• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Narendra Modi

విస్మరించజాలని కమ్యూనిస్టు ప్రణాళిక, కమ్యూనిస్టు పార్టీల ప్రాధాన్యత

09 Thursday Mar 2017

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Political Parties, RUSSIA, USA

≈ 1 Comment

Tags

China, china communist party, communist manifesto, Engels, Marx, Marx and Engels, Narendra Modi, Xi Jinping

Image result for one cannot deny the importance of the communist manifesto

ఎం కోటేశ్వరరావు

ఏ తర్కానికైనా దానికి ఒక న్యాయబద్దమైన ముగింపు వుంటుంది. తర్కంలో పాల్గొనేవారు తమకు అనుకూలమైనంత వరకే స్వీకరించి ఎదుటి వారికి సరైన సమాధానం చెప్పకపోతే చివరకు ఆ తర్కం అసంబద్దంగా ముగుస్తుంది. వుదాహరణకు కమ్యూనిజానికి కాలం చెల్లింది, అది పనికిరాదు అంటారు. అదే నిజమైతే ప్రపంచవ్యాపితంగా కమ్యూనిజం గురించి అనుకూలంగానో వ్యతిరేకంగానో ఎందుకు చర్చ జరుగుతోంది?

కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ రచించిన కమ్యూనిస్టు ప్రణాళిక తొలి ముద్రణ జరిగి ఫిబ్రవరి 21 నాటికి 170 సంవత్సరాలు పూర్తి అయింది.అమెరికాలో ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత పుస్తక దుకాణాలలో ఆఫ్రో-అమెరికన్ల గురించి రాసిన న్యూ జిమ్‌ క్రో గ్రంధం తరువాత కమ్యూనిస్టు మానిఫెస్టో గురించి పాఠకులు అడుగుతున్నారని అమెరికాలోని సింపోజియం బుక్స్‌ యజమాని చెప్పారు. జనం కమ్యూనిస్టుమానిఫెస్టో గురించి ఎందుకు అడుగుతున్నట్లు ? అంటే కమ్యూనిస్టు సిద్దాంతం పనికిరాదని చెబుతున్నమాటలను జనం పూర్తిగా విశ్వసించటం లేదన్నమాట. 2008లో ధనిక దేశాలలో సంక్షోభం ప్రారంభమైన తరువాత అనేక మంది కమ్యూనిస్టు మానిఫెస్టో దుమ్ముదులుపుతున్నారు. ప్రఖ్యాత అమెరికన్‌ ఆర్ధికవేత్త రాబర్ట్‌ ఎల్‌ హెయిల్‌బ్రోనర్‌ ఒక సందర్భంలో ‘మనం మార్క్స్‌వైపు చూస్తున్నామంటే ఆయన సర్వజ్ఞుడని కాదు, ఎందుకంటే ఆయన్నుంచి మనం తప్పించుకోలేం’ అన్నారు. పాలకవర్గాలు తమ అస్ధిత్వానికి ముప్పు ఏర్పడినపుడు అంతకు ముందు ఏం చెప్పినప్పటికీ దాన్నుంచి తప్పించుకొనేందుకు ఒక మహా సంఘటనగా ఏర్పడతాయి. సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు రాజ్యాల కూల్చివేతకు ఐరోపా, అమెరికాలోని కమ్యూనిస్టు వ్యతిరేకశక్తులు, పోప్‌ ఒక కూటమిగా ఏర్పడటం ప్రపంచ చరిత్రలో ఒక ప్రధాన ఘటన కాదా? అంటే ఈ రెండు ఖండాలలోని అధికార శక్తులు కమ్యూనిజం తమను సవాలు చేసే ఒక శక్తి అని గుర్తించినట్లే కదా ? చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు జరిగిన కుట్రలో బౌద్ద దలైలామా ఒక పావుగా వుపయోగపడ్డారా లేదా ? అందుకే ఎవరెన్ని చెప్పినా కమ్యూనిస్టు మానిఫెస్టో, కాపిటల్‌ గ్రంధాలు ఇప్పటికీ కొత్త తరాలకు ఆసక్తి కలిగిస్తూనే వున్నాయి. ఇక్కడొక ప్రశ్న తలెత్త వచ్చు. తమకు ముప్పు తెచ్చే పుస్తకాలను అమెజాన్‌ వంటి బహుళజాతి కార్పొరేషన్లు ఎందుకు విక్రయిస్తున్నాయి, గూగుల్‌ వంటి కంపెనీలు ఆ సాహిత్యాన్ని ఆన్‌లైన్‌లో ఎందుకు అనుమతిస్తున్నాయని ఎవరైనా అడగవచ్చు. మార్క్సు రైనిష్‌ జీటుంగ్‌ పత్రికలో నాటి రష్యన్‌ జారు ఒకటవ నికోలస్‌ను విమర్శిస్తూ వ్యాసం రాయటంతో ఆ పత్రికపై నిషేధం విధించాలని ప్రష్యన్‌ ప్రభుత్వాన్ని కోరగా ఆ పని చేశారు. కమ్యూనిస్టు మానిఫెస్టో, కాపిటల్‌ తొలి ముద్రణలు పొందినపుడు వాటి వల్ల ముప్పు వస్తుందని నాటి పాలకవర్గాలు భావించలేదు కనుకనే ముద్రణ, విక్రయాలకు అనుమతిచ్చాయి, ఇప్పుడు ముప్పులేదని పైకి చెబుతున్న కారణంగా, దాని కంటే ఆ పుస్తకాలకు గిరాకీ వున్నందున వాటిపై కూడా లాభం సంపాదించేందుకు ఇప్పుడు అనుమతిస్తున్నారు. ఎంతకాలం అనుమతిస్తారో చూడాల్సిందే.

Image result for marx engels

చైనా కంటే భారత్‌ ఎందుకు వెనుకబడింది అంటే అది నిరంకుశ దేశం, మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం అని టక్కున సమాధానం చెబుతారు.అమెరికాతో పోలిస్తే 1917కు ముందు రష్యా కూడా నిరంకుశ జార్‌ పాలనలోనే మగ్గింది. మరి అదెందుకు వెనుకబడిపోయింది. ప్రపంచానికి ప్రజాస్వామ్యాన్ని నేర్పినట్లు చెప్పుకొనే రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని కలిగి వున్న బ్రిటన్‌ ఈ రోజు అమెరికా అనుచర దేశంగా ఎందుకు మారిపోయింది? నిరంకుశ దేశాలన్నీ చైనా మాదిరి అంతగాకపోయినా వాటి స్ధాయిలో అయినా ఎందుకు పురోగమించటం లేదు అంటే సరైన సమాధానం వుండదు. మన దేశం త్వరలో చైనాను అధిగమించనుంది అని చెబుతున్నారు. అంతకంటే కావాల్సిందేముంది? మన వారందరూ అమెరికా వెళ్లి ఆ దేశాన్ని ప్రధమ స్ధానంలో వుంచుతున్నారని మన చంద్రబాబు వంటి వారు చెబుతున్నారు. అందువలన అభివృద్దిలో చైనాతోయేం ఖర్మ అమెరికాతోనే పోటీ పడాలి. కానీ మనం ఎక్కడున్నాం, సర్దార్‌ పటేల్‌ విగ్రహాన్ని కూడా తయారు చేసుకోలేక చైనాకు ఆర్డర్‌ ఇచ్చాము. అదే నోటితో మేకిన్‌ ఇండియా అని పిలుపులు ఇస్తాము. మన ముందు ఏం మాట్లాడినా మన వెనుక ప్రపంచం నవ్వదా ?

Image result for xi jinping

చైనా విజయానికి కమ్యూనిస్టు పార్టీ ఎలా మార్గదర్శకత్వం వహించింది అనే పేరుతో అమెరికాకు చెందిన న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఒక వ్యాసాన్ని ప్రచురించింది. అదేమీ మ్యూనిస్టు అనుకూల పత్రిక కాదు. సెబాస్టియన్‌ హెయిల్‌మాన్‌(51) అనే ఒక జర్మన్‌ బెర్లిన్‌లోని మెర్కాటర్‌ ఇసిస్టిట్యూట్‌ ఆఫ్‌ చైనీస్‌ స్టడీస్‌ సంస్ధ స్ధాపక అధ్యక్షుడు. ట్రయర్‌ విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ ప్రొఫెసర్‌.ఆయనతో ఇంటర్వూ చేసి న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించింది. హెయిల్‌ మన్‌ రాసిన చైనా రాజకీయ వ్యవస్ధ అనే అంగ్ల అనువాదాన్ని ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి నవీకరిస్తున్నారు. ఎప్పటికప్పుడు చైనాలో జరుగుతున్న మార్పులను పాఠకులకు అందించేందుకు దానిని ఆన్‌లైన్‌లో పెట్టారు. చైనా పురోభివృద్ధిలో చైనా కమ్యూనిస్టు పార్టీ పాత్ర గురించి ఆయనెంతో లోతుగా పరిశోధించారు. ఇది కమ్యూనిజం విజయం కాదా? మనమెంతో తెలివిగలవారమని, చైనీయులు నల్లమందు భాయీలని ఎద్దేవా చేసిన రోజులను మనం మరిచిపోయామా ? అలాంటి వారిని ఎంతో తెలివిగలవారిగా మార్చిందెవరు ? కమ్యూనిస్టులు కాదా ? ప్రజాస్వామ్య వ్యవస్ధ మనలను అలా ఎందుకు మార్చలేకపోయింది ?

     మన దేశంలో అధికారంలో ఏ పార్టీ వున్నా తన కాడర్‌పై ఆధారపడటం అన్నది ఆత్మవంచన చేసుకొనేవారు తప్ప మిగిలిన వారందరూ అంగీకరిస్తున్న సత్యం. పార్టీ కార్యకర్తలకు నామినేటెడ్‌ పదవులను ఇచ్చి రాజకీయ నిరుద్యోగం పోగొట్టి వుపాధి కల్పించటం, ఆ పదవులను స్ధాయిని బట్టి పెద్ద ఎత్తున అక్రమంగా పోగేసుకోవటానికి వినియోగించటం తెలిసిందే. అది చైనాలో లేదా అంటే అక్కడా వుందని కమ్యూనిస్టుపార్టీయే స్వయంగా చెప్పి అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తున్నది. ఎన్నో వేల మందిపై వేటు వేశారు. మన దేశంలో ఏ పార్టీ అయినా అవినీతికి పాల్పడిన వారిని ఒక్కరినంటే ఒక్కరిని తొలగించి, శిక్షించిన వుదంతం వుందా ? ఎందుకు లేదు? ప్రజాస్వామ్యం నుకనా ?

     మన వంటి దేశాలలో విధాన నిర్ణయాలు, చట్టాలు చేసేది చట్టసభలు. వాటిని అమలు జరిపేది వుద్యోగ యంత్రాంగం. చైనాలో చట్టసభలు తమపని తాము చేస్తే వాటిని అమలు చేసే బాధ్యత పార్టీ కార్యకర్తలపై పెట్టటమే అక్కడి విజయ రహస్యం అన్నది హెయిల్‌మన్‌ అధ్యయన సారంశాలలో ఒకటి. వుదాహరణకు మన ప్రధాని నరేంద్రమోడీ సర్వరోగ నివారిణి జిందాతిలిస్మాత్‌ అన్నట్లుగా నల్లధనం నుంచి అవినీతి, వుగ్రవాదం, పన్నుల ఎగవేత, నగదు రహిత లావాదేవీల వంటి అనేక చర్యలకు గాను ఒకే మాత్ర అన్నట్లుగా పెద్ద నోట్ల రద్దును ప్రకటించి అమలు చేశారు. ఆ సందర్భంగా బిజెపి ప్రజాప్రతినిధులు, నాయకులందరూ తమ బ్యాంకు ఖాతాల లావాదేవీల వివరాలను పార్టీ నాయకత్వానికి అందచేయాలని ఆదేశించినట్లు మన ప్రజాస్వామిక మీడియాలో వార్తలు చదివాము. ఆ లెక్కల్లో ఎలాంటి అక్రమాలు లేవని అయినా ప్రకటించాలి కదా ? అసలు దాని గురించి ఎందుకు మాట్లాడరు ? అన్నింటికీ మించి రిజర్వుబ్యాంకు దగ్గరకు వచ్చిన రద్దయిన నోట్లెన్ని? ఎంత నల్లధనం బయటపడిందీ ఎందుకు ప్రకటించలేదు. ప్రజాస్వామిక వ్యవస్ధలలో ఇలాంటి వన్నీ రహస్యమా ?

చైనాలో కూడా బయటి నుంచి వచ్చిన పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అవినీతి కూడా దిగుమతి అయి కొందరు అవినీతిపరులుగా మారారు. వారిపై అక్కడి అధ్యక్షుడు గ్జీ జింగ్‌ పింగ్‌ కూడా చర్యలు తీసుకున్నారు. రోజూ ఏదో ఒక మూల నుంచి అవినీతి పరులపై చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు చదువుతూనే వున్నాము కదా? మన దేశంలో అలాంటి వార్తలు ఎందుకు రావటం లేదు. చెన్నయ్‌లో కోట్ల కొలది కొత్త నోట్లు పోగేసిన బడా కాంట్రాక్టర్‌ వుదంతంలో ఎందరు బ్యాంకు వున్నతాధికారులపై చర్యతీసుకున్నారో ఎవరైనా ప్రకటించారా ?

చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం ఎంతో పట్టువిడుపులతో చట్టాలు చేయబోయే ముందు అనేక అంశాలపై ప్రయోగాలు చేసిన తరువాతే చట్టాలు చేయటం కూడా విజయ రహస్యమని జర్మన్‌ ప్రొఫెసర్‌ అంటున్నారు. సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం అన్నది 1917కు ముందు తెలియదు. సోవియట్‌ ఒక ప్రయోగం. అక్కడ వచ్చిన ఫలితాలను అధ్యయనం చేసిన తరువాత చైనా తనదైన పంధాను ఎంచుకున్నది. భూ సంస్కరణల విషయంలో అది కనిపిస్తుంది. సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణానికి ఒక మూస అనేది వుండదని గ్రహించిన తరువాత చైనాలో సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌సియావో పింగ్‌, తరువాత నేతలుగా వున్న వారు అనేక ప్రయోగాలకు తెరతీశారు. మంచి గాలికోసం కిటికీలు తెరిస్తే దాంతో పాటు ఈగలు, దోమలు కూడా ప్రవేశించవచ్చు, అయితే వాటిని ఎలా అరికట్టాలో మాకు తెలుసు అని డెంగ్‌ అన్నారంటే ఒక ప్రయోగానికి శ్రీకారం చుట్టటమే. దానికి తోడు సత్వర ఫలితాలు రావాలంటే ప్రయోగాలను కూడా వికేంద్రీకరించాలని భావించారు, అది అవినీతికి తెరతీసిందని గ్రహించిన తరువాత ప్రస్తుత అధ్యక్షుడు గ్జీ జింగ్‌ పింగ్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కేంద్ర స్ధానం నుంచి పధకాలకు రూపకల్పన చేస్తున్నారు. దీని ఫలితాలను చూసిన తరువాత మార్పులు చేర్పులు చేయటం అనివార్యం. చైనా విజయ రహస్యం ఇదే. సోషలిజం, కమ్యూనిజం వాటిని అమలు చేసే వ్యవస్ధల నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఎదురుదెబ్బలు తిన్న పూర్వపు సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాల గురించిగానీ లేదా ప్రస్తుతం సోషలిస్టు వ్యవస్ధల నిర్మాణంలో నిమగ్నమైన చైనా, వియత్నాం, క్యూబా, లావోస్‌, కంపూచియా ప్రయోగాల గురించి తమ తమ దృక్కోణాల నుంచి అనేక మంది విశ్లేషణలు చేస్తున్నారు. వాటిని యథాతధంగా స్వీకరించటం లేదా తిరస్కరించటం గాకుండా అధ్యయనం చేయటం అవసరం. మావో మరణం తరువాత ఇంక చైనా పని అయిపోయినట్లే అని అనేక మంది వ్యాఖ్యానాలు చేశారు. తరువాత డెంగ్‌ను గురించి కూడా అదే విధంగా మాట్లాడారు. కానీ చైనా, వియత్నాం, క్యూబా వంటి దేశాలలో వున్న కమ్యూనిస్టు పార్టీలకు ఒక ప్రత్యేక చరిత్ర, అంకిత భావం గల కార్యకర్తల గురించి వారు విస్మరించారు. నాయకులు మరణించిన తరువాత కమ్యూనిజానికి భవిష్యత్‌ లేదని చెప్పటం వ్యతిరేకుల ప్రచారదాడిలో అస్త్రాలు తప్ప మరొకటి కాదని అనేక దేశాల అనుభవాలు నిరూపించాయి. రామాయణం గురించి చెప్పేవారు రాక్షసుడిగా చిత్రించినప్పటికీ రావణుడిని , మహాభారతంలో ధుర్యోధనుడిని, హిట్లర్‌ను పొగిడేవారు వాడి పీచమణిన స్టాలిన్‌ గురించి, గాడ్సేసు దేవుడిగా కొలిచే ‘జాతీయవాదులు’ మహాత్మాగాంధీని పక్కన పెట్టి ముందుకు పోలేరు. అలాగే ప్రఖ్యాత అమెరికన్‌ ఆర్ధికవేత్త రాబర్ట్‌ ఎల్‌ హెయిల్‌బ్రోనర్‌ ‘మార్క్స్‌ నుంచి మనం తప్పించుకోలేం’ అని చెప్పినట్లుగానే వర్తమానంలో అపూర్వ విజయాలు సాధించిన, సాధిస్తున్న చైనా గురించి అధ్యయనం చేయకుండా కమ్యూనిస్టు వ్యతిరేకులతో సహా ఎవరూ తప్పించుకోలేరు.

భూమి పొరలలో వుండి నిరంతరం తొలిచే లక్షణం గల చుంచెలుక మనం వూహించని చోట బయటకు వచ్చి కనిపిస్తుంది. అలాగే దోపిడీ శక్తులను వ్యతిరేకించే శక్తులు కూడా నిరంతరం పని చేస్తూనే వుంటాయి. అవి ఎక్కడ, ఎలా కనిపిస్తాయనేది ఎవరూ చెప్పజాలరు. రూపం మారవచ్చు తప్ప మౌలిక లక్షణం మారదు. కమ్యూనిస్టు మానిఫెస్టో కూడా అలాంటిదే. రెండు రెళ్లు నాలుగు అన్నది మారనట్లే దోపిడీ వున్నంత కాలం దానిని కొనసాగించేందుకు ఎవరెంతగా ప్రయత్నించినా, దానిని నాశనం చేసేందుకు పిలుపు ఇచ్చిన కమ్యూనిస్టు మానిఫెస్టో ఏదో రూపంలో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే వుంటుంది. ఇదే కమ్యూనిస్టుల తర్కానికి మూలం, ముగింపు కూడా.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వుడకకే వుడకకే ఓ వుల్లి గడ్డా నీ వెంత వుడికినా నీ కంపు పోదు !

16 Monday Jan 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Father of the Nation, Gandhi's Charkha Pose, KVIC, KVIC calendar, Mahatama Gandhi, mahatma, Narendra Modi

ఎం కోటేశ్వరరావు

    తెల్లగా వున్నంత మాత్రాన వుల్లి మల్లి అవుతుందా, వుప్పు కప్పురంబు చూడ ఒక్కటిగ నుండు చూడ చూడ రుచుల జాడ వేరయా అన్న ప్రఖ్యాత తెలుగు సామెతలు, సామ్యాల గురించి చాలా మంది వినే వుంటారు. నా చిన్న తనంలో ఫొటో తీయించుకోవటం అన్నది చాలా మందికి ఒక తీరని కల. తిరునాళ్లకు వెళ్లినపుడు లేదా పట్టణాలకు వెళ్లినపుడు అక్కడ స్టూడియోలకు వెళితే మోటారు సైకిలు మీద, గుర్రం మీద కూర్చున్నట్లు ఫొటోలు తీయించుకుంటే చెప్పలేని ఆనందం. ఎందుకంటే అవి ఆ నాడు సామాన్యులకు అందుబాటులో వుండేవి కాదు. ఎవరైనా గ్రామానికి మోటార్‌ సైకిల్‌ మీద వస్తే గ్రామం మొత్తం అబ్బో అన్నట్లుగా చూసేది, ఒకప్పుడు బైసికిలు(సైకిల్‌ను బైసికిలుగా ఆమె నోట మొదటిసారి విన్నాను) ఎక్కినపుడు కూడా అలాగే చూసేవారని మా తాతమ్మ చెప్పేది.

   ఇప్పుడు మన ప్రధాని నరేంద్రమోడీకి కూడా అలాంటి సరదాయే కలిగిందా అన్న అనుమానం వస్తోంది. లూధియానాలో జరిగిన ఒక కార్యక్రమంలో మహాత్మా గాంధీ మాదిరి చరఖా ముందు కూర్చొన్నపుడు తీసిన ఫొటోను ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ కాలండర్‌, డైరీలపై ముద్రించారు. అసలు ఖాదీ అంటే సామాన్యులు వాడే ముతక రకం వస్త్రం. ఇస్త్రీ లేకుండా ఖాదీ దుస్తులు ధరిస్తే అదేదో సినిమాలో చెప్పినట్లు చాల బాగోదు. ఇప్పుడు ఎందుకంటే గల్లీ నుంచి ఢిల్లీవరకు చిల్లర రాజకీయాలు చేసే వారు, ఫ్యాన్సీగా ధనికులు తప్ప సామాన్యులెవరూ వాడటం లేదు. వాటిని ధరించి పొలాల్లో, ఫ్యాక్టరీలలో పనిచేసే సామాన్యులెవరూ మనకు కనిపించరు. ఖద్దరు మాదిరి కనిపించే మర మగ్గాలు లేదా మిల్లు వస్త్రాలు మార్కెట్‌లో ఖాదీగా చెలామణి అవుతున్నాయన్నది కూడా వాస్తవమే.

    ఇక నరేంద్రమోడీ ఫొటోలంటే పడి చస్తారనేది ఇప్పటికి అనేక సందర్భాలలో రుజువైంది. ప్రధాన మంత్రి కనుక కేంద్ర ప్రభుత్వ ప్రమేయం వున్న ఏ శాఖ లేదా సంస్ధ కాలండర్‌లో అయినా ఫొటో వేయటాన్ని తప్పుపట్టనవసరం లేదు. స్వాతంత్య్ర వుద్యమ కాలంలో జనంలో స్వాతంత్య్ర కాంక్ష రగిల్చేందుకు గాంధీ ఖాదీ తయారీని విదేశీ వ్యతిరేక స్వదేశీ వుద్యమంగా చేెపట్టారు, స్వయంగా వడికారు. గాంధీ అంటే ఖాదీ, ఖాదీ అంటే గాంధీ అన్న నానుడి వునికిలోకి వచ్చింది. ఇప్పుడు నరేంద్రమోడీ విదేశీ వస్తువులకు మన తలపులను మరింత బార్లా తెరిచి తానొక బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారాలనుకుంటున్నారు. దేశానికి ఏ మాత్రం వుపయోగపడినా కూడా తప్పులేదు. అంబానీ జియో వేదిక, ప్రకటనలు చూస్తే మనకు అది కనిపిస్తుంది. ఖాదీ విషయంలో ముఖ్యమంత్రిగా గుజరాత్‌లో, ప్రధానిగా దేశంలో ప్రత్యేకంగా చేసిందేమీలేదు. ఖాదీ నూలు వడికే వారి బతుకుల దైన్య స్ధితే అందుకు నిదర్శనం. తాజా వివాదానికి వస్తే ఖాదీ సంస్ధ కాలెండర్‌పై గాంధీని అనుకరించిన ఫొటో వేయటమే అభ్యంతరకరం. చారిత్మ్రాత్మక గాంధీ ఫొటోకు, నరేంద్రమోడీ పాల్గొన్న ఒక సభలోని చిత్రానికి తేడా ఏమిటంటే ఆయన చొక్కా వేసుకోలేదు, సాదాసీదాగా నిజంగా నూలు వడుకుతున్నపుడు తీసింది. మోడీది డిజైన్డ్‌ చరఖా, ఖాదీ చొక్కా, కుర్తా వేసుకుకొని ఫొటో కోసం ఫోజిచ్చిన చిత్రం. అందుకే చూసే వారికి మొదటి ఫొటో సహజంగా కనిపించింది, రెండవ చిత్రం ఎబ్బెట్టుగా వుంది. బహిరంగ సభలలో మిత్రోం అంటూ సంబోధించే ఫొజుతో వున్న ఏ ఫొటోను అయినా ఒకవైపు, రెండవ వైపు గాంధీ ఫొటోను కాలండర్‌పై ముద్రించి వుంటే ఇంతటి వివాదం తలెత్తి వుండేది కాదు.

   ఖాదీ సంస్ధ కాలండర్‌పై గాంధీ చిత్రాన్ని తొలగించి మోడీ బొమ్మ ముద్రించటంతో అనేక మంది మనోభావాలు గాయపడ్డాయి . అయితే మాకేంటి అంటారా పోనీ అదైనా చెప్పండి. కాలండర్‌పై గాంధీ బొమ్మ స్ధానంలో నరేంద్రమోడీ చిత్రం పెట్టటాన్ని ఖాదీ సంస్ధ సమర్ధించుకున్న తీరు చిత్రంగా వుంది. ప్రధాని బొమ్మ పెట్టి ఆయన అనుగ్రహం పొందేందుకు ఖాదీ సంస్ద అధికారులు ప్రయత్నిస్తే వారి చర్యను సమర్ధించి నరేంద్రమోడీ కార్యాలయం ప్రజల మనోభావాలను గాయపరిచింది. ఇక హర్యానా బిజెపి మంత్రి అనిల్‌ విజె అర్‌ఎస్‌ఎస్‌ పరివార అంతరంగాన్ని బయటపెట్టారు.

   తమ చర్యను ఖాదీ కమిషన్‌ అడ్డంగా సమర్ధించుకొంటోంది. ‘ గాంధీ తత్వశాస్త్రం, ఆశయాలు, ఆలోచనల ప్రాతిపదికనే మొత్తం ఖాదీ పరిశ్రమ ఏర్పడింది. ఖాదీ గ్రామోద్యోగ కమిషన్‌ ఆత్మ ఆయన, అలాంటి గాంధీని విస్మరించే ప్రశ్నే లేదు. నరేంద్రమోడీ ఎంతో కాలం నుంచి ఖాదీని ధరిస్తున్నారు. ఖాదీతో తన స్వంత శైలిని అభివృద్ధి చేసుకుంటూ సామాన్య జనంలోనూ విదేశీ అతిధులలోనూ ఎంతో ప్రాచుర్యం కల్పించారు. వాస్తవానికి ఆయన ఖాదీకి అతిపెద్ద బ్రాండ్‌ అంబాసిడర్‌, ఆయన భావనలు ఖాదీ గ్రామోద్యోగ కమిషన్‌కు సరిపోయాయి. బొమ్మల ముద్రణకు సంబంధించి ఎలాంటి నిబంధనలు, సాంప్రదాయాలు లేవు, గతంలో కూడా ముద్రించని సందర్భాలు వున్నాయని’ కమిషన్‌ చైర్మన్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా చెప్పారు. ప్రధాని కార్యాలయం కూడా అనవసరమైన రచ్చ అంటూ కొట్టి పారవేసిందని, 1996, 2005, 2011,12,13, 16లో గాంధీ ఫొటో లేదని, కాంగ్రెస్‌ యాభై సంవత్సరాల పాలనలో రెండు నుంచి ఏడుశాతం చొప్పున మాత్రమే ఖాదీ అమ్మకాలు పెరిగాయని అదే గత రెండు సంవత్సరాలలో 34శాతం పెరిగాయంటే ఖాదీని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు మోడీ చేసిన యత్నాలే కారణమని కార్యాలయ వర్గాలు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దానిలో వాస్తవాంశాల కొస్తే మోడీ హయాంలో పెరుగుదల ఏడుశాతమే తప్ప 34శాతం కాదని వార్తలు వచ్చాయి. మిగతా విషయాల కొస్తే కార్యాలయ వర్గాలు పేర్కొన్న ప్రకారమైనా కొన్ని తప్ప మిగతా సంవత్సరాలన్నీ గాంధీ బొమ్మనే ముద్రించారు, ఆయన బోధనలనే ప్రచురించారు తప్ప, దాని బదులు మరొక ప్రధాని బొమ్మను ముద్రించినట్లు , వేరే వారి సుభాషితాలను పేర్కొన్నట్లు ప్రధాని కార్యాలయం, ఖాదీ కమిషన్‌గానీ చెప్పలేదు. మోడీ ఖాదీ ధరిస్తారు కనుక అమ్మకాలు ఎక్కువ అవుతాయన్నది మరొక వాదన, మిగతా ప్రధానులెవరూ ఖాదీ ధరించలేదా ? చేనేత, ఖాదీ ధరించమని ఏదో ఒక సందర్భంలో చెప్పలేదా ?

    సేనాని అయిన ప్రధాని కార్యాలయమే సమర్ధనకు దిగిన తరువాత సైనికులు మామూలుగా వుంటారా ? ఆదివారం నాడు హర్యానా బిజెపి మంత్రి అనిల్‌ విజ్‌ కరెన్సీ నోట్లపై మహాత్మాగాంధీ బొమ్మను ముద్రించినప్పటి నుంచి దాని విలువ తగ్గిపోతున్నదని, అందువలన వాటిపై కూడా క్రమంగా ఆ బొమ్మ అంతరించిపోతుందన్నాడు.ఖాదీతో గాంధీ పేరు ముడిపడివున్నంత కాలం దాని అమ్మకాలు పెద్దగా లేవు, తగ్గిపోయాయి. కాలండెర్‌పై బొమ్మ తీసివేయటం మంచి పని.మోడీ బొమ్మ పెట్టిన తరువాత 14శాతం పెరిగాయని అనిల్‌ వ్యాఖ్యానించాడు. వాటిపై విమర్శలు రావటంతో హర్యానా ముఖమంత్రి ఖట్టర్‌ ఒక ప్రకటన చేసి అవి అతని వ్యక్తిగత వ్యాఖ్యలని కొట్టిపారవేశారు. పార్టీకి సంబంధం లేదన్నారు. తరువాత తాను అన్న మాటలను వుపసంహరించుకున్నట్లు అనిల్‌ ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. బిజెపి నేతలు ఇలాంటి వదరుబోతు వ్యాఖ్యలు చేయటం తరువాత వాటిని వుపసంహరించుకున్నట్లు ప్రకటించటం ఒక ఎత్తుగడ, ఒక అలవాటు. కడుపులో వున్నదే బయటికి వస్తుంది తప్ప వేరొకటి కాదు. వాటిని వుపసంహరించుకున్నట్లు ప్రకటించినప్పటికీ అవి తిరుగుతూ వాటిపని అవి చేస్తాయి.

  ఖాదీ వినియోగం పెంపుదలకు నరేంద్రమోడీ ఎంతగానో కృషి చేస్తున్నారనేది ఒక ప్రచారం మాత్రమే. గ్రామాలలో ఖాదీ దారాలను తయారు చేసే కార్మికులకు కనీసవేతనాలు కూడా రావటం లేదని రోజుకు 125-150 మాత్రమే వేతనం వస్తున్నట్లు కొందరు పరిశోధకులు మూడు నెలల క్రితం తమ పత్రంలో ప్రకటించారు.

   కాళ్లు తుడుచుకునే పట్టాలను మన జాతీయ పతాక రంగులు, చిహ్నంతో తయారు చేసి విక్రయించటాన్ని వెంటనే నిలిపి వేయాలని, భారతీయుల మనోభావాలను గౌరవించాలని అంతర్జాతీయ వాణిజ్య దిగ్గజం అమెజాన్‌ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక చేసింది. ఈ మేరకు మన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ముందు ఒక ట్వీట్‌ చేసి పాలనా పద్దతుల్లో కొత్త ఒరవడిని సృష్టించారు. వుపసంహరించకపోతే అమెజాన్‌ కంపెనీ అధికారుల వీసాలను పునరుద్ధరించబోమని హెచ్చరించారు. తరువాత విదేశాంగ శాఖ వాషింగ్టన్‌లోని మన రాయబారిద్వారా అమెజాన్‌ కంపెనీకి నిరసన తెలియ చేయమని చెప్పారు. ఇలాంటివి పునరావృతం కానివ్వబోమని అమెజాన్‌ కంపెనీ చెప్పిందనుకోండి. నిజానికి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు, కానీ ఆ పని చేయకుండా ట్విటర్‌ ద్వారా హెచ్చరించటం విశేషం.మన జాతీయ జెండాను అలా వుపయోగించటం చట్టరీత్యా నేరమే కాకుండా, మన మనోభావాలను దెబ్బతీసిన అంతర్జాతీయ వాణిజ్య సంస్ధకు హెచ్చరికలు చేసిన పాలకులు గాంధీ బొమ్మ స్ధానంలో నరేంద్రమోడీ చిత్రాన్ని పెట్టి మనోభావాలను గాయపరచటాన్ని ఏమనాలి?

    గాంధీని చంపిన గాడ్సే వారసులు తామరతంపరగా చెలరేగుతున్న ఈ తరుణంలో అలాంటి గౌరవం జాతిపితకు ఇస్తారని ఆశించటమే అసహజం. గాంధీ, గాంధీయిజానికి మేము వ్యతిరేకం, దాన్ని ఏడు నిలువుల లోతున పాతేస్తాం, అందుకే గాంధీని జనం మరిచిపోయేట్లు చేయదలచుకున్నాం అని నిజాయితీగా ప్రకటించి చేస్తే అదో పద్దతి. అలాగాక కొందరు అంటున్నట్లు చరఖా ముందు కూర్చొని గాంధీని అనుకరించి ఫొటోలు దిగితే నరేంద్రమోడీ మహాత్ముడు అవుతారా, ఆయనపై పడిన మచ్చలు తొలుగుతాయా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మార్పు కోసం మోడీకి ఓటు వేశాను తప్ప ద్వేషం కోసం కాదు !

12 Thursday Jan 2017

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, BJP's social media, BJP’s IT cell, BJP’s trolling army, I am a troll, Narendra Modi, Rahul gandhi, Trolls

సాధ్వి ఖోస్లా

    స్వాతంత్య్ర సమర యోధుల పరంపరనుంచి వచ్చిన కొంత మందికి రెండు విషయాలు మాత్రమే -దేశ భక్తి మరియు గాంధీజీ సిద్ధాంతాలు-ఎరుకలో వుంటాయి. నాకైతే నా రాష్ట్రం పంజాబ్‌ కూడా. పంజాబ్‌ మీద నాకున్న ప్రేమ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలకు మరియు వాటికి అనుకూలంగా వున్న రాష్ట రాజకీయ పరిసరాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు శక్తి నిచ్చింది. ద్వేష పూరితమైన భారతీయ జనతా పార్టీ మరియు తమను తాము వీరులుగా చెప్పుకొనే దాని సామాజిక మీడియా మరుగుజ్జు యోధులపై పోరాడేందుకు దేశం మీద నాకున్న ప్రేమ బలాన్నిచ్చింది.

    గత మూడు సంవత్సరాలుగా ప్రధాని నరేంద్రమోడీ ట్విటర్‌ మీద నన్ను అసుసరిస్తున్నారు.ఈ రోజు నేనేమీ కాదు మరియు బిజెపితో నా అనుబంధాన్ని ప్రశ్నిస్తున్నారు. స్వాతి చతుర్వేది పుస్తకం అయామ్‌ ఏ ట్రోల్‌ (నేనో వెంటాడే మరుగుజ్జును )లో నేను వెల్లడించిన వాస్తవాలతో మండిపడుతున్న బిజెపి సామాజిక మీడియా సేనలోని అజ్ఞాత ముఖాలు నన్నొక దుష్టశక్తిగా చిత్రిస్తున్నాయి. ప్రధాన మంత్రి, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిజాలు పలికే గొంతులేమైనా వుంటే వాటిని మూయిస్తారని నేను చెప్పింది వాస్తవమని వారు రుజువు చేస్తున్నారు.నేను బయటపడి వాస్తవాలను బహిరంగ పరచాలన్న నా నిర్ణయం కాంగ్రెస్‌తో నాకున్న స్వల్పకాల అనుబంధం వలన కాదు, అసత్యాలను వేద వాక్యంగా మార్చటాన్ని అపేందుకు చిత్తశుద్దితో చేస్తున్న ప్రయత్నమిది. ఎప్పటికప్పుడు వార్తలు అందుతున్న నేటి యుగంలో నిజం కంటే వ్యతిరేక సమాచార ప్రచారాన్ని వాట్సాప్‌, ట్విటర్‌ మరియు ఫేస్‌బుక్‌లలో జనం ఎక్కువగా నమ్ముతున్నారు. ఆ సమయానికి నిజం అడుగున పడిపోయి జరగాల్సిన హాని జరుగుతుంది.

    మన గొప్ప దేశాన్ని గత ప్రభుత్వాలు మలుచుతున్న తీరుతో ఇతర తరుణ వయస్సు భారత పౌరుల మాదిరే నేను కూడా 2013లో అసంతృప్తి చెందాను. నేను మొదటి సారిగా నా ఓటు హక్కును మోడీకి అనుకూలంగా వినియోగించాను, ఎందుకంటే మెరుగైన భారత్‌ గురించి ఆయన దర్శన కోణాన్ని, ఆయనను నమ్మాను. ఆ నమ్మకమే నన్ను 272 మంది మరియు వారితో పాటు వున్న వలంటీర్లతో కూడిన బిజెపి మిషన్‌ (ప్రచార దళం)లో చేరేందుకు ప్రేరణనిచ్చింది.ఆ ప్రచార దళపు ‘సరికొత్త ప్రచార పద్దతులు ‘ వెంటాడటంతో సహా అప్రతిష్టపాలు చేయటం, వాస్తవానికి వక్రభాష్యాలు చెప్పి జనాల న్యాయనిర్ణయాలను అయోమయంలోకి నెట్టటం గురించి నాకు ముందుగా ఏమాత్రం తెలియదు.

     2015 నవంబరులో అమీర్‌ ఖాన్‌ దేశంలో నాడున్న పరిస్ధితుల గురించి తన మనోభావాలను వ్యక్తం చేసినపుడు అరవింద గుప్తా నాయకత్వంలోని బిజెపి ఐటి విభాగం ఎలక్ట్రానిక్‌ వాణిజ్య సంస్ధ అయిన స్నాప్‌డీల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వున్న ఆ నటుడిని తప్పించేందుకు గాను ఒత్తిడి చేస్తూ ఒక సామాజిక మీడియా ప్రచారాన్ని నిర్వహించింది. ఆ నటుడిని వెంటాడాలని, వివిధ వేదికలపై అతనిపై బురద చల్లాలని, అతని సినిమాలు చూడకుండా జనాన్ని రెచ్చగొట్టాలని మాకు (బిజెపి ఐటి విభాగంలోని వలంటీర్లకు) ఆదేశాలు జారీ చేశారు. నా భావజాలం మరియు ఆత్మ బిజెపి మతోన్మాద దళంలో భాగస్వామి అయ్యేందుకు అనుమతించలేదు.భ్రమలు తొలిగిన నేను దాని నుంచి బయటపడ్డాను. వత్తిడి కారణంగా 2016 జనవరిలో స్నాప్‌డీల్‌ అమీర్‌ ఖాన్‌తో తన సంబంధాలను రద్దు చేసుకుంది.

     అటువంటి చర్యల తీవ్ర పర్యవసానాలను మనం గుర్తించలేదు. ఒక నటుడిగా ఎన్నో సంవత్సరాల నుంచి మన ఇండ్లలో వుంటూ మన హృదయాలను దోచుకున్న వ్యక్తి ఆకస్మికంగా ఒక ‘ముస్లింగా’ మారిపోయాడు. ద్వేషాన్ని వ్యాపింప చేయటానికి సామాజిక మాధ్యమం ఒక ప్రమాదకర సాధనంగా మారిపోయింది, అదికొన్ని సందర్భాలలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు కూడా దారితీయవచ్చు. చివరికి మతం కూడా రాజకీయాల మాదిరి మనల్ని విడదీయలేదు.

జాతి వ్యతిరేకిగా ముద్ర

     దాదాపు రెండు సంవత్సరాలు తీవ్ర స్ధాయిలో ప్రధాన మంత్రికి ట్విటర్‌ మీద మద్దతు పలికాను, చురుకుగా బిజెపికి ప్రచారం చేశాను, వారి ఎజండాలలో భాగంగా స్మృతి ఇరానీ, కిరణ్‌ ఖేర్‌ వంటి బిజెపి నాయకులకు తోడ్పడ్డాను. నేను వ్యతిరేకించిన సమయంలో కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ కూటమికి నాయకత్వం లేకపోవటాన్ని, దిగజారిన విధానాలను కూడా విమర్శించాను. ఇదే సమయంలో పంజాబ్‌ మీద వున్న నా అభిమానం రాష్ట్రంలో వున్న భయంకరమైన మాదకద్రవ్యాల వ్యాప్తిని వెల్లడిస్తూ దాని మీద ఒక డాక్యుమెంటరీని తీయించేందుకు కూడా నడిపించింది. ఆందోళన కలిగించే వాస్తవాలను ప్రధాన మంత్రి దృష్టికి తెచ్చేందుకు ట్విటర్‌ ద్వారా ఒక వర్తమానం కూడా పంపాను. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడతామని మోడీ వాగ్దానం చేశారు, అయితే అందుకు సహాయం చేసేందుకు నేను చేసిన వినతులను విస్మరించారు.

  ప్రధాన మంత్రి నిర్లక్ష్యం నన్ను కాంగ్రెస్‌ వైపు తిరిగేట్లు చేసింది. నేను గట్టిగా బలపరిచిన నరేంద్రమోడీ విస్మరిస్తే నా వినతులను రాహుల్‌ గాంధీ విన్నారు. కాంగ్రెస్‌ వుపాధ్యక్షుడితో కలిసినప్పటి నా చిత్రాలను సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన బిజెపి వెంటాడే సేనకు నా కృతజ్ఞతలు. రహస్యంగా వుంచిన వారి క్రీడను నేను బయట పెట్టటాన్ని నా రాజకీయ అజండాలో భాగంగా చూపుతున్నారు. నేను నిర్మించిన డాక్యుమెంటరీని 2016 మార్చి 18న రాహుల్‌ గాంధీ విడుదల చేశారు. కాంగ్రెస్‌తో నా ఏకైక సంబంధం అది మాత్రమే.

   2014 ఎన్నికలు భారత రాజకీయ ముఖచిత్రాన్నే మార్చివేశాయి. మీడియాలో ప్రచారం ఎలా పొందాలో తెలిసిన ప్రధాన మంత్రి ఇంటర్నెట్‌ ద్వారా జనాలకు చేరువ అవుతున్నారు. ట్విటర్‌, ఫేస్‌బుక్‌ ద్వారా జనానికి తెలియచేస్తున్నారు. ఆయనను మిలియన్ల మంది అనుసరిస్తున్నారు, కానీ ఆయన మాత్రం కొద్ది మంది ఎంపిక చేసిన వారిని మాత్రమే అనుసరిస్తారు. వారిలో ఎక్కువ మంది దూషిస్తూ వెంటాడతారని బాగా తెలిసిన వారే. ప్రధానిని సందర్శించి, శుభాకాంక్షలు తెలిపేందుకు ఇలా దూషించే వారిని ఎప్పటికప్పుడు ఆహ్వానిస్తూ వుంటారు. ఇలా వెంటాడే వారిని ప్రోత్సహించనని బిజెపి చెప్పుకునేట్లయితే ఇలాంటి అక్రమ చర్యలకు వ్యతిరేకంగా ముఖ్యంగా తమ కార్ఖానా నుంచి తయారై బయటకు వస్తున్న వాటి గురించి ప్రధాని ఎందుకు మాట్లాడలేదు?

   సామాజిక మాధ్యమ వేదికను నిర్మాణాత్మక అభివృద్ధికి వినియోగించుకోవటానికి బదులు తమ వ్యతిరేక అభిప్రాయాలను వెల్లడించించిన వారిని అవమానించే విధంగా తన దిగువ సేనను వినియోగించుకుంటోంది. ఏ వ్యక్తి, సంస్ధ లేదా సమాజం అభివృద్ధి చెందాలంటే సానుకూల విమర్శలు ఆరోగ్యకరమైనవి, కానీ అసహ్యంగా విమర్శించటం, వ్యక్తిత్వాలను దెబ్బతీయటం అవాంఛనీయం. ప్రధానిని సమర్ధించే పేరుతో జనాలను మరియు వారి వ్యక్తిత్వాలను దెబ్బతీస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల చీకటి చిత్రాన్ని మాత్రమే ఇది బయట పెడుతోంది. వ్యతిరేకుల, జర్నలిస్టుల, రాజకీయనేతలు మరి ఇతరులెవరి ప్రతిష్టనైనా దెబ్బతీయాలని కిరాయి వలంటీర్లకు మార్గదర్శనం చేశారు. భిన్నమైన వైఖరి కలిగి వున్న ఎవరినైనా మోడీ మరియు జాతి వ్యతిరేకిగా వర్ణించారు. ఎంత అసహ్యంగా అయితే అంతగా మహిళలు, మైనారిటీలను లక్ష్యంగా చేసుకున్నారు. రాహుల్‌ గాంధీ,ఆయన తల్లి సోనియాగాంధీలపై తప్పుడు ప్రచారం చేశారు, బర్ఖాదత్‌ వంటి జర్నలిస్టులను చంపేస్తామని, మాన భంగం చేస్తామని బెదిరింపులు చేశారు.

  బిజెపి ప్రచారాన్ని బయటపెట్టిన మాకు అన్ని జీవన రంగాల నుంచి ప్రజామద్దతు వెల్లువెత్తుతున్నది. ఈ అంశం దేశంలోని మారుమూలలకు కూడా ప్రయాణించింది. వ్యతిరేక భావజాలాన్ని అణచివేసేందుకు పాలకపార్టీ సామాజిక మీడియాను వినియోగించుకోవటాన్ని జనం ప్రశ్నిస్తున్నారు.అంతిమంగా బిజెపి సామాజిక మీడియా సేన మరియు మద్దతుదారుల లక్ష్యంగా పుస్తక రచయిత్రి స్వాతి చతుర్వేది మరియు నేను వుంటాము. వారు మాపై బూతులు, కించపరిచే ప్రచారం, బెదిరింపులతో దాడి చేస్తారు. ఇదంతా ఎందుకంటే వారి చీకటి రహస్యం బట్టబయలైంది, నిజం గాయపరుస్తుంది.

   నేను నా ఆత్మ చెప్పినట్లు నడిచాను. వ్యతిరేక భావాలు కలిగి వున్న వ్యతిరేకులు లేదా ప్రముఖులకు వ్యతిరేకంగా కించపరిచే ప్రచారం చేయటానికి సామాజిక మీడియాను ఎలా సాధనంగా చేసుకుంటున్నారో నా అందమైన దేశం, దాని ప్రజలు తెలుసుకోవాలన్నది నా ఆలోచన మరియు విధి.

ప్రేమ కంటే ద్వేషం త్వరగా విస్తరించటం విచారకరం !

నేను మార్పు కోసం నరేంద్రమోడీకి ఓటు వేశాను తప్ప ద్వేషం కోసం కాదు. !

నేను చెప్పాల్సింది చెప్పాను, నేను నమ్మిందే చేశాను, చేసిందే చెప్పాను. ఇది నేను చెబుతున్న నిజం !

స్క్రోల్‌.ఇన్‌ సౌజన్యంతో

Share this:

  • Tweet
  • More
Like Loading...

అచ్చే దిన్‌ కాదు అంగిట్లో ముల్లు !

14 Wednesday Dec 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

achhe din, Demonetisation, Indian currency, Narendra Modi, Rupee

Image result for people have got quinsy,demonetisation

ఎం కోటేశ్వరరావు

    నరేంద్రమోడీ ఎన్నికలకు ముందు చెప్పినట్లు అచ్చే దిన్‌ (మంచిరోజులు) ఎప్పుడు వస్తాయో తెలియటం లేదుగానీ పెద్ద నోట్ల రద్దుతో పరిస్థితి అంగిట్లో ముల్లులా తయారైంది. దాన్ని మింగలేము, ఒక పట్టాన బయటకు తీయలేము. సూదికోసం సోదికి పోతే పాత రంకులన్నీ బయటకు వచ్చాయట. (ఈ సామెత రంకు  చేసే ఆడ మగా ఇద్దరికీ వర్తిస్తుంది). విదేశాల్లో వున్న నల్లధనాన్ని బయటకు తెస్తే ప్రతి వారి బ్యాంకు ఖాతాలో తలా పదిహేను లక్షల రూపాయలు వేయవచ్చని నరేంద్రమోడీ ఎన్నికలలో వూరూ వాడా చెప్పారు. అది నల్లధనాన్ని తెచ్చి ఖాతాల్లో వేస్తామని చెప్పినట్లు కాదు, ప్రతిపక్షాలు, మీడియా దానిని నిజంగానే మోడీ చేసిన వాగ్దానంగా చిత్రించి తమ నేతను బదనాం చేస్తున్నాయని మోడీ భక్తులు లేదా అనుయాయులు చెబుతున్నారు. మోడీకి నీడగా భావించే బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా దాని గురించి అడిగితే అలాంటి వాగ్దానం చేసినట్లు గానీ చేయలేదని గానీ ఎటూ చెప్పకుండా అరే భాయ్‌ ఎన్నికలలో అనేకం చెబుతుంటాం ఇదీ వాటిలో ఒకటి అని చిరుగడ్డాన్ని సవరించుకుంటూ చెప్పారు.

Image result for venkaiah naidu,demonetisation

     ఇక అచ్చే దిన్‌కు సంబంధించి వాగ్దానం చేసిన మాట నిజమే గాని ఎన్ని రోజుల్లో అని చెప్పామా ? అంటూ ఎప్పుడో ఎదురుదాడికి దిగారు మన తెలుగువాడైన వెంకయ్య నాయుడు.http://indianexpress.com/article/india/india-others/venkaiah-naidu-defends-pm-narendra-modi-1-year-is-too-short-to-judge/ మోడీ పాలన ఏడాది పూర్తి చేసుకున్న తరువాత ఒక సభలో మాట్లాడుతూ ఏడాది కాలంలో ఎవరైనా ఒక బిడ్డను కనవచ్చు, ఆ బిడ్డ పెరిగి పెరిగి పెద్దయి పరుగెత్తటానికి సమయం పడుతుందా లేదా ! అలాగే జనం ఓపిక పట్టాలి. కొత్త వస్తువులను సృష్టించటానికి నరేంద్రమోడీ ఏమీ ఇంద్రుడు కాదు’ అన్నారు. దీన్నే అచ్చ తెలుగులో గోడమీద అప్పు రేపు అని రాయటం అని చెప్పుకోవాలి. ఎప్పుడు వచ్చి చూసినా అదే దర్శనమిస్తుంది. వెంకయ్య నాయుడిగారి ప్రాస ప్రకారం సిద్దాంతం లేదా రాద్దాంతం ప్రకారం బిడ్డ పుట్టి పరుగెత్తగానే మంచి రోజులు రావు. పరిపూర్ణ వ్యక్తిగా ఇంకా ఇంకా చాలా చాలా జరిగినపుడే మంచి రోజులు వస్తాయి.

   అసలింతకీ అచ్చే దిన్‌ అనే నినాదం కూడా నరేంద్రమోడీ స్వంతం కాదట. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నుంచి అరువు తెచ్చుకున్నదని స్వయంగా కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు.http://blogs.timesofindia.indiatimes.com/chakallas/truth-behind-narendra-modis-acche-din-slogan/ 2012 జనవరి ఎనిమిదిన జైపూర్‌లో జరిగిన ప్రవాస భారతీయుల సభలో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ ప్రపంచంలో ఏర్పడిన మాంద్య పరిస్థితుల నుంచి బయటపడి త్వరలో మంచి రోజులు వస్తాయంటూ ఆశాభావం వెలిబుచ్చారు. ఆ మరుసటి రోజు గుజరాత్‌ ముఖ్య మంత్రిగా నరేంద్రమోడీ మాట్లాడారు. అప్పటికే తన గుజరాత్‌ మోడల్‌ అభివృద్ది గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. ఆ సభలో వుక్కు దిగ్గజం ఎల్‌ఎన్‌ మిట్టల్‌ కూడా వున్నారు. నరేంద్రమోడీ తనదైన ప్రత్యేక శైలిలో వుపన్యాసం ప్రారంభిస్తూ మిట్టల్‌వైపు చూపుతూ ఇదిగో ఆయన లండన్‌లో తినే టొమాటాలు, బెండకాయలు కూడా గుజరాత్‌లో పండినవే అంటూ తన ఘనతతో ప్రారంభించారు. తరువాత నిన్న మన ప్రధాన మంత్రి మంచి రోజుల గురించి చెప్పారు. నేను కూడా చెబుతున్నాను త్వరలో ఆ మంచి రోజులు నిరుపమాన రీతిలో తీసుకొస్తాం’ అని చెప్పగానే సభలో మోడీ మోడీ అంటూ పెద్ద స్పందన వచ్చిందట. దాంతో ఇది బాగుందని ఆ నినాదాన్ని కొనసాగించారట. అయితే అది ఇప్పుడు అంగిట్లో ముల్లులా తయారైందని ఇటీవలనే గడ్కరీ చెప్పారట. అంటే దానిని అమలు జరపలేము, అలాగని ఆ వాగ్దానానికి దూరంగా పోలేక అటూ ఇటూగాని స్థితిలో వున్నట్లు అంగీకరించటమే. బహుశా అందుకేనేమో తాజాగా 50 రోజుల్లో మంచి రోజులు అంటూ పెద్ద నోట్ల రద్దు సందర్భంగా కొత్త నినాదమిచ్చారని కోవాలా ?

    దీన్నుంచి తప్పించుకోవటానికి షరతులు వర్తిస్తాయని కొన్ని స్కీములకు కంపెనీలు షరతు పెట్టినట్లుగానే ముందు కొన్ని రోజులు ఇబ్బందులు పడాలి, తరువాత అంతా మంచే అని చెప్పారు. అంటే యాభై రోజుల తరువాత వెంటనే మంచి రోజులు రానట్లే. డిసెంబరు 31 తరువాత ఎలాగూ నరేంద్రమోడీ తిరిగి మౌన ప్రతంలోకి లేదా ఏ విదేశాలకో వెళ్లిపోతారు కనుక ఆయన మాట్లాడరు. మనం తిరిగి వెంకయ్య సమాధానాలు వినటానికి సిద్ద పడాలి. ఎన్నో రోజులు లేవు గనుక ఏం చెబుతారో చూద్దాం !

Image result for people have got quinsy,demonetisation

     చలామణిలో వున్న కరెన్సీలో రద్దు చేసిన పెద్ద నోట్ల మొత్తం 14.44 లక్షల కోట్లని ప్రభుత్వమే ప్రకటించింది. ఇప్పుడు కొత్త 500, 2000 నోట్లతో పాటు మిగిలిన పాత కరెన్సీ కూడా ప్రచురించి పంపిణీ చేసింది కేవలం 4.61లక్షల కోట్ల రూపాయలకు మాత్రమే అని రిజర్వుబ్యాంకు స్వయంగా ప్రకటించింది. ఇప్పటికి బ్యాంకులకు చేరిన పాతనోట్ల మొత్తం విలువ 12.4 లక్షల కోట్లు ఆ తరువాత నాలుగు రోజులు గడిచాయి కనుక. మరో యాభైవేల కోట్లయినా డిపాజిట్‌ అయి వుంటాయని అంచనా. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది కనుక రద్దయిన 14.44 లక్షల కోట్లకు గాను కేవలం తొమ్మిది లక్షల కోట్లు అచ్చువేస్తే చాలని ప్రభుత్వం భావించినట్లు వార్తలు వచ్చాయి. వెయ్యి రూపాయల నోట్లు పూర్తిగా రద్దు చేస్తామని(ఇప్పటికి, పిచ్చివాడి చేతిలో రాయి మాదిరి రేపేం ప్రకటిస్తారో తెలియదు ) చెప్పినందున వాట స్ధానంలో రెండు వేల నోట్లు ఎలాంటి చిల్లర సమస్యలను తెస్తున్నాయో గత కొద్ది రోజులుగా చూస్తున్నాము. అంటే అంతకంటే తక్కువ నోట్లు అచ్చువేయాలి. ఒక రెండువేల నోటుకు ఐదు వందలైతే నాలుగు, వంద అయితే 20,యాభై అయితే 40, ఇరవై అయితే వంద ఇలా తగ్గే కొద్దీ అచ్చేయాల్సిన నోట్ల సంఖ్య పెరుగుతుంది. ప్రభుత్వానికి అదొక తలనొప్పి. చిల్లర కావాలన్నా జనం కమిషన్లు ఇచ్చుకోవాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు. తొమ్మిది లక్షల కోట్ల రూపాయలకు అవసరమైన నోట్ల ముద్రణ కూడా వచ్చే ఏడాడి ఏప్రిల్‌ నాటికి, అదే మొత్తం నోట్లు అచ్చేయాలంటే జూలై వరకు పడుతుందని చెబుతున్నారు.

    మన దౌర్భాగ్యం ఎలాంటి దంటే మనకు కావాల్సిన నోట్లను కూడా మనం స్వయంగా అచ్సేసుకొనే స్ధితిలో లేమట. 1997-98లో లక్ష కోట్ల రూపాయల విలువగల వివిధ కరెన్సీ నోట్లను మన రిజర్వుబ్యాంకు బ్రిటన్‌, అమెరికా, జర్మనీలలో ముద్రణ చేయించిందని పార్లమెంటరీ కమిటీ నివేదికలో తేలింది. తాడి చెట్టు ఎందుకు ఎక్కావంటూ దూడగడ్డి కోసం అని చెప్పినట్లుగా ఎందుకీ పని చేశారంటే ఆ మూడు దేశాలు మనకు కావాల్సిన కరెన్సీని వేగంగా ముద్రించి ఇచ్చే సామర్ధ్యం కలిగి వున్నాయని అధికారులు చెప్పారట.http://timesofindia.indiatimes.com/India/House-panel-pulls-up-govt-for-outsourcing-printing-of-currency-notes/articleshow/5878095.cms ఇదంతా కాంగ్రెస్‌ హయాంలో జరిగింది. అవినీతి అక్రమాలకు, కుంభకోణాలకు ఆ పార్టీ పెట్టింది పేరు. చిత్రం ఏమిటంటే కాంగ్రెస్‌ హయాంలో బయటి దేశాలలో నోట్ల ముద్రణ లావాదేవీలలో పాలుపంచుకున్న రెండు కంపెనీలు అక్రమాలకు పాల్పడినట్లు తేలటంతో భవిష్యత్‌లో వాటితా లావాదేవీలు జరపకూడదని మన ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ నిషేధాన్ని నరేంద్రమోడీ సర్కార్‌ ఎత్తివేయటమే విశేషం. ఎందుకు ఎత్తివేశారయ్యా అంటే అవి 150 సంవత్సరాల నుంచి నోట్లచ్చువేసే వ్యాపారంలో వున్నాయి. ఒక దేశ సమాచారాన్ని మరొక దేశానికి అవి చేరవేసి అవి వ్యాపారాన్ని పొగొట్టుకుంటాయా ? మా దర్యాప్తుల అలాంటిదేమీ లేదని తేలింది. అందుకే ఎత్తివేశామని అధికారులు చెప్పారట. ఇలా పొరుగుసేవల కాంట్రాక్టు కోసం సదరు కంపెనీ ముడుపులు కూడా చెల్లించిందని వార్తలు.http://greatgameindia.com/secret-world-indian-currency-printers-de-la-rue/ ఆ నిషేధం ఎత్తివేసిన తరువాత ఆ కంపెనీ షేర్ల ధరలు బాగా పెరిగాయట కూడా. ఇవన్నీ నరేంద్రమోడీ సర్కార్‌కు తెలియకుండా వుండవు. వీటిపై నిజా నిజాలను వెలికి తీసి జనానికి వెల్లడి చేయాలి. మనకు నోట్లు సరఫరా చేసే లేదా అచ్చువేసే కంపెనీలే పాకిస్థాన్‌కు కూడా చేస్తాయట. అంటే మన నోట్లనే కొన్నింటిని దానికి కూడా సరఫరా చేస్తే ? మనం కూడా అక్కడి నుంచే కొన్ని పాక్‌ నోట్లను తెచ్చుకోవాలా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రజాస్వామ్య దేవాలయాన్ని బహిష్కరిస్తున్న పూజారి మోడీ 

12 Monday Dec 2016

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

Narendra Modi, Priest Narendra Modi, temple of democracy

Image result for Priest Narendra Modi

సత్య

   ‘జరిగిన ప్రచారాన్ని చూస్తే నరేంద్రమోడీ వుద్యమం దేశపు వుత్తమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేసిందనే భావం కలిగింది. అది దేశాన్ని సోషలిజం మరియు విప్లవం వైపు నడిపిస్తుందనిపించింది. ప్రత్యర్ధులను ఆ ప్రచారం వెర్రివాళ్లను చేసింది, ఆశ్యర్యంలో ముంచెత్తి రక్షణ లేని స్థితిలో పడవేసింది, గుక్క తిప్పుకోకుండా దాడులతో వుక్కిరిబిక్కిరి చేసింది. అది కొంత మందిని నేరగాళ్లగా ఆరోపించింది. అవాస్తవాలను ప్రచారం చేసింది. దేశ వ్యవస్ధ యావత్తూ ప్రచారంపై నిర్మితమైంది. భీతిని ఘోరంగా స్థుతించారు.ఈ ప్రచారదాడిలో లక్షల మంది అనుబంధ సంఘాల సభ్యులను సాధనాలుగా వినియోగించారు. మోడీ ప్రచారం మొత్తాన్ని ప్రచార వూహకర్తల పధకాలమేరకు రూపొందించారు .’ నరేంద్రమోడీ నిజస్వరూపం ఏమిటో ముందునుంచీ తెలిసిన వారికి ఈ మాటలు ఆశ్చర్యం గొలపకపోవచ్చు. గత రెండున్నర సంవత్సరాలుగా ఆయన వీర భక్తులుగా మారిన ఎందరినో గత 33 రోజులు ఆలోచనలో పడవేశాయి. ఏమిటిలా జరుగుతోంది అనే అంతర్మధనం వారిలో ప్రారంభమైంది. ఒక అయిడియా జీవితాన్నే మార్చేసింది అంటే ఇదే. పై పేరాలో వర్ణితమైన అంశం నిజానికి నరేంద్రమోడీ గురించి రాసింది కాదు. హిట్లర్‌ గురించి ‘ ద థర్డ్‌ రీచ్‌ ‘ అనే పుస్తకంలో రాసిన ఒక పేరా. అందువలన దానిలో నరేంద్రమోడీ అన్న దగ్గరల్లా హిట్లర్‌ అని చదువుకోవాలి. నోట్ల రద్దు గురించి జరుగుతున్న ప్రచార తీరు తెన్నులు, దానిని అమలు చేసిన తీరును తప్పుపట్టిన వారిపై జరుగుతున్న ప్రచారదాడిని చూస్తే అది యాదృచ్చికంగా జరుగుతోందా లేక హిట్లర్‌ ప్రచార వూహాలను బాగా అధ్యయనం చేసిన నరేంద్రమోడి నియమించిన నిపుణుల ఎత్తుగడల మేరకా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. హిట్లర్‌ లక్షణాలు మాత్రం కనిపిస్తున్నాయి.

    పార్లమెంట్‌ భవనాన్ని తానే తగుల బెట్టించి ఆ పని కమ్యూనిస్టులపై ఆరోపించి వారి అణచివేతకు ఒకసాకుగా వుపయోగించుకున్న హిట్లర్‌ దుర్మార్గానికి ఇప్పుడు రుజువులు అవసరం లేదు. గత కొద్ది రోజులుగా నరేంద్రమోడీ, ఆయన మంత్రులు బాణీ మార్చారు. ప్రతిపక్షాలు తనను పార్లమెంటులో మాట్లాడకుండా అడ్డుకుంటున్నాయని నరేంద్రమోడీ పదే పదే పెద్ద గొంతుకతో చెబుతున్నారు.ప్రతిపక్షాలు నల్లధనులకు మద్దతు పలుకుతున్నాయనేది సరేసరి. ఎంతైనా ప్రధాని కనుక దొంగే దొంగ అని అరచినట్లున్నదని చెప్పటానికి మనస్కరించటం లేదు. పెద్ద నోట్ల రద్దుతో వుగ్రవాదుల పీచమణిచామని చెప్పుకుంటున్నారు. హోంమంత్రి రాజనాధ్‌ సింగు మన దేశాన్ని విడదీసేందుకు పాక్‌ ప్రయత్నిస్తున్నదని, మనం తలచుకుంటే దానిని పది ముక్కలు చేయగలమని మాట్లాడారు. నోట్ల రద్దుతో వుగ్రవాదం తగ్గిపోయిందని, వారికి డబ్బులందించే హవాలా మార్గాన్ని కూడా మూసివేశామని చెబుతున్న తరువాత ఈ మాటలు చెప్పటం విశేషం.

   పార్లమెంటును ప్రజాస్వామ్య దేవాలయంగా పదవీ బాధ్యతలు స్వీకరించే సందర్బంగా నరేంద్రమోడీ పేర్కొన్నారు. అలాంటి దేవాలయానికి ఒక ప్రధానిగా నరేంద్రమోడీ ఒక పూజారి లాంటి వారు. ప్రతి రోజూ పూజారి రాకుండా భక్తులు మాత్రం వచ్చి తమ పాత్ర తాము నిర్వహించి భక్తి రసాన్ని రక్తి కట్టిస్తున్నారు. పూజారి దేవాలయానికి రాకుండా తప్పించుకుంటున్నారని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. దానికి సమాధానం చెప్పకుండా తననే అడ్డుకుంటున్నాయని మోడీ ఎదురుదాడికి దిగారు. బలమైన ప్రధానిగా, ఒక్క మగాడు అన్న భుజకీర్తులు తగిలించుకున్న వ్యక్తి నుంచి ఇంతటి బలహీనమైన వాదన వెలువడటం ఆశ్చర్యం. ఏదో మంచి జరగబోతోందన్న భావనతో తాము ఇబ్బందులు పడుతున్నా ఎంతో సహనం ప్రదర్శిస్తున్న జనం బయట వున్నారు. తిరుగులేని మెజారిటీ వున్న మోడీని పార్లమెంటులో అడ్డుకొనేదెవరు ? ఓటింగ్‌కు అవకాశం వున్న నిబంధన కింద చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్న మాట నిజం.వాటికా హక్కు లేదా ? పోనీ అదైనా చెప్పమనండి. దానికి బదులు ధర్మోపన్యాసాలతో చర్చను ముగించే నిబంధన కింద జరపాలని అధికారపక్షం మొరాయిస్తోంది. అదే పార్లమెంట్‌ జరగకపోవటానికి కారణం. గతంలో బిజెపి ప్రతిపక్షంలో వుండగా ఇదే మాదిరి డిమాండ్‌ చేసిందా లేదా ? అప్పుడు తనకు సరైనది ఇప్పుడు కాకుండా ఎలా వుంటుంది? లోక్‌సభలో ఓటింగ్‌ జరిగినా మోడీ సర్కార్‌కు ఢోకా లేదు. రాజ్యసభలో ఓడిపోయినంత మాత్రాన రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. అసలు ప్రతిపక్షాలు ఓటింగ్‌కు పట్టుబడతాయో లేదో కూడా వూహాజనితమే. చర్చను బట్టి ఎవరి రంగేమిటో జనానికి తెలుస్తుంది. అటువంటపుడు అధికారపక్షం భయపడాల్సిన పనేముంది? ప్రజాస్వామిక దేవాలయాన్ని పూజారి బహిష్కరించాల్సిన అవసరం ఏముంది ?

    అసలు విషయం ఏమంటే నోట్ల రద్దుతో తలెత్తే ప్రయోజనాల గురించి ఆహా ఓహో అన్నట్లుగా పార్లమెంట్‌లో చెబితే కుదరదు, నిర్ధిష్టంగా జరిగే ప్రయోజనం ఏమిటో ప్రభుత్వం స్పష్టీకరించాలి. చీకట్లో బాణం వేసినట్లుగా అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అనటం తప్ప మరొక అంశం లేదుకనుకనే నరేంద్రమోడీ పార్లమెంట్‌లో మాట్లాడేందుకు సిద్ధం కావటం లేదు. దేశ ప్రజలందరినీ అతలాకుతలం చేసిన ఇంతటి తీవ్ర చర్య గురించి కూడా ప్రధాని మీడియా సమావేశం పెట్ట లేదంటే జర్నలిస్టులను చూసి కూడా భయపడుతున్నారా అని సందేహించాల్సి వస్తోంది. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్ధలో ఒక మంచి వరవడిని నెలకొల్పాల్సిన వారు ఇలా చేయటం నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేయటమే. తాను ప్రధాని గద్దె నెక్కెందుకు పార్లమెంట్‌ సోపానాలు కావాల్సి వచ్చాయి గాని తరువాత మాట్లాడేందుకు మాత్రం పనికిరాకుండా పోయాయా ? ఏంత చిత్రం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

బహుమానం-బలి ఆయుధంగా ‘ప్రకటనలు’

12 Monday Dec 2016

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Political Parties

≈ Leave a comment

Tags

advertising purchases, freedom house, India press freedom, Media, Narendra Modi, news outlets, press freedom, punish, reward

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఫ్రీడం హౌస్‌ విమర్శ

   తాము కోరుకున్న రీతిలో వార్తల ప్రచురణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీడియా సంస్ధలపై బహుమానం-బలి ఆయుధంగా ‘ప్రకటనలను’ వుపయోగిస్తున్నాయని అమెరికా కేంద్రంగా పని చేసే ఫ్రీడం హౌస్‌ 2016 నివేదికలో మన దేశ పరిస్థితి గురించి పేర్కొన్నది. కోరుకున్న రీతిలో వార్తలు ఇస్తే బహుమానంగా ప్రకటనల జారీ, విమర్శనాత్మకం, వ్యతిరేక వార్తలు ఇచ్చిన వారికి శిక్షగా ప్రకటనలు ఇవ్వకపోవటం గురించి మన నిత్యజీవితంలో చూస్తున్నదే. ఆ నివేదికలో మన దేశం గురించి రాసిన కొన్ని అంశాలు ఇలా వున్నాయి. అంతకు ముందు సంవత్సర నివేదికలో పత్రికా స్వేచ్చలో 40, రాజకీయ వాతావరణంలో 20 వ స్ధానాలలో వున్నది కాస్తా 2016లో రెండింటిలో ఒక పాయింటు చొప్పున తగ్గి 41,21గా వున్నట్లు, భారత్‌ను పాక్షిక స్వేచ్చ వున్న తరగతి కింద పరిగణిస్తున్నట్లు పేర్కొన్నది.

    దక్షిణాసియా పరిధిలో భారత మీడియా 2015 సంవత్సరంలో అత్యంత స్వేచ్చాయుతమైనదిగా వుండగా ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని ప్రభుత్వం కింద మీడియా సిబ్బంది ఆటంకాలను ఎదుర్కోవటం కొనసాగింది. ప్రభుత్వ అధికారులను కలుసుకోవటంలో ఇబ్బందులను ఎదుర్కొన్నామని జర్నలిస్టులు చెప్పారు, ఆ ఏడాదిలో ప్రభుత్వ సెన్సార్‌ షిష్‌ను అతిగా వుపయోగించి నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో అసహనం పెరుగుతోందా అని దేశవ్యాపిత చర్చ జరగగా జర్నలిస్టులు, రచయితలు తమ పనికి సంబంధించి బెదిరింపులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. విధి నిర్వహణ కారణంగా ఒక జర్నలిస్టు హత్యకు గురయ్యాడు. శిక్షలు పడని వాతావరణం నెల కొన్న కారణంగా హింసాకాండను ప్రోత్సహించారు.

ముఖ్య పరిణామాలు

    సతాయింపు లేదా ఇబ్బంది కలిగించేందుకు వుద్ధేశించిన సమాచారాన్ని ఇంటర్నెట్‌లో పెట్టటాన్ని నేరపూరిత చర్యగా పరిగణిస్తూ 2000 సంవత్సర ఐటి చట్టంలోని ఒక సెక్షన్‌ను నిలుపు చేస్తూ 2015మార్చినెలలో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఢిల్లీలో 2012లో సామూహిత అత్యాచారం, హత్యకు గురైన ఒక వైద్య విద్యార్దినిపై నిర్మించిన ఒక డాక్యుమెంటరీని అదే నెలలో అధికారులు నిషేధించారు. ఫేస్‌బుక్‌లో విమర్మనాత్మక రిపోర్టులు పెట్టాడన్న కక్షతో వుత్తర ప్రదేశ్‌కు చెందిన పాలక సమాజవాదీ పార్టీకి చెందిన వారు జర్నలిస్టు జగేంద్ర సింగ్‌ను జూన్‌ నెలలో సజీవదహనం చేశారు. ఆగస్టునెలలో గుజరాత్‌లో పెద్ద ఎత్తున ప్రజా ప్రదర్శనలు జరిగిన సమయంలో జనం గుమి కూడ కుండా, వార్తలు, సమాచారాన్ని వెల్లడికానివ్వకుండా చేసేందుకు గుజరాత్‌ ప్రభుత్వం మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసింది.

    భావ ప్రకటన, స్వేచ్చల గురించి రాజ్యాంగం హామీ ఇచ్చినప్పటికీ ఎల్లవేళలా కోర్టులు తగిన విధంగా వాటిని కాపాడలేదు లేదా లేదా ప్రభుత్వ అధికారులు తగిన విధంగా చట్టపరమైన రక్షణలు కల్పించటంలో వాటిని గౌరవించలేదు.మీడియా స్వేచ్చను పరిమితం చేసే అనేక చట్టాలు ఇంకా అమలులోనే వున్నాయి. ప్రభుత్వంపై ద్వేషం లేదా వుల్లంఘన లేదా వ్యతిరేకతను రెచ్చగొట్టటం లేదా ప్రయత్నించటాన్ని దేశ ద్రోహంగా పరిగణించే 1860పీనల్‌ కోడ్‌లోని 124ఏ కొనసాగుతున్నది. భద్రతకు సంబంధించిన అంశాల వార్తలపై నిషేధం, జర్నలిస్టులను శిక్షించే అదికారాన్ని కట్టబెట్టిన 1923నాటి అధికారిక రహస్యాల చట్టం అమలులో వుంది. రోడ్డు నిర్మాణ యంత్రాన్ని తగుల బెట్టేందుకు మావోయిస్టు సానుభూతి పరులకు సహకరించాడనే పేరుతో సోమారు నాగ్‌ అనే జర్నలిస్టును చత్తీస్‌ఘర్‌ పోలీసులు అరెస్టు చేశారు. హింసాకాండ, నేరపూరిత కుట్రకు పాల్పడ్డాడనే ఆరోపణతో సంతోష్‌ యాదవ్‌ అనే జర్నలిస్టును కూడా అరెస్టు చేశారు. మీడియా సంస్ధలపై పరువు నష్టం కేసులు కూడా పెరిగాయి. ఎస్సార్‌ స్టీల్‌ కంపెనీ రాజకీయ అవినీతికి పాల్పడిందని రాసిన కారవాన్‌ పత్రికపై 3.9 కోట్ల డాలర్లకు కేసు వేసింది.

    దేశంలోని టెలికాం కంపెనీల నెట్‌వర్క్‌లో ప్రసారమయ్యే డేటా, ఫోన్‌ కాల్స్‌ను ఒక కేంద్రీయ వ్యవస్ధ ద్వారా అధికారులు తెలుసుకొనేందుకు 2013లో కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రకటించింది. ప్రభుత్వ వ్యవస్ధకు అనుగుణంగా ఆ సమాచారం లేదని వెల్లడి అయితే దీర్ఘకాల జైలు శిక్షలు విధించవచ్చు. దానిని 2016లో అమలులోకి తీసుకురానున్నారు. జర్నలిస్టులకు వ్యతిరేకంగా దీనిని దుర్వినియోగం చేయవచ్చు. ఇంటర్నెట్‌ ద్వారా నిఘావేసే ‘నేత్ర’ వ్యవస్ధ ఏర్పాటు గురించి వార్తలు వచ్చాయి.

   కొంత మందికి అనుకూలంగా వార్తలు రాయాలని కొంత మంది మేనేజర్లు జర్నలిస్టులను ఆదేశించటం ఆందోళనకరమైన అంశం. ప్రభుత్వానికి అనుకూలంగా మలిచేందుకు దూరదర్శన్‌ను వినియోగిస్తున్నారు. గొడ్డు మాంసంలో ఐరన్‌ లభ్యం అవుతుందని రాసినందుకు హర్యానా ప్రభుత్వం తన పత్రిక సంపాదకుడిని తొలగించింది. గొడ్డు మాంస వినియోగానికి వ్యతిరేకంగా హిందుత్వవాదులు పెద్ద ఎత్తున ప్రచారం చేసిన పూర్వరంగంలో ఇది జరిగింది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత అధికార ప్రతినిధులు మీడియాతో మాట్లాడవద్దని చెప్పినట్లు తెలిసింది. ఆమేరకు మాట్లాడటం మానివేయటం లేదా ఎంతో కష్టంతో మాట్లాడుతున్నారని గతేడాది మార్చినెలలో 74శాతం మంది జర్నలిస్టులు వెల్లడించారు.

     ప్రభుత్వ రంగ కంపెనీల ప్రకటనలు పోగొట్టుకోకుండా వుండేందుకు కొన్ని మీడియా సంస&థలు స్వయం సెన్సార్‌షిప్పును విధించుకున్నాయి. గతంలో విమర్మశలతో కూడిన వార్తలు రాసిన విదేశీ జర్నలిస్టులకు వీసాలు దొరకటం కష్టమౌతున్నది. ఒక మరాఠీ ఛానల్‌ సంపాదకుడు నిఖిల్‌ వాగ్లేను మితవాద హింసాత్మక హిందూత్వ సంస&థ బెదిరించింది. కేబుల్‌ పంపిణీ నెట్వర్కులను స్వంతం చేసుకుంటున్న రాజకీయ నేతలు తమ ప్రయోజనాలకు అనుగుణ్యంగా లేని టీవీ ఛానళ్లను నిలిపివేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు నచ్చిన మీడియాకు లబ్ది చేకూర్చటానికి, నచ్చని వాటిని దెబ్బతీయటానికి ప్రకటనల జారీని సాధనంగా చేసుకుంటున్నాయి. ప్రభుత్వ లేదా ప్రయివేటు ప్రయోజనాలకు గాను జర్నలిస్టులు, సంపాదకులకు లంచాలతో సహా ప్రలోభాలు అందోళన కలిగిస్తున్నాయి. అదే విధంగా బడా కంపెనీలతో ప్రయివేటు ఒప్పందాల కారణంగా అనేక కంపెనీలలో సంపాదకవర్గం-వాణిజ్య విభాగానికి హద్దులు చెరిగిపోతున్నాయి. పార్టీలు, అభ్యర్ధులకు అనుకూలంగా నోటుకు వార్తల ప్రచురణలపై ఎన్నికల కమిషన్‌, ప్రెస్‌ కౌన్సిల్‌ విచారణలు జరుపుతున్నప్పటికీ ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున అవి జరుగుతున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కల్పిత వార్తలు- కట్టు కధలతో హిల్లరీకి దెబ్బ- మోడీకి లబ్ది

11 Sunday Dec 2016

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Political Parties, USA

≈ Leave a comment

Tags

Comet Ping Pong, fake news, Hillary Clinton, Narendra Modi, photos, Pizza Gate, Pizza Gate Fake News

 

Image result for  Hillary Clinton ,pizzagate

సత్య

    ప్రస్తుతం ప్రతిదీ నకిలీ, కల్పిత మయం. దీంతో ఏది నిజమో కాదో, ఎవరు నిజాయితీ పరులో కాదో తెలుసుకోవటం ఎంతో కష్టంగా మారుతోంది. నిజాన్ని నిగ్గు తేల్చే ఓపిక, వనరులు అందుబాటులో లేకపోవటంతో అనేక మంది అనుమానం వచ్చినా కాదని ఖండించలేని, విశ్వసించలేని పరిసి&థతి అయితే ప్రపంచవ్యాపితంగా జరుగుతున్న తీరు తెన్నులను చూస్తే అత్యధికులు నమ్ముతున్నారు. ఈ బలహీనతను సొమ్ము చేసుకొనేందుకు నకిలీ, కల్పితాంశాలను సాంప్రదాయక, సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున ముందుకు తెస్తున్నారు. కాదేదీ కవిత కనర్హం అన్నట్లుగా ప్రపంచంలో అనేక చోట్ల కట్టుకథలను ప్రచారంలో పెట్టి సొమ్ము చేసుకుంటున్నవారు వున్నారన్నది నమ్మలేని నిజం. ప్రత్యర్ధులను దెబ్బతీయటానికి కొందరు వీటిని ఆశ్రయిస్తే తమ నేతలను గొప్పవారిగా చిత్రించేందుకు కొందరు వుపయోగించుకుంటున్నారు. ఈ రెండింటికీ హిల్లరీ క్లింటన్‌, నరేంద్రమోడీని వుదాహరణగా చెప్పవచ్చు.

   మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం డిసెంబరు నాలుగవ తేదీన వాషింగ్టన్‌ డిసిలోని కామెట్‌ పింగ్‌ పాంగ్‌ అనే ఒక పీజా దుకాణానికి ఒక వ్యక్తి వచ్చాడు. వస్తూనే తన చేతిలో వున్న తుపాకితో ఢాం ఢాం మ్మని కాల్పులు జరిపాడు. అమెరికాలో అలా వచ్చి ఇలా కాల్పులు జరిపి కొంత మందిని చంపి, తనను తాను కాల్చుకొని లేదా భద్రతా దళాలకు దొరికి పోవటం సాధారణ విషయం. అయితే పింగ్‌ పాంగ్‌లో జరిపిన కాల్పులలో ఎవరూ గాయపడలేదు. కాల్పులు జరిపిన వ్యక్తి తాపీగా తన ఆయుధాన్ని అప్పగించి పోలీసులకు లొంగిపోయాడు అది అమెరికా చరిత్రలో ఎనిమిదవ వింత !

    మన పాత తెలుగు సినిమాలలో మాదిరి గిర్రున తిరుగుతూ వెనక్కు వెళితే తప్ప ఈ అసాధారణ వరిణామం గురించి అర్ధం కాదు. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ‘పిజాగేట్‌ ‘ పేరుతో ఒక వార్త అమెరికన్లను వూపివేసింది. అదేమిటంటే పైన పేర్కొన్న పింగ్‌ పాంగ్‌ రెస్టారెంట్‌లోని సెల్లార్‌లో చిన్న పిల్లలతో సెక్స్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని దాని వెనుక డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్‌ ఆమె ప్రచార బాధ్యతలు చూసే మేనేజర్‌ జాన్‌ పొడేస్టా వున్నారని ఒక వార్త వచ్చింది. అది పిజా దుకాణం కనుక దానికి పిజాగేట్‌ అని పేరు పెట్టారు. ఆ వార్తలో ఆ దుకాణ చిరునామా, ఆ భవనంలోని ఏభాగంలో సెక్స్‌ నిర్వహిస్తున్నారో స్పష్టంగా పేర్కొన్నారు. తట్టి మరీ లేపి ఈ వార్త విన్నారా అని అడిగినట్లుగా ప్రత్యర్ధి డోనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదారులు ఆ వార్త తెలియని వారికి కూడా తెలిసే విధంగా చేయాల్సిందంతా చేశారు. ఇంకే మంది అనేక మంది ఆ షాప్‌ యజమాని, దానిలో పని చేసే సిబ్బందిని చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. అవి న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి అంతర్జాతీయ పత్రికలలో కూడా వార్తలయ్యాయి.బాబోయ్‌ ఈ బెదిరింపులు, అసలు కుట్రవార్త గురించి దర్యాప్తు చేసి నిగ్గుదేల్చండని పిజా షాప్‌ యాజమాన్యం ఎఫ్‌బిఐని, సామాజిక మీడియా కంపెనీలను కోరింది.అయినా సరే ప్రచారం ఆగలేదు. షాపు యజమాని, క్లింటన్‌ మేనేజర్‌ మధ్య జరిగిన ఇమెయిల్‌ వుత్తర ప్రత్యుత్తరాలంటూ ఒక వెబ్‌సైట్‌ బయట పెట్టటంతో అందరూ పీజా గేట్‌ నిజమే అనుకున్నారు. దానిలో పేర్కొన్న పీజా షాపులోని ఆహార పదార్ధాల పేర్లను సంకేత భాష అంటూ అర్ధాలు తీసి వ్యాఖ్యలు చేశారు. బెదిరింపులను భరించలేక షాప్‌ మేనేజర్‌ వుద్యోగానికి రాజీనామా చేయాలని అతని భార్య పోరు పెట్టింది.

    చిత్రం ఏమిటంటే పీజాగేట్‌ కుంభకోణం నిజమని గానీ, కాదని గానీ ఎఫ్‌బిఐ ప్రకటించలేదు. హిల్లరీ క్లింటన్‌ స్వయంగా పిల్లలను హత్య చేసింది అనే ఒక వీడియో రంగంలోకి వచ్చింది. తరువాత దానిని వుపసంహరించుకున్నారు. అయితే అప్పటికే అది చేయాల్సిన హాని చేసింది.నాలుగులక్షల 20వేల మంది దానిని కాపీ చేసుకున్నారని తేలింది. న్యూయార్క్‌ పోలీసు వర్గాల కధనం పేరుతో వార్తలు వచ్చాయి. హిల్లరీ క్లింటన్‌ ఇంటిపై దాడి జరిగిందనే బ్రేకింగ్‌ న్యూస్‌లు వచ్చాయి. వాటి మీద సోషల్‌ మీడియాలో వ్యాఖ్యానాల గురించి ఇంక చెప్పేదేముంది. ఎన్నికలైపోయాయి.హిల్లరీ క్లింటన్‌కు జరగాల్సిన నష్టం, ట్రంప్‌కు లాభం కలిగింది.

    మరోసారి గిర్రున తిరిగి వర్తమానంలోకి వస్తే వుత్తర కరోలినా నివాసి 28ఏండ్ల ఎడ్గార్‌ మాడిసన్‌ వాల్చ్‌ అనే యువకుడు పిల్లలను రక్షించేందుకంటూ తుపాకితో రెస్టారెంట్‌కు వచ్చాడు. పిల్లలతో సెక్స్‌ రాకెట్‌ నడిచిందన్న సెల్లార్‌ కోసం చూశాడు. అసలు ఆ భవనానికి సెల్లారే లేదని తేలింది. గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా పీజా గేట్‌ అనేది ఒక కట్టుకధ అని తెలుసుకొని గాలిలోకి కాల్పులు జరిపి తన ఆయుధాన్ని అక్కడి సిబ్బందికి అప్పగించి తానెందుకు వచ్చిందీ చెప్పాడట. మా రెస్టారెంట్‌లో గనుక సెల్లార్‌ వుండి వుంటే ఏం జరిగి వుండేదో, కట్టుకధలు ఎలాంటి పరిస్ధితులను తెస్తాయో ఈ రోజు మీరు చూశారు. ఇక ముందైనా ఇలాంటి వాటిని నమ్మకండని యజమాని వేడుకున్నాడు. అయితే ఈ వుదంతాన్ని కూడా కొంత మంది కట్టుకథగా కొట్టి పేస్తున్నవారు లేకపోలేదు. కొందరైతే పోలీసులు ఆడించిన నాటకంగా కూడా చెప్పారు. ఏది ఏమైనా క్లింటన్‌ ఓటమికి ఇది కూడా తన వంతుగా తోడ్పడిందని చెప్పవచ్చు.

     ఇక కట్టుకధలతో లబ్ది పొందిన వారిలో మన ప్రధాని నరేంద్రమోడీ ఒకరని చెప్పవచ్చు. ఆయన గురించి సామాజిక మీడియాలో ఎన్నికల సందర్భంగా వ్యాపింప చేసిన కథలు ఎన్నో. వాటిలో ఒకటి మోడీ యువకుడిగా వున్నపుడు ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశాల సందర్భంగా గదులను వూడ్చిన నిరాడంబరుడు అంటూ సామాజిక మాధ్యమాలలో తిప్పిన ఫొటో ఒకటి. అసలూ, దానికి నకిలీని దిగువ చూడవచ్చు.

Image result for narendra modi fake news, fake photos

ఈ ఫొటో గురించి ఫేస్‌బుక్‌ దర్యాప్తు బృందం కొన్ని విషయాలను బయట పెట్టింది. చాలా మంది ఇప్పటికీ నరేంద్రమోడీ నిరాడంబరతకు ఆ చిత్రాన్ని వుదాహరణగా చూపుతున్నారు. అంతగా జనంలోకి వెళ్లింది. అసలు ఆ ఫొటో స్వాతంత్య్రానికి ముందు 1946లో అసోసియేటెడ్‌ ప్రెస్‌ తీసిన ఫొటో అని అది ఇ బే నుంచి స్వీకరించారని తేలింది. అంటే అప్పటికి అసలు నరేంద్రమోడీ పుట్టలేదు. ఆ ఫొటో ఎలా సంపాదించారనేది ఇంకా రహస్యంగానే వుంది. దొంగలు తమకు తెలియకుండానే కొన్ని ఆనవాళ్లను వదులుతారని పోలీసు చెబుతారు. ఈ చిత్రం విషయంలో కూడా అదే జరిగింది. అది 1988 నాటిదని దానిలో పేర్కొన్నారు. ఆ సమయంలో నరేంద్రమోడీకి అలాంటి గడ్డం లేకుండా వున్నారని కొందరు 1980దశకంలో ఎల్‌కె అద్వానీతో కలసి వున్న ఒక ఫొటోను వుదహరించారు. దాన్ని పక్కన పెడితే మహారాష్ట్ర బిజెపి మీడియా విభాగపు సహ కన్వీనర్‌గా వున్న ప్రీతీ గాంధీ ఆ చిత్రం నరేంద్రమోడీదే అంటూ 2013జూలై 12 తెల్లవారు ఝామున రూపా పంజారియాకు ట్వీట్‌ చేశారు. ఈ విషయాలు కావాలంటే దిగువ లింక్‌లో వున్నాయి చూసుకోవచ్చు.http://fbinvestigations.blogspot.in/2014/04/modi-fake-vs-real.html

Share this:

  • Tweet
  • More
Like Loading...

మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌- నరేంద్రమోడీకి తేడా ఏమిటి ?

03 Saturday Dec 2016

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

black money, black money unearth, Demonetisation, India black money, muhammad bin tughlaq, Narendra Modi

ఎంకెఆర్‌

   ఒక అయిడియా జీవితాన్నే మార్చేసింది అనేది ఈ రోజుల్లో ఒక జోకుగా మారిపోయింది. పెద్ద నోట్ల రద్దు, లెక్కకు మించిన బంగారంపై దాడుల వార్తలు రెండవసారి కూడా గద్దె నెక్కాలన్న నరేంద్రమోడీ ఆశల మీద నీళ్లు చల్లుతాయా ? అసలు తొలి అయిదు సంవత్సరాలూ పదవిలో కొనసాగటాన్నే ప్రశ్నార్ధకం చేస్తాయా ? జ్యోతిష్కులకు పెద్ద సవాల్‌ ఇది. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు అనే నరేంద్రమోడీ అయిడియా – లేఖ రాసిన చంద్రబాబు తన వాటా ఖ్యాతి గురించి ఏమంటారో తెలియదు – అనేక మంది ప్రాణాలను తీసి, జనాన్ని నానాయాతనలకు గురి చేస్తోంది. ఇలాంటి మహత్తర అయిడియా పేటెంట్‌ హక్కు తనదేనా లేక మరొకరిదా అన్నది స్పష్టం చేయాల్సిన బాధ్యత మోడీగారి మీదే వుంది. నోట్ల రద్దు నిర్ణయం ఏక్షణంలో తీసుకున్నారో గాని పెద్దలు ఒక మాట మీద నిలకడగా లేరు. ఎన్ని నిర్ణయాలు , ఎన్ని మార్పులు ! ఏ రోజు బ్యాంకులలో ఎంత డబ్బు ఇస్తారో తెలియదు, ఏ ఎటిఎం ఎప్పుడు తెరుచుకుంటుందో అసలే తెలియదు. అనేక అంశాలను ముందే కనిపెట్టి చెప్పేశాం అని గొప్పలు చెప్పుకొనే జ్యోతిష్కులు, జ్యోతిషాన్ని పాఠాలుగా చెబుతున్న విశ్వవిద్యాలయాల మేథావులు గానీ నోరు మెదపటం లేదు. వారి దురవస్థకు జాలి పడాలి. నోట్ల రద్దు దెబ్బకు గ్రహాలు కూడా గతి తప్పి డబ్బుకోసం క్యూలలో నిలవటానికి వెళ్లి వుండాలి. ఒక ఎటిఎం నుంచి మరో ఎటిఎం వద్దకు పరుగులు తీసే క్రమంలో తమ చిరునామాలే మరచిపోయాయా ? లేకపోతే మన జ్యోతిష్కులు ఈ పాటికి ఏదో ఒకటి చెప్పే వుండేవారు.

    గత కొద్ది రోజులుగా వెలువడుతున్న సమాచారం, తీరు తెన్నులను చూస్తే మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌కు ప్రధాని నరేంద్రమోడీకి వున్న తేడా ఏమిటని అనేక మంది విశ్లేషించేపనిలో పడ్డారు. చరిత్ర అవసరం లేదని చెప్పిన వారంతా ఇప్పుడు తుగ్లక్‌ చరిత్రను చదువుతున్నారు. దేశం మొత్తాన్ని అంటే దక్షిణాదిని కూడా తన పాలనలోకి తెచ్చుకోవాలంటే ఢిల్లీ దూరంగా వుంది కనుక రాజధానిని దేశం మధ్యలోకి తరలించాలని తుగ్లక్‌ భావించాడు. అలాగే బిజెపిని వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో గెలిపించి పటిష్టపరచాలంటే నోట్ల రద్దు వంటి చర్యలు అవసరమని మోడీ భావించినట్లు కనిపిస్తోంది. తుగ్లక్‌ రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరి( మహారాష్ట్రలోని దౌలతాబాద్‌)కు మారుస్తూ పరివారంతో పాటు రాజధాని జనాన్ని మాత్రమే ఇబ్బంది పెట్టాడు. మోడీ దేశం మొత్తాన్ని యాతనలకు గురి చేస్తున్నారు. నెలాఖరుకు కాస్త నొప్పి తగ్గుతుందని, తరువాత కొంత కాలం వరకు వుంటుందని ఆర్ధిక మంత్రి అరుణ్‌జెట్లీ చెప్పేశారు. తుగ్లక్‌ నగదు రద్దు చేసి అభాసుపాలయ్యాడు. మోడీ పాత పెద్ద నోట్లను వుపసంహరించి ఏం కాబోతున్నారో డిసెంబరు ఆఖరు నాటికి స్పష్టత రానుంది.

    నోట్ల రద్దు వలన ఆహా ఎన్ని ప్రయోజనాలో ఓహో ఎన్ని ప్రయోజనాలో, 50 రోజుల తరువాత తడాఖా చూడండి, ముందుకాస్త నొప్పి వుంటుంది కానీ తరువాత అంతా మంచే అని చెప్పటం తప్ప నల్లధనం ఎంత వస్తుందో, దానితో ఏమి చేయవచ్చో అపర మేథావిగా నీరాజనాలు అందుకుంటున్న నరేంద్రమోడీగానీ, అంతకంటే ఎక్కువ తెలివితేటలు వున్నాయని చుట్టుపక్కల వుండే వారి ప్రశంసలు అందుకొనే చంద్రబాబు గానీ లేదా వారికి మద్దతు ఇస్తున్న మీడియా విశ్లేషకులు గానీ నిర్ధిష్టంగా చెప్పలేదు. మూడు నుంచి ఐదులక్షల కోట్ల రూపాయల మేరకు నల్లధనం బయటకు వస్తుందని, ఈ మొత్తాన్ని ప్రభుత్వ లోటు తీర్చుకునేందుకు లేదా నరేంద్రమోడీని మరోసారి గద్దె నెక్కించేందుకు వీలుగా సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేయటం లేదా విజయమాల్య వంటి ఘరానా పెద్దలకు ఇచ్చిన అప్పులను రద్దు చేయటం ద్వారా నష్టపోయిన బ్యాంకులకు పెట్టుబడిగా పెట్టి ఆదుకోవటం వంటి అనేక పిట్టల దొరల వూహాగానాలు వెలువడ్డాయి. వాటిని ఇప్పటికీ నమ్ముతున్నవారు గణనీయంగా వున్నారు. సమాజంలో మధ్యతరగతికి లోలకం లక్షణం వుందని అనుభవజ్ఞులు చెబుతారు. గోడగడియారాలలో లోలకం ఆ వైపు ఈ వైపు తిరుగుతుంటుంది తప్ప మధ్యలో ఎప్పుడూ ఆగదు. అలాగే పొలో మంటూ నరేంద్రమోడీని ఆకాశానికి ఎత్తిన వారు అంతే వేగంతో కిందకూడా పడేయగలరు. ఏం జరుగుతుందో తెలియదు కనుక తోటి వారు కాస్త కనిపెట్టి వుండటం మంచిది.

    నవంబరు 29న రాజ్యసభకు ఆర్ధికశాఖ సహాయ మంత్రి తెలియచేసినదాని ప్రకారం పెద్ద నోట్లు రద్దు చేసే సమయానికి దేశంలో 1716.5 కోట్ల ఐదు వందల నోట్లు, 685.8 కోట్ల వెయ్యిరూపాయల నోట్లు చలామణిలో వున్నాయి.(దీనిలోనే నల్లధనం కూడా కలసి వుంది) వాటి మొత్తం విలువ 15.44 లక్షల కోట్లరూపాయలు. రిజర్వు ప్రకటించినదాని ప్రకారం నవంబరు 27 తేదీ నాటికి బ్యాంకుల వద్ద డిపాజిట్‌ చేసిన పెద్ద నోట్ల విలువ రు.8.45లక్షల కోట్లు. నోట్ల మార్పిడికి ప్రభుత్వం ఇచ్చిన 50 రోజుల గడువులో 18 రోజులలో జమ అయిన మొత్తం ఇది. సుప్రీంకోర్టుకు ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం పదిలక్షల కోట్ల మేరకు జమ కావచ్చని అంచనా. అంటే ఐదులక్షల కోట్లకు అటూ ఇటూగా నల్లధనం బయటకు రావచ్చని మోడీ సర్కార్‌ లెక్కలు వేసుకుంది. అయితే ఇది పంచపాండవులు-మంచం కోళ్ల కథను గుర్తుకు తెస్తోంది.http://www.thehindu.com/business/Economy/Deposits-of-withdrawn-notes-nears-Rs.11-lakh-crore/article16738256.ece  ప్రకారం 14.15లక్షల కోట్ల కరెన్సీ చలామణిలో వుంది. చెలామణిలో వున్న నోట్ల విలువ గురించి లెక్కలలో తేడాలు వుంటున్నాయి. అందువలన కొన్ని వేల కోట్లు అటూ ఇటూగా 14లక్షల కోట్లని అందరూ చెబుతున్నారు. డిసెంబరు 30 నాటికి బ్యాంకుల వద్ద ఎంత మేరకు పెద్ద నోట్లు జమ అవుతాయో చూసిన తరువాత రిజర్వుబ్యాంకు తాము ముద్రించిన నోట్లెన్నో, తమ వద్దకు వచ్చినవెన్నో లెక్కించి రాని వాటిని నల్లధనంగా ప్రకటిస్తుంది. అంటే ఆ మేరకు తిరిగి అదనంగా ముద్రించి ఆ సొమ్మును ఏం చేయాలో ప్రభుత్వ నిర్ణయం మేరకు అది చేస్తారు. అంతకు ముందు డిపాజిట్‌ చేసిన తీరు తెన్నులను బట్టి నవంబరు 30వ తేదీ నాటికి 11లక్షల కోట్ల మేరకు డిపాజిట్‌ అయివుంటుందని బ్యాంకర్ల అంచనా. అంటే ప్రభుత్వం అనుకున్న ఐదులక్షల కోట్లు కాస్తా మూడుకు పడిపోయాయి. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో పాతనోట్లే ఎక్కువగా చెలామణిలో వున్నాయి. వాటిని కూడా డిపాజిట్‌ చేయటానికి ఈనెలాఖరు వరకు గడువు వుంది కనుక, చివరి నిమిషంలో జమ చేసే వారు కూడా గణనీయంగానే వుంటారు కనుక మిగిలిన మూడులక్షల కోట్లలో ఎంత జమ అవుతుంది అన్నది ప్రశ్న. ఇంక ఈ మొత్తం జమ కాకుండా వుండేట్లు చూడు మనువా, మా మోడీ పరువు కాపాడు మనువా అని ఆయన వీర భక్తులు రహస్యంగా మొక్కుకోవటం ప్రారంభించటం మంచిది. ఎందుకంటే ఇంకే మాత్రం బ్యాంకుల్లో జమ అయినా జనం అడిగే ప్రశ్నలకు వారి దగ్గర సమాధానాలు వుండవు. ఎవరైనా దీని మీద కూడా కొత్త నోట్లతో పందాలు కాసే ప్రమాదం లేకపోలేదు.

  వారం రోజుల క్రితం సిఎంఐఇ అనే సంస్ధ వేసిన అంచనా ప్రకారం లక్షా 28వేల కోట్ల రూపాయల మేర నోట్ల రద్దు వలన నష్టాలుంటాయట. అంటే ఇంకా జనం దగ్గర వున్న మూడులక్షల కోట్లూ నల్లధనమే అనుకున్నా, అనుకున్నా నిఖర లాభం లక్షా 82వేల కోట్లు మాత్రమే. మూడులక్షల కోట్లలో ఈ నెలాఖరుకు రెండులక్షల కోట్లు బ్యాంకుల్లో జమ అయినా ఆర్ధికంగా నష్టదాయకమే. అది నిఖరంగా ఎంత అన్నది కొత్త సంవత్సర కానుకగా తెలుసుకోవచ్చు.

సిఎంఐఇ లెక్కల ప్రకారం అది వేసిన నష్ట అంచనాలన్నీ తక్కువలో తక్కువ. ఆ యాభై రోజులు బ్యాంకులు, ఎటిఎంల దగ్గర నిలిచిన కారణంగా పోయిన పని లేదా సెలవుల నష్టం మొత్తం 15వేల కోట్ల రూపాయలు.

బ్యాంకులు కొత్త నోట్లను అమర్చేందుకు, గుర్తించేందుకు వీలుగా ఎటిఎంలలో చేయాల్సిన మార్పులకు అయ్యే ఖర్చు రు.35.1వేల కోట్లు.

కొత్త నోట్లను అచ్చు వేయటానికి ప్రభుత్వానికి లేదా రిజర్వుబ్యాంకుకు వదిలే చేతి చమురు రు.16.8వేల కోట్లు.

వ్యాపార, వాణిజ్యాల ప్రత్యక్ష నష్ట అంచనా రు.61.5వేల కోట్లు.

   వీటన్నింటి మొత్తం లక్షా 28వేల కోట్ల రూపాయలు. ఇక ప్రభుత్వానికి సంభవించే నష్టాలను కూడా లెక్కించాల్సి వుంది. అవి కూడా బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా వెల్లడి అవుతాయి. సిఎంఐఇ సంస్ధ వేసిన నష్టాలలో టోల్‌ టాక్సు రద్దు వలన కలిగిన లోటును పరిగణనలోకి తీసుకోలేదు. రోజుకు 80 నుంచి 90 కోట్ల మేర జాతీయ రహదారుల మీద ఆదాయం కోల్పోయినట్లు అంచనా. ఇంకా ఇలాంటి చిన్న చిన్న వాటిని కూడా కలుపు కుంటే నష్టాలు తడిచి మోపెడు అవుతాయి. అవన్నీ ఆయా సంస్ధలు వార్షిక లెక్కలు తయారు చేసేటపుడుగానీ స్పష్టం గావు అందువలన మోడీ సర్కార్‌ నల్ల ధనాన్ని ఈ మేరకు నష్టపోయిన విలువగల దానిని అయినా పట్టుకుంటే జనానికి మిగిలేది ఆయాసం అయినా నల్లధనంపై పోరులో నేను సైతం అన్నట్లుగా ఎంతో కొంత త్యాగం చేశామని గర్వపడతారు-లేకపోతే జనంలో కలిగేది ఆగ్రహం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

పెద్ద నోట్ల రద్దు, నగదు రహితం వెనుక రిలయన్స్‌ హస్తం ?

01 Thursday Dec 2016

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

black money, cashless transactions, demonetization, Narendra Modi, Reliance

Image result for Reliance hand behind demonetization and cashless transactions move ?

ఎం కోటేశ్వరరావు

  నగదు రహిత లావాదేవీలను ఎక్కువగా నిర్వహించేందుకు అవసరమైన పద్దతులను సూచించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కన్వీనర్‌గా కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. నగదుకు బదులు కార్డు గీకి కార్యకలాపాలు నిర్వహించేందుకు అనువైన పరిస్థితులు లేకున్నా బలవంతంగా అయినా ఆ పద్దతికి మళ్లించేందుకు పూనుకున్నట్లు కనిపిస్తోంది. మరికొద్ది రోజులు పరిస్థితులు ఇలాగే కొనసాగితే జనం అనివార్యంగా అటువైపు మళ్లుతారని గత కొద్ది రోజులుగా పేటిమ్‌ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరగటాన్ని బట్టి చెప్పవచ్చు.

    నల్లధనాన్ని అరికట్టే పేరుతో పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధాని నరేంద్రమోడీ వెంటనే నగదు రహిత కార్యకలాపాల గురించి ఎందుకు తొందర పడుతున్నారో చంద్రబాబు నాయుడి నాయకత్వంలో ఒక కమిటినీ ఎందుకు వేశారో, గురువారం నాడు రిలయన్స్‌ అధిపతి ముఖేష్‌ అంబానీ ప్రకటనతో స్పష్టమైంది. నోట్ల రద్దుకు దీనికి ఏదైనా సంబంధం వుందా ? ముఖేష్‌ ప్రకటించిన వివరాల ప్రకారం సోమవారం నుంచి దేశవ్యాపితంగా కోటి మంది వ్యాపారులను జియో మనీతో అనుసంధానించేందుకు ఏర్పాట్లు చేశారు. దానికి వీలు కల్పించే జియో వుచిత డేటా, ఫోన్‌ సౌకర్యాన్ని మరో మూడు నెలల వరకు వుచితంగా అందచేయనున్నారు. ఆధార్‌ నంబరు అనుసంధానంతో చిన్న ఎటిఎంలను మార్చినెల నాటికి దేశ వ్యాపితంగా నాలుగు లక్షలు ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు అన్ని బ్యాంకులకు వున్న ఎటిఎంల కంటే ఇవి రెట్టింపు. ఇప్పటికే రెండులక్షల దుకాణాలతో ఈ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. దుకాణాలతో లావాదేవీలు మాత్రమే గాక వ్యక్తుల నుంచి వ్యక్తులకు కూడా లావాదేవీలు జరపవచ్చు. వినియోగదారులు తమ బ్యాంకు ఖాతాల నుంచి వ్యాపారి ఖాతాకు సొమ్ము బదలాయించటమే కాకుండా వ్యాపారులు దీనితో తమ బ్యాంకు ఖాతాలలో కూడా నగదు జమచేయటానికి వినియోగించవచ్చు.ఎస్‌బిఐతో కలిసి నగదు చెల్లించే బ్యాంకు లైసన్సును కూడా జియో తీసుకున్న విషయం తెలిసిందే.ఇప్పటికే జియో ఫోన్‌ కనెక్షన్ల ద్వారా ఐదు కోట్లకు పైగా ఆధార్‌ కార్డుల సమాచారాన్ని రిలయన్స్‌ సేకరించింది. అంటే బ్యాంకింగ్‌ వ్యవస్ధకు సమాంతరంగా ఆర్ధిక కార్యకలాపాలను నిర్వహించేందుకు ఈ సంస్ధ పధకాలతో వున్నట్లు చెప్పవచ్చు.

  నగదు రహిత కార్యకలాపాల నిర్వహణ ద్వారా పారదర్శకతను పెంచుతామని, అవినీతిని అరికడతామని చెప్పటాన్ని ఎవరూ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అయితే దేశంలో పుష్కలంగా నిరక్షరాస్యత, అమాయకత్వం నిండి వుండి, అనువైన వ్యవస్థాగత సౌకర్యాలు లేకపోతే సామాన్య జనం నోట్ల రద్దు మాదిరి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. రెండవది నూటికి నూరుశాతం నగదు రహిత దేశాలు, ప్రాంతాలుగా వున్న చోట్ల అవినీతి రూపం మార్చుకుంది తప్ప పోలేదు. నూతన ఆర్ధిక విధానాలు, ప్రపంచీకరణ పేరుతో గత పాతిక సంవత్సరాలుగా అనుసరించిన విధానాలు వుపాధి రహిత అభివృద్ధికి బాటలు వేశాయి. పర్యవసానంగా ఆర్ధిక అసమానతలు మరింతగా పెరిగాయి. ప్రపంచవ్యాపితంగా జరిగిన పరిణామమే మన దేశంలో కూడా జరిగింది.

   అనేక మందికి నగదు రహితం అంటే డబ్బుకు బదులు కార్డులను గీకటం మాత్రమే అనుకుంటున్నారు. రిలయన్స్‌ వంటి సంస్ధలు మన జేబులను స్మార్ట్‌గా కొల్లగొడతాయి. అంబానీలు నాలుగులక్షల చిన్న ఎటిఎంలు పెట్టినా, ఆరునెలల పాటు వుచితంగా డేటా, ఫోన్‌ సౌకర్యం కలిగించినా అది తాను సంపాదించిన లక్షల కోట్ల సంపద నుంచి చేస్తున్న దానం కాదని తెలుసుకోవటం అవసరం. వేల కోట్ల పెట్టుబడులు పెట్టి ఇవన్నీ చేస్తున్న పెద్ద మనిషి వడ్డీతో సహా అసలు, లాభాలను రాబట్టుకొనేందుకు చూస్తాడని వేరే చెప్పాలా ? కార్డు డబ్బు లావాదేవీలపై జనానికి అలవాటు చేసేందుకు తొలి రోజుల్లో కొన్ని రాయితీలు ఇస్తారు. తరువాత అసలు నగదుపైనే పరిమితులు విధించి విధిగా కార్డులపై ఆధారపడేట్లు చేస్తారు. అటువంటి పరిస్థితి వచ్చిన తరువాత చార్జీలు, సర్చార్జీల మోత మోగుతుంది. అంటే నగదు కంటే నగదు రహితంతో వినియోగదారులు అధిక మొత్తాన్ని చెల్లించాల్సి వుంటుంది.

     వుదాహరణకు క్రెడిట్‌ కార్డులపై బంకుల్లో పెట్రోలు పోయించుకుంటే ఎలాంటి సర్‌ఛార్జీలు వుండవు అని చెబుతారు. రద్దు చేస్తున్న మాట కూడా నిజం. అయితే ఈ రాయితీ శాశ్వతం కాదు. ఎలాంటి చార్జి వసూలు చేయవు అన్నది కూడా వాస్తవం కాదు. వుదాహరణకు నేను కోటక్‌ క్రెడిట్‌ కార్డు మీద రు.1500ల పెట్రోలు కొనుగోలు చేస్తే కార్డును గీకినపుడు ఇచ్చిన రశీదుపై అంతే మొత్తం వుంది. తీరా క్రెడిట్‌ కార్డు బిల్లు చూస్తే అసలు విషయం తెలిసింది. రు.43.13లు ఎక్కువ వసూలు చేసి దాని నుంచి రు.37.64 తిరిగి జమ చేసినట్లు బిల్లులో పేర్కొన్నారు. మిగిలిన రు.5.49 నేను కోటక్‌ కార్డు యజమానులకు చెల్లించాను. ఇది ఒక లావాదేవీకి మాత్రమే. ప్రతిదానికి విలువను బట్టి వుంటుంది. అదే నగదు చెల్లిస్తే అదనం వుండదు. ఎలక్ట్రానిక్‌ పద్దతుల్లో నగదు బదిలీ చేసినా, కార్డు ద్వారా చెల్లించినా కొద్ది రోజులు వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేయకపోవచ్చు. వినియోగదారుల తరఫున వ్యాపారి తన లాభంలోంచి ఆ మొత్తాన్ని చెల్లిస్తాడు. తరువాత పరోక్షంగా సరకు ధరలో దానిని కూడా కలిపి మన దగ్గర వసూలు చేస్తాడు. కార్డు మోజు ఖరీదు ఇలా వుంటుంది.

   నగదు లావాదేవీ అంటే పెద్ద పెద్ద వ్యాపార సంస్ధలు రోజువారీ వచ్చిన సొమ్ముకు ఒకటో, రెండో,మూడు ఖాతాలలోనో లెక్కలు రాయాలి. మరుసటి రోజు లేక అదే రోజు బ్యాంకుల్లో జమ చేయాలి. సరే ఇప్పుడంటే లెక్క పెట్టటానికి మిషన్లు వున్నాయి కనుక కట్టలు కట్టటానికి, వాటిని బ్యాంకులకు చేర్చటానికి సిబ్బంది, వాహనాలు, రక్షణ అవసరం. నగదు రహితమైతే అవేమీ అవసరం లేదు. అంటే దుకాణాలలో కొన్ని వుద్యోగాలు పోవటం ఖాయం.

   నగదు రహిత కార్యకలాపాలు పెరిగితే బ్యాంకులలో వుద్యోగాలు కూడా హరీ అంటాయి. ఇప్పటికే ఎటిఎం మిషన్లు, కంప్యూటర్లు వచ్చి సిబ్బంది తగ్గిపోయారు. పశ్చిమ దేశాలలో కొన్ని బ్యాంకు శాఖలు అసలు నగదు స్వీకరించవు. ఎక్కువ చోట్ల నామమాత్రంగా సిబ్బంది వుంటారు. మన దేశంలో కూడా అదే పునరావృతం అవుతుంది. ఇప్పటికే నగదు జమ చేయటానికి కూడా ఎటిఎంలు వచ్చాయి. అసలు నగదు లేకపోతే ఏటిఎం మిషన్లు అవసరం వుండదు. అంటే ప్రతిదాని దగ్గర వుండే రెండు సెక్యూరిటీ , వాటి నిర్వహణ సిబ్బంది వుద్యోగాలు ఎగిరి పోతాయి.

    ఇక నగదు రహిత లావాదేవీల సాధ్యాసాధ్యాల గురించి చూద్దాం. గిరిజన ప్రాంతాల జనం విద్య, వైద్య సౌకర్యాలు లేక ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో, ఎంతెంత దూరాలు కొండలు, గుట్టలు ఎక్కి దిగుతున్నారో చూస్తున్నాం. వారందరికీ అమలు చేయటం సాధ్యమేనా ? ఎంతో అభివృద్ధి చెందింది అని చెప్పుకొనే అమెరికాలో 2012లో 40శాతం నగదు లావాదేవీలు జరిగాయి, తగ్గే ధోరణిలో వున్నాయి. అక్కడే 2013 లెక్కల ప్రకారం అసలు బ్యాంకులలో ఖాతాలు లేని జనం ఎనిమిదిశాతం అయితే మరో 20శాతం మందికి ఖాతాలున్నప్పటికీ పూర్తిగా వాటిని వినియోగించకుండా ప్రత్యామ్నాయ అంటే నగదు, ఇతర పద్దతులలో లావాదేవీలు నిర్వహిస్తున్నారు.2014 గ్యాలప్‌ సర్వే ప్రకారం 29శాతం మందికి క్రెడిట్‌ కార్డులు లేవు.2009లో చేసిన కార్డు చట్టం ప్రకారం 21 సంవత్సరాల లోపు వారికి క్రెడిట్‌ కార్డులు ఇవ్వరు. అందువలన నగదు లావాదేవీలను పరిమితం చేసినా, లభ్యతను పరిమితం చేసి అప్రకటిత నిషేధం విధించినా బ్యాంకు ఖాతాలు లేని పేదలు తీవ్ర ఇబ్బందులు పడతారు. అలాంటి వారు ప్రీపెయిడ్‌ అంటే మనం సెల్‌ఫోన్లను చార్జింగ్‌ చేయించుకున్నట్లుగా డబ్బును కార్డులలో వేయించుకోవాలి. ప్రీపెయిడ్‌ ఫోన్‌ కాల్‌ ఎలా ఎక్కువ ఖరీదో ప్రీపెయిడ్‌ డెబిట్‌ కార్డుకు కూడా చార్జీలు ఎక్కువ అవుతాయి.

   నగదు రహిత విధానాన్ని ప్రవేశపెట్టటమంటే జనంపై బలవంతంగా రుద్దటమే అన్నది అనేక దేశాల అనుభవం చెబుతున్నది. ఫ్రాన్స్‌లో వెయ్యి యూరోల కంటే ఎక్కువ విలువగల లావాదేవీలకు నగదు వినియోగించటం చట్టవిరుద్దం. అనేక దేశాలలో ఇలాంటి ఆంక్షలున్నాయి.కొన్ని ఐరోపా దేశాలలో గ్రీసు వంటి చోట్ల ఒక పట్టణంలో మాత్రమే చెల్లుబాటయ్యే ప్రత్యామ్నాయ కరెన్సీలు కూడా వునికిలోకి వచ్చాయి. అవి కూడా పరిమిత సంఖ్యలో మాత్రమే కలిగి వుండాలి. కొన్ని చోట్ల పిల్లలకు ఇచ్చే డబ్బును పుస్తకాల వంటికి వాటికి మాత్రమే వుపయోగించాలి. ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో వినియోగించటం నిషిద్ధం.

    బ్యాంకులు పెద్ద మొత్తంలో నగదు నోట్లను ముద్రించటం, వాటిని రవాణా చేయటం, భద్రతను కూడా లాభనష్టాల కోణంలో చూస్తున్నాయి.ఈ ఏడాది జూలై ఎనిమిదిన రిజర్వు బ్యాంకు సమాచారం మేరకు 95శాతం కరెన్సీ అంటే 16.8లక్షల కోట్ల నోట్లు చలామణిలో వున్నాయి. ఏటా నోట్ల ముద్రణ ఖర్చు 3,760 కోట్లు,ఎటిఎంల నిర్వహణకు రు.15,800 కోట్లు ఖర్చవుతున్నాయి. ఈ ఖర్చును కూడా గణనీయంగా తగ్గించేందుకు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నారు. న్యూఢిల్లీలో నోట్ల రవాణాకు 2014లో 9.1 కోట్ల రూపాయలు ఖర్చయినట్లు తేలింది.నగదు రహిత లావాదేవీలు నిర్వహించే పశ్చిమ దేశాలలో పెద్ద నోట్లను ముద్రించటం లేదు. అదే బాటలో మన దేశంలో కూడా వెయ్యి నోట్లను ముద్రించకూడదని నిర్ణయించారని, రెండువేల రూపాయల నోట్లను కూడా రద్దు చేసి తరువాత మిగతా నోట్ల ముద్రణను కూడా పరిమితం చేసే ఆలోచనలో వున్నట్లు కనిపిస్తోంది.నగదు రహిత లావాదేవీలు జనంపై ఆదనపు భారం మోపకూడదు. వీటి వలన పన్ను ఎగవేతలు తగ్గి ఆదాయం పెరుగుతుంది అంటున్నారు కనుక ఆమేరకు జనంపై విధించే పన్నుల భారం కూడా తగ్గాలి. లేదా పెరిగిన ఆదాయాన్ని పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు రాయితీల రూపంలో కట్టబెట్టటం కాకుండా జన సంక్షేమానికి వెచ్చించాలి. ఈ విషయాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగి మంచి చెడ్డలను వివరించిన తరువాతే ముందుకు పోయే విషయాన్ని నిర్ణయించాలి .లేకుంటే పెద్ద నోట్ల రద్దు మాదిరి పరిస్థితులు నిత్యకృత్యంగా మారతాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నోట్ల రద్దు పర్యవసానాలపై నిరసన విఫలమైందా ? సఫలమైందా ?

28 Monday Nov 2016

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

Black Economy in India, black money, Demonetisation, Demonetisation standoff, Narendra Modi, opposition protest on demonetisation, protest on demonetisation

కేరళ హర్తాళ్ దృశ్యమ్

ఎం కోటేశ్వరరావు

    పెద్ద కరెన్సీ నోట్ల రద్దు సందర్భంగా పౌరుల మీద రుద్దిన ఇబ్బందులకు నిరసనగా అనేక పార్టీలు విడివిడిగా ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం నాడు (నవంబరు 28న) దేశ వ్యాపితంగా వచ్చిన స్పందన గురించి రకరకాల వార్తలు, వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. అది ఏ రూపంలో జరిగింది ? జయప్రదమైందా విఫలమైందా అన్న లెక్కలు వేయబోవటం లేదు. జయప్రదమైంది అంటే దాని అర్ధం బిజెపి చిత్రిస్తున్నట్లు నిరసనకు మద్దతు ఇచ్చిన వారందరూ నల్లధనాన్ని, అవినీతిని సమర్ధించేవారు కాదు. విఫలమైంది అంటే ముందు చూపులేకుండా, అనాలోచితంగా నరేంద్రమోడీ చేసిన పిచ్చిపనిని ఆందరూ ఆమోదించినట్లూ కాదు. నోట్ల రద్దుతో తలెత్తిన సమస్యను పక్కదారి పట్టించేందుకు గత కొద్ది రోజులుగా నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు వంటి వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాణీగారి ప్రతిపక్షం, రాణీగారీ అనుకూల పక్షాల మాదిరి వ్యవహరిస్తున్న మీడియా సంస్ధలు, వాటిలో పనిచేసే షార్ట్‌ హాండ్‌ జర్నలిస్టులు ఈ సమస్యపై కూడా తమ పాత్రలను చక్కగా పోషిస్తున్నారు.

   గత ఇరవై రోజులుగా దేశ విదేశాల విశ్లేషకుల నుంచి వెలువడుతున్న వ్యాఖ్యలు, సమాచారం ప్రకారం నోట్ల రద్దు వలన నల్లధనం రద్దు పెద్ద ప్రహసనంగా మారనున్నట్లు కేంద్రంలోని పెద్దలు గ్రహిస్తున్న కారణంగానే దానినొక రాజకీయ అంశంగా ప్రతిపక్షాలపై దాడి చేసేందుకు, నగదు రహిత ఆర్ధిక లావాదేవీల పెంపుదల ప్రచార అంశంగా మార్చి వేస్తున్నారు. పార్లమెంట్‌లో ఎంత రచ్చ జరిగినా బయట తప్ప అక్కడ మాట్లేడేందుకు నరేంద్రమోడీ ఇప్పటికీ విముఖంగానే వున్నారు. అంటే అసలు సమస్య నుంచి జనం దృష్టిని వేరే వివాదంపైపు మార్చేందుకు చూస్తున్నట్లుగానే భావించాలి. నోట్ల రద్దును స్వాతంత్య్రానంతర తొలి విప్లవాత్మక చర్య అన్నంత గొప్పగా చెప్పుకుంటున్న నరేంద్రమోడీ దాని గురించి మాట్లాడటానికి, చర్చించటానికి పార్లమెంట్‌కు హాజరు కాకపోవటమే పెద్ద వైఫల్యం. ఎంతకాలం మౌనంగా వుంటారు, ఎంతకాలం తప్పించుకుంటారు ? గతంలో ఏదైనా ఒక అంశంపై పాలకపార్టీని నిలదీయాలంటే భిన్న ధృవాలుగా వున్న పార్టీలు సైతం పార్లమెంట్‌లో సమన్వయం చేసుకొనేవి. అలాంటిది ఇప్పుడు పార్లమెంట్‌లో ఎవరికి వారు తమ అభిప్రాయాలు వెల్లడించటమే కాదు, నోట్ల సమస్యపై వెలుపల కూడా ఒకే రోజు వివిధ రూపాలలో విడివిడిగా ఆందోళనకు పిలుపు ఇవ్వటం బహుశా ఇదే మొదటి సారి అని చెప్పవచ్చు. నోరు వుంది కదా, మీడియాలో ఎక్కడ లేని ప్రచారం దొరుకుతోంది కదా అని పాలకపార్టీ నేతలు సంబర పడవచ్చు. ఎందుకైనా మంచిది, భవిష్యత్‌లో ఎటుబోయి ఎటువస్తుందో ఒక అవకాశం అట్టిపెట్టుకుందామని చంద్రబాబు నాయుడి వంటి వారు ఒకవైపు మంచిదని చెబుతూనే మరోవైపు అసంతృప్తి గళం వినిపించటం మామూలు విషయం కాదు.

    సమస్య తీవ్రత కారణంగా సామాన్యులే కాదు చివరికి ఆర్ధిక మంత్రి కుటుంబం కూడా ఎలా ఇబ్బంది పడుతుందో చూడండి అని నమ్మించేందుకు వండి వార్చిన కట్టుకధలలో భాగంగా కొన్ని పత్రికలలో ఒక వార్త వచ్చింది. ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ గారు ఒక వంద మందికి విందు ఏర్పాటు చేయమని తన సతీమణికి చెప్పారట. తీరా ఆమె తన, భర్త ఖాతాల నుంచి 24వేల చొప్పున తీసుకున్న డబ్బుతో 50 మందికి మాత్రమే ఏర్పాటు చేయవచ్చని చెప్పారట. సరే పెద్ద వారు అంత ఖరీదైన విందులు ఇస్తారు వదిలేద్దాం. నరేంద్రమోడీ, చంద్రబాబు గారు నగదుతో పని లేకుండా అంతా కార్డులతో ఎంత సులభంగా నడిపించవచ్చో జనానికి చెబుతున్నారు. కేంద్రమంత్రి కుటుంబం వంద మంది విందుకు సరిపడా అవసరమైన ఖర్చులకు నగదు లేక ఇబ్బంది పడ్డారంటే వారికి కూడా అలాంటి కార్డులు లేనట్లే కదా ? ఒక వేళ వుంటే ఇలాంటి కట్టుకధలు ఎందుకు పుట్టినట్లు ?

    మరొక కధ. ఇది స్వయంగా నరేంద్రమోడీ చెప్పిన పిట్ట కధ. తాను టీ అమ్మిన సమయంలో పేదలు స్ట్రాంగ్‌ టీ అడుగుతుండేవారట. అలాగే ఇప్పడు నల్లధనంపై గట్టి చర్య తీసుకున్నా అన్నారు. ఒకే. ఆయన టీ అమ్మినట్లు చెబుతున్న ప్రాంతాలు రైల్వే స్టేషన్‌, బస్టాండ్లలో అమాయకులు తప్ప రోజూ టీ తాగే వారు ఎవరైనా స్ట్రాంగ్‌ టీ అడుగుతారా ? అలాంటి చోట్ల స్ట్రాంగ్‌ టీ దొరకటం ఎంత నిజమో పెద్ద నోట్ల రద్దుతో గట్టి చర్య కూడా అంతే నిజం !

   సాంప్రదాయక మీడియా, సామాజిక మీడియాలో అనేక మంది ఈ నిరసనను భారత బంద్‌ పిలుపుగా వర్ణించారు. బంద్‌లు జరపకూడదని, కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కూడా 1997లో సమర్ధించిన తరువాత ఏ పార్టీ కూడా బంద్‌ పిలుపులు ఇవ్వటం లేదు. అయితే తరువాత మరొక కేసు సందర్భంగా బంద్‌లు జరపటం ప్రజాస్వామ్య బద్దమే అని అదే కోర్టు 2009లో చెప్పిందనుకోండి. సోమవారం నాడు స్ధానిక పరిస్థితులను బట్టి వివిధ రూపాలలో నిరసన తెలపమని వామపక్షాలు పిలుపు ఇచ్చాయి.http://cpim.org/pressbriefs/observe-november-28-all-india-protest-day ఈ లింక్‌లో సిపిఎం అధికారిక ప్రకటన వుంది. దానిలో ఎక్కడా బంద్‌ అన్న పదం లేదు.

    ఇక నిరసన రూపం గురించి పాక్షికం, విఫలం, తీవ్ర అంతరాయం ఇలా రకరకాలుగా వర్ణించటాన్ని చూడవచ్చు. తొంభై బస్‌లు ఆగిపోయి ప్రయాణీకులు లేకుండా పంతానికి పది తిప్పినా, రోజంతా మూసి సాయంత్రం కొద్ది సేపు దుకాణాలు తెరిచినా పాక్షికం అని చిత్రించ వచ్చు. స్వతంత్ర భారత చరిత్రలో అనేక బంద్‌లు, నిరసన కార్యక్రమాలు జరిగాయి. అన్ని నిరసనలలోనూ అందరికీ సంబంధించిన సమస్యలు ఎప్పుడూ వుండవు. నోట్ల రద్దు అందుకు మినహాయింపు. సామాన్యుడైనా, ముకేష్‌ అంబానీ అయినా రోడ్డు మీదకు వచ్చి ఒక చాయ్‌ తాగాలంటే స్వయంగా లేదా డ్రైవర్‌ ద్వారా అయినా డబ్చిచ్చి తాగాలే తప్ప చెక్కు లేదా కార్డు గీక్కో మంటే కుదరదు. అందువలన ఇది అందరికీ సంబంధించిన సమస్య కనుక దీనికి ఒక ప్రత్యేకత వుంది. చిత్రం ఏమంటే తాను పేదలకు టీ అమ్మానని చెప్పిన మోడీ ఆ పేదలు టీ డబ్బులను కార్డులు, చెక్కుల రూపంలో ఇవ్వలేరని అర్దం చేసుకోలేకపోయారు. అందువలన నిజంగా అమ్మారా అని ఎవరైనా సందేహించే ఆస్కారం కూడా వుంది.

   నోట్ల రద్దు నల్లధనం రద్దుకు అని చెప్పారు. తీరా ఇప్పుడు పెద్ద లందరూ అసలు నోట్లతో పని లేకుండా మీ చేతిలో ఆండ్రాయిడ్‌ ఫోనుంటే చాలు, దాని మీద మీటలు నొక్కటం నేర్చుకుంటే అంతా అయి పోతుందని వూదర గొడుతున్నారు. నోట్ల రద్దును వేల కోట్ల సంపదలున్న పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు సమర్ధిస్తూ ప్రకటనలు చేయటాన్ని చూస్తే అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

   ఒకటి. నోట్ల రద్దు మరుసటి రోజు నుంచి జరిగిన పరిణామాలను చూస్తే డబ్బుతో పని లేకుండా కార్డులు గీకి వస్తువులు అమ్మే చోట్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి, డబ్బుతీసుకొని అమ్మే దుకాణాలలో తగ్గాయి. అంటే పెద్ద దుకాణాల వారు ఈ నోట్ల రద్దు వెనుక చక్రం తీప్పారా ? కారణం ఏదైనా తనకు కూడా అలాంటి కార్డులు గీకే హెరిటేజ్‌ దుకాణాలు వున్నాయి కనుక ముందు చూపుతో పెద్ద నోట్లు రద్దు చేయాలని అందరి కంటే ముందే కేంద్రానికి లేఖ రాశారా ? చంద్రబాబు నాయుడు కార్డుల ద్వారా లావాదేవీలు జరిపించేందుకు నాలుగు కమిటీలను కూడా వేశామని ప్రకటించారు. మంచిదే. త్వరలో కార్డులు కూడా ఇప్పిస్తారు. ఫోన్లు కూడా ఇప్పిస్తామంటున్నారు కనుక సందేహం లేదు. ( వుద్యోగాలకు బదులు ఫోన్లు, గీకే కార్డులు కావాలని జనాన్ని తిప్పించుకోవచ్చు ) అవి వచ్చిన తరువాత ఏ రోజు పని చేస్తే వచ్చిన ఆరోజు కూలి డబ్బులతో వస్తువులను కొనుగోలు చేసే వారు పల్లె టూళ్ల నుంచి సాయంత్రానికి బ్యాంకులున్న పెద్ద గ్రామాలు లేదా పట్టణాలకు వెళ్లి తమ కూలి డబ్బులను బ్యాంకుల్లో వేయాలి. ఆ సమయానికి బ్యాంకులు మూసివేస్తారు కనుక ఆ రాత్రికి అక్కడ వుండి మరుసటి రోజు వుదయం లేదా వేరే వారికి ఇచ్చి తమ ఖాతాలలో వేయించుకొని మరుసటి రోజు సాయంత్రానికి కార్డుపై సరకులు కొనుక్కోవాలి. ప్రతి రోజు కూలి డబ్బులను అలానే చేయాల్సి వుంటుంది. లేదా కులానికొక కార్పొరేషన్‌ పెట్టినట్లుగా బ్యాంకులు కూడా పెట్టించి వాటి శాఖలను ప్రతి వూరిలో లేదా ఏ కులపు వారికి ఆ కులవీధులలో ఏర్పాటు చేసి అక్కడే వేయించవచ్చు.

   రెండు. బ్యాంకుల వద్దకు చలామణిలో వున్న సొమ్ము పెద్ద మొత్తంలో చేరింది. వెంటనే అనేక బ్యాంకులు తమ వద్ద సొమ్ము దాచుకున్నవారి డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేటను తగ్గించేశారు. అంటే ఆ మేరకు సుజనా చౌదరి, రాజగోపాల్‌ వంటి పెద్దల కుటుంబాల పారిశ్రామిక, వాణిజ్య సంస్ధలకు ఇచ్చే రుణాల రేట్లు కూడా తగ్గిపోతాయి. గత రెండున్నర సంవత్సరాలుగా ఇలాంటి కంపెనీలకు వడ్డీ రేట్లు తగ్గించాలని సుబ్రమణ్యస్వామి వంటి వారు వారందరూ పని గట్టుకొని రఘురామ్‌ రాజన్‌కు రెండోసారి అవకాశం ఇవ్వకుండా వుర్జిత్‌ పటేల్‌ను తెచ్చి పెట్టుకోవటం, ఆయన ఆధ్వర్యంలో పెద్ద నోట్ల రద్దు వెనుక పెద్దల హస్తం కూడా వుందా ?

   మూడు. బ్యాంకులలో దోపిడీలు జరుగుతున్నాయని ఎవరైనా బ్యాంకులను మూసి వేస్తారా ? ఎలుకలున్నాయని ఇంటినే తగుల పెట్టుకుంటారా ? రొట్టెను ముక్కలుగా కోయటానికి చాకు బదులు పెద్ద కత్తులను వాడతామా ? పెద్ద సుత్తులతో బాదుతామా ? నరేంద్రమోడీ సర్కార్‌ అదే చేసింది. అసలు మన దేశంలో పాకిస్థాన్‌ లేదా మరొక దేశం నుంచి గానీ వస్తున్న లేదా మన దేశంలో మేకిన్‌ ఇండియా ‘ముద్రణ పరిశ్రమల’ నుంచి వస్తున్న కోయంబత్తూరు నోట్లుగా పిలిచే దొంగ నోట్లు ఎన్ని వున్నాయి? నల్లధనం ఎంత?

    నల్లధనం ఎంత అనే ప్రశ్నకు ప్రభుత్వం వద్ద కూడా కచ్చితమైన సమాధానం లేదు. రెండవది నల్లధనం మొత్తం కూడా నగదు రూపంలో దొంగ నిల్వలుగా లేదు.అధిక భాగం నల్లధనం స్విట్జర్లాండ్‌, పనామా వంటి పన్నులు లేని ప్రాంతాలకు తరలిపోయింది. అక్కడి నుంచి కేవలం తపాల పెట్టె చిరునామా లేదా సూట్‌కేసు కంపెనీల పేరుతో వున్న వాటాల రూపంలో, రియలెస్టేట్‌, బంగారం తదితర రూపాలలో ప్రపంచమంతటికీ పోతోంది. అలాంటి చోట్ల, వివిధ రూపాలలో డబ్బు దాచుకున్న పెద్దలందరూ మోడీ చర్య మంచిదేనని పొగడటమే విషాదం. వారిని వదలి జనానికి ఇబ్బందులు కలుగుతున్నాయని, వాటిని పరిష్కరించాలని కోరుతున్న, విమర్శిస్తున్నవారిని నల్లధనులను బలపరిచేవారిగా బిజెపి, దాని మిత్రపక్షాలు చిత్రిస్తున్నాయి. మన దేశంలోకి విదేశీ పెట్టుబడుల రూపంలో వస్తున్న మొత్తాలలో కూడా నల్లధనం వుంది. ఎంత వంతే అంత ఎర్రతివాచీ పరచి ఆహ్వానించటం తప్ప వాటి మంచి చెడ్డలను కనుగొనేందుకు పాలకులు ప్రయత్నించటం లేదు.

    ఒక గీత పెద్దదా చిన్నదా పెద్దదా అని చెప్పటానికి మరో గీత అవసరం. అలాగే నల్లధనం సమస్య కూడా. షిండర్‌ అంచనా ప్రకారం ఖండాలవారీగా లాటిన్‌ అమెరికా, ఆఫ్రికాలలో నల్లధనం 41-44శాతం మధ్య వున్నది.ఆసియాలో అది 28-30శాతం. అధికారికంగా ప్రకటించిన జిడిపి లెక్కల ప్రకారం 96 అభివృద్ధి చెందుతున్న దేశాల సగటు 38.7శాతం. అదే అంచనా ప్రకారం మన దేశంలో 23-26శాతం మధ్య వుంది. మన దేశానికి వచ్చే విదేశీ పెట్టుబడులలో 35శాతం మారిషస్‌ నుంచి 14శాతం సింగపూర్‌ కంపెనీల పేరుతో వస్తోంది. దీనిలో ఎక్కువ భాగం మన దేశం నుంచి తరలిన నల్లధనమే అని వేరే చెప్పనవసరం లేదు. చైనాకు ఒక్క హాంకాంగ్‌ నుంచే 73శాతం వస్తోంది. అది చైనా నుంచి తరలి వెళ్లిన నల్లధనం అనుకోవచ్చు లేదా హాంకాంగ్‌లో విదేశీయులు దాచుకున్నది కావచ్చు.

   ఇక నకిలీ నోట్ల విషయానికి వస్తే ఇది ప్రపంచవ్యాపిత సమస్య. అమెరికా డాలర్లనే పెద్ద ఎత్తున ముద్రిస్తున్నారు. అయినా డాలర్లను అమెరికా రద్దు చేయలేదు. మన దేశంలో చలామణిలో వున్న నోట్ల మొత్తం 16లక్షల కోట్లు. వాటిలో నకిలీ నోట్లు 400 కోట్లు. అంటే 0.03శాతం. అనేక దేశాలలో వాటి నివారణకు నిరంతరం చర్యలు తీసుకుంటూనే వుంటారు.అనుమానం వచ్చిన సిరీస్‌ నోట్ల వుపసంహరణ వాటిలో ఒకటి.మన దేశంలో కొద్ది నెలల క్రితం ఐదువందల నోట్లపై ముద్రించిన సంవత్సరం వుందా లేదా అని చూసుకోమని జనాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా తెచ్చిన రెండువేలు, ఐదు వందల నోట్లకు సైతం నకిలీలను తయారు చేయటం పెద్ద కష్టమేమీ కాదు. వాటిపై నిరంతర నిఘాతప్ప ఇప్పుడు చేసిన మాదిరి చర్యలు కాదు.

    సోమవారం వారం నాటి నిరసన సమర్ధనీయమా, కాదా అన్న విషయాన్ని పక్కన పెడితే నోట్ల రద్దు చేసిన నాడు వున్న మద్దతు తరువాత క్రమంగా తగ్గిపోయిందన్నది వాస్తవం. ఒక వైపు మోడీని సమర్ధిస్తూనే చేసిన పని బాగాలేదని విమర్శించేవారి సంఖ్య పెరిగింది. ప్రతిపక్షాల విమర్శలకంటే సామాన్యుల్లో వచ్చిన విమర్శనాత్మక స్పందనే బిజెపి వారిని భయపెడుతోంది. దాన్ని దాచుకొనేందుకు నానా పాట్లు పడుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d