• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Religious Intolarence

అంబేద్కర్‌, బుద్ద సబ్బులతో మానసిక బానిసత్వ శుద్ధి !

30 Tuesday May 2017

Posted by raomk in Communalism, Current Affairs, History, INDIA, Literature., Opinion, RELIGION, Social Inclusion

≈ Leave a comment

Tags

Ambedkar, Buddha, Dalit, manuvadis, mental slavery, soaps, Yogi Adityanath

అంబేద్కర్‌, బుద్ద సబ్బులతో మానసిక బానిసత్వ శుద్ధి !

అసంగ్‌ వాంఖడే

ఇదిగో నా నైవేద్యం

మనువు నన్ను మలినం గావించాడు

మీ అసహ్యబుద్ది

మాకు దుర్గంధం వంటి కులనామాన్నిచ్చి వెలివేసింది

గాయాల వాసనతోనే నేను ప్రకాశించాను

నాపై వున్నది అణచివేత జాడలు తప్ప మీ దుర్గంధం కాదు

మీ దేవుడి ప్రసన్నం కొరకు

ఈ రోజు నాకు షాంపూ, సబ్బులు ఇచ్చారు

మైనారిటీల హింస, మానభంగాలను వల్లించే

మీ కంపునోళ్లను కడిగేందుకు వాటినెప్పుడైనా వాడారా

మనువాదం, వర్ణాశ్రమ ధర్మం అని ప్రవచించే

బుద్ధి శుద్ధికి పుపయోగించారా

మీ కానుకలతో

మీరు నా మాన మర్యాదలను మంటగలిపారు

నా నైవేద్యంతో

మీ అహంభావ, గర్వాలను అసహ్యించుకుంటున్నా

మా బాబా సాహెబ్‌ చర్యలు

నా క్షణభంగురమైన వాసనలను శుద్ధి చేస్తాయి

నా కుల అణచివేత, వెలి గాయాలను సబ్బులు మరింత మండిస్తాయి

నాకు మీ సానుభూతి అవసరం లేదు

నాకు మీపై ద్వేషం కావాలి

నిరసన కేకల మధ్య

నా ఆత్మప్రతిష్ట గానం వినిపిస్తాను

అదే నాకు ఆత్మగౌరం, స్వాతంత్య్రాలను,

రణానికి స్వేచ్చ నిస్తుంది.

రెండు సార్ల తిండి కోసం

నేను నీ మలమూత్రాలను మోస్తాను

లేదంటే ఈ సర్వసత్తాక రాజ్యంలో

నేను ఆకలితో నిద్రపోవాలి

సబ్బులు, షాంపులు మీ అజా&క్షన ఆకలిని తప్ప

మా కడుపులను నింపవు

దేశ వెలుగుల ప్రసరణ కోసమే మీ ప్రభువు ఇక్కడున్నాడు

ఆయన ఆహ్లాదం కోసం మమ్మల్ని శుద్ధి చేశారు

భజనపరుల మాదిరి చిరునవ్వులు చిందించమన్నారు

మా అంతరంగం తన మౌనాన్ని వీడితే ఎలాంటి కంపనలు వస్తాయో తెలుసా ?

ఓ దేవుడా మా ఇంటిని చూసేందుకు దయచేయి

అది మీ కాషాయ అంగవస్త్రం కంటే శుభ్రంగా వుంటుంది

అయితే నీ అంతరంగం పరిశుద్ధంగా వున్నపుడు మాత్రమే మాట్లాడు

మనువును తగులబెట్టిపుడు మాత్రమే నవ్వు

నీ హృదయంలో నృత్యం చెయ్యి

నా నిశ్శబ్దం బద్దలు కాబోతున్నది

ఇప్పటికే వుషోదయమైంది

మీరు వెనుదిరిగి వెళ్లే ముందు ఇదే నా నైవేద్యం

నేను అంబేద్కర్‌, బుద్దుడు అనే సబ్బులను అర్పిస్తున్నాను

వెళ్లి మీ మానసిక బానిసత్వాన్ని శుద్ధి చేసుకోండి

మీ తాత్వికతలో మనువు చొప్పించిన కులాన్ని అంతం చేయండి

మీ కాషాయ అంగవస్త్రాన్ని తెల్లగా చేయండి

మా వైపు ఇద్దరు సూర్యులు వుండ కూడదు

మిమ్మల్ని భస్మం చేసేందుకు మా స్వంత సూర్యుడున్నాడు

కొద్ది రోజుల క్రితం వుత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధుడు ఒక గ్రామానికి వెళ్లారు. ఆ సందర్భంగా దళితులకు సబ్బులు, షాంపూలు ఇచ్చి యోగి దర్శనానికి శుభ్రంగా స్నానం చేసి రమ్మని ఆదేశించారు. దానిపై న్యాయవాది, కవి అయిన అసంగ్‌ వాంఖడే స్పందనే ఈ కవిత. అనువాదం ఎం కోటేశ్వరరావు. నేను స్వతహాగా కవిని కాదు కనుక అనువాదంలో ఆ ఆవేశం వుండదు కనుక విమర్శకులు మన్నించాలి. అందువలన ఆంగ్ల మూలాన్ని కూడా ఇక్కడ ఇస్తున్నాను.

Here is my offer
Manu made me unclean.
Your prejudiced mind makes me
reek of caste names and exclusion
I glow with the fragrance of sores,
I stink of oppression and not your shit.

To please your lord, you offered me
soap and shampoo today.
Have you ever used them to clean
those foul smelling tongues,
which talk of raping minorities and violence?
Or used them to clean those brains,
that preach Manuvād and varnashramadharma?

With your offer,
you have abused my dignity.
With my offer,
I am abusing your conceit.

Appropriators of my Babasaheb
act as my ephemeral cleansers.
Soap exacerbates my wounds
of caste oppression and exclusion,
I don’t want your sympathy,
I want your detestation.
I play the song of assertion
in the cries of protests;
It gives me dignity and freedom,
a freedom to fight for.

For two meals
I carry your faeces!
If I don’t, I will sleep
hungry in this Republic.
Soap and shampoo only feed your ignorance,
not my stomach.

Your lord is here to capture the nation’s spotlight
We are bleached, to look presentable;
We are told to cheer like minions,
What will tremble when my insides break their silence?

Oh Lord, come see my home!
It is cleaner than your bhagwa drape.
But talk only when your consciousness is clean;
Smile only when you burn the Manu
dancing in your heart.
For my silence is about to break,
It is dawn already.

Before you turn your back
here is my offer.
I offer you my soaps, Ambedkar and Buddha.
Go clean your mental slavery,
Go annihilate caste and the Manu infused in your reason,
bleach your bhagwa to white.
There cannot be two Suns on this side, and
We have our own, to incinerate yours.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పొట్టి హిట్లర్‌ బాటలో పొడుగు జనాల సృష్టికి ఆర్‌ఎస్‌ఎస్‌ యత్నం !

18 Thursday May 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Arogya Bharati, ‘customised’ babies, best off- springs, Garbh Vigyan Sanskar, Hitler, Nazi Racist project, RSS, RSS ‘customised’ babies, samarth Bharat, uttam santati

ఎం కోటేశ్వరరావు

‘పూనా డక్కన్‌ కాలేజీలో నేను చదువుతున్నపుడు ది ఎలవెన్‌ కాజెస్‌ ఫర్ది డీ జెనరేషన్‌ ఆఫ్‌ ఇండియా గురించి మూడు ఘంటలు ఒక్కబిగిని లెక్చర్‌ ఇచ్చేప్పటికి ప్రొఫెసర్లు డంగై పోయినారు. మొన్న బంగాళీ వాడు ఈ వూళ్లో లెక్చర్‌ ఇచ్చినపుడు ఒక్కడికైనా నోరు పెగిలిందీ ! మన వాళ్లు వట్టి వెధవాయ్‌లోయ్‌ ‘ అన్న గురజాడ గిరీశాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, ఏం తినాలి, ఏం తినకూడదో, ఏది దేశ భక్తి ఏది కాదో , ఎవరిని ప్రేమించాలి, ఎవరిని ప్రేమించకూడదో చెప్పే వారు , వినకపోతే బలవంతంగా తన్ని మరీ చేయించే వారు నానాటికీ పెరిగిపోవటాన్ని చూస్తున్నాం. బహుశా ప్రశ్నించటానికి ముందుకు రాని వారి గురించే వెధవాయ్‌లోయ్‌ అని మహాకవి గురజాడ వ్యంగ్యాస్త్రం వదిలాడనిపిస్తోంది.

అన్నీ వేదాల్లోనే వున్నాయ్‌ ! శాస్త్రకారుడు అలా చెప్పాడు !! అంటే నోరు మూసుకొని చెప్పింది చేస్తున్నాం. మానవ జాతి మనుగడ, నూతన ఆవిష్కరణలకు మూలమైన ఎవరు, ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలా అనే ప్రశ్నలు వేయటాన్ని మనం ఎప్పుడైతే మరచిపోయామో అప్పుడే మన జాతి పురోగతి ఆగిపోయింది. ఎవరైనా అలా ప్రశ్నిస్తే నీకు తెలియదని నోర్మూయిస్తున్నాం. ఈ మధ్య ప్రశ్నించటాన్ని దేశద్రోహంగా, గొర్రెల మాదిరి చెప్పింది వినటం, చేయటమే దేశభక్తిగా భాష్యం చెప్పేవారు తయారయ్యారు. ఈ నయా దేశ భక్తులు చివరకు పరిశుద్ధులైన పిల్లలను పుట్టించేందుకు ఇప్పుడు పడకగదులలో కూడా జోక్యం చేసుకొనేందుకు తయారయ్యారంటే అతిశయోక్తి కాదు.

ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన ప్రధాని నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా పిలుపు ద్వారా ఇక్కడ వస్తువులను వుత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేయాలని చెప్పారు. ప్రధాని మాతృ సంస్ధ వుత్తమ సంతతిని పుట్టించి లేదా వుత్పత్తి చేసి పటిష్ట (స్మార్టు ) భారత దేశాన్ని తయారు చేస్తామని చెబుతోంది. ఎలా ? ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికకు ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్ధల ప్రతినిధులు ఇచ్చిన ఇంటర్వ్యూ లేదా సమాచారాన్ని బట్టి ఎలా చేస్తారో తరువాత చూద్దాం. అంతకంటే ముందు వారి ఆరాధ్యదైవం హిట్లర్‌ ఎలా ప్రయత్నించారో చూడకపోతే దానికి సమగ్రత రాదు. కావాలంటే ఏం చేశాడో ఈ లింక్‌లో చదవండి.http://historacle.org/hitlers_supermen.html తాను నికార్సయిన ఆర్య జాతికి చెందిన వాడినని చెప్పుకున్న హిట్లర్‌ 5 అడుగుల ఎనిమిది అంగుళాల పొట్టి వాడు. తన కంటే పొడవైన, బలిష్ఠులైన శుద్దమైన ఆర్యజాతిని శుద్ధి చేసే, కొత్తగా పుట్టించే కార్యక్రమంలో భాగంగానే దాదాపు అరవైలక్షల మంది యూదులను, భారతీయ మూలాలున్నట్లు శాస్త్రవేత్తలు చెప్పే ఐదు లక్షల మంది ‘రోమా’ సంచార తెగవారిని వూచకోత కోయించాడు. నాశిరకం పిల్లలను కనకుండా నాలుగు లక్షల మంది జర్మన్లకు ఆపరేషన్లు చేయించాడు. 1932లో వుత్తమ సంతతి కార్య క్రమాన్ని ప్రారంభించాడు. దానిలో భాగంగా పిల్లల వుత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేశాడు. వాటిలో పరిపూర్ణమైన మహిళలను, పురుషులను నాజీ పార్టీ ఎస్‌ఎస్‌ సైనికుల ద్వారా చేర్చారు. వారు 1750 నుంచి జాతి పరంగా ఎలాంటి కల్తీకి గురై వుండకూడదని షరతు పెట్టారు. హిట్లర్‌ చచ్చేంత వరకు ఆ కార్యక్రమం కొనసాగి 42వేల మంది పిల్లలను పుట్టించారు. అంతే కాదు, హిట్లర్‌ ఆక్రమణకు గురైన దేశాలలో ఆర్య సంతతికి చెందిన వారిగా భావించిన మహిళలను, పిల్లలను జర్మన్‌ సైన్యం కిడ్నాప్‌ చేసింది. ఒక్క పోలాండ్‌లోనే రెండు లక్షల మంది అలాంటి వారున్నారంటే ఎంత పెద్ద స్ధాయిలో జరిగిందో చూడవచ్చు. అది జర్మనీకే పరిమితం కాలేదు, 1974లో అక్కడి సుప్రీం కోర్టు రద్దు చేసే వరకు అమెరికాలో కూడా అరవై వేల మంది మహిళలకు అలాంటి ఆపరేషన్లే చేశారని, అమెరికా వలస విధానంలో ఐరిష్‌, తూర్పు ఐరోపా యూదులు, ఆసియన్లు, ఆఫ్రికన్లు నీచజాతుల వారని వర్ణించినట్లు ప్రముఖ విశ్లేషకుడు ప్రబీర్‌ పురకాయస్ధ తన విశ్లేషణలో పేర్కొన్నారు.http://newsclick.in/rss-marketing-illegal-mumbo-jumbo-science-making-superbabies

అలాంటి కార్యక్రమ ప్రారంభం గుజరాతులో జరిగింది.ఆరోగ్య భారతి పేరుతో గత పది సంవత్సరాలుగా అక్కడ ప్రయోగాలు జరుపుతూ 2015 నుంచి దేశమంతటికీ విస్తరించాలని నిర&ణయించారు. ఇందుకు అవసరమైన నిధులను విద్యాభారతి అనే సంస&ధ ద్వారా సమకూర్చుతున్నారు. గుజరాతు, మధ్యప్రదేశ్‌లో పది కేంద్రాలు ఏర్పాటు చేశారు, వుత్తర ప్రదేశ్‌, బెంగాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే వీరు ఇలాంటి ‘సంస్కారం ద్వారా 450 మంది వున్నత లక్షణాలు గల పిల్లలను పుట్టించారు. 2020 నాటికి పతి రాష్ట్రంలో ఇలాంటి వారిని పుట్టించేందుకు ‘గర్భ విజా&క్షన అనుసంధాన కేంద్రాలను’ ఏర్పాటు చేయనున్నారు. వీరంతా ఎవరు ? ఇంకెవరు ఆర్‌ఎస్‌ఎస్‌ వారే. వారు నడిపే అనేక సంస్ధలలో ఒకటి ఆరోగ్యభారతి. దానికీ వారికి వున్న సంబంధం గురించి దిగువ లింక్‌లో వున్న సమాచారాన్ని ఆసక్తి వున్న వారు చదువుకోవచ్చు.https://www.altnews.in/link-arogya-bharati-promises-genius-babies-rashtriya-swayamsevak-sangh-rss-opindia-couldnt-find/ సైన్సు పేరుతో చేస్తున్న ఈ కార్యకలాపాలను ప్రశ్నించకపోతే ఏం జరుగుతుంది? ఈ శక్తులు ఆరాధించే హిట్లర్‌ జర్మనీలో ఏం చేయించాడో తెలుసుకున్న తరువాత అయినా ప్రశ్నిస్తారా ? గిరీశం చెప్పిన దాన్ని నిజం చేస్తారా ?

ప్రస్తుతం ఆధునిక ఆవిష్కరణలుగా పరిగణిస్తున్న టెస్టు ట్యూబ్‌ బేబీల మొదలు పెట్రోలుతో పని లేకుండా ఎటు కావాలంటే అటు తిరిగే, ఎంత మంది ఎక్కినా ఒకరికి ఖాళీ వుండే ఖండాంతర విమానాలు, ఆయుధాల సమాచారం అంతా వేదాల్లోనే అన్నీ వున్నాయష అని చెప్పటమే తప్ప ఎందుకు వెలికి తీయలేదు అన్న హేతువాదుల ప్రశ్నకు సమాధానమా అన్నట్లు వాటి బదులు ‘నమ్మకం తప్ప’ ఆధారాలు చూపనవసరం లేని వుత్తమ పిల్లలను పుట్టించే ప్రయత్నాలు వున్నాయి. అయితే ఇవి నాజీల బాటలో వున్నాయి. దానికి భారతీయత రంగు అద్దే క్రమంలో ఆయుర్వేదం, పురాతన విజా&క్షనం ఆధారం అని చెబుతున్నారు. బిజెపి నేత తరుణ్‌ విజయ్‌ నల్లగా వుండే దక్షిణ భారతీయులతో మేము సామరస్యంగా కలసి వుండటం లేదా అంటూ ఆఫ్రికన్లపై న్యూఢిల్లీ సమీపంలో జరిగిన దాడి సందర్భంగా తన అంతరంగాన్ని వెల్లడించారు.బహుశా అలా ఎక్కువ కాలం కలసి జీవించలేరు కనుకనే ముందుగా పొడవైన, తెల్ల పిల్లల కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రయోగాలు చేపట్టింది అనుకోవాలి.

మే నెల ఆరు, ఏడు తేదీలలో ఆరోగ్యభారతి కొల్‌కతాలో గర్భ సంస్కార కార్యక్రమాన్ని తలపెట్టింది. దాన్ని అభ్యంతర పెట్టిన ఆ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ వినతిని స్వీకరించిన హైకోర్టు ఆ కార్యక్రమాన్ని వుపన్యాసాలకే పరిమితం చేసి వాటిని వీడియో తీసి కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. మిగతా విషయాలను తరువాత విచారిస్తామని తెలిపింది. ఆరోగ్య భారతి సంస్ధ కార్యకలాపాలు, ప్రచారం చట్టవిరుద్దమైనవి. జెనెటిక్‌ ఇంజనీరింగ్‌ ద్వారా కూడా గర్భసంస్కారం చేయవచ్చని చెబుతూ తాము చెబుతున్న దానికి శాస్త్రీయ ముసుగువేసుకొనే ప్రయత్నం కూడా వారు చేస్తున్నారు. ‘ కొడుకు పుట్టాల ‘ అని కోరుకొనే వారు తామర తంపరగా వున్న మన దేశంలో ఆ వ్యామోహం లేదా బలహీనతను సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నించే యత్నం జరుగుతోంది. ఆరోగ్యభారతి ద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా అలాంటి కోరికలు వున్నవారిని ప్రోత్సహించటం తప్ప ఇది మరొకటి కాదు. ఏమో ఏ పుట్టలో ఏ పాముందో, ఒకసారి ప్రయత్నం చేసి చూస్తే పోలా పోయేదేముంది అనే తత్వం మన నరనరాన జీర్ణించి వుంది. అందుకే రోడ్డు మీద పోయే వారు కనిపించిన ప్రతి రాయికీ ఒక నమస్కారం పడవేసి పోతుంటారు. మేము పక్కా లోకల్‌ అని చెప్పుకొనే వారు ప్రతిదానికీ ఏదో ఒక పశ్చిమ దేశాన్నో, వ్యక్తులనో వుదాహరిస్తుంటారు. దానికీ ఒక లాజిక్కు వుంది. మన వేద, శాస్త్రవిజా&క్షనాన్ని పశ్చిమ దేశాల వారు ముఖ్యంగా జర్మన్లు గ్రహించారని చెబుతుంటారు. గర్భ సంస్కారానికి కూడా అదే చెబుతున్నారు.

ఆరోగ్య భారతి జాతీయ కన్వీనర్‌ డాక్టర్‌ హితేష్‌ జానీ చెప్పినదాని ప్రకారం తలిదండ్రులకు ఐక్యూ (తెలివితేటలు) తక్కువగా వున్నా, చదువు సంధ్యలు లేకపోయినా గర్భ శుద్ధి చేయించుకుంటే పొట్టిగా, నల్లగా వున్న తలిదండ్రులకు కూడా తెల్లగా, పొడవుగా వుండే పిల్లలు పుడతారు. ఈ ప్రక్రియను హిందూ శాస్త్రాలు చెప్పాయి. రెండు దశలలో తలిదండ్రులు కాదలచుకున్న వారిని శుద్ధీకరణ చేస్తారు. వుత్తమ సంతతిని పుట్టించే ఈ పధకానికి జాతీయ కన్వీనర్‌గా వున్న డాక్టర్‌ కరీష్మా నర్వానీ చెప్పినదాని ప్రకారం ఇప్పటికే అలాంటి పిల్లలను పుట్టించేందుకు విశాఖ, విజయవాడలలో కూడా కార్యక్రమాలను నిర్వహించారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జర్మనీలో ఈ ఆయుర్వేద పద్దతి ద్వారా వుత్తమ సంతతిని పుట్టిస్తున్నారు. హోమియో పతి వైద్యాన్ని తొలుత ప్రతిపాదించిందీ లేదా దాని గురించి రాసింది జర్మన్‌ భాషలో, రోమ్‌ సామ్రాజ్యంలో, ప్రస్తుతం జర్మనీలో భాగంగా వున్న శాగ్జనీ ప్రాంతంలోనే హోమియో పతికి మారుపేరైన హనిమన్‌ పుట్టాడు, వైద్యం చేశాడు. అయినప్పటికీ జర్మన్లు మన ఆయుర్వేదంతో వుత్తేజం పొందారని ప్రచారకులు చెప్పిందాన్ని మనం నమ్మాలి. సహజ పద్దతులలో జోక్యం చేసుకోవటంగా గర్భశుద్ధిని పరిగణించరాదని, ఆయుర్వేద పద్దతి ప్రకారం దాన్ని చేస్తున్నామని, మనకు కావలసిన బలిష్టులైన, తెలివి తేటలు గల పిల్లలను ఎలా పుట్టించవచ్చో ఆయుర్వేదంలో వుందంటూ, ఆరో నెలలో ఐక్యూ (తెలివితేటలు) అభివృద్ధి అవుతుందని, అయితే అందుకు తల్లులు నిర్ధేశిత పద్దతి ప్రకారం చెప్పిన దాని ప్రకారం తినటం, వినటం, చదవటం వంటివి చేయాలని కరిష్మా చెప్పారు. ఇలా చేస్తే జన్యుపరమైన లోపాలను మరమ్మతు చేసి బిడ్డలకు రాకుండా చేయవచ్చట. దానికి గాను మూడు నెలల్లో శుద్ధి ప్రక్రియను రెండు దశలలో చేయాలట. ఒకటి నాడీ శుద్ధి, రెండవది దేహశుద్ధి. వాటి ప్రకారం పురుషుడి వీర్యం, స్త్రీ అండాన్ని ముందుగా శుద్ధి చేసి జన్యుపరమైన లోపాలేమైనా వుంటే సరి చేసి బిడ్డకు రాకుండా చేస్తారు. తరువాత శాస్త్రాలలో పేర్కొన్నదాని ప్రకారం జాతకాలు, గ్రహాల స్ధితి గతులను బట్టి భార్యా భర్తలు ఏ సమయంలో కలవాలో వుత్తమ సంతతి ప్రాజెక్టు వైద్యులు నిర్ణయిస్తారట. దాని ప్రకారం వారు కలవాలి. గర్భధారణ నిర్ధారణ అయిన తరువాత ఏ ఆహారం తీసుకోవాలో, ఎంత తీసుకోవాలో నిర్ధేశిస్తారు. ఆ ప్రకారం చేస్తే ఆ మహిళ వుత్తమ సంతితికి జన్మనిస్తుంది. అశోక్‌ కుమార్‌ వర్షనే అనే ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారకుడు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినదాని ప్రకారం గర్భ సమయంలో మహిళ శ్లోకాలు, మంత్రాలను జపిస్తే అది బిడ్డ మానసిక అభివృద్ధికి తోడ్పడుతుంది. ఆమె అలాంటి జీవితాన్ని ఆ సమయంలో గడిపిత పిల్లలు అదనంగా మూడు వందల గ్రాములు పెరుగుతారు, పురుటి నొప్పులు రాకుండా ప్రసతవం అవుతుందట. ఇంతకూ ఈ ప్రక్రియ ఎలా వెలుగులోకి వచ్చిందీ ?. గర్భ సంస్కారాన్ని నలభై సంవత్సరాల క్రితం ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ సిద్ధాంత వేత్త ఒకరు జర్మనీ మాతృమూర్తిగా పరిగణించబడే ఒక మహిళను కలసినపుడు ఆమె వివరించిందట.మీరు భారత్‌ నుంచి వచ్చారు కదా అభిమన్యుడి గురించి వినలేదా అని అడిగి తమ దేశంలోని నూతన తరం గర్భ సంస్కారం ద్వారా పుట్టిన కారణంగానే తమ దేశం ఇంతగా అభివృద్ధి చెందిందని చెప్పిందట. అయితే ఆమె ఎవరో లేదా ఆమెను కలిసిన ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖుడి పేరు అశోక్‌ కుమార్‌ చెప్పలేదు. గర్భంలో వుండగానే అభిమన్యుడు పద్మవ్యూహంలో ప్రవేశించటం గురించి వినటానికి కారణం గర్భ సంస్కారమే అని అందువలన దానిని పాటిస్తే పుట్టక ముందే పిల్లలకు ముందే అన్నీ నేర్పవచ్చన్నది అంతరార్ధం.ఈ విషయం సదరు ప్రచారకుడికి జర్మనీ వెళితే కాని ‘జ్ఞానోదయం’ కాలేదన్నమాట!

బుర్ర శుద్ధి చేసుకుంటే ఇక్కడ కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. హిందువుగా పుట్టు హిందువుగా జీవించు అన్న నినాదం ఇటుకల గోడలతో పాటు ఫేస్‌బుక్‌ గోడల నిండా సంఘపరివార్‌ సంస్ధలు చెడరాశాయి. పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. గర్భ శుద్ధి కార్యక్రమం ఒక్క హిందువులకేనా, ఇతర మతాల వారికి కూడా విస్తరిస్తారా ? శ్లోకాలు, మంత్రాలు పలకటం రాని వారి సంగతి ఏమిటి ? హిందువులలోనే తమ కులం, గోత్రం కాని వారితో వివాహాలు చేసుకుంటే అమ్మాయిలు, అబ్బాయిలను పట్టుకొని హతమారుస్తున్న పరిస్ధితులు వున్నపుడు తమ కంటే తక్కువ అని భావించే కులాల వారికి కూడా వుత్తమ సంతతిని పుట్టించటాన్ని అగ్రకులాలనుకొనే వారు సహిస్తారా ? ఆర్‌ఎస్‌ఎస్‌ దాని రాజకీయ సంస్ధ అయిన పూర్వపు జన సంఘం, తరువాత జనతా పార్టీలో విలీనమైన ఆ భాగం, తరువాత దాని నుంచి బయటకు వచ్చి బిజెపిగా ఏర్పడిన వారు కాంగ్రెస్‌ నుంచి దేశాన్ని విముక్తి చేయాలని చెబుతున్నారు. తామే అసలు సిసలు అయిన దేశ భక్తులమని నొక్కివక్కాణిస్తున్నారు. తమది నిర్మాణాత్మక కార్యక్రమం అని కూడా చెప్పుకుంటారు. అలాంటి వారికి వుత్తమ సంతతి ద్వారా జర్మనీ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అభివృద్ధి చెందిన విషయం 40 ఏండ్ల నాడే తెలిసినపుడు వెంటనే ఎందుకు ప్రారంభించలేదు? ప్రారంభించి వుంటే ఇప్పటికి నలభై సంవత్సరాల వయస్సున్న వారందరిలో కనీసం సగం మంది అయినా వుత్తమ సంతతిగా తయారై దేశానికి ఎంతో మేలు జరిగి వుండేది. ప్రపంచంలో అగ్రస్ధానంలో వుండే అవకాశాలను ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు దెబ్బతీశారు.తమ స్వంత పాలకుడు ప్రధాని అయిన తరువాతనే తమ వద్ద వున్న పురాతన పరిజ్ఞానాన్ని బయటకు తీయాలనే సంకుచిత ధోరణులకు గురైనట్లు కనిపిస్తోంది. జపాన్‌ కూడా రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఎలక్ట్రానిక్స్‌, ఆటో, నిర్మాణం వంటి అనేక రంగాలలో అభివృద్ధి చెందింది. మరి వారు ఏ ప్రక్రియతో వుత్తమ సంతతిని పుట్టించారు. ఐటిని అభివృద్ధి చేసిన అమెరికన్లు వుత్తమ సంతతిని ఎలా పొందారు. ఆర్ధికంగా రెండో స్ధానంలో వున్న జపాన్‌ను వెనక్కు నెట్టటానికి చైనీయులు ప్రత్యేకంగా వుత్తమ సంతతిని పుట్టించినట్లు మనం ఎక్కడా చదవలేదు.

చరిత్రలో ఏ దేశం కూడా పటిష్టంగా వుండటానికి ఇలాంటి వుత్తమ సంతతిని పుట్టించే కార్యక్రమం చేపట్ట లేదు. అలాంటపుడు ఇదేమి వెర్రి ! గర్భ సంస్కారం ద్వారా వున్నత సంతతిని పుట్టిస్తామని చెప్పటమే ఆశాస్త్రీయం. మన పురాతన గ్రంధాలలో వున్నదానినే తాము బయటకు తీస్తున్నామని చెప్పే నకిలీ శాస్త్రవేత్తల బండారాన్ని శాస్త్రీయ జ్ఞానంపై ఆధారపడిన వారు బయటపెట్టాల్సిన అవసరం వుందో లేక గిరీశం తరగతిలో చేరిపోవాలో తేల్చుకోవాలి. ఆమెగానో అతడిగానో వుండాలి తప్ప దాన్నీ నమ్ముతాము, దీన్నీ నమ్ముతాము అంటూ అటూ ఇటూ గాకుండా వుంటే ప్రయోజనం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చల్లేవారు పార్టీ ప్రతినిధులు-రాసే వారు ప్రచారకర్తలు !

12 Friday May 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Gandhi Peace Foundation, Indian media, journalism, journalists, Kuldip Nayyar Award, ndtv, NDTV anchor Ravish Kumar, Ravish Kumar

‘సిరా’ వినియోగంపై సుప్రసిద్ధ జర్నలిస్టు రవీష్‌ కుమార్‌ వ్యంగ్యాస్త్రం

జర్నలిజంలో విశిష్ట స్ధానం సంపాదించిన ఎన్‌డిటివీ యాంకర్‌ రవీష్‌ కుమార్‌కు కులదీప్‌ నయ్యర్‌ జర్నలిజం అవార్డు ప్రదానం సందర్భంగా మార్చి 19న చేసిన ప్రసంగ అనువాదమిది. జర్నలిస్టులలో ఆలోచన పాదుకొల్పేదిగా వున్నందున పాఠకుల కోసం దీనిని అందచేస్తున్నాం

ప్రపంచ వ్యాపితంగా చులకనగా చూస్తున్న తరుణంలో సత్కారం పొందటం ఒక విధంగా వినోదంగా వుంది. అలారం కొట్టే గడియారాలు కొన్ని దశాబ్దాల క్రితమే మూగపోయినప్పటికీ ఇంకా అలారం కొడుతున్న గడియారాన్ని చూస్తున్నట్లుగా ఇది వుంది. అంటే మనం అప్పటి నుంచి మెల్లగా చేసే శబ్దాలను బట్టి సమయాన్ని గ్రహించే ఇంద్రియ సామర్ధ్యాన్ని మనం కోల్పోయాం. నుక మనం వర్తమాన కాల న్యాయా అన్యాయాలను మదింపు చేయటంలో కూడా విఫలమౌతున్నాం.ఈ రోజులు ఎలా వున్నాయనే భావన కలుగుతోందంటే మనం ఒక పరీక్ష హాలులో వున్నట్లు మనలో వున్న తప్ప చేసే వారిని ప్రత్యక్షంగా పట్టుకోవాలని పిలుస్తున్నట్లు, ధృడ నిశ్చయంతో దాడి చేసే నిఘా బృందాలు, ఆకస్మిక దాడుల దళాలు నిరంతరం దాడులు చేస్తున్నాయన్నట్లుగా వుంది. మనం పదే పదే శోధించబడుతున్నాం. ఎవరైతే తమ మనసులోని మాటలను స్వేచ్చగా వెల్లడిస్తామో వారిపై మరుగుజ్జు భూతాలు (ట్రోల్స్‌) తమ లక్ష్యంగా చేసుకుంటాయి.

కొత్త దాడి బృందం వచ్చి నపుడల్లా ‘పరీక్ష హాలులో ‘ వున్న వారి వెన్నులో వణుకుపుడుతోంది. ఏ నేరమూ చేయకుండానే భయం కొల్పుతున్నాయి. తప్పు చేసిన వారిని పట్టుకోవటం గాక అమాయకులను ఎక్కువగా భయకంపితులు గావిస్తున్నాయి. ఇది నకిలీ డిగ్రీలు-నిజమైన డిగ్రీల గురించి చర్చలు చేస్తున్న ఈ కాలంలో వివిధ రూపాలలో ధర్డ్‌ డిగ్రీ( సాధారణంగా పోలీసుల చిత్ర హింసలను ఆంగ్లంలో అలా సంబోధిస్తారు, టీవీ చర్చలు కూడా అంతే చిత్రహింసలు పెడుతున్నాయన్నది ప్రసంగకర్త విరుపు ) తిరిగి వచ్చింది. ఈ కాలంలో న్యూస్‌ యాంకర్‌ నూతన అధికార కేంద్రంగా మారారు. తాను కోరుకున్నదానికి భిన్నంగా ఎవరైనా మాట్లాడితే హఠాత్తుగా విరుచుకుపడతారు. వ్యతిరేక అభిప్రాయం కలిగి వుండటం నేరం. ప్రత్యామ్నాయ అభిప్రాయం కలిగి వుండటం ఒక తీవ్రమైన నేరం, వాస్తవాలను ముందుంచటం అశ్లీల చర్య, నిజాయితీగా వుండటం పాపం. తొలుత టీవీలు మన సాయంత్రాలను మాత్రమే బందీలుగా చేశాయి. ఇప్పుడు ఈ ‘పోలీస్‌ స్టేషన్లు ‘ రోజంతా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. మీరు తొలి అవార్డుకు ఒక న్యూస్‌ యాంకర్‌ను ఎంపిక చేశారు.అంటే ఇంకా బతికుండేందుకు మీరు సాహసం చేస్తున్నారనేందుకు ఈ రుజువు చాలు. వారి బ్రతుకు ఒక భ్రమ అయినప్పటికీ మరో ఓటమిని ఎదుర్కొనే సాహసం చేయటానికి సిద్ధంగా వుండే జనాలు ఇంకా వున్నారు. నేను కృతజ్ఞుడనై వున్నాను.

గాంధీ పీస్‌ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు.ఈ అవార్డును చెమటోడ్చిన జర్నలిస్టులు ఏర్పాటు చేశారనే స్పృహ వున్న వాడిని. ఈ వృత్తిలో నాకంటే పెద్ద వారి నుంచి ఏది తీసుకున్నప్పటికీ దానినొక బహుమానంగా నేను భావిస్తాను. నా ప్రార్ధనలకు సమాధానం వంటిది. మన మందరం కులదీప్‌ నయ్యర్‌గారిని గౌరవిస్తాము. మీరు రాసిన వాటిని మిలియన్ల మంది చదివారు. ప్రతి రోజు ఎవరి పేరునైతే ద్వేషించారో, విషం చిమ్మారో వారి ఎల్లలలో మీరు జ్యోతులను వెలిగించారు. వాస్తవానికి మనలో ఎంత మందిమి కనీసం ప్రేమ గురించి మాట్లాడుతున్నాం, జనం ప్రేమ గురించి ఆలోచిస్తున్నారా అన్నది నాకు సందేహమే. మనం ఇంకేమాత్రం రోజూ వుషోదయాలతో లేవటం లేదు, దానికి బదులు వాట్సాప్‌లో మనకు శుభోదయాలు చెప్పారా అనే వెతుకులాటతో రోజును ప్రారంభిస్తున్నాం. దీనిని చూస్తుంటే వాట్సాప్‌లతో సూర్యుడు వుదయించటంతో ప్రపంచం ప్రారంభమౌతుందా అని పిస్తోంది. త్వరలో మనం గెలీలియోను మరోసారి శిక్షించబోతున్నాం, ఈ సారి దానిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తాం.

అవకాశాలను కనుగొనే దశ ఇది. నూతన, మిగిలిపోయిన అవకాశాలకోసం మనం నిరంతరం చూస్తున్నాము, ఆ నూతన ఆశలు, అవకాశాలను రక్షించే, పెంచి పోషించే జనం కోసం కూడా చూస్తున్నాము. అయినప్పటికీ ఈ ఆశలు, అవకాశాలు నేడు సన్నగిల్లుతున్నాయి. వీటి మధ్య మన ఆశలు ఏకాంతంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. మనం ఎంతకాలం బతికి వుంటామనేది మనందరినీ వేధిస్తున్నది. మన చుట్టూ ఎలా వున్నప్పటికీ అర్ధవంతంగా ఎలా జీవించాలనే అంశాన్ని మనం మరచిపోయాము. ఇటువంటి పరిస్ధితిలో మన శక్తిని, ఆవేశాన్ని తిరిగి రగిలించుకోవాల్సి వుంది. మీ ప్రశ్నలను సానపెట్టండి, మీరు నమ్మిన రాజకీయ బృందాలను ప్రశ్నించండి. ఆ బృందాలు మన విశ్వాసాన్ని దెబ్బతీశాయి. మీకు విశ్వాసం లేని వారిని కూడా ప్రశ్నించండి. మన సమాజంలో ఇతరులతో మాటా మంతీ పూర్తిగా నిలిచిపోయింది. నేడు సమాజం తన ఆశలన్నింటినీ మార్పు తెచ్చే రాజకీయ పార్టీలపై పెట్టుకుంది.రాజకీయంగా శక్తి వంతులైన వారు మాత్రమే ప్రమోదం లేదా ప్రమాదకరమైన మార్పులను గానీ తేగలరని సమాజానికి ఇప్పుడు తెలుసు. ఈ కారణంగానే రాజకీయపార్టీలపై పెట్టుకున్న ఆశలనుంచి వెనక్కు పోవటం లేదు. జనం ఈ సాహసం చేయటాన్ని కొనసాగిస్తారు. రాజకీయపార్టీలు ప్రతిసారీ వారిని విఫలం చేస్తాయి, అయినప్పటికీ మరోసారి వాటిపై నమ్మకం పెట్టుకుంటారు.

తమ సభ్యులు వివిధ మార్గాలను వెతుక్కొనేందుకు నిరంతరం తమ నుంచి వెళ్లిపోవటాన్ని రాజకీయపార్టీలు గమనించాయి. అలా వెళ్లేవారు సామాజిక మార్పునకు రాజకీయాలను ఒక సాధనంగా ఇంకే మాత్రం పరిగణించటం లేదు. అటువంటి వారు తగ్గిపోతున్న కారణంగా రాజకీయపార్టీలు నైతికంగా పతనం అవుతున్నాయి. రాజకీయ పార్టీలకు కొత్త రూపునిచ్చి పున:నిర్మాణం చేయాల్సి వుంది. దయచేసి మీ అంతర్గత వైరుధ్యాలను పక్కన పెట్టండి. గత 30,40 సంవత్సరాలుగా వాటిని చూస్తున్నాము. వామపక్షవాదులు, గాంధీవాదులు, అంబేద్కరిస్టులు మరియు సోషలిస్టులు వారి ప్రధాన రాజకీయ నిర్మాణాల నుంచి వైదొలిగారు. దీంతో ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు ప్రత్యామ్నాయ రాజకీయాల ఆశయాలను కోల్పోయాయి. అటువంటి పార్టీలలోకి తిరిగి రండి, వాటి బాధ్యతలను స్వీకరించండి. గతాన్ని మరచిపోండి. నూతన రాజకీయాల కోసం కష్టపడండి. మన అసహాయత, పిరికితనాన్ని గుర్తించటానికి ఇది మంచి సమయం. మనల్ని మనం నిజాయితీతో విశ్లేషించుకోవటానికి ఈ చీకటి సమయాలు సరైన అవకాశం.

నా జర్నలిజం కారణంగా నాకు ఈ అవార్డునిచ్చారు. మీరు ఏదైనా వుందని ఆలోచిస్తున్నట్లయితే ఆ సంక్షోభం నేడు జర్నలిజంలో లేదని చెప్పటానికి ఇది నాకు ఎంతో సంతోషం కలిగిస్తోంది. రాజధాని నుంచి చిన్న జిల్లా కేంద్రాల వరకు వున్న సంపాదకులందరూ ఒక రాజకీయపార్టీ సైద్ధాంతిక తుపానులో కొట్టుకుపోవటానికి సంతోషంగా వున్నారు. అయినప్పటికీ మనం వారిని విమర్శిస్తున్నాము. వారు ఎంతో సంతోషంగా వున్నారని మనం అంగీకరించాల్సి వుంది. తాము నేర్పుగల జర్నలిస్టులుగా వున్నామని ఈ కారణంగానే వారు భావించగలుగుతున్నారు. గత యాభై అరవై సంవత్సరాలుగా రాజకీయ వస్తువుతో మిళితం చేసేందుకు మీడియా నిరంతర ప్రయత్నాలు చేసింది. హోటళ్లు, దుకాణ సముదాయాలు, గనుల కౌలు మరియు ఇతర లైసన్సులు పొందటంద్వారా వారి ఆకలి తీరలేదు. వారి ఆత్మలింకా అసంతృతోనే వున్నాయి. ఇప్పుడు అవి శాంతిని పొందాయి. అంతిమంగా అధికార రాజకీయాలతో భాగంగా వుండాలన్న మీడియా కల నెరవేరింది.

భారతీయ మీడియా నేడు పారవశ్య స్ధితిలో వుంది. స్వర్గానికి చేరుకోవాలంటే మెట్లను కనుక్కోవాల్సి వుందని జనాలు మాట్లాడుకున్న రోజులున్నాయి. నేడు అలాంటి వారు భూమి మీదనే స్వర్గాన్ని కనుగొన్నారు.వారికి మెట్లదారి ఇంకేమాత్రం అవసరం లేదు. మీరు నా మాటలను విశ్వసించకపోయినట్లయితే మీరు ఏ వార్తా పత్రికనైనా చదవండి లేదా న్యూస్‌ ఛానల్‌ను అయినా చూడండి. ఒక ప్రత్యేక రాజకీయ అజెండాకు విశ్వాసపాత్రులుగా వుండేందుకు మీడియా తహతహలాడుతున్నట్లు మీకు స్పష్టంగా కనిపిస్తుంది. దశాబ్దాల నిరాశా నిస్పృల తరువాత మాత్రమే మీరు ఈ బ్రహ్మానందాన్ని చూడగలరు, ఎంతటి బాధనైనా తేలికగా తీసుకుంటారు. అలంకరించుకున్న ఈ యాంకర్లు మీకు ఇంతకు ముందెన్నడూ ఇంత అందంగా కనిపించి వుండరు. లేదా ఒక మహిళా యాంకర్‌ ప్రభుత్వాన్ని ఎంతో అందంగా పొగడటాన్ని చూసి వుండరు. ఇప్పుడు ప్రభుత్వం ఎలా వుందో జర్నలిస్టులు కూడా అలాగే వున్నారు.

మీకు పోరాడాలని వుంటే వార్తా పత్రిక, టెలివిజన్‌తో పోరాడండి. మునిగిపోతున్న జర్నలిజం గురించి మీ ధృడ వైఖరిని కోల్పోకండి. జర్నలిస్టులు సైతం కాపాడాలని కోరుకోవటం లేదు. మిగిలి వున్న వారెవరైనా వుంటే వారిని కూడా సులభంగా తొలగించి వేస్తారు.ఏ ఒక్కరినైనా బతికిస్తే పరిస్ధితికి అది ఎలా తోడ్పడగలదు. సంస్ధలు మొత్తంగా మతపూరితం గావించబడ్డాయి. భారత్‌లో జర్నలిజం మతోన్మాదాన్ని వ్యాపింప చేస్తోంది.అది రక్తదాహంతో వుంది. ఏదో ఒక రోజు జాతి మొత్తాన్ని రక్తసిక్తం గావించనుంది. తన అజెండాను విజయవంతంగా ముందుకు తీసుకుపోయినట్లు ఈ రోజు కనిపించకపోవచ్చు. కానీ దాని ప్రయత్నాలను మనం విస్మరించకూడదు. అందువలన మనకు ఎదురైన వాటి గురించి ఎవరైనా, ప్రతివారూ దీని గురించి ఆలోచించవలసిన అవసరం ఏర్పడింది. వార్తా పత్రికలు, టీవీ ఛానల్స్‌ రాజకీయ పార్టీల శాఖలుగా తయారయ్యాయి. రాజకీయ పార్టీల ప్రధాన కార్యదర్శుల కంటే యాంకర్లు ఇప్పుడు ఎక్కువ అధికారం కలిగి వున్నారు. ఈ నూతన నిర్మాణాలపై ప్రతి ఒక్కరూ పోరాడకుండా నూతన రాజకీయ ఆలోచనలు ఒక రూపం తీసుకోవు. జరుగుతున్న వాటిని నేనెందుకు ప్రశ్నించాలి అనే విధంగా ప్రతి వారి బుర్రలను తయారు చేసే విధంగా ఆధిపత్యం వహించటంలో వారు కృతకృత్యులయ్యారు. ఎవరైతే సిరా చల్లుతారో వారిని పార్టీ అధికార ప్రతినిధులుగా నియమిస్తున్నారు. ఎవరైతే సిరాతో రాస్తారో వారు కేవలం ప్రచారంలో మాత్రమే పొల్గొంటున్నారు. వర్తమాన జర్నలిజం వర్తమాన ప్రచారంగా మారింది.

అయితే సాధ్యమయ్యేవాటిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్న జర్నలిస్టులను మనం ఎలా విస్మరించగలం? ఈ అవకాశాలు చివరికి అంతరించుతాయి కానీ వారి వారసత్వ సొత్తు మాత్రం భవిష్యత్‌లో మనకు సాధికారతనిస్తుంది. ఈ జర్నలిస్టులు ఎప్పుడైతే ఇచ్చకాలమారితనంతో అలసి పోతారో లేదా వంచన ద్వారా ఓడిపోతారో అప్పుడు తమ గాఢనిద్ర నుంచి మేలుకుంటారు. ఈ అశాభావాలు మరియు అవకాశాలే వారిని రక్షిస్తాయి. అందుకే మన ఆశలను, అవకాశాలను కొనసాగించాలని నేను అంటాను. ఈ రోజులను ఇంద్ర ధనుస్సు వంటి ఆశలతోనో లేదా వైఫల్య దృష్టితోనో చూడవద్దు. మనం ఒక పెద్ద ఇంజను వస్తున్న రైల్వే లైనుపై వున్నాం, పారిపోవటానికి లేదా మనల్ని మనం రక్షించుకోవటానికి గాని సమయంలేని స్ధితిలో వున్నాము. ఆశ లేదా వైఫల్యానికి గాని అవకాశం లేదు. మనం స్వయంగా రంగంలోకి దిగాలి. మనకు సమయం తక్కువగా వుంది దాని వేగం ఎక్కువగా వుండాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బాబరీ విధ్వంస కుట్ర కేసు విచారణ మధ్యంతర ఎన్నికలకు బాట వేయనుందా ?

19 Wednesday Apr 2017

Posted by raomk in AP, BJP, Communalism, Congress, Current Affairs, Gujarat, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Telangana

≈ Leave a comment

Tags

Guajarat., LOK SABHA, lok sabha midterm poles, Narendra Modi, Trial in Babri Masjid Case

Image result for babri masjid demolition

ఎం కోటేశ్వరరావు

గడువు ప్రకారం 2019లో జరగాల్సిన మన లోక్‌సభ, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముందే జరుగుతాయా ? అన్న వూహాగానాలు చెలరేగుతున్న తరుణంలో బాబరీ మసీదు కూల్చివేత కుట్రకేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన కీలకమమైన తీర్పు మధ్యంతర ఎన్నికలను మరింత వేగిరం చేయనున్నాయా ? దీనికి తోడు బాబరీ మసీదు కూల్చివేత లో కుట్రపూరిత నేరారోపణ నుంచి ఎవరికీ మినహాయింపు ఇవ్వనవసరం లేదని, రెండు సంవత్సరాలలోగా విచారణ పూర్తి చేయాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అందువలన దాన్నింక వాయిదా వేయటానికి వీలులేదు. ఇప్పుడున్న స్ధితిలో ఆ కేసులో వచ్చే తీర్పు ఎలా వుంటుందనేదాని కంటే బిజెపి అగ్రనాయకులపై విచారణ జరపాలని కోర్టు చెప్పటమే రాజకీయంగా బిజెపికి తొలి చెంపపెట్టు. కరసేవపేరుతో బాబరీ మసీదు కూల్చివేత వాస్తవం. అందుకు పధకం రూపొందించిన వారి బండారాన్ని బయట పెట్టటం, కూల్చివేసిన వారిని శిక్షించటం రాజ్యధర్మం. వీటన్నింటి పూర్వరంగంలో తమ విధానాలను మరింత గట్టిగా అమలు జరపాలంటే మరింత బలం కావాలని, స్పష్టమైన తీర్పు ఇవ్వాలనో మరొక సాకుతోనో కమల దళపతులు కొత్త పల్లవి అందుకోనున్నారా ?

1971 పార్లమెంట్‌ ఎన్నికలలో అక్రమాలకు పాల్పడినట్లు రుజువు కావటంతో ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని, ఆమె ఆరు సంవత్సరాల పాటు పోటీ చేయాటానికి అనర్హురాలని 1975 జూన్‌ 12న అలహాబాద్‌ కోర్టు తీర్పు అదే నెల 26న దేశంలో అత్యవసర పరిస్ధితి విధింపునకు దారి తీసిన విషయం తెలిసిందే. బాబరీ మసీదు కూల్చివేత కుట్ర కేసు అలాంటి పరిణామానికి దారితీసే అవకాశం లేదు. అయితే సరిగ్గా 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు గనుక కోర్టు తీర్పు వెలువడితే, అది బిజెపి నేతలను నిందితులుగా నిర్దారిస్తే పరిణామాలు ఎలా వుంటుంది అన్నది ఆసక్తికరం. దాని కంటే ముందు ప్రజాస్వామ్య విలువలకు పెద్ద పీట వేస్తానని చెప్పే నరేంద్రమోడీ తన రాజధర్మాన్ని ఎలా పాటిస్తారు అన్నది తేల నుంది. ఒక కేసులో నిందితులుగా విచారణ ఎదుర్కొనేవారు అధికార పదవులలో కొనసాగవచ్చా ? కేంద్ర మంత్రి వుమా భారతిని మంత్రిగా వుంచుతారా లేక తొలగిస్తారా ? ఒక వేళ కొనసాగిస్తే అలాంటి ఇతరుల గురించి బిజెపి నోరు మూతపడాల్సి వుంటుంది. రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రచారంలోకి వచ్చిన లేదా తెచ్చిన అద్వానీకి కోర్టు నిర్ణయం పిడుగువంటిదే. బాబరీ మసీదు కూల్చివేత ఘటనతో తాత్కాలికంగా అయినా మధ్యతరగతిలో అనేక మంది బిజెపికి దూరమయ్యారు. పాతిక సంవత్సరాల తరువాత కేసు తీర్పు కుట్రను నిర్ధారిస్తే అదే పునరావృతం అవుతుందా అన్నది ప్రశ్న. అదే మధ్యతరగతి ఇటీవలి కాలంలో మోడీ మోజుతో తిరిగి బిజెపి వైపు చేరింది. కుట్ర నిజమే అని ఒక వేళ కోర్టు నిర్ధారిస్తే ఇప్పుడున్న స్ధితిలో హిందూత్వ శక్తులు మరింతగా రెచ్చిపోవచ్చు. లేదని వస్తే చూశారా మేము ఎలాంటి కుట్ర చేయలేదు, ప్రజలే కూల్చి వేశారని అమాయకపు ఫోజు పెట్టవచ్చు. కాంగ్రెస్‌తో సహా అన్ని పాలకవర్గ పార్టీలు ఓట్ల కోసం మతోన్మాదంపై అంత కరకుగా వుండటం లేదు. బిజెపి మాదిరి మెజారిటీ, మైనారిటీ మత ప్రభావిత ఓట్ల కోసం సంతుష్ట రాజకీయాలకు పాల్పడుతున్నాయి. బిజెపికి బీ టీములుగా తయారవుతున్నాయి.అయితే దేశ వ్యాపితంగా తమ పాలన సాగాలని కోరుకుంటున్న బిజెపి కోర్టు తీర్పు ఎలా వచ్చినా నిండా మునిగిన తమకు ఇంకా చలేమిటనే వైఖరితో రిస్కు తీసుకుంటుందా ? అది చెప్పే హిందూత్వలో ఇమడలేని వారు మన దేశంలో మైనారిటీలు, దళితులు, గిరిజనులు 40 కోట్ల మంది వరకు వున్నారు. అంత మంది ఓట్లు లేకుండా ఏ పార్టీ అయినా దేశవ్యాపితంగా అన్ని రాష్ట్రాలలో అధికారాన్ని ఎలా సాధించగలుగుతుంది.

రాజకీయ నాయకుల మాటలకు అరా&థలే వేరులే అని బ్రిటన్‌ ప్రధాని థెరేసా మే రుజువు చేశారు. 2020 వరకు గడువున్న తమ పార్లమెంట్‌ను రద్దు చేయాల్సిన అగత్యం లేదంటూ నమ్మబలికిన థెరెస్సా మే ఆకస్మికంగా జూన్‌ ఎనిమిదిన ఎన్నికలు జరపనున్నట్లు ప్రకటించారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం నిర్ణీత గడువులోపల పార్లమెంట్‌ను రద్దు చేయటానికి వీలులేదు. ఏదో ఒక ప్రభుత్వం కొనసాగాల్సిందే. అయితేనేం చట్టమన్నతరువాత లొసుగు లేకుండా వుండదన్నట్లు మూడింట రెండు వంతుల మంది ఎంపీల మద్దతు వుంటే రద్దు చేయవచ్చన్న అవకాశాన్ని వుపయోగించుకొని ఆమేరకు పార్లమెంట్‌లో ఒక తీర్మానం చేయనున్నారు. పోయేదేముంది అవకాశం వుస్తుందేమో అని ఎదురు చూసే ప్రతిపక్షం లేబర్‌ పార్టీ కూడా అందుకు సై అంది. అందువలన లాంఛనంగా పార్లమెంట్‌ రద్దు, ఎన్నికలు జరగాల్సి వుంది. నిజానికి బ్రిటన్‌ కన్సర్వేటివ్‌ ప్రభుత్వానికి ఆకస్మికంగా వచ్చిన ముప్పేమీ లేదు, నాయకత్వాన్ని సవాలు చేసే వారు కూడా లేరు. బ్రెక్సిట్‌ కారణంగా తన విధానాలను పక్కాగా అమలు జరపాలంటే తాజా ప్రజాతీర్పు కోరటం అవసరమని ప్రధాని థెరెస్సా ప్రకటించారు. ఏ వంకా లేకపోతే డొంకట్టుకు ఏడ్చారన్న సామెత వూరికే పుట్టలేదు. బ్రిటన్‌ ఆర్ధిక వ్యవస్ధ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్ధితినుంచి తప్పించుకొనేందుకు ఇదొక ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. ఆమె ఏ విధానాలను అమలు జరిపినా మద్దతు ఇచ్చే పాలక పార్టీకి సంపూర్ణ మద్దతు వున్నప్పటికీ ఎన్నికలకు తెరతీశారు.

మన దేశంలో కూడా గడువు ప్రకారమే ఎన్నికలంటూ గంభీరంగా నేతలు ప్రకటనలు చేస్తున్నప్పటికీ నిప్పులేనిదే పొగరాదన్నట్లుగా అధికారంలో వున్న పార్టీలలో కనిపిస్తున్న పరిణామాలు, ఇతర అంశాలను చూస్తే జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఏ అంశాలు ఇటువంటి వూహాగానాలకు తావిస్తున్నాయో చూద్దాం. తెలంగాణాలో చంద్రశేఖర రావు వివిధ కార్పొరేషన్లకు, ఇతర పదవులను తన పార్టీవారితో నింపటం, వివిధ కులాల వారిని బుజ్జగించేందుకు తాయిలాలు ప్రకటించటం, రిజర్వేషన్ల పెంపుదలకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశ నిర్వహణ, ప్రత్యర్ధి రాజకీయపార్టీలపై అధికారపక్ష దాడి తీవ్రతరం వంటి వన్నీ కొన్ని సూచనలు. అటు ఆంధ్రప్రదేశ్‌లో కొంత మంది దెప్పి పొడుస్తున్నట్లుగా జయంతికి, వర్ధంతికి కూడా ఇంకా తేడా తెలియని కుమారుడికి చంద్రబాబు నాయుడు అమాత్యపదవి కట్టబెట్టటం, మంత్రివర్గ విస్తరణ ఎన్నికల కోసమే అన్నది విశ్లేషకుల అభిప్రాయం.

ఇటీవలనే ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి.వాటిలో బిజెపి, దాని మిత్రపక్షం అకాలీదళ్‌ పంజాబ్‌లో ఘోరపరాజయాన్ని చవిచూశాయి. గోవాలో అధికారంలో వున్న బిజెపి ఓడిపోయింది. వుత్తరాఖండ్‌లో మాత్రమే బిజెపి విజయం సాధించింది. వుత్తర ప్రదేశ్‌లో విజయం సాధించింది, మణిపూర్‌లో ఓడిపోయింది. సాంకేతికంగా 2017లో గడువు ముగిసే అసెంబ్లీలు లేనప్పటికీ 2018లో ఏడు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడాల్సి వుంది. వాటిలో హిమచల్‌ ప్రదేశ్‌లో జనవరి ఏడు, గుజరాత్‌లో జనవరి 22, మేఘాలయలో మార్చి ఆరు, నాగాలాండ్‌లో మార్చి 13, త్రిపురలో మార్చి 14, మిజోరంలో మార్చి 15, కర్ణాటకలో మే 28వ తేదీతో అసెంబ్లీల గడువు ముగుస్తుంది కనుక ముందుగానే ఎన్నికలు జరగాలి. మరుసటి ఏడాది లోక్‌సభ ఎన్నికలు, మరికొన్ని రాష్ట్రాల ఎన్నికలు జరగాల్సి వుంది. ఈ పూర్వరంగంలో అన్ని రాష్ట్రాల అధికారంలో పాగావేయాలన్నది బిజెపి ఎత్తుగడ. అయితే గత ఎన్నికల ఫలితాలు, పర్యవసానాలను చూసినపుడు బిజెపి పరిస్థితి నల్లేరు మీద బండిలా సాగుతుందా అన్నది చూడాల్సి వుంది.

దేశ ఆర్ధిక స్ధితిని చూస్తే మోడీ సర్కార్‌ మూడు సంవత్సరాలలో సాధించినదాని గురించి అధికార, ప్రయివేటు మీడియా దన్నుతో సంబరాలు చేసుకోవచ్చుగాని సామాన్యుల జీవితాలను ప్రభావితం చేసిన ఒక్క అంశం కూడా లేదన్నది విశ్లేకుల అభిప్రాయం. ధరల పెరుగుదలలో మార్పు లేదు, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలలో పురోగతి లేదు, ఎగుమతులు పడిపోయాయి, దిగుమతులు పెరిగాయి. సర్వరోగ నివారిణి జిందాతిలిస్మాత్‌ అన్నట్లు గత మూడు సంవత్సరాలుగా కేంద్రీకరించిన వస్తు, సేవల పన్ను చట్టం జూలై నుంచి అమలులోకి రానుంది. దాంతో మొదట ధరలు పెరుగుతాయని, తరువాత జనానికి ఫలితాలు అందుతాయని పాలకపార్టీతో పాటు, దాని సమర్ధకులు వూదరగొడుతున్నారు. అంటే మొరటుగా చెప్పాలంటే ముందు నీ గోచి పాతను కూడా పోగొట్టుకుంటావు తరువాత పట్టుపంచలు పొందుతావు అన్నట్లుగా వుంది. ముందు ధరలు పెరగటం ఏమిటో తరువాత తగ్గటం ఏమిటో, ఇది ఏ పాఠశాల ఆర్ధశాస్త్రపాఠమో ఎవరూ చెప్పరు. ఒకసారి పెరగటం ఎందుకు తరువాత తగ్గటం ఎందుకు ? మానవ జాతి చరిత్రలో ఏ దేశంలో అయినా ఒకసారి పెరిగిన ధరలు తగ్గిన వుదాహరణ వుందా ? అందువలన అధికారం తప్ప మరొకటి పట్టని బిజెపి పెరిగిన ధరల మధ్య మోడీ పాలనలో దేశం వెలిగిపోతోంది అని చెప్పుకోజాలదు. కనుక ధరల సెగ జనానికి పూర్తిగా సోకక ముందే మరోసారి నాకు ఓటేస్తే ఇంకా మంచి రోజులు తెస్తానని గడువుకు ముందే ఎన్నికల ప్రకటన చేసి నరేంద్రమోడీ జనం ముందుకు వెళతారన్నది ఒక విశ్లేషణ.

పూర్వసామెత ప్రకారం ఆరునెలలు సాము గరిడీలు చేసి కనీసం ఓటి కుండలు పగలగొట్టిన ‘ప్రతిభావంతుల’ గురించి మాత్రమే విన్నాం. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనాన్ని వెలికి తీస్తానని చెప్పిన నరేంద్రమోడీ ఆరునెలలు గడిచిపోతున్నా రద్దు చేసిన పెద్ద నోట్లలో ఎంత మొత్తం తిరిగి వచ్చిందీ, ఎంత డబ్బు రాలేదు, ప్రభుత్వానికి ఎంత లబ్ది కలిగిందీ అన్న విషయాలేవీ ఇంతవరకు చెప్పలేదు. నరేంద్రమోడీకి నల్లధనం తేలు కుట్టింది కనుక మిన్నకున్నారా ? పెద్ద నోట్ల రద్దుతో కాశ్మీరుతో సహా దేశమంతటా తీవ్రవాద వెన్ను విరిచామని చెప్పారు. రాళ్లు విసురుతున్న ఘటనలు ఆ కారణంగానే తగ్గాయన్నారు. అన్ని చెప్పిన ఐదు నెలల తరువాత తమ రక్షణ వలయంగా ఒక యువకుడిని జీపుకు కట్టి వీధులలో రక్షణ పొందిన మిలిటరీ వుదంతం గతంలో ఎన్నడూ లేదంటే బిజెపి విధానాలు విజయవంతమైనట్లా కాశ్మీరులో పరిస్థితులను మరింత దిగజార్చి నట్లా ? ఎన్నికలలో చెప్పిన గుజరాతు నమూనా పాలన, ప్రగతి ఇలా చెప్పుకోవాలంటే ఎన్నో వున్నాయి. ఇవి జనంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీయక ముందే ఓట్లను కొల్లగొట్టే పని పూర్తి చేసుకోబోతున్నారా ?

పార్లమెంటు ఎన్నికల తరువాత ఢిల్లీ, బీహారులో సంభవించిన పరాభవం తరువాత జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల గురించి బిజెపి ఎన్నో గొప్పలు చెప్పుకోవచ్చు. 2012 పంజాబు అసెంబ్లీ ఎన్నికలలో అకాలీదళ్‌-బిజెపి కూటమికి 34.59,7.15 చొప్పున మొత్తం 41.64 శాతం ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికలలో కాంగ్రెసుకు 39.92 శాతం వచ్చాయి. 2014 పార్లమెంటు ఎన్నికలలో అకాలీ-బిజెపి కూటమికి 26.3, కాంగ్రెసుకు 33.1, కొత్తగా వచ్చిన ఆమాద్మీ పార్టీకి 24.4 శాతం వచ్చాయి. తాజా అసెంబ్లీ ఎన్నికలలో ఈ పార్టీలకు వరుసగా 25.2, 38.5, 23.7 శాతం చొప్పున వచ్చాయి. మోడీ మాయలు, మంత్రాలు ఇక్కడ పని చేయలేదు.

ఘనవిజయం సాధించామని చెప్పుకుంటున్న వుత్తర ప్రదేశ్‌ వివరాలు చూద్దాము. 2012 ఎన్నికలలో అధికారానికి వచ్చిన సమాజవాది పార్టీకి 29.15, రెండో స్ధానంలో వున్న బిఎస్‌పికి 25.91, బిజెపికి 15, కాంగ్రెస్‌కు 11.63 శాతం ఓట్లు వచ్చాయి. 2014 లోక్‌సభ ఎన్నికలలో వరుసగా ఈ పార్టీలకు 22.2, 19.6, 42.3, 7.5 చొప్పున వచ్చాయి. తాజా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌తో కలిపి ఎస్‌పి కూటమికి 28, బిఎస్‌పి 22.2, బిజెపి కూటమికి 41.4శాతం వచ్చాయి. ప్రతిపక్ష ఓట్ల చీలిక కారణంగా పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి. నిజంగా దేశంలో మోడీ గాలి వీస్తుంటే పెద్ద నోట్ల రద్దు వంటి ప్రయోగం అంతగా విజయవంతమైతే బిజెపి ఓట్లెందుకు తగ్గినట్లు ? గోవాలో బిజెపి అధికారంలో వుండి ఓడిపోయింది. తనపై గెలిచిన కొందరు ఎంఎల్‌ఏలకు ఎర చూపి తిరిగి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయటం వేరే విషయం. అక్కడ ఎంజిపితో కలసి 2012లో పోటీ చేసిన బిజెపి కూటమికి 41.7 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 30.78 శాతం ఓట్లు వచ్చాయి. తాజా అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఓట్ల శాతం 32.5, కాంగ్రెస్‌ ఓట్లు 28.4 శాతానికి తగ్గినా బిజెపి సీట్లు కోల్పోగా కాంగ్రెస్‌ పెంచుకుంది. విడిగా పోటీ చేసి పదకొండుశాతం ఓట్లు తెచ్చుకున్న ఎంజిపికి మూడు సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు ఎంఎల్‌ఏలను ఫిరాయింప చేసి మిగిలిన చిన్న పార్టీలన్నింటినీ కూడగట్టి బిజెపి అడ్డదారిలో అధికారాన్ని పొందింది.

అందువలన పైకి ఎంత గంభీరంగా మాట్లాడినా ఓట్ల లెక్కలు బిజెపికి అనుకూలంగా లేవన్నది స్పష్టం. ఈ ఏడాది చివరిలో జరగాల్సిన గుజరాత్‌ ఎన్నికలు బిజెపికి ఒక పరీక్ష వంటివి. ఎందుకంటే అక్కడ ఓట్లు చీలే అవకాశం లేదు. మోడీ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తరువాత అక్కడ జరిగిన స్ధానిక సంస్ధ ఎన్నికలలో పట్టణాలలో బిజెపి గెలిచినా గ్రామీణ జిల్లా పంచాయతీలలో బోర్లా పడింది. కాంగ్రెస్‌ అనేక విజయాలు సాధించింది. అందువలన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఓడిపోయినా లేక ఇప్పుడున్నదాని కంటే సీట్లు తగ్గినా నరేంద్రమోడీ గాలి తుస్సుమనటం ఖాయం. అందువలన గుజరాత్‌తో పాటే లోక్‌సభ ఎన్నికలను రుద్దే అవకాశాలే ఎక్కువగా వున్నాయి.

బిజెపి సర్కార్‌ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన మేకిన్‌ ఇండియా, ఐదు సంవత్సరాలలో రైతుల ఆదాయాల రెట్టింపు వంటివి నినాదాలుగానే మిగిలిపోయాయి. ఇలా ఏ రంగంలో చూసినా ఎదురు దెబ్బలు తప్ప సానుకూల పరిణామాలు లేని స్ధితిలో ఐదేండ్లూ కొనసాగితే ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత పెరగటం అని వార్యం. అందుకే ఏదో ఒకసాకుతో మధ్యంతర ఎన్నికలను దేశం మీద రుద్దనున్నారనే అభిప్రాయం కలుగుతోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

గోరక్షకులు మరియు వారి సమర్ధకులకు బహిరంగ లేఖ

29 Wednesday Mar 2017

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Politics, RELIGION

≈ Leave a comment

Tags

ban oncow slaughter, beef, cow, cow slaughter, Cow Vigilante Groups, dalits, Gau Rakshaks, Muslims

Image result for Gau Rakshaks, and their apologists

వుత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ అక్రమ పశువధ శాలలను మూసివేయిస్తానంటూ ప్రకటించి మారోసారి బీఫ్‌ లేదా పశుమాంసం, గో సంరక్షణ సమస్యను ముందుకు తెచ్చారు. దీన్ని కావాలని తెచ్చారా లేక ఆయన సహజత్వానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారా అన్నదాని గురించి చర్చించనవసరం లేదు. చర్చ ఎటు తిరిగి ఎటు ముగిసినా పర్యవసానం ఒకటే.ఈ పూర్వరంగంలో పర్హాన్‌ రహమాన్‌ ఆనే వ్యక్తి తన ఫేస్‌ బుక్‌ పేజీలో గో సంరక్షకులకు వారి సమర్ధకులకు ఒక బహిరంగ లేఖ రాశారు. దానిలో ఆసక్తి కలిగించే అంశాలు వున్నందున పాఠకుల కోసం అనువాదాన్ని దిగువ అందచేస్తున్నాం.ఈ లేఖలోని అంశాలలో అసంబద్ధత, వక్రీకరణలువుంటే ఎవరైనా వాటిని చర్చకు పెట్టవలసిందిగా కోరుతున్నాము.

గోరక్షకులు మరియు వారి సమర్ధకులకు బహిరంగ లేఖ

మార్చి 28,2017

ప్రియమైన గోరక్షకులకు

2014లో పాలకులలో వచ్చిన మార్పుతో ధైర్య భావనతో వున్న మీరు ప్రస్తుతం అధికార అలలపె సవారి చేయటాన్ని నేను అర్ధం చేసుకోగలను.ఈ ఆకస్మిక పరిణామం తెల్లవారేసరికి తయారైన రాజకీయ వాక్సూరత్వ వుత్పాదనకాదని, దీర్ఘకాలంగా అణచిపెట్టిన భావోద్వేగాల ఫలితమని కూడా నేను అర్ధం చేసుకోగలను.అనేక దశాబ్దాలుగా మీ పవిత్రమైన గోవును అపవిత్రం గావించిన, దూషించిన, హింసపెట్టిన వారిపై ప్రతీకారం చేయాలని మీరు వాంఛిస్తారు. ఇప్పటి వరకు రాజ్య రక్షణ పొందినవారికి ఒక గుణపాఠం చెప్పాలంటే ప్రతీకారం తీర్చుకోవాలనే వైపుగా వున్న మీ చర్యను నేను అర్ధం చేసుకోగలను.

మీకు బోధ చేయాలని గానీ లేదా మీ చర్యలు తగినవి కాదని గానీ చెప్పటానికి నేనీ లేఖ రాయటం లేదు.లేదా కపటత్వంతో కూడిన మీ చర్యలను హేళన చేయటానికి గానీ కాదు.అదేమంటే గోవధ సమస్యపై ఒకవైపున మీరు ముస్లింలు, దళితులపై దాడులు చేస్తున్నారు. మరోవైపు గొడ్డు మాంస ఎగుమతులలో ప్రపంచంలో విజయవంతంగా భారత్‌ను అగ్రస్ధానంలో నిలపాలని చూస్తున్న కొత్తగా వచ్చిన ప్రభుత్వం (దానికి మీరు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అనుబంధమై వున్నారు) గులాబి విప్లవాన్ని ప్రోత్సహిస్తున్నది. మీరు కూడా నా మాదిరి వినమ్రులైన వ్యక్తులే. వుద్రేకం హేతువుపై ఆధిపత్యం చెలాయించటం ప్రారంభించినపుడు భావోద్వేగాలకు లోనవుతాము.మన శక్తిని సరైనదారిలో వుపయోగించగలిగితే అది మీకు అదే విధంగా దేశానికి ఎంతో ప్రయోజనకారి అవుతుంది.శక్తి పనిచేస్తే వుద్రేకంపై హేతువుది పైచేయి కావాలి.

Image result for Gau Rakshaks, and their apologists

నాలేఖలో కొన్ని ప్రశ్నలు వున్నాయి. వాటికి మీరు నాకు సమాధానం చెప్పనవసరం లేదుకానీ మీకు మీరు చెప్పుకోవాలి. మీ చర్యలు సరైనదారిలో వున్నాయా లేక తమ భౌతిక ప్రయోజనాల కోసం రాజకీయ, ఆర్ధిక రంగాల పెద్దలు దుర్వినియోగం చేస్తున్నారా అని మీకు మీరు హేతుబద్దంగా అలోచించండి.

మీ రోజువారీ కార్యకలాపాలతో ప్రారంభించనివ్వండి.

1.వుదయం లేవగానే మీరు వుపయోగించే టూత్‌ పేస్టు పవిత్రమైన ఆవు కొవ్వు నుంచి తీసిన గ్లిజరీన్‌తో తయారు చేసింది కాకూడదని మీరు కోరుకుంటారు. అవును గ్లిజరీన్‌ కొవ్వు నుంచి తీస్తారు. కాల్గేట్‌, క్లోజ్‌అప్‌ మరియు పియర్స్‌( లేదా ఈ విషయానికి వస్తే ఏ బ్రాండ్‌ అయినా) కేవలం మీ విశ్వాసాన్ని గౌరవించేందుకు కూరగాయ వనరులైన సోయాబీన్‌ లేదా ఆయిల్‌పామ్‌ నుంచి గ్లిజరీన్‌ తయారు చేసినట్లు చెప్పుకుంటాయి. మాంస వనరునుంచి తయారు చేసే దాని కంటే శాఖాహార వనరుల నుంచి తయారు చేసే గ్లిజరీన్‌ ఎంతో ఖర్చుతో కూడుకున్నదని మీరు నిజంగా నమ్ముతారా?

2.మీరు వుపయోగించే షేవింగ్‌ క్రీమ్‌, సబ్బు,హెయిర్‌ క్రీమ్‌, షాంపూలు, కండిషనర్లు, మాయిశ్చరైజర్‌ తదితరాలను పవిత్రమైన ఆవు నుంచి సేకరించినవి కాదని మీరెప్పుడైనా తనిఖీ చేశారా ?పాంథనోల్‌ అమినో యాసిడ్స్‌ లేదా విటమిన్‌ బిలను జంతు లేదా చెట్ల వనరుల నుంచి సేకరిస్తారు.వాటిని వుపయోగించబోయే ముందు దయచేసి తనిఖీ చేయండి. వస్త్రాలను సాపు చేసేందుకు వుపయోగించే వాటిలో డీహైడ్రోజనేట్‌ చేసిన కొవ్వు నుంచి తీసే డై మిథైల్‌ అమోనియం క్లోరైడ్‌ వుంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది?

3.మీ దంతాలను తోముకుంటారా? ఒక కప్పు టీ తాగుతారా ? అయితే కాస్త ఆగండి, మీరు వుపయోగించే పంచదారను తెల్లగా చేయటానికి ఆవు ఎముకలను వుపయోగించలేదని నిర్ధారించుకోండి.

4.మనం పొద్దునే వుపాహారం తీసుకుంటాం, ఏం కావాలని మీరు కోరుకుంటారు ?చోలేతో పూరీ, చపాతీయేనా ? మీరు వుపయోగించే అదానీ తయారు చేసే ఖాద్య తైలాలలో గొడ్డు కొవ్వు కలవలేదని నిర్ధారించుకోండి. మీ సమాచారనిమిత్తం తెలియచేస్తున్నదేమంటే కూరగాయల నుంచి ఖాద్యతైలం వనస్పతిని తయారు చేస్తున్న కంపెనీలు గొడ్డు కొవ్వును వినియోగిస్తున్నట్లు బయటపడిన తరువాత 1983లో ఇందిరాగాంధీ ప్రభుత్వం గొడ్డు కొవ్వు వినియోగంపై విధించిన నిషేధాన్ని 32 సంవత్సరాల తరువాత మీరు ఎన్నుకున్న దేశభక్త ప్రభుత్వం మోసపూరితంగా తొలగించింది.

5. సరే దీన్నుంచి బయటకు వద్దాం. మీకు కారు, మోటార్‌ సైకిళ్లలో దేనిని ఎంచుకుంటారు ? దయచేసి టైర్లను తనిఖీ చేయండి. గాలి వత్తిడి ఎంతవుందో చూసేందుకు కాదు. వుపరితల రాపిడిని తట్టుకొని ఆకృతి మారకుండా వుండేందుకు రబ్బరుకు సహాయపడే జంతు సంబంధిత స్టెయరిక్‌ యాసిడ్‌ను టైర్ల తయారీదార్లు వుపయోగించారో లేదో చూడండి.

6. దేన్నయినా అంటించాలనుకుంటున్నారా ? జిగురును వుపయోగించండి. అయితే మరగపెట్టిన జంతు ఎముకలు, సంధాన కణజాలము, లేదా పశువుల చర్మాల నుంచి దానిని తయారు చేయలేదని దయచేసి నిర్ధారించుకోండి. ఫెవికాల్‌ అంత గట్టిగా వుంటుంది, తెగదు.

7.ఇప్పుడు షాపింగ్‌కు వెళదాం. అయితే ప్లాస్టిక్‌ సంచులను వినియోగానికి దూరంగా వుండండి. ఎందుకని? షాపింగ్‌ బ్యాగ్స్‌తో సహా అనేక ప్లాస్టిక్స్‌ పదార్ధాలలో వత్తిడిని తగ్గించే స్లిప్‌ ఏజంట్స్‌ వుంటాయి.వాటిని దేని నుంచి తయారు చేస్తారు ? జంతు కొవ్వు నుంచి అని చెప్పనవసరం లేదనుకోండి.చమురును వుపయోగించి పోలిమర్స్‌ను తయారు చేసినప్పటికీ పదార్ధ గుణాలు, ధర్మాలను మెరుగు పరిచేందుకు జంతుసంబంధితమైన వాటిని ప్లాస్టిక్స్‌ తయారీదారులు తరచూ వుపయోగిస్తారు మరియు ముడి పోలిమర్స్‌ను ప్రాసెస్‌ చేసేందుకు కూడా వుపయోగిస్తారు.

8.దళితులు, ఆవు వ్యాపారులైన ముస్లింలపై దాడి చేసే మీ ప్రాధమిక పని గురించి చూద్దాం.దయచేసి ఆ కొట్లాటలో మీరు గాయపడకుండా చూసుకోండి. ఒకవేళ జరిగితే దయచేసి కాప్సూల్స్‌ కాకుండా టాబ్లెట్లు ఇవ్వమని డాక్టర్‌ను అడగండి. ఎందుకంటే కాప్సూల్‌ కవర్‌ మళ్లీ జంతు ప్రొటీన్‌ నుంచే తయారు చేస్తారు. మీకు కుట్లు వేయాల్సి వస్తే అందుకు వుపయోగించే దారాలు దేనితో తయారు చేసినవో దయచేసి డాక్టర్‌ను అడగండి. సాధారణంగా వాటిని పవిత్రమైన ఆవు పేగుల నుంచి తయారు చేస్తారు.

9.ఆశాభంగం చెందారా ? ఒకే ఐపిఎల్‌ మాచ్‌ చూద్దాం. అయితే ఆగండి. పరుగెట్టిస్తూ మిమ్మల్ని కట్టిపడవేసే ఆ క్రీడలో ఆవు ప్రమేయం వుందని మీకు తెలుసా ? పవిత్రమైన ఆవు. క్రికెట్‌లో వినియోగించే బంతిని కప్పి వుంచే తోలు ఆవు దూడ చర్మం నుంచి తీసిందే.

10.సరే.చలిగా వుంది. ఒక దమ్ము కొడదాం. అయితే సిగిరెట్‌ కూడా నాన్‌ వెజిటేరియన్‌ అయిపోయిందే. సిగిరెట్‌ బడ్‌లో పంది రక్తం కలుస్తుంది. అయితే ముస్లింలకు పంది అంటే ఇష్టం వుండదని తెలుసు కదా ? మీకు దానితో ఎలాంటి సమస్య లేదు. గుట్కా సంగతేమిటి? పశు చర్మాల శుద్ది తరువాత మిగిలిపోయే వక్క నుంచి సేకరించేదే గుట్కాలోని వక్క అని మీకు తెలుసా ?రెండు రూపాయల ఖరీదు చేసే పాకెట్‌ నుంచి మీరేమి ఆశిస్తారు? తాజా వక్కలా ? స్వయంగా పరిశీలించుకోండి, తయారీదారు చిరునామా కాన్పూరు, తోళ్ల పరిశ్రమ కేంద్రం, గ్రహించారా? కావాలంటే గూగుల్‌లో స్వయంగా తెలుసుకోండి.

11.సరే, వాటిని వదిలేయండి,ఎందుకంటే అవి ఆరోగ్యానికి హానికరం. అయితే మీరు ఎప్పుడైనా ఒకసారి పిల్లలకోసం ఇంటికి తీసుకు వెళ్లే జెల్లీ బీన్స్‌, కాండీ కూడా మాంసాహారమే. వాటిని జంతు ఎముకల నుంచి తయారు చేస్తారు. ఆరుద్ర పురుగుల నుంచి తయారు చేసే అద్దకపు ఎరుపు రంగుతో పాటు మహిళలు వుపయోగించే లిప్‌స్టిక్‌ కూడా జంతు కొవ్వు నుంచి తయారు చేసిందే.యగ్‌హర్టు(పెరుగు వంటి పుల్లటి తినే పదార్ధం) ఐస్‌క్రీమ్‌, కనుపాపలను తీర్చిదిద్దే క్రీములో కూడా అది వుంటుంది.

ఇలాంటి వందల వుత్పత్తుల గురించి నేను వివరించగలను.(నిజాయితీగా చెప్పాలంటే వీటిపై పరిశోధన చేసేందుకు అవసరమైన వుత్సాహ హేతువును మీరు నాకు అందించారు) కానీ నేను ఒక అంశాన్ని స్పష్టం చేయకతప్పదు. అదేమంటే మీ విశ్వాసాలను నాశనం చేస్తున్నది దళితులు, ముస్లింలు కాదు. కార్పొరేట్‌ ప్రపంచం మీ విశ్వాస వ్యవస్ధలు విముక్తి పొందలేనంత గట్టిగా బిగించి వేసింది. అందువలన కొద్దిపాటి మొత్తాలు వచ్చే సొమ్ముతో సర్దుబాటు చేసుకొని జీవించేందుకు ఆ జంతువులతో వ్యాపారం చేస్తున్నవారి మీద మీరు దాడులు చేయటం ఎందుకు ? నిజమైన వ్యాపారం చేస్తున్నది కార్పొరేట్స్‌, వారి మీద దాడి చేయటానికి మీకు ధైర్యమున్నదా ?

సరే మీరు గొడ్డు మాంసం తినటానికి వ్యతిరేకం. మీ నిత్య జీవితంలో వుపయోగించే వస్తువుల తయారీకి వుపయోగించే జంతువుల ఎముకలు, కొవ్వు, చర్మాలు తదితరాలను మీరు ఎక్కడి నుంచి తీసుకువస్తారు? కాబట్టి మీరు జీవించండి, ఇతరులను జీవించనివ్వండి. అందరికీ అవకాశం వుంది. మీ మతావేశంతో ఎప్పటి నుంచో వున్న బంధాలను నాశనం చేస్తున్నారు. దేనికోసమిది?

Image result for Gau Rakshaks, and their apologists

కలసిమెలసి జీవించండి. వాక్శూరనాయకుల చేతిలో బొమ్మలుగా మారకండి.మిమ్మల్ని సైనికులుగా వాడుకొనే వారు తమ రాజకీయలక్ష్యం తీరగానే చచ్చిన ఆవును పారవేసినట్లుగానే మిమ్మల్ని కూడా వదలివేస్తారు. ఎప్పటి నుంచో వున్న బంధాలను పున:జీవింపచేయండి.మీ ఇరుగుపొరుగు లేదా మీ స్నేహితులతో సంతోషంగా వుండండి, వారు మీ సామాజికతరగతికి చెందినవారే అయి వుండనవసరం లేదు. మీ దేశ ప్రజలను ప్రేమించండి. అయితే బాణసంచాపేల్చకండి.కాలుష్యం కావాలని ఎవరూ కోరుకోరు.బాణ సంచాలో అల్యూమినియం, ఇనుము వంటి లోహాల పౌడర్‌కు కోటింగ్‌ వేసేందుకు స్టియారిక్‌ ఆసిడ్‌ను ఎక్కువగా వాడతారు. అదిఆమ్లజనీకరణను నిరోధిస్తుంది.అందుకుదోహదం చేసేవాటిని దీర్ఘకాలం నిలువవుంచుతుంది.స్టియారిక్‌ యాసిడ్‌ను దేని నుంచి తయారు చేస్తారో ఎవరైనా వూహించారా?

పర్హాన్‌ రహమాన్‌

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆత్మవంచన మాని బిజెపి తన కింది నలుపును చూసుకుంటుందా !

27 Monday Mar 2017

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, RELIGION

≈ Leave a comment

Tags

BJP, BJP values, Casinos, Goa, Goa BJP, Goa Casinos, RSS, RSS Duplicity, The hippocratic BJP, UP News, Yogi Adityanath

Image result for yogi adityanath sabka sath,sabka eek cartoons

ఎంకెఆర్‌

యోగులైనా, భోగులైనా తమ తమ మఠాలు, మందిరాలకు పరిమితమైనంత వరకే వారి చర్యలు ప్రయివేటు వ్యవహారాలు. గీత దాటి బహిరంగ జీవితంలోకి వస్తే వారి చర్యల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసేందుకైనా సభ్య సమాజానికి హక్కు, అవకాశం వుంటుంది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న, తలెత్తుతున్న చర్చలు, అభిప్రాయాలపై కొన్ని శక్తులు తమ అసహనాన్ని వెళ్ల గక్కుతున్నాయి. వాటిపై ప్రతి వ్యాఖ్య, విమర్శ వేరు, అవి చేయలేక అసహనం వ్యక్తం చేయటం మరో తీరు. గతంలో ఎన్నో నీతులు, రీతులు బోధించిన బిజెపి ఇప్పుడు వాటిని తానే దిగమింగి వ్యవహరిస్తోందనే విమర్శలను ఎదుర్కొంటోంది. భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినవారిపై ఆ పార్టీ అనుచరగణం విరుచుకుపడిపోతున్నది. మిత్ర సూచనలు, హెచ్చరికలను కూడా ‘సహించ ‘టం లేదు. ఇది కచ్చితంగా భారతీయ సంస్కృతి కాదు.

Image result for yogi adityanath sabka sath,sabka eek cartoons

ప్రస్తుతం వుత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బిజెపి ఎంపిక చేసిన వ్యక్తి యోగి ఆదిత్యనాథ్‌. అయోధ్యలో బాబరీ మసీదును కూలదోసి దాని స్ధానంలో రామమందిరం కట్టాలన్న హిందూత్వ వాదుల నాయకత్వాన్ని చూసి వుత్తేజితుడై తన జీవితాన్ని రామమందిరం, హిందూత్వకోసం అంకితం చేయాలని చిన్నతనంలోనే నిర్ణయించుకున్నారు. అది ఆయన ఇష్టం, దానిలో భాగంగానే ముస్లింల వ్యతిరేక వ్యాఖ్యలు, ఇతరనేరపూరిత చర్యలకు పాల్పడిన కారణంగా కేసులు నమోదు చేసినా వెనక్కు తగ్గలేదు. చట్టం ఇంకా తనపని తాను చేయలేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన హిందూత్వకు ప్రతీక, హిందూత్వను అమలు జరపటానికే బిజెపి, దాని మార్గదర్శ సంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ ఎంపిక చేసిందని కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలపై యోగి అనుయాయులు భజరంగ భళీ-బలి అంటున్నారు. వారు ఆత్మవంచనకు పాల్పడుతున్నారని ఎవరైనా అంటే తప్పేముంది.

ప్రజాసేవకోసం చిన్నతనంలోనే దేశ సేవకు, బ్రిటీష్‌ వారిని ఎదిరించేందుకు అంకితమైన అల్లూరి, భగత్‌సింగ్‌, సుందరయ్య వంటి వారి గురించి ఎన్నో విన్నాం. సామాన్యజనం వారిని విప్లవకారులని పిలిచినందుకు వారి జీవితాలను ఆదర్శంగా తీసుకున్నవారేమీ అభ్యంతర పెట్టలేదు, అసహనం వ్యక్తం చేయలేదు. వారి చర్యలతో తమకు ప్రమాదం అని భావించిన శక్తులు వాటికి ప్రాతినిధ్యం వహించిన నాటి ప్రభుత్వాలు వారిని సమాజంలో అశాంతిరేపేవారుగా చిత్రించి ఆరోపణలు చేయటాన్ని జనం అంగీకరించలేదు. అనేక మంది వారి బాటలో నడిచారు, ఇప్పటికీ నడుస్తున్నారు.

Image result for BJP, hippocracy, values cartoons

అలాగే ఆంగ్లేయుల పాలనను వ్యతిరేకించే వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించి జైలు జీవితాన్ని తట్టుకోలేక అదే బ్రిటీష్‌ ప్రభుత్వానికి లొంగిపోయి లేఖలు రాసి తన రాణీగారీ భక్తిని ప్రదర్శించుకున్న విడి సావర్కర్‌ గురించి కూడా మనకు తెలుసు. ఆయనొక ఎత్తుగడలో భాగంగా ఆ లేఖలు రాశారని అందువలన ఆయన దేశభక్తుడే అన్నది ఆర్‌ఎస్‌ఎస్‌ వారి వ్యాఖ్యానం. దాన్ని సమాజం అంగీకరించిన దాఖలాలు లేవు. కానీ ఆ తరువాత స్వాతంత్య్రపోరాటంలోకి దూకిన భగత్‌ సింగ్‌కు అలాంటి తెలివితేటలు, ఎత్తుగడలు లేవు, చిరునవ్వుతో ప్రాణాలు అర్పించటం తప్ప మరొకటి తెలియని అసలు సిసలు దేశ భక్తుడు. బ్రిటీష్‌ వారికి విధేయుడిగా వుంటానని లేఖ రాసిన సావర్కర్‌ ఆ తరువాత ఎక్కడా బ్రిటీష్‌ వ్యతిరేకపోరాటంలో కనపడరు. వారికి మరో రూపంలో సాయం చేసేందుకు హిందూత్వను ముందుకు తెచ్చారు. ఆయన రాసిన లేఖ బయటపడిన తరువాత కూడా సావర్కర్‌ను దేశభక్తుడిగా సమర్ధించేందుకు, భగత్‌ సింగ్‌ కంటే పెద్ద త్యాగధనుడిగా చిత్రించేందుకు, ఆయన ముందుకు తెచ్చిన హిందూత్వకు వారసులుగా చెప్పుకోవటానికి అనేక మందికి ఎలాంటి అభ్యంతరం వుండటం లేదు. అలాంటపుడు యోగి ఆదిత్యనాధ్‌ హిందూత్వవాది గురించి ఆయనను వ్యతిరేకించేవారు ఏమి అన్నప్పటికీ సరైన బాటలోనే నడుస్తున్నారని భావించే ఆయన అభిమానులు సంతోషంతో పులకించి పోవటానికి బదులు హిందూత్వ ప్రతినిధి అని వ్యాఖ్యానించిన వారిని వ్యతిరేకించాల్సిన అవసరం ఏముంది. అలా చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నారా ?

కాంగ్రెస్‌ తాను ప్రవచించిన ఆదర్శాలను ఎప్పుడో వదలి పెట్టింది. అందుకు తగిన ఫలితాలు అనుభవిస్తున్నది. దానికి భిన్నమైన పార్టీ అని కదా బిజెపి చెప్పుకున్నది. మాంసం దగ్గర మంచోడి సంగతి తెలుస్తుందన్నది ఒక సామెత. ఇప్పుడు బిజెపికి అది చక్కగా వర్తిస్తుంది. దాని నిజరూపం వామపక్ష శక్తులు, ప్రజాతంత్ర శక్తులలో కొంత భాగానికి ముందే తెలిసినా సామాన్య జనానికి అర్ధం కావటం ఇప్పుడే ప్రారంభమైంది. ఆ పార్టీ ఆత్మవంచన, పరవంచన గురించి మచ్చుకు రెండు అంశాలను చూద్దాం.

Image result for yogi adityanath sabka sath,sabka eek cartoons

హాజ్‌యాత్రకు సబ్సిడీ లేదా రాయితీ ఇచ్చి ముస్లింలను సంతృప్తి పరచి ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకొనేందుకు ఇతర పార్టీలన్నీ ప్రయత్నిస్తున్నాయని ఆర్‌ఎస్‌ఎస్‌ దాని అనుబంధ సంస్ధలైన బిజెపి వంటివి ఎన్నో ఏళ్లుగా నానా యాగీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ రాయితీని క్రమంగా తగ్గించి 2022 నాటికి పూర్తిగా రద్దు చేయాలని 2012లో సుప్రీం కోర్టు ఆదేశించింది. చిత్రం ఏమంటే మానస సరోవర యాత్ర చేసేందుకు హిందువులకు లక్ష రూపాయల వరకు ఇవ్వటానికి నిర్ణయించినట్లు యోగి ఆదిత్యనాధ్‌ ప్రకటించారు. ముస్లింలకు హాజ్‌ హౌస్‌లు నిర్మించినట్లుగానే మానస సరోవర్‌ యాత్రీకులకూ ఢిల్లీ సమీపంలో భవనాలు నిర్మించనున్నట్లు కూడా ప్రకటించారు. ఇదేమిటి? ఒక మత యాత్రకు అభ్యంతరం తెలిపిన వారు మరొక మత యాత్రకు సబ్సిడీలు ఇవ్వటం ప్రారంభించటాన్ని ఏమనాలి? మైనారిటీ మత సంతుష్టీకరణ మాత్రమే తప్పు మెజారిటీది ఒప్పు అంటారా ?

ఇక బీఫ్‌ గురించి చూద్దాం. రీడ్‌ ఇండియా రైట్‌ ( ఇండియా మితవాదులు చెప్పేది చదవండి) అని టాగ్‌లైన్‌ పెట్టుకున్న పత్రిక ‘స్వరాజ్య ‘. దాని సారధి ఆర్‌ జగన్నాథన్‌. అక్రమంగా వున్న కబేళాల మూసివేతకు యోగి ఆదిత్యనాథ్‌ తొందర పడితే జరిగే మంచికంటే నష్టమే ఎక్కువ అనే శీర్షికతో ఆయనొక విశ్లేషణ రాశారు. ఇంకేముంది ఆ పత్రికను చదివే మితవాదులు అతగాడొక కమ్యూనిస్టు అని, వుద్యోగం నుంచి తొలగించాలంటూ దాడికి దిగారు. ఎన్నికలలో మెజారిటీ సంపాదించటం వేరు ప్రభుత్వాలు అందరికోసం పని చేయాలి. యోగి తొలి చర్యలు చూస్తుంటే సబ్‌కాసాత్‌ సబ్‌కా ఏక్‌ ను సాధించే అవకాశమే లేదని, పెద్ద సంఖ్యలో మైనారీటీల మనసులను విరిచివేస్తాయని జగన్నాధన్‌ వ్యాఖ్యానించారు.గోవధనిషేధం అంటే ఆవు ఆర్ధిక విలువ పడిపోవటమేనని, దున్న లేక బర్రె మాంసానికి డిమాండ్‌ పెరుగుతున్న కారణంగా ఆవుల రాష్ట్రాలుగా వున్న ప్రాంతాలలో వాటి స్ధానంలో గేదెలు పెరుగుతున్నాయని,2007 లెక్కల ప్రకారం దేశంలోని మొత్తం పశు సంపదలో గేదెలశాతం 34.6కాగా హర్యానాలో 79.3, పంజాబ్‌లో 74, వుత్తర ప్రదేశ్‌లో 55.8, ఆంధ్రప్రదేశ్‌లో 54.2, గుజరాత్‌లో 52.4, రాజస్తాన్‌లో 47.8, బీహార్‌లో 34.8శాతం వున్నాయి. గేదెల శాతం అతి తక్కువగా వున్న కేరళ 3.2, బెంగాల్‌ 3.8, ఈశాన్య రాష్ట్రాలలో 4.6శాతం కాగా అక్కడ గోవధ లేదా గొడ్డు మాంసం విక్రయాలపై నిషేధం లేదని జగన్నాధన్‌ పేర్కొన్నారు.అవు ప్రాంతాల హిందువులు తమ పార్టీకి ఓటు వేసిన చోట గేదెల కంటే తక్కువ ఆర్ధిక విలువ కారణంగా ఆవులను వదిలించుకుంటున్న విషయాన్ని యోగి ఆదిత్యనాధ్‌ గమనించవచ్చని ఈ నేపధ్యంలో పశువధ శాలలపై నిషేధం గురించి పునరాలోచించాల్సిన అవసరం వుందని వ్యాఖ్యానించారు. ఆవు మరియు దున్న-గేదె మాంసానికి తేడాను సులభంగా తెలుసుకోలేని స్ధితిలో అత్యధిక నిఘా బృందాలు వున్న కారణంగా యోగి ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారని ముగించారు.

దేశం నుంచి జరుగుతున్న దున్న-గేదె మాంస ఎగుమతుల్లో సగం వుత్తర ప్రదేశ్‌ నుంచే వున్నాయి. అనధికార కబేళాల మూసివేత పేరుతో తీసుకుంటున్న చర్యల వలన జరిగే ఆర్ధిక, వుపాధి నష్టాలను పూడ్చేందుకు ప్రత్యామ్నాయ చర్యలు లేకుండా మొరటుగా ముందుకు పోయినట్లయితే జరిగే నష్టం ముస్లింలకే కాదు, వాటిపై ఆధారపడిన ఇతర వెనుకబడిన తరగతులు, గిరిజనులు, దళితులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. అనుమతి వున్న కబేళాల జోలికి తాను పోవటం లేదని, గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు అనధికారికంగా నడుపుతున్నవాటి మీదే చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్న ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్‌ సమర్ధనలు జగన్నాధన్‌ వంటి బిజెపి భక్తులకు తెలియకుండానే ఇలాంటి వ్యాఖ్యానం చేసి వుంటారని అనుకోగలమా ? ఎన్నికల తరువాత ఇలా మాట్లాడుతున్న జగన్నాధన్‌ వంటి వారు బీఫ్‌ లేదా గొడ్డు మాంసాన్ని వివాదాస్పదం చేసి ఓట్ల లబ్ది పొందేందుకు చూస్తున్నపుడు ఎందుకు మౌనంగా వున్నట్లు ?

అనధికార కబేళాలను ఎవరూ సమర్ధించరు, అదే సమయంలో వాటివలన జరిగే నష్టమూ లేదు. సదుద్ధేశ్యంతో వాటిని క్రమబద్దీకరించేందుకు చర్యలు తీసుకొని వుంటే అక్కడి మాంసం వ్యాపారులు సమ్మెకు దిగి వుండేవారు కాదు. బీఫ్‌ తినేవారు, తయారు చేసేవారు కేవలం ముస్లింలే కాదు ఇతరులు కూడా వున్నారని గ్రహిస్తే మంచిది. పురాణాల ప్రకారం ఆవులతో పాటు దున్నలు కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగినవే. యముడి వాహనం దున్న. ఆవు పవిత్రత దున్నలు-గేదెలకు లేదా?ఎందుకీ ఆత్మవంచన?

ఎన్నో నీతులు చెప్పే బిజెపి ఏటా ఎన్నో కుటుంబాలలో చిచ్చు రేపుతున్న, జేబులను గుల్ల చేస్తున్న జూదశాలలను నిషేధించాలని గతంలో డిమాండ్‌ చేసింది. జూదం మనదే కాదు, ఏ సభ్య సమాజ సంస్కృతీ కాదు. కానీ మన సంస్కృతిని పరిరక్షించే ఏకైక రక్షకురాలిని అని చెప్పుకొనే బిజెపి గత ఐదు సంవత్సరాలుగా అధికారంలో వున్న గోవాలో అక్కడి జూదశాలలపై ఎలాంటి నిషేధం విధించలేదు. గోవా ఆర్ధిక వనరులను పెంచే పేరుతో గతంలో కాంగ్రెస్‌ పాలకులు జూదశాలలకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు గోవా గడ్డమీద, మాండవీ నది మీద కలిపి దాదాపు ఇరవై జూదశాలలున్నాయి. బిజెపి వాటిని కొనసాగించింది. ఈ ఐదు సంవత్సరాలలో గోవాలో ‘ఎంజాయ్‌’ చేసే వారి సంఖ్య పెరగటం తప్ప తగ్గిన దాఖలాలు లేవు. ఆర్‌ఎస్‌ఎస్‌ వారి భారతీయ సంస్కృతి పరిరక్షణ లక్ష్యం ఏమైనట్లు ? అక్కడ జరిగే పర్యావరణ హాని గురించి వారికి పట్టదు.గోవాలో అనధికారికంగా నడుస్తున్న జూదశాలల గురించి తెలిసినప్పటికీ వాటి గురించి పట్టించుకోలేదు.అదేమి చిత్రమో దేశమంతటా సంస్కృతి పరిరక్షణ పేరుతో ఏ పార్కులో ఏ ప్రేమికులున్నారో వెతికేందుకు, వారిపై దాడులు చేసేందుకు వివిధ సంస్ధల ముసుగులో వుత్సాహం చూపే ఆర్‌ఎస్‌ఎస్‌ ఖాకీ వాలాలు, గోవాలో మనకు ఎక్కడా కనపడరు.

అనధికారికంగా మాంసం దుకాణాలు నిర్వహిస్తున్నవారందరూ అక్రమాలకు పాల్పడుతున్నవారిగా జమకడితే అంతకంటే అన్యాయం మరొకటి వుండదు. కానీ యోగి గారు అదే తన ప్రాధాన్యత అంటున్నారు. ఇదే సమయంలో అదే పార్టీకి చెందిన గోవా పాలకులు ఎన్నో కుటుంబాలను బలితీసుకొనే, ఎందరో మహిళల జీవితాలను అతలాకుతలం గావించే అక్కడి జూదశాలలను మాత్రం అరికట్టరు. మాదక ద్రవ్యాలకు, అత్యాచారాలు, హత్యలు, అన్ని రకాల వ్యభిచారాలకు నిలయం గోవా అన్నది జగమెరిగిన సత్యం. అందుకే దేశ విదేశాల నుంచి వీటన్నింటినీ అనుభవించటానికి( ఎంజాయ్‌ చేయటానికి) వచ్చే వారికి మాత్రం టూరిజం పేరుతో సకల సౌకర్యాలను కల్పిస్తున్నారు.ఒకే పార్టీ ! ఎందుకీ ఆత్మవంచన?

Image result for goa bjp,casinos cartoons

అభివృద్ధి నినాదాన్ని నిత్యం పారాయణం చేస్తున్న బిజెపి, దాని మిత్రులైన చంద్రబాబు నాయుడి వంటి వారు టూరిజం అభివృద్ధి పేరుతో జూదశాలలకు తెరతీయటానికి ప్రయత్నిస్తున్నారు. సంస్కృతి పరిరక్షకులుగా ఫోజు పెడుతున్న మనువాదులు, నయా జాతీయ వాదులు, వారి మద్దతుదారులు జూదాన్ని ఎంత నాజూకుగా సమర్ధిస్తున్నారో ‘స్వరాజ్య’ పత్రికలో వెల్లడైన అభిప్రాయాలు చదివితే మతిపోతుంది. పశువధ నిషేధం ద్వారా యోగి ఆదిత్యనాధ్‌ చర్యలతో మంచికంటే చెడే ఎక్కువ వుంటుంది అని చెప్పిన జగన్నాధన్‌ను విమర్శించిన స్వరాజ్య పత్రిక పాఠకులు కొందరు గోవాలో జూదశాలల గురించి సమర్ధనకు పూనుకున్నారు. వేదాలలోనే జూదం గురించి వుందట. బలి ప్రతిపాద, లక్ష్మీపూజ అంటే ద్యూత క్రీడ అని టీకాతాత్పర్యాలు చెబుతున్నారు. బెట్టింగ్‌, నగదు అక్రమలావాదేవీలను అరికట్టాలంటే బ్రిటన్‌ మాదిరి జూదశాలలను అనుమతించాలని కొందరు, ఆదాయపన్ను కట్టేవారినే అలాంటి వాటిలో అనుమతించాలని మరికొందరు సూచించారు. కౌటిల్యుడు తన అర్ధశాస్త్రంలో వేశ్యావృత్తిని పూర్తిగా నిషేధించకుండా క్రమబద్దీకరించాలని మాత్రమే చెప్పాడని కొందరు సమర్ధించారు. ఎవరేమి చెప్పినా నీవు చేయాల్సిందాని గురించి తప్ప పర్యవసానాలపై నీ అదుపు వుండదని శ్రీకృష్ణుడు చెప్పారంటూ మద్దతు. ఇలాంటి వాదనలు దోపిడీదారులు లేదా దోపిడీ సమాజం వున్నదాన్ని వున్నట్లు వుంచాలని కోరుకొనే వారు చేసే వుద్ధేశ్యపూర్వక ప్రచారంలో భాగం లేదా వాటిని ఎందుకు అనే ప్రశ్న వేసుకోకుండా నమ్మి ప్రచారం చేసే వారు మరికొందరు. హానిలేని పశువధ శాలల మూసివేతకు వుత్తర ప్రదేశ్‌లో ఆతృపడుతున్న బిజెపి గోవాలో గత ఐదు సంవత్సరాలలో అధికారంలో వుండి, తాజాగా అడ్డదారిలో పాగావేసి జన జీవితాలను నాశనం చేసే జూదశాలల అనుమతుల రద్దుకు, అనుమతి లేని ఇతర అక్రమ చర్యల నివారణకు ఎందుకు చర్యలు తీసుకోదు ? పశ్చిమ దేశాలు ఆత్మవంచన చేసుకుంటున్నాయని విమర్శించే బిజెపి తన కింది నలుపును చూసుకుంటుందా ? జనాన్ని మభ్యపెట్టటం మానుకుంటుందా?

Share this:

  • Tweet
  • More
Like Loading...

యుపి ముఖ్య మంత్రిగా ‘చెడ్డ పిల్లాడు’ ఆదిత్యనాథ్‌ !

22 Wednesday Mar 2017

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ 1 Comment

Tags

Anti Muslim, BJP, Hinduthwa, naughty boy, UP CM, YogiAdityanath

Image result for yogi adityanath

ఎం కోటేశ్వరరావు


ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి, కొత్త ప్రభుత్వాలు కొలువు తీరాయి. వుద్రేకాలు, వుద్వేగాలు, అధికార రాజకీయాలను కాసేపు పక్కన పెట్టి నిజాయితీగా ఆలోచించాల్సిన సమయమిది. ప్రజాస్వామ్యాన్ని వమ్ము చేయటంలో కాంగ్రెస్‌ కంటే తామేమీ వెనుకపడలేదని, తమకూ ఆ సత్తా వుందని బాల్యంలోనే బిజెపి నిరూపించుకుంది. ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చే ఈ క్రీడలో మాకు మేమే సాటి, బస్తీమే సవాల్‌ అంటూ తొడగొడుతున్న బిజెపిని ప్రస్తుతానికి ఎవరేమీ చేయలేరనే వాతావరణం అంతటా ఆవరించి వుంది. కాంగ్రెస్‌ అప్రజాస్వామిక, నియంతృత్వ రూపం బయట పడటానికి దేశానికి 28 సంవత్సరాలు పట్టింది.(1975 అత్యవసర పరిస్ధితి) మీడియా ఎంతగా మూసిపెట్టాలని చూసినా బిజెపి గురించి తెలుసుకోవటానికి అంత వ్యవధి అవసరం లేదు. స్వాతంత్య్ర వుద్యమం అనే ఒక ప్రజాతంత్ర ప్రవాహం నుంచి వచ్చిన కాంగ్రెస్‌ నేతలు అందుకు విరుద్దమైన మారుమనసు పుచ్చుకోవటానికి మూడు దశాబ్దాలు పట్టింది. బిజెపి పూర్తిగా తన సంఖ్యాబలంపై ఆధారపడి అధికారానికి వచ్చిన మూడు సంవత్సరాలు కూడా పూర్తిగాక ముందే తానేమిటో బహిర్గతం చేయటం ప్రారంభించింది. పురాణాల ప్రకారం నరకుడనే రాక్షసుడు విష్ణుమూర్తి-భూదేవికి పుట్టినట్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రారంభమే వివాదాస్పదం, భయానికి నాంది పలికింది. అందువలన ఇప్పుడు బిజెపికి మద్దతు ఇస్తున్నవారందరూ దాని గతాన్ని అంగీకరించి ఆ పని చేస్తున్నారని అనుకోలేము.నరకుడిని భరించలేని స్ధితిలో విష్ణువు మరో రూపంలో తల్లిచేతనే సంహరింపచేసిన దీపావళి కథ తెలిసిందే. చరిత్రలో ఇలాంటి పనులు చేసిన వ్యక్తులు, శక్తులు చివరికి ఏమయ్యాయో కూడా చూస్తూనే వున్నాం.

మన గొప్పతనం గురించి మాత్రమే కాదు, మన బలహీనతల గురించి కూడా వ్యాఖ్యానించే స్వేచ్చ మనకు వుండాలి. ఐదు రాష్ట్రాల ఎన్నికలలో మూడు చోట్ల బిజెపి ఓడిపోయింది. రెండు చోట్ల గెలిచింది. నాలుగు చోట్ల మంత్రి వర్గాలను ఏర్పాటు చేసింది. ఇదెలా సాధ్యమైంది అని ప్రశ్నించేవారు లోకం పోకడ పట్టించుకోని, ఈ కాలానికి తగని వారు అనుకోవటం తప్ప మరొక విధంగా చెప్పలేం. అన్నయ్యా వాలిని, రావణుడిని రాముడు చంపా డాలేదా అని తప్ప ఎలా అన్నది ముఖ్యం కాదు అన్నట్లు, ప్రస్తుత పరిస్ధితుల్లో మనం ఆవు అంటే వీపులు పగులగొట్టే వారు సిద్ధంగా వున్నారు కనుక మరో విధంగా చెప్పుకుందాం. మన గేదె లేక బర్రె ఏ దొడ్లో కట్టింది అని కాదు మన దొడ్లో ఈనిందా లేదా అన్నదే ముఖ్యం అన్నట్లు అనుకున్న విజయం సాధించారా లేదా ఎలా అన్నది ముఖ్యం కాదంటూ దానిని కీర్తించేవారే ఎక్కువగా వున్నారు. మన సమాజ బలహీనత ఇది.

2014లోక్‌సభ, 2017 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఓట్ల శాతం యూపీలో 42.3 నుంచి 39.7కు, వుత్తరాఖండ్‌లో 55.3 నుంచి 46.5కు పడిపోయింది. వీటికోసం నానా గడ్డీ కరిచిన తరువాత వచ్చిన ఫలితమిది. దీన్ని మద్దతు పెరగటంగా చెప్పటమంటే జనాన్ని చెవిలో పూలు పెట్టుకున్నవారిగా జమకట్టటమే. ఈ రీతిలో పెరుగుతున్న ‘మద్దతుతో ‘ రెండు సంవత్సరాల తరువాత జరగబోయే లోక్‌సభ ఎన్నికలలో మరోసారి మోడీ విజయం సాధించబోతున్నారనే ‘ప్రచారదాడికి ‘ నాంది పలికారు. మీడియాను ఆక్రమించిన కార్పొరేట్లు తమ లాభాలకు ఎవరు తోడ్పడతారో వారి ప్రచార కార్యకర్తలుగా మారటాన్ని చూశాము. అందువలన విజయగానాలకు కొదవేముంటుంది. ప్రతిపక్షం చీలికలు పేలికలు, జనం కులాలు, మతాలు, ప్రజావ్యతిరేకుల పట్ల వుపేక్ష వహిస్తే 2014 పునరావృతం కూడా కావచ్చేమో !

హిట్లర్‌ హయాంలో జన మెదళ్లను గందరగోళ పరచే ప్రచారదాడికి రూపకల్పన చేసిన గోబెల్స్‌ కనుక స్వర్గం లేదా నరకం నుంచో మన వేద లేద పురాణ కాల పుష్పక విమానమెక్కి మన దేశంలో దిగి చూస్తే తనకంటే ఎన్నో రెట్లు పెద్దవారిగా కనిపించే మీడియా గోబెల్స్‌ను చూసి ఇంత విపరీతమా అని సిగ్గుపడిపోతాడు. పెద్ద నోట్ల రద్దును జనం సమర్ధించారని చెప్పుకొనేందుకు రెండు రాష్ట్రాల ఫలితాను చూపుతున్నారు. గెలిచిన యూపిలో 60శాతం వ్యతిరేకంగా జనం ఓటు చేయటం సమర్ధించటమా? ఓడిపోయిన మూడు రాష్ట్రాల సంగతేమిటి? పోనీ గెలిచిన చోటయినా గతం కంటే ఓట్లెందుకు తగ్గాయి ? పెద్ద నోట్ల రద్దు వలన సాధించిందేమిటి ? అసలు ఎన్ని నోట్లు రిజర్వుబ్యాంకుకు తిరిగి వచ్చాయి? ఎన్నికలు ముగిసిన తరువాత కూడా దాని గురించి చెప్పరెందుకని, చన్నయ్‌ శేఖర రెడ్డి వంటి వారికి కొత్త రెండువేల నోట్ల రూపాయలకట్టలను నేరుగా అందించిన వున్నతాధికారులపై తీసుకున్న చర్యలేమిటి ? ఇలాంటి ప్రశ్నలన్నీ విజయగానాల ముందు వినిపించవు, మీడియాలో కనిపించవు.

నిప్పు, పట్టుకోవద్దు, కాలుతుంది అని చెబుతాం. ప్రశ్నించటం పిల్లల లక్షణం కనుక నీకెలా తెలుసు అని ఠకీమని అడగటం సహజం. వారితో పాటు వున్న వారు లేదు మీకు నిప్పంటే మొదటి నుంచి సదభిప్రాయం లేదు, అందుకే అలా చెబుతున్నారు అన్నారనుకోండి కాలేది పిల్లలకే, వారికి కాదు. డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారానికి వస్తే అమెరికాలోనే కాదు, ప్రపంచమంతటా అల్లకల్లోలం తలెత్తుతుంది అని అతగాడి గురించి తెలిసిన వారు చెప్పారు. అయినా సరే అమెరికా సామాన్యుల కంటే ఆంగ్లం బాగా చదివి, రాయగలిగిన అక్షరాస్యులైన ప్రవాస భారతీయులతో సహా అనేక మంది తన్మయత్వంతో ఓటేసి గెలిపించారు. ఇప్పుడు ఏం జరుగుతోందో చూస్తున్నాము. అక్కడి జాత్యహంకార దాడికి బలైన తెలుగువాడు కూచిభొట్ల శ్రీనివాస్‌ అంత్యక్రియలలో ట్రంప్‌ వ్యతిరేక నినాదాల హోరులో వేదమంత్రాలు వినిపించలేదన్న వార్తలు చదువుకున్నాం. అందువలన జనం ఎల్లకాలం ఒకేలా వుంటారని అనుకోనవసరం లేదు. ఏ కమ్యూనిస్టులు ప్రేరేపిస్తే అంత్యక్రియలలో ట్రంప్‌ వ్యతిరేక నినాదాలు చేసినట్లు ? ఎవరి కాళ్ల కిందకు నీరు వస్తే గాని వారికి తెలియదు.

కనుక కేంద్రంలోని బిజెపి తన అధికారాన్ని మరింతగా విస్తరించుకోవటానికి గోవా, మణిపూర్‌ వంటి చోట్ల అప్రజాస్వామిక పద్దతులకు పాల్పడి ప్రజాతీర్పును వమ్ము చేసినా, గతం కంటే తక్కువ ఓట్లు తెచ్చుకొని తమ విధానాలకు మద్దతు పెరిగిందని పెద్ద నోళ్లు వేసుకొని అరిచినా, నోరు తెరిస్తే మతోన్మాదం, పరమత విద్వేషం, హంతక భాష తప్ప మరొకటి పలకటం రాని ‘యోగి ‘ ఆదిత్యనాథ్‌ను వుత్తర ప్రదేశ్‌ పీఠంపై కూర్చో బెట్టినా ముందే చెప్పినట్లు చరిత్ర తనపని తాను చేస్తుంది. విదేశీ దండయాత్రలను, ఆక్రమణను సమైక్యంగా అడ్డుకోలేకపోయిన కారణంగా మన దేశం అనుభవిస్తున్న పర్యవసానాలను చూస్తున్నాము. విదేశీయులు సోమనాధ దేవాలయాన్ని కొల్లగొట్టి దానిని నాశనం చేయటం తప్పని చెబుతున్న స్వదేశీయులు ఆయోధ్యలో బాబరీ మసీదును కూల్చివేయటాన్ని ఏమనాలి? చరిత్రనుంచి మనం ఏ పాఠాలు నేర్చుకున్నట్లు ?

మనం చరిత్రలో, పురాణాలు, ఇతిహాసాలలో అనేక మంది యోగులు, యోగినులు, సన్యాసులు, సన్యాసినుల గురించి చదివాం. కొంత మంది దృష్టిలో హిందూత్వను పునరుద్దరించే కారణ జన్ములుగా స్ధానం వున్న ఇలాంటి యోగులు ఎవరి వారసులో, ఎలా పుట్టుకు వచ్చారో, వారిని సమర్ధించేవారు అడ్డగోలుగా కాకుండా ఆధారాలతో చెప్పాలి. కులాల పరిభాషలో చెప్పాలంటే వెనుకబడిన తరగతుల మంత్రం జపించే బిజెపి ఒక వేళ ఒక యోగినే ఎంచుకోదలచుకుంటే క్షత్రియడు తప్ప వివాదాస్పదం కాని వెనుకబడిన తరగతుల యోగి దొరకలేదా ?

యోగి ఆదిత్యనాధ్‌ గురించి లోకానికి తెలిసిందానితో పాటు తానేమిటో తనపై వున్న నేరపూర్తి కేసులేమిటో పార్లమెంట్‌ ఎన్నికల నామినేషన్‌ పత్రాలలోనే స్వయంగా రాసుకున్నారు. మత రాజ్యాలుగా ప్రకటించుకున్న పాకిస్తాన్‌ వంటి దేశాల గురించి విమర్శలు తెలిసిందే. మరి వుత్తర ప్రదేశ్‌ సంగతేమిటి ? హిందూ మతానికి చెందిన గోరఖనాధ్‌ మఠాధిపతి అయిన ఆదిత్యనాధ్‌ దాన్ని వదులుకోకుండానే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. దీన్నేమనాలి ? మత రాజ్యం గాక పోతే మత రాష్ట్రం. ఒక చోట అధికారికంగా మతాన్ని రుద్దుతారు మరోచోట అనధికారికంగా అదే పని చేస్తారు. ఇలాంటి విపరీత పరిస్ధితిని మన లౌకిక రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ వూహించి వుండరు.

యుపి ముఖ్యమంత్రిగా వివాదాస్పద యోగిని ఎంపిక చేయటాన్ని సమర్ధించుకోవటానికి బిజెపికి అడ్డగోలు వాదనలు తప్ప తర్కానికి నిలిచే మాటలు చెప్పటం లేదు. రాజ్యాంగం ప్రకారం మెజారిటీ వచ్చిన పార్టీ తమ నేతగా ఎవరిని నియమించుకోవాలన్నది ఆ పార్టీ ఇష్టం, ఒక ఎత్తుగడగానే ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించలేదు ఇలాంటి సారం లేని వాదనలు తప్ప తమ యోగికి వున్న అర్హతల సమర్ధించుకొంటూ మాట్లాడకపోవటం దాని బలహీనతను సూచిస్తోంది. ఎవరిని ఎంచుకోవాలన్నది మీ ఇష్టమైతే ముఖ్యమంత్రి ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహిస్తారు కనుక ఆ ఎంపికపై విమర్శలు చేసే అధికారం ప్రతిపక్షాలకు, ప్రజలందరికీ వుంటుంది. చెప్పుకొనేందుకేమీ లేకపోగా వివాదాస్పద నేపధ్యం వున్న కారణంగానే యోగికి ఒక అవకాశమిస్తే తప్పేమిటి, ఇటీవలి ఎన్నికలలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టలేదు కదా, ముఖ్యమంత్రి పాత్రలో ఎలా వుంటారో చూడకుండానే విమర్శలా అని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరికొందరు ఇంకొక అడుగు ముందుకు వేసి ప్రధాని నరేంద్రమోడీ తన మంత్ర దండంతో ఇలాంటి వారందరినీ అదుపులో వుంచుతాడు అంటూ భరోసా ఇస్తున్నారు. రంజాన్‌ సమయంలో పూర్తి విద్యుత్‌ ఇచ్చారు, దీపావళికి కోతలు విధించారంటూ స్వయంగా సదరు మోడీయే యుపీ గల్లీలలో రెచ్చగొట్టే ప్రచారం చేసి ఓట్లడుక్కున్న దిగజారుడు తనం దాస్తే దాగుతుందా ? తానే మత భావనలను రెచ్చగొట్టే భాష మాట్లాడకుండా తమాయించుకోలేని వ్యక్తి ఆదిత్యనాధ్‌ వంటి యోగులను నియంత్రిస్తారంటే నమ్మటం ఎలా ? సదరు పెద్దమనిషి గత చరిత్ర చూస్తే బిజెపియే తన బాటలో నడవాలి తప్ప తాను నడవాల్సిన అవసరం లేదని చెప్పటమే కాదు, తన మత అజెండాను అమలు జరిపేందుకు ఒక సంస్ధనే ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరికీ తేడా ఏమంటే మాంసం తినండి గానీ ఎముకలు మెడలో వేసుకొని తిరగవద్దని బిజెపి చెబితే మాంసమంటూ తింటున్న తరువాత ఎముకలు వేసుకు తిరిగితేనే కదా జనానికి మనమీద నమ్మకం కలిగేదన్నది యోగి తీరు.

ఆదిత్యనాథ్‌ తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నట్లుగా తనపై వున్న హత్యాయత్నం, నేరపూరిత బెదిరింపులు, కొట్లాటలు, భిన్నమతాల జనం మధ్య శతృత్వాన్ని పెంచే నేరాలకు సంబంధించిన కేసులను ఎలా ఎత్తివేయించుకుంటారన్నది ఆసక్తికరం. ఎన్నికల సభలలో నోరు పారవేసుకున్నందుకు ఎన్నికల కమిషన్‌ ఆయన్ను మందలించింది. ప్రధాని నరేంద్రమోడీ అపరభక్తురాలైన జర్నలిస్టు తవ్లీన్‌ సింగ్‌ ‘బూతులు, దుర్భాషలు మాట్లాడే వున్మత్తుడని’ ఒక సందర్భంలో వర్ణించారు. రెండు సంవత్సరాల క్రితం లష్కరే తాయెబా స్ధాపకుడు హఫీస్‌ సయిద్‌కు సినీనటుడు షారూఖ్‌ ఖాన్‌కు తేడాలేదని యోగి సెలవిచ్చారు. ఆ మాటలు సరికాదని, తమ పార్టీ లేదా ప్రధాని నరేంద్రమోడీ మూల విశ్వాసాలకు అవి ప్రతిబింబాలు కాదని బిజెపి అధికార ప్రతినిధి నలిన్‌ కోహ్లీ స్పష్టం చేశారు. అలాంటి వ్యక్తిని దేశంలో అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్య మంత్రిని చేశారు. ఒక యోగిగా ఏం చేశాడన్నది పక్కన పెట్టి ముఖ్యమంత్రిగా ఏం చేస్తారో చూసేందుకు ఒక అవకాశం ఇచ్చి చూడండంటూ వంది మాగధులచేత మాట్లాడిస్తున్నారు. అదే సరైన ప్రాతిపదిక అయితే మాకూ ఒక అవకాశమిచ్చి చూడండి అని అసదుద్దీన్‌ ఒవైసీ పార్టీ మజ్లిస్‌ కూడా ఓటర్లను అడుగుతోంది. ఒకరు గాడ్సే భావజాలానికి, కార్యాచరణకు, మరొకరు రజాకార్ల భావజాలం, కార్యాచరణకు వారసులన్నది విశ్లేషకుల అభిప్రాయం. అందువలన అవకాశమివ్వాల్సిన ‘అర్హతల’లో ఎవరు ఎవరికీ తీసిపోరు ! అవకాశం ఇచ్చి చూడాలనటం గురించి ఒక విశ్లేషకుడు పాఠకులకు ఒక ప్రశ్న వేశారు. పోటీగా వున్న ఒక స్కూలును తగులబెట్టి రమ్మని మీ పిల్లలు చదివే స్కూలు హెడ్మాస్టర్‌ ఒక పని అప్పగించారనుకోండి తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలకు ఒక అవకాశం ఇచ్చి, వారి పనితీరు ఎలా వుంటుందో చూద్దామని అనుకుంటారా లేక ఆందోళన వ్యక్తం చేస్తారా ? అన్నదే ఆప్రశ్న.

ఐదుసార్లు ఎంపీగా గెలిచాడు, మీకు ఇష్టం లేకపోతే ఆరునెలల్లో అసెంబ్లీకి పోటీ చేయాలి గనుక అప్పుడు ఓడించండి అంటూ ఒక వుచిత సలహా. ఆ మాత్రం తెలియని అమాయకత్వంతో యోగిని విమర్శించే వారు వున్నారనుకుంటున్నారా ?

రాహుల్‌ గాంధీ కూడా మూడుసార్లు వరుసగా ఎన్నికైనప్పటికీ ఆయనకు పార్టీ నడిపే అర్హత లేదని బిజెపి విమర్శిస్తుంది. ఎన్నిక కావటమే అర్హత అయితే వుత్తర ప్రదేశ్‌లో ఆదిత్యనాధ్‌ కంటే పేరు మోసినవారు ఎందరో వున్నారు, వారికి ముందు అవకాశం ఇవ్వాలి. అక్కడ ఎన్నికైన ప్రతి నాలుగో ఎంఎల్‌ఏ మీద అత్యాచారం, హత్యల వంటి తీవ్ర నేరాల కేసులు వున్నాయి. కొత్త అసెంబ్లీకి నూట మూడు మంది ఎన్నికైనందున రొటేషన్‌ పద్దతులలో వారందరికీ ఒక్కో ఏడాది పాటు మంత్రి పదవుల అవకాశాలు ఇచ్చి కొత్త పాత్రను వారెలా పోషిస్తారో చూడాలి. బిజెపికి మాత్రమే అలాంటి అవకాశం అంటే ఆపార్టీలో వున్న 82 మందికి రెండున్నర సంవత్సరాల చొప్పున అవకాశం ఇవ్వాలి మరి. ముక్తార్‌ అన్సారీ అనే పేరుమోసిన కేసులున్న పెద్దమనిషి అదే యూపీలో తాజా ఎన్నికలతో సహా 1996 నుంచి ఆదిత్యనాధ్‌తో పాటు వరుసగా ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికౌతూనే వున్నాడు.అదీ నాలుగుసార్లు జైల్లో వుండే గెలిచాడు. మరో పెద్ద మనిషి వున్నాడు రాజా భయ్యాగా పేరుమోసిన రఘురాజ్‌ ప్రతాప్‌ సింగ్‌. మాజీ రాజకుటుంబానికి చెందిన ఆ పెద్దమనిషిపై కేసులు తక్కువేమీ లేవు.ఆదిత్యనాధ్‌ కంటే ముందునుంచి అంటే 1993 నుంచి వరుసగా ఎన్నికవుతూనే వున్నాడు.కేరళలో కెఎం మణి ఏకంగా 13 సార్లు వరుసగా ఎన్నికయ్యాడు. అందువలన ఈ రోజుల్లో ఐదుసార్లు ఎన్నికయ్యాడు కనుక సచ్చీలుడు అంటే కుదరదు. బిజెపి తరఫున తాజాగా ఎన్నికైన వారిలో నేరస్ధ నేపధ్యం వున్న ఇద్దరు మహిళలు కూడా ఎన్నికైన ఘనత ఆపార్టీ ఖాతాలో వుంది. అందులో ఒకరు ఇటీవల కాంగ్రెస్‌ నుంచి ఫిరాయించి బిజెపిలో చేరి గెలిచిన ఒక డాక్టర్‌ కూడా వున్నారు.

మా యోగి రాహుల్‌ గాంధీ మాదిరి కుటుంబ నేపధ్యం నుంచి రాలేదు అన్నది మరొక ముక్తాయింపు. నిజమే గోరఖ్‌ పూర్‌ మఠం ఒక మతానికి చెందినది. దాని అధిపతిగా వున్న మహంత్‌ అవైద్యనాధ్‌ మతాధికారిగా వుంటూనే రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన స్ధానంలో మతబాధ్యతలు స్వీకరించిన ఆదిత్యనాధ్‌ అదే మత పూర్వరంగంలో ఐదుసార్లు ఎన్నికయ్యారు. ఒకరికి కుటుంబం, మరొకరికి మత వారసత్వం ! తేడా ఏముంది? వారసత్వ పరంపరను కొనసాగిస్తున్న తెలుగుదేశం పార్టీ నలుపు మాత్రం బిజెపికి కనపడదు. నరేంద్రమోడీ ఒక ఎత్తుగడగా తన మత అజెండాను పక్కన పెట్టి గత ఎన్నికలలో అభివృద్ధి మంత్రం జపించారు. కానీ ఆదిత్యనాధ్‌ రికార్డులో నేరపూరిత, మతోన్మాదం తప్ప అభివృద్ధి జాడలు లేవు. తాజా ఎన్నికలలో అలాంటి ప్రసంగాలు, ప్రచారం చేసిన దాఖలాలు లేవు. అసలు ఆయనొక ప్రధాన ప్రచారకుడిగా కూడా లేరు. గతంలో ఆయన ప్రసంగాలన్నీ ముస్లింల చుట్టూ తిరిగాయి తప్ప అభివృద్ధి కాదు. చివరిగా ఒక ముక్క చెప్పాలి. ప్రముఖ రచయిత చేతన్‌ భగత్‌ తనదైన శైలిలో ఆదిత్యనాధ్‌ను సమర్ధించారు. దొంగకు తాళాలిస్తే సొత్తుకు హామీ వుంటుందన్నట్లుగా ఒక తరగతిలో చెడు ప్రవర్తన కలిగిన పిల్లవాడిని తరగతి పర్యవేక్షకుడిగా చేస్తే మంచిగా ప్రవర్తించే మాదిరి యుపి ముఖ్య మంత్రిగా ఆదిత్యనాధ్‌ వ్యవహరిస్తారు అని కితాబునిస్తూ భగత్‌ ట్వీట్‌ చేశాడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మళయాళ నటికి మరుగుజ్జు యోధుల బెదిరింపులు !

20 Monday Feb 2017

Posted by raomk in BJP, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Religious Intolarence, Women

≈ Leave a comment

Tags

Aami actress, BJP’s trolling army, Manju warrier, Trolls

ఎం కోటేశ్వరరావు

    మత, మితవాద శక్తులు వివాదాస్పదం గావించిన మళయాళ చిత్రం ‘ఆమీ ‘ నిర్మాణం సజావుగా సాగుతుందా? సాగినా ప్రేక్షకులను చూడనిస్తారా అనే వూహాజనిత ప్రశ్నలను కాసేపు పక్కన పెడదాం. అసలు ఈ చిత్రంలో ఏ ముందో చూడకుండానే దర్శకుడు, నటీ నటులపై వత్తిడి తీసుకురావటం,సామాజిక మీడియాలో బెదిరింపులకు పాల్పడం మన దేశంలో కొన్ని శక్తుల అసహన ధోరణులు పెరుగుతున్నాయే తప్ప తగ్గటం లేదన్న సంకేతాలు స్పష్టంగా కనిపించటం లేదూ ! తన జాతీయతను ఎవరూ ప్రశ్నించజాలరని, తాను హిందువునే అంటూ రచయిత్రి కమలా సురయ్య జీవిత కథ ఆధారంగా నిర్మించే చిత్రంలో కమల పాత్ర ధరించటానికి తనకు హక్కుందని, తాను నటిస్తానని సినీ నటి మంజు వారియర్‌ స్పష్టం చేశారు. సుప్రసిద్ధ నటి విద్యాబాలన్‌ మాదిరి మంజుపై కూడా తిరోగామి శక్తులు వత్తిడిని ఇంకా పెంచుతాయా? ఆమె వాటిని తట్టుకొని చెప్పినట్లు చిత్రంలో నటించగలరా అన్న సందేహాలు వుండనే వుంటాయి.

     భిన్నాభిప్రాయాన్ని, అసమ్మతి, విమర్శలను జాతి వ్యతిరేకంగా చిత్రించే నాజీ పోకడలను జనం మెదళ్లలోకి క్రమంగా ఎక్కిస్తున్న తరుణమిది. మన దేశం స్వల్పకాలం ఇందిరా గాంధీ అత్యవసర పరిస్ధితిని చూసింది తప్ప నాజీ, ఫాసిజం స్వరూపాన్ని చూడలేదు. అలాగని నిజమైన ప్రజాస్వామిక వ్యవస్ధను కూడా చూడలేదన్నది కూడా అంతే వాస్తవం. ఇది నిజంగా ఒక విచిత్రమైన, ప్రమాదకరమైన పరిస్ధితి.మనకు తెలియని వాటి గురించి జనానికి తెలియచేయటం కంటే తెలిసినట్లుండి, నిజంగా తెలియని ప్రజాస్వామ్యం అంటే ఏమిటో చెబితే దానికి వ్యతిరేకమైన నియంతృత్వం గురించి చైతన్యవంతులను గావించటం సులభం అవుతుంది.

   తాము మాంసం తింటామని తెలియ చేసేందుకు ఎముకలను మెడలో వేసుకు తిరగరన్నది తెలిసిందే. అలాగే నియంతలు, ప్రజాస్వామ్యాన్ని ఏడునిలువుల లోతున పాతిపెట్టాలనుకొనే శక్తులు కూడా అదే మాదిరి ప్రవర్తిస్తాయి.తమ భావజాలాన్ని, రాజకీయాలను వ్యతిరేకించే వారిని సామాజిక మాధ్యమంలో ఎలా వేధిస్తారో, వెంటాడుతారో ఇటీవల వెల్లడైన విషయం తెలిసిందే. ఇప్పుడు సినీనటి మంజు వారియర్‌ను కూడా అలాగే వేధించి, వెంటాడుతున్నారు. సాహితీలోకంలో, కేరళలో మాధవికుట్టి అనే పేరుతో రచనలు చేసి జీవిత చివరి కాలంలో కమలా సురయ్యాగా మారిన కమలాదాస్‌ గురించి పరిచయం చేయనవసరం లేదు. కేరళలోని ఒక ఛాందసవాద నాయర్‌ కుటుంబంలో జన్మించిన ఆమె తన రచనలలో స్త్రీ, పురుష లైంగిక సంబంధాలు, సమాజంలోని అక్రమ సంబంధాల గురించి నిర్మొహమాటంగా చర్చించటం కొంత మందికి మింగుడు పడలేదు.ఆమె రచయిత్రిగానే గాక పత్రికల్లో వివిధ అంశాలపై రచనలు చేశారు. ప్రముఖ రచయిత్రుల సరసన స్ధానం సంపాదించారు. తన 65వ ఏట ఆమె హిందూమతాన్ని వదలి ముస్లింగా మారారు. ఆ సమయంలో పెద్దవివాదమే చెలరేగింది. నాడు ఆమెపై ధ్వజమెత్తిన పరంపరకు చెందిన వారే ఇప్పుడు మరోసారి మరో రూపంలో దాడికి దిగారు. తన 75వ ఏట 2009లో ఆమె మరణించారు. ఆమె హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా మతం మారారని కొందరు ఆక్షేపిస్తే ఒక ముస్లిం పారిశ్రామికవేత్తతో వున్న సంబంధాల కారణంగా మతం మారారని కొందరు నిందించారు. ఇప్పుడు ఆమె జీవిత కథా ఇతివృత్తంతో సినిమా తీస్తున్న దర్శకుడు కమల్‌గా సుప్రసిద్ధుడైన కమాలుద్దీన్‌ మహమ్మద్‌ మాజిద్‌ అనే ఒక ముస్లిం అని అతగాడు తీస్తున్న సినిమా గనుక అది లవ్‌ జీహాద్‌ను ప్రోత్సహించేదిగా వుంటుందని కొందరు ధ్వజమెత్తారు. తొలుత కమలాదాస్‌ పాత్రకు విద్యాబాలన్‌ను ఎంపిక చేసి మేకప్‌ టెస్టులు, దుస్తులు అన్నీ సిద్ధం చేసుకొని చిత్రీకరణకు వెళ్లబోయే ముందు కథనాన్ని మార్చిన కారణంగా తాను నటించలేనని ప్రకటించారు. హిందూత్వ శక్తుల దాడికి భయపడి ఆమె ఆ నిర్ణయం తీసుకున్నారని గతేడాదే మళయాల చిత్రసీమలో, మీడియాలో వార్తలు వచ్చాయి.

   దర్శకుడు కమల్‌ విషయానికి వస్తే నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దు చర్యను విమర్శించాడు. సినిమాహాళ్లలో జాతీయ గీతాలాపన సందర్భంగా లేచి నిలబడని వారిపై పోలీసులు చర్యలు తీసుకోవటాన్ని విమర్శించారు. రాజకీయంగా బిజెపి, హిందూత్వశక్తులు ఇది మింగుడు పడలేదు. జాతీయ గీతాన్ని గౌరవించకపోతే ఈ దేశం వదలి పోవాలని కూడా కొందరు బిజెపి నేతలు కమల్‌ను కోరారు. విద్యాబాలన్‌ వెనక్కు తగ్గిన తరువాత మంజూ వారియర్‌ను సంప్రదించగా ఆమె అంగీకరించారు. గతంలో ఆమె కమల్‌ చిత్రాలలో నటించారు. సామాజిక మాధ్యమాలలో తనపై దాడి, వేధింపులకు దిగిన వారికి మంజు వారియర్‌ అదే మాధ్యమం ద్వారా తన ఫేస్‌బుక్‌లో సమాధానమిచ్చారు.

    ‘ నేను కమల్‌ సార్‌ను నా గురువుగా చూస్తాను. ఇరవై సంవత్సరాల తరువాత ఆయనలోని ఒక గొప్ప కళాకారుడితో పని చేసే అవకాశం వచ్చినందుకు వుద్విగ్నతకు లోనవుతున్నాను తప్ప ఆయన రాజకీయాలను చూసి కాదు. నా దేశమే నా రాజకీయాలు. ప్రార్ధనలు చేసేందుకు నేను రోజుకు రెండుసార్లు దేవాలయాని వెళతాను. అదే విధంగా ఒక చర్చి, ఒక మసీదు ముందుకు వెళ్లినపుడు కూడా నేను అదే మాదిరి భక్తితో తలవంచుతాను.’ అని మంజు పేర్కొన్నారు. భిన్న రాజకీయాలు, భావజాలాలు వున్న వారు అనేక మంది కలసి పని చేస్తున్నారంటే ఒక మంచి సినిమా నిర్మాణ లక్ష్యం తప్ప మరొకటి కాదు.

    మంజుపై తిరోగామి శక్తులు దాడి, బెదిరింపులకు దిగితే ఆమె అభిమానులు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతూ సామాజిక మాధ్యమంలో స్పందించారు. తాను హిందువునని చెప్పుకోవటం సంఘపరివార్‌కు లొంగిపోవటంగా కూడా వర్ణించినవారు లేకపోలేదు. కొందరు ఎత్తుగడగా ఆమె అలా ప్రకటించిందన్న వారు కూడా వున్నారు. దేశంలో నెలకొన్న అసహన ధోరణుల నుంచి రక్షణ పొందేందుకు ఆమె జాతీయత కింద రక్షణ పొందారని ప్రముఖ రచయిత ఎంఎన్‌ కరాసెరీ వ్యాఖ్యానించారు. ‘ఆమె అభత్రాభావానికి లోనైవుంటే అందుకు ఆమెను నేను తప్పుపట్టటం లేదు. ఆమె ఇప్పటికే తన జీవితంలో అనేక విషాదాలను చూశారు. ఆమె సున్నిత మనస్కురాలైన కళాకారణి తప్ప రాజకీయవేత్తకాదు. ఆమెకు విద్వేష రాజకీయాలు తెలియవు ‘ అన్నారు. మత జాతీయ వాదాన్ని ముందుకు తెచ్చే వారికి కళ అన్నా కళాకారులన్నా ప్రేమ వుండదు. అందువల్లనే ఎంఎఫ్‌ హుస్సేన్‌, సల్మాన్‌ రష్డి వంటి వారి చిత్రాలు, రచనలను వ్యతిరేకిస్తారు. సృజనాత్మక స్వేచ్చను వ్యతిరేకించటంలో హిందువులు, ముస్లింలు ఇద్దరూ ఒకటే అని కూడా కరసెరీ వ్యాఖ్యానించారు. ‘కమలా సురయ్యా జీవితం నిజంగా ఎంతో సమ్మోహనమైంది. స్త్రీ లైంగికత్వం గురించి ఎంతో నిజాయితీగా ఆమె రచనలను విప్లవాత్మకం కావించింది. ఆమె జీవిత చరమాంకంలో ప్రేమ కోసం ఇస్లాంలోకి మారటంద్వారా విమర్శలపాలయ్యారు.ఆమె జీవిత మంతా వివాదాల మయం. ఒక కళాకారిణికి ఇవన్నీ ఎన్నో సవాళ్లను ముందుకు తెస్తాయి. మంజు ఒక యువ మహిళ, ఆమెకు సూక్ష్మ రాజకీయ బేధాలను గ్రహించలేకపోవచ్చు, తన పాత్రను అంగీకరించే సమయంలో దాని పరిధిని మాత్రమే పరిగణనలోకి తీసుకొని వుండవచ్చు ‘ అన్నారు.

    సామాజిక మీడియాలో మంజు వారియర్‌పై దాడి, బెదిరింపులు, హెచ్చరికలు చేస్తున్నవారు తమ రాజకీయ భావాలను వెల్లడించకపోయినప్పటికీ ప్రస్తుతం నెలకొన్న వాతావరణంలో వారంతా ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారానికి చెందిన వారు లేదా దాని ప్రభావానికి లోనైన వారన్నది స్పష్టం. మీడియా ప్రతినిధులు ఈ వివాదం, బెదిరింపుల గురించి ప్రశ్నించినపుడు సామాజిక మీడియాలో ప్రచారం వెనుక తమ పాత్ర లేదని బిజెపి సీనియర్‌ నాయకులు చెప్పారు.’ సామాజిక మీడియాలో చర్చ జరుగుతున్న కారణంగా ఈ చిత్రానికి వ్యతిరేకంగా బిజెపి మరియు సంఘపరివార్‌ ప్రచారం నిర్వహిస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి, సామాజిక మీడియాలో వస్తున్నది బిజెపి వైఖరి కాదు. దానికి మా బాధ్యత లేదు ‘ అని బిజెపి కార్యదర్శి బి గోపాల కృష్ణన్‌ చెప్పారు. తమపై తీవ్ర ఆరోపణలు వచ్చినప్పటికీ ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా ఆ వివాదం లేదా ప్రచారంపై తమ వైఖరి ఏమిటో బిజెపి ఇంతవరకు ప్రకటించకపోవటం విశేషం. అనేక సందర్భాలలో కాగల కార్యకర్యం గంధర్వులు తీరుస్తారన్నట్లుగా ఇలా వ్యవహరించటం పరివార్‌ సంస్ధలకు సాధారణమే అన్నది విమర్శ.

    తమకేమీ సంబంధం లేదని బిజెపి నేతలు చెప్పటాన్ని తాము అంగీకరించటం లేదని సామాజిక కార్యకర్త ఎంఎన్‌ పియర్సన్‌ వంటి వారు స్పష్టం చేస్తున్నారు.’ ఇది ఒక గెరిల్లా దాడి వంటిది. సమాజంలో ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకున్నవారిని వెనక్కు కొట్టేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో వారి రాజీకీయ అజెండాలో భాగమిది ‘ అన్నారు. అన్ని రకాల ఆలోచనా కోణాలను అంగీకరించే సంప్రదాయమున్న రాష్ట్రంలో అనేక మంది రచయితలు ఎంఎం కలబుర్గి, గోవింద్‌ పన్సారే, నరేంద్ర దబోల్కర్‌ వంటి వారిని బలిగొన్న విద్వేష ప్రచారాన్ని కొనసాగించే దానిలో మంజు, కమల్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయటం ఒక భాగమని సిపిఎం పార్లమెంట్‌ సభ్యుడు ఎంబి రాజేష్‌ విమర్శించారు.

   సినిమా స్క్రిప్టులో మార్పులు చేసిన కారణంగా తాను చిత్రం నుంచి వైదొలుగుతున్నట్లు విద్యాబాలన్‌ చెప్పినప్పటికీ ఇంతవరకు అలాంటి మార్పులేమీ లేవని దర్శకుడు కమల్‌ స్పష్టం చేశారు. నవంబరులో షూటింగ్‌ ప్రారంభం కావాల్సి వుండగా విద్యాబాలన్‌ వెనక్కు తగ్గిన కారణంగా వాయిదా పడింది. జీవిత చరమాంకంలో ఇస్లాం మతం పుచ్చుకున్న కమలాదాస్‌ వివాదాస్పద జీవితం వున్న పాత్రను పోషించటం గురించి విద్యాబాలన్‌ భయపడి వుండవచ్చు. బాలీవుడ్‌లో ఆమె ఇటీవల కొన్ని ఎదురుదెబ్బలు తిన్నది. దక్షిణ భారత్‌లో ఈ సమయంలో ఇలాంటి చిత్రంలో చేస్తే తన భవిష్యత్‌ అవకాశాలను ప్రభావితం చేస్తాయోమో అన్నది కారణం కావచ్చని కమల్‌ వ్యాఖ్యానించారు. బయటి బెదిరింపులకు భయపడి మంజు వారియర్‌ వెనక్కు తగ్గుతుందని తాను భావించటం లేదని అన్నారు. కేరళ, ముంబై, కొల్‌కతాలలో షూటింగ్‌ జరుపుకొని మూడు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రావాలన్నది నిర్మాతల లక్ష్యం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వుడకకే వుడకకే ఓ వుల్లి గడ్డా నీ వెంత వుడికినా నీ కంపు పోదు !

16 Monday Jan 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Father of the Nation, Gandhi's Charkha Pose, KVIC, KVIC calendar, Mahatama Gandhi, mahatma, Narendra Modi

ఎం కోటేశ్వరరావు

    తెల్లగా వున్నంత మాత్రాన వుల్లి మల్లి అవుతుందా, వుప్పు కప్పురంబు చూడ ఒక్కటిగ నుండు చూడ చూడ రుచుల జాడ వేరయా అన్న ప్రఖ్యాత తెలుగు సామెతలు, సామ్యాల గురించి చాలా మంది వినే వుంటారు. నా చిన్న తనంలో ఫొటో తీయించుకోవటం అన్నది చాలా మందికి ఒక తీరని కల. తిరునాళ్లకు వెళ్లినపుడు లేదా పట్టణాలకు వెళ్లినపుడు అక్కడ స్టూడియోలకు వెళితే మోటారు సైకిలు మీద, గుర్రం మీద కూర్చున్నట్లు ఫొటోలు తీయించుకుంటే చెప్పలేని ఆనందం. ఎందుకంటే అవి ఆ నాడు సామాన్యులకు అందుబాటులో వుండేవి కాదు. ఎవరైనా గ్రామానికి మోటార్‌ సైకిల్‌ మీద వస్తే గ్రామం మొత్తం అబ్బో అన్నట్లుగా చూసేది, ఒకప్పుడు బైసికిలు(సైకిల్‌ను బైసికిలుగా ఆమె నోట మొదటిసారి విన్నాను) ఎక్కినపుడు కూడా అలాగే చూసేవారని మా తాతమ్మ చెప్పేది.

   ఇప్పుడు మన ప్రధాని నరేంద్రమోడీకి కూడా అలాంటి సరదాయే కలిగిందా అన్న అనుమానం వస్తోంది. లూధియానాలో జరిగిన ఒక కార్యక్రమంలో మహాత్మా గాంధీ మాదిరి చరఖా ముందు కూర్చొన్నపుడు తీసిన ఫొటోను ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ కాలండర్‌, డైరీలపై ముద్రించారు. అసలు ఖాదీ అంటే సామాన్యులు వాడే ముతక రకం వస్త్రం. ఇస్త్రీ లేకుండా ఖాదీ దుస్తులు ధరిస్తే అదేదో సినిమాలో చెప్పినట్లు చాల బాగోదు. ఇప్పుడు ఎందుకంటే గల్లీ నుంచి ఢిల్లీవరకు చిల్లర రాజకీయాలు చేసే వారు, ఫ్యాన్సీగా ధనికులు తప్ప సామాన్యులెవరూ వాడటం లేదు. వాటిని ధరించి పొలాల్లో, ఫ్యాక్టరీలలో పనిచేసే సామాన్యులెవరూ మనకు కనిపించరు. ఖద్దరు మాదిరి కనిపించే మర మగ్గాలు లేదా మిల్లు వస్త్రాలు మార్కెట్‌లో ఖాదీగా చెలామణి అవుతున్నాయన్నది కూడా వాస్తవమే.

    ఇక నరేంద్రమోడీ ఫొటోలంటే పడి చస్తారనేది ఇప్పటికి అనేక సందర్భాలలో రుజువైంది. ప్రధాన మంత్రి కనుక కేంద్ర ప్రభుత్వ ప్రమేయం వున్న ఏ శాఖ లేదా సంస్ధ కాలండర్‌లో అయినా ఫొటో వేయటాన్ని తప్పుపట్టనవసరం లేదు. స్వాతంత్య్ర వుద్యమ కాలంలో జనంలో స్వాతంత్య్ర కాంక్ష రగిల్చేందుకు గాంధీ ఖాదీ తయారీని విదేశీ వ్యతిరేక స్వదేశీ వుద్యమంగా చేెపట్టారు, స్వయంగా వడికారు. గాంధీ అంటే ఖాదీ, ఖాదీ అంటే గాంధీ అన్న నానుడి వునికిలోకి వచ్చింది. ఇప్పుడు నరేంద్రమోడీ విదేశీ వస్తువులకు మన తలపులను మరింత బార్లా తెరిచి తానొక బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారాలనుకుంటున్నారు. దేశానికి ఏ మాత్రం వుపయోగపడినా కూడా తప్పులేదు. అంబానీ జియో వేదిక, ప్రకటనలు చూస్తే మనకు అది కనిపిస్తుంది. ఖాదీ విషయంలో ముఖ్యమంత్రిగా గుజరాత్‌లో, ప్రధానిగా దేశంలో ప్రత్యేకంగా చేసిందేమీలేదు. ఖాదీ నూలు వడికే వారి బతుకుల దైన్య స్ధితే అందుకు నిదర్శనం. తాజా వివాదానికి వస్తే ఖాదీ సంస్ధ కాలెండర్‌పై గాంధీని అనుకరించిన ఫొటో వేయటమే అభ్యంతరకరం. చారిత్మ్రాత్మక గాంధీ ఫొటోకు, నరేంద్రమోడీ పాల్గొన్న ఒక సభలోని చిత్రానికి తేడా ఏమిటంటే ఆయన చొక్కా వేసుకోలేదు, సాదాసీదాగా నిజంగా నూలు వడుకుతున్నపుడు తీసింది. మోడీది డిజైన్డ్‌ చరఖా, ఖాదీ చొక్కా, కుర్తా వేసుకుకొని ఫొటో కోసం ఫోజిచ్చిన చిత్రం. అందుకే చూసే వారికి మొదటి ఫొటో సహజంగా కనిపించింది, రెండవ చిత్రం ఎబ్బెట్టుగా వుంది. బహిరంగ సభలలో మిత్రోం అంటూ సంబోధించే ఫొజుతో వున్న ఏ ఫొటోను అయినా ఒకవైపు, రెండవ వైపు గాంధీ ఫొటోను కాలండర్‌పై ముద్రించి వుంటే ఇంతటి వివాదం తలెత్తి వుండేది కాదు.

   ఖాదీ సంస్ధ కాలండర్‌పై గాంధీ చిత్రాన్ని తొలగించి మోడీ బొమ్మ ముద్రించటంతో అనేక మంది మనోభావాలు గాయపడ్డాయి . అయితే మాకేంటి అంటారా పోనీ అదైనా చెప్పండి. కాలండర్‌పై గాంధీ బొమ్మ స్ధానంలో నరేంద్రమోడీ చిత్రం పెట్టటాన్ని ఖాదీ సంస్ధ సమర్ధించుకున్న తీరు చిత్రంగా వుంది. ప్రధాని బొమ్మ పెట్టి ఆయన అనుగ్రహం పొందేందుకు ఖాదీ సంస్ద అధికారులు ప్రయత్నిస్తే వారి చర్యను సమర్ధించి నరేంద్రమోడీ కార్యాలయం ప్రజల మనోభావాలను గాయపరిచింది. ఇక హర్యానా బిజెపి మంత్రి అనిల్‌ విజె అర్‌ఎస్‌ఎస్‌ పరివార అంతరంగాన్ని బయటపెట్టారు.

   తమ చర్యను ఖాదీ కమిషన్‌ అడ్డంగా సమర్ధించుకొంటోంది. ‘ గాంధీ తత్వశాస్త్రం, ఆశయాలు, ఆలోచనల ప్రాతిపదికనే మొత్తం ఖాదీ పరిశ్రమ ఏర్పడింది. ఖాదీ గ్రామోద్యోగ కమిషన్‌ ఆత్మ ఆయన, అలాంటి గాంధీని విస్మరించే ప్రశ్నే లేదు. నరేంద్రమోడీ ఎంతో కాలం నుంచి ఖాదీని ధరిస్తున్నారు. ఖాదీతో తన స్వంత శైలిని అభివృద్ధి చేసుకుంటూ సామాన్య జనంలోనూ విదేశీ అతిధులలోనూ ఎంతో ప్రాచుర్యం కల్పించారు. వాస్తవానికి ఆయన ఖాదీకి అతిపెద్ద బ్రాండ్‌ అంబాసిడర్‌, ఆయన భావనలు ఖాదీ గ్రామోద్యోగ కమిషన్‌కు సరిపోయాయి. బొమ్మల ముద్రణకు సంబంధించి ఎలాంటి నిబంధనలు, సాంప్రదాయాలు లేవు, గతంలో కూడా ముద్రించని సందర్భాలు వున్నాయని’ కమిషన్‌ చైర్మన్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా చెప్పారు. ప్రధాని కార్యాలయం కూడా అనవసరమైన రచ్చ అంటూ కొట్టి పారవేసిందని, 1996, 2005, 2011,12,13, 16లో గాంధీ ఫొటో లేదని, కాంగ్రెస్‌ యాభై సంవత్సరాల పాలనలో రెండు నుంచి ఏడుశాతం చొప్పున మాత్రమే ఖాదీ అమ్మకాలు పెరిగాయని అదే గత రెండు సంవత్సరాలలో 34శాతం పెరిగాయంటే ఖాదీని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు మోడీ చేసిన యత్నాలే కారణమని కార్యాలయ వర్గాలు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దానిలో వాస్తవాంశాల కొస్తే మోడీ హయాంలో పెరుగుదల ఏడుశాతమే తప్ప 34శాతం కాదని వార్తలు వచ్చాయి. మిగతా విషయాల కొస్తే కార్యాలయ వర్గాలు పేర్కొన్న ప్రకారమైనా కొన్ని తప్ప మిగతా సంవత్సరాలన్నీ గాంధీ బొమ్మనే ముద్రించారు, ఆయన బోధనలనే ప్రచురించారు తప్ప, దాని బదులు మరొక ప్రధాని బొమ్మను ముద్రించినట్లు , వేరే వారి సుభాషితాలను పేర్కొన్నట్లు ప్రధాని కార్యాలయం, ఖాదీ కమిషన్‌గానీ చెప్పలేదు. మోడీ ఖాదీ ధరిస్తారు కనుక అమ్మకాలు ఎక్కువ అవుతాయన్నది మరొక వాదన, మిగతా ప్రధానులెవరూ ఖాదీ ధరించలేదా ? చేనేత, ఖాదీ ధరించమని ఏదో ఒక సందర్భంలో చెప్పలేదా ?

    సేనాని అయిన ప్రధాని కార్యాలయమే సమర్ధనకు దిగిన తరువాత సైనికులు మామూలుగా వుంటారా ? ఆదివారం నాడు హర్యానా బిజెపి మంత్రి అనిల్‌ విజ్‌ కరెన్సీ నోట్లపై మహాత్మాగాంధీ బొమ్మను ముద్రించినప్పటి నుంచి దాని విలువ తగ్గిపోతున్నదని, అందువలన వాటిపై కూడా క్రమంగా ఆ బొమ్మ అంతరించిపోతుందన్నాడు.ఖాదీతో గాంధీ పేరు ముడిపడివున్నంత కాలం దాని అమ్మకాలు పెద్దగా లేవు, తగ్గిపోయాయి. కాలండెర్‌పై బొమ్మ తీసివేయటం మంచి పని.మోడీ బొమ్మ పెట్టిన తరువాత 14శాతం పెరిగాయని అనిల్‌ వ్యాఖ్యానించాడు. వాటిపై విమర్శలు రావటంతో హర్యానా ముఖమంత్రి ఖట్టర్‌ ఒక ప్రకటన చేసి అవి అతని వ్యక్తిగత వ్యాఖ్యలని కొట్టిపారవేశారు. పార్టీకి సంబంధం లేదన్నారు. తరువాత తాను అన్న మాటలను వుపసంహరించుకున్నట్లు అనిల్‌ ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. బిజెపి నేతలు ఇలాంటి వదరుబోతు వ్యాఖ్యలు చేయటం తరువాత వాటిని వుపసంహరించుకున్నట్లు ప్రకటించటం ఒక ఎత్తుగడ, ఒక అలవాటు. కడుపులో వున్నదే బయటికి వస్తుంది తప్ప వేరొకటి కాదు. వాటిని వుపసంహరించుకున్నట్లు ప్రకటించినప్పటికీ అవి తిరుగుతూ వాటిపని అవి చేస్తాయి.

  ఖాదీ వినియోగం పెంపుదలకు నరేంద్రమోడీ ఎంతగానో కృషి చేస్తున్నారనేది ఒక ప్రచారం మాత్రమే. గ్రామాలలో ఖాదీ దారాలను తయారు చేసే కార్మికులకు కనీసవేతనాలు కూడా రావటం లేదని రోజుకు 125-150 మాత్రమే వేతనం వస్తున్నట్లు కొందరు పరిశోధకులు మూడు నెలల క్రితం తమ పత్రంలో ప్రకటించారు.

   కాళ్లు తుడుచుకునే పట్టాలను మన జాతీయ పతాక రంగులు, చిహ్నంతో తయారు చేసి విక్రయించటాన్ని వెంటనే నిలిపి వేయాలని, భారతీయుల మనోభావాలను గౌరవించాలని అంతర్జాతీయ వాణిజ్య దిగ్గజం అమెజాన్‌ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక చేసింది. ఈ మేరకు మన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ముందు ఒక ట్వీట్‌ చేసి పాలనా పద్దతుల్లో కొత్త ఒరవడిని సృష్టించారు. వుపసంహరించకపోతే అమెజాన్‌ కంపెనీ అధికారుల వీసాలను పునరుద్ధరించబోమని హెచ్చరించారు. తరువాత విదేశాంగ శాఖ వాషింగ్టన్‌లోని మన రాయబారిద్వారా అమెజాన్‌ కంపెనీకి నిరసన తెలియ చేయమని చెప్పారు. ఇలాంటివి పునరావృతం కానివ్వబోమని అమెజాన్‌ కంపెనీ చెప్పిందనుకోండి. నిజానికి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు, కానీ ఆ పని చేయకుండా ట్విటర్‌ ద్వారా హెచ్చరించటం విశేషం.మన జాతీయ జెండాను అలా వుపయోగించటం చట్టరీత్యా నేరమే కాకుండా, మన మనోభావాలను దెబ్బతీసిన అంతర్జాతీయ వాణిజ్య సంస్ధకు హెచ్చరికలు చేసిన పాలకులు గాంధీ బొమ్మ స్ధానంలో నరేంద్రమోడీ చిత్రాన్ని పెట్టి మనోభావాలను గాయపరచటాన్ని ఏమనాలి?

    గాంధీని చంపిన గాడ్సే వారసులు తామరతంపరగా చెలరేగుతున్న ఈ తరుణంలో అలాంటి గౌరవం జాతిపితకు ఇస్తారని ఆశించటమే అసహజం. గాంధీ, గాంధీయిజానికి మేము వ్యతిరేకం, దాన్ని ఏడు నిలువుల లోతున పాతేస్తాం, అందుకే గాంధీని జనం మరిచిపోయేట్లు చేయదలచుకున్నాం అని నిజాయితీగా ప్రకటించి చేస్తే అదో పద్దతి. అలాగాక కొందరు అంటున్నట్లు చరఖా ముందు కూర్చొని గాంధీని అనుకరించి ఫొటోలు దిగితే నరేంద్రమోడీ మహాత్ముడు అవుతారా, ఆయనపై పడిన మచ్చలు తొలుగుతాయా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మార్పు కోసం మోడీకి ఓటు వేశాను తప్ప ద్వేషం కోసం కాదు !

12 Thursday Jan 2017

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, BJP's social media, BJP’s IT cell, BJP’s trolling army, I am a troll, Narendra Modi, Rahul gandhi, Trolls

సాధ్వి ఖోస్లా

    స్వాతంత్య్ర సమర యోధుల పరంపరనుంచి వచ్చిన కొంత మందికి రెండు విషయాలు మాత్రమే -దేశ భక్తి మరియు గాంధీజీ సిద్ధాంతాలు-ఎరుకలో వుంటాయి. నాకైతే నా రాష్ట్రం పంజాబ్‌ కూడా. పంజాబ్‌ మీద నాకున్న ప్రేమ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలకు మరియు వాటికి అనుకూలంగా వున్న రాష్ట రాజకీయ పరిసరాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు శక్తి నిచ్చింది. ద్వేష పూరితమైన భారతీయ జనతా పార్టీ మరియు తమను తాము వీరులుగా చెప్పుకొనే దాని సామాజిక మీడియా మరుగుజ్జు యోధులపై పోరాడేందుకు దేశం మీద నాకున్న ప్రేమ బలాన్నిచ్చింది.

    గత మూడు సంవత్సరాలుగా ప్రధాని నరేంద్రమోడీ ట్విటర్‌ మీద నన్ను అసుసరిస్తున్నారు.ఈ రోజు నేనేమీ కాదు మరియు బిజెపితో నా అనుబంధాన్ని ప్రశ్నిస్తున్నారు. స్వాతి చతుర్వేది పుస్తకం అయామ్‌ ఏ ట్రోల్‌ (నేనో వెంటాడే మరుగుజ్జును )లో నేను వెల్లడించిన వాస్తవాలతో మండిపడుతున్న బిజెపి సామాజిక మీడియా సేనలోని అజ్ఞాత ముఖాలు నన్నొక దుష్టశక్తిగా చిత్రిస్తున్నాయి. ప్రధాన మంత్రి, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిజాలు పలికే గొంతులేమైనా వుంటే వాటిని మూయిస్తారని నేను చెప్పింది వాస్తవమని వారు రుజువు చేస్తున్నారు.నేను బయటపడి వాస్తవాలను బహిరంగ పరచాలన్న నా నిర్ణయం కాంగ్రెస్‌తో నాకున్న స్వల్పకాల అనుబంధం వలన కాదు, అసత్యాలను వేద వాక్యంగా మార్చటాన్ని అపేందుకు చిత్తశుద్దితో చేస్తున్న ప్రయత్నమిది. ఎప్పటికప్పుడు వార్తలు అందుతున్న నేటి యుగంలో నిజం కంటే వ్యతిరేక సమాచార ప్రచారాన్ని వాట్సాప్‌, ట్విటర్‌ మరియు ఫేస్‌బుక్‌లలో జనం ఎక్కువగా నమ్ముతున్నారు. ఆ సమయానికి నిజం అడుగున పడిపోయి జరగాల్సిన హాని జరుగుతుంది.

    మన గొప్ప దేశాన్ని గత ప్రభుత్వాలు మలుచుతున్న తీరుతో ఇతర తరుణ వయస్సు భారత పౌరుల మాదిరే నేను కూడా 2013లో అసంతృప్తి చెందాను. నేను మొదటి సారిగా నా ఓటు హక్కును మోడీకి అనుకూలంగా వినియోగించాను, ఎందుకంటే మెరుగైన భారత్‌ గురించి ఆయన దర్శన కోణాన్ని, ఆయనను నమ్మాను. ఆ నమ్మకమే నన్ను 272 మంది మరియు వారితో పాటు వున్న వలంటీర్లతో కూడిన బిజెపి మిషన్‌ (ప్రచార దళం)లో చేరేందుకు ప్రేరణనిచ్చింది.ఆ ప్రచార దళపు ‘సరికొత్త ప్రచార పద్దతులు ‘ వెంటాడటంతో సహా అప్రతిష్టపాలు చేయటం, వాస్తవానికి వక్రభాష్యాలు చెప్పి జనాల న్యాయనిర్ణయాలను అయోమయంలోకి నెట్టటం గురించి నాకు ముందుగా ఏమాత్రం తెలియదు.

     2015 నవంబరులో అమీర్‌ ఖాన్‌ దేశంలో నాడున్న పరిస్ధితుల గురించి తన మనోభావాలను వ్యక్తం చేసినపుడు అరవింద గుప్తా నాయకత్వంలోని బిజెపి ఐటి విభాగం ఎలక్ట్రానిక్‌ వాణిజ్య సంస్ధ అయిన స్నాప్‌డీల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వున్న ఆ నటుడిని తప్పించేందుకు గాను ఒత్తిడి చేస్తూ ఒక సామాజిక మీడియా ప్రచారాన్ని నిర్వహించింది. ఆ నటుడిని వెంటాడాలని, వివిధ వేదికలపై అతనిపై బురద చల్లాలని, అతని సినిమాలు చూడకుండా జనాన్ని రెచ్చగొట్టాలని మాకు (బిజెపి ఐటి విభాగంలోని వలంటీర్లకు) ఆదేశాలు జారీ చేశారు. నా భావజాలం మరియు ఆత్మ బిజెపి మతోన్మాద దళంలో భాగస్వామి అయ్యేందుకు అనుమతించలేదు.భ్రమలు తొలిగిన నేను దాని నుంచి బయటపడ్డాను. వత్తిడి కారణంగా 2016 జనవరిలో స్నాప్‌డీల్‌ అమీర్‌ ఖాన్‌తో తన సంబంధాలను రద్దు చేసుకుంది.

     అటువంటి చర్యల తీవ్ర పర్యవసానాలను మనం గుర్తించలేదు. ఒక నటుడిగా ఎన్నో సంవత్సరాల నుంచి మన ఇండ్లలో వుంటూ మన హృదయాలను దోచుకున్న వ్యక్తి ఆకస్మికంగా ఒక ‘ముస్లింగా’ మారిపోయాడు. ద్వేషాన్ని వ్యాపింప చేయటానికి సామాజిక మాధ్యమం ఒక ప్రమాదకర సాధనంగా మారిపోయింది, అదికొన్ని సందర్భాలలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు కూడా దారితీయవచ్చు. చివరికి మతం కూడా రాజకీయాల మాదిరి మనల్ని విడదీయలేదు.

జాతి వ్యతిరేకిగా ముద్ర

     దాదాపు రెండు సంవత్సరాలు తీవ్ర స్ధాయిలో ప్రధాన మంత్రికి ట్విటర్‌ మీద మద్దతు పలికాను, చురుకుగా బిజెపికి ప్రచారం చేశాను, వారి ఎజండాలలో భాగంగా స్మృతి ఇరానీ, కిరణ్‌ ఖేర్‌ వంటి బిజెపి నాయకులకు తోడ్పడ్డాను. నేను వ్యతిరేకించిన సమయంలో కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ కూటమికి నాయకత్వం లేకపోవటాన్ని, దిగజారిన విధానాలను కూడా విమర్శించాను. ఇదే సమయంలో పంజాబ్‌ మీద వున్న నా అభిమానం రాష్ట్రంలో వున్న భయంకరమైన మాదకద్రవ్యాల వ్యాప్తిని వెల్లడిస్తూ దాని మీద ఒక డాక్యుమెంటరీని తీయించేందుకు కూడా నడిపించింది. ఆందోళన కలిగించే వాస్తవాలను ప్రధాన మంత్రి దృష్టికి తెచ్చేందుకు ట్విటర్‌ ద్వారా ఒక వర్తమానం కూడా పంపాను. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడతామని మోడీ వాగ్దానం చేశారు, అయితే అందుకు సహాయం చేసేందుకు నేను చేసిన వినతులను విస్మరించారు.

  ప్రధాన మంత్రి నిర్లక్ష్యం నన్ను కాంగ్రెస్‌ వైపు తిరిగేట్లు చేసింది. నేను గట్టిగా బలపరిచిన నరేంద్రమోడీ విస్మరిస్తే నా వినతులను రాహుల్‌ గాంధీ విన్నారు. కాంగ్రెస్‌ వుపాధ్యక్షుడితో కలిసినప్పటి నా చిత్రాలను సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన బిజెపి వెంటాడే సేనకు నా కృతజ్ఞతలు. రహస్యంగా వుంచిన వారి క్రీడను నేను బయట పెట్టటాన్ని నా రాజకీయ అజండాలో భాగంగా చూపుతున్నారు. నేను నిర్మించిన డాక్యుమెంటరీని 2016 మార్చి 18న రాహుల్‌ గాంధీ విడుదల చేశారు. కాంగ్రెస్‌తో నా ఏకైక సంబంధం అది మాత్రమే.

   2014 ఎన్నికలు భారత రాజకీయ ముఖచిత్రాన్నే మార్చివేశాయి. మీడియాలో ప్రచారం ఎలా పొందాలో తెలిసిన ప్రధాన మంత్రి ఇంటర్నెట్‌ ద్వారా జనాలకు చేరువ అవుతున్నారు. ట్విటర్‌, ఫేస్‌బుక్‌ ద్వారా జనానికి తెలియచేస్తున్నారు. ఆయనను మిలియన్ల మంది అనుసరిస్తున్నారు, కానీ ఆయన మాత్రం కొద్ది మంది ఎంపిక చేసిన వారిని మాత్రమే అనుసరిస్తారు. వారిలో ఎక్కువ మంది దూషిస్తూ వెంటాడతారని బాగా తెలిసిన వారే. ప్రధానిని సందర్శించి, శుభాకాంక్షలు తెలిపేందుకు ఇలా దూషించే వారిని ఎప్పటికప్పుడు ఆహ్వానిస్తూ వుంటారు. ఇలా వెంటాడే వారిని ప్రోత్సహించనని బిజెపి చెప్పుకునేట్లయితే ఇలాంటి అక్రమ చర్యలకు వ్యతిరేకంగా ముఖ్యంగా తమ కార్ఖానా నుంచి తయారై బయటకు వస్తున్న వాటి గురించి ప్రధాని ఎందుకు మాట్లాడలేదు?

   సామాజిక మాధ్యమ వేదికను నిర్మాణాత్మక అభివృద్ధికి వినియోగించుకోవటానికి బదులు తమ వ్యతిరేక అభిప్రాయాలను వెల్లడించించిన వారిని అవమానించే విధంగా తన దిగువ సేనను వినియోగించుకుంటోంది. ఏ వ్యక్తి, సంస్ధ లేదా సమాజం అభివృద్ధి చెందాలంటే సానుకూల విమర్శలు ఆరోగ్యకరమైనవి, కానీ అసహ్యంగా విమర్శించటం, వ్యక్తిత్వాలను దెబ్బతీయటం అవాంఛనీయం. ప్రధానిని సమర్ధించే పేరుతో జనాలను మరియు వారి వ్యక్తిత్వాలను దెబ్బతీస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల చీకటి చిత్రాన్ని మాత్రమే ఇది బయట పెడుతోంది. వ్యతిరేకుల, జర్నలిస్టుల, రాజకీయనేతలు మరి ఇతరులెవరి ప్రతిష్టనైనా దెబ్బతీయాలని కిరాయి వలంటీర్లకు మార్గదర్శనం చేశారు. భిన్నమైన వైఖరి కలిగి వున్న ఎవరినైనా మోడీ మరియు జాతి వ్యతిరేకిగా వర్ణించారు. ఎంత అసహ్యంగా అయితే అంతగా మహిళలు, మైనారిటీలను లక్ష్యంగా చేసుకున్నారు. రాహుల్‌ గాంధీ,ఆయన తల్లి సోనియాగాంధీలపై తప్పుడు ప్రచారం చేశారు, బర్ఖాదత్‌ వంటి జర్నలిస్టులను చంపేస్తామని, మాన భంగం చేస్తామని బెదిరింపులు చేశారు.

  బిజెపి ప్రచారాన్ని బయటపెట్టిన మాకు అన్ని జీవన రంగాల నుంచి ప్రజామద్దతు వెల్లువెత్తుతున్నది. ఈ అంశం దేశంలోని మారుమూలలకు కూడా ప్రయాణించింది. వ్యతిరేక భావజాలాన్ని అణచివేసేందుకు పాలకపార్టీ సామాజిక మీడియాను వినియోగించుకోవటాన్ని జనం ప్రశ్నిస్తున్నారు.అంతిమంగా బిజెపి సామాజిక మీడియా సేన మరియు మద్దతుదారుల లక్ష్యంగా పుస్తక రచయిత్రి స్వాతి చతుర్వేది మరియు నేను వుంటాము. వారు మాపై బూతులు, కించపరిచే ప్రచారం, బెదిరింపులతో దాడి చేస్తారు. ఇదంతా ఎందుకంటే వారి చీకటి రహస్యం బట్టబయలైంది, నిజం గాయపరుస్తుంది.

   నేను నా ఆత్మ చెప్పినట్లు నడిచాను. వ్యతిరేక భావాలు కలిగి వున్న వ్యతిరేకులు లేదా ప్రముఖులకు వ్యతిరేకంగా కించపరిచే ప్రచారం చేయటానికి సామాజిక మీడియాను ఎలా సాధనంగా చేసుకుంటున్నారో నా అందమైన దేశం, దాని ప్రజలు తెలుసుకోవాలన్నది నా ఆలోచన మరియు విధి.

ప్రేమ కంటే ద్వేషం త్వరగా విస్తరించటం విచారకరం !

నేను మార్పు కోసం నరేంద్రమోడీకి ఓటు వేశాను తప్ప ద్వేషం కోసం కాదు. !

నేను చెప్పాల్సింది చెప్పాను, నేను నమ్మిందే చేశాను, చేసిందే చెప్పాను. ఇది నేను చెబుతున్న నిజం !

స్క్రోల్‌.ఇన్‌ సౌజన్యంతో

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • యోగులు-స్వాముల కొట్లాట : సిఎం ఆదిత్యనాధ్‌ను నకిలీ హిందువుగా ప్రకటిస్తా , శంకరాచార్య అవిముక్తేశ్వరానంద !
  • ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !
  • రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !
  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • యోగులు-స్వాముల కొట్లాట : సిఎం ఆదిత్యనాధ్‌ను నకిలీ హిందువుగా ప్రకటిస్తా , శంకరాచార్య అవిముక్తేశ్వరానంద !
  • ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !
  • రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !
  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • యోగులు-స్వాముల కొట్లాట : సిఎం ఆదిత్యనాధ్‌ను నకిలీ హిందువుగా ప్రకటిస్తా , శంకరాచార్య అవిముక్తేశ్వరానంద !
  • ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !
  • రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !
  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d