Bernie and the Movement | Jacobin
23 Tuesday Feb 2016
Posted in Uncategorized
23 Tuesday Feb 2016
Posted in Uncategorized
23 Tuesday Feb 2016
Posted in Current Affairs, Education, INTERNATIONAL NEWS, UK, USA, Women
Tags
CAPITALISM, capitalist crisis, student debt, students, Sugar Babies, sugar mummies and daddies, UK, USA
ఎం కోటేశ్వరరావు
సుగర్ డాడీ, సుగర్ మమ్మీ, సుగర్ బేబీ ఆగండాగండి. సుగర్ వ్యాధి కుటుంబం గురించి చెబుతున్నారని అనుకుంటున్నారా ? కానే కాదు, ఆ వ్యాధికీ వీరికీ నక్కకూ నాగలోగలోకానికి వున్నంత దూరం. పోనీ ఈ పదాల గురించి విన్నారా ? లేదా ఎక్కడైనా తారసిల్లారా ?
సోషల్ మీడియాలోని ఫేస్‌బుక్‌లో ఖాతాలున్న వారికి ఎప్పుడో ఒకప్పడు వీళ్లలో ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో తగిలే వుంటారు. పబ్లిక్ అన్నతరువాత పది రకాల మనుషులు వుంటారు.నేను ఖాళీగా వున్నాను కావాలంటే మీరు నాతో మాట్లాడవచ్చు, నా ఫోన్ రీచార్జి చేయించండి నేను సెక్స్ ఛాట్ చేస్తా, నాకు చాలా డబ్బు అవసరం ప్లీజ్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా ఇలాంటి మెసేజ్‌లు ఫోన్,ఫేస్‌బుక్‌లో చాలా మందికి రావటం, కొంత మంది స్పందించటం సర్వసాధారణం. ఇంకా చాలా దారుణమైన సందేశాలు కూడా వస్తుంటాయి. సోషల్ మీడియాతో ప్రయోజనంతో పాటు ఇలాంటి ప్రమాదాలు కూడా వున్నాయి.
ముందుగా సుగర్ డాడీ, సుగర్ మమ్మీల గురించి తెలుసుకుందాం. డాడీలైతే తమ కూతురి వయస్సున్న ఆడపిల్లలను, మమ్మీలైతే తమ కొడుకుల, కూతుర్ల వయస్సులో వున్న కోడెకారు కుర్ర వాళ్లను చేరదీసి తమ దేహ అవసరాలను తీర్చుకోవటంతో పాటు వారి ఆర్ధిక అవసరాలను కూడా తీర్చే వారు. భూస్వామిక వ్యవస్ధ పెత్తనం చేస్తున్న రోజులలో సుగర్ డాడీలు అనేక చోట్ల తమ ఖాతాలు తెరిచేవారు, ఎంత మందిని చేరదీస్తే అంత గొప్ప భూస్వామి లేదా జమిందారు కింద లెక్క. మరి ఇప్పుడు కార్పొరేట్ సుగర్ డాడీలు ఆ స్ధానాన్ని ఆక్రమిస్తున్నారు.ఈ పరంపరలోనే సుగర్ మమ్మీలు కూడా తయారవుతారని వేరే చెప్పనవసరం లేదు. వారికి ఎస్కార్టులనో మరో పేరుతోనే బలయ్యేవారే సుగర్ బేబీలు, బాబులు.
పెట్టుబడిదారీ విధానం బాగా పెరిగే కొద్దీ ఇలాంటి వారి సంఖ్య పెరుగుతూ వుంటుంది. మన దేశం లేదా ప్రాంతం ఇంకా అలాంటి వున్నత ‘అభివృద్ధి’ దశకు చేరలేదు కనుక ఈ విషయాలు కొంచెం ఎబ్బెట్టుగానూ, మరీ చోద్యం గాకపోతే అనిపిస్తాయి. పెట్టుబడిదారీ వ్యవస్దలో ప్రతిదీ సరుకే. కార్పొరేట్స్ తమకు అవసరమైన దానిని కొనుక్కుంటారు. అభాగ్యులు, వేరే ప్రత్యామ్నాయం లేనివారు, పెట్టుబడిదారీ విలాసాలకు అలవాటు పడి వెనక్కు రాలేని వారు వారు తమ దగ్గర వున్నదానిని అది శ్రమ లేదా శరీరం ఏదైనా కావచ్చు విక్రయించటం,అవసరాలు తీర్చుకోవటం జరుగుతుంది.
పశ్చిమ దేశాలలో ఇలాంటి వ్యాపారం లేదా సేవలు అందించేందుకు ప్రత్యేకంగా కొన్ని వెబ్‌సైట్లు కూడా పనిచేస్తున్నాయి. మన దగ్గర కూడా కొన్ని సైట్స్ వున్నాయి. బ్రిటన్‌లో ‘సీకింగ్ అరేంజ్‌మెంట్.కామ్ అనేది ఒక పేరుమోసిన సుగర్ డాడీ,మమ్మీ, బేబీల డేటింగ్ సైట్. పచ్చి తెలుగులో చెప్పుకోవాలంటే తార్పుడు కేంద్రం. పెట్టుబడిదారీ వ్యవస్ధకు పుట్టిన ఒక తీవ్ర అవలక్షణం.
బ్రిటన్ ప్రభుత్వం ట్యూషన్ ఫీజులను మూడు రెట్లు పెంచిన తరువాత కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్ధినులు ఈ సైట్లో తమ పేర్లు నమోదు చేసుకోవటం పెరిగినట్లు తేలింది. అంటే విశ్వవిద్యాలయ విద్యను కొనుగోలు చేయటానికి స్ధోమత లేనివారు దానికి దూరంగా వుండాలి లేదా అందుకోసం దేనికైనా సిద్ధ పడాలి. బ్రిటన్‌లో అత్యంత ప్రతిష్ట కలిగిన ఆ సంస్ధకు నిర్వహణ వ్యయం చెల్లించటాన్ని నిలిపివేస్తామని ఈనెలలో ప్రభుత్వం ప్రకటించింది కనుక వచ్చే ఏడాది మరోసారి ట్యూషన్ ఫీజులతో పాటు వాటిని చెల్లించేందుకు డబ్బులిచ్చే సుగర్ డాడీల కోసం వెతికే విద్యార్దులు కూడా పెరుగుతారని ఆ కేంద్రం అంచనా వేస్తోంది.ఎంత దైన్య స్దితి, ఎంత దుర్మార్గం ?
వెబ్‌సైట్‌లో రకరకాల సేవల గురించి వివరాలు వుంటాయి. ఏ సేవ కావాల్సిన వారు వారిని ఎంచుకోవచ్చు. అందుకు తగ్గ ఫీజు లేదా పరిహారం, బహుమతులు వుంటాయి. పైన చెప్పిన బ్రిటన్ డాట్‌కామ్‌లో ఈ ఏడాది జనవరి నాటికి తమకు సదరు సేవలందించేందుకు సిద్దంగా వున్నట్లు అంగీకారం తెలిపేవారు గానీ 2.25లక్షల మంది విద్యార్ధులున్నారట. మరో అంచనా ప్రకారం ఇంకా ఎక్కువ మందే వున్నారు. ఆ డాట్‌కాం స్ధాపక సిఇవో బ్రాండన్ వేడ్ దీని గురించి చెబుతూ దేశం ఒక విధంగా అత్యవసర పరిస్ధితిలో వున్నట్లుగా వుంది.అయితే వుగ్రవాదంతో కాదు, 1.2లక్షల కోట్ల పౌండ్ల విద్యార్ధుల అప్పు పేరుకుపోయి సంక్షోభానికి దారితీసేదిగా వుంది.ఎవరూ దీని గురించి ఎవరూ పట్టించుకోవటం లేదు, మేము మిలియన్లలో గాక పోయినా లక్షల మందికి మా సైట్ ద్వారా విద్యకోసం చేసిన అప్పునుంచి బయట పడేట్లు తోడ్పడుతున్నాం అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు.
సేవల విషయానికి వస్తే సుగర్ డాడీలు కొందరు వెబ్‌కామ్‌ల ముందు కూర్చొని కబుర్లు చెప్పమని అడుగుతారట. అయితే మేం బట్టలు వేసుకొనే మాట్లాడతాం అని అమ్మాయిలు షరతులు విధిస్తున్నవారు కూడా వున్నారట. ఇది అమలిన శృంగారం. కొంత మంది భౌతిక సుఖాల జోలికి పోకుండా కేవలం ఫోన్లో సంభాషిస్తూ విద్యార్దినులను ఆదుకొనే వారు కూడా వున్నారట.ఎవరైనా ఒక పరిధికి మించి డిమాండ్ చేస్తే దక్కిన వరకు సొమ్ము తీసుకొని గుడ్‌బై చెప్పేవారు కూడా వున్నారట.విశ్వవిద్యాలయ విద్యకోసం ఇదంతా తాము స్వచ్చందంగానే చేస్తున్నాం తప్ప ఎవరి బలవంతమూ లేదంటున్నవారు కూడా లేకపోలేదు.అయితే అవసరాల బలహీనతను సొమ్ము చేసుకోవటానికి ఏ అమ్మాయి దొరుకుతుందా అని సదరు వెబ్‌సైట్ వారు నిరంతరం శోధిస్తుంటారని, ఇక్కడ కూడా మహిళలు దోపిడీకి గురవుతున్నారని వేరు చెప్పనవసరం లేదు.
పెట్టుబడిదారీ ధనిక దేశాలలో విద్యారంగం నుంచి ప్రభుత్వాలు తప్పుకోవటం, సంక్షేమ చర్యలపై కోత పెట్టటం ఎక్కువ చేయటంతో పాటు 2008లో ప్రారంభమైన ఆర్దిక సంక్షోభ సమయంలోనే బ్రిటన్‌లోనీ సీకింగ్ అరెంజ్‌మెంట్ డాట్ కామ్ 2006లో వునికిలోకి వచ్చింది. ఇప్పుడది ప్రపంచంలోనే అగ్రగామి సంస్ధ.ముందే చెప్పుకున్నట్లు విశ్వవిద్యాలయాలలో ఫీజుల రేట్లు పెరిగే కొద్దీ ఇలాంటి సైట్లలో నమోదు చేసుకొనే విద్యార్ధినుల సంఖ్య పెరుగుతోంది. అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 2015లో పెరుగుదల రేటు 40శాతం ఎక్కువ. అనధికారికంగా ఇంకా చాలా మంది వుంటారని వేరే చెప్పనవసరం లేదు. ఈ సేవలకు ముందుకు వస్తున్న వారి గురించి చేసిన విశ్లేషణలో ఇలాంటి వారు 21-27 సంవత్సరాల వయస్సులో వారు అత్యధికులు వున్నారు.ఇరవై నాలుగు శాతం మంది అల్పాదాయ, 56శాతం మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు. సగటున వారు రెండువేల పౌండ్ల ప్రతిఫలం పొందుతున్నారు.ఆ మొత్తంలో వారి కనీస అవసరాలైన ట్యూషన్ ఫీజుకు 36శాతం, అద్దెకు 23, పుస్తకాలకు 20, ట్రాన్స్‌పోర్ట్‌కు 9శాతం మొత్తాలను ఖర్చు చేస్తున్నట్లు తేలింది.
నేటి విద్యార్ధే రేపటి పౌరుడన్న సంగతేమో గానీ రేపటి రుణగ్రస్తుడిగా మారుతున్నాడన్నది 2014 సర్వేలో తేలిన సత్యం. కాలేజీల నుంచి బయట పడిన తరువాత 50 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు కొంత మంది విద్య కోసం చేసిన అప్పును తీరుస్తూనే వున్నారట.డిగ్రీతో పాటు సగటున 44వేల పౌండ్ల అప్పుతో బయటకు వస్తున్నారు. రుణం తీసుకొని చదువు కొనుక్కొనే వారు బ్రిటన్‌లో నానాటికీ పెరుగుతున్నారు . అలాంటి వారు 2013లో 60శాతం వుంటే 2015 నాటికి 74శాతానికి పెరిగారు.అంటే సంక్షోభ తీవ్రతకు ఇది దర్పణం. తమ చదువు కోసం పని చేస్తున్న వారి సంఖ్య కూడా 59 నుంచి 74శాతానికి పెరిగింది. యువకులు సగటున నెలకు 412 పౌండ్లు సంపాదిస్తుంటే, యువతులు 334 పౌండ్లు పొందుతున్నారు.ఈ పూర్వరంగంలోనే అవి చాలనపుడు 2000 పౌండ్ల ఆదాయం వచ్చే సుగర్ బేబీస్‌గా మారుతున్నారు.
పోనీ పని చేసి సంపాదించినా లేదా నీతి తప్పి సంపాదించి పొందిన సర్టిఫికెట్లతో మంచి వుద్యోగాలు వస్తున్నాయా, వాటితో అప్పు తీర్చగలుగుతున్నారా అంటే అదీ లేదు. చదుకు తగిన వుద్యోగాలు లేవు, అవసరానికి తగిన వేతనాలు లేవు.ఇది ఒక్క బ్రిటన్ పరిస్దితే కాదు మొత్తం పెట్టుబడిదారీ ధనిక దేశాలన్నింటా వున్న దౌర్బాగ్యం. దివాళాకోరు, ఖాయిలా పడిన పెట్టుబడిదారీ విధాన ఫలితమిది.
అమెరికాలో గత ఏడు సంవత్సరాలలో 58శాతం పెరిగింది. అప్పుతో పాటు చెల్లించలేని వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. విద్యార్ది రుణం 2014లో 1.2లక్షల కోట్ల డాలర్లని, చెల్లించటంలో విఫలమైన వారు 70లక్షల మంది వున్నట్లు తేలింది.ఈ కారణంగానే ఈ ఏడాది జరగనున్న ఎన్నికలలో విద్యార్ధి రుణ సమస్య కూడా ముందుకు వచ్చింది.ఈ సమస్య గత రెండు దశాబ్దాలలోనే ముందుకు వచ్చింది.కారణం అన్ని చోట్లా వుదారవాద విధానాల పేరుతో ప్రభుత్వం చేసే ఖర్చు తగ్గించటం, ప్రజలపై భారాలు మోపుతున్న పర్యవసానాల ఫలితమిది.
22 Monday Feb 2016
Posted in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence
Tags
ABVP, ANTI NATIONAL, BJP, Bjp nationalism, JNU, JNU ROW, Media, Narendra Modi, RSS
ప్రపంచ యుద్ధాలు, ఏ నియంత పాలన చరిత్రను చూసినా ఏదో ఒక చిన్న సాకుతోనే ప్రారంభమయ్యాయి. ఏదీ లేకపోతే వాగు ఎగువన వున్న తోడేలు దిగువన వున్న మేకపిల్లతో నీటిని కెలికావని గిల్లి కజ్జా పెట్టుకొని మింగేసిన కధ తెలిసిందే. మీడియా విశ్వసనీయతను దెబ్బతీసే జీ టీవీ,ఆర్నాబ్ గోస్వామి వంటి జర్నలిస్టులు ఇలాంటి తోడేళ్లకు తోడైన తరువాత ఇంక చెప్పేదేముంది. అయితే అంతిమంగా జనం అందరి పనిపడతారన్నది వేరే విషయం.
ఎం కోటేశ్వరరావు
ప్చ్ ! నరేంద్రమోడీ కూడా నిరాశపరుస్తున్నారు. ఆదివారం నాడు ఒడిషాలో మోడీ పాడిన పాచి పాత పాట జనానికి బోర్ కొట్టింది. ప్రతివారికీ పదిహేను లక్షల నల్లధన సొమ్ము పంపిణీ, దేశమంతటా గుజరాత్ నమూనా విస్తరణ మాదిరి కిక్కిచ్చే కొత్త అంశాలు ఇంకా తమ మహా మౌనబాబా నోటి నుంచి వెలువడతాయని అభిమానులు ఎదురు చూస్తుంటే తన అంబుల పొదిలోంచి పాతపడిన, పదునులేని బాణాలు బయటకు తీస్తున్నారు.అదేదో సినిమాలో డైలాగు మాదిరి ఇదేం చాలా బాగోలేదు, వ్యతిరేకులను ఎలాగూ ఎదుర్కోలేరు, కనీసం భక్తులకు అయినా నమ్మకం కలిగించాలి కదా. ఇందిరా గాంధీ తన పాలన ఇబ్బందుల్లో పడినపుడు, ప్రజా వ్యతిరేక చర్యలకు పూనుకున్నపుడల్లా తన ప్రభుత్వానికి విదేశీ హస్తం నుంచి ముప్పు వుందని చెప్పేవారు, ముఖ్యంగా 1975లో అత్యవసర పరిస్ధితి విధించబోయే ముందు ఈ మాటలు ఎక్కువగా చెప్పారు. నాడు జనసంఘం ముసుగులో వున్న నేటి బిజెపి నాయకులు దాన్ని ఎద్దేవా చేశారు, ఆ హస్తాన్ని బయట పెట్టమని అడిగేవారు. ఆదివారం నాడు ప్రధాని నరేంద్రమోడీ ఒడిషాలో జరిగిన రైతు సభలో ప్రసంగిస్తూ తన ప్రభుత్వాన్ని అస్ధిర పరిచే కుట్ర జరుగుతోందని, ఒక చాయ్‌వాలా ప్రధాని అయ్యారన్న వాస్తవాన్ని కొందరు వ్యక్తులు జీర్ణించుకోలేకపోతున్నారని చేసిన ఆరోపణ నరేంద్రమోడీకి అత్యంత ప్రీతి పాత్రుడైన వెంకయ్య నాయుడి మూస ప్రాసలో చెప్పాలంటే రుచీపచీ లేని పాత చింతకాయ పచ్చడిలా మరోసారి ఇందిరా గాంధీని జ్ఞప్తికి తెచ్చింది. ఇలా అయితే మనం గతంలో కాంగ్రెస్‌ను ఏడిపించినట్లుగా ఇప్పుడు వారు మనల్ని కూడా ఆడుకుంటారు సార్ అని మోడీ అభిమానులు లోలోపలే మధన పడుతున్నారు. మంత్రసానితనానికి అంగీకరించిన తరువాత ఏదొచ్చినా పట్టక తప్పదు మరి. దేశంలో అత్యవసర పరిస్ధితి పునరావృతమయ్యే పరిస్ధితులు కనిపిస్తున్నాయని గతేడాది జూన్‌లో బిజెపి సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ చేసిన వ్యాఖ్యను ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. అది కచ్చితంగా నరేంద్రమోడీని వుద్దేశించే చేశారని లోకం కోడై కూసింది. మోడీ ఆరోపణ దానిలో భాగమేనా ? ప్రపంచ యుద్ధాలు, ఏ నియంత పాలన చరిత్రను చూసినా ఏదో ఒక చిన్న సాకుతోనే ప్రారంభమయ్యాయి. ఏదీ లేకపోతే వాగు ఎగువన వున్న తోడేలు దిగువన వున్న మేకపిల్లతో నీటిని కెలికావని గిల్లి కజ్జా పెట్టుకొని మింగేసిన కధ తెలిసిందే. మీడియా విశ్వసనీయతను దెబ్బతీసే జీ టీవీ,ఆర్నాబ్ గోస్వామి వంటి జర్నలిస్టులు ఇలాంటి తోడేళ్లకు తోడైన తరువాత ఇంక చెప్పేదేముంది. అయితే అంతిమంగా జనం అందరి పనిపడతారన్నది వేరే విషయం.
గత ఇరవై నెలల పాలనా కాలంలో నరేంద్రమోడీ సర్కార్ అన్ని రంగాలలో ఘోరంగా విఫలమైంది. రానున్న రోజులలో మరింత తిరోగమనం తప్ప పురోగమన దాఖలాలు కనిపించటం లేదు. పెట్టబోయే బడ్జెట్ కూడా అంత ఆకర్షణీయంగా వుండబోదని ముందే వార్తలు వెలువడుతున్నాయి. వేతన సంఘసిఫార్సులను వుద్యోగులు అంగీకరించటం లేదు. ఈ స్ధితిలో కాషాయ మార్కు జాతీయ వాదాన్ని ముందుకు తెచ్చి కొంతకాలం జనం దృష్టిని మరల్చాలి. అందుకు తగిన అవకాశాల కోసం వెతుకుతున్న తరుణంలో హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం, తరువాత జెఎన్‌యులో జరిగిన సభలు, వాటి పర్యవసానాలు మంచి అవకాశాన్ని ఇచ్చాయి. వాటిని వుపయోగించుకోకుండా ఏ విఫల అధికారపక్షమైనా ఎలా వుంటుంది. అయితే బిజెపి ఈ బస్సు కూడా మిస్సయినట్లే. కానీ ఒకందుకు మాత్రం బిజెపి మేథోచెరువులో ఈదులాడుతున్న వారిని అభినందించాలి. తిను,తాగు, తిరుగు అనేవి తప్ప దేశంలో వేరే ఇజాలేవీ లేవు అన్న వాతావరణం పెరిగిపోయి యువత అనేక విధాలుగా క్షీణ సంస్కృతి ప్రభావానికి లోనవుతున్న దశలో వారికి తెలియకుండానే ఒక సైద్ధాంతిక చర్చకు దోహదం చేశారు. ఢిల్లీ జెఎన్‌యులోని ఎబివిపి నాయకుల నుంచే తమకు ఎదురు దెబ్బ తగులుతుందని వారు కలలో కూడా వూహించి వుండరు. మేకతోలు కప్పుకున్న పులి వంటి సంఘపరివార్ సంస్ధల నైజం తెలియక లేదా వారే అసలైన దేశభక్తులనే ప్రచారం నిజమే అని నమ్మిగాని లేదా కాంగ్రెస్‌పై వ్యతిరేకతతో గాని అనేక మంది దాని అనుబంధ సంస్ధలలో చేరుతున్నారు, మద్దతతు ఇస్తున్నారు. అయితే వారందరూ శాశ్వతంగా వాటితోనే వుండిపోతారనుకుంటే భ్రమే. ‘జెఎన్‌యులో ప్రస్తుత సంఘటన, మనుస్మృతిపై పార్టీలో కొనసాగుతున్న దీర్ఘకాల విబేధాలతో పాటు రోహిత్ వేముల ఘటన.ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన విశ్వవిద్యాలయంలో వినిపించిన దేశ వ్యతిరేక నినాదాలు దురదృష్టకరం.అవి గుండెలు పగిలేలా వున్నాయి.వాటికి కారణమైన వారిని చట్టప్రకారం తప్పనిసరిగా శిక్షించాల్సిందే……విద్యార్ధి లోకంపై అణచివేతకు దిగిన ప్రభుత్వానికి మేం బాకాలుగా వుండలేం. ప్రభుత్వానికి చెందిన ఓపి శర్మ వంటి శాసనసభ్యుడు పాటియాలా కోర్టులో గానీ, జెఎన్‌యు వుత్తర గేటు వద్దగానీ చేసిన దాడులు మితవాద ఫాసిస్టు చర్యకు నిదర్శనం…..’ అని నిరసన తెలిపిన ఏబివిపి విద్యార్ధి నాయకులు నూరు కాకుల్లో ఒక్క కోకిల మాదిరి ముగ్గురే కావచ్చు కానీ వారి ప్రకటన సంఘపరివార్‌కు తగలరాని చోట తగిలిన దెబ్బ.
ప్రఖ్యాత జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఢిల్లీ పోలీసులు కొన్ని టీవీ ఛానల్స్ తప్పుడు వార్తల ఆధారంగా తప్పుడు కేసులతో 1975 నాటి అత్యవసర పరిస్థితి మాదిరి వ్యవహరించటం, సంఘపరివార్ శక్తులు పాటియాలో కోర్టులో విద్యార్ధులు, జర్నలిస్టులపై అమానుషంగా దాడి చేసినా, సుప్రీంకోర్టు స్పందించినా దేశ ప్రధాని నరేంద్రమోడీ ఇంతవరకు నోరు విప్పలేదు. గతంలో కూడా పలు వుదంతాలలో ప్రధాని బిజెపికి జరిగే నష్ట నివారణ చర్యలలో భాగంగా నోరు విప్పారే తప్ప సకాలంలో ఎన్నడూ స్పందించలేదు. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో బిజెపి నేతలు, మంత్రులు వ్యవహరించిన తీరుతో ప్రతిష్టను కోల్పోయిన బిజెపిని ఇప్పుడు జెఎన్‌యు వుదంతాలు మరింతగా దెబ్బతీశాయి. అయినా ఎదురుదాడులతో జనం నోరు మూయించాలని చూస్తున్నారు. తమ ప్రభుత్వ చర్యను తాము సమర్ధించుకొనే ధైర్యం లేక తమ కనుసన్నలలో మెలిగే మాజీ సైనికులను ఢిల్లీ వీధులలో ప్రదర్శనలు చేయించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి డ్రామాలు మరిన్ని ఆడించినా ఆశ్చర్యం లేదు. ఈ సమస్యను పక్కదారి పట్టించేందుకు, పార్లమెంట్ సమావేశాలలో ఎదురుదాడికి దిగేందుకు బిజెపి నిర్ణయించినట్లుగా ఒడిషాలో మోడీ ఆరోపణలు వున్నాయి. కొన్ని స్వచ్చంద సంస్ధలకు విదేశీ నిధులు వస్తున్నాయని తమ ప్రభుత్వం దానిని తప్పుపట్టకపోయినా లెక్కల్ని అడగటం ప్రారంభించేసరికి వారంతా కలసి మోడీని కొట్టండి, మోడీని కొట్టండి అని నినదిస్తున్నారని ప్రధాని ఆరోపించారు.
స్వచ్చంద సంస్ధలకు విదేశాల నుంచి వస్తున్న నిధుల గురించి ఒక శ్వేత పత్రం సమర్పించటానికి కేంద్ర ప్రభుత్వానికి సర్వ అధికారాలూ వున్నాయి. అసలెన్ని సంస్ధలున్నాయి, వాటికి ఎంతెంత నిధులు వస్తున్నాయి? వాటికి లెక్కలు చెప్పమని ఎన్నింటిని కేంద్రం అడిగిందీ, ఎన్ని జవాబిచ్చాయి. ఏవేవి ప్రధానిని కొట్టమని చెబుతున్నాయో ప్రకటిస్తే జనానికి అసలు విషయాలు తెలుస్తాయి. నిధులు రావటాన్ని తప్పు పట్టవద్దని అసలు ఎవరు అడిగారు, అడిగితే వూరుకుంటారా ? ఇరవై నెలలు గడిచినా ఏ చర్యలు తీసుకోకుండా ఏ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నట్లు ? ఇప్పుడెందుకు తన ప్రభుత్వాన్ని అస్ధిర పరిచే కుట్ర జరుగుతోందని చీకట్లో బాణాలు వేస్తున్నట్లు ? ఇంత పెద్ద దేశంలో లెక్కలు చెప్పని కొన్ని స్వచ్చంద సంస్ధలు కుట్రలు చేస్తే పడిపోయేంత బలహీనంగా మోడీ సర్కార్ వుందా ? ఒక బూచిని చూపి ప్రజల దృష్టిని మళ్లించటం తప్ప మరొకటి కాదన్నది స్పష్టం.
ఆర్ధిక, పాలనా రంగాలలో తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనేందుకు బిజెపి జాతీయ వాదాన్ని ముందుకు తెచ్చి రానున్న పార్లమెంట్ సమావేశాలలో తప్పించుకోవాలని చూస్తున్నది.ఒకవేళ నిజంగా అదే జరిగితే దీనిలో కూడా బిజెపికి మరో ఎదురుదెబ్బ తగలటం ఖాయం. జనసంఘం నుంచి జనతా తరువాత భారతీయ జనతా ఏ పేరు పెట్టినా అది సంఘపరివార్ రాజకీయ ప్రతినిధిగానే పని చేసింది. జర్మనీ, ఇటలీ వంటి దేశాలలో హిట్లర్,ముస్సోలినీ వంటి ఫాసిస్టులు కూడా జాతీయ వాదం పేరుతో జనాన్ని రెచ్చగొట్టారు.జాతీయోద్యమాలు పరాయిపాలకులకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా వుద్యమాలు. అవి దేశ స్వాతంతంత్య్రాలకు దారితీశాయి. కానీ నియంతల జాతీయ వాదాలు ప్రభుత్వ వ్యతిరేకుల అణచివేతలకు, ప్రపంచ యుద్ధాలకు దారితీశాయి. హిట్లర్ తన జాతీయవాదాన్ని రెచ్చగొట్టేందుకు మొదటి ప్రపంచ యుద్దంలో ఓడిపోయిన జర్మనీపై రుద్దిన ఒప్పందాలతో పాటు యూదు వ్యతిరేకతను రెచ్చగొట్టి తన ప్రాబల్యాన్ని పెంచుకున్నాడు. అందుకే ఈనాడు ఐరోపాలో ఎవరైనా జాతీయవాదాన్ని ముందుకు తెస్తే దానిని ఫాసిజంగా భావించి జనం ఛీకొడుతున్నారు. ఐరోపాలో జాతీయ వాదం అంటే బూతుపదం కన్నా నీచంగా చూస్తారు. దేశంలో వువ్వెత్తున జాతీయోద్యమం జరిగినపుడు సంఘపరివార్ శక్తులు దూరంగా లేదా వ్యతిరేకంగా, చివరికి బ్రిటీష్ వారితో చేతులు కలిపాయి. అందుకు సావర్కర్ లేఖ తిరుగులేని నిదర్శనం. ఇప్పుడు జాతీయ వాదం పేరుతో ఎక్కడలేని దేశభక్తిని తామే కలిగి వున్నట్లు ఫోజు పెడుతున్నాయి.ఈ జాతీయ వాదం ఏ వలస దేశానికి వ్యతిరేకం? సంఘపరివార్ ఆదిపురుషులు జాతీయవాదం ఏమిటంటే హిందూయిజమే జాతీయ వాదం,జాతీయ వాదమంటే హిందూయిజం అని ఎప్పుడో నిర్ధారించారు. హిట్లర్ యూదు , కమ్యూనిస్టు వ్యతిరేకత మాదిరి భారత్‌లో ఇస్లాం, క్రైస్తవ, కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు కాషాయ పరివార్ పూనుకుంది. అందువలన ఏది సిసలైన జాతీయత? ఇప్పుడు కావాల్సింది ఏమిటి అనే చర్చ జరగటం అనివార్యం, ఆరోగ్యకరం కూడా. ఎవరి రంగు ఏమిటో తెలిసి పోతుంది.ముస్లింలను వ్యతిరేకించటం, పాకిస్తాన్‌ను తిట్టిన వారే జాతీయ వాదులుగానూ కానటువంటి మిగతా వారందరినీ జాతి వ్యతిరేక శక్తులుగా ముద్రవేస్తున్నారు. అందువల్లనే కమ్యూనిస్టులు కానటువంటి రాజదీప్ సర్దేశాయ్, బర్ఖాదత్ వంటి జర్నలిస్టులు తాము జాతీయ వాదులం కామని స్పష్టం చేస్తూ తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. మీడియాలో జాతీయత, బిజెపి కుహనా జాతీయత గురించి పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.
మీడియాలో సంఘపరివార్‌కు తోడ్పడే శక్తుల బండారం గూడా ఈ సందర్బంగా బయట పడింది. తాము నిష్పాక్షికం అని చెప్పుకున్నంత మాత్రాన ఆచరణలో అలా వుండరని అనేక ఛానళ్లు, పత్రికలు జెఎన్‌యు వంటి వుదంతాల సందర్భంగా తమ నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నాయి. స్థూలంగా కాషాయపరివార్ జాతీయ వాదాన్ని అంగీకరించి అందుకు అనుగుణంగా రెచ్చగొట్టే శక్తులు, బిజెపి జాతీయవాదాన్ని అంగీకరించకుండా వాస్తవాలను, వాస్తవాలుగా పాఠకులు ముందుంచే వారిగా రెండు శిబిరాలుగా చీలిపోయాయి. రానున్న రోజులలో ఇది మరింత స్పష్టం కానుంది.సంఘపరివార్ చర్యలు,అజెండాతో మీడియాలో ఇంకే మాత్రం కాషాయ పులులు మేకతోళ్లు కప్పుకొని వుండలేని పరిస్ధితి.తమ ఛానల్ జెఎన్‌యు వుదంతంలో వ్యవహరించిన తీరును నిరసిస్తూ జీ న్యూస్ ప్రొడ్యూసర్ విశ్వదీపక్ రాజీనామా చేయటం మీడియాలోని పరిస్ధితికి దర్పణం.వార్తలపై ఎవరైనా ఎటువంటి అభిప్రాయాలనైనా కలిగి వుండవచ్చు. కానీ వృత్తికే కళంకం తెచ్చేలా వీడియోలను తారు మారు చేయటం దుర్మార్గం. పాకిస్తాన్ జిందాబాద్ అని కొందరు జెఎన్‌యు విద్యార్ధులు నినదించినట్లు చూపిన వీడియోలో మార్పులు జరిగాయి.దురభిమానాల కారణంగా భారతీయ కోర్టు జిందా బాద్ అన్న నినాదం కాస్తా పాకిస్తాన్ జిందాబాద్‌గా మారిపోయిందని విశ్వదీపక్ పేర్కొన్నారు.ప్రభుత్వ వైఖరికి అనుకూలంగా వ్యవహరించిన కారణంగా కొందరి జీవితాలు, వారి ఆశలు, కుటుంబాలను ప్రమాదపుటంచులలోకి నెట్టారని ఆయన వాపోయారు. ప్రభుత్వ అధికార ప్రతినిధులా లేక కిరాయి హంతకులా అనే అభిప్రాయం ఎవరికైనా కలిగితే అసలు మనం జర్నలిస్టులమేనా అన్న ఆశ్చర్యానికి తాను లోనుకావటం ప్రారంభమైందని కూడా ఆవేదన చెందారు. ‘ హింసాకాండను రెచ్చగొట్టటానికి, మరియు జనాన్ని దేశద్రోహులు, లేదా జాతి వ్యతిరేకులు అని పిలవటానికి ,మాట్లాడటానికి గాక బెదిరించటానికి మనం టీవీని అనుమతించాలా అని ఎన్‌డిటివి చెందిన రవీష్ కుమార్ ప్రశ్నిస్తున్నారు. పాటియాల కోర్టుల భవనం వద్ద జర్నలిస్టులపై జరిగిన దాడులకు వ్యతిరేకంగా కొందరు జర్నలిస్టులు ప్రదర్శన చేస్తే దానికి సంబంధించిన వార్తల విషయంలో అత్యవసర పరిస్ధితి నాటి స్పందన కనిపించింది. ఆరోజులలో కొన్ని మీడియా సంస్ధలు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే కొన్ని అనుకూలబాకాలుగా వ్యవహరించాయి. అనేక మంది జర్నలిస్టులు దేశానికి విధేయులుగా వుండాలా ఒక రాజకీయ వైఖరి, వ్యవస్దకు విధేయులుగా వుండాలా అనేది తేల్చుకోలేకపోతున్నారు. కొన్ని యాజమాన్యాల కారణంగా జర్నలిస్టులు కూడా ఏ సంస్ధలో వుంటే అది అభిమానించే పార్టీల ప్రతినిధుల మాదిరి వ్యవహరిస్తున్నారు. ఏది ఏమైనా ఎవరు ఎటు అన్నది తేల్చుకొనే విధంగా సంఘపరివార్ ఎగదోస్తున్నది. ఆ విభజన తమకు లాభం అనుకుంటున్నది. జర్మనీ, ఫాసిస్టు హిట్లర్ పరిణామాలను చూసిన తరువాత కూడా ఎవరైనా మూర్ఖంగా, మొరటుగా నిప్పును చేత్తో పట్టుకుంటామంటే చేసేదేముంది, పట్టుకొని చూడమని చెప్పటమే.
21 Sunday Feb 2016
Posted in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS
Tags
|
NHRC Team visits Central Prison, Tihar to inquire into important issues pertaining to Shri Kanhaiya Kumar; inquiry report forwarded to Commission of Police, Delhi and Director General of Prisons, Tihar Jail for comments (19.02.2016) New Delhi, 19th February, 2016 On 16.02.2016, the Commission took suo motu cognizance of the newspaper report published in Hindu newspaper dated 13.02.2016 captioned as “Govt. acts tough, JNU student leader charged with sedition”. It was reported that the President of JUNSU was arrested on the charges of sedition after allegedly raising anti-India slogans. The Commission issued notice to the Home Secretary, Govt. of India, Chief Secretary, NCT of Delhi, Commissioner of Police, Delhi and the Registrar, Jawaharlal Nehru University. On 18th February, 2016, the Acting Chairperson, NHRC directed that a team comprising Sh. C. K. Chaturvedi, Registrar (Law) and Sh. S. K. Jain, SSP (Investigation) may visit Central Prison, Tihar and inquire into the following important issues pertaining to Sh. Kanhaiya Kumar : The NHRC team has submitted a report dated 19.02.2016 with the following findings: i. The Central Prison, Tihar has made special arrangements to ensure safety and security of Sh. Kanhaiya Kumar inside the prison. He has been kept in an independent and separate cell. Dedicated security staff has been deployed to ensure his safety and security round the clock. Several security instructions have been issued by the prison authorities in this regard. He has no complaints against prison official. A copy of the inquiry report submitted by the NHRC team has been forwarded to the Commisioner of Police, Delhi and the Director General of Prisons, Tihar Jail for their comments, to be received by the Commission, on or before 26.02.2016. |
20 Saturday Feb 2016
Posted in AP NEWS, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence
కులాల ప్రస్తావన లేని క్రైస్తవ మతంలో అనేక మంది స్వాతంత్య్రానికి పూర్వమే చేరారు. వారిలో అన్ని కులాల వారూ వున్నారు. ఇప్పుడు చూస్తే మతం మారినా వారి కులాల్లో మార్పులు లేవు. కమ్మ క్రైస్తవులు, రెడ్డి క్రైస్తవులు వివాహాలు వారి కులాల్లోనే జరుగుతున్నాయి. అలాగే ఆ మహానుభావుడు చెప్పినట్లు అందరికీ వుపనయనాలు జరిపి, గాయత్రీ మంత్రం వుపదేశించినా అదే జరిగి వుండేది. కనుక అది పరిష్కారం కాదన్నది స్పష్టం.
ఎం కోటేశ్వరరావు
ధర్మాన్ని రక్షించటం అంటే ? అనే శీర్షికతో రిటైర్డ్ డిజిపి కె అరవిందరావు తన వ్యాసపరంపరలో భాగంగా ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు. ఆయన ప్రస్తావించిన విషయాల మంచి చెడ్డలను పరిశీలించబోయే ముందు ధర్మాన్ని రక్షించటానికి ముగింపులో ఆయన చెప్పిన మార్గంతో ప్రారంభిద్దాం. దళిత, బలహీన వర్గాలను ప్రత్యేకంగా చూసి వారిని సమాజం నుంచి వేరు చేయటం కాకుండా వారితో అగ్రవర్ణాలు తమ సంస్కారాన్ని పంచుకోవాలని దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు చెప్పారని, అందరికీ వుపనయనం చేయాలని, గాయత్రీ మంత్రం నేర్పాలని ఆయన చెప్పిన మాట హాస్యాస్పదంగా కనపడవచ్చు కానీ లోతుగా ఆలోచించాల్సిస విషయం.పైన చెప్పిన వర్గాల వారికి మేలు చేస్తున్నామనే భావంతో వారిని వుద్యమాల్లోకి దింపి మన దేశాన్నీ, సంస్కృతిని ద్వేషించేట్లు చేసేవారిని అడ్డుకోవటానికి ఇదొక మార్గం అని అరవిందరావు గారు సూక్ష్మంలో ధర్మాన్ని రక్షించే మోక్ష మార్గం చెప్పారు. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాల కృష్ణయ్య వంటి మహానుభావులు ఆనాటికి తమకు తోచిన దానిని నిజాయితీగానే చెప్పారు. మన సమాజం ఎంతగా చీలిపోయి వుందంటే కులాల ప్రస్తావన లేని క్రైస్తవ మతంలో అనేక మంది స్వాతంత్య్రానికి పూర్వమే చేరారు. వారిలో అన్ని కులాల వారూ వున్నారు. ఇప్పుడు చూస్తే మతం మారినా వారి కులాల్లో మార్పులు లేవు. కమ్మ క్రైస్తవులు, రెడ్డి క్రైస్తవులు వివాహాలు వారి కులాల్లోనే జరుగుతున్నాయి. అలాగే ఆ మహానుభావుడు చెప్పినట్లు అందరికీ వుపనయనాలు జరిపి, గాయత్రీ మంత్రం వుపదేశించినా అదే జరిగి వుండేది. కనుక అది పరిష్కారం కాదన్నది స్పష్టం.
ఇక అరవిందరావుగారు ఆరోపించినట్లుగా మొదటి విషయం ఈ దేశంలో పుట్టిన వారెవరూ దేశాన్ని ద్వేషించటం లేదు. పుట్టుక అనేది ఒక ప్రమాదం వంటిది. ఎప్పుడు జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఎందుకు తెలియదు. యాదృచ్చికంగా ఒక కుటుంబంలో పుడితే అగ్రకులమని, మరొక కులంలో పుడితే అధమ కులమని వెంటనే ముద్రవేసే కుసంస్కృతిని, సామాజిక దుష్టత్వాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. అలాంటి కులాల అంతరాలను తరతరాలుగా కాపాడుతూ, అనుమతిస్తున్న ‘మను’ సంస్కృతిని కాపాడాలి అని ఎవరైనా అంటే ఏడునిలువులలోతున పాతి వేయాలంటూ దానిని ద్వేషిస్తున్న వారు మెజారిటీగా వున్నారు. సంస్కృతి పేరుతో ఇక్ష్వాకుల కాలం నాటి అడ్డగోలు వ్యవహారాలను రుద్దాలంటే కుదరదు. పనికిరానిదానిని ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఆరోగ్యకరమైన దానిని ప్రోత్సహించటమే మానవ సంస్కృతి. దేన్నయినా మూసిపెడితే పాచిపోతుంది. ప్రతిదాని మంచి చెడ్డలను విశ్లేషించినట్లే సంస్కృతిపై కూడా నిరంతరం చర్చ జరగాలి. నవీకరణ జరగాలి. కానీ అరవిందరావు గారు కొన్ని విశ్వవిద్యాలయాలూ, మీడియాలోనూ జరుగుతున్న చర్చను అసత్య ప్రచారంగా చిత్రిస్తున్నారు. విమర్శలకు రెండు కారణాలంటూ ఒకటి మన దేశాన్ని బలహీన పరచాలనే వ్యూహంలో భాగంగా వస్తున్న వుద్యమాలు, రెండోది నిజంగానే మన వ్యవస్ధలో రావాల్సిన మార్పు. మొదటి అంశాన్ని ఇక్కడ చర్చించటం లేదు, కొంత మంది వేదాలు చదవటానికి అనర్హులు అని గీత గీసినట్లు రెండవది మన పీఠాలు, ఆచార్యుల పరిధిలోది అని చెప్పేశారు.
పోలీసు వ్యవస్ధలో దీర్ఘకాలం పనిచేసిన అరవిందరావు వంటి వారికి విశ్వవిద్యాలయాలూ, మీడియాలో జరుగుతున్న చర్చలు దేశాన్ని బలహీనపరచాలనే వుద్యమాలుగా కనిపించటంలో ఆశ్చర్యం లేదు. ఒక ఆరోపణ చేసి వాటిని ఇక్కడ చర్చించటం లేదు అని తప్పుకుంటే కుదరదు. మీ ఆరోపణ కూడా ఒక మీడియా వేదికలో చేసిందే అని గమనించండి. మీ దగ్గర ఆ చర్చలకు సరైన సమాధానం లేదని అనుకోవాల్సి వస్తుంది. రెండోది మన వ్యవస్ధలో రావాల్సిన మార్పులు పీఠాలు, ఆచార్యుల పరిధిలోనివి అన్నారు. ప్రపంచ మతాల చరిత్రలో ఏ పీఠం లేదా ఆచార్యులు కూడా మార్పులకు శ్రీకారం చుట్టినట్లు మనకు ఎక్కడా కనపడదు. వారిపై తిరుగుబాటు చేసిన వారికి ప్రతి దేశం,ప్రతికాలంలోనూ సామాన్య జనం మద్దతు ఇచ్చారు. మన దేశంలో స్థూలంగా హిందూ మతం అని పిలిచేదానిపై తిరుగుబాటుగానే బౌద్దం,జైనం అవతరించాయి. ఆ హిందూ మతంలో భిన్న భావజాలంతో వున్న శైవ, వైష్ణవ శాఖలు ఎలా కొట్టుకున్నాయో, ఒకదానినొకటి అంతం చేసుకోవటానికి ఎంత రక్తపాతానికి పాల్పడ్డాయో, అవే రాజీపడి బౌద్ధ,జైనాలను, అసలు మతాలనే సవాలు చేసే చార్వాకులు, లోకాయతులను, వారి గ్రంధాలను ఎలా నాశనం చేశాయో చరిత్రలో నమోదయ్యే వుంది. అనేక బౌద్ధ,జైనాలయాలను శివాలయాలుగా మార్చిన చరిత్ర ఆంధ్రదేశంలో అడుగడుగునా కనిపిస్తుంది. అందువలన ఇసు నుంచి తైలాన్ని తీయవచ్చుగానీ పీఠాధిపతుల నుంచి సంస్కరణలు ఆశించటమా? ఇంతకు ముందు జరగలేదు, ఇక ముందు జరగవు. మొత్తంగా చెప్పాలంటే సంస్కృతి మంచి చెడ్డల గురించి చర్చించటానికి, మార్చుకోవటానికి అరవిందరావు వంటి వారు సిద్ధం కాదు.
‘ప్రస్తుతం ఎలాంటి ఘటన జరిగినా దాన్ని మన సంస్కృతితో ముడిపెట్టటం, హిందూమతం అంటేనే బ్రాహ్మణిజం అనీ, బ్రాహ్మణిజం అంటే కులతత్వం అనీ, కులతత్వం అంటే అణచివేత అనే ప్రచారాన్ని చూస్తున్నాం. దీన్ని కేవలం మన దేశంలోనే కాకుండా అనేక పాశ్చాత్య విశ్వవిద్యాలయాల్లో కూడా చర్చించటం, అందుకు మన సమాజం మౌనం వహించటం ప్రమాదకరం.’ అని అరవిందరావుగారు వాపోయారు. పురాతన కాలంలో తక్షశిల, పాటలీ పుత్రవంటి మన విశ్వవిద్యాలయాలకు విదేశాల నుంచి విద్యార్ధులు వచ్చే వారని గర్వంగా చెప్పుకుంటాం. ప్రస్తుతం అంతకంటే విస్తృతమైన ప్రపంచీకరణ యుగంలో వున్నాము. పిల్లి నల్లదా తెల్లదా అని కాదు, అది ఎలుకలను పడుతుందా లేదా అన్నది ముఖ్యం అన్నట్లుగా విమర్శలు సరైనవా కావా అన్నది పాయింటు. అనేక తూర్పు ఆసియా దేశాలలో హిందూమతం, ఆచారాలు వ్యాపించాయి. వర్తమానంలో అనేక దేశాలలో మన దేశం నుంచి వలస వెళ్లిన వారు అక్కడ స్ధిరపడుతున్నారు, దేవాలయాలు నిర్మిస్తున్నారు, మతాచారాలను మరింతగా రెచ్చిపోయి పాటిస్తున్నారు. అందువలన ఎవరు ఎక్కడ చర్చించాలో చర్చించకూడదో గీతలు గీయటం సంకుచితం.
ప్రతిదానికీ సంస్కృతితో ఎవరు ముడిపెడుతున్నారు? మతం వేరు సంస్కృతి వేరు. అన్ని మతాలు,అలవాట్లు, ఆచారాలను సహించటం మన సంస్కృతి. దాన్ని తిరస్కరించటం మత సంస్కృతి.దానిలో భాగంగానే అది ఏమతమైనా ఎవరేం తినాలో, దుస్తులు ఎలా ధరించాలో, ఎలా కూర్చోవాలో, ఎలా పరుగెత్తాలో కూడా నిర్దేశించేందుకు పూనుకున్నారు. మీరే చెప్పినట్లు భారతీయ మూల సిద్ధాంతంలోనే సహనశీలత, విశాల భావాలు వున్నాయనేది నిర్వివాదాంశం అయినపుడు చర్చలపై సమాజం మౌనం వహిస్తున్నదంటే వాటిని అంగీకరించినట్లే, మీ కెందుకు అంత దుగ్ద, లేదూ మీరు మౌనం వీడి చర్చలు, విమర్శలు ఎలా సరైనవికాదో విమర్శించండి. ఇస్లాం పుట్ట ముందే భారత దేశంలో బ్రాహ్మణులు లేత గోమాంసాన్ని లొట్టలు వేసుకుంటూ తినటం గురించి రాసింది వాస్తవమా కాదా? గోవులు, కోడె దూడల మాంసం తినటం గురించి వేదాల్లో వుందా లేదా ? అలాంటపుడు గోవును హిందూ సంస్కృతికి ముడిపెట్టి గోవధ చేసిన వారిని చంపివేయాలని వేదాలు చెప్పాయని తప్పుడు వ్యాఖ్యానాలు చేసే వారి గురించి అరవిందరావు ఏమంటారు ? భారత్‌లో పురాతన కాలంలోనే హిందూ మత భావజాలాన్ని అనేక మంది సవాలు చేశారు. దాన్ని మన సమాజం అంగీకరించింది. అరవిందరావుగారే చెప్పినట్లు వైదిక సంప్రదాయంలోనే శంకరాచార్యులు, రామానుజులు, మధ్వాచార్యులు ఒకరి సిద్దాంతాన్ని ఒకరు విమర్శించుకున్నారు. అలాంటిది వీరందరి సిద్ధాంతాలను కమ్యూనిస్టులో మరొకరో ఎవరైనా విమర్శిస్తే ఎక్కడలేని అసహనం ఎందుకు వెల్లడి అవుతోంది. ఎవరు అవునన్నా కాదన్నా మన దేశం వివిధ మతాల, మతరహిత భావజాలాల కేంద్రంగా వుంది. అలాంటి దానిలో జాతీయత అంటే హిందూయిజమే, హిందూయిజమే జాతీయత అన్న తమ భావాన్ని రుద్దేందుకు కాషాయ తాలిబాన్లు ప్రయత్నిస్తున్నారు.వాదనలో తమతో ఏకీభవించని వారిని అంతం చేసేందుకు కూడా వీరశైవులు వెనకాడలేదని చరిత్ర చెబుతోంది.ఇప్పుడు అది మరో రూపంలో పునరావృతం అవుతున్నట్లు కనిపిస్తోంది.
పురాణాలు, ఇతిహాసాలపై విశ్వాసం వున్న వారి ప్రకారం నాలుగు యుగాలున్నాయి. వాటిలో మొదటిదైన సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాలతో నడిచిందట. బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా సమాజం వున్నప్పటికీ ఎవరికి ఎవరూ తీసిపోయేవారు కాదని, ఎవరి వృత్తి వారికి గొప్పదని, అందరికీ దేవుడు ఒక్కడేనని, ఆయనను ,స్వర్గం చేరుకోవటానికి ప్రతి ఒక్కరికి తపస్సు చేసుకోవటానికి అవకాశం వుందని చెబుతారు.ఈ యుగాలు, సామాజిక తరగతుల గురించి ఎవరికి వారు తమవైన వ్యాఖ్యానాలు చేస్తున్నందున వాటిలో ఒకదానిని నేను ప్రస్తావించాను.త్రేతాయుగం నాటికి ధర్మం మూడు పాదాలు, ద్వాపర యుగంలో రెండు పాదాలు, కలియుగంలో ఒక పాదంతో నడుస్తుందని చెబుతారు. ఇది కలియుగ అంతం కనుక అసలు ఏకపాద ధర్మం అయినా వుందో లేదో తెలియటం లేదని బాధ పడేవారు కూడా లేకపోలేదు. అరవిందరావు వంటి వారు కలియుగ అంతంలో అసలు ధర్మం ఏమిటో అంత స్పష్టంగా తెలియని స్ధితిలో గడిచిపోయిన యుగాలలోని ధర్మాలను ఇప్పుడు అమలు జరపాలని చెబుతున్నారా అనిపిస్తోంది. ఎలా సాధ్యం ? మాతృగర్భం నుంచి ఒకసారి బిడ్డ బయటికి వచ్చిన తరువాత తిరిగి అమ్మకడుపులోకి వెళ్లటం ఎంత అసాధ్యమో గడచిపోయినట్లు చెబుతున్న యుగ ధర్మాలను ఇప్పుడు అమలు జరపటం అంత కష్టం.
సత్యయుగంలో అందరూ సమానమే అని చెబుతూనే శూద్రులు మిగతా తరగతులైన బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులకు సేవలు చేయాలని కూడా చెప్పారు. ఇదొక వైరుధ్యం. సత్యయుగంలో శూద్రులు కూడా తపస్సు చేయవచ్చని చెప్పారు. కానీ త్రేతాయుగం వచ్చే నాటికి శూద్రులు తపస్సు చేయటం ధర్మవిరుద్ధంగా మారిపోయింది. వాల్మీకి రామాయణంలోని వుత్తరకాండలో రాసినదాని ప్రకారం ఒక రోజు ఒక బ్రాహ్మణుడు మరణించిన తన కుమారుడి శవాన్ని తీసుకొని శ్రీరాముడి వద్దకు వస్తాడు. నీవు కచ్చితంగా పాపం చేసిన కారణంగానే తన బిడ్డ మరణించాడని లేకుంటే బతికేవాడని ఆరోపిస్తాడు. ఆ సమయానికి ప్రత్యక్షమైన నారదుడు అసలు విషయం రాముడి పాపం కాదని ఒక శూద్రుడు తపస్సు చేస్తున్న కారణంగానే బ్రాహ్మణ బాలుడు మరణించాడని చెబుతాడు. వెంటనే రాముడు తనిఖీకి బయలు దేరి వెళ్లగా శంబుకుడు కనిపిస్తాడు. రామా నేను బొందితో కైలాసానికి వెళ్లటానికి ఈ తపస్సు చేస్తున్నానని చెబుతాడు.అది అధర్మం అంటూ శంబుకుడిని రాముడు వధిస్తాడు. తన కంటే ముందున్న సత్య యుగంలో శూద్రులు కూడా తపస్సు చేయటానికి అవకాశం వున్న విషయాన్ని రాముడెందుకు గ్రహించలేకపోయాడు. అప్పుడు కానిది తరువాత అధర్మం ఎందుకు అయింది అని ధర్మ చర్చకు ఎందుకు పెద్దలను సమావేశ పరచలేకపోయాడు? నియంతల పాలనలో మాదిరి అంతా రామరాజ్యంలో కూడా ఏకపక్షంగా నడిచినట్లు కనిపించటం లేదూ?అసలు శూద్రులు తపస్సు చేయటం ఎందుకు నిషిద్ధం ? అరవిందరావు వంటి వారు చెబుతున్నట్లుగా వేదాలలో చేసిన వృత్తులు బట్టి వర్ణాలు వచ్చాయంటున్నారే, రాముడి కాలంలో ఆ వేదాలలో చెప్పిన దాని ప్రకారం శూద్రులు తపస్సు చేయటం ఎలా అధర్మం అవుతుంది? అంటే వేదాల స్ఫూర్తిని రాముడి కాలంలోనే తోసిపుచ్చారా ? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సేవచేయటానికి శూద్రులు కట్టుబడి వుండాలి తప్ప ఇతరత్రా పనులు చేస్తే ఇదే జరుగుతుందని శంబుక వధతో రాముడు మిగతా శూద్రులను హెచ్చరించాడా ? నేటి దృష్టితో నాడు జరిగిన వాటిని ప్రశ్నించటం సమంజసమా అన్న ప్రశ్న వెంటనే వస్తుంది. నిజమే ! అది ప్రశ్నించేవారికే కాదు, నాటి ఆదర్శాలను నేటికీ వల్లె వేస్తున్నవారికి అమలు జరపాలని చూస్తున్న వర్తించదా ?
బ్రాహ్మలు కాని వారు పూజా పునస్కారాలు, పౌరోహిత్యం చేయటం వల్ల, కమ్యూనిస్టులు వేదమంత్రాలతో పనిలేకుండా వివాహాలు చేయటం వలన బ్రాహ్మలకు కష్టకాలం వచ్చిందని ఎవరైనా ఫిర్యాదు చేస్తే నారద మునీంద్రుల వంటి వారు నిజమే అని చెబితే ఏ ముఖ్యమంత్రి అయినా అలాంటి వారిపై చర్యలు తీసుకుంటారా ? తనపైన ప్రశ్నించే మరొకరు లేరనే కదా ఎవడో ఏదో అన్నాడని శ్రీరాముడు గర్భిణీ అని కూడా చూడకుండా సీతను అడవులలో వదలి పెట్టి వచ్చాడు. ఇప్పుడు ఎవరైనా నేను రాముడిని అనుసరిస్తున్నాను, నా భార్య శీలం గురించి ఎవరో ఏదో అన్నారు కనుక నేను ఆమెను వదలి వేస్తున్నాను అంటే చెల్లుతుందా? లేదా నేను కృష్ణ భక్తుడిని ఆయన మాదిరి బహు వివాహాలు చేసుకుంటుంటే నిత్య పెళ్లి కొడుకు అని పోలీసులు జైల్లో పెట్టి నా మనోభావాలను గాయపరిచారు అని అంటే కుదురుతుందా ?
ధర్మం నిర్వచనాన్ని ఎప్పుటి కప్పుడు పున:పరిశీలించాలి, మత పెద్దలు తప్ప మరెవరు చెప్పినా దీనికి ప్రామాణ్యం వుండదు అని అరవిందరావు అభిప్రాయపడ్డారు. అది జరిగేదేనా ? మత రాజ్యాలలోనే అలా జరగలేదు. అనేక మంది రాజులు మతాలు మారారు లేదా ఇతర మతాలను అనుమతించారు. ఇప్పుడు అది అసలు కుదిరేది కాదు.మత ప్రతినిధులుగా చెప్పుకుంటున్నవారు రాజ్యాంగాన్నే ధిక్కరిస్తూ మా విశ్వాసంలో న్యాయస్ధానాలు జోక్యం చేసుకోకూడదు, మా మనోభావాలు దెబ్బతినకూడదు అంటున్నారు.ఇటువంటి స్ధితిలో ధర్మాన్ని ఎవరు నిర్ణయించాలి శైవులా, వైష్ణవులా ఇతర శాఖల వారా ?పోనీ వీరంతా రాజీ పడినా, ఇతర మతాల వారి ధర్మాన్ని అంగీకరించే పరిస్ధితి వుందా ?
చివరిగా అరవిందరావు గారి మరో ఆవేదన గురించి చూద్దాం. ‘ధర్మం గురించీ, మత సిద్ధాంతాల గురించీ ఎప్పుడు విమర్శలు వచ్చినా ఆ విమర్శలను ఎప్పటి కపుడు మన ఆచార్యులు ఎదుర్కొన్నారు…..ఎదుటి వాడి సిద్దాంతాన్ని సమీక్షించి తమ సిద్దాంతాన్ని నిలబెట్టుకోవటానికి ప్రయత్నించారు. ఈ సంప్రదాయం గత నాలుగైదు శతాబ్దాలుగా పూర్తిగా లోపించటం, విమర్శలు వచ్చినా మన పండితులు, మత పెద్దలు స్దబ్దంగా వుండటం చాలా ఆశ్చర్యకరం ‘ అని వాపోయారు. మన మతం గురించి విదేశీ విశ్వవిద్యాలయాలలో చర్చించటాన్ని తప్పుపట్టిన అరవిందరావు ఈ విషయంలో పాశ్చాత్యులు కూడా వేలెత్తి చూపారని తన వాదనకు సమర్ధనగా తీసుకున్నారు. ఇది అన్యాయం కదా ? షెల్డన్ పోలాక్ అనే రచయిత ‘పదహారవ శతాబ్దం వరకు వున్న వాడి, వేడి మన పండిత లోకంలో నశించిందని ఆయన అభిప్రాయం. ఆయన చేసిన మిగతా విమర్శలు ఎలా వున్నా ఈ వ్యాఖ్యలో మాత్రం సత్యముంది అని ముక్తాయింపు నిచ్చారు.
‘ఈ కాలమందు మత త్రయము వారు( అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత మత శాఖల్ని ప్రచారం చేసిన శంకర-రామానుజ- మధ్వాచార్వుల గురించి ) తమ తమ మత వ్యాప్తికై పరస్పర హింసా దూషణములతో వివాదపడి హిందూ రాజ్యముల దుర్బలతకు, తుదకు వినాశనమునకు బాగుగా తోడ్పడిరి. విజయనగర సామ్రాజ్య పతనమునదేకు, తర్వాతి యరాజక స్ధితికి దేశము య్కె అత్యంత దయనీయ స్ధితికి ఈ మతత్రయము వారెంత బాధ్యులో, ఎంత గొప్ప భాగస్వాములో నిరూపించుటకు ప్రత్యేక గ్రంధమవసరమగును’ అని సురవరం ప్రతాపరెడ్డి తన ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంధంలో రాశారు. విజయనగరం, కాకతీయ సామ్రాజ్యపతనాలకు ఈ మతాల చిచ్చు ఒక కారణంగా చెబుతారు. అవి పతనమైన తరువాత వాటి స్దానాన్ని నవాబులు, ఆంగ్లేయులు ఆక్రమించిన చరిత్ర తెలిసిందే. ఈ కాలంలో మత కొట్లాటలలతో లాభం లేదని ఆదరించే వారు వుండరని గ్రహించి ఒకరు కొకరు రాజీపడి కొత్త పాలకులను కొలవటానికి, బోగలాలసతకు అలవాటు పడిన మత పెద్దలు, పండిత లోకం వాడి,వేడిగా తిట్టుకోవాల్సిన అవసరం ఏముంది?
20 Saturday Feb 2016
Posted in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS
గత ఎన్నికలలో తాము వ్యక్తిత్వంతో, ఒక విజన్‌తో, వైఎస్‌ఆర్ కుటుంబంపై అభిమానంతో పోటీచేసి గెలిచామని భూమా చెప్పారు. జనం వీటిని నమ్ముతారా ? అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నామని చెప్పేవారు ఇంతకు ముందు తాము ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలలో తమ ప్రాతినిధ్య కాలంలో సాధించిన అభివృద్ధి ఏమిటి? ఇంకా ఏమి మిగిలి పోయి వున్నాయి? వాటిని పూర్తి చేయటానికి పార్టీ మారితే ఎలా అవకాశాలు వస్తాయో శ్వేత పత్రం విడుదల చేయటం అవసరం.
ఎం కోటేశ్వరరావు
ఓకే, భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిల ప్రియ ఇతర సపరివార బంధు మిత్రులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరటానికి లేదా ఫిరాయించటానికి సర్వహక్కులూ వున్నాయి.భూమాకు పార్టీలు మారటం కొత్తేమీ కాదు, కొట్టిన పిండే గనుక మార్గాల గురించి వేరే చెప్పనవసరం లేదు. అభివృద్ధికి అడ్డుపడితే ఎవరినైనా తమ పార్టీలో చేర్చుకుంటాం, మా సహనాన్ని పరీక్షించవద్దు అని వైఎస్‌ఆర్‌సిపికి ముందే తెలుగుదేశం నాయకులు చెప్పారు, ఆ వెంటనే భూమా పార్టీ మారటం గురించి వార్తలు వచ్చాయి. ఎన్నికలలో ఓట్ల లెక్కింపు పూర్తి కాక ముందే తాను పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చాయని చెప్పారు తప్ప వాటిని ఆయన పూర్తిగా ఖండించనూ లేదు తిరస్కరించనూ లేదు. తెలంగాణాలో జరిగిన పరిణామాలను చూసిన తరువాత ఏం జరిగినా ఆశ్చర్యం లేదు. లెక్కలు తేల్చుకోవటాన్ని బట్టి వుంటుంది. పార్టీ మారితే భూమా కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారా అనో, లేకపోతే వైసిపి నాయకుడు జగన్ పనితీరు నచ్చలేదనో ఏదో ఒక కారణం చెప్పవచ్చు. ఏ కారణం చెప్పినా తన అనుచరులతో చర్చించే ఈ నిర్ణయం తీసుకున్నా అని ప్రతివారూ సమర్ధించుకుంటారు. దీనిలో పెద్ద కిక్కుండటం లేదు. మన రాజ్యాంగంలో ఓటర్లను సంప్రదించాలి లేదా వారి అంగీకారం తీసుకోవాలనే నిబంధనలేమీ లేవు గనుక ఫిరాయించటం సులభం. తిరిగి గెలుస్తామనే ధైర్యం వుంటే ఫిరాయింపు చట్టం కింద అనర్హత వేటు పడినా తిరిగి ఎన్నికలలో నిలబడవచ్చు. ఈలోపల ఎంఎల్‌ఏ కాకున్నా ఆరునెలల పాటు మంత్రి పదవిలో వుండవచ్చు కనుక మంత్రిగా ఎన్నికలలో తిరిగి పోటీ చేయవచ్చు. లేదా తెలంగాణాలో మాదిరి వేరే పార్టీలో వుంటూ కూడా మంత్రివర్గంలో చేరవచ్చునని కొత్త మార్గాన్ని ఏర్పరిచారు. స్పీకర్‌ను బట్టి అది వుంటుంది. కోర్టులు కూడా ఏమీ చేయలేవు. లేదా తేలే లోపల ఐదు సంవత్సరాలు పూర్తి అవుతాయి. ఇంకా ఇలాంటివి చాలా చూశాము గనుక పెద్దగా చర్చించాల్సినపని లేదు.
గత ఎన్నికలలో తాము వ్యక్తిత్వంతో, ఒక విజన్‌తో, వైఎస్‌ఆర్ కుటుంబంపై అభిమానంతో పోటీచేసి గెలిచామని భూమా చెప్పారు. జనం వీటిని నమ్ముతారా ? అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నామని చెప్పేవారు ఇంతకు ముందు తాము ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలలో తమ ప్రాతినిధ్య కాలంలో సాధించిన అభివృద్ధి ఏమిటి? ఇంకా ఏమి మిగిలి పోయి వున్నాయి? వాటిని పూర్తి చేయటానికి పార్టీ మారితే ఎలా అవకాశాలు వస్తాయో శ్వేత పత్రం విడుదల చేయటం అవసరం. దీని వలన అనుచరులే కాదు సామాన్య ఓటర్లను కూడా చైతన్య వంతులను చేసిన వారౌతారు. ఓటు వేసిన వారికి కాస్త సంతృప్తి అయినా మిగులుతుంది. పార్టీ మారే వారే కాదు, వారిని చేర్చుకొనే అధికార పార్టీ లేదా ప్రతిపక్షం ఎందుకంటే జగన్ కూడా తనతో టిడిపి ఎంఎల్‌ఏలు టచ్‌లో వున్నారని చెబుతున్నారు గనుక వారు కూడా ఆ నియోజకవర్గాల ఓటర్లకు శ్వేతపత్రం వెల్లడించాలి. ఫలానా నియోజకవర్గంలో ఇంతవరకు జరిగిన అభివృద్ధి ఇది, ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే ప్రతినిధి తమ పార్టీలో వుండి వుంటే అభివృద్ది ఇంకా ఏమి జరిగి వుండేదో, చేర్చుకుంటే ఏమేమి చేయాలనుకుంటున్నామో అని అధికార పార్టీ కూడా ప్రకటించాలి. లేదా అధికార పార్టీ నుంచి ఎవరైనా ప్రతిపక్షంలోకి ఫిరాయిస్తే తమ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా కుంటుపడిందో, పార్టీ మారి దాన్ని ఎలా పట్టాలపైకి ఎక్కించాలనుకుంటున్నారో ప్రతిపక్షపార్టీ అయినా ఓటర్లకు తెలపాలి.
ఏదో ఒక పద్దతి పాటించాలి. కర్నూలు జిల్లాలో భూమా కుటుంబం తెలుగుదేశం పార్టీ నుంచి ప్రజారాజ్యం పార్టీలో చేరింది, తరువాత వైఎస్‌ఆర్‌సిపిలో చేరింది. ఆ కుటుంబ సభ్యులు మధ్యలో కొంతకాలం తప్ప ఎక్కువ భాగం ప్రజాప్రతినిధులుగానే వున్నారు. అందువలన ఒకవేళ పార్టీ మారితే గీరితే ఇంతవరకు తాము ప్రాతినిధ్యం వహించిన కాలంలో సాధించిన అభివృద్ధి ఏమిటో, పార్టీ మారి ఇంకా ఏమి చేయబోతున్నారో చెబితే ఆ కుటుంబంపై వున్న గౌరవం ఇంకా ఇనుమడిస్తుంది. పార్టీలు మారే వారికి ఒక కొత్త ఆదర్శాన్ని చూపినవారు అవుతారు. అభివృద్ధి అయినా మరొక కారణం చెప్పినా నైతిక బాధ్యత ఒకటి వుంటుంది. కలియుగంలో నీతి నియమాలేమిటి తూనా బొడ్డుబాలు అనుకుంటే వేరే విషయం. లేదు కేవలం అధికారం కోసమే పార్టీ మారుతున్నాం అని నిజం చెప్పినా అదీ ఒక నిజాయితీయే ఈ రోజుల్లో, ఏం చెబుతారో చూద్ధాం. రాయలసీమలో ముఠాకక్షలలో ఎన్నోమార్పులు జరుగుతున్నాయి. వారిలో కూడా పాతకాలపు మొరటు పద్దతులు పోయి ఆధునిక సర్దుబాటు ధోరణులు వ్యక్తమౌతున్నాయి. మా ప్రయోజనాలకు మీరు అడ్డురావద్దు, మీకు మేము అడ్డురాము అనే సహనం,సహజీవనం పెరుగుతోంది. ఈ పూర్వరంగంలోనే కర్నూలు జిల్లా తెలుగుదేశం నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశం ఏర్పాటు చేసినట్లు వార్తలు వచ్చాయి. కొంత కాలం క్రితం అక్రమంగా తిన్నవాడెవడో చెప్పాలని నిలదీసిన జనం ఈ రోజు అసలు తినని వాడెవడో చెప్పండని దబాయిస్తున్న రోజులివి.జనం ఇలాంటి ఫిరాయింపులు, అనైతిక వ్యవహారాలను సహించినంత కాలం ఏం జరిగినా ఆశ్చర్యం లేదు.
19 Friday Feb 2016
Posted in Current Affairs, INTERNATIONAL NEWS, Latin America, Left politics
Tags
Allende, Chile, guerrilla fighters, Latin America, MIR, Pinochet
Leaders from the MIR said they intend to distinguish themselves from the two political coalitions that dominate Chilean politics. A faction within Chile's Movement of the Revolutionary Left, which resisted the brutal Pinochet dictatorship, announced that it has begun the process to become a formal political party. The decision of the Movement of the Revolutionary Left, known as the MIR, to become a party represents a significant shift for an organization that holds very strong criticisms of other leftist organizations that participate in Chilean party politics. “We taken the decision to start our process of legalization, convinced that this instrument can be a contribution to the democratization process that is so necessary for Chilean society,” read a statement by the MIR's central committee in January. Secretary-General Demetrio Hernandez said that a group of representatives met with the Electoral Service of Chile to begin the legalization process. "We want to turn to those honest men and women who really want change, who really want democracy in Chile. And we are going to ask them for their support, and we're going to ask that, in turn, they persuade others," said Hernandez. The group has until August to collect a minimum of 8,000 signatures to qualify for legal status. Hernandez said the new party would seek to set itself apart from the two political coalitions that currently dominate Chilean politics. He added that the MIR would pursue forming a new coalition with other leftist parties. The MIR was a significant political force in Chile before and after the 1973 coup that ousted the Popular Unity government of Salvador Allende. Led by the charismatic Miguel Enriquez, the MIR supported the Allende government. After the 1973 coup, many of the MIR's membership refused to go into exile and engaged in armed struggle to topple the dictatorship. Enriquez himself was killed in a gun battle with Pinochet's secret police Oct. 5, 1974. Several former guerrilla fighters throughout Latin America have gone on to become heads of state in their respective countries, including Salvador Sanchez Ceren in El Salvador, Daniel Ortega in Nicaragua, Dilma Rousseff in Brazil, and Jose Mujica in Uruguay. This content was originally published by teleSUR at the following address: "http://www.telesurtv.net/english/news/Former-Guerrilla-Movement-to-Form-New-Party-in-Chile-20160216-0003.html".
19 Friday Feb 2016
Posted in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others, Politics
Tags
రాష్ట్ర విభజనతో తనకేమీ సంబంధం లేనట్లు, వేరే ఎవరో తీరని నష్టం చేసినట్లు చెబుతున్నారు.ఇంతకీ రెండు కళ్ల సిద్ధాంతం, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎట్టి పరిస్ధితుల్లో తీసుకు వస్తా, ఇంటికి ఒక వుద్యోగం ఇస్తా , రాష్ట్రాన్ని సింగపూర్, మలేసియాలా మారుస్తా అని చెప్పిన చంద్రబాబూ ఈయనా ఒకరేనా ?
ఎం కోటేశ్వరరావు
సరైన దర్శకుడు, మాటల రచయిత లేకపోతే ఈ రోజుల్లో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద హిట్‌కు బదులు ఫట్ అవుతున్నాయి. ఒక మహానటుడు పెట్టిన పార్టీకి ఈ రోజు సరైన దర్శకులు, పదునైన డైలాగులు రాసే మాటల రచయితలే కరవయ్యారా ? హత విధీ ఏమి ఖర్మ పట్టినది ? సమర్ధులైన నటులు రంగస్ధలం మీద వున్నపుడు తోటి నటీనటులు తమ డైలాగులు మరిచిపోతే దాన్ని కనిపించకుండా నాటకాన్ని రక్తి కట్టించిన ఎందరో నటుల గురించి మనకు తెలుసు. కానీ తెలుగు దేశం డ్రామాలో ఏ నటుడేం మాట్లాడుతున్నారో, దానికి అర్ధం తెలిసి పలుకుతున్నారా ? వెనుక నుంచి ప్రాంప్టింగ్ సరిగా లేక ఒకటి చెప్పబోయి మరొకటి చెబుతున్నారా ?
ఏమిటిది ? ఎన్ని ఇబ్బందులెదురైతే మాత్రం ఈ మాటలేమిటి ? రాజకీయాలు, విలువలు, ఫిరాయింపు నిరోధక చట్టం, ఫిరాయింపులు, నైతిక విలువలను పాటించాలను కొనే వారంతా రాజకీయాలకు పనికిరారని ఎప్పుడో తేలిపోయింది. అందువలన అ విలువల వలువలు విప్పిన వారు కూడా మరీ ఇంతగా బరితెగిస్తారా అని ఎవరైనా అనుకోవచ్చు. అధికార రాజకీయాలలో ఇలాంటివి సహజం. మహాను భావులు అయారాం గయారాంలు ఎప్పుడో వీటికి ప్రాతిపదిక వేశారు. అందుకే అలాంటి చర్చను రానివ్వకూడదని పాలకపార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. అందుకే వాటి గురించి ఎవరూ మాట్లాడరు.
విషాద నాటకాలు, సినిమాలలో కూడా హాస్యాన్ని పండించే దృశ్యాలు వుంటాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలోని తెలుగుదేశం పార్టీలో కూడా అదే జరుగుతోందా అనిపిస్తోంది. ఏదైనా అకాల వైపరీత్యాలు సంభవించి ఏరులు వరదలై పారినపుడు ప్రాజెక్టుల గేట్లు తెరవండి అని ఆదేశించటం తెలుసు. కానీ ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించేందుకు గేట్లు తెరవండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పార్టీ మంత్రులతో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. చదివేవారికి, వినే వారికి, చూసే వారికి బుర్రల్లేవనుకుంటేనే ఇలాంటి వార్తలను వండి వడ్డిస్తారు. అసలు తెలుగుదేశం ఇతర పార్టీల నుంచి వలసల నిరోధానికి తెరిచిన గేట్లను మూసిందెప్పుడు? అయినా ఈ వార్తలను ఖండించలేదు కనుక నిజమే అనుకోవాలి. ప్రతిదాన్నీ ఎక్కడ ఖండిస్తాం మా ముఖ్యమంత్రి ఆ మాట అన్నట్లు ఆధారాలున్నాయా అంటే ఎవరైనా ఏం చెబుతారు. మీడియాకు లీకులు ఇవ్వటంలో, అవసరమైనపుడు కధలు రాయించుకోవటంలో అందెవేసిన చేయి ఎవరిదో ఎవరికి తెలియనిది. 1950,60,70 దశకాలలో జనం సినిమాల గురించి ముఖ్యంగా పల్లెటూళ్లలో గుంపులు గుంపులుగా చెప్పుకొనే వారు. ఎవరైనా ఒక సినిమా చూసి వస్తే దానిలోని కథను సచిత్రంగా వర్ణిస్తుంటే అబ్బ ఎంత బాగా చెప్పిండు అన్నట్లుగా వినేవారు, సంతృప్తి చెందేవారు. ఇప్పుడు కూడా కొన్ని పత్రికలు, టీవీ ఛానల్సు కూడా అంతకంటే గొప్పగా కధలు చెబుతున్నాయి. మంత్రివర్గ సమావేశాలలో సైతం పక్కనే కూర్చుని విన్నట్లు, స్వయంగా చూసినట్లు తమ ప్రతిభా పాటవాలను ఆ విలేకరులు ప్రదర్శిస్తున్నారు.అయితే ఫిరాయింపుల గురించి చంద్రబాబు నిజంగానే చెప్పి వుంటారనేందుకు ఆస్కారం వుంది. ఎందుకంటే తెలంగాణాలో తగిలిన షాక్ నుంచి ఇంకా ఆయన తేరుకోలేదు.అపర చాణుక్యుడనని తనకు తాను అనుకుంటారో లేదో తెలియదు గానీ తన మీద అనుయాయులకు వున్న అలాంటి విశ్వాసం తగ్గకుండా వుండాలంటే ఏదో ఒకటి చేయాలి కదా ! ఏ మాటకామాటే చెప్పుకోవాలి .చంద్రబాబు తన అనుయాయులకు కన్నుగీటటంలో ఆయన స్టైలే వేరు.
చంద్రబాబు స్వయంగా చెప్పినట్లు తాను అభివృద్ధి చేసిన హైదరాబాదు నగరంలో పూలమ్మిన చోటే కట్టెలమ్మినట్లుగా తెలుగుదేశం పార్టీ ఒక్కటంటే ఒక్క కార్పొరేటర్ స్ధానాన్ని గెలుచుకుంది. మావ తిట్టినందుకు కాదు తోడల్లుడు సానుభూతి పలికినందుకు ఎక్కడలేని బాధ అన్నట్లుగా తమకు ఒక్క సీటు రావటం కంటే తమదే పెద్ద పార్టీ అని బిజెపిని భాగస్వామిగా చేసుకొని పోటీ చేస్తే దానికి నాలుగు సీట్లు రావటం మరింత బాధ కలిగించింది. కంటి చూపు తప్ప నోట మాట రాలేదు. ఈ స్ధితిలో గోరుచుట్టు మీద రోకటి పోటు మాదిరి తెలంగాణాలో శాసనసభా పక్ష నాయకుడే ఫిరాయించటంతో వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో జనం దృష్టి మళ్లించేందుకు తెలుగుదేశం నేతలకు చంద్రబాబు కన్నుగీటినట్లుగా వుంది. వెంటనే కొందరు మంత్రులు వైఎస్‌ఆర్ సిపి నుంచి తమ పార్టీలోకి ఫిరాయించే ఎంఎల్‌ఏల గురించి చెప్పి చంద్రబాబును ఓదార్చే యత్నం చేశారు. కారణాలేమయినా ఒకరిద్దరు శాసనసభ్యులు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశాం తప్ప పార్టీ మారేందుకు కాదని చెప్పారు.ఎంతో ఆశించి, ఏదో జరుగుతుందని భ్రమపడిన వారు ఇంతకాలం అధికారానికి దూరంగా వుండటమే విశేషం. చివరికి తమ నాయకుడి మాదిరి తాము కూడా ఐదు సంవత్సరాల పాటు ఓదార్పు యాత్రలతోనే కాలం గడపాలా అని కొందరిలో ఆలోచన రావటంలో ఆశ్చర్యం ఏముంది. అదేమి చిత్రమో ఎప్పటికప్పుడు కొత్త సాఫ్ట్‌వేర్‌లు, ప్రోగ్రామ్‌లు వస్తున్నా వైఎస్‌ఆర్‌సిపి ఇంకా పాతబడిన ఓదార్పు యాత్రలనే కొనసాగిస్తున్నది.
ఇంత జరుగుతున్న తరువాత తాను మాట్లాడకుండా వుంటే తన శిబిరంలోని వారు ఆందోళన పడరా మరి, దాంతో తాను తలచుకుంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని పడగొడతానని వైఎస్ జగన్‌మోహనరెడ్డి తొడగొట్టారు. 21 మంది తెలుగుదేశ పార్టీ ఎంఎల్‌ఏలు తనతో సంబంధాలలో వున్నారని అయితే వారి పేర్లు అవసరమైనపుడు చెబుతానని, చెప్పిన వెంటనే గంటలో ప్రభుత్వం పడిపోతుందని జగన్ చెప్పారు. మా వారు టిడిపిలోకి వెళ్లటం, వారు మాలోకి రావటం ఎందుకు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు పెట్టమని కూడా జగన్ సవాల్ చేశారు. తాను లేస్తే మనిషిని కానని దారిన పొయ్యే వారిని బెదిరించిన కుంటి మల్లయ్య కధ కొందరికి గుర్తుకు వస్తే రావచ్చు.
జగన్ తొడగొట్టడాన్ని సహించలేని తెలుగుదేశం మంత్రులు మా ప్రభుత్వాన్ని పడగొట్టటం కాదు, మీ వారి చేతే రాజీనామాలు చేయించి, ఎన్నికలు జరిపించి మీ సంఖ్యను మీరు నిలుపుకుంటే మేం దేనికైనా రెడీ అని సినిమా డైలాగులు చెప్పారు. అన్నింటికంటే విచిత్రం ఏమంటే మంత్రాలయం నియోజకవర్గ సభల్లో ప్రసంగించిన వుప ముఖ్యమంత్రి కెయి కృష్ణ మూర్తి ‘ ఓర్పు వున్నంత వరకు సహిస్తాం, ఓర్పు నశిస్తే వైసిపి ఎంఎల్‌ఏలను మా పార్టీలో చేర్చుకుంటాం, ఇక ఎవరూ మిగలరు జాగ్రత్త ! అడుగడునా అభివృద్ధికి అడ్డుపడితే వైసిపి నుంచి జంప్ చేయటానికి సిద్ధంగా వున్న 28 మంది ఎంఎల్‌ఏలను మా పార్టీలో చేర్చుకుంటాం ‘ అని హెచ్చరించారు. వైసిపితో సంబంధాలలో వున్న టిడిపి ఎంఎల్‌ఏల పేర్లు బహిర్గతం చేయాలని ఎంఎల్‌సి ముద్దుకృష్ణమ నాయుడు సవాల్ చేశారు. ఇతర మంత్రులు, నాయకులు ఇలాంటి కామెడీ డైలాగులు సభల్లో చెప్పి జనాన్ని నవ్వించారు. దీన్ని చూస్తే తెలుగుదేశం పార్టీలో తెరవెనుక వుండి మంచి డైలాగులు రాసేవారు, డైరెక్షన్ చేసే సమర్దులు వున్నట్లు కనిపించటం లేదు. అన్ని వారే చూసుకోవాలంటే చంద్రబాబు, లోకేష్ బాబుకు ఎక్కడ సాధ్యం అవుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఇలా వుంటే తెలంగాణా నేతలు మరింత హాస్యం పండిస్తున్నారు. మొగుడు పోతేనేం పొన్నకాయలా గుండు నున్నగా బలే వుందే అన్న సామెత మాదిరి వుంది. టిఆర్‌ఎస్‌కు వందసీట్లు వస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ చేశా , అటువంటి పరిస్ధితి రాకుండా కాపాడి తనను రాజకీయాల్లో నిలబెట్టినందుకు కూకట్‌పల్లి వాసులకు కృతజ్ఞతలంటూ తెలంగాణా టిడిపి నేత రేవంతరెడ్డి సన్మానాలు చేయించుకొని మరీ నవ్వులు పండిస్తున్నారు. హైదరాబాదులో టిఆర్‌ఎస్‌కు వందసీట్లు వస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని రేవంతరెడ్డి ఎన్నికలకు ముందు సవాలు చేశారు. టిఆర్‌ఎస్‌కు 99 వచ్చాయి. తెలుగుదేశం పార్టీ తరఫున ఒకే ఒక్కరు గెలిచారు.ఈ ఒక్క సీటు రానందుకు కెసిఆర్ అసంతృప్తితో వున్నారు, గ్రేటర్ సవాల్‌లో నాదే విజయం అని చెప్పుకున్నారు. ఆ సభకు వచ్చిన అనేక మందికి దేనితో నవ్వాలో అర్ధం కాలేదట. ఇక మిగతా వుపన్యాస విషయానికి వస్తే టిడిపి నుంచి ఫిరాయించిన ఎమ్మేల్యేలది వెన్నెముక లేనిబతుకు అని వర్ణించారు. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ టిడిపిలోకి వచ్చిన వారందరి పరిస్ధితీ అదే. రావటానికి సిద్ధంగా వున్నారని చెబుతున్నవారిదీ అదే స్ధితి అని రేవంత రెడ్డి చెప్పినట్లే.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి శంకుస్ధాపన చేసిన చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ హైదరాబాదు లేకుంటే తెలంగాణాలో ఏముంది అని వ్యాఖ్యానించారు. అన్నింటికంటే విభజనతో రాష్ట్రానికి తీరని నష్టం చేసిన వారే అసూయపడేలా రాజధానిని నిర్మించి తీరతామని చెప్పారు. విద్యార్ధులకు చరిత్ర పాఠాలు ఎందుకు దండగ అన్న చంద్రబాబు నాయుడికి నిజంగా ఎంతో ముందు చూపు వుంది. చరిత్రలో తన గురించి చదువుకోకుండా వుండేందుకే ముందు జాగ్రత్త చర్యగా అలా చేసి వుంటారు. అందుకనే రాష్ట్ర విభజనతో తనకేమీ సంబంధం లేనట్లు, వేరే ఎవరో తీరని నష్టం చేసినట్లు చెబుతున్నారు.ఇంతకీ రెండు కళ్ల సిద్ధాంతం, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎట్టి పరిస్ధితుల్లో తీసుకు వస్తా, ఇంటికి ఒక వుద్యోగం ఇస్తా , రాష్ట్రాన్ని సింగపూర్, మలేసియాలా మారుస్తా అని చెప్పిన చంద్రబాబూ ఈయనా ఒకరేనా ? నేను చరిత్ర విద్యార్ధిని కాదు !
18 Thursday Feb 2016
Posted in BJP, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion
ఎం కోటేశ్వరరావు
జెఎన్‌యులో జరుగుతున్న ఘటనలకు మూలం ఏమిటి ? అని నేను రాసిన అంశంపై వచ్చిన విమర్శల సారాంశం ఏమంటే ఒకటి పూర్తిగా ‘ఎడమవైపు’నుంచే రాశారు, మావోయిజాన్ని విశ్వసించే డిఎస్‌యు అనే విద్యార్ధి సంస్ధ కాశ్మీరీ వేర్పాటు వాదులకు సానుభూతిగా సభ ఏర్పాటు చేయటం నిజమే కదా , అక్కడ జాతి వ్యతిరేక నినాదాలు చేశారు కదా అంటే దానర్ధం వారు కూడా మద్దతు ఇచ్చినట్లే అలాంటపుడు వారిపై చర్య తీసుకుంటే తప్పేమిటి అన్నది ఒక సమర్ధన. ఇవే కాదు, ఇంకా ఎవరైనా చేసే విమర్శలకు ఆహ్వానం. మన దేశంలో రెండువేల సంవత్సరాలకు పూర్వమే తర్క శాస్త్రాన్ని (వాద విద్య) అభివృద్ధి చేసిన వారిలో గౌతముడు ఒకరు.ఈ గౌతముడు పురాణాలలో కనిపించే సప్త రుషులలో ఒకరు గానీ, గౌతమ బుద్దుడు గానీ కాదని గమనించాలి. వేదాలు, వుపనిషత్తులు మొదలైన వాటిని చార్వాకులు, లోకాయతుల వంటి ఆది భౌతికవాదులు ప్రశ్నించటం ప్రారంభించినపుడు వాటికి సమర్ధనగా రూపొందించినదే తర్కశాస్త్రమని ఒక అభిప్రాయం. దానితో ఎవరైనా విబేధించవచ్చు అది వేరే విషయం. శంకరాచార్యుడి చివరి దినాలలో తమకేదైనా వుపదేశం చెయ్యమని శిష్యులు అడిగినపుడు చెప్పిన అనేక అంశాలలో ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే దానికి రంధ్రాన్వేషణ చేయకుండా తర్కబద్దమైన సమాధానం చెప్పాలని వుపదేశించినట్లుగా రాశారు. అందువలన అటువంటి చర్చలు ఎన్నయినా జరపవచ్చు. ఇందుకు ‘కుడి,ఎడమ’లు ఎవరికీ మినహాయింపు కాదు. ఇది మా విశ్వాసం, తర్కానికి, న్యాయశాస్త్రానికి అతీతం అందువలన దీనిపై తర్కించేదేమీ లేదు, మేము చెప్పింది వినాలి తప్ప మరొకటి కాదు, మరీ కాదంటే తంతాం, చంపుతాం అంటే కుదురుతుందా ? సహించాలా ?
దేశద్రోహం ఆరోపణలతో అరెస్టు చేసిన జెఎన్‌యు విద్యార్ధి సంఘ నాయకుడు కన్నయ్య కుమార్‌ను బుధవారం నాడు పాటియాల కోర్టుకు హాజరు పరిచే సమయంలో అతనిపై లాయర్ల ముసుగులో వున్న వ్యక్తులు గూండాల మాదిరి దాడి చేయటం లోకమంతా చూసింది. ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు అది తోపులాటలా కనిపించింది కనుక ఆయనకు వైద్య పరీక్షలు చేయటం అవసరం. వారు లాయర్లా లేక నల్లకోట్లు వేసుకొని వచ్చిన సంఘపరివార్ కార్యకర్తలా లేక లాయర్లలో వున్న దేశభక్తులైన సంఘపరివార్ కార్యకర్తలా అన్నది దాచినా దాగదు. వారు ప్రవర్తించిన తీరు గురించి ప్రత్యక్షంగా చూసిన మరొక లాయర్ చెప్పిన కధనాన్ని ఫిబ్రవరి 18వ తేదీ పత్రికలో హిందుస్తాన్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. అదేమీ కమ్యూనిస్టుల లేదా అభ్యుదయ వాదుల పత్రిక కాదు. ఆ లాయర్ పేరు రాస్తే ఆయన ప్రాణాలకు ఎక్కడ ముప్పు వస్తుందో అని పేరు రాయలేదు. దీన్ని ఎవరైనా కట్టుకధ అంటే చేసేదేమీ లేదు. ఫాసిస్టుశక్తులు, ఫాసిజం లక్షణాలు తప్ప ఇవి మరొకటి కాదు.
‘ బుధవారం నాడు వృత్తి చేస్తున్న ఒక లాయర్‌గా నా ప్రస్తానంలో అత్యంత ఆందోళనకరమైన వుదంతాన్ని చూశాను.అది సాయంత్రం ఒంటి గంట సమయం. పాటియాలా కోర్టుల ప్రాంగణంలో కన్నయ్య కుమార్‌ను చూసేందుకు రెండవ నంబరు గేటు దగ్గర వందలాది మంది లాయర్లు గుమికూడారు.పరిమితమైన సంఖ్యలో మాత్రమే కోర్టు లోపలికి అనుమతించనున్నట్లు ఒక పోలీసు ప్రకటన చేశాడు.అప్పుడు అంతా ప్రారంభమైంది. అందరు జర్నలిస్టులు మరియు జెఎన్‌యు విద్యార్ధులను బయటకు పంపాలని లాయర్లు డిమాండ్ చేయటానికి ఆ ప్రకటన ఒక సంకేతమైంది. కొంతమంది లాయర్ల బృందం బాల్కనీలో గుమికూడి వుంది. ఎవరైనా వీడియో తీస్తున్నారా అని వారు చూస్తున్నారు. ఆ తరువాత దేశభక్తి చర్యగా బాల్కనీ నుంచి ఒక లాయర్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి భారత మాతాకీ జై అంటూ నినాదాలు ఇచ్చాడు. అతని పక్కనే వున్న మరొక లాయర్ కన్నయ్యను తీసుకురానివ్వండి వాడిని సజీవ దహనం చేస్తాము అని అరిచాడు. పోలీసుల పక్కనే వున్న కొంత మంది లాయర్లు దానితో వుత్సాహపడ్డారు. వారిలోని ఒక లాయర్ సెల్‌ఫోన్ తీసి నువ్వు కూడా రా ఒకరిద్దరు జెఎన్‌యు విద్యార్ధులను బాదవచ్చు అని చెప్పాడు.
అది రెండున్నర గంటల సమయం. కన్నయ్య కుమార్ కోర్టు వద్దకు చేరాడు. అతనిని మరొక మార్గం ద్వారా లోపలికి తీసుకు వెళ్లారు. ఇది తెలిసిన లాయర్లు వెంటనే ఆ గేటువైపు వెళ్లి కన్నయ్యపై దాడి చేశారు. ఆ తరువాత గర్వంతో తిరిగి వస్తున్న లాయర్లను నేను చూశాను. వారిలో ఒకరు నేను రెండుసార్లు తన్నాను, ముఖంపై కొట్టాను అని చెప్పాడు. మా నల్లకోట్లు మేము ఒక విద్యావంతులైన తరగతికి చెందిన వారమని వెల్లడించేందుకు వుద్దేశించినవి, కానీ కొంత మంది లాయర్లు బార్ ప్రతిష్టకు మచ్చతెచ్చారు.’ అని చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొన్నది. కావాలంటే అలాంటి వారు నల్ల కోట్లు తీసి వేసి కాషాయ దుస్తులతోనే గూండాయిజం చేయవచ్చు. అప్పుడు సమాజమే వారి సంగతి తేల్చుకుంటుంది. అలాగాక వారు కోర్టులో కన్నయ్యకు వ్యతిరేకంగా తమ వాద విద్య పటిమను ప్రదర్శించి వుంటే దాని గురించి గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ వారు నల్లకోట్లు వేసుకొని శంకరాచార్యుడి వుపదేశాలకు విరుద్ధంగా గూండాయిజానికి పాల్పడ్డారు.ఇలాంటి ‘కుడి’ వారి గురించి ఏమని చెప్పాలి?
మావోయిజాన్ని నమ్మే డిఎస్‌యు కాశ్మీర్ వేర్పాటు వాదులు, దేశద్రోహులతో కలసి సభ జరపటాన్ని ఎలా సమర్ధిస్తారన్నది. ముందుగా ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. మావోయిజం అంటే దేశ వ్యతిరేకం కాదు. మార్క్స్-ఎంగెల్స్ రూపొందించిన దానిని మార్క్సిజం అని పిలిచారు. తరువాత దానిని రష్యాకు అనువర్తింపచేసి విప్లవాన్ని ముందుకు నడిపించిన లెనిన్ అనుభవాలను జోడించి తరువాత కాలంలో మార్క్సిజం-లెనినిజం అన్నారు. ఈ రెండింటినీ మేళవించి ఆసియాలో భిన్నమైన పరిస్ధితులున్న చైనాలో దోపిడీ వ్యవస్ధను కూలదోసేందుకు అక్కడి కమ్యూనిస్టుపార్టీ మావో నాయకత్వంలో అభివృద్ధి చేసిన విధానాన్ని మావోయిజం అన్నారు. అన్నింటినీ కలిపి మార్క్సిజం-లెనినిజం- మావోయిజాల అనుభవాలన్నింటినీ తీసుకొని ఆ తరువాత కాలంలో అనేక దేశాలలో కమ్యూనిస్టులు తమకు అనువైన విధానాలు, ఎత్తుగడలు రూపొందించుకుంటున్నారు.ఈ క్రమంలో భారత్‌లో కొందరు కమ్యూనిస్టులు స్వతంత్ర కార్యాచరణ, ఎత్తుగడలను విస్మరించి తాము చైనా పంధాలో విప్లవాన్ని తీసుకువస్తామని చెప్పేందుకు తమది మావోయిస్టు పంధా అని చెప్పటమే కాక మావోయే మా చైర్మన్ అన్నంత దుందుడుకు వైఖరి తీసుకున్నారు. ఇదంతా ఐదు దశాబ్దాల నాటి చరిత్ర. ఆ వైఖరి విఫలం కావటమే కాక మావోయిజాన్ని అనుసరిస్తున్నామని చెప్పుకొనేవారు చీలికలు పీలికలై పోయారు. ప్రతి ఆందోళనను విప్లవ మార్గంవైపు మార్చాలనే మావో సూత్రీకరణకు తప్పుడు భాష్యం చెప్పి కాశ్మీర్ వేర్పాటు వాదాన్ని సమర్ధించేవరకు వారు పయనించారు. దానితో సిపిఎం, సిపిఐ ఏకీభవించటం లేదు. అలాంటి వారిని సమర్ధించిన వుదంతం చరిత్రలో ఒక్కటంటే ఒక్కటీ లేదు. మరైతే సమస్య ఎక్కడ ?
జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం అరాచకవాదం నుంచి అన్ని రకాల భావజాలాలకు ప్రాతినిధ్యం వహించేవారు వున్న ఒక విద్యా సంస్ధ. ఎవరికి వారు తమ భావజాలాన్ని విద్యార్ధులలో ప్రచారం చేసుకోవటానికి సభలు, సమావేశాలు పెట్టుకోవటం ఎప్పటి నుంచో జరుగుతోంది. అందుకు అధికార యంత్రాంగం కూడా అనుమతిస్తోంది. కాశ్మీర్ సమస్య విషయంలో ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు అక్కడ సమస్యను మరింత క్లిష్టతరం గావించాయన్నది తిరుగులేని వాస్తవం. దానిమీద అనేక తరగతులలో భిన్న అభిప్రాయాలు వున్నాయి. వాటిని చర్చించేందుకు వేదికలను ఏర్పాటు చేసుకున్నారు. దానిలో భాగంగానే ఈనెల తొమ్మిదిన డిఎస్‌యు ఒక సభను ఏర్పాటు చేసింది. అదేమీ రహస్య సమావేశం కాదు, అధికార యంత్రాంగం కూడా అనుమతించింది. తీరా సభ జరగబోయే సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ అఖిల భారత విద్యార్ధి పరిషత్(ఎబివిపి) రంగంలోకి దిగి సభకు అనుమతివ్వటంపై అభ్యంతరం తెలుపుతూ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఆ వత్తిడికి వారు లొంగారు. చివరి నిమిషంలో సభకు అనుమతి రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఆ సమయంలో ఎప్పటి నుంచో అలాంటి సభలు జరపటానికి లేని అభ్యంతరం ఇప్పుడు పెడుతున్నారని ఈ విషయంలో సభ జరుపుకొనేందుకు తమకు మద్దతు తెలపాలని డిఎస్‌యు అక్కడ వున్న విద్యార్ధి సంఘ అధ్యక్షుడు కన్నయ్య, ఇతర సంఘాలైన ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ, ఏఐఎస్‌ఎఫ్ వంటి సంఘాలను కోరారు తప్ప తమ భావజాలానికి మద్దతు ఇవ్వాలని వారు అడగలేదు. దాంతో అధికారులు సభ జరిగే ప్రాంతానికి కొంత మంది భద్రతా సిబ్బందిని పంపటంతో పాటు, మైకులు లేకుండా నిర్వహించుకోవాలని షరతు విధించారు. దానికి కూడా నిర్వాహకులు అంగీకరించారు. ఈ విషయం తెలిసిన ఎబివిపి ఎలాగైనా సరే ఆ సభను జరగనివ్వకూడదని తన మద్దతుదార్లను సమీకరించింది.ఆ సమయంలో కన్నయ్యతో సహా అనేక విద్యార్ధి సంఘాలకు చెందిన వారూ , ఏ సంఘాలకూ చెందని వారూ, డిఎస్‌యు లేదా వారితో ఏకీభవించే ఇతర సంఘాలకు చెందిన వారు వున్నారు. వారిలో వుగ్రవాద సంస్ధలతో సంబంధం వున్న వారు కూడా వున్నారని ఆ వుదంతం తరువాత వెల్లడైంది. సభ నిర్వాహకులు, దానికి హాజరయ్యేందుకు బయటి నుంచి వచ్చిన వారిలో కొందరు భారత వ్యతిరేక నినాదాలు చేశారు. అంతే తప్ప కన్నయ్య లేదా ఎఎఫ్‌ఐ ఇతర సంఘాలకు చెందిన వారు కాశ్మీర్ వేర్పాటు వాద లేక పాక్‌అనుకూల, భారత వ్యతిరేక నినాదాలు చేయలేదు. కొందరు చేసిన నినాదాలను సాకుగా తీసుకొని అక్కడి వామపక్ష విద్యార్ధి కార్యకర్తలను వేధించటానికి, విశ్వవిద్యాలయంలో వున్న భావప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామిక వాతావరణాన్ని లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగిందన్నది స్పష్టం.
బయటి వ్యక్తులు లేదా అక్కడి కొంత మంది భారత వ్యతిరేక నినాదాలు చేసిన సమయంలో విద్యార్ధి సంఘ అధ్యక్షుడు కన్నయ్య మరికొందరు వున్న వీడియోలు తప్ప వ్యతిరేక నినాదాలు చేశారన్న సాక్ష్యాలు లేవు. తాము అ సమయంలో అక్కడ ఎందుకున్నదీ వారు స్పష్టం చెబుతున్నారు, లేరని బుకాయించటం లేదు. ఏబివిపి వత్తిడి, అభ్యంతరం పెట్టింది కనుక అధికారులు డిఎస్‌యు సభను రద్దు చేయాలని ప్రయత్నించారు. ఈ రోజు డిఎస్‌యు సభను అడ్డుకున్న వారు రేపు తమ సభను మాత్రం అడ్డుకోరన్న గ్యారంటీ ఏముంది? అందువలన ఆ సంగతేదో ఇక్కడే,ఇప్పుడే తేల్చుకోవాలని ఇతర సంఘాల వారు కూడా అక్కడే వున్నారు. దీనికి దేశద్రోహం అని పేరు పెట్టారు. ఆ సమయంలో ఎబిబివి ఆరోపణలను ఖండిస్తూ దేశభక్తి గురించి తాము ఎబివిపి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదని కన్నయ్య చేసిన వుపన్యాసంలో కూడా విమర్శ తప్ప అభ్యంతరకర భాష, పదజాలం లేదు. అందువలన ఇప్పుడు జరుగుతున్న రచ్చ లేదా నిరసన, ఆందోళనలకు కారకులు ‘కుడి పక్షం’ తప్ప మరొకరు కాదు. అందుకే చివరికి ఎబివిపిలో కాస్త తర్కబద్దంగా ఆలోచిస్తున్నవారు కూడా దేశవ్యతిరేక నినాదాలు చేసిన వారిని తప్పుపడుతూనే చేయనివారి పట్ల అనుసరించిన వైఖరికి నిరసనగా ముగ్గురు ఎబివిపి కమిటీ నుంచి తప్పు కున్నారు. కేంద్ర ప్రభుత్వ అనుసరించిన వైఖరితో తాము విబేధిస్తున్నట్లు పేర్కొన్నారు. అంటే వారు కూడా దేశద్రోహులను సమర్ధించినట్లా ?
కేంద్ర ప్రభుత్వ కనుసన్నలలో ఢిల్లీ పోలీసు నడుస్తున్నదనటానికి జెఎన్‌యు విశ్వవిద్యాలయ విద్యార్ధుల గురించి ఎలాంటి నివేదిక ఇచ్చారో గురువారం నాటి పత్రికల్లో వచ్చింది. విద్యార్ధులు బీఫ్ పెట్టాలని కోరారని, కొందరు మహిషాసుర వర్ధంతి జరిపారని నివేదికలో ఆరోపించారంటే హిందూత్వ ఎలా తలకెక్కిందో అర్ధం అవుతోంది.అరుణాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేసి తమ కనుసన్నలలో నడిచే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌ను అడ్డుపెట్టుకొని బిజెపి ఏం చేసిందో దేశమంతా చూసింది. అక్కడి ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకు గవర్నర్ చూపిన కారణాలలో రాజభవన్ ఎదుట గోవధ చేశారని కూడాపేర్కొన్నారు. ప్రతిదానికీ ఆవు కధకు లంకె పెడుతున్నారు. అంటే ఎవరు ఏమి తినాలో ఎవరిని అభిమానించాలో,పూజించాలో కూడా మనువాదులు చెప్పినట్లు జరగాలా ? కేంద్రంలోని బిజెపి సర్కార్, వారిని నిత్యం సమీక్షించి, మార్గదర్శనం చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ సంఘపరివార్ దేశం ఎదుర్కొంటున్న అసలు సమస్యలను పక్కన పెట్టి వివాదాస్పద, ఏకపక్షంగా తమ మతభావజాలాన్ని రుద్దే క్రమంలో తెగేదాగా లాగేందుకే నిర్ణయించుకున్నట్లు అనేక పరిణామాల సందర్బంగా అనుసరిస్తున్న వైఖరి వెల్లడిస్తోంది. అందుకే గతంలో పేర్కొన్నదే అయినప్పటికీ మరోసారి హిట్లర్ హయాంలో బందీ అయిన ఒక పాస్టర్ మార్టిన్ నియోమిలర్ రాసిన మేలుకొలుపు అంశాలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. మార్పల్లా అక్కడ నాజీలు అయితే ఇక్కడ హిందూత్వవాదులను చేర్చుకోవటమే. దాన్ని నేటి పరిస్ధితులకు మారిస్తే ఇలా వుంటుంది.
తొలుత వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు,
నేను కమ్యూనిస్టును కాదు కనుక మౌనం దాల్చాను.
తరువాత వారు ప్రజాస్వామిక వాదుల కోసం వచ్చారు,
ప్రజాస్వామ్యం అంటే నాకు విశ్వాసం పోయింది కనుక మిన్నకున్నాను.
తరువాత మహిళల కోసం వచ్చారు,
ఇంటి పట్టున వుండక ఫ్యాషన్లంటూ మగాళ్లను రెచ్చగొడుతున్నారు కనుక మంచిదే అనుకున్నాను.
ఆ వెంటనే ముస్లింల కోసం వచ్చారు,
నేను ముస్లింను కాదు గనుక పట్టించుకోలేదు.
తరువాత వారు దళితుల కోసం వచ్చారు,
వారు అంటరాని వారని మా పెద్దలు చెప్పారు గనుక ఆ ఛాయలకే పోలేదు.
తరువాత వారు బీసీల కోసం వచ్చారు,
నేను బీసి కాదు కనుక చూసీ చూడనట్లు వున్నాను.
చివరికి నా కోసం వచ్చారు,
అప్పుడు చూస్తే అసలు నా వెనుకెవరూ మిగల్లేదు.
చెన్నయ్ ఐఐటిలో,పూనా ఫిలిం ఇన్సిస్టిట్యూట్‌లో, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, కలుబుర్గి, గోవింద పన్సారే, నరేంద్ర దబోల్కర్‌ల వుదంతాలలో ప్రజాస్వామిక వాదులు, భావప్రకటన స్వేచ్చను కోరుకొనే వారు, లౌకిక వాదులు తగినంతగా స్పందించి వుంటే ఇప్పుడు జెఎన్‌యు పరిణామాలు జరిగి వుండేవి కాదు. ఇప్పటి కైనా మేల్కొనకపోతే అన్ని జీవన రంగాలకు ఈ ధోరణి విస్తరిస్తుందని గమనించాలి.
18 Thursday Feb 2016
Posted in AP NEWS, BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS
The Cabinet Committee of Economic Affairs, chaired by the Prime Minister Shri Narendra Modi, has approved construction of six Railway Lines and a Railway bridge to cater to both increased passenger and freight needs in various areas of the country. The proposals will cost over Rs.10,700 crore and most part of the expenditure will be met through extra budgetary resources (Institutional Financing). Details of the six approved projects are as follows:
1) Doubling of Hubli-Chickajur railway line
Doubling of 190 km long Hubli-Chickajur broad gauge single railway line has been approved. The total estimated expenditure will be Rs.1294.13 crore. The project is likely to be completed in 4¼ years during 13th Plan period and will cover the areas of Chitradurga, Davangere, Haveri and Dharwad.
Entire route from Pune-Miraj-Hubli-Bengalore has been identified for doubling which will not only improve smooth flow of traffic but also boost overall development of the region.
This stretch is part of an important rail link of passenger trains between Mumbai and Bangalore and goods trains to the ports at Mangalore. On this route, doubling between Bangalore-Tumkur and Arsikere-Chickajur have already been completed. On balance portion, doubling work between Hubli-Londa part of Hubli-Londa-Vasco-da-Gama, is also in progress.
2) Construction of Wardha (Sewagram) – Ballarshah 3rd railway line
Construction of Wardha (Sewagram) – Ballarshah 3rd railway line of 132 km will be taken up at an estimated completion cost of Rs.1443.32 crore. The project is likely to be completed in five years during 13th Plan period and will be located in Wardha and Chandrapur districts.
The line capacity utilization of the section is saturated and running of additional Mail/Express and Goods traffic over the section cause detention to the trains. Wardha (Sewagram) – Ballarshah section is very important from goods originating point of view of Nagpur Division where many collieries and many sidings are proposed on the section.
3) Doubling of Ramna-Singrauli railway line
Doubling of 160 km long Ramna – Singarauli railway line has been approved at a cost Rs.2675.64 crore and is likely to be completed by 2019-20. The project will cover the districts of Garhwa in Jharkhand, Singrauli in Madhya Pradesh andSonbhadra in Uttar Pradesh.
The Ramna-Singrauli section falls in Dhanbad Division of East Central Railway. At present traffic utilization of the section is 105%, resulting in detention of trains and loss of revenue. In order to attain the desired fluidity and increase in the sectional capacity, doubling of this single line section is very essential from operational point of view. The project will serve the freight and passenger traffic needs in the jurisdiction of Northern Coal Fields and series of power plants and associated small scale industries in and around Anpara and Shaktinagar, namely Anpara Super Thermal Power Plant, RihandSuper Thermal Power Plant, Renusagar Hydro Power Plant,Singrauli Super Thermal Power Plant, Vidhyachal Super Thermal Power Plant.
4) Construction of 3rd railway line between Anuppur-Katni
Construction of 165 km long 3rd railway line between Anuppur-Katni in Madhya Pradesh has also been apporved at a cost of Rs.1595.76 crore. The project is likely to be completed in 5 ¼ years spanning over 12th and 13th plan period.
The project would cover the districts of Anuppur, Shahdol, Umaria and Katni districts of Madhya Pradesh.
There has been tremendous surge in coal and one mining which has been geared up in the recent past and ambitious plans for an enormous leap forward in the ensuing years to tap these resources lying hitherto untapped. As a result of the rapid industrialization, number of industrial townships have also grown up along the project line. These developments have resulted in large demand for additional coaching services on the section. With this anticipated increase of freight traffic, the capacity utilization will reach upto 175%. Apart from this substantial additional coal traffic from IB valley, Korba area, East Corridor and Gevra Road – Pendra Road Project would be channelized through this route to the respective destinations. In order to meet the growth in the freight and passenger traffic, tripling of 3rd line between Anuppur-Katni is essential.
5) Doubling of Katni-Singrauli railway line
Construction of doubling of 261 km long Katni – Singarauli railway at a cost of Rs.2084.90 crore has been approved. The project will be completed in 5 ¼ years. The project would cover the districts of Katni, Shahdol, Sidhi and Singrauli in Madhya Pradesh.
Katni-Singrauli is a critical and busy section carrying coal from Northern Coal Fields towards Western and Northern thermal power plants. This section intersects Allahabad-Mumbai route at Katni. Provision of doubling between Katni-Singrauli section would provide the necessary line capacity for introduction of additional mail/express and passenger trains to serve the people of the area and transportation of coal from collieries. This will also boost overall development of the region.
6) Construction of additional Bridge and doubling project of Rampur Dumra-Tal-Rajendrapul
Construction of additional Bridge and doubling project of Rampur Dumra-Tal-Rajendrapul sector in Bihar at a cost of Rs.1700.24 crore has also got CCEA’s approval today.
The project is likely to be completed by 2019-20. The project is located in Begusarai and Patna districts of Bihar.
The existing rail-cum-road bridge at Hathidah has single line track and doubling is not possible. Present traffic utilization of the section is 123.5%. At present this is the only railway bridge connecting both North and South Bihar. Existing single line has resulted in heavy detention of goods and passenger traffic.
In order to streamline the operation of traffic in this single line section, it is very essential that one additional bridge and doubling of this section is undertaken. By providing this facility, there will be ample fluidity in maintaining train operations as well as introduction of more passenger/goods trains in the section and it will augment line capacity too. This will also facilitate in minimizing the running time of trains between Kiul-Barauni and Mokama-Barauni section and will ease out the existing operational constraints in this section.