• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: USA

జనం చచ్చినా సరే -ఆర్ధిక వ్యవస్ధ ముఖ్యం అంటున్న ట్రంప్‌ !

24 Tuesday Mar 2020

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Coronavirus outbreak in US, Donald trump, Trump on COVID 19, USA COVID 19

Image result for WE CANNOT LET THE CURE BE WORSE THAN THE PROBLEM ITSELF: Donald trump
ఎం కోటేశ్వరరావు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ! కరోనా వైరస్‌ తీవ్రతను పట్టించుకోని అగ్రరాజ్య అధిపతి !! చైనా, ఇటలీ తరువాత మూడో స్ధానంలోకి చేరిన అమెరికా !!! వారం రోజుల క్రితం అమెరికాలో కరోనా మరణాలు 85, మంగళవారం రాత్రికి 622కు చేరిక, కోలుకున్న వారు 361 మంది. ఇదే వ్యవధిలో పాజిటివ్‌ కేసులు 4,600 నుంచి 49,594కు పెరిగాయి. సగం కేసులు న్యూయార్క్‌ నగరంలోనే నమోదయ్యాయి. రెండు వందల ఇరవై ఎనిమిది సంవత్సరాల న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ చరిత్రలో తొలిసారిగా సోమవారం నాడు వాణిజ్య కేంద్రం మూసివేత. ఉద్దీపన పధకానికి సెనెట్‌లో ఎదురుదెబ్బ తగిలింది.దాంతో ఫెడరల్‌ రిజర్వు(రిజర్వుబ్యాంకు వంటిది) రంగంలోకి అప్పులు, ఇతర ఆస్ధులను కొనుగోలు చేస్తామని ప్రకటించింది. దాంతో ఆసియాలోని స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే ఇది ఎంతకాలం పతనాన్ని ఆపుతుందన్నది ప్రశ్న.
ఒకవైపు గంట గంటకూ అమెరికాలో వైరస్‌ వ్యాప్తి పెరుగుతోంది. అయినా ” వ్యాధి తీవ్రత కంటే చికిత్స కఠినంగా ఉండకూడదు. పది హేను రోజుల తరువాత ఏ మార్గంలో మన పయనించాలనుకుంటున్నామో నిర్ణయిస్తాం ” అని ట్రంప్‌ ప్రకటించాడు. దీని అర్ధం ట్రంప్‌కు విలువైన మానవ ప్రాణాల కంటే కార్పొరేట్ల ప్రయోజనాలే ముఖ్యమని వేరే చెప్పనవసరం లేదు. సామాజికంగా జనం దూరం పాటించటం వలన కరోనా వైరస్‌ విస్తరణ తగ్గవచ్చు, కానీ ఆర్ధిక వ్యవస్ధ దెబ్బతింటోందనే భావం కార్పొరేట్ల నుంచి వెలువడుతోంది. ఈ నేపధ్యంలోనే సామాజికంగా దూరం పాటించాలన్న మార్గదర్శక సూత్రాలను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్‌ సూచన ప్రాయంగా తెలిపారు.బాధ్యతా రహితంగా ఏం మాట్లాడుతున్నాడో తెలియని ట్రంప్‌ తీరుతెన్నుల గురించి అడిగిన ఒక ప్రశ్నకు అంటువ్యాధుల జాతీయ సంస్ధ డైరెక్టర్‌ ఆంథోనీ ఫాసీ జవాబిస్తూ ”ట్రంప్‌ మాట్లాడుతుంటే ముందుకు దూకి ఆయనను పక్కకు తోసి మైకు లాక్కోలేను కదా ! మాట్లాడేదేదో మాట్లాడనివ్వండి, రెండవ సారి సరి చేస్తాం ” అని సైన్సు పత్రిక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు.
కరోనా సాయం పేరుతో సామాన్యులకు బదులు ఎన్నికల సమయంలో తనకు అనుకూల కార్పొరేట్లకు జనం సొమ్మును కట్టబెట్టే యత్నాలను డెమోక్రాట్లు అడ్డుకున్న పూర్వరంగంలో ట్రంప్‌ ప్రేలాపనలివి. అమెరికా కంటే తీవ్రంగా ప్రభావితమైన చైనాలో వైరస్‌ వ్యాప్తి కారణంగా ఆర్ధిక వ్యవస్ధ తీవ్రంగా ప్రభావితం అవుతున్నా ఖర్చుకు వెనకాడకుండా అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలకూ, ట్రంప్‌ వైఖరికి ఎంత తేడా ఉందో చూడవచ్చు. అదే జనం పట్ల నిబద్దత ఉన్న కమ్యూనిస్టులకు, కార్పొరేట్ల సేవలో తరించే పెట్టుబడిదారీ ప్రతినిధులకు ఉన్న వ్యత్యాసం. అమెరికాలో వేగంగా వైరస్‌ విస్తరిస్తున్న పూర్వరంగంలో ఇప్పటికే పది కోట్ల మంది స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. మరోవైపు దానికి వ్యతిరేకంగా ట్రంప్‌ మాట్లాడుతున్నాడు. ఇటలీ అనుభవాన్ని ఏమాత్రం పరిగణనలోకి తీసుకున్నా ఇలా వ్యవహరిస్తాడా ?

Image result for coronavirus Donald trump cartoons
తక్కువ ఆదాయం ఉన్న అమెరికన్లకు ఒక్కొక్కరికి పన్నెండు వందల డాలర్ల నగదు అందచేతతో సహా రెండు లక్షల కోట్ల డాలర్ల ఉద్దీపన పధకానికి ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. అయితే ఆసుపత్రులు, నగరాలు, రాష్ట్రాలు, వైద్య సిబ్బందికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చని, ట్రంప్‌, ఆర్ధిక మంత్రి విచక్షణ మేరకు కార్పొరేట్లకు నిధులు పందారం చేసే ప్రతిపాదనను సెనెట్‌లో డెమోక్రాట్లు అడ్డుకున్నారు. అక్కడి నిబంధనల ప్రకారం ఇలాంటి పధకాలకు సెనెట్‌లోని వంద మంది సభ్యులకు గాను 60 మంది ఆమోదం అవసరం. ప్రతి పక్షం మద్దతు ఇస్తే తప్ప అది కుదరదు. నిరుద్యోగ భృతి చెల్లించాలని అభ్యర్ధిస్తూ వచ్చిన వినతులు గతవారంలో 20లక్షలకు పైగా వచ్చాయని, ఆర్ధిక పరిస్ధితి బాగోలేదనేందుకు ఇదొక సూచిక అని గోల్డ్‌మన్‌ సాచెస్‌ విశ్లేషకుడు చెప్పారు. రానున్న రోజుల్లో 1930దశకం నాటి మహామాంద్యం కంటే ఎక్కువగా నిరుద్యోగం 30శాతం మించవచ్చని కొందరు చెబుతున్నారు.
అమెరికా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఉద్దీపన పధకాన్ని డెమోక్రాట్లు అడ్డుకున్నట్లు కార్పొరేట్‌ అనుకూల అమెరికా మీడియా వార్తలను ఇచ్చింది. అధికార రిపబ్లికన్లు సామాన్యులకు బదులు కార్పొరేట్లకు ప్రజాధనాన్ని అప్పగించే ప్రతిపాదనలు చేసిన కారణంగానే డెమోక్రాట్లు వ్యతిరేకించారన్న విషయాన్ని దాచి పెట్టేందుకు మీడియా ప్రయత్నించింది. లక్ష కోట్ల డాలర్ల మేరకు ఉద్దీపన చర్యల గురించి చెబుతూ ఆమొత్తంలో 50వేల కోట్ల డాలర్లను కార్పొరేట్లకే కట్టబెట్టేందుకు ట్రంప్‌ పూనుకున్నాడు. దీన్ని ఆమోదించాలా వ్యతిరేకించాలా ? అది కూడా ట్రంప్‌, ఆర్ధిక మంత్రి ఎవరికి సిఫార్సు చేస్తే వారికి చెల్లించే ప్రతిపాదనలతో నిండి ఉంది. ఎన్నికలకు ముందు ఇలాంటి విచక్షణ అధికారంతో ఎవరు లబ్ది పొందుతారో, అందుకు ఎలాంటి పధకం వేశారో తెలుస్తూనే ఉంది. సెనెట్‌లోని వందమంది సభ్యుల్లో 60 మంది ఆమోదం అవసరం కనుక డెమోక్రాట్లు దాన్ని అడ్డుకున్నారు.
అమెరికా వ్యవస్ధ స్ధితి గురించి ప్రముఖ సామాజికవేత్త నోమ్‌ చోమ్‌స్కీ మాట్లాడుతూ ”ఆర్ధిక వ్యవస్ధ మరియు సామర్ధ్యం గురించి ఒక భావన ఉంది.రేపటికి అవసరమైన పడకలు ఉంటే మనకు చాలు, భవిష్యత్‌ కోసం సిద్దం కానవసరం లేదు. ఇలా భావించబట్టే ఆసుపత్రుల వ్యవస్ధ కుప్పకూలుతోంది. దక్షిణ కొరియాలో సాధారణ పరీక్షలను సులభంగా చేయించుకోవచ్చు, ఇక్కడ పొందలేము. కాబట్టి కరోనా వైరస్‌ను పనిచేసే సమాజంలో మాత్రమే అదుపు చేయగలం, ఇక్కడ చేతులు దాటిపోతోంది. మనం దానికి సిద్ధంగా లేము. మనమూ, మన నేతలూ గత నాలుగుదశాబ్దాలుగా బాగా చేస్తున్నదేమంటే మిగతా అంతా కుప్పకూలి పోతుంటే ధనికులు, కార్పొరేట్ల జేబులు నింపుతున్నాం.” అన్నారు.
భయంకరమైన ఈ సంక్షోభాన్ని సొమ్ము చేసుకొనేందుకు కార్పొరేట్లను అనుమతించే సమయం కాదిది అని డెమోక్రటిక్‌ పార్టీ నేత బెర్నీశాండర్స్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా కార్పొరేట్ల ఏజంట్లు(లాబీయిస్టులు) ఆయా పరిశ్రమలకు రాయితీల కోసం పైరవీలు చేస్తున్నారు. ప్రయివేటు అంతరిక్ష పరిశ్రమ ఐదు, విమానయానం 50, హౌటల్స్‌ 150బిలియన్‌ డాలర్లు కోరితే పారిశ్రామికవేత్తలు లక్షా40వేలు, అంతర్జాతీయ షాపింగ్‌ మాల్స్‌ వారు లక్ష కోట్ల డాలర్ల మేర రాయితీలు కావాలని కోరినట్లు శాండర్స్‌ తెలిపారు. జిమ్‌లు, షాపింగ్‌ మాల్స్‌ను దేశవ్యాపితంగా మూసివేసినప్పటికీ సభ్యత్వాల చెల్లింపు, ఫిట్‌నెస్‌ పరికరాలకు ముందస్తు పన్ను చెల్లింపు సొమ్మును వినియోగించేందుకు అనుమతి ఇవ్వాలని ఆడిదాస్‌ కోరింది. ఒక వైపు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించి నిలిపివేస్తే అతిధి కార్మికులకు వీసాలు ఇచ్చేందుకు వెంటనే పార్లమెంట్‌ చర్యలు తీసుకోవాలని పందిమాంస కార్పొరేట్స్‌ కోరినట్లు వార్తలు వచ్చాయి. అత్యవసర ఆరోగ్య సేవలకోసం ఈ అసాధారణ సంక్షోభ సమయంలో పార్లమెంట్‌ అసాధారణ చర్యలకు ఉపక్రమించాలని శాండర్స్‌ కోరాడు.
మన దేశం విషయానికి వస్తే కరోనా వైరస్‌ వ్యాప్తి నేపధ్యంలో పార్లమెంట్‌ బడ్జెట్‌ను ముందుగానే ఆమోదించింది. ఇదే సమయంలో వైద్యులు, ఇతర సిబ్బంది సేవలను అభినందిస్తూ ప్రధాని నరేంద్రమోడీ జనతా కర్ఫ్యూ సందర్భంగా చప్పట్లు చరచాలని ఇచ్చిన పిలుపును అన్ని పార్టీల వారూ ఆమోదించారు, ఆచరించారు. అనేక రాష్ట్రాలు కరోనా కట్టడిలో భాగంగా జనాన్ని ఇండ్లకే పరిమితం చేస్తూ నిర్ణయించటంతో పాటు పేదలను ఆదుకొనేందుకు తమ శక్తికొద్దీ సాయాన్ని ప్రకటించాయి. అయితే కేంద్ర ప్రభుత్వం పరిశుభ్రతకు నిధులు ఇస్తామని చెప్పటం తప్ప పేదలను ఆదుకొనే నిర్దిష్ట చర్యలేవీ(ఇది రాస్తున్న సమయానికి) ప్రకటించలేదు. జనానికి ఉపశమనం కల్పించాల్సింది పోయి ఈ సమయంలోనే లీటరు పెట్రోలు, డీజిల్‌కు మూడేసి రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం పన్ను పెంచింది. మరో ఎనిమిది, పది రూపాయల వరకు పెంచుకొనేందుకు పార్లమెంట్‌ అనుమతి తీసుకుంది. లీటరుకు ఒక రూపాయి పన్ను పెంపుదల ద్వారా కేంద్రానికి ఏటా పద్నాలుగువేల కోట్ల రూపాయల ఆదాయం అదనంగా సమకూరుతుంది. గత ఆరు సంవత్సరాల కాలంలో మోడీ సర్కార్‌ పెట్రోలు మీద ఎక్సయిజ్‌ సుంకం రూ.9.48 నుంచి రూ. 22.98కి పెంచిన విషయం తెలిసిందే. అంటే జనం మీద ఏటా లక్షా 90 కోట్ల రూపాయల భారాన్ని అదనంగా మోపుతోంది. అయినా కరోనా సంక్షోభంలో కష్ట జీవులను ఆదుకొనేందుకు ముందుకు రావటం లేదు.
ఉద్దీపన చర్యల్లో భాగంగా రెండులక్షల కోట్ల రూపాయల పాకేజి ప్రకటించాలని పరిశ్రమలు, వాణిజ్య సంస్ధల వారు కేంద్రాన్ని కోరారు. జనధన్‌ బ్యాంకు ఖాతాలున్న వారికి ఐదు వేల రూపాయల నగదును బదిలీ చేయాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి ప్రధాని మోడీకి ఒక లేఖ రాశారు. ఉద్యోగులు, కార్మికులు పనులకు వెళ్లలేని స్ధితిలో ఉంటే కనీసం 80శాతం వేతనం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరారు.

Image result for coronavirus Donald trump cartoons
వివిధ దేశాలు తీసుకుంటున్న చర్యలు సామాన్య జనాన్ని ఆదుకొనేవిగా ఉండాలి తప్ప కార్పొరేట్లకు దోచిపెట్టేవిగా మారకూడదనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.ఈ సందర్భంగా ప్రభుత్వాలు తీసుకొనే చర్యలు విమర్శలకు అతీతంగా ఉంటాయని, కొన్ని కంపెనీల ప్రయోజనాలకు తోడ్పడకూడదని ఎవరైనా ఆశిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ జారీ చేసిన ఒక సర్క్యులర్‌ ఆ విధంగానే కనిపిస్తున్నది. రాఫెల్‌ విమానాల విషయంలో ప్రభుత్వ రంగ సంస్ధను విస్మరించి అంబానీలకు కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు కరోనా పరీక్షలకు ప్రభుత్వ సంస్ధ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవి) ఆమోదించిన అన్ని కిట్లను ఉపయోగించకుండా కేవలం అమెరికా, ఐరోపా యూనియన్‌ ఆమోదించిన వాటికే పరిమితం చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేయటాన్ని ఏమనాలి. పోనీ అవసరాలకు తగ్గట్లుగా అవి సరఫరా అవుతున్నాయా అంటే, లేదు. అలాంటి వాటిని ఉత్పత్తి చేసే సంస్ధ గుజరాత్‌లో ఒక్కటి మాత్రమే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఒకటి రెండు కంపెనీలు కిట్లతో లాభాలు పిండుకోవటాన్ని వెంటనే నివారించటం అవసరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనాను ఖాతరు చేయక ముప్పు తెచ్చిన అమెరికా,ఐరోపా పాలకులు !

21 Saturday Mar 2020

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Health, History, International, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

combat the coronavirus, COVID 19 China, COVID- 19 pandemic, COVID-19, COVID-19 in US, COVID-19 Robots

The Chinese navy’s Daishandao is the country’s only hospital ship, but that could be about to change. Photo: Reuters
ఎం కోటేశ్వరరావు
జనవరిలోనే వైరస్‌ తీవ్రత గురించి గూఢచార సంస్ధలు హెచ్చరించినా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పట్టించుకోలేదని వాషింగ్టన్‌ పోస్టు పత్రిక ఒక సంచలన విషయాన్ని తాజాగా వెల్లడించింది. చైనా కటువుగా వ్యవహరించి ఫలితాలు సాధిస్తే, స్వేచ్చా సమాజాల పేరుతో వ్యవహరించిన తీరు కారణంగా ఐరోపా, అమెరికాల్లో దానికి మూల్యం చెల్లించాల్సి వస్తోందంటూ న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి పత్రికలు వాపోతున్నాయి. ఇల్లినాయిస్‌ రాష్ట్రం కూడా జనాలు బయటకు రావద్దని ప్రకటించటంతో అమెరికాలో ఏడున్నర కోట్ల మంది జనాన్ని ఇండ్లకే పరిమితం చేసినట్లయింది. మరోవైపు తొలుత ఎక్కడైతే వైరస్‌ ప్రబలిందో చైనాలోని ఆ ఊహాన్‌ నగరం, పరిసరాల్లో సాధారణ పరిస్ధితులు నెలకొంటున్నాయి. ఎవరు మహమ్మారిని నిర్లక్ష్యం చేశారు, ఎవరు బాధ్యతాయుతంగా వ్యవహరించారో ప్రపంచానికి వెల్లడైంది.
అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలలో కరోనా కేసులు నమోదయ్యాయి. కేవలం ఆరు రోజుల్లోనే న్యూయార్క్‌ నగరం కరోనా కేంద్ర స్ధానంగా మారిపోయింది. న్యూయూర్క్‌ రాష్ట్రంలో 8,377 కేసులు నిర్దారణ కాగా ఒక్క న్యూయార్క్‌ నగరంలోనే ఆరు రోజుల వ్యవధిలో 183 నుంచి 5,151కి పెరిగాయి. ఇవి మొత్తం అమెరికాలో మూడో వంతు అని నగర మేయర్‌ పరిస్ధితి తీవ్రతను వివరించారు.రెండు మూడు వారాలకు సరిపడా మాత్రమే వైద్య సరఫరాలు ఉంటాయని కూడా చెప్పారు.
చైనాలో కొత్తగా కేసులేమీ నమోదు కావటం లేదన్న వార్తలను యావత్‌ ప్రపంచం హర్షిస్తోంది. మహమ్మారిని అదుపు చేయటం సాధ్యమే అని రుజువైంది. తాము ఒక మహమ్మారితో పోరాడుతున్నామని చైనా అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ తొలుత ప్రకటించారు, అదే విధంగా తొలిసారిగా ఆరోగ్య అత్యవసర పరిస్ధితిని ప్రకటించి సిపిఎం నాయకత్వంలోని కేరళ ప్రభుత్వం తన ప్రత్యేకతను వెల్లడించింది. కేరళలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు నమోదైనపుడు చైనా కమ్యూనిస్టు దేశంలో ప్రారంభమైన వైరస్‌ కమ్యూనిస్టు ప్రభుత్వం ఉంది కనుక అక్కడకు వచ్చిందని ప్రచారం చేసిన ప్రబుద్దులు లేకపోలేదు. వైరస్‌ గురించి చైనా సర్కార్‌ దాచి పెట్టిందని జీవ ఆయుధాన్ని తయారు చేస్తూ తన గోతిలో తానే పడిందని దుమ్మెత్తి పోయటంతో పాటు జనాన్ని నిర్బంధించిందని ప్రచారం చేసిన వారికీ కొదవ లేదు. ఇప్పుడు అవే నోళ్లు చైనా, కేరళ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నాయి. అవి నోళ్లా మరొకటా అన్నది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి.

H/O: China Robots coronavirus CloudMinds robot in Wuhan with patients at field hospital
చైనా నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి. వాటిలో కరోనా వైరస్‌ అదుపు కూడా చేరింది. దాని గురించి కొన్ని అంశాలను చూద్దాం. మహమ్మారి దండయాత్ర ప్రారంభమైన ఉహాన్‌ నగరంలోని హాంగ్‌షాన్‌ క్రీడా కేంద్రాన్ని రోబోట్లతో నడిచే ఆసుపత్రిగా మార్చివేశారు. స్మార్ట్‌ ఫీల్డ్‌ హాస్పటల్‌గా పిలిచిన ఆ కేంద్రంలో ఇరవై వేల మందికి వ్యాధిగ్రస్తులకు చికిత్స ఏర్పాట్లు చేశారు. వైరస్‌ విస్తరణ తగ్గుముఖం పడుతున్న సమయంలో తీసుకున్న ఈ చర్య ఆరోగ్యకార్యకర్తల మీద వత్తిడిని తగ్గించేందుకు అన్నది స్పష్టం. జనవరిలో కరోనా వైరస్‌ డైమండ్‌ ప్రిన్సెస్‌ అనే నౌకలో వ్యాపించి 712 మందికి సోకి ఏడుగురి ప్రాణాలు తీసింది. ఓడలోని ప్రయాణీకులకు ఆహారం సరఫరా చేసే పళ్లాల(ట్రే) ద్వారా వ్యాప్తి చెంది ఉండవచ్చని ఒక జపాన్‌ నిపుణుడు వ్యాఖ్యానించిన తరువాత రోబోల ప్రయోగం గురించి ఆలోచన వచ్చింది. చైనా, స్పెయిన్లలో డ్రోన్లను జనాన్ని కట్టడి చేసే ప్రచారానికి, ఔషధాల సరఫరాకు వినియోగించారు. దక్షిణ కొరియాలో వైరస్‌ ప్రబలిన ప్రాంతాలలో రోగ క్రిమి నిర్మూలన మందులు చల్లేందుకు వినియోగించారు. ఈ నేపధ్యంలోనే చైనాలోని క్రీడా కేంద్రాన్ని ఆసుపత్రిగా మార్చి అక్కడ పెద్ద ఎత్తున రోబోలను వినియోగించారు. రోగులు ఆసుపత్రిలోకి ప్రవేశిస్తుండగానే రోబోలు, ఇంటర్నెట్‌తో అనుసంధానించిన ఇతర పరికరాలతో రోగులను స్కాన్‌ చేశారు. వారి స్ధితిని తెరల మీద నుంచి వైద్యులు పర్యవేక్షించారు. సిబ్బందికి సైతం కొన్ని పరికరాలను అందచేశారు. అంతేనా రోగులకు అవసరమైన ఆహారం, మంచినీరు, ఔషధాలకే కాదు, ఆసుపత్రిని శుభ్రం చేయటం, రోగులకు ఉల్లాసం కలిగించటం కోసం చివరికి రోబోలతో డ్యాన్సులు కూడా చేయించారు. ఇప్పుడు తీవ్రత తగ్గిపోయినా తిరిగి ప్రబలితే పని చేయించేందుకు వాటిని సిద్దంగా ఉంచినట్లు క్లౌడ్‌ మైండ్స్‌ అనే సంస్ధ తెలిపింది.

GP: Coronavirus China robot disinfectant
రోబోలతో ఆహారాన్ని అందించటం ఇప్పటికే అనేక చోట్ల పరిమితంగా జరుగుతోంది కనుక ఇదేమీ కొత్త కాదు. ఆసుపత్రులలో వినియోగించటమే విశేషం. వందల కిలోమీటర్ల దూరం నుంచి వాటిని విమానాల్లో తెప్పించి ఊహాన్‌ నగరంలోకి ప్రవేశించే అనేక చోట్ల వాటిని వినియోగించారు.వైరస్‌ నిరోధ అవసరాలకు అనుగుణ్యంగా రోబోలలో కొన్ని మార్పులు చేశారు.ఇవి తమకు ఎంతో సహాయకారిగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనేక దేశాల నుంచి వీటిని తెప్పించారు. చైనా అనుభవం చూసిన తరువాత కరోనా బారిన పడిన ఇటలీ, ఇతర అనేక దేశాలలో రోబోల వినియోగం పెరిగింది. తాము తయారు చేసిన రోబో ఒక్కొక్కటి విద్యుత్‌ చార్జి చేసిన తరువాత రెండున్నర గంటల పాటు పని చేస్తుందని తొమ్మిది- పది గదులలలో క్రిమి నిర్మూలన మందులను చల్లి శుభ్రం చేస్తుందని, పది నిమిషాల్లో బాక్టీరియా, కొన్ని రకాల వైరస్‌లను నిర్మూలిస్తుందని డెన్మార్క్‌ కంపెనీ ప్రతినిధి చెప్పారు. రోబోలను తయారు చేసే అమెరికా గ్జెనెక్స్‌ కంపెనీ ఉత్పత్తి గత ఏడాది మొత్తంగా చేసిన వాటి కంటే ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 400శాతం పెరిగిందని వెల్లడించారు.

Image result for Covid 19 pandemic, trump cartoons
వైరస్‌ తీవ్రత గురించి చెప్పినప్పటికీ ట్రంప్‌ కొట్టిపారవేశారని, తీవ్రంగా పరిగణించలేదని, అమెరికాలో వ్యాపించే అవకాశం లేదని భావించినట్లు , చైనా అధ్యక్షుడు చెప్పినదానిని నమ్మాల్సిన పనిలేదని అన్నట్లు వాషింగ్టన్‌ పోస్టు పేర్కొన్నది. తొలి వారంలోనే నివేదించినప్పటికీ జనవరి 18వ తేదీ వరకు ఆరోగ్య, మానవ వనరుల శాఖల అధికారులు ట్రంప్‌కు నచ్చ చెప్పేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనట్లు తెలిపింది. తరువాత ఉన్నతాధికారులను కలసి వారిని ఒప్పించిన తరువాత సమీక్షలు ప్రారంభమైనట్లు కూడా పేర్కొన్నది. చివరకు అమెరికాలో వ్యాపించినట్లు వెల్లడైన తరువాత కూడా దాన్నొక ముప్పుగా ట్రంప్‌ పరిగణించలేదని, వ్యాధి నిరోధక కేంద్రం అధికారిణి నాన్సీ ఫిబ్రవరి చివరిలో హెచ్చరికలను కూడా పట్టించుకోకపోగా ఆమె మదుపుదార్లను భయపెడుతున్నారని ట్రంప్‌ ఫిర్యాదు చేసినట్లు కూడా వాషింగ్టన్‌ పోస్టు వ్యాఖ్యానించింది.
ఉహాన్‌లో యుద్ద ఓడలకు రూపకల్పన చేసే ప్రభుత్వ ఓడల నిర్మాణ సంస్ధ అత్యవసర వైద్య సహాయ ఓడలకు రూపకల్పన పూర్తి చేసినట్లుగా తాజాగా వార్తలు వెలువడ్డాయి. ఇది కరోనా వైరస్‌లకే కాదు, ఇతర వైరస్‌ చికిత్సలకు సైతం అనువుగా ఉంటుందని పత్రికలు రాశాయి. ప్రస్తుతం చైనా మిలిటరీ ఆధ్వర్యంలో 14వేల టన్నుల బరువు గల ఒక ఆసుపత్రి ఓడ ఉంది. దానిని విదేశాలకు మానవతా పూర్వక సాయం చేసేందుకు శాంతి ఓడ పేరుతో నిర్వహిస్తున్నారు. దీనిలో 20 ఇంటెన్సివ్‌ కేర్‌, పది క్వారంటైన్‌ పడకలతో సహా మూడు వందల మందికి ఒకేసారి చికిత్సలు చేయవచ్చు.చైనా కొత్తగా రూపకల్పన చేసిన ఓడ నిర్మాణం పూర్తయిన తరువాత మహమ్మారులు తలెత్తినపుడు బాధితులను తరలించేందుకు, చికిత్సలకు, సముద్రాల్లో రోగుల నుంచి వ్యా ధులు విస్తరించకుండా క్వారంటైన్‌ చేసేందుకు, ఇతర సందర్భాలలో ఇతర అవసరాలకు కూడా వినియోగించవచ్చు. ఈ ఓడ నమూనాతో ప్రయాణీకుల ఓడలను కూడా నిర్మిస్తే వాణిజ్య పరంగా కూడా ఎంతో లాభసాటిగా ఉంటాయని భావిస్తున్నారు.
చైనా కంటే కరోనా వైరస్‌ ఐరోపాను గట్టిగా తాకింది. ఇది స్వేచ్చా సమాజాలు చెల్లిస్తున్న మూల్యమా అని ప్రశ్నిస్తూ న్యూయార్క్‌ టైమ్స్‌ ఒక వ్యాఖ్యానం, విశ్లేషణను ప్రచురించింది. ఇది వంకర బుద్ది నుంచి వెలువడిన ఉత్పత్తి అన్నది స్పష్టం. స్వేచ్చా సమాజమా, మరొకటా అన్న విచక్షణ వైరస్‌లు, బాక్టీరియాలకు ఉండన్నది వేల సంవత్సరాల చరిత్ర. అంతెందుకు వర్తమానానికి వస్తే ఫ్లూ(జలుబు)కారణంగా ఏటా అమెరికాలో 27 నుంచి 77వేల మంది వరకు మరణిస్తున్నారని ఇది ఫ్లూ(ఇన్‌ఫ్లూయంజా) కంటే పెద్ద ప్రమాదకరమైనదేమీ కాదన్నట్లుగా మార్చి నాలుగవ తేదీ డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. అమెరికా సిడిసి సమాచారం ప్రకారం 2010 నుంచి ఏటా అమెరికాలో 93లక్షల నుంచి 4.9 కోట్ల మంది వరకు ఫ్లూబారిన పడుతున్నారు, 37వేల నుంచి 2017-18వరకు 61వేల మధ్య మరణించారు. స్వేచ్చా సమాజానికి ప్రతీకగా ఉన్న అమెరికాలో ఉన్న పరిస్ధితి ఇది. దీనికి న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఏమి చెబుతుంది ?

Image result for Covid 19 pandemic, trump cartoons
ఫిబ్రవరి 28వ తేదీన కరోనా గురించి ట్రంప్‌ పత్రికా గోష్టిలో మాట్లాడినదేమిటో చూద్దాం. ఒక అద్భుతం లేదా మాయ మాదిరి ఒక్క రోజులో కరోనా మాయం అవుతుంది. వేడి వాతావరణం వైరస్‌ను హరిస్తుంది, వ్యాప్తిని అరికడుతుంది అని చెప్పాడు.(బహుశా ఆ ప్రభావంతోనే బ్లీచింగ్‌ పౌడర్‌, పారాసిటమాల్‌తో కరోనాను అరికట్ట వచ్చని తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు చెప్పారా ?) అలాంటి పెద్ద మనిషి ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోని కారణంగా నేడు అమెరికాలో కూడా పెద్ద ఎత్తున వ్యాపిస్తున్నది. స్వేచ్చా సమాజం కారణంగానా పాలకుల బాధ్యతా రాహిత్యం వలన ఇది జరిగిందా ? విశ్లేషకులకు ఈ మాత్రం కూడా తెలియదని అనుకోవాలా ? చైనా సకాలంలో స్పందించలేదని విమర్శిస్తున్న వారు అమెరికా, ఐరోపా పాలకుల, ప్రభుత్వాల నిర్లక్ష్య స్పందనను ఏ విధంగా వర్ణిస్తారు?
ఐరోపా సౌహాద్రత అనేది పుస్తకాలకే పరిమితమైన దేవతా కథల వంటివి. మీరు తప్ప మాకు సాయం చేసే వారు లేరు, డబ్బు మాకు సమస్య కాదు, ఐరోపా యూనియన్‌ నుంచి అవసరమైన పరికరాలు తెచ్చుకోవటం అసాధ్యమని దాని ప్రకటన వెల్లడించింది. ఈ స్ధితిలో మీరు తప్ప మాకు వేరే స్నేహితులు లేరు, మీరే ఆదుకోవాలి, మాకు డబ్బు అవసరం లేదు, మీరు ఏది పంపగలిగితే దాన్ని పంపండి, మేమేమీ దాచుకోవటం లేదు, మమ్మల్ని మేము రక్షించుకోలేని స్ధితిలో ఉన్నాం, చైనా సోదరుల సాయం కోసం ఎదురు చూస్తున్నాం అని ఐరోపా దేశమైన సెర్బియా అధ్య క్షుడు యుసినిక్‌ చైనా రాయబారికి చేసిన వినతిని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. కరోనా సమస్య తలెత్తక ముందు చైనా నుంచి దిగుమతులను తగ్గించుకోవాలని, ఐరోపా నుంచి పెంచుకోవాలని ఐరోపా ధనిక దేశాలు సెర్బియా మీద వత్తిడి తెచ్చాయి. ఇప్పుడు అవే దేశాలు కరోనా కారణంగా తాము వస్తు సరఫరా చేయలేమని చేతులెత్తాశాయి. పరస్పరం సాయం చేసుకోవాల్సిన తరుణంలో తోటి దేశం పట్ల స్వేచ్చా సమాజాల నిజస్వరూపమిది !

Share this:

  • Tweet
  • More
Like Loading...

సౌదీ-రష్యా మధ్యలో అమెరికా, చమురు యుద్ద కారణాలు, పర్యవసానాలు !

12 Thursday Mar 2020

Posted by raomk in Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

OPEC, OPEC oil war, RUSSIA, Russia- Saudi oil war, Saudi oil war

Image result for behind the oil price war and its implications

ఎం కోటేశ్వరరావు
బస్తీమే సవాల్‌ అంటూ చమురు యుద్ధానికి సౌదీ అరేబియా తెరలేపింది. ఇప్పటికే మేము గోచీతో ఉన్నాం, దాన్ని కూడా లేకుండా చేస్తారా ? చేయండి చూస్తాం అన్నట్లుగా యుద్దానికి సిద్దమే అని రష్యా పేర్కొంది. పోరు శంఖారావం దెబ్బకు 30శాతం వరకు చమురు ధరలు పడిపోయాయి. ఇది ఆరంభమే, ఎవరికి వారు తమ వైఖరులకు కట్టుబడి ఉంటే రానున్న రోజుల్లో ఇంకా పతనమయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. తరువాత మూడు రోజుల్లో చూస్తే స్వల్ప మార్పులు తప్ప చమురు మార్కెట్‌లో పెను మార్పులు లేవు. యుద్ధం అంటే అంత తేలిక కాదు కనుక ప్రారంభం చేసిన అన్ని యుద్ధాలు కొనసాగలేదు, కనుక ఎప్పుడు ఏమి జరిగేదీ చెప్పలేము, ఏ యుద్దమైనా అది వాంఛనీయం కాదు, నష్టదాయకం కనుక రాకూడదనే కోరుకుందాం. అయితే దానికి దారి తీసిన పరిస్ధితులు పర్యవసానాలను తప్పక చర్చించాల్సిందే.
అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గిన మేరకు నరేంద్రమోడీ సర్కార్‌ జనానికి చమురు ధరలు తగ్గిస్తుందా? లేక వినియోగదారుల జేబులు కొల్లగొట్టి వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు రాయితీల రూపంలో దోచి పెడుతుందా ? అసలు సౌదీ-రష్యా ఇప్పుడు చమురు ధరల యుద్దానికి దిగాల్సిన అవసరం ఏమిటి? ఎంత కాలం సాగుతుంది? ఎంత మేరకు ధరలు పతనం అవుతాయి ? పర్యవసానాలు ఏమిటి ? ఇలా ఎన్నో అంశాలు జనం నోళ్లలో నానుతున్నాయి.
సోమవారం చమురు ధరలు, స్టాక్‌ మార్కెట్‌ పతనం, మంగళవారం నాడు మన దేశంలో స్టాక్‌ మార్కెట్లకు సెలవు, బుధవారం నాడు నష్టాల పాలు కాలేదు గానీ లాభాలు కూడా రాలేదు. గురువారం నాడు ఐదు రకాల చమురుల్లో పీపా ధర నాలుగు 25 సెంట్ల నుంచి 182 సెంట్ల వరకు పతనం కాగా మరో నాలుగు రకాల ధరలు 85 నుంచి 297 సెంట్ల వరకు పెరిగాయి, అయినప్పటికీ సోమవారం నాటి కంటే దారుణంగా స్టాక్‌మార్కెట్లు పతనమయ్యాయి. సోమవారపు పతనానికి కరోనా వైరస్‌ వ్యాప్తి, చమురు ధరల యుద్దం అని చెప్పారు. కరోనా వైరస్‌ చైనాలో తగ్గుముఖం పట్టింది, ఇతర దేశాల్లో కేసుల సంఖ్య పెరిగింది, కరోనాను ప్రపంచ మహమ్మారిగా గత కొద్ది రోజులుగా పరిగణిస్తున్నారు, బుధవారం నాడు ప్రపంచ ఆరోగ్య సంస్ధ దానిని అధికారికంగా ప్రకటించటం తప్ప గత మూడు రోజుల్లో పెను మార్పులేమీ లేవు, అయినా స్టాక్‌ మార్కెట్‌ పతనం చాలా తీవ్రంగా ఉండటం విశేషం. బుధవారం నాడు చైనాలోని వైరస్‌ పీడిత ప్రాంతం హుబెరులో పది మంది మరణిస్తే వారిలో ఏడుగురు ఒక్క ఉహాన్‌ నగరానికి చెందిన వారే ఉన్నారు. గత వారం రోజులుగా హుబెరు రాష్ట్రంలోని ఉహాన్‌ మినహా 16నగరాలలో కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

Image result for russia, sowdy oil  war cartoons
చమురు ధరల యుద్దం గురించి చూద్దాం. దీనికి సవాలక్ష కారణాలలో కరోనా వైరస్‌ ఒకటి మాత్రమే. ఒక వేళ ఆ సమస్య లేకపోయినా మరి కొద్ది వారాలు లేదా నెలల్లో చమురు యుద్దం తలెత్తి ఉండేది, కరోనా కాస్త ముందుకు జరిపింది. మన దేశంలో తన బడ్జెట్‌ లోటును పూడ్చుకొనేందుకు రిజర్వుబ్యాంకు దగ్గర డబ్బును లాక్కున్న మోడీ సర్కార్‌ ఎల్‌ఐసితో అనేక ప్రభుత్వరంగ సంస్దలను తెగనమ్మి ఇంకా మిగిలిన లోటును పూడ్చుకొనేందుకు చూస్తున్నది. నరేంద్రమోడీ జిగినీ దోస్తు (కాకపోతే అన్ని సార్లు ఒకరినొకరు ఎలా కౌగిలించుకుంటారు !) డోనాల్డ్‌ ట్రంప్‌ తన స్నేహితుడిని అనుసరిస్తున్నాడు. తాగుబోతులు అన్ని వనరులు అయిపోయిన తరువాత పెళ్లాం పుస్తెలు గుంజుకున్నట్లుగా అత్యవసరాల కోసం నిల్వచేసిన చమురులో కోటీ ఇరవైలక్షల పీపాల చమురును తెగనమ్మి 45బిలియన్‌ డాలర్లు సమకూర్చుకోవాలని ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయించింది. అయితే చమురు ధరలు ఢమాల్‌ అనటంతో పరిస్ధితి మెరుగుపడేంత వరకు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. రష్యా కరన్సీ రూబుల్‌ విలువ మరింత పతనమైంది. మొదటి పర్యవసానం ట్రంప్‌, అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మీద వత్తిడిని పెంచితే, రెండవ చర్య వలన ప్రపంచ మార్కెట్‌లో రష్యా నుంచి కొనుగోలు చేసే సరకులు తక్కువ మొత్తాలకు దొరుకుతాయి. తద్వారా రష్యాకు మేలు జరుగుతుంది. ఆంబోతుల కుమ్ములాట లేగదూడలకు ముప్పు తెస్తుంది అంటారు, కానీ ఇక్కడ చమురు ఆంబోతుల పోరు మనవంటి దేశాలకు మేలు చేస్తుంది. ఆ ఒక్కటీ అడక్కు అన్నట్లు (తగ్గిన మేరకు లబ్దిని వినియోగదారులకు బదలాయించాలి) నరేంద్రమోడీ సర్కార్‌ వ్యవహరిస్తే జనానికి ఆయాసం తప్ప ఒరిగేదేమీ ఉండదు.
చమురు ఉత్పత్తి చేసే దేశాల సంస్ధతో సహకరించేందుకు తాము సిద్దమే, ఉత్పత్తిని తగ్గించటానికి, పెంచటానికి, ఒప్పందం కుదుర్చుకోవటానికి ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయి అంటూనే ఏప్రిల్‌ ఒకటి తరువాత స్వల్ప కాలంలో రోజుకు రెండు, మూడులక్షలు అవసరమైతే ఐదులక్షల పీపాల వరకు చమురు ఉత్పత్తిని పెంచుతామని రష్యా ప్రకటించింది. అవసరమైతే వివాద పరిష్కారానికి తాము మధ్యవర్తిత్వం వహిస్తామని మెక్సికో ప్రకటించింది. గతంలో చమురు ధరలు పడిపోయిన సమయంలో పెంచేందుకు సహకరించుకోవాలని ఒపెక్‌-రష్యా 2016లో ఒక అవగాహనకు వచ్చాయి. ఇటీవలి కాలంలో చమురు ధరలు కొంత మేరకు తగ్గాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి పూర్వరంగంలో వినియోగం తగ్గుతుందనే అంచనాతో రోజుకు పదిహేను లక్షల పీపాల చమురు ఉత్పత్తిని తగ్గించుదామని సౌదీ అరేబియా ఒక ప్రతిపాదన చేసింది. దానికి రష్యా అంగీకరించలేదు. దాంతో సౌదీ ప్రభుత్వ రంగ చమురు సంస్ద ఆరామ్‌కో రష్యా చమురు మార్కెట్‌ను దెబ్బతీసే విధంగా ఏప్రిల్‌లో సరఫరా చేసే చమురు ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మే లేదా జూన్‌ నెలలో మరోసారి ఒపెక్‌-ఇతర దేశాల సమావేశాలు జరగాల్సి ఉంది. ఫిబ్రవరి నెలలో రష్యా రోజుకు 11.289 మిలియన్‌ పీపాల చమురును వెలికి తీసింది. తాజాగా ప్రకటించినట్లు మరో ఐదు లక్షల పీపాలు అదనంగా తీస్తే అది కొత్త రికార్డుగా నమోదు కానుంది. ధరల పెంపుదలకు అందరం చమురు ఉత్పత్తిని తగ్గించుదామని ప్రతిపాదించిన సౌదీ అరేబియా అందుకు రష్యా అంగీకరించకపోవటంతో ఆగ్రహంతో ఏప్రిల్‌ నెలలో ఉత్పత్తిని రోజుకు 12.3 మిలియన్‌ పీపాలకు పెంచి మార్కెట్లను ముంచెత్తాలని తద్వారా ధరలను మరింత పతనం కావించాలని నిర్ణయించింది.దీని పర్యవసానంగా తమ ఆదాయం పడిపోకుండా చూసుకొనేందుకు నైజీరియా ఉత్పత్తిని పెంచనున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలో రోజుకు 80 మిలియన్ల పీపాలు ఉత్పత్తి అవుతుండగా అమెరికా 15మిలియన్లతో అగ్రస్ధానంలో, తరువాత సౌదీ, రష్యా ఉన్నాయి.

Image result for russia, sowdy oil  war cartoons
ఒక పీపా ధర 25 నుంచి 30 డాలర్లకు పడిపోయినా ఆరు నుంచి పది సంవత్సరాల వరకు తాము తట్టుకొని నిలబడగలమని రష్యా చెబుతోంది. పీపా ధర 12-20 డాలర్లకు పడిపోయినా తట్టుకొనే విధంగా బడ్జెట్‌లను సవరించుకోవాలని అవసరమైతే పదిడాలర్ల కంటే తగ్గినా ఎలాంటి ఢోకాలేకుండా చూసుకోవాలని సౌదీ అరేబియా సిద్దం అవుతోంది. అమెరికాలోని షేల్‌ ఆయిల్‌ ఉత్పత్తి సంస్ధలు ఉత్పత్తిని తగ్గించేందుకు పూనుకున్నాయి. ప్రస్తుతం ఉన్న ధరలు కొనసాగితే కొన్ని కంపెనీలు బతుకుతాయి, అయితే అవి అవి ఆక్సిజన్‌ కోసం చూస్తాయని ఒక విశ్లేషకుడు వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఉన్న ఉత్పతిలో రోజుకు పది నుంచి ఇరవై లక్షల పీపాల వరకు తగ్గించవచ్చని వార్తలు వచ్చాయి. కేవలం ఐదు కంపెనీలు మాత్రమే ఖర్చుకు తగిన ఆదాయాన్ని పొందుతున్నట్లు చెబుతున్నారు.
2009 తరువాత తొలిసారిగా చమురు వినియోగం ఈ ఏడాది తగ్గనుందని అంతర్జాతీయ ఇంధన సంస్ధ పేర్కొన్నది. గత ద శాబ్ది కాలంలో వడ్డీ రేట్లు తక్కువగా ఉండటంతో ఇంథన కంపెనీలు పెద్ద మొత్తంలో అప్పులు తీసుకున్నాయి. చమురు ధరల పతనం కారణంగా ఈ కంపెనీల రుణాలను కొనుగోలు చేసిన సంస్ధలు సాధారణంగా పొందే ఒక డాలరుకు 67 సెంట్లకు బదులు 55 నుంచి 60సెంట్ల వరకు మాత్రమే రాబట్టుకోగలవని బర్కలీ పేర్కొన్నది.
చమురు యుద్ధాన్ని సౌదీ అరేబియా ప్రారంభించినప్పటికీ రష్యా లక్ష్యం అమెరికా షేల్‌ అయిల్‌ కంపెనీలే అని కొందరు విశ్లేషిస్తున్నారు.సౌదీ తక్షణ లక్ష్యం రష్యన్‌ మార్కెట్‌ను ఆక్రమించటం అయినప్పటికీ చమురు ఎగుమతి దేశాల సంస్ధ(ఒపెక్‌) తమ మార్కెట్‌ను రోజు రోజుకూ అమెరికాకు అప్పగించటం తనకు ముప్పుగా రష్యా పరిగణిస్తోంది. 2009 నుంచి అమెరికా షేల్‌ అయిల్‌ ఉత్పత్తి పెరుగుతోంది.2019 అమెరికా ఉత్పత్తిలో 63శాతం(రోజుకు 7.7మిలియన్‌ పీపాలు) ఉంది. వారిని దెబ్బతీయటం రష్యన్ల లక్ష్యం. అయితే తాజా పరిణామాల పర్యవసానం రష్యన్లకు సైతం నష్టం కలిగించేదే. ప్రస్తుతం సౌదీ అరేబియా బడ్జెట్‌ అవసరాలకు గాను ఒక పీపా బ్రెంట్‌ రకం ముడిచమురు ధర 80 డాలర్లు ఉండాలి, అదే రష్యాకు 45 డాలర్లు ఉన్నా తట్టుకోగలదని అంచనా. అమెరికన్‌ ఉత్పత్తిదారుల పరిస్ధితి ఇప్పుడు తాడు మీద నడక మాదిరి ఉంది. చమురు యుద్దం పీపా ధరను ఇరవై డాలర్లకు పతనం కావించవచ్చని గోల్డ్‌మన్‌ సాచస్‌ విశ్లేషకులు చెప్పారు. 2019 వివరాల ప్రకారం ప్రపంచ చమురు నిల్వల్లో 75శాతం ఒపెక్‌ దేశాల్లో ఉండగా ప్రపంచ ఉత్పత్తిలో 42శాతం కలిగి ఉన్నాయి. ఒక దేశంగా ఉత్పత్తిలో అమెరికా ప్రధమ స్ధానంలో ఉన్నప్పటికీ ప్రపంచమార్కెట్‌ను నియంత్రించగల శక్తి ఇంకా ఓపెక్‌దే అని చెబుతున్నారు.
చమురు చరిత్రలోకి వెళితే వాణిజ్యపరంగా తొలిసారి వెలికి తీసి వినియోగించింది అమెరికాయే.1860వ దశకంలో అమెరికాలో అంతర్యుద్ధం కారణంగా పెరిగిన డిమాండ్‌తో పీపా చమురుధర ఇప్పటి ధరలతో పోల్చుకుంటే గరిష్టంగా 120 డాలర్లు ఉండేది. తరువాత కాలంలో గణనీయంగా పడిపోయింది.1900దశకంలో స్పిండిల్‌టాప్‌ చమురు బావిని కనుగొన్న తరువాత అమెరికా ఆర్ధిక వ్యవస్ధలో చమురు ప్రధాన పాత్ర వహించటం ప్రారంభమైంది. ఒక్క ఏడాది కాలంలోనే 1500 కంపెనీలు పుట్టుకు వచ్చాయి. దాంతో ధరలు మరింతగా తగ్గాయి. 1908లో ఇరాన్‌లో, 1930లో సౌదీ అరేబియాలో చమురు నిల్వలను కనుగొన్న తరువాత చమురు సరఫరా విపరీతంగా పెరిగింది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మరింతగా విస్తరించటం, వియత్నాం యుద్ధం వంటి కారణాలతో పెరిగిన అవసరాలకు చమురు దిగుమతి చేసుకోవటం ప్రారంభించింది. ఇదే సమయంలో 1960లో ఇరాన్‌, ఇరాక్‌, కువాయిట్‌, సౌదీ అరేబియా, వెనెజులా చమురు ఎగుమతి దేశాల సంస్ధ(ఒపెక్‌)ను ప్రారంభించాయి. తరువాత కొన్ని దేశాలు చేరటం, సంస్ధ నుంచి విడిపోవటం జరిగినా ప్రస్తుతం 15దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. అమెరికా, రష్యా వాటిలో లేవు. కొత్తగా బ్రెజిల్‌ను గత ఏడాది ఆహ్వానించారు.

Image result for oil price war
1973లో పాలస్తీనా సమస్యలో అమెరికన్లు ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వటం అది ఇరుగుపొరుగు అరబ్‌ దేశాలపై దాడులు, భూభాగాల ఆక్రమణల పూర్వరంగంలో ఒపెక్‌ దేశాలు అమెరికాకు చమురు ఎగుమతులను నిలిపివేశాయి. ధరలు కూడా పతనమయ్యాయి. అంతకు ముందు పశ్చిమ దేశాలకు చెందిన ఏడు చమురు కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్‌ను అదుపు చేసేవి, 1973 తరువాత ఒపెక్‌ నిర్ణయాత్మక శక్తిగా మారింది. ధరలు, ఉత్పత్తిని నియంత్రించింది.1991వరకు ఇదే కొనసాగింది. ఆ ఏడాది సోవియట్‌ యూనియన్‌ పతనమైన తరువాత అనేక సంవత్సరాల పాటు రష్యా చమురు ఉత్పత్తిలో సమస్యలు తలెత్తాయి, ఇదే సమయంలో ఆసియన్‌ దేశాలలో ద్రవ్య సంక్షోభం ఏర్పడింది. చమురుకు డిమాండ్‌ విపరీతంగా పడిపోయింది. తరువాత అనేక పరిణామాలు సంభవించినా ఒపెక్‌ నియంత్రణ కొనసాగింది. రష్యా చమురు పరిశ్రమ స్ధిరపడింది. ప్రపంచ చమురు నియంత్రణ రష్యా సహకారం లేనిదే సాధ్యం కాని పరిస్ధితి ఏర్పడింది. అందుకే 2016లో ఒపెక్‌ దేశాలు దానితో సమన్వయం చేసుకున్నాయి. మరోవైపున 2003 నుంచి అమెరికాలో షేల్‌ ఆయిల్‌ వెలికితీత ప్రారంభం, 2014 నుంచి విపరీతంగా పెరగటం వంటి పరిణామాలు, పర్యవసానాలతో ఒపెక్‌, రష్యా ఆధిపత్యానికి గండిపడింది. అమెరికా చమురు ఎగుమతి దేశంగా తయారైంది. అమెరికా అనుభవాన్ని చూసిన తరువాత అనేక దేశాలు షేల్‌ ఆయిల్‌, గ్యాస్‌ నిల్వల వెలికితీతకు పెద్ద ఎత్తున పూనుకున్నాయి. ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగటమే కాదు, ఇరాన్‌, మరొక ఒపెక్‌ దేశమైన వెనెజులా చమురు అమ్మకాలపై రాజకీయ కారణాలతో అనేక ఆంక్షలు విధించింది. వీటిని ఎదుర్కోవటంలో ఒపెక్‌ విఫలమైంది. గతశతాబ్దిలో ప్రపంచ చమురు ధరలను అమెరికా నిర్ణయించేది, తరువాత ఆ స్ధానాన్ని ఒపెక్‌ ఆక్రమించింది, అయితే ఇటీవల తిరిగి అమెరికా నియంత్రణశక్తిగా ముందుకు వస్తోంది. చమురు ధరలు పెరిగినపుడు అమెరికా ఉత్పాదక సంస్దలు పెద్ద మొత్తాన్ని మార్కెట్‌కు విడుదల చేసి లబ్ది పొందుతున్నాయి. ఒపెక్‌ చమురు అవసరం అమెరికాకు తగ్గిపోవటంతో ఆ సంస్ధ నియంత్రణ పని చేయటం లేదు.

2017,18 సంవత్సరాలలో రోజుకు 12లక్షల పీపాల ఉత్పత్తి తగ్గించాలని ఒపెక్‌ నిర్ణయించి అమలు జరిపింది. అది అన్ని దేశాల కంటే అమెరికా కంపెనీలకే ఎక్కువ లబ్ది చేకూర్చింది. మరోవైపున తన రాజకీయ, ఆర్ధిక పలుకుబడిని ఉపయోగించి తన కంపెనీలకు చమురు ఎగుమతుల అవకాశాలను అందిస్తోంది. ఉదాహరణకు ఇరాన్‌ మనకు మిత్ర దేశం, మన రూపాయలకు చమురు విక్రయించింది. యాభై ఆరు అంగుళాల ఛాతి గలిగిన ధీశాలి అని ప్రశంసలు పొందిన నరేంద్రమోడీ పిరికితనాన్ని ప్రదర్శించి ట్రంప్‌ ఆదేశాలకు లొంగి ఇరాన్‌ బదులు అమెరికా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నారు. 2017లో 19లక్షల టన్నుల చమురును అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకుంటే మరుసటి ఏడాది అది 62లక్షల టన్నులకు పెరిగింది. 2019 తొలి ఆరునెలల్లోనే 54లక్షల టన్నులు దిగుమతి చేసుకున్నాము.
ఒపెక్‌ దేశాల మార్కెట్‌ వాటా ఒక నాడు 44శాతం ఉంటే నేడు 30శాతానికి పడిపోయింది. గత రెండు సంవత్సరాలలో అది మరింత వేగంగా జరిగింది. చమురు వ్యాపారం డాలర్లలోనే జరుగుతుంది. ఇటీవలి కాలంలో డాలరు రేటు పతనం కావటంతో ఎగుమతి దేశాలకు నష్టదాయకంగా మారుతోంది. ఒపెక్‌ దేశాలు ధరలు పెంచాలను కోవటం వెనుక ఇది కూడా ఒక ప్రధాన కారణం. తాజా చమురు యుద్దానికి నేపధ్యమిది.

Image result for oil price war cartoons
చమురు యుద్దానికి రష్యా ఎందుకు సిద్ద పడుతోంది అన్నది అనేక మందిలో ఉన్న సందేహం లేదా ప్రశ్న. చమురు ధరలు పడిపోయినపుడు అమెరికా షేల్‌ ఆయిల్‌ ఉత్పత్తి తగ్గుతోంది. తమ మీద అమెరికా చీటికి మాటికి ఆంక్షలు విధిస్తూ ఆర్ధికంగా దెబ్బతీస్తోంది. అందువలన దాన్ని దెబ్బతీయాలంటే చమురు ధరలు పతనం కావాలని రష్యా కోరుకుంటోంది. గత ఐదు సంవత్సరాలలో అమెరికా ఆంక్షల కారణంగా వాటిని తట్టుకొని నిలబడే విధంగా రష్యా ఆర్ధిక వ్యవస్ధ ఒక సాధారణ స్దితికి వచ్చింది. దాని దిగుమతులు తగ్గుతున్నాయే తప్ప పెరగటం లేదు. రూబుల్‌ విలువ పతనమైతే ఎగుమతి దార్లకు మేలు, డాలర్ల ఆదాయం పెరుగుతుంది. అందువలన చమురు ధరలు పతనమైనా తమకు ఢోకా లేదని పుతిన్‌ భావిస్తున్నారు. రూబుల్‌ విలువ పతనమైతే తమ ఎగుమతులు పెరుగుతాయని తద్వారా చమురుతో వచ్చే నష్టాన్ని పూడ్చుకోవచ్చన్నది ఆలోచన. రష్యా దగ్గర ఇప్పుడు డాలర్ల నిల్వలు గణనీయంగా ఉన్నాయి, దాని అప్పులు కూడా తక్కువే. పీపా ధర వంద డాలర్లుంటే తప్ప గిట్టుబాటు కాని స్ధితిలో ఒక నాడు రష్యా ఉండేది. తరువాత తీసుకున్న పొదుపు, ఇతర చర్యల కారణంగా 51 డాలర్లు వచ్చినా బడ్జెట్‌ అవసరాలను తీర్చుకొనే స్ధితికి చేరింది. అది ఇప్పుడు మరింతగా తగ్గి 40డాలర్లకు చేరిందని చెబుతున్నారు. సౌదీ అరేబియా 80డాలర్ల ధర అవసరం ఉన్న స్ధితిలో ఉంది.
అమెరికా మీద ప్రభావం ఎలా ఉంటుంది అని చూస్తే చమురు ధరల పతనం దాని చమురు ఉత్పత్తి కంపెనీలకు నష్టమైతే, మార్కెటింగ్‌ కంపెనీలకు లాభాలను తెచ్చిపెడుతుంది. ధరలు పతనమై షేల్‌ ఆయిల్‌ ఉత్పత్తి రోజు ఒక మిలియన్‌ పీపాలు తగ్గితే ఎగుమతి దేశ స్ధాయి కోల్పోయి దిగుమతి దేశాల జాబితాలో తిరిగి చేరుతుంది. చమురు స్వయం సమృద్ధికి కూడా అంతరాయం ఏర్పడవచ్చు. ధరలు తగ్గితే దిగుమతుల బిల్లు తగ్గుతుంది, మార్కెటింగ్‌ కంపెనీలకు లబ్ది కలుగుతుంది. ఈ నేపధ్యంలో సౌదీ ప్రారంభించిన చమురు యుద్దం ఎంతకాలం కొనసాగుతుంది? దాని వలన మన ఆర్ధిక వ్యవస్ధ, వినియోగదారులకు లబ్ది కలుగతుందా లేదా అని మరోసారి చూద్దాం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనా కట్టడికి గోమూత్ర విందులు – రెచ్చి పోతున్న ఫేక్‌ న్యూస్‌ !

07 Saturday Mar 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Science, USA

≈ Leave a comment

Tags

Coronavirus outbreak, COVID-19, fake news, Gaumutra party with cow-dung cakes

Image result for Cow Piss and Dung Cakes to Fight Coronavirus cartoons

ఎం కోటేశ్వరరావు
వంచన, దగా, అబద్దం దేని నుంచి వచ్చినా సరే లాభం ఆమోదయోగ్యంగానే ఉంటుంది అని గ్రీకు తత్వవేత్త సోఫిక్లస్‌ క్రీస్తుపూర్వమే చెప్పాడు. వ్యాపారమంటే ఒక నాడు వస్తు ఉత్పత్తి, విక్రయం, కొనుగోలు. తరువాత సేవలు కూడా వ్యాపార వస్తువులయ్యాయి. ఇప్పుడు వస్తూత్పత్తి ఉండదు, సేవలతో పని లేదు. జనం ముఖ్యంగా విద్యావంతుల మూఢనమ్మకాలు, విచక్షణారాహిత్యం వంటి వాటిని ఆధారంగా చేసుకొని కేవలం అబద్దాల అమ్మకాలతో కూడా అపరమిత లాభాలు సంపాదించవచ్చని ఆధునిక పెట్టుబడిదారీ విధానం రుజువు చేసింది. ఫేస్‌బుక్‌, దాని సోదరి వాట్సాప్‌, గూగుల్‌ ఇతర సామాజిక మాధ్యమ యజమానులు ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. మన మందరం వారికోసం జీతం, భత్యం లేకుండా నిరంతరం నైపుణ్యాన్ని పెంచుకుంటూ పని చేస్తున్న శ్రమజీవులం. ముఖ్యంగా వాట్సాప్‌ ద్వారా అబద్దాల అమ్మకాలను మనమే పెంచుతున్నాం. ఈ దోపిడీ గురించి బహుశా ఏ ఆర్ధికవేత్తా ఊహించి ఉండరు. తాజాగా కరోనా వైరస్‌ను అలాగే సొమ్ము చేసుకుంటున్నారు.

Image result for Parties With Cow Piss and Dung Cakes to Fight Coronavirus
మన దేశంలో మూఢవిశ్వాసాలు, మనోభావాల వ్యాప్తికి కరోనా వైరస్‌ను వినియోగించుకొనే మతోన్మాద, తిరోగామి శక్తులు రంగంలోకి దిగాయి. హైదరాబాద్‌లో బహిరంగంగా వేదికలపై మంత్రులు, ఇతర ప్రముఖులు కోడి మాంసం తిన్న తరువాతే కరోనా వైరస్‌ మన దేశంలోకి వచ్చిందని హిందూ మహాసభ నేతలు ప్రచారం చేస్తున్నారు. మాంసాహారాన్ని తినే వారిని శిక్షించేందుకు దేవుడు కరోనా వైరస్‌ అవతారం ఎత్తాడని, తెలంగాణా మంత్రులు కరోనాకు క్షమాపణ చెప్పాలని అన్నారు. శాఖాహారులకు దానితో ఎలాంటి ముప్పు లేదని అయితే ముందు జాగ్రత్త చర్యగా నివారణకు గోమూత్ర, ఆవు పేడ పిడకల పార్టీలు నిర్వహిస్తామని హిందూమహాసభ నేత చక్రపాణి మహరాజ్‌ ప్రకటించారు. ఆయనొక హిందూ మత ఉద్దారక స్వామీజీ. ఆవు మూత్రాన్ని తాగటం, ఒంటి మీద చల్లుకోవటం,పిడకలతో రాసుకోవటం, అగర్‌బత్తీల మాదిరి వెలిగించటం ద్వారా వైరస్‌ను నివారించవచ్చని చెబుతున్నారు. ఇక రామ్‌దేవ్‌ బాబా సర్వరోగ నివారిణి యోగా అని ప్రకటించారనుకోండి.
కరోనా వైరస్‌ గురించి ప్రపంచ వ్యాపితంగా అనేక మూఢనమ్మకాలను వ్యాపింప చేశారు, చేస్తున్నారు. మన దేశంలో కూడా అదే జరుగుతోంది. అలాంటి వాటితో ఇతర దేశాల్లో దేనిని ఆశిస్తున్నారో ఇక్కడ కూడా దాన్నే ఆశిస్తున్నారు. జనాన్ని చీకట్లో ఉంచటం. హైదరాబాదు శివార్లలోని చిలుకూరు బాలాజీ డాలర్‌ దేవుడిగా ప్రఖ్యాతి చెందారు. అక్కడికి వెళ్లి పూజలు చేస్తే అమెరికాకు వీసా వస్తుందని ఎందరో నమ్మి ప్రదక్షిణలు చేశారు. ఇప్పుడు ట్రంప్‌ కోత పెట్టారు, బాలాజీ ఏమి చేస్తున్నట్లు ? అమెరికా సర్కార్‌ అనుమతిస్తున్న కారణంగా వీసాలు వస్తున్నాయి తప్ప బాలాజీ మహిమ వల్ల కాదని అక్కడి పూజారులు ఎప్పుడూ చెప్పలేదు, ప్రోత్సహించారు. తాజాగా చైనాలో కరోనా వైరస్‌ వ్యాప్తి వార్తలు రాగానే సదరు వైరస్‌ను భారత్‌కు రాకుండా అడ్డుకొమ్మని బాలాజీని కోరుతూ అదే దేవాలయంలో పూజలు చేశారు. తీరా మన దేశంలో కేసులు బయట పడిన తరువాత వస్తే రానిచ్చారు గానీ ఇప్పుడు వ్యాప్తి చెందకుండా చూడు సామీ అని పూజలు చేస్తున్నారు. రెండు పూజల్లోనూ మూఢనమ్మకాలకు పెద్ద పీట వేశారు. సమాజంలో అలాంటి వాటిని వ్యాప్తి చెందించటమే వారు కోరు కుంటున్న లాభం, కానట్లయితే ఎందుకు చేస్తున్నట్లు ? వైరస్‌ వ్యాప్తి నిరోధంలో బాలాజీ విఫలమయ్యారు కదా అని ఎవరైనా అంటే అదిగో హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ దెబ్బలాటలకు వస్తున్నారు. మరికొందరు ఇంకాస్త ముందుకు పోయి దాని వలన అక్కడి పూజారులేమీ లబ్ది పొందటం లేదు కదా అని ఎదురు దాడులు, వితండవాదనలు చేస్తున్నారు. ఆ పూజలను నమ్మి తగుజాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు తిరిగి వైరస్‌ను కొని తెచ్చుకొంటే బాధ్యత ఎవరిది ? పూజారిదా బాలాజీదా ? మూఢనమ్మకాలను వ్యాపింప చేయటం వలన వేలు లక్షలు తగలేసి దోష నివారణలు చేయిస్తున్నారు. ఇప్పుడు కరోనా దోష నివారణ పూజలకు తెరలేపరనే గ్యారంటీ ఏముంది? తమకేమీ లాభం లేదని చెప్పేవారు ఈ పూజల దోపిడీ గురించి ఏమి చెబుతారు? వారికేమీ సామాజిక బాధ్యత లేదా ? మూఢనమ్మకాల వ్యాప్తి విషయంలో హిందూ, క్రైస్తవం, ఇస్లాం ఏ మతమైనా ఒక్కటే !
కరోనా వైరస్‌ మూఢనమ్మకాలను, తిరోగామి భావాలనే కాదు, జాత్యహంకారశక్తులనూ ముందుకు తెచ్చింది. శుద్దీ బద్దం ఉండని చైనా జాతీయులు, యూదుల కారణంగానే కరోనా వైరస్‌ వ్యాపిస్తోందని, వారినే హతమారుస్తోందని శ్వేత జాతి జాత్యహంకారులు ఆరోపిస్తున్నారు. నయా నాజీలు యూదుల మీద విష ప్రచారం చేస్తున్నారు. టెలిగ్రామ్‌,4చాన్‌ వంటి వేదికలు వీటికి ఆలంబనగా ఉన్నాయి.శ్వేత జాతేతర దేశాల్లోనే కరోనా వ్యాపిస్తోందనే పోస్టులు, పోస్టర్లు వీటిలో విచ్చల విడిగా దర్శనమిస్తున్నాయి. కరోనా రోగులను ఇజ్రాయెల్‌కు పంపండి, మీరు మరణశయ్యమీద ఉంటే మీతో పాటు వీలైనంత మంది యూదులను తీసుకుపోండి, మీకు గనుక వ్యాధి సోకితే మన శత్రువులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఎక్కువగా తిరగండి వంటి పోస్టులు దర్శనమిస్తున్నాయి.
వాక్సిన్‌ వ్యాపారంలో ఎంతో ముందున్న బిల్‌గేట్స్‌(చాలా మందికి మైక్రోసాప్ట్‌ అధినేతగానే తెలుసు), ఇతర ఔషధ కంపెనీలు వైరస్‌ను వ్యాపింప చేస్తున్నాయనే పోస్టులు కూడా వస్తున్నాయి. చైనా 5జి నెట్‌వర్క్‌ పరిజ్ఞానంలో ముందుంది. దాన్ని దెబ్బతీసేందుకు కూడా సామాజిక మాధ్యమాల్లో ప్రయత్నం జరుగుతోంది. చైనా 5జి వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ హుబెరు రాష్ట్రంలోని జనాల రోగనిరోధక శక్తిని బలహీన పరిచిందనే ప్రచారం వాటిలో ఒకటి. పైన పేర్కొన్నవన్నీ తప్పుడు ప్రచారాలే. గతంలో కొన్ని కంపెనీలు, కొన్ని ప్రభుత్వాలు ఇలాంటి అక్రమాలకు పాల్పడిన కారణంగానే కరోనా విషయంలో కూడా అదే జరిగి ఉంటుందనే అనుమానాల నుంచి ఇవన్నీ పుడుతున్నాయి. వాటికి జాత్యహంకారం, విద్వేషం తోడైతే ఇక చెప్పాల్సిందేముంది !

Image result for Cow Piss and Dung Cakes to Fight Coronavirus cartoons
గోమూత్రం తాగితే, చల్లుకుంటే వైరస్‌ దూరం అవుతుందని హిందూ మత ఉద్దారకులుగా చెలామణి అవుతున్నవారు చెబుతున్నారు. అలాగే ఎన్నికల నాటికి వైరస్‌కు వాక్సిన్‌ కనుగొనండి అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన ఆతృత, తెలివి తక్కువ తనాన్ని బయట పెట్టుకున్నాడు. కరోనా వైస్‌ నివారణ అధికార యంత్రాంగం, ఔషధరంగ ప్రముఖులతో జరిపిన సమావేశంలో ఈ ప్రతిపాదన చేసి అభాసుపాలయ్యాడు. కరోనా వైరస్‌ కోవిడ్‌-19కు వాక్సిన్‌ కనుగొనేందుకు కనీసం పద్దెనిమిది నెలల సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రకటించిన తరువాత కూడా ట్రంప్‌ అలా మాట్లాడటాన్ని గమనించాలి. నవంబరులోగా తయారీ సాధ్యం కాదని ఒక అధికారి వివరించబోయినా తెలుసులేవయ్యా అంటూ ట్రంప్‌ వినిపించుకోలేదు.
ఫేక్‌ న్యూస్‌ లేదా కుహనా వార్తలు, వాటి ఉత్పత్తి వివిధ రూపాల్లో ఉంటాయి.కరోనా వైరస్‌ గురించి వందలాది తప్పుడు, వక్రీకరణ వార్తలను ప్రపంచ వ్యాపితంగా వ్యాపింప చేస్తున్నారు. కుహనా వార్త తయారీలో శ్రామికులు ఉండరా అంటే ఏ ఉత్పత్తి అయినా ఏదో ఒక శ్రమ లేకుండా తయారు కాదు. ఇవి కూడా అంతే. వాటికి సైతం యంత్రాల(కంప్యూటర్లు, తదితరాలు)తో కూడిన ఫ్యాక్టరీలుంటాయి, మేథో శ్రమను అమ్ముకొనే వారు ఉంటారు. ఆ ఉత్పత్తులతో అమెరికాలో ట్రంప్‌, రష్యాలో పుతిన్‌, మన దేశంలో నరేంద్రమోడీ ఎన్నికల్లో, ఇతర విధాలుగా లబ్ది పొందిన వారిలో కొందరైతే, వినియోగదారులుగా మోసపోయిన వారు కోట్లలో ఉన్నారు. ఒక వస్తువు నకిలీదని తేలితే కేసు పెట్టటానికి, పరిహారం పొందటానికి చట్టాలున్నాయి. ఒక నకిలీ వార్తను నమ్మి మోసపోతే అలాంటి రక్షణ లేకపోగా వాటిని గుడ్డిగా నమ్మటానికి నీ బుర్ర ఏమైందని ఎదురు తిట్లు తినాల్సి ఉంటుంది. ఏ కోర్టులూ వాటి తయారీదార్లను ఏమీ చేయలేవు. అసలు ఉత్పత్తి కేంద్రాలు ఆయా దేశాల్లోనే ఉండవు,ఎక్కడుంటాయో కూడా తెలియదు.

Image result for Parties With Cow Piss and Dung Cakes to Fight Coronavirus
మన దేశంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీ మారేందుకు నియోజకవర్గ అభివృద్ధి, కార్యకర్తల అభీష్టం అని నిస్సిగ్గుగా సమర్ధించుకున్నవారిని చూశాము. ఇప్పుడు అలాంటి వాటి సరసన జాతీయవాదం చేరింది. బిజెపిలో చేరాలనుకొనే వారు ఆ పార్టీ జాతీయవాదం, దేశ భక్తి నచ్చి చేరాలనుకున్నామని చెబుతున్నారు. తాము చెప్పే (కుహనా) జాతీయవాదం, దేశభక్తి వర్గీకరణలోకి రాని వారందరూ తుకడే తుకడే గ్యాంగ్స్‌, దేశ ద్రోహులే అని బిజెపి ముద్రవేస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ వ్యాప్తికి కారణాలు ఇథమిద్దంగా తెలియదు. కానీ దేశంలోని సాధారణ జనంలో(ఎంతశాతం అనేది వేరే సంగతి) అంతకంటే ప్రమాదకరమైన జాతీయవాద వైరస్‌ పెరగటానికి కారణం కుహనా వార్తల వ్యాప్తి చోదకశక్తిగా ఉందని కొంత కాలం క్రితం బిబిసి పరిశోధనలో వెల్లడైంది. భావోద్వేగ భరితమైన జాతీయవాదం పెరుగుదలలో వాస్తవాలకు ప్రాధాన్యత నామమాత్రమని తేల్చింది. ఎలాంటి సమాచారాన్ని జనం పొందుతున్నారు,ఇతరుల నుంచి ఎలా పొందుతున్నారు వంటి ప్రశ్నలతో ఈ పరిశోధన సాగింది. దాని సారాంశం ఇలా ఉంది. కుహనా జాతీయవాద కథల వ్యాప్తిలో మితవాద(సంఘపరివార్‌) సంస్ధలు ఎంతో సంఘటితంగా పని చేస్తున్నాయి. ప్రధాన స్రవంతి మీడియా చెబుతున్న అంశాలను విశ్వసించని కారణంగా ప్రత్యామ్నాయ వనరులవైపు జనం చూస్తున్నారు. నకిలీ వార్తా , కాదా అని నిర్ధారించుకొనే ప్రయత్నం చేయకుండానే తాము నిజమైన దానినే వ్యాపింప చేస్తున్నామని, ఏది నకిలీనో ఏది అసలైనదో తెలియనంత అమాయకులం కాదని తమ మీద తాము అతి నమ్మకంతో ఉంటారు. బిబిసి పరిశోధకులతో మాట్లాడిన వారు తామ వార్తల విశ్వసనీయతను నిర్ధారించుకొనేందుకు ఏ చిన్న ప్రయత్నం చేయలేదని, ప్రత్యామ్నాయ సమాచారం నిజమని నమ్మామని నిజాయితిగానే అంగీకరించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు పంపినవి గనుక వాస్తవమే అని గుడ్డిగా నమ్ముతున్నారు.వాట్సాప్‌లో తప్పుడు సమాచారాన్ని నిజమని నమ్మిన కారణంగా అది భారత్‌లో హింసాకాండ ప్రజ్వలనకు దోహదం చేసింది. పిల్లలను అపహరించేవారి గురించి, ఇతర సమాచారంతో తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, తమ సామాజిక తరగతిని చైతన్యపరచాలనే భావనతోనే అలాంటి పనులు చేస్తున్నారు. రెండు సంవత్సరాల కాలంలో ఇలాంటి తప్పుడు సమాచారం కారణంగా31 మంది హత్యకు గురైనట్లు బిబిసి గుర్తించింది. ఇలాంటి పరిణామం అనేక దేశాల్లో ఉంది.
2018లో రాండ్‌ కార్పొరేషన్‌ అన్ని రకాల కుహనా వార్తల మీద ఒక సర్వే చేసింది. వాటిలో ఆరోగ్యపరమైన వార్తలు మరీ దారుణంగా ఉన్నాయని తేల్చింది. అభిప్రాయాలకు-వాస్తవాలకు మధ్య ఉన్న తేడాను కోవిడ్‌-19 చెరిపివేసినట్లు వెల్లడైంది.కుహనా వార్తల మీద ఫేస్‌బుక్‌ యుద్దం ప్రకటించింది. నిజానికి అదంతా ఒక ప్రచార ప్రహసనం మాత్రమే. తప్పుడు వార్తల తయారీ, వ్యాప్తిదార్లకు అవి సొమ్ములను కురిపిస్తాయి, వాటిని ఉపయోగించుకొనే వారికి తగినంత ప్రచారాన్ని కల్పిస్తాయి. అనేక మందిని భ్రమింపచేసి మద్దతుదారులుగా మార్చివేస్తాయి. నియంత్రణలు, పర్యవేక్షణలేని ప్రాంతాలను ఎంచుకొని అక్కడి నుంచి ప్రపంచ వ్యాపితంగా వీటిని వ్యాపింప చేస్తాయి. తప్పుడు వార్తలను సొమ్ము చేసుకొనేందుకు ఫేస్‌బుక్‌, గూగుల్‌ వంటివి వారధులుగా ఉన్నాయి. అవి కూడా వాటిని సొమ్ము చేసుకుంటాయి గనుక ఎన్ని సుభాషితాలు పలికినా ఏదో ఒకదారిలో అనుమతిస్తూనే ఉంటాయి. అందుకు గాను అనేక వ్యాపార పద్దతులను అనుసరిస్తున్నాయి. మాసిడోనియా ప్రాంతం నుంచి అమెరికా ఎన్నికల మీద ఒక తప్పుడు వార్తను దిమిత్రి అనే యువకుడు ఇంటర్నెట్‌లో పెట్టాడు. గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి సంస్ధలు వాటిని జనం చూసే నడతను బట్టి వాణిజ్య ప్రకటనలను జోడిస్తాయి. డోనాల్డ్‌ ట్రంప్‌ అభిమానులు ఆ వార్త మీద క్లిక్‌ చేసి చూసినందుకు గాను ఆరునెలల్లో 60వేల డాలర్లు తన వాటాగా పొందాడు. తప్పుడు వార్తలున్న పేజీలను గుర్తించి వాటి మీద వాణిజ్య ప్రకటనలు పెట్టటాన్ని అడ్డుకుంటామని ఫేస్‌బుక్‌, గూగుల్‌ ప్రకటించాయి.కానీ తరువాత చూస్తే తప్పుడు వార్తల మీద వాణిజ్య ప్రకటనలను అనుమతించి ఆదాయాన్ని పొందుతున్నట్లు తేలింది. దీంతో కొన్ని కంపెనీలు తమ ప్రకటనలను తప్పుడు వెబ్‌సైట్లలో పెడితే తమ బ్రాండ్‌(పేరు)కు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నందున డబ్బు చెల్లించేది లేదని చెప్పాల్సి వచ్చింది.

Image result for Cow Piss and Dung Cakes to Fight Coronavirus cartoons

విధానపరంగా నిషేధం విధించినప్పటికీ దొడ్డి దారిన గూగుల్‌ సంస్ద కరోనా వైరస్‌ నిరోధ ఉత్పత్తులు, పరిమితంగా అందుబాటులో ఉన్నాయనే సందేశాలతో ఎగబడి కొనే విధంగా కొన్ని ప్రకటనలను అనుమతించి సొమ్ము చేసుకుంటున్నది. విమర్శలు తలెత్తగానే తమ వేదికలను మూడవ పక్షాలు వుపయోగించుకుంటున్నాయని గూగుల్‌, అమెజాన్‌ వంటివి తమకేమీ సంబంధం లేదన్నట్లుగా ప్రకటించాయి. కరోనా వైరస్‌ నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం తప్ప నివారణకు ఎలాంటి చిట్కాలు పని చేయవు, నోరు, ముక్కులకు వేసుకొనే ముసుగులు , శానిటైజర్స్‌ కూడా అలాంటివే అని నిపుణులు చెబుతున్నా జనం బ్లాక్‌ మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నారు, వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వైరస్‌ వ్యాపిస్తున్నా ఎన్నికల సభలు ఆపొద్దు : డోనాల్డ్‌ ట్రంప్‌ !

04 Wednesday Mar 2020

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

coronavirus spreads, COVID-19, COVID-19 in US, Donald trump

Image result for Go ahead campaign rallies even as coronavirus spreads:Trump

ఎం కోటేశ్వరరావు
ఒక వైపు చైనాలో కరోనా వైరస్‌ తగ్గుముఖం పడుతున్నట్లు వార్తలు రాగా అమెరికాతో సహా అనేక దేశాల్లో అది విస్తరిస్తున్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి. చైనా పౌరుల పట్ల తన బాధ్యతగా ఖర్చుకు వెనుకాడకుండా నివారణ, చికిత్స చర్యలు తీసుకుంటుండగా అమెరికాలో దానికి భిన్నంగా భారాన్ని జనం మీద మోపేందుకు పూనుకున్నట్లు ఇంతవరకు వచ్చిన వార్తలు సూచిస్తున్నాయి. ఇది వ్యాధికంటే జనాన్ని ఆర్ధికంగా దెబ్బతీసేదిగాను, ఆప్పుల పాలు చేసేదిగానూ ఉంది. సోమవారం నాటి వరకు ఆరుగురు మరణించగా 15 రాష్ట్రాలలో వందలాది మందికి సోకినట్లు వార్తలు వచ్చాయి. వ్యాధి నిర్దారణ పరీక్షలకు డబ్బు వసూలు చేయవద్దని న్యూయార్క్‌ గవర్నర్‌ బీమా కంపెనీలను కోరారు. వైరస్‌ విస్తరిస్తున్నా ప్రమాదం లేదని ఎన్నికల సభలను ఆపాల్సిన అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన అనుయాయులను కోరాడు. కావాలంటే డెమోక్రాట్లను చూడండి, వారు కొనసాగిస్తున్నారని కూడా సెలవిచ్చాడు.
ఊరంతటిదీ ఒక దారి అయితే ఉలిపికట్టెది ఒక దారి అన్నది ఒక సామెత. ప్రపంచ వ్యాపితంగా కోవిద్‌-19(కరోనా వైరస్‌)ను ఎలా అదుపులోకి తేవాలా అని చూస్తుంటే అమెరికాలో దాన్నుంచి లబ్ది పొందటం గురించి ఆలోచించే వారున్నట్లు కొన్ని ఔషధ కంపెనీల వాటాల ధరలు పెరగటం సూచిస్తున్నది. డిసెంబరు 31న చైనాలో తొలి వైరస్‌ కేసు బయటపడిన తరువాత అది ఎక్కడైనా కనిపించవచ్చు అన్న హెచ్చరికలు వెలువడ్డాయి. పాకిస్ధాన్‌ వంటి పేద దేశమంటే అర్ధం చేసుకోవచ్చు, అమెరికా వంటి ధనిక సమాజాలు ఎందుకు సిద్దం కాలేదు అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తాయి. అంచనా వేసిన దాని కంటే ఎక్కువగానే అక్కడ వ్యాపించవచ్చని ఆరోగ్య అధికారులు తాజాగా ప్రకటించారు. కోవిద్‌-19 కొత్తది కనుక చికిత్సకు వెంటనే సిద్ధపడలేదు అని చెప్పినా కొంత మేరకు అర్ధం చేసుకోవచ్చు. కానీ ప్రతి ఏటా సంభవించే ఫ్లూ(ఇది వైరస్‌తో వచ్చే జలుబు) గురించి తెలిసినా ఈ ఏడాది డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు అమెరికాలో మూడులక్షల పదివేల మందికి సోకి ఆసుపత్రుల పాలుకాగా 18వేల మంది మరణించారని వ్యాధుల నియంత్రణ మరియు నిరోధ కేంద్రం(సిడిసి) పేర్కొన్నది. కరోనా వైరస్‌ కూడా దీనికి తోడైతే అతలాకుతలంగాక తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కరోనా వైరస్‌ సోకినట్లు అనుమానించిన వారి ఆసుపత్రుల బిల్లులు చూస్తే అమెరికా పేదల పరిస్ధితి ఏమిటన్న చర్చ మొదలైంది. సాధారణ సమయాల్లో అమెరికాలో ప్రజారోగ్య భద్రతకు కేటాయింపులు తక్కువ అనే విమర్శ ఇప్పటికే ఉంది. ఇలాంటి మహమ్మారి తలెత్తినపుడు అయ్యే ఖర్చు గురించి చెప్పనవసరం లేదు. చైనా నుంచి అమెరికా పౌరుడు ఫ్రాంక్‌ యుసినిస్కీ, అతని మూడు సంవత్సరాల కుమార్తెను శాండియాగోలోని ఒక ఆసుపత్రిలో ఉంచి పరీక్షలు చేసి పరిశీలించి వ్యాధి సోకలేదని ఇంటికి పంపారు. న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక వెల్లడించిన సమాచారం మేరకు అతనికి 3,918 డాలర్ల బిల్లు వచ్చింది, దానిలో వారిని ఆసుపత్రికి తరలించి, తీసుకు వచ్చిన అంబులెన్స్‌ ఛార్జీ 2,600 డాలర్లు. అంత మొత్తం తాను చెల్లించే స్ధితిలో లేనని దాతలు తనకు సాయం చేయాలని గో ఫండ్‌ మీ అనే వెబ్‌సైట్‌లో అభ్యర్ధన పెట్టాడు. చైనా నుంచి రావటానికి అయ్యే ఛార్జీలను భరించాల్సి ఉంటుందని తనకు తనకు తెలుసునని, ఆసుపత్రికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని భావించానని యుసినిస్కీ వాపోయాడు. చైనాలో ఉద్యోగం చేస్తున్న సమయంలో యజమాని తనకు వైద్యబీమా చేయించారని, అమెరికాలో బీమా లేదని అతను పేర్కొన్నాడు. అనేక మంది పేదలు అమెరికాలో బీమా చేయించుకోలేకపోవటం లేదా ఉన్నా పాక్షికంగా మాత్రమే సౌకర్యాలను కలిగి ఉంటున్నారు. ఈ ఉదంతం మీడియాలో వచ్చిన తరువాత పొరపాటున బిల్లు పంపామని ఆసుపత్రి యాజమాన్యం విలేకర్లకు చెప్పింది. అంబులెన్స్‌ కంపెనీ వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది. విధిగా ఆసుపత్రుల్లో చేరి పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వాలు ఆదేశించినపుడు దానికయ్యే ఖర్చును ఎవరు భరించాలన్నది తెలియటం లేదని ఒక అధికారి వ్యాఖ్యానించారు. ప్రజారోగ్య భద్రతా చర్యల్లో భాగంగా పౌరులు తమంతట తాము సంసర్గ నిషేధం(క్వారంటైన్‌) విధించుకోవాలని ప్రభుత్వాలు ఆదేశించవచ్చు. అయితే ఇది అసాధారణంగా జరుగుతుంది కనుక అందుకయ్యే ఖర్చు గురించి ఎలాంటి విధి విధానాలను రూపొందించలేదు కనుక బీమా కంపెనీలు బిల్లులు పంపుతున్నాయి.
మియామీ పౌరుడు ఓస్మెల్‌ మార్టినెజ్‌ చైనా వెళ్లి వచ్చిన తరువాత ఫ్లూ(జలుబు) చేయటంతో ఒక స్ధానిక ఆసుపత్రిలో పరీక్షలు చేయమని కోరాడు. సిటి స్కాన్‌ చేయాలని ఆసుపత్రి సిబ్బంది చెప్పగా ఫ్లూ పరీక్ష మాత్రమే చేయించుకున్నాడు. దానికి గాను 3,270 డాలర్లకు గాను బీమా సొమ్ము పోను 1400 డాలర్లు చెల్లించాలని బిల్లు చేతిలో పెట్టటంతో దిమ్మ తిరిగి జలుబు ఎగిరిపోయింది. అనేక మంది ఇలాంటి బిల్లులను చూసి పరీక్షలు చేయించుకొనేందుకు భయపడుతున్నట్లు ప్రజారోగ్య నిపుణుడైన ఒక ప్రొఫెసర్‌ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఫ్లూ లేదా ఆ లక్షణాలు ఉండే కరోనా వైరస్‌ పరీక్షలు చేయించుకొంటే తాము అప్పుల పాలు కావలసిందే అని సామాన్య అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్‌ పరీక్షలు ఉచితం అయినా బీమా వర్తించని ఆసుపత్రిల రూము అద్దెలు, అంబులెన్సులు ఇతర ఖర్చులు తడిచి మోపెడు కానున్నాయి. అసలు బీమా రక్షణ లేని అమెరికన్లు 2.7కోట్ల మంది ఉన్నారు. సాధారణ ఫ్లూ, ఎ, బి వైరస్‌ పరీక్షలు, సిఎంపి రక్త పరీక్షలకు 1295 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అదే బీమా ఉంటే 587 డాలర్లు చెల్లిస్తే సరిపోతుంది.
గడచిన 24 గంటలలో 125 కొత్త కేసుల నమోదు, హుబెరులో 31 మంది మరణించినట్లు మంగళవారం నాడు చైనా ప్రకటించింది. జనవరి 21వ తేదీ తరువాత ఇంత తక్కువగా నమోదు కావటం ఇదే ప్రధమం. అక్కడ మొత్తం 80,151 మందికి సోకగా 2,943 మంది మరణించారు. డెబ్బరు దేశాలలో 90వేల మందికి సోకగా 3,116 మంది మరణించారు. ప్రస్తుతం దక్షిణకొరియా, ఇరాన్‌, ఇటలీలో ఎక్కువగా వ్యాపిస్తోంది. దక్షిణ కొరియాలో 5,186 మందికి సోకింది. అక్కడి ప్రభుత్వం వైరస్‌పై యుద్దం ప్రకటించింది. ఆర్ధికంగా ఉద్దీపన చర్యలకు 25బిలియన్‌ డాలర్లు ప్రకటించింది. దక్షిణ కొరియాలో స్ధానిక పౌరులు కానప్పటికీ ఆరోగ్య రక్షణ అక్కడ ఉచితంగా అందిస్తారు. ప్రపంచ వ్యాపితంగా ఉన్న తన సిబ్బంది ఇండ్ల నుంచే పని చేయాలని ట్విటర్‌ కోరింది. ఇటలీలో 2036 కేసులు నమోదయ్యాయి.

Image result for Go ahead campaign rallies even as coronavirus spreads:Trump
అమెరికాలో కరోనా వైరస్‌ వార్తలు రాగానే కొన్ని కంపెనీలు తాము పరీక్ష కిట్‌లను విక్రయించనున్నట్లు ప్రకటించాయి. అలాంటి వాటిలో ఒకటి కో డయాగస్టిక్స్‌, కిట్లను విక్రయించనున్నట్లు ప్రకటించగానే దాని వాటాల ధర 59శాతం పెరిగాయి. ఫైజర్‌ కంపెనీల వాటాల ధరలు ఒక్కరోజే పదమూడుశాతం ఎగబాకాయి. వాటాలను కొనేందుకు మదుపుదారులు ఎగబడటం తప్పా ఒప్పా అనే అంశాన్ని పక్కనపెడితే కార్పొరేట్‌ కంపెనీలు వ్యాధులతో జరిపే వ్యాపారాల్లో లాభాలు ఎలా ఉంటాయో కూడా ఇది వెల్లడిస్తున్నది.
2009లో స్వైన్‌ ఫ్లూ(హెచ్‌1ఎన్‌1) విస్తరించిన సమయంలో ఒక్క అమెరికాలోనే 5.9కోట్ల మందికి సోకగా పన్నెండువేల మంది మరణించారు, ప్రపంచ వ్యాపితంగా మూడులక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. కరోనా గురించి నిర్ధారణ కాగానే చైనా తీసుకున్న అసాధారణ నివారణ చర్యలను, స్వైన్‌ ఫ్లూ వచ్చినపుడు అమెరికా తీరును ఒక్కసారి పోల్చి చూడటం అవసరం. వెయ్యి , పదహారు వందల పడకల రెండు ఆసుపత్రులను పది రోజుల వ్యవధిలో చైనా నిర్మించిన తీరు, ఏడుకోట్ల మంది జనాన్ని ఇండ్లకే పరిమితం చేసిన నిర్ణయం కనీవినీ ఎరుగనివి. అమెరికన్‌ వైరస్‌గా అమెరికన్లే పిలుచుకున్న స్వైన్‌ ఫ్లూ విస్తరణ సందర్భంగా నివారణ చర్యలు తీసుకొనేందుకు ఆరునెలల సమయం తీసుకుంది. ఎలాంటి ప్రయాణ ఆంక్షలు, సంసర్గ నిషేధాలు, సరిహద్దుల్లో తనిఖీలు లేవు. అది మహమ్మారిగా మారి 214 ప్రాంతాలు, దేశాలకు విస్తరించింది. ఇప్పుడు చైనాను నిందిస్తున్న మాదిరి అప్పుడు స్వైన్‌ ఫ్లూ అమెరికాయే కారణమని ఎవరూ నిందించలేదు. సోషలిస్టు చైనా నాయకత్వానికి, లాభాలు తప్ప మరొకటి పట్టని పెట్టుబడిదారీ వ్యవస్ధకు ఉన్న తేడా ఇది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ -ట్రంప్‌ ఉల్లాసాన్ని దెబ్బతీసిన ఢిల్లీ ‘పధకం’ !

01 Sunday Mar 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, USA

≈ Leave a comment

Tags

Delhi violence, Donald trump, Donald Trump India tour, Narendra Modi

Image result for delhi planned violence spoils modi-trump party

ఎం కోటేశ్వరరావు
నరేంద్రమోడీ అనుకున్నదొకటీ, అయింది ఒకటి. కొన్ని సందర్భాలలో ఎవరి పథకాలు, ఎత్తుగడలు వారినే దెబ్బతీస్తాయి. మోడీ ఆహ్వానం మేరకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కుటుంబ సమేతంగా రెండు రోజుల పర్యటన జరిపి వెళ్లారు. ఆ పెద్దమనిషి ఢిల్లీలో ఉండగానే జరిపించిన, జరిగిన ఘటనలతో కాషాయ దళాల ముసుగు మరింతగా తొలిగింది, చాలా దగ్గరగా అనేక మంది వారిని చూడగలిగారు. దొంగకే తాళాలు ఇస్తే దొంగతనాలు ఆగిపోతాయని అనేక మంది భ్రమపడినట్లే మతోన్మాదులకే అధికారమిస్తే మత ఘర్షణలు జరగకుండా ప్రశాంతంగా బతకవచ్చు అనుకున్నవారికి కూడా ఢిల్లీ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మత ఘర్షణల చరిత్రను చూసినపుడు అవి ఎన్నడూ వాటంతట అవి పుట్టలేదు, ఎక్కడో ఒక దగ్గర రూపొందించిన పథకాలతోనే జరిగాయి. లేదా ఎక్కడైనా అనుకోకుండా జరిగిన ఘటనలను ఉపయోగించుకొనేందుకు సిద్దంగా ఉన్న వారు చెలరేగిపోయినపుడు తలెత్తాయి.
ఢిల్లీ ఎన్నికలకు ముందునుంచీ బిజెపి నేతల రెచ్చగొట్టుడు తీరు తెన్నులు, వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయో అని అనేక మంది భయపడ్డారు. దానికి అనుగుణ్యంగానే అనేక మంది అనుమానిస్తున్నట్లుగా ఉత్తర ప్రదేశ్‌ నుంచి వచ్చిన అపర ‘జాతీయ వాదులు లేదా దేశ భక్తులు ‘ ఈశాన్య, తూర్పు ఢిల్లీలో జరిపిన హింసాకాండను చూశాము. దాన్ని ప్రతిఘటించే క్రమంలో కూడా కొందరు బలై ఉంటారు. హింసాకాండ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తి మురళీధర్‌ను రాత్రికి రాత్రే ఢిల్లీ హైకోర్టు నుంచి బదిలీ చేసిన తీరుతో హింసాత్మక శక్తులను రక్షించేందుకు కేంద్ర పాలకులు ఎంతకైనా తెగిస్తారని అనేక మందికి ఎవరూ చెప్పకుండానే అర్ధం అయింది. దీన్నుంచి తేరుకోక ముందే శుక్రవారం నాడు రికార్డు స్ధాయిలో స్టాక్‌ మార్కెట్‌ పతనం, వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో మూడవ త్రైమాసిక అభివృద్ధి అంచనా 4.7శాతంగా ఉన్నట్లు ప్రభుత్వమే ప్రకటించింది. డోనాల్డ్‌ ట్రంప్‌ నుంచి పొందిన ప్రశంసలతో కొద్ది రోజులు కాలక్షేపం చేద్దామని సంబరపడిన మోడీ పరివారాన్ని వెంట వెంటనే జరిగిన ఈ ఘటనలన్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ పరిణామాలు దేశాన్ని ఎటు తీసుకుపోనున్నాయో, ఆర్ధిక సమస్యల నుంచి ఎలా బయటపడతామో తెలియని అయోమయంలో దేశం ఉంది.
సామాజిక మాధ్యమంలో కాషాయ దళాలు భారతమాతాకి జై అనే పేరుతో వ్యాపింప చేస్తున్న ఒక పోస్టులోని అంశాలు ఇలా ఉన్నాయి.” బీజేపీ దేశం కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.ఇప్పటి వరకు కొన్ని నిర్ణయాలు మాత్రమే తీసుకున్నాము, 1. జిఎస్‌టి,2.ట్రిపుల్‌ తలాఖ్‌ రద్దు 3. రామ మందిర్‌ 4.370ఆర్టికల్‌ రద్దు-5.( సిఎఎ)పౌరసత్వ సవరణ చట్టం,నోట్ల రద్దు.6. బినామీ చట్టం 7.కార్పొరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడం,8.త్రివిధ దళాల అధిపతి నియామకం (సీడీఎస్‌),ఇవన్నీ కేవలం సాంపిల్స్‌,మాత్రమే. ఇప్పటి నుంచి అసలు కథ . ఇండియా యాక్షన్‌ ప్లాన్‌ 2020. రాబోయే రోజులో ఇంకా చాలా ఉన్నాయి.1. ఎన్‌ఆర్‌సి,2. యుసిసి(ఉమ్మడి పౌరస్మృతి), 3.ఆక్రమిత కాశ్మీర్‌,4. కుటుంబ నియంత్రణ చట్టం,5. జమిలి ఎన్నికలు,6. మత మార్పిడి నిరోధక చట్టం. ఇలా చాలా చాలా చేస్తాము, చేస్తూనే ఉంటాము .. దేశ క్షేమమే మా లక్ష్యం..దేశం కోసం, దేశ శ్రేయస్సు కోసం, సనాతన భారతీయత ధర్మ పరి రక్షణ కోసం చేయవలసినది చేస్తాము .. తనకు ….సంపదన మీద ఆశ లేదు …. అవినీతి సంపాదన పోతుందీ అన్న బెంగా లేదు, తన ప్రాణం మీద ప్రీతీ లేదు,ఉన్నది ఒకటే, ఇదీ..మన దేశం… నా దేశం.అంతే..ఉంటే ఉంటాం పోతే పోతాం..దేశానికి మేలు చేసే పోతాం.”
పైన పేర్కొన్న అంశాలలో ఏ ఒక్కటీ దిగజారుతున్న దేశ ఆర్ధిక స్ధితిని మెరుగుపరచేది కాదు, ఉపాధిని పెంచేది కాదు, ఉద్యోగాలు ఇచ్చేదీ, ధరలు తగ్గించేదీ కాదు. వివాదాస్పద అంశాలతో సామాజికంగా అశాంతిని, విభజనను మరింతగా పెంచే భావోద్వేగ అంశాలు తప్ప దేశ ఆర్ధిక పరిస్ధితిని మెరుగుపరచే చర్యలేవీ వాటిలో లేవు. గత ఆరు సంవత్సరాలలో కూడా చేసింది ఇదే. దేశ వృద్ధి రేటు గరిష్టంగా ఉన్న ఏడున్నరశాతం నుంచి ఏడేండ్ల కనిష్టానికి( ఐదుశాతానికి ) దిగజారింది. సామాజికంగా పరస్పరం అపనమ్మకాలు, విద్వేషాలు పెరిగాయి. అయినా ఇప్పటి వరకు నమూనా మాత్రమే, అసలైన అజెండా ముందుంది అంటూ కాషాయ దళాలు దేశాన్ని మరింతగా ఇబ్బందుల పాలు చేసే అజెండాను అమలు జరుపుతామని రెచ్చిపోతున్నాయి. భావోద్వేగాలు పరిస్ధితిని మరింత దిగజార్చుతాయి తప్ప మెరుగుపరచే అంశాలేమీ వాటిలో ఉండవు.
పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) దేశంలో చిచ్చు రేపింది. దీని వలన ఎవరికీ పౌరసత్వం పోదు కదా ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నట్లు అంటూ కాషాయ దళాలు అమాయకంగా అడుగుతున్నాయి. దానివలన పౌరసత్వం పోతుందని ఎవరూ చెప్పటం లేదు. ఎన్‌ఆర్‌సి పేరుతో పౌరసత్వాన్ని నిరూపించుకొనేందుకు అవసరమైన పత్రాలు సమర్పించాలన్న అంశంతో అసలు ఆందోళన ప్రారంభమైంది.సిఎఎ తరువాత ఎన్‌ఆర్‌సి అని చెప్పింది బిజెపి వారే. సిఎఎ ద్వారా ఎందరికి పౌరసత్వం కల్పించనున్నారో చెప్పండని బిజెపి వారిని ఎవరినైనా అడిగితే వారి దగ్గర సమాధానం లేదు. పౌరసత్వం ఒకరు ఇచ్చేది కాదు, విదేశీయులకు ఏ గడ్డమీద అయినా పిల్లలు పుడితే అక్కడి పౌరులు కావటం అనేక దేశాలలో జన్మతహ: ఇస్తున్న హక్కు. మన దేశంలో పుట్టిన వారినే ఆధారాలు చూపమని అడుగుతున్నారు. ఈ విపరీత పోకడ ప్రపంచంలో ఎక్కడా లేదు. గత 70సంవత్సరాలుగా పౌరసత్వం రాని లక్షలు, కోట్లాది మందికి మందికి పౌరసత్వం ఇవ్వనున్నామని కాషాయ దళాలు చెప్పటం మోసకారితనమే.
తాము మత ప్రాతిపదికన దాడులకు గురయ్యామంటూ మన దేశ పౌరసత్వాన్ని కోరుకున్న విదేశీయుల సంఖ్య కేవలం 31,313 మంది మాత్రమే అని వారిలో హిందువులు 25,447, సిక్కులు 5,807, క్రైస్తవులు 55, బౌద్దులు ఇద్దరు మాత్రమే అని ఇంటెలిజెన్స్‌ బ్యూరో గతేడాది వెల్లడించింది. వీరందరూ నిజంగా మత పరమైన దాడులకు గురయ్యారా లేక మన దేశం రావటానికి ఆ మార్గం అయితే సులువుగా వుంటుందని ఆ కారణాలు చెబుతున్నారో అన్నది కూడా అనుమానమే. అంటే సిఎఎ ద్వారా లబ్ది పొందేది వీరు మాత్రమే. సిఎఎ దీనికి మాత్రమే పరిమితం అయితే సమస్య లేదు, దాని కొనసాగింపుగా జాతీయ పౌరసత్వ జాబితా తయారు చేస్తామని దానిలో పౌరసత్వాన్ని నిరూపించుకొనే పత్రాలు ఇవ్వాలని చెప్పటమే అసలు అందోళనకు మూలం. నిజానికి సిఎఎ ద్వారా పొరుగుదేశాల్లో ఉన్న హిందువులు, ఇతర ముస్లిమేతర మైనారిటీల మీద దాడులకు, ఆయా దేశాల నుంచి తరిమి వేయాలని అక్కడి మతోన్మాదులను ప్రోత్సహించటమే. ఇక్కడి మతోన్మాదులను మైనారిటీల మీదకు ఉసిగొల్పే దుష్ట ఆలోచనే. ఒక వేళ ఎక్కడైనా అలాంటి దాడులు జరిగితే ఆయా ప్రభుత్వాల మీద వత్తిడి తెచ్చి వాటిని ఆపాలి తప్ప మతం పేరుతో రాజకీయాలు చేయటం, ముస్లింలపై ద్వేషాన్ని రెచ్చగొట్టటం అంటే ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాను అమలు జరపటమే. దానికోసం దేశాన్ని బలిపెట్టాలా ?

Image result for delhi violence
ఎన్‌ఆర్‌సి, ఎన్‌ఆర్‌పిలను వ్యతిరేకిస్తున్నది ఒక్క ముస్లింలే కాదు, హిందువులతో సహా అన్ని మతాల వారు వ్యతిరేకిస్తున్నారు. వారిలో ఎన్‌ఆర్‌సితో తమను ఇబ్బందులు పెట్టాలన్న ఎత్తుగడ ఉందని భయపడుతున్న ముస్లింలు గత కొద్ది నెలలుగా బహిరంగంగానే ఆందోళన చేస్తున్నారు. బిజెపి అజెండాలో తొలి దాడి ముస్లింల మీద ఉంది కనుక వారు ముందుగా మేలుకొని వీధుల్లోకి వచ్చారు తప్ప ఆధారాలు సమర్పించలేని కోట్లాది మంది ఇతర సామాజిక తరగతుల్లో కూడా అలాంటి ఆందోళన లేకపోలేదు. దేశ విభజన సమయంలో అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అనేక మంది మారిపోయారు గనుక వెంటనే ఒక పౌరజాబితాను తయారు చేయాల్సి వచ్చింది. తరువాత బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన వారి సమస్య కారణంగా అసోంలో జాబితాను తయారు చేయాల్సి వచ్చింది తప్ప మిగతా దేశానికి అవసరం ఏమిటి? అక్రమంగా వచ్చే వారిని నిరోధిస్తున్నారు లేదా శరణార్ధులుగా వచ్చే వారికి పౌరసత్వం ఇవ్వాలా లేదా లేక వారిని పౌరసత్వం లేని పౌరులుగా గుర్తించి అనుమతించాలా అనేందుకు ఇప్పటికే చట్టాలు ఉన్నాయి. అలాగాక తలిదండ్రులు, తాతలతో సహా పుట్టిన ఆధారాలు సమర్పించి పౌరులని నిరూపించుకోవాల్సిన బాధ్యత మనకు లేదు. కానీ పౌరజాబితా తయారీని అమలు జరపాలని ఆందోళన చేస్తున్నవారెవరు ? దాని వెనుక ఉన్న లక్ష్యం ఏమిటి? ఎన్‌ఆర్‌సి, ఎన్‌ఆర్‌పి అమలు జరపాలనటానికి, జై శ్రీరామ్‌ నినాదాలతో పనేముంది ? ఈశాన్య ఢిల్లీలో జై శ్రీరాం పేరుతో చెలరేగిపోవటం, సిఎఎ వ్యతిరేక ఆందోళనను మత ఘర్షణలుగా మార్చటం వెనుక ఉన్నది ఎవరు ? వారు కూడా షాహిన్‌బాగ్‌ లేదా మరొక చోటో కూర్చొని శాంతియుత ఆందోళన చేసేందుకు అవకాశం ఉంది కదా ? లేదూ సిఎఎ వ్యతిరేకుల కుట్రే ఇది అని చెబుతున్న బిజెపి పెద్దలే ఢిల్లీ చుట్టుపట్ల ఉన్న రాష్ట్రాలన్నింటా అధికారంలో ఉన్నారు. వారి పోలీసు, గూఢచార, కేంద్ర గూఢచార వ్యవస్ధలన్నీ ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ? అందునా ట్రంప్‌ పర్యటనకు వస్తున్నపుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా ? అయినా స్వేచ్చగా అల్లరి మూకలు చెలరేగటం, ఢిల్లీ పోలీసులు ప్రేక్షకపాత్ర వహించటాన్ని బట్టి సిఎఎ, ఎన్‌ఆర్‌సి వ్యతిరేకులు, ప్రతిపక్షాల మీద నిందమోపే ఒక కుట్రలో భాగంగానే ఢిల్లీ పరిణామాలు జరిగాయని అందరూ అనుకుంటున్నారు. అమెరికా సిఐఏ, ఇజ్రాయెల్‌ మొసాద్‌ల నుంచి నేర్చుకున్న ఇలాంటి చావు తెలివి తేటలను ప్రయోగించి చూస్తున్నారు. ఒక ఆప్‌ కౌన్సిలర్‌ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అతను నిజంగా అల్లర్లను ప్రేరేపించాడా లేక రాజకీయంగా ఆప్‌ను దెబ్బతీసేందుకు తప్పుడు కేసు బనాయించారా అన్నది చెప్పలేము. పేలని తుపాకులు, కమ్యూనిస్టు సాహిత్యాన్ని పక్కన పడవేసి బూటకపు ఎన్‌కౌంటర్లు చేయటం లేదా విప్లవ సాహిత్యం పేరుతో కేసులు నమోదు చేయటాన్ని చూస్తున్న మనకు పోలీసులు ఎంతకైనా తెగిస్తారన్నది తెలిసిందే.
గతేడాది అక్టోబరు రెండవ వారంలో చైనా అధిపతి గ్జీ జింపింగ్‌ మహాబలిపురం పర్యటనకు వచ్చారు, ఫిబ్రవరి చివరి వారంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా వచ్చారు. ఇద్దరినీ నరేంద్రమోడీ ఆహ్వానించారు. వారి పర్యటనల్లో ఎంత వ్యత్యాసం ఉందో మనం గమనించాము. గ్జీ పర్యటన సాదాసీదాగా సాగింది, ట్రంప్‌ పరస్పర పొగడ్తలు, కౌగిలింతలు, అదిరింపులు, బెదిరింపులను యావత్‌ ప్రపంచం చూసింది. ఈ పర్యటనల్లో ఉన్న తేడాలు ఏమిటి ? అమెరికాతో మన వాణిజ్యం మిగులులో ఉంది. చైనాతో లోటులో ఉంది. మనకు గతంలో ఇస్తున్న రాయితీలను ఎత్తివేసింది అమెరికా, మనలను అభివృద్ది చెందిన దేశంగా పరిగణించి మరికొన్ని రాయితీలను రద్దు చేసింది. మనం ప్రతిగా విధించిన పన్నులను చూపి మన మీద బెదిరింపులకు దిగింది. తమ వస్తువుల మీద పన్నులు తగ్గించాలని, ఎక్కువగా కొనుగోలు చేయాలంటూ ట్రంప్‌ వత్తిడి తెచ్చారు, మిలిటరీ హెలికాప్టర్ల ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నారు. రాబోయే రోజుల్లో తమ దగ్గర నుంచి చమురు, గ్యాస్‌ దిగుమతులను మరింతగా పెంచాలని, కోళ్ల ఉత్పత్తులు, పాల ఉత్పత్తులను ఎక్కువగా కొనుగోలు చేయకపోతే ఆలోచించాల్సి వస్తుందని బెదిరింపులతో కూడిన హెచ్చరికలు చేసి వెళ్లారు. అదే జింపింగ్‌ విషయానికి వస్తే నిర్దిష్ట అజెండా లేకుండానే వచ్చారు. రాబోయే రోజుల్లో మా వస్తువులను మరింతగా కొనుగోలు చేయాలంటూ నరేంద్రమోడీ సర్కార్‌ సాధారణపద్దతుల్లోనే కోరింది తప్ప వత్తిడి, డిమాండ్ల రూపంలో వ్యవహరించలేదు. చైనా నేత బెదిరింపులకు దిగలేదు.
2018-19లో అమెరికాతో మన వాణిజ్య మిగులు 16.85 బిలియన్‌ డాలర్లు, తరువాత సంవత్సరంలో కూడా అదే ధోరణి కొనసాగింది. నిజానికి అమెరికాతో మన మిగులు నరేంద్రమోడీ సర్కార్‌ సాధించిన ఘనత కాదు. అంతకు ముందు మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడిలో కూడా మన దేశం మిగుల్లోనే ఉంది. కొద్ది పాటి హెచ్చు తగ్గులు తప్ప దాదాపు గత ఆరు ఏడు సంవత్సరాలుగా ఒకే మోస్తరులో ఉంది. ఇదే సమయంలో సంఘపరివార్‌ చైనాను ఎంతగా ద్వేషిస్తుందో దాని నేతగా ఉన్న నరేంద్రమోడీ హయాంలో వాణిజ్యంతో పాటు లోటు కూడా గణనీయంగా పెరిగిందన్నది చాలా మంది జీర్ణించుకోలేని అంశం. 2012లో మన దేశ వాణిజ్య లోటు చైనాతో 39.4 బిలియన్‌ డాలర్లు ఉంటే గతేడాది 74 బిలియన్‌ డాలర్లకు చేరింది.
ఈ కారణంగానే మన వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేయాలని మనం చైనాను డిమాండ్‌ చేస్తుంటే తమ వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేయాలని అమెరికా మనలను డిమాండ్‌ చేస్తోంది. అమెరికా నుంచి కొన్ని వస్తువులను కొనుగోలు మన మీద అధిక భారం పడుతుంది. కోళ్లు, పాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తే వాటి మీద అమెరికా ఇచ్చే రాయితీలు, తక్కువ ధరల కారణంగా మన కోళ్ల, పాడిపరిశ్రమ మీద ఆధారపడిన దాదాపు పది కోట్ల మంది రైతాంగం, కార్మికులు తీవ్రంగా నష్టపోతారు. ఈ రంగాలలో మనం సాధించిన స్వయం పోషకత్వం పోయి పరాయి దేశాల మీద ఆధారపడాల్సి వస్తుంది. అందుకే ఎవరు అధికారంలో ఉన్నా ఈ రంగాలలో అమెరికా లేదా మరొక దేశ వస్తువుల దిగుమతుల అనుమతికి జంకుతున్నారు తప్ప నేతల గొప్పతనం లేదా ట్రంప్‌ చెప్పినట్లు మోడీ కఠినంగా వ్యవహరించటమూ కాదు. ఇదే నరేంద్రమోడీ గారు కొన్ని విషయాల్లో బాంచన్‌ దొరా మీరు అనుకున్నట్లే చేస్తా అని ఎలా లొంగిపోతున్నారో మరోచోట చూద్దాం.
ఇక డోనాల్డ్‌ ట్రంప్‌ను ఆహ్వానించి నరేంద్రమోడీ తన పలుకుబడితో భారత్‌కు ఎంతో మేలు చేకూర్చుతారని ఎందరో ఆశించారు. అదే విధంగా ఎన్నికల సంవత్సరంలో తమ ట్రంప్‌ ప్రతి దేశంతోనూ గీచి గీచి బేరాలాడి లేదా బెదిరించి తమ ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తారని అమెరికన్లు కూడా ఆశించారు. అక్కడ కార్పొరేట్లు ఆశలు పెట్టుకుంటే దిగజారుతున్న దేశ ఆర్ధిక పరిస్ధితిని మోడీ చక్కదిద్ది తమ జీవితాలను మరింతగా దిగజారకుండా చూస్తారా అని సామాన్యులు ప్రధానంగా ఇక్కడ ఎదురు చూశారు. జరిగిన పరిణామాలను బట్టి అక్కడ ట్రంప్‌, ఇక్కడ నరేంద్రమోడీ కూడా నిరాశపరిచారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. తేడా అల్లా అక్కడ కొన్ని కార్పొరేట్లు తాత్కాలికంగా నిరాశచెందితే ఇక్కడ సామాన్యులు ఆశాభంగం పొంది ఇక మన బతుకులింతే అనే నిర్వేదానికి గురవుతున్నారు.
ట్రంప్‌ పర్యటన సమయంలోనే ఒక వార్త వెలువడింది. ట్రంప్‌ భజనలో మీడియాలో దానికి అంత ప్రాచుర్యం రాలేదని చెప్పాలి. ఇటీవలి వాణిజ్య లావాదేవీలలో మన వాణిజ్యం చైనాను అధిగమించి అమెరికాతో ఎక్కువ జరిగింది అన్నది వార్త సారాంశం. చైనా వ్యతిరేకులకు ఇది వీనుల వింపైన సంగీతం వంటిదే. అదే దేశభక్తి అని భావించేవారు కూడా లేకపోలేదు. ఇక్కడ ప్రశ్న ఏ దేశంతో అయినా వాణిజ్యం జరిపేది కార్పొరేట్‌ సంస్ధలే, సామాన్యులు కాదు అన్నది పచ్చినిజం. ఎవరి కోసం తొలి రోజు గుజరాత్‌ పర్యటనలో ట్రంప్‌-నరేంద్రమోడీ ఆరుసార్లు కౌగలించుకున్నట్లు ? నాటకంలో ప్రతి పాత్రధారి తన పాత్రను రక్తి కట్టించేందుకు ప్రయత్నించారు అని సమీక్షకులు రాస్తారు.ఈ కౌగిలింతల పర్వం కూడా అదే. దేశం కోసమే ఇదంతా అన్నట్లుగా ఎవరికి వారు నటించారని చెప్పవచ్చు. ఎన్నికల్లో మరోసారి విజయం కోసం ట్రంప్‌ తాపత్రయ పడుతుంటే రెండవ సారి గెలిచి రాజకీయంతో సహా అన్ని రంగాలలో వైఫల్యాలను ఎదుర్కొంటున్న నరేంద్రమోడీ తన పరపతి ఎలాంటిదో ఒక అగ్రరాజ్యనేత నోట వినిపించాలని తహతహలాడారు. ఆర్ధిక పరిస్ధితి, ఢిల్లీ పరిణామాలతో ట్రంప్‌ పొగడ్తలను నెమరు వేసుకొని ఆనందించే అవకాశం లేకుండా పోయింది. ట్రంప్‌ నోట కాశ్మీర్‌, సిఎఎ వంటి అంశాలపై ఎక్కడ ప్రతికూల వ్యాఖ్యలు వస్తాయో, రాకుండా చూడు గోమాతా అన్నట్లుగా బిజెపి నేతలు ఉగ్గపట్టుకు కూర్చున్నారు. భవిష్యత్‌లో మరింత పెద్ద అవసరానికి లేదా ప్రయోజనానికి తురుపు ముక్కగా ప్రయోగించుదాం అన్నట్లుగా విలేకర్లు అడిగినా ట్రంప్‌ తప్పించుకోవటానికి అర్దం ఇదే.

Image result for delhi planned violence spoils modi-trump party
మీ ప్రధాని నరేంద్రమోడీ ఎంతో గట్టిగా వ్యవహరిస్తారబ్బా అని ట్రంప్‌ పొగిడారు. ఇది మోడీని ఉబ్బవేయటానికి చెప్పిన మాటలు మాత్రమే. ఏ దేశంతో స్నేహం చేసినా మన దేశ ప్రయోజనాలను సదా గమనంలో ఉంచుకోవాలి.ఎదుటి వారి పొగడ్తల కోసం మనల్ని మనం మరిచిపోకూడదు. అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఐరోపా యూనియన్‌ కలసి ఇరాన్‌తో ఒక అణు ఒప్పందాన్ని చేసుకున్నాయి. దాన్నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలిగింది. అంతేకాదు, ఇరాన్‌తో వాణిజ్యలావాదేవీలు జరిపే దేశాల మీద ఆంక్షలు పెట్టింది. చిత్రం ఏమిటంటే ఒప్పందంలోని ఏ ఒక్కదేశ మూ అమెరికా వైఖరిని సమర్ధించలేదు, ఆంక్షలను ఖాతరు చేయలేదు. కానీ అమెరికాతో మనం సమాన భాగస్వాములుగా ఉన్నాం, ఎంతో కఠినంగా వ్యవహరిస్తాం, స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తాం అని గొప్పలు చెప్పుకుంటున్న మోడీ సర్కార్‌ మాత్రం ఆంక్షలను అమలు జరిపేందుకు అమెరికాకు సాగిల పడింది. మన రూపాయలు ప్రపంచ మార్కెట్లో దేనికీ పనికి రావు, అయినా ఎప్పటి నుంచో ఉన్న స్నేహం కారణంగా వాటిని తీసుకొని చమురు విక్రయిస్తున్న ఇరాన్‌ దగ్గర కొనుగోలు చేయటం నిలిపివేసి అమెరికా నుంచి తెచ్చుకుంటున్నాం. అమెరికా నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేనపుడు కరాచీ రేవుతో పని లేకుండా ఇరాన్‌లోని చాబహార్‌ రేవును అభివృద్ధి చేయటం ద్వారా మన వాణిజ్య లావాదేవీలు నిర్వహించుకోవాలని నరేంద్రమోడీ సర్కార్‌ అక్కడ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించింది. అమెరికా బెదిరింపుల కారణంగా ఇప్పుడు ఆ పధకాన్ని పక్కన పడేసింది. ఇరాన్‌-అమెరికా మధ్య పంచాయతీ తలెత్తటం ఏమిటి? అమెరికాకు కోపం రాగానే మన ప్రయోజనాలకోసం నిర్మించే రేవును మధ్యలో వదలి వేసి రావటం ఏమిటి ? ఈ పరిణామం మన దేశం అమెరికాకు లొంగిపోవటాన్ని సూచిస్తున్నదా? లేక స్వతంత్ర వైఖరి, సమాన భాగస్వామిగా మన దేశ ప్రతిష్ట,మాన మర్యాదలను నిలబెట్టేదిగా ఉందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా కమ్యూనిస్టు భూతం – బెర్నీ శాండర్స్‌ !

26 Wednesday Feb 2020

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

#BernieSanders 2020, 'Socialist' Bernie Sanders, 2020 US Elections, A specter is haunting US, Bernie Sanders 2020

Image result for communist specter
ఎం కోటేశ్వరరావు
”ఐరోపాను ఒక భూతం తరుముతోంది. అది కమ్యూనిస్టు భూతం. ఈ దయ్యాన్ని వదిలించుకొనేందుకు పాత ఐరోపాలోని అధికార శక్తులన్నీ ఒక పవిత్ర కూటమిగా ఏర్పడ్డాయి.పోప్‌, జార్‌, మెటర్‌నిచ్‌, గురుజోట్‌, ఫ్రెంచ్‌ రాడికల్స్‌,జర్మన్‌ పోలీసు గూఢచారుల వంటి అందరూ దానిలో ఉన్నారు. కమ్యూనిజాన్ని ఒక శక్తిగా ఐరోపా అధికార శక్తులన్నీ ఇప్పటికే గుర్తించాయి ” 1848 ఫిబ్రవరి21న తొలిసారిగా ప్రచురితమైన మార్క్స్‌-ఎంగెల్స్‌ కమ్యూనిస్టు (పార్టీ) ప్రణాళిక పైన పేర్కొన్న పదాలతో ప్రారంభం అవుతుంది. మతం, పాలకుల అండతో తర్జుమా, ముద్రితం అయిన బైబిల్‌ తరువాత ఆది నుంచీ మతం, పాలకుల వ్యతిరేకతను ఎదుర్కొని, కష్టజీవుల మద్దతుతో అత్యధిక భాషలలో తర్జుమా అయిన గ్రంధం కమ్యూనిస్టు ప్రణాళిక తప్ప మరొకటి లేదు. ఐదు అభ్యుదయ తెలుగు పుస్తక ప్రచురణ సంస్ధలు ఫిబ్రవరి 21రెడ్‌ బుక్స్‌ డే సందర్భంగా లక్ష కాపీలను ఉమ్మడిగా ప్రచురించి పాఠకుల వద్దకు తీసుకువెళ్లేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాయి. ఒకటి రెండు రోజుల్లోనే లక్ష కాపీలు అయిపోవటంతో మరో లక్ష ప్రచురించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రచురణకర్తలు ప్రకటించారు.
కమ్యూనిస్టు భూతాన్ని అదుపు చేసి భూస్ధాపితం చేశామని మూడు దశాబ్దాల క్రితం సంబరపడిన కమ్యూనిస్టు వ్యతిరేకులందరినీ ఇది మరోసారి భయపెడుతోందంటే అతిశయోక్తి కాదు. అదెక్కడో కాదు, కమ్యూనిజంపై విజయం సాధించామని,ఏడు నిలువుల లోతున పాతి పెట్టామని సంబర పడుతూ ప్రకటించుకున్న అమెరికా గడ్డమీదే ప్రారంభమైంది.1848లో లండన్‌లోని బిషప్‌ గేట్‌ ప్రాంతంలో ప్రచురితమైన కమ్యూనిస్టు మానిఫెస్టో 1872లో 24 ఏండ్లకు గానీ ఆంగ్లంలో అమెరికాలో ప్రచురణకు నోచుకోలేదు. అయితే ఇప్పుడు అమెరికాలో లేదా మరోచోట ఏమి జరిగితే దాన్ని ప్రపంచమంతా చూసేందుకు, చదివేందుకు 24ఏండ్లు అవసరం లేదు. ఇరవై నాలుగు క్షణాలు చాలు. ఎవరి భాషలో వారు వెంటనే అనువదించుకొనే వెసులుబాటు కూడా అందుబాటులోకి వచ్చింది. అమెరికాలో నేడు ఏమి జరిగితే రేపు ప్రపంచం దాన్ని అనుకరించుతుంది అని అనేక మంది చెబుతుంటారు. అలాంటపుడు అది సోషలిజం, కమ్యూనిజాలపై జరుగుతున్న మధనానికి ఎందుకు వర్తించదు ?
ఈ ఏడాది నవంబరు మూడవ తేదీన అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. హిరణ్యకశ్యుపుడికి శ్రీహరి నామం వినపడితే తేళ్లూ జెర్రులు పాకినట్లు ఉండేదని, చివరికి కుమారుడు ప్రహ్లాదుడిని కూడా సహించలేదని పురాణాలు చెబుతాయి. అమెరికాలో గతశతాబ్దిలో సోషలిజం, కమ్యూనిజం పదాలు కూడా అలాంటివే. కార్పొరేట్ల కనుసన్నలలో మెలుగుతూ ప్రతిదాన్నీ డాలర్లతో సొమ్ము చేసుకొనే అక్కడి మీడియాకు ఇప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా, వ్యతిరేకంగా అయినా ఆ పదాలను ఉచ్చరించకతప్పటం లేదు. అనేక మంది రచయితలు పరిణామాలు, పర్యవసానాలను మింగా కక్కలేకుండా ఉన్నారు. కమ్యూనిస్టు వ్యతిరేక ఇనుప తెరలను ఛేదించుకొని అమెరికా సమాజం బయట పడుతోందా ?
అమెరికా ఎన్నికల్లో ముందు పార్టీ అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ప్రస్తుతం పన్నెండు మంది డెమోక్రటిక్‌ పార్టీ తరఫున రంగంలో ఉన్నారు. పార్టీకి చెందిన 3,979 మంది ప్రతినిధులలో ఒక అభ్యర్ధి ఎన్నిక కావాలంటే 1991 మంది మద్దతు అవసరం. ఒక వేళ ఎవరూ సాధించకపోతే సభ నిర్వహించి దాని ఓటింగ్‌ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. దీనిలో కూడా అవకతవకలకు ఎన్నో అవకాశాలుంటాయని వేరే చెప్పనవసరం లేదు. ఇది రాసిన సమయానికి యాభైకి గాను రెండు రాష్ట్రాలలో బెర్నీ శాండర్స్‌ విజయం సాధించారు. వంద మంది ప్రతినిధులు తమ ఓట్లు వేశారు. ఆరుగురు అభ్యర్ధులకు మాత్రమే ఓట్లు పడ్డాయి వారిలో బెర్నీశాండర్స్‌ 45,పేట్‌ బటిగెగ్‌ 25, జోబిడెన్‌ 15, ఎలిజబెత్‌ వారెన్‌ 8, ఆమీ కలుబుచర్‌ 7, తెచ్చుకున్నారు. ఒక్క ఓటూ తెచ్చుకోని న్యూయార్క్‌ నగర మాజీ మేయర్‌, కుబేరుల్లో ఒకడైన మైఖేల్‌ బ్లూమ్‌ బెర్గ్‌ తన అర్ధబలంతో అభ్యర్ధిగా నెగ్గాలని చూస్తున్నాడు. కార్పొరేట్‌ మీడియాను ఇప్పటికే పాకేజ్‌లతో కట్టడి చేశాడని స్పష్టమైంది.

Image result for bernie sanders 2020
టైమ్‌ మాగజైన్‌ విలేకరి చార్లెటీ ఆల్టర్‌ ఈ ఫలితాలను చూసిన తరువాత ఒక విశ్లేషణ చేస్తూ గత రెండు వారాలుగా 78ఏండ్ల సోషలిస్టు బెర్నీశాండర్స్‌కు అనేక మంది యువత ఎందుకు ఆకర్షితులౌతున్నారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అంటూ కొన్ని అంశాలు రాశారు. వాటి సారాంశం ఇలా ఉంది.’ ప్రచ్చన్న యుద్ద సమయంలో (1991కి ముందు) పెరిగిన వారికి సోషలిజం జనాన్ని కమ్యూనిజానికి తీసుకుపోతుంది, కమ్యూనిజం అమెరికా స్వేచ్చకు ముప్పుగా పరిణమిస్తుంది అన్నట్లుగా కనిపించేది. అప్పుడు వారు సోషలిజం అంటే సోవియట్‌ యూనియన్‌, దాని నిర్బంధ శ్రామిక శిబిరాలు,లోపభూయిష్టమైన ఆర్ధిక వ్యవస్ద గురించి ఆలోచించేవారు. కానీ శాండర్స్‌ లేదా ఎలిజబెత్‌ వారెన్లకు మద్దతు పలుకుతున్న సహస్రాబ్ది యువతరం ఆ కథలతో పెరగలేదు. వారిలో పెద్ద వారు బెర్లిన్‌ గోడ కూల్చివేత సమయానికి ఎనిమిది సంవత్సరాల వయస్సులో ఉన్నారు. వారిలో అత్యధికులకు సోషలిజం అంటే ఐరోపాలోని అనేక ప్రాంతాలలో ఉన్న అందరికీ ఆరోగ్యం,శిశు సంరక్షణ,కళాశాల ఉచిత విద్య. నా వయస్సు వారికి సోషలిజం కాదు తిరోగమిస్తున్న పెట్టుబడిదారీ విధానం, జీవితాలను చితక్కొట్టిన ప్రభావం తెలుసు. 2008 ద్రవ్య సంక్షోభం సమయంలో వచ్చిన సహస్రాబ్ది యువతకు విద్యారుణాల భారం విపరీతంగా పెరిగింది, స్వంత ఇల్లు, కార్ల వంటి అనేక అంశాలకు తలిదండ్రులున్నారనే భరోసా లేదు.వాతావరణ సంక్షోభంతో సంఘర్షించారు, అది తమ పిల్లలు జీవించటానికి వీలులేని అనేక ప్రాంతాలను ప్రపంచంలో సృష్టించనుంది. అందుకే వారు వామపక్షం వైపు మొగ్గుతున్నారు. నేను ప్రజాస్వామ్య సోషలిజానికి అనుకూలంగా వాదించటం లేదు. ఒక జర్నలిస్టును, కార్యకర్తను కాదు. కానీ అనేక మంది ఈ ధోరణిని సంపూర్ణంగా అపార్ధం చేసుకున్నారు అని నాకు అర్ధమైంది.

Image result for bernie sanders : is really communist specter of america
సహస్రాబ్ది యువత తాము సోషలిస్టులమని చెప్పినపుడు దాని అర్ధం తాము ఎన్నుకున్న ప్రతినిధులు అందరికీ అందుబాటులో ఇండ్లు, ఆరోగ్య రక్షణ, కాలేజీ ట్యూషన్‌ ఫీజు, పర్యావరణ రక్షణకు గట్టిగా పాటుపడటం వంటి వాటిని నెరవేర్చేందుకు పని చేయాలని కోరుతున్నారని అర్ధం చేసుకోవాలి. ఇందుకోసం ధనికులపై అధిక పన్నులు వేయాలని కోరుతున్నారు. సామాజిక సమస్యల పరిష్కారం అమెరికా ప్రభుత్వం తాహతుకు మించినట్లుగా ఉందని చెబుతుంటారు. పురోగమన వాదులు కనీసవేతనాన్ని, ఆదాయపన్ను ప్రవేశ పెట్టారు, బాలకార్మిక వ్యవస్ధను నిర్మూలించారు. అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ సామాజిక భద్రతను ఏర్పాటు చేశారు, కోట్లాది మందిని రోడ్లు, వంతెనలు, పాఠశాలల నిర్మాణంలో నిమగం కావించారు. లిండన్‌ జాన్సన్‌ వృద్ధులకు ఆరోగ్య రక్షణ, పేదలకు వైద్యసాయం చేశారు. తప్పో వప్పో, ఇతర అమెరికన్ల మాదిరి మన వర్తమాన చరిత్రలో బెర్నీ శాండర్స్‌,ఎలిజబెత్‌ వారెన్‌ వంటి వారు పెద్ద సంస్ధాగత మార్పుల గురించి మాట్లాడుతున్నారు. మీకు వారు కోరుతున్నవాటిని అభిమానించకపోవచ్చు, కానీ, మంచి సమాజం కోసం పెద్ద సవాళ్లను ఎదుర్కొనేందుకు పెద్ద ఆలోచనలతో ఈ పురోగమనవాదులు కనీసం ప్రయత్నం చేస్తున్నారు.”
సోషలిజం పట్ల ప్రస్తుతం అమెరికన్‌ సమాజంలోని వృద్ధ తరాల్లో గూడుకట్టుకున్న వ్యతిరేకత మిగతా వారిలో లేదన్నది స్పష్టం. దీనర్ధం వారంతా సోషలిజానికి వెంటనే ఓటు వేస్తారని కాదు. సోవియట్‌ సోషలిస్టు విధానం గురించి వారు ఎన్నో తప్పుడు అభిప్రాయాలు ఏర్పరచుకున్నారు. అది అంతరించి పోయిన తరువాత పెట్టుబడిదారీ విధానం తమ జీవితాలను ఎలా అతలాకుతలం చేస్తున్నదో ప్రత్యక్షంగా చూశారు. అదింకేమాత్రం తమను అభివృద్ధి చేయలేదనే అభిప్రాయాన్ని కలిగిన వారు రోజురోజుకూ పెరుగుతున్నారు. పెట్టుబడిదారీ విధాన సమర్దకులు వారిలో ఆ వ్యవస్ధ పట్ల విశ్వాసాన్ని కలిగించలేకపోతున్నారు. అమెరికా పాలకవర్గం చైనా కమ్యూనిస్టు పార్టీ మీద ఒక వైపు సైద్ధాంతిక దాడి చేస్తున్నది. మరొక వైపు చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకోక తప్పని స్ధితిలోకి అమెరికాను నెట్టింది. గతంలో సోవియట్‌ కాలంలో ఇలాంటి పరిస్ధితి లేదు. ప్రతి వస్తువుకూ చైనాపై ఆధారపడుతూ అక్కడి సోషలిజం విఫలమైంది అంటే నమ్మేవారు లేరు. రోజు రోజుకూ అది తమతో పోటీపడగలిగిన బలమైన ఆర్ధిక వ్యవస్ధగా తయారు కావటాన్ని యువతరం, ఇతరులు గమనిస్తున్నారు. అమలులో లోపాలు లేకపోతే సోషలిస్టు వ్యవస్ధలో సంక్షేమ చర్యలను అమలు జరపవచ్చని నమ్ముతున్నారు. అందుకే మిగతా దేశాలలోని కమ్యూనిస్టుల మాదిరి వారు సోవియట్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలకు తగిలిన ఎదురుదెబ్బల గురించి తల్లడిల్లటం లేదు. సోషలిజం పట్ల అభిమానం పెంచుకుంటున్నారు. అయితే అది కమ్యూనిస్టు పార్టీలు చెప్పే పద్దతుల్లోని వ్యవస్ధా ? అమెరికన్‌ పెట్టుబడిదారీ వర్గం ఆ భావజాల వ్యాప్తిని అనుమతిస్తుందా ? ఇలాంటి అనేక సందేహాలు బయటివారికి కలగటం సహజమే. మౌలిక వర్గ వ్యవస్ధకు ముప్పు కలగనంత వరకు ఏ దేశంలో అయినా పురోగామి శక్తులను పాలకవర్గాలు అనుమతించాయి. తరువాతే అణచివేతకు పూనుకున్నాయి. అమెరికా దానికి మినహాయింపు ఎలా అవుతుంది? తమ అనుభవాల నుంచి సోషలిజం పట్ల అభిమానం పెంచుకున్న వారు దానికి ప్రతిఘటన ఎదురైతే ఎలా ఎదుర్కోవాలో, ముందుకు పోవాలో, సరైన దారిలో నడవకపోతే మార్పు గురించి ఆలోచించలేరా ? ప్రతి దేశంలో విప్లవాలు గానీ, సోషలిస్టు వ్యవస్ధల నిర్మాణాలు గానీ ఆయా దేశాల పరిస్ధితులను బట్టి ఉంటాయి తప్ప ఒక నమూనా లేదు. చైనా వంటి దేశాలలో తొలి రోజుల్లో సోషలిస్టు వ్యవస్ధ ఎదుర్కొన్న సవాళ్లు-అక్షరాస్యత, వైద్యం వంటి సమస్యలు – అమెరికా లేదా అభివృద్ధి చెందిన ఐరోపా సమాజాలకు ఎదురు కావు.

Image result for bernie sanders 2020
దాదాపు శతాబ్దం పాటు సోషలిజం, కమ్యూనిజాలను భూతాలుగా చూపుతూ భయపెట్టిన స్ధితిని ఛేదించుకొని నేడు అమెరికాలో సోషలిజం ప్రాచుర్యం పొందుతోంది.అన్ని జీవన రంగాలలో కమ్యూనిస్టు వ్యతిరేకతను నూరిపోశారు. మన దేశంలో చార్వాకులు, వారి సిద్ధాంతాలను అణచివేసి వారిని నిందించే క్రమంలో రాసిన వాటి ఆధారంగానే వారేమి చెప్పారనే అంశాలను ఒక చోటికి పేర్చి అర్ధం చేసుకున్నట్లుగా అమెరికాలో పురోగమన వాదుల గురించి వారేమి చెబుతున్నారనేదాని కంటే వారిని ఎలా దూషించారు అనే అంశాలకే మీడియా ప్రాధాన్యత ఇస్తోంది గనుక సమగ్ర సమాచారం పొందటంలో సమస్యలు ఎదురవుతున్నాయి. బెర్నీ శాండర్స్‌ చెప్పేది శాస్త్రీయ సోషలిస్టు సిద్ధాంతానికి అనుగుణ్యంగా ఉందా మరొకటా అన్నదానిని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాల్సిందే. సోషలిజాన్ని సాధించటానికి ఎన్నో దశలు ఉన్నట్లుగానే, సమాజంలోని వ్యక్తులు శాస్త్రీయ సోషలిస్టు పద్దతుల్లో తయారు కావటానికి కూడా ఎన్నో దశలు ఉంటాయి. ముందే ఫలానా విధంగా ఉంటేనే నిన్ను సోషలిస్టు శిబిరంలోకి రానిస్తాము, సోషలిస్టుగా పరిగణిస్తాము అంటే కుదరదు. మౌలికమైన అంశం దోపిడీని అంతం చేయాలి, సామాజిక న్యాయం సాధించాలి వంటి అంశాలతో ఏకీభావం వుందా వ్యతిరేకత ఉందా అన్నది గీటురాయిగా ఉండాలి. అమెరికాలో సోషలిస్టు అంటే ఎయిడ్స్‌ వచ్చిన వ్యక్తిగా చూస్తున్న దశలో నేను సోషలిస్టునే అని చెప్పుకొనేందుకు, పెట్టుబడిదారీ విధానం విఫలమైంది, సోషలిస్టు వ్యవస్ధకు ఒకసారి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు అంటూ యువత ముందుకు రావటాన్ని ఆహ్వానించాలా లేదా ?
బెర్నీ శాండర్స్‌ ఒక కమ్యూనిస్టు, ప్రచ్చన్న యుద్ద కాలంలో సోవియట్‌ యూనియన్‌తో ముడి వేసుకున్నాడు అని డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యను ఉటంకిస్తూ మీడియా ప్రచారం చేస్తోంది. ట్రంప్‌ పుట్టుకతోనే అబద్దాల కోరు, నేను కమ్యూనిస్టును కాదు, మాస్కోతో ముడివేసుకోలేదు,అయితే యరోస్లావల్‌ నగరంతో సోదర పట్టణ కార్యక్రమం కింద సోవియట్‌ యూనియన్‌ సందర్శించాను అక్కడ జరిగిన కార్యక్రమంలో అమెరికా విదేశాంగ, దేశీయ విధానాలను విమర్శించాను తప్ప మరేమీ లేదని శాండర్స్‌ వ్యాఖ్యానించాడు. ఒక వేళ మీరు డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధి అయితే నేను ప్రజాస్వామ్య సోషలిస్టును అని గర్వంగా చెప్పుకుంటాను అని గతంలో అన్న దానితోనే ప్రచారం చేస్తారా అని ఒక విలేకరి ప్రశ్నించాడు. అనేక అంశాలను చూస్తే మనది ఇప్పటికే సోషలిస్టు సమాజం, మనకు పెద్ద బడ్జెట్‌ ఉంది, అన్ని రంగాలకు నిధులు ఖర్చు చేస్తున్నాము అని శాండర్స్‌ చెప్పాడు. దీనిలో అనేక తిరకాసులు లేకపోలేదు.అమెరికన్‌ మీడియా, డెమోక్రటిక్‌ పార్టీలోని ప్రత్యర్దులు శాండర్స్‌ నోటి వెంట సోషలిస్టును అనిపించాలని చూస్తున్నారు, అలా చెబితే ఎన్నికల్లో దాన్నొక అస్త్రంగా ప్రయోగించేందుకు సిద్దంగా ఉన్నారు. కొన్ని అంశాలలో పురోగామి వైఖరిని ప్రకటిస్తూ మరియు జనం కోరుతున్న డిమాండ్లను ముందుకు తెస్తున్న ఒక పురోగామి, సంస్కరణ వాది శాండర్స్‌ అని చెప్పవచ్చు. అమెరికా రాజకీయాల్లో అలాంటి వారు ఒక ప్రత్యామ్నాయంగా ముందుకు రావటమే పెద్ద మార్పునకు సంకేతం.

Image result for bernie sanders : is really communist specter of america
శాండర్స్‌ గురించి అనేక మంది భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. శాండర్స్‌ను కమ్యూనిస్టుగా వర్ణించటాన్ని ఆయన మద్దతుదారులు అంగీకరించటం లేదు, ఒక ప్రజాస్వామిక సోషలిస్టు, ఐరోపాలో అనేక మంది అర్ధం చేసుకుంటున్నట్లుగా శాండర్స్‌ వెనెజులా లేదా ప్రపంచంలోని ఇతర మరొక కమ్యూనిస్టు అనే కంటే స్వీడన్‌ సోషలిస్టులకు దగ్గరగా ఉంటారు అని న్యూస్‌ వీక్‌ పత్రికలో రాసిన జాసన్‌ లెమన్‌ అభిప్రాయ పడ్డారు. ఒక విధంగా ట్రంప్‌ చెప్పింది నూటికి నూరుపాళ్లు వాస్తవం కావచ్చు. నోర్డిక్‌ తరహా సోషల్‌ డెమాక్రాట్‌ శాండర్స్‌ అనేది అబద్దం కనుక కమ్యూనిస్టు అని ట్రంప్‌ చెప్పి ఉండవచ్చు అని లెమన్‌ అంటారు.
శాండర్స్‌ తాను సోషల్‌ డెమోక్రాట్‌ కంటే డెమోక్రటిక్‌ సోషలిస్టును అని చెప్పుకుంటాడు. నోర్డిక్‌ సోషల్‌ డెమాక్రాట్స్‌ సంక్షేమ రాజ్యాన్ని కోరుకుంటారు, పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరిస్తారు. ప్రభుత్వ అదుపును వ్యతిరేకిస్తారు. శాండర్స్‌ విషయానికి వస్తే పెట్టుబడిదారీ విధానానికి స్వస్తి పలకాలనే అభిప్రాయాలను బలపరిచాడు. ప్రయివేటు ఆస్ధిని రద్దు చేయాలని, ఆర్ధిక వ్యవస్ధ మీద ప్రభుత్వ అజమాయిషీ ఉండాలని చెబుతాడు. కమ్యూనిస్టు కాస్ట్రో, ఇతర నేతలను శాండర్స్‌ బలపరిచాడు, తాను మేయర్‌గా ఉన్న సమయంలో తన కార్యాలయంలో సుత్తీ కొడవలి ఉన్న ఎర్రజెండాను వేలాడతీశాడు.నాటి సోవియట్‌ యూనియన్‌ అసమ్మతివాదులను కలిసేందుకు నిరాకరించాడు. నోర్డిక్‌ సోషల్‌ డెమోక్రాట్స్‌ వ్యతిరేకించారు. ఇలాంటి అనేక అంశాలు ఉన్నందున శాండర్స్‌ను పూర్తిగా కొట్టి పారవేయటం వలన ప్రయోజనం లేదు. సోషలిస్టు మహాప్రస్తానంలో ఎవరు ఎంత వరకు వస్తే వారిని అంతవరకు కలుపుకుపోవాలి తప్ప, అన్నీ సక్రంమంగా ఉంటేనే అంగీకరిస్తామనటం విప్లవానికి తోడ్పడదు.
ఇప్పుడున్న పరిస్ధితుల్లో డెమోక్రటిక్‌ పార్టీ తరఫున శాండర్స్‌ అభ్యర్ధిగా ఎన్నిక అవుతారని అనేక మంది విశ్వసిస్తున్నారు. అది అంత తేలిక కాదు, ఎన్నో ఆటంకాలను అధిగమించాల్సి ఉంది. ఎవరూ భ్రమలు పెట్టుకోవాల్సిన పని లేదు. ఒక వేళ నిజంగానే అభ్యర్ధిగా ఎంపిక అయితే అమెరికా చరిత్రలో అదొక అనూహ్యపరిణామమే అవుతుంది. అలాంటిది సాధ్యమా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనా వైరస్‌ – ముందే ”గ్రహించిన” రచన బండారం బట్టబయలు ?

22 Saturday Feb 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

COVID-19, Dean Koontz, dean koontz the eyes of darkness wuhan 400, dean koontz the eyes of darkness wuhan 400 truth, DeanKoontz the eyes of darkness

ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ గురించి కంత్రీగాళ్లు జనాన్ని ఎంతగా బురిడీ కొట్టిస్తున్నారంటే కాస్త హేతుబద్దంగా ఆలోచిస్తారు అనుకొనే వారిని కూడా సందేహంలో పడవేస్తున్నారు. అలాంటి వాటిలో ఒకటి అమెరికన్‌ నవలా రచయిత డీన్‌ కూన్జ్‌ నాలుగు దశాబ్దాల క్రితమే కోవిద్‌-19 (కరోనా వైరస్‌) గురించి ఊహాన్‌-400పేరుతో ఊహించినట్లు వారం రోజులుగా ప్రచారం జరుగుతోంది.దీనిలో వాస్తవాలేమిటి అన్నది చూడబోయే ముందు మరికొన్ని అంశాల గురించి చూద్దాం.
కలరా, మసూచి, ప్లేగు మహామారి మాదిరి కరోనా వైరస్‌ పేరుతో సమాచార మహామారి (మహమ్మారి అని కూడా కొందరు పిలుస్తారు) వ్యాపిస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్ధ వ్యాఖ్యానించాల్సి వచ్చింది. దీనికి బలికాని వారు చాలా అరుదుగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ మహామారిని ఎదుర్కొనేందుకు ఒక వాక్సిన్‌ అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఆరోగ్య అత్యవసర కార్యక్రమ అధిపతి డాక్టర్‌ మైక్‌ రియాన్‌ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కరోనా వైరస్‌ గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న పూర్వరంగంలో దాన్ని ఎదుర్కొనేచర్యల్లో భాగంగా వాస్తవాలను వెల్లడించేందుకు ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఒక కార్యక్రమాన్నే చేపట్టాల్సి వచ్చింది. దానికి ‘ఎపివిన్‌’ అని పేరు పెట్టారు. దాన్ని తెలుగులో చెప్పుకోవాలంటే ‘మహామారుల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్ధ సమాచార వ్యవస్ధ’ అని అర్ధం.
కరోనా వైరస్‌ ప్రధానంగా చైనాలోని హుబెరు ప్రాంతంలో కొన్ని చోట్లనే ఎక్కువగా వ్యాప్తి చెందింది. కానీ తప్పుడు సమచార మహామారి చైనాతో పాటు ప్రపంచమంతటా వేగంగా వ్యాపిస్తోంది. వాస్తవం ఒక కిలోమీటరు ప్రయాణించే సమయానికి అవాస్తవం వందకిలోమీటర్ల ముందు ఉంటోంది.ప్రపంచంలో 380 కోట్ల మంది ఇంటర్నెట్‌ వినియోగదారులు ఉన్నట్లు అంచనా కాగా వారిలో 21శాతం చైనాలో ఉన్నారు. అందువలన వారికోసం కూడా వాస్తవాలను అందించాల్సి ఉంది. నువ్వుల నూనె రాసుకుంటే, మంట నుంచి వెలువడే పొగను పీల్చినా కరోనా వైరస్‌ అంటదు అనేది ఒక పెద్ద తప్పుడు ప్రచారం. ఇలా మరికొన్నింటి గురించి తెలిసిందే. ఆయా సంస్దలలో పని చేసే సిబ్బంది ఇతర వనరుల నుంచి వెలువడే దాని కంటే తమ యజమానులు చెప్పేదానిని ఎక్కువగా విశ్వసిస్తారన్నది ఒక తాజా అధ్యయనంలో తేలిన అంశం. అందువలన ప్రపంచ ఆరోగ్య సంస్ధ బడా కంపెనీల యజమానులతో సమావేశాలు జరిపి తమ సిబ్బందికి వాస్తవాలను వివరించాలని కోరుతోంది. కోవిద్‌-19కు సహజ లక్షణాలు లేవని, కృత్రిమంగా ఉహాన్‌ పరిశోధనాశాలలో తయారు చేశారనే కుట్ర సిద్ధాంతాలు, ప్రచారాన్ని తాము విశ్వసించటం లేదని 27 మంది ప్రముఖ ప్రజారోగ్య శాస్త్రవేత్తలు ఖండించినట్లు ఇటీవల లాన్‌సెట్‌ ప్రచురించింది.
ఇక అమెరికన్‌ రచయిత డీన్‌ కూన్జ్‌ జోశ్యం కథ చూద్దాం. అనేక మారు పేర్లతో రకరకాల ఇతివృత్తాలతో నవలలు రాసే డీన్‌ 1981లో రాసిన ది ఐస్‌ ఆఫ్‌ది డార్క్‌నెస్‌ అనే నవలలో పాత్రధారులతో ఊహాన్‌ -400 అనే జీవ ఆయుధం, అది పనిచేసే తీరు, జనాలను ఎలా హతమారుస్తుందో, దాన్ని ఎలా తయారు చేస్తారో చెప్పించాడు చూడండి అంటూ ఆయన అభిమానులు లేదా ఆ నవలను విక్రయించే అమెజాన్‌ కంపెనీకి చెందిన వారు గానీ 2008నాటి నవలా సమీక్ష చిత్రాన్ని వారం రోజుల క్రితం సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. ఒక పేజీలో జీవ ఆయుధం గురించి మరొక పేజీలో నవల ముఖచిత్రం ఉంది. ఇంకేముంది పుస్తకం మన ముందు ఉంది కనుక వాస్తవమే అని చాలా మంది నమ్మారు. ఆ పేజీలో పేర్కొన్నదాని ప్రకారం సదరు జీవ ఆయుధం కరోనా వైరస్‌ అనో మరొకటనో చెప్పలేదు. దానికీ కరోనా వైరస్‌కు అసలు పోలికే లేదు. అనేక డిటెక్టివ్‌, సైన్స్‌ ఫిక్షన్‌ కధలు, సినిమాల్లో ఇలాంటివి మనకు కోకొల్లలుగా కనిపిస్తాయి.

Image result for dean koontz

ది ఐస్‌ ఆఫ్‌ ది డార్క్‌నెస్‌ నవలా రచయిత డీన్‌ కూన్జ్‌
ఈ నవల పేజీ ప్రచారంలోకి వచ్చిన తరువాత ఈ కథ ఊహించని మలుపు తిరిగింది. గూగుల్‌లో వెతికిన కొందరికి కొత్త అంశం కనిపించింది. అదే నవలలో అదే పాత్ర ధారులు రష్యన్‌లు గోర్కీ పట్టణంలో తయారు చేసిన గోర్కీ-400 జీవ ఆయుధం గురించి చర్చిస్తారు. ఆ పేజీ నవల 1981నాటి ముద్రణలో ఉంది. కానీ తరువాత గోర్కీ కాస్తా 2008 నాటికి ఊహాన్‌గా మారిపోయింది. రెండు ముద్రణల్లోని రెండు రకాల పేజీలను దీనితో పాటు ఇచ్చిన చిత్రాలలో చూడవచ్చు. ఇదెలా జరిగింది? ఊహించటం కష్టమేమీ కాదు. అమెరికా, ఐరోపాలోని అనేక మంది రచయితలు, సినిమా దర్శకులు, కథకులు 1991 ముందు వరకు సోవియట్‌ యూనియన్‌, ఇతర తూర్పు ఐరోపా దేశాలలోని సోషలిస్టు వ్యవస్దలను దుష్టమైనవిగా చిత్రించి సొమ్ము చేసుకోవటం పరిపాటి.అమెరికన్లు, సిఐఏ ఏజంట్లు అసాధారణ తెలివి తేటలు గలవారిగా, సోవియట్‌ ఏజంట్లను పిచ్చిపుల్లయ్యలుగా చిత్రించిన సినిమాలు అనేకం ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. సోవియట్‌, ఇతర సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత అలాంటి వారు సొమ్ము చేసుకొనేందుకు కొత్త కథలను అల్లటం ప్రారంభించారు. అమెరికా ప్రధాన ప్రత్యర్ధిగా అనూహ్యంగా చైనా ముందుకు వచ్చింది.1991 తరువాత వచ్చిన సినిమాల్లో, రష్యన్ల బదులు చైనీయులు విలన్లుగా, అపహాస్యపు పాత్రధారులుగా మారిపోవటాన్ని చూడవచ్చు. దానిలో భాగంగానే కొత్త నవల రాయటం దండగ పేర్లు, స్ధలాలను మారిస్తే చాలని రచయిత, ప్రచురణకర్తలు భావించి ఆ మేరకు మార్చి ప్రచురించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వివాదం గురించి నవలా రచయిత డీన్‌ కూన్జ్‌ వైపు నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన వెలువడలేదు. జనాలకు జ్ఞాపకశక్తి తక్కువ కనుక తాము ఏమి రాసినా, ఏమి చెప్పినా చెల్లుబాటు అవుతుంది అనుకొనే వారు ఆ జనాల్లో కూడా తెలివిగల వారు ఉంటారని తమ బండారాన్ని బయటపెడతారని గ్రహించటం మంచిది.

Image

1981నాటి ప్రచురణలో గోర్కీ -400 గురించి రాసిన పేజీ

Share this:

  • Tweet
  • More
Like Loading...

డోనాల్ట్‌ ట్రంప్‌ భారత్‌ రాక : ఎవరు దేశ ద్రోహులు, ఎవరు దేశ భక్తులు ?

20 Thursday Feb 2020

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Donald Trump India tour, Namastee Trump, Naredra Modi

Image result for donald trump india tour : who are patriots and who are not

ఎం కోటేశ్వరరావు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఈనెల 24,25 తేదీలలో మన దేశ పర్యటన జరపనున్నారు. ఆ పెద్ద మనిషి రాకను నిరసిస్తూ తాము ప్రదర్శనలు జరుపుతామని వామపక్షాలు ప్రకటించాయి. ట్రంప్‌ రాక సందర్భంగా గుజరాత్‌ బిజెపి ప్రభుత్వం(కేంద్ర పెద్దల ఆదేశాలతోనే అన్నది స్పష్టం) చేస్తున్న హడావుడి చూస్తుంటే మన దేశం బ్రిటీష్‌ రాజరికంలో మాదిరి ఇప్పుడు అమెరికా బానిసత్వంలోకి పోయిందా అనిపిస్తోంది. అంతర్జాతీయంగా మీడియాలో ఇప్పటికే అపహాస్యం ప్రారంభమైంది. ఇంత చేసి సాధించేదేమిటి అన్నది అపూర్వచింతామణి ప్రశ్న. సమాధానం చెప్పకపోతే తలలు తెగవు గానీ, గత ఆరు సంవత్సరాలలో మోడీ గారు ఖరీదైన కోట్లు తొడుక్కొని విదేశాలు తిరటం తప్ప సాధించిందేమీ లేదు కనుక, ట్రంప్‌ రాకతో అటు సూర్యుడు ఇటు పొడుస్తాడు అని ఎవరైనా అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు.
డోనాల్డ్‌ ట్రంప్‌ రాకను సిపిఎంతో సహా వామపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ప్రధాని నరేంద్రమోడీ ట్రంప్‌ రాకకోసం ఎందుకు తహతహలాడుతున్నారు అన్నది ప్రశ్న. ట్రంప్‌ను ఆహ్వానించే వారు ఇప్పుడు అసలు సిసలు దేశభక్తులుగా ప్రచారం చేసుకుంటున్నారు లేదా చలామణి అవుతున్నారు. వ్యతిరేకించే వారిని దేశ ప్రయోజనాలను వ్యతిరేకించే వారిగా, దేశద్రోహులుగా సామాజిక మాధ్యమంలో దుమ్మెత్తి పోస్తున్నారు. ఎవరు దేశద్రోహులు, ఎవరు దేశ భక్తులో తటస్దులు ఆలోచించాలి.
తన భారత పర్యటన గురించి డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికన్‌ విలేకర్లతో చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోడీతో పాటు మన దేశ గౌరవాన్ని గంగలో కలిపాయి. ట్రంప్‌ నోటి వెంట వెలువడిన ఆణిముత్యాల సారాంశం ఇలా ఉంది. ” వాణిజ్యం విషయంలో అమెరికా పట్ల భారత్‌ సరిగా వ్యవహరించలేదు. నరేంద్రమోడీ ఎంతో మంచి వ్యక్తి గనుక పర్యటన పట్ల ఆసక్తితో ఉన్నా. భవిష్యత్‌ కోసం భారత్‌తో ఒక పెద్ద ఒప్పందాన్ని ఖరారు చేసుకుంటాం. అది అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందా అన్నది తెలియదు. ఈ పర్యటనలో ఒప్పందం ఉండకపోవచ్చు.నేను మోడీని ఎంతగానో ఇష్టపడుతున్నా. విమానాశ్రయం నుంచి కార్యక్రమాలు జరిగే ప్రాంతం, స్టేడియంలో 70లక్షల మంది పాల్గొంటారని నరేంద్రమోడీ నాతో చెప్పారు. ప్రపంచంలోనే పెద్దదైన స్టేడియం నిర్మాణం జరుగుతున్నదని అనుకుంటున్నాను. అందువలన అది ఎంతో ఉత్సుకత కలిగిస్తోంది. కాబట్టి మనమంతా ఖుషీగా గడపవచ్చు”.
మన దేశంలో పర్యటించే ఒక విదేశీ నేత ఇలా మాట్లాడటం అహంకారానికి సూచిక. మన దేశంలో స్ధానికంగా ఒక నేత పర్యటిస్తుంటే మద్దతుదారులు ఎంతెంత మంది జనాన్ని సమీకరిస్తారో ముందుగానే సదరు నేతకు చెప్పినట్లుగా మన ప్రధాని స్వయంగా ట్రంప్‌తో మీ కార్యక్రమానికి 70లక్షల మందిని సమీకరిస్తా, బ్రహ్మాండంగా చేస్తా అని చెప్పటం సిగ్గుగా లేదూ ! అందుకే ట్రంప్‌ మన దేశం వస్తే కమ్యూనిస్టులకు పోయేదేమిటి ? ఎందుకు వ్యతిరేకించాలి అని సామాజిక మాధ్యమంలో లేవనెత్తుతున్న ప్రశ్నలను నిజమే కదా అని భావిస్తున్న తటస్దులు కమ్యూనిస్టుల వ్యతిరేకతకంటే బిజెపి పాలకుల బానిసబుద్ది మన దేశానికి గౌరవాన్ని తెచ్చిపెడుతుందా అని ఆలోచించాలి. అంతర్జాతీయంగా అనేక ప్రాంతాలలో అమెరికన్లు శాంతికి విఘాతం కలిగిస్తున్నారు. ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారు, ఎప్పుడు ఎక్కడ దాడులు చేస్తారో, ఎందరిని బలిచేస్తారో తెలియదు. అందువలన అలాంటి వాటిని వ్యతిరేకించే కమ్యూనిస్టులు అంతర్జాతీయ వాదులు కనుక సహజంగానే వ్యతిరేకిస్తారు? మన దేశానికి, మన రైతాంగం, కార్మికుల ప్రయోజనాలకు అమెరికన్లు ముప్పు తేవటం లేదా ? లేక వాటిని చూసేందుకు మనం తిరస్కరిస్తున్నామా ? అసలవి సమస్యలుగా కనిపించటం లేదా ? వాటిని వివరంగా చర్చించబోయే ముందు క్లుప్తంగా ట్రంప్‌ పర్యటన వివరాలను చూద్దాం.

Image result for donald trump india tour : who are patriots and who are not
గతేడాది అమెరికాలో హౌడీ మోడీ సభ సందర్భంగా నరేంద్రమోడీ డోనాల్డ్‌ ట్రంప్‌ను మన దేశానికి ఆహ్వానించారు. ఈ మేరకు ఈనెల 24న వస్తున్న ట్రంప్‌ దంపతులకు అహమ్మదాబాద్‌ విమానాశ్రయంలో మోడీ స్వాగతం పలుకుతారు. విమానాశ్రయం నుంచి 22 కిలోమీటర్ల దూరం రోడ్‌ షో నిర్వహిస్తారు. సబర్మతి ఆశ్రమం దగ్గర మహాత్మాగాంధీకి నివాళి అర్పిస్తారు. తరువాత వల్లభారు పటేల్‌ స్టేడియంలో నమస్తే ట్రంప్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. అదే రోజు మూడున్నరకు అహమ్మదాబాద్‌ నుంచి బయలు దేరి ఆగ్రాలోని తాజ్‌ మహల్‌ సందర్శన, తరువాత ఢిల్లీ వెళతారు. రెండవ రోజు రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌ దంపతులకు రాష్ట్రపతి రామనాధ్‌ కోవింద్‌ దంపతులు స్వాగతం పలుకుతారు. తరువాత రాజఘాట్‌లో మహాత్మాగాంధీకి మరోసారి నివాళి అర్పిస్తారు. తరువాత హైదరాబాద్‌ హౌస్‌లో అధికారిక చర్చలు జరుగుతాయి.ఆ సమయంలో ట్రంప్‌ సతీమణి మెలానియా ఢిల్లీలోని ఒక పాఠశాలను సందర్శిస్తారు. మూడు గంటలకు అమెరికా రాయబార కార్యాలయంలో ముఖ్య వాణిజ్యవేత్తలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ట్రంప్‌ పాల్గొంటారు. రాత్రి ఎనిమిది గంటలకు రాష్ట్రపతి భవన్‌లో విందు, తరువాత పది గంటలకు అమెరికాకు తిరుగు ప్రయాణమౌతారు.
గుజరాత్‌లో కొద్ది గంటలు మాత్రమే గడిపే ట్రంప్‌ దంపతుల కోసం సర్కార్‌ పదివేల మంది పోలీసులను, వందల మంది అధికారులను దింపుతోంది. నిన్నటి వరకు బిజెపి మిత్రపక్షంగా ఉన్న శివసేన పత్రిక సామ్నా మోడీ చేస్తున్న హడావుడిని బానిస మనస్తత్వంగా వర్ణించింది. రోడ్ల మీద ఉండే పాన్‌ దుకాణాల మూత మొదలు, వీధి కుక్కల పట్టివేత, పేదరికం, పేదలు కనపడకుండా అహమ్మదాబాదులో కొన్ని చోట్ల గోడల నిర్మాణం, కొన్ని చోట్ల కుటుంబాల తొలగింపు వంటిచర్యలకు ప్రభుత్వం పాల్పడింది. కొద్ది గంటల పాటు ట్రంప్‌ దంపతులకు మురికివాడలు కనపడకుండా చేసేందుకు అహమ్మదాబాదులో దాదాపు వందకోట్ల రూపాయలు తగలేసి గోడ కట్టిన మన నిర్వాకాన్ని చూసి ఎవరైనా ఏమనుకుంటారు? అహమ్మదాబాద్‌ విమానాశ్రయానికి అరవైకి పైగా అంతర్జాతీయ, దేశీయ విమానాల రాకపోకలు రోజూ ఉంటాయి. కేవలం పది విమానాలను మాత్రమే అనుమతిస్తూ మిగతా వాటిని ఇతర ప్రాంతాలకు మరల్చేందుకు నిర్ణయించారు. స్టేడియంకు జనాలను తరలించేందుకు 2,200 బస్సులు ఏర్పాటు చేశారు. రోడ్డు పొడవునా దోమలు లేకుండా చేసేందుకు ఫాగింగ్‌ యంత్రాలను అమర్చారు. రోడ్ల మీద లక్ష మొక్కలను తాత్కాలికంగా ఏర్పాటు చేసేందుకు పూనుకున్నారు.ట్రంప్‌కు జయజయ ధ్వానాలు పలికేందుకు రోడ్ల మీద ఇరవై ఎనిమిది వేదికలను ఏర్పాటు చేశారు.
గతేడాది సెప్టెంబరులో నరేంద్రమోడీ అమెరికా పర్యటన జరిపి హౌడీ మోడీ పేరుతో భారత సంతతి వారిని సమీకరించి మన దేశం ఎంతో బాగుందని ఎనిమిది సార్లు ఎనిమిది భాషల్లో చెప్పి, ట్రంప్‌ను తాను పొగిడి, ప్రతిగా దేశ పిత అని ట్రంప్‌ చేత పొగిడించుకొని కౌగిలింతలతో తిరిగి వచ్చారు తప్ప సాధించిందేమిటి? మన ఎగుమతుల పెంపుదలకు ఎలాంటి ఒప్పందం నాడు లేదు, ఇది రాసిన సమయానికి వచ్చిన వార్తలను బట్టి ఇప్పడూ లేదు. అసలు కీలకమైన అమెరికా వాణిజ్య ప్రతినిధే ట్రంప్‌తో రావటం లేదు. ఇప్పుడు పరస్పరం ఎలా పొగుడు కుంటారో దేశం చూడనుంది. అసలు ట్రంప్‌ పర్యటనను ఎందుకు వ్యతిరేకించాలి ?
అలీన దేశంగా ఉన్న భారత్‌ను తమ చంకనెక్కించుకొని తన ప్రయోజనాలను నెరవేర్చుకొనేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఇది మన దేశానికి భద్రతా రీత్యా, ఆర్ధికంగా మోయలేని భారాలను మోపుతుంది. ఇరుగుపొరుగుదేశాలతో శతృత్వాలను పెంచుతుంది. ఈ రోజు మన ప్రాధాన్యత యావత్‌ దేశ జనాభా అవసరాలు తీరే విధంగా ఆర్ధిక వ్యవస్దను అభివృద్ధి చేయటానికి ఉండాలి తప్ప ఇరుగుపొరుగుదేశాలతో మిలిటరీ ఉద్రిక్తతల నడుమ మన సంపదలన్నీ అమెరికా లేదా మరొక దేశ ఆయుధాలకొనుగోలుకు వెచ్చించాల్సిన అవసరం లేదు. ఇరుగు పొరుగుదేశాలతో ఉన్న సరిహద్దు సమస్యలను పరిష్కరించేందుకు అమెరికాతో చెలిమి ఏ విధంగానూ మనకు ఉపయోగపడదు.పసిఫిక్‌ సముద్ర ప్రాంతంలో తన ప్రయోజనాలకోసం మన దేశాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యం పేరుతో తన మిలిటరీ వ్యూహంలోకి అమెరికా లాగుతోంది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో తన భారాన్ని మన మీద మోపేందుకు మన భుజం మీద తుపాకిని పెట్టి చైనాను కాల్చేందుకు ప్రయత్నిస్తోంది. తనకు అవసరం లేని, ఇతర దేశాలకు కూడా విక్రయిస్తున్న ఆయుధాలను మనకు కట్టబెట్టటం తద్వారా మన మిలిటరీ భవిష్యత్‌ను తన చేతుల్లోకి తీసుకొనే ప్రయత్నం చేస్తున్నది. అమెరికాకే అగ్రస్ధానం అనే పద్దతుల్లో ముందుకు పోతున్న అమెరికా మనలను ఎలా ముందుకుపోనిస్తోందో అందరూ ఆలోచించాలి.
మన దేశం చైనాతో అయినా మరొక దేశంతో అయినా మన జాగ్రత్తలు మనం తీసుకుంటూనే అభివృద్ధి మీద కేంద్రీకరించాలి. అమెరికన్లు చైనాను శత్రుదేశంగా పరిగణించటం వేరు, వారు వారు చూసుకుంటారు, వారి తరఫున మనలను కూడా అదే విధంగా వ్యవహరించాలని చూడటం మనకు ఏమాత్రం మంచిది కాదు. అనేక ప్రాంతాలలో గతంలో అమెరికా తన సైన్యాలను దించి ప్రత్యక్షంగా దాడుల్లో పాల్గొనేది, ఇప్పుడు తన చేతికి మట్టి అంటకుండా ఇతర దేశాలు ఆ పని చేయాలని వత్తిడి చేస్తోంది. అమెరికా ఆయుధాలకు మార్కెట్‌గా మారేందుకు, ఇరుగుపొరుగుదేశాలను శత్రువులుగా చేసుకోవటం మనకు అవసరమా ?
2018 నుంచి అమెరికన్లు చైనా మీద వత్తిడి తెచ్చి తమ ప్రయోజనాలను కాపాడుకోవాలని చూస్తున్నారు తప్ప మన దేశం నుంచి దిగుమతులకు పూనుకోవటం లేదు. మన దేశం నుంచి దిగుమతి చేసుకొనే కొన్ని వస్తువులకు ఇచ్చిన రాయితీలను కూడా రద్దు చేశారు, దానికి ప్రతిగా మనం కూడా అమెరికా వస్తువులపై పన్నులు పెంచాల్సి వచ్చింది. మనమేదో పత్తి రైతులకు కనీస మద్దతు ధరల రూపంలో సబ్సిడీలు ఇస్తున్నామనే పేరుతో ప్రపంచ వాణిజ్య సంస్దలో మన మీద దావా వేసింది అమెరికా. 2019 జనవరి-సెప్టెంబరు మాసాల మధ్య ఉభయ దేశాల వాణిజ్య వృద్ధి రేటు 8.4 నుంచి 4.5శాతానికి పడిపోయింది. రెండు దేశాల మధ్య సేవలు, వస్తువుల వాణిజ్య నిష్పత్తి 62:38శాతం ఉండగా చైనాతో వస్తువుల శాతమే ఎక్కువగా ఉంది.
అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించాలంటే తలసరి ఆదాయం 12,375 డాలర్లు ఉండాలి, మన దేశంలో రెండువేల డాలర్లకు అటూ ఇటూగా ఉన్నప్పటికీ మనలను అభివృద్ధి చెందిన తరగతి దేశాలతో జమకట్టిన ట్రంప్‌ సర్కార్‌ కొద్ధి రోజుల క్రితమే మనకు ఆరు రకాల సబ్సిడీలు దక్కకుండా చేసింది. ఆర్ధికంగా కొన్ని వందల కోట్ల రూపాయలు మనకు నష్టం కలిగించింది. ఒక వైపు మన పరిస్ధితి ఇంట్లో ఈగల మోతగా ఉంటే అమెరికా ఈ పల్లకీ మోత కారణంగా అనేక దేశాలు మనలను సతాయించుకు తింటాయి. అలాంటి ట్రంప్‌ మనకు మిత్రుడా ?
ప్రపంచ వాణిజ్య సంస్ద నిబంధనావళిలో సాధారణ ప్రాధాన్యత వ్యవస్ధ(జిఎస్‌పి) ప్రకారం రాయితీలు పొందుతున్న మనకు అభివృద్ది చెందుతున్న దేశ లబ్దిదారు(డిబిసి) హౌదాను అమెరికా రద్దు చేసింది. పర్యవసానంగా మన ఎగుమతులకు ఇస్తున్న వందలాది కోట్ల రూపాయల సబ్సిడీలు పోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో మన వస్తువుల ధరలు పెరుగుతాయి. ధరల నియంత్రణ వంటి అంశాలపై అమెరికా పాల ఉత్పత్తిదారులు, ఆధునిక వైద్య సాంకేతిక అసోసియేషన్‌ వంటి సంస్ధల వత్తిడి మేరకు ఇలా జరిగింది. జిఎస్‌పి రద్దు వలన ప్రధానంగా ప్రభావితులవుతున్నది చిన్న, మధ్యతరహా పరిశ్రమలే. దీనివలన మన ఎగుమతులతో పాటు కార్మికుల వేతనాలు కూడా పడిపోతాయి. నిరుద్యోగమూ పెరుగుతుంది. మనకు జిఎస్‌పి రద్దు చేసిన ట్రంప్‌ బంగ్లాదేశ్‌, బ్రెజిల్‌, ఈజిప్టు, కాంబోడియా, దక్షిణాఫ్రికాలకు కొనసాగిస్తున్నాడు. అంటే ఈ దేశాల నుంచి మనకు పోటీ పెరిగినట్లే, దాన్ని తట్టుకొనేందుకు ఆయా సంస్ధలకు సబ్సిడీలు ఇవ్వాల్సి ఉంది. ఇలాంటి పరిస్ధితికి నెట్టిన వ్యక్తిని మనం ఆహ్వానించటమా ?
ప్రపంచ వాణిజ్య సంస్దలో వివాదాల తీర్పులపై అప్పీలు చేసుకొనేందుకు ఒక సంస్ధ ఉంది. దానిలో ఉన్న ముగ్గురు న్యాయమూర్తులలో ఇద్దరు ఉద్యోగ విరమణ చేశారు. కొత్త వారిని నియమించకుండా ట్రంప్‌ సర్కార్‌ అడ్డుకుంటున్న కారణంగా అది పని చేయటం లేదు.గతేడాది డిసెంబరు నుంచి అప్పీళ్లను చేపట్టలేదు. వాటిలో మనదేశానికి చెందినవి కూడా ఉన్నాయి. మన దేశం ఎంఇఐఎస్‌ పధకం ద్వారా, ఎగుమతి ఆధారిత యూనిట్లు, ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ టెక్నాలజీ పార్కులు, ఎస్‌ఇజెడ్‌లు, సెజ్‌, ఎక్స్‌పోర్ట్‌ ప్రమోట్‌ కాపిటల్‌ గూడ్స్‌ వంటి వాటి ద్వారా చేసే ఎగుమతులు, వాటికి రాయితీలు ఇవ్వటాన్ని అమెరికా సవాలు చేసింది, వాటి కారణంగా తమ కంపెనీలకు నష్టం వాటిల్లుతోందని డబ్ల్యుటిఓకు ఫిర్యాదు చేసింది. దానిపై విచారణ జరిపిన కమిటీ అవన్నీ నిబంధనలకు విరుద్దమని ఎగుమతి సబ్సిడీలు ఇవ్వరాదని తేల్చింది.2017లోనే తమ సబ్సిడీలు పరిమితిని దాటాయని అప్పటి నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు అభివృద్ధి చెందుతున్న దేశంగా తాము సబ్సిడీలు ఇవ్వవచ్చని మన దేశం ఆ నివేదికను సవాలు చేసింది. మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ఇప్పుడు అమెరికా పరిగణించటం వెనుక ఇలాంటి రాయితీలను రద్దు చేయించే ఎత్తుగడ స్పష్టంగా ఉంది.ఇలాంటి సర్కార్‌ నేత ట్రంప్‌ మన భాగస్వామి ఎలా అవుతాడు ?

Image result for donald trump india tour : who are patriots and who are not
మన దేశం నిబంధనల మేరకు ఇస్తున్న సబ్సిడీలను అభ్యంతర పెడుతున్న అమెరికా మరోవైపు మన ఉత్పత్తులపై విధిస్తున్న పన్నులు అక్రమం అని ప్రపంచ వాణిజ్య సంస్ద పదే పదే చెబుతున్నా, తీర్పులు ఇచ్చినా వాటిని ఖాతరు చేయటం లేదు. భారతీయ స్టీలు పైపుల తయారీదార్లకు భారీగా సబ్సిడీలు ఇస్తున్నారనే పేరుతో కొన్ని రకాల పైపుల దిగుమతులపై 2012లో అమెరికా 300శాతం పన్ను విధించింది. అది అక్రమం అని 2014లో డబ్ల్యుటిఓ తీర్పు చెప్పింది. అయినా అమెరికా ఖాతరు చేయలేదు. గతేడాది కొన్ని మార్పులు చేసినప్పటికీ అమెరికా వైఖరిని తప్పుపట్టినా అదే పరిస్ధితి కొనసాగుతోంది. తమ 28వస్తువులపై భారత్‌ దిగుమతి పన్నులు పెంచిందంటూ అమెరికా ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం డబ్ల్యుటిఓలో మన దేశానికి సంబంధించి 14వివాదాలు ఉన్నాయి. పప్పుధాన్యాల దిగుమతులపై మన దేశం విధించిన నిషేధాన్ని అమెరికాతో సహా అనేక దేశాలు వివాదాస్పదం కావిస్తున్నాయి. ఇలాంటి దేశాల నేతలను నమ్మటం, వారిని కౌగలించుకోవటం ఏమిటి ? ఇలాంటి ట్రంప్‌ను వ్యతిరేకించటం దేశ ద్రోహమా లేక ఆహ్వానించి ఎర్రతివాచీ పరచటం దేశద్రోహమా ? ఎవరు దేశ ద్రోహులు, ఎవరు దేశ భక్తులు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

చరిత్రలో జీవ ఆయుధాల నేరగాండ్లెవరు?

19 Wednesday Feb 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

#China biological weapons, Biological weapons, China a victim of Biological weapons, japan bacteria bombs

Image result for japan bacteria bombs

– ఎం. కోటేశ్వరరావు

చైనాలోని హుబెయ్ రాష్ట్రంలో కోవిద్‌-19(కరోనా) వైరస్‌ ప్రబలి వందల మందిని బలిగొనటం వెనుక ఉన్నది వికటించిన చైనా జీవ ఆయుధ ప్రయోగాలే అని పశ్చిమ దేశాల మీడియా కథలను అల్లింది. వాటిని పొల్లుపోకుండా దున్న ఈనిందంటే దూడను గాటన కట్టేయమన్నట్టు తెలుగు మీడియా పునశ్చరణ కావించింది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని ఈనెల 15న ఆసియా టైమ్స్‌ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. గతంలో కొన్ని దేశాల చరిత్రను చూసినప్పుడు అప్పటికే గుర్తించిన వైరస్‌లు, బాక్టీరియాలతో జీవ ఆయుధాలను తయారు చేసి జనం మీద ప్రయోగించాయి. కోవిద్‌-19 వైరస్‌ కొత్తది. గతంలో గుర్తించిన 2019 నోవల్‌ కరోనా వైరస్‌కూ దీనికీ సంబంధం లేదు. అందువలన కోవిద్‌-19తో జీవాయుధాలు తయారు చేస్తున్నారనటానికి ఎలాంటి ఆధారాల్లేవని, ప్రధాన వైద్య నిపుణులెవరూ వివాదాస్పద కథనాలను అంగీకరించటం లేదని ఆసియా టైమ్స్‌ కథన రచయిత పేర్కొన్నారు.

చరిత్రలో ఇంతవరకు ఏ దేశంలోనూ జరగని విధంగా కోట్లాది మందిని ఇండ్లకే పరిమితం కావాలని వ్యాధినిరోధక చర్యల్లో భాగంగా చైనా సర్కార్‌ జనానికి సలహాయిచ్చింది. అది కూడా కొందరు ప్రబుద్దులకు జనాన్ని బందీలు చేయటంగా కనిపించిందంటే వారి చైనా వ్యతిరేక పిచ్చి తారాస్ధాయికి చేరిందనుకోవాలి. ప్రపంచ దేశాలన్నీ వైరస్‌ తగ్గుముఖం పట్టేవరకు చైనా ప్రయాణాలు మానుకోవాలని సలహా ఇచ్చాయి, అంటే దీని అర్ధం సేచ్చగా తిరగటాన్ని కట్టడి చేయటంగానూ, నిరంకుశ చర్యలుగా భావించాలా ? కోవిడ్‌-19 వైరస్‌ చైనాలో ఉహాన్‌ పరిశోధనశాలల నుంచే వెలువడిందనటానికి ఆధారాలు ఇంకా దొరకలేదని చెబుతూనే రుజువు చేసుకోవాల్సిన బాధ్యత చైనా కమ్యూనిస్టు పార్టీ మీద ఉందని అమెరికా రిపబ్లికన్‌ పార్టీ సెనెటర్‌ టామ్‌ కాటన్‌ చేసిన బాధ్యతారహిత ప్రకటనను ఆధారం చేసుకొని మీడియా రచ్చ చేస్తోంది. ఇండ్ల నుంచి బయటకు వచ్చిన వారిని చైనా కమ్యూనిస్టు పార్టీ పోలీసులు కొడుతున్నారని కాటన్‌ ప్రబుద్దుడు ఆరోపించాడు. ఇలాంటి వారి ప్రకటనలను ఆధారం చేసుకొని మీడియా సంచలనాత్మక కథనాలను వండుతోంది.

జీవ ఆయుధాలు ప్రపంచంలో తయారు కావటం లేదా, ఏ ఏదేశాలకు సామర్థ్యం ఉంది, అసలు ఎప్పటి నుంచి వీటిని వినియోగిస్తున్నారు, ఎవరు వినియోగిస్తున్నారో చూద్దాం. యుద్ధోన్మాదులు, ప్రపంచాన్ని ఆక్రమించుకోవాలని చూసిన వారు మాత్రమే వీటిని ఉపయోగించినట్టు చరిత్ర చెబుతోంది. కమ్యూనిస్టులు అలాంటి వారు కాదు కాబట్టి, సోషలిస్టు చైనాకు అలాంటి ఆయుధాలను తయారు చేయాల్సిన అవసరం లేదు. వైరస్‌, బాక్టీరియా, ఫంగస్‌, ఇతర కొన్ని రసాయనాలను జీవ ఆయుధాలుగా పరిగణిస్తున్నారు. వీటివలన మానవులు, పశువులే కాదు, మొక్కలు కూడా నాశనం అవుతాయి, అనారోగ్యపాలవుతాయి. అయితే వాటిని తయారు చేసే సత్తా చైనాకు లేదా అంటే లేదని ఎవరూ చెప్పజాలరు. మానవ కల్యాణం కోసం ఒక ప్రమాదకర వైరస్‌ను హతమార్చేందుకు మరొక వైరస్‌ను రూపొందించేందుకు ప్రతి దేశానికీ అవకాశం ఉంది. అయితే ఆ ముసుగులో ఆయుధాలు తయారు చేస్తున్నాయన్నదే అసలు సమస్య.

చరిత్రను తిరగేస్తే క్రీస్తు పూర్వం ఆరువందల సంవత్సరంలో క్రిసాను ముట్టడి సమయంలో రాజు సోలోన్‌ కటుక రోహిణీ అనే పుష్పాల నుంచి తీసిన రసాన్ని ప్రయోగించి విరేచనాలు, ఇతర వ్యాధులు కలిగించినట్టు చరిత్రలో ఉంది. 1155లో రాజు బార్బోసా ఇటలీలోని టోరోంటానాలోని మంచి నీటి బావుల్లో శవాలను పడవేసి కలుషితం కావించాడు. 1495లో ఫ్రెంచి సైనికులను హతమార్చేందుకు స్పెయిన్‌ రాజులు ఇటలీలోని నేపుల్స్‌లో కుష్టువ్యాధి గ్రస్తుల రక్తం కలిపిన వైన్‌ సరఫరా అయ్యేట్టు చూశారు.1675లో విషంతో కూడిన బుల్లెట్లను వినియోగించరాదని జర్మనీ-ఫ్రెంచి సైన్యం అంగీకారానికి వచ్చాయి. 1710లో రష్యన్‌ చక్రవర్తి స్వీడన్‌ పట్టణాలలో ప్లేగుతో మరణించిన శవాలను ఫిరంగులకు కట్టి పడవేయించాడు. 1763లో అమెరికాలోని గిరిజనులను దెబ్బతీసేందుకు బ్రిటిష్‌ పాలకులు అమ్మోరు పోసిన వ్యాధిగ్రస్తులు వాడిన దుప్పట్లు పంపిణీ చేశారు. నెపోలియన్‌ చక్రవర్తి 1797లో ఇటలీలోని మంటువాలో మలేరియా వ్యాధి వ్యాపింప చేసేందుకు మైదానాలను వరదలతో నింపించాడు. అంతర్యుద్ధ సమయంలో1863లో అమెరికాలోని బానిస వ్యవస్థను కోరుకొన్న తిరుగుబాటు రాష్ట్రాలు యూనియన్‌ సైనికులకు ఎల్లోఫీవర్‌, అమ్మోరు సోకిన రోగులు వాడిన వస్త్రాలను విక్రయించేట్టు చూశాయి.

1346లో జెనోయీస్‌-తార్తార్ల మధ్య నేటి ఉక్రెయిన్‌లో ఆధిపత్య పోరు సమయంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. ఓటమి దశలో ఉన్న తార్తార్లు ప్లేగువ్యాధి సోకిన, మరణించిన తమ వారిని ఫిరంగులకు కట్టి శత్రు ప్రాంతాల మీద పడేశారు. దాంతో జెనోయీస్‌ దళాలు వెనక్కు తగ్గాయి. ఈ పరిణామం గురించి గాబ్రియల్‌ డే ముసిస్‌ నమోదు చేశాడు. వెనక్కు తగ్గిన జెనోయీస్‌(ఇటాలియన్లు)లు తమతో పాటు ప్లేగు వ్యాధి కూడా తీసుకు వెళ్లారు. ప్లేగు వ్యాధిగ్రస్తులు, బహుశా దానిని వ్యాపింప చేసే ఎలుకలను కూడా తమ నౌకల్లో తీసుకుపోయి ఉంటారని పేర్కొన్నాడు. ఆ తరువాత అది ఐరోపా, ఆఫ్రికా, ఆసియాలో మన దేశంతో సహా అనేక దేశాలకు వ్యాపించింది. రెండున్నర కోట్ల మంది ఐరోపాలో దానికి బలయ్యారు. హైదరాబాదు సంస్థానంలో ప్లేగు వ్యాధి పదే పదే వస్తుండటంతో దాన్ని నివారించేందుకు 1591లో చార్మినార్‌ను నాటి నిజాం రాజు కట్టించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ తరువాత కూడా వస్తుండటంతో పాలకులు అనేక నివారణ చర్యలను తీసుకోవటం వేరే విషయం.

మొదటి ప్రపంచ యుద్ధంలో గుర్రాలకు సెంబరోగం (చీమిడి కారటం) వచ్చే ఆంత్రాక్స్‌ పౌడర్‌ను జర్మనీ, ఫ్రెంచి గూఢచారులు ప్రయోగించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ సైన్యాలు రష్యా, ఇతర అనేక దేశాలలో ప్లేగ్‌, అంతరాక్స్‌ వంటి వ్యాధులను వ్యాపింపచేసేందుకు ప్రయత్నించారు. జీవ ఆయుధాల తయారీ, ప్రయోగాలు నిర్వహించారు. 1980-88 మధ్య ఇరాక్‌-ఇరాన్‌ యుద్ధంలో అమెరికా అందచేసిన శరీన్‌, ఇతర గ్యాస్‌లను ప్రయోగించినట్టు ఇరాక్‌పై విమర్శలు వచ్చాయి. తరువాత కాలంలో వాటి నిల్వలు ఇంకా ఇరాక్‌ వద్ద ఉన్నట్టు అనుమానించిన అమెరికా సద్దామ్‌ హుసేన్‌ మానవవినాశక ఆయుధాలను గుట్టలుగా నిల్వచేసినట్టు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇరాక్‌లో అమెరికన్లకు అలాంటివేమీ దొరకలేదని తరువాత వెల్లడైంది.

అమెరికాను ఆక్రమించుకొనే క్రమంలో గిరిజనుల నుంచి ఎదురైన ప్రతిఘటనను అణచివేసేందుకు బ్రిటిష్‌ పాలకులు పైన చెప్పుకున్నట్టు మసూచి(అమ్మోరు)వ్యాప్తిని ఒక ఆయుధంగా వాడుకున్న దుర్మార్గం గురించి చరిత్రలో నమోదైంది. అవి ఎలా పనిచేశాయో వివరిస్తూ సమాచారాన్ని బ్రిటిష్‌ సైనిక అధికారులు నమోదు చేశారు. పర్యవసానంగా దాదాపు రెండువందల సంవత్సరాల పాటు అమెరికాలో మసూచి వ్యాప్తి చెందింది. ఇలాంటి వాటిని పని గట్టుకొని వ్యాపింప చేశారా లేక సహజంగానే తలెత్తాయా అనేది నిర్ధారించటం ఇప్పటికీ అంతసులభంగా అంతుబట్టటం లేదని నిపుణులు చెబుతున్నారు.

రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 22సంవత్సరాలకు 179 దేశాలు జీవ ఆయుధాల నియంత్రణకు ఒప్పందంపై సంతకం చేశాయి. ఎట్టి పరిస్ధితుల్లోనూ వాటి తయారీ, సేకరణ, నిల్వ, వినియోగించబోమని ఆ దేశాలు అంగీకారం తెలిపాయి. అయితే వైద్య అవసరాలకు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఉదాహరణకు ఒక ప్రాణాంతక వైరస్‌ను హతమార్చేందుకు మరొక వైరస్‌ తయారీకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు జీవ ఆయుధాలు తయారు చేస్తున్నవారు కూడా ఆ ముసుగుతోనే చేస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి. అనేక దేశాలు రసాయనిక ఆయుధాలు తయారు చేస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి. వాటికీ జీవ ఆయుధాలకు పెద్ద తేడా ఉండదు. ఉదాహరణకు వియత్నాంను ఆక్రమించుకొనేందుకు అమెరికా జరిపిన దాడుల సమయంలో కలుపు మొక్కలను నాశనం చేసే పేరుతో ఆరెంజ్‌ ఏజంట్‌ అనే రసాయనాన్ని పెద్ద ఎత్తున వియత్నాంలో చల్లారు. యాభై సంవత్సరాలు గడిచిన తరువాత కూడా అనేక చోట్ల కలుపు మొక్కలే కాదు అసలు ఏ మొక్కా బతకని పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రాంతాలలో పుట్టుకతో పిల్లల్లో లోపాలు, కాన్సర్‌, మధుమేహం వంటి వ్యాధులకు అమెరికా చిమ్మిన విషం కారణమని తేలింది. అణ్వాయుధాలను అత్యాధునికంగా ఎలా తయారు చేస్తున్నారో వైరస్‌లను కూడా ఏదో ఒక ముసుగులో అలాగే తయారు చేస్తున్నట్టు అనేక మంది అనుమానిస్తున్నారు.

మొదటి ప్రపంచ యుద్దంలో రష్యా, రుమేనియాల్లో కలరా, ప్లేగు, అంత్రాక్స్‌ను వ్యాపింప చేసేందుకు నౌకల్లో అవి సోకిన గుర్రాలు, ఇతర పశువులను ఎగుమతి చేసేందుకు జర్మనీ పధకం వేసిందని వార్తలు వచ్చాయి. అయితే దాని మీద విచారణ జరిపిన నానాజాతి సమితి కమిటీ జీవ ఆయుధాలను ఉపయోగించలేదు గానీ జర్మన్లు రసాయనిక ఆయుధాలు వాడినట్లు పేర్కొన్నది. తరువాత రసాయనిక ఆయుధాలను రూపొందించకూడదని కోరుతూ 1925లో జెనీవా ఒప్పందం చేసుకున్నారు. అనేక దేశాలు సంతకాలు చేసినా 1975వరకు అమెరికా భాగస్వామి అయ్యేందుకు మొరాయించింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత కొరియాపై దాడి సమయంలో అమెరికా జీవ ఆయుధాలను ఉపయోగించిందనే విమర్శలు వచ్చాయి. అయితే తమ దగ్గర జీవ ఆయుధాలు ఉన్నాయి తప్ప వాటిని ఉపయోగించలేదని అమెరికన్లు బుకాయించారు.

జపాన్‌ జీవ ఆయుధాల తయారీ బృందం నేత షిరోషి

రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ సామ్రాజ్యవాదులు ఆపరేషన్‌ చెర్రీ బ్లూసమ్స్‌ పేరుతో జీవ ఆయుధాలతో అమెరికా సహా అనేక దేశాల మీద దాడి చేయాలనే పథక రచన చేశారు. అందుకు ప్రత్యేక దళాన్నే ఏర్పాటు చేశారు. 1932 నుంచి 1942వరకు పరిశోధనలు చేసి రూపొందించారు. తొలుత ప్రయోగాల్లో భాగంగా తన ఆక్రమణలోని చైనాలోని హార్బిన్‌, కొరియా, మంచూరియా ప్రాంతంలో దాడి చేశారు. దానిలో కలరా, ప్లేగు, అంతరాక్స్‌, మసూచి వంటి ప్రమాదకర క్రిముల్ని వాడారు. 2002లో ఒక అంతర్జాతీయ సమావేశంలో జపాన్‌ మిలిటరీ జరిపిన బాక్టీరియా బాంబు దాడుల్లో మరణించిన వారు ఐదు లక్షల ఎనభైవేల మంది ఉన్నట్టు వక్తలు వెల్లడించారు. ఒక్క చైనాలోనే ప్లేగు, కలరా, ఆంత్రాక్స్‌ వంటి వాటితో నాలుగు లక్షలమంది మరణించారని అంచనా. అమెరికన్లు జపాన్‌ పెరల్‌ హార్బరు మీద దాడి చేసిన తరువాత పదిహేను కోట్ల ప్లేగు బాక్టీరియాను మోసుకుపోయే ఈగలు, ఎలుకలతో అమెరికా మీద దాడి చేయాలని జపాన్‌ ఏర్పాట్లు చేసుకుంది. అయితే కారణాలు ఏమైనా వాటిని మోసుకుపోయే బెలూన్‌ నిర్ణీత స్థలాన్ని చేరలేదు. తరువాత దాడి చేయాలనుకున్న తేదీకి కొద్ది వారాల ముందే జపాన్‌ లొంగిపోయింది. దాంతో పన్నాగం నెరవేరలేదు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత జరిపిన విచారణలో జీవ ఆయుధాల తయారీ బృందం నేత షిరోషిని జపాన్‌ విడిచినా సోవియట్‌ విచారణలో 12మంది జపనీయులకు శిక్షలు తప్పలేదు.
జపాన్‌ జీవ ఆయుధాల తయారీకి 150 భవనాలను, ఐదు శివారు ప్రాంతాలను ఉపయోగించి మూడువేల మంది శాస్త్రవేత్తలతో పని చేయించారు. వాటి తయారీ సమయంలో కనీసం పదివేల మంది ఖైదీలపై వాటిని ప్రయోగించగా మరణించినట్టు తేలింది. వారిలో మూడువేల మంది కొరియా, చైనా, సోవియట్‌, మంగోలియా, అమెరికన్‌, బ్రిటిష్‌, ఆస్ట్రేలియన్‌ యుద్ద ఖైదీలు ఉన్నట్టు బయట పడింది. జపాన్‌ జీవ ఆయుధాల విషయం బయటపడిన తరువాత అమెరికా పెద్ద ఎత్తున 1942నుంచి వాటిని రూపొందించేందుకు పూనుకుంది. తాను పెద్ద ఎత్తున జీవ ఆయుధాలను తయారు చేసినట్టుగానే ఇతరులు కూడా తయారు చేసి తమ మీద ప్రయోగిస్తారని అమెరికా భయపడుతోంది.

ఇరాక్‌పై దాడి, దురాకక్రమణ సమయంలో 1990-91లో తన సైనికులను రసాయన ఆయుధాల నుంచి రక్షించుకొనేందుకు అవసరమైన ముఖతొడుగులు(మాస్క్‌) అందచేసింది. వాటిని ఎలా కనుగొనాలో శిక్షణ ఇచ్చింది. లక్షా 50వేల మంది సైనికులకు ఆంత్రాక్స్‌ నివారణ వాక్సిన్లు, వేసింది. ఆంత్రాక్స్‌ సోకినపుడు నివారణకు ఐదులక్షల మంది సైనికులకు ఒక నెలకు అవసరమైన ఔషధాల నిల్వల్ని అందుబాటులో ఉంచింది.
చరిత్రలో మానవాళి పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన సామ్రాజ్యవాదుల దుష్ట చరిత్రను మూసిపెడుతూ సోషలిజం, కమ్యూనిజం మీద ఉన్న వ్యతిరేకతను మరోసారి రెచ్చగొట్టేందుకు కార్పొరేట్‌ మీడియా చైనా జీవ ఆయుధాల తయారీ కథలను చెబుతున్నది.రెండవ ప్రపంచ యుద్దంలో జీవ ఆయుధాల దాడికి గురైన బాధిత దేశం చైనా అన్నది గుర్తు పెట్టుకోవాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d