• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: STATES NEWS

 వేతన వాయిదా సరే, ఏపి మూడు రాజధానులు, తెలంగాణా కొత్త సచివాలయం సంగతేమిటి !

31 Tuesday Mar 2020

Posted by raomk in AP, AP NEWS, Current Affairs, employees, History, NATIONAL NEWS, Opinion, Pensioners, Telangana

≈ Leave a comment

Tags

Aandhra Pradesh three Capitals, AP CM YS Jagan, Government Employees wage deferment, KCR, Telangana CM

KCR, KTR extend wishes to YS Jagan for landslide victory in AP ...

ఎం కోటేశ్వరరావు
ఉద్యోగుల వేతనాల కోత పెట్టవద్దు, ఉద్యోగాలను రద్దు చేయవద్దు అని ప్రధాని నరేంద్రమోడీ దేశంలోని అన్ని కంపెనీలను కోరారు. ఎంత మంది దయగల యజమానులు దాన్ని అమలు జరుపుతారో చూడాల్సి ఉంది. అనేక మంది ప్రధాని, ముఖ్య మంత్రుల సహాయ నిధులకు విరాళాలు ఇస్తూ ప్రచారం చేసుకుంటున్నారు తప్ప తమ సంస్ధలలో వేతనాలు, ఉద్యోగాల గురించి ఏమి చెబుతున్నారో మనకు తెలియదు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత అంటూ మంగళవారం నాడు తెలంగాణా గురించి మీడియాలో వార్తలు వచ్చాయి. తీరా ప్రభుత్వ ఉత్తరువును చూసే ఎంతశాతం వేతనాల చెల్లింపువాయిదా వేస్తున్నారో దానిలో పేర్కొన్నారు. కోతకు వాయిదాకు తేడా ఉంది. కోత విధిస్తే తిరిగి రాదు, వాయిదా అయితే వస్తుంది. ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి చెల్లించే వేతనాలకు ఇది వర్తిస్తుందని, తదుపరి ఉత్తరువులు ఇచ్చేంతవరకు ఇది కొనసాగుతుందని పేర్కొన్నారు. అంటే ఎన్నినెలలు అన్నది చెప్పకపోవటంతో పాటు వాయిదా వేసిన వేతన మొత్తాలను ఎప్పుడు, ఎలా తిరిగి చెల్లించేది కూడా సదరు ఉత్తరువులో లేదు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో ఎలాంటి చర్చలు జరపకుండా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఇది.
విపత్తు సమయాలలో అలాంటి నిర్ణయాలు తీసుకొనే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ సిబ్బంది ప్రతినిధులతో చర్చించి విధి విధానాలకు సంబంధించి ఆదేశాలు జారీ చేస్తే అదొకతీరు. లేనపుడు ఏకపక్ష నిర్ణయంగానే పరిగణించాల్సి ఉంది. వేతనాలతో పాటు పెన్షన్లు కూడా వాయిదా వేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అసెంబ్లీ, శాసనమండలి, అన్ని స్ధానిక సంస్ధలకు ఎన్నికైన ప్రజాప్రతినిధుల మొత్తం వేతనాల్లో 75శాతం, అఖిలభారత సర్వీసు తరగతికి చెందిన వారికి 60శాతం, ఇతర ఉద్యోగులలో నాలుగవ తరగతికి చెందిన వారికి మినహా మిగిలిన వారందరికీ 50శాతం, నాలుగవ తరగతి వారికి పదిశాతం వేతన చెల్లింపు వాయిదా ఉంటుంది. పెన్షన్లలో కూడా ఇదే శాతాలలో వాయిదా ఉంటుంది. అత్యవసర సేవలు అందిస్తున్న ఉద్యోగులకు సైతం ఎలాంటి మినహాయింపు లేదు.
ఆర్ధిక పరిస్ధితి అంతా సజావుగా ఉంది అని ముఖ్య మంత్రి కె చంద్రశేఖరరావు బడ్జెట్‌ ప్రవేశపెట్టే సందర్భంగా చెప్పిన మాటలు ఇంకా చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. మార్చినెల 31వ తేదీతో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో 1,42,492 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామని, వచ్చే ఆర్ధిక సంవత్సరానికి 1,82,914 కోట్లు ఖర్చు చేస్తామని ఆర్ధిక మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈలోగా ఉద్యోగుల వేతనాల్లో సగాన్ని వాయిదా వేయాల్సిన అగత్యం ఏమి వచ్చిందో ప్రభుత్వం చెప్పలేదు. ఇంతకంటే తీవ్ర పరిస్ధితిని ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏప్రిల్‌ ఒక్క నెల సగం వేతనం ఇస్తామని, మిగిలిన సగం మొత్తాన్ని పరిస్ధితి మెరుగుపడిన తరువాత సర్దుబాటు చేస్తామని చెప్పినట్లు ప్రభుత్వ ఉద్యో గుల సంఘనేత ఒకరు చెప్పారు. తెలంగాణాలో నిరవధికంగా వేతన వాయిదాను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మీడియాకు వెల్లడించినదాని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు రెండు విడతలుగా జీతం ఇస్తామని సీఎం జగన్‌ చెప్పారని, రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నందున తాము సీఎం సూచనకు అంగీకరించామని వెల్లడించారు. ఈ ఒక్క నెల మాత్రమే జీతం రెండు విడతలుగా ఇస్తామని సీఎం చెప్పినట్టు సూర్యనారాయణ వివరించారు. కరోనా పరిస్థితుల ప్రభావంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని, ఈ నెలలో సగం జీతం ఇస్తామని చెప్పారని, మిగిలిన జీతం నిధులు సర్దుబాటు అనంతరం ఇస్తామని తెలిపారని సూర్యనారాయణ పేర్కొన్నారు. ఇదే విధంగా తెలంగాణా ముఖ్యమంత్రి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న సంఘాలుగా భావించబడుతున్నవారితో అయినా ఎందుకు సంప్రదించలేదన్నది ప్రశ్న. ఆంధ్రప్రదేశ్‌ అయినా తెలంగాణా అయినా ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయాలతో ఉద్యోగులు, పెన్షనర్లను తాత్కాలికంగా అయినా ఇబ్బందులకు గురి చేశారని చెప్పక తప్పదు. ప్రతి నెలా చెల్లించాల్సిన వాయిదా మొత్తాలు, ఇతర అవసరాలకు వేసుకున్న కుటుంబ బడ్జెట్లు తీవ్రంగా ప్రభావితం అవుతాయని ఇద్దరు ముఖ్యమంత్రులు, వారి సలహాదారులు, ఉన్నత అధికారులకు తెలియదా ? వాయిదా వేసిన వేతన మొత్తాల మేరకు కూడా రిజర్వుబ్యాంకు నుంచి రుణం లేదా అడ్వాన్సు తెచ్చుకోలేని దుస్ధితిలో ప్రభుత్వాలు ఉన్నాయా లేక వడ్డీ భారాన్ని ఉద్యోగుల మీద మోపే ఎత్తుగడ అనుకోవాలా ?
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ కంటే ముందుగా అసోం ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలనుంచి కొంత మినహాయించేందుకు నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగ సంఘంతో ఆర్ధిక మంత్రి చర్చలు జరిపి వారిని ఒప్పించి నిర్ణయం తీసుకున్నారు. కరోనా నిరోధ చర్యల్లో నిమగమైన వారికి వేతన మినహాయింపు వర్తింప చేయరాదని కోరినట్లు ఉద్యోగ సంఘనేతలు ప్రకటించారు.వేతనాన్ని పది నుంచి ఇరవై శాతం వరకు మార్చినెలకు మినహాయిస్తారు. ఆ మొత్తానికి నాలుగున్నరశాతం వడ్డీతో తరువాత ఉద్యోగులకు చెల్లిస్తారు.
మరో రాష్ట్రం మహారాష్ట్రలో ప్రజాప్రతినిధుల వేతనాల్లో 60శాతం, ఒకటి, రెండవ తరగతి అధికారుల వేతనాల్లో 50, మూడవ తరగతి ఉద్యోగులకు 25శాతాన్ని మినహాయిస్తారు, ఇతరులకు ఎలాంటి మినహాయింపులేదు. వీటిని చూసినపుడు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో ఎన్‌జివోలు, ఉపాధ్యాయులు తీవ్రంగా ప్రభావితం అవుతారన్నది స్పష్టం. పెన్షనర్ల సంగతి చెప్పనవసరం లేదు. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాది చివరిలో నిధులకు కటకటను ఎదుర్కొంటాయి. అందుకు గాను ముందుగానే బిల్లుల చెల్లింపు, కొత్తగా పనుల మంజూరు, వాహనాల కొనుగోలు వంటి కొన్ని చర్యలను ప్రకటించటం సర్వసాధారణం. ఇప్పుడు ఆర్ధిక సంవత్సరం ఆరంభమే ఉద్యోగుల వేతనాల వాయిదాతో ప్రారంభమైంది. ఇది మంచి సూచిక కాదు. తెలంగాణాలో ప్రస్తుతం రెండు విడతల కరవు భత్యం బకాయి ఉంది, ఇప్పటికే ప్రకటించిన మేరకు పిఆర్‌సి డిసెంబరు వరకు వెలుగు చూసే అవకాశం లేదు. మధ్యంతర భృతి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
ఇతర దేశాల్లో ఉద్యోగులు, కార్మికుల పరిస్ధితి ఎలా ఉందో చూద్దాం. లాటిన్‌ అమెరికాలోని పరాగ్వేలో ప్రభుత్వ రంగ సిబ్బందికి మూడునెలల పాటు వేతనాల కోతను ప్రకటించారు. దేశాధ్యక్షుడు పొందుతున్న వేతనానికి మించి ప్రభుత్వ రంగ సంస్ధలలో ఉన్నతాధికారులెవరికీ వేతనాలు చెల్లించకూడదన్నది వాటిలో ఒకటి.దేశంలో ప్రకటించిన కనీస వేతనాల కంటే ఐదు రెట్లు ఎక్కువ పొందే వారికి పదిశాతం, పది రెట్లు పొందేవారికి 20శాతం వేతన కోత విధిస్తారు.ప్రజారోగ్యవ్యవస్ధను మెరుగుపరచే పేరుతో ఈ కోత విధించారు.

Telangana government lifts ban on transfer of employees till June ...
సింగపూర్‌లో కూడా తీసుకోవాల్సిన చర్యల గురించి జాతీయ వేతన మండలి కొన్ని సూచనలు చేస్తూ ఆయా రంగాలలో ముందున్నవారు నమూనాగా నిలవాలని కోరింది. ఉద్యోగుల వేతనాల కోత చర్యలకు ముందు కంపెనీలు యాజమాన్య పొదుపు సంగతి చూడాలన్నది సూచనలలో ఒకటి. యూనియన్లతో వేతన సంప్రదింపులకు ముందు కంపెనీల పరిస్ధితి గురించి అన్ని విషయాలు వివరించాలి. అన్ని చర్యల తరువాతే ఉద్యోగుల తొలగింపు ఉండాలని ప్రభుత్వం కంపెనీలకు చెప్పాలి. ముందు కంపెనీలు వేతనేతర ఖర్చు తగ్గించాలి. మానవ వనరులు ఎక్కువగా ఉన్నట్లు భావిస్తే ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించాలి. ప్రభుత్వ సాయాన్ని పొందాలి. మూడవదిగా వేతన కోతలుండాలి. తక్కువ వేతనాలు పొందేవారి మీద నామమాత్ర ప్రభావం పడాలి. వేతనాలు పెరిగే కొద్దీ కోతలు పెరగాలి. తప్పనిసరి అయితే ఉద్యోగుల తొలగింపు బాధ్యతాయుత పద్దతిలో జరగాలి.
ఈ నేపధ్యంలో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ పాలకులు అన్ని ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపి ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకొని ఉండాల్సింది. ముందుగా ప్రభుత్వ శాఖలలో దుబారా తగ్గింపు చర్యలు ప్రకటించాలి. వాటి గురించి ఉద్యోగ సంఘాలు, సామాజిక, రాజకీయ, ప్రజాసంఘాలతో చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకొని ఉంటే కరోనాపై ఏకోన్ముఖ పోరాటం చేస్తున్న సందేశం జనంలోకి వెళ్లి ఉండేది. తెలంగాణాలో అవసరం లేకపోయినా వందల కోట్లు ఖర్చయ్యే కొత్త సచివాలయ నిర్మాణ ప్రతిపాదనను ప్రభుత్వం ఇంతవరకు విరమించుకోలేదు.ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అయినా ఆ పని చేసి ఉంటే గౌరవ ప్రదంగా ఉండేది. కొత్త అసెంబ్లీ, శాసనమండలి భవనాలు, కొత్త హైకోర్టుల నిర్మాణ ప్రతిపాదనలు కూడా అలాంటివే. ఇక ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే ఉద్యోగులకు వేతనాలకే డబ్బు లేని స్ధితిలో మూడు రాజధానుల ప్రతిపాదనలను రద్దు చేసుకొని ప్రతిష్టకు పోకుండా వివాదం నుంచి గౌరవ ప్రదంగా బయట పడేందుకు ఇప్పటికీ అవకాశం ఉంది.
ప్రభుత్వాలు తీసుకొనే వేతన చెల్లింపు వాయిదా చర్యవలన ఉద్యోగులు తాత్కాలికంగా ఇబ్బంది పడినా బకాయిలను తరువాతైనా పొందుతారు. కానీ ప్రయివేటు రంగంలోని వారి పరిస్ధితి ఏమిటి ? అంత పెద్ద ప్రభుత్వాలే వాయిదాలు వేస్తుంటే మేము వాయిదాలు పని చేయని రోజులకు అసలు చెల్లించలేము అంటే కార్మికులు, ఉద్యోగులకు దిక్కేమిటి ? సాధారణ రోజుల్లోనే కనీస వేతనాలు అమలు జరపని సంస్ధల మీద ఎలాంటి చర్యలు లేవు. ఇప్పుడు పని చేయని కాలానికి వేతనం ఇప్పించే చిత్త శుద్ధి పాలకులకు ఉందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాడు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌-నేడు ఇన్‌సైడర్‌ బ్రీఫింగ్‌ = ఆంధ్రుల రాజధానులు !

21 Saturday Dec 2019

Posted by raomk in AP, AP NEWS, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, STATES NEWS

≈ Leave a comment

Tags

AP three capitals, GN RAO Committee, YS jagan

Image result for andhra pradesh

ఎం కోటేశ్వరరావు
రాజధాని అమరావతితో సహా రాష్ట్ర సమగ్ర అభివృద్ధి గురించి మాజీ అయ్యేఎస్‌ అధికారి జిఎన్‌ రావు కార్యదర్శిగా నియమించిన ఐదుగురు నిపుణుల కమిటీ ఒక రోజు ముందుగానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పుట్టిన రోజు కానుకగా తమ నివేదిను అందించింది. దీనిలో ఏదో అలా జరిగిపోయింది గానీ, ముందస్తు ఆలోచనేమీ లేదని జగన్‌ అభిమానులు చెప్పుకోవచ్చు గానీ, అంతర్గతంగా వారే మరోవిధంగా అనుకుంటారు. ఎవరేమనుకున్నా వచ్చేది లేదు పోయేది లేదు. ఆంధ్రుల గురించి అలారాసి పెట్టి ఉంది, కనుక జరగాల్సింది జరిగింది అనుకోవాలా ?
ఒక్కటి మాత్రం స్పష్టం. అదేమిటో నాకన్నీ ముందే అలా తెలిసిపోతుంటాయి అన్నట్లుగా నివేదిక ఇవ్వక ముందే ముఖ్యమంత్రి అసెంబ్లీలో మూడు రాజధానులు రావచ్చు అని చెప్పారు. కాలజ్ఞానం విషయంలో పోతులూరి వీరబ్రహ్మం గారిని మించి పోయారు. గత సర్కార్‌ హయాంలో రాజధాని నిర్ణయం జరగముందే అంతర్గత వ్యాపారం జరిగిందని ఎంత బలంగా నమ్ముతున్నామో, ఇప్పుడు మూడు రాజధానుల విషయంలో నివేదిక తయారీకి అంతర్గత బోధ జరిగిందన్నది కూడా అంతే స్పష్టం. అమరావతిలో అంతర్గత వ్యాపారం(ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌) జరిగిందనటానికి జగన్‌ సర్కార్‌ వెల్లడించిన భూముల వివరాలు సాక్ష్యం అనుకుంటే, జగన్‌ ముందే చెప్పినట్లుగానే మూడు రాజధానుల మీద అంతర్గత బోధ (ఇన్‌సైడర్‌ బ్రీఫింగ్‌) జరిగిందనేందుకు జిఎన్‌ రావు కమిటీ నివేదిక తిరుగులేని సాక్ష్యం ! ఈ సిఫార్సులను రాష్ట్ర మంత్రివర్గం, అసెంబ్లీ ఆమోదించి, కేంద్రానికి పంపి, ఆమోదం వచ్చిన తరువాత ఎంతవరకు అమలు జరుగుతాయన్నది చూడాల్సి ఉంది. వీటిలో కేంద్ర ప్రమేయం, రాష్ట్ర అధికారాల గురించి చూడాల్సి ఉంది.
ఇక ఈ నివేదిక పూర్తి పాఠం ఇంకా అందలేదు కనుక జిఎన్‌రావు విలేకర్లతో చెప్పిన అంశాలకే ఈ పరిశీలన పరిమితం. రాష్ట్రాన్ని నాలుగు ప్రాంతీయ కమిషనరేట్స్‌గా ఏర్పాటు చేయాలని, ఒక దానిలో మూడు ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, రెండవ దానిలో ఉభయ గోదావరులు, కృష్ణా, మూడవ దానిలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, నాలుగవ దానిలో చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు ఉండాలని పేర్కొన్నారు. విశాఖలో సచివాలయం, అమరావతిలో అసెంబ్లీ, కర్నూలులో హైకోర్టు పెట్టాలని అమరావతి, విశాఖలో డివిజన్‌ బెంచ్‌లు పెట్టాలని సూచించారు. అమరావతిలో భాగం గాని మంగళగిరి ప్రాంతంలో మంత్రుల నివాసాలు, అమరావతిలో గవర్నర్‌, అసెంబ్లీ అని చెప్పారు. విశాఖలో అసెంబ్లీ వేసవి సమావేశాలు జరపాలన్నారు. ఇవన్నీ కూడా పదివేల కిలోమీటర్ల దూరం తిరిగి జనాభిప్రాయ సేకరణ చేసిన తరువాత చెప్పామన్నారు.
ఈ నివేదిక ఇచ్చేందుకు కమిటీ సభ్యులు పదివేల కిలోమీటర్ల దూరం తిరిగి వారు ప్రయాసకు గురై రాస్ట్ర ప్రజల సొమ్మును దుబారా చేశారనిపిస్తోంది. నాలుగు ప్రాంతీయ కమిషనరేట్స్‌ను కర్ణాటక తరహాలో అని వారే చెప్పారు. ఇంటర్నెట్‌లో ఆ వివరాలన్నీ ఉన్నాయి. రెండవది ప్రాంతీయ కమిషనరేట్స్‌ లేదా ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు అనేవి మనకు తెలియనివి కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణా ప్రాంతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేశారు. ముల్కీ నిబంధనల అమలును సుప్రీం కోర్టు సమర్ధించిన తరువాత దానిని రద్దు చేసి ఆరుసూత్రాల పధకంలో భాగంగా ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేశారు. తరువాత వాటిని కూడా రద్దు చేశారు. ఇప్పుడు నాలుగు ప్రాంతీయ కమిషనరేట్స్‌ అంటే వాటి స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయో తెలియదు. కర్ణాటక కమిషనరేట్స్‌ అయితే రెవెన్యూ డివిజన్లు. అంటే రాష్ట్ర కేంద్రం, జిల్లాల మధ్య మరొక అధికార దొంతర ఏర్పడుతుంది. లేదా గతంలో మాదిరి ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు అయితే రాజకీయనేతలకు ఉద్యోగాలిస్తారు. ఏది చేసినా వీటి ద్వారా ఆయా జిల్లాలను ఎలా అభివృద్ది చేస్తారు ? ఇప్పుడున్న వ్యవస్ధలో అభివృద్దికి అడ్డువస్తున్న ఆటంకా లేమిటి ?
కర్ణాటకలో అలాంటి ఏర్పాటు చేసినా అనేక ప్రాంతాలు వెనుకబడిపోయాయి. నైజాం సంస్ధానం నుంచి విడదీసి కర్ణాటకలో విలీనం చేసిన కన్నడ ప్రాంతాలలో ఇది చివరకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ వరకు దారి తీసింది. ఇప్పటికీ దానిని ముందుకు తెస్తూనే ఉన్నారు. అనేక రాష్ట్రాలలోని వెనుకబడిన ప్రాంతాలలో అలాంటి డిమాండ్లే ఉన్నాయి. మొత్తంగా దేశంలో జరుగుతున్న పరిణామాలను చూసినపుడు ఎక్కడ గతంలో అభివృద్ది చెందిన ప్రాంతాలున్నాయో అక్కడే, ఎక్కడ రేవులు, రోడ్డు, ఇతర రాష్ట్రాలకు సులభంగా సరకు రవాణా అవకాశాలుంటాయో అక్కడికే పెట్టుబడులు తరలి వెళుతున్నాయి తప్ప వెనుకబడిన ప్రాంతాలకు రావటం లేదు. నయా ఉదారవాద విధానాలు అమల్లోకి వచ్చిన తరువాత ఇది మరింత కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు, అనేక సంస్ధలను ఏర్పాటు చేశాయి. ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి పలికి ఉన్న ప్రభుత్వ రంగ సంస్ధలను అయినకాడికి తమ అనుయాయలకు తెగనమ్మి కట్టబెట్టే విధానాలను పాలకులు అనుసరిస్తున్నారు. అటువంటపుడు నాలుగు కమిషనరేట్ల ఏర్పాటుకు, అభివృద్ధికి సంబంధం ఏమిటి ? వైసిపి దగ్గర నవరత్నాలు తప్ప ఇతర అభివృద్ధి పధకాల ఊసే లేదు. ప్రయివేటు పెట్టుబడుల గురించి ప్రధాని నరేంద్రమోడీ పలు విమర్శలపాలై పెట్టుబడుల కోసం విదేశాలు తిరిగా అని చెప్పుకున్నా వచ్చిన పెట్టుబడులు లేవు, మేకిన్‌ ఇండియా పిలుపు ఘోరంగా విఫలం కావటం చూస్తున్నాం. అలాంటిది ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఎక్కడి నుంచి తీసుకువస్తారు ?
జిఎన్‌ రావు కమిటీలో ఉన్నదంతా పట్ణణ ప్రణాళికల నిపుణులే కనుక పట్టణీకరణ గురించి ప్రస్తావించి, వెనుకబడిన ప్రాంతాలలో అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. నిజానికి ఇది సామాన్యులకు కూడా తెలిసిన అంశమే. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ది చేసేది ఎవరనేదే కదా ప్రశ్న. సహజవనరులను దోచుకోవటానికి పెట్టుబడిదారులు ఎక్కడికైనా వెళతారు తప్ప పరిశ్రమలు, వ్యాపారాలు పెట్టేందుకు ఎక్కడా ఎవరూ ముందుకు రాలేదు. ప్రభుత్వాలు పెట్టుబడి పెట్టిన చోట్లనే అనుబంధ పరిశ్రమలు వచ్చాయి. మధ్య కోస్తోలో వ్యవసాయ రంగంలో మిగులు పట్టణీకరణ, వ్యాపారాల అభివృద్ధికి ఒక కారణం తప్ప ఒక్క పట్టుమని పదివేల మందికి ఒక దగ్గర ఉపాధి కల్పించేందుకు ఒక్క పరిశ్రమ లేదు.
2019 జనవరి ఒకటి నుంచి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అమరావతిలో పని చేయటం ప్రారంభమైంది. తిరిగి దానిని కర్నూలుకు తరలించటానికి, విశాఖ, అమరావతిలో బెంచ్‌లు ఏర్పాటు చేయటానికి సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వం ఏమేరకు ఆమోదిస్తాయన్నది సందేహమే. మద్రాసు ప్రావిన్సులోని తెలుగు ప్రాంతాలలో ఒక విశ్వవిద్యాలయం(తెలుగుకు పర్యాయపదం ఆంధ్రం కనుక ఆంధ్రా విశ్వవిద్యాలయాన్ని స్ధాపించాలనే డిమాండ్‌ వచ్చింది. అయితే దానిని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై నాటి కాంగ్రెస్‌ నేతల( ఆంధ్రా-రాయలసీమ) మధ్య వివాదం వచ్చింది. చాలా సంవత్సరాల పాటు కొనసాగి చివరికి విశాఖలో 1926లో ఏర్పాటు చేశారు. ఆంధ్రా విశ్వవిద్యాలయాన్ని ఆంధ్రప్రాంత నేతలు తన్నుకు పోయారనే అసంతృప్తిలో ఉన్న రాయలసీమ నేతలను సంతృప్తి పరచేందుకు చిత్తూరు, ఇతర రాయలసీమ(సీడెడ్‌) జిల్లాలను మాత్రం దానిలో చేర్చకుండా మద్రాసు యూనివర్సిటీకి అనుబంధంగా కొనసాగించారు. తరువాత మద్రాసు ప్రావిన్సు నుంచి ప్రత్యేక ఆంధ్ర ఏర్పడాలన్న డిమాండ్‌ ముందుకు వచ్చినపుడు మరోసారి రాయల సీమకు అన్యాయం జరుగుతుందనే భయాన్ని ఆ ప్రాంత నేతలు వ్యక్తం చేసి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌కు మద్దతు ఇవ్వలేదు. దాంతో ఉభయ ప్రాంతాల నేతలు కాశీనాధుని నాగేశ్వరరావు గృహం శ్రీబాగ్‌లో సమావేశమై భవిష్యత్‌లో ప్రత్యేక ఆంధ్ర ఏర్పడితే రాయలసీమలో హైకోర్టు లేదా రాజధానిని ఏర్పాటు చేయాలనే ( పెద్ద మనుషుల )ఒప్పందానికి వచ్చారు. ఆమేరకు కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పడింది. తరువాత రెండింటినీ హైదరాబాద్‌కు తరలించారు.
నరేంద్రమోడీ సర్కార్‌ అధికారానికి వచ్చిన తరువాత వివిధ చోట్ల హైకోర్టు బెంచ్‌లను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌లు ఒక్కదానినీ ఆమోదించలేదు. ఇరవై రెండు కోట్ల జనాభా ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో అలహాబాద్‌లోహైకోర్టు, లక్నోలో బెంచ్‌ ఉంది. మరో ఐదు బెంచ్‌లు ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు ఉన్నాయి, అలాగే ఇతర రాష్ట్రాలలో కూడా అలాంటి డిమాండ్లు ఉన్నాయి. వీటన్నింటినీ పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్‌లో మూడు చోట్ల బెంచ్‌లు పెట్టాలన్న ప్రతిపాదనను అంగీకరించటానికి కేంద్రం ఏ ప్రాతిపదికన ముందుకు వస్తుంది అన్నది ప్రశ్న. శ్రీబాగ్‌ ఒప్పందాన్ని జిఎన్‌ రావు కమిటీ ఉటంకించింది.

Image result for ys jagan mohan reddy
ఈ కమిటీ నివేదిక ఒక ప్రహసన ప్రాయం అన్నది స్పష్టం. అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్న ఆకాంక్ష వైసిపిలో ఎన్నడూ కనిపించలేదు. వారు కోరుకున్న విధంగా వ్యవహరించేందుకు ఒక ప్రాతిపదిక ఉండాలంటే దానికి ఒక కమిటీ నివేదిక కావాలి. అందుకోసం ఏర్పాటు చేసి తమకు అనుకూలంగా ఏమి రాయాలో రాయించుకున్నారు అన్న అభిప్రాయాలు సర్వత్రా వెల్లడి అవుతున్నాయి. గతంలో రాజధాని నిర్ణయానికి ముందు అనుయాయులకు ఉప్పందించి లబ్ది చేకూర్చేట్లు చేశారని, చంద్రబాబుతో సహా అనేక మంది భూములు కొనుగోలు చేసిన గ్రామాలను రాజధాని పరిధి, భూ సేకరణ నుంచి తప్పించారని వైసిపి చెబుతోంది. ఆమేరకు అసెంబ్లీలో కొన్ని వివరాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు మూడు రాజధానుల వెనుక వైసిపి నేతలు కూడా అదే పనికి పాల్పడ్డారని తెలుగుదేశం ఆరోపిస్తోంది. ఈ వివరాలు ఐదేండ్ల తరువాత కొత్త ప్రభుత్వం వస్తే, వారు బయట పెట్టేంత వరకు అనుమానాలు, ఆరోపణలుగానే ఉంటాయి. ఐదేండ్ల తరువాత వచ్చే పాలకులు మూడు రాజధానుల్లో అనుకున్నట్లుగా అభివృద్ది జరగలేదంటూ మరొక కమిటీని వేసి మరో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటే ? తన అధికారానికి ఇక తిరుగులేదని వైఎస్‌ జగన్‌ అనుకుంటున్నట్లే గతంలో చంద్రబాబు కూడా అనుకున్నారు, అయినా వేరేలా జరగలా ? రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

దేవుని స్తుతి – సైతాను దూషణ = జగన్‌ సైన్యం

15 Sunday Dec 2019

Posted by raomk in AP, AP NEWS, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Political Parties, STATES NEWS

≈ Leave a comment

Tags

Aandhra Pradesh Politics, chandrababu naidu, tdp, Ycp, YS jagan, ys jagan vs chandrababu naidu

Image result for ys jagan vs chandrababu naidu

ఎం కోటేశ్వరరావు
అన్నం ఉడికిందో లేదో చూడాలంటే ఒక్క మెతుకును చూస్తే చాలు అన్నది గత సామెత. ఇప్పుడు ప్రెషర్‌కుకర్లలో వండుతున్నందున వెలువడే మోతలు లేదా ఈలలను బట్టి ఉడికిందో లేదో చెప్పేయవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలలో చోటు చేసుకుంటున్న వాక్‌ ధ్వనులు, మోతలను బట్టి రాబోయే రోజుల్లో ఏమి జరగనుందో, ప్రజాప్రతినిధులు ఎలా ఉండబోతున్నారో ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది. ఆరు నెలలు గడిస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారంటారు. అరునెలలకు ముందు అసెంబ్లీలో తెలుగుదేశం ఎలా వ్యవహరించిందో, ఆరునెలల తరువాత వైసిపి అదే విధంగా వ్యవహరించనున్నట్లు స్పష్టమైన సంకేతాలిచ్చింది.
మేము పరిశుద్ధ రాజకీయాలు చేస్తాము, కొత్త వరవడికి శ్రీకారం చుడతాము, మాటతప్పము మడమ తిప్పము అని చెప్పుకొనేందుకు వైసిపి నాయకత్వానికి నైతికంగా ఇంకే మాత్రం అవకాశం లేదు.తెలుగుదేశం పార్టీ సభ్యుడు వల్లభనేని వంశీమోహన్‌ తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్‌ అయ్యారు. అసెంబ్లీలో తనకు ప్రత్యేక స్ధానం కేటాయించమని అడగటం, స్పీకర్‌ తమ్మినేని సీతారాం సదరు సభ్యుడిని ప్రత్యేక సభ్యుడిగా గుర్తించటం వెంటనే జరిగిపోయింది. ఫిరాయింపుల నిరోధక చట్టం నిబంధనలను పట్టించుకోకుండా స్పీకర్‌ విచక్షణ అధికారాల మేరకు ఇది జరిగింది. వంశీమోహన్‌ వైసిపికి దగ్గర అయ్యారు, అసెంబ్లీ సభ్యత్వానికీ ఢోకా లేదు. అసెంబ్లీలో చంద్రబాబు మీద ధ్వజమెత్తటానికి ఒక సభ్యుడు తోడయ్యారు. కావాల్సిన కార్యాన్ని స్పీకర్‌ తీర్చారు
తెలుగుదేశం నుంచి ఎవరైనా ఎంఎల్‌ఏలు బయటకు వచ్చి సభ్యత్వాలను కోల్పోకుండా మరొక పార్టీలో చేరాలంటే ఒక కొత్త దారిని కనుగొన్నారు. దీనికి వైసిపి దారి లేదా జగన్‌ బాట అని పేర పెట్టవచ్చు. ఎవరైనా పార్టీ మారదలచుకుంటే నాయకత్వం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి సస్పెన్షన్‌కు గురి కావటం, తరువాత తమకు ప్రత్యేక స్ధానం కేటాయించాలని స్పీకర్‌ను కోరవచ్చు, నచ్చిన పార్టీతో కలసి ఊరేగవచ్చు అని తేలిపోయింది.అయితే వంశీ ఉదంతం తరువాత ఇతర ఎంఎల్‌ఏలు ఎవరైనా తమ నాయకత్వాన్ని ఎంతగా తూలనాడినా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వారిని సస్పెండ్‌ చేయకపోవచ్చు. అయితే అది ఎంతకాలం అన్నది ప్రశ్న. పార్టీ మారాలనుకున్న సభ్యులు సస్పెండ్‌ అయ్యే వరకు విమర్శలు, తిట్లదండకాన్ని కొనసాగిస్తే మీడియా, జనానికి ఉచిత వినోదాన్ని పంచినట్లు అవుతుంది. సస్పెండ్‌ చేస్తే ప్రత్యేక స్ధానాల సంఖ్య పెరుగుతుంది. అయితే ఈ సౌకర్యం ఎంఎల్‌సీలకు తాత్కాలికంగా ఉండకపోవచ్చు. ప్రస్తుతం శాసన మండలిలో తెలుగుదేశం పెద్ద పార్టీగా ఉంది, ఆ పార్టీకి చెందిన షరీఫ్‌ మహమ్మద్‌ మండలి చైర్మన్‌గా ఉన్నందున ప్రత్యేక స్ధానాలు కేటాయించే అవకాశం ఉండదు. అధికారపక్షం మెజారిటీ సాధించి మండలి చైర్మన్‌ను మార్చేవరకు లేదా షరీఫ్‌ మారు మనసు పుచ్చుకుంటే తప్ప అదే పరిస్ధితి కొనసాగుతుంది. అప్పటికి తెలుగుదేశం పార్టీలో ఎందరు మిగులుతారన్నది ప్రశ్న.

Image result for ys jagan vs chandrababu naidu
ఇక అసెంబ్లీ సమావేశాల తీరుతెన్నులను చూస్తే వైసిపి సభ్యులు దేవుని స్తుతి, సైతాను నింద కొనసాగించేందుకు అస్త్ర శస్త్రాలను సమకూర్చుకున్నట్లు కనిపిస్తోంది. వ్యవసాయ ప్రధానమైన ఆంధ్రప్రదేశ్‌లో పంటలు మార్కెట్‌కు రావటం ఇప్పుడే ప్రారంభమైంది. వాటిని అమ్ముకోవటం,గిట్టుబాటు ధరల సంగతి దేవుడెరుగు కనీసం మద్దతు ధరలు అయినా వస్తాయా అన్నది పెద్ద ప్రశ్నగా ముందుకు వస్తోంది. ఎన్నికల సమయంలో వైసిపి అభ్యర్ధులతో పాటు మద్దతుదారులు పెట్టిన పెట్టుబడులకు ఏదో ఒక రూపంలో లాభాలు వచ్చే విధంగా పాలకులు చూడగలరు గానీ, రైతాంగానికి ధరలు, మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించే అవకాశాలు ఉండవు. ప్రభుత్వ విధానాల వలన తమకు నష్టం వస్తున్నట్లు గ్రహించిన తరువాత వైసిపి అభిమానం ఆవిరిగావటానికి ఎక్కువ సమయం పట్టదు. అసెంబ్లీ సమావేశాల్లో వాగ్వివాదాల హౌరులో వీటి గురించి పట్టించుకున్న దాఖలాలు కనిపించటం లేదు. తెలుగుదేశం నేతలపై ధ్వజం, గతపాలన తీరుతెన్నులను విమర్శిస్తూ వైసిపి ఎంతకాలం కాలం కాలక్షేపం చేయగలదు ?
దేన్నయినా మూసిపెడితే పాచిపోతుంది. ఇసుక విషయంలో ప్రభుత్వం అదే చేసింది. తీరా అది వివాదాస్పదం అయిన తరువాత ఎన్నడూ లేని విధంగా ఇసుక వారోత్సవాలను ప్రకటించాల్సి వచ్చింది. రాజధాని అమరావతి గురించి చంద్రబాబు నాయుడి పర్యటన తరువాత సిఆర్‌డిఏ పరిధిలో నిర్మాణాలను కొనసాగిస్తున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది. రాజధానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. మారుస్తామని మేమెక్కడ చెప్పామంటారు? రాజధాని అమరావతితో సహా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సూచనలు చేయాల్సిందిగా ఒక కమిటీని వేశామని, దాని సిఫార్సులు వచ్చిన తరువాత స్పష్టత వస్తుందని మరోవైపు చెబుతారు. రాష్ట్ర ప్రభుత్వం అంతిమంగా నిర్ణయాలు తీసుకొనే హక్కు, అవకాశం ఉన్నప్పటికీ ప్రధాన అంశాల మీద ప్రతిపక్షాలు, సామాజిక సంస్ధలు, ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలనే ప్రజాస్వామిక ప్రక్రియ పట్ల జగన్మోహనరెడ్డి సర్కార్‌కు విశ్వాసం, వైఖరి లేదనేది స్పష్టమైంది. నెలల తరబడి జాప్యం చేసి ప్రకటించిన ఇసుక విధానం, వివాదాస్పద ఆంగ్లమాధ్యమం అమలు- తెలుగు మాధ్యమ విద్యాబోధన ఎత్తివేత నిర్ణయాలు స్పష్టం చేశాయి.
వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి తానొక ముఖ్యమంత్రి అని మరచిపోయినట్లున్నారు. దిశపై అత్యాచారం, హత్యకేసులో నిందితులుగా ఉన్న నలుగురిని ఎన్‌కౌంటర్‌పేరుతో పోలీసులు హత్యచేస్తే అసెంబ్లీ సాక్షిగా ఆచర్యను సమర్ధించటం, తెలంగాణా ప్రభుత్వం, పోలీసులకు అభినందనలు చెప్పటం, ఎన్‌కౌంటర్‌ ఉదంతంపై విచారణకు రాజ్యాంగబద్ద సంస్ధ జాతీయ మానవహక్కుల సంఘం విచారణకు రావటాన్ని తప్పు పట్టటం రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నవారు చేయాల్సింది కాదు. ఏ ముఖ్య మంత్రీ గర్హనీయమైన ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు
కేంద్రంతో ప్రతి విషయం మీద ఘర్షణ పడాలని ఎవరూ కోరుకోరు. కేంద్రంలో ఉన్న అధికార పార్టీ అడుగులకు మడుగలొత్తటం, మోసేందుకు పోటీపడటం ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రధాన పార్టీల వైఖరిగా ఉంది. వివాదాస్పద అంశాలైన ఆర్టికల్‌ 370, కాశ్మీరు రాష్ట్ర రద్దు, పౌరసత్వ సవరణ బిల్లువంటి మీద కేంద్రానికి మద్దతు ఇచ్చేందుకు తెలుగుదేశం, వైసిపి పోటీ పడ్డాయి. కనీసం తటస్ధంగా కూడా లేవు. ‘బిజెపికి నేను ఎప్పుడు దూరమయ్యాను? దగ్గరగానే ఉన్నా. రాష్ట్రానికి ప్రత్యేక హౌదా కోసం కేంద్రంతో విభేదించాను. అమిత్‌షా అంటే నాకు అమితమైన గౌరవం. వైసిపి వాళ్లకు ఆయనంటే భయం. ప్రజలు బిజెపిని మంచి మోజార్టీతో రెండోసారి అధికారంలో కూర్చోబెట్టారు, మోడీ అమిత్‌షా దేశ ప్రయోజనాలు, దేశ రక్షణ కోసం పాటుపడుతున్నారు. నేను సెక్యులరిస్టును. ఓట్లు వచ్చినా, రాకపోయినా నేను నమ్మే హిందూ సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాను. హిందూధర్మ పరిరక్షణ గురించి నేను మాట్లాడితే, దాన్ని వక్రీకరించి వైసిపి అసత్య ప్రచారం చేసింది. ఎవరైనా సరే మత విశ్వాసాలను గౌరవించి తీరాల్సిందే. ‘మీరు టిడిపి, బిజెపితో పొత్తు పెట్టుకుంటారా?’ అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ‘చెప్పలేం… ఉండొచ్చు ఏమో… ఉత్తరప్రదేశ్‌లో మాయావతి దళిత, బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చింది. రెండోసారి అధికారం కోసం ఎవరిని పక్కన పెట్టి పార్టీని స్థాపించిందో ఆ బ్రాహ్మణులను అక్కున చేర్చుకుంది, రాజకీయాలు ఇలా ఉంటాయంటూ జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఇంత చక్కటి తెలుగులో చెప్పిన తరువాత దానికి టీకా తాత్పర్యాలు అవసరం లేదు. పవన్‌ కల్యాణ్‌ బాట చే గువేరాతో ప్రారంభమై అమిత్‌ షా వైపు పయనిస్తున్నదని మరొకరు చెప్పనవసరం లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి బలపడాలంటే దానికి రాష్ట్రంలో అధికారం కూడా ముఖ్యం. పార్లమెంట్‌ సభ్యులు ఏ పార్టీలో ఉన్నా వారిని ఆకర్షించటం దానికి పెద్ద కష్టం కాదు. ఎందుకంటే వారిలో చాలా మంది ఆర్ధిక లావాదేవీలు ఎక్కువ భాగం రాష్ట్రం వెలుపలే ఉంటాయి లేదా వారి లాబీ కంపెనీలు ఎక్కడైనా ఉండవచ్చు గనుక కేంద్రంతోనే ఎక్కువ అవసరాలుంటాయి. దీనికి వైసిపి ఎంపీలు అతీతులు కాదు గనుక కొత్తగా ఎంపీలైనవారు, పారిశ్రామిక, వాణిజ్యాలను ఇంకా ప్రారంభించని వారు మినహా మిగిలిన వారు జగన్‌తో కంటే నరేంద్రమోడీ, అమిత్‌ షాలకే గ్గరగా ఉంటారన్నది జగమెరిగిన సత్యం.
రాష్ట్రంలో స్ధానిక నేతలు బిజెపిలోకి రావాలంటే వారికి రాష్ట్రంలో అధికారం ముఖ్యం. అది ఉంటేనే వారికి లాభం. తెలుగుదేశం పార్టీతో ఆ పార్టీ అధికారాన్ని పంచుకున్నపుడు ఇదే రుజువైంది. అందుకే పవన్‌ కల్యాణ్‌ను ఒకవైపు రంగంలోకి దించి మరోవైపున వైసిపిని దారికి తెచ్చుకొనే ఎత్తుగడ ఉన్నట్లు భావిస్తున్నవారు కూడా లేకపోలేదు. తమ ప్రయోజనం నెరవేర్చుకొనేందుకు ఎన్ని పార్టీలు, ఎన్నికశక్తులనైనా తన మందలో చేర్చుకోగల శక్తి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సహజంగానే ఉంటుంది. వైఎస్‌ జగన్‌ మీద ఇప్పటికే కావలసినన్ని కేసులు ఉన్నందున బిజెపి పని సులువు అవుతుందని వేరే చెప్పనవసరం లేదు. ఆ వత్తిడిని తట్టుకొని వైసిపి ఎంతకాలం నిలుస్తుందో చెప్పలేము.
రక్తం రుచి మరిగిన పులిని బోనులో బంధిస్తే దాన్నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తుంది. అలాగే వైసిపిలో అధికార రుచిమరగిన నేతలకు కొదవలేదు. అవినీతికి దూరంగా ఉండాలని వైసిపి నాయకత్వం ఎంతగా చెబితే అంతగా వారిలో అసహనం పెరుగుతుంది. అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు ఎవరిని కదిలించినా ఇట్టే తెలిసిపోతుంది. ఆనం రామనారాయణ రెడ్డి వంటి సీనియర్‌ నేత నెల్లూరు జిల్లాలో పరిస్ధితి గురించి బహిరంగంగానే బయటపడ్డారు. అలాంటి వారిని తాత్కాలికంగా నోరు మూయించగలరు తప్ప ఎక్కువ కాలం కట్టడి చేయగలరా ? ప్రభుత్వ వైఫల్యాలు పెరుగుతున్న కొద్దీ, పార్టీలో, ప్రభుత్వంలో అధికార కేంద్రాలు కుదురుకున్నతరువాత వాటిలో చోటు దక్కని వారిని అదుపు చేయటం అంత తేలిక కాదు.

Image result for ys jagan vs chandrababu naidu
కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి బడ్జెట్‌లో చూపిన మేరకు వచ్చే అవకాశ ం లేదని ఇప్పటికే తేలిపోయింది. అందువలన ప్రకటించిన లేదా అమలు జరుపుతున్న పధకాలకు కోత పెట్టటం అనివార్యం. అదే జరిగితే జనంలో అసంతృప్తి ప్రారంభం అవుతుంది. పార్టీ క్యాడర్‌లో, జనంలో అలాంటి పరిస్ధితి ఏర్పడితే ఇంక చెప్పాల్సిందేముంటుంది ? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో గతంలో తెలుగుదేశం-చంద్రబాబు నాయకత్వ వైఖరి, తీరు తెన్నులను విమర్శించిన వారు, ఇప్పుడు వైసిపి-జగన్‌ నాయకత్వ తీరు తెన్నులను హర్షిస్తారనుకుంటే భ్రమలో ఉన్నట్లే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కాకమ్మ కథలు కాదు – సుదర్శన చక్రాలు, సమ్మోహనాస్త్రాలకు సమయమిదే !

21 Saturday Sep 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, Literature., NATIONAL NEWS, Opinion, Others, STATES NEWS, Telangana, Uncategorized

≈ Leave a comment

Tags

BJP on Uranium, cock and bull stories, puranic weapons, saffron talibans, TRS government, Uranium

Image result for puranic weapons

ఎం కోటేశ్వరరావు

కుక్క పిల్లా, అగ్గిపుల్లా, సబ్బు బిళ్లా కాదేదీ కవితకనర్హం అన్నాడు మహా కవి శ్రీశ్రీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో , దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ప్రతిదానినీ రాజకీయం చేస్తున్నారు, రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. అసలు సిసలు దేశభక్తులం మేమే అని చెప్పుకొనే వారి గురించి ఇక చెప్పనవసరం లేదు. మహాభారతంలో ఒక కధ వుంది. ద్రోణాచార్యుడు తన శిష్యుల కేంద్రీకరణ సరిగా వుందో లేదో పరీక్షించేందుకు ఒక రోజు పరీక్ష పెట్టాడు. ముందు కుమారుడు అశ్వధ్దామను పిలిచి చెట్టుమీద ఒక పక్షి వుంది,నీకేమి కనిపిస్తోంది అని అడగాడు. నాకు చెట్టు, దాని మీద పిట్ట, మీ పాదాలు కనిపిస్తున్నాయి అన్నాడు అశ్వధ్దామ. ఓకే, నీ బాణం కింద పెట్టు అని దుర్యోధనుడిని పిలిచి అదే ప్రశ్న అడిగాడు. గురువు గారూ నాకు చెట్టుమీద కొమ్మలు, వాటి మీద కూర్చున్న పిట్ట కనిపిస్తోంది, కొట్టమంటరా అన్నాడు, వద్దు వద్దు నీ ఆయుధాన్ని కింద పెట్టు అన్నారు. తరువాత వంతు అర్జునుడిది. నాకు పిట్ట తప్ప మరేమీ కనిపించటం లేదు అన్నాడు, అంతేనా అన్నాడు ద్రోణాచార్య. అంతే సర్‌ అన్నాడు అర్జునుడు. బిజెపి ఒక కంటికి అధికారమనే పిట్టమాత్రమే కనిపిస్తోంది. రెండో కంటికి యురేనియం వంటి సమస్యల మీద గుడ్డి సమర్దనకు అనేకం కనిపిస్తున్నాయి.

యురేనియం తవ్వకాలు, సర్వే గురించి సంప్రదాయ, సామాజిక మాధ్యమం రెండింటిలోనూ ఇప్పుడు చర్చ జరుగుతోంది. అనేక మంది సినీ ప్రముఖులు ముందుకు వచ్చి వాటికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అవసరమైతే ఆందోళనలో పాల్గొంటామని ప్రకటిస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు పిల్లి మొగ్గలు వేస్తున్నాయి.. ముందేమి మాట్లాడుతున్నాయో వెనకేమి అంటున్నాయో చూడటం లేదు. తవ్వకాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రకటించారు మరోవైపున శాసన మండలిలో మాట్లాడిన కెటిఆర్‌ యురేనియం అవసరాన్ని గురించి నొక్కి చెప్పారు. బిజెపి నేతలు తమ వైఖరి ఏమిటో చెప్పకుండా గతంలో సర్వే, తవ్వకాలకు అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌, మేము (కేంద్రం) తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదు, కనుగొనేందుకు మాత్రమే, అయినా అది పనికి వస్తుందో లేదో తెలియదు అంటూ ఏవేవో చెబుతూ తాము తవ్వకాలకు అనుకూలమో కాదో చెప్పటం లేదు. యురేనియం అవసరం అంటూ పరోక్షంగా సర్వే, తవ్వకాలను సమర్ధిస్తున్నది.ఈ చర్చలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి కూడా భాగస్వామి అయ్యారు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు ఆయన యురేనియం కంటే బొగ్గుతవ్వకమే ఎక్కువ ప్రమాదకరం అని చెప్పారు. ప్రమాదకరమైన వాటిన్నింటినీ ఆపివేయాలి, ఎవరు తవ్వమన్నారు. మరోవైపున సంఘపరివార్‌ శ్రేణులు సామాజిక మాధ్యమంలో యురేనియం తవ్వకం ఒక దేశభక్తి, దేశరక్షణ చర్యగా, పనిలో పనిగా కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయి. సామాజిక మాధ్యమంలో వారు వ్యాపింప చేస్తున్న ఒక సమాచారం దిగువ విధంగా వుంది. వూరూ పేరు లేకుండా ప్రచారం చేయటం అలాంటి వారి పద్దతి గనుక దానిలో వున్న భాష, భావాన్ని బట్టి అది వారి ప్రచారమే అని చెప్పాల్సి వస్తోంది.

Image result for sammohana astra

” యూరేనియం..ఇప్పుడు ఇదొక తర్కం..పర్యావరణం ఎంత ముఖ్యమో..దేశానికీ అణువిద్యుత్తు, అణ్వాయుధాల సమృద్ధి, అణ్వస్త్ర ప్రయోగశాల కార్యాచరణ కూడ అంతే ముఖ్యమన్న విషయ విజ్ఞానం మనం అర్ధంచేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది..ప్రస్తుతం కేవలం రీసెర్చ్‌ స్థాయిలో ఉన్న ఈ అంశం పై ఇంతగా ఆందోళన అనవసరం.జంతు జీవాలు మృగ్యం అయిపోతై, పురాతన కట్టడాలు ధ్వంసం అయిపోతై, అక్కడ నివాసితుల జీవితాలు నాశనం అయిపోతై, వింతరోగాలు ప్రబలిపోతాయి అంటూ కమ్మీస్‌ చేస్తున్న ప్రచారం కేవలం చైనా ఎజండా మాత్రమే.నిజానికి అది కమ్మీల విషప్రచారం మాత్రమే. 30000 ఎకరాల విస్తీర్ణంలో వున్న నల్లమల అడవుల్లో కేవలం 1000 ఎకరాల భూభాగంలో మాత్రమే ఈ రీసెర్చ్‌ జరగబోతోంది.రీసెర్చ్‌ ముగిసిన తర్వాత యురేనియం అందుబాటు స్థాయిని అధ్యయనం చేశాక యురేనియం ప్రాసెసింగ్‌ జరగాలి.అప్పుడు రేడియేషన్‌ విడుదల అవుతుంది.విడుదలయ్యే రేడియేషన్‌ వలన పై చెప్పబడిన ఏ ఒక్క విభాగము భారీ విపత్తుకు లోను కాకుండా తగు చర్యలు పటిష్టంగా తీసుకుంటుంది. కేంద్రంలో ఉన్నది ఆషామాషీ ప్రభుత్వమో.అభాధ్యతతో కూడిన ఆలోచనలతో సాగే యంత్రాంగమో, కాసుల కోసం క్షుద్ర ప్రయోగాలు ఆవిష్కరించే నీచ సంస్కృతికి నిలయమో కాదు.అనునిత్యం దేశహితమే తన మతంగా,130 కోట్ల భారతీయులే తన కుటుంబం అంటూ సాగుతున్న రాజర్షి నమో సారథ్యంలో దూసుకెళ్తున్న భారత్‌.. మేము విశ్వగురు భారత్‌ సంతతి అని భావితరాలు సగర్వంగా చాటుకునే స్థాయిని ఆవిష్కరిస్తున్న ప్రయాణం..అది

యురేనియం ఐనా,త్రిపుల్‌ తలాక్‌ ఐనా, ఆర్టికల్‌ 370, జి ఎస్‌ టి,నోట్ల రద్దైనా, జమిలి ఎన్నికలయినా, మరో అంశమైనా దేశంకోసం,దేశప్రతిష్ఠ కోసం, భావి భారతీయుల ఉజ్వల భవిష్యత్తుకోసం,ప్రపంచపటంలో భారతావనిని అగ్రగామిగా నిలపడంకోసం చేసే ప్రయత్నాలే.చైనాలో దోమ కుడితే ఇక్కడ గోక్కునే కమ్మీలు.అణ్వస్త్ర విభాగంలో భారత్‌ ఎక్కడ తమను మించిపోతుందో అనే చైనా భయాందోళనల మధ్య పుట్టుకొచ్చిన కుట్రలో భాగమే ఈ యాంటి యూరేనియం స్లొగన్స్‌, మావోయిస్టుల గంజాయి సాగుకు ఆటంకం, వాళ్ళ ఆయుధసేకరణకు అవసరమయ్యే ఆదాయవనరులకు గండి పడతాయి.ఇలాంటి అనేక అంశాలు ఈ కమ్మీలను పట్టిపీడిస్తున్నాయి.ఈ కమ్మీల ట్రాప్లో పడకుండా ప్రజలు అప్రమత్తంగా వుండాలి.నాణానికి రెండువైపులా అధ్యయనం చేయాలి.పర్యావరణాన్ని కాపాడుకుంటూ,అవసరమైన యురేనియం సమృద్ధిని పెంచుకుంటూ చైనా, పాకిస్తాన్‌ వంటి శత్రుదేశాల ఆగడాలను తరిమికొట్టే అణ్వస్త్ర ఆయుధ సంపత్తిని గణనీయంగా పెంచుకుని దేేశరక్షణ ప్రాముఖ్యతను గుర్తించి గౌరవించవలసిన బాధ్యత మనదే అనే ఆలోచన ప్రతి భారతీయ గుండెల్లో మారుమ్రోగాలి.జై భారత్‌. ”

ఇది కాషాయ తాలిబాన్ల వాదన తప్ప మరొకటి కాదు. మాకు సంబంధం లేదు అని వారు స్పష్టం చేస్తే అప్పుడు ఆలోచిద్దాం. అణు యుద్దం జరిగితే విజయం సంగతి తరువాత అసలు మానవాళిలో మిగిలేది ఎంత మంది, ఒకరూ అరా మిగిలినా వారు చేసేది ఏమిటి అన్నది సమస్య. అణుబాంబులు హిందువులను, ఆవులను వదలి, ముస్లింలు, క్రైస్తవులు, ఇతర జంతుజాలాల మీదనే ప్రభావం చూపుతాయి అనుకుంటున్నట్లు కనిపిస్తోంది ! హిరోషిమా, నాగసాకి నగరాల్లో జరిగిన విధ్వంసాన్ని చూస్తే కాషాయ దళానికి తప్ప ప్రపంచానికి అంతటికీ వాటి ముప్పు ఏమిటో అర్ధం అయింది. అందుకే ఇప్పటికే ఒకసారి ప్రయోగించిన అమెరికా తప్ప తమంతట తాముగా ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించబోమని మనతో సహా ప్రతి దేశం ప్రతిన పూనింది. ఈ విషయంలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌కు ప్రేరణ పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ . అతగాడి ప్రేలాపనలను అవకాశంగా మార్చుకొని తమలోని యుద్దోన్మాదాన్ని బయట పెట్టుకొంటున్నారు. ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించబోమనే దేశవైఖరిని తాము పునరాలోచించుకోవాల్సి వుంటుందని మన రక్షణ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ చెప్పటాన్ని ఏమనాలి? ఆయనకు ఇమ్రాన్‌ఖాన్‌కు తేడా ఏముంది?

అణువిద్యుత్‌ కేంద్రం కలిగిన ప్రతి దేశమూ అణ్వాయుధాలను తయారు చేసి పరిక్షించకపోయినా ఏ క్షణంలో అయినా వాటిని తయారు చేయగలిగిన పరిజ్ఞానాన్ని సమకూర్చుకున్నాయనేది బహిరంగ రహస్యం. ఇక కాషాయ దళాల వున్మాదం గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. మొదటి ప్రపంచ యుద్దం తరువాత జర్మనీకి ఏ కమ్యూనిస్టు లేదా పెట్టుబడిదారీ దేశం నుంచీ ముప్పు లేకపోయినా దేశాన్ని సమున్నతంగా నిలుపుతానంటూ జాతీయోన్మాదాన్ని, కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టిన హిట్లర్‌ గురించి అంతకంటే చెప్పాల్సిన పనిలేదు. వాడి వారసులే కాషాయ తాలిబాన్లు. ప్రతి దేశమూ తన రక్షణకు చర్యలు తీసుకోవటాన్ని ఎవరూ తప్పు పట్టరు, అందుకు అవసరమైన ఆయుధాలను కలిగి వుండటమూ అభ్యంతరం కాదు. అయితే అణ్వాయుధాలు ఏ దేశాన్నీ రక్షించలేవు. అందుకోసం జనాన్ని, పర్యావరణాన్ని ఫణంగా పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. విద్యుత్‌ కోసం అనే వాదనలో కూడా అర్ధం లేదు. అనేక ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. చెర్నోబిల్‌, పుకుషిమా ప్రమాదాలు జరిగిన తరువాత ఇంకా అణువిద్యుత్‌ గురించి మాట్లాడేవారిని ఏమనాలో అర్దం కాదు.

ఇక్కడ కాషాయ దళాలను జనం ఒక ప్రశ్న అడగాలి. మీరు చెబుతున్నట్లు కాసేపు యురేనియం తవ్వకాల వ్యతిరేక నినాదం చైనా కోసమే కమ్యూనిస్టులు చేస్తున్నారనే అనుకుందాం. మీరెందుకు విదేశాలను అనుకరించి యురేనియంతో ఆయుధాలు తయారు చేయాలని ఆరాటపడుతున్నారు. అసలు సిసలు అభినవ స్వదేశీ దేశభక్తులు కదా ! వేదాల్లోనే అన్నీ వున్నాయి, భారతీయ పురాతన విజ్ఞానం అంతా సంస్కృత గ్రంధాల్లో వుంది అని ప్రచారం చేస్తున్నది మీరు. ఈ గోబెల్స్‌ ప్రచారం ఎంతగా పెరిగిపోయిందంటే దీన్ని ప్రశ్నించేవారి పరిస్ధితి ఇప్పుడు నూరు కాకుల్లో ఒక్క కోకిల మాదిరి తయారైంది. అమెరికా,ఆస్ట్రేలియా, అనేక ఐరోపా దేశాలకు వెళ్లి వుద్యోగాలు, విదేశీ సంస్ధల్లో పరిశోధనలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నవారు కూడా ఎవరేమనుకుంటే నాకేటి సిగ్గు అన్నట్లుగా వేదాల్లో అన్నీ వున్నాయష అనే అగ్రహారీకుల కబుర్ల్లే వల్లిస్తున్నారు.

విష్ణుమూర్తి సుదర్శన చక్రం అనే అస్త్రం నియంత్రిత క్షిపణి మాదిరి వ్యవహరించి లక్ష్యంగా చేసుకున్న శత్రువులను మాత్రమే హతమార్చి తిరిగి వస్తుందని కదా చెబుతారు. అంటే అది అణ్వాయుధాల కంటే అధునాతనం, సురక్షితమైనది. అమాయకుల జోలికిపోదు, సంస్కృత పండితులు, ఆర్‌ఎస్‌ఎస్‌ స్వదేశీ జాగరణ మంచ్‌ వారు, ఇతరులు కలసి మేకిన్‌ ఇండియా కింద స్వదేశీ సుదర్శన చక్రాలను తయారు చేయవచ్చు కదా ! విదేశీ అణ్వాయుధాలెందుకు, వాటికోసం యురేనియమో మరొకటో తవ్వినపుడు ప్రమాదకరమైన కిరణాలను విడుదల చేయటం ఎందుకు ? వాటితో క్యాన్సర్‌, ఇతర భయంకర జబ్బులు రావటం ఎందుకు? అన్నీ కాలుష్యం కావాల్సిన పనేముంది? సుదర్శన అస్త్రం, ఇతర మరికొన్ని పురాణ అస్త్రాలు హింసాత్మకమైనవి మనది శాంతిభూమి కదా ఎవరైనా అనవచ్చు. పురాణాలలో సమ్మోహనాస్త్రాలు కూడా వున్నాయి. వాటిని తయారు చేసి మనకు నిత్యం తలనొప్పిగా వున్న పాక్‌ పాలకుల మీద, వారు పంపే తీవ్రవాదుల మీద దేశంలో వున్న వుగ్రవాద మావోయిస్టులు, ఇతర తీవ్రవాదుల మీద ప్రయోగిస్తే మంచివారిగా మారిపోతారు కదా ! అప్పుడు వారికి డబ్బు అందకుండా చూసేందుకు మరోసారి నోట్ల రద్దు అనే పిచ్చిపని, సర్జికల్‌ స్ట్రైక్స్‌ అవసరం వుండదు, వాటితో శతృవులను హతమార్చామని చెప్పుకోపని లేదు, ప్రతిపక్షాలకు రుజువులు చూపమని అడిగే అవకాశం వుండదు. అన్నింటికీ మించి మన శాస్త్ర పరిశోధనా కేంద్రాలన్నింటినీ మూసివేసి లేదా వాటిలో పని చేస్తున్న శాస్త్రవేత్తలను కట్టగట్టి ఇంటికి పంపి వేదాలు, సంస్కృత పండితులు, బవిరి గడ్డాల యోగులు, యోగినులతో నింపి వేస్తే ఎంతో ఖర్చు కలసి వస్తుంది. కారుచౌకగా కావాల్సిన అస్త్రాలను తయారు చేయించవచ్చు. వందల కోట్లు పెట్టి కిరస్తానీ దేశాల నుంచి రాఫెల్‌ విమానాలు, ఇతర ఆయుధాలను కొనుగోలు చేయాల్సిన అవసరం వుండదు. అందుకు అవసరమైన విదేశీ డాలర్లతో అసలే పని వుండదు. ఇది కలి యుగం గనుక అస్త్రాల తయారీ కాస్త ఆలశ్యం అవుతుంది అనుకుంటే ప్రజ్ఞా సింగ్‌ వంటి సాధ్వులను రంగంలోకి దించి శత్రువుల మీద శాపాలు పెట్టించండి. వారి నోటి దూల తీరి శత్రువుల పీడ విరగడ అవుతుంది. వందల కోట్లు ఖర్చు చేసి ఇస్రో ప్రయోగాలు చేయటం ఎందుకు, వేదగణితంతో లెక్కలు, డిజైన్లు వేసి వుంటే ఈ పాటికి చంద్రుడి మీన వారు రియెలెస్టేట్‌ ప్రారంభించి ఎంతో లబ్ది చేకూర్చి పెట్టి వుండేవారు. చంద్రయాన్‌ రెండవ ప్రయోగం విఫలమైందని మన ప్రధాని శాస్త్రవేత్తల మీద విసుక్కున్నారని వార్తలు వచ్చి వుండేవి కాదు, దాన్ని దాచుకునేందుకు తరువాత వారిని అక్కున జేర్చుకొని ఓదార్పుల దృశ్యాలు చూసే ఖర్మ మనకు తప్పేది.

Image result for puranic weapons

కొన్ని పురాణ అస్త్రాలు రక్షణ, శత్రు సంహారానికి సంబంధించినవి. వాటిలో సమ్మోహనాస్త్రం అయితే బహుళ ప్రయోజనకారి. నరేంద్రమోడీ గత ఐదు సంవత్సరాలలో ఎన్ని విదేశాలు తిరిగినా, ఎంత మంది విదేశీ నేతలను కౌగిలించుకున్నా మన దేశానికి పెద్దగా పెట్టుబడులు వచ్చింది లేదు. పరిశ్రమలు, వాణిజ్యాలు పెరిగి వుంటే నిరుద్యోగం నాలుగున్నర దశాబ్దాల నాటి రికార్డులను బద్దలు కొట్టి కొత్త రికార్డులను స్దాపించేది కాదు. మన గడ్డమీద నుంచే సమ్మోహనాస్త్రాలను ప్రయోగించినా, విదేశాలకు వెళ్లినపుడు కొన్నింటిని వెంటబెట్టుకు వెళ్లి ప్రయోగించినా సినిమాల్లో మాదిరి గింగిరాలు తిరుక్కుంటూ అన్ని దేశాల వారూ ఈ పాటికి ఇక్కడ పడి వుండేవారు. ఇంకచాలు బాబోయ్‌ అనేవరకు మనకు కావాల్సినవన్నీ తెచ్చి పడవేశేవారు. అందువలన ఇప్పటికీ మించిపోయింది లేదు. పెద్ద నోట్లను, ఆర్టికల్‌ 370 రద్దు చేసినా వుగ్రవాద సమస్య పోలేదు, మొత్తం కాశ్మీర్‌లో ఆగస్టు ఐదు నుంచి విధించిన కర్ఫ్యూను ఇంతవరకు తొలగించలేదు. దేశం ఆర్దిక మాంద్యం నుంచి గట్టెక్కాలంటే నిర్మలమ్మ గారు ఎన్ని వుద్దీపన పధకాలు ప్రకటించినా ప్రయోజనం వుందనే ఆశ లేదు. కనుక రక్షణ కోసం, సుదర్శన చక్రాలు, పెట్టుబడులు, ఎగుమతుల కోసం సమ్మోహన అస్త్రాలు తయారు చేసేందుకు పూనుకొని కాషాయ దళాలు తమ దేశభక్తిని నిరూపించుకోవాలి. ప్రపంచానికి భారత సత్తా చాటాలి. కాకమ్మ కబుర్లు కాదు కార్యాచరణ ముఖ్యం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమరావతి నిర్మాణం- బొత్స శల్యసారధ్యం !

01 Sunday Sep 2019

Posted by raomk in AP, Current Affairs, History, INDIA, Opinion, Political Parties, STATES NEWS

≈ Leave a comment

Tags

Amaravati capital, Amaravati capital controversy, ANDHRA PRADESH, ANDHRA PRADESH Politics, Chandra Babu, pavan kalyan, YS jagan

Image result for amaravati capital

ఎం కోటేశ్వరరావు

మహాభారతాన్ని ఒక రచనగా నమ్మేవారు గానీ, నిజంగా జరిగిందని విశ్వసించే వారికి గానీ శల్యుడి గురించి తెలిసిందే. యుద్ధంలో కర్ణుడి రధ సారధిగా వ్యవహరించిన తీరు శల్యసారధ్యంగా గణుతికెక్కింది. అర్జునుడిని గెలిపించేందుకు గాను కర్ణుడి సారధిగా వుంటూ అర్జునుడిని పొగుడుతూ కర్ణుడి దృష్టిని పక్కదారి పట్టించే అంటే ఒక నమ్మక ద్రోహి పాత్రను పోషించాడు. ఇదంతా ధర్మరాజు కోరిక మేరకే చేశాడని, తరువాత కృష్ణుడి సలహా మేరకు ఆ ధర్మరాజు చేతిలోనే శల్యుడు హతమయ్యాడన్నది కధ.

తెరవెనుక ఏమి జరిగిందన్నది ఎవరికి వారు వూహించుకోవటం తప్ప ఎవరూ విన్నది లేదు కన్నదీ లేదు గానీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతి విషయంలో శల్యుడి పాత్రను పోషిస్తున్నట్లుగా స్పష్టమైంది. వెంటనే దీనికి సూత్రధారి ఎవరు అనే ప్రశ్న తలెత్తుతుంది. ఏదీ రహస్యం కాదు, కాస్త వెనుకో ముందో అన్నీ బయటకు వస్తాయి. చివరికి బొత్స ఏమౌతారో తెలియదు గానీ, ఈ పరిణామాలను చూస్తున్న వారు సహజంగానే పెద్దన్న అంటే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి వైపే వేలెత్తి చూపటం సహజం.

అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఆమోదించటం వేరు, దానికి భూములు సేకరించిన తీరును విమర్శించటం మరొకటి. ఈ విషయంలో వైసిపి పక్ష నాయకుడిగా జగన్‌ అసెంబ్లీలో ఆమోదించారు. భూ సేకరణ పద్దతిని విమర్శించారు. ఐదు సంవత్సరాల తరువాత వారు వీరయ్యారు. రాజధాని నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని, ఆ ప్రాంత భూముల లావాదేవీల్లో అక్రమాలు జరిగాయని, రాజధాని నిర్ణయం జరగక ముందే చంద్రబాబు నాయుడు తన బినామీలు, అనుయాయులకు వుప్పందించి ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేయించారని, వాటికి రేట్లు పెరిగే విధంగా తరువాత రాజధాని ప్రాంత పరిధిని విస్తరింపచేసి లబ్ది చేకూర్చారనే విమర్శలు గతంలోనే వెల్లడయ్యాయి. వైసిపి నాయకత్వం కూడా చెప్పింది. వాటన్నింటి మీద విచారణ జరిపి అక్రమాలను బయట పెడతామంటే అంతర్గతంగా ఏమనుకున్నప్పటికీ తమకేమీ అభ్యంతరం లేదని తెలుగుదేశం పార్టీ కూడా ప్రకటించింది.

గతంలో జరిగిన అక్రమాలను వెలికి తీయటానికి ఎవరికీ అభ్యంతరం లేదు. ఇదే సమయంలో ఇప్పటి వరకు బయట పెట్టటానికి తీసుకున్న చర్యలేమీ లేవు. కొన్ని విద్యుత్‌ ఒప్పందాల సమీక్ష, పోలవరం టెండర్ల రద్దు, రివర్స్‌ టెండర్ల విషయంలో వేగంగా తీసుకున్న చర్యలను చూసిన జనం అమరావతి అక్రమాల విషయంలో లేస్తే మనిషిని కాదు అన్న కాళ్లు లేని మల్లయ్య మాదిరి అవసరమైనపుడు బయట పెడతాం అంటున్నారు. ఇది ఒక వైపు సాగుతుండగానే ముందే చెప్పుకున్న శల్యసారధ్యం మాదిరి బొత్స సత్యనారాయణ తెల్లారితే వెలుగు వస్తుంది, పొద్దు గూకితే చీకటి పడుతుంది అన్నట్లుగా వరదలు వస్తే అమరావతి మునిగిపోతుంది. పునాదులు లోతుగా తీయాలి, కట్టడాలను ఎత్తుగా కట్టాలి, మిగతా చోట్ల కంటే ఖర్చు రెట్టింపు అవుతుంది, అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరగాలి అనే రీతిలో మాట్లాడి ఈ ప్రభుత్వానికి అమరావతి రాజధాని అభివృద్ధి అంటే ఇష్టం లేదు, మరో ప్రాంతానికి తరలిస్తారు అని ప్రచారం చేసేందుకు, జనం నమ్మేందుకు ఆస్కారం కలిగించారు. బొత్స చెబుతున్నదాని ప్రకారం అయితే గతంలో రాజులు, రంగప్పల మాదిరి కొండలు, గుట్టల మీద దుర్గాలు, కోటల మాదిరి నిర్మాణాలు చేయాలి. మంత్రిగారికి మద్దతుగా వైసిపి నేతలు ఆయన మాట్లాడిందాంటో తప్పే ముంది, రాజధానిని తరలిస్తామని చెప్పలేదుగా అంటూ సమర్దనకు దిగారు. ఇదంతా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి అమెరికాలో వుండగా ప్రారంభమైంది. ఆయన రాష్ట్రానికి తిరిగి వచ్చిన తరువాత బొత్సవ్యాఖ్యలతో తలెత్తిన వివాదం లేదా గందరగోళానికి తెరదించుతారని, ముఖ్యమంత్రిగా ఒక వివరణ ఇవ్వాలని అందరూ ఆశించారు, కోరుకున్నారు. అదేమీ చేయలేదు, రాష్ట్రంలో ఒక ముఖ్యమైన అంశం మీద ముఖ్యమంత్రి స్పందించలేదంటే, కావాలనే ఇదంతా చేస్తున్నారు, సిఎం ఆశీస్సులు లేకుండా మంత్రి మాట్లాడి వుండరనే అభిప్రాయాన్ని నిర్దారించినట్లే భావించాల్సి వుంటుంది.

అమరావతి ప్రాంతం రాజధానిగా వుంటే ఎదురయ్యే సమస్యల గురించి శివరామ కృష్ణన్‌ కమిషన్‌ వెల్లడించిన అభిప్రాయాలను ఖాతరు చేయకుండా ఆ ప్రాంతంలోనే రాజధానిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దానికి మద్దతు తెలిపిన సమయంలో వైసిపి నాయకత్వానికి ఆ ప్రాంతంలో వరద ముప్పు తెచ్చే కొండవీటి వాగు గురించి తెలియదని, వారంతా అమాయకులని అనుకోలేము. రాజధానితో నిమిత్తం లేకుండానే రైతాంగాన్ని నష్టపరిచే ఆ వాగు ముంపు నివారణ చర్యలు తీసుకోవాలని మంగళగిరికి గతంలో ప్రాతినిధ్యం వహించిన సిపిఎం ఎంఎల్‌ఏ నిమ్మగడ్డ రామమోహనరావు, ఆ పార్టీ ఆధ్యర్యంలో అనేక సార్లు పాలకుల దృష్టికి తెచ్చినా తెలుగుదేశం పార్టీ గానీ, వైసిపి మాతృక కాంగ్రెస్‌ పాలకులు గానీ పట్టించుకోలేదన్నది తెలిసిందే. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన తరువాత ముంపు నివారణకు కొన్ని పధకాలను రూపొందించారు. వాటన్నింటినీ విస్మరించి మంత్రి ఆ సమస్యను ఇప్పుడు ముందుకు తేవటం ఏమిటి? అమరావతిపై అసెంబ్లీ చర్చ సందర్భంగా వైసిపి నేతలు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ?

అమరావతి అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తే మిగతా ప్రాంతాలు ఏమి కావాలన్నట్లు వైసిపి నేతలు కడవల కొద్దీ కన్నీరు కారుస్తున్నారు. మిగతా ప్రాంతాల అభివృద్ధికి ఎవరు అడ్డుపడ్డారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో కాంగ్రెస్‌ లేదా తెలుగుదేశం ఎవరున్నా కేంద్ర, రాష్ట్రాల పెట్టుబడులు, సంస్ధలను హైదరాబాదులోనే కేంద్రీకరించి అటు తెలంగాణా ఇటు రాయలసీమ, ఆంధ్రప్రాంతాలను నిర్లక్ష్యం చేసిన నేరానికి అందరినీ బోనులో నిలబెట్టాల్సిందే. మన దేశ అనుభవం తీసుకున్నా లేక ప్రపంచ దేశాల తీరు చూసినా ప్రయివేటు పెట్టుబడులు ఎక్కడ లాభసాటిగా వుంటే అక్కడికే తరలి వచ్చాయి, వస్తున్నాయి, వస్తాయి తప్ప మరోచోటికి రావటం లేదు. 1991 నుంచి కొన్ని రక్షణ సంబంధ సంస్ధల విషయంలో తప్ప కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టటం నిలిపివేశాయి. అన్ని ప్రాంతాల అభివృద్ధి గురించి చెబుతున్న వైసిపి తన ఎన్నికల ప్రణాళికలో నవరత్నాల గురించి తప్ప తాను అధికారంలోకి వస్తే ప్రభుత్వ పరంగా ఏఏ ప్రాంతాల్లో ఏ పరిశ్రమలకు పెట్టుబడులు పెడతానో ఎందుకు చెప్పలేదు. పాలకులు కోరిన చోట పెట్టుబడులు పెట్టేందుకు ప్రయివేటు వారు ఎవరూ ముందుకు రారు. అదే గనుక జరిగితే గత ఐదు సంవత్సరాలలో చంద్రబాబు, లోకేష్‌ బాబు దేశ విదేశాల్లో చేసిన హడావుడికి ఇంక చాలు బాబో అన్నట్లుగా పెట్టుబడులు, పరిశ్రమలు, సంస్ధలూ వచ్చి వుండాల్సింది. ఇంత ఘోరపరాజయాన్ని మూటగట్టుకొని వుండేవారు కాదు. అమెరికా, ఐరోపా వంటి దేశాలలో విమానాశ్రయాల వంటి మౌలిక సదుపాయాలకు కొదవలేదు, అయినా పెట్టుబడిదారులు అక్కడ పరిశ్రమలు, సేవలపై పెట్టుబడులు పెట్టటం మాని శ్రమశక్తి చౌకగా వున్న చైనా, బంగ్లాదేశ్‌, వియత్నాం వంటి దేశాలలో పెట్టుబడులు, పరిశ్రమలను పెట్టి వుత్పత్తులను తిరిగి తమ దేశాలకే ఎగుమతులు చేస్తున్నారు. ఆయా దేశాల కంపెనీలు మన దేశంలో ఐటి ఇంజనీర్లు వెట్టి చాకిరీ చేయటానికి అందుబాటులో వున్నారు గనుక పొరుగు సేవల రూపంలో ఐటి రంగ సేవలను పొందుతున్నాయి, కంపెనీలను పెడుతున్నాయి.

అమరావతి విషయంలో ఎన్నికబుర్లు చెప్పినా, భ్రమరావతిగా గ్రాఫిక్స్‌ ఎన్ని చూపినా తాత్కాలిక నిర్మాణాలు చేసినపుడే కాలక్షేపం చేయటానికి చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు, దాన్ని సాగదీస్తూ పూర్తి చేయాలంటే తనకు తిరిగి అధికారం కట్టాబెట్టాలని జనం కోసం ముందుకు వెళ్లాలని పధకం వేసినట్లు రుజువైంది.ఐదేండ్లలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయిన చంద్రబాబును నిలవేయని జనం మరో ఐదేండ్ల పాటు అదే పని చేస్తే వైసిపిని ప్రశ్నిస్తారని అనుకోలేం. తమకు ఖాళీ ఖజానా అప్పగించారని వైసిపి సర్కార్‌ వాపోతోంది, అందులో వాస్తవం కూడా వుంది. ఏ సర్కార్‌ అయినా వేలు లేదా లక్షల కోట్లు మిగిల్చి తరువాత వచ్చే ప్రభుత్వాలకు ఖజానా అందించిన వుదంతాలు ఎక్కడా లేవు. ఏ ప్రభుత్వం కూడా అలా మిగిల్చిన దాఖలాలు లేవని బడ్జెట్టను చూస్తేనే తెలుస్తుంది. అందువలన ఆ పేరుతో జగన్‌ సర్కార్‌ కాలక్షేపం చేయవచ్చు. రాజధాని నిర్మాణాలను పూర్తి చేయటానికి మా దగ్గర డబ్బు లేదు, అందువలన మరో ఐదేండ్లు తాత్కాలిక నిర్మాణాల్లోనే కాలక్షేపం చేస్తాం, రాజధాని అక్కడే వుంటుంది అని చెప్పండి. వివాదానికి తెరదించండి, అలా చేస్తే బొత్స సత్యనారాయణ ప్రతిష్టకు వచ్చే భంగమూ లేదు, జగన్‌ సర్కార్‌కు పోయే పరువూ లేదు. ఏదో ఒక స్పష్టత ఇచ్చి మంచి పని చేశారనే సానుకూల వైఖరే వ్యక్తం అవుతుంది. అలాగాక నాలుగు ప్రాంతాల్లో లేదా పదమూడు జిల్లాల్లో రాజధానులను ఏర్పాటు చేస్తాం అన్నట్లుగా మాట్లాడితే తుగ్గక్‌తో పోల్చుకుంటారు. తుపాకి రాముడు లేదా పిట్టల దొరలు అనుకుంటారు.

రాజధాని నిర్మాణం గురించి తెలుగుదేశం పార్టీ దాని సమర్ధకులు మరో వైపు లాగుతున్నారు. రాజధాని అంటే సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ప్రభుత్వశాఖల ప్రధాన కేంద్రం. సిబ్బందికి అవసరమైన వసతుల కల్పనకు ఏర్పాట్లు. అలాంటి రాజధానికి, రాజధాని నగర నిర్మాణానికి ముడిపెట్టి రియలెస్టేట్‌ స్పెక్యులేషన్‌కు తెలుగుదేశం తెరలేపింది. ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకోవటంలో తప్పులేదు. చత్తీస్‌ఘర్‌ రాష్ట్రం 2000 సంవత్సరంలో ఏర్పడింది. రాయపూర్‌ను రాజధానిగా ఎంచుకున్నారు. దాని శివార్లలో నయా రాయపూర్‌ నిర్మించి అక్కడ రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2031 నాటికి అక్కడ ఐదులక్షల ముఫ్పై వేల మంది నివసించటానికి ఏర్పాట్లు అవసరమైని రూపకల్పన చేశారు. ఝార్ఖండ్‌ కాత్త రాష్ట్రాన్ని కూడా 2000 సంవత్సరంలోనే ఏర్పాటు చేశారు. రాజధానిగా రాంచీని ఎన్నుకున్నారు. అలాగే వుత్తరాఖండ్‌ రాజధానిగా డెహ్రాడూన్‌ వుంది. గుజరాత్‌లో పెద్ద నగరం అహమ్మదాబాద్‌ వున్నప్పటికీ గాంధీనగర్‌ పేరుతో ప్రత్యేకంగా రాజధాని ప్రాంతాన్ని నిర్మించారు. కొన్ని దశాబ్దాల తరువాత కూడా దాని జనాభా మూడులలక్షలు దాటలేదు. హైదరాబాదు నగరం వంటి దానిని నిర్మిస్తే రాష్ట్రానికి ఆదాయం బాగా వస్తుంది, ఆ దిశగా అమరావతి నిర్మాణం అని చెబుతున్నారు. ఆదాయం కోసం ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ రాజధాని నగరాల నిర్మాణాలు జరపలేదు. అలా జరపటం అంటే అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించటం అనే ఒక తప్పుడు ఆలోచనలో భాగమే.హైదరాబాద్‌ లేదా ఏ మహానగర చరిత్ర చూసినా వందల సంవత్సరాల చరిత్ర, లక్షల కోట్ల రూపాయల మేర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెట్టుబడి, వాటిని ఆసరా చేసుకొని ప్రయివేటు రంగ విస్తరణ కనిపిస్తుంది.

చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా రాష్ట్ర సంపదను పెంచగలగటం గొప్ప విషయం కాదని ఎవరు మాత్రం అనగలరు అంటూ ఒక మీడియా సంస్ధ అధిపతి, జర్నలిస్టు సెలవిచ్చారు. దీన్ని గుర్తించటానికి నిరాకరించే నాయకులు, కుహనా మేథావులు వివాదాస్పదం చేశారు అంటూ అమరావతి గురించి, అందుకోసం చంద్రబాబు నాయుడు పడిన తపన గురించి వ్యాఖ్యానించారు. నాయకులందరూ, మేథావులు గానీ చంద్రబాబు నాయుడు లేదా జగన్‌మోహన్‌ రెడ్డి నందంటే నంది పందంటే పంది అని తలలూపే గంగిరెద్దులు కాదు.ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరిగే ఆ బాపతు వేరే వుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు పిల్లి మొగ్గలు వేసిన సందర్భంగా అది వెల్లడైంది. ఇప్పుడు రాజధాని విషయంలో వైసిపి నేతలు అలాంటి పనిలోనే వున్నట్లు కనిపిస్తోంది. ఒక అభిప్రాయం, అంచనాలతో వ్యతిరేకించే వారిని, విబేధించేవారందరినీ కుహనా మేథావులుగా ముద్రవేస్తే సదరు మీడియా సంస్ధ నడిపే పత్రికలు, టీవీ ఛానల్స్‌లో అలాంటి విబేధాలను నిత్యం ఏదో ఒక అంశం మీద వెల్లడిస్తూనే వున్నారు. అంటే వాటిని నిర్వహించే వారు, పని చేసే వారు కుహనా జర్నలిస్టులే అనుకోవాల్సి వుంటుంది. అది రాజధాని కావచ్చు లేదా పదమూడు జిల్లాల్లో కావచ్చు అసలు ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు ద్వారా అభివృద్ధి అని చెప్పటమే జనాన్ని తప్పుదారి పట్టించటం. ఎక్కడో ప్రభుత్వ కార్యాలయాలను పెడితే హోటల్స్‌, షాపింగ్‌ మాల్స్‌ వస్తాయా అని ఒక ముక్తాయింపు, అభివృద్ధి అంటే మాల్స్‌, హోటళ్లా ? గుంటూరు పొగాకు, పత్తి, మిర్చి పంటలకు పెద్ద వాణిజ్య కేంద్రం. ఎందరో విదేశీ పొగాకు వ్యాపారులు ప్రతి ఏడాది అక్కడకు వచ్చే వారు. అలాంటి చోట నిన్నమొన్నటి వరకు పెద్ద హోటళ్లు ఎన్ని వున్నాయి? లాభం వుంది గనుకనే గుంటూరులో పొగాకు వ్యాపారులు హోటళ్లను మించిన వసతి గృహాలను ఏర్పాటు చేశారు. లాభం వస్తే వ్యాపారి వరదన పోవటానికైనా వెనుకాడడు. విమానాల సౌకర్యమే ప్రాతిపదిక అయితే ఢిల్లీ, ముంబైకి వచ్చినన్ని విమానాలు ఏ నగరానికి రావు. అయినప్పటికీ బెంగలూరు, హైదరాబాదు మాత్రమే ఐటి రంగంలో ఒకటి రెండు స్ధానాల్లో ఎందుకు ఎదిగాయి. హిమచల్‌ ప్రదేశ్‌, వుత్తరాఖండ్‌ వంటి చోట్ల హైదరాబాదు నుంచి వెళ్లి మరీ ఔషధ కంపెనీలను ఏర్పాటు చేస్తున్నారు, అక్కడికి వున్న విమాన సౌకర్యాలు ఏపాటి ? లాభాల కోసం పరిశ్రమలు, వాణిజ్యం చేయాలనుకున్న పెట్టుబడిదారులు గానీ, వుద్యోగం కావాలనుకున్న యువత విమాన సౌకర్యాన్ని బట్టి నగరాలను ఎంచుకోరు. అవకాశం వుంటే ఆఫ్రికాకు అయినా వెళుతున్నారు.

Image result for amaravati capital

రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ కోరటం పైన పేర్కొన్న మీడియా అధిపతికి ఆశ్చర్యం కలిగిస్తోందట.ఇది ఒక రాజకీయ నేత నోటి నుంచి వస్తే అర్ధం చేసుకోగలం, ఒక జర్నలిస్టు కలం నుంచి వెలువడటం అంటే చౌకబారు జర్నలిజం తప్ప మరొకటి కాదు. ఒక్క పవన్‌ కల్యాణ్‌ ఏమిటి? చంద్రబాబు వైఖరిని విమర్శించిన వామపక్షాలు కూడా అదే కోరుతున్నాయి, రాజధాని నిర్మాణం అక్కడే జరపాలని చెబుతున్నాయి. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కాంగ్రెస్‌ నిర్వాకం చూసి అనేక మంది ఇలాంటి స్వాతంత్య్రాన్ని కాదు మేము కోరుకున్నది అని ఆవేదన చెందారు. అయినంత మాత్రాన ప్రజానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కాంగ్రెస్‌ను డిమాండ్‌ చేయకుండా వదల్లేదు. అమరావతిపై చర్చ సందర్భంగా ప్రతి పార్టీ, మేథావులు అనేక అభిప్రాయాలు చెప్పారు, వాటిలో వ్యతిరేకమైనవీ వున్నాయి. చంద్రబాబు భూసేకరణ తీరును తప్పు పట్టారు. వాటిని చంద్రబాబు పట్టించుకోలేదు. ఆ వైఖరి మాత్రం సదరు జర్నలిస్టుకు ఆమోదం అయింది గానీ ఆశ్చర్యం కలిగించలేదు. ఇష్టమైన రైతులు ప్రలోభాలకు గురయ్యో, అత్యాశలకు లోనయ్యో భూములు ఇచ్చారు. కొందరిని బెదిరించారని కూడా విమర్శలు వున్నాయి. స్వాతంత్య్ర వుద్యమ సమయంలో ఎందరో మహిళలు తమ వంతు త్యాగంగా భావించి వంటి మీద వున్న నిలువెత్తు బంగారాన్ని మహాత్మాగాంధీకి ఇచ్చారు. రాజధాని విషయంలో చంద్రబాబును కూడా అంతటి మహోన్నతుడిగా భ్రమించి కొందరు మహిళలు బంగారాన్ని ఇవ్వటం, కొన్ని మీడియాలు దాన్ని బాహుబలి స్ధాయిలో ప్రచారం చేయటం తెలిసిందే. ఇప్పుడు సదరు మహిళలు, భూములిచ్చిన వారికి నష్టం జరిగేట్లుగా కనిపిస్తున్నపుడు న్యాయం చేయాలని ఎవరైనా అడగవచ్చు, దానికి తప్పు పట్టటం ఏమిటి. అత్త పెత్తనం సామెత మాదిరి జనాన్ని ముంచినా తేల్చినా చంద్రబాబే చేయాలని చెప్పటమా ?

రాజధాని నిర్మాణం జరగని కారణంగానే ఆంధ్రప్రదేశ్‌ ఆదాయం తగ్గుతోందని అనే భావన కలిగేలా చిత్రిస్తున్నారు. అసలు దేశం మొత్తంగానే ఆ పరిస్ధితి ఎందుకు ఏర్పడిందో కనిపించదా? హైదరాబాదూ, ఆదాయం అంటూ అరచేతిలో వైకుంఠాన్ని చూపుతున్న వారు ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో కూడా ఆదాయం పడిపోయిందని, పొదుపు పాటించాలని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావే చెబుతున్న విషయాన్ని విస్మరించకూడదు. ఆదాయం లేని ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఆదాయం వున్న తెలంగాణా కూడా ఎందుకు అప్పులు చేయాల్సి వచ్చిందో, ఆరోగ్యశ్రీకి చెల్లింపులు చేయలేక ఆసుపత్రులు సమ్మెకు దిగాల్సిన పరిస్దితి ఎందుకు ఏర్పడిందో చెప్పాలి. రాజధాని నిర్మాణం గురించి వెంటనే జగన్‌మోహన్‌ రెడ్డి జనంలో తలెత్తిన అనుమానాలను నివృత్తి చేయాలి, అది ఒక ముఖ్యమంత్రి విధి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జగన్‌ సర్కార్‌ బడ్జెట్‌లో కొత్త దనం ఏమిటి !

14 Sunday Jul 2019

Posted by raomk in AP, AP NEWS, Current Affairs, Economics, Farmers, Health, History, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Andhra Pradesh Budget 2019-20, Y S Jagan Govt 1st Budget

Image result for What is new in YS Jagan first Budget

ఎం కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ తన తొలి బడ్జెట్‌లో ఎన్నో విన్యాసాలు ప్రదర్శించారు. పాదయాత్రలు, ఓదార్పు యాత్రలు, ఓట్ల యాత్రల సమయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన వాగ్దానాలు, విసిరిన వాగ్బాణాలకు అనుగుణ్యంగానే ఈ బడ్జెట్‌ను రూపొందించారు. అధికారానికి వచ్చిన రెండో నెల్లోనే బడ్జెట్‌ పెట్టాల్సి రావటం కసరత్తు చేసేందుకు తగిన సమయం లేదని చెప్పుకొనేందుకు, ఎవరైనా నిజమే కదా అనేందుకు ఆస్కారం వుంటుంది. దానిలో కొంత వాస్తవం కూడా లేకపోలేదు. బడ్జెట్‌ కొత్త మంత్రులకు హడావుడి తప్ప నిరంతరం కొనసాగే అధికార యంత్రాంగానికి రోజువారీ వ్యవహారమే. అందునా ఓట్‌ ఆన్‌ అకౌంట్‌కు ముందుకు గానే ఏర్పాట్లు చేశారు కనుక, నూతన పాలకుల ఆకాంక్షలకు అనుగుణంగా కొన్ని శాఖల, పధకాలకు కోత, వాత, కొన్నింటికి మోత అన్నట్లుగా సవరణలు చేయటం తప్ప పెద్దగా ఇబ్బంది వుండదు. ఫిబ్రవరి మాసంలో నాటి ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు రెండు లక్షల 26వేల కోట్లతో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ ప్రతిపాదిస్తే, రాజేంద్రనాధ్‌ రెండు లక్షల 27వేల కోట్లతో ప్రపతిపాదించారు.

అడుక్కొనే దగ్గర పిసినారి తనం ఎందుకన్నది పెద్దల మందలింపు వంటి సలహా. బడ్జెట్‌లో విషయంలో కూడా పాలకులు దీన్నే ప్రదర్శిస్తూ భారీగా ప్రతిపాదనలు చేస్తున్నారు. సంక్షేమ పధకాల అమలు విషయంలో ఎవరికీ పేచీ లేదు గానీ అవే సర్వస్వం, జిందా తిలిస్మాత్‌ (సర్వరోగ నివారిణి అన్నది దాని తయారీదార్ల ప్రచార నినాదం) అంటే కుదరదు. అవి సంక్షోభం లేదా సమస్యల్లో వున్న జనానికి పూత మందు వంటి వుపశమన చర్యలు మాత్రమే అన్నది ముందుగా చెప్పకతప్పదు. జగన్‌ సర్కార్‌ కూడా పిసినారితనం ప్రదర్శించలేదు. బడ్జెట్‌ అంటే అంకెల గజిబిజి కనుక సమీప అంకెల్లోకి మార్చి చెప్పుకుందాం. ప్రతిపాదించిన రెండులక్షల 27వేల కోట్లలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా, గ్రాంటులు, రాష్ట్రం తీసుకొనే అప్పులు అన్నీ కలసి వుంటాయి. బడ్జెట్లో చూపిన అంకెలను చూసి ఎవరైనా చూశారా మా జగన్‌ తడాఖా అని ఛాతీ విరుచుకున్నారో తెలుగుదేశం కార్యకర్తలకు జరిగిన పరాభవమే పునరావృతం అవుతుంది.

మార్చినెలతో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో చంద్రబాబు సర్కార్‌ లక్షా 91వేల కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించి ఏడాది చివరికి వచ్చేసరికి లక్షా 62వేల కోట్లకు కుదించింది. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం దాన్నే రెండులక్షల 27వేల కోట్లకు పెంచి చూశారా చంద్రబాబు కంటే తాము 19శాతం బడ్జెట్‌ పెంచాము అని గొప్పలు చెప్పుకొంటోంది. ఆచరణలో ఏం జరుగుతుందన్నది ముఖ్యం. గతేడాది తెలుగుదేశం సర్కార్‌ అప్పుల ఆదాయం మినహా మిగిలిన మొత్తం ఆదాయంలో కేంద్రం నుంచి వచ్చే గ్రాంటుల మొత్తం 50,695 కోట్లుగా చూపితే సవరించిన దాని ప్రకారం వచ్చిన మొత్తం 19,456 కోట్లు మాత్రమే. జగన్‌ సర్కార్‌ వస్తుందని చూపిన మొత్తం 61,071 కోట్లు. గత ఏడాది ఆశించిన మేర రాని కారణంగానే లక్షా 55వేల 507 కోట్ల అంచనాను లక్షా 14వేల 684 కోట్లకు తగ్గించారు. అయినా రాజేంద్రనాధ్‌ వర్తమాన సంవత్సరంలో లక్షా 78వేల 697 కోట్లను చూపారు. రాకపోతే చంద్రబాబు నాయుడి సర్కార్‌ మాదిరే కోత పెట్టటం తప్ప మరొక మార్గం లేదు. తెలుగుదేశం సర్కార్‌ గతేడాది 33,461 కోట్ల రూపాయలను అప్పులు తేవాలని లక్ష్యంగా పెట్టి 38,245 కోట్లకు పెంచింది. ఇప్పుడు జగన్‌ ఆ మొత్తాన్ని 47వేల కోట్లకు పెంచనున్నట్లు ప్రతిపాదించారు.

ఇక్కడ ఒక విషయాన్ని తెలుసుకోవాల్సి వుంది. బడ్జెట్‌కు ముందుగా ఆర్ధికశాఖ ఒక శ్వేత పత్రాన్ని వెల్లడించింది. ఇదే ఆర్ధిక శాఖ ఎన్నికలకు ముందు కూడా శ్వేతపత్రాన్ని ప్రకటించింది. ప్రభుత్వాలు మారగానే వాటిలోని పదజాలం వ్యాఖ్యానాలు కూడా మారిపోయాయి. ఆర్ధిక శాఖ లేదా ప్రభుత్వం ప్రకటించే పత్రాలు వాస్తవ అంకెలను జనం ముందుంచి వారి విచక్షణ, వ్యాఖ్యానాలకు వదలి వేయాలి తప్ప రాజకీయ వ్యాఖ్యానాలను చొప్పించినపుడు వాటి విశ్వసనీయతే ప్రమాదంలో పడుతుంది. వెంటనే వాటి మీద తలెత్తే ప్రశ్నలకు జవాబు చెప్పుకోవాల్సి వుంటుంది. గత ఐదు సంవత్సరాలలో పాలన, ఆర్ధిక యాజమాన్యంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని, మానవ, భౌతిక పెట్టుబడులపై పూర్తి నిర్లక్ష్యం, దానికి అవినీతి తోడై చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా రాష్ట్రాన్ని చీకటి యుగంలోకి నెట్టారని (జగన్‌ సర్కార్‌ ఆర్ధిక శాఖ శ్వేత పత్రం-పేరా 8) వ్యాఖ్యానించారు. సహజవనరులను ప్రయివేటు వారు లబ్దిపొందే విధంగా ఇష్టారాజ్యంగా దోపిడీ చేశారని, నీకిది నాకది అనే పద్దతుల్లో ప్రభుత్వ సంస్ధలను ప్రయివేటీకరించారని దానిలో పేర్కొన్నారు. ఈ విమర్శను తెలుగుదేశం అంగీకరించకపోవచ్చుగానీ మిగతా పార్టీలు, నిష్పాక్షికంగా చూసే వారికి ఎలాంటి అభ్యంతరమూ వుండదు. ఇక్కడ సమస్య జగన్‌ సర్కార్‌ దీన్నుంచి తీసుకున్న గుణపాఠాలు ఏమిటి? వాటిని సరిదిద్దేందుకు అనుసరించే వారి విధానం ఏమిటన్నదే అసలు ప్రశ్న. సహజవనరులను ప్రయివేటు వారి దోపిడికీ వదలి వేయకుండా తీసుకున్న లేదా తీసుకోబోయే చర్యలేమిటి? ప్రయివేటీకరణ మీద నూతన ప్రభుత్వ విధానం ఏమిటి అన్నదానికి ఆర్ధిక మంత్రి ప్రసంగంలో ఎక్కడా సమాధానం కనపడదు.

రెవెన్యూ ఖర్చు మీద గత ప్రభుత్వానికి అదుపు లేదని, అది విపరీతంగా పెరిగిపోయిందని,సమర్దవంతంగా నిర్వహించలేదని శ్వేత పత్రంలో పేర్కొన్నారు. పద్నాలుగవ ఆర్ధిక సంఘం నిర్ణయాల మేరకు రెవెన్యూ లోటు గ్రాంట్లను తీసుకుంటూనే రెవెన్యూ ఖాతా ఖర్చుకు గాను ప్రభుత్వం అప్పులు చేసిందని, మూలధన పెట్టుబడి ఖాతాకు అన్నింటికీ మించి మానవ వనరుల అభివృద్ధికి నిధులను గణనీయంగా తగ్గించటంతో విద్య, ఆరోగ్యం, పౌష్టికాహార సేవలు దిగజారి పోయినట్లు పేర్కొన్నారు. తాజా బడ్జెట్‌లో అందుకు భిన్నమైన విధానం అనుసరించారా అని చూస్తే అలాంటిదేమీ కనపడదు. ఆరోగ్యశ్రీకి నిధులు కేటాయించటం అంటే రాష్ట్ర ప్రజల ఆరోగ్య మెరుగుదలకు తోడ్పడుతుందని అనుకుంటే పొరపాటు. ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన మౌలిక సౌకర్యాలు, సిబ్బందిని సమకూర్చితే మొత్తంగా జనానికి చౌకగా వైద్యం అందుతుంది, కార్పొరేట్‌ ఆసుపత్రుల దోపిడీ నివారణ అవుతుంది. విద్యారంగంలో ప్రయివేటు సంస్ధలు ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్‌, లేదా ఇతర సంస్దలేవీ ప్రమాణాలను పెంచటం లేదని అనేక సర్వేలు వెల్లడించాయి.చేరే వారు లేక ఇంజనీరింగ్‌ కాలేజీలు మూతపడుతున్నాయి. అందువలన ప్రభుత్వం సర్కారీ బడులను అభివృద్ధి చేయకుండా అమ్మ వడి పేరుతో డబ్బు ఖర్చు చేస్తే ప్రయివేటు, కార్పొరేట్‌ సంస్ధలకే తిరిగి ప్రయోజనం జరుగుతుంది.

చంద్రబాబు సర్కార్‌ 2017ా18లో మూలధన పెట్టుబడి ఖాతాలో మొత్తం రూ.13,490 కోట్లు ఖర్చు చేసింది. గతేడాది 28,678 కోట్లు ప్రతిపాదించి, 20,398 కోట్లకు సవరించింది. ఇప్పుడు జగన్‌ సర్కార్‌ 32,293 కోట్లను ప్రతిపాదించింది.ఎంత ఖర్చు చేస్తారో తెలియదు. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని చూస్తే స్వల్ప పెంపుదల తప్ప చంద్రబాబుకుాజగన్‌కు పెద్ద తేడాలేదని అంకెలు చెబుతున్నాయి. దీనిలో కీలకమైన సాగునీటి రంగానికి గతేడాది బడ్జెట్‌లో 15,915 కోట్లు కేటాయించి 13,385 కోట్లకు సవరిస్తే, ఈ మొత్తం కూడా లేకుండా జగన్‌ 11,981 కోట్లు మాత్రమే ప్రతిపాదించటం ఆశ్చర్యం కలిగిస్తున్నది. వ్యవసాయ ప్రధాన రాష్ట్రంగా మారటం, వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో వున్న పూర్వరంగంలో దానికి జీవ ధార అయిన నీటి పారుదల రంగానికి కేటాయింపులు పెంచకుండా పోలవరం లేదా నిర్మాణంలో వున్న ఇతర సాగునీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తయి రైతులకు ఎలా వుపయోగపడతాయో తెలియదు. ఇదిలా వుంటే భారీ ఖర్చుతో తెలంగాణా గడ్డ మీద నుంచి శ్రీశైలానికి గోదావరి నీటిని తరలించే ఎత్తి పోతల పధకాల గురించి జగన్‌ సర్కార్‌ ఆలోచన చేయటం మరింత విడ్డూరంగా వుంది. మరోవైపు ఈ ప్రతిపాదనల మీద భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ వాటాగా వచ్చిన అప్పు 97వేల కోట్ల రూపాయలు. గత ఐదేండ్లలోఅది 2018ా19 నాటికి రెండులక్షల 59వేల కోట్ల రూపాయలకు చేరింది. ఇవి గాక రాష్ట్ర ప్రభుత్వశాఖలు తీసుకున్న మరో 57వేల కోట్ల రూపాయల అప్పులకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంటే మొత్తం అప్పు మూడు లక్షల 20వేల కోట్లకు చేరింది. సర్కార్‌ అప్పుమీద వడ్డీ ఇరవైవేల కోట్లు, అసలు తీర్చేందుకు మరో ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. ఈ ఏడాది జగన్‌ సర్కార్‌ తీసుకోదలచినట్లు ప్రతిపాదించిన రుణం 47వేల కోట్ల రూపాయలు. ప్రభుత్వం తీసుకున్న అప్పు మొత్తాన్ని మూలధన పెట్టుబడులకు ఖర్చు చేసి వుంటే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధ రూపురేఖలే మారిపోయి వుండేవని, మౌలిక వసతులు, నైపుణ్య శిక్షణ అభివృద్ధి చెందితే రాష్ట్రం పారిశ్రామిక, సేవారంగాల ఆధారిత రాష్ట్రంగా మారిపోయి వుండేదని తద్వారా ఆదాయ పెంపు సామర్ధ్యం పెరిగి వుండేదని శ్వేత పత్రం పేర్కొన్నది. దానికి అనుగుణమైన కేటాయింపులు బడ్జెట్లో కనిపించటం లేదు.

Image result for What is new in YS Jagan first Budget

బాబస్తే జాబస్తుందని ప్రచారం చేసిన తెలుగుదేశం ప్రభుత్వం 2017-18లో పారిశ్రామిక రంగంలో మూలధన పెట్టుబడి ఖర్చు వంద కోట్ల రూపాయలు(బడ్జెట్‌ పత్రాల్లో అంకెల ప్రకారం). ఈ మొత్తాన్ని గతేడాది బడ్జెట్లో 1464 కోట్లుగా ప్రతిపాదించి 653 కోట్లకు సవరించారు. జగన్‌ సర్కార్‌ 1116 కోట్లుగా ప్రకటించింది. దీని భావమేమి తిరుమలేశా ! కడప వుక్కు కర్మాగారం గురించి ప్రస్తావన స్వల్ప నామ మాత్ర కేటాయింపు చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలు అంటే అదొక్కటే కాదు.1991నుంచి ప్రారంభమైన నూతన ఆర్ధిక విధానాల్లో భాగంగా ప్రభుత్వాలు పరిశ్రమల స్ధాపన బాధ్యతను విస్మరించాయి. ఆ తరువాత ఎక్కడైనా ఒకటీ అరాచోట రక్షణ రంగ పరిశ్రమలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది తప్ప ఇతరంగా ఏవీ రాలేదు. ప్రభుత్వరంగ పరిశ్రమలను వదిలించుకొనేందుకు తెగనమ్మటమే విధానంగా ముందుకు వచ్చింది. జగన్‌ సర్కార్‌ బడ్జెట్‌ కూడా దాని కొనసాగింపుగానే వుంది తప్ప మరొకటి కాదు.ప్రతి ఏటా వ్యవసాయరంగంలో యాంత్రీకరణకు నిధులు కేటాయించి కొనుగోలు చేసిన వారికి రాయితీలు ఇస్తున్నారు. దాని వలన వ్యవసాయ కార్మికులకు వుపాధి పోతోంది. వారికి ప్రత్యామ్నాయం పారిశ్రామిక రంగం తప్ప మరొకటి కాదు. మానవ శ్రమ పాత్రను తగ్గించేలా పాత పరిశ్రమలను నవీకరిస్తున్నారు, కొత్త పరిశ్రమల్లో అసలు ప్రారంభం నుంచి అదే పరిస్ధితి. అందుకే అభివృద్ధి అంకెలను వెల్లడిస్తున్నా దానికి తగిన విధంగా వుపాధి పెంపొందటం లేదు. వుపాధి రహిత అభివృద్ధి దశలోకి మన దేశం రోజురోజుకూ వేగంగా మారిపోతున్నది. ఆంధ్రప్రదేశ్‌ దానికి మినహాయింపుగా వుండజాలదు. రెండవది ప్రయివేటు రంగంలోని ఐటి సంస్ధలు ఇప్పటికే కేంద్రీకృతం అయిన నగరాల్లో తప్ప మిగతా చోట్లకు రావని గత ఐదు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్‌ అనుభవం తెలిపింది.

రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికులు గణనీయంగా వున్నారు. కార్మికులు, వ్యవసాయ కార్మికులు, ఇతర చేతి వృత్తి దారుల ఆదాయాలు గణనీయంగా పెరగకుండా రాష్ట్రంలో వస్తు వినియోగం పెరగదు. అది లేకుండా పరిశ్రమలు, వ్యాపారాలు వృద్ధి కావు, ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరగదు. అసంఘటిత రంగ కార్మికులకు పదేండ్లు, అంతకు ముందు నిర్ణయించిన వేతనాలే ఇప్పటికీ అమలు జరుగుతున్నాయి. ప్రభుత్వ వుద్యోగులకు తాత్కాలిక భృతి ప్రకటించాల్సిందే, వేతన సవరణ జరగాల్సిందే. అసంఘటిత రంగ కార్మికుల, చిరుద్యోగుల సంగతేమిటి? బడ్జెట్‌ వుపన్యాసంలో అ సలు ఈ ప్రస్తావనే లేదు. జగన్‌ పర్యటనల్లో ఎవరూ వీటి గురించి అడగలేదు అనుకోవాలా ? ఈ పూర్వరంగంలో వివిధ తరగతుల ఆదాయాలను పెంచేందుకు,నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు జగన్‌ సర్కార్‌ నవరత్నాల పరిధి దాటి ఆలోచించటమే కొత్తదనం అవుతుంది. ఈ బడ్జెట్‌లో అదేమీ లేదు. అసెంబ్లీ చర్చలో అయినా ఇలాంటి లోపాలను సవరిస్తారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఇచ్చిన నిధులేమిటో తెలుసా !

25 Tuesday Jun 2019

Posted by raomk in AP, AP NEWS, Current Affairs, History, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Andhra Pradesh Re-organization Act, Central funds to Andhra Pradesh, Polavaram Irrigation Project

Image result for do you know the  Central funds released to Andhra Pradesh

ఎం కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం కింద గత మూడు సంవత్సరాలలో కేంద్రం విడుదల చేసిన అదనపు నిధుల గురించి మంగళవారం నాడు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఒక లిఖిత పూర్వక సమాధానంలో దిగువ వివరాలను తెలియ చేసింది. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపిన వివరాల ప్రకారం 2016-17 సంవత్సరంలో వివిధ ఖాతాల కింద విడుదల చేసిన మొత్తం రూ .10,169.2 కోట్లు, తదుపరి రెండు సంవత్సరాల్లో వరుసగా రూ 20,505.72 మరియు రూ.19,698.01 కోట్లు. ఇవిగాక రాష్ట్ర పునర్విభజన చట్టం కింద కేంద్ర ప్రభుత్వ పధకాలకింద మరియు ఇతరంగా అందచేసిన నిధుల వివరాలు ఇలా వున్నాయి.

పోలవరం ప్రాజెక్టుకు 2016-17లో రూ.2,514.7, 2017-18లో రూ.2,000, 2018-19లో రూ.1,400 కోట్ల రూపాయల వంతున విడుదల చేశారు. ఇవిగాక ఆర్దికలోటును తేడాను పూడ్చేందుకు 2016-17లో రూ.1176.5 కోట్లు, అదే ఏడాది రాయలసీమ,వుత్తర కోస్తాలోని వెనుకబడిన ఏడు జిల్లాలకు రూ.350 కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ.450 కోట్లు, ఇచ్చారు. మిగిలిన సంవత్సరాలలో ఇచ్చిందేమీ లేదు. ఇవిగాక 2015-16 నుంచి 2019-20 సంవత్సరాల వరకు విదేశీ సాయంతో చేపట్టిన పధకాలకు విడుదల చేసిన నిధుల వడ్డీ నిమిత్తం 2018-19లో రూ.15 కోట్ల 81 లక్షల రూపాయలు విడుదల చేశారు.

Image result for do you know the  Central funds released to Andhra Pradesh

2018 ఫిబ్రవరి 8న లోక్‌సభకు రాతపూర్వక సమాధానంలో ప్రభుత్వం చెప్పినదాని ప్రకారం 2010-11 ధరలో పోలవరం నిర్మాణానికి అనుమతించిన ఖర్చు రూ.16,010.45 కోట్లు. దానిలో సాగునీటి విభాగపు ఖర్చు రూ.12,294.40 కోట్లు. దానికి గాను 2014 మార్చి 31వరకు ఏఐబిపి కింద కేంద్రం చెల్లించిన మొత్తం రూ.562.57 కోట్లు. దాన్ని కేంద్ర ప్రాజక్టుగా అనుమతించినందున 2014 ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి ఇరిగిగేషన్‌ విభాగానికి అంగీకరించిన మొత్తం నూటికి నూరుశాతాన్ని కేంద్రం చెల్లిస్తుంది. ఆ మేరకు 2014 ఏప్రిల్‌ ఒకటి నుంచి 2017 మార్చి 31వరకు కేంద్రసాయంగా రూ.3,364.16 కోట్లు చెల్లించింది.2017-18 సంవత్సరానికి గాను రూ.1020.64 కోట్లు మంజూరు చేసి రూ.979.36 కోట్లను విడుదల చేశారు.2019 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని, సకాలంలో పూర్తి చేసేందుకు ఆటంకాలుగా వున్న పరిష్కారంగాని భూసేకరణ, పునరావాస సమస్యలు, డిజైన్ల ఖరారు మొదలైన వాటన్నింటినీ సక్రమంగా పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని ఆ ప్రకటనలో వుంది.

ఈ రెండు ప్రకటనలను చూసినపుడు సామాన్యులకు కాస్త గందరగోళం ఏర్పడుతోంది. అందువలన సామాన్యులకు సైతం అర్దమయ్యే భాషలో పోలవరం గురించి కేంద్రం అంగీకరించినదేమిటి, రాష్ట్రం భరించాల్సిందేమిటి, అసలింతవరకు జరిగిందేమిటి అన్నది జనానికి తెలియచెప్పటం కనీస బాధ్యత. గత ప్రభుత్వం అటువంటి స్పష్టతను ఇవ్వలేదు. కేంద్రంతో ఘర్షణ పడాలని ఎవరూ కోరుకోరు. న్యాయమైన వాటా కోసం ఇతర రాష్ట్రాలతో కలసి అవసరమైతే ఘర్షణ పడక ఎలాగూ తప్పదు. కేంద్రంలోని బిజెపితో రాజకీయంగా సఖ్యతగా వుండాలా,అణగిమణిగి వుండాలా, ఆత్మగౌరవంతో వుండాలా అన్నది వైసిపి-బిజెపికి సంబంధించిన అంతర్గత వ్యహారం. రాష్ట్ర పధకాలు, నిధులకు సంబంధించి ప్రజలకు వాస్తవాలను చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. గత పాలకులు ఆపని చేయలేదు. ఇపుడు ఆ లోపాన్ని పునరావృతం కానివ్వకూడదు.

Image result for do you know the  Central funds released to Andhra Pradesh

వైసిపికి తొలి ఎదురుదెబ్బ-అసలైన పరీక్ష !

ప్రత్యేక హోదా నినాదంతో అధికారానికి వచ్చిన వైసిపికి ఆదిలోనే కేంద్రం తన వైఖరి ఏమిటో స్పష్టం చేసింది. హోదా ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. ఈ పూర్వరంగంలో ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ దాని గురించి ముఖ్యమంత్రి అడుగుతూనే వుంటారా ! ఏం చేస్తారో చూద్దాం. అంతర్గతంగా కారణాలు ఏవైనా కావచ్చు, కృష్ణానదీ తీరంలో నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చివేసేందుకు ముఖ్యమంత్రి ఆదేశించారు. కలెక్టర్ల సమావేశం ముగియగానే యంత్రాంగం ఆపనిలో వుంది. అది ప్రభుత్వ భవనం, అనుమతుల్లేకుండా నిర్మించారని సిఆర్‌డిఏ అధికారులే చెప్పారు కనుక కూల్చివేత గురించి ఏ సమస్యా లేదు. నది రెండు వైపులా కృష్ణ, గుంటూరు జిల్లాల్లో అక్రమంగా నిర్మించిన ఇతర ప్రయివేటు కట్టడాలను కూల్చివేస్తారా లేదా అని రాష్ట్రమంతా ఆతృతతో ఎదురు చూస్తోంది. వాటిలో ఒక్క వామపక్షాలకు చెందిన వారు తప్ప అన్ని పార్టీల నేతలు లేదా మద్దతుదారుల కట్టడాలు వున్నాయి. గతంలో కాంగ్రెస్‌ హయాంలో నిర్మించినవే ఎక్కువ.కూల్చివేత ఒక్క ప్రజావేదికకే పరిమితం అయితే రాష్ట్ర ప్రభుత్వ పరువు పోవటం ఖాయం.

గతంలో తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా డిమాండ్‌ను వదులుకొని ప్రత్యేక పాకేజికి అంగీకరించింది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే దానికి ప్రత్యేకమైన బ్యాంకు ఖాతాలను తెరవాలని ప్రత్యేక అవసరాలకు మాత్రమే వాటిని వినియోగించాలని షరతు పెట్టింది. ఆ తరువాత అది ఏమైందో తెలియదు, తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఎన్‌డిఏ నుంచి దూరమై తిరిగి ప్రత్యేక హోదా నినాదాన్ని అందుకుంది. దానికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం వుంది. అసలా పాకేజి ఏమిటి? దాని మీద జరిగిన వుత్తర ప్రత్యుత్తరాలు, ఇతర అంశాలేమిటి అన్నవాటి మీద జగన్‌ ప్రభుత్వం ఒక శ్వేత పత్రం ప్రకటిస్తే తప్ప రాష్ట్ర ప్రజలకు అర్ధం కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తెలుగుదేశం మీద బిజెపి మెరుపుదాడి: నలుగురు ఎంపీల పట్టివేత !

21 Friday Jun 2019

Posted by raomk in AP, AP NEWS, BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Telangana, Telugu

≈ Leave a comment

Tags

BJP, bjp surgical strike on tdp, CHANDRABABU, Defections from TDP, tdp

Image result for bjp surgical strike on tdp four mps captured

ఎం కోటేశ్వరరావు

బాలకోట్‌ మీద రాత్రిపూట జరిపిన మెరుపుదాడిలో ఎందరు వుగ్రవాదులను మట్టుబెట్టారో చెప్పలేరు గానీ, పట్టపగలు అందరి ఎదుటే గురువారం సాయంత్రం తెలుగుదేశం మీద జరిపిన మెరుపుదాడిలో బిజెపి నలుగురు రాజ్యసభ సభ్యులను చేజిక్కించుకుంది. ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే రాజ్యసభ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు విలీనాన్ని ఆమోదించటం, బిజెపి తన సభ్యుల జాబితాలో నలుగురు సభ్యులైన వై సుజనా చౌదరి, సిఎం రమేష్‌, టిజి వెంకటేష్‌, గరికపాటి మోహనరావు పేర్లను చేర్చటం జరిగిపోయాయి. రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా అలాంటి దాడులకే సన్నద్దం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గురువారం నాడు పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగం తరువాత వెంటవెంటనే జరిగిన పరిణామాల్లో వూహకు అందని రీతిలో పనికానిచ్చి తమ తీరే వేరని బిజెపి నిరూపించుకుంది. వీరితో పాటు మరి కొందరు ఎంపీలు, ఎంఎల్‌ఏల కోసం కూడా బిజెపి మాటువేసిందని వార్తలు కొద్ది రోజుల క్రితమే వచ్చినప్పటికీ మరీ ఇంత త్వరలో పని పూర్తి చేస్తారని వూహించి వుండరు. ఒక నిర్ణయం జరిగిన తరువాత నలుగురి నోళ్లలో నానటం ఎందుకు వచ్చే చెడ్డపేరు ఎలాగూ వస్తుంది, ఈ మాత్రం దానికి సిగ్గు ఎందుకు అన్నట్లుగా జరిపించేశారు. కాంగ్రెస్‌ పార్టీ అన్ని రకాల అక్రమాలకు, అత్యవసర పరిస్ధితి వంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడటానికి మూడు దశాబ్దాలు పడితే పూవు పుట్టగానే పరిమళించినట్లుగా వాటిలో ఒకటైన ఫిరాయింపుల ప్రోత్సాహం, కేంద్ర దర్యాప్తు సంస్ధలను వుపయోగించుకొని బెదిరించటానికి రెండవసారి సంపూర్ణ మెజారిటీతో అధికారానికి వచ్చిన నాటి నుంచి బిజెపి ప్రారంభించి తమది భిన్నమైన పార్టీ అని నిజంగానే నిరూపించుకుంది.

తమ నేత చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్లటాన్ని చూసి నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీ ఫిరాయించారని తెలుగుదేశం నేతలు కార్యకర్తల్లో మనోభావాన్ని రెచ్చగొట్టేందుకు, ఒక సాకును చొప్పించేందుకు ప్రయత్నించారు. ఫిరాయించే వారు అధినేత వుంటే కాళ్లకు మొక్కి ఆశీస్సులు తీసుకొని సకల లాంఛనాలతో పోతారా ? అదే ప్రమాణం అనుకుంటే వైస్రాయ్‌ వుదంతాలలో ఎన్‌టిఆర్‌కు తెలుగు తమ్ముళ్లు ఇచ్చిన గౌరవం ఏమిటో యావత్‌ దేశం సచిత్రంగా చూసింది. ఎవరూ ఎన్‌టిఆర్‌ ఆశీస్సులు తీసుకోలేదు, ఆయన వుండగానే తిరుగుబాటు చేశారు కదా ! పార్టీ ఎంపీలు, మరికొందరు నేతలు ఏక్షణంలో అయినా పార్టీ మారేందుకు సిద్ధంగా వున్నారని వార్తలు వచ్చినప్పటికీ పార్టీని కాపాడుకోవటానికి ప్రయత్నించకుండా చంద్రబాబు నాయుడు విదేశాలకు విహారయాత్రలకు వెళ్లటం ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం వుండదు. తమ సభ్యుల పట్ల మితిమీరిన విశ్వాసమా ?

ఒకటి స్పష్టమైంది. కేంద్ర ప్రభుత్వ సిబిఐ, ఇడి అనే వేట సంస్ధల వేటు నుంచి తప్పించుకోవటానికి వ్యాపారులందరూ కేంద్రంలో, రాష్ట్రాలలో వారికి మిత్రపక్షాలుగా ఎవరు అధికారంలో వుంటే వారితో సయోధ్యగా వుండటమో లేక జతకట్టటమో చేస్తుంటారు. అది గత ఎన్నికల్లోనే వైసిపి ఎంపీల విషయంలో రుజువైంది. ప్రత్యర్ధుల ఆర్ధిక మూలాలను దెబ్బతీసి లొంగదీసుకొనేందుకు అసమర్ధ కాంగ్రెస్‌కు ఐదు దశాబ్దాలు పడితే సమర్ధ బిజెపి కేవలం ఐదు సంవత్సరాలలోనే ఆ విజయాన్ని సాధించింది. సమావేశం లేదు, తీర్మానాలు లేవు, సుజనా చౌదరి బహిరంగంగా చెప్పినట్లు నలుగురూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోలేదు కూడా. ఫిరాయించిన ఎంపీలు అనర్హత వేటును తప్పించుకొనేందుకు పార్టీని విలీనం చేసినట్లు అవసరమైన పత్రాలను తయారు చేయటం, దాన్ని ఏకంగా రాజ్యసభ అధ్యక్షుడు, వుపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి అందచేయటం అంతా నాటకీయంగా జరిగిపోయాయి. రాజకీయ నీతులు చెప్పే వెంకయ్య నాయుడు వారి పత్రాన్ని స్వీకరిస్తూ ఫొటోలకు ఇచ్చిన ఫోజును చూసి ఏమనుకోవాలో జనానికే వదలివేద్దాం. రానున్న రోజుల్లో మిగిలిన తెలుగుదేశం ఎంపీల్లో ఎందరు మిగులుతారనేది శేష ప్రశ్న. ఎంపీల ఫిరాయింపు తెలుగుదేశం ఎంఎల్‌ఏల ఫిరాయింపులను వేగవంతం చేసిందనే వార్తలు వచ్చాయి. తమ నేత విదేశాల నుంచి వచ్చేంతవరకు ఆగుతారా లేక వచ్చిన తరువాతే తాము ఫిరాయిస్తే ఏం చేస్తారో చూస్తాం అంటూ వేచి చూస్తారా అన్నది చూడాలి. జరగనున్నది జరగక మానదు, ముందుగా నిర్ణయించుకున్న యాత్ర పూర్తి చేసి కనీసం కుటుంబసభ్యులనైనా సంతోష పెడితే మంచిదేమో చంద్రబాబు ఆలోచించుకోవాలి.అదే నేను ఇక్కడ వుంటేనా అని చెప్పుకొనేందుకైనా అక్కడే వుండి అంతా పూర్తయిన తరువాత తిరిగి వస్తే కాస్త పరువు దక్కుతుంది. ఫేక్‌ ప్రచారాలను చేయించటంలో తెలుగుదేశంతో సహా ఏ ఒక్క పార్టీ తక్కువ తినలేదు. ఇప్పుడు స్వయంగా తెలుగుదేశం నేత, వారి రాజగురువు రామోజీరావు, ఇతర కుల పెద్దలే ఎంపీలను బిజెపిలోకి పంపారనే సామాజిక మాధ్య ప్రచారానికి వారే సమాధానం చెప్పుకోవాలి.

బిజెపి విషయానికి వస్తే ఆ పార్టీలో మత విద్వేషాలను రెచ్చగొట్టేవారు, గో సంరక్షణ పేరుతో దాడులు చేసే వారు, ఇతర అవాంఛనీయ శక్తులు పుష్కలంగా వున్నాయి. ఇతర పార్టీల నుంచి అవినీతి, అక్రమాల ముద్రపడిన వారు, పార్టీకి పెట్టుబడులు పెట్టగలిగిన వారు కొన్ని రాష్ట్రాలలో దానికి కొరతగా వున్నందున దాన్ని పూడ్చుకొనేందుకు ఎంతగా ఆత్రత పడుతోందో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ పరిణామాలు వెల్లడిస్తున్నాయి. తాము అవినీతి ఆరోపణలు చేసిన వారు, తమపై రాజకీయంగా దాడి చేసిన వారిని ఇప్పుడు బిజెపి చేర్చుకుంది. గతంలో సిబిఐ, ఇడి దాడులకు, బిజెపి ఆరోపణలకు గురైన వారిని తెలుగుదేశం పార్టీ సమర్ధించింది. ఇదే అదే పార్టీ వారు ఎంపీలు స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీని వీడారని చెబుతున్నారు, వారివి నాలికలా మరొకటా అన్న అనుమానం వస్తోంది. బిజెపి నేతలకు కూడా ఇదే వర్తిస్తుంది. ఆయారామ్‌ గయారామ్‌ టిజి వెంకటేష్‌ ఏ ప్రయోజనం కోసం తెలుగుదేశం పార్టీలో చేరారో అదే ప్రయోజనం కోసం బిజెపి పంచన చేరారు. మిగిలిన ముగ్గురిదీ అదే దారి.

Image result for bjp surgical strike on tdp four mps captured

కేసులు, ఆరోపణలు వున్నంత మాత్రాన నిర్ధారణ అయ్యేంత వరకు ఎంపీలు నేరం చేసినట్లు కాదని అందువలన తెలుగుదేశం ఎంపీలను తమ పార్టీలో చేర్చుకోవటం తప్పుకాదని బిజెపి నేతలు కుంటిసాకు చెబుతున్నారు. గతంలో డేరాబాబా, ఆశారాంబాపు వంటి నేరగాండ్ల గురించి కూడా బిజెపి నేతలు ఇదే వాదనలు చేసి వారితో అంటకాగిన విషయం తెలిసిందే. బిజెపి ఇలాంటి నేర చరిత్ర, కేసులు వున్నవారిని ఇదే వాదనలతో పెద్ద సంఖ్యలో అభ్యర్ధులుగా నిలిపి మద్దతు పలికింది, తర తమ స్ధాయిలో మిగతా పార్టీలు కూడా అదే బాట పట్టాయి. గతంలో పార్టీల నేతలు తాము ఎంత పరిశుద్ధమో చెప్పుకొనేందుకు తమ రక్తాల గురించి చెప్పేవారు. ఇప్పుడు తెలుగుదేశం లేదా బిజెపి, కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ ఇలా ఏ పార్టీని చూసినా వాటి రక్తాలన్నీ లుషితమే. జన్యువుల్లోనే మార్పులు జరిగాయి. కనుకనే ఏ పార్టీ నుంచి ఎవరు చేరినా వారిని తమలో ఇముడ్చుకోవటానికి వాటికి ఎలాంటి ఇబ్బంది కలగటం లేదు. ఎన్నికల ముందు, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తరువాత కూడా ఫిరాయింపుదార్లను చేర్చుకుంటున్నపుడు వారు ఎన్నికలైన తరువాత ప్రమాణస్వీకారం కూడా చేయకముందే వేరే పార్టీ వైపు చూస్తే, ఫిరాయిస్తే తప్పు పట్టాల్సిన పనేముంది? నీవు నేర్పిన విద్యయే కదా ! అసలు తప్పు ఎవరిది అని చెప్పాల్సి వస్తే అలాంటి వారిని గుడ్డిగా ఎన్నుకుంటున్న జనానిదే అనక తప్పదు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం నేతలను బిజెపిలో చేర్చుకోవటం అంటే త్వరలోనే వైసిపి మీద రాజకీయ దాడికి నాందిపలకటమే అన్నది ఒక అభిప్రాయం.అదే జరిగితే జగన్‌, ఇతరుల మీద వున్న కేసులను, తెలుగుదేశం నుంచి కాషాయ తీర్ధం పుచ్చుకున్న నేతల దాడిని వైసిపి ఎలా ఎదుర్కొంటుంది అనేదే ఆసక్తికరం. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, ఇప్పుడు తెలంగాణాలో తెరాస మాదిరి ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల ఆర్ధిక మూలాలను దెబ్బతీసేందుకు తెలుగుదేశం ఫిరాయింపుదార్ల పట్ల, బిజెపినేతల పట్ల వైసిపి వ్యవహరిస్తే కేంద్రం తన వద్ద వున్న పెద్ద కత్తిని వైసిపి మెడమీద ప్రయోగించటానికి వెనుకాడదు. ఇదొక ప్రత్యేక పరిస్ధితి అనవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ ప్రసంగం 1: జగన్‌ సర్కార్‌ విస్మరించిందేమిటి? చేయాల్సిందేమిటి?

16 Sunday Jun 2019

Posted by raomk in AP, BJP, Current Affairs, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Telugu

≈ Leave a comment

Tags

AP Governor Speech, CHANDRABABU, CM YS Jagan, Narendra Modi 2.0, YS jagan, ys jagan vs chandrababu

https://s3.ap-south-1.amazonaws.com/hansindia-bucket/2975_YS-jagan-Mohan-Reddy.jpg

ఎం కోటేశ్వరరావు

ఎన్నికలు ముగిశాయి, మంత్రివర్గ ముచ్చట కూడా తీరింది. మరో అయిదు సంవత్సరాల వరకు ఢోకాలేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి సీట్లు తెచ్చుకుంది. రాజకీయాల్లో ఈక్షణంలో మిత్రులుగా వున్న వారు మరుక్షణం శత్రువులౌతుండటాన్ని చూస్తున్నాం, అందువలన ఆంధ్రప్రదేశ్‌లో ఈ స్ధిరత్వం కేంద్రంలోని బిజెపి నాయకత్వం వైసిపిని మింగేయనంత వరకే అని గుర్తు పెట్టుకోవాలి.శుభం పలకవయ్యా అంటే ఈ జోశ్యం ఏమిటి అని ఎవరికైనా కాస్త కటువుగా అనిపించవచ్చు.” ప్రత్యేక హోదా మాత్రమే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కొంతమేర పూడ్చగలదు. ప్రత్యేక హోదా వల్ల మాకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా వచ్చే మొత్తం పెరుగుతుంది. దానికి తోడు పారిశ్రామిక రాయితీలు, పన్ను రాయితీలు ఇతర మినహాయింపులు, జీఎస్టీ ఇతర అంశాల్లో పెట్టుబడిదార్లకు ప్రోత్సాహకాన్ని ఇస్తాయి. తద్వారా ఉద్యోగ కల్పన పెరిగి నిరుద్యోగ సమస్యను పరిష్కరించే అవకాశం ఏర్పడుతుంది. ప్రత్యేక హోదా ద్వారానే మా రాష్ట్రానికి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు, స్టార్‌ హోటళ్లు, పరిశ్రమలు, సేవా రంగాల అభివ అద్ధి జరుగుతుంది.ఇందుమూలంగా మనవి చేయునది ఏమనగా. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు పార్లమెంట్‌ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవెర్చే ఉదార స్వభావం చూపాల్సిందిగా ప్రధానిని కోరుకుంటున్నాను’ అని సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఎక్కడ అంటే శనివారం నాడు(జూన్‌15న) న్యూఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశంలో అని వేరే చెప్పనవసరం లేదు.

గతంలో ప్రత్యేక హోదా వాగ్దానాన్ని అమలు జరపమని నరేంద్రమోడీకి చంద్రబాబు నాయుడు నాలుగు సంవత్సరాల పాటు ఎంత వినయంగా ఎన్నిలేఖలు రాశారో, ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినపుడు విజ్ఞాపనలు చేశారో, ఎన్ని పిల్లి మొగ్గలు వేశారో మనం చూశాము, చంద్రబాబు నాయుడు కూడా జనానికి చెప్పారు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు, దాన్ని గురించి మరచిపోండి అని అదే ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేసిన తరువాత నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అన్నట్లుగా మోడీ మనసు కరిగేట్లు చూడండి సార్‌ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెబుతున్నారు. మనం చూస్తున్నాము. జగన్‌ పదే పదే దేవుడి ప్రస్తావన తీసుకువస్తున్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారీ తాను అడుగుతూనే వుంటానని ప్రకటించారు. అటు ప్రధాని నరేంద్రమోడీ, ఇటు వైఎస్‌ జగన్‌ ఇద్దరూ దేవుడిని నమ్మినవారే. ఇద్దరు దేవుని భక్తులూ కలసి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను ముంచుతారా తేల్చుతారా, మోడీ మారుమనసు పుచ్చుకొని జగన్‌ ఆశిస్తున్నట్లు ప్రత్యేక హోదా ఇస్తారా అన్నది చూడాల్సిందే.

రాజు తలచుకోవాలేగాని దెబ్బలకు కొదవా అన్నారు తప్ప జనానికి మేళ్ల గురించి ఎలాంటి సామెతలు, లోకోక్తులు, సరస సంభాషణలు లేవు. ఇది తెలిసి కూడా అనేక మంది విశ్లేషకులు, ఆశాజీవులు ఏదీ అసాధ్యం కాదు, అలాంటపుడు ప్రత్యేక హోదా ఎందుకు రాదు అంటున్నారు. ఇప్పటికే ఎన్నో భ్రమలు కల్పించిన వారిని గుడ్డిగా నమ్మిన జనం మరికొన్నింటిని నమ్మలేరా ! కర్మ సిద్ధాంతం మాదిరి ఈ మధ్య బి పాజిటివ్‌ (సానుకూలంగా వుండండి) అన్నదానిని కూడా జనానికి బాగా ఎక్కించారు. ఒక చెంప కొడితే మరో చెంప ఖాళీగా వుందని అందించే మనం దీన్ని కూడా అలాగే చూద్దాం. పదే పదే అడక్కపోతే జనానికి కోపం, అడిగితే…… చెయ్యి ఖాళీలేదని చెబితే అర్ధం కాదా మీకు, విసిగించకుండా చెప్పదలచుకున్నదానిని ఫిర్యాదులు, సలహాల బాక్సు పెట్టాం, దానిలో వేసి వెళ్లండి అన్నట్లుగా బిజెపి చెప్పకపోతుందా ! ఒక్కటి మాత్రం ఖాయం, ప్రతి సందర్భంలోనూ, ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి సందర్భోచితంగా ప్రత్యేక హోదా గురించి అడుగుతూనే వుంటామని జగన్‌ చెప్పారు కనుక వాటిని వినలేక బోరు కొట్టి బాబూ మరోసారి అడక్కండి అని జనం వేడుకొనే పరిస్ధితిని తీసుకు వచ్చే తీరు కనిపిస్తోంది. ఎవరి తరహా వారిది మరి ! ఈ నాటకం ఇలా కొనసాగాల్సిందేనా ?

శాసనమండలి మరియు నూతన శాసనసభ సభ్యుల నుద్దేశించి జూన్‌ 14 రాష్ట్ర గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహం చేసిన ప్రసంగం మీద చర్చించి లాంఛనంగా ధన్యవాదాల తీర్మానం ఆమోదిస్తారు. వాస్తవానికి గవర్నర్‌ పేరుతో అది జరిగినా తమ ప్రభుత్వానికి తామే ధన్యవాదాలు తెలుపుకోవటం తప్ప మరేమీ కాదు. ఎందుకంటే ప్రభుత్వాలు తయారు చేసి ఇచ్చిన ప్రసంగాన్నే గవర్నర్‌ చదవటం ఒక రాజ్యాంగ విధి. ఇప్పుడున్న స్ధితిలో దీని మీద వుభయ సభల్లో ఏదైనా చర్చిస్తారో లేక వివాదాలతో చర్చలేకుండా ముగిస్తారో వూహించలేము. అలాగాకుండా సజావుగా జరగాలని కోరుకుందాం. గవర్నర్‌ ప్రసంగం అంటే ప్రభుత్వ విధానాలను సూచించే వైఖరి అందుకే నా ప్రభుత్వం అని సంబోధిస్తారు. ఆ ప్రసంగ మంచి చెడ్డలను ఒక్కసారి అవలోకిద్దాం. దీనిలో నవరత్నాల గురించి వివరణ తప్ప ప్రత్యేక హోదా సాధన గురించి ఎలాంటి ప్రస్తావనా లేదు. ప్రత్యేక హోదాలోనే పుట్టి ,ప్రత్యేక హోదా గాలినే పీల్చుతున్న జగన్‌ దాని గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని ఎవరైనా అడగవచ్చు. దాని మీద అవగాహనను పైన పేర్కొన్న నీతి ఆయోగ్‌ సమావేశంలో చెప్పారు గనక దాన్నే ప్రమాణంగా తీసుకుందాం.

2014లో చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చాక గవర్నర్‌ ప్రసంగంలో చెప్పిన అంశాలేమిటో చూద్దాం.” 1995-96లో రెండవ తరం సంస్కరణలు ప్రారంభించబడిన సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో ఆర్ధికాభివృద్ధిని పెంచి దారిద్య్రాన్ని నిర్మూలించటం కోసం దాదాపు ఒక దశాబ్దం పాటు కఠినంగా సంస్కరణలు అమలయ్యాయి.1990దశాబ్దం మధ్యలో సమాచార, సాంకేతిక రంగాల్లో మార్పు వచ్చింది. ఈ కాలంలో భూమి, నీరు, అటవీ వనరుల భాగస్వామ్య నిర్వహణ విషయంలో గణనీయమైన మార్పులు చేయటం జరిగింది. మునుపటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మహిళా, స్వయం సహాయక బృందాలు మరియు డ్వాక్రా గ్రూపులు ప్రపంచ విజయగాధగా నిలిచాయి. వీటి ద్వారా సామాజిక సమీకరణ,సామాజిక సాధికారత, సామర్ధ్య నిర్మాణం పేదరిక నిర్మూలన విధానంలో కీలకంగా మారాయి. ఈ చర్యలు ఆర్ధిక సంస్కరణలలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్‌కు మంచి పేరు తెచ్చి పెట్టాయి. దేశ విదేశాలలో అంచనాలు పెరగటానికి దారితీశాయి. అయితే ప్రభుత్వం నుంచి తగినంత ఆర్ధిక మద్దతు లేకపోవటం వల్ల ఈ బృహత్తర వుద్యమం 2004 నుంచి వేగంగా క్షీణించటం ప్రారంభమైంది.దురదృష్ట వశాత్తూ గత దశాబ్దంలో రాష్ట్ర ఆర్ధిక విషయంలో ముఖ్యంగా సహజ వనరుల కేటాయింపు అంశంలో అనేక అవకాశాలను కోల్పోవటం జరిగింది.” ఇలా సాగిన ప్రసంగంలో అవినీతి తదితర అంశాల గురించి ప్రస్తావన వుంది.

ఐదు సంవత్సరాల తరువాత అధికారానికి వచ్చిన జగన్‌ గవర్నర్‌ ద్వారా ఏం చెప్పించారు? ” నూతన ప్రభుత్వానికి తక్షణ సమస్యలపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్న మైంది. వాటిలో కొన్ని రాష్ట్ర విభజన పర్యవసానంగా ఏర్పడినవి. మిగిలినవి విభజనానంతరం తలెత్తిన సవాళ్ల అసంగత నిర్వహణకు పర్యవసానాలుగా వున్నాయి. మానవ మరియు భౌతిక వనరులు రెండింటినీ దుర్వినియోగ పరచటం రాష్ట్రం యొక్క దుస్ధితిని మరింత తీవ్రతరం చేసింది. నా ప్రభుత్వానికి దాదాపు ఖాళీ ఖజానా సంక్రమించినందున ప్రజాధనాన్ని మరియు అన్ని సహాయకవనరులను పూర్తి జవాబుదారీగా, సమర్ధవంతంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడింది……పేదలు, నిరుపేదలు, అభాగ్యులకు సహాయపడే మార్గాలను అన్వేషిస్తూ తప్పనిసరిగా కేంద్రీకృత పరిపాలన అంతటా దృష్టి సారించాలనేది మునుపటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారి భావజాలం ప్రస్తుత సందర్భంలో ప్రతి ఒక్కరూ గ్రహిస్తారు. ఇది బహుశా ఏ సమయంలో వున్నదాని కంటే ఇప్పుడు సంగతంగా వుంటుంది. దీనిని దృష్టిలో వుంచుకొని ప్రస్తుత ప్రభుత్వం తొమ్మిది ఇతి వృత్తాలతో కూడి వున్న నవరత్నాలు అనే ఒక ఏకీకృత సంక్షేమ అజెండాను రూపొందిస్తున్నది,” అని పేర్కొన్నారు.

Image result for YS Jagan

దీనిని బట్టి మనం అర్ధం చేసుకోవాల్సింది ఏమిటి? ఎవరు కొత్తగా అధికారానికి వచ్చినా గత పాలకులు తమకు ఖాళీ ఖజనా అప్పగించి వెళ్లారనో, ఆర్ధిక వ్యవస్ధను అస్తవ్యస్తం చేశారనో చెబుతారు. పోనీ వీరికి ముందుగా తెలియదా అంటే ఎన్నికలకు ముందువరకు ప్రతిపక్షంలో వుండి చేసే పని పాలకుల లోపాలను ఎండగట్టటమే కదా, మరి తెలియకుండా ఎలా వుంటుంది, తెలిసి కూడా వాగ్దానాలు చేయటమెందుకు, అమలు విషయానికి వచ్చే సరికి ఖజానా గురించి సొల్లు కబుర్లెందుకు? పార్టీ కార్యకర్తలూ, సామాన్యజనమూ, మీడియా విసిగిపోయేంత వరకు ప్రపంచ బ్యాంకు ఆదేశిత విజయగాధలను వినిపించటం, ఆ విధానాలను అమలు జరపిన కారణంగానే తెలుగుదేశం పార్టీని 2004లో, 2014లో జనం తిరస్కరించారు. వాటిని మరింత ముమ్మరంగా అమలు జరిపిన కారణంగానే వైఎస్‌ రాజశేఖరరెడ్డి సర్కార్‌ను జనం ఓడించేందుకు నిర్ణయించుకున్న తరుణంలో ప్రత్యామ్నాయం అంటూ ప్రజారాజ్యం పార్టీ వచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు గండి కొట్టటంతో వైఎస్‌ఆర్‌ రెండవ సారి మైనారిటీ ఓట్లతో బొటాబొటి సీట్లతో అధికారానికి వచ్చారు. తన పాత విధానాల అమలు వల్లనే తాము పది సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో వుండాల్సి వచ్చిందని 2014లో అధికారానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ గుణపాఠం తీసుకోలేదు, తిరిగి అదే విధానాలను అమలు జరుపుతూ జనాన్ని మభ్యపెట్టిన కారణంగానే జనం నిర్ణయాత్మకంగా ఓటు వేసి మరోసారి సాగనంపారు. దీన్ని గుర్తించకుండా తమపై జరిగిన తప్పుడు ప్రచారం ఓటమికి కారణం అనే తీరులో తెలుగుదేశం నేతలు మాట్లాడుతున్నారు. తన తండ్రి రెండవసారి ఓటమి అంచుదాకా ఎందుకు పోయారో జగన్‌ కూడా గుణపాఠంగా తీసుకోలేదు. అంతకంటే ఎక్కువగా సంక్షేమ పధకాల గురించి చెబుతున్నారు. విధానాలను మార్చుకోకపోతే, సంక్షేమ పధకాల బాటలోనే నడిస్తే ఐదేండ్ల తరువాత ఏమౌతుందో వూహించుకోవటం కష్టం కాదు.

సంక్షేమ పధకాలు, వాటి గురించి వూదరగొట్టుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు. ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా కొంత కాలం వరకు సంక్షేమ పధకాలకు ఎలాంటి ఆటంకం కలగదు, కొనసాగుతాయి. వృద్దాప్య, ఇతర, అభాగ్య జీవుల పెన్షన్లను రద్దు చేసే అవకాశం లేదు. కొన్నింటిని రద్దు చేస్తారు. ఎన్ని పధకాలను అమలు చేసినా జనంలో అసంతృప్తి తగ్గటం లేదు అంటే అసలు సమస్యను ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదనే అర్ధం. అయినప్పటికీ వాటినే మరింత ఎక్కువగా అమలు జరపనున్నట్లు జగన్‌ చెబుతున్నారు.

అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణా విడిపోయిన తరువాత మిగిలి వున్న ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మార్పులేమిటి? విభజనకు ముందు రాష్ట్ర జిడిపిలో వ్యవసాయ రంగ వాటా 23శాతం. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో అది 30.2శాతం అయింది. తరువాత 2017-18 ముందస్తు అంచనా ప్రకారం 34.4శాతం వుంది. ఇదే సయమంలో పారిశ్రామిక రంగం వాటా 25.5శాతం నుంచి 22.1శాతానికి,సేవారంగం వాటా 44.6 నుంచి 43.5శాతానికి పడిపోయింది. దేశంలో ఈ మూడు రంగాల వాటా వరుసగా 17.09, 29.06, 53.85 శాతాలుగా వున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్‌ జాతీయ సగటు కంటే బాగా వెనుక బడి వుంది. ఇదే సమయంలో మిగిలిన నాలుగు దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణా, కర్ణాటక, కేరళ జిడిపిలో సేవారంగం వాటా 64శాతానికి పైగా వుంది. తమిళనాడులో 53.7శాతం సేవారంగం నుంచి గరిష్టంగా, 34.05శాతం పారిశ్రామికరంగం నుంచి వస్తున్నది. వ్యవసాయ రంగ వాటా కర్ణాటకలో 10.82, కేరళలో 12.51, తమిళనాడులో 12.58, తెలంగాణాలో 14.28 శాతం వుంది. ప్రస్తుత ఆర్ధిక వ్యవస్ధలో ఆంధ్రప్రదేశ్‌ పరిస్ధితి ఆందోళనకరంగా వుందన్నది స్పష్టం. గణనీయంగా పెరిగిన ఎరువుల ధరలతో సహా వ్యవసాయ పెట్టుబడులు పెరిగి రైతాంగ నిజ ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి. వ్యవసాయం గిట్టుబాటు కాని స్ధితి ఏర్పడింది. బాబొస్తే జాబొస్తుందని చేసిన తెలుగుదేశం పార్టీ నినాదం విఫలం కావటానికి, ఎదురు దెబ్బలు తగలటానికి కారణం దీని పర్యవసానాలే. పని చేసే వారిలో 58శాతం మంది వ్యవసాయ రంగంలో వున్నారు. ఈ కారణంగా రుతుపవనాలు విఫలమైనా, జలాశయాలు నిండకపోయినా, ఇతర ఏ కారణాల వల్ల అయినా వ్యవసాయం కుంటుపడితే దానిలో పని చేసే వారంతా వుపాధికోసం రోడ్డెక్కవలసిందే, దీనికి తోడు చేతుల వృత్తులు నానాటికీ దెబ్బతింటున్నందున ఆ రంగం నుంచి వచ్చేవారు కూడా నిరుద్యోగ సైన్యంలో చేరతారు.

భ్రమలు కల్పించటం ప్రజాకర్షక నినాదాలు ఇచ్చే నేతల లక్షణాలలో ఒకటి. వైఫల్యాలను ప్రశ్నించే లేదా తమ సమస్యలను పరిష్కరించాలని గళమెత్తేవారిని సహించకపోవటం, అణచివేయటం కూడా వారి లక్షణాలలో భాగమే. చంద్రబాబు నాయుడిలో ఈ లక్షణాలు అడుగడుగునా మనకు కనిపిస్తాయి. ప్రపంచ స్ధాయి రాజధాని నిర్మాణం చేస్తా, సింగపూర్‌, వాషింగ్టన్‌లా చేస్తా అని వూదరొట్టటం దానిలో భాగమే. అలా అనుకుంటే ప్రపంచంలో ఒక్కోదేశంలోనే అలాంటి నగరాలు అనేకం వున్నాయి. అయినప్పటికీ ఆర్ధిక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. రెండో లక్షణానికి వస్తే ఆయన ఎక్కడ పర్యటనకు వెళితే అక్కడ వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, ఇతర పార్టీల కార్యకర్తలు, నేతలను అరెస్టు చేయించటం తెలిసిందే. పరిశ్రమలకు పెట్టుబడులను ఆకర్షించే పేరుతో చంద్రబాబు నాయుడు సదస్సులతో కాలక్షేపం చేస్తే ఐటి మంత్రిగా ఆయన తనయుడు ఒప్పందాల పేరుతో అదే బాటలో నడచి హడావుడి చేయటం తప్ప సాధించింది లేదు. నాలుగున్నర సంవత్సరాల పాలన తరువాత చంద్రబాబు నాయుడు సర్కార్‌ ప్రవేశ పెట్టిన శ్వేత పత్రాల గురించి మీడియాలో లేదా బయటగానీ పెద్దగా చర్చ, ప్రస్తావనలు లేవు.

Image result for YS Jagan

వాటిలో పరిశ్రమలు, వుపాధి, నైపుణ్య శిక్షణ పేరుతో ఒక పత్రం వుంది. దానిలో వున్న కొన్ని అంశాలు ఇలా వున్నాయి. 201,17,18 సంవత్సరాలలో పెద్ద ఎత్తున హడావుడి చేసి విశాఖలో పెట్టుబడి భాగస్వామ్య సదస్సులంటూ జరిపారు.2,622 ప్రాజక్టులకు ఒప్పందాలు కుదిరాయని వాటిలో పెట్టుబడులు 15,48,743 కోట్ల రూపాయలని, 32,35,916 మందికి వుద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. ఆచరణలో వుత్పాదనలోకి వెళ్లిన ప్రాజక్టులు 810, వాటిలో పెట్టుబడి 1.77లక్షల కోట్లు, వుపాధి కల్పించామని చెప్పింది 2.51లక్షల మందికి. కాగితాల మీద వున్న అంకెలకు వాస్తవాలకు ఎంత తేడా వుంటుందో తెలిసిందే. ఆరోగ్యశ్రీ పధకం కింద రోగులు ఆసుపత్రులకు వెళితే ఎంత ఎక్కువ బిల్లులు వేసి ప్రభుత్వాల నుంచి తెలుగు రాష్ట్రాలలో కార్పొరేట్‌ ఆసుపత్రులు గుంజుతున్నాయో తెలిసిందే. అలాగే పెట్టుబడులు, వుపాధిని ఎక్కువగా చూపి రాయితీలు పొందేందుకు పెట్టుబడిదారులు కూడా అలాంటి పనులే చేస్తారు. శ్వేత పత్రంలో వున్న అంశాల ప్రకారం మరో 1211 ప్రాజెక్టులకు సివిల్‌ పనులు జరుగుతున్నాయట, వాటిలో పెట్టుబడి 5.27లక్షల కోట్లు, వుపాధి అంచనా 7.66 లక్షలు. ఇవిగాక అసలు ప్రారంభమే కానివి ఆరువందల ప్రాజెక్టులు, వాటిలో వుంటాయనుకునే పెట్టుబడులు వాటిలో పెట్టుబడులు 8.45లక్షల కోట్ల రూపాయలైతే వుపాధి 22,18,916 మందికి వస్తుందా ? వీటిని కాకి లెక్కలను కోవాలా, నిజమనుకోవాలా ?

ఎలక్ట్రానిక్స్‌ రంగంలో ఐదు బిలియన్‌ డాలర్ల పెట్టుబడులతో( సుమారుగా 35వేల కోట్ల రూపాయలకు సమానం) రెండు లక్షల మందికి, రెండు బిలియన్‌ డాలర్లతో(14వేల కోట్ల రూపాయలకు సమానం)తో లక్ష మంది ఐటి లేదా ఐటి అనుబంధ వుద్యోగాలు కల్పించే లక్ష్యం గురించి వూదరగొట్టారు. నాలుగున్నర సంవత్సరాల తరువాత ఎలక్ట్రాన్స్‌ రంగంలో ఐదు కంపెనీలు 927 కోట్ల రూపాయలతో వుత్పత్తి ప్రారంభించాయని, 21,850 మందికి వుపాధి కల్పించినట్లు పేర్కొన్నారు.హైదరాబాదులో ఐటి పరిశ్రమను తానే నెలకొల్పానని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎంత మందికి ఐటి రంగంలో వుపాధి కల్పించారో శ్వేతపత్రంలో పేర్కొనలేదు. ఈ పూర్వరంగంలో ఏ ప్రభుత్వం ముందైనా పెద్ద సవాలే వుంటుంది. మొత్తంగా వుపాధి గురించి జగన్‌ నవరత్నాలలో గానీ, గవర్నర్‌ ప్రసంగంలోగానీ పేర్కొన్నదేమీ లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తెలుగుదేశం పార్టీ ఓటమి, చిత్తశుద్ధి లేని పాఠాలు !

30 Thursday May 2019

Posted by raomk in AP, Current Affairs, History, INDIA, Opinion, Others, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

AP Assembly Elections 2019, hypocritical lessons, N Chandra babu naidu, tdp, telugu desam party debacle, ysrcp

Image result for chandrababu naidu debacle

ఎం కోటేశ్వరరావు

2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ నాలుగు జిల్లాల్లో తుడిచి పెట్టుకుపోయింది. మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడిని ఒక జిల్లాకు పరిమితం చేయకపోతే విజయ నగరం, నెల్లూరు, కడప, కర్నూలుతో పాటు చిత్తూరు కూడా అదే కోవకు చెందుతుంది. అక్కడ మరొక తెలుగుదేశం అభ్యర్ధి గెలవలేదు. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో రెండేసి స్ధానాలకు, విశాఖ పట్టణం, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాలో నాలుగు స్ధానాల చొప్పున ఆ పార్టీ గెలుచుకుంది. ఇక ఓటింగ్‌ వివరాలకు వస్తే వైఎస్‌ఆర్‌సిపికి 49.9, తెలుగుదేశం పార్టీకి 39.2శాతం ఓట్లు వచ్చాయి. జనసేనకు 6.78, దానితో సీట్లు సర్దుబాటు చేసుకున్న సిపిఎం, సిపిఐలకు 0.43శాతం, కాంగ్రెస్‌కు1.17, బిఎస్‌పికి 0.28, బిజెపికి 0.84శాతం ఓట్లు, వైసిపికి 151, తెలుగుదేశం పార్టీకి 23, జనసేనకు ఒక స్ధానం వచ్చాయి.

తెలుగుదేశం పార్టీకి గతంలో ఓటు చేసిన బిజెపి, పవన్‌ కల్యాణ్‌ అభిమానుల ఓట్లు ఈసారి పడవని, ఎవరి బలం వారికి వుంటుందని, ఆ పరిస్ధితి వైఎస్‌ఆర్‌సిపికి అనుకూలంగా వుంటుందనేది అంకెలు చెప్పిన సత్యం. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 44.6, వైసిపికి 44.2, కాంగ్రెస్‌కు 8.8, బిజెపికి 2.2శాతం వచ్చాయి. ఇప్పుడు శాతాల వారీ చూస్తే తెలుగుదేశం పార్టీకి ఐదుశాతం ఓట్లు తగ్గగా వైసిపికి 5.7శాతం పెరిగాయి. దీన్నిబట్టి చూసినపుడు కాంగ్రెస్‌కుకు తగ్గిన ఏడున్నరశాతం ఓట్లు మొత్తం వైఎస్‌ఆర్‌సికికి పడి వుంటే దాని ఓటింగ్‌ ఇంకా పెరిగి వుండేది. మెజారిటీ ఓట్లు మాత్రమే వైసిపికి పడ్డాయన్నది స్పష్టం. ఇక తెలుగుదేశానికి తగ్గిన ఓట్లు, దానిపునాది చెదిరింది అనేదాని కంటే బిజెపి, పవన్‌ కల్యాణ్‌ ప్రభావంతో వచ్చిన ఓట్లు ఐదుశాతం తగ్గినట్లు పరిగణించ వచ్చు. ఈ ఓట్లు తగ్గటం, కాంగ్రెస్‌, బిజెపి ఓటింగ్‌ కొంత మళ్లిన కారణంగా వైసిపి అఖండ విజయం సాధించింది. ఒక వేళ పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీ రెండు పార్టీలలోని ఒక సామాజిక వర్గం ఓట్లు చీల్చింది అనుకున్నా, కొందరు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మారారని అనుకున్నా ఎవరి బలం వారికి వుంది అని అంకెలు చెబుతున్నాయి.

ఈ నేపధ్యంలో తెలుగుదేశం ఓటమి గురించి వెలువడుతున్న విశ్లేషణలు, వెల్లడవుతున్న అభిప్రాయాలను చూద్దాం. తెలుగుదేశం పార్టీ పైనుంచి కింది వరకు అవినీతి అక్రమాలకు పాల్పడిందనటంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి జనం అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేసి వుంటే తెలుగుదేశం ఓటింగ్‌ ఇంకా ఘోరంగా పడిపోయి వుండేది, అన్ని ఓట్లు వచ్చి వుండేవి కాదు, బహుశా చంద్రబాబు నాయుడు నామమాత్ర మెజారిటీతో గెలిచి ఒకే ఒక్కడుగా అసెంబ్లీలో మిగిలి వుండేవారు. అసలు పట్టించుకోలేదు అనలేము గాని ఎవరు తక్కువలే ఎవరు వచ్చినా తినకుండా వుండేవారెవరు అని జనం అవినీతిని నిత్యజీవితంలో విడదీయని భాగంగా పరిగణించి పెద్దగా పట్టించుకోలేదా అన్నది సూక్ష్మ పరిశీలన చేస్తే తప్ప తెలియదు. ఒక వేళ అవినీతి అక్రమాలపై ఆగ్రహం కారణంగా కోల్పోయిన ఓట్లను ఎన్నికల ముందు తెలుగుదేశం పందారం చేసిన తాయిలాలు పూడ్చాయా అన్నది కూడా ఒక ముఖ్య అంశమే.

తెలుగుదేశం పార్టీ అధికారయుతంగా ఎన్నికల ఓటమి కారణాలను ఇంకా వెల్లడించలేదు. అయినా తెలుగుదేశం మద్దతుదార్లుగా లేదా పాకేజి ఒప్పంద భాగస్వాములుగా లేదా వైఎస్‌ఆర్‌సిపి వ్యతిరేకులుగా పేరు ఏదైనా కానివ్వండి ముద్రపడిన పత్రికల వ్యాఖ్యాతలు, ఎన్నికలలో ఆ పార్టీ తరఫున సీట్లు ఆశించి, చివరి వరకు మద్దతుదార్లుగా వున్న జర్నలిస్టులు ఇప్పుడు తెలుగుదేశం ఓటమి కారణాల గురించి వెంటనే స్పందిస్తున్నారు. తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దానిలో చిత్తశుద్ధి వుందా, విశ్వసనీయత ఎంత అన్నది అనుమానమే.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు విఫలం కాలేదు, పార్టీ నేతగా వైఫల్యం చెందారు అన్నది ఒక సూత్రీకరణ. ఈ మాటలను సెలవిచ్చిన పెద్దలే ఎంఎల్‌ఏల, జన్మభూమి కమిటీ సభ్యుల అవినీతిని అరికట్టలేకపోయారు అంటారు. సన్నిహితులు చెప్పినా ఖాతరు చేయలేదు అంటారు, మరో వైపు జగన్‌కు విజయసాయి రెడ్డి వంటి వారు ఎందరో వున్నారు, చంద్రబాబుకు అలా లేరు అంటారు. మరి చంద్రబాబు సన్నిహితులంటే ఎవరు ? తొలి వ్యాక్యంలో ఏమి రాస్తున్నామో మలిగా ఏమి చెబుతున్నామో తెలలియకుండా రాయటాన్ని ఏమనాలి? ఎడా పెడా ఏదో ఒకటి రాస్తున్నట్లా ? అంటే ముఖ్య మంత్రిగా అవినీతి పరులను సహించటం, చెప్పింది వినకపోవటం చంద్రబాబు విజయమని చెబుతున్నట్లా ? వైఎస్‌ జగన్‌ గురించి గతంలో ఇలాంటి ప్రచారమే చెప్పారు. ఆయన ఎవరి మాటా వినడు, తాను చేయదలచుకున్నది చేస్తాడు , ఎంద పెద్ద వారైనా చేతులు కట్టుకొని నిలబడాల్సిందే ఇంకా అలాంటివి ఎన్నో .ఇప్పుడు అదే నోటితో చంద్రబాబు గురించి చెబుతున్నారు. గుండెలు తీసిన బంట్లంటే వేరే వుంటారా ? గతంలో గత ఐదేండ్లలో కూడా కొన్ని పత్రికలు, ఛానల్స్‌లో ఇదే విధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మంచే చేశారు, అనర్ధాలకు అధికార యంత్రాంగమే కారణం అని సూత్రీకరించి పాఠకుల మెదళ్లకు ఎక్కించారు. రాజకీయాల్లో వెన్నుపోట్లను చూశాము. మీడియా రంగంలో వున్న వారు చంద్రబాబును ఇలా మునగచెట్టిక్కించి మూతిపళ్లు వూడగొట్టేట్లు చేయటం తప్ప మరొకటి కాదు. అయినా నరేంద్రమోడీ కంటే సీనియర్‌ను అని చెప్పుకున్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పార్టీనేతగా జరుగుతున్నదానిని చూడలేక పోవటానికి ధృతరాష్ట్రుడేమీ కాదుగా. ఇక్కడ చంద్రబాబును గతంలో సమర్ధించిన, ఇప్పుడు ఏ కారణంతో అయినా సమర్ధిస్తున్న మీడియాలో ఎన్నడైనా ఎంఎల్‌ఏల, జన్మభూమి కమిటీల అవినీతి గురించి పతాకశీర్షికలు కాదు, పక్కన అయినా వార్తలు ఇచ్చాయా ? పాఠకులకు మతిమరపు ఎక్కువ అనే ధైర్యంతో ఇప్పుడు తగుదునమ్మా అంటూ అసలు విషయాలను పక్కదారి పట్టించేందుకు పూనుకున్నారు. మీడియా గురించి చంద్రబాబు నాయుడికి తెలియదు అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి వుండదు. అధికారంలో వున్నవారు, మీడియా సంస్ధలు నీకిది, నాకది అనే పద్దతుల్లో ఎవరికి కావాల్సినదానిని వారు పొందటం బహిరంగ రహస్యం. గతంలో ఎన్‌టి రామారావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా, అదే విధంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా పని చేసినపుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయినట్లు ? ఏది వాటంగా వుంటే అది రాయటమేనా ? 2016 నుంచి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కళా వెంకటరావు వున్నప్పటికీ వుత్సవిగ్రహంగా తప్ప ఆయనకు అధికారాలు ఎక్కడున్నాయి. మీడియా పండితులు అన్నీ చంద్రబాబు నాయుడే చూసుకున్నారని చెప్పారు కదా !

అధికారంలో వుండి కూడా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో నిధుల కోసం వెతుక్కోవాల్సి వచ్చిందని ఒక ముక్తాయింపు. తెలుగుదేశం పార్టీ వారికి 50 చోట్ల నిధులు అందకుండా ప్రత్యర్ధులు సఫలమయ్యారని మరొక బాజా. ఇలాంటి వాటిని చదివి, చూసి దేనితో నవ్వాలో అర్ధం కాదు. పాఠకులు మరీ అంతగా చెవుల్లో పూలు పెట్టుకొని వున్నారనుకుంటున్నారా ? ప్రత్యర్ధి పార్టీల ప్రజాప్రతినిధులు, నేతల వ్యాపారాలు, పరిశ్రమలలో జరిపే అక్రమాల బలహీనతలను ఆధారం చేసుకొని కేంద్రంలోని బిజెపి మద్దతుతో తెలుగుదేశం పార్టీ అనేక మందిని తన పార్టీలోకి ఫిరాయించేవిధంగా చేసిన గతం ఎవరికి తెలియనిది. దొంగే దొంగ దొంగ అని అరవటం అంటే ఇదే. ఇదే విషయాలను ఎన్నికల సమయంలో సదరు మీడియా ఓటర్ల ముందుకు ఎందుకు తీసుకురాలేదు? అధికారంలో వుండి సంక్షేమ పధకాల పేరుతో ఎన్నికల ముందు ఓటర్లకు ఇచ్చిన వేల కోట్ల తాయిలాల మాటేమిటి? ఐదేండ్ల పాటు ఎంఎల్‌ఏలు, ఎంపీలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని వీరే చెబుతారు, ఎక్కడో ఒకరో అరా తప్ప వారు లేదా వారసులు అభ్యర్ధులుగా వచ్చారు, మరి వారు జనం నుంచి కొల్లగొట్టిన సొమ్మంతా ఏమైనట్లు? అసలు తెలుగుదేశం లేదా వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధుల్లో డబ్బు లేని వారెందరు?

ఆడలేక మద్దెల ఓడన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైఎస్‌ఆర్‌సిపి వ్యూహాలను తెలుగుదేశం తిప్పికొట్టలేకపోయిందని మరొక సూత్రీకరణ. అసలు మన దేశంలో, ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక మాధ్యమాలు అందుబాటులో వున్నవారెందరు? 250 మేర ఛానళ్లు, గ్రూపులతో వైఎస్‌ఆర్‌సిపి చేసిన ప్రచారాన్ని తెలుగుదేశం తిప్పికొట్టలేకపోయిందట. ప్రధాన స్రవంతి మీడియాలో చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ సాగించిన ప్రచారం సంగతేమిటి? బహుశా ఇలాంటి మీడియా పండితులు చెప్పిన అంశాలనే తెలుగుదేశం పార్టీ తన సమీక్షగా ముద్రవేసుకొని జనం ముందుకు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే గత అనుభవం ఇదే. లీకుల పేరుతో ఇదే మీడియా పెద్దలు తెలుగుదేశం చెప్పిన అంశాలనే జనానికి అందచేసేవారు. ఇప్పుడు కూడా వారితో మాట్లాడకుండా, వారి అభిప్రాయాలను తమ అభిప్రాయాలుగా పాఠకుల ముందు వుంచలేదని ఎలా అనుకోగలం. రాజకీయనేతల మాదిరే నేడు మీడియా విశ్వసనీయత కూడా ప్రశ్నార్ధకంగా వున్నపుడు ఇలా అనుకోవటంలో తప్పేముంది?

Image result for chandrababu naidu debacle

వుదాహరణకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయానే తీసుకుందాం. దీని గురించి చంద్రబాబు నాయుడుగాని, ఆయనను సమర్ధించిన మీడియా గానీ ఎప్పుడైనా పాఠకులకు వాస్తవాలు చెప్పిందా? ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే మంచిది. దాని మీద చంద్రబాబు నాయుడు, నరేంద్రమోడీ వేసిన పిల్లి మొగ్గలను తు.చ తప్ప కుండా మీడియా కూడా వేసింది. జాతీయ అభివృద్ది మండలి ప్రత్యేక హోదా గురించి గతంలో ఆమోదించిన నిబంధనలను మార్చకుండా హోదాను ఆంధ్రప్రదేశ్‌కు వర్తింప చేయటం అసాధ్యం. అటువంటి ప్రయత్నమే చేయలేదు. పార్లమెంట్‌లో చేసిన ప్రకటన ఆధారంగా అలా చేసేందుకు నిబంధనలు మార్చటం అంటే తేనెతుట్టెను కదిలించటమే. అధికారానికి రాక ముందు ఓటర్లను మభ్య పెట్టేందుకు చెప్పినా నరేంద్రమోడీకి ముందే తెలుసు కనుకనే గద్దెనెక్కిన మరునాటి నుంచి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆ అంశాన్ని ముందుకు రాకుండా చేశారు. తెలుగుదేశం ప్రభుత్వమే దాని మీద అసెంబ్లీ తీర్మానాల పేరుతో మరొక పేరుతో నాటకాలాడింది. తరువాత దాని బదులు ప్రత్యేక పాకేజి అంటే దానికి కూడా మీడియా తాన తందాన పలికింది. పోనీ దాని బండారాన్ని అయినా బయట పెట్టారా అంటే అదీ లేదు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రావటానికి పాతికేండ్లు పట్టింది, అదే జగన్‌కు పదేండ్లు మాత్రమే అని కొందరి సూత్రీకరణ. దాన్ని ఎవరూ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 1983 నుంచి 2004 మధ్య 1989నుంచి ఒకసారి కాంగ్రెస్‌ పాలన ఐదేండ్లు కొనసాగటం తప్ప మిగతా కాలమంతా తెలుగుదేశం పాలనే కొనసాగింది. అందువల్లనే రాజశేఖరరెడ్డి అంతకాలం ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ కాలంలోనే ప్రపంచ బ్యాంకు ఆదేశిత సంస్కరణలు, 1991నుంచి ప్రారంభమైన నూతన ఆర్ధిక సంస్కరణలు అమలు జరిగాయి. వాటితో జనానికి ఎలాంటి ప్రయోజనం లేకపోగా భారాలు పెరిగాయి, అవినీతి పెద్ద ఎత్తున చోటు చేసుకుంది. దేశం దృష్టిని ఆకర్షించిన విద్యుత్‌ వుద్యమం వంటివి ఈ కాలంలోనే జరిగాయి. దీనికి తోడు బిజెపితో తెలుగుదేశం పార్టీ జట్టుకట్టిన పూర్వరంగంలో కాంగ్రెస్‌తో వామపక్షాలతో పాటు టిఆర్‌ఎస్‌కూడా సీట్లు సర్దుబాటు చేసుకుంది కనుకనే 2004లో రాజశేఖరేఖరరెడ్డి అధికారానికి వచ్చారు. అదే విధానాలను అమలు జరిపిన కారణంగా వైఎస్‌ఆర్‌పై కూడా అసంతృప్తి తలెత్తినప్పటికీ 2009లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ లేకపోతే రెండవ సారి అధికారానికి వచ్చేవారు కాదన్నది తెలిసిందే. అంటే నూతన ఆర్ధిక విధానాలు ఏ పాలకపార్టీని కూడా వరుసగా రెండవ సారి అధికారానికి తెచ్చే పరిస్ధితి లేదన్నది స్పష్టం. తెలంగాణాలో తెరాస మీద భ్రమలు తొలగకపోవటం, ఇతర అంశాలు తోడై తిరిగి చంద్రశేఖరరావు అధికారానికి వచ్చారు. ఆరునెలల్లోనే పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజావ్యతిరేకత వెల్లడైందా లేదా ? ఆ దివాలా కోరు విధానాలతో రెండవ సారి అధికారానికి వచ్చిన చంద్రబాబు నాయుడు జన విశ్వాసం పొందలేకపోవటంతో పాటు పైన చెప్పుకున్న ఇతర కారణాలు కూడా తోడై ఈ ఎన్నికల్లో జగన్‌కు అవకాశం వచ్చింది.

చంద్రబాబు నాయుడు , మరొకరు ఎవరైనా ప్రజాకర్షక విధానాలతో కొన్ని సంక్షేమ చర్యలను చేపట్టినంత మాత్రాన జనానికి వాటితోనే సంతృప్తి వుండదు. నిరుద్యోగం, దారిద్య్రం వంటి అనేక అంశాలు జనాన్ని పీడిస్తున్నపుడు సంక్షేమ పధకాలు వుపశమనం తప్ప మరొకటి కాదు. తెలంగాణాలో రైతు బంధు సొమ్ము తీసుకున్న రైతులే నిజామాబాద్‌లో రోడ్డెక్కారు, అధికార పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నామినేషన్లు వేసి ఎన్నికలలో కూడా నిరసన తెలిపారు. నయావుదారవాద విధానాలు జనంలో ప్రతి తరగతిలోనూ భ్రమలను పెంచుతాయి. అవినీతిని మరింతగా విస్తరింప చేస్తాయి. అందరూ అడ్డదారిలో సంపాదించుకోగలిగినపుడు మనం కూడా ఎందుకు ప్రయత్నించకూడదనే దగ్గరి దారి ఆలోచనలను ప్రతివారిలో రేకెత్తిస్తాయి.ఈ క్రమంలో ప్రతి పాలక పార్టీ భ్రమలను పెంచటంలో, మరిన్ని ప్రజాకర్షక నినాదాలను ముందుకు తేవటంలో, చర్యలు చేపట్టటంలో పోటీ పడతాయి. విలువలను నాశనం చేస్తాయి. గతంలో ఓటర్లు డబ్బు తీసుకున్నపుడు ఓటేయకపోతే ఎలా అని విశ్వాసంతో తీసుకున్న పార్టీకి ఓటు వేసేవారు, మరో పార్టీ దగ్గర తీసుకొనే వారు కాదు. ఇప్పుడు ఎవరు ఇస్తే ఎంత ఇస్తే అంత తీసుకొని నచ్చిన వారికి ఓటు చేస్తున్నారు. అంటూ ఎవరికీ లేని నిజాయితీ మనకెందుకు అనుకోబట్టే ఈ స్ధితి. అందుకే చంద్రబాబు ఎన్ని తాయిలాలు పెట్టినా ఎన్నికల ముందు ఎవరైనా చేస్తున్నది అదేలే అని లబ్ది పొందిన వారు చూశారు తప్ప, కృతజ్ఞత చూపలేదు. చూపుతారనే ఆశతో గతం చంద్రబాబు నా పధకాల వలన లబ్దిపొందిన వారు నాకే ఓట్లు వేయాలన్నట్లుగా మాట్లాడిన తీరు తెలిసిందే.

Image result for chandrababu naidu hypocrisy

చంద్రబాబు నాయుడి ఐదు సంవత్సరాల కాలంలో వామపక్షాల బలం ఎంత పరిమితం అయినప్పటికీ ఆయన పర్యటనకు వెళ్లిన ప్రతి చోటా ఆ పార్టీల కార్యకర్తలు, నేతలను ముందస్తు అరెస్టులు చేయించటం, వివిధ తరగతుల సమస్యలపై ఆందోళనలకు పిలుపులు ఇచ్చినపుడు వాటిని సాగకుండా ఎక్కడికక్కడ పోలీసులను ప్రయోగించి అణచివేత, విఫలం చేసేందుకు ప్రయత్నించటాన్ని చూశాము. అంటే ప్రజాకర్షక నేతలు వైఫల్యం చెందినపుడు అణచివేతలకు పాల్పడతారన్న ప్రపంచ అనుభవం ఇక్కడ కూడా వాస్తవ రూపం దాల్చింది. దీనికి తోడు కార్మిక సంఘాలను చీల్చటం, నిరంకుశ పద్దతుల్లో డిమాండ్లను వ్యతిరేకించటం, తమతో చేతులు కలిపితే పరిష్కరిస్తామంటూ పోరాడే కార్మిక సంఘాలన్నింటినీ చీల్చటం వంటి అనేక ప్రజాస్వామ్య విరుద్ద చర్యలను చూశాము.

పకోడీలు అమ్ముకోవటం కూడా వుపాధికల్పనకిందికే వస్తుందని నరేంద్రమోడీ చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు, ఆయన బృందం చెప్పకపోవచ్చుగానీ వుద్యోగ కల్పన. పెట్టుబడుల ఆకర్షణ పేరుతో ఎంత ప్రచార ఆర్భాటం చేశారో చూశాము. స్విడ్జర్లాండ్‌లోని దవోస్‌ నగర కేంద్రంగా ప్రపంచ ఆర్ధిక వేదిక పని చేస్తుంది. ప్రతి సంవత్సరం అక్కడ జరిగే సమావేశాలకు చంద్రబాబు నాయుడు పెద్ద పరివారాన్ని వేసుకొని తీర్ధయాత్రల మాదిరి తిరిగి వచ్చేవారు. ఆ పిచ్చి ముదిరి ఎంతవరకు పోయిందంటే దవోస్‌ నగరంలో తిరిగే బస్సుల మీద మేక్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో ప్రచారానికి డబ్బు ఖర్చు చేశారు. అంటే ప్రపంచ పెట్టుబడిదారులు దవోస్‌ రోడ్ల మీద తిరుగుతుంటారని, వారు బస్సుల మీద ప్రకటనలు చూసి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి పెట్టుబడులు పెడతారని జనం నమ్మాలి. ఎంత మందికి వుపాధిని అదనంగా కల్పించారో నరేంద్రమోడీయే కాదు, చంద్రబాబు కూడా చెప్పలేకపోయారు.

ప్రపంచ వ్యాపితంగా ప్రస్తుతం వుపాధి రహిత అభివృద్ధి జరుగుతోంది. దానికి మనం మినహాయింపు కాదు. రోబోట్‌లు, కంప్యూటర్‌ నియంత్రణ యంత్రాలతో పరిశ్రమలు కొత్త పరిశ్రమలు వస్తున్నాయి, పాత పరిశ్రమలను నవీకరిస్తున్నారు. అటువంటపుడు వుపాధి పెరగకపోగా తరుగుతోంది. రెండవది పెట్టుబడులకు తగిన రాయితీలు లేదా మార్కెటింగ్‌ను బట్టి ఆయా ప్రాంతాలకు వస్తాయి తప్ప వ్యక్తుల గొప్పనో, మొహమాటాలకో రావు. ఐటి సంస్ధలు కూడా అంతే ఎక్కడైతే కేంద్రీకరణ జరిగిందో అక్కడికే ప్రతి కంపెనీ వెళ్లాలని చూస్తుంది తప్ప కొత్త ప్రాంతాలలో పెట్టి ప్రయోగాలు జరపదు. అందువలన బాబొస్తే జాబస్తుంది అనే ఒక నినాదం ప్రహసన ప్రాయంగా మారింది. అందువలన ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ, గెలిచిన వైఎస్‌ఆర్‌సిపి అయినా చిత్తశుద్దితో గుణపాఠాలను తీసుకోవటం అవసరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d