పుక్కిటి పురాణ పాత్రలను విమర్శిస్తే కేసులు నమోదు చేస్తున్నారు. దాడులకు తెగబడుతున్నారు. ఆవు పేరుతో ఎలాంటి తప్పు చేయని ఒక మనిషిని మూకదాడిలో చంపితే తోటి మనుషుల మనోభావాలు దెబ్బతినకపోగా మరింతగా జరగాలని ప్రోత్సహిస్తున్నవాతావరణం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇది సామూహిక వున్మాదం తప్ప వ్యక్తిపరమైన సమస్య కాదు.వ్యక్తికి, ఇంటికి పరిమితం చేయాల్సిన దేవుడు, దేవతలను ఓట్లకోసం వీధుల్లోకి తెచ్చారు. దాని కొనసాగింపుగానే ఆవును గోమాతను, దేవతను చేశారు. ఓట్ల కోసం మన దేశంలో ఆహారం కోసం గోవును వధించకూడదని నానా రాద్దాంతం చేస్తున్న వారు, మరో దేశంలో మార్కెట్‌, పెట్టుబడుల కోసం పడుతున్న పాట్లలో భాగంగా అక్కడ గోవులను తింటారని, ఆ దేశాధ్యక్షుడికి గోపంపిణీ అంటే ప్రీతి అని తెలిసి గోవులనే బహమతులుగా ఇచ్చిన ప్రధాని నరేంద్రమోడీ మనోభావాలు ఏమైనట్లు? ప్రతిదానికీ మా మనోభావాలు గాయపడ్డాయంటూ నానా యాగీ చేస్తున్న వారు ఇప్పుడేమంటారు? ఇప్పుడేం చేస్తారు? ప్రాణ, విత్త, మానభంగములందు ఆడి తప్పవచ్చు అని మినహాయింపులిచ్చినట్లుగానే పెట్టుబడిదారులు, వ్యాపారుల లాభాల కోసం వధిస్తారని తెలిసీ నరేంద్రమోడీ గోవులను బహుమతిగా ఇచ్చినపుడు, జీవనోపాధికోసం తప్ప వధించటానికి కాదు మేము గోవులను కొనేదీ అమ్మేదీ అని నెత్తీ నోరు కొట్టుకుంటున్న ముస్లింల గోడును ఆయన అనుయాయులు, మద్దతుదారులు ఎందుకు పట్టించుకోరు? మోడీ మాదిరి మనోభావాలకు అతీతంగా వ్యవహరించలేరా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

శూద్ర కులాలను రామాయణం ఎందుకు అవమానించింది ?

09 Monday Jul 2018

Posted by raomk in Communalism, Current Affairs, INDIA, Literature., Opinion, RELIGION

≈ Leave a comment

Tags

Ramayana epic, shudras, why ramayana epic insults shudras

Image result for why ramayana epic insults shudras

డాక్టర్‌ కదిరె కృష్ణ

ఈనెల 7వ తేదీన ప్రముఖ రచయిత వనం జ్వాలా నరసింహారావు ”వాల్మీకి బోయవాడేనా?” అన్న శీర్షికతో నవ తెలంగాణలో అచ్చయిన నా వ్యాసానికి స్పందిస్తూ ”వాల్మీకి రామాయణంలో ఏముంది?” శీర్షికన మరో వ్యాసం రాశారు. వాల్మీకిని బోయవాడుగా ఎందుకు చేశారు? అనే నా ప్రశ్నకి సమాధానం అన్నట్టు రామాయణం రాసినవాడు బోయవాడా? బ్రాహ్మణుడా అనే కంటే ఆయన రామాయణంలో ఏముంది? అది ఎందుకు అవశ్యపఠనీయం? అనే దృష్టితో పటిస్తేకానీ దానిలోని తత్వం బోధపడదు అంటూ సెలవిచ్చారు. దరిమిలా రామాయణాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసే ప్రయత్నం చేశాను. నా అజ్ఞానాన్ని మరోసారి రామాయణ పారాయణంతో కడిగేసుకుందామనీ కృషిచేసాను. లాభంలేకపోయింది! తిరిగేసి మర్రేసి చదివినా నరసింహరావుగారు అన్న మంత్ర పూతం, ఉపనిషత్‌ సారం, అంత:కరణ శుద్ది మహత్వం ఏమీ కనిపించలేదు. పైగా రామాయణం చదివినంతసేపు మనోవేదనకు గురియ్యాను. ఈ కావ్యం శూద్రాతి శూద్ర కులాలను/జాతులను ఘోరంగా అవమానించింది. బాలకాండ మొదలుకొని యుద్దకాండ వరకు (పూర్వ ఉత్తరాకాండ సహా) బ్రాహ్మణాధిక్యత, ఆర్య రాజ్య విస్తరణ తప్ప మరో శాస్త్ర మర్మం నాకు ఇందులో కనిపించలేదు.
రామాయణం, వర్ణ ధర్మాన్ని కాపాడటానికి వ్రాయబడ్డదని ఇప్పటికే మహాత్మాపూలే, డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌, పెరియార్‌ ఇ.వి. రామస్వామి సవివరణాత్మకంగా నిరూపించారు. అయినా వీరి వాధనలతో తృప్తి చెందకనే రామాయణం సభక్తితో పఠిస్తుంటే భక్తిరసం భగమై జాతి వివక్ష, అకారణ హింస నా జాతి కడగండ్లు కండ్లముందు సాక్షాత్కారమై కన్నీటి పర్యంతమయ్యాను. నా నోట ”మానిషాద…” శ్లోకం రాలేదు, నా శోకమూ ఆరలేదు. రామాయణంలోని బాలకాండ ప్రథమ సర్గలో వాల్మీకి ఫలశ్రుతిని ఇలా చెప్పారు ”పఠన్‌ ద్విజో వాగృష భత్వమీయాత్‌/ స్యాత్‌ క్షత్రియో భూమిపతిత్వ మీయాత్‌/వణిగ్జన: పణ్యఫలత్వ మీయాత్‌/ జనశ్చశూద్రో2పి మహత్వమీయాత్‌” అనగా ”రామాయణం పఠించిన ద్విజులు వేదవేదాంగముల యందును, శాస్త్రములలోనూ పండితులగుదురు. క్షత్రియులు, రాజ్యాధికారమును పొందుదురు. వైశ్యులకు వ్యాపార లాభము కలుగును.
శూద్రులు పై వారికి సేవ చేసిన మహత్వమును పొందుదురు”. వివిక్ష ఎంత స్పష్టంగా ఉందో పై శ్లోకమే రూఢి చేస్తుంది. రామాయణం పఠించినా శూద్రుడు పండితుడు కాలేడు. రాజ్యాధికార ప్రసక్తి లేనేలేదని పై వాక్యాలు స్పష్టంగానే ప్రవచిస్తున్నాయి. అందరికీ రామాయణం ఒకే ఫలాన్ని ఎందుకు ఇవ్వడంలేదు? ఆ కావ్యానికి ఆ వాల్మీకికి ఎందుకింత వివిక్ష శూద్రులమీద ఈ విషయాలేమీ తెలుసుకోలేక ప్రస్తుతం శూద్రులే (బి.సి.లు) ఈ రామాయణాన్ని, ఆ దేవుడ్ని భుజాలు కాయలు కాసేలా మోస్తున్నారు. వాస్తవాన్ని జాతికి తెలియజేయాల్సిన అవసరం
ఉన్నదనేదే నా వ్యాస ఫలశృతి. జ్వాలా నరసింహారావుకి చివరికి ఇందులో గాయత్రి మంత్ర మహత్వం గోచరించింది. ఆయన ఈ విషయాన్ని తన వ్యాసంలో వివరించారు. వనం వారిది ఆర్య బ్రాహ్మణ దృష్టి. మసి పూసి మారేడుకాయలు చేసే జంతర్‌మంతర వాదన. శూద్రునికి ఇలాంటి గతి ఎందుకు పట్టింది అని ఆలోచించే బదులు గాయత్రి చివరి అక్షరంతో ముగించాడని పై శ్లోకానికి పవిత్రత, ఆధ్యాత్మికత జోడించే ప్రయత్నం చేశాడు. ఇదే మనువాదం, మయావాదం. ఇంకా వనం వారికి జ్ఞానోదయం కలిగించే శ్లోకం అదే సర్గ నుండి ”చాతుర్వర్ణ్యం చ లోకే 2 అస్మిన్‌ స్వేస్వే ధర్మే నియోక్ష్యతి” అంటే చాతుర్వర్ణ్యాలను సధర్మంగా నడపడమే రామాయణపు అంతిమ లక్ష్యం. రాముడు, బ్రాహ్మణులకు ఎందుకింత ప్రీతిపాత్రుడయ్యాడు? అతనికి ఎందుకంతగా దైవకత్వాన్ని ఆపాదించారు. ఈ ప్రశ్నకు బాలకాండలోనే మళ్ళీ సమాధానం దొరుకుతుంది. ”గవాం కోట్యయుతం దత్వా విద్వద్భ్యో విధి పూర్వకమ్‌/ అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశా:” దీనిర్ధం కోట్లాది గోవులను అపరిమితమైన ధనధాన్యములను రాముడు, బ్రాహ్మణులకు దానిమిచ్చును. కేవలం ఆర్యుడైనందుకేకాదు బ్రాహ్మణులకు సంతర్పణలు సజావుగా సాగించినందుకు ఆయన దైవత్వాన్ని పొందాడు.
అసలు బ్రాహ్మణ రక్షణార్దమే జన్మించానని శ్రీరాముడు ప్రకటించినందుకు ఆయన్ని దేవుణ్ణి ఆ కావ్యాన్ని మహత్వం గల రచనగా వృద్ది చేసి ప్రచారం చేసి కట్టుకథలకు రంగులు పూసిన ఘటికులు ఈ ఆర్య బ్రాహ్మణులు. రాముడు పితృవాక్య పాలకుడు అంటారు. అంటే బ్రాహ్మణులను నెత్తికెత్తుకొనేవాడని అసలు రహస్యం. బయటకు చెప్పేది అంతగా సరిపోయేలాలేదనడానికి ఈ కావ్యంలోనే సాక్ష్యాలున్నాయి. కోసలను పరిపాలించిన దశరధుడు అతని రాజధాని అయోద్య, ఆయన పాలనలోని ప్రజా వర్ణన మనకు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తాయి. అయోధ్యను ఎవరు నిర్మించారు? ”అయోధ్య నామ నగరీ తత్రాసీల్లోక విశ్రుతా/ మనునా మానవేంద్రేణయాపురీ నిర్మితా స్వయమ్‌” మనువు నిర్మించాడని రామాయణం చెబుతుంది. మనువు నిర్మించిన నగరంలో మూలవాసి బహుజనులకు ఏ స్థానం ఉంటుందో గ్రహించడం పెద్ద కష్టమేమీకాదు. ఇంతటి కుల వివక్షకు భారతీయ సమాజ విధ్వంసానికి కారకుడైన మనవు నిర్మించిన పట్టణంలో శూద్రుల పరిస్థితిని సులభంగానే పసిగట్టగలం. ఆ నగరంలోని బ్రాహ్మణులు మహా పండితులట. క్షత్రియులు, బ్రాహ్మణుల యెడల గౌరవము కలిగి ఉండేవారట. వర్ణ సంకరులు లేనేలేరట (కశ్చిదాసీ దయోధ్యాయాం న చ నిర్వృత్త సంకర:) అంటే వర్ణ వ్యవస్థను చాలా భద్రంగా కాపాడుకున్నరాజు దశరధుడు. వర్ణ సంకరం తప్పా? తప్పనే చెబుతుంది రామాయణం. అంతటి మహాపట్టణంలో నా ప్రజలు ఎంతటి గౌరవాన్ని పొందారోనని మరింత కుతూహలంతో ఇంకా శ్రద్దగా చదివాను. అయ్యో! గుండె లక్షముక్కలయ్యింది. ఇప్పుడు కన్నీళ్ళ బదులు నెత్తురు కారే వాతావరణం నెలకొన్నది. ”శూద్రా: స్వధర్మనిరతా: త్రీన్‌ వర్ణానుపచారిణ:” అంటూ శ్లోకం తగలనే తగిలింది. ప్రొ|| కంచె ఐలయ్య చెప్పినట్టు ”స్వయం గౌరవంలేని జీవితాలనే మాకు తగిలించారు తప్ప వృత్తి గౌరవంగానీ సామాజిక గౌరవంగానీ ఈ జాతులకు కల్పించే ఔదార్యం ఈ బ్రాహ్మణ గ్రంధాలకు గానీ, బ్రాహ్మణ రచయితలకుగానీ లేదు”. ఇంతకీ పై పద్యానికి అర్ధం ఏమిటంటే అయోధ్యనగరంలోని శూద్రులు తమ తమ ధర్మములను ఆచరించుచూ, పై మూడు వర్ణముల (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య) వారిని సేవించిచుండెడివారు. ఈ శ్లోకార్ధం బోధపడ్డాక మనస్సు కకలావికలంకాక మరేమవుతుంది. నెత్తురు సలసలకాగింది. కడలి కల్లోలం అయ్యింది.
వనం వారు ఈ ఆక్రోశాన్ని, ఆవేదనను, తీవ్రవాదమో, నాస్తికవాదమో, చాదస్తమోనని కొట్టిపారేస్తారేమో!? విషయానికొస్తే దశరధుడు ఏ విధంగానైతే వర్ణ ధర్మాన్ని తూ.చ. తప్పకుండా పాటిస్తూ వర్ణ ధర్మాన్ని అతిక్రమించే ప్రశ్నేలేని శిక్షలు విధిస్తూ రాజ్య పాలన చేశాడో, రాముడు కూడా అలాగే నూటికి నూరు పాలు ఆచరించి చూపాడు. అందుకే ఆయన పితృవాక్య పాలకుడయ్యాడు. నా వాదానికి బలమైన సాక్ష్యాన్ని రామాయణంలో బాలకాండ నుండే గ్రహించాను. రాముడు, తాటకను సంహరించే సందర్భంలో ”గో బ్రాహ్మణ హితార్ధాయ దేశస్యాస్య సుఖాయచ / తవ చైవా ప్రమేయస్య వచనం కర్తు ముద్యత:” అంటాడు. ఈ శ్లోక భావము ఏమంటే గో రక్షణము, బ్రాహ్మణుల హితము… కొరకు మీ వచనమును (మాటలను) పాటించుచూ ఈ తాటకను చంపుటకు పూనుకొనుచున్నాను అని రాముడు విశ్వామిత్రుడితో చెప్తాడు. ఇదే పితృవాక్య పాలన అంటే. (పితుర్వచన నిర్దేశాత్‌, పితుర్వచన గౌరవాత్‌). ఇంకా స్పష్టత కావాలంటారా వనం నరసింహారావు పండితోత్తమా!? ఈ దేశ మూలవాసి మహారాణి, నేటి శూద్రాతిశూద్ర కులాల ప్రతినిధి అయిన తాటకిని చంపడం పితృవాక్య పాలనేనా? అంటే స్త్రీలను చంపటం, మాతృస్వామ్య రాజ్యాలను ద్వంసం చేయడం పితృవాక్యపాలనన్నమాట. అలాగే మాతృస్వామ్య వ్యవస్థ నిర్మాతలైన మూలవాసీ భారతీయ తత్త్వ విరోధి, విద్వంశకుడు, పితృస్వామ్య పాలకుడు ఈ దేశ స్త్రీలకు ఎలా దైవంగా మారాడే నేటి మహిళా మేధావులకు ఇంకా బోధపడకపోవడానికి కారణం? అలాగే ఇహపర లోకాల్లో సుఖపడాలనుకునేవారికి రామాయణ పఠనమే అవశ్యకర్తవ్యమని ప్రబోధించాడు మహానుభావుడు వనం జ్వాలా నర్సింహారావు. ఈలోకంలోనే ఇలా వెట్టి చాకిరీతో సుఖపెట్టిన శూద్రాతి శూద్ర జాతులను పరలోకంలో ఎంత సుఖపెడతారో చాలానే అర్దమవుతుంది. దశరధుని రాజ్యంలో బ్రాహ్మణుల భోగలాలసత్వానికి, ధనధాన్యాలకు, గోదానాలకు, కొదవేలేదు. బ్రాహ్మణుల ఆదిక్యతను తెలిపే కథను ఒకదాన్ని రామాయణ బాలకాండ వివరిస్తుంది. అది ”రుష్యశృంగుని కథ” పూర్వం అంగరాజ్యాన్ని రోమపాదుడు పాలించే క్రమంలో అతడు ధర్మం తప్పాడట. ధర్మం తప్పడం అంటే బ్రాహ్మణులను తృప్తిపరచకపోవడం, వర్ణ ధర్మాన్ని పాటించకపోవడం. బహుశా రోమపాదుడు సమానత్వం, ప్రజాస్వామ్యం పట్ల ఆసక్తి చూపెట్టి ఉంటాడు. అయితే కొంతకాలానికి వర్షాలు లేక కరువు వచ్చిందట. దానికి కారణం వర్ణ ధర్మాన్ని విస్మరించడమేనని బ్రాహ్మణులు ప్రచారం చేశారు. రోమపాదుడు బుద్దిష్ట్‌ లేదా జైనమతస్తుడై ఉంటాడు. ఆ ప్రచారంతో రాజ్యంలో కలకలం రేగేలా చేశారు. దానికి పరిష్కారం బ్రాహ్మణుడు, యజ్ఞకర్మల్లో నిష్ణాతుడైన రుష్యశృంగున్ని ఆహ్వానించి యజ్ఞం చేయించడమేనని నమ్మబలికారు.
చివరికి రోమపాదుడు బ్రాహ్మణ తంత్రానికి తలొగ్గక తప్పలేదు. రుష్యశృంగుడు రాజ్యంలో అడుగు పెట్టగానే వర్షం భీకరంగా కురిసిందట. దానికి రాజు తృప్తిపడి విపరీత దానాలతో పాటు కూతురునిచ్చి వివాహం చేశాడట. ఈ మోసపూరిత కథ ద్వారా వారిచ్చే సందేశం ఏమంటే బ్రాహ్మణులు పరమ పవిత్రులని. వారు రాజ్యంలో ఉంటే రాజ్యంలో వర్షాలు కురవడం, సుభిక్షంగా ఉండటం. ఇక్కడ రెండు ప్రశ్నలు 1) వర్ణ సంకరాన్ని వ్యతిరేకించే రామాయణం, బ్రాహ్మణుడైన రుష్య శృంగునికి క్షత్రియుడైన రోమపాదుడు కూతురునిచ్చి వివాహం చేయడాన్ని ఎలా సమర్ధించింది? 2) వర్ణ సంకరమే రుచించని దశరధుడు, వర్ణ సంకరానికి పాల్పడిన రుష్యశృంగుని ఆధ్వర్యంలో పుత్ర కామేష్టి యాగం ఎలా చేశాడు? అప్పుడు దశరధుని గురించి రామాయణం చెప్పింది శుద్ద తప్పు కదా? ఈ కథను ప్రచారం చేసి మొత్తం రాజ్యంలోని బ్రాహ్మణులు తిరుగులేని ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు. ఇలాంటి ఉన్నత స్థానం బ్రాహ్మణులకిచ్చి నీచస్థానం శూద్రులకిచ్చిన రామాయణం నరసింహారావుగారు అన్నట్టు నా చాలా సందేహాలను నివృత్తి చేసింది. రామాయణం ద్వారా ఆర్యులు సాధించదలచుకున్న ప్రయోజనాలు చాల ానే
ఉన్నాయి. మాతృస్వామ్యాన్ని నాశనం చేయడం, క్షత్రియులపైన స్థానాన్ని ఆక్రమించుకోవడం (క్షత్రియుల స్థానాన్ని దిగువకు నెట్టివేయడం రామాయణంలో చాలా చోట్ల కన్పిస్తుంది)” మరో ముఖ్యమైన ప్రయోజనం మూలవాసి చక్రవర్తులను హతమార్చి ధర్మ పరిరక్షకులుగా కీర్తించబడటం. డా|| ఎస్‌.వి. రారు ”సింధూ నాగరికతకు ప్రధానమైన మొహెంజోదారోను జయించడానికి ఆర్యులు చేసిన యుద్దం చుట్టూ రామకథను అల్లారు” అంటాడు. అంతేగాక దక్షిణ భారతదేశంలోకి ఆర్య సంస్కృతిని, ఆర్యుల దురాక్రమణను పరోక్ష రూపంలో వనవాసం పేరుతో దండయాత్రగా సాగించాడు రాముడు. అందుకు వాల్మీకి రామాయణంలోని బాలకాండనే ప్రత్యక్షసాక్ష్యం. రాముడు తనసహచరి సీతతో, లక్ష్మణుని కలుపుకుని దండకారణ్యంలోకి ప్రవేశించాడు. నేటి దండకారణ్యమే ఆనాటిది కూడా. ఆ దండకారణ్యంలోకి రాముడు ఎందుకు ప్రవేశిస్తాడు. ఆరాజ్యం రాముడిది కాదు.
పరాయి రాజ్యంలోకి అక్రమంగా ప్రవేశించే అర్హత మరో రాజుకు ఉంటుందా? ఇది రాజనీతి అవుతుందా? మూల వాసీ చక్రవర్తి రావణుడు ఆ రాజ్యాధిపతి. అందుకు ఈ శ్లోకమే నిర్ధారణ. ”తేన తత్రైవ వసతా జనస్థాన వాసినీ” (బాలకాండ 1వ సర్గ 46వ శ్లోకం) దండకారణ్యంలో జనస్థానమనే ప్రాంతం ఉంది. అది రావణుని రాజ్యంలో భాగం.
ఆ రాజ్యానికి శూర్పణఖ రక్షకాధిపతి. ఆ ప్రాంతంలో ఆర్యులు అక్రమంగా ఆశ్రమాల నెపంతో దురాక్రమణ చేస్తుంటే సహజంగానే శూర్పణఖ వారిని తరిమి కొడుతుంది. ఇది ఏరాజైనా, రాణైనా చేసే రాజనీతి. ఆర్యులు వెంటనే దండకారణ్య సమీపంలోని రామున్ని దర్శించారు. రెచ్చగొట్టారు. రాముడు దండకార్యాన్ని ఆక్రమించి ఆ ప్రాంతం నుండి రక్షసులను (రాక్షసులనేది వారి భాష) ఆ ప్రాంతం నుండి తరిమి వేస్తానని ప్రతినబూనాడు. దండకారణ్యంలోకి ప్రవేశించాడు. అంతే సహజంగా రక్షసులు వీరి ప్రవేశాన్ని ఎదిరించారు. వరుసగా అడ్డుకున్నవారందరిని హతమార్చాడు రాముడు. క్రూరాతిక్రూరంగా రాజనీతికి, యుద్ధ నీతికి వ్యతిరేకంగా ఈ హింసాకాండ జరుగుతున్న తీరుకు సీత చలించిపోయింది. ఎంతైనా తల్లి హృదయం కదా! ఆమె, రాముణ్ణి నివారించే ప్రయత్నం చేసింది. అకారణంగా ఈ అటవీ రక్షకులను సంహరించడం అన్యాయం అని అర్దించింది. ఈ సందర్భంలో సీతామాత పలికిన దయార్ద్ర వచనములు రామునికి చెవికెక్కలేదు. ”ప్రతిజ్ఞా తస్త్వయా, వీర! దండకారణ్య వాసినామ్‌/ ఋషీణాం రక్షణార్ధాయా వధస్సంయతి రక్షసామ్‌” ఇది దండకారణ్యమ్‌ ఇది వారి నివాస స్థలం (రాక్షసులు). వారు ఇక్కడ నివసించడమే ధర్మం. వారి ప్రాంతంలోనికి అనధికారికంగా ప్రవేశించి వారినే సంహరించడం అధర్మం. ఏ వైర భావం లేకున్నను వీరిని హతమార్చుట తగునా? అని ప్రశ్నించడమే పై శ్లోకం. సీత మరింత లోతుగా న్యాయాన్యాయ వివేచన, ధర్మాధర్మ ఆచరణ నిబద్దతను స్పృశించింది. ”క్వచ శస్త్రం క్వచ వనం క్వచక్షాత్రం తప: క్వచ/ వ్యావిద్దమిదమ స్మాభి: దేశ ధర్మస్తు పూజ్యతామ్‌” (అరణ్యకాండ తొమ్మిదో సర్గ 27వ శ్లోకం). అంటే మనమిప్పుడు వనవాసంలో ఉన్నాం. వన జీవన ధర్మమగు తప: వృత్తిని ఆచరించాలి. అలా కాక అస్త్రము ధరించి ఇలా హత్యా కాండకు పూనుకొనడం సరికాదు. శస్త్రదారణమెక్కడీ వనవాసమెక్కడీ క్షత్రియ ధర్మమెక్కడీ తపో వృత్తి యెక్కడీ ఇవి పరస్పర విరుద్దములు. కావాలంటే అయోధ్య చేరిన తరువాత వనవాసం ముగిసిన వెంటనే మీ క్షత్రియ ధర్మమైన యుద్దాన్ని కొనసాగించండి అంటూ మరోసారి ధర్మ పరిశీలన చేసింది.
ఈ మాటలు రాముడికి వంటబట్టలేదు. బ్రాహ్మణులకు మాట యిచ్చాను. ఏదిఏమైనా ఈ రాక్షసులను హతమార్చి తీరుతాను అంటూ ఆమె నోరు మూయించాడు. దండకారణ్య ప్రవేశాన్ని వ్యతిరేకించినందుకే రాముడు, శూర్పణఖ ముక్కు, చెవులు కోయించాడు. కామరూపత అనేది వట్టి శాకు. పిచ్చికుక్కను చేసి చంపే కుట్ర ఇందులో దాగి ఉంది. అంతేకాదు ఆ దండకారణ్య సైనాన్ని శ్రీరాముడు ఊచకోత కోశాడు.
(బాలకాండ 1వ సర్గ శ్లోకం 48) ”వనే తస్మిన్‌ నివసతా జనస్థాన నివాసినామ్‌ / రక్షసాం నిహతాన్యాసన్‌ సహస్రాణి చతుర్ధశ”. అనగా ఖరుడు, ధూషణుడు, త్రిశరుడు మొ|| వీర యోధులను దాదాపు 14 వేల మంది సైనాన్ని హతమార్చారు రామ లక్ష్మణులు. అక్రమంగా తమ రాజ్యంలోనికి ప్రవేశించి తమ సోదరి ముక్కు చెవులు కోసి 14 వేల మంది తమ సైన్యాన్ని నెత్తుటి యేరులో ముంచి నరమేదం సృష్టించినా రావణుడికి కోపం రాకూడదా? ఇప్పుడు పాకిస్తాన్‌ సరిహద్దుల్లో ఆ దేశం చేస్తున్న కవ్వింపు చర్యలే ఆనాటి ఆర్యులు చేసిన ఉదంతం ఇది. కాదంటారా నరసింహారావు తత్వ వివేచకా?! దీన్ని మాబోటి శూద్రులు ఏ దృష్టితో పారాయణం చేయమంటారు? ఈ నరమేధాన్ని ఎలా అర్ధం చేసుకోమంటారు? తప్పొప్పులను ఏ మర్మాలతో అంచనా కట్టమంటారు.
దీనికి కారణం ఏ వాల్మీక దృక్ఫధం నిర్వచిస్తుంది. చివరగా వాల్మీకి బోయవాడా? కాదా? తేల్చేందుకు నరసింహారావు ఒక కథను ఉటంకించారు. అందులో ఋషులకు ఎదురైన వాల్మీకిని నీచ బ్రాహ్మణుడా? అంటూ సంభోదిస్తారు. బోయవాని వేషంలో ఉన్న వాల్మీకిని బోయవాడా అని సంబోధించక బ్రాహ్మణుడా అని సంబోధించడంలోని మర్మమేమంటారు జ్వాలాగారు? ఇకనైనా చరిత్రలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుని శూద్రాతి శూద్రులకు ఈ ఆర్య గ్రంధాలు చేసిన అపరాదాన్ని నష్టాన్ని పూడ్చేందుకు ప్రయత్నించాలి. ఈ గ్రంధాల్లోని కుట్రలను గ్రహించి బహుజనులు ఏకమై రాజ్యాధికారం దిశగా సాగాలి. ఇదే పరిష్కారం.

డాక్టర్‌ కదిరె కృష్ణ పేస్‌ బుక్‌ పోస్టు సౌజన్యంతో

Share this:

  • Tweet
  • More
Like Loading...

నేనెందుకు బిజెపి నుంచి రాజీనామా చేస్తున్నాను ? ఒక మేథావి ఆత్మశోధన

19 Tuesday Jun 2018

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Others, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, BJP activist, BJP leaders lies, Naredra Modi, Shivam Shankar Singh, Shivam Shankar Singh Political Consultant

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌, శివం శంకర్‌ సింగ్‌

శివం శంకర్‌ సింగ్‌

(బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ నాయకత్వంలోని బృందంలో అనేక ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో శివం శంకర్‌ సింగ్‌ పని చేశారు. రచయిత, ఇండియా ఫౌండేషన్‌లో సీనియర్‌ పరిశోధకుడు అయిన సింగ్‌ బిజెపి రాజకీయ ప్రచారాల సమాచార విశ్లేషకుడిగా పనిచేశారు. అమెరికాలోని మిచిగాన్‌ విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేట్‌. ఒక పార్లమెంట్‌ సభ్యుని వద్ద సహాయకునిగా కూడా పని చేశారు )

దేశంలో రాజకీయ చర్చ, కనీసం నా జీవిత సమయంలో అత్యంత నీచమైన స్ధానంలో వుంది.భాగస్వామ్యం అనూహ్యం. తమ పక్షాన వున్న రుజువు ఏమిటి అనేదానితో నిమిత్తం లేకుండా జనాలు మద్దతు కొనసాగిస్తున్నారు. తాము కుహనా వార్తలను వ్యాపింప చేస్తునాసషశ్రీతీయత్నీమని రుజువు అయిన తరువాత కూడా వారిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించటం లేదు. ఇది ప్రతివారిలో వుంది, పార్టీలు మరియు ఓటర్లు లేదా మద్దతుదార్లందరూ దీనికి బాధ్యులే అని చెప్పాల్సి వుంది. నమ్మశక్యం గాని విధంగా అత్యంత శక్తివంతమైన ప్రచారం ద్వారా కొన్ని ప్రత్యేక సందేశాలను వ్యాపింప చేయటంలో భారతీయజనతా పార్టీ ఎంతో చేసింది. ఆ పార్టీకి ఇంకేమాత్రం మద్దతు ఇవ్వకూడదని నేను నిర్ణయించుకోవటానికి ప్రాధమిక కారణాలు ఆ సందేశాలే. అయితే అవేమిటి అనే వివరాల్లోకి వెళ్లే ముందు ఏ పార్టీ కూడా పూర్తిగా మంచిదీ కాదు పూర్తిగా చెడ్డదీ కాదు అని అర్ధం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వాలన్నీ ఎంతో కొంత మంచి చేశాయి, కొన్ని రంగాలలో మురికిగా వ్యవహరించాయి.ఈ ప్రభుత్వం దీనికి మినహాయింపేమీ కాదు.

మంచి పనులు

1.గతంతో పోలిస్తే రోడ్ల నిర్మాణం వేగంగా వుంది. రోడ్డు పొడవును లెక్కించే పద్దతిలో తేడా వుంది, దానిలో కారణాంకనాలున్నప్పటికీ అది వేగంగానే జరిగినట్లు కనిపిస్తుంది.

2.విద్యుత్‌ కనెక్షన్లు పెరిగాయి. అన్ని గ్రామాలు విద్యుదీకరించబడ్డాయి, జనానికి ఎక్కువ గంటలు విద్యుత్‌ లభిస్తోంది.( కాంగ్రెస్‌ ఐదులక్షల గ్రామాలను విద్యుదీకరించింది. చివరి 18వేలకు పైగా వున్న గ్రామాలను మోడీ పూర్తి చేశారు. ఈ సాధనను మీరు కోరుకున్న విధంగా పరిగణించవచ్చు. ఇదే విధంగా స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ విద్యుత్‌ సరఫరా పెరుగుతూనే వుంది, కానీ మనకు బిజెపి హయాంలోనే పెద్ద పెరుగుదల వున్నట్లు మనం చూడవచ్చు) 3. వున్నత స్ధాయిలో అవినీతి తగ్గింది- ఇప్పటి వరకు మంత్రుల స్ధాయిలో పెద్ద కేసులేమీ లేవు( అయితే యుపిఏ ఒకటి హయాంలో కూడా ఇలాగే వున్నమాట నిజం. దిగువ స్ధాయిలో అలాగే వున్నాయి, చెల్లించాల్సిన మొత్తాలు పెరిగాయి, పోలీసులు, పట్వారీలు తదితరుల ను అదుపు చేయగలవారెవరూ కనిపించటం లేదు.) 4. స్వచ్చభారత్‌ కార్యక్రమం నిస్సందేహంగా విజయవంతమైంది. గతం కంటే ఎక్కువగా మరుగుదొడ్లు నిర్మించారు ఇప్పుడు జనాల మనస్సులో స్వచ్చత భావన నెలకొన్నది. 5. వుజ్వల యోజన ఒక గొప్ప చొరవ అయితే రెండవ సిలిండర్‌ను ఎంత మంది కొన్నారో చూడాల్సి వుంది. మొదటిది, స్టవ్‌ వుచితం, అయితే జనాలు ఇప్పుడు వాటికి డబ్బు చెల్లించాల్సి వుంది, ప్రభుత్వం కార్య క్రమం చేపట్టినప్పటి నుంచి సిలిండర్‌ ఖర్చు రెట్టింపైంది, ఇప్పుడు ఒక్కొక్కటి ఎనిమిది రూపాయలకంటే ఎక్కువ వుంది. 6. ఈశాన్య భారత్‌తో సంబంధాలు నిస్సందేహంగా పెరిగాయి. రైళ్లు, రోడ్లు, విమానాలు పెరిగాయి. అన్నింటికంటే ముఖ్యమైనదేమంటే ప్రధాన స్రవంతి న్యూస్‌ ఛానళ్లలో ఈ ప్రాంతం గురించి చర్చ జరుగుతోంది. 7. ప్రాంతీయ పార్టీల పాలనతో పోలిస్తే శాంతి భద్రతల పరిస్ధితి మెరుగ్గా వుంది.

చెడ్డ పనులు

జాతులు, వ్యవస్ధలను నిర్మించాలంటే దశాబ్దాలు, శతాబ్దాలు పడుతుంది. బిజెపి పాలనలో నేను చూసిన అతి పెద్ద వైఫల్యం ఏమంటే చాలా దుర్బలమైన కారణాలను చూపి కొన్ని గొప్పవాటిని నాశనం చేయటం.

1. ఎలక్ట్రరల్‌ బాండ్లు ా ఇది అవినీతిని చట్టబద్దం చేస్తుంది, మన రాజకీయపార్టీలను కొనుగోలు చేసేందుకు కార్పొరేట్లు, విదేశీశక్తులకు అవకాశమిస్తుంది. ఈ బాండ్లు అజ్ఞాతమైనవి. కాబట్టి ఒక కార్పొరేట్‌ సంస్ధ మీరు గనుక ఒక నిర్ణీత విధానాన్ని ఆమోదిస్తే వెయ్యి కోట్ల విలువైన ఎలక్ట్రొరల్‌ బాండ్లు ఇస్తాను చెబుతుంది, దానిని శిక్షించేవారుండరు. దీని వలన ఒక అజ్ఞాత సాధనం ద్వారా నీకిది నాకది అని నిరూపించే అవకాశం వుండదు. ఇది మంత్రిత్వస్ధాయికి అవినీతిని ఎలా దించిందో కూడా వివరిస్తోంది. దీనికి ఫైలు లేదా వుత్తరువులతో పని లేదు. ఇది అమెరికాలో మాదిరి విధాన స్ధాయిలోనే జరుగుతోంది. 2. ప్రణాళికా సంఘ నివేదికలు :సమాచార ప్రధాన వనరులుగా వీటిని వినియోగించుకోవచ్చు.ప్రభుత్వ పధకాలను అవి ఆడిట్‌ చేస్తాయి, ఎలా జరుగుతున్నదీ చెబుతాయి. అది పోయిన తరువాత ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్ని నమ్మటం తప్ప మరొక మార్గం లేదు.(కాగ్‌ నివేదికలు చాలా కాలం తరువాత వస్తాయి) నీతి అయోగ్‌కు ఈ బాధ్యత లేదు, అది మౌలికంగా సలహాలిచ్చే మేథావులతో నిండిన, ప్రజా సంబంధాల సంస్ధ మాత్రమే. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయకుండానే ప్రణాళిక లేదా ప్రణాళికేతరానికి తేడా లేకుండా చేయవచ్చు.3. సిబిఐ, ఇడిల దుర్వినియోగం: నేను చూసినంత వరకు వీటిని రాజకీయ ప్రయోజనాల కొరకు వినియోగిస్తున్నారు. ఒక వేళ అలాంటిదేమీ లేదనుకుంటే మోడీ లేదా అమిత్‌ షాకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఈ సంస్ధల ద్వారా వారిమీద దాడిచేయిస్తారనే భయం వున్న మాట నిజం. ప్రజాస్వామ్యంలో అంతర్భాగమైన భిన్నాభిప్రాయాన్ని హతం చేయటానికి ఇది చాలు. 4. కాలిఖో పాల్‌ ఆత్మహత్య నోట్‌, జడ్జి లోయా మరణం, సొహ్రబుద్దీన్‌ హత్యల దర్యాప్తులో విఫలం, వున్నావోలో ఒక రేప్‌ కేసులో నిందితుడైన ఎంఎల్‌ఏను వెనకేసుకురావటం, అతని బంధువు ఆ బాలిక తండ్రిని హత్యకేసులో నిందితుడు కావటం, ఒక ఏడాది పాటు ఎఫ్‌ఐర్‌ నమోదు చేయకపోవటం.5. పెద్ద నోట్ల రద్దు: ఇది విఫలమైంది, అంతకంటే దారుణం ఏమంటే ఆ వైఫల్యాన్ని బిజెపి అంగీకరించలేకపోవటం. ఈ చర్య ద్వారా వుగ్రవాదులకు నిధులు నిలిచిపోతాయని, నగదు లావాదేవీలు తగ్గుతాయని, అవినీతి అంతమౌతుందని చేసిన ప్రచారమంతా అసంబద్దమైనది. ఇది వాణిజ్యాన్ని అంతం చేసింది. 6. జిఎస్‌టి అమలు: దీన్ని హడావుడిగా అమలు జరిపారు, వ్యాపారానికి హాని చేసింది. వ్యవస్ధను సంక్లిష్టం గావించింది. వివిధ వస్తువుల మీద అనేక రేట్లు, పన్నుల దాఖలులో సంక్లిష్టత. కొంత వ్యవధిలో స్ధిరపడుతుందని అనుకున్నారు, కానీ అది హాని చేసింది. ఈ వైఫల్యాన్ని అంగీకరించేందుకు బిజెపి ఎంతో దురహంకారంతో వ్యవహరించింది.7.కేవలం చప్పట్లు కొట్టించుకొనేందుకు విదేశాంగ విధానాన్ని గందరగోళపరచటం: శ్రీలంకలో చైనాకు ఒక రేవు వుంది, బంగ్లాదేశ్‌, పాకిస్ధాన్లలో పెద్ద ప్రయోజనాలున్నాయీభారత్‌ను చుట్టుముడుతోంది, మాల్దీవులలో వైఫల్యం( భారత విదేశాంగ విధాన వైఫల్యం కారణంగా అక్కడ ఇంకే మాత్రం భారతీయ కార్మికులకు వీసాలు దొరికే అవకాశం లేదు) మోడీగారు విదేశాలు తిరుగుతూ 2014కు ముందు విదేశాలలో భారతీయులంటే గౌరవం లేదని ఇప్పుడు ఎంతగానో గౌరవిస్తున్నారని చెబుతున్నారు.( ఇదొక చెత్త మన ఆర్ధిక వ్యవస్ధ మరియు ఐటి రంగంలో పురోగమనం కారణంగా విదేశాలలో భారత్‌కు గౌరవం ప్రత్యక్ష ఫలితం, మోడీ కారణంగా అది ఒక్క ఔన్సు కూడా మెరుగుపడలేదు, బీఫ్‌ పేరుతో వధించటాలు, జర్నలిస్టులకు బెదిరింపుల వంటి వాటితో అదింకా దిగజారి వుండవచ్చు) 8. పధకాల వైఫల్యం, వాటిని గుర్తించటంలో లేదా సరిచేయటంలో వైఫల్యం : సంసద్‌ ఆదర్శ గ్రామ యోజన, మేకిన్‌ ఇండియా, నైపుణ్య అభివృద్ధి, ఫసల్‌ భీమా( తిరిగి చెల్లింపులను చూస్తే బీమా కంపెనీల జేబులు నింపటం కనిపిస్తుంది.) నిరుద్యోగం, రైతాంగ సంక్షోభాలను గుర్తించటంలో వైఫల్యం, ప్రతి వాస్తవ సమస్యను ప్రతిపక్ష నాటకంగా వర్ణించటం. 9. పెట్రోలు, డీజిల్‌ ధరల పెరుగుదల : కాంగ్రెస్‌ అధికారంలో వుండగా మోడీ, బిజెపి మంత్రులు మరియు మద్దతుదార్లందరూ వాటి ధరలు ఎక్కువగా వున్నాయని విమర్శించారు. అప్పటితో పోలిస్తే అప్పుడు ముడిచమురు ధర తక్కువగా వున్నప్పటికీ ఎక్కువగా ధరలు వుండటాన్ని ఇప్పుడు సమర్ధిస్తున్నారు. ఇదేమాత్రం ఆమోదయోగ్యమైనది కాదు. 10. అత్యధిక మౌలిక సమస్యల విషయాలపై పని చేయటంలో వైఫల్యం : విద్య, ఆరోగ్య సంరక్షణ. విద్యారంగంలో చేసిందేమీ లేదు, జాతీయంగా అది అతి పెద్ద వైఫల్యం.దశాబ్దాలుగా ప్రభుత్వ పాఠశాలల నాణ్యత తగ్గిపోయింది(ఎఎస్‌ఇఆర్‌ నివేదికలు) ఎలాంటి చర్య తీసుకోలేదు. గత నాలుగు సంవత్సరాలుగా ఆరోగ్య సంరక్షణకు వారు చేసిందేమీ లేదు. ఆయుష్మాన్‌ భారత్‌ ప్రకటించారు. చేసిందేమీ లేకపోగా ఆ పధకం నన్ను మరింత భయపెడుతోంది.బీమా పధకాలు భయంకర బాటలో నడుస్తున్నాయి అవి అమెరికా బాటలో నడుస్తున్నాయి.అది ఆరోగ్య రక్షణలో భయంకరమైన గమ్యం(మైఖేల్‌ మూర్‌ సినిమా సికో చూడండి)

మీరు కొన్నింటిని జోడించవచ్చు, సమస్యను మీ స్వంత అవగాహన మేరకు మరికొన్నింటిని తీసివేయవచ్చు, కానీ ఇది నా మదింపు. ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌ సమస్య పెద్దది, సుప్రీం కోర్టు దానిని రద్దు చేయవచ్చని అనుకుంటున్నాను. ప్రతి ప్రభుత్వానికి కొన్ని వైఫల్యాలు, కొన్ని చెడులు వుండవచ్చు గానీ అన్నింటికంటే పెద్ద సమస్య నైతికవిలువలకు మించి లేదు.

వికారమైనది

ఈ ప్రభుత్వ నిజమైన ప్రతికూలత ఏమంటే ఎంతో యోచించిన పధకం ప్రకారం జాతీయ చర్చను అది ఎలా దెబ్బతీసిందనేదే. ఇది వైఫల్యం కాదు, ఇదొక పధకం.

1. ఇది మీడియాను నమ్మరానిదిగా చేసింది. దాంతో ఇప్పుడు ప్రతి విమర్శ వెనుక ఒక జర్నలిస్టు బిజెపి లేదా కాంగ్రెస్‌ నుంచి డబ్బు తీసుకుంటున్నట్లు చిత్రితమౌతున్నది. అనేక మంది జర్నలిస్టుల విషయంలో అది వాస్తవం కాదని నాకు తెలుసు. అంతకంటే ముఖ్య మైన అంశమేమంటే ఏ ఒక్కరూ ఆరోపణలు లేదా ఫిర్యాదుల గురించి ఎన్నడూ పట్టించుకోలేదు కేవలం సమస్యను ముందుకు తెచ్చి వ్యక్తుల మీద దాడిచేయటం, తరువాత సమస్యను కూడా విస్మరిస్తున్నారు. 2.గత డెబ్బయి సంవత్సరాలలో ఏమీ జరగలేదనే ఒక అభిప్రాయాన్ని బలవంతంగా రుద్దారు. ఇది పూర్తిగా అనుచితం, ఫలితంగా తలెత్తే మానసిక ప్రవృత్తి దేశానికి హానికరం. ప్రభుత్వం ప్రకటనల మీద నాలుగువేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది, ఇప్పుడది ఒక ధోరణిగా మారింది. చిన్న పనులు చేసినా పెద్దగా ప్రచారం చేసుకోవటం. మొదటిసారిగా రోడ్లను మోడీ నిర్మించలేదు. మాయావతి, అఖిలేష్‌ యాదవ్‌ల మానసపుత్రికల వంటి పధకాల ద్వారా నిర్మించిన కొన్ని మంచి రోడ్ల మీద నేను ప్రయాణించాను. 1990 దశకం నుంచి భారత్‌ ఐటి శక్తి కేంద్రంగా మారింది. నేడున్న పరిస్ధితులను బట్టి గత పని తీరును అంచనా వేస్తూ గత నాయకులను దూషించటం సులభం. వుదాహరణకు ఎవరైనా కాంగ్రెస్‌ 70 సంవత్సరాలుగా మరుగుదొడ్లను ఎందుకు నిర్మించలేదని అడగవచ్చు. వారు కొన్ని మౌలికమైనవి కూడా చేయలేకపోయారు. ఈ వాదన ఎంతో తర్కబద్దంగా వినిపించవచ్చు, దేశ చరిత్రను చదవటం ప్రారంభించే వరకు నేను కూడా నమ్మాను. 1947లో మనం స్వాతంత్య్రం సంపాదించుకొనే నాటికి మనది చాలా పేద దేశం. మనకు ఒక రాజధాని లేదు మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన వనరులు లేవు. దీన్ని అధిగమించేందుకు నెహ్రూ సోషలిస్టు మార్గం పట్టి ప్రభుత్వరంగ సంస్ధలను ఏర్పాటు చేశారు. మనకు వుక్కు ఫ్యాక్టరీ నిర్మించుకొనే సామర్ధ్యం లేకపోతే రష్యన్ల సాయం తీసుకున్నారు. దేశంలో యంత్రాలు, వుక్కు తయారీకి రాంచీలో హెవీ ఇంజనీరింగ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు. ఇవి లేకుండా మనకు వుక్కు వుండేది కాదు, ఇతర మౌలిక సదుపాయాలూ వుండేవి కావు. మనకు ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి కరవులు వచ్చేవి,పెద్ద సంఖ్యలో జనం మరణించేవారు. జనానికి తిండి పెట్టటం ప్రాధాన్యత, అప్పుడు మరుగుదొడ్లు విలాసం దానికోసం ఎవరూ చూడలేదు. హరిత విప్లవం వచ్చి 1990దశకం నాటికి ఆహార కొరత అదృశ్యమైంది. ఇప్పుడు మనం మిగులు సమస్యను ఎదుర్కొంటున్నాము. మరుగుదొడ్ల మాదిరే పాతికేండ్ల తరువాత నరేంద్రమోడీ అన్ని ఇండ్లకు ఎసి ఎందుకు పెట్టించలేదని అడుగుతారు. అది ఈ రోజు ఒక విలాసంగా కనిపించినట్లే ఒక రోజు మరుగుదొడ్లు కూడా విలాసమే. ఈ పరిణామం త్వరలో జరగవచ్చు లేదా పదిపదిహేనేండ్ల క్రితమే జరిగి వుండవచ్చు. కానీ 70ఏండ్లలో ఏమీ జరగలేదని చెప్పటం బలవంతంగా రుద్దే ఒక భయంకరమైన అవాస్తవం. 3. కుహనా వార్తల వ్యాప్తి, వాటిపై ఆధారపడటం : బిజెపి వ్యతిరేక కుహనా వార్తలు కూడా కొన్ని వున్నాయి, కానీ బిజెపి అనుకూల, ప్రతి పక్ష వ్యతిరేక కుహనా వార్తలు జనానికి చేరటంలో మైళ్ల దూరం ముందున్నాయి. వాటిలో కొన్ని మద్దతుదార్లవి, అయితే ఎక్కువ భాగం పార్టీ నుంచే వస్తున్నాయి. తరచూ అవి విద్వేషపూరితంగానూ జన సమీకరణ వైఖరి అంతకంటే నీచమైనవిగా కూడా తయారవుతున్నాయి. ఈ ప్రభుత్వ మద్దతు వున్న ఆన్‌లైన్‌ న్యూస్‌ పోర్టల్స్‌ మనకు తెలిసినదాని కంటే సమాజానికి ఎక్కువ హాని చేస్తున్నాయి. 4. హిందూయిజం ప్రమాదంలో వుంది: హిందువులు, హిందూయిజం ప్రమాదంలో వుందనే భావనను, మనల్ని రక్షించాలంటే మోడీ మాత్రమే దిక్కు అని జనాల బుర్రలోకి నూరిపోశారు. వాస్తవంలో జనాల భావంలో మార్పు తప్ప ఈ ప్రభుత్వం రాకముందు హిందువులు ఎలా జీవిస్తున్నారో ఇప్పుడు కూడా అలాగే వున్నారు, మారిందేమీ లేదు. హిందువులమైన మనం 2007లో ప్రమాదంలో పడ్డామా? నావరకైతే దాని గురించి రోజూ వినలేదు, మరింత భయం, విద్వేషం తప్ప హిందువుల స్ధితిగతులలో నాకైతే మెరుగుదల కనిపించలేదు. 5. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మీరు దేశవ్యతిరేకులు, ఇటీవలి కాలంలో హిందూ వ్యతిరేకులు అంటున్నారు. ఈ విధమైన ముద్రవేయటం ద్వారా న్యాయమైన విమర్శను బయటకు రాకుండా చేస్తున్నారు. మీ జాతీయతను రుజువు చేసుకోండి, ప్రతిచోటా వందేమాతరం పాడండి( బిజెపి నేతలకు దానిలో వుండే పదాలేమిటో కూడా తెలియనప్పటికీ దానిని పాడాలని మిమ్మల్ని బలవంతం చేస్తారు.) నేను జాతీయవాదిగా గర్వపడతాను, అయితే దాన్ని బహిరంగంగా ప్రదర్శించమని ఏవరైనా బలవంతం చేయటాన్ని నా జాతీయవాదం అనుమతించదు. అవసరమైనపుడు లేదా నాకు పాడాలని అనిపించినపుడు జాతీయ గీతాన్ని జాతీయ పాటను నేను పాడతాను. అయితే ఇతరుల వెర్రులకు అనుగుణ్యంగా పాడాలని ఎవరైనా బలవంతం చేస్తే నేను పాడను.6. బిజెపి నేతలు నిర్వహిస్తున్న వార్తా ఛానళ్ల ఏకైక కార్యక్రమం హిందూ-ముస్లిం, జాతీయవాదం-జాతి వ్యతిరేకులు, భారత్‌-పాకిస్ధాన్‌, సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే, విడిపోయే సమీకరణలను రెచ్చగొట్టే చర్చలు మాత్రమే. అవి ఏవో మీ అందరికీ తెలుసు, నీచమైన ప్రచారాన్ని వెదజల్లే చర్చలు జరిపేవారికి నజరానాలు అందచేస్తున్న విషయం కూడా మీకు తెలుసు. 7. సమీకరణ : అభివృద్ధి సందేశం గతించింది. వచ్చే సాధారణ ఎన్నికలకు బిజెపి వ్యూహం ఏమిటంటే విభజించే సమీకరణలను, కుహనా జాతీయవాదాన్ని రెచ్చగొట్టటం. మోడీగారు స్వయంగా తన ప్రసంగాల్లో చెప్పారు. జిన్నా, నెహ్రూ, భగత్‌ సింగ్‌ జైల్లో వున్నపుడు కాంగ్రెస్‌ నేతలు ఆయనను పరామర్శించలేదు( ఆ నకిలీ వార్త స్వయంగా ప్రధాని నోటి నుంచి వెలువడింది). గుజరాత్‌లో మోడీని ఓడించేందుకు కాంగ్రెస్‌ నేతలు పాకిస్ధాన్‌లో సమావేశమయ్యారు. అక్బర్‌ కంటే మహారాణా ప్రతాప్‌ గొప్పవాడని అని యోగి గారు చెబుతారు. జెన్‌యు విద్యార్ధులు జాతి వ్యతిరేకులు, వారు దేశాన్ని ముక్కలు చేస్తారు. ఈ ప్రచారమంతా విడదీయండి, ఎన్నికల్లో గెలవండి అనే ఒక ప్రత్యేక లక్ష్యంతో రూపొందించినది. ఇటువంటి దానిని మా నేతల నుంచి వినాలని కోరుకోవటం లేదు, రాజకీయ ప్రయోజనాల కోసం కొట్లాటలతో దేశం తగుల బడాలని కోరుకొనే ఎవరినైనా అనుసరించేందుకు నేను వ్యతిరేకిస్తాను.

జాతీయ చర్చను ఒక చీకటి కోణంలోకి బిజెపి ఎలా నెడుతోందో చెప్పేందుకు కొన్ని వుదాహరణలు మాత్రమే ఇవి. దీని కోసం నేను బిజెపిలో చేరలేదు, వీటన్నింటికీ నేను మద్దతు ఇవ్వలేను, అందుకే నేను బిజెపి నుంచి రాజీనామా చేస్తున్నా.

గమనిక: భారత ఆశాకిరణం మాదిరి నరేంద్రమోడీ గారు కనిపించటంతో నేను 2013 నుంచి  బిజెపిలో పని చేస్తున్నాను, అభివృద్ధి  సందేశాన్ని నమ్మాను. ఆ సందేశం, ఆశ ఇప్పుడు పూర్తిగా పోయాయి. నావరకైతే నరేంద్రమోడీ మరియు అమిత్‌ షా ప్రభుత్వంలోని సానుకూలతల కంటే ప్రతికూలతలు ఎక్కువగా వున్నాయి.అయితే ప్రతి ఓటరు స్వంతంగా ఆ నిర్ణయం తీసుకోవాలి. వాస్తవాన్ని, చరిత్రను ఎలా సంక్లిష్టం గావిస్తున్నారో తెలుసుకోండి. ప్రచారాన్ని తేలికగా తీసుకోవటం, ఎలాంటి ప్రశ్నలు లేకుండా ఆరాధించటం హీనమైన అంశాలు. ఇది ఈ దేశం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనవి.

ఎన్నికలు దగ్గరపడుతున్నందున మీ నిర్ణయాన్ని మీరు తీసుకోండి. దాంతో మీకు శుభం కలగాలని కోరుకుంటున్నాను. ఏ భావజాలాన్ని లేదా ఏ పార్టీ అని కాదు, అది మెరుగైన, బలమైన, దారిద్య్రం లేని, అభివృద్ధి చెందిన భారత్‌ను నడిపించేదిగా వుండేదానికి మనం మద్దతు ఇవ్వాలి. నా ఏకైక ఆశ ఏమంటే మనమందరం సామరస్యతతో పని చేస్తామన్నదే. రెండు వైపులా మంచి వారుంటారని ఎల్లవేళలా గుర్తుంచుకోండి. వారు భిన్న పార్టీలలో వున్నప్పటికీ వారికి ఓటరు మద్దతు, వారి మద్దతు ఓటర్లకు వుండాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇరాక్‌ ఎన్నికలు-కమ్యూనిస్టుల పునరుజ్జీవనం !

02 Saturday Jun 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RELIGION, USA

≈ Leave a comment

Tags

IRAQ ELECTIONS, Iraqi Communist Party, Muqtada al-Sadr, non-religious parties, Sadrist-Communist alliance, Sairoun Alliance, Shi’ite cleric Muqtada al-Sadr

టీచర్‌, మహిళా హక్కుల కార్యకర్త అయిన సుహాద్‌ అల్‌ ఖతీబ్‌ కమ్యూనిస్టు పార్టీ అభ్యర్ధిగా నజఫ్‌ నియోజక వర్గం నుంచి ఎన్నికైన తొలి పార్లమెంట్‌ సభ్యురాలు

ఎం కోటేశ్వరరావు

ఇరాక్‌లో అంతరించి పోయిందనుకున్న కమ్యూనిస్టు పార్టీ పునరుజ్జీవనం పొందిందా? అవునంటే సహజంగానే కమ్యూనిస్టులకు వుత్సాహం కలిగించే అంశమైతే, వ్యతిరేకులకు దడపుట్టించే పరిణామమే. అన్నింటికీ మించి అసలు కమ్యూనిస్టులేమిటి ఒక మత నాయకుడి ఆధ్వర్యంలోని పార్టీతో జతకట్టటం ఏమిటి, అధికారంలో కూడా పాలుపంచుకొనేందుకు సిద్దపడటం ఏమిటి అని అనేక మంది ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతేనా, తాజా ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ తరఫున అదీ ఒక మహిళ, షియా ముస్లింల ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా పరిగణించబడే నజఫ్‌ పట్టణ నియోజకవర్గం నుంచి విజయం సాధించటమేమిటి? ముస్లిం ఛాందసులు కమ్యూనిజం మీద వ్యతిరేకత వదులుకున్నారా అని ఆశ్చర్యంతో తలమునకలు అవుతున్నవారు కూడా లేకపోలేదు. ఇంతకీ అసలక్కడేం జరిగింది. దాని గురించి పరిశీలకులేమంటున్నారు?

ఇరాక్‌ మరోసారి ప్రపంచ వార్తల్లోకి ఎక్కింది. గత నెల పన్నెండున అక్కడ జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలలో అల్‌ సదర్‌-కమ్యూనిస్టు పార్టీ కూటమి ‘సంస్కరణల కోసం పదండి మ ముందుకు ‘ అనే నినాదంతో అనూహ్యంగా పెద్ద కూటమిగా ఎన్నికైంది. తమతో కలసి వచ్చే పార్టీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటుకు వారు పూనుకున్నట్లు వార్తలు వచ్చాయి. సంక్లిష్టమైన తీర్పు రావటంతో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు రాజ్యాంగం అనుమతించిన మూడునెలల వ్యవధిలోగా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందా అన్నది పెద్ద ప్రశ్నగా తయారైంది. కమ్యూనిస్టు పార్టీ ప్రాచుర్యంలోకి రావటం ఇష్టం లేని శక్తుల ప్రోద్బలంతో పార్టీ కార్యాలయం మీద బాంబు దాడి జరిగింది.ఎన్నికలకు ముందు ఇరాన్‌ మాజీ మంత్రి, సీనియర్‌ రాజకీయవేత్త అయిన అలీ అక్బర్‌ వెలాయతీ ఇరాక్‌ సందర్శనకు వచ్చి వుదారవాదులు, కమ్యూనిస్టులను ఇరాక్‌ పాలనకు తాము అనుమతించేది లేదని చేసిన ప్రకటన ఇరాన్‌ ప్రభుత్వ ఆలోచనా ధోరణికి ప్రతిబింబం. అమెరికా సరేసరి దాని గురించి చెప్పాల్సిన పని లేదు. న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక అమెరికన్‌ సామ్రాజ్యవాదుల పెంపుడు చిలక. ‘పదండి ముందుకు’ పేరుతో ఎక్కువ స్ధానాలు సాధించిన కూటమి గురించి ఆ ఏముంది అవసాన దశలో వున్న కమ్యూనిస్టులు, సున్నీ వ్యాపారులు, ఆధ్యాత్మిక కార్యకర్తలతో కూడిన కూటమి అంటూ తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నించింది. ఆ కూటమిలో ఆల్‌ సదర్‌ పార్టీతో పాటు, కమ్యూనిస్టుపార్టీ, మార్పుకోసం యువజనోద్యమ పార్టీ, పురోగామి మరియు సంస్కరణల పార్టీ, ఇరాకీ రిపబ్లికన్‌ గ్రూప్‌, జస్టిస్‌ పార్టీ వంటివి వున్నాయి. జనంలో పెరుగుతున్న అసంతృప్తికి ప్రతిరూపంగా ఇరాక్‌లో జరుగుతున్న సమీకరణలకు ప్రతిబింబం ఈ ఎన్నికలని చెప్పవచ్చు. ఈ ఎన్నికల పట్ల ఓటర్లు పెద్దగా ఆసక్తి కనపరచలేదు, దేశవ్యాపితంగా 44శాతం మంది పాల్గంటే బాగ్దాద్‌లో అది 33శాతమే వుంది. ఈ నగరంలో సాదరిస్టు కూటమి 23శాతం ఓట్లు తెచ్చుకుంది. మిగతా పార్టీలలో దేనీకీ పదిశాతానికి మించి రాలేదు. ఎన్నికలు ముగిసి ఫలితాలు ప్రకటించిన పదిహేను రోజుల తరువాత కొన్నివేల పోలింగ్‌ కేంద్రాలలో అక్రమాలు జరిగాయని అక్కడి ఓటింగ్‌ను రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. అందువలన అక్కడేం జరుగుతుందో ఫలితాన్ని ఎటువైపుగా తిప్పుతారో తెలియదు.

ఇరాన్‌ాఇరాక్‌ యుద్ధం, ఇరాక్‌పై అమెరికా నాయకత్వంలో సామ్రాజ్యవాద దేశాల దాడి, దురాక్రమణ తరువాత, సద్దామ్‌ హుస్సేన్‌ హత్య అనంతరం ప్రపంచ వార్తల్లో ఇరాక్‌ వాటా బాగా తగ్గిపోయింది. అలాంటిది తాజా ఎన్నికలతో పశ్చిమ ఆసియా, పాశ్చాత్య దేశాల మీడియాలో ఈ ఎన్నికలు ఒక కుదుపు మాదిరి ఇరాక్‌ పరిణామాలు ముందుకు వచ్చాయి. ఇవి టీకప్పులో తుపానులా సమసిపోతాయా లేక సరికొత్త పరిణామాలకు నాంది అవుతాయా అన్నది చూడాల్సి వుంది.

మక్తాడా ఆల్‌ సదర్‌

ఎన్నికలలో గెలిచిందెవరన్నది సాధారణ వార్త, అయితే ‘ఇరాక్‌ ఎన్నికలలో ఓడిందెవరు? ఇరాన్‌ మరియు అమెరికా’ అనే శీర్షికతో ఒక వ్యాఖ్యానం వెలువడింది. ఇది అసాధారణం. గతంలో ఇరాన్‌కు అనుకూలంగా, అమెరికాకు వ్యతిరేకంగా వున్న ఒక మతాధికారి ఇరాక్‌ను స్వాతంత్య్రం వైపుగా నడిపించాలని కోరుకుంటున్నారు అని సారాంశాన్ని రాశారు. సద్దాం హుస్సేన్‌ను హతమార్చిన తరువాత ఇరాక్‌ వ్యవహారాలపై పట్టు సాధించేందుకు 2003 నుంచి అమెరికాతో పాటు ఇరాన్‌కూడా చేయాల్సిందంతా చేసింది. ఆ రెండింటి మద్దతుదార్లను పక్కన పెట్టిన ఇరాకీ ఓటర్లు తమ అస్ధిత్వాన్ని, స్వాతంత్య్రాన్ని ప్రకటించుకోవాలనే ధోరణి వైపు మొగ్గుతున్నట్లు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇరాక్‌ పార్లమెంట్‌లో 329 స్ధానాలున్నాయి.వాటిలో షియా మతనాయకుడు మక్తాడా ఆల్‌ సదర్‌, కమ్యూనిస్టులతో కూడిన నాయకత్వంలోని రాజకీయ సంఘటన 54 స్ధానాలతో మొదటి స్ధానంలో వుంది. వీరిలో కమ్యూనిస్టులు ముగ్గురే అయినప్పటికీ రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన వుదంతంగా మారింది. ఇరాన్‌ అనుకూల షియా పార్టీల కూటమికి 47, అమెరికా అనుకూల ప్రధాని హైదర్‌ అల్‌ అబాదీ నాయకత్వంలోని కూటమికి 42 స్ధానాలు వచ్చాయి. మిగిలినవి అనేక చిన్న పార్టీలు, ప్రాంతీయ, మత, గిరిజన తెగలకు ప్రాతినిధ్యం వహించే వారికి దక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 165 మంది మద్దతు కావాల్సి వుంది.కొన్ని పోలింగ్‌ కేంద్రాల ఓటింగ్‌ను రద్దు చేసి కొన్ని ఫలితాలను తారు మారు చేస్తారా, చేసినప్పటికీ బలాబలాల్లో పెద్ద మార్పు వుండే అవకాశం లేదు. సదర్‌ కూటమి లేకుండా ఇరాన్‌ అనుకూల ప్రభుత్వం ఏర్పడినా, సదర్‌ ప్రమేయంతో అమెరికా వ్యతిరేక కూటమి ప్రభుత్వం ఏర్పడినాఅమెరికాతో లడాయి తప్పుదు. రెండవది జరిగితే అది ఇరాన్‌ ప్రభావం, ప్రమేయాన్ని కూడా అంగీకరించే అవకాశం వుండదు.పశ్చిమాసియాలో కొత్త పరిణామాలకు దారితీస్తుంది. ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రభావం కలిగించే అనూహ్య పరిణామాలు జరిగినా ఆశ్చర్యం లేదు. అమెరికాతో సంబంధాలు బెడిసిన పూర్వరంగంలో తన అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇరాన్‌ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అదే జరిగితే అమెరికా చూస్తూ వూరుకుంటుందా? పశ్చిమాసియా రాజకీయాలలో అమెరికాతో జతకట్టిన సౌదీ అరేబియాలో ఆ ప్రాంతంలో ఇరాన్‌ పలుకుబడిని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. అది సదర్‌ కూటమికి మద్దతు ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏ ప్రభుత్వం ఏర్పడినా దాని సుస్ధిరత అన్నది ప్రశ్నార్ధకమే.

ఇరాక్‌, అక్కడి కమ్యూనిస్టు పార్టీ పరిణామాలను ఎలా అర్ధం చేసుకోవాలి? షియా తెగకు చెందిన మక్తాదర్‌ అల్‌ సదర్‌ నాయకత్వంలో ప్రారంభమైన ఇరాకీ జాతీయవాద వుద్యమం సున్నీ తెగవారిపై అమెరికా సైన్యం జరిపిన అత్యాచారాలకు వ్యతిరేకంగా సాయుధ చర్యలు కూడా జరిపింది. షియాల్లోని మితవాదులు,పేదలు కూడా ఇది ఇరాన్‌ అనుకూల వైఖరిగా పరిగణించారు. ఇప్పటివైఖరిని చూస్తే అమెరికా వ్యతిరేకత, ఇరాన్‌ వైఖరిని కూడా వ్యతిరేకించే ఒక జాతీయ రాజకీయ వుద్యమంగా అది మారింది. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో సున్నీ అరబ్బులు కూడా నేడు గణనీయంగా సదర్‌కు మద్దతు ఇస్తున్నారని తాజా ఎన్నికలు వెల్లడించాయి. ఇరాక్‌ ప్రయోజనాలకే పెద్ద పీట, అమెరికా, ఇరాన్‌కు వ్యతిరేకం అనే నినాదంతో ఎన్నికలలో పోటీ చేశారు. ఫలితాలు వెలువడిన వెంటనే ఇరాన్‌ పీడ వదిలింది, ఇరాక్‌ స్వేచ్చ పొందింది అని కూటమి మద్దతుదార్లు బాగ్దాద్‌ వీధుల్లో నినాదాలు చేశారు.

మత ప్రమేయం కలిగిన సదరిస్టులు, మతాన్ని అంగీకరించని కమ్యూనిస్టులు ఎందుకు కలిశారు అన్న ప్రశ్నలకు పరిశీలకులు చెబుతున్నదేమిటి? ముందు దేశంపై ఇరాన్‌ ప్రభావాన్ని అంతం చేయాలి అన్నది ఒకటి.దేశంలో అది ఇరాన్‌ లేదా అమెరికా అనుకూల ప్రభుత్వమైనా అవినీతిని పెంచి పోషించటంలో ఎలాంటి తేడా లేదు, అందువలన అవినీతి నిర్మూలనకు, అభివృద్ధికోసం పనిచేసేందుకన్నది మరొక కారణంగా చెబుతున్నారు. సదరిస్టులు షియా మతభావాలతో ప్రారంభమైనప్పటికీ షియా-సున్నీ తెగలలోని కార్మికులు, ఇతర పేదలను ఐక్యం చేయటంలో జయప్రదమయ్యారని పేదల వాణిగా మారారన్నది కొందరి అభిప్రాయం. కమ్యూనిస్టులు చేతులు కలపటానికి ఇదొక కారణంగా భావిస్తున్నారు. ప్రపంచమంతటా కమ్యూనిజానికి కాలం చెల్లిందన్న ప్రచారం బలంగా జరుగుతున్న కాలంలో, ముస్లింలు- కమ్యూనిజానికి చుక్కెదురు అని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు మరొకవైపు జరుగుతున్న పూర్వరంగంలో ఇరాక్‌, ఇతర అరబ్బు దేశాలలో కమ్యూనిజానికి జనం ఆకర్షితులౌతారా అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.

లండన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఛాతమ్‌ హౌస్‌ అనే ఒక సంస్ధలో పని చేస్తున్న డాక్టర్‌ నసైబా యూనిస్‌ ఒక మీడియా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు.’ సద్దామ్‌ హుస్సేన్‌ (2003) అనంతర కాల రాజకీయాలను తిరస్కరించే వారికి ఒక వాహనంగా ఇటీవలి కాలంలో కమ్యూనిస్టు పార్టీ తయారైంది. ప్రభుత్వాల అవినీతి, పేదల సంక్షేమాన్ని విస్మరణ కారణంగా అలసిపోయిన ఇరాకీలను ఒక విశాల సామాజిక న్యాయ అజెండాతో ఆకర్షించి మద్దతును కూడగట్టుకున్నది. కష్టజీవులకు సేవ చేయాలనే ఒక వుమ్మడి సైద్ధాంతికపరమైన కేంద్రీకరణ, యధాతధ స్ధితిని మార్చాలనే ఒక వుమ్మడి అభిప్రాయం సాదరిస్టులు మరియు కమ్యూనిస్టులకు వుంది. ఇదే సమయంలో నాయకత్వ స్ధాయిలలో వుదారవాదులైన సాదరిస్టులు వున్నప్పటికీ మత విలువలను రుద్దకుండా స్వేచ్చ, స్వాతంత్య్రాలకు సాదరిస్టులు ఎంత మేరకు కట్టుబడి వుంటారు ప్రత్యేకించి ఈ కూటమిలో కమ్యూనిస్టులు ఒక చిన్న భాగస్వామిగా గట్టిగా వున్నపుడు అన్న ఒక ఆతృత కూడా ఇరాకీ వామపక్ష శక్తులలో గణనీయంగా వుంది. మహిళల హక్కుల వంటి విషయాలలో పక్షపాతం లేని వైఖరిని, మద్దతును సాదరిస్టులు విస్తరించకపోవచ్చు ‘ అని నసీబా చెప్పారు.

జోయల్‌ వింగ్‌ అనే మరొక విశ్లేషకుడు ఇరాక్‌ కమ్యూనిస్టు పార్టీ గురించి ఇలా చెప్పారు.’ ఇరాక్‌ కమ్యూనిస్టు పార్టీ 1934లో ఏర్పడింది. సాంప్రదాయక మార్క్సిజం-లెనినిజాన్ని అనుసరిస్తుంది. సోవియట్‌ యూనియన్‌ వునికిలో వున్నపుడు దానికి అనుకూలంగా వుండేది. గతంలో మధ్యప్రాచ్యంలో కమ్యూనిస్టు పార్టీలు ఇతరులతో ప్రత్యేకించి అరబ్‌ ప్రాంతంలో విస్తరించిన పార్టీలైన నాజరైట్స్‌, బాతిస్టుల వంటివాటితో పోటీపడేవి. 1958 వరకు కమ్యూనిస్టులను రాజరికం నిరంతరం హింసించినప్పటికీ దేశంలోని కార్మికవర్గం, విద్యార్ధులలో కమ్యూనిస్టులు పునాదిని ఏర్పాటు చేసుకున్నారు. వారికి సైద్ధాంతిక మద్దతుదారులు వుండేవారు, వారిలో ప్రధానంగా జనరల్‌ అబ్దల్‌ కరీమ్‌ ఖాశిం తిరుగుబాటుద్వారా అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తరువాత 1968లో బాత్‌పార్టీ నాయకత్వంలో తిరుగుబాటు చేసి ఖాశిం ప్రభుత్వాన్ని కూలద్రోసి ఆయనను హత్య చేశారు. కమ్యూనిస్టుపార్టీని దాదాపు నాశనం చేశారు. తరువా వారు ఎక్కువ భాగం రహస్యంగా పని చేశారు. 2003 తరువాతనే పార్టీ చాలా పరిమితంగా పనిచేస్తూ బహిరంగ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది.అయితే అది చాలా చిన్నది. వంతుల వారీ రాజకీయ అధికార పద్దతి, తెగలవారీ దామాషా పద్దతిలో పదవుల పంపిణీ విధానం, అవినీతికి వ్యతిరేకంగా పౌర సమాజ బృందాలు ఆందోళనకు వుపక్రమించినపుడు కమ్యూనిస్టు పార్టీ వారితో కలసి గత ఐదు సంవత్సరాలలో తిరిగి కమ్యూనిస్టు పార్టీ ప్రాచుర్యంలోకి వచ్చింది. అవినీతి వ్యతిరేక నిరసనల ద్వారా సాదరిస్టులతో కమ్యూనిస్టుపార్టీ జతకట్టింది. అదే మే నెలలో సాదరిస్టు కూటమిలో భాగంగా పోటీ చేసేందుకు దారి తీసింది. రక్షణ కల్పిస్తామని సాదరిస్టులు చెప్పటం, ఇరాకీ రాజకీయ ప్రముఖులలో చేరేందుకు ఒక దారిగా కమ్యూనిస్టులు ఈ నిర్ణయానికి వచ్చారు. అయినప్పటికీ కమ్యూనిస్టు శ్రేణులలో ఒక అనిశ్చితి వుంది. తమకు నచ్చని విధానాలను సాదరిస్టులు రుద్దుతారా అని అనేక మంది కమ్యూనిస్టు పార్టీ సభ్యులు ఆలోచిస్తున్నారు. సాదరిస్టు పార్టీ అధికారంలో చేరటాన్ని కమ్యూనిస్టులు జీర్ణించుకోవటం లేదు, ఒకవేళ అదే జరిగితే ఆ కూటమి నుంచి బయటపడాలని కొంత మంది ఆలోచిస్తున్నారు.’ అని జోయెల్‌ వింగ్‌ పేర్కొన్నారు.

‘ గత పదిహేను సంవత్సరాలుగా నడచిన ప్రభుత్వ వ్యవస్ధను తిరస్కరించటంలో, సంస్కరణ, అవినీతి, వంతుల వారీ అధికార స్వీకరణ విధానానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ప్రతిధ్వనించారు. అయితే ఇవి వైఖరులు తప్ప విధానాలు కాదు, వాస్తవ సంస్కరణల అజెండాలో అవెలా వాస్తవ రూపం దాల్చుతాయో తెలియదనుకోండి ‘ అని సింగపూర్‌ విశ్వవిద్యాలయ పరిశోధకుడు ఫనర్‌ హదాద్‌ పేర్కొన్నారు. వంతుల వారీ పద్దతిలో అధికారాన్ని పంచుకోవటం కంటే ప్రతిపక్షంలోనే వుండటం మేలని ఎన్నికల ఫలితాల అనంతరం సాదర్‌ కూటమిలోని కొన్ని పార్టీల నేతలు పేర్కొన్నారు. టీచర్‌, మహిళా హక్కుల కార్యకర్త అయిన సుహాద్‌ అల్‌ ఖతీబ్‌ కమ్యూనిస్టు పార్టీ అభ్యర్ధిగా అక్కడ ఎన్నికయ్యారు.

జాతీయవాది, కమ్యూనిస్టు అభిమాని అయిన మాజీ ప్రధాని జనరల్‌ అబ్దుల్‌ కరీమ్‌ ఖాశిం హయాంలో గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారికోసం బాగ్దాద్‌ శివార్లలో విప్లవ నగర్‌ పేరుతో ఏర్పాటు చేసిన ఆవాసం తరువాత కాలంలో సాదర్‌ నగరంగా మారింది. దాని జనాభా ప్రస్తుతం 35లక్షలు. బాగ్దాద్‌లో సగం. ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. 1999లో షియా మతనాయకుడు అయాతుల్లా మహమ్మద్‌ సాదిక్‌ అల్‌ సదర్‌ను హత్య చేసిన తరువాత ఆ నగరం సాదర్‌ సిటీగాను, ప్రస్తుతం సాదర్‌ పార్టీ కేంద్రంగా మారింది.ఆయన కుమారుడే ప్రస్తుతం సాదరిస్టు పార్టీ నేత మక్తాదా అల్‌ సదర్‌. సాదర్‌ పార్టీ నాయకత్వంలోని సాయుధ విభాగం అమెరికా సైన్యాన్ని ఎదిరించటంలో ఈ నగరాన్ని కేంద్రంగా చేసుకొని పోరాడిన చరిత్ర వుంది.

2003లో ఇరాక్‌ను ఆక్రమించినప్పటి నుంచి అమెరికా అధికారుల కనుసన్నలలో నడిచిన ప్రభుత్వాలు ప్రజల కనీస అవసరాలను పట్టించుకోలేదు. వివిధ సేవలను అందించటానికి ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్లు అవినీతి అక్రమాలలో మునిగిపోయారు. 2010 వేసవిలో తీవ్ర ఎండలు, విద్యుత్‌ కోత కారణంగా జనం తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. దాంతో జనం నిరసనలకు దిగారు. 2011 వసంత గర్జన పేరుతో మధ్యప్రాచ్యంలో ప్రారంభమైన నిరసనలు ఇరాక్‌ను కూడా తాకాయి.ఇరాకీ వసంత గర్జన పేరుతో వుద్యోగాలు, విద్యుత్‌ తదితర డిమాండ్లపై పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి.ప్రభుత్వం అణచివేతకు దిగటంతో 45 మంది మరణించారు. అప్పటి నుంచి ప్రతి శుక్రవారం దేశమంతటా అనేక సమస్యలపై ప్రదర్శనలు జరగటం పరిపాటి అయింది. 2015 నుంచి మరింత సంఘటితంగా జరిగాయి. ఈ క్రమంలోనే సాదరిస్టులు, కమ్యూనిస్టులు దగ్గరయ్యారు. మత, తెగల ప్రాతిపదికన ప్రభుత్వంలో పదవుల పందేరాన్ని ఈ ప్రదర్శనల్లో నిరసించారు. ఇరాక్‌ పార్లమెంట్‌, ఇస్లామిక్‌ మత రాజ్యం ఒకే నాణెపు బమ్మా బరుసు వంటివని యువత బ్యానర్లు ప్రదర్శించేవారు.

సద్దామ్‌ హుస్సేన్‌ అమెరికాను వ్యతిరేకించి దాని కుట్రకు బలైన యోధుడిగా లోకం ముందు కనిపించేది నాణానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు కరడు గట్టిన కమ్యూనిస్టు, కార్మిక వ్యతిరేకత వుంది. అమెరికా సిఐఏతో చేతులు కలిపిన ఇరాక్‌ బాతిస్టు పార్టీనేతలు కమ్యూనిస్టు అనుకూల జనరల్‌ అబ్దుల్‌ కరీమ్‌ ఖాశిం ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి ఆయనను హతమార్చి అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ కుట్రలో సద్దామ్‌ హుస్సేన్‌ ఒక ప్రముఖుడు. బాతిస్టు పార్టీ, సద్దామ్‌ హయాంలో కమ్యూనిస్టులను అణచివేశారు.కార్మిక సంఘాల ఏర్పాటును కూడా నిషేధించారు. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇరాక్‌ను తయారు చేయటంలో అమెరికా పాత్ర అందరికీ తెలిసిందే. ఆ రెండు దేశాలూ యుద్ధానికి తలపడిన సమయంలో అమెరికా సద్దామ్‌ హుసేన్‌కు మద్దతు ఇచ్చింది. ఆయుధాలు కూడా అందచేసింది. తరువాత సద్దాం వ్యతిరేకిగా మారటంతో అదే అమెరికా చివరకు ఇరాక్‌ను ఆక్రమించి హతం చేసింది. సద్దాం మరణం తరువాతే విదేశాలలో, స్వదేశంలో వున్న ఇరాకీ కమ్యూనిస్టులు బహిరంగ కార్యకలాపాలలోకి వచ్చారు.

ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సి వుంది. అమెరికా వ్యతిరేకిగా మారిన సద్దామ్‌ హుస్సేన్‌ను బయటి ప్రపంచంలోని కమ్యూనిస్టులు, వామపక్ష అభిమానులు గతంలో బలపరిచారు. ఇరాక్‌ దురాక్రమణను, సద్దాం వురిని కూడా నిరసించారు. సద్దామ్‌ అణచివేతకు గురైన ఇరాకీ కమ్యూనిస్టులు ఈ వైఖరిని ఆమోదించరనేది స్పష్టం. అలాగే ఇప్పుడు మన దేశంలో వున్న మతోన్మాదశక్తులు, అవి చెలరేగిపోతున్న పూర్వరంగంలో వాటికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న కమ్యూనిస్టులు, అభ్యుదయ వాదులకు ఇరాకీ కమ్యూనిస్టుల వైఖరి మింగుడుపడకపోవచ్చు. ముందే చెప్పుకున్నట్లు ఒక మత నాయకుడి ఆధ్వర్యంలోని పార్టీతో ఎలా కలుస్తారు అన్న ప్రశ్న తలెత్తుతుంది. మన దేశంలోని మతోన్మాదులు కమ్యూనిస్టులను శత్రువులుగా చూస్తున్నారు, కేరళ వంటి చోట్ల హతమార్చేందుకు వెనుకాడటం లేదు.ఇరాష్‌ షియా మతనాయకుడి ఆధ్వర్యంలోని పార్టీ సున్నీ తెగ ముస్లింల మద్దతు కూడా కూడగట్టుకున్నది. కమ్యూనిస్టుల విషయం తెలిసి కూడా అనేక పోరాటాలలో వారితో భుజం కలిపింది. అయితే అది శాశ్వతంగా అలాగే వుంటుందా? అధికారం వచ్చేంత వరకు కమ్యూనిస్టులను వుపయోగించుకొని తరువాత వ్యతిరేకిగా మారితే ఏమిటి అన్న సందేహాలు తలెత్తటం సహజం. తాము స్వయంగా అనేక ప్రపంచ అనుభవాలు చూసిన తరువాత ఇరాకీ కమ్యూనిస్టులు అంత గుడ్డిగా లేదా భ్రమలతో ఒక మత నేత సారధ్యంలోని పార్టీతో చేతులు కలుపుతారని అనుకోవాల్సిన అవసరం లేదు. పదండి ముందుకు పేరుతో ఏర్పాటు చేసిన కూటమి ఎన్నికల కార్యక్రమంలో మతపరమైన అంశాలు లేదా కమ్యూనిస్టులు చెప్పే సోషలిజం వంటి అంశాలేమీ లేవు. అవినీతి, అక్రమాలు, ప్రజా సమస్యలు, ఇరాన్‌, అమెరికా జోక్యానికి వ్యతిరేకమైన ఒక జాతీయవాద అజెండాతో వారు జనం ముందుకు వెళ్లారు. అనూహ్యంగా ఒక వేళ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి అధికారానికి వచ్చి ఎన్నికల ప్రణాళికు భిన్నంగా ఏ పార్టీ వ్యవహరించినా మిగతా పార్టీలు వ్యతిరేకించి బయటకు వస్తాయి. కమ్యూనిస్టులు కూడా అదే చేస్తారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వేదాలను ప్రశ్నించిన మహాకవి వేమన కూడా జాతి వ్యతిరేకి, కమ్యూనిస్టేనా ?

02 Wednesday May 2018

Posted by raomk in Communalism, Current Affairs, History, INDIA, Literature., Opinion, RELIGION

≈ 1 Comment

Tags

ANTI NATIONAL, communal forces, communalism, communist, everything lies in veda’s only, Religious Fundamentalists, vedas, Vemana

ఎం కోటేశ్వరరావు

వేదాల్లో అన్నీ వుంటే మన వారెందుకు విదేశాలకు పరుగులు తీస్తున్నట్లు అన్న శీర్షికతో నేను రాసిన వ్యాసంపై సామాజిక మాధ్యమంలోని ఫేస్బుక్‌లో సంస్కారయుతంగా స్పందించిన వారందరికీ ఒక దండం, అనాగరికంగా స్పందించిన వారికి వంద దండాలు. చర్చలో లేవనెత్తిన కొన్ని ప్రశ్నలకు స్పందించటం కనీస ధర్మంగా భావిస్తున్నా.

‘వేదాలు ఎందరు చాడుతున్నారు కమ్మీ’

జ: దీనిలో చాడు ను వాడు గా అనుకున్నా కమ్మీ అనే తిట్టు తప్ప ప్రశ్న అర్ధం కాలేదు.

‘ అబ్బే అన్నీ దాస్‌ కాపిటల్‌ లోనే ఉన్నాయి పోయి చదువుకోండి.’

జ: అంత వుక్రోషం వద్దులే మిత్రమా ! ప్రపంచంలో వేదాలు చదువుతున్న వారి కంటే దాస్‌ కాపిటల్‌ చదివేవారే ఎక్కువ . గత పది సంవత్సరాలుగా ధనిక దేశాలలో వచ్చిన సంక్షోభం తరువాత మరీ ఎక్కువగా చదువుతున్నారని వార్తలు. ప్రపంచంలో దాస్‌ కాపిటల్‌ చదివి తిరుగుబాట్లు చేశారు. వేదాలు చదివిన వారు అగ్రహారాలకే పరిమితం అయ్యారు , వాటిని కూడా సంస్కరించుకోలేకపోయారు అన్నది అంగీకరించక తప్పదు మరి. ఇదే సమయంలో ఒక కాలపు సాహిత్యంగా చరిత్రలో వేదాలకు స్ధానం వుంది.

‘రిజర్వేషన్‌ వల్ల రా కమ్మి. నీ వయసు కి విలువ ఇవ్వాలంపియట్లేదు’

జ: రిజర్వేషన్ల వ్యతిరేకత కనిపిస్తోంది. వేదాలు- మనువాదం రెండింటినీ విడదీయలేము. ప్రపంచంలో ఎక్కడా లేని రిజర్వేషన్ల విధానం రావటానికి జనాభాలో ఐదో వంతుగా వున్న దళిత, గిరిజనులను వేల సంవత్సరాలుగా అంటరాని వారిగా చూసినందువల్లనే ఇవి వచ్చాయి. ఆ దురాచారాన్ని రూపు మాపి వారిని కూడా తోటి మానవులుగా గుర్తించినపుడు రిజర్వేషన్లు వుండవు. కానీ ఇప్పుడు ఆధునిక మనువాదులు అంటరాని తనం వుండాలి, రిజర్వేషన్లు పోవాలి అంటున్నారు. ఇక నా వయస్సు, ఫేస్‌బుక్‌లో నేనే వివరాలు పెట్టాను, అందరికీ ఆధైర్యం వుండదు, అనేక మంది ఫేక్స్‌ వున్నారు. గురువు అద్వానీకే శిష్యుడు నరేంద్రమోడీ ఇచ్చిన విలువేమిటో చూశాము. వాదన, విషయంలో వున్నదానిని బట్టి విలువ ఇవ్వండి చాలు. కొంత మంది కుర్రవాళ్లు పేర్లకీ పుకార్లకీ నిబద్ధులు, తాతగారి నాన్నగారి భావాలకు దాసులు. నేనైతే ఆ టైప్‌ కాదు. వయసుతో పని ఏముంది మనసులోనే అంతా వుంది అని నమ్ముతా.

‘కమ్మీలకు స్వంత సిద్దాంతాల్లేక విదేశాలనుంచి ఎందుకు దిగుమతి చేసికొన్నారు?స్వంతంగా సిద్దాంతాలే తయారుచేసికోలేని అనామకులా కమ్మీలు?కాస్తైనా జ్ఞానంలేని మూర్ఖులైన కమ్మీలను ప్రజలెలా ఆదరిస్తారు?

జ: వసుధైక కుటుంబం అనే భావనలో నమ్మకం వున్న వాడిని. మన రాజ్యాంగంతో సహా అనేక అంశాలను విదేశాల నుంచి తెచ్చుకుంటున్నాము. ఇస్లాం, క్రైస్తవ మతాలను నిత్యం దుమ్మెత్తి పోసే వారు వారి దీనార్లు, డాలర్లు, ఇతర వస్తువులను తెచ్చుకోవటానికి, ఆ దేశాలకు వెళ్లి మరుగుదొడ్లు కడగటం నుంచి కంప్యూటర్ల వరకు ఏ పని అయినా చేయటానికి, కూలి డబ్బులు తెచ్చుకోవటానికి కోట్లాది మంది సిగ్గుపడటం లేదు. ఏం తెచ్చారో, ఎంత తెచ్చారో ఇంతవరకు తెలియకపోయినా నిత్యం నరేంద్రమోడీ విదేశాల నుంచి ఏదో ఒకటి తీసుకురావటానికే కేగా అందమైన సూట్లు వేసుకొని పైలా పచ్చీసుగా తిరుగుతోంది. భారతీయతకు ప్రతిబింబంగా కొందరు భావించే పిలక, పంచకట్టుతో ఎందుకు వెళ్లటం లేదు. ఇన్ని జరుగుతున్నపుడు, వాటికి అభ్యంతరం లేనపుడు కమ్యూనిస్టులు ఒక సిద్ధాంతాన్ని తమకు వర్తింప చేసుకుంటే తప్పేమిటట? బౌద్దం, ఇస్లాం, క్రైస్తవం, హిందూ మతం ఒక చోట పుట్టి అనేక దేశాలకు విస్తరించింది. కమ్యూనిజం కూడా అంతే .వాటికి లేని అంటూ సొంటూ కమ్యూనిజానికికే ఎందుకు?

‘ మీ బతుకులు ఈ దేశ గొప్పదనం తక్కువ చేయడానికే. పంది బురద మెచ్చు, పన్నీరుమెచ్చునా విశ్వదాభిరామ…’

జ: నాకు తెలిసినంత వరకు ఏ కమ్యూనిస్టూ ఈ దేశ గొప్పతనాన్ని తక్కువ చేయలేదు. అలా చేసినట్లు ఒక్క వుదంతం వున్నా చూపాలని చేసిన సవాలుకు ఇంతవరకు ఎవరూ బదులివ్వలేదు. అనేక మతాలు వచ్చాయి, పెరిగాయి, తరిగాయి. మధ్య యుగాల నాటి మాదిరి భీకర మత యుద్ధాలు మహత్తరమైన భారత గడ్డమీద జరగలేదు గాని మత యుద్ధాలు మనకు కొత్త గాదు. శైవులు-వైష్ణవుల మధ్య పరిమితంగా అయినా యుద్ధాలు జరిగాయి. జైన, బౌద్ధ మతాలను, హేతువాద, భౌతిక వాదులైన చార్వాకులను హిందూ మతంగా చెప్పుకొనే వారు అణచివేచిన చరిత్ర వుంది. ఇప్పుడు క్రైస్తవం, ఇస్లాం మతాలకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్న మెజారిటీ మతోన్మాదులు, దానికి స్పందిస్తున్న మైనారిటీ మతోన్మాదులు దొందూ దొందే. పందులు పన్నీరు మెచ్చకపోయినా నష్టం లేదు. మతోన్మాదులు ఎందరు మగువల కన్నీరు ఒలికించటానికి నీ పేరుతో ప్రయత్నిస్తున్నారో వీలైతే వారిని ఆపేట్లు చూడు రామా అని కమ్యూనిస్టులు కాని వారెందరో మొక్కుకుంటున్నారు.

‘విదేశాలకు పరుగులు తీయాలని కూడా వేదాల్లోనే ఉందట’

జ: అన్నీ వున్నాయష అన్నపడు పరుగుల గురించి ఎందుకుండదు

‘ వీళ్ళు వీళ్ళ పిచ్చ…వేదాలని ప్రశ్నిస్తే కమ్మీలు అంటారు,వాళ్లంటే అంత భయమేంటో, వాళ్ళ పేరే కలవరిస్తారు.’

జ: ఇది తరతరాలుగా వస్తున్న భయం, గంగిరెద్దుల్లా తలాడించటం, మన్ను దిన్న పాముల్లా జనం పడి వుండాలని కోరుకొనే వారికి ప్రశ్నించే ఒక్కడు కనపడినా భయమే. వేద ప్రామాణ్యాన్ని ప్రశ్నించటం ఈ రోజు కాదు, వాటిని రాసిన నాటి నుంచీ ఎవరో ఒకరు ప్రశ్నిస్తూనే వున్నారు. ఒక్క వేదాలే కాదు, గీత, ఖురాన్‌, బైబిల్‌ వంటి ఏ మత గ్రంధమైనా, మరొకటైనా సమాజ పురోగతికి ఆటంకం కలిగించే ప్రతిదాన్నీ జనం ప్రశ్నిస్తారు. అలాంటి వారిని అణచివేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి. దోపిడీ వర్గాన్ని సమర్ధించే వారే నాడు నేడు ఈ అణచివేతకు పాల్పడుతున్నారు.

‘ఎవడైనా సరుకున్నవాడినే రమ్మంటారు’

‘ వారికి నేర్పడానికి నాసా లో హిందువులేఎక్కువ ‘

జ: సరకున్నవాడినే ఎవరైనా రమ్మంటారన్నది కొంత వరకు నిజమే. తమకు అవసరమైన వాళ్లను కూడా రమ్మంటారు అని కూడా తెలుసుకోవాలి. అమెరికా, ఐరోపా వారు వస్తువులు తయారు చేసుకోలేకనా చివరకు …..తుడుచుకొనే కాగితంతో సహా చైనా నుంచి దిగుమతులు చేసుకుంటున్నది. కాదు, వ్యాపారికి లాభం కావాలి. చైనాలో తయారయ్యేందుకు అయ్యే ఖర్చు కంటే అమెరికాలో ఎక్కువ చెల్లించాలి. అందుకే ఎక్కడ శ్రమశక్తి తక్కువుంటే అక్కడి నుంచి దిగుమతులు చేసుకుంటున్నారు. అలాగే వైద్యులు, శాస్త్రవేత్తలు, కంప్యూటర్‌ ఇంజనీర్లు. అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాలు వారిని తయారు చేసుకోలేక కాదు. ఒక వైద్యుడు తయారు కావాలంటే అమెరికాలో అయ్యే ఖర్చు కంటే ఇండియాలో తక్కువ. మిగతావారు కూడా అంతే. మన దేశంలో వున్నన్ని జబ్బుల గురించి అమెరికా, ఐరోపాలో తెలుసుకోవాలంటే కుదరదు, అక్కడన్ని లేవు గనుక. అందుకే విదేశాల నుంచి రమ్ముంటున్నారు తప్ప మన మీద ప్రేమ వుండి కాదు, మనమే గొప్పవారం అని కాదు. ప్రపంచంలో విదేశాలలో నివసించే చైనా జాతీయులు ఐదు కోట్ల మంది అయితే మన వారు మూడు కోట్లకు పైబడి వున్నారు. అమెరికాలో కూడా భారతీయుల కంటే చైనీయులే ఎక్కువ. అందువలన మన గురించి చెప్పుకోవచ్చు తప్ప అతిశయోక్తులు చెప్ప కూడదు. నాసాలో పని చేస్తున్న మన సైంటిస్టులందరూ హిందువులే అని చెప్పటం అతిశయోక్తి. అంటే హిందువులందరూ మన దేశ పరిశోధనలను వదలి పెట్టి అమెరికన్లకు వూడిగం చేస్తున్నారను కోవాలి. ఇదేమీ దేశభక్తి ?

‘ఎప్పుడూ పక్కదేశం బానిసలుగా బతికేవారికి ఆత్మవిశ్వాసం లోపించి మనలో ఏమీ లేదు అనుకునే పర్సనాలిటీ డిసార్డర్‌, ఇన్ఫిరియారిటి కాంప్లెక్స్‌తో బ్రతికే మానసిక రోగులు మన కమ్యూనిస్టులు. ముందు మీ పూర్వీకుల ఘనతను తెలుసుకుని,ఎవరైనా సైకాలజిస్ట్‌ దగ్గర కౌన్సిలింగ్‌ తీసుకోండి.

జ: కమ్యూనిస్టులు ఏ దేశం వారినైనా వారు దోపిడీ చేసేవారా, దోపిడీకి గురయ్యే వారా అని మాత్రమే చూస్తారు తప్ప మతం, కుల ప్రాతిపదికన చూడరు. పక్కన వున్న వాడికి ఒక కన్ను పోవాలనుకుంటే మనకు రెండూ పోతాయి. సమాజంలో కొంత మంది కంటే తాము గొప్ప వారమనే సుపీరియారిటీ రోగాన్ని పెంచిన మనువాదం మొత్తంగా నిచ్చెన మెట్ల కుల వ్యవస్ధను ప్రోత్సహించి, నిర్మించి సమాజానికి చేసిన హాని అంతా ఇంతా కాదు. మహిళలను అణచివేసింది, వారికి విద్య, వివేకం లేకుండా చేసింది. పంచముల పేరుతో నాలుగోవంతు, ఇతర వృత్తుల పేరుతో మరి కొ ందరిని ఈ దేశం మాది అనుకొనే స్ధితి లేకుండా చేసింది. ఎందరు హిందూ రాజులు పాలించినా వేల సంవత్సరాలు అదే స్ధితి కొనసాగింది. అందువలన, విదేశీయులు, హూణులు, తరుష్కులు, యూరోపియన్లు ఎవరు దేశం మీద దాడులు చేసినా, మొత్తాన్ని ఆక్రమించుకున్నా మన బతుకులు మారేదేమీ వుండదని ఏం జరిగితే మనకెందుకు లెమ్మని మెజారిటీ జనం ప్రేక్షక పాత్ర పోషించబట్టే దేశం వందల సంవత్సరాలు పరాధీనమైంది. ఎక్కడ ఏమాత్రం గౌరవం, ఆదరణ, సాటి మనిషిగా గుర్తింపు వుంటుందని భావించినా అనేక మంది మతమార్పిడులకు సిద్దపడటానికి కూడా కారణమదే. ఇప్పటికీ అదే స్ధితి. అందుకు అంబేద్కరే ప్రత్యక్ష నిదర్శనం. అందువలన మన గత ఘనత గురించి మరీ ఎక్కువగా చెప్పుకొనే మానసిక రోగులకే ముందు కౌన్సిలింగ్‌ ఇప్పించాలి. బుర్రలను మరమ్మతు చేయాలి.

ౖ’వేదాలలలో అన్ని ఉన్నాయి విదేశీయులు వఛ్చి అన్ని వేదిలేసేం ఇప్పటి అమెరికా వైద్యం కన్నా మంచి వైద్యం మన దగ్గర ఉండేది ఎంసెట్‌ రాంక్‌ వఛ్చినవాడు ఎం బి బి ఎస్‌ చదువుతాడుకాని ఆయుర్వేదం చదవడుకదా జెర్మనీ వాడు మానవేదాలని ఉపయోగించుకుని ఆయుధాలు మందులు చేసుకుంటున్నాడు మన రాజమండ్రి ఆయనని అక్కడకి తీసుకునివెళ్ళి మరి ఆయుధాల విద్య నేర్చుకున్నారు మనకి మాత్రం అలుసు మన పూర్వులగురించి తెలియదు తెలుసుకోము విదేశీయులంటే మోజు అన్ని ఉన్న విజ్ఞానం మనది

జ: ఇలాంటి నమ్మకాలు వున్న వారు రెండు తరగతులు.లోతైన అధ్యయనం, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు, ఎక్కడ అనే ప్రశ్నలు వేయకుండా గుడ్డిగా నమ్మి ప్ర చారం చేసేవారు. కావాలని దురహంకారాన్ని రెచ్చగొట్టే వారు. ఈ దేశంలో ఇప్పుడు కేంద్రంలో, మెజారిటీ రాష్ట్రాలలో వున్నది వేదాలలో అన్నీ వునాయష అని నమ్మే తిరోగమన భావజాలం వున్న వారే. దేశీయ వైద్యాన్ని అభివృద్ధి చేయటానికి వారికి ఎవరు అడ్డుపడ్డారు. కార్పొరేట్‌ ప్రయివేటు వైద్య విద్య, చికిత్సను ప్రోత్సహిస్తున్నారు. మన రాజమండ్రి ఆయనని తీసుకొనివెళ్లి జర్మన్లు ఆయుధాల విద్య నేర్చుకున్నారని చెప్పటం అమాయకత్వం తప్ప మరొకటి కాదు.

‘చదువుకున్నా చదువుకు సరైన ఉపాదిలభించక ఉపాధిని పొందడమే జీవిత లక్ష్యం

వేదాలలో …. నిర్వేదం ఉంది కాబట్టి

అవి శుద్ద దండగా అని నిరూపించడానికి……….

ఇప్పుడు అభివ ద్ధిలో ఉన్న దేశాలు కొన్ని ఒకప్పుడు భారతదేశానికి వచ్చి బాగు పడిపోయినవి.

డబ్బు కోసం తెల్లోని తొత్తులాయ్‌ మతం మరి సలాం కొట్టి గులాం గిరి చేసారు

వాడు వచ్చి మనని దోచి మన వేదాలను బూడిద చేసి మన దేవాలయాలను కూలగొట్టి

మన దేశం లో మనకే రాజు గామారి న తరవాత మనం ఇప్పుడు వాణి దెగ్గర గులాం చేయక ఎం చేస్తారు

అదే మన వేదాలను మన దెగ్గర భద్ర పరిస్తే ఈ పరిస్థితి ఉండేదా.

వేదాలు చదివిన ఘనాపాఠిలను చూసి వాళ్ళు ఏ కొత్త టెక్నా జీని ఆవిష్కరించలేక పోతున్నారని వారే విదేశీయ ఉత్పత్తుల కొరకు ఆరాటపడి పోతున్నారని నిర్ధారించుకొని విదేశాలకు పరుగులు పెడుతున్నారు. ఏ దేశంలో లేని ఖనిజ సంపద వనరులు కలిగిన మన మాత  భూమిని భారతదేశాన్ని కాలదన్ని విదేశీ మోజుతో వెళ్ళిపోతున్నారు.

వేదాల్లో అన్నీ ఉంటే వేదాలు చదివిన వేద పండితులు ప్రపంచానికి అవసరమైన ఆవిష్కరణలు చేసి భారత ప్రతిష్టను ప్రపంచ దేశాల్లో ఎగరవేసేవారు. ప్రపంచ ప్రజలు .. ఇది భారత వేద పండితులచే కనిపెట్టబడినదని చెప్పుకొనే కనీసం ఒక వస్తువైనా ఉందా

జ: నా వ్యాసంలోను వీటి గురించి కొంత చర్చించి నందున కొన్నింటిపై వ్యాఖ్య అవసరం లేదని భావిస్తున్నాను. చివరగా ఒక మిత్రుడు ప్రశ్న వేదిక వేదాల గురించి వేమన ఎలా స్పందించిందీ చూడండి అంటూ రెండు పద్యాలు పంపారు.

వేద విద్యలెల్ల వేశ్యల వంటివి

భ్రమలు పెట్టి తేట పడగ నీవు

గుప్త విద్య యొకటె కులకాంత వంటిది

విశ్వదాభిరామ వినుర వేమ.

వేన వేలు చేరి వెర్రి కుక్కల వలె

అర్ధ హీన వేద మరచు చుంద్రు

కంఠ శోష కంటె కలిగెడి ఫలమేమి

విశ్వదాభిరామ వినుర వేమ!

మహాకవి వేమన హేతువాద భావజాలాన్ని అనుసరించే, ముందుకు తీసుకుపోయే అనేక మందిపై మతోన్మాదశక్తులు దాడులు చేస్తున్నాయి, ప్రాణాలు కూడా తీస్తున్నాయి. జనంలో ప్రతికూల స్పందన వస్తుందని భయపడిపోయి గానీ వేమనను కూడా కమ్యూనిస్టు , జాతి, హిందూ వ్యతిరేకి అని వున్మాదులు తిట్టి పోసే రోజులు వచ్చినా ఆశ్చర్యం లేదు. భిన్నాభిప్రాయాన్ని అణచివేయాలని చూస్తున్న శక్తుల పట్ల ఎవరు వుపేక్షించినా వారు తమంతట తమ నోటిని మూసుకోవటమే. తరువాత తెరవాలన్నా తెరవనీయరు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వేదాల్లోనే అన్నీ వుంటే మన వారెందుకు విదేశాలకు పరుగులు తీస్తున్నట్లు ?

30 Monday Apr 2018

Posted by raomk in Communalism, Current Affairs, History, INDIA, Literature., NATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

If everything lies in veda’s only, Indian science, vedas

ఎం కోటేశ్వరరావు

వేదాల్లోనే అన్నీ వున్నాయష అని ముందుగా ఏ మహానుభావుడు సెలవిచ్చాడో నాకైతే వివరాలు దొరకలేదు గానీ తెలుగు జాతి నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు తన మహత్తర రచన కన్యాశుల్కం నాటకంలో అగ్నిహోత్రావధాన్లతో వేదాల్లోనే అన్నీ వున్నాయష అనిపించి దాన్ని గ్రంధస్ధం చేశారు. అది నిజమే అంటూ నేడు వున్నత చదువులు చదివిన వారెందరో అతని కంటే ఘనులు అన్నట్లు ఆధునిక అగ్నిహోత్రావధానులుగా తయారయ్యారు. శనివారం నాడు మధ్య ప్రదేశ్‌లోని వుజ్జయిని పట్టణంలో జరిగిన గురుకుల సంస్ధల సమావేశంలో గురుకుల వ్యవస్ధను పునరుద్ధరించాలని, వాటికి తగిన విధంగా బోధనాంశాలను మార్చాలని, సైన్సు మరింత ముందుకు పోవాలంటే వేదాలను కూడా అధ్యయనం చేయవలసిన అవసరం వుందని ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ సూచించారు. తల మీద ఒకవైపు పిలక, మరొక వైపు ఆధునిక క్రాఫ్‌ చేయించుకోవాలన్నట్లుగా వుంది. కుర్రకారు తేల్చుకోవాలి. గురుకుల, ఆధునిక విద్యలను అనుసంధానించేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ సెలవిచ్చారు. ఇప్పటికే ఆవు పేడ, మూత్రంలో ఏముందో చూడాలంటూ శాస్త్రవేత్తలను వాటిలో ముంచేందుకు పూనుకున్నారు. ఇలాంటి తిరోగామి శక్తులను ఇంకా అధికారంలో కొనసాగనిస్తే ఎలాంటి విపరీత ప్రయోగాలు చేయటానికైనా వెనుదీయరు. తస్మాత్‌ జాగ్రత్త.

వేదాలను బట్టీయం వేసి ఘనపాఠీలు, చదివిన వారు పండితులయ్యారు తప్ప ఒక్కరూ శాస్త్రవేత్త ఎందుకు కాలేదో మోహన్‌ భగవత్‌ చెబుతారా అని ఫేస్‌బుక్‌ గ్రూపుల్లో ఒక చర్చను ప్రతిపాదించాను. ఒక గ్రూపులో భారతీయ సంప్రదాయాలను కాపాడుతున్నామని నిజంగా నమ్ముతున్న భగవత్‌ అభిమానులంతా పచ్చిబూతులతో ప్రతిస్పందించటం చూసి భరతమాతా చివరకు నీకు ఎంత దుర్గతి పట్టింది ఇలాంటి నీ బిడ్డలను సరిదిద్దుకుంటావో, లేక బూతులు తప్ప మరొకటిరాని ఈ సంతును ఇలాగే వదలి వేస్తావో నువ్వే నిర్ణయించుకోవాలమ్మా అని చెప్పాను. వదిలేస్తే తరువాత బూతులు నీవంతే నమ్మా అని కూడా చెప్పాను. (అదేమిటి నీకు భరత మాత కనిపించిందా అని కొందరు నన్నడిగినపుడు మిగతా వారికి నిత్యం ప్రత్యక్షం అవుతున్నపుడు నాకు అప్పుడపుడన్నా కనపడదా అని జవాబిచ్చాననుకోండి. ) చర్చలో వెల్లడైన అభిప్రాయాలను చూస్తే గుడ్డి అనుసరణ, నమ్మకం తప్ప ఎందుకు ఏమిటి ఎలా ఎప్పుడు ఎవరు అనే ప్రశ్నలను వారు తమ దగ్గరకు రానివ్వరని తేలింది. నిజంగా వారిని చూస్తే జాలేసింది, ఎంతైనా వారు కూడా మనుషుల్లానే వున్నారు కదా అనిపించింది. అదే సమయంలో వారి బూతులు గుర్తుకు తెచ్చుకుంటే జాలి స్ధానంలో ఆగ్రహం కలిగింది. బూతులను ప్రస్తావించటం సంస్కారంకాదు కనుక అలాంటి పోస్టులను, వాటిలోని బూతులను మినహాయించి సారాంశం ఇస్తున్నాను.

వేదాల రిసెర్చే ఘనాపాఠీ అంటే, శాస్త్రవేత్త అంటెనే ఘనాపాఠీ, ఎందుకు కావాలి ఎవరి మార్గం వారిది, మీరెందుకు కాలేదు శాస్త్రవేత్తగా, ఆ వేదాలను ఆ పండిత పామరులను రీసెర్చ్‌ చేసినవారు శాస్త్రజ్ఞులు అయ్యారు, అట్లా బట్టీ పట్టక పోతే మీలాంటి వారు వాటిని ఎప్పుడో అంతం చేసేసి ఉండేవారు. ఇప్పటికైనా ఏదైనా కొద్దిగా ఉందీ అంటే అది బట్టీ కొట్టడం వలననే. ఆ స్వరాలు లో కొద్దిగా మార్పు వచ్చినా అర్థం మారిపోతుంది. అది బట్టీ కొట్టేది అందుకే, మొత్తం ప్రపంచానికి అందించిందే హిందువులు. టెక్నాలజీని అప్పుడు హిరణ్యకశిపుడు దొంగలించాడు. ఇప్పుడు ఈ హిరణ్యకసిపుళ్ళు దొంగిలించారు అందుకే వాళ్ళను రాక్షసులూ అంటారు, ఇప్పటికి వాళ్ళు కొన్నిటిని తెలుసుకోలేకఉన్నారు తెలుకోలేరు హిందువులు వాళ్లకు తెలనివ్వరు ఎందుకంటే ప్రక తి ని నాశనము చేవాళ్లకు ఇవ్వకూడదు సమయం వచ్చినప్పుడు వాటిని ఎలా ప్రయోగించాలో అపుడు ప్రయోగించడం జరుగుతుంది చివరిగా ఒక్కవిషయం ఏఏ దేశాలు అయితే మనదేశానికి వచ్చాయో ఇపుడు ఆదేశాలు నెంబర్‌ 1 స్తానం లో ఉన్నాయి స్వామి వివేకానంద, ఎంతో మంది మేధావులు,, శాస్త్రవేత్తలు జన్మించిన దేశం ,భారతదేశం.. నీకు తెలవదు,ఎందుకంటే నీకు మెదడు లేదు..ఓసారి చరిత్ర చూడు, భారతదేశం అనగానే ఒక సంస్క తీ, సంప్రదాయాలు, ఆచారాలు, ఆద్యాత్మిక భావాలు కలిగిన దేశంగా ప్రపంచం చూస్తుంది. విజ్ఞానము, సాంకేతిక విజ్ఞానం అంతగాలేని దేశంగా చూస్తారు, ప్రపంచమే కాదు మనదేశ ప్రజలకు కూడా తెలియదు. ఐతే ఈ మధ్య కాలాలలో ప్రపంచం కూడా ప్రాచీన భారతదేశం గొప్ప విజ్ఞానము, సాంకేతిక విజ్ఞానం ఉందని మనదేశ ప్రజలు, విదేశీయులు గుర్తిస్తున్నారు. భారతదేశంలో ఎన్నో ప్రాచీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి వాటిలో ఎంతోమంది దేశ విదేశీయులు విధ్యనభ్యసించేవారు. అవన్నీ ఇప్పుడు చరిత్రగా మిగిలిపోయాయి. భారతదేశం అనగానే ఒక సంస్క తీ, సంప్రదాయాలు, ఆచారాలు, ఆద్యాత్మిక భావాలు ప్రాచీన భారతదేశ విజ్ఞానము, సాంకేతిక విజ్ఞానం వాటిలో పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు వారు ఏకాలనికి చెందిన వారు అనే విషయం అంతగా లేదు అది తెలుసుకోవడం ఎంతో అవసరం. 1 శుశ్రుత క్రీ.పూ 600 వైద్య శాస్త్రం, 2 చరక క్రీ.పూ 300 వైద్య శాస్త్రం.

3. బౌదాయన్‌ క్రీ.పూ 8-7 గణిత శాస్త్ర వేత్త.4 కన్నడ (ఆళుక్యుడు) క్రీ.పూ 8-7 ఖగోళ మరియి గణిత శాస్త్రవేత్త. 5. నాగార్జున క్రీ.శ 150-250 ఖనిజ శాస్త్రవేత్త.

ఇంతవరకూ సైన్సు వేదం లో తెలిపిన దానిలో 10% కూడా కనుక్కోలేదు. అక్షర సత్యం, సున్నా 0 లేకపోతే కంప్యూటరైజేషన్‌ అనేది ఉంది ఉండేది కాదని తెలుసుగా, హిందువుల మీద ఏడ్చి ఏడ్చి ఏప్పుడో పోయేట్టున్నావు లే, నువ్వు నమ్మే నీ దొంగ మతం..పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వెంట్రుకతో సమానం..

ఇంకా వేదాలు పండితులు అవసరం లేదు, అంతేలే అన్యమతాల వారి ఎంగిలి మెతుకులు కోసం ఆశపడి

ఈ రకమైన పనులు చేస్తున్నారు, హిందూ ధర్మం మీద ఎంత విషం చిమ్మినా కానీ, మన మన్నెం కోటేశ్వరరావు వలన మంచే జరుగుతోంది. అతను రెచ్చగొట్టడం వలన హిందువులు ఏకమౌతున్నారు, తిక్కల ప్రశ్న. పిహెచ్‌డి చేసిన ప్రతివాడు సైంటిస్ట్‌ ఎందుకు కావడంలేదు… ప్రొఫెసర్‌లుగా ఎందుకు మారుతున్నారు.. ఇదీ అంతే, భారత్‌ను ఏలుతున్న సమయంలో ఫ్రెంచి, బ్రిటీష్‌ పాలకులు మనవేదాలను తీసుకెళ్లి అధ్యనం చేసి వాటిఆధారంగా ప్రయోగాలు చేసి విధ్యుత్‌,రేడియో,విమానం లాంటి అనేక వస్తువులను రూపొందించారనేది కాదనలేని యదార్థం. శాస్త్రవేత్తలు కాలేదని వారు చెప్పారు అల్జెబ్రా ట్రిగ్నోమెట్రీ లాంటివి చాలా కనుక్కున్నారు మేము లీలావతి భస్కర్‌ అని ఆల్జీబ్రాలో శ్లోకాలని చదివేము ఆ రోజుల్లో ఈ దేశం గురించి వాళ్లకి తెలియదు వాళ్ళగురించి మనకి తెలియదు వాళ్ళ మ్యాగజిన్‌ లో ప్రచురించకపోతే విజ్ణాన శాస్త్రమే లేదంటే ఏళ్ళ అగస్త్యుడి కా లంలోనే విమానం ఎలానడపాలి అన్నవిషయం ఉండేది నలందా విశ్వవిద్యాలయంలో కొన్ని వేల గ్రంధాలు కాల్చేసేరు మనం మనల్ని కించపరుచుకునే దుస్థితి దాపురించింది. ఆర్యభట్టు, వరాహమిహిరుడు, భాస్కరాచార్యుడు ఎవర్రా…… కళ్లు దొబ్బాయా. ఆధ్యాత్మిక ప్రపంచం లో సైన్స్‌ అనేది ఒక చిన్న ముక్కమాత్రమే.అధ్యాత్మికవేత్త అనే సముద్రం ముందు సైంటిస్ట్‌ అనే పిల్ల కాలువ పరవళ్లు తొక్కుతూ సముద్రం లో కలవాల్సిందే.పాచీనకాలంలో భారత దేశమే విజ్ఞాన భాండాగారం,నీకు ఇప్పుడు బ్రాహ్మణులు మాత్రమే కనిపెట్టినవి కావాలా,లేక భారతీయులు అయినా పర్వలేదా, ఎర్ర పకోడీ గాళ్లరా మీరు భారతీయులేన లేదా?? మీరు శాస్త్రజ్ఞులు కాదనుకొనేవారికి తెలిసిన శాస్త్రాలు మీరు శాస్త్రజ్ఞులనుకొనేవారిలో ఎంతమందికి ఎన్ని తెలుసు, అసలు శాస్త్రం అంటే ఏమిటి ? శాస్త్రవేత్త

వేత్త అనగా ఎవరు? ముందు దీనిని తెలుసుకొని ప్రశ్న వేయండి. మన పుష్పక విమానం ఫార్ములాతోనే రైట్‌ సోదరులు విమానం రూపకల్పనకు పూనుకొంది. స్ధూలంగా ఇదీ ధోరణి. వీటన్నింటినీ ఎప్పటి నుంచో మెదళ్లకు ఎక్కించుకొని ఒక పిచ్చిలో మునిగి తేలుతున్నట్లు కనిపిస్తోంది. అందువలన దాన్ని పోగొట్టాలంటే కొన్ని ఆసుపత్రులు చాలవు. పెద్దఎత్తున చర్చల కౌన్సిలింగ్‌ చేయకపోతే రాబోయే తరాలను కూడా చెడగొడతారు, మన దేశాన్ని మరింతగా వెనక్కు నెడతారు, నగుబాట్ల పాలు చేస్తారు.

తమకు నచ్చని, తెలియని అంశాన్ని ఎవరైనా చర్చకు పెడితే బూతులు తిట్టి నోరు మూయించేందుకు ప్రయత్నించటం ఒక చౌకబారు ఎత్తుగడ. తాలిబాన్లు వారికి ఆదర్శం. విమర్శకుల నోరు మూయించటానికి మేకిన్‌ ఇండియా చౌకబారు తయారీ. చిత్రం ఏమిటంటే ఆ బూతుల్లో కూడా వైవిధ్యం వుండదు. వారి భావ దారిద్య్రానికి నిదర్శనం ఇది. వారు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ప్రాణాలనే తృణప్రాయంగా అర్పించటానికి సిద్దపడిన వారికి బూతులు, అవమానాలు ఒక లెక్క కాదు. తిట్టినంత మాత్రాన విమర్శలు ఆగిపోయేట్లయితే ఈ పాటికి అది ఎప్పుడో జరిగి వుండేది. ఇంతకు మించి ఏమి తిడతారు, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేదేముంది అని అనేక మంది ఇప్పటికే రాటు తేలారు. ఇప్పటి వరకు తమను వ్యతిరేకించిన వారినే తిడుతున్నారు. ఇప్పుడు నువ్వు హిందువు కాదా, నువ్వు ముస్లిం కాదా, నువ్వు క్రైస్తవుడికాదా అని రెచ్చగొడుతున్నారు.బూతులు తిట్టకపోవటం సంస్కారం, తిట్టే వారిని అడ్డుకోకపోతే రాబోయే రోజుల్లో మాతో కలసి ఎందుకు తిట్టటం లేదని మౌనంగా వున్నవారి మీద కూడా తెగబడతారని గ్రహించటం మంచిది.

ఇక వేదాలలో అన్నీ వున్నాయష అంటూ ఇంకా టెక్నాలజీని బయటకు తీయని దేశ ద్రోహుల గురించి చూద్దాం. వేదాలను వెక్కిరించే వారిని వెధవలని ఒక పత్రిక సంపాదకుడిగా పనిచేసిన ఒక కాషాయ తాలిబాన్‌ నిందించాడు. విమర్శ రూపాలలో వెక్కిరింత ఒకటి. విమర్శకులను వెధవలు అనటం సరైనదే అయితే గుడ్డిగా సమర్ధించే వారు కూడా విమర్శకులకు బంధువులే.

వేదాలను వెక్కిరించే లేదా విమర్శించే వారు వుద్భవించటానికి కారకులు ఎవరు ? వేదాల్లోనే అన్నీ వున్నాయష అని చెప్పిన వెధవలే. 1760లో ప్రారంభమైన పారిశ్రామిక విప్లవం ప్రపంచాన్ని పెద్ద మలుపు తిప్పింది. వివిధ దేశాలలోని వారు ఒకరిని చూసి మరొకరు సరికొత్త ఆవిష్కరణలు చేసేందుకు పోటీ పడ్డారు. అందుకు విరుద్ధంగా మన దేశంలో మన కంటే గొప్ప మేధావులు ప్రపంచంలో లేరని, ఎవరైనా కొత్త వస్తువును కనుగొంటే అవన్నీ మన వేదాల్లో, పురాణాల్లో ఎప్పుడో వున్నాయని తమ జబ్బలను తామే చరుచుకున్నారు. పారిశ్రామిక విప్లవాన్ని మరో మలుపు తిప్పిన పరిణామం 1900 శతాబ్ది ప్రారంభ దశకంలో రైట్‌ సోదరులు కనిపెట్టిన విమానం. ఆవిరి యంత్రాన్ని కనిపెట్టినపుడే మన వేద పారంగతులు, విజ్ఞానవేత్తలు మేల్కొని వుంటే అరే మన పురాణాల్లో వున్న పుష్పక విమానాలను పునరుద్దరించేందుకు పూనుకొని వుండేవారు. నిజంగా ఆ పని చేసి వుంటే మనకు ఎన్ని ప్రయోజనాలు సమకూరి వుండేవో.

ప్రపంచంలో అసలు పెట్రోలుతో పనిలేని విమానాలను మనమే తయారు చేసి మేకిన్‌ ఇండియా అని గొప్పగా చెప్పుకొని మనువాదులు చెబుతున్నట్లు కాలర్‌ చొక్కాలు వేసుకోవటం భారతీయం కాదు గనుక పిలకలు ఎగరేసి వుండేవారం. మన పుష్పక విమాన , కీలు గుర్రాలు, ఎగిరే కార్పెట్ల టెక్నాలజీని బయట పెట్టి వుంటే కార్లు, స్కూటర్లు, లారీల వంటి వాటితో పని వుండేది కాదు, అన్నింటికీ మించి ముస్లిం దేశాల నుంచి చమురు కొనుక్కోనే ఖర్మ పట్టేది కాదు, ఇప్పుడు వారి దగ్గర చమురు కొని, దానికి చెల్లించాల్సిన డాలర్ల కోసం కిరస్తానీ దేశాలను దేబిరించే దుర్గతి పట్టించింది కచ్చితంగా మన వేద విజ్ఞానాన్ని బయటికి తీసేందుకు ముందుకు రాని వెధవలే అన్నది స్పష్టం.

వేదాలను ప్రామాణిక సూత్రాల ప్రకారం సక్రమంగా చదవకపోతే వ్యతిరేక ఫలితాలు వస్తాయని సెలవిచ్చారు. మన దేశంలో కొన్ని భాషాలలో కొన్ని పదాలు పలకవు. వుదాహరణకు బెంగాలీలకు వ, బ మాదిరి. ఇలా ప్రతి భాషకు వున్నాయి. దీని ప్రకారం వుచ్చారణ సరిగా లేకపోతే ఫలితాలు వ్యతిరేకంగా వుంటాయనుకోవాలి. మరి దీన్ని పరిష్కరించటం ఎలా అందువలన ఇప్పటికీ మించి పోయిందేమీ లేదు. డార్విన్‌, న్యూటన్‌ల సిద్ధాంతాలు, సూత్రాలు వద్దూ, వేదాలే ముద్దు అనే పాలకులే నేడు గద్దెల మీద వున్నారు. ఇప్పటికే మేకిన్‌ ఇండియా జయప్రదానికి ఆవుపేడ, మూత్రాలలో ఏముందో కనుగొనేందుకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి పరిశోధనలు చేయిస్తున్నారు. వేదాలలో వున్న టెక్నాలజీని అందరికీ అర్ధం అయ్యేలా ఘనాపాఠీలకే పేటెంట్‌ హక్కులిచ్చి చమురుతో పైలెట్లు, డ్రైవర్లతో పనిలేని విమానాలు, కార్లు,ఇతర వాహనాలను తయారు చేయించండి, విమర్శకుల లేదా వెక్కిరించే వారి నోరు మూయించండి. అదేమీ లేకుండా ఎవడో కిరస్తానీవాడు కనిపెట్టిన ఫేస్‌బుక్‌లో సొల్లు కబుర్లు చెబితే లేదా విమర్శి ంచేవారిని తిడితేనో ప్రయోజనం వుండదు. అంతులేని మన టెక్నాలజీని బయటకు తీసి దేశాన్ని ముందుకు నడిపించకపోతే అలాంటి వారిని దేశద్రోహులుగా పరిగణిస్తారని మనవి.

మన సాంకేతిక పరిజ్ఞానం నిక్షిప్తమై వున్న అనేక సంస్కృత గ్రంధాలను ఇస్లామిక్‌, క్రైస్తవులు నాశనం చేశారని ఒక నోటితో చెబుతూ దానిలోని విజ్ఞానాన్ని దొంగిలించారని మరో నోటితో చెబుతారు. వినేవారు నోట్లో వేలేసుకొని చెవులప్పగిస్తున్నారు. దేన్నయినా ఎందుకు అని ప్రశ్నించిన సమాజమే ముందుకు పోతుంది. ఎందుకు అని నువ్వు పెద్ద ప్రశ్నిస్తున్నావు మన పూర్వీకుల కంటే నువ్వు గొప్పవాడివా మానాన్నకు మాతాత చెప్పారు, మానాన్న నాకు చెప్పారు, నేను నీకు చెబుతున్నాను , నోరు మూసుకొని చెప్పింది చెయ్యి అంటూ తరతరాలుగా జిజ్ఞాసను అణచివేసిన ఆధిపత్య సమాజం మనది. అది వేదాలు, పురాణాలు, వుపనిషత్తులు, హిందూ ధర్మం ఏదైనా కావచ్చు. దేన్నీ ప్రశ్నించకుండా అణచివేశారు.

పురాతన కాలంలోనే అంటే క్రైస్తవం,ఇస్లామ్‌ మతాలు పుట్టక ముందే మన దేశంపై విదేశీయులు దండయాత్రలు చేశారు. క్రీస్తుపూర్వం 326లో అలెగ్జాండర్‌, క్రీపూ 200ల తరువాత శకులు, యవనులు, పహ్లవులు, క్రీస్తుశం 50లో కుషాణులు, క్రీశ 400లలో హూణులు దండయాత్రలు చేశారు. వారు మన వేద విజ్ఞానాన్ని నాశనం చేశారని ఎవరూ చెప్పలేదు. అలెగ్జాండర్‌ దాడి సమయంలోనే మన దేశానికి ప్రమాదం వుందని అర్ధమైంది. మరొకరు దాడికి పూనుకోకుండా ఎవరైనా ఏం చేయాలి, అందులోనూ దేశభక్తులు, అలెగ్జాండర్‌ నుంచి హూణుల వరకు మధ్యకాలం ఏడు వందల సంవత్సరాలలో ఏ ఒక్క సమయంలోనూ మన వేద విజ్ఞానులు విమానాలు లేదా అస్త్రాలను బయటకు తీసి సంధించి దురాక్రమణదారులను తరిమివేసి వుంటే తరువాత ముస్లింలు, క్రిస్టియన్లు దాడులు చేసి వుండేవారు కాదు. మహమ్మద్‌ ఘజనీ , ఘోరీలు అన్ని సార్లు దండయాత్రలు చేసి హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తుంటే మన అస్త్రాలను బయటకు తీయకుండా మన హిందూ ధర్మ పరిరక్షకులు ఏ గుడ్డి గుర్రానికి పండ్లుతోముతూ కూర్చున్నట్లు ?

మన నలంద విశ్వవిద్యాలయాన్ని ముస్లింలు తగుల బెట్టి మన విజ్ఞాన గ్రంధాలన్నింటినీ తగుల బెట్టారన్నది ఒక ప్రచారం. అనేక మంది చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారం తగులబెట్టింది వాస్తవం. ఎవరు తగులబెట్టారు ? పాట్నా హిందుస్తాన్‌ టైమ్స్‌ 2014 సెప్టెంబరు ఒకటిన రాసిన దాని ప్రకారం క్రీస్తుశకం 455-467 మధ్య స్కంధగుప్తుని కాలంలో మిహిరకులుడనే హూణ రాజు నాయకత్వంలో విశ్వవిద్యాలయాన్ని నాశనం చేశారు. తరువాత గౌడాస్‌ నాయకత్వంలో ఏడవ శతాబ్ది ప్రారంభంలో మరోసారి నాశనం చేశారు. దాన్ని తరువాత హర్షవర్ధనుడనే రాజు పునరుద్దరించాడు.1193లో భక్తియార్‌ ఖిల్జీ సేనలు మరోసారి నాశనం చేసిన తరువాత దాని పునరుద్దరణ జరగలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతుదారులు నడిపే పయనీర్‌ పత్రిక 2014 సెప్టెంబరు 20న రాసినదానిలో 1193లో టర్కీ సైన్యం దాడి చేసి విశ్వవిద్యాలయాన్ని తగుల పెట్టినట్లు పేర్కొన్నారు.

కొంత మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఖిల్జీ దాడుల నాటికే నలంద విశ్వవిద్యాలయం శిధిలమైంది. బౌద్ధంలో హీనయాన, మహాయాన శాఖల మధ్య వైరమే దీనికి కారణం అన్నది వారి వాదన. ఖిల్జీ సేనలు దాడి చేసింది నలంద జిల్లాలోనే వేరొక చోట వున్న మహావీర ఓదాంతపురి (నేటి బీహార్‌ షరీఫ్‌) కోటపై అన్నది ఒక అభిప్రాయం, నాటి చారిత్రక రచనల్లో అసలు నలంద ప్రస్తావన లేదని చెబుతున్నారు. డిల్లీ నుంచి బెంగాల్‌ వెళ్లే ప్రధాన మార్గంలో నలంద లేదని కూడా వాదించేవారున్నారు. చరిత్రకారులు ఎవరి భాష్యం వారు చెబుతున్నపుడు వాటి అధ్యయనానికి పరిమితం కావాలే తప్ప నిర్ధారణలకు రాకూడదు. ఇక్కడ సమస్య నలంద అనేది బౌద్ధ క్షేత్రం, బౌద్ధ విశ్వవిద్యాలయం అనేది నిర్వివాదం. బౌద్దులు వేద ప్రామాణ్యాన్ని నిరాకరించారు. అందువలన అక్కడున్నది వారి సాహిత్యం తప్ప వేద సంబంధిత సాహిత్యం ఎంత మాత్రమూ కాదు. ఒక వేళ వేద సాహిత్యమే నాశనం అయింది అనుకుంటే తరువాత ఎన్నో వందల సంవత్సరాల తరువాత వచ్చిన యూరోపియన్లు దొంగిలించటానికి అక్కడ ఏముంటుంది? వేదాలు, ఎంతో సాంకేతిక నైపుణ్యం వున్న సాహిత్యం సంస్కృతంలో వుందని చెబుతున్నవారు నలంద వంటి బౌద్ద విశ్వవిద్యాలయం మాదరి దేశంలో ఎక్కడా వేద విశ్వవిద్యాలయం ఎందుకు ఏర్పాటు చేయలేదు అన్నది ప్రశ్న.

వేదాలను బ్రహ్మ సృష్టించాడని చెబుతారు, అలాంటి వాటిని మానవ మాత్రులు నాశనం చేయటం ఏమిటి? శృతి, అనుశృతుల ద్వారా వేదాలు, వుపనిషత్తులు, పురాణాలను పరంపరగా తరువాతి తరాలకు అందించారు, అందువలన వాటిని భౌతికంగా నాశనం చేశారని చెప్పటం చెవుల్లో పూలు పెట్టటమే. చతుర్వేదాలు, పంచమ వేదంగా మహాభారతాన్ని చెప్పుకుంటున్నాం తప్ప నాశనం చేశారని, లేదా దొంగిలించారని చెబుతున్న వేదాల గురించి ఇంతవరకు ఎవరూ ఎందుకు చెప్పటం లేదు. పోనీ కాన్నింటినీ నాశనం చేశారని అనుకుందాం, అవన్నీ పోయిన తరువాత కూడా మన వారు వేదాల్లో అన్నీ వున్నాయష అన్నారు తప్ప కొన్నే వున్నాయష అన లేదు. అందువలన కొన్ని నాశనం చేశారని చెప్పటం ఇటీవలి కట్టుకధలు తప్ప మరొకటి కాదు. ముస్లిం పాలకులు మన దేశం మీద దండ యాత్రలు చేసినపుడు మన విజ్ఞానాన్నినాశనం చేశారని ఒక కధ, ఎవరైనా విజ్ఞానాన్ని గ్రహించి తాము వుపయోగించుకుంటారు. నిజంగానే వారు మన టెక్నాలజీని చోరీ చేసి వుంటే ముస్లిం దేశాలు నేడు సాంకేతిక పరంగా ఎంతో ముందుండాలి, దానికి బదులు పశ్చిమ దేశాల మీద ఎందుకు ఆధారపడుతున్నట్లు ? బ్రిటీష్‌, ఫ్రెంచి వారు అపహరించారంటారు. వారు మన దేశానికి రాకపూర్వమే ఐరోపాలో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైంది కదా, దాంతో పెరిగిన వుత్పత్తి అయిన వస్తువులను అమ్ముకొనేందుకే కదా మన దేశం వచ్చింది. మరి వారికి ఆ టెక్నాలజీ ఎలా వచ్చినట్లు ? సున్నా కనిపెట్టింది భారతీయులంటారు, ఎవరు నిర్ధారించారు? మూడువేల సంవత్సరాలకు పూర్వమే ఈజిప్టులో దాని ప్రస్తావన వున్నట్లు, నేటి సున్నాకు రూపమిచ్చింది చైనీయులని చరిత్ర వుంది. మనది కూడా పురాతన సమాజాలలో ఒకటి కనుక సున్నా గురించి పురాతన ప్రస్తావనలు మనకూ వున్నాయి. వేదాల్లో అన్నీ వున్నాయని చెప్పిన తరువాత ప్రతి దానిని మన ఖాతాలో వేసుకుంటే ప్రపంచం నవ్విపోతుంది. అంతెందుకు విదేశీ విడి భాగాలు లేకుండా మనం ఫోన్‌, కారు, టీవీ వంటి వాటిల్లో ఒక్కదానినైనా స్వంతంగా తయారు చేస్తున్నామా ? మనకు వున్న కీలకపేటెంట్లు ఎన్ని? చివరికి పెద్ద విగ్రహం తయారు చేసుకొనేందుకు కూడా చైనా వద్దకు పరుగెడుతున్నామే ఎంత సిగ్గు చేటు ?

క్రీస్తుకు పూర్వమే వున్న చరకుడు, ఆర్యభట్టు, శుశ్రుతుడు అంటూ ఒక జాబితాను వల్లె వేస్తున్నారు. వారితో ఎవరికి పేచీ వుంది ? వారి పరిజ్ఞానం ఎంత అన్న మీమాంస ఎప్పుడూ వుంటుంది. అతిశయోక్తులు జోడిస్తేనే వెక్కిరింతలు వస్తాయి. వినాయకుడికి ఏనుగు తలను అతికించిన గొప్ప శస్త్ర నిపుణులున్నారని చెబుతారా ? మనిషికి మనిషి తలదొరక్కపోతే దానికి సమబరువుతో వుంటే మరో కుక్కో, నక్క తలో అంటించాలిగాని మోయలేని ఏనుగు తలను అంటించే మొరటు వారా నాటి వైద్యులు. మహాభారత కాలంలోనే ఇంటర్నెట్‌ వుందని ఒక ముఖ్యమంత్రి ప్రవచిస్తాడా ? అదే నిజమైతే ముస్లింలు, అంతకు ముందు ఇతరుల దండయాత్రల గురించి ఎందుకు హెచ్చరించలేదు, తలలో మెదడు వుండి చెబుతున్న మాటలేనా ? పురాతన సమాజాలలో ఒకటైన మన దేశంలో కొన్ని రంగాలలో పని చేసిన ప్రముఖులను గుర్తించటానికి, వారి ఘనతను పొగటానికి ఎవరికీ ఇబ్బంది లేదు. వారందరూ వేదాలనుంచే ప్రావీణ్యం పొందారని చెబుతుంటేనే సవాలక్ష ప్రశ్నలు వస్తున్నాయి. వారికీ వేదాలకు సంబంధం వుండి వుండదు. ఒక వేళ వుంటే అదే వేదాల నుంచి తరువాతి తరాలు మరింత నైపుణ్యంతో వైద్యం, ఇతర శాస్త్రాలను ఎందుకు మెరుగుపరచలేకపోయారు? వేదాలతో సంబంధం లేకపోయినా వారి అనుచరులు తరువాత ఎందుకు నిపుణులుగా రాణించలేకపోయారు అన్నది పరిశోధించాల్సిన అంశం. వేదాలలో ఏముంది, అది పనికి వచ్చేదా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఒక సాహిత్యంగా చూసినపుడు వాటిని కంఠోపాఠం చేసి తరతరాలకు అందించినందుకు ఘనపాఠీలను అభినందించాల్సిందే. అదే సమయంలో వారి చాదస్తాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదు. అణకువ, ఆసక్తి, తపన వున్న సమాజమే ఎప్పుడైనా ముందుకు పోతుంది. అహంకారం, గర్వం వుంటే ఎక్కడో అక్కడ బొక్కబోర్లా పడి ముక్కు బద్దలు చేసుకుంటాం. సాయంత్రం కాగానే సత్రాలకు చేరుకొని గంజాయి దమ్ముకొట్టి మనం తెల్లవారిన తరువాత అది చేయాలి, ఇది చేయాలి అని ప్రగల్భాలు పలికి తెల్లవారి మత్తుదిగగానే ఎవరి కర్రాబుర్రా పట్టుకుని అడుక్కొనేందుకు పోయే సోమరిపోతుల మాదిరి కబుర్లు కాదు కావాల్సింది. వేదాల్లోనే అన్నీ వున్నాయని చెబుతున్న వారు విదేశాలకు ఎందుకు పరుగులు తీస్తున్నట్లు ? తమ బిడ్డలకు శ్లోకాలు నేర్పించటం ఒక దేశభక్తిగా అనేక మంది ప్రదర్శించుకుంటున్నారు. డాలర్ల కక్కుర్తి తప్ప దేశభక్తి ఏమైనా వుందా ?

ఇక గురుకులాల వ్యవస్ధను పునరుద్ధరించాలని మోహన్‌ భగవత్‌ చెబుతున్నారు. మదర్సాలనుంచి తాలిబాన్లు వస్తున్నారని నిత్యం ప్రచార దాడులు చేస్తున్న వారే వాటికి పోటీగా గురుకులాలను ఏర్పరచాలని అంటున్నారు. అంటే మైనారిటీ తాలిబాన్లతో పాటు మెజారిటీ తాలిబాన్లను తయారు చేసి సమాజాన్ని మధ్యయుగాల నాటికి తీసుకు పోయి రక్తపుటేరులు పారిద్దామనా ? ఏమిటీ వున్మాదం ? దీన్ని నాగరిక సమాజం సహించాలా ? ఆర్‌ఎస్‌ఎస్‌ను సమర్ధిస్తున్న వారిలో తమ బిడ్డలను గురుకులాల్లో చేర్పించటానికి ఎందరు ముందుకు రాగలరో చెప్పగలరా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నోటి తుత్తర నేతలు -బిజెపి ద్వంద్వ ప్రమాణాలు !

25 Wednesday Apr 2018

Posted by raomk in BJP, Communalism, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

BJP double standards, BJP motor mouths, motormouths, Narendra Modi

ఎం కోటేశ్వరరావు

నోటి తుత్తరతో సమస్యలు తీసుకురావద్దని ప్రధాని నరేంద్రమోడీ తన పార్టీ అనుచరగణానికి చెప్పాల్సి రావటం ఆ పార్టీ ఎలాంటి సంకట స్ధితిని ఎదుర్కొంటోందో తెలియచేస్తోంది. జర్నలిస్టుల ప్రత్యక్షంగా మాట్లాడకుండా మౌన దీక్షపూని ఒక ప్రపంచ రికార్డు ఇప్పటికే సృష్టించిన మోడీ త్వరలో ఐదో సంవత్సరంలో ప్రవేశించబోయే వుత్సవంతో కలిపి దాన్ని కూడా ఒక విజయంగా జరుపుకుంటారు. ఒకవైపు నేత నిక్కచ్చిగా వుంటే మరోవైపు అందుకు విరుద్ధంగా పండ్లుతోముకోవటమైనా మానతారేమోగాని బిజెపి నాయకులు మీడియా ముందు మాట్లాడకుండా ఒక్కరోజు కూడా గడపలేని స్ధితికి వచ్చారు. అయితే మోడీ ఇప్పుడెందుకు హెచ్చరించారనేదే అందరినీ ఆలోచింపచేస్తున్న అంశం. ఊరందరిదీ ఒక దారయితే వులిపికట్టెది మరొక దారి అన్నట్లుగా కథువా(అసిఫా) అత్యాచార వుదంతంపై దేశ మంతటా ఆగ్రహం, విచారంతో నిరసన వ్యక్తం చేస్తుంటే, పన్నెండేళ్లలోపు బాలికలపై అత్యాచారాలు జరిగినపుడు నిందితులకు వురి శిక్ష విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ చారిత్రాత్మకమైనది కనుక పండుగ చేసుకోవాలని బిజెపి నేతలు పిలుపునిచ్చారు.

వైపరీత్యం ఏమంటే ఎనిమిదేండ్ల అసిఫాపై అత్యాచారం జరిపి హత్య చేశారని కొందరిపై అభియోగం మోపారు. నిందితులు నిర్దోషులని, హిందువులను గబ్బు పట్టించటానికి ఇదంతా చేస్తున్నారంటూ వీధులకు ఎక్కి ప్రదర్శనలు చేసిందీ, కేసు నమోదుచేయకుండా పోలీసులను అడ్డుకున్న బిజెపి అనుకూల లాయర్ల, నేతలు,కార్యకర్తల తీరు తెన్నులు చూసి దేశం ఇంకా దిగ్బ్రాంతి నుంచి ఇంకా కోలుకోలేదు.Û గతంలో గోరక్షకుల మంటూ ఆవులను రక్షించటానికి ముందుకు వచ్చిన వారే ముక్కుపచ్చలారని పసి పిల్లపై అత్యాచారం చేసిన నిందితులకు మద్దతుగా రేపిస్టు రక్షకులుగా ముందుకు వస్తారని ఎవరూ వూహించి వుండరు. దాన్నుంచి దృష్టిమళ్లించటానికి తెచ్చిన ఆర్డినెన్స్‌పై పండుగ చేసుకోవాలని పిలుపివ్వటం గుండెలు తీసిన బంట్లకు తప్ప అన్యులకు అసాధ్యం. బిజెపి అభిమానులు దీన్ని ఎలా జీర్ణించుకుంటున్నారో అనూహ్యం. తమదాకా వచ్చినపుడు గాని వారికి తెలియదని సరి పెట్టుకోవటం తప్ప ఇంకేం చేయగలం. అనేక ప్రజావ్యతిరేక నిర్ణయాలపై వేగంగా నిర్ణయం తీసుకున్న మోడీ సర్కార్‌ దీనిపై ఎందుకు తాత్సారం చేసిందని, అదీ ఆర్డినెన్స్‌ జారీ చేయాల్సినంత అగత్యం ఏమిటని అడగటం పాచిపోయిన పాత పాట ‘దేశద్రోహం’ అవుతుందేమో !

పన్నెండు సంవత్సరాల లోపు బాలికలపై అత్యాచారం జరిగితే మరణశిక్ష, 12ా16 సంవత్సరాల మధ్యవారిపై జరిగినపుడు పది నుంచి ఇరవై సంవత్సరాలకు పెంచాలని మోడీ సర్కార్‌ తెచ్చిన ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. బిజెపి అధికార ప్రతినిధి మీనాక్షీ లేఖీ మాట్లాడుతూ దీర్ఘకాలంగా చేస్తున్న డిమాండ్‌ను నేటికి నెరవేర్చారని, ఈ రోజు చారిత్రాత్మకం అన్నారు. మహిళాసాధికారత పెంపుదలకు, గొడ్డుచాకిరీని తగ్గించేందుకు మోడీ సర్కార్‌ తీసుకున్న సానుకూల చర్యల గురించి చర్చించాల్సిన దినమిదన్నారు. అంతటితో వూరుకుంటే కిక్కేముంది. సమాజంలో వున్న కొంతమంది వున్మాదుల పట్ల కఠినంగా వ్యవహరించేందుకు తీసుకున్న చర్యలతో ఇది పండుగ చేసుకోవాల్సిన సందర్భమని అన్నారు.అసిఫా వుదంతంపై దేశమంతటా, విచార,మౌన, నిందుతులను వెనుకేసుకు వచ్చిన బిజెపి నేతలపై ఆగ్రహ ప్రదర్శనలు చేస్తుంటే ఈమె గారికి పండుగ చేసుకోవాల్సిన అవసరం కనిపించింది.

గత చరిత్రను చూసినపుడు బిజెపిలో నోటి దురుసుతనం లేదా తుత్తర ఎంత ఎక్కువగా వుంటే అంత త్వరగా వారు అధికార ప్రతినిధులుగా, పదవులు పొందుతారని వెల్లడైంది. దానికి కారణం మత, సామాజికరీత్యా విద్వేషభావాలను, ప్రచారాలను రెచ్చగొట్టటం, వదరుబోతుతనం తమకు ప్రయోజనకరమని ఆ పార్టీ వ్యూహకర్తలు భావించటమే. అదుపు తప్పిన నోళ్లు ఎప్పుడు ఏంమాట్లాడతాయో తెలియదు. అది రాజకీయంగా నష్టం కలిగించటం, తమ తెలివితక్కువ తనంతో ఓహో ఈ పార్టీ ఇలాంటివారితోనే నిండి వుందనే సందేశం ఇటీవలి కాలంలో అనేక మందికి అవగతం అవుతుండటంతో నోళ్లను అదుపులో పెట్టుకోవాలని మోడీ చెప్పాల్సి వచ్చింది.

‘ఇంత పెద్ద దేశంలో ఒకటి రెండు అత్యాచారాలు జరిగితే ఏమైంది, దానికే అన్ని వైపుల నుంచి నానా యాగీ చేయటం న్యాయం కాదు’ అంటూ కేంద్ర కార్మిక, వుపాధిశాఖల మంత్రి సంతోష్‌ గాంగ్వార్‌ స్వయంగా వ్యాఖ్యానించాడు. ఇలాంటి వ్యాఖ్యలు బిజెపి కార్యకర్తలకు మంచి వుత్సాహాన్నిచ్చి సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేకంగా స్పందించిన వారి మీద విరుచుకుపడేట్లు చేస్తాయి. అసలు విషయాన్ని జయప్రదంగా పక్కదారి పట్టిస్తాయి.’ ప్రతి సమస్య మీద విశ్లేషణ చేసే ఒక సామాజిక శాస్త్రవేత్తగానో లేక పండితులుగానో భావించుకొని టీవీ కనపడిన ప్రతిసారీ ఒక ప్రకటన చేసేందుకు తొందరపడవద్దు ‘ అని నమో ఆప్‌ ద్వారా నరేంద్రమోడీ తన సహచరులను మందలించారు. గత నాలుగు సంవత్సరాలలో అనేక మంది బిజెపి నేతలు మసాలా వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల ఒక బిజెపి నేత ఏర్పాటు చేసిన నైట్‌క్లబ్‌ను ప్రారంభించి మీడియాలో గబ్బుపట్టగానే నాకు అది క్లబ్బు అని చెప్పకుండా మోసం చేశారంటూ చేతులు దులుపుకున్న సాధువైన పార్టీ ఎంపీ గిరిరాజ్‌ సింగ్‌ ‘ ఒక వేళ రాజీవ్‌ గాంధీ ఒక నైజీరియన్‌ మహిళను పెళ్లి చేసుకొని వుంటే, ఆమెకు తెల్లతోలు లేకపోయి వుంటే కాంగ్రెస్‌ ఆమె నాయకత్వాన్ని ఆమోదించి వుండేదా ?’ అని వ్యాఖ్యానించారు. తరుణ్‌ విజయ్‌ అనే మరో ఎంపీ ‘ మేము జాత్యహంకారులమే అయితే మొత్తం దక్షిణ భారత్‌లో మేము ఎందుకు వుండేవాళ్లం. తమిళనాడు మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్‌ మరియు కేరళ మీకు తెలుసు, వారితో మేము జీవిస్తున్నాం, మా చుట్టూరా నల్ల వారున్నారు’ అని సెలవిచ్చిన విషయం తెలిసిందే. ‘డార్విన్‌ సిద్ధాంతం తప్పు ఎందుకంటే కోతులు మనుషులుగా మారటాన్ని ఎవరూ చూడలేదు’ అన్న సత్యపాల్‌ సింగ్‌, ‘మహాభారతంలో అంధుడైన ధృతరాష్ట్రుడికి సంజయుడు యుద్ధరంగంలో ఏం జరుగుతున్నదీ చెప్పగలిగాడంటే ఆ రోజు ఇంటర్నెట్‌ మరియు సాంకేతిక పరిజ్ఞానం వుండబట్టే ‘ అన్న త్రిపుర బిజెపి ముఖ్యమంత్రి విప్లవకుమార్‌ చెప్పిన మాటలతో బిజెపి నవ్వులపాలైంది. అయితే కొద్ధి సంవత్సరాల క్రితం ఇలాంటి మాటలను స్వయంగా నరేంద్రమోడీయే చెప్పినపుడు మీడియా వాటికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది. వాటిని సమర్ధించేందుకు అనేక మంది సమర్ధకులు బయటకు వచ్చారు. ఇప్పుడా సీన్‌ లేదు. అధికారానికి వచ్చిన ఆరునెలలకు 2014 అక్టోబరులో వైద్యులు,శాస్త్రవేత్తలు పాల్గన్న ఒక సమావేశంలో నరేంద్రమోడీ మాట్లాడుతూ మహాభారత సమయంలోనే జెనెటిక్స్‌ శాస్త్రంలో భారత్‌ ప్రావీణ్యం సంపాదించిందని, వినాయకుడికి ఏనుగుతలను అంటించటం ఆ సమయంలో మనకు ప్లాస్టిక్‌ సర్జన్స్‌ వున్నారనేందుకు ప్రత్యక్ష రుజువు అని సెలవిచ్చారు. అంతటి పెద్దమనిషే అలా అన్నతరువాత అనేక మంది తరువాత ఎన్నో అశాస్త్రీయ, కేవలం నవ్వులాటకు పనికి వచ్చే, మన దేశ పరువు తీసే అంశాలను ముందుకు తెచ్చి ప్రచారం చేసిన విషయం తెలిసిందే. వీటిని ప్రవచించిన పెద్దలందరూ నిజంగా వాటిని గట్టిగా విశ్వసించబట్టే చెప్పారు. ఎందుకంటే ఈ దేశంలోని తిరోగమన వాదులు బిజెపి పుట్టకముందే వేదాల్లోనే అన్నీ వున్నాయష అంటూ చేసిన ప్రచారాన్ని చిన్న తనం నుంచి తలకెక్కించుకున్నవారెందరో వున్నారు. వారిలో కాషాయ కుటుంబానికి చెందిన వారు అగ్రస్ధానంలో వుంటారు.

విద్వేష పూరిత ప్రసంగాలు చేసే నోళ్లు కూడా చిన్నవేమీ కాదు, తక్కువేమీ లేవు. వారు ఒక హిందువును చంపితే మేము వంద మంది ముస్లింలను చంపుతామన్న యోగి ఆదిత్యనాధ్‌, ఇంట్లో ఆవు మాంసం వుందంటూ దాద్రిలో దాడి చేసి ఇంటి యజమాని మహమ్మద్‌ అఖ్లాక్‌ను హత్యచేసిన తరువాత నిందితులను బదులు మాంసం కలిగి వున్నందుకు ఆ కుటుంబాన్ని అరెస్టు చేయాలన్న ఎంఎంల్‌ఏ సంగీత్‌ సోమ్‌, మన దేశాన్ని హిందుస్తాన్‌ అని పిలుస్తారు, అంటేదాని అర్ధం ఇది హిందువులది, గతంలో ఒక పద్దతి వుండేది ఎంత పెద్ద గడ్డం వుంటే అంత ఎక్కువ లబ్ది కలిగించేవారు అన్న ఎంఎల్‌ఏ విక్రమ్‌ సైనీ వ్యాఖ్యలు మచ్చుకు కొన్ని మాత్రమే. ఈ విషయంలో నరేంద్రమోడీ ఏమీ తక్కువ తినలేదు. ముఖ్యమంత్రిగా వున్నపుడే ముస్లిం కాందిశీక శిబిరాలన్నీ పిల్లలను పుట్టించే ఫాక్టరీలని, వుత్తర ప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో ఖబరస్తాన్‌(ముస్లింల శ్మశానవాటిక) ఏర్పాటు చేసినపుడల్లా ఒక శ్మశానాన్ని కూడా ఏర్పాటు చేయాల్సిందే అని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. బిజెపి మిత్ర పక్షం శివసేన నాయకులూ ఈ విషయంలో బిజెపితో పోటీపడతారు. అలాంటి పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయం బిజెపి ప్రజాప్రతినిధుల బాధ్యతారహితమైన వ్యాఖ్యలకు బాధ్యత ప్రధానిదే అని దాడి చేసింది. ఈ బిజెపి రాజ్యంలో ప్రధాని మోడీని చూసి వుత్తేజం పొందే పార్టీ మంత్రుల నోటికి అదుపుండదు అని పేర్కొన్నది.

పోనీ ఇలా నోరు అదుపులేని నేతల పట్ల బిజెపి గతంలో ఎలా వ్యవహరించింది? 2008లో ముంబై వుగ్ర దాడుల సందర్భంగా నాటి హోం మంత్రి ఆర్‌ఆర్‌ పాటిల్‌ నోరు జారారు. పెద్ద పట్టణాలలో ఇలాంటి చిన్నచిన్న అంశాలు జరుగుతుంటాయి అన్నందుకు గాను నానా యాగీ చేసిన బిజెపి ఆయన రాజీనామా చేసే వరకు వూరుకోలేదు. మరి ఇప్పుడు దేశమంతటినీ కుదిపివేసి వున్నావ్‌ అత్యాచార వుదంతంపై ఇంత పెద్ద దేశంలో ఒకటి రెండు అత్యాచారాలు జరిగితే ఏమైంది, దానికే అన్ని వైపుల నుంచి నానా యాగీ చేయటం న్యాయం కాదు అన్న కేంద్ర మంత్రి సంతోష్‌ గాంగ్వార్‌ను కనీసం అదే బిజెపి మందలించను కూడా లేదు, ద్వంద్వ ప్రమాణాలు అంటే ఇవే.

ఒక అత్యాచారం జరగ్గానే చేసిన వాడిని వురి తీయాలి, వాడి అంగాన్ని నరికివేయాలంటూ ఆగ్రహం తీవ్ర స్ధాయిలో వ్యక్తం చేయటం సహజం. హత్య నేరమే కొన్ని కేసులలో యావజ్జీవ శిక్ష పడుతుంది, కొన్నింటిలో వురి శిక్ష కూడా వేశారు. ఎందుకీ తేడా ? ఏదైనా హత్య హత్యేకదా ? వుద్రేకంలోనో, అసంకల్పిత ప్రతీకార చర్యలోనో మరొక కారణంతో జరిగితే అది సాధారణ హత్య. అలాగాక కుట్ర చేసి లేదా హత్యలు చేయటమే పనిగా పెట్టుకొని లేదా, వున్మాదంతో చేసేవి దారుణ హత్యలు. అందుకే శిక్షల్లో తేడా. వురి శిక్ష వేస్తే సమస్య పరిష్కారం అవుతుందా అంటే అనేక దేశాలు, మన దేశ అనుభవం చూసినా అలాంటి వాటి వలన ఫలితమేమీ కనపడటం లేదు. అందువలన సిపిఎం వంటి పార్టీలు, కొన్ని సంస్ధలు వురి శిక్షలు వద్దు ఇతర శిక్షలు వద్దని చెబుతున్నాయి. వద్దన్నవారిని దుండగులను ప్రోత్సహించేవారుగానూ, కావాలన్నవారిని నిరుత్సాహపరిచేవారుగానూ అనేక మందికి కనిపిస్తారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధులలోనూ, ఇతరత్రా చూసినపుడు అవాంఛనీయ శక్తులు ఇతర పార్టీలలనే ఎక్కువగా వున్నట్లు ఎవరికైనా ఇట్టే అర్ధం అవుతుంది.

సరే బిజెపి వారు అనేక చారిత్రకాంశాలకు ఆద్యులమని చెప్పుకుంటున్నారు గనుక వారు చెప్పుకున్నట్లు పన్నెండు సంవత్సరాల లోపు వయస్సు వున్న బాలికలపై అత్యాచారం చేసిన వారికి వురి శిక్ష విధిస్తూ , అంతకంటే కాస్త పెద్దవారిపై అత్యాచారం జరిగితే శిక్షను పది నుంచి 20కి పెంచుతూ శిక్షాస్మృతిని సవరిస్తూ తొలిసారిగా ఆర్డినెన్స్‌ తెచ్చిన ఆ ఖ్యాతిని కూడా వారి ఖాతాలోకే వేద్దాం. దాంతో పాటే మరొకదానిని కూడా వేయాలి. ఒక పన్నెండేళ్లలోపు బాలికపై అత్యాచార కేసులో నిందితులు నిర్దోషులంటూ హిందూ ఏకతా మంచ్‌ పేరుతో జరిపిన ప్రదర్శనలో బిజెపి మంత్రులు పాల్గనటం కూడా ఇదే ప్రధమం కనుక దీన్ని కూడా ఆ ఖాతాకే జమచేయటం న్యాయం.ఇక బేటీ బచావో నినాదం ఇచ్చిన ఖ్యాతి కూడా నరేంద్రమోడీ ఖాతాలోనే వేయాలి. దేశంలో అత్యాచారాలు ఈనాటివి కాదు. కొత్తగా బిజెపిలో ప్రారంభంగాని మాట నిజం.2016 లెక్కల ప్రకారం మొత్తం రేప్‌ కేసులు 39068,రోజుకు 107, గంటకు 4.46, ప్రతి 14ని నిమిషాలకు ఒక అత్యాచారం జరిగింది.

ఇక వివరాల్లోకి వస్తే ఆరేండ్ల లోపు అభాగినులు 520,6ా12 ఏండ్ల మధ్య వారు 1596,12ా18 ఏండ్ల మధ్య వయస్కులు 8656, మిగిలిన 22205 మందిలో 57 మంది అరవై సంవత్సరాల పైబడిన వారు కూడా వున్నారు. పన్నెండు సంవత్సరాల లోపు వారు 1114 మంది వున్నారు.2016లెక్కల ప్రకారం నాలుగో వంతు మైనర్‌ బాలికలపై జరుగుతున్నాయి. రెండు సంవత్సరాల నాడు ఇంత మందిపై జరిగాయి, తరువాత సంవత్సరం కూడా ఎంతమంది బలయ్యారో లెక్కలు వారికి అందుబాటులో వుంటాయి కనుక కేంద్రంలోని పెద్దలకు తెలియకపోదు. అలాంటపుడు ఆర్డినెన్స్‌లోని శిక్ష మంచిదో చెడ్డతో అన్న మీమాంసను పక్కన పెడితే ఇన్ని సంవత్సరాలు ఎందుకు తేలేదు, ఇన్నాళ్ల తరువాత తెచ్చిందానిని చారిత్రకం అని ఎందుకు డబ్బా కొట్టుకుంటున్నారు. దీన్ని కూడా ఓట్లకోసం వాడుకుంటారా? 2013 ఆగస్టు ఒకటిన ఆశారామ్‌ బాపు అనే ఒక బాబా దయ్యం వదలగొట్టే నెపంతో తనపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు బాబా నిర్దోషి అంటూ సమర్ధించిన వారిలో బిజెపి నేతలున్నారు. ఇప్పుడు ఆ కేసులో తీర్పు వెలువడనుండగా శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చుననే భయంతో పోలీసులను మోహరించాల్సిస దుస్ధితి వచ్చిందంటే బాబా భక్తులకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చినట్లు ? ఆ కేసులో బాబాపై పోస్కో చట్టంతో పాటు షెడ్యూలు కులాలు, తెగలపై అత్యాచార నిరోధ చట్టం కింద కూడా అభియోగాలను మోపారు.కోర్టు బాబాను దోషిగా తేల్చి యావజ్జీవ శిక్షవిధించింది. అదే కేసులో మరో నలుగురికి జోధ్‌పూర్‌ కోర్టు శిక్షలు వేసింది. ఈ సందర్భంగా ఐదు సంవత్సరాల క్రితం ముంబయ్‌లో శక్తి మిల్స్‌లో సామూహిక అత్యాచారానికి గురైన ఫొటో జర్నలిస్టు కేసును పరిశీలించటం సముచితం. ఇది శ క్తి మిల్స్‌ కేసుగా కూడా పిలుస్తారు. ఫొటో జర్నలిస్టుపై అత్యాచారం కేసులో 2014 మార్చి 20న ఇచ్చిన తీర్పులో ఐదుగురు నేరగాండ్లలో ముగ్గురికి మరణశిక్ష, ఒకడికి జీవిత ఖైదు విధించింది. అప్రూవర్‌గా మారినవాడిని వదిలేసింది. అదే మిల్స్‌ ఆవరణలో జరిగిన మరొక అత్యాచార వుదంతంలో ఒక మైనర్‌ బాలుడు నిందితుడు. వాడికి మూడు సంవత్సరాల శిక్ష విధించారు. చట్ట ప్రకారం అంతకంటే ఎక్కువ లేదు.

వదిలేద్దాం, ఓట్ల కోసం దేన్నయినా వాడుకోగల దిట్టగా బిజెపి ఆరితేరిందని దాని ఘనతను కీర్తిద్దాం. ఇప్పటికే వున్న చట్టాల ప్రకారం దారుణమైన నేరాలకు వురి శిక్ష విధించటానికి అవకాశం వుంది. ఈ నాలుగు సంవత్సరాలలో ఒక్క బాలిక వుదంతంలో కూడా కోర్టులు ఎందుకు వురి శిక్ష విధంచలేదు. న్యాయమూర్తులలో స్పందన లోపించిందా? అసాధారణ రేప్‌ కేసులలో వురి శిక్ష విధించాలని, అయితే తమ పార్టీ సూత్రప్రాయంగా వురిశిక్షకు వ్యతిరేకమని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ అభిప్రాయం చెప్పారు. అది నచ్చని వారు తప్పు పట్టవచ్చు, కానీ కొందరు రేపిస్టులను సిపిఎం సమర్ధిస్తోందంటూ దాడులకు దిగారు. అసలు కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్సు ఇప్పుడు రావటానికి కారణం ఏమిటి? కాశ్మీర్‌లోని కథువా ఎనిమిదేండ్ల బాలిక అసిఫా వుదంతంలో నిందులపై కేసు పెట్టకుండా అడ్డుకోచూసింది బిజెపి మద్దతుదారులైన లాయర్లు, నిందితులకు మద్దతుగా హిందూ ఏకతా మంచ్‌పేరుతో మతోన్మాదులు జరిపిన ర్యాలీలో పాల్గన్నది బిజెపి మంత్రులు, దీనిపై తీవ్ర విమర్శలు రావటంతో వారిని వుద్యోగాల నుంచి వూడగొట్టింది బిజెపి. గోరక్షక్‌ నుంచి రేపి స్ట్‌ రక్షక్‌ మారిందనే పేరు వచ్చింది. ఇంత పరువు పోయాక ఆ నష్ట నివారణ చర్యలో భాగం తప్ప ఆర్డినెన్స్‌లో నిజాయితీ ఎక్కడుంది? ఆర్డినెన్స్‌ తెచ్చినందుకు అభినందించుకోండి, వూరూరా తిప్పి సన్మానాలు చేయించి నీరాజనాలు పట్టండి, సమర్ధించని వారిని విమర్శించాల్సినంత సీన్‌ బిజెపి వారికి లేదు. చిత్రం ఏమిటంటే అసిఫా అత్యాచారాన్ని ఇంతవరకు ఖండించేందుకు నోరు రాని బిజెపి వారందరూ ఒక్కసారిగా ఇప్పుడు ఆర్డినెన్స్‌పై ఎక్కడలేని వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో దారుణ అత్యాచారానికి గురైన నిర్భయ పేరుతో ఒక చట్టాన్ని చేశారు. ఇప్పుడు పేరు ఎలాగూ బయటకు వచ్చింది కనుక తెచ్చిన ఆర్డినెన్స్‌ను చట్టంగా మార్చేటపుడు బిజెపి వారికి ఏమాత్రం నిజాయితీ వున్నా ఆసిఫా చట్టం అని పేరుపెడతారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

పశ్చిమ దేశాల పధకంలో భాగమే ముస్లిం వుగ్రవాదుల తయారీ !

03 Tuesday Apr 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RELIGION, UK, USA

≈ Leave a comment

Tags

Cold War, Saudi crown prince, Spread of Wahhabism

ఎం కోటేశ్వరరావు

తమ విలువైన సంపదలు పశ్చిమ దేశాల కార్పొరేట్‌ సంస్ధల పాలవుతున్నా గుడ్లప్పగించి చూడటం తప్ప ఏమీ చేయలేని స్థితిలో ముస్లిం దేశాల పౌరులున్నారు. మరోవైపు అదే సంస్ధల ఆధీనంలో వున్న మీడియా పని గట్టుకొని చేస్తున్న ప్రచారం, జరుగుతున్న కొన్ని వుదంతాల వలన మానసికంగా గాయపడిన, అవమానభారాలకు, గందరగోళానికి, ఆత్మన్యూనతకు గురి అవుతున్నారు. అలాంటి వారు వూరట పొందేందుకు, వాస్తవాలను అర్ధం చేసుకొనేందుకు సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ చెప్పిన అంశాలు నిస్సందేహంగా తోడ్పడతాయి. అత్యధిక ముస్లిం దేశాలలో పశ్చిమ దేశాలు, వారి ప్రయోజనాలతో ముడిపడి వున్న శక్తులతో సంబంధాలున్న నిరంకుశశక్తులు అధికారంలో వున్నాయి. వారు మిలిటరీ లేదా అవినీతి అక్రమాలకు నిలయంగా వున్నారు. అందువలన తమకు అవసరమైనది తప్ప ప్రపంచంలో ఏం జరుగుతున్నదీ ఆయా దేశాల జనానికి తెలియకుండా నియంత్రిస్తున్నారు. వారికి అందుబాటులో వున్నదంతా పశ్చిమ దేశాల కృత్రిమ తయారీ సమాచారమే. ఒక అంచనా ప్రకారం గత అర్ధశాతాబ్దంలో దాదాపు కోటి మంది సామాన్య ముస్లింలు పశ్చిమ దేశాల కుట్రలకు బలై ప్రాణాలర్పించారని అంచనా. ఇందుకు కారకులైన దుర్మార్గాలను మరుగుపరచి ముస్లింలందరూ వుగ్రవాదులు గాకపోయినా వుగ్రవాదులందరూ ముస్లింలే అనే పేరుతో అందరినీ అవమానాలకు గురి చేస్తున్నారు. ఇదంతా పశ్చిమ దేశాలు, వాటితో చేతులు కలిపిన తమ దేశాల పాలకవర్గాల పుణ్యమే అని గ్రహించలేని వారెందరో. అలాంటి వారిలో కొందరికైనా సౌదీ పాలకుడు అధికారికంగా అంగీకరించిన అంశం వుపకరిస్తుంది.

ఇస్లామిక్‌ దేశాలలో మతోన్మాదశక్తులు పెరగటానికి అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాదశక్తులే కారణం అన్నది ఎప్పటి నుంచో తెలిసిన బహిరంగ రహస్యం. 1960వ దశకంలో ఇండోనేషియాలో ప్రారంభమైన ఈ ప్రక్రియలో ఆఫ్ఘనిస్తాన్‌లో ఏర్పడిన వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోసేందుకు, సోవియట్‌ సేనలపై దాడులకు ముజాహిదీన్‌ లేదా తాలిబాన్ల పేరుతో వున్న మతశక్తులకు ఆయుధాలిచ్చాయి. ఇప్పుడు సిరియా, ఎమెన్‌ వంటి చోట్ల కిరాయి మూకలుగా వాటిని వుపయోగిస్తున్నారు. ముస్లిం దేశాలు సోవియట్‌ ప్రభావంలో పడకుండా వుండేందుకు గాను పశ్చిమ దేశాల సలహా మేరకు వహాబియిజాన్ని వ్యాప్తి చేసేందుకు తాము పెద్ద మొత్తంలో నిధులు అంద చేస్తున్నట్లు సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ వెల్లడించారు. గతనెల మూడవ వారంలో అమెరికా పర్యటన సందర్భంగా వాషింగ్టన్‌ పోస్టు పత్రిక జర్నలిస్టుల ఇష్టాగోష్టి సమావేశంలో పాల్గని అనేక విషయాలు చెప్పారు. ప్రచ్చన్న యుద్ద(కమ్యూనిజంపై సామ్రాజ్యవాదుల దాడికి పెట్టిన పేరు) సమయంలో సోవియట్‌ ప్రభావం (అంటే కమ్యూనిస్టు వుద్యమ) పెరగకుండా చూసేందుకు పశ్చిమ దేశాల సలహా సౌదీ అరేబియా వ్యవహరించిన తీరును వివరించారు. ఇష్టాగోష్టిగా చెప్పినప్పటికీ తరువాత కొన్ని విషయాలను ప్రచురించి, ప్రసారం చేయటానికి సౌదీ రాయబారకార్యాలయం వాషింగ్టన్‌ పోస్టు పత్రికకు అనుమతిచ్చింది.ఆ విధంగా పై వివరాలు బయటకు వచ్చాయి.

ఇస్లామిక్‌ దేశాలలో సోవియట్‌ ప్రభావం విస్తరించకుండా చూసేందుకు ఆ దేశాలలో సున్నీ తెగ ముస్లింల మసీదుల నిర్మాణం, మదార్సాల ఏర్పాటుకు నిధులివ్వాలని ప్రచ్చన్న యుద్ధ కాలంలో తమ దేశాన్ని పశ్చిమ దేశాలు కోరాయని, మధ్యలో కొన్ని సౌదీ ప్రభుత్వాలకు వాటితో సంబంధాలు తెగిపోయినప్పటికీ ఇప్పుడు తిరిగి పునరుద్ధరించుకున్నామని, వాటికి నిధులు ప్రభుత్వం ద్వారా కాకుండా ప్రధానంగా సౌదీలోని ధార్మిక సంస్ధల ద్వారా అంద చేస్తున్నట్లు యువరాజు వెల్లడించారు. తరువాత కొద్ది రోజుల తరువాత అట్లాంటిక్స్‌ పత్రిక సంపాదకుడితో మాట్లాడుతూ వహాబియిస్టులకు నిధులు ఇస్తున్న మాట వాస్తవమేనని అయితే వహాబియిజం అంటే నిర్వచనం ఏమిటో తనకు తెలియదని వ్యాఖ్యానించటం గమనించాల్సిన అంశం. ఇస్లామ్‌ను సంస్కరించే పేరుతో 1703-1791 మధ్య సౌదీ ప్రాంతంలో నివశించిన మహమ్మద్‌బిన్‌ అబ్దల్‌ వహాబ్‌ అనే ఇస్లామిక్‌ పండితుడు సున్నీ ముస్లింలు కఠోరనైతికతా వాదంతో ఎలా వుండాలో ప్రవచించిన దానినే వహాబియిజమ్‌ అని వ్యవహరిస్తున్నారు. దానికి పలు వ్యాఖ్యానాలున్నాయి. అయితే ఇప్పుడు తాలిబాన్లు, ఆల్‌ఖైదా, ఐఎస్‌, బోకో హారం పేరుతో వ్యవహరిస్తున్న మత వుగ్రవాద సంస్ధలన్నీ తాము వహాబియిజాన్నే అనుసరిస్తున్నామని, అలాంటి ముస్లిం సమాజాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతూ జనం మీద అనేక ఆంక్షలు విధిస్తున్నాయి, అమలు జరపనివారి మీద దాడులు చేస్తున్నాయి. మరోవైపు పశ్చిమ దేశాలతో చేతులు కలపని ముస్లిందేశాల పాలకులందరిని మత ద్రోహులుగా ముద్రవేసి పవిత్రపోరాటం పేరుతో అమెరికా తదితర దేశాలు ఇచ్చిన ఆయుధాలు, డబ్బుతో కిరాయిదాడులకు పాల్పడుతున్నాయి.

జనంలో తంపులు పెట్టటం, తిరోగమన శక్తులను పెంచి పోషించటంలో అందెవేసిన బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు వహాబియిజాన్ని సాధనంగా చేసుకొని తమ ప్రయోజనాలు నెరవేర్చుకున్నారు. తరువాత అమెరికా పెద్దన్న పాత్ర తీసుకొని పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. దీనిలో భాగంగానే బిన్‌ లాడెన్‌ వంటి దుష్టశక్తులను పెంచి పెద్ద చేశారు. ఆల్‌ఖైదా తీవ్రవాదులు 2001సెప్టెంబరు 11న న్యూయార్క్‌లోని ప్రపంచ వాణిజ్య కేంద్రాన్ని పేల్చివేసినప్పటికీ అమెరికన్లు ఈ మత వుగ్రవాదులకు మద్దతు ఇవ్వటం మానుకోలేదు. దానికి తన ప్రయోజనాలు తప్ప తాను పెంచిన వుగ్రవాదులు తన దేశపౌరులపై దాడులు చేసినప్పటికీ దానికేమీ చీమకుట్టినట్లు లేదని తరువాత పరిణామాలు స్పష్టం చేశాయి. సౌదీలోని పాలకులకు ఈ శక్తులు వెన్నుదన్నుగా వున్నాయి. ఆఫ్రికాలోని ఎమెన్‌ ప్రాంతం మిలిటరీ వ్యూహరీత్యా ఎంతో కీలకంగా వుండటంతో అక్కడ తిష్టవేసేందుకు అమెరికా గత యాభై సంవత్సరాలుగా చేయని దుర్మార్గం లేదు. ఆ కుట్రలు ఫలించకపోవటంతో సౌదీ అరేబియాను ముందు పెట్టి దాని నాయకత్వంలో గత కొద్ది సంవత్సరాలుగా ఎమెన్‌పై దాడులు చేయిస్తున్నారు. కొన్ని లక్షల మందిని చంపివేసినా, కరవు కాటకాలకు, కలరా వంటి వ్యాధులకు గురిచేసినా, లక్షల మందిని దేశం నుంచి తరిమివేసినా దాన్ని స్వాధీనం చేసుకోవటం సాధ్యం కావటం లేదు. అక్కడి సామ్రాజ్యవాద వ్యతిరేకశక్తులు మొక్కవోని ధైర్యంతో ప్రతిఘటిస్తున్నాయి. సౌదీ అరేబియన్‌ పౌరుల రక్షణకు మాత్రమే తాము అక్కడ జోక్యం చేసుకుంటున్నామని సల్మాన్‌ సమర్ధించుకున్నారు.

సామ్రాజ్యవాదుల కుట్రలో భాగంగా మతోన్మాద, కమ్యూనిస్టు వ్యతిరేక శక్తుల వలలో పడిన ముస్లిం యువతలో, యావత్‌ ఇస్లామిక్‌ దేశాలలో పురోగామి ఆలోచనలు రేకెత్తించటానికి, సామ్రాజ్యవాదుల కుట్రల పట్ల మరింత అప్రమత్తం కావటానికి సౌదీ యువరాజు వెల్లడించిన అంశాలు తోడ్పడతాయి. కమ్యూనిస్టు వుద్యమం విస్తరించకుండా చూసేందుకు సామ్రాజ్యవాదులు అనుసరించిన వ్యూహంలో ఎన్నో అంశాలున్నాయి. అరబ్‌ సోషలిజం పేరుతో సంస్కరణవాదశక్తులను ప్రోత్సహించారు. దానికి పెద్ద వుదాహరణ బాత్‌ పార్టీ సోషలిజం పేరుతో సద్ధాం హుసేన్‌ రంగంలోకి రావటానికి, సమర్ధించటంలో అమెరికా తోడ్పడింది. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఆ సద్దాంనే ప్రయోగించి యుద్దం చేయించిన వుదంతం మన కళ్ల ముందే వున్నది. అమెరికా కుట్రలను ఎరిగిన సోవియట్‌ యూనియన్‌ అనేక అరబ్బు దేశాలలో సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులకు మద్దతిచ్చి నిలబెట్టింది. అలాంటి వారిలో గడాఫీ ఒకరు. ఇదే సమయంలో సౌదీ అరేబియా వంటి దేశాల పాలకులతో చేతులు కలిపి తాలిబాన్లు,ఆల్‌ఖైదా వంటి ఛాందస వుగ్రవాదుల తయారీని చూశాము. సోవియట్‌ యూనియన్‌ కూలిపోయిన తరువాత తనను వ్యతిరేకించే అరబ్బు జాతీయశక్తులను దెబ్బతీసేందుకు అమెరికా పావులు కదిపింది. ఇరాక్‌ , లిబియాలో జరిగింది అదే. ఇరాన్‌లో విఫలయత్నం చేసింది. సిరియా, ఎమెన్‌ వంటి చోట్ల పాలకులను మార్చేందుకు ఇప్పటికీ దాడులు కొనసాగిస్తున్నది. తమ చేతికి మట్టి అంటకుండా ఇస్లామ్‌ పునీకరించేపేరుతో మతఛాందసాన్ని మెదళ్లకు ఎక్కించటం, ప్రపంచాధిపత్యంలో భాగంగా అపార చమురు, ఇతర సహజ సంపదలున్న ప్రాంతాలపై ఆధిపత్యం, మిలిటరీ రీత్యా కీలక ప్రాంతాలను తమ చేతుల్లో వుంచుకొనేందకే ఇదంతా చేస్తున్నారు.

సామ్రాజ్యవాదులు కేవలం ఇస్లామిక్‌ సమాజాలు, ఇస్లామిక్‌ దేశాల మీదే కేంద్రీకరించాయనుకుంటే పొరపాటు. అది మతం, ప్రాంతీయం, భాష, వేర్పాటు వాదం ఏదైనా కావచ్చు. వాటి వెనుక సామ్రాజ్యవాదుల హస్తం వుంటుంది. మన దేశంలో హిందూ తాలిబాన్లు,గతంలో పంజాబ్‌ తీవ్రవాదులు, ఇప్పుడు కాశ్మీరులో తీవ్రవాదులు, ఈశాన్య రాష్ట్రాలలో క్రైస్తవ వుగ్రవాదులు, ఐరోపా దేశాలలో నయా నాజీ బృందాల వెనుక పశ్చిమ దేశాల హస్తం, డబ్బు లేకుండా ఇంతగా రెచ్చిపోవటం సాధ్యం కాదు. తాము తయారు చేసిన వుగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్‌ కొన్ని చోట్ల తమ అదుపు తప్పటంతో లేదా తమ వ్యతిరేకులైన ఇరాన్‌ ప్రభావంలోకి పోవటం వంటి పరిణామాలతో అవే పశ్చిమ దేశాలు ఒక ఎత్తుగడగా వుగ్రవాద వ్యతిరేక ఫోజుపెడుతున్నాయి. తమతో సంబంధాలలో వున్న వారితో సిరియా, ఎమెన్‌ వంటి చోట్ల కిరాయి మూకలుగా వుపయోగించుకుంటున్నాయి. నిజానికి వంద సంవత్సరాల క్రితం ముస్లిం తీవ్రవాదం గురించి ప్రపంచానికి తెలియదు, అటువంటి వుగ్రవాద చర్యలు కూడా లేవు. ముస్లిం సమాజం వుగ్రవాదానికి లోనై వుంటే పశ్చిమాసియాలో వారి మెజారిటీగా వున్న ప్రాంతాలకు ప్రపంచంలో వున్న యూదులందరినీ సమీకరించి కొన్ని ప్రాంతాల రూపురేఖలను మార్చివేస్తుంటే సహించి వుండేవారా ? తమ ప్రాంతాల నుంచి తమను వెళ్లగొట్టటం ప్రారంభమైన తరువాతే పాలస్తీనియన్లు ఆయుధాలు పట్టారు తప్ప అంతకు ముందు ఎంతో సౌమ్యంగా వున్న సమాజాలవి. నిజానికి ఇస్లాం ఒక మతమే కాదు, ఒక సంస్కృతి కూడా. ప్రతి సంస్కృతిలో కొన్ని మినహాయింపులున్నట్లే దానికి భిన్నంగా ప్రవర్తించేవారు ఆ సమాజంలో వుండట ఆశ్చర్యమేమీ కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d