• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Religious Intolarence

శబరిమల తీర్పు 4: సామాజిక మాధ్యమంలో అసంబద్ధ, కుతర్కం !

12 Friday Oct 2018

Posted by raomk in Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence, Women

≈ Leave a comment

Tags

Anti Hindu, Hindu scriptures, illogical and inconsistent arguments in social media on Sabarimala verdict, sabarimala verdict, social media on Sabarimala verdict

Image result for illogical and inconsistent arguments in social media on  Sabarimala verdict

ఎం కోటేశ్వరరావు

ఏ మతం వారి ఆచార వ్యవహారాలలోని మంచి చెడ్డలను ఆ మతాల వారే ప్రశ్నించాలి, అంతేనా మతం పట్ల నమ్మకం వున్న వారే అందుకు అర్హులు, దేవుడు, దేవత, దేవదూత, ప్రవక్త, దేవుని బిడ్డల మీద ప్రశ్నించే వారికి నమ్మకం వుందని రుజువు ఏమిటి? ఒక మతం వారు మరొక మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. సామాజిక మాధ్యమంలో, సాంప్రదాయక మాధ్యమాల్లో వస్తున్న,వేస్తున్న, వేయిస్తున్న ప్రశ్నలివి.ఈ వాదన అక్కడితో ఆగటం లేదు, హిందూ దేవాలయాల్లో మహిళల ప్రవేశంపై ఆంక్షలు కూడదన్న కోర్టు మసీదుల్లో ప్రవేశాలకు ఆదేశాలు జారీ చేస్తాయా, ముస్లిం మహిళల బురఖాలను తీసివేయిస్తాయా, అన్ని మతాల ఆచార, వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటాయా? ఇలా చర్చ సాగుతోంది. ఈ తర్కంలో పరస్పర వైరుధ్యాలు, వుక్రోషం, అవకాశవాదం వున్నాయి.

ఈ క్రమంలో మసీదుల్లో మహిళల ప్రవేశానికి అనుమతించాలని ఆదేశాలివ్వాలంటూ కేరళ హిందూ మహాసభ నేత స్వామి దత్తాత్రేయ శాయి స్వరూపనాధ్‌ ఆ రాష్ట్ర హైకోర్టులో వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్య పిటీషన్‌ను న్యాయమూర్తులు తిరస్కరించారు. తన వాదనకు తగిన ఆధారాలను చూపటంలో విఫలమైన కారణంగా పిటీషన్‌ విచారణ అర్హం కాదని కొట్టి వేశారు. తగిన సాక్ష్యాలతో మరొకరు ఎవరైనా అవసరమైతే అలాంటి కేసులు వేసుకోవచ్చు లేదా ముస్లిం మత పెద్దలు అంతవరకు తెచ్చుకోకుండా మసీదుల్లోకి మహిళలను అనుమతించే వివేచనను అయినా చూపవచ్చు. అయ్యప్ప ఆలయంలో అలాంటి వివక్ష వుందని బలమైన ఆధారాలు, సాక్ష్యాలు వుండబట్టే అయ్యప్ప కేసు విచారణకు నిలిచింది, తీర్పును ప్రకటించాల్సి వచ్చింది. వివక్షను పాటించే వారు తమ వాదనలకు తగిన సాక్ష్యాలను చూపలేకపోయినందున కేసును ఓడిపోయారు.

పైన పేర్కొన్న వాదనలను సామాన్యులు చేశారంటే అర్ధం చేసుకోవచ్చు. ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన మార్కండేయ కట్జూయే ఎలాంటి ఫీజు లేకుండా ఇలాంటి వాదనలు, సుప్రీం కోర్టుకు సలహాలు ఇచ్చేందుకు పూనుకున్నారు. శబరిమల అయ్యప్ప దేవాలయంలో అన్ని వయస్సుల మహిళల ప్రవేశానికి అనుకూలంగా ఇచ్చిన తీర్పు మీద కట్జూ స్పందించారు.’ కొత్తగా బాధ్యతలు చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి ఆ కేసు తీర్పును పునర్విచారణ చేసేందుకు ఏడుగురు సభ్యుల బెంచ్‌ను ఏర్పాటు చేయాలి లేదా దేశమంతటా మసీదుల్లో మహిళల ప్రవేశాన్ని అమలు చేయించాలి. సిద్దాంత రీత్యా మసీదుల్లో మహిళల ప్రవేశానికి ఎలాంటి ఆంక్షలు లేవు, మక్కా, మదీనాల్లో అనుమతిస్తున్నారు, ఇండ్లలో ప్రార్ధనలు చేసుకోవాల్సిన మహిళలను భారత్‌లో ఒకటి రెండు శాతం మసీదుల్లో మాత్రమే అనుమతిస్తున్నారు. మసీదుల్లో తగినంత స్ధలం లేదన్నది సాధారణంగా సమర్ధనకు చెబుతున్నారు. అదే కారణం అయితే పురుషులకే ప్రాధాన్యత ఎందుకు? మహిళలు మసీదుల్లో పురుషులు బయట ఎందుకు చేయకూడదు. లేదా సగం సగం పద్దతిలో వేర్పాటు చేయాలి. కాబట్టి దీనిలో మీరు దేన్ని ఎంచుకుంటారు ‘ అని ప్రధాన న్యాయమూర్తిని ప్రశ్నించారు. అంతే కాదు, ఎవరైతే మత ఆచారాలను పాటిస్తున్నారో వారికే సమానత్వం గురించి అడిగే హక్కు వుందని, సదరు ఆచారం హేతుబద్దమైనదా కాదా అని నిర్ణయించే అధికారం కోర్టుకు లేదని శబరిమల కేసులో మిగతా నలుగురితో విబేధించిన ఐదవ న్యాయమూర్తి ఇందు మల్హోత్రా వాదనను కట్జూ సమర్ధించారు.

మనది లౌకిక రాజ్యం. ఏ మతానికి లేదా మత ఆచారాలకు రాజ్యాంగంలోని అంశాల నుంచి మినహాయింపు ఇవ్వలేదు. అలాగని ఏ మత ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకొనే అంశాలు కూడా లేవు. అవసరమని భావిస్తే ఏ ప్రజా ప్రయోజన లేదా సంబంధ అంశంపై అయినా కోర్టు స్వయంగా జోక్యం చేసుకోవచ్చు. ఏ రూపంలోనూ ప్రాధమిక హక్కులకు భంగం కలిగించేందుకు, వివక్ష పాటించేందుకు వీలు లేదు. ఈ పరిమితులకు లోబడే కోర్టులు తీర్పులు చెబుతున్నాయి.భర్త నుంచి మనోవర్తి పొందేందుకు ముస్లిం మహిళలకు హక్కు వుందని షాబానో కేసులో తీర్పు చెప్పిన కోర్టు మూడుసార్లు తలాక్‌ చెబితే విడాకులు చెల్లవని కూడా చెప్పింది.ఈ కేసులను ఇస్లాంను పాటించే ముస్లిం న్యాయమూర్తులే విచారించాలి,న్యాయవాదులే వాదించాలి, ముస్లింలు మాత్రమే కోర్టులో గుమస్తాలుగా వుండాలి అని ఆ మతానికి చెందిన వారితో సహా ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. లేదా శబరిమల ఆలయ కేసు విచారణ సమయంలోనూ ఏ వ్యక్తి లేదా ఏ సంస్ధా కేసులో పైన పేర్కొన్న వాదనతో ప్రతివాదులుగా చేరలేదు.

ఇప్పుడు అలాంటి వాదనలు ఎందుకు చేస్తున్నట్లు ? మూలం, పర్యవసానాలు ఏమిటి? అస్థిత్వ భావజాలం. సమాజంలో నిరాదరణకు గురయ్యే మైనారిటీ తరగతులు తమ ప్రయోజనాల పరిరక్షణకు ఈ భావనను ముందుకు తెచ్చారనే అభిప్రాయం వుంది. అది ప్రారంభంలో అభివృద్ధికరంగానే వున్నప్పటికీ ఒక పరిధి దాటిన తరువాత అదే ఆటంకంగా మారటంతో పాటు దోపిడీ వర్గాలు శ్రామిక వర్గాన్ని విభజించి పాలించేందుకు ఆ భావజాలాన్ని పెంచి పోషించాయనే అభిప్రాయం కూడా వుంది. వుదాహరణకు ఇటీవల సిపిఎస్‌(కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌)కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. నిజానికి కార్మిక, వుద్యోగ, వుపాధ్యాయ సంఘాలు ఈ అంశం మీద గట్టిగా కేంద్రీకరించి వ్యతిరేకించి వుండాల్సింది, అది జరగలేదు. ఆ పధకం కింద వుద్యోగంలో చేరిన వారికి కూడా ప్రారంభంలో దాని వలన కలిగే హానితెలియలేదు, పట్టించుకోలేదు. ముందు వుద్యోగం చాలనుకున్నారు. ఇప్పుడు వుద్యమంలో పాత పధకంలో వున్నవారు దానికి వ్యతిరేకంగా జరిగే వుద్యమంలో అంతగా ఆసక్తి చూపుతున్నారా అన్నది ప్రశ్న. కాడర్‌ వారీ సంఘాల ఏర్పాటు కూడా ఈ భావజాల పుణ్యమే. ఒక క్యాడర్‌ సమస్య మీద వుద్యమిస్తే మరో కాడర్‌లో స్పందన వుండదు. ప్రారంభంలో ఎలా వున్నప్పటికీ ఇప్పుడు అస్ధిత్వ భావజాలం ఐక్యతకు ఆటంకంగా మారిందనేందుకు ఇలా అనేక దృష్టాంతాలను పేర్కొనవచ్చు. స్ధూలంగా అస్థిత్వ రాజకీయాలుగా నామకరణం జరిగిన ఈ అంశం అన్ని జీవన రంగాల్లో ప్రబలంగా వ్యాపించింది. దళితుల సమస్యల మీద పోరాడాలంటే దళితులే నాయకత్వం వహించాలి, వారికి తెలిసినంతగా వారి సమస్యలు,వేదన ఇతరులకు అర్ధం కాదు. ఇదే తర్కాన్ని మహిళలకు వర్తింప చేశారు.కార్మిక సంఘాలకు కార్మికులే నాయకత్వం వహించాలి, బయటి రాజకీయ నాయకులు, ఇతరులు వుండకూడదు అని కార్మికుల కంటే యజమానులే గట్టిగా చెబుతున్నారు. ఆ మేరకు చట్ట సవరణ కూడా చేయాలనే డిమాండ్‌ ముందుకు తెచ్చారు. ఏ మతంవారి దురాచారాలను ఆ మతం వారే, అందునా వాటిని పాటించే వారే ప్రశ్నించాలి అనే తర్కానికి ఇదే మూలం. ఈ దేశంలో దేవుడు,దేవత, మతం, కులంతో ప్రమేయం లేకుండా జీవించాలని కోరుకొనే స్వేచ్చ, దేనినైనా ప్రశ్నించే హక్కు పౌరులకు వుంది అనే విషయాన్ని కొంత మంది మరచిపోతున్నారు.

ఆచారాలు, అలవాట్లను పాటించేవారే ప్రశ్నించేందుకు అర్హులు అనే వితండవాదానికి తావిస్తే గోవధ నిషేధించాలని డిమాండ్‌ చేసే హక్కు గోమాంసం తినని వారికి, వధించని వారికి ఎక్కడిది? ఆ పనిచేసే వారి నుంచే అది రావాలి కదా ! ఇలాంటి వాదనలు సమాజం యథాతధంగా వుండాలని కోరుకొనే తిరోగమన వాదులకు, మన రాజ్యాంగాన్ని వ్యతిరేకించే లేదా తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూసే శక్తులకు మాత్రమే సంతోషం కలిగిస్తాయి.మెజారిటీ పౌరులు హిందువులు కనుక హిందూ రాజ్యంగా వుండాలని, వారు చెప్పిందే అమలు జరగాలంటూ మనువాద పున:ప్రతిష్ట చేయాలని చూస్తున్న శక్తులు ప్రయత్నిస్తున్నాయి. దాని ప్రకారం మనం మతరాజ్యాల్లోకి మారిపోవాలి, రాజ్యాంగమెందుకు, పార్లమెంట్‌, కోర్టులెందుకు ?

మసీదుల్లోకి మహిళలకు ప్రవేశం కల్పించాలని కోర్టులెందుకు జోక్యం చేసుకోవు లేదా అమలు జరిపించవు అనే వాదనను చూద్దాం.మొదటి విషయం మన రాజ్యాంగం న్యాయవ్యవస్ధకు అలాంటి కార్యనిర్వాహక అధికారం ఇవ్వలేదు. మన రాత పూర్వక రాజ్యాంగంలో పేర్కొన్న అంశాల ప్రకారం న్యాయం జరుగుతున్నదా లేదా తీర్పు చెప్పటానికి, జరగటం లేదని కోర్టుకు స్వయంగా తెలిసినపుడు లేదా భావించినపుడు అమలు జరపాలని ప్రభుత్వాలకు మార్గదర్శనం, రాజ్యాంగ విరుద్దం అయితే ఆదేశాలు ఇస్తాయి. రాజ్యాంగం ప్రకారం నిర్ణీత వయస్సు వచ్చిన యువతీ యువకులు తమకు నచ్చిన వారిని వివాహం చేసుకోవచ్చు. కానీ రోజూ ఏదో ఒక మూల అలాంటి వివాహాలు చేసుకున్నవారిని వెంటాడి, వేటాడి చంపుతున్న వుదంతాలు దేనికి సూచిక, అలాగే అంటరాని తనం నేరం, శిక్షార్హం. సమాజంలో అదింకా కొనసాగుతున్నదా లేదా ? ఆ వివక్ష, నేరానికి వ్యతిరేకంగా లేదా తమకు న్యాయం చేయాలని ఎవరైనా కోర్టు తలుపు తడితేనో లేదా ఆ దురాచారం కొనసాగుతున్నతీరు గురించి మీడియా ఇచ్చిన వార్తలను చూసి స్పందిస్తేనో కోర్టులు జోక్యం చేసుకుంటాయి. అంతే తప్ప కోర్టులు ప్రతి ఇంటికి లేదా ప్రతి ప్రార్ధనా స్ధలానికి వెళ్లి అంటరానితనాన్ని పాటిస్తున్నారా లేదా అని చూడవు. మసీదులైనా అంతే. ఎవరైనా తమను ఫలానా మసీదులో ప్రవేశానికి ఆటంకం కలిగిస్తున్నారని కోర్టుకో, పోలీసులకో ఫిర్యాదు చేయకుండా ఆ వ్యవస్ధలు ఎలా స్పందిస్తాయి. మహిళలను మసీదులకు వెళ్లటాన్ని ఎవరు అడ్డగించారు, వెళ్ల వచ్చు అన్నది ఒక వాదన. వెళ్ల వచ్చు నిజమే, వెళ్లటం లేదన్నది వాస్తవం. ఎవరు అడ్డగించారు అని ఎదురు ప్రశ్న వేసే వారే ఎందుకు వెళ్లటం లేదో సమాధానం చెప్పాలి. ప్రతి మతంలోనూ సంస్కరణోద్యమాలు రావాలి, దీనికి ఇస్లాం మినహాయింపు కాదు. మా మతం మా ఇష్టం అంటే కుదరదు.

ముస్లిం మహిళల చేత బురఖాలు తీసేయిస్తారా అన్నదొక ప్రశ్న. కొన్ని దేశాలలో ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టే లేదా వ్యతిరేక చర్యల్లో భాగంగా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు లేదా ప్రతిపాదిస్తున్నారు. వాటిని చూసి ఇక్కడి ముస్లిం వ్యతిరేకులు ఈ అంశాన్ని తలకెత్తుకుంటున్నారు. ఫలాన దుస్తులు వేసుకోవాలి, ఫలానావి వేసుకోకూడదు, ఫలనాది తినకూడదు, ఫలానాదే తినాలి అనే తాలిబాన్ల ఫర్మానాలు కూడా ఇలాంటి వాటి మీద ప్రభావం చూపుతున్నాయి. బురఖా లేదా ముసుగు ధరించేది ఒక్క ముస్లిం మహిళలేనా? పూర్తిగా ముఖాన్ని కప్పి వుంచుతూ హిందువుల్లో అలాంటి వేషధారణ వున్నవారి సంగతేమిటి? వాటికి ఏ పేరు పెట్టినా వారిని కూడా ముసుగులు తొలగించే విధంగా కోర్టులు ఆదేశాలు జారీ చేయాలా?

ఇంకా మరికొన్ని వాదనలు, అయ్యప్ప బ్రహ్మచారి కనుక వయస్సులో వున్న యువతులు సందర్శిస్తే ఆయన వ్రత భంగం అవుతుంది. హిందూ పురాణాల ప్ర కారం కార్తికేయుడు కూడా బ్రహ్మచారే, ఆయన సోదరుడు వినాయకుడూ, రామ భక్త హనుమంతుడూ బ్రహ్మచారే. వారు కూడా బ్రహ్మచర్యాన్ని నిష్టగా పాటించినట్లు చదివాం తప్ప మినహాయింపులు తీసుకున్నట్లు తెలియదు. వారి దేవాలయ ప్రవేశాలకు ఎలాంటి ఆంక్షలు లేవు. వారి వ్రతానికి మహిళలు ఎలాంటి భంగమూ కలిగించటం లేదు. ఖురాన్‌ ప్రకారం బహిష్టులో వున్న మహిళలు నమాజు చేయటానికి లేదు, దానికి కూడా మనం వ్యతిరేకంగా పోరాడదాం. సుప్రీం కోర్టు దేవుడైతే భక్తుల మనోభావాలను గౌరవించాలి తప్ప సంస్కారం లేని మహిళావాదులను కాదు, ఇంకా ఇలాంటి అనేక వాదనలను ముందుకు తెచ్చారు. వీటన్నింటిని మొత్తంగా బేరేజు వేస్తే కోర్టు తీర్పు హిందూమతానికి వ్యతిరేకంగా ఇచ్చిందనే భావాన్ని కలిగించేందుకు తీవ్ర ప్రయత్నం కనిపిస్తోంది. ఇక్కడ గుర్తించాల్సిన అంశం ఏమంటే హిందూయేతర మతాల్లో వున్న వివక్ష లేదా అసంబద్దతలను గుర్తించటానికి, తొలగించటానికి ఈ తీర్పు దోహదం చేస్తుందన్నది పురోగామి వాదుల అభిప్రాయం అని చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

శబరిమల తీర్పు 3 : ప్రజాకర్షక నినాదాలతో భారతీయ మితవాదం !

10 Wednesday Oct 2018

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Women

≈ Leave a comment

Tags

BJP, Far right populism in India, RSS, RSS game, sabarimala verdict

Image result for Far right  in india cartoons

ఎం కోటేశ్వరరావు

దేశంలో పచ్చి మితవాద శక్తులు చెలరేగిపోవటం ఒకవైపు వాటి భావాజాలానికి విరుద్దంగా కొన్ని పురోగామి తీర్పులను సుప్రీం కోర్టు వెలువరించటం ఒక చిత్రమైన స్ధితి. అధికారంలో వున్న బిజెపి కొన్ని తీర్పుల మీద ఎలాంటి వైఖరులను వెల్లడించటం లేదు. ఆ పార్టీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి శబరిమల వివాదంలో మెజారిటీ తీర్పును వ్యతిరేకిస్తూ, మహిళలపై ఆంక్షలను కొనసాగించాలన్న న్యాయమూర్తి తీర్పును సమర్ధిస్తున్నట్లు ప్రకటించారు. దానికి వ్యక్తిగత అభిప్రాయమనే షరతు పెట్టారు. ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగాó నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరం ఏముంది, ఎవరు అడిగారు? బిజెపి లేదా ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్ధలు ఒకవైపు సదరు న్యాయమూర్తి తీర్పుతో ఏకీభవిస్తూ, మెజారిటీ బెంచ్‌ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ వీధులకు ఎక్కిన తరువాత ఆమెనుంచి అంతకు మించి ఎవరైనా ఎలా ఆశించగలరు?

ప్రధాన ప్రతిపక్షంగా వున్న కాంగ్రెస్‌ గోడమీద పిల్లి వాటంగా వ్యవహరిస్తోంది. ఇక ప్రాంతీయ పార్టీల సంగతి సరేసరి. వామపక్షాలు మాత్రమే తమ సూత్రబద్దమైన వైఖరులను స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను చూసినపుడు పురోగామి శక్తుల కంటే ప్రజాకర్షక నినాదాలతో తిరోగామి భావజాలానిదే పైచేయిగా వున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో దానికి గురయ్యేవారిలో పురుషులతో పాటు మహిళలూ వుంటారు. ఐరోపాలోని అనేక దేశాలలో నయా నాజీలు, ఫాసిస్టులు పెరుగుతున్నారు. మన దేశంలో ఈ భావజాలంతో పనిచేస్తున్న శక్తులు అధికార కేంద్రాలలో తిష్టవేశాయి. మరింతగా విస్తరించాలని ప్రయత్నిస్తున్నాయి. నాజీలు యూదువ్యతిరేకతను రెచ్చగొట్టి ఐరోపాలో మారణహోమం సృష్టిస్తే ఇప్పుడు ప్రపంచవ్యాపితంగా ముస్లిం వ్యతిరేకతను ముందుకు తెస్తున్నారు. మన దేశంలో ముస్లింలతో పాటు క్రైస్తవ వ్యతిరేకతను కూడా జోడించారు. ఎందుకిలా జరుగుతోంది. సమగ్రంగా చర్చ, పరిశోధన జరగాల్సి వుంది. ప్రజాకర్షక నినాదాలంటే సంక్షేమ కార్యక్రమాలే కానవసరం లేదు.అసోం, త్రిపురల నుంచి బంగ్లాదేశీయులను ఒకవైపు వెళ్లగొట్టాలంటున్న బిజెపి మరో వైపు గుజరాత్‌లో వుత్తరాది రాష్ట్రాల వారిని వెళ్లగొడుతుంటే అచేతనంగా వుంది.

వస్తు వ్యాపారం చేసే ఒక సాధారణ వ్యాపారి కంటే డబ్బుతో వ్యాపారం చేసే ఒక వడ్డీ వ్యాపారిని చూస్తే సామాన్యులు ఎక్కువగా భయపడతారు. పెట్టుబడిదారీ వ్యవస్దలో సంభవిస్తున్న సంక్షోభాలను అధిగమించటానికి ఒక వైపు ప్రయత్నిస్తూనే రెండోవైపు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత సోషలిజం, కమ్యూనిజాల వ్యాప్తిని అరికట్టేందుకు సామ్రాజ్యవాదం తీవ్రంగా నిమగ్నమైంది. మొదటి అంశంలో భాగంగా నయా వుదారవాద విధానాలను ముందుకు తెచ్చింది, రెండవ అంశంలో సోషలిస్టు వ్యవస్ద నిర్మాణంలో జరిగిన లోపాలను ఆసరా చేసుకొని, కుట్రలు చేసి ప్రధమ సోషలిస్టు రాజ్యాన్ని, దాని సాయంతో ఏర్పడిన తూర్పు ఐరోపా సోషలిస్టు దేశాలను కూల్చివేయటంలో జయప్రదమయ్యారు. సాధారణ వడ్డీ వ్యాపారి స్ధానంలో పట్టణాలలో గూండా వడ్డీవ్యాపారుల మాదిరి నయావుదారవాదం కార్మికవర్గం పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నది. దాని దెబ్బకు వుదారవాద ముసుగులు వేసుకున్న సోషలిస్టు, లేబర్‌ పార్టీల వంటివి జనం మీద భారాలు మోపటంలో మితవాదుల కంటే తక్కువేమీ కాదని ఈ కాలంలో రుజువు చేసుకున్నాయి. సాంప్రదాయ పార్టీల మీద జనానికి విశ్వాసం పోయింది. మరోవైపు పెట్టుబడిదారీ వ్యవస్ధలో అంతరాలు పెరగటంతో పాటు నయావుదారవాద విధానాలు ఎంత వేగంగా పెట్టుబడిదారుల సంపదలను పెంచుతాయో సంక్షోభాలను కూడా అంతేవేగంగా ముందుకు తెస్తాయని తేలిపోయింది. సోషలిస్టు వ్యవస్ధలకు ప్రత్యామ్నాయం పెట్టుబడిదారీ విధానమే అంటూ చూపిన రంగుల కలలు పాతికేండ్లలో కల్లలయ్యాయి. సోషలిజం, కమ్యూనిజాల మీద చేసిన తప్పుడు ప్రచారం, వాటికి తగిలిన తీవ్రమైన ఎదురుదెబ్బలను చూసిన తరువాత జనానికి తాత్కాలికంగా అయినా ఎటుపోవాలో తెలియని స్ధితి మితవాద శక్తుల పెరుగుదలకు అనువుగా తయారైందని చెప్పవచ్చు. అవి అనేక చోట్ల జనాకర్షక నినాదాలతో ముందుకు వస్తున్నాయి.అసంతృప్తి, ప్రత్యామ్నాయం గురించి అవగాహనలేని, విశ్వాసంలేని యువత ఇటువంటి శక్తుల వెనుక చేరటం గతంలో కూడా జరిగింది. ఈ స్ధితి ఎంతోకాలం వుండదని గత చరిత్ర రుజువు చేసింది.

పచ్చి మిత, తీవ్రవాద భావాలను రాజీకీయాలు, సమాజంలో మరింతగా వ్యాప్తి, అమలు చేసే క్రమంలో వాటిని అందంగా, మహిళీకరణ(ఫెమినైజ్‌కు ఈ పదం దగ్గరగా వుంటుందని ప్రయోగించాను, అంతకంటే మెరుగు, అర్ధవంతమైన పదాన్ని సూచిస్తే స్వీకరిస్తాను) చేయటం కనిపిస్తోంది. మరోసారి యూదులను చూపి ద్వేషం రెచ్చగొట్టే పరిస్ధితులు పునరావృతం అవుతాయా ? ఇప్పటికైతే అలాంటి సూచనలు లేవు. దాని స్ధానంలో ముస్లింలపట్ల ద్వేషాన్ని రెచ్చగొట్టటం, కొంత మేరకు జనాన్ని తప్పుదారి పట్టించగలిగినట్లు చెప్పవచ్చు. ముస్లింలందరూ వుగ్రవాదులు గాకపోవచ్చుగాని వుగ్రవాదులందరూ ముస్లింలే అనే ఒక ప్రమాదకరవాదన రూపంలో ద్వేషాన్ని పెంచుతున్నారు. ఫ్రెంచి మితవాద రాజకీయ వారసత్వ క్రమంలో మూడవతరానికి చెందిన యువతి మరియం మార్చల్‌ లీపెన్‌. ఆమె తన తాత మారీ లీపెన్‌, పిన్ని మారినే లీపెన్‌ బాటలో ముందుకు వచ్చింది.తాత కంటే పిన్ని ఎక్కువ మంది ఓటర్లను ఆకర్షించింది. ఇరవై మూడు సంవత్సరాలకే పార్లమెంట్‌కు ఎన్నికైన మరియం లీపెన్‌ పుట్టినప్పటి నుంచి మితవాద భావాల వుగ్గుపాలతో పెరిగా నంటూ తన భావాలను మరింత స్పష్టంగా చెబుతోంది. జాతీయవాదం కూడా నాజీజమే. మీరు కనుక జాతీయ ప్రయోజనాలను సమర్ధిస్తే వేదనామయ క్రమాన్ని ప్రారంభించినట్లే, అది యుద్దము, ప్రళయానికి దారి తీస్తుందని అంటోందా అమ్మడు.28ఏండ్ల మార్చెల్‌ లీపెన్‌ పచ్చి ముస్లిం వ్యతిరేకి. ఇస్లామ్‌ను మనం అంతమొందించాలి లేదా అదే మనల్ని పదే పదే చంపుతుంది అని విద్వేషాన్ని వెళ్లగక్కారు. నేషనల్‌ పార్టీలో వున్న వారికి ఈమె ప్రతిరూపం. గతంలో నేషనల్‌ ఫ్రంట్‌ పేరుతో ప్రస్తుతం నేషనల్‌ ర్యాలీ పార్టీ నేతగా మారీ లీపెన్‌ పని చేస్తున్నారు. తండ్రి నాయకత్వస్ధానాన్ని ఆమె అందుకున్నారు. ఐరోపా రాజకీయాలలో ఇలాంటి వారసత్వ ధోరణులు ఇటీవలి వరకు లేవు. గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికలలో ఈమె తొలి రౌండులో 21.3శాతం ఓట్లు తెచ్చుకొని అంతిమపోటీలో 33.9శాతం తెచ్చుకొని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.

Image result for Far right  in india cartoons

బ్రిటన్‌లో రంగంలోకి వచ్చిన మరొక ముస్లిం వ్యతిరేక సంస్ధ యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఇండిపెండెన్స్‌ పార్టీ(యుకెఐపి). ఇది ఐరోపాయూనియన్‌లో బ్రిటన్‌ చేరటాన్ని, వలస కార్మికుల, ముస్లిం వ్యతిరేకపార్టీ. పురుటి సమయంలో ఇచ్చే వేతనాలకు, ముస్లిం మహిళలు బహిరంగ ప్రదేశాల్లో బురఖాలు ధరించేందుకు ఇది వ్యతిరేకం. దీని వత్తిడి కారణంగానే 2016లో ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగాలా లేదా అన్న ప్రజాభిప్రాయ సేకరణ జరపటం, వైదొలగాలని తీర్పు రావటం తెలిసిందే. వలస కార్మికుల రాకను వ్యతిరేకిస్తున్న కారణంగా బ్రిటన్‌ కార్మికవర్గం గణనీయ భాగానికి దీనిపట్ల సానుకూల అభిప్రాయం వుందని వార్తలు వచ్చాయి. బ్రిటన్‌లో ఇదే మూడవ పెద్ద పార్టీ. స్ధానికంగా వున్నవారి కంటే వలస వచ్చిన వారికి అవకాశాలు ఎక్కువగా ఇస్తున్నారనే అభిప్రాయం యువతలో పెరుగుతున్నది.

అబార్షన్లను వ్యతిరేకించటంతో సహా మహిళపట్ల అనేక తిరోగమన ధోరణులు కలిగిన జిమ్‌ డౌసన్‌ బ్రిటన్‌లో కంటికి కనిపించని పెద్ద మితవాది అని టైమ్స్‌ పత్రిక వర్ణించింది. ఇలాంటి నీచులైన మగవారందరూ ఇస్లాం నుంచి మహిళలను రక్షించేవారుగా తమకు తామే ముందుకు వస్తున్నారని డేనియల్‌ ట్రిల్లింగ్‌ అనే రచయిత ‘క్రూరమైన నీచులు: బ్రిటన్‌లో పచ్చి మితవాదుల పెరుగుదల’అనే తన పుస్తకంలో పేర్కొన్నారు. ప్రధాన స్రవంతి రాజకీయాలకు దూరంగా వుండే భావజాలాల పట్ల ఆసక్తిని రేకెత్తించటంలో ఇంటర్నెట్‌ కూడా కూడా దోహదం చేస్తోందని, పచ్చి మిత వాద వైఖరులకు యువతగురి అవుతోందని కూడా పేర్కొన్నారు. కుహనా వార్తల యుగంలో అసంఖ్యాక వనరులు ఈ భావాలకు ఆసరా అవుతున్నాయి ప్రత్యేకించి ఈ మితవాదులలో అనేక మంది ప్రధాన స్రవంతి మీడియాను నమ్మటం లేదని ట్రిల్లంగ్‌ పేర్కొన్నారు.

జర్మనీలో ఇటీవల వునికిలోకి వచ్చి గత ఏడాది ఎన్నికలలో 709 స్ధానాలున్న పార్లమెంటులో 94సీట్లతో మూడవ పెద్ద పార్టీగా ఆల్టర్‌నేటివ్‌ ఫర్‌ జర్మనీ(ఎఎఫ్‌డి) అవతరించింది. ఆ పార్టీ పార్లమెంటరీ నేత 39 సంవత్సరాల ఎలిస్‌ ఎలిజబెత్‌. ఈ పార్టీ ముస్లిం, వలస కార్మికులకు వ్యతిరేకత, ఐరోపా యూనియన్‌ నుంచి బయటకు రావాలని చెబుతుంది.దేశంలోకి ప్రవేశించేవారిని అడ్డుకొనేందుకు అవసరమైతే మారణాయుధాలను వుపయోగించమని అంటోంది. నాజీల అత్యాచారాలను గుర్తు చేసుకోవటం ఆపివేయాలని, వాటి గురించి తక్కువ మాట్లాడాలని కోరుతోంది.

నార్వేలో అధికారంలో వున్న సంకీర్ణ కూటమిలోని ప్రోగ్రెస్‌ పార్టీ మితవాది. దేశాన్నీ ముస్లిమీకరణ చేస్తున్నారని, పోలీసు యూనిఫాంలో హిజబ్‌ ధరించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించే ఈమె ఇజ్రాయెల్‌ను పచ్చిగా సమర్ధిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. ఇలా అనేక దేశాలలో వున్న ఇలాంటి మహిళల ద్వేషపూరిత వైఖరి, మాటలకు మన దేశంలో సాధ్వుల మని చెప్పుకుంటూ నోరుపారవేసుకొనే వారికి పెద్ద తేడా లేదు. మచ్చుకు ఢిల్లీని పాలించేందుకు రాముడి అంశలో పుట్టిన వారు కావాలో లంజలకు పుట్టిన వారు కావాలో తేల్చుకోవాలని సాధ్వి నిరంజన జ్యోతి గత ఎన్నికలలో ప్రసంగాలు చేసిన విషయం తెలిసినదే.ఈమె నరేంద్రమోడీ నాయకత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. ఇక యోగులుగా చెప్పుకొనేవారి గురించి చెప్పనే అవసరం లేదు. చిత్రం ఏమిటంటే వీరందరూ బిజెపి మద్దతుదారులు, నేతలే కావటం విశేషం. ఏ విత్తనం వేస్తే ఆ కాయలే కాస్తాయి మరి.

మన దేశంలో పచ్చి మితవాద శక్తులతో నిండిన ఆర్‌ఎస్‌ఎస్‌, అది ఏర్పాటు చేసిన సంఘాల నాయకులు అనేక సందర్భాలలో తమ తిరోగామి భావాలను ఎలాంటి శషభిషలు లేకుండా వెల్లడిస్తూనే వున్నారు. అయినా అనేక మంది విద్యావంతులైన మహిళలు ఇలాంటి శక్తులను అనుసరిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో మహిళలకు ప్రవేశం లేదనే విషయం వేరే చెప్పనవసరం లేదు. ఎందుకు లేదో చెప్పరు. 2013 జనవరి ఆరున పిటిఐ ఒక వార్తను అందించింది.ఇండోర్‌ పట్టణంలో జరిగిన ఒక సభలో ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ చేసిన వుపన్యాసంలోని అంశాలు ఇలా వున్నాయి.’ భర్త మరియు భార్య మధ్య ఒక ఒప్పందం వుంటుంది. దాని ప్రకారం నువ్వు నా ఇంటిని జాగ్రత్తగా చూడు, నేను నీ అవసరాలన్నింటినీ తీరుస్తాను, నిన్ను సురక్షితంగా వుంచుతాను అని భర్త చెబుతాడు. కాబట్టి భార్య ఒప్పందానికి అనుగుణ్యంగా వున్నంత వరకు భర్త కాంట్రాక్టు నిబంధనలను అనుసరిస్తాడు, భార్యతో వుంటాడు. భార్య ఒప్పందాన్ని వుల్లంఘిస్తే అతను ఆమెను వదిలించుకోవచ్చు ‘. ఈ వుపన్యాసం గురించి సిపిఎం నాయకురాలు బృందాకరత్‌ స్పందిస్తూ ‘ఇలా మాట్లాడటం నాకేమీ ఆశ్చర్యం అనిపించలేదు అంతిమంగా ఆర్‌ఎస్‌ఎస్‌ అంటే ఇదే. అందుకే దీనిని రాష్ట్రీయ తిరోగమన సంఘ్‌ అని నేనంటాను. అధికారంలో వున్న బిజెపి పెద్దలు మనుస్మృతి ఆధారంగా కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలని కోరుతున్నారు. ఆయనిలాంటి భాషలో మాట్లాడారంటే తన భావజాలాన్ని ప్రతిబింబించినట్లే ‘ అన్నారు.

అంతకు ముందు అసోంలోని సిల్చార్‌లో మాట్లాడుతూ పశ్చిమ దేశాల ప్రభావం కారణంగా ప్రధానంగా పట్టణ ప్రాంతాలలోనే మానభంగాలు జరుగుతున్నాయి, దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో జరగవు అని ఇదే భగవత్‌ గారు సెలవిచ్చారని కూడా పిటిఐ వార్తలో పేర్కొన్నది.’దేశ పట్టణ ప్రాంతాలలో మహిళలపై నేరాలు జరగటం సిగ్గు చేటు, ఇది ప్రమాదకర ధోరణి. అయిటే అటువంటి నేరాలు ‘భారత్‌ లేదా దేశ గ్రామీణ ప్రాంతాలలో జరగవు. మీరు గ్రామీణ ప్రాంతాలు లేదా అడవులకు వెళ్లండి అక్కడ సామూహిక మానభంగాలు లేదా లైంగిక పరమైన నేరాలు వుండవు. పశ్చిమ దేశాల సంస్కృతి ప్రభావంతో భారత్‌ ఎప్పుడు ఇండియాగా మారిందో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అన్నారు. సమాజంలోని ప్రతి దొంతరలో నిజమైన భారతీయ విలువలు మరియు సంస్కృతిని చొప్పించాలి, అక్కడ మహిళను తల్లిగా చూస్తారు’ అన్నారు. భగవత్‌కు భారత్‌ గురించిగానీ ఇండియా గురించీ తెలియదు, ప్రభుత్వ లెక్కల ప్ర కారం గరిష్టంగా జరుగుతున్న అత్యాచారాలు పేదలు, దళితులు, గిరిజనుల మీదే అని బృందాకరత్‌ వ్యాఖ్యానించారు.

ప్రపంచ వ్యాపితంగా సామాజిక మీడియాలో మితవాద శక్తులు పెరుగుతున్నాయి. ఐరోపా, అమెరికా వంటి చోట్ల మితవాదానికి శ్వేతజాతి జాతీయవాదం తోడవుతున్నది. మన దేశంలో హిందూత్వ జాతీయవాదాన్ని ముందుకు తెస్తున్నారు. దీనికి కులదురహంకారం, వెనుకబడిన తరగతులు, షెడ్యూలు కులాల పట్ల ద్వేషం తోడవుతున్నదని ఇటీవల జరిగిన ప్రణయ్‌ హత్యతో సహా అనేక వుదంతాలు వెల్లడించాయి. అనేక మంది యువతులు ఫేస్‌బుక్‌లో వీడియోలను పెట్టి తిరోగమన భావాలను వెల్లడించటం కొత్త పరిణామం. సమాజంలోని వున్నత తరగతులకు చెందిన మహిళలు పచ్చి మితవాద శక్తులు, వారు జరిపే ఆందోళనలవైపు మొగ్గటం గతంలో కూడా వున్నది ఇటీవలి కాలంలో పెరగటం గమనించాల్సిన అంశం. గొర్రె కసాయివాడిని నమ్మినట్లు పచ్చిమితవాదులను మహిళా రక్షకులుగా అంగీకరించటం తప్ప ఇది వేరు కాదు. తమను యాజమాన్యాలకు అమ్మివేసే తొత్తులను కార్మికులు నమ్మినాయకత్వ స్ధానాలలో కూర్చో పెట్టటాన్ని చూస్తున్నాం. అలాంటిదే ఇది, గుండెలు బాదుకొని ఆందోళన చెందినందువలన ప్రయోజనం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

శబరిమల తీర్పు 2 : ఆర్‌ఎస్‌ఎస్‌ రెండు నాలికల వైఖరి !

08 Monday Oct 2018

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, RELIGION, Women

≈ Leave a comment

Tags

RSS doublespeak, RSS doublespeak on sabarimala, sabarimala, sabarimala verdict

Image result for rss doublespeak on sabarimala cartoons

ఎం కోటేశ్వరరావు

భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 125 ప్రకారం విడాకుల తరువాత ముస్లిం మహిళలు భర్త నుంచి భరణం పొందేందుకు అర్హులే అని సుప్రీం కోర్టు ఒక ముఖ్యమైన తీర్పు నిచ్చింది. ఇది తమ మత సాంప్రదాయాలు, వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటమే అని ముస్లింలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆ తీర్పును వమ్ము చేస్తూ కాంగ్రెస్‌ సర్కార్‌ ఏకంగా ఒక బిల్లునే పార్లమెంట్‌లో ఆమోదించింది. ఆ చర్యను వ్యతిరేకించిన బిజెపి అది ముస్లింల సంతుష్టీకరణ, ఓట్ల రాజకీయం అని విమర్శించింది. కానీ అదే పార్టీ నేడు ఇప్పటి వరకు ఆ డిమాండ్‌ చేయలేదుగానీ దాన్ని మద్దతు దారులు అదే డిమాండ్‌ చేస్తున్నారు. తీర్పును పునర్విచారణ జరపాలని బిజెపి కోరుతున్నది. గమనించాల్సిందేమిటంటే శని శింగనాపూర్‌ దేవాలయంలో అసలు మొత్తంగా మహిళలకు ప్రవేశం లేదు. అది చెల్లదని కోర్టు ఇచ్చిన తీర్పును పునర్విచారణ చేయాలని బిజెపి లేదా మహిళామోర్చా, ఇతర సంఘాలు గానీ డిమాండ్‌ చేయలేదు. పండలం మాజీ రాజకుటుంబం వారు షాబానో కేసు మాదిరి నరేంద్రమోడీ సర్కార్‌ కూడా శబరిమల తీర్పును రద్దు చేస్తూ పార్లమెంట్‌లో చట్టం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దాని గురించి ఇంతవరకు బిజెపి లేదా కేంద్రం నోరెత్తలేదు. నెపాన్ని సిపిఎం మీద నెట్టాలని చూస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం భక్తుల మనోభావాలను పట్టించుకోవటం లేదని ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి చెబుతున్నాయి. కమ్యూనిస్టులు కనుక వారి వైఖరి వారికి వుంటుంది. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ కొద్ది సంవత్సరాల క్రితం శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశించే అవకాశం ఇవ్వాలని కోరినపుడు భక్తులు గుర్తురాలేదా? ఎందుకీ అవకాశం వాదం, రెండు నాల్కల ధోరణి? కాంగ్రెస్‌ మైనారిటీ ముస్లిం ఛాందసవాదులను సంతృప్తి పరచేందుకు ప్రయత్నిస్తే నేడు బిజెపి మెజారిటీ హిందువుల ఓట్ల కోసం ఛాందసులను తృప్తి పరచేందుకు పూనుకుంది. కోర్టు తీర్పు అమలు గురించి చర్చించేందుకు రావాలని ఆలయ ప్రధాన పూజారి, ఆలయ నిర్మాణం చేసిన పండలం రాజకుటుంబీకుల వారసులను ప్రభుత్వం ఆహ్వానించింది. తీర్పుపై పునర్విచారణకు ప్రభుత్వం నిర్ణయించకుండా తాము చర్చలకు వచ్చేదని వారి ప్రతినిధులు ప్రకటించారు.

నాడు హిందూ కోడ్‌ బిల్లు ద్వారా హిందూ మత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆర్‌ఎస్‌ఎస్‌ వాదించిన విషయం ముందే చెప్పుకున్నాము. అదే సంస్ధ సృష్టి అయిన బిజెపి జమ్మూకాశ్మీర్‌లో మహిళల వారసత్వహక్కు విషయంలో వివక్ష చూపుతున్నారని మొసలి కన్నీరు కార్చుతున్నది. అసలు లక్ష్యం దానికి ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్‌ 370కి ఎసరు తేవటం. ఇదే బిజెపి వుమ్మడి పౌరస్మృతి గురించి చెబుతుంది. దీని వెనుక ముస్లిం, క్రిస్టియన్‌ వ్యతిరేకత వుంది. ఒక వైపు ముస్లింలు, క్రైస్తవులు ఎలాంటి కుటుంబ నియంత్రణ పాటించకుండా పిల్లలను ఎక్కువ మందిని కంటూ హిందూ జనాభాను మైనారిటీగా చేసేందుకు కుట్రపన్నారని చెబుతారు, మరోవైపు బిజెపిలోని నోటి తుత్తర గాళ్లు, పెండ్లీ పెటాకులు లేని సన్యాసులు, సన్యాసినులు హిందూ మహిళలు కుటుంబ నియంత్రణను పక్కన పెట్టి ఎక్కువ మంది పిల్లలను కనాలని చెబుతారు.

లవ్‌జీహాద్‌ పేరుతో హిందూ యువతులు ఇతర మతాలకు చెందిన వారిని వివాహం చేసుకోకుండా చూసేందుకు సంఘపరివార్‌ సంస్ధలు నిరంతర ప్రచారం చేస్తున్నాయి. మత వుద్రిక్తతలను రెచ్చగొడుతున్నాయి. వాలెంటైన్స్‌ డే రోజున వారంతా బృందాలుగా పార్కుల వెంట తిరుగుతూ కనిపించిన యువతీ యువకులను కొట్టటం, వివాహం చేసుకోమని బలవంత పెట్టటం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. నిచ్చెన మెట్ల వంటి మన కుల వ్యవస్ధలో పై మెట్టులో వున్న అమ్మాయి ఎవరైనా కింది మెట్టులో వున్న అబ్బాయిని వివాహం చేసుకుంటే యువకులను హత్య చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. అలాంటి చర్యలను సామాజిక మాధ్య మాల్లో నిస్సిగ్గుగా సమర్ధించేవారంతా పై తరగతికి చెందిన వారే అన్నది అందరికీ తెలిసిన నిజం. అనేక మంది బిజెపి అగ్రనేతల కుమార్తెలు, బంధువులు ముస్లింలను వివాహాలు చేసుకున్నారు. అది మాత్రం ఇలాంటి బాపతుకు లవ్‌ జీహాద్‌గా కనిపించదు. సుబ్రమణ్యస్వామి కుమార్తె సుహాసిని మాజీ అధికారి సల్మాన్‌ హైదర్‌ కుమారుడు నదీమ్‌ను, బిజెపినేతలు సికిందర్‌ భక్త్‌, షా నవాజ్‌ ఖాన్‌, ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ హిందూ యువతులను వివాహం చేసుకున్నారు. ఎల్‌కె అద్వానీ మేనకోడలు ఒక ముస్లింను వివాహం చేసుకుంది. సామాన్యులనే సమిధలుగా చేస్తున్నారు. మతకొట్లాటలను రెచ్చగొట్టేందుకు అలాంటి వుదంతాలను వినియోగించుకుంటున్నారు.

ఆమోదంతో స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సెక్షన్‌ 377ను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. దీని మీద కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఎనిమిదేండ్ల పాటు ఈ కేసు నడిచింది. ప్రస్తుతం వుత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వున్న యోగి ఆదిత్యనాధ్‌ 2013లో బిజెపి పార్లమెంట్‌ సభ్యుడిగా వుండి ఏం మాట్లాడారో చూడండి. ‘ సామాజిక నీతికి స్వలింగ సంపర్కం ప్రమాదకరం, సామాజిక కట్టుబాట్లు, సరిహద్దులను చెరిపివేస్తే ఆ తరువాత మనిషి జంతువుకు తేడా వుండదు. చౌకబారు కుతర్కంతో మత గ్రంధాలకు వీటిని జత చేయటం పూర్తి అనైతికం, ఇంట్లో చేసే వాటిని నాలుగు రోడ్ల కూడలిలో చేస్తామని ఎవరైనా అంటే దాన్ని సమాజం అంగీకరించకూడదు. దానికి ఏవిధమైన రాజ్యాంగ బద్దత కూడా వుండకూడదు’ అన్నారు. ప్రస్తుతం ప్రతిపక్షం వున్న కాంగ్రెస్‌ నేత గులాం నబీ అజాద్‌ 2011లో కేంద్ర మంత్రిగా మాట్లాడుతూ ‘ దురదృష్టం కొదీ ఎయిడ్స్‌ వ్యాధి ప్రపంచానికి మన దేశానికి వచ్చింది. ఒక పురుషుడు మరొక పురుషుడితో కలిస్తే ఇది వస్తుంది. ఇది పూర్తిగా అసహజమైనది, జరగకూడనిది, కానీ జరుగుతోంది. బిజెపి ఎంపీ సుబ్రమణ్య స్వామి మరొక అడుగు ముందుకు వేసి 2013లో మాట్లాడుతూ స్వలింగ సంపర్కాన్ని చట్టబద్దం చేస్తే అది లాభదాయకంగా మారి అన్ని పట్టణాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో స్వలంగ సంపర్క బార్లను తెరవటానికి దారి తీస్తుంది’ అన్నారు. ఇప్పటికి ఎన్ని బార్లు తెరిచారో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం తిరుగుతున్న నరేంద్రమోడీ సర్కార్‌ మనకు చెప్పాలి. ఇక ప్రతిదాన్నీ తన కంపెనీ లాభాల కోసం వినియోగించుకుంటున్న యోగా గురు బాబారామ్‌ దేవ్‌ ఈ అంశాన్ని కూడా వదల లేదు. స్వలింగ సంపర్కులు తన యోగాశ్రమానికి వస్తే దీనికి గ్యారంటీగా చికిత్స చేస్తామని చెప్పాడు. ఇది సాధారణంగా, సహజంగా మానవ మాత్రులెవరూ చేయకూడనిది అని టీవీల్లో బోధలు చేసే ముస్లిం పండితుడు జకీర్‌ నాయక్‌ చెప్పారు.

శబరి మల తీర్పుపై పునర్విచారణ పిటీషన్‌ వేయాలన్న డిమాండుకు తమ పార్టీ మద్దతు ఇస్తున్నదని ముస్లింలీగ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి పికె కున్హాలికుట్టి ప్రకటించారు.భక్తుల మనోభావాలను గౌరవిస్తున్న కారణంగానే ఆలయపవిత్రతను కాపాడాలని యుడిఎఫ్‌ ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిందన్నారు.కోర్టు తీర్పు కంటే భక్తుల విశ్వాసాలు, ఆలయ సాంప్రదాయాలను కాపాడాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న వైఖరి వల్లనే అలజడి తలెత్తింది. నేడు ఇది శబరిమల విషయంలో జరిగింది రేపు దీని ప్రభావం ఇతర విశ్వాసాల మీద కూడా పడవచ్చు అన్నారు. శబరిమల తీర్పు అమలు హేతువాదులకు,నాస్తికులకు ఒక సమస్యగాకపోవచ్చుగానీ కోట్లాది భక్తులకు ఇది ప్రధాన సమస్య. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ పునర్విచారణ పిటీషన్‌ దాఖలు చేయవచ్చు. మసీదుల్లో మహిళల ప్రవేశం గురించి కొన్ని ముస్లిం సంస్ధలు అనుమతించాలని కోరుతుండగా మరికొన్ని వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు.

భక్తుల విశ్వాసాలను గౌరవించాలంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన అనేక సంస్ధలు మహిళలను వీధుల్లోకి సమీకరిస్తున్నాయి. తొలుత కోర్టు తీర్పుకు అనుకూలంగా మాట్లాడిన ఆ సంస్ధ వెంటనే ప్లేటు ఫిరాయించింది. సుప్రీం కోర్టు తీర్పు చెప్పినప్పటికీ భక్తుల మనోభావాలను విస్మరించకూడదని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి సురేష్‌ భయ్యాజీ జోషి సన్నాయి నొక్కులు నొక్కారు. సమీక్ష పిటీషన్‌ వేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఇది జరిగిన మరుసటి రోజు కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి నడిపే జన్మభూమి దినపత్రికలో జోషి ప్రకటన తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌ మేధావి, భారతీయ విచార కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌ అయిన ఆర్‌ సంజయన్‌ రాసిన ఒక వ్యాసంలో కోర్టు తీర్పును సమర్ధించటం గమనించాల్సిన అంశం. వున్నత న్యాయ స్ధానం తీర్పు ఆలయ మౌలిక సాంప్రదాయాలు, క్రతువులను ఏ విధంగానూ మార్పు చేయదని, వాస్తవానికి మరింత మంది మహిళా భక్తులు దేవాలయాన్ని సందర్శిస్తే దాని ప్రాధాన్యత, ప్రజాదరణ పెరుగుతుందని వ్యాఖ్యానించారు. పది-యాభై సంవత్సరాల మధ్య వయస్సున్న వారి మీద వున్న ఆంక్షలను మాత్రమే కోర్టు కొట్టివేసింది. అటువంటి సాంప్రదాయాలు సక్రమం అని నిరూపించటానికి తర్కబద్దంగా లేదా తగిన శాస్త్రీయ పద్దతులు కూడా లేవని స్పష్టం చేశారు. ఆలయ అధికారుల సహాయంతో గతంలో అన్న ప్రాసన కార్యక్రమాలు కూడా జరిగాయని, పిల్లలను కనే వయస్సులో వున్న మహిళ ప్రవేశంపై ఆంక్షలు విధించాలని 1991లోనే కేరళ హైకోర్టు ఆంక్షలు విధించిందని పేర్కొన్నారు. దేవాలయాన్ని సందర్శించాలా లేదా అనే, ఎప్పుడు ఆ పని చేయాలి అనే అంశాలను నిర్ణయించుకొనే స్వేచ్చ మహిళలకే వదలి వేయాలి.వారికి నిర్ణయించుకొనే సామర్ధ్యం వుంది, పితృస్వామ్య రోజులు అంతరించాయని ప్రతి ఒక్కరూ గుర్తించటం అవసరం అని కూడా పేర్కొన్నారు. తిరువనంతపురం లోని భారతీయ విచార కేంద్రం డైరెక్టర్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ నేత అయిన పి పరమేశ్వరన్‌ 2006నవంబరులో త్రిసూర్‌లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ మహిళలు దేవాలయ సందర్శనను కోరుకుంటే వారిని అనుమతించాలి, అనుమతించకపోవటానికి ఎలాంటి కారణం లేదు అన్నారు.

మహిళలు కొండమీద వున్న ఆలయాన్ని చేరుకొనేందుకు ఎక్కలేరు, మహిళా కార్యకర్తలు తప్ప మూమూలు నిజమైన భక్త మహిళలెవరూ ఆలయాన్ని సందర్శించరు అనేవారు కొందరు. రెడీ టు వెయిట్‌ అంటే మాకు ఆలయ ప్రవేశ అర్హత వచ్చేంత వరకు వేచి చూస్తాం అనే నినాదంతో కొందరు మహిళలు ప్రచారం చేస్తున్నారు. మహిళలు అంత ఎత్తు ఎక్కలేరు, గంటల తరబడి వేచి వుండలేరు అని చెప్పే మహానుభావులారా అంతరిక్షంలోకి ప్రయాణిస్తున్న వారు అయ్యప్ప ఆలయానికి వెళ్లలేరా? వెళ్లాలా లేదా అనేది ఎవరిష్టం వారిది. వివక్ష కూడదన్నది సహజన్యాయం తప్ప బలవంతంగా వారిని గుళ్ల చుట్టూ తిప్పాలని ఏ కోర్టూ చెప్పలేదు, చెప్పదు. బస్సుల సౌకర్యం లేనపుడు ఏడుకొండలు ఎక్కి తిరుమలలో వెంకటేశ్వరుడిని మహిళలు దర్శించలేదా? ఇప్పుడు నడకదారిలో వెళుతున్నవారు లేరా ? శక్తి వున్న వారు నడుస్తారు. శబరిమల ఆలయంలోకి ప్రవేశ అర్హత వున్న పదేండ్ల లోపు వారు, యాభై ఏండ్ల పైబడిన వారు నడవగలరని ఎవరైనా చెప్పగలరా? ఇక మహిళా కార్యకర్తలు మాత్రమే ఆలయాన్ని సందర్శిస్తారని వుక్రోషంతో చెబుతున్నమాట తప్ప మరొకటి కాదు, ఆ మాట చెప్పిన ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పద్మకుమార్‌ మహిళలకు సౌకర్యం కోసం వంద ఎకరాల స్ధలం కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారని గుర్తు చేయటం అవసరం. ఆసక్తి వున్న వారికి అవకాశం కల్పించమని అడగటం తప్ప ఆంక్షలను వ్యతిరేకించే కమ్యూనిస్టు పురుషులు, మహిళా కార్యకర్తలెవరూ అయ్యప్పమాల వేసుకొని దర్శనాలు గతంలో చెయ్యలేదు, ఇప్పుడు చెయ్యరు.

శబరిమల తీర్పును ఆలిండియా కాంగ్రెస్‌ స్వాగతిస్తే కేరళ కాంగ్రెస్‌ నాయకుడు రమేష్‌ చెన్నితల మాత్రం అతని కంటే ఘనుడు ఆచంటమల్లన అన్నట్లు బిజెపి కంటే రెండాకులు ఎక్కువ చదివాడు. విశ్వాసం కంటే హేతుబద్దత పైచేయిగా వుండకూడదు అనటాన్ని నేను సమర్ధిస్తాను, తప్పుడు వాదాల ఆధారంగా కోర్టు తీర్పు ఇచ్చినట్లు కనిపిస్తున్నది, ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం, దేవస్ధానం బోర్డు భిన్నవైఖరులు తీసుకున్నాయి, తీర్పు పునర్విచారణ కోరాలి అని చెన్నితల వ్యాఖ్యానించారు. కోర్టు విచారణ ఒక రోజు ప్రారంభమై మరుసటి రోజుకు ముగియలేదు. సంవత్సరాల పాటు సాగింది, అదేమీ రహస్యంగా జరగలేదు, ఒక పక్షం తప్పుడు వాదాలు చేస్తే రెండవ పక్షం ఏమిచేసినట్లు? కోర్టు అంత గుడ్డిగా తీర్పు ఇచ్చినట్లా ? ప్రజాస్వామ్యంలో కోర్టు తీర్పు మీద అప్పీలు చేయవచ్చు.

ఎవరైనా ఒక వివాదంలో తనకు న్యాయం జరగలేదనుకున్నపుడు, తన వాదనను సరిగా పట్టించుకోలేదని భావించినపుడు కోర్టు తీర్పు మీద అప్పీలు చేసుకొనేందుకు, పునర్విచారణ కోరేందుకు అవకాశం, హక్కు వుంటుంది. శబరిమల కేసులో మహిళల ప్రవేశంపై ఎలాంటి ఆంక్షలు వుండరాదన్నది ఎల్‌డిఎఫ్‌ వైఖరి, దాన్నే కోర్టుకు సమర్పించింది, దానికి అనుగుణ్యంగానే తీర్పు వచ్చింది. అందుకే అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. తన వైఖరికి అనుగుణ్యంగానే తీర్పు వచ్చినందున పునర్విచారణ కోరటం అనే సమస్య ప్రభుత్వం ముందు వుండదు. అయినా సరే కోరకపోవటం తప్పని సిపిఎం వ్యతిరేకులు దాడి చేస్తున్నారు. ప్రజలకు ప్రధాన శత్రువుగా ఏ పార్టీ వుంది, ఏ అంశం ముప్పు కలిగిస్తుంది అని ఎంచుకోవటం, దానికి అనుగుణ్యంగా ఎత్తుగడలు నిర్ణయించుకోవటం గురించి సిపిఎం తీసుకున్న నిర్ణయాలతో ఎవరైనా ఏకీభవించకపోవచ్చు, మంచి చెడ్డలను విమర్శించవచ్చు. అయితే సామాజిక విషయాల్లో ఇంతవరకు ఓట్లకోసమో, మరొకదాని కోసమో గతంలో ప్రకటించిన తన సూత్రబద్ద వైఖరులను నవీకరించుకుందేమోగాని ఒకసారి నిర్ణయించుకున్న తరువాత దానికి విరుద్దంగా మార్చుకున్న దాఖలాలు ఇంతవరకు లేవు అనే అంశంలో దాని రాజకీయ వ్యతిరేకులు కూడా ఏకీభవించకతప్పదు. శబరిమల ఆలయ విషయంలో కూడా అదే రుజువైంది. విఎస్‌ అచ్యుతానందన్‌ ముఖ్య మంత్రిగా వుండగా ఇచ్చిన అఫిడవిట్‌లో ఆంక్షలను వ్యతిరేకించింది. తరువాత అధికారానికి వచ్చిన యుడిఎఫ్‌ దానికి విరుద్ధంగా సుప్రీం కోర్టుకు మరొక అఫిడవిట్‌ను సమర్పించింది. ఐదేండ్ల తరువాత తిరిగి అధికారానికి వచ్చిన సిపిఎం తన పూర్వపు వైఖరినే కోర్టులో పునరుద్ఘాటించింది.

మాటతప్పదు, మడమ తిప్పదు అని ఎంతో మంది నమ్మే ఆర్‌ఎస్‌ఎస్‌ శబరిమల విషయంలో అవకాశవాద వైఖరిని ప్రదర్శించింది. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి సురేష్‌ భయ్యాజీ జోషి ఇప్పుడు రెండు నాలికలతో మాట్లాడారు.దీని వెనుక వున్న కారణాన్ని తరువాత చెప్పుకుందాం. రెండు సంవత్సరాల క్రితం ఆలయ ప్రవేశం గురించి ఆర్‌ఎస్‌ఎస్‌ ఏం చెప్పిందో చూద్దాం. ‘ కొన్ని ప్రాంతాలలో కొన్ని అనుచిత సాంప్రదాయాల కారణంగా ఆలయ ప్రవేశం సమస్యపై ఏకాభిప్రాయం లేదు. ఎక్కడైతే అటువంటి సమస్యలు ముందుకు వచ్చాయో, తగిన చర్చల ద్వారా అలాంటి ఆలోచనా వైఖరిని మార్చేందుకు ప్రయత్నించాలి.సమాజ హితానికి వ్యతిరేకులైన కొందరు గత కొద్ది రోజులుగా మహిళల ఆలయ ప్రవేశంపై మింగుడు పడని వివాదాన్ని లేవనెత్తుతున్నారు. మత, ఆధ్యాత్మిక వ్యవహారాలు, ఆరాధన, విశ్వాసాల వంటి విషయాలలో స్త్రీ పురుషులు సహజంగానే సమాన భాగస్వాములు అనే ఒక వున్నత సాంప్రదాయాన్ని గతం నుంచీ పాటిస్తున్నాము. మహిళలు వేదాలు నేర్చుకుంటున్నారు, సహజపద్దతుల్లోనే వారు ఆలయ పూజారులుగా కూడా పని చేస్తున్నారు ‘ 2016 మార్చి రెండవ వారంలో రాజస్ధాన్‌లోని నాగౌర్‌ సమీపంలో జరిగిన మూడు రోజుల ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధుల సభకు సమర్పించిన నివేదికలో సురేష్‌ భయ్యాజీ ఈ మాటలు చెప్పినట్లు డక్కర్‌ హెరాల్డ్‌ పత్రిక వెల్లడించింది. శబరిమల ఆలయంలో కొన్ని వయస్సుల మహిళలకు ఆలయ ప్రవేశ నిషిద్ధం వెయ్యి సంవత్సరాల నాటి ఆచారం అని చెప్పినా అర్ధం లేదు, పురుషులకు ఏ పరిమితులు విధించారో మహిళందరికీ అవే వుండాలని ఆర్‌ఎస్‌ఎస్‌ కోరుతోందని కూడా సురేష్‌ చెప్పారు. నాడు కేరళలో అధికారంలో వున్న కాంగ్రెస్‌ మహిళల ప్రవేశానికి వ్యతిరేకం. అదే సమయంలో మహారాష్ట్రలోని శని శింగనాపూర్‌ ఆలయంలో మహిళల ప్రవేశం గురించి వివాదం నడుస్తున్నది. ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌లో ఒక వ్యాసం వచ్చింది, అంతకు ముందు అదే పత్రిక సంపాదకీయంలో గౌరవ ప్రదమైన చర్చ జరగాలని బోధ చేశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రవేశానికి సుముఖత వ్యక్తం చేయగా మంత్రి పంకజ్‌ ముండే వంటి వారు వ్యతిరేకించారు.ఈ సమావేశంలోనే నిక్కర్లను విప్పేసి పాంట్లు( పురాణాలు, వేదాలు, ఛాందసవాదుల ప్రకారం నిక్కరు,పాంట్లు మన సంస్కృతి కాదు) వేసుకోవాలని తీర్మానించారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ దాని అనుబంధ, అనుసరించే సంస్ధలు విశ్వాసాలు, నమ్మకాలు, సాంప్రదాయాల మీద కోర్టులు తీర్పు చెప్పజాలవనే వాదనను చాలా కాలంగా ముందుకు తెస్తున్నాయి. కూల్చివేసిన బాబరీ మసీదు స్ధలంలోనే రాముడు పుట్టాడని, అక్కడి రామాలయాన్ని కూల్చి బాబరు కాలంలో మసీదు నిర్మి ంచారని వాదిస్తున్నది. దానికి ఎలాంటి ఆధారాలు లేవు. విశ్వాసాలకు ఆధారాలేమిటని ఎదురుదాడికి దిగుతున్నది. బాబరీ మసీదు స్థల యాజమాన్య హక్కుల గురించి దీర్ఘకాలంగా నడుస్తున్న కోర్టు వివాదంలో అది తమకు అనుకూలంగా వస్తే ఈ శక్తులు మిన్నకుంటాయి లేకపోతే తమ విశ్వాసాలను దెబ్బతీశారంటూ ఆ తీర్పును వ్యతిరేకించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. అందుకే శబరిమల, శని సింగనాపూర్‌ వంటి వాటిని ఆసరా చేసుకొని తమ వాదనలను ముందుకు తెస్తున్నాయి. అందుకు గాను మహిళలను ముందు నిలుపుతున్నాయి.

మత ప్రాతిపదికన జనాన్ని చీల్చి అధికారానికి రావాలన్న మతోన్మాదుల ఎత్తుగడల్లో ప్రార్ధనా స్దలాలను వివాదాస్పదం చేయటం. దానిలో భాగమే రామాలయాన్ని కూల్చివేసి బాబరీ మసీదును కట్టారనటం, వారణాసిలో ఔరంగజేబ్‌ కాలంలో నిర్మించిన జ్ఞానవాపి మసీదు కాశీవిశ్వనాధుని ఆలయమని వివాదాలను రేపిన విషయం తెలిసినదే. కేరళలో పట్టు సంపాదించేందుకు శబరిమల ఆలయం మీద క్రైస్తవులు కుట్ర చేస్తున్నారనే ప్రచారం కూడా దానిలో భాగమే. ఆలయం పరిసర ప్రాంతాలలో క్రైస్తవులు ఎక్కువగా నివశిస్తున్నారు. అయ్యప్ప ఆలయ సమీపంలో పెద్ద చర్చిని నిర్మించి క్రైస్తవ యాత్రా కేంద్రంగా మార్చాలన్న కుట్ర వుందని ప్రచారం చేస్తున్నారు. నిజానికి కేరళలో క్రైస్తవం ఎన్నో శతాబ్దాల క్రితమే వ్యాపించింది. బ్రాహ్మలతో సహా అనేక నిచ్చెన మెట్ల వ్యవస్ధలో ఎగువున వున్న కులాలవారు ఎప్పుడో క్రైస్తవులుగా మారిపోయారన్నది చరిత్రలో దాగని సత్యం. తెలుగు ప్రాంతాలలో రెడ్డి, కమ్మ క్రైస్తవుల మాదిరి కేరళలో సిరియన్‌ క్రైస్తవులంటే అగ్రకులాలకు చెందిన వారే. తెలుగు ప్రాంతాలలో మాదిరి తాళిబట్టుతో సహా అనేక హిందూ సంప్రదాయాలను వారు పాటిస్తారు. సిరియన్‌ క్రిస్టియన్లు అనేక రంగాలలో ప్రముఖులుగా, ధనికులుగా వున్నారు.వారే ఆ ప్రాంతంలో చర్చి నిర్మించతలపెట్టారన్నది ఆరోపణ. బాబరీ మసీదు నిర్మాణంలో రామాలయ నిర్మాణ స్ధంభాలను వుపయోగించారని ఆధారంలేని ప్రచారం చేస్తున్నట్లే శబరిమల ఆలయానికి 20కిలోమీటర్ల దూరంలోని నీలక్కల్‌ శివాలయంలో రెండువేల సంవత్సరాల నాటి కొయ్య శిలువ బయటపడిందని, దానిని సిరియన్‌ క్రిస్టియన్‌ సమూహ ఆద్యుడు సెయింట్‌ థామస్‌ స్వయంగా తీసుకువచ్చిన 1983లో ప్రచారంలోకి వచ్చింది. సెయింట్‌ థామస్‌ చర్యను సహించని తమిళ బ్రాహ్మడు ఆయనను కత్తితో పొడిచి చంపాడని ప్రచారం చేశారు. దాన్ని నమ్మిన క్రైస్తవులు ఆ ప్రాంతాన్ని సందర్శించటంతో పాటు చర్చి నిర్మాణానికి స్ధలం కావాలని కోరారు. దానికి నిరసనగా బిజెపి నేత, ప్రస్తుతం మిజోరాం గవర్నర్‌గా వున్న కుమనం రాజశేఖర్‌ ఆందోళనకు నాయకత్వం వహించాడు.తరువాత అక్కడకు నాలుగు కిలోమీటర్ల దూరంలో అటవీ భూమిని కేటాయించారు. నిజానికి రెండువేల సంవత్సరాల నాటి కొయ్య మన దేశవాతావరణ పరిస్ధితులలో చెక్కుచెదరకుండా వుండటం అసాధ్యం. అయితే తరువాత వచ్చిన వార్తల ప్రకారం బాబరీ మసీదు ప్రాంగణంలో దొంగతనంగా రాముడి విగ్రహాన్ని పెట్టినట్లే అక్కడి శివాలయంలో శిలువను పెట్టారని తేలింది.హైదరాబాదులో హుస్సేన్‌ సాగర్‌ చెరువుకు హిందూమతశక్తులు వినాయకసాగర్‌ పేరు పెట్టినట్లుగానే క్రైస్తవమతశక్తులు అయ్యప్ప కొండను సెయింట్‌ థామస్‌ కొండగా పిలవటం ప్రారంభించారు.సెయింట్‌ థామస్‌ హత్య వాస్తవం కాదని, ఆయన ఇటలీలోని ఓర్టానాలో మరణించాడని వాటికన్‌ తరువాత వివరణ ఇచ్చింది. నిజానికి సిరియన్‌ క్రిస్టియన్లు వలస వచ్చిన వారి వారసులు కాదని, స్ధానిక బ్రాహ్మలే మతం మార్చుకున్నారని 1883లోనే ప్రచురించిన పుస్తకంలో పేర్కొన్నారు. హిందూ మతశక్తులు ఎలా కుట్రలు చేస్తున్నాయో శబరిమల ప్రాంతంలోని క్రైస్తవ మతోన్మాదులు కూడా అలాంటి వాటిలోనే నిమగ్నమయ్యారని జరుగుతున్న పరిణామాలు వెల్లడిస్తున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

శబరిమల తీర్పు 1 : సాంప్రదాయ ముసుగులో బిజెపి-ముస్లింలీగ్‌-కాంగ్రెస్‌ బృందగానం !

07 Sunday Oct 2018

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Women

≈ Leave a comment

Tags

congress- bjp- muslim league chorus, Kerala LDF, Ready to wait, Sabarimala Entry Case, sabarimala verdict

TDB says Only real women devotees expected to visit Sabarimala temple

ఎం కోటేశ్వరరావు

శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి మహిళల ప్రవేశంపై ఐదుగురు సభ్యుల సుప్రీం కోర్టు బెంచ్‌ మెజారిటీ (4ా1) తీర్పును వ్యతిరేకిస్తూ కేరళలో బిజెపి అనుబంధ విభాగమైన మహిళా మోర్చా,యువమోర్చా తదితర సంస్ధలు రంగంలోకి దిగాయి. ప్రదర్శనలు, ఇతర రూపాల్లో ఆందోళనలు చేయిస్తున్నాయి. మహిళలకు అనుకూలంగా వచ్చిన తీర్పులను బిజెపి ఎంత రెచ్చగొట్టినా మహిళలే వ్యతిరేకిస్తూ వీధుల్లోకి రావటం ఏమిటని అనేక మందిలో ఆశ్చర్యం, ఆవేదన, ఆందోళన కలిగి వుండవచ్చు.వేలు, లక్షల సంఖ్యలో రైతులు, కార్మికులు, వుద్యోగులు ఆందోళనలు చేస్తున్నా ఒక్క ముక్క కూడా వార్తలు, చిత్రాలను ప్రచురించని పత్రికలు వీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వటంతో పాటు అతిశయోక్తులను జోడించటం కూడా చాలా మందికి మింగుడుపడటం లేదు. సమాజం మొత్తం మీద చూసినపుడు వెనుకబడిన వారిలో మహిళలు అత్యంత వెనుకబడిన వారని, ప్రస్తుతం దేశంలో, ప్రపంచంలో వున్న పరిస్ధితులు, పరిణామాలను గుర్తిస్తే ఇలాంటి ప్రదర్శనల గురించి ఆశ్చర్యపడాల్సిన పని వుండదు. తిరోగామి భావజాల ప్రభావం సామాజికంగా వెనుకబడిన వారి మీద ఎక్కువగా వుంటుంది. మహిళలకు మినహాయింపు ఎలా వుంటుంది. అనేక వుదంతాలలో వారిని వారిని ముందుకు తెచ్చిన ఫ్యూడల్‌, ఇతర తిరోగామి శక్తులను చూశాము. అనేక ఆందోళనలు అవి రిజర్వేషన్లకు వ్యతిరేకం నుంచి దళితుల మీద దాడులు, వేర్పాటు వాదం నుంచి విచ్చిన్న వాదాల ఆందోళనల వరకు జరిగిన వాటిలో మహిళలు గణనీయంగా పాల్గనటం తెలిసిందే. అలాంటి వాటి గురించి వార్తలను గుప్పించటం, ఆందోళనలు, పోరాటాలను విస్మరించటం కార్పొరేట్‌, పాలకవర్గాల మీడియా వర్గదృష్టిలో భాగమని వేరే చెప్పనవసరం లేదు.

శబరిమల తీర్పు వివిధ రాజకీయపార్టీల, స్వచ్చంద లేదా సాంస్కృతిక సంస్ధల ముసుగులో వున్న శక్తుల బండారాన్ని, ఫ్యూడల్‌ శక్తుల సంతుష్టీకరణకు పడే తాపత్రయాన్ని బయట పెడుతున్నది. చిత్రం ఏమిటంటే మహిళల పట్ల మత విషయాలలో నాణానికి బమ్మా బరుసు వంటి బిజెపి-ముస్లింలీగ్‌ ఒకే పాట పాడుతున్నాయి, ఆ బృందగానంలో కాంగ్రెస్‌ గొంతు కలిపింది. శబరిమల ఆలయంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అడ్డుకొనేందుకు సాంప్రదాయ ముసుగు వేసుకొని రంగంలోకి దిగటమే కాదు, ఓట్ల రూపంలో సొమ్ము చేసుకొనేందుకు బిజెపి, కాంగ్రెస్‌, ముస్లింలీగ్‌, ఇతర శక్తులు పోటీ పడుతున్నాయి. తీర్పుపై పునర్విచారణకు అప్పీలు చేయరాదని నిర్ణయించినందుకు సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నాయి. కారాలు మిరియాలు నూరుతున్నాయి. మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకతను ముఖ్యంగా మహిళ్లో రెచ్చగొట్టేందుకు పూనుకున్నాయి.ఒక కుక్కను చంపాలంటే దానికి పిచ్చిదనే ముద్రవేయాలన్నది కుటిలనీతి. ఒక పురోగామి తీర్పు, పరిణామాన్ని అడ్డుకోవాలంటే దానికి సాంప్రదాయ ముసుగువేయి అన్నది మతోన్మాద, కులోన్మాద శక్తులు, వాటికి అంటకాగే అవకాశవాద శక్తులఎత్తుగడ. వివిధ సందర్భాలలో ఇది వెల్లడైంది. మనోభావాలను రెచ్చగొట్టేందుకు ప్రతిపక్ష శక్తులన్నీ ఏకమైన తరుణంలో ఆచితూచి వ్యవహరించేందుకు అక్కడి వామపక్ష ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. సరిగ్గా అరవై సంవత్సరాల క్రితం ఇదే కేరళలో హిందూ, ముస్లిం, క్రైస్తవ మతసంస్ధలు, వాటి రాజకీయ ప్రతినిధులు, వారికి నాయకత్వం వహించిన కాంగ్రెస్‌కు అమెరికా గూఢచార సంస్ధ డబ్చిచ్చి మరీ విమోచన సమరం పేరుతో ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ ఆధ్వర్యాన ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాల్సి వుంది. ఇప్పుడు శబరిమల పేరుతో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అని ఇప్పుడే చెప్పలేము గాని శాంతి భద్రతల సమస్యను సృష్టించే ప్రయత్నం కనిపిస్తున్నది. నంబూద్రిపాద్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యలేమీ కమ్యూనిస్టు విప్లవ అజెండాలోనివి కాదు, ప్రజాస్వామిక స్వభావం కలిగినవే. స్వాతంత్య్రవుద్యమంలో ముందుకు వచ్చిన భూ సంస్కరణల అమలుకు పూనుకుంది. కౌలుదార్లకు రక్షణ కల్పించటం, వ్యవసాయ కార్మికుల కనీసవేతనాలు పెంచటం, ప్రయివేటు విద్యా సంస్ధలలో వుద్యోగనియామకాల క్రమబద్దీకరణ, వేతనాలను ట్రెజరీల ద్వారా చెల్లించాలని, చట్టాన్ని వుల్లంఘించిన విద్యా సంస్ధలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం వంటి సాధారణ అంశాలు మాత్రమే వున్నాయి. నిజానికి వీటి మీద వాగ్దానాలు చేయని పార్టీ లేదు. కమ్యూనిస్టు ప్రభుత్వం చేసిన ‘నేరం’ ఏమిటంటే చేసిన వాగ్దానాన్ని అమలు జరపటమే. దీనికి వ్యతిరేకంగా సర్వమత శక్తులతో పాటు నేతిబీరలో నెయ్యి మాదిరి సోషలిస్టు పార్టీల ముసుగులో వున్న శక్తులు కూడా మతశక్తులు, కాంగ్రెస్‌తో చేతులు కలిపి తమ బండారాన్ని తాము బయట పెట్టుకున్నాయి. ఇప్పుడు ఆందోళనకు దిగిన అంశం కూడా కమ్యూనిస్టు అజెండాలోనిది కాదు. చట్టబద్దమైన పాలనకు కట్టుబడడిన వారిగా శబరిమల తీర్పును అమలు జరుపుతామని ముఖ్య మంత్రి పినరయి విజయన్‌ ప్రకటించటంతో రాజకీయ లబ్ది పొందేందుకు అన్ని రకాల శక్తులు రంగంలోకి దిగాయి. గతంలో చేసిన కుట్రలను జయప్రదంగా తిప్పి కొట్టిన కమ్యూనిస్టులు ఈ సారి దానిని ఎలా అధిగమిస్తారన్నదే ఆసక్తి కలిగించే అంశం.

మన దేశంలో పురోగమన వాదానికి కమ్యూనిస్టులు, ఇతర అభ్యుదయ వాదులు, తిరోగమన వాదానికి ఆర్‌ఎస్‌ఎస్‌, దాని భావజాలంతో ఏకీభవించే బిజెపి, శివసేన, వాటిఅనుబంధ సంస్థలు, ఏది వాటంగా వుంటే ఆవైపు మొగ్గే అవకాశవాదానికి ప్రతీకలుగా కాంగ్రెస్‌, ఇతర ప్రాంతీయ బూర్జువా పార్టీలని స్థూలంగా చెప్పవచ్చు. వూహాజనితమైన, భావోద్రేకాలను రెచ్చగొట్టే అంశాలను ముందుకు తెచ్చి దేశాన్ని పట్టి పీడిస్తున్న తక్షణ సమస్యలుగా చిత్రించటంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పెట్టింది పేరు. వుదాహరణకు లవ్‌ జీహాద్‌. ముస్లిం యువకులు హిందూ బాలికలను ఆకర్షించి వివాహాలు చేసుకొని ముస్లింలుగా మార్చివేస్తున్నారన్నది వాటిలో ఒకటి. అందుకోసం హిందూ కుటుంబాలన్నింటినీ కలసి దాని గురించి చెప్పాలని పిలుపునిస్తారు. వాలెంటైన్స్‌ డే రోజున ఏడాదికి ఒకసారి పార్కుల వెంట తిరిగి ప్రేమికుల కోసం వెతకటం రెండవది. ఈ బాపతు భాషలో చెప్పాలంటే రుక్మిణిని లేపుకు పోయి వివాహం చేసుకున్న కృష్ణుడిని మాత్రం ఆదర్శ పురుషుడిగా కొలుస్తారు.

మూడుసార్లు తలాక్‌ చెప్పటం ద్వారా విడాకులు చెల్లవని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో తాము ముస్లిం మహిళలను విముక్తి చేశామని, అందువలన వారంతా బిజెపికే ఓటు వేయాలని ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. నిజానికి మహిళల పట్ల ఆ పార్టీకి లేదా దానిని సృష్టించిన ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎలాంటి చిత్తశుద్ది లేదు. హిందూకోడ్‌ బిల్లు విషయంలో అదెలా వ్యవహరించింది చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ గాంధీ తరువాత భారత్‌ అనే తన పుస్తకంలో చెప్పిన అంశాల సారాంశం ఇలా వుంది. ధర్మశాస్త్రాల ప్రాతిపదికన ఏర్పడిన హిందూ చట్టాలలో జోక్యం చేసుకొనేందుకు రాజ్యాంగపరిషత్‌కు ఎలాంటి హక్కు లేదంటూ 1949లోనే ఆలిండియా యాంటీ హిందూకోడ్‌ బిల్‌ కమిటీ ఏర్పడింది. దేశమంతటా సభలు పెట్టారు. వుపన్యాసాలు చేసిన వారు, పాల్గన్న వారంతా ధర్మ యుద్ధ సైనికులుగా పోరాడతామన్నారు. ఢిల్లీ రామలీలా మైదానంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక సభను ఏర్పాటు చేసింది. హిందూ సమాజంపై బిల్లు ఆటంబాంబు వంటిదని ఒక వక్త వర్ణించాడు. రౌలట్‌ చట్టం బ్రిటీష్‌ రాజ్య పతనానికి నాంది పలికినట్లుగా ఈ బిల్లు నెహ్రూ ప్రభుత్వపతనానికి దారి తీస్తుందన్నారొకరు. మరుసటి రోజు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు రాజ్యాంగపరిషత్‌ భవనం వద్ద ప్రదర్శన చేశారు. నెహ్రూ, అంబేద్కర్‌ దిష్టిబమ్మలను తగులబెట్టారు. ఒక అంటరాని వ్యక్తికి బ్రాహ్మ ణులు కాపాడే విషయాలతో పనేమిటని కరపత్రిజీ మహరాజ్‌ అనే పెద్దగా తెలియని ఒక స్వామిజీ అంబేద్కర్‌ను వుద్దేశించి వ్యాఖ్యానించాడు. పురుషులు రెండో వివాహం చేసుకోవటం గురించి యాజ్ఞవల్క్యుడే స్వయంగా ఇలా చెప్పాడంటూ సమర్ధించాడు. దాని ప్రకారం భార్యకు నిరంతరం మద్యం తాగే అలవాటు వుంటే, పిల్లలు పుట్టరని తేలితే, మాయలాడి, పెద్ద నోరుగలది, మగ పిల్లలు లేకుండా కేవలం ఆడపిల్లలను మాత్రమే కన్నపుడు, భర్తను ద్వేషించినపుడు మొదటి భార్య జీవించి వున్నా భర్త రెండవ వివాహం చేసుకోవచ్చనిచెప్పాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం విడాకులు నిషేధం ఇలా సాగింది స్వామీజి సమర్దన. బిల్లుకు వ్యతిరేకంగా ద్వారకా పీఠ శంకరాచార్య ఒక ఫత్వా జారీచేశారు.

ఈ పూర్వరంగంలో లింగవివక్ష నివారణ, మహిళలకు సమాన స్థాయి కల్పించే లక్ష్యంతో రాజ్యాంగ పరిషత్‌ అధ్యక్షుడు అంబేద్కర్‌ నాటి ప్రధాని నెహ్రూ మద్దతుతో 1951లో హిందూ కోడ్‌ బిల్లును ప్రతిపాదించారు. దానిలో మహిళలకు వారసత్వం, విడాకులు,భరణపు హక్కులను ఇవ్వటంతో పాటు వివాహవయస్సు పెంపు, బహుభార్యాత్వానికి వ్యతిరేకత, వితంతు వివాహాలు, బాల్యవివాహాల నిరోధం వంటి అనేక పురోగామి అంశాలను దానిలో చేర్చారు. ఈ బిల్లును ఆనాడు హిందూ మహాసభ, ఆర్‌ఎస్‌ఎస్‌, నేటి బిజెపి పూర్వ రూపమైన భారతీయ జనసంఘ్‌ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. అది హిందూ జీవన విధానాన్ని, మహోన్నతంగా నిర్మితమైన హిందూ సంస్కృతిని నాశనం చేస్తాయని నాశనం చేస్తాయని గగ్గోలు పెట్టాయి. వారికి మిగతా మితవాద సంస్థలు, కాంగ్రెస్‌లోని మితవాదులు తోడయ్యారు. ఇహ సంఘపరివార్‌ వంటి సంస్థలున్న తరువాత పుకార్లకు కొదవేముంటుంది. తన కుమార్తె ఇందిరా గాంధీ విడాకులకోసమే నెహ్రూ ఈ బిల్లును తెచ్చారని ప్రచారం చేశారు. వత్తిడికి తలగ్గిన నెహ్రూ బిల్లును వాయిదా వేయించారు. దానికి నిరసనగా అంబేద్కర్‌ రాజీనామా చేశారు. 1952తొలి పార్లమెంట్‌ ఎన్నికలలో ఆ బిల్లును ఒక సమస్యగా చేసి ప్రచారం చేసిన నెహ్రూ ఆ తరువాత 1956లో అదే బిల్లు ఆమోదానికి దోహదం చేశారు.

ఇటీవల కాలానికి వస్తే రూప్‌ కన్వర్‌ అనే ఒక 18ఏండ్ల యువతి రాజస్ధాన్‌లోని దేవరాల గ్రామంలో మరణించిన ఆమె భర్తతో కలిపి సజీవ దహనం చేశారు. అప్పట్లో వచ్చిన వార్తల ప్రకారం ఆమె తప్పించుకొని పారిపోతే అత్తమామలు, ఇతర బంధువులు లాక్కొచ్చి మరీ చితిపై పడవేశారు. ఈ దుర్మార్గాన్ని కొందరు సతికి సహకరించటంగా వర్ణించి సమర్ధించారు.దీన్ని సమర్ధించటంలోనూ, అనుకూలంగా ప్రదర్శనలు, ఆందోళనలు చేయటంలోనూ ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి వంటి మతోన్మాద సంస్ధలు ముందున్నాయని మరచిపోకూడదు.( సాంప్రదాయం ఇతరులకే గాని తమకు కాదు అన్నట్లుగా ఆ దురాచారాన్ని నిస్సిగ్గుగా సమర్ధించిన బిజెపిలో ఏ ఒక్కరు కూడా సతికి పాల్పడినట్లు మనకు ఎక్కడా వార్తలు కనిపించవు). అది రాజపుత్రుల సాంప్రదాయమని, స్వచ్చందంగానే సతికి పాల్పడతారని ప్రచారం చేశారు. ఈ వుదంతంలో కూడా కాంగ్రెస్‌ అవకాశవాద వైఖరి కనిపించింది. అందుకు పాల్పడిన వారి మీద కేసు నమోదు చేసేందుకు, తీరా నమోదు చేసినా కేసు నిలిచేందుకు వీలుగా వ్యవహరించటంలో విఫలమైంది. కేసులో సాక్షులుగా పేర్కొన్నవారు అడ్డం తిరగటంతో అది వీగిపోయింది. హిందూకోడ్‌ బిల్లును తన కుమార్తె విడాకుల కోసం నెహ్రూ తెచ్చాడని ప్రచారం చేసిన వారి వారసులే, రూపకన్వర్‌ వుదంతంలో నెహ్రూమనవడు, ప్రధానిగా వున్న రాజీవ్‌ గాంధీ పట్ల కూడా అలాగే వ్యవహరించారు. ఒక పార్సీ అయిన ప్రధాని రాజీవ్‌ గాంధీ ఒక విదేశీ మహిళను వివాహం చేసుకొని హిందూ మతాన్ని అవమానిస్తున్నారని భక్తిలాల్‌ అనే రాజస్ధాన్‌ మాజీ ఎంపీ ఒకరు బహిరంగంగానే వ్యాఖ్యానించాడు. తరువాత సతి నిరోధక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినపుడు బిజెపి దానిని వ్యతిరేకించింది. సతి రాజపుత్రుల సంప్రదాయమని దానిని విధిగా రక్షించాలని వాదించింది.

శబరిమల ఆలయ పవిత్రతను రక్షించాలని కోరే వారిలో ఆధునిక ఛాందసవాద మహిళలేమీ తక్కువ తినలేదు. రెడీ టు వెయిట్‌ అంటే తమకు ఆలయ సందర్శన అర్హత వచ్చేవరకు(50నిండేవరకు) వేచి చూస్తాం అనే వారికి ఒక మనవి, ఒక సవినయ ప్రశ్న. ఆలయ సందర్శన మీ ఇష్టం, వెళ్లే వారిని అడ్డుకోవద్దు అని చెప్పటం తప్ప మిమ్మల్ని దేవాలయ ప్రవేశానికి బలవంతం చేసేవారెవరూ లేరు. ఇక్కడ తర్కంతో ఆలోచిస్తే ఈ నినాదం ఇచ్చేవారు ఇబ్బందుల్లో పడతారు. సాంప్రదాయాలను కాపాడాలి, పాటించాలి, అమలు జరపాలి అనే వారు ఒక్క శబరిమల ఆలయానికే పరిమితమా లేక ఇతర సాంప్రదాయాలన్నింటి విషయంలో అదే వైఖరిని కలిగి వుంటారా? సతి కూడా సాంప్రదాయమే దాని పరిరక్షించాలి, అనుమతించాలని రెడీ టు వెయిట్‌ పూర్వీకులు గతంలో ప్రదర్శనలు చేసిన విషయాన్ని వారు గుర్తుకు తెచ్చుకోవాలి. మరి ఈ విషయంలో రెడీ టు సతి బర్న్‌ (సతి చితిమంటలకు సిద్ధం) అని పిలుపిస్తారా? బహుభార్యాత్వం కూడా మన సాంప్రదాయంలో భాగమే, అందుకు కూడా సిద్దపడతారా ? పురాణ పురుషుడు కౌశికుడికి వేశ్యకొంపల వెంట తిరిగే అలవాటుంది.కుష్టువ్యాధి సోకినా ఆ బుద్ది పోలేదు, ఏకంగా భార్యనే వారి వద్దకు తీసుకుపొమ్మని చెప్పిన అంశం తెలిసిందే. తెల్లవారే సరికి మరణించాలని దారిలో మాండవ్యముని శాపానికి గురైన భర్తను రక్షించుకొనేందుకు కౌశికుడి భార్య తన ప్రాతివ్రత్యంతో సూర్యోదయాన్నే నిలిపివేయించిందట. అంత చేయకపోయినా సాంప్రదాయాలను పాటించాలి, వాటికి కట్టుబడివుండాలని చెబుతున్నవారు కౌశికుడి భార్య బాటలో నడచి భర్తలను వేశ్య కొంపల వెంట తిప్పుతారా? సూర్యోదయాన్ని ఆపలేకపోయినా కనీసం పోలీసు అరెస్టులనైనా అడ్డుకుంటారా? వుద్రేకం వివేచనను లేకుండా చేస్తుంది, అవి వేరు ఇవి వేరు అని అవకాశవాదంతో మాట్లాడకండి. ఇలాంటి వాటిని అడ్డుకుంటే తిరోగామి శక్తులు వదలి వేసిన పనికి మాలిన సాంప్రదాయాలకు ఘనత ముసుగు తొడిగి స్త్రీలను తిరిగి వెనుకటి స్ధితిలోకి నెట్టినా ఆశ్చర్య పడనవసరం లేదు. నిదానంగా ఆలోచించండి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

గాడిద మూత్రంతో విమానాలు నడపటం సాధ్యమో కాదో తేల్చండి :ఏఐసిటిఇ

02 Tuesday Oct 2018

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

AICTE, Hindu scriptures, Jets fuelled by donkey urine, Vedic plane theory, Viman Shastra

Image result for Jets fuelled by donkey urine cartoons

ఎం కోటేశ్వరరావు

‘మన పూర్వీకులు గాడిద మూత్రంతో విమానాలను నడిపారు. రుగ్వేదంలోనే కాంతి సంవత్సర వేగం గురించి చెప్పారు. ఇలాంటి విషయాలు అన్నింటికీ రుజువులున్నట్లు మేము చెప్పటం లేదు. అవి నిజమో కాదో పరిశోధించి చెప్పండి ‘ అంటున్నారు ఘనత వహించిన మన భారతీయ విద్యాభవన్‌ మేథావులు. మన దేశాన్ని ముందుకు తీసుకుపోవాలనుకొనే చిత్తశుద్ది కల వారెవరూ ఇలాంటి బాధ్యతా రహిత సలహాలనిచ్చి మన యువత విలువైన సమయాన్ని, ప్రజాధనాన్ని వృధా చేయరు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు ఇలాంటి పుస్తకాలను ఇంజనీరింగ్‌ సిలబస్‌లో చేర్చేందుకు అంగీకారం తెలిపిన ఏఐసిటిఇ(ఆలిండియా సాంకేతిక విద్యా మండలి) పెద్దలు, కావాలంటే పుస్తక అంశాలపై సమీక్ష జరపవచ్చు అంటున్నారు. బహుశా ఇలాంటి ప్రబుద్ధులను చూసే యుద్ధం, మరొకటో లేకుండా ఒక దేశాన్ని నాశనం చేయాలనుకుంటే ఆ దేశ విద్యావిధానాన్ని చెడగొడితే చాలు అనే ఒక నానుడి సామాజిక మాధ్యమాల్లో తిరగటాన్ని చాలా మంది చూసే వుంటారు. దాన్ని ముందుగా ఎవరు చెప్పారోగానీ ఎంతో అనుభవం వుండి వుండాలి.

కొత్త ప్రాంతాలు, దేశాలను కనుగొనమని ఇతర ఖండాలలో ఔత్సాహికులను ప్రోత్సహించి కొత్త ప్రపంచానికి ఒకవైపు బాటలు వేసిన సమయంలో మన దేశంలో జరిగిందేమిటి? దేశం వదలి సముద్రయానం చేసి పరాయి దేశాలకు పోయే వారు మ్లేచ్చుల సంపర్కంతో మైలపడిపోతారు, త్రికాల సంధ్యావందనాలు, పూజలు, పునస్కారాలు చేయటానికి అవకాశం వుండదంటూ విధించిన నిషేధాలు మనలను బావిలోని కప్పలుగా మార్చాయి. మినహాయింపులు, ప్రాయచిత్తాల పేరుతో పరిహాస ప్రాయమైన శుద్ధి చేసుకుంటున్నారు తప్ప ఇప్పటికీ ఆ నిషేధాలను ఎత్తివేయలేదు. గతంలో వాటిని వుల్లంఘించిన వారికి శిక్షలు వేశారు. వీటికి తోడు కులాల వారీ పని విభజన, దీని వలన జరిగిందేమిటి? పారిశ్రామిక విప్లవం, దాని ఫలితాలకు మనం దూరమయ్యాయం. వర్తమానంలోకి వస్తే విద్య ప్రయివేటీకరణ పర్యవసానాలు ఎలాంటి విద్యావంతులను తయారు చేస్తున్నాయో చూస్తున్నాం. డిగ్రీలు చేతికి ఇవ్వటం తప్ప అవి కలిగిన వారి ప్రావీణ్యత ఎంత నాసిరకంగా వుందో తెలియంది కాదు. మన దేశాన్ని నాశనం చేసేందుకు విద్య ప్రయివేటీకరణ తన పని తాను చేస్తోంది.

రెండో అంశాన్ని చూద్దాం. మొగలాయీలు, బ్రిటీష్‌ వారు రాకముందే మన దేశంలో విదేశీ, సముద్ర యానాన్ని నిషేధించిన మనువాద ఛాందస శక్తుల వారసులు ఇప్పుడు మన విద్యారంగాన్ని దెబ్బతీసేందుకు రెండోవైపు నుంచి దాడిని మొదలు పెట్టారు. కాంతి వేగం, గురుత్వాకర్షణ శక్తి సిద్ధాంతం గురించి రుగ్వేదంలోనే ఎంతో స్పష్టంగా చెప్పారంటూ రాసిన పుస్తకాలను మన ఇంజనీరింగ్‌ విద్యార్ధుల పాఠ్యాంశంగా పెట్టేందుకు నిర్ణయించారు. ఆలిండియా సాంకేతిక విద్యామండలి(ఏఐసిటిఇ), ఈ సంస్ధే దేశంలో ఇబ్బడి ముబ్బడిగా ఇంజనీరింగ్‌ కాలేజీలకు అనుమతులిచ్చి డిగ్రీ ముద్రణా కేంద్రాలు తామరతంపరగా పెరిగేందుకు దోహదం చేసింది. ఇప్పుడు పురాతన జ్ఞాన వ్యవస్ధల అధ్యయనం పేరుతో వేదాల్లోనే అన్నీ వున్నాయష అనే భావజాలాన్ని రుద్దేందుకు పూనుకుంది. భారతీయ విద్యాసార్‌ అనే పేరుతో భారతీయ విద్యా భవన్‌ ప్రచురించిన ఒక పుస్తకాన్ని ఇంజనీరింగ్‌ విద్యార్ధులతో అధ్యయనం చేయించేందుకు నడుం కట్టింది. దీన్ని అడ్డుకోవాలని ముంబైకి చెందిన కొందరు శ్స్తావేత్తలు, విద్యావంతులు నడుం కట్టారు.

సమాజాన్ని వెనక్కు నడపాలని చూస్తున్న తిరోగామి శక్తులు గతంలో ఎన్నడూ లేని విధంగా దేశ అధికార వ్యవస్ధలోకి చొచ్చుకువచ్చాయి.గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ ప్రయత్నాలు వూపందుకున్నాయి. అనేక అశాస్త్రీయ అంశాలను ముందుకు తెస్తున్నారు.మన దేశ సైన్సు, తత్వశాస్త్రాల చరిత్రను విద్యార్ధులకు తెలియచేయటంలో తప్పు లేదు. గతం, చరిత్ర లేకుండా భవిష్యత్‌ వుండదు.ఈ పుస్తకంలోని అంశాల గురించి శాస్త్రవేత్తలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న అంశాలేమిటి? రుషి అగస్త్యుడు ఎలక్ట్రోవాల్టయిక్‌ సెల్‌ను కనుగొన్నాడు. నీటి నుంచి ఆక్సిజన్‌, హైడ్రోజన్‌లను వుత్పత్తి చేసే ఎలక్ట్రోలసిస్‌ పద్దతిని అగస్త్యుడు వివరించాడు. రుషి కణాదుడు తన వైశేషిక సూత్రాలలో న్యూటన్‌, ఇతర పలు గతి సూత్రాల గురించి చర్చించాడు. రుషి భరద్వాజుడు వేల సంవత్సరాల క్రితమే వైమానిక శాస్త్రం గురించి పుస్తకం రాశాడు. విమానాల నిర్మాణం గురించేగాక నడపటం, ఇంధనాలు, పైలట్లను సన్నద్ధం చేయటం గురించి కూడా పేర్కొన్నాడు.కాంతి వేగం, గురుత్వాకర్షణ శక్తి సూత్రం గురించి ఎంతో స్పష్టంగా రుగ్వేదంలోనే రాశారు వంటి అంశాలతో ఆ పుస్తకాన్ని నింపారు. ఏఐసిటియి కూడా విద్యార్ధుల భవిష్యత్‌ను తీవ్రంగా నష్ట పరుస్తోందని, పేరు ప్రతిష్టలున్న ఏ విశ్వవిద్యాలయం కూడా ఇటువంటి పుస్తకాలను విద్యార్దుల అధ్యయనానికి ఎంపిక చేయదని ముంబై విద్యావేత్తలు తమ డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. దాని మీద ప్రస్తుతం వారు సంతకాలు సేకరిస్తున్నారు. ముంబైలోని హోమీబాబా సైన్సు విద్యాకేంద్రంలో పనిచేస్తున్న అనికేత్‌ సూలే ఈ పుస్తకం గురించి మాట్లాడుతూ ఇది శాస్త్రవేత్తల సమూహానికి అపకారం చేస్తుంది , ఏఐసిటియి డైరెక్టర్‌ అనిల్‌ సహస్రబుద్ది ఒక అకడమిషియన్‌ మా అభ్యంతరాన్ని ఆయన గ్రహించగలరనుకుంటున్నాను, తరువాత మండలితో చర్చలు జరుపుతాము అన్నారు.

తమ పుస్తకంపై ఆన్‌లైన్‌ పిటీషన్‌తో విమర్శలు రావటంతో భారతీయ విద్యాభవన్‌ సమర్ధనకు పూనుకుంది. దానిలోని అంశాలన్నీ శాస్త్రీయంగా రుజువైనవని తాము చెప్పటం లేదని, విద్యార్ధులు పరిశోధన చేసి వాటిని రుజువు చేసేందుకు లేదా కాదని నిరూపించేందుకు సమర్ధులుగా వుండేందుకు వుద్ధేశించినవని పేర్కొన్నది. ఏఐసిటియు చైర్మన్‌ అనిల్‌ సహస్రబుద్ధి కూడా అదే పద్దతిలో స్పందించారు. వాస్తవాన్ని కనుగొనేందుకు ప్రపంచమంతటా జనాలు ప్రయత్నిస్తున్నారు. ఎలాంటి పరిశోధనలు చేయకుండా పిడివాదంతో ఎవరైనా దేన్నయినా ఎలా తిరస్కరిస్తారు, కనీసం ప్రయత్నం కూడా చేయకుండా తిరస్కరించటం శాస్త్రీయ పద్దతా అని ఎదురుదాడికి దిగారు. పుస్తకంలోని అంశాలన్నీ శాస్త్రీయంగా రుజువైనవి కానప్పటికీ మన పురాతన గ్రంధాలలో వున్న జ్ఞానాన్ని వెలికితీసే ఎంపిక , పరిశోధనలు చేసే అవకాశాన్ని విద్యార్ధులకు ఇవ్వాలని, పుస్తకాంశాలను ఏఐసిటియు కమిటీ సమీక్షించిందని భారతీయ విద్యాభవన్‌ ఇండాలజీ ప్రొఫెసర్‌ శశిబాల చెప్పారు.

కేంద్రంలో, మెజారిటీ రాష్ట్రాలలో తిరోగామిశక్తులు పాలకులుగా వుండటంతో రాజుగారి మనసెరిగి మసలు కోవటం వుత్తమం అనే వెన్నెముకలేని ఒక తరగతి మేథావులు వారికి వంతపాడేందుకు సిద్దమయ్యారన్నది ఈ వుదంతం వెల్లడిస్తోంది. ఈ ధోరణి సైన్సు మీద దాడి తప్ప మరొకటి కాదు. అందుకు కొందరు మేథావులు పావులుగా మారటమే విచారకరం, గర్హనీయం. ప్రతి ఆధునిక అవిష్కరణ పురాతన హిందూ గ్రంధాలలో, వేదాలలో వున్నదే అనే ఒక వున్మాదపూరితమైన ధోరణిని పెంచి పోషించారు.దానికి అధికారిక ముద్రవేసే ప్రయత్నం ఇప్పుడు జరుగుతోంది.ఐఐటిలు, నిట్‌లలో మినహా మూడువేల ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్దులకు భారతీయ విద్యాభవన్‌ పుస్తకాలను అందచేస్తారు. బ్రిటీష్‌ వారు మనల్ని వందల సంవత్సరాలు పరిపాలించిన సమయంలో వారు కోరుకున్న విధంగా బ్రిటీష్‌ వారు నూతన ఆవిష్కరణలు ఎలా చేశారో మనకు బోధించారు, ఇప్పుడు మనం దాన్ని మార్చాల్సిన సమయం వచ్చిందని పుస్తకరచనలో భాగస్వామిగా వున్న ఒక ప్రొఫెసర్‌ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. మన పురాతన జ్ఞాన వెలుగులో మన దేశాన్ని మరొకసారి అగ్రదేశంగా ముందుకు తీసుకుపోవాలని, గత రెండువేల సంవత్సరాలుగా ఆపని జరగలేదని వేదాల్లోనే అన్నీ వుషాయష అనే తరగతి చెబుతోంది.దానికి వంతపాడే పాలకులు దొరకటంతో హిందూత్వను జోడించి రెచ్చిపోతున్నారు. ఒక మాజీపైలట్‌, ఒక టీచరు కలసి మూడు సంవత్సరాలక్రితం ముంబై సైన్సు కాంగ్రెస్‌లో మన పూర్వీకులు విమానాలు కలిగి వున్నారని, వాటిని గాడిద మూత్రంతో నడిపినట్లు పురాతన పుస్తకాల్లో వుందని ఒక పత్రాన్ని సమర్పించారు. కేంద్రమంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ దానికి వంతపాడారు.

ఇప్పటికే పిచ్చి ముదిరి ఆవు మూత్రంపై పరిశోధనలు చేయిస్తున్నవారు రాబోయే రోజుల్లో భారతీయ విద్యాభవన్‌, ఏఐసిటియు చెబుతున్నదాని ప్రకారం గాడిదలను కూడా సమీకరించి వాటి మూత్రంతో మన ఇంజనీరింగ్‌ విద్యార్ధులు ప్రయోగాలు చేసి వాటి ద్వారా విద్యుత్‌ తయారు చేయవచ్చో లేదా నిరూపించాలన్నమాట. సర్వం తెలిసిన సంస్కృత పండితులుండగా వేరే వారు పరిశోధనలు చేయటం ఏమిటి? పిచ్చి ముదిరితే రోకలి తలకు చుట్టమనటం అంటే ఇదే. మన సంస్కృత గ్రంధాలలోని విజ్ఞానాన్నంతటినీ జర్మన్లు గ్రహించారని చెప్పే బాపతు మనకు కనిపిస్తుంది. అదే నిజమైతే వారు తమకు అవసరమైన చమురు కోసం రష్యా మరొక దే శంతో ఒప్పందాలు ఎందుకు చేసుకుంటున్నట్లు ? కావలసినన్ని గాడిదలున్న మన దేశం నుంచి వాటిని దిగుమతి చేసుకొని లేదా నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియాలో భాగంగా గాడిద మూత్రాన్ని ఇక్కడి నుంచే సేకరించుకొని వారెందుకు తీసుకుపోవటం లేదో ఎవరైనా చెబుతారా ? భక్తితో ఆవు పేడను కొనుక్కొనే మన మూఢత్వాన్ని అమెరికా అమెజాన్‌ కంపెనీ సొమ్ము చేసుకుంటున్నది. గాడిద మూత్రానికి అంత సీన్‌ వుంటే వాటిని వదిలేదా ? ఆవులకు మంత్రిత్వశాఖలను ఏర్పాటు చేసిన బిజెపి పాలకులు గాడిదలకూ మంత్రులను నియమించి వుండేవారు.

ఆవు మూత్రంతో కాన్సర్‌ నయం అవుతుంది, మన పూర్వీకులు వేల సంవతత్సరాల నాడే గాడిద మూత్రంతో విద్యుత్‌ వుత్పత్తి చేసి వేల సంవత్సరాల నాడే ఖండాంత విమాన సర్వీసులు నిర్వహించారు, వేదాల్లోనే అన్నీ వున్నాయి, జర్మనీ వంటి వారు వాటిలోని విజ్ఞానాన్ని గ్రహించే అభివృద్ధి చెందారు వంటి అశాస్త్రీయ అంశాల ప్రచారాన్ని అడ్డుకోకపోతే కొంత కాలానికి అవే నిజమని నమ్మే తరాలు తయారవుతాయి. గతంలో ఇలాంటి అంశాలను చెప్పిన వారు చాదస్తులు అని సమాజం విస్మరించింది. ఇప్పుడు కేంద్ర మానవ వనరుల మంత్రి సత్యపాల్‌ సింగ్‌ వంటి వారు డార్విన్‌ పరిణామ సిద్ధాంతం తప్పు, దాన్ని పుస్తకాల నుంచి తొలగించాలన్నారు. క్రీస్తు పూర్వం 500-1500 సంవత్సరాల మధ్యలో భరద్వాజ మహర్షి రాశారని చెబుతున్న వైమానిక శాస్త్ర గ్రంధంలో విమానతయారీ, నడపటం గురించి వున్నదని కొందరు చెబుతున్నారు. రాసి వుండవచ్చు అది వూహకూడా కావచ్చు. 1903లోనే అమెరికాకు చెందిన రైట్‌ సోదరులు తొలి విమానాన్ని తయారు చేశారని వార్తలు వచ్చినపుడు అయినా సంస్కృత పండితులు మేల్కని విమానాన్ని ఎందుకు తయారు చేయలేకపోయారు? మన సంస్కృత విజ్ఞానాన్ని ఔపోసన పట్టారని చెబుతున్న జర్మన్లు ఎందుకు విమానాలను తయారు చేయలేకపోయారు? మనకు ఎక్కడా సమాధానాలు రావు. ఈ పిచ్చి ప్రచారం సంగతేమో చూద్దామని 1973,74లో ఐదుగురు బెంగళూరు శాస్త్రవేత్తలు పరిశీలించి వూహలు తప్ప అలా తయారు చేసే విమానాలు ఎగిరేవి కాదని తేల్చారు. వాటిలో ఒకటైన సుందర విమానాన్ని పూర్వీకులు గాడిద మూత్రంతో నడిపారని రాశారు. అయినా అవే అంశాలను 2015లో చాదస్తులు సైన్సు కాంగ్రెస్‌లో ఒక పత్రంగా ప్రవేశపెట్టారు. మన దేశానికి గణితంలో ఘనతమైన సంప్రదాయాలున్నాయి తప్ప అలాంటి విమానాలున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని ప్రొఫెసర్‌ రొడ్డం నరసింహ వంటి వారు చెప్పారు. ఎలాంటి ఆనవాళ్లను వదల కుండా సాంకేతిక పరిజ్ఞానం అంతర్ధానం కాదంటూ ఢిల్లీలో ఇనుప స్ధంభం నుంచి టిప్పు సుల్తాన్‌ రాకెట్ల వరకు లోహశాస్త్రంలో ఆధారాలున్నాయని విమానాలు వూహతప్ప మరొకటి కాదన్నారు.

భూమి చుట్టూ సూర్యుడు, ఇతర గ్రహాలు తిరుగుతున్నాయనే సిద్ధాంతాన్ని తోసి పుచ్చుతూ సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నదనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు నికొలస్‌ కోపర్నికస్‌. తన సిద్ధాంతాన్ని ప్రచురించిన వెంటనే వార్ధక్యం కారణంగా ఆయన మరణించాడు. తరువాత బైబిల్‌, కాథలిక్‌ విశ్వాసాలకు విరుద్ధంగా వున్నదంటూ చర్చి అధికారులు ఆ సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు.తొంభై సంవత్సరాల తరువాత ఆ సిద్ధాంతాన్ని బలపరిచిన మరో శాస్త్రవేత్త గెలీలియోను 1632 నుంచి 1642లో మరణించేవరకు గృహనిర్భంధం పాలు చేశారు. ఆనాడు బైబిల్‌ చెప్పిందానికి విరుద్ధంగా వున్నందుకు కొత్త సిద్ధాంతాన్ని బలపరిచినందుకు శాస్త్రవేత్తలు చర్చి, దాని ప్రభావంలో వున్న పాలకుల దాడులకు శాస్త్రవేత్తలు గురయ్యారు. నేడు మన దేశంలో కొత్త సిద్ధాంతాల ప్రతిపాదనకు ప్రోత్సాహం లేకపోగా ఆశాస్త్రీయ అంశాలను ముందుకు తెస్తున్నారు. ఎవరైనా వాటిని ప్రశ్నిస్తే హిందూత్వ శక్తులు, పాలకుల, ప్రభుత్వ అండ చూసుకొని ప్రశ్నించేవారిని అడ్డుకొనే ఒక వున్మాదం కనిపిస్తున్నది. సెప్టెంబరు తొమ్మిదవ తేదీన ముంబైలోని పరేల్‌ దామోదర్‌ హాలులో విమాన శాస్త్రం పేరుతో ఒక సభను ఏర్పాటు చేశారు. భారత పున జాగృతం పేరుతో వ్యవహరిస్తున్న సంస్ధ దీనిని నిర్వహించింది. డిఐఎటి మాజీ వైస్‌ ఛాన్సలర్‌ , డిఆర్‌డిఓ మాజీ ప్రధాన కంట్రోలర్‌ డాక్టర్‌ ప్రహ్లాద రామారావు, ఏరోనాటికల్‌ ఇంజనీర్‌ వడ్డాది కావ్య వంటి వారు ఆ సంస్ధలో వున్నారు. గాడిద మూత్రంతో పూర్వీకులు విమానాలను నడిపిన అంశం గురించి చర్చ. అనికేత్‌ సూలే, మరికొందరు శాస్త్రవేత్తలు అశాస్త్రీయ అంశంపై ప్రశ్నలు సంధించటాన్ని సభ నిర్వాహకులు అభ్యంతర పెట్టారు. నిర్వాహకులు చెప్పేది తప్ప మీరు అడిగేవాటిని వినేందుకు మేము రాలేదంటూ సభకు హాజరైన వారు ప్రశ్నించిన వారి మీద దాడికి వచ్చారు. ఇది గుడ్డి నమ్మకం తప్ప జ్ఞానవంతమైన లక్షణం కాదు. ఆవు మూత్రం తాగితే కొందరు చెప్పినట్లు ప్రయోజనం లేకపోతే పోవచ్చు నష్టం లేదుగా తాగితే మీకు ఇబ్బందేమిటి, దేవుడు వున్నాడని మేం చెబుతున్నాం లేడని మీరు చెబుతున్నారు లేడని రుజువు చేయండి అనే వితండవాదాలను ముందుకు తెస్తున్నారు. శాస్త్రీయ సిద్ధాంతాన్ని బలపరిచినందుకు గెలీలియోను నాడు జైలుపాలు చేస్తే శాస్త్రీయ భావాలను ప్రచారం చేస్తున్నందుకు నేడు నరేంద్ర దబోల్కర్‌, గోవింద పన్సారే, కులుబుర్గి వంటి వారిని మతోన్మాదులు హత్య చేస్తున్నారు. ‘అపకారానికి పాల్పడేవారు ప్రపంచాన్ని నాశనం చేయలేరు, దాన్ని చూస్తూ ఏమీ చేయకుండా వుండేవారి వల్లనే అది జరుగుతుంది’ అని అల్బర్ట్‌ ఐనిస్టీన్‌ చెప్పారు. కర్తవ్యం ఏమిటో నిర్ణయించుకోవాల్సిన తరుణం ఆసన్నమైందనిపించటం లేదా ?

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

శబరిమల కేసు: తప్పుడు ప్రచారాలు, వక్రీకరణలు, వాస్తవాలు !

01 Monday Oct 2018

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Ayyappa temple, sabarimala case, sabarimala case:lies, Sabarimala Entry Case

Image result for sabarimala case:lies,distortions,facts

ఎం కోటేశ్వరరావు

శబరిమలై అయ్యప్ప ఆలయంలోకి కొన్ని వయస్సుల మహిళల ప్రవేశంపై వున్న నిషేధాన్ని కొట్టి వేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మీద సామాజిక మాధ్యమాల్లో దాన్ని వ్యతిరేకించేవారు విరుచుకుపడుతున్నారు. ప్రవేశాన్ని కోర్టులో ఆ రాష్ట్ర వామపక్ష, ప్రజాతంత్ర ప్రభుత్వం సమర్ధించినందుకే అసాధారణరీతిలో అక్కడ వరదలు వచ్చాయని, అయప్ప ఆగ్రహించారని ప్రచారం చేసిన ప్రబుద్ధుల గురించి తెలిసిందే. విచారణ సమయంలోనే పిటీషనర్లు, కాని వారి మీద బెదిరింపులు, సామాజిక మాధ్యమంలో తప్పుడు ప్రచారం కొనసాగించిన వారు తీర్పు తరువాత మరో రూపంలో ఆదాడి కొనసాగిస్తున్నారు. వాటి మంచి చెడ్డలను చూద్దాం.

కమ్యూనిస్టులే ఈ తీర్పు రావటానికి కారణం !

దీనికి ఒక్క నిదర్శనం కూడా లేదు. అయినా కమ్యూనిస్టు వ్యతిరేకుల వుద్దేశ్యం, లక్ష్యం, ప్రచారం ఏమైనప్పటికీ ఇలాంటి తీర్పు వచ్చినందుకు కమ్యూనిస్టులు గర్వపడతారు, సంతోషిస్తారు,స్వాగతిస్తారు. నిజానికి ఈ కేసుతో కమ్యూనిస్టులకు ఎలాంటి సంబంధం లేదు.అయ్యప్ప భక్తుడైన తమిళ సినిమా దర్శకుడు కె.శంకర్‌ నిర్మించిన సినిమా చిత్రీకరణ తాజా వివాదానికి నాంది. ‘ నంబినార్‌ కెడువత్తిల్లై ‘సినిమా షూటింగ్‌ 1986 మార్చి 8-13 తేదీలలో అయ్యప్ప దేవాలయం వద్ద జరిగింది. పవిత్రంగా భావించే గుడి పద్దెనిమిది మెట్ల ముందు వయస్సులో వున్న ఐదుగురు యువతులు జయశ్రీ, సుధాచంద్రన్‌,అను, వాదివక్కురసి, మనోరమ నృత్యం చేసి అపవిత్రం చేసినందున వారి మీద, దర్శకుడు శంకర్‌,దేవస్ధానం బోర్డు అధ్యక్షుడు ఎన్‌. భాస్కరన్‌ నాయర్‌, సభ్యులు సరస్వతి కుంజి కృష్ణన్‌, హరిహర అయ్యర్‌లను నిందితులుగా చేస్తూ చర్య తీసుకోవాలంటూ వి.రాజేంద్రన్‌ అనే పౌరుడు రన్నీ కోర్టులో కేసు దాఖలు చేశాడు. ఐదుగురు డాన్సర్లలో మనోరమకు 50 ఏండ్లు పైబడిన కారణంగా ఆమెను మినహాయించి మిగిలిన వారికి వెయ్యి రూపాయల చొప్పున , చిత్రీకరణకు అనుమతి ఇచ్చినందుకు బోర్డు సభ్యులకు ఏడున్నరవేల రూపాయల జరిమానా విధించారు. తరువాత దేవస్ధానం అధికారి కూతురు నిబంధనలను అతిక్రమించి దేవాలయానికి వచ్చిందంటూ మరొక పౌరుడు హైకోర్టుకు ఫిర్యాదు చేయటంతో నిబంధనలను పక్కాగా పాటించాలని 1991లో కోర్టు ఆదేశించింది.కొంత కాలం క్రితం దేవాలయంలోకి మహిళ ప్రవేశించిన ఆనవాళ్లు వున్నాయని 2006లో ఒక జ్యోతిష్కుడు ప్రకటించాడు. ఆ వెంటనే కన్నడ నటి జయమాల తాను 28 సంవత్సరాల వయస్సులో 1987లో ఒక సినిమా చిత్రీకరణలో భాగంగా దేవాలయంలో ప్రవేశించి దేవుడిని తాకానని, ఇదంతా పూజారి అనుమతితోనే చేసినట్లు బహిరంగంగా ప్రకటించింది. అదే ఏడాది ఈ ఆరోపణ గురించి విచారణ జరిపించాలని కేరళ సర్కార్‌ పోలీసులను ఆదేశించింది, తరువాత కేసును వుపసంహరించుకుంది. తరువాత ఇండియా యంగ్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ మహిళా లాయర్లు మహిళలకు ప్రవేశ నిషేధాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో ఒక ప్రజాప్రయోజన పిటీషన్‌ దాఖలు చేశారు. దానికి మద్దతు తెలుపుతూ 2007 విఎస్‌ అచ్యుతానందన్‌ నాయకత్వంలోని నాటి వామపక్ష, ప్రజాతంత్ర సంఘటన సర్కార్‌ కోర్టుకు అఫిడవిట్‌ సమర్పించింది. రాజ్యాంగహక్కులకు విరుద్దంగా వున్న ఆటంకాలు రద్దు చేయబడతాయని 2008లో ఆ పిటీషన్ల విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. తరువాత 2011లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌ సర్కార్‌ అంతకు ముందు ఎల్‌డిఎఫ్‌ సర్కార్‌ తీసుకున్న దానికి విరుద్దమైన వైఖరిని తీసుకొని మహిళలపై ఆంక్షలకు మద్దతు తెలిపింది.తరువాత ఈకేసులు ఇతరులు ప్రతివాదులుగా చేరారు.తాము కేసును వుపసంహరించుకుంటామని పిటీషనర్లు కొందరు కోర్టుకు విన్నవించారు. అయితే ప్రజాప్రయోజవ్యాజ్యాన్ని ఒకసారి విచారణకు తీసుకున్న తరువాత దాన్ని వుపసంహరించుకొనే అవకాశం లేదని కోర్టు తిరస్కరించింది. ఐదు సంవత్సరాల తరువాత తిరిగి అధికారానికి వచ్చిన ఎల్‌డిఎఫ్‌ ఆంక్షలకు తాము వ్యతిరేకం అంటూ కోర్టుకు మరొక అఫిడవిట్‌ను సమర్పించింది.కేసు విచారణ పూర్తి చేసిన సుప్రీం కోర్టు మహిళలపై నిషేధాన్ని కొట్టివేసింది.

మసీదుల్లో మహిళల ప్రవేశాన్ని కమ్యూనిస్టులు అమలు చేస్తారా, డిమాండ్‌ చేస్తారా ?

పిటీషన్‌ దాఖలు చేసిన మహిళ అయ్యప్ప భక్తురాలా- కాదు,

పిటీషన్‌ దాఖలు చేసింది అయ్యప్ప భక్తులైన హిందువా- కాదు,

ఇండియాలో కేవలం హిందువుల పట్లనే ఇలా జరుగుతోందా- అవును

ఇవన్నీ జనాన్ని మత ప్రాతిపదికన రెచ్చగొట్టేందుకు మీడియాలో, సామాజిక మీడియాలో మహిళా వ్యతిరేకులు ముందుకు తెచ్చిన వాదనలు. ఈ ప్రశ్న వేసే వారు మహిళలు అయ్యప్ప దేవాలయ ప్రవేశాన్ని వ్యతిరేకించే శక్తులు తప్ప అనుకూలమైన వారు కాదు. కనుక నైతికంగా వారికి ఆ ప్రశ్న అడిగే హక్కులేదు.పిటీషన్‌ దాఖలు చేసిన వారి చూస్తే వారిలో హిందువులే ఎక్కువ మంది వున్నారు. అసలు అది ఒక సమస్య కానే కాదు. లౌకిక దేశంలో ఎవరు ఏ వివక్షను అయినా ప్రశ్నించవచ్చు. దాన్ని నిర్ణయించాల్సింది కోర్టులు తప్ప మతాలు కాదు. అన్ని రకాల వివక్షలకు కమ్యూనిస్టులు కాని అభ్యుదయవాదులు కూడా వ్యతిరేకమే. మహారాష్ట్రలోని శని శింగనాపూర్‌లో దేవాలయంలో మహిళలపై వివక్షకు వ్యతిరేకంగా వుద్యమం నడిపిన తృప్తి దేశాయ్‌ కమ్యూనిస్టు కాదు. దేవాలయాల్లో షెడ్యూలు కులాలు, తెగలవారికి ప్రవేశ నిషేధానికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర వుద్యమ కాలంలో వుద్యమించిన వారందరూ కమ్యూనిస్టులు కాదు. హిందూమతానికి మాయని మచ్చగా తయారైన సతీసహగమనాన్ని వ్యతిరేకించిన రాజా రామ్మోహన్‌ రాయ్‌, వితంతు వివాహాలను ప్రోత్సహించిన నవయుగ వైతాళికుడు వీరేశలింగం పంతులు కమ్యూనిస్టులు కాదు. ఇలా పెద్ద జాబితానే చెప్పుకోవచ్చు.

ఒక్క మసీదే కాదు, ఏ మతం లేదా వాటి ప్రార్ధనా మందిరాల్లో జరిగే కార్యక్రమాలకు జనాన్ని వెళ్లమని కమ్యూనిస్టులు తమ సభ్యులు, అనుయాయులు లేదా సాధారణ ప్రజానీకానికి కూడా చెప్పరు. అంతే కాదు వారుగా పూనుకొని అన్ని రకాల మతాల జనాన్ని సమీకరించి ఆయా మత ప్రార్ధనా కేంద్రాలలో పూజలు చేయించే కార్యక్రమాన్ని పెట్టుకోరు. అటువంటి కార్యక్రమం వారి అజెండాలో లేదు.మసీదుల్లోకి తమను అనుమతించాలని ఎవరైనా మహిళలు ముందుకు వచ్చి డిమాండ్‌ చేస్తే దాన్ని కమ్యూనిస్టులు బలపరుస్తారు. లేదా కోర్టులలో కేసులు దాఖలైతే కోర్టులు కోరితే కమ్యూనిస్టులు తమ అభిప్రాయాన్ని తెలియచేస్తారు.ఇటీవలి కాలంలో ఎక్కడైనా షెడ్యూలు కులాలు, తెగలవారిని వివక్షతో దురహంకారులు దేవాలయాల్లో ప్రవేశించేందుకు నిరాకరిస్తే, తమకు మద్దతు కావాలని బాధితులు అడిగితే అనేక చోట్ల కమ్యూనిస్టులే ఆందోళనకు ముందుండి నడిపించుతున్నారు.లేదా కులవివక్ష వ్యతిరేక సంఘాల వారు కార్యక్రమాలు తీసుకుంటే వాటిని బలపరుస్తున్నారు. ఎక్కడైనా ఒక అన్యాయం జరుగుతుంటే, వివక్ష చూపుతుంటే దాన్ని ప్రశ్నించటానికి అర్హతలు అవసరం లేదు.

హిందూ మతానికి ముప్పు తెస్తున్నారు, ఇతర మతాల వారిని వదలివేస్తున్నారు !

ఇది రెచ్చగొట్టే, తప్పుదారి పట్టించే వాదన. ఏదైనా ఒక మతానికి కీలకమైన అంశం ఏమిటి? దానికి కాస్త అటూ ఇటూగా ఏదైనా అయితే ఆ మత మౌలిక స్వభావమే మారిపోతుందా? అయ్యప్ప బ్రహ్మచారి, హనుమంతుడు కూడా బ్రహ్మచారే, ఆయనకు కూడా దేవాలయాలు వున్నాయి. అయ్యప్ప గుడుల్లో వయస్సులో వున్న మహిళకు వున్న నిషేధం, హనుమంతుడి గుడుల్లో లేదే ! 1972 శేషమ్మాల్‌-తమిళనాడు కేసులో కోర్టు ఒక స్పష్టత నిచ్చింది. ఒక మతానికి కీలకమైన అంశం అని దేనినైతే భావిస్తున్నారో దానిని తొలగిస్తే లేదా ఆచరణను నిలిపివేస్తే సదరు మత మౌలిక స్వభావమే మారిపోతే, విశ్వాసమే దెబ్బతింటే దానిని కీలకమైన అంశంగా భావించి దానికి మార్పులు చేర్పులు చేయరాదు, దానిని రాజ్యాంగం రక్షిస్తుంది అన్నది దాని సారాంశం. కొన్ని అంశాలు అటు వంటి మౌలిక స్వభావం కలిగినవి కాదంటూ కోర్టు గతంలో అభిప్రాయపడింది, సమర్ధించింది. ఎవరైనా వాటితో ఏకీభవించకపోతే తమ వాదనలను వినిపించుకోవచ్చు తప్ప నేను అంగీకరించను అంటే కుదరదు. బక్రీదు సందర్భంగా జంతుబలి ఇస్లాం మతంలో కీలకమైన అంశం అన్న వాదనను సుప్రీం కోర్టు 1995లో తిరస్కరించింది.అందుకు ఇస్లాం మత గ్రంధాలను వుదహరించింది. బాబరు చక్రవర్తి గోవధ నిషేధాన్ని అమలు చేస్తే తనయుడు హుమాయున్‌ కూడా తరువాత దాన్ని కొనసాగించాడని కోర్టు పేర్కొన్నది. తమ విశ్వాసాలు, ప్రబోధల ప్రకారం మారణాయుధాలు, కపాలాలు, బతికి వున్న పాములతో బహిరంగంగా నృత్యాలు చేయటం తమ హక్కని ఆనంద మార్గీయులు చేసిన వాదనను సుప్రీం కోర్టు 1983లో అంగీకరించలేదు.తాజాగా మూడుసార్లు తలాక్‌ చెప్పటం ఇస్లాం మతంలో కీలకమైన అంశమేమీ కాదంటూ దాని ఆచరణను సుప్రీం కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.ముంబైలోని హాజీ అలీ దర్గా కేసులో మహిళలకు దర్గాలో ప్రవేశం కల్పించాలని ముంబై హైకోర్టు తీర్పు ఇచ్చింది.

1993లో కేరళ హైకోర్టు బెంచ్‌ తన తీర్పులో నిషేధాన్ని సమర్ధించింది. అయితే అయ్యప్పస్వామి దేవస్ధానం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో 10-50 సంవత్సరాల మధ్య వయస్సున్న మహిళలు అన్న ప్రాసనల సందర్భంగా అంతకు ముందు పలుసార్లు దేవాలయ ప్రవేశం చేసినట్లు స్వయంగా అంగీకరించింది.ఆ విషయాన్ని హైకోర్టు తన తీర్పులో కూడా నమోదు చేసింది.అటువంటి కార్యక్రమాలకు వసూలు చేసే రుసుములకు దేవస్ధానం రసీదులు కూడా ఇచ్చింది. ప్రతి మళయాల నెలలో మొదటి ఐదు రోజులు అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం లేదని,41రోజుల దీక్షలను పాటించటం సాధ్యం కాదని కూడా దేవస్ధానం బోర్డు తన అఫిడవిట్‌లో పేర్కొన్నది. మండలం, విషు,మకరావిలక్కు సందర్భాలలో మాత్రమే మహిళలకు నిషేధం వున్నట్లు హైకోర్టు గమనించింది.గతంలో తిరువాన్కూరు రాజు తన రాణి, దివానుతో కలసి దేవాలయాన్ని సందర్శించినట్లు, దేవస్ధానం మాజీ కమిషనర్‌ తన మనవరాలి అన్నప్రాసన సందర్భంగా దేవాలయ ప్ర వేశం చేసినట్లు అంగీకరించారు. అంతే కాదు అయ్యప్ప సేవాసంఘం కూడా 1993కేసులో ఇచ్చిన సాక్ష్యంలో అంతకు ముందు పది పదిహేను సంవత్సరాలలో కొందరు మహిళలు దేవాలయ ప్రవేశం చేసినట్లు అంగీకరిచింది. తాజాగా సుప్రీం కోర్టు ఈ అంశాలనే పరిగణనలోకి తీసుకుంది. ప్రతి మళయాల నెల తొలి ఐదు రోజులు మహిళలను అనుమతించినపుడు అయ్యప్ప బ్రహ్మచారితనం ఏమైనట్లు, విగ్రహం అంతర్ధానమైందా అని జస్టిస్‌ నారిమన్‌ ప్రశ్నించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా తీర్పులో ఇలా వ్యాఖ్యానించారు. ‘ప్రార్ధనల కోసం శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించటం ద్వారా ఏ విధంగానూ హిందూ మతస్వభావంలో మౌలిక మార్పు జరిగినట్లు మార్చినట్లు వూహించలేము.అది శబరిమల ముఖ్య విశ్వాసం కాదు’ అని పేర్కొన్నారు.

హిందూ-ముస్లిం దొందూ దొందే !

మహిళల విషయాల్లో హిందూ, ముస్లిం మతాలు దొందూ దొందే. బహిష్టు అ య్యే వయస్సులోని మహిళలు అయ్యప్ప దేవాలయంలోకి ప్రవేశించకూడదని హిందూమతం వారు చెబుతుంటే, హాజీ ఆలీ దర్గా కేసులో కూడా ముస్లిం మత పెద్దలు అదే వాదన చేశారు. ఒక చోట అయ్యప్ప బ్రహ్మచారి అని కారణం చెబితే మరో చోట పురుష దేవదూత సమాధి దగ్గరకు మహిళలు రాకూడదని దర్గాలో అభ్యంతరం చెప్పారు.

అయ్యప్ప జన్మగురించి న్యాయమూర్తి చెప్పిందేమిటి?

తీర్పును ఇచ్చిన వారిలో ఒకరైన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ పేర్కొన్న అంశాలు గమనించాల్సినవి. దేశంలో అనేక అయ్యప్ప దేవాలయాలు వున్నప్పటికీ శబరిమల దేవాలయంలోని అయ్యప్పను నైష్టిక బ్రహ్మచారిగా పేర్కొంటున్నారు.లైంగిక కార్యకలాపాలకు దూరంగా వున్న కారణంగా ఆయనకు శక్తులు వచ్చినట్లు, ఆయన శివుడికి మోహినీ రూపంలో వున్న విష్ణువుకు జన్మించినట్లు చెబుతారు. మరొక కధ ప్రకారం పండలం రాజు రాజశేఖర వేటకు వెళ్లినపుడు పంబానది తీరంలో కనిపించిన బాలుడిని తీసుకు వస్తాడు. తరువాత రాజుకు మగపిల్లవాడు పుడతాడు. అధికారాన్ని గుంజుకోవాలని చూసిన మంత్రి రాణిని రోగం వచ్చినట్లు నటించమని చెప్పి అందుకు పులిపాలు కావాలంటాడు. వాటికోసం అయ్యప్పను అడవులకు పంపుతారు. అయ్యప్ప ఏకంగా పులులనే వెంటపెట్టుకు వచ్చి తన మహిమలు చూపి తరువాత అంతర్ధానమౌతాడు. ఆయన స్మారకంగా తరువాత గుడిని నిర్మించారని న్యాయమూర్తి వుటంకించారు.

తీర్పు గురించి ఎవరు ఎలా స్పందించారు?

తక్షణమే తీర్పును అమలు చేయాలని ముఖ్య మంత్రి పినరయ్‌ విజయన్‌ దేవస్ధానం అధికారులను ఆదేశించారు.నలభైశాతం భక్తులు పెరిగే అవకాశం వున్నందున అదనపు వసతుల కల్పనకు వంద ఎకరాలు కావాలని అడగ్గా నీలక్కల్‌ వద్ద కేటాయించేట్లు చూస్తామని సిఎం చెప్పినట్లు అధికారులు ప్రకటించారు. అయితే తీర్పును సమీక్షించాలని కోరేందుకు దేవస్ధానం బోర్డు ఆలోచిస్తున్నది. తీర్పును కొట్టి వేస్తూ ఒక నిర్ణయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరేందుకు పండలం మాజీ రాజ కుటుంబం ఆలోచిస్తున్నది. తీర్పును వ్యతిరేకిస్తూ సోమవారం నాడు కొన్ని సంస్ధలు హర్తాళ్‌కు పిలుపునిచ్చాయి.వాటిలో ఒకటైన శివసేన వరద సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలిగే అవకాశం వున్నందును పిలుపును వెనక్కు తీసుకున్నట్లు ప్ర కటించింది.

దేవస్ధాన ప్రధాన పూజారి, రాజకుటుంబ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నామని, సమీక్షకోసం పిటీషన్‌ వేస్తామని, అయితే తీర్పు అమలుకు తగిన చర్య తీసుకుంటామని దేవస్ధానం బోర్డు అధ్యక్షుడు పద్మకుమార్‌ చెప్పారు. తాము అధికారంలో వుండగా మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్‌ తీర్పును అంగీకరించతప్పదని ప్రకటించింది. సిపిఎం స్వాగతం పలికింది. బిజెపి మాత్రం పూజారులు, రాజకుటుంబం, హిందూ మతమనోభావాలను గమనంలోకి తీసుకొని ఏకాభిప్రాయాన్ని సాధించాలని సన్నాయి నొక్కులు నొక్కింది.

కేసు పిటీషన్‌ దాఖలు చేసింది ముస్లిమా ?

శబరిమల కేసులో పిటీషన్‌దారు ఎవరో తెలుసా? నౌషద్‌ అహమ్మద్‌ ఖాన్‌. వారి తల్లులు జీవితమంతా భయంతో గడిపితే వారి భర్తలు మాత్రం 1.మరో ముగ్గురు భార్యలను తెచ్చుకుంటారు, 2.వారికి ఎస్‌ఎంఎస్‌ ద్వారా విడాకులు ఇవ్వవచ్చు, 3.హలాలా అత్యాచారానికి వారిని బలవంతం చేయవచ్చు, ఇతరుల ఇండ్లలో దారిద్య్రం గురించి అడుక్కొనే వారు ఆందోళన చెందుతునా నంటూ ఒక పోస్టును సామాజిక మాధ్యమంలో మతోన్మాదశక్తులు తిప్పుతున్నాయి.

మొదటి విషయం : నౌషద్‌ అహమ్మద్‌ ఖాన్‌ అసలు పిటిషన్‌ దారు కాదని, అతనికి బెదిరింపులు వస్తున్న దృష్టా రక్షణ కల్పించాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా 2016 జనవరి 18న ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. ముస్లిం విశ్వాసి అయిన ఖాన్‌ హిందూ వ్యవహారాలలో జోక్యం కల్పించుకుంటున్నాడని ఆరోపిస్తూ ఒక వీడియో సామాజిక మాధ్యమంలో తిప్పుతున్న విషయం గురించి మాట్లాడుతూ సామాజిక మాధ్యమాన్ని తాము అదుపుచేయలేమని, అలాంటి వుద్ధేశ్యం కూడా లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు.

ఇండియన్‌ యంగ్‌ లాయర్స్‌ అసోసియేషన్‌కు ఖాన్‌ అధ్యక్షుడిగా వున్నారు. ఆ సంస్ధ కూడా పిటీషన్‌దార్లలో ఒకటి, దాని తరఫున దాని ప్రధాన కార్య దర్శి భక్తి పాసిరిజా అనే మహిళా న్యాయవాది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిగతావారిలో ప్రేరణ కుమారి, సుధాపాల్‌, లక్ష్మీశాస్త్రితో ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ ఇంటర్వూ చేసింది. తమకు హిందూ ఆచారాలు పూర్తిగా తెలియకుండానే పిటీషన్‌పై సంతకాలు చేసినట్లు చెప్పారని అది వార్త ప్రచురించింది. తనకు బెదిరింపులు వస్తున్న దృష్ట్యా కేసును వుపసంహరించుకొనేందుకు అనుమతివ్వాలని నౌషద్‌ ఖాన్‌ సుప్రీం కోర్టును కోరాడు. అయితే అప్పటికే ఇతరులు ఆ కేసులో తోడయ్యారు. ఒకసారి ప్రజావ్యాజ్య పిటీషన్‌ను కోర్టు ఆమోదించిన తరువాత దానిని వుపసంహరించుకొనే హక్కు పిటీషనర్లకు లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అందువలన విధిలేక వారు కేసును కొనసాగించాల్సి వచ్చింది.

సుప్రీం కోర్టు తీర్పును వ్యతిరేకంచే శక్తులు బంద్‌కు పిలుపు ఇవ్వటం అంటే కోర్టులను, న్యాయవ్యవస్ధనే ప్రభావితం చేసే చర్యతప్ప వేరు కాదు. ఒక వివాదం కోర్టుకు వెళ్లిన తరువాత వచ్చే తీర్పు తమకు నచ్చినా, నచ్చకపోయినా అంగీకరించటం తప్ప మరొకదారి లేదు. షాబానో మనోవర్తి కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తమ మతంలో జోక్యం చేసుకోవటంగా ఆరోపిస్తూ కొన్ని ముస్లిం సంస్ధలు ఆందోళనలు నిర్వహించాయి. తమ ఓటు బ్యాంకు ఎక్కడ గండి పడుతుందో అని భయపడిన కాంగ్రెస్‌ పార్టీ ఆ తీర్పును వమ్ము చేస్తూ పార్లమెంటులో ఏకంగా ఒక చట్టాన్నే తీసుకు వచ్చింది. ఆ చట్టాన్ని వ్యతిరేకించిన వారిలో వామపక్షాలతో పాటు బిజెపి కూడా వుంది. ముస్లింలను సంతుష్టీకరించే చర్యగా బిజెపి అభివర్ణించింది. ఇప్పుడు శబరిమల ఆలయ తీర్పును కూడా వమ్ము చేస్తూ పార్లమెంట్‌ ఒక చట్టం తీసుకురావాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. మెజారిటీ ఓటు బ్యాంకుపై కన్నేసిన బిజెపి పార్లమెంటులో తనకున్న మెజారిటీని ఆసరా చేసుకొని గతంలో కాంగ్రెస్‌ మాదిరే కొత్త చట్టాన్ని తీసుకు వస్తుందా, దాని చెప్పుల్లోనే కాళ్లు దూరుస్తుందా? ఓట్లకోసం మఠాలు, స్వామీజీల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్న కాంగ్రెస్‌ కూడా అందుకు సై అంటుందా?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కమ్యూనిస్టు చైనా-కాథలిక్‌ మతం మధ్య చారిత్రాత్మక ఒప్పందం !

27 Thursday Sep 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

agreement between china and vatican, china and vatican, Chinese Catholics, historic agreement between china and vatican, Pope Francis

Image result for historic agreement between china and vatican

ఎం కోటేశ్వరరావు

ఒకవైపు వాటికన్‌తో చర్చలు మరోవైపు బుల్‌డోజర్లతో చైనా క్రైస్తవాన్ని అదుపు చేయాలని చూస్తున్నదనే శీర్షికతో న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక రెచ్చగొట్టే ఒక విశ్లేషణ ప్రచురించింది. చైనాలో బిషప్పుల నియామకం గురించి అక్కడి ప్రభుత్వం-వాటికన్‌ చర్చి మధ్య సెప్టెంబరు 22న కుదిరిన తాత్కాలిక ఒప్పందం గురించి ప్రపంచ మీడియాలో, క్రైస్తవ మతంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దానిలో భాగమే ఇది. దేవుడు లేడని నమ్మే కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వంతో వున్నట్లు విశ్వసించే వాటికన్‌ ఒప్పందం చేసుకోవటం ఏమిటని అటు కమ్యూనిస్టులుగా వున్నవారు, ఇటు మతాన్ని పాటించే వారు దిగమింగలేకుండా వున్నారు. ఇదే సమయంలో ఆమోదించిన వారే ఎక్కువ అనేందుకు అసలు ఆ ఒప్పందం కుదరటమే నిదర్శనం. దాని ప్రకారం చైనాలో వాటికన్‌తో నిమిత్తం లేకుండా పని చేస్తున్న బిషప్పులను పోప్‌ ఆమోదిస్తారు. చైనా ప్రభుత్వ ఆమోదం లేని అనధికార బిషప్పులు కొందరు రాజీనామా చేస్తారు. ఇరు పక్షాలు కలసి రాబోయే రోజుల్లో కొత్త బిషప్పులను నియమిస్తాయి.

కొన్ని చోట్ల క్రైస్తవం కావచ్చు, మరికొన్ని చోట్ల ఇస్లాం, ఇతర మతాలు కావచ్చు. కాలక్రమంలో అంతరించాల్సిన మతాన్ని నిషేధాలు, అణచివేతల ద్వారా తెల్లవారే సరికి పరిష్కరించటం జరిగేది కాదు. సోషలిస్టు, కమ్యూనిస్టు వున్నత మానవాళి అవతరించినపుడే అది సాధ్యం. ఈ నేపధ్యంలో మతంతో సంబంధాలు అనేవి ప్రపంచ సోషలిస్టు, కమ్యూనిస్టు వుద్యమానికి ఎదురైన ఒక వాస్తవిక, పరిష్కారం కావాల్సిన సవాలు. దీనిని కమ్యూనిస్టు వుద్యమం విస్మరించజాలదు. సర్వేజనా సుఖినో భవంతు అన్న ఆశయాన్ని కమ్యూనిజం పుట్టక ముందే ప్రకటించారు. అది అమలు జరగలేదు గనుక ప్రకటించిన వారిని తప్పు పడతామా? సోషలిస్టు భావన కూడా అదే అయినప్పటికీ, అమలుకు ఒక కార్యాచరణను ప్రకటించటమే దాని ప్రత్యేకత. అందువలన దాని అమలులో తలెత్తే సమస్యలను పరిష్కరించటం వాస్తవికత.

ప్రపంచంలో అనేక చోట్ల మతాన్ని ఒక ఆయుధంగా చేసుకొని తమ ప్రయోజనాలను నెరవేర్చుకొనేందుకు దోపిడీ శక్తులు తీవ్రంగా ప్రయత్నించటాన్ని మనం చూస్తున్నాం. దానిలో భాగమే మతవిద్వేషాలను రెచ్చగొట్టటం. చైనా-వాటికన్‌ మధ్య ఒక ఒప్పందం కుదిరింది అంటే అర్ధం అక్కడ మత సమస్య పరిష్కారమైందని కాదు. సోషలిస్టు వ్యవస్ద నిర్మాణబాటలో ఎదురయ్యే అనేక ఆటంకాలను తొలగించుకుంటూ పోవటం తప్ప దగ్గరదారి లేదు.దానిలో భాగమే ఇది అని చెప్పవచ్చు. ఇది సరైనదా కాదా అన్న విషయం మీద ఇప్పటికిప్పుడు తీర్పు చెప్పటం సాధ్యం కాదు. సోషలిస్టు వ్యవస్ధను వ్యతిరేకించేందుకు, దెబ్బతీసేందుకు ఎవరు ప్రయత్నించినా కమ్యూనిస్టులు అలాంటి శక్తులను సహించరు. చైనా కమ్యూనిస్టు పార్టీ అందుకు మినహాయింపు అనుకోజాలం.

చైనాలో క్రైస్తవం మైనారిటీ మతం. ఎంత మంది దాన్ని అవలంభిస్తున్నారన్నది స్పష్టంగా తెలియదు. మీడియాలో వచ్చే అంకెలు పొంతన లేకుండా వున్నాయి. ఒప్పందం గురించి సహజంగానే ఎవరికి వారు ఏమి చెప్పుకున్నప్పటికీ చైనాలోని చర్చ్‌లపై వాటికన్‌ పోప్‌ అధికారాన్ని పరిమితంగానే అయినా కమ్యూనిస్టు ప్రభుత్వం గుర్తించటం, మత వ్యవహారాలలో ప్రభుత్వాల పాత్రను అంగీకరించం అనే వాటికన్‌ తన వైఖరిని సడలించుకోవటం ఒక చారిత్రక ముందడుగు. క్రైస్తవంతో సహా ఏమతమైనా సామాన్యుల బాధలు, గాధల పట్ల కడవల కొద్దీ కన్నీరు కార్చింది తప్ప వాటిని తొలగించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోరాడేవారిని నిర్వీర్యం చేసేందుకు మతాన్ని ఒక మత్తు మందుగా పాలకవర్గాలు ప్రయోగించాయి. ప్రధమ శ్రామికవర్గ రాజ్యం సోవియట్‌లో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణాన్ని, ప్రపంచం మొత్తంగా కమ్యూనిస్టు భావజాలాన్ని క్రైస్తవం వ్యతిరేకించింది. సామ్రాజ్యవాదంతో చేతులు కలిపింది. అందువల్లనే సోవియట్‌ యూనియన్‌ వునికిలో వున్నంత కాలం వాటికన్‌తో అధికారిక సంబంధాలు లేవు. అదొక అపరిష్కృత సమస్యగానే వుండిపోయింది.

క్రైస్తవంలో తలెత్తిన సంస్కరణ, ఇతర వుద్యమాల కారణంగా అనేక మొత్తం మీద ఏసును ప్రభువుగా గుర్తిస్తూనే మత కర్మకాండల విషయంలో భిన్న ధోరణులు, పలు చర్చి సమూహాలు వునికిలోకి వచ్చాయి. వాటికి పాలకవర్గాల మద్దతు లభించింది తప్ప ఎక్కడా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. ఎవరికి ఇష్టమైన చర్చిని వారు అనుసరించారు. దేవుడి వునికిని అంగీకరించని, రాజ్యానికి మతానికి సంబంధం వుండకూడదని కోరుకొనే కమ్యూనిస్టులు పాలకులుగా వచ్చిన తరువాత సరికొత్త సమస్య తలెత్తింది. అప్పటి వరకు తమలో తాము ఎంతగా కుమ్ములాడుకున్నప్పటికీ కమ్యూనిజం తమ వునికినే వ్యతిరేకిస్తున్న కారణంగా ముందుగా దాన్ని వ్యతిరేకించాలంటూ అన్ని రకాల చర్చ్‌లు ఏకమయ్యాయి. వాటి కుట్రలను ఎదుర్కొంటూనే సోషలిస్టు దేశాలన్నీ తమ పౌరులకు మత స్వేచ్చను ఇచ్చాయి. సోషలిస్టు వ్యవస్ధను కూల్చేందుకు ప్రయత్నించే ఇతర శక్తులతో సమంగా మతశక్తులనూ చూశాయి, చూస్తున్నాయి. కమ్యూనిస్టులు బిషప్పుల నియామకంలో వాటికన్‌ ఏకపక్ష పెత్తనం చైనా గడ్డమీద చెల్లదని ప్రభుత్వం రుజువు చేసిందని, రహస్య కార్యకలాపాలను నిర్వహించే అనధికార చర్చ్‌లను మూసివేయటానికి తోడ్పడుతుందని మరోవాదన.ప్రభుత్వాన్ని వ్యతిరేకించే కొందరు బిషప్పులను బాధ్యతల నుంచి తొలగించేందుకు వీలు కలుగుతుందని చెబుతున్నారు. ఈ ఒప్పందం చేసుకున్నప్పటికీ దానికి చైనా నాయకత్వం పెద్ద ప్రచారం కల్పించదలచలేదు, ఒక సాదాసీదా వ్యవహారంగానే చూడాలని నిర్ణయించినట్లు అధికార మీడియాలో క్లుప్తంగా వార్తలు ఇచ్చిన తీరే నిదర్శనం.

కొన్ని నెలల క్రితం చైనా లక్షణాలతో కూడిన మత కార్యకలాపాలు వుండాలనే ప్రచారానికి చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ శ్రీకారం చుట్టారు. చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్దను నిర్మించాలనే లక్ష్యం కలిగిన చైనా రాజ్యాంగానికి కట్టుబడే అన్ని మతకార్యకలాపాలుండాలని నిబంధనలు చెబుతున్నాయి.దానికి భిన్న మైన వైఖరి వ్యక్తమైన చోట్ల సరి చేసేందుకు, చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు వెనుకాడటం లేదు. దీన్ని వ్యతిరేకించే శక్తులు వాటిని చిలవలు పలవలుగా పెంచి ప్రచారం చేస్తున్నాయి. ప్రత్యేకించి ఇలాంటి ఒప్పందం కుదుర్చుకొనేందుకు సముఖత వ్యక్తమైనప్పటి నుంచీ గత మూడు సంవత్సరాలుగా పని గట్టుకొని ఈ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ముస్లింలను లక్షలాది మందిని శిబిరాలలోకి చేర్చి బలవంతంగా పందిమాంసం తినిపిస్తున్నారని, సాంప్రదాయ దుస్తులు వేసుకోరాదని, బురఖాలు, గడ్డాలను తీసివేయాలని వత్తిడి చేస్తున్నారని, క్రైస్తవ చర్చ్‌లను కూల్చివేస్తున్నారని, శిలువల ప్రదర్శనలను అనుమతించటం లేదని, మత కేంద్రాలలో పార్టీ పెత్తనాన్ని ఆమోదించాలని, కమ్యూనిస్టు నాయకుల ఫొటోలు పెట్టాలని వత్తిడిచేస్తున్నారంటూ రకరకాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆయా దేశాల వారు చైనాను ప్రశ్నించరేమని రెచ్చగొడుతున్నారు. మన దేశంలో నిత్యం ఇస్లాం, క్రైస్తవ మతాల మీద విద్వేషం రెచ్చగొట్టి, దాడులకు పాల్పడే శక్తులు కూడా మొసలి కన్నీరు కారుస్తూ తమ చైనా వ్యతిరేక ప్రచారానికి దీన్ని వాడుకుంటున్నాయి. టిబెట్‌ బౌద్ధ మతాధికారి దలైలామా ప్రభుత్వంపై విఫల తిరుగుబాటు చేసి పారిపోయి మన దేశంలో ఆశ్రయం పొందిన విషయం తెలిసిందే. టిబెట్‌ను చైనాలో అంతర్భాగంగా గుర్తించేందుకు నిరాకరిస్తున్న దలైలామా సామ్రాజ్యవాదుల చేతిలో పావుగా మారి చైనా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. మన ప్రభుత్వం టిబెట్‌ను చైనా అంతర్బాగÛంగా గుర్తిస్తున్నప్పటికీ దలైలామాకు ఆశ్రయం ఇవ్వటం గమనించాల్సిన అంశం. దలైలామా నియమించే మతాధికారులకు చైనాలో గుర్తింపు లేదు. దలైలామా కూడా చైనా రాజ్యాంగాన్ని ఆమోదించి, టిబెట్‌ను అంతర్భాంగా అంగీకరిస్తే తిరిగి చైనాలో ప్రవేశించేందుకు అభ్యంతరం వుండకపోవచ్చు.నేరాలేమైనా వుంటే రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకోవచ్చు.

Image result for historic agreement between china and vatican

‘ నేడు పోప్‌ ప్రతినిధి సింహద్వారం నుంచే బీజింగ్‌ వెళ్ల వచ్చు. రహస్య సంప్రదింపులు ఇంకేమాత్రం అవసరం లేదు. అయితే అధికారిక ఒప్పందం పోప్‌ను, చైనా కాథలిజం గౌరవాన్ని గుర్తించిందని’ వాటికన్‌తో దగ్గరి సంబంధాలున్న ఇటలీ మాజీ మంత్రి ఆండ్రియా రికార్డీ ఒప్పందం గురించి వ్యాఖ్యానించాడు. దీంతో చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌కు ఇంతకాలం ఒక దేశంగా వాటికన్‌ ఇచ్చిన గుర్తింపు రద్దయినట్లే. ఈ ఒప్పందం గురించి పశ్చిమ దేశాలలో చైనా వ్యతిరేక మీడియా ప్రముఖంగా వార్తలు ఇచ్చింది. అరెస్టులు, నిర్బంధాలకు గురై రహస్యంగా మతకార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిని ఫణంగా పెట్టి ఈ ఒప్పందం ద్వారా చైనా ప్రభుత్వానికి వాటికన్‌ అమ్ముడు పోయిందని, తోడేళ్లకు మేకలను బలిపెట్టినట్లయిందని హాంకాంగ్‌ మాజీ కార్డినల్‌ జోసెఫ్‌ జెన్‌ విషంగక్కాడు. చైనాలో ఎంత మంది బిషప్పులున్నారన్నది ఒక సమస్య. వాటికన్‌ లెక్క ప్రకారం 145 మంది వుండగా, చైనా లెక్కలో 96 వున్నట్లు హాంకాంగ్‌లోని ఒక సంస్ధ పేర్కొన్నది.

చైనా ప్రభుత్వ గుర్తింపుతో పని చేస్తున్న కాథలిక్‌ సంస్ధలు ఒప్పందాన్ని స్వాగతించాయి. దేశాన్ని, మతాన్ని ప్రేమించే సాంప్రదాయానికి తాము కట్టుబడి వున్నామని దానికి సోషలిస్టు సమాజమే మార్గమని, స్వతంత్రంగా పని చేయాలనే సూత్రాన్ని పాటిస్తామని చైనీస్‌ పేట్రియాటిక్‌ కాథలిక్‌ అసోసియేషన్‌(సిపిసిఏ), బిషప్స్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ కాథలిక్‌ చర్చ్‌ ఇన్‌ చైనా( బిసిసిసిసి) తమ ప్రకటనల్లో పేర్కొన్నాయి. మొదటి సంస్ధ 1957లో ఏర్పడగా, రెండవ సంస్ధ సాంస్కృతిక విప్లవం తరువాత 1980లో ఏర్పడింది. ఆ కాలంలో అన్ని మతాలను రద్దు చేయాలనే విపరీత ధోరణి కొందరు నేతల్లో వ్యక్తమైన విషయం తెలిసినదే. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శక సూత్రాల ప్రకారం బహిరంగంగా మతకార్యకలాపాలు నిర్వహించటం, కట్టడాలు నిర్మించటం, సాహిత్యం అమ్మటం తదితర అంశాలపై కొన్ని ఆంక్షలున్నాయి. వాటి మేరకు అనుమతి లేని చర్చ్‌లను కూల్చివేయటాన్ని మొత్తం చర్చ్‌లు కూల్చివేయటంగా పశ్చిమ దేశాల మీడియా వక్రీకరించింది.

ఈ ఒప్పందం గురించి కాథలిక్‌ న్యూస్‌ సర్వీస్‌ ప్రకటించిన విశ్లేషణలోని అంశాలు ఇలా వున్నాయి. ఇప్పుడు కావలసింది ఐక్యత, విశ్వాసం, ఒక నూతన ప్రేరణ. గతంలో వున్న అపోహలు, ఇటీవలి వుద్రిక్తతలతో సహా గతంలో తలెత్తిన వాటిని అధిగమించాలని వాటికన్‌ విదేశాంగ మంత్రి కార్డినల్‌ పెట్రో పారోలిన్‌ తన సందేశంలో పేర్కొన్నారు. బిషప్పుల నియామకం, పని వాటికన్‌-చైనా సంబంధాలలో ఒక ముఖ్యమైన ఆటంకం. బిషప్పులను పోప్‌ నియమించాలని వాటికన్‌ పట్టుబడుతుండగా, అలా చేయటం తమ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటమే అని చైనా భావించింది. ప్రభుత్వం ఆమోదించిన మత సంస్ధలు నియమించిన బిషప్పులను అనుసరించటానికి కొందరు కాథలిక్కులు తిరస్కరించారు. అనేక మందిని స్ధానికంగానే ఎన్నుకున్నారు,అయినప్పటికీ వారు పోప్‌కు విధేయత ప్ర కటించారు. చైనాలో బిషప్పుల నియామకం పూర్తిగా తమ అదుపులోనే వుండాలని తాము ఆశించటం లేదని, ముందు అక్కడి వారికి స్వేచ్చ, భద్రత కోరుకుంటున్నామని వాటికన్‌ అధికారులు ఎల్లపుడూ చెబుతూనే వున్నారు.

తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం బిషప్పుల నియామక ప్రక్రియను ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. ఒప్పంద ప్రతిని వాటికన్‌ విడుదల చేయలేదు. ఒప్పందానికి ముందు వచ్చిన వార్తల ప్రకారం బిషప్పుల నియామకానికి ఒక ప్రక్రియను రూపొందిస్తారు. భవిష్యత్‌లో జరిగే నియామకాలకు సబంధించి డయోసిస్‌ పరిధిలోని వారితో ప్రజాస్వామిక ఎన్నికల పద్దతి ద్వారా బిషప్పులను ఎన్నుకుంటారు. ఫలితాలను పరిశీలనకు ప్రభుత్వానికి అంద చేస్తారు, వాటి నుంచి జాబితాను అధికారికంగా పోప్‌కు పంపుతారు. ప్రభుత్వం, పోప్‌ కూడా జాబితాలోని వారిని వీటో చేయవచ్చు. ఎన్నిక సక్రమంగా జరిగిందా లేదా అన్నది పోప్‌ దర్యాప్తు చేయవచ్చునని జెసూట్‌లు నడిపే అమెరికన్‌ మాగజైన్‌ తెలిపింది. వీటో జరిగినపుడు చైనా-వాటికన్‌ ప్రతినిధులు సంప్రదింపుల ద్వారా పరిష్కారానికి ప్రయత్నిస్తారు, సాధ్యం కానపుడు చైనా మరోపేరును ప్రతిపాదిస్తుంది. అంతిమ నిర్ణయం పోప్‌దిగానే వుంటుంది. ఈనెల 20వ తేదీన ఒప్పందంపై సంతకాలకు ముందు కార్డినల్‌ పారోలిన్‌ విలేకర్లతో మాట్లాడుతూ ఇది ఒక ముందుడుగు అని భావిస్తున్నాం ఇక నుంచి అంతా సులభంగా జరిగిపోతుందని అనుకోవటం లేదు, అయితే ఇది మాకు సరైనదారి అనిపించింది అన్నారు. ఇది మతపరమైనది తప్ప రాజకీయమైంది కాదని ఒప్పందం గురించి వాటికన్‌ మీడియా డైరెక్టర్‌ గ్రెగ్‌ బుర్కే వ్యాఖ్యానించారు.

ఏ దేశంలో ఏ మత చరిత్ర చూసినా అది పాలకవర్గాల ఆయుధంగా వుంది. చైనాలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన విప్లవోద్యమం కొనసాగిన కాలంలో మెజారిటీ చర్చి అధికారులు దానికి వ్యతిరేకంగా వున్నారు, వ్యతిరేకులతో చేతులు కలిపారు, విదేశాలకు వెళ్లిపోయారు తప్ప సామాన్య జన పక్షాన లేరు, దోపిడీ నుంచి వారు విముక్తికావాలని కోరుకోలేదు. అందువలన సహజంగానే కమ్యూనిస్టు పార్టీ కూడా దానికి అనుగుణ్యంగానే వ్యవహరించింది. కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మిగతా సామ్రాజ్యవాదుల మాదిరే వాటికన్‌ కూడా ఆ ప్రభుత్వంతో దౌత్య సంబంధాలను రద్దు చేసుకుంది. శత్రువులతో చేతులు కలిపిన అనేక మంది విదేశీ చర్చి ప్రతినిధులను చైనా దేశం నుంచి పంపివేసింది. స్ధానికంగా వున్న వారిని కొంత మంది మీద విచారణ జరిపి దోషులుగా చేరిన వారి మీద చర్య తీసుకుంది. తరువాత అక్కడి మతాభిమానులు చైనా దేశభక్త కాధలిక్‌ అసోసియేషన్‌ పేరుతో బిషప్పులతో సహా పూజారులను నియమించుకొని కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. మతంపై కమ్యూనిస్టు ప్రభుత్వం ఎలాంటి నిషేధం విధించలేదు, కొందరు ప్రచారం చేసినట్లు ఒక్క చర్చిని కూడా కూల్చలేదు. ఈ పూర్వరంగంలో ఏడు దశాబ్దాల తరువాత చైనా-వాటికన్‌ మధ్య ఒప్పందం కుదరటం చారిత్రాత్మకమే.

ఈ ఒప్పందం గురించి కరడుగట్టిన మతవాదులు, అలాగే కొందరు విపరీత అభ్యుదయ వాదులు కూడా వ్యతిరేకతను వ్యక్తం చేయటం సహజమే. వందలు, వేల సంవత్సరాలుగా వేళ్లూనుకున్న మత భావనలను తెల్లవారే సరికి పోగొట్టగలమని ఎవరైనా అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి వుండదు. మతం మత్తు మందు అని నమ్మేకమ్యూనిస్టులు ఒక మతంతో రాజీ పడటం ఏమిటి అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. కమ్యూనిస్టులు చైతన్యంతో ఒక అడుగు ముందుండాలే తప్ప జనాన్ని వదలి దూరంగా వుంటే లాభం లేదు. మతం మత్తు మందు అని తాము నమ్మితే చాలదు, ఇంకా దాని మత్తులో వున్న విస్తార జనంలో దాన్ని వదిలించాలి. అంతిమ లక్ష్యమైన సోషలిస్టు సమాజ నిర్మాణానికి వర్గశత్రువుతో ఎలాగూ పోరాటం చేయక తప్పదు. మతాన్ని నమ్మిన సామాన్యులందరూ సోషలిజానికి శత్రువులు కాదు. ప్రతి దేశంలో ఏదో ఒక మతాన్ని అనుసరించే శ్రమజీవులే కదా కమ్యూనిస్టుల నాయకత్వాన విప్లవాలను జయప్రదం చేసింది. సామాన్యులందరూ మతోన్మాదులే అయితే ఇది సాధ్యమయ్యేదా? ఆ లక్ష్యాన్ని దెబ్బతీయటానికి మతాన్ని ఆయుధంగా చేసుకొనేశక్తులను అనుమతించకుండా, సామాన్యులను శత్రువులుగా చేసుకోకుండా ఎత్తుగడగా అయినా కొంత కాలం మతంతో రాజీపడటం వాస్తవానికి దగ్గరగా వుంటుంది. రాజీ వేరు లంగిపోవటం వేరు. హేతు, భౌతిక వాదాన్ని ఫణంగా పెట్టి మతాన్ని సంతృప్తి పరచటం వేరు. చైనా సర్కార్‌ చర్యలో అలాంటిదేమీ కనిపించటం లేదు. మతానికి సంబంధించి తన విధానాన్ని నవీకరించుకున్న తరువాతే ఈ పరిణామం జరిగింది.

రాజీ, సర్దుబాటు అన్నది అటు కమ్యూనిస్టు చైనాకు, ఇటు క్రైస్తవ వాటికన్‌కు రెండింటికీ అవసరం అయ్యాయనవచ్చు. సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారీ వర్గంతో కలసి క్రైస్తవులను సోషలిజం, కమ్యూనిస్టు వ్యవస్దలకు వ్యతిరేకంగా నిలబెట్టేందుకు చర్చి నిరంతరం ప్రయత్నిస్తున్నది. తూర్పు ఐరోపా, సోవియట్‌ వ్యవస్ధల కూల్చివేతలకు పోప్‌ రెండవ జాన్‌ పాల్‌ సామ్రాజ్యవాదులతో చేతులు కలిపారన్నది బహిరంగ రహస్యం. తూర్పు ఐరోపా, సోవియట్‌ యూనియన్‌ సోషలిస్టు వ్యవస్ధల కూల్చివేతలో ఇతర అనేక అంశాలతో పాటు కాథలిక్‌ చర్చి జోక్యం ముఖ్యంగా పోప్‌ రెండవ జాన్‌పాల్‌ పాత్ర గురించి బయటకు తెలిసినదాని కంటే చైనా కమ్యూనిస్టుపార్టీకి ఇంకా వివరంగా తెలుసన్నది వేరే చెప్పనవసరం లేదు.

తదనంతరం కాలంలో పశ్చిమ దేశాల మీడియా చైనాలో క్రైస్తవులను అణచివేస్తున్నారని, దాంతో రహస్యంగా ప్రార్ధనలు చేసే వారు పెరుగుతున్నారని పశ్చిమ దేశాల మీడియాలో ఒక పధకం ప్ర కారం ప్రచారం ఎక్కువైంది.కమ్యూనిస్టులు మతాన్ని నిషేధించరు, అణచివేయరు, స్వేచ్చను ఆటంక పరచరు అని లోకానికి తెలియటం అవసరం. తైవాన్‌ను ఒంటరి చేయాలంటే వాటికన్‌తో దౌత్య సంబంధాలను పునరుద్దరించుకోవటం ఒక మార్గం. ఈ పూర్వరంగంలో తెలివైన వారెవరైనా ప్రధాన అంశాల మీద కేంద్రీకరించి, మిగతావాటి మీద సర్దుబాటుకు ప్రయత్నిస్తారు. చైనా నాయకత్వం కూడా అదే చేసినట్లు కనిపిస్తోంది. తాను ఒక మెట్టుదిగి చైనా సర్కార్‌ ఆధిపత్యాన్ని అంగీకరించకపోతే లాభం లేదని వాటికన్‌ కూడా అనుభవంలో తెలుసుకుంది. ఏదో ఒక పరిష్కారం కుదుర్చుకొనేందుకు చొరవ చూపాలనే వత్తిడి కూడా క్రమంగా పెరిగింది. ఇదీ నేపధ్యం. ఈ ఒప్పందం కుదరటానికి పశ్చిమ దేశాల మీడియా లేదా మరికొందరు వర్ణిస్తున్నట్లు కమ్యూనిస్టు పోప్‌ ఫ్రాన్సిస్‌ కారణం అనుకుంటే పొరపాటు. ఆయన హయాంలో ప్రయత్నాలు వేగవంతం అయితే అయి వుండవచ్చుగానీ సర్దుబాటు లేదా రాజీకి పునాది పోప్‌ బెనెడిక్ట్‌-16 హయాంలోనే ప్రారంభమయ్యాయి. ఒక అంగీకారానికి రావటం ఇరు పక్షాలకూ కత్తిమీద సాము వంటిదే. పోప్‌ 16వ బెనెడిక్ట్‌ హయాంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. వాటికన్‌ విదేశాంగశాఖ మంత్రిగా వున్న ఆర్చిబిషప్‌ పిట్రో పారోలిన్‌ 2009లోనే తన ప్రయత్నాలను ప్రారంభించారని, చైనాతో ఒక అవగాహనకు వచ్చారని మిలన్‌ కాథలిక్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ అగొస్టినో జివాంగ్నోలీ చెప్పారు. ఆ ఏడాదే పారోలిన్‌ వెనెజులాకు వాటికన్‌ ప్రతినిధిగా వెళ్లారు.అయితే తరువాత ఎలాంటి పురోగతి లేదు. 2013లో పోప్‌ ప్రాన్సిస్‌ బాధ్యతలు చేపట్టిన వెంటనే అధ్యక్షుడిగా ఎన్నికైన జింపింగ్‌కు అభినందనలు పంపారు. తరువాత ఒక పోప్‌ ప్రయాణించే విమానాన్ని తొలిసారిగా తన భూభాగం మీదుగా అనుమతించి పోప్‌ ఫ్రాన్సిస్‌ దక్షిణ కొరియా పర్యటనకు చైనా అవకాశమిచ్చింది. ఆ వెంటనే అర్జెంటీనా రాజకీయవేత్త రికార్డో రోమనో ద్వారా ఒక లేఖ పంపిన పోప్‌ తాను చైనా నాయకుడితో చర్చలకు ఆహ్వానం పంపారు. ఆ తరువాత చైనా నూతన సంవత్సరం సందర్భంగా జీకి శుభాకాంక్షలు పంపారు. మెక్సికో నుంచి రోమ్‌ వెళుతూ విమానంలో విలేకర్లతో మాట్లాడిన పోప్‌ తాను చైనా సందర్శనను నిజంగా ప్రేమిస్తానని బహిరంగంగా చెప్పారు.2014లో రోమ్‌లో వుభయ ప్రతినిధులు సమావేశమయ్యారు. చైనాతో చర్చలు కొనసాగించి ఒక పరిష్కారాన్ని కనుగొనాలని పోప్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు ఒక అధికారి రెండు సంవత్సరాల క్రితమే రాయిటర్స్‌ వార్తా సంస్ధకు చెప్పారు. ఆ తరువాత ప్రతినిధి వర్గాల సమావేశాలు, తాజా ఒప్పందానికి దారి తీశాయి.

చైనా కమ్యూనిస్టు పార్టీ హేతువాద, భౌతికవాద దృక్పధం కలిగింది. అయినప్పటికీ అక్కడి ప్రభుత్వం అధికారయుతంగానే బౌద్ధం,తావో, ఇస్లాం, క్రైస్తవంలో ప్రొటెస్టెంట్‌, కాథలిక్‌ మతాలను గుర్తించి రాజ్యాంగ పరిధిలో మతారాధన, అవలంబన స్వేచ్చ హక్కులను ఇచ్చింది. మతం పేరుతో తమ దేశంలోని వారిని విదేశాలలో వున్న వారు అదుపు చేసే లేదా మార్గదర్శనం చేయటాన్ని అంగీకరించటం అంటే అదొక ముప్పుగా భావించింది. అందుకే కొన్ని పరిమితులు, పరిధిని ఏర్పాటు చేసింది. ప్రపంచంలో వున్న మతాలలో ఒక్క కాథలిక్‌ మతానికే ప్రపంచ కేంద్రం వుంది. అందువలన దాన్ని అవలంభించేవారు దాని ఆదేశాలు, మార్గదర్శనం కోసం ఎదురు చూస్తారు. మతపరంగా దానికే విధేయులై వుంటారు. చైనా విప్లవ కాలం, కమ్యూనిస్టు పార్టీ అధికారానికి వచ్చిన తరువాత వాటికన్‌ నియమించిన మతాధికారులు మొత్తం మీద కమ్యూనిస్టుల వునికి, విప్లవం, ప్రభుత్వాన్ని గుర్తించేందుకు నిరాకరించారు. సోవియట్‌ యూనియన్‌లోని కొన్ని రిపబ్లిక్‌లలోని అతి పెద్దదైన రష్యా, ఇతర చోట్ల కాథలిక్‌ చర్చి ఆధిపత్యాన్ని అంగీకరించని ఆర్ధొడాక్‌ చర్చ్‌ ప్రభావం ఎక్కువ. అది కూడా సోషలిజాన్ని వ్యతిరేకించింది, తరువాత రాజీపడి కొనసాగింది. 1989లో సోవియట్‌ చివరి రోజులలో గోర్బచెవ్‌ నాటి పోప్‌ను తొలిసారిగా సోవియట్‌ నేత హోదాలో కలిశారు. తరువాత రెండు సంవత్సరాలకే దాన్ని కూల్చివేశారు.

వాటికన్‌తో ఒప్పందం విషయంలో చైనా నాయకత్వంలో కూడా సందేహాలు వ్యక్తమయ్యాయి. పద్దెనిమిది సంవత్సరాల క్రితం హాంకాంగ్‌, మకావో దీవులు చైనాలో విలీనమయ్యాయి. ప్రజాస్వామ్యం పేరుతో హాంగాంగ్‌లో నిర్వహిస్తున్న చైనా వ్యతిరేక ఆందోళనలో స్దానిక కాథలిక్‌ అధికారులు, ఇతర విదేశీ మిషనరీల పాత్ర సుపరిచతం. చర్చలు ప్రారంభమైన తరువాత కూడా హాంకాంగ్‌ మాజీ బిషప్‌ జోసెఫ్‌ జెన్‌ వంటి వారు తమ చైనా వ్యతిరేకతను దాచుకోలేదు. అందువలన పోప్‌ను నమ్మవచ్చా, ఒప్పందం కుదిరిన తరువాత చైనా అంతర్గత వ్యవహారాలలో వాటికన్‌ జోక్యం చేసుకోకుండా వుంటుందా? మతభావనలు మరింతగా పెరిగే అవకాశాలేమైనా వుంటాయా; అప్పుడేమి చెయ్యాలి? అనే తర్జన భర్జనలు జరగకపోలేదు. వాటన్నింటి తరువాతే ఒప్పందం కుదిరింది. విదేశీ పెట్టుబడులకు,సంస్థలకు ద్వారాలు తెరిచినపుడు సంస్కరణలకు ఆద్యుడు డెంగ్‌సియావో పింగ్‌ ఒక మాట చెప్పారు. గాలి కోసం కిటికీ తెరిచినపుడు దానితో పాటు హాని కలిగించే క్రిమి కీటకాలు కూడా ప్రవేశిస్తాయి, వాటిని ఎలా అరికట్టాలో తెలుసు అన్నారు. ఇప్పుడు వాటికన్‌తో ఒప్పందం విషయంలో కూడా అదే జాగ్రత్తలతో చైనా నాయకత్వం వుంటుందని ఎందుకు అనుకోకూడదు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మాజీ ప్రధాని వాజ్‌పేయిపై మీడియాలో అతిశయోక్తులు !

20 Monday Aug 2018

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

AB Vajpayee, BJP, RSS

Image result for ab vajpayee, govindacharya

ఎం కోటేశ్వరరావు

మాజీ ప్రధాని ఏబి వాజ్‌పేయి దేశ రాజకీయ చరిత్రలో ఏ రకంగా చూసినప్పటికీ ఒక ప్రముఖుడనటం నిర్వివివాదాంశం. స్ధానిక, జాతీయ మీడియా సహజంగానే, అందునా కేంద్రంలో, రాష్ట్రాలలో వున్న ప్రభుత్వాలకు భయపడి లేదా భక్తితో గానీ భారీగానే ఆయన మరణవార్తలకు చోటు కల్పించింది. కేంద్ర సర్కార్‌ తీసుకున్న చర్యల వలన తన ఆదాయం రెట్టింపు అయిందని చత్తీస్‌ ఘర్‌ రాష్ట్ర రైతు మహిళ ఒకరు చెప్పిన అంశాన్ని నరేంద్రమోడీ పెద్ద ఎత్తున తన ప్రచారానికి వినియోగించుకున్నారు. అదెంత బూటకమో బయట పెట్టిన ఎబిపి న్యూస్‌ ఛానల్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌, మరొక జర్నలిస్టులను రాజీనామా చేసి బయటకు పోయే విధంగా యాజమాన్యం వత్తిడి తెచ్చింది. దీని వెనుక కేంద్ర అధికార పార్టీ పెద్దల బెదిరింపులున్నాయన్నది బహిరంగ రహస్యం. తమ నేత వాజ్‌పేయి మృతికి తగినంత చోటు కల్పించలేదని ఆ పెద్దలు కినుక వహిస్తే… ఎందుకులే తంటా అని గావచ్చు లేదా వాజ్‌పేయి అంటే మీడియా యాజమాన్యాలకు వున్న భక్తి కావచ్చు.

వాజ్‌పేయి ఒక మాజీ ప్రధాని, అటువంటి వ్యక్తి మరణించినపుడు రాజకీయాలతో నిమిత్తం లేకుండా విచారం వెలిబుచ్చటం, నివాళి అర్పించటం ఒక సంస్కారం. అలా చేయటమంటే ఆయన రాజకీయాలను, ఇతర అంశాలన్నింటితో ఏకీభవించటం అని కానే కాదు. కమ్యూనిస్టు పార్టీలు సంతాప ప్రకటనలు చేయటాన్ని సామాజిక మాధ్యమంలో తప్పుపడుతూ, వ్యంగోక్తులు విసురుతూ కొందరు వ్యాఖ్యానాలు చేశారు. వాజ్‌పేయి రాజకీయ జీవితంలో వున్న ప్రతికూలతల కారణంగా ఆయన మరణానికి విచారం ప్రకటించకపోవటం ఒక విప్లవ చర్య అనే అర్ధం వచ్చేట్లుగా కొందరి తీరు వుంది. అలా అయితే హిట్లర్‌ మరణానికి కూడా సంతాపం ప్రకటించాలి కదా అనే తీరులో స్పందించారు కొందరు. దాని గురించి వదిలేద్దాం. వాజ్‌పేయికి సంతాపం ప్రకటించిన సిపిఐ(ఎం) ప్రకటన పూర్తి పాఠం ఇలా వుంది.(The Polit Bureau of the Communist Party of India (Marxist) expresses its grief at the death of former Prime Minister Shri Atal Behari Vajpayee.Shri Vajpayee had a distinguished political career in parliament, in government and as Prime Minister of India.As a political leader he commanded respect of all sections.) ‘మాజీ ప్రధాని శ్రీ అతల్‌ బిహారీ వాజ్‌పేయి మరణం పట్ల భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తన విచారాన్ని వ్యక్తం చేస్తున్నది. ప్రధానిగా ప్రభుత్వంలోనూ, పార్లమెంటులోనూ వాజ్‌పేయి విలక్షణ రాజకీయ వురవడి కలిగినవారు. ఒక రాజకీయవేత్తగా అన్ని తరగతుల మెప్పు పొందారు.’ ఈ మాత్రపు ప్రకటన కూడా చేయకూడదని ఎవరైనా అనుకుంటే వారి అది వారికున్న స్వేచ్చ.

దేశ రాజకీయాలలో వాజ్‌పేయి పాత్ర గురించి మరణించిన సమయంలో వ్యతిరేక వ్యాఖ్యలు చేయటం గురించి సామాజిక మాధ్యమంలో కొంతమంది పరివార్‌ అభిమానులు, కానివారు కూడా అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బతికి వున్నపుడు, చురుకుగా రాజకీయాల్లో వున్నపుడు కూడా ఆయన గురించి తీవ్ర విమర్శలు చేసినపుడు కూడా ‘అభిమానులు’ పై మాదిరే వ్యవహరించారు.బిజెపికి వాజ్‌పేయి ఒక ముసుగు అని వర్ణించిన ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంత వేత్త కెఎన్‌ గోవిందాచార్య గురించి తెలిసిందే. వాజ్‌పేయి మరణం సందర్భంగా దాని గురించి మాట్లాడుతూ తాను చెప్పిన మాటను ఒక తరగతి మీడియా వక్రీకరించిందని ఆరోపించారు. బిజెపిలో వాజ్‌పేయి బహుళ ఆదరణ కలిగిన వారు, అత్యధికులు ఆమోదించే ముఖ రూపసి అని చెప్పానని అయితే ముఖ రూపసి బదులు ముసుగుగా మార్చారని గోవిందాచార్య అన్నారు. ఆ వుదంతంతో గోవిందాచార్య బిజెపి, రాజకీయాలలో కూడా చోటును కోల్పోయారు.
చరిత్రలో హిట్లర్‌ను కూడా నిస్సిగ్గుగా సమర్ధించేవారున్నారు. చరిత్రలో బతికి వున్నపుడు, మరణించిన తరువాత తీవ్ర ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొనని రాజకీయనేతలు బహు కొద్ది మంది. అలాంటి వారిలో వాజ్‌పేయి లేరు. కొంత మంది తమ అభిమాన రాజకీయ నేతల విషయంలో అతిశయోక్తులను ముందుకు తెస్తారు. పని గట్టుకొని ప్రచారం చేస్తారు. వాజ్‌పేయి విషయంలోనూ అదే జరుగుతోందా ?

ఆగస్టు 17వ తేదీన ఆంధ్రజ్యోతి పత్రికలో 1942.. ఏ లవ్‌ స్టోరీ పేరుతో ఒక వార్త వచ్చింది. దాని సారాంశం ఇలా వుంది. 1942లో గ్వాలియర్‌ విక్టోరియా కాలేజీలో వాజ్‌పేయి తన సహాధ్యాయిని ప్రేమించి దాన్ని బహిరంగంగా చెప్పలేక ప్రేమలేఖ రాసి పుస్తకంలో పెట్టి ఆమెకు ఇచ్చారు. రెండు మూడు రోజులు గడిచినా ఏ స్పందనా లేకపోవటంతో తన లేఖను ఆమె చూడలేదని అనుకున్నారు. అయితే ఆమె కూడా అంగీకరిస్తూ రాసిన లేఖను అదే పుస్తకంలో పెట్టి వాజ్‌పేయికి ఇద్దామనుకున్నారు. ఆ సమయంలో వ్యక్తిగత కారణాలతో వాజ్‌పేయి ఢిల్లీ వెళ్లినందున ఆ లేఖ ఆయనకు చేరలేదు. తమ ప్రేమ గురించి రాజకుమారి తలిదండ్రులకు చెప్పినా శాఖాబేధం కారణంగా వారు అంగీకరించలేదు. ఆమెకు 1947లో ఢిల్లీలో హడావుడిగా నిశ్చితార్ధం చేయించి ఆ తరువాత గ్వాలియర్‌ తీసుకువచ్చి పెళ్లి చేశారు. ప్రేమ విఫలం కావటంతో వాజ్‌పేయి పెళ్లి చేసుకోకుండా రాజకీయాలకు అంకితమై పోయారు. కొన్నాళ్ల తరువాత ఢిల్లీలో వాజ్‌పేయి అమెని కలిశారు. తరువాత వారింటికి తరచూ వెళ్లే వారు. భర్త చనిపోయిన తరువాత రాజకుమారి ఆయన అధికార నివాసానికి మకాం మార్చారు. వాజ్‌పేయితోనే వుండిపోయారు.’

అనేక మంది రాజకీయ నేతల మాదిరే వారి సంబంధం గురించి అనేక కధనాలు గతంలోనే వెలువడ్డాయి. వాటి మీద వాజ్‌పేయి స్పందించిందీ లేనిదీ తెలియదు. నాకు ఎక్కడా దొరకలేదు. ఆగస్టు 19నాటి ఈనాడు పత్రికలో వాజ్‌పేయీ స్వీయ నిర్బంధం ! అనే శీర్షికతో ఒక వార్తను బాక్సు కట్టీ మరీ ప్రచురించారు. దాని సారాంశం ఇలా వుంది. పెళ్లి అనే రెండు అక్షరాలకూ వాజ్‌పేయి బహుదూరం. వివాహానికి దూరంగా వుండిపోతే జీవితాన్ని జాతికి అంకితం చేసే వీలుంటుందన్నదే వాజ్‌పేయి అభిమతం అని ఆయన సన్నిహిత మిత్రుడు దివంగత గోరేలాల్‌ త్రిపాఠీ తనయుడైన విజయ ప్రకాష్‌ చెప్పారు. తొలి నుంచీ బ్రహ్మచర్య జీవితాన్నే ఇష్టపడేవారు. ఆయన పీజీ చేసే రోజులలో తలిదండ్రులు ఆయన వివాహం గురించి అనుకోవటం ఆయన చెవిన పడింది. కల్యాణమంటే విరక్తి పెంచుకున్న వాజ్‌పేయి కాన్పూర్‌లోని మిత్రుడి ఇంటిలో ఒక గదిలోకి వెళ్లి మూడు రోజులు తనను తాను బంధించుకున్నంత పని చేశారు.’

ఆంధ్రజ్యోతి వార్త ప్రకారం వాజ్‌పేయి ఒక భగ్న ప్రేమికుడు. ప్రేమికురాలు రాజకుమారి భర్త చనిపోయిన తరువాత ఆమె తన నివాసాన్ని వాజ్‌పేయి ఇంటికి మార్చి నాలుగు సంవత్సరాల క్రితం మరణించే వరకు అక్కడే వున్నారు. అందువలన పై రెండు వార్తలనూ పక్కపక్కనే పెట్టుకొని చదివితే పాఠకుడు గందరగోళంలో పడిపోతాడు. వాజ్‌పేయి గురించి ఈనాడు అతిశయోక్తులు రాసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక వాజ్‌పేయి గురించి గతంలో పత్రికల్లో, మరణించిన తరువాత సామాజిక మాధ్యమంలో జరిగిన చర్చలో 1942లో క్విట్‌ ఇండియా వుద్యమంలో అరెస్టయి అప్రూవర్‌గా మారి చెప్పిన సాక్ష్యంతో కొంత మందికి శిక్షలు పడ్డాయనే అంశం. ఆయన మరణించిన సందర్భంలో ఈ విషయాన్ని ప్రస్తావించటం ఏమిటి? ఆయన బతికి వుండగా విమర్శిస్తే సమాధానం చెప్పటమో, సరిదిద్దుకోవటమో చేసే వారు కదా అని కొంత మంది సామాజిక మాధ్యమ చర్చల్లో అభిప్రాయపడ్డారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ స్వాతంత్య్ర వుద్యమానికి దూరం. అలాంటి సంస్ధలో 1939లోనే చేరిన వాజ్‌పేయి 1942లో క్విట్‌ ఇండియా వుద్యమంలో ఎలా పాల్గొన్నారు. ద్రోహం చేసినట్లు, కోర్టులో అంగీకరించిన ప్రకటన వలన ఆయన బయటపడినా కొందరికి శిక్షలు పడటం గురించి నిజా నిజాలేమిటి? దీనికి సంబంధించి ఫ్రంట్‌లైన్‌ పక్షపత్రిక 1998 ఫిబ్రవరి 7-20వ తేదీ సంచికలో ఒక పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. వాజ్‌పేయిని ప్రధాని అభ్యర్ధిగా ముందుకు తెచ్చే క్రమంలో ఆయనకు స్వాతంత్య్రవుద్యమంలో పాల్గన్న నేపధ్యం వుంది అని చెప్పేందుకు గాను సంఘపరివార్‌, బిజెపి తాపత్రయ పడింది, వాజ్‌పేయి క్విట్‌ ఇండియా వుద్యమంలో పాల్గొని జైలు పాలయ్యారని ప్రచారం చేశారు. చివరికి వాజ్‌పేయి కూడా స్వయంగా తాను క్విట్‌ ఇండియా వుద్యమంలో పాల్గొన్నట్లు చెప్పుకున్నారు. ఇక్కడే చిక్కువచ్చింది. ఇరవై ఒక్క రోజులు జైలులో వున్న తరువాత ఒక పత్రం రాసి ఇచ్చి బయటపడ్డారు. అయితే తాను ఎలాంటి పత్రం రాయలేదని, బ్రిటీష్‌ వారికి లొంగిపోలేదని వాదించారు. చివరకు మీడియా పరిశోధనలో వెల్లడైన అంశాల కారణంగా తాను పత్రంపై సంతకం చేసిన మాట నిజమే అని ఫ్రంట్‌లైన్‌ ప్రతినిధులతో అంగీకరించారు. 1942 సెప్టెంబరు ఒకటవ తేదీన ఆగ్రా జిల్లా సెకెండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ముందు వుర్దూలో రాసిన పత్రంపై వాజ్‌పేయి ఆంగ్లంలో సంతకం చేశారు. దాదాపు అలాంటిదానినే ఆయన సోదరుడు ప్రేమ్‌ బిహారీ వాజ్‌పేయి కూడా మెజిస్ట్రేట్‌కు అంద చేశారు. ఇంతకీ ఎబి వాజ్‌పేయి రాసిచ్చిన పత్రంలో ఏముంది?

నా పేరు : అతల్‌ బిహారీ , తండ్రిపేరు : గౌరీ శంకర్‌, నా కులం: బ్రాహ్మణ, వయస్సు : 20, వృత్తి : విద్యార్ధి గ్వాలియర్‌ కాలేజి, చిరునామా : బాతేష్వర్‌, పిఎస్‌ బా, జిల్లా ఆగ్రా

మీరు దహనకాండకు పాల్పడ్డారని, నష్టపరిచారని చెబుతున్నారు, దీనికి సంబంధించి మీరేమి చెబుతారు. అన్న న్యాయూర్తి ప్రశ్నకు ‘ 1942 ఆగస్టు 27న బాతేష్వర్‌ బజార్‌లో ఆలా గానం నిర్వహిస్తున్నారు. సాయంత్రం రెండు గంటల సమయంలో కకువా అనే లీలాధర్‌ మరియు మహువా ఆలా దగ్గరకు వచ్చి ఒక వుపన్యాసం ఇచ్చి అటవీ చట్టాలను వుల్లంఘించాలని కోరారు. రెండువందల మంది జనం ఫారెస్ట్‌ ఆఫీసుకు వెళ్లారు, నేను నా సోదరుడు జనాన్ని అనుసరించాము బటేష్వర్‌ అటవీ కార్యాలయానికి చేరుకున్నాము. నా సోదరుడు, నేను కిందనే వున్నాము, జనం పైకి వెళ్లారు. నాకు కకువా మరియు మహువా తప్ప అక్కడున్నవారిలో మరే ఇతర వ్యక్తి పేరూ తెలియదు. ఇటుకలు కిందికి పడుతున్నట్లు నాకు కనిపించింది. గోడను ఎవరు పడగొడుతున్నారో తెలియదు కానీ గోడ ఇటుకలు మాత్రం పడుతున్నాయి. నేను నా సోదరుడితో కలసి మెయిపురా వెళ్లేందుకు బయలుదేరాము, జనం మా వెనుక వస్తున్నారు.పైన పేర్కొన్న వ్యక్తులు పశువుల శాల నుంచి మేకలను బలవంతంగా బిచికోలీ వైపు మళ్లించారు. అటవీ కార్యాలయంలో పది పన్నెండు మంది వున్నారు. నేను వంద అడుగుల దూరంలో వున్నాను. ప్రభుత్వ భవనాన్ని పడగొట్టటానికి నేను ఎలాంటి సాయం చేయలేదు. ఆ తరువాత మేము ఇండ్లకు వెళ్లాము.’

ఈ పత్రంపై అతల్‌ బిహారీ వాజ్‌పేయితో పాటు మెజిస్ట్రేట్‌ ఎస్‌ హసన్‌ కూడా సంతకాలు చేశారు. శిక్షా స్మృతి సెక్షన్‌ 164కింద ఈ ప్రకటనను నమోదు చేశారు. ఆ పత్రం మీద మెజిస్ట్రేట్‌ చేత్తో కింది విధంగా రాసి సంతకం చేశారు.

అతనెలాంటి తప్పు చేయలేదని గౌరీశంకర్‌ కుమారుడైన అతల్‌ బిహారీకి నేను వివరించాను, ఒకవేళ చేసి వుంటే ఏ తప్పయినా చేస్తే దానిని అతనికి వ్యతిరేకంగా సాక్ష్యంగా పరిగణిస్తామని చెప్పాను. ఈ విషయాలు అతను స్వచ్చందంగా వెల్లడించినట్లు నేను నమ్ముతున్నాను.ఇది నా సమక్షములో తీసుకున్నది, అతల్‌ బిహారికి చదివి వినిపించబడినది, దానిలో తాను చెప్పిన అంశాలే పూర్తిగా వున్నాయని, సరైనవే అని అతను అంగీకరించాడు.

కోర్టులో చేసిన ఈ ప్రకటనను బట్టి వాజ్‌పేయి క్విట్‌ ఇండియా వుద్యమంలో పాల్గొనలేదు. ఆందోళనకారుల వెనుక వున్నందున ఆయనను కూడా అరెస్టు చేశారు. ఆ రోజు జరిగినదానితో తనకేమీ సంబంధం లేదని స్పష్టంగా చెప్పినందున తరువాత కేసు నుంచి ఆయన బయట పడ్డారు. నిజమైన స్వాతంత్య్ర సమర యోధులందరూ పోలీసులు, కోర్టుల ముందు తాము బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పాల్గొన్నట్లు వీరోచితంగా ప్రకటనలు చేసి చెరసాలలు, వురికొయ్యలకు తమ జీవితాలను అంకితం చేశారు. జైలు జీవితాలు, చిత్రహింసలను భరించలేని సావర్కర్‌ వంటి వారు లొంగిపోయి బ్రిటీష్‌ వారికి సేవ చేసుకుంటామని, విధేయతతో వుంటామని లేఖలు రాసి బయట పడ్డారు. ఇక వాజ్‌పేయి కోర్టులో చేసిన ప్రకటనలో తన పేరు ప్రస్తావించినందున సాక్ష్యంగా చెప్పకపోయినా తన శిక్షకు కారణం అది కూడా ఒకటని కకువా అనే లీలాధర్‌ అభిప్రాయపడ్డారు. దాన్నే కాంగ్రెస్‌ నాయకులు ప్రచారంలో పెట్టి వాజ్‌పేయి లొంగుబాటు కారణంగా స్వాతంత్య్ర సమర యోధులకు శిక్షలు పడ్డాయని ప్రకటనలు చేశారు. చాలా కాలం పాటు వాజ్‌పేయి క్విట్‌ ఇండియా వుద్యమంలో పాల్గొన్న సమర యోధుడని చేసిన ప్రచారం అవాస్తవమని తేలింది. తాను పాల్గొనలేదని, జరిగినదానితో జరిగినదానికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్వయంగా కోర్టులో ప్రకటన చేశారు. వాజ్‌పేయి గానీ మరొక నేత గానీ ఎవరి గురించి అయినా అతిశయోక్తులు ప్రచారం చేసుకోవటానికి కొందిరికి ఎలా స్వేచ్చ వుంటుందో విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించటానికి కూడా ఎవరికైనా అలాంటి స్వేచ్చే వుంటుంది. ఎవరూ చరిత్ర విశ్లేషణలు, విమర్శలకు అతీతులు కాదు. అది సభ్య సమాజం ఆమోదించిన పరిమితులకు లోబడి వుండాలి. సానుకూలంగా లేదా ప్రతికూలంగా చేసే విమర్శలు లేదా ఆరోపణలకు ఆధారాలు చూపగలిగి వుండాలి. మేం చెప్పింది మా నమ్మకం, విశ్వాసం, ఇతరులు మా మనోభావాలను దెబ్బతీస్తున్నారంటే కుదరదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రేమతో ఆవుల బహుమతి: నరేంద్రమోడీ ర్వాండా గో మాంస ప్రియుల సంతుష్టీకరణ దౌత్యం !

26 Thursday Jul 2018

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, RELIGION

≈ Leave a comment

Tags

cows, Girinka, Girinka Programme, Modi, Modi gifts 200 cows, Rwanda

ఎం కోటేశ్వరరావు

విదేశీ పర్యటనల సమయంలో లేదా విదేశీ అతిధులు మన దేశాన్ని సందర్శించినపుడు మన ప్రధాని నరేంద్రమోడీ అందచేసే బహుమతుల గురించి ఒక పెద్ద పరిశోధనే చేయవచ్చునంటే అతిశయోక్తి కాదు. ఆయన రూటే వేరు. కాదేదీ కవిత కనర్హం అన్నట్లుగా ఆవులతో కూడా దౌత్యనీతిని ప్రదర్శించవచ్చని తొలిసారిగా ప్రపంచానికి చాటి చెప్పిన రాజనీతిజ్ఞుడిగా కూడా చరిత్రకెక్కారు. దేశంలో మోడీ మాతృసంస్ధ సంఘపరివార్‌, దాని అనుబంధ రాజకీయ, ఇతర సంస్ధల కార్యకర్తలందరూ ‘గోరక్షణ కర్తవ్యం పేరుతో’ ముస్లింలపై మూకదాడులు, హత్యలకు పాల్పడుతున్నారు. గోరక్షణకు కంకణం కట్టుకున్నానని నమ్మబలుకుతున్న నరేంద్రమోడీ దేశ ప్రజల అదృష్టం లేదా ఖర్మకొద్దీ ప్రధానిగా వున్నందున ప్రస్తుతానికి గోరక్షణ కార్యక్రమాలలో పాల్గనే అవకాశాలు లేవు. విదేశీ అతిధులు మన దేశానికి వచ్చినా, నరేంద్రమోడీ విదేశీ పర్యటనలు జరిపినా పురుష నేతల భుజాలపై చేతులు వేయటం లేదా కౌగలించుకొని ఎంతో ఆత్మీయతను ప్రదర్శించటం తెలిసిందే. బ్రిక్స్‌ సమావేశంలో పాల్గనేందుకు దక్షిణాఫ్రికా వెళుతూ దానితో పాటు కోటీ 20లక్షల జనాభా వున్న ర్వాండా అనే దేశాన్ని సందర్శించిన మోడీ అక్కడి వారికి 200 ఆవులను బహుమతిగా ఇచ్చి ఇటు జాతీయంగా ప్రతిపక్షాల వారిని అటు అంతర్జాతీయంగా తామే తిరుగులేని తలపండిన పెద్ద దౌత్యవేత్తలమని విర్రవీగుతున్న వారిని కూడా ఆశ్చర్యపరుస్తూ కొత్త వరవడికి శ్రీకారం చుట్టారని చెప్పకతప్పదు. ర్వాండా అధ్యక్షుడికి గోవుల పంపిణీ ఇష్టమని మనసెరిగి గోపాలుడి అవతారమెత్తిన నరేంద్రమోడీ ఒక గ్రామానికి ప్రత్యేకంగా వెళ్లి కార్యక్రమంలో పాల్గని ఆ దేశాధ్యక్షుడిని పడేశారు.

మోడీ ప్రయాణించే విమానంలో మన దేశం నుంచి గోవులను రవాణా చేయటం కుదరదు, ఇక్కడి హిందూ గోమాతలు ఆఫ్రికా వాతావరణానికి సరిపడతాయో లేదో తెలియదు, అన్నింటికీ మించి అక్కడి క్రైస్తవ, ముస్లిం ఆచార వ్యవహారాలతో సరిపడక వాటి మనోభావాలు దెబ్బతినవచ్చు. సంకరంతో వ్రతం చెడవచ్చు. అందువలన ఎవరి మనోభావాలకు దెబ్బతగుల కుండా స్ధానికంగా దొరికే మెజారిటీ క్రైస్తవ గోమాతలనే కొనుగోలు చేయించి వాటిని అక్కడి వారికి బహుమతిగా ఇచ్చి ర్వాండాతో సంబంధాలను మెరుగుపరచుకొనేందుకు ప్రయత్నించారు. ఆ దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధానిగా చరిత్రకెక్కారు.

ర్వాండా పేదల సంక్షేమ పధకాలలో భాగంగా గిరింకా పేరుతో అధ్యక్షుడు పాల్‌ కగామే ఆవుల పంపిణీ పధకం చేపట్టినట్లు మోడీ సర్కార్‌ తెలుసుకుంది. అందువలన దానికి సంబంధించిన బహుమతి ఇచ్చి అక్కడి ప్రభుత్వాన్ని ఆకట్టుకోవచ్చని మోడీ సలహాదారులు భావించి వుండాలి.ఆవుల పంపిణీ కార్యక్రమంపై ర్వాండా అధ్యక్షుకి స్వయంగా ఆసక్తి వున్నందున దానిలో మన దేశం కూడా భాగస్వామి కావటం ప్రాముఖ్యత సంతరించుకుందని విదేశీ వ్యవహారాల ఆర్ధిక సంబంధాల కార్యదర్శి టిఎస్‌ తిరుమూర్తి విలేకర్లతో స్వయంగా చెప్పారు. దాని ఫలితమే ఆవుల బహుమతి. ర్వాండాతో సోదర, సౌహార్ధ్ర సంబంధాల మెరుగుదలకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

గిరింకా పధకం ప్రకారం ప్రభుత్వం పేదలకు ఆవులను బహుమతిగా ఇస్తుంది. వాటిని పొందిన వారు సదరు ఆవులకు పెయ్య దూడలు పుడితే వాటిని పొరుగు పేదలకు బహుమతిగా ఇవ్వాలి. ఇలా మూడున్నరలక్షల ఆవులను పంపిణీ చేయాలని అధ్యక్షుడు నిర్ణయించాడు. ఆవుల పధకంతో కుటుంబాలకు అవసరమైన పాలతో పాటు వ్యవసాయానికి కావాల్సిన ఎరువు సమకూరుతుంది, వట్టిపోయిన తరువాత ఆవులను, కోడెదూడలను మాంసానికి వినియోగిస్తారు కావున పోషకాహారలేమితో బాధపడుతున్న దేశంలోని పిల్లలకు దానిని సరఫరా చేయాలన్నది ఆ పధక లక్ష్యం. ర్వాండా జనాభాలో అత్యధికులు క్రైస్తవులు. వారి ఆహారంలో గొడ్డు మాంసం ముఖ్యమైనది. మనకు ప్రతి వూరిలో హోటల్‌లో ఇడ్లీ, దోసె దొరికినట్లుగా అక్కడ అది దొరుకుతుంది.

గో గూండాలు మరోమారు విజృంభించి మరొకరి ప్రాణం తీసిన వుదంతం మీడియాలో ప్రముఖంగా వచ్చిన తరుణంలోనే మోడీ గో దౌత్యం గురించి కూడా ఆ వార్తలతో పాటు దీన్ని చదువుకున్నాం గోవధను ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో నిషేధించారు, దేశమంతటా అమలు చేయాలని హిందూత్వ శక్తులు పట్టుబడుతున్న తరుణంలో దానికి అనుగుణంగానే గో గూండాలు చెలరేగుతున్నారు. మూక హత్యలు పెరిగిపోతున్నాయి. అలాంటి దేశానికి అసలు సిసలైన ప్రతినిధిని అని చెప్పుకుంటున్న మోడీ గొడ్డు మాంసం లేనిదే ముద్ద దిగని దేశంలో ఆవులను బహుమతిగా ఇవ్వటంపై గో అభిమానులే పరిహాసాలాడుతున్నారు.కోరిన చెయ్యే కొట్టు, కొట్టిన చెయ్యే కోరు అన్నట్లు పేటెంట్‌ కలిగి వుండకపోయినా గోవుల స్వంతదారుల మాదిరి ప్రవర్తిస్తున్నవారు ఏం చేసినా తప్పులేదని ఎవరైనా వాదించినా ఆశ్చర్యం లేదు.

‘ బుగెసెరాలో ఏర్పాటవుతున్న అతి పెద్ద గోమాంస(పరిశ్రమ) కబేళాకు ప్రేమతో 200 గోవులను బహుమతిగా ఇచ్చిన నరేంద్రమోడీ ‘ అన్నది వాటిలో ఒకటి. పన్నెండు వేల ఎకరాల విస్తీర్ణంలో గోవులు, ఇతర పశుసంపదను పెంచి, వాటి నుంచి మాంసం వుత్పత్తి చేసేందుకు ఒక పెద్ద పరిశ్రమ బుగెసెరా అనే చోట దశలవారీ ఏర్పాటు అవుతున్నది. దానికి దేశాధ్యక్షుడు పాల్‌ కగామే అనుమతి ఇచ్చారు. ఏటా 1200 గోవులతో ప్రారంభమై 2018నాటికి మూడువేల స్ధాయికి పెంచనున్నట్లు ప్రభుత్వమే ప్రకటించింది. ఒక్కో ఆవు నుంచి 160కిలోల మాంసం తయారవుతుంది. దేశం మొత్తంలో 2015లో 86వేల టన్నులుగా వున్న వుత్పత్తిని 2018 నాటికి 2,30,000 టన్నులకు పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ప్రతి పశువును 120 రోజులు బాగా మేపి తరువాత కబేళాకు తరలిస్తారు. గో మాంస ఎగుమతులకు బుగెసెరాలో ఏర్పాటు కానున్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా వినియోగించుకుంటారు. గోవులను పెంచేందుకు, కబేళాల ఏర్పాటుకు ప్రభుత్వమే భూములను కౌలుకు ఇస్తుంది.

‘ మోడీ ర్వాండాకు 200 గోవులను బహుమతిగా ఇవ్వటం కొంత గందరగోళం కలిగిస్తోంది. ఆ దేశంలో ప్రతి చోటా ఆవులు వుండాలని ఆరు కోరుకుంటారు, ప్రత్యేకించి భోజన బల్లల మీద, త్వరిత గతిన దూకే గోరక్షక దళాన్ని ఏర్పాటు చేయాల్సి రావచ్చు, వారిని తెల్లవారే సరికి పారా చూట్ల ద్వారా దించటాన్ని నేను చూడగలను’

‘ గోరక్షకులందరికీ సామూహిక అప్రమత్త సందేశం, ర్వాండాలో ఈ ఆవులను రక్షించేందుకు దయచేసి వెళ్లండి, వెళ్లండి, ఇప్పుడే వెళ్లండి’ ‘ ర్వాండాకు రెండువందల ఆవులను తరలిస్తున్న స్మగ్లర్‌ కనిపించాడు.’ ‘ ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి రెండు ఆవులను తరలిస్తున్న ఒక వ్యక్తిని వధించారు, మరొక వ్యక్తి 200 ఆవులను భారత్‌ నుంచి ర్వాండాకు తరలిస్తున్నట్లు నేను ఇప్పుడే విన్నాను. అయితే అతనికేమీ కాకూడదని ఆశిస్తున్నాను, అతని కోసం నేను ప్రార్ధిస్తాను.’ ‘200 ఆవులను ర్వాండాకు స్మగ్లింగ్‌ చేస్తున్నందుకు యునెస్కో మోడీకి అతి పెద్ద ఆవుల స్మగ్లర్‌ అనే అవార్డు ఇచ్చింది. వావ్‌ మోడీ వావ్‌, ప్రియమైన భక్తులారా మన ప్రధానిని వధించవద్దు, ఎందుకంటే ఆయన భాగీదారు తప్ప చౌకీదారు కాదు ‘

మాంసం కోసం లేత ఆవులు, కోడె దూడలను వధించటం, అతిధులకు దానిని వడ్డించటం ఒక మర్యాదగా మన దేశంలో ఒకప్పుడు విలసిల్లింది. మా మనోభావాలను గాయపరిచారనే పేరుతో పుక్కిటి పురాణ పాత్రలను విమర్శిస్తే కేసులు నమోదు చేస్తున్నారు. దాడులకు తెగబడుతున్నారు. ఆవు పేరుతో ఎలాంటి తప్పు చేయని ఒక మనిషిని మూకదాడిలో చంపితే తోటి మనుషుల మనోభావాలు దెబ్బతినకపోగా మరింతగా జరగాలని ప్రోత్సహిస్తున్నవాతావరణం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇది సామూహిక వున్మాదం తప్ప వ్యక్తిపరమైన సమస్య కాదు.వ్యక్తికి, ఇంటికి పరిమితం చేయాల్సిన దేవుడు, దేవతలను ఓట్లకోసం వీధుల్లోకి తెచ్చారు. దాని కొనసాగింపుగానే ఆవును గోమాతను, దేవతను చేశారు. ఓట్ల కోసం మన దేశంలో ఆహారం కోసం గోవును వధించకూడదని నానా రాద్దాంతం చేస్తున్న వారు, మరో దేశంలో మార్కెట్‌, పెట్టుబడుల కోసం పడుతున్న పాట్లలో భాగంగా అక్కడ గోవులను తింటారని, ఆ దేశాధ్యక్షుడికి గోపంపిణీ అంటే ప్రీతి అని తెలిసి గోవులనే బహమతులుగా ఇచ్చిన ప్రధాని నరేంద్రమోడీ మనోభావాలు ఏమైనట్లు? ప్రతిదానికీ మా మనోభావాలు గాయపడ్డాయంటూ నానా యాగీ చేస్తున్న వారు ఇప్పుడేమంటారు? ఇప్పుడేం చేస్తారు? ప్రాణ, విత్త, మానభంగములందు ఆడి తప్పవచ్చు అని మినహాయింపులిచ్చినట్లుగానే పెట్టుబడిదారులు, వ్యాపారుల లాభాల కోసం వధిస్తారని తెలిసీ నరేంద్రమోడీ గోవులను బహుమతిగా ఇచ్చినపుడు, జీవనోపాధికోసం తప్ప వధించటానికి కాదు మేము గోవులను కొనేదీ అమ్మేదీ అని నెత్తీ నోరు కొట్టుకుంటున్న ముస్లింల గోడును ఆయన అనుయాయులు, మద్దతుదారులు ఎందుకు పట్టించుకోరు? మోడీ మాదిరి మనోభావాలకు అతీతంగా వ్యవహరించలేరా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

శూద్ర కులాలను రామాయణం ఎందుకు అవమానించింది ?

09 Monday Jul 2018

Posted by raomk in Communalism, Current Affairs, INDIA, Literature., Opinion, RELIGION

≈ Leave a comment

Tags

Ramayana epic, shudras, why ramayana epic insults shudras

Image result for why ramayana epic insults shudras

డాక్టర్‌ కదిరె కృష్ణ

ఈనెల 7వ తేదీన ప్రముఖ రచయిత వనం జ్వాలా నరసింహారావు ”వాల్మీకి బోయవాడేనా?” అన్న శీర్షికతో నవ తెలంగాణలో అచ్చయిన నా వ్యాసానికి స్పందిస్తూ ”వాల్మీకి రామాయణంలో ఏముంది?” శీర్షికన మరో వ్యాసం రాశారు. వాల్మీకిని బోయవాడుగా ఎందుకు చేశారు? అనే నా ప్రశ్నకి సమాధానం అన్నట్టు రామాయణం రాసినవాడు బోయవాడా? బ్రాహ్మణుడా అనే కంటే ఆయన రామాయణంలో ఏముంది? అది ఎందుకు అవశ్యపఠనీయం? అనే దృష్టితో పటిస్తేకానీ దానిలోని తత్వం బోధపడదు అంటూ సెలవిచ్చారు. దరిమిలా రామాయణాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసే ప్రయత్నం చేశాను. నా అజ్ఞానాన్ని మరోసారి రామాయణ పారాయణంతో కడిగేసుకుందామనీ కృషిచేసాను. లాభంలేకపోయింది! తిరిగేసి మర్రేసి చదివినా నరసింహరావుగారు అన్న మంత్ర పూతం, ఉపనిషత్‌ సారం, అంత:కరణ శుద్ది మహత్వం ఏమీ కనిపించలేదు. పైగా రామాయణం చదివినంతసేపు మనోవేదనకు గురియ్యాను. ఈ కావ్యం శూద్రాతి శూద్ర కులాలను/జాతులను ఘోరంగా అవమానించింది. బాలకాండ మొదలుకొని యుద్దకాండ వరకు (పూర్వ ఉత్తరాకాండ సహా) బ్రాహ్మణాధిక్యత, ఆర్య రాజ్య విస్తరణ తప్ప మరో శాస్త్ర మర్మం నాకు ఇందులో కనిపించలేదు.
రామాయణం, వర్ణ ధర్మాన్ని కాపాడటానికి వ్రాయబడ్డదని ఇప్పటికే మహాత్మాపూలే, డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌, పెరియార్‌ ఇ.వి. రామస్వామి సవివరణాత్మకంగా నిరూపించారు. అయినా వీరి వాధనలతో తృప్తి చెందకనే రామాయణం సభక్తితో పఠిస్తుంటే భక్తిరసం భగమై జాతి వివక్ష, అకారణ హింస నా జాతి కడగండ్లు కండ్లముందు సాక్షాత్కారమై కన్నీటి పర్యంతమయ్యాను. నా నోట ”మానిషాద…” శ్లోకం రాలేదు, నా శోకమూ ఆరలేదు. రామాయణంలోని బాలకాండ ప్రథమ సర్గలో వాల్మీకి ఫలశ్రుతిని ఇలా చెప్పారు ”పఠన్‌ ద్విజో వాగృష భత్వమీయాత్‌/ స్యాత్‌ క్షత్రియో భూమిపతిత్వ మీయాత్‌/వణిగ్జన: పణ్యఫలత్వ మీయాత్‌/ జనశ్చశూద్రో2పి మహత్వమీయాత్‌” అనగా ”రామాయణం పఠించిన ద్విజులు వేదవేదాంగముల యందును, శాస్త్రములలోనూ పండితులగుదురు. క్షత్రియులు, రాజ్యాధికారమును పొందుదురు. వైశ్యులకు వ్యాపార లాభము కలుగును.
శూద్రులు పై వారికి సేవ చేసిన మహత్వమును పొందుదురు”. వివిక్ష ఎంత స్పష్టంగా ఉందో పై శ్లోకమే రూఢి చేస్తుంది. రామాయణం పఠించినా శూద్రుడు పండితుడు కాలేడు. రాజ్యాధికార ప్రసక్తి లేనేలేదని పై వాక్యాలు స్పష్టంగానే ప్రవచిస్తున్నాయి. అందరికీ రామాయణం ఒకే ఫలాన్ని ఎందుకు ఇవ్వడంలేదు? ఆ కావ్యానికి ఆ వాల్మీకికి ఎందుకింత వివిక్ష శూద్రులమీద ఈ విషయాలేమీ తెలుసుకోలేక ప్రస్తుతం శూద్రులే (బి.సి.లు) ఈ రామాయణాన్ని, ఆ దేవుడ్ని భుజాలు కాయలు కాసేలా మోస్తున్నారు. వాస్తవాన్ని జాతికి తెలియజేయాల్సిన అవసరం
ఉన్నదనేదే నా వ్యాస ఫలశృతి. జ్వాలా నరసింహారావుకి చివరికి ఇందులో గాయత్రి మంత్ర మహత్వం గోచరించింది. ఆయన ఈ విషయాన్ని తన వ్యాసంలో వివరించారు. వనం వారిది ఆర్య బ్రాహ్మణ దృష్టి. మసి పూసి మారేడుకాయలు చేసే జంతర్‌మంతర వాదన. శూద్రునికి ఇలాంటి గతి ఎందుకు పట్టింది అని ఆలోచించే బదులు గాయత్రి చివరి అక్షరంతో ముగించాడని పై శ్లోకానికి పవిత్రత, ఆధ్యాత్మికత జోడించే ప్రయత్నం చేశాడు. ఇదే మనువాదం, మయావాదం. ఇంకా వనం వారికి జ్ఞానోదయం కలిగించే శ్లోకం అదే సర్గ నుండి ”చాతుర్వర్ణ్యం చ లోకే 2 అస్మిన్‌ స్వేస్వే ధర్మే నియోక్ష్యతి” అంటే చాతుర్వర్ణ్యాలను సధర్మంగా నడపడమే రామాయణపు అంతిమ లక్ష్యం. రాముడు, బ్రాహ్మణులకు ఎందుకింత ప్రీతిపాత్రుడయ్యాడు? అతనికి ఎందుకంతగా దైవకత్వాన్ని ఆపాదించారు. ఈ ప్రశ్నకు బాలకాండలోనే మళ్ళీ సమాధానం దొరుకుతుంది. ”గవాం కోట్యయుతం దత్వా విద్వద్భ్యో విధి పూర్వకమ్‌/ అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశా:” దీనిర్ధం కోట్లాది గోవులను అపరిమితమైన ధనధాన్యములను రాముడు, బ్రాహ్మణులకు దానిమిచ్చును. కేవలం ఆర్యుడైనందుకేకాదు బ్రాహ్మణులకు సంతర్పణలు సజావుగా సాగించినందుకు ఆయన దైవత్వాన్ని పొందాడు.
అసలు బ్రాహ్మణ రక్షణార్దమే జన్మించానని శ్రీరాముడు ప్రకటించినందుకు ఆయన్ని దేవుణ్ణి ఆ కావ్యాన్ని మహత్వం గల రచనగా వృద్ది చేసి ప్రచారం చేసి కట్టుకథలకు రంగులు పూసిన ఘటికులు ఈ ఆర్య బ్రాహ్మణులు. రాముడు పితృవాక్య పాలకుడు అంటారు. అంటే బ్రాహ్మణులను నెత్తికెత్తుకొనేవాడని అసలు రహస్యం. బయటకు చెప్పేది అంతగా సరిపోయేలాలేదనడానికి ఈ కావ్యంలోనే సాక్ష్యాలున్నాయి. కోసలను పరిపాలించిన దశరధుడు అతని రాజధాని అయోద్య, ఆయన పాలనలోని ప్రజా వర్ణన మనకు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తాయి. అయోధ్యను ఎవరు నిర్మించారు? ”అయోధ్య నామ నగరీ తత్రాసీల్లోక విశ్రుతా/ మనునా మానవేంద్రేణయాపురీ నిర్మితా స్వయమ్‌” మనువు నిర్మించాడని రామాయణం చెబుతుంది. మనువు నిర్మించిన నగరంలో మూలవాసి బహుజనులకు ఏ స్థానం ఉంటుందో గ్రహించడం పెద్ద కష్టమేమీకాదు. ఇంతటి కుల వివక్షకు భారతీయ సమాజ విధ్వంసానికి కారకుడైన మనవు నిర్మించిన పట్టణంలో శూద్రుల పరిస్థితిని సులభంగానే పసిగట్టగలం. ఆ నగరంలోని బ్రాహ్మణులు మహా పండితులట. క్షత్రియులు, బ్రాహ్మణుల యెడల గౌరవము కలిగి ఉండేవారట. వర్ణ సంకరులు లేనేలేరట (కశ్చిదాసీ దయోధ్యాయాం న చ నిర్వృత్త సంకర:) అంటే వర్ణ వ్యవస్థను చాలా భద్రంగా కాపాడుకున్నరాజు దశరధుడు. వర్ణ సంకరం తప్పా? తప్పనే చెబుతుంది రామాయణం. అంతటి మహాపట్టణంలో నా ప్రజలు ఎంతటి గౌరవాన్ని పొందారోనని మరింత కుతూహలంతో ఇంకా శ్రద్దగా చదివాను. అయ్యో! గుండె లక్షముక్కలయ్యింది. ఇప్పుడు కన్నీళ్ళ బదులు నెత్తురు కారే వాతావరణం నెలకొన్నది. ”శూద్రా: స్వధర్మనిరతా: త్రీన్‌ వర్ణానుపచారిణ:” అంటూ శ్లోకం తగలనే తగిలింది. ప్రొ|| కంచె ఐలయ్య చెప్పినట్టు ”స్వయం గౌరవంలేని జీవితాలనే మాకు తగిలించారు తప్ప వృత్తి గౌరవంగానీ సామాజిక గౌరవంగానీ ఈ జాతులకు కల్పించే ఔదార్యం ఈ బ్రాహ్మణ గ్రంధాలకు గానీ, బ్రాహ్మణ రచయితలకుగానీ లేదు”. ఇంతకీ పై పద్యానికి అర్ధం ఏమిటంటే అయోధ్యనగరంలోని శూద్రులు తమ తమ ధర్మములను ఆచరించుచూ, పై మూడు వర్ణముల (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య) వారిని సేవించిచుండెడివారు. ఈ శ్లోకార్ధం బోధపడ్డాక మనస్సు కకలావికలంకాక మరేమవుతుంది. నెత్తురు సలసలకాగింది. కడలి కల్లోలం అయ్యింది.
వనం వారు ఈ ఆక్రోశాన్ని, ఆవేదనను, తీవ్రవాదమో, నాస్తికవాదమో, చాదస్తమోనని కొట్టిపారేస్తారేమో!? విషయానికొస్తే దశరధుడు ఏ విధంగానైతే వర్ణ ధర్మాన్ని తూ.చ. తప్పకుండా పాటిస్తూ వర్ణ ధర్మాన్ని అతిక్రమించే ప్రశ్నేలేని శిక్షలు విధిస్తూ రాజ్య పాలన చేశాడో, రాముడు కూడా అలాగే నూటికి నూరు పాలు ఆచరించి చూపాడు. అందుకే ఆయన పితృవాక్య పాలకుడయ్యాడు. నా వాదానికి బలమైన సాక్ష్యాన్ని రామాయణంలో బాలకాండ నుండే గ్రహించాను. రాముడు, తాటకను సంహరించే సందర్భంలో ”గో బ్రాహ్మణ హితార్ధాయ దేశస్యాస్య సుఖాయచ / తవ చైవా ప్రమేయస్య వచనం కర్తు ముద్యత:” అంటాడు. ఈ శ్లోక భావము ఏమంటే గో రక్షణము, బ్రాహ్మణుల హితము… కొరకు మీ వచనమును (మాటలను) పాటించుచూ ఈ తాటకను చంపుటకు పూనుకొనుచున్నాను అని రాముడు విశ్వామిత్రుడితో చెప్తాడు. ఇదే పితృవాక్య పాలన అంటే. (పితుర్వచన నిర్దేశాత్‌, పితుర్వచన గౌరవాత్‌). ఇంకా స్పష్టత కావాలంటారా వనం నరసింహారావు పండితోత్తమా!? ఈ దేశ మూలవాసి మహారాణి, నేటి శూద్రాతిశూద్ర కులాల ప్రతినిధి అయిన తాటకిని చంపడం పితృవాక్య పాలనేనా? అంటే స్త్రీలను చంపటం, మాతృస్వామ్య రాజ్యాలను ద్వంసం చేయడం పితృవాక్యపాలనన్నమాట. అలాగే మాతృస్వామ్య వ్యవస్థ నిర్మాతలైన మూలవాసీ భారతీయ తత్త్వ విరోధి, విద్వంశకుడు, పితృస్వామ్య పాలకుడు ఈ దేశ స్త్రీలకు ఎలా దైవంగా మారాడే నేటి మహిళా మేధావులకు ఇంకా బోధపడకపోవడానికి కారణం? అలాగే ఇహపర లోకాల్లో సుఖపడాలనుకునేవారికి రామాయణ పఠనమే అవశ్యకర్తవ్యమని ప్రబోధించాడు మహానుభావుడు వనం జ్వాలా నర్సింహారావు. ఈలోకంలోనే ఇలా వెట్టి చాకిరీతో సుఖపెట్టిన శూద్రాతి శూద్ర జాతులను పరలోకంలో ఎంత సుఖపెడతారో చాలానే అర్దమవుతుంది. దశరధుని రాజ్యంలో బ్రాహ్మణుల భోగలాలసత్వానికి, ధనధాన్యాలకు, గోదానాలకు, కొదవేలేదు. బ్రాహ్మణుల ఆదిక్యతను తెలిపే కథను ఒకదాన్ని రామాయణ బాలకాండ వివరిస్తుంది. అది ”రుష్యశృంగుని కథ” పూర్వం అంగరాజ్యాన్ని రోమపాదుడు పాలించే క్రమంలో అతడు ధర్మం తప్పాడట. ధర్మం తప్పడం అంటే బ్రాహ్మణులను తృప్తిపరచకపోవడం, వర్ణ ధర్మాన్ని పాటించకపోవడం. బహుశా రోమపాదుడు సమానత్వం, ప్రజాస్వామ్యం పట్ల ఆసక్తి చూపెట్టి ఉంటాడు. అయితే కొంతకాలానికి వర్షాలు లేక కరువు వచ్చిందట. దానికి కారణం వర్ణ ధర్మాన్ని విస్మరించడమేనని బ్రాహ్మణులు ప్రచారం చేశారు. రోమపాదుడు బుద్దిష్ట్‌ లేదా జైనమతస్తుడై ఉంటాడు. ఆ ప్రచారంతో రాజ్యంలో కలకలం రేగేలా చేశారు. దానికి పరిష్కారం బ్రాహ్మణుడు, యజ్ఞకర్మల్లో నిష్ణాతుడైన రుష్యశృంగున్ని ఆహ్వానించి యజ్ఞం చేయించడమేనని నమ్మబలికారు.
చివరికి రోమపాదుడు బ్రాహ్మణ తంత్రానికి తలొగ్గక తప్పలేదు. రుష్యశృంగుడు రాజ్యంలో అడుగు పెట్టగానే వర్షం భీకరంగా కురిసిందట. దానికి రాజు తృప్తిపడి విపరీత దానాలతో పాటు కూతురునిచ్చి వివాహం చేశాడట. ఈ మోసపూరిత కథ ద్వారా వారిచ్చే సందేశం ఏమంటే బ్రాహ్మణులు పరమ పవిత్రులని. వారు రాజ్యంలో ఉంటే రాజ్యంలో వర్షాలు కురవడం, సుభిక్షంగా ఉండటం. ఇక్కడ రెండు ప్రశ్నలు 1) వర్ణ సంకరాన్ని వ్యతిరేకించే రామాయణం, బ్రాహ్మణుడైన రుష్య శృంగునికి క్షత్రియుడైన రోమపాదుడు కూతురునిచ్చి వివాహం చేయడాన్ని ఎలా సమర్ధించింది? 2) వర్ణ సంకరమే రుచించని దశరధుడు, వర్ణ సంకరానికి పాల్పడిన రుష్యశృంగుని ఆధ్వర్యంలో పుత్ర కామేష్టి యాగం ఎలా చేశాడు? అప్పుడు దశరధుని గురించి రామాయణం చెప్పింది శుద్ద తప్పు కదా? ఈ కథను ప్రచారం చేసి మొత్తం రాజ్యంలోని బ్రాహ్మణులు తిరుగులేని ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు. ఇలాంటి ఉన్నత స్థానం బ్రాహ్మణులకిచ్చి నీచస్థానం శూద్రులకిచ్చిన రామాయణం నరసింహారావుగారు అన్నట్టు నా చాలా సందేహాలను నివృత్తి చేసింది. రామాయణం ద్వారా ఆర్యులు సాధించదలచుకున్న ప్రయోజనాలు చాల ానే
ఉన్నాయి. మాతృస్వామ్యాన్ని నాశనం చేయడం, క్షత్రియులపైన స్థానాన్ని ఆక్రమించుకోవడం (క్షత్రియుల స్థానాన్ని దిగువకు నెట్టివేయడం రామాయణంలో చాలా చోట్ల కన్పిస్తుంది)” మరో ముఖ్యమైన ప్రయోజనం మూలవాసి చక్రవర్తులను హతమార్చి ధర్మ పరిరక్షకులుగా కీర్తించబడటం. డా|| ఎస్‌.వి. రారు ”సింధూ నాగరికతకు ప్రధానమైన మొహెంజోదారోను జయించడానికి ఆర్యులు చేసిన యుద్దం చుట్టూ రామకథను అల్లారు” అంటాడు. అంతేగాక దక్షిణ భారతదేశంలోకి ఆర్య సంస్కృతిని, ఆర్యుల దురాక్రమణను పరోక్ష రూపంలో వనవాసం పేరుతో దండయాత్రగా సాగించాడు రాముడు. అందుకు వాల్మీకి రామాయణంలోని బాలకాండనే ప్రత్యక్షసాక్ష్యం. రాముడు తనసహచరి సీతతో, లక్ష్మణుని కలుపుకుని దండకారణ్యంలోకి ప్రవేశించాడు. నేటి దండకారణ్యమే ఆనాటిది కూడా. ఆ దండకారణ్యంలోకి రాముడు ఎందుకు ప్రవేశిస్తాడు. ఆరాజ్యం రాముడిది కాదు.
పరాయి రాజ్యంలోకి అక్రమంగా ప్రవేశించే అర్హత మరో రాజుకు ఉంటుందా? ఇది రాజనీతి అవుతుందా? మూల వాసీ చక్రవర్తి రావణుడు ఆ రాజ్యాధిపతి. అందుకు ఈ శ్లోకమే నిర్ధారణ. ”తేన తత్రైవ వసతా జనస్థాన వాసినీ” (బాలకాండ 1వ సర్గ 46వ శ్లోకం) దండకారణ్యంలో జనస్థానమనే ప్రాంతం ఉంది. అది రావణుని రాజ్యంలో భాగం.
ఆ రాజ్యానికి శూర్పణఖ రక్షకాధిపతి. ఆ ప్రాంతంలో ఆర్యులు అక్రమంగా ఆశ్రమాల నెపంతో దురాక్రమణ చేస్తుంటే సహజంగానే శూర్పణఖ వారిని తరిమి కొడుతుంది. ఇది ఏరాజైనా, రాణైనా చేసే రాజనీతి. ఆర్యులు వెంటనే దండకారణ్య సమీపంలోని రామున్ని దర్శించారు. రెచ్చగొట్టారు. రాముడు దండకార్యాన్ని ఆక్రమించి ఆ ప్రాంతం నుండి రక్షసులను (రాక్షసులనేది వారి భాష) ఆ ప్రాంతం నుండి తరిమి వేస్తానని ప్రతినబూనాడు. దండకారణ్యంలోకి ప్రవేశించాడు. అంతే సహజంగా రక్షసులు వీరి ప్రవేశాన్ని ఎదిరించారు. వరుసగా అడ్డుకున్నవారందరిని హతమార్చాడు రాముడు. క్రూరాతిక్రూరంగా రాజనీతికి, యుద్ధ నీతికి వ్యతిరేకంగా ఈ హింసాకాండ జరుగుతున్న తీరుకు సీత చలించిపోయింది. ఎంతైనా తల్లి హృదయం కదా! ఆమె, రాముణ్ణి నివారించే ప్రయత్నం చేసింది. అకారణంగా ఈ అటవీ రక్షకులను సంహరించడం అన్యాయం అని అర్దించింది. ఈ సందర్భంలో సీతామాత పలికిన దయార్ద్ర వచనములు రామునికి చెవికెక్కలేదు. ”ప్రతిజ్ఞా తస్త్వయా, వీర! దండకారణ్య వాసినామ్‌/ ఋషీణాం రక్షణార్ధాయా వధస్సంయతి రక్షసామ్‌” ఇది దండకారణ్యమ్‌ ఇది వారి నివాస స్థలం (రాక్షసులు). వారు ఇక్కడ నివసించడమే ధర్మం. వారి ప్రాంతంలోనికి అనధికారికంగా ప్రవేశించి వారినే సంహరించడం అధర్మం. ఏ వైర భావం లేకున్నను వీరిని హతమార్చుట తగునా? అని ప్రశ్నించడమే పై శ్లోకం. సీత మరింత లోతుగా న్యాయాన్యాయ వివేచన, ధర్మాధర్మ ఆచరణ నిబద్దతను స్పృశించింది. ”క్వచ శస్త్రం క్వచ వనం క్వచక్షాత్రం తప: క్వచ/ వ్యావిద్దమిదమ స్మాభి: దేశ ధర్మస్తు పూజ్యతామ్‌” (అరణ్యకాండ తొమ్మిదో సర్గ 27వ శ్లోకం). అంటే మనమిప్పుడు వనవాసంలో ఉన్నాం. వన జీవన ధర్మమగు తప: వృత్తిని ఆచరించాలి. అలా కాక అస్త్రము ధరించి ఇలా హత్యా కాండకు పూనుకొనడం సరికాదు. శస్త్రదారణమెక్కడీ వనవాసమెక్కడీ క్షత్రియ ధర్మమెక్కడీ తపో వృత్తి యెక్కడీ ఇవి పరస్పర విరుద్దములు. కావాలంటే అయోధ్య చేరిన తరువాత వనవాసం ముగిసిన వెంటనే మీ క్షత్రియ ధర్మమైన యుద్దాన్ని కొనసాగించండి అంటూ మరోసారి ధర్మ పరిశీలన చేసింది.
ఈ మాటలు రాముడికి వంటబట్టలేదు. బ్రాహ్మణులకు మాట యిచ్చాను. ఏదిఏమైనా ఈ రాక్షసులను హతమార్చి తీరుతాను అంటూ ఆమె నోరు మూయించాడు. దండకారణ్య ప్రవేశాన్ని వ్యతిరేకించినందుకే రాముడు, శూర్పణఖ ముక్కు, చెవులు కోయించాడు. కామరూపత అనేది వట్టి శాకు. పిచ్చికుక్కను చేసి చంపే కుట్ర ఇందులో దాగి ఉంది. అంతేకాదు ఆ దండకారణ్య సైనాన్ని శ్రీరాముడు ఊచకోత కోశాడు.
(బాలకాండ 1వ సర్గ శ్లోకం 48) ”వనే తస్మిన్‌ నివసతా జనస్థాన నివాసినామ్‌ / రక్షసాం నిహతాన్యాసన్‌ సహస్రాణి చతుర్ధశ”. అనగా ఖరుడు, ధూషణుడు, త్రిశరుడు మొ|| వీర యోధులను దాదాపు 14 వేల మంది సైనాన్ని హతమార్చారు రామ లక్ష్మణులు. అక్రమంగా తమ రాజ్యంలోనికి ప్రవేశించి తమ సోదరి ముక్కు చెవులు కోసి 14 వేల మంది తమ సైన్యాన్ని నెత్తుటి యేరులో ముంచి నరమేదం సృష్టించినా రావణుడికి కోపం రాకూడదా? ఇప్పుడు పాకిస్తాన్‌ సరిహద్దుల్లో ఆ దేశం చేస్తున్న కవ్వింపు చర్యలే ఆనాటి ఆర్యులు చేసిన ఉదంతం ఇది. కాదంటారా నరసింహారావు తత్వ వివేచకా?! దీన్ని మాబోటి శూద్రులు ఏ దృష్టితో పారాయణం చేయమంటారు? ఈ నరమేధాన్ని ఎలా అర్ధం చేసుకోమంటారు? తప్పొప్పులను ఏ మర్మాలతో అంచనా కట్టమంటారు.
దీనికి కారణం ఏ వాల్మీక దృక్ఫధం నిర్వచిస్తుంది. చివరగా వాల్మీకి బోయవాడా? కాదా? తేల్చేందుకు నరసింహారావు ఒక కథను ఉటంకించారు. అందులో ఋషులకు ఎదురైన వాల్మీకిని నీచ బ్రాహ్మణుడా? అంటూ సంభోదిస్తారు. బోయవాని వేషంలో ఉన్న వాల్మీకిని బోయవాడా అని సంబోధించక బ్రాహ్మణుడా అని సంబోధించడంలోని మర్మమేమంటారు జ్వాలాగారు? ఇకనైనా చరిత్రలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుని శూద్రాతి శూద్రులకు ఈ ఆర్య గ్రంధాలు చేసిన అపరాదాన్ని నష్టాన్ని పూడ్చేందుకు ప్రయత్నించాలి. ఈ గ్రంధాల్లోని కుట్రలను గ్రహించి బహుజనులు ఏకమై రాజ్యాధికారం దిశగా సాగాలి. ఇదే పరిష్కారం.

డాక్టర్‌ కదిరె కృష్ణ పేస్‌ బుక్‌ పోస్టు సౌజన్యంతో

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • యోగులు-స్వాముల కొట్లాట : సిఎం ఆదిత్యనాధ్‌ను నకిలీ హిందువుగా ప్రకటిస్తా , శంకరాచార్య అవిముక్తేశ్వరానంద !
  • ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !
  • రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !
  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • యోగులు-స్వాముల కొట్లాట : సిఎం ఆదిత్యనాధ్‌ను నకిలీ హిందువుగా ప్రకటిస్తా , శంకరాచార్య అవిముక్తేశ్వరానంద !
  • ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !
  • రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !
  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • యోగులు-స్వాముల కొట్లాట : సిఎం ఆదిత్యనాధ్‌ను నకిలీ హిందువుగా ప్రకటిస్తా , శంకరాచార్య అవిముక్తేశ్వరానంద !
  • ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !
  • రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !
  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d