• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Narendra Modi

ఎపిఎస్‌ఆర్‌టిసి ప్రయాణీకులపై మోడీ – జగన్‌ బాదుడే బాదుడు !

02 Saturday Jul 2022

Posted by raomk in AP NEWS, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

APSRTC, Narendra Modi, YS jagan


ఎం కోటేశ్వరరావు


ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ(ఎపిఎస్‌ఆర్‌టి) డీజిల్‌ సెస్‌ పేరుతో ప్రయాణీకుల మీద భారం మోపింది. 2022 జూలై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.ఈ సందర్భంగా సంస్థ చేసిన ప్రకటనలో ” పొరుగు రాష్ట్రంలో అన్ని బస్సుల టిక్కెట్లు మరియు పాస్‌ల ధరలు 9.6.2022 నుంచి పెంచటం జరిగినది ” అని సమర్ధించుకుంది.ఎదుటి వారు తొడ కోసుకుంటే మనం మెడ కోసుకుంటామా అన్న లోకోక్తి తెలిసిందే. భారం మోపేందుకు ఇది ఒక సాకు తప్ప హేతుబద్దత లేదు. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వాటన్నింటినీ ఆంధ్రప్రదేశ్‌ అమలు జరుపుతున్నదా, ఎపిలో ఉన్న వాటిని ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయా ! ఒకరు పెంచితే మిగతావారు పెంచాలని, తగ్గిస్తే తగ్గించాలనే ఒప్పందం గానీ విధిగానీ లేదు. జూలై రెండవ తేదీన ఇరుగు పొరుగు రాష్ట్రాలలో ఒక లీటరు పెట్రోలు, డీజిలు ధరలు దిగువ విధంగా ఉన్నాయి.
పట్టణం ×××× పెట్రోలు××× డీజిలు
విజయవాడ×× 111.66 ××× 99.43
హైదరాబాదు × 109.66 ××× 97.82
బెంగలూరు ×× 101.94 ××× 87.89
చెన్నై ×××××× 102.63 ××× 94.24
భువనేశ్వర్‌ ××× 103.19 ××× 95.28
ఆర్‌టిసీ ఛార్జీల పెంపుదల కోసం పొరుగు రాష్ట్రంతో పోలిక తెచ్చిన జగన్‌మోహనరెడ్డి సర్కార్‌ మరి ఈ రేట్లను గమనించి తక్కువ ఎక్కడుందో దాన్ని ఎందుకు అనుసరించటం లేదు ? దున్నబోతే దూడల్లో తినబోతే ఎద్దుల్లో అంటే ఇదే కదా ! అడ్డగోలు సమర్ధనకు ఒక తర్కం-పద్దతీ పాడూ ఉండదు. ఆర్‌టిసి ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కూడా సర్వీసులను నిర్వహిస్తున్నది. ఇప్పుడు రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నవారు పొరుగునే తక్కువగా ఉన్న ధరలకు డీజిలు, పెట్రోలు కొనుగోలు చేస్తున్నారు.అలాగే ఎపిఎస్‌ఆర్‌టిసి ఛార్జీలు తక్కువగా ఉంటే పొరుగు రాష్ట్రాల జనాలు మన బస్సులు ఎక్కుతారు, రాబడి కూడా పెరుగుతుంది కదా ! సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి చుట్టూ తిష్టవేసిన సలహాదారులకు, అధికారులకు గానీ ఈ చిన్న అంశం తట్టలేదా ! గతంలో కూడా డీజిలు ధరలు పెరిగాయి. ఎన్నడూ ఆర్‌టిసి చరిత్రలో దొడ్డిదారిన డీజిల్‌ సెస్‌ పేరుతో భారం మోపలేదు.


నవరత్నాలలో భాగంగా గత మూడు సంవత్సరాలలో లక్షా 50వేల కోట్ల వరకు జనానికి లబ్ది చేకూర్చినట్లు వైసిపి ప్రభుత్వ విజయాలలో చెప్పుకుంటున్నారు. ఆర్‌టిసి అధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం గత మూడు సంవత్సరాలలో వరుసగా వచ్చినట్లు చెప్పిన నష్టం 2019-20లో రు.1,222.96 కోట్లు, 2020-21లో రు.2,982.32 కోట్లు, 2021-22లో రు.2,698.86 కోట్లు. ఆర్‌టిసిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.ఇది మిగిలిన ప్రభుత్వశాఖల వంటిది కాగా నష్టాల గురించి ఎందుకు చెబుతున్నారన్నది ప్రశ్న. వైద్య ఆరోగ్యశాఖలో కూడా అందించేది సేవ మాత్రమే. ఆర్‌టిసిలో సిబ్బంది వేతనాలు, బస్సుల కొనుగోలు, నిర్వహణ ఉన్నట్లే అక్కడా సిబ్బంది వేతనాలు, ఆసుపత్రులు, వాటికి అవసరమైన వైద్య పరికరాలు, ఔషధాల కొనుగోలు వంటివి ఉంటాయి. దానిలో లేని లాభనష్టాల లెక్కలు ఆర్టీసికి ఎందుకు చెబుతున్నట్లు ? ఆసుపత్రుల్లో వాణిజ్య దుకాణాలు ఉండవు,అదే బస్టాండ్లలో ఎంతో కొంత దుకాణాల ద్వారా రాబడి వస్తుంది. ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణించేది పేద, మధ్య తరగతి వారు మాత్రమే. వారి కోసం రవాణా సబ్సిడీని కూడా నవరత్నాల్లో భాగంగా పరిగణించి ఏడాదికి మూడువేల కోట్ల రూపాయల భారాన్ని భరించే శక్తిలేనిదిగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదా ? నిజానికి నష్టం అని చెబుతున్నదంతా నష్టం కాదు. వృద్దులు, స్కూలు విద్యార్దులు, బస్‌పాస్‌లు, ఆర్‌టిసి మాజీ సిబ్బంది, జర్నలిస్టులు, ఇతరులకు ఇస్తున్న రాయితీలు కూడా దీనిలో ఉన్నందున ఆ మేరకు ప్రభుత్వం సంస్థకు చెల్లిస్తే నష్టాల మొత్తం తగ్గుతుంది. గత మూడు సంవత్సరాల్లో డీజిలు ధర లీటరుకు రు.40 పెరిగిందని ఆర్‌టిసి తన ప్రకటనలో చెప్పింది. డీజిలు మీద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 22.25శాతం పన్ను విధిస్తున్నది అంటే, అంత మేర రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయం వస్తున్నదనేది పచ్చినిజం. ఆ మేరకు ఆర్‌టిసి కొనుగోలు చేసే డీజిలు మీద పన్ను తగ్గించినా భారం తగ్గుతుంది కదా !


పెద్ద మొత్తంలో డీజిలు కొనుగోలు చేసేవారికి లీటరుకు రు.30 అదనంగా కేంద్ర ప్రభుత్వం అమ్ముతున్నది. ఇది జనం మీద విధిస్తున్న మోడీ టాక్సు అని చెప్పవచ్చు. తెలంగాణా వంటి చోట్ల ఆర్‌టిసి ఏకమొత్త కొనుగోలు నిలిపివేసి ఆ భారాన్ని తగ్గించుకొనేందుకు విడిగా కొనుగోలు చేస్తున్నారు. ఎపిఎస్‌ఆర్‌టిసి కూడా అదే పద్దతిని అనుసరించవచ్చు.ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇప్పుడు కొనుగోలు నిలిపివేశారని చెబుతున్నారు. అలాంటపుడు ఆ పేరుతో జనాల మీద భారం మోపారంటే దీన్ని మోడీ-జగన్‌ టాక్సు అని పిలవాల్సి ఉంటుంది. ఆర్‌టిసి బస్సుల్లో ఇప్పటికే టోలు, పాసింజరు, సేఫ్టీ పేరుతో అదనపు మొత్తాలను ప్రయాణీకుల నుంచే వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఇది అదనపు భారం.


ఆర్‌టిసిలో వివిధ సర్వీసుల మీద పెంచిన డీజిల్‌ భారం వెనుక పాలకపార్టీ పెద్దలు-ప్రయివేటు బస్‌ యజమానుల కుమ్మక్కును కొట్టి పారవేయలేము. వారు విడిగా తక్కువ ధరలకు బంకుల్లో డీజిలు కొనుగోలు చేస్తారు కనుక ఆర్‌టిసి పెంచిన మొత్తం ఎంతైతే అంత వారికి వచ్చే అదనపు లాభమే. డిమాండ్‌ ఉన్నపుడు తప్ప మిగిలిన రోజుల్లో ఇప్పటికే ఆర్టీసి కంటే తక్కువ చార్జీలకే తిప్పుతున్నారు. అందువలన ఇప్పుడు ఆర్‌టిసిలో పెంపుదల వారికి మరింత లాభం ఉంటుంది. దానిలో కొంత తగ్గించుకొని ఆర్టీసి కంటే తక్కువ ఛార్జీలకు ప్రయాణీకులను ఆకర్షించేందుకు అవకాశం పెరుగుతుంది. ఇప్పటికే ఆర్‌టిసిలో ఎక్కేవారు తగ్గుతున్నారు. లాభం వుండే దూరపు సర్వీసుల్లో మరింతగా తగ్గితే నష్టాలు మరింతగా పెరుగుతాయి. అందువలన ఏ విధంగా చూసినా సంస్థను మరింత దెబ్బతీసేపనే తప్ప మరొకటి కాదు

Share this:

  • Tweet
  • More
Like Loading...

నోటి దూల నూపుర్‌ శర్మకు సుప్రీం చివాట్లు – బిజెపికి చెప్పుకోలేని చోట తగిలిన దెబ్బ !

02 Saturday Jul 2022

Posted by raomk in Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Narendra Modi, Narendra Modi Failures, nupur sharma fringe comments, RSS, Supreme Court of India


ఎం కోటేశ్వరరావు


బిజెపి అధికార ప్రతినిధి ó(ఆమెను తాత్కాలికంగా నిలిపి ఉంచారు తప్ప పూర్తిగా తొలగించలేదు గనుక ఇంకా ఆ పదవిలో ఉన్నట్లే ) నూపుర్‌ శర్మకు జూలై ఒకటవ తేదీన సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తనపై వివిధ రాష్ట్రాలలో దాఖలైన కేసులన్నింటినీ ఒక్కటిగా చేసి ఢిల్లీలో విచారించాలని ఆమె చేసిన వినతిని కోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా ఇద్దరు న్యాయమూర్తులు సూర్య కాంత్‌, జెపి పార్దీవాలాతో కూడిన వేసవి సెలవుల బెంచ్‌ నూపుర్‌ వినతిని విచారించింది. ఆమె నోటి దూల దేశమంతటా నిప్పు రాజేసింది. దేశంలో తలెత్తిన ఉద్రిక్తతలకు ఆమెదే పూర్తి బాధ్యత అని సుప్రీం కోర్టు చెప్పింది. దేశంలో మహమ్మద్‌ ప్రవక్త మీద చేసిన వ్యాఖ్యలతో దేశంలో రగిలించిన ఆవేశాలకుగాను దేశం మొత్తానికి ఆమె క్షమాపణ చెప్పాలన్నది. సుప్రీం కోర్టు నుంచి ఇలాంటి ప్రతిస్పందనను ఎవరూ ఊహించి ఉండరు. నూపుర్‌ శర్మపై సుప్రీం కోర్టు జడ్జీలు చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొనేట్లు ఆదేశించాలని అజయ గౌతమ్‌ అనే వ్యక్తి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌ వి రమణకు దరఖాస్తు చేశారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు అలాంటి వ్యాఖ్యలు చేసినందున ఆమెకు న్యాయం జరగకపోవచ్చని ఆరోపించారు. తన పిటీషన్‌ కాపీని రాష్ట్రపతికి కూడా పంపుతానని అతను పేర్కొన్నాడు.


గ్యానవాపి మసీదు అంశం కోర్టు విచారణలో ఉన్నందున ఒక అజెండాను ముందుకు తేవాలని తప్ప దాని మీద టైమ్స్‌ నౌ ఛానల్‌ చర్చ ఎందుకు నిర్వహించింది అని కోర్టు ప్రశ్నించింది. మే 27వ తేదీన సదరు ఛానల్‌ చర్చలో నూపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్రవివాదాన్ని రేకెత్తించిన సంగతి తెలిసిందే. ” చౌకబారు ప్రచారం కోసం, రాజకీయ అజెండా లేదా దుర్మార్గమైన కార్యకలాపాల కోసం ఆమె మాట్లాడి ఉండాలి. ఆమె వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆమె అలా మాట్లాడాల్సిన అవసరం ఏమిటి ? దేశమంతటా ఆవేశాలను రగిలించేందుకు ఆమె మాట్లాడిన తీరు కారణం, దేశంలో జరుగుతున్నదానికి ఈ మహిళదే ఏకైక బాధ్యత. ఆమె ఎలా రెచ్చగొట్టిందీ చర్చను మేము చూశాము. తరువాత లాయర్నని ఆమె చెప్పుకుంది ఇది సిగ్గుచేటు. ఆమె దేశం మొత్తానికి క్షమాపణ చెప్పాలి. ” అని బెంచ్‌కు అధ్యక్షత వహించిన జస్టిస్‌ సూర్య కాంత్‌ అన్నారు.


నూపుర్‌ శర్మ తరఫు న్యాయవాది మణీందర్‌ సింగ్‌ మాట్లాడుతూ చర్చ సందర్భంగా నవికా కుమార్‌ మాట్లాడిన దానికి స్పందనగా నూపుర్‌ శర్మ మాట్లాడినట్లు చెప్పగా అయితే చర్చను నిర్వహించిన వారి మీద కూడా కేసు నమోదు చేయాలని కోర్టు అన్నది.అలాంటి ఉద్దేశ్యం యాంకర్‌కు లేదు. చర్చలో మరొకరు పదే పదే శివలింగం కాదు కేవలం ఫౌంటెన్‌ చెప్పారు అని మణిందర్‌ సింగ్‌ అన్నారు. తన కక్షిదారుకు ప్రాణహాని ఉన్నందున కేసులన్నింటినీ ఒకేచోట విచారించాలని మణీందర్‌ సింగ్‌ కోరారు. ” అమెకు ముప్పు ఉన్నదా లేక దేశ భద్రతకే ఆమె ముప్పు తెచ్చారా ? ఉదయపూర్‌లో జరిగిన దురదృష్టకర హత్యకు ఆమె మాటలే కారణం ” అని జస్టిస్‌ పార్దీవాలా అన్నారు. నూపుర్‌ శర్మ తన వ్యాఖ్యల మీద క్షమాపణ చెప్పారని, వెనక్కు తీసుకున్నారని న్యాయవాది చెప్పగా ” దేశానికి క్షమాపణ చెప్పేందుకు ఆమె టీవీ స్టూడియోకు వెళ్లాలి. వెనక్కు తీసుకోవటం కూడా చాలా ఆలస్యమైంది. అది కూడా మనోభావాలు గాయపడితే అనే షరతులతో కూడి ఉంది. రెచ్చగొట్టేందుకు వీరేమీ మతపరమైన వారు కాదు.” అని కోర్టు పేర్కొన్నది.


నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయించటం గురించి జస్టిస్‌ సూర్య కాంత్‌ మాట్లాడుతూ ” నూపుర్‌ పిటీషన్‌ ఆమె పొగరును వెల్లడిస్తున్నది. దేశంలోని మెజిస్ట్రేట్‌లు ఆమెకు చాలా చిన్నవారిగా కనిపిస్తున్నారు. ఆమె ఒక పార్టీ అధికార ప్రతినిధైతే ఏమిటి ? తన వెనుక అధికారం ఉందని, దేశంలోని చట్టాలతో నిమిత్తం లేకుండా ఏమైనా మాట్లాడగలనని ఆమె అనుకుంటున్నారు. కేవలం ఒక జాతీయ పార్టీ ప్రతినిధి అయినంత మాత్రాన క్షోభను కలిగించే అంశాలు మాట్లాడేందుకు లైసన్సు ఇవ్వరాదు. కోర్టులో ఉన్న అంశం గురించి ఆమె ఎందుకు మాట్లాడారు ” అని జస్టిస్‌ సూర్య కాంత్‌ ప్రశ్నించారు. ఈ అంశంలో ఢిల్లీ పోలీసుల తీరును కూడా కోర్టు ప్రశ్నించింది.పోలీసులు ఏమి చేశారు ? మా నోరు తెరిపించవద్దు అని సున్నితంగా కోర్టు మందలించింది.వివిధ రాష్ట్రాల నుంచి నిరంతరం వస్తున్న బెదిరింపులతో తన ప్రాణాలకు ముప్పు ఉందని నూపుర్‌ శర్మ తన పిటీషన్‌లో పేర్కొన్నారు.


దేవుడు నైవేద్యం ఆరగించడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాగే ఎక్కడో ఒక చోట జరిగిన దాని మీద వివిధ రాష్ట్రాల్లో కేసులు పెట్టి ఏండ్లతరబడి తిప్పే అంశం బిజెపికి చెందిన నూపుర్‌ శర్మకు, అందునా లాయర్‌ గనుక ఆమెకు తెలిసినంతగా మరొకరికి తెలియదు.కాషాయ దళాలు ప్రత్యేక శిక్షణతో ఉంటాయి.నీవు నేర్పిన విద్యఏనీరజాక్షా అన్నట్లుగా మిగతావారూ ప్రారంభించారు. బహుశా ఆ దృశ్యాలు కనిపించి తన మీద ఉన్న కేసులన్నింటినీ ఢిల్లీలోనే విచారించాలని కోరి ఉండవచ్చు. నూపుర్‌ శర్మ గురించి సుప్రీం కోర్టు తీవ్రమైన వ్యాఖ్యల నేపధ్యంలో కట్టుకథలకు, వక్రీకరణకు మారుపేరైన కాషాయదళాల నిర్వహణలోని వెబ్‌సైట్‌ ఓపి ఇండియా ఒక తప్పుడు కథనాన్ని ప్రచురించింది. నూపుర్‌ శర్మ దరఖాస్తును విచారించి తిరస్కరించిన ఇద్దరు సభ్యుల బెంచ్‌లో ఒకరు జెబి పార్దీవాలా. సదరు న్యాయమూర్తి గతంలో కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏగా, 1980-90లో గుజరాత్‌ స్పీకర్‌గా పని చేసినట్లు ఆ కథనంలో పేర్కొన్నది. నిజానికి ఆ పదవిలో ఉన్నది పార్దీవాలా తండ్రి బి పార్దీవాలా. పదవిలో ఉన్నది 1990 జనవరి 19 నుంచి మార్చి 16వరకు మాత్రమే, 86 ఏండ్ల వయస్సులో 2015లో మరణించారు. ఉద్రేకపడితే విచక్షణ ఎగిరిపోతుంది. జెబి పార్దీవాలా 2022 మే 9వ తేదీన సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలను స్వీకరించారు. అన్నీ సక్రమంగా ఉంటే ఇప్పుడున్న వారిలో సీనియారిటీ ప్రకారం 2028 మే నెలలో ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొంది రెండు సంవత్సరాల మూడు నెలలపాటు కొనసాగుతారు. గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసినపుడు ఇచ్చిన ఒక తీర్పులో ప్రస్తావించిన అంశాల మీద అభ్యంతరాలు వ్యక్తం కావటంతో వాటిని వెనక్కు తీసుకున్నారని ఇప్పుడు అదే న్యాయమూర్తి శుక్రవారం నాడు నూపుర్‌ శర్మ మీద అనవసరమైన వ్యాఖ్యలు చేసినట్లు అర్ధం వచ్చే రీతిలో ఒపిఇండియా కథనం ఉంది.


దానిలో పేర్కొన్నదాని ప్రకారం పటేల్‌ సామాజిక తరగతికి రిజర్వేషన్లు కల్పించాలన్న పిటీషన్‌ విచారణ సందర్భంగా ” ఈ దేశాన్ని నాశనం చేసింది లేదా సరైన దారిలో ముందుకు పోయేందుకు ఆటంకం కలిగించిన రెండు అంశాల పేర్లు చెప్పమని ఎవరైనా నన్ను అడిగితే రిజర్వేషన్లు, అవినీతి అని చెబుతా. ఆరున్నర దశాబ్దాల తరువాత రిజర్వేషన్లు కావాలని అడిగితే ఏ పౌరుడికైనా సిగ్గు చేటు. మన రాజ్యాంగాన్ని రూపొందించినపుడు పది సంవత్సరాల పాటు రిజర్వేషన్లు ఉండాలని భావించారు. కానీ దురదృష్టం కొద్దీ స్వాతంత్య్రం వచ్చిన 65 సంవత్సరాల తరువాత కూడా కొనసాగుతున్నట్ల ” పార్దీవాలా అన్నట్లు, దాంతో జడ్జి పదవి నుంచి తొలగించాలని 58 మంది రాజ్యసభ ఎంపీలు 2015లో పిటీషన్‌ దాఖలు చేసినపడు తన పదజాలాన్ని వెనక్కు తీసుకున్నట్లు పేర్కొన్నది. ఇక్కడ గమనించాల్సింది నిజంగా ఓపి ఇండియా రాసినట్లే జరిగిందా మరొకటా అన్నది కాదు. నూపుర్‌ శర్మ మీద సుప్రీం కోర్టు బెంచ్‌ జడ్జీలు చేసిన వ్యాఖ్యలు కూడా రిజర్వేషన్ల మీద చేసిన అంతటి తీవ్రమైనవైతే ఇప్పుడు కూడా బిజెపి, భుజాలు మార్చుకోకుండా దాన్ని మోస్తున్న పార్టీల ఎంపీలందరూ అలాంటి పిటీషన్‌ పెట్టమనండి.


నూపుర్‌ శర్మ నోటి దూల కలిగించిన పరిస్థితి గురించి దేశంలో ఉన్న అనేక మంది మనస్సులో ఉన్న మాటలనే సుప్రీం జడ్జీలు చెప్పారు.దాంతో బిజెపి, దాని అభిమానులకు అన్నింటికీ మించి నూపుర్‌ శర్మ చేసింది సరైనదే అని వాదించే, నమ్ముతున్నవారికి శుక్రవారం నాడు సుప్రీం కోర్టులో చెప్పుకోలేని చోట దెబ్బతగిలింది. సుప్రీం కోర్టు న్యాయ మూర్తులు చేసిన వా ఖ్యల మీద ” మీడియా నేడు మౌనంగా ఉంది. వారి నోళ్లు మూసుకున్నారు.నూపుర్‌ శర్మ కేసులో ఎవరూ న్యాయమూర్తుల మాటల మీద బహిరంగంగా మాట్లాడటం లేదు. ఇది నిజంగా చెడురోజు ” అంటూ ఒపి ఇండియా సంపాదకులలో ఒకరైన నూపుర్‌ జె శర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇలా మాట్లాడటం నూపుర్‌ శర్మకు బరితెగించి మద్దతు ఇవ్వటం తప్ప వేరు కాదు.ఆమె నోటి దూల పర్యవసానాలే ఉదయపూర్‌లోని ఒక సాధారణ దర్జీ ప్రాణాలు తీసేందుకు దారి తీసిందని సుప్రీం కోర్టే చెప్పింది. ఇలా చెప్పటమంటే హంతకులను సమర్ధించినట్లు కాదు. దర్జీ ఉదంతం మర్చిపోక ముందే మహారాష్ట్రలోని అమరావతి పట్టణంలో మరొకరు ఆమె నోటి దూలకు బలైనట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు దాన్ని నిగ్గుతేల్చాల్సి ఉంది. అమిత్‌ మెడికల్‌ స్టోర్స్‌ దుకాణదారు ఉమేష్‌ ప్రహ్లాదరావు కోహ్లే (54) జూన్‌ 21 రాత్రి 10-10.30 మధ్య హత్యకు గురైనాడు. ఆ వెనుకే వస్తున్న కుమారుడు సంకేత్‌, కోడలు ఉమేష్‌ను ఆసుపత్రిలో చేర్చినా ఫలితం లేకపోయింది. పోలీసులు చెబుతున్న ప్రాధమిక సమాచారం ప్రకారం ఉమేష్‌ వాట్సాప్‌ గ్రూపులో నూపుర్‌ శర్మకు మద్దతుగా పెట్టిన లేదా ఫార్వర్డ్‌ చేసిన పోస్టు తన ఖాతాదారులైన ముస్లింలు ఉన్న గ్రూపులో కూడా పెట్టాడు. ఈ కేసులో అరెస్టైన ఐదుగురు నిందితుల్లో ఒకడు మహమ్మద్‌ ప్రవక్తను కించిపరిచిన వారు చావాల్సిందే అని పోలీసులతో చెప్పినట్లు ఒక అధికారి చెప్పినట్లు వార్తలు వచ్చాయి. తన తండ్రి అలాంటి వాడు కాదని తాను కూడా అదే కథనాన్ని విన్నట్లు, డబ్బుకోసమైతే తన తండ్రిని చంపలేదని మాత్రం తాను చెప్పగలనని కుమారుడు చెబుతున్నాడు. పోలీసులు స్పష్టంగా దేన్నీ చెప్పలేదు.


న్యాయమూర్తుల వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని ఆదేశించాలన్న దరఖాస్తు ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి దగ్గర ఉంది. దాన్ని ఏమి చేస్తారన్నది ఆసక్తికర అంశం. ఒక వేళ దరఖాస్తు దారు కోరికను మన్నిస్తే కొత్త సమస్యలకు దారి తీస్తుంది. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు మౌఖికంగా ఏమీ మాట్లాడేందుకు వీలుండకపోవచ్చు. దీన్ని అంగీకరిస్తే గతంలో సుప్రీంతో సహా వివిధ కోర్టులలో చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని కొత్త పిటీషన్లు, కేసులు దాఖలు కావచ్చు.


పాత కేసుల పేరుతో ఎలా వేధించవచ్చో ఆల్ట్‌ న్యూస్‌ జర్నలిస్టు మహమ్మద్‌ జుబేర్‌ ఉదంతం వెల్లడించింది. 2018లో చేసిన ఒక ట్వీట్‌ మీద దాఖలు చేసిన కేసులో గతనెలలో జుబేర్‌ను అరెస్టు చేసి నాలుగు రోజుల పాటు కస్టడీకి పంపారు. ఒక ట్వీట్‌ మీద ఢిల్లీ పోలీసులు నాలుగు సంవత్సరాలుగా విచారణ చేస్తూనే ఉన్నారట. ఒక వేళ అరెస్టు చేయాల్సినంత పెద్ద నేరమైతే అప్పుడే చేసి ఉండాలి. ఇంతకూ మతపరమైన మనోభావాలను గాయపరచినట్లు ఆరోపించిన జుబేర్‌ ట్వీట్‌లో ఉన్నదేమిటి ? ఒక పాత హిందీ సినిమాలో ఒక హౌటల్‌ మీద హనుమాన్‌ హౌటల్‌ అని రాసి ఉన్న ఉన్న చిత్రాన్ని తీసుకొని దాని కింద ” 2014కు ముందు హనీమూన్‌ హౌటల్‌ 2014 తరువాత హనుమాన్‌ హౌటల్‌ ” అని ట్వీట్‌ చేశారు. దాని మీద హనుమాన్‌ భక్త అనే పేరుతో ఉన్న ఒక ట్విటర్‌ ఇచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదు చేశారట. హనుమంతుడు బ్రహ్మచారి, ఇలా రాయటం హిందువులను నేరుగా అవమానించటమే కనుక చర్యతీసుకోవాలని సదరు ట్వీట్టర్‌ పోలీసులకు ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదు చేశాడట. అసలు ఫిర్యాదీ చిరునామా లేకుండా కేసు ఎలా పెడతారని జుబేర్‌ కోర్టులో ప్రశ్నిస్తే చిరునామా లేకుండా ట్వీటర్‌ సంస్థ ఖాతా తెరవదు కదా అని ప్రభుత్వ ప్లీడర్‌ సమాధానం. అది ఊరూపేరులేని ట్విటర్‌ ఖాతా కావచ్చు. ప్రపంచమంతటా అలాంటి నకిలీ ఖాతాలు ఉన్నపుడు ఆ సాకుతో కేసు పెట్టవచ్చు. తమకు నచ్చని లేదా లొంగని వారిని ఎలా వేధించే పరిస్థితి దేశంలో ఉందో ఈ ఉదంతం వెల్లడిస్తున్నది. అంతే కాదు ఒక చిన్న కేసును సంవత్సరాల తరబడి పరిష్కరించలేని అసమర్ధత మన పోలీసు శాఖలో ఉందని ఎవరన్నా అన్నా ఉడుక్కోనవసరం లేదు. అనేక పాత సినిమాలు, విమర్శనాత్మక గ్రంధాలలో అనేక అంశాలు ఉన్నాయి. అవి మా మనోభావాలను దెబ్బతీశాయని కేసులు పెడతారా ? వాటన్నింటినీ విచారిస్తారా ? ఎక్కడికి పోతున్నదీ అసహనం ? దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నామని పాలకులు చెప్పేదానికి అర్ధం ఇదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

రష్యా, చైనాలపై దాడే 48వ జి7 శిఖరాగ్ర సభ లక్ష్యం !

30 Thursday Jun 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

48th G7 summit, G7 summit 2022, Joe Biden, Narendra Modi


ఎం కోటేశ్వరరావు


జూన్‌ 26 నుంచి 28వ తేదీ వరకు జర్మనీలోని బవేరియా ఆల్ఫ్స్‌ ప్రాంతంలోని ఎలమౌ కాజిల్‌ రిసార్ట్‌లో 48వ జి7 శిఖరాగ్ర సమావేశం జరిగింది. ” ధర్మ బద్ధ ప్రపంచం వైపు పురోగమనం ” అనే ఇతివృత్తంతో దీన్ని నిర్వహించారు. ఈ సభ కొనసాగింపుగా 29-30 తేదీల్లో స్పెయిన్లోని మాడ్రిడ్‌ నగరంలో నాటో కూటమి సమావేశాలను ఏర్పాటు చేశారు. జి7 సమావేశానికి మన ప్రధాని నరేంద్రమోడీతో పాటు అర్జెంటీనా, దక్షిణ ఆఫ్రికా, ఇండోనేషియా, సెనెగల్‌ దేశాధినేతలను కూడా ఆహ్వానించారు. ఎడతెగని, ఎప్పుడూ ఉండే,ఎవరూ పాటించని పర్యావరణం, ఉగ్రవాద నిరోధం, ఆహార భద్రత వంటి అంశాల గురించి ఈ సమావేశంలో సుభాషితాలను పక్కన పెడితే రెండు కీలక అంశాల మీద అమెరికా పెత్తనంలోని ఈ కూటమి కేంద్రీకరించిందని చెప్పవచ్చు. అవి రష్యా మీద మరిన్ని ఆంక్షలు, చైనాను నిలువరించే పధకాలు. ఉక్రెయిన్‌ మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్య ఐదవ నెలలో ప్రవేశించింది. ఇప్పటికే తూర్పున ఉన్న డాన్‌బాస్‌ ప్రాంతాన్ని, కీలక రేవులు, పారిశ్రామిక ప్రాంతాల నుంచి ఉక్రెయిన్‌ మిలిటరీ, దానితో కలసి ప్రతిఘటిస్తున్న కిరాయి మూకలను ఆ ప్రాంతం నుంచి రష్యా తరిమివేసింది. కొత్త ప్రాంతాలకు దాడులను విస్తరించింది.చమురు ఎగుమతులపై విధించిన ఆంక్షలు పెద్దగా ప్రభావం చూపకపోవటంతో బంగారం కొనుగోళ్లను నిలిపివేయాలని జి7 కూటమి పిలుపునిచ్చింది. దీంతో పాటు మరిన్ని ఆయుధాలను పంపాలని నిర్ణయించింది.


నవంబరులో జరిగే పార్లమెంటు ఎన్నికలలో అధికార డెమోక్రటిక్‌ పార్టీకి దెబ్బతగుల నుందన్న వార్తల నేపధ్యంలో లబ్దిపొందేందుకు జో బైడెన్‌ ఈ సమావేశాలను వినియోగించుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఒక అంశం మాత్రమే అని చెప్పవచ్చు. ఉక్రెయిన్‌ మిలిటరీ అనేక ప్రాంతాల నుంచి వెనుదిరుగుతున్న పూర్వరంగంలో అనేక దేశాలు పునరాలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నందున నాటో కూటమి, ఇతర దేశాలను నిలువరించేందుకు అమెరికా పూనుకుంది. రష్యా నుంచి బంగారం దిగుమతులపై నిషేధం కేవలం ఒక ప్రచార అస్త్రం తప్ప రష్యా మీద పెద్దగా ప్రభావం పడదని విశ్లేషకులు చెబుతున్నారు. గతేడాది 15.5బిలియన్‌ డాలర్ల మేరకు అక్కడి నుంచి ఎగుమతులు జరిగాయి. ప్రపంచంలో పదిశాతం( 2021లో 333.4 టన్నులు) బంగారాన్ని ఉత్పత్తి చేస్తూ రష్యా రెండవ స్థానంలో ఉండగా 370 టన్నులతో చైనా ప్రధమ స్థానంలో ఉంది.రష్యా నుంచి దిగుమతులు చేసుకొనే దేశాల్లో మనది కూడా ఒకటి. దాని ఎగుమతులపై నిషేధం వలన చమురు ధరలు పెరిగినట్లుగానే బంగారం ధరలు, వాటితో పాటు ద్రవ్యోల్బణం కూడా పెరగవచ్చు. చమురును ఇతర దేశాలకు ఎగుమతి చేసినట్లుగానే బంగారానికి కూడా మార్కెట్లను రష్యా చూసుకుంటుందని చెబుతున్నారు.


తాము సృష్టించిన ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని మరింత ఎగదోసేందుకు తప్ప పరిష్కరించేందుకు జి7 సమావేశం ఎలాంటి చొరవ చూపలేదు. రానున్న ఐదు సంవత్సరాల కాలంలో లాభాలు వచ్చే పధకాలపై పెట్టుబడులకు 600బిలియన్‌ డాలర్లు సేకరించాలని ఈ సమావేశం పిలుపునిచ్చింది తప్ప అనేక దేశాల్లో తలెత్తిన ఆకలి మంటల గురించి ధనిక దేశాలు పట్టించుకోలేదు. ఆసాధారణ ప్రపంచ ఆకలి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని, ప్రపంచ ఆహార మార్కెట్‌ను స్థిరంగా ఉండేట్లు చూడాలని, ధరల ఒడిదుడుకులను నివారించాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్రెస్‌ జి7 కూటమిని కోరారు. ప్రపంచ గోధుమ ఎగుమతుల్లో 29శాతం వాటా కలిగిన ఉక్రెయిన్‌, రష్యాల నుంచి ఎగుమతుల పునరుద్దరణకు ప్రభావశీలమైన పరిష్కారాన్ని కనుగొనకపోతే ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. నేతలు తమ ప్రసంగాల్లో ఆహార భద్రత గురించి ప్రస్తావించటం తప్ప నిర్దిష్ట చర్యలు లేవు. ఉక్రెయిన్‌ రేవుల్లో నిలిచిన రవాణా పునరుద్దరణ, తమ దేశం నుంచి ఎరువులు, ఆహార ధాన్యాల ఎగుమతులకు విధించిన ఆంక్షల ఎత్తివేతతో పాటు సముద్రాల్లో ఉక్రెయిన్‌ ఏర్పాటు చేసిన మందుపాతరలను తొలగించాలని రష్యా డిమాండ్‌ చేస్తోంది.


ప్రపంచంలో వివిధ దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆరువందల బిలియన్‌ డాలర్లు సేకరించాలని జి7 కూటమి నిర్ణయింది. ఈ మొత్తం చైనాను అడ్డుకొనేందుకు అని ఎక్కడా చెప్పకపోయినా దాని బిఆర్‌ఐ పధకాన్ని అడ్డుకొనేందుకే అని మీడియా పేర్కొన్నది. ప్రపంచ మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల కోసం భాగస్వామ్యం(పిజిఐఐ) అనే పేరుతో ఒక పధకాన్ని అమలు జరపాలని గతేడాది లండన్‌ సమావేశంలోనే ఒక పధకాన్ని ఈ కూటమి ప్రకటించింది. ఇప్పుడు 2027నాటికి ఆరువందల బిలియన్లతో ఒక నిధిని ఏర్పాటు చేయాలని సంకల్పం చెప్పుకున్నారు. ఇది చైనా 2013 నుంచి అమలు చేస్తున్న బిఆర్‌ఐ పధకానికి పోటీగా పరిగణిస్తున్నారు. ఇదేదో దయా-ధర్మం కాదు దీనిలో పెట్టుబడులు పెట్టిన వారందరికీ అమెరికన్లతో సహా అందరికీ ఫలితాలు ఉండాల్సిందే అని స్పష్టం చేస్తున్నా అని జో బైడెన్‌ చెప్పారు.అభివృద్ధి చెందుతున్న దేశాలలో అవసరమైన మౌలిక, ఆధునిక వసతుల కల్పనకు 40లక్షల కోట్ల డాలర్లు అవసరమని అంచనా. తాము 200 బిలియన్‌ డాలర్లు ఇస్తామని అమెరికా చెబుతుండగా తాము 317బి.డాలర్లు సమకూర్చుతామని ఐరోపా సమ్యాఖ్య పేర్కొన్నది.


అసలు జి 7 అంటే ఏమిటన్న ప్రశ్న కొంతమందికైనా తలెత్తటం సహజం.అమెరికా,జపాన్‌, కెనడా, నెదర్లాండ్స్‌తో తలెత్తిన వివాదంలో ఆ దేశాలకు చమురు సరఫరాలపై నిషేధం విధిస్తున్నట్లు ఒపెక్‌ దేశాలు చేసిన ప్రకటన 1973లో చమురు సంక్షోభానికి దారి తీసింది. దాన్నుంచి బయడపడేందుకు ధనికదేశాల ఆలోచన నుంచి పుట్టిందే జి7. చమురు, విత్త సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ధనిక దేశాలు ఉమ్మడిగా చేసిన ఆలోచనకు ఒక రూపమే 1975లో ఏర్పడిన ఈ దేశాల బృందం. నాటి ఫ్రెంచి అధ్యక్షుడు వాలెరీ గిస్కార్డ్‌, జర్మన్‌ ఛాన్సలర్‌ హెల్మట్‌ స్మిత్‌ చొరవతో పారిస్‌లో అమెరికా,బ్రిటన్‌,ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌ నేతలు తొలి సమావేశం జరిపారు.మరుసటి ఏడాది కెనడా, 1998లో రష్యా చేరింది. దాంతో అది జి8గా మారింది. 2014లో ఉక్రెయిన్‌ ఏలుబడిలో ఉన్న క్రిమియా ప్రాంతాన్ని రష్యా స్వాధీనం చేసుకోవటంతో ఆ బృందం నుంచి తొలగించిన తరువాత తిరిగి జి7గా మారింది.1981 నుంచి ఐరోపా సమాఖ్య(ఇయు)ను శాశ్వత ఆహ్వానిత సంస్థగా మార్చారు. ప్రతి సంవత్సరం ఒక సభ్యదేశ ఆతిధ్యంలో శిఖరాగ్ర సమావేశాలు జరుగుతాయి.సహజంగా ఆ దేశాధినేతలే ఏడాది పాటు అధ్యక్ష స్థానంలో ఉంటారు. ఈ బృందానికి ఒక కేంద్ర స్థానం లేదా శాశ్వత సిబ్బందిగానీ ఉండరు. ఇప్పటి వరకు గత ఎనిమిది సంవత్సరాల్లో నరేంద్రమోడీ మూడు సమావేశాల్లో పాల్గొన్నారు. అంతకు ముందు మన్మోహన్‌ సింగ్‌ పదేండ్ల కాలంలో ఐదు సార్లు అతిధిగా వెళ్లారు. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ప్రపంచ రాజకీయాలు, ఆర్ధిక రంగంలో మన దేశానికి ఉన్న ప్రాధాన్యత రీత్యా మన దేశానికి ప్రతిదేశం ఆహ్వానం పలుకుతోంది. గత ఎనిమిదేండ్లలో మూడు సార్లు ఆహ్వానించటం నరేంద్రమోడీ ఘనత అన్నట్లు కొందరు చిత్రిస్తున్నారు.


ఉక్రెయిన్‌ సంక్షోభం తలెత్తిన తరువాత రష్యా సైనిక చర్యను ఖండించటమా లేదా అన్న అంశంపై ప్రపంచ దేశాలు మూడు శిబిరాలుగా మారాయి. ఒకటి అమెరికా బాటలో ఖండించే, రెండవది రష్యాను సమర్ధించే, మూడవది తటస్థంగా ఉండే దేశాలు. మనది, చైనా మూడవ తరగతిలో ఉన్నాయి. ఖండించని దేశాలన్నీ రష్యాను సమర్ధించినట్లేనని అమెరికా కూటమి చిత్రిస్తోంది. జర్మనీ సభకు భారత్‌ను ఆహ్వానించటం గురించి అమెరికా జాతీయ భద్రతా మండలి సమన్వయకర్త జాన్‌ కిర్బీ మాట్లాడుతూ లోతైన, భిన్నమైన అజెండా ఉన్న కారణంగానే భారత్‌ను ఆహ్వానించారు తప్ప రష్యా నుంచి వేరు చేసేందుకు కాదన్నారు. ఆహ్వానించాలా లేదా అని జర్మనీ మల్లగుల్లాలు పడినట్లు వార్తలు వచ్చాయి తప్ప నిజానికి అందుకే పిలుస్తున్నట్లు ఎవరూ ఎక్కడా చెప్పలేదు. కానీ అమెరికా ప్రతినిధి కడుపు ఉబ్బరాన్ని ఆపుకోలేక అంతరంగాన్ని మరో రూపంలో వెల్లడించాడు. ఇతివృత్తం ఒకటైతే నిజానికి అక్కడ జరిగిన ప్రధాన చర్చ అంతా చైనా, రష్యాలను దెబ్బతీయటం ఎలా అన్నదాని చుట్టూనే తిరిగింది. ఆర్ధిక స్థిరత్వం, మార్పు, ప్రపంచ ఆరోగ్యమెరుగుదల, ప్రపంచ పర్యావరణ రక్షణ, నిరంతర పెట్టుబడుల వంటి వన్నీ మాయపుచ్చే అంశాలే. ప్రపంచ చట్టబద్ద సంస్థలు చేసిన నిర్ణయాలు, లక్ష్యాలనే ఈ దేశాలు ఖాతరు చేయటం లేదు. తొలి రోజు సమావేశంలో రష్యా చమురు ధరలను ఎలా అదుపు చేయాలన్న అంశం మీద, ఉక్రెయినుకు మరిన్ని ఆయుధాలిచ్చి ఎలా నిలబెట్టాలా అన్నదాని మీద కేంద్రీకరించారు తప్ప తమతో సహా అనేక దేశాలను అతలాకుతలం చేస్తున్న ద్రవ్యోల్బణాన్ని పట్టించుకోలేదు. గోధుమలపై మన దేశం నిషేధం విధించినపుడు పశ్చిమ దేశాలు విమర్శించాయి, తరువాత దాన్ని పంచదారకు పొడిగించారు. మోడీ జర్మనీ వెళుతుండగా బియ్యం ఎగుమతులపై నిషేధ ఆలోచన ఉన్నట్లు వార్తలొచ్చాయి.


ఇప్పటి వరకు జరిగిన సమావేశాల్లో మన ప్రధానులు తొమ్మిది సార్లు అతిధులుగా పాల్గొన్నారు.అతిధులుగా వెళ్లిన వారు ఎవరైనప్పటికీ ధర్మోపన్యాసాలు చేయటం, ఆతిధ్యాన్ని పుచ్చుకోవటం తప్ప అజెండాను నిర్ణయించే అవకాశం ఉండదు. హాజరైన దేశాధినేతలు, సంస్థల ప్రతినిధులతో తాను అభిప్రాయ మార్పిడి చేసుకుంటానని జర్మనీ వెళ్లే ముందు ప్రధాని నరేంద్రమోడీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కూటమి దేశాల నేతలు ఒక వైపు ఇలాంటి శిఖరాగ్ర సమావేశాల్లో గొప్ప ప్రకటనలు చేస్తూనే మరోవైపు తమ స్వంత అజెండాలతో వివిధ దేశాలతో వ్యవహరించటం తెలిసిందే. ఇతర దేశాల మీద దాడులు, ఆరోపణలు, తప్పుడు ప్రచారం చేయటంలో దాదాపు అన్నీ ఒక గూటి చిలుకలుగానే ఉంటాయి. ఉక్రెయిను సంక్షోభం గురించి ఈ బృందనేతలు మాట్లాడుతున్న సమయంలో మన ప్రధానిగా ఎవరున్నా మౌన ప్రేక్షుకుడిగా ఉండటం లేదా ఏదో ఒకమిషతో వెలుపలికి రావాల్సిందే తప్ప మన వైఖరిని వెల్లడించే లేదా సమర్ధించుకొనే అవకాశం ఉండదు. అమెరికా దేశాల శిఖరాగ్ర సమావేశానికి వెనెజులా, క్యూబాలను మినహాయించిన అమెరికా దుశ్చర్యను అర్జెంటీనా అధ్యక్షుడు అల్బర్టో ఫెర్నాండెజ్‌ ఆ సమావేశంలో సభ్య హౌదాలో ఉతికి ఆరేశారు. అదే జి7 సమావేశంలో ఆహ్వానితుడిగా ఉన్నందున ఆ విధంగా మాట్లాడలేరు. ఎవరికైనా ఈ పరిమితులు ఉంటాయి. ఉక్రెయిను వివాదంలో మన దేశాన్ని తమవైపు తిప్పుకొనేందుకు అమెరికా కూటమి ఎప్పటికప్పడు గాలాలు వేస్తూనే ఉంటుంది.చైనాను బూచిగా చూపి మనలను తమవైపు తిప్పుకొనేందుకు చేయని యత్నం లేదు. వర్తమాన రాజకీయ అంశం ఉక్రెయిన్‌ వివాదంలో పశ్చిమ దేశాలతో చేతులు కలపకపోయినా మిగతా అంశాలలో మీతోనే ఉంటామనే సందేశాన్ని ఇప్పటికే నరేంద్రమోడీ సర్కార్‌ ఇచ్చింది. దాని కొనసాగింపుగానే ఈ సమావేశానికి హాజరైనట్లు చెప్పవచ్చు.


జర్మనీ జి7 సమావేశాల్లో నరేంద్రమోడీని అమెరికా అధినేత జో బైడెన్‌ పలుకరించిన తీరును మీడియా ప్రత్యేకంగా చూపింది. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడేవ్‌తో మాట్లాడుతుండగా వెనుక నుంచి వచ్చి నరేంద్రమోడీ భుజం తట్టి మరీ జో బైడెన్‌ పలుకరించారు. ఇది నరేంద్రమోడీ ఘనతగా చిత్రిస్తున్నారు.మన దేశాన్ని తమ కూటమిలో చేర్చుకొనేందుకు ఎలాంటి గాలం వేస్తారో డోనాల్డ్‌ ట్రంప్‌ తీరు తెన్నులు వెల్లడించాయి.జి 7 కూటమి కాలం చెల్లిన దేశాలతో ఉంది, దాన్ని విస్తరించాలని ట్రంప్‌ ఒకసారి చెప్పాడు.ఆస్ట్రేలియా,భారత్‌, దక్షిణ కొరియా, రష్యాలతో విస్తరించాలని అందుకే 2020 సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు చెప్పాడు. నరేంద్రమోడీకి ఫోన్‌ చేసి మరీ ఆహ్వానం పలికాడు. నిజమే అనుకొని మన దేశం జి7లో చేరినట్లుగానే కొందరు కలలు కన్నారు. అమెరికా తరువాత పెద్ద ఆర్ధికశక్తిగా ఉన్న చైనాను పక్కన పెట్టి ధనికదేశాల బృందాన్ని విస్తరించటం అంటే అది చైనాను కట్టడి చేసేందుకే అన్నది స్పష్టం. ఇప్పుడు జి7 సమావేశానికి వెళ్లి సాధించిందేమిటో నరేంద్రమోడీ దేశానికి చెప్పాల్సి ఉంటుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !

25 Saturday Jun 2022

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Adani Coal, Ambani and Adani, Ambani’s Reliance, BJP, Narendra Modi


ఎం కోటేశ్వరరావు


ఎవ్విరిబడీ లవ్స్‌ ఏ గుడ్‌ డ్రాట్‌ ( మంచి కరువును ప్రతివారూ ప్రేమిస్తారు) అనే పేరుతో ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి శాయినాధ్‌ పాతికేండ్ల క్రితం రాసిన పరిశోధనాత్మక కధనాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. అవి నిత్య సత్యాలు. వర్తమానంలో కొనసాగుతున్న ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని చూసిన తరువాత ” మంచి యుద్ధాన్ని ప్రేమిస్తారు ” అనే పేరుతో విశ్లేషణలు రాయవచ్చు. ఉక్రెయిను మీద సైనిక చర్య జరుపుతున్న రష్యా మీద తాము విధించిన ఆంక్షలను భారత్‌ ఖాతరు చేయటం లేదని అమెరికా, ఐరోపా ధనిక దేశాలు గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. వలలో పడుతుందనుకున్న పిట్ట జారిపోయిందని ఆశాభంగం చెందినట్లుగా మింగలేక కక్కలేక ఎప్పటికైనా తిరిగి పడకపోతుందా అన్నట్లుగా వలలు పన్ని ఎదురు చూస్తున్నాయి.


ప్రతిదేశ రాజకీయ వైఖరుల వెనుక ఆ దేశ పాలకవర్గాల ఆర్ధిక ప్రయోజనాలుంటాయన్నది జగమెరిగిన పచ్చినిజం.అమెరికాను శాసించే సంస్థల్లో ఒకటైన అమెజాన్‌ కంపెనీ సిఇవో బెజోస్‌ భారత్‌ వచ్చినపుడు నరేంద్రమోడీ కలుసుకొనేందుకు ఇష్టపడలేదు. విదేశాలకు వెళ్లి మరీ పెద్ద పీటవేసి పెట్టుబడులను ఆహ్వానించినట్లు చెప్పుకున్న మోడీ ఏకంగా మన దేశానికి వచ్చిన అమెజాన్‌ అధిపతి పట్ల అలా ఎందుకు వ్యవహరించినట్లు ? అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం ఏమంటే అమెజాన్‌ కంపెనీ తన జియోకు ఎక్కడ పోటీ వస్తుందో, ఎలా మింగివేస్తుందో అని ముకేష్‌ అంబానీ భావించటమే. తరువాత జరిగిన అనేక పరిణామాలు దీన్నే నిర్ధారించాయి. తమకు అనుకూలంగా మోడీ సర్కార్‌ ఉంది కనుక అంబానీ మీడియా నరేంద్రమోడీకి భజన చేస్తుంటే అమెజాన్‌ కంపెనీకి అవకాశం ఇవ్వటం లేదు గనుక అదే కంపెనీకి చెందిన వాషింగ్టన్‌ పోస్టు పత్రిక విమర్శనాత్మకంగా ఉంది, మోడీ సర్కార్‌ను విమర్శిస్తూ రాస్తున్నది. ఉక్రెయిన్‌ వివాదంలో కూడా అమెరికా మీడియా మొత్తంగా అదే చేస్తున్నది. ఇక ఉక్రెయిన్‌ సంక్షోభం ముకేష్‌ అంబానీకి ” మంచి యుద్ధం ” గా మారి లాభాలు కురిపిస్తున్నదంటే చాలా మంది నమ్మకపోవచ్చు గానీ ఇది పచ్చినిజం.


అమెరికా ఆంక్షలను ధిక్కరించి రష్యా నుంచి చౌకధరలకు మన దేశం కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్న ముడి చమురు వివరాలను చూస్తే అసలు కధ ఏమిటో అర్ధం అవుతుంది. మన దేశం రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న చమురు ఏప్రిల్‌ నుంచి 50 రెట్లు పెరిగింది. ఈ చమురులో 69శాతం రిలయన్స్‌, నయారా వంటి సంస్థలే దిగుమతి చేసుకుంటున్నట్లు వార్తలు.ప్రభుత్వ లేదా ప్రయివేటు సంస్థలు ఏవి దిగుమతి చేసుకున్నా దిగుమతి ఖర్చు తగ్గినపుడు జనాలకు ఆమేరకు తగ్గాలి. అలా తగ్గటం లేదు ఎందుకని ? రిలయన్స్‌, నయారా తదితర ప్రైవేటు బంకుల్లో చమురు విక్రయాలు దాదాపు లేవు, ఎక్కడైనా తెరిచి ఉంచినా కొనుగోలు చేసే వారు కూడా ఉండరు. మరి దిగుమతి చేసుకున్న చమురును శుద్దిచేసి ఏమి చేస్తున్నట్లు ? విదేశాలకు, అమెరికా, ఆఫ్రికా, ఐరోపాకు ఎగుమతి చేసి లాభాలు పోగేసుకుంటున్నాయి.


రాయిటర్స్‌ వార్తా సంస్థ జూన్‌ ఒకటవ తేదీ కధనం ప్రకారం 2021 తొలి ఐదు నెలల్లో మన దేశం ఎగుమతి చేసిన చమురు ఉత్పత్తుల కంటే ఈ ఏడాది అదే కాలంలో 15 శాతం పెరిగినట్లు కెప్లర్‌ సంస్థ సమాచారం వెల్లడించింది. ఒక లీటరు డీజిలు మీద రు.20, పెట్రోలు మీద రు.17 నష్టం వస్తున్నందున ప్రయివేటు చమురు శుద్ధి సంస్థలు మార్కెటింగ్‌ను గణనీయంగా తగ్గించాయి. శ్రీలంక పరిణామాలను చూసిన తరువాత ధరల పెరుగుదలతో ప్రభుత్వం మీద జనంలో అసంతృప్తి తలెత్తుతుందనే భయంతో కేంద్ర ప్రభుత్వం కొంత మేరకు పన్ను తగ్గించటంతో పాటు ఏప్రిల్‌ ఆరు నుంచి ధరల సవరణను స్థంభింపచేసింది. రిలయన్స్‌ కంపెనీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న శుద్ధి కర్మాగారాన్ని వార్షిక నిర్వహణలో భాగంగా కొంతకాలం మూసి పనులు చేపట్టాలని భావించింది.అలాంటిది ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా అందుబాటులోకి వచ్చిన చౌక ధర రష్యా చమురు కారణంగా నిర్వహణ పనులను వాయిదా వేసి శుద్ది కొనసాగిస్తూ ఎగుమతులతో లాభాలను పొందుతున్నది. ఆ సంక్షోభం ఎంతకాలం కొనసాగితే అంతకాలం లాభాలే లాభాలు. మన దేశం కొనుగోలు చేసే ధరల కంటే పీపాకు 30 డాలర్ల వరకు రష్యా రాయితీ ఇస్తున్నది. మరో ఆరునెలల పాటు ఒక నిర్ణీత ధరకు సరఫరా చేస్తారా అంటూ ఈ కంపెనీలు రష్యాతో ఇప్పుడు బేరమాడుతున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ తెలిపింది. అందుకే అంబానీకి ఇది మంచి యుద్ధంగా, జనానికి చెడుగా మారింది. ప్రధానంగా లబ్ది పొందుతున్నది రిలయన్స్‌, వచ్చే ఎన్నికల్లో ఆదుకొనే వాటిలో ఆ కంపెనీ ఒకటి గనుక అమెరికా బెదిరింపులను నరేంద్రమోడీ ఖాతరు చేయటం లేదని వేరే చెప్పనవసరం లేదు.

ఇటీవల మన దేశానికి చమురును సరఫరా దేశాల్లో రెండవ స్థానంలో ఉన్న సౌదీని వెనక్కు నెట్టేసి రష్యా రెండవ స్థానానికి చేరుకుంది. జర్మనీని రెండవ స్థానానికి నెట్టి చైనాకైతే మొదటిదిగా మారింది. అమెరికా, ఐరోపా దేశాలు విధించిన ఆంక్షల పర్యవసానాలు దీర్ఘకాలంలో ఎలా ఉంటాయో చెప్పలేము గానీ, ముడి చమురు ధరలు పెరిగిన కారణంగా రాయితీ ఇచ్చినప్పటికీ రష్యాకు లాభంగానే ఉంది. గత ఏడాది కంటే సగటున 60శాతం ధర పెరిగింది. ఈ స్థితిని అంచనా గట్టటంలో అమెరికా, పశ్చిమదేశాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఐరోపాకు 75శాతం ఇంధన ఎగుమతి తగ్గినప్పటికీ ధరల పెరుగుదల వలన రోజుకు పది కోట్ల డాలర్లు వస్తున్నట్లు, గతేడాదితో సమంగా ఉన్నట్లు అంచనా.ఉక్రెయిన్‌ సంక్షోభం తొలి వంద రోజుల్లో ( ఫిబ్రవరి 24 నుంచి జూన్‌ 3 వరకు) ఇంథన ఎగుమతుల ద్వారా రష్యా 98బి.యురోలను పొందింది. వాటిలో 61శాతం ఐరోపా దేశాల నుంచే ఉంది. దేశాల వారీ చూస్తే చైనా 12.6, జర్మనీ 12.1, ఇటలీ 7.8, నెదర్లాండ్స్‌ 7.8, టర్కీ 6.7, పోలాండ్‌ 4.4, ఫ్రాన్స్‌ 4.3, భారత్‌ 3.4, బెల్జియం బి.యురోల మేరకు దిగుమతి చేసుకున్నాయి. మన అవసరాల్లో రష్యా నుంచి దిగుమతులు ఫిబ్రవరి 24కు ముందు ఒకశాతం ఉంటే మే నెలలో 18శాతానికి పెరిగాయి. మన దేశం దిగుమతి చేసుకున్న ముడి చమురు నుంచి తయారు చేసిన ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.


అమెరికా వడ్డీరేట్లు పెంచటం, అక్కడ, ఇతర ధనిక దేశాల్లో మాంద్యం తలెత్తవచ్చనే అంచనాల వెల్లడితో ఇటీవల 124 డాలర్లకు చేరిన ప్రామాణిక బ్రెంట్‌ రకం ముడిచమురు ధర గత వారంలో 103 డాలర్లవరకు పడిపోయింది.జూన్‌ 24వ తేదీన 113 డాలర్లుంది. అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు వడ్డీ రేట్ల పెంపు వలన ప్రయోజనం ఉండదని, ఏడాది-ఏడాదిన్నరలో అక్కడ మాంద్యం తలెత్తవచ్చని అనేక మంది ఆర్ధికవేత్తలు హెచ్చరిస్తున్నారు. నవంబరులో జరిగే పార్లమెంటు ఎన్నికలలో ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు జో బైడెన్‌ కూడా చమురు పన్ను తగ్గించే ప్రతిపాదనలో ఉన్నట్లు వార్తలు. డాలరు విలువ పెరుగుతున్నందున చమురు దిగుమతి చేసుకొనే దేశాల మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపవచ్చని చెబుతున్నారు. దానికి నిదర్శనంగా మన రూపాయి విలువ పతనంలో ఇటీవల కొత్త రికార్డులను నెలకొల్పుతున్నది.


ఇక అదానీ కంపెనీల విషయానికి వస్తే నరేంద్రమోడీ సర్కార్‌ ఆస్ట్రేలియాలోని అదానీ బొగ్గు గనుల నుంచి దిగుమతులు చేసుకొనేందుకు అనువైన పరిస్థితిని కల్పించింది. అదానీకి మంచి రోజుల కోసమే ఇదంతా అన్నది స్పష్టం. మన దేశంలో 1,07,727 మిలియన్‌ టన్నుల మేరకు బొగ్గు నిల్వలున్నట్లు నిర్ధారణైంది. ప్రపంచంలో ఐదవ దేశంగా 9శాతం కలిగి ఉంది. వర్తమాన వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ నిల్వలు 111.5రెట్లు ఎక్కువ. ఇంత మొత్తం ఉన్నప్పటికీ బొగ్గు తవ్వకంలో నరేంద్రమోడీ సర్కార్‌ వైఫల్యం కారణంగా విదేశాల నుంచి దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌టిపిసి ఆస్ట్రేలియాలోని అదానీ కంపెనీ నుంచి పదిలక్షల టన్నుల బొగ్గు దిగుమతి ఒప్పందం చేసుకుంది. మరో సంస్థ డివిసి మరో పదిలక్షల టన్నుల దిగుమతికి సంప్రదింపులు జరిపింది. దిగుమతి చేసుకున్న బొగ్గుధర ఎక్కువగా ఉంది. అదానీ వంటి కంపెనీలకు లబ్ది కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకున్న బొగ్గును విధిగా దేశీయ బొగ్గుతో మిశ్రమం చేసిి వినియోగించాలని ఆదేశించింది. ఇది విద్యుత్‌ చార్జీల పెంపుదలకు దారి తీస్తున్నది. నరేంద్రమోడీ పాలనలో దేశీయ చమురు ఉత్పత్తి కూడా పడిపోయిన సంగతి తెలిసిందే.


కేంద్ర విద్యుత్‌ శాఖా మంత్రి ఆర్‌కె సింగ్‌ మే నెలలో అన్ని రాష్ట్రాలకు రాసిన లేఖలో విదేశీ బొగ్గు దిగుమతుల గురించి ఆదేశించారు.2022 అక్టోబరు వరకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు గాను రాష్ట్రాల విద్యుత్‌ ఉత్పత్తి కంపెనీలు, ప్రయివేటు సంస్థలకు షరతులు విధించారు. మే నెలాఖరులోగా వాటి అవసరాల్లో పదిశాతం దిగుమతులు చేసుకోని పక్షంలో జరిమానాగా తరువాత 15శాతానికి పెంచుతారు. జూన్‌ 15లోగా విదేశీ-స్వదేశీ బొగ్గును మిశ్రితం ప్రారంభించని పక్షంలో జరిమానాగా స్వదేశీ బొగ్గు కేటాయింపులో ఐదుశాతం కోత విధిస్తారు. దేశంలోని 173 విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలలో సగటున ఏడు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలులేని స్థితిలో ఈ ఆదేశాలను జారీ చేశారు.97 కేంద్రాలలో ఏడు రోజుల కంటే తక్కువ, 50 కేంద్రాలలో నాలుగు రోజుల కంటే తక్కువ, కొన్నింటిలో ఒక రోజుకు సరిపడా నిల్వలున్నట్లు పేర్కొన్నారు. మొత్తం విద్యుత్‌ కేంద్రాలలో కేవలం 18 మాత్రమే బొగ్గుగనుల సమీపంలో(ఉదా: కొత్తగూడెం) ఉండగా 155 కేంద్రాలు 500 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?

20 Monday Jun 2022

Posted by raomk in Uncategorized

≈ Leave a comment

Tags

Agnipath, Agnipath stir, BJP, Narendra Modi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


అగ్నిపథ్‌ పధకాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దాని మీద నిరసనలు తలెత్తటంతో సమర్ధించేందుకు మిలిటరీ అధికారులను దించింది. ఇది ఒక ప్రమాదకర సాంప్రదాయం.మనది పాకిస్థాన్‌, ఇతర అనేక దేశాల మాదిరి మిలిటరీ కనుసన్నలలో నడిచే ప్రభుత్వం కాదు. ఈ పధకం మిలిటరీ రూపొందించింది తప్ప తమది కాదు అని తప్పుకొనేందుకా అన్నట్లుగా ప్రధాని, సంబంధిత శాఖ మంత్రి ఇంతవరకు స్పష్టమైన ప్రకటనతో దేశం ముందుకు రాలేదు. పరోక్షంగా సుభాషితాలు పలుకుతున్నారు. ఈ పధకంతో మిలిటరీ ఎంపికలో సమూల మార్పులు చేశారు. ఇదేమీ రహస్యం కాదు. విద్యుత్‌ సంస్కరణల ప్రతిపాదనల మాదిరి. ముందుగానే ప్రతిపాదనలను బహిరంగంగా విడుదల చేసి అభిప్రాయాలను తీసుకోవచ్చు.


ఈ పధకం గురించి వివరించేందుకు గాను మంగళవారం నాడు త్రివిధ దళాధిపతులు ప్రధాని నరేంద్రమోడీని కలవనున్నారని వార్తలు. ఈ పధకాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన తరువాతనే జూన్‌ 14న ప్రకటించారు. ఇలాంటి కీలకాంశం గురించి ముందుగా ప్రధానికి వివరించకుండానే ఇదంతా జరుగుతుందంటే ఎవరైనా నమ్ముతారా ? ఒకవేళ అదే జరిగితే నిరసన తలెత్తిన వెంటనే దీని సంగతేమిటని ప్రధాని అడిగి ఉండాలి కదా ! ముందే తెలిపి ఉంటే ఇప్పుడు కొత్తగా చెప్పేదేమిటి ? ఈ పధకం ప్రకటనతో తలెత్తిన శాంతిభద్రతల సమస్య గురించైతే అది మిలిటరీ అధికారులకు సంబంధం లేదు, హౌంశాఖ మంత్రి, ప్రతినిధులు వివరించాలి.తగిన కసరత్తు, ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా తీసుకొనే సంస్కరణలు దేనికి దారితీస్తాయో పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి, మూడు సాగు చట్టాల తీరుతెన్నులను చూశాము. అందుకే నష్టనివారణ చర్యగా ఈ తతంగం జరుగుతోందా అనే సందేహాలు కలగటం సహజం.


ఈ పధకానికి నిరసనగా సోమవారం నాడు భారత బంద్‌కు మిలిటరీ ఎంపికకు సిద్దం అవుతున్నవారు పిలుపుఇచ్చినట్లు వార్తలు.దాంతో ముందు జాగ్రత్త చర్యగా దేశమంతటా ఐదు వందలకు పైగా రైళ్లను రద్దు చేశారు. ఝార్కండ్‌లో స్కూళ్లను మూసివేశారు. ఢిల్లీ వంటి చోట్ల పోలీసుల అతి కారణంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడింది. హర్యానాలో రెండు జిల్లాల్లో కోచింగ్‌ సెంటర్ల మూసివేతకు ఆదేశించారు. ఈనెల 24న నిరసన తెలుపున్నట్లు రైతు నేత రాకేష్‌ తికాయత్‌ ప్రకటించారు. సోమవారం నాడు బంద్‌ ఎలా జరిగిందన్నది ప్రశ్న కాదు. ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తిందన్నదే కీలకం. ఒక్కటి మాత్రం స్పష్టం.అగ్నిపథ్‌ పధకం సంగతేమో గానీ దాని కింద శిక్షణ పొందిన వారు అగ్నివీరులమని చెప్పుకొనేందుకు సిగ్గుపడతారు. ఆ పధకం కింద ఎంపికైన వారికి మిలిటరీ శిక్షణలో భాగంగా ఇతర అంశాలతో పాటు బట్టలుతకటం,క్షౌరం చేయటం, చౌకీదార్లుగా నైపుణ్యం కల్పిస్తారట. ఇక ఈ పధకం గురించి విమర్శల వెనుక టూల్‌కిట్‌ గాంగ్‌ ఉందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్‌ విజయవర్గీయ ఆరోపించారు. మరి ఆ గాంగ్‌ చిరునామా ఏమిటో వారి మీద కేంద్రం, బిజెపి పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేమిటో తెలీదు. ఒక వేళ అలాంటి గాంగ్‌ ఉంటే వారు రూపొందిస్తున్న టూల్‌కిట్లకు టూల్స్‌ సరఫరా చేస్తున్నది బిజెపి నేతలే. విమర్శించేవారు చెప్పేది స్పష్టంగా ఉంది. సమర్ధిస్తూ మాట్లాడేవారే అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నారు. రైతు ఉద్యమం సందర్భంగా దిశ రవి అనే యువతి మీద కేంద్ర ప్రభుత్వం టూల్‌ కిట్‌ కేసు పెట్టి దేశద్రోహానికి పాల్పడినట్లు ఆరోపించి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రైతుల ఆందోళనకు సంబంధించిన సమాచారాన్ని ఒక చోట చేర్చి సామాజిక మాధ్యమంలో అందుబాటులో ఉంచటాన్నే టూల్‌కిట్‌గా వర్ణించారు.


తమ ఆఫీసులకు అవసరమైన భద్రతా సిబ్బంది నియామకంలో అగ్నివీరులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పింది కైలాష్‌ విజయవర్గీయ. ఆ పెద్దమనిషి ఆరుసార్లు ఎంఎల్‌ఏగా, పన్నేండ్లు మంత్రిగా పని చేసి ఇప్పుడు వారసత్వంగా కుమారుడు ఆకాష్‌ను ఎంఎల్‌ఏ చేశారు తప్ప బిజెపి ఆఫీసులో చౌకీదారుగా నియమించలేదు. నోటికొచ్చినట్లు మాట్లాడటం కైలాష్‌కు కొత్తేమీ కాదు. స్వంత రాష్ట్రమైన మధ్య ప్రదేశ్‌లో బిజెపి నేత లక్ష్మీకాంత శర్మ వంటి వారి ప్రమేయ ఉన్న వ్యాపం కుంభకోణం గురించి విలేకర్లు అడిగితే అది మీకు పెద్దది కావచ్చు గాని మాకు చిన్న కుంభకోణం అని సెలవిచ్చారు. దాని గురించి వివరాలు సేకరిస్తున్న జర్నలిస్టు అక్షయ సింగ్‌ అనుమానాస్పద స్థితిలో మరణించటం గురించి అడిగితే మరణించిన ఆ జర్నలిస్టును మరచిపోండి, నాకంటే అతను ముఖ్యమా అని ఎదురు ప్రశ్నించారు. అంతేనా దేశంలో జరుగుతున్న మానభంగాల గురించి అడిగితే మహిళలు వారి హద్దుల్లో వారు లేకపోతే పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని సెలవిచ్చారు. ఇండోర్‌ నగరంలో ఒక పాతభవన కూల్చివేతను పర్యవేక్షిస్తున్న ఒక అధికారిని కుమారుడు ఆకాష్‌ హాకీ బాట్‌తో కొట్టటాన్ని సమర్ధించి తన పుత్ర ప్రేమను చాటుకున్నారు. వివాదాస్పద మాటలతో ఎప్పుడూ జనం నోళ్లలో నానుతున్న కైలాష్‌ అగ్నివీరులను బిజెపి ఆఫీసులో చౌకీదార్లుగా పెడతామని చెప్పటంలో ఆశ్చర్యం ఏముంది !


దేశం కోసం ప్రాణాలర్పించేందుకు సిద్దపడి మిలిటరీలో చేరేందుకు సిద్దపడుతున్న వారిని కించపరిచేలా ఉన్న తన వ్యాఖ్యలు దుమారం రేపటంతో తన మాటలను టూల్‌కిట్‌ గాంగ్‌ వక్రీకరించిందని ఎదురుదాడికి దిగారు. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం కైలాష్‌ ఇలా మాట్లాడారు.” నేను గనుక బిజెపి ఆఫీసులో భద్రతా సిబ్బందిని పెట్టాల్సి వస్తే అగ్నివీరులకు ప్రాధాన్యత ఇస్తా, మీరు కూడా చేయవచ్చు. నా స్నేహితుల్లో ఒకరు 35 ఏండ్ల రిటైర్డ్‌ మిలిటరీ వ్యక్తిని సెక్యూరిటీ గార్డుగా పెట్టుకున్నారు, అతని మీద తనకు నమ్మకం ఉందని చెప్పారు. అతను సైనికుడు కాబట్టి తాను భయపడలేదని చెప్పారు.దీని అర్ధం ఏమిటి సైనికుడు అంటే ఆత్మవిశ్వాసం ” అని కైలాష్‌ చెప్పారు. దీని మీద విమర్శలు తలెత్తటంతో వివరణ ఇచ్చుకుంటూ అంతకు ముందు చెప్పినదాన్ని సమర్ధించుకున్నారు.” అగ్ని పథ్‌ పధకం కింద శిక్షణ పొందిన అగ్నివీరులు తమ సర్వీసు పూర్తి చేసిన తరువాత వారు తప్పనిసరిగా నైపుణ్యం పొందుతారు, తమ విధుల పట్ల అంకిత భావంతో ఉంటారు. మిలిటరీలో తమ సేవ పూర్తైన తరువాత ఎంచుకునే రంగాలలో ఈ నైపుణ్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇదీ నేను చెప్పదలచుకున్నది. టూల్‌కిట్‌ ముఠాలతో సంబంధం ఉన్న నా మాటలను వక్రీకరించి శ్రమజీవులను కించపరిచేందుకు చూస్తున్నారు. ఇది ఈ దేశ కర్మవీరులకు అవమానం.రాష్ట్ర వీరులు-ధర్మవీరులకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న ఈ టూల్‌కిట్‌ ముఠా గురించి దేశానికి బాగా తెలుసు.” అన్నారు.నైపుణ్యం, అంకిత భావం ఒక్క మిలిటరీకేనా, ఇతర పౌరసేవల్లో ఉన్నవారికి అవసరం లేదా ?


దేశ యువతను అవమానించవద్దని ఢిల్లీ సిఎం అరవింద కేజరీవాల్‌ అన్నారు. వారు దేశం కోసం పని చేసేందుకు సిద్దం అవుతున్నారు తప్ప బిజెపి ఆఫీసు వెలుపల చౌకీదార్లుగా పనిచేసేందుకు కాదు అన్నారు. 2019లో నేను కూడా చౌకీదారునే అనే బిజెపి ప్రచారం అర్ధం ఏమిటో ఇప్పుడు కైలాష్‌ మాటలద్వారా బోధపడిందని కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ చమత్కరించారు.బిజెపి ఎంపీ వరుణ్‌ గాంధీ కూడా విమర్శించారు. మిలటరీ అంటే దేశసేవ కోసం తప్ప కేవలం ఉపాధికోసం కాదన్నారు. కేంద్ర టూరిజం మంత్రి జి కిషన్‌రెడ్డి కూడా అగ్నివీరుల గురించి అనుచితంగానే మాట్లాడారు.” అగ్ని వీరులకు ఇతర అంశాలతో పాటు ఎలక్ట్రీషియన్లుగా, డ్రైవర్లుగా, బట్టలుతికేవారిగా, క్షురకులుగా అన్ని రకాల శిక్షణ ఇస్తారు.” అన్నారు. నైపుణ్య శిక్షణ పేరుతో కార్యక్రమం ఉంది కదా అన్న విలేకర్ల ప్రశ్నకు మిలటరీలో శిక్షణ ఇవ్వకూడదా అని ఎదురు ప్రశ్నించారు. ఈ పన్లు చేసేందుకు మిలటరీలో చేరాలా అనే ప్రశ్న ఎదురవుతుందనే విచక్షణ బిజెపి నేతలకు లేకపోయింది. బట్టలుతికేందుకు మిషన్లున్నాయి. మిలిటరీ, పోలీసు క్రాఫ్‌లు చేసేందుకు నిజానికి పెద్ద నైపుణ్యంతో పనేముంది.


2018 ఏప్రిల్‌ 22న ఢిల్లీలో బిజెపి ఎంపీలు, ఎంఎల్‌ఏల సమావేశంలో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన హితవచనాలను ఆ పార్టీ నేతలు మరిచినట్లున్నారు. పార్టీ అధికారిక ప్రతినిధి నూపుర్‌ శర్మ చిల్లర మాటలు మాట్లాడి విధిలేని స్థితిలో సస్పెన్షకు గురైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అగ్నిపథ్‌ పధకం మీద యువత ఆగ్రహించినపుడు ఆ పార్టీ నేతలు తమ నోటి తుత్తరను ప్రదర్శించారు. ఐదు సంవత్సరాల క్రితం నరేంద్రమోడీ చెప్పిందేమిటి? ” మన మీడియాకు మసాలాను ఇస్తున్నాం. కెమెరాలను చూడగానే మనమేదో పెద్ద సామాజిక శాస్త్రవేత్తలం లేదా మేథావులం అన్నట్లుగా ప్రకటనలు చేసేందుకు దూకుతాం. తరువాత చెరుపు చేసే ప్రకటనలను ఉపయోగించుకొని మన పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు మీడియా చూస్తుంది. ఇది మీడియా తప్పుకాదు. ” అన్నారు. బహుశా ఈ కారణంగానే ఎన్ని విమర్శలు వచ్చినా ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రధానిగా మోడీ విలేకర్ల సమావేశం నిర్వహించలేదు.


భారత్‌ బంద్‌ పిలుపుకు సైతం దారి తీసిన అగ్నిపథ్‌ పధకాన్ని నరేంద్రమోడీ సమర్ధించారు. సోమవారం నాడు బెంగళూరులో మాట్లాడుతూ అనేక నిర్ణయాలు, సంస్కరణలు తొలుత అనుచితంగానే కనిపించవచ్చు.తరువాత అవి జాతి నిర్మాణానికి తోడ్పడతాయి. రోజులు గడిచే కొద్దీ ఆ సంస్కరణలతోనే దేశం లబ్ది పొందుతుంది. సంస్కరణల బాట మనలను నూతన లక్ష్యాలు, కర్తవ్యాలవైపు తీసుకుపోతుంది అన్నారు. 1990 నుంచి అమలు జరుపుతున్న సంస్కరణలు దేశం అంటే జనానికి చేసిన లబ్ది ఏమిటన్నది బ్రహ్మ పదార్ధం. వాటిని మరింత వేగంగా అమలు జరుపుతున్నట్లు ప్రధాని గతంలో చెప్పారు. ఈ ఎనిమిదేండ్లలో అవిచ్చిన ఫలితాల కంటే దుష్ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. అందువలన ఇలాంటి సుభాషితాలను నమ్మే స్థితి నుంచి జనం క్రమంగా బయటపడుతున్నారు. దానికి ప్రతిరూపమే అగ్నిపథ్‌ పధకంపై తలెత్తిన నిరసన. ఆ పధకాన్ని ఎలా సమర్ధించుకోవాలో అర్ధం గాక బిజెపి నేతలు రెచ్చగొట్టే-కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు. దేశభక్తి, క్రమశిక్షణ పేరుతో నోరు మూయించాలని చూస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చిల్లర గాళ్ల దురుసు మాటలు – నోరు విప్పని నరేంద్రమోడీ !

10 Friday Jun 2022

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized, Women

≈ Leave a comment

Tags

BJP, Fringe elements, Narendra Modi, Narendra Modi Failures, Nupur Sharma, Qatar, RSS

ఎం కోటేశ్వరరావు


బిజెపి నాయకురాలు, ఓ ఇప్పుడు మాజీ అంటున్నారు కదా ! కానీ పార్టీ వారు సస్పెన్షన్‌ అన్నారు తప్ప బహిష్కరించలేదు కనుక ఆమెను ఇంకా ఆ పార్టీనేతగానే చూడాలి. ఆమె అంటే నూపుర్‌ శర్మ, మహమ్మద్‌ ప్రవక్త గురించి మాట్లాడిన మాటలు ఫ్రింజ్‌ ఎలిమెంట్స్‌వి తప్ప పార్టీ వైఖరి కాదు అని బిజెపి చెప్పుకుంది. క్రమశిక్షణకు గురైన వారు అలాంటి వారా కాదా అన్నది ఎక్కడా చెప్పలేదు. అసలు ఫ్రింజ్‌ అంటే ఏమిటి ? నిఘంటువులో వివరించినదాని ప్రకారం కొంగు, అంచు, జాలరు, పట్టిక అని ఉంది. సులభంగా చెప్పుకోవాలంటే చీర అంతా ఒకటిగా ఉండి-కొంగులు మరొక విధంగా ఉండటం తెలిసిందే కదా. కొంగును చూసి అదే చీర అనుకోవద్దు అని బిజెపి చెబుతోంది.


ఫ్రింజ్‌ ఎలిమెంట్స్‌ అంటే మరికొన్ని అర్ధాలు కూడా ఉన్నాయి. సూది కోసం సోదికి పోతే పాత బండారమంతా బయటపడిందన్నట్లుగా నూపుర్‌ శర్మ ఉదంతం తరువాత బిజెపి, దాని మాతృసంస్థ సంఘపరివార సంస్థల నేతల మాటలన్నింటినీ అడిగిన వారందరికీ గూగులమ్మతల్లి టూల్‌కిట్లుగా అందిస్తోంది. ఆమె వంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారని చెబుతోంది. ఇంతకూ గూగుల్‌ మతం ఏమిటి? ఈ చర్చ-సమాచారం కూడా రెచ్చిపోతున్న మెజారిటీ-మైనారిటీ మతోన్మాదశక్తుల గురించి ఎంత మందికి జ్ఞానోదయం కలిగిస్తుందో చెప్పలేము గానీ కొందరిలోనైనా ఆలోచన రేకెత్తిస్తుంది. ఫ్రింజ్‌ ఎలిమెంట్స్‌ అంటే తీవ్రవాదులు, ఆచారవిరోధులు, ఎడ్డెమంటే తెడ్డెమనే బాపతు వంటి వివరణలు ఉన్నాయి. అంతే కాదు తెలుగు ప్రాంతాల్లో వాడుకలో ఉన్న అమాంబాపతు, చిల్లరగాండ్లు, అణాకానీ స్వభావం, నోటితుత్తర, నోటి దూలను ప్రదర్శించేవారు ఇదే కోవకు చెందుతారు. బిజెపి చర్యతీసుకున్న నూపుర్‌శర్మ, నవీన్‌ జిందాల్‌, వారిని సమర్ధిస్తూ రంగంలోకి దిగిన వారిని ఏ బాపతు కింద పరిగణించాలో ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే, దాన్ని బట్టే మనమెలాంటి వారమో కూడా జనానికి తెలుస్తుంది.


జకీర్‌ నాయక్‌ అనే ముస్లిం బోధకుడు ఏం చెప్పాడో దాన్నే ధైర్యంగా నూపుర్‌ శర్మ పునశ్చరణ చేశారంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక పాంచజన్య తన సంపాదకీయంలో మద్దతు పలికింది. సదరు జకీర్‌ ఒక వివాదాస్పద వ్యక్తి, విద్వేషపూరిత ప్రసంగాలు చేసి 2016లో దేశం విడిచి పారిపోయాడు. అతగాడి మాటలు పాంచజన్యానికి సముచితంగా, వినసొంపుగా ఉన్నాయి. మరి నూపుర్‌ శర్మ కూడా ఇప్పుడు అదేబాటపడతారా ? హిందువులు అసహనపరులుగా తయారైనట్లు చెబుతూ భారత పేరును దెబ్బతీసేందుకు కొందరు పూనుకున్నారని కూడా పాంచజన్య రాసింది. శుభానికి పోతూ పిల్లిని చంకన పెట్టుకుపోయినట్లు నూపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌ వంటి బాపతును ఇంతకాలం తమ ప్రతినిధులుగా చేసిన బిజెపి, ఇతర సంఘపరివార్‌ సంస్థల సంగతేమిటి ? ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి నేత రామ్‌ మాధవ్‌ స్పందన ఆ పార్టీ అంతరంగాన్ని వెల్లడించింది.” కొంత మంది పార్టీ ప్రతినిధులు చేసిన ప్రకటనల వివాదాలు నరేంద్రమోడీకి కొత్తేమీ కాదు. దశాబ్దాల తరబడి అలాంటి బురద నుంచి బయటకు వచ్చారు. వాటిని తన రాజకీయాలకు అనువుగా మార్చుకోవటంలో ఆయన దిట్ట ” అని చెప్పారు. అందుకే నూపుర్‌ శర్మ మీద చర్య ఒక రాజకీయ ఎత్తుగడ తప్ప మరొకటి కాదు.
బిజెపిలో నూపుర్‌ శర్మ అచిర కాలంలోనే రామబాణంలా దూసుకువచ్చి పార్టీలో ప్రముఖస్థానాన్ని పొందారు. అమిత్‌ షా ఆమెకు వెన్నుదన్నుగా ఉన్నారంటారు. ఆమె మాటలు నోటిదూల బాపతు, మాకు సంబంధం లేదని బిజెపి అనేసింది. ఆమె మాట్లాడిన మరుసటి రోజో రెండోరోజో ఆపని చేసి ఉంటే అదొకదారి. ముస్లిం దేశాలు తీవ్ర నిరసన తెలిపిన తరువాత చేశారు. సంతుష్టీకరణలో నరేంద్రమోడీ కూడా తక్కువ తినలేదని నిరూపించుకున్నారు. వసుదేవుడికే గాడిద కాళ్లు పట్టుకోక తప్పలేదంటారు కదా !


నోటి దూల మతోన్మాదశక్తులకు మాత్రమే కాదు. బాబరీ మసీదు వివాద సమయంలో ఉత్తరాది పత్రికలు కొన్ని అదే బాటలో నడవగా ఇప్పుడు కొన్ని టీవీ ఛానళ్లకూ పాకింది. ఇటీవలి ముస్లిం విద్వేష ప్రచారంలో చేర్చిన కొత్త అస్త్రం ముస్లింలు తమ దుకాణాలు, హౌటళ్లలో తయారు చేసే ఆహార పదార్ధాల మీద వారు ఉమ్మిన తరువాత విక్రయిస్తారంటూ ” థూక్‌ జిహాద్‌ ” పేరుతో ప్రచారం చేస్తున్నారు.అలాంటి ఒక నకిలీ వీడియోను తీసుకొని న్యూస్‌ 18 ఛానల్లో అమన్‌ శర్మ అనే యాంకర్‌ ఒక చర్చనే నడిపారు. దాన్ని చూసి హిందూ రక్షాదల్‌ పేరుతో ఉన్న వారు హనుమాన్‌ చాలీసా పఠనం పేరుతో కొన్ని ప్రాంతాల్లో మాంస దుకాణాలనే మూసివేయాలంటూ రోడ్లెక్కారు. టీవీ ఛానళ్ల తీరు తెన్నులను చూస్తే చర్చలను నిర్వహించే యాంకర్లు, మోడరేటర్లు తాము అభిమానించే పార్టీల ప్రతినిధులు, మతశక్తుల కంటే మరింతగా రెచ్చిపోతుండటం గమనించవచ్చు. కొన్ని ఛానళ్లలో అభిమాన పార్టీల మీద విమర్శలకు అవకాశం ఇవ్వరు. మొత్తంగా చూసినపుడు టీవీల రేటింగ్‌లు పెంచటమే వారి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. మహమ్మద్‌ ప్రవక్త అయినా మరొక అంశమైనా వారికి కావాల్సింది తమ ఛానల్‌కు లాభం ఎంత అని మాత్రమే. తెలుగులో కొన్ని ఛానళ్లకు ఉన్న రంగుల గురించి, వాటిలో మాట్లాడే రంగుల విశ్లేషకుల గురించి తెలిసిందే. గతంలో ఛానళ్లు, పత్రికలతో రాజకీయ పార్టీలు, శక్తుల పాకేజ్‌ల గురించే తెలుసు ఇప్పుడు కొన్ని ప్రాంతీయ, జాతీయ ఛానళ్లలో విశ్లేషకులపేరుతో వచ్చే వారికి కూడా పాకేజ్‌లు ఉన్నాయంటున్నారు. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లుగా కొందరు విశ్లేషకులకు, ఛానళ్లకు మినహాయింపు ఉందని మనవి.


పార్టీ ఒక్కటే కాదు చివరికి ప్రభుత్వం కూడా బిజెపి నేతలు మాట్లాడిన, ట్వీట్‌ చేసిన వాటిని నోటిదూల గలవారిగా వర్ణించింది. వారి మీద చర్యలు తీసుకున్నారు, ప్రభుత్వానికి సంబంధం లేదు అని విదేశాలను సంతృప్తిపరచేందుకు చూసింది. విద్వేష పూరితమైన, రెచ్చగొట్టేట్లు మాట్లాడకపోతే కొందరు జనానికి కిక్కు ఎక్కించలేని స్థితికి వచ్చారు.దాని ఫలితాలను చూస్తూనే ఉన్నాం. మధ్యప్రదేశ్‌లో మతిస్థిమితం సరిగా లేని భవర్‌లాల్‌ జైన్‌ అనే 65ఏండ్ల వ్యక్తి ఒక వివాహానికి వెళ్లి వస్తుండగా దారితప్పాడు. మూడు రోజుల తరువాత శవమైకనిపించాడు. కిక్కు ఎక్కిన దినేష్‌ కుష్వహా అనే బిజెపి కార్యకర్త సదరు వృద్దుడిని కొడుతూ నీ పేరేమిటి ? మహమ్మదేనా, ఆధార్‌కార్డు చూపు అంటూ మాట్లాడిన వీడియో ప్రచారంలోకి వచ్చింది. సదరు దినేష్‌ తమ పార్టీవాడేనని బిజెపి అంగీకరించగా, అతని భార్య బిజెపి మాజీ కార్పొరేటర్‌ అని పోలీసులు చెప్పారు. మూర్ఛరోగులమని మెడలో బిళ్లలు వేసుకొని తిరిగినట్లుగా ఇక ముందు ఎవరైనా – ఎందుకంటే అనేక మంది గడ్డాలు పెంచుతున్నారు గనుక – తమ పేరు, మతం, ఆధారకార్డు వివరాలను తగిలించుకొని తిరగకపోతే బిజెపి జనాలు అలాంటి వారిని ముస్లింలుగా పరిగణించి చావచితకకొడతారని భావించాల్సి వస్తోంది. ” దసరా సందర్భంగా హిందువులు రావణబొమ్మలను దహనం చేసినట్లుగా ముస్లింలను తగులబెట్టాలంటూ ” ఒకసారి, వారికి ఓటింగ్‌ హక్కు రద్దు చేయాలని, రెండవ తరగతి పౌరులుగా చూడాలని మరోసారి బీహార్‌ బిజెపి ఎంఎల్‌ఏ హరిభూషన్‌ ఠాకూర్‌ బచువల్‌ సెలవిచ్చారు.


అశ్వనీ ఉపాధ్యాయ బిజెపి నేత, సుప్రీం కోర్టు లాయర్‌ కూడా. ఉమ్మడి పౌరస్మృతి కావాలంటూ ఢిల్లీ జంతర్‌ మంతర్‌ దగ్గర జరిపిన ప్రదర్శనలో ముస్లిం వ్యతిరేక నినాదాలు చేసినందుకు అరెస్టు చేశారు.ముస్లింలను హతమార్చాలంటూ నినాదాలిచ్చినట్లు కేసు నమోదైంది. ఈ పెద్దమనిషి హరిద్వార్‌ ధర్మసంసద్‌గా పేరుమోసిన విద్వేష సభలో దర్శనమిచ్చినట్లు వార్తలు వచ్చాయి. మయన్మార్‌లో రోహింగ్యాలను హతమార్చినట్లుగా మన దేశంలో కూడా ముస్లింలను ఊచకోత కోయాలన్న ప్రసంగాలు ఆ సభలో అనేక మంది చేసిన సంగతి తెలిసిందే.హిందూత్వ ప్రభాకరన్‌గా మారే వారికి ఏడాదికి వంద కోట్లు ఇస్తానని యతి నరసింగానంద ప్రకటించారు.హిందూ మతానికి ముప్పుగా మారతారనే తలపు వచ్చినా వారిని సహించకూడదన్నారు. అతగాడి మీద వెంటనే కనీసం కేసు పెట్టలేదు, పెట్టిన తరువాత వెంటనే బెయిలు వచ్చింది. పూజా షుకున్‌ పాండే అనే హిందూ మహాసభ నాయకురాలు ” మనలో వంద మంది సిద్దమైనా సరే 20లక్షల మంది వారిని(ముస్లింలను) చంపి విజయంతో జైలుకు పోవచ్చు ” అని పిలుపునిచ్చారు.హిందూమతానికి ముప్పుగా పరిణమించిన వారి నుంచి మతరక్షణకు గాను ఏ విధంగానైనా సరే పూనుకోవాల్సిందే అని అదే సభలో ప్రతిజ్ఞ చేశారు.ఈ సభలోనే బిజెపి మహిళామోర్చా నేత ఉదిత త్యాగి ఉన్నారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బిజెపి ఎంఎల్‌ఏ మయంకేశ్వర్‌ సింగ్‌ ఏమన్నాడో తెలుసా ” హిందూస్తాన్‌లోని హిందువులు గనుక మేలుకుంటే గడ్డాలను లాగి జడలుగా మార్చివేస్తారు. హిందూస్తాన్‌లో జీవించాలంటే రాధే రాధే అని చెప్పాలి, లేకపోతే దేశవిభజన సమయంలో మాదిరి పాకిస్తాన్‌ వెళ్లాలి, మీ వలన ఇక్కడ ప్రయోజనం లేదు ” అని మాట్లాడిన వీడియోలున్నాయి.


కర్ణాటకలోని కొడుగు జిల్లాలో భజరంగ్‌ దళ్‌ నిర్వహించిన ఆయుధ శిక్షణ శిబిరంలో ముగ్గురు బిజెపి ఎంఎల్‌ఏలు కెజి బోపయ్య, అప్పాచురంజన్‌, సుజా కుషాలప్ప ఉన్నారు.వారి మీద కేసు నమోదు చేసిన పోలీసు అధికారిని లోకాయక్త ఆఫీసుకు బదిలీ చేసి కసి తీర్చుకున్నారు.” తనకు ఓటు వేయని హిందువుల నరాల్లో ముస్లింల రక్తం ఉన్నట్లే. అలాంటి వాడు ద్రోహి, జైచంద్‌కు పుట్టినవాడే, హిందూ వ్యతిరేకులను నాశనం చేస్తా” అంటూ ఉత్తర ప్రదేశ్‌ బిజెపి ఎంఎల్‌ఏ రాఘవేంద్ర ప్రతాప్‌ సింగ్‌ చెలరేగారు. ఇంకా ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు ముస్లింల మీద కూడా చేశారు. ఇలా చెప్పాలంటే అనేక నోటి దూల ఉదంతాలున్నాయి..వారిమీద ఎలాంటి చర్యలూ లేవు, వారివి దూల నోళ్లనీ చెప్పలేదు.నూపూర్‌ శర్మలో మాత్రమే నోటి దూల కనిపించింది. ద వైర్‌ పోర్టల్‌ నమోదు చేసిన వివరాల ప్రకారం 2021 అక్టోబరు నుంచి నాలుగు నెలల్లో ఆరు ఉత్తరాది రాష్ట్రాల్లో 89 ఉదంతాల్లో వివిధ సంస్థలకు చెందిన వారు విద్వేష ప్రసంగాలు చేసినట్లు తేలింది. వాస్తవానికి ఇంకా ఎక్కువే ఉంటాయి. అక్టోబరు నెలలో పండుగల తరుణంలో 29 విద్వేష నేరాలు జరగ్గా అవన్నీ ముస్లింలకు వ్యతిరేకంగా జరిగినవే. హర్యానాలో ముస్లింలు ప్రార్ధనలు చేసే స్థలంలో గోవర్ధన పూజల పేరుతో పోటీగా నిర్వహించారు. ప్రభుత్వ స్థలాల్లో నమాజ్‌ చేసుకొనేందుకు గతంలో అంగీకరించిన ముఖ్యమంత్రి ఎంఎల్‌ ఖట్టర్‌ తరువాత రద్దు చేశారు. నవరాత్రుల పేరుతో మాంసం దుకాణాలను బందు చేశారు.


ధర్మ సంసద్‌ తరువాత సుదర్శన్‌ న్యూస్‌ అధినేత సురేష్‌ చవాణ్కే భారత్‌ను హిందూ దేశంగా మార్చేందుకు అవసరమైతే పోరాడాలి, చావాలి, చంపాలి అని పిలుపునిచ్చాడు. నూతన పౌరసత్వ చట్టానికి నిరసనగా దేశంలో నిరసనలు తెలుపుతున్నవారి గురించి ఝార్ఖండ్‌ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ ముస్లింల గురించి పరోక్షంగా మాట్లాడిందేమిటి ? ” అగ్గిని వ్యాపింప చేస్తున్నవారెవరో వారి దుస్తులను బట్టి గుర్తించవచ్చు ” అన్నారు. బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన ముస్లింలను చెదపురుగులని, వారిని బంగాళాఖాతంలో కలపాలని అమిత్‌ షా బిజెపి అధ్యక్షుడిగా ఉన్నపుడు మాట్లాడారు. ఢిల్లీ ఎన్నికలకు ముందు 2020లో బిజెపి ఎంపీ పర్వేష్‌ వర్మ మాటలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి.” ఢిల్లీ పౌరులు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి.వారు(ముస్లింలు) మీ ఇండ్లలోకి వస్తారు, మీ సోదరి, కూతుళ్లను మానభంగం చేస్తారు.వారిని చంపివేయండి. మీకు ఇంకా వ్యవధి ఉంది. రేపు మిమ్మల్ని రక్షించేందుకు మోడీగారు, అమిత్‌ షా రారు.” 2014 ఎన్నికలకు ముందు ఫతేపూర్‌ బిజెపి ఎంపీగా ఉన్న నిరంజన్‌ జ్యోతి ఢిల్లీ సభలో మాట్లాడుతూ మీకు రాముడి సంతానం కావాలో జారుల సంతానపు ప్రభుత్వం కావాలో తేల్చుకోండి అని రెచ్చగొట్టారు. ఆమె తిరిగి 2019లో గెలిచారు. సాక్షి మహరాజ్‌ అనే మరోబిజెపి ఎంపీ 2015లో మాట్లాడుతూ ” ఇక్కడ నలుగురు భార్యలు-40 మంది సంతానాన్ని కనటం భారత్‌లో కుదరదు.అయితే హిందూమతాన్ని కాపాడేందుకు ప్రతి హిందూ మహిళ నలుగురు సంతానాన్ని కనాలి ” అన్నారు.


నూపూర్‌ శర్మ మాట్లాడింది తప్పే అంతమాత్రాన మానభంగం చేస్తామని, హతమారుస్తామని బెదిరించటం ఏమిటని చాలా మంది ఆందోళన్యక్తం చేస్తున్నారు. నిజమే చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోకూడదు, స్వంత చట్టాలను ముందుకు తేగూడదు. ఆమె నోటిదూల కారణంగా గుర్తుతెలియని సంస్థలు, వ్యక్తుల పేరుతో బెదిరింపులు వచ్చినట్లు చెబుతున్నారు. అవి నిజం కావచ్చు లేదా నకిలీవి కావచ్చు. పోలీసులు గుర్తు తెలియని వారి పేరుతోనే కేసు నమోదు చేశారు. కానీ ఉత్తర ప్రదేశ్‌లోని సీతాపూర్‌లో భజరంగ్‌ మునిదాస్‌ అనే ఒక ఆశ్రమ పెద్ద బహిరంగంగా ముస్లిం మహిళలను కిడ్నాప్‌ చేసి బహిరంగంగా మానభంగం చేయిస్తానంటూ వేసిన వీరంగం, దానికి పెద్ద ఎత్తున మద్దతు పలికి హర్షం వెల్లడించిన జనాలను చూస్తే దేశంలో ఎలాంటి శక్తులు చెలరేగుతున్నాయో, జనం ఎలా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఏప్రిల్‌ రెండవ తేదీన పోలీసుల కాపలాతో ఒక మసీదు ముందు రెచ్చగొట్టిన ఈ ప్రబుద్దుడి మీద కేసు నమోదు చేసేందుకు పోలీసులు కొన్ని వారాలు తీసుకున్నారు. నూపుర్‌ శర్మ మాదిరి ఏ ముస్లిం మహిళైనా నోరు పారవేసుకుంటే ఆమెను మానభంగం చేయిస్తానని ఎవరైనా అంటే అదొక తీరు, అది ఆధునిక హిందూ సంస్కృతి అని సరిపెట్టుకోవచ్చు. మొత్తం ముస్లిం మహిళలేమి తప్పుడు మాటలు మాట్లాడారు లేదా ఏ నేరం చేశారని మునిదాస్‌ నోరుపారవేసుకున్నట్లు ? బిజెపి నేత ఉమాభారతి మరొక అడుగు ముందుకు వేసి ” నూపుర్‌ శర్మను మా పార్టీ శిక్షించింది, అంతమాత్రాన ఆమెను తోడేళ్లకు అప్పగించలేము కదా ! ఆమెకు బెదిరింపులు మన దేశ సంస్కృతి కాదు ” అని చెప్పారు. మరి మునిదాస్‌ ప్రవర్తన గురించి, మొత్తం ముస్లింలనే అంతం చేయాలనే ధర్మ సంసద్‌ ప్రబోధకులను ఆమె ఎందుకు ఖండించలేదు ? అప్పుడు సంస్కృతి గుర్తుకు రాలేదా ?


నూపూర్‌శర్మ చిల్లర మాటల తరువాత సామాజిక మాధ్యమంలో సరికొత్త ప్రచారం మొదలైంది. ఆమె మాటలకు నిరసన తెలిపిన దేశాల్లో కతార్‌ ఒకటి. పట్టుమని ముఫ్పైలక్షల జనాభా కూడా లేని ఒక చిన్న దేశం మనకు పాఠాలు చెప్పటమా అని దురహంకారంతో కొందరు రెచ్చగొడుతున్నారు. చిన్నదా పెద్దదా అని కాదు దేశమా కాదా అన్నదే గీటు రాయి. మరి అంత చిన్న దేశమైతే నరేంద్రమోడీ సర్కార్‌ అంత పెద్ద సంజాయిషీ ఎందుకు ఇచ్చుకున్నట్లు ? ఆ కతార్‌లోనే ఆప్ఘన్‌తాలిబాన్లతో తెరచాటు మంతనాలు ఎందుకు జరిపినట్లు ? రాజీకుదర్చమని ఎందుకు ప్రాధేయపడినట్లు ? అసలు కథనడిపింది కతార్‌ కాదు, దాని వెనుక అమెరికా ఉంది అంటూ వాట్సాప్‌ పండితులు ప్రచారం మొదలు పెట్టారు. ఎందుకటా ఉక్రెయిను వివాదంలో అమెరికా మాట విననందుకట. అలాంటపుడు అదే అమెరికా నేతలు అంతకు ముందు తనను అవమానించినా, అబద్దాలు చెప్పినా కిమ్మనకుండా చెట్టపట్టాలేసుకొని తిరిగేందుకు విశ్వగురువు అంటున్న నరేంద్రమోడీ ఎందుకు తహతహలాడుతున్నట్లు ? ఇంత రచ్చ జరిగినా నోరు ఎందుకు విప్పటం లేదు, అమెరికా అంటే భయమా, ఏమిటీ బలహీనత ? దేశంలోని 70-80శాతం గోరక్షకులు నకిలీలని నరేంద్రమోడీ వ్యాఖ్యానించిన ఉదంతం తెలిసిందే.2016 జూలై, ఆగస్టు నెలల్లో గో రక్షకులుగా అవతారమెత్తిన వారు కొందరు దళితుల మీద జరిపిన దాడులతో వారెక్కడ పార్టీకి దూరమౌతారో అన్న భయంతో అప్పుడు అలా మాట్లాడారు. ఇప్పుడు దేశమంతటా చర్చకు తెరలేపి, ముస్లిం దేశాల్లో తలెత్తిన నిరసనకు కారణమైన పార్టీ నేతల వ్యాఖ్యల మీద మౌనం దాలుస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఎవరి గురించీ నోరు విప్పలేదు. నూపూర్‌ శర్మ మాటల వలన కొత్తగా దూరమయ్యే ఓటర్లు లేరు, తాత్కాలికంగా తలెత్తిన నిరసన సద్దుమణిగిన తరువాత ముస్లిం విద్వేషాన్ని తలకు ఎక్కించుకున్నవారు మరింత గట్టి మద్దతుదార్లుగా మారతారనే ఎత్తుగడతోనే ఈ మౌనమా ! రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే ! గత ఎనిమిది సంవత్సరాల్లో ఎందరికి సాధికారత వచ్చిందో లేదో తెలియదు గానీ చిల్లరగాళ్లు చెలరేగటాన్ని బట్టి వారికి వచ్చిందని చెప్పవచ్చు. బిజెపి సర్కార్‌ లేదా మేథావులు ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువులో ఫ్రింజ్‌ అనే పదానికి కొత్త అర్ధాన్ని చేరిస్తే తప్ప అప్పటి వరకు ఇలాంటి వారందరినీ చిల్లర, నోటి దూలగాళ్లుగానే భావించాల్సి ఉంటుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

” నరేంద్రమోడీ శివలింగం మీద తేలు ” బిజెపి తాజా రాజకీయంలో పాత సంగతి !

04 Saturday Jun 2022

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, BJP shiva lingam politics, Narendra Modi, RSS, Scorpion on Shiva Linga, Shashi Tharoor


ఎం కోటేశ్వరరావు


శివలింగాల కోసం మసీదులను తవ్వేద్దామన్నారు బిజెపి ఎంపీ బండి సంజయ. ప్రతి మసీదులో శివలింగం కోసం చూడటం ఎందుకు అని ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ సుభాషితం పలికారు. గ్యానవాపి వివాదాన్ని కొత్తగా రేపగా అది కొనసాగుతున్న వివాదమని భగవత్‌ చెప్పటం గమనించాల్సిన అంశం. ఇద్దరూ ఒకే సంస్థకు, భావజాలానికి చెందిన వారు. ఇద్దరి ఆలోచనలు పరస్పరం తెలియని స్థితిలో ఉన్నారా ? ఒకరు పిర్రగిల్లాలి, మరొకరు జోలపాడాలి. ఎవరికి తెలియని నాటకమిది ? భలేగా జనాన్ని ఆడుకుంటున్నారు కదా ! బాబరీ మసీదు మీద సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వరకు రాముడి జన్మభూమి రాజకీయం నడిపారు. ఇప్పుడు శివలింగాల మీద కేంద్రీకరించారు.లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు అన్న సామెత తెలిసిందే. రాజకీయ, మత వ్యాపారులు దీనికి మినహాయింపుగా ఎలా ఉంటారు ?


ఆమె మధ్య ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి. పదవీ కుమ్ములాటల కారణంగా బిజెపి నుంచి బహిష్కరణకు గురై భారతీయ జనశక్తి పార్టీ పేరుతో స్వంత దుకాణం నడిపి లాభం లేకపోవటంతో తిరిగి బిజెపి దుకాణంలో చేరారు, ఆమె పేరు ఉమా భారతి.రామజన్మభూమి ఆందోళనలో ప్రముఖ పాత్రధారి, బాబరీ మసీదును కూల్చివేసినపుడు అక్కడే ఉన్నారని వార్తలు. ఇప్పుడు ఆమె ఒక శివాలయాన్ని ఏడాది పొడవునా తెరిచి ఉంచకపోతే తనకు నిదరపట్టదని, అన్నం మానివేస్తానని బెదిరింపులకు దిగారు. మధ్యప్రదేశ్‌లోని రాయిసేన్‌ జిల్లాలోని రాయిసేన్‌ కోట భారత పురావస్తుశాఖ (ఎఎస్‌ఐ) ఆధీనంలో ఉంది. పార్లమెంటు చేసిన చట్టం ప్రకారం దాని ఆధీనంలో ఉన్న ఆలయాలను సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరిచి పూజలకు అనుమతిస్తారు. ఇక్కడ మహాశివరాత్రి రోజు పూజలు చేస్తారు. దాన్ని ఏడాది పొడవునా తెరిచి ఉంచాలని ఉమాభారతి డిమాండ్‌ చేశారు. ఏప్రిల్‌ నెలలో ఆ కోటను సందర్శించి గేటు వెలుపల నుంచి శివలింగం మీద నీటిని చల్లి అభిషేక తంతు జరిపారు. తాను గంగ నుంచి నీటిని తెచ్చి అధికారులకు అందచేశానని, గుడిని ఎప్పుడు తెరిచేది చెబితే వచ్చి వాటితో అభిషేకం చేస్తానని ఆమె విలేకర్లతో చెప్పారు. తాళాలు బద్దలు కొట్టటం వంటి పనులకు తాను పాల్పడనని అన్నారు. అసలు ఇక్కడ శివాయం ఉన్నట్లే తనకు తెలియదని మత బోధకుడు ప్రదీప్‌ మిశ్రా ప్రకటనల ద్వారా తెలుసుకొని వచ్చానన్నారు. మద్యపాన నిషేధం పేరుతో ఇటీవల ఆమె తన పార్టీకే చెందిన ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తో వివాదపడుతున్నారు. దానిలో భాగంగానే శివాలయ రాజకీయం ప్రారంభించారని భావిస్తున్నారు.


శివలింగ రాజకీయంలో బిజెపి నేతలు తక్కువ తినలేదు. గ్యానవాపి మసీదులో కనిపించిందని చెబుతున్న శివలింగం గురించి బిజెపి తన వైఖరి ఏమిటో ఇంతవరకు ప్రకటించలేదు. కానీ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పని చేసి ప్రస్తుతం స్వదేశీ జాగరణ మంచ్‌ నేతగా ఉన్న పి. మురళీధర రావు మాత్రం వ్యక్తిగతం పేరుతో ప్రకటనలు చేస్తుంటారు. ఇదొక నాటకం. శివలింగపూజను ప్రపంచంలో ఏ శక్తీ అడ్డుకోలేదని మసీదులో శివలింగం ఉందన్న వాస్తవాన్ని ముస్లింలు అంగీకరించాలని ట్వీట్లు చేస్తారు. అక్కడ శివలింగం దొరికింది కనుక అక్కడ పూజలను అనుమతించాలి, అలా చేసినపుడు 1947 ఆగస్టు 15 నాటికి ఉన్న యధాతధ స్థితిని కొనసాగించాలని 1991లో చేసిన చట్టం కొనసాగటం అసాధ్యమని వాదించారు. 1991నాటి చట్టం అమల్లో ఉండగా బిజెపి అధికారికంగా దానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇబ్బంది కనుక మద్దతుదార్లతో కేసులు వేయిస్తారు, వారితో తమకు సంబంధం లేదంటారు. ఏదో ఒక రూపంలో దాని గురించి రోజూ మాట్లాడుతూ ఉంటారు.

మహారాష్ట్రలో మతవాద రాజకీయాలు నడిపేవాటిలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్‌ఎస్‌) ఒకటి.దాని నేత గజానన్‌ కాలే ఒక ట్వీట్‌ చేస్తూ ఔరంగాబాద్‌లో ఔరంగజేబు సమాధి ఉండాల్సిన అవసరం లేదని దాన్ని కూల్చివేయాలంటూ రెచ్చగొట్టాడు. ఆ పని చేస్తే అక్కడికి జనాలు వెళ్లరని అన్నారు. దాంతో కొంత మంది దానికి తాళాలు వేసి రక్షణ కల్పించాలని ప్రయత్నించారు. మజ్లిస్‌ నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ ఇటీవల సమాధిని సందర్శించిన తరువాత ఇది జరిగింది. ఈ సందర్శన కొత్త వివాదాన్ని సృష్టించేందుకే అని ఒవైసీ మీద విమర్శలు వచ్చాయి. ఇలా ఎక్కడికక్కడ ఏదో ఒక పేరుతో మత శక్తులు రెచ్చిపోతున్నాయి.


చివరకు హిందువుల వ్యక్తిగత స్వేచ్చను కూడా బిజెపి సహించటం లేదు. గుజరాత్‌లోని వడోదరా పట్టణానికి చెందిన కష్మా బిందు అనే యువతి జూన్‌ 11న ఒక దేవాలయంలో తనను తానే వివాహం చేసుకోనున్నట్లు ప్రకటించింది. ఇది హిందూత్వకు వ్యతిరేకం గనుక దాన్ని అనుమతించేది లేదని నగర బిజెపి నాయకురాలు సునీతా షుక్లా ప్రకటించారు. దీని వలన హిందూ జనాభా తగ్గిపోతుందని, మతానికి వ్యతిరేకంగా చేసే వాటిని సహించేది లేదన్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే దేశ చరిత్రలో తనును తానే వివాహం చేసుకోవాలనుకోవటం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. అదే యువతి సాధ్విగా మారి ఉంటే ఎలాంటి అభ్యంతరం, హిందూ జనాభా తగ్గుదల అంశం తలెత్తిఉండేది కాదు.


దేశంలో శివలింగ రాజకీయాలు నడుస్తున్నాయి గనుక ఆసక్తికరమైన అంశాన్ని ఇక్కడ చెప్పుకోకుండా ఉండలేం. ఒక హత్య కేసులో ఉన్న కాంగ్రెస్‌ ఎంపీ శశిధరూర్‌ దేవుడు శివుడిని అవమానించారని 2018లో కేంద్ర మంత్రిగా ఉన్న రవిశంకర ప్రసాద్‌ ఆరోపించారు. ఒక కాంగ్రెస్‌ ఎంపీ భయంకరంగా హిందూ దేవుళ్లను అవమానించినందుకు శివ భక్తుడిని అని చెప్పుకున్న రాహుల్‌ గాంధీ సమాధానం చెప్పాలని, హిందువులందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. బెంగళూరు సాహిత్య సమ్మేళనంలో 2018 అక్టోబరు 28న శశిధరూర్‌ ప్రసంగించారు. నరేంద్రమోడీ శివలింగం మీదకు చేరిన తేలు వంటి వారని దాన్ని చేత్తో తీసివేయలేము చెప్పుతో కొట్టనూ లేమని ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఉపమాలంకారంగా ఒక జర్నలిస్టుతో అన్నారని ఆ ప్రసంగంలో శశిధరూర్‌ చెప్పినట్లు ఎఎన్‌ఐ వార్తా సంస్థ నివేదించింది. దాన్ని హిందూమతాన్ని అవమానించినట్లుగా రవిశంకర ప్రసాద్‌ చిత్రించారు. ఈ మాటను శశిధరూర్‌ పాకిస్తాన్‌లో అని ఉంటే నోరు మూయించేవారు, అతను కేవలం ప్రధాన మంత్రినే కాదు ఈ దేశంలోని కోట్లాది మంది శివభక్తులను అవమానించారు అని మరో కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ఆరోపించారు. ఈ మాటలకు గాను శశి ధరూర్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని రాహుల్‌ గాంధీని బిజెపి నేత సంబిత్‌ పాత్ర డిమాండ్‌ చేశారు.ఇంతకూ జరిగిందేమిటి ?


శశిధరూర్‌ తన ప్రసంగంలో కారవాన్‌ పత్రిక జర్నలిస్టు వినోద్‌ జోస్‌తో ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖుడు నరేంద్రమోడీ శివలింగం మీద తేలుకొండి లాంటివాడని చేత్తో తొలగించలేము, చెప్పుతో కొట్టలేమని అన్న మాటలను ఉటంకిస్తున్నట్లు చెప్పారు.2012 కారవాన్‌ పత్రికలో వినోద్‌ జోస్‌ కథనం ప్రచురితమైంది. దాన్లో ఇలా రాశారు.” నేను గుజరాత్‌ నుంచి వచ్చే ముందు పెద్ద నిట్టూర్పుతో ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ నేత తన భావాలను నాతో ఇలా పంచుకున్నారు.” శివలింగం మీద తేలుకొండి కూర్చుని ఉంది. అది పవిత్రమైన శివలింగం కావటంతో చేత్తో తొలగించలేము-చెప్పుతో కొట్టనూ లేము ” అన్నట్లు రాశారు. సదరు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత పేరు వెల్లడించాలని ఒక ట్విటర్‌ కోరగా ఒక జర్నలిస్టుగా తనకు చెప్పిన వారిని మోసం చేయలేనంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఒక్కరే కాదు నరేంద్రమోడీ మంత్రివర్గంలో హౌం మంత్రిగా పని చేసిన గోర్ధన్‌ జడాఫియా కూడా అదే మాట అన్నట్లు వినోద్‌ జోస్‌ సమాధానమిచ్చారు.


2010 సెప్టెంబరు 12న న్యూస్‌ 9 అనే ఆంగ్ల టీవీ ఆరునిమిషాల వీడియో వార్తను ప్రసారం చేసింది. దానిలో మోడీ ఒక తేలుకొండి అంటూ ఒక భాగం ఉంది. తెరమీద ఆ మాటలను చూపిన వెంటనే గోర్ధన్‌ జడాఫియా వ్యాఖ్య ఇలా మొదలైంది.” నేను గనుక చెప్పాల్సి వస్తే శివలింగం మీద తేలుకొండి కూర్చున్నదని చెప్పగలను. సంఘపరివార్‌ కూడా దాన్ని ముట్టుకోలేదు – శివలింగానికి హానీ కలిగేట్లు దేన్నీ విసరలేదు. మొత్తం పరివారమంతా చూస్తున్నది. వారిలో కూడా ఈ భావనలు ఉన్నా వారేమీ చేయలేరు.” అన్నారు. ఈ జడాఫియా విశ్వహిందూపరిషత్‌ నేత. అహమ్మదాబాద్‌ బిజెపి ప్రధాన కార్యదర్శి, రెండుసార్లు ఎంఎల్‌ఏగా, నరేంద్రమోడీ మంత్రివర్గంలో హౌంమంత్రిగా పనిచేశారు.2002 గుజరాత్‌ మారణకాండలో పాత్రధారి అనే విమర్శలున్నాయి. విశ్వహిందూపరిషత్‌కు అనుకూలంగా ఉన్న పోలీసు అధికారులను కొన్ని చోట్లకు బదిలీ చేసి హింసాకాండకు తోడ్పడేట్లు చేశారని, అతని ఆదేశం మేరకు పోలీసులు నిర్వాశితులైన బాధితుల మీద శిబిరాల్లోనే దాడులు చేయించినట్లు విమర్శలున్నాయి. నరేంద్రమోడీ పొడగిట్టని విశ్వహిందూపరిషత్‌ నేత ప్రవీణ్‌ తొగాడియా అనుచరుడిగా ఉన్న కారణంగా గుజరాత్‌ హింసాకాండ తరువాత జడాఫియాను మంత్రివర్గం నుంచి మోడీ తొలగించారు. దాంతో 2007 ఎన్నికల్లో మహాగుజరాత్‌ జనతా పార్టీ అనే కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. తరువాత బిజెపి నుంచి వెలుపలికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేశూభాయి పటేల్‌ దుకాణమైన గుజరాత్‌ పరివర్తన్‌ పార్టీలో దాన్ని విలీనం చేశారు.2012 ఎన్నికల్లో అది బిజెపి మీద పోటీకి దిగి భంగపడింది.తరువాత విశ్వహిందూపరిషత్‌ పూర్తిగా నరేంద్రమోడీకి మద్దతు ప్రకటించింది. గుజరాత్‌ కొట్లాటలపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం మూడు సార్లు జడాఫియాను ప్రశ్నించింది, నరేంద్రమోడీ పాత్ర గురించి సాక్ష్యం చెప్పేందుకు సుముఖత చూపినట్లు, ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు వత్తిడి తెచ్చి వారించినట్లు దాంతో వెనక్కు తగ్గినట్లు వార్తలు వచ్చాయి. రాజీగా జడాఫియాను తిరిగి పార్టీలో చేర్చుకొనేందుకు ఒప్పందం కుదరటంతో 2014లో గుజరాత్‌ పరివర్తన్‌ పార్టీని బిజెపిలో విలీనం చేసి పార్టీలో చేరారు.

దేశంలో ప్రస్తుతం ప్రారంభమైన శివలింగాల రాజకీయం ఏ మలుపులు తిరుగుతుందో ! రామజన్మ భూమి మాదిరి ఓట్లను రాలుస్తుందా ? ఈ కొత్త నాటకాన్ని జనం గ్రహిస్తారా ? ఆర్ధిక రంగంలో ఘోరంగా విఫలమై జన జీవితాలు అతలాకుదలం అవుతున్న స్థితిలో వాటి నుంచి జనాన్ని మళ్లించేందుకు అనేక ఎత్తులు వేస్తున్నారు. దానిలో లింగాల రాజకీయం ఒకటి అన్నది స్పష్టం. శ్రీలంక ఆర్ధిక దిగజారుడు, రాజకీయ పరిణామాల నేపధ్యంలో ధరల అదుపునకు జమ్మిక్కులు చేస్తున్నారు. ఆర్ధిక దిగజారుడు మరింతగా జరగకముందే ఏదో ఒకసాకుతో లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరిపినా ఆశ్చర్యం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ భాగం ) : ఐదు లక్షల డాలర్ల జిడిపితో జనానికి ఒరిగేదేమిటి !

27 Friday May 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Prices, Uncategorized

≈ 1 Comment

Tags

BJP, Modi Govt @ 8, Narendra Modi, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


ఎనిమిదేండ్ల నరేంద్రమోడీ పాలన గురించి కొన్ని అంశాలను మొదటి భాగంలో విశ్లేషించాము. మరికొన్ని అంశాలను ఈ భాగంలో చూద్దాము. 2025 నాటికి దేశ ఆర్ధిక వ్యవస్థను ఐదు లక్షల కోట్ల డాలర్లకు తీసుకుపోయి, ప్రపంచంలో మూడో స్థానంలో నిలబెడతానని 2019లో నరేంద్రమోడీ ప్రకటించారు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి 2028 నాటికి 4.92లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని ఐదు లక్షల కోట్లు కావాలంటే 2029లోనే సాధ్యమని ఐఎంఎఫ్‌ తాజాగా ప్రకటించింది. తరువాత 2027 అని సవరించింది. అప్పటికి నరేంద్రమోడీ అధికారంలో ఉంటారో లేదో కూడా తెలియదు.2028నాటికి రూపాయి విలువ 2022లో 77.7 నుంచి 94.4కు పతనం కానుందని కూడా ఐఎంఎఫ్‌ పేర్కొన్నది. మరోవైపు మన అధికారులు మాత్రం 2025-26 లేదా మరుసటి ఆర్ధిక సంవత్సరానికి ఐదులక్షల డాలర్లకు చేరతామని అంటున్నారు. ఇక్కడ సమస్య ఎంతకు, ఎప్పుడు చేరుతుందని కాదు, దాని వలన జనానికి ఒరిగేదేమిటి ? ఉపాధి రహిత, వేతన పెంపుదల లేని ఆర్ధిక వ్యవస్థలో సంపదలు పోగుపడితే చెప్పుకోవటానికి గొప్పగా ఉండవచ్చు, కుహనా జాతీయ వాదులను సంతృప్తి పరచవచ్చు తప్ప సామాన్యులకు ఒరిగేదేమీ ఉండదు. ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం 2020 నుంచి 2027వరకు తలసరి జిడిపి డాలర్లలో ఇలా ఉండనుంది.
దేశం××× 2020×× 2021×× 2022×× 2023×× 2024×× 2025×× 2026×× 2027
భారత్‌×× 1,935 ××2,185××2,342××2,527××2,720××2,929×× 3,138××3,350
బంగ్లాదేశ్‌× 1,962 ××2,147××2,363 ××2,588××2,814××3,056××3,315××3,587
చైనా×× 10,525 ××12,359××14,029××15,486××16,740××17,991××19,312××20743
తొలిసారి 2020లో భారత తలసరి జిడిపి బంగ్లాదేశ్‌ కంటే వెనుక బడిందని చెప్పటాన్ని కూడా బిజెపి నేతలు దేశద్రోహం అన్నట్లు చిత్రించారు. కావాలంటే బంగ్లాదేశ్‌కు వెళ్లమని చెప్పారు. ఐఎంఎఫ్‌ చెప్పినదాని ప్రకారం 2021 మినహా 2027వరకు మనకంటే బంగ్లాదేశ్‌ తలసరి జిడిపి ఎక్కువగా ఉండనుంది. ఇదేమైనా అంకెల గారడీనా ? కరోనా కారణమా ? కానేకాదు.2014లో బంగ్లాదేశ్‌ తలసరి జిడిపి 1,119 మన దేశంలో 1,574 డాలర్లు ఉంది. మనదేశం ఇతర చోట్ల నుంచి పత్తి దిగుమతి చేసుకొని బంగ్లా పాలకులు దుస్తుల ఎగుమతుల మీద కేంద్రీకరిస్తే మన పాలకులు వాటి బదులు వస్త్రధారణ వివాదాల మీద కేంద్రీకరించటమే అసలు కారణం అని చెప్పవచ్చు. సిఇఐసి సమాచారం ప్రకారం కార్మికశక్తి భాగస్వామ్యం 2021లో మన దేశంలో 45.6శాతం ఉంటే బంగ్లాదేశ్‌లో 57, చైనాలో 68.1శాతం ఉంది.పాకిస్తాన్‌లో 50.1శాతం ఉంది. సిఎంఐఇ సమాచారం ప్రకారం 2022 మార్చినెలలో మన దేశంలో కార్మిక భాగస్వామ్యం 39.5శాతం ఉంది. 2018లో నిరుద్యోగం నాలుగుదశాబ్దాల గరిష్ట స్దాయికి చేరితే తరువాత పెరగటమే తప్ప తగ్గింది లేదు. పని చేసే అవకాశాలు, చేసే వారు పెరగకుండా జిడిపి పెరగదు కదా ! గ్రామీణ ప్రాంతాల్లో పని తగ్గిపోతున్న కారణంగా 2013లో గ్రామీణ ఉపాధి హామీ పధకం కింద పని చేసిన వారితో పోల్చితే తాజాగా లెక్కల ప్రకారం నాలుగు రెట్లు పెరిగారు. కరోనా కాలంలో ఎనభై కోట్ల మందికి నెలకు తాము ఆరుకిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా ఇచ్చామని బిజెపి నేతలు ఒక ఘనతగా చెప్పుకుంటారు. దాన్ని తిరగేసి చూస్తే జనాన్ని ఎంతగా దరిద్రంలో ఉంచారన్నది వెల్లడిస్తున్నది.


నల్లధనాన్ని వెలికి తీసేందుకు ప్రపంచంలో ఇంతవరకు నరేంద్రమోడీ తప్ప ఏ పాలకుడూ కరెన్సీని రద్దు చేయలేదు.పోనీ ఇంత చేసి సాధించిందేమైనా ఉందా అంటే కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదు. జనానికి ఇబ్బందులు, ఆర్ధిక రంగాన్ని కుదేలు చేయటం తప్ప జరిగిందేమీ లేదు. మొత్తం నోట్లలో 99.3శాతం బాంకులకు తిరిగి వచ్చాయి, మిగిలినవి కూడా అనేక మందికి తెలియక డిపాజిట్‌ చేయకపోవటం వంటి కారణాలు తప్ప మరొకటి కాదు. ఈ తప్పిదానికి మన్నించమని నరేంద్రమోడీ జనాన్ని కోరలేదు, అసలు ఉలుకూపలుకు లేదు. దేశంలో నల్లధనం ఎప్పటి మాదిరే తనపని తాను చేసుకుపోతున్నదని అందరికీ తెలిసిందే.2016నవంబరు ఎనిమిదవ తేదీ సాయంత్రం జరిగే కాబినెట్‌ సమావేశానికి మంత్రులెవరూ సెల్‌ఫోన్లు తీసుకురావద్దని చెప్పినట్లు వార్తలు వచ్చాయి, కానీ కొందరు ఆశ్రితులకు ముందే ఈ సమాచారాన్ని చేరవేశారని, వారంతా జాగ్రత్త పడినట్లు తరువాత వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.


నరేంద్రమోడీ వాగ్దానం చేసిన అచ్చేదిన్‌ (మంచి రోజులు)కు అర్ధం ఏమిటో ఇంతవరకు తెలియదు.అమెరికా సంస్ధ పూ అంచనా ప్రకారం 2021 నుంచి ఇప్పటికి రెండున్నర కోట్ల మంది ఉపాధి కోల్పోయారు, ఏడున్నర కోట్ల మంది దారిద్య్రంలోకి దిగజారారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని నరేంద్రమోడీ వాగ్దానం చేసినప్పటికీ గత దశాబ్దకాలంలో ఏటా 43లక్షలకు మించలేదు. ఎనిమిదేండ్ల నాటి ధరల పెరుగుల రికార్డులను ఏక్షణంలోనైనా బద్దలు కొట్టే అవకాశం ఉంది. అంటే జనాలకు చచ్చే రోజులు తప్ప అచ్చేదిన్‌ కనుచూపు మేరలో కనిపించటం లేదు. ఉపాధి, గౌరవ ప్రదమైన, కనీస అవసరాలు తీరే వేతనాలు, సరసమైన ధరల స్థితి ఉంటే రోజులు మంచిగా ఉన్నట్లు భావిస్తారు. ఇప్పుడు ఆ స్ధితి ఉందా ? అందుకే అసలు ఆ పదాన్ని పురాతన భాండాగారంలో పెట్టాలని, అసలు మర్చిపోవాలని జనాలు జోకులు పేలుస్తున్నారు. చిల్లర ద్రవ్యోల్బణం ఎనిమిదేండ్ల గరిష్ఠం 7.79శాతానికి చేరింది. నాలుగుశాతం వద్ద అదుపులో ఉంచాలన్నది ఆర్‌బిఐ నిర్దేశిత లక్ష్యం కాగా దానికి రెట్టింపు ఉంది. జిడిపి వృద్ధిరేట్లలో మన దేశంలో ఒక నిలకడ లేదు.1997 నుంచి ఉద్థాన పతనాలు నమోదవుతున్నాయి. కరోనాకు ముందు మూడు మాసాల్లో 42 సంవత్సరాల కనిష్ట వృద్ధి రేటు నమోదైంది. వార్షిక వృద్ది రేటు 2014లో ఎనిమిదిశాతం ఉండగా 2020 మార్చినాటికి నాలుగుశాతానికి పడిపోయింది. తరువాత కరోనా వచ్చి నరేంద్రమోడీ వైఫల్యాల గురించి చర్చకు అవకాశం లేకుండా చేసింది. కరోనా ప్రభావం తొలగి సాధారణ స్థితికి వచ్చింది. కానీ ఆర్ధిక రంగంలో అలాంటి మార్పు కనిపించటం లేదు. దిగజారిన ఆర్ధిక వ్యవస్ధ గణాంకాలను ప్రాతిపాదికగా చేసుకొని 2022లో ఎనిమిదిశాతం వృద్ధి రేటు ఉంటుందని ఊదరగొడుతున్నారు. అది జరిగినా కరోనాతో ముందు పరిస్థితితో పోల్చితే వాస్తవ వృద్ధి ఒకటి రెండుశాతం మాత్రమే ఉంటుందన్నది ఒక అభిప్రాయం. అందువలన తరువాత వృద్ధి అంకెలు అచ్చేదిన్‌ అసలు బండారాన్ని వెల్లడిస్తాయి. ప్రస్తుతం పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రయివేటు పెట్టుబడుల లేకపోవటం వంటి అంశాలు ప్రతికూలతను వెల్లడిస్తున్నాయి.


గత పది సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం వివిధ బాంకుల వద్ద పేరుకు పోయిన బకాయిలను నిరర్ధక ఆస్తుల పేరుతో రు.11,68,095 కోట్లను రద్దు చేసింది. వాటిని తిరిగి వసూలు చేస్తామని చెబుతున్నప్పటికీ ఎంత శాతం అన్నది ప్రశ్న. 2021మార్చినెలతో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో రద్దు చేసిన మొత్తం రు.2,02,781 కోట్లు ఉంది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత గత ఏడు సంవత్సరాల్లో రద్దు చేసిన మొత్తం రు.10.7లక్షల కోట్లు ఉంది. ఇంతవరకు రుణాలు ఎగవేసిన పెద్దల పేర్లు వెల్లడించేందుకు బాంకులు నిరాకరిస్తున్నాయి. రద్దు చేసిన మొత్తాలలో ప్రభుత్వరంగ బాంకుల వాటా 75శాతం ఉంది.నిరర్దక ఆస్తులను ఖాతాల నుంచి తొలగిస్తే బాంకులకు పన్ను భారం తగ్గుతుందని చెప్పారు.వసూలు అవకాశాలన్నీ మూసుకుపోయిన తరువాతే రద్దు చేస్తారు. తన పాలన అంతా సజావుగా ఉందని చెబుతున్న నరేంద్రమోడీ సర్కార్‌ ఏలుబడిలో బకాయిలు పేరుకు పోవటం అంటే కావాలని ఎగవేతకు పాల్పడటమే. ప్రజల సొమ్ము ప్రతిపైసాకు జవాబుదారీ అని చౌకీదారునని చెప్పుకున్న మోడీ అలాంటి వారి పట్ల ఎందుకు కఠినంగా వ్యవహరించటం లేదన్న ప్రశ్నకు జవాబు లేదు. రద్దు చేసిన బకాయిల్లో వసూలవుతున్న మొత్తం 15-20శాతానికి మించి ఉండటం లేదు.


నరేంద్రమోడీ అధికారానికి వచ్చినపుడు స్వదేశీ ఉత్పత్తిని పెంచి చమురు దిగుమతులు తగ్గిస్తామని చెప్పారు. గత ఎనిమిది సంవత్సరాల్లో అంతకు ముందున్న స్ధితి కంటే దేశీయ ఉత్పత్తి తగ్గింది. ఎనిమిది సంవత్సరాల క్రితం రూపాయి విలువ డాలరుకు 58 ఉండేది, ఇప్పుడు అది 77.56కు పడిపోయింది. రూపాయి విలువ పతనం ప్రభుత్వ అసమర్దతకు నిదర్శనమని ముఖ్యమంత్రిగా ఉండగా నరేంద్రమోడీ, ఇతర బిజెపి నేతలు ధ్వజమెత్తారు. ఈ అసమర్ధతను నెహ్రూ మీద నెడతారా ? 2014లో పీపా ముడిచమురు ధర 110వద్ద ఉండగా మోడీ అధికారానికి వచ్చారు. తరువాత తగ్గటం తప్ప పెరిగింది లేదు. ఆ మేరకు జనానికి ధర తగ్గించాల్సిన మోడీ సర్కార్‌ తప్పుడు కారణాలు చూపి పెట్రోలు, డీజిలు మీద భారీగా సెస్‌లను పెంచి సొమ్ము చేసుకుంది. రూపాయి విలువను కాపాడలేని మోడీ సర్కార్‌ అసమర్దతకు జనం మూల్యం చెల్లించాల్సి వస్తున్నది.2013-14లో మన దేశం దిగుమతి చేసుకున్న ముడి చమురు పీపా సగటు ధర 105.52 డాలర్లు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత గత ఎనిమిది సంవత్సరాలలో ఇలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పిపిఏసి సమాచారం మేరకు వర్తమాన ఆర్ధిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో సగటు ధర 103.10 డాలర్లు ఉంది.
సంవత్సరం×××× డాలర్లలో ధర
2014-15××× 84.16
2015-16××× 46.17
2016-17××× 47.56
2017-18××× 56.43
2018-19××× 69.88
2019-20××× 60.47
2020-21××× 44.82
2021-22××× 79.18
పైన పేర్కొన్న వివరాలను చూసినపుడు మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడి చివరి సంవత్సరంలో ఉన్న స్ధాయి కంటే ఇప్పటికీ తక్కువగానే ఉన్నా సరే నరేంద్రమోడీ సర్కార్‌ అంతర్జాతీయంగా తగ్గిన మేరకు జనాలకు ధరలను తగ్గించలేదు. భారీ ఎత్తున సుంకాలు పెంచి ఆ మొత్తాలను కార్పొరేట్లకు రాయితీలకు మళ్లించటం, ఇతర అంశాలే దీనికి కారణం. వాటికి తోడు రూపాయి విలువ పతనం కూడా తోడైంది. మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ మన కరెన్సీ విలువ పతనాన్ని అరికట్టటంలో విఫలమైందని నరేంద్రమోడీ సహా అనేక మంది బిజెపి నేతలు గతంలో విమర్శించారు. అందువలన ఇప్పుడు వారి నిర్వాకం కూడా జనాలకు శాపంగా మారింది.


రుణభారాన్ని అదుపు చేసుకోవాలని మోడీ సర్కార్‌ రాష్ట్రాలను కోరుతున్నది. కానీ తాను చేసిన అప్పుల గురించి ప్రస్తావించటం లేదు. 2021 సెప్టెంబరులో రిజర్వుబాంకు విడుదల చేసిన వివరాల ప్రకారం నరేంద్రమోడీ అధికారం చేపట్టే నాటికి అంటే 2014 మార్చి ఆఖరుకు కేంద్ర ప్రభుత్వానికి ఉన్న దేశీయ రుణం రు.54,84,848కోట్లు, విదేశీ అప్పు రు.3,74,483 కోట్లు మొత్తం రు.58,59,331 కోట్లు. 2022-23 బడ్జెట్‌లో పేర్కొన్నదాని ప్రకారం 2023 మార్చినాటికి దేశీయ రుణం రు.147,48,875కోట్లు, విదేశీ అప్పు రు.4,69,034 కోట్లు మొత్తం రు.152,17,910 కోట్లు అవుతుందని అంచనా.ద్రవ్యోల్బణం పెరుగుదల, విదేశీ అప్పులు డాలర్లలో చెల్లించాలి గనుక రూపాయి విలువ రికార్డు పతనం కొనసాగితే ఇంకా పెరిగినా ఆశ్చర్యలేదు. ఈ ఎనిమిది సంవత్సరాల్లో ప్రభుత్వరంగ కంపెనీలను తెగనమ్మి పొందిన సొమ్ము, చమురుపై విధించిన భారీ సెస్సుల ఆదాయమంతా ఎటుపోయినట్లు, తెచ్చిన దాదాపు వందలక్షల కోట్లను ఏమి చేసినట్లు ? చివరికి చూసుకుంటే రికార్డు స్దాయి నిరుద్యోగం, వృద్ది రేటు పతనం, కనుచూపు మేరలో లేని అచ్చేదిన్‌ ! కొనుగోలు శక్తి పడిపోతోంది. ఇప్పటికే ఉన్న పారిశ్రామిక సామర్ద్యాన్ని పూర్తిగా వినియోగించలేని స్థితిలో కొత్తగా పెట్టుబడులు పెడితే తమకు వచ్చేదేమిటని ప్రయివేటురంగం ప్రశ్నిస్తోంది. ఆత్మనిర్భర్‌, కరోనా పేరుతో పొందిన రాయితీలతో లబ్దిపొందుతోంది.


ఎనిమిదేండ్ల క్రితం నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో ముందుకు తెచ్చిన అంశాలను చూసినపుడు బలమైన ఆర్ధిక పునాదులు వేస్తామన్నదే వాటి సారాంశం. కానీ తరువాత గత ఎనిమిదేండ్లలో అటు కేంద్రంలో, ఇటు మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి కేంద్రీకరణ ఆర్ధిక వృద్ధి కంటే మతపరమైన రాజకీయలక్ష్యాలకే తొలి ప్రాధాన్యత ఇచ్చారన్నది స్పష్టం. ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా కట్టుబడిన మోడీ ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండా అమలుకు అగ్రాసనం వేశారు. దేశాన్ని ప్రామాణిక హిందూ మూలాల్లోకి తీసుకుపోతామని చెబుతున్నారు. గతంలో అలాంటి భావజాలం, మతం దేశాన్ని పారిశ్రామిక విప్లవానికి దూరం చేసింది. తిరిగి అదే స్థితికి తీసుకుపోతామని చెబుతున్నారు. దానికిగాను హిందూమతానికి సంబంధం లేని హిందూత్వను ఆయుధంగా చేసుకొని మధ్య యుగాలనాటి మతవిద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. ఇది దేశాన్ని ఆర్ధికంగా దిగజారుస్తుందే తప్ప మంచి రోజుల వైపు తీసుకుపోదు. ఒక ఆర్ధిక వ్యవస్థను ఎలా నాశనం చేయవచ్చు అని ఎవరైనా అధ్యయం చేయదలిస్తే ఎనిమిదేండ్ల నరేంద్రమోడీ పాలనను ఎంచుకోవచ్చని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ పార్టీలో విఫల నేత అని కొందరు చెప్పవచ్చు. నరేంద్రమోడీ వైఫల్యం, బూటకం గురించి చెప్పింది వాస్తవమే కదా !

ఈ విశ్లేషణ డివివిఎస్‌ వర్మ సంపాదకత్వంలో వెలువడిన మోడీ ”భార” తం ప్రత్యేక సంచికలో తొలుత ప్రచురితమైనది.

మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భాగం) : ఆర్ధిక వృద్ధి కంటే మత విభజనకే పెద్ద పీట !

మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భాగం) : ఆర్ధిక వృద్ధి కంటే మత విభజనకే పెద్ద పీట !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భాగం) : ఆర్ధిక వృద్ధి కంటే మత విభజనకే పెద్ద పీట !

27 Friday May 2022

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Prices, RELIGION, Religious Intolarence

≈ 1 Comment

Tags

BJP, Modi Govt @ 8, Narendra Modi, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


జాతిపిత మహాత్మాగాంధీని హతమార్చిన గాడ్సే మాతృ సంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ను ఒక గౌరవ ప్రదమైనదిగా జనం చేత ఆమోదింపచేసేందుకు, జాతీయ వాదం పేరుతో సమాజంలో చీలికలు తెచ్చేందుకు నరేంద్రమోడీ, ఇతర పాలకపెద్దలు కేంద్రీకరించిన తీరును ఎనిమిదేండ్లలో చూశాం. దీనిలో వందో వంతైనా సరైన ఆర్ధిక విధానాలపట్ల చూపితే ఎనిమిదేండ్ల తరువాత నరేంద్రమోడీ సర్కార్‌ వైఫల్యాల గురించి జనం చర్చించుకోవాల్సిన అవసరం ఉండేది కాదన్నది ఒక అభిప్రాయం. ఎనిమిదేండ్ల నరేంద్రమోడీ పాలన ఆర్ధికలక్ష్యాల సాధనలో వైఫల్యం చెందినట్లు బిజెపి నేత సుబ్రమణ్య స్వామి స్వయంగా చెప్పారు.2016 నుంచి వృద్ధి రేటు దిగజారిందన్నారు. మీరెందుకు నరేంద్రమోడీకి సలహా ఇవ్వటం లేదన్న ప్రశ్నకు స్వామి చెప్పిన సమాధానం మోడీని అభిశంచించటమే.” పూర్వకాలపు రుషుల ఉద్బోధనల ప్రకారం వినే శ్రద్ద ఉన్నవారితో మాత్రమే విజ్ఞానాన్ని పంచుకోవాలి” అన్నారు. నరేంద్రమోడీకి సరైన ప్రత్నామ్నాయం లేదని అభిమానులు చెబుతున్నారు కదా అన్నపుడు ” తాము దేశం వదలిపెట్టిన తరువాత భారత్‌ పతనం అవుతుందని బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు కూడా చెప్పారు, జరిగిందా అని స్వామి ఎదురు ప్రశ్నించారు. మరోసారి రాజ్యసభకు పంపే అవకాశం లేదని తెలుసుకొని స్వామి ఇలా మాట్లాడుతున్నారని కొందరు చిత్రించవచ్చు గాని వాస్తవం ఏమిటో వారు నోరు విప్పలేరు. ఈ సందర్భంగా దేశ ఆర్ధిక రంగానికి సంబంధించి కొన్ని ముఖ్య అంశాలను చూద్దాం.

2022 నాటికి దేశ జిడిపిలో పారిశ్రామిక ఉత్పత్తి రంగం వాటాను 25శాతానికి పెంచే విధంగా మేక్‌ ఇన్‌ ఇండియా పధకాన్ని 2014లో ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. దీనికి గాను ఏటా 12-14శాతం చొప్పున ఈ రంగంలో వృద్ధి రేటు సాధిస్తామని చెప్పారు. ఎనిమిదేండ్ల తరువాత చూస్తే ఇరవై ఐదుశాతానికి పెంచే లక్ష్యం 2025కు చేరనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీనికోసం నడిపించిన ప్రహసనాలు ఎన్నో. తొలి రోజుల్లో నరేంద్రమోడీ ఎడతెరిపిలేకుండా విదేశాలు చుట్టి రావటం గురించి విమర్శ వస్తే దేశంలో పెట్టుబడులు సాధించేందుకు, విదేశాల్లో అడుగంటిన ప్రతిష్టను తిరిగి నెలకొల్పేందుకే పర్యటనలని అధికారపక్షం బుకాయించింది. ప్రపంచ బాంకు సులభతర వాణిజ్య సూచికలో మన స్ధానం 2014లో 134 ఉండగా 2019 నాటికి 63వ స్ధానానికి నరేంద్రమోడీ తీసుకుపోయారు. అంతిమంగా సాధించిందేమిటి అంటే డబ్బాకొట్టుకొనేందుకు రాంకు పనికి వచ్చింది తప్ప జరిగిందేమీ లేదు. జిడిపిలో పారిశ్రామిక ఉత్పత్తి వాటా 25శాతానికి చేరే సంగతి అటుంచి మోడీ ఏలుబడిలోకి వచ్చేనాటికి ఉన్న 16.3శాతం కాస్తా 2020-21నాటికి 14.3శాతానికి దిగజారింది. కరోనా కారణంగా దిగజారింది అని ఎవరైనా బుకాయించవచ్చు, అసలు అంతకు ముందు పెరిగిందేమైనా ఉంటే కదా ? అందువలన 2025 నాటికి కనీసం 2014నాటి స్థితికైనా చేరతామా అన్నది ప్రశ్న.


ఈ దుస్థితికి కారణమెవరు? రెండు ఇంజన్ల పేరుతో కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వం, మెజారిటీ రాష్ట్రాల్లో బిజెపి, దాని మిత్రపక్షాలే అధికారంలో ఉన్నందున దిగజారుతున్న ఆర్ధిక దుస్థితికి వారే బాధ్యులు. ప్రతిదానికీ చైనాతో పోల్చుకుంటున్న మనం కరోనా వచ్చిన కారణంగా చైనాలో వృద్ధి రేటు తగ్గింది తప్ప మన మాదిరి తిరోగమనంలో లేదు.చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్లు ప్రాణాంతకం కాకున్నా పరిమితంగా కేసులు నమోదైనప్పటికీ తాజాగా షాంఘై వంటి పట్టణాల్లో లాక్‌డౌన్‌ అమలు జరిపింది చైనా. మన దేశంలో అలాంటి పరిస్థితి లేకున్నా కరోనాకు ముందున్న ఆర్దిక వృద్ధి స్థాయికి ఇంకా చేరుకోలేదు. ఎప్పటికి చేరుకుంటుందో కూడా చెప్పలేము.


దేశంలో పారిశ్రామిక రంగం దిగజారటం లేదా స్థిరంగా ఉంటున్న ధోరణి తప్ప పెరుగుదల కనిపించటం లేదు.2006 నుంచి 2012వరకు పారిశ్రామిక కార్మికులు ఏటా 9.5శాతం పెరిగితే తరువాత ఆరు సంవత్సరాల్లో అది 7.4శాతానికి దిగజారింది. నిజవేతనాల పతనం కారణంగా కరోనాకు ముందే వినియోగం కూడా తగ్గింది.2019లో వార్షిక ప్రాతిపదికన నిజవేతనాలు 2.8శాతం తగ్గగా 2020 జనవరి-మార్చి నెలల్లో తగ్గుదల 5.3శాతం ఉంది.సిఇడిఏ-సిఎంఐఇ సమాచారం ప్రకారం 2017-2021 మధ్య ఉత్పాదక రంగంలో కార్మికుల సంఖ్య ఐదు నుంచి 2.9కోట్లకు తగ్గింది. స్టాక్‌మార్కెట్లో నమోదైన కంపెనీల వేతన బిల్లు 2018 సెప్టెంబరులో రు.53వేల కోట్లుండగా 2020జూన్‌ నాటికి రు.48,500 కోట్లకు తగ్గింది.2021 సెప్టెంబరులో రు.60వేల కోట్లుగా ఉంది.ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే నిజవేతనాలు తగ్గినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. పారిశ్రామిక రంగంలో ఉపాధి తగ్గటంతో పాటు నిజవేతనాల పతనం కారణంగా గత దశాబ్దిలో గృహస్తుల రుణాలు రెట్టింపైనట్లు ఎస్‌బిఐ నివేదిక వెల్లడించింది.2018 భారత రుణ-పెట్టుబడి నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 84శాతం రుణభారం పెరగ్గా పట్టణాల్లో 42శాతం ఉంది.


మేకిన్‌ ఇండియా పధకాన్ని ఉపాధి పెంపుదల, విదేశాలకు వస్తు ఎగుమతులు, మన దిగుమతులు తగ్గించే లక్ష్యంతో ప్రకటించారు. మన దిగుమతుల బిల్లు తగ్గిన దాఖలాలుగానీ, ఎగుమతులు పెరిగిన ఆనవాలు గానీ కనిపించటం లేదు.2021-22 బడ్జెట్‌లో ఆత్మనిర్భర పేరుతో ఉత్పాదకతతో ముడిపడిన ప్రోత్సహకాల కోసం కేంద్ర ప్రభుత్వం రు.1.97లక్షల కోట్లు కేటాయించింది. చిత్రం ఏమిటంటే ఈ పధకం కింద లబ్ది పొందేందుకు పరుగులు పెట్టాల్సిన కంపెనీలు మన దేశం నుంచి వెళ్లిపోతున్నాయి. ఎగుమతుల కోసం విద్యుత్‌ వాహనాలను తయారు చేసేది లేదని, మీ ప్రోత్సాహం అవసరం లేదని ఫోర్డ్‌ కంపెనీ 2022 మే 12న ప్రకటించింది. ఇక్కడున్న ఉత్పాదక సౌకర్యాలను వేరే దేశాలకు తరలించనున్నట్లుగా తెలిపింది. దిగుమతి పన్నులు ఎక్కువగా ఉన్న కారణంగా అమెరికా, చైనాల్లో తయారైన విద్యుత్‌ వాహనాలను మన దేశంలో విక్రయించరాదని మరుసటి రోజే టెస్లా నిర్ణయించింది. ఫోర్డ్‌ కంపెనీ మూత కారణంగా నాలుగువేల ఉద్యోగాలు ప్రత్యక్షంగానూ, దేశమంతటా దాని డీలర్లు పరోక్షంగా సృష్టించిన మరికొన్నివేల ఉద్యోగాలు పరోక్షంగా హరీమంటున్నాయి.2017తరువాత జనరల్‌ మోటార్స్‌, మాన్‌ ట్రక్స్‌, హార్లేడేవిడ్సన్‌,యునైటెడ్‌ మోటార్స్‌ మూతపడిన కారణంగా తమ పెట్టుబడి రు.2,485 కోట్లు హరీ మన్నదని, 64వేల మందికి ఉపాధి నష్టం జరిగిందని డీలర్స్‌ సంఘం పేర్కొన్నది.


విదేశాల్లో మన ప్రతిష్ట పెంచామని, పెట్టుబడులను ఆకర్షించినట్లు, సులభతర వాణిజ్య పరిస్థితిని కల్పించినట్లు నరేంద్రమోడీ అండ్‌ కో చెబుతున్నదానిలో ఆర్భాటం-వాస్తవమెంతో ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. రాష్ట్రాల్లో వివిధ రకాల పన్నులు విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు చికాకు తెప్పిస్తున్నట్లు, వాటి బదులు ఏక రూప పన్నును అమలు చేస్తే ఉత్సాహంగా పెట్టుబడులు పెడతారంటూ జిఎస్‌టిని తెచ్చారు. అది కొన్ని రంగాలను దెబ్బతీసింది తప్ప పరిస్ధితిని చక్కదిద్దలేదన్నది తెలిసిందే. కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ వార్షిక నివేదికల ప్రకారం 2014-2021 కాలంలో నమోదైన విదేశీ కంపెనీల పెరుగుదల 2016లో 3.9శాతం ఉండగా 2021లో అది 1.5శాతానికి తగ్గింది.(216 నుంచి 63కు తగ్గాయి) ఇక చురుకుగా ఉండే కంపెనీలు ఇదే కాలంలో 80 నుంచి 66శాతానికి తగ్గాయి. ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా చైనాను పక్కకు నెట్టేసి మన దేశం ఆవిర్భంచనుందని ఎనిమిదేండ్ల క్రితం ఊదరగొట్టారు. గతేడాది చైనా నుంచి పెద్ద సంఖ్యలో కంపెనీలు మన దేశానికి రానున్నాయని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ సిఎంల సమావేశంలో చెప్పారు. పత్రికలు అవి1000 అని రాశాయి. నిజమే అనుకొని కొందరు సిఎంలు సదరు కంపెనీలకు ఎర్రతివాచీలు పరిచేందుకు సిద్దం అన్నారు. దీని ప్రహసనం 2021పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ నివేదికలో వెల్లడైంది.”కరోనా అనంతర ఆర్ధిక రంగంలో పెట్టుబడుల ఆకర్షణ:భారత్‌కు సవాళ్లు,అవకాశాలు ” అనే శీర్షిక కింద చైనా నుంచి వస్తున్నట్లు చెప్పిన కంపెనీల గురించి ఏం చెప్పారో చూడండి.”’ మీడియాల వార్తల ద్వారా తెలుసుకున్నదేమంటే ఈ కంపెనీల్లో అత్యధికం తమ సంస్థలను వియత్నాం, థాయిలాండ్‌, తైవాన్‌ తదితర దేశాలకు తరలించాయి తప్ప భారత్‌కు వచ్చింది కొన్ని మాత్రమే.” అసలు పార్లమెంటరీ కమిటీ పత్రికా వార్తల మీద ఆధారపడటం ఏమిటి ? ప్రభుత్వం తగ్గర సమాచారం లేదా ? ఉంటే అలా రాసి ఉండేవారు కాదు. చైనా నుంచి కంపెనీలు వెలుపలికి రావటం, విదేశాల నుంచి వెళ్లి అక్కడ కంపెనీలు పెట్టటం కొత్త కాదు. జపాన్‌ నొమురా బాంకు 2018 ఏప్రిల్‌ నుంచి 2019 ఆగస్టు వరకు చైనా నుంచి 56 కంపెనీలు వెలుపలికి తరలితే భారత్‌కు వచ్చింది కేవలం మూడే అని తెలిపింది. దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచిక(ఐఐపి) 2013 నుంచి 2022 వరకు వార్షిక పెరుగుదల సగటు 2.9శాతం, కాగా ఇదే కాలంలో జిడిపి సగటు 5.5శాతం ఉంది. అంతకు ముందు 2006 నుంచి 2012వరకు సగటు ఐఐపి 9శాతం ఉంది. సామర్ధ్య వినియోగం 2015 నుంచి 2022 వరకు 70.9శాతం ఉంది, అది పదేండ్ల క్రితం 80శాతం. అంటే ఉన్నదాన్ని కూడా వినియోగించుకోలేకపోతున్నాము. ఇదంతా మేకిన్‌ ఇండి పిలుపు తరువాత జరిగిందే సుమా !


తాను వస్తే జనాలకు మంచి రోజులు తెస్తానని మోడీ చెప్పారు. వాటికి వేతనాలు కీలకం. దేశంలో నిజవేతనాల రేటు పెరుగుదల ఎలా ఉందో చూద్దాం. (అంకెలు శాతాలని గమనించాలి.) మొత్తంగా చూసినపుడు 2011-12కు ముందు ఉన్న పెరుగుదలతో పోల్చితే తరువాత కాలంలో గణనీయంగా తగ్గింది. రెగ్యులర్‌ సిబ్బందికి పెరగకపోగా తగ్గిపోవటాన్ని చూడవచ్చు.(ఆధారం ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌, వర్కింగ్‌ పేపర్‌ 01-2020)
2004-05 నుంచి 2011-12 ×××××××× 2011-12 నుంచి 2017-18
తరగతి×××మొత్తం×× కాజువల్‌××రెగ్యులర్‌ ×××మొత్తం×× కాజువల్‌××రెగ్యులర్‌
గ్రామీణ×××6.10 ×× 8.04 ×× 3.02 ××× 2.91 ×× 2.34 ×× -0.22
పట్టణ ×××4.55 ×× 6.42 ×× 4.10 ××× -1.49 ×× 1.10 ×× -2.05
పురుష ×××4.77 ×× 7.08 ×× 3.78 ××× 0.75 ×× 2.23 ×× -1.75
మహిళ×××7.92 ×× 8.24 ×× 4.87 ××× 2.31 ×× 1.34 ×× -1.38
మొత్తం ×××5.52 ×× 7.75 ×× 3.91 ××× 1.05 ×× 2.26 ×× -1.76
రైతాంగానికి 2022 నాటికి వారి ఆదాయాలను రెట్టింపు చేస్తామన్నది ప్రధాని నరేంద్రమోడీ చేసిన వాగ్దానాలలో ఒకటి. అది నెరవేర్చకపోగా వారికి మొత్తంగా ఎసరు పెట్టి కార్పొరేట్లకు అప్పగించేందుకు మూడు సాగు చట్టాలను రుద్దేందుకు పూనుకున్న అంశం తెలిసిందే. ఏడాది పాటు చారిత్రాత్మకంగా జరిపిన పోరు నేపధ్యంలో క్షమాపణలు చెప్పి మరీ వాటిని రద్దు చేశారు. కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించే అంశం గురించి ఒక కమిటీని వేస్తామని ప్రకటించి ఆరునెలలు దాటినా దాని ఊసే లేదు.
2015-16ను ప్రాతిపదికగా చేసుకొని 2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని చెప్పారు. దీనికి గాను ఏటా 10.4శాతం వార్షిక వృద్ది రేటు అవసరమని అంచనా. దీనికి సంబంధించి ప్రభుత్వం వద్ద ఇంతవరకు సమగ్ర సమాచారమే లేదు.వ్యవసాయ కుటుంబాలకు సంబంధించి అందుబాటులో ఉన్న తాజా సమాచారంగా 2019 జనవరి-డిసెంబరు మధ్య సేకరించిన 77వ దఫా ఎన్‌ఎస్‌ఎస్‌ఓ వివరాలే ఉన్నాయి. దాని ప్రకారం 2012-13లో రైతు కుటుంబ నెలవారీ ఆదాయం సగటున రు.6,426 ఉండగా 2019నాటికి రు.10,218కి పెరిగింది. అంటే నరేంద్రమోడీ ప్రకటనతో నిమిత్తం లేకుండానే ఇది జరిగిందని గమనించాలి. అందువలన ఎలాగూ ఎంతో కొంత పెరుగుతుంది గనుక దాన్ని తన ఖాతాలో వేసుకోవచ్చన్న ఆలోచన బిజెపికి వచ్చిందా అన్న ప్రశ్న తలెత్తుతున్నది.2019నాటి పెరుగుదల వివరాలను గమనిస్తే అసలు కథ తెలుస్తుంది. రైతులు తమ పొలంలో సాగుతో పాటు వేతన కూలీలుగా, కోళ్లు, పాడిపశువుల పెంపకం వంటి ఉప వృత్తుల ద్వారా కూడా ఆదాయాన్ని పొందుతారు.రైతుల ఆదాయవనరులు, వాటి తీరు తెన్నులు ఇలా ఉన్నాయి.నెలవారీ ఆదాయం రూపాయల్లో ఉంది.
వనరు×××××2012-13×××× 2018-19
వేతనం××××× 2,071 ×××× 4,043
పంటలు××××× 3,081 ×××× 3,798
పశుపాలన×××× 763 ×××× 1,582
ఇతరం ××××× 511 ×××× 795
మొత్తం××××× 6,426 ×××× 10,218
పై వివరాలను గమనించినపుడు వేతన, పశుపాలన ఆదాయం పెరుగుదల దాదాపు రెట్టింపు ఉంది.పంటల ఆదాయం ఆమేరకు లేదు. ఇతరంగా వచ్చే ఆదాయం అంటే కౌలు ద్వారా ఇతర అవసరాలకు భూమిని ఇవ్వటం ద్వారా పొందేది.2020-21 ఆర్ధిక సర్వేలో వెల్లడించిన వివరాల ప్రకారం 2014-2021 సంవత్సరాల్లో పరిస్ధితి అంచనా సర్వే(ఎస్‌ఏఎస్‌) ప్రకారం రైతులకు వచ్చే ఆదాయంలో పంటల నుంచి వచ్చే మొత్తం 48 నుంచి 37శాతానికి తగ్గింది.వేతనం ద్వారా వచ్చే మొత్తం 32 నుంచి 40శాతానికి, పశుపాలన ద్వారా వచ్చేది 12 నుంచి 16శాతానికి పెరిగింది. దీన్ని బట్టి పంటలకు తగినంతగా మద్దతు ధర కల్పించకపోవటం, లేదా మార్కెట్‌ శక్తుల దోపిడీ కారణంగా రావాల్సినంత రాకపోవటంగానీ జరుగుతున్నది. ఈ కారణంగానే కనీస మద్దతు ధరల విధానాన్ని ఎత్తివేసేందుకు దారి తీసే మూడు సాగు చట్టాల రద్దుకు రైతాంగం తీవ్రంగా పోరాడిందని, దానికి చట్టబద్దత కల్పించాలని డిమాండ్‌ చేసినట్లు భావించవచ్చు.ఆదాయంలో వేతనం ద్వారా పెరిగింది ఎక్కువగా ఉండటాన్ని బట్టి రైతులు కూలి మీద ఎక్కువ ఆధారపడుతున్నట్లుగా చెప్పవచ్చు.


రైతాంగ ఆదాయం రు.10,218 అన్నది దేశ సగటు. రాష్ట్రాల వారీ ఎగుడుదిగుడులు ఉన్నాయి.పద్దెనిమిది వేలు అంతకు మించి పొందున్నవారు మేఘాలయ, పంజాబ్‌, హర్యానా, అరుణాచల్‌ ప్రదేశ్‌, జమ్ము-కాశ్మీరుల్లో ఉండగా ఎనిమిదివేలకు తక్కువ వచ్చే వారు ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమబెంగాల్‌, ఒడిషా, ఝార్కండ్‌లో ఉన్నారు. సాగు చట్టాలపై దేశమంతటా రైతులు ఒకే విధంగా స్పందించకపోవటానికి ఇది కూడా కారణం కావచ్చు, ఎక్కువ ఆదాయం పొందుతున్నవారిలో ఉన్న ఆందోళన తక్కువ పొందే వారిలో ఉండకపోవటం సహజం.


పంటల దిగుబడి పెంచటం ద్వారా రైతాంగ ఆదాయం పెంచవచ్చని కొందరు చెబుతారు. అది అనేక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. సాగు ఖర్చులు స్థిరంగా ఉంటే దిగుబడి పెరిగితే రాబడి పెరుగుతుంది. కానీ దేశంలో ఆ పరిస్థితి ఉందా ? పెరుగుతున్న ఎరువులు, పురుగుమందులు ధరలు, వేతన, యంత్రాల వినియోగ ఖర్చు పెరుగుదల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నపుడు ఖర్చులు ఎక్కువగా పెరుగుతున్నాయి. అందుకే సాగు గిట్టుబాటు కావటం లేదన్న అభిప్రాయంతో అనేక మంది సాగుమాని కౌలుకు ఇవ్వటం వంటి వాటికి మరలుతున్నారు. ఎనిమిది సంవత్సరాల క్రితంతో పోల్చితే 2013-14లో ఉన్న ఆహార ధాన్యాల ఉత్పత్తి 265.05మిలియన్‌ టన్నుల నుంచి 2021-22లో 305.43మి.టన్నులకు పెరిగిందని అంచనా. ఇదే కాలంలో వరి,గోధుమల కనీస మద్దతు ధరలు రెట్టింపు కాలేదు. వరి ధర రు.1,310 నుంచి 1,940, గోధుమలకు రు.1,400 నుంచి 2,015కు పెరిగింది. కేవలం 14శాతం మంది రైతులు మాత్రమే కనీస మద్దతు ధరల వలన లబ్దిపొందుతున్నట్లు అంచనా.కనీస మద్దతు, గిట్టుబాటు ధరలను కల్పించే బాధ్యతను తీసుకొనేందుకు మొరాయిస్తున్న పాలకులు రైతాంగానికి గిట్టుబాటు కల్పించే పేరుతో యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నారు. దీని వలన వ్యవసాయకార్మికుల ఉపాధికి ముప్పు ఏర్పడుతున్నది. మేకిన్‌ ఇండియా మాదిరిగానే రైతుల ఆదాయాల రెట్టింపు అన్నది ఒక కలగానే ఉంది.

ఈ విశ్లేషణ డివివిఎస్‌ వర్మ సంపాదకత్వంలో వెలువడిన మోడీ ”భార” తం ప్రత్యేక సంచికలో తొలుత ప్రచురితమైనది.

మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ భాగం ) : ఐదు లక్షల డాలర్ల జిడిపితో జనానికి ఒరిగేదేమిటి !

మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ భాగం ) : ఐదు లక్షల డాలర్ల జిడిపితో జనానికి ఒరిగేదేమిటి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా, రష్యాలను బూచిగా చూపేందుకే బైడెన్‌ ఆసియా పర్యటన !

26 Thursday May 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Joe Biden, Joe Biden Asia tour, Narendra Modi, Quad, Quadrilateral Security Dialogue, Taiwan Matters, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


వార్తలద్వారా ఎలా రెచ్చగొట్టవచ్చో ఒక మంచి ఉదాహరణను చూద్దాం.” ప్రధాని మోడీ పాల్గొన్న చతుష్టయ సమావేశానికి దగ్గరగా చైనా, రష్యా యుద్ద విమానాలు : జపాన్‌ మంత్రి ” అన్నది ఒక వార్త శీర్షిక. జపాన్‌ రాజధాని టోకియోలో జరిగిన ఆ సమావేశంలో అమెరికా,జపాన్‌,ఆస్ట్రేలియా దేశాధినేతలు కూడా ఉన్నారు. నరేంద్రమోడీ ఉన్నందున అనే అర్ధం వచ్చేట్లు శీర్షిక పెట్టటం చైనా, రష్యాలతో మన దేశానికి తంపులు పెట్టే లేదా పెంచే వ్యవహారం తప్ప మరొకటి కాదు. చతుష్టయ దేశాలను హెచ్చరించేందుకే ఈ చర్య అని మన దేశంలో కొన్ని పత్రికల సంపాదకీయాలు రాయటం సరేసరి.ఇది తీవ్ర ఆందోళన కలిగించేది అని జపాన్‌ రక్షణ మంత్రి నోబు కిషి గుండెలు బాదుకున్నాడు. ఇలా జపాన్‌ సరిహద్దుల వరకు చైనా-రష్యా విమానాలు రావటం గతేడాది నవంబరు నుంచి నాలుగవసారి అని కూడా కిషి చెప్పాడు. మరి అప్పుడే సమావేశాలు జరిగినట్లు ? ఎవరిని హెచ్చరించేందుకు వచ్చినట్లు ?వాటిలో నరేంద్రమోడీ గారు లేరు కదా ! మా మంత్రిగారు ఏం చెప్పారన్నది వేరే గానీ ఆ విమానాలు తమ గగనతలాన్ని అతిక్రమించలేదని జపాన్‌ రక్షణ మంత్రిత్వశాఖ చెప్పినట్లు ఎఎఫ్‌పి వార్తా సంస్ద పేర్కొన్నది. జపాన్‌ సముద్రం మీద రెండు చైనా విమానాలతో జత కలసిన మరో రెండు రష్యా విమానాలు తూర్పు చైనా సముద్రం నుంచి పసిఫిక్‌ సముద్రం వైపు వెళ్లినట్లు జపాన్‌ మంత్రి చెప్పాడు. గూఢచార సమాచారాన్ని సేకరించేందుకు రష్యా విమానం ఒకటి కూడా జపాన్‌ వైపు వచ్చినట్లు, ఈ చర్యలు రెచ్చగొట్టేందుకే అని ఆరోపించాడు. అంతర్జాతీయ నిబంధనలను పాటించి మరొక దేశ గగనతలాన్ని అతిక్రమించకుండా విమానాలు తిరగటం సర్వసాధారణం.


ఇలా తమ విమానాలు సంయుక్తంగా తిరగటం నిరంతర గస్తీలో భాగమే అని చైనా, రష్యా పేర్కొన్నాయి.వార్షిక మిలిటరీ సహకార ఒప్పందంలో భాగంగా తిరిగినట్లు చైనా రక్షణశాఖ నిర్ధారించింది.టోకియో చతుష్టయ సమావేశాల సందర్భంగా తన రెచ్చగొట్టుడు చర్యలను సమర్దించుకొనేందుకు జపాన్‌ ఇలాంటి ఆరోపణలను చేస్తోందని చైనా పేర్కొన్నది. అమెరికా, జపాన్‌ రెచ్చగొడుతున్న తరుణంలో రెండు యుద్ద నౌకలను జపాన్‌ సమీపంలోని రెండు జలసంధులకు చైనా పంపింది. పశ్చిమ పసిఫిక్‌ సముద్రంలోని చైనా విమానవాహక నౌక నుంచి గత ఇరవై రోజుల్లో కనీసం మూడువందల సార్లు విమానాలు చక్కర్లు కొట్టినట్లు, తైవాన్‌ విషయంలో జోక్యం చేసుకుంటే తమ సత్తా ఏమిటో చూపేందుకే ఇలా చేసినట్లు వార్తలు వచ్చాయి.


జపాన్‌ పార్లమెంటు వెలుపల చతుష్టయ సమావేశాలు జరిగే చోట ఏర్పాటు చేసిన బానర్లు, పోస్టర్లలో ” హాంకాంగ్‌ స్వాతంత్య్రం, విప్లవం, ఉఘిర్‌లో మారణకాండను ఆపండి ” అని రాయటం చైనాను రెచ్చగొట్టటమే అన్నది స్పష్టం. ఇక జపాన్‌ సంగతికొస్తే 2021లో ఇరుగు పొరుగు దేశాలు తన గగనతలాన్ని అతిక్రమిస్తున్నాయనే అనుమానంతో తానే రికార్డు స్ధాయిలో ఎగబడి పట్టుకొనేందుకు ప్రయత్నించటం లేదా తానే గస్తీ తిరగటం వంటి పనులు చేసింది.ఇది ఆప్రాంతంలో తలెత్తిన తీవ్ర పరిస్ధితికి అద్దం పడుతోంది. ఇదంతా చతుష్టయం పేరుతో చైనా వ్యతిరేక కూటమి చర్యలు ముమ్మరం అయిన తరువాతే అన్నది స్పష్టం. 2020లో 279లో సార్లు , 2021లో 1,004 సార్లు జపాన్‌ విమానాలు తిరిగాయి. అంతకు ముందు 2016లో గరిష్టంగా 1,168సార్లు వెంటపడినట్లు అధికారికంగా వెల్లడించారు. దానికి 2012లో జపాన్‌ జనావాసం లేని మూడు దీవులను ప్రయివేటు వారినుంచి కొనుగోలు చేసింది, అవి తమవని చైనా చెప్పటంతో వాటి చుట్టూ జపాన్‌ తన విమానాలను గస్తీ తిప్పింది. దక్షిణ, తూర్పు చైనా సముద్రాల్లో చైనా చర్యలు ఆందోళన కలిగిస్తున్నట్లు చైనా తన శ్వేతపత్రంలో ఆరోపించింది.

యధాతధ స్ధితిని బలవంతంగా మార్చేందుకు పూనుకుంటే సహించేది లేదని ఏ దేశం పేరు పెట్టకుండా టోకియో చతుష్టయ సమావేశం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నప్పటికీ అది చైనా, రష్యాల గురించే అన్నది స్పష్టం. పేరుకు తమది మిలిటరీ కూటమి కాదంటూనే ఆ దిశగా దాన్ని మార్చేందుకు పూనుకున్నారు.దానికి విరుగుడుగా చైనా కూడా జాగ్రత్తపడుతోంది.దానిలో భాగంగానే తన మిలిటరీని పటిష్టపరుస్తోంది.దక్షిణ పసిఫిక్‌ ప్రాంతంలోని అనేక చిన్న దేశాలతో సంబంధాలను పటిష్టపరుచుకుంటోంది. 2017వరకు ఒక భావనగానే ఉన్న ఈ కూటమి గడచిన రెండు సంవత్సరాలలో నాలుగు సార్లు సమావేశం కావటం గమనించాల్సిన అంశం. ఆ తరువాతే లడఖ్‌లోని గాల్వన్‌ లోయ ఉదంతం జరిగినట్లు అంతర్జాతీయ పరిశీలకులు చెప్పారు. ఆస్ట్రేలియా-చైనా మధ్య వాణిజ్యపోరు మొదలైంది. సోలోమన్‌ దీవుల ప్రభుత్వంతో చైనా కుదుర్చుకున్న భద్రతా ఒప్పందం తమకు వ్యతిరేకంగానే అని ఆస్ట్రేలియా ఆరోపిస్తోంది. చైనా నావలు ఆ దీవుల్లో లంగరువేసేందుకు వీలుకలుగుతుందని అంటోంది.దీనికి ప్రతిగా బ్రిటన్‌, అమెరికాతో కలసి అకుస్‌ పేరుతో మిలిటరీ ఒప్పందం చేసుకుంది. బ్రిటన్‌ నుంచి అణుశక్తితో నడిచే జలాంతర్గాముల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. దాదాపు శతాబ్దికాలంగా జపాన్‌-చైనా మధ్య వివాదాస్పదంగా ఉన్న కొన్ని దీవుల అంశమై ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఒకవైపు తైవాన్‌ దీవిని చైనా అంతర్భాగంగా గుర్తిస్తున్నామని చెబుతూనే దాన్ని సైనికంగా బలపరిచేందుకు అమెరికా పూనుకుంది.ఒక వేళ చైనా గనుక బలవంతంగా విలీనం చేసుకోవాలని పూనుకుంటే తాము మిలిటరీతో రక్షణ కల్పిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆసియా పర్యటనలో బెదిరించిన అంశం తెలిసిందే.


చతుర్ముఖ భద్రతా మాటామంతీ( ద క్వాడ్రిలేటరల్‌ సెక్యూరిటీ డైలాగ్‌) పేరుతో 2007లో జపాన్‌ చొరవతో భారత్‌,ఆస్ట్రేలియా, అమెరికా చర్చలు ప్రారంభించాయి. దీన్నే క్వాడ్‌(చతుష్టయం) అంటున్నారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనాను ఎదుర్కోవటమే దీని లక్ష్యం. అదే ఏడాది ఆస్ట్రేలియా వెనక్కు తగ్గటంతో ఆ కూటమి ముందుకు సాగలేదు.2017లో మనీలాలో జరిగిన ఆసియన్‌ కూటమి సమావేశాల సందర్భంగా ఈ కూటమిని పునరుద్దరించాలని నాలుగు దేశాలు నిర్ణయించాయి.ఆ ప్రాంతంలో నౌకలను అడ్డుకున్న ఉదంతం ఒక్కటీ లేకున్నా ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలోని తూర్పు, దక్షిణ చైనా సముద్రాల్లో స్వేచ్చగా నౌకా రవాణా ఉండే పరిస్ధితి కల్పించాలనే పేరుతో ఒక అజెండాను ముందుకు తెచ్చాయి.పైకి ఏమి చెప్పినా చైనాను అడ్డుకోవటమే అసలు ఎత్తుగడ. ఇండో-పసిఫిక్‌ ప్రాంతం గురించే తమ కేంద్రీకరణ అని చెప్పిన చతుష్టయ కూటమి క్రమంగా ఇతర అంశాల మీద కూడా దృష్టి సారిస్తోంది.టోకియో భేటీతో పాటు ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన సమావేశంలో ఉక్రెయిన్‌ సంక్షోభం గురించి చర్చించింది.
ఉక్రెయిన్‌ మీద రష్యా దాడి చేసినపుడు వివిధ కారణాలతో మిలిటరీతో ఆదుకోలేదు, తైవాన్‌ విషయంలో కూడా చైనా దాడి చేస్తే అలాగే ఉంటారా లేక రక్షణకు వస్తారా అని టోకియోలో విలేకరి అడిగిన ప్రశ్నకు వెంటనే జో బైడెన్‌ అవసరమైతే తైవాన్‌లో మిలిటరీతో ఎదుర్కొంటామని చెప్పాడు. ఒకే చైనా విధానాన్ని అమెరికా అంగీకరించింది నిజం, ఆ మేరకు ఒప్పందంపై సంతకాలు కూడా చేశాము. దానిలో ఎలాంటి మార్పూ లేదు. కానీ తైవాన్ను బలవంతంగా స్వాధీనం చేసుకోవటం సబబు కాదు. అందుకు పూనుకుంటే మిలిటరీతో ఎదుర్కొంటాం అన్నాడు. బలప్రయోగం చేసే హక్కు చైనాకు లేదన్నాడు. బలవంతంగా ఆక్రమించేందుకు చైనా పూనుకుంటుందని తాను అనుకోవటం లేదని, అది ప్రపంచం ఎంత గట్టిగా స్పందస్తుంది అనేదానిపై ఆధారపడి ఉంటుందని, దురాక్రమణకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నాడు. అంతకు ముందు జపాన్‌ ప్రధాని కిషిడాతో కలసి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడైనా ఏకపక్షంగా యధాతధ స్ధితిని మార్చేందుకు ఎవరైనా పూనుకుంటే సహించేది లేదని, రష్యా దాడి ప్రపంచ వ్యవస్ధ పునాదులను కదలించిందని బైడెన్‌ అన్నాడు.

బైడెన్‌ ప్రకటనల మీద చైనా తీవ్రంగా స్పందించింది. ఏదో అనుకోకుండా మాట్లాడినట్లుగా తాజా స్పందనను పరిగణించలేమని, అంగీకరించిన ఒకే చైనా విధానం నుంచి వెనక్కు తగ్గుతున్నదనేందుకు సూచిక, మరొక అడుగు ముందుకు వేసినట్లు చైనా భావిస్తోంది. ఉక్రెయిన్‌ ముసుగులో తైవాన్‌ స్వాతంత్య్రం గురించి అమెరికా, జపాన్‌ తమ పధకాలతో ముందుకు పోతే వాటిని గట్టిగా ఎదుర్కొంటామని స్పష్టం చేసింది. ఉక్రెయిన్లో మాదిరి బలప్రయోగంతో ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో కూడా ఏకపక్షంగా యధాతధ స్దితిని మార్చితే చూస్తూ ఊరుకోబోమని జపాన్‌ ప్రధాని కిషిదా కూడా చెప్పటాన్ని చైనా పరిశీలకులు గుర్తు చేశారు. తైవాన్‌ తమ అంతర్గత అంశమని, దానిలో విదేశీ శక్తుల జోక్యాన్ని అనుమతించబోమని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ విలేకర్లతో స్పష్టం చేశాడు. అమెరికా సైనికులను తైవాన్‌కు తరలించనప్పటికీ ఏదో ఒకముసుగులో ఆయుధాలను పెద్ద ఎత్తున అందచేస్తున్నది. అందువలన సైనికులను పంపటం ఒక్కటే మిలిటరీ జోక్యం కాదని ఆయుధాల అందచేత కూడా మిలిటరీ జోక్యమే అని చైనా పరిగణిస్తున్నప్పటికీ సంయమనం పాటిస్తున్నది. చైనా మీదకు పోవాలని బైడెన్‌ కోరుకున్నట్లయితే చైనా-అమెరికా సంబంధాలు టైటానిక్‌ ఓడ మంచుకొండను ఢకొీన్నపుడు జరిగిన మాదిరే జరుగుతుందని చైనా పరిశీలకులు వర్ణించారు. ఉక్రెయిన్‌ అంశాన్ని తైవాన్‌ సమస్యతో కలిపి చూపటం వెనుక తైవాన్‌ దీవిపై చైనా సార్వభౌమత్వాన్ని తిరస్కరించే ఎత్తుగడ ఉంది.అంతేకాదు తైవాన్ను చూపుతూ ఆసియా పసిఫిక్‌ ప్రాంతానికి చైనా ముప్పు ఉందని ఈ ప్రాంత దేశాలను నమ్మించటం,తప్పుదారి పట్టించటం కూడా తెలిసిందే.


జో బైడెన్‌ ఆసియా పర్యటనను మొత్తంగా చూసినట్లయితే ప్రధానంగా రెండు లక్ష్యాలతో సాగినట్లు చెప్పవచ్చు. గత రెండు దశాబ్దాలలో తొలిసారిగా ఆసియా పర్యటన జరిపిన అమెరికా నేతలందరూ చైనాను సందర్శించారు. తొలిసారిగా జోబైడెన్‌ చైనాలో అడుగుపెట్టలేదు. ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్యం (ఆర్‌సిఇపి) పేరుతో ఏర్పడిన అతి పెద్ద ఆర్ధిక కూటమిలో అమెరికా లేదు. దానికి పోటీగా ఇండో పసిఫిక్‌ ఎకనమిక్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఐపిఇఎఫ్‌) పేరుతో కొత్త కూటమిని ఉనికిలోకి తెచ్చి ఆ ప్రాంత దేశాలను ఆకర్షించటం, తద్వారా తనపెత్తనాన్ని నిలుపుకొనేందుకు పూనుకోవటం. దీని వలన మనకు కలిగే లబ్ది ఏమిటో తెలియకుండానే మన దేశం సిద్దం సుమతీ అన్నది. ఆర్‌సిఇపిలోని మరికొన్ని దేశాలు కూడా దీనిలో చేరుతున్నట్లు ప్రకటించాయి.ఈ కూటమిలో అమెరికా మార్కెట్లో ప్రవేశించే అవకాశాలు పరిమితమని ఇప్పటికే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇది కూడా చైనాను దూరంగా పెట్టే ఎత్తుగడే. రెండవదాని కొస్తే ఉక్రెయిన్‌ విషయంలో తాము మిలిటరీని పంపేది లేదని అమెరికా చెప్పటంతో దాన్ని నమ్ముకుంటే అంతే సంగతులని అనేక దేశాలు భావిస్తున్నాయి. ఇది అమెరికాకు రాజకీయంగా ఎంతో నష్టం కలిగించింది. తన ప్రయోజనాలకోసం రెచ్చగొట్టి ముందుకు తోసి తాను తప్పుకుంటుందనే భావం ఎల్లెడలా కలిగింది. దాన్ని పోగొట్టేందుకు, మద్దతుదార్లలో విశ్వాసాన్ని కల్పించేందుకు తైవాన్‌ అంశంలో తాము సైనికంగా జోక్యం చేసుకుంటామని బైడెన్‌ చెప్పాడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d