• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Narendra Modi

భారత్‌పై బుజ్జగింపులు, వత్తిడి, బెదిరింపులకు దిగిన అమెరికా !

08 Tuesday Mar 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, Narendra Modi, Ukraine-Russia crisis, US imperialism


ఎం కోటేశ్వరరావు
లాహిరి లాహిరిలో ఓహౌ జగమే ఊగెనుగా సాగెనుగా అంటూ సాగుతున్న భారత – అమెరికా ప్రేమ నౌకను ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధం ఒక్క కుదుపు కుదిపింది.ప్రేమ జంట తాత్కాలికంగా వేరు పడింది. జన్మజన్మలకు ఒక్కటిగా ఉందామంటూ చేసుకున్న బాసలను మర్చి పోయి నాతో కలసి రష్యాను ఖండిస్తూ యుగళగీతం పాడేందుకు నిరాకరిస్తావా అంటూ అమెరికా గుర్రుగా ఉంది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మాటల్లేవుగానీ తడిక రాయబారాలు కొనసాగుతున్నాయి.వత్తిడికి తట్టుకోలేక నరేంద్రమోడీ సర్కార్‌ తిరిగి ప్రేమ నౌక ఎక్కుతుందా, మరేమైనా చేస్తుందా ? అసలెందుకు భాగస్వాముల మధ్య ఈ పరిస్ధితి వచ్చిందన్నది ప్రపంచంలో చర్చ జరుగుతోంది. మధ్యలో కొందరు చైనాను లాగుతున్నారు? వారి ఎత్తుగడ ఏమిటి ? ఇలాంటి ప్రశ్నలెన్నింటినో ఉక్రెయిన్‌ – రష్యా వివాదం ముందుకు తెచ్చింది. మరోమాటలో చెప్పాలంటే మన విదేశాంగ విధానం గురించి సరైన దారీ తెన్నూ గురించి తేల్చుకోవాల్సిన అగత్యాన్ని వెల్లడిస్తోంది.


ఈ వివాదంలో మన దేశం ప్రకటించిన తటస్ధ వైఖరి గురించి అంతర్గతంగా రష్యా ఏమనుకుంటోందో ఇంకా తెలియదు, తన వ్యతిరేకులతో చేతులు కలపకపోవటం ఒక రకంగా మేలే అని భావిస్తున్నట్లు దాని సానుకూల స్పందన వెల్లడించింది. మరోవైపు అమెరికా పట్టలేని ఆగ్రహంతో ఉన్నా తన పధకాల్లో మన అవసరాలను గమనంలో ఉంచుకొని తమాయించుకుంటూ బయపడకుండా ఉంది. దాని అధినేత, నరేంద్రమోడీతో పెద్దన్న బైడెన్‌ ఇంతవరకు మాట్లాడలేదు. యుద్ధానికి ముందే కొన్ని నెలల పాటు తమతో గొంతు కలపాలని ఒప్పించేందుకు తమ నేతలు తీవ్ర కసరత్తు చేసినట్లు, యుద్దం ప్రారంభమైన తరువాత మరింతగా ప్రయత్నాలున్నట్లు అధికారయంత్రాంగం చెప్పింది.


పలు వైఫల్యాల కారణంగా ప్రపంచంలో పరువు పోగొట్టుకుంటున్నది అమెరికా. శత్రుదేశాలుగా పరిగణిస్తున్నవాటి మీద మరింతగా దూకుడు పెంచటం ద్వారా నష్టనివారణ, తన మిత్రదేశాల్లో విశ్వాసం పెంపొందించేందుకు దుస్సాహసాలకు పాల్పడుతోంది. గత రెండు దశాబ్దాలుగా భారత్‌ను తన కౌగిట్లోకి తీసుకొనేందుకు పావులు కదిపింది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత కొంత మేరకు సఫలీకృతమైంది.చైనాకు వ్యతిరేకంగా మన దేశాన్ని ముందుకు నెట్టే ఎత్తుగడతో ఒక ప్రాంతీయ కూటమిని ఏర్పాటు చేసేందుకు 2007లోనే చతుష్టయ(క్వాడ్‌) కూటమికి రూపకల్పన చేసినా అది ముందుకు సాగలేదు. మన దేశం చేతులు కాల్చుకొనేందుకు సిద్దం కాకపోవటం ఒక ప్రధాన కారణం.కానీ 2017లో దానికి నరేంద్రమోడీ సిద్దపడటంతో అది అమల్లోకి వచ్చింది. లడఖ్‌ సరిహద్దులోని గాల్వన్‌ ఉదంత రూపంలో దాని పర్యవసానాలను చూశాము.


ఇప్పుడు ఉక్రెయిన్‌ – రష్యా పరిణామాలను ఆసరా చేసుకొని అమెరికా, మన దేశంలోని దాని మద్దతుదారులు మరోసారి చైనాను ఒక బూచిగా చూపేందుకు పూనుకున్నారు.ఆసియాలో ఆధిపత్యానికి చైనా పూనుకున్నదనే అమెరికా ప్రచారాన్ని మరో రూపంలో ముందుకు తెస్తున్నారు. రష్యా మనకు తరతరాలుగా మిలిటరీ సాయం అందిస్తున్నది. దాన్ని వదులుకుంటే మన జుట్టు అమెరికా వాడి చేతికి చిక్కుతుందనే భయమూ, వారి పాతబడిన ఆయుధాలు కొనుగోలు చేయటం కంటే రష్యా గతంలో ఇచ్చిన వాటిని నవీకరించుకోవటం మెరుగు అనే అభిప్రాయమూ ఉంది. రష్యాను చూపి కొత్త వాటిని ఇస్తారా లేదా అని అమెరికాతో బేరమాడేందుకూ కావచ్చు, ఇలా అనేక అంశాలున్నాయి. మనం కావాలన్న క్షిపణి రక్షణ వ్యవస్ధలను ఇచ్చేందుకు అమెరికా సిద్దం కాదు. రష్యా గతంలో ఇస్రోకు క్రయోజనిక్‌ ఇంజన్లు, వాటి పరిజ్ఞానం అందచేసింది. మనతో కలసి బ్రహ్మౌస్‌ అనే ఆధునిక క్షిపణులు, బహుళ ప్రయోజనాలకు అవసరమైన విమానాల రూపకల్పన, ఎకె రకం తుపాకుల తయారీ వంటి అంశాల్లో భాగస్వామిగా ఉంది. అమెరికా మబ్బుల్లో నీళ్లు చూసి రష్యా ముంతలోని నీళ్లు పారబోసుకుంటే జరిగేదేమిటో మనకు తెలుసు. అందుకే అమెరికా బెదిరించినా ఎస్‌-400 అనే రష్యా క్షిపణి వ్యవస్ధలను కొనుగోలు చేశాము. ఇన్ని కారణాలతో ఉక్రెయిన్‌ కోసం రష్యాను కాదని అమెరికా చంకనెక్కి దాని పాటపాడేందుకు మనం సిద్దం కాలేదు.


ఈ విషయాలు చెప్పుకొనేందుకు మన పాలక ప్రభువులు, మీడియాకు భయం, ఎందుకంటే అమెరికా ఆగ్రహం మరింత పెరుగుతుందేమోననే దడ. దాన్ని కప్పి పుచ్చి చైనా ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే రష్యా అవసరం కనుక తటస్ధంగా ఉండి దాన్ని దగ్గర చేసుకొనేందుకు పూనుకున్నామని చెప్పేవారు తయారయ్యారు. అమెరికన్లు ఇప్పుడు పుతిన్‌ బూచిని చూపి మనలను వారి చంకనెక్కమంటున్నారు. దక్షిణాసియా వ్యవహారాల అమెరికా విదేశాంగశాఖ సహాయ మంత్రి డోనాల్డ్‌ లు తమ ఎంపీలతో మాట్లాడుతూ అమెరికా-భారత్‌ మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేందుకు ప్రతి రోజూ పని చేస్తున్నామని, పుతిన్‌కు అడ్డుకట్టవేయకపోతే చైనా మరింత రెచ్చిపోతుందని, ఉక్రెయిన్‌లో జరుగుతున్నదానితో చైనా ప్రవర్తన ప్రభావితం అవుతుందని, అది భారత్‌కు అర్ధంకావాలి. ” అన్నాడు.ఇప్పటి వరకు ఐరాసలో మన దేశం నాలుగు సార్లు తటస్ధంగా ఉంది.


ఒక స్పష్టమైన వైఖరి (అంటే తమబాటలో నడిచే) తీసుకోవాలని అమెరికా కోరుతోంది. కొద్ది నెలలుగా మన మీద బుజ్జగింపులు, వత్తిడికి దిగిన అమెరికన్లు ఇప్పుడు బెదిరింపులకూ పాల్పడ్డారు. ” ఇప్పుడు రష్యాకు మరింతదూరంగా భారత్‌ జరగాల్సిన తరుణం ఆసన్నమైంది.లేనట్లయితే తమ ” కాట్సా ” చట్టం (తమ ప్రయోజనాలకు భంగం కలిగితే ఏ దేశం మీదనైనా ఆంక్షలు విధించవచ్చని అమెరికా రూపొందించుకున్న స్వంత చట్టం ) కింద గతంలో ఇచ్చిన మినహాయింపులను ఉపసంహరించుకొనే అంశాన్ని బైడెన్‌ పరిశీలిస్తారని ” డోనాల్డ్‌ లు బెదిరించాడు.ఆంక్షలను ధిక్కరించి రష్యా నుంచి 543 కోట్ల డాలర్ల ఎస్‌-400 క్షిపణి వ్యవస్ధల కొనుగోలుకు 2018లో ఒప్పందం చేసుకున్నాము. అప్పటి అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మన మీద ” కాట్సా” తో వేటు వేస్తానని బెదిరించినా వెనక్కు తగ్గాడు. తరువాత అదే ట్రంప్‌ను అమెరికా వెళ్లి మన నరేంద్రమోడీ కౌగిలింతలతో ముంచెత్తి ట్రంప్‌ మరోసారి అధికారంలోకి రావాలని ఒక సభలో ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు ఆ మినహాయింపు గురించి జోబైడెన్‌ బెదిరిస్తున్నాడు.


అంతేకాదు భారత అధికారులను మందలించాలని, ఐరాసలో పదే పదే చర్చలు జరపాలని కోరటం, తటస్ధ వైఖరి అవలంభించటం అంటే రష్యా శిబిరంలో ఉన్నట్లే అన్న ముద్రవేయాలని అమెరికా తన దౌత్యసిబ్బందికి పదునైన పదజాలంతో వర్తమానం పంపింది. దాన్ని కావాలనే లీకు చేసింది. రష్యాకంటే భారత్‌ మనకు దగ్గరగా ఉన్నందున ఇలాంటి పని చేస్తే తీరా అది వ్యతిరేక ఫలితాలనిస్తుందేమో అన్న భయం కొందరిలో పట్టుకుందని వార్తలు వచ్చాయి. ఈ సమస్యకారణంగా చైనాపై భారత్‌-అమెరికా వ్యూహాత్మక ఐక్యతకు భంగం కలిగించకూడదని, అమెరికా ప్రయోజనాల రీత్యా భారత్‌తో సంబంధాలు కొనసాగించటం ముఖ్యమని చెబుతున్నవారు కూడా ఉన్నారు. మన దేశం ఇప్పుడు ఉక్రెయిన్‌ అంశంలో తటస్ధంగా ఉన్నట్లే భారత్‌-చైనా వివాదంలో బహిరంగంగా, నిర్ణయాత్మకంగా చైనా వైపు రష్యా ఉండకుండా చూసుకోవాలన్నది కొందరి సలహా.


ఇస్లామాబాద్‌లోని 22 మంది విదేశీ రాయబారులు ఒక బహిరంగ సంయుక్త లేఖను విడుదల చేశారు. రష్యా చర్యను ఐరాసలో ఖండించాలని వారు పాకిస్తాన్ను కోరారు. దీని మీద ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మండిపడ్డాడు. మీరు చెప్పినట్లు చేసేందుకు మేమేమైనా బానిసలం అనుకుంటున్నారా, మా గురించి ఏమనుకుంటున్నారు ? ఇలాంటి లేఖను మీరు భారత్‌కు రాశారా అంటూ ఐరోపా దేశాల రాయబారులపై ధ్వజమెత్తాడు. తమకు అమెరికా, రష్యా, చైనా, ఐరోపా అందరూ కావాల్సినవారే, స్నేహితులే, ఏ శిబిరంలోనూ మేము ఉండం అన్నాడు. మన దేశానికి లేఖ రాసిందీ లేనిదీ బహిరంగం కాలేదు గాని ఢిల్లీలోని విదేశీ దౌత్యవేత్తలు కొందరు ఉక్రెయినుకు మద్దతుగా ఒక సమావేశం నిర్వహించారు. దాని మీద మన దేశం ఎలాంటి అభ్యంతరమూ వెల్లడించలేదు.


ఉక్రెయినుపై భారత్‌ అనుసరిస్తున్న గడసాము వైఖరి సంతృప్తికరంగా లేదని, ఆ దేశం నిశిత పరిశీలనను ఎదుర్కోవాల్సి ఉంటుందని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక రాసింది. ఇది అమెరికా అంతరంగంగా చెప్పవచ్చు.ఇదీ బెదిరింపే. ఒక వేళ అమెరికా వత్తిడి ఫలించినా, భారత్‌ రాజీపడటం కష్టమని, కొన్ని స్వల్పమార్పులు మాత్రమే ఉండవచ్చని, బహిరంగంగా రష్యాను విమర్శించలేకపోవచ్చని చైనా నిపుణులు చెప్పారు. అమెరికా తన అవసరాలకు అనుగుణంగా చదరంగంలోని పావుల్లా దేశాలను వాడుకోవాలని చూస్తోందన్నది అనేక దేశాలు గుర్తిస్తున్నాయి. మెక్సికో, టర్కీ తాము రష్యాపై ఎలాంటి ఆర్ధిక ఆంక్షలను అమలు జరపబోమని ప్రకటించగా బ్రెజిల్‌, పనామా, అర్జెంటీనా, బలీవియా వంటివి ఖండించేందుకు తిరస్కరించాయి.


రష్యా ఇప్పుడు సోషలిస్టు దేశమూ కాదు, పుతిన్‌ కమ్యూనిస్టూ కాడు. సోవియట్‌ విడిపోయిన తరువాత రష్యా అనేక సమస్యలను ఎదుర్కొన్నది, ఆర్ధికంగా బలహీనపడింది. ఇదే అమెరికా, ఇతర ధనిక దేశాలు తమ జి7 బృందాన్ని విస్తరించి రష్యాను కలుపుకొని జి8గా వ్యవహరించిన రోజులు ఉన్నాయి. అది ఆర్ధికంగా బలపడటం ప్రారంభం కావటం, నాటో విస్తరణ పేరుతో దాని ముంగిటకు తన సైన్యాలు, ఆయుధాలను తరలించాలని ఎప్పుడైతే చూసిందో అప్పటి నుంచి రెండు దేశాలు దూరం కావటం, జి8 నుంచి రష్యాను తొలగించటం తెలిసిందే. ఇదే సమయంలో ఆర్ధికంగా ఎదుగుతున్న చైనాను చూసి కూడా అమెరికాకు దడపట్టుకుంది. ఈ రెండు దేశాలను దెబ్బతీయాలని ఒకేసారి పావులు కదుపుతోంది. వీటికి వ్యతిరేకంగా మన దేశాన్ని, జపాన్‌, ఆస్ట్రేలియాలను ముగ్గులోకి దించేందుకు పూనుకుంది. అందువలన రష్యా పెట్టుబడిదారీ దేశమైనా, చైనా సోషలిస్టు వ్యవస్ధ కలదైనా ఉమ్మడి శత్రువుగా అమెరికా కూటమి ముందుకు వస్తున్నందున ఇప్పుడున్న బలాబలాల్లో రెండూ కలిసి ఎదుర్కోవాల్సిన అగత్యాన్ని గుర్తించి ముందుకు పోతున్నాయి. ఇది శాశ్వతమా అంటే చెప్పలేము. రెండవ ప్రపంచ యుద్దంలో సోవియట్‌ నేత స్టాలిన్‌ నాజీ హిట్లర్‌తో ఒప్పందం చేసుకున్నాడు, అదిశాశ్వతంగా ఉండదని ఇద్దరికీ తెలుసు. రష్యా గత మూడుదశాబ్దాలుగా తన ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నది. ఇంతవరకు ఏ దేశాన్నీ ఆక్రమించేందుకు పూనుకున్న ఉదంతాలు లేవు. సిరియా వంటి చోట్ల అమెరికా కూటమికి వ్యతిరేకంగా ఉంది. రష్యా-చైనాల మధ్య 4,209 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. వివాదాల్లేకపోతే అంత పొడవున సాధారణ మిలిటరీ కార్యకలాపాతో సరిపెట్టుకోవచ్చు. అదే ఉద్రిక్తతలు ఉంటే పెద్ద మొత్తంలో వనరులు ఖర్చు. ఆ మొత్తాన్ని ఇప్పుడు చైనా అభివృద్ది కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చు.భవిష్యత్‌లో సమస్యవస్తే అప్పుడు ఎలాగూ తప్పదు.


ఈ వివాదంలో మన దేశం తీసుకుంటున్న వైఖరి గురించి ప్రతిపక్ష పార్టీలకు ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు వివరించలేదు అన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఐరాసలో తటస్ధతను ప్రకటించటాన్ని ప్రతిపక్ష పార్టీలేవీ విమర్శించలేదు. ఆపరేషన్‌ గంగ మీద వచ్చిన విమర్శలకు విదేశాంగ విధానానికి సంబంధం లేదు.స్వతంత్ర వైఖరిని తీసుకోవాల్సిన తరుణం వచ్చింది. చైనా, పాకిస్తాన్‌లను బూచిగా చూపి అమెరికా వత్తిళ్లకు లొంగుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

దడ పుట్టిస్తున్న చమురు ధరలు – నరేంద్రమోడీ జనం గురించి పట్టించుకుంటారా ?

03 Thursday Mar 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, crude oil price, Fuel Price in India, Fuel prices freezing, Narendra Modi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు గురువారం నాడు మరో మెట్టు ఎక్కాయి. ఇది రాసిన సమయానికి బ్రెంట్‌ రకం పీపా ధర 116.94 డాలర్లను తాకింది. వ్యూహాత్మక నిల్వల నుంచి 60మిలియన్ల పీపాల చమురును మార్కెట్లోకి విడుదల చేయాలని అంతర్జాతీ ఇంధన సంస్ధ(ఐఇఏ) మంత్రుల సమావేశం ప్రకటించిన తరువాత కూడా మార్కెట్లో ధరలు పెరిగాయి. ఈ మొత్తంలో తాము 30మిలియన్ల పీపాలు విడుదల చేస్తామని అమెరికా పేర్కొన్నది. అరవై మిలియన్ల పీపాలు ఐఇఏలోని 31 దేశాల నిల్వల్లో నాలుగుశాతం. ఈ దేశాల్లో 1.5బిలియన్ల పీపాలు ఉంటే ఒక్క అమెరికాలోనే 600మి. పీపాలుంది. మార్కెట్‌ ఇబ్బందుల్లో పడిన ప్రతికూల సందేశాన్ని సందేశాన్ని ఈ నిర్ణయం పంపిందని, అరవై మిలియన్లన్నది చమురు పీపాలో ఒకబొట్టు వంటిదని, ప్రపంచంలో ఒక రోజుకు అవసరమైన 100మి. పీపాల గిరాకీ కంటే తక్కువంటూ ఇది చమురు ధరలపై ప్రభావం ఎలా చూపుతుందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఆంక్షల కారణంగా మార్కెట్లోకి రష్యానుంచి రోజుకు ఏడు మిలియన్‌ పీపాల సరఫరా నిలిచిపోనుంది. ఆంక్షలున్నప్పటికీ తమ కొనుగోళ్లు కొనసాగుతూనే ఉంటాయని చైనా ప్రకటించింది. గోధుమల దిగుమతులపై గతంలో ఉన్న పరిమితులను కూడా ఎత్తివేస్తున్నట్లు తెలిపింది.


ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలతో నిమిత్తం లేకుండానే అమెరికాలో నాలుగుదశాబ్దాల రికార్డు స్ధాయిలో 7.5శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. ఇప్పుడు చమురు ధరల పెరుగుదల తోడైంది. కొందరి అంచనా ప్రకారం 125 డాలర్లకు పెరిగితే అమెరికా ఏకంగా మాంద్యంలోకి దిగజారుతుంది. ఐరోపా దేశాలకు చమురు, గాస్‌ అవసరం కనుక రష్యా నుంచి వాటి ఎగుమతులపై ఆంక్షలను మినహాయించారు, లేనట్లయితే ఐరోపాలో మరోరకం సంక్షోభం తలెత్తి ఉండేది.ఐరోపా దేశాలు మరిన్ని ఆంక్షలను విధించినట్లయితే తనకు మరింత నష్టమైనా రష్యా చమురు, గాస్‌ నిలిపివేత అస్త్రాన్ని ప్రయోగించవచ్చు. ఈ కారణంగానే స్విఫ్ట్‌( అంతర్జాతీయ బాంకు లావాదేవీల వ్యవస్ధ) నుంచి ఏడు రష్యన్‌ బాంకులకు ఆంక్షల నుంచి పశ్చిమ దేశాలు మినహాయింపునిచ్చాయి. ఉక్రెయిన్‌ వివాదం వలన ఇంధన ధరలు పెరిగితే అది ద్రవ్యోల్బణానికి దారితీసి అమెరికా ఆర్ధిక పురోగతి, పౌరుల ఖర్చు తగ్గేందుకు దారి తీస్తుందని రిచ్‌మండ్‌ ఫెడరల్‌ రిజర్వు అధ్యక్షుడు టామ్‌ బార్కింగ్‌ హెచ్చరించాడు.ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ సగటున చమురు ధరలు వంద డాలర్లు ఉంటే అమెరికా ఆర్ధిక రంగం ఆరునెలల పాటు నిభాయించుకోగలదని, 125 డాలర్లకు పెరిగితే నిరుద్యోగం పెరుగుతుందని, వృద్ధి ఆగుతుందని ఆర్ధికవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జో బైడెన్‌ సైతం ఉక్రెయిన్‌ వివాదానికి అమెరికన్లు మూల్యం చెల్లించాల్సి రావచ్చని చెప్పిన అంశం తెలిసిందే.ఐరోపాలో గాస్‌ ధరలు 60శాతం పెరిగాయి. చలికాలంలో మరింతగా పెరగవచ్చని భావిస్తున్నారు. రష్యాకు వెసులుబాటు కల్పించేందుకు ఇరు దేశాల మధ్య తమ కరెన్సీలో చెల్లింపులకు చైనా ఏర్పాట్లు చేసింది.ఈ అనుభవం భవిష్యత్‌లో అంతర్జాతీయ మార్పిడి కరెన్సీగా డాలర్‌ను పక్కకు నెట్టేందుకు కూడా తోడ్పడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం డాలర్‌ చెల్లింపులు 40శాతం ఉండగా చైనా కరెన్సీ రెన్‌మిన్‌బీ(యువాన్‌) రెండుశాతం జరుగుతున్నాయి.


2022-23 ఆర్ధిక సంవత్సరంలో ముడి చమురు పీపా ధర 70-75 డాలర్ల మధ్య ఉంటుందనే అంచనాతో కేంద్ర బడ్జెట్‌ను ప్రతిపాదించారు. మార్చి నెలాఖరుతో ముగియనున్న ఆర్ధిక సంవత్సరంపై పెరిగిన చమురు ధరలు ప్రభావం చూపటం ప్రారంభమైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం పెట్రోలు, డీజిలుపై సెస్‌లను ఐదు, పది చొప్పున తగ్గించటంతో పాటు నవంబరు నాలుగవ తేదీ నుంచి వాటి ధరలను స్ధంభింప చేశారు.ఈ నెల ఏడవ తేదీన చివరి దశ పోలింగ్‌ ముగిసిన తరువాత నుంచి చమురు ధరలు పెరగటం ఖాయం. రానున్న రోజుల్లో జిడిపి వృద్ధి తగ్గటంతో పాటు ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ఎంకి పెళ్లి సుబ్చి చావుకు వచ్చిందన్నట్లుగా ఉక్రెయిన్‌ – రష్యా వివాదంతో మనకు ప్రమేయం లేనప్పటికీ దాని పర్యవసానాలను అనుభవించాల్సి వస్తోంది. మన దిగుమతుల బిల్లు తడిచి మోపెడు అవుతోంది.దీంతో మన కరెంటు ఖాతాలోటు పెరుగుతోంది. ముడిచమురు, ఎరువులు, ఖాద్య, ఖనిజతైలాలు, ఇతర దిగుమతుల ధరలు పెరుగుతున్నాయి. దిగుమతుల బిల్లు 2022లో 600బి. డాలర్లు దాటవచ్చని అంచనా. తక్షణం ద్రవ్యోల్బణం, దానితో పాటు వచ్చే ధరల పెరుగుదల, రూపాయి విలువ పతనం జరగవచ్చు. ఒక పీపా ధర ఐదు డాలర్లు పెరిగితే మన కరెంటు ఖాతాలోటు 6.6బి.డాలర్లు పెరుగుతుంది. ముడి చమురు ధర 105 డాలర్లకు అటూ ఇటూగా ఉన్నప్పటి అంచనాల ప్రకారం మార్చి ఎనిమిది తరువాత చమురు కంపెనీలు పెట్రోలు, డీజిలు ధరలను పది రూపాయల వరకు పెంచవచ్చని అంచనా. ఇప్పుడు 117 డాలర్ల వరకు తాకింది. ఇది ఇతర వస్తువుల ధరల పెరుగుదలకు దోహదం చేస్తుంది. మన ఎగుమతుల మీద కూడా ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఈ ఏడాది తొలి ఆరునెలల పాటు చమురు ధరలు వంద డాలర్లకు ఎగువనే ఉంటాయని భావిస్తున్నారు. ఈ ఏడాది మొత్తంగా దేశ ప్రగతి నిస్తేజంగా ఉంటుందని ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ విశ్లేషకులు చెప్పారు.


జాతీయ గణాంకాల సంస్ధ(ఎన్‌ఎస్‌ఓ) 2021-22లో వృద్ధి రేటు అంతకు ముందు సంవత్సరంలోని 7.3శాతం తిరోగమనాన్ని అధిగమించి 9.2శాతం పురోగమనం ఉంటుందని అంచనా వేసింది. తాజాగా తొమ్మిది నెలల తరువాత దాన్ని8.9శాతానికి తగ్గించింది. తొలి మూడు మాసాల్లో 20.3 శాతంవృద్ధి కాస్తా రెండవ త్రైమాసికంలో 8.4శాతానికి తగ్గింది.తదుపరి మూడు నెలల్లో 5.4శాతంగా ఉందని అంచనా వేశారు. చమురు ధరల పెరుగుదల గణనీయంగా ఉన్న జనవరి-మార్చి నెలల గణాంకాలు వెల్లడైతే స్పష్టమైన అంచనాలు తెలుస్తాయి. ఈ వృద్ధి కూడా గతేడాది తగ్గిన దాని ప్రాతిపదికన చెబుతున్న లెక్క కనుక వాస్తవ వృద్ధి రేటు అంత ఉండదు. అందుకే గతంలో ఉన్న జిడిపి స్దాయికి చేరాలంటే దీర్ఘకాలం పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. రిజర్వుబాంకు వడ్డీ రేట్లను తక్కువగా ఉంచినప్పటికీ వృద్ది రేటు ఆందోళనకరంగా ఉంది. ద్రవ్యోల్బణం మరింతగా పెరిగేట్లయితే వడ్డీ రేట్లు పెరుగుతాయి, అది మరొక సమస్యకు దారి తీస్తుంది.


వినియోగదారుల ధరల సూచిక (సిపిఐ) ప్రాతిపదికన ద్రవ్యోల్బణం ఆరుశాతం వరకు మనం భరించగలమని రిజర్వుబాంకు అన్నది. అంటే ఆ మేరకు ధరలు పెరుగుతాయని సిద్దంకమ్మని జనానికి చెప్పింది.డిసెంబరులో 5.59శాతం ఉన్నది జనవరిలో 6.01శాతానికి పెరిగింది. ఇదే తరుణంలో టోకు ధరల ద్రవ్యోల్బణం దాదాపు 13శాతంగా ఉంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచిక కూడా పదినెలల కనిష్టానికి పడిపోయింది. మన దేశంలో ప్రయివేటు వినియోగం 55శాతం ఉంది. ఇది కరోనాకు ముందున్న స్దాయికంటే తక్కువే. కరోనా మహమ్మారి జనాల పొదుపు మొత్తాలను, గణనీయంగా వేతనాలను హరించివేసినందున వినియోగం బలహీనంగా ఉంది. పులిమీద పుట్రలా దీనికి ఉక్రెయిన్‌ వివాదం మరింత ముప్పు తెచ్చింది. జనంపై పెరిగే భారాల గురించి ఏం చేద్దామన్న అంశాన్ని చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోడీ పూనుకున్నారని గానీ, సమీక్షలు జరిపినట్లుగా ఎక్కడా వార్తలు లేవు. చేతులు కాలిన తరువాత ఆకలు పట్టుకున్నట్లు ఆపరేషన్‌ గంగ పేరుతో ఉక్రెయిన్లో చిక్కుకు పోయిన మన విద్యార్దుల గురించి ఎక్కడలేని శ్రద్ద చూపుతున్నట్లు సమావేశాల మీద సమావేశాలు జరుపుతున్నట్లు ప్రకటిస్తున్నారు, మంచిదే, ఇవాళా రేపట్లో అది కూడా పూర్తి అవుతుంది. తరువాతనైనా జనం గురించి పట్టించుకుంటారా ?చమురు ధరలు తగ్గితే ఆ మేరకు జనానికి ఉపశమనం కలిగించకుండా వందల రెట్లు పన్ను, సెస్‌లు పెంచి ఖజానా నింపుకొనేందుకు చూపిన వేగం ఇప్పుడు చమురు ధరలు పెరుగుతుంటే భారం తగ్గించేందుకు కనపరచరేం ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

తరువాత వంతు తైవాన్‌దే అంటూ తప్పుడు ప్రచారం – జలసంధిలో అమెరికా యుద్ద నౌక !

27 Sunday Feb 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ 1 Comment

Tags

BJP, China, Narendra Modi, Propaganda War, RSS, Taiwan Next propaganda, US warship transit in Taiwan Straits


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌ తరువాత వంతు తైవాన్‌దే అంటూ అంతర్జాతీయ మీడియా మరోసారి కథనాలను వండి వడ్డిస్తోంది. గతంలో హాంకాంగ్‌ వేర్పాటువాదులపై చైనా చర్య తీసుకోగానే ఇంకేముంది తరువాత వంతు తైవాన్‌దే అంటూ ఇలాంటి ఊహాగానాలే రాసింది. ఒకవైపు తన కనుసన్నల్లో పని చేసే మీడియా ఇలాంటి కథనాలను రాయిస్తూ మరోవైపు చైనాను రెచ్చ గొట్టేందుకు తైవాన్‌ జలసంధిలో శనివారం నాడు అమెరికా తన యుద్ధ నౌక రాల్ఫ్‌ జాన్సన్ను నడిపింది. అంతర్జాతీయ జలాల్లో నౌకలను నడిపే హక్కు తమకుందని అమెరికా చెప్పటంతో పాటు తైవాన్‌కు మద్దతుగా తామున్నామనే సందేశాన్నివ్వటం దీనిలో ఉంది. ఈ నౌక మామూలుగానే అటువచ్చినట్లు కనిపిస్తున్నా చెడు సంకేతాలను ఇచ్చిందని చైనా నిపుణులు చెప్పారు. ఈ నౌకను అనుసరిస్తూ ఒక అమెరికా నిఘావిమానం కూడా చక్కర్లు కొట్టింది. చైనా వైపు నుంచి ఉన్న కదలికలు, చర్యలను కనిపెట్టటమే దాని లక్ష్యం. డిసెంబరు, జనవరి మాసాల్లో కూడా అమెరికా నౌకలు ఇదే మాదిరి రాకపోకలు సాగించాయి. ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబాన్ల చేతిలో పరాభవం తరువాత తాము ఒకేసారి రెండు రంగాల్లో సత్తా చూపగలమని ప్రపంచానికి చాటేందుకు అమెరికా పూనుకుంది.దానిలో భాగంగానే ఉక్రెయినుకు ఆయుధాలు ఇచ్చింది. ఇటు చైనాను రెచ్చగొట్టేందుకు ఇలాంటి కవ్వింపు చర్యలు, తప్పుడు ప్రచారానికి పూనుకుంది.ఐరోపాలో ఆరవ, ఐరోపా కమాండ్‌ నౌకాదళాలను దించితే చైనాను బెదరించేందుకు ఇండో-పసిఫిక్‌ సముద్రంలో సప్తమ నౌకాదళాన్ని మోహరించింది.


ఆఫ్ఘనిస్తాన్‌లో పరాభవంతో అమెరికా బలహీనత ఏమిటో ప్రపంచానికి స్పష్టమైంది. ఇప్పుడు కొండంత రాగం తీసి కీచుమన్నట్లు ఉక్రెయిన్లో వ్యవహరించిన తీరు దాని డొల్లతనాన్ని(దీని అర్ధం అమెరికా పూర్తిగా బలహీనపడింది అని కాదు) వెల్లడించింది. దాని దగ్గర ఎన్ని అణ్వాయుధాలు, ఆధునిక జెట్‌, యుద్ద విమానాలు, క్షిపణులు ఉన్నా తమను నమ్ముకున్న వారిని నట్టేట ముంచి తన ప్రయోజనం తాను చూసుకుంటుందని స్వయంగా నిరూపించుకుంది. మరొక దేశం చేతులు కాల్చుకోకుండా ఒక గుణపాఠం నేర్పింది. తాను ఆడించినట్లు ఐరోపా ధనిక దేశాలు ఆడవన్న వాస్తవాన్ని ప్రపంచం చూసింది. ఉక్రెయిన్‌ యుద్దం ముగిసిన తరువాత చైనా, రష్యా మరింతగా అమెరికా, దాని మిత్రపక్షాల మీద వత్తిడి పెంచుతాయి.దాని కూటములు బీటలు వారతాయని, రాజగురుత్వం పలుచనవుతుందనే విశ్లేషణలు ఇప్పటికే వెలువడ్డాయి.


ఇక తదుపరి వంతు తైవాన్‌దే అనే ప్రచారం ప్రారంభమైంది. ఉక్రెయిన్‌ ఉదంతాన్ని చూసిన తరువాత తైవాన్ను విలీనం చేసుకొనేందుకు చైనా గనుక బలప్రయోగానికి పాల్పడితే ఇక్కడికి కూడా అమెరికా తన దళాలను పంపదా అంటూ ఊహాగానాలు రాస్తున్నారు. ఇది విలీనాన్ని మరింత క్లిష్టతరం గావించే ఎత్తుగడలో భాగం. అసలు ఉక్రెయిన్‌ సమస్యకు, తైవాన్‌, హాంకాంగ్‌లకు సంబంధమే లేదు. చైనా గురించి రాస్తున్న పశ్చిమ దేశాల మీడియా కాశ్మీరు గురించి ఎందుకు మౌనంగా ఉన్నట్లు ? అది తైవాన్‌ కంటే ముందే తలెత్తింది. ఈ దశలో నరేంద్రమోడీ సర్కార్‌ను చర్చలోకి లాగితే అమెరికా, పశ్చిమ దేశాలకే నష్టం కనుకనే వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ఆక్రమిత కాశ్మీరును స్వాధీనం చేసుకుంటామని, అవసరమైతే మిలిటరీ చర్యకు పూనుకుంటామని కూడా బిజెపి పదే పదే చెప్పింది. కేంద్ర మంత్రులు అమిత్‌ షా, ఇతరులు కూడా కాశ్మీరు గురించి మాట్లాడటం అంటే ఆక్రమిత కాశ్మీరు స్వాధీనం గురించే అని చెప్పారు. ఆక్రమిత కాశ్మీరు మన దేశ అంతర్భాగమే అన్నది నిస్సందేహం.


పాకిస్ధాన్‌ – భారత్‌ మధ్య కాశ్మీరు అనే స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసి భారత్‌, చైనాలను దెబ్బతీసే కుట్రకు అమెరికా, బ్రిటన్‌ తెరతీశాయి. అందుకే కాశ్మీరును ఆక్రమించుకొనేందుకు దేశవిభజన తరువాత పాకిస్తాన్ను పురికొల్పాయి. దానిలో భాగంగానే కాశ్మీరు ఒక స్వతంత్రదేశం కనుకనే దాన్ని తమలో విలీనం చేసుకోలేదని ఆజాద్‌ కాశ్మీర్‌ (స్వతంత్ర కాశ్మీరు) అని పాక్‌చేత చెప్పించటమే కాదు, పాకిస్తాన్‌లో విలీనం చేయకుండా దాని పర్యవేక్షణలో ఒక ప్రత్యేక ప్రాంతంగా ఉంచారు. అందుకే పాక్‌ పార్లమెంటులో కూడా అక్కడి నుంచి ప్రాతినిధ్యకల్పించలేదు. అమెరికా, ఇతర ఐరోపా దేశాలు తమ దుష్టపధకంలో భాగంగా కాశ్మీరును భారత ఆక్రమిత ప్రాంతమని వర్ణిస్తాయి. ఇటీవల అమెరికా మనతో మిత్రత్వం నెరపుతోంది కనుక చిల్లికాదు తూటు అన్నట్లు భారత పాలిత అని చెబుతున్నాయి తప్ప మన అంతర్భాగంగా ఇప్పటికీ గుర్తించటం లేదు. దానికి ప్రతిగా మన దేశం కాశ్మీరు మన అంతర్భాగమని ప్రకటించింది. ఆక్రమిత కాశ్మీరు కూడా ఎప్పటికైనా విలీనం కావాల్సిందేనని, ఆ ప్రాంతానికి కాశ్మీరు అసెంబ్లీలో కొన్ని స్దానాలను కూడా కేటాయించింది. ఆక్రమిత్‌ కాశ్మీరును వెనక్కు తీసుకురావటంలో కాంగ్రెస్‌ విఫలమైందని, తాము అధికారానికి అధికారానికి వస్తే ఆ పని చేసి చూపుతామని బిజెపి చెప్పిన అంశం తెలిసిందే.


ఉక్రెయిన్‌ మాదిరి తైవాన్‌ గురించి ఇటీవలి కాలంలో ఎక్కడైనా చర్చ జరిగిందా ? రష్యా మాదిరి చైనా తన మిలిటరీని మోహరించిందా అంటే లేదు. ఉక్రెయిన్‌పై ఫిబ్రవరి 16న రష్యా దురాక్రమణకు పాల్పడనున్నదని అమెరికా చెప్పింది. అలాంటి గడువులను తైవాన్‌ అంశంలో చెప్పలేదు. మరి అమెరికన్‌ మీడియా తదుపరి తైవానే అంటూ ప్రచారం ఎందుకు మొదలు పెట్టినట్లు ? చైనాను రెచ్చగొట్టటం, ప్రపంచదృష్టిని మరల్చటం తప్ప మరొకటి కనిపించటం లేదు.


తైవాన్‌, హాంకాంగ్‌, మకావో దీవులు చైనాలో అంతర్భాగాలు అన్నది ఐరాసతో పాటు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలన్నీ అంగీకరించినదే. తైవాన్‌కు ఐరాస గుర్తింపులేదు. అక్కడి జనాలకు ఆమోదమైనపుడు చైనాలో విలీనం జరగాలని అమెరికా చెబుతున్నది. అదే సమయంలో స్వాతంత్య్రం కావాలంటూ కొందరితో నాటకం ఆడిస్తూ పరోక్షంగా ప్రోత్సహిస్తున్నది, జెట్‌ విమానాలతో సహా అన్ని రకాల ఆయుధాలను అందిస్తున్నది.బ్రిటన్‌ కౌలు గడువు తీరగానే 1997లో హంకాంగ్‌ , పోర్చుగీసు కౌలు గడువు తీరగానే మకావూ దీవులు1999లో చైనా ఆధీనంలోకి వచ్చాయి. ఈ రెండు ప్రాంతాల్లోని వ్యవస్ధలను 50 సంవత్సరాల పాటు కొనసాగనిస్తామని చైనా ఒప్పందం చేసుకుంది. అందువల్లనే అవి ప్రత్యేక పాలిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఇక 1949లో కమ్యూనిస్టులు దీర్ఘకాల సాయుధ పోరాటం తరువాత చైనాలో అధికారానికి వచ్చినపుడు అధికారంలో ఉన్న చాంగ్‌కై షేక్‌ మొత్తం నాటి మిలిటరీ, ఆయుధాలన్నింటినీ తైవాన్‌ దీవికి తరలించి అక్కడ తిష్టవేశాడు. దాన్ని కాపాడేందుకు అప్పుడే అమెరికా, బ్రిటన్‌ అన్ని రకాల సాయం అందించి పటిష్టపరిచాయి. మిగతా దేశంలో అధికారాన్ని సుస్దిరం చేసుకున్న తరువాత తైవాన్‌ సంగతి చూద్దాంలెమ్మని కమ్యూనిస్టులు కేంద్రీకరించారు. అదే సమయంలో అమెరికా ఎత్తుగడలో భాగంగా అప్పటికే భద్రతామండలిలో శాశ్వత సభ్యదేశంగా ఉన్న చైనాకు అసలైన ప్రతినిధిగా ఐరాసలో చాంగ్‌కై షేక్‌ ప్రభుత్వాన్నే గుర్తించి తైవాన్‌ కేంద్రంగా ఉన్న పాలకులు నియమించిన అధికారులనే అనుమతించారు.1970దశకం వరకు అదే కొనసాగింది. తరువాత అమెరికా-కమ్యూనిస్టు చైనా మధ్యకుదిరిన ఒప్పందం మేరకు అసలైనా చైనాగా ప్రధాన భూభాగాన్ని గుర్తించారు. అంతకు ముందు ఒకే చైనా ఉంది కనుక తరువాత కూడా తైవాన్‌తో సహా అంతా ఒకే చైనా అని కూడా గుర్తించాల్సి వచ్చింది. అప్పటి నుంచి తైవాన్ను బలవంతంగా చైనాలో విలీనం చేయకూడదనే కొత్త పల్లవి అందుకున్నారు.హాంకాంగ్‌ అంశానికి వస్తే 99 సంవత్సరాల పాటు బ్రిటన్‌ ఏలుబడిలో ఉన్న అక్కడ అసలు ఎన్నికలే లేవు, ఎవరూ స్వాతంత్య్ర అంశాన్నే ఎత్తలేదు. చైనా ఆధీనంలోకి వచ్చిన తరువాతనే తొలిసారి ఎన్నికలు జరిగాయి.అమెరికా ఇతర దేశాలు రెచ్చగొట్టి వేర్పాటు వాదాన్ని రెచ్చగొట్టాయి.


చైనా సంస్కరణలు, ఆర్ధికాభివృద్ది మీద కేంద్రీకరించింది.ముందే చెప్పుకున్నట్లు హాంకాంగ్‌, మకావూల్లో ఐదు దశాబ్దాల పాటు అక్కడి పెట్టుబడిదారీ వ్యవస్దలను కొనసాగించేందుకు అంగీకరించినందున ఆ గడువు నాటికి వాటితో పాటు తైవాన్ను కూడా విలీనం చేసుకోవాలన్నది చైనా ఆలోచన. అందుకే అక్కడ కూడా అనుమతిస్తున్నది. నిజానికి తైవాన్ను స్వాధీనం చేసుకోవటం చైనాకు పెద్ద సమస్యకాదు. అది శాంతియుతంగా జరగాలని కోరుకుంటున్నది కనుకనే సహనంతో ఉంది. పశ్చిమ దేశాలు దాని స్వాతంత్య్రం గురించి మాట్లాడినపుడల్లా తన అధికారాన్ని గుర్తు చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నది. అందువలన పశ్చిమ దేశాలు అధికారికంగా మాట్లాడే వీలు లేదు, మాట్లాడితే చైనాతో సంబంధాలు దెబ్బతింటాయి. దాని బదులు మీడియా ద్వారా కథనాలు వెల్లడిస్తుంటాయి. ఉక్రెయిన్‌ పరిణామాలు జరిగినా జరగకున్నా చైనాలో తైవాన్‌ విలీనం అనేది ముందే రాసిపెట్టి ఉంది. అది ఎప్పుడు ఎలా అన్నది చూడాల్సి ఉంది. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వమిచ్చి రష్యా ముంగిట ఆ ముసుగులో తన సైన్యాన్ని, ఆయుధాలను మోహరించి మెడమీద కత్తిలా మారాలన్న అమెరికా దురాలోచన అక్కడి తాజా పరిణామాలకు మూలం. అదే మాదిరి తైవాన్ను, హాంకాంగ్‌ను స్వతంత్ర రాజ్యాలుగా చేసి చైనాకు రెండు వైపులా ఎసరు పెట్టాలన్నది అమెరికా, జపాన్‌ తదితర దేశాల దుష్టాలోచన. దాన్ని ఎట్టి పరిస్ధితిలోనూ చైనా అంగీకరించదు, సాగనివ్వదు. ఎవరికీ ఎలాంటి భ్రమలు, ఈ అంశాల మీద తప్పుడు అంచనాలకు లోనుకాకూడదని చైనా పదే పదే హెచ్చరిస్తోంది. అమెరికా, జపాన్‌, ఇతర దేశాలను హెచ్చరించేందుకు చైనా కూడా శనివారం నాడు తైవాన్‌ జలసంధికి వైపు జలాంతర్గాములను దెబ్బతీసే విమానాలు, ఇతర విమానాలను చైనా పంపింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా చెలగాటం భారత్‌కు ప్రాణ సంకటం : రూపాయి పతనం, చమురు, గాస్‌ ధరల పెరుగుదల !

23 Wednesday Feb 2022

Posted by raomk in BJP, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ 1 Comment

Tags

BJP, Fuel Price in India, India economy, Narendra Modi, RUSSIA, Russia-Ukraine tensions Impact on India, Ukraine war


ఎం కోటేశ్వరరావు


నాటో కూటమిలోని యుద్దోన్మాద దేశాలు ముఖ్యంగా అమెరికా, బ్రిటన్‌ సృష్టించిన ఉక్రెయిన్‌-రష్యా వివాద ప్రతికూల పర్యవసానాలు అనేక దేశాలను కలవరపెడుతున్నాయి.వాటిలో మన దేశం ఒకటి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న తరుణంలోనే ఈ వివాదం తలెత్తింది. సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని భద్రతామండలిలో మన దేశం సరైన వైఖరినే వెల్లడించింది. ఈ వివాదం వలన తలెత్తే ఆర్ధిక ఇబ్బందుల గురించి మంత్రులు లేదా పాలకపార్టీల నేతలెవరూ నోరు విప్పటం లేదు. కారణం ఐదు రాష్ట్రాల ఎన్నికల మీద ప్రభావం పడకూడదనే. ఎంతకాలం మౌనవ్రతం పాటిస్తారు.మార్చి ఏడవతేదీతో ఆఖరు దశ పోలింగ్‌ ముగుస్తుంది, పదవ తేదీన ఫలితాలు వెలువడతాయి. వాటితో నిమిత్తం లేకుండానే గత నవంబరు నాలుగు నుంచి ఉన్న చమురు ధరల స్ధంభన ఎత్తివేసి సుప్రభాత చమురు ధరల పెరపుదలకు తిరిగి శ్రీకారం చుడతారు. ఇతర పర్యవసానాలు దాని వెంటే ఉంటాయి.


అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ రకం ముడిచమురు ధర 99.5 డాలర్లు దాటి 2014 తరువాత కొత్త రికార్డు స్దాపించింది. ఆర్ధిక విశ్లేషకుల అంచనా ప్రకారం ఇది ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు, రూపాయి విలువ పతనానికి దారితీస్తుంది. ప్రస్తుతం ఒక డాలరుకు 75కు అటూ ఇటూగా ఉన్న విలువ రు.80కి పడిపోవచ్చని చెబుతున్నారు.రష్యా-ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉంటే సహజవాయు, నిత్యావసర వస్తువులు, లోహాలు, ఇతర వస్తువుల ధరలు మన దేశంలో కూడా పెరుగుతాయని చెబుతున్నారు. జెపి మోర్గాన్‌ చెబుతున్నదాని ప్రకారం 150 డాలర్ల వరకు ముడిచమురు ధర పెరగవచ్చు. అదే జరిగితే ప్రపంచ జిడిపి వృద్ది రేటు కేవలం 0.9శాతానికి పడిపోతుంది. మన దేశ టోకు ధరల సూచికలో చమురు సంబంధిత ఉత్పత్తులు తొమ్మిదిశాతం ఉంటాయి. చమురుధరలు పెరిగితే ద్రవ్యోల్బణం 0.9శాతం పెరుగుతుందని అంచనా. మరోవైపున కిరోసిన్‌పై ఇస్తున్న సబ్సిడీ మరింత పెరుగుతుంది. ఎరువులు, వంటగాస్‌ ధరలను పెంచనట్లైతే ఆ మేరకు అదనంగా సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని కేంద్రం భరిస్తుందా జనం మీదే మోపుతుందా అన్నది చూడాల్సి ఉంది. మన దిగుమతుల్లో ఒక్క చమురే నాలుగోవంతు ఉన్నందున దాని ధరల పెరుగుదల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మోటారు వాహనాలు, మొబైల్‌ ఫోన్లకు అవసరమైన పల్లాడియం అనే లోహపు ధర ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగింది, ఇప్పుడు మరింతగా పెరగటం, లభ్యత సమస్యలు కూడా తలెత్తవచ్చు.
ఈ ఏడాది ఆగస్టు-డిసెంబరు నాటికి రెండు సార్లు వడ్డీ రేట్లు పెరగవచ్చని భావిస్తున్నారు. గతేడాది ధరల పెరుగుదలను అదుపులో ఉంచే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చమురు ధరలపై ఐదు, పది వంతున సెస్‌లను తగ్గించగా కొన్ని రాష్ట్రాల్లో వాట్‌ను తగ్గించారు. అప్పటికీ ఇప్పటికీ చమురు ధరల పెరుగుదల తేడా చాలా ఉంది. సెస్‌లను మరింతగా తగ్గించకపోతే ధరల పెరుగుదలను అరికట్టలేరు.


మన దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాల్లో ఎక్కువ భాగం తేలిక రకం ముడిచమురును మాత్రమే శుద్ది చేస్తాయి. రష్యా చమురు సాంద్రత ఎక్కువ కనుక మనం పరిమితంగా దిగుమతి చేసుకుంటున్నాము. ఉద్రిక్తతల కారణంగా నిలిచిపోయినా మన దిగుమతుల్లో ఒకశాతమే కనుక ఇబ్బంది లేదు. మన అవసరాల్లో 63.4శాతం పశ్చిమాసియా నుంచి తెచ్చుకుంటున్నాము. చమురు ధరల పెరుగుదలే అసలు సమస్య.బుధవారం నాడు ఇది రాసిన సమయానికి బ్రెంట్‌ రకం 97.19 డాలర్లు ఉంది. ప్రపంచ ఎగుమతుల్లో రష్యా వాటా 11-12శాతాలుగా ఉంది. దీనిలో 60శాతం చమురును ఆంక్షలను ఖాతరు చేయని చైనా, బెలారస్‌, మరికొన్ని దేశాలు కొనుగోలు చేస్తున్నాయి.రోజుకు మూడు మిలియన్‌ పీపాల మేరకు ఆంక్షల కారణంగా సరఫరా ఉండదు. దీని వలన చమురు ధర 110 డాలర్లకు పెరుగుతుందని జోశ్యం చెబుతున్నారు.ఇరాన్‌తో అమెరికా అణు ఒప్పందం కుదుర్చుకోనుందన్న వార్తలు వాస్తవరూపం దాల్చితే ఒకటిన్నర మిలియన్‌ పీపాల చమురు అందుబాటులోకి వస్తుంది. ఐనప్పటికీ ఈ ఏడాదిలో ఎక్కువ భాగం వంద డాలర్లకంటే తగ్గదని అంటున్నారు. ఉక్రెయిన్‌లో పరిస్ధితి విషమిస్తే 120 డాలర్లు కావచ్చు. ఏడాదికి ప్రస్తుతం 25లక్షల టన్నుల ఎల్‌ఎన్‌జిని రష్యా నుంచి మన గెయిల్‌ దిగుమతి చేసుకుంటున్నది. ప్రస్తుతం రష్యా చమురు కంపెనీల్లో మన దేశం నుంచి 13.63 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు ఉన్నాయి. అమెరికా, ఐరోపా ఆంక్షలు మనకూ వర్తింప చేస్తే మన సర్కార్‌ వాటికి లొంగిపోతే వాటి పరిస్ధితి ఏమిటన్నది ప్రశ్న. గతంలో క్షిపణి వ్యవస్దలను కొనుగోలు చేయరాదన్న అమెరికా బెదరింపులను ఖాతరు చేయకుండా కొనుగోలు చేశాము. ఇదే ఇరాన్‌ చమురు అంశంలో మోడీ సర్కార్‌ లొంగిపోయి కొనుగోలు నిలిపివేసింది.


ఏప్రిల్‌ ఒకటి నుంచి ప్రారంభం కానున్న ఆర్ధిక సంవత్సరంలో మన చమురు డిమాండ్‌ 214.5 మిలియన్‌ టన్నులని అంచనా. ఇది గతేడాది కంటే 5.5శాతం ఎక్కువ. కేంద్ర ప్రభుత్వం పంచదార, ఆహారధాన్యాలు, ఇతరంగా బయో ఇంధనాన్ని భారీగా తయారు చేసి దిగుమతుల భారాన్ని తగ్గించాలని చూస్తున్నది. ధరలు పెరిగితే దాని వలన కలిగే ఆదా కూడా హరించుకుపోతుంది.2022-23లో మనం కొనుగోలు చేసే ముడి చమురు ధర 70-75 డాలర్ల మధ్య ఉండవచ్చని ఆర్ధిక సర్వే అంచనా వేసింది. జోశ్యాలు చెబుతున్నట్లు వంద లేదా 90 డాలర్లు ఉన్నా మన బడ్జెట్‌ అంకెలన్నీ మారిపోతాయి, లేదా జనం మీద భారాలు పెరుగుతాయి. మన దేశం నుంచి ఐరోపాకు ఎగుమతులు చేసే కంపెనీల వాటాల ధరలు స్వల్పంగా తగ్గటాన్ని బట్టి ఎగుమతులపై కూడా ప్రతికూల ప్రభావం చూపవచ్చు. మన టీ ఎగుమతుల్లో 18శాతం రష్యాకే జరుగుతున్నాయి.


ప్రస్తుతం రష్యా సోషలిస్టు దేశం కాదు, పెట్టుబడిదారీ విధానానికి మారింది. ఇటీవలి కాలంలో రాజకీయంగా మనం అమెరికాకు దగ్గర లేదా జూనియర్‌ భాగస్వామిగా మారేందుకు చూపుతున్న తహ తహ గతంలో ఎన్నడూ లేదు. ముందే చెప్పుకున్నట్లు ఇరాన్‌, వెనెజులా చమురు కొనుగోలు అంశంలో అమెరికా వత్తిడికి లొంగిన మోడీ సర్కార్‌ ఎస్‌-400 క్షిపణి వ్యవస్దలపై ఆంక్షలను ఖాతరు చేయలేదు. గతంలో సోవియట్‌ కాలంలో, తరువాత రష్యా ఆయుధాలే మనకు ఆలంబన. ఇప్పుడు వాటిని పూర్తిగా మాని అమెరికా నుంచి కొనుగోలు చేయాలని పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నప్పటికీ ఆచరణాత్మక సమస్యలు అడ్డుపడుతున్నాయి. అమెరికా తనకు పనికిరాని, ఇతర దేశాలకూ అమ్మే వాటినే మనకూ విక్రయిస్తోంది. ఎస్‌-400 వంటి క్షిపణి వ్యవస్దలు అమెరికా దగ్గర లేక కాదు, ఇవ్వటం ఇష్టం లేకనే. రష్యన్‌ ఆయుధ ఎగుమతుల్లో మనం 23శాతం దిగుమతి చేసుకుంటున్నాం. వాటిలో కొత్తవాటితో పాటు పాతవాటికి విడిభాగాలూ ఉన్నాయి. రెండు దేశాల సంబంధాలు కేవలం అమ్మకందారు-కొనుగోలు దారు మాదిరిగాక బ్రహ్మౌస్‌ వంటి ఖండాంతర క్షిపణులను రెండు దేశాలూ కలసి తయారు చేస్తున్నాయి. గతంలో మన ఇస్రోకు క్రయోజెనిక్‌ ఇంజన్ల సాంకేతిక పరిజ్ఞానం అందచేసినట్లుగానే ఇప్పుడు ఐదవ తరం ఫైటర్‌ విమానాల రూపకల్పన, వృద్ది, బహుముఖ కార్యకలాపాలకు పనికి వచ్చే విమానాల మీద కూడా రెండు దేశాలూ పని చేస్తున్నాయి. ఇటువంటి ప్రాజెక్టులు అమెరికాతో లేవు. ఐనా దేశభక్తులం అని నామాలు పెట్టుకున్న కొందరు అమెరికాతో అంటకాగేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ కారణంగానే అమెరికా వైపు మనసు లాగుతున్నా రష్యా వైపు మాట్లాడకపోయినా తటస్ధత పాటిస్తున్నది మన దేశం. ఈ వైఖరిని వచ్చే రోజుల్లో అమెరికా తప్పు పట్టినా ఆశ్చర్యం లేదు. చైనాకు వ్యతిరేకంగా మన దేశాన్ని నిలపాలన్న ఎత్తుగడ కారణంగానే అమెరికా కాస్త తగ్గి వ్యవహరిస్తున్నది.


ప్రపంచీకరణతో ప్రపంచం ఒక గ్రామంగా మారిందని చెప్పుకుంటున్నాము. ఒక ప్రాంతంలో తలెత్తే తీవ్ర సమస్యలు మొత్తం గ్రామాన్ని ఏదో విధంగా ప్రభావితం చేయకుండా ఎలా ఉంటాయి. వసుధైక కుటుంబం అని అందరూ చెబుతున్నా ఎవరి రాజకీయాలు వారు చేయటం, స్వప్రయోజనాలకు పెద్ద పీట వేస్తున్న రోజులివి. ఐరోపాలో తలెత్తిన ఉద్రిక్తతలు ప్రతిదేశాన్ని ఉలిక్కిపడేట్లు చేశాయి. వీటి ప్రభావాలు చమురు ధర వంటి తక్షణ పర్యవసానాలకు దారితీస్తే పరోక్షంగా ఏ రంగం మీద ఎంత ప్రభావం పడేది పరిస్ధితిని బట్టి మారుతుంది. వాటి తీవ్రతను వెంటనే బేరీజు వేయటం కష్టం. ఉక్రెయిన్‌ – రష్యా ఉద్రిక్తతలు ఎలా పరిష్కారమైనప్పటికీ చమురు ధరలు మన సామాన్యజనాల నడ్డి విరవటం ఖాయం. ఆర్‌టిసి, రైల్వే వంటి ప్రజారవాణా వ్యవస్దలు పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే డీజిలు ధరలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఆ మేరకు భారం ప్రయాణీకుల మీద మోపటం ఖాయం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా రైతాంగానికి పత్తి ధర ఎక్కువ-పాకిస్ధాన్‌ కంటే మన దగ్గర తక్కువ !

11 Friday Feb 2022

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Farmers, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, USA

≈ Leave a comment

Tags

BJP, cotton farmers, Narendra Modi, WTO-Agriculture, WTO-India


ఎం కోటేశ్వరరావు


ఈ ఏడాది పత్తికి మంచి ధర వచ్చిందని రైతులు సంతోషపడ్డారు. వివిధ కారణాలతో పంట దిగుబడి తగ్గింది, ఖర్చులో ఎలాంటి మార్పు లేదు. కనుక ధర పెరిగినా రైతులకు సంతోషం లేకుండా పోయింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా గణనీయంగా ధరలు పెరిగాయి. ఇప్పుడున్న ధరలు వచ్చే ఏడాది ఉంటాయనే సూచనలు లేవు. తాజా మార్కెట్‌ సమాచారం ప్రకారం అమెరికా ముందస్తు మార్కెట్‌లో మార్చి నెలలో ఒక పౌండు(454 గ్రాములు) దూది ధర 125.66 సెంట్లు(ఒక డాలరుకు వందసెంట్లు)గా ఉంది. మే నెలలో 123.20, వచ్చే ఏడాది జూలైలో 120.51, అక్టోబరులో 109.75, డిసెంబరులో 105.27 సెంట్లుగా ఉంది. ఉత్పత్తి, గిరాకీ, వినియోగం తదితర అంశాల ఆధారంగా అంతర్జాతీయ, జాతీయ మార్కెట్‌ శక్తులు ధరలను నిర్ణయిస్తాయి.


న్యూయార్క్‌ ముందస్తు మార్కెట్లో మార్చినెల ధర 115 నుంచి 127 సెంట్ల వరకు పెరిగింది. చైనాలో 160-163 సెంట్ల మధ్యఉంది. మన దేశంలో నాణ్యమైన పొడవు పింజరకం శంకర్‌ – 6రకం ధర 126 నుంచి 133 సెంట్లకు పెరిగింది. పాకిస్ధాన్‌లో 127 నుంచి 140 డాలర్లకు పెరిగింది. పంజాబ్‌ ఒక మండ్‌ (37.324కిలోలు) ధర ఎనిమిదివేల రూపాయలకు అటూ ఇటూగా ఉంది. అదే పాకిస్థాన్‌లో రు.8,900 వరకు ఉంది. పత్తి పండించే ప్రధాన దేశాలన్నింటినీ పోల్చినపుడు మన దేశంలోనే ధరలు తక్కువగా ఉన్నాయి. మార్కెట్‌ ధరలను బట్టే రైతులకూ చెల్లింపు ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. ఎగుమతులకు డిమాండ్‌ ఉండటంతో నూలు మిల్లర్లు ఎగబడి కొనుగోలు చేశారు.


అమెరికా వ్యవసాయశాఖ సమాచారం ప్రకారం ప్రపంచ పత్తి ఉత్పత్తి 8,03,000 బేళ్లు తగ్గి 120.2 మిలియన్‌ బేళ్ల వద్ద ఉంది. ఇదే సమయంలో మిల్లు వినియోగం 1,86,000 పెరిగి 124.4మి.బేళ్లని పేర్కొన్నది.2021-22 88.7మి.బేళ్ల నిల్వలతో ప్రారంభమై 84.3మి.బేళ్లతో ముగియనున్నట్లు అంచనా వేసింది. ఈ కారణంగానే ప్రపంచమంతటా పత్తి ధరలు పెరిగాయి. భారత్‌లో ఐదులక్షల బేళ్లు తగ్గి ఉత్పత్తి 27మి.బేళ్లుగా ఉందని అమెరికా పేర్కొన్నది.ప్రపంచంలో పత్తి దిగుమతులు 46.4 మి.బేళ్లని, చైనా దిగుమతులు రెండున్నర లక్షలు తగ్గి 9.5మి.బేళ్లు దిగుమతి ఉంటుందని పేర్కొన్నది. వివిధ దేశాల్లో పత్తి చేతికి వచ్చే తరుణం ఒకే విధంగా లేనందున అంతిమంగా లెక్కల ఖరారులో అంకెలు మారతాయి. మన దేశంలో ధరలు పెరుగుతున్న కారణంగా ధనిక రైతులు మరింతగా పెరుగుదలను ఆశించి మార్కెట్‌కు పూర్తిగా తీసుకురావటం లేదని వ్యాపారులు చెబుతున్నారు.చెనాలో కూడా ఇదే పరిస్ధితి ఉంది. అమెరికా, ఐరోపా దేశాల్లో ద్రవ్యోల్బణం కారణంగా ధరలు పెరిగి గిరాకి తగ్గినందున పత్తి ధరలు అదుపులో ఉన్నాయని లేనట్లయితే మరికొంత పెరిగేవన్నది ఒక అభిప్రాయం. గతంతో పోలిస్తే ప్రస్తుతం ధరలు పెరిగినందున 2022-23లో ప్రపంచమంతటా సాగు పెరగవచ్చని జోశ్యం చెబుతున్నారు.


స్ధానికంగా ఉత్పత్తి తగ్గటం, మిల్లు డిమాండ్‌ పెరగటంతో ఈ ఏడాది మన పత్తి ఎగుమతులు పెద్దగా లేవు. దాంతో సాంప్రదాయంగా మన దేశం నుంచి దిగుమతి చేసుకొనే దేశాలు వేరే మార్కెట్లనుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. మన దేశం నుంచి పరిమితంగా బంగ్లాదేశ్‌కు ఎగుమతులు జరుగుతున్నాయి. ఒక పౌను ధర 135 సెంట్ల వరకు ఉంది. గతేడాది మన దేశం 78లక్షల బేళ్లను ఎగుమతి చేయగా ఈ ఏడాది 40లక్షల వరకు ఉండవచ్చని అంచనా.గతేడాది పత్తి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం పదిశాతం దిగుమతి పన్ను విధించింది. పన్ను ఎత్తివేస్తే పెద్ద మొత్తంలో దిగుమతులు పెరిగి స్ధానిక ధరలు పడిపోయి ఉండేవి. దిగుమతి పన్ను ఎత్తివేయాలని మిల్లర్లు వత్తిడి తెస్తున్నారు. ముడిసరకుల ధరలు పెరుగుతున్నందున పత్తిపై దిగుమతి పన్ను రద్దుతో పాటు దిగుమతులపై పరిమాణాత్మక ఆంక్షలను తొలగించాలని కోరుతున్నారు.


వ్యాపారుల అంచనా ప్రకారం సెప్టెంబరు 30తో ముగిసిన పత్తి సంవత్సరంలో గతేడాది కంటే పదిలక్షల బేళ్లు తగ్గింది. ఉత్పత్తి 350లక్షల బేళ్లకు అటూ ఇటూగా ఉంటుండగా ప్రతి ఏడాది 40-45లక్షల బేళ్లు వినియోగానికి పనికి రాదని, ఈ ఏడాది ఈ సమస్యతో పాటు దిగుబడి తగ్గిందని, గతేడాది అక్టోబరు ఒకటిన కాండీ ధర 43,300ఉంటే జనవరికి 57వేలకు తరువాత 80వేలకు చేరినట్లు దక్షిణాది మిల్లుల ప్రతినిధి రవిశామ్‌ చెప్పారు.పన్నులేని పత్తిని 30లక్షల బేళ్ల వరకు దిగుమతికి అనుమించాలని అన్నారు. ఈ ఏడాది ధరల కారణంగా వచ్చే సంవత్సరం పత్తి సాగు 20-25శాతం పెరగవచ్చని కాటన్‌ అసోసిఏషన్‌ పేర్కొన్నది. పొడవు పింజ రకాలకు కనీస మద్దతు ధర 25శాతం, ఇతర రకాలకు 3-5శాతం మాత్రమే పెంచాలని మిల్లుల వారు చెబుతున్నారు.2021-22 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం మధ్యరకం పింజరకాల మద్దతు ధరను క్వింటాలుకు రు.5,726, పొడవు పింజకు రు.6,025గా నిర్ణయించింది. ఇవి అంతకు ముందు ఏడాదితో పోలిస్తే రు.211, 200 ఎక్కువ.


ఈ ఏడాది పత్తి మార్కెట్‌ ధరలతో పోల్చి చూస్తే కనీస మద్దతు ధరలు తక్కువే అన్నది స్పష్టం. అవి సాగు ఖర్చులను ప్రతిబింబించటం లేదు. ఈ ధరలను కూడా ప్రకటించటానికి వీల్లేదని మన సహజభాగస్వామిగా నరేంద్రమోడీ వర్ణించిన అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్దలో మన దేశం మీద కేసులు దాఖలు చేశాయి. వాటిని సంతుష్టీకరించేందుకు గాను కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించేందుకు మోడీ సర్కార్‌ మొరాయిస్తున్నది. అసలు మొత్తంగా ఎంఎస్‌పిని నీరు గార్చేందుకు మూడు సాగు చట్టాలను తెచ్చి రైతాంగాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకు పూనుకున్న అంశం తెలిసిందే. అమెరికా ఇస్తున్న భారీ సబ్సిడీలతో మనతో పాటు చిన్న దేశాలైన ఆఫ్రికన్‌ రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నది.2020 లెక్కల ప్రకారం ప్రపంచ పత్తి ఎగుమతుల్లో అమెరికా వాటా 35శాతం. అక్కడ జరిగే ఉత్పత్తిలో 85.6శాతం ఎగుమతులు చేస్తున్నది. అందువలన తనకు పోటీ వచ్చే మనవంటి దేశాలను దెబ్బతీసేందుకు అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనల పేరుతో దాడి చేస్తున్నది. కనీస మద్దతు ధర నిర్ణయాన్ని సబ్సిడీ చెల్లించటంగా చిత్రిస్తున్నది. నిజానికి మార్కెట్లో అంతకంటే ఎక్కువ ధరలు ఉన్నపుడు ప్రభుత్వ సంస్ధ సిసిఐ కొనుగోళ్లు జరపటం లేదు. జరిపినా ఎంఎస్‌పికి కొనుగోలు చేస్తున్నది తప్ప కేంద్ర ప్రభుత్వం ఎలాంటి బోనస్‌ ఇవ్వటం లేదు.


అమెరికాలో ఒక్కొక్క పత్తి రైతుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రత్యక్ష, పరోక్ష సబ్సిడీ 1,17,494 డాలర్లు కాగా మన దేశంలో ఇస్తున్న పరోక్ష సబ్సిడీ కేవలం 27డాలర్లు మాత్రమే. ఈ మొత్తాన్ని కూడా ఇవ్వకూడదని వత్తిడి తెస్తోంది. అమెరికాలో ఉన్న చట్టాల ప్రకారం మద్దతు ధర, మార్కెట్లో దాని కంటే రైతులకు తక్కువ వస్తే ఆ మేరకు ప్రభుత్వం లెక్క కట్టి నగదు చెల్లిస్తుంది. అదిగాక రైతులకు సబ్సిడీలతో కూడిన రుణాలు, బీమా సబ్సిడీ, నేరుగా ఇచ్చే రాయితీలు ఇలా ఉన్నాయి.1995-2020 సంవత్సరాలలో 40.10బిలియన్‌ డాలర్లు సబ్సిడీల రూపంలో చెల్లించారు. రైతులకు జిన్నింగ్‌ ఖర్చు తగ్గించే పేరుతో 3.16 బిలియన్‌ డాలర్లు ఇచ్చారు. ఈ సబ్సిడీల కారణంగా ప్రపంచంలో పత్తి ధరలు పతనమయ్యాయి.1995లో పౌను పత్తి ధర 98 సెంట్లు ఉండగా 2001లో 48 సెంట్లకు తగ్గి 2020లో 70 సెంట్లు ఉంది. అంటే పాతిక సంవత్సరాల్లో మొత్తంగా పత్తి ధరలు తగ్గాయి. ఎగుమతులపై ఆధారపడిన అమెరికాలో ఏ పత్తి రైతూ బలవన్మరణానికి పాల్పడిన ఉదంతాలు లేవు.


అమెరికా ఇస్తున్న సబ్సిడీలను తగ్గించాలని 2003 నుంచి అనేక దేశాలు వత్తిడి చేస్తున్నా ఫలితం కనిపించటం లేదు.1986-88లో ఉన్న సబ్సిడీల ఆధారంగా ఇప్పటికీ సబ్సిడీలను లెక్కిస్తున్నారు. అమెరికా తన సబ్సిడీలను డాలర్లలో చెబుతుండగా మన సబ్సిడీలను రూపాయల్లో లెక్కించి చూశారా ఎంత ఎక్కువ ఇస్తున్నారో అని కేసులు దాఖలు చేశారు. నాడు మన దేశంలో కనీస మద్దతు ధర అంతర్జాతీయ ధరల కంటే తక్కువగా ఉంది.1986-88 మధ్య తమ పత్తి సబ్సిడీ 2,348 మి.డాలర్లని గాట్‌ చర్చల్లో అమెరికా చెప్పింది. కానీ 1986లో 1,702 మి.డాలర్లని దాన్నే ప్రమాణంగా తీసుకోవాలని తొండి చేస్తోంది. ఈ తప్పుడు లెక్కల కారణంగా 19బి.డాలర్లు అదనంగా ఇచ్చిన సొమ్మును దాచి పెడుతోంది. ఈ వివాదం ఇంకా తేలలేదు. ప్రపంచ వాణిజ్య సంస్ధను, అమెరికా వంటి ధనిక దేశాలను సంతృప్తిపరచేందుకు మోడీ సర్కార్‌ చూపుతున్న శ్రద్ద మన రైతాంగం మీద కనిపించటం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉత్తర ప్రదేశ్‌ గనుక కేరళగా మారితే మతం పేరుతో హత్యలుండవు – యోగికి పినరయి విజయన్‌ చురక !

10 Thursday Feb 2022

Posted by raomk in BJP, Communalism, CPI(M), Current Affairs, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Narendra Modi, Narendra Modi Failures, Pinarai Vijayan, UP CM, UP election 2022, Yogi Adityanath


ఎం కోటేశ్వరరావు


ఎన్నికల్లో ఎవరి గొప్ప గురించి వారు చెప్పుకోవటం ఒక పద్దతి. అలాగాక ఇతర రాష్ట్రాలను కెలికితే ఏమౌతుంది. కరోనాతో మరణించిన వారి శవాలను గంగలో నెట్టి వేయించిన ఘనత ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ మూటగట్టుకున్న అంశం తెలిసిందే. అలాంటి పెద్ద మనిషి ప్రతిపక్షాలకు గనుక అధికారమిస్తే ఒక బెంగాల్‌, ఒక కాశ్మీరుగా, ఒక కేరళగా ఉత్తర ప్రదేశ్‌ మారిపోతుంది గనుక ఓటరులారా తిరిగి బిజెపికే పట్టం కట్టండని ఒక వీడియో ప్రకటనలో యోగి ఆదిత్యనాధ్‌ పేర్కొన్నారు.


ఏ రాష్ట్రం ఏ రంగంలో ఎంత ప్రగతి సాధించిందో ఇటీవలనే కేంద్ర నీతి అయోగ్‌ ప్రకటించిన సంగతి ఎన్నికల్లో ఎదురీదుతున్న యోగి మరచిపోయి ఉంటారు.బహుముఖ దారిద్య్ర సూచిక(ఎంపిఐ)లో 0.71శాతంతో కేరళ ప్రధమ స్ధానంలో ఉంది. మరి యోగి పాలనలో ఉత్తర ప్రదేశ్‌ ఎక్కడ ఉంది? బీహార్‌ 51.91, ఝార్ఖండ్‌ 42.16, ఉత్తర ప్రదేశ్‌ 37.79శాతంతో అడుగునుంచి మూడవ స్ధానంలో ఉంది. అందుకే కేరళ సిఎం పినరయి విజయన్‌ వెంటనే సమాధానమిచ్చారు. ఉత్తర ప్రదేశ్‌ గనుక కేరళగా మారితే జనాలకు మంచి విద్య, ఆరోగ్య సేవలు, సాంఘిక సంక్షేమం అందుతుందని తిప్పికొట్టారు. అంతే కాదు జీవన ప్రమాణాలు, సామరస్యపూరిత సమాజం ఉంటుంది కనుక మతం, కులం పేరుతో జనాలు హత్యలకు గురికారని, ఉత్తర ప్రదేశ్‌ జనాలు కూడా అదే కోరుకుంటున్నారని కూడా అన్నారు.


యోగి ఆదిత్యనాధ్‌ తన వీడియో ప్రకటనలో చెప్పిందేమిటి ? ” నా ఆందోళన ఏమిటంటే ఈ జనాలు(ప్రతిపక్షాలు) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.వారు చెబుతున్నట్లుగా మీరు అధికారమిస్తే ఏమౌతుంది. నా ఐదేండ్ల కష్టమంతా వృధా అవుతుంది. ఉత్తర ప్రదేశ్‌ కాస్తా కాశ్మీరు, బెంగాల్‌,కేరళగా మారటానికి ఎంతో సమయం పట్టదు. మీ మంచి జీవనానికి మీ ఓటే హామీ. ఈ ఐదు సంవత్సరాల్లో అనేక అద్భుతాలు జరిగాయి” అంటూ ఆరునిమిషాల వీడియోలో తన పాలన ఘనత గురించి చెప్పుకున్నారు.


నీతి అయోగ్‌ నివేదికలో అలాంటి అద్భుతం ఏమిటో చూశాము. ఆరోగ్యవంతమైన రాష్ట్రాలు-పురోగమన భారత్‌ పేరుతో నివేదిక రూపొందించారు. దాన్ని నీతి అయోగ్‌, కేంద్ర ఆరోగ్యశాఖ, ప్రపంచ బాంకు 2019-20 సమాచారం మేరకు విశ్లేషించాయి. పెద్ద రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, తెలంగాణా మొదటి మూడు స్ధానాల్లో ఉన్నాయి.చివరన 19వ స్ధానంలో ఉత్తర ప్రదేశ్‌ ఉంది. కేరళకు 82.2, ఉత్తర ప్రదేశ్‌కు 30.57 మార్కులు వచ్చాయి. ఇక నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) సమాచారం ప్రకారం 2018-20 సంవత్సరాల్లో కేరళలో 921 హత్యలు జరిగాయి. ఇది ప్రతిలక్ష మందికి 0.9శాతం కాగా జాతీయ సగటు 2.2గా ఉంది. దీనిలో కూడా ఉత్తర ప్రదేశే అలగ్రస్ధానంలో ఉంది. మాదక ద్రవ్యాల కేసుల్లో పంజాబ్‌, హిమచల్‌ ప్రదేశ్‌ తరువాత స్దానం ఉత్తర ప్రదేశ్‌దే.


దేశంలో సంచలనం కలిగించిన లఖింపూర్‌ ఖేరీ మారణకాండలో ప్రధాన నిందితుడైన( కేంద్ర మంత్రి అజయ మిశ్రా కుమారుడు ) ఆశిష్‌ మిశ్రాకు ఎన్నికల తొలిదశ పోలింగ్‌ రోజే బెయిలు లభించింది. జనవరి 18న తీర్పును రిజర్వుచేసినట్లు ప్రకటించిన అలహాబాద్‌ హైకోర్టు గురువారం(ఫిబ్రవరి 10) నాడు వెల్లడించింది. గతేడాది అక్టోబరు మూడున కార్లతో తొక్కించి నలుగురు రైతులను దారుణంగా హత్యగావించిన అంశం తెలిసిందే. తదనంతరం రైతుల ఆగ్రహానికి ముగ్గురు బిజెపి దుండగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉదంతం జరిగినపుడు తన కుమారుడు అక్కడ లేడని కేంద్రమంత్రి బుకాయించారు. ప్రభుత్వం మాత్రం సంఘటన దురదృష్టకరం అని పేర్కొన్నది. అక్టోబరు 9న నిందితులను అరెస్టు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన కొన్ని కేసులలో సాక్షులను హతమార్చిన ఉదంతాల నేపధ్యంలో లఖింపూర్‌ ఖేరీ ఉదంత సాక్షులకు రక్షణ కల్పించాలని సుప్రీం కోర్టు ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది.నష్ట నివారణ చర్యల్లో భాగంగా అనివార్యమై యోగి సర్కార్‌ సుప్రీం కోర్టు ఆదేశం మేరకు ప్రత్యేక దర్యాప్తు బౄందాన్ని ఏర్పాటు చేసింది.తొలుత కుట్రదారుగా కేంద్ర మంత్రి పేరును చేర్చిన సిట్‌ తరువాత దాన్ని తొలగించి మంత్రి బావమరిది వీరేంద్ర శుక్లా పేరు చేర్చింది. మంత్రికుమారుడి దారుణానికి బలైన జగదీప్‌ సింగ్‌ తండ్రి నచత్తర్‌ సింగ్‌ తాను కేంద్ర మంత్రి మీద వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని, తనకు మద్దతు ఇవ్వాలని ఎస్‌పి, కాంగ్రెస్‌లను కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న పార్టీల కోరికను తిరస్కరించారు. రైతుల్లో మరింత ఆగ్రహం తలెత్తుతుందనే భయంతో ఇంతవరకు ఎక్కడా కేంద్ర మంత్రిని బిజెపి ప్రచారానికి పంపలేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిజెపికి చమురు సెగ : ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఉచితం – చమురుపై మూడేండ్లు పన్నులు పెంచం !

09 Wednesday Feb 2022

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

fuel politics, Fuel Price in India, Fuel prices freezing, Narendra Modi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


బిజెపికి చమురు సెగ తగిలింది. తమను గెలిపిస్తే ఏడాదికి ప్రతి ఇంటికి మూడు గాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, మూడు సంవత్సరాల పాటు చమురుపై పన్నులు పెంచబోమని గోవా బిజెపి ఓటర్లకు వాగ్దానం చేసింది. తమను గెలిపిస్తే లీటరు పెట్రోలు ధర రు.80కి మించి పెరగనివ్వం అని వాగ్దానం చేసింది.దీని మీద బిజెపి మానిఫెస్టోను విడుదల చేసిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ త్వరలో వాహనాలకు అమర్చే ఇంజన్లను ఇథనాల్‌తో నడిపించవచ్చని, అది లీటరు ధర రు.62కు మించదని, అందువలన కాంగ్రెస్‌ రు.80 పరిమితి విధించాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. అంతపరమ రహస్యం తెలిసిన పెద్దలు తామే ఆ ముక్క వాగ్దానంగా చెప్పవచ్చు, అంత సంతోషకరమైన వార్తను కేంద్రమే ఒక ప్రకటనగా చేయవచ్చు. ఇంక బిజెపి పెద్దలు గోవాలో అమెరికా ప్రమాణాలతో కూడిన రోడ్డు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కూడా సెలవిచ్చారు.


అమెరికా – ఇరాన్‌ మధ్య అణుచర్చలు జరుగుతాయనే వార్తలు రాగానే ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి.సఫలమైతే మరికొంత తగ్గవచ్చు, విఫలమైతే పెరగవచ్చు. అంటే అమెరికా చర్యలు అంతర్జాతీయ మార్కెట్‌ మీద ప్రభావం చూపుతున్నాయి. అనేక దేశాలు అణు పరీక్షలు జరుపుతున్నా అమెరికాకు పెద్దగా పట్టదు, అదే ఇరాన్‌ జరిపితే దానికి నొప్పి ఏమిటి ? ఏ దేశాన్నీ ప్రశాంతంగా ఉండనివ్వదా ? దాని రాజకీయం, లబ్ది కోసం ప్రపంచమంతా బలి కావాలా ? అలాంటి అమెరికా తోకపట్టుకొని మనం పోవాలా ?


గత ఏడు సంవత్సరాలలో తొలిసారిగా ఫిబ్రవరి ఏడున బ్రెంట్‌ రకం ముడిచమురు 94 డాలర్లను తాకింది(దానికి ఒక డాలరు తక్కువగా మన దేశం దిగుమతి చేసుకొనే చమురు ధర ఉంటుంది) అమెరికా-ఇరాన్‌ పరోక్షంగా చర్చలను ప్రారంభించనున్నాయి.దీంతో బుధవారం నాడు 90.6 డాలర్ల వద్ద మార్కెట్‌ ఉంది. గతంలో అంగీకరించిన ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగిన కారణంగా తాను అణు కార్యక్రమాన్ని పునరుద్దరిస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది. దాన్ని సాకుగా తీసుకొని మన దేశంతో సహా ఎవరూ ఇరాన్‌ చమురు కొనుగోలు చేయకూడని అమెరికా ఆంక్షలు విధించింది. ట్రంప్‌ను సంతుష్టీకరించేందుకు మనం తలొగ్గి మిత్రదేశమైన ఇరాన్‌ నుంచి చమురుకొనుగోలు నిలిపివేశాము. ఇరాన్‌పై కొన్ని ఆంక్షలను అమెరికా తొలగించటంతో ధరలు పరిమితంగా తగ్గాయి. చమురుకు డిమాండ్‌ పెరుగుతున్నందున ఇది తాత్కాలికమే అని చెబుతున్నారు.


గతంలో ఆసియా దేశాలకు సరఫరా చేసే చమురు ధరలను సౌదీ అరేబియా స్వల్పంగా తగ్గించినపుడు చూశారా నరేంద్రమోడీ పలుకుబడి అంటూ డబ్బాకొట్టారు. ఇప్పుడు ధరలను పెంచుతున్నట్లు సౌదీ ప్రకటించింది. నోరు మూతపడింది. నిజానికి గతంలో కూడా ఒక్క మన దేశానికే కాదు, ఇతర ఆసియా దేశాలకూ తగ్గించింది. ఇప్పుడు గిరాకీ ఉంది కనుక ఎంతైనా కొనుగోలు చేయక తప్పదు. వెనెజులా కూడా మనకు మిత్రదేశమే.దాని దాడికి దిగిన అమెరికా ఆంక్షల కారణంగా అక్కడి నుంచి కూడా మనం చమురు కొనుగోలు నిలిపివేశాము. పేరుకు స్వతంత్ర దేశం ఆచరణలో అమెరికా అడుగులకు మడుగులొత్తటం.వెనెజులా బదులు మెక్సికో నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. ఇప్పుడు దానికి మెక్సికో కోత పెట్టింది.గతేడాది రోజుకు 98వేల పీపాలను దిగుమతి చేసుకోగా ఈ ఏడాది తొలి రెండు నెలల్లో దాన్ని 15వేలకు తగ్గించారు. దేశీయ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే విధానంలో భాగంగా ఈ చర్యతీసుకున్నట్లు చెబుతున్నారు. మనకు చమురును విక్రయించే దేశాలు సమంజసమైన ధరలకు చమురు సరఫరా చేయాలని కోరుతున్నట్లు మన చమురుశాఖ సహాయ మంత్రి రామేశ్వర తేలి ఫిబ్రవరి ఏడున రాజ్యసభలో చెప్పారు. గతంలో ఇరాన్‌ మనకు రవాణా రాయితీతో పాటు, ప్రపంచంలో ఎక్కడా చెల్లని మన రూపాయిలను తీసుకొనేందుకు కూడా ఇరాన్‌ వీలు కల్పించింది. ఇప్పుడు దానితో పరోక్షంగా వైరం తెచ్చుకున్నాం. జర కాస్త చూసి ధరవేసుకోండి అంటూ ఇతర దేశాలను బతిమాలుకుంటున్నాం.

మనం దిగుమతి చేసుకొనే చమురు ధర డిసెంబరు ఒకటిన 71.32 డాలర్లు ఉండగా జనవరి 31న 89.41డాలర్లని మరోమంత్రి హరదీప్‌ సింగ్‌ పూరీ వెల్లడించారు. ఇంత పెరుగుదల ఉన్నప్పటికీ ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా పెట్రోలు, డీజిలు ధరలను పెంచకుండా నిలిపివేశారు.ఎన్నికలు ముగియగానే ఈ మొత్తాలను వసూలు చేసే విధంగా ధరలను పెంచనున్నారు.
అనేక దేశాల్లో చమురు ధరల పెరుగుల సెగతగలటం ప్రారంభమైంది.ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల కనిపిస్తోంది.న్యూజిలాండ్‌లో ఏడాది కాలంలో 30శాతం చమురు ధరలు పెరిగాయి.ద్రవ్యోల్బణం 5.9శాతానికి పెరగటంలో చమురు ప్రధాన కారణంగా పేర్కొన్నారు. కాలుష్యనివారణలో భాగంగా పెట్రోలు మీద లీటరుకు ఎనిమిది నుంచి 16సెంట్ల వరకు పన్ను విధిస్తున్నారు. ఐరోపా యునియన్‌ దేశాల్లో జీవన వ్యయం పెరిగిపోతోంది. దాంతో జనం పొదుపు చర్యలకు పూనుకున్నారు. దానికి పెట్రోలు టూరిజం అని ముద్దుపేరు పెట్టారు. తన జనం మీద భారం తగ్గించాలని పోలెండ్‌ సర్కార్‌ చమురు, గాస్‌ మీద పన్ను తగ్గించింది. దాంతో లీటరుకు 25 నుంచి 35సెంట్ల భారం తగ్గింది. ఐతే ఈ చర్య ఇప్పుడు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఇరుగుపొరుగుదేశాలైన హంగరీ, జర్మనీ, స్లోవేకియా, చెక్‌ తదితర దేశాల వారందరూ పెద్ద కాన్లతో వచ్చి కొనుగోలు చేస్తున్నారు. దీంతో దేశంలో కొరత ఏర్పడింది. ఎవరూ 60లీటర్ల కాన్లు నాలుగుకు మించి విడిగా తీసుకుపోకూడదంటూ రోడ్ల మీద తనిఖీ సిబ్బందిని ఏర్పాటు చేశారు.స్లోవాక్‌లు సరిహద్దుదాటి వచ్చి 50లీటర్ల కారు టాంకు నింపుకుంటే దూరాన్ని బట్టి 10 నుంచి 18 యురోలు మిగుల్చుకుంటున్నారు. పోలెండ్‌లో ఇతర సరకులపై కూడా పన్ను తగ్గించటంతో పెట్రోలు, డీజిలుతో పాటు సరకులను కూడాకొనుగోలు చేసి తీసుకుపోతున్నారు. అనేక చోట్ల చమురు, గాస్‌ బంకులు సరఫరా లేక మూసివేస్తున్నారు. పోలెండ్‌తో ఇతర దేశాల్లోని సరిహద్దు సమీప బంకుల వారు పెట్రోలు టూరిజంతో భారీగా నష్టపోతున్నారు. వారి వద్ద కొనుగోలు చేసే వారు లేకుండా పోయారు.(మన దేశంలో ఢిల్లీ చుట్టూ ఉన్న హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వాలు పన్ను తగ్గించటంతో ఢిల్లీ పరిధిలోని బంకులకూ అదే పరిస్దితి ఎదురైంది. ఢిల్లీ నుంచి సమీపంలోని రాష్ట్రాల బంకుల్లో కొనుగోలు లేదా ఇతర మార్గాల్లో సమకూర్చుకోవటంతో కేజరీవాల్‌ కూడా పన్ను తగ్గించాల్సి వచ్చింది)


చమురు, గాస్‌, విద్యుత్‌ ధరల పెరుగుదల ఐరోపా దేశాల పర్యాటక రంగం మీద కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది.బ్రిటన్‌లో ఏప్రిల్‌ నాటికి 54శాతం వరకు ఇంధన బిల్లులు పెరగవచ్చని అంచనా. కార్లలో విహార యాత్రలకు వచ్చే కుటుంబాలకు ఒక టాంకు పెట్రోలు నింపుకునేందుకు గతంలో 60యురోలు చెల్లించాల్సి వస్తే ఇప్పుడు 85కు పెరిగాయి, అందువలన ప్రయాణ దూరాలపై కూడా పరిమితులు విధించుకుంటున్నారు. మార్చి ఏడవ తేదీన ఉత్తర ప్రదేశ్‌లోని చివరి దశ ఎన్నికలు ముగుస్తాయి, ఆ మరుసటి రోజునుంచే ధరల పెరుగుదల ప్రారంభం కానుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిజెపి ఎన్నికల లబ్దికే చమురు ధరల స్ధంభన – మార్చి ఏడు తరువాత బాదుడే బాదుడు !

19 Wednesday Jan 2022

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, fuel politics, Fuel Price in India, Fuel prices freezing, Narendra Modi, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


ప్రకటిత విధానాలను తుంగలో తొక్కటంలో కమ్యూనిస్టులు తప్ప మిగతా పార్టీల వారి గురించి ఎవరికీ తేడా లేదు. మాది మిగతా పార్టీలకు భిన్నం అని చెప్పుకున్న బిజెపిని ఏర్పాటు చేసింది ఆర్‌ఎస్‌ఎస్‌, కనుక అనేక మంది అది నిజమే అనుకున్నారు. క్రమంగా మా మీద అలాంటి భ్రమలేవీ పెట్టుకోవద్దని బిజెపి తన చర్యల ద్వారా పదే పదే జనాలకు చెబుతోంది. దానికి తాజా ఉదాహరణే చమురు ధరల స్ధంభన.


నవంబరు నాలుగవ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు దేశంలో చమురు ధరలు స్ధిరంగా కొనసాగుతున్నాయి. తరువాత కూడా మార్చి ఏడవ తేదీ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్‌ చివరి దశ ముగిసేవరకు ఇదే స్ధితి కొనసాగుతుంది. ఇలా చెబుతున్నామంటే జోశ్యం కాదు. ఆచరణ ప్రాతిపదిక ఉంది. ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోండి. 2021 ఫిబ్రవరి 27 నుంచి మార్చి 23 వరకు రు.91.17, మరుసటి రోజు రు.90.99, 25 నుంచి 29వరకు పెట్రోలు రేటు రు.90.78, మరుసటి రోజు నుంచి ఏప్రిల్‌ 14వరకు రు.90.56, ఆ మరుసటి రోజు నుంచి మే మూడవ తేదీ వరకు రు.90.40. ఇదంతా ఐదు రాష్ట్రాల ఎన్నికల అచ్చేదిన్‌లో జరిగింది. ఈ కాలంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఎలా ఉన్నాయి?


ఫిబ్రవరినెల 28 రోజుల్లో చమురు ధరలను 17 సార్లు సవరించారు. ఆ నెలలో ముడి చమురు మనం కొనుగోలు చేస్తున్నది పీపా ధర నెల సగటున 61.22 డాలర్లుంది. మార్చి నెలలో 64.73 డాలర్లకు పెరిగినా ధర ఫిబ్రవరి 27 నుంచి మార్చి 23వరకు ఒకే ధర(రు.91.17) ఆ తరువాత ఇంకా తగ్గింది. ఏప్రిల్‌ నెలలో ముడిచమురు సగటు ధర 63.40 డాలర్లు. మార్చి నెల కంటే ఏప్రిల్‌లో తగ్గింది 1.33 డాలర్లు, దాన్ని వినియోగదారులకు బదలాయించారు గనుక లీటరుకు 38 పైసలు తగ్గించారనుకుందాం ? మరి ఫిబ్రవరి-మార్చినెలల మధ్య పీపా ధరలో 3.51 డాలర్ల పెరుగుదల ఉంటే ధరలను స్ధిరంగా ఉంచటం ఎలా సాధ్యమైనట్లు ? ఇవి ఐదు రాష్ట్రాల ఎన్నికల అచ్చేదినాలు అన్నది స్పష్టం.


ఇప్పుడు జరగనున్న మరో ఐదు రాష్ట్రాల అచ్చేదిన్‌ సంగతి చూద్దాం. ఉప ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలతో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు మీద ఐదు, డీజిలు మీద పది చొప్పున పన్నులు తగ్గించినట్లు ప్రకటించింది. సంతోషం. బిజెపి పాలిత రాష్ట్రాలు నరేంద్రమోడీగారిని ఆదర్శంగా తీసుకొని వాట్‌ను తగ్గించాయి. ఇంకా సంతోషం. జరుగుతున్నదేమిటి ? అక్టోబరు ఒకటి నుంచి నవంబరు 3వరకు 34రోజుల్లో 28 సార్లు సవరించారు. కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ ఎనాలసిస్‌( పిపిఎసి) సమాచారం ప్రకారం సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 27వరకు సగటున పీపా ముడి చమురు దిగుమతి ధర 81.54 డాలర్లు, అక్టోబరు 28 నుంచి నవంబరు 26వరకు 81.51 కాగా నవంబరు 27 నుంచి డిసెంబరు 29వరకు 72.93 డాలర్లకు తగ్గింది. దీపావళి ధమాకా పేరుతో కేంద్రం, రాష్ట్రాలు తగ్గించిన పన్నుల మేరకు తప్ప చమురు కంపెనీలు నవంబరు నాలుగవ తేదీ నుంచి ఇది రాసిన జనవరి 20వరకు 75 రోజులుగా తమ ధరలను ఎందుకు సవరించలేదు ? వాటికి పన్నులతో సంబంధం లేదు కదా ? ముడిచమురు ధరలు పెరిగితే పెంచుతాం తగ్గితే దించుతాం అని చెప్పిన విధానం ఏమైంది ? పాలకులు కంపెనీలను ఎందుకు ప్రశ్నించటం లేదు ? సమాధానం చెప్పే జవాబుదారీ తనం ఉందా ? అసలు కథేమిటి ?


అక్టోబరు 25న గరిష్టంగా మన ముడి చమురు కొనుగోలు ధర పీపా 84.77 డాలర్లను తాకింది.తరువాత క్రమంగా పడిపోతూ డిసెంబరు నాలుగున 69.52 డాలర్లకు తగ్గింది.పదిహేను డాలర్లు తగ్గినా చమురు ధరలు పైసా తగ్గించలేదు. డిసెంబరు సగటు ధర ముందే చెప్పుకున్నట్లు 72.93 డాలర్లు. చంబల్‌ బందిపోట్లు ధనికులను మాత్రమే దోచుకొనే వారు. ప్రభుత్వం ఎవరినీ వదలటం లేదు, అంతకంటే పెద్ద దోపిడీ సాగుతోందా లేదా ? ప్రభుత్వరంగ సంస్థలదే మార్కెట్‌లో ప్రధాన వాటా అయినా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత రిలయన్స్‌ బంకులు కొన్ని తిరిగి తెరుచుకున్నాయి.ప్రభుత్వ ధరలనే అవీ వసూలు చేస్తున్నాయి. ముడి చమురు ధర తగ్గిన మేరకు అదేమీ తగ్గించలేదు. ప్రభుత్వ విధానం దానికి లాభాల పంట పండిస్తున్నపుడు వాటిలో కొంత మొత్తాన్ని ఎన్నికల బాండ్లు, ఇతర రూపాల్లో బిజెపికి అప్పగిస్తుంది గానీ జనాలకు ఎందుకు తగ్గిస్తుంది. ఓకే రిలయన్స్‌ ప్రైవేటు కంపెనీ కనుక అలా చేస్తోంది అనుకుందాం, మరి ప్రభుత్వ కంపెనీలు ?


ఐదు రాష్ట్రాల ఎన్నికల తరుణంలో నెలల తరబడి ధరలను సవరించకుండా బిజెపికి సానుకూలతను సృష్టించేందుకు తమ వంతు చేస్తున్నాయి. దీని వలన ఇతర సరకుల ధరలు కూడా తాత్కాలికంగా కొంత మేరకు అదుపులో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఐదు, పది రూపాయల మేరకు భారం తగ్గించిన తరువాత ముడి చమురు ధరలు తగ్గాయి. ఆమేరకు జనానికి తగ్గించలేదు. డిసెంబరు ఐదు నుంచి ముడి చమురు ధరలు మనం దిగుమతి చేసుకొనేది జనవరి 18వరకు 69.52 డాలర్ల నుంచి 87.03పెరిగింది. నరేంద్రమోడీ ఏలుబడిలో ఇది సరికొత్త రికార్డు. జనవరి 20వ తేదీన బ్రెంట్‌ రకం ముడిచమురు ధర 88.68 డాలర్లకు చేరింది, త్వరలో వంద డాలర్లకు చేరవచ్చని అంచనా.


అక్టోబరు 25న మన దిగుమతి రకం 84.77 డాలర్లు ఒక రికార్డు. ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టింది. ఐనా ధరలు పెంచలేదు.మార్చి ఏడవ తేదీన ఎన్నికల చివరి దశ ముగుస్తుంది. అంటే ఆ రోజు వరకు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఎలా ఉన్నా అప్పటి వరకు ఇప్పుడున్న ధరలే కొనసాగుతాయి. ఆ తరువాతే అసలు కథ మొదలౌతుంది. నవంబరు 4- మార్చి ఏడవ తేదీ మధ్య జరిగిన లావాదేవీల లెక్కలు చూసుకున్నపుడు వచ్చిన లాభం హరించుకుపోయి నష్టం ఉందనుకోండి, ఆమేరకు ధరలు పెంచి లోటు మొత్తాన్ని కంపెనీలు పూడ్చుకుంటాయి. ఈ లోగా బిజెపి తన ప్రచారం తాను చేసుకుంటుంది. కంపెనీలకు వచ్చే ఆర్ధిక నష్టం ఏమీ ఉండదు. అధికార పార్టీలపై వ్యతిరేకత పెరగటానికి ధరల పెరుగుదల ఒక కారణం మాత్రమే. అది ఒక్క చమురు ధరల మీదనే ఆధారపడి ఉండదు. అందువలన వాటిని నియంత్రించి జనాలను మాయ చేయ చూసినా వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు బిజెపికి ఎదురు దెబ్బలు తగలవచ్చు.


తమ పాలిత రాష్ట్రాల మాదిరి ఇతర పార్టీల ఏలుబడిలోని రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాల్సిందే అని బిజెపి డిమాండ్‌ చేసింది. రాష్ట్రాలను దెబ్బతీసే కేంద్ర ప్రభుత్వ ఎత్తుగడ కారణంగా ఇప్పటికే రాష్ట్రాలు ఎక్సయిజు పన్ను వాటాను గణనీయంగా కోల్పోయాయి, వాటిలో మెజారిటీ బిజెపి పాలనలో ఉన్నవే. కేంద్రంలో అధికారం ఉంది కనుక ఆ మేరకు వేరే రూపంలో ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు అలాంటి అవకాశం లేదు.2017లో పెట్రోలు మీద ఎక్సయిజు పన్ను లీటరుకు రు.9.48, డీజిలు మీద రు.11.33 ఉండగా 2021 ఫిబ్రవరిలో ఆ మొత్తాలను కేంద్రం రు.1.40-1.80కి తగ్గించింది. ఆ మేరకు, తరువాత అదనంగా సెస్‌లను విధించింది. వినియోగదారులకు ఎలాంటి మార్పు లేనందున వారికి ఈ మతలబు అర్దం కాలేదు. దీపావళి పేరుతో తగ్గించిన మేరకు రాష్ట్రాలకు వాట్‌ శాతం తగ్గి రాబడి తగ్గింది. పరోక్షంగా అవీ తగ్గించినట్లే. బిజెపి పాలిత రాష్ట్రాలకు ఏదో ఒక రూపంలో కేంద్రం సొమ్ము ముట్టచెబుతుంది.


ఢిల్లీ చుట్టూ హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ ప్రాంతాలు ఉన్నాయి. అక్కడి బంకుల్లో ధరలు తక్కువగా ఉన్నపుడు ఢిల్లీ వాహనదారులందరూ కొద్ది కిలోమీటర్లు వెళ్లి అక్కడే కొనుగోలు చేస్తారు. అది బంకుల వారికి, ఢిల్లీ ప్రభుత్వానికి నష్టమే కనుక కొద్ది రోజు తరువాత ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం పెట్రోలుపై వాట్‌ను 30నుంచి 19.4శాతానికి తగ్గించటంతో డిసెంబరు ఒకటిన రు.104.01గా ఉన్న రేటు నాలుగవ తేదీన రు.95.41కి తగ్గింది. డీజిలు మీద అంతకు ముందే వాట్‌ 16.75శాతం ఉన్నందున డీజిలు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో ఇప్పుడు డీజిలుపై కేంద్ర పన్నులు, సెస్‌ల మొత్తం రు.21.80కాగా రాష్ట్ర పన్ను రు.12.69 మాత్రమే. పెట్రోలు మీద కేంద్ర పన్ను రు.27.90 కాగా ఢిల్లీ రాష్ట్రపన్ను రు.15.60 మాత్రమే. కేంద్ర పన్నులు అన్ని చోట్లా ఒకే విధంగా ఉంటాయి. రాష్ట్రాలలో వాట్‌ రేట్లు భిన్నంగా ఉన్నందున వాటికి అనుగుణంగా మొత్తాలు మారతాయి.


బిజెపి నేతలు, వారికి వంతపాడే నోళ్లు చేసే వాదనల గురించి తెలిసిందే. కేంద్రం విధించే పన్నుల్లో 41శాతం వాటా రాష్ట్రాలకు వస్తుంది. కేంద్రం చేసే ఖర్చు కూడా రాష్ట్రాలలోనే కనుక రాష్ట్రాలకే ఎక్కువ దక్కుతోందని, అందువలన రాష్ట్రాలే పన్ను తగ్గించాలనే కుతర్కాన్ని ముందుకు తెచ్చారు. ఇది జనాలను మోసం చేసే ప్రక్రియ. పిఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసర్చ్‌ సంస్ద వెల్లడించిన వివరాల మేరకు 2017 ఏప్రిల్‌లో పెట్రోలు మీద కేంద్రం విధించిన ఎక్సయిజు పన్ను (రాష్ట్రాలకు వాటా ఇచ్చేది) రు.9.48, సెస్‌,సర్‌ఛార్జీలు రు.12. కేంద్ర పన్నుల్లో వీటి శాతాలు 44-56, కాగా 2021ఫిబ్రవరి నాటికి ఇవి రు.1.40 – 31.50గా ఉన్నాయి, శాతాలు 4-96 మారాయి. ఇదే డీజిలు సంగతి చూస్తే ఎక్సయిజు – సెస్‌,సర్‌ఛార్జీలు 2017 ఏప్రిల్‌లో రు.11.33- రు.6 శాతాల వారీ 65-35గా ఉన్నాయి. 2021 ఫిబ్రవరి నాటికి ఇవి రు.1.80- రు.30 కాగా శాతాలు 6-94కు మారాయి. రాష్ట్రాలకు హక్కుగా రావాల్సిన వాటాకు మోడీ సర్కార్‌ ఎలా కోత పెట్టిందో స్పష్టం. కేంద్రం పన్నుల పేరుతో వసూలు చేసిన మొత్తాలు 2014 తరువాత గణనీయంగా పెరిగాయి.2019-20లో ఆ మొత్తాలు రు.2.38లక్షల కోట్లుండగా 2020-21కి అవి 3.84లక్షల కోట్లకు పెరిగాయి.2020 మేనెలలో పెట్రోలు మీద పది, డీజిలు మీద రు. 13 చొప్పున భారం మోపటమే దీనికి కారణం. ఇదే కాలంలో సెస్‌ను సవరించిన కారణంగా రాష్ట్రాలకు వచ్చే వాటా మొత్తం తగ్గింది. కేంద్రం తగ్గించిన ఐదు, పది వలన కేంద్రానికి ఆదాయం ఎంత తగ్గిందన్నది చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

యువతలో పెరుగుతున్న అసంతృప్తి, అప్పులు దేశానికి ముప్పు- ప్రపంచ ఆర్ధికవేదిక హెచ్చరిక

17 Monday Jan 2022

Posted by raomk in BJP, Economics, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Disillusionment among youth, Global Risk Report, India Youth, Narendra Modi, Narendra Modi Failures, World Economic Forum


ఎం కోటేశ్వరరావు


దవోస్‌ కేంద్రంగా ఉన్న ప్రపంచ ఆర్ధిక వేదిక వార్షిక సమావేశాలు గత నెలలో జరగాల్సినవి కరోనా కారణంగా జనవరి 17-21 తేదీలలో జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతి ఏటా ప్రపంచ ముప్పు నివేదికను వెలువరించటం ఆనవాయితీగా వస్తోంది. వివిధ దేశాలలో గడచిన ఏడాది కాలంలో సంభవించిన సంక్షోభాలను దీనిలో విశ్లేషిస్తారు.ఆర్ధిక వేదిక సమావేశాల్లో వాటికి తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రపంచ నేతలు చర్చిస్తారు. ఈ సారి ఏమి చర్చిస్తారో, ఏం జరుగుతుందో సమావేశాల తరువాత చూద్దాం. గతేడాది మాదిరే ఈ సారి కూడా కరోనా సంక్షోభం మీదే ప్రధానంగా కేంద్రీకరణ ఉంది. ప్రతిదేశం ఎదుర్కొంటున్న ముప్పుల గురించి దీనిలో చర్చించారు.
మన దేశం ఐదు ప్రధాన ముప్పులను ఎదుర్కొంటున్నదని 2022 నివేదికలో పేర్కొన్నారు. ఒకటి యువత అసంతృప్తి,రుణభారం, డిజిటల్‌ అసమానత, అంతర్రాష్ట సంబంధాలు దెబ్బతినటం, సాంకేతిక పాలన వైఫల్యంగా పేర్కొన్నారు. పని కోసం అడ్డాల మీదకు వస్తున్న వారికి ఉపాధి చూపకపోతే పక్కదార్లు పడతారు. అనేక సామాజిక సమస్యలు తలెత్తుతాయి. పర్యవసానాలను ఊహించలేము. జి-20 కూటమిలోని మన దేశంలో ఇది పెద్ద ముప్పుగా ఉంది. దేశంలో కార్మికశక్తి భాగస్వామ్యం 2020లో 46.29శాతం ఉండగా చైనాలో 66.82శాతం ఉంది. గతేడాది డిసెంబరులో సిఎంఐఇ సమాచారం ప్రకారం దేశం మొత్తంగా 7.91శాతం, పట్టణాల్లో 9.3,గ్రామాల్లో 7.28శాతం నిరుద్యోగులున్నారు. పరిస్ధితి ఎప్పుడు మెరుగుపడుతుందో అర్ధంగాని స్ధితిలో యువత ఉంది. కరోనాకు ముందే నిరుద్యోగం నాలుగున్నర దశాబ్దాల రికార్డును అధిగమించిందన్న సమాచారాన్ని లోక్‌సభ ఎన్నికల ముందు ప్రభుత్వం తొక్కిపెట్టింది. అనధికార మార్గం ద్వారా వెల్లడైన అంశాలను వాస్తవం కాదని తోసి పుచ్చి లెక్కలు సరిగా లేవని చెప్పింది. ఎన్నికలు ముగిశాక ఆ నివేదికనే గుట్టుచప్పుడు కాకుండా అంగీకరించింది. అప్పటితో పోల్చితే ఇప్పుడు పరిస్ధితి ఇంకా దిగజారింది.వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌లో నిరుద్యోగం ద్రవ్యోల్బణం కూడా ఎక్కువగా ఉన్నట్లు వివరాలు చెబుతున్నాయి.


1975అత్యవసర పరిస్ధితికి ముందున్న నిరాశా, నిస్పృహలు కనిపిస్తున్నాయి.2014, 2019లో రెండు సార్లు మంచి రోజులను తెస్తానన్న నరేంద్రమోడీ వాగ్దానం,రేకెత్తించిన ఆశలకు ఇది విరుద్దం. వెనుకా ముందూ ఆలోచించకుండా, కుల, మతాలను అధిగమించి మద్దతు ఇచ్చిన వారు హతాశులౌతున్నారు. ఒకసారి అధికారంలో అన్నీ చేయటం ఎవరికైనా కష్టమే, రెండోసారి అవకాశం ఇద్దాం అనుకున్నవారు ఫలితాలు వచ్చిన దగ్గర నుంచీ ఊహించని పరిణామాలను చూస్తున్నారు.


నైపుణ్యశిక్షణ ఉంటే ఇంకేముంది ఉద్యోగం సిద్దం అన్నారు. డిగ్రీలు పుచ్చుకున్నవారు కాలేజీల నుంచి వెలుపలికి రాగానే వేలాది రూపాయలు వెచ్చించి పొందిన శిక్షణలు ఉపాధికి పనికి రాకుండా పోతున్నాయి. అసమానతలు, ఆర్ధిక రంగ పునరుద్దరణ, కరోనా పర్యవసానాలు కనీసం పదేండ్ల పాటు ప్రతికూల ప్రభావాలు చూపుతాయనే నిపుణుల అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కుటుంబాలు, దేశం అప్పుల పాలు కావటం కూడా యువత మీద ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. పాలకులు చేసిన అప్పులకు వడ్డీ, అసలు మొత్తాలకు వచ్చిన ఆదాయాలను ఖర్చు చేస్తారా లేక ఉపాధికి అవసరమైన పెట్టుబడులు పెడతారా అంటే మొదటి దానికే మొగ్గు. రెండవ దానికి ప్రాధాన్యత ఇచ్చి ఉంటే వనరుల వృద్ది జరిగి అపులు చేయాల్సి వచ్చినా పరిమితంగా ఉండేవి. కరోనా పేరుతో ఒకవైపు జనాల మీద భారాలు మోపుతూ అప్పులకు సైతం వాటినే కారణాలుగా చూపుతున్నారు. అసలు కార్పొరేట్లకు ఇచ్చే రాయితీలకే ఎక్కువగా మళ్లిస్తున్నారు.కరోనా కారణంగా అసమానతలు మరింత పెరిగినట్లు ప్రపంచబాంకు కూడా చెప్పింది. ప్రపంచంలోని ధనికుల్లో ఎగువన ఉన్న 20శాతం మంది 2021లో తమ నష్టాలలో సగాన్ని తిరిగి పొందగలిగితే, దిగువ 20శాతం మంది ఐదుశాతంపైగా ఆదాయాలను కోల్పోయారు. కరోనా ముందున్న పరిస్ధితితో పోల్చితే 2030 నాటికి 5.1 కోట్ల మంది ఎక్కువగా దుర్భరదారిద్య్రంలో ఉంటారని అంచనా.


ఒక్క యువతే కాదు, గత ఎనిమిది సంవత్సరాల మోడీ పాలన చూసినపుడు ఏ రంగంలోనూ ఆశాజనక పరిస్ధితి కనిపించటం లేదు. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లు ఏ రంగంలో చూసినా దిగజారుడు లేదా గిడసబారుడే.చెప్పుకొనే గొప్పలకు తక్కువ లేదు. దేశాన్ని అవినీతి నుంచి రక్షిస్తానని నేను తినను ఎవరినీ తిననివ్వను అని నరేంద్రమోడీ చెప్పినపుడు సంసార బంధాలు, బాధ్యతలు లేవు గనుక నిజంగానే చేస్తారని జనం నమ్మారు, ఇప్పటికీ నమ్ముతున్నారు. తన ఆశ్రితులకు అప్పనంగా జన సంపదలను అప్పగించటం ఏమిటన్నది ప్రశ్న. ఎవరి మేలుకోసం ఇది చేస్తున్నట్లు ?ప్రపంచ వాణిజ్య లంచాల ముప్పు సూచికలో మన దేశ స్ధానం 2021లో 82లో ఉంది, అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే ఏడు స్ధానాలు దిగజారింది. మొత్తంగా ఎనిమిదేండ్ల పాలన చూసినపుడు 2014లో ఉన్న 82వ స్ధానమే ఇప్పుడూ ఉంది. మరి అవినీతిని అరికట్టిందెక్కడ ? ట్రేస్‌ అనే అంతర్జాతీయ సంస్ధ 194 దేశాలతో రూపొందించిన జాబితాలో మన స్ధానం అది. 2020లో 45 మార్కులు వస్తే 2021నాటికి 44కు తగ్గాయి.2014లో కూడా అన్నే మార్కులొచ్చాయి. ప్రభుత్వంతో వాణిజ్యలావాదేవీలు, అవినీతి నిరోధక చర్యలు, పౌరయంత్రాంగ పారదర్శకత, మీడియాతో సహా పౌరసమాజ నిష్ట సామర్ధ్యం తదితర అంశాల ప్రాతిపదికన దీన్ని మదింపువేస్తారు. ముడుపుల డిమాండ్‌ ఎక్కువగా ఉందంటే విదేశీ సంస్ధలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయి.


దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు. కాంగ్రెస్‌ 50 సంవత్సరాల్లో చేసిన వాటిని తాము ఐదు సంవత్సరాల్లోనే చేసినట్లు చెప్పుకున్న పాలకుల ఏలుబడిలో ఉన్నాము. అనేక సూచికలను చూస్తే వివిధ అంశాలలో మనం ఎక్కడున్నాం అన్నది అవలోకనం చేసుకోవాల్సి ఉంది. వైఫల్యాలను కాంగ్రెస్‌ మీదో మరొకరి మీదో నెడితే ఇంకేమాత్రం కుదరదు. స్వాతంత్య్రం తరువాత అత్యంతబలమైన ప్రభుత్వాన్ని నరేంద్రమోడీ మాత్రమే నెలకొల్పారని చెబుతున్నపుడు ఫలితాలు కూడా అలాగే ఉండాలి కదా ! లంచాల సూచికలో పని తీరు ఏమిటో చూశాము. మరికొన్నింటిలో ఏ స్ధానంలో ఉన్నామో పరిశీలించుదాం.
ప్రపంచ వాణిజ్య లంచాల ముప్పు సూచిక 82(2021)
నిరంతర అభివృద్ధిసూచిక(ఎస్‌డిజి) 120 (2021)
మానవాభివృద్ధి సూచిక(యుఎన్‌డిపి) 131 (2020)
ప్రపంచ లింగవివక్ష(ప్రపంచ ఆర్ధికవేదిక) 140 (2021)
ప్రపంచ ఆకలి సూచిక 94(2020)
ప్రపంచ యువత ఆభివృద్ధి సూచిక 122(2020)
ప్రపంచ ఆరోగ్య భద్రత సూచిక 57(2019)
ప్రపంచ ముప్పు సూచిక 89(2020)
ప్రపంచ పర్యావరణ ముప్పు సూచిక 7(2021)
ప్రపంచ ఉగ్రవాద ముప్పు సూచిక 8 (2020)
ప్రపంచ ప్రజాస్వామ్య (ఇఐయు) సూచిక 53(2020)
ప్రపంచ మానవ స్వేచ్చ (కాటో) సూచిక 111(2020)
ప్రపంచ ఆర్ధిక స్వేచ్చ సూచిక 105(2020)
ప్రపంచ అవినీతి దృష్టి సూచిక 86(2020)
ప్రపంచ పత్రికా స్వేచ్చ సూచిక 142(2021)
ప్రపంచ సుపరిపాలన సూచిక 49(2021)
ప్రపంచ సులభతర వాణిజ్య సూచిక 63(2019)
ప్రపంచ పోటీతత్వ సూచిక 43(2021)
ప్రపంచ నవకల్పన సూచిక 48(2020)
ప్రపంచ పిల్లల హక్కుల సూచిక 112(2021)
ప్రపంచ అసమానతల నివారణ నిబద్దత సూచిక 129(2020)
ప్రపంచ ఇంటర్నెట్‌ సూచిక 49(2021)
ప్రపంచ ప్రతిభ పోటీతత్వ సూచిక 72(2021)
ప్రపంచ శాంతి సూచిక 135(2021)
ప్రపంచ విద్యా సూచిక 135(2020)


దేశ రుణ భారం ఆకస్మికంగా పెరిగింది. ఇది అన్ని రంగాల మీద ప్రభావం చూపుతుంది. ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం ప్రపంచ రుణం 226లక్షల కోట్ల డాలర్లు.2019 కంటే 27లక్షల కోట్ల డాలర్లు ఎక్కువ. కరోనా తరువాత విపరీతంగా పెరిగింది. మన జిడిపిలో అప్పు మొత్తం 90.6శాతం ఉంది. మన అప్పులు 2016లో 68.9శాతం కాగా 2020 నాటికి 89.6, మరుసటి ఏడాదికి 90.6శాతానికి పెరుగుతుందని అంచనా వేశారు. తరువాత మొత్తంగా చూస్తే అప్పు పెరిగినప్పటికీ జిడిపి పెరుగుదల కూడా ఉంటుంది కనుక దానితో పోలిస్తే 2022లో 88.8 నుంచి 2026 నాటికి 85.2శాతానికి చేరుతుందని అంచనా. అంటే కరోనా ముందు స్ధితికి చేరే అవకాశమే లేదు. రుణాల పెరుగుదల వలన సామాజిక అశాంతి పెరుగుతుందని ఐఎంఎఫ్‌ నివేదిక హెచ్చరించింది. పాలకులు ఇప్పటికైనా పట్టించుకొని పరిష్కారాలను చూస్తారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉత్తర ప్రదేశ్‌ బిజెపికి తాళం కప్ప బహుమతి – ఒక మంత్రి, 15 మంది ఎంఎల్‌ఏలు రాం రాం !

12 Wednesday Jan 2022

Posted by raomk in BJP, Communalism, Congress, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION

≈ Leave a comment

Tags

#Akhilesh Yadav, BJP, Hinduthwa, Narendra Modi, OBC, Swami Prasad Maurya, UP BJP poll fate, UP poll 2022, Yogi Adityanath


ఎం కోటేశ్వరరావు


మంగళవారం నాడు ఉత్తర ప్రదేశ్‌ బిజెపికి అనూహ్య బహుమతి లభించగా, ఊహించని దెబ్బ తగిలింది. దాదాపు 60 మంది ఎంఎల్‌ఏలను తప్పించి కొత్త ముఖాలతో బరిలోకి దిగేందుకు ఢిల్లీలో మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు. కార్మిక శాఖ మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్య పదవికి రాజీనామా చేసి సమాజవాది పార్టీ నేతతో ఫొటోకు ఫోజిచ్చారు. మరో ముగ్గురు ఎంఎల్‌ఏలు కూడా అదే బాట పట్టారు. పదమూడు మంది బిజెపి ఎంఎల్‌ఏలు రాజీనామా చేయనున్నట్లు ఎన్‌సిపి అధినేత శరద్‌ పవార్‌ ప్రకటించారు. తన బాటలో నడిచే వారు 15 మంది వరకు ఉన్నట్లు మౌర్య చెబుతున్నారు. మరో మంత్రి ధరమ్‌ సింగ్‌ సయానీ కూడా ఇదే బాటపట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. సీట్లు రాని వారు, బిజెపి గెలిచే అవకాశాలు లేవని గ్రహించిన వారు ఎందరు రాం రాం చెబుతారో తెలియదు. మార్చి పదవ తేదీ తరువాత పార్టీ కార్యాలయాన్ని మూసుకోవాల్సి వస్తుంది కనుక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌ సింగ్‌కు తాళం కప్పను బహుమతిగా పంపినట్లు సమాజవాది పార్టీ నేత ఐపి సింగ్‌ ప్రకటించారు. ” ఓం ప్రకాష్‌ రాజభర్‌, జయంత్‌ చౌదరి, రాజమాత కృష్ణపటేల్‌, సంజయ చౌహాన్‌, ఇప్పుడు స్వామి ప్రసాద్‌ మౌర్య మాతో ఉన్నారు. బిజెపి ప్రధాన కార్యాలయానికి తాళం కప్పను బహుమతిగా పంపాను. మార్చి పదవ తేదీ(ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు) తరువాత తాళం వేసి ఇంటికి వెళ్లి పోండి. ఇది అలకాదు, ఎస్‌పి తుపాను ” అని ట్వీట్‌ చేశారు.


యోగి సర్కార్‌ ఒబిసిలు, దళితులు, రైతులు,చిన్న సన్నకారు వ్యాపారులు, నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తోందని మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్య ట్వీట్‌ ద్వారా రాజీనామా లేఖ పంపారు. ఇది వెలువడిన కొన్ని నిమిషాల్లోనే మౌర్య సమాజవాది నేత అఖిలేష్‌ యాదవ్‌ను కలిసిన ఫొటో దర్శనమిచ్చింది.స్వామి ప్రసాద్‌ను పార్టీలోకి ఆహ్వానించినట్లు అఖిలేష్‌ ప్రకటించారు. ఐదు సార్లు ఎంఎల్‌ఏగా, మంత్రిగా పనిచేసి మాయావతి తరువాత నేతగా పేరున్న మౌర్య 2016లో బిఎస్‌పి నుంచి బిజెపిలో చేరారు. ఇప్పుడు సమాజవాదిలో నేరుగా చేరతారా లేక గతంలో ఏర్పాటు చేసిన వేదికను పునరుద్దరించి మిత్రపక్షంగా బరిలోకి దిగుతారా అన్నది ఇంకా స్పష్టం కాలేదు.
ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల గురించి వివిధ సర్వేలు వెలువడుతున్నాయి. ఏబిపి-సి ఓటర్‌ 2021 మార్చి 18న ఒక సర్వే, తాజాగా జనవరి 10న సర్వే వివరాలను ప్రకటించింది.మధ్యలో మరోనాలుగు సర్వేలను నిర్వహించింది.తొలి, తాజా సర్వేల అంచనా సీట్లు, ఓట్లశాతాలు ఇలా ఉన్నాయి.తొమ్మిది నెలల కాలంలో బిజెపి పలుకుబడి ఎలా పడిపోతోందో ఈ వివరాలు సూచిస్తున్నాయి. నామినేషన్లు, ఉపసంహరణల లోగా జరిగే పరిణామాలు పార్టీ ప్రభావాన్ని మరింతగా దిగజార్చేవే తప్ప పెంచేవిగా లేవు.


తేదీ××××××ఎన్‌డిఏ ×××××××ఎస్‌పి×××××××బిఎస్‌పి×××××××కాంగ్రెస్‌×× ఇతరులు
18.3.21××284-294(41)×××54-64(24.4)×××33-43(20.8)××1-7(5.9)××10-16(7.9)
10.1.22××223-235(41.5)××145-157(33.3)××8-16(12.9)××3-7(7.1)××4-8(5.3)
గతఫలితాలు××312(41.4)××47(23.6)××××19(22.2)××××××× 7(6.3)××××ు(6.5)


తన వంటి ఉదారవాదులు బిజెపి ఓడిపోవాలని కోరుకుంటున్నప్పటికీ ఉత్తర ప్రదేశ్‌లో అదే జరిగితే దేశంలో సంస్కరణలు వెనుకపట్టు పడతాయని కార్పొరేట్లకు కొమ్ముకాసే ప్రముఖ జర్నలిస్టు స్వామినాధన్‌ అంక్లేశ్వరియా అయ్యర్‌ పేర్కొన్నారు. ఎకనమిక్స్‌ టైమ్స్‌ ప్రతినిధితో మాట్లాడుతూ సాగు చట్టాల ప్రహసనంతో ఇప్పటికే సంస్కరణలు వెనుకపట్టు పట్టాయి.మానిటైజేషన్‌, కార్మిక సంస్కరణలు కూడా అదే విధంగా మారతాయన్నారు. ఉత్తర ప్రదేశ్‌ నుంచి వెలువడుతున్న చెడు సంకేతాల కారణంగా మానిటైజేషన్‌ మందగించిందన్నారు. బిజెపి గెలిస్తే సంస్కరణలు వేగంగా అమలు జరుగుతాయని, ఓడితే మిగతా రాష్ట్రాల సంస్కరణల మీద కూడా ప్రభావం ఉంటుందన్నారు. దేశ ఆర్ధిక రంగం ఏ బాటలో నడుస్తుందన్నది వచ్చే బడ్జెట్‌ మీదగాక ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. బిజెపి మతతత్వ వైఖరిని అయ్యర్‌ వంటి వారు ఆమోదించనప్పటికీ సమాజం ఏమైనా ఫరవాలేదు కార్పొరేట్ల ప్రయోజనాల కోసం గెలవాలని కోరుకుంటున్నారు. కార్పొరేట్ల అంతరంగానికి ఇది ప్రతిబింబం.


సీట్ల సంఖ్య తగ్గినా తిరిగి అధికారం ఖాయం అనే ముక్తాయింపులు తప్ప గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో బిజెపికి ఓట్లశాతం పెరుగుతుందని ఏ సర్వే కూడా చెప్పటం లేదు. ప్రభుత్వ వ్యతిరేకత ఉందని చెబుతున్నపుడు ఓట్లు తగ్గకుండా ఎలా ఉంటాయన్న ప్రశ్న తలెత్తుతోంది.తన ఓటు బాంకును నిలుపుకొనేందుకు యోగి ఆదిత్యనాధ్‌ రాష్ట్ర ఎన్నికలు 80-20శాతాల మధ్య జరగనున్నాయంటూ మతాన్ని ముందుకు తెచ్చారు. ఉత్తర ప్రదేశ్‌ జనాభాలో 80శాతం హిందువులు, 20శాతం ముస్లింలు ఉన్నారన్న సంగతి తెలిసిందే.403కు గాను 140 నియోజకవర్గాలలో 70 చోట్ల ఓటర్లలో 30శాతం, మిగిలిన చోట్ల 25-30శాతం వరకు ముస్లిం సామాజిక తరగతికి చెందిన వారున్నారని అంచనా. బిజెపి బీ టీమ్‌గా భావిస్తున్న మజ్లిస్‌ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది, ఐనప్పటికీ అత్యధిక ఓటర్లు ఎస్‌పి వైపు మొగ్గు చూపనున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. బిఎస్‌పిలో మాయావతి తరువాత స్ధానంలో ఉన్న మౌర్య తమ పార్టీలో చేరినపుడు గొప్ప పరిణామంగా చిత్రించిన బిజెపి ఇప్పుడు అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా ఒక రోజు సంచలన వార్త తప్ప ఏదో ఒక రోజు ఇలా చేస్తారని తమకు తెలుసు అని బిజెపి చెబుతోంది. కుమార్తె సంఘమిత్ర ఎంపీగా ఉన్నారని, తన కుమారుడికి సీటు ఇవ్వాలన్న కోర్కెను పార్టీ తిరస్కరించినందున ఇలా చేశారని ఆరోపించింది.(గత ఎన్నికల్లో సీటు ఇచ్చారు, సమాజవాదీ చేతిలో ఓడారు) బిజెపి విధానానికి వ్యతిరేకంగా ఓబిసి జన గణన చేయాలని కోరిన వారిలో మౌర్యఒకరు.


సమాజవాదితో మౌర్య చేతులు కలిపితే యాదవేతర ఓబిసిల్లో కొంత శాతం బిజెపికి దూరమైనా ఫలితాలు చాలా చోట్ల తారుమారౌతాయి. వెనుకబడిన తరగతుల్లో మౌర్య, కుష్వాహ సామాజిక తరగతికి చెందిన వారిలో స్వామి ప్రసాద్‌ మౌర్య పలుకుబడి కలిగిన నేత. ఇదే సామాజికి తరగతికి చెందిన కేశవ ప్రసాద్‌ మౌర్య ఉపముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అంతపలుకుబడి కలిగిన వారని కాదని చెబుతారు. ఇప్పటికే బిజెపి కూటమి నుంచి మరో రెండు బిసి సామాజిక తరగతుల నేతలు సమాజవాది పార్టీతో చేతులు కలిపారు.యాదవులు మినహా మిగిలిన ఓబిసిలందరూ తమతో ఉన్నారని బిజెపి చెప్పుకొనేందుకు ఇప్పుడు అవకాశం లేదు. కాంగ్రెస్‌కు చెందిన బలమైన నేత ఇమ్రాన్‌ మసూద్‌ కూడా తాను ఎస్‌పిలో చేరుతున్నట్లు ప్రకటించారు. గణనీయ సంఖ్యలో ఉన్న ముస్లింలు ఎస్‌పి, బిఎస్‌పి, కాంగ్రెస్‌ పార్టీల వెనుక చీలి ఉన్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాల నేపధ్యంలో మెజారిటీ ఇప్పుడు ఎస్‌పి వెనుక సమీకృతులౌతున్నట్లు చెబుతున్నారు. గతంలో ముజఫర్‌ నగర్‌ ప్రాంతంలో మతఘర్షణల్లో జాట్లు-ముస్లింలు మతాల వారీ చీలినప్పటికీ ఇటీవలి రైతు ఉద్యమం వారిని సన్నిహితం చేసిందని వార్తలు వచ్చాయి. ఏడు దశలుగా జరిగే ఎన్నికల్లో తొలి రెండు దశలకు జనవరి 14న నామినేషన్లు ప్రారంభమౌతాయి. ఈ దశల్లోని 113 సీట్లకు ముందుగా బిజెపి అభ్యర్దులను ఖరారు చేయనుంది. సమాజవాది కూడా అదే పద్దతిని పాటించవచ్చు. తాను పోటీ చేయటం లేదని ప్రకటించిన మాయావతి బిఎస్‌పి తరఫున అన్ని చోట్లా పోటీ పెట్టనున్నట్లు ప్రకటించారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d